పిఠాపురం ఎమ్మెల్యే కుమార్తె మృతి | pithapuram mla daughter kavya died due to brain tumor | Sakshi
Sakshi News home page

పిఠాపురం ఎమ్మెల్యే కుమార్తె మృతి

Published Tue, Jul 21 2015 11:15 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM

pithapuram mla daughter kavya died due to brain tumor

పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ కుమార్తె కావ్య (21) అనారోగ్యంతో మృతిచెందింది.  హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో ఇంజనీరింగ్ చదివిన కావ్య బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యుల కథనం. తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆమెను సోమవారం రాత్రి  స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా... పరిస్థితి విషమంగా ఉండడంతో అర్ధరాత్రి కాకినాడలోని మరో ఆస్పత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ కావ్య మృతి చెందింది. వర్మకు ఓ కమారుడు కూడా ఉన్నారు. అనారోగ్యంతో చిన్న వయసులో కావ్య మృతి చెందడంతో కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement