► అమ్మ సమాధి వద్ద అశ్రుతర్పణాలు
►గుండు కొట్టించుకున్న 60 మంది అభిమానులు
►66కు పెరిగిన మృతుల సంఖ్య
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తిరిగి రాని లోకాలకు వెళ్లిన వాస్తవాన్ని తమిళనాడు ప్రజలు తట్టుకోలేక పోతున్నారు. బుధవారం నాటికి అమ్మ లేదనే ఆవేదనతో మొత్తం 66 గుండెలు ఆగిపోయారుు. లక్షలాది మంది ప్రజలు బుధవారం మెరీనాబీచ్‌లోని అమ్మ సమాధిని కనులారా చూసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. - సాక్షి ప్రతినిధి, చెన్నై
సాక్షి ప్రతినిధి, చెన్నై: స్వల్ప అస్వస్థత మాత్రమే అంటూ సెప్టెంబరు 22వ తేదీన అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అరుున అమ్మ ఈనెల 5వ తేదీన ప్రాణం కోల్పోరుున స్థితిలోనే బైటకు వచ్చారు. ఇదిగో డిశ్చార్జ్...అదిగో ఇంటికి వెళతారు అంటూ ప్రజలు పెంచుకున్న నమ్మకాన్ని వమ్ముచేస్తూ జయలలిత శాశ్వతంగా కన్నుమూసారు. అమ్మను కడసారి చూసుకోవాలనే తలపంపుతో ఈనెల 6వ తేదీన జరిగిన అంతిమ సంస్కారానికి జనం తండోపతండాలుగా తరలివచ్చారు. లక్షల సంఖ్యలో ఉన్న జనం మధ్య అమ్మ పార్దివదేహం ఊరేగింపుగా మెరీనా బీచ్ తీరంతోని ఎంజీఆర్ సమాధి వద్దకు చేరుకుంది. ప్రభుత్వ లాంఛనాలతో ఆమె భౌతికకాయాన్ని ఖననం చేశారు. ఈ దృశ్యాలను కొందరు ప్రత్యక్షంగా చూసి కన్నీరుపెట్టగా, మరికొందరు టీవీల్లో వీక్షిస్తూ విలపించారు. అమ్మ లేదనే ఆవేదన మిన్నంటగా మెరీనా బీచ్ తీరం బుధవారం సైతం కన్నీటి సంద్రంగా మారిపోరుుంది.
భారీ పోలీసు బందోబస్తు వల్ల అంత్యక్రియల సమయంలో ఆమె ఖనన దృశ్యాలను దగ్గరగా చూడలేక పోరుున వేలాది మంది ప్రజలు మంగళవారం రాత్రి నగరంలోనే ఉండిపోయారు. బుధవారం తెల్లవారుజాము నుండే అమ్మను ఖననం చేసిన చోటును దగ్గరగా తిలకించేందుకు ఎంజీఆర్ సమాధి వద్ద క్యూ కట్టారు. అమ్మకు బుధవారం సైతం అంత్యక్రియలు కొనసాగుతున్నాయా అని భావించే స్థారుులో మెరీనాబీచ్ రోడ్డు జనసంద్రంగా మారిపోరుుంది. వేలాది మంది కార్లు, ద్విచక్రవాహనాల్లో అక్కడికి చేరుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుండి వేలాది మంది చెన్నైకి వచ్చారు. బుధవారం సైతం ఇంత పెద్ద సంఖ్యలో జనం వస్తారని ఊహించని పోలీసులు పెద్ద సంఖ్యలో బీచ్ వద్దకు చేరుకున్నారు. అమ్మ సమాధి చుట్టూ బ్యారికేడ్లను అమర్చి క్యూలైన్లను ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య జయలలిత సమాధిని ప్రజల సందర్శించుకుని శ్రద్దాంజలి ఘటించారు. కొందరు అభిమానులు అమ్మ సమాధి వద్ద కూలబడి గుక్కపట్టి విలపించారు. మరో మహిళ అమ్మ సమాధి చూడగానే సృ్పహతప్పి పడిపోగా 108 అంబులెన్‌సలో ఆసుపత్రికి తరలించారు.
గుండుకొట్టించుకుని నివాళి :
ఇదిలా ఉండగా, అండిపట్టి అన్నాడీఎంకే ఎమ్మెల్యే తంగ తమిళ్‌సెల్వన్ నాయకత్వంలో 60 మంది పార్టీ కార్యకర్తలు బుధవారం అమ్మ సమాధి వద్ద గుండుకొట్టించుకుని నివాళులర్పించారు. జయలలిత తమను కన్నతల్లిలా ఆదరించింది, అందుకే కన్నతల్లి ఎలా చేస్తామో అలా ఈ అమ్మకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు మరో అభిమాని తెలిపాడు. ఇలా గుండు కొట్టించుకున్న వారిలో కొందరు మహిళలు కూడా ఉన్నారు.
పోచంపల్లిలో అమ్మకు అంత్యక్రియలు :
జయలలితపై తమకు అభిమానాన్ని కృష్ణగిరి జిల్లా పోచంపల్లి ప్రజలు ప్రత్యేకంగా చాటుకున్నారు. బంకమట్టితో అమ్మ భౌతికకాయాన్ని పోలిన బొమ్మను తయారు చేసి పాడెపై ఊరేగించి ఖనన సంస్కారాలు చేయడం చూపరులను కంటతడిపెట్టించింది.
స్మారక మండపం ఏర్పాట్లు :
ఇదిలా ఉండగా, అమ్మను ఖననం చేసిన చోట స్మారక మండపం నిర్మించేందుకు బుధవారం ఏర్పాట్లు ప్రారంభమైనారుు. జయలలిత జీవితంలోని విశేషాలు, ప్రవేశపెట్టిన పధకాలు, ఆమె వినియోగించిన వస్తువులు ఇలా అనేక ఆకర్షణీయమైన అంశాలతో స్మారక మండపాన్ని తీర్చిదిద్దనున్నట్లు సమాచారం.
66కు పెరిగిన మృతుల సంఖ్య :
అమ్మ మృతి చెందిన వార్తను తట్టుకోలేక మృతి చెందిన వారి సంఖ్య బుధవారానికి 66 కు చేరుకుంది. మంగళవారం సాయంత్రానికి 61 మంది చనిపోగా బుధవారం మరో ఐదు మంది ప్రాణాలు విడిచారు.
గుండెల్లో అమ్మ
Published Thu, Dec 8 2016 3:58 AM | Last Updated on Mon, Sep 4 2017 10:09 PM
Advertisement
Advertisement