
కోలీవుడ్ సూపర్‌స్టార్ ప్రస్తుతం వెట్టైయాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను లైక్షా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే తాజాగా రజినీకాంత్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాజకీయాలను ఉద్దేశించి తలైవా చేసిన వ్యాఖ్యలు మరో స్టార్ హీరో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
తాజాగా ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రజినీకాంత్ పొలిటికల్ కామెంట్స్ చేశారు. డీఎంకే పార్టీ మర్రి చెట్టులాంటిదని.. దాన్ని ఎవరూ కదిలించలేరని అన్నారు. ఎలాంటి తుఫానునైనా ఈ పార్టీకి ఎదుర్కొనే శక్తి ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి ఎదురైన సమస్యలు మరెవరికైనా వచ్చి ఉంటే కనుమరుగయ్యేవారన్నారు. కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్ కరుణానిధి గురించి అరగంటసేపు మాట్లాడారంటే ఆయన స్థాయి ఏంటో అర్థమవుతోందన్నారు. ప్రస్తుతం సీఎం స్టాలిన్ అద్భుతంగా పనిచేస్తున్నారని రజినీకాంత్ కొనియాడారు. ఎ.వి.వేలు రచించిన కళైంజ్ఞర్ ఎనుమ్ థాయ్ అనే పుస్తకావిష్కరణ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.
మండిపడుతున్న విజయ్ ఫ్యాన్స్
అయితే కోలీవుడ్ స్టార్‌హీరో, దళపతి ఇటీవలే తన పార్టీ జెండాను ఆవిష్కరించారు. వచ్చే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు విజయ్ పార్టీని ఉద్దేశించే చేశారంటూ ఆయన అభిమానులు మండిపడుతున్నారు. ప్రస్తుతం తలైనా చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment