
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని ప్రజలు గుర్తించారని, దీంతో బీజేపీపై ప్రజలకు నమ్మకం పెరిగిందని బీజేపి జాతీయ కార్యదర్శి బండి సంజయ్ అన్నారు.
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని ప్రజలు గుర్తించారని, దీంతో బీజేపీపై ప్రజలకు నమ్మకం పెరిగిందని బీజేపి జాతీయ కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. బీఆర్‌ఎస్ బండారాన్ని మోదీ బయట పెట్టారన్న బండి.. అడ్డా మీది కూలీలను తెచ్చి కండువా వేస్తున్న బీఆర్‌ఎస్ అంటూ ఎద్దేవా చేశారు.
‘‘సీట్ల విషయంలో కలిసి కట్టుగా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మా లిస్ట్ ఢిల్లీకి వెళ్లింది.. కాంగ్రెస్ లిస్ట్ మాత్రం ప్రగతి భవన్‌కి వెళ్లింది. పెద్ద సార్ ఆమోదం కోసం వెయిట్ చేస్తున్న లిస్ట్. పాపం ఇది రేవంత్‌కి తెలీదు’’ అంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘‘కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వచ్చే అవకాశం లేదు. వీరిద్దరికీ ఎంఐఎం మధ్యవర్తిత్వం వహిస్తుంది. అధికారం కోసం మూడు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. రేవంత్, హరీష్‌లు ఇద్దరు బలిచ్చే బకరాలు. కాంగ్రెస్‌లో బకరా రేవంత్ అయితే, బీఆర్‌ఎస్‌లో హరీష్ రావు’’ అని బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
చదవండి: ఈటల రాజేందర్ సంచలన ప్రకటన