
కోలీవుడ్‌లో వసూళ్ల రారాజు నటుడు విజయ్. ఈయన చిత్రం వస్తుందంటే ఇతర చిత్రాల నిర్మాతల్లో కలవరం. అభిమానుల్లో కోలాహలం కనిపిస్తాయి. ఆ స్థాయిలో స్టార్ డమ్ సంపాదించుకున్న దళపతి విజయ్ నటకు బ్రేక్ ఇస్తారా? ఇది జరిగే పనేనా? అంశం ప్రస్తుతం కోలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విజయ్ ప్రస్తుతం లియో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీపావళికి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధం అవుతోంది.
(ఇదీ చదవండి: అక్కడ మరొకరు ఉన్నా లిప్‌లాక్ చేసేదాన్ని:నటి)
కాగా విజయ్ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఇది ఆయన 68వ చిత్రం అవుతుంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం త్వరలో సెట్ పైకి వెళ్లనుంది. దీన్ని విజయ్ 2024 మే నెలాఖరు కల్లా పూర్తి చేసి నటనకు బ్రేక్ ఇవ్వనున్నారనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. అంతేకాదు ఆయన రాజకీయాల్లో యాక్టివ్ కావాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జోరందుకుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల విజయ్ ఓటుకు నోటుపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు గట్టిగానే హితబోధ చేశారు. కాగా 2025 ఏడాదంతా విజయ్ ప్రజా సంఘాలను బలోపేతం చేస్తూ సేవా కార్యక్రమాలు, రాజకీయ అంశాలపై పూర్తిగా దష్టి పెట్టనున్నట్లు టాక్. ఇక 2026 అసెంబ్లీ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో సత్తా చాటేలా వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. దీంతో విజయ్ చర్యలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ సాగుతోంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ)
Comments
Please login to add a commentAdd a comment