కోమటిరెడ్డి కమీషన్లు తీసుకోలేదా?
Published Thu, Jul 13 2017 4:26 PM | Last Updated on Tue, Sep 5 2017 3:57 PM
మిర్యాలగూడ : కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డిలకు రాజకీయ భవిష్యత్ లేదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే భాస్కర్ రావు విమర్శించారు. మిర్యాలగూడ సభలో మాట్లాడుతూ.. మిషన్ కాకతీయలో కోమటిరెడ్డి కమీషన్లు తీసుకున్న విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. ఆధారాలతో సహా నిరూపించి ప్రజల ముందు పెడ్తానని సవాల్ విసిరారు.
జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి మంత్రులుగా పనిచేసిన మిర్యాలగూడలో రహదారి వెడల్పునకు ఎటువంటి నిధులివ్వలేదని గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రూ.7 కోట్లు మంజూరు చేసి రోడ్ల వెడల్పునకు శంకుస్థాపన చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు ప్రజల కోసం చెరువుల్లో పని చేయించలేదని.. కేవలం కాంట్రాక్టర్ల కోసమే ఐ.బి. శాఖ పని చేసేలా చేశారని మండిపడ్డారు.
Advertisement