నల్గొండ: మండల పరిధిలోని పర్వతగిరి గ్రామంలో మంగళవారం సాయంత్రం యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చనగాని కావ్య(20) గత రెండు సంవత్సరాలుగా ఫిట్స్‌తో బాధపడుతోంది.
తీవ్ర మనోవేదనకు గురై మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరేసుకుంది. సోదరుడు నవీన్ ఇంటికి వచ్చి కావ్యను గమనించి, నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కావ్య తల్లి లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment