
తెలంగాణలో తొలిసారిగా అల్లోగ్రాఫ్ట్ టెండన్ ఆగ్మెంటేషన్ ద్వారా శోల్డర్ జాయింట్ ప్రిజర్వేషన్ శస్త్రచికిత్స
అపోలో హాస్పిటల్స్ వైద్యుల ఘనత
హైదరాబాద్: ఆధునిక ఆర్థోపెడిక్ చికిత్సలో అపోలో వైద్యులు అరుదైన ఘనతను సాధింఆరు తెలంగాణలోనే తొలి అల్లోగ్రాఫ్ట్ టెండన్ (ఆకిలీస్ టెండన్) ఆధారిత లోయర్ ట్రాపీజియస్ ట్రాన్స్ఫర్ విజయవంతంగా నిర్వహించారు. ప్రముఖ షోల్డర్ సర్జన్ డా. ప్రశాంత్ మేశ్రం ఈ సంక్లిష్ట శస్త్రచికిత్సను నిర్వహించారు. ఇటువంటి చికిత్స అపోలో గ్రూప్ ఆసుపత్రుల్లో తొలిసారిగా జాయింట్ ప్రిజర్వేషన్ కోసం అల్లోగ్రాఫ్ట్ టెండన్ ద్వారా ఆ శస్త్ర చికిత్స చేసినట్టు వైద్యులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే 55 ఏళ్ల శక్తివంతమైన వ్యక్తి ప్రమాదంలో గాయపడ్డాడు. ఆరు నెలలపాటు తీవ్రమైన నొప్పితోపాటు, చేతిలో బలహీనతతో బాధపడ్డాడు. మాసివ్, మరమ్మతులు చేయలేని రోటేటర్ కఫ్ టియర్తో పాటు ఆర్మ్ జాయింట్లో ప్రారంభ దశ ఆర్థరైటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో వారు అపోలో ఆసుపత్రి జూబ్లీహిల్స్‌లోని డా. మేశ్రంని సంప్రదించారు.
ఈ మేరకు అతి సంక్లిష్టమైన ఈ ఆర్థోస్కోపిక్-అసిస్టెడ్ లోయర్ ట్రాపీజియస్ ట్రాన్స్ఫర్ శస్త్రచికిత్సలో ఆకిలీస్ టెండన్ అల్లోగ్రాప్ట్‌ను నిష్ణాతంగా ఉపయోగించారు. బైసెప్స్ టెండన్ రీ-రూటింగ్, సబ్స్కాపులారిస్ టెండన్ మరమ్మతులతో కూడిన ఈ చికిత్స ద్వారా భుజం పనితీరు సామర్థ్యాన్ని పునరుద్ధరించి, తద్వారా ఆర్థరైటిస్‌ను నివారించే ప్రయత్నించి విజయవంతమైనారు. ఆపరేషన్ తర్వాత చేసిన షోల్డర్ జాయింట్లో మారిన హెడ్ పొజిషన్ తిరిగి సరి అయినట్టు వెల్లడైంది. అరుదైన ఈ శస్త్రచికిత్స విజయవంతం కావడం ఒక కొత్త మైలురాయి అని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది.