కీళ్ల నొప్పుల చికిత్సలోమరో అధ్యాయం | Apollo launches joint preservation program | Sakshi
Sakshi News home page

కీళ్ల నొప్పుల చికిత్సలోమరో అధ్యాయం

Published Mon, Mar 17 2025 6:25 PM | Last Updated on Mon, Mar 17 2025 6:25 PM

Apollo launches joint preservation program

జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్‌‌ని ప్రారంభించిన అపోలో

హైదరాబాద్,: శస్త్ర చికిత్స అవసరం లేకుండానే కీళ్ల నొప్పులు మాయం చేసే కార్యక్రమాన్ని అపోలో ఆసుపత్రి యాజమాన్యం ఘనంగా ప్రారంభించింది. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మార్చి 17న ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహసంగా జరిగింది. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి ఇది ఒక వరమనే చెప్పుకోవచ్చు. బాధితుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని శస్త్రచికిత్స అవసరం లేకుండానే దీనిని రూపొందించారు.  కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, వాపు సమస్యలు, స్నాయువు గాయాలతో బాధపడుతున్న రోగుల అవసరాల తీర్చేలా డిజైన్ చేశారు. అసౌకర్యం కలగకుండా, శస్త్ర చికిత్స అవసరం లేకుండానే నొప్పులను తగ్గించే విధంగా దీనిని రూపొందించారు.

అన్ని వయస్సుల వారికీ ఉపయోగం...
అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి మాట్లాడుతూ... “జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్ రోగికి సౌకర్యవంతంగా ఉండే చికిత్స. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న అన్ని వయస్కుల వారికి ప్రయోజనం చేకూర్చేలా దీన్ని రూపొందించారు. ఇందులో భాగంగా టైలర్డ్ అడ్వైజ్, ట్రీట్మెంట్, థెరఫీస్, రీహాబిలిటేషన్ , పోషకాహారం, అవసరమైన ప్రత్యామ్నయ చికిత్సలు- '3 Ts' పై దృష్టి పెడుతుంది.  బాధితులు కీళ్ల సమస్యల నుంచి బయటపడటంతోపాటు సుదీర్ఘకాలంపాటు ఆరోగ్యవంతమైన జీవనశైలితో గడిపేందుకు ఇది ఉపయోగపడనుంది. కీళ్ల పనితీరు మెరుగుపరిచి బాధితులను శక్తివంతులను చేయాలనే కృతనిశ్చయంతో మేం పని చేస్తున్నాం” అని అన్నారు. 

"కీళ్ల నొప్పుల నుంచి కాపాడటానికి ఈ నూతన కార్యక్రమం ఆర్థ్రోస్కోపిక్ పద్ధతులను చికిత్సలతో అనుసంధానిస్తుంది. కీళ్ల పనితీరును మెరుగుపరచడం,పూర్తి కీలు మార్పిడి  అవసరం లేకుండా సమస్య నివారించడంపై మేము దృష్టి సారించాం" అని అపోలో హాస్పిటల్స్ చీఫ్ జాయింట్ రీప్లేస్‌మెంట్ & ఆర్థ్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కె జె రెడ్డి అన్నారు. ఆర్థ్రోస్కోపీ & స్పోర్ట్స్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ రవితేజ రుద్రరాజు మాట్లాడుతూ.. "ఈ కార్యక్రమం అత్యాధునిక రీ జెనరేటివ్ చికిత్సలను సమగ్రమైన రీహాబిలిటేషన్, పోషకాహార  పద్దతులతో మిళితం చేసి  సమగ్ర చికిత్స మార్గాన్ని అందిస్తుంది. తద్వారా కీళ్ల సమస్యలకు  ముందుగానే ప్రభావవంతమైన చికిత్స అందేలా తోడ్పడుతుంది"అని అన్నారు. 

జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రాంలో భాగంగా ప్లేట్‌లెట్-రిచ్ ప్లాస్మా (PRP) చికిత్స, అత్యాధునిక స్టెమ్ సెల్ వినియోగం వంటి మార్గదర్శక పునరుత్పత్తి చికిత్సలతో పాటు అధునాతన ఆర్థోబయోలాజిక్ చికిత్సలను ఉపయోగించడం ద్వారా, రోగులు తమ కీళ్ల పనితీరును మెరుగ్గా  నిర్వహించుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఇందులో కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి, సిడ్నీ రాయల్ ప్రిన్స్ ఆల్ఫ్రెడ్ హాస్పిటల్‌ ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్థ్రోస్కోపిక్ & మోకీళ్ల మార్పిడి నిపుణులు డాక్టర్ బ్రెట్ ఫ్రిట్ష్, జూబ్లీ హిల్స్‌- అపోలో హాస్పిటల్స్ సీఈఓ తేజస్వి రావు, అపోలో హాస్పిటల్స్ చీఫ్ జాయింట్ రీప్లేస్‌మెంట్ & ఆర్థ్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ కె జె రెడ్డి , అపోలో హాస్పిటల్స్‌లోని ఆర్థ్రోస్కోపీ & స్పోర్ట్స్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ రవి తేజ రుద్రరాజు, అపోలో హాస్పిటల్స్‌లోని సీనియర్ కన్సల్టెంట్-ఆర్థ్రోస్కోపీ & స్పోర్ట్స్ మెడిసిన్ డాక్టర్ కౌశిక్ రెడ్డి, షోల్డర్  సర్జన్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రశాంత్ మేష్రామ్, ఫుట్ & యాంకిల్ సర్జన్ కన్సల్టెంట్ డాక్టర్ వరుణ్ కొమ్మాలపాటి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement