సాక్షి, విశాఖ: ఏపీలో మంత్రి నాదెండ్ల మనోహర్(Nadendla Manohar)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి తాజాగా కలెక్టర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ క్రమంలో అక్కడ పట్టుకున్న బియ్యం రేపోమాపో చైనాకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఏపీ(Andhra Pradesh)లో కూటమి సర్కార్ పాలన హడావుడికి ఎక్కువ పని తక్కువ అన్న చందంగా తయారైంది. మంత్రులు కనీస అవగాహన కూడా లేకుండా ఓవరాక్షన్ చేస్తున్నారు. తాజాగా మంత్రి నాదెండ్ల మనోహర్‌కు చుక్కెదురైంది. విశాఖ పోర్టులో పట్టుకున్న బియ్యానికి కలెక్టర్ క్లీన్ చిట్ ఇచ్చారు. గత నెల 9న కంటైనర్ టెర్మినల్‌లో నాదెండ్ల తనిఖీలు చేశారు. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్‌లో 259 టన్నుల రేషన్ బియ్యం గుర్తించినట్లు నాదెండ్ల ప్రకటించారు.
ఇదే సమయంలో వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని బియ్యం తీసుకొచ్చిన సంస్థపై కేసు నమోదు చేసినట్లు మంత్రి హడావిడి చేశారు. ఇక, నెల రోజుల తర్వాత అవి రేషన్ బియ్యం కాదంటూ కలెక్టర్ ధృవీకరించారు. ఈ క్రమంలో వాటిని బిబో సంస్థకి ఎగుమతి కోసం అప్పగిస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు.. మంత్రి అనుచరులు బియ్యాన్ని విడిచిపెట్టాలంటూ కలెక్టర్‌పై ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. కాగా, బియ్యం రేపోమాపో చైనాకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment