
సాక్షి, నిజామాబాద్ జిల్లా: భీంగల్ మండల కేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డిల మధ్య వాగ్వాదం జరిగింది. కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ విషయంలో వివాదం తలెత్తింది. తులం బంగారం ఎక్కడంటూ ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. మంత్రి జూపల్లి గో బ్యాక్ అంటూ బీఆర్‌ఎస్ నాయకులు నినాదాలు చేశారు.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చారు. మంత్రి కాన్వాయ్‌కు అడ్డు తగిలి తులం బంగారం ఎప్పుడు ఇస్తారు రాహుల్ గాంధీ' అనే క్యాప్షన్ ఉన్న ఫ్లెక్సీలను బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రదర్శించారు. దీంతో మంత్రి జూపల్లి అసహనం వ్యక్తం చేశారు.