
హైదరాబాద్: : తెలంగాణ రాష్ట్రంలో అసమర్థ, అవినీతి ప్రభుత్వం నడుస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. అసలు రాష్ట్రంలో పరిపాలన శూన్యమని, ప్రజల దృష్టికి మరల్చడానికే హెచ్ సీయూ హైడ్రా వివాదాలని ఆరోపించారు అరవింద్. లక్షల కోట్ల అప్పు ఉందని తెలిసి కాంగ్రెస్ ఇన్ని వాగ్దానాలు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. ప్రగతిభవన్ లో లంకె బిందెలు ఉన్నాయనుకున్నప్పుడు, కేసీఆర్ కు తెలియదా.. లంకె బిందెలు ఎక్కడ దాచుకోవాలో అని నిలదీశారు.
ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ పూర్తి చేయలేదని మండిపడ్డారు. ‘ సీఎం రేవంత్ సీసీపీయూ( Connect Collect Pay Use) కోర్సు చేశారని, ఇది మాత్రమే ఆయనకు తెలుసు. రేవంత్ పాలనలో పెద్దల నుంచి అంగన్ వాడిలో చదువుకునే చిన్నపిల్లలు కూడా సంతోషంగా లేరు. కేసీఆర్, రేవంత్ ల కథ గజదొంగ గంగన్న, ఆయన కొడుకు రంగన్న కథలా ఉంది.
HCU భూముల అంశంలో బిజేపి ఎంపీ ఉన్నాడు అంటూ కేటీఆర్ కామెంట్ చేస్తున్నారు. మరి పేరు ఎందుకు బయటపెట్టడం లేదు. టైమ్ ఎప్పుడు వస్తుంది.రేవంత్ ను మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ చూస్తోంది. సీఎంను మారిస్తే మళ్లీ అర్హత గల సీఎం దొరకడం లేదు. ఎలిజిబుల్ ఉన్న శ్రీధర్ బాబు సహా మిగతావారికి వసూల్ చేయడం రాదు. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ వెనక్కి తగ్గుతోంది’ అని ఆరోపించారు ధర్మపురి అరవింద్.
