Apollo
-
ఘనంగా అపోలో మెడికల్ కాలేజ్ కాన్వోకేషన్
అపోలో మెడికల్ కాలేజ్ కాన్వోకేషన్ ఉత్సవం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వైద్యులు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ నాగేశ్వరరెడ్డి హాజరయ్యారు. అపోలో మెడికల్ కాలేజ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి అత్యుత్తమంగా నిలిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ అందజేశారు. 2018 బ్యాచ్ ఎంబీబీఎస్ చదివిన 100 మంది విద్యార్థులకు పట్టాలు అందించారు. ఈ కార్యక్రమంలో సీవోవో అపర్ణా రెడ్డి, డీన్ మనోహర్, మెడికల్ కాలేజ్ విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.జనరల్ మెడిసిన్‌లో అవినాష్‌కు గోల్డ్ మెడల్2018 బ్యాచ్ జనరల్ మెడిసిన్‌కు గాను డాక్టర్ దండు అవినాష్ రెడ్డి గోల్డ్ మెడల్ అందుకున్నారు. "కష్టపడి చదవడం వల్ల గోల్డ్ మెడల్ సాధించగలిగానని, తల్లితండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉందని, అత్యుత్తమ విద్య బోధించినందుకు అపోలోకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని" అవినాష్ తెలిపారు. ఇక డాక్టర్ ప్రతాప్‌రెడ్డికి సంబంధించి ఛైర్మన్ మెడల్‌ను సిద్ధాంత్ బర్మేచ అందుకున్నారు.700 దాటిన అపోలో మెడిసిన్ గ్రాడ్యుయేట్లుఅపోలో కాలేజ్ ప్రారంభించి ఇప్పటికీ పుష్కరకాలం దాటింది. 2012లో ప్రారంభమైన అపోలో మెడికల్ కాలేజ్ నుంచి ఇప్పటివరకు 700 మంది విద్యార్థులు డాక్టర్లుగా ఎదిగారు. ఇదే విషయాన్ని కాన్వోకేషన్లో ప్రస్తావించారు డాక్టర్ నాగేశ్వరరెడ్డి. "భారతదేశంలోనే నాణ్యమైన వైద్య విద్యను అందిస్తోన్న అపోలోలో చదువుకునే అదృష్టం మీకు దక్కడం గొప్ప విషయం. ఈ పునాదిని మరింత బలంగా మార్చుకుని వైద్యులుగా రాణించాలని కోరుకుంటున్నాను. అలాగే నేర్చుకోవాలన్న మీ ధృడ సంకల్పం జీవితాంతం కొనసాగాలని ఆశిస్తున్నాను" అని అన్నారు. -
రిసార్ట్ శైలి జీవనమే లక్ష్యంగా ఐఖ్యా ఇన్ఫ్రా డెవలపర్స్ 'ఈ5వరల్డ్’ కు అంకురార్పణ
హైదరాబాద్, నవంబర్ 2024: ఐఖ్యా ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో ఐకేఎఫ్ ఫైనాన్స్ సహకారంతో హైదరాబాద్‌లో ఇరవై ఎకరాల విస్తీర్ణంలో లగ్జరీతో కూడిన రిసార్ట్ శైలి జీవనమే లక్ష్యంగా 'ఈ5వరల్డ్' కు అంకురార్పణ జరిగింది. ఈ వివరాలు తెలిపేందుకు బంజారాహిల్స్ లోని తాజ్ డెక్కన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఐకేఎఫ్ ఫైనాన్స్ వ్యవస్థాపకులు, ఈ5వరల్డ్ ప్రమోటర్ వీజీకే ప్రసాద్ మాట్లాడుతూ రిసార్ట్ స్టైల్ లివింగ్‌లో సరికొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తున్నామని చెప్పారు. ఇది లగ్జరీ, వెల్నెస్, నేచర్ సమతుల్యతతో డిజైన్ చేయబడిందన్నారు. ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిసార్ట్ ప్రత్యేకంగా రూపొందించామని తెలిపారు. ప్రీమియం సౌకర్యాలు కలవన్నారు. ప్రకృతి నుంచి స్ఫూర్తి పొందే ఆర్కిటెక్చర్ ఇక్కడ ప్రత్యేకత అన్నారు. దీనిని మూడు దశల్లో అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. మొదటి దశలో 1 నుంచి 5 ఎకరాలు, రెండో దశలో 2 నుంచి 10 ఎకరాలు, మూడో దశలో 3 నుంచి 5 ఎకరాలు అభివృద్ధి చేయనున్నామన్నారు. లగ్జరీ, వెల్నెస్, స్థిరమైన డిజైన్‌తో హైదరాబాదులో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తున్నామని చెప్పారు. ఇది పచ్చని వాతావరణంలో ప్రశాంతతతో కూడిన ఉన్నత స్థాయి రిసార్ట్ జీవనానికి నిలయంగా ఉండనుందన్నారు.ఐకేఎఫ్ ఫైనాన్స్ రూ. 2,356.99 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన విశ్వసనీయ ఆర్థిక సంస్థ అన్నారు. హైదరాబాద్‌లో లగ్జరీ లివింగ్‌ను మలుపు తిప్పేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. ఇది కేవలం ఒక లగ్జరీ రిసార్ట్ లివింగ్ కమ్యూనిటీ మాత్రమే కాదని, ఇది నాణ్యత, ఆవిష్కరణ, స్థిరమైన జీవనం తాలుకా నిబద్ధతను ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఆర్కిటెక్చర్ కీర్తి షా లగ్జరీ, నేచర్ కలయిక విజన్ అద్భుతమన్నారు. ఉన్నతమైన జీవన విధానానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. ఇక్కడ నివసించే వారికి లగ్జరీ జీవనంతో పాటు పర్యావరణ అనుకూల వాతావరణాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ లగ్జరీ రిసార్ట్స్‌కు ఎక్కువ డిమాండ్ ఉందన్నారు. పెట్టుబడిదారులు దీర్ఘకాలంలో వృద్ధిపై ఆసక్తి చూపిస్తున్నారన్నారు. పెట్టుబడిదారులకు ఫ్రాక్షనల్ ఓనర్షిప్ అందించే ప్రత్యేక అవకాశాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఈ మోడల్ ద్వారా పెట్టుబడిదారులు రిసార్ట్‌లో భాగస్వామ్యం పొందవచ్చన్నారు.ఈ సందర్భంగా ఓపస్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ రఘురాం వుప్పుటూరి మాట్లాడుతూ ప్రాక్షనల్ ఓనర్షిప్ ద్వారా దీనిని అందరికి చేరువ చేయనున్నామని చెప్పారు. రూ.10 లక్షలలోపు మొత్తంతో రిసార్ట్‌లో భాగస్వామ్యం పొందవచ్చన్నారు. ఇది కుటుంబాలు సమయం గడిపేందుకు ఒక వీకెండ్ గమ్యస్థలంగా కూడా ఉంటుందన్నారు. ఇందులో ఉన్న విస్తృతమైన సౌకర్యాలు అన్ని వయస్సులు, వర్గాలకు అనుకూలంగా రూపొందించబడ్డాయని చెప్పారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికి అనుకూలంగా ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో మూడు క్లబ్ హౌస్‌లు కలవన్నారు. వీటి విస్తీర్ణం 10,000, 30,000, 50,000 చదరపు అడుగులు అన్నారు. అందులో యోగా గదులు, వెల్నెస్ జోన్లు, స్విమ్మింగ్ పూల్స్, వినోద సౌకర్యాలు ఉన్నాయన్నారు. రెండు రెస్టారెంట్లు కలవన్నారు. ఈ రెస్టారెంట్లలో ప్రపంచ, స్థానిక వంటకాలు అందుబాటులో ఉంటాయన్నారు. తాజా, సేంద్రీయ పదార్థాలను ప్రధానంగా ఉపయోగించనున్నామని తెలిపారు. విశాలమైన పచ్చని ప్రదేశాలు, గ్రీన్ గార్డెన్స్, నీటి వనరులు, నడక మార్గాలు ఉన్నాయన్నారు. పిల్లల కోసం ప్రత్యేక అడ్వెంచర్ ప్రదేశాలు, పెద్దలు, వృద్ధుల కోసం నేచర్ ట్రైల్స్, వెల్నెస్ లాంజ్‌లు ఉన్నాయని తెలిపారు. ఈ కమ్యూనిటీ ప్రత్యేక మెంబర్షిప్ ప్యాకేజీలను కూడా అందిస్తుందని చెప్పారు. హైదరాబాద్ నివాసితులు ప్రపంచ స్థాయి సదుపాయాలు ఆస్వాదించే అవకాశం ఉందన్నారు.ఈ సందర్భంగా ఈ5వరల్డ్ సేల్స్, బ్రాండ్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఈ5వరల్డ్ హైదరాబాద్ వాసులు ఆనందించే ఒక ప్రత్యేక గమ్యస్థలంగా మారనుందన్నారు. ఇది వివిధ వయస్సులు, వర్గాల ప్రజల అవసరాలను తీర్చబోతుందన్నారు.ఈ సందర్భంగా ఆర్కిటెక్ట్, అర్బన్ ప్లానర్, ఈ5వరల్డ్ వ్యవస్థాపక సభ్యులు కీర్తి షా మాట్లాడుతూ ఈ5వరల్డ్ స్థిరమైన నిర్మాణం, వెల్నెస్ ఆధారిత జీవనశైలిలో ఉంటుందన్నారు. ఆధునిక సౌకర్యాలు ఆస్వాదిస్తూ.. ప్రకృతితో మళ్లీ కనెక్ట్ అయ్యేలా చేయడం మా లక్ష్యమన్నారు. మా స్టాండ్ ఏమిటంటే.. పర్యావరణానికి అనుకూలంగా ఉంటూ విలాసవంతమైన జీవనానికి ఒక నమూనాగా, సమకాలీన సౌకర్యాలతో సహజ ప్రకృతి దృశ్యాలను మిళితం చేయడం అన్నారు. ఈ5వరల్డ్ భారతదేశంలో పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపకల్పన చేసిన మొదటి రిసార్ట్ లివింగ్ కమ్యూనిటీగా నిలుస్తుందని తెలిపారు. ఈ వినూత్న పద్ధతిని క్యూలీడ్.ఏఐ డాక్టర్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో అమలు అవుతుందన్నారు. ఇందులో మార్కెట్ కమ్యూనికేషన్, ఉత్పత్తి మార్కెట్ సరిపోలిక, ఆదాయ అంచనాలు, వ్యూహాత్మక ప్రణాళిక వంటి ప్రతి అంశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సూచనలు ఉంటాయన్నారు. ఐకేఎఫ్ ఫైనాన్స్ ప్రమోటర్ల మద్దతుతో ఐఖ్యా ఇన్ఫ్రా డెవలపర్స్ లగ్జరీ రిసార్ట్ లివింగ్‌లో మొదటి ప్రయత్నంగా ఈ5వరల్డ్ కు పునాది పడింది. ఇది ఈ సంస్థ ఆర్థిక సేవలలో ఉన్న బలమైన పునాది నుంచి సహజ విస్తరణను ప్రతిబింబిస్తుంది. ఇది 1991లో స్థాపించబడింది. ఐకేఎఫ్ ఫైనాన్స్ నిరంతరం అగ్రగామిగా ఉంది. ఇది తన పోర్ట్‌ఫోలియోను వాహన, ఎంఎస్ఎంఈ, హౌసింగ్ ఫైనాన్స్‌లను కలుపుతూ విస్తరించింది. తొమ్మిది రాష్ట్రాలలో ప్రస్థానం కలిగి ఉంది. 613.76 కోట్ల రూపాయల అంచనా కలిగిన సమగ్ర టర్నోవర్‌తో ఐకేఎఫ్ ఫైనాన్స్ మద్దతుతో స్థిరత్వం, నాణ్యత, దీర్ఘకాలిక విలువకు హామీగా నిలుస్తుంది. ఈ సమావేశంలో బిజినెస్ కన్సల్టెంట్ దేవేంద్ర దాంగ్ పాల్గొన్నారు.ఐకేఎఫ్ ఫైనాన్స్ గురించిఐకేఎఫ్ ఫైనాన్స్ వీజీకే ప్రసాద్ చేత స్థాపించబడింది. పారదర్శకత, వృద్ధి, కస్టమర్ సేవల పట్ల నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా ఎదిగింది. కంపెనీ ట్రాక్ రికార్డ్ దాని తాజా వెంచర్ ఈ5వరల్డ్ హైదరాబాద్‌లో ప్రీమియర్ లైఫ్ స్టైల్ కు మద్దతు ఇస్తుంది.ఐకేఎఫ్ ఫైనాన్స్ వాహన ఫైనాన్సింగ్‌పై దృష్టి సారించడంతో ప్రారంభమైంది. భారతదేశంలో విభిన్న శ్రేణి ఆర్థిక ఉత్పత్తులను అందించే పవర్ హౌస్‌గా ఎదిగింది. ఆయన దూరదృష్టితో కూడిన నాయకత్వంలో ఐకేఎఫ్ ప్రతిష్టాత్మకమైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సుందరం ఫైనాన్స్, టెల్కో వంటి సంస్థలతో కలిసి పని చేస్తుంది. దీర్ఘకాల భాగస్వామ్యాలు, పరిశ్రమ నైపుణ్యాన్ని పెంపొందించుకుంది.మరింత సమాచారానికి దయచేసి సంప్రదించండి : 9959154371/ 9963980259 -
రజనీకాంత్‌కు స్టెంట్ వేసిన వైద్యులు
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ (73) సోమవారం అర్ధరాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో తీవ్ర కడుపునొప్పితో చేరారు. వైద్యపరీక్షల అనంతరం ఆయన పొత్తికడుపులో స్టెంట్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిలకడగా రజనీకాంత్ ఆరోగ్యం ఉన్నట్లు చెబుతున్నారు. మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి రజనీ డిశ్చార్జ్ అవుతారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.ఈ ఉదయం అపోలో కాత్ ల్యాబ్‌లో రజినీకాంత్‌కు ఎలక్టివ్ ప్రొసీజర్ ట్రీట్ మెంట్ జరిగింది. భయపడాల్సింది ఏం లేదని, రెండు రోజుల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారని వైద్యులు చెప్పుకొచ్చారు.రజనీకాంత్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారని వార్తలు వచ్చిన వెంటనే ఆయన అభిమానులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో ఆయన సతీమణి లతా కూడా స్పందించారు. రజనీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె పేర్కొన్నారు. అభిమానులు ఆందోళన చెందకండని కోరారు. రజనీ క్షేమంగా ఉన్నారని తెలియగానే అభిమానులు సంతోషిస్తున్నారు. చెన్నై అపోలో కాత్ ల్యాబ్‌లో రజినీకాంత్‌కు కార్డియాలజిస్టుల పరీక్షలు కూడా పూర్తిచేశారు.జైలర్ సినిమా తర్వాత రజనీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అక్టోబర్ 10న దర్శకుడు జ్ఞానవేల్ రాజా తెరకెక్కించిన వేట్టైయన్ విడుదల కానుంది. ఇటీవలే లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ షూటింగ్ షెడ్యూల్ ముగించుకుని రజనీ చెన్నై వచ్చిన విషయం తెలిసిందే. -
అర్ధరాత్రి ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్
కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ (73) సోమవారం అర్ధరాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. అక్టోబర్ 1 మంగళవారం నాడు ఆయనకు పలు వైద్య పరీక్షలను చేయనున్నారు. ఈ క్రమంలో ఎలెక్టివ్ ప్రొసీజర్ ట్రీట్మెంట్ ఆయనకు అందించనున్నట్లు తెలుస్తోంది. గుండెకు సంబంధించిన పరీక్షలు ఆయనకు చేయనున్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఉదయం 8 గంటలకు హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు. రొటీన్ చెకప్ కోసం అడ్మిట్ అయ్యారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సతీమణి లతా రజనీకాంత్ వెళ్లడించారు.జైలర్ సినిమా తర్వాత రజనీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అక్టోబర్ 10న దర్శకుడు జ్ఞానవేల్ రాజా తెరకెక్కించిన వేట్టైయన్ విడుదల కానుంది. ఇటీవలే లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ షూటింగ్ షెడ్యూల్ ముగించుకుని రజనీ చెన్నై వచ్చారు. ఇంతలో ఆయన ఆరోగ్యంపై ఇలాంటి వార్తలు రావడంతో అభిమానులు ఆందోళనలో ఉన్నారు. సుమారు పదేళ్ల క్రితం సింగపూర్‌లో రజనీకాంత్ కిడ్నీ మార్పిడి చేయించుకున్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి: 'హీరోతో విడాకులు.. నన్ను తప్పుగా చిత్రీకరించేందుకు ప్రయత్నం' -
బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ హెల్త్ అప్డేట్
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ ఢిల్లీలోని అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు గురువారం అపోలో ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది.కాగా బుధవారం సాయంత్రం అనారోగ్యానికి గురైన ఆయనను.. కుటుంబసభ్యులు హుటాహుటిన ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ వినిత్ సూరి పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో నేడు డిశ్చార్జ్ అయ్యారు.అయితే వారం రోజుల వ్యవధిలోనే 96 ఏళ్ల అద్వానీ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడం రెండోసారి. గత నెల 26న వృద్ధాప్యం కారణంగా యూరాలజీ సంబంధిత సమస్యతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయనకు సర్జరీ నిర్వహించిన విషయం తెలిసిందే. సర్జరీ తర్వాత కోలుకున్న ఆయనను డిశ్చార్జ్ చేశారు. మళ్లీ అద్వానీ ఆస్వస్థకు గురవడంతో ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందజేశారు.కాగా ఈ ఏడాది దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందుకున్నారు అద్వానీ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఈ వేడుకకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ సీనియర్ నేతలు హాజరయ్యారు. అయితే అద్వానీ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన నివాసంలోనే ఈ కార్యక్రమం జరిగింది. -
ఎర్త్ రైజ్ ఫోటోతో ప్రపంచాన్నే మార్చేసిన నాసా ఆస్ట్రోనాట్ దుర్మరణం
అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా)లో విషాదం చోటు చేసుకుంది. నాసా రిటైర్డ్ వ్యోమగామి విలియం ఆండర్స్ (90) ఘోర విమాన ప్రమాదంలో మరణించారు.1968న నాసా అపోలో 8లో ముగ్గురు వ్యోమగాములు ఫ్రాంక్ బోర్మాన్, జేమ్స్ లోవెల్, విలియం ఆండర్స్ చంద్రుడి మీదకు పంపించింది.అయితే ఈ ముగ్గురు వ్యామగాములు డిసెంబర్ 24, 1968న చంద్ర కక్ష్యలోకి వెళ్లి తిరిగి డిసెంబర్ 27న భూమికి తిరిగి వచ్చారు. అప్పుడే భూమి మూలాలతో చంద్రుడికి సంబంధం ఉన్నట్లు వెల్లడించారు.ఆ ఫోటో తీసింది ఈయనే అపోలో 8లో చంద్రుడి చుట్టు తిరిగే సమయంలో ముగ్గురి ఆస్ట్రోనాట్స్‌లో ఒకరైన విలియం ఆండర్స్ చంద్రుడి ఉపరితలంపై నుంచి వెలుగుతూ కనిపిస్తున్న భూమి ఫోటోని తీశారు.ఈ ఫోటోకు ‘ఎర్త్ రైజ్’గా పేరు పెట్టారు. అంతరిక్షం నుంచి భూమికి తీసిన తొలి కలర్ ఫోటో ఇదీ.విమానంలో సాంకేతిక లోపంతాజాగా ఎర్త్రైజ్ ఫోటోతీసిన విలియం అండర్స్ జోన్స్ ద్వీపం తీరానికి చేరే సమయంలో ఆండర్స్ ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలింది. ఈ విమానం ప్రమాదంలో అండర్స్ మరణించారని, ఆ విమానంలో తన తండ్రి మాత్రమే ఉన్నారంటూ అండర్స్ కుమారుడు గ్రెగ్ చెప్పారంటూ ది సీటెల్ టైమ్స్ నివేదించింది.ఆకాశం నుంచి అనంతలోకాల్లోకి కేసీపీక్యూ-టీవీ కథనం ప్రకారం..అండర్స్ పాతకాలపు ఎయిర్ ఫోర్స్ సింగిల్ ఇంజిన్ టీ-34 విమానంలో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో లోపం తలెత్తడంతో ఆయన ప్రయాణిస్తున్న విమానం ఆకాశం నుంచి నిటారుగా సముద్ర తీర ప్రాంతాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అండర్స్ ప్రాణాలు కోల్పోవడంతో నాసాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
వన్యప్రాణుల సంరక్షణ నేషనల్ అంబాసిడర్‌గా ఉపాసన
కొణిదెల... కామినేని కుటుంబాల్లో ఉపాసన చాలా ప్రత్యేకం.. మెగా ఇంటికి కోడలిగా ఆమె అడుగుపెట్టిన సమయం నుంచి ఆమె పేరు మరింత పాపులర్ అయింది. గ్లోబల్‌స్టార్ హీరో రాంచరణ్ సతీమణిగా బెస్ట్ కపుల్స్ అనిపించుకున్న ఉపాసన టాలీవుడ్‌తో పాటు వ్యాపార ప్రపంచంలో కూడా తనదైన ముద్ర వేసింది.అపోలో హాస్పిటల్స్ వ్యాపార సామ్రాజ్యంలో కీలక పాత్ర పోసిస్తున్న ఉపాసనకు మరో బాధ్యతను అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం పాటుపడే వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) ఇండియా విభాగానికి నేషనల్ అంబాసిడర్‌గా నియమితులైంది. ఈ విషయాన్ని నాగర్‌కర్నూల్ డీఎఫ్‌వో రోహిత్ గోపిడి తాజాగా తెలిపారు. అపోలో ఆసుపత్రి ట్రస్ట్ యందు వైస్ చైర్‌పర్సన్‌గా ఆమె విధులు నిర్వహిస్తుంది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా, అపోలో హాస్పిటల్ ట్రస్ట్ మధ్య ఒప్పందం ప్రకారం నాలుగేళ్ల పాటు ఉపాసన ఈ బాధ్యతల్లో కొనసాగనుంది.ఈ ఒప్పందం ప్రకారం వన్యప్రాణుల సంరక్షణ ప్రాంతాల్లో గాయపడిన పులులు, ఏనుగులు వంటి ప్రాణులకు వైద్యం అందించడమే కాకుండా.. అటవీశాఖ సిబ్బందికి కూడా అపోలో ఆసుపత్రిలో ఉచిత చికిత్సను అందించనున్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
యూపీ సీఎంతో మెగా కోడలి భేటీ!
మెగా కోడలు ఉపాసన కొణిదెల నేడు అయోధ్య బాలరామున్ని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆమె తన తాతగారు అయిన అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డితో పాటుగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలుసుకున్నారు. అనంతరం తన తాత ప్రతాప్ రెడ్డి లెగసీని తెలియజేసే ‘ది అపోలో స్టోరీ’ బుక్ ని కూడా యోగి ఆదిత్యనాథ్‌కు ఆమె అందజేశారు. ఆపోలో హాస్పిటల్స్ నిర్వహణతో పాటు పలు ప్రాంతాల్లో విస్తరించడంలో ఉపాసన పాత్ర కీలకంగా ఉంటారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలుసుకున్న తర్వాత అయోధ్యలో ఆపోలో ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు వారు ప్రకటించారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థయాత్రలో అత్యాధునిక మల్టీ స్పెషాలిటీ అత్యవసర వైద్య కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ సెంటర్లోని అధునాతన సేవల గురించి అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి మాట్లాడుతూ.. ఈ సెంటర్లో విస్తృత స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇవి ప్రాథమిక ప్రథమ చికిత్స నుంచి గుండెపోటు,స్ట్రోక్‌తో సహా వైద్య అత్యవసర సేవల వరకు ఉన్నాయని ఆసుపత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దలు,పిల్లలకు 24x7 క్రిటికల్ కేర్ సపోర్ట్‌తో పాటు ICU బ్యాకప్ కూడా ఉంటుందని వారు చెప్పారు.ఈ ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని వారు ప్రకటించారు. దాదాపు 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్‌ను నిర్మించనున్నారు. ఈ ప్రకటన ప్రకారం, శ్రీరామ్ లల్లా దర్శనానికి వచ్చే యాత్రికులకు కేంద్రంలో వైద్య సేవలు పూర్తిగా ఉచితం. అయోధ్యను సందర్శించే యాత్రికుల ఆరోగ్యం, శ్రేయస్సు పట్ల అపోలో హాస్పిటల్స్ అచంచలమైన నిబద్ధతకు ఈ చొరవ నిదర్శనమని అపోలో హాస్పిటల్స్ లక్నో ఎండి, సిఇఒ డాక్టర్ మయాంక్ సోమాని అన్నారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
మా తాత బర్త్ డే నాకెంతో ప్రత్యేకం.. వేదికపై ఉపాసన ఎమోషనల్!
భారతీయ వైద్య రంగంలో విప్లవం తీసుకొచ్చిన ప్రముఖ వైద్యుడు, అపోలో ఆస్పత్రి అధినేత ప్రతాప్ సీ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైద్య రంగంలో ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించింది. అలాంటి ప్రతాప్ సీ రెడ్డి తన అపోలో ఆస్పత్రి సేవలను దేశంవ్యాప్తంగా విస్తరించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 5వ తేదీన ఆయన 91వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా చెన్నైలోని గ్రీమ్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఆయన మనవరాలు, రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కామినేని కొణిదెల కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత నిమ్మి సాక్సో రాసిన అపోలో స్టోరీ అనే కామిక్ బుక్‌ను డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి ఆవిష్కరించారు. అయితే ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం పట్ల ఎలా అనిపిస్తుందని ఉపాసనను ప్రశ్నించారు. దీనికి ఉపాసన చెప్పిన సమాధానం వైరల్‌గా మారింది. ఉపాసన మాట్లాడుతూ.. 'మా గ్రాండ్ ఫాదర్ మాత్రమే కాదు.. ఇప్పుడు క్లీంకార గ్రాండ్ ఫాదర్ కూడా పద్మ విభూషణ్ అందుకున్నారు. మా కుటుంబంలో ఇద్దరు ఈ పురస్కారం అందుకోవడం నిజంగా ఎంతో గౌరవంగా భావిస్తున్నా. మా తాత జన్మదినం మాకు ఎంతో ప్రత్యేకం. ఈ రోజును భవిష్యత్తులో వ్యాపారవేత్తలుగా ఎదగాలని కలలు కనే యువ వ్యాపారవేత్తలు, మహిళలతో కలిసి జరుపుకోవడం ఇంకా సంతోషంగా ఉంది. వైద్య రంగంలో ఆయన ఏర్పరచుకున్న సామ్రాజ్యాన్ని మరింత విస్తరించడం, ఆయన కలలను నెరవేర్చడానికి నిరంతరం శ్రమిస్తామని' ఉపాసన పేర్కొన్నారు. కాగా.. సినీ రంగంలో చేసిన సేవలకు మెగాస్టార్ చిరంజీవిని ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌తో సత్కరించింది. అంతకుముందు 2010లో ప్రతాప్ చంద్ర రెడ్డి కూడా పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. Happy 91st Birthday Thatha @DrPrathapCReddy The Apollo Story is an emotional tribute to every girl child to dream without boundaries & to every father to support their daughters as equals Thank You @amarchitrkatha @RanaDaggubati for helping us put this together@ApolloFND pic.twitter.com/mPPuUjpbdG — Upasana Konidela (@upasanakonidela) February 5, 2024 -
నాడే విడుదల వీర శూర సూర్యచిత్ర
ఆదిత్య ఎల్1 మిషన్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన సందడి ఆకాశంలోనే కాదు అంతర్జాలంలోనూ కనిపిస్తోంది. సూర్యుడి చుట్టూ పరిభ్రమించిన సైన్స్–ఫిక్షన్ నుంచి సినిమాల వరకు ఎన్నో విషయాలు అంతర్జాలంలో చక్కర్లు కొడుతున్నాయి. మచ్చుకు ఫేస్బుక్లో ఒక వీడియో... జర్నీ టు ది ఫార్ సైడ్ ఆఫ్ ది సన్(1969) సినిమా తాలూకు ట్రైలర్ ఇది. ‘అపోలో హ్యాజ్ కాంకర్డ్ ది మూన్’ ‘వేర్ టూ నౌ ఇన్ స్పేస్?’ టైటిల్స్‌తో ట్రైలర్ మొదలవుతుంది. ఆ తరువాత... ఒక రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకువెళుతుంది. ఇప్పటి సినిమాలకు ఏమాత్రం తగ్గని ఉత్కంఠ ఈ ట్రైలర్లో కనిపిస్తుంది. ‘నాట్ ది ఎండ్’ అని ఊరిస్తూ ట్రైలర్ ముగుస్తుంది. -
చంద్రుడిపై అడుగు.. నమ్మరేంట్రా బాబూ!
అదొక అత్యంత అద్భుతమైన ఘట్టం. 1969 జులై 20వ తేదీన.. ‘ఈగిల్’ లునార్ మాడ్యుల్ నుంచి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై మొట్టమొదటగా అడుగుపెట్టాడు. ఆ వెంటనే మరో పైలెట్ బజ్ ఆల్డ్రిన్ రెండో వ్యక్తిగా అడుగుపెట్టగా.. ఇద్దరూ కలిసి చంద్రుడిపై అమెరికా జెండాను పాతి చరిత్రకెక్కారు. చందమామ కలను మనిషి సాకారం చేసుకున్న క్షణాలివి. అయితే ఆ ఘనత నిజమేనా అనుమానాలు తరచూ వ్యక్తం అవుతుంటాయి.. అందుకు కారణాలు లేకపోలేదు. జులై 16న ఉదయం 9గం.30ని. శాటర్న్ వీ రాకెట్ ద్వారా ‘అపోలో 11 స్పేస్ ఫ్లైట్’ ఫ్లోరిడా మారిట్ ఐల్యాండ్‌లోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరింది. లునార్ మాడ్యుల్ ‘ఈగిల్’ కమాండర్‌గా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, పైలెట్ బజ్ అల్డ్రిన్, కమాండ్ మాడ్యూల్ ‘కొలంబియా’ పైలెట్ మైకేల్ కోలిన్స్ అపోలో స్పేస్ ఫ్లయిట్లో పయనం అయ్యారు. అంతరిక్షంలో సుమారు రెండు లక్షల నలభై వేల మైళ్ల దూరపు ప్రయాణం తర్వాత జులై 19న చంద్రుడి కక్ష్యలోకి అడుగుపెట్టింది అపోలో. ఉత్కంఠ రేకెత్తిస్తూ.. జులై 19వ తేదీ.. అర్ధరాత్రి దాటాక అపోలో నుంచి లునార్ మాడ్యూల్, ఈగిల్ మాడ్యూల్ రెండూ విడిపోయాయి. ఈగిల్ మాడ్యూల్లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ అల్డ్రిన్ ఉండగా.. మాడ్యూల్ పైలెట్ మైకేల్ కోలిన్స్ చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టాడు. ఇక రెండు గంటలు ఉపరితలంలో సంచరించాక.. చంద్రుడిపై సేఫ్ ల్యాండ్ అయ్యింది ఈగిల్. ఆ విషయాన్ని ఆర్మ్‌స్ట్రాంగ్ నాసా స్పేస్ కమ్యూనికేషన్ సెంటర్‌కు తెలిపాడు. అప్పటిదాకా సాఫీగా సాగిన ప్రయాణంతో పోలిస్తే.. అక్కడి నుంచి అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. సుమారు ఐదు గంటల తర్వాత మాడ్యూల్ నుంచి చంద్రుడి మీద అడుగు మోపాడు ఆర్మ్‌స్ట్రాంగ్. వెంట తెచ్చిన బీమ్ సిగ్నల్ ఆధారిత టీవీ కెమెరాతో అదంతా లైవ్ రికార్డు చేస్తూ వచ్చాడు. అలా అదొక అద్భుతమైన ఘట్టంగా మిగిలిపోయింది. “That one small step for man, one giant leap for mankind.”.. ఇది చంద్రుడి మీద అడుగుమోపిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చెప్పిన మాటలు. అప్పటికి టైం.. రాత్రి 10గం.56ని(ET). బజ్ అల్డ్రిన్ పది నిమిషాలకు బయటకు వచ్చేంత వరకు ఆర్మ్‌స్ట్రాంగ్ అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అమెరికా జెండా పాతారు. కొన్ని పరికరాలను అక్కడ ఉంచారు. సంతోషంగా కలియతిరిగారు. ఈ మొత్తాన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 65 కోట్ల మంది టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. గ్రేటెస్ట్ అచీవ్మెంట్ కదా! ఆ ఇద్దరూ చంద్రుడి మీద 21 గంటలు గడిపినట్లు చెప్తుంటారు. అక్కడి మట్టిని సేకరించారు. అలాగే వాళ్లు దిగిన ప్రాంతానికి ‘ట్రాన్క్విలిటీ బేస్’ అనే పేరు పెట్టారు. చివరికి ఈ ఇద్దరూ కమాండ్ మాడ్యూల్ కొలంబియాలో కొలిన్స్‌తో కలిసి చివరికి భూమ్మీదకు ప్రయాణం అయ్యారు. జులై 24న వాళ్లు భూమ్మీద సేఫ్‌గా ల్యాండ్ కావడంతో ఆ అంకం విజయవంతంగా పూర్తైంది. నాసా దృష్టిలో అది ‘సింగిల్ గ్రేటెస్ట్ టెక్నాలజికల్ అఛీవ్మెంట్ ఆఫ్ ఆఫ్ ఆల్‌టైం’. ఆ తర్వాత ఎన్నో దేశాల రోదసీ ప్రయోగాలకు బలం ఇచ్చిందది. ఈ విజయానికి గుర్తుగా ఎన్నో డాక్యుమెంటరీలు, ఆధారాలు కళ్ల ముందు కనిపిస్తుంటాయి. కానీ, చాలామంది దీనిని నమ్మరు. అదంతా కట్టుకథగా భావిస్తుంటారు. ఎందుకు.. చుక్కలు కనపడాలి కదా! బిల్ కేసింగ్ అనే అమెరికన్ రైటర్.. జులై 1969 నుంచి డిసెంబర్ 1972 దాకా జరిగిన అపోలో మూన్ ల్యాండింగ్స్ అన్నీ ఉత్త ప్రచారాలే అని ప్రచారం చేసిన మొదటి వ్యక్తి. చంద్రుడి మీద నాసా పరిశోధనలంతా నాటకమే అని అన్నాడాయన. ఆ తర్వాత ఆయన రూట్లో చాలామంది పయనించారు. అయితే ఈ వాదనను కొట్టేయడానికి సైంటిస్టులు ఆధారాలను ఎప్పటికప్పుడు చూపిస్తూ వస్తుంటారు. చాలామందికి కలిగిన కామన్ డౌన్ ఏంటంటే.. మూన్ ల్యాండింగ్ టైంలో నక్షత్రాలు కనిపించకపోవడం. చంద్రుడి మీద గాలి లేకపోవడంతో ఆకాశం నల్లగా ఉంటుంది. అలాంటప్పుడు నక్షత్రాలు కూడా కనిపించాలి కదా? అని అడిగారు. అయితే అవి కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉంటాయని నాసా వివరణ ఇచ్చింది. ఇక జెండా రెపరెపలాడడం. గాలి లేనప్పుడు జెండా ఎగిరిందని కొందరు ప్రశ్నించారు. అయితే ఆ జెండా కదలికలు వ్యోమగాములు పాతినప్పుడు కలిగినవేనవి వివరణ ఇచ్చారు. ఇక ముఖ్యమైన అనుమానం ఏంటంటే.. వాన్ లెన్ బెల్టులు. అంతరిక్షంలోని ఈ బెల్టుల గుండా ప్రయాణం వీలు కాదని, ఒకవేళ చేస్తే హై రేడియేషన్ ఎఫెక్ట్‌తో ప్రాణాలు పోతాయనేది కొందరి అభిప్రాయం కమ్ అనుమానం. అయితే వాళ్లు ప్రయాణించిన వేగం, తక్కువ టైంలో చేరుకవోడం వల్లే తక్కువ రేడియోధార్మికత నుంచి సురక్షితంగా బయటపడ్డారేది సైంటిస్టుల వాదన. ఇవన్నీ పక్కనపెడితే.. యాభై రెండేళ్లు పూర్తయ్యాక కూడా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మాటలు.. ఈనాటికీ అంతరిక్ష ప్రయోగాలప్పుడు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఇక నాటి అద్భుతానికి ఆధారంగా.. చంద్రుడి మీద నుంచి తెచ్చిన మట్టి.. వివిధ దేశాల అంతరిక్ష ల్యాబ్‌ల్లో ఉన్న వాటి శాంపిల్స్, చంద్రుడిపై పాద ముద్రలు, 2009లో నాసా లునార్ రీ కన్నియసాన్స్ ఆర్బిటర్ తీసిన ఫొటోలు. చైనా, ఇండియా జపాన్ దేశాలు పంపిన స్పేస్ వెహికిల్స్ సేకరించిన సాక్ష్యాలు.. అన్నింటికి మించి సుమారు 24 బిలియన్ల డాలర్ల ఖర్చుతో రష్యాకు ధీటైన ప్రయోగంలో విజయం సాధించామనే నాసా సంబురాలు.. ఇంతకంటే సజీవ సాక్ష్యాలు ఇంకేం కావాలనేది స్పేస్ సైంటిస్టుల మాట. చంద్రయాన్-3 నేపథ్యంలో సాక్షి వెబ్‌డెస్క్ ప్రత్యేకం -
మేనకోడలుకోసం అపొలోకి వచ్చిన అత్తలు శ్రీజ,సుష్మిత
-
Apollo Hospital : అపోలో హాస్పిటల్ ముందు మెగా ఫ్యాన్స్ హంగామా (ఫొటోలు)
-
మేన కోడలిని చూడడానికి వచ్చిన అల్లు అర్జున్, స్నేహ...
-
దేశంలో పలు కంపెనీల సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో కల్యాణ్ జ్యువెలర్స్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 54 శాతం జంప్‌చేసి రూ. 106 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 69 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం 20 శాతం వృద్ధితో రూ. 3,476 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 2,889 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ కాలంలో దక్షిణాది మినహా ఇతర మార్కెట్లలో కొత్తగా ఐదు షోరూములను ప్రారంభించినట్లు కంపెనీ వెల్లడించింది. వెరసి సెప్టెంబర్‌కల్లా మధ్యప్రాచ్యంతో కలిపి మొత్తం స్టోర్ల సంఖ్య 163కు చేరినట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో కల్యాణ్ జ్యువెలర్స్ షేరు ఎన్ఎస్ఈలో 4 శాతం పతనమై రూ. 103 వద్ద ముగిసింది. ఎన్‌హెచ్‌పీసీ లాభం ప్లస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో విద్యుత్ రంగ పీఎస్‌యూ ఎన్‌హెచ్‌పీసీ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం దాదాపు 22 శాతం వృద్ధితో రూ. 1,686 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 1,387 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 3,166 కోట్ల నుంచి రూ. 3,529 కోట్లకు ఎగసింది. ఫలితాల నేపథ్యంలో ఎన్‌హెచ్‌పీసీ షేరు ఎన్ఎస్ఈలో 1.5 శాతం క్షీణించి రూ. 43 వద్ద ముగిసింది. ఆయిల్ ఇండియాకు రికార్డు లాభాలు ప్రభుత్వరంగ చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థ ఆయిల్ ఇండియా సెప్టెంబర్ క్వార్టర్‌కు రికార్డు స్థాయి లాభాలను ప్రకటించింది. రూ1,720 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఆదాయం రూ.6,671 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.504 కోట్లు, ఆదాయం రూ.3,679 కోట్లుగా ఉండడం గమనార్హం ఓఎన్జీసీ తర్వాత ఆయిల్ ఇండియా దేశీయంగా రెండో అతిపెద్ద చమురు కంపెనీ కావడం గమనార్హం. ఒక్కో బ్యారెల్‌కు సెప్టెంబర్ క్వార్టర్లో రూ.100.59 డాలర్లు ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది బ్యారెల్‌కు 71 డాలర్లుగా ఉండడం గమనార్హం. ఆయిల్ ఉత్పత్తిలోనూ పెద్దగా మార్పులేదు. 0.79 మిలియన్ టన్నులుగా, గ్యాస్ ఉత్పత్తి 0.82 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉంది. ఐషర్ మోటార్స్ లాభం హైజంప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఆటో రంగ దిగ్గజం ఐషర్ మోటార్స్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 76 శాతం జంప్‌చేసి రూ. 657 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 373 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 2,250 కోట్ల నుంచి రూ. 3,519 కోట్లకు ఎగసింది. ద్విచక్ర వాహన విభాగం రాయల్ ఎన్ఫీల్డ్ అమ్మకాలు 65 శాతం వృద్ధితో 2,03,451 యూనిట్లకు చేరాయి. ఫలితాల నేపథ్యంలో ఐషర్ మోటార్స్ షేరు బీఎస్ఈలో 0.8 శాతం క్షీణించి రూ. 3,702 వద్ద ముగిసింది. లాభాల్లోకి సుజ్లాన్ ఎనర్జీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో పవన విద్యుత్ రంగ కంపెనీ సుజ్లాన్ ఎనర్జీ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ 2)లో రూ. 56.5 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 12.4 కోట్ల నికర నష్టం ప్రకటించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 1,362 కోట్ల నుంచి రూ. 1,443 కోట్లకు బలపడింది. సెప్టెంబర్‌కల్లా 759 మెగావాట్ల ఆర్డర్‌బుక్‌ను కలిగి ఉన్నట్లు కంపెనీ వైస్‌చైర్మన్ గిరీష్ తంతి పేర్కొన్నారు. 193 మెగావాట్ల కొత్త ఆర్డర్లను జత చేసుకున్నట్లు తెలియజేశారు. రైట్స్ నిధులతో రూ. 583 కోట్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు కంపెనీ సీఎఫ్‌వో హిమాన్షు మోడీ తెలియజేశారు. వెరసి నికర రుణ భారం రూ. 2,722 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో సుజ్లాన్ ఎనర్జీ షేరు ఎన్ఎస్ఈలో 0.6 శాతం బలపడి రూ. 8.30 వద్ద ముగిసింది. పెట్రోనెట్ డివిడెండ్ రూ. 7 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ఇంధన రంగ కంపెనీ పెట్రో నెట్ ఎల్ఎన్జీ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 4 శాతం క్షీణించి రూ. 786 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 818 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం ఒక క్వార్టర్‌కు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 15,986 కోట్లకు చేరింది. గత క్యూ2లో రూ. 10,813 కోట్ల టర్నోవర్ మాత్రమే నమోదైంది. కంపెనీ బోర్డు వాటాదారు లకు షేరుకి రూ. 7 చొప్పున ప్రత్యేక మధ్యంతర డివిడెండు ప్రకటించింది. ఈ కాలంలో కంపెనీ ప్రధాన టెర్మినల్ దహేజ్ 182 టీబీటీ యూనిట్ల ఎల్ఎన్జీని ప్రాసెస్ చేసింది. గత క్యూ2లో 225 టీబీటీయూ నమోదైంది. ఒడిషాలోని గోపాల్పూర్ పోర్టులో 4 మిలియన్ టన్నుల సామర్థ్యంతో తేలియాడే ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 2,306 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఫలితాల నేపథ్యంలో పెట్రోనెట్ షేరు ఎన్ఎస్ఈలో 1.5 శాతం పుంజుకుని రూ. 212 వద్ద ముగిసింది. బాటా లాభంలో 47% వృద్ధి న్యూఢిల్లీ: బాటా ఇండియా కన్సాలిడేటెడ్ లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 47% పెరిగి రూ. 55 కోట్లుగా నమోదైంది. ఆదాయం 35% వృద్ధితో రూ.830 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి లాభం రూ.37 కోట్లు, ఆదాయం రూ.614 కోట్లుగా ఉన్నాయి. క్లిష్టమైన నిర్వహణ వాతావరణం, అధిక ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ అన్ని వ్యాపార చానల్స్‌లోనూ మెరుగైన పనితీరు చూపించినట్టు బాటా తెలిపింది. తగ్గిన అపోలో లాభం వైద్య సేవల సంస్థ అపోలో హాస్పిటల్స్ సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 20 శాతం తగ్గి రూ.213 కోట్లు నమోదు చేసింది. టర్నోవర్ రూ.3,723 కోట్ల నుంచి రూ.4,274 కోట్లకు ఎగసింది. క్రితం ముగింపుతో పోలిస్తే అపోలో షేరు ధర బీఎస్ఈలో గురువారం 1.80 శాతం తగ్గి రూ.4,282.25 వద్ద స్థిరపడింది. తగ్గిన నాట్కో లాభం ఔషధ రంగ కంపెనీ నాట్కో ఫార్మా సెప్టెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 12.75 శాతం తగ్గి రూ.56.8 కోట్లు సాధించింది. టర్నోవర్ 9 శాతం ఎగసి రూ.452 కోట్లు నమోదు చేసింది. 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రెండవ మధ్యంతర డివిడెండ్ కింద 75 పైసలు చెల్లించాలని బోర్డు ప్రతిపాదించింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఎన్ఎస్ఈలో నాట్కో షేరు ధర గురువారం 4.19 శాతం తగ్గి రూ.588.25 వద్ద స్థిరపడింది. ఐఆర్ఎఫ్సీ ఫర్వాలేదు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లాభం సెప్టెంబర్ త్రైమాసికంలో 14 శాతం పెరిగి రూ.1,714 కోట్లుగా ఉంది. ఆదాయం రూ.24 శాతం పెరిగి రూ.5,810 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది కాలానికి లాభం రూ.1,501 కోట్లు, ఆదాయం రూ.4,690 కోట్ల చొప్పున ఉన్నాయి. నిర్వహణ ఆస్తులు రూ.4,39,070 కోట్లకు చేరాయి. ఒక్కో షేరుకు రూ.0.80 చొప్పున మధ్యంతర డివిడెండ్ ఇచ్చేందుకు కంపెనీ నిర్ణయం తీసుకుంది. ముత్తూట్ ఫైనాన్స్ లాభం రూ.902 కోట్లు బంగారం, ఇతర రుణాలు అందించే ముత్తూట్ ఫైనాన్స్ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.902 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలానికి వచ్చిన లాభం రూ.1,003 కోట్లతో పోలిస్తే 10 శాతం తగ్గింది. కానీ, ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో లాభం రూ.825 కోట్లతో పోలిస్తే (సీక్వెన్షియల్‌గా ) 9 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ఇక కంపెనీ ఆదాయం సెప్టెంబర్ త్రైమాసికానికి రూ.2,842 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.3,065 కోట్లతో పోలిస్తే తగ్గింది. ముఖ్యంగా వడ్డీ ఆదాయం 8.2 శాతం తగ్గి రూ.2,758 కోట్లకు పరిమితం కావడం లాభాల క్షీణతకు దారితీసింది. దేశవ్యాప్తంగా ఈ సంస్థకు 4,641 శాఖలు ఉన్నాయి. తన దగ్గర రుణగ్రహీతలు తనఖాగా ఉంచిన 177 టన్నుల బంగారం ఆభరణాల్లో 65 శాతం గ్రామీణ ప్రాంతాల నుంచే ఉన్నట్టు ముత్తూట్ ఫైనాన్స్ తెలిపింది. వ్యక్తిగత రుణాలు, నగదు బదిలీ సేవలను కూడా ముత్తూట్ ఆఫర్ చేస్తుంటుంది. -
బ్రిటన్ కంపెనీపై ముఖేష్ అంబానీ కన్ను! అదే నిజమైతే!
లండన్: కొన్నాళ్ల క్రితం ఆటబొమ్మల రిటైల్ సంస్థ హామ్లీస్‌ను కొనుగోలు చేసిన దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తాజాగా మరో బ్రిటన్ కంపెనీపై కన్నేసింది. ఫార్మసీ చెయిన్ ’బూట్స్’ను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్తో కలిసి సంయుక్తంగా బిడ్ వేయాలని ఆర్ఐఎల్ భావిస్తున్నట్లు బ్రిటన్ వార్తాపత్రిక ది ఫైనాన్షియల్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. ఈ డీల్ సాకారమైతే.. బూట్స్ కొత్తగా భారత్, మధ్య ప్రాచ్య, ఆగ్నేయాసియా మార్కెట్లలోకి కూడా కార్యకలాపాలు విస్తరించేందుకు వీలుంటుందని పేర్కొంది. బ్రిటన్‌లో పేరొందిన ఫార్మసీ చెయిన్ అయిన బూట్స్‌కు అమెరికాకు చెందిన వాల్‌గ్రీన్స్ బూట్స్ అలయన్స్ మాతృ సంస్థ. తమ దేశంలో హెల్త్‌కేర్ వ్యాపారంపైనే పూర్తిగా దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో బూట్స్‌ను వాల్గ్రీన్ బూట్స్ గతేడాది డిసెంబర్లో అమ్మకానికి పెట్టింది. బిడ్ల దాఖలుకు మే 16 ఆఖరు రోజు. బూట్స్‌కు బ్రిటన్‌లో 2,000 పైచిలుకు స్టోర్స్ ఉన్నాయి -
సాయిధరమ్ తేజ్ పై అపోలో హెల్త్ బులిటెన్
-
సలాం సోనూ సూద్...మీరో గొప్ప వరం!
సాక్షి, ముంబై: ప్రముఖ నటుడు సోనూసూద్ సేవా నిరతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కరోనా సంక్షోభం ఆరంభమైంది మొదలు.. తనకు కరోనా సోకిన సమయంలో సేవా కార్యక్రమాలనుంచి ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తనకు నెగిటివ్ వచ్చిందని ట్విటర్లో షేర్ చేసిన సోనూ.. తాజాగా మరో ఘటనతో వార్తల్లో సంచలన వ్యక్తిగా నిలిచాడు. కరోనా బారినపడి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఒక మహిళ(25)ను చికిత్స కోసం నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు ఏకంగా ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించి తన మానవత్వానికి ఎల్లలు లేవని చాటుకున్నారు. దీంతో కనిపించే దైవం అంటూ అభిమానులు సోనూసూద్‌ను హృదయ పూర్వకంగా అభినందిస్తున్నారు. (శుభవార్త చెప్పిన సోనూసూద్) వివరాల్లోకి వెళ్లితే రిటైర్డ్ రైల్వే అధికారి కుమార్తె భారతి కోవిడ్-19 కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురైనారు. ఆమె ఊపిరితిత్తులు దాదాపు 85 నుండి 90శాతం పాడైపోయాయి. మొదట ఆమెను నాగ్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడానికి సహాయం చేశాడు సోనూ సూద్. అయితే ఆమెకు ఊపిరితిత్తుల మార్పడి అవసరమని వైద్యులు ప్రకటించారు. అయినా 20 శాతం మాత్రమే బతికే అవకాశాలు ఉన్నాయని కూడా వైద్యులు చెప్పారు. పైగా ఆ అవకాశం ఒక్క అపోలోలో మాత్రమే ఉంది. అయినా సోనూ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. క్షణం ఆలస్యం చేయకుండా చివరివరకు ప్రయత్నిద్దాం అంటూ అపోలో హాస్పిటల్స్ డైరెక్టర్లతో సంప్రదించి, ప్రత్యేకమైన ఎక్మో సపోర్టు ద్వారా హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించేందుకు సాయపడ్డారు. అంతేకాదు శరీరానికి కృత్రిమంగా రక్తం పంప్ చేసే ఎక్మో చికిత్సలో నిపుణులైన వైద్యబృందాన్ని రప్పించి మరీ ఎయిర్ అంబులెన్స్‌లో ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. సోనూ ప్రత్యేకత అదే కదా. ప్రస్తుతం భారతి చికిత్స పొందుతున్నారు. కరోనా పోరులో ఆమె నిలిచి గెలుస్తుందనే ధీమాను వ్యక్తం చేశాడు. దీంతో విషయం తెలుసుకున్న అభిమానులు, ఇతర నెటిజనులు రియల్ హీరోను ప్రశంసిస్తున్నారు. గ్రేట్ సోనూజీ.. అంచనాలకు అందని మీ మానవత్వం, ఔదార్యం.. మీ మాతృమూర్తి భారతీయులకు అందించిన గొప్పవరం మీరు అంటూ కమెంట్ చేస్తున్నారు. -
ఆన్లైన్లో అపోలో టైర్స్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ అపోలోటైర్స్ ఈ-కామర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. భారత మార్కెట్లో ఆన్లైన్ టైర్ల అమ్మకాల కోసం ఇ-కామర్స్ పోర్టల్‌ను ప్రారంభించింది. దీంతో దేశీయ కస్టమర్లు ఇక నుంచి కార్లు, ద్విచక్ర వాహన టైర్లను ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు. ‘బై ఆన్లైన్.. ఫిట్ ఆఫ్‌లైన్’ మోడల్లో ఈ విధానం పనిచేస్తుంది. అంటే ఆన్లైన్లో టైర్లు కొనుగోలు చేసి వాటిని బిగించేందుకు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. దగ్గర్లోని అపోలో టైర్స్ డీలర్ లొకేషన్‌కు చేరుకొని టైర్లను వాహనానికి బిగిస్తాడని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. తొలుత ఢిల్లీ, ఎన్‌సిఆర్, బెంగళూరు, ముంబై, కొచ్చిలలో ప్రారంభించిన ఈ సేవలను త్వరలో దేశంలోని ఇతర నగరాలకు విస్తరించనుంది. -
కోవిడ్-19 నిర్ధారణకు టాటా ఎండీ ‘చెక్’
సాక్షి, హైదరాబాద్: కోవిడ్-19 నిర్ధారణ పరీక్షలకై టాటా మెడికల్ అండ్ డయాగ్నొస్టిక్స్ ‘చెక్’ పేరుతో రూపొందించిన టెస్ట్ కిట్‌ను తొలిసారిగా భారత్‌లో అపోలో హాస్పిటల్స్ వినియోగించనుంది. ఫెలూదా డయాగ్నొస్టిక్ టెక్నాలజీపై ప్రపంచంలో మొదటిసారిగా కరోనా వైరస్ పరీక్షలకై డీఎన్ఏ జీనోమ్ ఎడిటింగ్ టూల్ క్రిస్పర్ కాస్-9తో ఈ కిట్ రూపుదిద్దుకుంది. ఫెలూదాను కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్‌కు (సీఎస్ఐఆర్) చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్, ఇంటిగ్రేటివ్ బయాలజీ అభివృద్ధి చేసింది. చెక్ టెస్ట్ ద్వారా అధిక కచ్చితత్వంతోపాటు పరీక్ష ఫలితాలు వేగంగా తెలుసుకోవచ్చు. (గుడ్‌న్యూస్: క్రిస్మస్కు ముందే కరోనా వ్యాక్సిన్) అపోలో డయాగ్నోస్టిక్స్ 2020 డిసెంబర్ మొదటి వారం నుండి జాతీయ రాజధాని ప్రాంతంలో (ఎన్‌సిఆర్) టాటా ఎమ్‌డి చెక్ పరీక్షను అందిస్తాయని, ఆ తరువాత దేశంలోని అన్ని ప్రధాన మెట్రోల్లో దీనిని విడుదల చేయనున్నట్లు కంపెనీలు తెలిపాయి. ప్రధానంగా మొదటి దశలో కోల్‌కతా, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్, పూణే, తరువాత రెండవ దశ ఇతర నగరాలకు చేరుకున్నాయని వారు తెలిపారు. (కరోనా వ్యాక్సిన్ : ఇన్ఫీ మూర్తి కీలక డిమాండ్) -
అపోలో ఫార్మసీలో నిలువు దోపిడీ
సాక్షి, హైదరాబాద్: కిందిస్థాయి ఉద్యోగుల జీతాలను షార్టేజ్ పేరుతో నిలువు దోపిడి చేస్తున్న ఘటన రాచకొండ కాప్రా గాంధీ నగర్ అపోలో ఫార్మసీలో చోటుచేసుకుంది. చాలచాలనీ జీతాలు ఇస్తూ అందులోనూ షార్టేజ్ పేరుతో.. ఎగ్జిక్యూటివ్ సిబ్బంది డబ్బులు కాజేయడాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఫార్మసీ ఉద్యోగులు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. గాంధీనగర్ అపోలో ఫార్మసీలో ట్రైనీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్న జెస్సీ(బేబీ) ఈ మేరకు పోలీసులను ఆశ్రయించారు. ప్రతినెలా షార్టేజ్ పేరుతో 5వేల నుంచి 8వేల రూపాయల వరకు కాజేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వచ్చే జీతంలో మొత్తం డబ్బులు వారే తీసుకుంటే మేము ఎలా బ్రతకాలి..? మా కుటుంబాల్ని ఎలా పోషించుకోవాలని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇదేంటని అడిగితే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో, మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ మా దగ్గర ఉన్నాయని బెదిరింపులకు దిగుతున్నట్లు వివరించారు. (హైదరాబాద్ పోలీసుల సాహసం..) దీంతో ఫార్మసీ ఉద్యోగులు పోలీసులను కలిసి బాధిత ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. పై అధికారులకు తెలియకుండా కింది స్థాయి ఉద్యోగులు మాఫియాగా ఏర్పడి ఉద్యోగులను వేదిస్తున్నట్టు ఫిర్యాదు చేశారు. ఫార్మసీ ఉద్యోగుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న కుషాయిగూడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
శరీర బరువులో సగం ఉన్న కణితి, తొలగించిన డాక్టర్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని 52 ఏళ్ల మహిళ కడుపులో నుంచి 50 కిలోల అండాశయ కణితిని డాకర్లు తొలగించారు. ఆమె శరీర బరువులో సగభాగం ఆ కణితే ఉండేదని డాక్టర్లు తెలిపారు. కణిత బాగా పెరిగిపోవడంతో ఆ మహిళకు కడుపులో నొప్పి విపరీతంగా వచ్చేది. అంతే కాకుండా ఆమె సంవత్సరం నుంచి విపరీతంగా బరువు పెరగడం మొదలుపెట్టింది. దీంతో అనేక నొప్పులు, నడవడం కష్టమవడం, నిద్రపోవడం ఇబ్బంది ఉండటం లాంటి సమస్యలు మొదలయ్యాయి. ఆమె దగ్గరలో ఉన్న డాక్టరుకు చూపించుకోగా ఆయన ఇంద్రప్రస్థాన్ అపోలో హాస్పటల్‌కు వెళ్లాల్సిందిగా ఆ మహిళకు సూచించారు. పరీక్షలు చేసిన అపోలో డాక్టర్లు ఆమె అండశయంలో కణితి పెరుగుతున్నట్లు గుర్తించారు. మూడున్నర గంటల పాటు కష్టపడి ఆమె కడుపులోని కణితి తొలగించారు. దీంతో ఆమె శరీర బరువు 106 కేజీల నుంచి అమాంతం 56 కేజీలకు తగ్గిపోయింది. అంటే ఆమె శరీరంలో దాదాపు సగం బరువు ఈ కణితే ఉంది. చికిత్స అనంతరం ఆమెను ఆగస్టు 22న డిశార్జ్ చేశారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఆపరేషన్ చేసిన కణిత ఇదేనని, అదివరకు కొయంబత్తూరుకు చెందిన మహిళ కడుపు నుంచి 2017 లో 34 కేజీల కణితను తొలగించామని డాక్టర్లు తెలిపారు. చదవండి: ‘యూపీ సర్కార్ ఆ సూత్రాలను పాటించడం లేదు’ -
అలెక్సా.. ఓపెన్ అపోలో!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ హాస్పిటల్ చెయిన్ అపోలో గ్రూప్ వాయిస్ ఆధారిత యాప్ ‘అమెజాన్ అలెక్సా స్కిల్– ఆస్క్ అపోలో’ను ఆవిష్కరించింది. దీంతో వాయిస్ కమాండ్‌తో దగ్గర్లోని అపోలో ఆసుపత్రులు, క్లినిక్స్, ఫార్మసీల వివరాలు తెలుసుకోవచ్చని, డాక్టర్ల అపాయింట్మెంట్ తీసుకోవచ్చని అపోలో గ్రూప్ ప్రకటన తెలిపింది. దేశవ్యాప్తంగా 72 అపోలో ఆసుపత్రులు, 5 వేల మంది వైద్యులు, 3,500 ఫార్మసీలు, 90 క్లినిక్స్, 15 డయాగ్నోస్టిక్ సెంటర్లు, 110 టెలిమెడిసిన్ సెంటర్లు, 15 మెడికల్ ఎడ్యుకేషన్ సెంటర్లు ఈ యాప్‌తో అనుసంధానమై ఉన్నట్లు సంస్థ జాయింట్ ఎండీ సంగీతా రెడ్డి తెలిపారు. -
సందడిగా అపోలో కేన్సర్ కాంక్లేవ్ సదస్సు
-
జెట్ రేసులో ఇండిగో!
న్యూఢిల్లీ: జెట్ ఎయిర్వేస్కు మళ్లీ మంచి రోజులు వచ్చేట్టున్నాయి. రుణాలు తీర్చలేక, చేతిలో చిల్లిగవ్వ లేక ఈ సంస్థ కార్యకలాపాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ సంస్థకు రూ.8,000 కోట్లకు పైగా రుణాలు ఇచ్చిన బ్యాంకులు వాటిని వసూలు చేసుకునేందుకు మార్గంగా జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేయడం తెలిసిందే. ఓ పరిష్కార నిపుణుడిని నియమించి, 90 రోజుల్లోపు దీనికి పరిష్కారం కనుగొనాలని ఎన్సీఎల్టీ ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో ఎన్సీఎల్టీ ముంగిటకు చేరిన జెట్ ఎయిర్వేస్పై పలు సంస్థలు ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. దేశీయంగా విమానయానంలో అతిపెద్ద వాటా కలిగిన ఇండిగో దివాలా దశకు చేరిన జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకోవాలన్న ఆలోచనతో ఉంది. ఇందుకోసం ప్రైవేటు ఈక్విటీ సంస్థ టీపీజీ క్యాపిటల్‌తో కలసి దివాలా చట్టం (ఐబీసీ) కింద జెట్ఎయిర్వేస్కు బిడ్ వేయనున్నట్టు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. అమెరికాకు చెందిన మరో ప్రైవేటు ఈక్విటీ సంస్థ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ సైతం జెట్ కొనుగోలుకు ముందుకొస్తోంది ఆసక్తిగల ఇతర ఇన్వెస్టర్లతో కలసి జెట్ ఎయిర్వేస్కు బిడ్ వేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. సమస్యాత్మక కంపెనీల్లో పెట్టుబడులకు అపోలో గ్లోబల్ ప్రసిద్ధి చెందిన సంస్థ. ఇప్పటికే జెట్ ఎయిర్వేస్ ఉద్యోగుల కన్సార్షియంను సంప్రదించినట్టు తెలిసింది. ఈ సంస్థ నిర్వహణలో 280 బిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నాయి. ప్రాథమిక చర్చలు జరిగాయి... ‘‘ఇండిగో, టీపీజీ క్యాపిటల్ జెట్ ఎయిర్వేస్ పట్ల ఆసక్తిగా ఉన్నాయి. లీడ్ బ్యాంకర్ అయిన ఎస్బీఐతో ఇటీవలే ప్రాథమిక చర్చలు కూడా నిర్వహించాయి. ప్రస్తుతం కొనసాగుతున్న దివాలా ప్రక్రియ కింద ఈ రెండు సంస్థలు సంయుక్తంగా బిడ్ వేసే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. జెట్ ఎయిర్వేస్కు చెందిన దేశీయ, అంతర్జాతీయ స్లాట్లపై ఇండిగో ఆసక్తిగా ఉంది. తద్వారా తన మార్కెట్ వాటాను కాపాడుకోవాలని భావిస్తోంది. జెట్ ప్రివిలేజ్ ప్రైవేటు లిమిటెడ్ (జేపీపీఎల్) పట్ల టీపీజీ క్యాపిటల్ ఎక్కువ ఆసక్తితో ఉంది. ఎందుకంటే జెట్ ఎయిర్‌వేస్‌తో పోలిస్తే జేపీపీఎల్ ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండడమే కాకుండా, గతంలో లాభాలు కూడా చవిచూసింది.స్వతంత్ర సంస్థ అయిన జేపీపీఎల్ దివాలా చర్యల్లో భాగంగా లేకపోవడమే ఉన్న అడ్డంకి. ఈ బిడ్డింగ్ ప్రక్రియలో జేపీపీఎల్ను కూడా భాగం చేయవచ్చా అన్నదానిపై ఎస్బీఐ ఆధ్వర్యంలోని రుణదాతల కన్సార్షియం కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది’’ అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జేపీపీఎల్ అన్నది జెట్ ఎయిర్వేస్ సర్వీసుల్లో తరచుగా ప్రయాణించే వారి కోసం ఉద్దేశించిన లాయల్టీ ప్రోగ్రామ్. 2012లో జెట్ సొంత విభాగంగా ఏర్పాటవ్వగా, 2014లో స్వతంత్ర సంస్థగా మార్చారు. ఆ ఏడాది ఎతిహాద్ ఎయిర్వేస్ 150 మిలియన్ డాలర్లతో 50.1 శాతం వాటా తీసుకుంది. మిగిలిన వాటా జెట్ చేతుల్లో ఉంది. జేపీపీఎల్ విలువ రూ.7,300 కోట్లు ఉంటుందని ఆన్ పాయింట్ లాయల్టీ అనే సంస్థ అంచనా కట్టింది. ఇక, అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ సైతం జెట్ ఎయిర్వేస్ ఉద్యోగుల కన్సార్షియంతో ఇటీవలే సమావేశమైందని, వ్యాల్యూ ఇన్వెస్టర్లుగా జెట్ ఎయిర్వేస్లో మంచి అవకాశం కోసం చూస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జెట్ రుణదాతల కన్సార్షియం ఈ నెల 16న తొలిసారి సమావేశమై చర్చలు కూడా నిర్వహించింది. ఈ వారాంతంలోపు జెట్ ఎయిర్వేస్కు సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణలకు ఆహ్వానం పలకొచ్చని, బిడ్లు వేసేందుకు ఆగస్ట్ మొదటి వారం వరకు గడువు ఇవ్వొచ్చని భావిస్తున్నారు. -
గ్రామాలకు అమెరికా వైద్యం
సాక్షి, సిటీబ్యూరో: దేశంలోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు టెలీమెడిసిన్ ద్వారా సెకండ్ ఒపీనియన్ సేవలు అందించేందుకు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా ఆరిజన్ ముందుకొచ్చింది. హెల్త్‌నెట్ గ్లోబల్ లిమిటెడ్ సాంకేతిక సహకారంతో ఈ సేవలను అందించనుంది. ఈ మేరకు సోమవారం తాజ్‌కృష్ణా హోటల్లో జరిగిన సమావేశంలో అపోలో గ్రూఫ్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్ సంగీతారెడ్డి, అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్‌రెడ్డిలు అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఇప్పటికే అపోలో ఆస్పత్రి హెల్త్‌నెట్ గ్లోబల్ లిమిటెడ్ సాంకేతిక సహకారంతో టెలీమెడిసిన్ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జాబితాలో అమెరికా వైద్యులు చేరడంతో ఈ సేవలకు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. సంక్లిష్టమైన వ్యాధులతో బాధపడుతూ చికిత్సలకు తగ్గని మొండి జబ్బులు, వైద్య పరీక్షలు, వాటి తాలూకు రిపోర్టులను మీసేవా కేంద్రాల ద్వారా గానీ కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా గానీ ఆన్లైన్లో అమెరికాలో ఉన్న వైద్యులకు పంపిస్తారు. వారు రోగి తాలుకూ రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించి, జబ్బుకు కారణాలు, చికిత్సల్లో వైద్యులు అనుసరించాల్సిన పద్ధతులు, వాడాల్సిన మందులను సూచిస్తారు. తద్వారా మారుమూల ప్రాంతాల్లోని రోగులకు సైతం నిపుణుల వైద్య సేవలు పొందే అవకాశం ఉంది. 90 రోజుల్లో ఈ సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి. సెకండ్ ఒపీనియన్ పొందాలని భావించే బాధితులు ముందస్తుగా ఆన్లైన్లో ఆయా వైద్యుల అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. 1982లో స్థాపించిన ఈ అమెరికన్ అసోసియేషన్‌లో ఇప్పటి వరకు 80వేలకుపైగా వైద్యులు, 40వేలకు పైగా వైద్య విద్యార్థులు సభ్యులుగా ఉన్నారు. వీరు దేశంలోని ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ సహా రాజస్థాన్‌లోని మారుమూల ప్రాంతాల్లోని నిరుపేదలకు ఉచితంగా టెలీమెడిసిన్ వైద్యసేవలు అందించనున్నారు. ఇదిలా ఉంటే అపోలో ఆస్క్ టెలీమెడిసిన్ ద్వారా ఇప్పటి వరకు 10 మిలియన్ టెలీమెడిసిన్ సేవలు అందించినట్లు ఆ ఆస్పత్రి డైరెక్టర్ సంగీతారెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. మాతృభూమికి కొంత సేవ చేయాలనే ఆలోచనతోనే వైద్యులు ఈ తరహా సేవలను అందించేందుకు ముందుకు వచ్చారని సురేష్‌రెడ్డి తెలిపారు. టెలీమెడిసిన్ వైద్య సేవల విషయంలో అపోలో–అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా ఆరిజన్ల మధ్య అవగాహాన ఒప్పందం కుదరడం ఒక చారిత్రక దినంగా అభివర్ణించారు. -
అపోలో ‘సొసైటీ క్లినిక్స్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న అపోలో క్లినిక్ భారీ నివాస సముదాయాల్లో సొసైటీ క్లినిక్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ సేవల్లో ఉన్న అప్నా కాంప్లెక్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. హైదరాబాద్ సహా బెంగళూరు, పుణే, చెన్నైలో వీటిని నెలకొల్పుతారు. ఈ క్లినిక్స్‌లో వైద్యుల కన్సల్టేషన్, రక్తపరీక్షల కోసం నమూనాల సేకరణ, హెల్త్ చెక్ ప్యాక్స్, ప్రాథమిక వైద్య పరీక్షలు, వైద్య చికిత్సలు, వ్యాక్సినేషన్ సేవలు అందుబాటులో ఉంటాయి. మూడేళ్లలో హైదరాబాద్‌లో ఇటువంటి కేంద్రాలు 75 దాకా ఏర్పాటు చేస్తామని అపోలో క్లినిక్ సీవోవో ఆనంద్ వెల్లడించారు. మరో ఎనిమిది నగరాలకు విస్తరించడం ద్వారా 2021 నాటికి 500 కేంద్రాల స్థాయికి తీసుకువెళతామని చెప్పారు. -
మాతా శిశు మరణాల రేటు తగ్గించాలి
సాక్షి, హైదరాబాద్: దేశంలో నమోదవుతున్న మాతా శిశు మరణాలపై అపోలో క్రెడిల్స్ జాతీయ సదస్సు–2018 ఆందోళన వ్యక్తం చేసింది. అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ..ఇప్పటికీ మాతా శిశు మరణాలు వెలుగు చూస్తుండటంపై విస్మయం వ్యక్తం చేసింది. ఈ మరణాల రేటును మరింత తగ్గించాల్సిన ఆవశ్యకత నేటితరం వైద్యులపై ఉందని పేర్కొంది. అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు పార్క్ హయత్ హోటల్లో జరిగే ఈ సదస్సును అపోలో గ్రూప్ సంస్థల చైర్మన్ డాక్టర్ ప్రతాప్.సి.రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మాతా శిశు సంరక్షణ కోసం మరింత కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జాతీయ కుటుంబ సంక్షేమ శాఖ నివేదిక ప్రకారం దేశంలో మెటర్నల్ మోర్టాలిటీ రేట్ (ఎంఎంఆర్) పెద్ద సమస్యగా ఉందన్నారు. 2005–06లో ప్రతీ వెయ్యిమంది తల్లుల్లో 335 మంది ప్రసవ సమయంలో మరణించారని, ఈ మరణాల రేటు 2014–15 నాటికి 135కు తగ్గిందని ఆయన వెల్లడించారు. ఆస్పత్రి ప్రసవాల సంఖ్య పెరగడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. గతంలో 26%గా ఉన్న ఆస్పత్రి ప్రసవాలు ప్రస్తుతం 81 శాతానికి పెరిగినా మరణాల రేటు ఇంకా కొనసాగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. మరణాల రేటు 70కు తగ్గించాలి 2030 నాటికి ప్రసవ సమయంలో తల్లుల మరణాల సంఖ్యను 70కు తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ప్రతాప్.సి.రెడ్డి తెలిపారు. ప్రపంచ సగటు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు (ఐఎంఆర్)12 ఉండగా, దేశంలో 2017 నాటికి పుట్టిన ప్రతీ వెయ్యి మంది శిశువులకు 32 శిశువులు చనిపోతున్నారని తెలిపారు. ఇందులో నెలలోపు శిశువుల్లో 24 మంది మృతి చెందుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. 2030 నాటికి 70% మాతా శిశు మరణాలకు దీర్ఘకాలిక రోగాలు కారణమవుతాయని, రాబోయే రోజుల్లో వీటి నుంచి భారీ ప్రమాదాన్ని పొంచి ఉందని హెచ్చరించారు. ఈ సదస్సుకు అపోలో గ్రూప్ వైస్‌చైర్ పర్సన్ శోభన కామినేని, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి, మెడికల్ డైరెక్టర్ అనుపమ్ సిబల్, ఓబీఎస్‌హెచ్ వైస్ చైర్మన్ డాక్టర్ మహితారెడ్డి, పీఏటీఎస్ అధ్యక్షురాలు డాక్టర్ హిమబిందు, ఎన్ఎన్ఎఫ్ అధ్యక్షుడు డాక్టర్ బల్దేవ్ భాటియా, డాక్టర్ సియంగ్ లిన్‌టాన్, డాక్టర్ వైఎస్ యంగ్, డాక్టర్ శైలేశ్ కుమార్, సహా వివిధ రాష్ట్రాలకు చెందిన 600 మంది గైనకాలజీ, పీడియాట్రిక్ వైద్యనిపుణులు హాజరయ్యారు. -
అపోలో లాభం 43% డౌన్
న్యూఢిల్లీ: అపోలో హాస్పిటల్స్ నికర లాభం జనవరి–మార్చి త్రైమాసిక కాలంలో 43 శాతం తగ్గింది. 2016–17 క్యూ4లో రూ.62 కోట్లుగా ఉన్న నికర లాభం (కన్సాలిడేటెడ్) ఈ సారి రూ.36 కోట్లకు తగ్గినట్లు అపోలో హాస్పిటల్స్ తెలిపింది. ఆదాయం రూ.1,857 కోట్ల నుంచి 14 శాతం వృద్ధితో రూ.2,111 కోట్లకు పెరిగిందని సంస్థ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. రూ.5 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.5 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని చెప్పారు. ‘‘స్టాండ్ ఆలోన్ ప్రాతిపదికన చూస్తే, కంపెనీ నికర లాభం 24 శాతం పెరిగింది. 2017–18లో క్యూ4లో ఇది 60 కోట్లు కాగా... అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో రూ.48 కోట్లే. మొత్తం ఆదాయం రూ.1,625 కోట్ల నుంచి 15 శాతం వృద్ధితో రూ.1,863 కోట్లకు చేరింది’’ అని వివరించారు. మొత్తం వ్యయాలు 13 శాతం పెరిగి రూ.1,785 కోట్లకు చేరాయన్నారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.216 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 46 శాతం తగ్గి రూ.117 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ.7,256 కోట్ల నుంచి 14 శాతం వృద్ధితో రూ.8,243 కోట్లకు పెరిగింది. బాధ్యతాయుత ఆరోగ్య సంరక్షణ సంస్థగా తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నామని ఫలితాల వెల్లడి సందర్భంగా ప్రతాప్ రెడ్డి చెప్పారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో అపోలో హాస్పిటల్స్ షేరు 2 శాతం నష్టంతో రూ.984 వద్ద ముగిసింది. -
అపోలో మైక్రో సిస్టమ్స్ లిస్టింగ్ అదరహో..!
న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన అపోలో మైక్రో సిస్టమ్స్ కంపెనీ స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లో మెరుపులు మెరిపించింది. ఈ కంపెనీ షేరు బీఎస్ఈలో ఇష్యూ ధర రూ.275తో పోలిస్తే 74 శాతం లాభం తో రూ.478 వద్ద లిస్టయింది. ఇష్యూ ధరతో పోలిస్తే 65 శాతం లాభంతో రూ.454 వద్దముగిసింది. ఇంట్రాడేలో రూ.480 గరిష్ట స్థాయిని తాకింది. ఎన్ఎస్ఈలో రూ.465 వద్ద లిస్టయిన ఈ షేర్ ఇంట్రాడేలో రూ.480 గరిష్ట స్థాయిని తాకి చివరకు రూ.442 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 1.7 లక్షలు, ఎన్ఎస్ఈలో 10.38 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. -
శ్వాస తీసుకోలేని స్థితిలో ఆస్పత్రికి జయ!
సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనేక అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆమె మృతి విషయంలో తాజాగా అపోలో ఆస్పత్రి టాప్ అధికారిపలు కీలక విషయాలు వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబర్ 22న జయలలితను అపోలో ఆస్పత్రికి తీసుకొచ్చారని, ఆమె అప్పుడు శ్వాస తీసుకోలేనిస్థితిలో ఉన్నారని అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ ప్రీతారెడ్డి తెలిపారు. అన్నాడీఎంకే అధినేత్రి అయిన జయలలిత 75రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రాణాలొదిలిన సంగతి తెలిసిందే. ‘శ్వాస తీసుకోలేని స్థితిలో ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమె కోలుకునేందుకు అవసరమైన చికిత్సను అందించాం’ అని ప్రీతారెడ్డి ఢిల్లీలో ఓ తమిళ చానెల్‌కు తెలిపారు. ‘అయితే, చివర్లో అందరికి ఆశలకు భిన్నమైన ఫలితం వచ్చింది. అయినా అది విధి చేతుల్లో ఉంటుందని, ఆ విషయంలో ఎవ్వరం ఏమి చేయలేమని నేను భావిస్తాను’ అని ఆమె అన్నారు. జయలలిత మృతి పట్ల వస్తున్న అనుమానాలు, వివాదాలపై స్పందిస్తూ..ఢిల్లీ, ఎయిమ్స్, విదేశాలకు చెందిన ఉత్తమ వైద్యులతో జయలలితకు చికిత్స అందించామని, అపోలో ఆస్పత్రి ఉత్తమ చికిత్స అందించిందని చెప్పారు. ప్రస్తుతం ఈ విషయమై విచారణ కొనసాగుతోందని, పూర్తి సమాచారాన్ని విచారించిన తర్వాత మిస్టరీ వీడిపోతుందని ఆమె అన్నారు. రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఏ అరుముగస్వామి నేతృత్వంలో జయలలిత మృతిపై అనుమానాల నివృత్తికి ఎంక్వైరీ కమిషన్‌ను తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంగతి తెలిసింది. జయలలితకు చికిత్స అందిస్తున్న సమయంలో ఆమె పక్కన ఆమె ఆమోదించిన వ్యక్తులు, అవసరమైన వైద్యులు, నర్సులు ఉన్నారని తెలిపారు. ఆస్పత్రిలో జయలలిత వేలిముద్రలు తీసుకున్న విషయంలో ఆమెకు తెలుసా? అన్న ప్రశ్నకు తాను ఆమె పక్కన లేనందున సమాధానం చెప్పలేనని అన్నారు. అప్పటి ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థుల ఖరారు కోసం జయలలిత వేలిముద్రలను సేకరించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. -
పేదలకు చేరువగా ఆధునిక వైద్యం..
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక వైద్యాన్ని నిరుపేదలకు చేరువ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అపోలో గ్రూఫ్ ఆఫ్ హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి అన్నారు. టెలీ మెడిసిన్ ద్వారా అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చని చెప్పారు. ఈ నెల 28 నుంచి హైదరాబాద్ వేదికగా జరగనున్న జీఈఎస్‌లో మాట్లాడే అవకాశం ఆమెకు లభించిన విషయం తెలిసిందే. ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ రంగంలో విశేష కృషి చేయడమే కాకుండా, 140 దేశాల్లో 50 మిలియన్ల మందిని ప్రభావితం చేయగలిగే స్థాయికి అపోలో గ్రూప్‌ను తీసుకెళ్లిన ఆమె సదస్సులో మాట్లాడబోయే అంశాలను శుక్రవారం ‘సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు ఆమె మాటల్లోనే.. ‘నా ప్రసంగంలో ప్రజావైద్యం బలోపేతం... ఔషధ పారిశ్రామిక రంగం విస్తరణ వంటి అంశాలే కీలకంగా ఉంటాయి. టెలీమెడిసిన్ ద్వారా మారుమూల ప్రాంతాల్లోని రోగులకు సూపర్ స్పెషాలిటీ సేవలు ఎలా అందించవచ్చు. ఆపదలో ఉన్న రోగిని ఎలా కాపాడవచ్చు.. తక్కువ ధరకు అధునాతన వైద్యసేవలు ఎలా అందించవచ్చు.. వైద్య రంగం అవసరాలు.. ఔషధ కంపెనీల ఉత్పత్తులు, ప్రస్తుత మార్కెటింగ్.. వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తా. ప్రభుత్వ పరంగా ఆయా ఆస్పత్రుల్లో నమోదవుతున్న వ్యాధుల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసి, విశ్లేషించడంతో వచ్చిన ఫలితాల ఆధారంగా చికిత్స అందించే అవకాశం ఉంది. ఆరోగ్య రాజధానిగా గుర్తింపు పొందిన హైదరాబాద్ అనేక ఔషధ కంపెనీలకు కేంద్రంగా మారింది. తక్కువ ధరకే మెరుగైన వైద్యసేవలు అందుతుండటంతో విదేశీ రోగులు కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ తయారైన మందులు విదేశాలకు సరఫరా చేస్తున్నారు. కానీ వ్యాధి నిర్ధారణలో కీలకంగా మారిన ఎంఆర్ఐ, సీటీ స్కాన్ వంటి వైద్య పరికరాలను మాత్రం ఎక్కువ ధర చెల్లించి విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఆస్పత్రులు ఈ ఖర్చులను రోగులపై రుద్దుతున్నాయి. అదే కంపెనీ తమ ఉత్పత్తులను స్థానికంగా కొనసాగిస్తే.. రవాణా, ఇతర చార్జీలు తగ్గే అవకాశం ఉంది. తద్వారా రోగులకు తక్కువ ధరకే మెరుగైన వైద్యసేవలు అందించే అవకాశం లభిస్తుంది. ప్రపంచ పారిశ్రామిక సదస్సులో ఈ అంశాలను ప్రధానంగా వివరించి, పారిశ్రామిక వేత్తల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తా’అని సంగీతారెడ్డి చెప్పారు. -
సీఎం ఆరోగ్య కేంద్రాల అవినీతిపై విచారణ!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల ముసుగులో జరుగుతున్న అవినీతి తుట్టె కదిలింది. కార్పొరేట్ సంస్థలకు రూ.కోట్లు ౖకైంకర్యం అవుతున్న తీరుపై పలువురు ప్రైవేటు వ్యక్తులు కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ)కు ఫిర్యాదులు చేశారు. స్పందించిన సీవీసీ తాజాగా వీటిపై విచారణకు ఆదేశించింది. రాష్ట్రంలో మున్సిపాలిటీల పరిధిలో 222 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను కొద్ది నెలల కిందట ఏర్పాటు చేశారు. మొత్తం మూడు జోన్లుగా విభజించి అపోలో సంస్థకు రెండు జోన్లు, ధనుష్–ఈ వైద్య కన్సార్టియం సంస్థకు ఒక జోన్ కేటాయించారు. ఒక్కో కేంద్రానికి సగటున నెలకు రూ. 4.08 లక్షలను జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి చెల్లిస్తున్నారు. కానీ వీటి సేవలు సక్రమంగా అందడం లేదు. టెండర్లలో కూడా పలు అవకతవకలు జరిగాయి. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు అనుచరుడిగా చెప్పుకుంటున్న ఈ–వైద్య సంస్థ ప్రతినిధి కోసం ఏకంగా మూడు దఫాలు టెండర్లు రద్దు చేసి మళ్లీ నిర్వహించినట్టు అప్పట్లో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై కొందరు వ్యక్తులు సీవీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీవీసీ విచారణకు ఆదేశించింది. నెలరోజుల్లోగా ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించింది. ఉపరాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆదేశాలు కేంద్ర విజిలెన్స్ కమిషన్‌తో పాటు ఉప రాష్ట్రపతి కార్యాలయానికి కూడా ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలపై ఫిర్యాదులు వెళ్లాయి. వీటిపై స్పందించిన ఉపరాష్ట్రపతి కార్యాలయం.. ఫిర్యాదుదారులకు ప్రత్యుత్తర సమాచారం పంపింది. అంతేగాకుండా దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
కిడ్నీకి రూ.కోటి!
సాక్షి, హైదరాబాద్ : అవయవాలు ఖరీదు చేస్తామం టూ ఓ నైజీరియన్ సైబర్ నేరగాడు ఎరవేసి అందినకాడికి కాజేశాడు. అపోలో హాస్పిటల్స్ 220 ఎట్ జీమెయిల్.కామ్ పేరుతో ఈ–మెయిల్ ఐడీ క్రియేట్ చేశాడు. ఫేస్బుక్లో ఖాతా తెరిచాడు. బోగస్ ధ్రువీకరణలతో కొన్ని సిమ్‌కార్డులు సైతం తీసుకుని వీటి ఆధారంగా వాట్సాప్ ఖాతాలు కూడా తెరిచాడు. ఈ మేరకు మానవ అవయవాలు కొంటామంటూ వివిధ సోషల్‌మీడియాల్లో ప్రకటన లు ఇచ్చాడు. వీటికి ఆకర్షితులై సంప్రదించినవారి తో చాటింగ్ చేస్తూ బేరసారాలు చేశాడు. తాను విదేశంలో ఉన్నానని, కిడ్నీ గరిష్టంగా రూ.కోటి వెచ్చించి ఖరీదు చేస్తానని, ఇతర వ్యవహారాలను మొత్తం తానే పర్యవేక్షిస్తానంటూ నమ్మించేవాడు. రేటు ఖరారైన తర్వాత సదరు నేరగాడు నగదుతో ఇతర దేశం నుంచి బయలుదేరుతున్నట్లు సమాచా రమిస్తాడు. ఆ తర్వాత షరామామూలే. ఒకటి, రెండు రోజులకు విమానాశ్రయం నుంచి కస్టమ్స్ అధికారులమంటూ ‘విక్రేత’కు ఫోన్ వస్తుంది. పలానా వ్యక్తి పలానా దేశం నుంచి భారీ మొత్తంతో వచ్చి తమ విమానాశ్రయంలో దిగాడని, అంత డబ్బుతో ఎయిర్పోర్ట్ దాటి బయటకు రావాలంటే వివిధ రకాలైన పన్నులు చెల్లించాల్సి ఉంటుందని చెబుతారు. దీని కోసం కొన్ని బ్యాంకు ఖాతాల వివరాలు అందించి కస్టమ్స్, యాంటీ టెర్రర్ ట్యాక్స్‌ల పేరుతో డిపాజిట్ చేయించుకుని స్వాహా చేస్తున్నారు. అసలే ఆర్థిక సమస్యలు/అవస రాల్లో ఉండి తమ అవయవాలు సైతం అమ్ముకునేందుకు సిద్ధమైన బాధితులు ఈ మోసాలతో మరింత కుదే లవుతున్నారు. తమ ఆస్పత్రి పేరుతో ఓ ఐడీ సృష్టించిన కొందరు అవయవాల కొనుగోలు పేరుతో దందా ప్రారంభించారని, దీనిపై చర్యలు తీసుకోవాలని అపోలో ఆస్పత్రి యాజమాన్యం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సాంకేతిక ఆధారాలను బట్టి దర్యాప్తు చేపట్టిన పోలీసులు బెంగళూరు కేంద్రంగా ఓ వ్యక్తి ఈ దందా చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు ఓ ప్రత్యేక బృందం అక్కడకు వెళ్లగా, ఆ నేరగాడు నైజీరియన్ అని తేలింది. అతడు ఇటీవలే తమ దేశానికి వెళ్లిపోయినట్లు తెలిసింది. అతడు ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తితో బేరసారాలు చేశాడని బయటప డింది. అతడి కిడ్నీని రూ.కోటికి ఖరీదు చేస్తానం టూ చెప్పి.. ఎయిర్పోర్ట్ కథ నడిపి రూ.30 లక్షలు స్వాహా చేశాడని సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తిం చారు. దీనిపై ఆ జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. -
అపోలోలో అరుదైన చికిత్స
ఛాతీపై కత్తిగాటు లేకుండానే గుండెవాల్వ్ రీప్లేస్మెంట్ - 80 ఏళ్ల వృద్ధుడికి విజయవంతంగా చికిత్స - దేశంలోనే ఈ తరహా చికిత్స తొలిదని వైద్యుల వెల్లడి సాక్షి, హైదరాబాద్: కొంతకాలంగా హృద్రోగ సమస్యతో బాధపడుతున్న 80 ఏళ్ల వృద్ధునికి ఛాతీపై కత్తిగాటు పెట్టకుండా గుండె వాల్వ్‌ను విజయవంతంగా మార్చారు హైదరాబాద్‌లోని హైదర్‌గూడ అపోలో ఆస్పత్రి వైద్యులు. చికిత్స తర్వాత రెండో రోజే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. సోమవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ సూర్యప్రకాశ్‌రావు,డాక్టర్ పీఎస్ఎన్ కపర్థి, డాక్టర్ శ్రీవాస్తవ్, డాక్టర్ విశ్వనాథ్, డాక్టర్ కాంతిలాల్ షా, డాక్టర్ సత్యజిత్ మహేత్రి, సీటీ సర్జన్ డాక్టర్ వెంకట్‌రెడ్డి, అనస్తీషియన్ డాక్టర్ శ్యామ్ చికిత్సవివరాలను వెల్లడించా రు. హైదరాబాద్ గాంధీనగర్‌కు చెందిన ప్రభాకర్ కొంత కాలంగా తీవ్ర హృద్రోగ సమస్యతో బాధపడుతున్నాడు. ఇటీవల ఆయనకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో హైదర్‌గూడ అపోలోలో చేర్పించారు. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ సూర్యప్రకాశ్‌రావు నేతృత్వంలోని వైద్య బృందం ఆయన్ను పరీక్షించింది. కాల్స్పిక్స్టేనోసిస్ బైకస్పిడ్ అరోటిక్ వాల్వ్(కాల్షియంతో నిండిన బృహద్ధ మని గుండె కవాటం గట్టిపడి కుంచించుకుపోవడం)వంటి సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అప్పటికే ఒక సారి బైపాస్ సర్జరీ చేయడం, వయసు పైబడటం, కిడ్నీ, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో బాధపడుతుండ టంతో మళ్లీ సర్జరీ చేయడం ఆయన ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదని భావించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞా నం ‘పర్క్యుటినియస్ టెక్నిక్’(సూదితో తొడ భాగంలో రంధ్రం చేయడం ద్వారా) సాయంతో బాధితుడికి విజయవంతంగా ఆరోటిక్ వాల్వ్‌ను మార్చారు. తక్కువ కోత, మత్తు మందును ఉపయోగించి చికిత్స చేశామన్నారు. ఈ తరహా చికిత్స దేశంలోనే తొలిదని కపర్థి వెల్లడించారు. -
జీఎస్టీపై కొత్త డిమాండ్లు
♦ రైల్వే, రోడ్లను మినహాయించాలన్న అసోచామ్ ♦ వైద్యం ఖరీదవుతుంది: అపోలో ♦ భారం కానున్న ఆర్థిక సేవలు న్యూఢిల్లీ: జీఎస్టీ అమలుకు గడువు మరో పది రోజులే మిగిలి ఉండగా, కొత్త డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. రోడ్లు, రైల్వేలను తప్పనిసరిగా జీఎస్టీ నుంచి మినహాయించాలని అసోచామ్ తాజాగా కేంద్రాన్ని కోరింది. ఈ విభాగాల్లో ప్రాజెక్టులు ఫలితాలనిచ్చేందుకు సుదీర్ఘ సమయం తీసుకోవడంతోపాటు, ప్రతికూల రాబడుల నేపథ్యంలో మినహాయింపు అవసరమని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖకు ఓ ప్రతిపాదన పంపింది. ప్రస్తుత ప్రాజెక్టులకు మినహాయింపులు ఎత్తివేయడం వల్ల వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవేళ ప్రస్తుతమున్న మినహాయింపులను ఎత్తివేసేట్టు అయితే జీఎస్టీలో కాంట్రాక్టు విలువపై జీరో రేటింగ్ వంటి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాలని అభ్యర్థించింది. దీనివల్ల మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై అదనపు పన్ను భారం పడకుండా ఉంటుందని వివరించింది. ‘‘ప్రస్తుతం రహదారులపై ప్రయాణికుల నుంచి వసూలు చేసే టోల్‌కు, రహదారుల నిర్మాణం, నిర్వహణకు గాను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) నుంచి అందుకునే కాంట్రాక్టు మొత్తాలపై సేవా పన్ను మినహాయింపు ఉంది. జీఎస్టీలో రహదారులు, వంతెనల సేవలను పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. కానీ, ఈ తరహా మినహాయింపు ఎన్హెచ్ఏఐ నుంచి అందుకునే మొత్తాలపై లేదు’’ అని అసోచామ్ పేర్కొంది. ఆరోగ్య సేవలపై పన్ను భారం: ప్రతాప్ సి రెడ్డి జీఎస్టీ కారణంగా ఆరోగ్య సంరక్షణ వ్యయాలు పెరిగిపోతాయని అపోలో హాస్పిటల్స్ పేర్కొంది. కొన్ని సేవలు, ఉత్పత్తులపై 15–18 శాతం పన్ను రేటు విధించడమే ఇందుకు కారణమని తెలిపింది. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి మాట్లాడుతూ... ‘‘రెండు శాతం వరకు వ్యయాలు పెరిగితే వాటిని ఆస్పత్రులు సర్దుబాటు చేసుకోగలవు. అంతకు మించితే మాత్రం రోగులే వాటిని భరించాల్సి ఉంటుంది. మాకు జీఎస్టీ లేకపోయినా కొన్ని సేవలు, ఉత్పత్తులు 15–18 శాతం పన్ను పరిధిలో ఉండడం వల్ల భారం పడనుంది’’ అని వివరించారు. క్రెడిట్ కార్డు బిల్లు, ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రియం క్రెడిట్ కార్డు వినియోగదారులు, ఇన్సూరెన్స్ పాలసీదారులు జూలై 1 తర్వాత అదనంగా చెల్లించేందుకు సిద్ధపడాల్సిందే. క్రెడిట్ కార్డ్ బిల్లు, పాలసీ ప్రీమియంలపై ప్రస్తుతం 15 శాతం సర్వీస్ ట్యాక్స్ ఉండగా, జీఎస్టీలో 18 శాతం పన్ను అమలు కానుంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు తమ కస్టమర్లకు అధిక చెల్లింపులపై అలర్ట్ మెస్సేజ్‌లు పంపడాన్ని ప్రారంభించాయి వీటిలో ఎస్బీఐ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు ఉన్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రం టర్మ్ పాలసీ ప్రీమియం, యులిప్ పాలసీల్లో ఫండ్ మేనేజ్మెంట్ చార్జీలపై 18 శాతం పన్ను భారం పడనుందని తన ఖాతాదారులకు పంపిన ఈమెయిల్లో తెలిపింది. ఇక సంప్రదాయ ఎండోమెంట్ పాలసీలపై 1.88 శాతం పన్ను స్థానంలో 2.25 శాతం అమలు కానుంది. అన్ని ఆర్థిక సేవలు, టెలికం సేవలను సైతం 18 శాతం పన్ను పరిధిలో చేర్చిన విషయం తెలిసిందే. ఆటోమొబైల్ రంగానికి కొత్త సవాలు పెద్ద నోట్ల రద్దు, ఆ తర్వాత భారత్స్టేజ్–4 ప్రమాణాల అమలు దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమకు సవాళ్లుగా నిలిచాయి. ఇప్పుడు జీఎస్టీ రూపంలో కొత్త సవాల్ ఎదురుకానుందన్న ఆందోళన నెలకొంది. జీఎస్టీతో తాత్కాలిక విఘాతం ఉంటుందని శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఎండీ ఉమేశ్ రేవంకర్ అన్నారు. కొత్త విధానానికి సర్దుబాటు అయ్యే వరకు వినియోగం తగ్గుముఖం పట్టొచ్చన్నారు. దీనివల్ల కొంత కాలం పాటు రవాణా చార్జీలు, వాణిజ్య వాహనాలపై ప్రభావం ఉంటుందన్నారు. మరోవైపు వాహన రుణాలపై సేవా పన్ను భారం సైతం పడనుంది. లోన్ ప్రాసెసింగ్ చార్జీలపై ప్రస్తుతమున్న 15 శాతం పన్ను జీఎస్టీ అనంతరం 18 శాతం కానుంది. -
గుండెల్లో అమ్మ
► అమ్మ సమాధి వద్ద అశ్రుతర్పణాలు ►గుండు కొట్టించుకున్న 60 మంది అభిమానులు ►66కు పెరిగిన మృతుల సంఖ్య అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తిరిగి రాని లోకాలకు వెళ్లిన వాస్తవాన్ని తమిళనాడు ప్రజలు తట్టుకోలేక పోతున్నారు. బుధవారం నాటికి అమ్మ లేదనే ఆవేదనతో మొత్తం 66 గుండెలు ఆగిపోయారుు. లక్షలాది మంది ప్రజలు బుధవారం మెరీనాబీచ్‌లోని అమ్మ సమాధిని కనులారా చూసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. - సాక్షి ప్రతినిధి, చెన్నై సాక్షి ప్రతినిధి, చెన్నై: స్వల్ప అస్వస్థత మాత్రమే అంటూ సెప్టెంబరు 22వ తేదీన అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అరుున అమ్మ ఈనెల 5వ తేదీన ప్రాణం కోల్పోరుున స్థితిలోనే బైటకు వచ్చారు. ఇదిగో డిశ్చార్జ్...అదిగో ఇంటికి వెళతారు అంటూ ప్రజలు పెంచుకున్న నమ్మకాన్ని వమ్ముచేస్తూ జయలలిత శాశ్వతంగా కన్నుమూసారు. అమ్మను కడసారి చూసుకోవాలనే తలపంపుతో ఈనెల 6వ తేదీన జరిగిన అంతిమ సంస్కారానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. లక్షల సంఖ్యలో ఉన్న జనం మధ్య అమ్మ పార్దివదేహం ఊరేగింపుగా మెరీనా బీచ్ తీరంతోని ఎంజీఆర్ సమాధి వద్దకు చేరుకుంది. ప్రభుత్వ లాంఛనాలతో ఆమె భౌతికకాయాన్ని ఖననం చేశారు. ఈ దృశ్యాలను కొందరు ప్రత్యక్షంగా చూసి కన్నీరుపెట్టగా, మరికొందరు టీవీల్లో వీక్షిస్తూ విలపించారు. అమ్మ లేదనే ఆవేదన మిన్నంటగా మెరీనా బీచ్ తీరం బుధవారం సైతం కన్నీటి సంద్రంగా మారిపోరుుంది. భారీ పోలీసు బందోబస్తు వల్ల అంత్యక్రియల సమయంలో ఆమె ఖనన దృశ్యాలను దగ్గరగా చూడలేక పోరుున వేలాది మంది ప్రజలు మంగళవారం రాత్రి నగరంలోనే ఉండిపోయారు. బుధవారం తెల్లవారుజాము నుండే అమ్మను ఖననం చేసిన చోటును దగ్గరగా తిలకించేందుకు ఎంజీఆర్ సమాధి వద్ద క్యూ కట్టారు. అమ్మకు బుధవారం సైతం అంత్యక్రియలు కొనసాగుతున్నాయా అని భావించే స్థారుులో మెరీనాబీచ్ రోడ్డు జనసంద్రంగా మారిపోరుుంది. వేలాది మంది కార్లు, ద్విచక్రవాహనాల్లో అక్కడికి చేరుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుండి వేలాది మంది చెన్నైకి వచ్చారు. బుధవారం సైతం ఇంత పెద్ద సంఖ్యలో జనం వస్తారని ఊహించని పోలీసులు పెద్ద సంఖ్యలో బీచ్ వద్దకు చేరుకున్నారు. అమ్మ సమాధి చుట్టూ బ్యారికేడ్లను అమర్చి క్యూలైన్లను ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య జయలలిత సమాధిని ప్రజల సందర్శించుకుని శ్రద్దాంజలి ఘటించారు. కొందరు అభిమానులు అమ్మ సమాధి వద్ద కూలబడి గుక్కపట్టి విలపించారు. మరో మహిళ అమ్మ సమాధి చూడగానే సృ్పహతప్పి పడిపోగా 108 అంబులెన్సలో ఆసుపత్రికి తరలించారు. గుండుకొట్టించుకుని నివాళి : ఇదిలా ఉండగా, అండిపట్టి అన్నాడీఎంకే ఎమ్మెల్యే తంగ తమిళ్‌సెల్వన్ నాయకత్వంలో 60 మంది పార్టీ కార్యకర్తలు బుధవారం అమ్మ సమాధి వద్ద గుండుకొట్టించుకుని నివాళులర్పించారు. జయలలిత తమను కన్నతల్లిలా ఆదరించింది, అందుకే కన్నతల్లి ఎలా చేస్తామో అలా ఈ అమ్మకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు మరో అభిమాని తెలిపాడు. ఇలా గుండు కొట్టించుకున్న వారిలో కొందరు మహిళలు కూడా ఉన్నారు. పోచంపల్లిలో అమ్మకు అంత్యక్రియలు : జయలలితపై తమకు అభిమానాన్ని కృష్ణగిరి జిల్లా పోచంపల్లి ప్రజలు ప్రత్యేకంగా చాటుకున్నారు. బంకమట్టితో అమ్మ భౌతికకాయాన్ని పోలిన బొమ్మను తయారు చేసి పాడెపై ఊరేగించి ఖనన సంస్కారాలు చేయడం చూపరులను కంటతడిపెట్టించింది. స్మారక మండపం ఏర్పాట్లు : ఇదిలా ఉండగా, అమ్మను ఖననం చేసిన చోట స్మారక మండపం నిర్మించేందుకు బుధవారం ఏర్పాట్లు ప్రారంభమైనారుు. జయలలిత జీవితంలోని విశేషాలు, ప్రవేశపెట్టిన పధకాలు, ఆమె వినియోగించిన వస్తువులు ఇలా అనేక ఆకర్షణీయమైన అంశాలతో స్మారక మండపాన్ని తీర్చిదిద్దనున్నట్లు సమాచారం. 66కు పెరిగిన మృతుల సంఖ్య : అమ్మ మృతి చెందిన వార్తను తట్టుకోలేక మృతి చెందిన వారి సంఖ్య బుధవారానికి 66 కు చేరుకుంది. మంగళవారం సాయంత్రానికి 61 మంది చనిపోగా బుధవారం మరో ఐదు మంది ప్రాణాలు విడిచారు. -
అమ్మ మాట
► మైక్‌లో మాట్లాడిన ముఖ్యమంత్రి జయ ► డిశ్చార్జ్ ఆమె అభీష్టమే ► అపోలో ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి సాక్షి ప్రతినిధి, చెన్నై: ముఖ్యమంత్రి జయలలిత మైక్ సహాయంతో కొద్దిసేపు మాట్లాడారని, ఆమె ఆరోగ్యం సాధారణస్థితికి చేరుకుందని అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి తెలిపారు. అనారోగ్య కారణాలతో సెప్టెంబర్ 22వ తేదీ అర్ధరాత్రి అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలితకు దేశ, విదేశీ వైద్యులు సుమారు రెండు నెలలపాటు చికిత్సను అందించారు. ఆమె ఆస్పత్రిలో చేరి శుక్రవారానికి 64 రోజులు పూర్తరుుంది. ముఖ్యమంత్రి బాగా కోలుకున్నట్లు రెండువారాల క్రితమే అపోలో అధినేత ప్రతాప్ సీ రెడ్డి ప్రకటించారు. అవయవదానంపై అపోలో ఆస్పత్రి శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఫిజియోథెరపీ వల్ల ముఖ్యమంత్రి సహజస్థితికి చేరుకున్నారని చెప్పారు. మైక్ సహాయంతో కొద్ది నిమిషాలు ఆమె మాట్లాడారని, 90 శాతం వరకూ ఆమె సహజసిద్ధంగా శ్వాస తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అపోలో ఆస్పత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ కావాలని ముఖ్యమంత్రి మనస్సులో ఉందో తెలుసుకునేందుకు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నామని తెలిపారు. డిశ్చార్జ్ ఎప్పుడనేది ఆమె అభీష్టమని, ఎప్పుడైనా ఇంటికి వెళ్లవచ్చని ఆయన తెలియజేశారు. -
ఎదురుచూపులు
► సీఎం జయ డిశ్చార్జ్‌కు సిద్ధం ► 27వ తేదీలోగా ప్రకటన 33 రోజులుగా చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయలలిత త్వరలో డిశ్చార్జ్ కానున్నారని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇందుకు సన్నాహాలు సాగుతున్నట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి,చెన్నై: జ్వరం, డీహైడ్రేషన్ బారినపడి ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో చేరార ంటూ గత నెల 23వ తేదీన అపోలో హెల్త్‌బులెటిన్ విడుదల చేసింది. స్వల్ప అనారోగ్యమేనని, రెండు మూడు రోజుల్లో ఆమె ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకుంటారని అందరూ భావించారు. అయితే ఇప్పట్లో డిశ్చార్జ్ కారని, సుదీర్ఘకాలం ఆసుపత్రిలో ఉంటూ చికిత్సలు పొందాల్సి ఉంటుందని బులెటిన్ స్పష్టం చేయడంతో అన్నాడీఎంకే శ్రేణులు నిరాశకు లోనయ్యారు. స్వల్ప అనారోగ్యం అంటూనే లండన్ నుంచి అంతర్జాతీయ వైద్యనిపుణుడు డాక్టర్ రిచర్డ్‌ను, ఢిల్లీ నుంచి ఎయిమ్స్ వైద్యులను, సింగపూర్ నుంచి మహిళా ఫిజియోథెరపిస్టులను వరుసగా రప్పించడం అన్నాడీఎంకే శ్రేణులను ఆందోళన కలిగించింది. సీఎం ఆరోగ్యం కుదుటపడాలని కోరుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రార్థనలు, ప్రత్యేక పూజలు, హోమాలు ప్రారంభమైనాయి. ఈ ప్రార్థనలు ఫలించాయా అన్నట్లుగా సీఎం క్రమేణా కోలుకున్నారు. శ్వాసకోశ ఇబ్బందులను దాటుకుని స్వేచ్ఛగా శ్వాస పీల్చడంతోపాటు, తానే స్వయంగా ఆహారం తీసుకుంటున్నట్లు అపోలో వైద్యులు చెబుతున్నారు. ఆమె ఆరోగ్యం దాదాపు సాధారణ స్థితికి వచ్చినట్లు తేలడంతో డిశ్చార్జ్ చేయాలని వైద్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే ముఖ్యనేతలంతా అపోలో ఆసుపత్రి వద్దనే గడుపుతున్నందున వారంతా దీపావళి పండుగకు దూరం అవుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని సీఎం జయలలిత సైతం దీపావళి పండుగలోగా ఇంటికి చేరుకోవాలని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరో రెండు, మూడు రోజుల్లో సీఎం డిశ్చార్జ్ అవుతారని తెలుస్తుండగా ఇందుకు సంబంధించి ఈనెల 27వ తేదీలోగా ఒక ప్రకటన విడుదల కాగలదని అంచనా వేస్తున్నారు. అంతేగాక అమ్మ డిశ్చార్జ్ కోసం అటు వైద్యులు, ఇటు పార్టీ శ్రేణులు సన్నాహాలు సాగిస్తున్నట్లు సమాచారం. అధికారులకు హైకోర్టు ఆదేశం: సీఎం జయలలిత చికిత్స పొందడాన్ని అడ్డుపెట్టుకుని డీఎంకే నేతల ఫేస్బుక్, ట్విట్టర్లను హాక్ చేయరాదని మద్రాసు హైకోర్టు పోలీసు శాఖను ఆదేశించింది. డీఎంకే నేతల హక్కులను కాలరాచే విధంగా పోలీసు యంత్రాంగం వ్యవహరిస్తోందని, అమ్మ వదంతులు అంటూ అరెస్టులకు పాల్పడుతోందని పొల్లాచ్చికి చెందిన నవనీత కృష్ణన్ అనే డీఎంకే నేత మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం కోర్టు ముందుకు విచారణకు వచ్చింది. ముఖ్యమంత్రి జయలలిత పరువుకు భంగం కలిగించే విధంగా వ్యవహరించబోమని డీఎంకే ఇచ్చిన హామీని రికార్డు చేసుకుంటున్నామని న్యాయమూర్తి రాజేంద్రన్ తెలిపారు. కొన్ని నిబంధనలకు లోబడి ఫేస్బుక్, ట్విట్టర్లలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ప్రజలకు ఉందని ఆయన అన్నారు. డీఎంకే నేతల ట్విట్టర్, ఫేస్‌బుక్‌లను హాక్ చేయడం సరికాదని అన్నారు. సీఎం గురించి డీఎంకే తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తీసుకోవచ్చు కాబట్టి, ఈ కేసు విచారణను ఇంతటితో ముగిస్తున్నామని న్యాయమూర్తి తెలిపారు. అమ్మ కోలుకోవాలని ప్రార్థిస్తూ అనేక ఆలయాల్లో ప్రత్యేక పూజలు, మృత్యుంజయ హోమాలు జరిగాయి. -
అప్పుడు జయ.. ఇప్పుడామె వారసులు!
తమిళనాడులో రాజకీయ చరిత్ర పునరావృతం అవుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటిలాగే గతంలోనూ అప్పటి ముఖ్యమంత్రి ఎంజీఆర్ అనారోగ్యంపాలై అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆస్పత్రిలో చేరిన వెంటనే అన్నాడీఎంకే పార్టీలో వర్గ రాజకీయాలు వెలుగులోకి వచ్చాయి. సినీ నిర్మాత, సీనియర్ నాయకుడు ఆర్ఎం వీరప్పన్ నేతృత్వంలోని ఈ వర్గం అప్పట్లో ఆస్పత్రిలో ఉన్న ఎంజీఆర్‌ను కలిసేందుకు జయలలితను అనుమతించలేదు. 1982లో అన్నాడీఎంకేలో చేరిన జయలలిత అతి త్వరలోనే ముఖ్య నాయకురాలిగా పేరుతెచ్చుకున్నారు. ఆమె ఎదుగుదలను ఓర్వలేకపోయిన వీరప్పన్ వర్గం జయలలితను అణచివేసేందుకు ప్రయత్నించింది. జపాన్ నుంచి వచ్చిన వైద్యబృందం ఎంజీఆర్‌కు చికిత్స అందజేస్తున్నట్టు ఆమె పార్టీ తరఫున ప్రకటన కూడా విడుదల చేశారు. కానీ. ఈ ప్రకటనను ఖండించిన అప్పటి పార్టీ ప్రధాన కార్యదర్శి పీయూ షణ్ముగం.. జయలలితకు షోకాజ్ నోటీసులు జారీచేస్తామని హెచ్చరించారు కూడా. ఇదంతా గతం కాగా.. ఇప్పుడు వర్తమానంలోనూ గతంలాంటి పరిస్థితే కనిపిస్తోంది. గత 15 రోజులకుపైగా జయలలిత అదే అపోలో ఆస్పత్రిలో ఉండి చికిత్స పొందుతున్నారు. అదే సమయంలో ఆమె రాజకీయ వారసులు ఎవరనే దానిపై చర్చ జరుగుతోంది. తన రాజకీయ వారసుడిగా ప్రముఖ సినీ నటుడు అజిత్ కుమార్‌ను పేర్కొంటూ జయలలిత వీలునామా రాశారని కథనాలు కూడా వస్తున్నాయి. మరోవైపు జయలలిత రాజకీయ వారసురాలిని నేనేనంటూ ఆమె అన్న కూతురు దీప ముందుకొచ్చారు. జయలలిత సొంత సోదరుడు జయకుమార్, విజయలక్ష్మి దంపతుల కూతురు దీప. ఆమె ఇటీవల అపోలో ఆస్పత్రి వద్ద జయ వారసురాలినంటూ హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, అన్నాడీఎంకే నేతలు జయలలితను కలిసేందుకు దీపను అనుమతించలేదు. దీంతో నిరాశగా వెనుదిరిగిన ఆమె.. జయ వారసత్వం కోసం తనదైన ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కథనాల సంగతి ఎలా ఉన్నా జయలలిత త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు కోరుకుంటున్నారు. -
జయ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అపోలో అసుపత్రి గురువారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇందులో జయ ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని, అయితే మరికొన్ని రోజులు ఆమె వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని తెలిపారు. ఎయిమ్స్ వైద్యులతో పాటు అపోలో బృందం ముఖ్యమంత్రికి చికిత్స అందిస్తున్నట్లు అపోలో వర్గాలు తెలిపాయి. జయకు చికిత్స అందిస్తున్న వైద్యుల వివరాలతో పాటు పలు విషయాలను హెల్త్ బులెటిన్‌లో అపోలో వర్గాలు వెల్లడించాయి. ఆమెకు రెస్పిరేటరీ(శ్వాసక్రియ) సపోర్ట్‌తో పాటు.. అవసరమైన యాంటీబయాటిక్స్ అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. కార్డియాలజిస్టులు, రెస్పిరేటరీ ఫిజిషియన్స్‌తో పాటు డయబెటాలజిస్ట్‌లు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. సీఎంకు అందిస్తున్న చికిత్సపై ఎయిమ్స్ కు చెందిన వైద్య నిపుణుల బృందం కూడా పరీక్షించింది. అమ్మకు మెరుగైన చికిత్స నిమిత్తం ఎయిమ్స్ వైద్య బృందం ఈ నెల 7వ తేదీ వరకూ ఆస్పత్రిలోనే ఉండి పర్యవేక్షించనుంది. గతవారం 30న సీఎం జయకు లండన్ కు చెందిన డాక్టర్ రిచర్డ్ బాలే నేతృత్వంలో చికిత్స అందించిన సంగతి తెలిసిందే. రిచార్డ్ బాలే ఈ రోజు కూడా జయ ఆరోగ్యాన్ని పరీక్షించారు. ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని, అయితే మరికొన్ని రోజులు ఆమె వైద్యుల పర్యవేక్షణలోనే ఉండాలని రిచార్డ్ బాలే తెలిపారు. -
అపోలో చేతికి నంద్యాల అర్బన్ హెల్త్ సెంటర్లు
నంద్యాల రూరల్: అర్బన్ హెల్త్ సెంటర్లకు ప్రభుత్వం మంగళం పాడింది. వాటిని కార్పొరేట్ సంస్థ అపోలోకు అప్పగించింది. దీంతో ఆ సంస్థ యాజమాన్యం శుక్రవారం నంద్యాలలోని వైఎస్సార్‌నగర్, ఆత్మకూరు బస్టాండ్, భీమవరం రోడ్డులోని హరిజనవాడ, ఎంఎస్‌నగర్, దేవనగర్లలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లను స్వాధీనం చేసుకుంది. 2000 సంవత్సరం జూలై 1న 15 వేల మందికి ఒక అర్బన్ హెల్త్‌సెంటర్ చొప్పున ప్రభుత్వం నంద్యాలలో మొత్తం ఐదు సెంటర్లు ఏర్పాటు చేసింది.అప్పటి నుంచి ఇప్పటి వరకు పేదలకు ఉచితంగా వైద్యసేవలు అందిస్తూ వచ్చాయి. అక్టోబర్ 2 నుంచి∙ఈ సెంటర్లు అపోలో క్లీనిక్‌లుగా మారనున్నాయి. ఇప్పటి వరకు హెల్త్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, ఏఎన్ఎంలు, సిబ్బంది తమను అపోలో యాజమాన్యం కొనసాగిస్తుందా లేదా అన్నది తెలియక సతమతమవుతున్నారు. -
కాన్సర్ చికిత్సలో టోమోథెరపీ లాంచ్
హైదరాబాద్: క్యాన్సర్ నివారణ చికిత్సలో అడ్వాన్స్ డ్ `టోమోథెరపీ' ప్రక్రియను ప్రారంభించినట్టు అపోలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రకటించింది. ఈ అధునాతన రేడియేషన్ డెలివరీ సిస్టమ్' ను తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీ రామారావు హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో అధికారికంగా లాంచ్ చేశారు. ఆసుపత్రిలోని ఆంకాలజీ విభాగానికి అనుబంధాన్ని దీన్ని ప్రారంభించారు. క్యాన్సర్ ట్యూమర్ ఆకారాన్ని బట్టి రేడియోధార్మిక మోతాదును ధ్రువీకరించడం ద్వారా ఖచ్చితమైన క్యాన్సర్ చికిత్సకు ఇది అనుమతిస్తుందని వైద్యులు తెలిపారు. ఈ పధ్ధతిలో రొమ్ము, ప్రోస్టేట్, ఊపిరితిత్తుల, మల, మెదడు క్యాన్సర్ కణితులను కచ్చితంగా గుర్తిస్తుందనీ, తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ తో వ్యాధిని నయం చేయవచ్చని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి చెప్పారు. ప్రపంచస్తాయి వైద్యసేవలను అందిస్తామన్న తమ వాగ్దానంలో భాగంగా తరువాతి తరం క్యాన్సర్ చికిత్సా విధానాన్ని ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. ఈ ఆల్ ఇన్ వన్ సిస్టం ఎక్కువ కచ్చితత్వంతో పాటు, ఆరోగ్యకరమైన కణజాలానికి అతి తక్కువ హాని తో రేడియేషన్ చికిత్స అందుతుందని వైద్యులు వివరించారు.ఈ సందర్భంగా ఒలింపిక్స్ రజత పతక విజేత పీసీ సింధు, కోచ్ పుల్లెల గోపీచంద్ లను సన్మానించారు. -
అపోలో చేతికి అర్బన్ హెల్త్ సెంటర్ల తాళాలు
అనంతపురం సిటీ: అపోలో హాస్పిటల్స్ చేతికి అర్బన్ హెల్త్ సెంటర్స్ తాళాలు అప్పగించాలంటూ కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సెంటర్ నుంచి గురువారం ఉత్తర్వులు అందాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి వెంకటరమణ తెలిపారు. దీంతో జిల్లాలోని 19 ఆరోగ్య కేంద్రాలు అపోలో హాస్పిటల్స్ చేతిలోకి వెళ్లిపోనున్నాయి. ఆ సంస్థ ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. రెండు, మూడు రోజుల్లో పూర్తీ వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. -
షష్టిపూర్తి వేడుకలకు హాజరైన చిరంజీవి
దోమకొండ : నిజామాబాద్ జిల్లాలోని దోమకొండ గడీకోటలో శనివారం తన వియ్యంకుడు, అపోలో ఆస్పత్రుల డైరెక్టర్ అయిన కామినేని అనిల్‌కుమార్ షష్టిపూర్తి కార్యక్రమానికి ప్రముఖ సినీనటుడు చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, కుమారుడు రాంచరణ్‌తేజ, ఆయన సతీమణి ఉపాసనలు హాజరయ్యారు. గడీకోటలోని మహదేవుని ఆలయంలో ఉదయం నుంచి షష్టిపూర్తి కార్యక్రమం సందర్భంగా పూజలు నిర్వహించారు. అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, రిటైర్డు ఐఏఏస్ అధికారి కామినేని ఉమాపతిరావ్, తదితరులు అనిల్‌కుమార్ దంపతులను∙దీవించారు. రాత్రి చిరంజీవి డిన్నర్‌కు హాజరై తిరిగి వెళ్లిపోయారు. రాంచరణ్ మాత్రం ఆయన సతీమణితో కలిసి ఇక్కడే ఉన్నారని గడీకోట ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. -
విశాఖలో అపోలో క్యాన్సర్ ఆస్పత్రి
♦ 6 నెలల్లో వైద్య సేవలు అందుబాటులోకి ♦ అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని హెల్త్‌సిటీలో ప్రపంచశ్రేణి ప్రమాణాలతో వంద పడకల క్యాన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నట్టు అపోలో ఆస్పత్రుల గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. మరో ఆరు నెలల్లో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. శుక్రవారం విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగర శివారులోని హెల్త్‌సిటీలో రూ.150 కోట్లతో ఎనిమిది ఎకరాల్లో నిర్మించిన ఆస్పత్రిని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభిస్తారని చెప్పారు. 250 పడకలున్న ఈ ఆస్పత్రిలో ప్రముఖ వైద్య నిపుణులు, అత్యాధునిక వైద్య పరికరాలతో అన్ని స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. భవిష్యత్తులో ఈ ఆస్పత్రిని విస్తరిస్తామన్నారు. గత ఏడాది రికార్డు స్థాయిలో 1.64 లక్షల పల్మనరీ సర్జరీలు చేశామన్నారు. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ 35 దేశాలతో టెలిమెడిసిన్ కనెక్టివిటీ కలిగి ఉందన్నారు. గుండె శస్త్రచికిత్సలు విదేశాల్లో కంటే భారత్‌లోనే తక్కువ ఖర్చుతో అవుతున్నాయన్నారు. గుండె మార్పిడికి అమెరికాలో 6.5 లక్షల డాలర్లవుతుంటే భారత్‌లో 50 వేల డాలర్లకే జరగుతున్నాయని చెప్పారు. అందువల్ల ఇతర దేశాల నుంచి మనదేశానికే ఎక్కువ మంది హృద్రోగ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ చికిత్సలకు వస్తున్నారన్నారు. భారత్‌లో 2030 నాటికి గుండెజబ్బులు, క్యాన్సర్, షుగర్ వంటి అంటుయేతర వ్యాధుల(నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్)తో మరణించే వారి సంఖ్య 3.60 కోట్లకు చేరుకుంటుందని ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. ఇది ఇతర దేశాలతో పోల్చుకుంటే 4 రెట్లు అధికమన్నారు. విలేకరుల సమావేశంలో అపోలో గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ హరిప్రసాద్, సీఈవో డాక్టర్ సందీప్ పాల్గొన్నారు. -
అపోలో మ్యూనిక్‌లో అపోలో హాస్పిటల్స్ వాటాల విక్రయం
♦ 23.3 శాతం వాటాల అమ్మకం ♦ డీల్ విలువ రూ. 163.5 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అపోలో మ్యూనిక్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో తమకున్న 23.3 శాతం వాటాలను జర్మన్ భాగస్వామ్య సంస్థ ‘మ్యూనిక్ రీ’కి విక్రయించనున్నట్లు అపోలో ఎనర్జీ కంపెనీ వెల్లడించింది. ఈ ఒప్పందం విలువ సుమారు రూ. 163.5 కోట్లుగా ఉండనుంది. డీల్ అనంతరం జాయింట్ వెంచర్లో మ్యూనిక్ రీ వాటా 48.7 శాతానికి పెరుగుతుంది. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ వాటా 74.4 శాతం నుంచి 51.1 శాతానికి తగ్గుతుంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో డీల్ పూర్తి కాగలదని అపోలో హాస్పిటల్స్ గ్రూప్‌లో భాగమైన అపోలో ఎనర్జీ కంపెనీ తెలిపింది. ప్రతిపాదిత లావాదేవీ ప్రకారం అపోలో మ్యూనిక్ విలువ రూ. 703 కోట్లుగా ఉండనుంది. అందరికీ వైద్యసేవలు అందుబాటులోకి తేవాలన్న తమ లక్ష్య సాధనకు ఈ డీల్ తోడ్పడగలదని అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి పేర్కొన్నారు. -
ఏటా 1.7 లక్షల రొమ్ము క్యాన్సర్ కేసులు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఏటా కొత్తగా 1.7 లక్షల రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదు అవుతున్నట్లు అసోసియేషన్ ఆఫ్ గైనకాలజిక్ ఆంకాలజిస్ట్ ఆఫ్ ఇండియా(ఏజీఓఐ)- 2015 మూడు రోజుల సదస్సు ప్రకటించింది. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల పట్టణ ప్రాంతాల్లో ప్రతి లక్ష మంది మహిళల్లో 35, గ్రామీణ ప్రాంతాల్లో 8 మంది రొమ్ము క్యాన్సర్‌కు గురవుతున్నట్టు వెల్లడించింది. మహిళల ఆరోగ్యంపై ప్రభుత్వం ఇప్పటికైనా అప్రమత్తంగా వ్యవహరించకపోతే భవిష్యత్తులో ఈ సంఖ్య భారీగా పెరుగుతుందని హెచ్చరించింది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి, అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సంయుక్తాధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సు శుక్రవారం హోటల్ మారియట్‌లో ప్రారంభమైంది. పది మంది అంతర్జాతీయ, 100 మంది జాతీయ ఫ్యాకల్టీలు... గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ శస్త్రచికిత్సల్లో వస్తున్న అధునాతన మార్పలు, మెళకువలను లైవ్ సర్జరీల ద్వారా ఇందులో వివరించారు. 400 మంది వైద్య నిపుణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏజీఓఐసీఓఎన్ ఆర్గనైజింగ్ చైర్మన్ టి.సుబ్రహ్మణ్యేశ్వర్‌రావు, ఏజీఓఐ అధ్యక్షురాలు నీరజాభట్ల, కార్యదర్శి రమాజోషి, స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ క్లినికల్ చీఫ్ శశికాంత్ లేలే మాట్లాడారు. తగ్గిన సర్వైకల్ క్యాన్సర్... గతంతో పోలిస్తే ప్రస్తుతం సర్వైకల్ క్యాన్సర్ తగ్గిందని నిపుణులు అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత శుభ్రతపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించడం, అవగాహన పెరగడం, యుక్త వయసు వచ్చిన తర్వాతే పెళ్లి చేసుకోవడమే ఇందుకు కారణమన్నారు. శరీరాకృతి దెబ్బతింటుందనే అపోహలతో పిల్లలకు పాలివ్వక పోవడంవల్ల అనేక మంది మహిళలు 30 ఏళ్లకే రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే ఈ సంఖ్య అధికంగా ఉందన్నారు. ముందస్తు వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల క్యాన్సర్ నుంచి కాపాడుకోవచ్చన్నారు. జాతీయ టీకాల కార్యక్రమంలో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను చేర్చి బాలికలు భవిష్యత్తులో క్యాన్సర్ బారిన పడకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 30 ఏళ్లు దాటిన ప్రతి మహిళా నెలకోసారి రొమ్ము సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవాలని, మార్పులుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. -
నేడు మందుల దుకాణాలు బంద్
అపోలో, మెడ్‌ప్లస్, ఆసుపత్రుల దుకాణాలు మినహా.. సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో మందుల (మెడిసిన్స్) కొనుగోలు, అమ్మకాలు జరిపే విధానాన్ని నిరసిస్తూ బుధవారం దేశవ్యాప్తంగా 8 లక్షల మందుల దుకాణాలు బంద్ పాటించనున్నాయి. ఈ మేరకు తెలంగాణ కెమిస్ట్, డ్ర గ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటపతి, గౌరవ కార్యదర్శి శ్రీనివాస్, కోశాధికారి మధుసూదన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో మందుల కొనుగోలు అమ్మకాల వల్ల అనేక నష్టాలున్నాయని పేర్కొన్నారు. డాక్టర్‌ను సంప్రదించకుండానే ప్రజలు అపరిమితంగా మందులను వాడే ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న బంద్‌కు సహకరించాలని కోరారు. కాగా, మందుల దుకాణాల బంద్ నేపథ్యంలో ప్రభుత్వ డ్రగ్ కంట్రోల్ విభాగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. సాధారణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అత్యవసర మందులు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసినట్లు డ్రగ్ కంట్రోల్ విభాగం ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని దుకాణాలు, జెనరిక్ మందుల దుకాణాలు, సింగరేణికి చెందిన దుకాణాలు, అపోలో, మెడ్‌ప్లస్ దుకాణాలు, ఆసుపత్రులకు అనుబంధంగా ఉండే మందుల దుకాణాలు తెరిచే ఉంటాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్‌లో అన్ని ప్రభుత్వ, కార్పొరేట్ ఆసుపత్రులకు అనుబంధంగా ఉండే మందుల దుకాణాలన్నీ తెరిచే ఉంటాయని వెల్లడించారు. -
తాంబూలంలో పెట్టి ఇచ్చేయటం లేదు
⇒ ఆస్పత్రుల్లో ప్రైవేటు భాగస్వామ్యం ఉంటేనే మెరుగైన సేవలు ⇒ వైద్యశాఖ ప్రత్యేక కార్యదర్శి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు ⇒ చిత్తూరు ఆస్పత్రిని అపోలోకు ఇవ్వడంపై సమర్థన చిత్తూరు(అర్బన్): ‘ప్రభుత్వ ఆస్పత్రులను అడిగిన వెంటనే తాంబూలంలో పెట్టి ఇచ్చేయడంలేదు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు లోబడే అపోలో సంస్థలకు లీజుకు ఇస్తున్నాం. ఇందు లో ఏదో జరిగిపోతోందని పాత్రికేయులు ఊహాజనిత కథనాలు రాస్తున్నారు. అయినా ఇక్కడ (చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో) వైద్య సేవలు సంతృప్తికరంగా ఉన్నాయా మీరే చెప్పండి? ఉంటే నేను మధ్యాహ్న భోజనం తినడం మానేస్తా..’ అని రాష్ట్ర వైద్యశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎల్వీ.సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. అపోలో వైద్య సంస్థలకు లీజుకు ఇవ్వడం కోసం ఏర్పాటైన కమిటీ శుక్రవారం చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని సందర్శించింది. ఈ సందర్భంగా సుబ్రమణ్యం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రైవేటు భాగస్వామ్యం ఉండటం వల్ల పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని చెప్పారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 320 పడక లు ఉంటే భవిష్యత్తులో 1,200 పడకలుగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీని సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. ఆస్పత్రిలో పెట్టుబడులు, ఆధునికీకరణ తో పాటు వైద్య వృత్తికి సంబంధించిన అనేక కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. నంద్యాల, విజయనగనం ప్రభుత్వాస్పత్రుల్లో కూడా డీమ్డ్ కోర్సులను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు వెళ్లాయని స్పష్టం చేశారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సమక్షంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలోని మౌలిక సదుపాయాలు, భవనాల వివరాలపై జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ కమిటీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సీపీఐ నాయకుల ఆందోళన చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ సీపీఐ నాయకులు ధర్నా చేశారు. అనంతరం ఆస్పత్రి వద్ద ఎల్వీ.సుబ్రమణ్యానికి వినతిపత్రం అందజేశారు. మురకంబట్టులో అపోలో వైద్య కళాశాలకు సేకరించిన స్థలాలకు పరిహారం ఇవ్వలేదంటూ బాధితులు ఆందోళనకు దిగారు. కమిటీ సమావేశం జరుగుతుండగా ప్రభుత్వానికి, అపోలో ఆస్పత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
మళ్లీ అపోలో ఆస్పత్రికి రాజయ్య
హైదరాబాద్ : మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మరోసారి అపోలో ఆస్పత్రిలో చేరారు. బుధవారం ఉదయం ఆయనను కుటుంబ సభ్యులు వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకు వచ్చారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో రాజయ్యను మంగళవారం సాయంత్రం హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. రాజయ్యకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనకు బీపీ, పల్స్ రేటు పెరిగినట్లు గుర్తించారు. అనంతరం రాజయ్యను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కాగా వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి రావాల్సిందిగా గతరాత్రి వైద్యులు సూచించారు. దాంతో డాక్టర్ల సూచన మేరకు రాజయ్య ఈరోజు ఉదయం ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. -
బర్తరఫ్ మాట విని ఆవేదన చెందా: రాజయ్య
హైదరాబాద్: తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య అపోలో ఆస్పత్రి నుంచి మంగళవారం రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో రాజయ్యను ఈ సాయంత్రం హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. రాజయ్యకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనకు బీపీ, పల్స్ రేటు పెరిగినట్లు గుర్తించారు. రాజయ్యకు బీపీ, షుగర్ ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడంతో ఆయన మనస్థాపం చెందినట్లు అనుచరులు చెబుతున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రాజయ్య మాట్లాడుతూ బర్తరఫ్ మాటవిని ఆవేదన చెందానని చెప్పారు. తన పొరపాటు ఉంటే విచారణ జరిపించాలని అన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. వైద్యులు అన్ని పరీక్షలు చేశారని చెప్పారు. వైద్యుల సహకారంతో ఇంటివద్దే ఉండి చికిత్స పొందుతానన్నారు. రేపు మళ్లీ ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకుంటానని చెప్పారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని కోరారు. -
మాజీ మంత్రి రాజయ్యకు గుండెపోటు
⇒ హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలింపు ⇒ ఐసీయూలో వైద్య పరీక్షలు ⇒ మంత్రి చందూలాల్ సహా పలువురు నేతల పరామర్శ ⇒ చికిత్స అనంతరం డిశ్చార్జి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మంగళవారం గుండెపోటుతో ఆస్పత్రి పాలయ్యారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అవడంతో ఆవేదన చెందుతున్న ఆయన మూడు రోజులుగా బీపీ, షుగర్ మందులు వేసుకోవట్లేదు. దీంతో రక్తపోటు, షుగర్ లెవల్స్ బాగా పెరిగాయి. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్‌లో తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు, మిత్రులతో మాట్లాడుతూ రాజయ్య ఛాతీ నొప్పితో కూలబడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన హైదర్‌గూడలో ఉన్న అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు రాజయ్యను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి వైద్యం అందించారు. ఆయనకు ఈసీజీ, 2డీ ఎకో, షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించారు. షుగర్, బీపీ స్థాయిలు పెరగడం వల్లే ఛాతీ నొప్పి వచ్చినట్లు ‘హెల్త్ బులిటెన్’లో పేర్కొన్నారు. అనంతరం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అంతకుముందు రాజయ్య అస్వస్థత విషయం తెలుసుకున్న రాష్ట్ర పర్యాటకాభివృద్ధిశాఖ మంత్రి చందూలాల్, మాజీ మంత్రి మారెప్ప, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు. మాజీ ఎంపీ మధుయాష్కి, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్, టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు తదితరులు ఆస్పత్రికి చేరుకొని రాజయ్యను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా, రాజయ్యపట్ల సీఎం కేసీఆర్ ప్రదర్శిస్తున్న తీరును తప్పుబడుతూ తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్యతోపాటు పలువురు ఎమ్మార్పీఎస్ (మంద కృష్ణమాదిగ వర్గం) నాయకులు ఆస్పత్రి వద్ద కాసేపు రాస్తారోకో చేపట్టారు. తప్పు చేసి ఉంటే ... విచారణ జరపండి: రాజయ్య ‘బర్తరఫ్ మాట విని ఆవేదన చెందా. నా పొరపాటు ఉంటే విచారణ జరపండి. వైద్య, ఆరోగ్యశాఖలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించండి. సీఎం కేసీఆర్ నాకు తండ్రిలాంటి వారు. ఆయన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నా. మూడు రోజులుగా నిద్ర లేదు. తీవ్ర ఒత్తిడికి గురయ్యాను. మంత్రి వర్గం నుంచి తప్పించిన తీరు కలచి వేసింది. ఇప్పటికీ చెబుతున్నా, నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఈ అంశంపై విచారణ జరిపించాలి..’ అని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అనంతరం రాజయ్య మీడియాతో పేర్కొన్నారు. తన ఆరోగ్య పరిస్థితి మెరుగైందని, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవద్దని, మినిస్టర్స్ క్వార్టర్స్‌లో అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. -
క్లిక్ చేస్తే ఇంటికే మందులు..
⇒ ఆన్లైన్ బాటపట్టిన ఫార్మసీలు ⇒ అగ్రస్థానంలో అపోలో, మెడ్‌ప్లస్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దుస్తులు, ఎలక్ట్రానిక్స్, పుస్తకాలు.. ఇవే కాదు ఈ-కామర్స్ వ్యాపారంలోకి ఇప్పుడు మందులూ వచ్చి చేరాయి. క్లిక్ చేస్తే చాలు ఎంచక్కా ఇంటికే వచ్చి చేరుతున్నాయి. అదీ కొన్ని గంటల వ్యవధిలోనే. ఇంటర్నెట్ విస్తరణతో ఈ-కామర్స్ వ్యాపారం భారత్‌లో జోరు మీద ఉంది. ఏది కావాలన్నా అర చేతిలోని స్మార్ట్‌ఫోన్‌లో కస్టమర్లు ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. ఈ అంశమే ఫార్మసీ రిటైల్ కంపెనీలకు కలిసి వచ్చింది. ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, సౌందర్య సాధనాలే కాదు నిత్యావసర ఔషధాలనూ ఆన్లైన్లో విక్రయిస్తున్నాయి. ఇక్కడ మరో విశేషమేమంటే ఇతర కంపెనీల (సబ్‌స్టిట్యూట్) మందులూ, వాటి ధరలు తెలుసుకునే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చాయి. క్యాష్ ఆన్ డెలివరీ.. అపోలో ఫార్మసీ, మెడ్‌ప్లస్ మార్ట్, గార్డియన్ ఫార్మసీ ప్రస్తుతానికి ఈ-కామర్స్ బాట పట్టాయి. అపోలో, మెడ్ప్లస్లు ఒక అడుగు ముందుకేసి నిత్యావసర మందులనూ ఆన్లైన్లో విక్రయిస్తున్నాయి. ఈ-కామర్స్ కంపెనీల మాదిరిగానే క్యాష్ ఆన్ డెలివరీ (ఇంటి వద్దే చెల్లింపు) విధానాన్ని ఈ కంపెనీలు అనుసరిస్తున్నాయి. ఆర్డరు ఇచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ఉత ్పత్తులను ఇంటికి చేరవేస్తున్నాయి. స్కిన్ కేర్, హెయిర్ కేర్, వ్యక్తిగత సంరక్షణ, విటమిన్లు, సప్లిమెంట్లు, పిల్లల ఉత్పత్తులు.. ఇలా వేలాది రకాలు ఆన్లైన్లో కొలువుదీరాయి. ఆయుర్వేద, విదేశీ ఉత్పత్తులనూ ఇక్కడి కస్టమర్ల కోసం ఆఫర్ చేస్తున్నాయి. ప్రైవేట్ లేబుల్ ప్రొడక్టులూ విక్రయించుకునేందుకు ఫార్మసీలకు ఈ-కామర్స్ చక్కని వేదికగా నిలుస్తోంది. పేరు నమోదు అయితేనే..: ఆన్లైన్లో మందులను ఆర్డరు ఇవ్వాలనుకుంటే ఫార్మసీల్లో ప్రత్యక్షంగా, లేదా వెబ్సైట్ ద్వారా కస్టమర్లు తమ పేరు నమోదు చేసుకోవాలి. వైద్యులు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ (మందుల చీటీ) నకలును వెబ్‌సైట్‌కు అప్లోడ్ చేయాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులను సరఫరా చేయరు. కంపెనీని బట్టి రూ.500-600 ఆపై విలువ చేసే ఉత్పత్తులు ఆర్డరు చేస్తే ఎటువంటి అదనపు చార్జీ లేకుండా ఉచితంగా డెలివరీ చేస్తున్నాయి. అంతేకాదు డిస్కౌంట్లూ ఆఫర్ చేస్తున్నాయి. అపోలో ఫార్మసీ ద్వారా అయితే కనీసం రూ.200 విలువ చేసే మందులను ఆర్డరు చేయాలి. ఉత్పత్తుల విలువ రూ.600 దాటితే ఉచిత డెలివరీ. రూ.600 లోపు ఉంటే డెలివరీ చార్జీ రూ.55 చెల్లిం చాలి. డబ్బులు ముందుగా చెల్లిస్తే కస్టమర్ కోరిన ప్రదేశంలో డెలివరీ చేస్తోంది అపోలో ఫార్మసీ. నచ్చిన బ్రాండ్.. నిత్యావసర మందులను భారత్‌లో ఆన్లైన్లో తొలుత పరిచయం చేసింది హైదరాబాద్‌కు చెందిన మెడ్‌ప్లస్. ఈ కంపెనీ మెడ్‌ప్లస్‌మార్ట్.కామ్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో విక్రయాలు చేపడుతోంది. స్మార్ట్‌ఫోన్ కస్టమర్ల కోసం అప్లికేషన్(యాప్)ను కూడా అందుబాటులోకి తెచ్చింది. వెబ్సైట్ ప్రత్యేకత ఏమంటే ప్రతి మందుకు సబ్‌స్టిట్యూట్(ప్రత్యామ్నాయ) మందులనూ తెరపై చూపిస్తుంది. ఒక్కో ఔషధం ధర కంపెనీని(బ్రాండ్) బట్టి మారుతుంది. ధర, కస్టమర్ అడిగిన మందుకు, ఇతర బ్రాండ్ల మందులకుగల ధర వ్యత్యాసం, తయారు చేసిన కంపెనీ వివరాలూ పొందుపరిచింది. ఉదాహరణకు జీఎస్కే కంపెనీ తయారు చేసిన క్రోసిన్ను తీసుకుంటే అందులో ఉండే మందు ప్యారాసిటమాల్. ఇతర కంపెనీల ప్యారాసిటమాల్ మందులూ తెరపై ప్రత్యక్షమవుతాయి. తక్కువ ధరలో లభించే మంచి బ్రాండ్‌ను కస్టమర్ ఎంచుకోవచ్చు. -
అపోలోలో తొలి ఎస్కేపీ సర్జరీ
ఏక కాలంలో కిడ్నీ,పాంక్రియస్ల మార్పిడి సర్జరీ విజయవంతమని అపోలో ప్రకటన అన్నానగర్, న్యూస్‌లైన్: దక్షిణాది వైద్య చరిత్రలోనే మొదటిదిగా చెప్పబడుతున్న సైమల్టేనియస్ కిడ్నీ - పాంక్రియాస్ సర్జరీ (ఎస్కేపీ)ను అపోలో వైద్యులు విజయవంతం చేశారని ఆ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి తెలిపారు. అపోలో ఎండీ ప్రీతారెడ్డి మాట్లాడుతూ త్వరలో అపోలో ఒక మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ యూనిట్‌ను ప్రారంభిస్తుందని తెలిపారు.నగరంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ సర్జరీకు చెందిన విశేషాలను వివరించారు. పాండిచ్చేరికి చెందిన 52 ఏళ్ల పరమేశ్వరీ రాజశేఖర్ మధుమేహ వ్యాధితో చెడిపోయిన కిడ్నీతో తమ వద్దకు వైద్యం కోసం వచ్చారు. ఈ శస్త్ర చికిత్సకు సారథ్యం వహించిన డాక్టర్ ఆనంద్ కక్కర్ తెలిపారు. బాగా ఆలోచించిన మీదట ఆమెకు చెడిపోయిన కిడ్నీతో పాటు, చక్కెర స్థాయిని నియంత్రించే పాంక్రియాస్ గ్రంధిని కూడా పూర్తిగా తొలగించి వాటి స్థానంలో అవయవదాతల నుంచి సేకరించిన ఆరోగ్యకరమైన కిడ్నీ - పాంక్రియాస్‌లను అమర్చడం వలన ఆమెను మధుమేహం నుంచి పూర్తిగా విముక్తిరాల్ని చేయవచ్చు. ఈ క్రమంలో తన సహవైద్యులైన డాక్టర్ మనీష్ వర్మ, డాక్టర్ ఆనంద్ రామమూర్తి, డాక్టర్ మహేష్‌లతో కల్సి ఈ సరికొత్త ఎస్కేపీ సర్జరీను పరమేశ్వరికి చేసి విజయం సాధించామన్నారు. టైప్టూ మధుమేహంతో బాధపడుతున్న పరమేశ్వరీ ఈ సర్జరీ అనంతరం పూర్తి స్థాయి ఆరోగ్యంతో ఉన్నారని, ఆమె పాంక్రియాస్, కిడ్నీలు బాగా పని చేస్తున్నాయని కక్కర్ తెలిపారు. ఈ విధానం ఉత్తర భారతావనిలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉందన్నారు. రోగి పరమేశ్వరి విలేకరులతో మాట్లాడుతూ ఈ సర్జరీ తర్వాత తాను అన్ని పదార్థాలనూ యథేచ్ఛగా తినగల్గుతున్నానని తెలిపారు. మరో ఆరు నెలల తర్వాత స్వీట్లను కూడా తాను తినవచ్చునని వైద్యులు తెలిపారన్నారు. తాను వ్యాధి సోకక ముందు ఎలా ఉన్నానో సర్జరీ తర్వాత కూడా అంతే ఉత్సాహం, ఆరోగ్యంతో ఉన్నానని ఆమె చెప్పారు. అపోలో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ విభాగం వైద్యుడు డాక్టర్ భామ, అపోలో వైద్యులు, సిబ్బంది కూడా పాల్గొన్నారు. -
అపోలో ఆసుపత్రుల్లో అత్యాధునిక టెక్నాలజీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆరోగ్యసేవల రంగంలో ప్రపంచంలో అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తాము వినియోగిస్తున్నట్టు అపోలో హాస్పిటల్స్ తెలిపింది. నూతన పరిజ్ఞానాన్ని కొనుగోలు చేయడం, ప్రస్తుతమున్నవాటి స్థాయి పెంచడానికి ఏటా రూ.30 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నట్టు సంస్థ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సీ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఆసుపత్రిని ప్రారంభించి 25 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా సోమవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో తొలి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇదేనని చెప్పారు. 120 దేశాల నుంచి రోగులు వైద్యం కోసం అపోలోకు వస్తున్నారని వెల్లడించారు. ‘ఆసుపత్రి ప్రారంభించిన తొలినాళ్లలో గుండె శస్త్ర చికిత్సకు 3 వేల డాలర్లు చార్జీ చేసేవాళ్లం. ఇప్పుడు 2,700 డాలర్లు తీసుకుంటున్నాం. అమెరికాలో అయితే 65-75 వేల డాలర్లు వ్యయం అవుతుంది’ అని పేర్కొన్నారు. ఈ ఏడాది గుండె, కాలేయం, మూత్ర పిండాల మార్పిడి ఆపరేషన్లు అత్యధికంగా నిర్వహించింది అపోలో అని చెప్పారు. కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సకు అమెరికాలో 10 లక్షల డాలర్లుందని, తాము రూ.30 లక్షలకు నిర్వహిస్తున్నామని వివరించారు. భారీ విస్తరణ: అపోలో హాస్పిటల్స్ ప్రస్తుతం 59 ఆసుపత్రులను నిర్వహిస్తోంది. వీటన్నిటి పడకల సామర్థ్యం 8,700. వచ్చే మార్చినాటికి పడకల సంఖ్యను 10 వేలకు చేర్చనుంది. ఏడు దేశాలకు అపోలో తన వైద్య సేవలను విస్తరించింది. దశల వారీగా మరిన్ని దేశాల్లో అడుగుపెట్టనుంది. మొబైల్ ఫోన్ ద్వారా వైద్య సేవలందించే ప్రాజెక్టు డిసెంబరులోగా ప్రారంభించనుంది. ఇది కార్యరూపం దాలిస్తే ప్రపంచంలో ఏ మూలనున్నా రోగులను చేరుకోవచ్చని అపోలో విశ్వసిస్తోంది. తమ ఆసుపత్రుల్లో ఇప్పటివరకు 3.5 కోట్ల మంది వైద్య సేవలు పొందినట్టు అపోలో తెలిపింది. కాగా, హీలర్: డాక్టర్ ప్రతాప్ చంద్రారెడ్డి, ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా పేరుతో ప్రతాప్‌రెడ్డి జీవిత చరిత్రను ప్రముఖ రచయిత, కాలమిస్టు ప్రణయ్ గుప్తే రాస్తున్నారు. కొద్ది రోజుల్లో ఇది మార్కెట్లోకి రానుంది.