fans
-
రైతులు... అభిమానులే రక్షణ వలయంగా
-
అభిమానుల ఆగ్రహానికి గురైన రష్మిక .. అంతా ఆ కామెంట్స్ వల్లే..! (ఫోటోలు)
-
అక్కినేని ఫ్యాన్స్ ప్రెసిడెంట్‌ను కలిసిన నాగచైతన్య.. ఎందుకంటే?
అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా తండేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమా ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ మూవీలో చైతూ సరసన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. తొలి రోజే ఈ మూవీ పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. తండేల్ చిత్రం సక్సెస్ కావడంతో నాగచైతన్య విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శకుడు చందు మొండేటితో కలిసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అయితే విజయవాడ వెళ్లిన నాగచైతన్య ఆలిండియా అక్కినేని నాగార్జున యువసేన అధ్యక్షులు సర్వేశ్వరరావు ఇంటికి వెళ్లారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారన్న విషయం తెలుసుకుని ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది.కాగా.. తండేల్ చిత్రాన్ని శ్రీకాకుళంకు చెందిన మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించారు. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన కొందరు జాలర్లు పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లడంతో అరెస్టయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఆధారంగా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకొచ్చారు. అక్కినేని నాగచైతన్య తండేల్ రాజ్‌గా పాత్రలో కనిపించారు. -
'దయచేసి నా అభిమానులు ఆ పని చేయొద్దు'.. జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశాడు. మిమ్మల్ని కలిసేందుకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానని తెలిపాడు. త్వరలోనే మీ అందరినీ కలుస్తానని అన్నారు. త్వరలో సమావేశం ఏర్పాటు చేసి వ్యక్తిగతంగా మాట్లాడతానని వెల్లడించారు. తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.పాదయాత్రలు చేయొద్దు..అయితే తనను కలిసేందుకు పాదయాత్రలు లాంటివి చేయవద్దని జూనియర్ ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. మీ సంక్షేమమే నాకు ముఖ్యమన్నారు. తనను కలుసుకోవాలని ఎదురు చూస్తున్న మీ ఆసక్తిని అర్థం చేసుకుని వ్యక్తిగతంగా కలుసుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అధికారులతో అన్ని అనుమతులు తీసుకుని.. అందరినీ సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందామని తెలిపారు. ఇంత పెద్ద సమావేశం నిర్వహించటానికి కొంత సమయం అవసరం అవుతుంది.. ఈ విషయంలో అభిమానులు ఓర్పుగా ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు.గతేడాది దేవర మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రంతో శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది.A Statement from @tarak9999 Office#JrNTR #ManOfMasses𝐍𝐓𝐑#Devara #war2 #Ntrneel pic.twitter.com/erzTOohW0R— TigerNation 🐯 (@IamGanesh1718) February 4, 2025 -
మీరందరూ తప్పకుండా ఇలా చేయాలనేదే నా కోరిక: సమంతా
ఉదయం ధ్యానం చేయడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. రోజంతా గడపడానికి కావల్సిన శక్తి, శాంతి లభిస్తుంది.ధ్యానం అనేది శరీరం మనస్సును ఏకీకృతం చేయడంలో సహాయపడుతుంది. ఇది ఏకాగ్రత, విశ్రాంతిని అందిస్తుంది.భావోద్వేగాలను అదుపులో ఉంచుకునేలా, స్థిరమైన ఆలోచనలను అందిస్తుంది. చాలామందికి, ఇదొక ఆధ్యాత్మిక అనుభవం. ఈవిషయాన్ని స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో వివరించింది.ప్రతిరోజూ కేవలం 15 నిమిషాల ధ్యానం ఆరోగ్యానికి చాలామందని సూచించింది. నిశ్శబ్దంగా కూర్చని, శ్వాసమీద ధ్యాస పెడితే ప్రశాంతంగా ఉంటుందని వెల్లడించింది. దీనికి సంబంధించి ఒక వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ధ్యానంతన జీవితంలో చాలా బాగా పనిచేసిందని తెలిపింది. ఒక ప్రశాతమైన ప్రవాహంలోకి పయనించడానికి ధ్యానానికి మించింది లేదని పేర్కొంది. ప్రపంచం ఎంత గందరగోళంగా ఉన్నా, తనలోని ఆ నిశ్శబ్ద ప్రదేశం ఎప్పుడూ అక్కడే ఉంటుంది. మీరు మెడిటేషన్‌ను ఎన్నుకుంటే అన్ని గందగగోళాలనుంచి శాంతి లభిస్తుందని తెలిపింది. మీ మనస్సులోని ఆలోచనల గురించి చింతించకండి. వాటిని పక్కన పెట్టడమే ఉపాయం. మీరందరూ ప్రయత్నించాలని నేను కోరుకునేది ఏదైనా ఉంటే, అది ఇదే అంటూ రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl)ధ్యానం వలన లాభాలు ,ఎపుడు ప్రారంభించాలి.ధ్యానం ఉదయం, సాయంత్రం, నిర్ణీత సమయంలో ఆచరిస్తే మంచిది. వాస్తవానకి ధ్యానం చేయడానికి "చెడు" సమయం అంటూ ఏమీ ఉండదు. నిబద్ధతతో, పట్టుదలగా చేయడమే ముఖ్యం. రిలాక్స్‌గా , సౌకర్యవంతంగా ఉన్న వాతావరణంలో ధ్యానాన్ని ఆచరించాలి. అయితే ఉదయం ధ్యానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు మెండు అని చెబుతారు. ఒక పది లేదా పదహేను నిమిషాలు పాటు మనతో మనం కనెక్ట్ అయ్యే అవకాశం.కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌కు చెందిన సర్టిఫైడ్ మెడిటేషన్ ఇన్స్ట్రక్టర్ ఇంటిగ్రేటివ్ వెల్నెస్ ఎక్స్పర్ట్ అభిప్రాయం ప్రకారం ఉదయం ధ్యానం చేయడం వల్ల రోజంతా ఆ సానుకూల ప్రభావం కొనసాగుతుంది. ప్రశాంతంగా, విషయాలమీద మనస్సును కేంద్రీకరించేలా, ఒత్తిడిని, భావోద్వేగాల్ని అదుపు చేసుకోవడంలో సాయడపడుతుంది. ముఖ్యంగా ఒత్తిడితో కూడిన రోజుల్లో అయితే ఆందోళనను తగ్గిస్తుంది. ఓరిమి పెరుగుతుంది. 8 వారాల పాటు రోజుకు13 నిమిషాలు ధ్యానం చేసేవారిలో సానుకూల మార్పులు కనిపించినట్టు అధ్యయనం తేలింది.ఇదీ చదవండి: అతిలోకసుందరి వారసురాలు జాన్వీకపూర్ లగ్జరీ ఇల్లు : ఎంత వైభోగమో!ధ్యానం, రకాలుశ్రద్ధ ధ్యానంఆధ్యాత్మిక ధ్యానందృష్టి ధ్యానంమంత్ర ధ్యానంఅతీంద్రియ ధ్యానంలవింక్ కైండ్‌నెస్ ధ్యానంవిజువలైజేషన్; వాకింగ్ ధ్యానం, శ్వాసమీద ధ్యాస ఇలా పలు రకాలున్నాయి. -
పక్కవాడితో నీకెందుకు.. ముందు నువ్వు బాగుండాలి కదా?: అజిత్ కుమార్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముఖ్యంగా అభిమానులను ఉద్దేశించిన ఆయన చేసిన కామెంట్స్ తెగ వైరలవుతున్నాయి. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటం వల్ల ఏ మాత్రం ఉపయోగం ఉండదని ఫ్యాన్స్‌కు సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్స్ వార్‌పై ఆయన మాట్లాడారు.అజిత్ మాట్లాడుతూ.. 'ఇతరుల విషయాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దు. మీరు చేయాల్సిన పనిపై ముందు దృష్టి పెట్టండి. ఇతరుల గురించి ఆలోచిస్తూ మీరు టైన్షన్ తెచ్చుకోకండి. అలాంటి వాటితో మీకేలాంటి ఉపయోగం ఉండదు. ముందు మీ లైఫ్ గురించి ఆలోచించండి. నేను నా అభిమానులకు కూడా ఇదే చెబుతా. సినిమాలు చూడటం వరకు ఓకే.. కానీ జై అజిత్.. జై విజయ్ అంటుంటే జై కొడుతూ ఉంటే నువ్వెప్పుడు బాగుపడతావ్. మీ చూపిస్తున్న ప్రేమకు నాకు ఆనందంగానే ఉంటుంది. కానీ మీ జీవితం బాగున్న తర్వాతే కదా ఏదైనా. నా ఫ్యాన్స్ ఆనందంగా ఉన్నారని తెలిసినప్పుడే నాకు సంతోషంగా అనిపిస్తుంది' అని అన్నారు.కాగా.. ఇటీవల దుబాయ్ కారు రేసింగ్‌లో అజిత్ టీమ్ మూడో స్థానంలో నిలిచింది. అజిత్ కారు రేసింగ్ గెలవడంపై సినీ ప్రముఖులు ఆయనపై ప్రశంసలు కురిపించారు. రేస్ గెలిచిన తర్వాత జాతీయ జెండా పట్టుకుని అజిత్ సంతోషం వ్యక్తం చేశారు. విదాముయార్చి వాయిదా..కోలీవుడ్ స్టార్ ప్రస్తుతం అజిత్ కుమార్(ajith Kumar) విదాముయార్చి మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఊహించని కారణాలతో ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ కాలేదు. ఈ సినిమాకు మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా నటించారు. అర్జన్ సర్జా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్డెట్లో నిర్మించారు.మైత్రి మూవీ మేకర్స్‌తో సినిమా..అజిత్ కుమార్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌తో జతకట్టారు. ఆయన హీరోగా తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. ఇందులోనూ త్రిషనే హీరోయిన్గా నటిస్తోంది . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని వేసవిలో ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. -
రామ్ చరణ్ ఫ్యాన్స్ మృతి.. ఎవరూ పట్టించుకోలేదన్న బాధిత కుటుంబాలు!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్' (Game Changer Movie). శంకర్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది.అయితే మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఏపీలోని రాజమండ్రిలో భారీస్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో రామ్ చరణ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరయ్యారు. శనివారం నిర్వహించిన ఈవెంట్లో గేమ్ ఛేంజర్ టీమ్ అంతా పాల్గొన్నారు.ఇంటికి వెళ్తుండగా విషాదం..అయితే అభిమాన హీరో ఈవెంట్‌కు హాజరైన ఇద్దరు అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు ఫ్యాన్స్ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. వాళ్లిద్దరూ బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ ఢీ కొట్టడంతో మరణించారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.ఎవరూ పట్టించుకోలేదు.. బాధిత కుటుంబాల ఆవేదన..తాము కన్న కుమారులను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్న తమను ఎవరూ కూడా పరామర్శించలేదని బాధితుల కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వద్దకు ఎవరూ రాలేదని.. చాలా నరకం అనుభవించామని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు.బాధితు కుటుంబ సభ్యుడు మాట్లాడుతూ..' పరామర్శించడానికి ఎవరూ రాలేదండి. ఆదివారమంతా మేము నరకం అనుభవించాం. మమ్మల్ని ఎవరు పట్టించుకున్నా పాపాన పోలేదు. మాకు మేమే వాళ్ల కాళ్లు, వీళ్ల కాళ్లు పట్టుకుని సొంతంగా పోస్టుమార్టం చేయించుకున్నాం. ఏ రాజకీయ నాయకుడు కూడా మా గురించి పట్టించుకోలేదు. మేము ఫోన్ చేసినా ఎవరూ కూడా రెస్పాండ్ కాలేదండి. ఇప్పటి వరకు కూడా ఎవరూ మా వద్దకు రాలేదు. పరామర్శించేదు' అని అన్నారు.సంతాపం ప్రకటించిన రామ్ చరణ్.. రూ.10 లక్షల సాయంఅభిమానుల మృతిపై రామ్ చరణ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆ ఘటన గురించి తెలిసిన వెంటనే అభిమానుల ఇంటికి తన మనుషులను పంపించి ధైర్యం చెప్పించారు. మృతి చెందిన అభిమానుల రెండు కుటుంబాలకు చెరొక ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.రామ్ చరణ్ మాట్లాడుతూ... 'ఈవెంట్ చూసేందుకు వచ్చిన అభిమానులు సురక్షితంగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటాం. ఇటువంటి ఘటన జరగడం దురదృష్టకరం. అభిమానుల కుటుంబాలు ఎంత బాధ పడతాయో అర్థం చేసుకోగలను. నాకూ అంతే బాధగా ఉంది. అభిమానుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను' అని అన్నారు.గేమ్ ఛేంజర్ సినిమా విషయానికి వస్తే ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీకాంత్, అంజలి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఎస్జే సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందించాడు. ఈ చిత్రంలో కేవలం ఐదు పాటల కోసమే ఏకంగా రూ.75 కోట్లు ఖర్చు పెట్టారు. ఓ నిజాయితీ ఐఏఎస్ ఆఫీసర్‌కి, అవినీతి పరుడైన రాజకీయ నాయకుడికి మధ్య జరిగే పోరాటమే గేమ్ ఛేంజర్ కథ. -
మరణించిన మెగా అభిమానులను పట్టించుకోని డిప్యూటీ సీఎం పవన్
-
రజనీకాంత్‌ను మెప్పించిన అభిమాని.. ఇంటికి పిలిచి గిఫ్ట్‌తో సత్కారం
అభిమానులు లేనిదే ఏ హీరో లేడులే అన్నది వాస్తవం. అందుకే ప్రముఖ నటులు అభిమానులే మా దేవుళ్లు అంటుంటారు. ఈ అభిమానం అన్నది ఎంత వ్యసనం అంటే తమ అభిమాన హీరోల చిత్రాలు విడుదలయితే చూడాలని తహ తహలాడుతుంటారు. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. అదేవిధంగా అభిమానులు సినిమాలు చూడటంతో సరిపెట్టుకోరు. కొందరు తమ అభిమాన నటీనటులకు గుడులు కట్టించి నిత్యం పూజలు నిర్వహిస్తుంటారు. ఇది అభిమానానికి పరాకాష్ట అని చెప్పవచ్చు. ఇక నటుడు రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆయన్ను చూడటానికి అనేకమంది అభిమానులు ఆయన ఇంటి ముందు పడిగాపులు కాస్తుంటారు. అలాంటి సమయంలో రజనీకాంత్ ఇంటి గేటు వరకు వచ్చి చెయ్యి పైకెత్తి అభివాదం చేస్తే చాలు.. వాళ్ల జన్మ ధన్యమైనట్లు ఆనందంతో ఉప్పొంగిపోతుంటారు. కాగా అలాంటి వీరాభిమాని ఒకరు నటుడు రజనీకాంత్‌కు గుడి కట్టించి నిత్య పూజలు నిర్వహిస్తున్నాడు.. అతని పేరు కార్తీక్. ఇతను ఓ మాజీ సైనికుడు కావడం విశేషం. మధురై జిల్లా, తిరుమంగంలో అతను రజనీకాంత్‌కు గుడి కట్టించి అందులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిత్య పూజలు నిర్వహిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన రజనీకాంత్ తనకు గుడి కట్టించిన వీరాభిమాని కార్తీక్ అతని కుటుంబ సభ్యులను చెన్నై, పోయస్ గార్డెన్‌లోని తన ఇంటికి రప్పించి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారికి తన ఇంటిని చూపించి వారితో ఫొటోలు దిగి, బాబా విగ్రహాన్ని కానుకగా అందించి సంతోష పెట్టారు. ఈ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. #WATCH | Tamil Nadu: Fans of actor Rajinikanth offered prayers at Rajinikanth temple in Madurai on the occasion of his birth anniversary. pic.twitter.com/Ski0udt9sf— ANI (@ANI) December 12, 2023 -
విషాదం.. గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి వస్తుండగా ఇద్దరు మృతి..!
ఏపీలో విషాదం చోటు చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. రాజమండ్రిలో శనివారం జరిగిన గేమ్ రేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వస్తూ ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. రంగంపేట మండలం కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో ఐచర్ వ్యాన్ ఢీకొని మరణించారు. వారిద్దరిని కాకినాడకు చెందిన తోకడ చరణ్, ఆరవ మణికంఠ గుర్తించారు.ఘటనా స్థలంలోనే ఆరవ మణికంఠ మృతి చెందగా.. తీవ్ర గాయాల పాలైన తోకడ చరణ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు. తమ అభిమాన హీరోను చూసేందుకు తిరిగిరాని లోకాలకు వెళ్లి పోయారని మృతుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి మరణంతో రెండు కుటుంబాలు ఆధారాన్ని కోల్పోయాయి.భర్త చనిపోవడంతో మణికంఠకు అన్ని తానే చదివించానని తల్లి రోదిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. తండ్రితో కలిపి పళ్ల వ్యాపారం చేస్తున్న చరణ్ మృతితో వారి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే ఇప్పటివరకు బాధిత కుటుంబాలను సినీ ప్రముఖులు కానీ, అధికారులు కానీ పరామర్శించలేదని తెలుస్తోంది. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాల సభ్యులు వేడుకుంటున్నారు. -
ఫ్యాన్స్ కు తలైవా విషెస్.
-
ఇదెక్కడి క్రేజ్ రా అయ్యా.. పుష్పరాజ్ దెబ్బకు ట్రాఫిక్ జామ్!
అల్లు అర్జున్ పుష్ప-2 థియేటర్లను షేక్ చేస్తోంది. ఈ నెల 5న మొదలైన పుష్పరాజ్ బాక్సాఫీస్ విధ్వంసం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే కలెక్షన్ల పరంగా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప-2 కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్క్‌ను చేరుకుంది. అంతేకాకుండా హిందీలో ఎప్పుడు లేనివిధంగా రికార్డులు తిరగరాస్తోంది. కేవలం 12 రోజుల్లోనే రూ.582 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా సెకండ్ వీకెండ్లో రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన తొలిచిత్రంగా నిలిచింది.ఈ వసూళ్లు చూస్తే చాలు హిందీలో పుష్పరాజ్ క్రేజ్ ఏంటో తెలిసిపోతుంది. రెండోవారంలో ఆదివారం థియేటర్ల వద్ద ఏకంగా ఆడియన్స్‌ను చూస్తే ఏకంగా జాతరను తలపించింది. అయితే అది తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కాదు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో పుష్ప-2 థియేటర్ వద్ద ఇసుకెస్తే రాలనంత జనం వచ్చారు. టికెట్స్ కౌంటర్ వద్ద మాస్ జాతర కనిపించింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ దెబ్బకు ఏకంగా థియేటర్ ముందు రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయింది. ఇదంతా ఓ అభిమాని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చిన పుష్పరాజ్ రికార్డుల మీద రికార్డ్స్ సృష్టిస్తోంది. అత్యంత వేగంగా వెయ్యి కోట్ల మార్కు అందుకున్న ఘనతను ఇప్పటికే సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 లాంటి భారీ సినిమాల అల్ టైమ్ వసూళ్లను అధిగమించింది. ఇప్పటికే రూ.1409 కోట్లకు వసూళ్లతో రెండు వేల కోట్ల మార్క్ దిశగా పుష్పరాజ్ దూసుకెళ్తున్నాడు. ఇదే జోరు కొనసాగితే ఈ వీకెండ్లోనే రూ.2000 వేల కోట్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. #Pushpa2 నిన్న ఆదివారం Raipur లో థియేటర్ లో టికెట్ల కోసం క్యూ... తెలుగు సినిమా 💪❤️ pic.twitter.com/amyUAvmoGf— Rajesh Manne (@rajeshmanne1) December 16, 2024 -
కొరియన్ డ్రామా నటుడు సాంగ్ జే రిమ్ కన్నుమూత
సియోల్: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ నటుడు సాంగ్ జే రిమ్(39) తన ఇంటిలో కన్నుమూశారు. సాంగ్ జే రిమ్ మరణానికి కారణం ఇంకా స్పష్టంగా వెల్లడికాలేదు. కే-డ్రామాలు 'ది మూన్ ఎంబ్రేసింగ్ ది సన్', 'క్వీన్ వూ'లో కీలక పాత్రలు పోషించిన జే రిమ్ మంచి నటునిగా పేరు తెచ్చుకున్నారు.సాంగ్ జే రిమ్ మరణవార్త తెలిసిన వెంటనే అభిమానులు షాక్‌కు గురయ్యారు. తమ అభిమాన నటుడు ఇక ఈ లోకంలో లేడంటే నమ్మలేకపోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.మీడియాకు అందిన సమచారం ప్రకారం పోలీసులు సాంగ్ జే రిమ్ మృతిపై దర్యాప్తు చేపట్టారు. జే రిమ్ ఇంటిలో పోలీసులకు ఒక సూసైడ్ నోట్ లభ్యమయ్యింది. అతను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే దీనిపై అటు జే రిమ్ కుటుంబ సభ్యులు లేదా ఇటు సియోల్ పోలీసులు గానీ మీడియాకు నిర్దిష్ట సమాచారం ఇవ్వలేదు.సాంగ్ జే రిమ్ అంత్యక్రియలు నవంబర్ 14న జరగనున్నాయి. సాంగ్ జే రిమ్ మృతికి విచారం వ్యక్తం చేస్తూ అతని అభిమానులు సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. 2009లో సాంగ్ జే రిమ్ నటనను ప్రారంభించారు. తొలుత 2011లో మూన్ ఎంబ్రేసింగ్ ది సన్‌లో నటించాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇది కూడా చదవండి: ‘నేటి పిల్లలే రేపటి సూపర్ మోడల్స్’.. 200 మంది పేరెంట్స్‌కు రూ. 5 కోట్ల టోకరా -
స్టార్ హీరో ఫ్యాన్స్ నన్ను టార్గెట్ చేశారు: మహిళా ఎంపీ
ప్రముఖ హీరో అభిమానులు.. తనని సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేశారని మహిళా ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆరోపణలు చేశారు. డబ్బులిచ్చి మరీ ఇలా చేయిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ విషయం కాస్త బాలీవుడ్లో చర్చనీయాంశమైంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ చరిత్రలోనే పరమ చెత్త కంటెస్టెంట్.. హరితేజ ఏమందంటే?)మహారాష్ట్రలో నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాయి. రీసెంట్గా లాతూర్‌లో జరిగిన ర్యాలీలో తన సోదరుడు, కాంగ్రెస్ అభ్యర్థి ధీరజ్ దేశ్‌ముఖ్ కోసం బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్‌ముఖ్ ప్రచారంలో పాల్గొన్నాడు. బీజేపీ మత రాజకీయాలపై కాస్త గట్టిగానే విమర్శలు చేశాడు. మతాన్ని భోదించే వాళ్లకు చెప్పండి, మేం ధర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం, వీటి బదులుగా మన జీవితాల్ని ప్రభావితం చేసే నిజమైన సమస్యల గురించి మాట్లాడుకుందని అన్నాడు.రితేశ్ దేశ్‌ముఖ్ వీడియోని ప్రియాంక చతుర్వేది ట్విట్టర్లో షేర్ చేశారు. దీంతో బీజేపీ సపోర్ట్ చేసే అక్షయ్ కుమార్ అభిమానులు ఈమెని టార్గెట్ చేశారు. ఈమెకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇదే విషయమై ప్రియాంక ట్వీట్ చేశారు. తనని లక్ష్యంగా చేసుకుని హ్యాష్‌ట్యాగ్‌లు వైరల్ చేసేందుకు కొందరికి డబ్బు చెల్లించారని.. అక్షయ్ కుమార్ ఫ్యాన్ క్లబ్, పెయిడ్ బ్లూ టిక్ ఫిల్మ్ ఇన్ఫ్లుయెన్సర్లకు హ్యాష్‌ట్యాగ్స్ ఇచ్చి మరీ తనపై ట్వీట్లు వేస్తున్నారని ఈమె ఆరోపించారు. అయితే ఇదంతా ఎవరు చేస్తున్నారో తనకు తెలుసని ఈమె చెప్పడం సంచలనంగా మారింది.(ఇదీ చదవండి: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై కేసు)Today some Akshay Kumar fan club and paid blue tick film influencers have been given a hashtag and drafted tweets to target me.🥱 Easy to guess where it’s coming from thanks to grammatical errors in the drafted tweet bank 😂IYKYK— Priyanka Chaturvedi🇮🇳 (@priyankac19) November 11, 2024 -
ఇదేం పిచ్చి సామీ.. హీరో కోసం 95 రోజులుగా!
సినీ ఇండస్ట్రీలో హీరోలకు క్రేజే వేరు. హీరోయిన్ల కంటే ఎక్కువ ఫాలోయింగ్ వీరికే ఉంటుంది. పాన్ ఇండియా మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరోలు కూడా ఉన్నారు. అలాంటి వారిలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కూడా ఒకరు. ఆయనకు వరల్డ్ వైడ్‌గా డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు.తాజాగా ఓ వీరాభిమాని తన ఫేవరేట్ హీరోను కలవడం కోసం చేసిన సాహసం చూస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది. అతను షారూఖ్ ఖాన్‌ను కలిసేందుకు దాదాపు 95 రోజుల పాటు ఆయన నివాసమైన మన్నత్ బయటే ఉన్నాడట. జార్ఖండ్‌కు చెందిన వీరాభిమాని షారూఖ్‌ను కలవాలన్న ఆశతో ఇంటి బయటే వేచి చూశాడు. చివరికీ షారూఖ్‌ను కలిసి తన కోరిక నెరవేర్చుకున్నాడు. అభిమాన హీరోతో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. నవంబర్ 2న షారూక్ ఖాన్ తన 59వ బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నారు.గతేడాది బ్యాక్-టు-బ్యాక్ పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం షారూఖ్ కింగ్ అనే చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రానికి సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆయన కుమార్తె సుహానా ఖాన్ నటించనున్నారు. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. -
అర్థరాత్రి ప్రభాస్ అభిమానుల హల్ చల్
-
ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య వివాదం
ప్రభాస్ బర్త్‌డే ఈవెంట్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వివాదంగా మారింది. ప్రభాస్ పుట్టిన రోజు (అక్టోబర్ 23)సందర్భంగా కొంతమంది ఫేక్ ఫ్యాన్స్‌తో కలిసి ప్రసన్న సాహో డబ్బులు వసూలు చేసి కమర్షియల్ ఈవెంట్స్ చేస్తున్నారని ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఉండి వాసు ఆరోపించారు. ఆ ఈవెంట్‌ని కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే తాను ఎలాంటి కమర్షియల్ ఈవెంట్ చేయడం లేదని ప్రసన్న సాహో వర్గం వివరణ ఇచ్చింది. (చదవండి: రేణు దేశాయ్ ఇంట చండీ హోమం)ఎవరి దగ్గర తాను డబ్బులు తీసుకోలేదని, కావాలనే తనను టార్గెట్ చేశారంటూ ప్రసన్న మండి పడ్డారు. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా మెగా బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తామని ప్రసన్న సాహో వర్గం వెల్లడించింది.(చదవండి: టాప్ హీరో ఫ్యామిలీ నుంచి పూరీ జగన్నాథ్‌కు ఆఫర్)కాగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్‌డేని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకునేందుకు దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 23న ఆయన కొత్త సినిమాల అప్డేట్స్ రావడంతో పాటు ఆయన నటించిన ఆరు సినిమాలు రీరిలీజ్ అవుతుండడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. బర్త్‌డే రోజు మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, ఛత్రపతి, ఈశ్వర్, రెబల్, సలార్ చిత్రాలు రీరిలీజ్ చేస్తున్నారు. -
నాజూగ్గా ప్రియాంక చోప్రా, స్టైయిలిష్ లుకికి ఫ్యాన్స్ ఫిదా (ఫొటోలు)
-
అందరికీ ధన్యవాదాలు
సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థత కారణంగా గత సోమవారం రాత్రి చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన గుండెలోని రక్తనాళానికి వాపు రావడంతో వైద్యులు శస్త్ర చికిత్స లేకుండా స్టెంట్ అమర్చారు. శుక్రవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు రజనీ. వైద్యులు ఆయనకు 15 రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కాగా రజనీ అనారోగ్యానికి గురైన విషయం తెలిసి ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక అభిమానులైతే గుళ్లు, గోపురాలు, చర్చిలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రజనీకాంత్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ‘‘నేను ఆస్పత్రిలో ఉన్నప్పుడు త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ నాయక మిత్రులకు, సినీ రంగానికి చెందిన స్నేహితులకు, నా క్షేమం కోరిన మీడియా మిత్రులకు, నన్ను బతికిస్తున్న ఫ్యాన్స్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని రజనీకాంత్ పేర్కొన్నారు. – సాక్షి ప్రతినిధి, చెన్నైఆస్పత్రి నుంచి గోవిందా డిశ్చార్జ్బాలీవుడ్ నటుడు గోవిందా ఈ నెల 1న తన వ్యక్తిగత తుపాకీ పొరపాటున పేలడంతో కాలికి గాయాలై ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. శుక్రవారం వైద్యులు ఆయన్ను డిశ్చార్జ్ చేసి, కొన్ని రోజులపాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. వీల్‌ఛైర్‌లో ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన గోవిందాను పలువురు అభిమానులు పరామర్శించారు. ‘‘ప్రస్తుతం క్షేమంగా ఉన్నాను. నేను త్వరగా కోలుకోవాలనిప్రార్థించినవారికి కృతజ్ఞతలు’’ అని గోవిందా తెలిపారు. -
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యమని యువతకు హీరో జూ. ఎన్టీఆర్ పిలుపు
-
Sanam Saeed: ప్రైడ్ ఆఫ్ పాకిస్తాన్.. ఫ్యాన్ ఆఫ్ ఇండియా!
సనమ్ సయీద్.. బ్రిటిష్ పాకిస్తానీ మోడల్, నటి, గాయని కూడా! ఉర్దూ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ప్రసిద్ధురాలు. మన దగ్గరా ఆమెకు ఘనమైన అభిమానగణం ఉంది. జీ5, హమ్ చానళ్ల వీక్షకులకు ఆమె సుపరిచితం.సనమ్ పుట్టింది లండన్‌లో. తన ఆరేళ్ల వయసులో ఆమె కుటుంబం పాకిస్తాన్‌లోని కరాచీకి వెళ్లి, స్థిరపడింది. ప్రాథమిక విద్యాభ్యాసం కరాచీలో, ఉన్నత విద్యాభ్యాసం లాహోర్‌లో గడిచింది. ఫిల్మ్ అండ్ థియేటర్ స్టడీస్‌లో డిగ్రీ చేసింది.ఆమె తన పదహారవయేట నుంచి మోడలింగ్ మొదలుపెట్టింది. పదిహేడేళ్లప్పుడు ఎమ్‌టీవీ (పాకిస్తాన్)లో వీజేగా కనిపించింది.‘షికాగో’ అనే నాటకంతో రంగస్థల ప్రవేశం చేసింది. అందులోని ఆమె నటనకు ప్రేక్షకులు నీరాజనం పట్టారు. దాంతో ఆమెకు టీవీ సీరియల్స్‌లోనూ అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. ‘దామ్’ అనే సీరియల్‌తో బుల్లితెర ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇటు నాటకాలు, అటు సీరియళ్లతో బిజీగా ఉన్న సమయంలో కోక్ స్టూడియో పాకిస్తాన్లో తన గళాన్ని వినిపించి.. తనలోని గాన ప్రతిభనూ చాటుకుంది.సనమ్ మల్టీటాలెంట్ ఆమెను వెండితెరకూ పరిచయం చేసింది ‘బచానా’ అనే ఉర్దూ సినిమాతో! ‘మాహ్ ఎ మీర్’, ‘దొబారా ఫిర్ సే’, ‘ఇశ్రత్ మేడ్ ఇన్ చైనా’ వంటి సినిమాలు ఆమెకు మంచి పేరుతెచ్చిపెట్టాయి.సనమ్‌ను మనకు ఇంట్రడ్యూస్ చేసి.. ఇక్కడ ఆమెకు పాపులారిటీ తెచ్చిపెట్టిన సీరియల్ ‘జిందగీ గుల్జార్ హై’. ఇది హమ్ టీవీలో ప్రసారం అయింది. ఈ సీరియల్ ఆమెకు ఇండియన్ ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచింది.ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఆమెకున్న ఫేమ్‌ను చూసి ఓటీటీ కూడా ఆమెకు ప్లేస్ ఇచ్చింది.. ‘కాతిల్ హసీనాఓం కే నామ్’తో! ఇది జీ5లో స్ట్రీమ్ అవుతోంది.మోడలింగ్, థియేటర్, టీవీ, సినిమా, ఓటీటీ, సింగింగ్.. ఇలా అడుగిడిన ప్రతి రంగంలో ఆమెకు ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు దక్కాయి. అందులో ఒకటి ‘ప్రైడ్ ఆఫ్ పాకిస్తాన్’.'ఇండియాలో నాకు ఫ్యాన్స్ ఉండటం అనిర్వచనీయమైన ఆనందం. ఇండియన్స్ పరాయివాళ్లన్న భావన నాకెన్నడూ లేదు. ఎప్పుడో.. ఎక్కడో తప్పిపోయి.. వేరువేరు ఇళ్లల్లో పెరిగిన తోబుట్టువుల్లా తోస్తారు. ఇప్పుడు నా సీరియల్స్, సిరీస్‌తో వాళ్లను కలుసుకుంటున్నట్టనిపిస్తోంది.'ఇవి చదవండి: ఊహించని వేగంతో.. అంతర్జాతీయ స్థాయిలో.. ఆఫ్రికా బోల్ట్! -
సల్మాన్ చేతికి ఖరీదైన వాచ్ : తెగ ఫీలైపోతున్న ఫ్యాన్స్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సొంతమైన ఖరీదైన వాచ్‌లను ధరించడం కొత్తేమీ కాదు. డైమండ్స్ పొదిగిన ఖరీదైన వాచీలు అంటే సల్మాన్‌కు చాలా ప్రీతి. తాజాగా ఖరీదైన వాచ్‌తో ఓ ఫొటోకు పోజివ్వడం అందర్నీ ఆకర్షించింది.విలాసవంతమైన వాచ్ కంపెనీ జాకబ్ అండ్ కో బిలియనీర్ III వాచ్‌ను ధరించాడు. అంతేకాదు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు జాకబ్ అరబోను ఆలింగనం చేసుకోవడం కనిపించింది. జాకబ్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో దీనికి సంబంధించిన వీడియోను పంచుకున్నాడు. ఇందులో జాకబ్ తన స్వహస్తాలతో 714 వజ్రాలు పొదిగిన గడియారాన్ని సల్మాన్‌కు అలంకరించాడు. తాను ఎపుడు ఎవర్నీ బిలియనీర్ వాచ్‌ని ట్రై చేయనీయలేదు, కానీ సల్మాన్ అందుకు మినహాయింపు అంటూ వీడియోను షేర్ చేశాడు. దీంతో అభిమానులు బీటౌన్ టైగర్, స్టార్ పవర్ ఆ వాచ్కే అందం తెస్తాడు స్పందించారు. అయితే సల్మాన్ ఖాన్ ఖరీదైన వాచ్ పెట్టుకోవం కాదు. ఈ గడియారాన్ని సల్మాన్ ఖాన్ ధరించడమే విశేషం, సల్మాన్ పెట్టుకోవడం వల్లే దానికి వాల్యూ వచ్చింది, లివింగ్ లెజెండ్, బాస్ ఆఫ్ బాలీవుడ్ అంటూ మరికొంతమంది ఫ్యాన్స్ తెగ ఫీలయి పోతున్నారు. View this post on Instagram A post shared by Jacob Arabo (@jacobarabo)రూ. 41.94 కోట్ల వాచ్ విశేషాలు జాకబ్ అండ్ కో కంపెనీ సంబంధించిన చాలా ప్రత్యేకమైన వాచ్ బిలియనీర్ III . ఇవి ప్రపంచవ్యాప్తంగా కేవలం 18 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీని కేస్, లోపలి రింగ్‌పై 152 ఎమరాల్డ్ కట్ డైమండ్స్, అదనంగా 76 వజ్రాలు మరింత ఆకర్షణీయంగా పొదిగారు. 57 బాగెట్-కట్ డైమండ్స్‌తో ,బ్రాస్లెట్లో మొత్తం 504 తెల్లని పచ్చ-కట్ డైమండ్స్‌తో కలిపి మొత్తం న 714 అద్భుతమై వజ్రాలతో దీన్ని రూపొందించారు. జాకబ్ అండ్ కో వెబ్సైట్ ప్రకారం, బిలియనీర్ III ధర. రూ. 41.94 కోట్లు. View this post on Instagram A post shared by Jacob Arabo (@jacobarabo) -
సల్మాన్ క్రేజ్.. ఇలాంటి ఫ్యాన్స్ కూడా ఉన్నారా?
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ క్రేజే వేరే లెవెల్. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఫ్యాన్స్ ఉన్న హీరోల్లో సల్మాన్ ముందుంటారు. ఇటీవల ఓ ఈవెంట్లో వేదికపై చిన్నపిల్లాడి అభిమానంతో సల్మాన్ కాళ్లకు నమస్కరించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలైంది. తాజాగా బిగ్‌బాస్-18 సెట్స్‌లోనూ ఆయన ఓ అభిమానితో ముచ్చటించారు.సల్మాన్ ఖాన్‌ను చూసిన ఆమె సంతోషంతో ఉప్పొంగిపోయింది. మీకోసం నేను దేవుడిని ప్రార్థించానంటూ సల్మాన్ పట్ల తన అభిమానాన్ని చాటుకుంది. ఆమె చెబుతున్న మాటలను సల్మాన్ ఖాన్ ఆసక్తిగా విన్నారు. కొద్దిసేపు ఆమెతో ముచ్చటించారు. దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో ఫ్యాన్స్ అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏ మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. సల్మాన్ ఖాన్ చివరిగా 'టైగర్ 3'లో కత్రినా కైఫ్ సరసన నటించారు. ప్రస్తుతం ఆయన 'సికందర్'మూవీలో కనిపించనున్నాడు, ఈ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సల్మాన్ సరసన రష్మిక మందన్నా స్క్రీన్ పంచుకోనుంది. అంతేకాకుండా కమల్ హాసన్- అట్లీ మూవీలోనూ సల్మాన్ నటించనున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) -
హద్దులు దాటిందెవరు?.. మోసం చేసిందెవరు??
మెగాస్టార్‌గా పేరోందిన ప్రఖ్యాత నటుడు చిరంజీవి కుటుంబం, ఆయన బంధువుల మద్య విభేదాలు ఏర్పడ్డాయా? అనే చర్చ అటు సినీ వర్గాల్లోను.. ఇటు రాజకీయ వర్గాల్లోను జోరుగా సాగుతోంది. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభిమానులకు, జాతీయ ఉత్తమ నటుడి అవార్డు పొందిన మరో స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు మధ్య తీవ్రస్థాయిలో రగడ జరుగుతోంది. దీనికి తొలుత పవన్ కళ్యాణే అజ్యం పోయడం విశేషం. తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొల్లిశెట్టి శ్రీనివాస్ అల్లు అర్జున్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అర్జున్ ఏమైన పుడింగా అంటూ ప్రశ్నించారు. ఆయనకు తోడుగా మరికొందరు జనసేన నేతలు సైతం అర్జున్ను కించపరుస్తూ విమర్శలు కురిపించారు. దీంతో మెగా కుటుంబంలో విభేదాలు ఏర్పడ్డాయి అనే అభిప్రాయం వచ్చింది. చిరంజీవి సినిమాల్లో స్వయంగానే ఎదిగినా, ఆయన మామ మరో ప్రఖ్యాత నటుడు అల్లు రామలింగయ్య ప్రభావంతో కూడా బాగా అభివృద్ది చెందారు. అల్లు రామలింగయ్య కుమార్తెను ఆయన వివాహం ఆడారు. బావ మరిది అల్లు అరవింద్‌తో కలిసి పలు హిట్ సినిమాలు తీశారు. చిరంజీవి, అల్లు అరవింద్‌లు ఒక బ్రాండ్‌గా మారారు. ఆ తర్వాత కాలంలో.. చిరంజీవి సోదరులు నాగబాబు, పవన్ కల్యాణ్‌లు సినీరంగంలోకి రాగా... పవన్ కల్యాణ్ ఒక క్రేజ్ తెచ్చుకున్నారు. తదుపరి తరంలో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ్ సినీరంగంలోకి వచ్చి వెలుగొందుతున్నారు. ఇదే కుటుంబంకు చెందిన వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ సినీ రంగంలో తమ ప్రభావాన్ని చూపుతున్నారు. మరోవైపు అల్లు అరవింద్ పెద్ద నిర్మాతగా పెరగడమే కాకుండా, ఆయన కుమారుడు అల్లు అర్జున్ స్టార్ హిరో అయ్యారు. మాస్ ఫాలోయింగ్‌ను తెచ్చుకున్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్‌లు రాజకీయాల్లోకి వెళ్లారు. గెలుపు ఓటములు చవిచూశారు. అల్లు అర్జున్ రాజకీయాల జోలికి వెళ్లలేదు. కానీ.. ఈ మధ్య నంద్యాలలో ఎన్నికల సమయంలో తన స్నేహితుడు అయిన వైఎస్సార్సీపీ అభ్యర్ధి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి దగ్గరికి వెళ్లి వచ్చారు. కాని అక్కడ ఆయన ఎన్నికల ప్రచారం చేసింది లేదు. ఆయన రాక తెలిసి పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి వచ్చారు. అది పవన్ కల్యాణ్‌కు జనసేన మద్దతుదారుల కోపానికి కారణం అయ్యింది. 2019 ఎన్నికల సమయంలో కూడా అర్జున్ వెళ్లివచ్చినా అప్పుడు విమర్శలు రాలేదు. ఈ సారి ఎందుకో పవన్ కళ్యాణే పరోక్షంగా బయటపడిపోయారు. బెంగుళూరులో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో అటవీ పర్యావరణ శాఖ మంత్రి హోదాలో మాట్లడుతూ, కలప స్మగ్లింగ్ ప్రస్తావన తెచ్చారు. ఆ క్రమంలో సినీ హీరోలు స్మగర్ల పాత్రలు వేస్తున్నారని అక్షేపణ తెలిపారు. ఇది అల్లు అర్జున్ను ఉద్దేశించే అని, అయనపై ద్వేషంతోనే పవన్ కల్యాణ్ మాట్లాడారని అర్జున్ అభిమానులు భావించారు. .. దానిపై రకరకాల కామెంట్స్ సోషల్ మీడియాలో సాగాయి. దీనికి అల్లు అర్జున్ పరోక్షంగానే సమాధానం ఇస్తూ... తాను తన మిత్రుల కోసం తగ్గేదేలే అని స్పష్టం చేసారు. దీనితో పవన్ అభిమానులు మరింత అగ్రహం చెందారు. ఆ టైంలో అల్లు అర్జున్‌కు మద్దతుగా మామ చంద్రశేఖర్ రెడ్డి టీవీలకు ఇంటర్వూలు ఇచ్చారు. అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.. హద్దులు దాటి మాట్లాడారు. అల్లు అర్జున్ ఏమైనా పుడింగా? అని ప్రశ్నించారు. అయనకు ఫ్యాన్స్ ఎవరు ఉన్నారు?ఉన్నదంతా మెగా ఫ్యాన్స్. బ్రాంచీలు, షామియానా కంపెనీల గూరించి తెలియదంటూ ఏవేవో మాట్లడేశారు. దీంతో ఈ వివాదం చినికి చినికి గాలి వానగా మారింది. అల్లు అర్జున్ ఒక్క చోటకు వెళితే అక్కడ కూడా ఓటమే జరిగిందని... ఆయన తండ్రి అరవింద్‌ను గతంలో అర్జున్ గెలిపించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. నిజానికి బొలిశెట్టి ఇలా రియాక్ట్ కానక్కర్లేదు. అర్జున్‌కు కొంత మెగా బ్రాండ్ ఉపయోగపడితే ఉపయోగపడి ఉండవచ్చు. అలాగని ఆయన తండ్రి అరవింద్‌కు ఉన్న సామర్థ్యం తెలియనిది కాదు. ప్రముఖ నిర్మాతగానే కాకుండా సినిమా ఫీల్డ్‌లోని ఇతర విభాగాలలో ఆయనకు చాలా పట్టు ఉంది. అరవింద్ కావాలనుకుంటే అర్జున్‌తో ఎన్నో సినిమాలు నిర్మించగలరు. అలాగే.. అర్జున్‌కు సినీ రంగంలో ఎంతో డిమాండ్ ఉంది. జనసేన నేతలు అలాంటి వ్యక్తిని బెదిరించడం సబబు కాదు. మరో జనసేన నేత అయితే అల్లు అర్జున్ సినిమాలు ఎలా ఆడతాయో చూస్తామని రెచ్చిపోయారు. ఇది చాలా తప్పు. రాజకీయాలు వేరు. సినిమాలు వేరు. ఆ సంగతి విస్మరించి మాట్లాడితే దానివల్ల పవన్ కల్యాణ్‌కు కూడా నష్టం జరగవచ్చు. కేవలం పవన్ మెప్పు కోసం బొలిశెట్టికాని మరికొందరు కాని అలా మాట్లాడినట్టు అనిపిస్తోంది... అర్జున్ నంద్యాల వెళితే అక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్ధి గెలవలేదని వీరు ఎత్తిపొడిచారు. అది ఎలా ప్రామాణికం అవుతుందో అర్థం కాదు. ఆ మాటకు వస్తే, ఎన్నికలలో ఇంతకుముందు చిరంజీవి ఒక చోట, పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు. అంత మాత్రాన వారికి అభిమానులు లేరని, పలుకుబడి లేదని ఏవరైన అన్నారా?. సినిమా పాత్రలకు రాజకీయ పాత్రలకు సంబంధం పెట్టదలిస్తే పవన్ కల్యాణ్ సంబంధించి ఎన్నో ఉదాహరణలు దోరుకుతాయి. అయన తన సినిమాల్లో అడపిల్లలను సరాదాగా అయినా వేధించిన సన్నివేశాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు దాన్ని తప్పు పట్టగలమా? చిరంజీవి నెగెటివ్ రోల్స్ కూడా పోషించారు. మరి సినిమా హిరోలు ఎవరూ అలాంటి పాత్రలు పోషించకూడదు అన్నది పవన్ అభిప్రాయం అయితే.. ఇక నుంచి ఆయన అలాంటి పాత్రలు వేయకూడదు. ఆ మాటకు వస్తే.. సినిమాల్లో హిరోగా ఎన్నో డైలాగ్‌లు చెప్పిన అయన రాజకీయాల్లో పూర్తి విరుద్ధంగా అబద్ధాలు, మాటలు మార్చడం వంటివి ఎన్నో చేస్తున్నారు. అనేక విషయాల్లో పొంతన లేకుండా మాట్లడుతున్నారు. సూపర్ సిక్స్ అంటూ మోసపూరిత హమీలు ఇచ్చారు. అదర్శాలు వల్లించే ఒక సినీ హిరో ఇలా మోసం చేయవచ్చా? అంటే ఏమని సమాధానం ఇస్తారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంతో సినీ, రాజకీయ రంగం మధ్య సంబంధాలు పెరిగాయి. ఎన్టీఆర్ కంటే చంద్రబాబు సినిమా వాళ్లను ఎక్కువగా వాడుకోగలిగారని అంటారు. కోట శ్రీనివాస్ రావు అప్పట్లో ఒక రాజకీయ సినిమాల్లో ఎన్టీఆర్ పాత్ర పోషిస్తే, ఆయన అభిమానులు ఆయనపై దౌర్జన్యం చేసారు. ఆ సంగతి తెలిసిన ఎన్టీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌కు, కృష్ణకు రాజకీయాల్లో అసలు పడేది కాదు. ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా కృష్ణ విజయ నిర్మల ప్రచారం చేశారు. చిరంజీవి, బాలకృష్ణలతో కలిసి విభిన్నమైన పాత్రల్లో నటించిన రోజా వైఎస్సార్సీపీ పక్షాన ఎమ్మెల్యే, మంత్రి అయ్యారు. రాజకీయంగా పరస్పర విమర్శలు కూడా సాగాయి. గతంలో మాగుంట సుబ్బిరామి రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటి చేసినప్పుడు అయనతో వ్యక్తిగత సంబంధాల రిత్యా కొంత మంది సినీ నటులు ప్రచారం చేసేవారు. చిరంజీవి కూడా అలాగే కొందరికి మద్దతు ఇచ్చారు. ఇప్పటికి ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నట్టుగా లెక్క. కాని ఇటీవలి ఎన్నికలలో జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్, బీజేపీ అభ్యర్ధి సియం రమేష్‌కు ఓపెన్‌గా మద్దతు ఇచ్చారు. మరి దాన్ని సమర్ధించాలా... తప్పుబట్టాలా?. గతంలో విజయశాంతి ఒంగోలులో సుబ్బిరామిరెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు. సినీనటి సౌందర్య రాజకీయాల్లో లేకపోయినా బీజేపీకి ప్రచారం చేయడానికి వస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఇలా రాజకీయ, సినీ రంగాలకు అవినాభావ సంబంధాలు కొనసాగుతున్నాయి. అంత మాత్రన వారు నటించిన పాత్రలకు, వారు మద్దతు ఇచ్చిన రాజకీయ పార్టీలకు లింక్ చేసి విమర్శించడం అర్థ రహితమే కావచ్చు.ఈ నేపథ్యంలో మెగా కుటుంబంలో తగాదాలు ఏర్పడ్డాయన్న భావన వస్తుంది. గతంలో పవన్‌కు, చిరంజీవి, నాగబాబులకు మధ్య గ్యాప్ వచ్చిందని అనేవారు. నాగబాబు అయితే నేరుగా పవన్ అభిమానులపై చిరాకుపడ్డారు. కానీ ఆ తర్వాత వీరంతా కలిసిపోయారు. ఇప్పుడు కూడా అలాగే జరగవచ్చు. అల్లు అర్జున్ తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోయి, వీళ్లతో రాజీపడతారా? లేదా? అనేది అప్పుడే చెప్పలేం. ఇవి అన్నీ పరిశీలిస్తే పవన్ కల్యాణ్ అభిమానులు ఈ మధ్య మరీ రెచ్చిపోయి ఇలాంటి కామెంట్ల రూపంలో పిచ్చి పనులు చేస్తున్నారేమో అనిపిస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు పాలన అనుభవం లేదంటూ మాట్లాడి పరువు తీసుకున్నారు. ముందు ఆయనకు తన అభిమానులుగాని, జనసేన కార్యకర్తలు కాని తగు సలహాలు ఇచ్చి, ఆ తర్వాతే ఇంకెవరి జోలికైనా వెళితే బెటర్.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అల్లు అర్జున్ ఏమైనా పుడింగా? అసలు ఫ్యాన్స్ ఉన్నారా?: జనసేన ఎమ్మెల్యే
అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఉన్నట్టు నాకు తెలియదు. మెగా కుటుంబం నుంచి విడిపోయి ఎవరైనా ఫ్యాన్స్ బ్రాంచిలు, షామియానా కంపెనీలులాగా పెట్టుకుంటే మేం చెప్పలేం. తనకు ఫ్యాన్స్ ఉన్నారని అల్లు అర్జున్ ఊహించుకుంటున్నారేమో! ఆయన స్థాయి మరిచి మాట్లాడుతున్నారు. జాగ్రత్తగా మాట్లాడాలి. అలా కాదని.. నేను పెద్ద పుడింగిని, నా కిష్టమైతేనే వస్తా అంటే.. ఎవడికి కావాలి? మానేయ్ వెళ్లిపో.. ఆయన వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? – జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి తాడేపల్లిగూడెం: ‘అల్లు అర్జున్ ఏమైనా పుడింగా.. ఆయనకు అసలు ఫ్యాన్స్ ఉన్నారా? ఉన్నది మెగా ఫ్యాన్సే’ అని తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మెగా, అల్లు కుటుంబాల మధ్య జరుగుతోన్న వార్ గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు పై విధంగా బొలిశెట్టి స్పందించారు. అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఉన్నట్టు తనకు తెలియదన్నారు. మెగా కుటుంబం నుంచి విడిపోయి ఎవరైనా ఫ్యాన్స్ బ్రాంచిలు, షామియానా కంపెనీలులాగా పెట్టుకుంటే మేం చెప్పలేం అని వ్యాఖ్యానించారు. ఉన్నదే మెగా ఫ్యాన్స్, ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ అని అంతే తప్ప అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ ఉన్నట్లు తనకు తెలియదన్నారు. తనకు ఫ్యాన్స్ ఉన్నారని అల్లు అర్జున్ ఊహించుకుంటున్నారేమో అని, ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారని, జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందని అన్నారు. అల్లు అర్జున్‌లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్ అభిమానులు వారి హీరోలను చూసుకుంటున్నారన్నారు. ‘ఆయనను కాదని.. నేను పెద్ద పుడింగిని, నా కిష్టమైతే వస్తా అంటే, మానేయ్ వెళ్లిపో..ఎవడికి కావాలి? అల్లు అర్జున్ను రమ్మని అడిగారా? ఆయన వస్తే ఏంటి, రాకపోతే ఏంటి? 21 చోట్ల పోటీ చేస్తే 21 చోట్ల మేం నెగ్గాం’ అని బొలిశెట్టి వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ ఒక చోటకు వెళితే అక్కడ కూడా ఓటమి వచ్చిందన్నారు. అల్లు అర్జున్ తండ్రి ఎంపీగా నిలబడినప్పుడే అర్జున్ నెగ్గించుకోలేకపోయారని, అందరినీ విమర్శించడం మంచిది కాదన్నారు. -
ఆస్పత్రిలో ఊర్వశి రౌతేలా.. లక్ష గులాబీలు పంపిన అభిమానులు (ఫోటోలు)
-
రానా గొప్ప మనసు.. అభిమాని కోసం ఏకంగా!
టాలీవుడ్ హీరో రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి చిత్రం భల్లాలదేవుని పాత్రలో ప్రేక్షకుల స్థిరస్థాయిగా నిలిచిపోయారు. ప్రస్తుతం రానా కోలీవుడ్ సూపర్‌స్టార్ రజినీకాంత్ మూవీ వెట్టయాన్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆ తర్వాత రానా నాయుడు సీజన్-2లోనూ కనిపించనున్నారు. అమెరికన్ టీవీ సిరీస్ రే డొనోవన్‌కు రీమేక్‌గా దీనిని రూపొందిస్తున్నారు.ప్రస్తుతం రానా అమెరికాలోని చికాగోలో పర్యటిస్తున్నారు. అక్కడే ఆయన బాక్సింగ్ షో ఈవెంట్లకు కామెంటేటర్‌గా వ్యవహరించనున్నారు. తాజాగా ఆయన ఓ అభిమాని కోసం ఏకంగా కారును ఆపి మరి పలకరించారు. తన కారు వెంట అభిమాని ఫ్యామిలీతో రావడం గమనించిన రానా.. రోడ్డు పక్కన కారు నిలిపి వారికి సర్ప్రైజ్ ఇచ్చారు. అక్కడే అతని ఫ్యామిలీతో, అభిమానులతో సరదాగా మాట్లాడుతూ ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Rana Daggubati ❤️ Diehard Fans (@ranadaggubatif) -
రవితేజను భయపెట్టిన అభిమాని.. అసలేం జరిగిందంటే?
మాస్ మహారాజా రవితేజ- హరీశ్ శంకర్ కాంబోలో వస్తోన్న యాక్షన్ చిత్రం 'మిస్టర్ బచ్చన్'. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ నెల 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడతుండడంతో చిత్రబృందం ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.తాజాగా మిస్టర్ బచ్చన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కర్నూలులో గ్రాండ్‌గా నిర్వహించారు. నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో జరిగిన ఈవెంట్లో డైరెక్టర్‌తో పాటు చిత్రయూనిట్ సభ్యులంతా హాజరయ్యారు. అయితే ఈవెంట్ మధ్యలో రవితేజ మాట్లాడుతుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఓ అభిమాని ఒక్కసారిగా స్టేజీపైకి దూసుకొచ్చాడు. దీంతో రవితేజ అతన్ని ఆగు ఆగు గట్టిగా అరుస్తూ.. అభిమాని వద్దకు వెళ్లి అలా రాకూడదని అతనికి సూచించాడు. ఇలా వచ్చి మమ్మల్ని భయపెట్టకండ్రా బాబు.. అలా టప్పున వచ్చేస్తే మే భయపడతాం అంటూ రవితేజ నవ్వుతూ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Orai Ila Tappana Rakandra Babu Bayapadtham 😂😂🔥🔥🔥🔥#RaviTeja #MrBachchan pic.twitter.com/XBBfgSBlCe— Srinivas (@Srinivasrtfan2) August 12, 2024 -
పవన్ కు అల్లు ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్..
-
విశాఖలో రెచ్చిపోయిన పవన్ అభిమానులు.. నడిరోడ్డుపై కొట్లాట
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో పవన్ కల్యాణ్ అభిమానులు రెచ్చిపోయారు. రద్దీగా ఉండే రోడ్డుపై ఏకంగా ముష్టి యుద్దానికి దిగారు. రెండు వర్గాలుగా విడిపోయి సినిమా స్టైల్లో దాడికి దిగారు. గోపాలపట్నం బాజీ జంక్షన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. అసలు అభిమానుల మధ్య గొడవకు కారణాలు తెలియలేదు కానీ.. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఒక్కసారిగా రోడ్డు మీద జరుగుతున్న కొట్లాటతో స్థానికులు విస్తుపోయారు. వీరిని ఆపేందుకు స్థానికులు ప్రయత్నించినా.. పట్టించుకోకుండా రోడ్డుపైనే వీరంగం సృష్టించారు. విద్యార్ధుల కొట్లాట కారణంగా రహదారిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది.విశాఖపట్నంలో నడిరోడ్డుపై రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్న విద్యార్థులు. pic.twitter.com/ujyKm8CA4D— Telugu Scribe (@TeluguScribe) August 6, 2024 -
వినుకొండ పర్యటన అనంతరం వైఎస్ జగన్ ట్వీట్
-
యూరో ఛాంపియన్స్‌కు గ్రాండ్ వెల్కమ్.. జనసంద్రంలా మారిన మాడ్రిడ్ (ఫొటోలు)
-
ఇడుపులపాయకు భారీగా తరలివచ్చిన YSR అభిమానులు
-
వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గురువారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలో భద్రతా వైఫల్యం సృష్టంగా కనిపించింది. తమ అభిమాన నేతను చూసేందుకు వేలాది మంది వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు తరలి రావడంతో వారిని కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. హెలిప్యాడ్ వద్దకు వేలాది మంది దూసుకు రావడంతో వైఎస్ జగన్ హెలికాప్టర్ నుంచి దిగేందుకు కొద్ది సేపు సంశయించాల్సి వచ్చిందంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గురువారం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో ములాఖత్ అయ్యేలా పర్యటన ఖరారైంది. నెల్లూరు రూరల్ పరిధిలోని కనపర్తిపాడు జెడ్పీ హైస్కూల్ ఆవరణలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు.అక్కడ నుంచి నేరుగా వాహనంలో జాతీయ రహదారి మీదగా నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు వెళ్లి వచ్చేలా పర్యటన ఏర్పాట్లు చేశారు. అయితే మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత హోదాలో వైఎస్ జగన్ పర్యటనకు జిల్లా పోలీస్ యంత్రాంగం సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు. దాదాపు 80 మంది పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశామని చెబుతున్నప్పటికీ, అంతా హెలికాప్టర్ దిగే ప్రదేశం వద్దకే వేలాది మంది అభిమానులు దూసుకొచ్చి చుట్టు ముట్టేశారు.కనీసం రోప్ పార్టీ కూడా లేని పరిస్థితి. దీంతో తన వ్యక్తిగత సిబ్బంది సాయంతో అభిమానులు తోపులాటల మధ్య వైఎస్ జగన్ హెలికాప్టర్ దిగి, వాహనం వద్దకు చేరుకున్నారు. హైస్కూల్ ఆవరణలో అభిమానుల్ని కంట్రోల్ చేసేందుకు బారికేడ్లు ఏర్పాటు చేశారు కానీ, తగినంత పోలీస్ సిబ్బంది మాత్రం లేరు. దీంతో అభిమానుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు హెలిప్యాడ్ వద్దకు వచ్చేందుకు కూడా అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. చాలా మంది హెలిప్యాడ్ వద్ద జగన్‌ను కలవలేకపోయారు. ఇదీ చదవండి; పద్ధతి మార్చుకో.. చంద్రబాబుకు వైఎస్ జగన్ హెచ్చరికవైఎస్సార్సీపీ నేతల్లో ఆందోళన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించిందని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ శాఖ అభిమానుల్ని కంట్రోల్ చేయలేక చేతులెత్తేయడంతో అభిమానుల ముసుగులో ఎవరైనా ఆయనకు ఏదైనా ప్రమాదం తలపెట్టే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. వేలాది మంది హెలికాప్టర్‌ను చుట్టేయడంతో జగన్ వ్యక్తిగత సిబ్బంది కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆ సమయంలో అభిమానుల ముసుగులో టీడీపీ మూకలు ఆయనపై దాడి చేసే అవకాశం ఉందని, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు చూస్తున్న నేపథ్యంలో ఈ సందేహం వస్తోందని ఆ పార్టీ నేత ఒకరు అన్నారు. గతంలో విజయవాడలో ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్‌పై రాయితో హత్యాయత్నం చేశారని గుర్తు చేశారు. -
విజయవాడలో బుజ్జిని చూసేందుకు ఎగబడ్డ ఫ్యాన్స్ (ఫోటోలు)
-
ఆదిపురుష్ డైరెక్టర్ ని వదలని ఫ్యాన్స్.. కల్కి, హనుమాన్ ని చూసి..
-
మమ్మీ నేను కేసీఆర్ ను కలిసినా
-
సిక్కోలులో తండేల్ టీమ్.. చైతూకు మాస్ వెల్కమ్!
అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం తండేల్ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమావలో చైతూ సరసన హీరోయిన్గా సాయిపల్లవి కనిపించనుంది. గతంలో వీరిద్దరు జంటగా లవ్ స్టోరీ చిత్రంలో నటించారు. మరోసారి ఈ జోడీ వెండితెరపై సందడి చేయనున్నారు. సముద్ర జాలర్ల బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను తెరెకెక్కిస్తున్నారు.అయితే ప్రస్తుతం తండేల్ మూవీ షూటింగ్ శ్రీకాకుళంలో జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీకాకుళం విచ్చేసి యువసామ్రాట్ నాగ చైతన్యకు అదిరిపోయే స్వాగతం లభించింది. రోడ్ల వెంట బ్యానర్లు ప్రదర్శిస్తూ.. టపాసులతో అభిమానులు వెల్కమ్ చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వైరలవుతున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్ మాస్ వెల్కమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అనంతరం తండేల్ టీమ్ అంతా అరసవెల్లి సత్యనారాయణ స్వామివారిని ఆమె దర్శించుకున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ సాయిపల్లవిని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు అభిమానులతో నిండిపోయాయి. పక్కనే నాగచైతన్య కూడా ఉండడంతో ఫ్యాన్స్ హడావుడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా.. తండేల్ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 20న రిలీజ్ చేయనున్నారు.Fans Celebrating Visuals Before Chay Arrival !! #ChayMass 💥 Dhullakotti Dhupameseyyala .. #Thandel ♥️⚓ Guri Thappedheles #NagaChaitanya @chay_akkineni Nuvvante Abhimanam Gundela Ninda Kani Thanks Custody Lu Antene Badha🙇Jai Chaithu Jai Jai Chaithu 💥🥳 https://t.co/SCGOeQ58el pic.twitter.com/KPv62UssGT— Chay (@PurnaMaaya_) June 19, 2024Srikakulam resonated with "Jai chaithu" slogans 🔥❤🔥🤙Yuva Samrat @chay_akkineni arrived to srikakulam for #Thandel Shoot ⚓#Nagachaitanya @ThandelTheMovie @GeethaArts pic.twitter.com/6TiK9owOGC— AKKINENI TO AKKINENI FANS ASSOCIATION FANS (@chayfanschitvel) June 19, 2024తండేల్ చిత్రీకరణ కోసం శ్రీకాకుళం వెళ్లిన నాగచైతన్య ,సాయి పల్లవి కి అభిమానులు ఘనస్వాగతం పలికారు. అరసవల్లి టెంపుల్ దర్శనం కు వెళ్లిన సాయిపల్లవి చూసెందుకు ఫ్యాన్స్ ఉత్సాహాం చూపారు..#nagachaitanya #Saipallavi#Thandel #ramayan pic.twitter.com/5WgINPftRN— suzen (@Suzenbabu) June 19, 2024 -
ఫ్యాన్స్‌కు ఊహించని షాక్ ఇచ్చిన పుష్పరాజ్
-
అమెరికాలో విజయ్ దేవరకొండ క్రేజ్ చూశారా.. మామూలుగా లేదు!
కొత్త ఏడాదిలో ఫ్యామిలీ స్టార్‌తో హిట్ కొట్టిన టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ అతనికి జంటగా నటించింది. పరశురామ్ పెట్ల డైరెక్షన్లో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ప్రస్తుతం ఆయన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. అయితే తాజాగా మన యంగ్ హీరో విజయ్ దేవరకొండ అమెరికాలో సందడి చేశారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నారు. విజయ్ను చూసిన అక్కడి అభిమానులు సెల్ఫీల కోసం పోటీపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది చూసిన అభిమానులు ఎక్కడికెళ్లినా విజయ్ క్రేజ్ వేరే లెవెల్ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. ప్రస్తుతం విజయ్- గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ గూఢచారి పాత్రలో కనిపించనున్నాడు. అలాగే రవికిరణ్ కోలా డైరెక్షన్లో ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. వీటితో పాటు రాహుల్ సంకృత్యాన్‌తో ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు.Akkada ikkada clg oo mall oo kadhu raa idii US lo Ela mida padtunnaro chudandii adi ma @TheDeverakonda anna craze uuuu❤️🔥❤️🔥🔥#VijayDeverakonda pic.twitter.com/39FBZIfrF6— The Revanth (@Revanth__7) June 10, 2024Rowdy boy @TheDeverakonda receives overwhelming love and massive response from USA Telugu people-Women forum At ATA - USA! ❤️🔥😍#VijayDeverakonda #VD12 #TeluguFilmNagar pic.twitter.com/T3W7paaWPH— Telugu FilmNagar (@telugufilmnagar) June 10, 2024 -
రాష్ట్రవ్యాప్తంగా ఆగుతున్న YSRCP అభిమానుల గుండెలు
-
రష్మికకు ఫ్యాన్స్ రిక్వెస్ట్.. అదేంటో తెలుసా?
పుష్ప సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిపోయిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్ సింగిల్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ నెల 29న పుష్ప-2 రెండో సింగిల్ కూడా రిలీజ్ చేయనున్నారు. పుష్ప మూవీతో వచ్చిన క్రేజ్‌తో దేశవ్యాప్తంగా కూడా ఆమెకు ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా రష్మిక టాలీవుడ్ మూవీ గంగం గణేశా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైంది.అయితే రష్మికకు సౌత్‌తో పాటు నార్త్‌లోనూ ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంది. తాజాగా రష్మిక ఢిల్లీ ఫ్యాన్స్ చేసిన విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ప్రీ రిలీజ్‌కు ఈవెంట్‌కు హాజరైన రష్మిక ఫోటోను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. రష్మిక ఈవెంట్లో మీరు చాలా అందంగా కనిపించారు..మిమ్మల్ని చూసినందుకు మాకు చాలా సంతోషం కలిగింది.. కానీ మీరు తెలుగులో మాట్లాడటంతో మాకు అర్థం కాలేదు. నార్త్‌లోనూ మీ అభిమానులు మీ మాటలు వినడానికి ఎంతో ఇష్టపడతారు. అలాంటి వారికోసం ఇంగ్లీషులో మాట్లాడాలని ట్విటర్ వేదికగా రష్మికను కోరారు. దయచేసి మా అభ్యర్థనను పరిశీలించవలసిందిగా కోరుతున్నాం అంటూ పోస్ట్ చేశారు. అయితే దీనికి రష్మిక సైతం రిప్లై ఇచ్చింది.రష్మిక ట్వీట్ రాస్తూ..' మీరు ఎక్కడి నుంచి వచ్చినా.. మీరందరూ నన్ను అర్థం చేసుకునేలా ఇంగ్లీషులో మాట్లాడేందుకు నేను నా వంతు ప్రయత్నం చేస్తాను. చాలామంది వారి స్థానిక భాషలోనే మాట్లాడాలని కోరుకుంటారు. వారి భాషపై ఉన్న గౌరవంతో అలా మాట్లాడుతా. దక్షిణాదితో పాటు మీలాంటి ఫ్యాన్స్ కోసం ఇంగ్లీషులో మాట్లాడేందుకు నేను నా వంతు ప్రయత్నం చేస్తా' అంటూ బదులిచ్చింది. ప్రస్తుతం ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరలవుతోంది. I try my best to talk in English so that everyone of you understand me no matter where you are from..❤️ but I am just uncomfortable with the fact that many people who want me to speak in their language will think that I am disrespectful of the language or that I don’t know the…— Rashmika Mandanna (@iamRashmika) May 28, 2024 -
అల్లు అదుర్స్.. నాగబాబు బెదుర్స్
-
"సారీ రా బన్నీ.."
-
పవన్ ఫ్యాన్ కి చెంప చెళ్లుమనిపించిన రేణు
-
సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌తో కలిసి బిర్యానీ ఎంజాయ్ చేసిన ఈ బ్యూటీ ఎవరంటే?(ఫొటోలు)
-
డార్లింగ్ లైఫ్‌లోకి స్పెషల్ పర్సన్?.. ఆసక్తికర పోస్ట్ (ఫొటోలు)
-
సీఎం జగన్ గెలుపు ధీమా.. కింగ్ ఆఫ్ ఏపీ అంటూ అభిమానం (ఫొటోలు)
-
జననేతపై అభిమానం.. ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ మద్దతు
సాక్షి, కర్నూలు జిల్లా: సినిమాల్లో ఎందరు హీరోలున్నా రాజకీయాల్లో మాత్రం సీఎం జగన్ ఒక్కరే హీరో.. అంతులేని అభిమానం ఆయనకే సొంతం. తాజాగా, కర్నూలు ప్రచార సభలో సీఎం జగన్‌కు ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ మద్దతు తెలిపారు. ది లీడర్ జగన్ అంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించారు. జై జగన్ అంటూ ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్ సభలో నినాదాలు చేశారు.సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలకు జనం ప్రభంజనంలా తరలివస్తున్నారు. ఓవైపు సీఎం జగన్ నిర్వహిస్తున్న ప్రచార సభలకు సునామీలా జనం పోటెత్తుతుండటం.. మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి స్పందనే లేకపోవడంతో కూటమి శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. -
అభిమాని పట్ల షకీబ్ దురుస ప్రవర్తన.. వీడియో వైరల్
షకీబ్ అల్ హసన్.. ఈ పేరు గురించి క్రికెట్ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరల్డ్ క్రికెట్ సమకాలీన క్రికెట్లో అత్యుత్తమ ఆల్రౌండర్లలో ఒకడిగా కొనసాగతున్న షకీబ్.. నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తుంటాడు. ఈ బంగ్లా స్టార్ ఆల్‌రౌండర్ మరోసారి తన దురుసు ప్రవర్తన కారణంగా వార్తల్లో నిలిచాడు. జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు దూరంగా ఉంటున్న షకీబ్.. ప్రస్తుతం దేశవాళీ టోర్నమెంట్లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో మ్యాచ్ ఆరంభానికి ముందు షకీబ్ మైదానంలో ఉండగా.. గ్రౌండ్ స్టాప్ ఒకరు అతడి దగ్గరకు వచ్చి సెల్పీ అడిగాడు.దానికే చిరెత్తుకుపోయిన షకీబ్ అతడిని కొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆ గ్రౌండ్స్‌మన్ బాధపడుతూ పక్కకు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు షకీబ్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మరి అంత పొగరు పనికిరాదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతుకుముందు చాలా సందర్భాల్లో అభిమానులపై షకీబ్ చేయిచేసుకున్నాడు కూడా. Shakib… when a groundsman tried tontake a selfie with him 🤨 pic.twitter.com/BWbDX4LAsK— Nibraz Ramzan (@nibraz88cricket) May 7, 2024 -
స్టార్ హీరోయిన్‌పై నెటిజన్స్ ఆగ్రహం.. ఎందుకంటే?
బాలీవుడ్ భామ కాజోల్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. అజయ్ దేవగణ్‌ను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మకు ఓ కూతురు కూడా ఉన్నారు. ప్రస్తుతం దో పట్టి అనే చిత్రంలో కనిపించనుంది. అయితే తాజాగా ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన కాజోల్ నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. దీంతో ఆమె వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఇంతకీ అసలేం జరిగిందో తెలసుకుందాం.ఇటీవల ముంబయి జుహూలోని ఓ రెస్టారెంట్‌కు కాజోల్ తన ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లింది. అదే సమయంలో ఆమెకు వీరాభిమాని అయిన హోటల్ వెయిటర్ కాజోల్‌ను చూశాడు. ఆమె వద్ద నుంచి బిల్ తీసుకునే సమయంలో భావోద్వాగానికి గురయ్యాడు. తన అభిమాన నటిని చూడగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు.అయితే అతని తీరుపై కాజోల్ మండిపడింది. నాటకాలు ఆపి.. ముందు బిల్ తీస్కో అంటూ ర్యాష్‌గా మాట్లాడింది. అంతే కాకుండా ఇలాంటి వారిని వెయిటర్‌గా నియమించడంపై ఏకంగా మేనేజర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో కాజోల్ వ్యవహరించిన తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ అభిమాని అయినందుకు కనీసం అతనికి కృతజ్ఞతలు కూడా చెప్పలేకపోయారంటూ మండిపడుతున్నారు. కాజోల్ తీరుపై వెయిటర్ సోదరుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. -
పవన్ ఫ్యాన్స్ కూడా అమర్ నాథ్ వైపు..
-
లేడీ సూపర్‌స్టార్ నయన్ లగ్జరీ వాచ్..ధర తెలిస్తే!
లేడీ సూపర్‌స్టార్ నయనతార భర్త, ట్విన్స్‌తో కలిసి కొత్త ఏడాది(విషు) వేడుకలను ఘనంగా జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచు కోవడంతోపాటు, అందరికి పండుగ శుభాకాంక్షలకు కూడా అందించింది. ఈ సందర్భంగా ఆమె ధరించిన రోలెక్స్ ఓస్టెర్ ఫ్యాన్స్‌ను ఎట్రాక్ట్ చేసింది. సమ్మర్ సీజన్లో క్లాసిక్ సమ్మర్ రెడీ యాక్సెసరీరీ జతగా లగ్జరీ వాచ్నుధరించింది. దుస్తుల నుండి బ్యాగ్ వరకు అన్నీ లగ్జరీ వస్తువులు కావడం విశేషం. ఇందులో రోలెక్స్ ఆయిస్టర్ పర్మనెంట్ బ్రాండ్ వాచీ మరీ స్పెషల్. కాటన్ సూట్‌కు మ్యాచ్ అయ్యేలా లైట్ పింక్ కలర్ డయల్ ఉన్న రోలెక్స్ వాచ్ అతికినట్టు సరిపోయింది. దీని ధర సుమారు రూ. 53 లక్షలట. నయన్ బర్త్‌డే సందర్బంగా భర్త విఘ్నేష్ శివన్ రూ.2.7 కోట్ల విలువైన మెర్సిడెస్ మేబ్యాక్ కారును బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే షూట్ టైం అంటూ చీరలో అద్భుతమై ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంది నయనతార. కాగా నయనతార కరియర్ పరంగా వరుసగా హిట్లతో దూసుకుపోతోంది.అలాగే ఇటీవల వ్యాపారంలోకి కూడా అడుగు పెట్టింది. ఒక కొత్త స్టూడియోను నిర్మిస్తున్న విషయాన్ని న్యూజర్నీ అంటూ ఇటీవల ఇన్‌స్టాలో షేర్ చేసింది. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) அனைவருக்கும் இனிய தமிழ் புத்தாண்டு சித்திரை திருநாள் நல்வாழ்த்துகள் #TamilNew2024 ഏവർക്കും ഹൃദയം നിറഞ്ഞ വിഷു ആശംസകൾ#HappyVishu2024 pic.twitter.com/Wh6MlGu21r — Nayanthara✨ (@NayantharaU) April 15, 2024 -
SRH Vs CSK Highlights Pics: సన్‌రైజర్స్‌ను చీర్ చేసిన సెలబ్రిటీ ఫ్యాన్స్.. ఫొటోలు
-
IPL 2024 SRH vs CSK : ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ అభిమానులు సందడి (ఫొటోలు)
-
అభిమాని తీవ్ర భావోద్వేగం.. ఐకాన్ స్టార్ చేసిన పనికి ఫిదా!
టాలీవుడ్ హీరోలకు క్రేజ్ మామూలుగా ఉండదు. జూనియర్, రామ్ చరణ్, బన్నీ, ప్రభాస్, మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోల ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా రిలీజ్ రోజైతే హడావుడి అంతా ఇంతా కాదు. అది మన హీరోలకు ఉన్న క్రేజ్. చాలా మంది టాలీవుడ్ హీరోలకు డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. తాజాగా ఓ అభిమాని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను కలిశారు. అభిమాన హీరోను కలిసిన వేళ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బన్నీని పట్టుకుని బోరున విలపించాడు. దీంతో ఏడుస్తున్న అభిమానిని అల్లు అర్జున్ ఓదార్చాడు. కన్నీళ్లు పెట్టుకుంటున్న అభిమానికి బన్నీ ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో ట్విటర్లో తెగ వైరలవుతోంది. ఎంతైనా ఒక అభిమానిని దగ్గరికీ తీసుకుని స్టార్ హీరో సముదాయించడాన్ని నెటిజన్స్ అభినందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. A heartfelt moment captured! ❤️ Witness the touching moment as a diehard fan meets his idol @alluarjun for the first time. Emotions overflow as comforting words and a handshake create memories to last a lifetime.#AlluArjun pic.twitter.com/RS4NalS3kq — All India Allu Arjun Fans & Welfare Association (@AIAFAOnline) March 15, 2024 -
మాటలు రాని అభిమానం మంచు శిఖరాల ఎత్తుల్లో జగన్
-
మిల్కీ బ్యూటీపై అలాంటి పోస్ట్.. మొత్తానికి రియాక్ట్ అయిందిగా!
తమన్నా పేరు కంటే.. మిల్కీ బ్యూటీ అంటే ప్రేక్షకులు ఠక్కున గుర్తు పట్టేస్తారు. అంతలా అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది ముద్దుగుమ్మ. గతేడాది జైలర్ మూవీలో స్పెషల్ సాంగ్‌తో తన గ్లామర్ డోస్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపించింది. జైలర్ సూపర్ హిట్ కావడంతో పారితోషికం అమాంతం పెంచేసిందంటూ టాక్ కూడా వినిపించింది. దీంతో బాలీవుడ్లో లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్‌లోనూ మెరిసింది. ఇందులో తన బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి నటించింది. ఇదలా ఉంచితే తమన్నా 2005లోనే తన కెరీర్ ప్రారంభించింది. ఓకే ఏడాదిలో తెలుగు, హిందీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్లో శ్రీ మూవీతో అడుగుపెట్టింది. ఆ తర్వాత హ్యాపీ డేస్, బద్రినాథ్, 100% లవ్, రచ్చ, బాహుబలి సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది. అయితే తమన్నా తన కెరీర్ ప్రారంభించి ఇప్పటికీ 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఓ అభిమాని తమన్నా సినిమాల్లో చేసిన పాత్రలతో ఫోటోను షేర్ చేశాడు. ఇది చూసిన తమన్నా అభిమాని ట్వీట్‌కు స్పందించింది. తనపై చూపిస్తున్న ప్రేమకు అతనికి ధన్యవాదాలు తెలిపింది. ఇలాంటి ఫోటోలు మరిన్నీ వస్తాయంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఒక అభిమాని ట్వీట్‌కు తమన్నా రిప్లై ఇవ్వడంపై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Thank you 🫶🏻 Many more to come 💕 https://t.co/TNMr1ChANd — Tamannaah Bhatia (@tamannaahspeaks) March 5, 2024 -
పవన్‌ను ఓడించేది టీడీపీనే
సాక్షి, రాజమహేంద్రవరం: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఓడించేది టీడీపీ నేతలేనని, ఈ విషయంలో జనసేన అభిమానులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్‌నే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, నాదెండ్ల మనోహర్ వంటి గుంటనక్కలతో పవన్ ప్రయాణం చేస్తున్నాడని చెప్పారు. ఎవరు ఎప్పుడు ఎలా పొడుస్తారో చెప్పలేని పరిస్థితి అని అన్నారు. పవన్‌ను కాపాడుకోవాల్సిన అవసరం జనసైనికులు, అభిమానులకు ఉందన్నారు. అది జరగాలంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును పాతాళానికి తొక్కి, టీడీపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలో సోమవారం ‘ఎన్నికలకు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం సిద్ధం’ పేరిట స్థానిక ఎంపీ, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ మార్గాని భరత్‌రామ్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇందులో కొడాలి నాని మాట్లాడుతూ, పవన్‌ను ఓడించేందుకు సీఎం వైఎస్ జగన్ వ్యూహం పన్నుతున్నారంటూ బాబు, ఆయన అనుకూల మీడియా డప్పు కొడుతున్నారని.. రాష్ట్రంలోని 175 సీట్లలోనూ వైఎస్సార్ సీపీ గెలవాలన్నది సీఎం జగన్ ఉద్దేశమని, ఓడే వాళ్లలో బాబు, పవన్, లోకేశ్ కూడా ఉండవచ్చని అన్నారు. ఒక్కడే ఎన్నికల బరిలో వస్తే గెలవలేడని భావించిన చంద్రబాబు.. దత్తపుత్రుడు పవన్, డ్రామోజీ, టీవీ–5, పౌడర్ డబ్బా వంటి వారిని వెంట వేసుకుని వస్తున్నాడని ధ్వజమెత్తారు. 3 శాతం ఉన్న కమ్మ సామాజిక వర్గానికి 30 స్థానాలిచ్చిన చంద్రబాబు.. 20 శాతం ఉన్న కాపులకు మాత్రం 24 సీట్లే ఇచ్చాడని దుయ్యబట్టారు. ఇవ్వడానికి చంద్రబాబుకు.. తీసుకునేందుకు పవన్‌కు సిగ్గుండాలని విమర్శించారు. వైఎస్సార్సీపీలోనే ప్రాధాన్యం: పేర్ని నాని రాజకీయ చరిత్రలో పార్టీ కార్యకర్తలకు అత్యంత విలువ, ప్రాధాన్యం ఇస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీ అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. కార్యకర్తలు తమకు ఎమ్మెల్యే అభ్యర్థి వద్దంటే మార్చే పరిస్థితులు మరే పార్టీలోనైనా ఉంటాయా? అని ప్రశ్నించారు. టీడీపీలో డబ్బుంటేనే టికెట్ ఇస్తున్నారని ఆరోపించారు. సంక్షేమానికి డబ్బులు ఇస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని విమర్శిస్తున్న చంద్రబాబు.. ఆయన ప్రకటించిన పథకాలకు డబ్బులు ఏవిధంగా ఇస్తారని దుయ్యబట్టారు. బాబుకు బుద్ధి చెప్పాలి: భరత్‌రామ్ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ, పొరుగు రాష్ట్రంలో తలదాచుకుంటూ, ఏపీలో రాజకీయ వ్యాపారం చేస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు రాష్ట్రానికి అవసరం లేదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో దగాకోరు చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. టీడీపీ, జనసేన నేతల కల్లబొల్లి మాటలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. నగరంలోని ఒక మహిళా వలంటీర్‌ను ఫోన్ చేసి బెదిరించిన టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావుపై ఎంపీ భరత్‌తో పాటు మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఆడపిల్లకు ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం మగతనం కాదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రశాంత్ కిశోర్ ఓ చిల్లర మనిషి గుడివాడ టౌన్: డబ్బులు తీసుకుని చిల్లర వాగుడు వాగే ప్రశాంత్ కిశోర్ వంటి వారిని పట్టించుకోవలసిన అవసరం లేదని కొడాలి నాని మండిపడ్డారు. గుడివాడలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రశాంత్ కిశోర్‌ను ప్రస్తుతం ఏరాజకీయ పార్టీ వ్యూహకర్తగా పెట్టుకోలేదన్నారు. ఐప్యాక్ నుంచి తన్ని తరిమేసిన తర్వాత ఏపార్టీ అతన్ని చేరదీయక పోతే తీసేసిన తహసీల్దార్లాగా బిహార్‌లో సొంత పార్టీ పెట్టి ఫలితం లేక డిజాస్టర్ అయిపోయాడన్నారు. చంద్రబాబు లాంటి పనికి మాలిన వ్యక్తుల వద్ద ప్యాకేజ్ తీసుకుని జ్యోతిష్యం చెపుతున్నాడన్నారు. ఐప్యాక్ టీమ్ ఇప్పటికీ వైఎస్సార్సీపీకి పని చేస్తోందన్నారు. లగడపాటి రాజగోపాల్లాగా జ్యోతిష్యం చెప్పడం ప్రారంభించిన పీకే చెపితే రెండు, మూడు శాతం ఓట్లు మారి తనకు పడతాయనేది చంద్రబాబు ఆశ అని అన్నారు. -
పవన్ కల్యాణ్‌ను ఓడించేది టీడీపీనే: కొడాలి నాని
కృష్ణా: అభిమానులు అప్రమత్తంగా లేకపోతే పవన్ కల్యాణ్ మూల్యం చెల్లించుకుంటాడని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. పవన్ కల్యాణ్‌ను రక్షంచుకోవాల్సిన అవసరం జనసైనికులు.. అభిమానులకు ఉందని తెలిపారు. ఈమేరకు సోమవారం ఆయన జన సైనికులు, పవన్ కల్యాణ్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ‘చంద్రబాబు ఓట్లు కావాలి... కానీ సీట్లు ఇవ్వరు. మేము రాష్ట్రంలో ఏ నియోజకవర్గాన్ని టార్గెట్‌గా పెట్టుకోలేదు...175 స్థానాల్లో గెలవడమే మా లక్ష్యం. కచ్చితంగా చెబుతున్నా పవన్ కల్యాణ్‌ను ఓడించేది టీడీపీనే. ఎన్నికల అనంతరం ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ...వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు అయిన చంద్రబాబు, నాదెండ్లను పవన్ కల్యాణ్ పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు. అధికారంలో ఉన్న ఎన్టీఆర్‌నే కూల్చిపడేసిన చంద్రబాబు, నాదెండ్ల వారికి పవన్ ఎంత?. 3 శాతం ఓటింగ్ ఉన్న తన సామాజిక వర్గానికి 30 సీట్లు ఇచ్చి.. 20 శాతం ఉన్న వర్గానికి 24 సీట్లిచ్చాడు. ... జనసేనకి ఇచ్చిన సీట్లలో పది కచ్చితంగా ఓడిపోయే సీట్లు ఉన్నాయి. ఇవ్వడానికి చంద్రబాబుకి.. తీసుకోవడానికి పవన్‌కు సిగ్గుండాలి. రాజ్యాధికారం కోసం ఎదురుచూస్తున్న పవన్ సామాజిక వర్గం ఓట్లు ట్రాన్స్ ఫర్ అవ్వవు’ అని కొడాలి నాని అన్నారు. కృష్ణాజిల్లా: సచివాలయం కూడా తాకట్టు పెట్టేశారన్న చంద్రబాబు వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టారని చంద్రబాబుకు గగ్గోలు పెడుతున్నాడని మండిపడ్డారు. ‘నేడు రాష్ట్ర అప్పులు రూ. 4లక్షల కోట్లు ఉంటే... రూ. 2.50లక్షల కోట్లు చంద్రబాబు చేసినవే. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండానే... చంద్రబాబు రెండున్నర లక్షల కోట్లు అప్పు చేశారా?. ప్రజలకు అవసరమైనప్పుడు... ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టడం మామూలే. సచివాలయం అనేది పది ఎకరాల ఆస్తి మాత్రమే. ప్రత్యేకించి ఏ ఆస్తులు తాకట్టు పెట్టాలో అన్న విషయం రాజ్యాంగంలో ఏమైనా రాశారా? ప్రజల అవసరాల కోసం...ప్రభుత్వ వెసులుబాటును బట్టే ఆస్తులు తాకట్టు పెట్టడం జరుగుతుంది. చిల్లర రాజకీయ నాయకుడు.. చంద్రబాబు చేస్తేనే సంసారం’ అని కొడాలి నాని అన్నారు. -
Raghava Lawrence: అభిమానుల కోసం లారెన్స్ కీలక నిర్ణయం!
అభిమానుల కోసం స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, హీరో రాఘవా లారెన్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై తనను కలిసేందుకు అభిమానులు రావొద్దని..తానే వారి వద్దకు వెళ్తానని ప్రకటించాడు. తనకు కలిసేందుకు వచ్చిన ఓ అభిమాని రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కలత చెందిన లారెన్స్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. సినిమాలతో పాటు సామాజిక సేవ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్.. అప్పుడప్పుడు తన ఫ్యాన్స్ కోసం సెల్ఫీలు దిగే కార్యక్రమం నిర్వహిస్తుంటాడు. అలా గతేడాదిలో చెన్నై నిర్వహించిన సెల్ఫీ కార్యక్రమానికి హాజరై, తిరిగి వెళ్తున్న ఓ అభిమాని రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి సెల్ఫీ కార్యక్రమానికి దూరంగా ఉన్నాడు లారెన్స్. అభిమానులు ఎవరు తనను కలిసేందుకు రావొద్దని విజ్ఞప్తి చేశాడు. తానే స్వయంగా ప్యాన్స్ వద్దకు వచ్చి సెల్ఫీ ఇస్తానని తాజాగా ఎక్స్(ట్విటర్) వేదికగా వెల్లడించాడు. హాయ్ ఫ్రెండ్స్, ఫ్యాన్స్.. చివరిసారిగా చెన్నైలో నిర్వహించిన ఫ్యాన్స్ మీట్ ఫోటోషూట్ సందర్భంగా నా అభిమాని ఒకరు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఆ సంఘటన నన్ను బాగా కలిచివేసింది. ఆ రోజే నా అభిమానులెవరు నా కోసం ప్రయాణం చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఇకపై నేనే వారి కోసం ప్రయాణం చేస్తాను. వారి పట్టణంలో ఫోటోషూట్ నిర్వహిస్తాను. రేపటి(ఫిబ్రవరి 25) నుంచి ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాను. రేపు మొదట విల్లుపురం లో గలక్ష్మి మహల్ వద్ద కలుద్దాం.’ అని ట్వీట్ చేశాడు. లారెన్స్ నిర్ణయం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో తమవద్దకే వచ్చి కలవడం ఆనందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
ఇదే కదా నిజమైన ఆనందం: మెగాస్టార్ ఎమోషనల్ స్పీచ్!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో చిరుకి జోడీగా లియో భామ త్రిష కనిపించనుంది. చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరు సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో ఈ చిత్రంపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా.. ఇటీవలే మెగాస్టార్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలోనే అత్యున్నత పురస్కారం చిరంజీవిని వరించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మెగాస్టార్‌కు అభినందనలు తెలిపారు. తాజాగా అమెరికా పర్యటనలో ఉన్న మెగాస్టార్‌కు ఘనమైన స్వాగతం లభించింది. అక్కడి తెలుగువారు చిరంజీవిని ప్రత్యేకంగా సత్కరించారు. లాస్ఎంజిల్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన చిరుపై పూలవర్షం కురిపించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. చిరంజీవి మాట్లాడుతూ..'పద్మ విభూషణ్ అవార్డ్ వచ్చినప్పుడు ఆనందం, సంతోషం కలిగింది. అవార్డ్ వచ్చినందుకు నాకంటే మీరు బాగా ఆనందపడుతున్నారు. నా పట్ల మీరు చూపిస్తున్న అభిమానం వెల కట్టలేనిది. ఇంతమంది ఆనందంగా ఉన్నారంటే.. ఇదే కదా అసలు సిసలైన ఆనందం. ఇంతకంటే అవార్డ్ ఇంకా ఏముంటుంది' అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. -
నటుడు మిథున్ చక్రవర్తిని పరామర్శించిన బీజేపీ నేత
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి(73) తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతూ కోల్‌కతాలోని ఒక ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం మిథున్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. తాజాగా ఆయనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఆయనను వీడియోలో చూసిన అభిమానులు భగవంతునికి ధన్యవాదాలు చెబుతున్నారు. #WATCH | West Bengal BJP chief Sukanta Majumdar met veteran actor and BJP leader Mithun Chakraborty at a private hospital in Kolkata pic.twitter.com/4FRNoTuwKb — ANI (@ANI) February 11, 2024 కోల్‌కతాలోని అపోలో ఆసుపత్రిలో చేరిన మిథున్ చక్రవర్తిని బీజేపీ నేత సుకాంత్ మజుందార్ పరామర్శించారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిథున్ చక్రవర్తికి చెందిన వీడియోను ఏఎన్ఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో మిథున్ చక్రవర్తి హాస్పిటల్ బెడ్‌పై పడుకుని, వైద్యులతో మాట్లాడటాన్ని చూడవచ్చు. మిథున్ చక్రవర్తి ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతున్నట్లు ఈ వీడియోలో స్పష్టమవుతోంది. భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ కూడా మిథున్ చక్రవర్తిని కలుసుకుని పరామర్శించారు. #WATCH | West Bengal: Former Indian cricketer Sourav Ganguly arrives at a private hospital in Kolkata to meet his mother, who is admitted here. pic.twitter.com/c4goODkOX1 — ANI (@ANI) February 11, 2024 -
థియేటర్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ
-
విశాఖ అందాలు అద్భుతం అంటూ ఇంగ్లాండ్ ఫ్యాన్స్ ప్రశంసలు
-
శంకర్ ను టార్గెట్ చేసిన రామ్ చరణ్ ఫ్యాన్స్
-
US: ట్రంప్ చేతిపై ఎర్ర మచ్చలేంటి ? ఫ్యాన్స్‌లో జోరుగా చర్చ
వాషింగ్టన్: ఈ ఏడాదిలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే హాట్ ఫేవరెట్‌గా మారారు. రిపబ్లికన్ల తరపున ప్రెసిడెంట్ అభ్యర్థిగా ట్రంప్ నామినేట్ అవడం దాదాపు ఖాయమనే తెలుస్తోంది. తాజాగా జరిగిన అయోవా స్టేట్ ప్రైమరీ బ్యాలెట్లో ట్రంప్ తిరుగులేని విజయం నమోదు చేసుకున్నారు. అయోవాలోనే 51 శాతం ఓట్లతో ట్రంప్ విజయభేరి మోగించారంటే మిగిలిన చోట్ల ట్రంప్ గెలుపు సులువేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదంతా ఇలా ఉంటే ట్రంప్ తాజాగా ఓ విషయమై సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు. బుధవారం న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో ఒక డిఫమేషన్ కేసులో కోర్టుకు వచ్చినపుడు అక్కడున్న మద్దతుదారుల వైపు చూస్తూ ట్రంప్ చేయి ఊపారు. అయితే ఆ సమయంలో ట్రంప్ చేతిపై ఎర్ర మచ్చలున్నాయి. ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ట్రంప్ చేతిపై ఉన్న రెడ్ స్పాట్స్‌కు నెటిజన్లు తమకు తోచిన విధంగా కారణాలు చెబుతున్నారు. కొందరు ఆ మచ్చలు కెచప్ తిని చేయి శుభ్రం చేసుకోకపోవడం వల్ల వచ్చాయంటుంటే మరికొందరు అయోవాలో గడ్డకట్టించే చలి వల్ల వచ్చాయని కామెంట్లు చేస్తున్నారు. What happened to Trump’s hand? It wasn’t like this in New Hampshire. pic.twitter.com/B4TlPxEmDV — PatriotTakes 🇺🇸 (@patriottakes) January 17, 2024 ఇదీచదవండి.. రూపాయి కంటే తక్కువ విలువైన కరెన్సీలు ఇవే -
జూ ఎన్టీఆర్ జెండాలు చించి పడేసిన టీడీపీ నేతలు
-
చంద్రబాబు సభలకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెగ
సాక్షి, పశ్చిమగోదావరి: చంద్రబాబు సభలకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెగ తగిలింది. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో చంద్రబాబు ‘రా కదలిరా’ సభకు ఎన్టీఆర్ బ్యానర్లతో ఫ్యాన్స్ రాగా, టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ చోటుచేసుకుంది. జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లతో వేదికపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. ఇరు వర్గాల మధ్య తోపులాట, పరస్పర దాడులు జరిగాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్లకార్డులను తీసుకువచ్చిన ఫ్యాన్స్.. చంద్రబాబు వేదికపైకి వచ్చే ముందు ప్రదర్శించారు. కోపోద్రిక్తులైన టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులపై దాడికి పాల్పడారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ నినాదాలతో హోరెత్తించారు. తిరువూరులో... కాగా, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు చంద్రబాబు సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఎన్టీఆర్ ఫోటో ఉన్న బ్యానర్లు, జెండాలతో వచ్చిన టీడీపీ కార్యకర్తలు.. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ జెండాలపై రాశారు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ రాసిన జెండాలను లాక్కొన్న టీడీపీ నేతలు పక్కన పడేశారు. టీడీపీ నేతల తీరుపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: ఎంత మంది ఉన్నారన్నది కాదు.. ఇటు ఎవరున్నారన్నది పాయింట్ -
సంక్రాంతికి డబుల్ ధమాకా
ప్రభాస్ అభిమానులకు శుభవార్త. ఈ సంక్రాంతికి తన ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా ఇవ్వనున్నారాయన. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్‌ను సంక్రాంతి పండగ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ‘‘డైనోసార్ డార్లింగ్‌గా ఎలా మారాడో తెలుసుకునేందుకు రెడీగా ఉండండి. సంక్రాంతి రోజున ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ చేస్తున్నాం’’ అంటూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘ఎక్స్’లో షేర్ చేసింది. ‘‘రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమాలో ప్రభాస్ ఒక కొత్త లుక్‌లో, క్యారెక్టర్లో కనిపిస్తారు. ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఒక స్పెషల్ మూవీ ఇవ్వాలనే ఆశయంతో మారుతి ఈ సినిమా చేస్తున్నారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: వివేక్ కూఛిబొట్ల. కల్కి కోసం కొత్త ప్రపంచం ‘‘ఇండియాలో సైన్స్ ఫిక్షన్ చిత్రాలు ఎక్కువ రాలేదు. ‘కల్కి 2898 ఏడీ’ వైవిధ్యమైన సినిమా. ఒక ప్రత్యేక ప్రపంచంలో జరిగే కథ. హాలీవుడ్ ఫ్యూచరిస్ట్ సినిమాల్లో అక్కడి సిటీలు భవిష్యత్‌లో ఎలా ఉంటాయో చూశాం. ఇండియా ఫ్యూచర్ సిటీలు ఎలా ఉంటాయో ‘కల్కి 2898 ఏడీ’లో చూస్తారు. ఈ సినిమా కోసం కొత్త ప్రపంచం సృష్టించాం’’ అన్నారు నాగ్ అశ్విన్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర కీలక పాత్రల్లో సి. అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. కాగా ఐఐటీ బాంబేలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘కల్కి 2898 ఏడీ’ ప్రత్యేక కంటెంట్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ– ‘‘కల్కి’లో ప్రభాస్, అమితాబ్, కమల్‌హాసన్, దీపికాగార్లు తమ అభిమానులు అమితంగా ఆనందపడే పాత్రల్లో కనిపిస్తారు. ప్రత్యేకించి ఈ మూవీలో ఫ్యూచర్ ప్రభాస్‌ని చూస్తారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అన్నారు. -
‘ఆంధ్రజ్యోతి’పై భగ్గుమన్న బాలయ్య ఫాన్స్
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, సాక్షి: వేమూరి రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిపై నందమూరి అభిమానులు భగ్గుమన్నారు. ఏకంగా ఆ పత్రిక పేపర్లను తగలబెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. కావలిలో బాలకృష్ణ ఫ్యాన్స్ ఈ పని చేశారు. ఇందుకు కారణం ఏంటంటే.. తాజాగా నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభను విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో యువగళం- నవశకం పేరిట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా పాల్గొన్నారు. అయితే.. ఆయన పేరునుగానీ, ఫోటోగానీ ఆంధ్రజ్యోతిలో ప్రచురించలేదట. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కావలి ట్రంక్ రోడ్డులో ఆంధ్రజ్యోతి పేపర్‌ను ఆయన అభిమానులు తగలబెట్టారు. ఇదిలా ఉంటే.. ఆంధ్రజ్యోతి పేపర్, ఏబీఎన్ ఛానెల్ నందమూరి బాలకృష్ణ పట్ల గత కొంతకాలంగా వివక్షత చూపుతోందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని వెన్నుపోటు ద్వారా చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకున్నాడు. కనీసం ఇప్పుడైనా నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నాడా? అని అదీ లేదు. దీనికి తోడు.. ఇప్పుడు యెల్లో మీడియా కూడా కేవలం నారా కుటుంబాన్నే హైలెట్ చేస్తుండడాన్ని తట్టుకోలేకపోతున్నారు అభిమానులు. ఇదీ చదవండి: పవన్ తమ్ముడా?.. వీళ్లు మారరా? -
హెలికాప్టర్లతో ప్రభాస్‌కు ఎయిర్ సెల్యూట్
-
‘నేనెక్కడికీ వెళ్లడంలేదు’ రోదిస్తున్న మహిళలకు శివరాజ్ భరోసా!
శివరాజ్ సింగ్ చౌహాన్.. మహిళల నుంచి ఎనలేని ఆదరణ పొందిన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. ఆయన సీఎం పదవికి దూరమైనా.. అభిమానుల నుంచి ఆయనకు దక్కుతున్న ప్రేమ, అభిమానంలో ఏ మాత్రం తేడా కనిపించడం లేదు. రాష్ట్రంలోని ప్రజలు శివరాజ్‌ను ప్రేమగా అన్న, మామ అని పిలుచుకుంటారు. శివరాజ్ సింగ్ చౌహాన్‌తో అతని అభిమానులు, మద్దతుదారుల అనుబంధం విడదీయరానిది. ఇటీవల ఆయన విదిశలో తన మద్దతుదారులను, అభిమానులకు కలిసేందుకు వచ్చినప్పుడు భావోద్వేగ వాతావరణం ఏర్పడింది. వీరిలో మహిళలు అధికంగా ఉండటం విశేషం. శివరాజ్ సింగ్ చౌహాన్ తిరిగి రాష్ట్ర పగ్గాలు చేపట్టాలని వారంతా డిమాండ్ చేయడం విశేషం. శివరాజ్ సింగ్ చౌహాన్ తన హయాంలో మహిళల కోసం పలు ప్రజా సంక్షేమ పథకాలు చేపట్టారు. ఇవే అతనిని మహిళల ఆదరణకు పాత్రుడిని చేశాయి. ఆయన విదిశకు వచ్చినప్పుడు మద్దతుదారులు, అభిమానులు కురిపించిన ప్రేమను చూసిన ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. తన దగ్గరకు వచ్చి, రోదిస్తున్న మహిళలతో శివరాజ్ సింగ్..‘నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. మధ్యప్రదేశ్‌లో మీ మధ్యనే ఉంటున్నానని’ వారికి భరోసా ఇచ్చారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు శివరాజ్‌సింగ్ మధ్యప్రదేశ్ సీఎంగా ప్రజల ఆదరణ అందుకున్నారు. అయితే డిసెంబర్ 11న నూతన సీఎంగా మోహన్ యాదవ్ నియమితులయ్యారు. శివరాజ్ సింగ్ చౌహాన్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సెహోర్ జిల్లాలోని బుద్ని నుంచి లక్షకు పైగా ఓట్ల తేడాతో రికార్డు స్థాయి విజయం సాధించారు. ఇది కూడా చదవండి: కరడుగట్టిన నియంత ఏడ్చిన వేళ.. -
అభిమానికి వీడియో కాల్ చేసి సర్ ప్రైజ్ చేసిన రష్మిక !
-
అవన్నీ ఫేక్.. అలా చేయొద్దంటూ హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఈ ఏడాది పెళ్లిబంధంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా. ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాను పెళ్లాడింది. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు సెప్టెంబరు 24, 2023న రాజస్థాన్‌లో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి బాలీవుడ్ తారలు, రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. అయితే ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్‌ను ఆస్వాదిస్తున్న బ్యూటీ సోషల్ మీడియా ఫ్యాన్స్, ఫ్యాన్ క్లబ్స్ పేజీలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కొందరు తమ అభిమాన నటులను ప్రశంసించుకోవడానికి పలువురు తన పేరును ఉపయోగిస్తున్నారని పరిణీతి మండిపడింది. ఈ మేరకు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇన్‌స్టా స్టోరీస్‌లో రాస్తూ.. 'నా పేరుని ఉపయోగించి కొందరు ఫ్యాన్ పేజీలు తమ అభిమాన నటులకు అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. ఇలాంటివీ చాలా నా దృష్టికి వచ్చాయి. నా పేరుతో వస్తున్న ఇలాంటి పోస్టులన్న నకిలీవి. ఇలా ఏ ఒక్కరినీ పొగిడేందుకు నేను ఎలాంటి ఇంటర్వ్యూలూ ఇవ్వడం లేదు. ఇలా మరోసారి జరిగితే కచ్చితంగా ఫిర్యాదు చేస్తా . మీరు ఏదైనా పోస్టు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోండి.' అంటూ కాస్తా ఘాటుగానే ఇచ్చిపడేసింది. కాగా.. 2011లో బాలీవుడ్‌లోకి నటిగా ఎంట్రీ ఇచ్చిన పరిణీతి చోప్రా ఆ తర్వాత శుద్ధ్ దేశీ రొమాన్స్, కిల్ దిల్, డిష్యూం, కేసరి, సైనా, ది గర్ల్ ఆన్ ది ట్రైన్ చిత్రాల్లో ఆమె నటించారు. పరిణీతి చివరిసారిగా అక్షయ్ కుమార్ నటించిన మిషన్ రాణిగంజ్‌లో కనిపించింది. ఆమె ప్రస్తుతం చమ్కిలా చిత్రంలో దిల్జిత్ దోసాంజ్‌తో స్క్రీన్ పంచుకోనుంది. -
సూర్యునికి అర్ఘ్యమిస్తూ మ్యాచ్ చూసే మహత్తర అవకాశం!
ఈరోజు(ఆదివారం) ఉత్తరాదిన మహిళలు భర్త క్షేమం కోరుతూ ఛత్ వ్రతం చేస్తున్నారు. దీనిలో భాగంగా నేటి సాయంత్రం వేళ నదిలో నిలుచుని సూర్యునికి అర్ఘ్యమివ్వనున్నారు. మరోవైపు ఈ రోజు క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపధ్యంలో అటు ఛత్ పూజలో పాల్గొని, సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడంతో పాటు అదే సమయంలో భారీ స్క్రీన్‌పై క్రికెట్ మ్యాచ్ వీక్షించే అవకాశం యూపీలోని ప్రయాగ్‌రాజ్‌వాసులకు దక్కింది. టీమ్ ఇండియా ఫైనల్‌కు చేరుకోగానే దేశంలోని క్రికెట్ అభిమానులు ఉత్సాహం అంబరాన్ని తాకింది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలోనే యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో క్రికెట్ అభిమానులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్థానికులు అటు ఛత్ పూజలో పాల్గొంటూ, అదే సమయంలో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూసేందుకు వివిధ గంగా ఘాట్ల వద్ద భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం ఒడ్డున సూర్య భగవానుని విగ్రహం దగ్గర భారత జట్టు పోస్టర్లను ఏర్పాటు చేశారు. టీమ్ ఇండియా విజయం కోరుతూ భక్తులు రామాయణ పారాయణం కూడా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఛత్ పూజ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని గంగానది ఒడ్డున ఛత్ పూజా మండపం ఏర్పాటు చేస్తారు. అయితే ఈసారి మండపంలో భారత జట్టు పోస్టర్లను కూడా ఉంచారు. దీంతో ఇక్కడి పూజలు నిర్వహిస్తున్నవారంతా భారత్ విజయం కోసం కూడా ప్రార్థనలు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘అమ్మా..గంగమ్మ తల్లీ.. భారత్‌ను గెలిపించమ్మా’ -
‘అమ్మా..గంగమ్మ తల్లీ.. భారత్‌ను గెలిపించమ్మా’
ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం(ఈరోజు) భారత్, ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్‌లో జరగనుంది. ఇందుకోసం దేశప్రజలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులంతా భారత్ విజయం కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లో భారత జట్టు అభిమానులు ముక్తేశ్వర్ ధామ్‌లోని గంగా ఘాట్ వద్ద భారీగా పూజలు నిర్వహించి ‘అమ్మా..గంగమ్మ తల్లీ.. భారత్‌ను గెలిపించమ్మా’ అని వేడుకున్నారు. గంగామాత ఆశీర్వాదాలు భారత టీమ్‌కు ఉంటాయని వారు అంటున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక క్రికెట్ అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరూ ఒకే స్వరంతో ‘ఆల్ ది బెస్ట్ ఇండియా’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి సారధ్యం వహించిన జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు చందేశ్వర్ ప్రసాద్ సిన్హా అలియాస్ బోడి సిన్హా మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో దేశం విజయం సాధించేందుకు పూజా కార్యక్రమాలు నిర్వహించి, మన టీమ్ విజయం కోసం ప్రార్థనలు చేశామన్నారు. క్రికెట్ అభిమాని రంజిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ ‘ఈసారి ప్రపంచకప్ క్రికెట్లో భారత జట్టు తప్పకుండా మన జెండాను ఎగురవేస్తుందని’ అన్నారు. ప్రపంచకప్ 2023లో బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ ఇరు జట్లకు ఆదివారం చివరి మ్యాచ్ జరగనుంది. ఇది కూడా చదవండి: మ్యాచ్ అహ్మదాబాద్‌లో.. ‘రెట్టించిన ఉత్సాహం’ ఢిల్లీలో.. -
సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ
సూపర్‌స్టార్ కృష్ణ విగ్రహాన్ని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ ఆవిష్కరించారు. విజయవాడలోని గురునానక్ కాలనీ కేడీజీఓ పార్కులో కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ‘భారతీయుడు 2’ చిత్రం షూటింగ్ కోసం విజయవాడలో ఉన్న కమల్‌హాసన్.. కృష్ణ–మహేశ్‌బాబు ఫ్యాన్స్ ఆహ్వానం మేరకు కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ‘‘కృష్ణగారి విగ్రహావిష్కరణలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది’’ అన్నారు కమల్‌హాసన్ . ఈ విగ్రహావిష్కరణలో పాల్గొన్న విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ–‘‘కళామతల్లికి తనదైన శైలిలో సేవలందించి, ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు కృష్ణగారు. తండ్రి గౌరవాన్ని మహేశ్‌బాబుగారు నిలబెడుతున్నారు’’ అన్నారు. ‘‘కృష్ణగారి విగ్రహావిష్కరణ కేవలం పదిరోజుల వ్యవధిలో పూర్తి చేసేందుకు సహకరించిన సీఎం జగన్ మోహన్ రెడ్డిగారికి కృతజ్ఞతలు’’ అని కృష్ణ అభిమానుల సంఘం పేర్కొంది. ఈ కార్యక్రమంలో విజయవాడ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కృష్ణ కుటుంబ సభ్యుడు ఘట్టమనేని బాబీ, వైఎస్సార్సీపీ నాయకులు గల్లా పద్మావతి, రాజ్‌కమల్ పాల్గొన్నారు. గర్వంగా ఉంది: హీరో మహేశ్‌బాబు ‘‘నాన్నగారి విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్ గారికి కృతజ్ఞతలు. నాన్నగారు వదిలి వెళ్లిన జ్ఞాపకాలు, వారసత్వానికి ఇదొక నివాళి. నాన్న విగ్రహం ఏర్పాటుకు కారణమైన అందరికీ, ఈ వేడుక ఘనంగా నిర్వహించిన అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు’’ అంటూ ట్వీట్ చేశారు మహేశ్ బాబు. -
జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని.. ఆయన పేరుతో ఏకంగా!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ రేంజే వేరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వరించింది. అందుకే ఎన్టీఆర్ అంటే అంతలా అభిమానిస్తారు. తాజాగా ఓ అభిమాని తన ప్రేమను వినూత్నంగా చాటుకున్నారు. ఏపీలోని కర్నూలుకు ఓ వీరాభిమాని తన కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు. అయితే ఇంటి నిర్మాణానికి వినియోగించే ఇటుకలపై ఎన్టీఆర్ అని పేరును ముద్రించారు. ఈ విధంగా తన అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్‌పై ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. కాగా.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్‌రాజ్, జిస్సు సేన్‌గుప్తా, శ్రీకాంత్, టామ్ చాకో, నరైన్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆ తర్వాత హృతిక్ రోషన్ మూవీ వార్-2లో ఎన్టీఆర్ కనిపించనున్నారు. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దీనికి దర్శకత్వం వహించనున్నారు. Kurnool City & Dt@tarak9999 ఒక అభిమాని తన ఇంటి కోసం NTR అనే పేరు గల ఇటికలను తన ఇల్లు నిర్మాణం కోసం కావాలని తెప్పించుకున్నాడు ఇటువంటి అభిమానులు చాలా అరుదుగా ఉంటారు రాయలసీమలో #JaiNTR #ManOfMassesNTR pic.twitter.com/ZtOG35VSYt — MadhuYadav (jr.NTR) Kurnool (@MadhuYadavTarak) November 3, 2023 -
ఖర్చు తక్కువ, ఇంధనం ఆదా అయ్యే సరికొత్త కుకింగ్ స్టవ్‌లు, ఫ్యాన్లు!
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ప్రభుత్వ రంగ సంస్థల జాయింట్ వెంచర్ ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) ఆధ్వర్యంలో నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రామ్(ఎన్‌ఈసీపీ), ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్స్ ప్రోగ్రామ్(ఈఈఎఫ్‌పీ)ని ప్రారంభించారు. అందులో భాగంగా ఈఈఎస్ఎల్ దేశవ్యాప్తంగా ఒక కోటి సమర్ధవంతమైన బీఎల్డీసీ ఫ్యాన్లు, 20 లక్షల సమర్థవంతమైన ఇండక్షన్ కుకిగ్ స్టవ్‌లను పంపిణీ చేస్తోంది. వంట పద్ధతులను విప్లవాత్మకంగా మార్చడం, శక్తి సామర్థ్యం వినియోగంపై ప్రాముఖ్యత, ఆవశ్యకతలను తెలియజేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఈఈఎస్ఎల్. ఇంతకీ ఈ ఇండక్షన్ స్టవ్‌లు, బీఎల్డీసీ ఫ్యాన్ల ఉపయోగం, ప్రయోజనాలు ఏమిటి? ఇవి సాధారణ ప్రజలకు ఉపయోగపడతాయా? ఈ కుకింగ్ స్టవ్ ప్రత్యేకత.. నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రామ్(ఎన్‌ఈసీపీ) తీసుకువచ్చిన ఈ ఇండక్షన్ ఆధారిత కుకింగ్ స్టవ్ సాంప్రదాయ వంట పద్ధతులకు మించి సుమారు 25 నుంచి 30 శాతం ఖర్చు ప్రయోజనాలను అందిస్తాయి. వీటితో ఇంధనం ఆదా అవ్వడమే గాక తక్కువ ఖర్చుతో మంచి వంటను అందించగలుగుతాం. భారతదేశం అంతట ఈ ఇండక్షన్ స్టవ్‌లు వినియోగించడం వల్ల ముఖ్యంగా పర్యావరణం హితకరంగా ఉంటుంది. అంతేగాదు వాతావరణంలో గాలి స్వచ్ఛంగా ఉండటమే గాక పౌరులకు మెరుగైన ఆరోగ్యం అందుతుంది. ఈ స్టవ్‌లను ఈఈఎస్ఎల్, మోడరన్ ఎనర్జీ కుకింగ్ సర్వీసెస్(ఎంఈసీఎస్)ల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున దేశంలో పంపిణీ చేస్తోంది. దీంతో వంటశాలల్లో ఈ ఆధునిక ఎలక్ట్రిక్ వంట పరికరాల హవా వేగవంతంగా విస్తరించడమే గాకుండా వంట పద్ధతుల్లో వేగవంతంమైన మార్పులు వస్తాయని చెబుతున్నారు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్. తక్కువ ఆదాయ కుటుంబాలకు ఈ స్టవ్ చాలా బాగా ఉపయోగపడుతుందని అన్నారు. సీలింగ్ ఫ్యాన్ ప్రత్యేకత ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్స్ ప్రోగ్రామ్(ఈఈఎఫ్‌పీ) ఎల్సీడీ బల్బులు మాదిరిగా విద్యుత్ ఖర్చు తక్కువ, పర్యావరణానికి మేలు కలిగించేలా ఈ సీలింగ్ ఫ్యాన్లను అభివృద్ధి చేశారు. ఈ ఫ్యాన్ వల్ల విద్యుత్ బిల్లు కూడా తక్కువగానే ఉంటుంది. విద్యుత్ వినియోగంలో 35% తగ్గించే లక్ష్యంతో ఈ ఆధునాత ఫ్యాన్లను తీసుకొచ్చింది ఈఈఎస్ఎల్. ఇంతకమునుపు ఎల్ఈడీ బల్బులను తీసుకొచ్చి ప్రతి ఇంట్లో అవి ఉండేలా విజయవంతమైంది. మళ్లీ అదేవిధమైన విజయం పునరావృత్తమయ్యేలా ఈ ఆధునాత ఎలక్ట్రిక్ సీలింగ్ ఫ్యాన్లు, ఇండక్షన్ స్టవ్‌లను తీసుకొచ్చింది. ప్రయోజనం ఈ రెండు ఆధునాత ఎలక్రిక్ పరికరాల వల్ల కార్బన్ ఉద్గారాలు గణనీయంగా త్గగుతాయి అలాగే 12 జీడబ్ల్యూ గరిష్ట విద్యుత్ డిమాండ్‌ని నిరోధించగలం వినియోగదారులకు విద్యుత్ బిల్లు కూడా తక్కువగానే వస్తుంది. ఈ నేషనల్ ఎఫిషియెంట్ కుకింగ్ ప్రోగ్రామ్, ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్ ప్రోగ్రామ్‌లు భారతీయ గృహాలలో ఇంధన సామర్థ్యాన్ని పెంచడం తోపాటు కార్బన్ ఉద్గారాల పాదముద్రలను తగ్గించేలా సాహసోపేతమైన చర్యలు తీసుకుంటోంది. అంతకమునుపు ఉజ్వలా కింద జాతీయ వీధిలైట్ల కార్యక్రమంలో మిలియన్ల కొద్దీ ఎల్ఈడీ బల్బుల పంపిణీని తీసుకొచ్చి క్షేత్ర స్థాయిలో శక్తి వినియోగాన్ని, గరిష్ట విద్యుత్ డిమాండ్‌ని తగ్గించి గణనీయమైన ఫలితాన్ని పొందేలా చేసింది ఈఈఎస్ఎల్ . అదేవిధంగా ఈ ఇండక్షన్ కుకింగ్ స్టవ్‌లు, సీలింగ్ ఫ్యాన్లు శక్తి వినియోగాన్ని, కార్గన్ ఉద్గారాలను తగ్గించి పూర్తి స్థాయిలో విజయవంతమవుతాయని విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ఆ కాంక్షిస్తున్నారు. (చదవండి: చేతులు లేని తొలి మహిళా పారా ఆర్చర్! రెండు పతకాలతో ప్రపంచాన్నే..) -
సెలబ్రేషన్స్ టైమ్
ప్రభాస్ జన్మదిన (అక్టోబర్ 23) వేడుకను హైదరాబాద్‌లోని కూకట్పల్లి కైతలాపూర్ గ్రౌండ్స్‌లో ఫ్యాన్స్ నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ‘సలార్’ చిత్రం లుక్‌తో ప్రభాస్ భారీ కటౌట్‌ను ఆవిష్కరించారు ఫ్యాన్స్. ఈ కార్యక్రమంలో ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు శాస్త్రి, రామకృష్ణ, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సలార్’ చిత్రంలోని తొలి భాగం ‘సలార్: సీజ్ఫైర్’ డిసెంబరు 22న విడుదల కానుంది. మరోవైపు ప్రభాస్ ప్రస్తుతం ఫారిన్లో ఉన్నారని, వచ్చే నెల తన మరో చిత్రం ‘కల్కి 2898ఏడీ’ షూటింగ్లో ఆయన పాల్గొంటారని ఫిల్మ్‌నగర్ సమాచారం. -
భలే ముద్దుగున్నాయ్ చూడుర్రి.. పెట్ ఫ్యాన్స్‌కి పండగే!
-
Allu Arjun-69th National Film Award: అల్లు అర్జున్‌కు ఘనస్వాగతం.. ఇంటివద్ద ఫ్యాన్స్ కోలాహలం!(ఫొటోలు)
-
భారత్-పాక్ మ్యాచ్: స్టేడియంలో అభిమానుల సందడి (ఫొటోలు)
-
వీ గార్డ్ నుంచి ప్రీమియం బీఎల్డీసీ ఫ్యాన్లు
ముంబై: ప్రముఖ కన్జూమర్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ సంస్థ వీ–గార్డ్ ‘ఇన్సైట్ –జీ’ పేరుతో ప్రీమియం బీఎల్డీసీ ఫ్యాన్లు ఆవిష్కరించింది. వీటిలో ఆర్ఎంపీ 370 హై స్పీడ్ మోటార్ ఉంది. 5 స్టార్ రేటింగ్‌తో ఐదేళ్ల వారెంటీ కలిగి ఉన్నాయి. కనీసం 35 వాట్ల కంటే తక్కువ విద్యుత్‌ను వినియోగించుకుంటూ వార్షికంగా రూ.1518 ఆదా చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. డస్ట్ రిప్లెంట్ కోటింగ్, రివర్స్ మోడ్ ఆపరేషన్, వినియోగానికి అనుకూలమైన రిమోట్ కంట్రోల్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. బూస్ట్ మోడ్, బ్రీజ్ మోడ్, స్లీప్ మోడ్, స్టాండర్ మోడ్, కస్టమ్ మోడ్‌తో సహా పలు ఆపరేషన్ మోడ్‌లను కూడా అందిస్తుంది. భారతీయ గృహాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ఫ్యాన్లు తయారు చేశామని కంపెనీ ఎండీ రామచంద్రన్ తెలిపారు. -
అక్కినేని నాగచైతన్య సింప్లిసిటీ.. సిబ్బంది బైక్‌పై రైడ్!
అక్కినేని నాగచైతన్య ఈ ఏడాది కస్టడీ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీ తర్వాత నాగ్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారు. చందు మొండేటి డైరెక్షన్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. దీనికి సంబంధించి వివరాలను ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. (ఇది చదవండి: చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు 25 ఏళ్లు.. మెగాస్టార్ ఎమోషనల్ పోస్ట్) అయితే తాజాగా నాగచైతన్య తన సింప్లిసిటీని మరోసారి చాటుకున్నారు. అయితే తన సిబ్బందిలో ఒకరు కొత్త బైక్ కొన్నారు. దీంతో అతని బైక్ నడపడమే కాకుండా.. తన ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్యకు బైక్స్, కార్లు అంటే చాలా ఇష్టం. ఆయన వద్ద ఇప్పటికే చాలా మోడల్స్ కూడా ఉన్నాయి. మార్కెట్లో కొత్త మోడల్స్ వస్తే వాటిని తన గ్యారేజ్‌లోకి తీసుకురావాల్సిందే. హైదరాబాద్ రోడ్లపై అప్పుడప్పుడు బైక్ రైడ్స్ చేస్తూ కనిపిస్తుంటారు. View this post on Instagram A post shared by Sai (@always__about__akkineni) (ఇది చదవండి: లెస్బియన్స్‌గా యంగ్ హీరోయిన్స్.. ఓటీటీలో దూసుకెళ్తోన్న మూవీ!) -
రియల్ హీరో అంటే మీరే సార్.. !
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన గొప్ప మనసును చాటుకున్నారు. తన అభిమాని ఒకరు మృతి చెందడంతో ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. సినిమాలతో ఎప్పుడు హీరో తన అభిమాని కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు రావడంతో ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ మీలో హీరో ఉన్నాడంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: జవాన్ టీం బంపరాఫర్.. ఆ మూడు రోజులు టికెట్ ఫ్రీ! ) చెన్నైలోని ఎన్నూర్‌లో నివసించే అరవింద్ హీరో సూర్యకు వీరాభిమాని. సూర్య ఫ్యాన్స్ క్లబ్లో కొన్నేళ్లుగా మెంబర్ కూడా పని చేశారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న సూర్య వెంటనే అరవింద్ వాళ్ల ఇంటికి వెళ్లారు. అతడి తల్లిదండ్రులతో మాట్లాడి వారిలో ధైర్యాన్ని నింపారు. గతంలోనూ అభిమానులు చనిపోతే వాళ్ల కుటుంబాలకి అండగా నిలిచారు. కాగా.. సూర్య ప్రస్తుతం కంగువ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. (ఇది చదవండి: సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన ధోని 'ఎల్‌జీఎమ్'... తెలుగు సినిమాలు ఎన్నో తెలుసా?) The Man With Golden Heart 🛐❤️#Aravind a fan and a member of Fans Club lost his life in a road accident. Upon hearing the news, @Suriya_offl visited Aravind's home in Ennore to meet the family and conveyed his prayers and condolences.@rajsekarpandian #Kanguva pic.twitter.com/IycmuazAMC — SURIYA FANS TELUGU (@SuryaFansAndhra) September 28, 2023 -
గర్ల్ ఫ్రెండ్ కోసం ఓ ఫ్రీ టికెట్.. గట్టిగానే ఇచ్చిపడేసిన షారుక్!
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటించిన తాజా చిత్రం జవాన్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 7న థియేటర్లలో సందడి చేయనుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు కింగ్ ఖాన్ షారుక్. ఈ నేపథ్యంలోనే తన అభిమానులతో ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించారు. అయితే ఈ సెషన్లో ఓ అభిమాని ఓ ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. (ఇది చదవండి: ఆ స్టార్ డైరెక్టర్ సినిమాలో లేడీ సూపర్ స్టార్!) మీరు నా గర్ల్ ఫ్రెండ్ కోసం ఓ టికెట్ ఇప్పించగలరా? అని షారుక్‌ను అభిమాని అడిగాడు. అయితే దీనికి షారుక్ తనదైన స్టైల్లో కౌంటరిచ్చాడు. 'ఉచితంగా ప్రేమ మాత్రమే దొరుకుతుంది.. టికెట్ కాదు' అంటూ బాద్షా బదులిచ్చాడు. టికెట్ కావాలంటే డబ్బులిచ్చి కొనుక్కోవాల్సిందే. ప్రేమ విషయంలో మరి ఇంత చీప్‌గా ఉండకండి. వెళ్లి టికెట్ కొనుక్కోండి. మీ ప్రియురాలిని సినిమాకు తీసుకెళ్లండి.' అంటూ షారుక్ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ప్రియమణి, సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించగా.. దీపికా పదుకొణె ప్రత్యేక కనిపించనుంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే జవాన్ ట్రైలర్ విడుదలై నెటిజన్ల ప్రశంసలు అందుకుంది. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో ఈ చిత్రాన్ని గౌరీ ఖాన్ నిర్మించారు. జవాన్ తర్వాత షారుక్ రాజ్‌కుమార్ హిరానీ డైరెక్షన్లో డంకీలో నటించనున్నారు. (ఇది చదవండి: ఆ విషయంలో మమ్మల్ని క్షమించండి.. నవీన్ పోలిశెట్టి ఆసక్తికర కామెంట్స్!) Free mein pyaar deta hoon bhai….ticket ke toh paise hi lagenge!! Don’t be cheap in romance go and buy the ticket…and take her with u. #Jawan https://t.co/uwGRrZkz9I — Shah Rukh Khan (@iamsrk) September 3, 2023 -
ఆమె ఎందుకలా చేసిందో తెలియదు: దుల్కర్ సల్మాన్ షాకింగ్ కామెంట్స్
సీతారామం సినిమాతో టాలీవుడ్లో క్రేజ్ దక్కించుకున్న హీరో దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు మలయాళ సినిమాలతో బిజీగా ఉన్నారు. 'కింగ్ ఆఫ్ కోతా' అంటూ అభిమానులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. అంతే కాకుండా దుల్కర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వెబ్ సిరీస్ గన్స్ అండ్ గులాబ్స్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం కింగ్ ఆఫ్ కోత మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న దుల్కర్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా మహిళ అభిమానులు తన పట్ల వ్యవహరించిన తీరుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక మహిళా అభిమాని తనను అనుచితంగా తాకిందని వెల్లడించారు. (ఇది చదవండి: అలా చేయమని ఒత్తిడి.. డైరెక్టర్ చెంప చెళ్లుమనిపించా: నటి) దుల్కర్ మాట్లాడుతూ..'సాధారణంగా అభిమానులు సెలబ్రిటీలకు హాని కలిగించాలని అనుకోరు. కానీ కొన్నిసార్లు ఉత్సాహంతో కొన్నిసార్లు అలా ప్రవర్తిస్తారు. కానీ ఓ సంఘటన నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఓ మహిళ తన కాళ్లపై చేతులతో రుద్దింది. ఆమె అలా ఎందుకు చేసిందో తెలియదు. ఆ సమయంలో నాకు చాలా నొప్పిగా అనిపించింది. ఆమె వయసులో నాకన్న చాలా పెద్దది. ఆమె అలా ఎందుకు చేసిందో అర్థం కాలేదు. అక్కడే వేదికపై చాలా మంది ఉన్నారు.' అని తన అనుభవాన్ని పంచుకున్నారు. కొందరు తమ చేతులను ఎక్కడ ఉంచుకోవాలో తెలియనప్పుడు ఇలా జరుగుతుందని దుల్కర్ సల్మాన్ అన్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో చాలా అసౌకర్యంగా అనిపిస్తుందని తెలిపారు. ఆ సమయంలో ఏం జరుగుతుందోనని ఆశ్చర్యపోయా.. దాని నుంచి ఎలా బయటపడాలో నాకు తెలియలేదంటూ దుల్కర్ పంచుకున్నారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటించిన 'గన్స్ అండ్ గులాబ్స్' ఆగస్టు 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో రాజ్‌కుమార్ రావు, పూజా గోర్, గుల్షన్ దేవయ్య, ఆదర్శ్ గౌరవ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. దుల్కర్ నటించిన కింగ్ ఆఫ్ కోత ఆగస్టు 24న థియేటర్లలోకి రానుంది. (ఇది చదవండి: భార్యతో విడాకులు తీసుకున్న బిగ్ బాస్ ఫేమ్!) -
ప్రభాస్ ఫ్యాన్స్ వీరంగం.. థియేటర్ అద్దాలు ధ్వంసం!
హైదరాబాద్‌లో ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని థియేటర్లో వీరంగం సృష్టించారు. సుదర్శన్ థియేటర్లో యోగి రీరిలీజ్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. రెచ్చిపోయిన ప్రభాస్ ఫ్యాన్స్ టాకీస్‌లోని స్క్రీన్‌తో పాటు ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. (ఇది చదవండి: షారూక్ ఖాన్‌పై డైరెక్టర్ సంచలన కామెంట్స్..!) థియేటర్‌పై కూల్‌డ్రింక్ బాటిళ్లతో ఫ్యాన్స్ దాడి చేయడంతో అద్దాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఇద్దరిని చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉండగా వారికోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. (ఇది చదవండి: జిలేబి సినిమా రివ్యూ) Frustrated Prabhas fans are damaging theatre property because #Rogi4K failed to cross even the parking collections of previous re-releases. The cost of theatre damage is greater than the overall collections collected by ROGI till now."pic.twitter.com/eNO1XiYiw3 — HNE Official™ (@urstrulyHNE) August 18, 2023 -
కోటా హాస్టల్స్‌లో ఆత్మహత్యల కట్టడికి కొత్త ఆలోచన
జైపూర్: రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వీటిని అరికట్టడానికి నివారణ చర్యలు చేపట్టింది. హాస్టల్ గదుల్లో సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో 'స్బ్రింగ్ లోడెడ్ ఫ్యాన్ల'ను అమర్చుతున్నారు. ప్రస్తుతం ఈ అంశంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. విద్యార్థుల మానసిక స్థితిని మార్చడానికి ప్రయత్నించాలి కానీ.. సీలింగ్ ఫ్యాన్లు కాదని నెటిజన్లు ఫైరవుతున్నారు. ఐఐటీ, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు నిలయంగా ఉంటుంది రాజస్థాన్‌లోని కోటా. ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్థులు అక్కడికి వచ్చి శిక్షణ పొందుతుంటారు. ఈ క్రమంలో ప్రతి ఏడాది విద్యార్థులు మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గత ఏడాది 15 మంది ప్రాణాలు కోల్పోగా.. ఈ సారి 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల ఓ విద్యార్థి(18) చనిపోయిన వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నెలలో ఇది నాలుగో ఆత్మహత్య కావడం గమనార్హం. #WATCH | Spring-loaded fans installed in all hostels and paying guest (PG) accommodations of Kota to decrease suicide cases among students, (17.08) https://t.co/laxcU1LHeW pic.twitter.com/J16ccd4X0S — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 18, 2023 అయితే.. ఎక్కువగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉండటంతో అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను అమర్చారు. ఏమాత్రం బరువు పడినా వెంటనే ఊడివచ్చేలా ఫ్యాన్లను అమర్చారు. ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థుల మానసిక స్థితిగతులను మార్చాలని, అందుకు కౌన్సిలింగ్ వంటి చర్యలు చేపట్టాలని నెటిజన్లు సూచనలు చేస్తున్నారు. ఇదీ చదవండి: ఆత్మనిర్భర్ స్ఫూర్తి.. దేశంలోనే తొలి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు.. అదీ 45 రోజుల్లో! -
మీ నవ్వులు చూడాలనుకుంటున్నా– విజయ్ దేవరకొండ
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నా సక్సెస్‌లో, ఫెయిల్యూర్స్‌లో ఇంత ప్రేమ ఇచ్చిన మీకు(ఫ్యాన్స్) థ్యాంక్స్. జీవితంలో చాలా మారాయి. ఎత్తు, పల్లాలు చూస్తున్నా. నా చుట్టూ మనుషులు మారుతున్నారు.. నా గురించి ఏదో మాట్లాడతారు. కానీ, మీ (ఫ్యాన్స్) ప్రేమ స్థిరంగా ఉంటుంది.. అందుకే సెప్టెంబర్ 1న మీ మొహాల్లో నవ్వులు చూడాలనుకుంటున్నా’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదలవుతోంది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ‘ఖుషి మ్యూజికల్ కన్సర్ట్’ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ–‘‘నీ మొహంలో నవ్వు చూడాలని మాత్రమే పనిచేస్తున్నా’ అంటూ గత నెల రోజులుగా చెబుతున్నాడు శివ నిర్వాణ. నాక్కూడా నవ్వులు చూడాలని ఉంది. కానీ, నాకంటే ఎక్కువగా సమంత మొహంలో నవ్వులు చూడాలని ఉంది. తను ఈ సినిమా కోసం ఎంతో కష్టపడింది. అలాగే శివ నిర్వాణలోనూ నవ్వులు చూడాలనుంది’’ అన్నారు. సమంత మాట్లాడుతూ–‘‘మీ కోసం(అభిమానులు, ప్రేక్షకులు) కష్టపడుతున్నాను.. తిరిగి ఆరోగ్యంగా వస్తాను.. ‘ఖుషి’తో బ్లాక్ బస్టర్ ఇస్తానని మీకు మాట ఇస్తున్నాను’’ అన్నారు. శివ నిర్వాణ మాట్లాడుతూ–‘‘ఖుషి’ చూస్తే మీకు(ప్రేక్షకులు) విజయ్, సమంత కనిపించరు.. విప్లవ్, ఆరాధ్య మాత్రమే కనిపిస్తారు. సినిమా చూసి బయటికెళ్లేటప్పుడు ఈ మూవీని మరోసారి చూద్దామనిపిస్తుంది’’ అన్నారు. ‘‘డియర్ కామ్రేడ్’ మేము అనుకున్నంత విజయం సాధించలేదు. కానీ ‘ఖుషి’ పెద్ద హిట్ కాబోతోంది’’ అన్నారు నవీన్ యెర్నేని. ‘‘శివ నిర్వాణతో మా బ్యానర్లో మరో సినిమా చేయనున్నాం’’ అన్నారు వై.రవిశంకర్. ‘‘ఖుషి మ్యూజికల్ కన్సర్ట్’కి విచ్చేసిన విజయ్, సమంతలకి థ్యాంక్స్. ఈ వేడుకని గ్రాండ్‌గా చేసేందుకు సహకారం అందించిన నవీన్, రవిశంకర్, దినేశ్గార్లకు కృతజ్ఞతలు’’ అన్నారు చిత్ర సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్. ఈ కార్యక్రమంలో మైత్రీ మూవీస్ సీఈవో చెర్రీ, కెమెరామేన్ జి.మురళి, డైరెక్టర్ అనిల్ రావిపూడి తదితరులు పాల్గొన్నారు. -
పవన్‌పై అనకాపల్లివాసుల అసహనం
సాక్షి, విశాఖపట్నం: ‘‘జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తన పర్యటనతో ఏం సాధిస్తున్నారు?. మిడిమిడి జ్ఞానంతో ప్రభుత్వంపై ఇష్టానుసారం విమర్శలు చేయడం తప్పించి!’’ అనే విమర్శే వినిపిస్తోంది ప్రత్యర్థుల నుంచి. ఈ క్రమంలో.. స్థానికులు సైతం పవన్, జనసైనికుల తీరుతో ఇబ్బందులు పడుతున్నారు. ఏదో ఒకటి మాట్లాడడం తప్పించి.. రూల్స్ ఫాలో అయ్యేది లేదు.. ఓ క్రమశిక్షణా లేదు.. జనసైనికులతో కలిసి తన పర్యటనతో పవన్ విశాఖ వాసులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా తాజాగా పవన్ కళ్యాణ్ ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి హైవేకు ఇరువైపులా బైక్ ర్యాలీతో పవన్ దూసుకుపోగా.. ఆ ట్రాఫిక్ మధ్యలోనే ఆగిపోయి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మొన్న రుషికొండ పర్యటన సందర్భంగా హడావిడి చేసిన పవన్.. ముందస్తు సమాచారం ఇచ్చి భారీగా అభిమానులు గుమిగూడేందుకు కారణం అయ్యాడు. పైగా సాయంత్రం సమయం కావడంతో జనాలు ట్రాఫిక్ రద్దీతో బాగా ఇబ్బంది పడ్డారు. ఇదీ చదవండి: గొడవలు చేయడానికే పవన్ రుషికొండ వెళ్లింది! -
షారుక్ లేనిదే 'డాన్' లేదు.. ఇప్పుడేమో ఏకంగా!
‘మా డాన్ షారుక్ ఖాన్... వేరే ఎవర్నీ ఊహించలేం’ అంటూ మంగళవారం పలువురు షారుక్ ఖాన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న అబిప్రాయాలు వైరల్ అవుతున్నాయి. ‘డాన్, డాన్ 2’ తర్వాత రానున్న ‘డాన్ 3’లో షారుక్ నటించరన్న వార్త గుప్పుమనడంతో ‘‘షారుక్ ప్లేస్‌లో వేరే డాన్ని చూడలేం’’ అంటున్నారు ఫ్యాన్స్. మంగళవారం ఫర్హాన్ అక్తర్ చెప్పీ చెప్పనట్లు సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్‌తో ‘డాన్ 3’ అంశం పై చర్చ ఊపందుకుంది. ఆ వివరాల్లోకి వెళదాం.. హిందీ తెరపై డాన్ అంటే అమితాబ్ బచ్చన్ గుర్తొస్తారు. ఆయన టైటిల్ రోల్లో రూపొందిన ‘డాన్’ (1978) సూపర్ డూపర్ హిట్టయింది. చంద్ర బారోత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అయిన బడ్జెట్ దాదాపు రూ 70 లక్షలు. కానీ వసూళ్లు రూ. 7 కోట్లు. అంటే.. పదింతల లాభం. డాన్‌గా అమితాబ్ యాక్షన్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇదే సినిమా తెలుగు రీమేక్ ‘యుగంధర్’ (1979)లో ఎన్టీఆర్, తమిళ రీమేక్ ‘బిల్లా’లో రజనీకాంత్ నటించారు. దక్షిణాదిన కూడా ఈ డాన్ సూపర్ హిట్. ది చేజ్ బిగిన్స్ ఎగైన్ అమితాబ్ బచ్చన్ డాన్ క్యారెక్టర్ అద్భుతంగా చేయడంతో ఇక డాన్ క్యారెక్టర్ అంటే ఆయనే అని ఫిక్స్ అయ్యారు బాలీవుడ్ ప్రేక్షకులు. అలాంటి తరుణంలో ‘నేను ఉన్నాను’ అంటూ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత షారుక్ ఖాన్ డాన్‌గా తెరపైకి వచ్చారు. షారుక్ డాన్ రోల్లో ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’ (2006) రూపొందింది. అమితాబ్ ‘డాన్’కి రీ బూట్ వెర్షన్‌లా ఫర్హాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 30 ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కాబట్టి ట్రెండ్‌ని దృష్టిలో పెట్టుకుని కథ తయారు చేయించారు. ఇక అమితాబ్ తర్వాతి తరంలో డాన్ అంటే షారుక్ అనేలా కింగ్ ఖాన్ అద్భుతంగా నటించారు. షారుక్ సరసన ప్రియాంకా చోప్రా నటించారు. సుమారు రూ. 40 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ‘డాన్’ దాదాపు రూ. 105 కోట్ల వసూళ్లు రాబట్టి, సంచలన విజయం సాధించింది. ది కింగ్ ఈజ్ బ్యాక్ సిల్వర్ స్క్రీన్‌పై ఒక పాత్ర హిట్టయితే ఆ క్యారెక్టర్ని మళ్లీ మళ్లీ చూడాలనుకుంటారు ప్రేక్షకులు. అమితాబ్ ‘డాన్’ తర్వాత మళ్లీ డాన్ క్యారెక్టర్ని చూడాలనుకున్నారు. షారుక్ ‘డాన్’గా వచ్చి, అలరించారు. ఈ హిట్ డాన్ని అలా వదిలేస్తే ఎలా? మళ్లీ ఈ పాత్ర చేయాలని షారుక్ అనుకున్నారు. డాన్ కోసం కథలు తయారు చేయించాలని ఫర్హాన్ కూడా ఫిక్స్ అయ్యారు. అలా ‘డాన్: ది కింగ్ ఈజ్ బ్యాక్’ అంటూ సెకండ్ వెర్షన్ ఆరంభించారు. ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’ విడుదలైన ఐదేళ్లకు ‘డాన్ 2’ (2011)ని వెండితెరపైకి వదిలారు. ఇందులోనూ షారుక్ సరసన ప్రియాంకా చోప్రా నటించారు. ‘డాన్: ది చేజ్ బిగిన్స్ ఎగైన్’కి రెండింతల బడ్జెట్.. అంటే దాదాపు రూ. 80 కోట్లతో రూ΄పొందించారు. సుమారు రూ. 200 కోట్ల వసూళ్లతో రీబూట్ వెర్షన్లో వచ్చిన ఈ రెండో ‘డాన్’ కూడా ఘనవిజయం సాధించింది. ఫస్ట్ వెర్షన్‌కి ఫర్హాన్ దర్శకత్వం వహించి, ఓ నిర్మాతగా వ్యవహరించారు. రెండో వెర్షన్‌కి కూడా ఫర్హాన్ ఈ రెండు బాధ్యతలు చేపట్టగా, షారుక్ నటించడంతో పాటు ఓ నిర్మాతగా వ్యవహరించారు. ‘డాన్ 3’లో రణ్వీర్ సింగ్? ప్రేక్షకులు, షారుక్ అభిమానులు డాన్ క్యారెక్టర్ని మరచిపోలేదు. షారుక్ కూడా డాన్ పాత్రతో అనుబంధం పెంచుకున్నారు. ఫర్హాన్‌కి కూడా ఆ పాత్ర అంటే మక్కువ. అందుకే 2011లో ‘డాన్ 2’ని రిలీజ్ చేసినప్పట్నుంచి ఇప్పటివరకూ ‘డాన్ 3’ గురించి ఏదో సందర్భంలో ఇద్దరూ మాట్లాడుతూ వచ్చారు. ‘డాన్ 3’ కచ్చితంగా ఉంటుందని ఫర్హాన్ చెప్పుకుంటూ వచ్చారు. త్వరలో మూడో వెర్షన్‌కి శ్రీకారం జరిగే అవకాశం ఉందని మంగళవారం ఫర్హాన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన వీడియో స్పష్టం చేస్తోంది. ఆ వీడియోలో ‘3’ అంకె కనిపించడంతో పాటు బ్యాక్‌గ్రౌండ్‌లో ‘డాన్’ థీమ్ మ్యూజిక్ వినబడుతోంది. అలాగే కొత్త శకం ఆరంభం కాబోతోంది అని ఉంది. సో... ‘డాన్ 3’ రానుందని చాలామంది ఫిక్స్ అయ్యారు. అయితే ఫర్హాన్ నటీనటులను ప్రకటించలేదు. దాంతో ఒకవేళ షారుక్ ఖాన్ అని ఫిక్స్ అయ్యుంటే.. ప్రకటించి ఉండేవారు కదా అనే చర్చ మొదలైంది. అలాగే కొత్త డాన్‌గా రణ్వీర్ సింగ్ నటిస్తారనే వార్త ఎప్పట్నుంచో ప్రచారంలో ఉంది. సో.. థర్డ్ వెర్షన్లో నటించబోయేది రణ్‌వీరే అని షారుక్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. పైగా ‘కొత్త శకం ఆరంభం కాబోతోంది’ అన్నారు కాబట్టి హీరోని మార్చే ఆలోచనలో ఫర్హాన్ ఉన్నారని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. కొందరు ఫ్యాన్స్ ఫర్హాన్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేస్తే షారుక్ చేయాలి.. లేదా ఈ సిరీస్‌కి ఫుల్స్టాప్ పడాలన్నట్లుగా స్పందిస్తున్నారు. మరోవైపు రణ్వీర్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి.. షారుక్ మళ్లీ డాన్‌గా కనిపిస్తారా లేక రణ్వీర్ తెర మీదకు వస్తారా? ఒకవేళ రణ్వీర్ వస్తే.. అప్పట్లో అమితాబ్‌కి దీటుగా నటించి, డాన్‌గా భేష్ అని షారుక్ అనిపించుకున్నట్లే రణ్వీర్ కూడా ప్రేక్షకుల మెప్పు ΄పొందగలుగుతారా? వేచి చూడాల్సిందే. -
గుండె బరువుతో పాటకు సెలవు..
సాక్షి, సిటీబ్యూరో/అల్వాల్/ గన్‌పౌండ్రి: ప్రజా యుద్ధనౌక ఇక సెలవంటూ తరలివెళ్లింది. తన పదనునైన గళంతో, ఉర్రూతలూగించే పాటలతో అర్ధ శతాబ్దం పాటు యావత్ సమాజాన్ని ప్రభావితం చేసిన సాంస్కృతిక యోధుడు, ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం అల్వాల్ భూదేవినగర్‌లో ఆయన స్థాపించిన మహాబోధి పాఠశాలలో ముగిశాయి. వేలాదిమంది అభిమానులు, వివిధ పారీ్టలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, కవులు, కళాకారులు, ప్రజా సంఘాలకు చెందిన ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు, కుటుంబసభ్యులు, బంధువులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో క్రియాశీలమైన భూమికను పోషించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన వంతు కృషి చేసిన గద్దర్ అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించింది. బౌద్ధమత సాంప్రదాయం ప్రకారం గద్దర్ తనయుడు సూర్య అంత్యక్రియల క్రతువును నిర్వహించారు. బౌద్ధమత గురువులు పంచశీల సూత్రాలను పఠించారు. అనంతరం గద్దర్ పార్థివదేహాన్ని సమాధి చేశారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ భూదేవినగర్‌లోని గద్దర్ నివాసానికి వచ్చి ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. గద్దర్ భార్య విమలను, కుటుంబసభ్యులను పరామర్శించారు. మంత్రులు మహమూద్ అలీ, హరీశ్‌రావు, తలసాని తదితరులు సీఎం వెంట ఉన్నారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు కూడా అల్వాల్‌లో గద్దర్ భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు దానం నాగేందర్, టి.రాజయ్య, జీవన్‌రెడ్డి, మంచు మోహన్‌బాబు, మనోజ్, అలీ, నాగబాబు, నిహారిక, పరుచూరి గోపాలకృష్ట, ఆర్.నారాయణమూర్తి, ప్రొఫెసర్ కోదండరాం, జయప్రకాశ్ నారాయణ, తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, జూలకంటి రంగారెడ్డి, అనగాని సత్యప్రసాద్, జనార్ధన్, పరిటాల శ్రీరామ్, వివేక్, మోత్కుపల్లి నరసింహులు తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. భూదేవినగర్, వెంకటాపురం ప్రజలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిమంది తరలివచ్చి కన్నీటి నివాళులర్పించారు. అంత్యక్రియలకు ప్రముఖులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ఎమ్మెల్యే సీతక్క, మధుయాష్కీ గౌడ్, వి.హనుమంతరావు, మల్లు రవి ,శ్రీధర్‌బాబు, మాభూమి చిత్ర దర్శకులు నర్సింగ్ రావు, ప్రముఖ సినీనటుడు ఆర్.నారాయణమూర్తి, తెలంగాణ ఉద్యమ నేత గాదె ఇన్నయ్య, జనశక్తి నేతలు కూర రాజన్న, అమర్, విమలక్క, బీఆర్ఎస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, రసమయి బాలకిషన్, గోరటి వెంకన్న, బాల్క సుమన్, క్రాంతి, గెల్లు శ్రీనివాస్, పల్లె రవి, ఎమ్మార్పిఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, జర్నలిస్టు పాశం యాదగిరి, వేదకుమార్, తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. దారంతా జన ప్రభంజనం తెలుగు ప్రజల సాంస్కృతిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన గద్దర్ అంతిమయాత్ర మహాజన ప్రభంజనాన్ని తలపించింది. ఎల్బీ స్టేడియం నుంచి అల్వాల్ వరకు రహదారులు జసందోహంతో పోటెత్తాయి. పోలీసుల గౌరవ వందనంతో అంతిమ యాత్ర ప్రారంభమైంది. అనారోగ్యంతో ఆదివారం కన్నుమూసిన గద్దర్ భౌతికకాయాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఎల్బీ స్టేడియంలో ఉంచిన సంగతి తెలిసిందే. కాగా మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర గన్‌పార్క్, ట్యాంక్‌బండ్ (అంబేడ్కర్ విగ్రహం), సికింద్రాబాద్ మీదుగా సాయంత్రం 4 గంటలకు అల్వాల్‌కు చేరుకుంది. వాహనానికి జై భీం జెండాలతో పాటు బుద్దుడి పంచశీల జెండాలను ఏర్పాటు చేశారు. గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద కళాకారులు పాటలతో శ్రద్ధాంజలి ఘటించారు. గద్దర్ పార్థివదేహాన్ని ఉంచిన వాహనానికి ముందు, వెనుక వేలాదిగా కదిలివచ్చిన అభిమానులు ‘అమర్ రహే గద్దర్’, ‘జోహార్ గద్దరన్న’ అంటూ ఇచ్చిన నినాదాలతో పరిసరాలు ప్రతిధ్వనించాయి. ఎల్బీ స్టేడియంలో ఘన నివాళులు ఎల్బీ స్టేడియంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు, అభిమానులు, సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో గద్దర్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, మాజీ మంత్రి జానారెడ్డి, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రత్యేక వేదికలు.. కటౌట్లు గద్దర్‌ను చివరిసారి చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా ప్రజలు బారులు తీరారు. ఎక్కడికక్కడ వాహనాన్ని నిలిపివేసి ఆయన భౌతికకాయానికి నమస్కరిస్తూ నివాళులర్పించారు. సికింద్రాబాద్, జేబీఎస్, కార్ఖానా, తిరుమలగిరి, తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి తలసాని పాల్గొన్నారు. దారి పొడవునా అక్కడక్కడా పెద్ద ఎత్తున గద్దర్ కటౌట్లను ఏర్పాటు చేశారు. ప్రజా నాట్యమండలి, జన నాట్యమండలి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకు చెందిన కళాకారుల ఆట, పాటల నడుమ గద్దర్ అంతిమయాత్ర సాగింది. అంతిమయాత్రలో విషాదం సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ కన్నుమూత గద్దర్ అంతిమయాత్ర సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. వివిధ రంగాల ప్రముఖులతో పాటు అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావడంతో అల్వాల్‌లో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో చిక్కుకున్న సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ (63) తీవ్రమైన నీరసంతో జనంమధ్యలో పడిపోయారు. స్థానికులు వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కార్డియాక్ అరెస్టుతో చనిపోయినట్లు చెప్పారు. గద్దర్‌కు సన్నిహితుడైన జహీరుద్దీన్ ఆదివారం నుంచి ఆయన భౌతికకాయం వద్దే ఉన్నారు. సీఎం కేసీఆర్ సంతాపం సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం ఉర్దూ పత్రిక ప్రపంచానికి తీరనిలోటన్నారు. పత్రికా సంపాదకుడుగా తెలంగాణ ఉద్యమంలో అలీఖాన్ పోషించిన పాత్ర, ఆయన సేవలను సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన ఉర్దూ పత్రికారంగానికి ఎనలేని సేవలు చేశారన్నారు. జహీరుద్దీన్ కుటుంబసభ్యులకు కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జహీరుద్దీన్ మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య సంతాపం తెలిపారు. జహీరుద్దీన్ అలీఖాన్ ఆకస్మిక మరణం పట్ల, మీడియా అకాడమీ చైర్మన్, అల్లం నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాతబస్తీ రాజకీయాల్లో ప్రముఖపాత్ర వహించి చెరగని ముద్ర వేశారని, దేశంలోని ఉర్దూ జర్నలిజానికి ఆయన మరణం తీరని లోటు అన్నారు. వ్యక్తిగతంగా జహీరుద్దీన్ అలీఖాన్‌తో తమ కుటుంబానికి మంచి సంబంధాలు ఉండేవని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గుర్తు చేసుకున్నారు. అతని కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని కలి్పంచాలని భగవంతుడిని కోరారు. జహీరుద్దీన్ మృతిపై ఇంకా ఏఐఎంఎస్ఎస్ రాష్ట్ర ఇన్చార్జి సీహెచ్.ప్రమీల, ఏఐడీఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్‌రాజ్, ఏఐడీవైఓ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి వై.నాగరాజు సంతాపం తెలిపారు. కలం.. గళం 24 గంటల్లోనే లోకాన్ని విడిచిన ఆప్తమిత్రులు ప్రజాయుద్ధనౌక గద్దర్, ‘సియాసత్’జహీరుద్దీన్ సాక్షి, హైదరాబాద్: అవును వారిద్దరూ ఆప్తమిత్రులు... ఎన్నో ఆలోచనలు..మరెన్నో చర్చలు..ఇద్దరూ సమాజ శ్రేయస్సుకు కృషి చేసిన వారే.. 24 గంటల వ్యవధిలోనే ఈ లోకాన్ని విడిచివెళ్లారు. వారిలో ఒకరు తన ఆటాపాటతో విప్లవ, తెలంగాణ ఉద్యమాలకు ఊపిరిలూదితే.. మరొకరు పత్రిక ద్వారా మైనారిటీ, బడుగు బలహీనవర్గాల పక్షాన నిలిచారు. వారే ప్రజాయుద్ధనౌక గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్‌రావు.. మరొకరు సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్. వారిద్దరూ సియాసత్ కార్యాలయంలో గంటల తరబడి చర్చల్లో మునిగితేలేవారు. గద్దర్ వారానికోసారైనా సియాసత్ కార్యాలయానికి వెళ్లడం అక్కడ సామాజిక, రాజకీయ అంశాలే కాకుండా ప్రజానీకం సమస్యలపై తరచు చర్చలు సాగించేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ వీరిద్దరూ కీలకభూమిక పోషించారు. సియాసత్ తరఫున నిర్వహించే సామాజిక కార్యక్రమాలకు సంబంధించి జహీరుద్దీన్అలీఖాన్ గద్దర్‌తో చర్చించేవారు. గద్దర్ మరణించిన వార్త తెలిసి జహీరుద్దీన్ చలించిపోయారు. ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ అంత్యక్రియలు జరిగే అల్వాల్‌లోని వెంకటాపూర్ వరకు పార్థివదేహం వెళ్లిన వాహనంలోనే ఆయన వెళ్లారు. అక్కడ దిగిన తర్వాత గద్దర్ భౌతికకాయాన్ని తీసుకెళుతున్న సమయంలో ఒక్కసారిగా జనం తోపులాట ఎక్కువ కావడం, ఆ మధ్యలోనే జహీరుద్దీన్ పడిపోవడం, తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. దగ్గర్లోని ఆస్పత్రికి ఆయన్ను తరలించినా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. అందరివాడు గద్దర్ అన్ని రంగాలు, వర్గాలతో సన్నిహితంగా మెలిగిన ప్రజాగాయకుడు సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం..పీడిత వర్గాల తరఫున ప్రభుత్వాలను ప్రశ్నించిన గొంతు అది..పోలీసులు ఎక్కుపెట్టిన తుపాకులను సైతం లెక్క చేయక నిలబడి కొట్లాడిన గళం అది..అయినాసరే గద్దర్ అజాత శత్రువుగానే బతికారు. ఉద్యమం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపే పోరాటం కాదని, ప్రజల హక్కులను కాపాడుకోవడం అని ఎన్నోసార్లు తన విధానాన్ని సుస్పష్టం చేశారు. తన వ్యవహార శైలితో సమాజంలోని అన్ని వర్గాలకు దగ్గరయ్యారు. రాజకీయ పారీ్టలకతీతంగా ప్రముఖ నాయకులందరితోనూ సాన్నిహిత్యాన్ని సంపాదించారు. కళాకారుడిగా, రచయితగా సినీరంగంతోనూ ఆయన అనుబంధం కొనసాగింది. గద్దర్ మరణ వార్తతో అన్ని రంగాల ప్రముఖులు, సామాన్యుల నుంచి అన్ని వర్గాల వారు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇక సోమవారం జరిగిన గద్దర్ అంతిమయాత్ర ఆసాంతం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పట్టింది. 1972 నుంచి 2012 వరకు నాలుగు దశాబ్దాల విప్లవ ప్రస్థానంలో పీడిత ప్రజల పక్షాన నిలబడ్డ గద్దర్ తన పాటలతో ఎన్నో ఉద్యమాలకు ఊపిరిలూదారు. ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాట గొంతుకగా నిలిచారు. నిక్కచ్చిగా మాట్లేడే తత్వమే గద్దర్‌కు ఎంతో మందిని దగ్గర చేసింది. మావోయిస్టు ఉద్యమాలకు దశాబ్దాలుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయన అందించిన తోడ్పాటును గుర్తుచేస్తూ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఓ లేఖ విడుదల చేసింది. గద్దర్ మృతి తమను తీవ్రంగా బాధించిందని పేర్కొంది. మరోవైపు ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ఎన్నో సందర్భాల్లో ప్రశ్నించిన ప్రజాయుద్ధ నౌక అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వమే అధికార లాంఛనాలతో నిర్వహించింది. ఉద్యమ సమయంలో, అనేక ఎన్కౌంటర్ల సమయంలో పోలీసులతో ఎన్నో అంశాలపై కొట్లాడిన గద్దర్‌కు నివాళులర్పించేందుకు ఒకప్పటి ఎస్ఐబీ చీఫ్ సజ్జనార్ సైతం వచ్చారు. గద్దర్‌తో తన అనుబంధాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. సినీ ప్రముఖులు సైతం సంతాపం తెలిపారు. ఆయన అభిమానులు, తోటి రచయితలు, అంతిమయాత్రలో పాదం కలిపారు. మావోయిస్టు ఉద్యమంతో దశాబ్దాలు గడిపిన గద్దర్‌కు చివరి గడియల్లో పోలీసు తుపాకులు గౌరవ వందనం సమర్పించడం.. ఆయన అందరివాడన్న దానికి మరో నిదర్శనంగా నిలిచింది. -
తమన్నా చేయి పట్టుకున్న అభిమాని.. హీరోయిన్ ఏం చేసిందంటే?
మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్‌తో పాటు సౌత్ సినిమాలతో బిజీ అయిపోయింది. ఇటీవలే లస్ట్ స్టోరీస్-2తో ప్రేక్షకుల ముందుకొచ్చిన ప్రస్తుతం ఆమె నటించిన భోళాశంకర్, జైలర్ విడుదలకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే రిలీజైన జైలర్ సాంగ్ కావాలయ్యా అంటూ అభిమానలను ఓ రేంజ్లో ఊపేస్తోంది ముద్దుగుమ్మ. తాజాగా ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సావానికి వెళ్లిన భామకు అభిమానుల తాకిడి ఎదురైంది. (ఇది చదవండి: థియేటర్లో యాంకర్ రచ్చ రచ్చ.. భర్తతో కలిసి!) కేరళలోని కొల్లాంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్లగా తమన్నాకు ఊహించని సంఘటన ఎదురైంది. ఆమె చుట్టూ బౌన్సర్లు ఉండగా.. వారందరినీ తప్పించుకుని ఏకంగా తమన్నా చేయిని పట్టుకున్నాడు. దీంతో అక్కడున్న బౌన్సర్లు ఒక్కసారిగా అప్రమత్తమై అతన్ని పక్కకు లాగేశారు. అయితే అభిమాని అత్యుత్సాహాన్ని గమనించిన మిల్కీ బ్యూటీ బౌన్సర్లకు నచ్చజెప్పి.. అభిమానితో నవ్వుతూ సెల్పీ దిగింది. మరీ మిల్కీ బ్యూటీ అభిమానులంటే ఆ మాత్రం ఉంటది అంటున్నారు నెటిజన్స్. కాగా.. రజినీకాంత్ సరసన తమన్నా నటించిన జైలర్ ఈనెల 10న థియేటర్లలో సందడి చేయనుంది. అలాగే మెగాస్టార్ భోళాశంకర్ సైతం ఈనెల 11వ తేదీన రిలీజ్ కానుంది. (ఇది చదవండి: మారకపోతే ఆగిపోతాం.. పెళ్లి ప్లాన్ ఇప్పటికైతే లేదు: –తమన్నా) Bouncers try to stop fan from getting near #Tamannaah but she says #Kaavaalaa and gracefully poses for a selfie sending the fan to cloud nine #KaavaalaaStorms100MViews Get ready to witness @tamannaahspeaks magic on big screens #JailerFromAugust10th 😍😍pic.twitter.com/cnt4N9ZFsh — moviememesmedia (@moviememesmedi1) August 6, 2023 -
బ్రో సినిమాలో పవన్ ఫ్యాన్స్ రచ్చ
-
చనిపోయిన అభిమానుల కుటుంబాలకు అండగా సూర్య, వీడియో కాల్ చేసి..
-
విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అరాచకం
సాక్షి, విశాఖపట్నం: నగరంలో పవన్ కల్యాణ్ అభిమానులు అరాచకం సృష్టించారు. బ్రో ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో తమ నాయకుడిలానే ఊగిపోతూ రచ్చరచ్చ చేశారు. జగదాంబ థియేటర్లో అద్దాలు పగుల గొట్టి బీభత్సం సృష్టించారు. గతంలో కూడా అనేక కార్యక్రమాలలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గందరగోళం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా, గత నెలలో తొలిప్రేమ సినిమా ప్రదర్శించిన థియేటర్‌ను ధ్వంసం చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులపై విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. గాంధీనగర్‌లో ఉన్న కపర్థి థియేటర్లో ప్రదర్శించారు. సెకండ్ షో రాత్రి 10.30 గంటలకు మొదలవగా, 10.45కి కొంతమంది అభిమానులు స్క్రీన్ వద్దకు చేరి డ్యాన్సులు చేశారు. స్క్రీన్‌ను చింపేందుకు ప్రయత్నించగా, థియేటర్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో పవన్ అభిమానులు రెచ్చిపోయి సిబ్బందిపై దాడి చేశారు. స్క్రీన్‌ను చించివేశారు. కుర్చీలు, తలుపులు విరగ్గొట్టారు. అద్దాలను పగులగొట్టారు. సినిమాకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు థియేటర్లో విధ్వంసం సృష్టించి రూ.4 లక్షలు ఆస్తి నష్టం కలిగించారు. చదవండి: ‘పవన్.. ఈ తరహా చర్యల వల్ల మీ టీచర్లు కూడా సిగ్గు పడతారు’ -
విషాదం.. హీరో సూర్య తెలుగు ఫ్యాన్స్ మృతి!
హీరో సూర్య పేరుకే తమిళం. కానీ తెలుగులోనూ మన స్టార్ హీరోలకు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. అయితే ఇప్పుడు అనుకోని విషాదం జరిగింది. సూర్య అభిమానులు కరెంట్ షాక్ తో చనిపోయారు. తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీ కడుతూ షాక్ కొట్టడంతో ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం ఈ విషయం ప్రేక్షకుల్ని కంటతడి పెట్టిస్తోంది. (ఇదీ చదవండి: 9 రోజులుగా ఆస్పత్రిలో.. మీ అందరికీ రుణపడి ఉంటా: హీరోయిన్) ఆంధ్రప్రదేశ్‌లోని నరసరావుపేటలోని మోపువారిపాలెంలో విషాదం నెలకొంది. హీరో సూర్య పుట్టినరోజు సందర్భంగా నక్కా వెంకటేష్, పోలూరు సాయి అనే ఇద్దరు అభిమానులు.. ఫ్లెక్సీలు కడుతున్నారు. అయితే సడన్‌గా కరెంట్ పాస్ అవ్వడంతో అక్కడికక్కడే కన్నుమూశారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన కుర్రాళ్లు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఇకపోతే సూర్య పుట్టినరోజు సందర్భంగా 'కంగువ' మూవీ నుంచి గ్లింప్స్ విడుదల చేశారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తీస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. దిశా పటానీ హీరోయిన్ కాగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్ తో తీస్తున్న ఈ మూవీని ఏకంగా 10 భాషల్లో విడుదల చేయనుండటం విశేషం. సూర్య కెరీర్లోనే ఇది హైయస్ట్ బడ్జెట్ మూవీ. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ షో ఫేక్.. జనాల్ని పిచ్చోళ్లను చేస్తున్నారు: సరయు) -
లోకేష్ కి చుక్కలు చూపించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్..
-
ప్రాజెక్ట్ K లాంటి పెద్ద సినిమాకి ఇలాంటి చీప్ పబ్లిసిటీ ట్రిక్స్
-
ఫ్యాన్స్‌తో విజయ్ చర్చలు.. మళ్లీ ఆదే టాపిక్ వైరల్
హీరో విజయ్.. కోలీవుడ్‌లో ఈ పేరు ఇప్పుడు ఆయన అభిమానులకు తారక మంత్రంగా మారింది. రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిగ్గా మారింది. వివరాలు.. విజయ్ అత్యధిక ప్రేక్షకాదరణ కలిగిన నటుడిగా ఎదిగారు. తన అభిమాన సంఘాలను విజయ్ ప్రజా సంఘాలుగా మార్చారు. తద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలకు చెందిన 10, ప్లస్–1, ప్లస్–2 తరగతుల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉత్తీర్ణత సాధించిన నియోజకవర్గం ముగ్గురు చొప్పున ఎంపిక చేసిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పనైయూరులోని తన కార్యాలయానికి ఆహ్వానించి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. (ఇదీ చదవండి: ప్రాజెక్ట్- కే యూనిట్‌పై ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్) ఈ సందర్భంగా విద్యార్థులకు పలు హిత వాక్యాలు చేశారు. ముఖ్యంగా ఓటుకు నోటు విధానం మంచిది కాదనే విషయాన్ని తనదైన శైలిలో స్పష్టం చేశారు. ఇది రాజకీయ వర్గాల్లోనూ, టీవీ ఛానల్లో పెద్ద డిబేట్ జరిగింది. అంతేకాకుండా విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారనే నమ్మకాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు విజయ్ మంగళవారం ఉదయం మరోసారి తన అభిమాన సంఘ నిర్వాహకులను, కార్యకర్తలను చైన్నెలోని తన కార్యాలయంలో కలిశారు. (ఇదీ చదవండి: ధోని తొలి సినిమా రెడీ! హీరోహీరోయిన్లు, కథ ఏంటంటే?) ఈ సందర్భంగా తమిళనాడులోని అన్ని నియోజకవర్గాల్లోనూ జరుగుతున్న పరిణామాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించినట్లు సమాచారం. అదే విధంగా మరికొన్ని రాజకీయ పరమైన అంశాల గురించి తీవ్రంగా కార్యకర్తలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో 15 జిల్లాలకు చెందిన విజయ్ ప్రజా సంఘం నిర్వాహకులు పాల్గొన్నట్లు సమాచారం. దీంతో మారోసారి విజయ్ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. -
టమాటా ధరల ఎఫెక్ట్.. స్టార్ హీరో అభిమానులు ఏం చేశారంటే?
ప్రస్తుతం మార్కెట్లో పెట్రోల్, డీజిల్, బంగారం ధరల కంటే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటివరకు ఎప్పుడులేని రీతిలో వాటితో పోటీపడుతోంది. మరేదో కాదు.. అదేనండీ.. టమాటా. ఎందుకంటే మనకు టమాటా లేకుండా ఏ కూర, పప్పు చేయలేరు. ఒకప్పుడు ఉల్లిగడ్డ ఇతర వాటితో పోటీ పడేది. అదేంటే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఉల్లిగడ్డ ప్లేస్‌ను టమాటా ఎప్పుడో కబ్జా చేసింది. ఇప్పుడు ఎక్కడా చూసిన టమాటా ధరలపైనే చర్చ నడుస్తోంది. పెరిగిన ధరలతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి అభిమానులు గొప్ప మనసును చాటుకున్నారు. (ఇది చదవండి: ప్రముఖ ఫైట్ మాస్టర్ అరెస్ట్.. అలా చేయడంతో!) తమిళనాడులో పెరుగుతున్న టమాటా ధరలతో సామాన్య ప్రజలు అల్లాడుతున్నారు. వారి పరిస్థితిని గమనించిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి అభిమాన సంఘం ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా టమాటాలు పంపిణీ చేశారు. తమిళనాడులోని మానవహారం జిల్లా ఆలందూరులో ఈ కార్యక్రమం చేపట్టారు. చెంగల్పట్టు విజయ్ సేతుపతి అభిమానుల సంఘం అధినేత తాంబరం విక్కీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు వారికి కృతజ్ఞతలు తెలిపారు. (ఇది చదవండి: లేటు వయసులో నటుడి పెళ్లి.. మళ్లీ హనీమూన్ కూడానా?) -
యువతికి కేక్ తినిపించిన బాలకృష్ణ.. ఆమె ఎవరంటూ..
జులై 7వ తేదీ నుంచి 9వరకు అమెరికా ఫిలడెల్ఫియాలో జరిగిన తానా సభల్లో ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ పాల్గొన్న సంగతి తెలిసిందే. తానా సంబరాల్లో బాలకృష్ణ కుటుంబంతో పాటు ఓ యువతి దిగిన ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. ఆ యువతి ఎవరని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో వెతుకుతున్నారు. (ఇదీ చదవండి: రెండోపెళ్లి చేసుకోనున్న ఐశ్వర్య రజనీకాంత్..?) ఇంతకు తనెవరంటే... తానా సభలో తన అభిమానిని అంటూ ఓ యువతి బాలయ్య దగ్గరకు వచ్చింది. ఈరోజు తన పుట్టినరోజని ఆశీర్వదించమని కోరింది. దీంతో వెంటనే ఆమె కోసం కేక్ తెప్పించి కటింగ్ చేయించారు బాలయ్య. ఆ విధంగా పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ఆయన సతీమణి వసుంధరతో పాటు ఆ యువతిని ఆశీర్వదించారు. ఆ అభిమానికి జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాన్ని బాలయ్య అందించారు. ఇవే ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (ఇదీ చదవండి: నా కంటే 30 ఏళ్లు పెద్దవాడు.. అయినా పెళ్లి చేసుకుంటే: ప్రముఖ సింగర్) -
Bruce Lee Workout Plan: ఇదే బ్రూస్ లీ జిమ్ వర్క్అవుట్ ప్లాన్..
బ్రూస్ లీ.. ఈ పేరు విననివారు ఎవరూ ఉండరు. మార్షల్ ఆర్ట్స్ అనగానే ఎవరికైనా టక్కున బ్రూస్ లీ పేరు గుర్తుకు వస్తుంది. మార్షల్ ఆర్ట్స్‌లో ఇప్పటి వరకూ బ్రూస్లీ పేరును పడగొట్టే మొనగాడెవడూ లేడంటే అతిశయోక్తి కాదు. ఇంటర్నెట్లో బ్రూస్ లీ గురించి వెదుకులాట.. తన 32 ఏళ్ల జీవితంలో బ్రూస్ లీ అద్భుత ప్రతిభతలో ప్రపంచవ్యాప్తంగా తన పేరు మారుమోగిపోయేలా చేసుకున్నాడు. ఈరోజు ప్రపంచమంతా బ్రూస్ లీని ఎంతో గౌరవ మర్యాదలతో చూస్తుంది. బ్రూస్ లీ 1940లో ఫ్రాన్సిస్కోలో జన్మించారు. నేటి కాలంలోనూ ఇంటర్నెట్లో బ్రూస్ లీకి సంబంధించిన అనేక విషయాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే లెక్కకు మించిన నెటిజన్లు తరచూ బ్రూస్ లీ గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తుంటారు. ఇటీవల బ్రూస్ లీకి సంబంధించిన 1965 నాటి వర్క్అవుట్ ప్లాన్ వైరల్‌గా మారింది. Bruce Lee early Training plan in 1965. pic.twitter.com/H1uLj49NFK — World Of History (@UmarBzv) May 17, 2023 బ్రూస్ లీ వర్క్అవుట్ ఇలా.. బ్రూస్ లీ వర్క్అవుట్ ప్లాన్ కెవుంగ్ జిమ్నాషియంతో ముడిపడివుంది. దీనిలో అతను ఏ వర్క్అవుట్ ఎన్నిసార్లు, ఎంతసేపు చేసేవాడనే వివరాలు ఉన్నాయి. ఈ వర్క్అవుట్ ప్లాన్ చూసినవారు ఈ రొటీన్‌ను ఫాలో చేయడం అంత సులభం కాదని వారు చెబుతున్నారు. ట్వీట్ చేసిన ఈ పోస్టులో బ్రూస్ లీకి సంబంధించిన ఒక బ్లాక్ అండ్ వైట్ ఫొటో కనిపిస్తోంది. అతని ట్రైనింగ్ ప్రోగ్రాం వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలలో కనిపిస్తోంది. ఈ ప్లాన్ చూసిన వారంతా.. ట్విట్టర్‌పై ఈ పోస్టును ‘వరల్డ్ ఆఫ్ హిస్టరీ’(@UmarBzv) పేరు గల పేజీలో షేర్ చేశారు. దానికి 1965లో బ్రూస్ లీ ఎర్లీ ట్రైనింగ్ ప్లాన్ అనే కామెంట్ రాశారు. ఈ పోస్టుకు 8 మిలియన్లకుపైగా వ్యూస్ దక్కాయి. 70 వేలకుపైగా లైక్స్ పడ్డాయి. ఈ వర్క్అవుట్ ప్లాన్ చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతూ, దీనిని ఫాలో చేయడం అసాధ్యమంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్.. బ్రూస్ లీ వర్క్అవుట్ ప్లాన్‌ను పరిశీలించి ఈ ప్లాన్ పూర్తి చేసేందుకు 2 గంటల సమయం పడుతుందని లెక్కవేశారు. ఇది కూడా చదవండి: ఈ 8 రైల్వే స్టేషన్లు బ్రిటీష్ కాలం నాటివి.. ఇప్పుడెలా ఉన్నాయో తెలిస్తే.. -
విషాదం.. యంగ్ టైగర్ వీరాభిమాని మృతి
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి వారిలో యంగ్ టైగర్‌ను ప్రాణానికి ప్రాణంగా భావించే అభిమాని శ్యామ్ (23) కన్నుమూశాడు. చిన్నవయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ సంఘటనతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు. శ్యామ్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని కొప్పిగుంట గ్రామం. కానీ శ్యామ్ చనిపోయింది మాత్రం చింతలూరు గ్రామం. అక్కడ తను ఉంటున్న రూమ్‌లో ఉరి వేసుకుని చనిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి ) కాగా.. గతంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ మూవీ ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యాడు. ఆ సమయంలో వేదికపై వచ్చిన శ్యామ్ ఎన్టీఆర్‌ను హత్తుకున్నారు. ఆ సమయంలో ఆ వీడియో తెగ వైరలైంది. ప్రస్తుతం శ్యామ్ మృతి చెందడంతో ఆ వీడియోను షేర్ చేస్తూ అతని ఆత్మకు శాంతి చేకూరాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. (ఇది చదవండి: టాలీవుడ్ డైరెక్టర్ ఇంట విషాదం) RIP raa Thammudu...😭😭💔 Epudu natho events lo evaru Racha chestharu...😭😭😭😭 Final ga ni dream fullfill chesukuni elipoyav😭😪 (@tarak9999 Kalesav) NTR fans lo Unna oka Thammudu kuda vadhilesi poyadu..😪 @shyambadboy6 Om Shanti 🙏🥀💔😭 pic.twitter.com/lBMCCBKqaI — Sandhya NTR🖤 (@Kuttima_kutty) June 25, 2023 Today We Lost One Of Our Co Fan @shyambadboy6 💔 Rest In peace Brother 🙏 pic.twitter.com/Zbf1NViqNI — Jr NTR Fan Club (@JrNTRFC) June 25, 2023 -
ఫాన్స్‌తో వ్యవహారం మామూలుగా ఉండదు..అదొక మనస్తత్వ శాస్త్రం!
అది న్యూస్ రిపోర్టర్ల వాట్సాప్ గ్రూప్. అందులో ఒక వీడియో. ఆ వీడియోలో.. కొత్తగా రిలీజ్ అయిన సినిమా థియేటర్ ముందు సినిమా హాల్ నుంచి బయటకు వచ్చిన వారిని "సినిమా ఎలా వుంది ? అని అడుగుతున్నారు . సాధారణంగా " సూపర్ " " హండ్రెడ్ డేస్ " వెయ్యి రోజులు ఖాయం " కలియుగాంతం దాకా ఈ సినిమా ఆడుతుంది " అని ఇలాంటి సందర్బాల్లో సమాధానాలు వస్తుంటాయి . అది అభిమానులు చెప్పే మాటలో లేక మానేజ్ చేసినవో తెలియదు. లోతుగా పరిశీలించి తెలుసుకోవాల్సినంత సీన్ లేదు. ఇలాంటి వీడియో ఒకటి ఉంటుంది అనుకొని దాన్ని చూడలేదు. ఆ గ్రూప్‌లో వచ్చిన కామెంట్స్ చూసి అసలు వీడియోలో ఏముందో అని క్లిక్ చేసి డౌన్ లోడ్ అయ్యాక చూసా. ఎవరో వ్యక్తి సినిమా బాగోలేదు అని కామెంట్ కామెంట్ చేసాడు. దానితో అక్కడ ఉన్న అభిమానులు అతనిపై దాడి చేసారు. చూడగానే మనసు చివుక్కు మంది. ఆ వ్యక్తి తన మనసులోని ఫీలింగ్స్ చెప్పాడో లేదా కావాలనే దుష్ప్రచారం చేసాడో .. తరువాతి మాట . సినిమా బాగా లేదు అనగానే దాడి చేస్తారా ? మనం ఏమైనా తాలిబన్ల రాజ్యంలో ఉన్నామా? అనిపించింది. హీరోల అభిమానులు అలాగే ఉంటారని మా బాల్యంలో చెప్పుకునేవారు. ఒకప్పుడూ ఎంజీఆర్ సినిమా తొలి రోజు సినిమాకు వెళితే అయన అభిమానులు తలతో ఫైట్ చేసేవారట. అమాయకుడు ఎవరైనా వెళితే తలపగలడం ఖాయం అట. అది ఎంత వరకు నిజమో కానీ ఫాన్స్ వ్యవహారం మామూలుగా ఉండదు . అదొక సామాజిక- మనస్తత్వ శాస్త్ర టాపిక్. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక రకమయిన మానసిక రుగ్మత. కాలం మారినా దక్షిణాదిన ఈ ధోరణి మారలేదు. అభిమానులు తమకు అసెట్ అని చాలా మంది సో కాల్డ్ హీరోస్ అనుకొంటారు. అభిమానులు వీరి మెడకు వేలాడే గుదిబండలు అని .. పాపం గ్రహించలేరు. అంత తెలివితేటలు ఉండే అవకాశం తక్కువ. భ్రమల లోకంలో బతికేస్తుంటారు . సాగినన్నాళ్లు సాగుతుంది. ఒక్కోసారి ఆకాశం నుంచి నేలకు పడిపోతారు. నిన్నటి హీరో.. పాపం తీవ్ర డిప్రెషన్ తో బాధ పడుతున్నాడు . ఇంకా ఎంతో మంది ఇలాంటి కోవలో ఉన్నారో లేదా కాస్త తక్కువ స్థాయిలో డిప్రెషన్లో ఉన్నారు అనేదాని గురించి మాట్లాడడం .. విశ్లేషించడం టైం వేస్ట్. చిత్రమయిన విషయం ఏమిటంటే అంత బహిరంగంగా దాడి చేయడం. నిజానికి ఇది తప్పు .. మీకు అభిమానం ఉంటే సినిమా ఎందుకు బాగోలేదో చెప్పుమని అడగొచ్చు అంతే గాని దాడి చెయ్యడం ఏంటి ? అని ఎవరూ అడిగినట్లు లేరు . పోలీస్‌లు ఏమి చేసారో తెలియదు. అటుపై ఇంకో వీడియో చూసా. దాడి జరిగిన వ్యక్తి .. హీరో నన్ను ఇంటికి పిలిస్తే సంతోష పడుతాను అంటున్నాడు . అలాంటివి జరగవు అని నాకు తెలుసు. ఒక వేళా హీరో జరిగిన దానికి సారీ చెప్పాలనుకున్నా అభిమానులు .. సలహాదారులు చెప్పనివ్వరు. నెక్స్ట్ సీన్.. ఫేస్బుక్ ఫ్రెండ్ .. ఓ మహిళ. ఆ మధ్యలో మెసెంజర్లో లండన్ గురించి సమాచారం ఇచ్చారనుకొంటా! నా పోస్ట్‌ల పై కామెంట్స్ పెడుతుంటారు . నేను లోతుగా పరిశీలించలేదు. ఆమెకు దేవుడంటే భక్తి . విదేశాల్లో ఉన్నా భారతీయ సంస్కృతి సంప్రదాయాలు అంటే అమితంగా ఇష్ట పడే వ్యక్తి. ఆమె ఆ సినిమా నచ్చలేదని పోస్ట్ పెట్టినట్టున్నారు . దాని పై కొంత మంది తనని టార్గెట్ చేసుకొంటూ ఎలా మాట్లాడింది అంటూ.. పోస్ట్‌లు పెట్టారు . నేను ఎప్పుడో కానీ ఫేస్‌బుక్‌లోకి వెళ్లి ఇతరుల పోస్ట్‌లు చూడను. అనుకోకుండా ఈ పోస్ట్ కనిపించింది. ఆ సినిమాను విమర్శించింది కాబట్టి ఆమె హిందువు కాదు అని.. ఇంకా రకరకాలుగా కామెంట్స్ చేసారని అర్థం అయ్యింది. సినిమా సినిమానే . జీవితం కాదు. ఒకే ఇంట్లో ఒకరికి సినిమా నచ్చోచ్చు. ఇంకొరికి నచ్చక పోవచ్చు. అదేమీ అసాధారణం కాదు. సినిమా నచ్చకపొతే ఆమె తన అభిప్రాయాన్ని పోస్ట్ చేసారు . ఒకవేళ..లేదు సినిమా బాగుంది .. ఈ కోణం లో చూడాలి" అని కామెంట్ చెయ్యడం సమంజసం. తప్పు లేదు. కానీ వ్యక్తిగత దాడి చేయడానికి అసలు ఎవరు మీరు ? సినిమా అభిమానులా ? హీరో అభిమానులా? అంటే కాదు. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే ఒక పార్టీ అభిమానులు (అందరూ కాదు .. కొందరు ) ఇలా పోస్ట్ లు పెట్టడాన్ని చూసాను. ఇదేమి పార్టీ వ్యవహారం కాదు. పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వదు . వీరికి సినిమా నచ్చితే దాన్ని పోస్ట్ చేసుకోవచ్చు. సినిమాపై వస్తున్న విమర్శల్ని కూడా తిప్పి కొట్టొచ్చు. కానీ ఆ క్రమం లో వ్యక్తిగత కామెంట్స్ చేయడం .. పిచ్చి పిచ్చి లాజిక్‌లు తియ్యడం .. సినిమాను విమర్శించిన వారందరూ సంఘ వ్యతిరేఖ శక్తులు వీరికి భక్తి లేదు .. దేవుడంటే నమ్మకం లేదు అని కామెంట్స్ చెయ్యడం .. ఈ పనులు వల్ల వీరు ఏమి సాధించారో నాకైతే అర్థం కాలేదు. మొదట్లో సదరు హీరోపై నాకు సధాభిప్రాయం ఉండేది. కష్టపడుతాడు, అనుకొన్నది సాధించాలన్న పట్టుదల ఉంది అనుకొనే వాడిని. ఆ సినిమాపై, ప్రారంభంలో నాకు ఎలాంటి అభిప్రాయం లేదు . కానీ ఈ అభిమానులు చేసిన రచ్చ తరువాత ఒక నెగటివ్ ఫీలింగ్ వచ్చింది. నాలా నెగటివ్ ఫీలింగ్స్ తెచ్చుకొన్నవారు కచ్చితంగా వేలల్లో/లక్షల్లో వుంటారు. చాలా మంది అన్నీ గమనిస్తుంటారు. జరుగుతున్న దాన్ని బట్టి ఒక అభిప్రాయాన్ని ఏర్పర్చుకుంటారు. అభిమానం అంటే నిర్మాణాత్మక విమర్శలను ఆహ్వానించడం. అంతే కానీ తనకు నచ్చనిది అవతలి వారు చెప్పారు కనుక వారిపై మాటలతో దాడికి రెడీ అవ్వడం కాదు. అత్యుత్సాహంతో ఎవరో ఇద్దరు ముగ్గురు కామెంట్ చెయ్యడంతో నొచ్చుకొన్న ఆమె " ఛీ .. మీరు ఇలాంటి వారా?" అంటూ మొత్తం ఆ ఐడియాలజీ వర్గాన్ని అసహ్యించుకొంటూ పోస్ట్ పెట్టారు . సెల్ఫ్ గోల్ వేసుకోవడం అని దీన్నే అంటారని చెబుతున్నారు.మానసిక శాస్త్ర పరిశోధకులు, - వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక శాస్త్ర పరిశోధకులు, సీనియర్ విద్యావేత్త. (చదవండి: పేద విద్యార్థులకు అండగా నాట్స్ అధ్యక్షుడు) -
హీరో బర్త్‌డే.. బంగారు ఉంగరాలు పంచిన ఫ్యాన్స్
హీరో విజయ్ జన్మదిన వేడుకలను వేలూరులో అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. విజయ్ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడు వేల్మురుగన్ అధ్యక్షతన అభిమానులు వేలూరు శిశు భవన్‌లోని అనాథ పిల్లల మధ్య కేక్ కట్ చేసి పంచి పెట్టారు. అన్నదానం చేశారు. వేలూరు పెట్లాండ్ ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం జన్మించిన చిన్నారులకు బంగారు ఉంగరాలు బహూకరించారు. వేల్మురుగన్ మాట్లాడుతూ సూపర్ స్టార్ విజయ్ జన్మదినోత్సవాన్ని శిశు భవనంలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. తమ నాయకుడు త్వరలో రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయ్ అభిమానుల సంఘం కార్పొరేషన్ అధ్యక్షుడు శంకరన్, కార్యదర్శి సురేష్, భరత్, డివిజన్ కార్యదర్శి రాజేష్, జాయింట్ కార్యదర్శి వివేక్, విజయ్ మండ్ర అధ్యక్షుడు శరవణన్, రేణు పాల్గొన్నారు. అదే విధంగా వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లోనూ విజయ్ అభిమానులు కేక్ కట్ చేసి, టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. చదవండి: కోలీవుడ్‌లో సూపర్ స్టార్ ఎవరు? -
కీర్తి సురేష్‌తో ఉన్న వ్యక్తి ఎవరు.. ఫోటో వైరల్?
టాలీవుడ్ మహానటి కీర్తి సురేశ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందని, దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్తతో సంబంధం సెట్ అయిందని ఆ మధ్య తెగ వార్తలు వచ్చాయ్. వాటిపై కీర్తి తల్లిదండ్రులు రియాక్ట్ అయ్యారు కూడా.. తనకు పెళ్లి చేసే సమయంలో అందరికీ చెప్పే చేస్తామని వారు తెలిపారు. ఇదే విషయాన్ని కీర్తి సురేశ్ కూడా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. దాంతో ఆ గొడవ సద్దుమనిగింది. (ఇదీ చదవండి: నిర్మాతపై లైంగిక వేధింపుల కేసు.. స్టేట్మెంట్లో సంచలన విషయాలు!) తాజాగా కీర్తి సురేష్‌కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎరుపు రంగు డ్రెస్‌లో కీర్తి సురేష్ నవ్వుతూ ఉండగా.. ఆమెతో పాటు ఒక వ్యక్తి ఎంతో సన్నిహితంగా ఫోటోలో కనిపించాడు. ఇంకేముంది ఇప్పుడా ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాదు ఆ ఫోటోకు క్యాప్షన్‌గా మెకానిక్‌తో ప్రేమాయణం అంటూ రాసుకొచ్చారు. (ఇదీ చదవండి: ఆ ఫోటోలు నావి కావు. . నాకు ట్వీటర్ ఖాతానే లేదు: జయవాణి) ఈ ఫోటో విషయంపై కీర్తి అభిమానులు మండిపడుతున్నారు. సినిమా షూటింగ్ సమయంలో ఎవరితో అయినా ఒక్క ఫోటో దిగితే ఇలాంటి చెత్త కామెంట్లు చేస్తారా? అంటూ ఫైర్ అవుతున్నారు. అసలు ఇలాంట ఆలోచనలు ఎలా వస్తాయని వారు మండిపడుతున్నారు. ‘భోళా శంకర్’ చిత్రం షూటింగ్ సమయంలో కీర్తి సురేష్‌తో ఒక టెక్నిషియన్ ఫోటో దిగాడని, దానిని పట్టుకుని అసభ్యంగా ప్రచారం చేయడం ఎంటని, వారు కామెంట్ చేస్తున్నారు. మరోసారి కీర్తీ సురేష్‌పై ఇలాంటి ప్రచారాలు చేస్తే పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తామని ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు. -
Apollo Hospital : అపోలో హాస్పిటల్ ముందు మెగా ఫ్యాన్స్ హంగామా (ఫొటోలు)
-
మహేష్ ఫాన్స్ కు మరో షాక్ ఇచ్చిన త్రివిక్రమ్
-
పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని ఇరిటేట్ చేయడానికి కారణం ఏంటంటే
-
కెప్టెన్సీ మాకు వద్దు అంటూ ట్రోల్స్ రోహిత్ శర్మ ఏం చేసాడో చూడండి..!
-
ఫాన్స్ కి గుడ్ న్యూస్ ఎవరి సాయం లేకుండానే..!
-
Adipurush Public Talk: ఆదిపురుష్ మూవీ గురించి ప్రభాస్ ఫ్యాన్స్ ఏమన్నారంటే...
-
ఇకపై ఆ వివాదానికి దూరంగా ఉంటా : అనసూయ
సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కి తనకు మధ్య జరిగిన ట్విటర్ వార్‌పై యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ స్పందించింది. విజయ్ దేవరకొండ డబ్బులిచ్చి మరి నన్ను తిట్టించాడని తెలిసి చాలా బాధ పడ్డానని ఆమె పేర్కొంది. తాజాగా ‘విమానం’ సినిమా సక్సెస్ మీట్లో పాల్గొన్న అనసూయకు .. ‘విజయ్ ఫ్యాన్స్‌తో ట్విటర్ వార్ ఇకపై ఆపేస్తారని చెప్పారట నిజమేనా? అనే ప్రశ్న ఎదురైంది. (చదవండి: వరుణ్‌తో నిశ్చితార్థం, లావణ్య త్రిపాఠి చీర ధరెంతో తెలుసా?) దీనికి అనసూయ సమాధానం ఇస్తూ.. ‘నిజమే. ఇకపై విజయ్ ఫ్యాన్స్‌తో గొడవపడొద్దని డిసైడ్ అయ్యాను. మానసిక ప్రశాంతత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాడు. డబ్బులిచ్చి నన్ను తిట్టించారనే విషయం తెలిసి చాలా బాధపడ్డాను. అతనితో(విజయ్ దేవరకొండ) ఫోన్ కాల్ మాట్లాడడానికి ట్రై చేశా.. కానీ స్పందించలేదు. నాకు పీఆర్ టీమ్ లేదు. ఏదైనా నేనే మాట్లాడుతా. ట్వీట్స్ కూడా నేనే చేశా. కానీ ఇకపై ఈ వివాదానికి దూరంగా ఉండాలనుకుంటున్నాను’ అని అనసూయ చెప్పుకొచ్చింది. అనసూయ విజయ్‌ల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. అనసూయ తరచూ విజయ్‌పై పరోక్షంగా ట్వీట్స్ చేస్తుంటారు. ఇటీవల విజయ్ నటించిన ఖుషీ పోస్టర్‌పై ‘ది విజయ్ దేవరకొండ’అని ఉండటాన్ని తప్పుబడుతూ ఆమె వరుస ట్వీట్స్ చేసింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ అనసూయను ట్రోల్ చేశారు. -
బేబీ బంప్ ఫోటో షేర్ చేసిన ఇలియానా.. మళ్లీ బ్యాడ్ కామెంట్స్
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర లేదు. వైవియస్ చౌదరి దర్శకత్వంలో ‘దేవదాసు’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా... ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కిన ‘పోకిరి’ మూవీతో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ పోస్ట్‌పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. (ఇదీ చదవండి: దుస్తులు లేకుండా ఫోటో షేర్ చేసిన ప్రముఖ నటి.. మద్ధతు తెలిపిన ఫ్యాన్స్) తన ఫ్యాన్స్‌తో అన్ని విషయాలు షేర్ చేసుకుంటున్న ఇల్లీ బేబీ.. రీసెంట్గా తన ప్రెగ్నెన్సీని ప్రకటించి షాకిచ్చింది. పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరో చెప్పకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం తన బేబీమూన్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఈ మేరకు బికినీలో బేబీ బంప్ చూపిస్తూ.. బీచ్‌లో సముద్ర తీరాన్ని ఆస్వాదిస్తున్న పిక్స్ పంచుకుంది. ఈ బేబీమూన్ స్పాట్ ఎక్కడనేది ఇలియానా ప్రస్తావించలేదు. ‘ఇసుకలో పాదాలు, సంతోషకరమైన హృదయం’ అని ఈ ఫోటోకు క్యాప్షన్ జోడించింది. (ఇదీ చదవండి: నన్ను చంపేందుకు ప్లాన్ చేశారు.. కరాటే కల్యాణి షాకింగ్ కామెంట్స్) అలాగే సముద్రం, అలల తాకిడిని చూపిస్తూ చిన్న గ్లింప్స్ వీడియోను కూడా షేర్ చేసింది. చివరగా సెల్ఫీ పిక్ పోస్ట్ చేయగా.. ఇందులో ఎల్లో బికినీ, బ్రౌన్ కలర్ సన్ గ్లాసెస్ ధరించిన ఇలియానా తన బేబీ బంప్‌ను చూపించింది. అయితే ఇలా ఫొటోలు రిలీజ్ చేసిన వెంటనే మరోసారి ఆమెపై విమర్శల వర్షం మొదలైంది. తండ్రి ఎవరో చెప్పకుండా ఈ ప్రెగ్నెన్సీ ఫొటోలు పెడితే బ్యాడ్ ఫీలింగ్ వస్తుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలియానా మాత్రం ఈ కామెంట్స్‌ను పట్టించుకోవడం లేదు. తన జీవితంలో స్పెషల్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తోంది. అయితే, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా డేటింగ్ చేస్తున్నట్లు గతంలో అనేక రూమర్స్ వచ్చాయి. కానీ ఈ విషయంపై ఇప్పటి వరకు ఇలియానా ఎలాంటి కామెంట్స్ చేయలేదు. -
ఓ వ్యక్తి చెంప పగలగొట్టిన ప్రభాస్ ఫ్యాన్స్..వీడియో వైరల్
ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో టాలీవుడ్ హవా సాగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు చిత్రాలకు భారీ ఆదరణ లభిస్తోంది. దేశం మొత్తం మన హీరోల గురించి మాట్లాడుకుంటున్నారు. టాలీవుడ్లో ఉంటే ఫ్రెండ్లీ వాతావరణంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. స్టార్ హీరోలు సైతం ఎలాంటి ఈగోలకు వెళ్లకుండా ఇతర హీరోల సినిమాలకు తగినంత సహాయం చేస్తున్నారని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇదంతా నిజమే. ఈ మధ్య మన హీరోలతో చాలా మార్పు వచ్చింది. కానీ వారి అభిమానుల్లో మాత్రం ఆ మార్పు రాలేదు. ఇప్పటికీ నా హీరో గొప్పంటే.. నా హీరో గొప్పంటూ కొట్లాడుకుంటున్నారు. (చదవండి: ఏడాది రెండు మూడు సినిమాలు చేస్తా, పెళ్లి తిరుపతిలోనే : ప్రభాస్ ) తాజాగా ఆదిపురుష్ ప్రిరీలీజ్ ఈవెంట్లో కూడా ప్రభాస్ ఫ్యాన్స్.. మరో స్టార్ హీరో అభిమానిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం తిరుపతిలో ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చి ఈవెంట్‌ని గ్రాండ్ సక్సెస్ చేశారు. అయితే ఇక్కడ ప్రభాస్ అభిమానులు ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి ఏం మాట్లాడారో తెలియదు కానీ పలువురు ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం అతనిపై దాడి చేశారు. చెంపపై గట్టిగా కొడుతూ రచ్చ రచ్చ చేశారు. ఆ వ్యక్తి మహేశ్ అభిమాని అని.. ప్రభాస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దాడి చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈవెంట్లో ఓ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతోనే ఇలా చేశారని మరికొంత మంది చెబుతున్నారు. #Prabhas fans vs. #MaheshBabu fans fight. Worst.. 🥲🫢🫤#Adipurush #AdipurushTrailer #AdipurushOnJune16th #AdipurushTrailer2pic.twitter.com/pSU7lpnoWz — VCD (@VCDtweets) June 7, 2023 -
జై శ్రీరామ్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ..
-
మహేష్ బాబు బర్త్ డే సప్రైజ్ ఫిక్స్.. ఇక ఫాన్స్ కి పూనకాలు లోడింగ్..!
-
మహి అన్న కోసం ఏదైనా చేస్తా టచ్ చేస్తున్న జడేజా మాటలు..!
-
CSK అభిమానులకు జడేజా భార్య ట్రీట్ ..!
-
గెలిచిన CSK.. పండగ చేసుకుంటున్న పాకిస్థాన్ ఫాన్స్ ..!
-
త్రివిక్రమ్ పై మండిపడుతున్న చిరు, వెంకటేష్ ఫాన్స్ ..
-
కోహ్లీ పేరు ఫుల్ కిక్ ఇస్తుంది
-
నవీన్ ఉల్ హుక్ కి ఎటకారం ఎక్కువే ..
-
చరిత్రలో తోలి సారి కంకషన్ సబ్ స్టిట్యూట్
-
ఐపీఏల్ లో అట్టర్ ఫ్లాప్.. పార్టీలకు మాత్రం ఫుల్ ఫామ్ నువ్వు మాములోడివి కాదు సామీ...
-
సీఎస్కే, జీటీ తుది పోరు.. వర్షంలో అభిమానులు ఇలా..!(ఫొటోలు)
-
దుమ్మురేపుతున్న సామ్ కర్రన్.. ఓరేంజ్ లోే తిడుతున్న ఫ్యాన్స్
-
ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెడుతున్న రీ రిలీజ్ మూవీస్ ధ్వంసం అవుతున్న ధీయేటర్లు
-
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై కేసు నమోదు.. ఎందుకంటే?
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. మచిలీపట్నంలోని సిరి కృష్ణ, సిరి వెంకట థియేటర్‌కి జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా అభిమానులు పెద్దఎత్తున చేరుకున్నారు. అక్కడే రెండు మేకలను బలి ఇచ్చి వీరంగం సృష్టించారు. అంతే కాకుండా వాటి రక్తాన్ని ఎన్టీఆర్ బ్యానర్లపై చిందించారు. (ఇది చదవండి: షాకింగ్.. నమ్మలేకపోతున్నాం.. రాజమౌళి, ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్) ఈ క్రమంలో వారు పదునైన ఆయుధాలను బహిరంగంగా తీసుకురావడం.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై రాబర్ట్‌సన్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. సింహాద్రి రీ-రిలీజ్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు విజయావాడలో థియేటర్లో టపాసులు పేల్చడంతో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. కాగా.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో దేవర చిత్రంలో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ చిత్రం జనతా గ్యారేజ్ తర్వాత వీరి కాంబినేషన్లో చిత్రం తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్‌లుక్, టైటిల్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించనున్నారు. అంతేకాకుండా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ -2లో జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్‌తో జతకట్టనున్నారు. (ఇది చదవండి: ఊర్వశి రౌతేలా నెక్లెస్.. ధరపై నెటిజన్స్ ట్రోల్స్!) -
హీరోయిన్ నడుముపై చేయి వేసిన అభిమాని.. ఆమె ఏం చేసిందంటే?
బాలీవుడ్ నటి ఓ అభిమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఐదేళ్ల వార్షికోత్సవంలో ముంబయిలో జరిగింది. ఈ వేడుకల్లో పాల్గొన్న నటి అహన కుమ్రా నడుముపై ఓ అభిమాని చేయి వేశారు. ఈ చర్య అహన కుమ్రాకు కోపం తెప్పించింది. దీంతో డోంట్ టచ్ మీ అంటూ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: బుల్లితెర హీరోయిన్ వెండితెరపైకి.. వరుస ఛాన్సులు) ఇది చూసిన నెటిజన్స్ అభిమాని చేసిన పనిని తప్పుబడుతున్నారు. ఆ సమయంలో అహనా చాలా వేగంగా స్పందించిందని ప్రశంసిస్తున్నారు. ఎవరైనా పర్మిషన్ లేకుండా అలా తాకడం తప్పని చెబుతున్నారు. కాగా.. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన యుధ్ అనే టీవీ షోతో అహన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, ఇండియా లాక్ డౌన్ లాంటి చిత్రాల్లో కూడా ఆమె నటించారు. ప్రస్తుతం ఆమె షరీబ్ హష్మీతో కలిసి క్యాన్సర్ అనే చిత్రంలో నటించనున్నారు. (ఇది చదవండి: ఆ దేవుడు నన్ను కరుణించలేదు: జబర్దస్త్ యాంకర్ ఎమోషనల్) View this post on Instagram A post shared by Aahana S Kumra (@aahanakumra) -
చంద్రబాబు మాకొద్దు.. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో కనిపించని బాబు ఫొటో
సాక్షి, తిరుపతి: ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌ల ఫొటోలు కనిపించలేదు. ఫ్లెక్సీలు, జెండాల్లో చంద్రబాబు బొమ్మను పెట్టేందుకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇష్టపడలేదు. టీడీపీ ముఖ్య నేతలు ప్రాధేయపడ్డా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తిరస్కరించారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి పదవి, పార్టీని లాక్కుని ఆయన మరణానికి కారణమైన వ్యక్తి ఫొటోను పెడితే ఆయన ఆత్మ క్షోభిస్తుందని జూనియర్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు. తిరుపతి నగరంలో శనివారం నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. తిమ్మినాయుడుపాళెం వద్ద ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా జూనియర్ అభిమానులు భారీ ఫ్లెక్సీలు, బ్యానర్లు, జెండాలు ఏర్పాటు చేశారు. చదవండి: తండ్రి హంతకులకు అండదండలా?.. వివాదాస్పదంగా సునీత వైఖరి అయితే వీటిలో ఎక్కడా చంద్రబాబు, లోకేశ్‌ల ఫొటోలు కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. విగ్రహావిష్కరణకు వచ్చిన ముఖ్య నేతలు చెప్పినా వారు పట్టించుకోలేదు. కాగా, ఫ్లెక్సీలు, జెండాల్లో చంద్రబాబు, లోకేశ్‌ల ఫొటోలు లేవని కొందరు దౌర్జన్యంగా వాటిని తొలగించారు. -
పవన్ ఫ్యాన్స్ కు ఓపెన్ గా ఫోన్ నంబర్ ఇచ్చేసిన కేఏ పాల్..
-
చెర్రీ ఫ్యాన్స్ అంటే ఇలా ఉండాలి.. మనసులు గెలిచారు భయ్యా!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు గొప్ప మనసు చాటుకున్నారు. మండువేసవిలో సేవ కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలిచారు. ముంబయిలోని అంధేరి , భీవండి, జుహూలోని శంకర్ ఆలయం పరిసరాల్లో దాదాపు 1000 మంది చెర్రీ ఫ్యాన్స్ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేసవిలో ఎండ వేడిమిని తట్టుకునేందుకు దాదాపు తొమ్మిది వేల మందికి మజ్జిగ పాకెట్స్ పంపిణీ చేశారు. తమ అభిమాన నటుడు చేసే సేవా కార్యక్రమాలను చూసి తాము స్ఫూర్తి పొందినట్లు తెలిపారు. (ఇది చదవండి: ఈ వారం ఓటీటీ/ థియేటర్స్‌లో సందడి చేసే చిత్రాలివే) రామ్‌చరణ్ అనగానే సిల్వర్‌స్క్రీన్ మీద ఆయనకున్న క్రేజే వేరు. సొసైటీకి ఆయన చేసే సేవలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. ఎన్నో అసోసియేషన్ల ద్వారా, ఎన్జీవోల ద్వారా, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా రక్తదానాలు, నేత్రదానాలు, కొవిడ్ సమయంలోనూ సహకారం అందించారు. తమ అభిమాన హీరో చేసిన మంచి పనులను ఆదర్శంగా తీసుకున్న ఫ్యాన్స్ సమాజానికి సాయపడాలని ముందుకొచ్చారు. తమ స్టార్‌లాగానే సమాజం పట్ల బాధ్యతతో ఉండాలని.. తమకు వచ్చిన ఆలోచనకు ఒక రూపం మాత్రమేనని అన్నారు. ఈ నెల 6న ముంబయిలోనూ.. ఏప్రిల్ 29న షోలాపూర్‌లోనూ ఈ మజ్జిక పంపిణీ, అన్నదానం కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. (ఇది చదవండి: నరేశ్-పవిత్ర.. వారి బంధానికి ఇంతకన్నా ఏం కావాలి?) -
తన బర్త్ డే రోజున ఫాన్స్ కి ఊహించని సర్ప్రైజ్ లు ప్లాన్ చేసిన తారక్..
-
SRH VS LSG: ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ అభిమానులు సందడి (ఫొటోలు)
-
ధోని చెప్పినా పట్టించుకోని ఫ్యాన్స్...
-
మహిళా అభిమాని దురుసుతనం.. స్టార్ సింగర్‌కు గాయం!
బాలీవుడ్ స్టార్ సింగర్ అర్జిత్సింగ్తో ఓ మహిళా అభిమాని దురుసుగా ప్రవర్తించింది. స్టేజ్‌పై ప్రదర్శన ఇస్తున్న సమయంతో అతని చేయి పట్టుకొని గట్టిగా కిందకు లాగింది. దీంతో అతని చేయి బెణికింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అర్జిత్ సింగ్ సినిమా పాటలే కాకుండా ప్రైవేట్ సాంగ్స్, కాన్సర్ట్ నిర్వహిస్తూ అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా మహారాష్ట్రలో ఔరంగాబాద్‌లోని రిద్ధి సిద్ధి ల్యాండ్‌మార్క్‌లో అర్జిత్ సింగ్ లైవ్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో అర్జిత్ పలు పాటలు ఆలపిస్తూ అందరిని అలరించాడు. అలాగే మధ్య మధ్యలో స్టేజికి దగ్గరగా ఉన్న అభిమానులతో ముచ్చటిస్తూ వారికి షేక్ హ్యాండ్ ఇస్తూ వచ్చారు. (చదవండి: 'ఆదిపురుష్' ట్రైలర్.. గూస్బంప్స్ తెప్పిస్తున్న డైలాగ్స్) ఈ క్రమంలో ఓ మహిళా అభిమాని అర్జిత్కి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ చేతిని గట్టిగా కిందకు లాగింది. దీంతో అర్జిత్ అదుపు తప్పి కిందపడబోయాడు. అనుకోకుండా జరిగిన ఈ పరిణామంతో అతని చేయికి గాయమైంది. దీంతో ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు. ఆమెకు సున్నితంగా హెచ్చరించారు. (చదవండి: నా జీవితంలో సామ్‌తో గడిపిన దశ అంటే ఎంతో గౌరవం: నాగచైతన్య) ‘మీరు చేసిన పనికి నా చేతులు వణుకుతున్నాయి. మీరు మీ సమయాన్ని సరదాగా గడపడానికి ఇక్కడికి వచ్చారు. నేను ప్రదర్శన ఇవ్వకపోతే మీకు ఆనందం ఎక్కడ నుంచి వస్తుంది. మీరు నన్ను లాగారు. ఇప్పుడు నా చేతులు వణుకుతున్నాయి. నేను చేయిని కదపలేకపోతున్నాను’ అని అన్నాడు. దీంతో సదరు మహిళ ఆర్జిత్కు క్షమాపణలు చెప్పింది. తాను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో చెప్పేందుకు ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. తెలుగులో అర్జిత్ ‘స్వామి రారా’, ‘దోచేయ్’, ‘హుషారు’, ‘ఉయ్యాల జంపాల’, ‘భలే మంచి రోజు’ తదితర సినిమాల్లో పాటలు పాడారు. View this post on Instagram A post shared by Arijit Singh (@arijitsinghliveupdates) -
వీడియో: ధోనీ రాకతో దద్దరిల్లిన స్టేడియం
-
అజిత్ ఫ్యాన్స్ Vs విజయ్ ఫ్యాన్స్
-
పంజాబ్ కింగ్స్ కు చుక్కలు చూపిస్తున్న రోహిత్ ఫ్యాన్స్
-
SRH vs KKR : ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ అభిమానులు సందడి (ఫొటోలు)
-
ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే హెడ్సెట్..
ఐపీఎల్ వీక్షకుల కోసం జియో సరికొత్త ఉత్పత్తిని తీసుకొచ్చింది. నేరుగా స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న అనుభూతిని కలిగించే జియో డైవ్ (JioDive) అనే కొత్త వర్చువల్ రియాలిటీ (వీఆర్) హెడ్‌సెట్‌ను లాంచ్ చేసింది. ఇదీ చదవండి: WEF Report: 1.4 కోట్ల ఉద్యోగాలు ఉఫ్! ప్రపంచ ఆర్థిక వేదిక సంచలన రిపోర్ట్ జియో సినిమా (JioCinema) యాప్‌లో ఐపీల్ మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు ఈ వీఆర్ హెడ్‌సెట్‌ని ఉపయోగించవచ్చు. ఇందులో 100 అంగుళాల వర్చువల్ స్క్రీన్, 360 డిగ్రీ వీక్షణ ఉన్నాయి. దీంతో నేరుగా స్టేడియంలోనే కూర్చుని మ్యాచ్ చూస్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ హెడ్‌సెట్‌ను జియో సినిమా యూజర్ల కోసమే ప్రత్యేకంగా రూపొందించారు. ఈ జియోడైవ్ హెడ్సెట్ ధర రూ. 1,299. జియో మార్ట్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది. పేటీఎం వ్యాలెట్ ద్వారా దీన్ని కొనుగోలు చేస్తే రూ. 500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అయితే హైజనిక్ కారణాల వల్ల ఈ ఒక సారి కొనుగోలు చేసిన ఈ వీఆర్ హెడ్‌సెట్‌ను రిటర్న్ చేసే వీలు లేదని కంపెనీ పేర్కొంది. జియోడైవ్ వీఆర్ హెడ్సెట్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు 100 అంగుళాల వర్చువల్ స్క్రీన్, 360 డిగ్రీల వీక్షణ 4.7 నుంచి 6.7 అంగుళాల స్క్రీన్ ఉన్న ఆండ్రాయిడ్, iOS ఫోన్లకు సపోర్ట్ లెన్స్ ఫోకస్, ఫైన్ ట్యూన్ అడ్జెస్ట్మెంట్ కోసం ఏర్పాటు. హెడ్‌సెట్‌ను సౌకర్యవంతంగా పెట్టుకునేందుకు 3వే అడ్జస్టబుల్ స్ట్రాప్ Android 9+, iOS 15+కి సపోర్ట్ ఉపయోగించడం ఎలా? బాక్స్‌పై ఉన్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి జియో ఇమ్మెర్స్ (JioImmerse) యాప్‌ను ఇన్స్టాల్ చేయండి సూచనలకు అనుగుణంగటా అన్ని అనుమతులను ఇచ్చి లాగిన్ చేయండి. ఇందుకోసం జియో నెట్వర్క్కి కనెక్ట్ అయిఉండాలి. జియోడైవ్ (JioDive) ఆప్షన్‌ను ఎంచుకుని ‘Watch on JioDive’పై క్లిక్ చేయండి హెడ్సెట్లో ఫ్రంట్ కవర్ని తీసి ఫోన్ సపోర్ట్ క్లిప్, లెన్స్‌ల మధ్య ఫోన్‌ను పెట్టిన తర్వాత ఫ్రంట్ కవర్‌ను మూసివేయండి హెడ్‌సెట్‌ను పెట్టకుని స్ట్రాప్స్‌ను సరిచేసుకోండి ఉత్తమ వీక్షణ అనుభవం, పిక్చర్ క్వాలిటీని అడ్జస్ట్మెంట్ వీల్స్‌ను సరిచేయండి ఇదీ చదవండి: Aunkita Nandi: రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం! ఈ బెంగాలీ అమ్మాయి సంకల్పం మామూలుది కాదు.. Bringing you a stadium-like experience at home with #JioDive. - Watch cricket in 360 immersive view - Enjoy #TATAIPLonJioCinema on a 100-inch virtual screen - Experience #360cricket from multiple camera angles Buy now https://t.co/1azFVIwqfR#EnterANewReality #IPL2023 pic.twitter.com/PxplF0SAz9 — JioDive (@jiodiveofficial) April 30, 2023 -
కేఏ పాల్ పెద్ద మనసు.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు బంపర్ ఆఫర్
-
సమంత డై హార్డ్ ఫ్యాన్.. ఏకంగా ఇంట్లోనే గుడి కట్టేస్తున్నాడు!
సినీ తారలకు అభిమానులు ఉండడం సహజం. సాధారణంగా వారికిష్టమైన హీరో లేదా హీరోయిన్ అంటే పడి చచ్చేంత అభిమానం. అభిమాన తారల సినిమా రిలీజ్ అయిందంటే వారి ఆనందానికి హద్దే ఉండదు. అంతలా సినీ తారలపై ఫ్యాన్స్ ప్రేమను చాటుకుంటారు. ఇక కొందరు వీరాభిమానులైతే అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో ఒక రూపంలో తమ ప్రేమను చాటుకుంటూ ఉంటారు. తమ ఫేవరేట్ హీరో, హీరోయిన్లను దేవతల్లా కూడా భావిస్తారు. వారికేమైనా జరిగితే కూడా తట్టుకోలేరు. అంతలా ప్రేమను చూపిస్తారు ఫ్యాన్స్. తాజాగా ఓ వీరాభిమాని తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. (ఇది చదవండి: సిల్క్ స్మిత సూసైడ్... ఆమెను చూసేందుకు వచ్చిన ఏకైక హీరో అతనే!) సాధారణంగా హీరోలకు డైహార్డ్ ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. కానీ తాజాగా ఓ వ్యక్తి తన అభిమాన హీరోయిన్ కోసం ఏకంగా గుడి కట్టేందుకు సిద్ధమవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గతేడాది మయోసైటిస్ వ్యాధి బారిన పడి ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అవుతున్న స్టార్ హీరోయిన్ సమంతకు డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఏపీలోని బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన సందీప్ సమంత బర్త్‌డేకు వినూత్నంగా గిఫ్ట్ ఇవ్వనున్నాడు. తన ఇంటిలోనే సమంత విగ్రహం తయారు చేయించి గుడి కడుతున్నాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరలవుతోంది. (ఇది చదవండి: అప్పుడు నేను కోమాలో ఉన్నాను: విరూపాక్ష డైరెక్టర్) అంతే కాకుండా సమంత వ్యాధి నుంచి కోలుకున్నందుకు ఇప్పటికే తిరుపతి, చెన్నై, నాగపట్నం, కడప దర్గాకు మొక్కుబడి యాత్ర కూడా నిర్వహించినట్లు సందీప్ తెలిపారు. గతంలో కూడా ఓ వీరాభిమాని సీనియర్ నటి ఖుష్బూ సుందర్ కూడా ఇలాగే గుడి కట్టి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఏదేమైనా సమంత బర్త్‌డేకు వీరాభిమాని గుడి కట్టడం విశేషంగా నిలవనుంది. ఈనెల 28న సమంత పుట్టినరోజు సందర్భంగా గుడి ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. సమంత ఇటీవలే శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. -
ఒక్క పాటతో ఆదిపురుష్ లెక్కలు పూర్తిగా మాయం...డైరెక్టర్ పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్
-
సెల్ఫీ ప్లీజ్!.. ‘నందన్ సార్’ భారత్‌లో మీ సేవలు అమోఘం!
నందన్ నిలేకని పరిచయం అక్కర్లేని పేరు. ‘ఆధార్ కార్డ్’ పేరుతో ప్రపంచంలో అతిపెద్ద బయోమెట్రిక్ ఐడీ సిస్టమ్ అందుబాటులోకి తెచ్చిన సృష్టికర్త, ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుడుతూ..ఎన్ఆర్ నారాయణ మూర్తితో కలిసి ఇన్ఫోసిస్‌ను స్థాపించిన సహా వ్యవస్థాపకుడు..ఆ సంస్థ ఛైర్మన్ కూడా. ఇలా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖుల్లో ఒకరైన నందన్ నిలేకనితో సెల్ఫీ దిగాలని ప్రపంచ దేశాలకు చెందిన ఆయన అభిమానులు కోరుతున్నారు. ఇటీవల అమెరికాకు చెందిన ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ బ్లాక్‌రాక్ గ్లోబుల్ క్లయింట్ బిజినెస్ హెడ్ మార్క్ వైడెమాన్ (Mark Wiedman) నందన్ నిలేకని గొప్పతనం గురించి లింక్డిన్ అకౌంట్లో షేర్ చేశారు. ఆ పోస్ట్‌లో నిలేకనికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్నారు. తన సంస్థ(బ్లాక్‌రాక్) ఉద్యోగులకు ఆయనంటే మహా ఇష్టం. నేను ఈ సంవత్సరం ముంబైలో నందన్ నీలేకనిని కలిసిన తర్వాత, దేశాభివృద్దిలో ఆయన సేవలు గురించి తెలుసుకునేందుకు నిర్మాణ సంస్థ హడ్సన్ యార్డ్స్ (Hudson Yards) కార్యాలయానికి ఆహ్వానించినట్లు వైడ్మాన్ తన పోస్ట్‌లో తెలిపారు. అంతేకాదు నిలేకని సహకారాన్ని ప్రస్తావిస్తూ.. వైడ్మాన్ ఒక ప్రశ్నతో ప్రారంభించారు. ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలు గుర్తింపు కార్డు లేకుండా జీవిస్తున్నారని ఊహించగలరా’ అని ప్రశ్నించారు. నిలేకని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్' (UPI) సృస్టికర్త. అతను గత 14 సంవత్సరాలుగా వందల మిలియన్ల మందికి ప్రత్యేకమైన గుర్తింపు కార్డ్‌లను అందించడంలో భారత్ రూపు రేఖల్ని మార్చేశారు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. నందన్ సృష్టించిన కొత్త సాంకేతికత భారతీయులకు వారి రోజువారీ జీవితంలో ఎలా సహాయపడుతుందో కూడా పేర్కొన్నారు. . ప్రపంచ వ్యాప్తంగా యూపీఐ పేమెంట్స్ జరగాలనేది ఆయన లక్ష్యం. ఇందుకోసం భారత్‌తో సహకరించేందుకు 50 దేశాలు ముందుకు వచ్చాయని తెలిపారు. ఇక కార్యక్రమం ముగిసిన అనంతరం తన సంస్థ ఉద్యోగులు నందన్‌తో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారని వెల్లడించారు. చదవండి👉 ఆధార్ కార్డ్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త! ఇంటి వద్ద నుంచే స్మార్ట్‌ఫోన్ ద్వారా