MLA Bhaskar Rao
-
మహిళపై నోరుపారేసుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
నల్గొండ: మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఓ మహిళపై నోరు పారేసుకున్నారు. వివరాలు.. వేములపల్లి మండలంలోని శెట్టిపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే భాస్కర్‌రావును గ్రామానికి చెందిన వనం విజయలక్ష్మి తనకు అన్ని అర్హతలు ఉన్నా గృహలక్ష్మి పథకంలో తన పేరును ఎందుకు తొలగించారంటూ అడిగింది. దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ఆమెను పరుష పదజాలంతో దూషిస్తూ.. ‘నీకు ఇల్లు పెట్టనుపో.. ఏం చేసుకుంటావో చేసుకో.. దానిని బయటికి నెట్టేయండి’ అంటూ పోలీసులను ఆదేశించారు. దీంతో పోలీసులు సదరు మహిళను బయటకు తీసుకెళ్తుండగా ఆమె ఎమ్మెల్యేను తిడుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతిఒక్కరికీ గృహలక్ష్మి పథకంలో ఇల్లు అందుతుందని, విజయలక్ష్మి అర్హురాలు అయితే తానే స్వయంగా ఆమెకు పథకం అందేలా చూస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా రెండో విడత గొర్రెల పంపిణీలో అర్హులకు కాకుండా బీఆర్ఎస్ కార్యకర్తల పేర్లే జాబితాలో పొందుపరిచారంటూ సల్కునూరు గ్రామానికి చెందిన యాదవులు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేపై ఫిర్యాదు తీసుకోవడం లేదంటూ నిరసన.. కాగా ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయడానికి సాయంత్రం వేములపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా పోలీసులు తన ఫిర్యాదును స్వీకరించలేదని బాధిత మహిళ వనం విజయ ఆరోపించారు. పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపీ నాయకులతో ఆమె పోలీస్ స్టేషన్లోనే బైఠాయించింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కనపర్తి సత్యప్రసాద్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. మహిళ అని కూడా చూడకుండా ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించడం తదగన్నారు. ఇదే విషయమై స్థానిక ఎస్ఐ విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా.. ఆమె ఇచ్చిన ఫిర్యాదును తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. నిరసన తెలిపిన వారిలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రతన్‌సింగ్‌నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు చిర్ర సాంబమూర్తి, పెదమాం వెంకన్న, చలమల్ల సీతారాంరెడ్డి, పందిరి భాగ్యమ్మ, జవ్వాజి సత్యనారాయణ తదితరులు ఉన్నారు. -
మహిళా సంక్షేమమే లక్ష్యం
మిర్యాలగూడ రూరల్ : రైతు, మహిళల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. ఆదివారం మండలం పరిధిలోని పలు గ్రామాల్లో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. వెంకటాద్రిపాలెం, జప్తివీరప్పగూడెం, తుంగపహాడ్, బాదలాపురం, ఆలగడప, రాయినిపాలెం, గూడూరు, రుద్రారం, కొత్తగూడెం, ఉట్లపల్లి, తక్కెళ్లపహాడ్, తడకమళ్ల గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 359 మందికి రూ.1,83,09,000 కల్యాణలక్ష్మి పథకం ద్వారా అందజేస్తున్నట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. పేదలకు ఆడపిల్ల భారం కాకూడదని వారి పెళ్లికి రూ.75,016 అందజేస్తున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నాడని అన్నారు. మార్చిలో రైతుకు నూతన పాస్ పుస్తకాలు జారీ, మేలో రైతులకు ఎకరాకు రూ.4వేలు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మాలి కృష్ణారెడ్డి, ఎంపీపీ ఒగ్గు జానయ్య, వైస్‌ఎంపీపీ నూకల సరళహన్మంతరెడ్డి, జెడ్పీటీసీ మట్టపల్లి నాగలక్ష్మీసైదులు యాదవ్, నాయకులు చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి, మేడ సురేందర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌లు మంజులవెంకటేశ్వర్లు, శశికళ శ్రీనివాసరెడ్డి, వీరమ్మ, ఎంపీటీసీ లలిత, చిట్టిబాబు, చౌగాని భిక్షంగౌడ్, యదగిరి, సైదులు, అశోక్‌రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
‘అమర’.. ఆగ్రహం
సాక్షిప్రతినిధి, నల్లగొండ : మిర్యాలగూడ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే భాస్కర్‌రావు, ఆ పార్టీ నియోజకవర్గ మాజీ ఇన్చార్జ్ అల్గుబెల్లి అమరేందరరెడ్డి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో ఆధిపత్యపోరు కొనసాగుతోంది. ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న అంతర్గత వర్గపోరు తాజాగా బహిరంగ వేదికలకు ఎక్కింది. నియోజకవర్గంలో పట్టణ, మండలాల కమిటీలు తమను సంప్రదించకుండానే వేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమరేందర్‌రెడ్డి వర్గం బలప్రదర్శన చేసింది. మిర్యాలగూడలో శుక్రవారం ఆత్మీయసభ పేరుతో ఆయన అనుచరులు సభ నిర్వహించి నేరుగా ఎమ్మెల్యే భాస్కర్రావుపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. ఎమ్మెల్యే చేరినప్పటినుంచి మొదలైన గ్రూపులు కాంగ్రెస్ తరఫున గెలుపొందిన ఎమ్మెల్యే భాస్కర్‌రావు టీఆర్ఎస్లో చేరినప్పటినుంచి నియోజకవర్గంలో టీఆర్ఎస్ కేడర్ గ్రూపులుగా విడిపోయింది. గతంలో ఉన్న ఉద్యమ, పార్టీ నేతలు, పలుపార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన కొంతమంది నేతలు అమరేందర్‌రెడ్డి వర్గంగా కొనసాగుతున్నారు. ఇక కాంగ్రెస్‌నుంచి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న నేతలు, కొంతమంది ఉద్యమ, పార్టీ నేతలు ఎమ్మెల్యే అనుచరులుగా ఉన్నారు. ఇలా ఎవరివర్గం వారు ఉంటూ.. పార్టీ ఇచ్చే కార్యక్రమాలను వేర్వేరుగానే చేస్తున్నారు. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలకు తమను ఆహ్వానించడం లేదని అమరేందర్‌రెడ్డి వర్గం కొంతకాలంగా అగ్గిమీద గుగ్గిలమవుతోంది. నియోజకవర్గంలో మం త్రులు పర్యటించినా ఎమ్మెల్యే అనుచరులు కనీసం అమరేందర్‌రెడ్డి ఫొటో కూడా ఫ్లెక్సీల్లో పెట్టడం లేద ని అధినేతల ముందు ఆందోళన వ్యక్తంచేశారు. వర్గాలుగా ఉన్న పోరు మూడు రోజు లు క్రితం ని యోజకవర్గంలో పట్టణ, మండల కమిటీలను వేయడంతో మరింత ముదిరింది. ఇటీవల వేసిన రైతు సమన్వ య సమితుల్లో ఎమ్మెల్యే వర్గానికే ప్రాధాన్యత ఇచ్చారని, ఇప్పుడూ కూడా ఆయన కనుసన్నల్లోనే ఆయన అనుచరులకే కమిటీల్లో కీలక బాధ్యతలు వచ్చాయని అమరేందర్‌రెడ్డి వర్గం ఆగ్రహంతో ఊగి పోయింది. కాంగ్రెస్‌నుంచి వచ్చిన నేతలకే పదవులు వస్తున్నాయని, పార్టీ జెండాను భూ జానికెత్తుకొని మోసన తమను పక్కన పెడతారని నిరసన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేతో తాడోపేడో తేల్చుకునేం దుకు ఏ కంగా అమరేందర్‌రెడ్డి వర్గం బల ప్రదర్శన చేసింది. ‘మిర్యాలగూడ టికెట్ నాకే’ ప్రకటనతో అలజడా..? టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు, ఆ పార్టీనుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఈసారి ఆయా నియోజకవర్గాల నుంచే పోటీ చేస్తారా..? లేక ఇతర నియోజకవర్గాలకు వెళ్తారా..? అని ఉమ్మడి జిల్లాలో రాజకీయంగా జోరుగా చర్చ సాగుతోంది. ఈ ప్రచారంలో భాగంగానే ఎమ్మెల్యే భాస్కర్‌రావు కూడా మిర్యాలగూడనా..? లేదా కోదాడనుంచి పోటీ చేస్తారా..? అని చర్చకు వచ్చింది. నాలుగు రోజుల క్రితం భాస్కర్‌రావు ‘మిర్యాలగూడ టికెట్ నాకే’ అంటూ ప్రకటన చేశారు. భాస్కర్‌రావు కోదాడకు వెళ్లితే.. అమరేందర్‌రెడ్డి ఇక్కడి నుంచి పోటీచేయడం ఖాయమని ఆయన అనుచర నేతలు భావించారు. కానీ ఎమ్మెల్యే ప్రకటన, పార్టీ కమిటీల్లో చోటు లేకపోవడం, తది తర అంశాలతో నరాజులో ఉన్న అమరేందర్‌రెడ్డి వ ర్గం ఒక్కసారిగా ఎమ్మెల్యేపై మండిపడింది. ఆయన ప్రధాన అనుచరుడు గాయం ఉపేందర్‌రెడ్డితో పాటు మరికొంతమంది నేతలు ‘ఆత్మీసభ’ను నిర్వహించి ఎమ్మెల్యేనే టార్గెట్‌గా విమర్శల వర్షం కురిపించారు. పార్టీ కమిటీల ప్రకటన.. ఎమ్మెల్యే వేయించిన పార్టీ కమిటీలను తాము గుర్తించడం లేదని పేర్కొంటూ ఉపేందర్‌రెడ్డి నేతృత్వంలో ఆత్మీయ సభలో కొత్త కమిటీలను ప్రకటిం చుకున్నారు. మిర్యాలగూడ పట్టణ, మండల, వేములపల్లి, దామరచర్ల, మాడ్గులపల్లి మండలాలకు కమిటీలను వేశారు. అయితే ఈ సభకు మాత్రం అమరేందర్‌రెడ్డి హాజరుకాలేదు. ఆయన కనుసన్నల్లోనే సభ జరిగిందని ఎమ్మెల్యే భాస్కర్‌రావు వర్గం భావి స్తోంది. మొత్తంగా మిర్యాలగూడలో చోటుచేసుకున్న ఈ పరిణామం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి వెళ్లనుందని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. ఇక్కడితే చెక్‌పెట్టకపోతే దేవరకొండతో పా టు ఇతర నియోజకవర్గాల్లో కూడా అసమ్మతి గళం బాహటంగానే బయటకు వస్తుందని.. దీంతో పార్టీకి నష్టం వాటిల్లుతుందని ఆ పార్టీ నేతలు సీనియర్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
కోమటిరెడ్డి కమీషన్లు తీసుకోలేదా?
మిర్యాలగూడ : కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డిలకు రాజకీయ భవిష్యత్ లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్ రావు విమర్శించారు. మిర్యాలగూడ సభలో మాట్లాడుతూ.. మిషన్ కాకతీయలో కోమటిరెడ్డి కమీషన్లు తీసుకున్న విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. ఆధారాలతో సహా నిరూపించి ప్రజల ముందు పెడ్తానని సవాల్ విసిరారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి మంత్రులుగా పనిచేసిన మిర్యాలగూడలో రహదారి వెడల్పునకు ఎటువంటి నిధులివ్వలేదని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రూ.7 కోట్లు మంజూరు చేసి రోడ్ల వెడల్పునకు శంకుస్థాపన చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు ప్రజల కోసం చెరువుల్లో పని చేయించలేదని.. కేవలం కాంట్రాక్టర్ల కోసమే ఐ.బి. శాఖ పని చేసేలా చేశారని మండిపడ్డారు. -
అండగా ఉంటాం..
దేవరకొండ/చందంపేట : ‘‘అధైర్య పడొద్దు..అండగా ఉంటాం..’’ అంటూ ఆత్మహత్యకు పాల్పడిన గిరిజన రైతు కుటుంబానికి సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి భరోసా ఇచ్చారు. చందంపేట మండలం గాగిళ్లాపురం గ్రామపంచాయతీ కొర్రోనితండాకు చెందిన కౌలురైతు కొర్ర రూప్లానాయక్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడగా అతని కుటుంబాన్ని మంగళవారం సీఎల్పీ నేత జానారెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి పరామర్శించారు. రూప్లానాయక్ ఇంటికి వెళ్లిన కాంగ్రెస్ నేతలు అతని భార్య లచ్చిని ఓదార్చారు. ఆత్మహత్యకు పురికొల్పిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సాగుకు వ్యవసాయ భూమి లేక, బతకడానికి దారిలేక అప్పులబాధ ఎక్కువై ఆత్మహత్యకు పాల్పడినట్లు లచ్చి నాయకులతో తెలిపింది. స్పందిం చిన నాయకులు తక్షణ సాయంగా ఆమెకు రూ.50వేలు అందించారు. కాంగ్రెస్ హయాంలో ఆత్మహత్యకు పాల్పడిర కుటుంబానికి అందించే లక్ష రూపాయల ఆర్థికసాయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకున్నప్పటికీ అధికారులతో ఈ విషయం మాట్లాడతానని జానారెడ్డి ఆమెకు హామీ ఇచ్చారు. రోడ్డుకు రూ.10 లక్షల జెడ్పీ నిధులు.. తండాకు వెళ్లడానికి రోడ్డు మార్గం లేకపోగా జానారెడ్డి పర్యటన ఖరారు కాగానే కాంగ్రెస్ నాయకులు అప్పటికప్పుడు తాత్కాలిక రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయి రోడ్డు నిర్మాణం కోసం ప్రస్తావించిన జానారెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డిలు జిల్లాపరిషత్ నిధుల నుంచి రూ. 10లక్షల వరకు కేటాయించాలని చైర్మన్ నేనావత్ బాలునాయక్‌ను కోరారు. దీనికి స్పం దించిన ఆయన అక్కడికక్కడే రోడ్డుకు నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు. అదే విధంగా తండాలో తాగునీటి వసతి లేకపోవడంతో వ్యవసాయ బావి నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని, ట్రాన్స్ఫార్మర్ లేక ఇబ్బందులకు గురవుతున్నామని సమస్య పరిష్కరించాలని గిరిజనులు కోరారు. వెంటనే బోరును రిపేర్ చేయించి జెడ్పీ నిధుల కింద చేతిపంపు మంజూరు చేస్తామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, మండల పార్టీ అధ్యక్షుడు గోవిందు యాదవ్, దేవరకొండ ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, మైనార్టీ నాయకులు సిరాజ్‌ఖాన్, దేవరకొండ నగర పంచాయతీ చైర్మన్ కేతావత్ మంజ్యానాయక్, మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు సురేష్‌రెడ్డి, ముక్కమల్ల వెంకటయ్య, రవి, ఎంపీటీసీ వెంకటయ్య, బెరైడ్డి కొండల్‌రెడ్డి, లక్ష్మానాయక్, సర్పంచ్ కొత్తపల్లి కృష్ణ, ఎంపీటీసీ గిరి యాదగిరి, బిక్కునాయక్, నేనావత్ భరత్‌కుమార్, మహాలక్ష్మయ్య, కొర్ర రాంసింగ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
'చంద్రబాబు ప్రతిపాదనలో కుట్ర దాగుంది'
హైదరాబాద్: ఫీజు మాఫీలో 58 శాతం భరిస్తానన్న చంద్రబాబు ప్రతిపాదనలో కుట్ర దాగుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ 60 శాతానికి పైగా సీమాంధ్ర విద్యార్థులే ఉన్నారని అన్నారు. హైదరాబాద్, రంగారెడ్డిలలో చదువుతున్న విద్యార్థుల్లో 58 శాతం ఫీజులను చంద్రబాబు భరించాలని, అప్పుడే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాప్యం చేయకుండా ఫీజు మాఫీ అంశంపై చర్చలు జరపాలని సూచించారు. ఎంసెట్‌లో కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థుల మొత్తం ఫీజులో తమ ప్రభుత్వం 58 శాతం ఫీజును రీయింబర్స్ చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే.