
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు కార్యక్రమంలో పాల్గొనడానికి కరీంనగర్ నుంచి హుజూరాబాద్ వెళ్లుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మార్గమధ్యంలో తాడికల్ వద్ద వివాహ వేడుకను చూశారు. వెంటనే బస్సు దిగి నూతన వధూవరులు కావ్య, మనోహర్‌లను పలకరించి, అక్షితలు చల్లి ముఖ్యమంత్రి ఆశీర్వదించారు. కళ్యాణలక్ష్మి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అనుకోని అతిథిలా ముఖ్యమంత్రి స్వయంగా రావడంతో వధూవరుల బంధువులు ఆనంద,ఆశ్చర్యాలకు గురయ్యారు. ముఖ్యమంత్రికి, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment