SVSN Varma
-
పిఠాపురం జమీందారుగా కొణిదెల నాగబాబు!
పిఠాపురం జమీందారుగా మెగా బ్రదర్ నాగబాబుకు పట్టాభిషేకం అయినట్లేనా?.. ఇక ఆ నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలు శంకు స్థాపనలు .. రివ్యూలు అన్నీ నాగబాబే చూసుకుంటారా? తెలుగుదేశం నాయకుడు వర్మను పూర్తిగా పక్కనబెట్టేసినట్లేనా?. పరిస్థితులు.. పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఏ పనుల్లో ఉంటారో కానీ నిత్యం బిజీగా ఉంటారు. అటు సినిమాలు.. వైద్యం చికిత్స.. బిజినెస్ వ్యవహారాల్లో ఆయన బిజీగా ఉంటారు. గెలిచారే కానీ పిఠాపురం మీద ఏమీ దృష్టి సారించడం లేదు. అక్కడ అభివృద్ధి వంటి పనుల పర్యవేక్షణ.. సమీక్షలకు ఆయనకు టైం చిక్కడం లేదు. పోనీ అలాగని తనను గెలిపించిన తెలుగుదేశం వర్మకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఆయన పరపతి పెరిగిపోతుందని, ప్రజల్లో ఆయన పలుకుబడి ఇనుమడిస్తుంది అని భయం!. అసలే గెలవక గెలవక పవన్ పిఠాపురం(Pithapuram)లో వర్మ పుణ్యమా గెలిచారు. ఇప్పుడు వర్మకు ప్రాధాన్యం ఇవ్వడానికి పవన్ కు ధైర్యం చాలడం లేదు. దీంతో పిఠాపురం బాధ్యతలు చూసేందుకు పవన్ కు ఎలాంటి ఇబ్బంది లేని.. పవన్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది..ముప్పు లేని వ్యక్తి కావాలి. సరిగ్గా ఆ ప్లేసులోకి నాగబాబు వచ్చి పడ్డారు. వాస్తవానికి ఎమ్మెల్యేలు.. ఎంపీలకు ఒక నిర్దిష్ట నియోజకవర్గం ఉంటుంది. ఆ ప్రాంతంలో వారు రాజకీయ కార్యకలాపాలు చేస్తారు కానీ ఎమ్మెల్సీలకు అదేం ఉండదు. దీంతో వాళ్లు తమకు ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ రాజకీయం చేస్తారు.పైగా నాగబాబుకు ప్రత్యేకంగా ఒక ప్రాంతంలో రాజకీయంగా పట్టుంది అని చెప్పేందుకు అవకాశం లేదు. దీంతో ఆయన ఏకంగా పిఠాపురంలో పాగావేసి తమ్ముడు పవన్ తరఫున పెద్దరికం..పెత్తనం చేస్తారన్నమాట. ఈ మేరకు పార్టీ కూడా అధికారికంగా ఒక ప్రకటన చేసింది. పిఠాపురంలో ఇకపై అధికారిక రివ్యూలు.. సమీక్షలు..అభివృద్ధిపనుల పర్యవేక్షణ కూడా నాగబాబే చేపడతారని పార్టీ ఒక ప్రకటన చేసింది.వాస్తవానికి నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి పని ప్రారంభించాలంటే ఎమ్మెల్యేలు.. మంత్రులే చేయాలి కానీ ఇప్పుడు ఆ బాధ్యతలు అన్నీ నాగబాబు చూస్తారని పార్టీ చెబుతోంది. ఇకముందు పిఠాపురంలో నాగబాబు(Naga Babu)కు ప్రాధాన్యం తప్ప ఆ ప్రకటనలో ఎక్కడా వర్మ ప్రస్తావన లేకుండా కుట్ర పన్నారు. అంటే రాజకీయంగా వర్మను ఇక తెరమరుగు చేయడమే లక్ష్యంగా పవన్.. నాగబాబు ముందుకు వెళ్తున్నారు.ఇకక ముందు వర్మ తనవాళ్ళకు ఒక పెన్షన్ కూడా ఇప్పించుకోలేని పరిస్థితి తీసుకొచ్చేందుకు స్కెచ్ సిద్ధం చేశారు. దీంతో ఇటు వర్మ వర్గీయులు లోలోన రగిలిపోతూ బయటకు కక్కలేక.. మింగలేక ఊరుకుంటున్నారు. మున్ముందు వర్మకు రాజకీయంగా ప్రాధాన్యం దక్కడం కూడా అనుమానమే. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తాము అని ఆనాడు పవన్ కళ్యాణ్.. చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు. ఆ ఇద్దరూ మాట నిలబెట్టుకున్నట్లయితే నిన్న నాగబాబుతో బాటు వర్మ కూడా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండేది. కానీ ఆ ఇద్దరూ నమ్మించి వెన్నుపోటు పొడవడంతో వర్మకు ఆశాభంగం మిగిలింది. ఇక ఇప్పుడు వర్మకు ఎమ్మెల్సీ ఇప్పించడం ఆయన్ను ప్రాధాన్యమైన పోస్టింగులో ఉంచడం అనేది బ్రదర్స్ కు కూడా ప్రమాదమే. ఎందుకంటే వర్మ స్థానికుడు కాబట్టి ఆయనకు ఏదైనా పదవి దక్కితే ఆయన దూకుడు వేరేగా ఉంటుంది. ప్రజల్లో ఇమేజ్ పెరుగుతుంది. ఇదంతా పవన్ కు, నాగబాబుకు సైతం ఇబ్బందికరమే. అందుకే వర్మకు ఈ ఐదేళ్లలో రాజకీయ ప్రాధాన్యం ఉన్న పదవి దక్కడం కలలో కూడా సాధ్యం కాదని తెలుస్తోంది. వర్మ భుజాల మీదుగా నడిచివెళ్ళి అసెంబ్లీలో కూర్చున్న పవన్ ఇప్పుడు వర్మను పూర్తిగా అణగదొక్కేందుకే అన్నయ్య నాగబాబును పిఠాపురంలో ప్రతిష్టించినట్లు వర్మ అభిమానులు లోలోన మధనపడుతున్నారు. :::సిమ్మాదిరప్పన్న -
వర్మ రివెంజ్ స్టార్ట్.. ఇక పవన్ కు చుక్కలే
-
పిఠాపురంలో మళ్లీ దబ్బిడి దిబ్బిడి
సాక్షి,కాకినాడ జిల్లా: పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. తమ నాయకుడు ఎస్వీఎస్ఎన్ వర్మ చెప్పబట్టే పవన్‌కు ఓటేశామంటూ జనసేన ఇన్ ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్‌పై వర్మ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మర్రెడ్డి శ్రీనివాస్‌పై వాగ్వాదానికి దిగారు. దీంతో టీడీపీ, జనసేన శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.బుధవారం పిఠాపురంలో జనసేన శ్రేణుల్ని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. గొల్లప్రోలు మండలం చెందూర్తిలో ఆర్వో ప్లాంట్ ఆవిష్కరణకు జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ వచ్చారు. అయితే, ఈ కార్యక్రమానికి ఎస్వీఎస్ఎన్ వర్మకు ఆహ్వానం అందలేదు. ఇదే అంశంపై వర్మ అనుచరులు మర్రెడ్డి శ్రీనివాస్‌ను నిలదీశారు. దీంతో ఏం చేయాలో పాలుపోని మర్రెడ్డి కార్యక్రమం మధ్యలోనే తిరిగి వెళ్ళిపోయారు. వెళ్లే సమయంలో టీడీపీ,జనసేన శ్రేణులు ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. వర్మ చెప్పబట్టే పవన్‌కు ఓటు వేశామని వర్మ అనుచరులు,టీడీపీ కార్యకర్తలు తన మనసులో మాటను భయటపెట్టారు. వారికి పోటీగా జనసేన శ్రేణులు రావడంతో వాగ్వాదం జరిగింది. ఒకరినొకరు నెట్టుకున్నారు. నాగబాబు ఏమన్నారంటే?మార్చి 14న పిఠాపురం చిత్రాడలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహించింది. ఆ సభలో నాగబాబు ..పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మను ఉద్దేశిస్తూ పరోక్షంగా మాట్లాడారు. ‘పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలుపులో ప్రధానంగా రెండు ఫ్యాక్టర్స్ పని చేశాయి. ఒకటి జనసేన ప్రెసిడెంట్ పవన్ కల్యాణ్. రెండు జనసైనికులు, పిఠాపురం ఓటర్లు’ మరెవరైనా పవన్ గెలుపులో తమ పాత్ర ఉందని అనుకుంటే అది వారి ఖర్మ’ అని నాగబాబు నొక్కి మరీ చెప్పారు. నాగబాబుకు వర్మ కౌంటర్‌గా ఆ వ్యాఖ్యలపై వర్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సభ జరిగిన తర్వాత వర్మ సైతం సోషల్ మీడియా వేదికగా జనసేనకు కౌంటర్ వేస్తూ పోస్టులు పెడుతూ వచ్చారు. ఈ తరుణంలో వర్మ అభిమానులు పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్‌పై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చాంశనీయంగా మారింది. -
వర్మకు ఎమ్మెల్సీ దక్కకుండా పవనే అడ్డుకున్నారనే టాక్
-
ఏరు దాటాక తెప్పతో పనేంటి?
కాకినాడ, సాక్షి: ఏరు దాటాక తెప్పతో పనేముంటుంది?.. తగలెట్టేయడమే!.. కాబోయే జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు(Konidela Naga babu) ఇప్పుడు ఇదే తరహా రాజకీయం చూపించారు. తన సోదరుడు, జనసేన అధినేత అయిన పవన్ కల్యాణ్ కోసం సీటును.. ఆపై ఆత్మాభిమానం చంపేసుకుని మరీ ప్రచారం చేసి గెలిపించారు పిఠాపురం టీడీపీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ. అంతటి త్యాగాన్ని చేసిన వ్యక్తిని ఉద్దేశించి నాగబాబు చేసిన వ్యాఖ్యలపై తెలుగు తమ్ముళ్లు మండిడుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో చర్చతో రచ్చ కూడా చేస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి తామే కారణమని ఎవరైనా అనుకుంటే... అది వారి ‘ఖర్మ’ అంటూ కొణిదెల నాగబాబు పిఠాపురం ఆవిర్భావ సభలో అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) విజయం ఎన్నికలకు ముందే ఖాయమైందని, ఆ విజయం వెనుక వర్మ చేసిందేమీ లేదన్నట్లుగా మాట్లాడారాయన. ఎన్నికల సమయంలో తనకు, తన బృందానికి పవన్ కళ్యాణ్ బాధ్యతలు అప్పగించారని, అది కేవలం తమ సంతృప్తి కోసం అప్పగించిన బాధ్యతలే అన్నారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు పవన్ కళ్యాణ్‌ను గెలిపించాలని ఎన్నికలకు ముందే నిశ్చయించుకున్నారని చెప్పారు. ఈ పరిస్థితిలో ఎవరైనా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పని చేశామని కానీ, విజయానికి తామే కారణమని కానీ అనుకుంటే అది వారి ‘ఖర్మ’ అని స్పష్టం చేశారు. కాగా, నాగబాబు వ్యాఖ్యలు టీడీపీలో దుమారం రేపుతున్నాయి. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విజయానికి తాను ఎంతో కష్టపడి పని చేశానని వర్మ అనేక సందర్భాల్లో చెప్పారు. అయినా మొన్న ఎమ్మెల్సీ సీటు ఆయనకు దక్కలేదు. పైగా నాగబాబుకు టికెట్ దక్కింది. అయితే ఎమ్మెల్సీ రాకపోయినా తాను సర్దుకుపోతానని వర్మ ఒక మాట అన్నారు. దీంతో ఇటు టీడీపీలోనే కాదు.. అటు జనసేనలోనూ ఆయనపై సింపథీ ఏర్పడింది. ఇలాంటి తరుణంలోనూ నాగబాబు పిఠాపురం సభలో చేసిన వ్యాఖ్యలు మంచి పద్ధతి కాదని సోషల్ మీడియా వేదికగా టీడీపీ అభిమానులు మండిపడుతున్నారు. పిఠాపురంలో వ్యూహాత్మకంగా టీడీపీని, వర్మను నిర్వీర్యం చేయడానికే నాగబాబు ఇలా మాట్లాడారని, ఓట్లు వేయించుకుని గద్దెనెక్కాక ఇలా నాలుక మడతెయ్యడం తగదని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్మ ఎవరినీ వదిలిపెట్టదని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. -
SVSN వర్మపై నాగబాబు కామెంట్స్
-
వర్మ అది నీ కర్మ! మళ్లీ అగ్గి రాజేసిన నాగబాబు
-
నాగబాబు వ్యంగ్యాస్త్రాలు.. మరింత అగ్గి రాజేసేలా!
పిఠాపురం: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవడానికి టీడీపీకి చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పాత్ర ఏమీ లేదని జనసేన నేత నాగబాబు ఒక్క దెబ్బలో తేల్చి పారేశారు. అసలు పవన్ గెలుపునకు ఏ నేతైనా కారణం అనుకుంటే అది వారి ‘ఖర్మ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది కూడా పిఠాపురం వేదికగా ఈరోజు(శుక్రవారం) జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో నాగబాబు పరోక్షంగా చురకలు అంటించారు. కేవలం పవన్ విజయానికి పిఠాపురం ప్రజలు, జన సైనికులే కారణమని ఒక్క ముక్కలో చెప్పేశారు నాగబాబు. ఇక్కడ పవన్ గెలుపునకు పవనే ప్రధాన కారణంగా చెప్పుకొచ్చారు. వర్మ సీటు త్యాగం సంగతి ఏంటో..?అసెంబ్లీలో అడుగు పెట్టడమే కలగా మారిన పవన్ కళ్యాణ్‌కు సహకరించి.. ఆ కల నెరవేరేలా చేసింది పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ. ఇక్కడ తన సీటును త్యాగం చేసి మరీ పవన్ ను భుజాన వేసుకున్నారు వర్మ, అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని చంద్రబాబు ఆశ చూపడంతో పాటు దానికి పవన్ కళ్యాణ్ కూడా వంత పాడటం కూడా జరిగింది. సర్లే.. చంద్రబాబు మన నాయకుడే.. పవన్ కూడా మన వాడే అనుకున్నాడో ఏమో వర్మ.. ఎమ్మెల్సీ టికెట్ అన్నారు కదా అని ఆ ఎమ్మెల్యే సీటను త్యాగం చేశారు వర్మ,. మరి తీరా చూస్తే వర్మకు ఊహంచని పరిణామం ఎదురైంది. ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకుండా పెద్ద షాకిచ్చారు చంద్రబాబు..పవనే దెబ్బ కొట్టారా..?ఆయనే రాజకీయంగా దెబ్బకొట్టారనే చర్చ జోరుగా జరుగుతోంది. ఆయనకు ఎమ్మెల్సీ సీటు రాకుండా పవన్ అడ్డుపడ్డారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే పిఠాపురంలో తనకు ఇబ్బందులు వస్తాయని ఆయన చంద్రబాబుకు చెప్పడం వల్లే పక్కన పెట్టారని టీడీపీ నేతలు చెబుతున్నారు.తనకు ప్రొటోకాల్ సమస్యలు వస్తాయని, వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వవద్దని స్వయంగా పవనే .. చంద్రబాబుకు చెప్పారని రెండు పార్టీల్లోనూ చర్చించుకుంటున్నారు. అలాగే వర్మకు పదవి లభిస్తే పిఠాపురంలో ఆయన ప్రాధాన్యత పెరిగి రెండు అధికార కేంద్రాలు ఏర్పాటవుతాయనే ఆందోళనలోనూ పవన్ కళ్యాణ్ ఉన్నట్లు చెబుతున్నారు.అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ తాను అక్కడి నుంచి పోటీ చేయడం కష్టమవుతుందనే భావనలో ఆయన ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. వర్మ ఎమ్మెల్సీ అయితే నియోజక వర్గానికి చెందిన కూటమి నేతలు ఆయన వద్దకే వెళతారని, ఇది రాజకీయంగా తమకు నష్టమని పవన్ అంచనా వేస్తున్నట్లు సమాచారం. మరింత అగ్గి రాజేసేలా..పవన్ కూడా వర్మ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూస్తానని అంతర్గతంగా చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీంతో పవన్‌ను గెలిపించేందుకు వర్మ అహర్నిశలు పనిచేశారు. టీడీపీ శ్రేణులు పలుచోట్ల ఆయనను తిట్టినా లెక్క చేయకుండా తిరిగి పవన్‌ను గెలిపించారు. రెండుచోట్ల ఓడిపోయిన వ్యక్తికి తన సీటును త్యాగం చేసి గెలిపించి అసెంబ్లీకి పంపడంలో కీలకపాత్ర పోషించారు.ఇప్పుడు ఆయనకే పవన్ అడ్డుపడడం ఏమిటని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వర్మను పవన్ దెబ్బకొట్టడం దారుణమని వాపోతున్నాయి. ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులో ఆయనకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందుతున్నాయి. ఇప్పుడు ఏకంగా నాగబాబు నోటి వెంట వర్మ పేరు రాలేదు.. కదా పరోక్షంగా సెటైర్లు వేయడం ఇప్పుడు మరో చర్చకు దారి తీసింది. ఇప్పటికే టీడీపీ-జనసేనలపై ఆగ్రహంగా ఉన్న వర్మ వర్గంలో మరింత అగ్గి రాజేశారనే వాదన తెరపైకి వచ్చింది. -
నాడు మా వర్మ... నేడు నీ ఖర్మ!
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో అడుగు పెట్టడమే కలగా మారిన పవన్ కళ్యాణ్‌కు సహకరించి.. ఆ కల నెరవేరేలా చేసిన పిఠాపురం టీడీపీ ఇన్‌ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మను ఆయనే రాజకీయంగా దెబ్బకొట్టారనే చర్చ జోరుగా జరుగుతోంది. ఆయనకు ఎమ్మెల్సీ సీటు రాకుండా పవన్ అడ్డుపడ్డారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తే పిఠాపురంలో తనకు ఇబ్బందులు వస్తాయని ఆయన చంద్రబాబుకు చెప్పడం వల్లే పక్కన పెట్టారని టీడీపీ నేతలు చెబుతున్నారు. తనకు ప్రొటోకాల్ సమస్యలు వస్తాయని, వర్మకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వవద్దని స్వయంగా పవనే .. చంద్రబాబుకు చెప్పారని రెండు పార్టీల్లోనూ చర్చించుకుంటున్నారు. అలాగే వర్మకు పదవి లభిస్తే పిఠాపురంలో ఆయన ప్రాధాన్యత పెరిగి రెండు అధికార కేంద్రాలు ఏర్పాటవుతాయనే ఆందోళనలోనూ పవన్ కళ్యాణ్ ఉన్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ తాను అక్కడి నుంచి పోటీ చేయడం కష్టమవుతుందనే భావనలో ఆయన ఉన్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. వర్మ ఎమ్మెల్సీ అయితే నియోజక వర్గానికి చెందిన కూటమి నేతలు ఆయన వద్దకే వెళతారని, ఇది రాజకీయంగా తమకు నష్టమని పవన్ అంచనా వేస్తున్నట్లు సమాచారం. సీటు త్యాగం చేసిన వ్యక్తికి వెన్నుపోటా!ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేసిన వర్మకు ఇది తీరని అన్యాయమని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాకలో పోటీ చేసి ఒక్క చోట కూడా పవన్ కళ్యాణ్ గెలవలేకపోయిన విషయం తెలిసిందే. పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో అధినేత ఓడిపోవడం అప్పట్లో జనసేన వర్గాలు జీర్ణించుకోలేకపోయాయి. పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని పలు సభల్లో చెప్పి బాధపడేవారు. దీంతో 2024 ఎన్నికల్లోనూ ఆయనను ఓటమి భయం వెంటాడింది. అందుకే చివరి వరకూ ఎక్కడ పోటీ చేయాలో తేల్చుకోలేకపోయారు. రకరకాల సమీకరణాల తర్వాత పిఠాపురం అయితే బాగుంటుందని పొత్తులో ఆ సీటును తీసుకున్నారు. కానీ టీడీపీ శ్రేణులు మొదట దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. టీడీపీ సీటును జనసేనకు ఎలా ఇస్తారని భారీ ఎత్తున ఆందోళనకు దిగాయి. టీడీపీ తరఫున ఆ సీటు దాదాపు ఖరారైన ఎస్వీఎస్ఎన్ వర్మ అయితే రాజీనామాకు సైతం సిద్ధపడ్డారు. కానీ, చంద్రబాబు పలుమార్లు బుజ్జగించడంతో శాంతించి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పని చేశారు. అధికారంలోకి వచ్చాక ఆయనను ఎమ్మెల్సీ చేస్తామని చంద్రబాబు గట్టిగా హామీ ఇవ్వడంతోనే ఆయన పవన్ కోసం తన సీటు త్యాగం చేశారు. పిఠాపురం టీడీపీ శ్రేణుల్ని బ్రతిమిలాడి ఆయన పవన్ కోసం పని చేయించారు. పవన్ అసెంబ్లీకి వెళ్లడంలో వర్మది కీలక పాత్ర పవన్ కూడా వర్మ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూస్తానని అంతర్గతంగా చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీంతో పవన్‌ను గెలిపించేందుకు వర్మ అహర్నిశలు పనిచేశారు. టీడీపీ శ్రేణులు పలుచోట్ల ఆయనను తిట్టినా లెక్క చేయకుండా తిరిగి పవన్‌ను గెలిపించారు. రెండుచోట్ల ఓడిపోయిన వ్యక్తికి తన సీటును త్యాగం చేసి గెలిపించి అసెంబ్లీకి పంపడంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పుడు ఆయనకే పవన్ అడ్డుపడడం ఏమిటని టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన వర్మను పవన్ దెబ్బకొట్టడం దారుణమని వాపోతున్నాయి. ఎమ్మెల్సీ స్థానాల కేటాయింపులో ఆయనకు అన్యాయం జరిగిందని ఆవేదన చెందుతున్నాయి. -
వర్మ.. నీ కర్మ వాళ్ళని ఎలా నమ్మావయ్యా..
-
‘వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్.. కానీ’: నాదెండ్ల మనోహర్
కాకినాడ: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకిచ్చిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మకి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన బాబు..ఇప్పుడు ఆ హామీని గాలికొదిలేశారు. దాంతో చంద్రబాబు మాట నమ్మి ఇప్పటికే రెండు సార్లు మోసపోయిన వర్మ.. మరోసారి దానికి గురి కాకతప్పలేదు. తాజాగా టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ టికెట్ల జాబితాలో వర్మ పేరు ఎక్కడా కనిపించలేదు.పవన్ కళ్యాణ్ కు పిఠాపురం ఎమ్మెల్యే సీటును వర్మ వదులుకున్న క్రమంలో ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు తీరా చూస్తే వర్మ కి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదుజఈ అంశంపై పీఏసీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఆసక్తికర కామెంట్లు చేశారు. ఎస్పీఎస్ఎన్ వర్మ ఒక సీనియర్ పొలిటిషియన్ అంటూనే, ఆయన ఎమ్మెల్సీ టికెట్ అంశమనేది వారి పార్టీనే నిర్ణయిస్తుందన్నారు మనోహర్. ఇక్కడ తాము వర్మకి చెక్ పెట్టాల్సిన అవసరం ఏముంటందన్నారు మనోహర్.‘పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా. వర్మ చాలా సీనియర్ పొలిటీషియన్. వాళ్ళ పార్టీ ఆయన విషయం లో నిర్ణయం తీసుకుంటుంది, అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. వర్మ ని గౌరవించడం లో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వర్మకి చెక్ పెట్టాల్సిన అవసరం ఏమి ఉంటుంది’ అని అన్నారు.ఇక ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు మనోహర్ పేర్కొన్నారు. పవన్ సెక్యూరిటీ విషయంలో డిపార్ట్మెంట్ తో పాటు పార్టీ పరంగా మేము కూడా చూసుకుంటాం. సభా ప్రాంగణం లో 75 సి సి కెమెరా లు ఏర్పాటు చేస్తాం. పిఠాపురం ప్రజలకి కృతజ్ఞతలు చెప్పడానికి ఈ సభ ఏర్పాటు చేశాం. ఈ నెల 14 న సాయంత్రం 4 గంటలకు జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ ప్రారంభమవుతుంది’ అని పేర్కొన్నారు మంత్రి మనోహర్. -
ఎమ్మెల్సీ పదవుల్లో సీనియర్లకు హ్యాండ్ ఇచ్చిన చంద్రబాబు
-
బాబు, పవన్ రాజకీయం.. వర్మకు వెన్నుపోటు!
ఎప్పటిలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మాట తప్పారు. చంద్రబాబు మాట మీద నిలబడితే వింతకానీ మాట తప్పితే వింతేముంది. తనది నలభై ఏళ్ల రాజకీయ అనుభవం అంటారు కానీ.. ఈ అనుభవం వెన్నుపోట్లలోనే ఎక్కువగా ఉంటుందన్నది చరిత్ర తెరిచి చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.దీనికి తాజా ఉదాహరణ కావాలా?. పిఠాపురం ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి.. జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన వర్మనే తీసుకుందాం. ‘నీకెందుకు వర్మా నీ రాజకీయ భవిష్యత్ నా చేతిలో ఉంది.. మొదటి ఛాన్స్ లోనే నీకు ఎమ్మెల్సీ ఖాయం.. ముందు నువ్వు పవన్‌ను గెలిపించి చూడు.. నీ ఫ్యూచర్ ఎక్కడో ఉంటుంది’ అని ఎన్నికల సమయంలో చంద్రబాబు వేలాది మంది జనం సమక్షంలో చెప్పారు.. అదే తరుణంలో పవన్ సైతం తనకు వర్మ రాజకీయ భవిష్యత్ కన్నా పెద్ద పనేం లేదని.. ఆయన్ను ఒక స్థాయిలో పెట్టడమే తన ముందున్న కర్తవ్యం అన్నారు. ఇలా ఇద్దరు పెద్ద మనుషులు మాటిచ్చారు.దీంతో, ఇక తనకు తిరుగులేదని వర్మ కూడా నిన్న మొన్నటివరకూ దిలాసాగా ఉన్నారు. తీరా చూస్తే ఎమ్మెల్యేల కోటాలో వచ్చిన మూడుకు మూడు ఎమ్మెల్సీలను కావలి గ్రీష్మ.. బీద రవిచంద్ర.. బీటీ నాయుడులకు ఇచ్చిన చంద్రబాబు.. వర్మకు మాత్రం దెబ్బేశారు. అదేంటి తన ఫ్యూచర్ కోసం ఇద్దరు హామీలు ఇచ్చారు కానీ ఒక్కరు కూడా తన గురించి ఆలోచించలేదా అని వర్మ.. ఆయన వర్గీయులు లోలోన మదనపడుతున్నారు. కానీ, ఈ విషయం ఎక్కడా బయటకు అనలేని పరిస్థితి.ఇదిలా ఉండగా తన గెలుపు వెనుక వెన్నుదన్నుగా నిలిచిన వర్మను పవన్ కళ్యాణ్ కూడా కావాలనే పట్టించుకోవడం మానేశారా.. అది తెలుగుదేశం పార్టీ వ్యవహారం కదా మధ్యలో నేనెందుకు దూరడం అని దూరంగా ఉన్నారా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకే తన పార్టీకి దక్కిన ఎమ్మెల్సీని అన్నయ్య నాగబాబుకు ఇచ్చి.. అక్కడితో పవన్ సైలెంట్ అయ్యారు తప్ప తన కోసం పని చేసిన వర్మను పట్టించుకోలేదు. వాస్తవానికి పవన్‌లో ఈ ఆలోచన ఉండుంటే అయన చంద్రబాబుకు గట్టిగా చెప్పి వర్మకు అవకాశం ఇప్పించవచ్చు. కానీ, పవన్ ఆపని చేయలేదు.అప్పట్లో మాటైతే ఇచ్చేసారు కానీ మాటను నిజం చేసే విషయంలో పెద్దగా సీరియస్‌గా లేరు. అందుకే వర్మను ఆయన మానాన ఆయన్ను వదిలేశారు. మరోవైపు చంద్రబాబు కూడా పిఠాపురంలో పవన్ ఫిక్స్ అయిపోతున్న తరుణంలో వర్మను ఎందుకు ఇంకా మోయడం అని పక్కన పెట్టారా అనే సందేహాలు కూడా ఉన్నాయ్.. ఏదైతేనేం పవన్‌ను గెలుపు తీరానికి చేర్చిన వర్మ రేవులో తాడిచెట్టు మాదిరిగా ఒంటరిగా మిగిలిపోయారు.. చంద్రబాబు బాగా వాడుకుని వదిలేసిన వారి జాబితాలో తాజాగా చేరిపోయారు.-సిమ్మాదిరప్పన్న. -
SVSN వర్మకు చంద్రబాబు, పవన్ వెన్నుపోటు
-
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి చంద్రబాబు షాక్
అమరావతి: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మకి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన బాబు..ఇప్పుడు ఆ హామీని గాలికొదిలేశారు. దాంతో చంద్రబాబు మాట నమ్మి ఇప్పటికే రెండు సార్లు మోసపోయిన వర్మ.. మరోసారి దానికి గురి కాకతప్పలేదు. తాజాగా టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ టికెట్ల జాబితాలో వర్మ పేరు ఎక్కడా కనిపించలేదు.పవన్ కళ్యాణ్ కు పిఠాపురం ఎమ్మెల్యే సీటును వర్మ వదులుకున్న క్రమంలో ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు తీరా చూస్తే వర్మ కి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు చంద్రబాబు. దాంతో చంద్రబాబు తీరుపై వర్మ వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరొకవైపు వర్మ రాజకీయ భవిష్యత్ ముగిసిందనే ప్రచారం కూడా సాగుతోంది. చంద్రబాబు ఇచ్చిన షాక్ తో వర్మ వర్గం అయోమయంలో పడింది. తమనేత రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిన సమయంలో ఏం చేయాలనే దానిపై వారు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. -
కష్టపడి సాధించిన విజయమే నిజమైన గౌరవం..! పిఠాపురం టీడీపీ వర్మ ట్వీట్ వైరల్
-
పిఠాపురం టీడీపీ ఇన్ ఛార్జ్ వర్మ సంచలన ట్వీట్
-
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై టీడీపీ నేత వర్మ సంచలన ట్వీట్
పిఠాపురం: పిఠాపురం నియోజకవర్గ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సంచలన ట్వీట్ చేశారు. ‘కష్టపడి సాధించే విజయానికి గౌరవం’ అంటూ తన ఎక్స్ హ్యాండిల్లో విడుదల చేసిన వీడియో కలకలం రేపుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గెలుపు కోసం తాను చేసిన ఎన్నికల ప్రచారాలన్నీ కలిపి వీడియోగా రూపొందించి, పోస్టు చేశారు. ఆ వీడియోలో ఎక్కడా పవన్ కల్యాణ్ ఫొటో కూడా లేకపోవడం సంచలనంగా మారింది. పవన్ గెలుపులో తన పాత్రే కీలకం అనే అర్థం వచ్చేలా తయారు చేయించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కేవలం గత ఎన్నికల్లో తాను చేసిన ప్రచారాన్ని మాత్రమే పోస్టు చేయడంతో పాటు, పవన్ కష్టపడి విజయం సాధించలేదని, తన కష్టంతో ఆయన పదవి సాధించారనే అర్థం వచ్చేలా ఉన్న ఆ పోస్టింగ్ జనసేన శ్రేణుల్లో మంట పుట్టించింది. ఇప్పటికే పిఠాపురంలో టీడీపీ–జనసేన మధ్య ఆధిపత్య పోరు రగులుతుండగా, ఈ పోస్టు మరింత అగ్గి రాజేసిందంటున్నారు. ఇదిలా ఉండగా తన సోషల్ మీడియా అకౌంట్‌ను మూడేళ్లుగా హైదరాబాద్‌కు చెందిన సోషల్ ప్లానెట్ సంస్థ నిర్వహిస్తోందని, గురువారం తన ఎక్స్ అకౌంట్లో వచ్చిన వీడియోతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని వర్మ తన అకౌంట్లో పోస్టు పెట్టారు. తన ప్రమేయం లేకుండా సోషల్ ప్లానెట్ సంస్థ తప్పుడు వీడియో పోస్టు చేసిన విషయం తెలుసుకుని, వెంటనే డిలీట్ చేయించానని, తన పర్మిషన్ లేకుండా తప్పుడు వార్తలు పోస్టు చేస్తే తగిన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.నా సోషల్ మీడియా అకౌంట్స్ గత 3 సంవత్సరాలుగా హైదరాబాదు లోని సోషల్ ప్లానెట్ సంస్థ మెయింటైన్ చేస్తూ ఉంటుంది.ఈరోజు నా ఎక్స్ లో పోస్ట్ చేసిన వీడియో కి నాకు ఎటువంటి సంబంధం లేదు సోషల్ మీడియాలో నా ప్రమేయం లేకుండా సోషల్ ప్లానెట్ సంస్థ వారు తప్పుడు వార్త పోస్ట్ చేసిన విషయం తెలుసుకొని (1/2)— SVSN Varma (@SVSN_Varma) February 20, 2025 -
లోకేష్ ను డిప్యూటీ సీఎంను చేయాల్సిందే.. పిఠాపురంలో పవన్ పని అయిపోయే
-
‘ఏ హోదాతో పిఠాపురంలో పెత్తనం చేస్తున్నారు?’
సాక్షి, కాకినాడ: పిఠాపురం నియోజకవర్గం కూటమి రాజకీయంలో కుంపటి నెమ్మదిగా రాజుకుంటోంది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజే.. జనసేన శ్రేణుల నుంచి టీడీపీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు చేదు అనుభవం ఎదురైంది. ఇక ఇప్పుడు.. ఆయనకు పూర్తిగా చెక్ పెట్టేందుకు జనసేన రాష్ట్ర కార్యదర్శి, పవన్ సోదరుడు నాగబాబు రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల్లో ఆయన హల్చల్ చేస్తుస్తుండడంతో.. వర్మ వర్గీయులకు సహించడం లేదు. తాజాగా నియోజకవర్గంలో అధికార యంత్రాంగంతో నాగబాబు సమావేశం అయ్యారు. సమస్యలు ఉంటే పవన్ దృష్టికి లేదంటే పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్‌కు తీసుకెళ్లాలని సూచించారు. అలాగే.. ఏదైనా ఇష్యూ ఉంటే మర్రెడ్డి డీల్ చేస్తారని, మర్రెడ్డి చెప్తేనే యాక్షన్ తీసుకోవాలని.. అంతేగానీ వేరే పార్టీకి, ఆ పార్టీ నేతలకు సరెండర్ కావాలని అవసరం లేదని నాగబాబు అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. నాగబాబు అధికారులతో జరిపిన చర్చ టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నాగబాబు ఏ హోదాతో పిఠాపురంలో ఇలాంటి పెత్తనాలు చేస్తున్నారు?.. ఆయన సోదరుడి నియోజకవర్గం అయినంతమాత్రానా ఇలా వ్యవహరించాలా? అని నిలదీస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని, లేకుంటే భవిష్యత్తులో నియోజకవర్గంలో పార్టీ ఉనికికే ప్రమాదం కలిగించవచ్చని, అదే జరిగితే తమ దారి తాము చూసుకుంటామని వర్మకు వాళ్లు అల్టిమేటం ఇచ్చినట్లు సమాచారం. మరి పిఠాపురంలో నాగబాబు డామినేషన్‌ను వర్మ ముందుముందు ఎలా డీల్ చేస్తారనేది చూడాలి. -
పిఠాపురంలో వర్మపై దాడి చేసిన జనసైనికులు
-
పిఠాపురం వర్మపై జనసేన దాడి
కాకినాడ, సాక్షి: పిఠాపురం టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మపై జనసేన కార్యకర్తలు దాడికి దిగారు. రాళ్లు, కొబ్బరికాయలతో దాడి చేయడంతో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనలో వర్మతో సహా పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో స్థానిక సర్పంచ్‌తో మంతనాలు జరిపేందుకు వర్మ వెళ్లారు.ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామ జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు వచ్చి వర్మను అడ్డుకున్నారు. ‘మాకు తెలియకుండా మా గ్రామం ఎందుకు వచ్చారు.. మాకు తెలియకుండా మా గ్రామంలో ఇతర పారీ్టల వాళ్లను ఎందుకు కలుస్తున్నారు’ అంటూ వర్మను నిలదీశారు. మీకు చెప్పాల్సిన పని లేదంటూ వర్మ వారికి బదులివ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు.రాళ్లు, కొబ్బరి కాయలతో వర్మ కారుపై దాడి చేయడంతో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. వారి నుంచి తప్పించుకుని ఆయన కారులో వేగంగా వెళ్లిపోయారు. వర్మపై దాడి విషయం తెలియడంతో గొల్లప్రోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జనసేన నేతలకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేసినా వారు శాంతించలేదు. జనసేన నేతల దాడి నుంచి తప్పించుకుని వచ్చిన వర్మ గొల్లప్రోలు– చేబ్రోలుకు మధ్యలో ఉన్న తన గెస్ట్‌హౌస్‌కు చేరుకోగా పోలీసులు ఆయనకు రక్షణ ఏర్పాట్లు చేశారు. నన్ను చంపడానికి ప్రయత్నించారు: వర్మ ఎన్నికల్లో పని చేసిన వారికి కృతజ్ఞతలు తెలపడానికి వెళితే జనసేన శ్రేణులు తనపై దాడి చేశాయని టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. ఆయన శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర సర్పంచ్ల సమాఖ్య అధ్యక్షుడు చిలకపూరి ప్రభాకరరావు పిలుపు మేరకు సర్పంచ్‌లు ఎన్నికల్లో తమకు అనుకూలంగా పని చేశారన్నారు. దీంతో తాను సర్పంచ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలపడానికి వన్నెపూడి వెళ్లానన్నారు. ఈ క్రమంలో ఆ గ్రామానికి చెందిన మాజీ టీడీపీ నేతలు, ప్రస్తుతం అధికారం కోసం జనసేనలోకి వెళ్లిన కొందరు నేతలు తనపై దాడికి దిగారని ఆరోపించారు. తనపై ఇటుకలు, గాజు గ్లాసులు, డ్రింక్ సీసాలు, కంకర రాళ్లు, కర్రలతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ దాడిలో తనతో పాటు మరికొందరికి గాయాలయ్యాయన్నారు. అల్లరి మూకలను జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. జనసేన నేతలు తనను చంపడానికి ప్రయతి్నంచారని ధ్వజమెత్తారు. 9 నెలలుగా ఉదయ్ తనను వేధిస్తున్నాడని.. జనసేనకు పనిచేయడం తన ఖర్మ అని వ్యాఖ్యానించారు.తనపై హత్యాయత్నం వెనుక ఉదయ్ హస్తం ఉందని ఆరోపించారు. తనపై దాడి చేస్తున్నప్పుడు వన్నెపూడికి చెందిన టీడీపీ కార్యకర్తలు సుమారు 150 మంది తనకు రక్షణ వలయంగా ఉండడంతో తాను బయటపడ్డానన్నారు. తనపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని కోరుతూ గొల్లప్రోలు పోలీసు స్టేషన్ వద్ద వర్మ టీడీపీ శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొనడంతో ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. -
పిఠాపురం:ఫలితం ఏదైనా వర్మకు వేదనే
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ పడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు రాజకీయంగా సమాధే అనే అభిప్రాయం ఆయన అనుచరవర్గం నుంచే వినిపిస్తోంది. ఒకవేళ విజయం సాధిస్తే అదంతా తన బలమేనని పవన్ గొప్పలు పోవడం గ్యారంటీ. ఓటమి పాలైతే వర్మ వెన్నుపోటు పొడిచారనే నెపం నెట్టేస్తారు. ఫలితం ఏదైనా తమ నాయకునికి రాజకీయ భవిష్యత్తు శూన్యంగా కనిపిస్తోందని వర్మ వర్గీయులు బలంగా భావిస్తున్నారు. ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి పవన్, వర్మల మధ్య సఖ్యత వీధుల్లో మాత్రమే కనిపిస్తోందని, అంతర్గతంగా ఎన్నెన్నో ఉన్నాయని జనసేన నాయకులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ 2019లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులైన టీసీ నాగిరెడ్డి (గాజువాక) చేతిలో 16,753 ఓట్లు, గ్రంధి శ్రీనివాస్ (భీమవరం) చేతిలో 8,357 ఓట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. తాజా ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేయబోతున్నట్లు చివరి నిమిషం వరకు కలరింగ్ ఇచ్చారు. టీడీపీ, బీజేపీలతో కలిసి జనసేన ఉమ్మడిగా ఎన్నికలకు వెళుతుండటం, తన సామాజిక వర్గీయులైన కాపు ఓటర్లు అధికంగా ఉన్నందున పవన్ పిఠాపురం అసెంబ్లీ స్థానాన్నిఎంచుకుని పోటీకి దిగారు. ఇక్కడి నుంచి 2014లో స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేసి 47,080 ఓట్ల మెజారీ్టతో గెలుపొందిన ఎస్వీఎస్ఎన్ వర్మ 2019లో టీడీపీ తరఫున పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి పెండెం దొరబాబు చేతిలో 14,992 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచీ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న వర్మను పొత్తుల మాటున పక్కకు నెట్టి పవన్ కల్యాణ్ సీటు చేజిక్కించుకున్నారు. మాటపై నిలబడతారా? అసెంబ్లీ సీటు చేజారడంతో జనసేనకు సహకరించే ప్రసక్తే లేదని, అనుయాయుల సహకారంతో మళ్లీ ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగుతానని బీరాలు పోయిన వర్మతో బాబు మంతనాలు జరిపి.. పవన్‌కు సహకరించేందుకు సమ్మతింపజేసిన సంగతి విదితమే. అన్యమనస్కంగానే ప్రచారంలోకి దిగిన తమ నేతతో ఎనలేని సఖ్యతను నటిస్తూ ఎన్నికల వరకూ సర్వం నీ చేతుల మీదుగానే సాగాలని అభిలíÙస్తున్నట్లుగా పవన్ పోకడలు ఉంటున్నాయని వర్మ అనుచరగణం అంటోంది. వాస్తవంగా జనసేన, టీడీపీ వ్యవహారాలు ఆ దిశగా లేవనేది క్షేత్ర స్థాయిలో పరిశీలకుల విశ్లేషణ. మరోవైపు మిత్రపక్షంలోని బీజేపీది పిఠాపురంలో నామమాత్రపు పాత్రేనని అంటున్నారు. ఈ పరిస్థితిలో వర్మ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. పవన్ గెలుపు ఓటముల్లో ఏదైనా సరే తనకు సంకట స్థితేనని ఈ మాజీ ఎమ్మెల్యే తన ముఖ్య అనుయాయుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. పవన్‌ది మాటపై నిలబడే తత్వం కాదని అనేక అంశాల్లో ఇప్పటికే నిర్ధారణయ్యింది. నాగిని నృత్యంలా ఆయన నాలుక ఎన్ని వంకర్లయినా తిరుగుతుంది. అవసరానికి వాడుకుని ఎన్నికలయ్యాక తూచ్.. నీకూ నాకూ చెల్లు అనడన్న గ్యారంటీ ఏమిటి? అనే ప్రశ్నను విజయవాడలో టీడీపీ ముఖ్య నాయకుని వద్ద వర్మ వ్యక్తం చేశారు. తర్వాత పిఠాపురం వైపు చూస్తారా? ఎన్నికలయ్యాక పవన్ పిఠాపురం వైపు చూస్తారా అనే అనుమానాలు జనసేనతో పాటు టీడీపీ క్యాడర్‌లోనూ లేకపోలేదు. 2019 ఎన్నికల్లో ఓడిన తర్వాత రెండు పర్యాయాలు మాత్రమే ఆయన గాజువాక వచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన నిరసనకు సంఘీభావం తెలిపేందుకు ఓసారి, పార్టీ నాయకులతో సమావేశానికి మరోసారి వచ్చారు. భీమవరానికి కూడా అంతే. పార్టీ నాయకులతో సమావేశానికి ఓ రోజు, వారాహి యాత్రలో భాగంగా మూడు రోజులు ఉంటానని చెప్పి, రెండు రోజులకు పరిమితమయ్యారు. నామమాత్రంగా పార్టీ సమావేశం కానిచ్చేసిన పవన్.. తక్కిన సమయాన్ని బ్రో సినిమా ట్రైలర్ డబ్బింగ్ పనికి వినియోగించుకున్నారు. 2023లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన జనసేన అధినేత.. ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో 2024 ఫిబ్రవరి 21న ముఖ్య నాయకులను కలుసుకునేందుకు మరోమారు వచ్చారు. పోటీ అంత సేఫ్ ఏమీ కాదు పోటీకి పిఠాపురాన్ని ఎంచుకున్నప్పటికీ అదంత సేఫ్ సీటేమీ కాదనే అనుమానాలు పవన్ వర్గంలో లేకపోలేదు. ఇదివరకే సొంత జిల్లాలోని భీమవరం నుంచి పవన్ ఓటమి చెందగా, ఆయన సోదరుడు చిరంజీవి సైతం సొంత నియోజకవర్గమైన పాలకొల్లులో బి.ఉషారాణి చేతిలో పరాభవం చవిచూశారు. మరో సోదరుడైన నాగబాబు సైతం నరసాపురం లోక్‌సభ అభ్యర్థిగా ఓడారు. వీటన్నింటినీ పరిశీలిస్తే గోదావరి జిల్లాలు కొణిదెల కుటుంబానికి సానుకూలం కాదనేది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. కాగా, పవన్ కల్యాణ్ ధోరణికి పిఠాపురం నియోజకవర్గం ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. సినిమా యాక్టర్, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పవన్‌ను కలవాలనుకునే వారికి ఏమాత్రం సాధ్యపడటం లేదు. ఈ విషయమై కొందరు నచ్చజెప్పగా ముందుగా నిర్ణయించిన వారిలో రోజుకు 50–60 మందికి సెల్పీలు దిగే అవకాశం ఇస్తానని సెలవిచ్చారట. ఈ లెక్కన రానున్న 30 రోజుల్లో గరిష్టంగా 1500–1800 మందిని కలుసుకోగలరన్న మాట. అదీ ఆయన నెల రోజుల పాటు నియోజకవర్గంలో నిలకడగా ఉన్న పక్షంలోనే. లేదంటే అదీ లేదు. ఇప్పుడే ఇలాగైతే ఎన్నికల తర్వాత తమ పరిస్థితి ఏమిటని పిఠాపురం నియోజకవర్గం ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గీత.. పక్కా లోకల్ పవన్‌కు పోటీదారైన వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీత విద్యాభ్యాసం అనంతరం టీడీపీలో చురుకుగా ఉంటూ జెడ్పీ చైర్‌పర్సన్‌గా, రాజ్యసభ సభ్యురాలిగా, ఎమ్మెల్యే (ప్రజారాజ్యం)గా, లోక్‌సభ సభ్యురాలిగా పిఠాపురం నియోజకవర్గంలో విస్తృత పరిచయాలు కలిగి ఉన్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా వంగా గీతను ‘మా అమ్మాయి’ అని చెప్పుకునేంతగా అందుబాటులో ఉంటూ కలిసిపోతారని, ఆమెతో పోటీ పడటం అంత సులువు కాదని టీడీపీ, జనసేన పారీ్టల ముఖ్యులు వ్యాఖ్యానిస్తున్నారు. -
‘పవన్.. పేకాట క్లబ్ మూయిస్తారా? లేక పార్ట్నర్ అవుతారా?’
నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది అనే సామెత జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కరెక్ట్‌గా సరిపోతుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏదీ మాట్లాడతారో ఆయనకే తెలియదు కాబట్టి. ఒక వ్యక్తి గురించి ముందు నెగిటివ్‌గా మాట్లాడి వెంటనే పాజిటివ్‌గా పొడుగుతూ ఆయన్నే దగ్గరకు తీసుకుంటారు పవన్. అంతేకాదు పొగడ్తలతో ముంచెత్తడం కూడా చేస్తారు. ఇంతకీ ఏం జరిగిందనుకుంటున్నారా.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు(2014) పిఠాపురం నుంచి ఎన్వీఎస్ఎన్ వర్మ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలో పవన్.. వర్మపై సంచలన ఆరోపణలు చేశారు. ఓ సభలో పవన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వర్మ ఇక్కడ పేకాట క్లబ్ నడుపుతున్నారు. ఎమ్మెల్యే అయి ఉండి పేకాట నడుపుతారా? అని ప్రశ్నించి వర్మపై చిందులు వేశారు. ఆగ్రహంతో ఊగిపోయారు. ఇక, కట్ చేస్తే ఇప్పుడు అదే వర్మను కలిసి పవన్ సాదర ఆహ్వానం పలికారు. అంతేకాదు ఆయన గెలుపు కోసం వర్మను వీరుడు అని అంటున్నాడు. దీంతో, సోషల్ మీడియాలో పవన్‌పై ట్రోలింగ్ మొదలైంది. సోషల్ మీడియా వేదికగా.. ఒకవేళ పవన్ గెలిస్తే మీ పార్ట్నర్ పేకాట క్లబ్ మూస్తారా? లేక మీరే పార్ట్నర్ అవుతారా? అని నెటిజన్లు ప్రశిస్తున్నారు. ఇదే సమయంలో పవన్‌పై సెటైరికల్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. -
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు.. పిఠాపురం వర్మ కౌంటర్
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురంలో పవన్ తప్ప వేరెవరొచ్చినా పల్లకీ మోయనంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తేల్చి చెప్పారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ పోటీ చేస్తేనే సహకరిస్తానన్నారు. ‘‘వేరే వాళ్లు పోటీకి దిగితే టీడీపీ నుంచి నేనే పోటీ చేస్తా.. పవన్ ఎంపీగా వెళ్తే నన్ను పోటీ చేయమని చంద్రబాబు చెప్పారు’’ అని వర్మ అన్నారు. కాగా, పిఠాపురం నుంచి పోటీ చేయడంపై పవన్ కల్యాణ్ తర్జనభర్జన పడుతున్నారు. బీజేపీ నాయకత్వం తనను ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పిందన్న పవన్.. మరోవైపు, కాకినాడ ఎంపీగా ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని ప్రకటించారు. ఒక వేళ అమిత్‌షా చెప్తే తాను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని పవన్ తెలిపారు. తాను ఎంపీగా పోటీ చేస్తే.. పిఠాపురం ఎమ్మెల్యేగా ఉదయ్ పోటీ చేస్తారని పవన్ చెప్పారు. ఇప్పటికే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించుకున్న పవన్.. ఇప్పుడు మళ్లీ అవసరమైతే కాకినాడ ఎంపీగా వెళ్తానంటున్నారు. ఇంతకీ పిఠాపురంలో పవన్ పోటీ చేస్తారా? లేదా? అనే దానిపై స్పష్టత లేక జనసేన వర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. ఇదీ చదవండి: చిలకలూరిపేట సభపై ఎల్లో మీడియా వక్రభాష్యం -
పిఠాపురం రచ్చ.. వర్మ దారెటు?
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు లేకుండానే సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. మూడు మండలాలు, రెండు మున్సిపాలిటీలు నుంచి అనుచరులు రావాలని వర్మ స్పష్టం చేశారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేయడానికి వర్మ మొగ్గుచూపుతున్నారు. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ చేస్తానని ప్రకటించడంతో టీడీపీలో రచ్చ మొదలైంది. ఇప్పటికే వర్మకు పార్టీ పెద్దలనుంచి పిలుపు రాగా, కార్యకర్తలతో సమావేశం తర్వాత వస్తానని వర్మ చెప్పినట్లు సమాచారం. కాగా, కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ ప్రకటించిన పది నిమిషాలకే అక్కడ టీడీపీలో అసమ్మతి అగ్గి రగిలింది. మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు టికెట్టు నిరాకరించడంపై ఆ పార్టీ వర్గాలు పిఠాపురంలో గురువారం తీవ్ర స్థాయి ఆందోళనకు దిగాయి. పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద వర్మ అనుచరులు, ఆ పార్టీ నేతలు చంద్రబాబుకు, పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ జెండాలు, బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పత్రికలు తగులబెట్టారు. వర్మకు టికెట్టు ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపి, రెబల్‌గా పోటీ చేయిస్తామని గతంలోనే వారు ప్రకటించారు. అధిష్టానం తన నిర్ణయం మార్చుకోపోతే టీడీపీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని, సానుకూల నిర్ణయం ప్రకటించేంత వరకూ టీడీపీ జెండాలు సైతం పట్టుకోబోమని ఇటీవల చెప్పారు. తామంతా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామంటూ సంతకాలు సేకరించారు. ఈ నేపథ్యంలో పవన్ ప్రకటనతో భగ్గుమన్న టీడీపీ నేతలు చంద్రబాబును, పవన్ కల్యాణ్‌ను తీవ్ర పదజాలంతో దూషించారు. ఇప్పటి వరకూ సీటు వర్మదే అంటూ నమ్మబలికిన చేతకాని లోకేశ్ ఇప్పుడు మాట మార్చి తమను మోసం చేశాడంటూ పలువురు మహిళా నేతలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. క్యాడర్‌తో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని వర్మ ప్రకటించారు. పార్టీని నమ్ముకుని ఇప్పటి వరకూ సేవ చేస్తే తనకు కాకుండా ఎవరో స్థానికేతరుడికి సీటు కేటాయించడం దారుణమంటూ పవన్ కల్యాణ్‌ను స్థానికేతరుడని పరోక్షంగా విమర్శించారు. తాను స్థానికుడినని పవన్ స్థానికేతరుడని చెబుతూ ఎవరి కోసమో తన సీటును బదలాయించడం చంద్రబాబు తీసుకున్న తప్పుడు నిర్ణయమని అన్నారు. -
Pithapuram Protest Photos: భగ్గుమన్న పిఠాపురం (ఫొటోలు)
-
Pithapuram: పిఠాపురం నుంచి పవన్ పోటీ.. టీడీపీలో అసంతృప్తి సెగలు
సాక్షి, కాకినాడ: పిఠాపురంలో టీడీపీలో అసమ్మతి సెగ రేగింది. పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పవన్ పోటీ చేస్తారన్న ప్రకటనతో అసమ్మతి భగ్గుమంది. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలను ఎన్వీఎస్ఎన్ వర్మ అనుచరులు దహనం చేశారు. వర్మను పార్టీ మోసం చేసిందంటూ నినాదాలు చేశారు. వర్మ ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని అనుచరులు ఆందోళన చేపట్టారు. వర్మకి సీటు రాకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు టీడీపీ కార్యకర్తలు సిద్ధమవుతున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా వర్మ అనుచరులు నినాదాలు చేస్తున్నారు. రేపు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా: వర్మ రేపు కార్యకర్తలతో సమావేశమవుతానని, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వర్మ తెలిపారు. గత 20 ఏళ్లుగా పిఠాపురంలో టీడీపీకి సేవలందిస్తున్నాను. గత రెండు నెలలుగా సీటు విషయమై చాలా బాధపడుతున్నాను. గత ఎన్నికల్లో ఓడినా.. పార్టీ, ప్రజల కోసం పని చేశానని వర్మ తెలిపారు. కాగా, పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి పవన్ కళ్యాణ్ దారుణంగా ఓడిపోయారు. ఎంపీగా పోటీ చేసే అంశంపై పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని పవన్ చెప్పుకొచ్చారు. గత కొన్ని రోజులుగా పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై జనసేన పార్టీలో సందిగ్ధత నెలకొంది. ఏ చోటకు వెళ్తే అక్కడ పోటీ చేస్తానని నిన్నటి వరకు ప్రకటనలు చేసిన పవన్.. ఎట్టకేలకు పిఠాపురం దగ్గర ఆగిపోయారు. -
టీడీపీకి కొత్త టెన్షన్.. బెడిసికొట్టిన ‘బాబు’ ప్లాన్!
పెళ్లికి ముందే దంపతులు కొట్టుకుంటోన్నట్లుంది టీడీపీ-జనసేనల వ్యవహారం. దేశ రాజకీయ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఎన్నికలకు చాలా నెలల ముందే టీడీపీ-జనసేన పొత్తు పెట్టేసుకున్నాయి. కలిసి వెళ్తామని చెప్పుకొచ్చాయి. అయితే క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల నేతల మధ్య ఏ మాత్రం సయోధ్య లేదు. ఆ విషయం ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశాలు చాలా చోట్ల రెండు పార్టీల నేతల మధ్య ఘర్షణలకు దారి తీస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఈ పొత్తుతో ఎన్నికల ఏరు ఎలా దాటుతారో అర్ధం కావడం లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు.. ఇటీవల కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం లో జరిగిన టీడీపీ-జనసేన పార్టీల సమన్వయ సమావేశం రచ్చ రచ్చయింది. ఇరుపార్టీల నేతల మధ్య సాగిన మాటల యుద్దం ఉద్రిక్త పరిస్ధితులకు దారి తీసింది. దీంతో ఇక ఇక్కడ భవిష్యత్తులో టీడీపీ-జనసేన కలిసి ముందుకు వెళ్ళే పరిస్ధితి లేదన్న విషయం నియోజకవర్గ ప్రజలకు అర్ధమైంది. ఇక అసలు విషయానికి వస్తే పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితులు ఏర్పడ్డాయి. ఇందుకు కారణం గత కొన్ని రోజులుగా టీడీపీకి చెందిన నేతలు, కార్యకర్తలను జనసేన పార్టీలో చేర్చుకుంటున్నారు ఉదయ్ శ్రీనివాస్. ఇది మాజీ ఎమ్మెల్యే వర్మకు నచ్చలేదు. టీడీపీకి షాక్.. రెండు పార్టీలు కలిసి ముందుకు వెళ్ళాల్సిన తరుణంలో బయట పార్టీలో ఉన్న నేతలు, కార్యకర్తలను చేర్చుకోవాల్సింది పోయి తన కేడర్‌ను చేర్చుకోవడం ఏమిటని శ్రీనివాస్‌పై రగిలిపోతున్నారు వర్మ. ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రిందట పిఠాపురంలోని పాత టీడీపీ కార్యాలయం వద్ద తెలుగుదేశం-జనసేన పార్టీల సమన్వయ కమీటీ సమావేశం జరిగింది. అయితే, ఈ సమావేశంలో జనసేన కో-ఆర్డినేటర్ ఉదయ్ శ్రీనివాస్ చేసిన వాఖ్యలు వర్మకు పుండు మీద కారం చల్లినట్లు అయ్యింది. వచ్చే ఎన్నికల్లో తనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని శ్రీనివాస్ కోరారు. గత ఎన్నికల్లో వర్మ ఓటమి చెందిన కారణంగా తనకు ఈ అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఇలా శ్రీనివాస్ చేసిన వాఖ్యలు వర్మకు మంట పుట్టించాయి. దీంతో వర్మ మైక్ పట్టుకుని చాలా కూల్‌గా శ్రీనివాస్‌కు కౌంటర్ ఇచ్చారు. గత ఎన్నికల్లో తాను ఓడిపోయింది వాస్తవమే అని.. తనతో పాటుగా ఆ ఎన్నికల్లో మహామహులు కూడా ఓడిపోయారంటూ పరోక్షంగా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి తనదైన శైలిలో విమర్శలు చేశారు. దీంతో వర్మ వాఖ్యలు రుచించని జనసేన నాయకులు ఆక్రోశంతో రగిలిపోయారు. జై జనసేన అంటూ టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమావేశం కోసం వేసిన కుర్చీలు, టేబుళ్ళలను తన్నేశారు. 2014 ఎన్నికల్లో నువ్వు ఇండిపెండెంట్ అభ్యర్ధిగా బరిలో ఉంటే మేము గెలిపించిన సంగతి మరచిపోవద్దంటూ వర్మకు సూటిగా సమాధానం ఇచ్చారు జనసేన నాయకులు. ఇలా జనసేన-టీడీపీ నేతల మధ్య కాసేపు దూషణలు జరగడంతో ఆ పార్టీలో నేతల మధ్య ఉన్న విభేధాలు బయట పడ్డాయి. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలకు టీడీపీ తనకు సీటు ఇవ్వని పక్షంలో 2014 మాదిరిగా మళ్లీ స్వతంత్ర అభ్యర్ధిగా వర్మ బరిలో నిలవాలని ఫిక్స్ అయ్యారటా. దీంతో పిఠాపురంలో టీడీపీ-జనసేన పొత్తు ఉండకపోవచ్చన్న భావన నియోజకవర్గ ప్రజల్లో పాతుకుపోయింది. -
యూ.కొత్తపల్లి పోలిస్‌స్టేష్‌న్ వద్ద ఉద్రిక్తత
-
లాఠీ చార్జి.. సొమ్మసిల్లిన మహిళ
కాకినాడ : యూ.కొత్తపల్లి పోలిస్‌స్టేష్‌న్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీ చార్జి చేయడంతో ఓ మహిళ సొమ్మల్లి పడిపోయింది. వివరాలు.. గత నెల 11న ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. పోలింగ్ రోజున పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో తమ గ్రామస్తులను అక్రమంగా అరెస్టు చేశారంటూ ఉప్పాడ ప్రజలు యూ.కొత్తపల్లి పోలిస్‌స్టేషన్ ఎదుట మంగళవారం ఆందోళనకు దిగారు. అధికార పార్టీ అండదండలతో పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడ్డారని ఆరోపించారు. తమ గ్రామస్తులను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. అయితే, శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఉప్పాడ గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జి చేసి జులుం ప్రదర్శించారు. లాఠీ దెబ్బలకు ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. పలువురు గాయపడ్డారు. కొంతమంది ఆందోళన కారులను పోలీసులు స్టేషన్లోకి ఈడ్చుకెళ్లారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
టీడీపీ ఎమ్మెల్యేపై కేసు
సాక్షి, తూర్పుగోదావరి : ఎన్నికల నిబంధనలు అతిక్రమించిన టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మపై కేసు నమోదు చేసినట్లు కొత్తపల్లి పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం ఎన్నికల సందర్భంగా ఈ నెల 11న ఉప్పాడ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ నిబంధనలకు విరుద్ధంగా కారుతో ప్రవేశించారు. స్కూల్ గేట్లు వేసి అరగంటకు పైగా పోలింగ్ కేంద్రంలో గడిపారు. ఓటర్లతో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా భయభ్రాంతులకు గురి చేశారు. వర్మ తీరుతో రెచ్చిపోయిన గ్రామస్థులు ఆందోళన దిగారు. ఈ విషయంపై ఎమ్మెల్యే వర్మపై వైఎస్సార్ సీపీ ఎన్నికల ఏజెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే వర్మతో పాటు మరో 30మందిపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు. -
పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యేకు చుక్కెదురు
సాక్షి, తూర్పు గోదావరి : పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే ఎస్ వి ఎస్ ఎన్ వర్మకు చుక్కెదురైంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనకు సెజ్ రైతుల నుంచి నిరసన ఎదురయింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా వర్మ గురువారం రమణక్కపేటలో పర్యటిస్తుండగా సెజ్ రైతులు ఎమ్మెల్యే ప్రచార రథాన్ని అడ్డుకున్నారు. గత ఎన్నికలకు ముందు సెబ్ భూముల్లో ఏరువాక చేసి వాటిని తిరిగి రైతులకు ఇచ్చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు. కానీ ఇప్పటివరకూ ఆ హామీని నేరవేర్చలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూములు తిరిగి ఇవ్వాలని.. లేదా నూతన భూసేకరణ చట్టం కింద తమకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులను ఈడ్చిపడేశారు. అయితే రైతుల పట్ల నిర్దయగా వ్యవహరించిన ఎమ్మెల్యే వర్మ పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతోంది. -
మరోసారి బట్టబయలైన టీడీపీ - జనసేన బంధం
సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీ, జనసేన వేర్వేరు కాదని.. ఆ రెండు పార్టీలు ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాయని గత కొన్ని రోజులుగా ఏపీ వ్యాప్తంగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. రెండు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయని మరోసారి స్పష్టమైంది. ఆ ఆరోపణలను నిజం చేస్తూ టీడీపీ, జనసేన పార్టీలు వేర్వేరు కాదని.. రెండు పార్టీలు ఒకటేనని తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే వర్మ బహిరంగ వ్యాఖ్యలు చేశారు. పిఠాపురానికి చెందిన స్థానిక జనసేన నేత ఒకరు శుక్రవారం వర్మ సమక్షంలో టీడీపీలో చేరారు. ఆ సందర్భంగా వర్మ ఆయనతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయడు, పవన్ కళ్యాణ్ స్నేహితులేని, ఎన్నికల తరువాత వారిద్దరూ కలిసే ఉంటారని అన్నారు. ఇంకా కొంతమంది ఉంటే టీడీపీలో చేర్పించాలని.. జనసేన కూడా మనతో కలిసే పార్టీయేనని చెప్పారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మధ్య బంధం ఇంకా కొనసాగుతూనే ఉందని విశాఖ టీడీపీ ఎన్నికల పరిశీలకు మెట్ట సత్యనారాయణ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. వాళ్లిద్దరి మధ్య మంచి అవగహన ఉందని.. దాని ప్రకారమే సీట్ల ఒప్పందం కూడా జరిగిందని ఆయన తెలిపారు. టీడీపీకి చెందిన కీలక నేత పవన్, బాబు మధ్య ఉన్న బంధాన్ని బహిర్గతం చేయడంతో ఇన్నేళ్లు జరుగుతున్న ప్రచారం నిజమైంది. కాగా టీడీపీ, జనసే మధ్య ఉన్న అతర్గత ఒప్పందం ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ సీట్ల పంపిణీ విషయంలో కూడా ఇరు పార్టీలు పరస్పరం సహకరించుకున్నాయి. టీడీపీ, జనసేన లోపాయికారీ ఒప్పందం. ఒక్కో ఘటన బయటపడుతుండడంతో నిజమైన జనసేన శ్రేణులు నివ్వెరపోతున్నాయి. కాగా నిజంగానే బాబుతో విభేదించి బయటకు వచ్చారని, నిజమైన ప్రత్యామ్నాయం కోసం పవన్ కల్యాణ్ తపనపడుతున్నాడని నమ్మిన ఆయన అనుచరులు కంగుతింటున్నారు. -
మరోసారి బట్టబయలైన టీడీపీ జనసేన మైత్రి
-
‘తమ్ముడూ..’ పవన్ మనోడే..!
సాక్షి, తూర్పుగోదావరి : టీడీపీ, జనసేన ముసుగు రాజకీయాలు మరోసారి తేటతెల్లమయ్యాయి. పవన్ కల్యాణ్, చంద్రబాబు ఇప్పటికీ కలిసే ఉన్నారని టీడీపీ ఇటీవల బయటపడుతున్న పలు ఉదంతాలు వెల్లడిస్తున్నాయి. వేదికలపై అంటీఅంటకుండా విమర్శలు చేసుకుంటున్న ఇరు పార్టీలు ప్రజల్ని మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నాయి. ఇక పవన్, బాబు మధ్య ఉన్న దోస్తానా గురించి పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ బయటపెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ.. ‘పవన్ మన స్నేహితుడే.. అంతా కలిసే పనిచేద్దాం’ అని పిలుపునిచ్చారు. ఇక విశాఖజిల్లా టీడీపీ ఎన్నికల పరిశీలకుడు, పార్టీ కీలక నేత మెట్ల రమణబాబు కూడా టీడీపీ, జనసేన బంధాన్ని బయటపెట్టారు. పవన్, చంద్రబాబు కలిసే ఉన్నారని, వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. అమలాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి గండి రవి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యకర్తల సమావేశంలో రమణబాబు మట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్, చంద్రబాబు కలిసే ఉన్నారు. ఇద్దరూ ఒక అండర్‌స్టాండింగ్‌తో ఉన్నారు. వాళ్లిద్దరూ బద్ద శత్రువులుగా ఏమీ లేరు. మధ్యలో చిన్న డిస్ట్రబెన్స్ క్రియేట్ అయింది. ఇప్పుడైతే ఇద్దరూ కలిసే ఉన్నారు’ అన్నారు. ఇంకా కలిసే ఉన్నారని, వారి మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం. ఒక అవగాహనతో ఉన్నారని బయటపెట్టారు. (చదవండి : ఎస్పీవై నామినేషన్ : టీడీపీ, జనసేన హైడ్రామా..!) (చదవండి : నామినేషన్ ఉపసంహరించుకున్న జనసేన అభ్యర్థి) -
వర్మకు టిక్కెట్ ఇస్తే ఓడిస్తాం
తూర్పుగోదావరి, పిఠాపురం: గత ఎన్నికల్లో తనకు టీడీపీ సీటు ఇవ్వనందుకు పార్టీ జండాలను పట్టపగలు నడిరోడ్డుపై తగులబెట్టించిన ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తెలుగుదేశం పార్టీ నేత ఎలా అవుతారంటూ ఆయన వ్యతిరేక వర్గం పోరాటాన్ని ఉద్ధృతం చేయడంతో పిఠాపురం టీడీపీలో ముసలం ముదిరి అధినేత వద్దకు చేరింది. శుక్రవారం పిఠాపురానికి చెందిన టీడీపీ నేతలు వర్మ వ్యతిరేక వర్గం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబును కలిసి వర్మపై ఫిర్యాదు చేయడంతోపాటు కాపు సామాజికవర్గం నేతకు సీటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల వర్మకు వ్యతిరేకంగా సమావేశమైన టీడీపీ నేతలు కాకినాడ ఎంపీ తోట నరసింహం వద్ద పంచాయితీ పెట్టిన అనంతరం ముఖ్యమంత్రిని కలిశారు. ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు సీటు ఇస్తే ఓడించి తీరుతామని టీడీపీ నేతలు అధిష్టానానికి హెచ్చరించినట్లు సమాచారం. ముఖ్యమంత్రిని కలిసినవారిలో తెలుగుదేశం పార్టీ నేతలు మున్సిపల్ చైర్మన్ కరణం చిన్నారావు, మాజీ జడ్పీటీసీ జవ్వాది కృష్ణమాధవరావు, మాజీ నీటి సంఘం అధ్యక్షుడు తుమ్మల బాబులు, పడాల ఏసు, తదితరులు ఉన్నారు. -
దగా దగా పాటను తొలగించాలి
సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మితమవుతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’చిత్రంలో దగా.. దగా.. కుట్ర పాట విషయంలో తెలంగాణ హైకోర్టు మంగళవారం కేంద్ర, రాష్ట్ర సెన్సార్ బోర్డులకు నోటీసులు జారీ చేసింది. ఈ పాటను సినిమాతోపాటు సామాజిక మాధ్యమాలు, యూట్యూబ్ నుంచి తొలగించాలని పిటిషనర్ కోరుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. దగా.. దగా.. కుట్ర పాటలో ఏపీ సీఎం చంద్రబాబును కించపరిచేలా చూపుతున్నారని, ఈ పాటను సినిమా నుంచి, యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాల నుంచి తొలగించేలా సెన్సార్ బోర్డును ఆదేశించాలని కోరుతూ పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. దీనిపై మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ ఏపీకి చెందిన వ్యక్తి అయినప్పుడు, ప్రజాప్రయోజన వ్యా జ్యాన్ని తెలంగాణ హైకోర్టులో ఎలా దాఖలు చేస్తా రని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ వ్యాజ్యం దాఖలు చేసే నాటికి హైకోర్టు ఉమ్మడిగానే ఉందని, ఈ పాట ను హైదరాబాద్‌లో విడుదల చేశారని ఎమ్మెల్యే తరఫు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ చెప్పారు. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడు చేయడానికి సంబంధించిన పాట అని, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబును కించపరిచేలా ఉందని అన్నారు. చంద్రబాబును మోసకారిగా చూపుతున్నారని, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడానికి బాబే కారణమన్నట్లు ఈ పాటలో చూపుతున్నారని తెలిపారు. -
వాల్.. వార్..
ఏలేరు ఆధునికీకరణ పనులు అధికార పక్ష ప్రజాప్రతినిధుల మధ్య వివాదానికి ఆజ్యం పోశాయి. సాక్షాత్తూ హోంమంత్రి, ఉపముఖ్యమంత్రి చినరాజప్ప అనుచరులు, పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మధ్య వాగ్వివాదం చోటు చేసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. రక్షణ గోడ పనుల విషయంలో రాద్ధాంతం మొదలైంది. ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వర్మ ఆందోళనకు దిగడంతో పరిస్థితి మరింత తీవ్రతరమైంది. తూర్పుగోదావరి, పెద్దాపురం: ఏలేరు ఆధునికీకరణ పనులు అధికార పక్ష ప్రజాప్రతినిధుల మధ్య వాగ్వివాదానికి తెర తీశాయి. శివారు భూములకు ఏలేరు నీరు అందాల్సి ఉండగా, ఏలేరు ఆయకట్టుపై పెద్దాపురం మండలం దివిలిలో నిర్మిస్తున్న రక్షణ గోడ నిర్మాణ విషయంలో ఆదివారం మధ్యాహ్నం పిఠాపురం ఎమ్మెల్యే వర్మ, మంత్రి రాజప్ప అనుచరుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. పిఠాపురం రోడ్డులో అప్రోచ్ నిర్మాణం జరుపుతున్న మండల సర్పంచ్ల సమాఖ్య మాజీ అధ్యక్షుడు కొత్తెం కోటి, వారి అనుచరులపై అప్రోచ్ నిర్మాణం ఆపాలంటూ ఎమ్మెల్యే వర్మ ఆందోళనకు దిగారు. అక్రమ కట్టడం కాదని, రక్షణ గోడ నిర్మాణం చేపడుతుంటే పనులు నిలపాలనడం సరికాదంటూ కోటి వర్గీయులు పనులు ఆపకుండా కాంక్రీట్ పనులు చేపట్టారు. దీంతో ఆగ్రహించిన వర్మ ప్రత్తిపాడు –సామర్లకోట ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పెద్దాపురం డీఎస్పీ చిలకా వెంకట రామారావు ఆధ్వర్యంలో సీఐ యువకుమార్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు కల్పించారు. మంత్రి సహాయకులు నిమ్మకాయల సుబ్బారావు, ఇరిగేషన్ ఎస్ఈ కృష్ణారావు వారిని సముదాయించే ప్రయత్నం చేసినా వర్మ ఆగలేదు. ‘‘ఆరు రోజుల నుంచి ఈ ఈఈ గాడికి చెబుతూనే ఉన్నాను.. అయినా ఈ నా కొడుకులు పట్టించుకోవట్లేదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన వర్గీయులు ఆందోళన తీవ్రతరం చేయడంతో విషయాన్ని ఇరిగేషన్ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన ఆదేశాల మేరకు నిర్మాణ పనులు తాత్కాలికంగా వాయిదా వేస్తామని హామీ ఇవ్వడంతో వర్మ ఆందోళన విరమించారు. మూడు గంటల ఉద్రిక్త పరిస్థితుల అనంతరం ఆందోళన విరమించడంతో ఇటు పోలీసులు, ఇరిగేషన్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రైతులకు అన్యాయం జరిగితే సహించం ఏలేరు రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీమోహన్ అన్నారు. దివిలి జంక్షన్లో రైతులు చేపట్టిన ఆందోళనకు ఆయన మద్దతు పలికారు. అప్రోచ్ నిర్మాణంలో అక్రమంగా రైతులకు నీరు విడుదల కాకుండా చేస్తే సహించేది లేదన్నారు. రైతుల పక్షాన ఆందోళనకు సిద్ధమవుతాం.. ఏలేరు నీరు శివారు భూములకు అందకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే రైతుల పక్షాన ఆందోళనకు సిద్ధమవుతామని పిఠాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్ పెండెం దొరబాబు హెచ్చరించారు. ఏలేరు ఆధునికీకరణ పనుల పేరుతో దివిలిలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై రైతుల ఆందోళనకు మద్దతుగా దివిలి వచ్చిన ఆయన అధికారులతో మాట్లాడారు. ఇరిగేషన్ ఎస్ఈ కృష్ణారావు, సర్పంచ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు కొత్తెం కోటి, రైతులతో సమావేశమై రైతులకు ఇబ్బందులు లేకుండా నిర్మాణాలు చేపట్టాలని నీరు ఇబ్బందులకు కారణమైతే ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. అప్రోచ్ నిర్మాణం తాత్కాలిక వాయిదాకు చర్యలు దివిలిలో జరుగుతున్న అప్రోచ్ నిర్మాణాన్ని రైతుల అభిప్రాయాల మేరకు తాత్కాలిక వాయిదాకు చర్యలు చేపట్టామని ఇరిగేషన్ ఎస్ఈ కృష్ణారావు అన్నారు. పిఠాపురం నియోజకవర్గ రైతుల ప్రధాన డిమాండ్ మేరకు జిల్లా కలెక్టర్ దృష్టిలో ఉంచామని, అప్రోచ్ నిర్మాణంపై పూర్తి విచారణ చేపట్టి రక్షణ గోడ నిర్మాణం చేపడతామన్నారు. -
వర్మను నమ్మడం మాఖర్మ..!
తూర్పుగోదావరి, పిఠాపురం: మాపార్టీ తరఫున ఎన్నికల్లో నిలబడడానికి అభ్యర్థులు లేరని ఎన్నికల్లో నిలబడి తమ పరువు నిలబెట్టాలని బతిమలాడితే రాజకీయాలపై ఆసక్తి లేకపోయినా ఆయన మాటలు నమ్మి ఎన్నికల్లో నిలబడి మెజార్టీ సాధించి పెడితే అవసరం తీరాకా అవతలికి తగిలేస్తున్నారని ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ తీరుపై పిఠాపురం మండలం భోగాపురం ఎంపీటీసీ (టీడీపీ) అల్లుమల్లు ధనలక్ష్మి కృష్ణారావు మండిపడ్డారు. కొన్ని నెలలుగా తమను పక్కన పెట్టి ఇతర నాయకులు అధికారులతో అభివృద్ధి పనులు చేయిస్తూ తమను అవమానిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసిన ఆమె ఎమ్మెల్యే వర్మ తీరుకు నిరసనగా తన ఎంపీటీసీ పదవితో పాటు తెలుగదేశం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం తన రాజీనామా పత్రాన్ని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో చేపట్టిన అన్ని అభివృద్ధి పనులను తనకు సంబంధం లేకుండా ఏవిధమైన సమాచారం ఇవ్వకుండా అధికారులతో చేయిస్తున్నారన్నారు. తాను సిఫార్సు చేసిన వారికి కాపు కార్పొరేషన్ రుణాల రాకుండా తీయించేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా ఒక నియంతగా పని చేస్తున్న ఎమ్మెల్యే వర్మ ప్రజల చేత ఎన్నుకోబడిన తనను ఒక మహిళను అనే విజ్ఞత కూడా లేకుండా పక్కన పెట్టారన్నారు. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పుకునే ఎమ్మెల్యే వర్మ టీడీపీకి కష్టకాలంలో నిలబడి ఒక ఎంపీటీసీ పదవిని తెచ్చిపెట్టిన తనను అవమానిస్తు ఆడబడుచులకు తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. చివరకు గ్రామదర్శిని కార్యక్రమానికి సైతం తనకు సమాచారం ఇవ్వకుండా అవమానించిన ఎమ్మెల్యే వర్మను నమ్మడం నిజంగా తమ ఖర్మేనని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల మద్దతు ఉన్న తనను అణగదొక్కడానికి కొంత కాలంగా ఇతర నాయకులకు ప్రాముఖ్యత కల్పిస్తు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దారుణం జరుగుతున్నా పార్టీపై ఉన్న నమ్మకం అభిమానం ప్రజలు తనకు ఇచ్చిన పదవిని వమ్ము చేయకూడదన్న ఒకే ఒక్క పట్టుదలతో ఇన్ని రోజులు ఇబ్బందులు ఎదుర్కొన్నాని ఆమె తెలిపారు. అయితే గెలిపించిన ప్రజలు నాకు జరుగుతున్న అవమానాలను చూసి చలించి పోతున్నారని, పనుల గురించి ప్రశ్నిస్తున్నారని ఆమె తెలిపారు. ఇక ఎమ్మెల్యే ఇతర నాయకులు చేస్తున్న అవమానాలను తట్టుకోలేక రాజీనామా చేస్తున్నానని నమ్మించి నట్టేటముంచిన వర్మ ఓటమిని చూడడమే ధ్యేయంగా తాను పని చేస్తానని ఇలాంటి నమ్మక ద్రోహం మరే ఆడబడుచుకు జరగకుండా పోరాడతానని ఆమె తెలిపారు. ఎమ్మెల్యే వర్మ దౌర్జన్యాన్ని నిరసిస్తూ నేడు ర్యాలీ కాకినాడ సిటీ: పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ ప్రభుత్వ ఉద్యోగులపై చేస్తున్న దౌర్జన్యాన్ని నిరసిస్తూ మంగళవారం పిఠాపురం పురవీధుల్లో భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఏపీఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బూరిగ ఆశీర్వాదం తెలిపారు. కాకినాడలో జిల్లా ఎన్జీఓ కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గొల్లప్రోలులో శానిటరీ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న శివ లక్ష్మిని అవమానకరంగా తిట్టడమే కాకుండా మహిళ అని చూడకుండా ఆమెతో మురికి కాలవలోని పూడిక తీయించిన విధానాన్ని జిల్లా ఎంప్లాయీస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఎమ్మెల్యే వర్మ చర్యలను నిరసిస్తూ పిఠాపురం పురవీధుల్లో చేపట్టనున్న నిరసన ర్యాలీకి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు తరలిరావాలని ఆశీర్వాదం పిలుపునిచ్చారు. ఏపీఎన్జీఓ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జియాఉద్దీన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాస్, నాయకులు వై.శ్రీనివాస్, నరసింహం, నాలుగో తరగతి ఉద్యోగ ఉద్యోగ సంఘ జిల్లా అధ్యక్షుడు వైఎన్ సత్యనారాయణమూర్తి, వీఆర్వోల సంఘ జిల్లా అధ్యక్షుడు సాయిరెడ్డి, నీలపాల వీరబాబు, నాగేశ్వరరావు, మూర్తిబాబు, కృష్ణ, నారాయణ, రామాంజనేయులు, అజీజ్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీలో భగ్గుమన్న విభేదాలు బిక్కవోలు (అనపర్తి): బిక్కవోలు గ్రామ తెలుగుదేశం పార్టీలో అంతర్గతంగా ఉన్న వర్గ విభేదాలు సోమవారం ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే సమక్షంలోనే వ్యతిరేక వర్గాలు రెండు తీవ్ర పదజాలంతో ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుని దాడులకు తెగబడే యత్నం చేశారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఇద్దరు ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, పార్టీకి చెందిన నాయకులు తమ పదవులకు పార్టీకి రాజీనామా చేస్తున్నామంటు ప్రకటించి మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు బీసీలకు పెద్దపీట వేస్తామని నమ్మబలికి ఆధికారంలోకి వచ్చిన తరువాత బీసీలను విస్మరించి అసలు ప్రజలకు సంబంధం లేకుండా నామినేటెడ్ పదవిలో ఉన్న ఊలపల్లికి చెందిన సురేష్‌రెడ్డికి బిక్కవోలు గ్రామం పై పెత్తనం అప్పగించడమేమిటంటు వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడడమే కాకుండా ఆస్తులు అమ్ముకున్నామని, అయినా తమను పక్కన పెట్టి తీవ్ర అన్యాయం చేశారని గ్రామానికి సంబంధం లేని వ్యక్తులకు గ్రామ పెత్తనాన్ని అప్పగించడం పై ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు గంటలకు విలేకర్ల సమావేశం పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న నాయకులు సాయంత్రానికి ఎమ్మెల్యే నుంచి పిలుపు రావడంతో శాంతించారు. సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. అయితే రచ్చకెక్కిన విభేదాల నేపథ్యంలో పార్టీపై వారి విధేయత ఏ మేరకు ఉంటుందో, ఎమ్మెల్యే విశ్వాసాన్ని పొందడం సాధ్యమేనా అనే విషయం పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
పవన్ కల్యాణ్‌పై వర్మ సీరియస్..
సాక్షి, పిఠాపురం/తూర్పుగోదావరి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ నిప్పులు చెరిగారు. టీడీపీ నాయకులను పదేపదే బ్రోకర్లు అని సంబోధిస్తున్న తీరు సరిగా లేదని అన్నారు. పవన్ కల్యాణ్‌కు భాషా సంస్కారం తెలియదని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పవన్ పరుష పదజాలాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. లోకేష్ గెలవలేదు.. అయితే.. మీ దగ్గర ఏం పని చేశామని బ్రోకర్లం అయ్యామంటూ వర్మ విమర్శలు గుప్పించారు. ఏ పార్టీలో అయినా విలీనమయ్యామా? లేక అమ్ముడు పోయామా? అంటూ ప్రజారాజ్యంపై విమర్శలు చేశారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెసోళ్ల పంచలు ఊడదీస్తామని భారీ డైలాగులు చెప్పిన పవన్ తర్వాత అదే కాంగ్రెస్‌తో చేరిపోయారని ఎద్దేవా చేశారు. లోకేష్‌పై అనుచిత విమర్శలు చేయనిదే పవన్‌కు నిద్ర పట్టేలా లేదని వ్యాఖ్యానించారు. లోకేష్ పంచాయతీ మెంబర్ కూడా కాలేదు.. మరి మీరు దేనికి మెంబర్ అయ్యారని చురకలంటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మీలా సినిమాలు, నటన తెలియదని అన్నారు. -
‘తూర్పు’లో మరో చింతమనేని
కాకినాడ: మహిళల పట్ల టీడీపీ నాయకుల ప్రవర్తన మారినట్లుగా కనిపించడం లేదు. గతంలో దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమేని ప్రభాకర్, మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెల్సిందే. తాజాగా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఓ మహిళా అధికారితో డ్రైనేజీలో చేయి పెట్టించి వార్తల్లోకి ఎక్కారు. గొల్లప్రోలు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ శివలక్ష్మీతో బలవంతంగా కచ్ఛ డ్రైనేజీలో చేయి పెట్టించి మురుగు నీటి మట్టిని పిఠాపురం ఎమ్మెల్యే వర్మ ఎత్తించారు. ఇటీవల గొల్లప్రోలు 10వ వార్డులో గ్రామదర్శిని కార్యక్రమం సందర్భంగా డ్రైనేజీ శుభ్రంపై స్థానికులు, ఎమ్మెల్యే వర్మకు ఫిర్యాదు చేశారు. దీంతో వర్మ, శానిటరీ అధికారులకు ఫోన్ చేసి బండ బూతులు తిట్టారు. శానిటరీ ఇన్స్పెక్టర్ శివలక్ష్మీని పిలిపించి ఆమె నుంచి బలవంతంగా సెల్‌ఫోన్ లాక్కున్నారు. కాలువ పారతో కచ్ఛ డ్రైయిన్‌లో మట్టిని తీస్తూ..శివలక్ష్మీ చేత్తో ఆ మట్టిని బలవంతంగా ఎత్తించారు. అందరి ముందు అవమానానికి గురికావడంతో శివలక్ష్మీ సెలవు పెట్టి వెళ్లిపోయారు. విధులలో నిర్లక్ష్యం వహించిందన్న కారణంగా శివలక్ష్మీని, మున్సిపల్ కమిషనర్ విధుల నుంచి ఉపసంహరించారు. ఎమ్మెల్యే వర్మ తనకు చేసిన అవమానంపై ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని శివలక్ష్మీ కన్నీరు పెట్టుకున్నారు. మళ్లీ తన జోలికి వస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరికలు కూడా చేశారు. నలభై వేల మంది జనాభా కలిగిన గొల్లప్రోలు మున్సిపాలిటీలో 60 మంది శానిటరీ సిబ్బంది ఉండాలి.. కానీ 32 మంది మాత్రమే ఉన్నారు. -
వర్మా.. ఇదేం ఖర్మ!
తూర్పుగోదావరి, గొల్లప్రోలు : మొదటి చిత్రంలో ఉత్త చేతులతో మురుగు కాలువలోని పూడిక తీస్తున్న మహిళ ఎవరో తెలుసా... శానిటరీ ఇన్స్పెక్టర్...ఆ పక్కన నిలబడి పెత్తనం చెలాయిస్తున్నది పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ. పూడిక పేరుకుపోతే పారిశుద్ధ్య కార్మికులను పిలిపించి ఆ పనులు చేపట్టించాలి గానీ ఇదేమి దౌర్జన్యం...అందరూ చూస్తుండగానే మురుగులో చేతులు పెట్టించి తీయించడం... అదీ ఓ మహిళా ఉద్యోగిపట్ల ఇంత అమానుషమా అని అక్కడున్నవారు ముక్కునవేలేసుకున్నారు. రెండో చిత్రం చూశారు కదా...మురుగు కాలువలో దిగి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పని చేస్తున్నది ఎవరో తెలుసా... ఆ ఇంకెవరు మున్సిపల్ కార్మికుడై ఉంటారనుకుంటే బురదలో కాలేసినట్టే...మన పక్క రాష్ట్రమైన పుదుచ్చేరి రాష్ట్ర విద్యాశాఖామంత్రి కమలకన్నన్. నిరసనగా ఇలా చేశారంటే కానేకాదు ... పారిశుద్ధ్య కార్మికుల కష్టాన్ని గుర్తించి ‘నేను సైతం’ అంటూ శ్రమదానంగా ఇలా పనిలోకి దిగారు. ఆ మంత్రి పనిలో పెత్తనం లేదు...అహంకారం అంతకన్నా లేదు...ఆత్మీయత కనిపిస్తోంది. మరి ఇక్కడ ఇంత అరాచకమేమిటని పంచాయతీ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. గొల్లప్రోలు పట్టణం 9, 10 వార్డుల్లో టీడీపీ గ్రామదర్శిని కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్యటిస్తున్న సమయంలో పదో వార్డులో పాత పోలీస్ స్టేషన్ వీధిలోని మహిళలు పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందంటూ ఫిర్యాదు చేశారు. ఆ పక్కనే ఉన్న శానిటరీ ఇన్స్పెక్టరు శివలక్ష్మిపై ఎమ్మెల్యే మండిపడ్డారు. సత్వరమే శుభ్ర పరచాలని ఆదేశించడంలోనూ తప్పులేదు. కానీ అక్కడున్న జనం మెప్పు కోసం మహిళా అధికారి అని కూడా చూడకుండా చేతులతో మురికిని తీయాలని ఒత్తిడి చేశారు. దీంతో ఆమె చేసేది లేక టీడీపీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు చూస్తుండగా అవమాన భారంతో కాలువలో మురికిని చేతులతో తొలగించారు. ఎమ్మెల్యే వైఖరిపై పంచాయతీ కార్మికులు, ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పిఠాపురం ఎమ్మెల్యే కుమార్తె మృతి
పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కుమార్తె కావ్య (21) అనారోగ్యంతో మృతిచెందింది. హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో ఇంజనీరింగ్ చదివిన కావ్య బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యుల కథనం. తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆమెను సోమవారం రాత్రి స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా... పరిస్థితి విషమంగా ఉండడంతో అర్ధరాత్రి కాకినాడలోని మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కావ్య మృతి చెందింది. వర్మకు ఓ కమారుడు కూడా ఉన్నారు. అనారోగ్యంతో చిన్న వయసులో కావ్య మృతి చెందడంతో కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. -
రగులుకున్న రగడ
సాక్షి, కాకినాడ :గత ఎన్నికల్లో ఓటమి పాలైన పిఠాపురం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ ఈసారి కూడా టిక్కెట్ తనదేనన్న ధీమాతో ఉన్నారు. నియోజకవర్గంలో మెజార్టీగా ఉన్న కాపు, బీసీ సామాజికవర్గాల నేతలు ఎక్కడ తనకు పోటీకి వస్తారోననే భయంతో వారిని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననివ్వకుండా పక్కన పెడుతున్నారు. పొమ్మనకుండా పొగపెట్టినట్టు ఒక్కొక్కరిగా పార్టీ నుంచి సాగనంపేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే కొత్తపల్లి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వెంగళి సుబ్బారావును పార్టీ నుంచి సాగనంపారు. మరో మాజీ జెడ్పీటీసీ జవ్వాది కృష్ణ మాధవరావుతో పాటు పిఠాపురం మండల టీడీపీ అధ్యక్షుడు అల్లుమల్లు విజయ్‌కుమార్, రాయవరం పీఏసీఎస్ అధ్యక్షుడు మాదేపల్లి శ్రీనివాసరావు, చిత్రాడ సర్పంచ్ సింగంపల్లి బాబూరావులను పార్టీ కార్యకలాపాల్లో పాల్గొననివ్వకుండా పక్కన పెట్టేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న మాజీ ఎమ్మెల్యే దివంగత వెన్నా నాగేశ్వరరావు తనయుడు జగదీష్‌ను సైతం పక్కన పెట్టేందుకు ప్రయ త్నించడం పట్ల పలువురు కాపు, బీసీ నేతలు వర్మపై గుర్రుగా ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా ఏకమవుతూ తిరుగుబాటు బావుటా ఎగరేస్తున్నారు. ఆయా సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ద్వితీయ శ్రేణి నేతలంతా వర్మ వ్యవహారశైలిపై అవకాశం చిక్కిన ప్పుడల్లా బాహాటంగానే అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఏదేమైనా ఈసారి వర్మకు టిక్కెట్ ఇవ్వకూడదన్న డిమాండ్‌ను బలంగా వినిపిస్తున్నారు. భగ్గుమన్న అసంతృప్తి ఎన్టీఆర్ వర్ధంతి రోజున జల్లూరులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసేందుకు వెళ్లిన వర్మను స్థానిక నాయకులు అడ్డుకున్నారు. ఒక దశలో వర్మ అనుచరులకు, స్థానిక నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి, తోపులాటకు దారితీసింది. చివరకు పార్టీని వర్మ నుంచి రక్షించాలంటూ ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించే పరిస్థితి ఏర్పడింది. కాగా నియోజకవర్గ ఇన్చార్జి పదవి నుంచి వర్మను తప్పించాలంటూ చిత్రాడలో సర్పంచ్ సింగంపల్లి బాబూరావు నేతృత్వంలో వర్మ దిష్టిబొమ్మతో గురువారం ర్యాలీ నిర్వహించడం పార్టీలో అసంతృప్తి సెగల తీవ్రతకు అద్దం పట్టింది. 216 జాతీయ రహదారిపై ధర్నా చేసి, వర్మ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేయడం ద్వారా ఆయన పట్ల తమలో ఎంత వ్యతిరేకత పేరుకుందో చాటారు. మండల టీడీనీ మాజీ అధ్యక్షుడు అల్లుమల్లు విజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే వెన్నా నాగేశ్వరరావు తనయుడు జగదీష్, పిఠాపురం మాజీ జెడ్పీటీసీ జవ్వాది కృష్ణ మాధవరావు, కొత్తపల్లి మాజీ జెడ్పీటీసీ వెంగళి సుబ్బారావు(పార్టీ బహిష్కృత నేత) తదితరులు ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలపడమే కాక వర్మ తీరుపై మండిపడ్డారు. ఇన్చార్జి పదవి నుంచి వర్మను తప్పించాలంటూ చంద్రబాబుకు లేఖను సైతం పంపారు. కార్యకర్తల మనోగతం పట్టించుకోకుండా అధినేత ఒంటెత్తు పోకడలతో వర్మనే కొనసాగిస్తే పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామంటూ వీరంతా చెప్పకనే చెబుతున్నారు.