
అమరావతి: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మకి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన బాబు..ఇప్పుడు ఆ హామీని గాలికొదిలేశారు. దాంతో చంద్రబాబు మాట నమ్మి ఇప్పటికే రెండు సార్లు మోసపోయిన వర్మ.. మరోసారి దానికి గురి కాకతప్పలేదు. తాజాగా టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ టికెట్ల జాబితాలో వర్మ పేరు ఎక్కడా కనిపించలేదు.
పవన్ కళ్యాణ్ కు పిఠాపురం ఎమ్మెల్యే సీటును వర్మ వదులుకున్న క్రమంలో ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు తీరా చూస్తే వర్మ కి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు చంద్రబాబు. దాంతో చంద్రబాబు తీరుపై వర్మ వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరొకవైపు వర్మ రాజకీయ భవిష్యత్ ముగిసిందనే ప్రచారం కూడా సాగుతోంది. చంద్రబాబు ఇచ్చిన షాక్ తో వర్మ వర్గం అయోమయంలో పడింది. తమనేత రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిన సమయంలో ఏం చేయాలనే దానిపై వారు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment