కల్యాణలక్ష్మి చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే భాస్కర్‌రావు
మిర్యాలగూడ రూరల్ : రైతు, మహిళల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. ఆదివారం మండలం పరిధిలోని పలు గ్రామాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. వెంకటాద్రిపాలెం, జప్తివీరప్పగూడెం, తుంగపహాడ్, బాదలాపురం, ఆలగడప, రాయినిపాలెం, గూడూరు, రుద్రారం, కొత్తగూడెం, ఉట్లపల్లి, తక్కెళ్లపహాడ్, తడకమళ్ల గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 359 మందికి రూ.1,83,09,000 కల్యాణలక్ష్మి పథకం ద్వారా అందజేస్తున్నట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.
పేదలకు ఆడపిల్ల భారం కాకూడదని వారి పెళ్లికి రూ.75,016 అందజేస్తున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాడని అన్నారు. మార్చిలో రైతుకు నూతన పాస్ పుస్తకాలు జారీ, మేలో రైతులకు ఎకరాకు రూ.4వేలు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మాలి కృష్ణారెడ్డి, ఎంపీపీ ఒగ్గు జానయ్య, వైస్‌ఎంపీపీ నూకల సరళహన్మంతరెడ్డి, జెడ్పీటీసీ మట్టపల్లి నాగలక్ష్మీసైదులు యాదవ్, నాయకులు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, మేడ సురేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌లు మంజులవెంకటేశ్వర్లు, శశికళ శ్రీనివాసరెడ్డి, వీరమ్మ, ఎంపీటీసీ లలిత, చిట్టిబాబు, చౌగాని భిక్షంగౌడ్, యదగిరి, సైదులు, అశోక్‌రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment