సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, 14 ఏళ్ల వనవాసం వీడి మళ్లీ గులాబీ గూటికి బాలకృష్ణారెడ్డి రావటం ఆనందంగా ఉందన్నారు. ఇవాళ కొన్ని గద్దలు, తోడేళ్లు ఒక్కటై తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నాయని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
‘‘ఆనాడు రాష్ట్రం వద్దన్న వాళ్లు ఇప్పుడు తెలంగాణపై ప్రేమ చూపిస్తున్నారు. మొన్న రేవంత్ రెడ్డి అమరుల స్థూపం వద్దకు వచ్చి పైసలు పంచను ప్రమాణం చేయాలని కేసీఆర్‌ను రమ్మని చెప్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి ఆనాడు తెలంగాణ బలి దేవత సోనియా గాంధీ అని అనలేదా?. పైసల కట్టెలతో దొరికిన దొంగ రేవంత్. తెలంగాణ అస్తిత్వంపై మరోసారి దాడి జరుగుతుంది’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
‘‘కేసీఆర్ లేకపోతే టీపీసీసీ, టీబీజేపీ ఎక్కడిది?. రేవంత్ రెడ్డికి, కిషన్ రెడ్డికి ఆ పదవులు ఎక్కడివి?. తొమ్మిదిన్నరేళ్లలో సంక్షేమం ఒక వైపు అభివృద్ది మరోవైపు. అజ్ఞానులు, అహంకారంతో మాట్లాడుతున్నారు. మేము ఎవరికి బీ టీమ్ కాదు. పార్లమెంట్‌లో కన్నుకొట్టి, కౌగిలించుకొని ఇక్కడేమో మనల్ని అంటున్నారు. సోనియా గాంధీని బలి దేవత అని, రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్నాడు రేవంత్ రెడ్డి. ఆ రోజు ముద్దపప్పు నిప్పు అయ్యింది, బలి దేవత కాళి దేవత అయ్యిందా?’’ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు.
చదవండి: ప్రసంగాల్లో సామెతలు.. ఉపన్యాసాల్లో నుడి‘కారాలు’!
Comments
Please login to add a commentAdd a comment