పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలయ్యే వరకు నిద్రపోం
సుప్రీంకోర్టులో కూడా పోరాడతాం
మాజీ మంత్రి హరీశ్‌రావు
రామచంద్రాపురం (పటాన్‌చెరు): పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పట్టణంలోని భారతీనగర్ కార్పొరేటర్ సింధు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యే వరకు తాము నిద్రపోమన్నారు. ఆ ఎమ్మెల్యేలు వెళ్లిపోయినంత మాత్రాన బీఆర్‌ఎస్ పారీ్టకి నష్టం లేదని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పని అయిపోయిందన్న వాళ్లు ఆ తరువాత అడ్రస్ లేకుండా పోయారన్నారు.
గతంలో పార్టీలు మారితే రాళ్లతో కొట్టండి అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే ఇప్పుడు ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని హైకోర్టులో కేసు వేశామని తెలిపారు. దీనిపై త్వరలో సుప్రీం కోర్టుకు వెళ్లి పోరాడతామన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా అందుకు కార్య కర్తలు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పరిపాలన స్తంభించిందని, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు.
ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం రేషన్‌కార్డు ఆధారంగా రైతులకు రుణమాఫీ చేస్తామని ఉంటే, తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి పాస్‌బుక్ ఉంటే సరిపోతుందని నోటి మాటగా చెబుతున్నారన్నారు. ఆయన చెప్పిన మా టలనే జీవోగా తెచ్చి రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో తిరగలేని పరిస్థితి రావ డం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఐదేళ్లకు మించి ఏ రాష్ట్రంలో అధికారంలో లేద న్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలో కి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి పాల్గొన్నారు.
హరీశ్.. టీఆర్‌ఎస్
టీఆర్‌ఎస్ కండువాతో మాజీమంత్రి హరీశ్‌రావు సందడి చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీఆర్‌ఎస్ కండువాతో హరీశ్ కనిపించడం చర్చనీయాంశమైంది. బీఆర్‌ఎస్ పేరును తిరిగి టీఆర్‌ఎస్‌గా మార్చే అవకాశం ఉందా? అని స్థానిక కార్యకర్తలు, స్థానికులు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment