Family
-
న్యాయం కోసం..
బాధితుల పక్షాన నిలబడడం అంటే అంత సులువైన విషయం ఏమీ కాదు. కొన్నిసార్లు బెదిరింపులు కూడా ఎదురుకావచ్చు. కొన్నిసార్లు బాధితులు వెనక్కి తగ్గవచ్చు. వారికి ధైర్యం చెప్పి, న్యాయం జరిగేలా, నిందితులకు శిక్ష పడేలా చేయడానికి వృత్తిపరమైన అంకితభావం కావాలి. అలాంటి అంకితభావం మూర్తీభవించిన ఒక అధికారి స్రవంతి. లైంగిక వేధింపులు, అత్యాచార కేసులలో నిందితులకు శిక్ష పడేలా చేయడంలో కామారెడ్డి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న స్రవంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక ఆఫీసర్లా కాకుండా కుటుంబ సభ్యురాలిగా బాధితుల తరఫున నిలుస్తున్నారు.ఆడపిల్లలపై జరిగిన వేధింపుల విషయంలో బయటకు చెబితే పరువు పోతుందని చాలామంది చెప్పుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఎవరి ద్వారానైనా విషయం తెలిస్తే చాలు ఆమె అక్కడకి చేరుకుంటారు. బాధిత బాలికల తల్లిదండ్రులతో మాట్లాడి పోలీసులకు ఫిర్యాదు చేయించి వారికి శిక్షలు పడేలా చేస్తున్నారు కామారెడ్డి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ (డీసీపీవో)గా విధులు నిర్వహిస్తున్న స్రవంతి.మెరుపు వేగంతో బాధితుల దగ్గరికి....ఐదేళ్ల కాలంలో కామారెడ్డి జిల్లాలో 114 పోక్సో కేసులు నమోదయ్యాయి. ఇందులో చాలా మందికి శిక్షలు కూడా పడ్డాయి. జిల్లాలో ఏప్రాంతంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు జరిగినా, వేధింపులు ఎదురైనా ముందుగా జిల్లా అధికారులకు విషయం తెలియజేసి అక్కడికి చేరుకుంటారు స్రవంతి. ఇటీవల నవోదయ విద్యాలయంలో కొందరు ఉపాధ్యాయులు, సిబ్బంది అరాచకాలతో అమ్మాయిలు పడుతున్న ఇబ్బందుల గురించి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్కు సమాచారం వచ్చింది. వెంటనే విచారణ జరపమని స్రవంతిని పంపించారు. అక్కడికి వెళ్లిన స్రవంతి విద్యార్థినులతో మాట్లాడారు. ఎవరెవరు ఇబ్బంది పెడుతున్నారో తెలుసుకున్నారు. పదకొండు మంది అమ్మాయిలతో సంబంధిత ఉపాధ్యాయులు, సిబ్బందిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు ఇప్పించారు. దీంతో నలుగురిపై పోక్సో కేసులు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండుకు పంపించారు.ఎన్నో కేసులు...→ ఒకటో తరగతి చదువుతున్న ఆరేళ్ల పాప ఇంటి దగ్గర ఆడుకుంటుండగా ఇరవై ఏళ్ల యువకుడు మ్యూజిక్ నేర్పిస్తానంటూ తీసుకువెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న డీసీపీవో స్రవంతి పాప తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేసి పూర్తి వివరాలతో పోలీసు కేసు నమోదు చేయించారు. పాపకి వైద్యపరీక్షలు చేయించి పూర్తి వివరాలను కోర్టు ముందుంచారు. దీంతో ఈ కేసులో నిందితుడికి జీవితఖైదు పడింది. → ఒక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను అదే పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడు లైంగికంగా వేధించేవాడు. విషయం తెలిసిన స్రవంతి ఆ అమ్మాయికి, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేసి ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేయించారు. ఈ కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినందుకు గాను పది మందిపైనా పోక్సో కేసు నమోదు చేయించారు.→ ఒక అమ్మాయిపై అత్యాచారం జరిగిందని తెలియడంతో విచారణకు వెళ్లిన సందర్భంగా ఆ అమ్మాయి కడుపునొప్పితో బాధపడుతోంది. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహిస్తే గర్భవతి అని నిర్ధారణ అయ్యింది. డాక్టర్‌తో ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేశారు. కడుపులో పెరుగుతున్న పాప చనిపోగా డెలివరీ చేశారు. ఆ తరువాత అమ్మాయిని బాలసదనంలో చేర్పించి ఎంపీహెచ్డబ్లు్య కోర్సు పూర్తి చేయించారు. అయితే సొంత అన్నే పలుసార్లు అత్యాచారం చేయగా ఆ అమ్మాయి గర్భం దాల్చినట్టు తేల్చారు. ఈ కేసులో నిందితుడికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష పడింది.→ బాల్య వివాహాల విషయంలోనూ స్రవంతి సీరియస్‌గా పనిచేస్తున్నారు. బాల్యవివాహం చేయడానికి సిద్ధమవుతున్నారని తెలిస్తే తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. చిన్నతనంలో పెళ్లి జరిగితే తలెత్తే సమస్యలను వివరించి బాల్య వివాహాలు జరగకుండా కృషి చేస్తున్నారు.బాధితులు బయటికి చెప్పుకోలేకపోతున్నారుచైల్డ్ప్రొటెక్షన్ ఆఫీసర్‌గా నేను చేయాల్సిన బాధ్యతను నిర్వర్తిస్తున్నాను. ఇంటా, బయటా ఆడపిల్లలపై లైంగిక వేధింపులు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. చాలా కేసుల్లో కుటుంబ సభ్యులే నిందితులుగా ఉంటున్నారు. కన్నతండ్రి, తోడబుట్టిన అన్న, తండ్రి తర్వాత తండ్రిలాంటి బాబాయ్... ఇలా రక్తసంబంధీకులే కాటేయాలని చూస్తున్న సంఘటనలతో సమాజం ఎటు పోతోందో అర్థం కావడం లేదు. చాలా సందర్భాల్లో తమ సమస్యల గురించి బాధితులకు బయటకు చెప్పుకోలేకపోతున్నారు. విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని అనుకుంటున్నారు. కానీ అలాగే వదిలేస్తే వేధింపులు, అఘాయిత్యాలు మరింత పెరుగుతాయి. ప్రతిచోటా పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పిస్తున్నాం. – స్రవంతి, డీసీపీవో, కామారెడ్డి – ఎస్.వేణుగోపాలచారి, సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
Nidhi Tiwari: ప్రధానికి ప్రైవేట్ సెక్రటరీ
వ్యక్తిగత కార్యదర్శి బాధ్యత జటిలమైనది. బాస్ చెప్పింది అర్థం చేసుకుని చెప్పబోయేది గ్రహించి చెబుతున్నది అమలు చేయాలి. మరి ఆ బాస్ ప్రధాని అయితే?అలాంటి జటిలమైన బాధ్యతకు ఎంపికైంది నిధి తివారి. వారణాసికి చెందిన ఈ ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ పి.ఎం.ఓ.లో అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చారు. ఆమె వ్యక్తిత్వం, వ్యక్తిగత వివరాలు.వారణాసి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచుతున్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రజలు కూడా తమ రాష్ట్రానికి చెందిన అమ్మాయి ఈ స్థానానికి చేరిందే అని గర్వంగా చూస్తున్నారు. ప్రధానికి ప్రయివేట్ సెక్రటరీగా నియమితురాలైన నిధి తివారి సొంత ఊరు వారణాసి అయితే సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. మరి ఈ హర్షం సహజమే కదా. ఏ పార్లమెంట్ స్థానం నుంచి ప్రధానిప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ స్థానానికి చెందిన మహిళకే ప్రధాని ఈ అవకాశం ఇవ్వడం వారణాసి ప్రజలకు నచ్చింది. ప్రధాని రోజువారి కార్యక్రమాల సమన్వయం చూసే వ్యక్తిగా నిధి తివారి పని చేయడం అంటే సామాన్యమా? సన్నివేశం కొంచెం అటు ఇటుగా మనం సినిమాల్లో చూసినట్టే ఉంటుంది.ప్రధాని ముందు రోజు అడుగుతారు– ‘రేపటి నా కార్యక్రమాలు ఏమిటి?’నిధి తివారి చెప్తారు: ‘సర్.. ఫలానా శాఖకు చెందిన మంత్రి మిమ్మల్ని కలవడానికి వస్తారు. ఫలానా శాఖ డైరెక్టర్ వచ్చి నివేదిక అందజేస్తారు. ఫలానా కార్యక్రమంప్రారంభోత్సవానికి వెళతారు. అయితే ఈ కార్యక్రమాలు ఫిక్స్డ్ కాదు. ఇంత పెద్ద దేశంలో ఎన్నో తక్షణ సమస్యలు వస్తాయి. వివిధ రాష్ట్రాల నుంచి ప్రధానిని అర్జెంట్‌గా కలవాలని ముఖ్యమంత్రుల దగ్గరి నుంచి ఉన్నత అధికారులు, ప్రతిపక్ష నాయకులు, వ్యాపారవేత్తలు అపాయింట్మెంట్లు అడుగుతారు. దేశాల నుంచి ఆహ్వానాలు వస్తుంటాయి. వాటన్నింటినీ సమన్వయం చేసి, ప్రధాని ప్రాధాన్యాలు గమనించి కార్యక్రమాల రూపకల్పన చేయాల్సి ఉంటుంది. ఈ కత్తి మీద సాముకే నిధి తివారి ఎంపికైంది.ఎవరు ఈ నిధి?నిధి తివారి.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వ్యక్తిగత కార్యదర్శి (ప్రైవేట్ కార్యదర్శి)గా ఇటీవల ఆమె నియమితులవడంలో ‘పిఎంఓ’లో స్త్రీలప్రాధాన్యం పెరుగుతున్నదనడానికి మరో ఆనవాలుగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. 2022 నవంబర్ నుంచి ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్నున్న నిధి ఇప్పుడు ప్రధాన వ్యక్తిగత కార్యదర్శిగా ప్రమోట్ అయ్యారు. వారణాసిలోని మెహమర్‌గంజ్‌లో పుట్టి పెరిగిన నిధి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ చేశారు. ఆ యూనివర్సిటీలోనే పరిచయమైన దియోరియా జిల్లాకు చెందిన వైద్యుడు డా.సుశీల్ జైస్వాల్‌ను 2006లో వివాహం చేసుకున్నారు.పెళ్లి తర్వాత సివిల్స్సివిల్ సర్వీసెస్‌లో చేరి దేశానికి తనవంతు సేవ చేయాలనేది చిన్ననాటి నుంచి నిధి లక్ష్యం. ’వివాహం విద్య నాశాయ’ అన్న మాటను అబద్ధం చేస్తూ కష్టపడి చదివి, వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్ (కమర్షియల్ ట్యాక్స్) ఉద్యోగం సాధించారు. ఆ ఉద్యోగం చేస్తూనే సివిల్స్‌కి సన్నద్ధమయ్యారు. కొడుకు పుట్టినా ఆమె తన లక్ష్యం వీడలేదు. 2013 సివిల్స్ ఫలితాల్లో 96వ ర్యాంకు సాధించారు. ఐఎఫ్ఎస్ అధికారిణిగా 2016లో శిక్షణలో ఉన్న సమయంలోనే ఆమె చూపిన ప్రతిభకు గుర్తింపుగా ’అంబాసిడర్ విమల్ సన్యాల్ స్మారక పతకం’ అందుకున్నారు.మొదటి మహిళమోది ప్రధాని అయ్యాక ఈ 11 ఏళ్లలో వ్యక్తిగత కార్యదర్శులుగా వివేక్ కుమార్, హార్దిక్ సతీష్ చంద్ర షా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆ స్థానంలో నిధి తివారీ మొదటి మహిళగా నియమితులయ్యారు. ప్రధాని వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న ఆమెకు నెలకు రూ.1.44 లక్షల వేతనంతోపాటు ఇతర సదుపాయాలన్నీ అందుతాయి. ప్రతిభ, సామర్థ్యం ఉంటే స్త్రీల ఉన్నతికి ఆకాశమే హద్దు అని నిరూపించేందుకు నిధి తివారి మరో గొప్ప ఉదాహరణగా నిలిచారు.అజిత్ దోవల్ టీమ్లోప్రధానమంత్రి కార్యాలయంలో పని చేయడానికి ముందు ప్రభుత్వం ఆమెను విదేశీ వ్యవహారాల శాఖలో ’నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాలు’ (డిజార్మమెంట్ అండ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అఫైర్స్) విభాగంలో అధికారిగా నియమించింది. దాంతోపాటు రాజస్థాన్‌కు సంబంధించిన పలు అంశాలపైనా ఆమె పనిచేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆధ్వర్యంలో ఆమె చూపిన ప్రతిభ ఆమెపై గౌరవాన్ని పెంచింది. దేశ భద్రత, అణుశక్తి, విదేశీ వ్యవహారాల వంటి అంశాలను ఆమె చాకచక్యంగా నిర్వహించగలదన్న నమ్మకం కుదిరింది. ఆ తర్వాత 2023లో భారత్‌లో తొలిసారి జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో నిధి తివారీ చురుకుదనం, వ్యవహార శైలి, దీక్ష, పట్టుదలపై ప్రధానికి ఆమె మీద విశ్వాసం ఏర్పడింది. -
Ghibli AI trend జిబ్లీ..ట్రెండ్.. చిక్కులు తెలుసుకోండి!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘జీబ్లీ తరం’ కొనసాగుతుందా..? ఎప్పటికప్పుడు కృత్రిమ మేధ వేదికగా పుట్టుకొస్తున్న కృత్రిమ ఆవిష్కరణలే ఈ తరం ట్రెండ్‌గా మారుతున్నాయా..? రానున్న రోజుల్లో ప్రతీదీ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌పైనే ఆధారపడి పనిచేస్తుందా..? ఇలాంటి ప్రశ్నలకు అవుననే సమాధానాలు వస్తున్నాయి. విషయానికొస్తే.. గతంలో ఒక పోట్రేట్(ముఖ చిత్రం) వేయించు కోవాలంటే ఒక మంచి ఆరి్టస్టు దగ్గరికో, ఈ మధ్య కాలంలోనైతే ఆన్లైన్లోనే ఆర్టిస్టులకు ఆర్డర్ ఇస్తే వారే అందమైన చిత్రాన్ని వేసి ఇంటికి పంపించేవారు. అయితే కొన్ని రోజుల నుంచి జీబ్లీ ఏఐ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఓపెన్ ఏ1 సంస్థ తన చాట్ జీపీటీ–40 మోడల్లో ఈ కొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఈ ట్రెండ్ మరింత వేగంగా వ్యాపించింది. ప్రతి ఒక్కరూ తమ ఫొటోలను ఈ వేదికగా సబ్మిట్ చేసి క్షణాల్లో వారి జీబ్లీ ఫొటోలను పొంది.. సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరోపేస్బుక్, ఇన్‌స్టా, వాట్సాప్, ఎక్స్ వంటి సోషల్ మీడియా యాప్స్ వినియోగం పెరిగిన తర్వాత.. వ్యక్తిగత ఫొటోలను వివిధ సందర్భాలను మిత్రులు, తెలిసినవారికి పంచుకోవాలనే ఆసక్తి బాగా పెరిగిన విషయం విధితమే. అయితే.. మారుతున్న కాలానికి అనుగుణంగా అందంగా, వినూత్నంగా తమ ఫొటోలను చూసుకోవాలన్న కుతూహలం పెరిగింది. గతంలోనైతే నగరంలోని ట్యాంక్ బండ్ పైనో, అలా శిల్పారామంలోనో పోట్రేట్ వేసే కళాకారులు ఉండేవారు.. వారి వద్ద లైవ్‌గా వేయించుకునేవారు. కానీ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని.. వినూత్న, కళాత్మక యానిమేటెడ్ ఫొటోలు క్షణాల్లో వచ్చేస్తున్నాయ్.. ఇంకేముంది.. వెంటనే డౌన్లోడ్ చేసుకోవడం, షేర్లు, పోస్టులు చేయడం చకచకా జరిగిపోతున్నాయి. దీనికి సామాన్యులు మొదలు సెలబ్రెటీల వరకు మినహాయింపు లేకుండా వాడేస్తున్నారు. ఐతే ఇందులోనూ చిక్కులు లేకపోలేదు. ఈ ట్రెండ్‌లో ప్రైవసీ, కాపీరైట్ సమస్యలు లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాపీరైట్స్ మాత్రం జపాన్‌కు చెందిన స్టూడియో జీబ్లీ.. ప్రస్తుతం వైరల్‌గా మారిని జీబ్లీ ఫొటోలు.. చాట్‌జీపీటీలో సరికొత్త ఇమేజ్ జనరేషన్ ఫీచర్. కానీ ఈ ఫొటోలు జపాన్‌లో ప్రసిద్ధి పొందిన స్టూడియో జీబ్లీకి చెందిన యానిమేషన్ శైలిలోకి మారుస్తున్నాయి. ఈ ట్రెండ్‌తో కొన్ని ప్రైవసీ, కాపీరైట్ సమస్యలు తలెత్తే అవకాశముంది. వినియోగదారులు తమ వ్యక్తిగత ఫొటోలను యాప్ సాధనాలకు అప్లోడ్ చేస్తున్నప్పుడు ఆ డేటా నిల్వ చేస్తారు. విభిన్న విధాలుగా ఉపయోగించవచ్చనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రధానంగా స్టూడియో జీబ్లీ ప్రత్యేక శైలిని అనుకరించడంతో ఆ సంస్థ కాపీరైట్ హక్కుల ఉల్లంఘన జరుగుతుందా అనే చర్చ కూడా కొనసాగుతుంది. మిలియన్ల కొద్దీ మంది ఈ సాంకేతికతను ఒకేసారి వినియోగిస్తున్న నేపథ్యంలో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి సందర్భమే గతంలోనూ జరిగింది. ‘హ్యాపీ బర్త్ డే టూ యూ’ అంటూ ప్రతీఒక్కరి బర్త్ డే రోజు వాడుకునే ఈ పాట వార్నర్/చాపెల్ అనే మ్యూజిక్ పబ్లిషర్ది. అప్పట్లో ఇది కూడా వైరల్ కావడంతో దీనిపై కూడా కాపీరైట్ కేసు కూడా ఫైల్ చేశారు యాజమాన్యం. కానీ అనంతరం అధికారికంగా పబ్లిక్ డోమైన్లోకి ఉచితంగా అందుబాటులోకి వచ్చింది.ఇది అనైతికం..: హయావో మియాజాకి తమ సాంకేతికత శైలిని పోలిన కళాత్మక ఫొటోలను సృష్టించడం అనైతిక చర్యగా గతంలో స్టూడియో జీబ్లీ సహ వ్యవస్థాపకుడు హయావో మియాజాకి తెలిపారు. 2016లోనే ఏఐ ద్వారా సృష్టించబడిన చిత్రాలను జీవితానికే అవమానంగా ఆయన అభివరి్ణస్తూ ఈ కళపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఇలాంటి ఆధునిక సాంకేతికత వలన పెయింటింగ్, డ్రాయింగ్, పోట్రేట్ పెయింటింగ్ వంటి కళలపైన జీవనం సాగిస్తున్న కళాకారులకు కష్ట–నష్టాలను తెచ్చిపెడుతుంది. -
అద్భుతమైన నల్లేరు పచ్చడి : ఇలా ఎపుడైనా ట్రై చేశారా?
నల్లేరు (సిస్సస్ క్వాడ్రాంగులారిస్) దీని గురించి ఎపుడైనా విన్నారా? సాధారణంగా ఉడుతలు అవి కొరక్కుండా ఉండేందుకు ఈ నల్లేరు తీగను కూరగాయల పాదులపై పాకిస్తారు. ఈ రోజుల్లో నల్లేరు దాదాపుగా మరచిపోయారు గానీ దీని వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నల్లేరు పచ్చడి తింటే కొలెస్ట్రాల్ కరుగుతుంది. కీళ్ల నొప్పులకు చాలా బాగా పని చేస్తుందంటున్నారు నిపుణులు. ఎముకుల పుష్టికి, విరిగిన ఎముకలు అతకడానికి, ఎముకలు గుల్లబారకుండా ఉండడానికి కీళ్ల సందుల్లోని ఇన్ఫ్లమేషన్ను, వాపును తగ్గించడానికి అట్లు వేసుకుని తింటే దగ్గు కూడా తగ్గుతుంది. మరి నల్లేరు పచ్చడి తయారీ విధానం ఎలాగో చూద్దాం.ఆంగ్లంలో వెల్డ్ గ్రేప్ అని ,హిందీలో హడ్జోరా , తెలుగులో నల్లేరు అని పిలుస్తారు. సంస్కృతంలో, దీనిని కవితాత్మకంగా వజ్రంగి, వజ్రవల్లి అని పిలుస్తారు. అంటే వజ్రం అంత బలమైనది అని దీని అర్తం. నల్లేరు తీగలోని ప్రతి భాగాన్ని వివిధ ఔషధాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారని ఆయుర్వేద గ్రంథాల ద్వారా తెలుస్తోంది. ఇందులొ విటమిన్ సీ, నీరు, ఫైబర్ కంటెంట్ ఎక్కువ.నల్లేరు పచ్చడి కావాల్సినవితరిగిన 10 నల్లేరు కాడలు అర కప్పు వేరుశెనగలు , చింతపండు , నాలుగు ఎండు లేదా పచ్చి మిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు 1 టీస్పూన్, కొద్దిగా కొత్తిమీర పచ్చడి తయారీ తీగ నుంచి నల్లేరు కాడలను కోసేముందు చేతికి ఆయిల్ రాసుకోవాలి. ఒట్టి చేతులతో తీస్తే దురద వస్తుంది. నల్లేరు లేత కాడలను తీసుకోవాలి. వాటి ఈనెలను తీసి చిన్న చిన్నముక్కలుగా కట్ చేసుకోని, ఉప్పు నీటిలో శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత ఒక బాణలిలో నూన్ వేసి నల్లేరు ముక్కలను వేయించుకోవాలి. బాగా వేగిన తరువాత, కొద్ది శనగపప్పు, వేరుశనగలు, పచ్చిమిరప లేదా ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ఒక టమాటా వేసి వేయించుకోవాలి. దీన్ని కొత్తగా చింతపండు కలిపి మెత్తగా రోట్లో రుబ్బుకోవాలి. దీన్ని తాజా కరివేపాకు, పోపు గింజలు వేసి పోపు పెట్టుకుంటే కమ్మటి నల్లేరు పచ్చడి రెడీ. దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆహా అనాల్సిందే. దోస, రోటీలో కూడా నంజుకోవచ్చు.నల్లేరుతో ఇతర వంటలునల్లేరు తీగలోని లేత కణుపులు కోసి వాటి నారను తీసి పచ్చడి, పప్పు, కూర చేసుకుంటారు. దీనిని కాడలతో పులుసు చేసుకొని చాలా ప్రాంతంలో తింటారు.నల్లేరుతో లాభాలు వీటి కాడల్ని శుభ్రం చేసి నీడలో ఎండబెట్టి దంచి పొడిగా చేసుకుని భద్రపరచుకొని, వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే నడుము నొప్పి, కీళ్ల నొప్పులు తగ్గిపోతాయని ఆయుర్వేదం నిపుణులు చెబుతున్నారు. నల్లేరు కాడలతో చేసిన పొడిని రోజూ తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చునల్లేరులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపులను తగ్గిస్తాయి. నల్లేరు ఆస్పిరిన్ వలె ప్రభావవంతంగా పనిచేస్తుంది.రక్తహీనత నివారణలో సహాయపడుతుంది.నల్లేరు బహిష్టు సమస్యలకు చక్కటి పరిష్కారంనల్లేరులో పీచు పదార్థం యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ ,యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.ఇదీ చదవండి: రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిపోయింది.. ఎవరీ ఐపీఎల్ గర్ల్? -
డిజిటల్ గైడ్‌బుక్ 'గోవా అన్‌సీన్'ను ఆవిష్కరించి ఎయిర్‌బీఎన్‌బీ
భారతదేశంలో అత్యంత ఇష్టమైన హాలిడే స్పాట్. రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా గోవా పర్యాటక శాఖ భాగస్వామ్యంతో ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb) రాష్ట్రంలోని సాంస్కృతిక మరియు వారసత్వ ప్రదేశాలను హైలైట్ చేసే డిజిటల్ గైడ్‌బుక్ 'గోవా అన్‌సీన్'ను ఆవిష్కరించింది. గోవా పర్యాటక శాఖతో సహకారంతో 'రీడిస్కవర్ గోవా' ప్రచారం, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా దీన్ని తీసుకొచ్చింది. ఇందులో గోవాలోని ప్రసిద్ధ బీచ్‌లు , నైట్ లైఫ్‌లకు సంబంధించిన ఎన్నో తెలియనవి వివరాలను విశేషాలను పొందుపర్చింది.గోవా ప్రభుత్వ పర్యాటక శాఖ గౌరవ మంత్రి శ్రీ రోహన్ ఖౌంటే, ఎయిర్బిఎన్బి కంట్రీ హెడ్ అమన్‌ప్రీత్ సింగ్ బజాజ్ నటుడు అభయ్ డియోల్ సమక్షంలో ఈ గైడ్‌బుక్‌ను ఆవిష్కరించారు. పర్యాటకుల సౌకర్యార్థం ఈ ‘గోవా అన్‌సీన్’గైడ్ బుక్‌లో చెఫ్‌లు, ట్రావెల్ రైటర్లు , కళాకారులతో సహా స్థానిక నిపుణుల అభిప్రాయాలను కూడా ఇందులో ఉన్నాయి. గోవా సంప్రదాయాలు, ప్రత్యేకమైన పాక అనుభవాలు కూడా ఈ డిజిటల్గైడ్బుక్లో లభ్యం. పాకశాస్త్ర విద్వాంసుడు అవినాష్ మార్టిన్స్, ఫుడ్ రైటర్, నోలన్ మస్కరెన్హాస్, కళాకారుడు , కంటెంట్ సృష్టికర్త సిద్ధార్థ్ కెర్కర్, గోవాగెట్టర్ వ్యవస్థాపకుడు గర్వ్ వోహ్రా, ట్రావెల్ రైటర్ ఇన్సియా లాసెవాల్లా ,టీవీ హోస్ట్ మరియు కంటెంట్ సృష్టికర్త స్కార్లెట్ రోజ్ అనుభవాలు, సిఫార్సులతో దీన్ని తీసుకొచ్చారు.గోవా పర్యాటక శాఖతో భాగస్వామ్యంతో ‘రీడిస్కవర్ గోవా’ , ‘గోవా అన్‌సీన్’ వంటి కార్యక్రమాల ద్వారా, రాష్ట్ర గొప్ప సాంస్కృతిక వారసత్వం, డైనమిక్ కమ్యూనిటీలు, ప్రత్యేకమైన వసతిని ప్రదర్శించడానికి కృషి చేస్తున్నామని హోమ్ స్టే బుకింగ్ వెబ్సైట్ ఎయిర్బిఎన్బి ఇండియా , ఆగ్నేయాసియా దేశ అధిపతి అమన్‌ప్రీత్ సింగ్ బజాజ్ తెలిపారు. “ రడిస్కవర్ గోవా 2.0 ప్రచారం & గోవా అన్‌సీన్ గైడ్‌బుక్ ఆవిష్కారంపై మాట్లాడుతూ , పర్యాటకం గోవా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక, ,పునరుత్పాదక పర్యాటక అభివృద్ధి ద్వారా ప్రయోజనాలు స్థానిక వ్యాపారాలు, సంఘాలు మరియు కొత్త తరం వ్యవస్థాపకులకు చేరేలా నిర్ధారిస్తుందని గోవా ప్రభుత్వ పర్యాటక శాఖ గౌరవ మంత్రి రోహన్ ఖౌంటే వ్యాఖ్యానించారు. ముఖ్యంగా గ్రామీణ గోవాలో హోమ్‌స్టేలను ప్రోత్సహించడం ద్వారా మహిళలు, యువతకు సాధికారత కల్పించాలన్ని భావిస్తున్నట్టు వెల్లడించారు. https://news.airbnb.com/wp-content/uploads/sites/4/2025/03/Airbnb-Goa-Unseen-Guide.pdf -
సమస్యలే సాఫల్యానికి సోపానాలు
ఒక ఊరిలో జలాలుద్దీన్ అని ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి కుటుంబం పెద్దది కావడంతో ఇల్లు ఏమాత్రం సరిపోయేది కాదు. చివరికి ఒకరోజు మసీదులో ఉన్న ధార్మిక గురువు దగ్గరికెళ్ళి ఉపాయం చెప్పమని ప్రాధేయపడ్డాడు. సావధానంగా విన్న గురువు.. ‘నువ్వొక కోడిని తీసుకువెళ్ళి మీతోపాటే ఇంట్లో ఉంచుకో. నీ సమస్య తీరిపోతుంది.’ అన్నాడు.ఆ వ్యక్తి కోడిని కొనుక్కొని వెళ్ళాడు. తమతోపాటే దాన్ని ఇంట్లో ఉంచాడు. అలా వారం గడిచింది. కాని పరిస్థితిలో మార్పు రాలేదు. పైగా సమస్య పెరిగిందే తప్ప తగ్గలేదు. ఆ వ్యక్తి మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళాడు. ‘‘అయ్యా.. మరికాస్త ఇబ్బంది ఎక్కువైంది’’ అని మొర పెట్టుకున్నాడు. ‘‘ఈసారి ఒక మేకను తీసుకువెళ్ళు. దాన్నీ మీతోపాటే ఇంట్లో ఉంచు. మళ్ళీ వారం తరువాత వచ్చి కలువు’ అన్నాడు గురువు.ఆ వ్యక్తి మేకను కొనుక్కొని తీసుకువెళ్ళాడు. ఈసారి సమస్య మరింత తీవ్రరూపం దాల్చింది. గురువు దగ్గరికి వెళ్ళి గోడు వెళ్ళబోసుకున్నాడు. అతను చెప్పినదంతా విని.. ‘ఇప్పుడు నువ్వు ఒక గాడిదను తీసుకు వెళ్ళు.. దాన్నీ మీతోనే ఇంట్లోనే ఉంచు. నీకు శుభం కలుగుతుంది’ అన్నాడు. గురువు మాటమీద గాడిదను తెచ్చిన తరువాత ఇల్లు నరకం అయిపోయింది. ఇంట్లో వాళ్ళకే కాదు, ఆ వీధి వీధంతా అల్లకల్లోలం మొదలైంది. ఏడవరోజు గాడిదతో పడిన నరక బాధను చెప్పుకొని కన్నీరు మున్నీరయ్యాడు. అప్పుడు గురువు ‘సరే.. నువ్వు ఇంటికెళ్ళి కోడిని కోసి వండుకొని తిను. వారం తరువాత వచ్చి కలువు.’ అని చెప్పాడు. ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి ఆరోజు కోడి కూర వండాడు. వారం తరువాత వెళ్ళి గురువుని కలిశాడు. ‘అయ్యా.. సమస్య అయితే తీరలేదు కాని, కాస్తంత పరవాలేదు.’ అన్నాడు. ‘ఈసారి మేకను కోసి విందు చేసుకోండి. మీ వీధి వారిని కూడా విందుకు పిలవండి.’ అని పురమాయించాడు. ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి గురువు చెప్పినట్టే చేసి వారం తర్వాత సంతోషంగా.. ‘‘ఇప్పుడు పరిస్థితి మెరుగు పడింది.’ అని చెప్పాడు. అప్పుడు గురువు, ‘‘నువ్వు గాడిదను సంతలో అమ్మెయ్ ..’ అని సలహా ఇచ్చారు. ఆ వ్యక్తి గాడిదను సంతలో అమ్మేసి ఇంటికి వెళ్ళాడు. వారం ప్రశాంతంగా గడిచింది. గురువు చేసిన ఉపదేశాల్లోని మర్మం అర్థమైంది. ‘అంతా అల్లాహ్ అనుగ్రహం గురువు గారూ..ఇప్పుడు పరమ సంతోషంగా ఉంది. ఇల్లు విశాలమై పోయింది.’ చెప్పాడు పరమానందంగా..!– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ట్రంప్ సుంకాల మోత, సోషల్ మీడియాలో మీమ్స్ హోరు మాములుగా లేదు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దాదాపు అన్ని దేశాలపై నా టారిఫ్స్ కొరడా ఝుళిపింఆడు. దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై "రెసిప్రోకల్ టారిఫ్స్" (Reciprocal Tariffs) విధించడం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అన్ని దేశాల వారూ తమ ఉత్పత్తులను అమెరికా మార్కెట్లో విక్రయించుకోవచ్చని.. అయితే కనీసం 10శాతం పన్నులు(Tariffs) చెల్లించాల్సింది ఉంటుందని ప్రకటించారు. భారత్ నుంచి దిగుమతి వస్తువులపై 26శాతం, చైనా నుండి వచ్చే వస్తువులపై 34 శాతం పన్ను విధించారు. దీంతో చైనా మొత్తం పన్నుల శాతం 54 శాతానికి చేరింది. ఇక సౌత్ కొరియాపై 25 శాతం యూరోపియన్ యూనియన్ నుండి వచ్చే వస్తువులపై 20 శాతం పన్ను విధించారు. యూకే వచ్చే వస్తువులపై 10 శాతం పన్ను విధించారు. ట్రంప్ తాజా ప్రకటనపై పలు దేశాధినేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు కూడా. మరోవైపు ట్రంప్ వడ్డింపులపై సోషల్‌మీడియాలో మీమ్స్ వెల్లువెత్తాయి.అమెరికా ఆర్థిక వ్యవస్థను రక్షించడానికి, వృద్ధికోసం దాని మిత్రదేశాలు సహా దాదాపు అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలను విధించారు ట్రంప్. ఎవరూ ఆపలేని ఆర్థిక యుద్ధం జరుగుతోందంటూ జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించి, సుంకాలను ప్రకటించిన వెంటనే #TrumpTariffs , #TradeWar ఎక్స్( X)లో ట్రెండింగ్ షురూ అయింది. Happy Liberation Day! Thanks Trump for ensuring that we become liberated from our money. I personally will miss being able to buy food. So when Trump said he was going to make America great again, I guess he meant he was gonna take us back to the Great Depression? #trumptariffs— Meredith (@meralee727) April 2, 2025 చదవండి: రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిపోయింది.. ఎవరీ ఐపీఎల్ గర్ల్?"విముక్తి దినోత్సవ శుభాకాంక్షలు! మన డబ్బు నుండి మనం విముక్తి పొందేలా చేసినందుకు ట్రంప్ ధన్యవాదాలు. ఇకనాకు బువ్వ ఉండదు. అమెరికా గ్రేట్ ఎగైన్ అంటే మనల్ని తిరిగి మహా మాంద్యంలోకి తీసుకెళ్లడం అని అనుకున్నాడనుకుంట’’ అని ఒకరు ట్వీట్ చేశారు. జపాన్ ఎగుమతులపై 24 శాతం సుంకాలు విధించినందుకు ట్రంప్‌ను విమర్శిస్తూ,"సరైన మనస్సు గల జపనీస్ వ్యక్తి అమెరికన్ కారును ఎందుకు కొనుగోలు చేయాలి?" అని ప్రశ్నించారు.Happy Liberation Day! Thanks Trump for ensuring that we become liberated from our money. I personally will miss being able to buy food. So when Trump said he was going to make America great again, I guess he meant he was gonna take us back to the Great Depression? #trumptariffs— Meredith (@meralee727) April 2, 2025 చదవండి: సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియోఅంతేకాదు ఈ సుంకాల నుండి రష్యాను మినహాయించినందుకు నెటిజన్లు ట్రంప్‌ను కూడా ఎగతాళి చేశారు. "ట్రంప్ రష్యాపై విధించిన సుంకాలు లేదా ఆర్థిక చర్యలు లేవు. నాకు ఎందుకు ఆశ్చర్యంగా ఉంది" అంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నవ్వుతూ ఉన్న జిఫ్‌ను ట్విట్ చేశాడు. "ట్రంప్స్టర్స్ శుభవార్త! మీ కిరాణా సామాగ్రికి ఎంత మిగులుతుందో గుర్తించడం కష్టం.. ఎందుకంటే మిగతాటికి ఖర్చులు మరింత భారం అవుతాయి కనుక’’ అంటూ మరొక యూజర్ ట్రంప్ సుంకాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. -
రాత్రికి రాత్రే సెన్సేషన్‌గా మారిపోయింది.. ఎవరీ ఐపీఎల్ గర్ల్?
సోషల్ మీడియాలో పుణ్యమా అని క్షణాల్లో వైరల్ అయిపోతున్నారు. సరైన సామర్థ్యం ఉండాలేగానే డిజిటల్ మాద్యమంతో అందరి దృష్టినీ ఆకర్షించవచ్చు. డిజిటల్ ఎరా పవర్ అలాంటిది మరి. కన్నుమూసి తెరిచే లోపే వైరల్ కంటెంట్‌తో సోషల్ మీడియా సూపర్స్టార్లుగా మారిపోతున్నారు. చెన్నైసూపర్ కింగ్స్ వీరాభభిమాని 19 ఏళ్ల అమ్మాయి ఆర్యప్రియ భుయాన్ విషయంలో కూడా అదే జరిగింది. సీఎస్కే రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ (IPL) మ్యాచ్ (RR vs CSK) లో ఈ అమ్మడి హావభావాలు, ఆమె రియాక్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని అవుట్‌కు ఆమె ఇచ్చిన రియాక్షన్‌తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. దెబ్బకి ఈ ఐపీఎల్ పాపులర్ గర్ల్ రాత్రికి రాత్రే లక్షల ఫాలోయర్లను సంపాదించుకుని సంచలనంగా మారింది. పూర్తి వివరాలు తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.ఆర్యప్రియ తన హావభావాలతో మిలియన్లకొద్దీ అభిమానులను సంపాదించుంది. కొన్ని సెకన్ల క్లిప్‌తో సూపర్ వైరల్ అయిన ఐపీఎల్ అమ్మాయి ఎవరు? ఆర్యప్రియ భుయాన్ (Aaryapriya Bhuyan) గౌహతికి చెందిన 19 ఏళ్ల టీనేజర్. మహేంద్ర సింగ్ ధోనికి వీరాభిమాని. ఆర్యప్రియ సోదరి ఆమెను 9-10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు సీఎస్కే, ధోనిని పరిచయం చేసింది. అంతే అప్పటినుంచి సీఎస్కే అన్నా, మన మిస్టర్ కూల్ అన్నా పిచ్చి అభిమానం అట.చదవండి: సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియో ధోనీ ఔట్ : ఏం జరిగిందంటే?చెన్నై-రాజస్థాన్ మ్యాచ్‌లో చెన్నై మాజీ కెప్టెన్ ధోనీ కొట్టిన షాట్ ను లాంగ్ఆన్ లో ఫీల్డర్ అద్భుతంగా క్యాచ్ చేశాడు. చెన్నై గెలుపునకు కీలకమైన సమయంలో ధోనీ ఔట్ కావడంతో అభిమానులను నిరాశపర్చింది. ఈక్రమంలో స్టేడియంలోని ఆర్యప్రియ కూడా నిర్ఘాంతపోయింది. ‘అరె ఏంట్రా ఇది’ అన్నట్టు ఫీలింగ్స్ ఇచ్చింది. క్యాచ్ పట్టుకున్న క్రికెటర్ని చంపేద్దామన్నంత ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఈ మేరకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆర్ఆర్ వర్సెస్ సిఎస్కె మ్యాచ్ సమయంలో తనను టీవీలో చూపించారని ఆర్యప్రియకు తెలియదు కానీ వైరల్ ఐపీఎల్ గర్ల్ అభిమానులు అమాంతం పెరిగారు. అప్పటివరకు 800 ఉన్న ఫాలోవర్ల సంఖ్య 1.72K లక్షలకు పెరిగింది. కొందరు ఈ వీడియోను వాట్సాప్ స్టేటస్‌లో షేర్ చేశారు. మరికొందరు క్రష్ అంటూ కమెంట్ చేశారు. వైరల్ వీడియోతో ఆమె సోషల్ మీడియా స్టార్‌గా, 'మీమ్ గర్ల్'గా మారిపోయింది.#IPL cameramen supremacy 🤩🤩#Dhoni Fan Girl reaction when #dhoni got out 🥲Chooo cute 🥰🥰🥰#CSKvsRR #RRvCSK #IPL2025 #IPL #IPLOnJioStar pic.twitter.com/7hbhMkh7hr— 𝑅𝒶𝓃𝓃𝒱𝒥💫 (@Rannvijju) March 31, 2025ఆర్యప్రియ ఏమందంటే..తాను సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా లేనని, కొన్ని వందల మంది ఫాలోవర్లు మాత్రమే ఉన్నారని, అప్పుడపుడు జస్ట్ ట్రావెల్ ఫోటోలు మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎంఎస్ ధోని వికెట్‌పై తన స్పందనను చూపించే ఆమె వీడియో వైరల్ అయిన తర్వాత రాత్రికి రాత్రే లక్షలకు పెరిగిందని నేషనల్ మీడియాతో చెప్పింది. ధోని అవుట్ అవుతాడని అస్సలు ఊహించలేదు... ధోని క్యాచ్ అవుట్ అవ్వగానే షాక్ అయ్యా..అందుకే అలాంటి రియాక్షన్ వచ్చింది. ఇది యాదృచ్చికంగా వచ్చింది అంతే అది వైరల్ అయిందని ఆర్యప్రియ పేర్కొంది. ప్రస్తుతానికి దీనిపై తాను, తన కుటుంబం సంతోషంగా ఉన్నామని తెలిపింది. -
భల్లే భల్లే.. పంజాబీ ఫుడ్ ఫెస్టివల్
నగరం విభిన్న సంస్కృతులకు నిలయమే కాకుండా ఆహార వైవిధ్యానికి కూడా కేంద్రంగా నిలుస్తోంది. దీనికి ప్రతిగా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన విభిన్న ప్రాంతాలకు చెందిన వంటకాలు నగరంలో అలరిస్తుంటాయి. ఇందులో భాగంగానే సికింద్రాబాద్‌లోని రాయల్ రెవ్ హోటల్ వేదికగా ప్రతిష్టాత్మక పంజాబీ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. పంజాబ్ సంప్రదాయ పంటల పండుగ ‘పంజాబీ ఫుడ్ ఫెస్టివల్‘ను అమృత్సర్ గ్యాస్ట్రోనమికల్ యాత్రలో భాగంగా ఈ నెల 4 నుంచి 13వ తేదీ వరకు రాయల్ రెవ్ హోటల్, లాజీజ్ మల్టీక్యూసిన్ రెస్టారెంట్ వేదికగా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. దీనికి సంబంధించి బుధవారం రాయల్ రేవ్ హోటల్ వేదికగా పంజాబీ పసందైన వంటకాలతో ప్రముఖ పంజాబీ మాస్టర్ చెఫ్ రాజుసింగ్ సోన్వాల్ ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేకంగా రూపొందించిన మెనూలో మటన్ బెలిరామ్, రారా మటన్, సాగ్ మీట్, తందూరీ కుక్కడ్, కుక్కడ్ మఖన్వాలా, మచ్లీ టిక్కా, మచ్లీ అమృత్సరి వంటి మాంసాహార వంటకాలు ఉన్నాయన్నారు. శాఖాహారులు పనీర్ టిక్కా జలంధరి, పెథివాలి టిక్కీని ఆస్వాదించవచ్చు. వీటితో పాటు మరెన్నో అందుబాటులో ఉన్నాయన్నారు. చదవండి:35 ఏళ్ల నాటి డ్రెస్‌తో రాధికా మర్చంట్ న్యూ లుక్...ఇదే తొలిసారి!సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియో -
రాముని గుణగణాలను అలవరచుకుందాం!
మానవాళి సంక్షేమం కోసం సహజయోగాన్ని ఆవిష్కరించిన పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి దేశ విదేశాలలో ఇచ్చిన అనేక ప్రవచనాలలో శ్రీ రాముని గుణ గణాలను, లక్షణాలను, ఆయన వ్యక్తిత్వం నుండి మనం నేర్చుకుని, వాటిని మనలో అంతర్గతంగా స్థిరపరచుకొని వ్యక్తీకరించుకోవలసిన అవశ్యకతను గురించి విశదీకరించారు.శ్రీరాముడు పుడమిపై అవతరించినప్పుడు విశ్వ విరాట్‌లో కుడిపార్శ్వం అభివృద్ధి చెందడానికి దోహద పడింది. తేత్రాయుగంలో రాక్షసుల నుండి, దుష్ట శక్తుల బారి నుండి తన భక్తులను, ప్రజలను సంరక్షించడానికి శ్రీ విష్ణువు తీసుకున్న అవతారమే శ్రీ రాముడు. ఆ కాలంలోనే రాజుల రాజ్యాధిపత్యం మొదలయ్యి అన్నిటికన్నా మిన్నగా ప్రజాభీష్టానికి ప్రాధాన్యత ఇవ్వడం ్ర΄ారంభమయ్యింది. ప్రజల కొరకు, మానవాళి యొక్క అభివృద్ధి కొరకు రాజు మంచితనాన్ని, ప్రేమ తత్వాన్ని కలిగి వుండాలని నిర్ణయించబడింది. నాయకుడైన రాజు ఎంత త్యాగం చేయడానికైనా సిద్దపడాలి. అది శ్రీరామునితోనే మొదలయ్యింది. నేటి సమస్త ప్రజానీకం కోరుకున్న ఋజు ప్రవర్తన, మంచితనం శ్రీ రామునిగా అవతరించాయి. ప్రభువు అనే వాడు శ్రీ రామునిగా వుండాలని కోరుకున్నారు. మంచితనం గురించి, రాజ ధర్మం గురించి కేవలం చెప్పడమే కాదు, దానిని ఆచరించి చూపించిన ఆదర్శవంతమైన రాజు. శ్రీ రాముడు అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఒక ఆదర్శవంతమైన తండ్రిగా, ఆదర్శవంతమైన భర్తగా, ఆదర్శవంతమైన కొడుకుగా, ఆదర్శవంతమైన రాజుగా, మర్యాద పురుషోత్తముడుగా ఇతిహాసంలో చెప్పుకోబడుతున్నాడు.అగస్త్య మహాముని రచించిన శ్రీ రామ రక్షా కవచంలో శ్రీ రాముని గుణగణాల గురించి ఇలా వర్ణించడం జరిగింది.ఆయన ఆజానుబాహుడు. చేతులలో ధనుర్బాణాలు ధరించి, పీతాంబరధారుడై సింహాసనంపై ఆసీనుడై వుంటాడు. ఆయన పద్మదళాయతాక్షుడు. తన ఎడమ పార్శ్వమున కూర్చున్నసీతాదేవిని చూస్తూమందస్మిత వదనార విందుడై మనకు కనిపిస్తాడు. అతని యొక్క మేని రంగు లేత నీలిరంగు ఛాయతోనూ, నేత్రములు తామర పుష్ప రేకులవలే పెద్దవిగా వుండి, ఇతరులకు ఆనందమును చేకూరుస్తుంటాయి. ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో విల్లు, వీపున అంబుల పొదితో దుష్ట సంహారం కొరకు సదా సన్నద్ధుడై ఉంటాడు.ఆయన జనన మరణాలకు అతీతుడు. అపార శక్తిమంతుడు. దుష్ట శక్తులన్నిటిని నాశనపరచి, మన కోరికలన్నిటినీ నెరవేర్చే సామర్ధ్యం కలవాడు శ్రీ రాముడు. తానొక అవతార పురుషుడునని గానీ, అవతార మూర్తినని గానీ ఎక్కడా ప్రకటించుకోలేదు. శ్రీ రాముని సుగుణాలలో మరొకటి ఏమిటంటే తను ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడం. ఆ లక్షణాన్ని మనలో కూడా స్థిరపరచు కోవాలి. ఇచ్చిన మాట తప్పించుకోవడానికి ఏవేవో కుంటిసాకులు వెతికి తప్పించుకోకూడదు. ఆయనకున్న మరో సుగుణం – అవతలివారి హృదయాన్ని నొప్పించే విధంగా మాట్లాడక ΄ోవడం. దీనినే సంకోచమని అంటారు. మానవ అంతర్గత సూక్ష్మ శరీరంలో అంగాంగమునందు, చక్రాలలోనూ, నాడులలోనూ దేవీదేవతలు కొలువై వున్నారు. కుండలినీ జాగృతి ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు వారిని, వారి లక్షణాలను మనలో జాగృతి పరచుకోవచ్చును. అలా సీతా సమేతుడైన శ్రీరాముడు మన హృదయంలోని కుడి పార్శ్వం వైపు ఆసీనులై వుంటాడు. ఆత్మ సాక్షాత్కారం పొంది సహజయోగ సాధన చేస్తున్న వారిలో మర్యాద పురుషోత్తమునిగా, ఆదర్శవంతమైన తండ్రిగా, శ్రీరాముని లక్షణాలు జాగృతి చెంది ప్రతిబింబిస్తూ వుంటాయి. ఆయన మనలోని ఊపిరి తిత్తులను పరిరక్షిస్తూ వుంటాడు. ఎవరితో ఎప్పుడు, ఎలా సంభాషించాలో మనం ఆయన దగ్గరనుండి నేర్చుకోవాలి. తన పరిమితులు, హద్దులు, శ్రీ రామునికి బాగా తెలుసు. వాటిని ఆయన ఎప్పుడూ అతిక్రమించలేదు. దేశాన్ని పరిపాలించే పరిపాలకుడు ఎలా వుండాలనేది రామరాజ్యం నుండే నేర్చుకుంటారు.మర్యాద పురుషోత్తముడైన శ్రీ రాముని శ్రీ రామ నవమి పర్వదినాన బాహ్య పరంగా పూజించుకోవడమే కాకుండా అతని గుణగణాలను, వ్యక్తిత్వాన్ని సహజ యోగ సాధన ద్వారా మనలో పొందు పరచుకుని అభివ్యక్తీరించుకోవటం అవసరం. – డా. పి. రాకేష్(పరమపూజ్య మాతాజీ శ్రీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా) -
600 ఏళ్ల చరిత్రగల పుణ్యక్షేత్రం, అన్నీ విశేషాలే!
కలియుగ వైకుంఠంగా, తెలంగాణ తిరుపతిగా, కొలిచిన వారికి కొంగు బంగారమై విరాజిల్లుతోంది మహబూబ్‌నగర్ జిల్లాలోని పేరెన్నికగన్న శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి దేవస్థానం. ఆర్థిక స్థోమత లేని భక్తులు మన్యంకొండకు వెళ్లి స్వామివారిని దర్శించుకున్నా, తిరుపతికి వెళ్లిన ఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం. తిరుపతిలో మాదిరిగానే మన్యంకొండలో స్వామివారు గుట్టపై కొలువుదీరగా దిగువకొండవద్ద అలమేలు మంగతాయారు కొలువుదీరి ఉన్నారు. దేవస్థానం సమీపంలో మునులు తపస్సు చేసినందువల్ల మునులకొండ అని పేరు వచ్చింది. అదే కాలక్రమేణా మన్యంకొండగా మారింది. మహబూబ్‌నగర్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో రాయిచూర్ అంతర్రాష్ట్ర రహదారి పక్కన ఎత్తైన గుట్టలపై మన్యంకొండ దేవస్థానం కొలువుదీరింది. 600 సంవత్సరాల చరిత్రగల ఈ దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల పాలిట కల్పతరువుగా భాసిల్లుతోంది. తవ్వని కోనేరు, చెక్కని పాదాలు, ఉలి ముట్టని స్వామి... ఈ దేవస్థానం ప్రత్యేకం. దేవస్థానం చరిత్ర...పురాణ కథనం ప్రకారం... దాదాపు 600 సంవత్సరాల క్రితం తమిళనాడులోని శ్రీరంగం సమీపంలోగల అళహరి గ్రామ నివాసి అళహరి కేశవయ్య కలలో శ్రీనివాసుడు కనిపించి కృష్ణానది తీర్ర ప్రాంతంలోగల మన్యంకొండపై తాను వెలిసి ఉన్నానని, కావున నీవు వెంటనే అక్కడికి వెళ్లి నిత్య సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించి అంతర్థానం అయ్యారట. దాంతో అళహరి కేశవయ్య తమ తండ్రి అనంతయ్యతోపాటు కుటుంబ సభ్యులతో కలిసి మన్యంకొండ సమీపంలోగల కోటకదిరలో నివాసం ఏర్పరుచుకొని గుట్టపైకి వెళ్లి సేవ చేయడం ప్రారంభించారు. కేశవయ్య దక్షిణాదిగల అన్ని దివ్యక్షేత్రాలూ తిరిగి తరించడం ప్రారంభించారు. అందులో భాగంగానే ఒకరోజు కృష్ణానదిలో స్నానం చేసి సూర్యభగవానునికి నమస్కరించి దోసిలితో ఆర్ఘ్యం వదులుతుండగా శిలారూపంలోగల వెంకటేశ్వరస్వామి ప్రతిమ వచ్చి కేశవయ్య దోసిలిలో నిలిచింది. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి మన్యంకొండపై శేషషాయి రూపంలోగల గుహలో ప్రతిష్టించి నిత్య ధూప దీప నైవేద్యాలతో స్వామిని ఆరాధించడం ప్రారంభించారు. వీటితోపాటు దేవస్థానం మండపంలో ఆంజనేయస్వామి, గరుడాళ్వార్ విగ్రహాన్ని కూడా ప్రతిష్టించారు. ఈ దేవస్థానం ఎదురుగా ఉన్న గుట్టపై అప్పట్లో మునులు తపస్సు చేసినట్లుగా చెప్పుకుంటున్న గుహ ఉంది. కీర్తనలతో ఖ్యాతి... అళహరి వంశానికి చెందిన హనుమద్దాసుల వారి కీర్తనలతో మన్యంకొండ ఖ్యాతి గడించింది. హనుమద్దాసుల వారు దాదాపు 300 కీర్తనలు రచించారు. ఈ కీర్తనలు దేవస్థానం చరిత్రను చాటిచె΄్పాయి. హనుమద్దాసుల తర్వాత ఆయన వంశానికి చెందిన అళహరి రామయ్య దేవస్థానం వద్ద పూజలు ్ర΄ారంభించారు. వంశ΄ారంపర్య ధర్మకర్తగా ఉండడంతో΄ాటు దేవస్థానం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు.విశేషోత్సవాల రోజు స్వామివారికి వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ప్రతి శనివారం తిరుచ్చిసేవ, ప్రతి పౌర్ణమికి స్వామివారి కళ్యాణమహోత్సవాన్ని నిర్వహిస్తారు. స్వామికి ప్రీతి పాత్రమైన నైవేద్యం దాసంగం. భక్తులు స్వామివారికి దాసంగాలు పెట్టి నైవేద్యాలు సమర్పిస్తారు. నిత్యకల్యాణం.. పచ్చతోరణం...మన్యంకొండ దిగువ కొండవద్ద శ్రీ అలివేలు మంగతాయారు దేవస్థానం ఉంది. ప్రతి సంవత్సరం అమ్మవారి సన్నిధిలో కొన్ని వందల వివాహాలు జరుగుతాయి. సుదూర ్ర΄ాంతాల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి మంటపంలో పెళ్లిళ్లు చేసుకుంటారు. అమ్మవారి సన్నిధిలో మహిళలు కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలను చేసి పునీతులవుతారు. స్థలపురాణం... ఆళహరి రామయ్యకు స్వామివారు కలలోకి వచ్చి అమ్మవారి దేవస్థానాన్ని తిరుపతి మాదిరిగా దిగువకొండ వద్ద నిర్మించాలని సూచించారు. దీంతో 1957–58 సంవత్సరంలో అలమేలు మంగతాయారు దేవస్థానాన్ని ఆయన సొంత నిధులతో అక్కడ నిర్మాణం చేశారు. తిరుమల తిరుపతి నుంచి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టించారు. ఆగమశాస్త్రం ప్రకారం రోజూ దేవస్థానంలో పలు ఆరాధన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది ఫాల్గుణ ద్వాదశి రోజు అమ్మవారి ఉత్సవాలను వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఎలా వెళ్లాలి..?బస్సు మార్గం: హైదరాబాద్ నుంచి నేరుగా మన్యంకొండకు ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. కర్నూల్ నుంచి వచ్చే భక్తులు జడ్చర్లలో దిగి మహబూబ్‌నగర్ మీదుగా మన్యంకొండకు చేరుకోవచ్చు. లేకుంటే భూత్పూర్లో దిగి మహబూబ్‌నగర్ మీదుగా మన్యంకొండకు చేరుకోవచ్చు. రైలులో రావాలంటే అటు హైదరాబాద్ లేదా కర్నూల్ నుండి చేరుకోవచ్చు. మహబూబ్‌నగర్ – దేవరకద్ర మార్గమధ్యలోని కోటకదిర రైల్వేస్టేషన్లో దిగితే అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ దేవస్థానం ఉంది. కేవలం ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఇక్కడ ఆగుతాయి.సీజన్లో పెళ్లిళ్ల హోరు...అమ్మవారి సన్నిధిలో పూజలు చేస్తే కొలిచిన వారికి నిత్య సుమంగళిత్వం, సంతానం, సిరిసంపదలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే పెళ్లి కావల్సిన వారు, సంతానం లేని వారు అమ్మ సన్నిధిలో ముడుపులు కట్టడం ఆచారం. మన్యంకొండ శ్రీ అలమేలు మంగతాయారు దేవస్థానం మంగళవాయిద్యాలతో హోరెత్తిపోతుంటుంది. ప్రతిరోజు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దేవస్థానం ఆవరణలో పెళ్లిళ్లు చేసుకుంటారు. ఒకేరోజు 12 నుంచి 25 పెళ్లిళ్ల దాకా ఇక్కడ జరుగుతాయి. అమ్మవారికి ఆలయంలో నిత్య కళ్యాణంతోపాటు కుంకుమార్చన, ఏడాదికి ఒకసారి అంగరంగ వైభవంగా కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. బస...మన్యంకొండ శ్రీ అలమేలు మంగ తాయారు దేవస్థానం వద్ద భక్తులు ఉండటానికి ఎటువంటి సత్రాలు లేవు. కాక΄ోతే దేవస్థా నానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టపైన శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం వద్ద భక్తులు ఉండటానికి సత్రాలు ఉన్నాయి. భక్తులు ఆ సత్రాల వద్ద ఉండవచ్చు. దీనికిగాను దేవస్థానానికి రోజుకు కొంత చొప్పున రుసుం చెల్లించాల్సి ఉంటుంది. అవసరమైన వారు అక్కడ ఉండొచ్చు. -
నాన్న.. నువ్వు మా ప్రాణం!
తండ్రీ కూతుళ్ల ప్రేమ అనిర్వచనీయం.. కూతురంటే ప్రతి తండ్రికీ ఎనలేని ప్రేమ.. తన కళ్లలో సంతోషం కోసం ఎంతటి కష్టమైనా సునాయసంగా భరిస్తుంటాడు తండ్రి.. తన తండ్రి రోజంతా కష్టపడి పనిచేసేది తన కోసమేనని తెలుసుకుంటుంది కూతురు. ప్రతిరోజూ సమయానికి ఇంటికి వచ్చే నాన్న.. కాస్త ఆలస్యం అయితే చాలు అమ్మా.. నాన్న ఎప్పుడొస్తాడని తల్లి వెంటపడుతుంది. తండ్రి ఇంట్లోకి అడుగు పెట్టగానే ఎగిరిగంతేస్తుంది. ఇది తండ్రీ కూతుళ్ల మధ్య నిత్యం జరిగేదే.. అయితే.. యాక్సిడెంట్లో తన తండ్రి ప్రాణాలు విడిచాడని, ఇక ఎప్పటికీ ఇంటికి రాడనే వార్త విన్న కూతురిని ఓదార్చడం ఎవరి తరమూ కాదు. ఇలాంటి ఘటనలు ఎక్కడా చోటుచేసుకోవద్దని ట్రాఫిక్ రూల్స్‌పై ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా చాలామందిలో మార్పు రావడం లేదు. దాంతో కూతురితో అవగాహన కలి్పస్తే తండ్రిలో తప్పకుండా మార్పు వస్తుందనే ఆలోచనతో ‘సర్వేజన ఫౌండేషన్’.. ‘స్టాప్ రోడ్ యాక్సిడెంట్స్’ పేరుతో కొత్త తరహా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. నాన్న! నేను ఇటీవల ఒక వార్త చదివాను. 2024లో 1.57 కోట్ల ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు నమోదయ్యాయని, ఇది మన రాష్ట్ర జనాభాలో దాదాపు సగంగా ఉండటం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ కేసుల్లో ఒకటి మీదైతే? ఒక చిన్న తప్పు మా జీవితాన్ని మార్చగలదనే ఆలోచన కూడా నన్ను భయపెడుతోంది. ప్రమాదాల్లో తల్లిదండ్రులను కోల్పోయిన కుటుంబాలను నేను చూశాను. తల్లిదండ్రుల కోసం ఏడుస్తూ వాళ్లు లేని జీవితం ఎలా ఉంటుందో తెలియక భయపడే పిల్లల్ని చూశాను. అందుకే నిన్ను కోల్పోవడం తలచుకుంటేనే నా గుండె భారంగా మారుతోంది నాన్న.. నాన్న! ఒక రోజు మేమంతా నీ రాకకోసం ఎదురుచూస్తుంటే.. నీవు ఇక ఎప్పటికీ రాకపోతే? ఒక నిర్లక్ష్య క్షణం నిన్ను మా నుంచి దూరం చేసేస్తే? నీ ప్రేమ, నీ నవ్వు, నీ మార్గనిర్ధేశం లేకుండా మేము ఎలా బతకుతాం? నాన్న దయచేసి ఎప్పుడూ రోడ్డు భద్రతా నిబంధనలను పాటిస్తానని నాకు మాటివ్వు. ఎప్పుడు మద్యం తాగి వాహనం నడపకూడదు, అధిక వేగంతో ప్రయాణించకూడదు, హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరగా ధరించాలి, డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడకూడదు. ఇవి చేయనని నాకు మాటివ్వు నాన్న.. ఎందుకంటే నీవు లేకుండా మా జీవితం ఊహించుకోలేం.. – అంతులేని ప్రేమతో.. నీ ప్రియమైన కుమార్తె ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాల్లో వేల కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోతున్నాయి. 90శాతం ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లనే జరుగుతున్నాయి.. అతివేగం, హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, డ్రైవింగ్ సమయంలో ఫోన్ మాట్లాడటం, సిగ్నల్ జంపింగ్, మద్యం తాగి వాహనం నడపడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ వంటివి ఎంతో మంది ప్రాణాలు పోయేందుకు కారణం అవుతున్నాయి.మానవ తప్పిదాల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలను అరికట్టాలనే లక్ష్యంతో ‘సర్వేజనా ఫౌండేషన్’.. ‘స్టాప్ రోడ్ యాక్సిడెంట్స్’ కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలను నివారించేందుకు ఓ కూతురు తండ్రికి ప్రేమతో అవగాహన కల్పించేలా ‘స్టాప్ రోడ్ యాక్సిడెంట్ యాప్’ ద్వారా అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఈ అవగాహన కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండగా ఈ మహత్ కార్యాన్ని ముందుకు తీసుకువెళ్తున్నామని సర్వేజన ఫౌండేషన్ చైర్పర్సన్, కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ ఏవీ గురవారెడ్డి అన్నారు. ప్రతి నెలా యాప్ ద్వారా పోటీలు నిర్వహించి నగదు బహుమతులు అందజేస్తున్నామని, కూతురితో తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఫౌండేషన్ సీఈఓ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు.రోడ్డు ప్రమాదాల గణాంకాలను పరిశీలిస్తే 2022లో రోడ్డు ప్రమాదాల్లో 1.63 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు ఇవి 1.63 లక్షల మంది కుటుంబాలు తల్లడిల్లిన సంఘటనలు.. వారి కలలు, భవిష్యత్తు నాశనమై, తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన పిల్లలు, పిల్లలను కోల్పోయి కన్నీళ్లు మిగిలిన తల్లిదండ్రులూ ఉన్నారు. అయితే వీరిలో 50 వేల మంది హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలను నడిపినవారయితే, మరొక 17 వేల మంది సీటు బెల్ట్ లేకుండా ప్రయాణించి ప్రాణాలు కోల్పోయారు. -
Erotomania ఆ హీరోనే పెళ్లి చేసుకుంటానంటోంది!
మాది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి. మా అమ్మాయి ఈ మధ్యే బి.టెక్. పూర్తి చేసింది. తనకి సంబంధాలు చూడడం మొదలుపెట్టాం. తను ఈ మధ్య కాస్త విచిత్రంగా మాట్లాడటం మొదలుపెట్టింది. తాను ఒక సినిమా హీరోని ప్రేమిస్తున్నానని, అతణ్ణి మాత్రమే పెళ్ళి చేసుకుంటానని అంటోంది. ఏదో చిన్నపిల్ల సరదాగా మాట్లాడుతుంది అనుకున్నాము. ఆ హీరో కూడా తనను ఇష్టపడుతున్నాడని, అందుకే తాను ఎవర్నీ పెళ్ళి చేసుకోవట్లేదని ఏదేదో మాట్లాడుతుంది. తన గది నిండా ఆ హీరో ఫోటోలతో నింపేసింది. ఫోన్లో ఎప్పుడూ ఆ హీరో సినిమాలే చూస్తుంటుంది. అతను ఇంటర్వ్యూలో ఏదైనా మాట్లాడితే అది తనకి ఇన్‌డైరెక్ట్‌గా మెసేజెస్ పంపిస్తున్నాడని అనుకుంటుంది. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది తమను కలుసు కోకుండా అడ్డం పడుతున్నారని, అందుకే నేరుగా వెళ్ళి తనను కలుస్తానని, ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. మేం గట్టిగా చెప్తే ఏదైనా చేసుకుంటా అని బెదిరిస్తోంది. మాకు ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు. దయచేసి మాకు ఈ సమస్య నుండి బయటపడే దారి చూపెట్టండి. – విజయలక్ష్మీ, రాజమండ్రిమీరు రాసిన లక్షణాలన్నీ ‘ఎరటో మేనియా ’(Erotomania) లేదా ‘డిక్లేరామ్బాల్ట్ సిండ్రోమ్’ (De Clérambault's syndrome) అనే ఒక రకమైన మానసిక రుగ్మతకు సంబంధించినవి. ఈ సమస్య ఎక్కువగా మహిళల్లోనే చూస్తుంటాం. తమకంటే బాగా ఉన్నత మయిన స్థాయిలో లేదా పదవిలో ఉన్న పురుషులు లేదా సినిమా స్టార్స్, స్పోర్ట్స్ స్టార్స్ లాంటి వారు తమతో రహస్యంగా ప్రేమలో ఉన్నారనే భ్రమలో ఉంటారు. వాళ్ళ ప్రవర్తనని, మాట్లాడే మాటలని తమకోసమే చేస్తున్నారని తప్పుగా భావించుకుంటారు. వాళ్ళకి ఉత్తరాలు, ఇమెయిల్స్, బహుమతులు పంపడం లాంటివి కూడా చేస్తుంటారు. అవతలివైపు నుండి ఎటువంటి స్పందన లేకపోతే తమ మధ్య వేరేవాళ్ళు అడ్డుపడుతున్నారనో లేదా కావాలనే అవతలి వ్యక్తి గోప్యతని పాటిస్తున్నారని కూడా వాదిస్తారు. వాళ్ళు అనుకునేది నిజం కాదు, భ్రమ అని చెప్పడానికి ఎవరైనా ప్రయత్నిస్తే, నమ్మకపోగా గొడవలు చేయడం, ఇంట్లో నుండి వెళ్ళిపోవడం లేదా ఏదైనా చేసుకుంటాం అని బెదిరించడం లాంటివి కూడా చేస్తారు.చదవండి: సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియోవాళ్ళకి ఉన్నది ఒక మానసిక సమస్యే అని వారికి తెలియకపోవడం వల్ల వారితో మందులు వేయించడం కూడా కష్టమే. ఇది కాస్త క్లిష్టమైన మానసిక సమస్యే అయినప్పటికీ కొంతకాలం వాళ్ళని సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో, ఆసుపత్రిలో ఉంచి, మందులు, కౌన్సెలింగ్ ద్వారా వైద్యం చేస్తే క్రమంగా వాళ్లలో మార్పు తీసుకురావచ్చు. వెంటనే మీ దగ్గర్లోని మానసిక వైద్యుని దగ్గరకు తీసుకువెళ్ళి తగిన వైద్యం చేయించండి. ఆ హీరోనే పెళ్లి చేసుకుంటానంటోంది! చదవండి: 35 ఏళ్ల నాటి డ్రెస్‌తో రాధికా మర్చంట్ న్యూ లుక్...ఇదే తొలిసారి!డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
ఈ రాతగాళ్లు సవ్యసాచులు
రెండు చేతులతో సంపాదించే వాళ్లను చూశాం కానీ.. రెండు చేతులతో రాసేపిల్లల్ని చూడాలంటే మధ్యప్రదేశ్ వెళ్లాల్సిందే. సింగ్రౌలీ జిల్లాకు 15 కిలోమీటర్ల దూరంలోని బుధేలా గ్రామంలో వీణావాదిని పబ్లిక్ స్కూల్ ఉంది. 1999 జూలై 8న ఈ పాఠశాలను స్థాపించారు. ఇక్కడి విద్యార్థుల ప్రత్యేకత ఏమిటంటే ఒకేసారి ఐదు భాషల్లో రెండు చేతులను ఉపయోగించి రాయగలరు. ఈ పాఠశాలలో చదివే విద్యార్థులు ఈ ద్విచేతి విద్యలో ఆరితేరారు. హిందీ, ఇంగ్లిష్, సంస్కృతం, ఉర్దూ, స్పానిష్ భాషల్లోప్రావీణ్యులు. అలాంటి శిక్షణ పొంది ఇప్పటివరకు 500 మందికి పైగా ఉత్తీర్ణత సాధించారు.. ఇది భారతదేశంలోనే తొలి సవ్యసాచి పాఠశాలగా గుర్తింపు పొందింది.మహాత్మాగాంధీ, మదర్ థెరిస్సా, ఆల్బర్ట్ ఐన్ స్టీన్, రతన్ టాటా, బిల్‌గేట్స్, సచిన్ టెండుల్కర్, బరాక్ ఒబామా వంటి ప్రముఖులు ఎడమ చేత్తో రాసేవారు. పూర్వ రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ రెండు చేతులతో రాయగల నేర్పరి. ఆయన స్ఫూర్తితో తమ విద్యార్థులకు ఈ సృజనను నేర్పినట్లు ప్రిన్సిపాల్ వృంగద్ శర్మ అంటారు. తొలుత సైనికుడిగా ఉన్న ఆయన రాజీనామా చేసి ద్విచేతి విద్యలో శిక్షణ పొందారు. అప్పుడే ఈ పాఠశాలను నెలకొల్పి చిన్న వయసు విద్యార్థులకు రెండు చేతులతో రాయడం నేర్పించడంప్రారంభించారు. నిరంతర సాధనతో ఈ పాఠశాల విద్యార్థులు కేవలం 11 గంటల్లో 24 వేల పదాలు రాయగలరు. రెండు చేతులతో రాయడం వల్ల గుర్తుంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. సమయం కూడా ఆదా అవుతుంది. దీన్ని ఆధ్యాత్మిక సాధనగా ఆయన అభివర్ణించారు. యోగ, ధ్యానం ద్వారా ఇది సాధ్యమవుతుంది. అందుకే రోజూ గంట సేపు స్కూల్లో వీటిని సాధన చేయిస్తారు.అనువాద బ్రహ్మలువిద్యార్థులు ఒకటి నుంచి 100 పదాలు ఉర్దూలో 45 సెకన్లు, రోమన్ లో ఒక నిమిషంలో, దేవనాగరి లిపి ఒక నిమిషంలో రాయగలరు. ఒక నిమిషంలో రెండు భాషల నుంచి 250 పదాలను అనువదించగలరు. నిమిషంలో 17 పదాల వరకు రాయగలరు. వారికి ఒక చేత్తో రెండు పదాల పట్టికను, మరో చేత్తో మూడు పదాల పట్టికను రాస్తే సత్తా ఉంది.కొంతమంది పిల్లలను పలకరించినప్పుడు వారు తమ అనుభవాలను పంచుకున్నారు. మూడోతరగతిలో ఉన్నప్పుడు కుడిచేత్తోనే రాసేవారట. తర్వాత ఎడమచేతి వాటం నేర్చుకున్నారు. ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ఒకేసారి రెండు చేతులతో.. అది కూడా ఐదు భాషలను మార్చి మార్చి రాసేప్రావీణ్యతను సంపాదించినట్లు చె΄్పారు. మానవ మెదడు రెండు భాగాలుగా విభజించి ఉంటుంది. ఆ రెండింటినీ ఒకేసారి ఉపయోగించగలిగేలా ఉపాధ్యాయులు పిల్లలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అందుకే ఏకకాలంలో రెండు చేతులతో రాయగలరని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు.– చెన్నాప్రగడ శర్మ -
శిఖరాన్ని వంచింది
ప్రకృతి పాఠశాల అంటే భరణికి చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి వచ్చేలా చేసింది. కొండలు, కోనలు భరణి నేస్తాలు. ఆ స్నేహమే ప్రపంచంలోని ప్రసిద్ధ పర్వతాలు అధిరోహించేలా చేస్తోంది. లద్ఖాఖ్‌లోని కాంగ్ యాప్సే నుంచి రష్యాలోని ఎల్ బ్రస్ పర్వతం వరకు ఎన్నో పర్వతాలను అధిరోహించిన చిత్తూరు జిల్లా డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌వో) భరణి గురించి...స్ఫూర్తినిచ్చే సాహసికుల గురించి వినడం, చదవడం భరణికి ఎంతో ఇష్టమైన పని. అలా విన్నప్పుడు, చదివినప్పుడు తాను కూడా ఆ పర్వతాలను అధిరోహించినట్లు కల కనేవారు. ఆ కల నిజమయ్యే సమయం రానే వచ్చింది. ఐపీఎస్ అధికారి అతుల్ కరవాల్ 50 ఏళ్ల వయసులో ఎవరెస్టు అధిరోహించడం భరణిని ప్రభావితం చేసింది. అతుల్ కరవాల్ ఎవరెస్ట్ అధిరోహించినట్లే తానూ ప్రపంచంలో మేటి శిఖరాలను అధిరోహించాలనుకున్నారు. 30 రోజులపాటు శిక్షణ తీసుకున్నారు భరణి.శిక్షణ తరువాత... ఎన్నో శిఖరాలురంపచోడవరంలో ఉప అటవీశాఖ అధికారిణిగా పనిచేస్తూనే డార్జిలింగ్‌లో కేంద్ర రక్షణ శాఖ నిర్వహిస్తోన్న హిమాలయన్ మౌంటెనరీ ఇన్ స్టిట్యూట్లో కోర్సు పూర్తి చేశారు. తొలి ప్రయత్నం గా లద్దాఖ్‌లోని కాంగ్ యాప్సే పర్వతాన్ని అధిరోహించారు.తొలి ప్రయత్నం... తొలి విజయం.తన మీద తనకు ఎంతో నమ్మకం వచ్చింది. మరింత ఉత్సాహం వచ్చింది. ఆ తరువాత...ఉత్తరాఖండ్‌లోని 4,200 మీటర్ల మల్లార్ లేక్ శిఖరాన్ని, రష్యాలో 5,642 మీటర్ల ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించారు.కిలిమంజారో పిలిచిందిఎన్నోసార్లు ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతం గురించి ఆసక్తిగా విన్న భరణి ఆ పర్వతాన్ని అధిరోహించాలనుకున్నారు. కిలిమంజారో ఎత్తు 5,895 మీటర్లు. వీపుపై 28 కిలోల బరువును మోస్తూ ఏటవాలుగా ఉన్న కొండలను ఎక్కడమంటే పెద్ద సాహసమే. ఏమాత్రం పట్టు తప్పినా ప్రాణాలకే ప్రమాదం. అయినా సరే కంటిముందు లక్ష్యం మాత్రమే కనిపించిందని భరణి చెబుతారు. 26 గంటలపాటు సుదీర్ఘంగా కిలిమంజారో అధిరోహణ సాగిందని, పర్వత శిఖరాగ్రంపై పాదం మోపిన వెంటనే కష్టాలన్నీ క్షణంలో మరచిపోయానని అంటారు భరణి.ప్రకృతి పాఠశాలలో...తమిళనాడులోని కోయంబత్తూరు భరణి జన్మస్థలం. తండ్రి సాథూర్ స్వామి ఆర్మీ ఆఫీసర్. తల్లి పద్మ టీచర్. నాన్న ఉద్యోగరీత్యా రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఆమె చదువు కొనసాగింది. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ పూర్తి చేసింది. తొమ్మిదో తరగతిలో కొడైకెనాల్‌కు విహారానికి వెళ్లినప్పుడు ఆ దట్టమైన అటవీప్రాంతం, సరస్సులు, కొండల నడుమ జాలువారే జలపాతాలు భరణి మనసును కట్టిపడేశాయి. పర్వత్రపాంతాలకు వెళ్లేటప్పుడు పర్వతారోహణకి సంబంధించి మెలకువలు నేర్చుకున్నారు. భవిష్యత్‌లో మరిన్ని శిఖరాలను అధిరోహించాలనేది భరణి కల. ఆమె కల నెరవేరాలని ఆశిద్దాం.ప్రతి సాహసం ఒక పాఠమేప్రతి ప్రయాణం, ప్రతి సాహసం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. అలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటున్నాను. ‘హాయిగా ఉద్యోగం చేసుకోకుండా ఎందుకు ఈ రిస్క్?’ అనే వాళ్లు కూడా ఉంటారు. అయితే రిస్క్ లేనిది ఎక్కడా! సాహసం చేస్తేనే దానిలో ఉన్న మజా ఏమిటో తెలుస్తుంది. ఒక సాహసం మరొక సాహసానికి స్ఫూర్తినిస్తుంది. పర్వతారోహణ అనేది మనలోని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసే సాహసం. భవిష్యత్‌లో మరిన్ని ప్రసిద్ధ పర్వతాలను అధిరోహించాలనుకుంటున్నాను.– భరణి– నామా హరీశ్, సాక్షి. చిత్తూరు -
మా ఇంటి మణిదీపం
‘ఆడపిల్ల పుట్టింది’ అనే వార్త చెవిన పడగానే... ‘మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది’ అంటూ సంబరం అంబరాన్ని అంటాలి. ‘మా పాప–మా ఇంటి మణిదీపం’ ఇచ్చే స్ఫూర్తి అదే. ‘ఆడపిల్లలు ఎంత చదివితే అంత ముందుకు వెళతారు. అంత అదనపు శక్తి వస్తుంది’ అని అమ్మమ్మ చెబుతుండే వారు. తన అమ్మమ్మ స్ఫూర్తితో చదువు నుంచి స్వయం ఉపాధి వరకు మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు రూపొందిస్తున్నారు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్...‘బేటీ బచావో...బేటీ పడావో’ స్ఫూర్తితో ఖమ్మం జిల్లాలో ‘మా పాప–మా ఇంటి మణిదీపం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆడపిల్ల పుట్టిన ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు, నానమ్మని సత్కరిస్తారు. శాలువ కప్పి స్వీట్ బాక్స్, పండ్లు, ఒక సర్టిఫికెట్‌ను అందజేస్తారు. కొందరి ఇళ్లకు స్వయంగా కలెక్టర్ వెళుతున్నారు.హాజరు శాతంపెరిగిందిపాఠశాలల్లో బాలికల హాజరు శాతంపై కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. బాలికల హాజరు శాతం పెరిగేలా కృషి చేస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో బాలికల హాజరు శాతం 86 నుంచి 92 శాతానికి పెరిగింది. పాఠశాలల్లో బాలికలకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు అయ్యేలా చర్యలు తీసుకున్నారు.ఆర్థిక శక్తిస్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలకు ఉపాధి కలిగిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో స్త్రీ–టీ క్యాంటీన్లు ప్రసిద్ధి చెందాయి. ఇప్పటికే 50 కి పైగా క్యాంటీన్ల వరకు జిల్లా వ్యాప్తంగా లాభాల బాటలో నడుస్తుండగా మరిన్ని క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు. యూనిట్లను మంజూరు చేయడంతోపాటు ఎప్పటికప్పుడు వాటి పనితీరును కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు.మా అమ్మమ్మ అలా లాయర్ అయింది...మహిళలు చదువుకుంటే తరతరాలుగా ఆ కుటుంబం బాగుపడుతుందని చెబుతారు. అది కళ్లతో చూశా. మా అమ్మమ్మకు పన్నెండేళ్లకే పెళ్లి చేశారు. అమ్మమ్మ వాళ్ల ఇంటి ఎదుట కిరాణాషాపు ఉండేది. అక్కడ సరుకులను న్యూస్ పేపర్లలో కట్టి ఇచ్చేవారు. ఆ న్యూస్ పేపర్లను చదువుతూ మరోసారి చదువుపై ఆసక్తిని పెంచుకుని బీఈడీ, ఎంఈడీ పూర్తి చేసింది. లాయర్ అయింది. అప్పుడే నాకు తెలిసింది చదువుతో ఎంతైనా సాధించవచ్చునని. – ముజమ్మిల్ ఖాన్, కలెక్టర్, ఖమ్మంకలెక్టర్ మా ఇంటికి వచ్చారు!నాకు మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. మా ఇంటికి కలెక్టర్ సార్ వచ్చిండు. మాకు సన్మానం చేసి, పూలు, పండ్లు, స్వీట్లు ఇచ్చారు. సర్టిఫికెట్ అందజేశారు. మా పాప పెద్దయ్యాక ఈ సర్టిఫికెట్ చూపించి కలెక్టర్ ఇచ్చారని చెప్పమన్నారు. ‘మీకు మహాలక్ష్మి పుట్టింది. బాగా చదివించండి. భవిష్యత్తులో మంచి ఉద్యోగం సంపాదిస్తుంది’ అంటూ ఆశీర్వదించారు. – బానోత్ కృష్ణవేణి, రామచంద్రాపురం, ఖమ్మం జిల్లా– బొల్లం శ్రీనివాస్, సాక్షి ప్రతినిధి, ఖమ్మం -
నీలి రంగు అద్దాల మేడలు : భగభగ మంటలు
ముంబై, ఉప నగరాల్లో మొన్నటిదాకా 34 డిగ్రీలున్న ఉష్ణోగ్రతలు ఇప్పుడు ఏకంగా 37, 38 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత పదిహేను రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతను భరించలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండల దెబ్బకు వివిధ అనారోగ్య సమస్యల బారిన పడి ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో చిన్న చిన్న క్లినిక్‌లు మొదలుకుని ప్రభుత్వ, ప్రైవేటు, బీఎంసీ తదితర ప్రధాన ఆసుపత్రులకు రోగులు బారులు తీరుతున్నారు. ఎండలు ముదరడంతో విధులకు వెళ్లేందుకు బయలుదేరిన ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ రకాల పనుల కోసం ఇల్లు కదిలే గృహిణులు, సామాన్యులు డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య శాఖ సూచించింది. ప్రతీరోజు రెండు నుంచి మూడు లీటర్లకుపైగా నీరు తాగాలని, అవసరమైతే కొబ్బరి నీళ్లు, మజ్జిగ, లస్సీ, పండ్ల రసాలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మధ్యాహ్న సమయాల్లో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని కళ్లు తిరగడం, వాంతులు, కాళ్లు, చేతుల నొప్పులు, దురద , మూత్రం సరిగా రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపం క్లినిక్‌లు లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాలని జె.జె.ఆసుపత్రి ప్రొఫెసర్ డా.మధుకర్ గైక్వాడ్ సూచించారు. లేదంటే వడదెబ్బతో తీవ్ర అనారోగ్యం బారిన పడే అవకాశముందని హెచ్చరించారు. – డా.మధుకర్ గైక్వాడ్అద్దాల మేడలూ కారణమే ముంబైలో అనేక బహుళ అంతస్తుల భవనాలు రోజురోజుకూ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. బేస్మెంట్పై అదనపు భారం పడకుండా , అందంగా కనిపించాలనే ఉద్దేశ్యంతో 90 శాతం భవనాలకు నీలం రంగు అద్దాలు బిగిస్తున్నారు. నగరంలో వేడిమి పెరుగుదలకు ఇది కూడా ఒక కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. – ఆరోగ్య నిపుణులు చదవండి: సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియోఅకాల వర్షాలకు అవకాశం వేసవి ఎండలతో సతమతమవుతున్న ముంబైకర్లపై మరో పిడుగు పడనుంది. త్వరలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అకాల వర్షాల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముందని, జాగ్రత్తలు పాటించాలని సూచించింది.– ఐఎండీచదవండి: నెట్టింట సంచలనంగా మోడల్ తమన్నా, జాన్వీకి షాక్! -
ప్రపంచ సమస్యలను-ఆర్ట్‌ని మిళితం చేసే వంటకాలు..చూస్తే మతిపోతుంది..!
ఎన్నో రకాల రెస్టారెంట్ వంటకాలు చూసుంటారు. కానీ ఇలాంటి వంటకాల తీరుని మాత్రం అస్సలు ?చూసుండరు. ఆర్డర్ చేస్తే ఎప్పుడొస్తుందా.. ? అని గంటలతరబడి వెయిట్ చేయాలి. తీరా ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చాకా..తినడం మర్చిపోతాం. అలా ఉంటుంది ఆ రెస్టారెంట్ వడ్డించే తీరు. వంటకాలు లిస్ట్ పెద్దదే..ఆ డెజర్ట్‌లు వడ్డించే తీరు ఊహకు దొరకదు..ప్రశంసకు అందదు అన్నట్లుగా ఉంటాయి ఆ వంటకాలు. ఇంతకీ ఇదంతా ఎక్కడంటే..కోపెన్‌హాగన్‌లోని రెఫ్షాలియోన్ జిల్లాలో ఉన్న ఆల్కెమిస్ట్ అనే రెస్టారెంట్లో ఇలా చిత్రమైన రీతీలో వంటకాలను వడ్డిస్తారు. ఈ రెస్టారెంట్ రెండు మిచెలిన్ స్టార్లను దక్కించుకుంది. అక్కడ భోజనం ఓ గొప్ప విషయాన్ని బోధిస్తాయి. అందుకోసం అయినా అక్కడకు వెళ్లి తీరాల్సిందే అని చెప్పొచ్చు. అక్కడ ప్రతి వంటకాన్ని.. పాకకళకు థియేటర్ అండ్ మల్టీమీడియా ఆర్ట్‌తో మిళితం చేసి.. కస్టమర్లకు సర్వ్ చేస్తుంది. వడ్డించే ప్రతి వంటకం..ఆహార కొరత, పర్యావరణ ఆందోళనలు, సామాజిక న్యాయం వంటి ప్రపంచ సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించినట్లుగా క్రియేటివిటీగా అందిస్తారు. అంతేకాదండోయ్ మెనూలో మొత్తం 40 రకాల వంటకాలను అందిస్తుంది. ఆర్డర్ కోసం గంటల తరబడి వెయిట్ చేయక తప్పదు. పైగా ధరలు కూడా కళ్లు చెదిరిపోయే రేంజ్లో ఉంటాయి. ఈ హోటల్లో తినాలంటే ముందుగానే రిజర్వ్ చేసుకోవాలి..ఆర్డర్ కోసం ఎలాంటి వాళ్లైనా.. తప్పక వెయిట్ చేయాల్సిందే. అక్కడ తింటే సుమారు రూ. 60 వేలు పైనే ఖర్చు అవుతుందట. అత్యంత డిమాండ్ ఉన్న ఈ రెస్టారెంట్లో వంటకాలకు సంబధించిన వీడియోని ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్ నెట్టిట షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో గతేడాది ఆ రెస్టారెంట్లో అందించిన వంటకాలు కనిపిస్తాయి. తినదగిన సీతాకోక చిలుకల రూపంలో డిజర్ట్ చూస్తే ప్రోటీన్ వనరులుగా కీటకాలును తినొచ్చు అని హైలెట్ చేస్తుంది. ఇంకా పచ్చి జెల్లీ ఫిష్, తినదగిన ప్లాస్టిక్‌లో చుట్టబడిన చేప (సముద్ర కాలుష్యం గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో), సోర్ క్రీంతో చదును చేయబడిన కోడి తల, పాడైనట్లు కనిపించే చీజ్, బోనులో కోడి పాదాలు (ఇది వ్యవసాయం పరిస్థితిని వివరించడం కోసం), పంది, జింక రక్తంలతో చేసిన స్వీట్(రక్తదానం ప్రాముఖ్యత కోసం)..ఇలా ప్రతి వంటకం ఒక్కో ప్రపంచ సమస్యను వివరించేలా అద్భుతమైన కళా నైపుణ్యంతో ప్రెజెంట్ చేశారు. వాటిని చూస్తే మతిపోవడం ఖాయం అనేలా ఉంటాయి. నెటిజన్లు మాత్రం మరీ ఇంత లగ్జరీయస్ గానా..! అని, మరికొందరూ..ఆహారం రూపంలో ప్రపంచ సమస్యలను హైలెట్ చేసేలా కళను కూడా జోడించడం అంటే మాటలు కాదు అని సదరు రెస్టారెంట్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Tiff (@greenonionbun)(చదవండి: పాపం ఆ సీఈవో.. ‘శరీరం’ చెప్పేది వినలేదు! ఆఖరికి ఇలా..) -
ఫేస్బుక్, ఇన్‌స్టా రీల్స్ రిపీట్ అంటూ తెగ చూసేస్తున్నారా?
పొద్దున్న లేచింది మొదలు రాత్రినిద్రపోయేంతవరకు సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు జనం. బస్సుల్లో, బస్‌స్టాప్‌లో, రైళ్లలో, పార్క్‌ల్లో, ఇలా ఎక్కడ చూసినా ఇదే తంతు. పెద్దలు చెప్పినట్టు లేవగానే దేవుడి ముఖం చూస్తారో లేదో తెలియదు గానీ స్మార్ట్ ఫోన్ (Smart Phone) చూడని వారుమాత్రం ఉండరంటే అతిశయోక్తికాదు. అలా మారిపోయింది నేటి డిజిటల్ యుగం. కొంచెం టైం దొరికితే చాలు.. ఫేస్బుక్, ఇన్‌స్టా రీల్స్ (Reels), యూట్యూబ్ షార్ట్ వీడియోలు... అక్కడితో అయిపోదు.. టైం వేస్ట్ అవుతోందని తెలిసినా..మళ్లీ ఈ సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది గంటల తరబడి. ఇలా రీల్స్ చూస్తూ టైం పాస్ చేస్తున్నవారికి ఒక హెచ్చరిక. ఈ అలవాటు అనేక మానసిక, శారీరక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని తెలుసా? స్మార్ట్‌ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల అనర్థాలపై ఇప్పటికే చాలా అధ్యయనాలు కీలక హెచ్చరికలు జారీ చేశాయి. పడుకునే సమయంలో షార్ట్ వీడియోలు లేదా రీల్స్ చూడటానికి గడిపే స్క్రీన్ సమయానికి , యువకులు మధ్య వయస్కులలో అధిక రక్తపోటుకు మధ్య పరస్పర సంబంధం ఉందని ఒక అధ్యయనం గుర్తించింది. తాజాగా ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ (APAO) 2025 కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ లలిత్ వర్మ ' సెలెండ్ ఎపిడమిక్ ఆఫ్ డిజిటల్ ఐ' అంటూ ప్రఖ్యాత కంటి వైద్య నిపుణులు హెచ్చరించారు. "రీల్స్ తక్కువగా ఉండవచ్చు, కానీ కంటి ఆరోగ్యంపై వాటి ప్రభావం జీవితాంతం ఉంటుంది" అని డాక్టర్ లాల్ హెచ్చరించారు.మితిమీరిన స్క్రీన్‌టైమ్‌తో మనుషులు అనేక సమస్యలు కొని తెచ్చుకోవడమేననీ, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, టిక్‌టాక్, ఫేస్బుక్ ,యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో రీల్స్‌ను అతిగా చూడటం వల్ల అన్ని వయసుల వారిలో, ముఖ్యంగా పిల్లలు , యువకుల్లో తీవ్రమైన కంటి సమస్యలు పెరుగుతున్నట్లు వెల్లడించారు. ఈ సమస్య అన్ని వయసుల వారిలోనూ విపరీతంగా ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని యశోభూమి- ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో సెంటర్లో మంగళవారం (ఏప్రిల్ 1) జరిగిన ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ ఆప్తామాలజీ, ఆల్ ఇండియా ఆప్తామాలాజికల్ సొసైటీ సంయుక్త సమావేశంలో ఇందుకు సంబంధించి పలు కీలక అంశాలను వెల్లడించారు. బ్లూ లైట్ ఎక్స్పోజర్ వల్ల పెద్దల్లో కూడాతరచుగా తలనొప్పి, మైగ్రేన్లు , నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇటీవలి అధ్యయనాల ప్రకారం, 2050 నాటికి, ప్రపంచ జనాభాలో 50శాతం కన్నా ఎక్కువ మంది నయంకాని అంధత్వానికి అత్యంత సాధారణ కారణమైన మయోపిక్‌తో బాధపడే అవకాశం ఉంటుందని అంచనా.చదవండి: నెట్టింట సంచలనంగా మోడల్ తమన్నా, జాన్వీకి షాక్!అధిక వేగం, దృశ్యపరంగా ఉత్తేజపరిచే కంటెంట్‌కు ఎక్కువ కాలం గురికావడం వల్ల డిజిటల్ కంటి ఒత్తిడి, మెల్లకన్ను,కంటి చూపు క్షీణించడం వంటి సమస్యలతో ముఖ్యంగా విద్యార్థులు ,పని చేసే నిపుణులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక స్క్రీన్ సమయం వల్ల సామాజికంగా ఒంటరితనం, మానసిక అలసట,మతిమరపు లాంటి సామాజిక , మానసిక నష్టాన్ని కూడా వారు నొక్కి వక్కాణిస్తున్నారు.చదవండి: సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియోఏం చేయాలి. 20.20.20 రూల్నియంత్రణలేని రీల్స్ వీక్షణంతో కంటి సమస్యలు పెరుగుతున్నాయని, తల్లిదండ్రులు, విద్యావేత్తలు మరియు సోషల్ మీడియా వినియోగదారులు తక్షణ నివారణ చర్యలు తీసుకోవాలని వైద్యులు ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకు 20-20-20 రూల్‌ను పాటించాలని నేత్ర వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ప్రతి 20 నిమిషాలకోసారి 20 సెకన్ల విరామం తీసుకోవాలి. ఆ సమయంలో 20 మీటర్ల దూరంలో ఉన్న వస్తువుపై దృష్టిని కేంద్రీకరించాలి. లేదా గంటకు 5 నిమిషాల పాటు కళ్లకు తగినంత విశ్రాంతినివ్వాలి. అలాగే ఐ బ్లింక్ రేటు పెంచడం, స్క్రీన్లను చూస్తున్నప్పుడు తరచుగా బ్లింక్ చేయడానికి ప్రయత్నం చేయడం, స్క్రీన్ సమయాన్ని తగ్గించడం,క్రమం తప్పకుండా స్క్రీన్ బ్రేక్‌లు వంటి డిజిటల్ డిటాక్స్ తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుందంటున్నారు కంటివైద్య నిపుణులు.చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు! -
రైలు మిస్ అయినా పర్లేదు..ఇలాంటి టెన్షన్ వద్దు..!
పెంపుడు జంతువులంటే చాలామందికి ఇష్టం. వాటిని యజమానులు తాము ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకు వెళ్తుంటారు. అంత వరకు ఓకే గానీ..కొన్ని ప్రదేశాలకు వెళ్లేటప్పుడూ వాటి భద్రతను కూడా దృష్టిలో పెట్టుకోవడం అత్యంత ముఖ్యం. అదే సమయంలో అక్కడుండే ఇతరులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యతను కూడా గుర్తించుకోవాలి. ఇవేం పట్టకుండా ఓ కుక్క యజమాని ఏదో రకంగా రైలుని క్యాచ్ చేయబోయి..పాపం ఆ మూగప్రాణి ప్రాణాల మీదకి తెచ్చిపెట్టాడు. అసలేం జరిగిందంటే..ఓ యజమాని తన కుక్క తోపాటు రైలు ఎక్కాలన్న తొందరలో ఉన్నాడు. అయితే అప్పటికే ఫ్లాట్‌ఫాంపై రైలు కదిలిపోతోంది. ఏదో రకంగా ఆ కదులుతున్న రైలుని ఎక్కాలని యత్నిస్తున్నాడు. అయితే తనతో ఉన్న కుక్క ఎందుకనో ఎక్కేందుకు ప్రయత్నించలేదు. రైలు కదిలిపోతుండటంతో ఎక్కేందుకు భయపడిందో ఏమో గానీ ఎంతలా యజమాని అదిలించినా అది రైలు ఎక్కేందుకు జంప్ చేయలేదు. ఆ యజమాని ఆ కుక్కల హడావిడి నడుమ అనూహ్యంగా ఆ కుక్క రైలుకి-ఫ్లాట్‌ఫాంకి మధ్యన పడిపోయింది. ఇక అంతే అక్కడ ఉన్న ఇతర ప్రయాణికులు, యజమాని అందరూ ఆ కుక్క ఎలా ఉందో? ఏంటో? అని ఊపిరిబిగపెట్టి చూస్తున్నారు. ఓ పక్కన రైలు వేగంగా వెళ్లిపోతుంది. అదృష్టవశాత్తు ఆ కుక్క ప్రాణాలతో బయటపడింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు మాత్రం ఆ కుక్క సేఫ్టీ కూడా చూసుకోవాలి గదా అని మండిపడుతూ పోస్టులు పెట్టారు.వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: (చదవండి: పాపం ఆ సీఈవో.. ‘శరీరం’ చెప్పేది వినలేదు! ఆఖరికి ఇలా..) -
నెట్టింట సంచలనంగా మోడల్ తమన్నా, జాన్వీకి షాక్!
లక్మే ఫ్యాషన్ వీక్ 2025లో అందమైన మోడల్స్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సందడి చేశారు. ముఖ్యంగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) స్ట్రాప్‌లెస్, థై స్లిట్ బ్లాక్ గౌన్‌లో గ్లామర్ ట్రీట్ అందించిది. రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన అదిరిపోయే డ్రెస్ ధరించి ర్యాంప్‌పై వయ్యారంగా వాక్ చేయడం అభిమానులు ఫిదా కావడం తెలిసిందే. అయితే తాజాగా జాన్వీ కపూర్ మించిన స్టైల్‌తో ఇంటర్నెట్లో తెగ సందడి చేస్తోంది మరో మోడల్. ఎవరబ్బా? తెలుసుకుందాం ఈ కథనంలో..లక్మే ఫ్యాషన్ వీక్ 2025 (Lakme Fashion Week)లో జాన్వీ కపూర్ వెనుక నడిచిన మోడల్ తమన్నా కటోచ్ (Tamanna Katoch). ఆమె స్టైల్, ర్యాంప్ వ్యాక్ చూసిన ఇంటర్నెట్ వినియోగదారులు ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు. అయితే ఇదే ఈవెంట్లో జాన్వీ కపూర్ గౌన్‌పై క్లాత్ తీసిన విధానంపై కొందరికి నచ్చలేదు. నడక, స్టైల్ స్టేట్మెంట్ నెటిజన్లను అస్సలు ఆకట్టుకోలేదు. పైగా డబుల్ సైడెడ్ టేప్ బయటకు కనిపించిందంటూ కొందరు ట్రోల్ కూడా చేశారు కూడా. ఈ నేపథ్యంలో ఆమె వెనుకాలనే నడిచిన తమన్నా లేటెస్ట్ సెన్సేషన్‌గా మారింది. తమన్నా కటోచ్ తన సూపర్ మోడల్ ర్యాంప్ వాక్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. షోస్టాపర్ జాన్వితో పోలిస్తే తమన్నానే షోస్టాపర్ అయ్యేదని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. View this post on Instagram A post shared by TAMANNA KATOCH (@tamanna__katoch)బ్లాక్ హాల్టర్నెక్ గౌనులో మెరిసిసోతున్న వీడియోను తమన్నా కటోచ్ ఇన్‌స్టాలో షేర్ చేసింది. తన లుక్ కి మరింత అందంగా తెచ్చేలా టై-అప్ హీల్స్ ని ఎంచుకుంది. అలాగే స్మోకీ ఐషాడో మేకప్, టై-అప్ హెయిర్‌స్టైల్‌తో అదిరిపోయింది. ఈగ్లింప్స్ను విడుదల చేసిన వెంటనే, నెటిజన్లు ఆమెను అభినందనల్లో ముంచెత్తారు. ‘‘జాన్వీని ఎవ్వరూ చూడలేదు.. నిన్నే చూశారు..’’, "లైన్ సెకండ్ సే షురు హోతీ హై" అని , "మీ నడకలో ఫైర్ ఉంది! అంటూ యూజర్ల కమెంట్లు వెల్లువెత్తాయి. -
సోనాలీ చేసిన పనికి : నెటిజన్లు ఫిదా, వైరల్ వీడియో
డిజిటల్ మాధ్యమంతో అన్నీ లాభాలే లేనప్పటికీ, దీని ద్వారా దేశంలో మూరుమూల ప్రాంతాలకు చెందిన అనేక మంది కళాకారులు వెలుగులోకి వస్తున్నారు. తమ అద్భుతమైన కళతో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతున్నారు. పెయింటింగ్, క్రాఫ్ట్, మేకప్, ఇలా అద్భుతమైన చేతిపనులతో తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్నారు. ఒక్కోసారి వారి నైపుణ్యం చూసి ఇంటర్నెట్ వినియోగదారులు అబ్బురపడిపోతూ ఉంటారు. ఇలాంటి కోవకు చెందిన వారే కొల్హాపూర్‌కు చెందిన మెహందీ/మేకప్ ఆర్టిస్ట్ సోనాలీ(Sonali) ఈమె చేసిన పనికి నెటిజనులు ఫిదా అవుతున్నారు. ఇంతకీ ఆమె చేసిన గొప్ప పనేంటి? పదండి తెలుసుకుందాం.తన మెహిందీ, మేకప్ కళ ద్వారా సోషల్ మీడియాలో చాలా పాపులర్ సోనాలి. ఆమెకు లక్షల్లో ఫోలోయర్లు ఉన్నారు. ఆమె వేసే గోరింటాకు డిజైన్లు చాలా అద్భుతంగా ఉంటూ ఆకట్టుకుంటూ ఉంటాయి. తాజాగా ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసిన ఒక వీడియో కోటికి పైగా వీక్షణలను పొందింది. సోనాలి నైపుణ్యాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. (35 ఏళ్ల నాటి డ్రెస్‌తో రాధికా మర్చంట్ న్యూ లుక్...ఇదే తొలిసారి!)అనంత్ అంబానీ రాధిక మర్చంట్ (AnantAmbani-RadhikaMerchant ప్రీ-వెడ్డింగ్ వేడుకల్లో సందడి చేసిన పాప్ స్టార్ రిహన్న (Rihanna) గుర్తుందా. సోనాలీ అచ్చం ఆమెలాగానే మేకప్ వేసుకుంది. రిహన్నాను పునఃసృష్టించిన సోనాలి అందమైన రూపాన్ని చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోకు 12.7 మిలియన్ల వ్యూస్, 6.5 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. నెటిజన్లు ఆమెపై ప్రేమను కురిపించారు. కొందరు ఆమె నైపుణ్యాలను ప్రశంసించగా, మరికొందరు ఆమె వేగవంతమైన బ్రష్ స్ట్రోక్స్ మరియు మేకప్ నైపుణ్యాలు , కంటెంట్, ఆమె భాషను మెచ్చుకున్నారు. అమేజింగ్ ఆర్ట్ అంటూ మరికొందరు కొనియాడారు. View this post on Instagram A post shared by mehndi artist sonali (@sonali_mehndi)కమాన్ గైస్.. ఇలాంటి టాలెంట్ వాళ్లను పాపులర్ చేద్దా అంటూ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వ్యాఖ్యానించింది. ఇంకా నటి క్రిషన్ ముఖర్జీ కూడా సోనాలి నైపుణ్యాలను చూసి ఆశ్చర్యపోయిందంటే ఆమె ఆర్ట్‌ను అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సోనాలి సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో యాక్టివ్‌గా ఉండే సోనాలీ తన మేకప్ నైపుణ్యాల వీడియోను తరచూ షేర్ చేస్తూ ఉంటుంది. ఇవి లక్షల వ్యూస్, లైక్స్‌తో ఆదరణ పొందుతుంటాయి. ముగ్గురు పిల్లల తల్లిగా ఇంకేం పని చేస్తావని తనను ఎగతాళి చేశారనీ, కానీ తల్లిగా వర్క్ లైఫ్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తోందీ వివరిస్తూ చేసిన సోనాలి వీడియో కూడా 6.9 మిలియన్ల మిలియన్ల వీక్షణలను, ప్రేమపూర్వక కామెంట్లను సంపాదించడం విశేషం. చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు! -
పాపం ఆ సీఈవో.. ‘శరీరం’ చెప్పేది వినలేదు! ఆఖరికి ఇలా..
ఉరుకుల పరుగుల జీనవ విధానంలో అందరూ తమ కెరీర్ లక్ష్యాలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే జీవిత పరమావధి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తలకు మించిన పనిభారానికి తోడు పోటీ వాతావరణానికి తగ్గట్లు దూసుకుపోవాలన్న ఒత్తడి కలగలసి శారీరక మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసున్నాయి. కొందరూ నిద్రను కూడా త్యాగం చేస్తూ ఎక్కువ గంటల కంప్యూటర్ స్క్రీన్లపైనే పనిచేస్తుంటారు. పాపం ఇలానే చేసి ఓ సీఈవో ఎంతటి పరిస్థితి కొని తెచ్చుకున్నాడో తెలిస్తే షాక్ అవ్వుతారు. అంతేగాదు ఆరోగ్యం విషయంలో నాలాగా అంతా అయిపోయాక ఇప్పుడే తెల్లారిందన్నట్లుగా మేల్కోవద్దు అంటూ హితువు పలుకుతున్నారు.బెంగళూరుకి చెందిన డేజీఇన్ఫో మీడియా అండ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, సీఈవో అమిత్ మిశ్రా లింక్డ్ఇన్లో తాను ఎదుర్కొన్న విషాదకర ఆరోగ్య పరిస్థితిని గురించి షేర్ చేసుకున్నారు. అతను తన ల్యాప్‌టాప్‌లో పనిచేస్తుండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఒక విధమైన ఆయాసంతో కూడిన వైద్య అత్యవసర పరిస్థితి ఎదురైంది. ముందస్తుగా ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకుంగా జరిగిన ఈ హఠాత్పరిణామం కారణంగా మిశ్రా ఆస్పత్రిపాలయ్యారు. వైద్యులు అతడిని ఐసీయూకి తరలించి సత్వరమే చికిత్స అందించారు. అప్పుడే ఆయన రక్తపోటు అనుహ్యంగా 230కి పెరిగిపోయి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. వైద్యులు సైతం అమిత్ మిశ్రా పరిస్థితిని చూసి షాకయ్యారు. ఇంతలా రక్తపోటు ఎందుకు పెరిగిపోయిందని తెలియక వైద్యులు కూడా కాస్త గందరగోళానికి గురయ్యారని పోస్ట్‌లో తెలిపారు మిశ్రా. "అయితే దీనంతటికీ కారణం.. పనికంటే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నా.. విషయాన్ని విస్మరించడమే. పనే ముఖ్యం అనుకుంటాం. కానీ అది చేయాలంటే ముందు మన ఆరోగ్యం అంతే ముఖ్యం అని అనుకోం. ఆఖరికి శరీరం ఇచ్చే సంకేతాలను కూడా పట్టించుకోం. బాగానే ఉన్నామనే ధీమాతో ఉండిపోతాం. ప్లీజ్ మిత్రమా..ఈ పోస్ట్‌ని గనుక చదువుతుంటే మనం శరీరం చెప్పేది వినండి..దాని బాధను గుర్తించండి." అని పోస్ట్‌లో రాసుకొచ్చారు మిశ్రా. నెటిజన్లు ఆ పోస్ట్‌కి స్పందిస్తూ..వృత్తిపరమైన జీవితం కంటే ఆరోగ్యానికే ప్రాధాన్యత ఇవ్వాలంటూ తమ అనుభవాలనే షేర్ చేయడమే గాక మిశ్రా త్వరితగతిన కోలుకోవాలని పోస్టులు పెట్టారు.(చదవండి: 40లలో ఏం తింటామో అది..70లలోని ఆర్యోగ్యాన్ని నిర్ణయిస్తుందా..?) -
టీకాలతో ఆటిజం వస్తుందా? అసలు చికిత్స ఉందా?
అమెరికాలో మీజిల్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్లు , ఆటిజం మధ్య సంబంధంపై విస్తృత చర్చ జరుగుతోంది. సీడీసీ(CDC), WHO చేసిన విస్తృతమైన అధ్యయనాలతో సహా పరిశోధనలు వ్యాక్సిన్లు , ఆటిజం మధ్య ఎటువంటి సంబంధం లేదని నిర్ధారించాయి. ఆటిజం ప్రధానంగా జన్యు, పర్యావరణ కారణాలుగా వస్తోందని భావిస్తున్నారు. టీకాలు నిజంగా ఆటిజానికి కారణం కానపుడు, సైన్స్ ప్రకారం దానికి కారణమేమిటి? World Autism Awareness Day డే సందర్బంగా అటిజానికి నివారణ, చికిత్స తదితర వివరాలు తెలుసుకుందాం. టీకాల కారణంగా ఆటిజం వస్తుందనేది కేవలం ఒక అపోహ మాత్రమే. టీకాలకూ, ఆటిజంకు సంబంధం లేదు. పిల్లలందరికీ ఏ వయసులో ఇప్పించాల్సిన టీకాలు యథావిధిగా ఆవయసులో ఇప్పించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రవర్తనకు అనుగుణంగా మందులు ఇవ్వడమే...ఆటిజంకు ఎలాంటి మందులూ అందుబాటులో లేవు. విటమిన్లు, గ్లూటెన్ ఫ్రీ, కేసిన్ ఫ్రీ డైట్లు వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. వీళ్లలో ఫిట్స్ (మూర్ఛ) వంటి అనుబంధ సమస్యలు లేదా ఇతర తీవ్రమైన ప్రవర్తనకు సంబంధించిన మార్పులు (బిహేవియరల్ ఛేంజెస్) ఉన్నప్పుడు వాటికి సంబంధించి మాత్రమే మందులు వాడాల్సి ఉంటుంది. - డా. చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ న్యూరో ఫిజీషియన్ బుద్ధిమాంద్యం అనే అపోహ ఉందిఆటిజం అంటే అది ఒక రకమైన బుద్ధిమాంద్యత అని కొందరు అపోహ పడుతుంటారు. చాలా కేసుల్లో మిగతా అందరు పిల్లల్లా అందరితోనూ కమ్యూనికేట్ చేయలేకపోవడమే వీరిలో ఉండే లోపం. నిజానికి చాలామంది నార్మల్ చిన్నారుల కంటే చాలా ఎక్కువ ఐక్యూను ప్రదర్శించేవారూ ఈ పిల్లల్లో ఉంటారు. మెదడు వికాసం లేకపోవడం అన్నది.. సమçస్య తీవ్రత ఎక్కువగా ఉన్న దాదాపు మూడోవంతు పిల్లల్లో మాత్రమే ఉంటుంది. వీరి విషయంలో ఏ అంశంలో వికాసం కొద్దిగా ఆలస్యం జరుగుతోందో ఆ అంశంలో శిక్షణ ఇస్తే వాళ్లు నార్మల్ పిల్లల్లానే పెరగగలుగుతారు. -డా.ప్రభ్‌జ్యోత్ కౌర్ సీనియర్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ఎంత త్వరగా సమస్య గుర్తిస్తే అంత మంచిదిఆటిజం ఫలానా కారణం వల్ల వస్తుందని చెప్పలేం. ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అనే ప్రశ్నలకు సమాధానాలను పరిశోధకులు ఇంకా అన్వేషిస్తూనే ఉన్నారు. అయితే ఆటిజం పిల్లలను గుర్తించి, వారికి సరైన శిక్షణ ఇవ్వడం ద్వారా మెరుగైన ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సమస్య పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ ఉంది. పట్టణాల్లో తమ పిల్లలకు ఆటిజం సమస్య ఉందని తెలిస్తే పరువు పోతుందేమో అనుకునేవారూ ఉన్నారు. పిల్లలు చూడటానికి బాగానే ఉన్నారు కదా, మనస్తత్వంలో మార్పు అందే వస్తుందిలే అని సరిపెట్టుకునేవారూ ఉన్నారు. కానీ, ఆటిజం సమస్య ఉన్న పిల్లలను చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. వారికి అర్ధమయ్యే విధంగా ఒక్కో అంశాన్ని పరిచయం చేయాలి. అందుకు చాలా ఓర్పు, శిక్షణ ఇచ్చే టీచర్లు అవసరం. ప్లే స్కూల్స్, ప్రైమరీ స్కూళ్ల నుంచే అవగాహన తరగతులు నిర్వహించాలి. టీచర్లు, తల్లిదండ్రులూ ఈ సమస్యను ఎంత త్వరగా గుర్తించి, శిక్షణ ఇస్తే అంత మంచిది. -పి. హారికారెడ్డిబిహేవియర్అనలిస్ట్, యాధా ఏబీఏ సెంటర్,అత్తాపూర్,హైదరాబాద్ఓపికగా నేర్పాలిఆటిజం అనేది న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. దీని బాధిత పిల్లల్లో కమ్యూనికేషన్ సమస్య ఉంటుంది. సమస్య ఉన్న పిల్లల్లో స్టీరియోటైపిక్ బిహేవియర్ (ఒకే పనిని పదేపదే చేయడం) ఉంటుంది. ఇలాంటివారిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కోపగించుకోవడం, వేరుగా చూడడం చేయకూడదు. ఇతరులతో ఎలా మాట్లాడాలి, ప్రవర్తించాలో ఓపికగా నేర్పాలి. -డాక్టర్ వై.ప్రదీప్చిన్న పిల్లల వైద్యులు, డైక్ సెంటర్ తిరుపతి3 స్థాయిల్లో ఆటిజమ్పిల్లల్లో కనిపించే లక్షణాల తీవ్రత ఆధారంగా దీనిని ప్రధానంగా మూడు స్థాయిలుగా విభజించారు. మైల్డ్ ఆటిజం: పిల్లల వికాసంతక్కువగా (30% వరకు) ప్రభావితం అవుతుంది. మాడరేట్ ఆటిజం : వీరిలో వికాసం 30% నుంచి 60% లోపు ప్రభావితమవుతుంది. సివియర్ ఆటిజం: వికాసం చాలాఎక్కువగా ప్రభావితమవుతుంది.అంటే 60 శాతానికి పైగా.నేర్చుకోవడానికి సంబంధించి కొన్ని సమస్యలు» ఈ చిన్నారుల్లో నేర్చుకోవడానికి సంబంధించిరకరకాల సమస్యలు కనిపించవచ్చు. వాటిల్లో కొన్ని.. » జ్ఞానేంద్రియాల నుంచి లభ్యమయ్యే సమాచారాన్ని సరిగావిశ్లేషిoచుకోలేకపోవడం (సెన్సరీ ప్రాసెసింగ్ డిజార్డర్ – ఎస్పీడీ). » నేర్చుకునే ప్రక్రియ సరిగా జరగకపోవడం (లెర్నింగ్ డిజార్డర్–ఎల్డీ). » కొంతమంది చిన్నారుల్లో ప్రవర్తనకు సంబంధించిన రుగ్మతలు(బిహేవియరల్ డిజార్డర్స్) ఉంటాయి. అంటే నలుగురితో కలవలేరు. అకారణంగా ఏడుస్తూ ఉంటారు. » కొందరిలో ఆటిజంతో పాటు మూర్ఛ వంటి నాడీ సంబంధిత రుగ్మతలుండవచ్చు. ఎందుకుఇలాంటి సమస్యలు?ఆటిజంకు కారణాలుతెలుసుకోడానికి ఇప్పటికీపెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ నిర్దిష్టమైన కారణాలేమీ ఇంకా తెలియరాలేదు. అయితే కొన్ని అధ్యయనాల్లో ఆటిజంకు గురికావడానికి కారణాలను కొంతవరకు తెలుసుకున్నారు. అవి... » కొంతమేరకు జన్యుపరమైన కారణాల వల్ల దీని బారిన పడుతున్నారు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, మెదడులో స్రవించే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాలు సంబంధిత అంశాల్లో లోపాల వల్ల.. » బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి జెస్టేషనల్ డయాబెటిస్‌కు, హార్మోన్ల అసమతుల్యతకు లోను కావడం, గర్భధారణకు ముందు ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్లకు గురికావడం, తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనుకావడం వల్ల..» గర్భంతో ఉన్నప్పుడు వాడిన, వాడకూడని కొన్ని మందుల వల్ల.. ఆ అధ్యయనాల్లోదేశంలో ఆటిజంతో బాధపడే చిన్నారుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపీ), ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాల ప్రకారం.. తొమ్మిదేళ్ల వయస్సులోపు చిన్నారుల్లో 1 నుంచి 1.5 శాతం పిల్లలు ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్‌తో బాధపడుతున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమని ఐఏపీ స్పష్టం చేస్తోంది. తెలంగాణలో ఎంతమంది ఉంటారనే దానిపై గణాంకాలు అందుబాటులో లేవు. అయితే తెలంగాణలో 0–9 ఏళ్ల వయస్సు చిన్నారులు 60 లక్షల వరకు ఉంటారని అర్ధ గణాంక శాఖ నివేదికను బట్టి తెలుస్తోంది. ఇందులో ఒక శాతాన్ని లెక్కిస్తే 60 వేల మంది, 1.5 శాతాన్ని పరిగణనలోకి తీసుకుంటే 90 వేల మంది వరకు చిన్నారులు ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. సాధారణంగా ఈ సమస్య మగపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఆటిజంలోని రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది.ఏం చేయాలి మరి.. ?దీనిపై తల్లిదండ్రుల్లో అవగాహన పెరగాలి. పిల్లల్లో సమస్యను గుర్తించిన వెంటనే చికిత్సకు తీసుకెళ్లాలి. ఎంత త్వరగా చికిత్స చేయిస్తే అంత త్వరగా సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని తల్లిదండ్రులు గుర్తించాలని నిపుణులు చెబుతున్నారు. 2 ఏళ్ల వయస్సు లోపు గనుక గమనిస్తే సులభంగా బయటపడే చాన్స్ ఉంటుందని అంటున్నారు. ఆటిజం లక్షణాలు కనబరచే పిల్లలకు.. కొన్ని నిర్దిష్టమైన ప్రశ్నలూ సమాధానాల ఫార్మాట్లో నిర్వహించే పరీక్షల ద్వారా సమస్యను నిర్ధారించవచ్చు. ఈ జబ్బు ఉన్నవారిలో ఫిట్స్ వంటి న్యూరలాజికల్ సమస్యలు ఉన్నప్పుడే ఎమ్మారై, ఈఈజీ, మెటబాలిక్ డిజార్డర్ స్క్రీనింగ్ వంటివి అవసరం.ఎలాంటి మందులూ లేవు.. ఈ రుగ్మతకు ఎలాంటి మందులూ లేవు. విటమిన్లు, గ్లూటెన్ ఫ్రీ, కేసిన్ ఫ్రీ డైట్ల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఫిట్స్ లేదా ఇతర తీవ్రమైన ప్రవర్తనకు సంబంధించిన మార్పులు (బిహేవియరల్ ఛేంజెస్) ఉన్నప్పుడు మాత్రమే మందులు వాడాల్సి ఉంటుంది. రకరకాల థెరపీలతోనే చికిత్సచిన్నారుల వ్యక్తిగత లక్షణాలూ, భావోద్వేగ పరమైన అంశాలను బట్టి న్యూరో స్పెషలిస్టులు, సైకాలజిస్టులు, స్పీచ్ థెరపిస్టులు, బిహేవియరల్ థెరపిస్టులు ఇలా అనేక మంది స్పెషలిస్టుల సహాయంతో, సెన్సరీ ఇంటిగ్రేషన్ థెరపీ వంటి ప్రక్రియలతో సమీకృత చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లలకు అవసరమైన విద్య అందించడం కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సికింద్రాబాద్‌లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజెబిలిటీస్’(ఎన్ఐఈపీఐడీ) వంటి సంస్థలు కృషి చేస్తున్నాయి. ఈ చిన్నారుల కనీస స్వావలంబన కోసం పలు సామాజిక సంస్థలు, ఎన్జీవోలు కూడా పనిచేస్తున్నాయి. అటిజమ్ ఇటీవలి కాలంలో ప్రధాన సమస్యగా మారుతోంది. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులు కావడం, పిల్లలతో గడిపే తీరిక లేకపోవడం, ఎక్కువగా స్క్రీన్కు అడిక్ట్ కావడం వంటివి ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు.పుట్టగొడుగుల్లా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్...ఆటిజంకు థెరపీ పేరిట నగరాల్లో ఎక్కడపడితే అక్కడ పుట్టగొడుగుల్లా చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్లు, చైల్డ్ రిహాబిలేటేషన్ సెంటర్లు వెలుస్తున్నాయి. వీటి నిర్వాహకులు అర్హత కలిగిన థెరపిస్ట్‌లు కాకపోయినా..కేవలం ఆయాలను నియమించుకుని ఇలాంటి సెంటర్లు నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొన్ని ఎన్జీవో సంస్థలు నిబద్ధతతో పనిచేస్తుంటే.. కొందరు పూర్తిస్థాయి వ్యాపారంలా నిర్వహిస్తున్నారు. ఒక్కో పిల్లాడిపై నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టి సారించకపోవడం, నిర్వహణ, నియంత్రణ లేకపోవడం వల్ల స్పీచ్ థెరపీ కేంద్రాలు ఇష్టానుసారం వెలుస్తున్నాయి. ఒక ఆసుపత్రి ఏర్పాటు చేయాలంటే ఆసుపత్రి భవనం, అందులో అర్హతగల డాక్టర్లు, నర్సులు, ఆయాలు, పడకలు తదితర సౌకర్యాలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు ఉంటాయి. కానీ ఈ పునరావాస కేంద్రాలకు ఎలాంటి మార్గదర్శకాలు లేకపోవడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలు..» ఆటిజం ఒక వైకల్యంగా గుర్తింపు.. » పునరావాస కేంద్రాలు నడిపించే ఎన్జీవోలకు ఆర్థిక సాయం » వైకల్యంతో బాధపడేవారికి సంబంధించిన హక్కుల చట్టాన్ని వీరికి కూడా వర్తింపచేయడం ద్వారా విద్యలో, పునరావాసంలో సహాయం » ఆటిజం బాధితులకు ఉన్నత విద్య అభ్యాసానికి ఆర్థికసాయం » వీరికి యూనిక్ డిజెబిలిటీ (విశిష్ట వైకల్యం) గుర్తింపు కార్డు ఇవ్వడం » రూ 2.5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించడం » ఆటిజం తగ్గింపునకు అవసరమైన పరికరాలు కొనుగోలుకు ఆర్థిక సాయం.» పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ, స్వయం ఉపాధికి రుణాలు మంజూరు, నైపుణ్య శిక్షణ. » ప్రాంతాల వారీగా సంగీత, నృత్య కచేరీలు ఏర్పాటు » రాష్ట్రంలో ఇప్పటివరకు ఆటిజంతో బాధపడుతున్న వారికి ప్రత్యేక గుర్తింపు కార్డులు లాంటి చర్యలు చేపట్టక పోవడం గమనార్హం. -
40లలో ఏం తింటామో అది..70లలోని ఆర్యోగ్యాన్ని నిర్ణయిస్తుందా..?
ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఎలాంటి దీర్ఘవ్యాధుల బారినపడకుండా సాగే చక్కటి వృద్ధాప్య జీవితం కొనసాగించడం ఎలా అనేది శాస్తవేత్తలను వేధిస్తున్న చిక్కు ప్రశ్న. మనం తినే ఆహారం వృద్ధాప్యానికి ఏమైనా లింక్ ఉందా? అనే దిశగా విస్తృతమైన పరిశోధనలు చేశారు. అయితే దానికి తాజాగా చేసిన పరిశోధనల్లో సరైన సమాధానం దొరికిందని వెల్లడించారు శాస్త్రవేత్తలు. ఆహారం వృద్ధాప్యాన్ని ఎలా డిసైడ్ చేస్తుందో నిర్థారించామని చెప్పారు. కేవలం ఎక్కువ కాలం జీవించడమే లక్ష్యం కాదని మెరుగ్గా జీవించడమనేది అత్యంత ప్రధానమంటూ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అవేంటో చూద్దామా..!.నిపుణుల అభిప్రాయం ప్రకారం..సమతుల్య ఆహారం, దీర్ఘాయువు, మెదడు పనితీరుతో సహా మొత్తం ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతుందని అన్నారు. పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు మంటను తగ్గించడానికి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి, శారీరక విధులకు మద్దతు ఇవ్వడానికి సహాపడతాయని చెప్పారు. అందుకోసం 30 ఏళ్ల లోపు వయసున్న దాదాపు ఒక లక్ష మందికి పైగా వ్యక్తుల ఆహారపు అలవాట్లను ట్రాక్ చేశామని చెప్పుకొచ్చారు. వారంతా తీసుకున్న ఆహారం..అది వారి 70 ఏళ్ల వయసులోని ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో నిర్థారించామని చెప్పారు. ఆ క్రమంలోనే ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం తీసుకోవాల్సిన సరైన ఎనిమిది ఆహార విధానాలను కూడా గుర్తించామని తెలిపారు. దాన్ని ఆరోగ్యకరమైన సూచిక(AHEI)గా వర్గీకరించారు. ఈ విధమైన ఆహారాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా నొక్కి చెప్పారు శాస్త్రవేత్తలు.ఆ ఆహారాలు ఏంటంటే..పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, చిక్కుళ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు(ఆలివ్ నూనె, చేప కొవ్వు) తదితరాలు మంచివని చెప్పారు. అదే సమయంలోఎరుపు మాంసం, ప్రాసెస్ చేసిన ఆహారాలు(జంక్‌ఫుడ్), శుద్ధిచేసిన ధాన్యాలు, అధిక సోడియం తదితరాలను నివారిస్తే మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలను పొందగలరని అన్నారు. ఈ ఆహారపు అలవాట్లకు కాస్త దగ్గరగా ఉన్నవారు.. 70లలో మెరుగైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకున్నట్లు వివరించారు. ఇలాంటి కొన్ని ఆరోగ్య సూత్రాలు ఆరోగ్యకరమైన జీవతానికి మద్దుతిస్తాయని చెప్పారు. అందుకోసం వివిధ రకాల రంగురంగుల పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, అసంతృప్త కొవ్వులు తదితర ఆహారపు అలవాట్లు ప్రాధాన్యత ఇస్తే..70లలో ఏ చీకు చింతా లేకుండా హాయిగా వృద్ధాప్యాన్ని ఆస్వాదించగలుగుతారని అన్నారు పరిశోధకులు.(చదవండి: పొట్ట ఫ్లాట్‌గా ఉండాలా..? ఐతే సాయంత్రం ఆరు తర్వాత ఆ ఆరు ఆహారాలను నివారించండి!) -
35 ఏళ్ల నాటి డ్రెస్‌తో రాధికా మర్చంట్ న్యూ లుక్...ఇదే తొలిసారి!
అంబానీ ఫ్యామిలీకి చెందిన 'చోటి బహు' రాధిక మర్చంట్ అందంలోనూ, ష్యాషన్ స్టైల్లోనూ ఎప్పుడూ స్పెషల్‌గా నిలుస్తుంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీని ప్రేమించి పెళ్లి చేసుకున్న రాధిక తన ట్రెండీ ఫ్యాషన్ లుక్స్‌తో అభిమానులను ఆకర్షిస్తూనే ఉంటుంది. ఆమె ఫ్యాషన్ సెన్స్‌తో ఫ్యాషన్ ప్రపంచాన్ని మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా చందేరీ చీరతో తన డ్రెస్‌ను వినూత్నంగా తీర్చి దిద్దిన వైనం ఆకర్షణీయంగా నిలిచింది. 35 ఏళ్ల వింటేజ్ కార్సెట్‌ను చందేరి చీరతో అందంగా స్టైల్ చేయడం హైలైట్‌గా నిలిచింది.అనంత్ అంబానీతో పెళ్లి సందర్భంగా రాధిక మర్చంట్ తన ఫ్యాషన్ స్టైల్‌ను చాటుకుంది. ప్రీ వెడ్డింగ్ వేడుకలు, అత్యంత ఘనంగా జరిగిన వెడ్డింగ్‌లో ఆమె ధరించిన ఒక్కో డ్రెస్ ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంది. హల్దీ వేడుకలు, మెహిందీ మొదలు సాంప్రదాయ దుస్తుల్లో కొత్త వధువుగా ఆమె లుక్స్ వరకు ప్రతీ వస్త్రాలంకరణలో అందరి హృదయాలను గెలుచు కుంది. తాజాగా రాధిక తనకు ఇష్టమైన స్టైలిస్ట్ రియా కపూర్ స్టైల్ చేసిన వింటేజ్ కార్సెట్నురీ మోడల్ చేసి కార్సెట్-సారీ ట్రెండ్ సృష్టించింది. సల్వార్-కమీజ్‌కు కూడా స్టైల్‌తో కనిపించేలా చందేరీ చీరతో 35 ఏళ్ల కార్సెట్‌ను రీ స్టైల్ చేసి ధరించడం ద్వారా మరోసారి ఫ్యాషన్ ముద్రను చాటుకుంది.ఏప్రిల్ 1న జరిగిన వివియన్నే వెస్ట్ వుడ్ షోకు హాజరైనప్పటి రాధిక ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో సందడి చేశాయి. వివియన్నే వెస్ట్ వుడ్ తయారు చేసిన పోర్ట్రెయిట్ కలెక్షన్ నుండి పురాతన కార్సెట్, స్కార్ఫ్ ధరించి కనిపించింది. ఇందులో ఫ్రెంచ్ కళాకారుడు ఫ్రాంకోయిస్ బౌచర్ రాసిన 'డాఫ్నిస్ అండ్ క్లో' (1743-174) పెయింటింగ్ కూడా ఉండటం విశేషం. వివియన్నే ఒక దుస్తులపై పెయింటింగ్‌ను పునరుత్పత్తి చేయడం ఇదే తొలిసారి. ఈ డ్రెస్ పద్దెనిమిదవ శతాబ్దపు ఆయిల్ పెయింటింగ్ గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది అంటున్నారు ఫ్యాషన్ రంగ నిపుణులు చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు!ఈ లుక్కు ముత్యాల చోకర్, మ్యాచింగ్ స్టడ్ చెవిపోగులతో స్టైల్ చేయడం మరో హైలైట్. ఈ గతంలో తన మంగళసూత్రాన్ని స్టైల్ చేసిన విధానం అందర్నీ ఆశ్చర్యపరిచింది. మెడలో ధరించాల్సిన మంగళసూత్రాన్ని బ్రాస్లెట్గా ధరించిన సంగతి తెలిసిందే. ముంబైలో జరిగిన వివియన్ వెస్ట్‌వుడ్ ష్యాషన్ ఈవెంట్‌కు రాధికా మర్చంట్ అక్క అంజలి మర్చంట్ మరో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. స్టార్-స్టడెడ్ ఈవెంట్లో ఎమరాల్డ్ గ్రీన్ గౌనులో ఆమె అందంగా కనిపించారు. View this post on Instagram A post shared by yogen shah (@yogenshah_s) -
మహిళలకు డిజిటల్ స్కిల్స్
సాక్షి, సిటీబ్యూరో: గ్రామీణ మహిళల సాధికారత కోసం పనిచేసే నాస్కామ్ ఫౌండేషన్ మహిళలకు డిజిటల్ స్కిల్స్‌లో శిక్షణ అందించేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. హెచ్ఎస్బీసీతో కలిసి 4వేల మంది మహిళలకు ఆర్థిక అక్షరాస్యత, వ్యాపార దక్షత, ఇ-గవర్నెన్స్.. తదితర విషయాల్లో అవగాహన కల్పించనున్నామని, రాష్ట్రంతో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల్లోనూ ఈ కార్యక్రమం కొనసాగుతోందని వివరించింది. ‘డిజిటల్ ఎకానమీలో మహిళల పాత్ర విస్తరణ, మహిళా వ్యాపారుల సామర్థ్యాలను పెంపొందించడం’ పేరిట ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొంది. పాటరీ వర్క్షాప్నగరంలోని ఆర్ట్ లవర్స్ కోసం ప్రత్యేకంగా పాటరీ వర్క్‌షాప్ ప్రారంభించింది మైరా స్టూడియో. బంజారాహిల్స్‌లోని స్టూడియో మైరా వేదికగా నేటి నుంచి ప్రారంభమయ్యే పాటరీ వర్క్‌షాపులో రంగులతో ప్రత్యేక కళాఖండాలను సృష్టించడానికి శిక్షణ అందించనున్నారు. ఈ వర్క్‌షాప్‌కు అవసరమైన మేకింగ్ మెటీరియల్ నిర్వాహకులే అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీ వరకూ కొనసాగనున్న ఈ వర్క్‌షాపులో ఐదేళ్లపైబడిన ఆర్ట్ లవర్స్ ఎవరైనా భాగస్వాములు కావచ్చని నిర్వాహకులు తెలిపారు. బుక్ మై షో ద్వారా నమోదు చేసుకోవచ్చని వివరించారు. తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులో ఉండే ఈ వర్క్‌షాపు వారంలోనూ, వారాంతాల్లోనూ ఉంటుంది. -
అగ్గినీ తట్టుకునే ‘అగవె’! దెబ్బకు కార్చిచ్చులు కట్టడి..
అగవె.. చాలా అరుదైన ఎడారి మొక్క. మంటలకు తట్టుకొని నిలబడగలిగే అరుదైన లక్షణం గల ఎడారి పంట ఇది. కలబంద మొక్క మాదిరిగా కనిపించే అగవే చాలా ఎత్తుగా ఎదుగుతుంది. అగవె మట్టల నుంచి నార తీసి, తాళ్లు అల్లే సంప్రదాయం ఉంది. ‘నార కలబంద’ అని పేరుంది. తీవ్ర వేడి పరిస్థితుల్లోనూ మనుగడ సాగిస్తుంది. పశుగ్రాసంగా పనికొస్తుంది. వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి భూమిలో స్థిరీకరించటం ద్వారా భూతాపాన్ని తగ్గిస్తుంది. నేలలో సేంద్రియ కర్బనాన్ని పెంపొందిస్తుంది. దీని మట్టల పైపొర చాలా దృఢంగా, బూడిద పూసినట్లు ఉండటం వల్ల మంటలను కూడా తట్టుకోగలుగుతుంది. అందువల్ల, అగవే తోటలకు నిప్పు భయం ఉండదు. ఉద్యాన తోటల మధ్యలో అక్కడక్కడా కొన్ని వరుసలు అగవే మొక్కలు నాటుకుంటే నిప్పు భయం నుంచి తోటలను కొంతమేరకైనా కాపాడుకోవచ్చు. 275కు పైగా రకాలుఅగవె సక్యులెంట్ ప్లాంట్. అంటే, గాలి నుంచి తేమను గ్రహించి తన ఆకుల్లో దాచుకోగలిగే ఎడారి మొక్క. ఐదారు అడుగుల ఎత్తుకు పెరిగే అగవె జాతులు కూడా ఉన్నాయి. బహుళ ప్రయోజనకారి అయిన అగవె తోటలు అమెరికా ఖండం అంతటా వ్యాపించి ఉన్నప్పటికినీ.. మెక్సికోలో ఎక్కువ. మన దేశంలోనూ అగవె మొక్కలు మెట్ట ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. 275కు పైగా అగవె పంట రకాలున్నాయి. ఇందులో ఎ. సిసాలన, ఎ. కంటల, ఎ.అమెరికానా వంటి అగవె రకాలు భారత దేశంలో అందుబాటులో ఉన్నాయని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం పదేళ్ల క్రితమే ప్రకటించింది. దీని సాగు పద్ధతులను కూడా ప్రామాణీకరించింది. అయినా, ఇప్పటికీ అగవె మనం ఉపయోగించుకోలేక΄ోయిన పంటగానే మిగిలిపోయింది.దైవమిచ్చిన పంట! మెక్సికోలో పురాతన కాలం నుంచే అజ్టెక్ ప్రజలు అగవెను దైవమిచ్చిన పంటగా భక్తితో సాగు చేసుకొని ఉపయోగించుకుంటున్నారని చరిత్ర చెబుతోంది. మాయాహుఎల్ అనే దేవత తమకు ప్రసాదించిన తేనె అగవె మట్టల నుంచి తీసినదేనని వారు నమ్ముతారు. ఇప్పుడు దీన్ని ఒక పారిశ్రామిక పంటగా, ఆదాయ వనరుగా కూడా చూస్తున్నారు. అనేక ఆల్కహాల్ ఉత్పత్తులతో పాటు.. షుగర్, సిరప్ వంటి ఆహారోత్పత్తులు, సహజ నార ఉత్పత్తుల తయారీకి.. పశుగ్రాసంగా కూడా అగవె పంటను ఉపయోగిస్తున్నారు. యాంటీఆక్సిడెంట్లు, సపోనిన్లు వంటి ఆరోగ్యకర ఉత్పత్తులను కూడా ఇటీవల అగవె నుంచి ఇటీవల సంగ్రహిస్తున్నారు. దీంతో ఇది బహుళ ప్రయోజనకారి అయిన పారిశ్రామిక పంటగా మారింది. భూతాపోన్నతి పెచ్చుమీరుతున్న ఈ దశలో ఈ ఎడారి పంట మరింత ప్రాచుర్యంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తీవ్ర నీటి ఎద్దడిని తట్టుకునే స్వభావం వల్ల లాండ్‌స్కేపింగ్‌లో కొన్ని రకాల అగవె మొక్కలను కంచెలుగా పెంచుతుండటం నగరాల్లోనూ కనిపిస్తోంది.వంద కోట్ల అగవె ప్రాజెక్టుఅగవె జాతి మొక్కల పెంపకం వల్ల ప్రజలకే కాకుండా పర్యావరణానికీ గొప్ప మేలు జరుగుతుందని నమ్మే ‘రీజెనరేషన్ ఇంటర్నేషనల్’ అనే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల అగవె మొక్కలు నాటాలన్న బృహత్ సంకల్పం తీసుకుంది. ద బిలియన్ అగవె ప్రాజెక్ట్‌లో భాగంగా మెక్సికోలోని గ్వానాజువాటో ఎడారి ప్రాంతంలో పర్యావరణంలో అద్భుత మార్పులు తేగల అగవె తోటలు నాటుతున్నారు. అగవె మొక్కలతో పాటు వాటి పక్కనే నత్రజనిని గాలిలో నుంచి గ్రహించి భూమిలో స్థిరీకరింపజేసే జాతుల చెట్లను నాటడం, పశువులను ఈ తోటల్లో తగుమాత్రంగా మేపుతూ ఉండటం ద్వారా ఆ ఎడారి ప్రాంతాన్ని తిరిగి పచ్చని ప్రాంతంగా మార్చటం ఈ ప్రాజెక్టు లక్ష్యం. తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్లో, నిస్సారమైన భూముల్లో అధికంగా పశుగ్రాసాన్ని పెద్ద మొత్తంలో సాగు చేయటం అగవె ద్వారానే సాధ్యమని ఈ సంస్థ తెలిపింది. అగవె మట్టలను గుజ్జులాగా చేసి, కొన్ని రోజులు గాలి తగలకుండా మగ్గబెడితే అద్భుతమైన పశుగ్రాసంగా పనికి వస్తుంది. తీవ్ర కరువు ్ర΄ాంతాల్లో పశువులను ఇది కష్టకాలంలో రక్షిస్తుందని చెబుతున్నారు.సరికొత్త తోటల నమూనా అగవెతో మెట్ట ప్రాంతాల్లో సాగు చేయదగిన సరికొత్త తోటల (ఆగ్రోఫారెస్ట్రీ) నమూనాను రీజనరేషన్ ఇంటర్నేషనల్ రూ΄÷ందించింది. హెక్టారుకు 1600–2500 మొక్కల్ని వత్తుగా నాటాలి. వీటి మధ్యలో వేగంగా పెరిగే, పశువులు తినే ఆకులుండే దీర్ఘకాలిక ద్విదళ జాతి చెట్ల జాతి (గ్లైరిసీడియా (గిరిపుష్పం), తుమ్మ వంటి) మొక్కల్ని 500 వరకు నాటాలి. అగవె మొక్కలు 3 ఏళ్లు పెరిగిన తర్వాత నుంచి 5–7 ఏళ్ల పాటు ఈ చెట్ల మట్టలను (ఆకులను) కోసుకోవచ్చు. గట్టిగా ఉండే ఈ మట్టలను చాప్ కట్టర్ వంటి యంత్రంతో గుజ్జులాగా తరగాలి. ΄్లాస్టిక్ బక్కెట్లు/ డ్రమ్ముల్లో ఈ గుజ్జును నింపి, మూత పెట్టి, 30 రోజులు మాగ బెట్టాలి. దీనితో ΄ాటు.. గ్లైరిసీడియా/ అడవి తుమ్మ /సర్కారు తుమ్మ వంటి ద్విదళ జాతి చెట్ల కాయలు, ఆకులను 20% వరకు కలిపి గుజ్జుగా చేసి కలిపితే ప్రోటీన్లు కూడా సమృద్ధిగా దొరుకుతాయి. ఈ విధంగా సహజ సిద్ధమైన కూడిన పశువుల దాణా అతి తక్కువ ఖర్చుతో తయారవుతుంది. 8–10 ఏళ్ల తర్వాత అగవె చెట్టు పువ్వు పూసి చని΄ోతుంది. ఆ దశలో చెట్టు కాండం నుంచి ఆల్కహాల్ ఉత్పత్తుల తయారీకి వినియోగించవచ్చు. ఈ అగవె తోటలో పశువులను మేపుకుంటూనే, పశువుల దాణాను కూడా తయారు చేసుకోవచ్చు. ఎడారి ప్రాంత రైతులకు అగవె తోటలు ఆర్థికంగానే కాకుండా పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తాయని రీజెనరేషన్ ఇంటర్నేషనల్ స్పష్టం చేస్తోంది. ఇది మన దేశంలోనూ దక్షిణాదిలో మెట్ట ప్రాంత రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే అగ్రోఫారెస్ట్రీ నమూనాగా చెప్పవచ్చు.ఎకరానికి 30–40 టన్నుల మట్టల దిగుబడిమన దేశంలో ఎ. సిసలన, ఎ. కంటల, ఎ. అమెరికానా రకాల అగవె మొక్కలు ఉన్నాయి. నీరు నిల్వ ఉండని, ఎర్ర గరప నేలల్లో బాగా పెరుగుతుందని అగవె పంటపై పరిశోధన చేసిన తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆకు ముక్కలను లేదా పిలకలను నాటుకోవాలి. ఆకు ముక్కల్ని నర్సరీలో 9–12 అంగుళాల వరకు పెంచి, 2“2 మీటర్ల దూరంలో, వర్షాకాలంలో నాటుకోవాలి. మూడేళ్ల తర్వాత నుంచి ఆకుల దిగుబడి వస్తుంది. మీటరు కన్నా ఎక్కువ ΄÷డవు పెరిగిన ఆకులను కత్తిరించాలి. ప్రతి మొక్కా ఏడాదికి 40–50 ఆకుల దిగుబడిని 8 ఏళ్ల వరకు ఇస్తుంది. ఈ మట్టల్లో నార/పీచు రకాన్ని బట్టి 2.5–4.5% వరకు ఉంటుంది. అగవె సిసలన రకంలో 4.5% నాణ్యమైన నార ఉంటుంది. మూడేళ్లు గడచిన తర్వాత ఎకరానికి 30–40 టన్నుల మట్టల దిగుబడి వస్తుంది. పదేళ్ల నాటి అంచనాల ప్రకారం.. ఎకరానికి రూ. 2 వేల నికారాదాయం వస్తుంది. పొలాల చుట్టూ కంచె పంటగా అగవెను నాటుకున్నా.. ఇందులో 25% నికరాదాయం వస్తుంది. యంత్రంతో నార తీసి, నీటితో శుద్ధిచేసి, ఎండబెట్టి బేళ్లుగా కట్టి అమ్మాలి. ఎండగా ఉన్న రోజే నార తియ్యాలి. మట్టలను కోసిన రెండు రోజుల్లోగా తీస్తేనే నాణ్యమైన నార వస్తుంది. పాల తెలుపు నుంచి బంగారు పసుపు రంగుల్లో ఈ నార ఉంటుందని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం పేర్కొంది. అగవెను పశు దాణా ఉత్పత్తి గురించి మెక్సికో రైతులు ఎక్కువగా చెబుతుంటే.. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం మాత్రం నార కోసం అని మాత్రమే చెబుతోంది. అందుకే దీనికి నార కలబంద అని పేరొచ్చినట్టుంది. ఏదేమైనా బంజర్లు, ఎడారి ్ర΄ాంతాల్లో అగవెతో కూడిన కొత్త రకం ఆగ్రోఫారెస్ట్రీ తోటల సాగుపై ప్రభుత్వ రంగ పరిశోధకులు దృష్టి సారిస్తే వర్షాధార ప్రాంత రైతులకు, పర్యావరణానికీ మేలు కలుగుతుంది. ‘అగవె’నే ఎందుకు?భూతాపం పెచ్చు మీరిన తర్వాత అడవుల్లో కార్చిచ్చులు మరీ ఎక్కువైపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. వేలాది ఎకరాల్లో అడవులు దగ్థమైపోతున్నాయి. అంతర్జాతీయంగా కార్చిచ్చుల నుంచి పచ్చని చెట్లను, తోటలను రక్షించుకోవటానికి మధ్యలో అక్కడక్కడా అగవే మొక్కలు నాటుకోవటం ఒక వినూత్న పరిష్కార మార్గంగా ముందుకు వస్తోంది.అగవె మట్టలు(ఆకులు) మందంగా, బూడిద పూసినట్లు ఉండి, వేడిని తట్టుకునేలా ఉంటాయి. సులువుగా నిప్పంటుకోవటానికి అవకాశం ఉండదు. అగవె మొక్క తన ఆకుల్లో చాలా నీటిని నిల్వ చేసుకుంటుంది. అందువల్ల వాటికి అంత సులువుగా నిప్పంటుకోదు. ఈ కారణంగా మంటలను అవతలి ప్రాంతానికి వ్యాపింపజేయకుండా అడ్డుకునే తత్వం అగవె మొక్కలకు వచ్చింది. అగవె చెట్టు వేర్లు ఎంత విస్తారంగా భూమిలోకి విస్తరించి ఉంటాయంటే.. ఇతరత్రా చెట్లన్నీ అగ్నికి ఆహుతైపోయినా ఇవి మాత్రం నిలబడే ఉంటాయి. ఒక మొక్కకు టన్ను పశువుల దాణా!అగవె మొక్కలు గాలికి, ఎండకు, వానకు పెరుగుతాయి. నిర్వహణ అతి సులభం. బాగా పెరుగుతుంది. ఒక్కో చెట్టు 8–10 ఏళ్లు బతుకుతుంది. ఈ కాలంలో ఒక టన్ను బరువైన మట్టలను అందిస్తుంది. ఈ చెట్లను ఇతర ద్విదళ చెట్లతో కలిపి పెంచితే ఎడారి ప్రాంతం కూడా ఆకుపచ్చగా మారుతుంది. భూమి సారవంతమవుతుంది. వాన నీరు అక్కడికక్కడే భూమిలోకి బాగా ఇంకుతుంది. వాతావరణంలోని కార్బన్ డయాక్సయిడ్ను భారీగా గ్రహించి భూమిలో స్థిరీకరించడానికి అగవె తోటలు దోహదపడతాయి. ఈ ప్రయోజనాల రీత్యా ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల అగవె మొక్కలు నాటాలని ద బిలియన్ అగవె ఉద్యమాన్ని రీజనరేటివ్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రారంభించింది. విరాళాలు, ప్రభుత్వ, ప్రజల పెట్టుబడులతో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని ఈ సంస్థ తలపెట్టింది. పతంగి రాంబాబు, సాగుబడి డెస్క్(చదవండి: beat the heat ఇండోర్ ప్లాంట్స్‌తో ఎండకు చెక్) -
Best Places to Visit వేసవి విహారం
వేసవి విహారానికి నగరం సన్నద్ధమవుతోంది. నచ్చిన ప్రదేశాలను సందర్శించేందుకు పర్యాటక ప్రియులు ఇప్పటి నుంచే ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. సాధారణంగా ప్రతి సంవత్సరం హైదరాబాద్ నుంచి లక్షలాది మంది పర్యాటకులు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల సందర్శనకు బయలుదేరుతారు. కొందరు కుటుంబాలతో సహా కలిసి పర్యటిస్తే, మరికొందరు సోలో టూర్ల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మేరకు ట్రావెల్స్ సంస్థలు, పర్యాటక ఏజెన్సీలు పర్యాటకుల అభిరుచికి తగినవిధంగా విభిన్న వర్గాలకు చెందిన ప్యాకేజీలను అందజేస్తున్నాయి. జాతీయ పర్యటనల్లో ఎక్కువ మంది హిమాచల్‌ప్రదేశ్, సిమ్లా, ఊటీ, కూర్గ్ వంటి ప్రాంతాలను ఎంపిక చేసుకుంటుండగా, అంతర్జాతీయ పర్యటనల్లో ఇటీవల కాలంలో మధ్య ఆసియా ప్రత్యేక ఆకర్షణగా మారినట్లు టూరిజం సంస్థలు పేర్కొంటున్నాయి. తక్కువ బడ్జెట్లో యూరప్‌లో పర్యటించిన అనుభూతిని కలిగించే కజఖిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, కిర్గిజిస్తాన్, తుర్కమెనిస్తాన్ తదితర దేశాల పట్ల ఆసక్తి చూపుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరో వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని చాలా మంది చల్లటిప్రదేశాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఆ తరువాత ఆధ్యాతి్మక, చారిత్రక ప్రదేశాలకు సైతం డిమాండ్ ఉందని పర్యాటక సంస్థలు చెబుతున్నాయి. ఈ మేరకు హిమాచల్‌ప్రదేశ్, సిమ్లా, కర్ణాటకలోని హిల్‌స్టేషన్‌గా పేరొందిన కూర్గ్, తమిళనాడులోని ఊటీకి హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో బుకింగ్స్ వస్తున్నట్లు హిమాయత్‌నగర్‌కు చెందిన ఓ ట్రావెల్స్ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఆ తరువాత ప్రపంచ వారసత్వ ప్రదేశంగా పేరొందిన హంపి, విరూపాక్ష ఆలయం, విఠల ఆలయం వంటి చారిత్రక ప్రదేశాలు. రాతి దేవాలయాలు, శిలలతో కూడిన శిల్పాలకు ప్రసిద్ధి చెందిన మహాబలిపురం. వారణాసి, అయోధ్య, ఢిల్లీ, జైపూర్ వంటి ప్రదేశాలకు సైతం ఎక్కువ మంది తరలి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు అంచనా. ప్రైవేటు సంస్థలతో పాటు ఐఆర్సీటీసీ వంటి ప్రభుత్వరంగ సంస్థలు సైతం ప్రత్యేక ప్యాకేజీలతో ఆకట్టుకుంటున్నాయి. ఏటా రెండు లక్షల మంది..జాతీయ, అంతర్జాతీయ పర్యటనలకు ప్రతి సంవత్సరం సుమారు రెండు లక్షల మంది ప్రయాణికులు హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్తునట్లు అంచనా. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతి రోజూ సుమారు 15,000 మంది విదేశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. వారిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం, బంధువుల వద్దకు వెళ్లేవాళ్లు కాకుండా కనీసం 5 వేల మంది పర్యాటకులు ఉన్నట్లు అంచనా. అలాగే దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక, పర్యాటక, చారిత్రక ప్రదేశాలకు వెళ్లేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రతి సంవత్సరం ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ప్రతి రోజూ సుమారు 3 లక్షల మంది హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుండగా వారిలో 30 వేల మందికి పైగా కేవలం పర్యాటకప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లేవాళ్లు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆహ్లాదం.. ఆనందం.. ఇటీవల కాలంలో మధ్య ఆసియా ప్రత్యేక ఆకర్షణగా మారింది. హైదరాబాద్ నుంచి వివిధ దేశాల పర్యటనలకు వెళ్లేవారిలో దుబాయ్, సింగపూర్, బ్యాంకాక్, మలేసియా తదితర దేశాల తరువాత మధ్య ఆసియా దేశాలకు ఎక్కువమంది వెళ్తున్నారు. కజికిస్తాన్‌లోని ఎత్తైన పర్వతాలు, రిసార్ట్‌లతో ఆకట్టుకునే ప్రాంతాలు, అమెరికాలోని గ్రాండ్ కాన్యన్ను తలపించే అందమైన ప్రాంతం చారిన్ కాన్యన్, ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన బైకనూర్ కాస్మోడ్రోమ్ వంటివి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.అలాగే ఉజ్బెకిస్తాన్‌లోని పురాతన నగరాలు, మధ్యయుగపు ఇస్లామిక్ కట్టడాలతో నిండి ఉన్న బుఖారా, మౌసోలియమ్స్, ఖివా వంటి ప్రాంతాలను పర్యాటకులు ఎంపిక చేసుకుంటున్నారు. నగర పర్యాటకులను ఆకట్టుకుంటున్న మరో అందమైన దేశం అజర్బైజాన్. తక్కువ బడ్జెట్లో పర్యటించేందుకు అవకాశం ఉన్న ఈ దేశంలో రాజధాని బాకు ఆధునిక ఆర్కిటెక్చర్‌తో చారిత్రక ప్రదేశాలతో నిండి ఉంటుంది. షెకీ మరో పురాతన నగరం. ఇది ప్యాలెస్‌ల నగరంగా పేరొందింది. అలాగే ప్రకృతి సౌందర్యం, పర్వతాలు, వినోదభరితమైన పార్కులతో కూడిన గాబాలా నగరం కూడా అజర్‌బైజాన్‌లోనే ఉంది. -
beat the heat ఇండోర్ ప్లాంట్స్‌తో ఎండకు చెక్
నగరంలో ఉష్ణోగ్రతలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. దీంతో వేడిని తట్టుకునేందుకు నగర వాసులు వివిధ రకాల పద్ధతులు పాటిస్తున్నారు.. ఇందులో భాగంగా ఏసీలు, కూలర్లు వంటివి లేకుండా ఉండలేని పరిస్థితి.. అయితే దీనికి భిన్నంగా వేడి నుంచి ఉపశమనం కోసం ప్రత్యామ్నాయ మార్గమైన మొక్కలను పెంచుతున్నారు. ఇంటి వాతావరణం చల్లబరిచేందుకు ఇదో చక్కటి మార్గమని నిపుణులు చెబుతున్నారు. నర్సరీల్లోనూ ఇటీవల కాలంలో ఇంటీరియర్ ప్లాంట్స్ అధిక మొత్తంలో అమ్ముడుపోతున్నాయని పలువురు నర్సరీల నిర్వాహకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇదే ట్రెండ్ అవ్వడంతో ఎక్కువ మంది ఈ పద్ధతిని అనుసరిస్తున్నారని ఇంటీరియర్ డిజైనర్స్ సైతం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటీరియర్ ప్లాంట్స్ గురించిన మరిన్ని విశేషాలు.. – సాక్షి, సిటీబ్యూరో వేసవి తాపానికి ఎండలు మాత్రమే ప్రధాన కారణం కాదు. పరిమితికి మించిన వాహనాల కాలుష్యం, పరిశ్రమలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్ల నుంచి వెలువడే కాలుష్యం వాతావరణాన్ని తీవ్ర స్థాయిలో దెబ్బతీస్తున్నాయి. అయితే గతంలో ఇంటి వద్ద మెక్కల పెంపకం కొందరికి హాబీగా ఉండేది. ఇప్పుడు ఇదో ఫ్యాషన్‌లా మారింది. కొందరు అందానికి, మరి కొందరు ఆరోగ్యం కోసం పెంచుతుంటే, ఇంకొందరు తాము ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని లక్షలు వెచ్చించి ఇంపోర్టెడ్ మొక్కలను పెంచుతున్నారు. దీంతో బాల్కనీ, డోర్స్ముందు ఖాళీ ప్రదేశంలోనే మనీ ప్లాంట్స్ వంటివి పెంచుతున్నారు. చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు!ముఖ్యంగా గాలిలోని టాక్సిన్లను హరించే హెర్బల్ ప్లాంట్స్, ఆక్సిజన్ స్థాయిలను పెంచే అరుదైన మొక్కలు, ఆహ్లాదాన్ని అందించే అలంకరణ మొక్కలు ఎంపిక చేసుకుంటున్నారు. వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకునే సకులెంట్స్, డిజర్ట్ ప్లాంట్స్ పెంచుతున్నారు. మరికొందరు అరుదైన లక్షణాలున్న మొక్క జాతులు, నీటిలో పెంచే ఆక్వా ప్లాంట్స్, బోన్సాయ్ మొక్కలు, క్రీపర్స్, హ్యాంగింగ్స్ పెంచుతున్నారు. వివిధ రకాల మొక్కలు..మోస్టరైజమ్, పెడల్లీఫ్, ఫిలిడాండ్రమ్, రబ్బర్ ప్లాంట్, పీస్ లిల్లీస్ పెంచుకోవచ్చని నిపుణుల సూచన. ఇండోర్, ఔట్‌డోర్‌లోనూ పెరిగే మనీ ప్లాంట్, ఇంటి ముందు కానీ సూర్యరశ్మి పడే ఇంటిలోపలి వాతావరణంలో అడీనియం, అరేలియా, హెల్కోనియా, దురంతా, పెంటాస్, గ్లోరోఫైటమ్, గ్రోటాన్, పెనివత్, సైకస్ తదితర జాతి మెక్కలను పెంచుకోవచ్చు. విలాసవంతమైన ఇళ్లలో బర్డ్ ఆఫ్ ప్యారడైస్, మేరీ గోల్డ్‌లాంటి అరుదైన మొక్కలను పెంచుతున్నారు. నగర నలుమూలలా అన్ని రకాల మెక్కలు దొరికే నర్సరీలు అందుబాటులో ఉన్నాయి.చదవండి: విద్యుత్తు లేకుండా ఆకుకూరలను 36 గంటలు నిల్వ ఉంచే బాక్స్! -
ప్రైవేటు స్కూళ్లకు సైతం గ్రాట్యుటీ చట్టం వర్తిస్తుంది!
నా పేరు జి.సుధీర్. నేను హైదరాబాద్ లో ఉంటాను. నేను ఒక కార్పొరేట్ విద్యా సంస్థలో గత పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. గత నెల (ఫిబ్రవరి 2025), మా హెడ్ నాకు వేరే బ్రాంచ్‌కు బదిలీ చేశారు. కానీ నేనూ ఆ రోజు నుండి డ్యూటీ కి వెళ్ళడం లేదు. నా రాజీనామా కూడా ఇవ్వలేదు. నా చివరి జీతం (ఫిబ్రవరి నెల) పొందడానికి, పి.ఎఫ్., గ్రాట్యుటీ సెటిల్మెంట్ కోసం నేను ఏమి చేయాలి? దీనిపై లీగల్‌గా ప్రోసీడ్ అవ్వాలంటే ఎలా? సలహా ఇవ్వగలరు.– జి. సుధీర్, హైదరాబాద్.ప్రైవేటు స్కూలు అయినప్పటికీ గ్రాట్యుటీ ప్రావిడెంట్ ఫండ్ పొందడం అనేది మీ హక్కు. ప్రైవేటు స్కూళ్లకు గ్రాట్యుటీ చట్టం వర్తించదు అంటూ పలు స్కూళ్ల యాజమాన్యాలు చేసిన వాదనలను సుప్రీంకోర్టు 2022లో తిరస్కరించింది. కాబట్టి మీరు కూడా గ్రాట్యుటీకి అర్హులు. అయితే గ్రాట్యుటీ పొందాలి అంటే మీరు కనీసం ఐదు సంవత్సరాలు (లేదా 4 సంవత్సరాల 7 నెలల కన్నా ఎక్కువ) సదరు సంస్థలో పనిచేసే ఉండాలి. అలా పని చేసి ఉంటే మీకు గ్రాట్యుటీ చట్టం నిర్ణయించిన కాల్కులేషన్ (జీతము 15 రోజులు X పనిచేసిన వ్యవధి / 26) ఆధారంగా గ్రాట్యుటీ చెల్లించవలసి ఉంటుంది. మీరు పనిచేసిన స్కూలు వారికి లిఖితపూర్వకంగా రాజీనామా చేసి, మీకు రావలసిన పి.ఎఫ్., గ్రాట్యుటీ సెటిల్మెంట్ కోసం ఒక దరఖాస్తు కూడా జత చేయండి. వారు పరిష్కరించని పక్షంలో హైదరాబాదులోని గ్రాట్యుటీ కమిషనర్ /లేబర్ కమిషనర్‌ను సంప్రదించి ఒక దరఖాస్తు సమర్పించవలసి ఉంటుంది. అలాగే పి.ఎఫ్ కూడా ఇవ్వకపోతే, పీ.ఎఫ్. కమిషనర్ వద్ద దరఖాస్తు/ఫిర్యాదు చేయవలసి ఉంటుంది. మీరు పని చేసిన స్కూలు వారికి నోటీసులు పంపించి వారి పక్షం కూడా విన్న తర్వాత మీకు రావలసిన బకాయిలు చెల్లించవలసినదిగా సదరు కమిషనర్లు ఆదేశాలు జారీ చేస్తారు. రెండు విభాగాల నుంచి కూడా మీకు సరైన ఉపశమనం లభిస్తుంది. న్యాయం జరుగుతుంది. ముందు మీరు స్కూల్‌కు రాజీనామా లేఖను అందజేయండి.– శ్రీకాంత్ చింతలహైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు.) (చదవండి: పింక్ ట్యాక్స్ అంటే..? ఆఖరికి అందులో కూడా వ్యత్యాసమేనా..!) -
పింక్ ట్యాక్స్ అంటే..? ఆఖరికి అందులో కూడా వ్యత్యాసమేనా..!
పెంపకంలో.. అవకాశాల్లో.. వేతనాల్లో లింగ వివక్ష క్రిస్టల్ క్లియర్! అది ధరల్లో కూడా ఉందన్న విషయం తెలుసా? అదీ స్త్రీ, పురుషులు ఇద్దరూ ఉపయోగించే ఒకే రకమైన వస్తువుల ధరల్లో! నిజం..!కేవలం ప్యాకింగ్‌లో తేడా వల్ల పర్సనల్ హైజీన్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ నుంచి దుస్తుల దాకా మగవాళ్ల కన్నా మహిళలు ఎక్కువ ధర చెల్లించి కొంటున్నారు. దీన్ని పింక్ టాక్స్ అంటున్నారు. ఇద్దరూ వాడే ఒకేరకమైన ప్రొడక్ట్స్ మీద స్త్రీలు సగటున ఏడు శాతం అధికంగా చెల్లిస్తున్నారట. కేవలం పింక్ ప్యాక్‌లో ఉన్నందున రేజర్ బ్లేడ్స్ మీద 29 శాతం, బాడీ వాష్ మీద 16 శాతం ఎక్కువ వెచ్చిస్తున్నారట. ఆ లెక్కన ఒకేరకమైన వస్తువులు,సేవల మీద పురుషుల కన్నా స్త్రీలు ఏడాదికి సగటున లక్ష రూపాయలు అధికంగా చెల్లిస్తున్నట్టు అంచనా. దీని మీద బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజూందార్ షా కూడా స్పందించారు. ‘పింక్ టాక్స్ అనేది లింగ వివక్షకే పరాకాష్ట. దీన్ని మహిళలు తీవ్రంగా పరిగణించాలి. ధరల్లో వ్యత్యాసమున్న అలాంటి ప్రొడక్ట్స్‌ను కొనకుండా ఆ వివక్షను వ్యతిరేకించాలి’ అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. పింక్ టాక్స్ అనేది మహిళల మీద ఆర్థిక భారాన్ని మోపడమే కాదు సమాజంలో ఇప్పటికే ఉన్న వివక్షను బలపరచే ప్రమాదాన్నీ సూచిస్తోందంటున్నారు సామాజిక విశ్లేషకులు. మార్కెట్లో ఏ తీరైనా.. ధోరణి అయినా న్యాయమైన ధరతో పాటు జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేసేట్టుగా, వివక్షతో కూడిన సామాజిక నియమాలను సవాలు చేసేట్టుగా ఉండాలి తప్ప వివక్షను ప్రేరేపించేట్టుగా ఉండకూడదని చెబుతున్నారు. ఈ పింక్ టాక్స్‌ను సవాలు చేయడానికి మన దగ్గర ప్రత్యేకమైన చట్టం లేక΄ోయినప్పటికీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14.. రైట్ టు ఈక్వాలిటీ కింద కోర్ట్‌లో దావా వేయొచ్చు. Pink Tax! A shameful gender bias that women must respond to by shunning such products! pic.twitter.com/U3ZQm2s7W9— Kiran Mazumdar-Shaw (@kiranshaw) March 12, 2024 (చదవండి: భాషలోనూ వివక్ష ఎందుకు?) -
పుట్టగొడుగుల్ని ఇంటికి తెచ్చే ట్రైసైకిల్!
తాజా పుట్టగొడుగులను నగర, పరిసర ప్రాంతాల వినియోగదారులకు వారి ఇంటి దగ్గరకే తీసుకెళ్లి అందించే లక్ష్యంతో సౌర విద్యుత్తుతో పుట్టగొడుగులను ఉత్పత్తి చేసే ట్రైసైకిల్ సాంకేతికతను బెంగళూరులోని బారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) రూపొందించింది. వేరే చోట పుట్టగొడుగులను పెంచి, తీసుకెళ్లి విక్రయించడటం వల్ల అవి తాజాదనాన్ని కోల్పోతుంటాయి. కోసిన తర్వాత వినియోగదారులకు చేరటం ఆలస్యమైతే రెండు, మూడు రోజుల్లో పుట్టగొడుగులు రంగు మారి వృథా అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ సమస్యను అధిగమించటంతో పాటు పౌష్టికాహారాన్ని ప్రజలకు తాజాగా అందించటం ద్వారా ఉపాధి పొందగోరే యువతకు ఆదాయ వనరుగా ఈ మష్రూమ్ సోలార్ ట్రైసైకిల్ సాంకేతికతను ఐఐహెచ్ఆర్ శాస్త్రవేత్తలు రూపొందించారు. చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు!పెరట్లో, మేడపైన కొద్ది ఖాళీలోనే అవుట్డోర్ సోలార్ మష్రూమ్ ప్రొడక్షన్ యూనిట్‌ను ఇంతకుముందే ఐఐహెచ్ఆర్ రూపొందించింది. ఈ యూనిట్లో పెరిగిన పుట్టుగొడుగులతో కూడిన గ్రోబాగ్స్‌ను సోలార్ ట్రైసైకిల్లోకి మార్చుకొని... వినియోగదారుల ఇళ్ల దగ్గరకు తీసుకు వెళ్లి విక్రయించడానికి ట్రైసైకిల్ ద్వారా అవకాశం కలిగిస్తోంది. తద్వారా పోషకవిలువలతో కూడిన పుట్టగొడుగులను ప్రజల దైనందిన ఆహారంలో భాగం చేసుకోగలుగుతారని ఐఐహెచ్ఆర్ ఆశిస్తోంది. చదవండి: beat the heat ఇండోర్ ప్లాంట్స్‌తో ఎండకు చెక్ఈ ట్రైసైకిల్ ఛాంబర్ 1.5“1“1 మీటర్ల సైజులో ఉంటుంది. అల్యూమినియం ఫ్రేమ్‌లలో పుట్టగొడుగులు పెరిగే బ్యాగులను అమర్చుకోవచ్చు. గాలి ఆడటం కోసం, పురుగులు, ఈగలు వాలకుండా నైలాన్ 40 మెష్‌ను, గోనె సంచులను చుట్టూతా ఏర్పాటు చేశారు. కిలో/2 కిలోల పుట్టగొడుగులతో కూడిన 36 బ్యాగ్‌లు ఇందులో పెట్టుకోవచ్చు. 30 వాట్స్ డిసి మిస్టింగ్ డయాఫ్రం పంప్ నిరంతరం గోనె సంచులపై నీటి తుంపర్లను చల్లుతూ చల్లబరుస్తూ ఉంటుంది. ఇది విద్యుత్తుతో లేదా సౌర విద్యుత్తుతో నడుస్తుంది. 300 వాట్స్ ΄్యానల్, ఇన్వర్టర్, 12వి స్టోరేజ్ బ్యాటరీ, టైమర్ ఇందులో అమర్చారు. ట్రైసైకిల్కి 48వి, 750 వాట్స్ డిసి గేర్డ్ మోటార్ అమర్చారు. వోల్టేజి కంట్రోలర్, సౌర విద్యుత్తును నిల్వ చేయటానికి 24ఎహెచ్ లిథియం అయాన్ బ్యాటరీని అమర్చారు. ఇతర వివరాలకు.. ఐఐహెచ్ఆర్ మష్రూమ్ లాబ్ (బెంగళూరు) – 070909 49605. -
డియర్ పేరెంట్స్.. పిల్లలకు మార్కులే జీవితం కాదు..!
‘డియర్ పేరెంట్స్.. ఇది పరీక్షల సమయం! మీ పిల్లల కన్నా మీరే ఎక్కువ ఆందోళనగా ఉండుంటారు.. వాళ్లు పరీక్షలు ఎలా రాస్తారో.. వందకు వంద మార్కులు తెచ్చుకుంటారో లేదో.. ఇంజినీరింగ్, మెడిసిన్‌కి ఎలిజిబుల్‌గా నిలబడతారో లేదో అని! రేపు పరీక్షలు రాయబోయే పిల్లల్లో ఒక మ్యుజీషియన్ ఉండొచ్చు.. వాడు కెమిస్ట్రీని పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఒక అథ్లెట్ ఉండొచ్చు.. ఆ అమ్మాయికి ఫిజిక్స్ కన్నా ఫిజికల్ ఫిట్నెస్ ముఖ్యం కావచ్చు. ఆర్టిస్ట్ ఉండొచ్చు.. ఆ స్టూడెంట్‌కి మ్యాథ్స్‌ని అర్థంచేసుకోవాల్సిన అవసరం లేకపోవచ్చు. ఆంట్రప్రెన్యూర్స్ ఉండొచ్చు.. వాళ్లకు హిస్టరీ, ఇంగ్లిష్ లిటరేచర్తో పనిలేకపోవచ్చు. మీ పిల్లలు మంచి మార్కులు తెచ్చుకుంటే చాలా సంతోషం. ఒకవేళ తెచ్చుకోకపోతే.. వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకండి. ‘పర్లేదు..మళ్లీ పరీక్ష రాసుకోవచ్చులే’ అంటూ అనునయించండి. ఆ ప్రేమతో వాళ్ల కలలను సాకారం చేసుకుంటారు. ఆ ధైర్యంతో వాళ్లు జీవితాన్ని గెలుస్తారు. ప్రపంచంలో కేవలం డాక్టర్లు, ఇంజినీర్లు మాత్రమే సంతోషంగా ఉంటారనే మైండ్‌సెట్‌ను మార్చుకోండి. మార్కులను కాకుండా పిల్లలను ప్రేమించండి.’ ఇది ఒక ప్రిన్సిపల్ పేరెంట్స్‌కి రాసిన ఉత్తరం. -
విద్యుత్తు లేకుండా ఆకుకూరలను 36 గంటలు నిల్వ ఉంచే బాక్స్!
దైనందిన ఆహారంలో ఆకుకూరలకు ఉన్న ప్రాధాన్యత తెలియనిది కాదు. అయితే, నగరాలు, పట్టణాల్లో నివసించే ప్రజలు, చిల్లర వర్తకులు ఆకుకూరలను రెండో రోజు వరకు నిల్వ ఉంచడానికి నానా తిప్పలు పడుతూ ఉంటారు. అయితే, బెంగళూరులోని భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) శాస్త్రవేత్తలు ఈ సమస్యకో పరిష్కారం కనుగొన్నారు. దాని పేరే అర్క హై హుమిడిటీ స్టోరేజ్ బాక్స్. సాధారణంగా 24 గంటల్లోనే ఆకుకూరలు వాడి పోయి పాడైపోతుంటాయి. అయితే, అర్క హై హుమిడిటీ స్టోరేజ్ బాక్స్‌లో పెడితే 36 గంటలపాటు తాజాగా ఉంటాయి. ఈ బాక్స్‌ను గది ఉష్ణోగ్రత(26–28 డిగ్రీల సెల్షియస్, 52% గాలిలో తేమ)లో ఉంచి, అందులో ఆకు కూరలు పెట్టి మూత వేస్తే చాలు. విద్యుత్తు అవసరం లేదు. రిఫ్రిజరేషన్ చేయనవసరం లేకుండానే అర్క హై హుమిడిటీ స్టోరేజ్ బాక్స్‌లో ఉంచితే చాలు.. ఆకుకూరలు 36 గంటలు తాజాగా ఉంటాయి. కూరగాయలు, ఆకుకూరలు విక్రయించే రిటైల్ షాపులకు, సూపర్ మార్కెట్లకు, తోపుడు బండ్లు/ ఆటోలపై కూరగాయలు అమ్మే వ్యాపారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. అర్క హై హుమిడిటీ స్టోరేజ్ బాక్స్‌లో పరిశుభ్రమైన స్థితిలో ఆకుకూరలను తాజాదనం కోల్పోకుండా నిల్వ ఉంచుకోవ్చు. ఇతర వివరాలకు... 77608 83948చదవండి: పుట్టగొడుగుల్ని ఇంటికి తెచ్చే ట్రైసైకిల్! -
భాషలోనూ వివక్ష ఎందుకు?
భాషకు రెండువైపులా పదును ఉంటుంది! అందుకే దాన్ని జెండర్ ఈక్వాలిటీతో న్యూట్రల్ చేద్దాం! చాలారోజుల కిందట ... ‘అమెరికాలోని ఆడవాళ్లంతా జిడ్డుపాత్రలతో కుస్తీ పడుతున్నారు’ అంటూ తన ప్రొడక్ట్ అయిన అంట్లు తోమే సబ్బు గురించి ఒక యాడ్ ఇచ్చింది ప్రాక్టర్ అండ్ గాంబుల్ సంస్థ. వెంటనే ఆ కంపెనీకి ఓ పదకొండేళ్ల అమ్మాయి నుంచి ఉత్తరం వచ్చింది.. ‘భోజనం అందరికీ కావాలి, అంట్లతో కుస్తీ మాత్రం ఆడవాళ్లే పట్టాలి. మగవాళ్లెందుకు అంట్లు తోమకూడదు? దయచేసి మీ యాడ్‌లో అమెరికాలోని ఆడవాళ్లు అని తీసేసి అమెరికా ప్రజలు అని మార్చండి?’ అని! ప్రాక్టర్ అండ్ గాంబుల్ తన తప్పు తెలుసుకుని ‘అమెరికా ప్రజలు’ అని మార్చుకుంది. ఆ ఉత్తరం రాసిన అమ్మాయెవరో కాదు.. మీడియా పర్సనాలిటీ, బ్రిటిష్ రాచకుటుంబం కోడలు మెఘన్ మార్కల్. ఈ మధ్య.. ‘మా సోషల్ బుక్‌లో ఒకచోట ‘మ్యాన్ మేడ్ ఆర్ నేచురల్?’ అని ఉంది. విమెన్ అని ఎందుకు లేదు? వాళ్లకు చేతకాదనా? మ్యాన్ లేదా ఉమన్ అనే బదులు ప్రజలు అనొచ్చు కదా? అబ్రహం లింకన్ కూడా ఆల్ మెన్ ఆర్ క్రియేటెడ్ ఈక్వల్ అన్నాడు. ప్రజలంతా సమానమే అనుంటే బాగుండేది కదమ్మా!’ నిండా పదేళ్లు లేని ఓ చిన్నారి ఆలోచన! సవరించుకోవాలి.. పై రెండు ఉదాహరణల్లోని విషయం.. భాషకూ జెండర్ ఈక్వాలిటీ ఉండాలనే! కొడుకు, కూతురు ఇద్దరూ సమానమనే ఎరుక పెంపకంతోనే మొదలవ్వాలని ఎలా అనుకుంటున్నామో.. భాష విషయంలోనూ అలాగే అనుకోవాలి. పనికి సామర్థ్యం, నిర్దేశిత అర్హతలు ప్రామాణికమవుతాయి కానీ స్త్రీ, పురుష జెండర్లు కావు కదా! ఆడవాళ్లు అల్లికలకే పరిమితమై పొవట్లేదు.. అంతరిక్షానికీ వెళ్తున్నారు. అందుకే తదనుగుణంగా భాషను సవరించుకోవాలి. వాళ్లూ మినహాయింపు కారు.. జెండర్ స్పృహ ఉన్న రచయితలు, దర్శకులూ వాస్తవికత, రానెస్ పేరుతో స్త్రీల వ్యక్తిత్వాన్ని కించపరచే తిట్లన్నిటినీ రచనల్లో, సినిమాల్లో ఉపయోగిస్తున్నారు. అదేమంటే ‘దాన్నెందుకు జెండర్ కోణంలోంచి చూస్తారు? కోపానికో.. ఆవేశానికో ఎక్స్‌ప్రెషన్‌గా చూడాలి కానీ’ అంటూ బదులిస్తున్నారు. అలా స్త్రీల వ్యక్తిత్వాన్ని హననం చేసే మాటలను భావోద్వేగ వ్యక్తీకరణగా భాషలో సర్దేసి.. దాన్నో సాధారణ విషయంగా మన మెదళ్లకు తర్ఫీదునిచ్చిందీ పితృస్వామ్యమే! కానీ అవగాహన పెరుగుతున్న కొద్దీ ఆ ఆలోచనను మార్చుకోవలసిన .. ఆ భాషను సరిదిద్దుకోవలసిన అవసరాన్ని గ్రహించాలి. పనులు, వృత్తులకున్న పేర్ల నుంచే ఇది మొదలవ్వాలి. ఈ కసరత్తు వల్ల లైంగిక పరిభాష, స్త్రీల వ్యక్తిత్వాన్ని హననం చేసే భావోద్వేగ వ్యక్తీకరణలూ నెమ్మదిగా మెదళ్ల నుంచి డిలీట్ అవుతాయి.దస్తావేజులు.. పాఠ్యపుస్తకాల్లోనూ.. ఈ విషయంలో పాశ్చాత్యదేశాల్లో కృషి జరుగుతోంది. ముఖ్యంగా ఇంగ్లిష్‌లో! ఎయిర్ హోస్టెస్‌ని ఫ్లయిట్ అటెండెంట్‌గా, మ్యాన్.. ఉమన్ అనే పదాలను పర్సన్‌గా, బాలుడు.. బాలికను చైల్డ్‌గా, వెయిటర్.. వెయిట్రస్‌ను సర్వర్‌గా, యాక్టర్.. యాక్ట్రెస్‌ను పెర్ఫార్మర్గా.. ఇంకా ఫైర్‌ఫైటర్, పోలీస్ ఆఫీసర్ వంటి ఎన్నో జెండర్ న్యూట్రల్ పదాలను ఉపయోగిస్తున్నారు.ఇంకో అడుగుముందుకేసి జెండర్‌ను కేవలం స్త్రీ, పురుషులకే పరిమితం చేయకుండా మిగిలిన ఐడెంటీలనూ కలుపుకుంటూ అతడు, ఆమెకు బదులు They అనే పదాన్ని వాడుకలోకి తెచ్చుకున్నారు. స్కాండినేవియన్ దేశాలు సహా జర్మనీ, పోర్చుగల్, నెదర్లండ్స్ లాంటి యూరోపియన్ దేశాలైతే అధికారిక వ్యవహారాలు, దస్తావేజులు, పాఠ్యపుస్తకాల్లోనూ జెండర్ న్యూట్రల్ లాంగ్వేజ్‌ను ప్రోత్సహిస్తున్నాయి. చట్టాలు కూడా ప్రగతిశీల దేశాలు కొన్ని లింగ వివక్షను రూపుమాపేందుకు థర్డ్ జెండర్నీ కలుపుకుంటూ జెండర్ న్యూట్రల్ లాంగ్వేజ్‌ను ్ర΄ోత్సహించే చట్టాలనూ తెచ్చుకున్నాయి. ఆ జాబితాలో అమెరికా (ట్రంప్ వచ్చాక మార్పు వచ్చి ఉండొచ్చు), కెనడా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా వంటి దేశాలున్నాయి. ఇదివరకు స్త్రీకి చదువు లేదు. ఇంటిపట్టునే ఉండేది కాబట్టి ఆ పనులు ఆడవాళ్లకే పరిమితమై వాటి పరిభాష అంతా స్త్రీ లింగంలోనే స్థిరపడింది. ఇప్పుడు మహిళలు అన్నిరంగాల్లో పురుషులతో సమంగా రాణిస్తున్నారు. వాళ్ల పనికి గుర్తింపు, గౌరవ మర్యాదలు కావాలి. ఆ ప్రయత్నంలో తొలి అడుగు భాషదే. స్త్రీ, పురుష సమానత్వ ప్రయాణంలోని ప్రతి మార్పునూ గమనిస్తూ తదనుగుణంగా భాషను దిద్దుకోవాలి. భాషకూ జెండర్‌కూ సంబంధం ఉంది భాషకు, జెండర్‌కు ఉన్న సంబంధాన్ని సామాజిక శాస్త్రం, సాంస్కృతిక సిద్ధాంతాలు, భాషాశాస్త్రం, స్త్రీవాద కోణాల నుంచి చూడవచ్చు. విశ్లేషించవచ్చు. దీనిపై 1970ల నుంచే పాశ్చాత్య దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. నిత్యజీవితంలో భాషను జెండర్‌ను నిర్దేశిస్తూ కాక, జెండర్ న్యూట్రల్‌గా వాడడానికి అవకాశం ఉందా అన్నది ఇటీవల మనదేశంలోనూ జరుగుతున్న చర్చ. పనిగట్టుకుని స్త్రీ అని చెప్పాలా లేక ఆ హోదా, ఆ పదవి, ఆ స్థానం మాత్రమే చెప్పి, అందులో ఉన్నది స్త్రీ అయినా, పురుషుడైనా సమానమేనని ధ్వనించేలా పదప్రయోగం ఉండాలా అన్నది దీని సారాంశం. ఫలితంగా తెలుగులో అధ్యక్షుడు, అధ్యక్షురాలు అనకుండా ‘అధ్యక్షులు’ అని, మేనేజింగ్ డైరెక్టర్ని కార్యనిర్వహణాధికారి అంటే చాలనే అవగాహనకు వచ్చేశాం. మంత్రి, ఆచార్య, గురువు అనే పదాలనూ ఇద్దరికీ వాడుతున్నాం. చెప్పొచ్చేదేంటంటే భాషకూ జెండర్‌కూ సంబంధం ఉంది. స్త్రీలు మొరటుగా మాట్లాడినా, బూతులు వాడినా వెంటనే గగ్గోలవుతుంది. పురుషుడి దుర్భాషలను సహజంగా తీసుకునే అలవాటు ఇంకా పోలేదు. ఇవన్నీ స్త్రీవాద విమర్శలో చర్చించాల్సిన విషయాలు. – సి. మృణాళిని, రచయిత అనాగరికులుగా పరిగణిస్తారు.. మా ఫినిష్ భాష స్వతహాగా జెండర్ న్యూట్రల్ భాష. స్త్రీ, పురుషులిద్దరికీ ఒకే సర్వనామం ఉంటుంది. చిన్నా, పెద్ద అనే తేడా కూడా లేకుండా అందరికీ ఒకేరకమైన సంబోధన ఉంటుంది. తెలుగులో స్త్రీకి ఇది, అది అనే పదాలున్నట్టు మా భాషలో లేవు. అందుకే స్త్రీ వ్యక్తిత్వాన్ని కించపరచే మాటలు ఉండవు. ఎప్పుడైనా ఎవరినోటి నుంచైనా అలాంటి ఇంగ్లిష్ మాటలు వినిపిస్తే వాళ్లను అనాగరికులుగా పరిగణిస్తారు. – ముచ్చర్ల రైతా ప్రదీప్, ఆంట్రప్రెన్యూర్ (తెలుగు వ్యక్తిని పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో ఉంటున్న ఫిన్లండ్ వనిత)– సరస్వతి రమ, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: కాంతివంతమైన కళ్లకోసం...) -
కాంతివంతమైన కళ్లకోసం...
అందాన్ని ఇనుమడింప చేసేది ముఖంలోని కలువరేకుల్లాంటి కళ్లే. ఆ కళ్లే అకర్షణీయంగా కనిపిస్తే ఆ అందమే వేరు. అందుకోసం చాలమంది మగువలు తపిస్తుంటారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో దొరికి ప్రతి క్రీమ్‌లు, ఐ డ్రాప్స్ వాడుతుంటారు. వాటన్నింటికి మన ఇంట్లో దొరికే సహజమైన వాటితో కళ్లను కాంతిమంతంగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో చూద్దామా..!.కీరా, బంగాళదుంప రెండిటినీ జ్యూస్ చేసి, కాటన్‌ను గుండ్రంగా చేసుకుని ఆ జ్యూస్లోవుుంచి కళ్లపై పెట్టుకోవాలి. 15–20 నిమిషాల తర్వాత కాటన్ తీసేసి నీటితో కడిగేయాలి. తర్వాత బేబీ ఆయిల్‌ని కంటి చుట్టూ అప్లై చేయాలి. ఇలా చేస్తే అలసిన కళ్ళు తిరిగి కాంతివంతంగా వూరతాయి.కనురెప్పలు పొడవుగా ఒత్తుగా పెరగాలంటే... ప్రతిరోజూ రాత్రి పడుకునే వుుందు క్యాస్టర్ ఆయిల్‌ని అప్లై చేయాలి. రెప్పలు రాలి΄ోకుండా దృఢంగా అవుతాయి. కొబ్బరినూనెను వుధ్యవేలితో తీసుకుని కంటి చుట్టూ గుండ్రంగా వుసాజ్ చేయాలి. ఇలా క్రవుం తప్పకుండా చేస్తే కంటి చుట్టూ ఉండే నల్లని వలయాలు ΄ోతాయి. కంటి కింద చర్మం ఉబ్బెత్తుగా అవ#తుంటే... బంగాళదుంపను గుండ్రంగా కోసి ఒక క్లాత్‌లో చుట్టి 15 నివుుషాల పాటు కళ్ళపైన పెట్టుకోవాలి. నీటిలో కొంచె ఉప్పు కలిపి ఆ నీటితో కళ్ళను కడిగితే కళ్ళు నిర్మలంగా వూరి, మెరుస్తాయి. టొమాటో రసం, నివ్మురసం రెండిటినీ సమపాళల్లో కలిపి కంటి చుట్టూ అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత చన్నీటితో ఓసారి, వేడినీటితో ఒకసారి కళ్ళను కడగాలి. (చదవండి: జస్ట్ మూడు సెకన్లలో మూడు దేశాలు చుట్టేసింది..!) -
కలిసి నడుద్దాం...
రోజూ వాకింగ్ చేస్తూ ఉంటే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని మనకు తెలిసిందే! వాకింగ్ చేసేవారు గ్రూప్‌గా కలిసి పర్యావరణ ఆరోగ్యాన్నీ బాగు చేద్దామనుకుంటే... ఆ పనిని హైదరాబాద్ కె రన్నర్స్ గ్రూప్ మూడేళ్లుగా చేస్తోంది. ఈ గ్రూప్‌లో డాక్టర్లు, ఐటీ నిపుణులు, గృహిణులు సభ్యులుగా ఉన్నారు. వృత్తి, ఉద్యోగాలు, పిల్లల బాధ్యతలు నిర్వర్తిస్తూనే పర్యావరణ, ఆరోగ్య అవగాహననూ స్వచ్ఛందంగా కల్పిస్తూ ఎంతో మందికి స్ఫూర్తి కలిగిస్తున్నారు. పర్యావరణ హితం కోరేవారంతా తమతో కలిసి నడవచ్చు అంటూ చెబుతున్న ఈ గ్రూప్ సభ్యుల సూచనను మనమూ అమలుచేద్దాం...విందు వినోదాలలో పాల్గొనడం మన చుట్టూ ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించుకోవడానికి. ఆ ఆనందంలో పర్యావరణానికి హాని చేస్తున్నామా అనే ఆలోచన చేయడమే కాదు మేలు కలిగే పనులనూ అమలులో పెట్టి చూపుతోంది కె రన్నర్ గ్రూప్. మూడేళ్లక్రితం ఇద్దరితో మొదలైన ఇప్పుడు 35 మందితో తమ చుట్టూ ఉన్నవారికి ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తోంది. విందు కార్యక్రమాలలో యూజ్ అండ్ థ్రోకు ‘నో’ చెబూతూ స్టీల్ ప్లేట్స్‌ను వెంట తీసుకెళుతున్నారు. వాకింగ్‌కి వెళుతూ రోడ్డు పక్కల పడి ఉన్న ప్లాస్టిక్‌ను సేకరించి, గార్బేజ్కు పంపిస్తున్నారు. వారాంతాల్లో చెరువులు, కోటలలో పేరుకు పోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తున్నారు. వీధుల్లో చేరే మూగజీవాలకు ఆహారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. పనుల ఒత్తిడిలోనూ అనేక ప్రయోజనకర పనులను ఎంచుకుంటున్నారు.వాకింగ్ చేస్తూ... ప్లాస్టిక్ సేకరిస్తూ...మా గ్రూప్‌లో నలభై ఏళ్ల నుంచి అరవై ఏళ్ల వయసు వాళ్లున్నారు. ఎవరి కాలనీలలో వారు రోజూ వాకింగ్, రన్నింగ్ చేసినా ప్రతి నెలా అందరూ కలిసేలా కంటి ఆరోగ్యం, క్యాన్సర్ అవేర్నెస్, ఉమెన్ పవర్.. అంటూ రన్ని ఏర్పాటు చేస్తుంటాం. దీనిలో భాగంగానే మా చుట్టూ ఉన్నవారిలో ఆరోగ్య స్పృహ పెంచడం, ప్లాస్టిక్ ఫ్రీ జోన్స్‌ని చేయాలనుకున్నాం. అందుకే, రోజూ వాకింగ్ వెళ్లినా వెంట ఓ బ్యాగ్ తీసుకెళ్లి, పడేసిన ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ సేకరించి, ఒక చోట డంప్ చేస్తున్నాం. ఇటీవల భువనగిరి ఫోర్ట్, అక్కడి చెరువు వద్ద ప్లాస్టిక్ ఫ్రీ జోన్‌గా చేయాలని సంకల్పించుకొని, వెళ్లి మా పనులు మొదలుపెట్టాం. రైతులు–వినియోగదారుల మధ్య దళారులు లేకుండా 35 కుటుంబాలకు నేరుగా కూరగాయలు, ఇతర ధాన్యం చేరేలా చూస్తున్నాం. ఇప్పుడు నేరుగా కస్టమర్లే రైతులు అడిగి, తమకు కావల్సినవి తెప్పించుకుంటున్నారు. రైతులు పువ్వులతో చేసిన ఆర్గానిక్ కలర్స్‌ని మా గ్రూప్ అంతా హోళీకి ఉపయోగించాం. – శోభా కార్తీక్, కరాటే ఇన్స్ట్రక్టర్పార్టీకి వెళితే... స్టీల్ ప్లేట్, స్పూన్బయట పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను చూసి, మా గ్రూప్ సభ్యులు యూజ్ అండ్ త్రో వస్తువులు వాడవద్దని ముందే నిర్ణయించుకున్నాం. దీంతో నేను మా పాప కోసం కేక్ కొనడానికి బేకరీకి వెళ్లినా వెంట స్టీల్ బాక్స్ తీసుకెళతాను. ఏదైనా పార్టీకి వెళ్లినా స్టీల్ ప్లేట్, స్పూన్, టీ కప్పు వెంటే ఉంటుంది. ఇందులో సిగ్గుపడాల్సిందేమీ లేదు. చెప్పడమే కాదు చేసి చూపితేనే అందరూ ఈ పద్ధతిని అవలంబిస్తారు. కొత్తపేటౖ రెతు మార్కెట్‌కి వెళ్లినప్పుడు అక్కడివాళ్లు టీ కోసం యూజ్ అండ్ త్రో కప్స్ ఎక్కువ వాడుతుండటం చూశాం. వాటిల్లో తాగడం ఆరోగ్యానికీ మంచిది కాదు.అందుకని, సిరామిక్ కప్పుల సెట్స్ తీసుకెళ్లి అక్కడి వర్కర్స్‌కి ఇచ్చి, ఎందుకు ప్లాస్టిక్ మంచిదో కాదో వివరించి వచ్చాం. మా రన్నర్స్ గ్రూప్‌లోని 28 మందిమి కలిసి ఇటీవల భువనగిరి కోట శుభ్రం చేయడానికి వెళ్లాం. అక్కడంతా రేపర్స్, పాలిథిన్ కవర్స్, ప్లాస్టిక్ బాటిల్స్... కనిపించాయి. మైక్రో ప్లాస్టిక్‌కి అయితే కొదవే లేదు. మేం కోట దిగి కిందకు వచ్చేసరికి వెంట తీసుకెళ్లిన బ్యాగులన్నీ నిండిపోయాయి. మా గ్రూప్‌లో జంతుప్రేమికులూ ఉన్నారు. వీధికుక్కలు దాడి చేస్తున్నాయని వాటిని కొట్టడం, చంపడం చేస్తుంటారు. వాటికి సరైన ఆహారం లేకనే అలా చేస్తుంటాయి. కారణాలు అన్వేషించాలి కానీ, చంపేస్తే ఎలా? అందుకే వాటికి కావల్సిన ఆహారం వండిపెట్టడం, అనారోగ్యంగా ఉన్నవాటికి చికిత్స అందించటం వంటివి గత పదేళ్లుగా చేస్తున్నాం. న్యూస్ పేపర్స్‌ని సేకరించి, స్కూల్ పిల్లల చేత బ్యాగులు చేయించి కూరగాయల మార్కెట్ దగ్గర కస్టమర్లకు ఇవ్వాలనే ప్లాన్ చేస్తున్నాం. – శ్రావణి, ఆర్కిటెక్ట్బంధుమిత్రులలోనూ అవగాహనమా గ్రూప్‌లో మల్టీ టాస్కింగ్ చేస్తున్న లాయర్లు, డాక్టర్లు, సాఫ్ట్వేర్లు, వివిధ రంగాలలో వర్క్ చేస్తున్నవారున్నారు. సిటీలో వివిధ చోట్ల నుంచి రన్లో పాల్గొనడానికి వచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రతిరోజూ వాకింగ్, రన్నింగ్‌కి కేటాయించే టైమ్, తీసుకోవాల్సిన హెల్తీ ఫుడ్ గురించి ఎవరి ఫిట్నెస్ బట్టి వారికి షెడ్యూల్ చేసుకుంటాం. నోబుల్ కాజెజ్ రన్స్ అన్నింటిలోనూ పాల్గొంటుంటాం. ఈ ప్రయోజనాలను మరికొందరికి అందించాలనే ఆలోచనతో బంధు, మిత్రులలోనూ, మా పిల్లలను కూడా రన్నర్స్ గ్రూప్‌లలో పాల్గొనేలా ఎంకరేజ్ చేస్తున్నాం. చుట్టూ ఉన్నవారిలో ఆరోగ్య అవగాహనతో ప్లాస్టిక్ ఫ్రీ జోన్స్ చేయాలనుకున్నాం. రన్ గ్రూప్ పార్టీలలో పర్యావరణ హితంగా ఏమేం చేయచ్చు అనే అంశాల మీద చర్చించుకొని, వారాంతాల్లో ఆ కార్యక్రమాలను నిర్వహిస్తుంటాం. – డాక్టర్ శిరీష, గైనకాలజిస్ట్ -
భక్తి శ్రద్ధలతో ఈద్–ఉల్–ఫిత్ర్
సోలాపూర్, భివండీ: సోలాపూర్ పట్టణం, జిల్లా వ్యాప్తంగా సోమవారం ఈద్ ఉల్ ఫిత్ర్(రంజాన్)పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హోటగి రోడ్డు వైపునున్న అలంగీర్ ఈద్గా మైదానం, జూని మిల్ కాంపౌండ్ హాల్లోని అదిల్ శాయి ఈద్గా మైదానం, అసర్ మైదానంలో ముస్లిం సోదరులు రంజాన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తర్వాత అందరూ ఒకరికొకరిని ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పోలీసులు బందోబస్తు నిర్వహించారు. చదవండి: శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు!భివండీలో... భివండీలోని పలుప్రాంతాల్లో సోమవారం రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచే ఈద్గా మైదానం సహా పట్టణంలో 113 మసీదులలో వేలాది ముస్లింలు సామూహిక ప్రార్థనలు చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పండుగ సందర్భంగా కోటర్ గేట్ వద్ద డీసీపీ మోహన్ దహికర్, ఏసీపీ దీపక్ దేశ్‌ముఖ్ ముస్లిం సోదరులకు గులాబీలు అందజేసి ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: Ugadi 2025 వైభవంగా ‘విశ్వావసు’ స్వాగతం, వేడుకలు -
Ugadi 2025 వైభవంగా ‘విశ్వావసు’ కి స్వాగతం, వేడుకలు
పన్వేల్ ఆంధ్రా కళా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉగాది వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ క్రోధి నామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి ఆనందోత్సాహాలతో స్వాగతం చెప్పారు. ఈ వేడుకల్లో సమితి సభ్యులు, పన్వేల్‌లోని తెలుగు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తాండవ కృష్ణ పంచాంగ పఠనం, క్రాంతి నాట్య, గానాలు సభికులను అలరించాయి. ఈ సందర్భంగా వేడుకలకు విచ్చేసిన వారికి సమితి సభ్యులు ఉగాది పచ్చడితో పాటు నూతన పంచాంగం పుస్తకాలను పంపిణీ చేశారు. ముంబై ఆంధ్ర ప్రజా సంఘం ఆధ్యర్యంలో... ముంబై ఆంధ్ర ప్రజా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో మహిళలు, పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఉగాది పచ్చడి తయారు చేసి ఒకరొకొకరు పంచుకున్నారు. ఈ సందర్భంగా సంఘం జాయింట్ సెక్రటరీ రాజకుమార్ సతీమణి జ్యోతి ఆధ్వర్యంలో ఉగాది ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి చిన్నారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రెసిడెంట్ మాకె రాంబాబు, భోగి విష్ణు, సాయిబాబా, ఉండు శ్రీనివాస్, ఎల్లమెల్లి శ్రీనివాస్, ధోనిపాటి శ్రీను, జే ఎస్ మూర్తి, మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. వాషి తెలుగు కళా సమితిలో.... వాషిలోని తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉగాది వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తెలుగుప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ జ్యోతిష పండితుడు పూజ్యం సత్యనారాయణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం సమర్పణం గ్రూప్ ఆలపించిన భక్తి గీతాలు, సిద్ధి నాట్య మందిర్ (గురు రష్మి – శ్రద్ధా భిడే పరివార్) కథక్ నాట్య ప్రదర్శన, ఢీ ప్రోగ్రాం సహాయ నృత్య దర్శకుడు సాయి టీం మెంబర్స్ గ్రూప్‌డాన్స్ ప్రేక్షకులను అలరించాయి. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త ఎల్ది సుదర్శన్‌కు తెలుగు కళా సమితి సభ్యులు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. అనంతరం విందు భోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకల్లో సమితి అధ్యక్షుడు బి. నారాయణరెడ్డి , ప్రధాన కార్యదర్శి జి. సుబ్రహ్మణ్యం, సంయుక్త కార్యదర్శులు టి. విజయలక్ష్మి, సంయుక్త కోశాధికారులు వెలుగొండరెడ్డి, కోటిరెడ్డి, వహీదా, ప్రత్యూష, శోభ, రాధిక, జానకి, కృష్ణ, శ్యామల, శ్రీనివాసరెడ్డి, లక్ష్మణ్ పాల్గొన్నారు. తెలుగు కళావేదిక ఆధ్వర్యంలో... నవీ ముంబై, సిబిడి బేలాపూర్‌లోని సాంస్కృతిక సంస్థ తెలుగు కళావేదిక ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ నూతన సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలుగు కళా వేదిక సభ్యులు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగు ప్రజలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సామూహిక మహాలక్ష్మీ పూజ , పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో మాస్టర్ సాయి హరి భగవద్గీత శ్లోకాల పారాయణ, కుమారి పద్మశ్రీ భరతనాట్య ప్రదర్శన, ప్రముఖ గాయని అనూరాధ శిష్యుల గానం , కవులు అద్దంకి లక్ష్మి రాజశేఖర్ కవితాగానం ప్రేక్షకులను అలరించాయి. అలాగే మహిళా సభ్యులు ప్రదర్శించిన ‘కిట్టీ పార్టీ’హాస్య నాటిక ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఈ కార్యక్రమానికి రవి చిమట వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తెలుగు సంఘం బోనాలు..అంధేరీ వెస్ట్‌లోని చార్‌బంగ్లా ప్రాంతంలో ఆదివా రం స్థానిక తెలుగు ప్రజలు బోనాల ర్యాలీతో ఉగాదికి స్వాగతం పలికారు. తెలుగు సంఘం ఆధ్వర్యంలో మొదటిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీసంఖ్యలో తెలుగువారు హాజరయ్యారు. భివండీలో ఉగాది సంబరాలు..ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం అఖిల పద్మశాలీ సమాజ్ ఆధ్వర్యంలో మండాయిలోని మార్కండేయ మహాముని మందిరంలో ప్రత్యేక పూజలు, ఉగాది పచ్చడి వితరణ జరిగాయి. ఈ సందర్భంగా సమాజ్ అధ్యక్షుడు పొట్టబత్తిని రామకృష్ణ, న్యాయదాని కమిటీ చైర్మన్ ఎలిగేటి శ్రీనివాస్ పట్టణ వ్యాప్తంగా ఉన్న సమాజ్ పెద్దలను టోపీ, శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ ఉగాది ప్రత్యేక కార్యక్రమంలో పట్టణంలోని వివిధ ప్రాంతాంలకు చెందిన అఖిల పద్మశాలీ సమాజం న్యాయనిర్ణేతలు, పెద్దలతోపాటు సమాజ్ ప్రధాన కార్యదర్శి కళ్యాడపు బాలకిషన్, కోశాధికారి యెల్లె సాగర్, కార్యాధ్యక్షుడు గాజెంగి రాజు, ఉపాధ్యక్షుడు వల్లాల్ మోహన్, కొంక మల్లేశం, సుంఖ శశిధర్, కోడం లక్ష్మీనారాయణ, ట్రస్టీలు వేముల నర్సయ్య, పాశికంటి లచ్చయ్య, ఎస్. మల్లేశం, వంగ పురుషోత్తం, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. పద్మశాలీ సమాజ్ యువక్ మండల్లో... ప్రతి ఏడాది మాదిరిగానే పద్మశాలీ సమాజ్ యువక్ మండల్లో, అధ్యక్షుడు వాసం రాజేందర్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అఖిల పద్మశాలీ సమాజ్ కార్యవర్గం కాల పరిమితి పూర్తి కావస్తున్న సందర్భంగా గౌరవ సత్కార సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంంలో సమాజ్ పెద్దలు, యువక్ మండలి కార్యవర్గ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కపిల్ పాటిల్ ఫౌండేషన్ కార్యాలయంలో... కపిల్ పాటిల్ ఫౌండేషన్ కార్యాలయం, బాలాజీనగర్ సంఘం, కామత్‌ఘర్‌లోని పలు సంఘాల్లో ఉగాది వేడుకలు, ఘనంగా నిర్వహించారు. -
శోభిత ధూళిపాళ బ్యూటీ సీక్రెట్స్ తెలిస్తే షాకవుతారు!
నటి,హీరో అక్కినేని నాగచైతన్య రెండో భార్య శోభిత ధూళిపాళ గ్లామరస్ గౌనులో అయినా క్లాసిక్ చీరలో అయినా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ బ్యూటీ అందం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. సాంప్రదాయ సౌందర్య సాధనాలే తన బ్యూటీ సిక్రెట్ అని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాజాగా వెల్లడించింది.వోగ్ బ్యూటీస్కోప్తో సంభాషించిన మేడ్ ఇన్ హెవెన్ యాక్టర్ శోభిత తన అందం రహస్యాలు, స్వీయ సంరక్షణకు సంబంధించి వివరాలను వెల్లడించింది. అందంగా కనిపించడం మాత్రమే కాదు,ఆనందంగా ఉండటం కూడా ముఖ్యమని వివరించింది. స్వీయ సంరక్షణ, ఆత్మవిశ్వాసం ముఖ్యమని నిజమైన అందం లోపలి నుండే వస్తుందని తన నమ్మకని తెలిపింది. శోభిత అందం రహస్యాలుతనదైన అందాన్ని కాపాడుకునేందుకు సింపుల్ ,ప్రభావవంతమైన పద్దుతులు పాటిస్తానని చెప్పుకొచ్చింది. ఇందులో ప్రధానమైంది శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆరోగ్యకరమైన ,మృదువైన చర్మం కోసం వినియోగించే కొబ్బరి నూనె. అదే తన సీక్రెట్ అని చెప్పింది. జుట్టు బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొబ్బరి నూనె బెస్ట్ ఆప్షన్ అని, కొబ్బరి నూనెతో చాలా సమస్యలకు చెక్ చెప్పవచ్చని, తనకు తీవ్రమైన మైగ్రేన్ వచ్చినపుడు ఇది నిజంగా హెల్ప్ చేసిందని తెలిపింది. అలాగే కొద్దిగా కొబ్బరి నూనెను నీటితో కలిపి, స్ప్రే బాటిల్లో వేసి, స్ప్రే చేసుకుంటే, తన జుట్టు అణిగి ఉంటుందని చెప్పింది. అంతేకాదు దద్దుర్లు, చర్మం పొడిబారడం ఇలా ప్రతీదానికి కొబ్బరినూనె వాడతానని తెలిపింది.పెదాలకు నెయ్యికి మించింది మరేదీ లేదు వివిధ రకాల పెదవి ఉత్పత్తులపై విచ్చలవిడిగా ఖర్చు పెట్టే బదులు, నెయ్యి అంత గొప్ప మాయిశ్చరైజర్ లేదనీ, లిప్ బామ్, లైనర్, కాజల్ వాడినప్పటికీ, పొద్దున్నే తన పెదవులపై నెయ్యి రాసుకుంటానని శోభిత తెలిపింది. పగిలిపోయిన పెదాలకు ఇది తప్పమరేఖరీదైన లిప్మాస్క్లు పనిచేయవని వెల్లడించింది. షూటింగ్ రోజుల్లో తప్ప భారీ మేకప్ లేకుండా, సాదా సీదాగానే ఉంటానని తెలిపింది. శోభిత తన లుక్స్ కి, నీలిరంగు ఇష్టపడతానని తెలిపింది.తన మానసిక స్థితిని ప్రకటించేలా మస్కారా, ఐషాడో, లిప్‌కలర్ అయినా బ్లూ రంగువే ఇష్టమని చెప్పుకొచ్చింది. చదవండి: అన్నతో కలిసి గ్రాండ్‌గా ఈద్ పార్టీ, సందడి చేసిన సెలబ్రిటీలుఅందం -సమతుల్యతఅందం అంటే చర్మానికి తగ్గట్టుగా బ్యాలెన్స్డ్గా ఉండటమే అని శోభిత విశ్వాసం. ఖరీదైన పద్ధతులు, అధునాతన గాడ్జెట్ల ప్రపంచంలో కొత్త ట్రెండ్లను ఆనందిస్తూనే సాంప్రదాయ సౌందర్య చిట్కాలను పాటించడం తన స్టైల్ అని శోభిత తెలిపింది. చదవండి: 30వ పుట్టిన రోజు : కాలినడకన ద్వారకకు అనంత్ అంబానీ -
జస్ట్ మూడు సెకన్లలో మూడు దేశాలు చుట్టేసింది..!
మూడే మూడు సెకన్లలో మూడు దేశాలు చుట్టొచ్చేయడమా..! అంటే నమ్మబుద్ధి కాదు కదా. కానీ ఈ అమ్మాయి ఏకంగా మూడు దేశాలను జస్ట్ మూడు సెకన్లలో చుట్టేసింది. ట్రావెల్ ఔత్సాహికులకు కూడా సాధ్యం కానిది ఆమెకు ఎలా సాధ్యమైందో చూద్దామా..!.మంచి అడ్వేంచర్ కోసం కొందరూ టూరిస్ట్‌లు రకరకాల దేశాలకు చుట్టొస్తుంటారు. కానీ ఆయా దేశాల వీసాలు వంటి పలు రకాల డాక్యుమెంట్స్ ఉంటేనే త్వరితగతిన చుట్టిరాగలం. కానీ అవేమి లేకుండానే ఈ అమ్మాయి కనురెప్ప వాల్చే టైంలో మూడు దేశాలు తిరిగొచ్చేసింది. అందుకు సంబంధించిన వీడియోని కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారామె. ఆ అమ్మాయి పేరు సమ్రంగి సాధు జిలక్. ఆమె జర్మనీ పశ్చిమ ప్రాంతంలోని ఆచెన్ నగరం సమీపంలో మూడు దేశాల సరిహద్దు ప్రాంతాల వద్ద ఒక్క జంప్‌తో మూడు దేశాలను చుట్టేసింది అంతే. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి ప్రయాణికులు నెదర్లాండ్స్‌లోని ఎత్తైన ప్రదేశం అయిన వాల్సెర్బర్గ్ కొండను ఎక్కాలి. అక్కడ నుంచి జర్మనీ, నెదర్లాండ్స్ , బెల్జియం మూడు దేశాల సరిహద్దు నేలపై మూడు తీగలతో దిశను చూపిస్తాయి. వాటిని అటు ఇటు ఒక్క జంప్‌తో దాటితే చాలు మూడు దేశాలను మూడు నిమిషాల్లో చుట్టేయొచ్చు. దాన్నే ట్రావెల్ వ్లాగర్ వీడియోలో చూపించింది. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు పాస్‌పోర్ట్ నియంత్రణ ఎక్కడ ఉంది? అని ఒకరు, మరొకరేమో ఇలాంటి ట్రిపుల్ సరిహద్దు మరొకచోట కూడా ఉందంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Samrangy Sadhu (Jhilik) (@jhilik.sadhu) (చదవండి: రెడ్ చిల్లీసాస్‌తో రూ. 8 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం..! ఎలాంటి అడ్వర్టైస్మెంట్లు లేకుండానే..) -
అన్నతో కలిసి గ్రాండ్‌గా ఈద్ పార్టీ, సందడి చేసిన సెలబ్రిటీలు
రంజాన్ పర్వదినం సందర్బంగా వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరిగాయి. ముఖ్యంగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా శర్మ ఖాన్ సోమవారం రాత్రి ఈద్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సోదరుడితో కలిసి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. పండుగ వేడుక, గ్లామర్ రెండింటినీ మిళితం చేసిన ఈ స్టార్-స్టడెడ్ ఈవెంట్లో పలువురు బాలీవుడ్ తారలు సందడి చేశారు. ఈద్ వేడుకలో సాంప్రదాయ లుక్స్‌లో అందరూ మంత్రముగ్ధుల్ని చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విశేషంగా నిలిచాయి.రంజాన్ సందర్బంగా అర్పితా ఖాన్ ఇచ్చిన లావిష్ పార్టీకి అర్బాజ్ ఖాన్, అల్విరా ఖాన్ , ఆయుష్ శర్మ వంటి కుటుంబ సభ్యులతోపాటు పెళ్లి తరువాత తొలిసారి ఈద్ వేడుకలను జరుపుకుంటున్నసోనాక్షి సిన్హా, భర్తతో కలిసి హాజరైంది.అర్పితా శర్మ ఖాన్ నిర్వహించిన స్టార్-స్టడెడ్ ఈద్ వేడుకలో, సోనాలి బింద్రే పింక్ సూట్లో అందంగా కనిపించింది. ఇంకా జెనీలియా,రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, షమితా శెట్టి, అంగద్ బేడి, నేహా ధుపియా తదితర బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.అంతకుముందు తన సోదరి గెలాక్సీ అపార్ట్మెంట్స్లోని తన బాల్కనీ నుండి అభిమానులను పలకరించాడు. సల్మాన్ సోదరి అర్పితా కుమార్తె, మేనకోడలితో కలిసి అభిమానులకు కనువిందు చేశాడు. అధిక భద్రతా సమస్యల కారణంగా బుల్లెట్ ప్రూఫ్ అద్దాల వెనుకనుంచి తెల్లటి కుర్తా-పైజామా ధరించి ఫ్యాన్స్‌ను అభినందించారు. ఈ సందర్బంగా సల్మాన్ మూవీ "సికందర్" అంటూ సందడి చేశారు. “షుక్రియా ధన్యవాదాలు ఔర్ సబ్ కో ఈద్ ముబారక్.” అంటూ వారికి ధన్యవాదాలు తెలిపారు. దీనికి సంబంధించి ఒక వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.Shukriya Thank you aur sab ko Eid Mubarak! pic.twitter.com/EaW0CeaZWi— Salman Khan (@BeingSalmanKhan) March 31, 2025 -
బొర్రకు.. బుర్రకు లింకు! మరి ‘సెట్’ అయ్యేదెట్లా?
మీ కడుపు చల్లగుండ.. ఎవరికైనా ఏదైనా సాయం చేసినప్పుడు ఇలా దీవించడం చూసే ఉంటారు. మీరు బాగుండాలనే ఆకాంక్ష అది. కానీ కడుపు చల్లగా ఉండటం ఏమిటి అనిపిస్తుంటుందా? నిజమే.. మన కడుపు చల్లగా, అంటే ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టేనని శాస్త్రవేత్తలు ఎప్పుడో తేల్చారు. కానీ పొట్ట (bellyfat) మన ఆలోచనలపైనా, మెదడు పనితీరుపైనా ఎఫెక్ట్ చూపుతుందని తాజాగా గుర్తించారు. ఆ లింకేమిటో, దాని ఎఫెక్ట్ ఏమిటో తెలుసు కుందామా... – సాక్షి, సెంట్రల్ డెస్క్అదో ‘మైక్రోబియం’ ప్రపంచం..మన పొట్ట లోపల అంతా మనమే కాదు... ఓ సూక్ష్మజీవ ప్రపంచమే ఉంటుంది. మన జీర్ణాశయం, పేగుల్లో వేల కోట్ల సంఖ్యలో బ్యాక్టీరియా, ఫంగస్, ఇతర సూక్ష్మజీవులు ఉంటాయి. వీటన్నింటినీ కలిపి ‘మైక్రోబియం’ లేదా ‘మైక్రోబయాటా’ అని పిలుస్తుంటారు. ఒక రకంగా చెప్పాలంటే మన శరీర కణాల సంఖ్య కంటే... ఈ సూక్ష్మజీవుల సంఖ్యే ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మన తినే ఆహారం జీర్ణంకావడంలో, జీవక్రియల్లో, రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉండటానికి ఈ మైక్రోబియం కీలకపాత్ర పోషిస్తుంది. కానీ అంతకన్నా ఓ అడుగు ముందుకేసి... మన ఆలోచనలను, భావాలను కూడా ఈ ‘సూక్ష్మజీవులు’ ప్రభావితం చేస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు.డైరెక్ట్‌గా సిగ్నల్ ఇవ్వడమే..పొట్టలోని ‘మైక్రోబియం’కు, మన మెదడుకు డైరెక్ట్ లింకు ఉందని ఇటీవలి పరిశోధనల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. మైక్రోబియం ఇచ్చే సిగ్నల్స్‌ను బట్టి మెదడు పనితీరు ఉంటుందని తేల్చారు. మన మూడ్, జ్ఞాపకశక్తితోపాటు డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలు కూడా మైక్రోబియం సిగ్నల్స్‌ను బట్టి హెచ్చు తగ్గులకు లోనవుతాయని గుర్తించారు.పరిశోధనకు ‘బుల్లెట్’ దిగింది!1822లో అలెక్సిస్ సెయింట్ మార్టిన్ అనే సైనికుడి పొట్టలోకి తూటా దూసుకెళ్లింది. ఆయనకు విలియం బ్యూమెంట్ అనే ఆర్మీ వైద్యుడు చికిత్స చేశాడు. ఆ సమయంలోనే జీర్ణవ్యవస్థ పనితీరుపై పరిశోధన చేశారు. మన ఎమోషన్ల వల్ల పొట్టపై ఎలాంటి ప్రభావం పడుతుంది? పొట్ట మన మెదడును ఎలా ప్రభావితం చేస్తుందనే అంశాలను అర్థం చేసుకోవడానికి మార్గం వేసింది.గుండె, కిడ్నీలకు మాత్రం దెబ్బపడేలా..పొట్టలో ఉండే బ్యాక్టీరియాతో మాంసాహారులకు ఓ సమస్య కూడా ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. ముఖ్యంగా మటన్ వంటి రెడ్‌మీట్ తీసుకున్నప్పుడు‘టిమావో (టీఎంఏఓ)’గా పిలిచే రసాయన సమ్మేళనాన్ని బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుందని... ఈ రసాయన సమ్మేళనం రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి, గుండె జబ్బులకు, కిడ్నీ సమస్యలకు దారితీస్తుందని గుర్తించారు. అయితే ఆలివ్, గ్రేప్సీడ్ ఆయిల్ వంటివి ఆహారంలో చేర్చుకుంటే ‘టిమావో’ ఉత్పత్తి తగ్గుతోందని కూడా గుర్తించారు.తేడా వస్తే ఊబకాయమే..!జీర్ణవ్యవస్థలోని మైక్రోబియంలో బ్యాలెన్స్ దెబ్బతిన్నప్పుడు.. మెదడుకు, దాని నుంచి పిట్యూటరీ గ్రంధికి తప్పుడు సిగ్నల్స్ వెళతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనితో ఆకలిని నియంత్రించే హార్మోన్లలో తేడాలు వచ్చి.. అతిగా తినడం, ఊబకాయం బారినపడటం వంటి సమస్యలు వస్తున్నాయని గుర్తించినట్టు వివరిస్తున్నారు.‘మైక్రోబియం’ సమస్యలకు కారణమేంటి?సరైన ఆహారం తీసుకోకపోవడం, ఆల్కాహాల్ అలవాటు, యాంటీ బయాటిక్స్ అతిగా వాడటం, శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, మానసిక ఒత్తిళ్లు, యాంగ్జైటీ వంటి సమస్యలు.. పొట్టలోని ‘మైక్రోబియం’లో బ్యాలెన్స్‌ను దెబ్బతీస్తాయి. మంచి బ్యాక్టీరియా తగ్గిపోయి.. చెడు బ్యాక్టీరియా పెరిగిపోతుంది. ఎన్నో సమస్యలు మొదలవుతాయి.చదవండి: 30వ పుట్టిన రోజు : కాలినడకన ద్వారకకు అనంత్ అంబానీఇది ‘సెట్’ అయ్యేదెట్లా?అన్ని పోషకాలు, ఫైబర్ ఉండే సమతుల ఆహారం తీసుకోవడం మొదటి అడుగు. మానసిక ఒత్తిళ్లు, నిద్రలేమి వంటివి జీర్ణవ్యవస్థ పనితీరును దెబ్బతీసి ‘మైక్రోబియం’ బ్యాలెన్స్‌ను మార్చేస్తాయి. అందువల్ల వీటిని నియంత్రించుకోవాలి. పెరుగు, ఫెర్మెంటెడ్ పదార్థాలు వంటి ప్రొబయాటిక్ ఆహారం... అరటి, అల్లం, ఉల్లి వంటి పీచు (ఫైబర్) ఎక్కువగా ఉండే ప్రీబయాటిక్ ఆహారం తీసుకుంటే మైక్రోబియం ‘సెట్’ అవుతుందని.. పరోక్షంగా మెదడు ఆరోగ్యానికీ తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇప్పటికైనా మెదడు మన మాట వినకుంటే.. పొట్టతో ‘సిగ్నల్’ ఇప్పించే ప్రయత్నం చేయండి మరి. -
జస్ట్ చిల్లీసాస్‌తో రూ. 8 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం..!
వంటగదిలో ఉండే ఎరుపు మిరపకాయలతో వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాడు. అదికూడా ఓ శరణార్థిగా వేరొక దేశంలోకి వచ్చి అక్కడే కోట్లకు పడగలెత్తాడు. ఎవ్వరూ ఊహించని రీతిలో వంటల్లో ఘాటు కోసం ఉపయోగించే మిరపకాయలతో అద్భుతమైన సాస్ తయారు చేశాడు. చూస్తుండగానే అతితక్కువ కాలంలోనే వ్యాపారం విస్తరించి లాభాల బాటపట్టింది. ఎలాంటి ప్రకటన, ప్రముఖుల అడ్వర్టైస్మెంట్లు లేకుండా కేవలం నోటిమాటతో వ్యాపారం ఊపందుకునేలా చేశాడు. విచిత్రమైన లోగోతోనే ఆ ప్రొడక్ట్ నాణ్యత ఏంటో అర్థమయ్యేలా చేశాడు. అలా ఆ ప్రొడక్ట్ పేరే బ్రాండ్ నేమ్‌గా స్థిరపడిపోయేలా ప్రజాదరణ పొందింది. ఇంతకీ ఆ వ్యాపార సామ్రాజ్యం సృష్టికర్త ఎవరు..? ఎలా ఈ సాస్ని రూపొందించాడంటే..పాశ్చాత్య దేశాల్లో ఏ నాన్‌వెజ్ తినాలన్నా ఈ చిల్లీసాస్ జోడించి ఆస్వాదిస్తారు. అక్కడ ప్రజలకు ఇది లేనిదే వంట పూర్తికాదు అన్నంతగా దీనిపై ఆధారపడిపోయారు. అది కూడా పచ్చగా ఉండే పచ్చిమర్చిని కాదని పండు ఎరుపు మిర్చిలనే ఎంచుకోవడానికి ప్రధాన కారణం దాని స్పైసీనెస్ అని చెప్పొచ్చు. పచ్చిమిర్చిలోని ఘాటుకంటే పండిని పచ్చిమిర్చిలో కారం ఎక్కువ. శ్రీరాచా చిల్లీసాస్ పేరుతో డేవిడ్ ట్రాన్ అనే వియత్నాం శరణార్థి దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చాడు. అతడి ప్రస్థానం మొదలైందిలా..1945లో దక్షిణ వియత్నాంలో జన్మించిన డేవిడ్ ట్రాన్ సైగాన్కు వెళ్లాడు. అక్కడ అతను దక్షిణ వియత్నామీస్ సైన్యంలో చేరడానికి ముందు రసాయనాల వ్యాపారంలో మెళుకువలు నేర్చుకున్నాడు. అక్కడే అతను చెఫ్‌గా కూడా పనిచేసేవాడు. ఆ టైంలోనే ట్రాన్ మిరపకాయలతో సాస్ తయారీ ప్రయోగాలు చేస్తుండేవాడు. వాటిని రీసైకిల్ చేసిన గెర్బర్ బేబీ ఫుడ్ జాడిలలో నిల్వ చేసేవాడు. అయితే ఇంతలో సైగాన్లో పరిస్థితి ఉద్రీక్తంగా మారిపోయింది. డిసెంబర్ 1978లో, కమ్యూనిస్ట్ వియత్నాం, చైనా మధ్య ఏర్పడిన శతృత్వం రీత్యా అక్కడ పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయింది. దీంతో ట్రాన్కి మాతృభూమిని వీడక తప్పలేదు. అయితే అతడు అద్భుతమైన దూరదృష్టితో తన ఆస్తులను ఆ కాలంలోనే దాదాపు రూ. 85 లక్షల రూపాయలకుపైనే విక్రయించి, ఆ డబ్బుతో హుయ్ ఫాంగ్" అనే తైవానీస్ సరుకు రవాణా నౌకలో అమెరికాకు వలస వచ్చాడు. సాస్ వ్యాపారం ఆవిర్భావం..బోస్టన్‌లో కొంతకాలం పనిచేసిన తర్వాత, ట్రాన్ 1980లో లాస్ ఏంజిల్స్‌కు మకాం మార్చాడు. అక్కడే తన హాట్‌సాస్ తయారీ ప్రారంభించాడు. సాంప్రదాయ వియత్నాం మిరపకాయలకు బదులుగా స్థానికంగా లభించే జలపెనోల మిరపకాయలను ఉపయోగించి తయారు చేశాడు. వాటిని రీసైకిల్ చేసిన బేబీ ఫుడ్ జాడిలలో నింపి నీలిరండు వ్యాన్‌లో దక్షిణ కాలిఫోర్నియా అంతటా ఉన్న ఆసియా రెస్టారెంట్లకు ట్రాన్ స్వయంగా డెలివరీ చేవాడు. అలా మొదటి నెల రూ. 2 లక్షల లాభాన్ని ఆర్జించాడు దీనికి వెంచర్ క్యాపిటల నిధులు లేవు, మార్కెటింగ్ బృందం లేదు, ప్రకటను ప్రచారాలు కూడా లేవు. తన ప్రొడక్ట్‌కి ఉన్న శ్రీరాచా అనే పేరు, దాని లోగో..విలక్షణమైన గ్రీన్క్యాప్ అమ్మకాలను ఆకర్షించే ట్రేడ్‌మార్క్‌గా క్రియేట్ చేశాడు. ఎవ్వరైనా తన ప్రొడక్ట్ పేరుని వాడుకునే యత్నం చేస్తే..వారిని తన వ్యాపారానికి ఉచితంగా అడ్వర్టైస్మెంట్ చేసేవాళ్లుగా అభివర్ణించేవాడు. అంతేగాదు మా ప్రొడక్ట్ అత్యంత హాట్‌గా ఉంటుంది. ఒకవేళ వేడిచేస్తే తక్కువగా వినియోగించండి అని స్వయంగా చెప్పేవాడు. అలా అనాతికాలంలోనే లాస్ ఏంజిల్స్‌లోని చైనాటౌన్, రోజ్మీడ్, కాలిఫోర్నియా అంతటా వ్యాపారం జోరుగా ఊపందుకుంది. ఇక తన ప్రొడక్ట్‌కి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కాలిఫోర్నియాలో 650,000 చదరపు అడుగుల ఫ్యాక్టరీ పెట్టే స్థాయికి చేరుకున్నాడు. దానికి తాను అమెరికాకు వలస వచ్చిన నౌక పేరు మీదుగా హుయ్ ఫాంగ్ ఫుడ్స్ అని పేరు పెట్టాడు.అలా 2019 నాటికి, వార్షిక అమ్మకాలు రూ. 16 వందల కోట్లకు చేరుకుంది. అంతేగాదు అమెరికన్ హాట్ సాస్ మార్కెట్లో దాదాపు 10% వాటాని సొంతం చేసుకుంది. అంతేగాదు ఈ రెడ్‌చిల్లీ బాటిల్‌పై లేబుల్ వియత్నామీస్, ఇంగ్లీష్, చైనీస్, ఫ్రెంచ్ స్పానిష్ వంటి భాషలలో టెక్స్ట్‌ను కలిగి ఉండటం విశేషం. తన ప్రొడక్ట్ ఇలా లాభాలతో దూసుకుపోవడానికి కారణం కేవలం "పేదవాడి ధరకు ధనవంతుడి సరిపోయే నాణ్యతలో సాస్ తయారు చేయడం" అని అంటారు ట్రాన్. ఈ ఏడాదితో ఈ వ్యాపారం 80 ఏళ్లకు చేరుకుంటోంది. పరిశ్రమ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. అతడి వ్యాపార సామ్రాజ్యం రూ. 11 వేల కోట్లు టర్నోవర్ ఉంటుదని అంచనా. నాణ్యతలో రాజీ పడకుండా, ఎలాంటి లాభదాయకమైన కొనుగోళ్లకు కక్కుర్తిపడకుండా ప్రజల నమ్మకాన్ని చూరగొంటే ఏ వ్యాపారమైన విజయపథంలో దూసుకుపోతుందంటారు డేవిడ్ ట్రాన్. కేవలం పట్టుదల, కష్టపడేతత్వం తదితరాలే వ్యాపారానికి అసలైన పెట్టుబడులని నొక్కి చెబుతున్నాడు.(చదవండి: కష్టాలు మనిషిని కనివినీ ఎరుగని రేంజ్‌కి చేరుస్తాయంటే ఇదే..!) -
April Fools Day 2025 : కాసిన్ని నవ్వులు, మరికొన్ని జోకులు..తేడా వచ్చిందంటే!
ప్రతీ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ వచ్చిందంటే చాలు సరదాల సందడి మొదలవుతుంది. ఏదో ఒక అబద్దం చెప్పాలి, ఎవరో ఒకరిని ఏప్రిల్ ఫూల్ చేయాలి. అదే ఏప్రిల్ ఫూల్స్ డే (April Fools Day 2025) అది సమీప బంధువులు కావొచ్చు, స్నేహితులు, సన్నిహితులు సహోద్యోగులపై కావచ్చు ‘ఏప్రిల్ ఫూల్’ అంటూ ఫన్నీగా ఆట పట్టిస్తారు. అలా రోజంతా జోకులు,చిలిపి పనులతో కొనసాగుతుంది. అసలు ఈ క్రేజీ ట్రెడిషన్ ఎప్పటినుంచి, ఎలా మొదలైందో తెలుసా? అసలు ఎందుకు వచ్చిందో తెలుసా? రండి తెలుసుకుందాం..ఏప్రిల్ ఫూల్స్ డే ఎలా వచ్చింది?గత కొన్ని శతాబ్దాలుగా ఏప్రిల్ ఫూల్స్ డేను జరుపుకుంటున్నారు. అయితే ఖచ్చితమైన మూలం ఇప్పటికీ పెద్దగా ఎవరికీ తెలియదు కానీ ఒక సిద్ధాంతం ప్రకారం ఇది 1582 నాటిది, ఫ్రాన్స్ జూలియన్ క్యాలెండర్ నుండి గ్రెగోరియన్ క్యాలెండర్‌కు మారినప్పుడు, కొత్త సంవత్సరం ప్రారంభాన్ని ఏప్రిల్ 1 నుండి జనవరి 1కి మార్చారు. ఫలితంగా, ఏప్రిల్ 1న కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునే వారిని "ఏప్రిల్ ఫూల్స్" అని ఎగతాళి చేసేవారట.చదవండి: 30వ పుట్టిన రోజు : కాలినడకన ద్వారకకు అనంత్ అంబానీమరొక సిద్ధాంతం ఏప్రిల్ ఫూల్స్ డేని మార్చి 25న సైబెలే దేవత గౌరవార్థం జరుపుకునే పురాతన రోమన్ పండుగ హిలేరియాతో అనుసంధానిస్తుంది. ఈ ఉత్సవంలో ప్రజలు మారువేషాలు ధరించి తోటి పౌరులను ఎగతాళి చేసేవారు. ఇది ఆధునిక కాలపు చిలిపి పనులకు ప్రేరణనిచ్చి ఉంటుందని అంచనా. అలాగే చాలా కాలం క్రితం జెఫ్రీ చౌసర్ అనే రచయిత తన పుస్తకం ‘ది కాంటర్బరీ టేల్స్’లో ఒక జోక్ వేశారట. ఆ జోక్ ను కొంతమంది ఏప్రిల్ ఫూల్స్ డేగా పాటించడం మొదలుపెట్టారని మరికొంతమందిచరిత్రకారులు చెబుతున్న మాట. ఇంగ్లాండ్‌లో ఏప్రిల్ ఫూల్స్ డే గురించిన మొదటి లిఖిత రికార్డులు 1686 నాటివిగా భావిస్తున్నారు. జాన్ ఆబ్రే అనే రచయిత ఏప్రిల్ 1ని "మూర్ఖుల పవిత్ర దినం"గా అభివర్ణించారట. 18వ శతాబ్దం నాటికి, ఈ సంప్రదాయం బ్రిటన్ అంతటా వ్యాపించి, 19వ శతాబ్దం నాటికి ఏప్రిల్ ఫూల్స్ డే మరింత ప్రజాదరణ పొందింది. ఇక స్కాట్లాండ్లో, ఏప్రిల్ ఫూల్స్ డే రెండు రోజులపాటు జరుపుకుంటారు.సరదాగానే... తేడావచ్చిందంటే..ఏప్రిల్ ఫూల్స్ డే అనేది జీవితంలో హాస్యానికున్న ప్రాధాన్యతను గుర్తుచేసే వేడుక. ఇది ఒకర్నొకరు సరదాగా ఆటపట్టించుకోవడానికి,నవ్వుకోడానికి మాత్రమే ఉపయోగపడాలి. దైనందిన కార్యక్రమాలనుంచి కాస్తంత పక్కకు వచ్చి, కాసేపు ఉల్లాసంగా గడపడానికి మాత్రమే ఈ వేడుక. ఈ రోజు అంతా తేలికైన జోకులు పంచుకోవడం, హానిచేయని చిలిపి పనులతో అంతా సరదాగా గడిపి కొన్ని మధుర క్షణాలను పదిలపర్చుకోవడానికి మాత్రమే ఏప్రిల్ ఫూల్స్ డేని జరుపుకోవాలి. అంతే తప్ప చిలిపి పనుల పేరుతో పక్కవారికి హానిచేయడమో, సరదాల ముసుగులో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి లాంటివి చేయకూడదని గుర్తుంచుకోవాలి. లేదంటే ‘సరదా’ తీరిపోద్ది. తేడాలొచ్చాయంటే.. మాతో పెట్టుకుంటే.. మడతడిపోద్ది.. అన్నట్టు మారిపోతుంది పరిస్థితి. సో తస్మాత్ జాగ్రత్త... హ్యాపీ ఏప్రిల్ ఫూల్స్ డే.. -
30వ పుట్టిన రోజు : కాలినడకన ద్వారకకు అనంత్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఆధ్యాత్మికకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తాజాగా తన 30వ పుట్టినరోజు సందర్భంగా మరో ఆధ్మాత్మికకార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గుజరాత్‌లోని ద్వారకాధీష్ ఆలయానికి కాలినడకన వెళ్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దాదాపు 141 కిలోమీటర్లమేర కాలినడకన ద్వారకకు చేరుకుని అక్కడ శ్రీ కృష్ణుడి పాదాలకు నమస్కరించనున్నారు. రోజుకు 15-20 కిలోమీటర్ల చొప్పున ఈ ఆధ్యాత్మిక యాత్ర ముగియనుంది.జామ్‌నగర్ నుండి ద్వారకకుఎపుడూ భక్తిని చాటుకునే అనంత్ అంబానీ, జామ్‌నగర్ నుండి శ్రీకృష్ణ నగరం ద్వారకకు ఆధ్యాత్మిక యాత్ర (పాదయాత్ర)గుజరాత్‌లోని జామ్‌నగర్ నుంచి ద్వారక వరకు మార్చి 27న ప్రారంభించారు. ద్వారకలో ద్వారకాధీశుని దర్శనంతో తన పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని నిర్ణయించు కున్నారు. 140 కిలోమీటర్ల ప్రయాణం ఐదవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, అనంత్ అంబానీ ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఎల్లప్పుడూ ద్వారకాధీశుని దర్శించుకుంటాననీ, దీంతో ఆ పనులు నిర్విఘ్నంగా పూర్తయ్యాయని పేర్కొన్నారు.#WATCH | Devbhumi Dwarka, Gujarat: Anant Ambani, Director, Reliance Industries Limited, is on a 'Padyatra' from Jamnagar to Dwarkadhish TempleHe says, "The padyatra is from our house in Jamnagar to Dwarka... It has been going on for the last 5 days and we will reach in another… pic.twitter.com/aujJyKYJDN— ANI (@ANI) April 1, 2025 > "జామ్‌నగర్‌లోని మా ఇంటి నుండి ద్వారక వరకు పాదయాత్ర గత ఐదు రోజులుగా కొనసాగుతోంది, మరో రెండు నాలుగు రోజుల్లో ద్వారక చేరుకుంటాము.ద్వారకాధీశుడు మనల్ని ఆశీర్వదించుగాక. ఏదైనా పని చేసే ముందు ద్వారకాధీశుడుపై విశ్వాసం ఉంచి, ద్వారకాధీశుడిని స్మరించుకోవాలని నేను యువతకు చెప్పాలనుకుంటున్నాను. ఆ పని ఖచ్చితంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతుంది. దేవుడు ఉన్నప్పుడు, చింతించాల్సిన పని లేదు" అని ఆయన అన్నారు.Anant Ambani’s decision to walk on foot speaks volumes about his dedication to faith. pic.twitter.com/3XHK4BWMBa— Amrish Kumar (@theamrishkumar) March 31, 2025 ఏప్రిల్ 10న పుట్టినరోజుకృష్ణ భక్తుడైన అనంత్ అంబానీ జై ద్వారకాదీష్ అంటూ నినదిస్తూ ఎంతో ఉత్సాహంగా నడుస్తున్నారు. అనేక మంది భక్తులను ఆకట్టుకుంటున్నారు. పలువురు ఆయనతో సెల్ఫీలు దిగారు. అంబానీ కుటుంబానికి చెందిన వ్యక్తి పాదయాత్ర చేయడం ఇదే తొలిసారి. దీంతో అనంత్ అంబానీపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ పాదయాత్ర ద్వారా ద్వారక శ్రీ కృష్ణ మందిరానికిచేరుకుంటారు. ఏప్రిల్ 10న అనంత్ అంబానీ తన 30వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఏప్రిల్ 8 నాటికి అనంత్ అంబానీ భార్య రాధిక మర్చంట్ ద్వారక చేరుకుంటే. తరువాత, ఇద్దరూ కలిసి శ్రీకృష్ణుని దర్శనం చేసుకుంటారు. ఇటీవల ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో భార్య రాధికతోపాటు అనంత్ అంబానీ త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం చేసిన సంగతి తెలిసిందే. -
14 ఏళ్లుగా.. వేసవిలో వారి పాలిట అక్షయ పాత్ర
నగరంలోని సనత్‌నగర్‌కు చెందిన శ్రీనివాస రామానుజ చారిటబుల్ ట్రస్ట్ పేదలకు, బాటసారులకు సేవలందిస్తోంది. వేసవిలో వారి పాలిట అక్షయ పాత్రలా మారుతోంది. ప్రతి రోజూ మధ్యాహ్నం మితాహారాన్ని అందిస్తూ అభాగ్యుల ఆకలి తీరుస్తోంది. యేటా రెండు నెలల పాటు ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతం వేసవి కావడంతో మంగళవారం నుంచి మరోసారి ఈ మహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. – సనత్‌నగర్ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 14 ఏళ్లుగా అన్నార్థుల ఆకలి తీరుస్తోంది శ్రీనివాస సమాజ సేవా సమితి. స్థానిక బీకేగూడ పార్కు వద్ద రోజుకు 250 నుంచి 300 మంది వరకూ మధ్యాహ్నం మిత భోజనాన్ని వడ్డించేందుకు సీనియర్ సిటిజన్స్ సిద్ధమయ్యారు. దాతల సహకారంతో.. రోజుకు ఇద్దరు, ముగ్గురు చొప్పున దాతలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యేందుకు పోటీపడు తుంటారు. అయితే రోజుకో దాత అనే సంప్రదాయాన్ని ట్రస్ట్ కొనసాగిస్తూ వస్తోంది. దాతల కోరిక మేరకు పుట్టిన రోజు, పెళ్లిరోజు వంటి కొన్ని ప్రత్యేక తేదీల్లో వారి పేరున నలుగురికీ ఆహారాన్ని పంచుతోంది. ఈ యేడాదికి గానూ ఇప్పటికే జూన్ 2 వరకూ అన్ని రోజులకు సరిపడా దాతలు తమ తేదీలను బుక్ చేసుకున్నారు. రోజుకు రూ.5వేల చొప్పున.. ఒక్కో దాత నుంచి రోజుకు రూ.5వేల చొప్పున మాత్రమే స్వీకరిస్తారు. వీటితో రుచికరమైన వంటకాలను అందిస్తారు. బగారా రైస్, టమాటా రైస్, జీరా రైస్, కర్రీ, పెరుగన్నం, నిమ్మకాయ పచ్చడి, స్వీట్స్‌తో పాటు ప్లేట్లు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలను కలిపి రూ.5,000 గా నిర్ణయించారు. ఈ మొత్తాన్ని ట్రస్ట్‌కు నగదు, చెక్కు రూపంలో స్వీకరిస్తారు. దాతల సహకారం అపూర్వం.. మంగళవారం ఉదయం 11.30 గంటలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఈ మితాహార కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇలాంటి అపూర్వమైన కార్యక్రమంలో దాతల సహకారం అపూర్వం. దీనికి సీనియర్ సిటిజన్స్ తోడవ్వడం మా అదృష్టం. వారి సహకారం మరువలేనిది. ఏటా మాదిరిగానే చలివేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చిన శ్యాంసుందర్రాజ్కు కృతజ్ఞతలు. – పార్థసారథి, శ్రీనివాస రామానుజ ట్రస్టీ -
ప్రపంచంలోనే అత్యంత శీతల మార్కెట్..! కొనాలంటే గజగజ వణకాల్సిందే..
గజగజలాడించే చలిప్రాంతాలు గురించి ఉన్నాం. అయితే మార్కెట్లు వ్యాపార ప్రాంతాలు కాస్త అనువైన ప్రదేశాల్లో, సాధారణ ఉష్ణోగ్రతలు ఉండే చోటనే ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మార్కెట్ మాత్రం గడ్డకట్టుకుపోయే మార్కెట్. అక్కడ కొనుగోలు చేయడానికి వెళ్లాలంటే తగిన జాగ్రత్తలతో వెళ్లకపోతే అంతే సంగతులు. అంతలా వణుకుపుట్టిస్తుంది అక్కడ చలి. శీతాకాలంలో అయితే ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 60 డిగ్రీలకు పడిపోతుందట. అంతలాంటి పరిస్థితుల్లోనూ అక్కడ జనాభా వృద్ధి చెందుతుండటం విశేసం. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడుందంటే..సైబీరియాలోని యాకుట్స్క్ అనే నగరం అత్యంత శీతల నగరంగా పేరుగాంచింది. అక్కడ నివాసితులు సాధారణ పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నట్లుగా మనుగడ సాగించటం విశేషం. వాళ్లేమి ఆ చలిని పెద్దగా లెక్కచేయరు. అది వారికి అత్యంత సర్వసాధారణం. అక్కడ ఒక నాన్‌వెజ్ మార్కెట్ ఉంటుంది. సందర్శనకు వెళ్లితే గజగజ వణికిపోవాల్సిందే. దీనిపై ట్రావెల్ వ్లాగర్ అంకితా కుమార్ డాక్యుమెంట్ చేసి మరీ ఈ నగరం విశేషాల గురించి వివరించింది. ఎముకలు కొరికే చలిలో మార్కెట్‌ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు అక్కడి ప్రజలు. యాకుట్స్క్ నగరవాసులు మాంసం బాగా తింటారట. అక్కడ చేపల మార్కెట్లు కూడా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయట. ఎలాంటి వాసనరాదట. అక్కడ గుర్రం, రెయిన్ డీర్, కుందేలు, కొన్ని రకాల పచ్చి మాంసాలు, చేపలు తదితరాలను విక్రయిస్తుంటారట. అక్కడ స్థానిక ప్రజలకు బాగా ఇష్టమైనది గుర్రపు కాలేయం అట. ఈ మార్కెట్ సందర్శించాలనుకుంటే రెడీమేడ్‌గా తినగలిగే పదార్థాలను తీసుకువెళ్లితే మంచిదట. ఇంతలా వణికించే చలికి తగ్గట్టుగానే వేసవి ఉష్ణోగ్రతలు ఓ రేంజ్లో ఉంటాయట. జూలైలో యాకుట్స్క్ సగటు అధిక ఉష్ణోగ్రత 78 డిగ్రీల ఫారెన్‌హీట్ ఉంటుందట. ఇది లండన్‌తో పోలిస్తే మరింత ఎక్కువని చెబుతోంది ట్రావెల్ వ్లాగర్ అంకితా కుమార్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియోపై ఓ లుక్కేయండి మరీ.. View this post on Instagram A post shared by Ankita Kumar 🇮🇳| TRAVEL (@monkey.inc) (చదవండి: పొట్ట ఫ్లాట్‌గా ఉండాలా..? ఐతే సాయంత్రం ఆరు తర్వాత ఆ ఆరు ఆహారాలను నివారించండి!) -
మనిషిని మార్చే సాన్నిధ్యం
వర్ధమాన మహావీరుని కాలంలోనే మక్కలి గోశాల్, అజిత్ కేశకంబల్, సంజయ్ విలేతిపుత్ర అనే ప్రముఖులూ ఉండేవారు. వారంతా మహామేధావులు, పండితులు, చక్కటి సంభాషణా చతురత గల వారు. ఒక్కొక్కరికీ వేలమంది శిష్యులుండేవారు. వారు వారి గురువు లను ‘తీర్థంకరుడు’ అనే గౌరవానికి అర్హులుగానే భావించేవారు. కానీ మహావీరుడు ‘తీర్థంకరుడై’ వేల ఏండ్లుగా జనంచే పూజింపబడుతున్నాడు. కానీ వారేమో చక్కటి వాగ్ధాటి, పాండిత్యం ఉన్న వారైనా కనుమరుగై కాలగర్భంలో కలిసి పోయారు.ఎక్కువ కాలం మౌనంగా ఉండి, ఎపుడో నాలుగు మాటలు చెప్పిన మహావీరుడు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. కారణం ఏమై ఉంటుంది? మహావీరుని జ్ఞానం స్వాను భవంతో వచ్చినది, ఇతరులది కేవలం శాస్త్ర పాండిత్యం. అంతరంగంలోని కరుణ నుండి వెలువడిన వాక్కులు మహావీరునివి! వారి వేమో మెదడు నుండి బయల్పడినవి. మహావీరుని మాట కాదు... ఆయన ఉనికే చుట్టూ వున్న వారిపై గణనీయమైన ప్రభావం చూపి వారిలో సమూల మార్పు తెచ్చేది.ఆనాడు దొంగతనం చేసి కుటుంబ పోషణ చేసే ఒక గజదొంగ తన అంత్యదశలో తన కుమారుడికి ఇచ్చిన సలహా: ‘నీవు ఎట్టి పరిస్థితుల్లోనూ మహావీరుడున్న ప్రాంతానికి వెళ్ళవద్దు. ఈ ఊరికి ఆయన వచ్చాడని తెలిస్తే వెంటనే నీవు పొరుగూరికి పారిపో. పొరబాటున కూడా ఆయన చెప్పే ఒక్క మాట కూడా నీ చెవిలో పడకుండా జాగ్రత్త పడు. ఒక్క మాట విన్నా నీవు మన వృత్తిని కొనసాగించలేవు, కుటుంబ పోషణ చేయలేవు జాగ్రత్త.’ దీన్ని బట్టి మహావీరుని మాట ఎంతటి ప్రభావం చూపగలదో అర్థం చేసుకోవచ్చు. (27-35 పుటలు: హిడెన్ మిస్టరీస్–ఓషో) పుణ్య పురుషుల సాన్నిధ్యంలో క్రూరమృగాలు సాధు జంతువులవుతాయి, దుర్మార్గులు సన్మార్గులవుతారు.– రాచమడుగు శ్రీనివాసులు -
పొట్ట ఫ్లాట్‌గా ఉండాలా..? ఐతే సాయంత్రం ఆరు తర్వాత..
బానపొట్ట ఉంటే ఎలాంటి ఫ్యాషన్ వేర్లను ధరించలేం. ఆడవాళ్లు అయితే సంప్రదాయ వస్త్రాలైన చీర వంటి వాటిని ధరించినప్పుడు కాస్త ఇబ్బందిగా ఫీలవ్వుతారు. ఇక మగవాళ్లు జీన్స్, పంచె వంటి ట్రెడిషనల్ వేర్లను ధరించినప్పుడూ స్పష్టంగా పొట్ట ఎత్తుగా కనిపిస్తుంది. అబ్బా ఈ పొట్ట కరిగిపోయి చక్కగా ఫ్లాట్‌గా ఉంటే బాగుండును అని అనుకోని వారే లేరు. ఎందుకంటే పెద్దవాళ్లే కాదు చిన్నారులు, టీనేజర్లు కూడా ఈ సమస్యనే అధికంగా ఎదుర్కొంటున్నారు. అయితే ఆ సమస్యకు సింపుల్‌గా ఇలా చెక్పెట్టేయండి అంటూ ప్రముఖ పోషకాహార నిపుణురాలు ప్రీతికా శ్రీనివాసన్ ఇన్స్టాగ్రాం వేదికగా చక్కటి సూచనలిచ్చారు. అవేంటో చూద్దామా..!.ఫ్లాట్ స్టమక్ కోసం చాలామంది ప్రయత్నిస్తుంటారు. జిమ్, వర్కౌట్లంటూ పలు వ్యాయామాలు చేసేస్తుంటారు. అయినా పొట్ట ఫ్లాట్‌గా అవ్వడం లేదని వాపోతుంటారు. అలాంటప్పుడే తీసుకునే ఆహారాలపై ఫోకస్ పెట్టాలంటున్నారు ప్రీతికా. ఎలాంటి ఆహారాలు ఏ సమయాల్లో తీసుకుంటే మంచిది అనేదానిపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. ఈ ఆహార స్ప్రుహ మిమ్మల్ని అనారోగ్య సమస్యల నుంచే గాక బానపొట్టను నివారిస్తుందని చెబుతున్నారామె. అదెలోగా ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.రాత్రిపూట మనం తీసుకునే ఆహారాలే బానపొట్టకు ప్రధాన కారణమని చెబుతున్నారు. కొన్ని రకాల ఆహారాలు పగటిపూట తీసుకోవడమే మంచిదట. మరికొన్ని రాత్రి సమయాల్లో నివారిస్తే ఈ సమస్య తగ్గుముఖం పట్టడమే గాక పొట్ట వచ్చే అవకాశం ఉండదని నమ్మకంగా చెబుతున్నారు. అందుకోసం ఏం చేయాలంటే..నివారించాల్సిన ఆహారాలు..పొట్ట ఫ్లాట్‌గా ఉండాలనుకుంటే.. సాయంత్రం ఆరు తర్వాత ఆరు ఆహారాలను పూర్తిగా నివారించాలని చెప్పారు. అవేంటంటే..చక్కెర కలిగిన ఆహారాలు కేకులు, కుకీలు, చాక్లెట్లు సాయంత్రం ఆరు తర్వాత పూర్తిగా నిషేధించండి. ఎందుకంటే వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బొడ్డు కొవ్వు నిల్వకు దారితీస్తాయి. ఫలితంగా బరువు పెరుగుతారు. మొదట్లో కష్టంగా అనిపించినా.. రాను రాను అదొక అలవాటుగా మారుతుందట. అలాగే భారీ ప్రోటీన్లు రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. ప్రోటీన్ అనేది ఆరోగ్యకరమైనప్పటికీ ఎర్రమాంసం, కూరలు వంటి భారీ ఆహారాలు రాత్రి సమయంలో జీర్ణం కావడం కాస్త కష్టం. ఫలితంగా నిద్ర లేమి, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయి. బదులుగా చికెన్ బ్రెస్ట్, గుడ్లు, వంటి తేలికపాటి ప్రోటీన్లు తీసుకోండి. కార్బోనేటెడ్ పానీయాలు అస్సలు ఆరోగ్యానికి మంచివి కావని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు ప్రీతికా. పొట్ట ఫ్లాట్‌గా ఉండాలనుకుంటే సాయంత్రం ఆరు తర్వాత దీన్ని పూర్తిగా నివారించండి అని సూచిస్తున్నారు. ఆఖరికి సోడాలు, బీర్లు, బిస్లరీ వాటర్ తదితరాలను కూడా నిషేధించండి. ఇవి పొట్ట ఉబ్బరం,గ్యాస్, కొవ్వు పెరిగేందుకు కారణమవుతాయట. ఇక సాయంత్రం ఆరు తర్వాత పాల ఉత్పత్తులను నివారించండి. ఇవి కడుపుపై చాలా భారాన్ని మోపుతాయట. ఇవి అరగడానికి సమయం ఎక్కువగా తీసుకోవడమే గాక జీర్ణ సమస్యలు, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుందట. అందుకే సాధ్యమైనంత వరకు పాలు, చీజ్, పెరుగు, క్రీమ్‌లు వంటి వాటిని రాత్రిపూట నివారించండి. వాటిని హాయిగా పగటిపూట తినండి గానీ సాయంత్రం తీసుకోవద్దు. తెల్లబియ్యం, శుద్ధిచేసిన కార్బోహైడ్రేట్లు, బ్రెడ్లు వంటివాటికి కూడా దూరంగా ఉండండి. వీటివల్ల ఇన్సులిన్ స్పైక్స్, బొడ్డు కొవ్వు పెరిగేందుకు దారితీస్తుంది. చివరగా డీప్-ఫ్రైడ్ ఫుడ్స్.. ఫ్రెంచ్ ఫ్రైస్, పకోడీలు, కచోరీలు, సమోసాలు వంటి డీప్-ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవద్దు. ఈ ఆహారాల్లో కేలరీలు అధికంగా ఉంటాయి. జీవక్రియను నెమ్మదిస్తాయి. పైగా శరీరంలో అధిక కొవ్వు నిల్వకు దారితీస్తాయి. పైన చెప్పిన ఈ ఆరు ఆహారాలను డైట్లో నివారించడం ప్రారంభించిన తర్వాత ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు మొదలవుతాయని చెబుతున్నారు పోషకాహార నిపుణురాలు ప్రీతికా. అంతేగాదు బానపొట్ట సమస్య తగ్గడమే గాక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందన్నారు. View this post on Instagram A post shared by LogaPritika Srinivasan (@fitmom.club) (చదవండి: భగభగమండే ఎండల్లో చర్మ సంరక్షణ కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!) -
యువతలో జోష్ నింపుతున్న క్రియేటర్ మీట్స్
సృజనాత్మక శక్తి కలిగిన క్రియేటర్లకు హైదరాబాద్ నగరం చిరునామాగా మారుతోంది. పలువురు యువతీ యువకులు సోషల్ మీడియాలో తమ సత్తా చాటుతున్నారు. అత్యధిక ఫాలోవర్లను, వ్యూస్‌ను అందుకుంటూ దూసుకుపోతున్నారు. పెద్ద సంఖ్యలో వెలుగులోకి వస్తున్న సిటీ డిజిటల్ స్టార్స్‌ను సొంతం చేసుకునేందుకు, మరింత మందిని తమవైపు తిప్పుకునేందుకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ హైదరాబాద్ నగరంపై దృష్టి సారించాయి. విభిన్న రకాల ఈవెంట్లతో నగర యువతను ఊపేస్తున్నాయి. ఈ యాప్స్ ఉపయోగించేవారిలో అత్యధికులు టీనేజర్లు, అందులో యువతులు ఉండడంతో ఈ ఆన్లైన్ యాప్స్ వారి కోసం నగరంలో పలు ఆఫ్‌లైన్ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నాయి. క్రియేటర్లకు అవగాహన, మార్గదర్శకత్వం అందించడంతో పాటు కొత్త కొత్త సాంకేతిక నైపుణ్యాలను అందిపుచ్చుకుంటూ మరింత రాణించేందుకు అన్ని విధాలా సహకరిస్తున్నాయి. అంతేకాకుండా తమ ఫాలోయింగ్, లైక్స్, వ్యూస్ ఉపయోగించుకుంటూ ప్రకటనలు పొందడం, మానిటైజేషన్ అవకాశాలను మెరుగుపరుచుకోవడంపైనా అవగాహన కలిగిస్తున్నాయి. హైదరాబాద్ తొలి ప్రాధాన్యత.. దేశవ్యాప్తంగా దాదాపు 200 మిలియన్ల క్రియేటర్లను కలిగి ఉన్న ప్రముఖ సోషల్ వేదిక స్నాప్‌చాట్ తన తొలి స్నాప్‌చాట్ క్రియేటర్ కనెక్ట్ కార్యక్రమాన్ని నగరంలోని దుర్గం చెరువు సమీపంలో ఉన్న ఆలివ్ బిస్ట్రో రెస్టారెంట్లో గత బుధవారం నిర్వహించింది. క్రియేటర్లకు అన్ని రకాలుగా సహాయ సహకారాలతో పాటు ఆదాయం ఆర్జించే అవకాశాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ ఈవెంట్ నిర్వహించినట్టు స్నాప్ ఇన్ కార్పొరేషన్ కంటెంట్, ఏఆర్ భాగస్వామ్యాల డైరెక్టర్, సాకేత్ ఝా సౌరభ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాంతీయ కంటెంట్ క్రియేటర్లకు తోడ్పడేందుకు నగరానికి చెందిన క్రియేటివ్ మీడియా సంస్థలు, తమడ మీడియా, చాయ్ బిస్కెట్, సిల్లీ మాంక్స్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు ప్రకటించారు. ప్రత్యేకంగా క్రియేటర్ డే సృష్టి.. అంతర్జాతీయ స్థాయిలో క్రియేటర్ల కోసం ప్రత్యేకంగా క్రియేటర్స్ డే కూడా నిర్వహిస్తున్నారు. మెటా ఆధ్వర్యంలోని ఫేస్బుక్, ఇన్‌స్టా ముంబయి, బెంగళూర్ సహా హైదరాబాద్‌లో నూ క్రియేటర్స్ డే ఘనంగా నిర్వహిస్తున్నాయి. దీంతో పాటే ఔత్సాహిక యువత కోసం ఈ యాప్స్ గతేడాదిలో క్రియేటర్స్ ల్యాబ్‌ను కూడా అందుబాటులోకి తెచ్చాయి. నటి రష్మిక మందన్న, హీరో నానితో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ ఈవెంట్స్‌లో పాల్గొంటుండడంతో వీటికి యువత నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో నగరాన్ని క్రియేటర్స్ హబ్‌గా చూడడం తథ్యం అనిపిస్తోంది. సోషల్ మీడియా ద్వారా కనెక్ట్ అవడం బాగుంది.. ‘యూ ట్యూబ్, ఇన్‌స్టా ద్వారా ప్రపంచవ్యాప్తంగా నిత్యం వేలాది, లక్షలాది మందితో కనెక్ట్ అవ్వొచ్చు’ అని చెప్పారు యాంకర్ లాస్య. ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రిటీగా తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ తెచ్చుకుంది లాస్య.. ప్రత్యేకంగా ఇలాగే చేయాలనే ముందస్తు ప్లాన్స్ లేకుండా అప్పటికప్పుడు చేసే సరదా బిట్స్ కూడా వీక్షకాదరణ పొందే అవకాశం లభిస్తోంది. ప్రస్తుతం టీవీకి, సినిమాకీ కొంత దూరంగా ఉన్నా, దీని ద్వారా ఆ లోటు తీరుతోంది. అయితే ఇప్పటికీ మంచి అవకాశం వస్తే వెండితెరపై మెరిసేందుకు సిద్ధమే. నా భర్త మంజునాథ్‌తో కలిసి కంటెంట్ క్రియేట్ చేస్తున్నా. ఈ సోషల్ మీడియాలో క్రియేటర్స్‌గా రాణించాలంటే ఎప్పటికప్పుడు మన స్కిల్స్ మెరుగుపరుచుకుంటూ, కొత్త కొత్త పోకడలు అందిపుచ్చుకుంటూ ఉండడం అవసరం. దీనికి ఈ యాప్స్ నిర్వహిస్తున్న ఆఫ్‌లైన్ ఈవెంట్స్ బాగా ఉపకరిస్తున్నాయి. ఈ కారణంగానే మేము స్నాప్ చాట్ ఏర్పాటు చేసిన క్రియేటర్స్ కనెక్ట్ ప్రోగ్రామ్‌కి అటెండ్ అయ్యాం. – మంజునాథ్ లాస్య (యాంకర్) (చదవండి: పింకీ ట్రిగ్గర్..! గంటల తరబడి ఫోన్ వాడుతున్నారా..?) -
పింకీ ట్రిగ్గర్..! గంటల తరబడి ఫోన్ వాడుతున్నారా..?
అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తూ పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకూ ప్రతి ఒక్కరూ దీనికి బానిసలే.. అదే నిత్యవ్యాపకంగా మారిన సెల్‌ఫోన్. ఈ మధ్యకాలంలో సెల్ ఉపయోగించని వారు లేరంటే అతిశయోక్తిలేదు. లేచింది మొదలు పడుకునే వరకూ దాదాపు ఫోన్‌తోనే కాలక్షేపం చేస్తున్న వారు అధికం అవుతున్నారు. దీంతో వీరిని రకరకాల రుగ్మతలు వెంటాడుతున్నాయి. వాటిలో ఒకటే పింకీ ట్రిగ్గర్, ఫోన్ పింకీ అని పిలుస్తున్నారు. అధిక శాతం మంది కనీసం రోజులో 4–6 గంటలు సగటున ఫోన్ వినియోగిస్తున్నారు. ఇక 13–18 మధ్య వయసు వారు 5–7 గంటలు, 18–30 మధ్య వయసు వారు 6–10 గంటలు, ఉద్యోగాలు చేసేవారు 3–5 గంటలు, సీనియర్ సిటిజన్స్ 1–3 గంటల పాటు ఫోన్ వినియోగిస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. సోషల్ మీడియా రాకతో ఎంటర్టైన్మెంట్, ఆన్లైన్ గేమ్స్, ఎడ్యుకేషన్, వీడియోలు, రీల్స్ ఇలా ఏ వయసు వారు ఆ స్థాయిలో ఫోన్ వినియోగిస్తున్నారు. పెరుగుతున్న సమస్యలు.. అతిగా ఫోన్ వినియోగించడం వల్ల రక రకాల రుగ్మతులు వెంటాడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇటీవల వెంటాడుతోన్న రుగ్మతల్లో ఒకటి పింకీ ఫింగర్, పింకీ ట్రిగ్గర్, ఫోన్ పింకీ ఒకటి. ఈ పదాలు వినడానికి కొత్తగా అనిపించినా ప్రస్తుతం వేదిస్తోన్న ప్రధాన సమస్య. గంటల తరబడి చిటికెను వేలుపై ఫోన్ బ్యాలెన్స్ చేయడం వల్ల ఈ సమస్య తలెత్తుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుల తరబడి ఫోన్ బరువు పడడంతో వేలుపై ఒత్తిడి పెరిగి తాత్కాలికంగా చిన్న డెంట్ ఏర్పడుతోంది. ఒత్తిడి తగ్గించాలివేళ్లపై అధిక ఒత్తిడి పడడంతో ఆ ప్రభావం నరాలపైనా పడుతోంది. ఫలితంగా కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనే సమస్యకు దారితీస్తోంది. ఇదో గందరగోళ వైద్య సమస్య అని చెబుతున్నారు. అంతేకాకుండా బొటనవేలు సందుల మధ్య కండరాలు ప్రభావితం చెందడం వల్ల ‘టెక్ట్సింగ్ థంబ్’ సమస్య ఏర్పడుతోంది. దీంతోపాటు ఎక్కువ సేపు తల వంచి ఫోన్ చూడటం వల్ల మెడ కండరాలపై ఒత్తిడి పెరిగి మెడనొప్పి సమస్యకు దారితీస్తోంది. వీటి నుంచి బయట పడటానికి రెండు చేతులూ వినియోగించడం, ఫోన్ స్టాండ్స్ వాడటం, చేతి వేళ్లకు విశ్రాంతి ఇవ్వడం, చేతుల వ్యాయామం చేయడం ఉత్తమం. – డాక్టర్ బి.చంద్రశేఖర్, షోల్డర్ సర్జన్, కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్స్, బేగంపేట (చదవండి: భగభగమండే ఎండల్లో చర్మ సంరక్షణ కోసం ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!) -
ఎండల్లో ఒళ్లు జాగ్రత్త..!
మానవ మనుగడకు ఎండ ఎంత అవసరమో... అందులోని రేడియేషన్‌తో... అందునా ముఖ్యంగా రేడియేషన్ స్పెక్ట్రమ్‌లోని అల్ట్రా వయొలెట్ కిరణాలతో అంత ప్రమాదం. ఎండ ఎప్పుడూ బాహ్య అవయవమైన చర్మంపైనే పడుతుంది కాబట్టి మొదటి ప్రమాదం మేనికే. పైగా ఇప్పుడు వేసవి ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. గత కొన్నేళ్లతో ΄ోలిస్తే ఫిబ్రవరి మొదటి వారాల్లోనే ఎండ తీవ్రతలు మొదలయ్యాయి. ఈ ఎండల్లో రేడియేషన్ నుంచి ముఖ్యంగా అందులోని అల్ట్రా వయొలెట్ కిరణాల దుష్ప్రభావాలనుంచి ఎలా రక్షించుకోవాలో తెలుసుకుందాం. సూర్యకాంతిలో అల్ట్రావయొలెట్ రేడియేషన్ భూ వాతావరణంలోకి ప్రవేశించగానే అందులోని అల్ట్రా వయొలెట్–ఏ, అల్ట్రా వయొలెట్–బీ, అల్ట్రా వయొలెట్–సీ (వీటినే సంక్షిప్తంగా యూవీ–ఏ, యూవీ–బీ, యూవీ–సీ అంటారు) అనే మూడు రకాల రేడియేషన్లు వాతావరణంలో ప్రవేశించాక ప్రధానంగా యూవీ–ఏ, యూవీ–బీ కిరణాలు చర్మంపై పడతాయి. అదృష్టవశాత్తూ అల్ట్రా వయొలెట్ రేడియేషన్‌లోని ప్రమాదకరమైన యూవీ–íసీ వాతావరణంలోకి ఇంకి΄ోతాయి. దాంతో యూవీఏ, యూవీబీ రెండూ చర్మంపై పడతాయి. అయితే ఈ రేడియేషన్‌లో దాదాపు 5 శాతం తిరిగి వెనక్కు వెళ్తాయి. మరికొంత పరిమాణం అన్నివైపులకూ చెదిరిపోతుంది. ఎండ తీవ్రంగానూ, నేరుగా పడే భూమధ్యరేఖ, ఉష్ణమండల ప్రాంతాల్లో యూవీ కిరణాల ప్రభావం ఎక్కువ అని చాలామంది అనుకుంటారు గానీ... నిజానికి మంచు కప్పి ఉన్న ప్రాంతాల్లోనే రేడియేషన్ ప్రభావమెక్కువ. అంటే భూమధ్య రేఖ కంటే ధ్రువాల వైపు ΄ోతున్న కొద్దీ, అలాగే ఎత్తుకు పోయిన కొద్దీ..., అలాగే వేసవి ముదురుతున్న కొద్దీ, వాతావరణంలో మబ్బులు లేకుండా నీలం రంగు ఆకాశం ఉన్నప్పుడూ ఈ రేడియేషన్‌లోని యూవీ కిరణాల తీవ్రత పెరుగుతుంది. రేడియేషన్‌లో ప్రమాదకరమైనది యూవీ–బీ... యూవీ–ఏ, యూవీ–బీలలో రెండోది (యూవీ–బీ) చాలా ప్రమాదకరమైనది. అది చర్మం తాలూకు ‘ఎపిడెర్మిస్’ అనే పొరను తాకాక అక్కడి డీఎన్ఏ, ఆర్ఎన్ఏ, ట్రి΄్టోఫాన్, టైరోజిన్, మెలనిన్లు ఆ కిరణాలను చర్మంలోకి ఇంకి΄ోయేలా చేస్తాయి. ఆ తర్వాత అవి చర్మంలోని మరో పొర ‘డెర్మిస్’నూ తాకుతాయి. అక్కడి ఇంట్రావాస్కులార్ హీమోగ్లోబిన్, డెర్మిస్లోని టిష్యూ బైలింబిన్ అనే కణజాలాలు వాటిని గ్రహించి మళ్లీ వెనకకు పంపుతాయి. అయితే ఈ ప్రక్రియలో అల్ట్రావయెలెట్ కిరణాలు గ్రహించిన ప్రతి డీఎన్ఏలో ఎంతోకొంత మార్పు రావడం జరుగుతుంది. అలాంటి మార్పులు చాలా పెద్ద ఎత్తున లేదా తీవ్రంగా జరిగినప్పుడు చర్మంపై అవి దుష్ప్రభావాల రూపంలో వ్యక్తమవుతాయి. ఇన్‌డోర్స్‌లో ఉన్నా ప్రమాదమే... ఇండ్లలో ఉన్నవాళ్ల మీద అల్ట్రావయొలెట్ రేడియేషన్ దుష్ప్రభావం ఉండదన్నది చాలా మందిలో ఉండే మరో అ΄ోహ. ఆరుబయటితో పోలిస్తే ఇన్‌డోర్స్‌లో కాస్త తక్కువే అయినా... రేడియేషన్ దుష్ప్రభావాలు గదుల్లో ఉన్నా ఎంతోకొంత ఉండనే ఉంటాయి. గదిలో ఉన్నప్పుడు మనకు అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావం ఉండదని అనుకుంటాంగానీ... ఇళ్లలో ఉండే ట్యూబ్లైట్స్, ఎలక్ట్రిక్ బల్బుల నుంచి కూడా దాదాపు 5 శాతం వరకు రేడియేషన్ ఉంటుంది. ఆకాశంలో మబ్బులు కమ్మి ఉన్నప్పుడు అల్ట్రా వయొలెట్ కిరణాల తీవ్రత కొద్దిగా తక్కువగా ఉండవచ్చు. కొన్ని వ్యాధుల్లో ఎండ వల్ల పెరిగే తీవ్రత... కొందరిలో ఈ కింద పేర్కొన్న ఆరోగ్య సమస్యల్లో ఏదో ఒకటి ముందుగానే ఉండవచ్చు. అయితే తీక్షణమైన ఎండకు అదేపనిగా ఎక్కువ సేపు ఎక్స్పోజ్ కావడం వల్ల ముందున్న వ్యాధి తీవ్రత పెరగవచ్చు. ఆ ఆరోగ్య సమస్యల్లో ఇవి కొన్ని... యాక్నె (మొటిమలు) అటోపిక్ ఎగ్జిమా (స్కిన్ అలర్జీ) పెలగ్రా లూపస్ అరిథమెటోసిస్, హెర్పిస్ సింప్లెక్స్ బుల్లస్ పెఫిగోయిడ్ లైకెన్ ప్లానస్ సోరియాసిస్ వైరల్ ఇన్ఫెక్షన్స్ మెలాస్మా వంటివి ముఖ్యమైనవి. రేడియేషన్ వల్ల చర్మానికి జరిగే అనర్థాలివి... అల్ట్రా వయొలెట్ కిరణాలకు ఎక్స్పోజ్ కావడం వల్ల...సన్ బర్న్స్ సన్ ట్యానింగ్ చర్మం మందంగా మారడం గోళ్లకు నష్టం కావడం అసలు వయసు కంటే పెద్ద వయసు వారిగా కనిపించడం. ఇక ఈ అంశాల గురించి వివరంగా చెప్పాలంటే... సన్‌బర్న్స్: రేడియేషన్‌లోని అల్ట్రా వయొలెట్ కిరణాల ప్రభావం మొట్టమొదట కణాల్లోని చర్మకణాల్లోని డీఎన్ఏ పై పడుతుంది. అంతకంటే ముందు మొదట చర్మం వేడెక్కుతుంది. తర్వాత ఎర్రబారుతుంది. ఆరుబయటకు వెళ్లినప్పుడు ఆ ప్రభావం నేరుగా ఎండ పడే చోట... అంటే... ఎండకు ఎక్స్΄ోజ్ అయ్యే ముఖం మీద, చేతుల మీద త్వరగా కనిపిస్తుంది. బాగా ఫెయిర్‌గా ఉండి తెల్లటి చర్మంతో ఉన్నవారిలో సన్‌బర్న్స్ త్వరగా కనిపిస్తాయి. అయితే మన దేశవాసుల్లో సన్‌బర్న్స్ కాస్త తక్కువే. సన్ ట్యానింగ్ : ఎండ తగిలిన కొద్దిసేపట్లోనే చర్మం రంగు మారి అలా అది కొన్ని నిమిషాలు మొదలుకొని కొన్ని గంటల పాటు అలాగే ఉంటుంది. దీన్నే ‘ఇమ్మీడియెట్ ట్యానింగ్’ అంటారు. ఇలా మారిన రంగు (నల్లబారడం) మొదట తాత్కాలికంగానే ఉంటుంది. కానీ ఎప్పుడూ ఎండలోనే ఉండేవారిలో రంగు మారడం చాలాకాలం పాటు కొనసాగి, ఆ మారిన రంగు కాస్తా అలాగే చాలాకాలం పాటు ఉండిపోతుంది. దీన్నే ‘డిలేయ్డ్ ట్యానింగ్’ అంటారు. అటు తర్వాత అలా చాలాకాలం పాటు ఎండకు అదేపనిగా ఎక్స్పోజ్ అవుతూ ఉండేవారిలో చర్మం మందంగా మారుతుంది. ఇలా కావడాన్ని ‘హైపర్ప్లేషియా’ అంటారు. తెల్లగా, ఎర్రగా ఉన్నవారిలో ఇలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.ఎండ ప్రభావం గోళ్ల మీద కూడా...ఎండకు అదేపనిగా ఎక్స్΄ోజ్ అవుతుండే గోళ్లకు కూడా నష్టం జరిగే అవకాశముంది. నిత్యం అల్ట్రావయొలెట్ రేడియేషన్‌కు గురయ్యే గోళ్లలో వేలి నుంచి గోరు విడివడి ఊడి΄ోయే అవకాశముంటుంది. ఇలా జరగడాన్ని వైద్యపరిభాషలో ‘ఒనైకోలైసిస్’ అంటారు. ఎండ తీవ్రతతో వచ్చే చర్మవ్యాధులివి... ఎండలోని అల్ట్రావయొలెట్ రేడియేషన్‌కు అదేపనిగా ఎక్స్పోజ్ అయ్యేవారిలో కొన్ని రకాల చర్మవ్యాధులు వచ్చే అవకాశముంది. అవి... పాలీమార్ఫిక్ లైట్ ఎరప్షన్స్ : ఇవి యుక్తవయస్కుల్లో, పిల్లల్లో ఎక్కువ. చర్మంపై ముఖ్యంగా చెంపలపైన, ముక్కుకు ఇరువైపులా ఎర్రగా ర్యాష్ రావడం, అరచేతి పైనా, మెడ వెనక ఈ ర్యాష్ కనిపిస్తుంది. ఇందులో దురద కూడా ఎక్కువే. ముఖం మీద తెల్లటి మచ్చలు వస్తాయి. ఆక్టినిక్ ప్రూరిగో: ఈ సమస్య ప్రధానంగా అమ్మాయిల్లో ఎక్కువ. చర్మం అలర్జీలు ఉన్నవారిలో ఎక్కువ. మొదట చిన్న చిన్న దురద పొక్కుల్లాగా వచ్చి, అవి పెచ్చులు కట్టి, మచ్చలా మారుతుంటాయి. అలా వచ్చిన మచ్చ ఎన్నటికీ పోదు. హైడ్రోవాక్సినిఫార్మ్ : ఈ సమస్య పిల్లల్లో కనిపించడం ఎక్కువ. ఇవి దురదగా ఉండే రక్తపు నీటి పొక్కుల్లా ఉంటాయి. చాలా ఎర్రగా మారి, ఆ తర్వాత ఎండి, రాలిపోతాయి. అటు తర్వాత అక్కడ చికెన్పాక్స్లో ఉండే మచ్చలాంటిది పడుతుంది. చెంపలు, చెవులు, ముక్కు, చేతుల మీద ఈ పొక్కులు ఎక్కువగా వస్తుంటాయి. సోలార్ అట్రికేరియా: ఎండకు బాగా ఎక్స్పోజ్ అయిన వాళ్లల్లో కొద్ది నిమిషాల్లోనే అకస్మాత్తుగా చర్మం మీద ఎర్రగా, దద్దుర్లు వస్తాయి. ఇవి ఎవరిలోనైనా రావచ్చు. క్రానిక్ యాక్టినిక్ డెర్మటైటిస్: ఇదో రకం స్కిన్ ఇన్ఫెక్షన్. ఇది వచ్చిన చోట చర్మం ఎర్రగా, మెరుస్తున్నట్లుగా, మందంగా మారి, దురద వస్తుంది. అది వచ్చిన చోట చర్మం పొడిగా మారడమే కాకుండా ఉబ్బినట్లుగా అవుతుంది. ఇది ముఖ్యంగా ముఖం మీద ఎక్కువగా కనిపించినప్పటికీ మాడు, వీపు, మెడ, ఛాతి, చేతుల మీదికి కూడా వ్యాపిస్తుంది. పెద్దవయసు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. స్కిన్ అలర్జీ, పుప్పొడితో కనిపించే అలర్జీలతోపాటు కలిసి వస్తుంది. చర్మ కేన్సర్లు : నిరంతరం నేరుగా, తీక్షణంగా పడే ఎండలో ఎక్కువగా ఉండేవారికి చర్మక్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువ. వీటిల్లో మెలనోమా, నాన్మెలనోమా అని రెండు రకాల క్యాన్సర్లు రావచ్చు. అల్ట్రా వయొలెట్ రేడియేషన్‌తో ఉండే కొన్ని ప్రయోజనాలివి... అల్ట్రా వయొలెట్ రేడియేషన్ వల్ల కొన్ని ఉపయోగాలు ఉంటాయి. అవి... విటమిన్ డి ఉత్పత్తికి : అల్ట్రా వయొలెట్ కిరణాలకు ఎక్స్΄ోజ్ కాక΄ోతే అసలు విటమిన్–డి ఉత్పత్తే జరగదు. ఎముకల బలానికీ, వ్యాధినిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండటానికీ, అనేక జీవక్రియలకూ విటమిన్–డి చాలా అవసరమన్న విషయం అందరికీ తెలిసిందే. ఎముకల బలానికి అవసరమైన క్యాల్షియమ్ మెటబాలిజమ్, ఎముకల పెరుగుదల, నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం కోసం, ఇన్సులిన్ ఉత్పత్తికి కూడా అల్ట్రా వయొలెట్ రేడియేషన్ కొంతమేరకు అవసరమవుతుంది. కొన్ని రకాల ఆరోగ్య సమస్యల చికిత్సల్లో : సోరియాసిస్, విటిలిగో, ఎగ్జిమా వంటి కొన్ని ఆరోగ్య సమస్యల చికిత్సలో అల్ట్రా వయొలెట్ కిరణాలను ఉపయోగిస్తుంటారు. పుట్టుకామెర్ల చికిత్సలో : నవజాత శిశువుల్లో వచ్చే పుట్టుకామెర్లు (జాండీస్)ను తగ్గించడం కోసం అల్ట్రా వయొలెట్ కిరణాలు ఉపయోగపడతాయి. ఎండలో ఉండే వ్యవధి, తీవ్రత... పెరుగుతున్న కొద్దీ దుష్ప్రభావాల పెరుగుదల... ఎండకు ఎంతసేపు అదేపనిగా ఎక్స్పోజ్ అవుతుంటే దుష్ప్రభావాలూ అంతగా పెరుగుతాయి. అలాగే అల్ట్రావయొలెట్ రేడియేషన్ తాలూకు తీవ్రత పెరుగుతున్నకొద్దీ నష్టాల తీవ్రత దానికి అనుగుణంగా పెరుగుతూనే ఉంటుంది. ఇందుకు ‘ఫొటో ఏజింగ్’ ఒక ఉదాహరణ. ఫొటో ఏజింగ్ అంటే ఎండకు ఎక్స్పోజ్ అవుతున్న కొద్దీ అంటే... ఎక్స్పోజ్ అయ్యే వ్యవధి పెరుగుతున్న కొద్దీ ఆ వ్యక్తి తన వాస్తవ వయసుకంటే ఎక్కువ వయసు పైబడినట్లుగా కనిపిస్తుంటాడు. అల్ట్రా వయొలెట్–బి రేడియేషనే ఇందుకు కారణం. ఆ కిరణాల వల్ల ముఖం అలాగే మేని మీద ముడుతలు రావడం, చర్మం మృదుత్వం కోల్పోవడం, నల్లటి మచ్చలు రావడం, వదులుగా మారి΄ోవడం, తన పటుత్వం కోల్పోవడం వల్ల ఇలా ఏజింగ్ కనిపిస్తూ ఉంటుంది. యూవీ రేడియేషన్ అనర్థాల నుంచి కాపాడుకోవడం ఇలా... ప్రధానంగా వేసవితో పాటు మిగతా అన్ని కాలాల్లోనూ ఎండ తీక్షణత ఎక్కువగా ఉండే సమయంలో అంటే... ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు వరకు ఎండలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. చర్మంపై సూర్యకాంతి పడకుండా పొడవు చేతి చొక్కాలు (పొడడైన స్లీవ్స్ ఉండే దుస్తులు) తొడగడం మంచిది. ఎండలోకి వెళ్లాల్సి వచ్చినప్పుడు ముఖం కవర్ అయ్యేలా చేసే బ్రిమ్ హ్యాట్స్తో పాటు వీలైతే సన్‌గ్లాసెస్ కూడా వాడుకోవడం మంచిది. ఎండలోకి వెళ్లడానికి అరగంట ముందుగా సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (ఎస్పీఎఫ్) ఎక్కువగా ఉన్న మంచి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. అలా ప్రతి మూడు గంటలకు ఓసారి రాసుకుంటూ ఉండాలి. ఈదేటప్పుడు, చెమట పట్టినప్పుడు రాసుకునేందుకు వీలుగా కొన్ని వాటర్ రెసిస్టాంట్ సన్‌స్క్రీన్ క్రీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సన్‌స్క్రీన్స్ ఎంచుకునే ముందర ఒకసారి చర్మవ్యాధి నిపుణలను సంప్రదించి తమకు సరిపడే ఎస్పీఎఫ్ను తెలుసుకుని వాడటం మంచిది. డీ–హైడ్రేషన్ నివారించడానికి నీళ్లు, ద్రవాహారాలు ఎక్కువగా తాగుతుండాలి. డా. వై. అరుణ కుమారి, సీనియర్ డెర్మటాలజిస్ట్ (చదవండి: కష్టాలు మనిషిని కనివినీ ఎరుగని రేంజ్‌కి చేరుస్తాయంటే ఇదే..!) -
మండే ఎండలతో ముప్పు తోటల సంరక్షణ ఎలా?
ఏటేటా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటంతో పండ్లు, కూరగాయలు, పూల తోటలకు ప్రతి వేసవీ పెను సవాలుగా మారుతోంది. 2024వ సంవత్సరంలో ప్రతి నెలా గత 190 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2025లో గడచిన మూడు నెలల తీరూ అంతే. సాధారణం కన్నా 4–5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదుకావటం మార్చిలోనే అనుభవంలోకి తెచ్చింది ఈ సంవత్సరం. ఈ నేపథ్యంలో సిద్ధిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ లక్ష్మీనారాయణ ధరావత్ అధిక ఉష్ణోగ్రతల నుంచి వివిధ ఉద్యాన తోటల సంరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను సవివరంగా తెలియజేస్తున్నారు.మామిడి→ ప్రస్తుతం కాయలు వివిధ దశల్లో అభివృద్ధి చెందుతున్నాయి. అందువల్ల వేసవిలో స్థిరమైన, తగినంత నీటి సరఫరా ఇవ్వాలి. → 10 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మామిడి చెట్లకు బిందుసేద్యం ద్వారా రోజుకు 4 నుంచి 5 గంటలు నీరు అందించాలి. → సాధారణ పద్ధతిలో నేల లక్షణాల ఆధారంగా 7 నుంచి 15 రోజుల వ్యవధిలో నీటిని అందించాలి. → పండ్లకు కాగితపు సంచులు కడితే వేడి నుంచి రక్షించుకోవటానికి సహాయపడుతుంది. → నీటి యాజమాన్యం సరిగ్గా అమలు చేయకపోతే పండ్ల తొడిమె భాగంలో అబ్షిషన్ పొరలు ఏర్పడి పండ్లు రాలిపోవడానికి కారణమవుతాయి. → చెట్ల పాదులకు పంట వ్యర్థాలతో ఆచ్ఛాదన (సేంద్రియ మల్చ్) ఏర్పాటు చేయాలి. → పొడి వాతావరణంలో తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా ఫి్రపోనిల్ 2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి సాయంత్రం వేళలో పిచికారీ చేయాలి. → పండు ఈగ నివారణకు లింగ ఆకర్షక బుట్టల ఉచ్చులను ఉపయోగించాలి. → గోలికాయ దశలో మామిడి కాయలు ఉన్నప్పుడు జిఎ3 (50 పిపిఎం) ఒక లీటరు నీటికి 50 మిల్లీ గ్రాములు కలిపి పిచియారీ చేయటం ద్వారా రాలే కాయలను 15% తగ్గించుకోవచ్చు.ద్రాక్ష→ ప్రతి రోజూ కనీసం చెట్టుకు 6–8 లీటర్ల నీటిని అందించాలి. ∙పందిళ్లపై షేడ్‌నెట్స్ వేస్తే, ద్రాక్ష గుత్తులపై సూర్యరశ్మి పడకుండా చేయవచ్చు.ఆయిల్ పామ్→ ముదురు ఆయిల్ పామ్ చెట్లకు సుమారుగా ఒక రోజుకు గాను ఏప్రిల్ నెలలో 250–300 లీటర్లు, అదేవిధంగా మే నెలలో 300–350 లీటర్ల నీరు అందించాలి. → సర్పిలాకార తెల్లదోమ ఉధృతి వేసవిలో అధికంగా ఉంది. ‘ఇసారియా ఫ్యూమాజోరోజియా’ జీవ శిలీంధ్ర నాశనిని వాడి సమర్థవంతంగా అరికట్టవచ్చు.→ కత్తిరించిన ఆకులను, మగ గెలలను, ఖాళీ గెలలను మొక్క మొదళ్లలో మల్చింగ్ వలె పరచాలి. తద్వారా నేలలోని నీటి తేమను కాపాడుకోవచ్చు.అరటి→ ఎండిన అరటి ఆకులు, వరి గడ్డి, మొక్కజొన్న గడ్డిని మల్చింగ్గా వేసి మొక్క మొదళ్లలో నీటి తేమను కాపాడాలి. → వేసవిలో నేరుగా సూర్యరశ్మి గెలలపై పడటం వలన గెలలు మాడిపోతాయి. తద్వారా వివిధ తెగుళ్లు ఆశించి కాయ / గెల కుళ్లిపోతుంది. కావున, నేరుగా సూర్యరశ్మి గెలలపై పడకుండా పక్కనే ఉన్న ఆకులను గెలలపై కప్పి గెల నాణ్యతను కాపాడాలి. → వెదురు / సర్వి /సుబాబుల్ వంటి కర్రలను వాడి అరటి చెట్టు కాండానికి ఊతం అందించాలి. లేదా టేపులను నాలుగు వైపులా కట్టాలి. తద్వారా వేసవి వడ గాలులకు అరటి చెట్లు పడిపోకుండా చూసుకోవచ్చు.కొబ్బరి→ పూత, కాత వస్తున్న చెట్లకు సుమారుగా 50–60 లీటర్ల నీటిని అందించాలి.→ సర్పిలాకార తెల్లదోమ ఉధృతి వేసవిలో అధికంగా ఉంది. దీని నివారణకు వేప నూనె (10,000 పిపిఎం) 2 మిల్లీ లీటర్లు / లీటరు నీటికి కలిపి ఆకులు బాగా తడిచేలా పిచికారీ చేయాలి. 10–15 రోజుల అనంతరం ఇసారియా ఫ్యూమారోజియా అనే జీవ శిలీంధ్ర నాశినిని ఆకుల కింద భాగం తడిచేలా పిచికారీ చేస్తే పురుగు ఉధృతిని సమర్థవంతంగా నివారించవచ్చు. → పంట వ్యర్థాలను మల్చింగ్గా వాడి నేలలోని నీటి తేమను కాపాడాలి.కూరగాయ తోటల రక్షణ ఎలా?టమాట→ అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల కారణంగా కాయలు/ పండ్లలో పగుళ్లు వస్తాయి. ఎండ దెబ్బ తగలటం వల్ల నాణ్యతలేని పండ్ల దిగుబడికి దారితీస్తుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో టమాటలో ఆకుముడత తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. → నీడనిచ్చే వస్త్రాలతో షేడ్‌నెట్ ఏర్పాటు చేసుకుంటే మొక్కలకు సూర్యకాంతి పడటం తగ్గుతుంది. నేల ఉష్ణోగ్రత, గాలి ఉష్ణోగ్రత తగ్గుతుంది. → నేల తేమను నిలుపుకోవడానికి, నేల ఉష్ణోగ్రత హెచ్చు తగ్గులను తగ్గించడానికి మొక్క చుట్టూ వెండి రంగు ప్లాస్టిక్ మల్చింగ్ లేదా గడ్డిని వేయాలి. → అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలుల సమయంలో నేల తేమను త్వరగా కోల్పోతుంది. మొక్కలు ఆకుల ద్వారా తేమను బయటకు వదిలే ప్రక్రియ (బాష్పీభవనం) ద్వారా కోల్పోయిన తేమను తిరిగి పొందడానికి తగినంత, తరచుగా నీటిని అందించాలి. → వేడిగాలుల సమయంలో తగినంత పోషకాలను అందించాలి. సంక్లిష్ట ఎరువుల (19–19–19 లేదా 13–0–45)తో పాటు సూక్ష్మపోషక మిశ్రమాలను 3–5 రోజుల వ్యవధిలో రెండుసార్లు లీటరుకు 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేస్తే కూరగాయ పంటలు వేడి ఒత్తిడిని తట్టుకుంటాయి.→ బాష్పీభవనం తగ్గించడానికి కయోలిన్ 3–5% (30–50 గ్రా./లీ.) పిచికారీ చేయాలి. → వడలు తెగులు నియంత్రణ కోసం లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సి క్లోరైడ్‌తో నేలను తడపాలి. → వైరస్ తెగుళ్ల నివారణకు వ్యాధిసోకిన మొక్క భాగాలను తుంచి నాశనం చేయాలి. → ఎకరానికి 10 జిగురు పూసిన పసుపు పచ్చ అట్టలను అక్కడక్కడా అమర్చాలి. → తెగులు ఆశించిన ప్రారంభ దశలో లీటరు నీటికి 5 మి.లీ. వేప నూనెతో పిచికారీ చేయాలి. → వాహకాలను నివారించడానికి లీటరు నీటికి ఫి్రపోనిల్ను 0.2 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్‌ను 0.3 మి.లీ. మోతాదులో కలిపి పిచికారీ చేయాలివంగ→ ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వంగ పంటను మొవ్వు, కాయతొలిచే పురుగులు ఆశించే అవకాశం ఉంది. → వీటి నియంత్రణకు ఎకరానికి 08–10 లింగాకర్షణ బుట్టలు ఏర్పాటు చేసి, నివారణ చర్యగా లీటరు నీటికి 3 మి.లీ. చొప్పున వేప నూనె (10,000 పిపిఎం)ను కలిపి పిచికారీ చేయాలి. → పురుగు తీవ్రత ఎక్కువగా ఉంటే లీటరు నీటికి ఫ్లూబెండియామైడ్ మందును 0.25 మి.లీ. లేదా ఇమామెక్టిన్బెంజోయేట్ మందును 0.4 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి.బెండ→ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు బెండకాయలో పల్లాకు తెగులు వైరస్ వ్యాప్తికి అనుకూలంగా ఉన్నాయి. → వ్యాధి సోకిన మొక్క భాగాలను తుంచి నాశనం చేయాలి. → ఎకరానికి 10 జిగురు పూసిన పసుపు పచ్చఅట్టలను అక్కడక్కడా అమర్చాలి. → తెగులు ఆశించినప్రారంభ దశలో లీటరు నీటికి 5 మి.లీ. వేప నూనె కలిపి పిచికారీ చేయాలి. → వాహకాలను నివారించడానికి ఇమిడాక్లోప్రిడ్‌ను 0.3 మి.లీ. లేదా డయాఫెంథియురాన్ను 1.5 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.రైతులకు ఏమైనా సందేహాలుంటే వివిధ పంటలకు సంబంధించి ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు.పండ్లు : డా. వి. సుచిత్ర – 6369803253కూరగాయలు : డా. డి. అనిత –94401 62396పూలు : డా. జి. జ్యోతి – 7993613179ఔషధ, సుగంధ ద్రవ్య మొక్కలు:కృష్ణవేణి – 9110726430పసుపు : మహేందర్ : 94415 32072మిర్చి : నాగరాజు : 8861188885 -
ప్రజాసేవే లక్ష్యం
పట్టుదల, తపన, దానికి తగ్గ సాధన తోడైతే ఎంతటి లక్ష్యమైనా తలొంచి తీరుతుందని గ్రూప్‌వన్ టాపర్ లక్ష్మీదీపిక కొమ్మిరెడ్డి నిరూపించారు. తెలంగాణ రాష్ట్రస్థాయిలో టాప్ ర్యాంక్ సాధించానన్న విషయం తెలిసిన దీపిక ముందు కొద్దిసేపటి వరకు అది కలే అనుకున్నారు. నిజమేనని తెలుసుకుని సంభ్రమాశ్చర్యాలలో మునిగి తేలారు. గ్రూప్1 పరీక్షల్లో రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించడానికి ఆమె పడిన కష్టం, తల్లిదండ్రుల ప్రోత్సాహం అన్నీ కలిపి ఆమెను మొదటి స్థానంలో నిలిపాయి. వివరాలు ఆమె మాటల్లోనే ..‘‘నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ఉండేది సఫిల్గూడప్రాంతంలో. అమ్మ పద్మావతి గృహిణి, నాన్న కృష్ణ కొమ్మిరెడ్డి రిటైర్డ్ సీనియర్ ఆడిట్ ఆఫీసర్. పదో తరగతి సఫిల్‌గూడలోని డీఏవీ పాఠశాల, ఇంటర్ నారాయణగూడ శ్రీ చైతన్య, 2013లో మెడిసిన్ లో 119వ ర్యాంక్‌తో ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశా. మాస్టర్స్ డిగ్రీ చేయడం కోసం అమెరికా వెళ్లాను. అమ్మా నాన్నలకు ఒక్కగానొక్క కూతురిని. అందుకే డాక్టరుగా ఇక్కడే ప్రాక్టీస్ చేద్దామని అనుకున్నా. కానీ అనుకోకుండా నా దృష్టి సివిల్స్‌పై మళ్లడంతో ఆ దిశగా ప్రయత్నించాలనుకున్నాను. అందుకు అమ్మానాన్నలు కూడా అంగీకరించారు. అదేసమయంలో గ్రూప్స్‌కు నోటిఫికేషన్ రావడంతో దరఖాస్తు చేసుకున్నా. ఆలోచన వచ్చిందే తడవుగా సిలబస్ చెక్ చేశాను. పాత ప్రశ్నాపత్రాలు పరిశీలించాను. ప్రిపరేషన్ సులభమనే అనిపించింది. దాంతో కోచింగ్‌కు వెళ్లాలనిపించలేదు. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్1 పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ సాధించాను. 2020లో మొదటిసారిగా యూపీఎస్సీ పరీక్ష రాశా! కాని, అది నేను అనుకున్నంత సులువు కాదని మూడు ప్రయత్నాలు విఫలం అయ్యేవరకు అర్థం కాలేదు. దాంతో అంతవరకు ఆప్షనల్‌గా ఉన్న తెలుగు బదులు ఆంత్రపాలజీని ఎంచుకుని గత ఏడాది నుంచి పూర్తిస్థాయిలో ప్రిపరేషన్ పై దృష్టి సారించాను. అలాగే గత సెప్టెంబర్‌లో యూపీఎస్సీ మెయిన్స్, అక్టోబర్‌లో టీజీపీఎస్సీ మెయిన్స్ కూడా రాశాను. ఈ సంవత్సరం మార్చి16న యూపీఎస్సీ ఇంటర్వ్యూకి హాజరయ్యాను.. ఆ ఫలితాలు వస్తాయనుకుంటే ఈ ఫలితాలు ముందుగా వచ్చాయి.సివిల్స్ సాధనే ఆశయం...నా జీవితాశయం సివిల్స్.. కెరీర్లో ఎదుగుదలతోపాటు ప్రజాసేవ చేయాలన్నది నా ఆకాంక్ష. త్వరలోనే వీటిని సాధిస్తానన్న నమ్మకం ఉంది. రోజూ కేవలం మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే చదివేదాన్ని. పరీక్షల సమయంలో మాత్రం 8– 9 గంటలు చదువుకునేదాన్ని. పరీక్షల సమయంలో మా అమ్మ కూడా నాతోపాటే జాగారం చేసేది. వొత్తిడి అనిపించినప్పుడు సరదాగా ముచ్చట్లు పెట్టుకునే వాళ్లం. పుస్తక పఠనం ముందునుంచే ఇష్టం. పాటలు పాడటం నా హాబీ. వొత్తిడి సమయంలో ఇవి నాకు చాలా ఉపయోగపడ్డాయి.’’ అంటూ ముగించారు దీపిక.సోషల్ మీడియాను సక్రమంగా ఉపయోగించుకోవాలికోచింగ్ల మీద ఆధార పడి సమయం, డబ్బును వృథా చేయద్దు. సోషల్ మీడియాలో చాలా మంచి సమాచారం అందుబాటులో ఉంది. దానిని సరిగా ఉపయోగించుకోగలగాలి. కెరీర్లో రాణించడానికి అవసరమైన ప్రణాళికను ముందే సిద్ధం చేసుకుని అందుకు తగ్గట్టు కృషి చేయాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ధైర్యంగా ఎదుర్కొని గమ్యమే లక్ష్యంగా ముందుకు సాగాలి. అప్పుడే ఆశయాన్ని సాధించగలం. – డా. లక్ష్మీ దీపిక కొమ్మిరెడ్డి, గ్రూప్ వన్ టాపర్ – పవన్ కుమార్ పలుగుల, సాక్షి, ఉప్పల్/ కాప్రా -
వధువే వరుడై... వరుడే వధువై...
హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురు మెడలో పెళ్లి కొడుకు తాళి కట్టడం సహజం. కానీ ఇక్కడ వధువే వరుడి మెడలో మూడు ముళ్లేస్తుంది. వధూవరులది ఒకే ఊరు. ఇరువురి మెడలో కరెన్సీ నోట్ల దండలు.. పెళ్లిపీటలపై కళ్లద్దాలు ధరిస్తూ దర్శనం. పెళ్లీడుకొచ్చిన అమ్మాయి, అబ్బాయిల మాటకు గౌరవమిచ్చే పెద్దలు. ఒకే ముహూర్తాన వందల సంఖ్యలో సామూహిక వివాహాలు.. దశాబ్దాలుగా ఎన్నికలెరుగని ఆ గ్రామం ఇంతకీ ఎక్కడుందంటే..? శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామం. సుమారు 12వేల జనాభా ఈ ఊరి సొంతం. స్వాతంత్య్రానికి పూర్వం నావల రేవుగా పిలిచేవారు. కాలక్రమేణా నువ్వలరేవుగా మారింది. రెవిన్యూ రికార్డుల్లో మాత్రం లక్ష్మీదేవిపేటగా కనిపించే ఆ గ్రామంలో అందరూ మత్స్యకారులే... చేపలవేట వీరి ప్రధాన జీవనాధారం. పెద్దవాళ్లు సముద్రంలో వేట సాగిస్తారు.చాటింపు వేసి.. వివరాలు సేకరించిఅంతగా ఉన్నత చదువులు లేకపోవడంతో ఈ ఊరి యువత ఉపాధి నిమిత్తం హైదరాబాద్, ముంబై, అండమాన్ ప్రాంతాలకు వలస వెళతారు. వీళ్లలో పెళ్లీడుకొచ్చిన యువకులను రెండేళ్లకోసారి గుర్తించి వారి జాబితాను సిద్ధం చేస్తారు. ఆ ఏడాదికి పెళ్లికి సిద్ధమయ్యేవారు ఎవరున్నారన్న సమాచారాన్ని ముందుగా చాటింపు వేయించి వారి వివరాలను సేకరిస్తారు. అలా ఎంపికైన వారందరికీ ఒకే ముహూర్తాన సామూహిక వివాహాలను జరిపిస్తారు.వధూవరులది ఒకే ఊరు గతంలో మూడేళ్లకోసారి ఈ పెళ్లిళ్లు చేసేవారు. కానీ ఇప్పుడు యువత సంఖ్య పెరగడంతో రెండేళ్లకోసారి ఈ తంతు జరిపిస్తున్నారు. వరుడికి కావాల్సిన వధువు కోసం ఎక్కడో అన్వేషించరు. ఉన్న ఊరిలోనే వరసకు వచ్చిన అమ్మాయితో నిశ్చయిస్తారు. సామూహిక వివాహ ప్రక్రియలో కులపెద్దలదే కీలక భూమిక. పెళ్లిళ్లన్నీ వారి పర్యవేక్షణలోనే జరుగుతాయి. ముహూర్తాలు నిశ్చయించిన వేళ పెళ్లీడుకొచ్చిన యువతీ యువకులను మరోసారి పెద్దలు పిలుస్తారు. వారి మనసులో ఎవరైనా ఉన్నారా... అని అడిగి తెలుసుకుంటారు. అలా ఇష్టపడినవారికి ఇచ్చి పెళ్లిచేయడంతో ఆ జంటల్లో ఆనందం రెట్టింపవుతుంది. నువ్వలరేవులో బైనపల్లి, బెహరా, మువ్వల అనే ఇంటి పేర్లున్న కుటుంబాలే అధికంగా ఉంటాయి. పెళ్లిళ్లన్నీ ఈ కుటుంబాల మధ్యే జరుగుతాయి.మూడు రోజుల పెళ్లి పండగసామూహిక వివాహ వేడుకను మూడురోజుల పాటు నిర్వహిస్తారు. మొదటి రోజు పందిరిరాట వేస్తారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంంతో కేరింతలు కొడతారు. రెండోరోజు ప్రధాన ఘట్టం. అదే మాంగల్యధారణ. అయితే ఇక్కడ తాళికట్టేది వరుడు మాత్రమే కాదు. పెళ్లికూతురు సైతం వరుడి మెడలో తాళి కట్టడం విశేషం. మూడోరోజు వధువు పుట్టింటి నుంచి వరుడి ఇంటికి సారె వస్తుంది. ఈ సందర్భంగా పెళ్లి పందిరిలో ఆ సారెను అందరికీ చూపిస్తారు. గ్రామంలోని బంధావతి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాక పెళ్లి వేడుక ముగుస్తుంది. జిల్లాలో సాధారణంగా వరుడి ఇంటివద్ద పెళ్లి జరిపిస్తారు. కానీ నువ్వలరేవులో మాత్రం వధువు ఇల్లే పెళ్లి వేదిక కావడం విశేషం.ఊరంత కుటుంబం వధూవరులిద్దరిదీ ఒకే గ్రామం కావడంతో ఊరంతా ఒకరికొకరికి ఏదో బంధుత్వం ఉండటం ఇక్కడి వారి సొంతం. పెళ్లి విందుకు బంధువులందరినీ ఆహ్వానించరు. ఏ ఇంటి పెళ్లి విందుకు ఎవరు వెళ్లాలన్నది గ్రామ పెద్దలే నిర్ణయిస్తారు. అలా ఆహార పదార్థాలను వృథా చేయకుండా, అనవసర ఖర్చులను నియంత్రిస్తూ జాగ్రత్తపడతారు.వరకట్నానికి దూరం నువ్వలరేవులో వరకట్నం అనే మాట వినిపించదు. పెళ్లికయ్యే ఖర్చును వధూవరులిద్దరి కుటుంబాలు సమానంగా భరిస్తాయి. ఆడపిల్లను పుట్టినింటి నుంచి మెట్టినింటికి పంపడమే మహాభాగ్యంగా మగపెళ్లివారు భావిస్తారు. పెళ్లిపీటలపై ఆసీనులైన వధూవరులిద్దరూ నల్లకళ్లజోడు ధరిస్తారు. ఇద్దరి మెడలో కరెన్సీ నోట్ల దండలు వేస్తారు. ఈ సామూహిక వేడుకను తిలకించేందుకు పరిసరప్రాంతాల ప్రజలు తరలి వస్తారు. దీంతో మూడురోజుల పాటు నువ్వల రేవులో తిరునాళ్ల సందడి కనిపిస్తుంది. నువ్వలరేవులో సామూహిక వివాహాలే కాదు, శ్రీరామనవమి ఉత్సవాలను సైతం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.ముందు వరుడు.. ఆ తర్వాత వధువు పెళ్లిలో ముందుగా వరుడు వధువు మెడలో తాళికడతాడు. అనంతరం వధువు వరుని మెడలో తాళి కడుతుంది. దీన్నే స్థానికులు దురషం అని వ్యవహరిస్తారు. ఈ సాంప్రదాయం నువ్వలరేవు ప్రత్యేకం. ఇలా ఒకరికి ఒకరు తాళికట్టడంతో ఒకరికొకరు ఆజన్మాంతం రక్షగా ఉంటారన్నది ఇక్కడి వారి విశ్వాసం. అలాగే ఒకరు ఎక్కువ, ఇంకొకరు తక్కువనే భావన తమలో ఉండదని, అమ్మాౖయెనా, అబ్బాౖయెనా సమానంగానే భావిస్తామని గ్రామపెద్దలు చెబుతారు.– గుంట శ్రీనివాసరావు, సాక్షి, వజ్రపుకొత్తూరు, శ్రీకాకుళం -
55 కిలోల వెయిట్ లాస్ : నిర్మాతకు రామ్ భార్య స్ట్రాంగ్ కౌంటర్
ప్రముఖ బుల్లి తెర నటుడు రామ్ కపూర్ 55 కిలోల బరువు తగ్గడం నెట్టింట విస్తృత చర్చకు, ఊహాగానాలకు దారితీసింది. ఓజెంపిక్ లేదా సర్జరీ వంటి షార్ట్కట్ల ద్వారా అంత బరువు తగ్గాడనే అరోపణలను తీవ్రంగా ఖండించిన నటుడు కష్టపడి , అంకితభావంతో 140 కిలోల బరువును 55 కిలోలు తగ్గి 85 కిలోలకు తగ్గించుకున్నట్టు వెల్లడించాడు. దీనిపై రామ్‌కు అనేక ప్రశంసలు లభించాయి కూడా. అయితే రామ్‌కు పేరు తీసుకొచ్చిన టీవీ షో ‘బడే అచ్చే లగ్తే హై’ నిర్మాత ఏక్తా కపూర్ మాత్రం సంచనల వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసింది. తాజాగా ఏక్తాకు కౌంటర్‌గా రామ్ భార్య గౌతమి కపూర్ ఒక వీడియోను పో స్ట్ చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ ఎంచుకోవాలా లేదా మౌంజారో, ఓజెంపిక్ తీసుకోవాలా, లేదా మౌనంగా ఉండాలా.. బడేహీ అచ్చే లగ్తేహై అంటూ ఒక పోస్ట్ పెట్టింది. పరోక్షంగా రామ్ కపూర్ వెయిట్ లాస్ జర్నీని ఏక్తా కపూర్ ఎగతాళి చేసింది. దీనిపై స్పందించిన గౌతమి వీడియోను విడుదల చేసింది. ఏక్తా కపూర్ తరహాలోనే కౌంటర్ "నేను యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తీసుకోవాలా? నేను మౌంజారో తీసుకోవాలా?నేను ఓజెంపిక్ తీసుకోవాలా లేదా పైన పేర్కొన్నవన్నీ తీసుకోవాలా? లేదా నా నోరు మూసుకోవాలా? క్యుంకి హుమే బడే నహీ చోటే హే అచ్చే లగ్తే హై..' అంటూ వీడియో పోస్ట్ చేసింది. అలాగే ఎవరికి నచ్చినది వార్ని చేయనివ్వాలి. జీవించాలి, జీవించనివ్వాలి, ఎందుకంటే లైఫ్‌లో అతి ముఖ్యమైనవి ఆరోగ్యం, ఆనందం, శాంతి అంటూ గౌతమి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. చివరగా నీ జీవితం నువ్వు చూస్కో అంటూ చురకలంటించింది. దీంతో భర్తకు సపోర్ట్‌గా నిలిచిన గౌతమిని అభిమానులు ప్రశంసించారు. View this post on Instagram A post shared by Gautami Kapoor (@gautamikapoor) ఏక్తా టీవీ సీరియల్ షో, బడే అచ్చే లగ్తే హై సీరియల్లో లీడ్ రోల్లో నటించిన రామ్‌కు, ఏక్తాకపూర్కు మధ్య ఇటీవల పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటోంది. బడే అచ్చే లగ్తే హై షోలో గురించి ఒక ఇంటర్వ్యూ లో రామ్ వ్యాఖ్యల నేపథ్యంలో వారువురి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఈ సీరియల్లో సాక్షి తన్వర్ పాత్రకు మధ్య తనకు సన్నిహిత సన్నివేశాన్ని రాసినది ఏక్తా కపూర్ అని, టీఆర్పీ రేటింగ్ కోసం అలాంటి సీన్లు పెట్టడాన్ని తాను ముందుగానే వ్యతిరేకించానని రామ్ వెల్లడించాడు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహించిన ఏక్తా కపూర్ పరోక్షంగా 'నోరు మూసుకో’ రామ్‌పై అంటూ మండిపడింది. ప్రొఫెషనల్ యాక్టర్ కాదని, అతనివి 'తప్పుడు' వ్యాఖ్యలని, తాను నోరు విప్పితే అసలు నిజం బయటపడుతుందని, కాన మౌనమే బెటర్ అని సమాధానమిచ్చింది. ఆ తరువాత అతని వెయిట్‌లాస్ జర్నీపై కూడా ఏక్తా వ్యంగ్య బాణాలు విసిరిన సంగతి తెలిసిందే. -
కష్టాలు మనిషిని కనివినీ ఎరుగని రేంజ్‌కి చేరుస్తాయంటే ఇదే..!
కష్టాలనగానే భయపడిపోతుంటాం. ఎందుకంటే ఆ సమయం ఎవ్వరైన చెప్పుకోలేని వేదన అనుభవిస్తారు. దాటుకుని రావడం అంత ఈజీ కూడా కాదు. పదేపదే వెంటాడే ఛీత్కారాలు, అవమానాలు తట్టుకుంటూ లక్ష్యంపై ఫోకస్ పెట్టడం కష్టమే అయినా సాధ్యం కానీ విషయం అయితే కాదు. అలా భావించిన వాళ్లే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని కనివినీ ఎరుగని సక్సస్‌ని అందుకుంటారు. పైగా తనని కష్టపెట్టిన వాళ్లే చేతులెత్తి సలాం కొట్టే స్థాయికి చేరుకుంటారు. అలాంటి విజయాన్నే అందుకుని యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది 23 ఏళ్ల ఊర్మిళ. ఆమె కథ ప్రతిఒక్కరికీ ఓ కనువిప్పు, సక్సెస్‌కి చిరునామాగా చెప్పొచ్చు. ముంబైకి చెందిన 23 ఏళ్ల ఊర్మిళ పాబుల్ ఐదవ తరగతిలో ఉన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. సింగిల్ మదర్ పెంపకంలో పెరిగింది. ఎన్నో అవహేళనలు, కష్టాలు ఎదుర్కొంది. తన తల్లే ఒంటరిగా తనని, సోదరుడుని చదివిస్తోందన్న విషయాన్ని ఏ క్షణాంలోననూ మరువలేదు. అదే ఆమె ఎదుగదలకు బూస్టప్‌గా తీసుకుంది. పడుతున్న ప్రతి కష్టాన్ని తన లక్ష్యాన్ని గుర్తు చేసేవిగా భావించింది. ఆ సానూకూల దృక్పథం, అచంచలమైన పట్టుదల, దీక్షలే ఆమెను స్కేట్‌బోర్డింగ్‌లో ఛాంపియన్‌గా మార్చింది. పలు అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి ప్రాతినిథ్యం వహించేలా చేసింది. ఆ క్రీడలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకునే రేంజ్‌కి ఎదిగింది. అలా ఆమె 36వ జాతీయ క్రీడలలో రజత పతకాన్ని గెలుచుకోవడమే గాక UAEలోని షార్జాలో జరిగిన ప్రపంచ స్కేట్బోర్డింగ్ ఛాంపియన్‌షిప్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరుకుంది. ఈ విజయాన్నీ ఆమెను ఒలింపిక్ అర్హతకు హెల్ప్ అవుతాయి కూడా. ప్రస్తుతం ఆమె స్నోబోర్డింగ్‌లో శిక్షణ తీసుకుని మరీ. గుల్మార్గ్లో జరిగిన ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025లో కాంస్య పతకాన్ని సాధించింది. ఈ ఏడాదే స్నోబోర్డింగ్ క్రీడలో శిక్షణ తీసుకుని పోటీలోకి దిగినా.. విజయ ఢంకా మోగించి ప్రపంచమే సతన వైపుతిరిగి చూసేలా చేసింది ఊర్మిళ. 'దటీజ్ ఊర్మిళ' అనుపించుకుంది. అంతేగాదు వ్యక్తిగత కష్టాలు మనిషిని ఉన్నతస్థితికి తీసుకువచ్చే సోపానాలని చాటిచెప్పింది. View this post on Instagram A post shared by India Cultural Hub (@indiaculturalhub) (చదవండి: ఎవరీ నిధి తివారీ? ఏకంగా ప్రధాని మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా యువ ఐఎఫ్ఎస్ అధికారిణి..!) -
ఎవరీ నిధి తివారీ? ఏకంగా ప్రధాని మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా యువ ఐఎఫ్ఎస్ అధికారిణి..!
ప్రధాని నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీవోపీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర క్యాబినేట్ నియమకాల కమిటీ ఆమె నియామకాన్ని ఆమోదించింది. నిధి తివారీ ఎవరంటే..2014 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ అధికారిణి జనవరి 6, 2023 నుంచి ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అంతకుముందు 2022లో పీఎంవోలో అండర్ సెక్రటరీగా చేరారు. గతంలో ఆమె విదేశాంగ మంత్రిత్వ శాఖలో అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె మోదీ ప్రైవేట్ కార్యదర్శిగా నియామకం జరిగింది. ఇక తివారీ పీఎంవోలో మూడు సంవత్సరాలకు పైగా పనిచేశారు. 2013లో సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ముందు, ఆమె వారణాసిలో అసిస్టెంట్ కమిషనర్ (వాణిజ్య పన్ను విభాగంలో)గా పనిచేశారు. ఆ తర్వాత ఆమె ఉద్యోగంతో పాటు 2014 సివిల్ సర్వీసెస్ పరీక్షకు సన్నద్ధమై.. 96వ ర్యాంక్ సాధించారు. ప్రస్తుతం నిధి ఈ పీఎంవోలో ప్రధానమంత్రి కార్యాలయం-పీఎంలో డిప్యూటీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదిలా ఉండగా, పీఎంవోలో చేరడానికి ముందు నిధి తివారీ విదేశాంగ మంత్రిత్వశాఖలోనూ పని చేశారు. ఆమె నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో ఉద్యోగం చేశారు. భారత్‌కు అంతర్జాతీయ సంబంధాలను మెరుగుపరచడంలో నిధి తివారీకి ఉన్న నైపుణ్యమే పీఎంవోలో కీలకపాత్ర పోషించే స్థాయికి చేరుకున్నారనేది అధికారిక వర్గాల సమాచారం. కాగా, ప్రధానమంత్రికి ఇప్పటివరకు ఇద్దరు ప్రైవేట్ కార్యదర్శులు ఉండగా..ఒకరు వివేక్ కుమార్ మరొకరు హార్దిక్ సతీశ్‌చంద్ర షా..ఇప్పుడు మూడో ప్రైవేట్ సెక్రటరీగా నిధి అగర్వాల్ నియామకం అయ్యారు.Nidhi Tewari appointed as Private Secretary to Prime Minister Narendra Modi. pic.twitter.com/erpTlJfjfn— Press Trust of India (@PTI_News) March 31, 2025 (చదవండి: నా పిల్లలు భారత్‌లోనే పెరగాలి ఎందుకంటే..? వైరల్‌గా అమెరికన్ తల్లి పోస్ట్) -
స్కూల్లోనే ప్రేమ, బోలెడంత కవిత్వం : కుమార సంగక్కర లవ్ స్టోరీ వైరల్!
గువాహతి వేదికగా ఆదివారం జరిగిన సీఎస్కే, ఆర్ఆర్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బాలీవుడ్ నటి మలైకా అరోరా దర్శన మివ్వడం ప్రత్యేక చర్చకు దారి తీసింది. శ్రీలంక మాజీ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ జట్టు డైరెక్టర్ కుమార సంగక్కర (Kumar Sangakkara)తో మలైకా మాటా ముచ్చటా నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో నెట్టింట వైరల్‌గా మారాయి. ఇటీవలే అర్జున్ కపూర్‌కు బ్రేకప్ చెప్పిన మలైకా (Malaika Arora) మళ్లీ ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమార సంగక్కర లవ్ స్టోరీ ఆసక్తికరంగా మారింది.కుమార్ సంగక్కరగా పాపులర్ అయిన కుమార్ చోక్షనాద సంగక్కర. శ్రీలంకలోని అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా ఖ్యాతి గడించాడు. 2000 నుండి 2015 వరకు దేశానికి ప్రాతినిధ్యం వహించి తనకంటూ కొన్ని పేజీలను క్రికెట్ చరిత్రలో లిఖించు కున్నాడు. చదవండి: ఐశ్వర్యరాయ్ బాడీగార్డ్ వేతనం ఎంతో తెలుసా? సీఈవోలకు మించిఅనూహ్యంగా క్రికెట్ కరియర్లోకి1977 అక్టోబర్ 27న సెంట్రల్ ప్రావిన్స్‌లోని మాటాలేలో జన్మించిన కుమార్, ముగ్గురు అన్నదమ్ములలో చిన్నవాడు. అతని తండ్రి క్రీడలపై ఆసక్తి ఎక్కువ. ఈ ఆసక్తితోనే తన పిల్లలకు గంటల తరబడి శిక్షణ ఇచ్చేవాడు.కుమార్ మొదట్లో పాఠశాలలో టెన్నిస్ ప్లేయర్‌గా, శక్తివంతమైన బ్యాక్‌హ్యాండ్ షాట్లకు ప్రసిద్ధి చెందాడు. దాదాపు ప్రతి క్రీడలోనూ ప్రావీణ్యం ఉన్నప్పటికీ పాఠశాల ప్రిన్సిపాల్ అతన్ని క్రికెట్‌పై దృష్టి పెట్టమని సూచించాడు. దీంతో సంగక్కర 1997–99లో, 20 సంవత్సరాల వయసులో క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 1999లో, సంగక్కర శ్రీలంక జట్టుకు ఎంపికయ్యాడు. స్టార్ క్రికెటర్‌గా అన్ని ఫార్మాట్లలో మాజీ కెప్టెన్ సంగక్కర క్రికెట్ చరిత్రలో గొప్ప వికెట్ కీపర్లు, బ్యాట్స్మెన్లలో ఒకరిగా దేశానికి పేరు తీసుకొచ్చాడు. 2015లో, కుమార్ సంగక్కర క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ఆ తరువాత వ్యాఖ్యాతగా ఉన్నాడు. 2021 - 2024 వరకు IPLలో రాజస్థాన్ రాయల్స్‌కు కోచ్‌గా ఉన్నాడు. కుమార్ సంగక్కర భార్య యెహాలి. అతని జీవిత భాగస్వామిగా సంగక్కర్కు చాలా అండగా నిలబడింది. అతనిని ప్రోత్సహించడం దగ్గర్నుంచీ, తిపెద్ద విమర్శకురాలిగా ఉండటం దాకా యెహాలి బెస్ట్ హాఫ్ అని చెప్పవచ్చు.(సమ్మర్ : ఉదయాన్నే ఈ ఫ్రూట్స్ తీసుకుంటే యవ్వనంగా మెరిసిపోవాల్సిందే!)ప్రేమకథ ఎలా మొదలైందంటేసంగక్కర, యెహాలి ప్రేమకథ పాఠశాల రోజుల్లోనే మొదలైంది. కాండీలోని ఆంగ్లికన్ బాలుర పాఠశాలలో సంగక్కర్ చదువుకుంటే, యెహాలి, కాండీలోని ది హిల్‌వుడ్ కాలేజీలో చదువుకుంది. ఇది పూర్తిగా బాలికల పాఠశాల. ఇలాంటి ఆంక్షలు చాలా ఉన్నప్పటికీ. వీరి ప్రేమ చిగురిస్తూనే వచ్చింది. అయితే కొంతకాలం తరువాత యెహాలి కొలంబోకు వెళ్లిపోయిన తరువాత కూడా క్లాసులకు డుమ్మాకొట్టి మరీ తన ప్రియురాల్ని కలుసుకునేవాడు. లేడీ లవ్‌తో సమయం గడపడానికి కాండీనుంచి కొలంబోకు బస్సులో వెళ్ళేవాడట.సంగక్కర తెలివైన విద్యార్థి, ఆంగ్ల భాష మీద పట్టు ఎక్కువ. కవిత్వం అంటే ఆసక్తి. అందమైన కవిత్వంతో యెహాలి పట్ల ప్రేమను చాటుకునేవాడు. ఏకంగా ఆమెకోసం ఒక ఒక కవితల పుస్తకం రాశాడు. కొలంబోకు మారినప్పుడు ఆమెకు కాల్ చేయడానికి రోజూ రూ. 100 పేఫోన్ కార్డులు కొనుక్కునేవాడినని ఒక సందర్బంగా సంగక్కర స్వయంగా తెలిపాడు. 2003లో ఈ ప్రేమపక్షులు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి కవలపిల్లలు (స్వైరీ-కవిత్) పుట్టారు. ఇపుడు క్రికెటర్ల భార్యలు, గర్ల్ ఫ్రెండ్స్ స్టేడియాల్లో సందడి చేస్తున్నారు. కానీ క్రికెటర్ల భార్యలు, స్నేహితు రాళ్ళు పెద్ద అంతరాయంగా భావించిన టైంలోనే యెహాలి సంగక్కర ప్రతీ టూర్లోనూ వెంట ఉండేది. భర్తను ఉత్సాహపరుస్తూ కనిపించేది. కెరీర్ ప్రారంభించిన రోజు నుంచీ నిరంతరం భర్తకు అన్ని విధాలా అండగా ఉండేది. వీడ్కోలు సిరీస్‌లో కూడా ఆమె ఉంది. కాగా కుమార్ సంగక్కర్ ఐపీఎల్ స్టార్ ప్లేయర్‌గా తనదైన ముద్ర వేశారు. పంజాబ్ కింగ్స్ (గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్), డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించారు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక పాత్ర పోషించిన సంగక్కర ప్రస్తుత సీజన్‌కు ముందు వరకు ఆ టీమ్ హెడ్ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. -
నా పిల్లలు భారత్‌లోనే పెరగాలి ఎందుకంటే..? వైరల్‌గా అమెరికన్ తల్లి పోస్ట్
అందాల అమెరికా అంటే మన భారత యువతకు ఓ బ్యూటీఫుల్ డ్రీమ్. ఆ కల సాకారం చేసుకోవడానికి తల్లిదండ్రులను కష్టపెట్టడమే కాకుండా తమన తాము ఇబ్బందుల్లోకి నెట్టుకుని మరీ తిప్పలు పడతారు. ఇలా ఏటా వేలాదిమంది యువత అమెరికాలో సెటిల్ అయ్యేందుకు ఎన్నో పాట్లుపడుతున్నారు. మనం ఇంతలా ప్రయాస పడుతుంటే ఓ అమెరికన్ అమ్మ మాత్రం సింపుల్‌గా అసలైన ఆనందం భారత్‌లోనే ఉందని మన దేశాన్ని ఆకాశానికి ఎత్తేసేలా కీర్తించింది. అంతేకాదండోయ్ సంపాదన పరంగా అమెరికా బెస్ట్ ఏమో కానీ సంతోషం మాత్రం భారత్‌లోనే దొరకుతుందని దిమ్మతిరిగేలా సమాధానమిచ్చింది ఆ తల్లి. అదెలాగో ఆమె మాటల్లోనే విందామా..! గత నాలుగు సంత్సరాలు ఢిల్లీలో నివశిస్తున్న అమెరికన్ మహిళ క్రిస్టెన్ ఫిషర్ తన పిల్లలు యునైటెడ్ స్టేట్స్ వద్దని భారత్‌లోనే ఎందుకు పెంచాలనుకుంటుందో షేర్ చేసుకుంది. స్కైఫిష్ డెవలప్మెంట్ కంటెంట్ క్రియేటర్ అయిన క్రిస్టెన్ ముగ్గురు పిల్లల తల్లి. ఆమె తన పిల్లలు భారతదేశంలోనే పెరిగితేనే ప్రయోజకులు అవుతారని విశ్వసిస్తున్నా అంటూ ఓ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేవారు. అదెలాగో కూడా సవివరంగా వెల్లడించింది. అమెరికాలో కంటే వారి బాల్యం భారత్‌లోనే గడిస్తేనే ఎందుకు మంచిదో.. ఎనిమిది కారణాలను వివరించారామె. అవేంటంటే.. భావోద్వేగాలను హ్యాండిల్ చేయడం: భారతదేశంలో నివశిస్తే తన పిల్లలు విభిన్న వ్యక్తులు, వారి సంస్కృతులను చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. దీనివల్ల సామజిక నైపుణ్యాలు మెరగవ్వడమే కాకుండా సానుభూతిగా వ్యవహరించడం ఎలాగో తెలుస్తుంది. స్ట్రాంగ్ రిలేషన్స్: భారతీయుల కుటుంబాల్లో బలమైన సన్నిహిత సంబంధాలు ఉంటాయి. తమ పిల్లలే అన్న భావనతో కూడిన ఐక్యత ఉంటుంది. ఇది వారికి భావోద్వేగ మద్దతును అందిస్తుంది. అందువల్ల వాళ్లు ఈ వాతావరణంలో పెరిగితే గనుక అమెరికాలోని వ్యక్తిగత సంస్కృతికి భిన్నంగా లోతైన సంబంధాలు ఎలా ఏర్పరుచుకోవాలో తెలుసుకుంటారు.కృతజ్ఞత, సద్దుకుపోవడం: సంపద, పేదరికం మధ్య స్పష్టమైన వ్యత్యాసాలు ఉండే కొన్ని ప్రాంతాల్లో ఆయా పరిస్థితులకు అనుగుణంగా బతకడం, సర్దుకుపోవడం వంటివి తెలుసుకుంటారు. ఆ పరిస్థితుల మద్య వాళ్లు కృతజ్ఞుడుగా ఉండటం, అవతలి వాళ్లని మనస్ఫూర్తిగా అభినందించడం వంటివి తెలుసుకుంటారు. గ్లోబల్ నెట్వర్క్ కనెక్షన్: అంతేగాదు ఇక్కడ పెరిగితే ప్రపంచంలోని వివిధ ప్రాంతాల వాళ్లు స్నేహితులవుతారు. ఇది వారికి ప్రపంచ నెట్‌వర్క్‌ను నిర్మించడంలో సహయపడతుంది. ఈ సంబంధాలు పిల్లలకు భవిష్యత్తులో మంచి కెరీర్‌కు నిర్మించుకోవడానికి హెల్ప్ అవుతాయి. ఇలా ఆ ఆమెరికన్ తల్లి క్రిస్టెన్ ఫిషర్ ఇక్కడే తన పిల్లలు పెరిగితే గొప్పవాళ్లు అవుతారని మనస్ఫూర్తిగా నమ్ముతానంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చింది. అంతేగాదు అమెరికాను వ్యక్తిత్వం కలిగిన దేశంగా, సామాజికంగా ఒంటరిగా ఉన్న దేశంగా అభివర్ణించింది. అయితే భారతదేశం అందర్నీ స్వాగతిస్తూ సంబంధాలను నెరుపుతూ ఆనందంగా జీవించడం ఎలాగో నేర్పిస్తుంది.పైగా ఒకరికొకరు సహాయ చేసుకోవడం అంటే ఏంటో నేర్పిస్తుంది. అందువ్లల తన పిల్లలు ఈ వాతావరణంలో పెరిగితే దినదినాభివృద్ధి చెందుతారని నమ్మకంగా చెప్పారు క్రిస్టిన్. కాగా, ఆమె గతేడాది అమెరికాని వీడుతూ భారత్‌లోనే ఎందుకు నివశించాలనుకుంటుందో వివరిస్తూ ఓ వీడియోని షేర్ చేశారామె. View this post on Instagram A post shared by Kristen Fischer (@kristenfischer3) (చదవండి: స్ట్రోక్ బారినపడిన జెరోధా సీఈవో నితిన్ కామత్..ఏకంగా 14 నెలలు..!) -
సమ్మర్ : ఉదయాన్నే ఈ ఫ్రూట్స్ తీసుకుంటే యవ్వనంగా మెరిసిపోవాల్సిందే!
మన ఆరోగ్య సంరక్షణలో తాజా కూరగాయలు, పండ్లకు ఉన్న ప్రాధాన్యతే వేరు. ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు, కూరగాయలు తినాలని ఆరోగ్యనిపుణులు చెబుతారు. అయితే ఉదయం పూట ఖాళీ కడుపుతో కొన్ని పండ్లు తింటే అదనపు ప్రయోజనం ఉంటుందని మీకు తెలుసా. రోజు ఉప్మా, ఇడ్లీ లాంటివి తిని బోర్ కొట్టిందా? మరింత ఆరోగ్యంగా ఉండేందుకు పండ్లను తీసుకోవాలని భావిస్తున్నారా. ఖాళీ కడుపుతో శక్తికి గేమ్-ఛేంజర్‌గా పనిచేసే కొన్ని పండ్ల గురించి తెలుసుకుందాం.ఉదయాన్నే పండ్లు తీసుకోవడంతో రోజంతా ఫ్రెష్ గా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. శరీరానికి మంచి శక్తిని ఇస్తాయి. ఖాళీ కడుపుతో కొన్ని పండ్లను తీసుకుంటే మంచి పోషకాలు లభిస్తాయి. మలబద్దకం, కడుపు కేన్సర్, డయేరియా, ఎముకల ఆరోగ్యం, మెదడు ఆరోగ్యం, చర్మం, జుట్టు ఆరోగ్యానికి మంచిది. జీర్ణక్రియ అద్భుతంగా పని చేస్తుంది. రక్తపోటును నియంత్రించవచ్చు. పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ మెరుస్తూ, యవ్వనంగా కనిపిస్తారు. ముఖ్యంగా అధిక బరువును నియంత్రించుకోవచ్చు. పుచ్చకాయ: జ్యూసీ జ్యూసీగా పుచ్చకాయశరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. రిఫ్రెషింగ్ రుచితోపాటు, మంచి హైడ్రేటింగ్‌గా పనిచేస్తుంది. ఇందులో 92 శాతం నీరు ఉండటం వల్ల ఉదయం తీసుకుంటే చాలా హైడ్రేటింగ్‌గా ఉంటుంది. పుచ్చకాయలో లైకోపీన్ కూడా అధికంగా ఉంటుంది. ఇది గుండె, చర్మాన్ని రక్షించడంలో సహాయపడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. లిక్విడ్స్, ఎలక్ట్రోలైట్లతో నిండిన పుచ్చకాయతో రోజును ప్రారంభించడం వల్ల రోజంతా హైడ్రేట్‌గా ఉండేందుకు ఉపయోగపడుతుంది.బొప్పాయి: బొప్పాయిలో పపైన్, కైమోపాపైన్ వంటి ఎంజైమ్‌లు పుష్కలంగా లభిస్తాయి. కేలరీలు తక్కువగా, ఫైబర్ అధికంగా ఉండే బొప్పాయి చాలా ఆరోగ్యప్రయోజనాలున్నాయి. విటమిన్లు A, C , E లతో నిండిన బొప్పాయితో బరువు కూడా తొందరగా తగ్గుతాం. ఇందులోని ఎంజైమ్‌లు జీర్ణక్రియకు మంచిది. మలబద్ధకాన్ని నివారించడానికి తోడ్పడతాయి. మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహించి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.పైనాపిల్ : విటమిన్ సి , మాంగనీస్ పుష్కలంగా లభించే పైనాపిల్ రోగనిరోధక వ్యవస్థకు ఒక సూపర్ హీరో అని చెప్పవచ్చు. ఎముకలను బలోపేతం చేస్తుంది. ఉబ్బరం , వాపు కూడా తగ్గుతుంది.ఆపిల్స్: పెక్టిన్ తో నిండిన ఆపిల్స్ జీర్ణక్రియకు సహాయపడతాయి. ఆకలికి తట్టుకుంటుంది. క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు బోనస్.మెదడు పనితీరును ,మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుతుంది.చదవండి: ఐశ్వర్యరాయ్ బాడీగార్డ్ వేతనం ఎంతో తెలుసా? సీఈవోలకు మించికివి: విటమిన్లు, ఖనిజాలు, ఎంజైమ్లతో నిండిన కివీ పండ్లు చాలా శక్తినిస్తాయి. ఈ పండు రోగనిరోధక శక్తిని మెరుగు పరుస్తుంది. చర్మ ఆరోగ్యం , జీర్ణక్రియకు అద్భుతాలు చేస్తుంది. ఇందులో జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్యాక్టినిడిన్ కూడా ఉంటుంది. ఉదయమే ఈ పండును తినడం అంటే పోషకాలతో కూడిన ఫుడ్‌ను శరీరానికి అందించడమే. అరటిపండ్లు: అరటిపండ్లు పొటాషియానికి గొప్ప మూలం. ఇవి గుండెకు మంచిది. ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేయడానికి , కండరాల పనితీరుకు ఇది అవసరం. ఈ పండ్లలో కార్బోహైడ్రేట్లు సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి సులభంగా జీర్ణమవుతాయి.బెర్రీ: కడుపు నిండిన అనుభూతికోసం ఈ పండ్లు ఉత్తమం. విటమిన్లు సి , కె, అలాగే పొటాషియం, కాపర్ అధికంగా ఉంటాయి. ఆరోగ్యానికి, ముఖ్యంగా మూత్రపిండాలు, ప్రేగులు, గుండెకు ప్రయోజనకరంగా ఉంటాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్బెర్రీస్ వంటి బెర్రీలు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి, ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి, రోగనిరోధక వ్యవస్థకు బలాన్నిస్తాయి కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడతాయి. -
గూగుల్ లోకల్ గైడ్.. ఏకంగా 18 వేలకు పైగా పోటోలు, 287 ప్రాంతాలు..!
ప్రపంచంలోని ఏ ప్రదేశం, ప్రాంతానికి సంబంధించిన ఫొటోలు, ఇతర సమాచారం తెలుసుకోవాలన్నా.. కేరాఫ్ అడ్రస్ ‘గూగుల్ మ్యాప్స్’. ఈ వేదికలో ప్రాధాన్యత, విశిష్టత తెలుసుకున్నాకే ఆ ప్రదేశానికి వెళ్లాలా వద్దా అని ప్లాన్ చేసుకుంటారు. గూగుల్ లోకల్ గైడ్స్ విభిన్న ప్రదేశాలు సందర్శించి ఈ ఆన్లైన్ వేదికలో ఫొటోలు పోస్ట్ చేస్తారు. ఇలా ఎక్కువ ఫొటోలు ట్యాగ్ చేసిన అతికొద్ది మందిలో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరానికి చెందిన కావలి చంద్రకాంత్ కూడా ఒకరు. 2017 నుంచి ఇప్పటి వరకూ ఆయన షేర్ చేసిన వేల ఫొటోలకు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడం విశేషం. టాప్ గూగుల్ లోకల్ గైడ్‌గా తన ప్రయత్నాన్ని గూగుల్ సంస్థ కూడా ప్రత్యేకంగా అభినందించడం మరో విశేషం. ఇప్పటి వరకూ గూగుల్ మ్యాప్స్‌కు తాను అందించిన వేల ఫొటోలు కేవలం తన మొబైల్ ఫోన్లో మాత్రమే తీశానని మరో ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. తన గూగుల్ ప్రయాణాన్ని, ఆయన చెబుతున్న ఫొటోల కథలు తయన మాటల్లోనే.. నాకు ఫొటోలు తీయడమంటే చాలా ఇష్టం. నా హాబీ మరొకరికి ఏదో విధంగా ఉపయోగపడితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలోంచి ఈ గూగుల్ మ్యాప్స్ కాంట్రిబ్యూషన్ మొదలైంది. ఇలా ఇప్పటి వరకూ గూగుల్ మ్యాప్స్‌లో 22 వేల ఫొటోలను ట్యాగ్ చేశాను. ఇందులో 18,888 కు పైగా ఫొటోలు అందుబాటులో ఉన్నాయి. ఇది ఓపెన్ ఫ్లాట్ ఫాం.. ఎవరైనా ఫొటోలు వినియోగించుకోవచ్చు. గూగుల్ లోకల్ గైడ్‌గా వాడుకోవచ్చు. అంతేకాదు ఇదే వేదికలో 382కు పైగా వీడియోలు కూడా పొందుపరిచాను. ఫొటోలు, వీడియోలు పెట్టడంతో పాటు గూగుల్ మ్యాప్స్‌లో వాటి విశిష్టతను, ప్రాధాన్యతను తెలియజేసే 257 పైగా సమీక్షలు రాశాను. మొదటిసారి మ్యాప్స్‌లో.. గతంలో హైదరాబాద్‌లోని మూసీ నది వరదల్లో చిక్కుకున్న 150 మంది వారి ప్రాణాలను కాపాడిన చింత చెట్టు (ఉస్మానియా ఆస్పత్రి ప్రక్కన ఉన్న చింత చెట్టు)ను మొదటి సారి గూగుల్ మ్యాప్‌లో చేర్చాను. ఇలా హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 287 పైగా ప్రదేశాలను మొదటిసారి నేనే గూగుల్ మ్యాప్స్‌కు పరిచయం చేశాను. నా ఫొటోలు శాశ్వతం.. నగరంలోని జేఎల్ఎల్ అనే మల్టీ నేషనల్ కంపెనీలో టెక్నికల్ ఎగ్జిక్యూటివ్ జాబ్ చేస్తున్నాను. వీకెండ్స్, ప్రత్యేక సెలవులు, ఖాళీ సమయాల్లో ఈ ఫొటోలు తీస్తుంటాను. బీటెక్, పీజీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ చేశాను. ప్రకృతి, వారసత్వ కట్టడాలు, నగరంలోని మల్టీనేషనల్ కంపెనీలు, రాష్ట్రంలోని చారిత్రాత్మక అంశాలు–కట్టడాలు, అత్యుత్తమ ప్రాజెక్టులు, అరుదైన విషయాలు–వింతలు, సంస్కృతులు, సంప్రదాయాలు ఇలా పలు అంశాలను ఫొటోలుగా బంధిస్తుంటాను. నగరంలోని అమేజాన్, అంజాన్, గూగుల్ మొదలు టీ హబ్ వరకూ అన్ని కంపెనీలకు సంబంధించిన ఫొటోలు ప్రత్యేకంగా తీసి గూగుల్ మ్యాప్స్‌లో షేర్ చేశాను. 2015 నుంచి ఫొటోలు తీస్తున్నాను.. కానీ నాకు ఇప్పటి వరకూ కెమెరా లేదు. నా మొబైల్ ఫోన్లో మాత్రమే ఫొటోలు తీస్తాను. ఇప్పటి వరకూ సుమారు 50 వేల ఫొటోలు తీశాను. గూగుల్ మ్యాప్స్‌లో ప్రస్తుతం మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడం చాలా ఆనందంగా ఉంది. గతంలో 25 కోట్ల వ్యూస్ వచి్చనప్పుడు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అభినందించారు. మా స్వగ్రామం మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన పెద్ద మునగల్ చేడ్ గ్రామం. మా ఊరిలోని స్కూల్ శిథిలావస్థలో ఉంటే.. వాటిని ఫొటోలుగా తీసి గ్రామ పెద్దలు, సంబంధిత అధికారుల దృష్టి తీసుకెళ్లగా.. వారి స్పందనతో నూతన స్కూల్ నిర్మించారు. ఈ సందర్భంగా నా మొదటి ఫొటో ఎగ్జిబిషన్ ఈ ప్రారంభోత్సవంలో పెట్టాను. మండలంలోని అడ్డాకల్లోని అన్ని గ్రామాలకు సంబంధించిన సమగ్ర అంశాలతో ఒక ప్రాజెక్టు ఫొటోగ్రఫీ జియో ట్యాగింగ్‌లో నిక్షిప్తం చేశాను. ఈ ప్రపంచంలో నేను శాశ్వతం కాదు.. కానీ నా ఫొటోలు శాశ్వతంగా నిలిచిపోతాయి. ఇంతకు మించిన సంతృప్తి ఏం ఉంటుంది. లోకల్ గైడ్స్ కనెక్ట్‌లో బెస్ట్ ఫొటో.. ఇలా గూగుల్‌కు ఫొటోలు అనుసంధానం చేసే వారిని 1 నుంచి 10 వరకూ టాప్ లెవల్స్‌లో గుర్తిస్తారు. ఇందులో నేను టాప్ 10 స్థానికి చేరుకున్నాను. ఇలాంటి వారందరి కోసం గూగుల్ ఆధ్వర్యంలో సాన్‌ఫ్రాన్సిస్కో నగరంలో గూగుల్ లోకల్ గైడ్స్ కనెక్ట్ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమం నిర్వహిస్తారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని 2019లో హైదరాబాద్ నగర కేంద్రంగా నిర్వహించిన కార్యక్రమంలో టాప్ లోకల్ గైడ్‌గా నన్ను కూడా ఆహా్వనించడం, ఈ వేదికపై కొండాపూర్ జాలన్లోని నేను తీసిన నాగ శివాలయం ఫొటో బెస్ట్ ఫొటోగ్రాఫ్గా ఎంపిక చేయడం ఎప్పటికీ మర్చిపోలేను. గతంలో జరిగిన గూగుల్ లోకల్ గైడ్స్ ప్రత్యేక సమావేశంలో పాల్గొని ఈ వేదికలో మార్పులు, చేర్పులకు సంబంధించిన సూచనల అంశంలో భాగస్వామ్యం పంచుకున్నాను. ఇతర రాష్ట్రాల సమాచారం.. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహరాష్ట్ర వంటి ప్రాంతాల్లోని ఫొటోలు గూగుల్‌లో ట్యాగ్ చేశాను. గూగుల్లోనే కాదు నేను తీసిన పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇలా విభిన్న ప్రాంతాలు తిరిగి గూగుల్‌కు ఫొటోలను అందించిన ప్రదేశాలు, కట్టడాలు తదితర అంశాలకు సంబంధించి 1,272పైగా రేటింగ్స్, వాటికి సంబంధించి వ్యూయర్స్ అడిగిన 1,419 పైగా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. (చదవండి: నగలు నా ఫేవరెట్ కలెక్షన్..: సూపర్‌స్టార్ మహేష్ తనయ సితార) -
నగలు నా ఫేవరెట్ కలెక్షన్..: సూపర్‌స్టార్ మహేష్ తనయ సితార
నగలంటే నాకెంతో ఇష్టం.. నగల కలెక్షన్ నా ఫేవరెట్.. దీంతోపాటు నా పేరుతో నగలు ఉన్నాయంటే అంతకంటే ఆనందమేంటి.. అంటూ సంతోషం వ్యక్తం చేశారు.. సూపర్‌స్టార్ మహేష్‌బాబు తనయి సితార ఘట్టమనేని. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లో పంజాగుట్టలోని పీఎంజే జ్యువెలర్స్ 40వ స్టోర్‌ను తన తల్లి నమ్రతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టోర్‌లో విభిన్న రకాల కలెక్షన్లను సితార ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను హెవీగా ఉండే జ్యువెలరీతో పాటు సందర్భాన్ని బట్టి లైట్ జ్యువెలరీని కూడా ఇష్టపడుతుంటానని చెప్పారు. తన తండ్రి మహేష్‌బాబు యాడ్‌లో నటించడం చాలా ఆనందంగా ఉందని, తాను బాగా ఎంజాయ్ చేశానని చెప్పారు. తామిద్దరం ఇంట్లో ఎలా ఉంటామో ఆ యాడ్‌లో కూడా అలాగే చేశామని సితార చెప్పుకొచ్చారు. నటి నమత్ర మాట్లాడుతూ.. సితార, తాను ఎప్పటికప్పుడు గిఫ్ట్‌లు ఇచ్చిపుచ్చుకుంటామని చెప్పారు. ఏది నచ్చినా అది కొనేస్తుంటామని, సితార ఎక్కువగా సైలెంట్‌గా ఉండటానికి ఇష్టపడుతుందని నమత్ర తెలిపారు. (చదవండి: 'తోలుబొమ్మలాట'ను సజీవంగా ఉండేలా చేసిందామె..! ఏకంగా రాజధానిలో..) -
ఐశ్వర్యరాయ్ బాడీగార్డ్ వేతనం ఎంతో తెలుసా? సీఈవోలకు మించి
సినీ తారల కీర్తి, సంపద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే ఉండదు. వృత్తిపరంగా వచ్చే ఆదాయంతో పాటు, ఎండార్స్మెంట్లు, ప్రకటనలు తదితర మార్గాల ద్వారా భారీ ఆదాయాన్నే సంపాదిస్తారు. ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్‌కి తోడు సహజంగానే అధిక భద్రత అవసరం ఉంటుంది. అందులోనూ సూపర్ స్టార్లకు మరింత రక్షణ అవసరం. వారి కుటుంబాలకు భద్రతాపరమైన ప్రత్యేకమైన ఏర్పాటు ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోలు, హీరోయిన్ల వ్యక్తిగత భద్రతకోసం తమతోపాటు పాటు వచ్చే వ్యక్తిగత అంగరక్షకులపై భారీగా ఖర్చు పెడతారు. ఒక్కో సెలబ్రిటీ బాడీగార్డ్ (Bodyguard) సంపాదన కార్పొరేట్ కంపెఈ సీఈవోలకు మించి ఉంటుంది. మరి బాలీవుడ్ అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) బాడీగార్డ్ జీతం ఎంతో తెలుసా?బాలీవుడ్ ప్రపంచం గ్లామర్ , స్టార్డమ్తో నిండి ఉంటుంది. అందాల ఐశ్వర్యం ఐశ్వర్య ప్రపంచవ్యాప్తంగా భారీ అభిమానులను సంపాదించుకుంది. ఆమె బయటికి అడుగుపెట్టినప్పుడల్లా నిరంతరం భారీ భద్రత అవసరం. సినిమాలు, రెడ్ కార్పెట్ ప్రదర్శనల నుండి అంతర్జాతీయ ప్రయాణాల వరకు ఐశ్వర్య విశ్వసనీయ బాడీగార్డ్ శివరాజ్. ఆయన అందిస్తున్నసేవలకు నిదర్శనంగా గత కొన్నేళ్లుగా బచ్చన్ కుటుంబ భద్రతా బృందంలో కొనసాగుతున్నాడు. ఐశ్వర్యతో పాటు సినిమా సెట్లు, పబ్లిక్ ఈవెంట్లు , అంతర్జాతీయ పర్యటనలకు శివరాజ్ తోడు ఉండాల్సిందే. మరో విధంగా చెప్పాలంటే శివరాజ్ కేవలం ఒక ప్రొఫెషనల్ గార్డు మాత్రమే కాదు ఆమె కుటుంబానికి అంతకుమించిన ఆత్మీయుడు కూడా. 2015లో శివరాజ్ పెళ్లికి కూడా ఐశ్వర్య హాజరు కావడం విశేషం. ఐశ్వర్యతోపాటు ఆమె కుటుంబాన్ని రక్షించడంలో అంతటి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. మరి అంతటి నమ్మకమైన అంగరక్షకుడు శివరాజ్ ఉంటే ఐశ్యర్య ఎక్కడ ఎలాంటి షోలకు, ప్రదర్శనకు వెళ్లినా నిశ్చింతగా ఉంటుందట. అంతటి నమ్మకస్తుడైన బాడీగార్డ్ శివరాజ్‌కు నెలకు దాదాపు 7 లక్షల రూపాయల వేతనం లభిస్తుందట. అంటే అతని వార్షిక జీతం సుమారు రూ. 84 లక్షలు. అగ్రశ్రేణి బహుళజాతి కంపెనీలలో పనిచేస్తున్న పలువురు కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌ల జీత ప్యాకేజీల కంటే ఈ మొత్తం ఎక్కువ. అంతేకాదు ఐశ్వర్య బృందంలోని మరో భద్రతా నిపుణుడు రాజేంద్ర ధోలే వార్షిక ఆదాయం రూ. కోటి వరకు ఉంటుందని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది.సెలబ్రిటీ బాడీగార్డ్‌గా ఉండటం అంత సులభం కాదు. ఎంతో అప్రమత్తత, ఓర్పు ఉండాలి. క్లిష్టమైన సమయాల్లో అభిమానుల అభిమానానికి భంగం కలగకుండా, ఆమె రక్షణ బాధ్యతను నిర్వర్తించడం కత్తిమీద సామే. ఈ రిస్క్‌లు , బాధ్యతల నేపథ్యంలో సెలబ్రిటీల వ్యక్తిగత భద్రతా సిబ్బందికి అంతటి ఆకర్షణీయమైన జీతాలు లభించడంలో ఆశ్చర్యం ఏముంటుంది.1973, నవంబరు ఒకటిన పుట్టిన ఐశ్వర్య రాయ్ 1994లో విశ్వసుందరిగా ఎంపికైంది. మోడల్‌గా, యాడ్ ఫిల్సింలో నటిస్తూ, బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అనేక హిట్ మూవీలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అనేక అవార్డులు సొంతం చేసుకుంది. 2007 ఏప్రిల్‌లో బాలివుడ్ హీరో అభిషేక్ బచ్చన్‌ను పెళ్లాడింది. వీరికి 2011, నవంబరులో కుమార్తె ఆరాధ్య పుట్టింది. -
అలా స్ట్రోక్ బారిన పడటంతో ఏకంగా 14 నెలలు..!: జెరోధా సీఈవో నితిన్ కామత్
స్టాక్ ట్రేడింగ్ చేసేవారికి జెరోధా పరిచయం అక్కర్లేని పేరు. ఎందరో దీంట్లో డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేసి ట్రేడింగ్ చేస్తుంటారు. ఇక జెరోధా సంస్థ సీఈఓ నితిన్ కామత్ కూడా అందరికి సుపరిచితమే. ఎప్పుడూ ఫిట్‌గా ఉంటూ.. ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడమే గాక పలు సలహాలు సూచనలు ఇస్తుంటారు. అలాంటి ఆయనే పాకిక్ష పక్షవాతానికి(స్టోక్) గురయ్యినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. అంతేగాదు తాను కోలుకోవడానికే పద్నాలుగు నెలలు పట్టిందని అన్నారు. ఆరోగ్యం పట్ల ఇంతలా కేర్ తీసుకునేవాళ్లే స్టోక్ బారినపడితే సామాన్యుల పరిస్థితి ఏంటీ..?, ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితా అంటే..ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో జెరోధా సహ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన నితిన్ కామత్ తాను స్టోక్ అనంతరం ఎలా కోలుకుని యథావిధికి వచ్చారో షేర్చేసుకున్నారు. తాతను గతేడాది మైల్డ్ స్టోక్ బారినపడినట్లు వివరించారు. తండ్రి చనిపోవడం, నిద్రలేమి, అలసట, డీహైడ్రేషన్, అతి వ్యాయమం వంటి వాటి వల్ల ఆ పరిస్థితి ఎదురయ్యిందని పోస్ట్‌లో తెలిపారు. దాన్నంచి ఆరునెలలో కోలుకున్నా కానీ, ముఖంలో ఆ స్ట్రోక్ తాలుకా లక్షణాలు క్లియర్‌గా కనిపించేవన్నారు. ఆ తర్వాత స్పష్టంగా చదవలేకపోవడం, రాయలేకపోవడం వంటి సమస్యలు ఎదుర్కొన్నా..కానీ ఆ తర్వాత నెమ్మదిగా మళ్లీ చదవడగలగడం, రాయడం వంటి సామర్థ్యాల్ని పొందగలిగానని అన్నారు. సుమారు 14 నెలలి తన శరీరం సాధారన స్థితికి చేరుకుందని అన్నారు. ఇప్పుడు దాదాపు 85% నా మనస్సు నా వద్దే ఉందన్నారు. అలాగే మునుపటిలో మరింత మెరుగుపడేలా సాధన చేయాల్సి ఉందని కూడా చెప్పారు. అయితే తాను ఇలా పూర్తి స్థాయిలో కోలుకోవడం చూసి డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారని అన్నారు. అంతేగాదు ఫిట్‌గా ఉండటంపై కేర్ తీసుకోవడమే గాక ఎంతమేర ఏ స్థాయి వరకు వ్యాయమాలు చేస్తే చాలు అన్న అవగాహన కూడా అత్యంత ముఖ్యమని చెప్పారు. అలాకాదని అతిగా వర్కౌట్లు చేస్తే శరీరం మోటారు వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూసి స్ట్రోక్ బారినపడే ప్రమాదం పొంచి ఉంటుందని హెచ్చిరించినట్లు తెలిపారు. ఆయన జీరో 1 ఫెస్ట్ అనే జెరోధా వెంచర్ సాయంతో ఆరోగ్య సంపద, అందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి వాటి గురించి చర్చించడం వంటివి చేస్తుంటారు. ఇంతకీ ఈ స్ట్రోక్ అనేది అత్యంత ప్రమాదరకమైనదా? అంటే..తస్మాత్ జాగ్రత్త..ఉన్నట్టుండి తూలిపడిపోతున్నారా.. రెప్పపాటులోనే కంటి చూపు పోయి అంతా చీకటి అవుతోందా…పెదవులు ఓ పక్కికి లాగినట్టు అవుతున్నాయా? అయితే బీకేర్‌ఫుల్? అది బ్రెయిన్ స్ట్రోక్ లక్షణం కావచ్చు. గుండెపోటు వస్తే కాస్త ఆలస్యం అయితే ప్రాణం పోతుంది కానీ… బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఏకంగా బతికినంత కాలం అంగవైకల్యం భారిన పడేసి… మరొకరి మీద ఆధారపడే దీనస్థితికి తీసుకువస్తుంది. అందుకే స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే సత్వరం స్పందించాలని హెచ్చరిస్తుంటారు వైద్యులు.లక్షణాలు..బ్రెయిన్ స్ట్రోక్ వస్తే కొన్నిసార్లు ప్రాణం పోతుంది. ఇంకొన్నిసార్లు పక్షవాతం బారినపడతారు. తలలోని రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడి రక్తం సరఫరా నిలిచిపోవటం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఒక్కసారి స్ట్రోక్ బారిన పడితే నాలుగు గంటలలోపు సరైన చికిత్స అందించకపోతే మనిషి చనిపోవచ్చు లేదా జీవితకాలం వైకల్యం బారిన పడి మంచానికే పరిమితమవుతుంటారు. అందుకే బ్రెయిన్ స్ట్రోక్‌ని అత్యంత ప్రమాదకారిగా చెబుతుంటారు. శరీరంలోని ఓ చేయి బలహీనంగా అనిపించటం, అడుగువేసేందుకు కాళ్లు సహకరించకపోవటం, ఉన్నపళంగా బ్యాలెన్స్ తప్పి పడిపోతుండటం, కళ్లకు ఏమి కనిపించకుండా చీకట్లు కమ్మటం, మూతి ఓ పక్కకు తిరిగిపోతుండటం వంటివి బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు.భారత్‌లో ప్రతి నలభై సెకన్లకు ఒకరు బ్రెయిన్ స్ట్రోక్ భారిన పడుతుండగా… ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు దీని కారణంగానే చనిపోతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్స్‌లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. మొదటిది ఇస్కిమిక్ స్ట్రోక్. ఇందులో మెదడులోని రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటం వల్ల వచ్చే స్ట్రోక్. దాదాపు 87 శాతం బ్రెయిన్ స్ట్రోక్‌లు ఇలా రక్తనాళాల్లో అంతరాయం ఏర్పడటం వల్ల వచ్చేవే. రెండోది హిమోరేజిక్ స్ట్రోక్. మెదడులో రక్తస్రావం అయినప్పుడు ఈ తరహా స్ట్రోక్‌లు వస్తాయి. కేవలం 13 శాతం మాత్రమే ఈ తరహా స్ట్రోక్‌లు ఉంటాయి. మనిషి శరీరంలో ఏ అవయవం పనిచేయాలన్నా మెదడు నుంచే సంకేతాలు రావాలి. అలాంటి మెదడు రక్తనాళాల్లో రక్తం సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు మనిషి మరణానికి దారి తీయటం లేదా పక్షవాతంతో కాళ్లు, చేతులు పనిచేయక శాశ్వత వైకల్యానికి దారి తీస్తోంది.ఎందువల్ల వస్తుందంటే..ఒక్కసారి స్ట్రోక్ బారినపడితే చాలు మనిషి జీవితం పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉంది. వాస్తవానికి బ్రెయిన్ స్ట్రోక్‌కి కారణాలు అనేకం. మెదడులో రక్తం గడ్డకట్టడం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ ప్రధాన కారణాలు కాగా.. కొన్ని రకాల గుండె జబ్బులు, వారసత్వం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవటం, తీవ్రమైన ఒత్తిడి, నిద్రలేమి, గురక, స్లీప్ ఆప్నియా వంటి అనేక కారణాలు స్ట్రోక్‌కి దారితీస్తున్నాయి. ఇటీవలే వాతావరణ మార్పులు సైతం స్ట్రోక్‌కి కారణమవుతున్నట్టు నిపుణులు గుర్తించారు. అయితే స్ట్రోక్ లక్షణాలని సకాలంలో గుర్తిస్తే బాధితులను కాపాడుకునే అవకాశం ఉంది. స్ట్రోక్ భారిన పడిన వారిని ఎంఆర్ఐ, సీటీ స్కాన్ వంటి సౌకర్యాలు ఉన్న ఆస్పత్రులకు తీసుకువెళ్లి.. టెస్టులు చేసి నాలుగు గంటలలోపే కొన్ని రకాల ఇంజక్షన్లు ఇవ్వటం ద్వారా బాధితులు శాశ్వత వైకల్యం భారిన పడకుండా కాపాడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉన్నామనే ఆలోచనతో దేన్ని తేలిగ్గా తీసుకోకండి, శరీరం మాట వినండి అని చెబుతున్నారు వైద్య నిపుణులు. View this post on Instagram A post shared by Nithin Kamath (@nithinkamath) (చదవండి: అంతర్వాహిని సరస్వతి నది పుష్కరాలు ట్రిప్‌కి వెళ్లొద్దాం ఇలా..! చక్కటి ఐఆర్సీటీసీ ప్యాకేజ్‌తో) -
Ugadi 2025 అంబరాన్నంటిన ఉగాది సంబరాలు
ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉగాది (Ugadi2025) సంబరాలు (మరాఠీ ప్రజలు జరుపుకునే పండగా గుడిపడ్వా) అంబరాన్ని అంటాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉగాది వేడుకలను కనులపండువగా నిర్వహించారు. ముఖ్యంగా హిందూ నూతన సంవత్సరానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు, ఇతర కార్యక్రమాల ద్వారా నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. మరాఠీ ప్రజలు ఉగాది పండుగ రోజును గుడిపడ్వాగా జరుపుకుంటారు. మరోవైపు ఈ సందర్భంగా తెలుగు ప్రజలు తమ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఉగాది పచ్చళ్లు తయారు చేయడంతో పాటు పంచాంగ శ్రవణ కార్యక్రమాలను ఏర్పాటు చేయగా మహారాష్ట్ర ప్రజలు తమ సంస్కృతి సంప్రదాయ పద్ధతుల్లో ఉగాది (గుడిపడ్వా)ను జరుపుకున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలు గుడిపడ్వా రోజున ఓ కర్రకు రాగిచెంబును బోర్లించి దానిపై నూతన వస్త్రం, మామిడి కొమ్మలు, చక్కెర పాకంతో తయారు చేసే చక్కెర బిల్లల హారాలతో అలంకరిస్తారు. వాటిని ఇంటి ముందు, ఎత్తైన స్థలాల్లో కడతారు. ఇలా ఏర్పాటు చేసిన వాటిని ‘గుడి’లుగా పేర్కొంటారు. ఇలాంటి ‘గుడి’లు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. అదే విధంగా నూతన సంవత్సరానికి సంప్రదాయ పద్ధతుల్లో స్వాగతం పలికారు. ముఖ్యంగా ముంబైలోని గిర్గావ్, థానే, డోంబివలి, పుణే, నాగ్పూర్లతో పాటు అనేక ప్రాంతాల్లో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు శోభాయాత్రలు ఊరేగింపులు నిర్వహించారు. ఈ శోభాయాత్రలో సంగీత వాయిద్యాలు వాయించడంతోపాటు సంప్రదాయమైన దుస్తులు ధరించిన మహిళలు, పురుషులు నృత్యం చేశారు. అదే విధంగా ఈ యాత్రలలో బైకులు, అశ్వాలు కూడా కని్పంచాయి. మరోవైపు భారీ రంగోళి (ముగ్గులు)లు వేశారు. రథయాత్రల ద్వారా అనేక అంశాలపై సందేశాలిచ్చే ప్రయత్నం చేశారు. ముంబైలో... ముంబైలోని గిర్గావ్, దాదర్, కాందివలి తదితరాలతోపాటు అనేక ప్రాంతాల్లో శోభాయాత్రలు నిర్వహించారు. ముఖ్యంగా గిర్గావ్లో ఉదయం నిర్వహించిన శోభాయాత్రలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. గిర్గావ్ శోభాయాత్రలో మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు బైకులు, బుల్ల్ట్లపై సంప్రదాయ దుస్తులు ధరించి ర్యాలీ నిర్వహించారు. దాదర్‌లో సంప్రదాయ దుస్తులతో మహిళలు కత్తులను తిప్పుతూ చేసిన విన్యాసాలు అందిరినీ ఆకట్టుకున్నాయి. అలాగే ములూండ్‌లో కూడా ఈ సారి శోభాయాత్ర జరిగింది. థానేలో... థానేలో కౌపినేశ్వర్ ఆలయం ఆధ్వర్యంలో మాసుందా జలాశయం (తలావ్పాలి) వద్ద శనివారం రాత్రి దీపోత్సవం జరిగింది. దీన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. మరోవైపు థానే, డోంబివలి ఫడ్కేరోడ్డుపై బైకుల ర్యాలీలతోపాటు బ్యాండు మేళాలతో శోభాయాత్ర జరిగింది. ముఖ్యంగా డోంబివలిలో అనేక సందేశాలతో ర్యాలీలు నిర్వహించారు. ఆలయాల్లో భక్తుల కిటకిట.. ఉగాది నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. పలు ప్రాంతాల్లో టపాసులు కాల్చి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఇదే తరహా ముంబై, థానే, డోంబివలి, పుణే, భివండీలతోపాటు రాష్ట్రంలోని మందిరాల్లో భక్తుల సందడి కని్పంచింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని దేవుళ్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముంబైలోని ముంబాదేవి ఆలయంతోపాటు అనేక ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
Eid-ul-Fitr 2025 దేవుని మన్నింపు రోజు
ఈద్ (Eid-ul-Fitr 2025) అంటే పండుగ, ఫిత్ర్ అంటే దానం... వెరసి దానధర్మాల పండుగ అని అర్థం. అందుకే రమజాన్ నెలలో ముస్లిం సోదరులు దానధర్మాలు అధికంగా చెయ్యడానికి ప్రయత్నిస్తారు. సదఖా, ఖైరాత్, జకాత్, ఫిత్రా... వంటి పేర్లతో పేదసాదలకు ఎంతో కొంత సహాయం చెయ్యాలని తద్వారా దైవ ప్రసన్నత పొందాలని ప్రయత్నిస్తుంటారు. ఇస్లాం ధర్మంలో దాతృత్వానికి అత్యంత ప్రాముఖ్యం ఉంది. ముఖ్యంగా రమజాన్‌లో దానధర్మాలు చేసే వారికి, స్వీకరించే వారికి కూడా మంచి ప్రతిఫలం లభిస్తుందని నమ్మకం. నిజానికి రమజాన్ అన్నది సంవ త్సరంలోని పన్నెండు నెలల్లో తొమ్మిదవ నెల పేరు. సర్వ మానవాళికి మార్గదర్శక గ్రంథమెన పవిత్ర ఖురాన్ రమజాన్ లోనే అవతరించింది. అందుకే ఇంతటి గౌరవం, ఘనత, పవిత్రత ఈ మాసా నికి ప్రాప్త మయ్యాయి. మానవుల శారీరక, మాన సిక, ఆధ్యాత్మిక వికాసానికి అద్భుతంగా ఉపకరించే ‘రోజా’ (ఉపవాస వ్రతం) అనే గొప్ప ఆరాధనను కూడా దైవం ఈ నెలలోనే విధిగా చేశాడు. ఇది జనహృదయాల్లో భయ భక్తులు జనింప జేసి, మానవీయ విలువలను పెంపొందిస్తుంది. స్థితిపరులు ఉపవాసం పాటిస్తే, పేదసాదల ఆకలి బాధను అనుభవ పూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ఇలా మరెన్నో మానవీయ, నైతిక సుగుణాలను మానవుల్లో పెంపొందింపజేసే ఏర్పాటు చేసిన విశ్వ ప్రభువుకు కృతజ్ఞతగా నెల రోజుల ఉపవాసాలను ముగించి షవ్వాల్ నెల మొదటి తేదీన ముగింపు ఉత్సవంగా ‘ఈద్’ జరుపుకొంటారు. ఈరోజు దైవం తన భక్తులకు నెలరోజుల సత్కార్యాలకు అనంతమైన ప్రతిఫలం ప్రసాదిస్తాడు. ఈద్ దేవుని మన్నింపు లభించే మహత్తర శుభదినం. ఈద్ తప్పులు, పొరపాట్లకు క్షమాపణ కోరుకునే రోజు. జరిగిన తప్పుల పట్ల సిగ్గుపడుతూ, ఇక ముందు తప్పులు చేయ మని, సత్యంపై స్థిరంగా ఉంటామని సంకల్పం చెప్పుకొనే రోజు. కనుక దేహంలో ప్రాణం ఉండగానే దైవం ఇచ్చిన సదవకాశాన్ని వినియోగించుకొని సన్మార్గం వైపునకు మరలాలి. – మదీహా అర్జుమంద్(ఈదుల్ ఫిత్ర్ పర్వదినం సందర్భంగా...) -
అంతర్వాహిని సరస్వతి నది పుష్కరాల ట్రిప్‌కి వెళ్లొద్దాం ఇలా..!
మే నెల 15వ తేదీ నుంచి సరస్వతి నదికి పుష్కరాలు. పుణ్యస్నానానికి ముందు ఏమైనా చూడగలిగితే బావుణ్ను.పుష్కరస్నానానికి ముందు ఐఆర్సీటీసీ వీటన్నింటినీ చూపిస్తోంది. పురి... బీచ్‌లో పట్నాయక్ సైకత శిల్పాలు... ఆలయంలో జగన్నాథుడు.కోణార్క్... బోద్‌గయ... సారనాథ్ ఈ టూర్లో చూసే వరల్డ్ హెరిటేజ్ సైట్లు. కాశీ విశ్వనాథుడు... విశాలాక్షి... అన్నపూర్ణలు గంగాసరయుల్లో హారతులు. అయోధ్య బాలరాముడు... హనుమంతుడు... కైక బహుమతి కనక్‌భవన్. ఈ ప్రయాణంలో... తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఒడిశాకి వెళ్తాం. నాలుగో రోజుకు బీహార్‌లో అడుగుపెడతాం. ఐదవ రోజు ఉత్తరప్రదేశ్‌కి చేరుతాం. ఎనిమిదవ రోజు త్రివేణి సంగమంలో అంతర్వాహిని సరస్వతి నదిలో పుష్కరస్నానం. మొదటి రోజు..ఈ రైలు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. సికింద్రాబాద్‌లో మొదలై బోన్గిర్, జన్‌గాన్, ఖాజీపేట, వరంగల్, మహబూబాబాద్, దోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ టూర్ ప్యాకేజ్‌లో పర్యాటకులు తమకు అనువైన స్టేషన్లో రైలెక్కవచ్చు. అలాగే దిగేటప్పుడు కూడా తమకు అనువైన స్టేషన్లో దిగవచ్చు. ఏ స్టేషన్లో రైలెక్కి, ఏ స్టేషన్లో దిగినా ప్యాకేజ్ ధరల్లో మార్పు ఉండదు.రెండోరోజుఉదయం తొమ్మిది గంటలకు పురి పట్టణం సమీపంలోని మల్తీపత్‌పూర్ స్టేషన్‌కి చేరుతుంది. రైలు దిగి రోడ్డు మార్గాన పూరీకి వెళ్లాలి. హోటల్లో చెక్ ఇన్ అయి రిఫ్రెష్మెంట్, లంచ్ తర్వాత జగన్నాథ ఆలయం దర్శనం. రాత్రి బస పూరీలో. ఇది పూరీ కాదు... పురి, అంటే పురం, జగన్నాథపురం అనే ఉద్దేశంలో జగన్నాతపురిగా వ్యవహారంలోకి వచ్చిన పేరు ఇది. ఇస్లాం దాడుల్లో 18 సార్లు ధ్వంసమైన ఆలయం ఇది. గజపతుల రాజ్యం. రాజ్యాలు, రాజరికాలు ΄ోయినప్పటికీ గజపతుల రాజవంశీయులు ఇప్పటికీ ఆలయంలో సంప్రదాయ క్రతువులను నిర్వహిస్తోంది. పురి అనగానే జగన్నాథుడితోపాటు గుర్తు వచ్చే మరో పేరు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుదర్శన్ పట్నాయక్. పురి బీచ్‌లో పట్నాయక్ చేతిలో రూపుదిద్దుకున్న బొమ్మలను చూడాలి. గోల్డెన్ బీచ్, చంద్రభాగ బీచ్‌లు అందంగా ఉంటాయి. మూడోరోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ గది చెక్ అవుట్ చేసి కోణార్క్‌కు ప్రయాణం. ఆలయ వీక్షణం తరవాత మల్తీపత్‌పూర్ స్టేషన్‌కి చేరి రైలెక్కాలి. రైలు భువనేశ్వర్, కటక్, భద్రక్, బాలాసోర్, ఆద్రా మీదుగా గయకు సాగిపోతుంది. చేతిలో పది రూపాయల నోటుుంటే... కోణార్క్ సూర్యదేవాలయాన్ని ఒకసారి చూసుకోండి. అసలైన సూర్యదేవాలయాన్ని ఆ తర్వాత చూడండి. కళింగ ఆర్కిటెక్చర్లో ఉన్న కదలని రథం యునెస్కో గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ సైట్. ఈ ఆలయం వంద అడుగుల ఎత్తున్న రథం ఆకారంలో ఉంటుంది. 13వ శతాబ్దంలో తూర్పు కళింగ గంగరాజు మొదటి నరసింగదేవ కట్టిన దేవాలయం ఇది. యూరప్ నుంచి వచ్చే నావికులు ఈ ఆలయాన్ని బ్లాక్ పగోడా అన్నారు. పురిలోని జగన్నాథ ఆలయాన్ని వైట్ పగోడా అన్నారు. బంగాళాఖాతంలో ప్రయాణిస్తున్న నౌకలకు ఈ ఆలయ శిఖరాలు పెద్ద ల్యాండ్‌మార్క్‌లు. నాల్గోరోజుఉదయం తొమ్మిదిన్నరకు గయకు చేరుతుంది. రైలు దిగి బో«ద్గయకు వెళ్లి హోటల్ గదికి వెళ్లి రిఫ్రెష్ అయిన తర్వాత లంచ్ చేసిన తర్వాత విష్ణుపాద ఆలయదర్శనం. రాత్రి బస బోద్ గయలోనే. బోద్‌గయ కూడా యునెస్కో గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది బౌద్ధులకు పవిత్రమైన క్షేత్రం. బుద్ధుడిని హిందూ దశావతారాల్లో భాగంగా గౌరవించడంతో హిందువులకు కూడా ఈ ప్రదేశం గొప్ప యాత్రాస్థలమైంది. బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయిందని చెప్పే ప్రదేశం ఇది. గయకు సమీపంలో (15 కి.మీలు) ఉండడంతో బుద్ధగయ, బో«ద్గయగా వ్యవహారంలోకి వచ్చింది. విష్ణుపాద ఆలయం గయలో ఉంది. ఈ ఆలయంలో 40 సెంటీమీటర్ల పొడవుగా ఒక అడుగు ఉంటుంది. దాని చుట్టూ షట్భుజి ఆకారంలో పాలరాతి నిర్మాణం ఉంటుంది. దాని చుట్టూ కూర్చుని పాదానికి పూజలు చేస్తారు. ఇక్కడ పూజారుల దోపిడీకి గురి కాకుండా జాగ్రత్త పడాలి. భక్తులను దబాయిస్తుంటారు. నిర్వహణ సరిగ్గా ఉండదు, పరిశుభ్రత తక్కువ. పూజారులు తొలిచూపులోనే ఉత్తరాది– దక్షిణాది మనుషులను గుర్తించగలుగుతారు. దక్షిణాది వారి పట్ల వివక్ష స్పష్టంగా వారి కళ్లలో కనిపిస్తుంది. ఆలయ గోపురం నిర్మాణ కౌశలాన్ని ఆస్వాదించడానికి ప్రశాంతంగా సమయం కేటాయించాలి. ఐదోరోజుఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసి ఎనిమిది గంటలకు గయ స్టేషన్‌కు చేరి రైలెక్కాలి. రైలు మధ్యాహ్నం ఒంటిగంటకు వారణాసికి చేరుతుంది. రైలు దిగి రోడ్డు మార్గాన సారనాథ్‌కు వెళ్లాలి. రాత్రి బస అక్కడే. సారనాథ్... ఇది బుద్ధుడు జ్ఞానోదయం తర్వాత ఐదుగురు శిష్యులకు తొలి ప్రవచనం ఇచ్చిన ప్రదేశం. ఇక్కడి స్థూపాన్ని థమేక్ స్థూప అంటారు. ఇది కూడా యునెస్కో గుర్తించిన వరల్డ్ హెరిటేజ్ సైట్. మన అధికారిక చిహ్నం అశోకుడి ధర్మచక్రం కూడా ఉంది. టిబెట్ బౌద్ధులు కట్టిన బౌద్ధమఠం కూడా ఉంది. ప్రశాంతంగా చూడాల్సిన ప్రదేశం ఇది. ఆరోరోజుఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కాశీ (వారణాసి)కి ప్రయాణం. కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణ ఆలయాల దర్శనం. సాయంత్రం గంగా హారతి తర్వాత రాత్రి బస వారణాసిలో. వారణాసిలో అడుగు పెట్టక ముందే మనోఫలకం మీద విశ్వనాథుడి రూపం మెదలుతుంది. కాశీ లైవ్ దర్శనం పేరుతో వెలువడిన వీడియోలను మన మైండ్ రీమైండ్ చేసుకుంటుంది. కొత్తగా కట్టిన ఆలయం నిర్మాణపరంగా ఒక అద్భుతం. విశ్వనాథుడి దర్శనం కోసం క్యూ లైన్లో ఉన్నప్పుడు పరిశీలనగా ఆలయ ప్రాంగణమంతా పరికించి చూస్తే ఇనుప కంచె వేసిన తెల్లటి నిర్మాణం కనిపిస్తుంది. అదే అప్పుడప్పుడూ వార్తల్లో కనిపిస్తున్న జ్ఞానవాపి. అక్కడి నంది విగ్రహం విశ్వనాథ ఆలయంలోని శివలింగానికి అభిముఖంగా ఉంటుంది. ఆ తర్వాత విశాలాక్షి, అన్నపూర్ణ, వారాహి, కాలభైరవ ఆలయాలను దర్శించుకుని గంగానదిలో పడవ విహారం చేయాలి. మణికర్ణికా ఘాట్, దశాశ్వమేథ ఘాట్ల వంటి అనేక ఘాట్లను సందర్శించి, గంగాహారతిని చూస్తే కాశీయాత్ర పరిపూర్ణమవుతుంది. ఇక్కడ ఉదయం పూట తాజా మీగడలో చక్కెర వేసి అమ్ముతారు. చాలా రుచిగా ఉంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత బనారస్ కిళ్లీ వేసుకుని బనారస్ చీరలు, చుడీదార్లు కొనుక్కుంటే మనసు సంతృప్తి చెందుతుంది. సారనాథ్‌లో టైమ్ దొరికితే దుస్తుల షాపింగ్ అక్కడే చేయవచ్చు. సారనాథ్‌లో వీవర్స్ సొసైటీ మగ్గాలు, ప్రభుత్వ ఆథరైజ్డ్ దుకాణాలున్నాయి. ఏడోరోజుఉదయం వారణాసిలో గది చెక్ అవుట్ చేసి ఏడు గంటలకు రైలెక్కాలి. అయోధ్యకు ప్రయాణం. మధ్యాహ్నం 12.30కు అయోధ్యధామ్ స్టేషన్‌కు చేరుతుంది. రామజన్మభూమి, హనుమాన్‌గరి దర్శనం తర్వాత సాయంత్రం సరయు నదిలో హారతిని వీక్షణం. రాత్రి భోజనం తర్వాత అయోధ్యధామ్ స్టేషన్‌కు చేరి రైలెక్కాలి. ప్రయాణం ప్రయాగ్‌రాజ్‌కి సాగుతుంది.గంగా తీరం నుంచి సరయు తీరానికి చేరి అయోధ్యలో అడుగుపెట్టినప్పటి నుంచి బాల రాముడి రూపం త్వరగా రమ్మని పిలుస్తూ ఉంటుంది. విశాలమైన బాలరాముడి ఆలయాన్ని చూసిన తరవాత అయోధ్యలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశం హనుమాన్ గరి, ఆ తర్వాత కనక్ భవన్. సీతారాములకు వారి వివాహ సందర్భంగా కైకేయి ఇచ్చిన బహుమతిగా చెబుతారు. అయోధ్యలో నాగేశ్వరనాథ్ఆలయాన్ని రాముడి కుమారుడు కుశుడు నిర్మించాడని చెబుతారు. సరయు నదిలో హారతి కూడా గంగాహారతిని తలపిస్తూ కనువిందు చేస్తుంది. అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు అంబరాన్నంటుతాయి.ఎనిమిదో రోజుతెల్లవారు జామున 4.30 గంటలకు రైలు ప్రయాగసంగమం రైల్వేస్టేషన్‌కి చేరుతుంది. త్రివేణి సంగమంలో పవిత్రస్నానమాచరిండం ఇతర క్రతువులు పూర్తి చేసుకుని మధ్యాహ్నం రెండు గంటలకు రైలెక్కాలి. ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) మనకు త్రివేణి సంగమస్థలిగానే గుర్తొస్తుంది. కుంభమేళా పూర్తి చేసుకుని నగరం సాధారణ స్థితికి చేరేలోపే సరస్వతి పుష్కరాల ఉత్సాహం మొదలైంది. త్రివేణి సంగమంలో గంగ, యమున నదులు స్పష్టంగా కనిపిస్తాయి. గంగ నీరు బురద మట్టి కలిసినట్లు గోధూళి వేళను తలపిస్తుంది. యమున నీరు మన కృష్ణానది నీటిలాగ కారుమేఘాన్ని తలపిస్తుంది. పడవలో నది విహారం చేస్తూ రెండు నదుల నీటిని బాటిళ్లలో నింపుకోవచ్చు. సరస్వతి నది ఇక్కడ అంతర్వాహిని కావడంతో ఆ నీటిని వర్ణించడం సాధ్యం కాదు. పుష్కరాల సమయంలో ఇక్కడ తీర్థ స్నానం చేస్తారు. పూజాదికాలు నిర్వహిస్తారు.తొమ్మిదో రోజుతెల్లవారు జామున 4.30 గంటలకు రైలు ప్రయాగసంగమం రైల్వేస్టేషన్‌కి చేరుతుంది. త్రివేణి సంగమంలో పవిత్రస్నానమాచరిండం ఇతర క్రతువులు పూర్తి చేసుకుని మధ్యాహ్నం రెండు గంటలకు రైలెక్కాలి. ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) మనకు త్రివేణి సంగమస్థలిగానే గుర్తొస్తుంది. కుంభమేళా పూర్తి చేసుకుని నగరం సాధారణ స్థితికి చేరేలోపే సరస్వతి పుష్కరాల ఉత్సాహం మొదలైంది. త్రివేణి సంగమంలో గంగ, యమున నదులు స్పష్టంగా కనిపిస్తాయి. గంగ నీరు బురద మట్టి కలిసినట్లు గోధూళి వేళను తలపిస్తుంది. యమున నీరు మన కృష్ణానది నీటిలాగ కారుమేఘాన్ని తలపిస్తుంది. పడవలో నది విహారం చేస్తూ రెండు నదుల నీటిని బాటిళ్లలో నింపుకోవచ్చు. సరస్వతి నది ఇక్కడ అంతర్వాహిని కావడంతో ఆ నీటిని వర్ణించడం సాధ్యం కాదు. పుష్కరాల సమయంలో ఇక్కడ తీర్థ స్నానం చేస్తారు. పూజాదికాలు నిర్వహిస్తారు.ఇర ఈ టూర్ మే నెల 8వ తేదీన మొదలవుతుంది. పుష్కరాలు మొదలయ్యే 15 తేదీ నాటికి ప్రయాగ్‌రాజ్‌కి తీసుకువెళ్తుంది. అంటే సరస్వతి నదికి పుష్కరాలు మొదలైన తొలిరోజే పుష్కర స్నానం ఆచరించే అవకాశం కలుగుతుంది. పుష్కరాలు మే నెల 26వ తేదీతో ముగుస్తాయి.ప్యాకేజీ వివరాలివి: అయోధ్య కాశీ పుణ్య క్షేత్ర యాత్ర (సరస్వతి పుష్కరాల స్పెషల్) ఇది 9 రాత్రులు, 10 రోజుల యాత్ర. పురి, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్లు కవర్ అవుతాయి. ఐఆర్సీటీసి నిర్వహిస్తున్న ఈ టూర్ ప్యాకేజీ పేరు ‘అయోధ్య–కాశీ పుణ్యక్షేత్ర యాత్ర (సరస్వతి పుష్కరాలు స్పెషల్), కోడ్ ఎస్‌సీజెడ్‌బీజీ 41 ఇందులో ఎకానమీ (స్లీపర్ క్లాస్), స్టాండర్డ్ (3 ఏసీ), కంఫర్ట్ (2ఏసీ) కేటగిరీలుంటాయి. ఎకానమీలో ఒక్కొక్కరికి సుమారు 17 వేలు, స్టాండర్డ్‌లో 27 వేలు, కంఫర్ట్‌లో 35వేల రూపాయలు. పూర్తి వివరాల కోసం ఈ వెబ్‌సైట్‌ని సందర్శించండి. https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCZBG41(చదవండి: -
రంజాన్ విందు: టేస్టీ.. టేస్టీగా..షీర్ కుర్మా, కచ్చీ బిర్యానీ చేసేయండిలా..!
రంజాన్ ఉపవాస దీక్షలు ముగించుకుని ఈదుల్ ఫిత్ర్ లేక రంజాన్ వేడుకను బంధుమిత్రులతో కలిసి ఆనందంగా సెలబ్రెట్ చేసుకుంటారు. ఈ పర్వదినాన్ని ఈద్ అని కూడా పిలుస్తారు. ప్రతి ఒక్కరూ ఈ రోజున వారి వారిస్థోమత మేరకు కొత్త దుస్తులు ధరించి, పలు రకాల తీపి వంటకాలు ముఖ్యంగా సేమియా/షీర్ ఖుర్మా, బిర్యానీ చేసుకుని ఆనందంగా విందు ఆరగిస్తారు. ఈ సందర్భంగా నోరూరించే ఆ వంటకాల తయారీ ఎలానో చూద్దామా..!.షీర్ కుర్మా..కావల్సినవి: పాలు – అర లీటర్ (3 కప్పులు); నెయ్యి – టేబుల్‌స్పూన్; పంచదార – ఒకటిన్నర టేబుల్ స్పూన్ (డేట్స్ ఎక్కువ వాడితే తక్కువ పంచదార వేసుకోవాలి); సేవియాన్ (వెర్మిసెల్లి)– అర కప్పు; జీడిపప్పు – 8 (తరగాలి); బాదంపప్పు – 8 (సన్నగా తరగాలి); పిస్తాపప్పు – 8 (తరగాలి); ఖర్జూర – 9 (సన్నగా తరగాలి); యాలకులు – 4 (లోపలి గింజలను ΄÷డి చేయాలి); బంగారు రంగులో ఉండే కిస్మిస్ – టేబుల్ స్పూన్; రోజ్‌వాటర్ – టీ స్పూన్‌తయారీ విధానం: సేవియాన్‌ను కొద్దిగా నెయ్యి వేసి బంగారురంగు వచ్చేలా వేయించి తీసి పక్కన పెట్టాలి.అదె గిన్నె లేదా పాన్‌లో మరికాస్త నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి తీయాలి ∙విడిగా పాలు మరిగించి, సన్నని మంట కాగనివ్వాలి. పాలు కొద్దిగా చిక్కబడ్డాక దీంట్లో వేయించిన సేవియాన్, పంచదార వేసి ఉడికించాలి. సేవియాన్ ఉడికాక మంట తగ్గించి డ్రై ఫ్రూట్స్ మిశ్రమం, యాలకుల పొడి వేసి కలిపి, మంట తీసేయాలి. తీపిదనం ఎక్కువ కావాలనుకునేవారు మరికాస్త పంచదార కలపుకోవచ్చు. కుంకుమపువ్వు, గులాబీ రేకలు, మరిన్ని డ్రై ఫ్రూట్స్ చివరగా అలంకరించుకోవచ్చు.నోట్: ఎండుఖర్జూరం ముక్కలు కలుపుకోవాలంటే వాటిని రాత్రిపూట నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు ఉపయోగించాలి.కచ్చీబిర్యానీ..కావల్సినవి: బాస్మతి బియ్యం – పావు కేజీ (250 గ్రా.ములు); మటన్ – కేజీ (ముక్కలు 2 అంగుళాల పరిమాణం); అల్లం– వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్; ఉల్లిపాయలు – 5 (నిలువుగా సన్నగా తరిగి, విడిగా వేయించి పక్కనుంచాలి); కారం – టేబుల్ స్పూన్; పసుపు – అర టీ స్పూన్; పచ్చి బొప్పాయి ముక్క – పేస్ట్ చేయాలి; చిలికిన పెరుగు – కప్పు; కుంకుమపువ్వు – కొన్ని రేకలు (గరిటెడు వేడి పాలలో కలిపి పక్కనుంచాలి)మటన్ మసాలా కోసం... (దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 పచ్చ యాలకులు, 3 లవంగాలు, బిర్యానీ ఆకు, అర టీ స్పూన్ మిరియాలు, అర టీ స్పూన్ సాజీర) రైస్ మసాలా కోసం... (యాలకులు 2, దాల్చిన చెక్క, పచ్చ యాలక్కాయ, 2 లవంగాలు, నెయ్యి లేదా నూనె 3 టేబుల్‌స్పూన్లు, పుదీనా, కొత్తిమీర గుప్పెడు, ఉప్పు తగినంత)తయారీ విధానం:బేసిన్లో మటన్ వేసి అందులో పెరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, బొప్పాయి ముద్ద, కారం, పసుపు, మసాలా, ఉప్పు, వేయించిన ఉల్లిపాయల తరుగు సగం వేసి కలిపి, 3 గంటల సేపు నానబెట్టాలి. కప్పు బియ్యానికి రెండున్నర కప్పుల చొప్పున నీళ్లు, మసాలా, బియ్యం, తగినంత ఉప్పు వేసి ముప్పావు వంతు వరకు ఉడికించి, నీళ్లను వడకట్టాలి. తర్వాత అందులో నెయ్యి వేసి కలపాలి. మరో మందపాటి డేకిసా(గిన్నె) తీసుకొని నెయ్యి వేసి వేడయ్యాక నానిన మటన్ వేసి కలపాలి. పైన పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నిమ్మరసం వేయాలి. సగం ఉడికిన బియ్యం పైన లేయర్‌గా వేయాలి. మిగిలిన నెయ్యి, కుంకుమపువ్వు కలిపిన పాలు, నిమ్మరసం వేయాలి. డేకిసా మీద మూత పెట్టి, గోధుమపిండి ముద్దతో చుట్టూ మూసేయాలి. పెద్ద మంట మీద 20–25 నిమిషాలసేపు ఉడకనివ్వాలి. సన్నని మంట మీద మరో 40 నిమిషాలు ఉంచాలి. తర్వాత దించి, రైతా/ఏదైనా గ్రేవీతో వేడి వేడిగా వడ్డించాలి. (చదవండి: ప్రేమను పంచే శుభదినం ఈద్) -
ఈ జాబ్ చాలా లక్కీ!: ఐపీఎస్ అంకిత సురానా
సాక్షి, పార్వతీపురం మన్యం: ‘‘మహిళలను వెన్నుతట్టి ప్రోత్సహిస్తే ఏ రంగంలోనైనా విజేతలవుతారు. అమ్మాయిలు ఇష్టమైన రంగాన్ని ఎంచుకోవాలి. డాక్టర్, పోలీస్, ఇంజినీర్.. ఇలా ఏదైనా సరే! దాన్ని సాధించేందుకు ఎదురైన ప్రతి సవాల్‌నూ ఛాలెంజింగ్‌గా తీసుకోవాలి. ఎర్విరిథింగ్ ఈజ్ పాజిబుల్.. కష్టపడితే గెలుపు మన ముందు వచ్చి వాలుతుంది..’’ ‘‘పార్వతీపురం మన్యం జిల్లా లాంటి ఏజెన్సీ ప్రాంతంలో పని చేయడం గొప్ప అనుభూతినిస్తోంది. ఇక్కడ గిరిజన జనాభా అధికం. నిరక్షరాస్యత కూడా ఉంది. గత కొన్నేళ్లుగా కొంత మార్పు కనిపిస్తోంది. బాలికలు విద్య, క్రీడలు, ఇతర రంగాల్లో ప్రావీణ్యం పొందుతున్నారు. వారిలో మరింత చైతన్యం తీసుకొచ్చేందుకు నా వంతుగా ప్రయత్నినస్తున్నా. పాఠశాలలు, కళాశాలలకు స్వయంగా వెళ్లి వివిధ అంశాలపై వివరిస్తున్నా. కేవలం భద్రతనే కాదు.. కెరియర్ కోసం కూడా వివరిస్తుండటం సంతృప్తినిస్తోంది.’’ చిన్నప్పుడు అందరిలానే తనూ ఒక సాధారణ అమ్మాయి. చదువు, ఆటపాటలే లోకం. డిగ్రీ చదువుతున్న సమయంలో.. సమాజంలో తన పాత్ర ఏమిటో అవగతమైంది. ఈ సొసైటీకి.. ప్రధానంగా మహిళలు, బాలికల కోసం ఏం చేయాలన్న ప్రశ్నలోనే.. ‘ఐపీఎస్’ అన్న లక్ష్యం బోధపడింది. ఆమే.. యువ ఐపీఎస్ అధికారిణి, పార్వతీపురం ఏఎస్పీ అంకిత సురాన. అత్యున్నతమైన ఇండియన్ పోలీస్ సర్వీస్ కు ఎంపిక కావడమే కాదు.. శిక్షణలోనూ ప్రతిభను చూపారు. నేడు విధి నిర్వహణలోనూ ‘ఫ్రెండ్లీ పోలీస్’ అన్న పదానికి అసలైన నిర్వచనం చెబుతూ, క్లిష్టమైన కేసుల్లోనూ తన మార్కు చూపిస్తూ.. విజయవంతమైన అధికారిణిగా గుర్తింపు పొందారు. రాష్ట్రానికి మారుమూలన ఉన్న పార్వతీపురం మన్యం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, యువతకు దిశానిర్దేశం చేయడంలో ముందుంటున్నారు. తన కుటుంబ నేపథ్యం, ఈ రంగంలోకి రావడానికి కారణం, విధి నిర్వహణలో సక్సెస్ఫుల్ జర్నీని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... శిక్షణ తర్వాత చాలా మార్పు సివిల్స్ సాధించిన తర్వాత శిక్షణ పూర్తయ్యాక నాలో చాలా మార్పు వచ్చింది. పట్టుదల పెరిగింది. ప్రజలకు సేవ చేయడాన్ని స్ఫూర్తిగా తీసుకున్నా. బాలలు, మహిళల రక్షణ కోసం పని చేయాలని అనిపించింది. ఈ రంగంలో తల్లిదండ్రులు ఎంతగానో ప్రోత్సహించారు. 2023లో గ్రేహౌండ్స్‌లో విశాఖలో విధుల్లో చేరా. తర్వాత పార్వతీపురం ఏఎస్పీగా వచ్చా. ఈ జాబ్ పొందడం చాలా లక్కీ! మరిచిపోలేని అనుభూతి.. రాష్ట్రస్థాయి రిపబ్లిక్‌డే వేడుకల పరేడ్ కమాండర్‌గా వ్యవహరించడం మరిచిపోలేని అనుభూతి. గర్వపడే సందర్భం. చాలా ఆనందం అనిపించింది. ఒక వారం శిక్షణ పొంది విజయవంతంగా పరేడ్ పూర్తి చేయగలిగాం. నాకు అవకాశమిచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నేటి తరానికి ఇచ్చే సందేశం.. నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్. ఎవి్వరిథింగ్ ఈజ్ పాజిబుల్. నేటి తరం బాలికలు, యువతకు చెప్పేదొకటే. విద్యార్థి దశలో చదువు, కెరియర్‌పైనే దృష్టి పెట్టాలి. మీరు ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారో గట్టిగా నిర్ణయించుకోవాలి. దాని సాధన దిశగా సాగాలి. పదో తరగతి తర్వాత కెరియర్ కౌన్సెలింగ్ చాలా ముఖ్యం. ఈ దశలో ఇతర విషయాల జోలికి వెళ్లకుండా, అనవసరంగా సమయం వృథా చేయకుండా భవిష్యత్తు కోసం ఆలోచిస్తే.. మంచి జీవితం లభిస్తుంది. కుటుంబ నేపథ్యం.. మా సొంత ప్రాంతం మహారాష్ట్ర. పదో తరగతి వరకు అక్కడే చదివా. తర్వాత కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడింది. ఇంటర్ (బైపీసీ) తర్వాత హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో బీఎస్సీ బయోకెమిస్ట్రీ డిగ్రీ, సల్సార్ యూనివర్సిటీలో క్రిమినల్ జస్టిస్ మేనేజ్మెంట్లో పీజీ పూర్తిచేశా. తల్లిదండ్రులు కౌసల్య, మహవీర్ సురానా. నాన్న వ్యాపార రంగంలో ఉన్నారు. ఇంట్లో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగంలో లేరు. అందరూ ప్రైవేట్ ఉద్యోగాలు, వ్యాపారాలే. మా కుటుంబం నుంచి నేను మొదటి పోలీస్ అధికారి కావడంతో మా కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉన్నారు. డిగ్రీలో ఉంటుండగానే కెరియర్ కోసం ఆలోచించా. సమాజానికి సేవ చేయాలని, ప్రజలకు దగ్గరగా ఉండే వృత్తిలో చేరాలని కోరిక. ఆ క్రమంలోనే సివిల్స్ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నా. డిగ్రీ చదువుతూనే.. సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించాను. లక్ష్యంపైనే గురి. మూడుసార్లు విజయం రాకపోయినా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. నాలుగో ప్రయత్నంలో సివిల్స్ సాధించాను. 398వ ర్యాంకు వచ్చింది. ఐపీఎస్‌కు ఎంపికయ్యా. 2021 బ్యాచ్ మాది. ప్రజల సహకారం ఉంటేనే.. ప్రజలను సురక్షితంగా ఉంచడం బాధ్యత. ఇదే సమయంలో శాంతి¿¶ద్రతల పరిరక్షణలో పోలీస్ శాఖపరంగా ఎంత చేసినా.. ప్రజల నుంచీ సహకారం అవసరం. ట్రాఫిక్ రూల్స్ పాటించడం, ప్రయాణ సమయంలో హెల్మెట్ ధారణ వంటివాటిలో ఎవరికివారు బాధ్యతగా వ్యవహరించాలి. పిల్లలు తప్పుడు దారిలో వెళ్లకుండా తల్లిదండ్రులు పర్యవేక్షణ చేయాలి. సమాజంలో ప్రధానంగా పోలీసులంటే భయం పోవాలి. 24 గంటలూ పోలీసులు అందుబాటులో ఉంటారు. ఏ సమయంలోనైనా ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలి. చుట్టుపక్కల అసాంఘిక కార్యకలాపాలు జరిగినా.. ఒక్క ఫొటో ద్వారానైనా శక్తి యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇతర పోలీస్ శాఖ టోల్‌ఫ్రీ నంబర్లనూ వినియోగించవచ్చు. శక్తి యాప్.. సేఫ్టీయాప్. ప్రధానంగా మహిళల వద్ద ఉండాలి. ఒక్క బటన్ ప్రెస్ చేస్తే పోలీసులు ఉంటారు. ప్రజలకు పోలీసులు ఉన్నారన్న నమ్మకం పెరగాలి నేను ఎక్కడ పనిచేసినా.. అక్కడ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు, చిన్నారులకు భద్రత కల్పించగలిగితే చాలు.. అంతకంటే సంతృప్తి ఉండదు. ప్రత్యేకించి మహిళలు, చిన్నారులకు పోలీస్‌పై నమ్మకం పెంచేలా పనిచేయగలగాలి. విధి నిర్వహణలో ప్రతి కేసునూ సవాల్‌గానే తీసుకుంటా. పోక్సో కేసులు, వరకట్నం, ఎస్సీ, ఎస్టీ కేసులు, శాంతిభద్రతలు.. ఇలా ఏదైనా బాధితులకు న్యాయం చేయాలి. అప్పుడే విధి నిర్వహణలో సంతృప్తి చెందగలం. మహిళల హక్కులు, చట్టాలపైన అవగాహన కల్పింస్తున్నాం. మహిళా దినోత్సవం సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ, ఇతర కార్యక్రమాలు చేశాం. చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. ఏ ఒక్కరూ భయపడకూడదు. ధైర్యంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలి. ఇటీవల ఒక పోక్సో కేసు వచ్చింది. ఆ అమ్మాయి చాలా డిప్రెషన్లోకి వెళ్లిపోయింది. వారం రోజులు కౌన్సెలింగ్ ఇచ్చాం. ఇప్పుడు ఆ అమ్మాయి చాలా హ్యాపీగా ఇంటర్ పరీక్షలు రాసుకుంటోంది. శాంతిభద్రతల పరిరక్షణలో... డ్రోన్ నిఘా వ్యవస్థను పటిష్టం చేశాం. ఈవ్‌టీజింగ్, జూదం, గంజాయి, సారా అక్రమ రవాణా వంటివాటిని డ్రోన్ల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ, కట్టడి చేస్తున్నాం. ప్రతి ముఖ్య కూడళ్లలోనూ సీసీ కెమెరాలు పెట్టాం. జిల్లాలో టాప్ 20 నేరస్తులను గుర్తించాం. వారిపై నిరంతరం ఓ కన్నేసి ఉంచుతున్నాం. మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా శక్తి యాప్ అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం పార్వతీపురం, పాలకొండ, సాలూరుల్లో టీమ్స్ పని చేస్తున్నాయి. వీరికి ప్రత్యేకంగా ఓ వాహనం ఉంటుంది. 100, 112 నంబర్లకు కూడా అత్యవసర సమయంలో ఫిర్యాదు చేయవచ్చు. నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అక్కడ ఉంటారు. గంజాయి, సారా రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నాం. కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. బాలికల కోసం స్వీయ రక్షణ తరగతులు నిర్వహిస్తున్నాం. అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి.. ఏ విధంగా రక్షణ పొందాలి, భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పింస్తున్నాం. పాఠశాలల్లో ఈగల్ టీమ్స్ ద్వారానూ అవగాహన పెంచుతున్నాం. చిన్నారులు, మహిళల రక్షణ కోసం వన్‌స్టాప్ సెంటర్ ఉంది. అక్కడ వారికి అవసరమైన అన్ని విధాల మద్దతు కూడా లభిస్తుంది. సైబర్ క్రైమ్ మోసాలు రోజుకో విధంగా కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. ప్రజలు వాటి బారిన పడకుండా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు ఆయా ఎస్‌హెచ్‌వోల ద్వారా చేపడుతున్నాం. పోలీస్ సిబ్బంది సొంత సమస్యలపైనా ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా గ్రీవెన్స్ నిర్వహించి, ఫిర్యాదులు స్వీకరిస్తున్నాం. -
మామా.. ఆర్డర్ చేస్తున్నా..!
ఏడాది కిందట పెళ్లైన ఓ జంట ఉద్యోగం చేసుకుంటోంది. భర్త చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తే... భార్య ప్రైవేటుగా పనిచేస్తోంది. ఈ ఇద్దరూ వారి వృత్తిలో బిజీగా గడుపుతున్నారు. వంట చేయడం రాదు. దీంతో కొన్ని నెలలు వంట మనిషిని పెట్టుకున్నారు. రుచి లేదని ఆమెను చాలించారు. ఈ కారణంగా ఎక్కువగా ఫాస్ట్‌పుడ్ సెంటర్లను ఆశ్రయిస్తుంటారు. ఆస్పత్రి ఆవరణం, పలమనేరు రోడ్డు, మురకంబట్టు రోడ్డు, లేకుంటే తమిళనాడులోని వేలూరుకు సైతం వెళుతున్నారు.కొత్త జంటలు వంటపై తంటాలు పడుతోంది. పెళ్లి కూతుర్లు వంటింట్లో అడుగు పెట్టాలంటే తెగ ఫీలైపోతున్నారు. వంట చేయడం రాక కొంత మంది వంట గదికి దూరంగా ఉండిపోతున్నారు. మరికొంత మంది పని ఒత్తిళ్లతో వంట దగ్గరికి వెళ్లలేకపోతున్నారు. ఇంకొంత మంది యూట్యూబ్ పాఠాలతో వంట వండేందుకు అపసోపాలు పడుతున్నారు. వారు వండిందే వారికే నచ్చక సింపుల్‌గా ఆన్లైన్ ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. లేకుంటే పాస్ట్ ఫుడ్‌ను వెతుక్కుంటున్నారు. వీటి సంఖ్య జిల్లాలో గణనీయంగా పెరిగింది. ఇలా ఆరగించడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాణిపాకం(చిత్తూరు): ఒకప్పుడు పెళ్లి చూపులంటే.. వరుడు వైపు వరకట్నంతో పాటు అమ్మాయికి వంటా వచ్చా అని అడిగేవాళ్లు. ఏ రకమైనవి ఎక్కువగా వండుతావ్ అని గుచ్చి గుచ్చి ప్రశ్నించేవారు. అప్పట్లో చదువు, ఉద్యోగం చూసేవారు కాదు. అమ్మాయి చక్కగా వండి పెడుతూ..ఇంట్లో ఉంటే చాలనుకునేవారు. ఇప్పుడు అమ్మాయి ఎంత వరకు చదువుకుంది..ఏం చేస్తోంది అని మాత్రమే చూస్తున్నారు. వధువు వైపు నుంచి...వరుడు చదువు, ఉద్యోగం, ఫ్యామిలీ పరిస్థితి చూసి..పెళ్లి ఫిక్స్ చేసేస్తున్నారు. అమ్మాయికి వంట వచ్చా అని అడిగే వాళ్లు పూర్తిగా కరువయ్యారు. చదువులపైనే దృష్టి పెడుతున్నారు.. ఒకప్పుడు ఆడ పిల్లలు 10 ఏళ్ల వయస్సు వచ్చిందంటేనే తల్లులు వంటింటికి తీసుకెళ్లి రకరకాల వంటలు చేయడం నేర్పేవాళ్లు. అత్తారింటికి వెళితే మీ అమ్మ వంట చేయడం నేర్పలేదా అని మమ్మలను చులకనగా మాట్లాడతారని తల్లులు పట్టుబట్టి వాళ్ల పిల్లలకు వంట నేర్పేవాళ్లు. ఇప్పుడు పల్లె, పట్నం అనే తేడా లేకుండా తల్లిదండ్రులు పిల్లలను చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. పిల్లల చదువుపై దృష్టి పెడుతున్నారు. బాగా చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం, ప్రభుత్వం ఉద్యోగం, డాక్టర్ అవ్వాలని, ఇతర ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నారు. ఇందులో చాలా మంది ఉన్నత చదువుల కోసం బయట రాష్ట్రాలకు, విదేశాలకు పంపుతున్నారు. ఒకప్పుడు మగ పిల్లలను చదివిస్తే ప్రయోజకుడై..పోషిస్తారని అనుకునేవాళ్లు. ఇప్పుడు మగ పిల్లలతో పాటు ఆడ పిల్లలను సమానంగా చదివిస్తున్నారు. చదువు తప్ప మరేది ముట్టుకోనివ్వడం లేదు. ఈ క్రమంలో ఆడ పిల్లలు వంటింటికి దూరమవుతున్నారు. తల్లులు సైతం పెళ్లైతే వంట నేర్చుకుంటుంది లే అని తేలికగా వదిలేస్తున్నారు. వంట చేయడం రాదు పెళ్లైన కొత్త జంటలు లగ్జరీ లైఫ్ వెతుక్కుంటున్నారు. పెళ్లికి ముందు నుంచే ఏ పని ముట్టుకోకుండా జీవించేయాలని కలలు కంటున్నారు. ముఖ్యంగా ఆడ పిల్లలు పుట్టింట్లో ఉన్నట్లుగా ఉండాలని కోరుకుంటున్నారు. అత్తారింటికి వెళ్లినా.. కాఫీ అంటే బెడ్ రూమ్‌కే వచ్చేయాలనే అనుకుంటున్నారు. వంట వచ్చిన మొగుడైతే ఇంకా బెటర్ అని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. ఇలా పుట్టింట్లో వంట నేర్చుకోక కొత్త పెళ్లి కూతుర్లు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా కాపురం పెట్టిన వారైతే వంట కోసం తంటాలు పడుతున్నారు. కొందరు యూట్యూబ్ చూసి వంట పాఠాలు నేర్చుకోవడానికి ప్రయతి్నస్తున్నారు. ఈ ప్రయత్నంలో చేతులు కాల్చుకుంటూ వద్దురా..ఈ వంట తంటా అంటూ చాలించుకుంటున్నారు. ఆ వండిన వంట రుచికరంగా లేకపోవడంతో అబ్బాయిలు ఆమడదూరం వెళ్లిపోతున్నారు. ఇక ఉద్యోగ రీత్యా దంపతులు ఇద్దరూ వంటింటికి దూరంగా ఉంటున్నారు. 8 గంటల పని, తర్వాత ఇంటి పని, ఇతర పనులు వెరసి అలసిపోతున్నారు.బయట ఫుడ్ డేంజర్..? అధికంగా బయట ఫుడ్ తినడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, బ్రెయిన్ స్ట్రోక్, క్యాన్సర్, రక్తనాళాల్లో కొలె్రస్టాల్ తదితర సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా పెళ్లైన వారు లావు కావడానికి ఇది కూడా ఒక కారణమని వెల్లడిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్‌కు జై కొడుతున్నారు దంపతులు ఇద్దరూ సంపాదన మీద పోటీ పడుతున్నారు. బిజీ లైఫ్‌లో పడిపోతున్నారు. నువ్వా నేనా అంటూ పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఈ తరుణంలో భార్య వంటింటికి దూరమై బయట ఫుడ్ కోసం అన్వేస్తున్నారు. అలాగే చాలా మంది వంట రాక అల్లాడిపోతున్నారు. యూట్యూబ్ చూసి వండిన ఆ టేస్ట్ రాకపోవడంతో ముద్ద మింగుడు పడడం లేదు. దీంతో ఫాస్ట్ ఫుడ్‌పై పడిపోతున్నారు. మూడు పూటల ఫాస్ట్‌ఫుడ్‌ను ఆరగిస్తున్నారు. లేకుంటే దర్జాగా ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్లు పెట్టుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే వాళ్ల పరిస్థితి అయితే అర్ధరాత్రి కూడా ఆర్డర్లు పెట్టుకుని ఆవురావురమని తినేస్తున్నారు. ఫుడ్ దొరక్కపోయినా ఫిజ్జాలు, బర్గర్లు తెప్పించుకుని కడుపు నింపుకుంటున్నారు. దీని ఫలితంగా జిల్లాలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు విచ్చలవిడిగా పుట్టుకొచ్చాయి. బిర్యానీ సెంటర్లు సందుకొక్కటి ఉన్నాయి. వీరి రాకతో ఆ సెంటర్లు, హోటళ్లు నిండిపోతున్నాయి. కొత్త జంటలతో కళకళలాడుతున్నాయి. అనారోగ్యం పాలుకావద్దు ఫాస్ట్ ఫుడ్ ప్రస్తుత సమాజంలో ఫ్యాషన్‌గా మారింది. పేద, మధ్య ధనిక తేడా లేకుండా ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారు చాలా మందికి వంట రాదు అని బయట ఫుడ్ తింటున్నారు. ఇది మంచిది కాదు. వీలైనంత వరకు తగ్గించుకుంటే మంచిది. తాజాగా వండి తినడం ఉత్తమం. బయట తినడం వల్ల అనేక రోగాలు మనిషిని చుట్టుముడుతాయి. – వెంకట ప్రసాద్, వైద్య నిపుణుడు, చిత్తూరు -
ప్రేమను పంచే శుభదినం ఈద్
ఈదుల్ ఫిత్ర్ లేక రంజాన్ పర్వదినం ప్రపంచంలోని ముస్లిం సమాజానికి అత్యంత పవిత్రమైన, ఆనందకరమైన వేడుక. అత్యంత ఉత్సాహంగా, ఆనందంగా వారు ఈవేడుకను జరుపుకుంటారు. ఈ పర్వదినాన్ని ‘ఈద్’ అని కూడా పిలుస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ ను అనుసరించి రంజాన్ నెల ముగిసిన మరునాడు దీన్ని జరుపుకుంటారు.రంజాన్, ఇస్లామిక్ క్యాలెండర్లో తొమ్మిదవ నెల. ఇది ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సమాజంలో చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నెలలో ముస్లింలు ప్రత్యేకంగా ఉపవాసం (సియామ్) పాటిస్తారు, అంటే ఉషోదయం నుండి సూర్యాస్తమయం వరకు భోజనం, పానీయాలు, ఇతర శరీర సంబంధిత అవసరాలన్నీ త్యజిస్తారు. ఉపవాసం ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఒక శుద్ధి ప్రక్రియగా భావించ బడుతుంది, ఇది స్వీయ నియంత్రణ, ప్రేమ, దయ, జాలి, క్షమ, సహనం, పరోపకారం, త్యాగం లాంటి అనేక సుగుణాలను పెంపొందించడానికి సహాయపడుతుంది. ఈ సందర్భంగా వారు వారి దైనందిన సేవాకార్యక్రమాలను మరింత విస్తరించుకొని, నైతికంగా, ఆధ్యాత్మికంగా తమ వ్యక్తిత్వాలను నిర్మించుకొని దేవుని కృపా కటాక్షాలు పొందడానికి ప్రయత్నిస్తారు. ఈదుల్ ఫిత్ర్ పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని, సమాజంలో పేదరికాన్ని తొలగించే ప్రయత్నం కూడా ఎంతోకొంత జరుగుతుంది. దాతృత్వం, సామాజిక సేవలకుప్రాధాన్యం ఇవ్వడం ఈ పండుగ ప్రధాన లక్ష్యం. ప్రతి ఒక్కరూ తమ తోటి సోదరులకు సహకరిస్తూ వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోడానికి ప్రయత్నిస్తారు. సదఖ, ఫిత్రా, జకాత్ ల ద్వారా అర్హులైన అవసరార్థులకు ఆర్థిక సహాయం అందిస్తారు.ఈదుల్ ఫిత్ర్ పర్వదినం సమస్త మానవాళి, సర్వ సృష్టిరాశి సుఖ సంతోషాలను కాంక్షించే రోజు. ఆనందం, శాంతి, సంతోషం, సమానత్వం, క్షమ, దయ, జాలి, పరోపకారం, సామాజిక బాధ్యతలను ప్రతిబింబించే ప్రత్యేకమైన రోజు. ఇది కేవలం ఒక ఆథ్యాత్మిక క్రతువు కాదు. సమాజంలో ప్రేమ, సహకారం, పరస్పర మైత్రి, బాధ్యత, ఆనందాలను పంచుకునే వేడుక. రంజాన్ నెల రోజుల శిక్షణ ద్వారానూ, ఈద్ పండుగ ద్వారానూ సమాజం ఆధ్యాత్మికతను, మానవతా విలువలను పునరుద్ధరించుకుంటుంది.పండగ తర్వాత కూడా...ఈద్ తో రోజాలకు వీడ్కోలు పలికినప్పటికీ, నెలరోజులపాటు అది ఇచ్చినటువంటి తర్ఫీదు అనంతర కాలంలోనూ తొణికిస లాడాలి. పవిత్ర రంజాన్ లో పొందిన దైవభీతి శిక్షణ, దయాగుణం, సహనం, సోదరభావం, పరస్పర సహకార, సామరస్య భావన, ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలు పంచుకునే గుణం, పరమత సహనం, సర్వ మానవ సమానత్వం లాంటి అనేక సదాచార సుగుణాలకు సంబంధించిన తర్ఫీదు ప్రభావం మిగతా పదకొండు నెలలకూ విస్తరించి, తద్వారా భావి జీవితమంతా మానవీయ విలువలే ప్రతిబింబించాలి. సమస్త మానవాళికీ సన్మార్గభాగ్యం ప్రాప్తమై, ఎలాంటి వివక్ష, అసమానతలులేని, దైవభీతి, మానవీయ విలువల పునాదులపై ఓ సుందర సమ సమాజం, సత్సమాజ నిర్మాణం జరగాలి. ఇహపర లోకాల్లో అందరూ సాఫల్యం పొందాలి. ఇదే రంజాన్ ధ్యేయం.ఈ రోజు ముస్లింలు ఉదయాన్నే నిద్రలేచి పరిశుభ్రతను పొందుతారు. ఈద్ నమాజ్ /ప్రార్థన ఆచరించి కుటుంబంతో, స్నేహితులతో కలిసి పండుగను జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ ఈ రోజున వారి వారిస్థోమత మేరకు కొత్త దుస్తులు ధరించి, పలు రకాల తీపి వంటకాలు ముఖ్యంగా సేమియా/షీర్ ఖుర్మా తీసుకుంటారు. ఈదుల్ ఫిత్ర్ పండుగ కేవలం ఒక వేడుక మాత్రమే కాదు, సమాజంలో నైతిక, ఆధ్యాత్మిక, మానవీయ సుగుణాలను పునరుధ్ధరించే మహత్తరమైన రోజు. ఈ పండుగ రోజున ముస్లిం సమాజం జకాతుల్ ఫిత్ర్ అనే దానం కూడా ఇస్తారు. పేదసాదలను గుర్తించి వారికి ఫిత్రా దానాలు చెల్లించడం ద్వారా తమ దాతృత్వాన్ని చాటుకోవడం కాకుండా తమ బాధ్యతను నెరవేర్చామని భావిస్తారు.రంజాన్ నెల ముగియగానే, షవ్వాల్ నెల మొదటి రోజు ముస్లిం సోదరులు ‘ఈదుల్ ఫిత్ర్’ పర్వదినం జరుపుకుంటారు. ‘ఫిత్ర్’ అంటే దానం, పవిత్రత లేదా శుద్ధి అని కూడా అంటారు. ఇది ఉపవాసం,ప్రార్థనల ధార్మిక విధిని పూర్తి చేసుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని దైవానికి కృతజ్ఞతలు తెలుపుకునే అపురూప సందర్భం.– మదీహా అర్జుమంద్ -
వర్క్ షేరింగ్.. హ్యాపీనెస్ లోడింగ్
రోజంతా బండెడు చాకిరీ చేసే భార్యకు ఇంటి పనిలో భర్త చేసే చిన్నపాటి సాయం ఎంతో ఉపశమనాన్నిస్తుంది. లేచింది మొదలు పడుకునే వరకు అలుపెరుగని ఆమె శ్రమకు వారంలో ఒక్కరోజైనా విరామం అవసరం. ఆదివారం (Sunday) భర్త ఇంటి పనులు చక్కబెడుతూ ఆమెను మురిపిస్తే వారి సంసార బంధం మరింత బలపడుతుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.సాక్షి, భీమవరం: తెల్లారి లేచింది మొదలు ఆడవాళ్ల చేతులు పనులకు ముడిపడతాయి. ఇంటిని శుభ్రం చేయడం, పిల్లలకు స్నానాలు చేయించడం, భర్త, పిల్లలు రెడీ అయ్యేసరికి టిఫిన్లు సిద్ధం చేసి పెట్టడం. అవి పూర్తయ్యేలోగా లంచ్ బాక్స్‌లు ప్యాకింగ్. ఇలా.. ఉదయం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు క్షణక్షణం ఉరుకులు పరుగుల జీవితం. భర్తను ఉద్యోగానికి, పిల్లల్ని బడికి సాగనంపాక బండెడు గిన్నులు తోముకుని, ఇంటిల్లపాదివి మాసిన దుస్తులు ఉతుక్కుని, స్నానం చేసి దేవుడికి దణ్ణం పెట్టుకుని.. హమ్మయ్యా అనుకునేసరికి టైం 11 అయిపోతుంది. చాలామంది గృహిణులు ప్రశాంతంగా కూర్చుని టిఫిన్ చేసేది అప్పుడే. సాయంత్రం పిల్లలు, భర్త ఇంటికి తిరిగి వచ్చే వరకు ఏదో పనిలో ఈదుతూనే ఉంటారు. పిల్లలతో హోం వర్క్ చేయించి రాత్రి అందరూ పడుకున్నాక ఉదయానికి అన్నీ సర్దుకుని అలసిసొలసి అప్పుడు నిద్రలోకి జారుకుంటుంటారు. కుటుంబానికి చేదోడుగా.. భర్త, పిల్లల్ని సాగనంపి కుటుంబ పోషణకు చేదోడుగా ఉద్యోగాలు, పనులు చేస్తున్న మహిళలు ఎందరో ఉన్నారు. వీరిపై పనిభారం మరింత ఎక్కువగా ఉంటుంది. దాదాపు ప్రతి ఇంటిలో తొలి మేలుకొలుపు భార్యదే. రాత్రి బాగా పొద్దిపోయాక నిద్రపోయేది ఆమెనే. పనుల సుడిగుండంలో తనను తాను మరిచిపోయి ఎల్లప్పుడూ కుటుంబ క్షేమం కోరే వ్యక్తి ఇల్లాలు. అలాంటి అర్ధాంగికి ఉపశమనం (Relief) కలిగించేలా వారాంతాలు, ముఖ్యంగా ఆదివారం ఇంటి పనుల్లో భర్త సహాయం చేయడం ద్వారా గృహిణుల మానసిక, శారీరక స్థితులు మ రింత దృఢమవుతాయని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. గృహ సంబంధ బాధ్యతలు పంచుకోవడం మేలని, ఈ దిశగా అందరూ ముందుండాలని అంటున్నారు. ఏమేం చేయాలంటే.. →ఉదయం లేవగానే గదులను తుడవడం, దుమ్ములు దులిపి ఇంటిని శుభ్రం చేయడం. ఇంటి ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలు తొలగించడం, మొక్కలకు నీరు పెట్టడం. గిన్నెలు తోమడం, కూరగాయలు కోయడం, వంట చేయడం. దుస్తులు ఉతికి ఆరబెట్టడం, ఐరెన్ చేయడం → పిల్లలు ఇంటి వద్దనే ఉంటారు కాబట్టి వారికి స్నానాలు చేయించడం, హోంవర్క్‌లో సాయం చేయడం, వారితో కలిసి సరాదాగా ఆడుకోవడం వంటివి భర్తలు చేస్తుండాలి.ప్రయోజనాలెన్నో.. → ఇంటిపనిలో చేదోడువాదోడుగా ఉండే భర్తని ఇల్లాలు చాలా ఎక్కువగా ప్రేమిస్తుందని నిపుణులు అంటున్నారు. భర్త తనను ఎంత ప్రేమగా, బాధ్యతగా చూసుకుంటున్నాడో అర్థం చేసుకుంటుంది. ఇద్దరి మధ్య ఏమైనా మనస్పర్థలు, అపార్థాలు ఉంటే తొలగిపోతాయి. ఆదివారం వర్క్ షేరింగ్‌తో ఆ ఇంట హ్యాపీనెస్ (Happiness) లోడింగ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. → ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటేనే ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఉంటారు. విశ్రాంతి వలన ఆమె శారీరక, మానసిక స్థితి మెరుగుపడుతుంది.→ ఇంటి పనులు త్వరగా పూర్తయితే ఇద్దరూ కూర్చుని కబుర్లు చెప్పుకునేందుకు సమయం పెరుగుతుంది. → సెలవురోజున పని అయ్యాక ఇల్లాలని సరదాగా బయటకు తీసుకువెళ్లడం వలన వారికి రీఫ్రెష్ అయిన భావన కలిగి వారమంతా ఉత్సాహంగా ఉండే వీలుంటుంది. → ఇల్లాలు భర్త నుంచి కొంత సమయం కోరుకుంటుంది. అది కూడా స్నేహపూర్వక వాతావరణంలో ఉండాలని భావిస్తుంది. ప్రేమగా వారి పనుల్లో పాలుపంచుకోవడం వలన ఇది సాధ్యపడుతుంది. → ఇంటి పని మహిళలే చేయాలన్న భావన నుంచి బయటపడొచ్చు. చదవండి: పిల్లలు స్కూల్ నుంచి రాగానే వారికి ఏం నేర్పిస్తున్నారు?భార్యకు విశ్రాంతి అవసరం భార్యకు ఒక్కరోజు విశ్రాంతినివ్వడం ఎంతో అవసరం. పని ఒత్తిడి నుంచి వారికి ఉపశమనం కలుగుతుంది. వారిని పట్టించుకోనట్టు ఉంటేనే ఆడవారికి అలకలు, కోపాలు వస్తాయి. భర్త ఇంటి పనుల్లో కలుగజేసుకుని భార్యకు చేసే సాయం వారి బంధానికి మరింత బలమవుతుంది. కౌన్సెలింగ్‌లో భార్యాభర్తలకు ఈ విషయాన్ని చెబుతుంటాం. – చల్లా భారతిదేవి, సైకియాట్రిస్ట్, పాలకొల్లు ఆయనకు సెలవొస్తే..మా వారు పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగి. ఆదివారం, సెలవు రోజుల్లో ఇంటి వద్ద వంట పని, ఇంటి పనుల్లో సాయం చేస్తుంటారు. నా కష్టాన్ని అర్థం చేసుకునే మనస్తత్వం ఆయనకు ఉందని సంతోషం, సంతృప్తి కలుగుతుంటాయి. నేను ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటానికి నా భర్త సహకారమే కారణం. – అంబటి అరుణ సూర్యకుమారి, గృహిణి, నరసాపురం తప్పనిసరిగా సహకరించాలి ఇంటి, వంట పనుల్లో భార్యకు తప్పనిసరిగా సహకరించాలి. నేను వ్యాపారరీత్యా ఆరు రోజులు షాపులో ఉన్నా ఆదివారం తప్పనిసరిగా ఇంటి పనుల్లో నా భార్య లక్ష్మీకుమారికి సహాయపడతాను. ఇతర రోజుల్లోనూ ఇతర పనుల్లో సహాయం చేస్తా. భా ర్యలకు సాయం చేయడం బాధ్యతగా భావించాలి తప్ప నామోషిగా ఫీల్ కాకూడదు. – కారుమూరి నర్సింహమూర్తి (బాబు), భీమవరం ఇంటి పనుల్లో సాయపడతాను నేను ప్రభుత్వ హైస్కూల్ ఉపాధ్యాయుడిని. ఉదయం నుంచి రాత్రి వరకూ ఇంటి కోసం కష్టపడే నా సతీమణి కోసం ఆదివారం ఇంటి పనుల్లో సాయపడతాను. అప్పుడు తెలుస్తుంది ఇంటిని చక్కబెట్టేందుకు ఆవిడ ఎంత కష్టపడుతుందోనని. పొద్దస్తమాను పనిచేసే మహిళలకు వారంలో ఒక రోజు విశ్రాంతి అవసరం. – పొద్దోకు గజేంద్ర గడ్కర్, ఉపాధ్యాయుడు, రాయకుదురు -
విశ్వావసు ఉగాది
అనాదిగా ఈ ఉగాది పర్వం కొత్త చివురులకు ఆరంభం గతమును తుడిచి వెతలను మరిచే నూతనోత్సాహ సంరంభంమోడులు వారి ఆకులు రాలిన శిశిరానికిదే సీమంతం చింత పులుపుకు మామిడి పిందెకు మరువరానిదీ అనుభంధం చెరుకు తీపితో చేదు వేప తన చెలిమిని పంచే శుభ సమయం కష్ట సుఖాలు కలిమి లేములు కలగలిసిన జీవన గమనం ‘క్రోధి'ని వీడి వీడ్కోలీయగ నవ నవోన్మేష నవ వర్షంవిమల తరళ విభుధాన్విత సంతుల “విశ్వావసు” కి స్వాగతం!- వెంకట్ కొత్తూర్, Ashburn VA USAఆదరణే ఆరాధనకాలం ఓ మహా గ్రంథంజీవితం మొత్తంచదువుకోవడమే బ్రతుకు.ప్రకృతిలో ప్రతి ప్రాణీమనిషికి బంధువు.ఆదరించడమే ఆరాధించడం.కాలం కంటి ఎదురుగాప్రకృతి ఒడిలో అనాదిగాసాగుతున్న ఆనందమే ఉగాది.– శ్రీ సాహితిపచ్చడిఉగాది కాంతిఋతువుల స్రవంతిరుచుల మార్గంకోకిల రాగంహామీల స్వరగానంసాగని మేళంజనం పచ్చడిఉచితాల ఉచ్చులులంకా దహనం– రేడియమ్ -
తెలుగు పండగ.. తెంగ్లిష్ శుభాకాంక్షలు
ఒకసారి కర్ణాటక లోని కూర్గ్ ట్రెక్ కి వెళ్ళాను.. సాహసికుల పరిచయాలు అయ్యాయి.. ఇంతలో ఒక కన్నడ మిత్రుడు నా దగ్గరికి వచ్చి.. "మీ తెలుగు రాష్ట్రాల నుంచి నువ్వే వచ్చావా?... అంటూ వచ్చీరాని తెలుగులోనే పలకరించాడు... మరో ఇద్దరు తెలుగు వాళ్ళు కూడా వచ్చారని.. వారిని చూపించాను... ఆ ఇద్దరిని చూసి.. "నువ్వు చెప్పింది నిజమేనా?.. తెలుగు వాళ్లేనా?" అన్నాడు."మరేం లేదు.. వచ్చినప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఇంగ్లిష్ లేదా హిందీ లో సంభాషిస్తుంటేనూ... అంటూ నసిగాడు..ఆయన చెప్పింది నిజమే.. అదేదో 30 రోజుల్లో ఆంగ్లం, హిందీ నేర్చుకోవడం ఎలాగో సాధన చేస్తున్నట్టు.. ఇద్దరూ కూడబలుక్కుని తెలుగు తప్ప ఆంగ్లం, హిందీలో మాట్లాడుతుండటం గమనించాను.."మా తెలుగు వాళ్ళం... ఏ ఇద్దరం కలుసుకున్నా.. తెలుగులో తప్ప మిగిలిన భాషల్లో మాట్లాడుకుంటామ్... అంతే".. అని కన్నడ మిత్రుడికి సమాధానం ఇచ్చి వెళ్ళిపోయాను. నా మాటల్లో వెటకారం అర్థమైన కన్నడ మిత్రుడు నవ్వుకున్నాడు..ఈ జ్ఞాపకం ఇప్పుడు ఎందుకంటే.. ఈ రోజు ఉదయం నుంచి "హ్యాపీ ఉగాది".. అంటూ శుభాకాంక్షల వెల్లువ...పైగా "ఎంజాయ్ ఉగాది... హౌ డూ యూ సెలబ్రేట్ ఫెస్టివల్ బ్రో".. అంటూ సందేశాలు.. .తెలుగువారి పండగైన మకర సంక్రాంతికి.. హ్యాపీ పొంగల్ (ఇది కేవలం తమిళులది) అంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. మీ పరాయి మోజు పాడుగాను..ఉండేది.. అమెరికా అయినా.. అన్నవరమైనా.. కనీసం తెలుగు వారి దగ్గరైనా.. తెలుగు పండగ రోజయినా.. తెలుగులో వెలగండి. మాతృభాషలో మాట్లాడుకునే మన పొరుగు రాష్ట్రాల సోదరుల్ని చూసైనా మారండి..అందరికీ ఉగాది శుభాకాంక్షలు..- బాలు అయ్యగారి -
ఉగాది గురించి పురాణ కథలు కనిపించవు.. ఎందుకు?
ఉగాదికి సంబంధించిన వేడుకలూ, సంప్రదాయాలూ ఉన్నాయి కానీ, ఉగాది గురించి పురాణ కథలు కనిపించవు. కారణం – ఉగాది (Ugadi) దైవానికి సంబంధించిన పండగ కాదు, కాలానికి సంబంధించిన పండగ! మనిషికున్న వనరులలో అన్నిటికంటె విలువైనది కాలం. అందులో క్షణం ఖర్చయిపోయిందంటే, దాన్ని తిరిగి సంపాదించుకొనే అవకాశం ఎవరికీ లేదు! మనిషి ఆయుర్దాయాన్ని పన్నెండు నెలల పొడుగు ఉన్న ముక్కలుగా విభజిస్తే, ఒక్కొక్క భాగం ఆరంభానికి, ఒక్కొక్క ఉగాది మైలురాయి. ‘నిన్నటితో నీ జీవితంలో మరో ఏడు వెళ్ళి పోయింది. అది ఇక తిరిగిరాదు. ఇవ్వాళ ఇంకొక భాగం ఆరంభం. గతం గతః కనుక, రాబోయే ఏడాదిలోనైనా ధర్మార్థ కామ మోక్షాల సాధనకు సమయాన్ని సరిగా కేటాయించుకొని, సద్వినియోగం చేసు కొమ్మని కాలం చేస్తున్న హెచ్చరికగా ఉగాదిని స్వీకరించవచ్చు.కాలం (Time) చిత్రమైంది. అందులో ప్రతిక్షణమూ మన కళ్ళముందే క్రమం తప్పకుండా టిక్‌టిక్‌మని జరిగిపోతూ ఉంటుంది. కానీ విలువయిన కాలం, విలువలేని భోగలాలసతలో వేగంగా మన చేయి జారిపోయిందని, మనకు బోధపడే నాటికి, సాధారణంగా మనం ముది వయసులో ఉంటాం. ‘లాలసులగు మానవులను/ కాలము వంచించు, దురవగాహము! సుమతీ!’ అన్నారు కదా పోతన గారు. ‘తస్మాత్ జాగ్రత్త’ అని గుర్తు చేసే పర్వదినంగా ఉగాదిని చూడవచ్చు.కాలంలో మరో విచిత్రం కూడా ఉంది. ‘కాలం మారిపోతున్నది, రోజురోజుకూ భ్రష్టమై, నాశనమై పోతున్నది!’ అని లోకులం తరచుగా వాపోతూ ఉంటాం. కానీ అది సబబు లేని మాట. కాలం సృష్ట్యాది నుంచి, ఒకే క్రమంలో ఒకే వేగంతో దాని దోవన అది పోతూ ఉన్నది. దానికి మార్పెక్కడ? మారేది లోకం, కాలం కాదు. కాలం మారిపోతున్నదనటం ‘... తల/ తిరుగు మానిసి ఇల యెల్ల తిరుగుననుటె!’ (పానుగంటి).శ్రీ విశ్వావసు నామ సంవత్సర రాశిఫలాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి‘మారేదీ, మారిందీ, మారగలిగిందీ, మారవలసిందీ కాలం కాదు, దేశం. దేశం (Country అంటే మనుషులు. అంటే మేమే! జరిగిపోయిన చెడుగు, అధర్మం, పతనం, భ్రష్టత్వాలు జరిగిపోయాయి. కనీసం రాబోయే కాలంలోనన్నా మేమంతా ‘మంచి’ దిశగా మారేలా చేయి స్వామీ! ఇప్పటి అంధకారం నుంచి మమ్మల్ని వెలుగుదిశగా నడిపించు. ‘తమసో మా జ్యోతిర్గమయ!’ అని చిత్తశుద్ధితో లోకులందరూ సర్వేశ్వరుడిని ప్రార్థించదగిన సుదినం ఉగాది.– ఎం. మారుతి శాస్త్రి -
పంచాంగ సూచనలు
సూర్యభగవానుడు ధనస్సురాశిలోఉండే మాసాన్ని ధనుర్మాసంగా పిలుస్తారు. ప్రదోషకాలంలో శివాలయంలో చండీ ప్రదక్షణ, శివార్చన సర్వసిద్ధిప్రదం. విద్యాప్రాప్తి కొరకు మేధా సంపత్తి కొరకు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయండి. నీలంరంగు ఉమ్మెత్త పూలతో అర్చన చేయుట సర్వకార్యసిద్ధి, శత్రుసంహారము. సంసార సంబంధమైన సర్వబాధలు నివారణకు లకీ‡్ష్మనరసింహస్తోత్ర పారాయణ చేయండి. శ్రీచక్రం ఇంట్లో వుంటే శౌచం ఎక్కువగా పాటించాలి. శివునికి బిల్వపత్రం, గణపతికి గరిక, విష్ణువుకు తులసి మహాప్రీతి. సంతానప్రాప్తికి శివారాధన విశేష ఫలితాలనిస్తుంది. బృహస్పతి అనుగ్రహం కోసం గురువారం శనగలు దానం చేస్తే మంచిది. షష్టిపూర్తి 60 నిండిన తర్వాత సంవత్సరాలలో చేసుకోవలెను. ఉగాదినాడు పంచాగానికి కాలపురుషాయ నమః అని పూజ చేయవలెను. కలియుగంలో భగవంతుడి నామస్మరణం ముక్తికి సులభోపాయం. రోజూ గణపతి స్తోత్ర పారాయణ వలన విఘ్నాలు తొలగును. దక్షిణామూర్తి, హయగ్రీవ దేవతా ఆరాధన వలన విద్యాప్రాప్తి. నిత్య భగవదారాధన తర్వాత, లోకక్షేమం కొరకు కూడా ప్రార్థించుట మంచిది. రోజూ కొంత సమయం దేశక్షేమం కొరకు దైవారాధన చేయుటచే మంచి నాయకులు ఉద్భవిస్తారు. దేవతారాధన ఎంతో– పితృదేవతా రాధనకు కూడా అంతే ప్రాధాన్యం ఉన్నది. ఉగాదినాడు పంచాంగ పూజ, శ్రవణం తప్పక చేయవలెను. నిత్యపూజలో నివేదన చేసే పదార్థం మీద ఆవునెయ్యి తప్పనిసరిగా వేయాలి. నిత్యం దేశక్షేమం కోసం కొంత సమయం దైవారాధన చేయండి. కుజగ్రహశాంతికి సుబ్రహ్మణ్య, హనుమ పూజలు శ్రేయస్కరం. అక్షరాభ్యాసములకు ఉత్తరాయనం విశేషం కొత్తబియ్యాన్ని పితృదేవతలకు నివేదించిన తరువాతే ఉపయోగించాలి. రోజు దైవారాధన అయ్యాక భగవంతునికి యథాశక్తి నైవేద్యం పెట్టవలెను పుష్కర శ్రాద్ధం సోదరులు అందరూ కలసి పెట్టరాదు. విడిగానే పెట్టాలి. గరికతో రోజూ గణపతిని అర్చిస్తే, కార్యవిజయం, కేతుగ్రహానుకూలం. పితృ దేవతారాధన సరిగా చేయకుంటే కుటుంబంలో దోషాలు వస్తాయి. శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మి ఆరాధన చేయండి. మాసశివరాత్రి రోజు శివకళ్యాణం చేయుట ద్వారా వివాహ ప్రయత్నాలు సిద్ధిస్తాయి. బుధ గ్రహ అనుగ్రహం కోసం విష్ణు స్తోత్రములు పారాయణ చేయవలెను. ప్రతిరోజూ ఉదయకాలంలో తప్పనిసరిగా దీపారాధన చేయాలి. శని త్రయోదశీ ప్రదోషకాలంలో శివపూజ ద్వారా సర్వసౌఖ్యాలు అందుతాయి. దీపారాధన చేయుటకు ‘‘వత్తులు’’ స్వయంగా తయారు చేసుకోవాలి. కనుమ రోజున ప్రయాణం చేసే ఆచారం మన ప్రాంతాలలో లేదు. మారేడు, తులసీ, తెల్లజిల్లేడు దేవతా వృక్షాలు. వీటిని స్నానం చేయకుండా ముట్టుకోరాదు. వ్యాసపూజ రోజున యతీశ్వరులను పూజించాలి. దుర్గాపూజలు చేయుట ద్వారా రాహుగ్రహ శాంతి కలుగును. గురు, రాహువులు 10 డిగ్రీలు లోపుగా కలిసి ఉంటే విద్యాభంగం ఏర్పడుతుంది. పేగు మెడలో వేసుకుంటే నాళవేష్టన జనన శాంతి చేయించాలి. వర్జ్యంలో పుడితే విషఘటికా శాంతి చేయించాలి. శుక్ర, రాహువులు 10 డిగ్రీలు లోపుగా కలిసి ఉంటే వైవాహిక జీవితం ఇబ్బందికరం. అస్థి సంచయనం కేవలం ఒక జీవనదిలోనే చేయాలి. రెండు మూడు నదులలో చేయరాదు.శంకుస్థాపన చేసిన రెండవ సంవత్సరం గృహప్రవేశం చేయుట దోషం కాదు. శుక్ర నక్షత్రాలలో రాహువు, రాహు నక్షత్రాలలో శుక్రుడు ఉండడం వైవాహిక జీవితానికి ఇబ్బంది. శనివారం నువ్వులనూనె శరీరానికి రాసుకొని స్నానంచేయుట ద్వారా శనికి శాంతి. కార్తీకమాసం శుక్లపక్షంలో వచ్చే ద్వాదశిని కైశిక ద్వాదశి అని అంటారు. కుజ గ్రహ శాంతి చేయించినా కుజదోషం ఉన్నవారికి ‘’కుజదోషం ఉందనే’’ చెప్పాలి. భగినీ హస్త భోజనం కార్తీక శుద్ధ విదియ నాడు చేయుట ఆయుర్వృద్ధి.గ్రహణ శాంతిగ్రహణ శాంతి: గ్రహణ సమయంలో ఇంట్లోని అన్ని వస్తువుల మీద దర్భలు ఉంచడం మన సనాతన ధర్మం. గ్రహణ ఆరంభంలో అందరూ సనాతన ధర్మం ఆచరించేవారు. స్నానం చేసి దైవ సంబంధ స్తోత్ర పారాయణ మంత్ర, జపాదులతో కాలక్షేపం చేసి గ్రహణానంతరం స్నానం చేయండి.దానం: వెండిచంద్రబింబం, నాగపడగ, బియ్యం, గోధుమలు, తెలుపువస్త్రం, కెంపు, రాగిపాత్ర, కంచుపాత్ర, నువ్వులు, ఆవునెయ్యి, దక్షిణ దానం ఇవ్వవలెను. గ్రహణం రోజు, మరుసటి రోజు లేదా మరల పౌర్ణమి లోపు దానం ఇయ్యవచ్చును. వెండితో చంద్రబింబం మాదిరిగా (బొట్టు బిళ్ళ మాదిరి) చేయించి దానం చేయవలెను.దాన సంకల్పం: ‘‘మమ జన్మరాశి జన్మనక్షత్రవ శాద్యరిష్ట స్థానస్థిత గ్రహణ సూచిత సర్వారిష్ట ప్రశాంతి పూర్వక ఏకాదశ స్థాన స్థిత గ్రహణ సూచిత శుభఫల ప్రాప్త్యర్థం బింబదానం కరిష్యే’’దాత చదవవలసిన శ్లోకం: తమోమయ మహాభీమ సోమసూర్య విమర్దన హేమ తారా ప్రదానేన మమ శాంతి ప్రదోభవ విధుంతుద నమస్తుభ్యం సింహికా నందనాచ్యుత దానేనానేన నాగస్య రక్షమాం వేధజాద్భయాత్.. ఎటువంటి దానం ఎప్పుడు ఇచ్చినా దానంతో పాటుగా ‘స్వయంపాకం’ ఇవ్వడం శుభప్రదం. గ్రహజపం వంటివి చేయించినాసరే ఇవ్వండి.గ్రహణశాంతి అనేది మహర్షులు గ్రంథస్థంగా చెప్పిన అంశం. దీనికి వైదికాచారం జోడించి పెద్దలు చెప్పే విషయాలను ప్రస్తావన చేశాం. సూర్య చంద్రులను ప్రత్యక్ష దైవాలుగా భావన చేసి మనం నిత్యం దైవ సంబంధ కార్యాలు చేస్తూ ఉంటాము. వారిరువురిలో ఏ ఒక్కరైనా ప్రత్యక్షంలో లేరు అంటే గ్రహణంగా భావన చేసి శాంతి పూజ చేయుట మన మతాచారం. అందుకోసమే ప్రతి అమావాస్య వెళ్ళిన మరుసటిరోజున, గ్రహణం మరుసటిరోజున, జాతాశౌచ, మృతాశౌచములకు మరుసటì æరోజున దేవతామందిరం అంతా కూడా శుభ్రంచేసి మరలా విగ్రహాలను కడిగి శుద్ధి చేసి దేవతామందిరములో పెట్టి అర్చన చేయడం మన సంప్రదాయం. -
శ్రీ విశ్వావసు నామ సంవత్సర (2025 – 26) రాశిఫలాలు
మేష రాశి ఆదాయం–2, వ్యయం–14, రాజయోగం–5, అవమానం–7.అశ్వని 1,2,3,4 పాదములు (చూ, చే, చో, లా)భరణి 1,2,3,4 పాదములు (లీ, లూ, లే, లో)కృత్తిక 1వ పాదము (ఆ)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (తృతీయ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (లాభ), కేతువు సింహరాశి (పంచమ) స్థానాల్లో సంచరిస్తారు. శని మార్చి 29 నుండి మీనరాశి (వ్యయం)లో సంచారం. ఏలినాటి శని ప్రారంభమైంది. ఈ సంవత్సరం పనులు ఆలస్యం అవుతాయే గాని, పనులు పాడవడం జరగదు. దూకుడుగా నిర్ణయాలు చేయకండి. ఇతరుల సహకారం తక్కువగా ఉంటుంది. రోజువారీ పనుల్లో మంచిగా వ్యవహరించి సత్ఫలితాలు అందుకుంటారు. అనవసర కాలక్షేపం చేస్తారు. బంధువర్గంతో జాగ్రత్తలు తీసుకోండి. పెద్దల ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. పిల్లల అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. స్థానచలన, ప్రమోషన్ ప్రయత్నాలు ప్రత్యేకంగా చేయకపోతే ప్రతికూలతలు తప్పవు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు వేగంగా సాగవు. వ్యాపారులకు అధికారుల ఒత్తిడి, పనివాళ్లతో సమస్యలున్నా, లాభాలు దక్కుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలకు, కొత్త పెట్టుబడులకు అనుకూలంగా ఉంది.వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఋణాలను ఎగవేసే వారు ఎక్కువ అవుతారు. కొత్త ఋణాలు దొరకవు. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉన్నది. నరాలు, ఎముకల సమస్యలు పెరగగలవు. మార్కెటింగ్ ఉద్యోగులకు పనులు ఆలస్యం అయినా, మంచి ఫలితాలు ఉంటాయి. షేర్ వ్యాపారులకు దూకుడుగా వ్యాపారం చేసే అవకాశం ఉండదు. రైతులు సాధారణ ఫలితాలు పొందుతారు. విద్యార్థులు ఆశించిన ఫలితాల కోసం మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. కోర్టు వ్యవహారాలలో నష్టాలు లేకున్నా, ఆశించిన ఫలితం ఉండదు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు మే నెల నుంచి అంతా సానుకూలం. విదేశీ విద్యా నివాస ప్రయాణ ప్రయత్నాలు çఫలిస్తాయి. ఈ రాశి స్త్రీలకు అన్ని విధాలా అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ వ్యాపార కుటుంబ విషయాలలో మంచి ఫలితాలు అందుకుంటారు. గర్భిణీ స్త్రీలు మే నెల చివర వరకు జాగ్రత్తలు పాటించడం మంచిది.అశ్వని: ఎక్కువ కాలం సమయపాలనలో పనులు పూర్తి చేయలేరు. అందరితో మైత్రీ భావంతో ఉంటూ, సమస్యలు దగ్గరకు రాకుండా చూసుకోగలరు. మీ వద్ద పనిచేసేవారు పూర్తిగా సహకరిస్తారు. ఇతరుల విషయాలలో కలుగ చేసుకోరు. భవిష్యత్ ప్రణాళికలు బాగా చేస్తారు. భరణి: మీ ప్రవర్తనతో బంధుమిత్రులకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. సాంఘిక కార్యక్రమాలలో అవమానం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల విషయంలో అసంతృప్తి ఎదురవుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధిని చేతులారా పాడు చేసుకుంటారు. కృత్తిక నక్షత్రం 1వ పాదం: మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనీ మధ్యలోనే వదిలి వేస్తూ ఉంటారు. ఒంటరిగా ప్రయాణాలు చేస్తుంటారు. కొన్నిసార్లు చక్కటి ఆలోచనా పటిమ ప్రదర్శించి విజయాలు సాధిస్తారు. విద్యా విషయాల్లో సానుకూలత ఎక్కువ. ఆర్థిక నిర్ణయాలు బాగుంటాయి. శాంతి మార్గం: నిత్యం రావిచెట్టు కింద ఉన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రదక్షిణలు చేయండి. రోజూ దశరథకృత శని స్తోత్ర పారాయణ చేయండి. మే 15 తరువాత శని/ గురువులకు జపం దానాలు చేయడం, నవముఖ రుద్రాక్షధారణ మంచిది.ఏప్రిల్: గురు, కుజుల అనుకూలత బాగుంది. ఐదు గ్రహాలు వ్యయంలో ఉన్నందున ప్రతి పనీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కుటుంబంలో అనుకోని సమస్యలు రాగలవు. మీకు సంబంధం లేని విషయాల్లోనూ ఇబ్బందులు రాగలవు. అందరికీ మీ మీద వైరభావం రాగలదు. దూర ప్రయాణాలు ఎక్కువగా చేయవద్దు. పనులు వాయిదా వేయకండి. ఒంటరిగా ఉండడం, ఒంటరిగా దూరప్రాంతాలకు వాహనాలు నడపడం మంచిదికాదు. మే: కొన్ని సందర్భాలు సానుకూలం అవుతాయి. వ్యయంలో వున్న రాహు, శని, శుక్ర సంచారం వల్ల ఎక్కువగా ఇుబ్బందికర çపరిస్థితులే ఉంటాయి. ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. ఇతరుల వ్యవహారాలలో కలగజేసుకోకండి. ఆర్థిక లావాదేవీలను స్వయంగా పరిశీలించండి. ఋణాలు తీర్చడం, కొత్త ఋణాలు దొరకడం కష్టమవుతుంది. జూన్: జన్మ శుక్రుడు వల్ల ఈ నెలంతా చాలా సమస్యలను తెలివిగా ఎదుర్కోగలుగుతారు. కుటుంబంలో అందరికీ వారి వారి విధానములు సవ్యంగా సాగుతాయి. ఒత్తిడి లేని జీవితం సాగిస్తారు. బంధువుల సహకారం బాగుంటుంది. ఆరోగ్యం పట్ల ముందుజాగ్రత్తలు పాటించి సమస్యలను నివారించుకుంటారు. జులై: పనులు సకాలంలో పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. అన్ని వ్యవహారాలలో ఓర్పు, సహనం ప్రదర్శించి అనుకున్న ఫలితాలు పొందుతారు. ఏలినాటి శని ప్రభావం పెద్దగా ఉండదు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలలో గొప్ప సానుకూలత ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలం. ఆగస్ట్: అన్ని పనులు చక్కగా సాగుతాయి. కొత్త ప్రయత్నాలు 21వ తేదీ నుండి వేగవంతమవుతాయి. మీకు అధికారులు, కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది. స్వబుద్ధితో కార్య జయం. ధన ధాన్యలాభం చేకూరుతుంది. బంధుమిత్రుల కలయిక వలన భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్ లభిస్తుంది. సెప్టెంబర్: బుద్ధి కుశలతతో పనులు సానుకూలం చేసుకుంటారు. కుటుంబ సమస్యలు పెరుగుతున్నట్లు అనిపించినా, తెలివిగా వాటిని పరిష్కరించుకుంటారు. ఓర్పుగా వ్యవహార జయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలను అధికంగా చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో అధికారుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను తెలివిగా అధిగమించగలరు. అక్టోబర్: కలహప్రదమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు పెంచుకోవద్దు. అన్న, వస్త్రాదులు సకాలంలో అందని పరిస్థితి ఏర్పడుతుంది. అవయవాలు ప్రతికూలిస్తున్నాయనే భావన ఎక్కువ అవుతుంది. మిత్రులతో మనసు విప్పి మాటలాడలేని పరిస్థితి. ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు ఇబ్బందికరం కాకుండా చూసుకోండి.నవంబర్: వాక్ నియంత్రణ పాటించడం, పాత ఆరోగ్య సమస్యలు తిరగపెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రోజువారీ కార్యక్రమాలు మినహా ఇతరమైనవి చేపట్టవద్దు. ఆగ్రహావేశాలను అదుపు చేసుకోండి. ఆర్థిక వెసులుబాటు ఉన్నా, అనవసర ఖర్చులు పెరుగుతాయి. డిసెంబర్: ప్రత్యేక జాగ్రత్తలతో కాలక్షేపం చేయవలసిన కాలం. ప్రతిపనికీ అవరోధాలు ఎదురవుతాయి. కుటుంబసభ్యులతో దూరప్రాంత విహారాలు చేస్తారు. శుభకార్యాలు, బంధు మిత్రుల కలయిక, కుటుంబంలోని పెద్దల ఆరోగ్య చికాకుల వల్ల వృత్తి ఉద్యోగాల్లో శ్రద్ధ తగ్గుతుంది. ఆర్థిక వెసులుబాటు తక్కువగా ఉన్నా, శ్రద్ధగా ఋణములు, ఖర్చులు నిర్వహిస్తారు. జనవరి: మంచి మార్పులు మొదలవుతాయి. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. సమస్యలను సరిచేసుకొని ముందుకు వెడతారు. ధైర్యంగా ఉంటారు. ఉద్యోగంలో పాత సమస్యలు తీరుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కుటుంబ పరిస్థితులు బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలలో ఇబ్బందులు ఉంటాయి. ఫిబ్రవరి: కాలం అనుకూలంగా ఉంది. గత సమస్యల పరిష్కారానికి కృషి చేయండి. ఇటువంటి మంచి గ్రహచారం చాలా అరుదుగా వస్తుంటుంది. కుటుంబ సమస్యలు తీరుతాయి. ఋణ విషయాలలో మంచి నిర్ణయాలు జరుగుతాయి. కొన్ని జటిల సమస్యలు పరిష్కారానికి దగ్గర అవుతాయి. స్థిరబుద్ధిని ప్రదర్శించండి. మార్చి: మొండి ధైర్యం పెరుగుతుంది. వ్యయ గ్రహచారం పెరుగుతోంది. జాగ్రత్తగా ఉండవలసిన కాలం. ఇతరులకు సలహాలు ఇవ్వడం శ్రేయస్కరం కాదు. మీ కుటుంబ సభ్యుల సహకారం తక్కువగా ఉంటుంది. రోజువారీ వ్యవహారాల్లోనూ అనుకూలత తక్కువగా ఉంటుంది. వ్యాపారులకు అనుకూలత తక్కువ. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగం అవుతాయి. వృషభ రాశిఆదాయం–11, వ్యయం–5, రాజయోగం–1, అవమానం–3.కృత్తిక 2,3,4 పాదములు (ఈ, ఊ, ఏ) రోహిణి 1,2,3,4 పాదములు (వో,వా,వీ,వూ)మృగశిర 1,2 పాదములు (వే,వో)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (ద్వితీయ) స్థానంలో ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (దశమ), కేతువు సింహరాశి (చతుర్థ) స్థానాల్లో సంచరిస్తారు. శని మార్చి 29 నుండి మీనరాశి (లాభ) సంచారం. శని, గురు సంచారం అనుకూలత కారణంగా మంచి ఫలితాలు అందుకుంటారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సమయపాలనతో విజయాలు సాధిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ధర్మకార్యాలు చేస్తారు. సమస్యలు లేని జీవితం సాగుతుంది. కుటుంబ విషయాలలో మంచి ఫలితాలు పొందుతారు. పిల్లల అభివృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందరి సహాయ సహకారాలతో విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలకు అనుకూలం. ఆర్థిక లావాదేవీలు బాగా ఉంటాయి. ఆదాయం అనుకూలం. ఖర్చులను అదుపు చేయగలరు. నగలు, అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. అవసరానికి తగిన ఋణ సౌకర్యం దొరుకుతుంది. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. పాత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. నియమబద్ధమైన జీవనం సాగించి ఆరోగ్యపరంగా సత్ఫలితాలు పొందుతారు. దూరప్రాంతాలను సందర్శిస్తారు. మార్కెటింగ్ ఉద్యోగులు తేలికపాటి ప్రయత్నాలతోనే అభివృద్ధి సాధిస్తారు. షేర్ వ్యాపారులకు లాభాల పంట. రైతులకు సంవత్సరం అంతా బాగుంటుంది. విద్యార్థులకు సర్వత్రా విజయప్రదం. విజ్ఞాన విహార యాత్రలు చేస్తారు. కోర్టు వ్యవహారాలలో అఖండ విజయానికి అవకాశం ఉంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో సానుకూల స్థితి ఉంటుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు వేగంగా సాగుతాయి. ఉద్యోగాలలో సత్ఫలితాలు ఉంటాయి. ఈ రాశి స్త్రీలకు పుణ్యక్షేత్ర సందర్శన అవకాశాలు పెరుగుతాయి. ఆనందంగా కాలక్షేపం చేస్తారు. అన్ని రంగాలలో విజయాలు సాధిస్తారు. పనివారితో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య విషయాలలో ముందు జాగ్రత్తలు పాటిస్తారు. గర్భిణీ స్త్రీలకు సంవత్సరం అంతా అనుకూలం. మే నుంచి సత్ఫలితాలు పెరుగుతాయి. సుఖ ప్రసవయోగం ఉంది.కృత్తిక 2, 3, 4 పాదాలు: అంతా శుభప్రదంగా ఉంటుంది. తెలియని మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. వ్యాపారులకు ఋణ వెసులుబాటు తక్కువగా ఉంటుంది. అయినా నష్టం ఉండదు. పుణ్యకార్యాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది. రోహిణి: తెలివిగా ఓర్పుగా వ్యవహరించడంలో వీరికి తిరుగులేదు. వృత్తి ఉద్యోగాలలో మంచి నిర్ణయాలు చేస్తారు. అందరికీ సహకరించడం ద్వారా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ అవసరాలు తీర్చడం ప్రధాన అంశంగా ముందుకు సాగుతారు. ప్రజాసంబంధాలు పెంచు కుంటారు.మృగశిర 1, 2 పాదాలు: ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతరుల విషయాలలో కలుగ చేసుకోవద్దు. మీ విషయంలో ఇతరుల ప్రమేయానికి అవకాశం ఇవ్వవద్దు. పుణ్యకార్య, శుభకార్యాల కోసం ప్రయాణాలు ఎక్కువ. ఖర్చులు ఎక్కువ. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడికి లోనవుతారు.శాంతి మార్గం: లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం నిత్యం పారాయణ చేయండి. ప్రాతః కాలంలో తెల్లటి పూలతో లక్ష్మీపూజ చేయడం, గోపూజ చేయడం విశేషం. గ్రహశాంతి ప్రత్యేకంగా అవసరం లేదు కాని, నవగ్రహస్తోత్రములు రోజూ పారాయణ చేయడం శ్రేయస్కరం. పంచముఖ రుద్రాక్షధారణ మంచిది.ఏప్రిల్: అన్ని పనులలోను ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉంటాయి. నూతనోత్సాహంతో ముందుకు వెడతారు. మీకు సహకరించే బంధుమిత్రులు ఉంటారు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. ప్రయత్నించవలసిన పనులు ఏమయినా ఉంటే 14వ తేదీ లోపుగా చేయండి. ఉద్యోగ, వ్యాపారాలలో మీ దగ్గర పనిచేసే వారి నుంచి ప్రోత్సాహం అందుకుంటారు. శుభకార్య, పుణ్యకార్య ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు, షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలం. మే: ఎక్కువకాలం అనుకూలంగా ఉంటుంది. కొద్దిరోజులు మాత్రమే మానసిక ఒత్తిడి వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబసభ్యుల సహకార ధోరణి వల్ల సత్ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా అనుకూల స్థితి ఉంటుంది. పుణ్యకార్య శుభకార్యాలు చేస్తారు. విజ్ఞాన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. జూన్: ప్రయాణాలలో మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. వాహనాలు తరచుగా రిపేర్‌కు వస్తుంటాయి.పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ, వ్యాపారాలలో అద్భుతంగా ఉంటుంది. పుణ్యకార్య శుభకార్యాల కోసం ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తెలివిగా పనులు సానుకూలం చేసుకుంటారు. జులై: చాలా అనుకూలమైన ఫలితాలు అందుతాయి. పుణ్యకార్య శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి విజయాలు అందుకుంటారు. ప్రారంభించిన ప్రతిపనీ అనుకూలమే. మనస్సౌఖ్యం ఎక్కువ. ధనధాన్య లాభం చేకూరుతుంది. కుటుంబపరంగా అన్నీ అనుకూలం. ఉద్యోగ, వ్యాపార, ఋణ, ఆరోగ్య విషయాలలో పనులు సానుకూలం చేసుకుంటారు. ఆగస్ట్: అకాలంలో పూర్తయ్యే పనులు వృత్తి ఉద్యోగాలకు చికాకులు కలిగిస్తాయి. భార్యా పిల్లల సహకారం బాగా ఉంటుంది. తరచుగా పనులు మరచిపోతుంటారు. పెంపుడు జంతువుల ద్వారా ఖర్చు పెరుగుతుంది. అధికారుల ద్వారా ఒత్తిడికి లోనవుతారు. అన్ని విషయాలలోనూ అసంతృప్తి ఉంటుంది. సెప్టెంబర్: వృద్ధి శాతం క్రమంగా పెరుగుతుంది. గత సమస్యల పరిష్కారానికి, కొత్త పనుల ప్రణాళికా రచనకు ఈ నెల అనుకూలం. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు. అందరి నుంచి సహకారం అందుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో సాధించే విజయాలతో ఆనందంగా ఉంటారు. అక్టోబర్: మనోధైర్యంతో ఉంటారు. విద్యా, వినోద, విజ్ఞాన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక వెసులుబాటు బాగా అందుతుంది. పదిమందికీ సలహాలు ఇస్తారు. ఉద్యోగ భద్రత, వ్యాపార వృద్ధి అద్వితీయంగా ఉంటాయి. ఋణ సౌకర్యం బాగుంటుంది. స్వేచ్ఛగా జీవితం గడుపుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నవంబర్: ఆరోగ్యపరంగా ఏదో తెలియని ఇబ్బందిని ఎదుర్కొంటారు. కుటుంబపరంగా గురు, శుక్ర, కుజ ప్రతికూలత దృష్ట్యా జాగ్రత్తలు అవసరం. అనవసర కలహాలకు దూరంగా ఉండండి. జ్ఞాతి వైరం ఎక్కువగా ఉం టుంది. శుభకార్య ప్రయత్నాలు, ప్రయాణాలలో విçఘ్నాలు ఎదురవుతాయి. అనవసర కాలక్షేపాలు చేస్తారు. డిసెంబర్: ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం అవసరం. అంతా అనుకూలంగా ఉందని అనుకున్నా, అకస్మాత్తుగా ఇబ్బందులు రాగలవు. ఇతర వ్యాపకాలు పనికిరాదు. కేవలం వృత్తి, కుటుంబ విషయాల మీద దృష్టి కేంద్రీకరించండి. పాత ఋణాల విషయంలో విచిత్రమైన సమస్యలు వచ్చే అవకాశములు ఎక్కువగా ఉన్నాయి. జనవరి: పిల్లల అభివృద్ధి సంతృప్తి కలిగిస్తుంది. క్రమంగా ఒక్కో మంచి మార్పు మీకు దగ్గర అవుతుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. భోజన వసతి 17వ తేదీ నుండి ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగ విషయాలు సాధారణంగా ఉంటాయి. మిగిలిన అన్ని ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఫిబ్రవరి: గోచారం చాలా బాగుంది. ప్రధానంగా పాత సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో ఎక్కువ శ్రమ చేసి, ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు సమస్యలు లేకుండా నడుస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. మార్చి: కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా వృద్ధిని సాధిస్తారు. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నడుపుతారు. ఋణ సౌకర్యం బాగుంటుంది. మనశ్శాంతిగా ఉంటారు. కుటుంబ జీవితం అనుకూలంగా సాగుతుంది. మిథున రాశిఆదాయం–14, వ్యయం–2, రాజయోగం–4, అవమానం–3.మృగశిర 3,4 పాదములు (కా, కి)ఆరుద్ర 1,2,3,4 పాదములు (కూ, ఖం, ఙ, ఛ)పునర్వసు 1,2,3 పాదములు (కే, కొ, హా)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (జన్మ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (నవమ), కేతువు సింహరాశి (తృతీయం) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (దశమ) సంచారం. తరచుగా బుద్ధి భ్రంశానికి లోనవుతుంటారు. చేసే పనులు విడిచి ప్రశాంతంగా దూరంగా వెళ్ళాలి అనే కోరిక పెరుగుతుంది. ప్రతిపనీ పరధ్యానంగా చేస్తారు. మీ ప్రయత్నాలు ఏవీ సరిగా సాగవు. చతుష్పాద జంతువులతో ఇబ్బంది ఉంటుంది. సమయపాలనతో రోజువారీ పనులు పూర్తి అవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో మే వరకు కొన్ని సమస్యలు ఉంటాయి, మే తర్వాత కొంత అనుకూలత ఉంటుంది. కుటుంబ వ్యవహారములలో ఇతరుల ప్రమేయాన్ని ఖండిస్తేనే సుఖపడతారు. ఉద్యోగ విషయాల్లో మీకు సహకరించే అధికారులు విరుద్ధంగా ఉంటారు. ప్రతిపనీ మీ అవగాహన లోపం వలన ఒకటికి రెండుసార్లు చేయవలసి వచ్చి ఇబ్బంది పడుతుంటారు. వ్యాపారులకు అనుకూలత తక్కువ. ఆలోచనలకు, అమలుకు సంబంధం లేక సాధారణ ఫలితాలు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రయత్నాలలో అనిశ్చితి వల్ల చికాకులు ఎదుర్కొంటారు. ఆదాయం తక్కువ. అనవసర ఖర్చులను నియంత్రించలేకపోతారు. ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి. వస్తునష్టం ఉంటుంది. కొత్త ఋణాలు సకాలంలో అందవు. పాత ఋణాలు ఇబ్బందులు సృష్టిస్తాయి. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. తరచుగా చికాకుపడుతుంటారు. మార్కెటింగ్ ఉద్యోగులు ప్రశాంతంగా ప్రవర్తిస్తే కొంత మంచి ఫలితాలు పొందగలరు. షేర్ వ్యాపారులకు చికాకులు ఎదురవుతాయి. ప్రశాంత చిత్తంతో ముందుకు వెళ్ళండి. రైతులకు శ్రమ ఎక్కువ. లాభాలు తక్కువ. విద్యార్థులకు సాధారణ స్థాయి ఫలితాలు అందు తాయి. కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టు వ్యవహారాలలో ప్రతిపనీ చికాకు పెడుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో అనుకూలత తక్కువ. విదేశీ నివాస ఉద్యోగ ప్రయాణ ప్రయత్నాలలో పనులు లాభదాయకంగా ఉంటాయి. ఈ రాశి స్త్రీలు చాలా విషయాలలో ధైర్యంగా ఉన్నా, బుద్ధి కుశలత తగ్గుతుంది. కుటుంబ సభ్యుల సహకారం మే నెల నుంచి పెరుగుతుంది. ప్రధానంగా పిల్లల విషయంలో కలవర పడుతుంటారు. ఆరోగ్యంలో తేడా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు ఇబ్బందికర ఘటనలేవీ ఉండవు. జూన్ వరకు ఆరోగ్య జాగ్రత్తలు అవసరం.మృగశిర 3, 4 పాదాలు: మీ స్వభావ సిద్ధమైన పనులు మాత్రమే చేసుకుంటూ కాలక్షేపం చేస్తారు. చతుష్పాద జంతువులు, పెంపుడు జంతువులు ఇబ్బంది సృష్టిస్తాయి. నమ్మకంగా ఉండే వారి ప్రవర్తన కూడా కొంత అనుమానించేలా ఉండటంతో సందిగ్ధావస్థ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సరిగా సాగవు. ఆరుద్ర: అంతా శుభ పరిణామాలే ఉంటాయి. కుటుంబపరంగా మంచి నిర్ణయాలు చేయగలుగుతారు. విజయం సాధిస్తారు. విద్యా, విజ్ఞాన, విషయ శోధనలో కాలక్షేపం జరుగుతుంది. ఆర్థిక వెసులుబాటు సాధారణంగా ఉంటుంది. వ్యాపారులకు ధనం వెసులుబాటు, పనివారి సహకారం తక్కువగా ఉంటుంది. పునర్వసు 1, 2, 3 పాదాలు: తరచుగా బుద్ధి స్థిమితం కోల్పోతుంటారు. ఆగ్రహావేశాలతో ప్రవర్తిస్తుంటారు. కుటుంబ సభ్యులకు మీకు సయోధ్య సరిగా సాగదు. అస్థిర బుద్ధితో ఏ పనీ సరిగా చేయలేరు. ఋణ విషయాలలో అవమానకర ఘటనలు ఉంటాయి. శాంతి మార్గం: కుజ గురువులకు జప, దాన, తర్పణ వంటివి తరచుగా చేయించండి. సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం రోజూ పఠించండి. ప్రదోషకాలంలో శివాలయంలో ‘‘శ్రీమాత్రే నమః’’ అని చెబుతూ 11 ప్రదక్షిణాలు, కాలభైరవాష్టకం పారాయణ చేయండి. షణ్ముఖ రుద్రాక్షధారణ మంచిది.ఏప్రిల్: ఆదాయం బాగుంటుంది. ఖర్చులు నియంత్రించలేరు. అన్నీ అనుకూలంగానే ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. అన్ని వ్యవహారాలలోనూ ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలలో తరచుగా పాల్గొంటారు. ఉద్యోగంలో స్థానచలన, ప్రమోషన్ ప్రయత్నాలకు అనుకూలం. వ్యాపారులు సంతృప్తికరంగా వ్యాపారం చేయగలుగుతారు. గురువులను, పూజ్యులను తరచుగా దర్శిస్తుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు సానుకూలం. మే: చాలా అనుకూల వాతావరణం. స్వయంగా పనులు పర్యవేక్షించడం, స్వబుద్ధితో ఆలోచించడం, సమయపాలన ద్వారా విజయావకాశాలు అందుకుంటారు. ఉద్యోగులకు అధికారుల సహకారం, తోటివారి సహకారం బాగా అందుతుంది. ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. జూన్: కేవలం ఓర్పు, సహనం మిమ్మల్ని విజయపథం వైపు నడిపిస్తాయి. మీ సహనాన్ని పరీక్షించే సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యపరంగా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. ఋణ సౌకర్యం తగ్గుతుంది. జులై: వాహన చికాకులు, ప్రయాణ చికాకులు రాకుండా జాగ్రత్తపడండి. ధనవ్యయం ఎక్కువ, ఆదాయం తక్కువగా ఉంటుంది. వస్తువులను తరచుగా మరచిపోతుంటారు. కార్యవిఘ్నం తరచుగా ఉంటుంది. మొండి ధైర్యంతో పనులకు శ్రీకారం చుడతారు. చతుష్పాద జంతువుల వలన ఇబ్బందులు ఉంటాయి. ఆగస్ట్: చాలా విచిత్రమైన కాలం. తెలివి, ఓర్పు ప్రదర్శిస్తారు. విజయాలు సాధిస్తారు. పని ఒత్తిడి ఎక్కువ. అనుకోకుండా కొత్త పనులు చేయవలసి వచ్చి రోజువారీ పనులకు ఇబ్బంది కలుగుతుంది. శుభ, పుణ్యకార్యాలలో పాల్గొంటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పాత కుటుంబ సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. సెప్టెంబర్: ఇబ్బందులు లేని కాలమే నడుస్తుంది. కొత్త కొత్త ప్రయత్నాలు, వాటికి సంబంధించిన చర్చలు చేస్తారు. అంతా శుభంగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో అన్యోన్యత బాగుంటుంది. పెద్దలు, పూజ్యులు, గురువుల సందర్శన, పుణ్యకార్య నిర్వహణలో కాలక్షేపం జరుగుతుంది. అక్టోబర్: సాధారణ జీవనశైలితో ముందుకు వెడతారు. తెలియని అనిశ్చితి ఏర్పడుతుంది. ఉద్యోగం బాగుంటుంది. అసంతృప్తిగా ఉంటారు. వ్యాపారం బాగా ఉన్నా, ఆర్థిక లావాదేవీలు, ఋణ వ్యవహారాలు ఇబ్బంది లేకున్నా, భయంతో గడుపుతారు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న చికాకులు, శ్రమాధిక్యం ఉంటాయి. నవంబర్: ఊహాతీతంగా పనులు వేగంగా పూర్తవుతాయి. అనుకోని వ్యక్తులు కూడా సహకారం అందిస్తారు. వృత్తి రీత్యా అభివృద్ధి బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అప్పులు తీర్చడానికి అనుకూలం. ప్రయాణాలు అధికంగా చేస్తారు. శుభ, పుణ్యకార్యాలలో పాల్గొంటారు. డిసెంబర్: శుక్ర, కుజుల అనుకూలత తక్కువగా ఉన్నందున కుటుంబ కలహాలకు అవకాశం ఇవ్వకుండా కాలక్షేపం చేయండి. ప్రతి విషయంలో ఓర్పు అవసరం. స్నేహితుల పొరపాట్లకు మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది. అనవసర కాలక్షేపాలకు దూరంగా ఉండండి. బంధువర్గంతో కలసి చేసే వ్యాపార వ్యవహారాలు సానుకూలం కావు. పుణ్యకార్య, పుణ్యక్షేత్ర సందర్శన ఖర్చులు పెరుగుతాయి. జనవరి: తరచుగా చేస్తున్న పనులు మానేసి, దూరంగా వెళ్ళాలి అనే కోరిక పెరుగుతుంది. రవి, కుజ, శుక్ర, బుధ సంచారం అనుకూలంగా లేదు. ప్రతి వ్యవహారాన్ని స్వయంగా సాధించుకోవాలి. సాంఘికంగా గౌరవ మర్యాదలకు ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడండి. ఋణ, ఆరోగ్య సమస్యలకు సంబంధించి జాగ్రత్తలు పాటించాలి. ఫిబ్రవరి: చాలాకాలం తరువాత అనుకూల గ్రహచారం చూస్తున్నారు. 13వ తేదీ నుండి కొంత మార్పు, 23వ తేదీ నుంచి పూర్తి అనుకూలత ఉంటుంది. పుణ్య, శుభకార్యాలు చేస్తారు. క్రమంగా లాభదాయక ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఈనెల ద్వితీయార్ధం అనుకూలంగా ఉంటుంది. ఋణ సమస్యలు తీరడానికి మంచి మార్గం దొరుకుతుంది. మార్చి: గ్రహచారం అద్భుతంగా ఉంది. అందరూ సహకరిస్తారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. షేర్ వ్యాపారులకు అనుకూలం. వాహన కొనుగోలు, అలంకరణ వస్తు కొనుగోలు పనులు వేగంగా జరుగుతాయి. కర్కాటక రాశిఆదాయం–8, వ్యయం–2, రాజయోగం–7, అవమానం–3పునర్వసు 4వ పాదము (హి)పుష్యమి 1,2,3,4 పాదములు (హూ, హే, హొ, డా)ఆశ్లేష 1,2,3,4 పాదములు (డీ, డూ, డే, డొ)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (నవమ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (అష్టమ), కేతువు సింహరాశి (ద్వితీయ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (భాగ్య) సంచారం. ఒక్కోసారి అనుకూలత, ఒక్కోసారి ప్రతికూలత ఎదురవుతాయి. మే నెల నుంచి మానసిక, శారీరక శ్రమ ఎక్కువ. మీ వస్తువులను ఏదో ఒక రూపంగా నష్టపోతూ ఉంటారు. జాగ్రత్త పడాలనే విషయాలలో అనవసర ప్రయత్నాలు చేస్తారు. తరచుగా పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. రోజువారీ పనుల్లో సమయపాలన లేక ఇతర పనుల్లో ఇబ్బంది పడుతుంటారు. పిల్లలకు, మీకు సమన్వయం కుదరక బాధపడతారు. పెద్దల ఆరోగ్యం ప్రతికూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో బంధువుల ప్రమేయం ఎక్కువ. ఉద్యోగులు మే తరువాత అధికారుల ఆగ్రహావేశాలను ఎదుర్కొంటారు. మే వరకు తెలివిగా ప్రవర్తిస్తారు. స్థానచలనం, ప్రమోషన్ ఆశించిన రీతిలో ఉండవు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో మోసపోయే అవకాశాలు మే నెల నుండి ఉన్నాయి. వ్యాపారులకు జాగ్రత్తలు మే నుంచి ఎక్కువ అవసరం. నూతన వ్యాపార ప్రయత్నాలలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆదాయానికి, ఖర్చుకు పొంతన ఉండదు. మే తరువాత నిల్వలు తీసే ఖర్చులు పెరుగుతాయి. ఋణ వ్యవహారాలలో అనుకూలత లేదు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. పెద్ద ఇబ్బంది లేకున్నా, మంచి వైద్య సలహాలు అందక చికాకు పడే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. పాత సమస్యలు ఇబ్బంది పెడతాయి. మార్కెటింగ్ ఉద్యోగులకు మానసిక, శారీరక శ్రమ తప్పదు. షేర్ వ్యాపారులకు దూకుడు తగ్గించమని సూచన. మే నుంచి చికాకులు పెరుగుతాయి. రైతులకు శ్రమ ఎక్కువ. నకిలీ పురుగు మందులు, ఎరువుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు బుద్ధి స్థిరం తప్పే అవకాశం ఉన్నది. కోర్టు వ్యవహారాలలో మే నుంచి ప్రతికూలతలు ఎక్కువ. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో తరచుగా తప్పుడు సూచనలు అందుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ధనవ్యయం ఎక్కువ అవుతుంది. ఈ రాశి స్త్రీలకు తరచుగా పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఎక్కువవుతాయి. సమర్థంగా ప్రవర్తించలేరు. అనవసర విషయాలు కలవర పెడుతుంటాయి. లేని అనారోగ్యాలకు కూడా భయపడతారు. గర్భిణీ స్త్రీలకు జాగ్రత్తలు అవసరం. మే 15 తరువాత ఆరోగ్య ఆహార విషయాలలో జాగ్రత్తలు పాటించలేక ఇబ్బందులకు లోనవుతారు. పునర్వసు 4వ పాదం: అనవసర ప్రయాణాలతో ఖర్చులు ఎక్కువవుతాయి. అందరితోనూ స్నేహంగా ఉండాలని ప్రయత్నించినా సానుకూలత ఉండదు. సమస్యల్లో చిక్కుకున్న ఇతరులకు సçహాయం చేసి అవమానాలకు లోనవుతుంటారు. శుభకార్య ప్రయత్నాలు తేలికగా పూర్తవుతాయి. జాగ్రత్తగా ఉన్నా, ఆశించిన ఫలితాలు అందవు. పుష్యమి: వృథా కాలక్షేపాలు అధికం అవుతాయి. వృత్తి విషయంలో మీ ఆలోచనకు, ఆచరణకు పొంతన ఉండదు. కుటుంబ విషయాలలో మంచి చేసినా అవమనాలకు లోనయ్యే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. ఆశ్లేష: తరచుగా అనుకూలతలు ప్రతికూలతలు వస్తుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకోని స్థానచలనం లేదా మార్పు ఉంటుంది. సమయపాలన లేకుండా పనులు చేయవలసి ఉంటుంది. పిల్లల వలన మానసిక చికాకులు ఎక్కువ అవుతాయి. కుటుంబంలో సంఘంలో మీకు నచ్చని సందర్భాలు ఎక్కువగా ఉంటాయి.శాంతి మార్గం: రాహువుకు దుర్గా స్తోత్ర పారాయణ మంచిది. కేతువుకు లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ మంచిది. శివాలయంలో రోజూ ‘‘శ్రీమాత్రే నమః’’ అని చెబుతూ 11 ప్రదక్షిణాలు చేయండి. గురు రాహు కేతువులకు జపదానం తర్పణం మేలో చేయించండి. త్రిముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: ప్రతి విషయం లాభదాయకంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. స్వయంగా విజయాలు సాధిస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగపరంగా అధికారుల ప్రోత్సాహం బాగుంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కోర్టు వ్యవహారాలు సానుకూలం. మార్కెటింగ్ ఉద్యోగులు లబ్ధి పొందుతారు. కులవృత్తిలో ఉన్నవారికి అనుకూలం. మే: ఆరుగ్రహాలు భాగ్య, రాజ్య, లాభ స్థానాలలో ఉన్నా, జన్మ కుజ, నవమ శని వల్ల ఏదో తెలియని భయం, ఆరోగ్య సమస్యలు ఉన్నాయనే భావన పీడిస్తుంటాయి. సమస్యలు ఉన్నా, పరిష్కార మార్గం కూడా పక్కనే ఉంటుంది. జూన్: మొదటివారంలో ఆశ్లేష వారికి అనుకూలత తక్కువ. అన్నీ బాగున్నట్లుగా ఉన్నా, ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలను అప్రమత్తంగా నిర్వహించాలి. పాత ఆరోగ్య సమస్యలు తిరగబడే సూచన. ఇతరుల వ్యవహారాల జోలికి పోవద్దు. ఈ నెలలో కొత్త ఋణాలు చేస్తే, వాటిని తీర్చడం కష్టం. జులై: పుష్యమీ నక్షత్రం వారికి 20వ తేదీ నుండి కొంచెం శ్రమ ఎక్కువ. రాశివారు అందరూ ఏదో ఒక రకంగా పను వాయిదా వేస్తుంటారు. ప్రతిచోట, ప్రతిపనిలోనూ అధిక ఖర్చులు తప్పవు. భోజనం, నిద్ర వంటి రోజువారీ పనుల్లోనూ జాప్యం ఎదురవుతుంది. ఆగస్ట్: వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పడండి. తెలియని అసంతృప్తి వెంబడిస్తుంది. కొన్ని సందర్భాలలో మొండి ధైర్యంతో పనులు సానుకూలం చేసుకుంటారు. విద్యార్థులకు, ఫైనాన్స్ వ్యాపారులకు జాగ్రత్తలు అవసరం. ఒంటరి ప్రయాణాలు, అనవసర కాలక్షేపాలు విడనాడండి. సెప్టెంబర్: ఆర్థిక సమస్యలకు ఈ నెలలో పరిష్కార మార్గాలు గోచరిస్తాయి. ఇంటి విషయంలోనూ, వృత్తి విషయంలోనూ పనివారు సహకరించరు. కుటుంబ సమస్యల పరిష్కారం తేలికవుతుంది. ప్రయాణాలు, శుభకార్యాలు, ఉద్యోగ సమస్యల పరిష్కారంతో కాలక్షేపం బాగా సాగుతుంది. అక్టోబర్: కొత్త పనులు చేపట్టినవారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో తోటివారి ప్రతికూలత ఎక్కువ. అధికారుల రక్షణ విశేషంగా ఉంటుంది. స్వబుద్ధితో పనులు సానుకూలం చేసుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు తేలికగా పూర్తి చేసుకుంటారు. నవంబర్: తెలివి, ఓర్పుతో విజయాలు సాధిస్తారు. పాత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. పాత ఆరోగ్య సమస్యలకు మంచి వైద్యం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపార కుటుంబ వ్యవహారాలలో సానుకూలత ఉంటుంది. డిసెంబర్: భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలలో మంచి సలహాలు అందవు. కొత్త ఋణాలు చేయకుండా ఉండడం మంచిది. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. జనవరి: అన్నింటిలోనూ 17వ తేదీ నుంచి అడ్డంకులు పెరుగుతాయి. కోపావేశాలను అదుపు చేసుకోవలసిన కాలం. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. దూర ప్రయాణాలు తగ్గించండి. కలహాలు, కోర్టు వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాలలో కలుగ చేసుకోవద్దు. ఫిబ్రవరి: ఎవరూ మీకు సరిగా సహాయ సహకారాలు చేయరు. పనులు ఆలస్యం అవుతాయి. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ఉండవు. అధికారులతో జాగ్రత్త అవసరం. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరుల వ్యవహారాలలో కలుగచేసుకోవద్దు. మార్చి: అవరోధాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ నిర్వహణ, వృత్తి నిర్వహణ ఒకదానికి మరొకటి అవరోధాలు సృష్టిస్తాయి. ఆర్థిక లావాదేవీలలో అనుకూలత తక్కువ. కుజ, గురు, శాంతి చేయించండి. ఉద్యోగ ఒత్తిడితో మీరు అందరితో కలహిస్తారు. ఇతరుల వ్యవహారాలు కలహప్రదంగా మారతాయి. సింహ రాశిఆదాయం–11, వ్యయం–11, రాజయోగం–3, అవమానం–6.మఘ 1,2,3,4 పాదములు (ము, మే, మూ, మే)పుబ్బ 1,2,3,4 పాదములు (మో, టా, టే, టూ)ఉత్తర 1వ పాదము (టే)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (లాభ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (సప్తమ), కేతువు సింహరాశి (జన్మ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుండి మీనరాశి (అష్టమ) సంచారం. మనస్పర్థలు రావడం, వాటిని సరి చేసుకోవడంతోనే ఈ ఏడాది కాలక్షేపం అవుతుంది. గురుబలం ఈ సంవత్సరమంతా శ్రీరామరక్ష. భాగస్వామ్య వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. గురు అనుకూలత ఉన్నప్పటికీ మంచి ప్రణాళికలు చేసినా, సన్నిహితులను నమ్మి సమస్యలకు దగ్గర అవుతుంటారు. రోజువారీ పనుల్లో భోజన, స్నాన, నిద్రలకు కూడా సమయపాలన ఉండదు. కుటుంబ విషయాల్లో మితభాషణ అవసరం. శని, రాహు సంచారం బాగా లేదు. ఉద్యోగులకు అధికారుల అండదండలు బాగా ఉంటాయి. మీ కింద పనిచేసేవారి ద్వారా ఇబ్బందులు పడతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అయోమయస్థితి ఉంటుంది. వ్యాపారస్తులకు శ్రమ తప్పదు. పనివారితో సమస్యలు ఎక్కువ, లాభాలు తక్కువ ఉంటాయి. ఆదాయానికి ఇబ్బంది లేదు కాని, అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. పాత, కొత్త ఋణాలు ఇబ్బందులు సృష్టిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాత, జీర్ణ çసమస్యలు ఉంటాయి. అయితే మంచి వైద్యం లభిస్తుంది. మార్కెటింగ్ ఉద్యోగులకు మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఎక్కువైనా, పనులు పూర్తి అవుతాయి. షేర్ వ్యాపారులు మంచి ఆలోచనలు చేస్తారు. రైతులకు శ్రమ ఎక్కువ. విద్యార్థులకు ఏకాగ్రత లోపం ఉంటుంది. కోర్టు వ్యవహారాలలో మోసపూరిత వాతావరణం ఎదురవుతుంది. స్థిరాస్తి కొనుగోలులో ఇతరుల సలహాలు పాటించకుండా ఉంటే మంచిది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో పనులు ఆలస్యం అవుతాయి. ఈ రాశి స్త్రీలకు అన్ని పనులు ఆలస్యంగా అవుతాయి. తెలివి, ఓర్పు ప్రదర్శిస్తారు. కుటుంబం, ఉద్యోగం సమతూకంగా నిర్వహించలేక ఇబ్బంది పడతారు. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు పాటించాలి. నిత్యం వైద్యుల సలహాలు, ఆహార, ఆరోగ్య నియమాలు పాటించాలి.మఘ: మానసికంగా ఇతరులతో అనుబంధంగా మెలగలేని పరిస్థితి ఉంటుంది. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు బాగానే ఉంటాయి. పుణ్య, శుభకార్య ప్రయత్నాలలో కాలక్షేపం చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలలో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. వాహన చికాకులు ఎక్కువ ఉంటాయి. పుబ్బ: ఇతరులను నమ్మి ధనం పెట్టుబడులు పెట్టవద్దు. మీ వస్తువులను ఎక్కడైనా మరచిపోవడం లేదా చౌర్యానికి గురవడం జరుగుతాయి. చేసే పనులలో ఏదో తెలియని అసంతృప్తి ఉంటుంది. రోజువారీ పనుల్లో సమయపాలన లోపిస్తుంది. ఉత్తర 1వ పాదం: మీ పనులు ఇతరులకు, ఇతరుల పనులు మీకు నచ్చక ఉద్యోగ, వ్యాపార కుటుంబ విషయాలలో ఒత్తిడికి లోనవుతారు. ప్రతి పనీ మళ్లీ మళ్లీ చేయవలసి వస్తుంది. అందరినీ అనుమానిస్తుంటారు. పనులు వదిలివేసి ఒంటరిగా ఉండాలనే కోరిక పెరుగుతుంది. శాంతి మార్గం: శని రాహు కేతువులకు శాంతి చేయించండి. మే నెల నుంచి ప్రతి నెలా ఒకసారి కుజగ్రహ శాంతి చేయించండి. రోజూ శివాలయంలో 11 ప్రదక్షిణలు చేసి భువనేశ్వరీ సహస్ర నామ స్తోత్రం పారాయణ చేయండి. కుదిరినప్పుడు చండీహోమం చేయించండి. సప్తముఖ రుద్రాక్షధారణ చేయడం శుభప్రదం.ఏప్రిల్: ప్రశాంతత కోసం, ధైర్యం కోసం ధ్యానం చేయండి. ప్రతిపనీ కాలవ్యయం, ధనవ్యయం సూచిస్తున్నాయి. నమ్మక ద్రోహం చేసేవారు మీ చుట్టూనే ఉంటారు. పాత ఆరోగ్య సమస్యలు తిరగపెట్టకుండా, పాత ఋణాలు ఇబ్బందికరం కాకుండా చూసుకోండి. వ్యవహార ప్రతిబంధకాలు గోచరిస్తున్నాయి. మే: తొందరపాటు నిర్ణయాలు చేయవద్దని సూచన. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు. రోజువారీ పనుల్లోనూ తెలియని ఆటంకాలు ఉంటాయి.ఉద్యోగ వ్యాపార ఆర్థిక విషయాలలో క్రమంగా మంచి ఆలోచనలు చేసి సమస్యలు దూరం చేసుకోగలుగుతారు. జూన్: మఘ నక్షత్రం వారికి 7వ తేదీ నుంచి ఆరోగ్య చికాకులు ఉంటాయి. అయితే శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. తరచుగా శుభ, పుణ్య కార్యాలలో పాల్గొంటారు. రోజువారీ పనులు అనుకూలంగా ఉంటాయి. జులై: పుబ్బా నక్షత్రం వారు 23 వరకు, ఉత్తర 1వ పాదం వారు 23 నుంచి ఆరోగ్య సమస్యలకు గురవుతారు. పుబ్బవారు ఈనెల 21 నుండి కొంచెం ఎక్కువ చికాకులు పొందుతారు. భాగస్వామ్య వ్యవహారాల్లో చిక్కులు తలెత్తవచ్చు. కుటుంబ, ఆరోగ్య, వృత్తి విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. ఆగస్ట్: శ్రమ చేసి ముఖ్యమైన సమస్యలు తీర్చుకోండి. ఒకటి రెండు ప్రయత్నాలు చేయడం ద్వారా సహకరించం అనే వ్యక్తులు కూడా బాగా సహకరించే అవకాశం ఉంటుంది. ఈ నెల 21 నుంచి కొన్ని పనులు వాయిదా పడడం, కొన్ని ప్రతికూలంగా ఉంటాయి. సెప్టెంబర్: ఆశ్చర్యకరమైన శుభ పరిణామాలు కొన్ని చోటు చేసుకుంటాయి. పనులు వాయిదా వేయడం, బద్ధకించడం మానకుంటే, 14వ తేదీ నుంచి మంచి పరిణామాలు ఉంటాయి. మీ శ్రమను గుర్తించి మీకు సహకరించేవారు పెరుగుతారు. ఉద్యోగ వ్యాపారాలలో అధికారుల తోడ్పాటు పెరుగుతుంది. అక్టోబర్: పుబ్బ నక్షత్ర జాతకులు మీ వ్యక్తిగత జాతకాన్ని సిద్ధాంతి ద్వారా పరిశీలన చేయించుకోండి. చాలా సందర్భాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. తెలివి, ఓర్పు ప్రదర్శించి కార్యసాధనకు కృషి చేస్తారు. అధికారులతో విరోధం రాకుండా జాగ్రత్తపడండి. కొన్ని ముఖ్యమైన పనులు మరచిపోయే లక్షణాలు గోచరిస్తున్నాయి. నవంబర్: కొంత అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నా, పనుల్లో తొందరపాటు పనికిరాదు. జాగ్రత్తగా ప్రయత్నిస్తే సత్ఫలితాలు పొందగలరు. కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు చాలావరకు సానుకూలం అవుతాయి. ఉద్యోగ, వ్యాపారాలు సత్ఫలితాలను ఇస్తాయి. భవిష్యత్తు ప్రణాళి కలు గురించి చర్చిస్తారు. డిసెంబర్: తెలివిగా కార్యసాధన చేస్తారు. అవరో«ధాలను లెక్కచేయరు. ఉద్యోగంలో కొత్త రకంగా అనుకూలత కలుగుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు సంబంధించి మంచి సలహాలు అందుతాయి. రైతులకు విద్యార్థులకు అనుకూలం. దేవాలయ దర్శనములు చేస్తుంటారు. జనవరి: శుభా శుభ పరిణామములతో కాలక్షేపం జరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయ, వ్యయ, ఋణ విషయాలలో కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో మాత్రం పూర్తి భిన్నంగా చాలా లాభదాయక ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఫిబ్రవరి: ప్రతి విషయం సునిశితంగా పరిశీలించి చేయడానికి అలవాటు పడండి. పని ఒత్తిడి 13వ తేదీ నుంచి పెరుగుతుంది. మీ ఇంటి యజమాని లేదా షాపు యజమానితో కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. రాబోయే రెండు మాసాల గోచారంలో అనుకూలత తక్కువగా గోచరిస్తోంది. అవకాశం ఉన్నంత వరకు ఈ నెలలోనే ఆ పనులు పూర్తి చేయడం శ్రేయస్కరం. మార్చి: చేయవలసిన పనులు మానేసి అనవసర వ్యవహారాల్లో తలమునకలు అవుతుంటారు. గ్రహచార ప్రతికూలతలు పెరుగుతున్నాయి. రాబోవు మూడు నెలలలో కోర్టు వ్యవహారాలు, ఆరోగ్యం, ఋణ విషయాలలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు పాటించాలి. ఒంటరి కాల క్షేపం, ఒంటరిగా దూరప్రాంత ప్రయాణములు విడనాడండి. కలహాలు, కొత్త ప్రయత్నాలు విడనాడండి. విద్యార్థులకు, రైతులకు కూడా అనుకూలత తక్కువగా ఉంది. కన్యా రాశిఆదాయం–14, వ్యయం–2, రాజయోగం–6, అవమానం–6.ఉత్తర 2,3,4 పాదములు (టే, పా, పీ)హస్త 1,2,3,4 పాదములు (పూ, ష, ణా, ఠా)చిత్త 1,2 పాదములు (పే, పో)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (దశమ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (షష్ఠ), కేతువు సింహరాశి (వ్యయ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (సప్తమ) సంచారం. మే నెల వరకు పుణ్యకార్యాలు, «ధార్మిక విజ్ఞాన వినోద కార్యక్రమాలు చేస్తుంటారు. «సంఘంలో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. ప్రతిపనిలోనూ మే నెల నుంచి ధైర్యం పెరుగుతుంది. ప్రతిపనీ ఆలస్యం అవుతుంది. తరచుగా కుటుంబానికి దూరంగా గడపవలసి వస్తుంది. కొన్నిసార్లు భయం పొందుతారు. రోజువారీ పనుల్లో మే నుంచి సమయపాలన లేకుండా ప్రవర్తిస్తారు. బంధువుల రాకపోకలు అధికం అవుతాయి. ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. ఉద్యోగ విషయాలలో సందర్భానుసారంగా ప్రవర్తించలేరు. ఒక పనిలో జరిగే ఆలస్యం మరొక ముఖ్యమైన పనికి ఇబ్బందిగా మారుతుంది. మే నెల నుంచి మీ కింద పనిచేసే వారితో ఇబ్బంది ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారులకు లాభాలు తక్కువ అయినా ప్రశాంతంగా ఉంటారు. నూతన వ్యాపార ప్రయత్నాలలో మంచి సలహాలు అందుతాయి. సకాలంలో స్పందించి లబ్ధి పొందుతారు. ఆర్థిక లావాదేవీలను సవ్యంగా నడపగలుగుతారు. ఖర్చులకు తగిన ఆర్థిక వనరులు సమకూరుతాయి. ఋణ విషయాలు సానుకూలం. ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తారు. కొత్తగా వచ్చే సమస్యలేవీ ఉండవు. భార్యాపిల్లల ఆరోగ్య విషయంలోనూ శుభ పరిణామాలు ఉంటాయి. మార్కెటింగ్ ఉద్యోగులకు టార్గెట్లు పూర్తి కావడానికి ఆలస్యమవుతుంది. అయితే నష్టం ఉండదు. షేర్ వ్యాపారులకు తెలివి, ధైర్యం ఉన్నా అనుకున్న ఫలితాలు దక్కవు. రైతులకు శ్రమ ఎక్కువ అయినా సమయానికి మంచి సలహాలు అందడం వల్ల నష్టం ఉండదు. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు అందవు. నిరుత్సాహం పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలలో ఇబ్బందులు ఉన్నా, ధైర్యంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో కావలసిన రీతిలో లబ్ధి పొందుతారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో పనులు ఆలస్యం అవుతాయి కాని, నష్టం ఉండదు. ఈ రాశి స్త్రీలకు శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. తరచుగా కుటుంబ, ఉద్యోగ విషయాలలో ఇతరుల నుంచి సహాయ సహకారాలు తగ్గుతాయి. పనులు సమయపాలన లేకుండా సాగడం వలన ముఖ్యమైన పనుల్లో ప్రతికూలతలు చూస్తారు. గర్భిణీ స్త్రీలు కంగారు పడనవసరం లేదు. వైద్య సలహాలు, చక్కటి నిర్ణయాలు తీసుకోవడం వలన మంచి ఆరోగ్యంతో సుఖజీవనం సాగిస్తారు.ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు: ఇతరుల విషయాలలో ఎక్కువగా కలుగ చేసుకోవద్దు తెలివిగా ప్రవర్తించి సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబంలో సంఘంలో అనుకూల స్థితి ఉంటుంది. కొత్త కొత్త ప్రణాళికలు చేస్తారు. విజయాలు సాధిస్తారు. అయితే ప్రతి పనీ ఆలస్యం అవుతుంది. హస్త: ప్రయాణాలను వీలయినంత తగ్గించుకుంటే లాభిస్తుంది. భవిష్యత్తు కార్యాచరణ మీద దృష్టి సారిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఒంటరి ప్రయాణం, ఒంటరి కాలక్షేపాలు పనికిరాదు. కొన్ని సందర్భాలలో ముఖ్యమైన పనులు వదిలేసి అనవసర కాలక్షేపం చేస్తూ ఉంటారు. చిత్త నక్షత్రం 1, 2 పాదాలు: వాహనాలు, పనిముట్ల వాడకంలో జాగ్రత్త అవసరం. ప్రతికూల విషయాలలో కూడా ధైర్యంగా ఉంటారు. వృత్తి ఉద్యోగ కుటుంబ విషయాలలో పనివారితో సమస్యలు తరచుగా ఉంటాయి. ఋణ వెసులుబాటు అవసర సమయంలో అందక ఒత్తిడికి లోనవుతారు. శాంతి మార్గం: ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో ‘‘శ్రీరామశ్శరణంమమ’’ అని చెబుతూ ప్రదక్షిణలు చేయడం మంచిది. ప్రాతఃకాలంలో లకీ‡్ష్మనారాయణ పూజ చేయండి. ఏప్రిల్‌లో శని శాంతికి జపదానాదులు చేయించండి. రామాయణ పారాయణ మంచిది. పంచముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని అంశాలు ఆశించిన రీతిగా సాగుతాయి. గురు, కుజుల అనుకూలత దృష్ట్యా ఋణ సమస్యలు ఎలా ఉన్నా, ఆర్థిక లావాదేవీలు బాగా నడపగలుగుతారు. పాత ఆరోగ్య సమస్యల పట్ల కూడా తెలివిగా ముందు జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. తరచు శుభకార్యాలలో పాల్గొంటారు. మే: అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రమేయం లేని విషయాల్లోనూ చికాకులు రాగలవు. తెలివిగా ఓర్పుగా ఉన్నా, వాత ఆర్థిక ఆరోగ్య కోర్టు సమస్యలు తిరగబెట్టగలవు. షేర్ వ్యాపారులు దూకుడు తగ్గించాలి. మార్కెటింగ్ ఉద్యోగులకు టార్గెట్లు పూర్తి కావడం కష్టమవుతుంది. ఇతరులను నమ్మి ఏ పనీ చేయవద్దు. జూన్: అందరికీ సహకరిస్తారు. మంచి గౌరవ మర్యాదలు అందుకుంటారు. కొన్నిసార్లు అనుకోని లాభాలు ఉంటాయి. మీ ఉద్యోగ వ్యాపార విషయాలలో ప్రతిపనీ ఆలస్యం అయినా లాభదాయకంగా పూర్తి అవుతాయి. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. విజ్ఞాన వినోద కార్యక్రమాలు ఎక్కువ చేస్తుంటారు. బంధువులకు సహాయం చేస్తారు. జులై: బాగా ఆలోచించి నిర్ణయాలు చేయవలసిన కాలం. తెలివి ఓర్పు ప్రదర్శించి కార్యసాధనలో అనుకూల స్థితిని పొందుతారు. కొన్ని మంచి ఫలితాలు కూడా అందుతాయి. అయితే జాగ్రత్తగా కాలక్షేపం చేయండి. ఇతరులపై ఆధారపడి ఏ పనినీ మొదలు పెట్టవద్దు. ఆగస్ట్: ప్రత్యేక జాగ్రత్తలు పాటించి, కొన్ని విషయాలలో విజయం సాధిస్తారు. మితభాషణ ఓర్పు అవసరం. కొన్ని సందర్భాలలో కొత్త అవకాశాలు వస్తాయి. ఇతరులను నమ్మి ఏ పనీ చేయవద్దని సూచన. శుభకార్య ప్రయత్నాలు లాభదాయకంగా పూర్తవుతాయి. సెప్టెంబర్: చిత్త నక్షత్రం 3వ తేదీ నుంచి 13వ తేదీ మధ్యలో ఆరోగ్య ఋణ సమస్యలు రాగలవు. రాశి వారు అందరికీ 14వ తేదీ నుంచి దూర ప్రయాణాలు, ఒంటరి ప్రయాణాలు మంచిది కాదు. వాహనాలు, ఆభరణాల మరమ్మతులకు ధనవ్యయం బాగా అవుతుంది. అక్టోబర్: అభివృద్ధి నిరోధకమైన అంశాలను సరి చేసుకుని మంచి జీవనం వైపు ప్రయాణం చేస్తారు. కొత్త వస్తువుల కొనుగోలుకు ఎక్కువ ధనవ్యయం చేస్తారు. ఆర్థిక లావాదేవీలలో ఇబ్బందులను సరిచేసుకోగలుగుతారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కొంత లాభదాయకంగా ఉంటాయి. నవంబర్: పనులు సకాలంలో జరగకపోవడం తప్ప మిగిలినవన్నీ సంతృప్తికరంగా ఉంటాయి. అందరి నుంచి సహకారం ఉంటుంది. ఇబ్బందులు లేని జీవితం సాగుతుంది. ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.డిసెంబర్: ఉద్యోగులు ఎక్కువగా రక్షణకు ప్రాధాన్యం ఇస్తారు. వ్యాపారులకు ఇబ్బందులు తొలగుతాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉంటాయి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు పరిస్థితులు సానుకూలం. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. జనవరి: సంతృప్తికరంగా కాలక్షేపం జరుగుతుంది. పనులు ఆలస్యమైనా, సానుకూలం అవుతాయి. ప్రతి పనీ విజయవంతం అయ్యే అవకాశాలు ఉంటాయి. గౌరవ మర్యాదలు పొందుతారు. గత సమస్యల పరిష్కారానికి అవకాశం చాలా బాగుంది. ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత. ఫిబ్రవరి: కుటుంబ విషయాలు మినహా అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనులు ఆలస్యం అవుతాయి. వ్యాపారాలలో ఏదో ఒక అడ్డంకి గోచరిస్తూనే ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం అసలు ఉండదు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు ఉంటాయి. మార్చి: పనులు ఆలస్యమైనా, సానుకూలంగా అవుతాయి. ఆర్థిక వెసులుబాటు తక్కువగా ఉన్నా, ఇబ్బందికరం కాదు. రోజువారీ పనుల్లోనూ చికాకులు ఎదురవుతాయి. ధైర్యంగా ఉద్యోగ, వ్యాపారాలలో ఒత్తిళ్లను ఎదుర్కోగలుగుతారు. కుటుంబ విషయాలు సాధారణం. తులా రాశిఆదాయం–11, వ్యయం–5, రాజయోగం–2, అవమానం–2.చిత్త 3,4 పాదములు (రా, రి)స్వాతి 1,2,3,4 పాదములు (రూ, రే, రో, తా)విశాఖ 1,2,3 పాదములు (తీ, తూ, తే)ఈ సంవత్సరం గురువు మే 14న మి«థునరాశి (భాగ్య) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (పంచమ), కేతువు సింహరాశి (లాభ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (షష్ఠ)లో సంచారం. చాలా సమస్యలకు పరిష్కారం పొందగలిగే కాలం. మే నెల నుంచి శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. పుణ్య, శుభకార్యములు, సాంఘిక కార్యక్రమాలు చేస్తారు. గత సమస్యలు తీరే అవకాశం మే నెల నుంచి పెరుగుతాయి. రోజువారీ పనులు సానుకూలంగా ఉంటాయి. కుటుంబ విషయాలలో శుభ పరిణామాలు ఎక్కువ. ఉద్యోగులకు ఇబ్బందులు లేని జీవితం సాగుతుంది. క్రమంగా అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది. అనూహ్యంగా అందరూ సహకరిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో చక్కటి లాభాలు అందుకుంటారు. వ్యాపారులకు కావలసిన వనరులు సమకూరి, ఇబ్బందిలేని వ్యాపారం చేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. మే తరువాత ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు పెరిగినా, వాటికి సమతూకంగా ఆదాయం అందుతుంది. పాతా ఋణాలు తీరుతాయి. అవసరానికి కొత్త ఋణాలు సకాలంలో అందుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త ప్రదర్శిస్తారు. పాత సమస్యలు తీరుతాయి. మార్కెటింగ్ ఉద్యోగులకు మే నెల వరకు ఒత్తిడి. మే నెల నుంచి మంచి ఫలితాలు ఉంటాయి. షేర్ వ్యాపారులు ఈ సంవత్సరం జూన్ నుంచి విశేష లాభాలను అందుకుంటారు. రైతులకు శ్రమ కొద్ది లాభదాయకంగా ఉంటుంది. ప్రభుత్వం, వరుణుడు, సలహాలు ఇచ్చేవారు అందరూ సహకరిస్తారు. విద్యార్థులకు మే వరకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. మే నుంచి విశేష ఫలితాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాలలో సమస్యల పరిష్కారానికి మే నుంచి సెటిల్మెంట్ ధోరణి ప్రదర్శించండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు కాలం అనుకూలం. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో సత్ఫలితాలు ఉంటాయి. ఈ రాశి స్త్రీలు ప్రశాంత జీవనం సాగిస్తారు. సంవత్సరారంభంలో ఉన్న ఒత్తిడిని అధిగమించి జూన్ నుంచి విశేష లాభాలు అందుకుంటారు. ఉద్యోగ, కుటుంబ పరిస్థితులు అనుకూలం. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బాగుంటుంది. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. గర్భిణీ స్త్రీలు ప్రశాంతంగా కాలక్షేపం చేస్తారు. మంచివైద్యం లభించి సుఖప్రసవం జరుగుతుంది.చిత్త 3, 4 పాదాలు: అద్భుతాలు చూస్తారు. కుటుంబ అవసరాలు తీర్చడంపై దృష్టి పెట్టి మంచి జీవనం సాగిస్తారు. విజయాలు సాధిస్తారు. పుణ్యకార్యాలు చేయడం, గురువులు, పూజ్యులను దర్శించుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. స్వాతి: కుటుంబంలో పెద్దల ఆరోగ్య విష యంగా సేవలు చేయవలసి రావడంతో సొంత పనులలో సమయపాలన లోపిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో మంచి అవకాశాలు చేజారే పరిస్థితులు తలెత్తుతాయి. కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది. మితభాషణ అవసరం అని గ్రహించండి. విశాఖ 1, 2, 3 పాదాలు: గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయ వ్యయాలపై మంచి పట్టు సాధిస్తారు. ఋణాలు ప్రతిబంధకం కాకుండా తెలివిగా ప్రవర్తిస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. పిల్లల విషయంలో చేయవలసిన పనుల పట్ల కొంత అసంతృప్తి ఉంటుంది.శాంతి మార్గం: గురు రాహువులకు జప, దానాదులు చేయండి. సంవత్సరారంభంలో రోజూ దేవీ భాగవతం పారాయణ చేయడం బాగుంటుంది. ప్రాతఃకాలంలో విష్ణు సహస్ర నామ పారాయణం, ప్రదోషకాలంలో కాలభైరవాష్టక పారాయణం ద్వారా పాత సమస్యలు పోతాయి. షణ్ముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: కొన్ని వ్యవహారాలు లాభదాయకంగానూ, కొన్ని ఇబ్బందికరంగానూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోండి. ఈ నెల ఎంత మౌనం వహిస్తే అంత అనుకూలంగా ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఒత్తిడి ఎక్కువవుతుంది. అధికారులు, కుటుంబ సభ్యుల సహకారం తక్కువగా ఉంటుంది. మే: మితభాషణ, ఓర్పు ప్రదర్శించి విజయాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం తక్కువగా ఉంటుంది. అన్నింటా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని విజయాలు సాధిస్తారు. గురుబలంతో వృత్తి, ఆర్థిక, ఆరోగ్య వ్యవహార లాభాలు ప్రారంభం అవుతాయి. కలహాలకు దూరంగా ఉండండి. జూన్: కోపావేశాలు తగ్గించుకోవాలి. రోజువారీ పనులు మాత్రమే చేస్తూ ఉండండి. భోజనం అయిష్టమైన విధానాలతో ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపారాలు, విదేశీ నివాస ప్రయత్నాలు పూర్తిగా సత్ఫలితాలను ఇస్తాయి. జులై: పుణ్యకార్య శుభకార్య ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపారాలలోను, విదేశీ నివాస, కోర్టు, ఋణ వ్యవహారాలలో అనుకూల స్థితి ఉంటుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు చాలా గొప్ప అనుకూల స్థితి. ఆదాయ, వ్యయ, ఋణ వ్యవహారాలు అనుకూలం. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బాగుంటుంది. ఆగస్ట్: అద్భుతమైన కాలమనే చెప్పాలి. స్థానచలనం వంటి ప్రయత్నాలు అనుకూలం అవుతాయి. కోర్టు వ్యవహారాలు, పాత కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. కాలం వృథా చేయకుండా ప్రయత్నించండి. ధన, ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండండి. సెప్టెంబర్: కుజగ్రహ శాంతి, సుబ్రహ్మణ్య ఆరాధన చాలా అవసరం. రోజువారీ పనులు బాగానే ఉన్నా, ఏదో తెలియని శారీరక మానసిక ఒత్తిడి వెంబడిస్తుంది. ఋణ వ్యవహారాలు, వాహనాలు ఇబ్బంది కలిగిస్తాయి. అక్టోబర్: ఒంటరిగా ప్రయాణాలు చేయవద్దు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. ఋణ, ఆరోగ్య విషయాలలో బహు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. కుటుంబ వ్యవహారాలలో ఇతరుల ప్రభావం వలన కలçహాలు పెరగవచ్చు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఇబ్బందికరం అవుతాయి. నవంబర్: ప్రతి విషయంలోనూ తెలివిగా వ్యవహరిస్తారు. అనుకున్న ఫలితాలను సాధిస్తారు. బంధువులకు, స్నేహితులకు సహాయం చేస్తారు. మీ వద్ద పనిచేసేవారు మీకు బాగా సహకరిస్తారు. పుణ్యకార్యాలు, శుభకార్యాలతో కాలక్షేపం చేస్తారు. డిసెంబర్: చాలా వ్యవహారాలను తెలివిగా సాధిస్తారు. పనులు వేగంగా సాగుతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో మీ వద్ద పనిచేసేవారు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలం. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో ఖర్చు పెరుగుతుంది. పిల్లల అభివృద్ధి వార్తలు అందుతాయి. జనవరి: కుటుంబ వ్యవహారాలను సానుకూలం చేయగలుగుతారు. ప్రశాంతంగా అన్ని వ్యవహారాలు సాధించుకుంటారు. బంధువులకు, స్నేహితులకు ధనవ్యయం చేయవలసి వస్తుంది. ప్రయాణాలలో ఖర్చులు పెరుగుతాయి. వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా అనుకూలత. ఫిబ్రవరి: తెలివిగా ధైర్యంగా వ్యవహార లాభం అందుకుంటారు. వృత్తి సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో ఎక్కువ శ్రమ చేయమని ప్రత్యేక సూచన. ఆదాయ, వ్యయాలను సమర్థంగా నిర్వహిస్తారు. అవసరమైన ఋణాలు సకాలంలో అందుతాయి. వ్యాపారులకు ప్రోత్సాహకరమైన కాలం. షేర్ వ్యాపారులు లబ్ధి పొందుతారు. మార్చి: ప్రతిపనీ స్వయంగా చేసుకోండి. కుటుంబ విషయాలలో ఇతరుల ప్రమేయ కలహాలకు దారి తీస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడిని తెలివిగా దాటతారు. ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. ప్రతి విషయంలో ఆర్థిక వెసులుబాటు అనుకూలం. వ్యాపారులకు అనుకూలం. మీ పిల్లల నుంచి ఆశించిన ఫలితాలు అందక మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఋణ సౌకర్యం బాగుంటుంది. వృశ్చిక రాశిఆదాయం–2, వ్యయం–14, రాజయోగం–5, అవమానం–2.విశాఖ 4 వ పాదము (తొ)అనురాధ 1,2,3,4 పాదములు (నా, నీ, నూ, నే)జ్యేష్ఠ 1,2,3,4 పాదములు (నో, యా, యీ,యూ)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (అష్టమ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (అర్థాష్టమ), కేతువు సింహరాశి (దశమ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29వ తేదీ నుండి మీనరాశి (పంచమ) సంచారం. ఏ పనిలోను స్థిరబుద్ధి ప్రదర్శించలేరు. అందరికీ మీ వ్యవహారాల మీద తక్కువ స్థాయి ఆలోచనలు ఉంటాయి. మీరు తరచుగా ప్రభుత్వ అధికారులు, చోరులు వంటి వారితో చికాకు పడుతూనే ఉంటారు. పరుషంగా మాట్లాడుతుంటారు. రోజువారీ పనుల్లో ఆలస్యం చేసి ఇబ్బంది పడతారు. మీ నుంచి కుటుంబీకులకు అందవలసినవన్నీ ఆలస్యంగా అందుతాయి. భోజన, స్నానాదికాలలో కూడా సమయపాలన లేక జీవనశైలి ఇబ్బందికరం అవుతుంది. ఉద్యోగ విషయాల్లో సరైన దృష్టి ప్రదర్శించక పనులు పాడు చేసుకుంటారు. ప్రమోషన్, స్థానచలనాలు అనుకూలంగా లేవు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో పనులు సరిగా సాగవు. వ్యాపారులకు అనుకూల లాభాలు లేకున్నా, ఇబ్బందులు ఉండవు. నూతన వ్యాపార ప్రయత్నాలను వాయిదా వేసుకుంటే మంచిది. ఆర్థిక లావాదేవీలు సరిగా సాగవు. స్థిరాస్తి లావాదేవీలు, ఆస్తి తగాదాలలో ఇబ్బందులు తప్పవు. మే వరకు ఆదాయ వ్యయాలు సమంగా ఉంటాయి. మే తరువాత డబ్బు ఇబ్బందులు తప్పవు. కొత్త ఋణాలు సకాలంలో అందవు. వాత సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. మార్కెటింగ్ ఉద్యోగులకు శారీరక మానసిక ఒత్తిడి ఉంటుంది. షేర్ వ్యాపారులకు మే వరకు లాభాలు బాగుంటాయి. మే తరువాత లాభాలు తక్కువగా ఉంటాయి. రైతులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. విద్యార్థులకు మే నుంచి ఏకాగ్రత లోపిస్తుంది. కోర్టు వ్యవహారాలలో వాయిదాలే శరణ్యం. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో మోసాలు ఎదురవుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో విద్య కోసం వెళ్ళేవారికి మే వరకు కాలం అనుకూలం. ఈ రాశి స్త్రీలకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ, కుటుంబ విషయాలకు సమతూకంగా న్యాయం చేయలేరు. కుటుంబ సభ్యులు తగిన గౌరవం ఇవ్వడం లేదనే భావనకు లోనవుతారు. పనులు వాయిదా పడుతుంటాయి. ఆర్థిక లావాదేవీలలో సమస్యలు వెంటాడుతాయి. గర్భిణీ స్త్రీలకు మే నుంచి జాగ్రత్తలు అవసరం. వైద్య సలహాలు, పెద్దల సంరక్షణ తప్పనిసరి.విశాఖ 4వ పాదం: దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ఆర్థిక చికాకులు ఇంకా ఉంటాయి. ఋణ అసౌకర్యం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలసి చేయవలసిన పనులు వాయిదా పడుతూ ఉంటాయి. వివాదాల జోలికి వెళ్ళవద్దు. స్వబుద్ధితో చేసే పనుల్లో విజయావకాశాలు ఎక్కువ. అనురాధ: స్పష్టత లేని నిర్ణయాలు చేస్తుంటారు. ఎప్పటి నుంచో ఉన్న వ్యాపార సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. ఉద్యోగ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ అవసరాలు తీర్చడానికి ఎక్కువ కృషి చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. జ్యేష్ఠ: అవసరమైన సమయాలలో ఆత్మీయులు స్పందింపక పోవడంతో మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. çగౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవసరానికి ఋణం, ఆదాయం సరిగా అందక ఇబ్బంది పడతారు. శాంతి మార్గం: మార్చి నెలలో రాహువుకు, మే నెలలో గురువుకు శాంతి చేయించండి. దుర్గా సప్తశ్లోకి, దక్షిణామూర్తి స్తోత్రం, దేవీ భాగవత పారాయణం చేయడం వలన ప్రశాంతత ఏర్పడుతుంది. విష్ణుపూజలు చేయండి. పంచముఖ రుద్రాక్షధారణ శ్రేయోదాయకం.ఏప్రిల్: కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. పిల్లల అభివృద్ధి వార్తలు తరచుగా వింటారు. ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగా సాగుతాయి. ఋణాలు ఇబ్బందికరం కాకుండా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలం. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మే: స్థానచలన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. 15వ తేదీ తరువాత గురుగ్రహ శాంతి చేయించండి. అందరి సహాయ సహకారాలు, గౌరవం అందుకుంటారు. ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలలో ఆలోచించి నిర్ణయాలు చేయండి. ఒంటరిగా దూర ప్రయాణాలు విరమించుకోండి. జూన్: ఆత్మీయుల సేవలను గుర్తించరు. ఉద్యోగ వ్యాపారాలలో ఒత్తిడి ఉంటుంది. కొన్ని పాత సమస్యలు మరలా తిరగబడే అవకాశం ఉంటుంది. అవసరాలకు తగిన డబ్బులు సర్దుబాటు జరగదు. కొన్ని సందర్భాలలో మనో నిబ్బరం ప్రదర్శిస్తారు. ప్రయాణ అసౌకర్యాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. జులై: కోపావేశాలకు అనుకూల కాలం కాదు. ఉద్యోగ రీత్యా అనవసర తిరుగుడు పెరుగుతుంది. జీర్ణసంబంధ ఇబ్బందులు రాగలవు. పాత సమస్యలు తిరగబడే అవకాశం ఉంది. అధికారులు, తోటివారు సహకరించరు. అవసరానికి ధనం అందుబాటు తక్కువ. అనవసర విషయాల జోలికి పోవద్దు. ఆగస్ట్: కొత్త అవసరాలకు తగిన ఆర్థిక సౌకర్యం లభిస్తుంది. చాలా విషయాలలో స్వయంగా శోధించి, విజయాలు అందుకుంటారు. తెలియక చేసిన పొరపాట్లు నెలాఖరులో సరిచేసుకునే అవకాశం ఉంది. బంధువులు, కుటుంబసభ్యులు సహకారం తక్కువ. ఉద్యోగ వ్యాపారాలలో సాధారణ స్థితి ఉంటుంది. సెప్టెంబర్: అధిక గ్రçహానుకూలత ఉన్న కాలం. కుటుంబ సౌఖ్యం అద్భుతంగా ఉంటుంది. ఆదాయం వ్యయాలు సమతూకంగా లేకున్నా, సమర్థంగా ఆర్థిక వ్యవహారాలను నిర్వహిస్తారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లలో కొత్త ఋణాలు చేయవద్దు. అక్టోబర్: ప్రశాంతత తగ్గే అవకాశం ఉంది. మీరు మంచి మాటలు చెప్పినా, అవి వికటించే అవకాశం ఉంది. మితభాషణ, ఓర్పు చాలా అవసరం. విద్యా వ్యాసంగం సరిగా సాగదు. నూతన ఉద్యోగ వ్యాపారాలు కొంత ఇబ్బందికరం. అవసరానికి తగిన ధనం చేకూరదు.నవంబర్: పనులు కొంచెం ఇబ్బందికరం అవుతున్నా, అన్నింటా సమర్థంగా వ్యవహరిస్తూ ముందుకు వెడతారు. ఫలితాలు ఆశించిన రీతిగా ఉండవు. విద్యా విజ్ఞాన కార్యక్రమాలలో విఘ్నాలు ఎదురవుతాయి. ఆర్థిక కార్యకలాపాలు సంతృప్తికరంగా సాగవు. డిసెంబర్: వృత్తి ఉద్యోగాలను శ్రద్ధగా నడపలేని పరిస్థితి ఉంటుంది. పనులు దాటవేసే లక్షణాలు ఎక్కువ అవుతాయి. ఎక్కువగా ప్రయాణాలు చేయాలనే కోరిక పెరుగుతుంది. పిల్లలు వ్యతిరేక ధోరణితో ప్రవర్తిస్తారు. ఆర్థిక లావాదేవీలలో తెలివిగా వ్యవహరిస్తారు. కొత్త ఋణాలు చేయవద్దని సూచన. జనవరి: మంచి కాలక్షేపం జరుగుతుంది. కుటుంబ సభ్యులు సహకరిస్తారు. ధైర్య స్థైర్యాలను అన్ని విషయాలలోనూ ప్రదర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలు బాగా సాగుతాయి. కుటుంబపరంగా చిన్న చిన్న చికాకులు ఉంటాయి. గత సమస్యలకు పరిష్కారాలను త్వరగా వెదకగలుగుతారు. కొత్త ఋణాలు అనుకూలం. ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి.ఫిబ్రవరి: మంచి అనుభూతులు మిగిల్చే కాలం. అన్ని విషయాలలో అనుకూలత ఉంటుంది. ఆర్థిక వెసులుబాటు ఇబ్బందికరం అయినా, తెలివిగా వ్యవరించి, లాభాలు పొందుతారు. ఉద్యోగంలో మంచి మార్పులు ఉంటాయి. ఒత్తిడిని తట్టుకుని నిలబడతారు. కుటుంబ, వృత్తి విషయాలు రెండింటినీ సమర్థంగా నడిపి మంచి పేరు సాధిస్తారు. మార్చి: రోజువారీ పనులలో బాగా తెలివిగా వ్యవహరిస్తారు. ఇతరులకు సçహాయం చేయడాన్ని ఒక విధిగా భావించి చేస్తుంటారు. ఉద్యోగంలో శ్రమ ఎక్కువ అవుతుంది. అధికారుల తోడ్పాటు తక్కువ అయినా నష్టంలేని జీవితం సాగుతుంది. వ్యాపారులకు సాధారణ స్థాయి లాభాలు అందుతాయి. ఆదాయ, వ్యయ ఋణాలు సాధారణ స్థాయిలో ఉంటాయి. మాట నిలబెట్టుకోలేరు. ధనూ రాశిఆదాయం–5, వ్యయం–5, రాజయోగం–1, అవమానం–5మూల 1,2,3,4 పాదములు (యే, యో, బా, బీ)పూర్వాషాఢ 1,2,3,4 పాదములు (బూ, ధా, భా, ఢా)ఉత్తరాషాఢ 1వ పాదము (బే)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (సప్తమ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (తృతీయం), కేతువు సింహరాశి (భాగ్య) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (అర్ధాష్టమ) సంచారం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చేసిన పనులకు తగిన గుర్తింపు రాదు. గొప్పగా ఓర్పు సహనం ప్రదర్శించి సాధారణ జీవనానికి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడతారు. అందరితోనూ కలహాలు రాకుండా స్నేహభావం ప్రదర్శిస్తారు. స్నేహితులతో మిత సంభాషణ, సంచారం చేయండి. రోజువారీ పనులపై ప్రత్యేక దృష్టి ఉంచండి. కుటుంబ వ్యవహారాల్లో శుభపరిణామాలు ఉంటాయి. మీ అవసరాలు గుర్తించి సహకరించే కుటుంబసభ్యుల కారణంగా మంచి ఫలితాలు ఉంటాయి. సోదరద్వేషం తప్పదు. ఉద్యోగాల్లో ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు జాగ్రత్తగా చేసుకుంటే మీకు కావలసిన చోటుకు చేరే అవకాశం ఉంటుంది. ఎవరూ సహకరించకపోయినా, విజయం తథ్యం. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో మంచి సూచనలు అందుతాయి. వ్యాపారులకు కొన్నిసార్లు విశేష మందగమనం, కొన్నిసార్లు విశేష లాభాలు ఉంటాయి. నూతన వ్యాపార ప్రయత్నాలలో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు తెలివిగా నడుపుతారు. అనవసర ఖర్చులు ఉంటాయి. ప్రయాణ ఖర్చులు అధికం అవుతాయి. ఋణ విషయాలు సానుకూలం. వాత సంబంధ ఆరోగ్య సమస్యలు, చర్మవ్యాధులు ఉన్నవారు ఇబ్బంది పడతారు. మార్కెటింగ్ ఉద్యోగులు జూన్ నుంచి తేలికపాటి ప్రయత్నాలతో మంచి ఫలితాలు అందుకుంటారు. షేర్ వ్యాపారులు బుద్ధి, ఓర్పుతో లాభాలు అందిస్తాయి. రైతులకు శ్రమకు తగిన లాభాలు అందుతాయి. విద్యార్థులకు మంచి కాలం. కోర్టు వ్యవహారాలలో స్వయంగా అన్నీ శోధిస్తే విజయం పొందగలరు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో పనులు వేగం చేయమని సూచన. వాహన కొనుగోలుకు కాలం అనుకూలం. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో అంతా లాభదాయకం. ఈ రాశి స్త్రీలకు చాలా ధైర్యం చేకూరుతుంది. ప్రతిపనీ చేయగలం అనే ధీమా ఉంటుంది. ఉద్యోగినులకు ప్రమోషన్లు ద్వితీయార్ధంలో అందుతాయి. వ్యాపారులు శ్రమతో పనులు పూర్తి చేసు కుంటారు. గర్భిణీ స్త్రీలకు సాధారణ ఫలితాలు ఉంటాయి. జూన్ దగ్గర నుంచి అంతా అనుకూలం. కావలసిన వైద్య సదుపాయాలు, మంచి సంరక్షణ అందుతాయి. మూల: ఎవరికీ హామీలు ఇవ్వవదు. ముఖ్య వ్యవహరాలలో అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది. బహు జాగ్రత్తలతో కాలక్షేపం చేయాలి. రోజువారీ కార్యక్రమాలకు పరిమితం కావడం మేలు. వేరే వ్యవహారాల జోలికి వెళ్ళవద్దు. పూర్వాషాఢ: మీ సహననానికి పరీక్షా కాలం. మీ ఆర్థిక వనరులు అవసరానికి ఉపయోగపడవు. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో శ్రమ ఎక్కువైనా, సమస్యలు ఉండవు. వినోద కార్యక్రమాలో పాల్గొంటారు. ఉత్తరాషాఢ 1వ పాదం: వ్యాపారులకు విజయావకాశాలు ఎక్కువ. ఉద్యోగంలో పదోన్నతికి ఆటంకాలు. కుటుంబ విషయంలో మంచి నిర్ణయాలు చేయగలుగుతారు. కొత్త ప్రయత్నాలు వద్దు అనుకుంటూనే ప్రారంభించి, రోజువారీ పనుల్లో ఇబ్బందులు పడతారు. అనవసర ప్రయాణాలు ఎక్కువ. శాంతి మార్గం: కుజగ్రహ సంచారం ఎక్కువ ఇబ్బందికరం. జూన్ వరకు నెలకు ఒకసారి కుజగ్రహ శాంతి చేయించండి. రోజూ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. పంచముఖ రుద్రాక్షధారణ శ్రేయోదాయకం.ఏప్రిల్: కొత్త కొత్త అనుభూతులు ఎదురవుతాయి. రోజువారీ జీవనశైలిలో విశేష మార్పులు చూస్తారు. కొన్ని సందర్భాలు ఆనందాన్ని, కొన్ని సందర్భాలు విచిత్రమైన భయాలు కలుగజేస్తాయి. అందరి సహకారం లభిస్తుంది. ఎవరినీ నమ్మలేని స్థితిలో ఉంటారు. ఉద్యోగ వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. మే: ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారో, ఎప్పుడు ఆగ్రహావేశాలతో ఉంటారో తెలియని పరిస్థితి. ఉద్యోగ వ్యాపారాలలో ఇతరుల ప్రమేయానికి ఆస్కారం ఇవ్వకండి. «అవసరానికి దనం సర్దుబాటు కాకపోవచ్చు. ఇల్లు లేదా వాహనం విషయంలో ఖర్చులు పెరగవచ్చు. 15వ తేదీ తరువాత అనుకూలం. జూన్: తెలివిగా ఉద్యోగ, వ్యాపార సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలలో నిబద్ధతతో వ్యవహరిస్తారు. కుటుంబ వ్యవహారాలు తెలివిగా సాగిస్తారు. పెద్దల ఆరోగ్య విషయంలో చికాకులు ఉంటాయి. పుణ్యకార్యాలు చేయాలనుకుంటారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. జులై: కలహాలు వచ్చే అవకాశం ఎక్కువ. ఏకాగ్రత లోపిస్తుంది. వాత సమస్యలు తరచుగా వెంటబడే అవకాశం ఉంటుంది. అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వేళకు అన్న వస్త్రాలు అందవు. స్థానచలన విషయంలో ప్రతికూలతలు రాకుండా జాగ్రత్త పడండి. తెలియని పొరపాట్ల వల్ల ఇబ్బంది పడవచ్చు. ఆగస్ట్: అనవసర చర్చలు, వృథా కాలక్షేపాలతో అవసరమైన పనులు దూరం చేసుకుంటారు. అధికారుల సహాయ సహకారాలు తగ్గుతాయి. దూర ప్రయాణాలలో చికాకులు, వాహన మరమ్మతు ఖర్చులు ఉంటాయి. బంధు మిత్రుల రాకపోకలు ఎక్కువవుతాయి. సెప్టెంబర్: ఆనందంగా కాలక్షేపం చేస్తారు. తరచుగా బంధు మిత్రుల కలయిక మంచి అనుభూతిని ఇస్తుంది. పుణ్య కార్య శుభ కార్యాలలో మంచి కాలక్షేపం జరుగుతుంది. ఉద్యోగ, వ్యాపార, కుటుంబ వ్యవహారాలను సమర్థంగా నిర్వహించగలుగుతారు. సర్వత్రా విజయం ఉంటుంది. అక్టోబర్: కొన్ని విశేష కార్యక్రమములకు శ్రీకారం చేస్తారు. కాలం చాలా బాగుంది. పనులు వేగం చేయండి. బంధు మిత్రులు బాగా సహకరిస్తారు. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా మారతాయి. కీర్తి ప్రతిష్ఠలు బాగా పెరుగుతాయి. నవంబర్: 15వ తేదీ తరువాత అడ్డంకులు తరచుగా వస్తాయి. ఆలోచనా శక్తి బాగున్నా పనుల అమలు కష్టం అవుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో అధికారులతో ఒత్తిడి ఉంటుంది. అందరూ సహకారం చేస్తున్నట్లుగా ఉన్నా, అది భ్రమ. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటేనే అభివృద్ధి ఉంటుంది.డిసెంబర్: అనవసర భయాందోళనలను దరి చేరనివ్వకండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. కుటుంబ సభ్యులతో సఖ్యత లోపిస్తుంది. ఆదాయం తక్కువగా ఉన్నా ఖర్చులు నియంత్రించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధిక్యం. మంచి ఆలోచనలు చేసినా అమలు చేయలేని స్థితి. జనవరి: బంధుమిత్రుల రాకపోకలలో కలహాలకు అవకాశం ఇవ్వవద్దని సూచన. కొన్ని పనుల వల్ల రోజువారీ పనుల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఆర్థిక లావాదేవీలు బాగానే ఉన్నా, ఋణ విషయాలలో కొంత జాగ్రత్త పాటించాలి. కుటుంబ అవసరాలు తీర్చడంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. విహార యాత్రలు, పుణ్యకార్యాలు చేస్తుంటారు. ఫిబ్రవరి: కాలం బాగా అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు చేసేవారు మాత్రమే ఇబ్బంది ఎదుర్కొంటారు. ఆరోగ్యం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ విషయాలు సాధారణంగా ఉంటాయి. వ్యాపారాలలో కొంత ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు సాధారణంగా ఉంటాయి. మార్చి: అంతా శుభ పరిణామాలతో గడచిపోతుంది. ఎప్పటి నుంచో ఉండిపోయిన వ్యవహారాలు ఈ నెలలో పూర్తి అయ్యే దిశగా పయనిస్తాయి. ఉద్యోగులకు చాలా విశేషమైన కాలం. పదోన్నతులు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు బాగా అనుకూలం. విద్యార్థులకు, షేర్ వ్యాపారులకు కాలం అనుకూలం. మకర రాశిఆదాయం–8, వ్యయం–14 , రాజయోగం–4, అవమానం–5 .ఉత్తరాషాఢ 2,3,4 పాదములు (బొ, జా, జీ)శ్రవణం 1,2,3,4 పాదములు (జే, జో, ఖా, ఖొ)ధనిష్ఠ 1,2 పాదములు (గా, గి)ఈ సంవత్సరం గురువు మే 14న మి«థునరాశి (షష్ఠ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (ద్వితీయ), కేతువు సింహరాశి (అష్టమం) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (తృతీయ) సంచారం. కేవలం శని, రాహు సంచారం అనుకూలత వల్ల విజయాలు సాధిస్తారు. అయితే జూన్ వరకు కుజ సంచారం ప్రభావంగా ప్రయాణ విషయాలలో చికాకులు ఉంటాయి. స్వబుద్ధి, స్వశక్తితో విజయాలు సాధిస్తారు. శ్రమతో కూడిన పనులు జూన్‌లోపుగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది. రోజువారీ పనుల్లో ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. కుటుంబ విషయాలను కొంచెం ఓర్పుగా చూసుకోవాలి. చికాకులు ఎప్పుడు ఎలా ఉత్పన్నమవుతాయో చెప్పలేని స్థితి ఉంటుంది. ఉద్యోగాలలో శని అనుకూలత వల్ల సర్వత్రా విజయమే. ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు, ప్రమోషన్ ప్రయత్నాలు విశేషంగా అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో పనులు జూన్ వరకు విశేషం. సంవత్సరం అంతా శుభమే. వ్యాపారులు మార్పులు చేపట్టే ఆలోచనలు చేస్తారు. వ్యాపారం అనుకూలంగానే ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాలలో సానుకూలత. ఆర్థిక లావాదేవీలు సమర్థంగా సాగిస్తారు. ఆదాయం తక్కువగా ఉన్నా, ఖర్చులు నియంత్రించి జూన్ వరకు సుఖపడతారు. జూన్ తరువాత ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశములు ఉ్తన్నాయి. తరువాత కొత్త ఋణాలు అందడం కష్టం అవుతుంది. ఆరోగ్య సమస్యలు పెద్దగా ఉండవు. ప్రతి విషయంలో ముందు జాగ్రత్తలు పాటిస్తారు. మార్కెటింగ్ ఉద్యోగులకు అన్ని విధాలుగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. షేర్ వ్యాపారులకు అంతా శుభసూచకమే. మీ ప్రణాళికలను విజయవంతంగా అమలు చేస్తారు. రైతులకు శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. విద్యార్థులకు విద్యావ్యాసంగం బాగా సాగుతుంది. కోర్టు వ్యవహారాలలో మంచి లాభ ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో పనులు వేగవంతం అవుతాయి. అనుకున్న రీతిగా వ్యవహారం జరుగుతుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి అవుతాయి. ఈ రాశి స్త్రీలకు మే వరకు ఉన్న ప్రశాంతతో చాలా విజయాలు సాధిస్తారు. ఇబ్బందిలేని జీవనం సాగిస్తారు. తెలివిగా ఓర్పుగా కుటుంబవృద్ధి సాధించుకుంటారు. గౌరవం పొందుతారు. సమయపాలన ద్వారా విజయాలు అందుకుంటారు. పుణ్య విజ్ఞాన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్య విషయంలో ముందు జాగ్రత్తలు పాటిస్తారు. అంతా శుభప్రదంగా ఉన్నా, అధైర్యం పొందుతారు. చిన్న ఆరోగ్య సమస్యలు తరచుగా వస్తుంటాయి. దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయండి.ఉత్తరాషాఢ 2, 3,4 పాదాలు: అనాలోచిత కార్యములు ఎక్కువగా చేస్తుంటారు. నమ్మకంగా మోసగించే లక్షణాలు వున్నవారు మీ పనులలో చొరబడతారు. ఉద్యోగ, వ్యాపార, కుటుంబ, ఆర్థిక విషయాలలో ఇతరుల సలహాలకు అవకాశం ఇవ్వకుండా గౌరవంగా పనులు పూర్తి చేసుకుంటారు. శ్రవణం: మరింత శ్రద్ధ అవసరం. ఇతరులకు ఇచ్చిన డబ్బులు వసూలు కావడంలో ఇబ్బందులు ఉంటాయి. ఇతర వ్యాపకాలు ఆకర్షించినా, వాటి జోలికి పోవద్దని సూచన. మితభాషణ, ఓర్పు మీకు శ్రీరామరక్షగా గుర్తించండి. ధనిష్ఠ 1, 2 పాదాలు: కర్తవ్య నిర్వహణ నిబద్ధతతో ఉండి గౌరవం అందుకుంటారు. కొత్త వ్యవహారాల జోలికి పోవద్దు. వ్యాపారులకు వర్కర్స్ ద్వారా సహకారం అందుతుంది. కొత్త అలంకరణ వస్తువులు, వాహనాల కొనుగోలుపై దృష్టి ఉంచుతారు. కుటుంబ ప్రోత్సాహం అద్భుతంగా అందుకుంటారు. శాంతి మార్గం: గురువుకు, కుజుడికి మే నెలలో శాంతి చేయించండి. రోజూ శివ కుటుంబం అంతా ఉన్న శివాలయంలో ప్రదోషకాలంలో 11 ప్రదక్షిణాలు చేయడం మంచిది. గురుచరిత్ర పారాయణ, సుదర్శన స్తోత్ర పారాయణ చేయడం మంచిది. అష్టముఖ రుద్రాక్షధారణ శ్రేయోదాయకం.ఏప్రిల్: కొత్త ప్రయోగాలు చేయకుండా ఉండేవారు సుఖంగా ఉంటారు. అనవసర ప్రయోగాలు చేసేవారు ఇబ్బందులు పడతారు. ఈ నెలంతా వృత్తి రీత్యా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ప్రతిపనీ ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయడం వలన అద్భుత ఫలితాలు రాగలవు. విద్యార్థులకు కాలం అనుకూలం. మే: ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోండి. కోపావేశాలకు గురి అవుతుంటారు. కొత్త ప్రయోగాలు చేయవద్దు. ఇతరుల వ్యవహారాల జోలికి వెళ్ళకండి. అధికంగా దూర ప్రయాణాలు చేయవద్దు. మార్కెటింగ్ ఉద్యోగులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. ప్రతి విషయానికి అతిగా స్పందించవద్దు. జూన్: బహు జాగ్రత్తలతో కాలక్షేపం చేయండి. జీవనోపాధి మార్గాలు సాధారణ స్థాయిలో నడుస్తాయి. కుటుంబ విషయాల్లో ఎప్పుడెలా సమస్యలు తలెత్తుతాయో చెప్పలేం. కొన్నిసార్లు లాభం చేకూరుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలలో మంచి వార్తలు వింటారు. జులై: 16 తర్వాత అనుకూలత తగ్గుతుంది. ప్రతి విషయంలోనూ అలసత్వం ప్రదర్శించకుండా ఓర్పుగా ముందుకు వెళితే విజయావకాశాలు పెరుగుతాయి. జాగ్రత్తగా సంచరించేవారికి ఈ నెల చాలా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆగస్ట్: చాలా విషయాలు స్వయంగా పరిశీలించుకుంటే ఇబ్బందులు ఉండవు. పూర్తి అనుకూలమైన కాలం కాకున్నా, సరిగా ప్రయత్నిస్తే సమస్యలు దూరం అవుతాయి. కొత్త అలంకరణ వస్తువుల కొనుగోలు విషయంగా ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. భవిష్యత్తు వ్యవహారాలకు శ్రీకారం చేస్తారు. సెప్టెంబర్: కోపావేశాలు లేనివారికి, తొందరపాటు నిర్ణయాలు చేయనివారికి చాలా మంచి కాలం. కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. అయితే వాటి అమలు కష్టసాధ్యం. ఆర్థిక పరిస్థితి కొంత ఉపశమనంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా మంచి మార్పులు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. అక్టోబర్: భార్యాభర్తలకు, తండ్రి పిల్లలకు మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వాహన లాభం, ప్రయాణ సౌఖ్యం బాగుంది. ఆర్థిక లావాదేవీలు బాగా జరుగుతాయి. అందరి ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెటింగ్ ఉద్యోగులు, షేర్ వ్యాపారులు కొంత శ్రమను పొందినా, లాభాలు పొందుతారు. విద్యార్థులకు, రైతులకు లాభదాయకం. నవంబర్: చాలా గొప్ప అనుభూతులు కలుగుతాయి. ధైర్యం తెలివి ప్రతి విషయంలో ప్రదర్శిస్తారు. మీ ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. ఇతరుల వ్యవహారాలు చూడడం విడనాడండి. కావలసిన ఆర్థిక వెసులుబాటు, మనిషి సహకారం బాగా అందుతాయి. ప్రశాంత జీవనంతో సుఖపడతారు. డిసెంబర్: వ్యాపార అవరో«ధాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలలో విచిత్రస్థితి ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలకు ఈ నెలలో కదలికలు వస్తాయి. జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగ వ్యాపార కుటుంబ వ్యవహారాలు మినహా ఇతర పనులు చేపట్టవద్దు అని సూచన. ఋణాలు అవసరానికి సర్దుబాటు కావు. జనవరి: ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ, కుటుంబ విషయాలు మినహా మిగిలిన వాటిని వాయిదా వేయడం మంచిది. ఇతరుల వ్యవహారాలలో కలుగ చేసుకోవడం మంచిది కాదు. ఒంటరిగా దూర ప్రయాణాలు చేయవద్దు. కోర్టు వ్యవహారాలు వాయిదా వేయడం శ్రేయస్కరం. ఫిబ్రవరి: శుభాశుభ పరిణామాలు ఉంటాయి. ఇతరుల వ్యవహారాలలో ఎక్కువగా కలుగచేసుకోకండి. పనులు స్వయంగా చేసుకోండి. ఆగ్రహావేశాలు తగ్గించండి. చాలా ఒత్తిడితో ఉద్యోగ విధి నిర్వహణ చేస్తారు. శుభకార్య పుణ్యకార్యాలలో ధనవ్యయం అధికం అవుతుంది. మార్చి: మంచి మార్పులు ఉంటాయి. అన్ని అంశాలలోనూ విజయాలకు దగ్గర అవుతారు. రాబోవు మూడు మాసాలలో చాలా అనుకూలతలు గోచరిస్తున్నాయి. వేగంగా పనులు పూర్తి చేసి వృత్తి ఉద్యోగాలలో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. ఆదాయ వ్యయాలు సానుకూలంగా ఉంటాయి. ప్రశాంత జీవనం చేస్తారు. కుంభ రాశిఆదాయం–8, వ్యయం–14, రాజయోగం–7, అవమానం–5ధనిష్ఠ 3,4 పాదములు (గూ, గే)శతభిషం 1,2,3,4 పాదములు (గొ, సా, సీ, సు)పూర్వాభాద్ర 1,2,3 పాదములు (సే, సొ, దా)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (పంచమ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (జన్మ), కేతువు సింహరాశి (సప్తమ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (ద్వితీయ) సంచారం. ఏలినాటి శని తృతీయ భాగంలో నడుస్తుంది. రాహువు పెద్దగా యోగించకపోయినా, గురుబలం అనుకూలత వలన మంచి ఫలితాలు అందుకుంటారు. కొన్నిసార్లు తెలివిగాను, కొన్నిసార్లు అసహనంతో ప్రవర్తిస్తుంటారు. మీ గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ప్రవర్తన ఉండేలా చూసుకోండి. రోజువారీ పనులలో స్థిరచిత్తం లోపించడంతో కొత్త కొత్త సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ విషయాల్లో అనవసర కలహాలకు అవకాశం ఇచ్చేలా ప్రవర్తిస్తుంటారు. గురుబలం వలన పెద్దస్థాయి కుటుంబ ఇబ్బందులు ఉండవు. ఉద్యోగాలలో కొన్నిసార్లు ఓర్పుగా ప్రవర్తించి మంచి ఫలితాలు, కొన్నిసార్లు చికాకుగా వ్యవహరించి ఇబ్బందులు పొందుతారు. అధికారులతో జాగ్రత్త అవసరం. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో పనులు వేగంగా సాగుతాయి. వ్యాపారులకు అంతా శుభ ఫలితాలే ఉన్నా, తెలియని అసంతృప్తి ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాలలో మంచి సలహాలు, సహకారం లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఇబ్బందులు లేకుండా కాలం సాగుతుంది. ఋణ విషయాలలో జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్య విషయంలో రోగం ఒకటి, వైద్యం మరొకటిగా ఉంటుంది. మార్కెటింగ్ ఉద్యోగులకు బుద్ధి సరిలేక తగిన ఫలితాలు అందుకోలేరు. షేర్ వ్యాపారులకు శుభపరిణామాలు ఉంటాయి. రైతులకు శ్రమకు తగిన లాభాలు అందుతాయి. విద్యార్థులకు శ్రమ చేసిన కొద్దీ మంచి ఫలితాలు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాలలో తప్పుదోవ పట్టించేవారిని గుర్తించి, దూరంగా ఉంచడం మంచిది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో చికాకులు, మోసం వెంట వచ్చినా చివరకు లాభాలు అందుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో మందగమనంగా లాభదాయకంగా పూర్తి అవుతాయి. ఈ రాశి స్త్రీలకు అన్ని పనులు విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో కొత్త ప్రయోగాలు చేస్తారు. రాహు ప్రభావం వల్ల మీ సేవలకు తగిన గుర్తింపు ఉండదు. మోసపోయే అవకాశాలు ఎక్కువ. గర్భిణీ స్త్రీల ఆరోగ్యం బాగానే ఉన్నా, అనవసర భయాందోళనలు పెరిగి చికాకులు పొందుతారు. దేవీ భాగవత పారాయణ చేయండి. దుర్గా/దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయండి.ధనిష్ఠ 3, 4 పాదాలు: తరచుగా మోసాలకు గురవుతారు. శారీరకంగా ఇబ్బంది ఉందనే భావన గోచరిస్తుంది. చేయవలసిన పనులు ఆపేసి అనవసరమైనవి చేస్తూ ఉంటారు. ఉద్యోగాల్లో అంతా బాగున్నా, తెలియని భయం వెంటాడుతుంది. అవసరాలకు కావలసిన డబ్బు అందుతుంది. సకాలంలో లక్ష్యాలు పూర్తి చేయరు. శతభిషం: వ్యాపారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజా సంబంధాలు చికాకులు సృష్టిస్తాయి. గొప్ప కోసం విరాళాలు ఇవ్వాల్సి వచ్చి ఇబ్బంది పడతారు. దూర ప్రయాణాల్లో జాగ్రత్త. కుటుంబంలో పెద్దలు, పిల్లల విషయంలో సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు: ఆర్థిక లావాదేవీలు విచిత్రంగా ఉంటాయి. కొన్నిసార్లు డబ్బు ఉన్నా అప్పులు చేయడం, కొన్నిసార్లు డబ్బు ఉన్నా అప్పులు తీర్చకపోవడం వంటివి చేస్తుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి అనుమానాలు పెరుగుతాయి. నేత్ర బాధలు చికాకులు కలిగిస్తాయి. అనాలోచితంగా ప్రవర్తించడం సహజ లక్షణంగా మారిపోతుంది. సొంత డ్రైవింగ్ తగ్గించండి.శాంతి మార్గం: శని, రాహు, కేతువులకు శాంతి చేయించండి. రోజూ ఇంద్రాక్షీ స్తోత్రం మరియు పిప్పలాద కృత శనిస్తోత్రం పారాయణ చేయడం శ్రేయస్కరం. శనివారం రోజు బట్టలు, చెప్పులు వంటివి దానం చేయడం శుభప్రదం. గౌరీశంకర రుద్రాక్షధారణ చేయడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది.ఏప్రిల్: సమస్యలు ఉన్నాయో లేవో చెప్పలేని సందిగ్ధ కాలం. ఓర్పుగా ఉండాలి. కొత్త పనులు చేయడం మంచిది కాదు. ఋణ లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఇతరుల ప్రమేయం వల్ల సమస్యలు రాగలవు. శతభిషా నక్షత్రం వారికి మానసిక అసౌకర్యం, పూర్వాభాద్ర వారికి ఆర్థిక అసౌకర్యం, ధనిష్ఠ వారికి ఉద్యోగ అసౌకర్యం ఉంటాయి. వ్యాపారులకు పనివారితో సమస్యలు ఎక్కువవుతాయి. మే: మాటకు విలువ పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పొందుతారు. అందరి సహకారం బాగుంటుంది. పూజ్యులు, గురువులు, పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలత ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అధికంగా ఉంటాయి. ఆరోగ్య ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తలు పాటిస్తారు. జూన్: జూన్, జులై నెలల్లో స్నేహితులు చేసిన పనుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. షేర్ వ్యాపారాలకు, మార్కెటింగ్ ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఋణ, ఆరోగ్య విషయములలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడండి. ఓర్పు అవసరం. జులై: మనో ధైర్యం పాడవకుండా జాగ్రత్తలు తీసుకోండి. విద్యా, విజ్ఞాన, ప్రదర్శన చేస్తారు. చాలా వ్యవహారాలలో అడ్డంకులు రావడం, వాటిని తొలగించుకోవడం జరుగుతుంది. స్నేహితుల ద్వారా ఇబ్బందులు రాకుండా చూసుకోండి. ప్రయాణ అసౌకర్యాలు ఎక్కువ. విద్యా వ్యాసంగం బాగుంటుంది. ధన ధాన్యలాభం చేకూరుతుంది. ఆగస్ట్: ఋణ, ఆరోగ్య విషయాలలో ప్రతికూల సలహాలు ఇచ్చేవారికి ఆకర్షితులు అవుతారు. ఆదాయం తక్కువ, ఖర్చులు నియంత్రించలేని స్థితి ఉంటుంది. ప్రతివారికి సహాయం చేయాలనే కోరిక పెరుగుతుంది. లాభదాయక సంఘటనలు ఉంటాయి. పెద్దలను దర్శించడం, పుణ్యకార్యాలు చేయడం జరుగుతుంది. సెప్టెంబర్: అభివృద్ధికి మీ కోపావేశాలు అడ్డంకులు కలిగిస్తాయి. ఎప్పుడు ఏ పని సక్రమంగా అవుతుందో తెలియని çపరిస్థితి. మితభాషణ చాలా అవసరం. ఇతరుల వ్యవహారాలలో కలగజేసుకోవద్దు. కలహాలకు దూరంగా ఉండండి. పనివారిని నమ్ముకొని పెద్ద వ్యవహారాలకు శ్రీకారం చుట్టవద్దు. అక్టోబర్: పనులు సకాలంలో సవ్యంగా పూర్తవని కారణంగా చికాకులు పడతారు. అనవసర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబంలో, ఉద్యోగంలో, తోటివారితో ఇబ్బందులు పెరుగుతాయి. రోజువారీ పనులు కాకుండా కొత్త çపనులు చేపట్టవద్దు. నవంబర్: పనులు సానుకూలం చేసుకుంటూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. అన్ని అంశాలలోనూ కాలం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ విషయాలు సానుకూలం అవుతాయి. వ్యాపారులకు లాభదాయకం. ఉద్యోగులకు పనులు సకాలంలో అవుతాయి. డిసెంబర్: మానసిక అశాంతి ఎక్కువైనా, విజయాలు సాధిస్తారు. కొన్నిసార్లు ధైర్యం ప్రదర్శిస్తారు. ఉద్యోగాలలో అంతా సానుకూలమే. వ్యాపారులు ప్రోత్సాహకర ఫలితాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు అద్భుతంగా ఉంటాయి. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు కాలం అనుకూలం. జనవరి: 13వ తేదీ నుండి జాగ్రత్తలు పాటించండి. 13వ తేదీ వరకు అనుకున్న పనులు వేగంగా సాగుతాయి. ఆ తర్వాత ప్రయాణ చికాకులు, ఆరోగ్య చికాకులు ఉంటాయి. ఒంటరిగా దూర ప్రయాణాలు చేయవద్దు. బంధు మిత్రులతో కలహాలు రాకుండా సంచరించాలి. కొత్త వ్యవహారాలు చేయవద్దు. ఫిబ్రవరి: తరచు ఇబ్బందులు వస్తుంటాయి. అయినా తెలివిగా సరి చేసుకోగలుగుతారు. ఆర్థిక అనుకూలత ఉంటుంది. ఉద్యోగంలో మంచి తెలివి ప్రదర్శిస్తారు కాని, రాబోవు మూడు మాసాలు ఒత్తిడిగానే సాగుతుంది. ఆరోగ్యం, స్థానచలనం విషయాలలో ముందు జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందులు రాగలవు. మార్చి: తరచు ఎదురయ్యే సమస్యలను సరిచేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి రావడంతో రోజువారీ పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. మానసికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎదురవుతాయి. ఉద్యోగ భద్రత కోసం ఎక్కువగా శ్రమించాలి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి. అధికంగా ప్రయాణాలు చేయవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. మీన రాశి ఆదాయం–5, వ్యయం–5 , రాజయోగం–3, అవమానం–1పూర్వాభాద్ర 4 వ పాదము (ది)ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు (దు, శ్య, ఝా, థా)రేవతి 1,2,3,4 పాదములు (దే, దొ, చా, చి)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (అర్థాష్టమ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (వ్యయ), కేతువు సింహరాశి (షష్ఠ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (జన్మ) సంచారం. ఏలినాటి శని జన్మంలో రెండవ భాగం ప్రారంభం. జన్మ శని, వ్యయ రాహు తగు జాగ్రత్తలతో కాలక్షేపం చేయాలి. మీ ప్రమేయం లేకుండా సమస్యలు తలెత్తే సమయం. అందరినీ మీరు, మిమ్మల్ని అందరూ అనుమానిస్తారు. ఇతర పనులు ఆపివేయండి. ప్రతిపనిలోనూ మందగమనం ఉంటుంది. రోజువారీ పనుల్లో జాగ్రత్త వహించండి. కుటుంబపరంగా ఇబ్బందిలేని జీవనశైలి ఉంటుంది. అలసత్వం, పనులు వాయిదా వేయడం, అనవసర కలహాలు మానసిక ఒత్తిడి కలిగిస్తాయి. ఉద్యోగులు తోటివారితోను, మీ కింద పనిచేసే వారితోను జాగ్రత్తగా ఉండాలి. మోసపూరిత వాతావరణంతో ఇబ్బంది పడతారు. అధికారులతో జాగ్రత్త. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో సానుకూలత ఉన్నట్లు కనిపించినా, పనులు పూర్తి కావు. వ్యాపారులకు శ్రమకు తగిన ఫలితాలు అందవు. పనివారితో సమస్యలు, అధికారుల ఒత్తిడి ఎక్కువ అవుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలలో మంచి ఫలితాలు లేవనే చెప్పాలి. ఆర్థిక లావాదేవీలలో చికాకులు పొందుతారు. అవసరానికి తగిన ఆదాయం అందదు. ఖర్చులు నియంత్రించలేరు. ఋణ విషయములో అవమానాలు ఎదురవకుండా జాగ్రత్తపడండి. ఆరోగ్య విషయంలో నేత్ర బాధలు ఉన్నవారు ఇబ్బందులు పడతారు. గుండె, ఎముకల సమస్యలు ఉన్నవారు పాత సమస్యలు తిరగబెట్టకుండా ముందు జాగ్రత్తలు పాటిస్తారు. మార్కెటింగ్ ఉద్యోగులకు ఎన్నో అడ్డంకులు ఉంటాయి. అధికారుల ఆగ్రహం తప్పదు. షేర్ వ్యాపారులకు కాలం అనుకూలం కాదు. రైతులు స్వబుద్ధితో ప్రత్యక్షంగా పనులు పర్యవేక్షించుకోవాలని సూచన. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. విద్యార్థులకు ఇతర వ్యాపకాలు ఎక్కువై ఇబ్బంది పడతారు. కోర్టు వ్యవహారాలలో బాగా సçహాయం చేస్తారు అనుకునేవారు కూడా మోసం చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో మోసాలు ఎదురవుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో పనులు చికాకులతో సాగుతాయి. ఈ రాశి స్త్రీలకు అంతటా చిక్కులు, సమస్యలు తప్పవ. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ ఉంచండి. ఇతరుల విషయాలలో కలుగచేసుకోవద్దు. దూర ప్రయాణాలు విరమించండి. అలంకరణ మీద దృష్టి ఉంచరు. మీరు చేసే పనికి గుర్తింపుకు రాకపోగా విమర్శలు ఎదురవుతాయి. గర్భిణీ స్త్రీలకు మానసిక ఆందోళనలు ఎక్కువవుతాయి.అనవసర భయాందోళనలు పెరుగుతాయి. తరచుగా వైద్య అవసరాలు ఏర్పడతాయి. సౌందర్యలహరి పారాయణ శ్రేయోదాయకం.పూర్వాభాద్ర 4వ పాదం: అనవసర ఆలోచనలు, అనవసర కాలక్షేపాలు, అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వైద్య, ఋణ, కోర్టు విషయాలలో సమస్యలు కొని తెచ్చుకుంటారు. కొత్త పనులు చేపట్టకపోవడం శ్రేయస్కరం. అన్ని పనుల్లోనూ వాయిదాలను ఇష్టపడుతుంటారు. ఉత్తరాభాద్ర: వైద్యపరంగా మంచి సలహాలు అందక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్య విషయాలలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించలేరు. అజీర్ణ సమస్యలు తరచుగా వస్తుంటాయి. ఉద్యోగ, వ్యాపారాలలో మంచిగా వ్యవహరించి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడతారు. ఆర్థిక ప్రోత్సాహం తక్కువ. రేవతి: వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. సామాజిక చెడు ప్రభావాలు మిమ్మల్ని చికాకు పెడతాయి. మిత్రుల సలహాలు, బంధు సహకారం అనుకూలించవు. మతిమరపు పెరుగుతుంది. ఆరోగ్యపరంగా అధిక జాగ్రత్తలు పాటిస్తారు. పుణ్యకార్యాలు చేస్తుంటారు. శాంతి మార్గం: శని, రాహు, కుజ గ్రహశాంతి అవసరం. రావి చెట్టు కింద కొలువైన ఆంజనేయస్వామికి ‘‘శ్రీరామ జయరామ జయజయరామ’’ అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయడం, ప్రదోషకాలంలో ‘‘శ్రీమాత్రే నమః’’ అని చెబుతూ శివాలయంలో ప్రదక్షిణలు చేయడం శుభప్రదం. గౌరీశంకరం రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: ఈ నెలలో చేసే కొత్త ఋణాలు భవిష్యత్తుకు ప్రమాదం అవుతాయి. పనులు వాయిదా వేయడం మానుకోండి. బుద్ధి కుశలత తగ్గుతుంది. ఒంటరి కాలక్షేపం, ఒంటరి ప్రయాణాలు విడనాడడం శ్రేయస్కరం. రోజువారీ పనులు మినహా కొత్త ప్రయోగాలు చేయవద్దు. ఎవరికీ వాగ్దానాలు చేయవదు.్ద మే: ఒక విచిత్రమైన కాలం. ప్రతిపనీ ఒకటికి రెండుసార్లు చేయవలసి ఉంటుంది. ప్రతిపనీ ఆలస్యం అవుతుంది. చాలా అంశాలలో తెలివి ప్రదర్శించి చికాకులు పెరగకుండా చూసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా సాగుతుంటాయి. జూన్: కుటుంబ వాతావరణం చాలా సౌకర్యంగా ఉంటుంది. మీ పనులు ఆలస్యమైనా, సానుకూలంగా పూర్తవుతాయి. వాహన, ప్రయాణ, ఆర్థిక విషయాలలో అనుకూల స్థితి ఉంటుంది. శుభకార్యాలు, పుణ్యకార్యాలు చేస్తుంటారు. జులై: పనులు సాధించే వనరులు ఉన్నా, ఆలస్యం అవుతుంటుంది. కొత్త ప్రయత్నాలు చేయవద్దు. అవయవాలు కొంత ప్రతికూలిస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార విదేశీ ప్రయత్నాలు మందగమనంగా ఉంటాయి. ఆగస్ట్: మానసిక ఒత్తిడి ఎక్కువ. ప్రతికూల సలహాలు ఎక్కువగా ఆకర్షిస్తాయి. చేయవలసిన పనులు ఆలస్యంగానూ, అనవసరమైన పనులు వేగంగానూ చేస్తూ ఉంటారు. ఎవరినీ నమ్మలేని స్థితి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు, ఋణ విషయాలు సానుకూలంగా సాగుతాయి.సెప్టెంబర్: విచిత్రమైన కాలం. ద్వితీయార్ధం కార్య వైఫల్యాలు ఉంటాయి. కొత్త పనులు చేయవద్దు. రోజువారీ పనులలోనూ, వృత్తి వ్యవహారాలలోనూ ప్రత్యేక పర్యవేక్షణ అవసరం. కుటుంబ వ్యవహారాలలో ఇతరుల ప్రమేయాన్ని తగ్గించండి. ప్రయాణాలు తగ్గించడం శ్రేయస్కరం. అక్టోబర్: బహు జాగ్రత్తగా కాలక్షేపం చేయండి. స్థానభ్రష్టతకు, కుటుంబంలో అనైక్యతకు అవకాశాలు ఎక్కువ. ఆర్థిక లావాదేవీలు, ఋణ వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. దూర ప్రయాణాలు విరమించండి. ఒంటరిగా ఏ పనీ చేయవద్దని సూచన. నవంబర్: విచిత్రమైన కాలం. ఏ పనీ సవ్యంగా సకాలంలో పూర్తవదు. ప్రతిదానికీ భయపడుతూ ఏ ప్రయత్నమూ సవ్యంగా చేయరు. మానసిక పరిస్థితికి, ఆచరణకు పొంతన ఉండదు. పుణ్యకార్యాలలో అవరోధాలు రాకుండా జాగ్రత్తపడండి. చిన్న చిన్న ఆర్థిక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. డిసెంబర్: ఉద్యోగంలో మీ అధికారులు బాగా ప్రోత్సాహం అందిస్తారు. వ్యాపారులకు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ విషయంలో అనుకూలత ఉంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. పుణ్యకార్యాలు చేస్తారు. విజ్ఞాన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దలను సేవించుకుంటారు. షేర్ వ్యాపారులకు అనుకూలం. జనవరి: క్రమంగా లాభాలు పెరుగుతాయి. ప్రారంభించిన ప్రతి పని లాభదాయకంగా పూర్తవుతుంది. గత సమస్యల పరిష్కారానికి, భవిష్యత్ ప్రణాళికలకు కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక ఆరోగ్య కుటుంబ ఉద్యోగ వ్యాపార వ్యవహారాలన్నీ చాలా అనుకూలం.ఫిబ్రవరి: చాలా జాగ్రత్తలు పాటించాలి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఋణ వ్యవహారాలలో అవమానాలు తలెత్తకుండా జాగ్రత్త పడండి. దూర ప్రయాణములు, ఒంటరి ప్రయాణాలు రాబోవు మూడు మాసములు అనుకూలంగా అగుపించడం లేదు. ఆర్థికలావాదేవీలు ఇబ్బందికరం. మార్చి: ఆరోగ్య చికాకులు రాగలవు. తెలివిగా పనిచేయగలిగిన శక్తి ఉన్నా, నిస్తేజంగా ఉండిపోతారు. పనులు అనుకూలం కావు. రోజువారీ పనులు అస్తవ్యస్తంగా జరుగుతాయి. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. పనులు సకాలంలో పూర్తికాకపోవడంతో ఇబ్బందులు పడతారు. మేష సంక్రమణ ఫలముది.14 ఏప్రిల్ 2025 ఉదయం 5:33లకు విశ్వావసు చైత్ర బహుళ పాడ్యమీ సోమవారం స్వాతి నక్షత్రం వజ్రనామయోగం, కౌలవ కరణం మీనలగ్న సమయంలో రవి మేషరాశిలో ప్రవేశం. సోమవారం సుభిక్షం. సంధ్యాకాలం ప్రజలకు సుఖం. స్వాతీ నక్షత్ర సమయంలో ప్రవేశం హానికలుగును. రోహిణీ చక్ర విధానంగా చూడగా మంచి వర్షానికి అవకాశం. సంవత్సరం అంతా ఉన్నది. ప్రవేశకాల గ్రహ సంచారం ప్రకారం లగ్నంలో చాతుర్గ్రహ కూటమి అందులోను, శని, రాహువులు పరిపాలనా రంగంలో ఎన్నో ఆటంకాలు ఉంటాయి. సమాజంలో ఇబ్బందికర ఘటనలకు అవకాశం గోచరిస్తుంది. అయితే గురుసంచారం బాగుంది. కావున సాధారణ స్థాయి ఇబ్బందులుగా గుర్తించవచ్చు.రవి ఆర్ద్ర నక్షత్ర ప్రవేశ ఫలముది.22–06–2024 పగలు (22.35 వి.ఘ.) గం.2:32ని.లకు విశ్వావసు సంవత్సరం జ్యేష్ఠ బహుళ ద్వాదశీ ఆదివారం భరణీ నక్షత్రం సుకర్మ యోగం తైతుల కరణం తులా లగ్నం సమయంలో రవి ఆర్ద్రా నక్షత్రంలో ప్రవేశం. ‘‘అపరేహేః ఆర్ద్రా ప్రవేశం అతిలోక పీడా’’ అపరాహ్ణ కాలములో ఆర్ద్రా నక్షత్రంలో రవి ప్రవేశం లోకులకు ఇబ్బంది. చంద్రుడు మేషంలో ఉన్న కారణంగా దివారాత్రి దోషం తోడయి ఎక్కువ కాలం నీటి ఎద్దడి. అయితే రవి చంద్రులకు ఇరువురికీ శుభగ్రహ కలయిక వలన దోషం తక్కువగా భావించాలి. ద్వాదశ్యాం శుభప్రోక్తం అని చెప్పబడినది. ఆదివారం పశువులకు నష్టం. కశ్యపవచనం దృష్ట్యా భరణిలో చంద్రుడు ఆర్ద్రా ప్రవేశ కాలంలో వున్న కారణం సస్యవృద్ధిగా గమనించాలి. సుకర్మ యోగం సువృష్టి అని చెప్పబడినది. భరణ్యాది చతుష్కమండలం దృష్ట్యా సస్యానుకాలం వర్షయోగం చెప్పబడినది. తులాలగ్న సమయంలో ప్రవేశం సువృష్టి. తైతుల కరణం నిత్యశుభం. ఫలితం: సాధారణం నుండి అధిక వర్షపాతం నమోదు అవుతుంది. సూచన: ఈరోజు వర్షం కురిసినట్లయితే, దానిని ఆధారం చేసుకొని భవిష్య వర్షయోగం నిర్ణయిస్తారు.చంద్రచారముజ్యేష్ఠ శుక్ల ప్రతిపత్ బుధవారం ‘‘సుభిక్షం క్షేమమారోగ్యం వృష్టిసస్య వివర్ధనం స్వధర్మ నిరతాభూపాః జ్యేష్టాదౌ సౌమ్యవాసరేః’’ సస్యానుకూల వర్షాలు పాడిపంటలు సమృద్ధి ఉంటుంది. రాజులు ధర్మ నిరతులై ఉంటారు. ‘‘ఆషాఢే పంచమీ శుక్లా సోమవారో యదా భవేత్ సుభిక్షం క్షేమమారోగ్యం సువృష్టిశ్చ భవేద్భవం’’ ఆషాఢ శుక్ల పంచమీ సోమవారం కూడా సుభిక్ష క్షేమ ఆరోగ్యాలను సూచిస్తోంది. ‘‘ఆషాఢే శుక్ల పక్షేతు దశమీ స్వాతీ సంయుతా మహద్వర్షం భవేద్ధ్రువం’’ అధిక వర్షాలకు అవకాశం. ‘‘ఆషాఢే కృష్ణపక్షే రోహిణీ ఏకాదశీ యుతామధ్యమ వర్షాలు మధ్యంగా సస్యాలు ఫలిస్తాయి. పుష్య అమావాస్య ఆదివారం దుర్భిక్షం మాఘ ఫాల్గుణాలలో అని గ్రహించాలి.మకర సంక్రాంతి పురుష లక్షణ ది.14 జనవరి 2026 రా.8:51లకు పుష్య బహుళ ద్వాదశి బుధవారం అనురాధ నక్షత్రం, గండ యోగం, కౌలవ కరణం సింహలగ్న సమయాన రవి మకరంలో రవి ప్రవేశం. తర్పణాలు సంకల్పాలు 15 జనవరి ఉదయం నుండి ప్రారంభం కుంకుమోదక స్నానం రాజులకు అరిష్టం. విచిత్ర వస్త్రధారణ శుభం. మందాకినీ నామధేయం రాజులకు నష్టం. -
అందమైన తెలుగుదనం– అనన్య నాగళ్ల
‘‘ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. మరి... మన తెలుగు సంవత్సరాదిని ఇంకా ఘనంగా జరుపుకోవాలి కదా. మన సంస్కృతీ సంప్రదాయాలను పాటించే విషయంలో అస్సలు తగ్గకూడదు’’ అంటున్నారు అనన్య నాగళ్ల. తెలుగు తెరపై కథానాయికగా దూసుకెళుతున్న ఈ పదహారణాల తెలుగు అమ్మాయి ‘సాక్షి’ కోసం ప్రత్యేకంగా ముస్తాబయ్యారు. సంప్రదాయబద్ధంగా తయారై, ఉగాది పండగ గురించి పలు విశేషాలు పంచుకున్నారు. → ఉగాది విశిష్టత అంటే మన తెలుగు సంవత్సరాది... మన సంప్రదాయం, మన సంస్కృతిని బాగా చూపించే పండగ. ఇంగ్లిష్ న్యూ ఇయర్‌ని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మన తెలుగు సంవత్సరాదిని అంతకంటే ఘనంగా జరుపుకోవడం నాకు ఇష్టం. పైగా తెలుగువారికి తొలి పండగ కాబట్టి బాగా జరుపుకోవాలనుకుంటాను.→ ఉగాది పండగ అనగానే నాకు రాశి ఫలాలు గుర్తొస్తాయి. ఉదయం లేవగానే రాశి ఫలాలు చూసుకోవడం, ఈ ఏడాది మన ఆదాయం, వ్యయం, రాజ పూజ్యం చూసుకోవడం అనేది సరదాగా అనిపిస్తుంటుంది. నాకు చిన్నప్పటి నుంచి అదొక ఆనవాయితీలా అయి΄ోయింది. ఉదయాన్నే లేచి అందంగా తయారవడం, ఉగాది పచ్చడి చేసుకోవడం, రాశి ఫలాలు చూసుకోవడం, గుడికి వెళ్లడం... ఇలానే నేను పండగ జరుపుకుంటాను. నాకు ఉగాది పండగ అంటే చాలా ఇష్టం. అందుకే ప్రతి ఏడాదీ బాగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. కానీ కొన్నిసార్లు కుదురుతుంది.. మరికొన్నిసార్లు కుదరదు. ఈ ఏడాది మాత్రం మంచిగా ముస్తాబై గుడికి వెళ్లాలని, ఇంటి వద్ద పిండి వంటలు చేసుకోవాలని ప్రణాళిక వేసుకున్నాను. → ఉగాది పచ్చడి ఎప్పుడూ తయారు చేయలేదు. కానీ, ప్రతి ఏడాది తింటాను. ప్రత్యేకించి వేర్వేరు ఆలయాల్లో వేర్వేరు రుచుల్లో ఉగాది పచ్చడి ఉంటుంది. వీలైనన్ని టేస్ట్ చేస్తాను. ఇంట్లో మా అమ్మ ఉగాది పచ్చడి చేస్తుంటే సాయం చేశాను కానీ, నేనెప్పుడూ చేయలేదు. అయితే ఆ పచ్చడి రుచి అంటే నాకు చాలా ఇష్టం. → ఉగాది పచ్చడి అంటేనే అందరూ చెబుతున్నట్లు ఆరు రుచులు ఉంటాయి. తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు... ఇలా అన్నమాట. నాకు ప్రత్యేకించి వగరుతో కూడిన రుచి అంటే ఇష్టం. ఎందుకంటే... బయట మనం వగరుతో కూడిన ఫుడ్‌ని ఎక్కువగా టేస్ట్ చేయలేం. అలాగే వగరు అనేది వైవిధ్యమైన ఫ్లేవర్‌ని యాడ్ చేస్తుంది... అందుకే నాకు ఇష్టం. → నా బాల్యంలో జరుపుకున్న ఉగాది అంటే చాలా ఇష్టం. మా ఇంటి ముందు గుడి ఉండేది... అందరం పండగని సెలబ్రేట్ చేసుకోవడానికి ఆ గుడికి వెళ్లేవాళ్లం. చిన్నప్పుడు కాబట్టి కొత్త బట్టలంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. ఇక రకరకాల పిండి వంటలు ఉంటాయి కదా... చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించేది.ఫొటో: ఎస్.ఎస్. ఠాకూర్ -
Ugadi 2025: విశ్వ శ్రేయస్సే విశ్వావసు...ఉగాది
మనిషికి భవిష్యత్తు తెలుసుకోవాలని ఎప్పుడూ ఉంటుంది. ఆ భవిష్యత్తులో మంచి జరగాలనే ఆకాంక్ష ఉంటుంది. కాని భవిష్యత్తు అనేది అనిశ్చితితో నిండి ఉంటుందన్న ఎరుక కూడా ఉంటుంది. అయితే ఒక ఆశ కావాలి కదా. ఆ ఆశను ఆధ్యాత్మిక రూపంలో గ్రహాలను ఊతంగా చేసుకుని సనాతనంగా వచ్చిన గ్రహ విజ్ఞానం ఆధారంగా నిలబెట్టేదే పంచాంగ దర్శనం. మంచిని వాగ్దానం చేస్తూ చెడును హెచ్చరిస్తూ సాగే పంచాంగంలో అనూహ్యమైనది ఏదీ కనిపించకపోయినా దానిని వినడం, చదవడం, పరికించడం ఆనవాయితీ. అయితే ఈసారి ‘సామాజిక పంచాంగం’ను వినిపించాలనుకుంది ‘సాక్షి’. ఆరు కీలక రంగాలు దేశంలో, స్థానికంగా ఎలా ఉంటాయో తెలియచేశారు పండితులు. అవధరించండి.ప్రకృతికి ప్రణామంమనం ఏ శుభలేఖల్లో అయినా స్వస్తిశ్రీ చాంద్రమానేన....అని చదువుతుంటాం. అంటే చాంద్రమానం ప్రకారం జరుపుకునే పండగల్లో ఉగాది పండగది ప్రథమస్థానం. ఉగాది రోజు నుంచే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ‘ఉగాది’ అన్న తెలుగు మాట ‘యుగాది‘ అన్న సంస్కృతపద వికృతి రూపం. బ్రహ్మ ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త బ్రహ్మ కల్పంలో సృష్టిని ఆరంభించిన రోజు. మొదటి ఋతువు వసంత ఋతువులో మొదటి మాసం ( చైత్ర మాసం)లో మొదటి తిథి అయిన పాడ్యమి నాడు, మొదటి రోజైన ఆదివారం నాడు యావత్తు సృష్టిని ప్రభవింపజేసాడని అర్థం. అందుకే మొదటి సంవత్సరానికి ‘ప్రభవ’ అని పేరు. చివరి అరవయ్యవ సంవత్సరం పేరు ‘క్షయ’ అంటే నాశనం అని అర్థం.ఉగాది సంప్రదాయాలుఉగాది రోజు తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, ఉగాది పచ్చడి సేవనం, ధ్వజారోహణం, పంచాంగ శ్రవణం తదితర పంచకృత్యాలను నిర్వహించాలని వ్రతగ్రంథం పేర్కొంటోంది. మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తాము పండించబోయే పంటకి ఏ కార్తెలో ఎంత వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి... వంటివన్నీ శ్రద్ధాభక్తులతో అడిగి తెలుసుకుంటారు.ఉగాది పూజఅన్ని పండుగలలాగానే ఉగాది పండుగనాడు ఉదయానే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి పూజ చేసుకొంటారు. అయితే ప్రత్యేకంగా ఫలాని దేవుడి పూజ అని ఏమీ చెప్పబడలేదు గనుక ఈరోజు ఇష్ట దేవతాపూజ చేసుకొంటారు. ఆ తర్వాత ఏమీ తినక ముందే తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు, అలాగే అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినడం వల్ల ఏడాదంతా అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేలా చేస్తుందని వైద్యులు చెప్పేమాట. కాలక్రమంలో ఉగాది పచ్చడిలో లేత మామిడి చిగుళ్ళు, అనేక చిగుళ్లు, ఇలాంటివన్నీ మానేసి కేవలం వేపపూత, బెల్లం ముక్కలను మాత్రమే ఉపయోగించటం కనిపిస్తుంది. ఎక్కడికీ కదలలేని చెట్లు కూడా తమ ఆకులను రాల్చేసుకుని చివుళ్లు తొడిగి పూత, పిందెలతో కళకళలాడే ఈ వసంతరుతువులో మనం కూడా మనలోని చెడు అలవాట్లను, నకారాత్మక ఆలోచనలను వదిలేసి, శుచి, శుభ్రత, సంయమనం, సమయపాలన, సమయోచిత కార్యాలను ఆచరించటమనే సద్గుణాలను అలవరచుకుందాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అర్థం ఏమిటి? నేడు మనం అడుగిడుతున్న కొత్త తెలుగు సంవత్సరానికి శ్రీవిశ్వావసు నామ సంవత్సరం అని పేరు. అంటే విశ్వ శ్రేయస్సు, విశ్వ సంపద అని అర్థం. ఇది అష్టవసువులలో ఒక వసువు పేరు. ఈ సంవత్సరం అందరికీ శ్రేయోదాయకంగా... సంపద్వంతంగా ఉంటుందని ఆశిద్దాం...కొత్తదనం... పచ్చదనంఉగాది అనగానే ఏదో తెలియని కొత్తదనం సుతిమెత్తగా మనసును తాకినట్టు అనిపిస్తుంది. పచ్చదనం మనసునిండా పరుచుకుంటుంది. మామిడిపళ్లు, మల్లెమొగ్గలు, తాటిముంజలు, పుచ్చకాయలు, కోయిల గానాలు మదిలో మెదులుతాయి. చిన్నప్పుడెప్పుడో చదువుకున్నట్టుగా చెట్లు చిగిర్చి పూలు పూసే వసంత రుతువు ఇది. మనసును ఉల్లాసపరిచే కాలం ఇది. అందుకే కవులు, కళాకారులు, సాహితీవేత్తలు ఉగాదిని, వసంత రుతువును విడిచిపెట్టలేదెప్పుడూ! ఉగాది కవి సమ్మేళనాలు, ఉగాది కథలు, కవితల పోటీలు, ఉగాది కార్టూన్లు కాగితం నిండా కళ్లు చేసుకుని తొంగి చూసే ప్రయత్నం చేస్తుంటాయి.ఆర్థికంగా ముందుకు...విశ్వావసు నామ సంవత్సరంలో మంత్రి చంద్రుడు అవడం చేత, రసాధిపతి శుక్రుడు అవడం చేత, నీరసాధిపతి బుధుడు అవడం చేత వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. భారతదేశం ఆర్థిక పరంగా ముందుకు సాగుతుంది. తెలుగురాష్ట్రాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయి. పశ్చిమ దేశాల్లో యుద్ధ భయం, యుద్ధ వాతావరణాలు ఉండి ఆర్థికపరంగా పశ్చిమ దేశాలకు అనిశ్చితి ఏర్పడుతుంది. మేఘాధిపతి రవి అవడం చేత పంటలకి క్రిమి కీటకాదుల వల్ల ముప్పు ఉంటుంది. రైతులకు కొంత ఆర్థిక నష్టం జరగవచ్చు. ధనవంతులు అధిక ధనవంతులు అవుతారు. పెద్ద వ్యాపారస్తులు లాభాలు బాగా ఆర్జిస్తారు. చిన్న వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆర్థికంగా భారతదేశానికి శుభ ఫలితాలనూ, తూర్పు ప్రాంతాలకు, తూర్పు దేశాలకు అనగా చైనా, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు అభివృద్ధిని సూచిస్తోంది.ఆరోగ్యం ఫరవాలేదు...శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో నవనాయకులలో ఐదుగురు పాపులు, నలుగురు శుభులు ఉండడం చేత రాజు రవి, మంత్రి చంద్రుడు అవటం వల్ల ప్రజలు ఆరోగ్యంగా, క్షేమంగా ఉంటారు. కొన్ని గ్రహాల స్థితిగతులు అలజడులకు, విచిత్ర రోగాలకు, సర్వత్రా ఆందోళనలకు దారి తీస్తాయి. సంవత్సరారంభం నుంచి మే 6వ తేదీ వరకూ మీనరాశిలో నాలుగు గ్రహాలు ఒకే రాశిలో కూటమి కావడం వల్ల విశేష సూర్యతాపం, అకాల మరణాలు, యుద్ధ భయాలు, ధరల పెరుగుదల వంటి ఫలితాలు చూడాల్సిన పరిస్థితి. ఏప్రిల్ 1 నుంచి 13 రోజుల పాటు మీనరాశిలోనే పంచగ్రహ కూటమి ఏర్పడనుంది. దీనివల్ల దుర్భిక్ష పరిస్థితులు, కొన్ని దేశాలలో వ్యాధుల వ్యాప్తి, జననష్టం, ప్రకృతి బీభత్సాలు వంటివి నెలకొంటాయి. జూన్ ఒకటో తేదీ నుంచి జులై 28వ తేదీ వరకూ కుజరాహువుల పరస్పర వీక్షణాల వల్ల యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు, కొన్ని వ్యాధులు వ్యాపించే సూచనలు. ఉగాది నుండి సుమారు మూడు నెలల పాటు అపసవ్య రీతిన కాలసర్పదోష ప్రభావం కారణంగా వివిధ సమస్యలు, రోగాలతో ప్రజలు అవస్థ పడతారు. జాతీయ, అంతర్జాతీయ నేతలు కొందరిపై ఆరోపణలు, అరెస్టులు, ఆందోళనలు రేకెత్తవచ్చు. – చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్తఅనుబంధాలు జాగ్రత్తఈ ఏడాది పాలకుల మధ్య గాని కుటుంబ, వ్యక్తిగత అనుబంధాలుగానీ అంత బాగుంటాయని చెప్పలేం. అందువల్ల బంధుమిత్రుల ఇళ్లకు అతి ముఖ్యమైన పని మీద వెళ్లినా, ఎక్కువ సమయం ఉండకుండా తొందరగా పని చూసుకుని రావడం మంచిది. అనుబంధాలు, మానవ సంబంధాలు బాగుండాలంటే తరచు మాట్లాడుకుంటూ ఉండటం శ్రేయస్కరం. ఆర్థికంగా అంత బాగుండని బంధువుల మీద తెలిసీ తెలియక భారం వెయ్యకుండా వారికి మీ వల్ల చేతనైన సాయం చేయడం మంచిది. అనవసరమైన, చెయ్యలేని, చేతకాని వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చలేక మాటలు పడి మానసిక ప్రశాంతతను పోగొట్టుకునే బదులు చెయ్యగలదానిని మాత్రమే చెప్పడం, చెయ్యలేని వాటిని సున్నితంగా ముందే మా వల్ల కాదని చెప్పడం వల్ల స్నేహసంబంధాలు దెబ్బ తినకుండా ఉంటాయి. బంధువులు, మిత్రుల మధ్య అనుబంధాలు బాగుండాలంటే వారితో స్నేహ సంబంధాలు కొనసాగించడం మేలు. – డా. మైలవరపు శ్రీనివాసరావు, ఆధ్యాత్మిక వేత్తఆనందానికి లోటు లేదుఈ విశ్వావసు నామవత్సరంలో పేరులోనే విశ్వశాంతి గోచరిస్తోంది. క్రోధాలు, మోసాలు, ద్వేషాలు తొలగిపోయి ప్రజలంతా ఒక్కమాటగా ఉంటారు. రాజకీయ రంగంలోని వారికి అవకాశాలు రావడం వల్ల ఆనందంగా ఉంటారు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు వచ్చి ఆనందంలో తేలుతారు, సాహిత్య, సాంస్కృతిక పర్యాటక రంగాలలోని వారికి అనుకూలంగా ఉండటం వల్ల ఆనందం కలుగుతుంది. ప్రజలంతా చేయీ చేయీ కలుపుకొని మాటా మాటా కలుపుకొని మనసులలోని శంకలు మాపుకొని ఒక్కతాటి మీద నడుస్తూ ఆనందంగా ఉంటారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరం తక్కువ ఎక్కువలనూ పేదాగొ΄్పా తారతమ్యాలను విడనాడి, దేశంలోని అన్ని రంగాలలో సమన్వయం ఏర్పడి అందరూ కలసి కట్టుగా ప్రతి నిత్యం ఆనందంతో మునిగి తేలుతూ అంబరాలనంటేలా సంబరాలను జరుపుకుంటూ జీవిద్దాం. – తాడిగడప సోదరులు: తాడిగడప సుబ్బారావు, తాడిగడప బాల మురళి భద్రిరాజు,శ్రీ వాగ్దేవి జ్యోతిష విద్యాలయం,పెద్దాపురంఅభివృద్ధికరంగా ఉంటుందిశ్రీవిశ్వావసు నామ సంవత్సరంలో దేశ అభివృద్ధి ఆశాజనకంగా ఉంది. ఈ సంవత్సరం గ్రహాలలో అత్యధిక శాతం శుభులు ఉండడం వల్ల ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. సస్యవృద్ధి, పశుసంపదకు క్షేమం, ఆయురారోగ్యం కలుగుతుంది. రాజ్యాధిపతి అనుకూలుడుగా ఉండడంవల్ల దేశాధినేతలకు పాలకులకు శుభం చేకూరుతుంది. కొన్ని రాష్ట్రాలలో అతివృషి,్ట మరికొన్ని రాష్ట్రాలలో అనుకూల వృష్టి ఉండవచ్చు. నిత్యావసర వస్తువుల ధరలు నిలకడగా ఉంటాయి. రసవస్తువుల ధరలు కొంత హెచ్చి తగ్గుతాయి. నీరస వస్తువులు ధరలు తగ్గి స్వల్పంగా హెచ్చుతాయి. పరిపాలకులు సంయమనంతో ఉంటారు. చేతివృత్తుల వారికి ఈ సంవత్సరం చేతి నిండా పని దొరుకుతుంది. దేశ రక్షణ బాధ్యతను వహించే సైనికులకు ఈ సంవత్సరం పరీక్షా సమయం అయినప్పటికీ విజయం సాధిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమంపై దృష్టి సారిస్తారు. నీటిపారుదల, పారిశ్రామిక రంగాలపై పాలకులు ్రపాధాన్యతను చూపుతారు. యువకులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి– ఓరుగంటి నాగరాజశర్మ, పుష్పగిరి పీఠ మహాసంస్థాన సిద్ధాంతి, జ్యోతిష విద్వాంసులుఆధ్యాత్మికం మిశ్రమంశ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆధ్యాత్మికంగా, సామాజిక పరంగా శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి చేయూత, పండితులకు కొంత వరకు ఆర్థికసాయం అందే అవకాశం ఉంది. గురుడు వర్ష జగ లగ్నంలో కేంద్ర గతులవడం వల్ల ధార్మిక ఆరాధనల్లో విస్తృతి పెరుగుతుంది. ముఖ్య దేవాలయాల్లో కొన్ని సంస్కరణల వల్ల హైందవ జాతికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా మతపరమైన విషయాల్లో స్వీయ మత ఎరుక పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా సనాతన ధర్మం అభివృద్ధికరంగా ఉంటుంది. అయితే షష్ఠగ్రహ కూటమి వల్ల బంద్‌లు, అధిక ఉష్ణోగ్రతల వల్ల సమాజంలో కొంత భయం ఏర్పడి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అంతరాయం కలుగవచ్చు. అలాగే మత్తు మందులు మారక ద్రవ్యాల వల్ల చెడుమార్గం పట్టే వారికి సంఖ్య పెరిగి వారికి ఆధ్యాత్మిక కట్టడి అవసరం అవుతుంది సమాజంలో ఆధ్యాత్మిక చింతనకు ధనవంతుల ఆర్థికసాయం లభించగలదు. – చింతా గోపీశర్మ, సిద్ధాంతి – డి.వి.ఆర్. భాస్కర్ -
షడ్రుచుల ఉగాది పచ్చడి తయారీ ..తినేటప్పుడు చదవాల్సిన శ్లోకం..!
తెలుగువారికి కొత్త సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభం అవుతుంది. మామూలుగా ఏ పండుగ రోజైనా స్పెషల్‌గా పిండివంటలు, గారెలు, బూరెలు, పాయసం లాంటి వంటకాలు ఉంటాయి. కానీ ఉగాది స్పెషల్ మాత్రం ఉగాది పచ్చడే!. ఎన్నో ఔషధగుణాలు ఉన్న షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ఉగాది పండుగ రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి పరగడుపున తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆహారంలో ఉండే ఔషధ గుణాలను స్వీకరిస్తూ, జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తూ కొత్త సంవత్సరమంతా ఆరోగ్యంగా, ఆనందంగా సాగిపోతుందనేది పురాణ వచనం. మరీ అందరికి ఎంతో ఇష్టమైన ఆ ఉగాది పచ్చడి తయారీ ఎలాగో చూద్దామా..!.ఉగాది పచ్చడి కావలసినవి: కొత్త బెల్లం – 100 గ్రామలు, పచ్చి మామిడి – ఒకటి (మీడియం సైజు), వేప పువ్వు – ఒక టేబుల్ స్పూన్, పచ్చి మిర్చి – రెండు (తురమాలి), ఉప్పు – చిటికెడు, చింతపండు – పెద్ద నిమ్మకాయంత (కొత్త చింతకాయల నుంచి సేకరించినది). తయారీ: బెల్లాన్ని తురిమి, అందులో కొద్దిగా నీటిని చిలకరించి పక్కన ఉంచాలి. వేప పువ్వు కాడలు లేకుండా వలిచి పువ్వు రెక్కలను సేకరించి పక్కన ఉంచాలి. మామిడి కాయ మొదలు (సొన కారే భాగం) తీసేయాలి. కాయను నిలువుగా కోసి లోపలి గింజను కూడా తీసేయాలి. ఇప్పుడు మామిడి కాయను తొక్కతోపాటు సన్నగా ముక్కలు తరగాలి లేదా తురిమి బెల్లం నీటిలో వేయాలి. చింతపండు గుజ్జును చిక్కగా రసం తీసి పై మిశ్రమంలో కలపాలి. అందులో పచ్చిమిర్చి తురుము, ఉప్పు, వేప పూత వేసి కలపాలి. ఈ మిశ్రమం చిక్కగా ఉంటుంది. మరింత రుచి కోసం చెరకు ముక్కలు, మిగుల మగ్గిన అరటి పండు గుజ్జు కలుపుకోవచ్చు. ఈ పచ్చడి తినేటప్పుడు చదవాల్సిన శ్లోకం..శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచసర్వారిష్టవినాశంచ నింబకందళ భక్షణమ్॥"అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుభాకాంక్షలు(చదవండి: -
చైత్ర మాసం విశిష్టత.. వ్రతాల మాసంగా ఎందుకు పిలుస్తారు..?
చైత్ర మాసం సంవత్సరానికి మొదటి నెలగా మాత్రమే కాక, అనేక ఆధ్యాత్మిక, పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటి రాశియైన మేషరాశిలో సంచరిస్తాడు. పురాణాలు చైత్రమాసాన్ని మధుమాసంగా, పవిత్ర మాసంగా కీర్తిస్తాయి. శుభాకార్యలు జరపకపోయినా..ఈ మాసానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు పండితులు. కొత్త సంవత్సరం ప్రారంభ సూచిక, మనందరికీ ఇష్టమైన ఉగాది పండుగతో ప్రారంభమయ్యే ఈ చైత్ర మాసం విశిష్టత, వ్రతాల మాసంగా పిలవడానికి కారణం తదితరాల గురించి సవివరంగా చూద్దామా..!.అప్పటి నుంచి మళ్లీ బాల్యావస్థ మొదలవుతుంది. అంటే చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. అకారణంగా అలగడం, అవీ.. ఇవీ తినాలని అడగటం, చిన్న చిన్న దొంగతనాలు చేయటం, ఎక్కువసేపు నిద్రపోవటం, చిన్న విషయాలకే ఆనంద పడటం, కోపం తెచ్చుకోవటం, కన్నీళ్లు పెట్టుకోవడం ఇలాంటి బాల్య చేష్టలన్నీ అరవైఏళ్ల నుంచి నెమ్మదిగా ప్రారంభమవుతాయి. ప్రతి కొడుకూ అరవై సంవత్సరాలు వచ్చిన నాటి నుంచి తన తండ్రిని తన బిడ్డలతో సమానంగా చూసుకోవాలని ధర్మశాస్త్రం చెబుతోంది. ఆరుపదుల జీవితాన్ని ఎవరైతే ఆనందంగా జీవిస్తారో వారి జీవితం ధన్యం. ఆ ధన్యజీవితపు జ్ఞాపకార్థమే బిడ్డలు, మనవళ్లు బంధువులు మిత్రులు కలిసి ‘షష్టిపూర్తి చేస్తారు’. ఇక ధర్మశాస్త్రం ప్రకారం చూసుకుంటే కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో మానవ ఆయుర్దాయం 180 సంవత్సరాలు. కలియుగానికి వచ్చే సరికి కలి ప్రభావంతో 120 సంవత్సరాలకు పడిపోయింది. అందుకే 60ఏళ్లు పూర్తవగానే షష్టి పూర్తి చేస్తారు. అంటే దీనర్థం. మొదటి 60 ఏళ్లు పూర్తవగానే లోక సంబంధ విషయాలు పూర్తయినట్లు భావించాలి. మిగిలిన 60ఏళ్లు ఆధ్యాత్మిక చింతనతో బతకాలని ధర్మశాస్త్రం చెబుతోంది.పురాణ గాథ!ఒకానొక సమయంలో నారద మునీంద్రుడు తానంత గొప్ప భక్తుడు లేడని, ఆ గర్వంతో విర్ర వీగుతున్నాడట. అప్పుడు శ్రీమహా విష్ణుడు అతడికి జ్ఞాన బోధ చేయాలని సంకల్పించారు. దీంతో నారదుడిని మాయ ఆవరించేలా చేసి ఒక సరస్సు తీసుకెళ్లి అందులో దిగి స్నానం చేయమన్నాడు. నారదుడు అందులో దిగి స్నానం చేయగానే, ఒక్కసారి పూర్వ స్మృతిని మర్చిపోయి, స్త్రీ రూపం ఎత్తాడు. అదే సమయంలో దారితప్పి అక్కడకు వచ్చిన ఓ మహారాజును చూసి మోహించి, వివాహం చేసుకుని 60మంది పిల్లలను కన్నాడు. వారే.. ప్రభవ.. విభవ.. శుక్ల.. చివరిగా అక్షయ. వారంతా ఒకరి తర్వాత ఒకరు యుద్ధంలో మరణిస్తుండటంతో పుత్రశోకంతో ఉండిపోయాడు. సంసార సాగరంలో మునిగిపోయి అసలు తానెవరో మర్చిపోయాడు. అప్పుడు నారదుడిని ఆవరించిన మాయను శ్రీహరి తొలగించి, ఇదీ సంసారం అంటే.. నీవు ఏదో గొప్ప భక్తుడవని భావిస్తున్నావు. అని జ్ఞానబోధ చేశాడట. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని విష్ణుమూర్తి వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.వ్రతాలన్నీ ఈ మాసంలోనే..“ఋతూనాం కుసుమాకరాం” అని భగవానుడు స్వయంగా తానే "వసంత"ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం. సంవత్సరానికి తొలి మాసం కూడా. చైత్రమాసం అనగానే మనకి "ఉగాది, "శ్రీరామనవమి" గుర్తుకొస్తాయి. అవే కాదు, దశావతారాలలో మొదటి అవతారం అయిన మత్స్యావతారం, యజ్ఞ వరాహమూర్తి జయంతి, సౌభాగ్యగౌరీ వ్రతం, వసంత నవరాత్రులు వంటి విశిష్టమైన వ్రతాలు ఆచరించేది ఈ మాసంలోనే. అమ్మకు ఇష్టమేన మాసం కూడా..అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం చైత్రమాసం. అమ్మవారిని ఈ కాలంలో పూజించిన వారికి విశేషఫలం లభిస్తుందని దేవీభాగవతమహిమ చెపుతోంది. దీనికి గల కారణం ఏమిటో శివుడే స్వయంగా బ్రహ్మవిష్ణువులకు వివరించినట్లు శివపురాణం చెపుతున్నది. ఈశ్వరుడు సృష్టి, స్థితి, సంహారం, తిరోభావం, అనుగ్రహం అనబడే అయిదు జగత్కార్యాలు చేస్తుంటాడు. ఈ అయిదుపనులలో సకలలోకాల ప్రాణుల ఉత్పత్తి లేక ఆరంభం, సృష్టిగా పిలుస్తారు. ఆరంభం అయిన ప్రాణులు, లోకాలు పోషింపబడి స్థిరంగా ఉండుట అనగా, జీవుల నుంచి జీవులు ఉత్పన్నులవుతూ కొనసాగడాన్ని స్థితి అంటారు. జీవులు కొంతకాలం అభివృద్ధిని చెంది, శిథిలావస్థకు వచ్చి, వినాశమును పొందడాన్ని సంహారం అంటారు. ప్రాణం బయటకు వచ్చి వేరొక దేహాన్ని పొంది, వేరు లోకాలకు పోవడాన్ని “తిరోధానం” అంటారు. జననమరణాదిచక్రమును తొలగించి ముక్తినివ్వడాన్ని అనుగ్రహము అంటారు. ఈ పంచకృత్యాలు నడిపించేపని భవుడు, భవానికి ఇచ్చాడు. ఈ పనులన్నీ ప్రారంభమైన కాలం చైత్రమాసం. అందువల్లనే ఈ కాలంలో భవానిని పూజించమని భవుడు చెప్పాడు.భవభవానీప్రీతికరమాసం, మధుమాసం కనుక ఈ మాసంలో ఆదిదంపతులను పూజించాలి.రామాయణ పారాయణము చేసేది కూడా.."రామో విగ్రహవాన్ ధర్మః" అని రామాయణంలో వాల్మీకి స్పష్టం చేసాడు. ధర్మాచరణకోసం ఎన్నో శాస్త్రాలు తిరగవేయవలసిన అవసరం లేదు. రాముని జీవితాన్ని సంపూర్ణంగా చదవాలి. జీర్ణించుకోవాలి. అప్పుడు ధర్మసూక్ష్మాలు స్పష్టంగా తెలుస్తాయి. శిష్యునిగా, ధర్మప్రభువుగా, దాతగా, రక్షకునిగా, శిక్షకునిగా ఒకటేమిటి అనేకపాత్రలు శ్రీరామచంద్రునిలో కనిపిస్తాయి.సంపూర్ణమానవునిగా జీవితం గడిపిన దివ్యావతారం శ్రీరామావతారం. శ్రీరామచంద్రుని ఆవిర్భావం జరిగినది చైత్రమాసంలోనే. అందువల్లనే చైత్రమాసాన్ని ధర్మమాసం అంటారని సౌరసంహిత చెపుతోంది. ఈ మాసంలో రామాయణ పారాయణము, శ్రవణమూ ఈ రెండూ అనంతఫలితాలను ఇస్తాయి. మానవులజీవితాలను వారివారి కర్మఫలాలను అనుసరించి నడుపుతూ సుఖదుఃఖాలను ఇచ్చేవారిలో నవగ్రహ దేవతలది ప్రధాన స్థానం. నవగ్రహాలలో ఒకరైన కేతువు గ్రహంగా ఆవిర్భవించినది చైత్రమాస కృష్ణపక్షచతుర్దశీ తిథి. ఈ తిథినాడు దర్భలు శిరస్సున ధరించి, నదీస్నానం చేసి కేతుతర్పణాలు ఇచ్చి, ఉలవలు దానం చేసినవారికి సకలబాధలూ తొలగుతాయి. ఊపిరితిత్తుల రోగాలు తక్షణమే తొలగిపోతాయి. కాబట్టి అంత మహిమాన్వితమైన ఈ మాసాన్ని భక్తులందరూ తమ శక్త్యానుసారం పూజలు చేసి..ఆ భగవంతుడి కృపకు పాత్రులుకండి. (చదవండి: -
ఆ పాట మధురం!
ఆమె పేరు స్ఫూర్తిరావు.. పుట్టుకతో వచ్చిన గాత్రానికి దైవదత్తమైన సంగీతాన్ని చేర్చి రాణించిన కళాకారిణి! పదేళ్ల క్రితమే ‘సూపర్ సింగర్ జూనియర్ -4’ పోటీ విజేత!ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విదుషీమణులు రంజని, గాయత్రీల శిష్యురాలు!ఎన్నో చోట్ల కచేరీలు చేసింది... భగవంతుడికి భక్తిపూర్వకంగా నాలుగు రాగాలు ఆలాపించింది.అలాంటి స్ఫూర్తి రావు .. భజనచేస్తూ వీధుల వెంబడి భిక్షాటన చేస్తున్న ఓ కళాకారుడి గొంతు విని... వచ్చిన పని వదిలేసి ఆతడి వెంట పరుగులు పెట్టడం.. శ్రీ వాదిరాజ తీర్థ విరచిత కళాకృతి ‘ఒందు బారి’ పాటలో అడిగి మరీ గొంతు కలపడం... ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు వేగంగా చక్కర్లు కొడుతోంది!వారం రోజుల క్రితం... కర్ణాటకలోని ఉడుపి శ్రీకృష్ణ దేవస్థానం వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన పూర్తి వివరాలు స్ఫూర్తి రావు మాటల్లోనే...‘‘ఉడుపి శ్రీకృష్ణుడి దివ్య దర్శనమైంది. జీవితపు ఈ మలుపులో ఓ స్పష్టత, దారి చూపమని ఆ దేవదేవుడిని కోరుకుంటున్న (కన్నీళ్లు ఎంతకీ ఆగకున్నా...) వేళ... మిట్టమధ్యాహ్నపు ఎండల్లో మఠం వద్దనే వీధుల్లో ఓ దుకాణం నీడలో ఓ భజన వినిపించింది. అతడి గాత్రం అద్భుతంగా ఉంది. గొంతు నిండా భక్తి. ఆగలేకపోయా. వారి వద్దకు కాళ్లు వడివడిగా నడిచాయి. అబ్బురంగా వారి పాట వింటూ ఉన్నా. శ్రీ వాదిరాజ తీర్థ విరచిత ‘ఒందు బారి’ పాటను వారు పాడుతున్న తీరుకు అచ్చెరుపొందా. కలిసి పాడొచ్చా? అని అడిగి మరీ వారితో గొంతు కలిపా. (స్టార్‌హీరోను చూసి మురిసిపోయే ఫ్యాన్ లా ఉంది నా పరిస్థితి. పాటలోని పదం కమలే అంటూ తలూపారు.)ఈ అనుభవం నాకు లభించిన ఆశీర్వాదమే. నీ మనసేం చెబుతోందో దాన్నే పాటించమని ఆ దేవదేవుడే నాకు చెప్పినట్లు అయ్యింది. నీకు సంతోషాన్ని ఇచ్చేదాన్ని వదిలేయవద్దని చెబుతూ... సంగీతంతో వచ్చే ఆనందం ఎంత అందమైందో గుర్తు చేసినట్లు అయ్యింది. ఈ ఘటన నా ఆత్మపై శాశ్వతంగా ముద్రేసుకుపోతుంది. జీవితాంతం దీన్ని కృతజ్ఞతతో మోస్తా. అంతేకాదు.. ఆ కళాకారుడితో గొంతు కలిపిన తరువాత రోజంతా సంతోషంతో పళ్లికిలిస్తూనే ఉన్నా. అదే రోజు సాయంత్రం మణిపాల్‌లో మా కాలేజీ మ్యూజిక్ ట్రిప్ కూడా అంతే అందంగా ముగిసింది.ఈ ఘటన నా జ్ఞాపకాల్లో, గుండెలో శాశ్వతంగా రికార్డై పోయింది. కానీ.. మిత్రులు నా వెంట పరుగెత్తుకు వచ్చి ఏం జరుగుతోందో అన్న కుతూహలంతో అన్నింటినీ ఇలా కెమెరాలో బంధించినందుకు కృతజ్ఞురాలిని!!! View this post on Instagram A post shared by Spoorthi Rao (@spoorthirao_) -
ఆస్పత్రిలో ప్రసవ వేదనతో ఉండగా భూకంపం.. పాపం ఆ మహిళ..!
సరిగ్గా ప్రకృతి విపత్తుల నడుమే అనుకోని విత్కర పరిస్థితులు వస్తుంటాయి. ఓ పక్కా భూప్ప్రకంపనాలతో వణికిపోతున్న తరుణంలో.. ఓ నిండు చూలాలు నొప్పులు పడుతుంటే..దేవుడా..! ఏంటిదీ అనిపిస్తుంది. అక్కడ ప్రాణం పోసే వైద్యులు తమ ప్రాణాలు రక్షించుకోలేని స్థితిలో ఉండగా..మరోవైపు పేషెంట్ ప్రసవ వేదనతో అల్లాడుతుంటే..ఏం చేయాలో తోచని స్థితి అది. మనిషి మరచిపోతున్న మానవత్వపు విలువను గుర్తుచేసేందుకు దేవుడి పెట్టిన విపత్కర పరీక్ష ఏమో అనిపిస్తుంటుంది. అయితే ఇక్కడ మానవత్వమే గెలిచింది. థాయ్‌లాండ్, మయన్మార్లని శుక్రవారం రెండు భారీ భూకంపాలు ఘోరంగా అతలాకుతులం చేసిన సంగతి తెలిసిందే. ఈ పెను విపత్తులో ఇప్పటిదాకి వెయ్యిమందికి పైగా మృతి చెందారు. అయితే దారుణ భూవిలయంల నడుమ జరిగిన ఓ అనుహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. సరిగ్గా థాయ్‌లాండ్‌లో భూకంపం సంభవిస్తున్న తరుణంలో.. బ్యాంకాక్‌లోని ఓ ఆస్పత్రిని ఖాళీ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ విపత్కర సమయంలో పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళను కూడా స్ట్రెచర్‌పై బయటకు తీసుకొచ్చారు. అక్కడ సమీపంలోని పార్క్‌లోనే ఆస్పత్రి సిబ్బంది చుట్టుముట్టి మరీ డెలివరీ చేశారు. ఓ పక్క భూవిలయం మరోవైపు శిశు జననం చోటు చేసుకున్న అరుదైన ఘటన ఇది. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. భూకంపం సమయంలో ఓ శిశువు ఊపిరిపోసుకుందంటూ ఓ వీడియోని షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. భూప్రకంపన నేపథ్యంలో మయ కింగ్ చులాలాంగ్‌కార్న్ మెమోరియల్ హాస్పిటల్ రోగులను చర్లు, వీల్చైర్లతో దగ్గరలోని పార్కుకి తరలించారు. ఆ సమయంలోనే ప్రసవ నొప్పులతో బాధపడుతున్న మహిళను స్ట్రెచర్‌పై బయటకు తీసుకొచ్చి పార్క్‌లోనే డెలివిరీ చేశారు. ఆ పార్కులోనే మిగతా రోగులకు కూడా చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కాగా, మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఈ ఘటనలో సుమారు 694 మంది మరణించగా, వెయ్యిమందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పైగా ఇంకా 68 మంది ఆచూకి కానరాలేదని సమాచారం. ఏదీఏమైనా ఇలాంటి ఘటనలు చూస్తుంటే.. విపత్తుల సమయంలోనే మనలోని మంచి మనిషి బయటకు వస్తాడేమో అంతా ఒక్కటే అనే భావనతో మెలుగుతాం కాబోలు. Footage during the earthquake in #Bangkok a baby was born in the park 😭 Waht a story to tell ‘’ I was born during the earthquake ‘’ #แผ่นดินไหว #earthquake #myanmarearthquake #bangkokearthquake #ตึกถล่ม pic.twitter.com/7E0FdzfPEf— Miia 🩵 (@i30199) March 28, 2025 (చదవండి: వరాహరూపం..దైవ వరిష్టం..! 600 ఏళ్ల నాటి ఆది వరాహస్వామి ఆలయం..) -
వరాహరూపం..దైవ వరిష్టం..! 600 ఏళ్ల నాటి ఆలయం..
దశావతారాల్లో వరాహావతారం ప్రసిద్ధి గాంచింది. జలప్రళయంలో చిక్కుకున్న భూ మండలాన్ని ఆదిదేవుడు వరాహావతారమెత్తి రక్షించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. అలాంటి ఆదివరాహావతారం తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండల కేంద్రంలో ఉంది. ఆదిదేవునికి ఏటా శ్రావణ మాసంలో పుట్టిన రోజు, ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం, ఉగాది పండుగ పర్వదినం సందర్భంగా ఉత్సవ వేడుకలు, మాస కల్యాణాలు నిర్వహిస్తారు. 40 ఏళ్లుగా నిత్యపూజలు సుమారు 40 ఏళ్లుగా ఏటా స్వామివారికి భక్తులు నిత్యపూజలతోపాటు అభిõÙకాలు చేస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే ఆదిదేవుడు వరాహస్వామిగా భక్తులు కొలుస్తుంటారు. స్వామివారికి భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎంతోమంది ప్రముఖులు స్వామి దర్శనం కోసం వచ్చి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. పాదాలకు పూజలుగతంలో ఆలయం చుట్టూ డోజర్‌తో చదును చేస్తుండగా బండరాయిపై స్వామివారి పాదాలు దర్శనమిచ్చాయి. అప్పటినుంచి స్వామివారు నడిచి వచ్చిన పాదాలుగా భక్తులు పేర్కొంటున్నారు. ఇక్కడ కూడా భక్తులు పూజలు చేస్తుంటారు. గుడి లేని క్షేత్రంగా..కమాన్‌పూర్ గ్రామానికి తూర్పున ఒక బండరాయిపై ఆదివరాహస్వామి విగ్రహం ఉంది. స్వామివారు గుడి లేకుండా వరాహావతారంలో భక్తులకు దర్శనమిస్తారు. కోరిక నెరవేరేందుకు ముడుపులుస్వామివారి దర్శనం కోసం వచి్చన భక్తులు.. తమ కోరికలు నెరవేరాలని ముడుపులు కట్టి అన్నదానాలు చేయడం ఇక్కడ ప్రత్యేకం. ఆదివరాహస్వామి ఆలయంలో ఈనెల 30న ఉగాది పర్వదినం సందర్భంగా ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలా చేరుకోవాలికమాన్పూర్ మండల కేంద్రంలో కొలువుదీరిన ఆదివరాహస్వామి దేవాలయానికి వచ్చే భక్తులు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి మంథని, కాళేశ్వరం వెళ్లే ప్రధాన రహదారి కమాన్‌పూర్ ఎక్స్ రోడ్డు వద్ద బస్సు దిగాలి. అక్కడి నుంచి ఆటోలో నాలుగు కిలోమీటర్ల దూరంలో స్వామివారి దేవాలయానికి చేరుకోవాలి. (చదవండి: Ugadi Special Recipes: పూర్ణాలు, పరమాన్నం, మామిడికాయ పులిహోర చేసేయండిలా..!) -
50 వేల ఏళ్ల నాటి పిల్ల మమొత్..!
పిల్లలూ... ఇక్కడ మీరు టేబుల్ మీద చూస్తున్నది ఏమిటో తెలుసా? ఏనుగు. కాని ఏనుగు కాదు. పూర్వకాలపు ఏనుగు. ఐస్ఏజ్ కాలం నాటిది. ఇప్పటి ఏనుగులా కాక ఒంటి నించి రోమాలతో ఉండేది. దానిని ‘మమొత్’ అంటారు. డైనోసార్లలాగానే ఇది కూడా భారీ ఆకారంతో ఉండేది. దీనికి పెద్ద పెద్ద దంతాలు ఉండేవి. కాని డైనోసార్లలాగానే 4000 ఏళ్ల క్రితం మమొత్లు కూడా అంతరించి పోయాయి. దానికి కారణం ఏమిటో అంతుపట్టలేదు కాని ఏదైనా మహమ్మారి కావచ్చని శాస్త్రవేత్తల ఊహ. అయితే వీటి కళేబరాలు రష్యాలోని సైబీరియా మంచు ఎడారిలో దొరుకుతూనే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నది రష్యాలోని ‘ఎకుషియా’ అనే చోట మంచు పొరల కింద దొరికిన పిల్ల మమొత్ కళేబరం. ఇది పిల్ల ఏనుగే అయినా దీని బరువు 180 కిలోలు ఉంది. ఇది 50 వేల ఏళ్ల క్రితం నాటిదని శాస్త్రవేత్తలు నిర్థారించారు. ఆ కళేబరానికి ‘నెక్రోప్సీ’ చేస్తున్న ఫొటోలు ఇవి. మనిషి మృతదేహాన్ని కోసి పరీక్ష చేస్తే ‘అటాప్సీ’. జంతువులను కోసి పరీక్ష చేస్తే ‘నెక్రోప్సీ’. ఈ పరీక్షల వల్ల మమొత్లకు సంబంధించిన మరిన్ని జీవన రహస్యాలు తెలుస్తాయని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తుంటారు. (చదవండి: 'చిన్నారి జర్నలిస్టు'..! ఏకంగా యుద్ధాన్ని రిపోర్ట్ చేస్తూ..) -
'చిన్నారి జర్నలిస్టు'..! ఏకంగా యుద్ధాన్ని రిపోర్ట్ చేస్తూ..
జర్నలిస్టు అంటే ఎవరు? ప్రపంచానికి వార్తలు అందించేవాడు. ప్రజలకు కీడు చేసే విషయాలను తెలిపి చైతన్యపరిచేవాడు. ప్రభుత్వాల దుర్మార్గాలను ఎండగట్టేవాడు. రాజకీయ నేతలు తమ స్వార్థం కోసం చేసే యుద్ధాలలో ఎంత విధ్వంసం జరుగుతుందో చూపేవాడు. జర్నలిస్టులు కొందరు ఆఫీసులో కూచుని పని చేస్తే మరికొందరు ఫీల్డులో ఉంటారు. ఆ ఫీల్టు యుద్ధ క్షేత్రమైతే ప్రాణాలకే ప్రమాదం. అయినా సరే జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి పని చేస్తారు.ఇప్పుడు ఇజ్రాయిల్ గాజాపై యుద్ధదాడులు చేస్తోంది. ఇది టీవీల్లో మీరూ చూసి ఉంటారు. ఇజ్రాయిల్– గాజా మధ్య జరుగుతున్న ఈ యుద్ధం కారణంగా ఎన్నో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలో గాజాకు చెందిన 12 ఏళ్ల సుమయ్యా జర్నలిస్టు అవతారం ఎత్తింది. స్థానికంగా జరుగుతున్న అంశాల గురించి రిపోర్ట్ చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షించింది.‘షిరీన్ అబూ’ అనే మహిళా జర్నలిస్టు కొంతకాలంగా గాజాపై జరుగుతున్న దాడుల గురించి అల్ జజీరా అనే ఛానెల్లో రిపోర్టింగ్ చేస్తూ ఉండేది. అయితే ఆమె మరణించింది. క్షేత్రస్థాయిలో ఆమె చెప్పే వార్తలు వింటూ ఉన్న సుమయ్యాకు ఆమె మరణం తీరని బాధను మిగిల్చింది. ఆమె ఆపిన పనని తాను పూర్తి చేయాలని భావించింది. వెంటనే ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ముందుగా వారు భయపడ్డారు. అప్పటికే వందమంది దాకా జర్నలిస్టులు యుద్ధాన్ని రిపోర్ట్ చేస్తూ ప్రాణాలు వదిలారు. అంత అనుభవం ఉన్నవారికే అలా జరిగినప్పుడు తమ కూతురు యుద్ధరంగంలో ఏమవుతుందోనని వారు ఆందోళన చెందారు. అయితే సుమయ్యా వారికి ధైర్యం చెప్పింది. స్థానికంగా జరుగుతున్న విషయాలను ప్రపంచానికి చూపించడం తన బాధ్యత అని వారికి వివరించింది. వారి అనుమతితో జర్నలిస్టుగా మారింది. అల్ జజీరా ఛానెల్లో అతి చిన్న జర్నలిస్టుగా మారింది. గాజాపై జరుగుతున్న దాడులు, అక్కడి ప్రజల స్థితిగతుల్ని ప్రపంచానికి వివరించింది. ఏమాత్రం బెరుకు లేకుండా తను చెప్పే విషయాలు అందర్నీ ఆలోచింపజేశాయి. ప్రపంచంలో యుద్ధాలన్నీ ఆగిపోవాలని, అంతా శాంతి నెలకొనాలని అంటోంది. అదే తన లక్ష్యమని, అందుకే ఈ రంగంలోకి వచ్చానని వివరిస్తోంది. తన ధైర్యానికి, ఆలోచనలకీ అందరూ శెభాష్ అంటున్నారు. (చదవండి: పిల్లలు స్కూల్ నుంచి రాగానే.. వారికి ఏం నేర్పిస్తున్నారు?) -
పిల్లలు స్కూల్ నుంచి రాగానే..వారికి ఏం నేర్పిస్తున్నారు?
పిల్లలు జీవితంలో సక్సెస్ సాధించాలంటే.. వారికి చిన్న వయసులోనే మంచి విలువలు అందించాలి. బాల్యంలో నేర్పించిన విలువలు వారిని జీవితంలో ఉన్నత స్థానంలో నిలబెడతాయి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకు కచ్చితంగా నేర్పించాల్సిన అలవాట్లు కొన్ని ఉన్నాయి. వాటిని నేర్పిస్తే పిల్లలు పెద్దయ్యాక కూడా మంచి విలువలతో బతుకుతారు. ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుందాం.పిల్లలు స్కూల్ నుంచి రాగానే వారి బ్యాగుల్ని, వస్తువుల్ని చక్కగా సర్దుకునే అలవాటు నేర్పించాలి. చక్కగా సర్దుకోవడం నేర్చుకుంటే వారి వస్తువుల్ని ఎక్కడ పెట్టారో అన్న క్లారిటీ వారికి ఉంటుంది. మార్నింగ్ స్కూల్ వెళ్లే టైమ్‌లో హడావిడి పడుకుండా తమ వస్తువుల్ని సులభంగా కనుగొంటారు. అంతేకాకుండా వారి పనుల్ని స్వయంగా చేసుకోవడం అలవాటు చేసుకుంటారు. రేపు భవిష్యత్తులో దూర్రప్రాంతాలకు వెళ్లి అక్కడ ఉండాల్సినప్పుడు ఈ అలవాటు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే పిల్లలు స్కూల్ నుంచి రాగానే బ్యాగు, వారి వస్తువులను సరైన స్థలంలో పెట్టేలా వారికి నేర్పండి.కాళ్లు, చేతులు, ముఖం కడుక్కోవడం...పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో ముఖ్యం. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే చేతులు, ముఖం కడుక్కోవడం గురించి చెప్పండి. ఇది వారిని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా వ్యాధులను దూరంగా ఉంచుతుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వారి యూనిఫామ్ తీసివేయమని చెప్పండి. ఆ తర్వాత చేతులు, ముఖం వాష్ చేసుకోమని వారికి చెప్పండి. ఈ అలవాటు నేర్చుకోవడం వల్ల పరిశుభ్రత ఎంతో కీలకమని తెలుసుకుంటారు. ఈ అలవాటు వారిని భవిష్యత్తులో మంచి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతుంది.సమయాన్ని తెలివిగా ఉపయోగించడం...పిల్లలకు తమ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకునే అలవాటును నేర్పించండి. టైమ్ మేనేజ్మెంట్ స్కిల్ వారికి ఎంతగానో సాయపడుతుంది. సకాలంలో వారి పనులు చేసుకోవడం, ఆటలు ఆడుకోవడం, చదువు, హోం వర్క్ వంటి పనులు చేయడం నేర్పించండి. దానికి తగ్గ టైమ్ టేబుల్ వేసి దాని ఫాలో అయ్యేలా ప్లాన్ చేయండి. దీంతో.. వారు సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటారు.చదువు, హోం వర్క్...స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కాసేపు పిల్లల్ని ఆడుకోనివ్వండి. ఆటల తర్వాత స్నానం చేసేలా ప్రోత్సహించండి. ఆ తర్వాత హోం వర్క్, చదువుకు టైం కేటాయించేలా వారికి అలవాటు చేయండి. ఆటలతోపాటు చదువు ప్రాముఖ్యత వారికి తెలపండి. సబ్జెక్ట్‌ల్లో ఏమైనా డౌట్లు ఉంటే దగ్గరుండి హెల్ప్ చేయండి. హోం వర్క్ పెండింగ్ పెట్టకుండా పూర్తిగా ఫినిష్ చేసేలా ప్లాన్ చేయండి. ఈ అలవాటు వల్ల వారు చదువుల్లో మెరుగ్గా రాణిస్తారు. (చదవండి: వృథాని జీరో చేద్దాం..వేస్ట్‌ని రీయూజ్ చేసేద్దాం..! ది బెస్ట్‌గా..) -
ఉగాది రోజున నోరూరించే కమ్మని పిండివంటలు ఈజీగా చేసుకోండిలా..!
పూర్ణాలు..కావలసినవి: పచ్చిశనగ పప్పు – అర కేజీ, బెల్లం – అరకేజీ, యాలక్కాయలు – పది, బియ్యం – రెండు కప్పులు, పొట్టుతీసిన మినప గుళ్లు – కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, ఆయిల్ – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙ముందుగా మినప పప్పు, బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరుగంటల పాటు నానబెట్టుకోవాలి. శనగ పప్పుని కూడా కడిగి గంట పాటు నానబెట్టాలి ∙నానిన బియ్యం మినప పప్పులని మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి ∙నానిన శనగపప్పుని కుకర్‌లో వేసి రెండు గ్లాసులు నీళ్లు΄ోసి మూడు విజిల్స్ రానివ్వాలి ∙ఉడికిన శనగ పప్పులో బెల్లం వేసి మెత్తగా గరిటతో తిప్పుతూ దగ్గర పడేంత వరకు ఉడికించి, యాలుక్కాయల పొడి వేసి తిప్పి దించేయాలి ∙శనగపప్పు మిశ్రమం చల్లారాక, ఉండలుగా చుట్టుకోవాలి ∙బియ్యం, మినపగుళ్ల రుబ్బులో కొద్దిగా ఉప్పు వేసి తి΄్పాలి. ఇప్పుడు శనగ పప్పు ఉండలను ఈ పిండిలో ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి ∙మీడియం మంట మీద గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయిస్తే తియ్యని పూర్ణాలు రెడీ.పరమాన్నం..కావలసినవి: బియ్యం – అర కప్పు, పాలు – కప్పు, బెల్లం తురుము – ముప్పావు కప్పు, నెయ్యి – ముప్పావు కప్పు, జీడి పప్పు పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి – అర టీస్పూను, పచ్చకర్పూరం – చిటికెడు. తయారీ: ముందుగా బియ్యాన్ని కడిగి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో పాలుపోసి కాయాలి. కాగిన పాలల్లో నానబెట్టిన బియ్యం వేసి తిప్పుతూ ఉడికించాలి. అన్నం మెత్తగా ఉడికాక దించి చల్లారనివ్వాలి. స్టవ్ మీద మరో బాణలి పెట్టుకుని నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తరువాత జీడి పప్పు పలుకులు వేసి గోల్డ్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. స్టవ్ మీద మరో పాత్ర పెట్టి బెల్లం తురుము వేయాలి. దీనిలో పావుకప్పు నీళ్లుపోసి సిరప్‌లా మారేవరకు ఉడికించి, చల్లారనివ్వాలి. బెల్లం సిరప్‌లోనే యాలకుల పొడి, పచ్చ కర్పూరం వేసి తిప్పాలి. బెల్లం సిరప్ చల్లారక అన్నంలో వేసి బాగా కలపాలి, దీనిలో మిగిలిన నెయ్యి, జీడిపప్పుతో గార్నిష్ చేస్తే పరమాన్నం రెడీ.మామిడికాయ పులిహోరకావలసినవి: బియ్యం – కప్పు, పచ్చిమామిడి కాయ – మీడియం సైజుది ఒకటి, పచ్చికొబ్బరి తురుము – అర కప్పు, ఆవాలు – టీస్పూను, మినప పప్పు – టీస్పూను, పచ్చిశనగ పప్పు – టీ స్పూను, వేరుశనగ గుళ్ళు – రెండు టేబుల్ స్పూన్లు, కరివేపాకు – మూడు రెమ్మలు, పచ్చిమిర్చి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, ఎండు మిర్చి – నాలుగు, మెంతులు – పావు టీస్పూను, ఆయిల్ – నాలుగు టేబుల్ స్పూన్లు, పసుపు – పావు టీస్పూను, చింతపండు ఉసిరికాయంత, బెల్లం తురుము – రెండు టీస్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా. తయారీ: ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అన్నం పొడి పొడిగా వచ్చేలా వండి ఆరబెట్టుకోవాలి మామిడి కాయ తొక్క తీసి ముక్కలుగా తరగాలి. ఎండు మిర్చి, మెంతులు, అరటీస్పూను ఆవాలను దోరగా వేయించుకుని పొడిచేయాలి. ఈ పొడిలో పచ్చికొబ్బరి, మామిడికాయ ముక్కలు, చింతపండు, బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కనపెట్టుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు వేయాలి. చిటపటలాడాక మినప పప్పు, శనగ పప్పు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేయాలి ∙ఇవన్ని వేగాక వేరుశనగ గుళ్ళు వేసి వేయించాలి. ఇవి వేగాక పసుపు, గ్రైండ్ చేసిన మామిడికాయ మిశ్రమం వేసి ఐదు నిమిషాలు వేయించాలి ∙తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసి, ఆరబెట్టిన అన్నాన్ని వేసి కలిపితే మామిడికాయ పులిహోర రెడీ. (చదవండి: 6 రుచులు... 6 ఆరోగ్య లాభాలు) -
వృథాని జీరో చేసేలా..ది బెస్ట్‌గా రీయూజ్ చేద్దాం ఇలా.!
యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ... మార్చి నెల 30వ తేదీని జీరో వేస్ట్ డే గా గుర్తిస్తూ 2022, డిసెంబర్ 14వ తేదీన ఒక తీర్మానాన్ని చేసింది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అప్పటి నుంచి మార్చి నెల 30వ తేదీని ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ జీరో వేస్ట్’గా గుర్తిస్తూ ప్రపంచాన్ని చైతన్యవంతం చేస్తోంది. ఈ ఏడాది ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్ రంగాల వృథా మీద దృష్టి పెట్టింది. పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న వాయు, నీటి కాలుష్యాలతోపాటు వస్త్రాల అవశేషాలు కూడా ప్రధానమైనవి. క్లాత్‌తో డ్రస్ కుట్టిన తర్వాత వచ్చే మిగులు నదులు, కాలువల్లోకి చేరి నీటిలో, నీటి అడుగుల మట్టిలో నిలిచి΄ోతోంది. కొంతకాలానికి ఆ వస్త్రానికి అద్దిన రసాయన రంగులు నేలలో, నీటలో ఇంకుతాయి. ఇలా వేస్ట్ క్లాత్ కారణంగా కెమికల్ పొల్యూషన్ నీటిని, మట్టిని కూడా కలుషితం చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దుస్తుల తయారీ విపరీతంగా పెరిగిపోయింది. 2000 సంవత్సరంలో ఉత్పత్పి 2015నాటికి రెండింతలైంది. ఏడాదికి 92 మిలియన్ టన్నుల టెక్స్టైల్ వేస్ట్ లెక్క తేలుతోంది. ఇది కాలువలు, నదుల్లోకి వెళ్తోంది. దీనిని అరికట్టడం కోసమే యూఎన్ఓ (యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్) ఈ ఏడాది ఫ్యాషన్ ఇండస్ట్రీ వేస్ట్ మీద దృష్టి పెట్టింది. ఫ్యాషన్, టెక్స్టైల్ రంగాలను జీరో వేస్ట్ దిశగా నడిపించడానికి మార్గాలను అన్వేషించాలంటోంది యూఎన్ఓ. హైదరాబాద్‌లో ఫ్యాషన్ ఇండస్ట్రీ నిర్వహిస్తున్న సుదీప కందుల ట్రిపుల్ ఆర్ (రీ యూజ్, రీ సైకిల్, రీ పెయిర్) అనే యూఎన్ఓ థీమ్‌ను రెండు దశాబ్దాలుగా అమలు చేస్తున్నారు. మనసుంటే మార్గం ఉంటుంది!సుదీప కందుల... ఆలన బొటీక్ పేరుతో చిన్న పిల్లల దుస్తుల డిజైనింగ ప్రారంభించి మూడు దశాబ్దాలవుతోంది. ఫ్యాషన్ ఇండస్ట్రీలో బొటీక్ కల్చర్ మొదలైన తొలినాళ్ల నుంచి బొటీక్ నడుపుతున్నారామె. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని భావించే సుదీప, ఆమె ఉద్యోగులు పాలిథిన్ కవర్ల వినియోగాన్ని తగ్గించడానికి మార్కెట్కెళ్లేటప్పుడు క్లాత్ బ్యాగ్‌ను వెంట తీసుకువెళ్తారు. బొటీక్‌లో ఉత్పన్నమయ్యే వేస్ట్ క్లాత్‌ను పునర్వినియోగంలోకి తీసుకురావడానికి అనేక మార్గాలనెంచుకున్నారు సుదీప. చిన్న ముక్కలతో నవజాత శిశువులకు, ఏడాది లోపు పిల్లలు ధరించడానికి వీలుగా కుట్టించి ఆర్ఫనేజ్‌కు ఇచ్చారు. అలా కుదరని వాటిని నగరంలోని ఒక ఎన్జీవోకి ఇస్తుంటారు. ఆ ఎన్జీవోలో అల్పాదాయ వర్గాల మహిళలకు ఆ క్లాత్‌తో చిన్న చిన్న పోట్లీ బ్యాగ్‌లు, పర్సులు తయారు చేసుకుంటారు. అలా కూడా పనికి రాని సన్నగా పొడవుగా రిబ్బన్ ముక్కల్లాంటి క్లాత్‌ని ఒక స్కూల్‌కి ఇస్తే వాళ్లు పిల్లల చేత డోర్‌మ్యాట్ మేకింగ్ వంటి క్రాఫ్ట్ ప్రాక్టీస్‌కి ఉపయోగిస్తున్నారు. ఇక ఎందుకూ పనికిరావనిపించే ముక్కలను ఒక కవర్లో జమ చేసి ఆ బొటీక్‌లో పని చేసే వాళ్లు దిండులో స్టఫింగ్‌గా నింపుకుంటారు. వ్యర్థాన్ని అర్థవంతంగా మారుస్తున్న సుదీప తన బొటీక్‌లో చిన్న ముక్క కూడా నేలపాలు కాకుండా ప్రయత్నం చేస్తున్నారు.ఉత్పత్తి– కొనుగోలు పెరిగాయిమనం కొంతకాలం వాడి ఇక పనికిరావని పారేస్తున్న వస్తువులు నిజానికి పనికిరానివి కాదు, వాటిని మరొక రకంగా మలుచుకుని ఉపయోగించుకోవడం మనకు చేతకాక΄ోవడమే. రీ యూజ్ చేయడం నేర్చుకోవాలి. నాచురల్ ఫైబర్‌తో వస్త్రాలు తయారుచేసినన్ని రోజులు వస్త్ర పరిశ్రమ, అనుబంధ పరిశ్రమల వ్యర్థాల గురించి మాట్లాడాల్సిన అవసరం రాలేదు. మ్యాన్‌మేడ్ ఫైబర్ ప్రవేశించిన తర్వాత ఎదురవుతున్న సమస్యలివన్నీ. నిజానికి వ్యర్థాల ఉత్పత్తి మనదేశంలోకంటే యూఎస్, యూరప్‌దేశాల్లో చాలా ఎక్కువ. అవసరానికి మించి ఉత్పత్తి చేయడం, అవసరానికి మించి కొనడం రెండూ పెరిగాయి.షాపింగ్ వ్యసనంఈ తరానికి షాపింగ్ ఒక వ్యసనంగా మారింది. యూఎస్, యూరప్‌ల నుంచి వాడిన దుస్తులు మూడవ ప్రపంచదేశాలకు డంప్ అవుతున్నాయి. అరేబియా షిప్పుల్లో గుజరాత్ తీరం నుంచి దేశంలోకి వస్తుంటాయవి. మన దగ్గర తయారయ్యే పాలియెస్టర్ వస్త్రాలకు తోడు ఆయాఖండాల నుంచి వచ్చిపడుతున్న దుస్తులు కూడా కలిసి డంప్ పెరిగిపోతోంది. పాలియెస్టర్ వస్త్రాలను ఫైబర్‌గా మార్చి కొత్త దుస్తులు తయారు చేసే క్రమంలో విడుదలయ్యే వ్యర్థాలు సముద్రాల్లోకి చేరి మైక్రోప్లాస్టిక్‌గా మారి తిరిగి మన మీదనే దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే పారేస్తున్న దుస్తులతో కాలువలు నిండిపోతున్నాయి.– డాక్టర్ దొంతి నరసింహారెడ్డి, పర్యావరణ నిపుణులు జీరో వేస్ట్‌తో ద బెస్ట్ప్లాస్టిక్, ఆహార వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ పరికరాల వేస్ట్‌తో ఏటా ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కోట్ల టన్నుల చెత్త జమవుతోంది. ఇది పెరుగుతూ భూగ్రహాన్ని ముంచేసినా ఆశ్చర్యం లేదు. ఈ ప్రమాదాన్ని మన దేశంలో ముందుగా గ్రహించి అప్రమత్తమైన పప్రాంతం ఢిల్లీ, మాల్వీయ నగర్‌లోని నవజీవన్ విహార్ రెసిడెన్షియల్ సొసైటీ. రీయూజ్, రీసైకిల్ను ఫాలో అవుతూ జీరో వేస్ట్‌తో పర్యావరణప్రియమైన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది.దాదాపు ఏడేళ్ల కిందట... ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ మాల్వీయనగర్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ఒక వర్క్‌షాప్ నిర్వహించింది. అందులో పాల్గొన్న నవజీవన్ విహార్ రెసిడెన్షియల్ సొసైటీ సభ్యులు ఆ వర్క్‌షాప్‌లో చెప్పినవి, చూపించినవి తమ కాలనీలో అమలు చేయడం మొదలుపెట్టారు. అక్కడ 250 ఇళ్లున్నాయి. ఉదయాన్నే ఇంటింటికి వెళ్లి తడి చెత్త, పొడి చెత్తను ఎలా వేరుచేయాలో వివరించి, కొన్నాళ్లపాటు పర్యవేక్షించారు సొసైటీ సెక్రటరీ, కంటివైద్యులు డాక్టర్ రూబీ మఖీజా. తతిమా సభ్యుల సహాయసహకారాలతో తడిచెత్తతో కాలనీలోనే కంపోస్ట్ తయారుచేయడం మొదలుపెట్టారు. ఆ ఎరువుతో కిచెన్, బాల్కనీ, రూఫ్ గార్డెన్స్‌ను ప్రోత్సహించారు. ఒక షెడ్డు లాంటిదీ ఏర్పాటు చేశారు.. ఇళ్లల్లో పాతపుస్తకాలు, దుస్తులు, ఆటబొమ్మలు, ఉపయోగంలో లేని వస్తువుల కోసం. ఆ కాలనీలో ఎవరికైనా ఏ వస్తువైనా అవసరం ఉంటే ముందు ఈ షెడ్డుకొచ్చి చూసి, అందులో తమకు కావలసింది లేకపోతేనే కొత్తది కొనుక్కోవాలి. అలా కాలనీ వాసులు తీసుకున్నవి పోనూ మిగిలినవి స్వచ్ఛంద సంస్థలకు ఇస్తారు అవసరమైన వాళ్లకు పంచేందుకు! ఈ కాలనీలో ప్లాస్టిక్ బ్యాన్. గుడ్డ సంచులనే వాడుతారు. నీటి వృథా, ఆదానూ సమర్థవంతంగా నిర్వహించుకుంటున్నారు. పిల్లలకు పర్యావరణం పట్ల అవగాహన కలిగించడానికి వారానికోసారి క్యాంప్ పెడతారు. అందులో పిల్లలను ఆడిస్తూ, పాడిస్తూ వాళ్లు ఎలక్ట్రానిక్ పరికరాలకు బానిసలు కాకుండా జాగ్రత్తపడుతున్నారు. వీళ్లో బ్రాడ్కాస్ట్ సిస్టమ్‌నూ ఏర్పాటు చేసుకున్నారు. ప్రతిరోజూ కాలనీలో జరిగే పర్యావరణపరిరక్షణ కార్యక్రమాలను వీడియోలుగా తీసి వాటిని సాయంకాలం ప్రసారం చేస్తారు. ఈ ప్రయత్నాలతో జీరో వేస్ట్‌లో దేశానికే స్ఫూర్తిగా నిలిచింది నవజీవన్ విహార్. (చదవండి: 'తోలుబొమ్మలాట'ను సజీవంగా ఉండేలా చేసిందామె..! ఏకంగా రాజధానిలో..) -
ఎండ నుంచి చర్మానికి రక్షణగా...
అందంగా కనబడాలని అందరూ కోరుకుంటారు. అయితే ప్రస్తుతం భానుడు భగభగలతో చర్మానికి రక్షణ లేకుండా పోతోంది. గడప దాటిన వెంటనే వేడి, ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితులు. వివిధ పనులపై బయటకు వెళ్లే వారు ఈ సమయంలో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడంపై తప్పనిసరిగా దృష్టిపెట్టాల్సిన పరిస్థితి. ప్రధానంగా ముఖం, చేతులు సూర్య కిరణాలు నేరుగా తగిలే ఇతర ప్రదేశాల్లో చర్మం నిర్జీవంగా మారిపోతోంది. దీంతో చర్మ కాంతి తగ్గిపోతుంది. ఈ పరిస్థితులను అధిగమించాలంటే కొన్ని చిట్కాలు పాటించక తప్పదంటున్నారు సౌందర్య నిపుణులు. వేసవిలో చర్మానికి చెమటలు పట్టడం, జిడ్డుగా మారడం, పొడిబారిపోవడం, నల్లని మచ్చలు రావడం, ముఖంపై మొటిమలు, ఇలా ఇబ్బంది పెట్టే సమస్యలెన్నో ఉత్పన్నమవుతాయి. వీటన్నింటి నుంచి విముక్తి పొందడానికి చాలామంది వారికి తెలిసిన వివిధ రకాల చిట్కాలు పాటిస్తున్నారు. అయితే చర్మ సౌందర్యం దెబ్బతినడానికి మృత కణాలు కూడా ఒక కారణం. అయితే వీటి వల్ల చర్మం నిగారింపు కోల్పోతుంది. చెమట గ్రంథుల్ని మూసివేడయం వల్ల మొటిమలు, మచ్చలు వంటివి ఏర్పడతాయి. వీటి నుంచి అధిగమించాలంటే ఈ చిక్కాలు పాటించాల్సిందే.. సన్ స్క్రీన్‌తో మేలు.. సూర్యకిరణాల నుంచి విడుదలయ్యే అధిక యూవీ ఎక్స్పోజర్ చర్మానికి హాని కలిగిస్తుంది. ఫలితంగా చర్మం ముడతలు పడటం, వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో సూర్యకిరణాలు తాకే ప్రదేశాల్లో సన్ స్క్రీన్ అప్లై చేయడం మంచిది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు, సిట్రస్ యాసిడ్, యాంటీ బ్యాక్టీరియల్ మొటిమలు, మచ్చలను నియంత్రించి చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. ముఖం మృదువుగా చేస్తుంది.పళ్లు , పళ్ల రసాలు తీసుకోవడం మంచిది.. వేసవి తాపానికి శరీరం తేమ కోల్పోతుంది. ఫలితంగా చర్మం ఎరగ్రా కందిపోతోంది. ఇటువంటి పరిస్థితుల్లో పళ్లు, పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మానికి అవసరమైన విటమిన్లతో పాటు, శరీరానికి అవసరమైన నీటి స్థాయిలను పునరుద్ధరిస్తాయి. చర్మం కాంతిమంతంగా మెరుస్తుంది. నిమ్మ, జామ, స్ట్రాబెర్రీ, దానిమ్మ, వాటర్ మెలాన్, బ్లూబెర్రీ, కివీ, యాపిల్ వంటి పండ్లు తీసుకోవడం మంచిది. జామపండులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సీ ఎండ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.మేకప్ తక్కువగా వేసుకోవాలి.. సూర్య కిరణాల నుంచి వెలువడే యూవీ ఎక్స్పోజర్ చర్మానికి హానికలిగిస్తుంది. దీనిని నుంచి రక్షణ కోసం ఎస్పీఎఫ్ 50 ఉన్న యూవీ స్పెక్ట్రమ్ సన్ బ్లాక్, సన్ స్క్రీన్ ఉపయోగించాలి. కాలంతో సంబంధం లేకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సి వస్తే సన్‌్రస్కీన్ లోషన్ రాసుకోవాలి. వేసవిలో ఇది మరింత అవసరం. ఇంటికి చేరుకున్న తర్వాత చల్లటి నీటితో ముఖం కడగడం, స్నానం చేయడం వంటి జాగ్రత్తలు పాటించాలి. ఎండ తీవ్రతకు చర్మం పొడిబారిపోకుండా తేమగా ఉండటానికి నిపుణుల సూచనల మేరకు మాయిశ్చరైజర్లు అప్లై చేసుకోవాలి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఎండలో తిరగకుండా ఉండేందుకు ప్రయతి్నంచాలి. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు రావాల్సి వస్తే ఎండ నుంచి ఉపశమనం కోసం బ్లాక్ గాగుల్స్, ఎండ తగలకుండా స్కార్్ఫ్స, గొడుగు వెంట తీసుకెళ్లడం మంచిది. వేసుకునే దుస్తులు కాటన్ మెటీరియల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. లూజుగా ఉన్న కాటన్ బట్టలు ధరించాలి. – ఆలపాటి శిరీష, కాస్మటాలజిస్టు, సికారా క్లినిక్స్, బంజారాహిల్స్ -
6 రుచులు... 6 ఆరోగ్య లాభాలు
ఉగాది పచ్చడిని సేవించే ఆచారం శాలివాహన శకారంభం నుంచి మొదలైనట్లుగా చరిత్రకారులు చెబుతారు. సంప్రదాయ పద్ధతిలో ఉగాది పచ్చడిని కొత్త మట్టికుండలోతయారు చేస్తారు. ఉగాది పచ్చడిలో వేపపూత, మామిడి పిందెలు, చింతపండు, ఉప్పు, మిరియాల పొడి, బెల్లం, అరటిపండు ముక్కలు ఉపయోగిస్తారు. వీటి వల్ల ఉగాది పచ్చడి ఆరురుచుల సమ్మేళనంగా తయారవుతుంది. ఉగాది పచ్చడిలో ఉపయోగించే పదార్థాలు, వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం....బెల్లం, అరటి పండ్లు– తీపిబెల్లం తీపిగా ఉంటుంది. ఎండ వేడిమి వల్ల కలిగే అలసటను పోగొట్టి, తక్షణ శక్తినిస్తుంది. బెల్లాన్ని అరటిపండుతో కలిపి తీసుకోవడం శ్రేష్ఠమని ఆయుర్వేదం చెబుతోంది. అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలను అరటిపండు నిరోధిస్తుంది.చింతపండు– పులుపుఉగాది పచ్చడి తయారీకి పాత చింతపండు ఉపయోగించడం మంచిది. పాత చింతపండు ఉష్ణాన్ని, వాత దోషాలను తగ్గిస్తుంది. బడలికను పోగొడుతుంది. జఠరశక్తిని పెంచుతుంది. మూత్రవిసర్జన సజావుగా సాగేందుకు దోహదపడుతుంది. వేసవిలో చింతపండు రసం తీసుకోవడం వల్ల ఉష్ణదోషాలు తగ్గుతాయని ఆయుర్వేదం చెబుతోంది.ఉప్పురుచులకు రారాజులాంటిది ఉప్పు. ఉప్పులేని పప్పులు, కూరలు, పచ్చళ్లు రుచించవు. ఆహారంలో అనునిత్యం ఉపయోగించే ఉప్పు త్రిదోషాలను– అంటే, వాత పిత్త కఫ దోషాలు మూడింటినీ పోగొడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. అయితే, ఉప్పును మోతాదులోనే వాడాలి.మామిడి పిందెలు– వగరుమామిడి కాయలు ముదిరితే పులుపుగా ఉంటాయి గాని, పిందెలు వగరుగా ఉంటాయి. మామిడి పిందెల వగరుదనం లేకుంటే, ఉగాది పచ్చడికి పరిపూర్ణత రాదు. మామిడి పిందెలలో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. మామిడి పిందెలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలోని త్రిదోషాలను హరించి, శక్తిని కలిగిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.వేపపూలు– చేదువసంతారంభంలో వేపపూలను తినే ఆచారం దాదాపు అన్నిప్రాంతాల్లోనూ ఉంది. దీనిని ‘నింబకుసుమ భక్షణం’ అంటారు. షడ్రసోపేతమైన ఉగాది పచ్చడిలో వేపపూలను ఉపయోగించడం మన తెలుగువాళ్లకే చెల్లింది. వేపపూలు కఫదోషాన్ని, క్రిమిదోషాలను పోగొడతాయి. జీర్ణకోశ సమస్యలను నివారిస్తాయి.మిరియాల పొడి–కారంమిరియాలను నేరుగాను, పొడిగాను వంటకాల్లో తరచుగా వినియోగిస్తూనే ఉంటాం. మిరియాలు రుచికి కారంగా ఉన్నా, శరీరానికి చాలా మేలు చేస్తాయి. మిరియాలు కఫదోషాన్ని, విష దోషాలను హరిస్తాయి. చర్మవ్యాధులను అరికట్టడమే కాకుండా, జీర్ణశక్తిని, శరీరంలోని జీవక్రియలను పెంచుతాయి. అందుకే సంప్రదాయ ఆయుర్వేద ఔషధాల్లో మిరియాలను విరివిగా ఉపయోగిస్తారు. -
కొత్త తరానికి చెబుదాం
తెలుగువారి తొలి పండగ వచ్చేస్తోంది. నూతనోత్సాహంతో ఉగాదిని ఆహ్వానించడానికి సిద్ధమవుతున్న వేళ... కొత్త తరానికి పండగల అర్థం తెలుస్తోందా? అంటే... ‘పెద్దవాళ్లు చెబితేనే తెలుస్తుంది’ అంటున్నారు ప్రముఖ రచయితలు రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్. ఉగాది ప్రత్యేకంగా ఇంకా ఈ ఇద్దరూ చెప్పిన విశేషాలు తెలుసుకుందాం.పండగలు జరుపుకోవడం ఎవరూ మానేయలేదు. పిండివంటలు చేసుకోవడానికైనా పండగలు చేసుకుంటున్నాం. పండగ పూట తల స్నానం చేసి, ఉగాది పచ్చడి తిన్న తర్వాతే మిగతా పనులు చేయాలని పిల్లలకు పెద్దలు చెప్పాలి. ఎప్పటికప్పుడు కొత్త తరానికి పాత తరంవాళ్లు చెబుతుండాలి. ఎందుకంటే పండగలన్నీ ముందు తరంవాళ్లు చేసుకుంటూ వచ్చారు కాబట్టి చెప్పడం వారి బాధ్యత. కొత్త తరాన్ని పాజిటివ్‌గా స్వాగతించాలి. వారూ వెల్‌కమింగ్‌గానే ఉంటారు. మన తానులో పెరిగిన ముక్కలు వేరేలా ఎలా ఉంటారు? కొత్త తరానికి పద్ధతులన్నీ కొత్తే. పోనీ ఇవాళ్టి పాత తరం అనుకున్నవారికి ఎవరు చెప్పారు? వారి ముందు తరంవారు చెబితేనే కదా వీరికి తెలిసింది. ఇది రిలే పందెంలాంటిది. ఒక తరానికి ఒక తరానికి సక్రమంగా విషయాలను అందజేయాల్సిన బాధ్యత ముందు తరానికి ఉంటుంది. యువతని నిందించడం సరికాదు: ప్రపంచాన్ని రెండు రకాలుగా చూడొచ్చు. మంచి కోణంలో... దుర్గార్మపు కోణంలో... ఎప్పుడూ మొదటి కోణంలో చూస్తే మంచిది. అది కాదనుకుని యువత పెడదారి పట్టిందని, ఏదేదో జరిగిపోతోందని యువతరాన్ని నిందించడం సరికాదు. ఏదీ వక్రీకరించిన కోణంలో చూడొద్దు. ఫారిన్ కల్చర్ అంటున్నాం... విదేశాలు వెళ్లి చూస్తే ఇక్కడికన్నా ఎక్కువ అక్కడ పండగలు బాగా జరుపుకుంటున్నారు. అన్నమాచార్యుల కీర్తనలు కూడా పాడుతున్నారు. ఇక్కడితో పోల్చితే అమెరికా ఫాస్ట్ ఫార్వార్డ్ అనుకోవాలి కదా. కానీ అక్కడ మన సంప్రదాయాలు బతికే ఉన్నాయి. ఇక ఎప్ప టికీ ఇండియా రామని తెలిసిన కుటుంబాలు కూడా తమ పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నారు... మన సంప్రదాయాల గురించి చెబుతున్నారు. పిల్లలూ నేర్చుకుంటున్నారు. యువతరం బాధ్యతగా ఉంటోంది: సారవంతమైన నేల అది (యువతరాన్ని ఉద్దేశించి). బీజం వేయడం అనేది మన చేతుల్లో ఉంది. ముందు తరం బాధ్యతగా ఉండి, తర్వాతి తరానికి దగ్గరుండి అన్నీ నేర్పించి, అన్నీ ఆచరించేలా చేయాలి. వీళ్లు పాటిస్తూ వాళ్లు పాటించేలా చేయాలి. పొద్దున్నే వీళ్లు స్నానం చేయకుండా... పిల్లలను స్నానం చేసి, పూజలు చేయమంటే ఎందుకు చేస్తారు? నువ్వు చేయడంలేదు కదా? అంటారు. ఒకవేళ మాటల రూపంలో చెప్పకపోయినా... ముందు తరం ఆచారాలు పాటిస్తుంటే వీళ్లు చూసి, నేర్చుకుంటారు... అనుసరించడానికి ఇష్టపడతారు. బోధించే విధానం సక్రమంగా ఉండాలి. ఫైనల్‌గా చెప్పేదేంటంటే... మనం అనుకున్నంతగా యువతరం ఏమీ దిగజారిపోలేదు. చెప్పాలంటే మనకన్నా ఇంకా బాధ్యతగా ఉంటూ, పాతా కొత్తా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతున్నారు. ఈ కాలపు పిల్లలు ఇంటికీ, బయటికీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తెలిసినవాళ్లు. వాళ్లలో ఏదైనా లోపం ఉందీ అంటే... చెప్పేవాళ్లదే కానీ వాళ్లది కాదు. సో... ఏ పండగని ఎందుకు జరుపుకోవాలో విడమర్చి యువతరానికి చెప్పాల్సిన బాధ్యత ముందు తరానిదే. సంవత్సరాది ఎందుకు జరుపుకుంటున్నాం? ఉగాది పచ్చడి విశిష్టత వంటివి చెప్పి, పండగ అర్థం తెలియజేయాలి.పండగ‘రుచి’చూపాలి– అనంత శ్రీరామ్పండగలు జరుపుకునే తీరు మారింది. పెళ్లిళ్లల్లో ఎప్పుడైతే మనకు లేని రిసెప్షన్ అని మొదలుపెట్టామో అలానే పండగలు జరుపుకునే తీరులోనూ మార్పు వచ్చింది. ఉగాది గురించి చెప్పాలంటే... మా ఊరులో ఐదు రోజులు ఉగాది జాతర జరుగుతుంది. మాది వెస్ట్ గోదావరి, యలమంచిలి మండలం, దొడ్డిపట్ల గ్రామం. జాతర సందర్భంగా ఊరేగింపులు అవీ చేస్తుంటారు. ఇప్పుడూ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు జాతరలో భాగంగా మేజిక్ షోస్ అంటూ వెస్ట్రన్ కల్చర్ మిక్స్ అయిపోయింది. ఉగాది అంటే కవి సమ్మేళనాలు విరివిగా జరిగేవి. ఇప్పుడలా లేదు. ఎవరైనా విద్యావంతులు లేదా శాంతి సమాఖ్యలు వాళ్లు ఏదో టౌన్ హాలులో కవి సమ్మేళనాలు ఏర్పాటు చేసినా ఓ ఇరవై ముప్పైమంది ఉంటున్నారు... అంతే. ఉగాది ప్రత్యేకం అమ్మవారి జాతర: ఇక మా ఊరి ఉగాది గురించి చెప్పాలంటే... మాణిక్యాలమ్మ మా గ్రామ దేవత. ఉగాది సమయంలో మాకు ఆ అమ్మవారి జాతర ఉంటుంది. ఉగాది ప్రత్యేకం అంటే ఆ జాతరే. ఐదు రోజులు ఘనంగా చేస్తారు. ఐదో రోజు అయితే అమ్మవారిని బాగా అలంకరించి, ఊరేగించి, తెప్పోత్సవం చేస్తారు. నేను ప్రతి ఏడాది దాదాపు మిస్ కాకుండా వెళతాను. ఈసారి కుదరదు. ఆరు రుచులను సమానంగా ఆస్వాదించాలి: ఉగాది పచ్చడిలోని షడ్రుచుల గురించి చెప్పాలంటే... నేను ‘ఒక్కడున్నాడు’ సినిమాలో ‘ఇవ్వాళ నా పిలుపు... ఇవ్వాలి నీకు గెలుపు... సంవత్సరం వరకు ఓ లోకమా...’ అని పాట రాశాను. అది పల్లవి. పాట మొదటి చరణంలో రుచుల గురించి రాశాను. ‘కొంచెం తీపి... కొంచెం పులుపు పంచే ఆ ఉల్లాసమూ... కొంచెం ఉప్పు... కొంచెం కారం పెంచే ఆ ఆవేశమూ... చేదూ వగరూ చేసే మేలూ... సమానంగా ఆస్వాదించమని ఇవ్వాళ నా పిలుపు’ అని రాశాను. ఆరు విభిన్నమైన రుచులను సమానంగా ఆస్వాదిస్తేనే జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలమని చెప్పడమే ఆ పాట ఉద్దేశం. అంటే... జీవితంలో ఎదురయ్యే పరిస్థితులన్నింటినీ సమానంగా స్వీకరించగలగాలి.ఆ బాధ్యత పెద్దవాళ్లదే: ఇక నేటి తరం గురించి చెప్పాలంటే... ఇప్పుడు కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలతో హాలోవెన్ అంటూ రకరకాల వేషాలు వేయిస్తున్నారు. వేలంటైన్స్ డే అనీ ఇంకా వేరే ఎక్కడెక్కడనుంచో తెచ్చిపెట్టుకున్న పండగలను జరుపుతున్నారు. అయితే పిల్లలకు మన పండగల గురించి చెప్పాలి. వేరే సంబరాలు ఎలా ఉన్నా కూడా మన పండగలకు ఎక్కువప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా పాత తరం ఆచరిస్తే కొత్త తరానికి అర్థం అవుతుంది. వాళ్లు మన సంస్కృతీ సంప్రదాయాలను ముందుకు తీసుకెళతారు. మా గ్రామంలో ఉగాది అంటే... ఇంట్లో పిల్లలకు వేప పూత, మామిడికాయలు, చెరుకు గడలు తెమ్మని టాస్కులు ఇచ్చేవారు. అవి తెచ్చే క్రమంలో మాకు పండగలు అర్థమయ్యేవి. అలా మా ముందు తరంవాళ్లు మాకు నేర్పించారు. కొత్త తరానికి మనం అలా నేర్పిస్తే వాళ్లు పాటిస్తారు. ముందు తరాలకు సంస్కృతీ సంప్రదాయాలను నేర్పించే బాధ్యత పెద్దవాళ్లదే.– డి.జి. భవాని -
'తోలుబొమ్మలాట'ను సజీవంగా ఉండేలా చేసిందామె..! ఏకంగా రాజధానిలో..
పూర్వకాలంలో పౌరాణిక కథలను ఇలా తోలుబొమ్మలాటలతోనే చెప్పేవారు. అప్పట్లో టీవీలు, రేడియోలు అందుబాటులో లేని కాలంలో ఇవి ఎక్కువగా ఉండేవి. ప్రస్తుత తరానికి మన టీవీల పుణ్యమా అని పంచతంత్ర వంటి ధారావాహికల కారణంగా వాటి గురించి తెలుసుకుంటున్నారు. చెప్పాలంటే చిన్నారులు ఇష్టంగా చూసే కార్టూన్ ఛానెల్స్ మాదిరిగా ఆ రోజుల్లో తోలుబొమ్మలాటలుండేవి. ఇప్పుడు కృత్రిమ మేథాదే హవా అనుకోకండి. ఎందుకంటే ఇప్పడు పాతదిగా అనిపించినా ఒకప్పుడది కొత్తది. దీనిక ప్రస్తుతం ఆదరణ పెరుగి ట్రెండ్‌గా మారుతోంది. స్కూల్క్, కోన్ని కల్చరల్ కార్యక్రమాలు జరిగే చోట ఈ కళా ప్రదర్శనకు అవకాశం ఇస్తున్నారంటే మన పూర్వకాలంనాటి కళలకు ప్రాముఖ్యత ఉందనే కదా అంటుంటారు అనురూప రాయ్. ఆమె వలనే ఈకళ సజీవంగా ఉందని చెప్పొచ్చు. ఎవరామె..? ఆమె ఎలా ఈ రంగంలోకి వచ్చింది తదితరాల గురించి తెలుసుకుందామా..!.ఢిల్లీకి చెందిన అనురూప రాయ్ ఆరేళ్ల వయసు నుంచే ఈ తోలుబొమ్మలాట అంటే మహాఇష్టం. ఆ ఇష్టంతోనే ఆ తోలుబొమ్మలను కొనుక్కుని మరీ జాగ్రత్తగా చూసుకునేది. ఆ ఇష్టం ఆమె వయసుతోపాటు పెరిగిందే గానీ తగ్గలేదు. ఒకప్పుడూ 80లలో బాగా ట్రెండ్‌గా ఉండే ఈ తోలుబొమ్మలాటని సజీవంగా ఉంచాలని ఆరాటపడింది. విద్యాపరంగా ఇలాంటి తోలుబొమ్మల కళారంగం ఎంచుకుంటావా అని విమర్శలు వచ్చినా ధైర్యంగా ఈ రంగంలోకి అడుగుపెట్టిందామె. అందరూ ఫిల్మ్ స్కూల్స్‌లో జాయిన్ అయితే అనురూప తోలుబొమ్మలాటకు సంబంధించిన కళారంగ సంస్థల్లో జాయిన్ అయ్యింది. అలా ఆ రంగం గురించి కూలంకషంగా నేర్చుకుని ఆ విద్యకే కాదు ఆ కళకే ప్రాణం పోసిందామె. ఆ కళను సజీవంగా ఉంచేలా "కథక్కథ పప్పెట్ ఆర్ట్స్ ట్రస్ట్"ని స్థాపించి కళాకారులను ఒక వద్దకు తీసుకొచ్చి ప్రదర్శనలిస్తున్నారామె. ఈ ప్రదర్శనకు మొదటి విమర్శకులు పిలలేలని అంటారామె. ఎందుకంటే కథ నచ్చకపోతే మధ్యలోంచి వెళ్లిపోతారు కాబట్టి నచ్చేలా చక్కటి కథనే ఎంచుకుని ప్రదర్శనలిస్తామన్నారు. ఈ ట్రస్ట్ ప్రదర్శనలు ఇవ్వని విరామ సమయాల్లో ప్రదర్శనకు సంబంధించిన పరిశోధనతో పాటు, ప్రేక్షకులను పెంచుకోవడం వంటి వాటిపై దృష్టిసారిస్తారు. అలాగే పండుగలు, సమావేశాలకు వెళ్లడం, సమాజం వెలుపల ఉన్న వ్యక్తులతో మాట్లాడి ప్రేక్షకాదరణ పొందేలా ప్రయత్నాలు చేయడం వంటివి చేస్తారని చెప్పారు అనురూప.ఈ ట్రస్ట్‌కి అంతర్జాతీయ ఉత్సవాలు, గ్యాలరీలు, మ్యూజియంల ప్రదర్శనల ద్వారా నిధులు ఉత్పత్తి అవుతాయి. వారి స్టూడియో ఢిల్లీలోని బాదర్పూర్ సరిహద్దులో ఉంది. ఇది నగరానికి, ఒక గ్రామానికి మధ్య ఉంటుంది. అందుకే అనురూప కిటికీలు తెరిచి తమ ప్రదర్శన కోసం రిహార్సల్ చేస్తుంటారట. కనీసం అలా అయినా గ్రామంలోని పిల్లలకు అదేంటో తెలుసుకునే వీలు ఉంటుందనే చిన్న ఆశ అంటారామె.కథలకే కాదు అలా కూడా..ఈ తోలు బొమ్మలాట అనగానే కేవలం పంచతంత్ర వంటి కథలనే కాదు. సామాజిక అవగాహన కార్యక్రమాలు కూడా ప్రదర్శిస్తారట. అలా ప్రజలకు ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి పనులు, సామాజిక సేవ గురించి ప్రజలకు తెలియజేస్తుంది. అంతేగాదు ఇటీవల అనురూప తన బృందంతో మధ్యప్రదేశ్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో రుతు కార్యక్రమంపై అవగాహన కల్పించే అద్భుత ప్రదర్శన ఇచ్చింది. తోలుబొమ్మలాటతో ఇలాంటి సామాజికి అవగాహన కార్యక్రమాలు కూడా ప్రదర్శించొచ్చని చూపించింది. ఆమె కృషి పలితంగా న్యూఢిల్లీలో కొద్దోగొప్పో తోలుబొమ్మలాట కళాకారులు ఉండటం విశేషం. అంతేగాదు రాజాధానిలో ఈ తోలుబొమ్మల విద్యను నేర్చుకునే పాఠశాల కూడా ఉందట. ఇందులో జైపూర్, పూణే, మధురై, బర్ధమాన్ తదితరప్రాంతాలకు చెందని విద్యార్థులు ఉన్నారు. వాళ్లంతా ఈ కళను నేర్చుకుని సొంతంగా సంస్థను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అంతేగాదు తన సంస్థే త్వరలో అంతర్జాతీయ తోలుబొమ్మల చిత్రోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. చలనచిత్రోత్సవంకి మించి ఎక్కువ ప్రదర్శనలిస్తారట. వాటిలో తమిళనాడుకి సంబంధించిన షాడో తోలుబొమ్మలాట ప్రధాన ఆకర్షణగా ఉంటుందట. ఇంకో విశేషం ఏంటంటే అనురూప గ్రామన్నే రాజధానికి తీసుకొచ్చేలా తన తోలుబొమ్మలాటతో గ్రామీణ దృశ్యాలను కళ్లకు కట్టినట్లు చూపించనుంది. ఇది సాయంత్రం నుంచి మొదలై తెల్లవారుజాము వరకు ఉంటుందని చెబుతున్నారామె. ఆ కార్యక్రమం వచ్చేనెల ఏప్రిల్ 4 నుంచి 6 వరకు ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జరుగునుందని చెప్పారు అనురూప రాయ్. కనుమరుగైపోతున్న కళను ఎంచుకోవడమే సాహసం, పైగా దానికి ఊపిరి పోసి సజీవంగా ఉండేలా చేయడం అంటే మాటలు కాదుకదా..!.(చదవండి: -
ది బెస్ట్ మాంసాహార రెసిపీగా భారతీయ వంటకం కీమా..!
ప్రపంచంలోనే ఉత్తమ మాంసాహార వంటకాల జాబితాను విడుదల చేసింది ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్. ఎప్పటిలానే బెస్ట్ స్వీట్స్, కర్రీల జాబితాను ఇచ్చినట్లుగానే ఈసారి బెస్ట్ మాంసాహార రెసిపీ జాబితాను విడుదల చేసింది. మొత్తం 100 ఉత్తమ మాంసాహార వంటకాలను విడుదల చేయగా అందులో మన భారతీయ వంటకం కీమా నాల్గోస్థానంలో నిలవడం విశేషం. ఈ కీమాని సమోసాలు, బ్రెడ్లు, పరాఠాలు వంటి వాటిల్లో నొంచుకుని ఆస్వాదిస్తారు. ముఖ్యంగా ఇది మేక లేదా కోడి మాంసాన్ని చాలా చిన్నగా కట్ చేస్తారు. దాంతో చేసే వంటకమే ఈ కీమా రెసిపీ. అయితే దీన్ని ఉడికించడం సులభం, రుచిగానూ ఉంటుంది. ఇక ప్రపంచంలోనే ఉత్తమ మాంసాహార వంటకాల జాబితాలో టర్కీకి చెందిన టైర్ కోఫ్టేసి అగ్రస్థానంలో నిలిచింది. తదుపరిస్థానాల్లో సెర్బియా నుంచి లెస్కోవాకి రోస్టిల్జ్ , టర్కీకి చెందిన అదానా కెబాప్, బారత్ నుంచి కీమా ట్రావ్నిక్, బోస్నియా నుంచి ట్రావ్నిక్కి సెవాపి, అజర్బైజాన్ నుంచి గురు ఖింగల్, ఇటలీ నుంచి పోల్పెట్ బోస్నియా మొదలైనవి చోటు దక్కించుకున్నాయి. కాగా, ఈ కీమా వంటకాలను అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరపకాయ, ఉల్లిపయాలు, నెయ్యి, గరం మసాల, కొద్దిపాటి సుగంధద్రవ్యాలతో రుచికరంగా తయారు చేస్తారు. సాధారణంగా పచ్చి బఠానీలు ఉపయోగించి చేస్తుంటారు చెఫ్‌లు. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) (చదవండి: అతడు 95% దృష్టిని కోల్పోయాడు అయినా..! వైరల్‌గా ఆనంద్ మహీంద్రా పోస్ట్) -
పరిస్థితులు ఎలా ఉన్నా గెలవడం అంటే ఇదే..! వైరల్‌గా ఆనంద్ మహీంద్రా పోస్ట్
పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ స్ఫూర్తిదాయకమైన కథలను పంచుకంటూటారు. అవి యువతకే కాదు, ఉద్యోగులకు, సాధారణ గృహిణులకు స్థైర్యాన్ని, స్పూర్తిని అందించేలా ఉంటాయి. మనకే ఇంత పెద్ద కష్టం ఏమో!.. అనే అజ్ఞానం నుంచి బయటపడేసేలా ప్రేరణాత్మకంగా ఉంటాయి. ఈసారి కూడా ఆనంద్ అలాంటి స్ఫూర్తిని కలిగించే వీడియోని షేర్చేశారు. విపత్కర పరిస్థితుల్లో ఓ ఉద్యోగి ఎలా వ్యవహరించాలో తెలియజెప్పే స్టోరీ ఇదీ..!.సమస్యలనేవి వస్తూనే ఉంటాయి. అయితే అవి ఏ రూపంలో వచ్చినా మనం ధైర్యం, ఆశ కోల్పోకూడదు. అదే చెబుతోంది ఈ రాజ్‌కుమార్ దాబీ గాథ. అతడు మహీంద్రా గ్రూప్ ఉద్యోగి. సేల్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే అతను 2014లో కంటిశుక్లంకి సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్నారు. దాంతో అప్పటి నుంచి నెమ్మదినెమ్మదిగా దృష్టిని కోల్పోవడం ప్రారంభించాడు. అలా ఇప్పుడాయన 5% దృష్టిని మాత్రమే కలిగి ఉన్నారు. అయినా ఆయన అధైర్యపడలేదు. అపుడెలా ఉద్యోగంలో డైనమిక్‌గా పనిచేశారో అలానే దూసుకుపోతున్నారు. తన సహోద్యోగులతో సమానంగా పనిచేస్తారాయన. ఆ టైంలో కూడా ఆయన సుమారు 5 మందికి పైగా తన విభాగంలో శిక్షణ ఇచ్చారు. అతడి సీనియర్ ఉద్యోగులు సైతం రాజ్‌కుమార్ దాబీ విల్పవర్కి అబ్బురపడటమే కాదు అతడి పనిని మెచ్చుకుంటున్నారు కూడా. అంతేగాదు అతను ఇలాంటి స్థితిలో కూడా మంచిగా అమ్మకాలు జోరందుకునేలా చేశాడని చెబుతున్నారు వారంతా. అతడు కంపెనీని తన కుటుంబంలా భావించి..వర్క్ గురించి తన కింద ఉద్యోగులకు తర్ఫీదు ఇస్తాడు. ఫలితంగా అతడు వాళ్ల నుంచి ప్రేమ ఆప్యాయతలో కూడిన ప్రోత్సహాం అందుకుంటాడు. అందువల్లే అతడు ఈ ఆకస్మిక వైకల్యాన్ని అధిగమించి ఉద్యోగంలో కొనసాగుతున్నాడు. అతడు తనకు సడెన్‌గా వచ్చిపడిన ఈవైకల్యానికి చింతిస్తూ కూర్చోలేదు. కేవలం పరిష్కారం దిశగా, తాను చేయగలిగే పనిపై దృష్టిసారించాడు. అదే అతడిని తన ఉద్యోగంలో యథావిధిగా కొనసాగిలే చేసింది. పని అనేది తన అభిరుచిగా భావించి చేసేవారికి తిరిగే ఉండదు అనేందుకు రాజ్‌కుమార్ దాబీనే ఉదాహరణ. ఆ వ్యక్తి తన కంపెనీలో సహోద్యోగిగా కొనసాగడం గర్వంగా భావిస్తున్నా అంటూ అతడికి సంబంధించిన వీడియోని కూడా జత చేసి పోస్ట్ చేశారు ఆనంద్ మహీంద్రా. నెటిజన్లు కూడా ఇది స్పూర్తిదాయకమైన కథ, కార్యాలయంలో గుర్తింపు ఎలా తెచ్చుకోవాలో ఇతడిని చూస్తే క్లియర్‌గా తెలుస్తుందని కొందరూ, ఎలాంటి పరిస్థితుల్లోనూ నమ్మకం కోల్పోకూడదు, అదే మనల్ని ముందుకు సాగేలా ధైర్యం అందిస్తుంది అంటూ పోస్టులు పెట్టారు. Often, the #MondayMotivation you need is right next to you, on your home turf…Dhanyavaad, Thank you, Rajkumar Dabi, for making me so proud to be your colleague. You inspire us every single day…pic.twitter.com/2UcBnqQxjc— anand mahindra (@anandmahindra) March 24, 2025 (చదవండి: 'విల్‌పవర్' అంటే ఇది..ఏకంగా వీల్‌చైర్‌తో బంగీ జంప్..! వీడియో వైరల్) -
వేసవిలో డీ హైడ్రేషన్ కట్టడికి కొబ్బరి నీరే తప్పనిసరా..?
సమ్మర్ వచ్చేస్తుందంటేనే భయం వేస్తుంది. ఉక్కపోతాలు, సూర్యుడి భగభగలు తలుచుకుంటే వామ్మో..! అనిపిస్తుంది. ఆఖరికి వండిన ఏ వంటకాలు నిల్వ ఉండవు. మధ్యాహ్నా 12 దాటితే బయటకు అగుపెట్టే ఛాన్సే లేదన్నంత వేడి సెగలు. ఎంత నీడ పట్టున కూర్చొన్న ఆ ఎండల వేడికి ఒకటే దాహం, నోరంతా పెడుచుకట్టుకుపోయినట్లు ఉంటుంది. దాంతో చాలావరకు కొబ్బరి బొండాలు, చెరుకురసం వంటివి వాటితో హైడ్రేటెడ్‌గా ఉండేలా చేసుకుంటారు. అయితే చెరుకురసంలో ఉండే అధిక చక్కెరల దృష్ట్యా కొబ్బరి నీళ్ల వైపుకే మొగ్గు చూపుతారు. అందులోనూ వేసవి అని అటు కొబ్బరి కాయల వ్యాపారలు అదును చూసి ఎక్కువ ధరలకు విక్రయిస్తుంటారు. ఎండల భయంతో విధిలేక అంత ధర వెచ్చించి మరీ కొని తాగేస్తుంటారు. అయితే అదేం అవసరం లేదంటున్నారు వైద్య నిపుణులు. సమ్మర్లో కొబ్బరి బొండాలు తప్పనిసరి ఏం కాదని తేల్చి చెబుతున్నారు. వాటికి బదులుగా తక్కువ ఖర్చులో డీహైడ్రేషన్‌కి చెక్‌పెట్టొచ్చని చెబుతున్నారు అదెలాగో చూద్దామా..!.ఆరోగ్య స్పుహ ఎక్కువై సోషల్ మీడియాలోనూ, పేపర్లోనూ కొబ్బరి నీరుకి మించిన దివ్యౌషధం లేదంటూ ఊదరగొట్టుస్తున్నారు. నిజానికి కొబ్బరి నీరేమి సర్వరోగ నివారిణి కాదంటున్నారు వైద్యులు. ఇది హైడ్రేషన్‌గా ఉంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అది సమంజసమే అయినా..మార్కెట్లో అధిక ధర పలుకుతున్నప్పడు ప్రత్యామ్నాయంగా తరుచుగా నీరు తాగితే చాలు. పోనీ వేడికి తాళ్లలేకపోతున్నాం అనుకుంటే అరటిపండ్లు, నీళ్లు తాగినా డీహైడ్రేషన్‌కి గురవ్వరని చెబుతున్నారు నిపుణులు. ఎలక్ట్రోలైట్ల సమృద్ధి కారణంగా..చాలామంది వేసవిలో కొబ్బరి నీళ్లు తాగకపోతే వేడి చేస్తుందని, ముక్కు నుంచి రక్తం కారుతుందని ఫిర్యాదులు చేస్తుంటారు. అది చాలా తప్పు ఆ సమస్యకు మూల కారణం తెలుసుకునేలా ఈఎన్టీ వైద్యుడిని సంప్రదించాలే గానీ కొబ్బరినీరు తగ్గిస్తుందని చెప్పడం సరైనది కాదంటున్నారు వైద్యులు. అలాగే చాలామంది మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి కొబ్బరి నీరే మంచిదనుకుంటారు. అది కూడా సరైనది కాదు. ఎందుకంటే కొబ్బరినీటిలో పోషకాలు ఉన్నాయి కానీ అది మూత్రపిండాల్లో రాళ్లను తగ్గించేంత శక్తి అయితే ఉండదని నొక్కి చెప్పారు నిపుణులు. కేవలం వడదెబ్బ తగ్గినప్పుడు ఈ కొబ్బరినీరు తక్షణమే శక్తిని ఇచ్చి, ఎలక్ట్రోలైట్లతో బాడీని భర్తీ చేస్తుంది. త్వరితగతిన కోలుకునేలా చేస్తుందన్నారు. లేత కొబ్బరి నీరు ప్రకృతి ప్రసాదించిన రిఫ్రెషింగ్ అమృతం!. ఎలక్ట్రోలైట్లతో నిండిన ఇది, తక్కువ కేలరీలు, అధిక పొటాషియం, విటమిన్ బీ, సీలు కలిగిన హైడ్రేటింగ్ పానీయం. రీహైడ్రేషన్, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. మనకు మంచి ఆరోగ్యకరమై ఎనర్జీ ఇచ్చేందుకు తీసుకోవాలే తప్ప. అది తీసుకుంటేనే హైడ్రేటెడ్‌గా ఉంటామనేది అపోహేనని తేల్చి చెప్పారు. అలాగే దీన్నీ హైడ్రేషన్‌కి సంబంధించిన ప్రాథమిక వనరుగా తీసుకోకూడదు. ఆ సమస్యలు ఉత్ఫన్నమైనప్పుడూ..అథ్లెట్లకు లేదా వేడి వాతావరణంలో పనిచేసేవారికి కొబ్బరినీటిలో ఉండే అధిక ఎలక్ట్రోలైట్ కంటెంట్ కారణంగా తీసుకోమని వైద్యులు సూచిస్తారే తప్ప, ప్రత్యామ్నాయంగా అరటిపండ్లు, చల్లటి నీరు తాగవచ్చు అని చెబుతున్నారు నిపుణులు. కొబ్బరి నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందించినప్పటికీ ఇది అన్నీ ఆరోగ్య సమస్యలకు అద్భుత నివారిణీ మాత్రం కాదని చెప్పారు. ముఖ్యంగా విరేచనాలు, మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నవారికి అలసట బారిన పడకుండా ఉండేలా వైద్యులు నీటికి బదులుగా దీన్ని సూచించడం జరుగుతుందని వివరించారు. కాబట్టి సరసమైన ధరల్లో కొబ్బరి బొండాలు దొరికితే హయిగా కొనుక్కుని ఆస్వాదించండి లేదంటే హైడ్రేషన్ కోసం తక్కువ ధరలోనే ప్రత్యామ్నాయులు ఉన్నాయనే విషయం గ్రహించండి అని చెబుతున్నారు వైద్యులు.(చదవండి: జెన్ జడ్ రెబల్స్..ఈ తరం ఉద్యోగులు సరిచేసుకోవాల్సినవి ఇవే..!) -
సెహ్రీ..తెల్లవారే ముందు వంటకాల విందు..!
మతాలకతీతంగా ప్రతి నగరవాసి సంప్రదాయ ఆహార సంస్కృతిలో మమేకమైపోయే సమయం రంజాన్. పాతబస్తీని అంతగా పట్టించుకోని ఐటీ నిపుణులు సైతం అసలు సిసలు హైదరాబాద్ అనుభవం కోసం ఓల్డ్ సిటీకి రౌండ్స్ కొట్టే సీజన్ ఇది. ఓ రకంగా దీన్ని లోకల్ టూరిజం అని పేర్కొనవచ్చు. రంజాన్ సీజన్లో ఈ లోకల్ టూరిస్టులు ఆస్వాదించే వాటిలో హలీమ్, ఇఫ్తార్లు మాత్రమే కాదు సెహ్రీ కూడా ఒకటి. రోజూ రకరకాల కారణాలతో.. రంజాన్ సమయంలో నగరం సెహ్రీ ప్రత్యేక మెనూల కోసం మేల్కొంటోంది. ఇది ముస్లింలు తమ రోజాను (ఉదయం నుంచి సాయంత్రం వరకూ చేసే ఉపవాసం) పునఃప్రారంభించే ముందుగా.. సూర్యోదయానికి ముందు తినే ఉదయపు భోజనం. అయితే ఈ సమయం సాధారణంగా ముస్లిమేతరులు ఎవరికీ అనుభవంలో లేని తెల్లవారుజామున ఆస్వాదించే వైవిధ్యభరిత అనుభూతి. సమయం మాత్రమే కాదు ఆ సమయానికి రెస్టారెంట్స్ వడ్డించే వంటకాలు కూడా ప్రత్యేక అనుభూతే. వైవిధ్యభరిత అనుభూతి.. సెహ్రీ కోసం బయటకు వెళ్లడం సంప్రదాయ పద్ధతి కానప్పటికీ, లేట్‌నైట్ షిఫ్టుల్లో పని చేసే వారి సంఖ్య పెరగడంతో పాటు, వంటగదిలోకి అడుగు పెట్టకుండానే రంజాన్ సమయంలో రిలాక్స్డ్ ఫుడ్‌ని ఇష్టపడే వారూ పెరగడం వల్ల కొత్తగా సెహ్రీ ఇంటి బయట ఊపందుకుంటోంది. రెస్టారెంట్లలో సెహ్రీ భోజనం సాధారణంగా తెల్లవారుజామున 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. సిసలైన సిటీ రుచుల సెహ్రీ.. సాధారణ బిర్యానీ లేదా హలీమ్లా కాకుండా, సెహ్రీలో కిచిడీ ఖట్టా–ఖీమా, నిహారీ విత్ నాన్, దమ్ కా కీమా కబాబ్‌లతో సహా అనేక రకాల సంప్రదాయ వంటకాలు సెహ్రీలో వడ్డిస్తారు. వీటిని రెస్టారెంట్లు ఈ సమయంలో ప్రత్యేకంగా అందిస్తాయి. కబాబ్‌లు వగైరా కూడా ఇందులో ఉన్నాయి, కానీ పూర్తిగా కొత్త మెనూను ఈ సందర్భంగా చాలా మంది రుచి చూస్తారు. సిటీలోని అనేక రెస్టారెంట్లు, హోటళ్లు, రోడ్‌సైడ్ కేఫ్స్ సైతం ప్రత్యేక సెహ్రీ మెనూ ప్లేటర్‌ను అందిస్తున్నాయి. ఈ ప్లేటర్లు లేదా కాంబోలు కనీసం నలుగురికి సరిపోయేంత పెద్దవిగా ఉండడం విశేషం. ఎక్కువగా ఈ సెహ్రీ కాంబోల్లో కబాబ్‌లు, రోటీలు, అన్నం, పప్పులతో పాటు మాంసాహార స్టార్టర్ల మిశ్రమం ఉంటుంది. దీంతో పాటు వివిధ రకాల కబాబ్‌లు, నయాబ్ హోటల్లో పాపులర్ డిష్ ఓ ఆఫాల్ ఫ్రై, రోటీ పే బోటీ, కబాబ్స్‌తో రోగ్ని రోటీ వంటివి సెహ్రీ స్పెషల్స్‌గా పేరొందాయి. ఎక్కడెక్కడ రుచి చూడొచ్చు అంటే.. ఓల్డ్ సిటీ, టోలిచౌకి, విమానాశ్రయ రహదారి (అరామ్‌ఘర్) వంటి ప్రాంతాల్లోని రెస్టారెంట్లు సెహ్రీ మెనులను అందిస్తాయి. అలాగే –టోలిచౌకి వంటి ప్రాంతాల్లో కూడా తాత్కాలిక ఆహార దుకాణాలు కనిపిస్తాయి. పాతబస్తీలోని నయాబ్ హోటల్ వంటి కొన్ని రెస్టారెంట్లు తమ సెహ్రీ మెనులను ఉదయం 1 గంట నుంచే అందిస్తాయి. అపరిమిత సెహ్రీ బఫేలను అందించేవి కూడా ఉన్నాయి. ‘గత సంవత్సరం ఇంటి బయట ‘సెహ్రీ’ కోసం అనేక మంది ఆసక్తిని కనబరిచారు, అందువల్ల మేం అనేక కొత్త రుచులను జోడించాం. ఉదయం 1 నుంచి 5 గంటల వరకూ స్పెషల్ మెనూలు అందిస్తున్నాం’ అని చార్మినార్ సమీపంలోని హోటల్ నయాబ్‌కు చెందిన జునైద్ అంటున్నారు. కొత్త మెనూలో ‘ఆచారి’ మటన్/చికెన్, నయాబ్ స్పెషల్ చికెన్, ‘కిచ్డీకి’, ‘దమ్ కా ఖీమా’ వంటి రుచికరమైన వంటకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం సెహ్రీ నగర నిజానికి ఒక భారీ ఆకర్షణగా మారుతోంది. మేం మా ‘సెహ్రీ’ మెనులో మటన్ ‘తహరీ’ అనే ప్రత్యేక వంటకం అందిస్తున్నాం’ అని లకడికాపూల్‌లోని పెషావర్ రెస్టారెంట్‌కు చెందిన మహమ్మద్ అబ్దుల్ మోయిద్ చెబుతున్నారు. (చదవండి: జెన్–జడ్ రెబల్స్..ఈ తరం ఉద్యోగులు సరిచేసుకోవాల్సినవి ఇవే..!) -
జెన్–జడ్ రెబల్స్..ఈ తరం ఉద్యోగులు సరిచేసుకోవాల్సినవి ఇవే..!
జెన్–జడ్ అనగానే ‘డైనమిక్ నేచర్’ అంటారు. అంతమాత్రాన అంతా సవ్యంగా ఉన్నట్లు కాదు. జెన్–జడ్ ఉద్యోగులు సరిచేసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. జెన్–జడ్లో ప్రొఫెషనలిజం లేకపోవడం ఆందోళన కలిగిస్తుందని, ప్రొఫెషనల్ స్కిల్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు నిపుణులు...క్వాయిట్ క్విట్టింగ్యువ ఉద్యోగులకు సంబంధించి నిశ్శబ్ద నిష్క్రమణ (క్వాయిట్ క్విట్టింగ్) భారతీయ పరిశ్రమలలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇది పరిశ్రమ నిర్వాహకులలో ఆందోళనను పెంచుతుంది. ‘ఉద్యోగం అంటే కాలేజికి ఎక్స్టెన్షన్ కాదు. ప్రొఫెషనలిజం అవసరమని చాలామందికి అర్థం కావడం లేదు. వివిధ రంగాల డైనమిక్స్‌పై కూడా అవగాహన కొరవడింది. ప్రతి రంగానికి ఒకే రకమైన పని అవసరాలు ఉంటాయని వారు భావిస్తున్నారు. జెన్–జడ్ ఉద్యోగుల ప్రవర్తనను కూడా నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది’ అంటున్నారు టీమ్‌లీజ్ డిజిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నీతి శర్మ.జెన్ జడ్ అలా కాదు...పాత తరం ఉద్యోగులు, జెన్–జడ్ ఉద్యోగులకు మధ్య ఉన్న తేడా ఏమిటి? ఒకప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురైనా ‘మౌనమే మంచిది’ అన్నట్లుగా ఉండేవాళ్లు. జెన్–జడ్ అలా కాదు...తమ అసమ్మతిని బహిరంగంగా చెప్పడానికి వెనకాడడం లేదు. పని ప్రమాణాలు, అవసరాల విషయంలో యువతరానికి, పాతతరానికి ఎంతో తేడా ఉంది. ‘పని మాత్రమే జీవితం అని యువతరం అనుకోవడం లేదు. పనికి మించిన జీవితం ఉందనే విషయం వారికి తెలుసు. అయితే దీన్ని పాతతరం అంగీకరించం కష్టం’ అంటుంది దిల్లీకి చెందిన సైకోథెరపిస్ట్ దివిజా బాసిన్. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ అయిన దివిజకు 2.6 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ‘హార్డ్ వర్క్’ను పునర్నిర్వచించాల్సిన అవసరం ఉంది అంటారు ఆమె. అయితే ఇది చిత్రానికి ఒక వైపు మాత్రమే. మరోవైపు యువతలోని ప్రతికూలతలు కనిపిస్తున్నాయి.స్కిల్ గ్యాప్ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రేడ్ బాడీ నాస్కామ్ నివేదిక ప్రకారం టెక్ రంగంలో ఆరు లక్షల మంది నిపుణుల కొరత ఉంది. ప్రస్తుతం ఉన్న ‘స్కిల్ గ్యాప్’ సమస్యకు సులువైన పరిష్కార మార్గాలు లేకపోయినప్పటికీ యువత కార్పొరేట్ వాతావరణానికి అలవాటు పడటానికి సహాయపడే సాఫ్ట్ స్కిల్క్స్పై పరిశ్రమలు మరింత దృష్టి పెట్టే అవసరం ఉంది. రిక్రూట్మెంట్కు వచ్చే కంపెనీలు విద్యార్థుల్లో సాఫ్ట్ స్కిల్స్‌కు సంబంధించి ఎక్కువగా ఆందోళన చెందుతున్నాయని దిల్లీకి చెందిన ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ హెడ్ చెప్పారు.కష్టమే సుమీ!అమెరికాకు చెందిన రెజ్యూమ్‌బిల్డర్.కామ్ నిర్వహించిన సర్వేలో 74 శాతం మంది మేనేజర్లు, బిజినెస్ లీడర్లు జెన్ జడ్‌తో పనిచేయడం కష్టమని చెప్పారు. స్కిల్ అసెస్మెంట్ సంస్థ వీబాక్స్ ఇండియా స్కిల్స్ రిపోర్ట్ ప్రకారం భారతీయ గ్రాడ్యుయేట్లలో 51 శాతం మంది మాత్రమే ఉపాధి పొందుతున్నారు. నేషనల్ ఎంప్లాయిబిలిటీ రిపోర్ట్ ఫర్ ఇంజనీరింగ్ ప్రకారం 80 శాతం మంది భారతీయ ఇంజనీర్లకు అవసరమైన నైపుణ్యాలు లేవు. అందుబాటులో ఉన్న ప్రతిభావంతులను నియమించుకోవడం తప్ప కంపెనీలకు మరో మార్గం కనిపించడం లేదు. (చదవండి: -
షడ్రుచుల ఉగాదికి..ప్రకృతే పరవశించేలా ఈ చేనేత చీరల్లో మెరుద్దాం..!
పచ్చని తోరణాలు.. షడ్రుచుల ఆస్వాదన.. సంప్రదాయ వస్త్రధారణ ఉగాదికి స్వాగతం పలుకుతూ కొత్త ఉత్సాహాన్ని మదికి మోసుకువస్తాయి. చేనేత చీరలు, ఎంబ్రాయిడరీ సొగసులు వాటి రంగుల హంగులు ప్రకృతి పరవశించేలా పండగకు మరింత శోభను తీసుకువస్తాయి. ముఖ్యంగా పసుపు, ఆరెంజ్, ఆకుపచ్చ, ఎరుపు రంగులు పండగ కళను రెట్టింపుగా మన కళ్లకు కడతాయి. చేనేత కళపండగ నాడు కళను రెట్టింపు చేసే అలంకరణకు ప్రాముఖ్యత ఇస్తుంటారు. అయితే, అందుకు పెద్ద హడావిడి లేకుండా మనవైన చేనేతలలో కాంతిమంతమైన రంగులున్న చీరలను ఎంపిక చేసుకోవచ్చు. వీటిలో కంచిపట్టు చీరల నుంచి కలనేత వరకు అన్నీ పండగను వెలిగించేవే.సహజమైన రంగులుప్రకృతి నేపధ్యంగా ఉగాది జరుపుకుంటారు కాబట్టి పసుపు, ఆకుపచ్చ, నారింజ, ఎరుపు రంగుల కాటన్, తెలుపు, ఎరుపు కాంబినేషన్, పింక్ కలర్ టస్సర్, సిల్క్ చీరలు ప్రత్యేక ఆకర్షణతో ఆకట్టుకుంటాయి. డిజైన్లుచెక్స్, లైన్స్‌తో ఉన్న డిజైన్లు, మెరుపులు లేకుండా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్, సహజంగా అనిపించే పెయింటింగ్స్ ఈ పండగకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇతర అలంకరణలు..చీరలకు లాంగ్ స్లీవ్స్ బ్లౌజులు, టెంపుల్ జ్యువెలరీ లేదా థ్రెడ్, టెర్రకోట జ్యువెలరీ బాగుంటాయి. పసుపు, ఎరుపు కాంబినేషన్ ప్లెయిన్ గాజులు, సహజంగా అనిపించేలా తక్కువ మేకప్ ప్రత్యేకతను చూపుతుంది.శిరోజాల అలంకరణలో జడ, కొప్పులు, పువ్వులకు ప్రాధాన్యమిస్తే పండగ ప్రకృతి కళతో ఆకట్టుకుంటుంది. (చదవండి: అందంగా ఉండాలంటే..సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలి..!) -
అందంగా ఉండాలంటే..సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలి..!
అందంగా ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందనేది అందరూ అంగీకరించాల్సిందే. యవ్వనంగా కనిపించాలనే తాపత్రయంతోనే జీవనం నాణ్యంగా గడపడానికీ ప్రయత్నించాలి. అందుకు బ్యూటీ చికిత్సలకు ఎక్కువ ఖర్చు పెట్టనవసరం లేదు. నేటి రోజుల్లో కాలుష్యం, సమతుల ఆహార లోపం, స్ట్రెస్ .. వీటన్నింటి ప్రభావం చర్మంపై పడుతుంది. అందుకని సమస్య ఎక్కడ ఉన్నదో దానిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయాలి.చాలా మంది ఎదుర్కొనేవి... యవ్వనంలో ఉన్నవాళైతే యాక్నె, మంగు మచ్చలు, కాస్మొటిక్స్ వాడకం వల్ల ఏర్పడే మచ్చల సమస్య ఉంటుంది. వీటికి ఇంట్లోనే సొంత చికిత్సలు తీసుకోవడం వల్ల మరికొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు.. మొటిమలకు వెల్లుల్లి, టూత్‌పేస్ట్ వంటివి వాడుతుంటారు. మంగు మచ్చలకు తమకు తామే స్టెరాయిడ్స్ వాడుతుంటారు. ఇక శిరోజాల విషయంలో అయితే ఐరనింగ్, స్ట్రెయిటనింగ్, స్టయిలింగ్.. వంటి హెయిర్‌స్టైల్స్ ఎక్కువైపోయాయి. వీటివల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. జుట్టు ఊడిపోవడం పెరుగుతుంది.బట్టల వల్ల అలెర్జీటైట్గా ఉండే బట్టలు వేసుకుంటుంటారు. ఫ్యాబ్రిక్ వల్ల దురద సమస్యలు వస్తుంటాయి. అవి, నిర్లక్ష్యం చేస్తే కుటుంబంలో మిగతా వారికీ ఆ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తుంది. పులిపిర్లు ప్రైవేట్ పార్ట్స్‌లో వస్తుంటాయి. వాటినీ నిర్లక్ష్యం చేస్తుంటారు. కాస్మొటిక్ ప్రయోగాలు అయితే చెప్పలేం. అవి తమ చర్మానికి సరిపడతాయో లేదో కూడా చూడరు. దీని వల్ల చర్మం రంగు మారుతుంది.ఫేషియల్స్ఫేషియల్స్ చేయించుకుంటుంటారు. ఫ్రూట్ ఫేషియల్స్ సాధారణ కాంతికి పనిచేస్తాయి. హైడ్రా ఫేషియల్, డెర్మాఫేషియల్స్, కెమికల్పీల్.. వంటి ఫేషియల్స్ నిపుణుల పర్యవేక్షణలోనే చేయించుకోవాలి. హెయిర్‌కి, స్కిన్‌కి పీఆర్పీ చేయించుకుంటారు. ఇవి చేయించుకున్నంత మాత్రాన అంతా బాగయిపోదు. సరైన మెయింటెనెన్స్ అవసరం.చెయిన్లతో మెడపై నలుపుఆడవాళ్లలో చాలా వరకు మెడపైన నల్లగా అవుతుంది. ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, శుభ్రత పాటించకపోవడం, అధిక బరువు వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. అండర్ ఆర్మ్స్ డార్క్‌గా ఉన్నప్పుడు నిపుణుల సూచనలు తీసుకోవాలి. అధికబరువుకు లైపోసక్షన్ వంటివి చికిత్సలు తీసుకుంటారు. బరువు తగ్గినప్పుడు ఎలాంటి ఫిట్నెస్ సూచనలు పాటించాలో కూడా నిపుణుల సూచనలు తీసుకోవాలి.స్ట్రెచ్ మార్క్స్మహిళలకు ప్రసవం తర్వాత స్ట్రెచ్ మార్క్స్ పెద్ద సమస్య. ప్రసవం తర్వాత మూడవ నెల వరకు క్రీములు వాడుతూ ఉండాలి. అన్ని డెలివరీలు పూర్తయ్యాక స్ట్రెచ్ మార్క్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. మరో సమస్య పాదాల పగుళ్లు. క్రీమ్ వాడితే దాని మీద దుమ్ము పేరుకుంటుంది. అందుకని, రాత్రి పడుకునేముందు పీదాలను శుభ్రం చేసి, క్రీమ్ రాసి, సాక్సులు ధరించాలి.డిటర్జెంట్స్ వల్ల ఎగ్జిమా!చేతులకు ఎగ్జిమా వస్తుంది. డిటర్జ్ంట్స్ వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. అందుకని ఇంటి క్లీనింగ్‌లో చేతులకు గ్లౌజ్స్ మోచేతుల వరకు ఉండేవి మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిని ఉపయోగించాలి.పర్మనెంట్స్ చేయించుకుంటున్నారా..!బ్యూటీ చికిత్సలలో పర్మనెంట్ మెథడ్స్‌కి ఇటీవల డిమాండ్ పెరిగింది. వాటిలో బొటాక్స్, ఫిల్లర్స్, స్కిన్ బూస్టర్స్, లిప్ కరెక్షన్, స్కిన్ టైటెనింగ్, గ్లోయింగ్ కోసం తీసుకునే ఇంజక్షన్స్.. ఈ కాస్మొటిక్స్ చికిత్సలన్నీ వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. రెగ్యులర్ మేకప్ చేసుకునేవారు కాస్మొటిక్స్ తమ చర్మతత్త్వానికి సరిపడేవి ఎంచుకోవాలి. తిరిగి శుభ్రం చేసుకోవడంలోనూ జాగ్రత్తలు పాటించాలి. (చదవండి: Ram Charan: రోజుకో వర్కవుట్.. ఆదివారం చీటింగ్! ఆ రూల్ మాత్రం తప్పడు!) -
Adolescence Review: డిజిటల్ లోయల్లో టీనేజ్ పిల్లలు
తల్లిదండ్రులు పిల్లల కోసం కష్టపడుతుంటారు. పిల్లలు చదువులతో కష్టపడాలి వాస్తవంగా. కాని వారికి సోషల్ మీడియాలోని చెత్తా చెదారం, తప్పుడు సమాచారం, ఉద్రిక్త ఆకర్షణలు, హింసాత్మక భావజాలాలు... ఇవి కష్టాలు తెచ్చి పెడుతున్నాయి. ఇటీవల వచ్చిన ‘అడోలసెన్స్’ వెబ్‌సిరీస్ మీద సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఇది హెచ్చరిక అంటున్నారు. ఈ సిరీస్ మనల్ని ఎలా నిద్ర లేపుతున్నది?మీ పిల్లలు మీతో ఇంట్లో మాట్లాడే భాష మీకు తెలుసు. వాళ్లు సోషల్ మీడియాలో మాట్లాడే భాష మీకు తెలుసా? వాళ్లు ఉపయోగించే ‘ఎమోజీ’ల అర్థాలు తెలుసా? మాటలు లేకుండా ఎమోజీలతో గాయపరిచే వీలు ఉంటుందని తెలుసా? కిడ్నీ బీన్స్, రెడ్ పిల్, బ్లూ పిల్, డైనమైట్, రెడ్ హార్ట్, పర్పుల్ హార్ట్, ఎల్లో హార్ట్.... ఈ ఎమోజీల అర్థం ప్రతి దానికీ మారుతుంది. అవి ఎందుకు ఉపయోగిస్తున్నారు. ఇంట్లో మన ఎదురుగా పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో మీకు తెలుసు. సోషల్ మీడియాలో ఎలా ప్రవర్తిస్తున్నారో మీకు తెలుసా?ముఖ్యంగా వారి వయసు 12– 14 సంవత్సరాల మధ్య ఉంటే వారికి తెలిసింది ఎంత... తెలియంది ఎంత... తెలిసీ తెలియంది అంత. జాగ్రత్త సుమా... అని హెచ్చరించడానికి వచ్చింది ‘అడోలసెన్స్’ అనే వెబ్ సిరీస్.నాలుగు ఎపిసోడ్స్ల సిరీస్‘అడోలసెన్స్’ అనేది నాలుగు ఎపిసోడ్ల మినీ వెబ్ సిరీస్. బ్రిటిష్ క్రైమ్ డ్రామా. బ్రిటన్‌లో టీనేజ్ పిల్లల్లో పెరుగుతున్న హింసా ప్రవృత్తిని గమనించి ఈ సిరీస్‌ను తీశారు. జాక్ థోర్న్ స్క్రిప్ట్ రాస్తే, ఫిలిప్ బరాన్టిని దర్శకత్వం వహించాడు. ఒక్కో ఎపిసోడ్ ఒక గంట ఉంటుంది. విశేషం ఏమిటంటే ప్రతి ఎపిసోడ్ సింగిల్ షాట్. అంటే మధ్యలో కట్ లేకుండా కెమెరా కదులుతూ దృశ్యాలను చూపుతూ వెళుతుంది. ఈ మేకింగ్‌లో వినూత్నత వల్ల కూడా ఈ సిరీస్ ప్రశంసలు అందుకుంటోంది.ఆ పసివాడి సంఘర్షణఈ సిరీస్ మొదలు కావడమే ‘జెమీ మిల్లర్’ అనే 13 ఏళ్ల పిల్లవాడి అరెస్టుతో మొదలవుతుంది. ముందు రోజు రాత్రి స్కూల్లో తన క్లాస్మేట్ అమ్మాయి కేటీని కత్తితో ఏడుసార్లు పొడిచి చంపాడని అభియోగం. తండ్రి, తల్లి, సోదరి హడలిపోతాడు. జెమీ మిల్లర్ అయితే పోలీసులను చూసి ప్యాంట్ తడుపుకుంటాడు. ఆ తర్వాత జేమీనే కేటీని చంపాడని ఇందుకు ఒక స్నేహితుడు కూడా పురిగొల్పాడని విచారణలో ప్రేక్షకులకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇందులో ఎవరి తప్పు ఎంత? దీనికి బాధ్యులు ఎవరెవరు? శిక్ష మాత్రం ఒక్కడికే పడబోతోందా?ఇన్‌స్టా గొడవజెమీ వయసు 13 ఏళ్లే అయినా అతనికి ఇన్‌స్టా అకౌంట్ ఉంది. అందమైన ఫిమేల్మోడల్స్ బొమ్మలను అప్పుడప్పుడు షేర్ చేస్తుంటాడు. అతని పోస్టులకు కేటీ కామెంట్స్ పెడుతూ ఉంటుంది. వాటికి రకరకాల ఎమోజీలు వాడుతుంటుంది. అవి జెమీని బాధ పెట్టాయని మనకు తెలుస్తుంది. జెమీ తన వయసులో అపరిపక్వత వల్ల తను ఆకర్షణీయంగా లేడని తనను ఎవరూ ఇష్టపడరని న్యూనతతో ఉంటాడు. కేటీ కామెంట్స్ ఇందుకు ఆజ్యం పోస్తాయి. అంతే కాదు సాటి మనిషి పట్ల, ఆడపిల్లల పట్ల సెన్సిటివ్‌గా ఉండాలనే భావజాలం కాకుండా వాళ్లను ఏమైనా అనొచ్చు ఎలాగైనా ఉండొచ్చు అనే ఆధిపత్యపు భావజాలమే ఎక్కువగా జెమీకి పరిచయం అవుతుంటుంది. వీటన్నింటి దరిమిలా అతడు కేటీప్రాణం తీసేవరకూ వెళతాడు.టీనేజ్ పిల్లలు ఎంతో సున్నితమైన దశలో ఉండే సీతాకోక చిలుకలు. వారిని గురించి అందరికీ బాధ్యత ఉండాలని చెబుతోంది ఈ సిరీస్. ఇందులోని ముఖ్య పాత్రను ఒవెన్ కూపర్ అనే బాల నటుడు అద్భుతంగా పోషించాడు. దిన పత్రికల వార్తలు కూడా మనకు రోజూ టీనేజ్ పిల్లల సమస్యలు, కుటుంబాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ లోపం పట్టి ఇస్తున్నాయి. తల్లిదండ్రులు ఈ సిరీస్ చూడటం మంచిదంటున్నారు అభిరుచి ఉన్న ప్రేక్షకులు. కొందరైతే టీనేజ్ పిల్లలతో పాటుగా తల్లిదండ్రులూ చూడాలని సూచిస్తునారు. ముందు పెద్దలు చూడండి. ఆ తర్వాత మీకు సబబని అనిపిస్తే పిల్లలకు చూపించండి. కానీ ఆలోచించండి.ఎవరు నిందితులు?సోషల్ మీడియాను, ఎమోజీలను కనిపెట్టిన వారా? వాటిని ఫోన్లకు అనుసంధానం చేసిన వారా? పిల్లలకు ఫోన్లు కొనిచ్చిన తల్లిదండ్రులా? వాళ్లు ఏ మీడియాను ఉపయోగిస్తున్నారో చూడని తల్లిదండ్రుల నిర్బాధ్యతా? వారితో గడపలేని బిజీతో ఉన్న తల్లిదండ్రుల నిర్లక్ష్యమా? సరిగా పెంచని, సరిగా విద్యాబుద్ధులు చెప్పని వారంతా ఇందుకు బాధ్యులు కాదా? సమాజంలో పేరుకున్న హింసా ప్రవృత్తిని దూరం చేయలేని పాలనా వ్యవస్థ, శాసన వ్యవస్థ, పౌర వ్యవస్థలో ఉన్న వీరంతా కాదా బాధ్యులు. -
ఆఫీసులో అమ్మ... ఇంట్లో బిడ్డ
ఐఏఎస్ అధికారిణి, ఇద్దరు పిల్లల తల్లి అయిన దివ్య మిట్టల్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ‘నేను ఒక ఐఏఎస్ అధికారిణి ని. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఢిల్లీలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎమ్) బెంగళూరులో చదివాను. వీటిని సాధించడానికి చాలా కష్టపడ్డాను. కానీ, నా ఇద్దరు చిన్నారి కూతుళ్లను పెంచే క్రమంలో సవాళ్లను ఎదుర్కోవడానికి ఏదీ నన్ను సిద్ధం చేయలేదు..’ అంటూ ఆ పోస్ట్‌లో పేర్కొంది. ఇటీవల కాలంలో ఉద్యోగం చేసే అమ్మల శాతం పెరుగుతోంది. అదే సమయంలో పిల్లల పెంపకం పట్ల సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నామా అనే ఆందోళనా పెరుగుతోంది. కాలానికి అనుగుణంగా వస్తున్న మార్పులను నేటి తల్లులు ఎలా సమతుల్యతను సాధించాలో నిపుణులు సూచిస్తున్నారు.వయస్సుతో సంబంధం లేకుండా కష్టాల్లో ఉన్నప్పుడు మనం ‘అమ్మా’ అని పిలుస్తాం. ఈ పిలుపు తల్లీ బిడ్డ జీవితాంతం పంచుకునే అనుబంధానికి స్పష్టమైన సూచన. ప్రాచీన కాలం నుండి సమాజంలో మహిళలు పిల్లల సంరక్షకులుగా పరిగణించబడ్డారు. వారి విధి ఇంటికి, ఇంట్లోని వారిని జాగ్రత్తగా చూసుకోవడానికి మాత్రమే పరిమితమయ్యింది. దీంతో తల్లులు ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలనే ఈ భావన పిల్లలను వారి జీవితాల్లో, అభివృద్ధిలో సురక్షితంగా ఉంచింది. నేడు సమాజంలో తల్లులు ఇంటి పనుల నిర్వహణలోనూ, పిల్లల సంరక్షణలోనూ రెండు పాత్రలను పోషిస్తున్నారు. పిల్లల సంరక్షణలో తండ్రుల వాటా పెరిగినప్పటికీ మహిళలు ఇప్పటికీ వారి ఇంట్లో మొదటి సంర క్షకులుగా ఉంటున్నారు.విజయవంతమైన మార్పుప్రపంచవ్యాప్తంగా వర్కింగ్ ఉమెన్ గురించి చేసిన అధ్యయనాల్లో దాదాపు 73 శాతం మంది మహిళలు 30 ఏళ్ల వయసులో తమ పిల్లలను చూసుకోవడానికి తమ ఉద్యోగాలను విడిచిపెట్టారని, 27 శాతం మంది కొంతకాలం తర్వాత తిరిగి వచ్చారని గమనించారు. వారిలో దాదాపు 16 శాతం మంది తమ వృత్తిపరమైన పని జీవితంలో అధికారులుగా ఉన్నారు. కాబట్టి తల్లులుగా ఉన్న మహిళలు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను విజయవంతంగా మార్చుకుంటున్నారని కూడా స్పష్టమైంది.‘ఉద్యోగినిగా డబ్బు సంపాదిస్తూ పిల్లలకు కావల్సినవి సమకూర్చగలుగుతున్నాను. కానీ, వారిని సక్రమంగా పెంచగలుగుతున్నానా..’ అనుకునే తల్లులకు సాంకేతికత వరంగా మారింది. సమయానుకూలంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఎంచుకోవచ్చు.సానుకూల ప్రభావాలు → ఉద్యోగ తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో రెండు పని చక్రాలతో తమ జీవితాలు సజావుగా నడుస్తున్నట్టు చూస్తారు. ఉన్నత విద్యను పొందగల సామర్థ్యం, భౌతిక, సౌకర్యవంతమైన జీవితాన్ని గడపగల సామర్థ్యం కారణంగా వారు మరింత సంతృప్తికరమైన జీవితాలను గడుపుతారు. ఇప్పుడు ఉద్యోగాల్లోకి వెళ్లే మహిళలు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, కెరీర్ అవకాశాలను సరైన ప్యాకేజీలతో అందుకుంటున్నారు. → హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అధ్యయనం ప్రకారం పనిచేసే తల్లుల కుమార్తెలు వారి తల్లులకంటే 23శాతం ఎక్కువ సంపాదిస్తారని తెలిసింది. మరోవైపు పనిచేసే తల్లుల కుమారులు బాధ్యతాయుతమైన పెద్దలుగా ఎదుగుతారు. వారి ఆఫీసుల్లో లింగ సమానత్వాన్ని ఇష్టపడతారు. మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను గౌరవిస్తారు. వారు భవిష్యత్తులో తమ కుమార్తెలకు అద్భుతమైన తండ్రులుగా కూడా పెరుగుతారు.→ తమ తల్లి జీవితంలోని దుఃఖకరమైన రోజులనూ చూసి ఉంటారు. అంతేకాదు తమ తల్లి పట్టుదల, దృఢ సంకల్పం వారు మానసికంగా, ఆర్థికంగా తమ సామర్థ్యాల మేరకు తమను తాము ముందుకు తీసుకెళ్లేలా చేస్తాయి. అన్నింటికంటే వారు హీరోలలో తమ తల్లిని ఒక షీ–రో గా చూస్తారు.మెరుగైన సమయ నిర్వహణ → పనిచేసే తల్లులు ప్రతిరోజూ తమ పిల్లలతో కనీసం ఒకటి లేదా రెండు గంటలు గడపగలిగేలా సమయాన్ని ప్లాన్చేసుకోవాలి. ఇది ఒక దినచర్యగా అనుసరించాలి. వేర్వేరు పనులను షెడ్యూల్ చేయడం, వాటిని సమయానికి పూర్తి చేయడం అనే మీ అలవాటు మీ పిల్లలు అదే అడుగు జాడల్లో నడవడానికి ఒక ఉదాహరణగా ఉపయోగపడుతుంది. → పిల్లలు టైమ్‌టేబుల్‌కు కట్టుబడి ఉండటానికి కూడా ప్రోత్సహిస్తుంది. పిల్లలు మీ పనిని పూర్తి చేయడంలో సహకరిస్తున్నందుకు మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. → కాలక్రమంలో పిల్లల సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇది వారి మెరుగైన జీవితానికి సహాయపడుతుంది. అంతేకాదు, పిల్లలతో మరింత నాణ్యమైన సమయాన్ని గడపడానికి సహాయపడుతుంది. రోజువారీ జీవన విధానంలో ముఖ్యమైన వాటికి సమయం ఇస్తూ, తమ పనిని బ్యాలెన్స్ చేసుకుంటూ, చేస్తున్న పని గురించి పిల్లలకు క్లారిటీ ఇవ్వడం వల్ల మెరుగైన ప్రయోజనాలను పొందుతారు. హద్దులు అవసరంపని, కుటుంబంతో పాటు వ్యక్తిగత అవసరాలకూప్రాముఖ్యం ఇవ్వండి. శారీరక, భావోద్వేగ శ్రేయస్సు కోసం స్వీయ సంరక్షణ అవసరం అనేది గుర్తుంచుకోవాలి. రోజులో పిల్లలకోసమే అన్నట్టుగా కొంత సమయం గడపండి. ఆ సమయంలో ఏదైనా పని నైపుణ్యాలు నేర్పించాలా, చదువు పట్ల దృష్టి పెట్టాలా, ఆనందంగా ఉంచడానికిప్రాధాన్యత ఇవ్వాలా.. ఇలా దేనికది బేరీజు వేసుకోవాలి. సహాయకులుగా ఉండేవారి మద్దతు ఎలా అందుతుందో చెక్ చేసుకోండి. వృత్తిపరమైన వృద్ధికి, తల్లి పాత్రకు విలువనిచ్చేవారిని సహాయకులుగా ఉండేలా చూసుకోండి. ప్రతి ఒక్కరూ జవాబుదారీతనం తీసుకునే కుటుంబ వాతావరణాన్ని సృష్టించండి. ప్రతి ఒక్కరూ పనులు చేసేలా, బాధ్యత తీసుకునే కుటుంబ వాతావరణాన్ని సృష్టించండి. –ప్రొ÷. పి.జ్యోతిరాజ, సైకాలజిస్ట్, లైఫ్ స్కిల్ నిపుణులుఅమ్మా, నువ్వే నా హీరో..నా పెద్ద కూతురికి 8 ఏళ్లు. ప్రపంచం గురించి ఇప్పటికే భిన్నమైన ఆలోచనలను చేస్తుంటుంది. ఎదిగే క్రమంలో ఆమె ఆలోచనల కాంతిని మసకబారనివ్వం. కొన్నిసార్లు పని ఒత్తిడిలో చాలా అలసిపోయినట్టుగా ఉంటుంది. ఆ అలసటలో ఏడుపు వచ్చేస్తుంటుంది కూడా. అలాంటప్పుడు నా కూతురు నన్ను కౌగిలించుకుని, ‘నువ్వు నా హీరోవి‘ అని చెబుతుంది. అంటే, పిల్లలు మనల్ని గమనిస్తారు. వారు మన వైఫల్యాల నుండి దృఢంగా ఎలా ఉండాలో నేర్చుకుంటారు. పడిపోవడం సహజమే అని ఆమెకు చూపించండి, ఆపై లేవండి. నా ఉద్యోగం నాకు ఇది నేర్పింది. ఏది జరిగినా నువ్వు స్థిరంగా ఉంటావని చూపించండి. మాతృత్వంలో తమకు తాము వేసుకునే ప్రశ్నల్లో కొంత అపరాధ భావనతో నిండి ఉంటాయి. నేను పిల్లలకు సరైనదే ఇస్తున్నానా, ఏమైనా తప్పులు చేస్తే.. ఇలాంటివి తలెత్తుతుంటాయి. కానీ, తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు మీ సొంత మార్గంలో ప్రయాణిస్తూ ఆమె దేనినైనా వెంబడించగల ప్రపంచాన్ని నిర్మిస్తున్నారని గుర్తించాలి. తనను తాను క్షమించుకుంటూ ముందుకు సాగడం కూడా చాలా ముఖ్యం. మీకు ఒకరి కంటే పిల్లలు ఎక్కువమంది ఉంటే ఆ బాధ్యత పది రెట్లు పెరుగుతూనే ఉంటుంది. అందుకని, పిల్లలను ప్రేమించడం కంటే కూడా న్యాయంగా ఉండడటం ముఖ్యం. – దివ్యా మిట్టల్– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
తండ్రీకూతుళ్లను కలిపిన కాలం కథ
అందరి నాన్నల్లా అతడు కూడా తన కూతురిని అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. తన కూతురిని పైలట్ చేయాలనుకున్నాడు. కానీ కూతురు ఊహించని షాక్ ఇచ్చింది. తన అభిష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. దీంత తండ్రికూతుళ్ల మధ్య పూడ్చలేనంత దూరం పెరిగింది. అయితే కాలం (Time) ఎవరి కోసం ఆగదుగా, అది తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎంతటి గాయాన్నైనా కాలం నయం చేస్తుందంటారు. అంతేకాదు విడిపోయిన మనుషులను కూడా కాలం కలుపుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే తండ్రి విషయంలోనూ అదే జరిగింది.అస్సలు ఊహించలేదు..ఆయన పేరు అశోక్ కేత్కర్. భారత వాయుసేనలో వింగ్ కమాండర్‌గా రిటైర్ అయ్యారు. విధి నిర్వహణలో ఆయన తన రెండు కాళ్లను కోల్పోయి చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. దీని కంటే కూడా తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కన్నకూతురు భార్గవి తనను కాదని పెళ్లి చేసుకుని వెళ్లిపోవడం కేత్కర్‌ను ఎక్కువ బాధ పెట్టింది. దీంతో కూతురికి కటీఫ్ చెప్పారు. ఇది జరిగిన ఐదేళ్ల తర్వాత ఒకరోజు కేత్కర్ విమానంలో ముంబై (Mumbai) నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఆయనకు ముందుగా తెలియదు ఈ ప్రయాణం (Journey) తన జీవితంలో అత్యంత తీపి జ్ఞాపకం అవుతుందని. భూమాకాశాల మధ్యలో విధి ప్రత్యేక ‘నిధి’ని కానుకగా అందివ్వబోతోందని ఆయన అస్సలు ఊహించలేదు.విమానం గాల్లోకి లేవగానే ఓ చిన్నపిల్లవాడు కేత్కర్కు వచ్చి గ్లాసుతో మంచినీళ్లు అందించాడు. ఆ బుడ్డోడిని చూసి ఎంతో ముచ్చటపడ్డారు కేత్కర్. ఇంతలో మైక్ నుంచి మహిళా పైలట్ (Woman Pilot) మాటలు వినిపించాయి. కేత్కర్‌ను యుద్ధవీరుడిగా ప్రయాణికులకు పరిచయం చేసింది. తర్వాత మాటలు విని ఆయన సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఎందుకంటే ఆ పైలట్ ఎవరో కాదు, ఆయన కూతురు భార్గవి. ‘సర్, మీరు బంధాలను తెంచుకున్న అమ్మాయి, మీ కూతురు భార్గవి ఈ విమానాన్ని నడుపుతోంది’ అనే మాటలు చెవిన పడగానే కేత్కర్ ఖిన్నుడయ్యారు.కేత్కర్ తేరుకునేలోపే కాక్‌పిట్ నుంచి బయటకు వచ్చిన భార్గవి, ఆయనకు ఎదురుగా నిలబడి సెల్యూట్ చేసింది. ‘నాన్నా.. నేను మీ కలను సాకారం చేశాను. మీరు అనుకున్నట్టుగానే పైలట్ అయ్యాను. దయచేసి నన్ను క్షమించండి’ అని వేడుకుంది. కూతురిని అలా చూడగానే ఆయన కరిగిపోయాడు. తన బిడ్డను ఆలింగనం చేసుకుని అప్యాయత కురిపించారు. ఇందాక మీకు మంచినీళ్లు ఇచ్చిన చిన్నారి ఎవరో కాదు తన కొడుకే అని భార్గవి చెప్పడంతో కేత్కర్ ఆనందంతో పొంగిపోయారు. ‘తాతయ్యా, నేను మీలాగే ఫైటర్ పైలట్ అవ్వాలనుకుంటున్నాను’ అని మనవడు అనడంతో ఆయన సంతోషం రెట్టింపయింది.‘బయట సూర్యుడు అస్తమించాడు. విమానం కిందకు దిగిపోయింది. కానీ అశోక్ కేత్కర్ జీవితం మళ్ళీ చిగురించింది’ అంటూ ఈ కథను ఎక్స్‌లో షేర్ చేశారు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా (Harsh Goenka). అయితే ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలు ఆయన వెల్లడించలేదు. ఈ పోస్ట్‌కు 3 లక్షలకు పైగా వ్యూస్, 5 వేలకు పైగా లైకులు వచ్చాయి.నెటిజన్ల రియాక్షన్..హర్ష్ గోయెంకా పోస్ట్‌పై పలువురు నెటిజనులు స్పందించారు. ‘దర్శకుడు మణిరత్నం దీన్ని చదివితే, ఈ కథకు ఒక రూపాన్ని ఇచ్చి సినిమా తెరకెక్కిస్తార’ని ఒకరు కామెంట్ చేశారు. ‘ఆ తండ్రి గర్వం, బాధ తన కూతురి కౌగిలిలో కరిగిపోయాయి. ఒకప్పుడు వారిని విడదీసిన ఆకాశం ఇప్పుడు వారిని కలిపింది. అతడు కూతురిని కోల్పోయాడు కానీ హీరోని కనుగొన్నాడు!’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇది నిజంగా జరిగిందనడానికి నమ్మదగిన ఆధారాలు లేవని మరొక యూజర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సోర్టీ చాట్‌జీపీటీ రాసిందా అని ఒక నెటిజన్ వ్యంగ్యంగా అడిగారు. కొంతమంది అయితే స్టోరీలోని లొసుగులను ప్రశ్నించారు. ఎక్కువ మంది మాత్రం పాజిటివ్‌గా స్పందించారు. At Mumbai airport, a wheelchair-bound veteran, Wing Commander Ashok Ketkar, boarded a flight to Delhi. He had lost both legs in service, but what truly broke him was losing his daughter Bhargavi, who married against his wishes.He hadn’t spoken to her in 5 years.Mid-flight, an…— Harsh Goenka (@hvgoenka) March 26, 2025 -
గ్లోబల్ స్టార్ రామ చరణ్ ఫిట్నెస్ సీక్రెట్..! డైట్లో అవి ఉండాల్సిందే..
చిరంజీవి నట వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. నటన పరంగా యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఎందులోనైనా తండ్రికి ధీటుగా చేసి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ప్రస్తుతం ఆయన గ్లోబల్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. ఇవాళ ఆయన పుట్టినరోజు. ఈ రోజుతో ఆయనకు 40 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా చరణ్ ఫిట్నెస్ సీక్రెట్, డైట్‌ప్లాన్‌లు ఏంటో చూద్దామా. ఆయన తొలి చిత్రం చిరుత మూవీ నుంచి ఇటీవల విడుదలైన గేమ్‌ఛేంజర్ మూవీ వరకు అదే లుక్‌తో కనిపించేలా బాడీని మెయింటైన్ చేస్తున్నారు. అంతలా ఫిట్‌గా కనిపించేందుకు వెనుక ఎంతో డెడీకేషన్తో చేసే వర్కౌట్లు అనుసరించే డైట్లే అత్యంత ప్రధానమైనవి. అవేంటో చూద్దామా..రామ్ చరణ్ ఒకసారి అపోలా లైఫ్ డాట్ కామ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను ఫిట్‌గా యాక్టివ్‌గా ఉండేందుకు ఎలాంటి వ్యాయమాలు, ఆహారం తీసుకుంటారో షేర్ చేసుకున్నారు. జంపింగ్ జాక్‌లు, సీటెడ్ మెషిన్ ప్రెస్‌ల నుంచి మిలిటరీ పుషప్‌లు, బార్బెల్ స్టిఫ్-లెగ్ డెడ్ లిఫ్ట్‌ల వరకు ప్రతిదీ చేస్తానని అన్నారు. అయితే ఇంట్లో వండిన భోజనం మాత్రమే తీసుకుంటానని అన్నారు. సమతుల్య జీవనశైలికి ప్రాధన్యాత ఇస్తానని చెప్పారు. ప్రతిరోజూ కొన్ని క్రీడలు తప్పనిసరిగా ఆడతానని అన్నారు. వారంలో నాలుగు రోజులు అధిక తీవ్రతతో కూడిన వ్యాయామాలు తప్పనిసరిగా చేస్తానని అన్నారు. ముఖ్యంగా ప్రశాంతంగా ఉండేందుకు ఇష్టపడతానని చెప్పారు. అలాగే ప్రతిరోజు ఒక గంటన్నర పాటు వ్యాయామం చేస్తానని తెలిపారు. అంతేగాదు శరీర బరువుని అదుపులో ఉంచే వ్యాయామాలపై దృష్టి పెడతానని చెప్పారు. 80% ఆహారంపైనే..ఫిట్ బాడీని నిర్వహించడంలో ఆహారం ప్రాముఖ్యతను హైలెట్ చేశారు రామ్‌చరణ. మన ఆరోగ్యం 80 శాతం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుందన్నారు. అందువల్ల మనం ఏం తింటున్నాం అనేది అత్యంత ముఖ్యం అని చెప్పారు. అలాగే తాను ఆహారం విషయంలో చాలా కేర్ తీసుకుంటానని చెప్పారు. అనారోగ్యకరమైన ఆహారాలకు చాలా దూరంగా ఉంటానని చెప్పారు. అంతేగాదు ప్రతి ఆదివారం చీట్మీల్స్లో పాల్గొంటా, కానీ అది సృతి మించకుండా చూసుకుంటానని అన్నారు. డైట్ సీక్రెట్స్ఫిట్నెస్ కోచ్ రాకేష్ ఉడియార్ రూపొందించిన డైట్ ప్లాన్ ప్రకారం..కెఫిన్, ఆల్కహాల్, చక్కెర పానీయాలు, రెడ్ మీట్, గోధుమలు, ప్రోటీన్ షేక్‌లకు దూరంగా ఉంటారట రామ్‌చరణ్. తన రోజుని గుడ్డులోని తెల్లసొనతో చేసిన ఆమ్లేట్ లేదా పూర్తి గుడ్లు, ఓట్స్, బాదంపాలతో ప్రారంభిస్తారట. ఆ తర్వాత మధ్యాహ్నం కూరగాయలతో చేసి సూప్‌ని తీసుకుంటారట. ఇక భోజనంలో చికెన్ బ్రెస్ట్, బ్రౌన్ రైస్, గ్రీన్ వెజిటేబుల్ కర్రీ తీసుకుంటారట. సాయంత్రం స్నాక్స్ కోసం గ్రిల్డ్ ఫిష్, చిలగడదుంప, గ్రిల్డ్ వెజిటేబుల్స్‌ను ఇష్టపడతారని చెప్పారు. సాయంత్రం 6 గంటలకు రాత్రి భోజనంలో 'లార్జ్ మిక్స్డ్ గ్రీన్ సలాడ్', కొన్ని అవకాడోలను తీసుకుంటారని తెలిపారు ఫిట్నెస్ కోచ్ రాకేష్ ఉడియార్.వారంలో చేసే వర్కౌట్లు:సోమవారం: బైసెప్స్ (తప్పనిసరి)మంగళవారం: క్వాడ్స్బుధవారం: క్లేవ్స్ అండ్ అబ్స్గురువారం: ఛాతీ ట్రైసెప్స్శుక్రవారం: బ్యాక్ వర్కౌట్లుశనివారం: హామ్ స్ట్రింగ్ అండ్ ఇన్నర్ థై అబ్స్ఆదివారం: ఫుల్ రెస్ట్ View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) (చదవండి: బాబోయ్ మరీ ఇంతలానా..! వైరల్‌గా ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ జీవనశైలి) -
'విల్ పవర్' అంటే ఇది..ఏకంగా వీల్‌చైర్‌తో బంగీ జంప్..!
మన మనోశక్తి ముందు ఎంత పెద్ద సమస్య లేదా అడ్డంకైన పక్కకు వెళ్లిపోవాల్సిందే. అందుకే అంటారు పెద్దలు సంకల్ప శక్తికి మించిన ఆయుధం ఇంకొకటి లేదని. విల్‌పవర్ ఉన్నోడికి దునియానే తలవంచి సలాం కొడుతుంది. అలాంటి సంఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ రిషికేశ్‌లో తన కంపెనీ ఉద్యోగి వీల్‌చైర్ తోపాటు బంగీ జంప్ చేస్తున్న వీడియోని పంచుకున్నారు. ఆయన సోషల్ మీడియా ఎక్స్‌లో ఈ వీడియోని జత చేస్తూ ఇలా రాశారు. "చాలామంది దీనిని థ్రిల్ కోసం చేస్తారు. కానీ మన మెహతా సంకల్ప శక్తి పవర్ చూపించడానికే ఈ సాహసం చేశారు. అయినా సంకల్ప శక్తి ముందు ఏ భయం, వైకల్యం అయినా పరార్ అయిపోవాల్సింది. దానిముందు ఏ అడ్డంకి నిలువలేవు అని రాసుకొచ్చారు పోస్ట్‌లో గౌతమ్ అదానీ. కాగా, గత నెల పిబ్రవరిలో అదానీ కుమారుడు జీత్ అదానీ దివాషాల వివాహంలో సామాజిక కార్యక్రమల కోసం దాదాపు రూ. 10 కోట్లు ఖర్చు చేస్తానని అన్నారు గౌతమ్ అదానీ. అలాగే ఆ కొత్త జంట కూడా ప్రతి ఏడాది సుమారు 500 మంది మహిళా వికలాంగులకు ఒక్కొక్కరం రూ. 10 లక్షలు చొప్పున విరాళంగా ఇస్తామని వాగ్దానం చేశారు. అంతేగాదు గౌతమ్ అదానీ హిందీ బుల్లితెర స్టార్ ప్లస్‌లో వచ్చే షార్క్ ట్యాంక్ ఇండియాలో సైతం ప్రముఖ టీవీ షోలో వికలాంగులు, వారి కోసం పాటుపడేవారి కోసం ఏదైనా చేయొచ్చేగా అని ఒక ఎపిసోడ్లో సూచించారు కూడా. Most people do it for the thrill. Kay Mehta, our own Adanian, did it to make a statement. From the heights of Rishikesh, strapped in his wheelchair, Kay took a leap that told the world: no odds, no fear, can stop willpower. Kay, you don’t just inspire us - you redefine what it… pic.twitter.com/n1CTvFKtsQ— Gautam Adani (@gautam_adani) March 27, 2025 (చదవండి: బాబోయ్ మరీ ఇంతలానా..! వైరల్‌గా ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ జీవనశైలి) -
బాబోయ్ మరీ ఇంతలానా..! వైరల్‌గా ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ జీవనశైలి
ఇటీవల ఇలా చేస్తే ఆరోగ్యానికి మంచిది అంటూ తెగ నెట్టింట ఫిట్నెస్ మంత్రాలు ట్రెండ్ అవుతున్నాయి. పాపం కొందరు ఫాలో అయ్యి వర్కౌట్ అవ్వాక ఇబ్బంది పడుతున్నారు. మరికొందరు మరిన్ని అనారోగ్య సమస్యలు కొని తెచ్చిపెట్టుకుంటున్నారు. ఇప్పుడు తాజగా ఓ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ తన విభిన్నమైన వెల్నెస్ రోటీన్ని నెట్టింట షేర్ చేశాడు. అది చూసి నెటిజన్లు బాబోయ్ మరీ ఇంత మంచి అలవాట్లా..అని విస్తుపోతున్నారు. నో ఛాన్స్ అదంతా వర్కౌట్ అయ్యే అవకాశం లేదని కామెంట్లు కూడా చేస్తున్నారు. మరీ అంత విచ్రితంగా అనిపించినా.. అతడి వెల్నెస్ రొటీన్ ఏంటో చూద్దామా..!.29 ఏళ్ల ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ ఆష్టన్ హాల్తన తీవ్రైమన ఆరోగ్య స్ప్రుహ కారణంగా నెట్టింట వైరల్‌గా మారాడు. అతడి ఫిట్నెస్ మంత్ర చూస్తే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలగక మానదు. అతడి స్ట్రిట్ ఫిట్నెస్ రొటీన్ ఎలా ఉంటుందంటే..అత్యంత క్రమశిక్షణాయుతమైన జీవనశైలి అతడిది. హాల్ ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ఉదయం 3:52 ప్రారంభమైమార్నింగ్ 9.30 గంటలకు ముగుస్తుంది. హాల్ నిద్రపోయేటప్పుడు తన నోటికి మౌత్ట్యాప్ వేసుకుంటాడు. ఇది గురకను నివారస్తుందనేది అతడి నమ్మకం. ఆ తర్వాత 7.30 నుంచి 8.30 గంటల వరకు స్విమ్మింగ్ పూల్‌లో గడిని తదనంతరం బ్రేక్‌ఫాస్ట్‌గా అరటిపళ్లు తీసుకుంటాడు.ఆ తర్వాత అదే అరటిపండు తొక్కలను ముఖానికి రుద్దుకుంటాడు. ఆ తర్వాతమ బ్రాండెడ్ మినరల్ వాటర్, గిలకొట్టన పచ్చిగుడ్లు, అవకాడో టోస్ట్ వంటివి అతడి ఆహారాలు. ఈ వెరైటీ దినచర్యకు గానూ హాల్ నెట్టింట వైరల్‌గా మారాడు. ఇది సాధ్యమయ్యేది కాదనేది నెటిజన్ల వాదన. అంతేగాదు సోషల్ మీడియాలో బ్రో బిజీ లైప్ ఇవన్నీ కష్టం అని కామెంట్ చేస్తూ పోస్టుల పెడుతున్నారుహాల్ అనుసరించే కొన్ని మంచి వెల్నెస్ ట్రెండ్లు..మౌత్ ట్యాపింగ్మౌత్ ట్యాపింగ్ అనేది రాత్రిపూట నోటిని మూసి ఉంచడానికి ఉపయోగించే ప్రత్యేక టేప్. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ ప్రసిద్ధ వెల్నెస్ ట్రెండ్ ముక్కు ద్వారా శ్వాస తీసుకునేలా చేస్తుంది. అలాగే పీల్చే గాలి ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. తద్వారా అలర్జీ కారకాలు, శిధిలాలు లేదా విషపదార్థాలు ఊపిరితిత్తులకు చేరక మునుపే ఫిల్టర్ అవుతాయి. అంతేగాదు తేలికపాటి స్లీప్ అప్నియా ఉంటే మౌత్ ట్యాపింగ్ హెల్ప్ అవుతుందని చెబుతున్నారు నిపుణులు. ముఖాన్ని ఐస్ వాటర్‌లో ముంచడం..చల్లటి నీటిలో ముఖాన్ని ముంచడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ఒత్తిడి హర్మోన్ స్థాయిని తగ్గిస్తుందట. నాడీ వ్యవస్థపై ప్రశాంతత ప్రభావాన్ని చూపుతుంది. చల్లటి నీరు రక్త నాళాలను ఇరుకుగా చేయడంలో సహాయపడుతుంది. రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. చర్మ కణాలకు ఆక్సిజన్ పోషకాలను అందిస్తుంది. ప్రకాశవంతమైన రంగుని అందించడంలో హెల్ప్ అవుతుందట. అంతేగాదు ఈ మంచులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయట. ఇవి మొటిమల రంధ్రాల పరిమాణాన్ని తగ్గిస్తాయట. అదే సమయంలో వాపు వంటివి దరిచేరనీయదు అని చెబుతున్నారు నిపుణులు.చర్మంపై అరటి తొక్క ప్రభావంఅరటిపండ్లు యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, పొటాషియంల శక్తివంతమైన వనరు. మొత్తం ఆరోగ్యానికి సహాయపడతాయి. చర్మంపై అరటి తొక్కను రుద్దడం వల్ల మాయిశ్చరైజర్‌గా పనిచేసి చర్మాని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. ముడతలు తగ్గుతాయి. గీతలు లేకుండా చేస్తుంది. అలాగే కళ్ళ కింద నల్లటి వలయాలను తగ్గిస్తుందని చెబుతున్నారు చర్మ నిపుణులుమార్నింగ్ వ్యాయామంఉదయం వ్యాయామం ప్రత్యేకమైన జీవక్రియ ప్రభావాలను కలిగి ఉంటుంది. అధ్యయనాల ప్రకారం, వ్యాయామం చేసే సమయంలో శరీరం జీవక్రియ ప్రతిస్పందనను ప్రభావితం చేస్తుంది. ఉదయం వ్యాయామాలు కొవ్వు జీవక్రియను మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా గ్లూకోజ్ టాలరెన్స్‌ను మెరుగుపరిచి అలసటను తగ్గిస్తుంది. అంతేగాదు శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది కూడా. అలాగే బాడీని ఫిట్‌గా ఉంచడమే కాకుండా మంచి నిద్రను, మెరుగైన ఏకాగ్రత అందిస్తుంది. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.(చదవండి: చిరాకుగా ఉన్నా..చిద్విలాసంగా ఉన్నా..చిరుతిండికే ఓటు..!) -
స్నాప్‌చాట్ క్రియేటర్ కనెక్ట్ ప్రోగ్రామ్! జెన్ జెడ్ స్టోరీ టెల్లర్స్‌కి అవకాశల వెల్లువ..
భారతదేశంలోని కంటెంట్ క్రియేటర్లను శక్తిమంతం చేసేలా హైదరాబాద్‌లో తొలి స్నాప్‌చాట్ క్రియేటర్ కనెక్ట్‌ను ప్రారంభించింది. ఇది లోకల్ టాలెంట్‌ని ప్రోత్సహించడమే గాక పరిశ్రమ సహకారాలతో కంటెంట్ క్రియేటర్ల తమ డిజిటల్ కథలను మరింత మెరుగుపరుచుకునేలా చేస్తుంది. అందులో భాగంగా స్నాప్ చాట్ హైదరాబాద్‌లోని ప్రముఖ క్రియేటర్ ఏజేన్సీలు టమాడా మీడియా, చాయ్‌బిస్కెట్ - ముటినీ, NRGY+, సిల్లీ మాంక్స్, వాక్డ్ అవుట్ మీడియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనివల్ల ప్రాంతీయ కంటెంట్ క్రియేటర్లకు మద్దతు లబించడమే గాక తదుపరి తరం ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు ఒక వేదిక అవుతుంది కూడా. Savvy on Snap వంటి కంటెంట్ ఎనేబుల్మెంట్ ప్రోగ్రామ్‌ల ద్వారా, భాగస్వాములు తమ Snapchat కమ్యూనిటీలకు ఉత్తమ పాప్ సంస్కృతిని తీసుకురావడంలో సహాయపడటానికి అవసరమైన స్నాప్ కన్సల్టింగ్ మద్దతు తోపాటు తగు వనరులను అందిస్తుంది. అంతేగాదు ఈ ప్లాట్‌ఫాం కంటెంట్క్రియేటర్లు లాభాలు ఆర్జించేలా రివార్డ్ ప్రోగ్రామ్‌లను కూడా అందిస్తోంది. ఇక్కడ క్రియేటర్లు తమ కథను ప్రేక్షకులను నిమగ్నం చేసేలా నిర్మించడం అనేది కీలకం. అదే వారికి ఆదాయాలను తెచ్చిపెడుతుంది. ఈ మేరకు స్నాప్ ఇంక్ డాట్ కంటెంట్, ఏఆర్ భాగస్వామ్యాల డైరెక్టర్ మాట్లాడుతూ..ఈ హైదరాబాద్ కంటెంట్ క్రియేటర్లకు నిలయం. ఇక్కడ మా మొట్టమొదటి Snapchat క్రియేటర్ కనెక్ట్ IPని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఇది జెన్ జెడ్ క్రియేటర్లు, వినియోగదారులకు కేంద్రంగా మారుతుంది. ట్రెండ్‌కి తగ్గ దృశ్యామన కళ పట్టుకోవడం, కుటుంబల లేదా స్నేమితుల అంతర్గత ఇతి వృత్తంగా ఉన్నవి తదతరాలకు Snapchat పెద్దపీట వేస్తుంది. పాప్ సంస్కృతిలో ఇది సరికొత్త మార్పుకి సంకేతమవుతుంద. భారతదేశం అంతటా ఉన్న కంటెంట్ క్రియేటర్లు ఈ స్నాప్‌చాట్ వేదికపై భాగస్వామ్యం అవుతారు. వారికి కావాల్సిన సహాయసహకారాలను తామందిస్తామని చెప్పారు సాకేత్ ఝా సౌరభ్.స్నాప్‌చాట్‌లో నేచురల్ స్టార్ అరంగేట్రంటాలీవుడ్ హీరో నాని ఈ కార్యక్రమంలో పాల్గొని మరింత సందడి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో తన మూవీ HIT: ది థర్డ్ కేస్ స్నాప్‌చాట్‌లో సహజంగా ప్రామాణికంగా ఉండటం గురించి మాట్లాడారు. అంతేగాదు స్నాప్‌చాట్ ఈ చిత్రం కోసం కొత్త మూవీ లెన్స్‌ను కూడా ప్రారంభించింది. ఈ ఇంటరాక్టివ్ AR లెన్స్ అభిమానులను యాక్షన్‌కు దగ్గరగా తీసుకువస్తుంది, పైగా సినీ ప్రపంచంలోకి అడుపెట్టేందుకు వీలు కల్పిస్తుంది. ఇక హీరో నాని మాట్లాడుతూ..కథ చెప్పడం ఎల్లప్పుడూ కనెక్ట్వ్గానే ఉంటుంది. యువ క్రియేటర్లు కథలు ఎలా చెబుతారు, తాజా ట్రెండ్ ఎలా ఉంటుంది తదితారాలు హైదరాబాద్ క్రియేటర్ కమ్యూనిటీతో తీసుకురావాలన్నా ఆలోచన బాగుంది. ఈ కార్యక్రమంలో భాగమవ్వడం మరింత అద్బుతంగా ఉంది. అంతేగాదు స్నాప్‌చాట్ ప్లాట్‌ఫామ్ క్రియేటర్లకు తమను తాము వ్యక్తీకరించుకోవడానికి కొత్త మార్గాలను అందిస్తున్నాయని అన్నారు.చివరగా ఈ కార్యక్రమం నయని పావని, శ్వేత నాయుడు, నైనికా అనసురు, ప్రణవి, అనుష రత్నం వంటి 50 మందికి పైగా అగ్ర సృష్టికర్తలను టాలెంట్ ఏజెన్సీలు, బ్రాండ్లు, పరిశ్రమ భాగస్వాములు పాల్గన్నారు. నిపుణుల నేతృత్వంలోని చర్చలలో భాగంగా, తమడ మీడియా నుంచి రాహుల్ తమడ క్రియేటర్ అనుభవాలు, వృద్ధి స్నాప్‌చాట్‌లో విజయంపై అనుభవాలను పంచుకున్నారు. అయితే చాయ్‌బిస్కెట్ నుంచి అనురాగ్ స్నాప్‌లో చిత్రాల భాగస్వామ్యం గురించి నొక్కి చెప్పారు. అందుకు సంబంధించిన కీలక ఉదాహరణలు, విజయగాథలను హైలైట్ చేశారు. స్నాప్‌చాట్ సాధనాలు - లెన్సులు, స్పాట్లైట్, స్టోరీస్ - క్రియేటర్ల ఆవిష్కరణ సామర్థ్యాన్ని మెరుగుపరచి, ప్రేక్షకులను ఎలా నిమగ్నమయ్యేలా చేస్తాయో ఈ కార్యక్రమానికి హజరైనవారికి వివరించారు నిర్వాహకులు.(చదవండి: ప్రియాంక చోప్రా..ఫ్రీడమ్ సెలబ్రేషన్..ఓ బిడ్డకు తల్లి అయితే తిప్పలు తప్పవు..!) -
అందం, వికారం పక్కపక్కనే ఉంటాయా..? షాక్‌లో చిత్రకారుడు
అతను ఓ చిత్రకారుడు. అతనికి ఓ అందమైన నగుమోము, వికారమైన మోము చిత్రాలు గీయాలనుకున్నాడు. ముందుగా అతను ఓ అందమైన నగుమోము గల ఓ చిత్రం గీయడానికి నిర్ణయించుకున్నాడు. చాలాకాలానికి అతను అనుకున్నట్టే ఓ అందమైన అయిదేళ్ళ చిన్నవాడొకడు కనిపించాడు. ఆ పసివాడి పెద్దల అనుమతితో వాడి బొమ్మ గీశాడు. ఆ చిత్రం ఎంతో అందంగా ఉంది. ఆ తర్వాత వికారస్వరూపమోము కోసం వెతకడం మొదలుపెట్టాడు. చాలా కాలమే పట్టింది. అతనిలో విసుగు మొదలైంది. అయినా ప్రయత్నం మానలేదు. ఉన్నట్లుండి అతనికి ఓ ఆలోచన వచ్చింది. ఎక్కడెక్కడో వెతకడమెందుకు ఒక జైలుకి వెళ్తే తాననుకున్న వికారస్వరూపుడు తారసపడతాడనుకున్నాడు. దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత అతను అనుకున్నట్టే ఒక జైలులో ఓ వికారమైన మోముగల ఒక వ్యక్తి కనిపించాడు. దాంతో అప్పటి దాకా అతనిలో ఉన్న నీరసం, విసుగు మటుమాయమయ్యాయి. ఉత్సాహం ఉ΄ప్పొంగింది. జైలు అధికారి అనుమతితో ఆ వికారస్వరూపుడి బొమ్మ గీయడం మొదలుపెట్టాడు. గీస్తున్నంతసేపు ఆ వికారస్వరూపుడిని మాటల్లో పెట్టాడు. అతని ఊరు, పేరు, పెద్దల వివరాలు ఇలా ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నాడు. అతను చెప్పిన వివరాలన్నీ విన్న తర్వాత చిత్రకారుడు నిశ్చేష్టుడయ్యాడు. ఎందుకంటే అతను మరెవరో కాదు, అందమైన చిన్నవాడనుకుని కొన్నేళ్ళ క్రితం గీసిన ఆ కుర్రాడే ఇప్పుడీ వికారస్వరూపుడు. కాలక్రమంలో ఆ అందమైన చిన్నోడు అనేక నేరాలూ ఘోరాలు చేసి ఇప్పుడిలా వికారస్వరూపుడిగా మారి తనముందున్నాడు. ఈ నిజం తెలిసి చిత్రకారుడి నోటి వెంట మాట లేదు. ప్రతి మనిషిలోనూ అందమూ, వికారమూ ఉంటాయి. అయితే అతన్ని ఒకసారి అందంగానూ, మరోసారి వికారంగానూ చూపేది అతనున్న పరిస్థితులే!– యామిజాల జగదీశ్ (చదవండి: సహజ యోగం..సమతుల్య జీవనం..!) -
సహజ యోగం.. సమతుల్య జీవనం..!
మానవుల ఆధ్యాత్మిక ప్రయాణంలో స్త్రీ పాత్ర అత్యంత కీలకమైనది. పురుషులు నిత్యజీవితంలో తమ చుట్టూ ఉండే స్త్రీలను గౌరవించడం ద్వారా తమ సూక్ష్మ శరీరం లోపల శక్తి కేంద్రాలను లేదా షట్చక్రాలను చైతన్యవంతం చేసుకోవచ్చు. తల్లిని గౌరవించినప్పుడు అతని లోపల శ్రీ గణేశుని సుగుణాలు స్థిరపడడం వలన మూలాధార చక్రము చైతన్య వంతం అవుతుంది. అలానే తల్లితో ఉండే అనుబంధం చక్కగా ఉన్నప్పుడు ఎడమవైపు హృదయ చక్రం చైతన్యవంతం అవుతుంది. తన సోదరీమణులను గౌరవించినప్పుడు, ఎడమవైపు విశుద్ధి చక్రం చైతన్య వంతం అవుతుంది. తన భార్యను గౌరవించినప్పుడు ఆమె తన ఇంటికి గృహ లక్ష్మి కాబట్టి ఎడమవైపు నాభీ చక్రం చైతన్య వంతం అవుతుంది. అలానే భార్యతో అతని సంబంధం చక్కగా ఉన్నప్పుడు ఎడమవైపు హృదయ చక్రం చైతన్యవంతం అవుతుంది. పరస్త్రీలను తల్లి వలె లేదా సోదరి వలె గౌరవించినప్పుడు ఆజ్ఞా చక్రం చైతన్యవంతం అవుతుంది. కాబట్టి పురుషులు తమ ఆధ్యాత్మిక ఉన్నతి కోసం స్త్రీలను గౌరవించవలసిన ఆవశ్యకతను తెలుసుకొని తదనుగుణంగా నడుచుకోవాలి.ఎప్పుడైతే ఒక స్త్రీ తన సంపూర్ణ శక్తులను ధరించి ఉపయోగిస్తుందో అప్పుడు ఆమె చాలా శక్తివంతమై భీకరంగా ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడూ వాదిస్తూ, కొట్లాడుతూ, విమర్శిస్తూ, చౌకబారుగా ప్రవర్తిస్తుందో, అప్పుడు ఆమె శక్తులన్నీ వృధా అయిపోతాయి. ఆమె కావాలనుకుంటే పురుషులకంటే ఎక్కువగా పని చేయగలదు. అయితే మొట్టమొదటగా ఆమె ఎంతో నమ్రతతోను, అణకువతోనూ, హుందాతనంతోను, చక్కటి అవగాహనతోను, వాత్సల్యపూరితంగా ఉండి తనలోగల శక్తులను గౌరవించుకుంటూ, శాంతిని నెలకొల్పటం నేర్చుకోవాలి. ఒక కవచం వలే రక్షణను కల్పించటం స్త్రీ యొక్క బాధ్యత. కవచం కత్తి యొక్క పనిని చేయలేదు. అలానే కత్తి కవచం చేసే పనిని చేయలేదు. అయితే ఆ రెండింటిలో ఏది గొప్ప? కవచమే గొప్ప. ఎందుచేతనంటే అది కత్తి యొక్క దెబ్బను తట్టుకోవాలి కాబట్టి. కత్తి విరుగుతుందేమో కానీ, కవచం మాత్రం విరగదు. అలా స్త్రీలు వారి శక్తులను గుర్తించి అందులో స్థిరపడాలి. నమ్రత అనేది ఆ శక్తికి ఒక గొప్ప ఇరుసు లాంటిది. ఎంతో నమ్రతా భావంతో, విధేయతతో ఆ శక్తులను తమ లోనికి గ్రహించుకుని వారు అందులో స్థిరపడాలి. మనం రోజూ పేపర్లో కానీ టీవిలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎన్నోహింసాత్మక, అనైతిక కార్యక్రమాలను చూస్తున్నాము. వాటి ప్రభావం చిన్న పిల్లల మీద, స్త్రీల మీద పడి సమాజం నాశనమవుతోంది. సహజయోగ మార్గాన్ని సరైన రీతిలో అర్థం చేసుకొని ఆచరించడం ద్వారా మహిళలు అటువంటి సమాజంలో పరివర్తన తీసుకు రాగలరు.ప్రపంచ వ్యాప్తంగా సహజ యోగా ధ్యాన సాధన చేస్తున్న మహిళలు అందరూ శ్రీ మాతాజీ నిర్మలా దేవి అనుసరించిన, ప్రబోధించిన స్త్రీ ధర్మాలను ఆచరిస్తూ ఉత్తమ కుటుంబ సభ్యులుగా తమ తమ దైనందిన జీవితంలో ప్రశాంతమైన, సమతుల్య జీవనం గడుపుతున్నారు.– డా. పి. రాకేష్ శ్రీ మాతాజీ నిర్మలాదేవి ప్రవచనాల ఆధారంగా (చదవండి: కాశీ కంటే పురాతన క్షేత్రం: 'వృద్ధాచల క్షేత్రం'..!) -
కాశీ కంటే పురాతన క్షేత్రం: 'వృద్ధాచల క్షేత్రం'..!
వృద్ధాచలాన్ని వృద్ధ కాశి అని కూడా పిలుస్తారు. ఇక్కడి స్థలపురాణం ప్రకారం వృద్ధ కాశిగా పేరొందిన ఈ విరుదాచలంలో మరణిస్తే కాశీలో మరణించిన వారికంటే ఎక్కువ పుణ్యమే లభిస్తుందని చెబుతారు. కాశీలో చెప్పినట్టే ఇక్కడ కూడా చనిపోతున్నవారి శిరస్సును తన ఒడిలో ఉంచుకొని ఇక్కడ కొలువై ఉన్న వృద్ధాంబిక తన చీర కొంగుతో విసురుతూ ఉండగా వారి చెవిలో పరమేశ్వరుడు తారక మంత్రాన్ని ఉపదేశించి వారికి మోక్షం ప్రసాదిస్తాడని చెబుతారు. అదే విధంగా పరమశివుడు నటరాజ రూపంలో నాట్యానికి ప్రసిద్ధి. ఈయన చిదంబరంలో కాళీమాతతో పోటిపడి నాట్యం చేస్తే ఈ విరుదాచలం లేదా వృద్ధాచలంలో తన సంతోషం కోసం నాట్యం చేశాడని చెబుతారు. అంతే స్వామి సంతోష తరంగాల్లో తేలి΄ోతూ నాట్యం చేసిన ప్రదేశం ఇదే.స్థలపురాణం...పూర్వం ఇక్కడ ప్రజలు కరువు కాటకాల వల్ల నిత్యం అష్ట కష్టాలు పడేవారు. దీంతో స్థానికంగా ఉండే విభాసిత మహర్షి, స్వామివారికి సేవ చేస్తే ఫలితం ఉంటుందని చె΄్పాడు. దీంతో ఆ ఊరిపెద్దలంతా కలిసి స్వామి వారికి దేవాలయం నిర్మించాలని తీర్మానించారు. అయితే ఆ సమయంలో వారి జీవనం ఎలా అన్న అనుమానం మొదలయ్యింది. దీనికి విభాసిత మహర్షి, వృద్ధేశ్వర స్వామి వారిపై నమ్మకంతో పని చేయండి చేసుకొన్నవారికి చేసుకొన్నంతగా లాభం చేకూరుతుందని చెప్పారు. దీంతో ప్రజలు ఆ పనికి పూనుకొన్నారు. ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకూ పనిచేసిన వారికి విభాసిత మహర్షి స్థానికంగా ఉంటున్న చెట్టు నుంచి కొన్ని ఆకులు తీసుకొని పనిచేసిన వారికి ఇచ్చేవాడు. ఆశ్చర్యం... ఎవరు ఎంత పని చేసారో అంతకు సమానంగా ఆ ఆకులు నాణాలుగా మారేవి. అప్పటి నుంచే చేసిన వారికి ‘చేసినంత, చేసుకున్నవారికి చేసుకొన్నంత’ అనే నానుడి మొదలయ్యిందని చెబుతారు. ఐదుతో అవినాభావ సంబంధం...ఈ ఆలయంలో 5 అంకెకు విశిష్ట స్థానం ఉంది. ఈ ప్రాంగణంలో పూజలందుకొనే మూర్తులు 5. వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, శివుడు, శక్తి, భైరవుడు. ఇక్కడ స్వామి వారికి 5 పేర్లు ఉన్నాయి. అవి విరుధ గిరీశ్వరుడు, పఝమలైనాధార్, విరుద్ధాచలేశ్వర్, ముద్దుకుండ్రీశ్వరుడు, వృద్ధ గిరీశ్వరుడు. ఆలయానికి 5 గోపురాలు, 5 ప్రాకారాలు, 5 మండపాలు, 5 నందులు ఉన్నాయి. వేకువ జాము నుంచి రాత్రిదాకా స్వామికి నిర్ణీత సమయంలో 5 సార్లు పూజలు చేస్తారు. ఇక్కడ 5 రథాలు ఉన్నాయి. ఇక్కడ స్వామివారు స్వయంభువుడు. ఇక్కడ శివుడిని ప్రార్థించిన వారికి మనశ్శాంతి కలగడమే కాకుండా అన్నిరకాల శరీర రుగ్మతల నుంచి వెంటనే విముక్తి కలుగుతుందని చెబుతారు. ఇక్కడ ఉన్న దుర్గాదేవిని పూజిస్తే వివాహం, సంతానం కలగడం వంటి కోరికలు నెరవేరుతాయని చెబుతారు. ΄ాతాళ వినాయకుడు శ్రీ కాళహస్తిలో ఉన్నట్లు ఇక్కడ విఘ్నేశ్వరుడు భూతలం నుంచి కిందికి ఉన్న ఆలయంలో ఉంటాడు. ఈ ఆలయంలోని స్వామివారిని సందర్శించడానికి 18 మెట్లు దిగి కిందికి వెళ్లాల్సి ఉంటుంది. చని΄ోయిన వారి చితా భస్మాన్ని ఇక్కడున్న మణి ముత్తా నదిలో నిమజ్జనం చేస్తే అవి చిన్న రాళ్లుగా మారి నది అడుగున చేరుతాయని చెబుతారు. ఈ విరుదా చలంలోని నదిలో వేసిన నాణాలు తిరువారూరు కోవెల పుష్కరిణిలో తేలుతాయని చెబుతారు. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు... ఇక్కడ వల్లీ దేవసేనలతో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువు తీరి ఉన్నాడు. ఆయన ఆలయంలో పైన చక్రాలు ఉంటాయి. అవి శ్రీ చక్రం, సుబ్రహ్మణ్య చక్రం, అమ్మవారి చక్రం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఇలాంటి చక్రాలు చాలా తక్కువ శివాలయంలో చూస్తాం. అందులో ఇది ఒకటి. అందుకే ఇక్కడ స్వామివారికి విన్నించుకొన్న కోరికలు త్వరగా తీరుతాయని చెబతారు.ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకూ అదే విధంగా సాయంకాలం 3.30 గంటల నుంచి 9 గంటల వరకూ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ కూడా తిరువణ్ణామలైలో చేసినట్లుగానే ప్రతి పౌర్ణమికీ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. దీనివల్ల వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం.చెన్నై నుంచి 230 కిలోమీటర్ల దూరంలో కడలూర్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడానికి నిత్యం బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి.ఇక్కడ వేసిన నాణేలు అక్కడి కొలనులో ...ఒకసారి సుందరర్ అనే శివభక్తుడు ఈ దారి గుండా వెడుతూ ఇక్కడి స్వామివారిని స్తుతించాడు. దీంతో స్వామి వారు స్వయంగా 12 వేల బంగారు నాణాలను అంద జేస్తాడు.తాను తిరువారూర్ వెళ్లాల్సి ఉందని అయితే తోవలో దొంగల భయం ఉందని సుందరార్ భయపడుతాడు.ఇదే విషయాన్ని శివుడికి చెబుతాడు. దీంతో శివుడు తాను ఈ నాణాలను ఇక్కడే ఉన్న మణిముత్తా నదిలో వేస్తానని, నీవు తిరువారూర్ వెళ్లిన తర్వాత అక్కడి కొలనులో తీసుకోవచ్చని చెబుతాడు. ఇందుకు అంగీకరించిన సుందరార్ తిరువారూర్ వెళ్లి అక్కడ కొలనులో నుంచి 12వేల బంగారు నాణాలను తీసుకొన్నాడని కథనం. అదే విధంగా ఆ నాణ్యాల నాణ్యతను సాక్షాత్తు వినాయకుడు పరీక్షించి అటు పై ఆ భక్తాగ్రేసరుడికి ఇచ్చారని చెబుతారు. డి.వీ.ఆర్(చదవండి: ప్రియాంక చోప్రా..ఫ్రీడమ్ సెలబ్రేషన్) -
ఎంత పెద్ద స్టార్ అయినా ఓ బిడ్డకు తల్లి అయితే ఇంతేగా..!: ప్రియాంక చోప్రా
పిల్లలను నిద్రపుచ్చడానికి తల్లులు పడే పాట్లు ఇన్నీ అన్నీ కావు. అల్లరి బిడ్డ నిద్రలోకి జారుకుంటే ఆ తల్లి ఆనందం ఇంతా అంతా కాదయా! ఇలాంటి అనుభవాన్ని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సొంతం చేసుకుంది. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను సరదాగా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది ప్రియాంక చోప్రా ఈసారి తన సరికొత్త పోస్ట్‌లో స్వాతంత్య్ర వేడుకల గురించి మాట్లాడింది!. నిద్రిస్తున్న తన కూతురు మాల్తీ మేరీ జోనాస్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ప్రియాంక. ‘మీ సూపర్ యాక్టివ్ బేబీ నిద్రపోతుంటే’ అని ప్రియాంక ఈ వీడియోను పరిచయం చేసింది. దీంతోపాటు లాఫింగ్ ఇమోజీని కూడా షేర్ చేసింది. కొన్ని సెకన్ల తరువాత టామ్, జెర్రీ డ్యాన్స్ చేస్తుండగా బ్యాక్‌గ్రౌండ్‌లో పాట వినిపిస్తుంది. ఈ వీడియోకు ‘ఆజాదీ’ అనే కాప్షన్ ఇచ్చింది. కూతురు అల్లరి చేయకుండా హాయిగా నిద్రపోవడమే... తనకు స్వాతంత్య్ర వేడుక!.(చదవండి: 'నలుపే అందం'..శక్తిమంతమైనది!: వర్ణవివక్షపై కేరళ సీఎస్ స్ట్రాంగ్ రిప్లై.. ) -
కాశ్మీర్ అందాలతో.. హాయిదరాబాద్
ఎండలు మండుతున్నాయి.. ఉదయం 10 గంటలు దాటితే భానుడు భగ్గుమంటున్నాడు. ఈ సమయంలో మైనస్ డిగ్రీల్లో గడ్డకట్టే చల్లని ప్రదేశం కోసం ఎదురుచూస్తున్నారా..? ఉపశమనం కోసం హిమగిరుల్లో సేదతీరాలని కోరుకుంటున్నారా.. సిమ్లా పొగ మంచులో విహరించాలని, డార్జిలింగ్ గడ్డకట్టిన మంచుపై స్కేటింగ్ చేయాలని ఆశిస్తున్నారా.. అయితే మీకోసం నగరంలో స్నో థీమ్‌తో వింటర్ థ్రిల్లింగ్ ప్రదేశాలు సిద్ధంగా ఉన్నాయి.కాశ్మీర్ మంచు కొండల అనుభూతిని కొండాపూర్‌లోని ఓ మాల్తో పాటు లోయర్ ట్యాంక్‌బండ్‌లోని ఓ ప్రాంతంలో సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. కుటుంబ సభ్యులు, పాఠశాలలు, కళాశాల విద్యార్థులు, కార్పొరేట్ సంస్థలు, ఐటీ కంపెనీ ఉద్యోగులు ఇలా వివిధ వర్గాలకు చెందిన వానిరి ఆకట్టుకోవడానికి వింటర్ థ్రిల్లింగ్ వినోద కేంద్రాల్లో ప్రత్యేకించి ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. కుటుంబ వ్యవహారాలు, చదువు, పనిఒత్తిడి నుంచి ఉపశమనం కోసం మైనస్ డిగ్రీల్లో సేదతీరేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. స్నో ప్రాంతంలోకి ప్రవేశించడానికి ముందు చలిని తట్టుకునే జర్కినీ, బూట్లు, చేతి గ్లౌజ్‌లు నిర్వాహకులు అందిస్తారు. విశాలమైన మంచు గదిలోకి వెళ్లగానే కశీ్మర్, సిమ్లా, డార్జిలింగ్ తదతర ప్రదేశాలు గుర్తుకొస్తాయి. మంచు కొండలు ఉన్న ప్రదేశాలకు వెళ్లాలంటే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవచ్చు. ఇక్కడే తక్కువ ఖర్చుతో ఆ అనుభూతి పొందవచ్చు. మండు వేసవిలో గడ్డకట్టిన స్నో, పొగ మంచుపై కాసేపు సరదాగా ఎంజాయ్ చేయవచ్చు.పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారుహిమాలయాల్లో ఉన్నామన్న ఫీల్ ఉంది. చాలాబాగా నచ్చింది. గడ్డకట్టిన ఐస్, పొగమంచు, వివిధ రకాల థీమ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మేం మొత్తం ఐదుగురం వచ్చాం. మా కంటే మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. – దీప, షేక్‌పేట్, హైదరాబాద్బాగా నచ్చింది ..మాది విశాఖపట్నం. మా ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి గతంలో ఇక్కడికి వచ్చాం. ఈ ప్రాంతం ఎంతగానో నచ్చింది. మరో రావాలనిపించింది. పాఠశాలలకు సెలవులు కావడంతో మళ్లీ మా అక్క నేను వచ్చాం. మంచులో బాగా ఎంజాయ్ చేస్తున్నాం. – హనీష్, రిథిమ, విశాఖపట్నంమంచు క్రీడలు.. విశాలమైన అతిశీతల గదుల్లో మంచు క్రీడలు అందుబాటులో ఉంటాయి. టోబోగానింగ్, స్నో స్లెడ్డింగ్, స్నో రాక్ క్లైమింగ్, స్నో డాన్స్, ఫ్లోర్లో డాన్స్ వంటివి ప్లాన్ చేసుకోవచ్చు. మంచు ప్యాలెస్‌లు, మంచుతో కప్పబడిన పర్వతాలు, నల్ల సీల్స్‌తో కూడిన ఓక్ చెట్లు, ధ్రువ ఎలుగుబంట్లు, పెంగి్వన్లు, ఇగ్లూలు కనువిందు చేస్తున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో స్నో మచ్ ఫన్, గేమ్స్‌తో గొప్ప జ్ఞాపకాలను సొంతం చేసుకోవచ్చు. పిల్లలు, పెద్దలకు వేర్వేరుగా టికెట్ ధరలు ఉంటాయి. -
మా చెల్లికి 28 ఏళ్లు.. పెళ్ళి చెయ్యొచ్చంటారా?
డాక్టర్! మా చెల్లెలి వయస్సు 28 ఏళ్లు. డిగ్రీ పాసయ్యింది. ఐదేళ్లుగా మానసిక వ్యాధికి మందులు ఇప్పిస్తున్నాం. తనలో తాను నవ్వుకోవడం, గొణుక్కోవడం, ఎవరేది అంటున్నా తన గురించేననడం. చెవిలో ఎవరివో మాటలు వినబడుతున్నాయనడం... పనేమీ చేయదు. సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో వైద్యం చేయించిన తర్వాత చాలా మెరుగైంది. కానీ పూర్తిగా మామూలు మనిషి కాలేదు. మా నాన్న లేరు. చెల్లికి పెళ్ళి చేయాలని అమ్మ తాపత్రయం. చెల్లి మానసిక స్థితి గురించి చెప్పకుండా చేస్తే తర్వాత సమస్యలొస్తాయని భయం. ఇలాంటి వారికి పెళ్ళి చెయ్యొచ్చంటారా? దీనికి పరిష్కారం ఉందా? – ఉదయరాణి, హైదరాబాద్మీరు చెప్పినదాన్ని బట్టి మీ చెల్లెలు...‘స్కిజోఫ్రీనియా’ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాధి వచ్చినవారు చాలా సంవత్సరాలపాటు డాక్టరు పర్యవేక్షణలో మందులు వాడాల్సి ఉంటుంది. ఈ వ్యాధి పూర్తిగా నయం కాకపోవచ్చు. షుగర్, బి.పి. లాగా స్కిజోఫ్రీనియాని కూడా మందులతో అదుపు చేయవచ్చే తప్ప, పూర్తిగా నయం చేయడం కష్టమే! ఇలాంటి వారికి కేవలం మందులే కాకుండా, కొంతకాలం ‘రిహాబిలిటేషన్’ సెంటర్లో ఉంచితే, ఆమె యాక్టివ్‌గా, నలుగురిలో కలిసేటట్లుగా తన పనులే కాకుండా, ఇంటిపని, వంటపని, పిల్లలను చూసుకోవడం లాంటి లక్షణాలు ఆమెలో పెంపోదించేట్లుగా శిక్షణ ఇస్తారు.ఇలా చేసిన తర్వాతే అవతలివారికి విషయం చెప్పి వారు ఒప్పుకుంటే వివాహానికి అభ్యంతరం లేదు. చెప్పకుండా చేయడం అనర్థదాయకం. అన్ని విషయాలు చెబితే కొందరు ఒప్పుకోవచ్చు. అవసరమైతే డాక్టరు దగ్గరికి కూడా అవతలి పార్టీని తీసుకొచ్చి వారి అనుమానాలు నివృత్తి చేయడం మంచిది. అన్నీ చెప్పి వాళ్ల సమ్మతి మీద పెళ్లి చేసిన సందర్భాలలో భవిష్యత్తులో ఏమైనా తేడాలే వచ్చినప్పుడు ఒకవేళ వారు విడాకుల కేసు వేసినా కోర్టు అంత సులభంగా విడాకులు మంజూరు చేయదు.ఎందుకంటే గతంలో ఒకరు తన భార్యకు స్కిజోఫ్రీనియా ఉంది కాబట్టి విడాకులివ్వాలని కోర్టుకెక్కాడు. అయితే స్కిజోఫ్రీనియా జబ్బు వచ్చినంత మాత్రాన విడాకులు ఇవ్వలేం, కానీ ఆ వ్యాధి వలన ఆ భర్త, పిల్లలు, కుటుంబం ఏమేరకు నష్టపోయిందనే విషయాలను నిర్ధారించగలిగితేనే అలాంటి కేసుల విషయంలో విడాకులు ఇవ్వాలా, వద్దా... అనే దాన్ని నిర్ణయించవలసి ఉంటుందని గతంలో సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ఈ జడ్జిమెంట్‌ను ఇప్పటికీ మన దేశంలో ప్రామాణికంగా పాటిస్తూ ఉన్నారు.డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
స్నేహ శిల్పం
వరల్డ్ ఆర్ట్ మార్కెట్లో మన ఆర్ట్ వాటా 0.5 శాతమే! అసలు విలువ రెండువేల కోట్లకు పైమాటే అని చెబుతున్నారు నిపుణులు! మరెందుకు అంత తక్కువంటే.. ‘మనకు ఆర్ట్‌ను మార్కెట్ చేసుకోవడం తెలీక’ అంటారు ఆర్ట్‌లో పీహెచ్డీ, ఆర్ట్ ట్రేడ్‌లో అపార అనుభవం గడించిన హైదరాబాద్ కళాకారిణి, శిల్పి డాక్టర్ స్నేహలతా ప్రసాద్. ఆమె పరిచయం.. .డాక్టర్ స్నేహలతా ప్రసాద్ సొంతూరు జోద్పూర్. తండ్రి దివాన్సింగ్ నరూకా డిఫెన్స్‌లో పనిచేసేవారు. అమ్మ.. లీలా దివాన్ హోమ్ మేకర్. ఆడపిల్లల మీద ఆంక్షలుండే రాజపుత్ర కుటుంబమైనా తల్లిదండ్రులిద్దరూ చదువుకున్నవారవడంతో స్నేహలతకు స్వేచ్ఛనిచ్చారు. ఆమె డాక్టర్ అవ్వాలని తండ్రి ఆశపడ్డాడు. కానీ స్నేహకు చిన్నప్పటి నుంచీ డ్రాయింగ్ అంటే ఆసక్తి. చక్కగా బొమ్మలు వేసేది. ఆర్మేచర్, క్లే ఆర్ట్ మీద వ్యాక్స్‌తో అలంకరించేది. అది గమనించే లీలా దివాన్ కూతురు ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంది. ఆమె అనుకున్నట్టే స్నేహ ఆర్టిస్ట్ అయింది. పీహెచ్డీ చేసింది. తన ఆర్ట్‌ని మార్కెట్ చేసుకునే ఆర్టూ తెలిసుండాలని ఫారిన్ ట్రేడ్ కోర్స్ కూడా చేసింది. సొంతంగా గ్యాలరీ పెట్టుకుంది. ఆర్ట్ + 2ఎగ్జిబిషన్స్ లో ఆమె పెయింటింగ్స్ ఎమ్మెఫ్ హుస్సేన్ పెయింటింగ్స్‌తో సమంగా సేల్ అయ్యేవి! అలా రాజస్థాన్‌లో టాప్ టెన్ యంగ్ ఆర్టిస్ట్స్లో ఒకరుగా నిలిచింది.పెళ్లితో...సంప్రదాయ రాజపుత్ర కుటుంబాల నుంచి వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ పెళ్లయ్యాక స్నేహ గృహిణిగా ఉండాలనే షరతుతో వచ్చినవే! దాంతో వాటిని తిరస్కరించారు స్నేహ తల్లిదండ్రులు. అప్పుడే స్నేహా వాళ్ల ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక సంబంధం తీసుకొచ్చారు. అబ్బాయి డాక్టర్. నాన్‌మెడికల్ ప్రొఫెషన్ అమ్మాయి కోసం వెదుకుతున్నాడతను. అందరికీ నచ్చడంతో 2004లో పెళ్లి అయింది. అతని పేరు డాక్టర్ ప్రసాద్ పత్రి. తెలుగు వ్యక్తి. అయితే అది రాజ్‌పుత్ సంబంధం కాదని ఆ పెళ్లికి స్నేహా వాళ్ల దగ్గరి బంధువులెవరూ రాలేదు. కొత్తదంపతులు హైదరాబాద్ వచ్చేశారు. పెళ్లయిన వెంటనే పిల్లలు పుట్టడంతో మాతృత్వాన్ని ఆస్వాదించాలనుకుంది స్నేహ. దాంతో పెయింటింగ్‌కి బ్రేక్ పడింది.సెకండ్ ఇన్నింగ్స్...పదేళ్ల తర్వాత మళ్లీ కాన్వాస్ ఫ్రేమ్ చేసుకుంది స్నేహ. అయితే అదంత ఈజీ కాలేదు. పెళ్లికిముందు ఆర్టిస్ట్‌గానే కాదు మంచి ఆంట్రప్రెన్యూర్‌గానూ స్పేస్ సంపాదించుకున్న ఆమెకు ఈ పదేళ్లలో చాలా మారిపోయినట్టనిపించింది. దాంతో జీరో నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ షో కోసం ఢిల్లీ లలిత కళా అకాడమీని బుక్ చేసుకుంది. నెల రోజుల్లో ప్రదర్శన. బ్రేక్ తీసుకున్న పదేళ్ల కాలాన్నే పద్నాలుగు పెయింటింగ్స్ తో వ్యక్తపరచింది. మరోటి ‘గోల్డెన్ ఎరా ఆఫ్ ఇండియన్ పెయింటింగ్’. తనను ఇన్స్పైర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఆర్ట్ఫామ్స్ని ట్రాన్స్పరెంట్ ఫామ్‌లో వేసిన 32 అడుగుల తన తొలి పెద్ద పెయింటింగ్. దాని కోసం చాలా కష్టపడింది. ఆ శ్రమ వృథా కాలేదు. కాంప్లిమెంట్స్తోబాటు కాసులూ వచ్చాయి. లలిత కళా అకాడమీలో ఆమెకు లభించిన ఆదరణ చూసి భర్త ప్రసాద్ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆమె కెరీర్‌కి సపోర్ట్‌గా నిలిచారు.శిల్పం...2013లో లలిత కళా అకాడమీ వాళ్లదే సిమ్లాలో ఆర్ట్ క్యాంప్ ఉంటే వెళ్లింది స్నేహ. అందులో పెయింటింగ్, స్కల్ప్చర్ రెండూ ఉన్నాయి. అక్కడ వుడ్ స్కల్ప్టింగ్ చూసేసరికి ఒక్కసారిగా తన చిన్నప్పటి స్కల్ప్టింగ్ ఆశ రెక్కలు తొడుక్కుంది. స్కల్ప్టింగ్కి ప్రయత్నించింది. తొలుత క్లే మోడలింగ్‌తో స్కల్ప్టింగ్ జర్నీ స్టార్ట్ చేసింది. తర్వాత స్టోన్ వర్క్ మొదలుపెట్టింది. ఆర్ట్ అండ్ కల్చర్ మినిస్ట్రీ జూనియర్ ఫెలోషిప్ కూడా పొందింది. ఎన్నో ఆర్ట్ క్యాంప్స్, నేషనల్, ఇంటర్నేషనల్ సింపోజియమ్స్ను నిర్వహించింది. ఈ మధ్యనే 25వ సోలో షో చేసింది. ఇంటర్నేషనల్ ఆర్ట్ షోస్‌నూ క్యురేట్ చేస్తోంది. ఆర్ట్ లెక్చర్స్ ఇస్తుంది. లాంగెస్ట్ పెయింటింగ్ ఆఫ్ ఇండియాలో పేరు సంపాదించింది. హైదరాబాద్‌లో ‘స్నేహా డి ఆర్ట్స్’ పేరుతో గ్యాలరీప్రారంభించింది. పెయింటింగ్, స్కల్ప్చర్లో శిక్షణ ఇస్తోంది. సంప్రదాయానికి విరుద్ధంగా తనను చదివించినందుకు, కళారంగంలో ప్రోత్సహించినందుకు ఎవరైతే స్నేహ కుటుంబాన్ని విమర్శించారో వాళ్లంతా స్నేహను చూసి మొత్తం ఖాన్దాన్కే ఖ్యాతినార్జించి పెట్టిందని గర్వపడే స్థాయికి ఎదిగింది. – సరస్వతి రమస్నేహలతా ఆర్ట్ క్రెడిట్స్రాజస్థాన్, ఢిల్లీ, హరియాణా హైవై, పుణె, హైదరాబాద్, కొత్తగూడెంలలో స్కల్ప్టింగ్ చేసింది. దేశంలోని పలుప్రాంతాల్లో పదిహేను ఎన్వైర్మెంట్ ఫ్రెండ్లీ పార్క్స్‌ను డిజైన్ చేసింది. సికంద్రాబాద్ కంటోన్మెంట్‌లోనూ స్కల్ప్టింగ్ చేసింది. వందల ఏళ్ల నాటి శిల్పాలను రెస్టొరేట్ చేసింది. ఏఐ ఇంటిరీయర్ డిజైన్ చేస్తోంది. బికనీర్ ఆర్మీ కోసమూ పనిచేస్తోంది.‘కళతోపాటు మార్కెట్‌ను క్రియేట్ చేసుకునే స్కిల్ కూడా ఉండాలి. ఎమ్మెఫ్ హుస్సేన్ సాబ్ గనుక తన మార్కెట్‌ను డెవలప్ చేసుకోకపోయి ఉంటే ఈరోజు ఆయన ఎవరికీ తెలిసుండేవారు కాదు. ఆర్ట్‌కి మార్కెట్ అంత ఇంపార్టెంట్. ఆర్ట్ అకడమిక్స్‌లోనూ మార్కెటింగ్‌ని చేర్చాలి. విమెన్ ఆర్టిస్ట్‌లు తమ పరిధిని విస్తృతం చేసుకోవాలి. బడ్డింగ్ ఆర్టిస్ట్‌లకు చెప్పేదొకటే.. ఓన్ స్టయిల్‌ను తద్వారా ఓన్ మార్కెట్‌ను క్రియేట్ చేసుకోవాలి.’– డాక్టర్ స్నేహలతా ప్రసాద్ -
World Theatre Day: రాజుల కాలం నుంచి హవా సాగుతోంది..!
రాజుల కాలం నుంచి విరాజిల్లుతూ నేటికీ తనప్రాభవాన్ని నిలబెట్టుకుంటున్న రంగం నాటకరంగం... మరింతమందికి ఈ రంగాన్ని చేరువ చేయడానికి కృషి చేస్తున్నవారు ఎందరో. ప్రపంచవ్యాప్తంగా మార్చి 27న రంగస్థల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా చదువుకు సాధనంగా, సామాజిక మార్పు కోసం ప్రభావంతంగా పనిచేసే నాటకం ప్రాముఖ్యత, మన సంస్కృతిలో ఎంతగా మమేకం అయ్యిందో తెలియజేస్తున్నారు కళాకారులు సురభి లలిత, ఆర్.రేఖ, ఇరిగి త్రివేణి.నైపుణ్యాలకు మెరుగుఎనిమిదేళ్ల వయసు నుంచే నాటకరంగంలోకి వచ్చాను. 28 ఏళ్లుగా నాటకరంగంలో ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నాను. నెలలో 4 నుంచి 8 వరకు ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. ఈ నెల 29న హైదరాబాద్‌లో మూడు రోజుల పాటు స్వేచ్ఛ నాటక ప్రదర్శన ఉంది. ఒక నాటకం చూడటానికి 500 నుంచి 800 మంది హాజరవుతుంటారు. లైవ్ ఫెర్ఫార్మెన్స్ కాబట్టి ఎంతో సంతోషం ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకోవడానికి పనికివస్తుంది. ఒక్కొక్క నాటిక 50 నుంచి వందసార్లు కూడా ప్రదర్శిస్తుంటాం. ఎంత ఇబ్బంది ఉన్నా, రాత్రిళ్లు నిద్ర లేకపోయినా సరే ఒకసారి మేకప్ వేసుకొని, వేదిక ఎక్కగానే ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. ‘గడి’ అనే నాటికకు ఉత్తమ నటి అవార్డు వచ్చింది. కిందటేడాది వేసిన స్వేచ్ఛ, నిశి.. నాటికలలో నా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. నాటక ప్రదర్శనలు లేనప్పుడు సినిమా ఆడిషన్స్‌కి వెళుతుంటాను. ఆ విధంగా ‘బలగం’ సినిమాలో మంచి పాత్ర వచ్చింది. కొన్ని వెబ్సీరీస్లలోనూ నటిస్తున్నాను. – సురభి లలిత, హైదరాబాద్ఎన్నో అవకాశాలకు దారి చూపిందిమా నాన్న వారసత్వంగా నాటక, హరికథా కళాకారిణిగా ప్రదర్శనలు ఇచ్చేదాన్ని. ఆ ఇష్టంతోనే ఎం.ఎ. థియేటర్ ఆర్ట్స్ చేశాను. సీతారాముల కళ్యాణంలో సీత పాత్ర, చరణ్దాసు నాటకంలో రాణి పాత్రలతో నాటకరంగానికి పరిచయం అయ్యాను. డా.బిఆర్ అంబేడ్కర్ రాజ గృహప్రవేశం నాటకంలో రమాబాయి పాత్రకు మంచి పేరు వచ్చింది. జాతీయ బహుమతి పొందిన రేడియో తెలుగు నాటకాలు– ఒక పరిశీలన అనే అంశంపై పరిశోధన చేస్తున్నాను. గాయనిగా వేదికల మీద ప్రదర్శనలు ఇస్తుంటాను. సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ పనిచేస్తున్నాను. ఇవన్నీ నాటకం నాకు ఇచ్చిన వరాలుగా చెప్పవచ్చు. గురుకుల పాఠశాలలో మ్యూజిక్ టీచర్‌గా చేస్తున్నాను. – ఆర్.రేఖ, హైదరాబాద్వెక్కిరించినవారే మెచ్చుకున్నారుమాది గ్రామీణ నేపథ్యం. తెలుగు యూనివర్శిటీలో జానపదం, అక్కడే థియేటర్ ఆర్ట్‌లో పీజీ చేశాను. వర్క్‌షాప్స్ చేస్తూ, నాలుగేళ్లుగా నాటకాలు వేస్తున్నాను. సమ్మక్క సారలమ్మ, చాకలి ఐలమ్మ, వి ఆర్ ఇండియన్స్.. ఇలా నాటకాల జాబితా ఎక్కువ. ఇప్పుడు చాలా థియేటర్ గ్రూప్స్ వస్తున్నాయి. సినిమాల వాళ్లు కూడా థియేటర్లో నటిస్తున్నవారికిప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికి పది రాష్ట్రాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నాను. మన వారసత్వం, సంప్రదాయాలు మన ముందు తరాలకు పరిచయం చేయాలని టీచింగ్ వైపుకు వచ్చాను. డ్యాన్స్, మ్యూజిక్, థియేటర్.. టీచర్‌గా కిందటి నెలలో సోషల్ వెల్ఫేర్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ విద్యార్థులకు బోధిస్తున్నాను. నేను చదువుకునేటప్పుడు మా చుట్టుపక్కల వాళ్లు ఈ నాటకాలు, డ్యాన్సులు ఏంటి.. పెళ్లి చేసుకోకుండా అనేవారు. ఇప్పుడు ‘సాధించావు’ అంటుంటారు. – ఇరిగి త్రివేణి, దేవరకొండ, నల్లగొండ– నిర్మలా రెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
నలుపు అంటే శక్తి
నాలుగు సంవత్సరాల అమ్మాయి తన తల్లిని ‘అమ్మా... నన్ను తిరిగి నీ గర్భంలోకి తీసుకొని తెల్లగా పుట్టించగలవా?’ అని అడిగింది. తల్లి ఆశ్చర్యంగా చూసి ‘ఎందుకమ్మా?’ అని అడిగింది. ‘నల్లపిల్ల అంటూ నన్ను అందరూ వెక్కిరిస్తున్నారు’ కళ్లనీళ్లతో చెప్పింది ఆ అమ్మాయి. ‘రంగుది ఏముందమ్మా! నువ్వు చదువుకొని పెద్ద స్థాయిలో ఉంటే రంగు గురించి ఎవరూ మాట్లాడరు’ అన్నది ఆ తల్లి ఓదార్పుగా.కట్ చేస్తే.... ఆ అమ్మాయి కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలాంటి పెద్ద పదవిలోకి వచ్చింది. అయినా నల్లటి ఆమె ఒంటి రంగును హేళన చేస్తూ అయిదు దశాబ్దాలుగా ఆమెను బాధిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తన ఆవేదనకు అక్షర రూపం ఇచ్చి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శారదా మురళీధరన్.‘నలుపు’ అనే ముద్ర వేసి వెక్కిరించడంపై శారదా మురళీధరన్ గొంతు విప్పారు. ‘ఇది విశ్వం యొక్క సర్వవ్యాప్త సత్యం అయినప్పుడు ఆ రంగును ఎందుకు కించపరుస్తున్నారు?’ అంటూ ప్రశ్నించారు. వర్ణ, లింగ వివక్షకు సంబంధించిన కామెంట్స్‌పై ఫేస్బుక్లో ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.శారదకు ఎంతోమంది నుంచి మద్దతు వెల్లువెత్తింది.‘ నల్లరంగు కారణంగా నేను ఇతరుల కంటే తక్కువ అనే భావన నాలో ఉండేది. నా పిల్లలు మాత్రం నలుపు అంటే అందం అంటారు. నల్లజాతి వారసత్వాన్ని కీర్తించారు. నేను గమనించని చోట అందాన్ని వెదుక్కుంటూ వచ్చారు. వారి మాటలు నలుపు వర్ణం విలువను, అందాన్ని గుర్తించేలా చేసింది’ అంటారు శారద.శారద 1990 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆరేళ్ల పాటు ప్రతిష్ఠాత్మకమైన ‘కుటుంబ శ్రీ’కి నేతృత్వం వహించారు. ఆ తర్వాత జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు. పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు.త్రివేండ్రం జిల్లా కలెక్టర్‌గా, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కమిషనర్‌గా... ఇలా ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించారు. గత సంవత్సరం భర్త డాక్టర్ వేణు నుంచి కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయినా సరే... ‘నలుపు’ పేరుతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వెక్కిరింపులు ఎదురవుతూనే ఉన్నాయి. కేరళ చీఫ్ సెక్రటరీగా తన భర్త నుంచి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రంగుతో పోల్చుతూ, ఆ పదవికి మీరేం సరిపోతారు? అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేశారు. వారి కామెంట్స్‌లో నలుపు రంగును తక్కువ చేసి వెక్కిరించడం ఉంది. ఆడవాళ్లకు పెద్ద పదవులు ఎందుకు? అనే పురుషాధిపత్య భావజాలం ఉంది. ఈ నేపథ్యంలోనే తన మనసులోని ఆవేదనను ఫేస్బుక్ పోస్ట్‌లో పెట్టారు శారద. ఆ పోస్ట్‌పై మొదట్లో కొందరి కామెంట్స్ చూసిన తరువాత ఆ పోస్ట్‌ను డిలీట్ చేశారు. ‘మీ పోస్ట్ నేపథ్యంలో చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి’ అని శ్రేయోభిలాషులు చెప్పడంతో మరోసారి పోస్ట్ చేశారు. రీ–షేర్ చేసిన తరువాత ఆమె పోస్ట్‌కు మద్దతుగా ఎన్నో కామెంట్స్ వచ్చాయి. శారద ధైర్యసాహసాలకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెను ప్రశంసించిన వారిలో కేరళ అసెంబ్లీలో ప్రతిపక్షనేత సతీశన్ కూడా ఉన్నారు.‘నల్లరంగు కారణంగా నేను ఇతరుల కంటే తక్కువ అనే భావన నాలో ఉండేది. నా పిల్లలు మాత్రం నలుపు అంటే అందం అంటారు. నల్లజాతి వారసత్వాన్నికీర్తించారు. నేను గమనించని చోట అందాన్ని వెదుక్కుంటూ వచ్చారు. వారి మాటలు నలుపు వర్ణం విలువను, అందాన్ని గుర్తించేలా చేసింది’ -
సాంస్కృతిక నగరిలో.. ఇండియా ఆర్ట్ ఫెస్టివల్
హైదరాబాద్ నగరం విభిన్న సంస్కృతుల సమ్మేళనంతో పాటు విభిన్న కళలకు గమ్యస్థానంగా నిలుస్తోంది. ఈ ఆనవాయితీ ఈనాటిది కాదు. నిజాం కాలం నుంచే వినూత్న, విదేశీ కళలకూ ప్రసిద్ధిగాంచింది. ఇందులో భాగంగానే నగర వేదికగా ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి ‘ఇండియా ఆర్ట్ ఫెస్టివల్’ (ఐఏఎఫ్) నిర్వహించనున్నారు. న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి విభిన్న నగరాల నుంచి ప్రముఖ ఆర్టిస్టులు ఈ కళా ఉత్సవంలో తమ కళలను ప్రదర్శించనున్నారు. 2011 నుంచి న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబయి నగరాల్లో నిర్వహించే ఈ ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ రెండో ఎడిషన్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఆర్ట్ ఫెస్టివల్‌తో పాటు ఫ్యూజన్ షోలు, లైవ్ మ్యూజిక్ షోలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ‘ది ఎటర్నల్ కాన్వాస్ – 12,000 ఇయర్స్ జర్నీ త్రూ ఇండియన్ ఆర్ట్’ ప్రదర్శన హైలైట్‌గా నిలువనుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ ప్రదర్శనలో ప్రతి రాష్ట్రం నుంచి కళాకారులు పాల్గోనున్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా 25 ఆర్ట్ గ్యాలరీలతో, 100 ఎయిర్ కండిషన్డ్ స్టాల్స్, దేశవ్యాప్తంగా 50 మంది దిగ్గజ కళాకారులతో పాటు దాదాపు 200 మంది ప్రముఖ, యువ, ఔత్సాహిక కళాకారులు రూపొందించిన 3,500 పైగా వైవిధ్యమైన పెయింటింగ్స్, శిల్పాలు ఈ ఆర్ట్ ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ ఆర్ట్ ఫెస్టివల్ రేతిబౌలి (మెహదీపట్నం) పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్ నంబర్ 68 దగ్గరున్న కింగ్స్ క్రౌన్ కన్వెన్షన్‌లో ఏప్రిల్ 4 నుంచి 6వ తేదీ వరకూ 11:00 నుంచి రాత్రి 8:00 గంటల వరకూ కొనసాగుతుంది. ప్రముఖ కళాకారుల ప్రదర్శన.. ప్రముఖ కళాకారులు జోగెన్ చౌదరి, మను పరేఖ్, క్రిషేన్ ఖన్నా, శక్తి బర్మన్, సీమా కోహ్లీ, పరేశ్ మెయితీ, యూసుఫ్ అరక్కల్, ఎస్ జి వాసుదేవ్, అంజోలీ ఎలా మీనన్, అతుల్ దోడియా, లక్ష్మా గౌడ్, టి వైకుంఠం, చింతల జగదీశ్, గిగి సర్కారియా, ఎంవి రమణా రెడ్డి, లక్ష్మణ్ ఏలె, అశోక్ భౌమిక్, గురుదాస్ షెనాయ్, జతిన్ దాస్, పి జ్ఞాన, రమేశ్ గోర్జాల తదితర ప్రముఖ కళాకారుల కళారూపాలు ప్రదర్శనలో కనువిందు చేయనున్నాయి. వైవిధ్యమైన కళావేదిక.. కళాకారులు తమ నెట్వర్క్ మరింతగా పెంచుకోడానికి, భిన్న రంగాలకు చెందిన ప్రేక్షకుల ఎదుట తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇది చక్కటి వేదిక. తమ ఇళ్లను చక్కని సృజనాత్మక కళాఖండాలతో అందంగా అలంకరించుకోవాలని ఉవ్విళ్ళూరే నగర యువతకు ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ చక్కని వేదికగా నిలుస్తుంది. చదవండి: స్మితా సబర్వాల్ అలా అనడం బాధాకరంయువ, మిడ్–కెరీర్ కళాకారులు తమ కళాకృతులను పలువురు దిగ్గజ కళాకారులతో పాటు ప్రదర్శించడానికి ‘వన్–స్టాప్ ఆర్ట్ షాప్’గా ఈ వేదిక నిలుస్తుంది. హైదరాబాద్ నగరం నుంచి ఆర్ట్స్బ్రీజ్ ఆర్ట్ గ్యాలరీ, గ్యాలరీ సెలెస్టే, ఐకాన్ ఆర్ట్ గ్యాలరీ, స్నేహా ఆర్ట్స్, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ వంటి సంస్థలు తమ కళాకృతులను ప్రదర్శిస్తున్నారు. – రాజేంద్ర, డైరెక్టర్ –ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ -
చిరాకుగా ఉన్నా.. చిద్విలాసంతో ఉన్నా.. చిరుతిండికే ఓటు ..!
ఆఫీసులో ఉండగా కలుద్దామని ఫ్రెండ్ ఫోన్ చేస్తే సమీపంలో ఉన్న ఏ ఛాయ్ క్యాంటీన్లోనో, కేఫ్‌లోనో కలుద్దాం అని చెబుతాం.. ఏ పార్క్‌లోనో, ట్యాంక్ బండ్ మీదో ఒంటరిగా కూర్చున్నప్పుడు పల్లీలు అమ్మేవాడో, ముంత కింద పప్పు వాడో కనిపిస్తే.. నోటికి పని చెబుతాం.. ఇలా ఎందుకు చేస్తాం? ఆకలి తీర్చుకోడానికా? లేక అవి తినాలనే ఆతృతతోనా? అంటే రెండూ కాదు.. మన మూడ్‌ను మెరుగుపరుచుకోవడం కోసం అంటున్నారు హైదరాబాద్ నగరవాసులు. రోడ్డు పక్కన దొరికే పానీ పూరీ కావచ్చు, థియేటర్లో కరకరమనిపించే పాప్ కార్న్ కావచ్చు.. సరదాగా లాగించే సమోసాలు కావచ్చు.. చిది్వలాసంతో నమిలేసే చిప్స్కావచ్చు.. ఇవన్నీ ఇంట్లో ముప్పూటలా తినేతిండికి అదనం. మన మూడ్స్‌ను మెరుగుపరిచే ఇంధనం.. గోద్రెజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎస్టీటీఈఎమ్ 2.0 స్నాకింగ్ రిపోర్ట్ ప్రకారం గత కొంతకాలంగా అధ్యయనాలు చెబుతున్న ఇదే అంశాన్ని అంగీకరిస్తున్నారు నగరవాసులు. చిరుతిండి మనలో ఉత్సాహాన్ని పెంచుతుంది. మన భావోద్వేగాలను మెరుగుపరచడంలో శక్తిమంతమైన పాత్ర పోషిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఎప్పుడు? ఎందుకు? ఏమిటి ఎలా.. సిటిజనులు స్నాక్‌కు సై అంటున్నారు? ఈ రిపోర్ట్‌లో పేర్కొన్న ప్రకారం చూస్తే.. మంచి మూడుకు స్నాక్ బూస్ట్..చిరుతిండి, హ్యాపీ మూడ్స్ ఒకదానికొకటి అనుబంధంగా ఉంటున్నాయనేది స్పష్టంగా తెలుస్తోంది. సర్వేలో పాల్గొన్నవారిలో 62% మంది మూడ్స్‌ను హ్యాపీగా ఉంచడం కోసం స్నాక్స్ తీసుకుంటారని అంగీకరించారు. అదే విధంగా 45% మంది పార్టీలు, వేడుకల సమయంలో ఫ్రోజెన్ స్నాక్స్ కోసం చూస్తామని చెప్పారు. అంటే విభిన్న రకాల వంటకాలు ఉన్నప్పటికీ స్నాక్స్ విలువ తగ్గదు అని దీనిద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే అవి వారి అనుభవాలను మరింతగా మెరుగుపరుస్తాయనే ఆలోచనతోనే అని చెబుతున్నారు. అలాగే నగరంలో 45% మంది వారాంతాల్లో కూడా ఫ్రోజెన్ స్నాక్స్‌ను ఇష్టపడతారు. వారి విశ్రాంతి సమయాలకు కొత్త రుచులను జత చేస్తారు. ఆరోగ్యకరమైనవి ఎంచుకుంటే మేలు.. స్నాక్స్ తీసుకోవడం తప్పుకాకున్నా.. ఒబెసిటీ ముప్పు వెంటాడుతూనే ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మితంగా తీసుకునే చిరుతిండిలో ఆరోగ్యకరమైన బాదం తదితర పప్పులు చేర్చాలని, విటమిన్లు, జింక్, ఫోలేట్ ఐరన్‌తో సహా 15 ముఖ్యమైన పోషకాల సహజ మూలంగా ఆల్మండ్స్ రోగనిరోధకతను మెరుగుపరుస్తాయని పోషక నిపుణులు చెబుతున్నారు. ఇవి ఎప్పుడైనా ఆస్వాదించడానికి అనుకూలమైన చిరుతిండిగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తేల్చింది. అలాగే నారింజ, ద్రాక్షపండు వంటి సిట్రస్ పండ్లు విటమిన్–సీ అందిస్తాయి. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకం–ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా రక్షణ ఇస్తుంది. ఈ పండ్లను స్నాక్స్‌గా మార్చుకోవడం రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. అలాగే ఆకుకూరలతో కూడిన వెజ్ సలాడ్స్ కూడా మేలైనవేనని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు.టైం ఏదైనా.. అటెన్షన్ కోసం.. పరీక్షల ముందు టెన్షన్ కావచ్చు.. రొమాంటిక్ సమయంలో అటెన్షన్ కావచ్చు.. కాదే సందర్భమూ స్నాకింగ్‌కు అనర్హం అంటున్నారు నగరవాసులు. నగరంలో 17% మంది విద్యార్థులు పరీక్షా సన్నాహక సమయంలో ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం చిరుతిండికి జై కొడుతున్నామని అంటున్నారు. మరోవైపు శృంగార సమయంలోనూ మానసిక స్థితిని బెటర్‌గా ఉంచేందుకు స్నాక్స్ తోడు కోరుకుంటున్నామని 16 శాతం మంది చెప్పారు. ఆట పాటల్లోనూ అదే బాట.. ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ పోటీ జరుగుతోంది. ఇలాంటి ప్రత్యక్ష క్రీడా ఈవెంట్లను కేఫ్స్లోనో, పబ్స్/క్లబ్స్లోనో వీక్షించే సమయంలో దాదాపు అందరి ముందూ ఏదో ఒక చిరుతిండి కనబడడం మనం గమనించవచ్చు. ఇదే విషయాన్ని అంగీకరిస్తూ నగరంలో 50% మంది తమ వీక్షణ అనుభవాన్ని మెరుగుపరచుకోడానికి స్నాక్స్‌కి సై అంటారు. అదే విధంగా 54% మంది నగరవాసులు టీవీ/ఒటీటీ/మొబైల్లో వెబ్ సిరీస్, సినిమాలు లేదా షోలను చూస్తున్నప్పుడు స్నాక్స్ తీసుకోడాన్ని ఇష్టపడతామని చెప్పారు. -
'నలుపే అందం'..శక్తిమంతమైనది!: వర్ణ వివక్షపై కేరళ సీఎస్ స్ట్రాంగ్ రిప్లై..
జాతి వివక్షకు మించిన అతిపెద్ద రోగం వర్ణ వివక్ష. మనుషులంతా ఒకేలా ఉంటే ఏముంది ఘనత అని పెద్దలు అంటుంటారు. కానీ కొందరికి అవేం పట్టవు. ఒక మనిషి తన శరీర రంగుని బట్టి.. చిన్నబుచ్చేలా మాట్లేడుస్తుంటారు చాలామంది. అవతలి వ్యక్తి ఎంత పెద్ద విద్యావేత్త లేదా అధికారి అన్న స్ప్రుహ ఉండదు. కేవలం శరీర వర్ణం నల్లగా ఉంటేనే..అతడు/ఆమెని ఏమైనా అనే అవకాశం వచ్చేస్తుందా..? లేక నలుపు రంగు అంటేనే లోకువ అనేది ఎవ్వరికీ అర్థంకానీ బాధని రగిల్చే సున్నితమైన అంశం. ఆ వ్యాఖ్యలన్నింటికి కేరళ సీనియర్ బ్యూరోక్రాట్ చాలా శక్తిమంతమైన రిప్లై ఇచ్చారు. ఇప్పుడది నెట్టింట హాట్‌టాపిక్‌గా మారడమే గాక శెభాష్ మేడమ్ బాగా చెప్పారంటూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆమె చెప్పిన తీరు చూస్తే నలుపులో ఇంత అందం దాగుందా అనిపిస్తుంది. మరి అదేంటో చూసేద్దామా..!కేరళ ప్రధాన కార్యదర్శి శారద మురళీధరన్ తన వంటి రంగు(నల్లటి రంగును )పై సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలకు చాలా స్ట్రాంగ్‌గా కౌంటరిచ్చారు. చెప్పాలంటే ఆ వ్యాఖ్యాలను తిప్పి కొట్టేలా కంటే ఆలోచింప చేసేలా నల్లనిదనంలోని అందాన్ని వెలికితెచ్చారామె. మరోమారు నల్లటి రంగు అని అవహేళన చేసే సాహసమే చేయనీకుండా చాలా చక్కగా పోస్ట్‌లో రిప్లై ఇచ్చారు. ఆమెపై చేసిన వ్యాఖ్య ఏంటి..?, ఏం చెప్పారామె అంటే..1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి శారద మురళీధరన్ ఆమె ప్రస్తుతం కేరళలో చీఫ్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో కొందరూ ఆమె పనితీరుని భర్త (మాజీ కేరళ ప్రధాన కార్యదర్శి వి వేణు) రంగుతో పోలుస్తూ..ఆమె భర్త ఒంటి రంగు తెలుపులా నల్లగా ఉందని వెటకారంగా పోస్టులు పెట్టారు. ఆమె వాటిని చూసి వెంటనే ఆ పోస్టులని డిలీట్ చేసేశారు. అయితే కొందరూ శ్రేయోభిలాషుల విజ్ఞప్తి మేరకు దీనిపై మాట్లాడుతున్నా అంటూ ఆ పోస్టులను రీ పోస్ట్ చేస్తూ.. రాసుకొచ్చారు. శారద మురళీధరన్ పోస్ట్‌లో.." నా నల్లదనాన్ని సొంత చేసుకునేందుకు మాట్లాడుతున్నా.. చీకటి హదయం నలుపు రంగు. సాయంత్రానికి సంకేతం. వర్షం వాగ్దానం(నల్లిని మేఘాలే వర్షం రాక). అదికేవలం రంగు మాత్రమే కాదు. అనారోగ్యానికి, చెడుకి సంకేతంగా కూడా భావిస్తారు. అసలు అది లేకపోతే ఎలా గుర్తించగలరు మంచిని. నలుపు అనగానే చులకన భావం వచ్చేస్తోంది. ఈ నల్లని రంగు విశ్వం సర్వవ్యాప్త సత్యం. అందుండబట్టే అంతరిక్షం, నక్షత్రాలు అన్న వాటి గురించి తెలుసుకోవాలనే ఆశ కలిగింది. ఇది అత్యంత శక్తిమంతమైన కలర్. ఏ రంగునైనా తనలో ఇముడ్చుకోగలదు. ఆఫీస్ దుస్తుల నుంచి ఇంటికి వెళ్లాక వేసుకునే క్యాజువల్ వరకు అన్నింట్లో ఈ నలుపు తప్పక ఉంటుంది. ఆఖరికి కంటి పాపకూడా నలుపు ఉంటేనేగా చూసేది. అలాంటి నలుపైపై ఎందుకింత అక్కసు, చులకనభావం అని నిలదీశారు. తాను కూడా ఒకప్పుడూ ఈ నలుపుని తక్కువగానే చూశా అంటూ తన చిన్ననాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు. నాలుగేళ్ల వయసులో అమ్మా నేను తెల్లగా పుడతాను కదా మళ్లీ నీ గర్భంలోకి వెళ్లితే అని అంటుండేదాన్నిఅలా 50 ఏళ్లు నా ఒంటి రంగు మంచిది కాదనే భావనలోనే బతికేశా. కానీ ఆ నలుపులోని అందాన్ని గుర్తించడంలో నా పిల్లలే సాయం చేశారు. వాళ్లు తమ నల్లజాతి వారసత్వాన్ని కీర్తించారు. నలుపులో ఉన్న అద్భుతాన్ని, అందాన్ని నాకు కళ్లకు కట్టినట్లు చూపించాక గానీ నేను గుర్తించలేదు నలుపు ఇంత అందంగా ఉంటుందని" అని పోస్టులో రాసుకొచ్చారామె.రంగు తక్కువ అనేభావం మాయం..సీనియర్ బ్యూరోక్రాట్ మురళీధరన్ పోస్టులో రాసిన ప్రతి మాట మనస్సుని హత్తుకునేలా ఉంది. అని కేరళ అసెంబ్లీలోని ప్రతిపక్ష నాయకుడు సతీశన్ అన్నారు. తన తల్లి కూడా నలుపురంగులోనే ఉందని, ఇది చర్చకు రావాలని కోరుకున్నా అని ఆయన పోస్ట్‌లో పేర్కొన్నారు.కాగా, శారద మురళీధరన్ తన భర్త వి. వేణు పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన స్థానంలో గతేడాది ఆగస్టు 31న ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో ఆమె నియామకం అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే కేరళ చరిత్రలోనే తొలిసారిగా భర్త నుంచి ఆమె ఛీప్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకారించారామె. ఇక ఆమె గతంలో పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ డైరెక్టర్ జనరల్‌గా, నేషనల్ రూరల్ లైవ్లిహుడ్స్ మిషన్‌లో సీఓఓగా, కుటుంబంశ్రీ మిషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కీలక పాత్రల్లో పనిచేశారు.(చదవండి: ఉషా వాన్స్ నటి దీపికా పదుకునే స్టైల్‌ని రీక్రియేట్ చేశారా..? వివాదాస్పదంగా ఇవాంకా పోస్ట్) -
ఉషా వాన్స్ నటి దీపికా పదుకొణె స్టైల్‌ని రీక్రియేట్ చేశారా..?
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నోసార్లు జేడీ వాన్స్ బహిరంగంగా తన భార్య ఉషను ప్రశంసిస్తూ పొగడ్తలతో మంచెత్తుతుంటారు. అంతేగాదు తన కెరీర్‌లోని ప్రతి విషయంలోనూ ఆమె అండగా ఉంటుందని చెబుతుంటారు కూడా. అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేప్పటినప్పటి నుంచి ఉషా కూడా ప్రతి వేడుకలో వాన్స్‌తో జతగా కనిపిస్తూ..వార్తల్లో హైలెట్ అవుతున్నారు. ఈ సారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక కారణంగా మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఇక్కడ ఇవాంక ఉషా వాన్స్ గురించి చేసిన పోస్ట్ పెద్ద దుమారం రేపి గందరగోళానికి గురిచేసింది. అయినా ఇలా ఉషా వాన్స్‌ని ప్రశంసిస్తూనే అవమాన పరిచేలా ఫోటోలు షేర్ చేశారేంటని మండిపడుతున్నారు నెటిజన్లు. ఇంతకీ ఇవాంక పోస్ట్‌లో జరిగిన తప్పిదం ఏంటంటే..డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ ఉషా వాన్స్‌ని ప్రశంసిస్తూనే పోస్ట్ పెట్టినా.. అది వివాదాస్పదమైంది. ఇవాంక ఆ పోస్ట్‌లో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భార్యని ప్రశంసిస్తూ.. ఆమెలోని అపారమైన దయ, గొప్ప తెలివితేటలు ఎవ్వరినైనా కట్టిపడేస్తాయి. ఆమె నిష్ణాతురాలైన న్యాయవాది కూడా అంటూ ఆమెపై పొగడ్తల జల్లు కురిపిస్తూ..మార్ఫింగ్ చేసి ఉన్న జేడీ వాన్స్ ఫోటోని షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా నెట్టింట ఇదేం పని ఇవాంకా అంటూ.. తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ప్రముఖ బాలీవుడ్ నటి దీపికా పదుకొణేకి సంబంధించిన ఫోటోని ఉషా వ్యాన్స్గా మార్ఫింగ్ చేసిన ఫోటోని ఎలా పోస్ట్ చేశారంటూ మండిపడుతున్నారు నెటిజన్లు. అంతలా ఇవాంక పోస్ట్ వివాదాస్పదమై నెటిజన్ల ఆగ్రహానికి గురి కావడానికి ప్రధాన కారణం మార్ఫింగ్ ఫోటో అనే కాదు. Usha Vance is a brilliant and accomplished attorney known for her intelligence, grace, and support for her husband, J.D. Vance. Her beauty is matched by her poise and dedication, making her an inspiring figure. pic.twitter.com/Wm56FK0uCq— Ivanka Trump 🇺🇲 🦅 News (@IvankaNews_) March 23, 2025ఆ మార్ఫింగ్ చేసిన ఫోటో 2022 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అందర్నీ ఆకర్షించిన దీపకా పదుకొణే ఎవర్గ్రీన్ స్టైల్ అది. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అబూ జని సందీప్ ఖోస్లా చేతి నుంచి జాలువారిని అద్భుత కళా రూపమే ఈ స్టైలిష్ చీర. ఇది అక్కడున్న వారందర్నీ ఆహా భారతీయుల చీరకట్టుకి మించిన ఫ్యాషన్ మరొకటి లేదనిపించేలా చేసింది. అంతలా ఆకర్షించినా ఆ ఫ్యాషన్ వేర్ని మార్ఫింగ్ చేసినట్లు ఉన్న ఉషా వాన్స్ ఫోటో అని క్లియర్‌గా స్పష్టమవుతండగా ఇవాంకాకు ఎలా తెలియకుండా పోయిందన్నది నెటిజన్ల వాదన. View this post on Instagram A post shared by Abu Jani Sandeep Khosla (@abujanisandeepkhosla) అది కూడా ఒకరిని వ్యక్తిగతంగా ప్రశంసించేటప్పడూ.. ఎంత గౌరవప్రదంగా ఉండే ఫోటోని జత చేస్తూ పోస్ట్ పెట్టాలి అని కామెంట్ చేస్తున్నారు. అయినా ఇలాంటి విషయాల్లో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని ఫోటో జత చేయాలి లేదంటే అది ప్రశంసలా అస్సలు ఉండదని తిట్టిపోస్తున్నారు నెటిజన్లు. ఒక్కోసారి కొద్దిపాటి నిర్లక్ష్యం.. మంచిని కూడా చెడుగా చిత్రీకరించేస్తుంది అంటే ఇదే కదా..!.(చదవండి: భారతదేశ సంప్రదాయ పానీయం గోలిసోడా..అమెరికా, బ్రిటన్‌లో పెరుగుతున్న క్రేజ్) -
భారత్ గోలీ సోడాకు విదేశాల్లో ఫుల్ డిమాండ్..!
ఒకప్పుడు మనదేశంలో సంప్రదాయ పానీయంగా ప్రజల మన్ననలను పొందిన గోలీసోడా చూస్తుండగానే కనుమరుగైంది. పెప్సీ, మజా, కోకోలా వంటి ఆధునిక పానీయాల దెబ్బతో జనాలే వాటిని దరిచేరనివ్వలేదు. ఒకప్పుడు టప్ మని శబ్దంతో ఆకర్షణీయమైన దాని ప్యాకేజింగ్‌తో ప్రజల మన్నలను అందుకున్న పానీయం ఇది. 80,90లలో దీనిదే హవా. అంతలా ప్రజాదరణ పొందింది. ముఖ్యంగా వేసవి దాహార్తిని తీర్చే పానీయంగానే కాకుండా కాస్త భోజనం అరగకపోయినా..కొద్దిగా సోడా తెగ్గుచుకుని తాగేవారు. అంతలా మనలో భాగమైన ఈ గోలీ సోడా మళ్లీ కొత్తగా వస్తూ ట్రెండ్‌గా మారింది. ముఖ్యంగా విదేశీయులు సైతం ఇష్టపడే పానీయంగా సరికొత్తగా వస్తోంది. పైగా అక్కడ దీని డిమాండ్ వెరేలెవెల్లో ఉంది. ఆ కథా కమామీషు ఏంటో చూద్దామా..!.మన భారత సంప్రదాయ పానీయమైన ఈ గోలీ సోడాకి అమెరికా, బ్రిటన్, యూరప్‌తో సహా గల్ఫ్ దేశాల్లో మంచి డిమాండ్ ఉందని వాజిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అక్కడ విదేశీయులు ఎంతో ఇష్టపడుతున్నారని, కామర్స్ మంత్రి పియూష్ గోయల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా తెలిపారు. ఒకప్పటి ఐకానిక్ పానీయం గ్లోబల్ వేదికపై ప్రభంజనం సృష్టించేలా అమ్ముడుపోతోందని చెబుతున్నారు. దాని వినూత్న రీక్రీయేషనే అందుకు కారణమని, అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో దీనికి డిమాండ్ పెరిగిందని అన్నారు. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతాల్లో దీనికి అతిపెద్ద రిటైల్ మార్కెట్ ఉందట. అంతేగాదు ఈ గోలిసోడా మార్కెట్‌కి సంబంధించి భారత్ సరసమైన ధరలతో వ్యూహాత్మక ఎగుమతుల భాగస్వామ్యాన్ని కలిగి ఉందని వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆర్మ్ అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎగుమతి డెవలప్మెంట్ అథారిటీ (APEDA) తెలిపింది. మన భారతీయులు సైతం ఈ గోలీసోడాను ఇష్టపడేది దాని వినూత్న రీతిలో ప్యాకేజ్ అయిన విధానమే. అదే విదేశీయలును కూడా ఆకర్షించడం విశేషం. అందులోనూ దాన్ని ఓపెన్ చేయడానికి ఉపయోగించే ప్రత్యేక ఓపెనర్‌తో వచ్చే టప్ మనే పేలుడు శబ్దం.. మనల్ని ప్రేమగా గుర్తుంచుకునేలా చేస్తుంది. అదే ఇప్పుడు మళ్లీ ఇలా రీబ్రాండింగ్ అంర్జాతీయ మార్కెట్‌ని ఆకర్షించి ఆధునాత ఉత్పత్తిగా అవతరించింది. ఇది ఒకరంగా మన భారతీయ రుచులు అంతర్జాతీయ దిగ్గజ బ్రాండ్లతో పోటీపడగలవని ప్రూవ్ చేసింది. అంతేకాదండోయ్ ఈ సోడా మన దేశంలో కూడా మళ్లీ ఇదివరకటి రోజుల్లా అమ్ముడైలా కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారట అధికారులు. ఇది చూస్తుంటే ఎప్పటికీ..ఓల్డ్ ఈ జ్ గోల్డ్ అన్న ఆర్యోక్తి గుర్తోస్తోంది కదూ..!.Bharat's very own GOLI POP SODA returns to wow tastebuds worldwide! 🇮🇳Kudos to @APEDADOC for promoting the revival of the traditional Indian Goli Soda.📖 https://t.co/Ask6n6YCCl pic.twitter.com/T7XZmc1xmc— Piyush Goyal (@PiyushGoyal) March 25, 2025(చదవండి: పెళ్లి సంగతి తర్వాత..కౌన్సిలింగ్ ఇప్పించండి..! ) -
వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు..!
గత మూడు రోజుల వాతావరణం:గడిచిన మూడు రోజులలో రాష్ట్రంలోఅక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసాయి. పగటి ఉష్ణోగ్రతలు35నుండి 40డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు18 నుండి 24డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యాయి.వచ్చే ఐదు రోజుల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు:హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు (సోమవారం మధ్యాహ్నానికి ఉన్న సమాచారం ఆధారంగా) అందించిన సమాచారం ప్రకారం ఈ నెల 26 (బుధవారం) నుండి 30వ(ఆదివారం) వరకు రాబోయే ఐదు రోజుల్లో వాతావరణం పొడిగా ఉండవచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 35 నుండి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 23 నుండి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదుకావచ్చు.నీటి వసతి గల ప్రాంతాలలో పచ్చిమేత కోసం పశుగ్రాస పంటలుగా జొన్న, మొక్కజొన్న పంటలను వేసుకోవచ్చు. తక్కువ నీటి వసతి గల ప్రాంతాల్లో పశుగ్రాస పంటలుగా సజ్జ, బొబ్బర పంటలను వేసుకోవచ్చు.నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో వరికి ఆరుతడులు ఇవ్వాలి.చీడపీడలు, తెగుళ్ళ ఉధృతి అధికంగా కాకుండా చూడటానికి సరైన సమయంలో నివారణ చర్యలు చేపట్టాలి. వడగళ్ళ వాన, అధిక వర్షాలు కురిసిన ప్రాంతపు రైతులు పాటించవలసిన యాజమాన్య పద్ధతులు: నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళను నివారించడానికి నేల బాగా తడిచే విధంగా 3 గ్రా. కాపర్ ఆక్సీ క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి మొదళ్ళలో పోయాలి.అధిక వర్షాలు కురిసిన ప్రాంతాల్లో పొలం నుంచి నీటిని తీసివేసిన తరువాత పంట త్వరగా కోలుకోవటానికి 2% యూరియా లేదా 1% ΄÷టాషియం నైట్రేట్ ద్రావణాన్ని పంటపై పిచికారీ చేయాలి.వర్షాలతో శాకీయ దశలో ఉన్న కూరగాయ పంటల్లో నష్టం ఎక్కువగా ఉంటే తిరిగి మొక్కలను నాటుకోవాలి.పడిపోయిన మొక్కజొన్న పచ్చి కంకి దశలో ఉనట్లయితే కంకులను కోసి పచ్చి కంకులుగా అమ్ముకోవాలి.అధిక వర్షాలు కురిసిన ప్రాంతాలలో వరి పంటలో అగ్గి తెగులు, గింజమచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. కావున తెగుళ్ళ ఉధృతి గమనించినట్లయితే 1 మి.లీ. ్ర΄ోపికోనజోల్ లేదా 0.4 గ్రా. టేబుకొనజోల్ + ట్రైఫ్లాక్సిస్త్రోబిన్ లేదా 2.5 గ్రా. ట్రైసైక్లాజోల్ + మాంకోజేబ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.మామిడి తోటలో పడిపోయిన కాయలను సేకరించి మంచిగా ఉన్న కాయలను మార్కెట్‌కు తరలించాలి. పగిలి ΄ోయిన కాయలను అలాగే తోటలో వదిలేసినట్లయితే తెగుళ్ళు ఆశించే అవకాశం ఉన్నది.మామిడిలో కాయమచ్చ తెగులు కనిపిస్తే 1 గ్రా. కార్బండజిమ్ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.వరిప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో ఆకునల్లి, కంకినల్లి ఆశించే అవకాశం ఉంది. నివారణకు 5 మి.లీ. డైకోఫాల్ లేదా 1 మి.లీ. స్పైరోమేసిఫిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి (కంకివెన్ను 10 శాతం కన్న తక్కువ ఉన్నప్పుడు మందుల పిచికారీ చేసుకోవాలి. కంకివెన్ను 10 శాతం కన్నా ఎక్కువ పైకి వచ్చినట్లయితే మందుల పిచికారీ చేస్తే దిగుబడి తగ్గుతుంది).వరిలో సుడిదోమ గమనించడమైనది. ఉధృతి తక్కువగా ఉన్నప్పుడు నివారణకు, ఎసిఫేట్ + ఇమిడాక్లోప్రిడ్: 1.5గ్రా. మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వరిలో అగ్గి తెగులు సోకడానికి అనుకూలం. తెగులు గమనించినచో నివారణకు ట్రైసైక్లాజోల్ 0.5 గ్రా. లేదా ఐసో ప్రోథైయోలిన్ 0.5 మీ.లీ. లేదా కాసుగామైసిన్ 2.5 మీ.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.వరిలో కాండం తొలిచే పురుగు ఆశించడానికి అనుకూలం. నివారణకు పిలకలు లేదా దుబ్బు చేసే దశలో కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను ఎకరాకి 10 కిలోల చొప్పున వేసిన రైతులు పొట్ట దశలో 0.3 మి. లీ. క్లోరాంట్రానిలిపోరల్ లేదా 0.5 మి.లీ. టెట్రానిలి్ర΄ోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణంలో వరికి జింక్ ధాతువు లోపం రావటానికి అనుకూలం. నివారణకు 2గ్రా. జింక్ సల్ఫేట్ మందును లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.మొక్కజొన్నప్రస్తుత వాతావరణ పరిస్థితులు (భూమిలో ఎక్కువ తేమ) మొక్కజొన్నలో బాక్టీరియా కాండం కుళ్ళు తెగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు 4 కి.గ్రా. బ్లీచింగ్ పొడి (35 % క్లోరిన్ కలిగిన) మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ళు తడిచేటట్లు పోయాలి.పూత అనంతరం ఎండు తెగులు ఆశించటానికి అనుకూలం. నివారణకు 1 గ్రా. కార్బండజిమ్ లేదా 3 గ్రా. కాపర్ ఆక్సి క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ళు తడిచేలా పోయాలి.మేడిస్ అకుమాడు తెగులు ఆశంచడానికి అనుకూలం. నివారణకు, 2.5గ్రా. మ్యంకోజేబ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.కత్తెర పురుగు ఆశించడానికి అనుకూలం. నివారణకు 0.4 మి.లీ. క్లోరంట్రానిలి్ర΄ోల్ లేదా 0.5 మి.లీ. స్పైనటోరం మందును లీటరు నీటికి కలిపి ఆకు సుడుల లోపల తడిచేలా పిచికారీ చేయాలి. మోకాలు ఎత్తు దశలో ఉన్న పైరులో ఒక కిలో సున్నం, 9 కిలోల ఇసుకను కలిపి మొక్క సుడులలో వేసి కత్తెర పురుగును నివారించుకోవాలి.వంగప్రస్తుత వాతావరణ పరిస్థితులు వంగలో కొమ్మ, కాయతొలిచే పురుగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు ఎకరానికి 10–15 లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. తలలను తుంచి 10,000 పి.పి.యమ్ వేపనూనెను 3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే 0.25 మి.లీ. ఫ్లూబెండమైడ్ లేదా 0.4 గ్రా. ఇమామెక్టిన్ బెంజోయేట్ లేదా 0.3 మి.లీ. క్లోరాంట్రినిలిపోరల్ పిచికారీ చేయాలి.మిరపప్రస్తుత వాతావరణ పరిస్థితులు మిరపలో జెమిని వైరస్ (ఆకుముడత) తెగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు.. వ్యాధి సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. పొలం లో కలుపు మొక్కలను నివారించాలి. n పసుపు రంగు జిగురు అట్టలను ఎకరాకు 8–10 చొప్పున అమర్చాలి.నివారణకు 1.5 మి.లీ. పైరాప్రాక్సిఫెన్ లేదా 1.0 మి.లీ. పైరాప్రాక్సిఫెన్ + ఫెన్ ప్రోపాత్రిన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.కొమ్మ ఎండు, కాయకుళ్ళు తెగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రా. మాంకోజెబ్ లేదా 1 మి.లీ.ప్రోపికోనజోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.నల్ల తామర పురుగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు, 2 మి.లీ. సైంట్రానిలిప్రోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.టమాటప్రస్తుత వాతావరణ పరిస్థితులు టమాటలో పొగాకు లద్దె పురుగు ఆశించడానికి అనుకూలం. నివారణకు, 1మి.లీ. నోవల్యూరాన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ∙ఫ్యుజేరియం ఎండు తెగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు 3గ్రా. కాపర్ ఆక్సి క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి మొదళ్ల చుట్టూ ΄ోయాలి.తీగజాతి కూరగాయలుప్రస్తుత వాతావరణ పరిస్థితులు తీగజాతి కూరగాయల పంటలలో పండు ఈగ ఆశించడానికి అనుకూలం. నివారణకు 2 మి.లీ. మలాథియాన్ లేదా 2 మి.లీ ప్రోఫెనోఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.మామిడితరచుగా పండు ఈగ గమనించే మామిడి తోటల్లో కాయ అభివృద్ధి దశ నుంచి పక్వానికి వచ్చే దశలో పాటించవలసిన యాజమన్య పద్దతులు: తోటలను శుభ్రంగా ఉంచాలి పండు ఈగ సోకిన కాయలను / పండ్లను ఏరి నాశనం చేయాలి. 10,000 పి.పి. యం వేప నూనెను పిచికారీ చేయాలి. పండుఈగ ఎరలను (2 మి.లీ. మలాథియాన్ + 2 మి.లీ. మిథైల్ యూజినాల్ మందును లీటరు నీటికి కలిపి) ఒక్కొక్క ప్లాస్టిక్ కంటైనర్ లో 200 మి.లీ. ఉంచి ఎకరాకి 6 చొప్పున చెట్టు కొమ్మలకు వేలాడదీయాలి. ఎకరాకి 40 పసుపు రంగు జిగురు అట్టలు అమర్చుకోవాలి.– డా. పి. లీలా రాణి, ప్రధాన శాస్త్రవేత్త (అగ్రానమి)– అధిపతి, వాతావరణ ఆధారిత వ్యవసాయ పరిశోధనా కేంద్రం, ఎఆర్ఎస్, పిజెటిఎయు, రాజేంద్రనగర్. (చదవండి: 'క్లైమేట్ ఎమర్జెన్సీ': ఇలాంటప్పుడు ఈ సిరి ధాన్య పంటలే మేలు..!) -
‘క్లైమెట్ ఎమర్జెన్సీ’..ఇలాంటప్పడు ఈ సిరి ధాన్య పంటలే మేలు..!
కరువు, భూగర్భ జలాలు అడుగంటడం, సాధారణం కన్నా ఎక్కువగా 4–5 అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో భూతాపం ముందెన్నడూ ఎరుగనంతగా పెరిగిపోతోంది.. 2024 ఏడాదిలో అన్ని నెలలూ మానవాళి చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎల్‌నినో కారణంగా ఇలా జరిగిందేమో అనుకుంటే.. లానినా దశలో కూడా 2025లో మొదటి 3 నెలలు కూడా రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మనం ఇప్పుడు క్లైమెట్ ఎమర్జెన్సీ స్థాయిలో పర్యావరణ సంక్షోభాన్ని అనుభవిస్తున్నామని చెప్పకతప్పదు. అందుకు తాజా నిదర్శనం.. రిజర్వాయర్లు ఖాళీ అవుతున్నాయి. జీవనదులు ఎండి΄ోతున్నాయి. మట్టి ఉష్ణోగ్రత పెరిగిపోతోంది. పంటలకు గడ్డు కాలం వచ్చింది. ప్రస్తుత రబీ సీజన్లో తెలుగునాట కొన్ని జిల్లాల్లో వరి తదితర పంటలు, పండ్ల తోటలు నిలువునా ఎండిపోతున్నాయి. ఇది స్పష్టంగా ‘క్లైమెట్ ఎమర్జెన్సీ’ పరిస్థితే! కిం కర్తవ్యం?వాతావరణ మార్పులను తట్టుకునేవి, తక్కువ నీటి అవసరం కలిగినవి అయిన చిరుధాన్యాలను ప్రధాన ఆహార పంటలుగా సాగు చేయాలని హైదరాబాద్‌లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ(ఐ.ఐ.ఎం.ఆర్.) సూచిస్తోంది. రైతుకు పర్యావరణ, ఆర్థిక, పౌష్టికాహార భద్రతనిచ్చే ఈ పంటలు వినియోగదారులకు సంపూర్ణ పౌష్టికాహారాన్ని అందిస్తాయి. ప్రకృతి వనరుల ఆధారంగానే వ్యవసాయం సాగేది. వర్షం మన వ్యవసాయానికి ముఖ్యాధారం. వర్షం ఎప్పుడొస్తుందో.. ఎంత తక్కువ కురుస్తుందో.. వర్షాకాలం మధ్యలో ఎన్ని రోజులు వర్షం మొహం చాటేస్తుందో తలపండిన వారికి కూడా అంతుపట్టని దశకు చేరాం. పెద్ద నదులపై ఉన్న రిజర్వాయర్లు సైతం వేసవి అడుగంటిపోవడంతో ఆయకట్టు భూములకు కూడా సాగు నీటి భద్రత కరువైపోయే పరిస్థితులు వచ్చాయి. దీని అర్థం ఏమిటంటే.. ఇంతకుముందు వేస్తున్న అధికంగా నీటి అవసరం ఉండే పంటల్నే గుడ్డిగా ఇక మీదట సాగు చేయలేం. నీటి అవసరం అంతగా అవసరం లేని ఆహార పంటల వైపు దృష్టి మరల్చడం రైతులకు, సమాజానికి శ్రేయస్కరం అంటున్నారు నిపుణులు. వచ్చే ఖరీఫ్ సీజన్లో సాగు చేసే పంటలను విజ్ఞతతో ఎంపిక చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. ఈ కోవలో ముందు వరుసలో ఉండేవి.. చిరుధాన్య పంటలు. జొన్న, సజ్జ, రాగి, కొర్ర, ఊద, సామ, అరికెలు, ఒరిగెలు.. ఇవీ మనకు ముఖ్యంగా తెలిసిన చిరుధాన్య పంటలు (మిల్లెట్స్). దక్షిణ భారతీయులకు వేలాది ఏళ్ల క్రితమే బాగా పరిచయమైన పంటలివి.. కొత్తవి కాదు. హరిత విప్లవం పేరుతో వరి, గోధుమ వంటి ఆహార పంటలను ప్రభుత్వం వ్యాప్తిలోకి తేవడానికి ముందు వేలాది ఏళ్లుగా మన పూర్వీకులు తింటూ ఆరోగ్యంగా జీవించడానికి కారణభూతమైన పంటలివి. పర్యావరణ, వాతావరణ సంక్షోభకాలంలో తిరిగి ఈ పంటల వైపు మన ప్రజలు, రైతులు, ప్రభుత్వాలు దృష్టిసారించాల్సిన అవసరం తోసుకు వచ్చిన తరుణం ఇది.సి–4 రకం పంటలు మేలునీటి వనరులు అందుబాటులో లేని, సారం పెద్దగా లేని తేలిక, ఎర్ర నేలలు వరి, పత్తి వంటి పంటల సాగుకు అనుకూలం కావు. ఈ పంటలను సాంకేతిక పరిభాషలో ‘సి–3’ పంటలు అంటారు. తక్కువ వర్షం తోనే, కరువు కాలంలో సయితం అంతగా సారం లేని తేలిక, ఎర్ర నేలల్లోనూ ఖచ్చితమైన దిగుబడులనిచ్చేవి చిరుధాన్య పంటలు. సాంకేతిక పరిభాషలో వీటిని ‘సి–4’ పంటలు అంటారు.చిరుధాన్య పంటలు వరి కన్నా అనేక రకాలుగా మేలైనవి . సమాజానికి పౌష్టికాహార భద్రతతోపాటు రైతులకు కనీస ఆదాయ భద్రతను ఇవ్వడంతోపాటు, వరి గడ్డి కన్నా అధిక ΄ోషక విలువలున్న పశుగ్రాసాన్ని కూడా అందిస్తాయన్నారు. భూతాపం అసాధారణంగా పెరుగుతున్న సంక్షోభ కాలంలో ఇంతకు ముందు వేసిన పంటే వేస్తామని, ఇంతకు ముందు తినే ఆహారమే తింటామని అనుకుంటూ ఉండకూడదు. వాతావరణ అసమతుల్యతను తట్టుకొని పెరిగే చిరుధాన్యాలను ముఖ్య ఆహారంగా తినటం మొదలుపెడితే రైతులూ పండించడం మొదలు పెడతారు. తెలుగు రాష్ట్రాల వ్యవసాయ శాఖలు, రైతులు అనువుకాని భూముల్లో వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలను లక్షల ఎకరాల్లో సాగు చేయడం మాని.. చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు. సి–4 పంటల విశిష్టత ఏమిటి?సి–4 రకం పంటల విశిష్టత ఏమిటంటే.. అతి తక్కువ నీటితో, తక్కువ పంట కాలంలోనే కరువును, అధిక ఉష్ణోగ్రతను తట్టుకొని, అధిక పౌష్టిక విలువలతో కూడిన ఆహార ధాన్యాలను అందిస్తాయి. వాతావరణం నుంచి బొగ్గుపులుసు వాయువును, సూర్యరశ్మిని గ్రహించి అధిక ఉష్ణోగ్రతలు, కరువు పరిస్థితుల్లో సైతం ఆహారాన్ని ఉత్పత్తి చేసుకొని మంచి దిగుబడులు ఇవ్వడంలో సి–4 పంటలు సి–3 రకం పంటలకన్నా అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. భూతాపాన్ని పెంచే హరిత గృహ వాయువులను చిరుధాన్య పంటలతో పోల్చితే వరి పంట 20 రెట్లు ఎక్కువగా విడుదల చేస్తున్నది. అందుకే చిరుధాన్యాలు రైతులకు బీమా ఇవ్వగలిగిన పంటలన్నారు. పప్పుధాన్యాలు, నూనెగింజలతో కలిపి సమీకృత వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసినప్పుడు ఎరువుల అవసరం, చీడపీడల బెడద కూడా చిరుధాన్య పంటలకు పెద్దగా ఉండదు.తేలిక భూముల్లో, ఎర్ర నేలల్లో మొక్కజొన్న, పత్తి సాగు చేస్తే వర్షాలు సక్రమంగా పడనప్పుడు ఈ పంటలు రైతులను తీవ్ర నష్టాల పాలుజేయడానికి అవకాశాలెక్కువ. చెరకు సాగుకు 2,100 ఎం.ఎం, వరికి 1,250 ఎం.ఎం., పత్తికి 600 ఎం.ఎం. నీరు అవసరం. అయితే, జొన్నలకు 400 ఎం,ఎం., సజ్జ, రాగి, కొర్ర తదితర స్మాల్ మిల్లెట్లకు 350 ఎం.ఎం. నీరు సరి΄ోతుంది. వేరుశనగకు 450 ఎం.ఎం., పప్పుధాన్యాలకు 300 ఎం.ఎం., మొక్కజొన్నకు 500 ఎం.ఎం. నీరు అవసరమవుతుంది. వ్యవసాయ శాఖలు రైతులను చైతన్య పరచి జొన్న, సజ్జ, రాగి వంటి పంటలను సూచించాలి. స్మాల్ మిల్లెట్స్ అయిన కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, ఒరిగెలు వంటి పౌష్టిక విలువలు కలిగిన ఈ పంటల సాగును తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ శాఖలు విస్తృతంగా ప్రోత్సహించాలి.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న క్రాప్ కాలనీలలో ఆయా ప్రాంతాన్ని, నేల స్వభావాన్ని బట్టి కొన్ని రకాల పంటలను ప్రోత్సహించి, దగ్గర్లోనే ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం వల్ల రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంటుంది. పంటల కాలనీలలో చిరుధాన్య పంటలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది. సి–3 పంటలు 1. వరి, గోధుమ, పత్తి, పొద్దుతిరుగుడు..2. చల్లని వాతావరణం (20–25 డిగ్రీల సెల్షియస్) అనుకూలం. 3. భూమ్మీద మొక్కల్లో 95% వరకు సి–3 రకం మొక్కలుంటాయి4. అధిక ఉష్ణోగ్రతను, కరువును తట్టుకునే సామర్థ్యం తక్కువ5. వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు వల్ల భూతాపం పెరిగేకొద్దీ దిగుబడి తగ్గుతుంది∙6. పంట కాలం ఎక్కువ.. 100–140 రోజులు7. సాగు నీరు బాగా అవసరం. బెట్ట పరిస్థితులను ఎక్కువ కాలం తట్టుకోలేవు8. వరికి 1,250 ఎం.ఎం., చెరకుకు 2,100 ఎం.ఎం., పత్తికి 600 ఎం.ఎం. వర్ష΄ాతం కావాలి 9. సారవంతమైన, నీటి వసతి ఉండే భూములు అనుకూలం10. వాతావరణంలో భూతాపం పెరుగుతున్నకొద్దీ ఈ పంటల్లో ΄ోషకాలు, ఖనిజ లవణాలు తగ్గుతాయి11. ఎరువుల అవసరం ఎక్కువసి–4 పంటలు1. కొర్ర, అరిక, సామ, అండుకొర్ర, ఊద, జొన్న, సజ్జ, రాగి.2. వేడి వాతావరణ (30–45 డిగ్రీల సెల్షియస్) పరిస్థితులను తట్టుకుంటాయి3. భూమ్మీద మొక్కల్లో 5% వరకు సి–4 రకం మొక్కలుంటాయి4. అధిక ఉష్ణోగ్రతను, కరువును తట్టుకునే సామర్థ్యం ఎక్కువ5. వాతావరణంలో బొగ్గుపులుసు వాయువు వల్ల భూతాపం పెరుగుతున్నా దిగుబడి తగ్గదు∙6. పంట కాలం తక్కువ.. 60–95 రోజులు (అరికలు 180 రోజులు)7. సాగు నీటి అవసరం బాగా తక్కువ. నీటి కొరతను ఎక్కువ కాలం తట్టుకోగలవు8. మొక్కజొన్నకు 500 ఎం.ఎం, జొన్నకు 400 ఎం.ఎం., రాగి, సజ్జలకు 350 ఎం.ఎం. చాలు. కొర్ర, సామ, అరిక, ఊద, అండుకొర్రలకు ఇంకా తక్కువ వర్షపాతం చాలు.9. తేలిక భూములు, భూసారం తక్కువగా ఉండే మెట్ట భూములు అనుకూలం10. పౌష్టిక విలువలు ఎక్కువ. పిండి పదార్థంతోపాటు అధిక పీచు, నాణ్యమైన మాంసకృత్తులు, ఖనిజ లవణాలు సమృద్ధిగా ఉన్న సిరిధాన్యాలివి 11. ఎరువుల అవసరం లేదు/తక్కువ జీఎస్టీ ఎత్తివేయాలిపర్యావరణానికి హాని కలిగించే వరి, గోధుమ వంటి పంటలకు సబ్సిడీలు ఇస్తున్న ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు దోహదపడే చిరుధాన్యాలపై మాత్రం ప్రభుత్వం జీఎస్టీ విధిస్తుండటం సమంజసం కాదు. జీఎస్టీ రద్దు చేయాలి. చిరుధాన్యాలను ప్రభుత్వాలు మద్దతు ధరకు సేకరించి, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు సబ్సిడీ ధరకు అందివ్వాలి. సి4 రకం పంటలైన సిరిధాన్యాలతోనే ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ, ఆహార, ఆరోగ్య భద్రత చేకూరుతుందని అందరూ గ్రహించాలి.– డాక్టర్ ఖాదర్ వలి, ప్రముఖ ఆహార ఆరోగ్య నిపుణులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత --పతంగి రాంబాబు, సాగుబడి డెస్క్(చదవండి: పంట పొలాల్లో డ్రోన్..! ఇక నుంచి ఆ పనుల్లో మహిళలు..) -
పెళ్లి సంగతి తర్వాత... కౌన్సెలింగ్ ఇప్పించండి..!
మా అక్క తన విడాకుల అనంతరం మాతోనే ఉంటున్నారు. తనకి ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురి వయసు 29 సంవత్సరాలు. గత ఎనిమిది సంవత్సరాలుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నాము. 2023వ సంవత్సరంలో ఒక అబ్బాయి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ‘‘నేను మరొకరిని ప్రేమిస్తున్నాను అని చెప్పింది’’ కానీ ఆ అబ్బాయి వివరాలు ఇవ్వలేదు. మేమే ఎలాగోలా అతని ఫోన్ నెంబర్ తెలుసుకుని అబ్బాయిని సంప్రదించగా తనకు జాబ్ వచ్చిన తరువాత మాత్రమే తమ ప్రేమ విషయం ఇంట్లో చె΄్తాను అన్నాడు. తన కుటుంబ వివరాలు కూడా మాకు ఇవ్వలేదు. వారిది వైజాగ్ అని మాత్రమే తెలుసు. అమ్మాయిని వేరే సంబంధం చేసుకోమంటే మా మాట వినటం లేదు. ఎలా అయినా సరే అతన్నే పెళ్లి చేసుకుంటాను అంటుంది. ఇలా అయితే లాభం లేదు, ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని గట్టిగా చెము. అయినా లాభం లేదు. ఇటీవలే అబ్బాయికి ఉద్యోగం వచ్చిన ట్లు తెలిసింది కానీ, తర్వాత నుంచి మా మేనకోడలితో కూడా మాట్లాడడం మానేశాడు. మా అక్కకి ఆ అబ్బాయితో సంబంధం ఇష్టం లేదు. పరిష్కారం చూపగలరు.– విజయ, హైదరాబాద్మీ మేనకోడలు ఒక మేజర్. చట్టప్రకారం తను ఎవరిని పెళ్లి చేసుకోవాలి – ఎవరితో కలిసి బతకాలి, అసలు పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుంది. అందులో మూడో వ్యక్తి జోక్యం చేసుకోవటాన్ని చట్టం అంగీకరించదు.అది తల్లిదండ్రులైనా సరే! ఏమి చేసినా ఆ అమ్మాయి అంగీకారంతో మాత్రమే చేయవలసి ఉంటుంది. మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే ఆ అబ్బాయికి ఇంక ఇంట్రెస్ట్ లేనట్టు కనిపిస్తుంది. బహుశా మీ అమ్మాయి ఈ విషయం జీర్ణించుకున్నట్లు లేదు. తనకు కౌన్సిలింగ్ అవసరం అనిపిస్తుంది. మీ అమ్మాయి అతన్ని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అనడానికి గల కారణం ఏమిటో ప్రేమగా మాట్లాడి తనకి ధైర్యాన్ని ఇస్తూ కనుక్కోండి. పరస్పర అంగీకారంతో ప్రేమించుకున్నట్లైతే సరేం అలా కాదు ఏదైనా వేరే కోణం ఉందేమో తెలుసుకోండి. శారీరక సుఖం కోసం ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడుతూ కోరిక తీరినాక మోసపూరితంగా వదిలేస్తే, అందుకు తగిన శిక్షలు భారతీయ న్యాయ సంహితలో వున్నాయి. కఠిన చర్యలు తీసుకోవచ్చు. ఏది ఏమైనా, ఈ సమయంలో మీరు తనపై మరింత ఒత్తిడి పెట్టడం సరైనది కాదు. మీరు కలిగించే ధైర్యం–నమ్మకం తనకు చాలా అవసరం. కాబట్టి పెళ్ళి సంగతులు కాసేపు పక్కనబెట్టి ముందు తన మానసిక పరిస్థితి, తనకు ఏం కావాలి అనే అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి. వీలైతే కౌన్సెలింగ్ ఇప్పించండి.– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు.)(చదవండి: యాక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ అంటే ఏంటి..? నటి సమంత, దర్శకుడు విక్రమ్ భట్) -
చిరాకుగా ఉన్నా.. చిద్విలాసంతో ఉన్నా.. చిరుతిండికే ఓటు
ఆఫీసులో ఉండగా కలుద్దామని ఫ్రెండ్ ఫోన్ చేస్తే సమీపంలో ఉన్న ఏ ఛాయ్ క్యాంటీన్లోనో, కేఫ్‌లోనో కలుద్దాం అని చెబుతాం.. ఏ పార్క్‌లోనో, ట్యాంక్ బండ్ మీదో ఒంటరిగా కూర్చున్నప్పుడు పల్లీలు అమ్మేవాడో, ముంత కింద పప్పు వాడో కనిపిస్తే.. నోటికి పని చెబుతాం.. ఇలా ఎందుకు చేస్తాం? ఆకలి తీర్చుకోడానికా? లేక అవి తినాలనే ఆతృతతోనా? అంటే రెండూ కాదు.. మన మూడ్‌ను మెరుగుపరుచుకోవడం కోసం అంటున్నారు నగరవాసులు. రోడ్డు పక్కన దొరికే పానీ పూరీ కావచ్చు, థియేటర్లో కరకరమనిపించే పాప్ కార్న్ కావచ్చు.. సరదాగా లాగించే సమోసాలు కావచ్చు.. చిది్వలాసంతో నమిలేసే చిప్స్కావచ్చు.. ఇవన్నీ ఇంట్లో ముప్పూటలా తినేతిండికి అదనం. మన మూడ్స్‌ను మెరుగుపరిచే ఇంధనం.. గోద్రెజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎస్టీటీఈఎమ్ 2.0 స్నాకింగ్ రిపోర్ట్ ప్రకారం గత కొంతకాలంగా అధ్యయనాలు చెబుతున్న ఇదే అంశాన్ని అంగీకరిస్తున్నారు నగరవాసులు. చిరుతిండి మనలో ఉత్సాహాన్ని పెంచుతుంది. మన భావోద్వేగాలను మెరుగుపరచడంలో శక్తిమంతమైన పాత్ర పోషిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఎప్పుడు? ఎందుకు? ఏమిటి ఎలా.. సిటిజనులు స్నాక్‌కు సై అంటున్నారు? ఈ రిపోర్ట్‌లో పేర్కొన్న ప్రకారం చూస్తే..మంచి మూడుకు స్నాక్ బూస్ట్..చిరుతిండి, హ్యాపీ మూడ్స్ ఒకదానికొకటి అనుబంధంగా ఉంటున్నాయనేది స్పష్టంగా తెలుస్తోంది. సర్వేలో పాల్గొన్నవారిలో 62% మంది మూడ్స్‌ను హ్యాపీగా ఉంచడం కోసం స్నాక్స్ తీసుకుంటారని అంగీకరించారు. అదే విధంగా 45% మంది పార్టీలు, వేడుకల సమయంలో ఫ్రోజెన్ స్నాక్స్ కోసం చూస్తామని చెప్పారు. అంటే విభిన్న రకాల వంటకాలు ఉన్నప్పటికీ స్నాక్స్ విలువ తగ్గదు అని దీనిద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే అవి వారి అనుభవాలను మరింతగా మెరుగుపరుస్తాయనే ఆలోచనతోనే అని చెబుతున్నారు. అలాగే నగరంలో 45% మంది వారాంతాల్లో కూడా ఫ్రోజెన్ స్నాక్స్‌ను ఇష్టపడతారు. వారి విశ్రాంతి సమయాలకు కొత్త రుచులను జత చేస్తారు.టైం ఏదైనా.. అటెన్షన్ కోసం.. పరీక్షల ముందు టెన్షన్ కావచ్చు.. రొమాంటిక్ సమయంలో అటెన్షన్ కావచ్చు.. కాదే సందర్భమూ స్నాకింగ్‌కు అనర్హం అంటున్నారు నగరవాసులు. నగరంలో 17% మంది విద్యార్థులు పరీక్షా సన్నాహక సమయంలో ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం చిరుతిండికి జై కొడుతున్నామని అంటున్నారు. మరోవైపు శృంగార సమయంలోనూ మానసిక స్థితిని బెటర్‌గా ఉంచేందుకు స్నాక్స్ తోడు కోరుకుంటున్నామని 16 శాతం మంది చెప్పారు.ఆట పాటల్లోనూ అదే బాట.. ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ పోటీ జరుగుతోంది. ఇలాంటి ప్రత్యక్ష క్రీడా ఈవెంట్లను కేఫ్స్లోనో, పబ్స్/క్లబ్స్లోనో వీక్షించే సమయంలో దాదాపు అందరి ముందూ ఏదో ఒక చిరుతిండి కనబడడం మనం గమనించవచ్చు. ఇదే విషయాన్ని అంగీకరిస్తూ నగరంలో 50% మంది తమ వీక్షణ అనుభవాన్ని మెరుగుపరచుకోడానికి స్నాక్స్‌కి సై అంటారు. అదే విధంగా 54% మంది నగరవాసులు టీవీ/ఒటీటీ/మొబైల్లో వెబ్ సిరీస్, సినిమాలు లేదా షోలను చూస్తున్నప్పుడు స్నాక్స్ తీసుకోడాన్ని ఇష్టపడతామని చెప్పారు.ఆరోగ్యకరమైనవి ఎంచుకుంటే మేలు.. స్నాక్స్ తీసుకోవడం తప్పుకాకున్నా.. ఒబెసిటీ ముప్పు వెంటాడుతూనే ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మితంగా తీసుకునే చిరుతిండిలో ఆరోగ్యకరమైన బాదం తదితర పప్పులు చేర్చాలని, విటమిన్లు, జింక్, ఫోలేట్ ఐరన్‌తో సహా 15 ముఖ్యమైన పోషకాల సహజ మూలంగా ఆల్మండ్స్ రోగనిరోధకతను మెరుగుపరుస్తాయని పోషక నిపుణులు చెబుతున్నారు. ఇవి ఎప్పుడైనా ఆస్వాదించడానికి అనుకూలమైన చిరుతిండిగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తేల్చంది. అలాగే నారింజ, ద్రాక్షపండు వంటి సిట్రస్ పండ్లు విటమిన్–సీ అందిస్తాయి. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకం–ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా రక్షణ ఇస్తుంది. ఈ పండ్లను స్నాక్స్‌గా మార్చుకోవడం రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. అలాగే ఆకుకూరలతో కూడిన వెజ్ సలాడ్స్ కూడా మేలైనవేనని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. -
పేదోళ్ల వకీలమ్మ
‘న్యాయవాది కావడం అనేది కేవలం వృత్తికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం... సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను ఎప్పుడూ గుర్తు పెట్టుకోవడం కూడా’ అనే ప్రసిద్ధ మాటను న్యాయవాదుల గురించి చెబుతుంటారు.నిజామాబాద్‌కు చెందిన కాటిపల్లి సరళ మహేందర్‌రెడ్డి న్యాయవాదిగా పేదలకు అండగా ఉండటమే కాదు...‘సమాజానికి తిరిగి ఇవ్వాలి’ అనే ఎరుకతో తన పాఠశాల ద్వారా పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తోంది. పిల్లలు వివిధ ఆటల్లో జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేస్తోంది.డిగ్రీ చదువుతున్నప్పుడే వివాహం అయినప్పటికీ భర్త, హైకోర్ట్ న్యాయవాది మహేందర్‌రెడ్డి(Sarala Mahender Reddy) ప్రోత్సాహంతో ఎల్ఎల్బీ పూర్తి చేసిన సరళ నిజామాబాద్ జిల్లా కోర్టులో ఎన్ రోల్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదటి మహిళా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసింది. ఉమ్మడి ఏపీ హైకోర్టులో ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా విశాఖ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల బాధ్యతలు చూసింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన తన బావగారు (భర్త అన్న) కాటిపల్లి రవీందర్‌రెడ్డి పేరుమీద ఎడ్యుకేషనల్ సొసైటీ ఏర్పాటు చేసి నర్సరీ నుంచి పదో తరగతి వరకు ఉచిత విద్యను అందిస్తున్నారు. బీఈడీ కళాశాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 300 మంది పేద విద్యార్ధులకు ఉచితంగా విద్యనందించారు. ఈ ఏడాది నుంచి ‘బాలసదన్ ’లో ఉంటున్న 30 మంది అనాథ పిల్లలకు ఉచితంగా విద్యనందిస్తున్నారు. ‘బాలసదన్ ’ చిన్నారుల కోసం జిల్లా జడ్జి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘భవిష్య జ్యోతి’ ట్రస్ట్‌కు చైర్పర్సన్ గా సరళ మహేందర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆటల్లో మెరిసేలా...గ్రామీణ విద్యార్థులను ఆటల్లో ప్రోత్సహించేందుకు ‘ఖేలో ఇండియా’ కార్యక్రమాలు పాఠశాల ద్వారా నిర్వహిస్తున్నారు. ఖోఖో ఆటలను స్పాన్సర్ చేస్తున్నారు. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు హాకీలో జాతీయ స్థాయిలో అడారు. రెండుసార్లు రాష్ట్రస్థాయి జూడో మీట్ నిర్వహించారు. స్కూల్ విద్యార్థులు జూడోలో రాష్ట్రస్థాయిలో అండర్–17 విభాగంలో 3 కాంస్య పతకాలు సాధించారు. జూనియర్స్, సబ్ జూనియర్స్ సైతం జూడో రాష్ట్ర స్థాయిలో ఆడుతున్నారు. – తుమాటి భద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, నిజామాబాద్సామాజిక సేవే... విలువైన సంపదన్యాయవాదిగా పేదలకు అండగా నిలవడమే కాదు సామాజికసేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నందుకు సంతోషంగా ఉంది. భవిష్యత్‌లో మరిన్ని సేవాకార్యక్రమాల్లో భాగం కావాలనుకుంటున్నాను. – సరళ మహేందర్‌రెడ్డి -
వియ్ హబ్ బ్రాండ్ అంబాసిడర్ వంట గెలిచింది
ఆమె... వంటతో జీవితాన్ని నిలబెట్టుకుంటానని, వంటలతో అవార్డులు అందుకుంటానని, వియ్ హబ్ (విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ హబ్)కి బ్రాండ్ అంబాసిడర్ అవుతానని కలలో కూడా కలగనలేదు. పాలతో కూరలు వండే గుజరాత్ వాళ్లు ఆమె చేసిన పుదీనా పచ్చడిని లొట్టలేసుకుంటూ తిన్నారు. కొబ్బరి, అరటితో మసాలాలు లేని తేలిక ఆహారం తీసుకునే కేరళ వాసులు కూడా ఆమె చేతి రుచికి ఫిదా అయ్యారు. గోవా వాళ్లకు చేపలతో కొత్త వంటలను పరిచయం చేశారామె. ఈ విజయాలన్నీ ఆమెను రాష్ట్ర సెక్రటేరియట్ వైపు నడిపించాయి. తెలంగాణ సెక్రటేరియట్లో క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. ఆమె పేరు ఆకుల కృష్ణకుమారి. ఊరు మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా, మూడు చింతలపల్లి గ్రామం. నెలకు లక్షకు పైగా ఆర్జిస్తున్న కృష్ణకుమారి జీవితం పలువురికి స్ఫూర్తిదాయకం.కృష్ణకుమారి గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా ఉద్యోగం చేశారు. ఆ తర్వాత కొంతకాలం ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఫ్రంట్ ఆఫీసర్. తనకు వంటలు చేయడం, వంటల్లో ప్రయోగాలు చేయడం ఇష్టం. ఆ ఇష్టంతో తాను చేసిన కొత్త వంటకాలను కొలీగ్స్‌కి ఇచ్చేవారామె. ‘‘మా నాన్న టైలర్. ఓ రోజు సెర్ప్ (సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ) డీపీఎమ్ సురేఖ గారు మా షాప్‌కి వచ్చారు. నన్ను చూసి నేను చేస్తున్న పని తెలిసిన తర్వాత ఆమె నాకో డైరెక్షన్ ఇచ్చారు. ఆ ధైర్యంతోనే నా కుటీర పరిశ్రమ మొదలైంది. తొలి ఆర్డర్ యూఎస్‌కి, డాక్టర్ గీతాంజలి మేడమ్ పది వేల రూపాయల ఆర్డర్ ఇచ్చారు. అలా మొదలైన నా జర్నీ ఇప్పుడు నెలకు లక్ష రూపాయలకు పైగా ఆదాయంతో విజయవంతంగా సాగుతోంది. మిల్లెట్స్‌తో ప్రయోగాలు నన్ను నిలబెట్టాయి.’’ అన్నారు కృష్ణకుమారి.మహిళాశక్తి క్యాంటీన్డ్వాక్రా స్వయంసహాయక బృందంలో చేరిన తర్వాత తన కార్యకలాపాలను వేగవంతం చేశారు కృష్ణకుమారి. హైదరాబాద్, రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఎన్ఐఆర్డీలో శిక్షణ తీసుకోవడంతోపాటు, తన ఉత్పత్తులకు ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫికేషన్ వంటి ప్రక్రియలన్నీ పూర్తి చేసుకున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే ఎగ్జిబిషన్లలో స్టాల్ పెట్టడంతో మొదలైన ఆమె జర్నీ సరస్ మేళా ఎగ్జిబిషన్లతో అండమాన్, కశ్మీర్ మినహా దేశమంతటికీ విస్తరించింది.ఆమె విజయపథం... ఎగ్జిబిషన్లో స్టాల్ కోసం అధికారులను అడగాల్సిన దశ నుంచి ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో స్టాల్ పెట్టవలసిందింగా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వచ్చే దశకు చేరింది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గత ఏడాది జూన్ నెల రెండవ తేదీన జరిగిన వేడుకల్లో ఆమె స్టాల్ పెట్టారు. ఆ స్టాల్‌లోని ఉత్పత్తులను ఆసాంతం పరిశీలించిన మంత్రులు, ముఖ్యమంత్రి ఆమె అక్కడికక్కడే లైవ్ కౌంటర్లో వండిన తెలంగాణ రుచులకు కూడా సంతృప్తి చెందారు.డ్వాక్రా మహిళల కోసం శాశ్వతంగా ఒక వేదికను ఏర్పాటు చేయవలసిందిగా కోరడంతో ‘సెక్రటేరియట్ క్యాంటీన్ మహిళలకే ఇద్దాం’ అని నోటిమాటగా వచ్చిన ఉత్తర్వుతో అదే నెల 21న ఇందిరా మహిళాశక్తి క్యాంటీన్ మొదలైంది. అందులో కృష్ణకుమారితో పాటు పదిమంది మహిళలు తమ ఉత్పత్తులను విక్రయిస్తూ ఉపాధిపొందుతున్నారు. జయహో మహిళాశక్తి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిచిన్న రైతులేనా ఉత్పత్తులకు స్వాద్ అనే బ్రాండ్‌నేమ్ రిజిస్టర్ చేశాను. పరిశ్రమ దమ్మాయిగూడలో ఉంది. ఆరుగురు మహిళలు పని చేస్తున్నారు. నేను ఉదయం తొమ్మిదిన్నరకు సెక్రటేరియట్‌కు చేరుకుంటాను. తిరిగి ఇంటికి చేరేటప్పటికి రాత్రి పదవుతుంది. యూనిట్లో నిన్న తయారైన మెటీరియల్‌ను ఈ రోజున కౌంటర్లో పెడతాను. ఏ రోజుకారోజు అమ్ముడైపోతాయి. సెక్రటేరియట్ క్యాంటీన్‌తోపాటు యూనిట్లోనే అవుట్లెట్ కూడా ఉంది. రాపిడో ద్వారా సప్లయ్ చేస్తున్నాం. వినియోగదారులు మా దగ్గరకు రావడం కంటే మేమే వినియోగదారుల దగ్గరకు వెళ్లాలనే ఉద్దేశంతో మొబైల్ యూనిట్ ప్రారంభించనున్నాను.నా సక్సెస్‌కి కారణం తోటలే. పచ్చళ్లు, పొడులు ఏవి చేయాలన్నా కూరగాయలు మార్కెట్ నుంచి తెచ్చుకోను. నేరుగా తోటలకే వెళ్లి తెచ్చుకుంటాను. భారీ స్థాయిలో పండించే వాళ్లు స్వయంగా మార్కెట్‌కు తరలించగలుగుతారు. చిన్న రైతులు తమకు తాముగా మార్కెట్‌కి తీసుకెళ్లాలంటే ఆ ఖర్చులు భరించలేరు. నేను వారి దగ్గర తీసుకుంటాను. నేను ఇష్టంతో ఎంచుకున్న ప్రొఫెషన్. నాకు ఉపాధినివ్వడంతోపాటు గుర్తింపును కూడా తెచ్చింది. ఇందులోనే భవిష్యత్తును నిర్మించుకుంటాను. మహిళల కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు మహిళలకు తెలియడం లేదు. ప్రభుత్వ పథకాల గురించి మహిళలకు అవగాహన కల్పించడం కోసం పని చేస్తాను.– ఆకుల కృష్ణకుమారి, స్వాద్ ఫుడ్స్ -
లేడీ బౌన్సర్స్‌కు అడ్డే లేదు
స్త్రీలను కొన్ని ఉపాధుల్లోకి రానీకుండా అడ్డుకుంటారు. అడ్డుకునేవారిని అడ్డుకుంటాం అంటున్నారు ఈ లేడీ బౌన్సర్లు. కొచ్చి, పూణె, ఢిల్లీ, ముంబైలలో లేడీ బౌన్సర్లకు గిరాకీ పెరిగింది. సెలబ్రిటీలను గుంపు నుంచి అడ్డుకుని వీరు కాపాడుతారు. స్పోర్ట్స్, మార్షల్ ఆర్ట్స్, బాడీ బిల్డింగ్ తెలిసిన స్త్రీలు ఈ రంగాన్ని ఎంచుకుంటున్నారు. రోజుకు రెండు వేల వరకూ ఫీజు. వివాహితలూ ఉన్నారు. వివరాలు...ఎనిమిది గంటలు డ్యూటీ. తీసుకెళ్లడం తీసుకురావడం ఏజెన్సీ పని. భోజనం ఉంటుంది. బయట ఊర్లయితే రూము కూడా ఇస్తారు. రోజుకు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు సంపాదన. చేయాల్సిన పని?⇒ క్రౌడ్‌ను కంట్రోల్ చేయడం⇒ ఈవెంట్ సెక్యూరిటీ⇒ సెలబ్రిటీల రక్షణ⇒ సెలబ్రిటీలను ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకోవడం⇒ సంపన్నుల వేడుకల్లో హంగామా కోసం ⇒ ప్రయివేటు సమస్యల్లో రక్షణఇటీవల ఒక సినీ నటుడి ఇంటి గొడవల్లో బౌన్సర్లనే మాట ఎక్కువగా వినిపించింది. పోలీసుల రక్షణ వీలుగాని చోట ప్రముఖులు బౌన్సర్ల సాయం తీసుకోవడం సాధారణం అయ్యింది. ఒకప్పుడు పబ్‌లలో తాగి గొడవ చేసే వారి కోసం మాత్రమే బౌన్సర్లు ఉండేవారు. ఇప్పుడు అన్ని సేవలకు వారిని ఉపయోగిస్తున్నారు. సెక్యూరిటీకి మాత్రమే కాదు దర్పం చూపించడానికి కూడా శ్రీమంతులు బౌన్సర్లను వాడుతున్నారు. ఉదాహరణకు కలవారి పెళ్లిళ్లలో వరుడు/వధువు కల్యాణ వేదికకు వచ్చేప్పుడు వరుసదీరిన బౌన్సర్లు చెరో పక్క నడుస్తూ బిల్డప్ ఇస్తున్నారు. చూసేవారికి ఇది గొప్పగా ఉంటుంది. వేడుకలకు, బిజినెస్ మీటింగ్స్‌కు వచ్చే అతిథుల కోసం ఎయిర్‌పోర్ట్‌కు బౌన్సర్లను పంపుతున్నారు. కాలేజీ వేడుకలు, ప్రారంభోత్సవాలు, ఔట్‌డోర్ షూటింగ్‌లు... వీటన్నింటికీ బౌన్సర్లు కావాలి. ఎంతమంది బౌన్సర్లుంటే అంత గొప్ప అనే స్థితికి సెలబ్రిటీలు వెళ్లారు. దాంతో వీరి సేవలను సమకూర్చే ఏజెన్సీలు నగరాల్లో పెరిగాయి. మహిళా బౌన్సర్లు కూడా పెరిగారు.ఇబ్బందిగా మొదలయ్యి...‘మొదట ప్యాంటూ షర్టు వేసుకున్నప్పుడు ఇబ్బందిగా అనిపించింది. ఇంట్లో వాళ్లు కొత్తగా చూశారు. ఇరుగుపొరుగు వారు వింతగా చూశారు. కాని తరువాత అలవాటైపోయింది’ అంది పూణెకు చెందిన ఒక మహిళా బౌన్సర్. 2016లో దేశంలోనే మొదటిసారిగా మహిళా బౌన్సర్ల ఏజెన్సీ ఇక్కడ మొదలైంది. ఆ తర్వాత ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో ఇలాంటివి వచ్చాయి. ఇప్పుడు కేరళలో ఈ రంగంలోకి వస్తున్నవారు పెరిగారు. ‘మేము ఎవరినో రక్షించడానికి వెళుతుంటే మా రక్షణ కోసం కొత్తల్లో కుటుంబ సభ్యులు ఆందోళన పడేవారు. కాని స్త్రీలు ఈ రంగంలో సురక్షితంగా పని చేయొచ్చని నెమ్మదిగా అర్థం చేసుకున్నారు’ అని మరో బౌన్సర్ అంది.రెండు విధాలా ఆదాయంకొచ్చిలో ‘షీల్డ్ బౌన్సర్స్ ఏజెన్సీ’కి చెందిన మహిళా బౌన్సర్లు వేడుకలకు ప్రధాన ఆకర్షణగా మారారు. ఈవెంట్స్‌లో మహిళా అతిథులకు, స్టేజ్ రక్షణకు, అతిథుల హోటల్ నుంచి ఈవెంట్ వద్దకు తీసుకు రావడానికి వీరి సేవలు ఉపయోగిస్తున్నారు. ‘సాధారణంగా ఈవెంట్స్ సాయంత్రాలు ఉంటాయి. బౌన్సర్ల పని అప్పటి నుంచి మొదలయ్యి అర్ధరాత్రి వరకూ సాగుతుంది. కాబట్టి పగటి పూట చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ లేదా ఇంటి పనులు చక్కబెట్టుకుంటూ మధ్యాహ్నం తర్వాత ఈ పని చేస్తున్నవారూ ఉన్నారు. దాంతో రెండు విధాల ఆదాయం ఉంటోంది’ అని ఆ ఏజెన్సీ నిర్వాహకుడు తెలిపాడు.స్పోర్ట్స్ తెలిసినవారుస్కూల్, కాలేజీల్లో స్పోర్ట్స్‌లో చురుగ్గా ఉన్న మహిళలు, వ్యాయామం ద్వారా జిమ్ ద్వారా దేహాన్ని ఫిట్‌గా ఉంచుకున్నవారు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న వారు మహిళా బౌన్సర్లుగా రాణిస్తారు. వెంటనే వారికి పని దొరికే పరిస్థితి ఉంది. దేశంలోని నగరాల్లో వివాహితలు, పిల్లలున్న తల్లులు కూడా వృత్తిలో రాణిస్తున్నారు. ‘జనాన్ని అదుపు చేయడం, వారిని ఒప్పించి ఇప్పుడే దూరంగా జరపడం, ఆకతాయిలను కనిపెట్టడం, సెలబ్రిటీలతో వ్యహరించే పద్ధతి తెలియడం, చట్టపరిధిలో గొడవలను అదుపు చేయడం తెలిస్తే ఈ వృత్తి లాభదాయకం’ అంటున్నారు ఈ మహిళా బౌన్సర్లు. -
క్యాంటీన్లో గిన్నెలు కడిగాడు : ఇపుడు బిజినెస్ టైకూన్లా కోట్లు
జీవితంలోని నిరాశ నిస్పృహలు ఎప్పటికీ అలాగే ఉండిపోవు. శోధించి, సాధించాలేగానీ సక్సెస్ మన పాదాక్రాంతమవుతుంది. దీనికి కావాల్సిందలా పట్టుదల, శ్రమ, ఓపిక. జీవితంలోని వైఫల్యాల్ని, కష్టాలనే ఒక్కో మెట్టుగా మలుచుకోవడం తెలియాలి. అంతేగానీ నాకే ఎందుకు ఇలా మానసికంగా కృంగిపోకూడదు. కాలేజీ క్యాంటీన్లో క్యాంటీన్లో గిన్నెలు కడగడం నుండి పెట్రోల్ పంపులో పని చేయడం వరకు. సంజిత్ కష్ట సమయాలను అధిగమించాడు. 40 మంది ఉద్యోగులతో కోట్లకు పడగలెత్తిన కాలేజీ డ్రాపవుట్ గురించి తెలిస్తే.. మీరు కూడా ఫిదా అవుతారు. బెంగళూరుకు చెందిన సంజిత్ కొండా సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం రండి.బెంగళూరుకు చెందిన సంజిత్ కొండా (Sanjith Konda) మెల్బోర్న్లోని లా ట్రోబ్ విశ్వవిద్యాలయంలోని బుండూరా క్యాంపస్‌లో తన బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్‌ను అభ్యసించడానికి ఆస్ట్రేలియాకు వెళ్లాడు జీవితంలో గొప్ప స్థానానికి ఎదగాలనే కలని సాకారం చేసుకునేందుకు ఇదో అవకాశంగా భావించాడు. కానీ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే కిక్ ఏముంది అన్నట్టు కష్టాలు మొదలయ్యాయి. విశ్వవిద్యాలయ క్యాంటీన్లో పాత్రలు శుభ్రం చేశాడు. గ్యాస్ స్టేషన్లలో రాత్రి ఉద్యోగాలు చేశాడు. సెలవు రోజుల్లో గ్యాస్ స్టేషన్లలో పనిచేస్తూ వారానికి రూ. 33 వేలు సంపాదించేవాడు. విద్యార్థుల మండలి ఎన్నిక కావడంతో అతని జీవితం మరో మలుపుకు నాంది పలికింది.2019లొ సంజిత్ స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు. దీనికి గాను అతనికి రూ. 1.1 లక్షల స్టైఫండ్ వచ్చేది. ఈ సమయంలోనే విద్యార్థి కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడు. ఈవెంట్స్ ఉత్సవాలను నిర్వహించాడు. ఐదో సెమిస్టర్లో కళాశాల చదువు మానేసి సొంత వ్యాపారాన్ని స్థాపించాలనే ఆలోచన వచ్చింది. ఆస్ట్రేలియన్లు టీ, కాఫీలను ఇష్టంగా తాగుతారని గమనించాడు. పైగా తనకు చిన్నప్పటినుంచీ టీ అంటే ఇష్టం. ఈ క్రేజ్‌నే బిజినెస్‌గా మల్చుకున్నాడు. దీనికి మెల్బోర్న్లోని తన స్నేహితుడు అసర్ అహ్మద్ సయ్యద్‌తో చర్చించాడు. ఆరో సెమిస్టర్లో కాలేజీ నుంచి తప్పుకున్నాడు. ఎలిజబెత్ స్ట్రీట్‌లో 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో తన మొదటి దుకాణాన్ని ప్రారంభించాడు. 'డ్రాపౌట్ చాయ్‌వాలా' గా సంజిత్ జర్నీ మొదలైంది. ప్రీతం అకు, అరుణ్ పి. సింగ్ అనే ఇద్దరు కళాశాల సీనియర్లను నియమించుకున్నాడు. అలా సంజిత్తో సహా కేవలం ఐదుగురు వ్యక్తులతో మరియు ఐదు రకాల చాయ్‌లతో ప్రారంభమైంది. మొదటి మూడు నెలలు అమ్మకాలు నెమ్మదిగా ఉన్నాయి. ఆ తరువాత ఉద్యోగులు, విద్యార్థులు ఆదరణతో బాగా పుంజుకుంది. ఒక్క ఏడాదిలోనే సంవత్సరంలోనే, చాయ్ ట్రక్‌తో సహా మరో రెండు ప్రదేశాల్లో తన షాపును ఓపెన్ చేశాడు. రకరకాల ప్లేవర్లను పరిచయం చేస్తూ ‘డ్రాపవుట్ చాయ్‌వాలా’ బాగా పాపులర్ అయ్యాడు. 40 మంది కార్మికులతో రూ. 5.57 కోట్లు టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగింది. ఫ్యూజన్ గ్రీన్ టీ, చాయ్పుచినో లాంటివాటితోపాటు, టోస్ట్, కుకీలు, బన్ మస్కా, బన్ మసాలా , వివిధ రకాల పేస్ట్రీలతో సహా తేలికపాటి స్నాక్స్‌ను కూడా అందిస్తుంది.సంజిత్ తండ్రి ఒక మెకానికల్ ఇంజనీర్, అతను సౌదీ అరేబియా చమురు వ్యాపారంలో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. సంజిత్ తల్లి గృహిణి. ఆమెకు ఇంటి పనుల్లో సాయ పడటం, తల్లి పాస్‌బుక్‌ను అప్డేట్కోసం బ్యాంకుకు వెళ్లడం, ఇంధన బిల్లు చెల్లించడం, ఇంటి అద్దె వసూలు లాంటి పనులతో అండగా నిలిచిన కొడుకు సక్సెస్‌తో సంజిత్ తల్లి చాలా సంతోషంగా ఉంది. View this post on Instagram A post shared by Dropout Chaiwala (@dropout_chaiwala)మూడేళ్ల సంబరం : డ్రాపౌట్ చాయ్‌వాలా ఇటీవల ముచ్చటగా మూడేళ్ల పండుగను పూర్తి చేసుకుంది. ఈ విజయం వెనుక అద్భుతమైన డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ బృందం ,సహోద్యోగులు ఉన్నారంటూ వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు సంజిత్.మీ అభిరుచి, కృషి, పట్టుదల, నమ్మకమే ఒక బ్రాండ్‌కు మించి ఎదిగిన కుటుంబం మనది అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. -
పిల్లల పెంపకం తపస్సు లాంటిది : మంచి పాటలతో మానిసిక ఉత్తేజం
ముంబై సెంట్రల్: ‘పిల్లల పెంపకమనేది వినోదం కాదు..అదో తపస్సు.. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమైన నేటికాలంలో పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల బాధ్యత మరింత పెరిగింది. పిల్లలు భవిష్యత్తులో ఆదర్శవంతంగా ఎదగాలంటే ముందు తల్లిదండ్రులు తమ ప్రవర్తన మార్చుకోవాలి. పిల్లలు కాపీ కొట్టేది ముందుగా తల్లిదండ్రుల్నే..’అన్నారు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డా’’ఇండ్ల విశాల్‌రెడ్డి. ఆదివారం ఆంధ్ర మహాసభలో ‘విజ్ఞానం–వినోదం’పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... పిల్లలు ఎల్రక్టానిక్ గాడ్జెట్స్‌కు అలవాటు పడకుండా చూడాలనీ, వారిలో సర్వాంగ వికాసానికి తల్లిదండ్రులు తగిన విధంగా చర్యలు తీసుకోవాలనీ సూచించారు. పిల్లల్ని ఇతరులతో పోల్చడం, వారిపై కఠినమైన ఆంక్షలు విధించడం, తల్లిదండ్రుల అభిరుచుల్ని బలవంతంగా రుద్దడం వల్ల పిల్లల్లో మానసిక వికాసం ఆగిపోతుందని హెచ్చరించారు. మంచి పాటలతో మానిసిక ఉత్తేజం: డా. ఇండ్ల రామసుబ్బారెడ్డికార్యక్రమంలో భాగంగా ‘మనసు పాటలపై మానసిక విశ్లేషణ’అనే అంశంపై సుప్రసిద్ధ మానసిక నిపుణులు డా’’ఇండ్ల రామసుబ్బారెడ్డి ప్రసంగించి, సభికుల్ని అలరించారు. ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు మానసిక క్షోభకు గురవుతాడనీ, అలాంటి సమయంలో కుంగిపోకుండా, మోటివేషన్ కలిగించే మధురమైన పాటలు వింటే తాత్కాలికంగా మానసిక ఒత్తిడికి దూరమై నూతన ఉత్తేజాన్ని పొందుతాడని చెప్పారు. ఒక మానసిక వైద్యుడిగా ఇది తాను సాధికారికంగా చెప్పగలననీ అన్నారు.ఈ సందర్భంగా ఆయన ‘ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, మనసు పలికే మౌన గీతం, మనసున మనసై బ్రతుకున బ్రతుకై, ముద్దబంతి పూవులో మూగకళ్ళ ఊసులో, మనసు గతి ఇంతే, పాడుతా తీయగా చల్లగా, ఆట గదరా శివా, కలకానిది విలువైనది.’లాంటి పలు పాటల్ని ప్రదర్శిస్తూ, ఆ పాటలు ప్రభావం మనిషి జీవితంపై చూపలగల ప్రభావాన్ని గురించి ఉదాహరణలతో సహా వివరించారు. తెలుగువారి ప్రయోజనాలే ముఖ్యం: అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి ఆంధ్ర మహాసభలో వినోదాత్మక కార్యక్రమాలతో పాటు ఆధ్యాతి్మక, మానసిక వికాస, సాహిత్య కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామనీ, తెలుగువారి ప్ర యోజనాలే తమకు ముఖ్యమని అధ్యక్షుడు మాదిరెడ్డి కొండారెడ్డి మాట్లాడుతూ తెలిపారు. ఈ కార్యక్రమానికి భారీసంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారు. వీరందరికీ ఆంధ్ర మహాసభ తరపున టీ, టిఫిన్లు ఏర్పాటుచేశారు. అనంతరం ఇరువురు వైద్యుల్ని మహాసభ తరపున ఘనంగా సన్మానించారు. ఈ సభకు సాహి త్య విభాగ ఉపాధ్యక్షుడు బొమ్మకంటి కైలాశ్ స్వా గతం పలకగా, ధర్మకర్తల మండలి సభ్యుడు గాలి మురళీధర్ సమన్వయ కర్తగా వ్యవహరించారు. గాలి మురళీధర్ వందన సమర్పణ గావించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్, ధర్మకర్తల మండలి సభ్యులు సంగం ఏక్నాథ్, భోగ సహాదేవ్, ద్యావరిశెట్టి గంగాధర్, తాళ్ళ నరేశ్, సంయుక్త కార్యదర్శులు మచ్చ సుజాత, కటుకం గణేశ్, అల్లె శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు కొక్కుల రమేష్, క్యాతం సువర్ణ, కూచన బాలకిషన్, చిలుక వినాయక్, అల్లం నాగేశ్వర్రావు, మహిళ శాఖ అధ్యక్షురాలు మంచికంటి మేఘమాల, కార్య దర్శి పిల్లమారపు పద్మ తదితరులు పాల్గొన్నారు. -
ఏడు నిమిషాల్లో బాడీ ఫిట్ : హిట్ హిట్ హుర్రే!
ప్రపంచం వేగంగా మారుతోంది. అలా వేగం పెరుగుతున్న కొద్దీ మన శారీరక కదలికలు తగ్గిపోతున్నాయి. మరోవైపు ఉరుకుల పరుగుల జీవితంలో వ్యాయామానికి సమయం లేదనడమూ సర్వసాధారణంగా మారింది. అయితే నిజానికి మానవ శరీరం చురుకుగా కదులుతూ ఉండేందుకు అనువుగా రూపొందింది. సమయం లేదంటూ దానిని కదిలించ కపోతే శారీరక సమస్యలతో పాటు ఆరోగ్యానికి చేటు తప్పదు. ఈ నేపథ్యంలో గంటల తరబడి చేయడానికి బదులు కేవలం నిమిషాల్లో ముగించేందుకు వీలుగా కొత్త కొత్త వ్యాయామాలు పుట్టుకొస్తున్నాయి. అలా అందుబాటులోకి వచ్చిందేఈ హిట్ పద్ధతి. – సాక్షి, సిటీబ్యూరో అమెరికాకు చెందిన వ్యాయామ మనస్తత్వవేత్త క్రిస్ జోర్డాన్ ఈ హిట్ అనే వ్యాయామ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇది కదలికలు కురవైన శరీరం తెచ్చిపెట్టే సమస్యలకు.. కేవలం 7 నిమిషాల్లో పరిష్కరించగలదని ఆయన చెబుతున్నారు. సొంత శరీర బరువును ఉపయోగించి సుపరిచితమైన కాలిస్టెనిక్ వ్యాయామాలను చేయడమే హై ఇన్టెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ) ఈ హిట్ ఫార్ములా. ప్రతి రౌండ్‌కూ మధ్య ఐదు సెకన్ల విశ్రాంతి తీసుకుంటూ చేసే హై ఇన్టెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ)గా దీనిని పేర్కొంటున్నారు. ఇందులో ప్రతి వ్యాయామం 30 సెకన్ల పాటు చేయాలి. ఒక భంగిమ నుంచి మరో భంగిమకు మారేటప్పుడు మధ్యన 5 సెకన్ల చొప్పున గ్యాప్ ఉండాలి. పుష్–అప్స్: నేలపై లేదా చాపపై ‘ప్లాంక్’ పొజిషన్న్లోకి వెళ్లి చేసే ప్రక్రియ. బరువును పాదాలకు బదులుగా మోకాళ్లపై ఉంచడం ద్వారా దీన్ని సులభతరం చేయవచ్చు. వాల్ సిటప్స్: గోడ దగ్గర వెనుకభాగంలో నిల్చుని కుర్చీలో కూర్చున్నట్లుగా కూర్చునే భంగిమ. ఓ రకంగా గోడకుర్చీ వేయడం అని చెప్పొచ్చు. అబ్ క్రంచ్: ప్రాథమిక క్రంచ్‌తో ప్రారంభించి, వెనుకభాగంలో చదునుగా ఉంచి పడుకోవాలి, మోకాళ్లను వంచి పాదాలను నేలపై ఉంచి చేయాలి. స్టెప్–అప్: దృఢమైన కుర్చీ లేదా బెంచ్‌కు ఎదురుగా నిలబడి, ఎడమ కాలితో ఓ సారి కుడికాలితో మరోసారి ప్రారంభించి చేయాలి. 30 సెకన్ల వ్యవధిలో వీలైనన్ని సార్లు చేయాలి. స్క్వాట్: పాదాలను భుజం–వెడల్పు వేరుగా చేసి కాలి వేళ్లను ముందుకు ఉంచి నిలబడాలి. ఈ భంగిమలో ఉన్నప్పుడు బరువులో ఎక్కువ భాగాన్ని మడమల మీద ఉంచాలి. 30 సెకన్ల పాటు ఇలా చేయాలి. ట్రైసెప్ డిప్: కుర్చీ లేదా బెంచ్ ముందు అంచున కూర్చుని, మన అరచేతులను అంచుపై ఉంచి దీనిని చేయాలి. ప్లాంక్: చాపపై బోర్లా పొట్టపై పడుకుని దీన్ని చేయాలి. ఈ భంగిమలో మన మోచేతులు మన వైపు దగ్గరగా, అరచేతులు కిందికి వేళ్లు ముందుకు ఎదురుగా ఉంటాయి.చదవండి: 64 ఏళ్ల ప్రేమ : ఇన్నాళ్లకు అంగరంగ వైభవంగా పెళ్లిహై ‘నీస్’: 30 సెకన్ల పాటు ఉన్నచోటే పరుగెత్తడంగా దీన్ని చెప్పొచ్చు. ప్రతి అడుగుతో మోకాళ్లను వీలైనంత ఎత్తుకు పైకి తీసుకొస్తూ, అరచేతులను తాకడానికి మన మోకాళ్లను వేగంగా పైకి కందికి ఎత్తుతూ చేయాలి. లంజెస్: పాదాలను కలిపి నిలబడి, కుడి పాదం మీద ముందుకు సాగదీయాలి. ముందు, వెనుక మోకాలు రెండూ వీలైనంత 90–డిగ్రీల కోణానికి దగ్గరగా వంగి ఉండే వరకూ చేయాలి.ఇదీ చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలుసైడ్ ప్లాంక్‌లు: చాపపై కుడి వైపున పడుకుని, ఎడమవైపు పడుకుని చేసే వ్యాయామం. -
నూరేళ్ల గ్రంథాలయం
పాల్వంచ సంస్థానంలో కుక్కునూరులో ఉన్న ‘దేశోద్ధారక ఆంధ్రభాషా నిలయం’ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. సరిగ్గా నేటికి వందేళ్ల క్రితం (1925 మార్చి 25) గోదావరి తీరంలో ఉన్న ‘అమరవరం’లో ‘గౌతమి ఆశ్రమం’తో పాటు ఈ గ్రంథాలయాన్నీ, ఒక పత్రికా పఠన మందిరాన్ని, ప్రాథమిక పాఠశాలను ప్రారంభించారు. అమరవర వాస్తవ్యులు, ఆంధ్ర భాషా కోవిదులు బ్రహ్మశ్రీ వేలూరు సుబ్రహ్మణ్యం తన పుస్తకాలు ఈ గ్రంథాలయానికి బహూకరించారు. వీటితో పాటు రెండు చెక్క బీరువాలు, బెంచీలు, బల్లలతో మౌలిక సదుపాయాలు కల్పించారు. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వర రావు తమ పత్రికలను ఈ గ్రంథాలయానికి అందించడంతో పాటు దాని ఉన్నతికి ఎంతో కృషి చేశారు. అందుకే ‘దేశోద్ధారక ఆంధ్రభాషా నిలయం’ అని దీనికి పేరుపెట్టారు. తరువాత ఈ గ్రంథాలయాన్ని కుక్కునూరుకు మార్చారు. గ్రంథాలయంలోని పత్రిక పఠన మందిరంలో ‘ఆంధ్ర పత్రిక, భారతి, నీలగిరి, తెలుగు, ఆంధ్ర రంpని, జన్మ భూమి, త్రిలింVýæ, సుజ్ఞాన చంద్రిక, బ్రహ్మానందిని, ఆంధ్ర అభ్యుదయం, శ్రీ శారద ధన్వంతరి, కృష్ణా పత్రిక’ వంటివి... కోటగిరి వెంకట అప్పారావు, మాజేటి రామచంద్ర రావు తదితరుల సహాయ సహకారాలతో గ్రంథాలయానికి వచ్చేవి. దసరా, దీపావళి, వైకుంఠ ఏకాదశి, పోతన జయంతి, శ్రీకృష్ణ జయంతి సందర్భంగా ‘గ్రంథాలయ యాత్ర’ చేపట్టి విరాళాలు సేకరించి గ్రంథాలయం ఉన్నతికి కృషి చేశారు. 1960-70 కాలం వరకు చుట్టుపక్కల దాదాపు 20 గ్రామాల ప్రజలు ఈ గ్రంథాలయాన్ని చక్కగా వినియోగించు కున్నారు. 1970 తరువాత అనుకున్నంత స్థాయిలో ఈ గ్రంథాలయం తన ప్రతిభను కనపరచలేకపోయింది, కారణం ఆర్థిక వన రులూ, మానవ వనరుల కొరత, నాటి అవసరాలకు అనుగుణంగా పుస్తకాలు లేకపోవడం వంటి కారణాలతో 1980–85 మధ్యకాలంలో ఈ గ్రంథాలయాన్ని ప్రభుత్వ గ్రంథాలయంలో విలీనం చేశారు. అప్పటికే ఆ గ్రంథాలయంలో ఉన్న చాలా విలువైన గ్రంథ సంపద అంతరించి పోయింది. – డా. రవి కుమార్ చేగొనితెలంగాణ గ్రంథాలయ సంఘం కార్యదర్శి(నేటితో దేశోద్ధారక ఆంధ్రభాషా నిలయానికి వందేళ్లు) -
మానవ సేవతో...
మూడు శతాబ్దాలు చూసిన మునిగా పేరు గాంచిన కల్యాణ్ దేవ్... వివేకానుందుని బోధనలతో ఉత్తేజితుడై మానవ సేవ ద్వారా మాధవునికి సేవ చేసి తరించారు. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పట్ జిల్లాలోని కోటనా గ్రామంలో 1876లో జన్మించిన ఆయన అసలు పేరు కాలూరామ్. రిషీకేశ్‌లో స్వామి పూర్ణానంద శిష్యులై స్వామి కల్యాణ్ దేవ్ అయ్యారు. కొన్నేళ్ళు హిమాలయాలలో తపస్సు చేశారు. అనంతరం ఆయన తన ప్రాంతంలోని పేద ప్రజలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్, హరియాణా, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, ఇతర ప్రాంతాల ప్రజల కోసం దాదాపు మూడు వందల పాఠ శాలలు, వైద్యకేంద్రాలను ఏర్పాటు చేశారు. అంటరాని తనం, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయన తన వాణిని వినిపించారు. నిర్లక్ష్యానికి గురైన మతపరమైన, చారిత్రక ప్రదే శాల పునర్నిర్మాణానికి కల్యాణ్‌దేవ్ మద్దతు ఇచ్చారు. ముజఫర్‌నగర్‌లోని శుక్తల్‌లో ఆయన ‘శుకదేవఆశ్రమం’, ‘సేవా సమితి’ని కూడా స్థాపించారు. హస్తినా పూర్లోని కొన్ని ప్రాంతాలను, హరియాణాలోని అనేక తీర్థయాత్రా స్థలాలను పునరుద్ధరించారు.ఒక ఇంటర్వ్యూ సందర్భంగా కల్యాణ్‌దేవ్ మాట్లా డుతూ... 1893లో ఖేత్రిలో వివేకానందుడిని కలిసి నప్పుడు తనకు ప్రేరణ కలిగిందని, ఆయన తనతో... ‘నువ్వు దేవుడిని చూడాలనుకుంటే, పేదల గుడిసెలకు వెళ్ళు... నువ్వు దేవుడిని పొందాలనుకుంటే, పేదలకు, నిస్సహాయులకు, అణగారినవారికి, దుఃఖితులకు సేవ చేయి’ అని అన్నారని చెప్పారు. పేదల సేవ ద్వారా దేవుడిని పొందడమే తనకు స్వామీజీ నుండి లభించిన మంత్రమని కల్యాణ్‌దేవ్ పేర్కొన్నారు.భారత ప్రభుత్వం 1982లో ఆయనను పద్మశ్రీ, 2000లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది మీరట్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డి.లిట్. ప్రదానం చేసింది. తుదకు ఆయన 2004లో పరమపదించారు. – యామిజాల జగదీశ్ -
64 ఏళ్ల ప్రేమ : ఇన్నాళ్లకు అంగరంగ వైభవంగా పెళ్లి
ప్రేమ, పెళ్లి అనేవి క్షణికమైన బంధాలుగా మారిపోతున్న వేళ పవిత్రమైన ప్రేమకు, వివాహ బంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిందో జంట. 64 ఏళ్ల నుంచి కలగా మిగిలిపోయిన వేడుకను ఆనందంగా జరుపుకున్నారు. అదీ మనవరాళ్ల మధ్య. గుజరాత్‌కు చెందిన ఈ జంట వివాహ వేడుక నెట్టింట పలువుర్ని ఆకట్టు కుంటోంది. 80 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కిన అందమైన జంట లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం.1961 నాటి ప్రేమకథ1961 సంవత్సరం అది. అసలు ప్రేమ, అందులోనూ ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకోవడం లాంటి విషయాలను చాలా ఆశ్చర్యంగా చూసే సామాజిక కట్టుబాట్లు ఉన్న రోజులవి. కులాంతర వివాహాలన్న ఊసే లేదు. ఇవి ఆచరణాత్మకంగా నిషిద్ధం. ఆ రోజుల్లో హర్ష్, మృధు మధ్య ప్రేమ చిగురించింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న జైన యువకుడు హర్ష్, బ్రాహ్మణ యువతి మృదుతో ప్రేమలో పడ్డాడు. పాఠశాలలో చిగురించిన ప్రేమ, ప్రేమ లేఖలతో మరింత బలపడింది. View this post on Instagram A post shared by The Culture Gully™️ (@theculturegully) యథాప్రకారం వీరి ప్రేమ గురించి తెలిసి ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి. చర్చోపచర్చలు, తర్కాలు తరువాత కూడా తమ వాదన మీదే నిలబడ్డాయి ఇరుకుటుంబాలు. అటు కుటుంబం, ఇటు ప్రేమ వీటి రెండింటి మధ్యా ప్రేమనే ఎంచుకున్నారు. ఇద్దరూ సాహసమే చేశారు. ధైర్యంగా కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. కొత్త జీవితాన్ని వెదుక్కుంటూ ఇంటినుంచి పారిపోయారు.హర్ష్ -మృదు వివాహంకలిసిన ఈ రెండు హృదయాలకు..ఒకరికొకరే తోడు నీడు తప్ప మరెవ్వరూ అండగా నిలబడలేదు. పెళ్లి వేడుక లేదు, పెద్దల ఆశీర్వాదాలు అసలే లేవు. అయినా పూర్తి నిబద్ధత, పట్టుదలతో సాదాసీదాగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. సామాజిక సరిహద్దులను అధిగమించే ప్రేమ విలువను అర్థం చేసుకునేలా పిల్లలను పెంచారు. వారికి పెళ్లిళ్లు చేశారు. మనవరాళ్లతో కుటుంబం చాలా సంతోషంగా ఉంది. ఈ అద్భుతమైన కథను వింటూ పెరిగారు హర్ష్ మృదు పిల్లలు మనవరాళ్ళు. ఈ క్రమంలోనే ఇన్నేళ్లుగా వారి మదిలి మిగిలిపోయిన కోరిక గురించి తెలుసుకున్నారు. 64వ వార్షికోత్సవం సందర్భంగా, కనీవిని ఎరుగని విధంగా తామే దగ్గరుండి వారికి పెళ్లి జరిపించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుక అతిథులందరి చేత కంట తడిపెట్టించింది.సాధారణ 10 రూపాయల చీరలో భర్తచేత ఆనాడు తాళి కట్టించుకున్న మృదు ఇపుడు గుజరాతీ సాంప్రదాయంలో ఘర్చోలా చీర, గోరింటాకు, నగలతో అందంగా ముస్తాబైంది. ఆరు దశాబ్దాలకు పైగా తన భర్తగా ఉన్న వ్యక్తిని మరోసారి పెళ్లాడి భావోద్వేగానికి లోనైంది. పవిత్ర అగ్నిహోమం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు, తొలిసారి కలిసిన ఈ జంట చేతులు మరింత దృఢంగా పెనవేసుకున్నాయి. జీవితాంతం పంచుకున్న ఆనందాలు , కష్టాలు, కన్నీళ్లను చూసిన వారి కళ్ళలో ఆనంద బాష్పాలు నిండాయి.చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలునిజమైన ప్రేమ అంటే ప్రేమించడం మాత్రమే కాదు; జీవిత పయనంలో వచ్చే ప్రతీ సవాల్‌ను స్వీకరించడం, అంతే బలంగా దాన్నుంచి బయటపడటం. ఓరిమితో , ఒకరికొరు తోడు నీడగా సాగిపోవడం. ఏ సామాజిక కట్టుబాట్లను తాము తోసి రాజన్నారో, ఆ అవగాహనను, చైతన్యాన్ని తమబిడ్డల్లో కలిగించడం. ఇదే జీవిత సత్యం. వైవాహిక జీవితానికి పరిపూర్ణత అంటే ఇదే అని నిరూపించిన జంటను శతాయుష్షు అంటూ దీవించారు పెళ్లి కొచ్చిన అతిథులంతా.చదవండి: కొడుకుకోసం..చిరుతపైనే పంజా విసిరింది! -
7 నిమిషాల్లోనే సంపూర్ణ వర్కవుట్
అమెరికాకు చెందిన వ్యాయామ మనస్తత్వవేత్త క్రిస్ జోర్డాన్ ఈ హిట్ అనే వ్యాయామ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇది కదలికలు కురవైన శరీరం తెచ్చిపెట్టే సమస్యలకు.. కేవలం 7 నిమిషాల్లో పరిష్కరించగలదని ఆయన చెబుతున్నారు. సొంత శరీర బరువును ఉపయోగించి సుపరిచితమైన కాలిస్టెనిక్ వ్యాయామాలను చేయడమే హై ఇన్టెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ) ఈ హిట్ ఫార్ములా. ప్రతి రౌండ్‌కూ మధ్య ఐదు సెకన్ల విశ్రాంతి తీసుకుంటూ చేసే హై ఇన్టెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ)గా దీనిని పేర్కొంటున్నారు. ఇందులో ప్రతి వ్యాయామం 30 సెకన్ల పాటు చేయాలి. ఒక భంగిమ నుంచి మరో భంగిమకు మారేటప్పుడు మధ్యన 5 సెకన్ల చొప్పున గ్యాప్ ఉండాలి.వాల్ సిటప్స్: గోడ దగ్గర వెనుకభాగంలో నిల్చుని కురీ్చలో కూర్చున్నట్లుగా కూర్చునే భంగిమ. ఓ రకంగా గోడకుర్చీ వేయడం అని చెప్పొచ్చు. అబ్ క్రంచ్: ప్రాథమిక క్రంచ్‌తో ప్రారంభించి, వెనుకభాగంలో చదునుగా ఉంచి పడుకోవాలి, మోకాళ్లను వంచి పాదాలను నేలపై ఉంచి చేయాలి.స్టెప్–అప్: దృఢమైన కుర్చీ లేదా బెంచ్‌కు ఎదురుగా నిలబడి, ఎడమ కాలితో ఓ సారి కుడికాలితో మరోసారి ప్రారంభించి చేయాలి. 30 సెకన్ల వ్యవధిలో వీలైనన్ని సార్లు చేయాలి.స్క్వాట్: పాదాలను భుజం–వెడల్పు వేరుగా చేసి కాలి వేళ్లను ముందుకు ఉంచి నిలబడాలి. ఈ భంగిమలో ఉన్నప్పుడు బరువులో ఎక్కువ భాగాన్ని మడమల మీద ఉంచాలి. 30 సెకన్ల పాటు ఇలా చేయాలి.ట్రైసెప్ డిప్: కుర్చీ లేదా బెంచ్ ముందు అంచున కూర్చుని, మన అరచేతులను అంచుపై ఉంచి దీనిని చేయాలి.ప్లాంక్: చాపపై బోర్లా పొట్టపై పడుకుని దీన్ని చేయాలి. ఈ భంగిమలో మన మోచేతులు మన వైపు దగ్గరగా, అరచేతులు కిందికి వేళ్లు ముందుకు ఎదురుగా ఉంటాయి.హై ‘నీస్’: 30 సెకన్ల పాటు ఉన్నచోటే పరుగెత్తడంగా దీన్ని చెప్పొచ్చు. ప్రతి అడుగుతో మోకాళ్లను వీలైనంత ఎత్తుకు పైకి తీసుకొస్తూ, అరచేతులను తాకడానికి మన మోకాళ్లను వేగంగా పైకి కందికి ఎత్తుతూ చేయాలి.లంజెస్: పాదాలను కలిపి నిలబడి, కుడి పాదం మీద ముందుకు సాగదీయాలి. ముందు, వెనుక మోకాలు రెండూ వీలైనంత 90–డిగ్రీల కోణానికి దగ్గరగా వంగి ఉండే వరకూ చేయాలి.సైడ్ ప్లాంక్‌లు: చాపపై కుడి వైపున పడుకుని, ఎడమవైపు పడుకుని చేసే వ్యాయామం. పుష్–అప్స్: నేలపై లేదా చాపపై ‘ప్లాంక్’ పొజిషన్Œలోకి వెళ్లి చేసే ప్రక్రియ. బరువును పాదాలకు బదులుగా మోకాళ్లపై ఉంచడం ద్వారా దీన్ని సులభతరం చేయవచ్చు. -
మూడు నెలల్లో 9 కిలోలు తగ్గిన జ్యోతిక: ఈ సక్సెస్ సీక్రెట్ ఆమే!
బోలెడన్ని వ్యాయామాలు అంతులేని ఆహారపు మెళకువలు అందుబాటులో ఉన్నప్పటికీ, బరువు నిర్వహణ తనకు ’ఎప్పుడూ కష్టంగానే అనిపించేది అని నటి జ్యోతిక అన్నారు. రకరకాల వ్యాయామాలు, అంతులేని ఆహారాల మార్పులు, అపరిమిత ఉపవాసం ఇవేవీ నా అదనపు కిలోల బరువును తగ్గించడంలో సహాయపడలేదు. అని కూడా స్పష్టం చేశారు...అలాంటి జ్యోతిక ఇప్పుడు బరువు తగ్గారు. అదెలా సాధ్యమైంది? దీనికి ఓ ఏడాది క్రితం బీజం పడింది అని ఆమె గుర్తు చేసుకుంటున్నారు. ఆ బీజం పేరు విద్యాబాలన్. బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఒక దశలో విపరీతంగా బరువు పెరిగారు. కానీ అకస్మాత్తుగా స్వల్ప వ్యవధిలోనే ఆమె గణనీయంగా బరువును తగ్గించుకోగలిగారు. దీనిపై ఎన్ని రకాల సందేహాలు, అంచనాలు, విశ్లేషణలు వచ్చినప్పటికీ... ఆమె మాత్రం స్పందించలేదు. అయితే గత అక్టోబర్ 2024లో విద్యాబాలన్ తన విపరీతమైన బరువు తగ్గడంపై మౌనం వీడింది జిమ్‌కి వెళ్లకుండానే చెమట్లు కక్కకుండానే తాను అదనపు కిలోల బరువు తగ్గడానికి కారణాలను, తన కొత్త ఆహారపు అలవాట్లను వెల్లడించింది. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ‘‘ డైట్ బట్ ’నో ఎక్సర్ సైజ్’ రొటీన్ ద్వారా విపరీతంగా బరువు తగ్గినట్టు వెల్లడించింది. దీనిని జ్యోతిక కూడా అనుసరించారు. ఆమెలాగానే నటి జ్యోతిక, తన బరువు తగ్గించే ప్రయాణాన్ని ప్రారంభించి ఆమె శిక్షకులనే ఎంచుకున్నారు. అచ్చం విద్య మాదిరిగానే తన డైట్ ఫిట్నెస్ మంత్రాన్ని మార్చడం ద్వారా ’ 3 నెలల్లో 9 కిలోల బరువు తగ్గినట్లు’ వెల్లడించింది. తన ట్రైనర్ చెన్నైకి చెందిన న్యూట్రీషియన్ గ్రూప్ అమురా హెల్త్ టీమ్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసింది. దానితో పాటు , ‘అమురా, కేవలం 3 నెలల్లో 9 కిలోల బరువు తగ్గినందుకు నా అంతరంగాన్ని తిరిగి కనుగొనడంలో నాకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు, అమురా! మీరందరూ ఓ మాయాజాలం అంటూ పొగిడింది. తన ఇంటర్వ్యూల ద్వారా నన్ను అమరా మాయా బృందానికి పరిచయం చేసినందుకు విద్యాబాలన్ కు కృతజ్ఞతలు’’ తెలిపింది. View this post on Instagram A post shared by Jyotika (@jyotika)‘‘‘నేను నా ప్రేగు, జీర్ణక్రియ, వేడిని కలిగించే ఆహారాలు ఆహార సమతుల్యత గురించి తెలుసుకున్నాను. మరీ ముఖ్యంగా, సానుకూల భావాన్ని కలిగించేటప్పుడు నా సంతోషం, మానసిక స్థితిపై ఆహారం ప్రభావాన్ని అర్థం చేసుకున్నాను. ఫలితంగా, ఈ రోజు ఒక వ్యక్తిగా నేను చాలా శక్తివంతంగా అదే సమయంలో ఆత్మవిశ్వాసంతో ఉన్నాను’’ అంటూ బరువు తగ్గడం కన్నా మన శరీరంపై మనకు అవగాహన ఏర్పడడం ముఖ్యమని ఆమె వివరించింది. అయితే బరువు తగ్గడంతో పాటే మహిళల ఆరోగ్యానికి వెయిట్ ట్రైనింగ్ ఎంత ముఖ్యమో కూడా జ్యోతిక తెలియజేసింది. ‘ఆరోగ్యకరమైన జీవితం సమతుల్యతతో కూడి ఉంటుంది; బరువు తగ్గడం లో ఆహారపు అలవాట్లు ముఖ్యమైనవి, అలాగని శక్తి అక్కర్లేదని కాదు.చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలువెయిట్ ట్రైనింగ్ అనేది మహిళల భవిష్యత్తుకు కీలకం, బరువు తగ్గడంతో పాటు శక్తి కోల్పోకుండా ఉండడం కూడా ముఖ్యమైన విషయం. ఇది నేర్పినందుకు వయస్సు కేవలం ఒక సంఖ్య అని నిరూపించినందుకు శిక్షకుడు మహేష్‌కు ధ్యాంక్స్ చెప్పాలి. ‘నా శరీరం దాని పనితీరును అర్థం చేసుకోవడం దానితో వ్యాయామాలను కలపడం నా అనుభవంపై గరిష్ట ప్రభావాన్ని చూపింది అంటూ ఇదే సందర్భంగా పోషకాహార నిపుణులు ఫిట్నెస్ నిపుణుల బృందానికి తనను పరిచయం చేసినందుకు విద్యకు ధన్యవాదాలు తెలిపింది.చదవండి: ట్రెండింగ్ కర్రీ బిజినెస్ : సండే స్పెషల్స్, టేస్టీ ఫుడ్ -
అకాలవర్షంతో నష్ట నివారణకు ఉద్యాన పంటల్లో జాగ్రత్తలు
అకాల వర్షాలు విరుచుకుపడటంతో గత రెండు, మూడు రోజులుగా అనేక చోట్ల అనేక పండ్ల తోటలకు నష్టం జరిగింది. ఈ తోటల్లో పునరుద్ధరణకు, నష్ట నివారణకు సిద్ధిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ లక్ష్మీనారాయణ ధరావత్ సూచనలు ఇక్కడ పొందుపరుస్తున్నాం.. మామిడివీలైనంత వరకు అకాల వర్షపు నీటిని 24 గంటల లోపు తోట బయటకు పంపాలి. అదే విధంగా నీరు నిలిచిపోయే పరిస్థితులను నివారించడానికి ఎతైన కట్టలతో సరైన పారుదల సౌకర్యాన్ని అందించాలి.గాలికి దెబ్బతిన్న కొమ్మలను కత్తిరించి కాపర్ ఆక్సీ క్లోరైడ్ ఒక లీటర్ నీటికి 20గ్రా. కలిపి పేస్ట్ లాగ చేసి పూయాలి.రాలిపోయిన పండ్లను చెట్ల కింద నుంచి సేకరించి దూరంగా వేసి, నాశనం చేయాలి. వీటిని అలాగే వదలివేయటం వల్ల తెగుళ్లు వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. మామిడికి ప్రస్తుతం పక్షి కన్ను తెగులు వచ్చే అవకాశం ఉంది. నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ ఒక లీటర్ నీటికి 3 గ్రా. కలిపి పిచికారీ చేయాలి. అదే విధంగా బాక్టీరియా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, స్ట్రె΄్టోమైసిన్ సల్ఫేట్ 0.5 గ్రా. ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.పండ్ల పరిమాణం పెరగడానికి ఒక లీటర్ నీటికి కెఎన్03ను 10 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.కాయలకు పగుళ్లు రాకుండా ఉండటానికి ఒక లీటర్ నీటికి బోరాన్‌ను 1.25 గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేయాలి.కాపర్ ఆక్సీక్లోరైడ్, స్ట్రెపోటోమైసిన్ సల్ఫేట్, కెఎన్03, బొరాన్.. ఈ నాలుగింటిని ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయవచ్చు.ప్రస్తుతం తడి వాతావరణం వల్ల పండు ఈగ కాయల్లో గుడ్లు పెట్టే అవకాశం ఉంది.నివారణకు మిథైల్ యూజీనాల్ (ఎర) ఉచ్చులను ఎకరానికి 10–20 అమర్చు కోవాలి.చెట్టుపైన మామిడి పండ్లను సంచులతో కప్పితే ఎగుమతికి అవసరమైన నాణ్యమైన పండ్లను పొందవచ్చు.చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలుటమాటకాయలకు పగుళ్లు వచ్చే అవకాశం ఉన్నందున బొరాక్స్ ఒక లీటర్ నీటికి 2 నుండి 3గ్రా. కలిపి పిచికారీ చేయాలి.పూత దశలో ఉంటే, పూత రాలి పోకుండా ఉండటానికి పోలానోఫిక్స్ ఒక మి.లీ., 4.5 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి.సూక్ష్మ పోషక మిశ్రమాన్ని ఒకలీటర్ నీటికి 5గ్రా. కలిపి పిచికారి చేయాలి.పసుపువర్షాల వల్ల ఆరబెట్టిన పసుపు తడిసి΄ోయే ప్రమాదం ఉంది. అందుబాటులో ఉన్న ప్లాస్టిక్ షీట్స్‌ను కప్పడం ద్వారా దీన్ని నివారించుకోవచ్చు. చదవండి: ట్రెండింగ్ కర్రీ బిజినెస్ : సండే స్పెషల్స్, టేస్టీ ఫుడ్రైతులకు ఏమైనా సందేహాలుంటే వివిధ పంటలకు సంబంధించి ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.పండ్లు : డా. వి. సుచిత్ర – 6369803253కూరగాయలు : డా. డి. అనిత –94401 62396పూలు : డా. జి. జ్యోతి – 7993613179ఔషధ మరియు సుగంధద్రవ్య మొక్కలు:శ్రీమతి కృష్ణవేణి – 9110726430పసుపు : శ్రీ మహేందర్ : 94415 32072మిర్చి : శ్రీ నాగరాజు : 8861188885 -
పెను గాలుల నుంచి టేపులతో అరటికి రక్షణ!
అరటి తోటలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న రైతులకు పెనుగాలులు తీవ్ర నషాన్ని కలిగిస్తూ ఉంటాయి. లక్షలు పెట్టుబడి పెట్టి పెంచిన అరటి తోటల్లో కొద్ది రోజుల్లో గెలలు కోతకు వచ్చే దశలో సుడిగాలులు, తుపాన్లకు విరిగి పడిపోతే రైతులకు నూటికి నూరు శాతం నష్టం జరుగుతుంది. వెదురు బొంగుల ఊతంతో అరటి చెట్లకు గాలుల నుంచి రక్షించుకునేందుకు రైతులు విఫలయత్నం చేస్తూ వుంటారు. అయితే, కర్ణాటకలో అరటి తోటలు సాగు చేస్తున్న ఒక యువ రైతు సరికొత్త ఆలోచనతో, తక్కువ ఖర్చుతోనే అరటి తోటలను పెను గాలుల నుంచి చక్కగా రక్షించుకుంటున్నారు. చెట్టుకు నాలుగు వైపులా గూటాలు వేసి, వాటికి ప్లాస్టిక్ టేప్‌లను కట్టటం ద్వారా పెను గాలుల నుంచి అరటి చెట్లను చాలా వరకు రక్షించుకోవచ్చని యువ రైతు సురేష్ సింహాద్రి చెబుతున్నారు.. సురేష్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తణుకు. కర్ణాటకలోని మైసూరుప్రాంతానికి వలస వెళ్లి కొన్ని సంవత్సరాల నుంచి యాలక్కి రకం అరటి తోటలను కౌలు భూముల్లో సాగు చేస్తున్నారు. చామరాజానగర జిల్లా కొల్లేగాలా తాలూకా, సత్తేగాల గ్రామంలో సురేష్ అరటి తోటలను సాగు చేస్తున్నారు. ఆయన అనుభవాలు.. ఆయన మాటల్లోనే..అరటి చెట్లకు నాలుగు వైపులా గూటాలు వేసి టేపులతో కట్టేస్తాంగాలుల నుంచి అరటి చెట్లకు గల సమస్యను అధిగమించడానికి తెలుగు రాష్ట్రాల్లో రైతులు సాధారణంగా వెదురు బొంగులను ఆసరాగా పెట్టి అరటి చెట్లకు రక్షణ కల్పిస్తుంటారు. ఇందుకోసం కర్రల కొనుగోలుకే ఎకరానికి రూ. లక్ష వరకు ఖర్చు చేస్తున్నారు. అయితే, మేము కర్రల అవసరం లేకుండా కేవలం టేపులతోనే అరటి చెట్టుకు నాలుగు వైపులా కట్టి గాలుల నుంచి విజయవంతంగా రక్షించుకుంటున్నాం. చెట్టుకు నాలుగు వైపులా నేలలోకి కట్టె గూటాలు దిగవేసి, వాటికి టేపులతో అరటి చెట్టు పై భాగాన్ని కడుతున్నాం. చెట్టుకు గట్టిగా బిగుతుగా కట్టకుండా కొంచెం వదులుగా ఉండేలా చెట్టు చుట్టూతా టేపులను రక్షణ చక్రం మాదిరిగా కడతాం. గాలులు వీచి చెట్టు అటూ ఇటూ ఊగినప్పుడు చెట్టు కాండం విరిగి పడిపోకుండా రక్షించుకుంటున్నాం. చెట్టుకు 6 నెలల వయసులో పువ్వు దశలో టేపు కట్టాలి. గత ఏడాది ఎప్పుడూ ఎరుగని రీతిలో మాప్రాంతంలో గాలి వాన వచ్చి అరటి తోటలే కాదు, కరెంటు స్థంభాలు కూడా కూలిపోయాయి. అయినా, మా తోటలో కొన్ని చెట్లు మాత్రమే ఒరిగాయి. మిగతా చెట్లు అదృష్టం కొద్దీ గాలులను చాలా వరకు తట్టుకున్నాయి. టేపులతో కట్టటం వల్లనే ఇది సాధ్యమైంది.ఎకరానికి రూ. 12 వేల ఖర్చుఎకరం అరటి తోటకు రూ. 12 వేల ఖర్చుతోనే టేపులతో రక్షణ కల్పించుకుంటున్నాం. ఎకరానికి 25 కిలోల టేపు అవసరం అవుతుంది. కిలో ధర రూ. 130. టేపులు కట్టడానికి కట్టె గూటాలు కావాలి. యూకలిప్టస్ లేత కర్రలను కొనుగోలు చేసి, 2 అడుగుల గూటాలను తయారు చేసుకొని వాడుతున్నాం. అడుగున్నర లోతు వరకు నేలలోకి ఏటవాలుగా దిగగొట్టి, ఆ గూటాలకు టేపులు కడతాం. దీని వల్ల గాలులు వచ్చినప్పుడు అవి చెక్కుచెదర కుండా చెట్టును కాపాడుతున్నాయి. కూలీల ఖర్చుతో కలిపితే చెట్టుకు రూ. 10 లకు మించి ఖర్చు కాదు. 6“6 దూరంలో అరటి మొక్కలు నాటితే ఎకరానికి 1200 మొక్కలు పడతాయి. అంటే.. ఎకరానికి టేపులు కట్టడానికి అయ్యే ఖర్చు కేవలం రూ. 12,000 మాత్రమే! కట్టిన టేపు రెండో పంటకు వాడటానికి పనికిరాదు. ప్రతి పంటకు మళ్లీ కట్టుకోవాలి. మేం యాలక్కి రకం నాటు రకం పిలకలను తెప్పించి నాటుతున్నాం. టిష్యూకల్చర్ మొక్కలు నాటితే అవి మరీ ఎత్తు పెరుగుతాయి. నాటు పిలకలు అయితే ఎత్తు తక్కువ పెరుగుతాయి, కాండం గట్టిగా కూడా ఉంటుంది. వరలక్ష్మి వ్రతం, వినియకచవితి రోజుల్లో ఈ రకం అరటికాయలకు మంచి గిరాకీ ఉంటుంది. కిలో కాయలను రూ. వందకు కూడా అమ్ముతూ ఉంటాం. రైతుగా నా అనుభవాలను, టేపులను అరటి చెట్లకు కట్టే విధానాన్ని చూపే వీడియోలను ‘మీ ఫార్మర్ సురేష్ (@MeFarmerSuresh)’ అనే నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. రైతులు ఈ వీడియోలు చూసి అవగాహన పెంచుకోవచ్చు. నా ఫోన్ నంబర్: 99004 42287. -
బతికాను.. బతికించాను
దినదిన గండం నూరేళ్ల ఆయుష్షుగా సాగింది కోవిడ్ కాలం! నిజంగానే ఫ్రంట్‌లైన్ వారియర్స్ ధైర్యంగా మనకు అండగా నిలబడకపోయుంటే ఎలా ఉండేదో మన జీవనం! ఆ టాస్క్‌లో వైద్యులది కీలకపాత్ర. ట్రాన్స్‌పోర్టేషన్ దగ్గర్నుంచి మందుల దాకా ఎదురైన సమస్యలన్నిటినీ పరిష్కరించుకుంటూ తమను తాము మోటివేట్ చేసుకుంటూ స్టాఫ్‌ని ముందుకు నడిపిస్తూ పేషంట్స్‌కి భరోసా ఇచ్చి, ప్రభుత్వ ఆసుపత్రుల గౌరవాన్ని పెంచిన డాక్టర్లలో హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ అప్పటి సూపరింటెండెంట్.. ఇప్పుడు మహేశ్వరం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి. నాగేందర్ ఒకరు. ఆ రోజులను గుర్తుచేసుకుంటూ ఆయన చెప్పిన విషయాలు..‘‘కోవిడ్ ప్రకృతి వైపరీత్యంలా వచ్చింది. దీని గురించి ప్రజలకే కాదు.. డాక్టర్స్కీ అవగాహన లేదప్పుడు. నేనప్పుడు ఉస్మానియా హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా ఉన్నాను. గాంధీ హాస్పిటల్ని కోవిడ్ హాస్పిటల్‌గా మార్చారు. అందుకని జనరల్ పేషంట్స్ అందరూ ఉస్మానియా కే వచ్చేవాళ్లు. వాళ్లకు కోవిడ్ ఉండొచ్చు.. లేకపోవచ్చు. టెస్ట్‌లో వాళ్లకు కోవిడ్ నిర్ధారణైతే గాంధీకి పంపేవాళ్లం. అప్పటికే అది ఎందరికో వ్యాపించేసేది. ఏదో ఒక జబ్బుతో వచ్చిన వాళ్లకు కోవిడ్ అని తేలితే కోవిడ్‌తో పాటు వాళ్లకున్న జబ్బుకూ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చేది. ఉదాహరణకు అపెండిక్స్తో జాయిన్ అయిన వాళ్లకు కోవిడ్ అని తేలితే వాళ్లను గాంధీకి పంపలేకపోయేవాళ్లం. ఎందుకంటే గాంధీలో అప్పుడు అపెండిక్స్ ట్రీట్మెంట్ లేదు.. కేవలం కోవిడ్కే! దాంతో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ ఆ పేషంట్‌కి ఉస్మానియాలోనే అపెండిక్స్‌కి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్లం. ఈ మొత్తం సర్వీస్‌లో నర్సింగ్ స్టాఫ్, శానిటేషన్ సిబ్బందిని అప్రిషియేట్ చేయాలి. వాళ్లు చాలా ధైర్యంగా నిలబడ్డారు. మా బలాన్ని పెంచింది.. లాక్డౌన్ ఎంత గడ్డు పరిస్థితో అందరికీ తెలుసు. రవాణా కూడా ఉండేది కాదు. హాస్పిటల్ స్టాఫ్ చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. అందుకే వాళ్లకోసం ఆర్టీసీ సంస్థ వాళ్లతో మాట్లాడి స్పెషల్ బస్‌లు, పాస్‌లను ఏర్పాటు చేయించాం. ఫుడ్ కూడా సమస్య కూడా ఉండేది. కొన్ని మందుల కొరత వల్ల దొంగతనాలూ జరిగేవి. అన్ని సమస్య ల్లో.. అంత కోవిడ్ తీవ్రతలోనూ సర్జరీలు చేశాం. సరైన చికిత్స చేస్తూ రోగులకు ఇబ్బందుల్లేకుండా చూసుకోగలిగాం. ముగ్గురు పేషంట్లకు న్యూరో సర్జరీ అయిన వెంటనే కోవిడ్ సోకింది. వాళ్లను ఆరోగ్యవంతులను చేసి పంపాం. చికిత్సతోపాటు కౌన్సెలింగ్ చేస్తూ వాళ్లకు ధైర్యమిచ్చే వాళ్లం. పేషంట్స్ చూపించిన కృతజ్ఞత మా స్ట్రెంత్‌ను పెంచింది. ఐసీయూలో పేషంట్లను చూస్తుండటం వల్ల నాకూ కోవిడ్ వచ్చింది. గాంధీలో అడ్మిట్ అయ్యాను. తీవ్రమయ్యేసరికి నిమ్స్ లో చేరాల్సి వచ్చింది. నా పక్క బెడ్ అతని కండిషన్ సడెన్‌గా సీరియస్ అయి చనిపోయాడు. చాలా డిస్టర్బ్ అయ్యాను. నేను వీక్ అయితే నా స్టాఫ్ కూడా వీక్ అయిపోతారని నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను. డిశ్చార్జ్ అవగానే డ్యూటీలో చేరాను. వ్యాక్సినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి అందరూ భయపడుతుంటే నేనే ముందు వ్యాక్సిన్ తీసుకుని మిగతావాళ్లను మోటివేట్ చేశాను. సమర్ధంగా, సమన్వయంతో పనిచేసి... కోవిడ్ టైమ్‌లో మేము అందించిన సేవలతో ప్రభుత్వ ఆస్పత్రులకి మంచి పేరొచ్చింది. గౌరవం పెరిగింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశం కోవిడ్ పరిస్థితులను చక్కగా మేనేజ్ చేసింది. వైద్యరంగం, పోలీస్ వ్యవస్థ, మున్సిపల్ కార్పొరేషన్, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సమన్వయంతో పనిచేయడం వల్ల సమర్థంగా కోవిడ్ సిట్యుయేషన్‌ను ఎదుర్కొన్నాం. కోవిడ్‌ను మానవ చరిత్రలో ఒక అధ్యాయంగా చెప్పుకోవచ్చు. గుణపాఠంగా మలచుకోవచ్చు. ఆరోగ్యాన్ని మించింది లేదని కరోనా మహమ్మారి నిరూపించింది. శుభ్రత నేర్పింది. మంచి జీవనశైలి అవసరాన్ని తెలియజెప్పింది. మానవ సంబంధాల విలువ చూపించింది’’ అంటూ నాటి గడ్డు రోజులను తాను అధిగమించిన తీరును గుర్తు చేసుకున్నారు డాక్టర్ నాగేందర్. – సరస్వతి రమ -
మంచు పావురం
కశ్మీర్లో సైకిల్ తొక్కడం కష్టం. అయితే మగ పోస్ట్‌మేన్‌లే సైకిల్ తొక్కుతారు. ఉల్ఫతాబానోకు తన రెండు కాళ్లే సైకిల్ చక్రాలు. కశ్మీర్లో మొదటి మహిళా పోస్ట్ఉమన్గా ఆమె 30 ఏళ్లుగా నడిచి ఉత్తరాలు అందిస్తోంది. మంచు తుఫాన్లు, కాల్పుల మోతలు, భయం గొలిపే ఒంటరి మార్గాలు ఆమెను ఆపలేవు. ఇలా వార్తలు మోసే పావురం ఒకటి ఉందని తెలియడానికి ఇంత కాలం పట్టింది. ఇప్పుడుగాని మీడియా రాయడం లేదు. ఈ ఉత్తరం జీవితకాలం లేటు.మంచులో నడవడం మీకు వచ్చా? మూడు నాలుగడుగుల మంచులో నాలుగు అడుగులు నడవడం ఎంత కష్టమో తెలుసా? బాగా శక్తి ఉన్న యువతీ యువకులకే సాధ్యం కాదు. కాని 55 ఏళ్ల ఉల్ఫతా బానో గత 30 ఏళ్లుగా అలాంటి మంచులోనే నడిచి తన ఊరికి బయటి ప్రపంచానికి అనుసంధానకర్తగా ఉంది. ‘హిర్పురా’ అనే చిన్న పల్లెకి ఆమె ఏకైక మహిళా పోస్ట్ఉమన్. ఈ ఊరు శ్రీనగర్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రపంచంతో తెగినట్టుండే ఈ ఊరిలో ఒక వార్త తెలియాలన్నా ఒక విశేషం అందాలన్నా ఉల్ఫతానే ఆధారం.5 నెలలు మంచులోనేదక్షిణ కశ్మీర్‌లోని హిర్పురాలో ప్రతి నవంబర్ నుంచి మార్చి వరకు ఐదు నెలల పాటు దారుణమైన వాతావరణం ఉంటుంది. దట్టమైన మంచు కురుస్తుంది. రోడ్లు మూసుకుపోతాయి. కాని హిర్పురాకు ప్రతిరోజూ కనీసం 30 ఉత్తరాలో, పార్శిళ్లో వస్తాయి. ఒక పురుష ఉద్యోగి జిల్లా హెడ్‌క్వార్టర్ అయిన షోపియన్‌కు వెళ్లి వాటిని పట్టుకొస్తాడు. ఇక పంచే బాధ్యత ఉల్ఫతా బానోదే. ‘నేను మెట్రిక్యులేషన్ చదవడం వల్ల ఈ ఉద్యోగం వచ్చింది. నా భర్త కూడా పోస్ట్‌మేన్‌గా పని చేసి రిటైర్ అయ్యాడు. నాకు ప్రస్తుతం 22 వేల రూపాయల జీతం వస్తోంది’ అని తెలిపింది ఉల్ఫతా బానో.ఎన్నో సవాళ్లు ధైర్యమే జవాబుఉల్ఫతాకు సైకిల్ తొక్కడం రాదు. సైకిల్ తొక్కడం కష్టమే ఆప్రాంతంలో. అందుకే తాను ఎక్కువగా నడుస్తుంది. ‘రోజుకు నాలుగైదు కిలోమీటర్లు నడుస్తాను’ అంటుందామె. ఉల్ఫతా ఎంతో అవసరం అయితే తప్ప లీవ్ పెట్టదు. ‘దట్టమైన మంచు కురుస్తున్నా లాంగ్బూట్లు వేసుకొని గొడుగు తీసుకొని డ్యూటీకి వెళతాను. పాపం... ఉత్తరాల కోసం ఎదురు చూస్తుంటారు కదా’ అంటుందామె. మంచులో ఒకో ఇంటికి మరో ఇంటికి కూడా సంబంధం తెగిపోయినా ఉల్ఫతా మాత్రం అక్కడకు వెళ్లి ఉత్తరం అందిస్తుంది. ‘ఊళ్లో చాలామంది స్టూడెంట్స్ స్టడీ మెటీరియల్ తెప్పించుకుంటూ ఉంటారు. వారికి నన్ను చూస్తే సంతోషం. వాళ్ళు చదువుకోవడానికి నేను సాయపడుతున్నందుకు తృప్తిగా ఉంటుంది’ అంటుందామె.క్రూరమృగాల భయంకశ్మీర్ సున్నితప్రాంతం. గొడవలు... కాల్పుల భయం ఉండనే ఉంటుంది. అయితే అది అటవీప్రాంతం కూడా. ‘మంచు కాలంలో ఆహారం దొరక్క మంచు చిరుతలు, ఎలుగుబంట్లు ఊరి మీద పడతాయి. నేను ఉత్తరాలు ఇవ్వడానికి తిరుగుతుంటే అవి ఎక్కడ దాడి చేస్తాయోననే భయం ఉంటుంది. కాని నాకెప్పుడు అవి ప్రమాదం తలపెట్టలేదు’ అంటుంది ఉల్ఫతా. సాధారణంగా ఇలాంటి ఊళ్లలో డ్యూటీ చేసినా చేయక పోయినా ఎవరూ పట్టించుకోరు. ‘కాని డ్యూటీ ఒప్పుకున్నాక చేయాలి కదా. అది పెద్ద బాధ్యత. ఆ బాధ్యతే నన్ను 30 ఏళ్లుగా పని చేసేలా చేస్తోంది’ అని సంతృప్తి వ్యక్తం చేస్తుంది ఉల్ఫతా.ఏసి ఆఫీసుల్లో ఉంటూ హాయిగా వాహనాల్లో వచ్చి పోతూ కూడా తమ డ్యూటీ తాము చేయడానికి అలక్ష్యం చేసే వారు ఉల్ఫతాను చూసి బాధ్యతను గుర్తెరగాలి. -
యాక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ అంటే ఏంటి..? నటి సమంత, దర్శకుడు విక్రమ్ భట్..
బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత, నటుడు అయిన విక్రమ్ భట్ ఎన్నో బ్లాక్‌బస్టర్ మూవీలు అందించారు. అంతేగాదు ఆయనకు ఫిల్మ్‌ఫేర్, ఉత్తమ దర్శకుడు వంటి అవార్డులు కూడా వరించాయి. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన దిగ్గజ దర్శకుడు విక్రమ్ భట్ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఓ మూవీ ప్రమోషన్లో పాల్గొన్నప్పడూ తన అనారోగ్యం గురించి బయటపెట్టారు. ఆ వ్యాధి కారణంగా తానెంతలా డిప్రెషన్‌కి గురయ్యానో కూడా వివరించారు. తన వ్యాధి నటి సమంత ఎదుర్కొంటున్న వ్యాధి దగ్గర దగ్గరగా ఉంటుందంటూ చెప్పుకొచ్చారు. అసలు విక్రమ్ భట్ ఈ వ్యాధిబారిన ఎలా పడ్డారు..? ఏంటా వ్యాధి తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.బాలీవుడ్లో మంచి పేరుగాంచిన రాజ్ మూవీ సీరిస్ దర్శకుడు విక్రమ్ భట్ తాను టాలీవుడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఎదుర్కొంటున్న మైయోసిటిస్ లాంటి వ్యాధితోనే బాధపడుతునట్లు వెల్లడించారు. దీని కారణంగా చాలా డిప్రెషన్‌కి గురైనట్లు చెప్పుకొచ్చారు. ఆ నేపథ్యంలోనే తన లైఫ్‌లో భార్య శ్వేత కూడా ఉండకూడదని నిర్ణయించుకున్నారట. అయితే తన భార్య అది నీ ఛాయిస్ కాదని తన నోరు మూయించేసిందన్నారు. ఆ కష్టకాలంలో తనతో ఉండి భరోసా ఇచ్చిందన్నారు. నిజానికి వ్యాధి కంటే దాని కాణంగా వచ్చే డిపప్రెషన్, ఆందోళనలే అత్యంత ప్రమాదకరమైనవన్నారు. ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న అతిపెద్ద అనారోగ్యం డిప్రెషన్ అని అన్నారు. దీనిపై సమంత, దీపికా పదుకునే లాంటి వాళ్లు మాట్లాడి యూత్‌ని చైతన్యపరుస్తున్నారని అభినందిచారు. దానివల్ల చిన్న వయసులోనే ఆత్మహత్యలు చేసుకోవడం వంటి ఘటనలు తగ్గుతాయన్నారు. ఇక అలాగే తాను ఎదుర్కొంటున్న వ్యాధి గురించి కూడా వివరించారు.ఆ వ్యాధి ఏంటంటే..విక్రమ్ ఆక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారు. దీని కారణంగా ఎముకలు కలిసిపోతున్నట్లుగా ఉండే ఒక విధమైన ఆర్థరైటిస్ సమస్య అని తెలిపారు. ఫలితంగా చాలా నొప్పిని అనుభవిస్తానని 56 ఏళ్ల భట్ అన్నారు. ఆక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ (AxSpA) అంటే..ఒక రకమైన ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. ఇది ప్రధానంగా వెన్నెముక, సాక్రోలియాక్ కీళ్లను ప్రభావితం చేస్తుంది. ఈ పరిస్థితి కారణంగా దీర్ఘకాలికి వెన్నునొప్పిని ఎదుర్కొంటారు. అది భరించలేనదిగా ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. ఎందుకు వస్తుందంటే..రోగనిరోధక వ్యవస్థ పొరపాటున ఆరోగ్యకరమైన కీళ్లపై దాడి చేసినప్పుడు ఇది సంభవిస్తుందట. ఫలితంగా వాపుతో కూడిన భరించలేని నొప్పి ఎదురవ్వుతుందని అన్నారు. దీనికి కుటుంబ డీఎన్ఏ కీలకపాత్ర పోషిస్తుందట. ఎందుకంటే కుటుంబంలో ఎవరికైన ఆర్థరైటిస్ ఉన్న చరిత్ర ఉంటే..ఈ పరిస్థితి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఇక ఈ పరిస్థితితో ఉన్నవారు ఉదయం లేచిన వెంటనే హాయిగా నడలేరట. ఎక్కడకక్కడ ఎముకలు బలంగా బిగిసుకుపోయి అలసటతో కూడిన నొప్పి వంటి లక్షణాలు ఉంటాయట. కాలక్రమేణ వెన్నెముక కదలికలు కష్టమై తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సింపుల్‌గా చెప్పాలంటే కదలికలే ఉండవు. చికిత్స:అది ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తి వేరుగా ఉంటుందట. చికిత్సలో ఎక్కువ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (NSAIDలు), ఫిజికల్ థెరపీ, జీవనశైలి మార్పులతో నయం అయ్యేలా చెస్తారు వైద్యులు. రోగ నిర్థారణ ఎంత తొందరగా జరిగిందన్న దానిబట్టే త్వరగా కోలుకోవడం అనేది ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ పరిస్థితికి శాశ్వత చికిత్స లేదట. కేవలం మందులతో ఈ రోగాన్ని అదుపులో ఉంచడమే మార్గమని అన్నారు వైద్యులు. మైయోసిటిస్కి పూర్తి భిన్నం..ఆక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ కీళ్ల ధృడత్వాన్ని బలహీనపరుస్తుంది. అదే మైయోసిటిస్ అనేది కండరాల వాపుకి సంబంధించినది. దీనివల్ల రోజువారీ కార్యకలాపాలు చేయడం కష్టతరమవుతుంది. అదే ఆక్సియల్ స్పాండిలో ఆర్థరైటిస్ అయితే వెన్నెముక, కీళ్లను ప్రభావితం చేస్తుంది. ఇది దీర్ఘకాలిక నొప్పి, కదలకుండా ధృఢంగా అయిపోతాయి ఎముకలు. చెప్పాలంటే కదలికలనేవి ఉండవు అని చెబుతున్నారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరింత సమాచారం కోసం వ్యక్తిగత నిపుణులను సంప్రదించడం ఉత్తమం(చదవండి: 'బిర్యానీ' పూర్తిగా మాంసం ఆధారిత వంటకమా?) -
కొడుకుకోసం..చిరుతపైనే పంజా విసిరింది!
ప్రాణాపాయంలో ఉన్న కన్నబిడ్డల్ని కాపాడుకునేందుకు తల్లి(Mother) ఎంతటి సాహసానికైనా పూనుకుంటుంది. తన కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు, ఎలాంటి కష్టాన్నైనా లెక్క చేయకుండా, తనబిడ్డల్ని రక్షించుకుంటుంది. ఆఖరికి కౄర మృగాలు ఎదురొచ్చినా సరే తన ప్రాణాలను ఫణంగా పెట్టైనా కన్నపేగు బంధాన్ని కాపాడుకుంటుంది. తాజాగా ఇలాంటి ఉదంతమొకటి పలువుర్ని ఆకట్టు కుంటోంది. తన కొడుకును కాపాడుకునేందుకు ఒక తల్లి పడిన ఆరాటం విశేషంగా నిలుస్తోంది.కన్న కుమారుడిని కూతురిని కాపాడుకునేందుకు ఓ తల్లి ఏకంగా చిరుతపులితోనే కొట్లాడింది. తెగించి పోరాడి చిరుతను అ డ్డుకుని తన ప్రాణాలు పోకుండా అడ్డుపడింది. తీవ్రంగా గాయపడిన బాలుడు గ్వాలియర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ బాలుడికి దాదాపు 120 గాయాలైనాయి. వీటికి శస్త్రచికిత్స జరిగింది. అయితే చిరుతపులి లాలాజలం నుండి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్నందున అతణ్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్క్ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. కెమెరా ట్రాప్ ఫుటేజ్ ఆధారంగా వేటాడే జంతువు చిరుతపులి అని అధికారులు నిర్ధారించారు.చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలుఆ తల్లి పేరు సురక్ష ధకాద్. తన తొమ్మిదేళ్ల బాలుడు అవినాష్ ధకాడ్పై చిరుతపులి దాడి చేయడాన్ని గమనించింది. మృత్యుముఖంలోకి జారిపోతున్నబిడ్డను కాపాడుకునేందుకు తన పంజా విసిరింది. సోమవారం కునో నుండి కేవలం 4 కి.మీ దూరంలో ఉన్న బఫర్ జోన్ అయిన విజయ్‌పూర్, షియోపూర్‌లోని ఉమ్రికాల గ్రామంలో జరిగిన ఆ భయంకరమైన దాడిని స్థానిక మీడియాకు వివరించింది. "నేను అక్కడికి చేరుకునేసరికి, చిరుత నా కొడుకుపై దాడి చేసింది. వాడిని చేయి పట్టుకుని నా వైపుకు లాగాను. 50 మంది అతన్ని అవతలి వైపు నుండి లాగుతున్నట్లు అనిపించింది. అయినా నా శక్తినంతా ఉపయోగించాను. చివరికి, నేను నా కొడుకును దాని నోటినుంచి నుండి బయటకు తీశాను, కానీ అతని ముఖమంతా గాయాలే. రక్తం ప్రవహిస్తోంది. ఈరోజు, నా కొడుకు సురక్షితంగా ఉన్నాడు అంటూ తెలిపింది. కొడుకు ముఖం , మెడలోకి తన గోళ్లు , దంతాలను ఎలా గుచ్చుకుపోయాయో వివరించింది. బాధితుడు అవినాష్ ధకాడ్ తన ఇంటి ప్రాంగణంలో ఆడుకుంటుండగా, అడవి జంతువు అకస్మాత్తుగా అతనిపైకి దాడి చేసిందని తెలిపింది. తన కొడుకు అరుపులు విన్న వెంటనే, సమీపంలో పశువులకు ఆహారం పెడుతున్న సురక్ష, సంఘటనా స్థలానికి చేరుకుని, అవినాష్ జంతువు పట్టులో చిక్కుకున్నట్లు గుర్తించింది. చాలా నిమిషాల పాటు పోరాటం జరిగింది, ఆ సమయంలో ఆమె తన కొడుకును విడిపించడానికి తీవ్రంగా పోరాడింది.ఇదీ చదవండి : ట్రెండింగ్ కర్రీ బిజినెస్ : సండే స్పెషల్స్, టేస్టీ ఫుడ్కార్బెట్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌లు కూడా అదే గ్రామంలో చిరుతపులి కదలికలను నిర్ధారించాయని లయన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉత్తమ్ శర్మ తెలిపారు. "ప్రతి చిరుతను ఒక పర్యవేక్షణ బృందం 24/7 పర్యవేక్షిస్తోంది. ప్రతి చిరుత కదలిక , అవి ఎక్కడికి వెళ్ళాయో మాకు ఖచ్చితంగా తెలుసు. మీరు చారిత్రక వాస్తవాలను పరిశీలిస్తే, ప్రపంచంలో ఎక్కడా చిరుతపులి మానవుడిపై దాడి చేసినట్లు నమోదు కాలేదు, ప్రాణాంతకమైనది కాదు. భారతదేశంలోని చిరుతలు భిన్నంగా ప్రవర్తిస్తాయని తాను భావించడం లేదన్నారు. అయితే, అటవీ శాఖ ఈ అవకాశాన్ని తోసిపుచ్చింది, దాడి చేసే విధానం చిరుతపులి లక్షణం అని పేర్కొంది.ఉమ్రికాల గ్రామం విజయ్‌పూర్ నుండి 27 కి.మీ దూరంలో ఉంది కానీ కునో నేషనల్ పార్క్ నుండి కేవలం 4 కి.మీ దూరంలో ఉంది, ఇక్కడ చిరుతలను తిరిగి ప్రవేశపెట్టారు. దాడికి ఒక రోజు ముందు చిరుతను చూసినట్లు కొంతమంది గ్రామస్తులు నివేదించారు. చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలు -
పిల్లలకు పాఠశాల కంటే వీడియో గేమ్స్ అంటే ఎందుకు ఇష్టం?
“మా బాబుకు స్మార్ట్‌ఫోన్ ఇవ్వకపోతే అరుపులు, కేకలు. ఇల్లంతా రచ్చరచ్చ చేసేస్తాడు. కానీ పుస్తకాలు తీస్తే బోలెడంత బద్ధకం. చదువంటే ఎప్పుడూ తప్పించుకునే ప్రయత్నమే. కానీ అదే వీడియో గేమ్ ఆడేటప్పుడు ఏమీ తినకుండా, తల ఊపకుండా గంటల తరబడి కూర్చుంటాడు!”ఇలాంటి మాటల్ని మీరు రోజూ వింటూనే అంటారు.దానికి మీరేం సలహా ఇస్తారు? “ఈ తరం పిల్లలు స్క్రీన్కు బానిసలైపోయారు.” “వీడియో గేమ్స్ బ్రెయిన్‌ను వదిలిపెట్టకుండా హైపర్ యాక్టివ్ చేస్తాయి.” “ఇది డిజిటల్ డెమెజ్.”"పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇవ్వకూడదు."కానీ, అసలు మర్మం ఎక్కడ ఉంది తెలుసా?వీడియో గేమ్స్ అనేవి సైకాలజీని వాడి డిజైన్ చేసిన అద్భుత ఇంజినీరింగ్.మొబైల్ గేమ్స్ ఆడే పిల్లవాడిని ఒకసారి గమనించండి… "ఈ లెవెల్‌ను కంప్లీట్ చేయాలి", "ఈ శత్రువును ఓడించాలి", "ఈ స్కోరు సాధించాలి" అని అతనికి స్పష్టమైన లక్ష్యం ఉంటుంది.అతను ప్రయత్నం చేస్తాడు. ఓడిపోతాడు. మళ్లీ ట్రై చేస్తాడు. మళ్లీ ఓడతాడు. చివరికి గెలుస్తాడు.విజయం పొందిన వెంటనే స్క్రీన్ మీద – "Congratulations!", "You’re a winner!", "Unlocked new powers!" అంటూ మెసేజ్ వస్తుంది.ఈ ఫీడ్‌బ్యాక్ అతని మెదడులో డోపమిన్ అనే హ్యాపీ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్ కోసమే, అది ఇచ్చే హ్యాపీనెస్ కోసమే అతను మళ్ళీ మళ్ళీ మొబైల్ గేమ్స్ ఆడుతూనే ఉంటాడు.ఇప్పుడు చదువును పరిశీలిద్దాం. ఓ ఏడో తరగతి పిల్లాడు, మొఘలుల వంశవృక్షం చదవాల్సి ఉంది. అతనికి పాఠం ఎంత పెద్దదో తెలియదు. ఎక్కడ మొదలుపెట్టాలో కూడా స్పష్టత లేదు. పుస్తకంలోని ప్రశ్నల్లో ఏది పరీక్షల్లో వస్తుందో, ఏది గుర్తుంచుకోవాలో తెలియక కంగారు.పరీక్షలో సరైన సమాధానం రాసినా – ఫలితం ఎప్పుడు వస్తుందో తెలీదు. పరీక్షలు వస్తున్నాయంటే "నువ్వేమైనా చదువుతున్నావా?" అంటూ తల్లి, తండ్రి, టీచర్లు ఒత్తిడి పెడతారు. ఆ ఒత్తిడి అతని మెదడులో కోర్టిసాల్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది.ఇదే అసలు తేడా. వీడియో గేమ్ మోటివేట్ చేస్తుంది. చదువు భయం, ఒత్తిడితో నడుస్తుంది.మా Genius Matrix వర్క్‌షాప్‌లో పాల్గొన్న 8వ తరగతి విద్యార్థిని మిహిర ఏం చెప్పిందో తెలుసా? “సర్, నేను Minecraft ఆడేటప్పుడు ఎంత creative అవుతానో తెలుసా? నా మీద నాకే ఆశ్చర్యం. కానీ అదే స్కూల్లో డ్రాయింగ్ competition ఉంటే, ఒక్కసారిగా భయమేస్తుంది. గెలవకపోతే నన్ను తక్కువగా చూస్తారని.”ఇంకొక తండ్రి తన కొడుకును గురించి ఇలా చెప్పాడు... “డాక్టర్ గారు, మా వాడి PUBG స్టాటిస్టిక్స్ మామూలుగా ఉండవు. ప్లానింగ్, లీడర్షిప్, టీమ్ వర్క్ – అన్నీ బాగా చూస్తాడు. కానీ అదే క్లాస్‌లో ప్రాజెక్ట్ వచ్చిందంటే మౌనంగా పడుకుంటాడు. ఎందుకంటే అక్కడ creativityతో పని లేదు, కేవలం marks కోసం పని చేయాలి.”వీడియో గేమ్‌లో చిన్న ప్రయత్నానికే పెద్ద గుర్తింపు వస్తుంది. చదువులో మంచి ప్రయత్నం చేసినా మార్కులు రాకపోతే ఎవరూ పట్టించుకోరు. వీడియో గేమ్‌లో స్వాతంత్య్రం ఉంటుంది. చదువులో నిబంధనలు, డెడ్లైన్లు, ఫలితాలపై భయం ఉంటుంది.ఒకసారి నేను ఓ క్లాస్‌లో పిల్లల్ని అడిగాను: “మీరు ఎక్కువ టైం ఏమి చేస్తారు?” ఒకటి: “గేమ్స్ ఆడతాను.” రెండు: “యూట్యూబ్ చూస్తాను.” మూడు: “కంప్యూటర్ మీద క్రియేట్ చేస్తాను.” చదువు ఎప్పుడూ నాల్గవ ఆప్షన్లా ఉంటుంది.మనం ఏమి చేయాలి? వీడియో గేమ్‌లు నిషేధించడం సమస్యకు పరిష్కారం కాదు. స్మార్ట్‌ఫోన్ తీసేయడం వల్ల కూడా సమస్య తీరిపోదు. “నీకు concentration లేదు” అని తిట్టడం వల్ల అస్సలు ఉపయోగం ఉండదు.మరేం చేయాలంటారా?పిల్లలు ఏది concentrationతో చేస్తారో గమనించాలి. మన పాఠశాల, మన ఇంటి వాతావరణం కూడా వీడియో గేమ్‌లా మారాలి.🔹చిన్న లక్ష్యాలు ఇవ్వండి – చిన్న విజయం పొందిన ఆనందాన్ని అనుభవించాలి.🔹ప్రయత్నాన్ని గుర్తించండి – “శబాష్, నువ్వు మంచి ట్రై చేశావు” అనే మాట ఎంతో విలువైనది.🔹విఫలమైనా మళ్లీ ప్రయత్నించేందుకు అవకాశం ఇవ్వండి – శిక్షలు కాదు, శక్తినివ్వండి.🔹విజయం చూపించండి – మార్కులు కాకపోయినా, మెరుగుదల కనబడాలి.🔹పిల్లల మనసును మెప్పించే చదువు… అలాగే వాళ్లే కోరుకునే అభ్యాసం కావాలి.🔹మనం పిల్లల మీద ఒత్తిడి పెట్టడం తగ్గించాలి. వాళ్లలో ఉత్తేజాన్ని పెంచాలి. 🔹వీడియో గేమ్‌ల మాదిరిగానే – విద్య కూడా ఒక అడ్వెంచర్ అనిపించాలి.చదువు ఒక బాధగా, భారంగా కాదు… ఒక ప్రయాణంగా మారితే – పిల్లలు కూడా చదువును “ఆటలా” ఆస్వాదిస్తారు.మొత్తానికి సమస్య స్క్రీన్ కాదు. చదువులో ఆనందాన్ని మేళవించడమే సమాధానం.-సైకాలజిస్ట్ విశేష్ +91 8019 000066www.psyvisesh.com -
'బిర్యానీ' పూర్తిగా మాంసం ఆధారిత వంటకమా?
ఆహార ప్రియులకు ఇష్టమైన వంటకాల్లో అగ్రస్థానం బిర్యానీదే. అంతేగాదు ఆన్లైన్ ఎక్కువ ఆర్డర్ చేసేది కూడా బిర్యానీ. అయితే ఈ వంటకం ఇరాన్లో ఉద్భవించిందని, మొఘల్ పాలన కారణంగా భారత ఉపఖండంలో నెమ్మదిగా భాగమైందని చెబుతుంటారు పాక నిపుణులు. ఆ విధంగా మనకు బిర్యానీ తెలిసిందేనది చాలామంది వాదన. అయితే అసలు బిర్యానీ అంటే మాంసంతో కలిపి చేసేదే బిర్యానీ అని, కూరగాయలతో చేసే వెజ్ బిర్యానీ అనేది బిర్యానీనే కాదని అంటున్నారు. నెట్టింట దీనిపై పెద్ద చర్చ నడుస్తోంది. మరీ ఇంతకీ వెజ్ బిర్యానీ అనేది ఉందా..?. మాంసం ఆధారిత వంటకమే బిర్యానీనా అంటే..వెజ్ లేదా నాన్ వెజ్ బిర్యానీ రెండూ వాటి రుచి పరంగా ఎవర్ గ్రీన్ అనే చెప్పొచ్చు. అయితే పాక నిపుణులు మాత్రం బిర్యానీ అనగానే మాంసంతోనే చేసే వంటకమని నమ్మకంగా చెబుతున్నారు. కానీ మరికొందరు మాత్రం కూరగాయలతో చేసినదే బిర్యానీ అని వాదిస్తున్నారు. ప్రముఖ చెఫ్‌లు పాక నిపుణులు బిర్యానీని పూర్వం సుగంధ ద్రవ్యాల తోపాటు, జంతువుల కొవ్వుని కూడా జోడించి మరింత రుచిని తీసుకొచ్చారని చెబుతున్నారు. అందువల్ల మాంసం లేకుండా తయారుచేసిన వంటకాన్ని నిజంగా "బిర్యానీ"గా పరిగణించలేమని అన్నారు. అయితే కాలక్రమే ఆహార వంటకాలు అభివృద్ధి చెందడంతో.. మాసంహారం తినని వాళ్ల కోసం ఇలా కూరగాయలు జోడించి చేయడంతో అది కాస్త వెజ్ బిర్యానీగా పిలవడం జరిగిందన్నారు. అయితే అది నిజమైన బిర్యానీ కాదని తేల్చి చెబుతున్నారు ప్రముఖ చెఫ్, ఫుడ్ ల్యాబ్ వ్యవస్థాపకుడు సంజ్యోత్ కీర్. అలాగే కూరగాయలు జోడించినంత మాత్రమే దానికి బిర్యానీ ఘమఘలు రావని, దానికి సుగంధ ద్రవ్యాలు తోడైతేనే.. కూరగాయలు రుచిగా మారి మనకు అద్భుతమైన వెజ్ బిర్యానీ సిద్ధమవుతుందని చెప్పారు. అందువల్ల కూరగాయలతో చేసినదాన్ని బిర్యానీగా పరిగణించరని అన్నారు. చాలామందికి ఇది నచ్చకపోయినా..వాస్తవం ఇదేనని అన్నారు. అలా అని వెజ్ బిర్యానీని కూడా తీసిపారేయలేం. ఎందుకంటే కాటేజ్ చీజ్ (పనీర్), సోయా బీన్, టోఫు, పుట్టగొడుగులు, జాక్‌ఫ్రూట్ (కథల్) లేదా ఖర్జూరం (ఖజూర్) వంటి కూరగాయలతో మరింత రుచికరంగా చేస్తున్నారు చెఫ్‌లు. చెప్పాలంటే..మాంసంతో చేసినన బిర్యానీ రుచి కూడా దానిముందు సరిపోదేమోనన్నంత టేస్టీగా ఉంటోందన్నారు చెఫ్ సంజ్యోత్ కీర్. (చదవండి: యూట్యూబ్ చూసి సెల్ఫ్ సర్జరీ..! వైద్య నిపుణుల స్ట్రాంగ్ వార్నింగ్) -
ట్రెండింగ్ కర్రీ బిజినెస్ : సండే స్పెషల్స్, టేస్టీ ఫుడ్
ఉరుకులు పరుగుల జీవితంలో ప్రత్యేకమైక సమయాన్ని కేటాయించి వంటలు చేసుకోవడం చాలా మందికి కష్టతరంగా మారింది. హోటల్స్‌లో భోజనం కూడా ఖర్చుతో కూడుకుంది కావడంతో అన్నం మాత్రం వండుకుని కర్రీస్‌ను బయట కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. దీంతో నగరంలో వీధికో కర్రీస్ పాయింట్లు వెలిశాయి. నగరంలోని కర్రీస్ పాయింట్లకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. అందుకు తగ్గట్లు కొత్త రుచులతో ఆహార ప్రియులకు రోజుకో ఒక స్పెషల్ కర్రీని పరిచయం చేస్తున్నారు. నాన్‌వేజ్ ఐటమ్స్‌లో కొత్త రకాలను పరిచయం చేస్తూ కర్రీస్ సెంటర్లు నగర వాసుల మన్నలను పొందుతున్నాయి. 17 ఏళ్ల క్రితం మాగుంట లేఅవుట్ ప్రాంతంలో గంగోత్రి కర్రీస్ పాయింట్ ఏర్పాటు చేశారు. అప్పట్లో కర్రీస్ పాయింట్లను పరిచయం చేసింది వారే. అయితే ప్రస్తుతం ఆ కర్రీ పాయింట్ లేదు. దాదాపు 400పైగా కర్రీ పాయింట్స్ నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో కర్రీ పాయింట్స్ అనేకం వెలిశాయి. ఒక్క స్టోన్‌హౌస్‌పేట, బాలాజీనగర్, నవాబుపేట, కిసాన్‌నగర్, మైపాడుగేటు ప్రాంతాల్లోనే 70 కర్రీస్ పాయింట్లు ఉన్నాయి. అదే విధంగా హరనాథపురం, చిల్డ్రన్స్‌పార్క్, చిన్నబజారు, పెద్దబజారు, వీఆర్సీ సెంటర్, మద్రాసు బస్టాండు, దర్గామిట్ట, వేదాయపాళెం, అయ్యప్పగుడి ఇలా ప్రధాన ప్రాంతాల్లోని అధిక సంఖ్యలో కర్రీస్ పాయింట్లు వెలిశాయి. ఇలా మొత్తం దాదాపు 400కు పైగా కర్రీస్ పాయింట్లు ఉన్నాయి. చదవండి: నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలు నిత్యావసరాల ఖర్చులు పెరగడంతో... గతంతో పోలిస్తే కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. దీంతో ఇంట్లో గ్యాస్, నిత్యావసర వస్తువులకు ఖర్చు చేయడం కన్నా రూ.20 నుంచి రూ.30లకు ఒక కర్రీ ప్యాకెట్ రావడంతో వాటిపైనే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. సాంబార్, పప్పు, రసానికి కలిపి రూ.60 నుంచి రూ.80లు వెచ్చిస్తే నలుగురు వ్యక్తులు తినేందుకు సరిపోతుంది. ఇంట్లో అన్నం వండుకుని కర్రీస్ కొనుగోలు చేస్తే రోజు గడిచిపోతుంది. జీవనోపాధికి దోహదం హోటల్స్‌లో పనిచేసిన అనుభవం ఉన్నవారు, సొంత కాళ్లపై నిలబడాలనే ఉద్దేశంతో ఉన్న వారు కర్రీ సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారు. ఇంటి పెద్ద మాత్రమే కాకుండా ఇంట్లోని భార్య, పిల్లలు కర్రీ పాయింట్లో అవసరమైన పనులు ఒకరికి ఒకరు సహాయ పడుతూ బుతుకు జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. ఉదయం 4 నుంచి కర్రీకి సంబంధించి కూరగాయలు, ఇతర వస్తువులను సమకూర్చుకుంటారు. ఉదయం 11 గంటలకే అన్ని రకాల కర్రీస్‌ను అందుబాటులో ఉంచుతారు. సాయంత్రానికి తిరిగి మళ్లీ వంటకాలు చేయాల్సి ఉంది. కుటుంబ సభ్యులు అందరూ కలిసి పనులను పంచుకుంటారు. వీరిలో రుచిని, నాణ్యతను అందించిన వాళ్లకు మాత్రమే ఆదరణ లభిస్తుంది. సండే స్పెషల్స్ ఆదివారం వచ్చిందంటే నగర వాసులు సినిమాలు, షికార్లుకు వెళ్తుంటారు. రోజంతా పిల్లలతో గడుపుతుంటారు. బయట వంటకాలు రుచి చూసేందుకు ఇçష్ట పడుతుంటారు. దీంతో ఆదివారం హోటల్స్‌తో పాటు కర్రీ సెంటర్లు కూడా ప్రత్యేకంగా నాన్‌వెజ్ రుచులను అందుబాటులోకి తెస్తుంటాయి. రాగి సంగటితో పాటు బొమ్మిడాయల పులుసు, రొయ్యలు, చికెన్, మటన్‌లో ఫ్రైలు, కర్రీల విక్రయాలు చేస్తుంటారు. సాధారణ రోజులో కన్నా ఆదివారం తమ వ్యాపారం జోరుగా ఉంటుందని కర్రీ పాయింట్ నిర్వాహకులు చెబుతున్నారు. చదవండి: వాకింగ్ చేస్తూనే మృత్యు ఒడికి.. సీసీటీవీలో దృశ్యాలు వివిధ రకాల పచ్చళ్లు... కర్రీ పాయింట్లలో అనేక రకాల పచ్చళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కొన్ని కర్రీ సెంటర్లు వారంలో ప్రతిరోజు ఒక్కో రకం పచ్చళ్లను అందుబాటులో ఉంచుతుంటాయి. అదే విధంగా కారపు పొడులు సైతం విక్రయిస్తున్నారు. అదే విధంగా నాన్‌వెజ్‌లో ఫ్రై ఐటమ్స్, వెజ్‌లో కూడా పలు కొత్త రకాల ఫ్రై ఐటమ్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు. రుచి, నాణ్యత ఉంటేనే.. చాలా కాలంగా కర్రీ పాయింట్ నిర్వహిస్తున్నా. అయితే రుచి, నాణ్యత ఇవ్వగలిగితేనే కస్టమర్లు మళ్లీ మళ్లీ వస్తారు. కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు హెచ్చుతగ్గులు ఉన్నా కస్టమర్ల కోసం అందుబాటు ధరల్లో విక్రయాలు చేస్తుంటాం. – వెంకటేశ్వర్లు, కర్రీ పాయింట్ నిర్వాహకుడు -
నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలు
అధిక బరువును తగ్గించుకోవాలంటే..భారీ కసరత్తే చేయాలి. చెమట చిందిస్తేనే అదనపు కొవ్వు కరుగుతుంది. అయితే ఇది అంత ఈజీ కాదు. పట్టుదల, కృషి ఉండాలి. అలాగే ఏదో యూట్యూబ్‌లోనో, ఇంకెవరోచెప్పారని కాకుండా, శరీరంపై మనంతీసుకుంటున్న ఆహారంపైనా అవగాహన పెంచుకుని, శ్రద్ధపెట్టి, నిపుణుల సలహా తీసుకని ఈ ప్రక్రియను మొదలు పెట్టాలి. విజయం సాధించాలి. అలా కేవలం ఆరు రోజుల్లో నాలుగు కిలోల బరువు తగ్గించుకుందో మోడల్. ఆ తరువాత తన సక్సెస్ గురించి ఇన్‌స్టాలో షేర్ చేసింది.సియోల్‌లో ఉంటున్న ఫ్రీలాన్స్ మోడల్' షెర్రీ తరచుగా ఫిట్నెస్ రహస్యాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఒక ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేసింది. కండరాల నష్టం లేకుండా 6 రోజుల్లో 4 కిలోల బరువు తగ్గిన విధానాన్ని తన అభిమానులతో పంచుకుంది. దీన్ని కొరియన్ 'స్విచ్ ఆన్' డైట్ అంటారట. ఆహారం, ఉపవాసం, అధిక ప్రోటీన్ భోజనం ఈ మూడు పద్దతులను అనుసరించినట్టు తెలిపింది. View this post on Instagram A post shared by Sherrie 셰리 🌸 | 외국인 모델 (@shukiiii)ఆహారం జీవనశైలి మార్పుల వివరాలనుఇలా పంచుకుంది..“నేను ఎలాంటి ఆహారం/జీవనశైలి మార్పులు చేసుకోవాలి లాంటి సలహా ఇవ్వడం లేదు. అంత ఎక్స్‌పర్ట్‌ని కూడా కాదు. కేవలం నా సొంత అనుభవం. కాబట్టి దీన్ని దయచేసి నా అనుభవంలాగే తీసుకోండి అంటూ తన అనుభవాన్ని షేర్ చేసింది.చదవండి: సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోలు వైరల్, ఎవరు తీశారో ఊహించగలరా?షెర్రీ వెయిట్ లాస్ జర్నీఆరు రోజుల్లో 4 కిలోలు తగ్గాను , ఎలా చేశానంటే.. తొలుత 'స్విచ్ ఆన్ (డైట్)' గురించి చెప్తా. ఇది చాలా కాలం పాటు బరువును నిలుపుకోవడంలో నాకు సహాయపడుతుంది. ఇది ఒక కొరియన్ వైద్యుడు అభివృద్ధి చేసిన 4 వారాల కార్యక్రమం. ఇది కండరాల నష్టాన్ని నివారించడంతో పాటు కొవ్వు జీవక్రియను సక్రియం చేయడంలో , ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరచడంలోసహాయపడుతుంది. ప్రాథమికంగా ఇది ఎలా పనిచేస్తుంది...”కండరాల శక్తి కోల్పోకుండా బరువుతగ్గాలంటే సరైన పోషకాహారం అవసరం. తగినంత ప్రోటీన్ తినేలా చూసుకుంది. అలాగే కెఫిన్, ఆల్కహాల్, ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెర లేకుండా జాగ్రత్త పడింది. ఉపవాసాలను కూడా తన డైట్ ప్లాన్‌లో చేర్చుకుంది.ఇంకా ఇలా చెప్పింది:మొదటి వారం: ప్రోటీన్ షేక్స్, కూరగాయలు , అధిక ప్రోటీన్ భోజనం తీసుకుంది. తద్వారా శరీరం నుంచి మలినాలు బైటికిపోతాయి. గట్ ఆరోగ్యం బలపడుతుంది. రెండో వారం అధిక మజిల్ రికవరీ కోసం ప్రోటీన్ భోజనం , ఉపవాసాలు చేసింది. మూడో వారంలో ఎక్కువ ఫాస్టింగ్ని ప్రాధాన్యత ఇచ్చింది. అలాగే అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తీసుకుంటూ, ఎక్కువ కొవ్వు కరిగేలా జాగ్రత్త పడింది. ఏమి తినాలి ? ఏమి తినకూడదు?షెర్రీ స్విచ్ డైట్ ప్లాన్ ప్రకారం మూడు రోజుల్లో తొలి రోజు అల్పాహారం, భోజనం, స్నాక్స్ , రాత్రి భోజనం అన్నీ ప్రోటీన్ షేక్ మీల్స్ మాత్రమే. ఇక మిగిలిన రెండు రోజుల్లో ప్రోటీన్ షేక్స్ 'కార్బ్-లెస్' మిశ్రమం, ఇంకా మల్టీ-గ్రెయిన్ రైస్, ఉడికించిన కొవ్వు లేని చికెన్, చేపలు, స్కిన్ లెస్ చికెన్, గింజలు, గుడ్లు, బెర్రీలు, అరటిపండు, చిలగడదుంపలు వంటి ఆహారాలతో కూడిన సాధారణ భోజనం.ఈ డైట్ ప్రోగ్రామ్‌లో కెఫిన్, ఆల్కహాల్, ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెర లాంటి పూర్తిగా నిషిద్ధం.స్విచ్ ఆన్ డైట్ కండరాలను కాపాడుతూ, ప్రస్తుత శక్తికోసం బాడీలోని అదనపు కొవ్వును కరిగిస్తుంది. గత ఏడాది కొవ్వు శాతాన్ని తగ్గించడంలో డైట్ సహాయపడింది. శీతాకాలంలో ఎక్కువ మొబిలిటీ లేక హార్మోన్లను ప్రభావితం చేయడంతో పాటు పేగు ఆరోగ్య సమస్యలకు దారితీసిందని అలాగే తన శరీరం నీరు పడుతుందని చెప్పుకొచ్చింది. అందుకే మళ్లీ ఈ డైట్ ప్రారంభించే ముందు 3 రోజుల ఉపవాసంతో ప్రతిదీ రీసెట్ చేసాననీ తెలిపింది. అలాగే ఈసారి పాల ఉత్పత్తులు లేకుండా కొన్ని మార్పులు చేసాను. తద్వారా తన డైట్‌ను యాంటీ ఇన్ఫ్లమేటరీగా మార్చి, ఫైబర్‌పై ఎక్కువ దృష్టి పెట్టినట్టు చెప్పింది. స్విచ్ ఆన్ డైట్ అంటే ఏమిటి?శాస్త్రీయంగా, బరువు తగ్గడం, గట్ హెల్త్ కోసం దక్షిణ కొరియాలో ట్రెండింగ్‌లో ఉన్నవిధానమే స్విచ్ ఆన్ డైట్. ఇది మజిల్స్‌కు నష్టం లేకుండా కొవ్వు కరిగించుకునేలా 4 వారాల జీవక్రియ రీసెట్ ప్రోగ్రామ్. డాక్టర్ పార్క్ యోంగ్-వూ దీన్ని రూపొందించారు. భారీ కేలరీలను తగ్గించడం, క్రాష్ డైటింగ్ లాంటి విధానం గాకుండా అడపాదడపా ఉపవాసం, శుభ్రంగా తినడం, జీవక్రియను సమతుల్యం చేయడంపై దృష్టి పెడుతుంది, అదే సమయంలో గట్ ఆరోగ్యానికి కాపాడుకునేలా జాగ్రత్త పడటం. నోట్: ఇది షెర్రీ వ్యక్తిగత అనుభవం మాత్రం అని గమనించగలరు. అధిక బరువును తగ్గించు కోవాలనుకుంటే, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. -
యూట్యూబ్ సాయంతో సెల్ఫ్ సర్జరీ..! ఐతే అతడు..
ఏదైన తెలియని విషయం నేర్చుకోవాలంటే ఠక్కున గుర్తొచ్చేది యూట్యూబ్ మాయజాలమే. అందులో ఏ వంటకమైన, తెలియని పనైనా సులభంగా నేర్చుకోవచ్చు..నిమిషాల్లో చేసేయొచ్చు. అయితే అది కొన్నింటికే పరిమితం. ఆరోగ్యానికి సంబంధించినవి చాలామటుకు వ్యక్తిగత వైద్యుల సలహా తీసుకునే చేయాలి. లేదంటే ప్రాణాలకే ముప్పు. అయితే ఈ వ్యక్తి ఏకంగా యూట్యూబ్ చూసి తనకు తాను సర్జరీ చేసుకున్నాడు. చివరికి అది కాస్త సివియర్ అయ్యి ఆస్పత్రి మెట్లు ఎక్కక తప్పలేదు. అయితే వైద్య నిపుణులు ఇదెంత వరకు సబబు అని మండిపడుతున్నారు. మరీ ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉందంటే..ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి యూట్యూబ్ వీడియోల సాయంతో నేర్చుకున్న పరిజ్ఞానంతో తనకు తానుగా సర్జీర చేసుకునేందుకు రెడీ అయిపోయాడు. అందుకోసం మార్కెట్ నుంచి సర్జికల్ బ్లేడ్లు, కుట్లు వేసే తీగలు, సూదులు వంటివి అన్ని కొనుగోలు చేశాడు. అనుకున్నట్లుగానే అన్నంత పని చేసేశాడు. తనకు తానుగా పొత్తికడుపు కోసుకుని మరీ ఆపరేషన్ చేసుకున్నాడు. అంత వరకు బాగానే ఉంది. ఆ మరుసటి రోజు ఆ వ్యక్తి పరిస్థితి దారుణంగా దిగజారడంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలింరు అతడి బంధువులు. ఆస్పత్రి వైద్యులు అతడి చేసిన ఘనకార్యం విని కంగుతిన్నారు. వెంటనే పరీక్షించగా..అదృష్టవశాత్తు సదరు వ్యక్తి పొత్తి కడుపు పైపొర మాతమే కోయడంతో త్రటిలో ప్రాణాపయం తప్పిందన్నారు. ఎందుకంటే కాస్త లోతుగా కోసుంటే ఇతర అంతర్గ అవయవాలు కూడా డ్యామేజ్ అయ్యేవని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారు.ఘటనపై సీరియస్ అవుతున్న వైద్యులు..ఆన్లైన్లో చూసిన ప్రతిదాన్ని చేసేయాలని చూడొద్దు. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో పరాచకాలు వద్దు. నిపుణుల సాయం లేకుండా సర్జరీ లాంటివి అత్యంత ప్రమాదకరమని అన్నారు. వైద్యుడిని సంప్రదించకుండా ఇలాంటి సర్జరీలు చేసేటప్పుడూ ఒకవేళ అధిక రక్తస్రావం అయితే పరిస్థితి చేజారిపోతుంది. పైగా ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. డబ్బు ఆదా చేయాలనో లేదా మాకు చాలా పరిజ్ఞానం వచ్చేసిందన్న అత్యుత్సాహంతోనే ఇలాంటిపనులకు అస్సలు ఒడిగట్టద్దు. ఈ మిడిమిడి జ్ఞానంతో స్వీయంగా లేదా వేరేవాళ్లకి సర్జరీలు చేసి లేనిపోని సమస్యలు కొని తెచ్చుకోవద్దు అని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా ఆన్లైన్ హెల్త్ ట్యూటోరియల్స్ లేదా హెల్త్ ట్రెండ్లు వంటి వాటిని చాలావరకు వైద్యులు ఆమోదించరిన అన్నారు. నిపుణుల మార్గదర్శకత్వంలోనే ఇలాంటివి చేయాలి. ఎంబీబిఎస్ చదివి ఎన్నేళ్లో ప్రాక్టీస్ చేసినా వైద్యులే ఒక్కోసారి పొరపాట్లు దొర్లుతుంటాయి. అలాంటిది ఏ మాత్రం అనుభవం లేకుండా .. జస్ట్ చూసి ఎలా చేసేస్తారంటూ మండిపడుతున్నారు వైద్య నిపుణులు.(చదవండి: 'విద్యార్థి భవన్ బెన్నే దోసె'..యూకే ప్రధాని, ఐకానిక్ డ్రమ్మర్ శివమణి ఇంకా..)