
కాకినాడ: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకిచ్చిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మకి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన బాబు..ఇప్పుడు ఆ హామీని గాలికొదిలేశారు. దాంతో చంద్రబాబు మాట నమ్మి ఇప్పటికే రెండు సార్లు మోసపోయిన వర్మ.. మరోసారి దానికి గురి కాకతప్పలేదు. తాజాగా టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ టికెట్ల జాబితాలో వర్మ పేరు ఎక్కడా కనిపించలేదు.
పవన్ కళ్యాణ్ కు పిఠాపురం ఎమ్మెల్యే సీటును వర్మ వదులుకున్న క్రమంలో ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు తీరా చూస్తే వర్మ కి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదుజ
ఈ అంశంపై పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఆసక్తికర కామెంట్లు చేశారు. ఎస్పీఎస్ఎన్ వర్మ ఒక సీనియర్ పొలిటిషియన్ అంటూనే, ఆయన ఎమ్మెల్సీ టికెట్ అంశమనేది వారి పార్టీనే నిర్ణయిస్తుందన్నారు మనోహర్. ఇక్కడ తాము వర్మకి చెక్ పెట్టాల్సిన అవసరం ఏముంటందన్నారు మనోహర్.
‘పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా. వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్. వాళ్ళ పార్టీ ఆయన విషయం లో నిర్ణయం తీసుకుంటుంది, అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. వర్మ ని గౌరవించడం లో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వర్మకి చెక్ పెట్టాల్సిన అవసరం ఏమి ఉంటుంది’ అని అన్నారు.
ఇక ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు మనోహర్ పేర్కొన్నారు. పవన్ సెక్యూరిటీ విషయంలో డిపార్ట్మెంట్ తో పాటు పార్టీ పరంగా మేము కూడా చూసుకుంటాం. సభా ప్రాంగణం లో 75 సి సి కెమెరా లు ఏర్పాటు చేస్తాం. పిఠాపురం ప్రజలకి కృతజ్ఞతలు చెప్పడానికి ఈ సభ ఏర్పాటు చేశాం. ఈ నెల 14 న సాయంత్రం 4 గంటలకు జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ప్రారంభమవుతుంది’ అని పేర్కొన్నారు మంత్రి మనోహర్.
Comments
Please login to add a commentAdd a comment