visakha
-
బల్క్ డ్రగ్ పార్క్.. పార్లమెంట్ సాక్షిగా చెప్పిన మాట ఇది
-
తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్‌కు బీర్ల సప్లై నిలిపివేత
-
దీక్షా శిబిరం దాటొస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరిక
-
మంత్రి నాదెండ్లకు షాక్.. పోర్టులో బియ్యానికి క్లీన్ చిట్
సాక్షి, విశాఖ: ఏపీలో మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి తాజాగా కలెక్టర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ క్రమంలో అక్కడ పట్టుకున్న బియ్యం రేపోమాపో చైనాకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఏపీ(Andhra Pradesh)లో కూటమి సర్కార్ పాలన హడావుడికి ఎక్కువ పని తక్కువ అన్న చందంగా తయారైంది. మంత్రులు కనీస అవగాహన కూడా లేకుండా ఓవరాక్షన్ చేస్తున్నారు. తాజాగా మంత్రి నాదెండ్ల మనోహర్‌కు చుక్కెదురైంది. విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి కలెక్టర్ క్లీన్ చిట్ ఇచ్చారు. గత నెల 9న కంటైనర్ టెర్మినల్‌లో నాదెండ్ల తనిఖీలు చేశారు. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లో 259 టన్నుల రేషన్ బియ్యం గుర్తించినట్లు నాదెండ్ల ప్రకటించారు.ఇదే సమయంలో వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని బియ్యం తీసుకొచ్చిన సంస్థపై కేసు నమోదు చేసినట్లు మంత్రి హడావిడి చేశారు. ఇక, నెల రోజుల తర్వాత అవి రేషన్ బియ్యం కాదంటూ కలెక్టర్ ధృవీకరించారు. ఈ క్రమంలో వాటిని బిబో సంస్థకి ఎగుమతి కోసం అప్పగిస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు.. మంత్రి అనుచరులు బియ్యాన్ని విడిచిపెట్టాలంటూ కలెక్టర్‌పై ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. కాగా, బియ్యం రేపోమాపో చైనాకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
విశాఖ హనీ ట్రాప్ కేసులో కీలక మలుపు
-
Cyclone Alert: తుఫాన్‌గా మారనున్న తీవ్ర వాయుగుండం..
-
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో దారుణం
-
ఆందోళనలతో దద్దరిల్లుతున్న ఏపీ..
-
ఈనెల 29న విశాఖ రానున్న ప్రధాని మోదీ
-
Diarrhea: వందల మందిని వణికిస్తున్న డయేరియా
-
సాయంకాలం.. చదువుల తీరం!
మురళీనగర్(విశాఖ ఉత్తర): పరిశ్రమలు, ఇతర రంగాల్లో పనిచేస్తున్న వారు పదోన్నతులు పొందేందుకు గాను తమ విద్యార్హతలను పెంచుకునే అవకాశం లభిస్తే.. భలే ఉంటుంది కదూ. డిప్లమో కోర్సులను సాయం కాలం చదివే అరుదైన అవకాశం విశాఖ నగరంలోని కంచరపాలెం ప్రభుత్వ కెమికల్ ఇస్టిట్యూట్(గైస్) అందిస్తోంది. రాష్ట్రంలో 87 ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలుండగా సాయంకాలం కోర్సులు నిర్వహణకు విశాఖలోని గైస్‌ను ఏఐసీటీఈ ఎంపిక చేయడం విశేషం. అలాగే మరో రెండు ప్రయివేట్ పాలిటెక్నిక్ కళాశాలలు.. బెహరా(నరవ), ప్రశాంతి(అచ్యుతాపురం)లలోనూ సాయంత్రం కోర్సుల నిర్వహణకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) అనుమతిచ్చిoది. వచ్చే నెల ఒకటి నుంచి తరగతులు కెమికల్ ఇంజనీరింగ్, పెట్రో కెమికల్స్, ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్ విభాగాల్లో వర్కింగ్ ప్రొఫెషనల్స్‌గా 2024–25 విద్యా సంవత్సరంలో చేరేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ మేరకు కోర్సులను నవంబర్ 1న ప్రారంభిస్తారు. ప్రతి కోర్సులోనూ 33 సీట్లుండగా.. వీటిలో 3 ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఉంటాయి. వీరు ఈ నెల 21 నుంచి 26వ వరకు సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే బెహరా పాలిటెక్నిక్ కాలేజీలో ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్, మెకానికల్, ప్రశాంతి పాలిటెక్నిక్ కాలేజీ(అచ్యుతాపురం)లో సివిల్ , మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నారు. టైమింగ్స్: రోజూ సాయంత్రం 6.30 నుంచి 9 గంటల వరకు, ఆదివారం, సెలవు దినాల్లో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5 వరకూ తరగతులు నిర్వహిస్తారు. అర్హత: గుర్తింపు పొందిన పరిశ్రమల్లో, లేదా కేంద్ర, రాష్ట్ర సంస్థల్లో, ప్రభుత్వ లేదా ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఇంటర్ ఎంపీసీ/ బైపీసీ/ఐవీసీ/లేదా ఐటీఐ సర్టిఫికెట్తో కెమికల్ ప్లాంట్ మెయింటెనెన్స్ మెకానిక్/అటెండెంట్ ఆపరేటర్, లేబొరేటరీ అసిస్టెంట్/ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ తదితర విభాగాల్లో ఏడాది రెగ్యులర్ ఉద్యోగిగా పనిచేస్తూ.. పై 3 కళాశాలకు 50 కిలోమీటర్ల పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఈ నెల 26 సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 28న ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. -
గ్లోబల్ టయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ : ఫైనలిస్ట్‌గా విశాఖ విద్యార్థిని
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన యువ కళాకారిణి పేరూరి లక్ష్మీ సహస్ర ప్రతిష్టాత్మక 17వ టొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్ (TDCAC) గ్లోబల్ కాంపిటీషన్లో ఉత్తమ ఫైనలిస్ట్‌లలో ఒకరిగా ఎంపికైంది. ఈ సందర్బంగా "టొయోటాస్ మెమరీ కార్" ఆర్ట్‌ను రూపొందించిన ఆమెను టొయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) ఇటీవల సత్కరించింది. 90 దేశాలనుంచి 712,845 ఎంట్రీల్లో టాప్ 26 ప్రపంచ ఫైనలిస్ట్‌లలో లక్ష్మీ సహస్ర సంపాదించు కోవడం విశేషం. 12-15 ఏళ్ల విభాగంలో ఆమె సాధించిన అత్యుత్తమ విజయానికి గుర్తింపుగా, రూ.2.51 లక్షల (3,000 డాలర్లు) బహుమతి గెల్చుకుంది.టొయోటా మోటార్ కార్పొరేషన్ 2004లో టయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్‌ను ప్రారంభించింది. "డ్రీమ్ కార్లను" తయారు చేసేలా విద్యార్థులను, యువ ఇంజనీర్లను ప్రోత్సహిస్తుంది. లక్షల కొద్దీ పిల్లల ఆసక్తితో పోటీ విపరీతంగా పెరిగింది. ప్రారంభంనుంచి ఇప్పటిదాకా 144 దేశాలు, ప్రాంతాల 9.4 మిలియన్లకు పైగా పిల్లలు పాల్గొన్నారు, సృజనాత్మకతను పెంపొందించడం , రవాణా మరియు స్థిరత్వ భవిష్యత్తు గురించి ఆలోచించేలా యువతలో ఆలోచన రేకెత్తించడమే దీని ఉద్దేశం.15 ఏళ్లు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను మూడు విభాగాలుగా విభజించారు: 7, 8–11 ,12–15 ఏళ్లలోపు. ఈ సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా 26 మంది విజేతలు ఎంపికయ్యారు. వీరిలో పేరూరి లక్ష్మీ సహస్ర కూడా ఒకరు.ఆమె కళాత్మక సృష్టి స్ఫూర్దిదాయకంటొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్ అనేది పోటీ కంటే ఎక్కువ- మొబిలిటీ ద్వారా ప్రకాశవంతమైన, మరింత అనుసంధానమైన భవిష్యత్తును ఊహించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలకు ఆహ్వానం పలకడమని టొయాటో సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్, వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ తెలిపారు. ప్రపంచ వేదికపై సహస్ర సాధించిన విజయం స్ఫూర్తిదాయకమన్నారు. చాలా సంతోషంగా ఉందిటొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్‌లో గ్లోబల్ ఫైనలిస్ట్‌లలో ఒకరిగా ఉండటం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది లక్ష్మీ సహస్ర. భవిష్యత్తులోని కార్లు ప్రపంచాన్ని ఎలా మార్చగలనో ఊహించా..అదే డ్రీమ్ కారు టొయోటాస్ మెమరీ కార్. సాంకేతికత అనేది మొబిలిటీకి సాధనంగా మాత్రమే కాకుండా జ్ఞాపకాలను భద్రపరచడంలో, అర్థవంతమైన మార్గాల్లో కనెక్ట్ చేయడంలో సహాయపడే ఆలోచనతో దీన్ని రూపొందించినట్టు తెలిపింది. తన లాంటి యువతకు ఇంత అద్భుతమైన వేదికను అందించినందుకు టొయోటాకు కృతజ్ఞతలు చెప్పింది. టొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్ గురించి మరింత సమాచారం, పేరూరి లక్ష్మీ సహస్ర అవార్డు-గెలుచుకున్న కారుఘార్ట్ ఇతర అద్భుతమైన ఎంట్రీలు చూడాలనుకుంటే, అధికారిక పోటీ వెబ్సైట్ toyota-dreamcarart.com. వీక్షించవచ్చు. -
విశాఖ బీచ్ రోడ్ లో ఉన్న కంటైనర్ టెర్మినల్ లో అగ్నిప్రమాదం
-
విశాఖ స్టీల్ వద్ద ఉద్రిక్తత
-
విశాఖలో ఘనంగా వినాయక చవితి సంబురాలు (ఫొటోలు)
-
చంద్రబాబుకు కార్మికుల డెడ్ లైన్..
-
చివరకు తప్పుకున్న టీడీపీ
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరి నుంచి అధికార టీడీపీ తప్పుకుంది. బలం లేకపోవడం.. బలగానికీ ఇష్టంలేకపోవడంతో పోటీలో ఉంటే చిత్తుగా ఓడిపోవడం తప్పదని పార్టీ పెద్దలు గ్రహించారు. అయినా, కుతంత్రాలపై ఆశలు పెట్టుకున్నారు. చివరికి.. సామదానభేద దండోపాయాలను ఉపయోగించారు. డబ్బులతో అయినా ఓట్లు కొనాలని చివరి నిమిషం వరకూ చూశారు. కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీల్లో కించిత్తైనా నమ్మకం లేకపోవడంతో కూటమి చేతులెత్తేసి తోకముడిచింది. దీంతో.. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా వైఎస్సార్సీపీ కేడర్ చెక్కు చెదరకపోవడంతో ఆ పార్టీ ఖాతాలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ సీటు చేరింది. బొత్స విజయం లాంఛనంగా మారింది. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఇది తొలిమెట్టుగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. పోటీకి అందరూ ససేమిరావాస్తవానికి.. ఎలాగైనా ఎవరో ఒకర్ని పోటీలో నిలపాలని కొద్దిరోజులుగా సీఎం చంద్రబాబు భావిస్తూ వచ్చారు. స్థానిక సంస్థల్లో అధికార పక్షానికి బలం లేకపోవడం, వైఎస్సార్సీపీకి పూర్తి మెజారిటీ ఉండటంతో టీడీపీ అ«భ్యర్థిగా బరిలో నిలిచేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, పీలా గోవింద్లలో ఎవరో ఒకర్ని పోటీచేయించాలని చంద్రబాబు ప్రయత్నించారు. కానీ, గెలిచేందుకు ఏమాత్రం అవకాశంలేకపోవడం.. పైగా బలమైన ప్రత్యర్థి బొత్స ఉండడంతో పోటీకి వారిద్దరూ ససేమిరా అన్నారు. దీంతో దిలీప్ చక్రవర్తిని అభ్యర్థిగా నిలిపేందుకు ప్రయత్నించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో దిలీప్ చక్రవర్తి అనకాపల్లి టికెట్ ఆశించారు. ఆ సీటు పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంతో అతనికి ఆశాభంగమైంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఆశపెట్టి అతన్ని బరిలో దించాలని విశాఖ జిల్లా టీడీపీ నేతలు చంద్రబాబుకు ప్రతిపాదించారు. పార్టీలో అన్నీ తానై వ్యవహరిస్తున్న లోకేశ్ కూడా ఈయన పేరును తెరపైకి తెచ్చారు. గెలిచే అవకాశంలేని ఎమ్మెల్సీ సీటుకు పోటీచేసేందుకు ఆయన కూడా ముందుకు రాకపోవడంతో గత్యంతరంలేని స్థితిలో పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు చంద్రబాబు మంగళవారం విశాఖ జిల్లా నేతలకు టెలీకాన్ఫరెన్స్‌లో వెల్లడించారు. ఓటమి భయంతోనే వెనకడుగుఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలని ముందు నుంచి భావించిన టీడీపీ చివరి నిమిషంలో తప్పుకోవడం వెనుక బలమైన కారణమే ఉంది. విశాఖ స్థానిక సంస్థల్లో సంపూర్ణ మెజారిటీ ఉన్న వైఎస్సార్సీపీని ఎదుర్కొని ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవడం సాధ్యంకాదు. ఈ నేపథ్యంలో.. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో వచ్చే ఓటమి ఘోర పరాభవం కింద లెక్కే. ఇటీవలే తెలంగాణలో కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోను ఇదే జరిగింది.అక్కడ మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పరాజయం పాలైంది. దీంతో.. స్థానిక సంస్థల్లో పూర్తి మెజారిటీ ఉన్న వైఎస్సార్సీపీని తట్టుకుని నిలబడటం టీడీపీకి పెను సవాల్‌గా మారే పరిస్థితి ఉందని.. పైగా, ప్రభుత్వం ఏర్పడిన రెండున్నర నెలలకే ఓటమి చవిచూస్తే ఆ ప్రభావం తట్టుకోవడం కష్టమనే పోటీకి ఎవరూ ముందుకు రాకపోవడంతో చంద్రబాబు చేతులెత్తిసినట్టు సమాచారం. బొత్స ఎన్నిక లాంఛనమేమరోవైపు.. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు వైఎస్సార్సీపీ సవాల్‌గా తీసుకుంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యూహాత్మకంగా మాజీమంత్రి, సీనియర్ నేత బొత్స సత్యనారాయణను బరిలోకి దించారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్సతోపాటు మరో స్వతంత్ర అభ్యర్థి షఫీ ఉల్లా కూడా నామినేషన్ వేశారు. గడువులోగా ఈయన నామినేషన్ ఉపసంహరించుకుంటే పోలింగ్ లేకుండానే బొత్సను విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ పోటీ జరిగినా బొత్స ఎన్నిక లాంఛనమే. దిలీప్‌కు హితోపదేశం..! ఇదిలా ఉంటే.. దిలీప్ పేరుని ప్రతిపాదించిన లోకేశ్ వ్యవహారశైలిని వ్యతిరేకిస్తూ.. ఆ ప్రతిపాదనలకు చెక్ పెట్టేందుకు వీలుగా టీడీపీ ఉత్తరాంధ్ర సీనియర్లు పావులు కదిపారు. టీడీపీకి చెందిన ఓ మాజీమంత్రి చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. దిలీప్ చక్రవర్తికి వ్యాపార భాగస్వామిగా ఉన్న ఓ ఎమ్మెల్సీ ద్వారా మంతనాలు ప్రారంభించారు. సదరు అభ్యర్థిగా భావిస్తున్న వ్యక్తికి హితోపదేశం చేయడం ప్రారంభించారు. రూ.100 కోట్లు కాదు.. రూ.200 కోట్లు ఖర్చుచేసినా.. గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని.. డబ్బులు, టైమ్ వేస్ట్ అంటూ బ్రెయిన్‌వాష్ చేశారని సమాచారం. ఓట్ల అంతరం చాలా ఉందనీ.. దాన్ని అధిగమించడం కష్టమనీ.. అందుకే ఓడిపోయే సీటును అంటగట్టేందుకు చూస్తున్నారని చెప్పారు. నామినేషన్ వేసి.. కోట్ల రూపాయలు నష్టపోయే కంటే.. అసలు పోటీలో ఉండకపోవడం మంచిదని సూచించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గ్రహించే గండి బాబ్జీ, పీలా గోవింద్‌లు పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కూడా వివరించారు. అంతా విన్న దిలీప్ పోటీచేయలేనంటూ లోకేశ్‌కి తెగేసి చెప్పేశారు. -
విశాఖ బీచ్ రోడ్డు డైనోసర్ పార్క్ లో అగ్నిప్రమాదం..
-
బాబుకు టీడీపీ నేతల వార్నింగ్..
-
వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ
-
Vizag MLC Election: కూటమిలో కన్ఫూజన్.. పోటీ చేయాలా? వద్దా?
సాక్షి, విశాఖపట్నం: ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై కూటమిలో గందరగోళం నెలకొంది. చంద్రబాబు వద్దకు చేరినా పంచాయితీ తేలలేదు. అభ్యర్థి ఎంపికపై మీరే నిర్ణయం తీసుకోవాలని నేతలకు చంద్రబాబు సూచించారు. అభ్యర్థి ఎంపికపై కూటమి నేతలు ఇవాళ భేటీ కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే అంశంపై చర్చించనున్నారు. కాగా, అభ్యర్థి ఎంపికపై కూటమి నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు.వైఎస్సార్ సీపీకి పెరిగిన మరింత బలంమరో వైపు ప్రచారంలో వైఎస్సార్సీపీ దూసుకుపోతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మరింత బలం పెరిగింది. ఆరు వందలకుపైగా ఓటర్లతో ఇప్పటికే స్పష్టమైన ఆధిక్యత ఉండగా మరో ముగ్గురు ఓటు నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఓటర్లు నమోదు కార్యక్రమం శనివారంతో ముగిసింది. కొత్తగా రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, డాక్టర్ కుంభా రవిబాబు దరఖాస్తు చేశారు. వీటిని విచారణ కోసం జీవీఎంసీకి పంపారు. ఈనెల 13న తుది జాబితాను ప్రకటిస్తారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 838 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 39 మంది జెడ్పీటీసీల్లో ప్రస్తుతం 36 మంది జెడ్పీటీసీ ఉన్నారు. అల్లూరి జిల్లాకు చెందిన హుకుంపేట జెడ్పీటీసీ రేగం మత్స్యలింగం అరకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రావికమతం జెడ్పీటీసీ తలారి రమణమ్మ, సబ్బవరం జెడ్పీటీసీ తుంపాల అప్పారావు చనిపోయారు. ప్రస్తు తం ఉన్న జెడ్పీటీసీల్లో వైఎస్సార్సీపీకి 34 మంది, టీడీపీకి నర్సీపట్నం జెడ్పీటీసీ, సీపీఎంకి అనంతగిరి జెడ్పీటీసీ ఉన్నారు. మొత్తం 652 మంది ఎంపీటీసీలకు గాను 636 మంది ఎంపీటీసీలు ఉన్నారు.16 మంది ఎంపీటీసీ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో వైఎస్సార్ సీపీకి 477 మంది, టీడీపీకి 116 మంది, ఇండిపెండెంట్లు 28 మంది, జనసేనకు ఇద్దరు, బీజేపీకి ఆరుగురు, సీపీఐకి ఇద్దరు, సీపీఎంకి ముగ్గురు, కాంగ్రెస్‌కు ఇద్దరు సభ్యులు ఉన్నారు. జీవీఎంసీలో 98 మంది కార్పొరేటర్లకు గాను ఒక స్థానం ఖాళీగా ఉంది. యలమంచలి పురపాలక సంఘం పరిధిలో 25 మంది కౌన్సిలర్లు, నర్సీపట్నం పురపాలక సంఘం పరిధిలో 28 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అలాగే ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉన్నారు. -
విశాఖలో హ్యాండ్లూమ్స్ కోసం చీర కట్టులో స్పెషల్ వాక్ ర్యాలీ (ఫొటోలు)
-
అమ్మో ఏపీకా?
సాక్షి, విశాఖపట్నం : పారిశ్రామికవేత్తలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పేరు వింటేనే భయపడిపోతున్నారు. ఇక్కడ పెట్టుబడులు పెడదామనుకున్న వారు మరో దారి చూసుకుంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిలో పరిశ్రమలు, ఐటీ సంస్థలు ఏర్పాటు చేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. బీచ్ ఐటీ కాన్సెప్ట్‌తో వెలుగులీనిన విశాఖ నగరం... ఇప్పుడు విలవిల్లాడుతోంది. ఒక్క విశాఖ నగరమే కాదు.. ఆంధ్రప్రదేశ్ వైపు ఐటీ పరిశ్రమలు రావాలంటేనే మొహం చాటేస్తున్నాయి. సంస్థ కార్యకలాపాలు ప్రారంభించాలంటే.. అమ్మో.. ఏపీకా.. అంటూ భయపడుతున్నాయి. నెల రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తున్న ఐటీ దిగ్గజాలు ఆంధ్రప్రదేశ్కుబై బై చెబుతున్నాయి. విశాఖలో డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించేందుకు సుముఖంగా ఉన్న ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమినీ ఇప్పుడు వెనకడుగు వేసి, చెన్నైకి చెక్కేసింది. ఆరు నెలలుగా విస్తరణ పనులు చురుగ్గా నిర్వహించిన విప్రో కూడా ఆలోచనలో పడింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులు, విధ్వంసాలు, పారిశ్రామికవేత్తలకు బెదిరింపులు, హింసా వాతావరణంతో ఐటీ, ఐటీ అనుబంధ సంస్థల ప్రతినిధులు, ఇతర పెట్టుబడిదారులు జంకుతున్నారు. ఒక్కసారిగా కుదుపువిభిన్నమైన ఐటీ పాలసీని మెచ్చి.. గత మూడేళ్లుగా దిగ్గజ ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెడుతూ ముందుకొచ్చాయి. ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్, హెచ్‌సీఎల్, యాక్సెంచర్, రాండ్‌స్టాడ్, డబ్ల్యూఎన్ఎస్, అమెజాన్ వంటి సంస్థలు వరుసగా క్యూ కట్టాయి. దివంగత వైఎస్సార్ హయాంలో పురుడు పోసుకున్న విప్రో సంస్థ.. ఆరు నెలల క్రితం కార్యకలాపాలు విస్తృతం చేస్తున్నట్లు ప్రకటించింది. ఇలా.. దిగ్గజ కంపెనీలన్నీ.. ఏపీలో శాఖలు విస్తరించేందుకు అడుగులు వేస్తున్న తరుణంలో ఒక్కసారిగా కుదుపు ఏర్పడింది. ప్రభుత్వం మారిన తర్వాత.. ప్రశాంత వాతావరణం కాస్తా.. అశాంతి వాతావరణంగా మారడంతో అన్ని సంస్థలూ పునరాలోచనలో పడిపోయాయి. ఏపీలో అడుగు పెట్టాలంటేనే ఐటీ, ఐటీ అనుబంధ సంస్థలు భయపడిపోతున్నాయి. ఇందుకు క్యాప్జెమినీనే ఉదాహరణ. అడుగడుగునా దాడులు.. బెదిరింపులు నెల రోజులుగా రాష్ట్రంలో వరుస దాడులు అన్ని వర్గాల ప్రజలతో పాటు వ్యాపార దిగ్గజాలను బెంబేలెత్తిస్తున్నాయి. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపైనే కాకుండా వ్యాపార సంస్థలపై కూడా వరుస దాడులు జరిగాయి. రైస్ మిల్లులు, ఫ్యాక్టరీలను మూయిస్తున్నారు. నిన్నటికి నిన్న మామూళ్లివ్వలేదని దాల్మియా సిమెంట్ ట్రాన్స్పోర్ట్ వాహనాలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. ‘మామూళ్లు ఇస్తేనే మీ లారీలు కదులుతాయి.. మీరు వ్యాపారం చేయాలంటే కప్పం కట్టాల్సిందే’ అంటూ ట్రాన్స్పోర్ట్ సంస్థల యజమానులను టీడీపీ నాయకులు బెదిరించారు. నిజాయితీగా వ్యాపారం చేసుకుంటున్న తామెందుకు డబ్బులివ్వాలని ట్రాన్స్‌పోర్టు సంస్థల యజమానులు ప్రశ్నించడంతో ఏకంగా 11 లారీలను ధ్వంసం చేశారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలంలో జరిగింది. ఇక్కడి దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీలోకి ప్రతిరోజూ వివిధ ట్రాన్స్పోర్ట్ కంపెనీలకు చెందిన వందలాది లారీలు సిమెంట్ రవాణా కోసం వస్తుంటాయి. కొన్ని రోజులుగా ఈ కంపెనీల యజమానులను టీడీపీ నాయకులు మామూళ్లు డిమాండ్ చేస్తున్నారు. వారు పట్టించుకోకపోవడంతో కక్ష పెంచుకుని లారెన్స్ ట్రాన్స్పోర్ట్కు చెందిన 11 లారీల అద్దాలు పగులగొట్టి బీభత్సం సృష్టించారు. వెంటనే మామూళ్లు ఇవ్వకపోతే మిగతా కంపెనీల లారీలకూ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఓ రైస్ మిల్లును మూయించారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలోని యునైటెడ్ బ్రూవరీస్ ఫ్యాక్టరీపై దాడి చేశారు. ముడి సరుకు తీసుకొస్తున్న లారీలను ఆపేశారు. ఊరూరా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను పగులగొడుతున్నారు. ఊళ్లొదిలి వెళ్లాలని హుకుం జారీ చేస్తున్నారు. వ్యాపారాల్లో ఉచిత వాటాలు కోరుతూ.. ఒప్పుకోని వారిపై కక్షగట్టి దాడులు చేస్తున్నారు. మేం ఫలానా వాళ్ల తాలూకా.. మేం పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా.. మేం లోకేశ్ తాలూకా.. అంటూ బండ్లు, వాహనాలపై పేర్లు రాసుకుని బెదిరింపులకు దిగుతుండటం కళ్లెదుటే స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని చోట్ల బండ్ల నంబర్ ప్లేట్లు తీసేసి ఇలా రాసుకుని తిరుగుతూ వ్యాపారులను, ప్రజలను భయపెడుతున్నారు. అందుకే పలు సంస్థలు మరో దారి రాష్ట్రంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఇప్పటికే ఇక్కడకు రావాలని నిర్ణయించిన పలు సంస్థలు మరో దారి చూసుకుంటున్నాయి. ఇక్కడ పెట్టుబడులు పెట్టడం సాహసమే అవుతుందని ఆలోచిస్తున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసే విషయమై.. దేశంలోని ఇతర నగరాలకు ప్రథమ ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించుకున్నాయని ఐటీ వర్గాలు చెబుతున్నాయి. లక్నో, ఇండోర్, జైపూర్, కొచ్చి, నాగ్‌పూర్, చండీగఢ్ తదితర నగరాలవైపు అడుగులు వేస్తున్నాయి. విస్తరణ పనులు చురుగ్గా నిర్వహించిన విప్రో సంస్థ కూడా.. పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా విస్తరించేందుకు సిద్ధమవుతున్న సమయంలో రాష్ట్రంలో పరిస్థితి వారిని కలవరపెడుతోందని సమాచారం. కొన్నాళ్లు వేచి చూసి.. తదుపరి నిర్ణయం తీసుకోవాలని విప్రో ప్రతినిధులు భావిస్తున్నట్లు తెలిసింది. మరికొన్ని ఐటీ అనుబంధ సంస్థలు, బీపీవోలు కూడా విశాఖలో శాఖలు ఏర్పాటు చేయాలని భావించినా, తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయని ఐటీ రంగ ప్రముఖుడొకరు తెలిపారు. అధికార పార్టీ నేతల తీరు వల్ల ఐటీ రంగం మళ్లీ కునారిల్లే దుస్థితి వచ్చిందని ఐటీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.విశాఖ కంటే.. చెన్నై బెటర్ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐటీ సంస్థలకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, బీచ్ ఐటీ కాన్సెప్ట్‌తో ఆకర్షితులైన సంస్థలు తమ కార్యక లాపాల్ని సాగరనగరిలో విస్తరించేందుకు గతంలో సన్నద్ధమైంది. క్యాప్ జెమినీ సంస్థ కూడా తమ శాఖను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా ఇతర నగరాల్లో కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ ఏడాది మార్చిలో ఉద్యోగుల మధ్య క్యాప్ జెమినీ సంస్థ సర్వే నిర్వహించింది. ఆ జాబితాలో వైజాగ్‌ని కూడా చేర్చింది. క్యాప్‌జెమినీలో పని చేస్తున్న వారిలో ఇప్పటి వరకు సింహభాగం ఉద్యోగులు విశాఖను ఎంపిక చేసుకున్నారు. గతంలో ఇన్ఫోసిస్‌లో కూడా ఇదే విధమైన సర్వే చేశారు. ఫిబ్రవరిలో క్యాప్ జెమిని సంస్థ ప్రతినిధులు సైతం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. త్వరలోనే విశాఖలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నట్లు క్యాప్‌జెమినీ సంస్థ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. అయితే నెల రోజులుగా రాష్ట్రంలో పరిస్థితుల్ని పరిశీలించిన సంస్థ.. చెన్నైలో విస్తరణ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. రూ.1,000కోట్ల పెట్టుబడితో 5 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా 2027నాటికి డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సంస్థ గతంలో స్పష్టం చేసింది. రాష్ట్రంలో అనుకూల వాతావరణం కనిపించి ఉంటే కచ్చితంగా ఈ సంస్థ శాఖ విశాఖలో విస్తరించేది. టీడీపీ, జనసేన నేతల దాడులు, విధ్వంస పర్వంతో రాష్ట్రంలో భీతావహ వాతావరణం ఏర్పడింది. ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తుండటంతో ఇది సరైన వేదిక కాదని మానసు మార్చుకుని క్యాప్‌జెమినీ సంస్థ ప్రతినిధులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని చెన్నై వెళ్లినట్లు తెలుస్తోంది. -
సముద్ర జలాల్లో శాంతి స్థాపనే లక్ష్యం
సాక్షి, విశాఖపట్నం: సముద్ర జలాల్లో శాంతి స్థాపనే తమ లక్ష్యమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సురక్షిత నౌకాయానం, రూల్–బేస్డ్ వరల్డ్ ఆర్డర్, యాంటీ పైరసీ, హిందూ మహా సముద్ర ప్రాంత(ఐవోఆర్) పరిధిలో శాంతి– స్థిరత్వం ప్రధాన ప్రాధాన్యతలుగా తీసుకుంటామని స్పష్టం చేశారు. రెండో సారి రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాజ్‌నాథ్‌సింగ్ తొలి పర్యటన విశాఖలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సముద్ర భద్రతను మరింత పటిష్టం చేస్తామన్నారు. ఇండియన్ నేవీ ఉనికిని మరింత ప్రభావవంతంగా చేయడంపై దృష్టి సారిస్తానని చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్‌కు చెందిన స్నేహపూర్వక దేశాలు సురక్షితంగా ఉంటూ పరస్పర ప్రగతి పథంలో కలిసి ముందుకు సాగేలా ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. దేశ అభివృద్ధిలో నౌకాదళం కీలక పాత్ర పోషిస్తోందనీ.. అంతర్జాతీయ వేదికగా భారత నౌకాదళ ఖ్యాతి పెరుగుతోందని ప్రశంసించారు. ఆర్థిక, సైనిక శక్తి ఆధారంగా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో ఏ దేశం ప్రమాదంలో పడకుండా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి కలిగిన భారత నౌకాదళం భరోసానిస్తోందన్నారు. పాక్ పౌరుల్ని రక్షించి మానవత్వాన్ని ప్రపంచానికి చాటింది ఈ ఏడాది మార్చిలో అరేబియా సముద్రంలో 23 మంది పాకిస్తానీ పౌరులను సోమాలి సముద్రపు దొంగల బారి నుంచి విడిపించినప్పుడు నేవీ సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ తీరు ప్రశంసనీయమన్నారు. జాతీయత, శత్రుత్వంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేసేలా ఇండియన్ నేవీ సిబ్బంది వ్యవహరిస్తూ.. మానవత్వ విలువల్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారని కొనియాడారు. భారతదేశ వాణిజ్య ప్రయోజనాలు ఐవోఆర్తో ముడిపడి ఉన్నాయనీ, వి్రస్తృత జాతీయ లక్ష్యాలను సాధించేందుకు నౌకాదళం సముద్ర సరిహద్దులను సంరక్షించడంలో ముఖ్య భూమిక పోషిస్తోందన్నారు. పెరుగుతున్న పారిశ్రామిక మౌలిక సదుపాయాల ద్వారా భారత నౌకాదళం నిరంతరం బలపడుతోందన్నారు. షిప్‌యార్డ్‌లు విస్తరిస్తున్నాయనీ, విమాన వాహక నౌకలు బలోపేతమవుతున్నాయన్నారు. ఇండియన్ నేవీ కొత్త శక్తివంతమైన శక్తిగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఘన స్వాగతం తొలుత విశాఖలోని నేవల్ ఎయిర్ బేస్ ఐఎన్ఎస్ డేగాకు భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠితో కలిసి చేరుకున్న రక్షణ మంత్రికి ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున ఘన స్వాగతం పలికారు. 50 మందితో కూడిన గార్డ్ ఆఫ్ హానర్‌తో సాదర స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి తూర్పు నౌకాదళం ప్రధాన కేంద్రానికి చేరుకున్న ఆయన ఐఎన్ఎస్ జలాశ్వలో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ నౌకలు, జలాంతర్గాములు, నేవల్ కమాండ్ విమానాల ద్వారా డైనమిక్ కార్యకలాపాలను వీక్షించారు, తూర్పు సముద్ర తీరంలో భారత నౌకాదళం కార్యాచరణ సంసిద్ధతని రాజ్‌నాథ్‌సింగ్ సమీక్షించారు. ‘డే ఎట్ సీ’ ముగింపులో భాగంగా స¯Œరైజ్ ఫ్లీట్ సిబ్బందితో కలిసి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భోజనం చేశారు. గౌరవ వీడ్కోలు అనంతరం.. ఐఎన్ఎస్ డేగాకు చేరుకొని ఢిల్లీకి పయనమయ్యారు. -
విశాఖలో సెయిలర్స్ ఇన్స్టిట్యూట్ ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళ సెయిలర్స్ కోసం సాగర్ పేరుతో ఏర్పాటు చేసిన ఇన్స్టిట్యూట్ విశాఖలో ప్రారంభమైంది. నావికుల శిక్షణ కోసం ఐఎన్ఎస్ విశ్వకర్మ బేస్‌లో ఉన్న సెయిలర్స్ ఎనెక్స్ ఇన్స్టిట్యూట్ను పూర్తిస్థాయిలో ఆధునికీకరించారు. సాగర్ పేరుతో ఆధునికీకరించిన ఈ భవనాన్ని తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ బుధవారం ప్రారంభించారు. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో అప్‌గ్రేడ్ చేసిన సాగర్‌లో పురుషులతో పాటు మహిళా సెయిలర్స్, అగ్నివీర్లకు, యుద్ధ నౌకల్లో విధులు నిర్వర్తించే వారి కోసం ఏర్పాట్లు చేసినట్లు ఈఎన్సీ చీఫ్ అడ్మిరల్ పెందార్కర్ తెలిపారు. భారత దేశ రక్షణ కోసం అహర్నిశలూ శ్రమిస్తున్న సెయిలర్స్‌కు ఆహ్లాదకరమైన వాతావరణంలో మోటివేషన్ అందించడంతో పాటు విశ్రాంతి తీసుకునేలా సాగర్ నిర్మాణం సాగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నౌకాదళాధికారులు పాల్గొన్నారు. నౌకాదళ సిబ్బందికి ‘ఏఐ’ క్యాప్సుల్ కోర్సు సాంకేతిక పరిజ్ఞానంలో నౌకాదళ సిబ్బంది ప్రతిభా పాటవాలు మెరుగు పరిచేందుకు తూర్పు నౌకాదళంలో విధులు నిర్వర్తిస్తున్న వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాప్సుల్ కోర్సును అందించారు. గీతం యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఐఎన్ఎస్ కళింగలో ఈనెల 10 నుంచి 3 రోజుల పాటు ఏఐ అప్లికేషన్స్‌తో పాటు మెషిన్ లెర్నింగ్ గురించి శిక్షణ తరగతులు నిర్వహించారు.ఇంటరాక్టివ్ సెషన్స్ ద్వారా సందేహాలు నివృత్తి చేయడంతో వివిధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్స్‌లో ప్రయోగాత్మక వివరణలు అందించారు. శిక్షణలో పాల్గొన్న తూర్పు నౌకాదళ సిబ్బందికి ధ్రువపత్రాలు అందజేశారు.