
ఆ పార్టీ అంటే రేవంత్ ప్రభుత్వానికి భయం: ఎంపీ ధర్మపురి అర్వింద్
నిజామాబాద్ సిటీ: ఎంఐఎం పార్టీ దేశానికి కేన్సర్ వ్యాధి వంటిద ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. ఆదివా రం జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా దానితో అంటకాగడం ఎంఐఎంకు అలవాటుగా మారిందని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎంఐఎంకు భయపడుతోందని ఎద్దేవా చేశారు. హైడ్రా పాతబస్తీలో అక్రమ కట్టడా లను ఎందుకు కూల్చటం లేదని ప్రశ్నించారు.
వక్ఫ్‌బోర్డు చట్టంలో అనేక లొసుగులున్నా యని, వాటిని సవరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేని మాజీ మంత్రి కేటీఆర్.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర చేయాలనుకుంటున్నారో ప్రజ లకు చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ పాదయాత్ర చేస్తే ప్రజలు ఆయనకు చీపుర్లు, చెప్పులతో స్వాగతం పలికి నిలదీయాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment