హీరో విజయ్.. కోలీవుడ్‌లో ఈ పేరు ఇప్పుడు ఆయన అభిమానులకు తారక మంత్రంగా మారింది. రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిగ్‌గా మారింది. వివరాలు.. విజయ్ అత్యధిక ప్రేక్షకాదరణ కలిగిన నటుడిగా ఎదిగారు. తన అభిమాన సంఘాలను విజయ్ ప్రజా సంఘాలుగా మార్చారు. తద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇటీవల రాష్ట్రంలోని 234 నియోజకవర్గాలకు చెందిన 10, ప్లస్–1, ప్లస్–2 తరగతుల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉత్తీర్ణత సాధించిన నియోజకవర్గం ముగ్గురు చొప్పున ఎంపిక చేసిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పనైయూరులోని తన కార్యాలయానికి ఆహ్వానించి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలతో సత్కరించారు.
(ఇదీ చదవండి: ప్రాజెక్ట్- కే యూనిట్‌పై ఫైర్ అవుతున్న ప్రభాస్ ఫ్యాన్స్)
ఈ సందర్భంగా విద్యార్థులకు పలు హిత వాక్యాలు చేశారు. ముఖ్యంగా ఓటుకు నోటు విధానం మంచిది కాదనే విషయాన్ని తనదైన శైలిలో స్పష్టం చేశారు. ఇది రాజకీయ వర్గాల్లోనూ, టీవీ ఛానల్లో పెద్ద డిబేట్ జరిగింది. అంతేకాకుండా విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారనే నమ్మకాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు విజయ్ మంగళవారం ఉదయం మరోసారి తన అభిమాన సంఘ నిర్వాహకులను, కార్యకర్తలను చైన్నెలోని తన కార్యాలయంలో కలిశారు.
(ఇదీ చదవండి: ధోని తొలి సినిమా రెడీ! హీరోహీరోయిన్లు, కథ ఏంటంటే?)
ఈ సందర్భంగా తమిళనాడులోని అన్ని నియోజకవర్గాల్లోనూ జరుగుతున్న పరిణామాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చించినట్లు సమాచారం. అదే విధంగా మరికొన్ని రాజకీయ పరమైన అంశాల గురించి తీవ్రంగా కార్యకర్తలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో 15 జిల్లాలకు చెందిన విజయ్ ప్రజా సంఘం నిర్వాహకులు పాల్గొన్నట్లు సమాచారం. దీంతో మారోసారి విజయ్ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు జోరందుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment