మంకీపాక్స్‌ నిర్ధారణ కిట్‌ విడుదల | Release Of Monkeypox Diagnosis Kit At Visakha Transasia Bio Medicals | Sakshi
Sakshi News home page

మంకీపాక్స్‌ నిర్ధారణ కిట్‌ విడుదల

Published Sat, Aug 20 2022 9:32 AM | Last Updated on Sat, Aug 20 2022 10:01 AM

Release Of Monkeypox Diagnosis Kit At Visakha Transasia Bio Medicals - Sakshi

దొండపర్తి (విశాఖ దక్షిణ): ప్రపంచాన్ని కలవర పెడుతున్న మంకీపాక్స్‌ వైరస్‌ను నిర్ధారించే కిట్‌ అందుబాటులోకి వచ్చింది. విశాఖలోని మెడ్‌ టెక్‌ జోన్‌లో ట్రాన్సాసియా బయో–మెడికల్స్‌ సంస్థ ఆర్టీపీసీఆర్‌ విధానంలో ఈ కిట్‌ను అభివృద్ధి చేసింది. స్వదేశంలో తయారైన మొట్టమొదటి మంకీపాక్స్‌ నిర్ధారణ కిట్‌ ఇదే కావడం విశేషం. ట్రాన్సాసియా–ఎర్బా పేరుతో తయారు చేసిన ఈ కిట్‌ను కేంద్రంలోని ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ అడ్వైజర్‌ ప్రొఫెసర్‌ అజయ్‌కుమార్‌ సూద్‌ శుక్రవారం మెడ్‌టెక్‌ జోన్‌లో ఆవిష్కరించారు.

అత్యంత సున్నితమైన, కచ్చితమైన ఫలితం కోసం ఈ కిట్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు సంస్థ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న మంకీపాక్స్‌ కేసులను ముందస్తుగా గుర్తించడం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ కిట్‌ ఉపయోగపడుతుందని ట్రాన్సాసియా వ్యవస్థాపక చైర్మన్‌ సురేష్‌ వాజిరాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో సైంటిఫిక్‌ సెక్రటరీ అరబింద మిత్ర, ఐసీఎంఆర్‌ మాజీ డైరెక్టర్‌ బలరాం భార్గవ, బయోటెక్నాలజీ విభాగం సలహాదారుడు అల్క శర్మ తదితరులు పాల్గొన్నారు. 

(చదవండి: 13 ఏళ్లకే 10వ తరగతి పూర్తి.. యాంకర్‌గా అదరగొడుతున్న అభిషేక్‌ )

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement