![Tension Situations At U Kothapalli Police Station Due To Lathi Charge - Sakshi](/styles/webp/s3/article_images/2019/05/7/lati.jpg.webp?itok=4AlISNgF)
కాకినాడ : యూ.కొత్తపల్లి పోలిస్‌స్టేష్‌న్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న గ్రామస్తులపై పోలీసులు లాఠీ చార్జి చేయడంతో ఓ మహిళ సొమ్మల్లి పడిపోయింది. వివరాలు.. గత నెల 11న ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. పోలింగ్ రోజున పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో తమ గ్రామస్తులను అక్రమంగా అరెస్టు చేశారంటూ ఉప్పాడ ప్రజలు యూ.కొత్తపల్లి పోలిస్‌స్టేషన్ ఎదుట మంగళవారం ఆందోళనకు దిగారు.
అధికార పార్టీ అండదండలతో పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడ్డారని ఆరోపించారు. తమ గ్రామస్తులను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. అయితే, శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఉప్పాడ గ్రామస్తులపై పోలీసులు లాఠీచార్జి చేసి జులుం ప్రదర్శించారు. లాఠీ దెబ్బలకు ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. పలువురు గాయపడ్డారు. కొంతమంది ఆందోళన కారులను పోలీసులు స్టేషన్‌లోకి ఈడ్చుకెళ్లారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment