Kavya
-
ఏసీబీకి చిక్కిన ఫుడ్ సేఫ్టీ అధికారి కావ్యరెడ్డి..
ఏలూరు టౌన్: నాణ్యత లేని గోలి సోడాలు తయారు చేస్తున్నారనే ఆరోపణలతో యజమాని నుంచి లంచం డిమాండ్ చేసిన ఏలూరు ఫుడ్‌సేఫ్టీ అధికారి, ఆఫీస్ అటెండర్‌ను ఏలూరు అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏలూరు అభివృద్ధి నిరోధక శాఖ డీఎస్పీ వి.సుబ్బరాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు మండలం కాట్లంపూడి గ్రామానికి చెందిన సాయి సుందర్ గోకుల్ అదే ప్రాంతంలో ఊప్స్ గోలీ సోడా కంపెనీ పేరుతో గోలీ సోడాను తయారు చేస్తున్నాడు. గోలి సోడా తయారీలో అధికంగా రసాయనాలు వినియోగిస్తున్నట్లు గుర్తించామనీ ఏలూరు ఫుడ్‌సేఫ్టీ అధికారి దొండపూడి కావ్యరెడ్డి, కార్యాలయ అటెండర్ పుల్లారావు గోకుల్‌కు ఫోన్ చేసి చెప్పారు. గోలీ సోడా విక్రయాలు సాఫీగా సాగాలంటే రూ.25 వేల లంచం డిమాండ్ చేశారు. ఎట్టకేలకు ఫుడ్‌సేఫ్టీ అధికారికి రూ.20 వేలు, సహాయకుడికి రూ.2 వేలు ఇచ్చేందుకు గోకుల్ సిద్ధపడ్డాడు. ఈ నేపథ్యంలో ఫుడ్‌సేఫ్టీ అధికారులు డబ్బులు కోసం వేధించటంతో గోకుల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో లంచం సొమ్మును ఫుడ్‌సేఫ్టీ అధికారి డి.వెంకట కావ్య రెడ్డికి, అటెండర్ పులపా పుల్లారావుకు గోకుల్ కార్యాలయంలో అందించాడు. అప్పటికే అవినీతి నిరోధక శాఖ అధికారులు వల పన్ని ఉండటంతో వెంటనే వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఫుడ్‌సేఫ్టీ అధికారి కావ్యరెడ్డి, అటెండర్ పుల్లారావు నుంచి రూ.22 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఫుడ్‌సేఫ్టీ అధికారి వినియోగిస్తున్న కారును తనిఖీ చేయగా లెక్కలు లేకుండా ఆరు కట్టలుగా కట్టి ఉన్న మరో రూ.87 వేల నగదును గుర్తించారు. మొత్తంగా రూ.లక్షా 9 వేల నగదును స్వా«దీనం చేసుకున్నారు. అలాగే ఫుడ్‌సేఫ్టీ అధికారి, అటెండర్ ఇంట్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఏలూరు ఏసీబీ డీఎస్పీ వీ.సుబ్బరాజు, సీఐలు ఎన్.బాలకృష్ణ, కే.శ్రీనివాస్, రాజమహేంద్రవరం ఏసీబీ అధికారి వాసుకృష్ణ ఉన్నారు. -
ఒక్కడిని చేసి వైఎస్సార్సీపీ నేతపై దాడి: Ramireddy Pratap Reddy
-
నిఖిల్ ముఖం వైపు కూడా చూసేందుకు ఇష్టపడని కావ్య..
-
ఎదురుపడ్డ మాజీ ప్రేమికులు నిఖిల్-కావ్య.. అక్కడే ఉన్నా గానీ!
ఈసారి బిగ్‌బాస్ షో (Bigg Boss 8 Telugu) విజేతగా సీరియల్ నటుడు నిఖిల్ (Nikhil Maliyakkal) నిలిచాడు. గేమ్‌లో గెలవడం సంగతి పక్కనబెడితే ఇతడికో లవ్ స్టోరీ ఉంది. తనతో పాటు సీరియల్స్ చేసిన కావ్యనే ప్రేమించాడు. కొన్నాళ్లు రిలేషన్లో ఉన్నారు. ఏమైందో ఏమో గానీ బ్రేకప్ అయింది. ఇదంతా నిఖిల్.. బిగ్‌బాస్‌కి రాకముందే జరిగిపోయింది. షోలో ఉన్నప్పుడే నిఖిల్-కావ్య ఒకరిపై ఒకరు కౌంటర్స్ వేసుకుంటూ ఇన్ స్టాలో పోస్టులు కూడా పెట్టారు.బిగ్ బాస్ అయిపోగానే వచ్చి కావ్యని కలుస్తానని షోలో ఉన్నప్పుడు నిఖిల్ చెప్పాడు. కానీ అలా చేయలేదు. నేరుగా కర్ణాటకలోని సొంతూరు వెళ్లిపోయారు. షోలో గెలిచిన ఆనందంలో పార్టీ చేసుకున్నారు. కానీ ఊహించని విధంగా మాజీ ప్రేమికులు నిఖిల్-కావ్య (Kavyashree) ఒకే షోలో ఎదురెదురు పడ్డారు. ఇంకా చెప్పాలంటే ఎదురు పడాల్సి వచ్చింది. కానీ కావ్య అయితే కనీసం నిఖిల్ ముఖం వైపు కూడా చూసేందుకు ఇష్టపడలేదు. షోలో నిఖిల్ ఉన్నంతసేపు చాలా సీరియస్ ఫేస్‌తో కనిపించింది.(ఇదీ చదవండి: Allu Arjun Issue: 3.30 గంటలు.. 20 ప్రశ్నలు)తాజాగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. దీనికే బిగ్‌బాస్ విజేత నిఖిల్ వచ్చాడు. అయితే కావ్యతో బ్రేకప్ గురించి తెలిసినా సరే హోస్ట్ శ్రీముఖి కావాలనే.. వీళ్లని పరిచయం చేస్తాను పదా అని చెప్పి కావ్య ఆడుతున్న టీమ్ దగ్గరకు తీసుకెళ్లింది. అయితే నిఖిల్ వైపు కనీసం చూసేందుకు కూడా కావ్య ఇష్టపడలేదు. షోలో ఉన్నంతసేపు కళ్లజోడు పెట్టుకునే నిఖిల్ కనిపించాడు. కళ్లద్దాలు తీయవా అని నిఖిల్‌ని శ్రీముఖి అడిగింది కానీ తీయను అనే సమాధానం నిఖిల్ నుంచి వచ్చింది.నిఖిల్-కావ్యని ఎదురెదురుగా పెట్టిన శ్రీముఖి.. మాట్లాడించడానికి చాలానే ప్రయత్నించింది. కానీ కావ్య మాత్రం చాలా కోపంగా చూసింది. కనీసం నిఖిల్‌ని చూడ్డానికి కూడా ఇష్టపడలేదు. నిఖిల్ నవ్వుతూనే కనిపించాడు కానీ కావ్యకి మాత్రం కన్నీళ్లు ఒక్కటే తక్కువ అన్నట్టుగా చాలా దిగులుగా కనిపించింది. తెగిపోయిన బంధం మళ్లీ అతుక్కునే ప్రసక్తే లేదు అన్నట్టుగానే కనిపించాయి కావ్య చూపులు. ప్రోమోలో అయితే కనీసం చూడలేదు. షోలో అయినా సరే వీళ్లు మాట్లాడించారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: పీవీ సింధు రిసెప్షన్లో సినీ స్టార్స్.. చిరు, అజిత్‌తో పాటు) -
కావ్య యష్మీల పై క్లారిటీ ఇచ్చిన నిఖిల్
-
జమ్మూ కశ్మీర్లో ఇద్దరు ఏపీ విద్యార్థుల దుర్మరణం
పత్తికొండ (తుగ్గలి)/గిద్దలూరు రూరల్: జమ్మూ కశ్మీర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు బీటెక్ విద్యార్థులు దుర్మరణం చెందారు. కారు అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో మొత్తం నలుగురు మృతి చెందగా వారిలో వీరిద్దరూ ఉన్నారు. మృతుల కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లా పత్తికొండలో స్థిర నివాసమేర్పరచుకున్న తుగ్గలి మండలం పెండేకల్లుకు చెందిన పాటిల్ ప్రతాపరెడ్డి, అనిత దంపతుల పెద్ద కుమారుడు వెంకట ఆనందరెడ్డి (21), ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీరాంనగర్‌కు చెందిన చెందిన ఆర్మీ జవాన్ రమణారెడ్డి కుమార్తె కావ్యారెడ్డి (19) ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో వీరు బీటెక్ చదువుతున్నారు. అయితే కావ్యారెడ్డి చెల్లెలు మనీషా (19) కూడా అదే కాలేజీలో బీటెక్ ఫస్టియర్ చదువుతోంది. దీపావళికి వరుస సెలవులు రావడంతో గత నెల 28వ తేదీన జమ్మూ కశ్మీర్‌కు 30 మంది స్నేహితులతో కలిసి ఆరు కార్లలో విహారయాత్రకు వెళ్లారు. 30వ తేదీ తిరుగు ప్రయాణంలో శ్రీనగర్–జమ్మూ నేషనల్ హైవేలో రామబన్ జిల్లా మగర్కూట్ వద్ద పర్వతాల మధ్య కారు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఘటనలో ఆనందరెడ్డి, కావ్యారెడ్డి, మరో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.కాగా, కారు లోయలో పడటాన్ని గమనించిన మనీషా వెంటనే డోరు తీసుకుని రోడ్డుపైకి దూకేసింది. దీంతో ఆమె చెయ్యి విరిగి తల పగిలింది. పరిస్థితి కొంత విషమంగా ఉంది. సమాచారం అందుకున్న మృతుల తల్లిదండ్రులు హుటాహుటిన ఘటనాస్థలానికి బయలుదేరి వెళ్లారు. శనివారం ఉదయం మృతదేహాలు స్వస్థలాలకు చేరుకుంటాయని బంధువులు తెలిపారు. -
కావ్య మండవతో దసరా ప్రత్యేక ఇంటర్వ్యూ
-
అడ్డంగా నరుకుతా.. రెచ్చిపోయిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి
సాక్షి, నెల్లూరు జిల్లా: అడ్డంగా నరుకుతా అంటూ సొంత పార్టీ నేతలపైనే కావలి టీడీపీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రెచ్చిపోయారు. వార్డు ఇంఛార్జ్ స్థాయికి కూడా పనికిరాని కొందరు తనపై లోకేష్‌కి ఫిర్యాదు చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.కావలి అడ్డాలో ఎక్కసెక్కాలు ఆడితే.. అడ్డంగా నరుకుతా అంటూ టీడీపీలోనే ప్రత్యర్థి వర్గానికి కావ్య వార్నింగ్ ఇచ్చేశారు. ఇటీవలే కావ్య కృష్ణారెడ్డిపై చంద్రబాబు, లోకేష్‌కు మాజీ ఇంచార్జ్ మాలేపాటి సుబ్బానాయడు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: దురుద్దేశంతో మహాపచారంకాగా, ఇటీవల కావలి తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై మాజీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జైల్లో ఉంటే టపాసులు కాల్చిన నేతలకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దగదర్తి మండలంలో తన వర్గాన్ని కొందరు ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని చంద్రబాబు,లోకేష్ వద్దే తేల్చుకుంటానని కార్యకర్తల సమావేశంలో మాలేపాటి వెల్లడించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం రూ.17 కోట్లు ఖర్చు పెట్టానంటూ మాలేపాటి వ్యాఖ్యానించారు. -
కావలి ఎమ్మెల్యే ఏకపక్ష వైఖరిపై యుద్ధం చేస్తా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘కావలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఏకపక్ష వైఖరితో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోంది. ఎమ్మెల్యే వైఖరిపై ఇకనుంచి ప్రత్యక్ష యుద్ధానికి నేను సిద్ధంగా ఉన్నాను. టీడీపీ నీది కాదని నన్ను అనే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు. టీడీపీ కోసం పని చేస్తే నాపై 16 కేసులు పెట్టించారు. ఇప్పుడు కొత్తగా నాపై వంద కేసులు పెట్టినా, జైల్లో పెట్టినా భయపడను. అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను. ఎన్నికల సందర్భంగా చెప్పిన మాట తప్పి, ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఘోరాలపై పార్టీ అధిష్టానం విచారణ కమిటీ నియమించి నిజాలను గుర్తించాలి’ అని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాలేపాటి సుబ్బానాయుడు పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు విజ్ఞప్తి చేశారు. ఆదివారం తన నివాసంలో కార్యకర్తలతో చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అవలంబిస్తున్న వివాదాస్పదమైన, ఘర్షణ పూరిత విధానాలపై ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే వీధుల్లో టాపాసులు కాల్చి సంబరాలు చేస్తున్న వ్యక్తులు ఈ రోజు టీడీపీలో పెత్తనం చేస్తున్నారని, ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడినే అడుగుతున్నా.. అసలు టీడీపీ ఎటు పోతోంది? ఏమి జరుగుతుంది? కడుపు రగిలిపోతుంది. పార్టీ ఏమవుతోందో అర్థం కావడం లేదన్నారు. నీతి నిజాయతీతో రాజకీయాలు చేయాలే కాని, లాలూచీ రాజకీయాలు చేస్తే ఊరుకోను. కావలిలో టీడీపీకి ఏమీ లేదు అనే రోజుల్లో పార్టీ ఆఫీస్‌ను ఏర్పాటు చేశానన్నారు. టీడీపీ కోసం రూ.17 కోట్లు ఖర్చు పెట్టానన్నారు. పార్టీ కార్యక్రమాలు, ఆందోళనలు నుంచి చంద్రబాబు సభలు, లోకేశ్ యువగళం ఆరు రోజుల పాదయాత్రను విజయవంతంగా నిర్వహించడంలో తాను ఎంతో కష్టపడ్డానన్నారు. దుగ్గిరాల కరుణాకర్ అనే యువకుడు చనిపోతే రూ.20 లక్షలు టీడీపీ తరఫున అతని కుటుంబ సభ్యులకు తాను సహాయం అందజేశానన్నారు. నోరుందని నిందలు వేసి పిచ్చిపిచ్చిగా మాట్లాడడం కాదని, నిరూపించాలని సవాల్ విసిరారు. టీడీపీలోకి రకరకాల వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు. కానీ తాను మాత్రం టీడీపీనే అన్నారు. ఇక నుంచి టీడీపీ కార్యకర్తలు, నాయకులకు అండగా ఉండేందుకు క్రియాశీలకంగా ఉంటానన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బుచ్చిరెడ్డిపాళెం– దగదర్తి రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తే.. ఇప్పుడు మళ్లీ రెండోసారి శంకుస్థాపన అంటూ హడావుడిగా చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. -
కదిలిన కావ్యం! వారాంతాల్లో పేదలకు అండగా..
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం.. ఆకర్షణీయమైన వేతనం.. ఆర్థికంగా అన్ని విధాలా స్థిరపడిన కుటుంబం.. ఇలాంటి సమయంలో యువత ఏం ఆలోచిస్తుంది.. మహా అయితే చర్మ సౌందర్యం.. బ్రాండెడ్ దుస్తులు, కార్లు, సెలవు రోజుల్లో రిలాక్స్ కోసంకుటుంబ సభ్యులు, స్నేహితులతో ప్రత్యేకంగా వీకెండ్ ప్లాన్స్ చేసుకుంటారు. దానికితోడు విలాసవంతమైన జీవితం కోరుకోవడం సహజం. అయితే హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి కావ్య మాత్రం పేద పిల్లలను చదివిస్తూ, ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం పెట్టి ఆకలి తీరుస్తూ, నాణ్యమైన దుస్తులు అందిస్తున్నారు. వారం రోజులు పనిదినాల్లో ఉద్యోగ బాధ్యతలతో బిజీగా ఉండే ఆమె సెలవు రోజుల్లో సేవా కార్యక్రమాలపై దృష్టిసారిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోఆమె ఆలోచనలకు కుటుంబ సభ్యులు ఆమోదం తెలుపుతుండగా, సహచర ఉద్యోగులు సైతం సహకరిస్తున్నారు. 2019లో ప్రముఖ సంస్థలో ఆమె సాఫ్ట్వేర్ సంస్థలో చేరారు. కరోనా సమయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి 200లకుపైగా కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అక్కడి నుంచి సేవా కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇదే క్రమంలో 2020లో చారిటీ విజిట్స్ యు ఆల్వేజ్ (చార్వ్య) పేరిట స్వచ్ఛంద సంస్థ స్థాపించారు. సెలవు దినాల్లో కార్యక్రమాలు నడిపిస్తున్నారు.మురికివాడలే లక్ష్యంగా.. నగర పరిధిలోని మురికి వాడలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, వలస కారి్మకులు ఉండే ప్రాంతాలే లక్ష్యంగా ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. ముందుగా ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో సుమారు ఎంత మంది జనం సాయం కోసం ఎదురుచూస్తున్నారు? వాళ్ల అవసరాలు తెలుసుకొని, అందుకు అనుగుణంగా సిద్ధమవుతున్నారు. ఆహారం, దుస్తులు, దుప్పట్లు, స్వెటర్లు, నిత్యావసర సరుకులు అందిస్తున్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులు ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు.ఆ ఆనందం వెలకట్టలేనిది..ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టడం, దుస్తులు, ఇతర సరుకులు అందించడం సంతోషంగా ఉంది. ఆ ఆనందం వెలకట్టలేనిది. ఇతరులు మంచి జీవితాన్ని పొందడానికి నా వంతు సాయం అందిస్తున్నా. నాకున్న అవకా శాల్లో ఒక మార్గం ఎంచుకొని ముందుకెళ్తున్నా.. కుటుంబ సభ్యులు సరే నీ ఇష్టం అన్నారు. నా వేతనం మొత్తాన్నీ చారిటీకే వెచి్చస్తున్నాను. మరింత మందికి సాయం చేసే అవకాశం కలి్పంచాలని భగవంతుడిని ప్రారి్థస్తున్నా. – కావ్య, చార్వ్య, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు -
సింగిల్ క్యారెక్టర్‌తో వస్తోన్న హలో బేబీ.. ట్రైలర్ చూశారా?
కావ్య కీర్తి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం హలో బేబీ. ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ రత్నం దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఎస్కేఎమ్ఎల్ మోషన్ పిక్చర్స్ పతాకంపై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. హీరో ఆది సాయికుమార్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆది సాయికుమార్ మాట్లాడుతూ..'ట్రైలర్ చూస్తుంటే సోలో క్యారెక్టర్‌తో తో సినిమా తీయడం చాలా మెచ్చుకోవలసిన విషయం. ఇప్పటికే ఎన్నో అవార్డులు పొందిన ఈ చిత్రం కచ్చితంగా మంచి హిట్ అవుతుంది. హ్యాకింగ్‌పై తీస్తున్న మొదటి చిత్రంగా దీన్ని జనాలు గుర్తుంచుకుంటారు' అని కొనియాడారు.నిర్మాతఆదినారాయణ మాట్లాడుతూ..' ఈ చిత్రం చాలా అద్భుతంగా వచ్చింది. త్వరలోనే చిత్రం రిలీజ్ చేస్తాం. దేశంలోనే మొట్టమొదటి హ్యాకింగ్ చిత్రంగా నిలవనుంది. ఇప్పటికే చాలా అవార్డులు వచ్చాయి. హీరోయిన్ కావ్య కీర్తి అద్భుతంగా చేసింది. డైరెక్టర్ రామ్ గోపాల్ రత్నం చేసిన కృషి మరువలేనిది' అని అన్నారు. -
కావ్య కనుసైగలతో మాలేపాటిపై కేసుల నమోదు?
కావలి టీడీపీలో ఆధిపత్యం.. అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరింది. ‘ఏరు దాటే వరకు మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ చందానా సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు సాగిన ఐక్యతారాగం.. ఇప్పుడు శృతి తప్పింది. ఆది నుంచి పార్టీకి వెన్నుదన్నుగా, సార్వత్రిక ఎన్నికల్లో విజయానికి ఎదురొడ్డి నిలిచిన నేతలనే టార్గెట్ చేయడం ఇప్పుడు ఆ పార్టీలో అగ్గి రాజుకుంది. అధికారంలోకి వచ్చామనే అహంకారంతో చెలరేగిపోయిన మాలేపాటి కుటుంబంపైనే కేసులు నమోదు చేయించడంతో జీర్ణించుకోక మానసిక క్షోభతో తీవ్ర అస్వస్థతకు గురై ఐసీయూలో చికిత్స పొందుతున్న పరిస్థితి చూస్తే టీడీపీలో అంతర్యుద్ధానికి అద్దం పడుతోంది.సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి టీడీపీ అంటే బీద రవిచంద్ర.. మాలేపాటి సుబ్బానాయుడు. ఇది మొన్నటి వరకు ఉన్న పరిస్థితి. ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు వెలువడ్డాయి. ఇంకా పరిపాలన గాడిలో పడలేదు. కానీ అప్పుడే టీడీపీలో రాజకీయ ముసలం మొదలైంది. ఆ పార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత నుంచి పార్టీ కాడి మోసే నేత లేని పరిస్థితుల్లో దగదర్తికి చెందిన మాలేపాటి సుబ్బానాయుడు రూ.కోట్లు ఖర్చు పెట్టుకుని ఉనికిని కాపాడుకుంటూ వచ్చాడు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర అండతో అధిష్టానం ఆశీస్సులతో నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగారు. తానే కాబోయే ఎమ్మెల్యే అభ్యర్థినంటూ విస్తృత ప్రచారం చేసుకున్నాడు. అయితే రాజకీయ సమీకరణాలు మారిపోవడంతో కావ్య కృష్ణారెడ్డి తెరపైకి రావడం, సార్వత్రిక ఎన్నికల్లో అధికారం మార్పు జరగడం చకాచకా జరిగిపోయాయి. ఈ క్రమం పార్టీకి విదేయుడిగా పని చేసిన సుబ్బానాయుడు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కావ్య కృష్ణారెడ్డి విజయంలో తనదైన పాత్ర పోషించారు.అయితే ఇప్పుడేం జరిగిందంటే..ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యాక కావ్య కృష్ణారెడ్డి విజయం సాధించిన తర్వాత టీడీపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో విజయోత్సవాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలుచోట్ల వైఎస్సా ర్సీపీ మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు అనేక చోట్ల భౌతిక దాడులు, ఆస్తుల ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలో మాలేపాటి సుబ్బానాయుడు తన స్వగ్రామమైన దగదర్తిలో ఈ నెల 9న టీడీపీకి చెందిన మాలేపాటి రవీంద్రనాయుడు, మాలేపాటి భాను, వడ్డే వినయ్, తాండ్రా కార్తీక్, తాండ్రా వెంకటేశ్వర్లు తదితరులు వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు మారెళ్ల వెంకటేశ్వర్లు ఇంటి ప్రహరీని జేసీబీతో ధ్వంసం చేశారు. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితుడు దగదర్తి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మాలేపాటి సుబ్బానాయుడు, భాను, గోపాల్, సూరయ్య, వినయ్ తదితరులు జేసీబీతో తమ ఇంటి ప్రహరీని కూల్చి వేశారని, అడ్డుకోబోయిన తన కోడలు, తనను దుర్భాషలాడుతూ దాడి చేయబోయారని దగదర్తికి చెందిన వైఎస్సార్సీపీ మద్దతుదారు అయిన కాండ్రా కామేశ్వరమ్మ టీడీపీ నేతలపై మరో ఫిర్యాదు చేశారు. ‘నీ కొడుకు శ్రీనివాసులు ఎక్కడున్నా వెతికి చంపేస్తామంటూ’ తమపై దాడి చేయబోగా వారి నుంచి తప్పించుకొని పోలీసు స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదుపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.మాలేపాటికి షాక్ ఇచ్చిన కావ్యమాలేపాటి అండ్ గ్యాంగ్ సాగించిన అరాచకంపై తన మండలంలోనే తమపై కేసులు నమోదు కావడాన్ని జీర్ణించుకోలేకపోయిన మాలేపాటి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. మాపై కేసులు పెడుతుంటే..చూస్తూ ఊరుకుంటావా? అంటూ ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. ఇదే సమయంలో కావ్య కూడా గట్టిగానే తిరిగి ప్రశ్నలు సంధించడంతో ఇద్దరి మధ్య వాగ్యువాదం తారస్థాయికి చేరింది. ‘ఎవర్ని అడిగి గోడలు కూల్చారు.. ఎవరిని అడిగి విచ్చలవిడిగా దౌర్జన్యాలు చేశారంటూ’ కావ్య నిలదీశారంట. ఎన్నికల ముందు నుంచి మాలేపాటి ఆర్థికంగా తనను వేధించిన విషయాలను మనస్సులో పెట్టుకున్న కావ్య ఒక్కొక్కటిగా కడిగిపారేయడంతో సుబ్బానాయుడు తీవ్ర ఫ్రస్ట్రేషన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతడిని కుటుంబ సభ్యులు చైన్నెలోని ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్‌పై పెట్టి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పిందని తెలుస్తోంది. ప్రస్తుతంలో ఐసీయూలో కోలుకుంటున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది.కావ్య వైఖరితోనే ఈ పరిస్థితి.. కావ్య కృష్ణారెడ్డి ఉద్దేశ పూర్వకంగానే మాలేపాటిపై కేసులు పెట్టించి.. ఆయన్ను తీవ్రంగా అవమానించడంతో పాటు వేధింపులకు గురిచేయడం కారణంగానే మాలేపాటి చావుబతుకుల్లో ఉన్నాడని ఆయన బంధువులు, అభిమానులు తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. టీడీపీ ప్రారంభం నుంచి వీరవిధేయులుగా ఉన్న తమను కాదని, ధన బలంతో పార్టీ టికెట్ చేజిక్కించుకొని ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి తమను ఇంతగా కించపరచడాన్ని మాలేపాటి వర్గీయులు ఏ మాత్రం సహించబోమని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో అసలైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాలేపాటికి అండగా నిలవాలని అంతర్గతంగా జోరుగా చర్చ జరుగుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే కావలి టీడీపీలో రెండు రాజకీయ కుంపట్లు ఏర్పడి మరింత సంక్షోభావానికి దారి తీయవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే కావ్య కృష్ణారెడ్డి వైఖరిపై బీద రవిచంద్ర కూడా కక్కలేక.. మింగలేక రగిలిపోతున్నట్లు సమాచారం. మాలేపాటి విషయంలో కావ్య వ్యవహరిస్తున్నట్లు తీరు, పార్టీ పరిస్థితిపై లోకేశ్ వద్ద పంచాయితీ పెట్టన్నట్లు తెలుస్తోంది. -
అత్తింటి వేధింపులతో గర్భిణి బలవన్మరణం
పెనమలూరు: కృష్ణాజిల్లా పెనమలూరు మండలం యనమలకుదురులో ఓ గర్భిణి బలవన్మరణానికి పాల్పడింది. వారసుడు కావాలని అత్తింటివారు వేధించడంతో కడుపులో ఉన్న ఆడబిడ్డను చంపలేక తానే ప్రాణాలు తీసుకుంది. సీఐ టి.వి.వి.రామారావు కథనం మేరకు.. యనమలకుదురు పుట్టరోడ్డుకు చెందిన కావ్యశ్రీ (19)కి రెండేళ్ల కిందట విజయవాడ కండ్రికకు చెందిన సందు శ్రీకాంత్‌తో(31) వివాహమైంది. శ్రీకాంత్ సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. పదినెలల కిందట పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కావ్యశ్రీ, ఇటీవల మళ్లీ గర్భం దాల్చింది. ఆమెకు ప్రస్తుతం ఐదో నెల. భర్త శ్రీకాంత్ నాలుగు రోజుల క్రితం కావ్యశ్రీకి విజయవాడలో స్కానింగ్ చేయించగా, ఆడపిల్ల పుడుతుందని అక్కడి సిబ్బంది చెప్పారు. దీంతో దంపతుల మధ్య గొడవ మొదలైంది. ఆడపిల్ల వద్దు, వారసుడే కావాలని కావ్యశ్రీపై భర్త శ్రీకాంత్‌తోపాటు అత్త వెంకటేశ్వరమ్మ, మామ లక్ష్మణరావు ఒత్తిడి తెచ్చారు. దీంతో భార్యాభర్తలు గత బుధవారం ఆస్పత్రికి వెళ్లగా, అబార్షన్ చేస్తే ప్రమాదమని డాక్టర్ హెచ్చరించడంతో వెనక్కి తగ్గారు. అయితే శ్రీకాంత్ స్నేహితుడు కానిస్టేబుల్ శ్యామ్ తన పరపతితో అబార్షన్ చేయిస్తానని చెప్పడంతో భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ మొదలైంది. అబార్షన్ చేయించుకోనని కడుపులో బిడ్డను చంపలేనని శుక్రవారం రాత్రి కావ్యశ్రీ తన భర్తకు తేల్చి చెప్పింది. శనివారం ఉదయం భార్యాభర్తలు మళ్లీ అబార్షన్ విషయమై చర్చించుకున్నారు. అనంతరం కావ్యశ్రీ స్నానానికి వెళ్తూ భర్తకు ఫోన్ ద్వారా ఓ మెసేజ్ చేసింది. ‘తాను వారసుడిని ఇవ్వలేనని,..కడుపులోని బిడ్డను చంపలేనని.. తనను ఛీదరించుకోవద్దని.. పదినెలల కుమార్తెను తన తల్లిదండ్రులే పెంచాలని..తనను క్షమించాలని’ ఆ మెసేజ్‌లో పేర్కొంది. కావ్యశ్రీ బాత్రూమ్ నుంచి ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో కటుంబసభ్యులు, భర్త బాత్రూమ్ తలుపులు తెరిచి చూడగా వెంటిలేటర్‌కు కావ్యశ్రీ ఉరేసుకుని కొనఊపిరితో ఉంది. ఆమెను వెంటనే కానూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ పరిస్థితి విషమించడంతో కావ్యశ్రీ ఆదివారం ఉదయం మృతి చెందింది. మృతిరాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కావ్యశ్రీ భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
షారూఖ్ కంటే కావ్య మారన్ ఆస్తులే నాలుగు రెట్లు ఎక్కువ..!
-
కావ్య చావుకు ఫిట్స్ కారణమా..?
నల్గొండ: మండల పరిధిలోని పర్వతగిరి గ్రామంలో మంగళవారం సాయంత్రం యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చనగాని కావ్య(20) గత రెండు సంవత్సరాలుగా ఫిట్స్‌తో బాధపడుతోంది. తీవ్ర మనోవేదనకు గురై మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరేసుకుంది. సోదరుడు నవీన్ ఇంటికి వచ్చి కావ్యను గమనించి, నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. కావ్య తల్లి లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
వరంగల్ లో ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరు
-
లోక్ సభ ఎన్నికల్లో కావ్య భారీ మెజారిటీతో గెలుస్తారు: శ్రీహరి
-
ఆయన నమ్మరు.. ఆయన్ను నమ్మరు
కావ్య ఎంట్రీతో కావలిలో టీడీపీ గ్రాఫ్ పాతాళానికి పడిపోయింది. కావ్య కృష్ణారెడ్డి అభ్యర్థిత్వంతో టీడీపీ భవితవ్యం తేలిపోయింది. చంద్రబాబు కావలిలో నిర్వహించిన ప్రజాగళం సభతో అది ప్రస్ఫుటమైంది. కావ్యను టీడీపీ కేడర్ ఆది నుంచి వ్యతిరేకిస్తున్న తరుణంలో ఆయన తన క్వారీల్లో పని చేసే సిబ్బందితో సొంత దళాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తనను వ్యతిరేకిస్తున్నారనే కారణంతో టీడీపీ వీరాభిమానులను సైతం కావ్య పక్కన పెట్టేశారు. టీడీపీకి మిత్రపక్షాలుగా ఉన్న జనసేన, బీజేపీ నేతలను సైతం దూరంగా ఉంచారు. ఎన్నికల కార్యాచరణలో వీరిని దూరంగా పెట్టి.. తన గుమాస్తాల చేతికే పెత్తనమంతా కట్టబెట్టారు. ఖర్చులకు సైతం డబ్బులివ్వకపోవడంతో టీడీపీ, జనసేన, బీజేపీ కేడర్ కావ్యను పక్కన పెట్టేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలే చంద్రబాబు సభకు జనసమీకరణకు కూటమి నేతలు ముఖం చాటేయడంతో ప్రజాగళం అట్టర్ ఫ్లాప్ అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కావలి: టీడీపీ కావలి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఏక్ నిరంజన్‌గా మిగిలిపోయాడు. ఆయన నేతలను నమ్మడం లేదు. నేతలు ఆయన్ను నమ్మడం లేదు. కావ్య అభ్యర్థత్వాన్ని టీడీపీ నేతలు ఆది నుంచి వ్యతిరేకిస్తున్నారు. టికెట్ రేస్‌లో పోటీపడి చివరకు సీటు దక్కించుకున్నాడు. అయితే ఎన్నికల కార్యాచరణలో తన గెలుపు కంటే.. తన వద్ద ఉండే డబ్బు కోసమే పని చేస్తారనే ఆలోచనతో సొంత పార్టీ నేతలనే కాదు.. మిత్రపక్షాలను సైతం దూరం పెట్టేశాడు. తన వద్ద పని చేసే ఉద్యోగులు, దగ్గరి బంధువులతో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పార్టీ నిర్ణయాన్ని కాదనలేక సర్దుకుపోదామని ప్రయత్నించినా మిత్ర పక్షాలకు, పార్టీ కేడర్‌కు కావ్య వర్గం నుంచి ప్రతి రోజూ అవమానాలు ఎదురవుతుండటంతో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు రగిలిపోతున్నారు. కావ్య శిబిరంలో కలవరం టీడీపీ అధినేత చంద్రబాబు కావలిలో నిర్వహించిన ప్రజాగళం సభ అట్టర్‌ఫ్లాప్ కావడంతో కావ్య శిబిరంలో కలవరం మొదలైంది. ముందుగానే ప్రజాగళం షెడ్యూల్ ప్రకటించినప్పటికీ జన సమీకరణ చేయడంలో చతికిల పడ్డారు. జన సమీకరణ పేరుతో డబ్బులు తినేస్తారనే భావనతో కావ్య ప్రజాగళం బహిరంగ సభకు సంబంధించిన బాధ్యతలను కార్యకర్తలు, నాయకులను కాదని తన క్వారీల్లో పని చేసే గుమాస్తాలకు, తన దగ్గరి బంధువులకు అప్పగించారు. తమపై నమ్మకం లేక గుమాస్తాలకు బాధ్యతలు అప్పగించిన వ్యక్తి కోసం తాము ఎందుకు పని చేయాలంటూ సొంత పార్టీ కేడర్‌తో పాటు మిత్రపక్షాలు బీజేపీ, జనసేన సైతం ముఖం చాటేశారు. కావ్య అహంకార వైఖరితో ఇప్పటికే నియోజకవర్గంలో బీద రవిచంద్ర వర్గీయులు, మాలేపాటి వర్గీయులు పారీ్టకి దూరదూరంగా ఉంటున్నారు. ఎవరూ సహకారం అందించకపోవడంతో తన దళాలను రంగంలోకి దింపి జన సమీకరణకు సిద్ధమయ్యారు. అసలే టీడీపీ సభలంటే జనం ముఖం చాటేస్తున్నారు. చంద్రబాబు హెలికాప్టర్ దిగినా.. జనం లేకపోవడంతో గంటా పది నిమిషాలు హెలిప్యాడ్‌లో ఉన్న బస్సులోనే పడిగాపులు పడ్డారు. ఎట్టకేలకు వెయ్యి.. రెండు వేల మందిని సభా స్థలికి చేర్చడంతో, రద్దీగా ఉండే ట్రంక్‌రోడ్‌లో జనం వచ్చే జనం, పోయే జనం పోగుకావడంతో సభ వద్దకు చంద్రబాబు వచ్చారు. ఆయన మాట్లాడుతుండగానే జనం పొలోమని వెళ్లిపోవడంతో అసహనంతో సభను అర్ధంతరంగా ముగించి వెళ్లిపోయారు. ప్రజాగళం ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో ఆగ్రహంతో వెళ్లిన చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో అనే ఆందోళన నెలకొంది. మిత్రపక్షాలకు దక్కని ప్రాధాన్యం టీడీపీ మిత్రపక్షాలైన బీజేపీ, జనసేన నాయకులను కూడా కావ్య కృష్ణారెడ్డి చిన్నచూపు చూస్తున్నారని ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. తాజాగా ప్రజాగళం సభలో జనసేన ఊసే లేకపోవడంతో పవన్ అభిమానులకు మింగుడు పడటం లేదు. బీజేపీ నాయకులను కూడా పట్టించుకోలేదు. కావలి పట్టణ బీజేపీ అధ్యక్షుడి సహా సీనియర్ నాయకులంతా కూడా ప్రజాగళంలో జనాల మధ్య సాధారణ కార్యకర్తల్లా ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో బీజేపీ, జనసేన నాయకులు కూడా కావ్యకు మద్దతు తెలిపే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. దొంగల్లా చూస్తున్నారని... 40 ఏళ్ల నుంచి పార్టీ కోసమే పని చేస్తున్నాం. పైసా ఆశించకుండా అభిమానంతో పార్టీ జెండా మోస్తున్నాం. కొత్తగా వచ్చిన కావ్య కృష్ణారెడ్డి మమ్మల్ని దొంగల్లా చూస్తున్నాడు. ప్రచార ఖర్చులకు అడిగినా కూడా అనుమానిస్తూ తన గుమాస్తాలకు లెక్కలు చెప్పమంటున్నాడు. ఇలాంటి వ్యక్తిని ఇంత వరకూ చూడలేదు. ఇలాంటి అనుమానపు వ్యక్తి ఉన్న పారీ్టలో కొనసాగడం మా వల్ల కాదంటూ సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరుగా పార్టీ నుంచి తప్పుకుంటున్నారు. ఇప్పటికే పలువురు నందమూరి అభిమానులు, సీనియర్ నాయకులు పారీ్టకి, కావ్యకు దండం పెట్టి వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇదే బాటలో మరికొంత మంది సీనియర్ నాయకులు కూడా పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. -
కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, కావ్య
హైదరాబాద్: స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, దీపాదాస్ మున్షి సమక్షంలో వీరు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కడియం శ్రీహరి, కావ్యకు దీపాదాస్ మున్షి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. కడియం కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత కే. కేశవరావు, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే ఫిరాయింపులు మొదలయ్యాయి. పలువురు నేతలు కాంగ్రెస్ బీఆర్ఎస్ గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలో వరసగా కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరటం ప్రతిపక్ష బీఆర్ఎస్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో భారి విజయం సొంతం చేసుకున్న కాంగెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లోనూ అధిక సీట్ల గెలుపే టార్గెట్‌గా పావులు కదుపుతోంది. -
కాంగ్రెస్‌లోకి కడియం.. వరంగల్ ఎంపీ అభ్యర్థిపై ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు నిర్ణయించుకున్నారు. అదే సమయంలో మరో సీనియర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరిక దాదాపు ఖరారైంది. కాంగ్రెస్‌లోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ నేతల బృందం శుక్రవారం ఉదయం కడియం ఇంటికి వెళ్లింది. ఆ బృందంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీతో పాటు మల్లు రవి, సంపత్ కుమార్, రోహీన్ రెడ్డి ఉన్నారు. దాదాపు అరగంటకు పైగా కడియం నివాసంలో వీళ్లంతా సమావేశం అయ్యారు. అనంతరం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. కడియం శ్రీహరి, కావ్యలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించాం.. వీళ్లు అధికారికంగా మా పార్టీలోకి చేరతారు అని ప్రకటించారు దీపాదాస్ మున్షీ. అలాగే.. ఏఐసీసీ ప్రతినిధిగా దీపాదాస్ తమను కలిశారని కడియం చెప్పారు. ఏఐసీసీ, పీసీసీ నన్ను కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించారు. నేను కాంగ్రెస్ లో ఇంకా చేరలేదు. నేను బీఆర్ఎస్ పార్టీ వీడడానికి చాలా కారణాలు ఉన్నాయి. వరంగల్ ఎంపీ అభ్యర్థి ఎవరనేది కూడా ఇంకా డిసైడ్ కాలేదు. అనుచరులు, అభిమానులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా అని ఏఐసీసీ ప్రతినిధికి చెప్పా అని కడియం మీడియాతో అన్నారు. కావ్య పేరు దాదాపు ఖరారు ఇదిలా ఉంటే.. కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైంది. ఈ క్రమంలోనే.. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ సీటును కావ్య వద్దని చెబుతూ.. కేసీఆర్‌కు లేఖ రాసింది. మరోవైపు కడియం ఫ్యామిలీ కాంగ్రెస్‌లో చేరతుందనే ప్రచారం తెర మీదకు రాగానే.. వరంగల్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ తరఫున కడియం శ్రీహరి పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే ఆ సీటును కావ్యకే కాంగ్రెస్ పార్టీ కేటాయించునున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో వీళ్లు చేరిన వెంటనే.. అభ్యర్థుల జాబితా ద్వారా కావ్య పేరును అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. రేవంత్‌తో కేకే భేటీ ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌లో చేరతానని అధికారికంగా గురువారం ప్రకటించిన సీనియర్ నేత కేకే.. ఈ ఉదయం పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్‌లో చేరికపై అరగంట పాటు వీళ్లిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. కుదిరితే రేపు.. లేకుంటే ఏప్రిల్ 6వ తేదీన కేకే కాంగ్రెస్ గూటికి చేరతారని ఆయన అనుచరులు చెబుతున్నారు. -
పోటీ నుంచి తప్పుకుంటున్నా
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్‌లో బీఆర్ఎస్ గట్టి షాక్ తగిలింది. మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె, బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆమె పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు గురువారం రాత్రి లేఖ రాశారు. పార్టీపై వచి్చన అవినీతి, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లోనే పోటీనుంచి విరమించుకుంటున్నానని తెలిపారు. కేసీఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలు తనను మన్నించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య? కడియం శ్రీహరి, కడియం కావ్యలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే కావ్య బీఆర్ఎస్ అభ్యర్థిగా తప్పుకున్నారని అంటున్నారు. ఇందుకోసమే ఇప్పటివరకు కాంగ్రెస్ కూడా తన అభ్యర్థిని ప్రకటించ లేదని చెబుతున్నారు. బీఆర్ఎస్కు రాజీనామా చేయనున్న తండ్రీకూతుళ్లు ఈ నెల 30న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి బరిలోకి దిగే అవకాశం ఉందని, కానిపక్షంలో కావ్య కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారని అంటున్నారు. ఒకవేళ కడియం శ్రీహరిని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే... ఆయన ఎంపీగా గెలిచిన అనంతరం కావ్యను స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ బరిలోకి దింపవచ్చనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ హామీల మేరకే శ్రీహరి, కావ్యలు బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పాలనే నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పష్టత కోసం శ్రీహరి, కావ్యలను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా వారు స్పందించలేదు. కావ్య ఎపిసోడ్లో ప్రభుత్వ సలహాదారు, కడియం శ్రీహరికి చిరకాల మిత్రుడు వేం నరేందర్‌రెడ్డి చక్రం తిప్పారన్న ప్రచారం కూడా జరుగుతోంది. -
వరంగల్: బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్య ఖరారు!
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు గులాబీ దళపతి, పార్టీ అధినేత కేసీఆర్ బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. రాజకీయ అరంగేట్రం చేసేందుకు ఎప్పటి నుంచో వేచిచూస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కావ్యకు ఎట్టకేలకు బీఆర్ఎస్ ‘బీ’ఫామ్ దక్కింది. సిట్టింగ్ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్‌ను ఈసారికి పోటీ నుంచి తప్పించారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత సిట్టింగ్ ఎంపీని మార్చడం తథ్యమన్న నేపథ్యంలో వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి ఎవరిని ఎంపిక చేస్తారన్న చర్చ మొదలైంది. వరంగల్ ఎంపీ స్థానం ఎస్సీలకు రిజర్వు కావడంతో పార్టీలో ఈ సామాజిక వర్గానికి చెందిన నేతల్లో ఎవరికి అవకాశం దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బీఆర్ఎస్కు రాజీ నామా చేయడంతో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్, కడియం కావ్య పేర్లు ప్రధానంగా వినిపించాయి. అరూరి రమేష్ మొదట ఆసక్తి చూపినా.. ఆ తర్వాత ఎందుకో పార్టీ మారాలనే యోచనలో పడటం పార్టీలో గందరగోళానికి తెరతీసింది. ఇదే సమయంలో ఆయన మంగళవారం హైదరాబాద్‌లో కేంద్ర మంత్రులను కలవడం.. బుధవారం హనుమకొండలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ప్రెస్మీట్లో మాట్లాడేకంటే ముందే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులు ఆయనను తమ వాహనాల్లో ఎక్కించుకుని హైదరాబాద్ తీసుకెళ్లి కేసీఆర్‌ను కలిపించారు. ఉమ్మడి వరంగల్ కీలక నేతలు, ప్రజాప్రతినిధులతో సుమారు గంటన్నర పాటు చర్చించిన కేసీఆర్.. కడియం కావ్య పేరును ఖరారు చేసినట్లు ప్రకటించారు. ఉన్నత విద్యాభ్యాసం.. సామాజిక సేవలో సీనియర్ రాజకీయ నాయకులు కడియం శ్రీహరి పెద్ద కూతురైన కావ్య దక్కన్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేశాక, ఉస్మానియా మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎండీ (పాథాలజీ) పూర్తి చేసి వరంగల్‌లో కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్‌గా పనిచేశారు. గతంలో వర్ధన్నపేట సామాజిక వైద్యకేంద్రంలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తూనే అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఆమె బాలికల విద్యా వ్యాప్తి కి విశేషించి కృషి చేస్తున్నారు. మెనుస్ట్రువల్ హైజీన్‌పై కడియం ఫౌండేషన్ ద్వారా వందలాది చైతన్య కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా హైజీన్ కిట్స్ పంపిణీ చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డాక్టర్ కావ్య తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. మానుకోట బీజేపీ ఎంపీ అభ్యర్థిగా సీతారాంనాయక్.. మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌ను ప్రకటించారు. ఆయన బీఆర్ఎస్ నుంచి బీజేపీలో అలా చేరారో.. లేదో.. ఇలా టికెట్ తెచ్చుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మల్లయ్యపల్లి గ్రామానికి చెందిన సీతారాంనాయక్ కేయూ ప్రొఫెసర్‌గా కొనసాగుతూనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఇలా బీఆర్ఎస్(అప్పటి టీఆర్ఎస్) అధినేత కేసీఆర్‌కు దగ్గరైన ఆయన.. స్వరాష్ట్రంలో 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందారు. మానుకోట పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌పై 34,992 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన స్థానంలో మాలోత్ కవితకు టికెట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన మౌనంగా ఉంటూ వచ్చారు. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు టికెట్ ఇవ్వాలని కోరగా.. అదీ దక్కలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీపై అసంతృప్తితో ఉన్న సీతారాంనాయక్ టికెట్ రాదని తెలిసి, ఈ నెల 10న బీజేపీలో చేరారు. చేరిన మూడు రోజులకే మానుకోట టికెట్ కేటాయించడం గమనార్హం. ఇవి చదవండి: బండ పగలకొడతాం.. సాగునీరు పారిస్తాం! : మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -
అడ్డదారుల్లో కోట్లు ఆర్జించాడు.. డబ్బు సంచులతో సీటు కొనుగోలు!
టీడీపీ కావలి సీటు విషయంలో ఆ పార్టీ అధిష్టానం చివరకు క్యాష్ వైపే మొగ్గు చూపింది. కావ్య కృష్ణారెడ్డికే జై కొట్టి నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించింది. పార్టీని నమ్ముకున్న వారిని నట్టేట ముంచి డబ్బుసంచుల వైపు చూడడంతో దీనిని కేడర్ జీర్ణించుకోలేకపోతోంది. దశాబ్దాల నుంచి కావలిలో టీడీపీని కాపు కాసిన బీద రవిచంద్ర మాట కూడా చెల్లుబాటు కాలేదు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న మాలేపాటి సుబ్బానాయుడికి సైతం మొండిచేయి చూపడంతో తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి టీడీపీ ఇన్చార్జిగా కావ్య కృష్ణారెడ్డి (దగుమాటి వెంకట కృష్ణారెడ్డి)ని ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. స్థానికుల అభిప్రాయాలకు వ్యతిరేకంగా అభ్యర్థి ప్రకటన చేయడంపై క్యాడర్ మండిపడుతోంది. బీద రవిచంద్ర దశాబ్దాల కాలంగా పార్టీని నమ్ముకుని ఉన్నారు. ఆ కుటుంబానికే పార్టీ ప్రాధాన్యత ఇవ్వడంతో వారే అన్నీ తామై నడిపించేవారు. కానీ ఈ దఫా బీద రవించంద్ర, ఆయన సతీమణిని ఎన్నికల బరిలోకి దింపే యోచనలో ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగినా స్థానికంగా పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో తన ప్రధాన అనుచరుడిగా ఉన్న మాలేపాటి సుబ్బానాయుడిని ఇన్చార్జిగా నియామకం చేయించారు. కష్టకాలంలో మాలేపాటి పార్టీ కోసం నిలబడ్డారు. గత టీడీపీ హయాంలో అడ్డగోలుగా దోపిడీ చేసిన సొమ్ములో కాస్త కరిగించేలా చేశారు. చివరకు ఎన్నికల సమయంలో మాలేపాటికి టికెట్ ఇప్పించే ప్రయత్నంలో బీద మాట చెల్లుబాటు కాకపోవడంతో మిన్నకుండిపోవాల్సివచ్చింది. కావ్య వర్సెస్ బీద కావ్య కృష్ణారెడ్డి టీడీపీ కావలి నియోజకవర్గ ఇన్చార్జిగా పార్టీలోకి ఎంట్రీ ఇవ్వకముందే బీద రవిచంద్రతో అమీతుమీకి సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. డబ్బు సంచులతో పార్టీ అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకుని టికెట్ ఖరారు చేయించుకుని వచ్చిన కావ్య కావలిలో హడావుడి చేశారు. బీదకు వ్యతిరేక వర్గాన్ని కూడదీయడంతోపాటు ఇకపై బీద మాట వినాల్సిన అవసరం లేదని, అంతా తన కనుసన్నల్లోనే జరుగుతుందనే సంకేతాలను కూడా ఆ పార్టీ కార్యకర్తల్లోకి పంపారు. కావ్య కృష్ణారెడ్డి ముందుగానే పార్టీ ఫండ్ పేరుతో రూ.కోటి విరాళం ఇచ్చారు. అంతేకాక ఏకంగా రూ.20 కోట్లు పార్టీ ఫండ్ కింద జమ చేసి మరో రూ.50 కోట్లు ఇచ్చే దానికై నా సిద్ధంగా ఉన్నానని సంకేతం పంపి లోకేశ్ వద్ద మార్కులు కొట్టేసి టికెట్ ఖరారు చేయించుకున్నారని తెలుస్తోంది. అడ్డదారులు తొక్కుతూ.. సుమారు పాతికేళ్ల క్రితం కామర్స్ అధ్యాపకుడిగా ఉన్న కావ్య కృష్ణారెడ్డి తాను నివాసం ఉండే ఇంటికి అద్దె చెల్లించలేని స్థితి నుంచి అంచెలంచెలుగా ఎదిగి రూ.వేల కోట్లకు అధిపతి అయ్యారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి క్వారీలు, క్రషర్లు, కాంక్రీట్ మిక్సర్లు పెట్టి అడ్డదారులు తొక్కుతూ అతి తక్కువ కాలంలోనే మైనింగ్ డాన్‌గా ఎదిగారు. అడ్డగోలుగా ఎదిగిన కావ్య కృష్ణారెడ్డి అందించిన డబ్బు సంచులకు సాగిలపడిన టీడీపీ ఆయనకు కావలి సీటు ఖరారు చేయడంపై ఆ పార్టీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పదవి పేరుతో ముంచేసి.. మండలస్థాయి నేతగా ఉన్న తనను కావలి నియోజకవర్గ ఇన్చార్జి పదవి పేరుతో ముంచేశారని మాలేపాటి సుబ్బానాయుడు తన అంతరంగీకుల వద్ద వాపోయినట్లు తెలుస్తోంది. గత టీడీపీ హయాంలో అడ్డగోలు సంపాదనకు అలవాటుపడిన మాలేపాటిని కావలి సీటు పేరుతో బీద ఊరించి అతని చేత ఖర్చు పెట్టించారని, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అతనిని నట్టేట ముంచారని పార్టీ నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. -
Kavya Gowda Baby Shower Pics: వైభవంగా కన్నడ నటి కావ్య గౌడ సీమంతం (ఫోటోలు)
-
కిక్కెక్కుతోందే జన్మ...
సందీప్ కిషన్ హీరోగా, కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యాంటసీ అడ్వెంచరస్ ఫిల్మ్ ‘ఊరు పేరు భైరవకోన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘నా వల్ల కాదే బొమ్మ.. నీ కళ్లు చూస్తే అమ్మా.. కిక్కెక్కుతోందే జన్మ..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను శనివారం విడుదల చేశారు. ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, తిరుపతి జావన లిరిక్స్ అందించిన ఈ పాటను రామ్ మిరియాల పాడారు. ఈ సినిమాకు సహనిర్మాత: బాలాజీ గుత్తా. -
ఆరేళ్ల కిందట పెద్దలను ఎదిరించి వివాహం!
సాక్షి, మహబూబ్‌నగర్: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు బలవంతంగా మాత్రలు మింగించి కడతేర్చాడో భర్త. ఈ విషాదకర ఘటన ఆత్మకూర్‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ నరేందర్ వివరాల మేరకు.. పట్టణానికి చెందిన శివకావ్య (26) బీటెక్ చదువుతున్న సమయంలో స్థానిక బీసీకాలనీకి చెందిన వడ్ల భరత్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆరేళ్ల కిందట పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు అన్విధ్ ఉన్నాడు. కట్నం కోసం శివకావ్యను వేధించడంతో రెండు పర్యాయాలు తల్లిదండ్రుల నుంచి రూ.లక్షల్లో డబ్బులు తీసుకొచ్చి భర్తకు ఇచ్చింది, అయినప్పటికీ ఇంకా డబ్బులు కావాలని వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో శివకావ్య గర్భం దాల్చింది. డబ్బులు ఇచ్చేంత వరకు పిల్లలను కనేదిలేదని చెబుతూ 45 రోజుల కిందట భార్యతో బలవంతంగా మాత్రలను మింగించాడు. అవి వికటించడంతో శివకావ్య తీవ్ర అనారోగ్యానికి గురైంది. పలు ప్రవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా కోలుకోకపోవడంతో తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. మృతురాలి తండ్రి ఆరెకటిక కిషన్‌జీ ఫిర్యాదు మేరకు వడ్ల భరత్, వేణుగోపాలాచారి, శారద ఇతర కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: ప్రాణాలు తీసిన నిద్రమత్తు.. డ్రైవర్‌తో సహాకూలీల కుటుంబాల్లో తీవ్ర విషాదం! -
చిన్నారి 'గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు'! మంత్రి హరీశ్‌రావు అభినందన!!
సంగారెడ్డి: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన మూడేళ్ల ఐదు నెలల వయసు ఉన్న అరుషి తన అద్భుత మేథాశక్తితో ఔరా అనిపిస్తుంది. బుడిబుడి అడుగులు వేస్తూ, ముద్దులొలికించే మాటలతో బుజ్జిగా కనిపించే చిన్నారి అరుషి ప్రపంచంలోని 195 దేశాల రాజధానుల పేర్లను 5 నిమిషాల 5 సెకన్ల సమయంలోనే చకాచకా చెప్పి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించింది. పట్టణానికి చెందిన సురేశ్, కావ్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు అరోహి గౌడ, అరుషి గౌడ ఉన్నారు. తండ్రి బేకరీ షాపు నిర్వహిస్తుంటాడు. తల్లి కావ్య ఇంటి వద్ద ఉంటుంది. ఈ ఇద్దరు చిన్నారులు మేథస్సులో దిట్ట. చిన్న పాప అరుషి గౌడ పట్టణంలో ఓ ప్రైవేట్ స్కూల్లో నర్సరీ చదువుతోంది. అరుషి జ్ఞాపక శక్తిని గుర్తించిన తల్లి ఏదో ఒక అంశంలో ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాలని సంకల్పించింది. ప్రతీరోజు 5 దేశాల రాజధానులపై శిక్షణ.. చిన్నారి అరుషిగౌడకు తల్లి కావ్య ప్రతీ రోజు ఐదు దేశాలకు సంబంధించిన రాజధానుల పేర్ల గురించి ఆడుకునే సమయంలో, అన్నం తినేటప్పుడు ప్రాక్టీస్ చేయించేది. నెలన్నరలో 195 దేశాల రాజధానుల పేర్లు అతి తక్కువ సమయంలో సునాయసంగా చెప్పేలా కంఠస్తం చేయించింది. ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎలా పార్టిసిపేట్ చేయాలో ఆ ప్రొసీజర్‌ను యూట్యూబ్ ద్వారా తెలుసుకుంది. వెంటనే మూడేళ్ల 5 నెలల అరుషిగౌడతో 195 దేశాల రాజధానుల పేర్లు 5 నిమిషాల 5 సెకన్లలో చెప్పేలా ఆన్లైన్ యాప్ ద్వారా వీడియోను చిత్రీకరించి రికార్డు చేసింది. ఆ వీడియోను ఢిల్లీలోని ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుకు జూలై 31న పంపించారు. ఢిల్లీ కార్యాలయంలో ముగ్గురు జడ్జిల సమక్షంలో ఆ వీడియోను పరిశీలించారు. అరుషిగౌడ ప్రతిభకు గిన్నిస్ బుక్‌లో చోటు దక్కినట్లు చీఫ్ ఎడిటర్ డాక్టర్ బైస్వారూప్ రాయ్ చౌదరి ఆగస్టు 7న ప్రకటించారు. ఈ విషయాన్ని ఫోన్, మెయిల్ ద్వారా చిన్నారి తల్లిదండ్రులకు తెలియజేశారు. ఇటీవల ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు (2023) పుస్తకం, మెడల్, ప్రశంసా పత్రాలను అరుషి గౌడ తల్లిదండ్రుల అడ్రస్‌కు పోస్ట్ ద్వారా పంపించారు. పెద్ద కూతురు కూడా.. సురేష్, కావ్య దంపతుల పెద్దకూతురు అరోహిగౌడ సైతం మేథస్సులో దిట్ట. ఆ చిన్నారి సైతం 2021లో మూడెళ్ల 9 నెలల వయస్సులో ప్రపంచంలోని 195 దేశాల రాజధానుల పేర్లను 5 నిమిషాల 30 సెకన్లలో చెప్పి ఇండియన్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించింది. అలాగే భారత దేశంలోని 28 రాష్ట్రాల పేర్లను 1 నిమిషం, 28 సెకండ్లు, ఫ్రీడమ్ ఫైటర్ల పేర్లను 4 నిమిషాల్లో చెప్పి గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించింది. టాలెంట్ ఉంటే ఏదైనా సాధించవచ్చు.. పిల్లల్లో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దానిని గుర్తిస్తే ఏదైనా సాధించగలుగుతారు. మాకు ఇద్దరు ఆడపిల్లలని ఏనాడూ బాధపడ లేదు. వీరిద్దరూ ఇండియా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించడం సంతోషంగా ఉంది. – సురేష్, కావ్య దంపతులు, హుస్నాబాద్ మంత్రి హరీశ్‌రావు అభినందన.. అరుషి గిన్నిస్ బుక్‌లో స్థానం పొందడం పట్ల ఈ నెల 4న రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్‌లు అరుషిగౌడను అభినందించి సన్మానించారు. భవిష్యత్‌లో ఇంకా ఎన్నో మెడల్స్‌ను గెలుచుకోవాలని వారు ఆకాంక్షించారు. -
స్వీయ దర్శకత్వంలో నచ్చినవాడు.. క్రేజీ అప్డేట్ వచ్చేసింది!
దర్శకుడిగా, హీరోగా లక్ష్మణ్ చిన్నా స్వీయ దర్శకత్వంలో తొలిసారిగా తెరకెక్కిస్తోన్న చిత్రం 'నచ్చినవాడు'. ఈ చిత్రంలో కావ్య రమేశ్ అతనికి జంటగా కనిపించనుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ వచ్చేసింది. 'నా మనసు నిన్ను చేర' అనే లవ్ సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ చిత్రానికి మిజో జోసెఫ్ సంగీతమందించారు. ఏనుగంటి ఫిల్మ్ జోన్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. (ఇది చదవండి: ‘రుద్రమాంబపురం’పై మంత్రి తలసాని ప్రశంసలు) లక్ష్మణ్ చిన్నా మాట్లాడుతూ..' నచ్చినవాడు మూవీ మహిళల ఆత్మ గౌరవమే కథాంశంగా చేసుకుని తెరకెక్కించి ప్రేమ కథా చిత్రం. హాస్యానికి పెద్దపీట వేశాం. నేటి యూత్‌కు కావాల్సిన ప్రతి అంశాన్ని చూపించాం. త్వరలోనే చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.' అని అన్నారు. కర్ణాటక, పాండిచ్చేరిలోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో పాటలు చిత్రీకరించామని తెలిపారు. ఈ సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చుతుందనే ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. (ఇది చదవండి: డబ్బుల కోసం పెళ్లి చేసుకుంటే ఇలానే ఉంటుంది: కంగనా కౌంటర్) -
లోకేశ్ యాత్రలో బీద జ్యోతి ఎంట్రీతో అయోమయం
కావలి టీడీపీ ఆది నుంచి చుక్కాని లేని నావలా ఉంది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి రెండుసార్లు మాత్రమే కావలిలో గెలిచింది. జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఒకసారి, తర్వాత మరోసారి మాత్రమే అత్తెసరు ఓట్లతో టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత నుంచి ఆ పార్టీ రాజకీయ కల్లోలాన్ని ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో పార్టీని నడిపించేందుకు బీద రవిచంద్ర రాజకీయ డ్రామాకు తెర తీశారు. నాలుగేళ్లుగా పార్టీని నడిపించేందుకు మాలేపాటిని వాడుకున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఆశ చూపి పార్టీకి ఫండ్ ఇప్పించి కావ్యను ఊరించారు. చివరికి రవిచంద్ర భార్య జ్యోతిని ఎంట్రీ చేయించి ట్విస్ట్ ఇచ్చాడు. తాజా పరిణామాలు ఆ పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. నేటి లోకేశ్ బహిరంగ సభకు జన సమీకరణపై అయోమయం నెలకొంది. నెల్లూరు: ఉనికి కోల్పోయిన టీడీపీని బతికించాలని లోకేశ్ చేస్తున్న యువగళం పాదయాత్రతో కావలిలో ఆ పార్టీ పూర్తిగా కనుమరుగైపోయే పరిస్థితి కనిపిస్తోంది. 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికలతో బీద సోదరులు రాజకీయంగా లైమ్‌లైట్‌లోకి వచ్చారు. టీడీపీలో బీద మస్తాన్‌రావు అండతో ఆయన సోదరుడు బీద రవిచంద్ర రాజకీయంగా ఎదిగాడు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ పార్టీ విజయాలను తన విజయాలుగా భ్రమింపచేశారు. 2009లో బీద మస్తాన్‌రావు ఎమ్మెల్యే అయినప్పటికీ వ్యాపార వ్యవహారాల్లో తలమునకలై ఉండడంతో బీద రవిచంద్ర కావలిలో షాడో ఎమ్మెల్యేగా హడావుడి చేశాడు. ఆ సమయంలోనే రవిచంద్ర నియోజకవర్గంలో తన కోటరీని సృష్టించుకున్నాడు. కావలి టికెట్‌పై ఆశలు పెంచుకుని 2014 ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నాలు చేశాడు. అయితే టికెట్ తన సోదరుడు బీద మస్తాన్‌రావుకే ఇవ్వడంతో పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని హామీ ఇవ్వడంతో మిన్నకుండిపోయాడు. ఆ ఎన్నికల్లో బీద మస్తాన్‌రావు ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో కూడా తన సతీమణిని బరిలోకి దింపాలని తెరవెనుక రాజకీయం నెరిపినా.. చివరికి మస్తాన్‌రావు తన పలుకుబడి ఉపయోగించి కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డిని బరిలోకి దింపడంతో రవిచంద్ర ఆశలు ఆవిరయ్యాయి. ఆ తర్వాత బీద మస్తాన్‌రావు, విష్ణువర్ధన్‌రెడ్డి పార్టీకి దూరం కావడంతో కావలి బాధ్యతలను రవిచంద్రకు అప్పగించారు. 2019లో ఓటమి తర్వాత.. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు కావడం, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. ఈ దశలో పార్టీని నడిపించేందుకు మాలేపాటిని కావలి నియోజవకర్గ ఇన్చార్జిగా నియమించి రాబోయే ఎన్నికల్లో టికెట్ నీదేనంటూ నాలుగేళ్లుగా వాడుకున్నాడు. అయినప్పటికీ పెత్తనమంతా బీద తన చెప్పు చేతుల్లోనే పెట్టుకున్నాడు. కావ్యకు టికెట్ ఆశలు తన జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యే కాకపోయినా.. కనీసం ఎమ్మెల్యే అభ్యర్థిని అనిపించుకోవాలని తహతహలాడుతున్న దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ( కావ్య కృష్ణారెడ్డి) ఈ పార్టీ.. ఆ పార్టీ అని తేడా అన్ని పార్టీల్లో ప్రయత్నించారు. ఇతను అయితే పార్టీకి ఉపయోగపడుతాడు.. చివరి వరకు వాడుకోవచ్చునని పార్టీ పెద్దలతో మాట్లాడించి అతనికి టికెట్ ఆశలు రేపాడు. దీంతో కావ్య కృష్ణారెడ్డి చేత పార్టీకి మహానాడులో ఫండ్ ఇప్పించాడు. కావలి టికెట్ తనకే అంటూ ఇటు మాలేపాటి, అటు కావ్య ఇద్దరూ ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నా.. అధిష్టానం నుంచి ఎటువంటి స్పష్టత లేదు. యువగళంలో బీద సతీమణి ఎంట్రీ ట్విస్ట్ కావలిలో లోకేశ్ పాదయాత్రను విజయవంతం చేయడానికి రవిచంద్ర పెట్టిన సమావేశంలో మాలేపాటి సుబ్బానాయుడు అంతా భారం తనపైనే వేయాలని, ఏ ఒక్కరిని భాగస్వామ్యం చేయొద్దని ఖరాఖండిగా చెప్పారు. లోకేశ్ పాదయాత్ర ఏర్పాట్లు, ఖర్చు అంతా కూడా మాలేపాటి చూసుకుంటారు, ఎవరూ ఎక్కడా జోక్యం చేసుకోవద్దని నాయకులకు చెప్పేశాడు. దీంతో వీరిద్దరూ సైలెంట్ అయిపోయారు. లోకేశ్ యాత్ర కావలి నియోజకవర్గంలోకి అడుగుపెట్టే సమయానికి కాలు బాధతో రెస్ట్‌లో ఉన్న బీద తన సతీమణి జ్యోతిని ఎంట్రీ చేయించారు. లోకేశ్ యాత్రలో ఆమె అంతా తానై వ్యవహరిస్తుండడంతో అంతా అయోమయం నెలకొంది. గతంలోనే తన సతీమణికి టికెట్ ఇప్పించుకోవాలని చూశారు. కావ్య, పసుపులేటి కేవలం టికెట్ ఇస్తేనే ఉంటారు.. లేదంటే బయటకు పోతారు. కానీ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న రవిచంద్రను కాదని మరెవరికి టికెట్వచ్చే అవకాశం లేదని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో తన సతీమణిని రంగంలోకి దింపడానికే యువగళంలో బీద జ్యోతిని ఎంట్రీ ఇప్పించాడని ప్రచారం. అయితే సోమవారం కావలిలో లోకేశ్ బహిరంగ సభకు జన సమీకరణకు ఉత్సాహంగా ఉన్న నేతలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. నేటి లోకేశ్ సభ పరిస్థితిపై అయోమయం నెలకొంది. -
మైనింగ్ డాన్ కావ్య కృష్ణారెడ్డికి ముకుతాడు
పాతికేళ్ల క్రితం అతనో కామర్స్ అధ్యాపకుడు. తాను ఉండే ఇంటికి అద్దె కూడా చెల్లించలేని పరిస్థితి. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి.. జలదంకి ఎంపీపీగా ఎన్నికై మైనింగ్ డాన్‌గా ఎదిగాడు. రియల్ ఎస్టేట్ నుంచి క్వారీలు, క్రషర్లు, కాంక్రీట్ మిక్సర్లు పెట్టి అడ్డదారులు తొక్కుతూ అతి తక్కువ కాలంలోనే వేల కోట్లకు అధిపతి అయ్యాడు. ఆయనే గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ యజమాని డీవీ కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి. ఇన్నాళ్లు తెరచాటుగా సాగిస్తున్న అతని అవినీతి బాగోతం ఇటీవల సమాచారహక్కు చట్టంతో బయటపడింది. ‘స్పందన’ ఫిర్యాదుతో వెలుగుచూసింది. రాష్ట్ర ప్రభుత్వం అతని అక్రమాలపై విచారణ జరిపి రూ.140 కోట్ల జరిమానా విధించి ఆ మైనింగ్ డాన్ దురాగతాలకు ముకుతాడు వేసింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జలదంకి మండలానికి చెందిన గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ యజమాని డీవీ కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి 2008లో రోడ్డు మెటల్ పేరుతో లీజుకు తీసుకున్న క్వారీలే అడ్డాగా సమీపంలోని అనధికార భూముల్లో మెటల్ తవ్వేసి వందల కోట్ల రూపాయల దోపిడీకి తెరతీశాడు. పదేళ్ల కాలపరిమితికి లీజుకు తీసుకుని గడువు ముగిసి ఐదేళ్లు దాటిపోయినా యథేచ్ఛగా మైనింగ్ చేస్తున్నాడు. క్వారీ మైనింగ్ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా స్టోన్ క్రషర్లు, కూలీల నివాసాలు, పెట్రోల్ బంకుల వంటివి ఏర్పాటు చేశాడు. అక్రమాలను తరచి చూస్తే.. గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ పేరు మీద డీవీ కృష్ణారెడ్డి, డి.కవిత పేరుతో జలదంకి మండలం గట్టుపల్లిలో సర్వేనంబర్ 1015లో 9.47 ఎకరాల భూమిని రోడ్డు మెటల్ తవ్వకానికి పదేళ్ల కాలపరిమితితో (26.02.2008 నుంచి 25.02.2018) మైనింగ్ లీజు హక్కులు పొందాడు. అదే మండలం అన్నవరంలో సర్వేనంబర్ 851/2పీలో 5.36 ఎకరాల భూమిని రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ పేరుతో రోడ్డు మెటల్ తవ్వకానికి 10 ఏళ్ల కాలపరిమితితో (26.02.2008 నుంచి 25.02.2018) మైనింగ్ లీజు హక్కులు పొందాడు. అయితే గట్టుపల్లి క్వారీలో టన్ను మెటల్ కూడా తవ్వకుండా అక్కడే క్రషర్లు, పెట్రోల్ బంకు, కూలీల నివాస భవనాలు, కార్యాలయం వంటివి ఏర్పాటు చేశాడు. అయితే ఈ క్వారీ నుంచి 28 వేల క్యూబిక్ మీటర్ల మెటల్ రవాణాకు పర్మిట్లు జారీ చేయడం గమనార్హం. ఈ క్వారీకి సంబంధించి పదేళ్ల లీజు కాలపరిమితి 2018 ఫిబ్రవరి 25వ తేదీ నాటికే పూర్తయితే 15 ఏళ్ల లీజు కాలపరిమితి పెంచమని ప్రతిపాదిస్తూ దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అది మైనింగ్‌శాఖ వద్ద పరిశీలనలో ఉండడంతో ఆ లీజు కొనసాగుతూనే ఉంది. గట్టుపల్లి క్వారీ పక్కనే ఉన్న ఇతరుల భూములు, ప్రభుత్వ భూముల్లో సుమారు 7 లక్షల క్యూబిక్ మీటర్ల మెటల్‌ను అక్రమంగా తవ్వేసినట్లు ఇటీవల మైనింగ్‌శాఖ తనిఖీల్లో బట్టబయలైంది. అన్నవరం క్వారీకి లీజు గడువు పెంచమనే అభ్యర్థనను కూడా మైనింగ్ శాఖ తిరస్కరించింది. అన్నవరం క్వారీతోపాటు పక్కనే ఉన్న భూముల్లో కూడా అక్రమంగా మైనింగ్ చేపట్టి 5 లక్షల క్యూబిక్ మీటర్ల మెటల్‌ను తవ్వేసినట్లు వెలుగుచూసింది. ఈ క్వారీ లీజు గడువు ముగిసినప్పటికీ గత ఐదేళ్లుగా గట్టుపల్లి క్వారీ పరి్మట్తోనే విచ్చలవిడిగా మైనింగ్ చేపట్టాడు. మొత్తంగా 12 లక్షల క్యూబిక్ మీటర్ల మెటల్‌ను అక్రమంగా తవి్వనట్లు మైనింగ్ శాఖ లెక్కలు తేల్చింది. అక్రమంగా తవ్వేసిన మెటల్ విలువ ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారు రూ.200 కోట్లు ఉంటుందని, మార్కెట్ ధర ప్రకారం రూ.600 కోట్లు ఉంటుందని అంచనా. కావ్య కృష్ణారెడ్డి అక్రమాలపై స్థానికులు సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తు చేయడంతో అసలు విషయాలు బయటకు వచ్చాయి. వీటి ఆధారంగా సదరు వ్యక్తులు ‘స్పందన’లో ఫిర్యాదు చేయడంతో అక్రమాల బాగోతం బయటపడింది. కరెంట్ బిల్లు ఆధారంగా.. గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్, రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ పేరుతో తీసుకున్న లీజు క్వారీల్లో అక్రమ మైనింగ్ జరగలేదని తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. క్రషర్లకు వినియోగించిన కరెంట్ బిల్లుల ఆధారంగా లెక్కలు తీయగా, 89 లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగించినట్లు తేలింది. టన్ను మెటల్ ప్రాసెస్ చేయడానికి 2.5 యూనిట్లు ఖర్చవుతుందని, ఆ మేరకు 12 లక్షల క్యూబిక్ మీటర్ల మెటల్‌ను అక్రమంగా తవ్వేసినట్లు నిర్ధారించారు. చితికిన ప్రాణాలు అక్రమ మైనింగ్ వాహనాల కింద పడి పదేళ్ల కాలంలో పలువురు మృతిచెందినట్లు తెలుస్తోంది. నిత్యం వందలాది వాహనాల్లో రోడ్మెటల్ నుంచి పెద్ద బండరాళ్లు, కంకర, మట్టి లాంటి సహజ వనరులను లూటీ చేశారు. ఈ అక్రమ రవాణా వాహనాల కిందపడి పలువురు ప్రాణాలు కోల్పోయినా ఎలాంటి కేసులు లేకుండా భయపెట్టి రాజీచేసి పంపించేవారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అనధికార బ్లాస్టింగ్లు చేస్తూ ఊరినే వణికిస్తున్నా అధికారులు, పోలీసులు పట్టించుకున్న దాఖలాలు లేవని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులను ప్రలోభపెట్టి.. అక్రమ మైనింగ్‌కు స్థానిక రెవెన్యూ, పోలీస్, మైనింగ్‌శాఖల సహకారం ఉన్నట్లు ఆ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అనుమతి లేని అక్రమ మైనింగ్‌పై ఎన్నోమార్లు ఫిర్యాదులు చేసినా స్పందించిన దాఖలాలు లేవని చెబుతున్నారు. ఈ అక్రమాల గురించి ప్రశ్నించిన వారిపై దాడులు చేయించడంతోపాటు ఇళ్లకు వెళ్లి బెదిరించేవారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా మధ్యస్తం చేసి పంపేవారని స్థానికులు పేర్కొంటున్నారు. గురు రాఘవేంద్ర కాంక్రీట్ మిక్సర్ ప్లాంట్లతో.. డీవీ కృష్ణారెడ్డి అక్రమాల దందా ఈనాటి కాదు. కొన్నేళ్ల క్రితమే నెల్లూరు పెన్నానది, నాయుడుపేటలోని స్వర్ణముఖి నదీతీరంలో గురు రాఘవేంద్ర కాంక్రీట్ మిక్సర్ ప్లాంట్లు ఏర్పాట్లు చేసి రూ.కోట్లు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. ఈ యూనిట్‌కు కంకర, సిమెంట్ కొనుగోలు చేసినా.. ఇసుకను మాత్రం నదీ తీరాల్లోనిదే వాడినట్లు సమాచారం. ఈ రెండు ప్లాంట్ల నుంచి నిత్యం వందల ట్యాంకర్ల కాంక్రీట్ మిక్సింగ్ వ్యాపారం జరిగిందని తెలుస్తోంది. గతంలో ఇసుక ఉచితంగా ఉండడంతో రూపాయి ఖర్చు లేకుండా నదీతీరాలను తవ్వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ఇసుక పాలసీ అమలు చేసి ధర నిర్ణయించింది. అయితే గురు రాఘవేంద్ర కాంక్రీట్ మిక్సర్ ప్లాంట్లలో ఈ నాలుగేళ్లలో ఎంత ఇసుక వినియోగించారు.. ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనే వివరాలను పరిశీలిస్తే అందులోని అక్రమాలు కూడా బట్టబయలయ్యే అవకాశం ఉంది. ఈ రెండు క్రషర్ల వద్ద కరెంట్ వినియోగాన్ని లెక్కిస్తే మరికొన్ని నిజాలు కూడా వెలుగుచూసే అవకాశం ఉంది. అక్రమాలపై తొమ్మిదేళ్లుగా పోరాటం గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్ యజమాని డీవీ కృష్ణారెడ్డి ఎన్నో ఏళ్లుగా సహజ వనరులను దోచుకుంటున్నాడు. అక్రమ మైనింగ్ ద్వారా వేల కోట్లు సంపాదించాడు. మా గట్టుపల్లి పంచాయతీలో సహజ వనరులు దోచుకుంటున్నా ఒక్క రూపాయి కూడా పంచాయతీకి సీనరేజ్ చెల్లించేవాడు కాదు. అతని అక్రమాలపై తొమ్మిదేళ్లుగా పోరాటం చేస్తున్నా. అక్రమాలను ప్రశ్నించినందుకు మా కుటుంబంపై దాడులు చేయించాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నా తొమ్మిదేళ్ల పోరాటానికి ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం మద్దతుగా నిలిచింది. విచారణ జరిపి జరిమానా విధించడం ద్వారా అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్టపడింది. – గుమ్మలపాటి సుబ్బారావు, ఉప సర్పంచ్, గట్టుపల్లి ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ ద్వారా గట్టుపల్లి పంచాయతీలో దోపిడీ చేస్తున్నారు. అనుమతు లు లేకుండా సహజ వనరులను దోచుకుంటున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. గ్రామస్తులు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మైనింగ్ అక్రమాలపై చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉంది. ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. – దివి నరేంద్రచౌదరి, గట్టుపల్లి, జలదంకి మండలం -
నర్సింగ్ విద్యార్థి కావ్య ఆత్మహత్య
ఖమ్మంక్రైం: ఖమ్మంలో ఓ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం మద్దుకూరుకు చెందిన కోడెం కృష్ణ – రమాదేవి రెండో కుమార్తె కావ్య(19) ఖమ్మంలోని పారా మెడికల్ కాలేజీలో నర్సింగ్ (ఏఎన్ఎం) చదువుతోంది. ఖమ్మం, బీకే బజార్‌లోని ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తూ స్నేహితురాలు సీతామహాలక్ష్మితో కలిసి అద్దె గదిలో ఉంటోంది. అయితే, మంగళవారం నైట్ డ్యూటీకి వెళ్లి వచ్చిన ఆమె బుధవారం ఉదయం నిద్రపోయింది. స్నేహితురాలు సీతామహాలక్ష్మి విధులకు వెళ్లింది. తరువాత కావ్య మరో స్నేహితురాలు తనుశ్రీ వచ్చి కాసేపు మాట్లాడి తిరిగి కిందకు వెళ్తుండగా పెద్ద శబ్దం వచ్చింది. ఏం జరిగిందోనని తనుశ్రీ వెళ్లి చూడగా కావ్య ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే చుట్టుపక్కల వారిని పిలవడంతో వచ్చి కిందకు దించారు. అప్పటికే ఆమె మృతి చెందింది. తాను మాట్లాడినప్పుడు కావ్య నీరసంగా ఉందని తనుశ్రీ తెలిపింది. ఘటనకు ముందు కావ్య తనకు ఫోన్ చేసి జాగ్రత్తలు చెప్పిందని తల్లి రమాదేవి వెల్లడించింది. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదంది. తల్లి ఫిర్యాదుతో ఖమ్మం వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య ఎపిసోడ్లో కీలక ట్విస్ట్ -
అనుబంధాలు గుర్తుకొస్తాయి
‘‘తెలంగాణకి చెందిన పల్లెటూర్లో జరిగే కథ ‘బలగం’. మా సినిమా చూస్తే కుటుంబంలోని బంధాలు, అనుబంధాలు గుర్తొస్తాయి. వేణు చక్కగా తీశాడు. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని ‘దిల్’ రాజు అన్నారు. ప్రియదర్శి, కావ్య, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ముఖ్య పాత్రల్లో వేణు ఎల్దండి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బలగం’. ‘దిల్’ రాజు ప్రొడక్షన్స్ శిరీష్ సమర్పణలో హర్షిత్, హన్షిత నిర్మించారు. -
జడలు విప్పుతున్న వికృత హింస.. చుట్టూ పరిస్థితులు మారాలి
ఇటీవల హైదరాబాద్‌లోని ఓ పాఠశాలలో ముక్కు పచ్చ లారని చిన్నారిపై లైంగిక దాడి జరిగింది. దీనిని చూస్తుంటే ఆడ పిల్లలు చిన్నా పెద్దా తేడా లేకుండా ఎక్కడైనా, ఎప్పుడైనా లైంగిక దాడికి గురయ్యే అవకాశం ఉందని అర్థమవుతోంది. జడలు విప్పుతున్న ఈ వికృత అమానవీయ హింస ఆడ పిల్లల తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. లైంగిక దాడులకు ప్రేరేపించే సంస్కృతి మన చుట్టూ విశృంఖల స్థాయిలో విస్తరిస్తున్నది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా... లైంగిక దాడులు కొనసాగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రక్త సంబంధీకులు, టీచర్లు, డ్రైవర్లు... ఇలా మన చుట్టుపక్కల ఉండే మనకు పరిచయం ఉన్నవారూ, లేనివారి రూపాల్లో లైంగికదాడులు పొంచి ఉంటున్నాయి. ఈ ఘటనలు చోటు చేసుకున్న సందర్భాల్లో పలుకుబడి ఉన్న నిందితులు బెదిరించడం వల్ల చాలామంది బాధిత కుటుంబాల వారు పోలీసులకు ఫిర్యాదు చేయడానికీ భయపడుతున్నారు. అలాగే లైంగిక దాడి సంగతి బయటికి తెలిస్తే పరువు పోతుందన్న భయం భారతీయ సమాజంలోని తల్లిదండ్రులకు సహజంగానే ఉంటుంది. అందుకే ఎవరికీ చెప్పు కోలేక తమలో తాము కుమిలిపోతూ ఉంటారు. అటువంటి కుటుంబాలపై దాడులు మరిన్ని జరిగే అవకాశం ఉంది. అందుకే బాధిత కుటుంబాలు వెంటనే పోలీస్ సహాయం పొందాలి. చిన్నపిల్లల విషయంలో ఆడ, మగ అన్న తేడాను చూపించకుండా ఇద్దరిపైనా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ క్రూరులు మరో అడుగు ముందుకువేసి చైల్డ్ సెక్స్, చైల్డ్ పోర్నోగ్రఫీల రూపంలో ఈ భయంకర సంస్కృతిని ఇంటర్నెట్లో పెట్టి డబ్బు చేసుకునే పనీ చేస్తున్నారు. అంటే వీళ్లు ఈ అసాంఘిక, అమానవీయ కార్యకలాపాలను ‘మార్కెట్ సరుకు’గా మార్చేశారన్న మాట. ‘వర్జిన్ సెక్స్’ పేరుతో టీనేజ్ పిల్లలపై లైంగికదాడులు చేస్తూ అంతర్జాలంలో ఆ వీడియోలు వైరల్ చేసి డబ్బులు సంపాదించడం ఇందులో భాగంగానే చూడాలి. ఈ దాడులకు గురైన పిల్లలు క్రమంగా సెక్స్ వ్యాపారం ఊబిలో కూరుకుపోయి జీవితాలను కోల్పోతున్నారు. ఆధునిక యాంత్రిక ప్రపంచంలో తల్లిద్రండులు పిల్లలకు పట్టించుకునే తీరిక లేకపోవడం వల్ల నేరస్థులు పిల్లలను ట్రాప్ చేయగలుగుతున్నారు. అలాగే పిల్లలకు సెల్‌ఫోన్ అందుబాటులో ఉండటం వల్ల అన్నీ చూసే అవకాశం ఏర్పడుతోంది. మాదక ద్రవ్యాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఫలితంగా వారు దారితప్పుతున్నారు. టీవీల్లో ప్రసారం అవుతున్న కంటెంట్ కూడా ఈ దురాగతాలకు కారణమవుతున్నది. ఈ పరిస్థితి మారాలంటే పాఠశాల స్థాయిలోనే మోరల్ సైన్స్ క్లాస్‌లను తప్పని సరిగా విద్యార్థులకు బోధించాల్సిన అవసరం ఉంది. బ్యాడ్ టచ్, గుడ్ టచ్‌ల గురించిన అవగాహన పిల్లలకు కల్పించాలి. పిల్లలపై లైంగిక దాడుల నియంత్రణ, వాటిని ఎదుర్కోవడానికి రూపొందించిన ‘పోక్సో’ తరహా చట్టాల పట్ల అవగాహన కూడా సమాజాన్ని అప్రమత్తం చేయటంలో ఉపకరిస్తాయి. (క్లిక్ చేయండి: ఆపన్నులకు ఫ్యామిలీ డాక్టర్ భరోసా) - డా. కడియం కావ్య కడియం ఫౌండేషన్ ఛైర్పర్సన్ -
అప్పుడు చైల్డ్ఆర్టిస్ట్.. ఇప్పుడేమో హీరోయిన్ రేంజ్ (ఫొటోలు)
-
అడవుల్లో ఉండిపోయింది
‘ఒక సమయం వస్తుంది. ఈ నగరాలకు దూరం వెళ్లిపోవాలనిపిస్తుంది. కాకుంటే నేను ఆ పిలుపు ముందు విన్నాను’ అంటుంది 35 కావ్య. నోయిడాలో ఫ్యాషన్ ఉత్పత్తుల రంగంలో పని చేసిన కావ్య గత పదేళ్లుగా సెలవుల్లో భారతీయ పల్లెలను తిరిగి చూస్తూ తన భవిష్యత్తు పల్లెల్లోనే అని గ్రహించింది. ‘ఒరిస్సా అడవులకు మారిపోయాను. ఈ ఆదివాసీల కోసం పని చేస్తాను’ అంటోంది కావ్య. ఆమెలా బతకడం ఎందరికి సాధ్యం. చుట్టూ దట్టమైన అడవులు. అమాయకంగా నవ్వే ఆదివాసీలు. స్విగ్గి, జొమాటో, అమెజాన్‌ల గోల లేకుండా దొరికేది తిని సింపుల్‌గా జీవించే జీవనం, స్వచ్ఛమైన గాలి, స్పర్శకు అందే రుతువులు... ఇంతకు మించి ఏం కావాలి. నగరం మనిషి సమయాన్ని గాయబ్ చేస్తోంది. మరో మనిషిని కలిసే సమయం లేకుండా చేస్తుంది. కాని పల్లెల్లో? సమయమే సమయం. మనుషుల సాంగత్యమే సాంగత్యం. ‘ఆ సాంగత్యం అలవాటైన వారు అడవిని వదల్లేరు’ అంటుంది కావ్య సక్సెనా. 35 ఏళ్ల కావ్య ఇప్పుడు ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌ల సరిహద్దులో ఉండే కోరాపుట్ ప్రాంతంలో సెటిల్ అయ్యింది. ఒక్కత్తే. అక్కడి పల్లెల్లో ఆమె నివాసం. ఆ ఊరివాళ్లే ఆమె మనుషులు. అక్కడి ఆహారమే ఆమె ఆహారం. కాని ఆ జీవితం ఎంతో బాగుంటుంది అంటోంది కావ్య. నోయిడా నుంచి జైపూర్‌లో జన్మించిన కావ్య చదువు కోసం అనేక ప్రాంతాలు తిరిగింది. కొన్నాళ్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పని చేసింది. ఆ తర్వాత నోయిడాలో ఫ్యాషన్ ఉత్పత్తుల కార్పొరెట్ సంస్థకు మారింది. అయితే ఎక్కడ పని చేస్తున్నా పల్లెలను తిరిగి చూడటం ఆమెకు అలవాటు. ‘అందరూ అందమైన బీచ్‌లను, టూరిస్ట్ ప్లేస్‌లను చూడటానికి వెళతారు. నేను కేవలం పల్లెటూళ్లు చూడటానికి వెళ్లేదాన్ని. పల్లెల్లో భిన్నమైన జీవితం ఉంటుంది. అది నాకు ఇష్టం’ అంటుంది కావ్య. అయితే 2020లో వచ్చిన లాక్డౌన్ ఆమె కాళ్లకు బేడీలు వేసింది. అక్టోబర్‌లో ఆంక్షలు సడలింపు మొదలయ్యాక ‘మహీంద్రా’ వారితో కలిసి ‘కావ్యాఆన్క్వెస్ట్’ అనే సోలో ట్రిప్‌కు బయలుదేరింది. దీని ఉద్దేశ్యం పల్లెల్లో ఉండే హస్తకళలను డాక్యుమెంట్ చేయడమే. ఆ దారిలో ఆమె అనేక పల్లెల్లో గ్రామీణులు, ఆదివాసీలు చేసే హస్తకళలను గమనించింది. ‘కాని వాటిని మార్కెట్ చేసే ఒక విధానం మన దగ్గర లేదు. పల్లెల్లోని ఉత్పత్తులకు పట్నాల్లోని మార్కెట్‌కు చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్‌ను పూడ్చాలి అనిపించింది’ అంది కావ్యా. ఇక ఆమెకు జీవిత గమ్యం అర్థమైంది. ‘నగరానికి తిరిగి వచ్చాక నాకు ఊపిరి ఆడలేదు. జూలై 2021లో ఇక నేను శాశ్వతంగా నగరానికి వీడ్కోలు చెప్పేశాను. ఒరిస్సాల్లోని ఈ అడవులకు వచ్చి ఉండిపోయాను’ అంటుంది కావ్య. క్రాఫ్ట్ టూరిజం ఇది కొత్తమాటగా అనిపించవచ్చు. కాని హస్తకళలు ఉన్న గ్రామాలను పర్యాటక కేంద్రాలుగా ప్రోత్సహించడమే క్రాఫ్ట్ టూరిజం. కావ్య ఇప్పుడు కోరాపుట్ ప్రాంతంలోని నియమగిరి కొండల దగ్గర నివశిస్తోంది. ఆ ప్రాంతంలో డోంగ్రియా తెగ ఆదివాసీలు ఎక్కువ. ‘వారు గడ్డితో చాలా అందమైన వస్తువులు చేస్తారు. అవి బాగుంటాయి. అంతేకాదు వారు 47 రకాల బియ్యాన్ని పండిస్తారు. వారి వంటలు మధురం. అవన్నీ నగరాల్లో ఎక్కడ తెలుస్తాయి. ఈ తెగవారు ‘కపడగంధ’ అనే శాలువాను అల్లుతారు. అది చాలా బాగుంటుంది. చెల్లెలు శాలువా అల్లి అన్నకు ఇస్తే అన్న తాను వివాహం చేసుకోదలిచిన అమ్మాయికి దానిని బహుమతిగా ఇస్తాడు. ఆ శాలువాలకు మంచి గిరాకీ ఉంది’ అంటుంది కావ్య. అయితే గ్రామీణ హస్తకళల ఉత్పత్తుల పేరుతో మార్కెట్లో డూప్లికేట్లు ఉండటం గురించి ఆమెకు బెంగ ఉంది. ‘ఒరిజినల్ ఉత్పత్తులను కస్టమర్లకు అందించడానికి ‘క్రాఫ్ట్ పోట్లీ’ అనే సంస్థ స్థాపించి పని చేస్తున్నాను. ఒక గ్రామాన్ని నా వంతుగా దత్తత చేసుకున్నాను. ఆ గ్రామంలో ఉండే 50 మంది మహిళలకు హస్తకళల ద్వారా ఉపాధి కల్పిస్తున్నాను’ అంది కావ్య. ఈమె చేస్తున్న పని చూసి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా తమ హస్తకళల ప్రమోషన్‌కు ఆహ్వానించింది. అక్కడి ఆదివాసీలను తరచూ కలిసి వస్తోంది కావ్య. త్వరలో ఆమె దేశంలోని అందరు ఆదివాసీలను ఒక ప్లాట్‌ఫామ్ మీదకు తెచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందరో మహానుభావులు అని మగవాళ్లను అంటారు. కాని ఎందరో మహా మహిళలు. కావ్య కూడా ఒక మహా మహిళ. -
ప్రేయసితో యంగ్ హీరో ఎంగేజ్మెంట్.. ఫోటో వైరల్
యంగ్ హీరో నాగ అన్వేష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన మనసుకు నచ్చిన అమ్మాయితో నాగ అన్వేష్ నిశ్చితార్థం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడకకు ఇరు కుటుంబాలతో పాటు స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు హాజరయ్యారు. వీరి ఎంగేజ్మెంట్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కాగా గత కొన్నాళ్లుగా నాగ అన్వేష్, కావ్య ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమ వ్యవహారాన్ని కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకురాగా ఇరు కుటుంబాలు ఆమోదం తెలిపాయి. నాగ అన్వేష్ తండ్రి ప్రముఖ నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి అన్న విషయం తెలిసిందే. -
మానసిక ఆరోగ్యం మనకాలపు అవసరం
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్– 19 మహమ్మారి ఆర్థిక, సామాజిక, విద్యా, ఉద్యోగ రంగాల లోనే కాకుండా మానసిక సంక్షోభాన్ని కూడా తెచ్చి పెట్టింది. ముఖ్యంగా ఫ్రంట్ లైన్ వర్కర్లయిన వైద్య సిబ్బంది, పోలీస్, శానిటేషన్ సిబ్బందితో పాటు ఒంటరిగా జీవించేవారిని మరింత కృంగదీసింది. అభివృద్ధి చెందుతున్న భారత్‌లాంటి దేశాలలో 6–7% ప్రజలు మానసిక వ్యాధులతో సతమతమవు తున్నారు. వారు కోల్పోయే ఆరోగ్యవంతమైన రోజులు మలేరియా, టీబీ, డయేరియా కన్నా ఎక్కువే. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2001 రిపోర్టు, ప్రతి నాలుగు కుటుంబాలలో ఒక కుటుంబంలోని సభ్యులు ప్రవ ర్తనా సంబంధిత రుగ్మతలకు గురయ్యే ప్రమాదం ఉందని వెల్లడించింది. ఈ రుగ్మతలు వీరి విద్య, ఉపాధి మార్గాలను దెబ్బకొట్టడమే కాకుండా, వీరి కుటుంబ సభ్యుల పైన కూడా ప్రభావం చూపుతాయి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్య పరిరక్షణకు కూడ ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. దీనికి ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని ఒక సందర్భం చేసుకోవాలి. ఈ 2021 థీమ్‌ను ‘మెంటల్ హెల్త్ ఇన్ ఆన్ అన్ఈక్వల్ వరల్డ్’గా ప్రకటించారు. మానసిక ఆరోగ్య సేవలు అందించడంలో ఎలాంటి అసమానతలు ఉండకూడ దని ఈ థీమ్ ముఖ్యోద్దేశం. ఎందుకంటే బాధితుల్లో 75–95 శాతం పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల వారే. వీరంతా వైద్యానికి ఆమడదూరంలో ఉన్నారు. ధనిక దేశాలలోనూ సేవలు ఆశాజనకంగా లేవు. దీనికి కారణం, ‘ఆరోగ్య బడ్జెట్’లోని నిధులలో మానసిక ఆరోగ్య సేవలకు కేటాయించేవి అత్యల్పం కావడం. చాలా కుటుంబాలు కుటుంబ పెద్దను కోల్పోయి, అనేక ఆర్థిక ఇబ్బందులతోపాటు ఆ తరువాత జరిగిన పలు పరిణామాలకు తీవ్ర నైరాశ్యానికి గురయ్యాయి. లాక్డౌన్లో ఉద్యోగాలు కోల్పోవడం, సామాజిక దూరం పాటిస్తూ ఉండటం, ఇంటి నుండి పనులు చేయడం వలన కూడ కొందరిలో డిసోసియేటివ్, సైకోటిక్, హైపోకాండ్రి యాక్ లక్షణాలు కనిపించ డంతో పాటు, ఓసీడీలతో కూడా సతమతవుతున్నారు. మానసిక వైద్యుడిని సంప్రదించడానికి నిరాసక్తతతో పాటు, మానసిక వ్యాధులను ఒక కళంకంగా భావించడం వలన వ్యాధి తీవ్రత పెరిగి ఆత్మహత్యా ప్రయత్నాల వరకు వెళ్ళుతున్నారు. కరోనాను అధిగ మించడం కోసం ఎంచుకున్న లాక్డౌన్ల వలన ఈ మానసిక రుగ్మతలు కౌమారదశ వారిలో అధికంగా బయటపడుతున్నాయి. ఈ సవాళ్లను అధిగమించేలా ‘మెంటల్ హెల్త్ డే’ నాడు లోకల్‌గానూ, గ్లోబల్గానూ యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలి. సివిల్ సొసైటీలుగా ఏర్పడి, వారి ప్రాంతంలో మానసిక వ్యాధులతో బాధపడే వారిని గుర్తించి, వారి గురించి అందుబాటులో ఉండే పీహెచ్సీ, ఆరోగ్య కార్యకర్తలకు సమాచారం అందించే విధంగా అవగాహన కలిగించాలి. మొదట సమస్యను గుర్తించి, దాని గురించి బయట చెప్పుకొనే విధంగా ప్రోత్సాహక వాతావరణాన్ని కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం 1982లో ‘నేషనల్ మెంటల్ హెల్త్ మిష న్’ను ఏర్పాటు చేసింది. ‘బళ్ళారీ మోడల్’ నమూ నాతో ‘డిస్ట్రిక్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్’ ఆవిష్కరించి మొదట నాలుగు జిల్లాలతో మొదలుపెట్టి వంద జిల్లాలలో అమలు చేయడానికి ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగా కమ్యూనిటీ స్థాయి నుండి సమాజం పాత్ర ఉండేలాగ, వ్యాధిని ముందుగా గుర్తించడం, వైద్య సిబ్బందికి తగు శిక్షణ ఇవ్వడం, పరిశోధన, ప్రజావగాహన కార్యక్రమాలు నిర్వహిం చడం చేయాలి. ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్రాలు సొంతం చేసుకొని మానసిక ఆరోగ్య సేవలను విస్తృతంగా అందుబాటులోకి తేవాలి. డాక్టర్ కడియం కావ్య వ్యాసకర్త పాథాలజీ విభాగ స్పెషలిస్ట్, వర్ధన్నపేట కడియం ఫౌండేషన్ చెయిర్ పర్సన్ (అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం) -
‘వల్లంకి పిట్టా’ బేబీ ఇప్పుడెలా ఉందో చూశారా?
కావ్య కల్యాణ్‌రామ్ తెలుసా మీకు? ఆమె ఎవరు అంటారా? సరే, అల్లు అర్జున్ ఫస్ట్ మూవీ గంగోత్రిలోని ‘వల్లంకి పిట్టా వల్లంకి పిట్టా మెల్లంగ రమ్మంటా’వీడియో సాంగ్‌ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అందులో ఓ బుడ్డి పాప క్యూట్, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. ఆ బుడ్డి పాప పేరే కావ్య కల్యాణ్‌రామ్. బాలనటిగా పలు సినిమాల్లో నటించిన ‘గంగోత్రి బేబీ’ ప్రస్తుతం ఎలా ఉంది? ఏం చేస్తుందో తెలుసా? హైదరాబాద్‌కి చెందిన కావ్య కల్యాణ్ రామ్ ‘గంగోత్రి’సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలకృష్ణ ‘విజయేంద్రవర్మ’, చిరంజీవి ‘ఠాగూర్’ నాగార్జున ‘స్నేహమంటే ఇదేరా’ పవన్ కల్యాణ్ ‘బాలు’తదితర సినిమాల్లో నటించింది. ఆ తర్వాత చదువుపై శ్రద్దపెట్టి, సినిమాలకు దూరమైంది. 2019లో ‘లా’ పట్టాపుచ్చుకుంది. గతేడాది ‘మసూద’ అనే సినిమాతోనే కావ్య హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ భామ హీరోయిన్గా రాణించాలనుకుంటుందట. అందుకే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ప్రస్తుతం కావ్య లుక్స్.. మంచి హీరోయిన్ కి ఎగ్జాక్ట్ గా స్యూట్ అయ్యేలా ఉంది. హాట్ బేబీగా మారిన క్యూట్ బేబీ కావ్యకు మంచి ఆఫర్లు వచ్చి స్టార్ హీరోయిన్గా రాణించాలని ఆశిద్దాం. View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) -
అచ్చ తెలుగు అమ్మాయిని
కావ్య... ఈ పేరు బహుశా ఎవరికీ తెలియకపోచ్చు. కానీ అల్లు అర్జున్ మొదటి సినిమా ‘గంగోత్రి’లోని ‘వల్లంకి పిట్ట.. వల్లంకి పిట్ట...’ పాటని గుర్తు చేస్తే టక్కున ఆ పాటలోని చిన్నారి పాప గుర్తొస్తుంది. ఆ పాపే కావ్య. ఇప్పుడు తను హీరోయిన్ కాబోతోంది. తెలుగమ్మాయి అయిన కావ్య పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ – ‘‘బాలు, అడవిరాముడు, అందమైన మనసులో, విజయేంద్రవర్మ’తో పాటు ఇంకా చాలా సినిమాల్లో బాలనటిగా చేశాను. పుణెలోని ఓ కాలేజీలో లా పూర్తి చేసి, ఇప్పుడు సినిమా వైపు దృష్టి పెట్టాను. తెలుగుతో పాటు తమిళ, మళయాళ సినిమాలకు కూడా ఆడిష¯Œ ్స చేస్తున్నాను. నిజానికి లాక్ డౌన్‌కి ముందుగానే ట్రయిల్స్ స్టార్ట్ చేశాను. లాక్ డౌన్ రాకుండా ఉంటే ఓ ప్రాజెక్ట్ ఓకే అయ్యేది. నేను తెలుగు అమ్మాయిని కావడం అడ్వాంటేజ్‌గా ఫీలవుతున్నాను. మన తెలుగు కల్చర్, నేటివిటీ అనేది హిందీ హీరోయిన్ల కన్నా తెలుగు అమ్మాయిలకే అర్థమవుతుంది. రియాలిటీకి దగ్గరగా ఉండే, ఇంట్రెస్టింగ్ , ఛాలెంజింగ్ పాత్రలంటే ఇష్టం. ఓటీటీలో డిఫరెంట్ సబ్జెక్ట్స్ వస్తున్నాయి. అలాంటి అవకాశం నాకు వచ్చి, పాత్ర ఆసక్తిగా అనిపిస్తే చేస్తాను’’ అని చెప్పారు. -
పచ్చని కాగితం
‘చెట్టును కొట్టి గోడ కట్టకూడదు’ మనిషి తన మనుగడ కోసం ప్రకృతి బీభత్సాన్ని సృష్టించకుండా ఉండడానికి చెప్పిన సూక్తి ఇది. ఇల్లు కట్టుకోవడానికి చెట్లు లేని నేలను చూసుకోవాలి తప్ప పచ్చగా ఎదిగిన చెట్లను మొదలు వరకు నరికేసి, వేళ్లను పెకలించి వేసి నేలను చదును చేసి ఇల్లు కట్టుకునే అరాచకత్వాన్ని అరికట్టడానికి చెప్పిన మంచిమాటే గోడ కట్టడానికి చెట్టును కొట్టకూడదు అనేది. మనిషి నాగరికుడయ్యే కొద్దీ ప్రకృతిని విచక్షణ రహితంగా వాడడం కూడా పెరిగిపోయింది. కాగితం తయారు కావడం మనిషి పరిణామక్రమాన్ని వేగవంతం చేసింది. ఇప్పుడు ఆ కాగితమే మనిషి మనుగడను ప్రశ్నార్థకంలో పడేయడానికి ఒక హేతువు కానుంది. ఒక దేశం రోజుకు ఎంత పేపర్ వాడుతోంది, ఆ కాగితం తయారీకి ఎన్ని చెట్లు ప్రాణాలర్పిస్తున్నాయి, చెట్టు గుజ్జు నుంచి కాగితం తయారు కావడానికి ఎంత నీరు ఖర్చవుతోంది... వంటివన్నీ లెక్కవేసింది కావ్య. ఆ కాగితాల్లో గ్రంథాలుగా మారి బీరువాల్లో భద్రంగా ఉండే కాగితాలెన్ని? చిత్తు లెక్క రాసి నలిపి పారేసేవెన్ని? గ్రంథానికి మంచి కాగితం కావాల్సిందే. చిత్తు లెక్క, అట్టముక్క కోసం కూడా చెట్టును నరకడం ఏమిటి? అనుకుందామె. చెట్లను కాపాడుకోవాలి, కాగితమూ కావాలి. అందుకే పచ్చదనానికి హాని కలగకుండా కాగితం తయారు చేసే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. ప్రకృతి ప్రేమ కావ్య మాదప్ప బెంగళూరు, సెయింట్ జోసెఫ్స్ కాలేజ్‌లో కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. నెదర్లాండ్ ఆధారిత అంతర్జాతీయ బ్యాంకులో ఉద్యోగం చేసింది. పారిశ్రామిక వేత్తగా ఎదగాలనే తన ఆకాంక్షను నిజం చేసుకోవడానికి 2005లో ఇండియాకి వచ్చేసింది. రాగానే సొంతూరు కూర్గ్‌లో ‘ఆమన్వన’ పేరుతో స్పా రిసార్ట్‌ను ప్రారంభించింది. ఆమె ప్రయత్నం విజయవంతమైంది. స్పా ప్రచారం కోసం తయారు చేస్తున్న బ్రోచర్లను చూసినప్పుడు వచ్చిన ఆలోచనే చెట్టు లేని కాగితం. నిజానికి ట్రీ ఫ్రీ పేపర్ ప్రయోగం కావ్యతో మొదలు కాలేదు. పర్యావరణ పరిరక్షణ కోసం కావ్య ఈ టెక్నాలజీని జైపూర్ నుంచి బెంగళూరుకు తెచ్చింది. ఇందుకోసం ఆమె 15 రోజుల పాటు జైపూర్‌లోని కుమారప్ప నేషనల్ హ్యాండ్‌మేడ్ పేపర్ ఇన్స్టిట్యూట్లో పేపర్ తయారీని అధ్యయనం చేసింది. ‘‘కూర్గ్ అడవుల్లో పచ్చని ప్రకృతి మధ్య పెరిగిన దానిని, కాగితం కోసం పది– ఇరవై ఏళ్ల పాటు పెరిగిన చెట్టును అమాంతం నరికిపారేయడాన్ని తలుచుకుంటేనే ఆ గొడ్డలి నా గుండెల మీద పడినట్లు అనిపిస్తుంది. అందుకే ఈ ప్రయత్నం’’ అంటోంది కావ్య. ఆమె తన బ్లూ క్యాట్ పేపర్ పరిశ్రమలో రోజుకు ఐదువేల పేపర్ షీట్లను తయారు చేస్తోంది. కాగితం తయారీకి కలప గుజ్జునే వాడాల్సిన పని లేదనే సంగతిని పిల్లలకు తెలియచేయడానికి స్కూలు పిల్లలను ఫీల్డ్ విజిట్‌కు తన పరిశ్రమకు ఆహ్వానిస్తోంది. కలప లేని కాగితం కావ్య మాదప్ప కాగితం కోసం కలపకు బదులు... వస్త్ర పరిశ్రమలో పత్తిని దారం కోసం ఉపయోగించిన తర్వాత పనికి రాని వేస్ట్ మెటీరియల్‌ను సేకరిస్తోంది. వాటితోపాటు అవిసె గింజల పొట్టు, మల్బరీ ఆకుల ఈనెలు (పట్టు పురుగుల పెంపకంలో పురుగులకు ఆహారంగా మల్బరీ ఆకులను వేస్తారు. పురుగులు ఆకులను మాత్రమే తింటాయి. ఆ ఈనెలను సేకరిస్తోంది కావ్య), కొబ్బరి పీచు, మొక్కజొన్న కండెల పొట్టు, ధాన్యపు గడ్డి, నిమ్మగడ్డి, కాఫీ గింజల పొట్టు, అరటి గెల కాండం ఈ కాగితానికి ముడిసరుకు. ఈ కాగితంతో నోట్‌బుక్స్, క్యారీ బ్యాగ్‌లు, ఫోల్డర్లు, గిఫ్ట్ బాక్సులు, ఫొటో ఫ్రేములు, టేబుల్ మ్యాట్లు, కవర్లు, గ్రీటింగ్ కార్డులు, పెళ్లి కార్డులు, ల్యాంప్ షేడ్లు తయారు చేస్తారు. ట్రీ ఫ్రీ పేపర్ ప్రయోగం చేసిన కావ్య... స్కూలు పిల్లలకు కాగితం తయారీని చూపిస్తూ... -
కావ్యను కాపాడటానికి 63 మంది సిద్ధం
తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్న ఓ బాలికను రక్షించేందుకు యువత కదిలింది. రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్నా బాలిక ప్రాణం కాపాడేందుకు ముందుకు వచ్చారు. బాలిక కోసం ఏకంగా 63 మంది రక్తదానం చేసి తమలోని మానవత్వాన్ని చాటుకున్నారు. మదురై విల్లాపురం పుదునగర్ వాసులు తమలోని ఐక్యత, సామరస్యాన్ని చాటుకున్నారు. సాక్షి, చెన్నై : తిరువారూర్‌కు చెందిన రవి కుమార్తె కావ్య(17) కొంత కాలంగా రక్తహీనత సమస్యతో బాధపడుతోంది. గత వారం మదురైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి ఆమెకు చికిత్స అందిస్తున్నారు. తాజాగా ఆమెకు అత్యధిక యూనిట్లు రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆస్పత్రి వర్గాల సూచన మేరకు బయట నుంచి రక్తాన్ని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రవికి ఏర్పడింది. అంత స్తోమత లేని దృష్ట్యా ఆస్పత్రి వర్గాలను సంప్రదించాడు. ఎవరైనా రక్తం ఇస్తే ప్రత్యామ్నాయంగా తమ వద్ద ఉన్న రక్తం ఎక్కించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వారు సలహా ఇచ్చారు. చదవండి: శాశ్వతంగా ఇంటినుంచేనా? నో...వే.. లాక్డౌన్ సమయంలో రక్తం దొరకడం గగనమేనని, దాతలు ముందుకు వచ్చే పరిస్థితి లేదని..నెలగా వెలుగు చేసిన ఘటలను అతనికి వివరించారు. దీంతో ఆందోళన చెందిన రవి తన కుమార్తెను రక్షించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశాడు. చివరకు మదురై జిల్లా తిరుప్పరగుండ్రం సమీపంలోని విల్లాపురం పుదునగర్‌లో ఉన్న తమ సమీప బంధువుకు గోడు చెప్పుకున్నాడు. పుదునగర్ వాసుల సంక్షేమ సంఘం పేరిట తరచూ ఇక్కడి యువకులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం రవికి కలిసి వచ్చింది. దీంతో ఆ సంఘం నిర్వాహకులు ఇబ్రాహీం, సుల్తాన్, షేట్లను కలిశారు. చదవండి: 'ఆయన చేసిన పనులను చరిత్ర క్షమించదు' ఆగమేఘాలపై శిబిరం రవి కుమార్తె కావ్యను రక్షించేందుకు ఆ సంక్షేమ సంఘంలోని యువత ముందుకు వచ్చింది. జిల్లా కలెక్టర్ అనుమతితో ప్రత్యేక వైద్య శిబిరాన్ని శనివారం మధ్యాహ్నం ఏర్పాటు చేశారు. మతాలకు అతీతంగా అందరూ కదిలారు. ఏకంగా 63 మంది యువకులు రక్తదానం చేశారు. ఇక బాలికను రక్షించాల్సిన బాధ్యత మీదే అంటూ వైద్యులకు విజ్ఞప్తి చేశారు. ఇక్కడి యువకుల ఐక్యత, సామరస్యం చూసిన ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్ వర్గాలు నివ్వెరపోయాయి. ఇందులో గమనించాల్సిన విషయం ఏమిటంటే రంజాన్ ఉపవాస దీక్షలో ఉన్నా పదుల సంఖ్యలో మైనారిటీ యువకులు రక్తదానం చేయడం విశేషం. ఇక్కడి యువత మతాలకు అతీతంగా అన్నదమ్ముళ్లుగా మెలుగుతున్నారని, ఎవరికి చిన్న కష్టం వచ్చినా చలించిపోతారంటూ ఆ సంక్షేమ సంఘం వర్గాలు ప్రశంసించాయి. బాలికకు అవసరం అయ్యే మేరకు తమ వద్ద ఉన్న ఆమె గ్రూపు రక్తాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటామని వైద్యులు తెలిపారు. -
కరోనాపై పోరులో చిరంజీవి తల్లి
సాక్షి, హైదరాబాద్: మేము సైతం అంటూ ప్రతి ఒక్కరూ కరోనాను ఎదుర్కొనేందుకు మానవత్వాన్ని చూపుతూ ముందుకు వస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనాదేవి కూడా కరోనాపై పోరులో తాను సైతం అంటూ ముందుకు వచ్చారు. ఆమె గత 3 రోజులుగా తన స్నేహితురాళ్లతో కలిసి 700 మాస్క్‌లు కుట్టారు. వీటిని అవసరమైన వారికి అందజేస్తున్నారు. తన వృద్ధాప్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆమె సమాజం కోసం తనవంతు బాధ్యతను నెరవేరుస్తున్నారు. దేశంపట్ల, సమాజం పట్ల ఆమె చూపుతున్న బాధ్యతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. (వారికి సెల్యూట్ చేస్తున్నా: చిరు) మాస్కులు తయారు చేసిన కిషన్‌రెడ్డి భార్య సాక్షి, న్యూఢిల్లీ: తన సతీమణి కావ్య మాస్కులు తయారుచేసి, వాటిని పంపిణీ చేసిన చిత్రాలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ట్విట్టర్లో పోస్టు చేశారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు తన సతీమణి సమయాన్ని సద్వినియోగం చేస్తూ, ఇంట్లోనే మాస్కులు తయారు చేసి, వాటిని అవసరం ఉన్నవారికి అందించారని తెలిపారు. ఈ ట్వీట్‌కు కేంద్ర మంత్రులు ప్రకాష్ జవదేకర్, బాబుల్ సుప్రియో, అనురాగ్ ఠాకూర్, కిరెన్ రిజీజు, బాలీవుడ్ నటులు అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్, కవి కుమార్ విశ్వాస్, ఢిల్లీకి చెందిన సీనియర్ జర్నలిస్టు, ఇండియా టుడే ఎడిటర్ గౌరవ్ సావంత్, టాలీవుడ్ సినీ ప్రముఖులు పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, సమంతను ట్యాగ్ చేశారు. ఇలాగే ప్రతి కుటుంబం తమకు సాధ్యమైనంతలో ఇతరులకు సహాయం అందించేందుకు ముందుకు రావాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. భార్య విలవిలలాడుతుంటే తట్టుకోలేక.. -
మహిళలూ జాగ్రత్త
నవీన్ .కె. చారి, ప్రియాన్స్, మేఘనా చౌదరి, సుమయ, కావ్య, శ్రీదేవి ముఖ్య పాత్రల్లో వడ్ల జనార్థన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హలో మేడమ్’. వడ్ల నాగశారద సమర్పణలో కార్తీక్ మూవీ మేకర్స్ పతాకంపై వడ్ల గురురాజ్, వడ్ల కార్తీక్ నిర్మించారు. ఈ చిత్రం లోగోని ప్రముఖ దర్శకుడు సాగర్, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ విడుదల చేశారు. ‘‘హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. విజయం సాధించాలి’’ అన్నారు సాగర్. ‘‘చిన్న సినిమాలకు థియేటర్ల సమస్య ఉంది అనేది వాస్తవం. ఎక్కువ థియేటర్లు దక్కేలా నా వంతు సహకారం అందిస్తా’’ అన్నారు ప్రతాని రామకృష్ణ గౌడ్. ‘‘తండ్రిని దర్శకుడిగా పరిచయం చేస్తూ కొడుకు సినిమా తీయడం గ్రేట్’’ అన్నారు నిర్మాత టి. రామసత్యనారాయణ. వడ్ల జనార్ధన్ మాట్లాడుతూ– ‘‘ప్రస్తుత సమాజంలో మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోతున్నాయి. అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని చెప్పే చిత్రమిది’’ అన్నారు. ‘‘దిశా ఘటనకు ముందే ఈ సినిమా చేశాం. అమ్మాయిలపై ఓ సైకో చేసే కిరాతకాలను తెలియజేస్తున్నాం’’ అన్నారు ఘటికాచలం. -
సోషల్ డాక్టర్
డాక్టర్ కావ్య... ఫలానా వారి అమ్మాయిగా గుర్తింపు పొందడం లేదు. అలాంటి గుర్తింపు ఆమెకే కాదు... వాళ్ల అమ్మానాన్నలకు కూడా ఇష్టం లేదు. ‘నీకు నువ్వుగా సాధించుకున్నదే నీ గుర్తింపు.. అమ్మానాన్నతో వచ్చేది గుర్తింపు కాద’ని చెప్పి పెంచారామెని. మెడిసిన్ కోర్సు మీద ఆసక్తి పెంచుకున్నారామె. ఆమె కోరుకున్నట్లే చదివించారు పెద్దవాళ్లు. పేథాలజిస్టుగా ఆమెది పేషెంట్ల హెల్త్ రిపోర్టులను సర్టిఫై చేయాల్సిన బాధ్యత. ఆ ఉద్యోగం చేయగా చేయగా... ఆమెకు ఒక నిజం తెలిసింది. అనారోగ్యం వ్యక్తుల్లో మాత్రమే కాదని.. సమాజంలోనూ ఉందని! స్త్రీల ఆరోగ్యాన్ని అలక్ష్యం చేసే ఆ సామాజిక అనారోగ్యానికి కూడా వైద్యం చేయాలనుకున్నారు. రక్తహీనతతో బాధపడుతున్న మహిళలను చైతన్యవంతం చేస్తున్నారు. డాక్టర్ కావ్య తన తండ్రి పేరుతో గుర్తింపు కోరుకోకపోయినప్పటికీ... ఆమె ప్రాథమిక పరిచయం మాత్రం తెలంగాణ మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారమ్మాయిగానే. తను సామాజిక వైద్యురాలిగా మారడానికి దారి తీసిన పరిస్థితులను వివరించే ముందు.. తన కుటుంబ వివరాలను సాక్షితో పంచుకున్నారు కావ్య. సిటీ బస్సులో కాలేజ్‌కి ‘‘ముగ్గురమ్మాయిల్లో నేనే పెద్దదాన్ని. నేను సెవెన్త్‌లో ఉన్నప్పుడు.. అంటే 1994లో ఓ రోజు... ఎప్పటిలాగానే మధ్యాహ్నం భోజనానికి స్కూలు నుంచి ఇంటికి వచ్చాను. మాకప్పట్లో డైనింగ్ టేబుల్ లేదు. నేల మీదనే భోజనాలు. అమ్మ మాకు వడ్డించి తనూ కూర్చుని ఉంది. అప్పుడు నాన్న మంత్రి అయ్యారనే సమాచారం వచ్చింది. మంత్రి అంటే ఏంటని అమ్మని అడిగితే, అమ్మ ఏదో చెప్పింది కానీ, అమ్మకి కూడా వివరంగా చెప్పేటంతగా తెలియదు’’ అన్నారు డాక్టర్ కావ్య. తనకు మంత్రిగారమ్మాయిగా కారులో ప్రయాణించడంతోపాటు బస్ పాస్ కొనుక్కుని ఎంబీబీఎస్ కి కాలేజ్‌లో సిటీబస్‌లో వెళ్లిన అనుభవాలూ ఉన్నాయన్నారామె. బాల్య వివాహాల నియంత్రణ రాజకీయాల్లోకి రాకముందు నాన్న లెక్చరర్. ఇప్పటికీ ఆయనలో టీచర్ అలాగే ఉన్నారు. చిన్నప్పుడు స్కూలుకెళ్లావా, కాలేజ్కెళ్లావా... అని అడిగినట్లే ఇప్పుడు ‘హాస్పిటల్‌కి వెళ్లావా’ అని అడుగుతారు. మన డ్యూటీ మనం నూటికి నూరు శాతం చేయాలనే తత్వం ఆయనది. ఎవరైనా ఆయన్ని ‘ముగ్గురమ్మాయిలు కదా వాళ్లకు ఏమిచ్చారు’ అని అడిగితే... ‘ఏమివ్వాలి’ అని ఎదురు ప్రశ్నిస్తారు. ‘ముగ్గురినీ చదివించాను. నా పిల్లలు ఒకరు డాక్టర్, ఇద్దరు ఇంజనీర్లు. ముగ్గురూ పోస్ట్ గ్రాడ్యుయేట్లు. ఇంకా నేనిచ్చేదేంటి? వాళ్ల కాళ్ల మీద వాళ్లే నిలబడతారు. వాళ్ల జీవితాన్ని వాళ్లే నిర్మించుకుంటారు’ అని చెబుతారు. ఆయనకు రికమండేషన్ చేయడం ఇష్టం ఉండదు. మాకోసం ఫేవర్ చేయమని ఎవరికీ ఏమీ చెప్పలేదు. ఎవరైనా మమ్మల్ని ఏదైనా హెల్ప్ అడిగినప్పుడు... ఆ విషయాన్ని నాన్న దగ్గరకు తీసుకెళ్లినా కూడా ఆయన ఒప్పుకునేవారు కాదు. ‘వ్యక్తులకు కాదు, వ్యవస్థలకు చేయాలి.. అలాంటి ఆలోచన ఏదైనా ఉంటే చెప్పు మాట్లాడదాం’ అనేవారు. ఆయనకు ఆడపిల్లలంటే ప్రత్యేకమైన అభిమానం. మేము ముగ్గురం. మా ముగ్గురికీ కలిపి నలుగురమ్మాయిలు. ఇంటి నిండా ఆడపిల్లలు కనిపిస్తుంటే ఆయనకు ఎంత సంతోషమో మాటల్లో చెప్పలేను. ఆయనకు బాలికల కోసం ఏదైనా చేయడం చాలా ఇష్టం. ఒకప్పుడు కస్తూర్బా విద్యాకేంద్రాల్లో ఎనిమిదవ తరగతి వరకే ఉండేది. ఆ తర్వాత ఆ పిల్లలను మరో స్కూల్లో చేర్చడం, దూరం పంపడానికి ధైర్యంలేక వాళ్ల అమ్మానాన్నలు ఆ అమ్మాయిలకు తొమ్మిదో తరగతి వయసుకే పెళ్లిళ్లు చేసేవాళ్లు. ఇలాంటి బాల్య వివాహాలను అరికట్టడం కోసం నాన్న ఆ విద్యా కేంద్రాలను పన్నెండవ తరగతి వరకు అప్‌గ్రేడ్ చేయించారు. నాన్న నుంచి చేర్చుకున్నా పేషెంట్‌ను పేషెంట్‌గా మాత్రమే చూడకుండా వ్యాధి లక్షణం వెనుక ఉన్న సామాజిక కారణాన్ని అన్వేషించడం ఎలా అలవడిందంటే ఇదీ అని స్పష్టంగా చెప్పలేను. మనం చేసిన పని వల్ల సమాజానికి ప్రయోజనం చేకూరాలని నాన్న చెప్పిన మాటలే కారణం అనుకుంటాను. గవర్నమెంట్ హాస్పిటల్లో పేథాలజిస్టుని. ఇప్పటి వరకు నా ఉద్యోగం గ్రామాలు, చిన్న పట్టణాలు, అల్పాదాయ వర్గాల నివాస ప్రాంతాల్లోనే. నా దగ్గరకు వచ్చిన పేషెంట్ల ఆరోగ్య పరీక్షల నమూనాల్లో మహిళల హిమోగ్లోబిన్ పర్సెంట్ ఏడు నుంచి తొమ్మిది వరకే ఉండడాన్ని గమనించాను. అది కనీసం పన్నెండైనా ఉండాలి. ఏ ఒకరో ఇద్దరిలోనో కాదు, తొంబై తొమ్మిది శాతం ఇంతే. పది శాతం హిమోగ్లోబిన్ నూటికి ఒకరికి మాత్రమే ఉండేది. మహిళలు అమాయకంగా తీసుకునే మరో నిర్ణయం గర్భాశయాన్ని తొలగించుకోవడం. మెన్స్ట్రువల్ హైజీన్ తెలియకపోవడం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకపోవడం. ఇన్నింటిని చూసిన తర్వాత నా ఉద్యోగం నేను చేసుకుని వచ్చేస్తే సరిపోదు.. ఏదో ఒకటి చేయాలనిపించింది. అయితే చేద్దామని అనుకున్నంత సులభం కాదు చేయడం. మెడికల్ క్యాంపు పెట్టి మందులిచ్చి వచ్చేస్తే కూడా సరిపోదు. ఐరన్‌మాత్రలు వేసుకుంటే పొట్ట ఉబ్బరంగా ఉంటోందని హాస్పిటల్లో ఇచ్చిన మాత్రలను వేసుకోవడం లేదు. మేమడిగితే ‘వేసుకున్నాం’ అని మమ్మల్ని మభ్య పెట్టాలని చూస్తారు. వాళ్ల మాటకంటే ముందు ముఖం చెప్పేస్తుంది రక్తహీనత అలాగే ఉందని. వాళ్లకు మంచి ఆహారం కావాలి. అలాగని ప్రతిదీ ప్రభుత్వపరంగా చేయడం కుదరదు. అందుకే ‘కడియం ఫౌండేషన్’ స్థాపించి రక్తహీనతతో బాధపడుతున్న ఆడపిల్లలు, మహిళలకు వేరుశనగపప్పు ఉండలతోపాటు విడిగా ఒక కేజీ బెల్లం ఇవ్వడం మొదలు పెట్టాను. మంచి ఫలితాలను ఇస్తోంది ఎవరెన్ని చెప్పినా ఆడవాళ్లలో ఆహారం పట్ల శ్రద్ధ తక్కువే. మా అమ్మే పెద్ద ఉదాహరణ. మా నాన్న క్యాంపుకెళ్లినప్పుడు ‘నాన్న లేరు కదా, ఏం వండుదాం, ఉన్నవేవో తినేద్దాం’ అనేది. ఈ మాట అనని అమ్మ మనదేశంలో బహుశా ఉండకపోవచ్చు. నేను స్కూళ్లకు వెళ్లి, కమ్యూనిటీ సెంటర్లకు వెళ్లి గొంతు చించుకుని చెప్తున్న విషయాలు.. ఒకటి పోషకాహారం అవసరత, రెండు మెన్స్ట్రువల్ హైజీన్, మూడవది ఆరోగ్య పరిరక్షణ. నా ప్రయత్నంలో భాగంగా ఇప్పుడిప్పుడు సరిగా తినడం, మెన్స్ట్రువల్ హైజీన్ అలవడుతోంది. అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి తీవ్రత పెరిగే వరకు ఉదాసీనంగా ఉండడంలో పెద్ద మార్పు రాలేదు. ఈ మూడో విషయంలో మా గ్రామాల మహిళలే కాదు, చదువుకున్న సంపన్న కుటుంబాల మహిళలు కూడా అలాగే ఉంటున్నారు. ఒక పెద్ద మహిళాధికారి ప్రీ క్యాన్సర్ దశలో వైద్యం చేయించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. మహిళల్లో ఆరోగ్యం పట్ల చైతన్యం కలిగించడానికి ఇలాంటి ఉదాహరణలెన్నింటినో చెబుతుంటాను’’ అన్నారు డాక్టర్ కావ్య. ఒక మహిళ అనారోగ్యం పాలయినా, ప్రాణాలు కోల్పోయినా ఆ కుటుంబం ఎంతగా ఒడిదొడుకులకు లోనవుతుందో వివరించగలిగితే చాలు. ఆడవాళ్లు తమ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయరు. అదే విషయాన్ని మనసుకు తాకేటట్లు చెప్పే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా జరగాల్సిన అవసరమూ ఉంది. అలాంటి ఒక పెద్ద సామాజిక ఆరోగ్య యజ్ఞంలో కావ్య తన వంతుగా చేస్తున్న ప్రయత్నం ఇది. వాకా మంజులారెడ్డి ఫొటోలు: జి. అమర్ మా వారిది గుంటూరు జిల్లా. మెడిసిన్ చదివేటప్పుడు పరిచయమ్యారు. నాన్నతో చెప్పినప్పుడు ఆయన వెంటనే ఏమీ చెప్పలేదు. నజీర్‌తో మాట్లాడిన తర్వాత తన అంగీకారాన్ని తెలియచేశారు. నిరాడంబరత, అభ్యుదయ భావాలను పైకి మాట్లాడరు. కానీ ఆయన ఆచరణలో అవి ఉంటాయి. గ్రామీణ మహిళల కోసం సర్వీస్ కూడా నాన్నతో మాట్లాడిన తర్వాతే మొదలుపెట్టాను. డాక్టర్ కావ్య, పేథాలజిస్ట్, వర్ధన్న పేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్, వరంగల్ జిల్లా -
దౌర్జన్యంగా ఇల్లు కూల్చివేత
కర్ణాటక, మాలూరు : పట్టణంలోని ఇందిరా నగర్లో ఓ ఇంటిని దౌర్జన్యంగా కూలివేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు ... పట్టణంలోని మునికృష్ణప్పకు ఆశ్రయ పథకం కింద 1992లో పురసభ నుంచి స్థలం మంజూరైంది. ఈ స్థలంలో మునికృష్ణప్ప కూతురు జయమ్మ భర్త అరుణ్ సింగ్‌లు ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. సుమారు 15 సంవత్సరాల క్రితం వీరు మరణించగా వారి కుమార్తె కావ్య ఒక్కతే ఇంట్లో ఉంటోంది. ప్రస్తుతం కావ్య పట్టణంలోని డిగ్రీ కళాశాలలో చదువుతోంది. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించి ఇందిరా నగర్‌కే చెందిన వనితా, మంజుల, విజయమ్మలు ఆ ఇంటి స్థలం తమకు చెందిందని వివాదం సృష్టించారు. దీనికి సంబంధించి కోర్టులో కేసు జరుగుతోంది. ఈ క్రమంలో మంగళ వారం వనిత, మంజుల, విజయమ్మలు మరో 13 మందితో కలిసి వచ్చి ఇంట్లో ఉన్న కావ్యను బయటకు లాగి జేసీబీతో ఇంటిని నేలమట్టం చేయడమే కాకుండా అడ్డుకోబోయిన కావ్యపై దాడి చేసి గాయపరిచారు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. గాయపడిన కావ్యను ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి కావ్యకు న్యాయం చేయాలని 100 మందికి పైగా స్థానికులు పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. పురసభ సభ్యులు తంగరాజ్ తదితరులు వచ్చి చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
యువతిపై అత్యాచారం, హత్య
సాక్షి, పోరుమామిళ్ల(ప్రకాశం) : కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఒంటరి యువతి కావ్య(20)ను గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి, చేశారు. పోరుమామిళ్ల పంచాయతీ రామాయపల్లె రోడ్డు పక్కన కాలువ సమీపంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా... ప్రకాశం జిల్లాకు చెందిన తల్లీకూతుర్లను పోరుమామిళ్ల ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి రెండేళ్ల క్రితం ఇక్కడికి తీసుకొచ్చాడు. కొన్ని రోజులు కలిసి ఉండి అనంతరం వారిని వదిలేయడంతో తల్లీకూతుర్లు మండల కార్యాలయ ఆవరణలో నిరుపయోగంగా ఉన్న కారు షెడ్డులో నివాసం ఉండేవారు. ఈక్రమంలో ఓ రోజు తహసీల్దారు కార్యాలయ భవనంపై తల్లి హత్యకు గురైంది. దీంతో కావ్య ఓంటరిదైంది. ఇదే అదునుగా కొందరు కావ్యతో వివాహేతర సంబంధం కొనసాగించారు. క్రమంగా మద్యం అలవాటు చేసి తమ కోరికలు తీర్చుకునేవారు. కాగా కావ్య మృతదేహం గురువారం రామాయపల్లె వద్ద కాలువలో పడిఉండడం, తలపై గాయాలు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. తల వెనుకభాగంలో బలంగా కొట్టడంతో రక్తగాయాలయ్యాయి. అత్యాచారం చేసి, ఆపై హత్య చేసి ఆటోలో తీసుకొచ్చి కాలువలో పడవేసినట్లు అనుమానిస్తున్నారు. సీఐ మోహన్‌రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ కావ్యను హత్యచేశారన్నారు. తలపై బలంగా కొట్టడంతో మృతిచెంది ఉంటుందన్నారు. ప్రస్తుతం హత్యకేసుగా నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించామన్నారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. -
ప్రేమలో కొత్త కోణం
సైకలాజికల్ ఎలిమెంట్స్ మిక్స్ అయిన న్యూ ఏజ్ లవ్ స్టోరీగా రూపొందిన చిత్రం‘మసక్కలి’. సాయిరోనక్, కావ్య, శిరీషలు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నమిత్ సింగ్ నిర్మాత. నబి.యేనుగుబాల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా నమిత్ సింగ్ మాట్లాడుతూ– ‘‘యూత్‌ను ఆకట్టుకునే పాయింట్‌తో పాటు ఓ కొత్త పాయింట్‌ను ఈ సినిమా ద్వారా చెప్పబోతున్నాం. సినిమా కథనం తప్పకుండా ఆకట్టుకుంటుంది. యూత్‌ఫుల్ లవ్‌లో కొత్త డైమన్షన్‌ను ఎఫెక్టివ్‌గా ప్రెజెంట్ చేశారు మా దర్శకుడు నబి’’ అన్నారు. దర్శకుడు నబి మాట్లాడుతూ– ‘‘మా ‘మసక్కలి’ అందమైన ప్రేమకథలా ఉంటూనే సైకలాజికల్ గేమ్‌లా ఉంటుంది. అందరికీ నచ్చుతుందని, కొత్త అనుభూతినిస్తుందనే గ్యారంటీ నాది’’ అన్నారు. -
విద్యార్థిని ఆత్మహత్య
ఆలేరు: ఓ యువతి.. ఒక యువకుడితో మాట్లాడుతుండగా బంధువయ్యే మరో యువకుడు ఫొటోలు తీశాడు. అంతటితో ఆగకుండా వాట్సాప్‌లో పెట్టాడు. దీనికితోడు బంధువుల సూటిపోటి మాటలతో మనస్తాపానికి గురై ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు గ్రామంలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్యాదపాక కావ్య (17) ఆలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. అదే గ్రామంలో ఇంటి పక్కన ఉండే బంధువయ్యే గ్యాదపాక పవన్ కూడా ఇదే కళాశాలలో చదువుకుంటున్నాడు. 10 రోజుల క్రితం కావ్య తన క్లాస్‌మేట్‌తో మాట్లాడుతుండగా.. పవన్ ఫొటో తీసి వాట్సాప్‌లో పెట్టాడు. దీంతో అమ్మాయి కుటుంబ సభ్యులు ఈనెల 24న గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని పెద్దలు హెచ్చరించడంతో పవన్ క్షమాపణ చెప్పాడు. అయితే ఈ విషయంలో పవన్ తల్లిదండ్రులు కావ్యను పలుమార్లు సూటిపోటి మాటలతో నిందించారు. దీంతో మనస్తాపానికి గురైన కావ్య బుధవారం సాయంత్రం పురుగుల మందు తాగింది. విషయాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కావ్య గురువారం ఉదయం మృతి చెందింది. స్థానిక ఎస్ఐ వెంకట్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. -
నూతన వధూవరులకు సీఎం కేసీఆర్ సర్ఫ్రైజ్
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు కార్యక్రమంలో పాల్గొనడానికి కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వెళ్లుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మార్గమధ్యంలో తాడికల్ వద్ద వివాహ వేడుకను చూశారు. వెంటనే బస్సు దిగి నూతన వధూవరులు కావ్య, మనోహర్‌లను పలకరించి, అక్షితలు చల్లి ముఖ్యమంత్రి ఆశీర్వదించారు. కళ్యాణలక్ష్మి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అనుకోని అతిథిలా ముఖ్యమంత్రి స్వయంగా రావడంతో వధూవరుల బంధువులు ఆనంద,ఆశ్చర్యాలకు గురయ్యారు. ముఖ్యమంత్రికి, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. -
అప్పూ గురి తప్పదు!
చదువులోనైనా... చురుగ్గా వ్యవరించడం లోనైనా అప్పూ గురి తప్పదు! అంత తెలివై నోడు కాబట్టే 8 ఏళ్ల వయసులో ఏనుగును చూడాలని ఇంటి నుంచి ఒంటరిగా బయట అడుగు పెట్టినోడు క్షేమంగా ఇంటికొస్తాడు. ఈ మధ్యలో అప్పూ ఏం చేశాడనేది తెరపై చూపిస్తామంటున్నారు దర్శక–నిర్మాత కె. మోహన్. మాస్టర్ సాయి శ్రీవంత్ టైటిల్ రోల్లో ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన బాలల సినిమా c జాకీ, లోహిత్, కావ్య, బండ జ్యోతి, జ్వాలా చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ లభించింది. చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కె. మోహన్ మాట్లాడుతూ– ‘‘చిన్నారుల చిన్ని చిన్ని కోరికలను తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే ఏమౌతుంది?’’ అనే çకథతో రూపొందిన చిత్రమిది’’ అన్నారు. బాలతారలుగా సుమిత్ జాషు, సాయి అభిషేక్, లాస్య, మేఘన, మనోజ్ఞ, ఆదా, చిరుహాస్, సద్దాం తదితరులు నటించారు. -
నకిలీ విత్తుకు నగరమే అడ్డా
► గుజరాత్ నుంచి హైదరాబాద్‌కు కావ్య పేరుతో నకిలీ విత్తనాలు తరలింపు ► నగరం కేంద్రంగా 3 జిల్లాల్లో విక్రయం ► ముగ్గురి అరెస్టు,రూ.20 లక్షల సరుకు స్వాధీనం సాక్షి, హైదరాబాద్: నగరం కేంద్రంగా సాగుతున్న నకిలీ పత్తి విత్తనాల దందాకు నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. గుజరాత్లో తయారవు తు న్న వీటిని హైదరాబాద్ నుంచి మూడు జిల్లాల్లో విక్ర యిస్తున్నట్లు గుర్తించారు. డిస్ట్రిబ్యూషన్ నిర్వహిస్తు న్న ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసి రూ.20 లక్షల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ బి.లింబారెడ్డి గురువారం వెల్లడించారు. ప్రధాన సూత్రధారి కోసం గాలిస్తున్నా మన్నారు. రాజస్తాన్ నుంచి వచ్చి నగరంలో దందా... రాజస్తాన్‌కు చెందిన భరత్ పటేల్ సికింద్రాబాద్‌లోని హైదర్‌బస్తీలో ‘మహావీర్ ట్రేడర్స్’ పేరుతో సంస్థ ఏర్పాటు చేశాడు. 6 నెలలుగా గుజరాత్ నుంచి ‘కావ్య’ బ్రాండ్ పేరుతో ఉన్న నకిలీ పత్తి విత్తనాలను తీసుకువస్తున్నాడు. గాంధీనగర్ బన్సీలాల్‌పేటలో ఓ గోదాము ఏర్పాటు చేసి.. గుజరాత్‌కు చెందిన పటేల్ అమిత్‌కుమార్ చంద్రకాంత్, హార్ధిక్ పటేల్, వినయ్ ఆర్.షాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాడు. వ్యవసాయ శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండా ‘కావ్య’ బ్రాండ్ పత్తి విత్తనాలను వీరు కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లోని దుకాణాల ద్వారా రైతులకు విక్రయిస్తున్నారు. తక్కువ ధరతో రైతులకు ఎర... 450 గ్రాముల బరువుతో ఉన్న ఆకర్షణీయమైన ప్యాకె ట్లు, విడిగా కేజీల లెక్కన విత్తనాలు అమ్ముతున్నారు. ఈ ప్యాకెట్లపై ధర, తయారీ తేదీ తదితర వివరాలేవీ లేవు. ప్రభుత్వ సబ్సిడీ పత్తి విత్తనాల ధర 450 గ్రాములు రూ.800 వరకు ఉండగా.. రూ.200 నుంచి రూ.250కు వీరు అమ్ము తున్నారు. ముగ్గురి అరెస్టు.. : దీనిపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ పి.బల్వంతయ్య బృందం వ్యవసాయ శాఖ అధికా రులతో కలిసి దాడి చేసి భరత్ పటేల్ మినహా మిగిలిన ముగ్గురినీ పట్టుకున్నారు. వీరి నుంచి రూ.20 లక్షల విలువైన 1,250 కేజీల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ విత్తనాలు మొలకెత్తకపోవడంతో మళ్లీ వేరే విత్తనాలు నాటాల్సి వచ్చిందని కరీంనగర్ రైతులు వాపోయారు. బీఎన్‌రెడ్డినగర్‌లో మరొకరి అరెస్టు.. హైదరాబాద్‌లోని బీఎన్‌రెడ్డినగర్‌లో వివిధ రకాల నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న ఎంఈ శివారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ఇతడు బీఎన్‌రెడ్డినగర్, ఎస్కేటీనగర్లలో కార్యాల యాలు ఏర్పాటు చేసుకుని వివిధ కంపెనీలకు చెందిన కూరగాయలు, పత్తి తదితర విత్తనాలను అనుమతి లేకుండా మిక్సింగ్, ప్రాసెసింగ్ చేస్తూ విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారంతో గురు వారం అతడిని అరెస్టు చేసి, రూ.27.86 లక్షల విలువైన నకిలీ విత్తనాల బ్యాగ్‌లు, మిక్సింగ్, ప్రాసెసింగ్ మిషన్లు స్వాధీనం చేసుకున్నట్టు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించి నట్టు చెప్పారు. గత నెలలో అత్తాపూర్ ఏజీ కాలనీలో అగ్రిబయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో దందా నిర్వహిస్తున్న శివారెడ్డిని శంషా బాద్ పోలీసులు అరెస్టు చేశారని, బయటకొచ్చిన తరువాత మకాం మార్చి మళ్లీ నకిలీ విత్తనాల వ్యాపారం మొదలుపెట్టాడని వెల్లడించారు. -
షేవింగ్ బ్లేడ్‌తో ప్రసన్న గొంతు కోశారు: సిఐ
-
ఎల్లంపేటలో చిన్నారి కావ్య దారుణ హత్య
-
ఎల్లంపేటలో చిన్నారి కావ్య దారుణ హత్య
హైదరాబాద్ : మేడ్చల్ మండలం ఎల్లంపేటలో ఎనిమిదేళ్ల చిన్నారి కావ్యను బుధవారం అర్థరాత్రి దుండగులు దారుణంగా హత్య చేశారు. అనంతరం వారు పరారైయ్యారు. గురువారం ఉదయం కావ్య మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. గాంధీ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి... దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
బతుకమ్మ పూలకోసం వెళ్లి..
అశ్వరావుపేట: బతుకమ్మ సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది. బతుకమ్మ పేర్చడానికి అవసరమైన పూలను తెచ్చేందుకు వెళ్లిన ఓ బాలిక చెరువులో పడి మృతి చెందింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం అనంతారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కావ్య(12) స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో ఈ రోజు బతుకమ్మ పేర్చడానికి పూలను కోసుకొచ్చేందుకు వెళ్లిన కావ్య ఊర చెరువులో పడి మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
నవ వధువు ఆత్మహత్య
బీర్కూరు: అత్తింటి వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా బీర్కూరు మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రశాంత్‌కు ఏడాది క్రితం అదే మండలానికి చెందిన కావ్య(23)తో వివాహమైంది. పెళ్లైనప్పటి నుంచి ప్రశాంత్‌తో పాటు అతని తల్లిదండ్రులు, అక్కలు కలిసి కావ్యను అదనపు కట్నం తీసుకురావాలని వేధించేవారు. దీంతో మనస్తాపానికి గురైన కావ్య పుట్టింటికి వెళ్లి.. నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడింది. తమ కూతురి చావుకు ప్రశాంత్ కుటుంబ సభ్యులే కారణమని బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికురాలి బ్యాగు మాయం
శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికురాలి బ్యాగ్ మాయమైంది. అందలో విలువైన ఆభరణాలతో పాటు పెద్ద ఎత్తున నగదు ఉన్నట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. శుక్రవారం అమెరికా నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావ్య బ్యాగు మాయమైంది. దీంతో ఆమె ఎయిర్పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో ఢీకొని చిన్నారి మృతి
నల్లగొండ: స్కూల్ పిల్లలను తీసుకెళ్తున్న ఆటో ఢీకొన్ని చిన్నారి మృతి చెందింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మేళ్లచెరువు మండలం కందిబండలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కేతెబోయిన కావ్య (3) ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్న సమయంలో పిల్లలను పాఠశాలకు తీసుకెళ్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో కావ్య తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చిన్నారి కిడ్నాప్ కేసు దర్యాప్తులో పురోగతి
కర్నూలులో నిందితురాలు పోలీసుల అదుపులో ఆమెకు సహకరించిన వ్యక్తి కిడ్నాపర్ కోసం పోలీసుల మోహరింపు చిలకలగూడ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అపహరణకు గురైన చిన్నారిని కన్నతల్లి ఒడికి చేర్చేందుకు చిలకలగూడ పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అపహరించిన వారిని గుర్తించడంలో పురోగతి సాధించారు. ఏ క్షణమైనా నిందితురాలిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక నిఘా బృందాలు కర్నూలు పట్టణంలో మాటు వేశాయి. మెదక్‌జిల్లా చిన్నశంకరంపేట మండలం గౌలిపల్లికి చెందిన రేణుక కుమార్తె కావ్య (9 నెలలు)ను శనివారం తెల్లవారుజామున గాంధీ ఆస్పత్రి విజటర్స్ షెడ్ నుంచి గుర్తుతెలియని మహిళ అపహరించిన సంగతి విదితమే. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం సాయంత్రానికి పురోగతి సాధించారు. నిందితురాలికి సహకరించిన వ్యక్తిని ఘట్కేసర్కు చెందిన రవికుమార్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా నిందితురాలు కర్నూలు పట్టణంలో ఉన్నట్లు గుర్తించి, ప్రత్యేక నిఘా బృందాలు అక్కడ మోహరించాయి. అదుపులోకి తీసుకున్న రవికుమార్ కూడా మహిళకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పలేకపోవడంతో నిందితురాలిని పట్టుకోవడంలో కొంతమేర జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది. కాగా నిందితురాలిని పట్టుకుని చిన్నారిని క్షేమంగా నగరానికి తీసుకువస్తున్నారని కొన్ని ఛానెళ్లలో ప్రసారం కావడాన్ని పోలీస్ వర్గాలు కొట్టిపారేశాయి. నిందితురాలిని ఆదివారం సాయంత్రం వరకూ అదుపులోకి తీసుకోలేదని, రాత్రికి, లేదా సోమవారం నాటికి అదుపులోకి తీసుకుంటామని పోలీస్‌వర్గాలు స్పష్టం చేశాయి. అడ్డంకిగా మారిన ఆదివారం... చిన్నారిని రక్షించేందుకు ఆదివారం అడ్డంకిగా మారినట్లు తెలిసింది. నిందితురాలు వినియోగిస్తున్న సెల్‌నంబర్ కర్నూలు టవర్ లొకేషన్ చూపించింది. అయితే ఆదివారం సెలవు కావడంతో సర్వీస్ ప్రొవైడర్ల నిందితురాలు వినియోగిస్తున్న సెల్‌నంబర్‌కు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం అందించలేకపోయారని తెలిసింది. సోమవారం నాటికి నిందితురాలిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. -
కిడ్నాపైన కావ్య ఆచూకీ లభ్యం
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో కిడ్నాప్‌నకు గురైన చిన్నారి కావ్య మిస్టరీ వీడింది. పోలీసులు ఈ చిన్నారి ఆచూకీని కనుగొన్నారు. పోలీసులు కిడ్నాపర్ల సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా వారిని గుర్తించి, కర్నూలులో అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని హైదరాబాద్ తీసుకువస్తున్నారు. శనివారం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో తొమ్మిది నెలల కావ్యను అపహరించిన సంగతి తెలిసిందే. చిన్నారి కిడ్నాప్ ఘటనపై హైదరాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు 14 పోలీస్ బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. మెదక్‌జిల్లా చిన్నశంకరంపేట మండలం గౌలపల్లికి చెందిన గూడ రేణుక థైరాయిడ్ సమస్యలతో బాధపడుతుంది. చికిత్స కోసం తొమ్మిది నెలల కుమార్తె కావ్య, అత్త సిద్ధమ్మ, తండ్రి మల్లేష్‌తో కలిసి గాంధీ ఆస్పత్రికి వచ్చినపుడు.. చిన్నారిని అపరణకు గురైంది. -
గాంధీ ఆసుపత్రిలో చిన్నారి అదృశ్యం
హైదరాబాద్: నగరంలోని గాంధీ ఆసుపత్రిలో తొమ్మిది నెలల చిన్నారి కావ్య శుక్రవారం రాత్రి అదృశ్యమైంది. దాంతో సదరు చిన్నారి తల్లిదండ్రులు చిలకలగూడ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా గాంధీ ఆసుపత్రితోపాటు పరిసర ప్రాంతాలలోని సీసీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం... కావ్య తల్లి రేణుక గత కొంత కాలంగా థైరాయిడ్ వ్యాధితో బాధపడుతోంది. దాంతో వైద్య పరీక్షల కోసం రేణుక భర్త, ఆమెను, కుమార్తెను గాంధీ ఆసుపత్రికి తీసుకు వచ్చాడు. ఆ క్రమంలో ఆసుపత్రిలో చిన్నారి కావ్యను ఆగంతంకులు అపహరించారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. -
పిఠాపురం ఎమ్మెల్యే కుమార్తె మృతి
పిఠాపురం: తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కుమార్తె కావ్య (21) అనారోగ్యంతో మృతిచెందింది. హైదరాబాద్‌లోని ఓ కళాశాలలో ఇంజనీరింగ్ చదివిన కావ్య బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నట్టు కుటుంబ సభ్యుల కథనం. తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న ఆమెను సోమవారం రాత్రి స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా... పరిస్థితి విషమంగా ఉండడంతో అర్ధరాత్రి కాకినాడలోని మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కావ్య మృతి చెందింది. వర్మకు ఓ కమారుడు కూడా ఉన్నారు. అనారోగ్యంతో చిన్న వయసులో కావ్య మృతి చెందడంతో కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. -
యూట్యూబ్‌లో 'మైమ్' వీడియోల హల్ చల్
పాత కొత్త పాటల మిక్స్‌తో గిమ్మిక్స్ మైమ్ త్రూ టాలీవుడ్, బాహుబలితో సిటీగాళ్స్ సందడి సాక్షి, లైఫ్‌స్టైల్ ప్రతినిధి: కదలని కారులో కుదురుగా ఉండని నాటీగాళ్స్.. నేపథ్యంలో పాటలు.. ఆ పాటలకు పెదాల నుంచి పాదాల దాకా కదుపుతూ వారి అభినయ నర్తనం... పల్లవుల వరకూ మాత్రమే వినిపించే ఆ హిట్‌సాంగ్స్ వరుసగా మారిపోతుంటాయి. అందుకు అనుగుణంగా అమ్మాయిల గెటప్స్ కూడా. కొన్ని నిమిషాల పాటు అలనాటి మెలొడీల నుంచి ఈ నాటి కొత్త ట్రెండీల వరకు అన్నింటినీ కిచిడీ చేసేసి, మనల్ని కదిపేసి కుదిపేస్తారు. ఇదీ ఆన్లైన్ సాక్షిగా ఉర్రూతలూగిస్తున్న మైమ్ వీడియోల సంక్షిప్త స్టోరీ. సిటీ అమ్మాయిలు సైతం చేస్తున్న ట్రెండీ సవారీ.. 'అహ నా పెళ్లి యంట... ఓహొ నా పెళ్లి యంట' పాట నుంచి 'సూపర్ మచ్చి' దాకా.. దాదాపు 16 పాటల్ని కలిపి కుట్టేసి, వెరైటీ వీడియోతో హిట్ కొట్టేశారు నగరానికి చెందిన 'యోయో గాళ్స్'. అంతేనా.. తెలుగు రాష్ట్రాలను పట్టి కుదిపేస్తున్న బాహుబలి మేనియాకు తగ్గట్టుగా ఆ సినిమా పాటలకూ నర్తించేసి వహ్వా.. అనిపించేస్తున్నారు. వీరి బాటలోనే మరికొందరు తెలుగమ్మాయిలు క్రియేట్ చేసిన మరో వీడియో సైతం ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. ఎలాంటి ప్రొఫెషనల్ బ్యాగ్రవుండ్ లేకుండా అకస్మాత్తుగా లైమ్‌లైట్‌లోకి దూసుకొచ్చేసిన ఈ అమ్మాయిలు ఎవరు? ఎలా మొదలు పెట్టారు?.. ఇలా అనుకున్నారు.. అలా పూర్తి చేసేశారు 'బీటెక్ పూర్తి చేసి ఎంఎస్ చేయడానికి ఆగస్టులో అమెరికా వెళుతున్నా. ఈలోగా గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలనుకున్నాను. షార్ట్ఫిల్మా.. ఇంకా ఏదైనా.. అని ఆలోచిస్తుంటే ఎవరో ఫ్రెండ్ 'మైమ్ త్రూ టైమ్' అనే హాలీవుడ్ వీడియోని ఫేస్బుక్లో షేర్ చేసింది. అది చూశాక.. చాలా బావుందనిపించింది. సెర్చ్ చేసుకుంటూ వెళితే బాలీవుడ్, ఇతర భాషల్లోనూ ఇలాంటి వీడియోలు ఉన్నాయని, అయితే తెలుగులో మాత్రం లేవని తెలిసింది. అప్పుడే ట్రై చేద్దామనే ఆలోచన వచ్చింది' అంటూ చెప్పింది హిమాయత్‌నగర్ నివాసి కావ్య. ఈ ఆలోచన వచ్చిందే తడవుగా మియాపూర్‌లో నివసించే తన కాలేజ్ క్లాస్మేట్ శృతి, యూసఫ్‌గూడ సెయింట్ మేరిస్లో డిగ్రీ సెకండియర్ చదువుతున్న తన కజిన్ కమ్లిలను కదిలించింది. వాళ్లిద్దరూ ఓకే చెప్పడంతో తన ఐడియాను 'ట్రాక్' ఎక్కించింది. 'శృతికి భరతనాట్యం, నాకు సినిమా డ్యాన్సులు వచ్చు. ఇద్దరికి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన అనుభవం ఉండడం కలిసొచ్చింది' అంటూ వివరించింది కావ్య. దాదాపు 60 ఏళ్ల నాటి పాత పాటల నుంచి ఆర్నెళ్ల క్రితం వచ్చిన కొత్త పాటల వరకూ తమ తొలి మైమ్ త్రూ టాలీవుడ్లో గుదిగుచ్చారీ మిత్రత్రయం. ‘ఇంగ్లిషు వాళ్లు సింగర్స్‌ని, బాలీవుడ్లో సినిమాలని తీసుకుంటే, మేం ఎన్టీయార్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి.. ఇలా హీరోల వారీగా తీసుకుని చేశాం. పాత పాటల్ని ఎంచుకోవడంలో అమ్మ హెల్ప్ చేసింది' అంటూ గుర్తు చేసుకుంది కావ్య. పాటల సెలక్షన్ అయిపోయాక, ఫ్రెండ్ కెమెరా తీసుకుని తమ కార్ షెడ్లోనే జైలో కారులో షూట్ చేశారు. ప్రాక్టీస్‌కి 3 గంటలు, షూటింగ్‌కి 7 గంటలు మొత్తం 10 గంటల్లో చిత్రీకరణ పూర్తయింది. తర్వాత రోజే యూ ట్యూబ్‌లో పెడితే.. రెండు వారాల్లోనే హిట్స్ లక్ష దాటేశాయి. 'ఎడిటింగ్‌లో మా ఫ్రెండ్ రాకేష్‌కి ఉన్న అనుభవం కెమెరా వర్క్‌ను అనూష, శిరీషలు సరిదిద్దడంతో మా పని మరింత ఈజీ అయింది. ఇక డ్యాన్స్‌కి పెద్దగా చేసిందేమీ లేదు. అంతా ఆన్‌స్పాట్ కొరియోగ్రఫీ. మా సొంత దుస్తులే వినియోగించాం. అయితే పాత పాటలకి ఎక్స్ప్రెషన్స్ కాస్త కష్టమైంది' అంటూ నవ్వేస్తున్న ఈ యోయో గాళ్స్.. ఇటీవలే 'బాహుబలి' పాటలతో మరో వీడియోను తీసి అప్లోడ్ చేసేశారు. ఇదీ హిట్టే. 'నెక్ట్స్ ఏమిటి?.. అని అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు ఫుల్ క్రేజ్ కదాని బాహుబలి చేశాం. ఈ సినిమాలోని థీమ్ బిట్ తప్ప అన్ని పాటలకు నర్తించాం. దీనికి కూడా మంచి రెస్పాన్సే వస్తోంది' అంటూ వీరు తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని వినూత్న తరహా కాన్సెప్ట్స్‌తో వీక్షకుల్ని అలరిస్తామంటున్నారు. 'మీ నుంచి చాలా వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం' అంటూ పలువురు అడుగుతున్నారని, దర్శకుడు మారుతి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని ఈ క్యూట్ గాళ్స్ చెబుతున్నారు. స్కెచ్షీతో శ్రీకారం.. మూణ్నెళ్ల క్రితం ఆస్ట్రేలియన్ కామెడీ గ్రూప్ 'స్కెచ్ షి.. మైమ్ త్రూ టైమ్’ పేరుతో ఓ వీడియో విడుదల చేసింది.. అందులో గ్రూప్ మెంబర్స్ షాలీ, మాడిసన్, ల్యానా.. ముగ్గురూ దశాబ్దాల క్రితం నాటి పాపులర్ ఇంగ్లిష్ ట్రాక్స్‌కి పెదాలు కదుపుతూ గెటప్స్ మారుస్తూ ఉన్న చోటే నృత్యం చేస్తూ కనువిందు చేశారు. మొత్తం ఒక కారులో సాగిన ఈ నృత్యాభినయ హేల యూ ట్యూబ్‌లో దాదాపు 2 కోట్లకు పైగా వీక్షకులను సంపాదించి రికార్డ్ సృష్టించింది. భారత్‌కు తెచ్చిన బెంగళూరు భామలు 'స్కెచ్షీ' వీడియోను స్ఫూర్తిగా తీసుకున్న బెంగళూరు బృందం మైమ్ త్రూ బాలీవుడ్ రూపొందించింది. 'ఈనా మీనా ఢీకా' నుంచి దేశీగాళ్ దాకా దమ్ మారో దమ్ నుంచి కొలవరి డి దాకా... ఇందులో కలిపి కొట్టారు. ఈ సందడిని కారు బయట నుంచి ఐఫోన్‌తో శ్యామ్ మోహన్ చిత్రీకరిస్తే.. ప్రీతా పెరీరా కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. స్టైలిస్ట్ మిథిలేష్ 14 రకాల కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాడు. ఒక్కరోజులోనే ఈ వీడియోకి 3 లక్షల హిట్స్ వచ్చాయి. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ శిల్ప జోహార్, ఇటీవలే కాలేజ్ చదువు ముగించుకున్న కవలలైన టీనా, టెస్సా వెల్లెరాలు నర్తనాభినయం చేశారు. (టీనా, టెస్సా షాహిద్ హీరోగా వచ్చిన 'షాందార్' హిందీ చిత్రంలో నటించారు). బాలీవుడ్ పాటల వీడియో హిట్‌ను అనుసరిస్తూ పంజాబీ, బెంగాలీ, మళయాళీ.. ఇలా వరుసగా పలు భాషలకు చెందిన మైమ్స్.. పుట్టుకొచ్చేస్తున్నాయ్. డి టౌన్ గాళ్స్.. ఒక్క వీడియోతో పాపులరైపోయిన ఈ స్నేహత్రయానికి ఇప్పుడు ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఫాలోవర్స్ కూడా వచ్చేశారు. వీరిని స్పూర్తిగా తీసుకుని మరో ముగ్గురు తెలుగమ్మాయిలు స్వప్నిక, రవళి, వర్షిణిలు ఇదే తరహా వీడియో తీసి 'టాలీవుడ్ టైమ్ మెషీన్' పేరుతో యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తే అదీ దాదాపు 90 వేల హిట్స్‌ను చేరుకోవడం విశేషం. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో వాళ్లు అభ్యంతరం పెట్టేందుకు కారణాలు అసలే లేవు. ఇలాంటి సానుకూలతల నేపథ్యంలో అమ్మాయిల నృత్యాభినయాలకు పెద్దపీట వేస్తున్న ఈ తరహా వీడియోల ట్రెండ్ సిటీలో మరింత ఊపందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. -
సందడి చేద్దాం.. సరదా తెద్దాం
ఏలూరు సిటీ : గడియారం తన పని తాను చేసుకుపోతోంది. 2014 సంవత్సరం చరిత్ర పుటల్లో కలిసిపోవడానికి.. 2015 ఆగమనానికి కౌంట్ డౌన్ మొదలైంది. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలైతే చాలు జనం ఆనందానికి అవధులు ఉండవు. చిన్నాపెద్దా.. పేద, ధనిక.. ఉద్యోగులు, వ్యాపారులు.. కుల మత భేదాలు లేకుండా సంబరాలు చేసుకునే ఘడియలవి. దీనిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు యువత రెడీ అవుతోంది. స్నేహాన్ని.. ప్రేమను.. అనుబంధాన్ని.. ఆప్యాయతలను చాటుకునేందుకు.. బహుమతులు ఇచ్చి పుచ్చుకునేందుకు.. కొంగొత్త ఆశలతో శుభాకాంక్షలు చెప్పుకునేందుకు.. రంగుల లోకాన్ని ఆవిష్కరించేందుకు యువత ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తోంది. వినోదాల పండగలాంటి ఈ అర్ధరాత్రి సంబరం విషాదం కాకూడదంటే ఏం చేయాలనే విషయమై ఏలూరు యువతుల మనోగతం... సంతోషంగా గడపాలి నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ పండగ చేసుకునే వేళ అందరూ సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. సెలబ్రేషన్స్ పేరుతో వేధింపులు, గొడవలు చేయడం తగదు. స్నేహానికి విలువ ఇస్తూ.. ఇతరులను గౌరవించేలా.. ఎదుటి వారి ఆకాంక్షలు నెరవేరేలా శుభాకాంక్షలు చెబుతూ వేడుకలు చేసుకుంటే మంచిది. అన్నయ్యలూ.. తమ్ముళ్లూ.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను హుందాగా జరుపుకుందాం. ఓకేనా. - జి.చంద్రిక తోటి వారిని ఇబ్బంది పెట్టొద్దు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా చేసుకోవడం తప్పు కానే కాదు. కానీ.. దాని పేరుతో మోటార్ సైకిళ్లను సెలైన్సర్లు తీసేసి నడపటం వల్ల శబ్ద కాలుష్యం పెరిగిపోతుంది. ఇళ్లుల్లో ఉండే వృద్ధులు, చంటిపిల్లలు, గుండె వ్యాధితో బాధపడే వ్యక్తులు తీవ్ర ఇబ్బంది పడతారు. వారిని దృష్టిలో ఉంచుకుని వ్యవహరిస్తే బాగుంటుంది. ఎదుటి వారి క్షేమాన్ని కోరి శుభాకాంక్షలు చెప్పుకునే వేళ తోటి వాళ్లను ఇబ్బంది పెట్టడం.. ఇబ్బందులు కొని తెచ్చుకోవడం మంచిది కాదు. - మమత జీవితం విలువను గుర్తించాలి జీవితం చాలా విలువైంది. దానిని జాగ్రత్తగా మలుచుకుంటేనే జీవితాంతం సంతోషం, ఆనందం ఉంటాయి. క్షణిక ఆనందం కోసం మనం చేసే సం దడి హద్దులు దాటితే ప్రమాదాల బారినపడతాం. దీనివల్ల మనతోపాటు మన కుటుంబ సభ్యులను కూడా బాధ పెట్టిన వాళ్లం అవుతాం. మనం చేసుకునే వేడుకల వల్ల ఆనందం, ఉత్సాహం రెట్టింపు అవ్వాలే తప్ప వీసమెత్తు విషాదం పలికినా ఇబ్బందే. అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. - కావ్య హరివిల్లు కావాలి కొత్త సంవత్సరంలో అందరి జీవితాలు రంగుల హరివిల్లులా మారాలి. విద్యార్థులు చదువులోను, ఉద్యోగులు, వ్యాపారులు తమ విధుల్లోను.. అన్ని రంగాల్లోని వ్యక్తులు ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించాలి. కొత్త ఆశలతో జీవితాన్ని ప్రారంభించి సరికొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్లాలి. మనలో ఉన్న ఒక్క లోపాన్ని అయినా గతించిపోయే పాత సంవత్సరానికి వదిలేస్తే.. వచ్చే ఏడాది ఎంతో బాగుంటుంది. - స్వాతి అలా చేయొద్దు డిసెంబర్ 31న రాత్రి నుంచి కొత్త సంవత్సరం రాక కోసం ఎదురు చూస్తూ అంద రం ఆనందంగా గడుపుతాం. అలాంటి వేళలో కొందరు యువకులు మద్యం సేవించి గొడవలు పడటం.. రోడ్లపై వెళ్లేవారిని అల్లరి పెట్టడం.. బైక్‌లు వేగంగా నడుపుతూ ప్రమాదాల బారిన పడటం వల్ల వారిని చుట్టుపక్కల వాళ్లు తిట్టుకుంటారు. పండగ వేళ ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం.. వారితో తిట్లు తినడం మంచిదంటారా. ఏడాదంతా బాగుండాలంటే తొలి రోజున నలుగురూ మెచ్చేలా ఉంటే బాగుంటుంది. - అనూష హద్దు మీరితే అరెస్ట్ చేస్తాం నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎవరైనా హద్దు మీరితే నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేస్తాం. మహిళలు, యువతులు, పాదచారులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. యువత కొత్త సంవత్సరం పండగను ఉత్సాహంగా చేసుకోవడం తప్పు కాదు. అయితే, ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించకూడదు. సెలైన్సర్లు తొలగించి మోటార్ సైకిళ్లు నడిపితే సహించేది లేదు. వాహనాలను అత్యంత వేగంగా నడపటం వల్ల ప్రమాదాలకు గురై విలువైన జీవితాన్ని నష్టపోతారు. ఈ విషయాన్ని యువత గమనించాలి. ఫ్రెండ్స్.. మీరంతా డిసెంబర్ 31 వేడుకల్ని సంతోషంగా జరుపుకోండి. విషాదాలకు, వివాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్త వహించండి. తద్వారా అందరిలో సంతోషం నింపేవిధంగా ప్లాన్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. - కె.రఘురామ్‌రెడ్డి, జిల్లా ఎస్పీ -
కావ్య ఆచూకీ కనిపెట్టేదెన్నడో..
తేరుకోని కె.తాడేపల్లి గ్రామం ప్రత్యేక గాలింపు బృందాలు ఏం చేశాయంటున్న స్థానికులు పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు చిట్టినగర్ : స్థానిక కొత్తూరు తాడేపల్లి గ్రామంలోని యానాదుల పేటలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన పసుపులేటి కావ్య(5) అదృశ్యమై 25 రోజులు దాటినా ఆచూకీ దొరక్కపోవడంతో తల్లిదండ్రులు పడుతున్న బాధ వర్ణనాతీతం. కావ్యను గుర్తు తెలియని వ్యక్తులు కారులో అపహరించడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. ఆ చిన్నారి ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే వారి గాలింపు చర్య లు సత్ఫలితాలు ఇవ్వలేదు. కనీసం చిన్నారి ప్రాణాలతోనైనా ఉందా? అనే అనుమానాలు గ్రామంలో వ్యక్తమవుతున్నాయి. పోలీసుల బిజీ షెడ్యూలు, మంత్రుల పర్యటనలు, ఉత్సవాలతో వారి హడావుడి వారిదేనన్నట్లు మారి పోయింది. కావ్య సంగతి తమకు, స్థానికులకు తప్ప ఎవరికీ గుర్తులేదని, పోలీసులు పట్టించుకోవడంలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా భయాందోళనలే.. కావ్య అదృశ్యమవడంతో పేటలోని ప్రతి కుటుంబం తీవ్ర ఆందోళన చెందుతోంది. చిన్న పిల్లలను ఒంటరి గా బయటకు వదలాలంటేనే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుంటున్నారు. ఏదైనా అత్యవసరమైన పని అయితే తమ పిల్లలను పక్క ఇంటి వారికి అప్పగించి వెళుతున్నారే తప్ప ఒంటరిగా వదిలి వెళ్లడం లేదు. పోస్టర్లు ఏమయ్యాయి.. కావ్య అదృశ్యమైన ప్పటి నుంచి పోలీసుల తీరు విమర్శలకు దారి తీస్తూ నే ఉంది. ఈ ఘటన జరిగాక చిన్నారి బంధువులను స్టేషన్‌కు తీసుకు వచ్చి విచారణ చేయడంపాటు నామమాత్రం గా గాలింపు చర్యలు చేపట్టారని పలువురు విమర్శిస్తున్నారు. గాలింపు బృందాల ఏర్పాటు విషయంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కావ్య ఫొటోతో వాల్ పోస్టర్లను చుట్టుపక్కల గ్రామాలతోపాటు రైల్వే స్టేషన్లు, బస్‌స్టాండ్‌ల్లో ఏర్పాటు చేస్తామని అధికారులు చేసిన ప్రకటన ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికైనా కావ్య ప్రాణాలతో తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు చేరుతుందని గ్రామస్తులతోపాటు కుటుంబీకులు ఆశతో ఎదురు చూస్తున్నారు. -
చెత్త మూటలు కట్టిపెట్టోయ్..
1995.. ప్రసాద్ ల్యాబ్‌లో డబ్బింగ్ థియేటర్. నాలుగేళ్ల ఓ చైల్డ్ ఆర్టిస్ట్ చాక్లెట్ ఇస్తే తినేసి ర్యాపర్ పట్టుకుని ల్యాబ్ అంతా తిరిగింది. అది పడేసే చోటు కోసం.. అంటే చెత్తబుట్ట కోసం ! ఓ పక్కన పడవేయమని ఎంతమందన్నా.. పట్టుబట్టి తనే స్వయంగా చెత్తబుట్టలో వేసింది. ఆ చిన్నారి బేబీ కావ్య. లిటిల్ సోల్జర్స్ చిత్రంతో ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డును అందుకున్న కావ్యకు ఉత్తమ సిటిజన్ సత్కారం ఇవ్వాలి. 2014 జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్. ఓ స్కూల్ బస్సు ఆగింది. లోపల పిల్లలకు చాక్లెట్లు పంచినట్టున్నారు. 3 నిమిషాల వ్యవధిలో కిటికీ నుంచి 4 చాక్లెట్ ర్యాపర్లు బయటకు వచ్చిపడ్డాయి. నేను ఓ వైపే చూశాను. మరోవైపు ఎన్ని పడ్డాయో తెలియదు. వాళ్లంతా కార్పొరేట్ విద్యార్థులు. వాళ్లకి రోడ్డే ఓ చెత్తబుట్ట. ఇది దేనికి సంకేతం..? ఒకప్పుడు పబ్లిక్ ప్రదేశాల్లో చెత్తకుండీలు అరుదుగా కనిపించేవి. కానీ, వ్యవస్థలో మార్పు కోసం మున్సిపాలిటీలు ఆకర్షణీయమైన చెత్తకుండీలు ఏర్పాటు చేశాయి. మార్పు రానిదల్లా మనలోనే. మనకు రోడ్లే చెత్తకుండీలు. ఇందుగలదు.. అందులేదన్న.. సందేహం వలదు.. అన్న చందాన చెత్త కనిపించనిదెక్కడ? ముందు మనం ‘చెత్త’డిసిప్లిన్ అలవాటు చేసుకుందాం. టైప్స్ ఆఫ్ వేస్ట్ చెత్త గురించి చెప్పాలంటే వంటింట్లో తయారయ్యే చెత్త.. కూరగాయ తొక్కలు, వండిన ఆహారం, పండ్లు, మాంసం.. ఇవి డీ కంపోజ్ అయ్యే చెత్త. ఇది కుళ్లి భూమిలో కలసిపోతుంది. ఇక డ్రై వేస్ట్.. పేపర్లు, గాజు, చెక్క వీటిలో చాలా వరకు రీసైకిల్ చేసేందుకు అనువుగా ఉంటాయి. పాలిథిన్ మహమ్మారి గురించి తర్వాత మాట్లాడుకుందాం. మన ఇంట్లో ఉత్పత్తయ్యే మరో రకం చెత్త ‘ఈ-వేస్ట్’. ఎలక్ట్రానిక్ విడిభాగాలు, బ్యాటరీలు, బల్బులు, కంప్యూటర్ సంబంధిత వేస్టేజ్. వీటిని ఎలా మేనేజ్ చేయాలో చాలామందికి తెలియదు. అందుకే ఈ-వేస్ట్‌ను కూడా సాధారణ చెత్తకుండీల్లో వేస్తున్నాం. ఇక ఇళ్లల్లో తక్కువగా, హాస్పిటల్స్‌లో ఎక్కువగా ఉత్పత్తయ్యే చెత్త మెడికల్ వేస్ట్. ఆస్పత్రుల్లో ఈ రకం చెత్తను రంగుల్లో విభజించి తరలిస్తారు. కానీ మన ఇళ్లలో సిరంజీలు, మాత్రలు వంటివి సాధారణ చెత్తలో కలసిపోతాయి. వీటిని వేరు చేసి రీసైక్లింగ్‌కు పంపడం ఎంత తలనొప్పి వ్యవహారమో ఒక్కసారి ఆలోచించండి. కలివిడిగా నడుద్దాం.. గోవాలో పాంజిమ్, మహారాష్ట్రలోని పుణే నగరాల్లో మున్సిపాలిటీలు తడి, పొడి చెత్తను విడివిడి రోజుల్లో కలెక్ట్ చేస్తున్నాయి. ప్రజలు కూడా సహకరించడంతో అవి క్లీన్‌సిటీలుగా మెరిసిపోతున్నాయి. మన మున్సిపాలిటీలోనూ దాన్ని ప్రవేశపెట్టాలని అనుకున్నారు గానీ.. ఇప్పటికీ అమల్లోకి రాలేదు. దాని సంగతి అటుంచితే.. మన నుంచి కొందరైనా చెత్తను విభజించి పంపిద్దాం. మన డంపింగ్ సమస్యల మేనేజ్మెంట్ గురించి గళమెత్తుతున్న సుకుకి ఎక్స్‌నోరా అనే స్వచ్ఛంద సంస్థ రెండు చెత్తల విధానాన్ని ప్రోత్సహించమని ప్రభుత్వాన్ని, సమాజాన్ని కదిలిస్తోంది. మనం కూడా ఈ రెండు చెత్తబుట్టల ఉద్యమంలో కలుద్దాం. తడిపి మోపెడు చేయొద్దు.. ఇప్పటికే చాలామంది వంటింటి వేస్టేజ్‌కు సపరేట్ చెత్తబుట్ట వాడుతున్నారు. పొడిచెత్త కలపకుండా డీకంపోజ్ అయ్యే చెత్తను మాత్రమే అందులో వేయండి. ఇంకో చెత్తబుట్టలో డ్రై వేస్ట్ అంటే రీసైకిల్ చేయగలిగిన పేపర్, గాజు, ప్లాస్టిక్, చెక్క వంటి వస్తువులు వేయండి. ఇందులో తడి చెత్త వేయకండి. పొడి చెత్తబుట్టకు న్యూస్ పేపర్ గానీ, పేపర్‌తో తయారు చేసిన బ్యాగులో గానీ ఇవి వేయండి. పారిశుధ్య కార్మికులకు న్యూస్‌పేపర్ బ్యాగ్ కానీ, పొట్లం కానీ రీసైకిల్‌కు సంకేతమని అర్థం అవుతుంది. ఇక మెడికల్ వేస్ట్‌ను వీటిలో కలపకుండా వీలు చూసుకుని దగ్గర్లోని హాస్పిటల్స్ ట్రాష్‌లో వేయండి. ‘ఈ-వేస్ట్’ సాధారణ చెత్తలో వేయకుండా...పాతసామాన్లు కొనే వారికి ఇవ్వండి. కనీసం అప్పుడైనా అది చేరాల్సిన చోటికి చేరుతుందేమో ! కంపౌండ్‌లో కంపోస్ట్.. తడి చెత్తను ప్లాస్టిక్ సంచుల్లో చుట్టి పారేస్తున్నారు. అది ఎంత ప్రమాదకరమో చెప్పక్కర్లేదు. కుదిరితే నల్లని రీసైకిల్డ్ బ్యాగ్‌లను వాడండి. మా ఇంట్లో పేపర్ సంచులు మేమే తయారు చేసుకుంటున్నాం. వీటి తయారీ పిల్లలూ ఇష్టపడతారు. పైగా ‘చెత్త’పాఠాలు నేర్చుకుంటారు. మరో అడుగు ముందుకు వేయగల్గితే.. ఇళ్లలో, అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో తడి చెత్తను మనమే కంపోస్ట్‌గా మార్చుకోవచ్చు. కంపోస్ట్ గుంటను గానీ, రెడీమెడ్ మట్టి కంపోస్ట్ కుండీలో గానీ వాడితే చెత్తను ఎరువుగా తయారు చే యొచ్చు. అదీ పెద్ద శ్రమ, ఖర్చు లేకుండానే. మూడేళ్లుగా మా ఇంటి చెత్తను మేం కంపోస్ట్ చేస్తున్నాం. ఇక అమల అక్కినేని గారైతే స్వయంగా కంపోస్ట్ చేయడమే కాక, అది తనకు స్ట్రెస్ రిలీవింగ్ యాక్టివిటీ అని మరీ చెప్తారు. ఈ కంపోస్ట్ తయారీ గురించి మరిన్ని వివరాలు హైదరాబాద్ గోస్ గ్రీన్ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ముందు ఏ చెత్తను ఏ బుట్టలో వేయాలో అందులోనే వేద్దాం. అంతకంటే ముందు చెత్తను చెత్త బుట్టలో వేసే ‘చెత్త డిసిప్లిన్’ అలవాటు చేసుకుందాం. లెట్స్ గ్రో క్లీన్. -
ముందు పొదుపు తర్వాతే ఖర్చు
ధనమేరా అన్నిటికీ మూలం... ఆ ధనము విలువ తెలుసుకొనుటె మానవ ధర్మం అన్నారు ఒక సినీ కవి. మనిషి అన్ని అవసరాలకూ ధనం అవసరం. సంపాదన ప్రారంభించిన నాటి నుంచి ఆదాయంలో కనీసం మూడవ వంతును ఆదా చేస్తూ వస్తే వయసు మళ్లాక హాయిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు. నేడు ప్రపంచ పొదుపు దినం సందర్భంగా ఎలా పొదుపు చేసుకుంటే జీవితం హాయిగా ఉంటుందో తెలుసుకుందాం... ఒకసారి కావ్య అనే అమ్మాయి నా దగ్గరకు వచ్చి తనకు ఈ మధ్యనే పెళ్లయిందనీ, తను గృహిణిననీ, భర్త ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారనీ, నెలకు 15 వేలు జీతమనీ చెప్పింది. వాళ్లు ప్రస్తుతం నెలకు 5 10 శాతం మ్యూచువల్ ఫండ్స్‌లో పెడుతున్నామనీ, మిగతా జీతమంతా ఖర్చు చేస్తున్నామనీ పొదుపు వివరాలు తెలిసింది. ఇంతకీ వారిద్దరికీ పెద్దలు ఇచ్చిన ఆస్తిపాస్తులు లేవు. ఒక సంవత్సరం తరువాత పిల్లలను కనాలనుకుంటున్నారు. కనుక కాన్పు, చదువు, ఇతర ఖర్చులను దృష్టిలో ఉంచుకుని పొదుపు చేయడానికి ఆర్థిక ప్రణాళికను సూచించమంది. కావ్య ప్రస్తుత పరిస్థితి గమనిస్తే చాలా తక్కువ మొత్తాన్ని పొదుపు చేస్తున్నట్లు లెక్క. అందువల్ల ఆమెకు ఈ కింది సంప్రదాయిక ఆర్థిక ప్రణాళికను సూచించాను. ప్రతి వ్యక్తికి శారీరక, మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో ఆర్థికారోగ్యం కూడా అంతే ముఖ్యం. విద్య, వైద్యం, గృహవసతి లాంటి ఖర్చులు ఏటా 10 నుంచి 20 శాతం దాకా పెరుగుతూ ఉంటాయి. ఇక నిత్యావసరాలు, అత్యవసరాల సంగతి సరే సరి. ఇవన్నీ కుటుంబ ఆదాయానికి గండికొడుతున్నాయి. ఆర్థిక వనరులను సక్రమంగా వాడుకుంటూ ప్రణాళికాబద్ధంగా లక్ష్యాలను చేరుకోవాలి. ఆ దిశగా ఉపయోగపడే కొన్ని ముఖ్యాంశాలు... బడ్జెట్ తయారీ: ప్రతి ఒక్కరూ ఆదాయవ్యయాలను రాసు కోవాలి. దీనివల్ల క్యాష్ ఫ్లో తెలుస్తుంది. అలాగే వారికున్న కీలకలక్ష్యాలను చేరడానికి పట్టే సమయాన్ని తెలుసుకుంటే, ఆర్థికప్రయాణం ఎక్కడవరకు చేయాలో అర్థం అవుతుంది. రూపాయి పాపాయి: రూపాయిని పాపాయిలా చూడాలని పెద్దలు చెబుతారు. ఒక రూపాయిని పొదుపు చేశామంటే, ఒక రూపాయిని సంపాదించినట్లు. కుటుంబానికి ఏది ఏ మేర అవసరం అనే స్పష్టతతో ఖర్చులను అదుపు చేసుకోవాలి. పక్కింటివారో, స్నేహితులో ఫలానాది కొన్నారని, అవసరం లేని వస్తువుల కోసం ఖర్చు పెట్టుకుంటూ పోతే రానున్న రోజుల్లో అవసరమైన వాటిని అమ్ముకోవలసి వస్తుంది. ప్రఖ్యాత పెట్టుబడిదారునిగా పేరొందిన వారెన్ బఫెట్ ‘పొదుపు చేశాకే ఖర్చు గురించి ఆలోచించు. అంతేగాని ఖర్చులు పోను ఏమైనా మిగిలితే అదే పొదుపు అనేది సరికాదు’ అన్నారు. అనుకోని సంఘటనలు: మరణం, అనారోగ్యం, అంగవైకల్యం లాంటివి మనల్ని ఇబ్బందిపెట్టే విషయాలు. జీవిత బీమా, ఆరోగ్య బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా... వీటి ద్వారా అవసరాలను కొంతవరకు అధిగమించవచ్చు. వీటితోపాటు ఇతర అత్యవసరాలను దాటేలా ఒక అత్యవసర నిధిని 3 నుండి 6 నెలల జీతంతో ఏర్పాటుచేసుకోగలగాలి. పొదుపు మదుపు: సంపాదనలో సింహభాగాన్ని పొదుపు- మదుపులకు మళ్లించాలి. వాటి రిస్క్, రిటర్న్స్ ఏ విధంగా ఉంటాయో ముందుగా తెలుసుకోవాలి. ఏయే సాధనాలు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుని కాలానుగుణంగా అవసరమైన మార్పు చేసుకోవాలి. వాయిదా చిన్నచూపు: పొదుపు అనగానే ఇప్పుడే కెరీర్ ప్రారంభించాం, ఇప్పుడే పెళ్లయ్యింది. వంశపారంపర్యంగా ఆస్తులు వచ్చాయి, ఇప్పుడు కాదులే... అంటూ వాయిదా వేయడం ఆర్థిక ప్రగతికి మొదటి అడ్డంకి. వంద రూపాయలకి ఏం వస్తుంది, ఈ చిన్న మొత్తాలలో మనం సాధించేదేమిటి... అనే చిన్నచూపును రెండో అడ్డంకిగా చెప్పవచ్చు. సంపాదన తొలినాళ్ల నుండే 20 30 శాతం పొదుపునకు కేటాయించితే, ఆర్థిక లక్ష్యాలను సులువుగా అందుకోవచ్చు. అప్పు ముప్పు: నెలసరి వాయిదాలతో వస్తువులు కొనడం, పర్సనల్ లోన్, వెహికల్ లోన్, క్రెడిట్ కార్ ్డలోన్ అంటూ కొంతమంది జీవితాంతం అప్పులు చేసి తిప్పలు పడుతుంటారు. ఇంటికోసం, పిల్లల చదువు కోసం, మంచి వ్యాపారం కోసం తప్పనిసరి పరిస్థితులలో తీసుకోవచ్చు. ఇప్పటికే అధిక వడ్డీ రేట్లకు రుణాలు తీసుకున్నవారు తక్కువ వడ్డీ రుణాలకు మారడం లేదా పూర్తిగా రుణవిముక్తులు కావడం మంచిది. సంపద సృష్టి: ఉమ్మడి కుటుంబాలు తగ్గుతూ మేమిద్దరం మాకిద్దరనే కుటుంబాలు పెరుగుతున్న రోజులివి. ఎక్కువ కుటుంబాలలో ఒకరే సంపాదించడం, మిగిలిన సభ్యులు ఆ వ్యక్తిపై ఆధారపడడం చూస్తుంటాం. ఆర్థిక లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలంటే అంతా డబ్బుతోనే ముడిపడి ఉంటుంది. అందుకోసం ఎవరికివారు ఎక్కువ మొత్తాన్ని సంపాదించాలి తక్కువ ఖర్చులు పెట్టుకొంటూ ఎక్కువ భాగాన్ని ‘పొదుపు మదుపుకి కేటాయించాలి. ఈ రెండవ పని స్థితప్రజ్ఞతతో, పట్టుదలతో చాలామంది చెయ్యటానికి అవకాశం ఉన్న మార్గం. సంపాదించే వయస్సులో వీలైనంత కూడపెడితే, ఆర్థిక లక్ష్యాలను అధిగమించి, మలి వయస్సు జీవితపు ఆర్థిక అవసరాలను అధిగమించగలుగుతాం. కావ్యకి 35 సంవత్సరాలు వచ్చేసరికి 15 లక్షల విలువైన ఇల్లు కొనుక్కుంది. 5 లక్షలతో ఒక కారు కొంది. పిల్లల కోసం 10 లక్షలు పొదుపు చేసింది. ఒక్క కావ్య మాత్రమే కాదు, అందరూ ఈ సూచనలను పాటించి, పొదుపు చేస్తే ఆనంద మయమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు. రజని భీమవరపు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, హైదరాబాద్ -
ఆభరణానికే అందం...
చాలా వెరైటీ వంటకాలు ఉన్నాయి కదా అని అన్నీ ఒకేసారి తినలేం. అలాగే ఏడు వారాల నగలు ఉన్నాయి కదా అని అన్నీ ఒకేసారి ధరించకూడదు. కట్టుకునే దుస్తులకే కాదు, పెట్టుకునే ఆభరణాలకూ ఓ ప్రత్యేకత ఉంటుంది. సమయం, సందర్భాలను బట్టి ఆభరణాలు ధరించాలి. ఆ ఆభరణాలలో మీరు మరింత ఆకర్షణీయంగా, అందంగా కనిపించాలంటే ఏది రాంగో, ఏది రైటో తెలిసుండాలి. అందుకు ఈ మెలకువలు పాటించి, ఆభరణాలకే అందాన్ని తీసుకురండి. నగలు ఆడవారికి ఎంత ఇష్టమో తెలిసిందే! పెళ్ళిళ్లకు, ఇతర ఫంక్షన్లకు వెళ్లినప్పుడు చీరల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.కాని నగలు ఒకే తరహావి పెట్టుకెళతారు. ఇక చాలా మంది చేసే పొరపాటు.. ఒకటికి రెండు, మూడు నగలు వేసుకోవడం. ధరించిన చీరకు, వేసుకున్న నగకు ఏ మాత్రం పొంతన లేకపోవడం... రోల్డ్‌గోల్డ్ కంటే బంగారు ఆభరణా లలో ఈ పొరపాట్లు ఎక్కువగా జరుగుతుంటాయి. మెడ పొడవుగా/ కురచగా ఉంటే!: ఆభరణాలు ధరించేటప్పుడు మెడను బట్టి ఎంచుకోవాలి. మెడ సన్నగా పొడవుగా ఉన్నదా, లేక కురచగా లావుగా ఉన్నదా అనేది చూసుకోవాలి. అలాగే వయసును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఒక వయసు వచ్చేసరికి మెడ మీద ముడతలు వచ్చేస్తాయి. మెడ పొడవుగా సన్నగా ఉంటే చౌకర్స్, నెక్లెస్ పెట్టుకోవచ్చు. అదే మెడ కురచగా.. లావుగా ఉన్నా, ముడతలుగా ఉన్నా నెక్లెస్‌లు పెట్టుకునే ధైర్యం చేయకూడదు. పొడవాటి హారాలు వేసుకోవాలి. ఫ్యాబ్రిక్‌కు తగిన ఆభరణం: వెళ్లబోయే వేడుక ఏంటి? ఏ చీర కట్టుకుంటున్నాం.. అనే దాన్ని బట్టి ఆభరణాలను ఎంపిక చేసుకోవాలి. షిఫాన్ చీర ధరించినప్పుడు పట్టుచీరపైకి వేసుకునే నగలు ధరించకూడదు. పోచంపల్లి, గద్వాల వంటి కాటన్ చీరలు కట్టుకున్నప్పుడు డల్ మెటల్స్, ఉడెన్ జ్యుయలరీ బాగా సూటవుతుంది. బంగారు ఆభరణాలైతే యాంటిక్ ఫినిషింగ్ చేసినవి నప్పుతాయి. షిఫాన్, జార్జెట్.. వంటి చీరలు కట్టుకున్నప్పుడు సంప్రదాయ ఆభరణాలు ఎంత మాత్రం నప్పవు. వీటికి ఫంకీ జువెల్లరీ... అదీ ఒక నగ మాత్రమే ధరించాలి. లేదా స్టైలిష్ ముత్యాలు వేసుకోవాలి. సన్నటి సింగిల్ లైన్ నెక్లెస్‌లు కూడా బాగుంటాయి. పట్టుచీర ధరించినప్పుడు బంగారు ఆభరణాలు, కెంపులు, పచ్చలు బాగుంటాయి. పట్టుచీరలో గోల్డ్, సిల్వర్ థ్రెడ్ డిజైన్స్ ఉంటాయి. ఆ గోల్డ్ డిజైన్‌కి ఈ గోల్డ్ జువెల్రీ బాగా సూటవుతుంది. అందుకే ముందు ఏ తరహా చీర కట్టుకుంటున్నామో దృష్టిలో పెట్టుకొని, దానికి తగిన ఆభరణాన్ని ఎంపిక చేసుకోవాలి. రంగులకు తగిన ఆభరణం: ఎంపిక లేదు, ఆభరణాలు తక్కువ ఉన్నాయి అనుకుంటే ఒకే ఒక్క నగ ధరించవచ్చు. అది కూడా సరైనది లేదు అనుకుంటే చీరకు సరిగ్గా మ్యాచ్ అయ్యే పెద్ద పెద్ద జూకాలు, హ్యాంగింగ్స్ పెట్టుకుంటే చాలు. అంతే కాని రాంగ్ జువెల్లరీ వేసుకోకూడదు. బ్లౌజ్‌కు తగినవిధంగా...!: హైనెక్ బ్లౌజ్ వేసుకుంటే మెడను పట్టి ఉంచే నెక్లెస్ అసలు పెట్టుకోకూడదు. హారం మాత్రమే వేసుకోవాలి. డీప్ నెక్ బ్లౌజ్ ధరిస్తే నెక్లెస్ బాగుంటుంది. ఒక్క నగే సరైన ఎంపిక: ఎప్పుడైనా రెండు మూడు నగలు వేసుకుంటే అవి ఎంత అందంగా ఉన్నా ఆకర్షణీయంగా కనిపించరు. పెళ్లిళ్లకు రెండు మూడు హారాలు వేసుకోవచ్చు. అయితే అవి కూడా మ్యాచింగ్ ఆభరణాలై ఉండాలి. ఒక హారాన్ని పోలిన డిజైన్, స్టోన్స్ వంటివి రెండు, మూడవ హారాలలోనూ కనిపించాలి. అప్పుడే బాగుంటాయి. పెళ్ళిళ్లకు తయారయ్యేవారు కొంతమంది అతిగా నగలు పెట్టుకుంటారు. చెవులకు, చేతులకు. నడుముకు, మెడలోనూ, శిరోజాలకు.. ఇలా అన్ని భాగాలనూ ఆభరణాలతో అలంకరిస్తే బాగానే ఉంటుంది. అలా కాకుండా ఏదో ఒక పార్ట్‌ని మాత్రమే ఎక్కువగా నగలతో అలంకరిస్తే కళ తప్పుతుంది. ఎక్కువ ఆభరణాలను అలంకరించుకోలేని వారు ఒక్క నగతో సరిపెట్టుకుంటే మంచిది. మిగతా ఏ సందర్భంలోనైనా ఒక్క నగే బాగుంటుంది. ఉన్నాయి కదా అని రెండు, మూడు హారాలు వేసుకోవడం వల్ల కట్టుకున్న చీర, మేకప్, శిరోజాల అలంకరణ మీద కన్నా ఎదుటివారి దృష్టి ముందుగా నగలమీదకు వెళుతుంది. దీంతో అందంగా కనిపించరు. మ్యాచింగ్ క్యాచింగ్...: ఎంపిక చేసుకున్న చీర, కేశాలంకరణ, శారీరక సౌష్టవం, ఆభరణం,... మొత్తం అందంగా కనిపించాలంటే కట్టుకున్న చీరకు ఆభరణం మ్యాచ్ అయి ఉండాలి. కొంతమంది మంగళసూత్రాలు, నల్లపూసలు, నెక్లెస్ అన్నీ ఓపిగ్గా ధరిస్తారు కానీ. సరైన పాదరక్షలు తొడుక్కోరు. అంతెందుకు... రోజూ వేసుకునే కేశాలంకరణే వేడుకలోనూ ఉంటుంది. ఒక్క నగలు మాత్రమే ప్రత్యేకంగా కనిపిస్తాయి. అందుకే ఎదుటివారి దృష్టి నగలమీదకే వెళుతుంది. మనకు ఉన్న నగలు మాత్రమే అందంగా కనిపించాలంటే ఆభరణాలు ఎన్ని రకాలైనా ధరించవచ్చు. మనం అందంగా కనిపించాలంటే ఆభరణాల ఎంపిక, ధరించడంలో కనీస జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. 1- షిఫాన్, జార్జెట్.. చీరలు ధరించినప్పుడు సంప్రదాయ ఆభరణాలు నప్పవు. ఫంకీ, స్టైలిష్ ముత్యాల ఆభరణాలు ధరిస్తే బాగా కనిపిస్తారు. 2- రెండు, మూడు హారాలు ధరించడం,చీరకు సూటవని ఆభరణాల వల్ల అందం దెబ్బతింటుంది. 3- అంచు ఉన్న షిఫాన్ చీరలు కట్టినప్పుడు ఒక నగను మాత్రమే, ధరించాలి. కేశాలంకరణ పైన దృష్టిపెట్టాలి. 4- ఒకేసారి పూసలు, నల్లపూసలు, ఫంకీ జువెల్రీ ధరించడం అంటే అలంకరణను మనమే పాడుచేసుకున్నట్టు. చీర రంగులోని ఏదో ఒక రంగును ప్రతిబింబించే నగను ఒకటే ధరిస్తే లుక్ అధునాతనంగా కనిపిస్తోంది. 5- వంగపండు రంగు జార్జెట్ చీరకు గోల్డ్ బార్డర్ ఉంది. ఆభరణాలను కూడా అదేవిధంగా జత చేయాలి. గోల్డ్ కలర్లో ఉన్న స్టైలిష్ ఆభరణాన్ని ధరిస్తే మోడ్రన్ లుక్‌లో కనిపిస్తారు. ఇలాగే ప్రతి చీరకు ఎంపికలో ప్రత్యేకత ఉండాలి. మోడల్స్: కావ్య, ప్రియాంజలి ఫొటోలు: శివ మల్లాల కర్టెసీ: మంగారెడ్డి ఫ్యాషన్ డిజైనర్ www.mangareddy@gmail.com -
చలించని సంప్రదాయం
ఆధునికత... ఎన్ని మెలికలైనా తిరుగుతుంది. సంప్రదాయం... చిన్న ట్విస్టుకే సిగ్గుల మొగ్గవుతుంది. ఎలా మరి? ‘ఆహ్వానం’ అంటూ పెళ్లి పిలుపులు. ‘ఆగండి’ అంటూ చలి బెదిరింపులు! చీర - లంగాఓణీ - లెహంగా - సల్వార్ కమీజ్... ఇవన్నీ... ట్రెడిషనలే కానీ, చలిని తట్టుకోడానికి అడిషనల్ కాదు. ఎలా మరి? ఓ పని చేద్దాం. పైటని శాలువాతో డిజైన్ చేయిద్దాం. బ్లవుజ్‌కి స్వెటర్ స్లీవ్స్ జత చేద్దాం. కమీజ్‌కు రా సిల్క్ కోట్ తొడుగుదాం. లంగాఓణీకి ఆల్టర్ నెక్ అల్లేద్దాం. అప్పుడిక సంప్రదాయం సంప్రదాయమే. వణికించే చలిలోనైనా... వేడుకకు వెళ్లిరావడమే. 1- లేత, ముదురు ఆకుపచ్చల కాంబినేషన్‌తో రూపొందించిన లంగా ఓణీ. రా సిల్క్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ఆల్టర్నెక్ ఓవర్‌కోట్ వేయడంతో ఆధునికంగా కనిపిస్తోంది. ఓవర్‌కోట్ అంచును ముత్యాలతో ఎంబ్రాయిడరీ చేశారు. 2- రెడ్ సల్వార్ కమీజ్‌కు రా సిల్క్ వెల్వెట్‌తో క్విల్ట్ చేసి ఓవర్ కోట్గా జతచేశారు. దీంతో చలిని తట్టుకునేలా ఛాతి భాగం వెచ్చగా ఉంటుంది. 3- ముదురు గులాబీ రంగు లెహంగాకు అదే రంగు శాలువాతో ఓణీని డిజైన్ చేశారు. థ్రెడ్ వర్క్ చేసిన మల్టీకలర్ బార్డర్‌ను జత చేశారు. బ్రొకేడ్ బ్లౌజ్‌కు స్వెటర్ స్లీవ్స్ జత చేశారు. లేదంటే శాలువా ఫ్యాబ్రిక్‌ను కట్ చేసి స్లీవ్స్‌గా వేసుకోవచ్చు. 4- లేత గులాబీ, నలుపు రంగుల కాంబినేషన్‌తో డిజైన్ చేసిన లంగాఓణి చీర ఇది. పైట భాగాన్ని శాలువాతో డిజైన్ చేసి, బార్డర్ని మల్టీకలర్ థ్రెడ్‌వర్క్‌తో రూపొందించారు. మోడల్స్: కావ్య, అశ్విని, సోనాలి మంగారెడ్డి, ఫ్యాషన్ డిజైనర్ www.mangareddy.com ఫొటోలు: శివ మల్లాల -
కావ్యా టీచర్...మా బడికి రండి
డెబ్బై ఐదేళ్ల క్రితం... యుద్ధంలో ధ్వంసమైన స్పెయిన్ గ్రామం ‘గెర్నికా’! నేటికీ అది అక్కడే ఉంది కానీ... గెర్నికా అంటే ప్రపంచానికిప్పుడు గ్రామం కాదు, పికాసో పెయింటింగ్! బ్లాక్ అండ్ వైట్‌లో రుధిర శిథిలాలను చిత్రించి... గెర్నికా జ్ఞాపకాలను ఆనాడు సజీవం చేశారు పికాసో. నేడు కావ్య కూడా అలాంటి పనిలోనే ఉన్నారు! పెచ్చులూడిపోతున్న బడి గోడలను శుభ్రం చేసి, చక్కటి క్యాన్వాస్గా మార్చి... పిల్లల సిలబస్‌ను బొమ్మలు బొమ్మలుగా గీస్తున్నారు. గవర్నమెంటు చదువుల్ని వర్ణమయం చేస్తున్నారు! పైచదువుల కోసం లండన్ వెళ్లవలసి ఉన్న అమ్మాయి ఆఖరి నిమిషంలో... ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నట్లు?! ప్రతి స్కూలూ ఆమెను ఎందుకు ఆహ్వానిస్తున్నట్లు? ఇదే ఈవారం మన ‘జనహితం’. సేవ చేయాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది. ఎలాంటి సేవ చేయాలి? ఏ వయసులో చేయాలనే ఆలోచనలు రావడానికే ఓ యాభైఏళ్ల వయసుదాటాలి. అలాంటిది... చదువుకునే వయసులోనే... సేవ అనే పదానికి తనకున్న కళను జోడించి పేద విద్యార్థుల పాలిట పెన్నిధి అయ్యింది ఈ యువకళాకారిణి. ఎంతో పేరు సంపాదించిన కళాకారులే సమాజం వైపు తొంగిచూడ్డానికి ఓ నిమిషం ఆలోచిస్తున్న పరిస్థితుల్లో చిన్నవయసులోనే తన కళను పదిమందికీ ఉపయోగపడాలన్న ఆలోచనతో ముందుకు సాగుతున్న ఈ సామాజిక కళాకారిణి పేరు కావ్య చైనం. పాఠశాల గోడలనే గ్యాలరీ షోగా మార్చేస్తున్న కావ్య మనోభావాలివి. కాలేజి రోజుల్లో.... ‘‘నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ‘స్టేట్ కన్జ్యూమర్ క్లబ్’కి కన్వీనర్‌గా పనిచేశాను. ఆ సమయంలో కొన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్ పాఠాలు చెప్పేదాన్ని. అరకొరవసతులు, అంతంత మాత్రం చదువులు, ఇరుకు గదులు... నా మనసుని చాలా బాధపెట్టాయి. వారికి ఉచితంగా పాఠాలు చెప్పడం తప్ప ఏమీ చేయలేని వయసు నాది. ఇంజినీరింగ్ పూర్తయ్యాక పైచదువుల కోసం లండన్ వెళ్లే అవకాశం వచ్చింది. కానీ ఆ ప్రయత్నం విరమించుకున్నాను. కారణం... నా మనసునిండా బోలెడు ఆలోచనలు, చిన్న చిన్న ఆశయాలు... అన్నీ కలిసి నన్ను నాకు నచ్చిన కుంచె వైపే నడిపించాయి’’ అంటూ పరిచయం చేసుకున్న కావ్యను నిలబెట్టింది తాను అభిమానించిన చిత్రలేఖనమే. చిన్ని వయసు నుంచే... చదివింది ఇంజజినీరింగ్ అయినా కావ్య తనను తాను చాలా రంగాల్లో పరీక్షించుకుంది. ఈవెంట్ మేనేజ్మెంట్, రేడియో జాకీ, టెలీఫిల్మ్స్... అంటూ తనకొచ్చిన ప్రతి అవకాశాన్ని కొన్నాళ్లు చేసి చూసింది. ఏదైనా చేయడానికి బాగానే ఉంది కాని తన మనసుకి నచ్చడం లేదు. ఆ సమయంలో ఆమె మనసుకు తట్టిన ఆలోచనకు రూపమే ‘స్లీపింగ్ బహుదూర్’. చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టపడి నేర్చుకున్న చిత్రలేఖనం నలుగురికీ ఉపయోగపడాలన్న ఆలోచనతో ఆ సంస్థని స్థాపించింది. మొదట్లో టీషర్టులపై బొమ్మలు వేయడం, లైఫ్‌స్టయిల్ ప్రాడెక్ట్స్ తయారుచేయడం ఆ సంస్థ పనులు. కొన్నాళ్ల తర్వాత ఆ సంస్థని సేవాసంస్థగా మార్చాలనుకుంది. అందులో భాగంగానే తాను చదువుకున్న రోజుల్లో సందర్శించిన ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి పెట్టింది. పదేళ్లకొకసారి కూడా సున్నం వేయని ప్రభుత్వ పాఠశాల గోడలపైకి కావ్య మనసు మళ్లింది. గోడలకు రంగులేయడంతోనే తన పని పూర్తికాదనుకుంది. తన చిత్రలేఖనంతో అక్కడి పేదవిద్యార్థులకు పాఠాలు చెప్పాలనుకుంది. ఆ దిశగా కావ్య వేసిన అడుగులు నాలుగు పాఠశాలలు దాటాయి. సైన్స్ బొమ్మలు, ప్రపంచ మ్యాప్‌లు... ‘‘శిథిలమైనట్టు ఉన్న గోడల మధ్య పాఠాలు నేర్చుకునే పిల్లలకు ఆ గోడల ద్వారానే పాఠాలు నేర్పాలనుకున్నాను. ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకూ ఉన్న పాఠ్యపుస్తకాలను చదివాను. ఏ క్లాస్‌లో ఏ బొమ్మలు అవసరమో ఒక నోట్స్ తయారుచేసుకున్నాను. మొదట ఒక స్కూల్‌కి వెళ్లి అక్కడి ఉపాధ్యాయులతో మాట్లాడాను. ఒకటి రెండు తరగతులకు ఒకటే గది ఉన్న స్కూళ్లలో నాలుగు గోడలను రెండుగా విభజించి ఒక గోడపై పండ్ల బొమ్మలు, మిక్కీమౌస్లు వేస్తే మరో రెండు గోడలపై మనిషి బొమ్మ వేసి కన్ను, ముక్కు అంటూ ఇంగ్లీష్‌లో పేర్లు రాశాను. పెద్ద క్లాసులకి వెళ్లేసరికి మూత్రపిండాలు, గుండె బొమ్మ ఒక క్లాస్‌లో, సౌరకుటుంబం, రాకెట్లని మరో గదిలో వేశాను’’ అని కావ్య చెబుతున్న మాటలకంటే ఆమె కళతో తీర్చిదిద్దిన తరగతి గోడలు మరింత అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఎడమచేతివాటం... ఎడమచేతి వాటంగల కావ్య బడిగోడల రూపాన్ని ఆ ఒంటిచేత్తోనే మార్చేస్తుంది. పేరుకే సంస్థ కాని అందులో అన్ని పనులు ఈ కళాకారిణే చేస్తుంది ‘‘నాకు సహకరించడానికి ఓ ఐదుగురు వాలంటీర్లు ఉన్నా... పనులన్నీ నేను చేసుకుంటున్నాను. ఇప్పటివరకూ నేను నాలుగు ప్రభుత్వ పాఠశాలలకు పనిచేశాను. పొద్దునే ఏడుగంటలకల్లా స్కూలుకి వెళ్లిపోతాను. సాయంత్రం ఆరింటికి బయటికి వస్తాను. వైట్‌వాష్ మొదలు చిత్రాల వరకూ అన్నీ ఒక్కదాన్నే వేసుకుంటాను. ఈ ప్రయాణంలో చాలామంది తెలిసినవారు సాయపడతామని ముందుకు వచ్చారు కాని ఈ పాఠశాలల్లో సౌకర్యాలను చూసి తమవల్లకాదన్నారు. అక్కడి విద్యార్థులు, ఉపాధ్యాయులు మాత్రం నన్ను చాలా అభిమానంగా చూసుకునేవారు. పద్మారావునగర్ దగ్గర మైలార్రెడ్డి ప్రభుత్వపాఠశాల ప్రిన్సిపల్ అయితే నేను పెయింటింగ్ వేసిన గదులన్నీ చూసుకుని భావోద్వేగానికి లోనయ్యారో.. ‘ మా పాఠశాల గోడలకు రంగులేస్తారని కలలో కూడా అనుకోలేదు. నేను రిటైర్ అయిపోయేలోగా...కనీసం తెల్లసున్నం అయినా వేస్తే బాగుండును అనుకున్నాను. అలాంటిది ఇంత ఖరీదైన రంగులతో పాటు పిల్లలకు ఉపయోగపడే బొమ్మలు కూడా గీసినందుకు థ్యాంక్సమ్మా’ అన్నారు. ఆసమయంలో నేను చాలా సంతోపడ్డాను’’ అంటూ తన ప్రయాణంలోని మధురస్మృతులని గుర్తుచేసుకుంది కావ్య. పిల్లలకు నేర్పిస్తూ... జవహర్‌నగర్, మైలార్రెడ్డి, బ్రాహ్మణబస్తీ పాఠశాలలతో పాటు కొన్ని స్వచ్ఛంద సంస్థల పాఠశాలలోని గ్రంథాలయాలకు కూడా కావ్య పెయింటింగ్స్ వేసింది. బడి గోడలపై చిత్రలేఖనంతో పాటు ఈ యువకళాకారిణి మరో సేవాకార్యక్రమం కూడా మొదలుపెట్టింది. ప్రభుత్వపాఠశాలలో ప్రైమరీ తరగతుల విద్యార్థులకు ఉచితంగా చిత్రలేఖనం నేర్పుతోంది. దీనికోసం ‘స్లీపింగ్ బహదూర్’ సంస్థ తరపున పిల్లలకు పెయింటింగ్ కిట్లు, పుస్తకాలు కూడా ఉచితంగా ఇస్తోంది. ఒక్కో స్కూల్లో ఒక్కో వారం క్లాసులు చెబుతోంది. జవహర్‌నగర్ స్కూల్లో ప్రతి గురువారం కావ్య చెప్పే పెయింటింగ్ క్లాసులకి ఒక్క విద్యార్థి కూడా డుమ్మా కొట్టరంటారు ఆ స్కూల్ ప్రిన్సిపల్ శివకుమార్. ‘‘నేను ఒక రకం బొమ్మ గీసి చూపిస్తే...వాళ్లు రకరకాల ప్రయోగాలు చేసి నన్నే అబ్బురపరుస్తుంటారు. నేను కనిపించగానే అక్కా...అక్కా అంటూ నన్ను చుట్టుముట్టేస్తారు. క్లాస్ ముగియగానే వారందరికీ చాక్లెట్లు ఇచ్చి ఇంటికొస్తాను’’ అని చెప్పే కావ్య మాటల్లో చాలా సంతృప్తి కనిపించింది. నిజమే! గ్యాలరీ షోల్లో పెట్టాల్సిన బొమ్మల్ని ప్రభుత్వ స్కూలు గోడలపై ప్రదర్శించి అక్కడి విద్యార్థుల మనసుదోచుకున్న ఈ కళాకారిణిని చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. ప్రముఖ లాయర్, నటులు సి. నరసింహారావు, ప్రముఖ అడ్వకేట్ అనురాధ కావ్య తల్లిదండ్రులు. బిడ్డ భవిష్యత్తుకి పునాదులు పడాల్సిన వయసులో కూతురు ఎంచుకున్న సేవాకార్యక్రమాలు వారి మనసుని కూడా కదిలించాయి. కావ్య పెయింటింగ్‌లు వేసిన పాఠశాలలను చూసిన మిగతా ప్రభుత్వపాఠశాల ఉపాధ్యాయులు తమ పాఠశాల గదుల రూపురేఖలు మార్చమంటూ అడుగుతున్నారు. ఎన్ని పాఠశాలలకైనా రంగులద్దడానికి తన ఎడమచేయి సై అంటోందని నవ్వుతూ చెబుతున్న కావ్యకు ఆల్ ది బెస్ట్ చెబుదాం. - జాయ్