DMK
-
ఆలు లేదు.. చూలు లేదు.. డీలిమిటేషన్‌పై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: డీలిమిటేషన్‌కు విధి విధానాలు ఇంకా ఖరారే కాలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కొందరు తీరు ఆలు లేదు.. చూలు లేదు.. అన్నట్లుగా ఉందంటూ చెన్నైలో జరిగిన డీలిమిటేషన్ సమావేశంపై ఆయన వ్యాఖ్యానించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు కేంద్రమంత్రి శంకుస్థాపన చేశారు.అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాదికి అన్యాయం అంటూ అపోహలు సృష్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే అపోహలు సృష్టిస్తున్నాయని దుయ్యబట్టారు. బీజేపీపై విషం కక్కడమే వారి అజెండా అని.. దక్షిణాదిపై మోదీకి ప్రత్యేకమైన ప్రేమ ఉంది. ఏ ఒక్క రాష్ట్రానికి అన్యాయం జరగదని కిషన్‌రెడ్డి అన్నారు. డీలిమిటేషన్‌పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. అన్ని ప్రాంతాలకు, అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నా పార్టీ బీజేపీ. దక్షిణాది అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది. దక్షిణ భారతదేశానికి సంబంధించి వీళ్ల సర్టిఫికెట్ అవసరం లేదు’’ అంటూ కిషన్‌రెడ్డి మండిపడ్డారు.‘‘అన్ని ప్రాంతాలకు బీజేపీ సమ న్యాయం చేస్తోంది. స్టాలిన్‌కు దురద పుడితే రేవంత్, కేటీఆర్ వెళ్లి గోకుతున్నారు. డీలిమిటేషన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే లేని పోని హడావుడి చేస్తున్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం కేంద్రం మీద బురద చల్లుతున్నారు’’ అని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. -
‘డీలిమిటేషన్ మీటింగ్.. కోడిగుడ్డుపై ఈకలు పీకడం అంటే ఇదే’
సాక్షి, ఢిల్లీ: తమిళనాడు ఎన్నికలలో డీఎంకే పార్టీ ఓడిపోబోతుందని.. అందుకే డీలిమిటేషన్‌పై ఆరోపణలు చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. జనాభా ప్రాతిపదికన దక్షిణ భారత దేశం వెనుకబడి పోతుందంటున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టమని మాట్లాడుతున్నారు. డీలిమిటేషన్ వలన తమిళనాడుకు కొద్దీమేర మాత్రమే నష్టం జరుగుతుంది. తమిళనాడు మినహా దేశంలో, ఏ దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదు’’ అని అరవింద్ పేర్కొన్నారు.‘‘తమిళనాడు రాష్ట్ర అంశాన్ని మాత్రమే బూచిగా చూపి దక్షిణాదికేదో జరుగుతున్నట్టు స్టాలిన్ ప్రచారం చేస్తున్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకడం అంటారు. 1971 దేశ జనాభా 41 కోట్లు ఉంటే, ఇప్పుడు సుమారు 140 కోట్లకు పెరిగింది. దేశంలో ముస్లిం జనాభా ఏడువందల శాతం పెరిగింది. హిందువుల జనాభా 300 శాతం పెరిగింది, అసలు సమస్య ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలు కాదు.. దేశంలో ముస్లింల సంఖ్య పెరగడమే’’ అంటూ అరవింద్ వ్యాఖ్యానించారు.‘‘ఈ సమస్యను పరిష్కరించేందుకు కామన్ సివిల్ కోడ్, ఎన్ఆర్సీకి సపోర్ట్ చేస్తారా?. స్టాలిన్, ఉదయ్ నిధి స్టాలిన్ లాంటి దుర్మార్గులు ఏ కమ్యూనిటిలో ఉండకూడదు. తెలంగాణలో 80 శాతం మైనార్టీలను బీసీల్లో కలిపారు. మేం అధికారంలోకి వచ్చాక బీసీల నుంచి మైనారిటీలను తొలగిస్తాం. మతపరమైన రిజర్వేషన్లు అమలు చేయం’’ అని అరవింద్ చెప్పారు. -
పార్లమెంట్లో టీ–షర్టుల రగడ
న్యూఢిల్లీ: లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై విపక్ష సభ్యులు గొంతెత్తారు. గురువారం లోక్‌సభలో తీవ్ర అలజడి సృష్టించారు. ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రయత్నించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించబోమని హెచ్చరించారు. తమిళనాడుకు చెందిన డీఎంకే సభ్యులు సభలో టీ–షర్టులు ధరించి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. దీంతో సభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది.నియోజకవర్గాల పునర్విభజనపై చర్చకు అనుమతి ఇవ్వాలని విపక్ష సభ్యులు కోరగా, స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. ప్రస్తుతానికి ఆ అంశం ప్రభుత్వ పరిశీలనలో లేదని, దానిపై ఇప్పుడు చర్చ అక్కర్లేదని తేల్చిచెప్పారు. నినాదాలు రాసి ఉన్న టీ–షర్టులు ధరించి సభకు వచ్చిన డీఎంకే ఎంపీలపై ఓం బిర్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. నిబంధనలు అతిక్రమించడం ఏమిటని మండిపడ్డారు. ఎవరైనా సరే సభా సంప్రదాయాలు పాటించాల్సిందేనని తేల్చిచెప్పారు. సభ గౌరవాన్ని కాపాడాలని అన్నారు.బయటకు వెళ్లి దుస్తులు మార్చుకొని రావాలని డీఎంకే సభ్యులకు సూచించారు. ఎంపీలకు గౌరవప్రదమైన వేషధారణ అవసరమని హితవు పలికారు. మధ్యా హ్నం 2 గంటలకు సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. విపక్ష ఎంపీలు నినాదాలు కొనసాగించారు. సభ సజా వుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ స్థానంలో ఉన్న తెన్నేటి కృష్ణ ప్రసాద్ పదేపదే కోరినా విపక్ష సభ్యులు శాంతించలేదు. దీంతో సభను శుక్రవారానికి కృష్ణ ప్రసాద్ వాయిదా వేశారు.రాజ్యసభలోనూ అదే తీరు పార్లమెంట్ ఎగువ సభలోనూ టీ–షర్టుల రభస చోటుచేసుకుంది. డీఎంకే ఎంపీలు నినాదాలు రాసిన టీ–షర్టులు ధరించి సభకు వచ్చారు. నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. ‘‘పునర్విభజన–తమిళనాడు పోరాటం సాగిస్తుంది. కచ్చితంగా విజయం సాధిస్తుంది’’ అని ఆ టీ–షర్టులపై రాసి ఉంది. ‘అనాగరికులు’ అంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలను డీఎంకే ఎంపీలు తప్పుపట్టారు. తమ టీ–షర్టులపై ‘అన్సివిలైజ్డ్’ అని రాసుకున్నారు. నినాదాలు ఆపేసి సభా కార్యకలాపాలకు సహకరించాలని చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ పలుమార్లు కోరినా, డీఎంకే ఎంపీలు వెనక్కి తగ్గలేదు.దాంతో సభ పలుమార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం పునఃప్రారంభమైన తర్వాత కూడా సభ అదుపులోకి రాకపోవడంతో చైర్మన్ మరుసటి రోజుకి వాయిదా వేశారు. రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో సభ నిష్ప్రయోజనంగా మారడం ఇదే మొదటిసారి. అంతకుముందు వివిధ పార్టీల సభా నాయకులతో చైర్మన్ ధన్‌ఖడ్ తన చాంబర్లో భేటీ అయ్యారు.సభలో టీ–షర్టులు ధరించకూడదని డీఎంకే సభ్యులకు సూచించారు. అలాంటి దుస్తులతో పార్లమెంట్‌కు రావడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టంచేశారు. అయితే, సభలో టీ–షర్టులు కచ్చితంగా ధరిస్తామని, నిరసన తెలియజేస్తామని డీఎంకే ఎంపీలు బదులిచ్చారు. సభ నుంచి సస్పెండ్ చేసినా తమకు అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. -
పవన్ కళ్యాణ్ కామెంట్స్ కు డీఎంకే కౌంటర్
-
‘తమిళభాష అభివృద్ధి కోసం స్టాలిన్ ఏం చేశారో చెప్పాలి?’
హైదరాబాద్: త్రిభాషా పాలసీ అనేది కొత్తది కాదన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పటునుండి ఈ విధానం కొనసాగుతుందన్నారు. దేశంలో ఎక్కడా హిందీ భాషను రుద్దడం లేదని, నచ్చిన భాషను చదువుకోవచ్చని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.‘ఇతర దేశాల్లో కూడా మాతృభాషలోనే మాట్లాడుతారు. డీఎంకే ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. దేశంలో నూతన విద్యా విధానం వచ్చాక మాతృభాషకు ప్రోత్సాహం ఇచ్చాం. తమిళనాడులో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి ప్రజలను రచ్చ కొట్టి అధికారం కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారు.నాలుగున్నర సంవత్సరాలలో తమిళ భాష అభివృద్ధికి స్టాలిన్ ఏం చేశారో చెప్పాలి.దేశంలోని అన్ని ప్రాంతీయ భాషల్లోని సినిమాలు దేశవ్యాప్తంగా మంచి ఫలితాలు లభిస్తున్నాయి. నియోజకవర్గ పునర్విభజన పై కొత్త నియమాలు రాలేదు.జనగణన జరగలేదు. ఈ అంశంపై ఏబిసిడిలు తెలియని సీఎం రేవంత్ యుద్ధం చేస్తా అని అంటున్నారు. దక్షిణ భారత ప్రజలు తన్యవంతులయ్యారు అక్షరాస్యత పెరిగింది.. మీ పిచ్చి మాటలు నమ్మరు. రాజకీయ దురుద్దేశంతో ప్రజల రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు నమ్మరు’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.కాగా, త్రిభాషా సూత్రం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమిలోని పార్టీలకు మిగతా పార్టీలకు మధ్య వార్ నడుస్తోంంది. ఇదే అంశంపై పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ త్రిభాషా విధానాన్ని సమర్ధించారు. ఎలాగు ఎన్డీఏ కూటమిలో జనసేన ఉంది కాబట్టి సమర్థిస్తూ మాట్లాడారు పవన్. దీనిపై డీఎంకే స్పందించింది. ‘‘మా వైఖరిని పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇతర భాషలు నేర్చుకునేందుకు మేం వ్యతిరేకం కాదు’’ అంటూ డీఎంకే అధికార ప్రతినిధి సయీద్ హఫీజుల్లా స్పష్టం చేశారు. తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారని.. హిందీపై కేంద్రం తీరును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. -
పవన్ బహుభాష వ్యాఖ్యలపై డీఎంకే రియాక్షన్
చెన్నె: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహుభాష వ్యాఖ్యలపై డీఎంకే స్పందించింది. ‘‘మా వైఖరిని పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇతర భాషలు నేర్చుకునేందుకు మేం వ్యతిరేకం కాదు’’ అంటూ డీఎంకే అధికార ప్రతినిధి సయీద్ హఫీజుల్లా స్పష్టం చేశారు. తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారని.. హిందీపై కేంద్రం తీరును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.‘‘వ్యక్తిగతంగా హిందీ, ఇతర భాషలు నేర్చుకోవడాన్ని తాము ఎన్నడూ అడ్డుకోలేదన్న డీఎంకే.. ఆసక్తి ఉన్నవారు నేర్చుకోవడం కోసం ఇప్పటికే తమ రాష్ట్రంలో హిందీ ప్రచార సభలను నిర్వహిస్తున్నామని పేర్కొంది. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎన్ఈపీ, పీఎం శ్రీ పాఠశాలలు వంటి విధానాలతో తమ రాష్ట్ర ప్రజలపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతోంది. దీన్ని మేం వ్యతిరేకిస్తున్నాం’’ అని సయీద్ హఫీజుల్లా తేల్చి చెప్పారు.మరోవైపు, పవన్ కల్యాణ్‌కు కౌంటరిచ్చారు నటుడు ప్రకాష్ రాజ్. హిందీ భాషను తమిళనాడు ప్రజల మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదని హితవు పలికారు. నటుడు ప్రకాష్‌రాజ్ ట్విట్టర్ వేదికగా..‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండి, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’, అని పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్..’ అంటూ కామెంట్స్ చేశారు.త్రిభాషా సూత్రం అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సభలో మాట్లాడుతూ.. ‘మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటారు.. అన్నీ దేశ భాషలే కదా.. తమిళనాడులో హిందీ రాకూడదని అంటూంటే నాకు ఒక్కటే అనిపించింది. తమిళ సినిమాలు హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో ఉత్తర ప్రదేశ్, బీహార్, చత్తీస్‌గఢ్ నుంచి కావాలి. హిందీని మాత్రం ద్వేషిస్తామంటే ఎలా? ఇక్కడి న్యాయం. తమిళనాడులో పెరినప్పుడు నేను వివక్ష అనుభవించాను. గోల్టీ గోల్టీ అని నన్ను అవమానించారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
‘కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలపై ఎటువంటి కుట్ర, కక్ష లేదు’
హైదరాబాద్: కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలపై ఎటువంటి కుట్ర, కక్ష లేదని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు(శుక్రవారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఎంపీ లక్ష్మణ్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ‘ డీఎంకే ప్రాంతీయ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయంతం చేస్తోంది. అందులో భాగంగా కేంద్ర పై విషయ ప్రచారం మొదలెట్టింది. కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలపై ఎటువంటి కుట్ర లేదు. డీఎంకే ముసుగులో కాంగ్రెస్ పార్టీ, బీ అర్ ఎస్ పార్టీ లు ఉన్నాయి. దక్షిణాదిలో బీజేపీ బలపడటం చూసి ఈ మూడు పార్టీలు భయపడుతున్నాయి. ఏపీలో ఎన్డీఏ, పుదుచ్చేరి లో బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. కర్ణాటకలో గాల్లో దీపంలా సిద్దరామయ్య ప్రభుత్వం ఉంది.డీఎంకే ఆధ్వర్యంలో జరిగే అఖిల పక్షం మీటింగ్ కి రేవంత్, కేటీఆర్ పోటీ పడి హాజరు అయ్యేందుకు సిద్ధమయ్యారు. రేవంత్ ఇచ్చిన 420 హామీల పై అఖిల పక్షం మీటింగ్ పెట్టాలి.హామీలపై కాంగ్రెస్ ను నిలదీయాల్సిన బీ అర్ ఎస్ కాంగ్రెస్ తో కలిసి అఖిల పక్షం మీటింగ్ కి హాజరు అవ్వడం ఏంటీ?, డిలిమిటేషన్ రాజ్యాంగ బద్దంగా జరిగే ప్రక్రియ. దీనికి రాజకీయాలు అంటగడతార?, బ్రిటిష్ నినాదం విభజించు - పాలించు ను కాంగ్రెస్ అనుసరిస్తుంది. గతంలో అధికార దుర్వినియోగం తో కాంగ్రెస్ బలవంతపు కుటుంబ నియంత్రణ చేపట్టింది. జనాభా తగ్గుదల పై కాంగ్రెస్ కు మాట్లాడే అర్హత లేదు ? , డిలిమిటేషన్ తో ఎస్సీ ఎస్టీలకు సీట్లు పెరుగుతాయి. మహిళలకు 33శాతం సీట్లు దక్కనున్నాయి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వొద్దని రేవంత్ అనుకుంటున్నారా? , కాంగ్రెస్ దొంగ ఏడుపులు ఏడుస్తూ.....జనాభా లెక్కలు అడ్డుకోవాలని చూస్తోంది. దేశాన్ని ఇండియా - పాకిస్తాన్ మాదిరిగా విభజించినట్టు సౌత్, నార్త్ అంటూ ప్రజలను మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న కాంగ్రెస్.. రేవంత్ 20 - 20 రాజకీయాలు చేయాలని మాట్లాడుతున్నారు. 20 - 20 మ్యాచ్ లో ఎన్నైనా అబద్ధాలు అడొచ్చా?, మొన్న జరిగిన ఢిల్లీ t20 లో మిమ్మల్ని డకౌట్ చేశారు. Mlc ఎన్నికల్లో రేవంత్ డాకౌట్ అయ్యారు. ఎటువంటి మ్యాచ్ జరిగిన మోదీ సెంచరీలు మోత మోగిస్తున్నారు’ అని ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. -
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం
సాక్షి, హైదరాబాద్: కొత్తగా నిర్వహించబోయే జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్వి భజన (డీ లిమిటేషన్) చేపడితే దక్షిణాది రాష్ట్రా లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేసిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిధ్యాన్ని తగ్గించాలనుకోవడం దారుణమని విమర్శించారు.ఈ అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆధ్వర్యంలో ఈ నెల 22న చెన్నైలో నిర్వహించే సమావేశానికి హాజరై బీఆర్ఎస్తో పాటు తెలంగాణ వాదనను వినిపిస్తామని తెలిపారు. తమిళ నాడు పురపాలక శాఖ మంత్రి కె.ఎన్.నెహ్రూ, రాజ్యసభ ఎంపీ ఎన్.ఆర్.ఎలాంగో బృందంతో తెలంగాణ భవన్లో కేటీఆర్ గురువారం సాయంత్రం సమావేశమయ్యా రు. డీలిమిటేషన్‌కు వ్య తిరేకంగా నిర్వహిస్తున్న సమావేశానికి రావాల్సిందిగా డీఎంకే బృందం బీఆర్ఎస్ పార్టీకి ఆహ్వానం అందజేసింది.ఈ సందర్భంగా ఇరుపక్షాలు మీడియాతో మాట్లాడాయి. ‘డీ లిమిటేషన్ మీద దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాల్సిన సందర్భం ఇది. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సమష్టిగా పోరాడితేనే దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది. 1970–80 దశకంలో కుటుంబ నియంత్రణ సమర్ధవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాల్లో పార్లమెంట్ స్థానాల సంఖ్యను కొత్తగా చేసే జనగణన ఆధారంగా నిర్ణయిస్తామని కేంద్రం చెప్పడం అన్యాయం.ఇదే జరిగితే పార్లమెంట్లో ఈ రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుంది. స్టాలిన్ ఏర్పాటు చేస్తున్న అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ తరపున హాజరుకావాలని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించారు. 22న చెన్నైలో జరిగే సమావేశానికి హాజరై బీఆర్ఎస్తోపాటు తెలంగాణ వాదనను బలంగా వినిపిస్తాం’అని కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశంలో అన్ని పార్టీలతో చర్చించి ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామని డీఎంకే నేతలు ప్రకటించారు. అంతకుముందు డీఎంకే నేతలను కేటీఆర్ సత్కరించారు. -
ఆ మాజీ ఎమ్మెల్యే కుమారుడే.. ఈ రూపాయి (₹) సింబల్‌ను డిజైన్ చేసింది..
ఢిల్లీ: జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)లో భాగమైన త్రిభాష సూత్రం అమలుపై తమిళనాడు-కేంద్ర ప్రభుత్వాల మధ్య తీవ్ర వివాదం తారా స్థాయికి చేరింది. ప్రస్తుతం,తమిళనాడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా, ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ప్రతుల్లో రూపాయి (₹) సింబల్‌ను (Rupee symbol row) తొలగించింది. ఆ స్థానంలో తమిళనాడులో రూ అనే అర్థం వచ్చే అక్షరాన్ని చేర్చింది. దీంతో భాషల వివాదం మరింత ముదిరినట్లైంది. ఈ క్రమంలో ఆ రూపాయి సింబల్ డిజైన్ ఎవరు తయారు చేశారు? అనే అంశంపై నెట్టింట్లో పెద్ద ఎత్తున జరుగుతోంది.రూపాయి సింబల్‌ను ఎవరు డిజైన్ చేశారు?ఇక ఆ రూపాయి డిజైన్‌ను చేసింది మరెవరోకాదు తమిళనాడు అధికార డీఎంకే మాజీ ఎమ్మెల్యే ఎన్.ధర్మలింగం కుమారుడు ఐఐటీ ప్రొఫెసర్ డీ.ఉదయ్‌కుమార్ ధర్మలింగం. తొలిసారిగా ఈ రూపాయి సింబల్ 2010లో నాటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో ప్రధాని మన్మోహన్ సింగ్ వినియోగంలోకి తెచ్చారు. రూపాయి డిజైన్ ఎలా చేశారంటే?2010 నాటి యూపీఏ ప్రభుత్వం రూపాయి డిజైన్ చేసేందుకు దేశవ్యాప్తంగా పోటీ నిర్వహించింది. అయితే, ఈ కాంటెస్ట్‌లో ఐఐటీ ముంబైలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఉదయ కుమార్ సైతం పాల్గొన్నారు. రూపాయి సంకేతం డిజైన్ చేయడంలో దేవనాగరి, రోమన్ భాషల్ని కలుపుతూ రూపాయి డిజైన్ చేశారు. రూపాయి సింబల్ కోసం దేవనగరి భాషలోని ‘ర’ను రోమన్‌లోని ‘ఆర్’ కలిపి రూ (₹) సింబల్‌ను తయారు చేశారు. సరిగ్గా ఐఐటీ గౌహతి డిజైన్ విభాగంలో కొత్త ఉద్యోగంలో చేరే ఒక రోజు ముందు కేంద్రం రూపాయి సింబల్ కోసం ఏర్పాటు చేసిన పోటీ విజేతల్ని ప్రకటించింది. దేశ వ్యాప్తంగా వందల కొద్ది డిజైన్లు పరిశీలించగా.. ఆ డిజైన్లు అన్నింటిల్లో ఉదయకుమార్ డిజైన్ చేసిన రూపాయి డిజైన్‌ను కేంద్రం ఎంపిక చేసింది.భారత కరెన్సీలో రూపాయి సింబల్ 2010 జూలై 15న,మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కరెన్సీ నోట్లపై ఉదయ కుమార్ డిజైన్ చేసిన రూపాయి సింబల్‌ను చేర్చింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా భారత కరెన్సీ గుర్తింపు అమాంతం పెరిగినట్లు ఆర్ధిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో తిరువణ్ణామలై సమీపంలో ఉన్న మారూరు గ్రామంలో జన్మించిన ఉదయ కుమార్ రూపాయి సింబల్‌ను ఎలా డిజైన్ చేశారో వివరించారు. ఇక, ప్రస్తుతం ఉదయ కుమార్ ఐఐటీ గౌహతి డిజైన్ విభాగం హెచ్ఓడీగా ఉన్నారు. ఐఐటీ-హైదరాబాద్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వంటి అనేక సంస్థలకు లోగోలు డిజైన్ చేశారు. -
రూపాయి చిహ్నం మార్చేసిన తమిళనాడు ప్రభుత్వం
జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ)లో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు - కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం జరుగుతోంది. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం 2025 - 26 బడ్జెట్లో సాధారణ రూపాయి చిహ్నానికి బదులుగా.. తమిళ చిహ్నంతో భర్తీ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కొత్త జాతీయ విద్యా విధానం ద్వారా 'హిందీ విధించడం'పై బీజీపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో.. అధికార డీఎంకే పోరాటం చేస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం రూపాయి చిహ్నం మార్చేసింది. ఈ మార్పుపై ఇప్పటివరకు తమిళనాడు ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. తమిళనాడు చర్య భారతదేశంలో ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా ఉందని బీజేపీ ప్రతినిధి అన్నారు.అంతే కాకుండా తమిళంలో చదవడం, రాయడం వచ్చి ఉంటేనే.. తమిళనాడులో ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని, మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్ కార్ల కథ ముగిసినట్టే?.. ఈవీ పాలసీ 2.0 గురించి తెలుసాతమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ''హిందీ, సంస్కృత ఆధిపత్యం కారణంగా ఉత్తర భారతదేశంలో 25 కంటే ఎక్కువ స్థానిక భాషలు కనుమరుగయ్యాయి. శతాబ్దాల నాటి ద్రవిడ ఉద్యమం అవగాహన, నిరసనల ద్వారా తమిళం.. దాని సంస్కృతిని రక్షించింది" అని ఆయన అన్నారు. -
దక్షిణాదిపై బీజేపీ పగబట్టింది: రేవంత్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: డీలిమిటేషన్ ప్రక్రియను ఒప్పుకునేది లేదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదే సమయంలో డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ విషయంలో తెలంగాణలోని అన్ని పార్టీలపై సమావేశం నిర్వహిస్తామని రేవంత్ చెప్పుకొచ్చారు.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలో డీలిమిటేషన్‌పై మార్చి 22న తమిళనాడు ప్రభుత్వ నిర్వహించే జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని డీఎంకే నేతలు, ఎంపీలు ఆహ్వానించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘డీలిమిటేషన్‌పై తమిళనాడు సీఎం స్టాలిన్ చూపించిన చొరవ అభినందనీయం. 22వ తేదీన తమిళనాడులో జరిగే జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి వెళ్లే అంశంపై ఏఐసీసీ అనుమతి తీసుకొని వెళ్తాం. డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం చూపుతుంది. డీలిమిటేషన్ లిమిట్ ఫర్ సౌత్ లాగా ఉంది.డీలిమిటేషన్ ప్రక్రియను ఒప్పుకునేదే లేదు. ఉత్తరాది రాష్ట్రాల కన్నా దక్షిణాది రాష్ట్రాలు అత్యధికంగా పన్నులు చెల్లిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో డీలిమిటేషన్‌పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. దీనికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా రావాలని కోరుతున్నాం. డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి తన గళం కేంద్ర క్యాబినెట్లో వినిపించాలి. తెలంగాణలోని అన్ని పార్టీలపై సమావేశం నిర్వహిస్తాం’ అని చెప్పుకొచ్చారు. -
Dharmendra Pradhan: కేంద్ర మంత్రిపై ప్రివిలేజ్ మోషన్
న్యూఢిల్లీ: తమిళుల మనోభావాలు దెబ్బతీశారంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై మండిపడుతున్న డీఎంకే పార్టీ.. ఆయనపై ప్రివిలేజ్ మోషన్(Privilege motion) ఇచ్చింది. ఆయన చట్ట సభను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ డీఎంకే ఎంపీ కనిమొళి లోక్‌సభలో ఈ తీర్మానం దాఖలు చేశారు.తమిళనాడు.. అక్కడి ప్రజలు అనాగరికులు(Uncivilized) అంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన తక్షణమే క్షమాపణలు చెప్పాలని డీఎంకే, 8 కోట్ల మంది తమిళుల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా అని అన్నారామె.జాతీయ విద్యా విధానం విషయంలో తమిళనాడు ప్రభుత్వం యూటర్న్ తీసుకుందని.. ఈ విషయంలో ఏమాత్రం నిజాయితీ లేకుండా వ్యవహరించిందని ధర్మేంద్ర ప్రధాన్(dharmendra pradhan) మండిపడిన సంగతి తెలిసిందే. ‘‘వాళ్లకు ఏమాత్రం నిజాయితీ లేదు. విద్యార్థుల జీవితాలు నాశనం చేసేలా రాజకీయాలు చేస్తున్నారు’’ అంటూ సోమవారం బడ్జెట్ మలివిడత సమావేశాల సందర్భంగా లోక్‌సభ వ్యాఖ్యలు చేశారు. దీంతో డీఎంకే ఎంపీలు ఆందోళనకు దిగగా.. సభ వాయిదా పడింది.అయితే కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై డీఎంకే భగ్గుమంది. ధర్మేంద్ర ప్రధాన్వి తలపొగరు వ్యాఖ్యలని డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. ఇది తమిళులను అవమానించడమేనని,ప్రధాని మోదీ ఇలాంటి వ్యాఖ్యలను అంగీకరిస్తారా? అంటూ మండిపడ్డారు.మరోవైపు.. పీఎం శ్రీ(PM SHRI) పథకం విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఎంవోయూపై సంతకాలకు అంగీకరించి.. ఆపై వెనక్కి తగ్గిందని ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. అయితే ఇది ఏమాత్రం నిజం కాదని.. ఈ ప్రకటన పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించేదేనని.. ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని డీఎంకే అంటోంది. ఈ నేపథ్యంలో ఎంపీ కనిమొళి ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేయగా.. ఆ తీర్మానాన్నిస్పీకర్ ఓం బిర్లా పరిశీలించనున్నారు. ఒకవేళ స్పీకర్ గనుక ఆ తీర్మానాన్ని అంగీకరిస్తే దర్యాప్తునకు ఆదేశిస్తారు. అందులో ఉల్లంఘన జరిగినట్లు తేలితే క్రమశిక్షణా ఉల్లంఘన కింద చర్యలు తీసుకుంటారు. -
డీలిమిటేషన్ హీట్.. యూటర్న్ తీసుకున్న స్టాలిన్
చెన్నై: నియోజకవర్గ పునర్వవ్యస్థీకరణపై రాజకీయ దుమారం కొనసాగుతున్న వేళ.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK Stalin) కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కొత్తగా పెళ్లైన జంటలను ఆలస్యంగా పిల్లలను కనాలని సూచించిన ఆయన.. ఇప్పుడు స్టాండ్‌పై యూటర్న్ తీసుకున్నారు. అందుకు నియోజకవర్గాల పునర్విభజన రాజకీయం వేడెక్కడమే కారణం. సోమవారం నాగపట్నంలో డీఎంకే నేత కుటుంబ వివాహ వేడుకకు హాజరైన సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. గతంలో కొత్తగా పెళ్లైన వాళ్లను పిల్లల విషయంలో కొంత సమయం తీసుకోవాలని నేనే చెప్పాను. ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో మనం విజయవంతం అయ్యాం కూడా. కానీ, ఇప్పుడు.. నియోజకవర్గాల పునర్విభజన(Delimitation)పై కేంద్రం కొత్త పాలసీలు తీసుకొస్తున్న వేళ అలా చెప్పను. కొత్తగా పెళ్లైన జంటలు వీలైనంత త్వరగా పిల్లలను కనండి. వాళ్లకు మంచి తమిళ పేర్లు పెట్టండి అని స్టాలిన్ అన్నారు. అయితే.. జనాభా ప్రతిపాదికన కేంద్రం నియోజకవర్గాలను పునర్విభజించబోతోందని స్టాలిన్ చెప్పడం ఇదేం కొత్త కాదు. ఇంతకు ముందూ ఆయన ఇలాగే మాట్లాడారు. అలా జనాభా ప్రకారం చూసుకుంటే.. తమిళనాడుకు 8 స్థానాలు తగ్గే అవకాశం ఉందని.. ఇది మరికొన్ని రాష్ట్రాలపైనా ప్రభావం చూపెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారాయన.దేశ సంక్షేమం, ఆర్థిక అభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే.. కుటుంబ నియంత్రణ ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా విజయం సాధించాయని అనుకుంటున్నాయి. రేపు ఒకవేళ జనాభా ప్రతిపాదికన గనుక కేంద్రం నియోజకవర్గాలను విభజిస్తే.. ఆ రాష్ట్రాలకే తీవ్ర నష్టం అని అంటున్నారాయన.అయితే స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ(BJP) కౌంటర్ ఇచ్చింది. తమిళనాడు సీఎం వ్యాఖ్యలు నిరాశవాదంతో కూడుకున్నవని, నిజాయితీలేని రాజకీయాలకు సంకేతమని బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ చెబుతున్నారు. జనాభాకు తగ్గట్లుగా హక్కులు ఉంటాయా? అని గతంలో మీ మిత్రపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని స్టాలిన్‌ను ఉద్దేశించి కేశవన్ అన్నారు. పాలనాపరమైన వైఫల్యాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ డ్రామాలని డీఎంకేపై మండిపడ్డారాయన. మరోవైపు.. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగబోదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇదివరకే ఓ ప్రకటన చేశారు. -
అవినీతిలో మాస్టర్స్ డిగ్రీ.. అమిత్‌షా చురకలు
చెన్నై: వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధిస్తుందని కేంద్ర హోమంత్రి అమిత్‌షా జోస్యం చెప్పారు. ఇవాళ అమిత్ షా తమిళనాడులోని పలు జిల్లాల్లో బీజేపీ పార్టీ కార్యాలయాల్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా అమిత్ షా.. తమిళ రాజకీయాలు, అసెంబ్లీ ఎన్నికలు, డీఎంకేలో అవినీతి వంటి అంశాలపై మాట్లాడారు. తమిళనాడులో అవినీతిలో మాస్టర్స్ డిగ్రీ చేసిన అవినీతి పరులంతా ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) సభ్యత్వం తీసుకున్నారు. ఒకరు క్యాష్ ఫర్ జాబ్ స్కామ్, మనీ లాండరింగ్, ఇసుక అక్రమ తవ్వకాలు, అక్రమ ఆస్తుల కేసులు నమోదయ్యాయి.నాకు కొన్ని సార్లు అనిపిస్తుంది అవినీతి పాల్పడే వారికి సభ్యత్వం ఇచ్చి డీఎంకే తన పార్టీలోకి చేర్చుకుంటుందేమోనని. తమిళనాడు డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్, అతని కుమారుడు డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్లు రాష్ట్ర సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఆ ఇద్దరు నేతలు డీలిమిటేషన్‌పై సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీ స్పష్టం చేశారు.డీలిమిటేషన్ తర్వాత దక్షణాది రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానల సీట్లలో ఎలాంటి మార్పు ఉండబోదని.అన్నీ అవాస్తవాలేతమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రధాని మోదీపై ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తోందని. ఆయన చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. రాష్ట్రానికి నిధుల కేటాయింపులపై యూపీఏ, ఎన్డీయేలను పోల్ల్చి చూస్తే.. ఎన్డీయే ప్రభుత్వం తమిళనాడుకు ఎక్కువ మొత్తంలో నిధుల్ని కేటాయించింది. మోదీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలలో తమిళనాడుకు రూ. 5 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది’ అని అమిత్ షా అన్నారు.కూటమిదే అధికారం..వచ్చే ఏడాది తమిళనాడులో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. కుటుంబ రాజకీయాలు, అవినీతి అంతమొందిస్తాం. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని రాష్ట్రం నుంచి పంపించేస్తాం’ అని అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలో జనగణన (Census) జరపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియ అనంతరం లోక్‌సభ స్థానాల విభజన ప్రక్రియ ఉంటుందని సమాచారం. ఇప్పుడు ఇదే అంశాన్ని తమిళనాడు అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధినేత, సీఎం ఎంకే స్టాలిన్ వ్యతిరేకిస్తున్నారు. ఇదే అంశంపై చర్చించేందుకు మార్చి నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 పార్టీలకు ఆహ్వానించారు. జన గణన ప్రక్రియ అనంతరం లోక్‌సభ స్థానాల విభజన ప్రక్రియ ఉండనుంది. అయితే, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తీవ్రంగా నష్టపోయేది దక్షిణాది రాష్ట్రాలే అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై ఎంకే స్టాలిన్ ఆల్ పార్టీ మీటింగ్‌కు పిలుపునిచ్చారు. -
‘ఏంటి బ్రో ఇది.. ఎల్కేజీ,యూకేజీ పిల్లల కొట్లాటలా ఉంది’
చెన్నై: ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం,బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మధ్య తారా స్థాయికి చేరిన త్రీభాషా సూత్రం వివాదంపై ప్రముఖ హీరో, తమిళగ వెట్రి కళగం (టీవీకే)అధినేత విజయ్ విమర్శలు గుప్పించారు. తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదాన్ని చిన్న పిల్లల కొట్లాటతో పోల్చారు.వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో అత్యధిక అసెంబ్లీ స్థానాల్ని కైవసం చేసుకునే దిశగా, వీలైతే అధికారంలోకి వచ్చేలా టీవీకే అధ్యక్షుడు విజయ్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం టీవీకే తొలి వార్షికోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా విజయ్ జాతీయ విద్యావిధానం – 2020 (NEP-2020) పై మాట్లాడారు. త్రిభాషా సూత్రం ప్రకారం.. రాష్ట్రాలు తప్పనిసరిగా త్రిభాషా (హిందీ, ఇంగ్లిష్, ప్రాంతీయ భాష) సూత్రాన్ని అమలు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానం అమలు చేయకపోతే కేంద్రం రాష్ట్రాలకు నిధులు కేటాయించమని కేంద్రం ప్రకటించిందంటూ వస్తోన్న ఆరోపణలపై నవ్వారు. త్రిభాషను అమలు చేయాలని కేంద్రం అనడం.. హిందీ కారణంగానే ఉత్తరాదిలో ప్రాంతీయ భాషల పరిధి తగ్గుతుందని, దాన్ని అమలు చేయబోమని డీఎంకే అనడం ఎల్కేజీ, యూకేజీ పిల్లల గొడవలా ఉందని వ్యాఖ్యానించారు. త్రిభాషా సూత్రంపై సోషల్ మీడియాలో డీఎంకే, బీజేపీ చేస్తున్నక్యాంపెయిన్‌ను తప్పుబట్టారు. వీళ్లు సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్‌తో కుటిల రాజకీయం చేస్తున్నారు. ఒకరు డ్యాన్స్ చేస్తుంటే.. మరొకరు పాటపాడుతున్నారు. వీళ్లిద్దరి గొడవ ఎల్కేజీ, యూకేజీ పిల్లల కొట్లాటలా ఉంది. సోషల్ మీడియాలో పోరాటం చేస్తూ మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి బ్రో .. ఇది.. చాలా తప్పు బ్రో అని ఎద్దేవా చేశారు.అదే సమయంలో త్రిభాషా విధానాన్ని విజయ్ వ్యతిరేకించారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. తాము అన్ని భాషలను గౌరవిస్తామని, తమిళనాడు భాషా విధానాన్ని భంగపరిచే ఉద్దేశ్యంతో రాజకీయంగా ఏ భాషనైనా బలవంతంగా రుద్దేందుకు యత్నిస్తే మాత్రం వ్యతిరేకిస్తామన్నారు. త్రిభాష సూత్రం అమలును అంగీకరించకపోతే.. తమిళనాడుకు రావాల్సిన 2 వేల400 కోట్ల నిధులను కేంద్రం నిలిపివేస్తామనడం సరికాదన్నారు. కేంద్రం నుంచి ఆ నిధులను పొందడం తమ హక్కు అని ఆయన అన్నారు.రెండు పార్టీలపై సెటైర్లు వేస్తూ బీజేపీ,డీఎంకేలు.. అవి ఫాసిజం, పాయసం లాంటివి.. వాళ్లు ఫాసిజం, ఫాసిజం, ఫాసిజం అని మాట్లాడుతారు. అవి ఏంటి? పాయసమా? అంటూ సెటైర్లు వేశారు విజయ్. -
భాషా యుద్ధానికి మేం సిద్ధం: తమిళనాడు సీఎం వార్నింగ్
చెన్నై: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే త్రీ లాంగ్వేజ్ పాలసీకి తాము వ్యతిరేకమని మరోసారి స్పష్టం చేశారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. తమపై హిందీ బాషను బలవంతంగా రుద్దాలనే ప్రయత్నం జరుగుతోందని స్టాలిన్ మండిపడ్డారు. అవసరమైతే మరో భాషా యుద్ధానికి తమిళనాడు సిద్ధంగా ఉందని హెచ్చరించారు స్టాలిన్. కేంద్ర ప్రభుత్వం నూతన లాంగ్వేజ్ పాలసీపై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా స్టాలిన్ ఘాటుగా స్పందించారు. ‘ మాపై హిందీని రుద్దాలనే యత్నం జరుగుతోంది. ఇది వద్దని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి చెబుతూనే ఉన్నాం. ఇందుకోసం మరో భాషా పోరాటానికైనా తమిళనాడు ప్రజలు సిద్ధం’ అని స్టాలిన్ పేర్కొన్నారు.మీది ద్వంద్వ వైఖరి.. కపట వైఖరి: అన్నామలైస్టాలిన్ వ్యాఖ్యలు చూస్తే ఆయనలో కపటత్వం కనబడుతోందన్నారు తమిళనాడు బీజేపీ చీఫ్ కె అన్నామలై. ఆయన కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చే లాంగ్వేజ్ పాలసీనే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. అక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు థర్డ్ లాంగ్వేజ్ ను నేర్చుకునే అవకాశాన్ని నిరాకరిస్తున్నారు కానీ మరి తమిళనాడులో ప్రైవేటు స్కూళ్లలో వారి సహచరులు నడిపే సీబీఎస్ఈ స్కూళ్లలో థర్డ్ లాంగ్వేజ్ లేదా అని ప్రశ్నించారు.మరి థర్డ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎటువంటి పరిమితులు లేవని స్టాలిన్ సూచిస్తున్నారా?, మీరు థర్డ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. మీ పిల్లల్ని మీ సహచరులు నడిపే స్కూళ్లలో చేర్చి నేర్చుకోండి. ఇక్కడ డీఎంకేది ద్వంద్వ విధానం. ధనికుల పిల్లలకు ఒక రకంగా, పేదల పిల్లలకు ఒక రకంగా వ్యవరిస్తోంది. ఇది కపట ధోరణి’ అంటూ అన్నామలై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. -
విజయ్ Y కేటగిరీ భద్రతపై రాజకీయ దుమారం
చెన్నై: అగ్రనటుడు, టీవైకే పార్టీ అధినేత విజయ్‌కు కేంద్రం ‘వై’ కేటగిరీ భద్రతను కేటాయించింది. రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా మారడం, పైగా తరచూ జనాల్లోకి వెళ్తుండడంతో ఆయన ప్రాణాలకు ముప్పు కలగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంతోనే హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది.నటుడు, రాజకీయనేత అయిన విజయ్(Vijay)తో పాటు పలువురు ప్రముఖుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తాజాగా కేంద్ర హోం శాఖకు నివేదికలు ఇచ్చాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో(Intelligence Bureau) సూచనల మేరకు వాళ్లందరికీ ‘ఎక్స్, వై, జెడ్’ కేటగిరీల కింద ప్రత్యేక భద్రత కల్పించేందుకు కేంద్ర హోం శాఖ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఫిబ్రవరి 13వ తేదీన ఓ నోటిఫికేషన్ కూడా రిలీజ్చేసింది. తాజా నిర్ణయంతో.. ఒకరు లేదా ఇద్దరు కమాండోలతో పాటు 8-11 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది విజయ్‌కు భద్రతగా ఉండనున్నారు. అయితే..ఈ వ్యవహారం(Vijay Security Row) తమిళనాట రాజకీయ విమర్శలకు దారి తీసింది. విజయ్‌కు రాష్ట్ర ప్రభుత్వమే ఇలాంటి భద్రత ఎందుకు కల్పించలేకపోయిందని బీజేపీ ప్రశ్నలు సంధించింది. ‘‘విజయ్ తమిళనాట ప్రజాదరణ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి భద్రతకు ముప్పు పొంచి ఉందనే సమాచారం ఉన్నప్పుడు.. ఇక్కడి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. డీఎంకే ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించేందుకు ముందుకు రావొచ్చు కదా?’’ అని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ప్రశ్నించారు. దీనిపై డీఎంకే నుంచి బదులు రావాల్సి ఉంది.మరోవైపు.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో విజయ్ను ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీ ఆడుతున్న డ్రామా ఇదని అన్నాడీఎంకే(AIADMK) ఆరోపిస్తోంది. నిజాయితీగా విజయ్‌కు కేంద్రం భద్రతను ఇచ్చి ఉంటే ఫర్వాలేదు. కానీ, రాజకీయం కోసం చేసి ఉంటే మాత్రం.. తమిళనాడులో అలాంటి పాచికలు పారవు’’ అని అన్నాడీఎంకే నేత మునుస్వామి చురకలటించారు.కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌కు తమిళనాడులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కిందటి ఏడాది ఫిబ్రవరిలో తమిళగ వెట్రి కజగం అనే పార్టీని ప్రకటించారు. రాష్ట్రంలో డీఎంకే, కేంద్రంలోని బీజేపీకి తన పార్టీ ప్రత్యామ్నాయమని ప్రకటించారాయన. ఆ మధ్య నిర్వహించిన ఓ బహిరంగ సభకు అశేషమైన స్పందన లభించింది కూడా. తరచూ జనాల్లో వెళ్తున్నారు కూడా. ఇక విజయ్ కదలికలను రాజకీయ వర్గాలు నిశితంగా పరిశీలిస్తూ వస్తున్నాయి. అలాగే.. మాజీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తోనూ ఆయన తరచూ భేటీ అవుతూ వస్తున్నారు. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలనే లక్ష్యంగా ఆయన టీవీకేను ముందుకు తీసుకెళ్తున్నారు.ఇదీ చదవండి: కళ్లు చెదిరిపోయేలా.. జయలలిత ఆస్తులు! -
రాజ్యసభకు కమల్ హాసన్?
చెన్నై, సాక్షి: సీనియర్ నటుడు కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నారనే చర్చ తమిళనాట జోరుగా నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్ధతు ప్రకటించిన ఆయన.. డీఎంకే అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో మొత్తం 39 సీట్లను కూటమి కైవసరం చేసుకుంది. దీంతో ఆయన్ను పెద్దల సభకు నామినేట్ చేయాలని డీఎంకే భావిస్తోందన్నది ఆ ప్రచార సారాంశం. ఈ ఏడాది జూన్‌లో రాజ్యసభ నుంచి ఆరు సీట్లు ఖాళీ కానున్నాయి. అయితే ఎన్నికల్లో మద్దతు ప్రకటించిన కమల్‌ను రాజ్యసభకు పంపే యోచనలో డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నారట. తాజాగా.. బుధవారం తమిళనాడు మంత్రి పీకే శేఖర్‌బాబు కమల్ హాసన్ నివాసానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. మరోవైపు కమల్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్(MNM) ప్రతినిధి మురళి అప్పాస్.. తమ పార్టీకి ఓ రాజ్యసభ సీటు దక్కబోతుందనే విషయాన్ని ధృవీకరించారు. అయితే అది ఎవరనేది పార్టీ అధ్యక్షుడు కమల్ హాసనే నిర్ణయిస్తారని తెలిపారాయన. శేఖర్‌బాబుతో కమల్ జరిపిన చర్చల సారాంశాన్ని ఆయన మీడియాకు వివరించేందుకు నిరాకరించారు.2018, ఫిబ్రవరి 21వ తేదీన కమల్ హాసన్ ఎన్ఎంఎం పార్టీని మధురైలో స్థాపించారు. అప్పటి నుంచి ఏ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ప్రభావం చూపెట్టలేకపోయింది. 2019 సార్వత్రిక ఆయన పార్టీ పోటీ చేసినప్పటికీ. ఆశించిన ఫలితం సాధించలేకపోయింది. అయితే.. ఓటు షేర్ మాత్రం 3.72 శాతం దక్కించుకుంది. మరీ ముఖ్యంగా చెన్నై, కోయంబత్తూరు, మధురైలో భారీగా ఓట్లు పడ్డాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసినా.. ఒక్క సీటు గెలవలేకపోయింది. కోయంబత్తూరులో పోటీ చేసిన కమల్.. బీజేపీ అభ్యర్థి వనతిశ్రీనివాసన్ చేతిలో 1,728 ఓట్ల మెజారిటీలోఓటమి పాలయ్యారు. 2022 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసినా.. 140 స్థానాలకు ఒక్కటి కూడా గెలవలేకపోయింది. -
ఆకతాయిల వేధింపులు.. వీడియో వైరల్
చెన్నై: తమిళనాడుకు చెందిన ఓ ప్రాంతంలో జనవరి 26న సాయంత్రం సమయంలో ఓ యువతి తన స్నేహితులతో కలిసి కారులో తన ఇంటికి వెళుతోంది. సరిగ్గా యువతి కారు ఈస్ట్ కోస్ట్ రోడ్డు ముట్టుకాడు ఫ్లైఓవర్ మీదగా వెళుతోంది. ఆ సమయంలో ఓ ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న ఆకతాయులు యువతి కారును వెంబడించారు. యువతిని, ఆమె స్నేహితుల్ని వేధించేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన బాధితురాలు తన కారును వెనక్కి తిప్పించేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో ఆకతాయిలో మరో కారును అడ్డుగా యువతి కారుకు అడ్డుగా పెట్టారు. ఈ ఘటన జరిగే సమయంలో కారులో ప్రయాణిస్తున్న యువతి స్నేహితురాలు వీడియో తీసింది. ఆ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆకతాయిల నుంచి తప్పించుకొని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియోల్ని సైతం అందించింది. ఆకతాయిలు ప్రయాణిస్తున్న ఎస్యూవీ వాహనంపై అధికార డీఎంకే పార్టీ జెండా ఉండడం ఆగ్నికి ఆజ్యం పోసినట్లైంది. ఆ వీడియో క్లిప్‌లో డీఎంకే జెండా ఉన్న ఎస్యూవీ కారుకు మార్గానికి అడ్డుగా ఉండడం, ఓ వ్యక్తి యువతి వాహనం వైపు పరుగెత్తడం వంటి దృశ్యాల్ని మనం చూడొచ్చు. .Safety of women in TN has become a luxury many can’t afford . DMK flag is the icing on the cake . #ShameOnYouStalin pic.twitter.com/SYGC4aCMPp— karthik gopinath (@karthikgnath) January 29, 2025బాధితురాలు తన ఫిర్యాదులో.. తాను, తన స్నేహితులతో కలిసి కానత్తూరులోని తన ఇంటికి వెళుతుండగా రెండు కార్లు వెంబడించాయని, కార్లలో ఉన్న యువకులు తమతో వేధించేందుకు ప్రయత్నించడంతో పాటు గొడవపడ్డారని పేర్కొంది. ఇక ఘటన జరిగే సమయంలో తీసిన వీడియోపై ప్రతిపక్ష నేత పళనిస్వామి ప్రభుత్వంపై మండిపడ్డారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో మహిళలు రాత్రిపూట తిరిగే హక్కును కోల్పోయారా? అని ప్రశ్నించారు. మహిళలపై నేరాలకు పాల్పడేందుకు అధికార పార్టీ జెండాకు లైసెన్స్ ఉందా? వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు.మోటార్ సైకిళ్లతో సహా పెట్రోలింగ్ వాహనాల సంఖ్యను పెంచాలని, రాత్రి వేళల్లో గస్తీని పెంచాలని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆకతాయిల్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ నటుడి ముద్దుల కూతురు
సినీ నటుడు, బాహుబలితో కట్టప్పగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సత్యరాజ్(Sathyaraj ) కూతురు దివ్య సత్యరాజ్( Divya Sathyaraj) డీఎంకేలో చేరారు. డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్( M K Stalin) సమక్షంలో ఆ పార్టీ సభ్యత్వాన్ని ఆమె తీసుకున్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీ డీఎంకే అని, అందుకే తాను చేరినట్టు దివ్య పేర్కొన్నారు. సినీ నటుడు సత్యరాజ్ తనయుడు సీబీ రాజ్ తండ్రిబాటలో వెండి తెర మీద రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆయన కుమార్తె దివ్య సత్యరాజ్ పోషకాహార నిపుణులుగా ఉన్నారు. దివ్య రాజకీయాల్లో రావాలని గత కొంత కాలంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె 2019 డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ను కలిసిన సందర్భంలోనే ఆపార్టీలో చేరనున్నారన్న ప్రచారం జరిగింది. ఇది మర్యాద పూర్వక భేటీ అని ఆమె స్పష్టం చేయడంతో రాజకీయ ప్రచారానికి తెర పడింది. ఆ తదుపరి సామాజిక మాధ్యమాలలో వ్యక్తిగత పోస్టులు, పోషకాహారానికి సంబంధించిన అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ వచ్చారు. ఫాస్ట్‌ఫుడ్ ప్రభావాల గురించి అవగాహన కల్పించే పనిలో పడ్డారు. (ఇదీ చదవండి: ఐదు వేలకు పైగా సినిమాల్లో నటించిన ప్రముఖ నటుడు మృతి)ఈక్రమంలో సోషల్ మీడియా పోస్టులు అనేకం వివాదాస్పదమవుతూ వచ్చాయి. ఈ పరిస్థితుల్లో డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌ను ఆమె కలిశారు. పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించి సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈ సమయంలో డీఎంకే కోశాధికారి టీఆర్‌బాలు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కేఎన్ నెహ్రూ, చైన్నె తూర్పు జిల్లా పార్టీ కార్యదర్శి శేఖర్‌బాబు ఆమెకు స్టాలిన్ ద్వారా సభ్యత్వాన్ని అందజేశారు. అనంతరం దివ్య మాట్లాడుతూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను కలవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. తాను పోషకాహార నిపుణురాలు అని పేర్కొంటూ, డీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్న పోషకాహార పథకం, అల్పాహార పథకం , మహిళలకు ప్రాధాన్యత ఇచ్చేవిధంగా మరెన్నో పథకాలకు ఆకర్షిస్తురాలైనట్లు వివరించారు. అన్ని మతాలను గౌరవించే పార్టీ డీఎంకే అని, అందుకే ఈ పార్టీలో చేరానని పేర్కొన్నారు. తన తండ్రి, స్నేహితులు, అందరూ ఎల్లప్పుడు నా వెన్నంటి ఉంటారని వ్యాఖ్యానిస్తూ ఏ బాధ్యతను తనకు అప్పగించినా శ్రమిస్తానని, కష్ట పడి పనిచేసి మంచి పేరు తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశారు. -
అవును.. నిందితుడు మా పార్టీ మద్దతుదారుడే: సీఎం స్టాలిన్
చెన్నై: అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి ఘటన తమిళనాట రాజకీయ దుమారం రేపుతోంది. అసెంబ్లీని సైతం దద్దరిల్లిపోయేలా చేసిన ఈ ఘటనపై బుధవారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పందించారు. నిందితుడు తమ పార్టీ మద్దతుదారుడేనని ప్రకటించారాయన. అయితే..అసెంబ్లీ సమావేశాల్లో మూడో రోజు సీఎం స్టాలిన్(CM Stalin) మాట్లాడుతూ.. ‘‘అన్నా వర్సిటీ ఘటనలో నిందితుడు కేవలం డీఎంకే మద్దతుదారుడేనని, ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నట్లు పార్టీ సభ్యుడు ఎంతమాత్రం కాదు’’ స్పష్టత ఇచ్చారు. అంతేకాదు.. మహిళల భద్రతే ప్రాధాన్యంగా పని చేస్తున్న తమ ప్రభుత్వం.. నిందితుడికి రక్షణ కల్పించలేదని, భవిష్యత్తులోనూ కల్పించబోదని, పైగా అతనిపై గుండా యాక్ట్ ప్రయోగించామని ప్రకటించారు. అన్నా వర్సిటీ ఘటన.. ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరును సీఎం స్టాలిన్ తీవ్రంగా తప్పుబట్టారు.‘‘విద్యార్థినిపై లైంగిక దాడి(Sexual Assault) క్రూరమైన ఘటన. అయితే.. చట్ట సభ్యులు ఇవాళ ఈ అంశం మీద ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని విమర్శించడమే అంతా పనిగా పెట్టుకున్నారు. బాధితురాలి తరఫు నిలబడి సత్వర న్యాయం చేకూర్చాలనే మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సాధారణంగా.. ఘటన జరిగాక నిందితుడు తప్పించుకుంటేనో.. అరెస్ట్‌లో జాప్యం జరిగితేనో.. లేకుంటే నిందితుడ్ని రక్షించే ప్రయత్నాలు జరిగితేనో విమర్శలు వినిపిస్తాయి. కానీ, ఇక్కడ వీలైనంత త్వరగా అరెస్ట్ చేసినా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం చేసే రాద్ధాంతం కాకపోతే ఇంకేంటి?’’ అని ప్రశ్నించారాయన. అన్నా వర్సిటీ(Anna University) ఘటనకు నిరసనగా ప్రతిపక్ష అన్నాడీఎంకే సభ్యులు నల్లదుస్తులతో అసెంబ్లీకి వచ్చారు. వాళ్లను ఉద్దేశిస్తూ సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు.గతంలో ఇదే ప్రతిపక్ష అన్నాడీఎంకే అధికారంలో ఉండగా.. పొల్లాచ్చి లైంగిక దాడి కేసు సంచలనం సృష్టించింది. ఆ టైంలో ప్రభుత్వం ఏం చేసింది?.. ఆలస్యంగా స్పందించడంతో నిందితుడు పారిపోలేదా? అని ప్రశ్నించారాయన. ప్రతిపక్షాలంతా నిందితుడు ఎవరు? మీ పార్టీ వాడు కాదా అని ప్రశ్నిస్తున్నాయి. అవును.. అతను మా పార్టీ మద్దతుదారుడే. కానీ, సభ్యుడు మాత్రం కాదు. ఈ విషయాన్ని మేం ముందు నుంచే చెబుతున్నాం. అరెస్ట్ విషయంలోనూ ఎక్కడా రాజకీయ జోక్యం జరగలేదు. ఒకవేళ.. అలా జరిగిందని ఆధారాలు ఉంటే సిట్‌కు సమర్పించండి. దర్యాప్తు అయ్యేదాకా ఎదురుచూడడండి. అంతేగానీ స్వప్రయోజనాల కోసం చిల్లర రాజకీయాలు చేయొద్దు అని ప్రతిపకక్షాలను ఉద్దేశించి హితవు పలికారాయన. ఈ తరుణంలో అసెంబ్లీ నుంచి అన్నాడీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. ఇదిలా ఉంటే.. అన్నా వర్సిటీ ఉందంతంపై దాఖలైన ఓ పిటిషన్ విషయంలోనూ మదద్రాస్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘‘అసలు మహిళల భద్రతపై ఎవరికీ అసలు చిత్తశుద్ధి లేదు. అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసును అంతా రాజకీయం చేస్తున్నారు. కేవలం వాళ్ల అవసరం వాడుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించింది. డిసెంబర్ 23వ తేదీన రాత్రి 8గం. ప్రాంతంలో క్యాంపస్‌లో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని(19) తన స్నేహితుడితో మాట్లాడుతుండగా.. దాడి చేసి ఆమెను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకు దిగాయి. అదే సమయంలో.. క్యాంపస్‌కు దగ్గర్లో బిర్యానీ సెంటర్ నడిపే జ్ఞానేశ్వర్‌ను నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అతను డీఎంకే సభ్యుడంటూ ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. మరోవైపు.. ఈ కేసులో ఇంకొంతమంది నిందితులు ఉన్నారని.. వాళ్లను రక్షించే ప్రయత్నం జరుగుతోందంటూ డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు.ఇదీ చదవండి: బీజేపీ నేత నోటి దురుసు! ఫలితంగా.. -
కొరడాతో కొట్టుకున్న తమిళనాడు బీజేపీ చీఫ్
కోయంబత్తూర్/చెన్నై: తమిళనాడు బీజేపీ చీఫ్ కె.అన్నామలై వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. చెన్నైలోని ఓ కాలేజీ విద్యార్థినిపై లైంగిక దాడి కేసు విషయంలో డీఎంకే ప్రభుత్వం, రాష్ట్ర పోలీసుల వైఖరిని ఖండిస్తూ అన్నామలై కొరడాతో తనను తాను కొట్టుకున్నారు. శుక్రవారం కోయంబత్తూర్‌లోని తన నివాసం వెలుపల అన్నామలై పచ్చని ధోతీ ధరించి, చొక్కా లేకుండానే కొరడాతో పదే పదే కొట్టుకున్నారు. ఆయన చుట్టూ గుమికూడిన బీజేపీ కార్యకర్తలు లైంగిక దాడి బాధితురాలి ఎఫ్ఐఆర్ను పోలీసులు లీక్ చేయడాన్ని నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇదే అంశంపై గురువారం అన్నామలై మీడియా సమావేశంలో పాదరక్షలను వదిలేశారు. తమిళనాడులో క్షీణిస్తున్న శాంతి భద్రతలకు డీఎంకే ప్రభుత్వమే కారణమని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా కాళ్లకు చెప్పులు వేసుకోనని ప్రతిజ్ఞ చేశారు. ఎన్నికల్లో డబ్బు పంచబోమని కూడా చెప్పారు. డీఎంకే ప్రభుత్వం పాల్పడిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా 48 రోజులపాటు ఉపవాసంతో ఉండి రాష్ట్రంలోని ఆరు ప్రముఖ మురుగన్ ఆలయాలను దర్శించుకుంటానని తెలిపారు. ఉత్తరం–దక్షిణ రాజకీయాలు బూచిగా చూపుతూ వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు డీఎంకే సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. డీఎంకే రాజకీయాలు చూసి రోత పుడుతోందని అన్నామలై చెప్పారు. అన్నామలై వర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన గుణశేఖరన్ పాతనేరస్తుడు. అతడు డీఎంకే వ్యక్తి కాబట్టే, పోలీసులు ఇప్పటిదాకా క్రిమినల్ కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. పోలీసులు ఎఫ్ఐఆర్ను లీక్ చేయడం బాధితురాలిని అవమానించడం, ఆమె వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనన్నారు. అయితే, అన్నామలై చర్య నవ్వు తెప్పించేలా ఉందని డీఎంకే వ్యాఖ్యానించింది. TN-BJP president @annamalai_k ji whips himself as a mark of protest against the DMK govt for their 'apathy' in handling the case of the sexual assault of an Anna University student.He has vowed to walk barefoot until the DMK govt falls.Truly a fighter...👏🏻 pic.twitter.com/FD3FGgWKIu— Mr Sinha (@MrSinha_) December 27, 2024 -
అప్పటివరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
చెన్నై: తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై లైంగికదాడి ఘటన ప్రకంపనలు రేపుతోంది. ఈ నేపథ్యంలో డీఎంకే అధికారం కోల్పోయేంత వరకు తాను చెప్పులు ధరించబోనంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై శపథం చేశారు. గురువారం ఆయన కోయంబత్తూర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ డీఎంకే సర్కార్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అన్నా విశ్వవిద్యాలయ విద్యార్థిని లైంగిక వేధింపుల కేసుపై ప్రభుత్వం తీరు పట్ల ఆయన నిరసన వ్యక్తం చేశారు.డీఎంకే ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించే వరకు తాను పాదరక్షలు ధరించనని.. చెప్పులు లేకుండానే నడుస్తానంటూ తేల్చిచెప్పారు. ఎన్నికల్లో గెలుపునకు ఎప్పటిలాగే డబ్బులు ఆశగా చూపమన్న అన్నామలై.. రూపాయి కూడా పంచకుండా ఎన్నికలకు వెళ్తామంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలుపు సాధించే వరకు చెప్పులు ధరించను’’ అని అన్నామలై స్పష్టం చేశారు.కాగా, చెడు అంతమైపోవాలంటూ తన నివాసంలో కొరడా దెబ్బలతో మురుగున్‌కు మొక్కు చెల్లించుకుంటానని చెప్పారు. రాష్ట్రంలోని ఆరు మురుగన్ క్షేతాలను దర్శించుకునేందుకు 48 గంటల పాటు ఉపవాస దీక్ష చేపట్టనున్నట్లు కూడా ఆయన తెలిపారు.#WATCH | During a press conference, Tamil Nadu BJP President K Annamalai removed his shoe and said, "From tomorrow onwards until the DMK is removed from power, I will not wear any footwear..."Tomorrow, K Annamalai will protest against how the government handled the Anna… https://t.co/Jir02WFrOx pic.twitter.com/aayn33R6LG— ANI (@ANI) December 26, 2024 ఇదీ చదవండి: వీడియో: కోడిగుడ్లతో బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై దాడి.. -
బీజేపీ, ఈసీపై సీఎం స్టాలిన్ సంచలన ఆరోపణ!
చెన్నై: కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కారణంగా ప్రజాస్వామ్యం తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటోందన్నారు. అలాగే, రాజ్యాంగం ప్రాథమిక లక్షణాలను కేంద్రం నాశనం చేస్తోందని కామెంట్స్ చేశారు.తమిళనాడు సీఎం స్టాలిన్ ట్విట్టర్ వేదికగా కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఈ సందర్బంగా స్టాలిన్.. కేంద్రం ఎన్నికల నియమావళికి నిర్లక్ష్యపూరిత సవరణ చేసింది. ఎన్నికల పారదర్శకతను దెబ్బతీసే నిర్ణయాలు తీసుకుంటోంది. కేంద్రం నిర్ణయాలతో ప్రజాస్వామ్యం తీవ్ర ముప్పును ఎదుర్కొంటోంది. ఎన్నికల నియమావళిలోని సెక్షన్ 93(2)(ఎ) సవరణతో ఎన్నికల్లో ఆందోళన కలుగుతోందన్నారు.అలాగే, ఎన్నికల బూత్‌లోని సీసీటీవీ ఫుటేజీని సమకూర్చాలని పంజాబ్, హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం సీసీటీవీ ఫుటేజీతో సహా ఎన్నికల పత్రాలను బహిరంగంగా తనిఖీ చేయకుండా ఈ సవరణను తీసుకొచ్చింది. రాజ్యాంగం ప్రాథమిక లక్షణాలలో ఒక దానిని బీజేపీ నాశనం చేసింది. ఇటీవల హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఆందోళన నెలకొంది. భారత ఎన్నికల సంఘం మోదీ ప్రభుత్వ ఒత్తిడికి లొంగిపోయింది. ఎన్నికల సంఘం తీరు దిగ్భ్రాంతికరం’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.Democracy is facing its gravest threat under the BJP-led Union Government with the reckless amendment of Section 93(2)(a) of the Conduct of Election Rules, to kill the transparency in election.Consequent on the direction of the Punjab and Haryana High Court to furnish the CCTV… https://t.co/vkAaY2ynr3— M.K.Stalin (@mkstalin) December 23, 2024 -
డీఎంకే ప్రభుత్వంపై విజయ్ ఫైర్
చెన్నై:తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వంపై తమిళగ వెట్రి కజగమ్(టీవీకే) అధినేత, హీరో విజయ్ ఫైర్ అయ్యారు.ఫెంగల్ తుఫాను సహాయక చర్యలపై విజయ్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శలు గుప్పించారు. తుఫాను రిలీఫ్‌లో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలన్నీ తాత్కాలికమైనవేనని,దీర్ఘకాలిక పరిష్కారాలేమీ చూపడం లేదన్నారు. ఏదైనా విపత్తు జరిగినపుడు ఒక సంప్రదాయం లాగ కొన్ని ప్రాంతాలు సందర్శించి ఆహారం పంపిణీ చేయడం ఫొటోలు దిగడం తప్ప ఏమీ చేయడం లేదని ఫైరయ్యారు. ఇవి కూడా కేవలం మీడియా ఫోకస్ ఉన్నంతవరకేనన్నారు. తుపానుకు సంబంధించి ముందస్తు హెచ్చరికలున్నా నష్ట నివారణ చర్యలను ప్రభుత్వం ఎంతమాత్రం తీసుకోలేదన్నారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే బీజేపీ ఏజెంట్లని ఎదురుదాడి చేయడం సర్వసాధారణమైపోయిందన్నారు.తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా ఉండాలని టీవీకే క్యాడర్‌కు విజయ్ పిలుపిచ్చారు. -
మంత్రిపై బురదజల్లిన వరద బాధితులు..
చెన్నై: ఫెంగల్ తుపాను తమిళనాడులో బీభత్సం సృష్టించింది. తుపాన్ కారణంగా ఇప్పటికే పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. వరద నీటికి ధాటికి పలు ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.మరోవైపు.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోని వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను పరామర్శించేందుకు వెళ్లిన మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. ఆగ్రహంతో ఉన్న ప్రజలు.. సదరు మంత్రిపైనే బురద చల్లారు. దీంతో, ఈ ఘటన తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.తమిళనాడు అటవీ శాఖ మంత్రి కె. పొన్ముడి సోమవారం విల్లుపురం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కొన్నారు. తుపాన్ సమయంలో తమకు సహాయక చర్యలు అందలేదని ఎవరూ పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇదే సమయంలో మంత్రి, ఆయన కుమారుడి సికామణిపై స్థానికులు బురదజల్లారు. దీంతో.. మంత్రి, సిబ్బంది చేసేదేమీలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.This is the current state of affairs in Tamil Nadu. The CM and the Deputy Chief Minister were busy taking photos in the streets of Chennai while the city received very little rain and did not bother to keep track of the happenings beyond Chennai. The DIPR behaves like the media… pic.twitter.com/DvZN3UT1f0— K.Annamalai (@annamalai_k) December 3, 2024 ఇక, ఈ ఘటనపై తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై స్పందించారు. వీడియోను ట్విట్టర్లో షేర్ చేస్తూ.. తమిళనాడులో ప్రస్తుత పరిస్థితి ఇది. చెన్నై వీధుల్లో సీఎం, ఉపముఖ్యమంత్రి ఫొటోలు దిగుతూ బిజీగా ఉన్నారు. చెన్నైకి బయట ఘటనలను ట్రాక్ చేయడానికి డీఐపీఆర్.. డీఎంకే మీడియా విభాగంలా ప్రవర్తిస్తుంది. వాస్తవాల నుండి ప్రజలను మళ్లించడానికి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అవినీతితో కూరుకుపోయిన డీఎంకే ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ప్రజల నిరసన తారాస్థాయికి చేరుకుంది. అందుకే ఇలాంటి దాడులు చేస్తున్నారు. ఇది కేవలం శాంపిల్ మాత్రమే అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
హీరో విజయ్‌కు ఉదయనిధి స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్
జట్టుగా వచ్చినా.. సింగిల్‌గా వచ్చినా డోంట్ కేర్ అంటున్నారు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్. ఇటీవల రాజకీయ రంగ ప్రవేశం చేసిన స్టార్ హీరో విజయ్‌కు పరోక్షంగా సవాల్ విసిరారు ఈ యువనేత. వచ్చే ఎన్నికల్లోనూ తామే గెలుస్తామని దీమా ప్రదర్శించారు. హీరో విజయ్ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తొలి బహిరంగ సభలో తమపై పరోక్షంగా విమర్శలు చేసిన విజయ్‌పై డీఎంకే నేతలు ఫైర్ అవుతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా విజయ్‌కు కౌంటర్ ఇచ్చారు. కొత్త పార్టీలు ఎన్ని వచ్చినా తమకు తిరుగులేదని, 2026లోనూ తిరిగి అధికారంలోకి వస్తామంటూ ‘దళపతి’కి పరోక్షంగా జవాబిచ్చారు. తంజావూరులో గురువారం జరిగిన భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ 75వ వ్యవస్థాపక దినోత్సవంలో ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారు.తమిళగ వెట్రి కజగం (టీవీకే) పేరుతో పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చిన విజయ్.. అక్టోబరు 27న విల్లుపురం జిల్లా విక్రవండిలో మానాడు పేరుతో మొదటి బహిరంగ సభ పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ద్రవిడ నమూనా పేరుతో తమిళనాడును ఒక కుటుంబం దోచుకుంటోందని ఇన్‌డైరెక్ట్‌గా స్టాలిన్ ఫ్యామిలీపై ఎటాక్ చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలను వదిలేసి తమను మాత్రమే విమర్శించడంతో విజయ్‌పై డీఎంకే నాయకులు మాటల దాడి పెంచారు.ఎంత మంది వచ్చినా మాదే గెలుపుఅయితే తమిళనాడు ప్రజలు తమ వెంటే ఉన్నారని, ఎంత మంది వచ్చినా డీఎంకే నీడను కూడా తాకలేరని తాజాగా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. ప్రజారంజక పాలన అందిస్తున్నామని, 2026 లోనూ అధికారాన్ని నిలబెట్టుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏడోసారి డీఎంకే పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని, దీన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. ‘2026 అసెంబ్లీ ఎన్నికల్లో మనల్ని వ్యతిరేకించేవారంతా జట్టు కట్టినా.. ఢిల్లీ నుంచి వచ్చినా, స్థానికంగా ఏ దిక్కు నుంచి వచ్చినా డీఎంకేనే గెలుస్తుంది. మా పార్టీని నాశనం చేయాలని చూస్తే ప్రజలే బుద్ధి చెబుతార’ని వార్నింగ్ ఇచ్చారు. కాగా, విజయ్ను ఉద్దేశించే ఉదయనిధి ఈ వ్యాఖ్యలు చేశారని తమిళ ప్రజలు చర్చించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో వీరిద్దరి మధ్య రాజకీయ వైరం మరింత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అయితే విక్రవండిలో మానాడు సభ సందర్భంలో విజయ్‌కు ఉదయనిధి శుభాకాంక్షలు చెప్పడం విశేషం.చదవండి: హీరో విజయ్.. రాజకీయ ప్రవేశం ఇండియా కూటమికే లాభంవిజయ్ ఓడిపోతాడు..మరోవైపు సూపర్‌స్టార్ రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ.. విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు ఎన్నికల్లో తమిళగ వెట్రి కజగం పార్టీకి గెలుపు అవకాశాలు లేవని, విజయ్ కూడా ఓడిపోతాడని జోస్యం చెప్పారు. మదురైలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలవడం అంటే మామూలు విషయం కాదన్నారాయన.చదవండి: ‘దళపతి’ అడుగుల ముద్ర పడేనా?69 సినిమాపై విజయ్ ఫోకస్కాగా, విజయ్ ప్రస్తుతం తన 69 సినిమాపై ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పడంతో ఇదే ఆయన అఖరి సినిమాగా ప్రచారం జరుగుతోంది. దళపతి రాజకీయ జీవితానికి ఉపయోగపడేలా ఈ సినిమా ఉంటుందని టాక్. హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. -
నన్ను క్షమించండి.. తప్పు చేయలేదు: కస్తూరి
తమిళనాడులో తెలుగు ప్రజలనుద్దేశించి నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆమెపై కేసు కూడా నమోదైయింది. కస్తూరి వ్యాఖ్యలపై తెలుగు రాష్ట్రాల్లో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె వైఖరిని ఖండిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాయి. కస్తూరి మాత్రం తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకకరించారని చెబుతోంది.తాజాగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ..తెలుగు ప్రజలు అంటే తనకు చాలా గౌరవం అని.. వారిని కించపరిచే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. అసత్య ప్రచారం వల్ల తెలుగు ప్రజలు తనను అపార్థం చేసుకుంటున్నారని.. తన వ్యాఖ్యల వల్ల బాధపడి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు.‘తమిళనాడులో ఇప్పుడు డ్రవిడియన్ ఐడియాలజీ జరుగుతుంది. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించేవాళ్లు నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. రోజుకో వ్యక్తితో అక్రమ సంబంధం అంటగడుతున్నారు. తాగుడు అలవాటే లేకున్నా.. తాగుబోతునని ప్రచారం చేస్తున్నారు. అధికారంలో ఉన్న డీఎంకే పార్టీపై విమర్శలు చేసినందుకే నాపై ఇలాంటి అబద్ధాలు, అసత్య ప్రచారాలు జరిపిస్తున్నారు. ఇటీవల నేను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులేదు. నేను బ్రాహ్మణులకు జరిగిన అన్యాయంపై మాట్లాడుతూ.. ఎక్కడి నుంచో తమిళనాడుకు వచ్చిన డీఎంకే నేతలను ఉద్దేశించి మాట్లాడానే తప్ప తెలుగువారిని ఒక్క మాట కూడా అనలేదు. తెలుగు అనే పదం వాడింది నిజమే. కానీ నేను ఏ ఉద్దేశ్యం గురించి ఆ పదం వాడానో నా స్పీచ్ మొత్తం వింటే తెలుస్తుంది. తెలిసో తెలియకో ఓ మాట అన్నాను.దాన్ని తప్పుగా వక్రీకరిస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారు’ అని కస్తూరి అన్నారు. -
తెలుగు వారి గురించి నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు: నటి కస్తూరి
హిందూ పీపుల్స్ పార్టీ ఆఫ్ తమిళనాడు తరపున బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ నటి కస్తూరి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ఇదే వేదికపై ఆమె తెలుగు వారి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో నివశిస్తున్న తెలుగు ప్రజలను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో క్లారిటి ఇస్తూ ఒక పోస్ట్ చేశారు.'నేను తెలుగు వారికి వ్యతిరేకంగా మాట్లాడాను అంటూ డీఎంకే పార్టీకి చెందిన వారు ఫేక్ ప్రచారాలకు తెరలేపారు. తెలుగు గడ్డ నా మెట్టినిల్లుతో సమానం. తెలుగు ప్రజలందరూ నా కుంటుంబం అనే భావిస్తాను. ఈ విషయం తెలియని కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారు. నిన్నటిరోజున నేను చేసిన వ్యాఖ్యలను తమిళ మీడియాలో తప్పుగా వక్రీకరిస్తూ చెబుతున్నారు. ఈ ట్రాప్‌లో తెలుగు మీడియా పడొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆంధ్ర,తెలంగాణ ప్రజలు ఎంతోమంది నాపై ప్రేమ చూపుతున్నారు. దాని నుంచి నన్ను వేరు చేసేందుకే ఈ కుట్రను అమలు చేస్తున్నారు. ఇలా నాపై నెగెటివిటీ తీసుకొచ్చి నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు.' అని తెలిపింది.సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి తమిళనాడుకు తెలుగు వారు వచ్చారని కస్తూరు వ్యాఖ్యలు చేసింది. అలా వచ్చిన వారంతా ఇపుడు తమది తమిళ జాతి అంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆమె కామెంట్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అలా అయితే, ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరు..? అని ఆమె ప్రశ్నించారంటూ తమిళనాట వార్తలు వస్తున్నాయి. -
జమిలి ఎన్నికలపై విజయ్ పార్టీ కీలక నిర్ణయం
చెన్నై: సినీ నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీతో తమిళనాట రాజకీయం హీటెక్కింది. తాజాగా టీవీకే పార్టీ అధినేత విజయ్.. స్టాలిన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. అలాగే, జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ మేరకు టీవీకే(తమిళిగా వెట్రి కగజం) పార్టీ తీర్మానం కూడా చేయడం విశేషం.దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై తీవ్ర చర్చ నడుస్తోంది. 2027లోనే జమిలీ ఎన్నికలు వస్తాయని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నటుడు విజయ్‌కి చెందిన టీవీకే పార్టీ.. జమిలి ఎన్నికలు సహా పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. నేడు చెన్నైలో విజయ్ అధ్యక్షతన టీవీకే పార్టీ నేతల కీలక సమావేశం జరిగింది. ఈ సందర్బంగా పార్టీ ఎజెండాను ముందుకు ఎలా తీసుకెళ్లాలన్న విషయంపై చర్చించారు. ఇదే సమయంలో జమిలి ఎన్నికలకు తమ పార్టీ వ్యతిరేకమని విజయ్ ప్రకటించారు. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికలకు వ్యతిరేకంగా సమావేశంలో తీర్మానం చేశారు. అలాగే, నీట్ పరీక్షపై కూడా తాజాగా తీర్మానం చేశారు.ఇదే సమయంలో తమిళనాడులోకి స్టాలిన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు విజయ్. రాష్ట్రంలో అబద్దపు హామీలు ఇచ్చి స్టాలిన్ అధికారంలోకి వచ్చారని అన్నారు. కులగణన ప్రక్రియ జాప్యంపై అధికార డీఎంకే వైఖరిని తప్పుబట్టారు. ఇక, తమిళనాడులో ద్విభాషా సిద్ధాంతమే అమలులో ఉండాలని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో హిందీ అమలుకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో హిందీకి రాష్ట్రంలో చోటులేదని స్పష్టం చేశారు. కేంద్రం పెత్తనం లేకుండా రాష్ట్రాలకు స్వయంప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా.. ఇటీవలే విజయ్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాజకీయ ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా టీవీకే పార్టీ పోటీపై క్లారిటీ ఇచ్చారు. తమిళనాడు 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. అలాగే, ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని చెప్పుకొచ్చారు. క్షేత్రస్థాయిలో మహిళలకే తమ పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. -
విజయ్ అద్భుతం చేస్తాడా?
-
‘విజయ్ పార్టీది.. కాపీ, కాక్టెయిల్ భావజాలం’
చెన్నై: తమిళనాడు స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ఇప్పటికే తమిళగ వెట్రి కళగం(టీవీకే) పేరుతో పార్టీని స్థాపించారు. ఆయన పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనుంది. ఈ సందర్భంగా ఆదివారం విల్లుపురంలో నిర్వహించిన సభలో.. టీవీకే పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఈ భారీ బహిరంగ సభకు లక్షల సంఖ్యలో విజయ్ అభిమానులు హాజరైన విషయం తెలిసిందే.అయితే.. తాజాగా రాజకీయాల్లో విజయ్ చెప్పిన భావజాలాన్ని డీఎంకే పార్టీ కొట్టిపారేసింది. ఆయన పార్టీ సిద్ధాంతాలపై అధికార డీఎంకే పార్టీ నేత విమర్శలు గుప్పించారు. విజయ్ తన పార్టీ సిద్ధాంతాలు, భావజాలాన్ని ఇతర పార్టీల నుంచి కాపీ కొట్టారని డీఎంకే నేత టీకేఎస్ ఇలంగోవన్ అన్నారు. విజయ్ పార్టీ సిద్ధాంతాలు, భావజాలం.. ప్రధాన ప్రతిపక్షమైన ఏఐఏడీఎంకే, ఇతర పార్టీల ప్రస్తుత రాజకీయ దృక్కోణాల ‘కాక్టెయిల్’ అని ఎద్దేవా చేశారు. ‘‘అవన్నీ మా విధానాలు, కానీ విజయ వాటిని కాపీ చేశాడు. ఆయన ఏది చెప్పినా.. అది మేం ఇప్పటికే చెప్పాం, ఇప్పటికీ మేం వాటిని అనుసరిస్తున్నాం’’అని అన్నారు.ఇక.. నిన్న( ఆదివారం) విజయ్ తన తొలి బహిరంగ సభ ప్రసంగంలో అధికార డీఎంకే పార్టీ లక్ష్యంగా విమర్శలు చేశారు. ద్రవిడియన్ మోడల్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. అదేవిధంగా ద్రవిడ, తమిళ జాతీయవాద సిద్ధాంతాలను తమ పార్టీ అనుసరిస్తామని తెలిపారు. తమిళనాడు గడ్డకు అవీ రెండు కళ్ల లాంటివన్నారు. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే మా పార్టీ భావజాలమని ఆయన స్పష్టం చేశారు. పెరియార్ ఈవీ రామస్వామి, కె.కామరాజ్, బాబాసాహెబ్ అంబేడ్కర్, వేలు నాచియార్, అంజలి అమ్మాళ్ ఆశయాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తామని విజయ్ వెల్లడించారు. నాకు రాజకీయ అనుభవం లేకపోయినా భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తొలి సభలోనే డీఎంకే, బీజేపీపై విమర్శలు గుప్పించారు. -
‘మురసోలి’ సెల్వమ్ కన్నుమూత
సాక్షి, చెన్నై: కేంద్ర మాజీ మంత్రి దివంగత మురసోలి మారన్ సోదరుడు, డీఎంకే అధికార పత్రిక మురసోలి మాజీ ఎడిటర్ మురసోలి సెల్వమ్(84) గురువారం ఉదయం బెంగళూరులో గుండెపోటుతో కన్నుమూశారు. డీఎంకే వ్యవస్థాపకుడు ఎం.కరుణానిధి సోదరి కుమారుడే సెల్వమ్. మురసోలి పత్రికకు సిలంది పేరిట 50 ఏళ్లపాటు సంపాదకుడిగా పనిచేశారు. పలు తమిళ సినిమాలకు ప్రొడ్యూసర్‌గాను ఉన్నారు. కరుణానిధి కుమార్తె సెల్విని ఆయన వివాహమాడారు. సీఎం ఎంకే స్టాలిన్‌కు బావ అవుతారు. ‘మంచి రచయిత, జర్నలిస్ట్ కూడా అయిన సెల్వమ్ డీఎంకే భావజాలాన్ని వ్యాప్తి చేయడంతోపాటు హిందీ వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నారు’అని డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ ఒక సందేశంలో పేర్కొన్నారు. మురసోలి సెల్వమ్ మృతితో తమిళనాడు ప్రభుత్వం 10వ తేదీ నుంచి మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. -
పవన్ వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ కౌంటర్
చెన్నై: తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో సనాతన ధర్మంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కౌంటర్ ఇచ్చింది. తిరుమల లడ్డూ కల్తీ జరిగిందంటూ కూటమి ప్రభుత్వం చేసిన రాజకీయంపై సుప్రీం కోర్టు మొట్టి కాయలు వేసిన విషయాన్ని గుర్తు చేసింది. గురువారం పవన్ వారాహి డిక్లరేషన్ సభలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. దానిపై తాజాగా శుక్రవారం తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించలేరంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ.. ‘వేచి చూడండి. వేచి చూడండి’ అని అన్నారు.#WATCH | On Andhra Pradesh Deputy CM Pawan Kalyan's remark 'Sanatana Dharma cannot be wiped out and who said those would be wiped out', Tamil Nadu Deputy CM Udhayanidhi Stalin says "Let's wait and see" pic.twitter.com/YUKtOJRnp9— ANI (@ANI) October 4, 2024 ‘‘సనాతన ధర్మం వైరస్ లాంటిదని, ఆ మహమ్మారిని నిర్మూలించాలని ఈ మధ్య ఓ యువ నాయకుడు మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఎవరైనా సరే దాన్ని నిర్మూలించాలనుకుంటే, వారే తుడిచి పెట్టుకుని పోతారు. తిరుపతి బాలాజీ సాక్షిగా ఈ మాట చెబుతున్నా’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.అయితే పవన్ వ్యాఖ్యలపై డీఎంకే ఇప్పటికే గట్టి కౌంటర్ ఇచ్చింది. డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా మాట్లాడుతూ.. తమ పార్టీ ‘‘ ఏ మతం గురించి, ప్రత్యేకంగా హిందూ మతం గురించి మాట్లాడదు.. కుల దురాగతాలు, అంటరానితనం గురించి మాత్రమే మాట్లాడుతుంది’’ అని సూచించారు. చదవండి: Tirupati Laddu Case Hearing: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ -
‘మీరే హిందూ మతానికి అసలైన శత్రువులు’.. పవన్‌కు డీఎంకే కౌంటర్
చెన్నై: తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో సనాతన ధర్మంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కౌంటర్ ఇచ్చింది. తిరుమల లడ్డూ కల్తీ జరిగిందంటూ కూటమి ప్రభుత్వం చేసిన రాజకీయంపై సుప్రీం కోర్టు మొట్టి కాయలు వేసిన విషయాన్ని గుర్తు చేసింది పవన్ వారాహి డిక్లరేషన్ సభలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా మాట్లాడారు. ‘సనాతన ధర్మం వైరస్ లాంటిదని, ఆ మహమ్మారిని నిర్మూలించాలని ఈ మధ్య ఓ యువ నాయకుడు మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఎవరైనా సరే దాన్ని నిర్మూలించాలనుకుంటే, వారే తుడిచి పెట్టుకుని పోతారు. తిరుపతి బాలాజీ సాక్షిగా ఈ మాట చెబుతున్నా’ అంటూ హెచ్చరించారు.అయితే పవన్ వ్యాఖ్యలపై డీఎంకే గట్టి కౌంటర్ ఇచ్చింది. డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా మాట్లాడుతూ.. తమ పార్టీ ‘ఏ మతం గురించి, ప్రత్యేకంగా హిందూ మతం గురించి మాట్లాడదు.. కుల దురాగతాలు, అంటరానితనం గురించి మాత్రమే మాట్లాడుతుంది’ అని సూచించారు. తిరుమల లడ్డూ వివాదంపై సెప్టెంబర్ 30న తొలిసారి సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా.. శ్రీవారి ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యానించడం తగదంటూ మొట్టికాయలు వేసింది. తాజాగా ఆ వ్యాఖ్యల్ని ప్రస్తావించిన హఫీజుల్లా..‘ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీలే హిందూ మతం, మానవత్వానికి నిజమైన శత్రువులు ’ ద్వజమెత్తారు. డీఎంకే ఏ మతం గురించి మాట్లాడదు. మతాన్ని, హిందూ దేవుళ్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేది బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్. వారే అసలైన శత్రువులు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో మీకు మీరే సాటి అని సెటైర్లు వేశారు. ‘ఇంకా.. కులం, అంటరానితనంపై అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, పెరియార్ ఇతర ద్రావిడ ఉద్యమ వ్యవస్థాపకుల తరహా వైఖరినే డీఎంకే అవలంభిస్తుంది. వాటికి అనుగుణంగా కులం, అంటరానితనం గురించి పోరాడుతుంది. వ్యతిరేకిస్తుందని సూచించారు.👉చదవండి: సుప్రీంలో చంద్రబాబుకు ఎదురు దెబ్బ -
డిప్యూటీ సీఎంగా పగ్గాలు.. స్పందించిన ఉదయనిధి స్టాలిన్
చెన్నై: తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలపై తాజాగా మంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. డిప్యూటీ సీఎం పదవి కట్టబెడతారనే వార్తలు కేవలం వదంతులేనని మరోసారి తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియతో మాట్లాడుతూ..ఈ నిర్ణయం పూర్తిగా ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌పై ఆధారపడి ఉంటుందని అన్నారు. ‘ఇది సీఎం వ్యక్తిగత నిర్ణయం. మీరు.(మీడియాను ఉద్ధేశిస్తూ..) నిర్ణయం తీసుకోకూడదు. మంత్రులందరూ ఆయనకు మద్దతుగా ఉన్నారు. మీరు ముఖ్యమంత్రిని అడగండి. ఇది సీఎం మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సిన నిర్ణయం’ అని ఉదయనిధి పేర్కొన్నారు.అయితే ఈ పుకార్లను ఉదయనిధి కొట్టిపారేయడం తొలిసారి కాదు. గతంలోనూ మీడియాలో వస్తున్న వార్తలు వట్టి పుకార్లేనని, ముఖ్యమంత్రి మాత్రమే దానిపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. తన వరకు యువజన విభాగం కార్యదర్శి పదవి ముఖ్యమైనదిగా పేర్కొన్నారు.చదవండి :జాబ్స్ కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్, ఇద్దరు కుమారులకు కోర్టు సమన్లుకాగా తమిళనాడు డిప్యూటీ సీఎంగా మంత్రి ఉదయనిధి స్టాలిన్ పగ్గాలు అందుకోనున్నట్లు అధికార డీఎంకేలో ఎప్పటి నుంచో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. తన తనయుడికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టనున్నారని కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎంగా ఉదయనిధి ఖరారు అయినట్లు వార్తలు రాగా.. వాటిని ఆయన కొట్టిపారేశారు.ఇక ఉదయనిధి ప్రస్తుతం డీఎంకే కేబినెట్లో క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా చెన్నై మెట్రో రైలు ఫేజ్-2 వంటి ప్రత్యేక కార్యక్రమాల అమలుకు సంబంధించిన కీలక శాఖలను కూడా నిర్వహిస్తున్నారు. -
మరికొన్ని గంటల్లో డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్!
చెన్నై: తమిళనాడు డిప్యూటీ సీఎంగా మంత్రి ఉదయనిధి స్టాలిన్ పగ్గాలు అందుకోనున్నట్లు అధికార డీఎంకేలో ఎప్పటి నుంచో వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. తన తనయుడికి డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టనున్నారని కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగోతంది.ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎంగా ఉదయనిధి ఖరారు అయినట్లు తెలుస్తోంది. కేవలం మరికొన్నిగంటల్లో ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. అధికారిక ప్రకటన వెలువడగానే.. ఉదయనిధి కొత్త పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై 24 గంటల్లో స్పష్టత రానుంది.చదవండి: Kolkata: వెనక్కి తగ్గని వైద్యులు.. ఆగని నిరసనలుకాగా ఉదయనిధి ప్రస్తుతం డీఎంకే కేబినెట్లో క్రీడా, యువజన సంక్షేమ శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అదేవిధంగా చెన్నై మెట్రో రైలు ఫేజ్-2 వంటి ప్రత్యేక కార్యక్రమాల అమలుకు సంబంధించిన కీలక శాఖలను కూడా నిర్వహిస్తున్నారు.మరోవైపు డిప్యూటీ వార్తలను ఉదయనిధి ఇప్పటికే కొట్టి పారేసిన విషయం తెలిసిందే. మీడియాలో వస్తున్న వార్తలు వట్టి పుకార్లేనని, ముఖ్యమంత్రి మాత్రమే దానిపై నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ఇక ఈ వార్తలపై సీఎం ఎంకే స్టాలిన్ ఇటీవలే స్పందిస్తూ.. ఉదయనిధి డిప్యూటీ సీఎం అయ్యే టైమ్ ఇంకా రాలేదంటూ చెప్పుకొచ్చారు. అయితే 2026లో ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. -
డీఎంకే ఎంపీకి 900 కోట్ల ఈడీ జరిమానా!
చెన్నై : డీఎంకే ఎంపీ జగత్రక్షకన్కు భారీ షాకిచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసులో ఆయనకు ఏకంగా రూ.908 కోట్ల జరిమానా విధించింది. ఇప్పటికే ఈ కేసులో కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన దర్యాప్తు సంస్థ.. ఇప్పుడు భారీ ఫైన్‌తో చర్యలు తీసుకుంది.ఫెమా నిబంధనలు ఉల్లంఘన కేసులో బుధవారం ఈడీ అధికారులు తమిళనాడులో వ్యాపారవేత్త, డీఎంకే ఎంపీ జగత్రక్షకన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు జరిపారు. ఫెమా చట్టం సెక్షన్ 37ఏ కింద రూ.89.19 కోట్ల విలువైన ఆస్తుల్ని సీజ్ చేయడంతో పాటు రూ.908 కోట్లు జరిమానా విధించినట్లు ఎక్స్ వేదికగా ఈడీ వెల్లడించింది. ED, Gurugram has provisionally attached assets worth Rs. 294.19 Crore in the form of Lands, Buildings, Flats and FDR under the provisions of the PMLA, 2002 in the case of M/s Sunstar Overseas Ltd. & Others.— ED (@dir_ed) August 28, 2024జగత్రక్షకన్ ఎవరు?జగత్రక్షకన్ తమిళనాడు డీఎంకే అరక్కోణం లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో పాటు పలు రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. డీఎంకే ఎంపీ ఎస్ జగత్రక్షకన్‌పై ఈడీ కేసు అయితే డిసెంబర్ 1,2021లో డీఎంకే ఎంపీ జగత్రక్షకన్, అతని కుటుంబ సభ్యులకు చెందిన సంస్థలు ఫెమాలోని సెక్షన్ 16 కింద నిబంధనల ఉల్లంఘించినట్లు ఫిర్యాదు అందినట్లు ఈడీ తెలిపింది. ఫిర్యాదు ఆధారంగా తాము విచారణ చేపట్టామని, విచారణలో జగత్రక్షకన్‌పై ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించినట్లు పేర్కొంది. ఆ కేసు విచారణలో భాగంగా తాజాగా సోదాలు జరిపి పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న ఈడీ భారీ మొత్తంలో ఫైన్ విధించినట్లు ఈడీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. -
రజినీకాంత్ సంచలన కామెంట్స్.. మండిపడుతున్న ఫ్యాన్స్!
కోలీవుడ్ సూపర్‌స్టార్ ప్రస్తుతం వెట్టైయాన్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను లైక్షా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే తాజాగా రజినీకాంత్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాజకీయాలను ఉద్దేశించి తలైవా చేసిన వ్యాఖ్యలు మరో స్టార్ హీరో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.తాజాగా ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రజినీకాంత్ పొలిటికల్ కామెంట్స్ చేశారు. డీఎంకే పార్టీ మర్రి చెట్టులాంటిదని.. దాన్ని ఎవరూ కదిలించలేరని అన్నారు. ఎలాంటి తుఫానునైనా ఈ పార్టీకి ఎదుర్కొనే శక్తి ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి ఎదురైన సమస్యలు మరెవరికైనా వచ్చి ఉంటే కనుమరుగయ్యేవారన్నారు. కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్ కరుణానిధి గురించి అరగంటసేపు మాట్లాడారంటే ఆయన స్థాయి ఏంటో అర్థమవుతోందన్నారు. ప్రస్తుతం సీఎం స్టాలిన్ అద్భుతంగా పనిచేస్తున్నారని రజినీకాంత్ కొనియాడారు. ఎ.వి.వేలు రచించిన కళైంజ్ఞర్ ఎనుమ్ థాయ్ అనే పుస్తకావిష్కరణ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.మండిపడుతున్న విజయ్ ఫ్యాన్స్అయితే కోలీవుడ్ స్టార్హీరో, దళపతి ఇటీవలే తన పార్టీ జెండాను ఆవిష్కరించారు. వచ్చే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు విజయ్ పార్టీని ఉద్దేశించే చేశారంటూ ఆయన అభిమానులు మండిపడుతున్నారు. ప్రస్తుతం తలైనా చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. -
డీఎంకే బాటలో బీఆర్ఎస్!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ త్వరలో బీజేపీలో విలీనమవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి అంటుంటే, బీజేపీలో కాదు.. కాంగ్రెస్‌లో కలిసిపోతుందంటూ బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నారు. కొంతకాలంగా ఎవరికి వారు ఈ విధమైన ప్రచారం చేస్తున్నారు. అయితే జాతీయ పార్టీల్లో తమ పార్టీ విలీనంపై ఆయా పార్టీల నేతలు చేస్తున్న ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఖండిస్తున్న బీఆర్ఎస్.. మరోవైపు పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించింది.ఇందుకోసం అనుసరించాల్సిన మార్గాలను అన్వేషిస్తోంది. ఆటుపోట్లను అధిగమిస్తూ దేశ రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రాంతీయ పార్టీల పనితీరును నిశితంగా పరిశీలిస్తోంది. ముఖ్యంగా స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ప్రాంతీయ పార్టీగా అవతరించి నేటికీ దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నిర్మాణం, పనితీరుపై బీఆర్ఎస్ దృష్టి సారించింది.డీఎంకేతో అనేక పోలికలుతమిళనాడుకు చెందిన డీఎంకే తరహాలోనే తమది కూడా ఉద్యమ పార్టీ కావడంతో రెండు పార్టీల నడుమ అనేక సిద్ధాంతపరమైన పోలికలు ఉన్నట్లు బీఆర్ఎస్ భావిస్తోంది. తమిళ చరిత్ర, సంస్కృతి, ఆత్మగౌరవం తదితరాలను పార్టీ సిద్ధాంత భూమికగా కలిగి ఉన్న డీఎంకే రీతిలోనే తమ పార్టీ కూడా తెలంగాణ ఆత్మకు ప్రతీకగా నిలుస్తోందని పార్టీ నేతలు చెప్తున్నారు. డీఎంకే సుమారు 75 ఏళ్లుగా తమిళనాడు రాజకీయాలను శాసిస్తోంది. అదే రీతిలో బీఆర్ఎస్ కూడా సుమారు 24 ఏళ్లుగా తెలంగాణ రాజకీయాల్లో కీలక శక్తిగా మారింది. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో పలుమార్లు ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన డీఎంకే..కొన్నిసార్లు అతితక్కువ స్థానాలకే పరిమితమైంది. 1991లో కేవలం 2 స్థానాలు, 1984, 2011లో కేవలం 25లోపు అసెంబ్లీ స్థానాల్లోనే గెలుపొందింది. బీఆర్ఎస్ కూడా రాష్ట్రంలో వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి రాగా.. గత ఏడాది ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యింది. దీంతో ఈ విషయంలోనూ డీఎంకేతో పోలిక ఉన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. డీఎంకే సంస్థాగత నిర్మాణం, కార్యకలాపాల పరిశీలనబీఆర్ఎస్ను మరో 50 ఏళ్ల పాటు తెలంగాణ రాజకీయాల్లో ప్రబల శక్తిగా నిలిపేలా బలోపేతం చేస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఇటీవల చెప్పారు. ఈ నేపథ్యంలో పార్టీ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నేతృత్వంలో ఆంజనేయ గౌడ్, తుంగ బాలు వంటి యువ నేతలు చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం ‘అన్నా అరివాలయం’ను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకుంది. డీఎంకేలో సుదీర్ఘకాలంగా కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్న ఆర్ఎస్ భారతితో వారు భేటీ అయ్యారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, అనుబంధ విభాగాలైన యువజన, విద్యార్థి, మహిళా విభాగాల పనితీరు, సోషల్ మీడియా వింగ్ కార్యకలాపాలు తదితరాలను అడిగి తెలుసుకున్నారు. నాలుగు తరాలుగా పార్టీతో కేడర్ మమేకమైన తీరు, క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకలాపాలపై ఆరా తీశారు. తిరువల్లువర్, పశ్చిమ చెన్నై జిల్లాల్లోనూ పర్యటించిన బాల్క సుమన్ బృందం తాము పరిశీలించిన అంశాలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.తృణమూల్, బీజేడీ పనితీరుపై కూడా..!ఉద్యమ పార్టీగా ప్రస్థానం ప్రారంభించి రెండు పర్యాయాలు అధికారంలో ఉన్నప్పటికీ ఇటీవలి ఎన్నికల్లో పరాజయం పాలైన నేపథ్యంలో.. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన డీఎంకే ఆటుపోట్లను ఎలా అధిగమించిందనే అంశాన్ని అధ్యయనం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కేటీఆర్ నేతృత్వంలోని పార్టీ సీనియర్ నేతల బృందం సెప్టెంబర్‌లో చెన్నైలో పర్యటించనుంది. క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు డీఎంకే సంస్థాగత నిర్మాణంతో పాటు ఇతర అంశాలను వారం రోజుల పాటు ఈ బృందం అధ్యయనం చేయనుంది. అలాగే దేశంలోని మరికొన్ని క్రియాశీల ప్రాంతీయ పార్టీల పనితీరును.. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, ఒడిశాలో బిజూ జనతాదళ్ (బీజేడీ) పనితీరును కేటీఆర్ బృందం ప్రత్యక్షంగా అధ్యయనం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఆ తర్వాతే సంస్థాగత నిర్మాణంపై దృష్టిఅసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు అవసరమైన కార్యాచరణపై పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు కసరత్తు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగత నిర్మాణం, శిక్షణ తదితరాలను ముమ్మరం చేయాలని భావిస్తున్నా రు. ఈ నేపథ్యంలో అక్టోబర్ నాటికి డీఎంకేతో పాటు మరికొన్ని బలమైన ప్రధాన ప్రాంతీయ పార్టీల పనితీరుపై అధ్యయనం పూర్తి చేయాలని, అధ్యయనంలో తేలిన అంశాలను దృష్టిలో ఉంచుకుని పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా కార్యాచరణకు పదును పెట్టాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. -
రాముడిపై తమిళనాడు మంత్రి వ్యాఖ్యల దుమారం
చెన్నై: శ్రీరాముడిపై తమిళనాడు మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు రాముని ఉనికిని చాటే ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని డీఎంకే మంత్రి ఎస్ఎస్ శివశంకర్ వ్యాఖ్యానించారు. అరియలూర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో శివశంకర్ మాట్లాడుతూ.. రాముడికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు.చోళ రాజ వంశానికి చెందిన రాజేంద్ర-I వారసత్వాన్ని జరుపుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని తెలిపారు. రాజేంద్ర చోళన్ జీవించాడని చూపించడానికి ఆయన నిర్మించిన చెరువులు, ఆలయాలు ఉన్నాయి. అతని పేరు స్క్రిప్ట్‌లలో ప్రస్తావించారు. అతని శిల్పాలు ఉన్నాయి. కానీ రాముడు ఉన్నాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు, చరిత్ర లేదు. రామడిని అవతార్ అని పిలుస్తారు. అవతార్ పుట్టదు. మనల్ని మభ్యపెట్టేందుకు ఇలా చేస్తారు. మన చరిత్రను దాచి మరో చరిత్రను పెద్దగా చూపించే ప్రయత్నమిది.అయితే డీఎంకే మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా దుమారాన్ని రేపాయి. దీనిపై బీజేపీ ఘాటుగా బదులిచ్చింది. ఈ మేరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై డిఎంకేపై మండిపడ్డారు.భగవంతుడు శ్రీరాముడిపై డీఎంకేకు ఉన్న ఆస్మిక అభిమానం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. డీఎంకే నేతల జ్ఞాపకాలు ఇంత త్వరగా మసకబారుతున్నాయని ఎవరనుకుంటారు. వీరే కదా కొత్త పార్లమెంట్ కాంప్లెక్స్‌లో చోళ రాజవంశం సెంగోల్‌ను ఏర్పాటు చేసినందుకు ప్రధాని మోదీని వ్యతిరేకించిన వారు? తమిళనాడు చరిత్ర 1967లో ప్రారంభమైందని భావించే డీఎంకే పార్టీ అకస్మాత్తుగా దేశ గొప్ప సంస్కృతి చరిత్రపై ప్రేమను చూపడం హాస్యాస్పదంగా ఉంది.రాముడిని ద్రావిడ మోడల్‌కు ఆద్యుడుగా పేర్కొన్న మరో మంత్రి రేగుపతిని ప్రస్తావిస్తూ.. తన సహోద్యోగితో (శివశంకర్) చర్చించి రాముడిపై ఏకాభిప్రాయానికి రావాలని అన్నామలై కోరారు. భగవంతుడైన రాముడి గురించి కొన్ని విషయాలు తన సహచర మంత్రి నుంచి శివశంకర్ నేర్చుకోగలరనే నమ్మకం ఉన్నట్లు చెప్పారు. -
ఉదయనిధి స్టాలిన్‌కు డిప్యూటీ సీఎం పదవి.. మంత్రి రియాక్షన్ ఇదే!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, యువజన సంక్షేమ శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి పొందనున్నారనే ఊహాగానాలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై ఆయన శనివారం స్పందించారు. డీఎంకే ఒక కుటుంబమని.. తమ ప్రభుత్వంలోని మంత్రులంతా డిప్యూటీ సీఎంలేనని పేర్కొన్నారు. గతంలో కూడా తాను ఇదే చెప్పానని తెలిపారు.‘డీఎంకేలోని మంత్రులందరూ మా ముఖ్యమంత్రికి డిప్యూటీలు. నాకు ఏ పెద్ద పదవి లేదా బాధ్యత ఇచ్చినా.. నా మనసుకు దగ్గరయ్యేది డీఎంకే యువజన విభాగం కార్యదర్శి పదవే. నాకు ఏ పదవి వచ్చినా డీఎంకే యువజన విభాగం ఎప్పటికీ మర్చిపోలేను. నాకు డిప్యూటీ సీఎం పదవిపై అనేక వార్తలు వచ్చాయి. అది ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది’ అని పేర్కొన్నారు. -
ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి జోరు
న్యూఢిల్లీ: ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలు ఆధిక్యాన్ని కనబర్చాయి. విపక్ష ఇండియా కూటమి పారీ్టలైన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), డీఎంకే, ఆప్‌లు పది అసెంబ్లీ సీట్లను గెల్చుకున్నాయి. బీజేపీ రెండు స్థానాలతో సరిపెట్టుకోగా, ఒకచోట స్వతంత్ర అభ్యర్థి నెగ్గారు. పశ్చిమబెంగాల్లోని నాలుగు, హిమాచల్ ప్రదేశ్‌లోని మూడు, ఉత్తరాఖండ్‌లోని రెండు, పంజాబ్, మధ్యప్రదేశ్, బిహార్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి బుధవారం ఉప ఎన్నికలు జరగ్గా.. శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో 42 స్థానాలకుగాను 29 చోట్ల నెగ్గి బెంగాల్లో తనకు తిరుగులేదని నిరూపించుకున్న సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నాలుగింటికి నాలుగు స్థానాలను తమ ఖాతాలో వేసుకుంది. వీటిలో మూడు బీజేపీ సిట్టింగ్ స్థానాలు కావడం విశేషం. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఆధిక్యం వచి్చన చోట్ల కూడా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఎంసీ జయకేతనం ఎగురవేసింది. 294 మంది సభ్యులున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ బలం 215కు చేరింది. అసెంబ్లీలో భార్యాభర్తలు హిమాచల్ ప్రదేశ్‌లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు రాజీనామా చేసి.. బీజేపీ టికెట్‌పై పోటీచేశారు. వీరిలో ఇద్దరు ఓటమి పాలుకాగా.. ఒక్కరు గెలుపొందారు. అందరి దృష్టిని ఆకర్షించిన డేహ్రా నియోజకవర్గంలో హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సతీమణి కమలేష్ ఠాకూర్ విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం పట్టుబట్టి మరీ కమలే‹Ùను రంగంలోకి దింపింది. హిమాచల్ అసెంబ్లీలో ఇకపై భార్యాభర్తలు సుఖ్విందర్, కమలే‹Ùలు కనిపించనున్నారు. తాజాగా ఇద్దరి గెలుపుతో 68 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 40కి చేరింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లు నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో ఏకంగా ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి బీజేపీకి ఓటేయడంతో కాంగ్రెస్ బలం 34కు పడిపోయింది. సుఖు ప్రభుత్వాన్ని అస్థిరత వెంటాడింది. లోక్‌సభ ఎన్నికలతో పాటే 6 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగు నెగ్గింది. ఇప్పుడు మరో రెండు స్థానాలు గెలవడంతో కాంగ్రెస్ బలం మళ్లీ 40కి చేరింది. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్‌లో రెండు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. రెండింటినీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇందులో ఒకటి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. -
ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి జోరు
న్యూఢిల్లీ: ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలు ఆధిక్యాన్ని కనబర్చాయి. విపక్ష ఇండియా కూటమి పారీ్టలైన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), డీఎంకే, ఆప్‌లు పది అసెంబ్లీ సీట్లను గెల్చుకున్నాయి. బీజేపీ రెండు స్థానాలతో సరిపెట్టుకోగా, ఒకచోట స్వతంత్ర అభ్యర్థి నెగ్గారు. పశ్చిమబెంగాల్లోని నాలుగు, హిమాచల్ ప్రదేశ్‌లోని మూడు, ఉత్తరాఖండ్‌లోని రెండు, పంజాబ్, మధ్యప్రదేశ్, బిహార్, తమిళనాడు రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి బుధవారం ఉప ఎన్నికలు జరగ్గా.. శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో 42 స్థానాలకుగాను 29 చోట్ల నెగ్గి బెంగాల్లో తనకు తిరుగులేదని నిరూపించుకున్న సీఎం మమతా బెనర్జీ సారథ్యంలోని టీఎంసీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నాలుగింటికి నాలుగు స్థానాలను తమ ఖాతాలో వేసుకుంది. వీటిలో మూడు బీజేపీ సిట్టింగ్ స్థానాలు కావడం విశేషం. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఆధిక్యం వచి్చన చోట్ల కూడా అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఎంసీ జయకేతనం ఎగురవేసింది. 294 మంది సభ్యులున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ బలం 215కు చేరింది. అసెంబ్లీలో భార్యాభర్తలు హిమాచల్ ప్రదేశ్‌లో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు రాజీనామా చేసి.. బీజేపీ టికెట్‌పై పోటీచేశారు. వీరిలో ఇద్దరు ఓటమి పాలుకాగా.. ఒక్కరు గెలుపొందారు. అందరి దృష్టిని ఆకర్షించిన డేహ్రా నియోజకవర్గంలో హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సతీమణి కమలేష్ ఠాకూర్ విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం పట్టుబట్టి మరీ కమలే‹Ùను రంగంలోకి దింపింది. హిమాచల్ అసెంబ్లీలో ఇకపై భార్యాభర్తలు సుఖ్విందర్, కమలే‹Ùలు కనిపించనున్నారు. తాజాగా ఇద్దరి గెలుపుతో 68 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 40కి చేరింది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 సీట్లు నెగ్గి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే రాజ్యసభ ఎన్నికల్లో ఏకంగా ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి బీజేపీకి ఓటేయడంతో కాంగ్రెస్ బలం 34కు పడిపోయింది. సుఖు ప్రభుత్వాన్ని అస్థిరత వెంటాడింది. లోక్‌సభ ఎన్నికలతో పాటే 6 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నాలుగు నెగ్గింది. ఇప్పుడు మరో రెండు స్థానాలు గెలవడంతో కాంగ్రెస్ బలం మళ్లీ 40కి చేరింది. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్‌లో రెండు స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. రెండింటినీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇందులో ఒకటి కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. -
బీజేపీ మిత్రపక్ష పార్టీని ఓడించండి: మంత్రి ఉదయ్‌నిధి స్టాలిన్
చెన్నై: తమిళనాడులోని విక్రవాండీ అసెంబ్లీ ఉపఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షమైన పట్టాలి మక్కల్ కట్చి(పీఎంకే) పార్టీని ఓడించాలని డీఎంకే నేత, మంత్రి ఉదయ్‌నిధి స్టాలిన్ అన్నారు. ఆయన సోమవారం ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. నీట్-యూజీ -2024 పరీక్ష పేపర్ లీకేజీ, అక్రమాల విషయంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. అందుకే ఈ ఉపఎన్నికల్లో బీజేపీ మిత్రమైన పక్షమైన పీఎంకే పార్టీని ఓడించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.‘మీరు (ప్రజలు) అంతా ఇప్పటికే అధికార డీఎంకే పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై డీఎంకే బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పింది. దీంతో ఉత్తరాది నేతలు కూడా బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు చేయటం మొదలుపెట్టారు. ఈ సమయంలో బీజేపీ మిత్రపక్షమైన పీఎంకే ఉపఎన్నిక బరిలో నిలిచింది. అందుకే పీఎంకే పార్టీని ఓడించాలని కోరుతున్నా’అని ఉదయ్ నిధి అన్నారు. పరీక్ష పేపర్ లీకైన నేపథ్యంలో జూన్ 28న తమిళనాడు అసెంబ్లీలో నీట్ పరీక్షను రద్దు చేయాలని డీఎంకే ప్రభుత్వం తీర్మానం చేసింది.ఇక.. విక్రవాండీ అసెంబ్లీ డీఎంకే ఎమ్మెల్యే ఎన్. పుగజేంటి అనారోగ్యం కారణాలతో ఏప్రిల్ 6న మృతిచెందగా ఇక్కడ ఉప ఎన్నిక జరగనుంది. ఇక.. ఇక్కడ పోటీ డీఎంకే పార్టీ, పీఎంకే పార్టీకి మధ్య నెలకొంది. డీఎంకే నుంచి అన్నియూర్ శివ, పీఎంకే నుంచి పార్టీ ఉపాధ్యక్షుడు సి అన్బుమణి అభ్యర్థులుగా బరిలో దిగారు. రెండు పార్టీలు వన్నియార్ కమ్యూనిటీకి చెందిన అభ్యర్థులను నిలబెట్టాయి. ఇక్కడ దళిత ఓటర్లు మెజార్టీగా ఉన్నారు. -
నీట్ రద్దు చేయాలంటూ.. తమిళనాడు అసెంబ్లీ తీర్మానం
చెన్నై: వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) పేపర్ లీక్‌పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమతున్న విషయం తెలిసిందే. అటు పార్లమెంట్‌ను సైతం ఈ అంశం కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా నీట్ రద్దు చేయాలంటూ ఏకగ్రీవ తీర్మానాన్ని తమిళనాడు అసెంబ్లీ ఆమోదించింది. నీట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేసింది.నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మెడికల్ కాలేజీలో తమ విద్యార్థులను చేర్చుకోకుండా రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని, నీట్ అమలుకు ముందు మాదిరిగా 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.నీట్ పరీక్ష నిర్వహణపై అనేక రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనలు, పరీక్షపై వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకుని కేంద్రం నీట్‌ను రద్దు చేసేందుకు జాతీయ వైద్య కమిషన్ చట్టాన్ని సముచితంగా సవరించాలని తీర్మానంలో పేర్కొన్నారు.అయితే సభ ఆమోదించినప్పటికీ, దీనిని నిరసిస్తూ బీజేపీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. అనూహ్యంగా దాని మిత్రపక్షం పీఎంకే డీఎంకే తీర్మానానికి మద్దతు ఇచ్చింది.కాగా, నీట్-యూజీ 2024 ఎగ్జామ్ పేపర్ లీక్, నీట్-పీజీ 2024 పరీక్షను ఆకస్మికంగా వాయిదా వేయడంపై అభ్యర్థుల్లో గందరగోళం నెలకొన్నది. ఈ తరుణంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ శుక్రవారం నీట్ రద్దు తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మణితనేయ మక్కల్ కట్చి, మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం, తమిళగ వెట్రి కజగం, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సహా పలు ప్రాంతీయ పార్టీలు ఈ తీర్మానానికి మద్దతు తెలిపాయి. -
డ్రగ్స్‌ను అరికట్టడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైంది: నటుడు విజయ్
చెన్నై: తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్.. డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతోందని, దీనిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విజయ్ ధ్వజమెత్తారు. మాదకద్రవ్యాలను నియంత్రించేందుకు స్టాలిన్ సర్కార్ ఏ ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు.విజయ్ మాట్లాడుతూ.. 'ఇటీవల కాలంలో తమిళనాడు యువతలో డ్రగ్స్ వాడకం ఎక్కువగా ఉంది. ఒక పేరెంట్‌గా, రాజకీయ పార్టీ నాయకుడిగా నేనే దీని గురించి భయపడుతున్నాను. యువతను డ్రగ్స్ నుంచి రక్షించడం ప్రభుత్వ కర్తవ్యం. కానీ ఈ విషయంలో ప్రస్తుత ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాష్ట్రంలో మంచి నాయకులు రావాల్సిన అవసరం ఉందిస అని పేర్కొన్నారు.కాగా స్టాలిన్ ప్రభుత్వంపై విజయ్ నేరుగా విమర్శలు చేయడం ఇదే తొలిసారి. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టాలని యోచిస్తున్న తరుణంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా.. తమిళనాడులోని కళ్లకురిచిలో ఇటీవల కల్తీ సారా తాగడం వల్ల 60 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ మరణాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టి, వారంలోగా వివరణాత్మక నివేదిక ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్‌కు నోటీసులు జారీ చేసింది. నివేదికను దాఖలు చేసేందుకు మద్రాసు హైకోర్టు జూలై 3 వరకు గడువు ఇచ్చింది. -
టైం వచ్చింది.. నా రీఎంట్రీ మొదలైంది: శశికళ
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే రాజకీయాలలో తన ప్రవేశానికి సమయం ఆసన్నమైందని దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ వ్యాఖ్యానించారు. చైన్నెలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. అన్నాడీఎంకే కార్యకర్తల పార్టీ అని అన్నారు. ఈ పార్టీని దివంగత నేతలు ఎంజీఆర్, జయలలిత చెక్కు చెదరకుండా పరిరక్షించారని వివరించారు. అయితే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఆందోళన, మనో వేదనకు గురి చేస్తున్నాయన్నారు. కుల మతాలకు అతీతంగా అన్నాడీఎంకేలో అందర్నీ దివంగత నేత జయలలిత చూసే వారు అని గుర్తుచేశారు. కుల, మతం చూసి ఉంటే తనను దగ్గర చేర్చి ఉంటారా? అని ప్రశ్నించారు. ఆమెకు అందరూ సమానం అని, అందుకే ఆమెను ప్రజలు అమ్మగా కొలుస్తూ వస్తున్నారన్నారు. అయితే ప్రస్తుతం అన్నాడీఎంకేలోకి కులం ప్రవేశించిందని, ఓ సామాజిక వర్గంకు చెందిన వారు వ్యక్తిగత స్వలాభం, ఆధిపత్యం దిశగా చేస్తున్న ప్రయత్నాలు పార్టీని పాతాళంలోకి నెడుతున్నదని ఆరోపించారు. అన్నాడీఎంకే అంటే ఒకే కుటుంబం అని, ఇది కార్యకర్తల పార్టీ అని వ్యాఖ్యలు చేశారు. డీఎంకే అంటే ఒకే కుటుంబం అని ఆ కుటుంబానికి చెందిన వారికే అందులో పదవులు ఉంటాయని విమర్శించారు. డీఎంకే విధానాన్ని అన్నాడీఎంకేలోకి అనుమతించే ప్రసక్తేలేదన్నారు. తన లక్ష్యం ఒక్కటే అని అందర్నీ ఏకం చేయడం అన్నాడీఎంకేను బలోపేతం చేసి రానున్న ఎన్నికలలో విజయంతో అధికారం చేజిక్కించుకోవడమేనని అన్నారు. ఇందుకోసం తన ప్రయత్నం మొదలెట్టానని, తన ప్రవేశానికి సమయం ఆసన్నమైందని, ఇక, మరింత వేగంగా ముందుకెళ్లబోతున్నట్టు శశికళ తెలిపారు. -
‘ఒక్క స్వీట్ బాక్స్‌తో మోదీ ఇమేజ్‌కు రాహుల్ చెక్’
చెన్నై: లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎనిమిదిసార్లు తమిళనాడుకు వచ్చి సాధించుకున్న ఇమేజ్ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక్క స్వీట్ బాక్స్‌తో ముక్కలు చేశాని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. కోయంబత్తూరులో డీఎంకే పార్టీ ఏర్పాటు చేసిన లోక్‌సభ ఎన్నికల ‘విజయ ర్యాలీ’ సభలో ఆయన శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు.‘‘ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో నేను చివరిసారి కోయంబత్తూరు వచ్చినప్పడు నా పర్యటన దేశవ్యాప్తంగా ట్రెండ్ అయింది. మోదీ తమిళనాడకు 8 సార్లు పర్యటించి పొందిన ఇమేజ్ను కోయంబత్తూరులో రాహుల్ గాంధీ నాకు కేవలం ఒక స్వీట్ బ్యాక్స్ ఇచ్చి ముక్కలు చేశారు. నేను కోయంబత్తూరులో ఉన్న సమయంలో తమిళనాడుకు వచ్చిన రాహుల్ నాకు స్వీట్ బాక్స్ ఇచ్చారు. సోదరుడు రాహుల్ గాంధీ నాపై చూపిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోను’’ అని స్టాలిన్ అన్నారు.నరేంద్ర మోదీ బీజేపీ సొంతబలంతో ప్రధానమంత్రి కాలేదని, భాగస్వామ్య పార్టీల సాయంతో ప్రధాని అయ్యారని ఎద్దేవా చేశారు. భాగస్వామ్య పార్టీల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం మోదీ ఫెయిల్యూర్‌కు నిదర్శనం అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి సాధించిన విజయం సాధారణమే అయినప్పటికీ.. మోదీని సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేకుండా చేయటంలో ‘చారిత్రాత్మక విజయం’ గా మారిందని అన్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలో మొత్తం 40 స్థానాల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమి విజయం సాధించిందన్నారు. అయితే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చుతామని చెప్పిందని, ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి 41వ విజయం సాధించిందని తెలిపారు. ఇదే విజయాన్ని 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం రిపీట్ చేస్తామని స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. -
డిప్యూటీ సీఎంల కథ కంచికి
దొడ్డబళ్లాపురం: కులాల ప్రాతిదికన ఉపముఖ్యమంత్రుల సంఖ్యను పెంచాలని ఇన్ని రోజులూ డిమాండు చేస్తున్న పలువురు కాంగ్రెస్ నాయకులు, మంత్రులు లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరువాత మౌనం దాల్చారు. డిప్యూటీ సీఎం పదవులు కావాలని అనేకమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇది ఒక రకంగా పార్టీలో అసమ్మతిని రాజేసింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతుదారులు ఈ డిమాండును తీవ్రంగా వ్యతిరేకించారు. సీఎం సిద్ధరామయ్య మద్దతుదారులైన మంత్రులు రాజన్న, పరమేశ్వర్, సతీష్ జార్కిహొళి, ఎంబీ పాటీల్,ఎమ్మెల్యే బసవరాయరెడ్డి తదితరులు కేబినెట్లో 5 మంది ఉప ముఖ్యమంత్రులను నియమించాలని డిమాండు చేశారు. తద్వారా డీకేశి ఆధిపత్యానికి చెక్ పెట్టాలని భావించారు. ఇది కాంగ్రెస్ నాయకత్వానికి ఇబ్బందిగా మారింది.మంత్రుల జిల్లాల్లో పరాభవంలోక్సభ ఎన్నికల్లో మొత్తం 28 స్థానాలలోకి 17 సీట్లలో కాంగ్రెస్ ఓడిపోవడం తెలిసిందే. అందులోనూ మంత్రుల జిల్లాల్లో కాంగ్రెస్‌కు ఓట్లు పడకపోగా జేడీఎస్, బీజేపీ కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీ సాధించారు. ఇందుకు మంత్రులే బాధ్యత వహించాల్సి ఉంది. ఉదాహరణకు శివమొగ్గలో మంత్రి మధు బంగారప్ప సోదరి గీత, తుమకూరులో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు. దీంతో హోంమంత్రి పరమేశ్వర్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కొందరు మంత్రులపై వేటు పడే అవకాశం లేకపోలేదని వార్తలు వస్తున్నాయి. ఇటీవల బెంగళూరుకు వచ్చిన రాహుల్ గాంధీ కూడా మంత్రుల సొంత జిల్లాల్లో కాంగ్రెస్ మట్టి కరవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.ఆ ఆలోచనే లేదు: హోంమంత్రిఇటీవల ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ వర్కింగ్ కమిటీ సమావేశానికి వెళ్లిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్వయంగా ఖర్గేతో డీసీఎంలు, ఎన్నికల్లో ఓటమి గురించి చర్చించారని తెలిసింది. సోమవారం నాడు మీడియాతో మాట్లాడిన హోంమంత్రి జీ పరమేశ్వర్.. ఉప ముఖ్యమంత్రి పదవుల సంఖ్య పెంచే ఆలోచన పార్టీ హైకమాండ్‌కు లేదని చెప్పారు. ప్రభుత్వం సమర్థవంతంగా నడుస్తోందని, ఇప్పుడు అలాంటి ప్రస్తావనలు లేవని వివాదానికి ముగింపు పలికేలా మాట్లాడారు.ఓటమిపై ఆత్మపరిశీలన: డీకేశివాజీనగర: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ వెనుకంజ కారణాలకు పరిశీలనా కమిటీ ఏర్పాటు గురించి డీసీఎం డీ.కే.శివకుమార్ మాట్లాడుతూ, తమకు ఇది హెచ్చరిక గంట, తాము సరి చేసుకోవాల్సిన అవసరముందని అన్నారు. సోమవారం నగరంలో మీడియాతో మాట్లాడుతూ కమిటీ ఏర్పాటు చేయాలని రాహుల్‌గాంఽధీ సూచించారు, దీనిపై త్వరలోనే బెంగళూరు ఎమ్మెల్యేల సమావేశాన్ని జరుపనున్నట్లు తెలిపారు. ఎక్కడ తప్పు జరిగింది అనేది పరిశీలిస్తామన్నారు. పార్టీ నేతలు ఎవరూ మీడియాతో ఓటమి గురించి మాట్లాడరాదని సూచించాం. మాకు 14 నుంచి 18 సీట్లు రావాల్సింది. అన్ని స్థానాలు రాలేదు. విఫలమయ్యామనేది అంగీకరిస్తాం. కొంతమంది మంత్రుల నియోజకవర్గాల్లో కూడా వెనుకబడ్డాం. ఓటమిపై ఏ మంత్రి ఫిర్యాదు చేయలేదని చెప్పారు. -
Lok sabha elections 2024: ఆ ఏడు స్థానాల్లోబిగ్ ఫైట్
లోక్‌సభ సీట్లపరంగా దక్షిణాదిన అతి పెద్ద రాష్ట్రమైన తమిళనాడులో పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మొత్తం 39 స్థానాలకూ శుక్రవారం తొలి దశలోనే ఎన్నికలు పూర్తవనున్నాయి. ఈ ద్రవిడనాడులో ఎప్పుడూ డీఎంకే, అన్నాడీఎంకే మధ్య ద్విముఖ పోటీయే రివాజు. ఈసారి అన్నాడీఎంకే బలహీనపడిపోగా దాని స్థానాన్ని క్రమంగా బీజేపీ చేజిక్కించుకుంటున్నట్టు కని్పస్తోంది. డీఎంకేకు కమళదళం గట్టి పోటీ ఇస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. సొంతంగా రికార్డు సంఖ్యలో స్థానాలు గెలిచినా ఆశ్చర్యం లేదంటున్నారు. అంతేగాక చాలా స్థానాల్లో డీఎంకే భాగ్యరేఖలను బీజేపీ మార్చేసేలా కని్పస్తోందని సమాచారం. గత లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ కూటమి ఏకంగా 38 సీట్లు కైవసం చేసుకుంది. ఈ విడత వాటికి సీట్లు బాగా తగ్గుతాయని అంచనా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పాదయాత్రతో బీజేపీకి తమిళనాట సానుకూల వాతావరణం ఏర్పడినట్టు కనిపిస్తోంది. దీంతో బీజేపీ ఓటు బ్యాంక్ ఏకంగా రెండంకెలకు చేరుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు హాట్ సీట్లలో పోటీ మరింత రసవత్తరంగా మారింది... కోయంబత్తూర్ బీజేపీ గెలుపుపై గట్టిగా నమ్మకం పెట్టుకున్న స్థానాల్లో ఇదొకటి. అన్నామలై ఇక్కడ పోటీలో నిలిచారు. తాను గెలిస్తే నియోజకవర్గంలో ఐఐఎంతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) శాఖలను ఏర్పాటు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. దివంగత సీఎం కె.కామరాజ్ పేరిట 24 గంటలూ మొబైల్ ఆహారశాలలు అందుబాటులో ఉండేలా చూస్తామన్నది బీజేపీ హామీల్లో మరొకటి. ఇక్కడ 1999లో బీజేపీ తరఫున సి.పి.రాధాకృష్ణన్ విజయం సాధించారు. తర్వాత డీఎంకే మిత్రపక్షాలైన సీపీఐ, సీపీఎం గెలుస్తూ వస్తున్నాయి. 2014లో మాత్రం అన్నాడీఎంకే అభ్యర్థి పి.నాగరాజన్ నెగ్గారు. అయితే గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ ఇక్కడ రెండో స్థానంలో ఉండటం విశేషం. ఈసారి మోదీ మేనియాకు అన్నామలై పాపులారిటీ తోడై బీజేపీ గెలుస్తుందన్న అంచనాలున్నాయి. డీఎంకే నుంచి పి.రాజ్‌కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ పోటీలో ఉన్నారు. తూత్తుకుడి ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. డీఎంకే తరఫున సిట్టింగ్ ఎంపీ, దివంగత సీఎం కరుణానిధి కూతురు, సీఎం స్టాలిన్ సోదరి కనిమొళి మరోసారి బరిలోకి దిగారు. ఎన్డీఏ భాగస్వామి తమిళ మానిల కాంగ్రెస్ (మూపనార్) నుంచి విజయశీలన్, అన్నాడీఎంకే నుంచి ఆర్.శివస్వామి వేలుమణి బరిలో ఉన్నారు. కనిమొళి 2019లో వేలుమణిపై ఏకంగా 3.47 లక్షల మెజారిటీతో ఘనవిజయం సాధించడం విశేషం. అయితే వేలుమణి స్థానికంగా బాగా పట్టున్న నేత. పుత్తూర్ బోన్ అండ్ జాయింట్ సెంటర్ అధినేత. చారిత్రకంగా ఇక్కడి నుంచి డీఎంకే లేదంటే అన్నాడీఎంకే గెలుస్తూ వస్తున్నాయి. ఈసారి మాత్రం స్థానిక అంశాలను బాగా ప్రస్తావిస్తూ విజయశీలన్ ఓటర్లకు దగ్గర అవుతున్నారు. బీజేపీ దన్ను కూడా ఆయనకు బాగానే కలిసొస్తోంది. ఈసారి సౌత్ నుంచి బీజేపీ నుంచి పోటీ చేస్తున్న తమిళసై సౌందరరాజన్ 2019 తూత్తుకుడిలో 2,15,934 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలవడం విశేషం! చెన్నై సౌత్ ఈ ఎన్నికల ముందు దాకా తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ హుటాహుటిన రాజీనామా చేసి చెన్నై సౌత్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు. బీజేపీ నేతగానే గాక డాక్టర్‌గా కూడా ఈ నియోజకవర్గానికి ఆమె చిరపరిచితులే. దీనికి తోడు ఇక్కడ బ్రాహ్మణ ఓటర్లు బాగా ఉండడం ఆమెకు మరింత కలిసొచ్చే అంశం. 2019లో ఇక్కడ డీఎంకే తరఫున తమిళాచి తంగపాండియన్ 2.62 లక్షల ఓట్ల మెజారిటీతో అన్నాడీఎంకే అభ్యర్థి జయవర్ధన్‌పై గెలిచారు. ఆమె మాజీ మంత్రి తంగపాండియన్ కుమార్తె కావడంతో తమ సంస్థాగత బలంతో మరోసారి గెలుపు తమదేనన్న ధీమాతో డీఎంకే ఉంది. ఇక్కడ కూడా త్రిముఖ పోటీ ఉంది. నీలగిరీస్ ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. డీఎంకే నేత ఎ.రాజా ఇక్కడ బలమైన నేతగా ఉన్నారు. 2009, 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 2019లోనైతే ఏకంగా 5.47 లక్షల ఓట్లు (54.2 శాతం) సొంతం చేసుకున్నారు! అయితే యూపీఏ హయాంలో కేంద్ర మంత్రిగా 2జీ కుంభకోణం ఆరోపణల దెబ్బకు 2014 ఎన్నికల్లో ఇక్కడ ఆయన ఓటమి చవిచూశారు. గత రెండు ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ పోటీ చేయలేదు. ఈ విడత కేంద్ర మత్స్య శాఖ మంత్రి ఎల్.మురుగన్‌ను బరిలో దింపింది. ఈ నియోజకవర్గంలో బడగాస్ సామాజికవర్గ ప్రాబల్యం ఎక్కువ. సనాతన ధర్మాన్ని హేళన చేస్తూ రాజా చేసిన వ్యాఖ్యలు వారిలో తీవ్ర ఆగ్రహం కలిగించాయి. దాంతో ఈసారి రాజా గెలుపు సులభం కాదన్నది విశ్లేషకుల అంచనా. కృష్ణగిరి ఒకప్పుడు మూడు రాష్ట్రాల పోలీసులను గజగజలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ పెద్ద కుమార్తె విద్యారాణి వీరప్పన్ బరిలో దిగడంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది. వృత్తిరీత్యా ఆమె న్యాయవాది అయిన ఆమె నామ్ తమిళార్ కచ్చి (ఎన్టీకే) పార్టీ తరఫున తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. విద్యారాణి 2020లో బీజేపీలో చేరి పార్టీ యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా చేశారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి కె.గోపీనాథ్, అన్నాడీఎంకే నుంచి వి.జయప్రకాశ్, బీజేపీ నుంచి సి.నరసింహన్ పోటీలో ఉన్నారు. 2019లో కాంగ్రెస్ తరఫున ఎ.చెల్లకుమార్ ఘన విజయం సాధించారు. 1991 దాకా ఇక్కడ కాంగ్రెస్ హవాయే నడిచింది. తర్వాత ప్రధానంగా డీఎంకే, అన్నాడీఎంకే పోటీ ఉండేది. ఈ విడత కాంగ్రెస్ సిటింగ్ ఎంపీని మార్చడం, వీరప్పన్ కుమార్తె బరిలో ఉండటం పోటీపై ఆసక్తిని పెంచింది. రామనాథపురం ఏకంగా మూడుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా (రెండుసార్లు జయలలిత న్యాయ సమస్యల్లో చిక్కినప్పుడు, మూడోసారి ఆమె మరణానంతరం) పనిచేసిన ఒ.పన్నీర్‌సెల్వం రాజకీయ భవిష్యత్ ఇప్పుడు రామనాథపురం ఓటర్ల చేతిలో ఉంది. జయలలితకు అత్యంత విశ్వాసపాత్రుడైన ఆయనను అంతా ఓపీఎస్ అని పిలుచుకుంటారు. జయ మరణానంతరం అన్నాడీఎంకే ఆయన్ను బయటకు పంపేసింది. దాంతో ఓపీఎస్ ఈసారి బీజేపీ మద్దతుతో రామనాథపురం నుంచి పోటీలో ఉన్నారు. దీనికి తోడు ఇక్కడి కుల సమీకరణాలు కూడా ఓపీఎస్‌కు బాగా అనుకూలంగా ఉన్నాయి. సిట్టింగ్ ఎంపీ కె.నవాన్ ఖని (ఐయూఎంఎల్) ఓపీఎస్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. మత్య్సకారుల సమస్య ఇక్కడ ప్రధానాంశం. ఈ నేపథ్యంలో కచ్చతీవు దీవి అంశాన్ని బీజేపీ ఇటీవల ప్రముఖంగా ప్రస్తావిస్తుండడం ఓపీఎస్‌కు మరింత కలిసొస్తుందని భావిస్తున్నారు. తేని జయలలిత తర్వాత అన్నాడీఎంకే సారథి కావాలన్న శశికళ కల కూడా నెరవేరకపోయినా ఆమె వారసుడైన టీటీవీ దినకరన్ తేని లోక్‌సభ స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఆయన అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు ఓపీఎస్ దన్నుంది. వీరిద్దరూ ఒకే కులానికి చెందినవారు. ఒకరి విజయానికి ఒకరు సంపూర్ణంగా సహకరించుకుంటున్నారు. వీరిద్దరికీ బీజేపీ మద్దతిస్తోంది. పైగా తేని సిట్టింగ్ ఎంపీ పి.రవీంద్రనాథ్ పన్నీర్‌సెల్వం కుమారుడే. తండ్రి ఆదేశాల మేరకు ఆయన కూడా దినకరన్ విజయానికి పూర్తిగా సహకరిస్తున్నారు. దీనికి తోడు ఓపీఎస్ స్వస్థలం తేని జిల్లాయే. దాంతో ఇక్కడ ఆయనకున్న పట్టు దినకరన్‌కు మరింత కలిసొస్తుందని భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై కేసు నమోదు..
చెన్నై: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలైపై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు అతిక్రమించారన్న ఆరోపణలపై కోయంబత్తూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటలలోగా ప్రచారం ముగించాల్సి ఉంటుంది. అయితే అవరంపాళ్యంలో రాత్రి పది గంటల తరువాత ఎన్నికల ప్రచారం చేశారంటూ దాఖలైన ఫిర్యాదుపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్లు 143, 341 290 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. అనుమతించిన సమయం కన్నా ఎక్కువ సేపు ప్రచారం చేయడంపై డీఎంకే, లెఫ్ట్ పార్టీలు అభ్యంతరం తెలపడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో డీఎంకే కార్యకర్తలపై దాడి జరిగిందనే ఆరోపణలపై బీజేపీపై మరో కేసు నమోదైంది. డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ మాట్లాడుతూ.. ఓటమి భయంతో అన్నామలై తీవ్రవాదాన్ని, అల్లర్లను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అహంకారం గురించి మాట్లాడే ప్రధాని అన్నామలైకి జ్ఞానోదయం ఇవ్వాలని సెటౌర్లు వేశారు. అయితే డీఎంకే ఆరోపణలపై స్పందించన అన్నామలై ధీటుగా బదులిచ్చారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. రాత్రి 10 గంటల తర్వాత ప్రజలను కలిసే హక్కు నాకు ఉంది. ఏ ఎన్నికల సంఘం దీన్ని ఆపుతుందని ప్రశ్నించారు. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఉంటే దానిని తనకు చూపించాలని అన్నారు. కాగా కోయంబత్తూరులో బీజేపీ తరపున అన్నామలై ఎంపీగా పోటీచేస్తుండగా. అధికార డీఎంకే గణపతి రాజ్‌కుమార్‌ను, అన్నాడీఎంకే సింగై రామచంద్రన్‌ను బరిలోకి దింపింది. అయితే కోయంబత్తూరు అన్నాడీఎంకే కంచుకోట అయినప్పటికీ.. 2019 ఎన్నికల్లో సీపీఎం ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని 39 స్థానాల్లో 38 చోట్ల డీఎంకే కూటమి విజయ బావుటాను ఎగరవేసింది. చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ హై టెన్షన్.. భారతీయులకు కేంద్రం అలర్ట్ -
అవినీతి యూనివర్సిటి ఛాన్సలర్ మోదీ : సీఎం స్టాలిన్
చెన్నై: డీఎంకేని అవినీతి పార్టీ అన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కౌంటర్ ఇచ్చారు. అవినీతి అనే ఓ యూనివర్సిటీ ఉంటే దానికి ప్రధాని నరేంద్ర మోదీ ఛాన్సలర్ అవుతారని అని సెటైర్లు వేశారు. ‘అవినీతి పేరుతో ఓ విశ్వవిద్యాలయం స్థాపిస్తే.. ఆ యూనివర్సిటీకి ప్రధాన మంత్రి మోదీ ఛాన్సలర్ అవుతారు. ఛాన్సలర్ కావడానికి ప్రధాని మోదీకి అన్ని అర్హతలు ఉన్నాయి. బీజేపీనే దేశంలో అతిపెద్ద అవినీతీ పార్టీ. దానికి ఉదాహారణ.. ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం. అది ఒక్కటే కాదు.. పీఎం కేర్స్ ఫండ్, కేసుల్లో ఇరుకున్న ఇతర పార్టీ నేతలు బీజేపీలో చేరిన తర్వాత విచారణ ఉండకపోవటం. అసలు అవినీతితో కూడిన పార్టీ బీజేపీ’ అని సీఎం ఎంకే స్టాలిన్ విమర్శలు చేశారు. ఇక.. బుధవారం తమిళనాడులోని వెల్లూరులో బీజేపీ ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ.. అధికార డీఎంకే ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. డీఎంకే అవినీతి పార్టీ అని మండిపడ్డారు. ‘అవినీతికి మొదటి కాపీ రైట్ డీఎంకేకు చెందుతుంది. ఎంకే స్టాలిన్ కుటుంబం మొత్తం తమిళనాడును దోచుకుంది. తమిళనాడు ప్రజలను అవినీతి కుటుంబ పాలన కొనసాగించే డీఎంకే తమ ట్రాప్‌లో పడిపోయారు. డీఎంకే పార్టీ తమిళ సంస్కృతి, సాంప్రదాయానికి వ్యవతిరేకంగా ఉంది. సీఎం స్టాలిన్ వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకున్నారు’ అని మోదీ విమర్శలు చేశారు. -
PM Narendra Modi: అవినీతికి మారుపేరు డీఎంకే
వెల్లూరు: తమిళనాడులో అధికార డీఎంకేపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. డీఎంకే అవినీతికి మారుపేరుగా మారిపోయిందని, రాష్ట్రాభివృద్ధిని ఏమా త్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. విద్వేష, విభజన రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. బుధవారం తమిళనాడులోని వెల్లూరు, మెట్టుపాళ్యంలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో డీఎంకే ముమ్మాటికీ కుటుంబ పారీ్టలేనని అన్నారు. అవినీతిపై మొదటి పేటెంట్ హక్కు డీఎంకేకు ఉందని ఎద్దేవా చేశారు. ఒక కుటుంబం రాష్ట్రాన్ని విచ్చలవిడిగా లూటీ చేస్తోందని ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబంపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యామిలీ కంపెనీ అయిన డీఎంకే పాతకాలపు ఆలోచనా ధోరణితో రాష్ట్రంలో యువత ఎదుగుదలను అడ్డుకుంటోందని విమర్శించారు. భాష, కులం, మతం, విశ్వాసం పేరిట ప్రజల్లో విభజనను సృష్టిస్తోందని డీఎంకేపై మండిపడ్డారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంతో దేశం ముందడుగు వేస్తుండగా, పెట్టుబడులను అడ్డుకొనేవారితో డీఎంకే అంటకాగుతోందని ఆరోపించారు. కచ్చతీవు అప్పగింత వల్ల లాభపడిందెవరు? తమిళనాడులో డీఎంకే తరహాలోనే దేశంలో కాంగ్రెస్ పార్టీ వివక్ష, విభజన అనే ప్రమాదకరమైన ఆట ఆడుతోందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. విపక్ష ‘ఇండియా’ కూటమిలోని బాగస్వామ్యపక్షాలకు బుజ్జగింపు రాజకీయాలు తప్ప అభివృద్ధి అంటే ఏమిటో తెలియని వ్యంగ్యా్రస్తాలు విసిరారు. అవినీతిపరులను కాపాడాలని కాంగ్రెస్, డీఎంకే ఆరాటపడుతున్నాయని విమర్శించారు. వారసత్వ పార్టీలకు సొంత కుటుంబ సభ్యులు, వారసులు తప్ప ఇతరుల సంక్షేమం పట్టదని అన్నారు. గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును తాము రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో దింపితే వారసత్వ పారీ్టలు వ్యతిరేకించాయని గుర్తుచేశారు. మన దేశంలో అందర్భాగమైన కచ్చతీవును 1974లో అన్యాయంగా శ్రీలంకకు అప్పగించారని ప్రధానమంత్రి ధ్వజమెత్తారు. అప్పట్లో కేంద్రంలో కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉన్నాయని వివరించారు. కచ్చతీవు అప్పగింతపై ఏ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు. అంబేడ్కర్ ఆత్మ ఆశీస్సులు ఉన్నాయి.. నాగపూర్: ఆరి్టకల్ 370 రద్దుతో తనకు అంబేడ్కర్ ఆత్మ ఆశీస్సులు లభిస్తున్నాయని మోదీ చెప్పారు. ప్రతిపక్షాల ఆరోపణలు, దూషణలతో తనకు మేలు జరుగుతుందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిచే సీట్లు మరిన్ని పెరుగుతాయని అన్నారు. ఆయన బుధవారం మహారాష్ట్రలో నాగపూర్ జిల్లాలోని కన్హాన్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. మోదీ మూడోసారి గెలిస్తే దేశంలో రాజ్యాంగ, ప్రజాస్వామ్యం ఉండబోవంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. -
తమిళనాట మోదీ సంచలన ప్రకటన.. డిఫెన్స్‌లో డీఎంకే!
సాక్షి, చెన్నై: లోక్‌సభ ఎన్నికల వేళ తమిళనాడులో ప్రజలకు ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. శ్రీలంకలో అరెస్ట్ అయిన మత్స్యకారులను క్షేమంగా భారత్‌కు తీసుకువస్తామని మోదీ హామీ ఇచ్చారు. ఇదే సమయంలో తమిళ సంస్కృతికి డీఎంకే వ్యతిరేకి అంటూ సంచలన కామెంట్స్ చేశారు. కాగా, ప్రధాని మోదీ తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేలూరులో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. ఈరోజు దేశం మొత్తం కాంగ్రెస్, డీఎంకే పార్టీల మరో కపట నాటకం గురించి చర్చిస్తోంది. కాంగ్రెస్ హయాంలోనే కచ్చాతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించారు. ఎవరి ప్రయోజనం కోసం కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది. ఏ కేబినెట్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. #WATCH | Tamil Nadu: Addressing a public rally in Vellore, PM Narendra Modi says, "Today the whole country is discussing another hypocrisy of Congress and the DMK party. When Congress was in government, these people gave Kachchatheevu Island to Sri Lanka. In which cabinet was… pic.twitter.com/Gr004Zxmea — ANI (@ANI) April 10, 2024 కచ్చాతీవు ద్వీపం వద్దకు వెళ్లిన వేలాది మంది తమిళనాడు మృత్స్యకారులను శ్రీలంక కోస్టల్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరి అరెస్ట్‌పై కాంగ్రెస్ ఎందుకు మౌనం వహించింది. కానీ, బీజేపీ ప్రభుత్వం మాత్రం అరెస్ట్ అయిన మత్స్యకారులను క్షేమంగా వెనక్కి తీసుకువస్తుంది. అదొక్కటే కాదు మరణ శిక్షలు విధింపబడిన వారిని కూడా సజీవంగా వెనక్కి తీసుకువస్తున్నాం. వారిని వారి వారి కుటుంబాలకు అప్పగించే బాధ్యత బీజేపీది అని వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో అధికార డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తమిళ సంస్కృతికి డీఎంకే వ్యతిరేకి. డీఎంకేది విభజన రాజకీయం. తమిళులను చీకట్లో ఉంచేసింది. అవినీతి చేయడానికి డీఎంకే కాపీరైట్ తీసుకుంది. కుటుంబం మొత్తం తమిళనాడును దోచుకుంటోంది. తమిళనాడులో బీజేపీ చరిత్ర సృష్టించబోతోంది. రానున్న ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీ గెలవబోతోంది అంటూ కామెంట్స్ చేశారు. -
అన్నామలై Vs కమల్: తమిళనాట రసవత్తర రాజకీయం
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక, తాజాగా అన్నామలై, కమల్ హాసన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో అన్నామలై.. కమల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ.. దేశ రాజధాని మార్పు అంటూ ఎవరైనా ఇలాంటి ఆరోపణలు చేస్తే వారిని వెంటనే మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలి. వారి మెదడుకు సరిగా పనిచేస్తుందో లేదో పరీక్షలు చేయాలి. మానసిక వైద్యుడి వద్దకు వెళ్లి కమల్ సలహాలు తీసుకుకోవాలి. దేశ రాజధానిని నాగ్‌పూర్‌కు ఎలా మారుస్తారు? అని ప్రశ్నించారు. అయితే, చెన్నైని దేశానికి వేసవి లేదా శీతాకాల రాజధానిగా చేయాలని కమల్ పేర్కొన్నట్లయితే నేను దానిని అంగీకరిస్తాను అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో డీఎంకే నుంచి రాజ్యసభ ఎంపీ కావాలనే ఉద్దేశ్యంతోనే కమల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, అన్నామలై వ్యాఖ్యలపై కమల్ హాసన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Kamal Haasan: If BJP wins elections, they will change India's capital to Nagpur. Annamalai: Kamal Haasan should get his brain checked. pic.twitter.com/uGHpXGKpzC — Megh Updates 🚨™ (@MeghUpdates) April 9, 2024 కాగా, ఎన్నికల సందర్భంగా డీఎంకే-ఎంఎన్ఎం కూటమిలో భాగంగా కమల్ హసన్.. అభ్యర్థి కళానిధి వీరాస్వా మికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తే నాగ్‌పూర్‌ను భారత్‌కు కొత్త రాజధానిగా చేస్తుందన్నారు. బీజేపీ నేతలు, ఆదాయపు పన్ను శాఖ ద్వారా ప్రతిపక్షాలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అలాగే, జాతీయ జెండాను కూడా త్రివర్ణ పతాకం నుంచి ఒకే రంగు ఉన్న జెండా(బీజేపీ జెండా)కు మార్చాలని ప్రయత్నిస్తున్నారన్నారు. ఇదే సమయంలో గుజరాత్ మోడల్‌పై కూడా కమల్ విమర్శలు చేశారు. ప్రజలు ఎప్పుడూ గుజరాత్ మోడల్‌ను కోరుకోలేదు. గొప్పదని చెప్పలేదు. గుజరాత్ మోడల్ కన్నా ద్రవిడ మోడల్ ఎంతో గొప్పది. ఆ మోడల్‌నే మేము అనుసరిస్తాము. బీజేపీ నేతలు ద్రవిడ మోడల్‌ను విస్మరిస్తున్నారు అని కామెంట్స్ చేశారు. -
మోదీ మాత్రమే ఉంటారు.. బీజేపీ కాదు: సీఎం స్టాలిన్
చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చి నరేంద్ర మోదీ మరోసారి ప్రధానమంత్రి అయితే దేశం మరోసారి సార్వత్రిక ఎన్నికలను చూడబోదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. భారత్‌లో ఉన్న ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా మార్చివేసి.. నిరంకుశత్వాన్ని తీసుకువస్తారని ప్రధాని మోదీపై ధ్వజమేత్తారు. డీఎంకే అధినేత స్టాలిన్ ఓ జాతీయా మీడియా ఇంటర్య్వూలో పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు. ప్రస్తుతం జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో దేశం నిరంకుశ రాజ్యంగా మారకుండా అడ్డుకోవటమే తమ పార్టీ ప్రధానాంశమని తెలిపారు. నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలో వస్తే.. బీజేపీకి కూడా ఎంటువంటి లబ్ధి జరగదన్నారు. నెమ్మదిగా బీజేపీ పార్టీ తన ఉనికి కోల్పోతుందన్నారు. కేవలం నరేంద్ర మోదీ మాత్రమే మిగులుతారని అన్నారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో చేస్తున్న ఎన్నికల ప్రచారంపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఉత్తర భారతదేశంలో కూడా బీజేపీ ప్రభావం తగ్గుతోందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రజలు బీజేపీకి ఈసారి ఎన్నికల్లో కూడా ఓట్లు వేయరని స్పష్టం చేశారు. ఇండియా కూటమిలో ప్రధాన మంత్రి అభ్యర్థి ఎన్నికల ఫలితాల అనంతరమే తెరమీదకు వస్తారని తెలిపారు. గతంలో మన్మోహన్ సింగ్ మాదిరిగానే ఎన్నికల ఫలితాలు వెలువడగానే పీఎం అభ్యర్థిని కూటమి ప్రకటింస్తుందని తెలిపారు. ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థులుగా సమర్థులైన, అనుభవం గల నేతలు చాలా మంది ఉన్నారని గుర్తుచేశారు. కచ్చతీవు ద్వీపం వ్యవహారంపై మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శ్రీలంకను చాలా సార్లు సందర్శించారు. ఎందుకు ఒక్కసారి కూడా కచ్చతీవు ద్వీపం గురించి ప్రస్తావించలేదని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల వేళ కచ్చతీవు ద్వీపం వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోదీ ముసలి కన్నీరు కారుస్తున్నారని సీఎం స్టాలిన్ మండిపడ్డారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే కూటమి 38 సీట్లతో పోటి చేయగా 23 స్థానాల్లో గెలుపొందింది. అందులో కాంగ్రెస్ పార్టీ 8 సిట్లలో విజయం సాధించింది. సీపీఐ రెండు స్థానాల్లో గెలుపొందింది. ఇక.. 39 స్థానాలు ఉన్న తమిళనాడులో ఒకే దశలో ఏప్రిల్ 19న పోలింగ్ జరనుంది. ఫలితాలు జూన్4న వెలువడనున్నాయి. -
త్రిముఖ పోరు : తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై గెలిచేనా?
చెన్నై : దక్షిణ చెన్నై పార్లమెంట్లో త్రిముఖ పోరు సాగుతోంది. గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేసుకుంటూ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. పార్లమెంట్ స్థానం అధికార పార్టీ డీఎంకేకి కంచుకోటే అయినప్పటికీ అక్కడ హోరాహోరీ పోరు కొనసాగనుంది. అయితే ఈ త్రిముఖ పోరులో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విజయం సాధిస్తారా? తమిళనాడులో దక్షిణ చెన్నై లోక్‌సభ స్థానం హాట్‌సీట్ మారింది. డీఎంకే కంచుకోటలో త్రిముఖపోరు జరగబోతుంది. ప్రస్తుత డీఎంకే సిట్టింగ్ అభ్యర్ధి తమిళచి తంగపాండియన్‌పై తమిళనాడు మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్, ఏఐఏడీఎంకే తరుపున జే. జయవర్ధన్ తలపడనున్నారు. గవర్నర్ పదవినే వదులుకున్నా ఈ తరుణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళసై సౌందరరాజన్ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో తమిళసై మాట్లాడుతూ.. ‘ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధిస్తాననే నమ్మకం నాకుంది. గెలిచిన వెంటనే దక్షిణ చెన్నైలో మంచి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నియోజకవర్గంతో నాకు ఎనలేని అనుంబంధం ఉంది. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు గవర్నర్ పదవిని సైతం వదులుకున్నట్లు తెలిపారు. నియోజకవర్గానికి రోగ నిరోధక శక్తి పెరగాలి తమిళసై స్వతహాగా వైద్యురాలు కావడంతో ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం దక్షిణ చెన్నైకి ఎలాంటి మందులు ఇస్తారంటూ మీడియా అడిగిన ప్రశ్నలకు నియోజకవర్గం మొత్తం చెత్త, డంపింగ్ యార్డులతో నిండిపోయింది. ముందు నియోజకవర్గానికి రోగనిరోధక శక్తి పెరగాలి. ఆపై రవాణా, పరిశుభ్రత, దోమల బెడదపై దృష్టి సారిస్తామని సూచించారు. వారిదే కీలకం ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే)తో సైతం పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటి చేస్తుంది. తమిళనాడులోని ఉత్తర ప్రాంతంలో పీఎంకే ప్రాభవం ఎక్కువగా ఉంది. ఇక్కడ అత్యంత వెనుకబడిన తరగతులకు (ఎంబీసీలు) చెందిన వన్నియార్లు ఎక్కువ శాతం నియోజకవర్గాల్లో ఆయా పార్టీల అభ్యర్ధుల గెలుపు, ఓటుముల్ని నిర్ధేశించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరి ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాల్సి ఉంది. -
చిరుదీవిలో ఎన్నికల చేపలవేట
ఎన్నికలంటే సాధారణంగా ఉద్యోగాలు, ద్రవ్యోల్బణం లాంటివి ప్రస్తావనకొస్తాయి. కానీ, మూడు రోజులుగా ఓ విదేశాంగ విధానం ప్రధానాంశమై కూర్చుంది. లోక్‌సభ ఎన్నికల తొలి దశలోనే తమిళనాట పోలింగ్ జరగనున్న వేళ ఆ రాష్ట్రానికి అతి సమీపంగా భారత – శ్రీలంకల మధ్యనున్న చిరుద్వీపం కచ్చతీవు ఇప్పుడు వార్తల్లో నిలిచింది. స్టాలిన్ సారథ్యంలోని స్థానిక డీఎంకె ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రధాని, విదేశాంగ మంత్రి సహా సమస్త శక్తులనూ బీజేపీ కేంద్రీకరించినట్టు కనిపిస్తోంది. ఎన్నికల మాట అటుంచితే, భారత సర్కారే ఒకప్పుడు శ్రీలంకకు అప్పగించిన ఓ ద్వీపప్రాంత ప్రాదేశిక హక్కులపై ఇప్పుడు రగడ చేయడం సబబేనా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా సముద్ర జలాల సరిహద్దులు మార్చేసే ప్రయత్నాలు ఎక్కడికి దారి తీస్తాయి? భారత్ – శ్రీలంకల మధ్య పాక్ జలసంధిలో 1.6 కిలోమీటర్ల పొడవు, 300 మీటర్ల వెడల్పున్న చిన్న ప్రాంతం కచ్చతీవు. భారత్‌లోని రామేశ్వరానికి ఉత్తరాన 30 కి.మీ.ల దూరంలో, శ్రీలంకలోని జాఫ్నాకు దక్షిణాన 60 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ద్వీపం వ్యూహాత్మకంగా కీలకమైనది. కచ్చతీవు చారిత్రకంగా జాఫ్నా రాజ్యంలో, ఆపైన రామ్నాడ్ సహా పలువురు రాజుల ఏలుబడిలో, బ్రిటీష్ వారి హయాంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేది. తాగునీటితో సహా ప్రాథమిక వసతులేవీ లేని ఈ ప్రాంతంలో ఒకే ఒక్క చర్చి మినహా నివాసాలే లేవు. ఈ ద్వీపం తాలూకు ప్రాదేశిక హోదాపై భారత్, శ్రీలంకల మధ్య దీర్ఘకాలం వివాదం నెలకొంది. అయితే, 1974లో ఇరుదేశాలూ ఓ ఒప్పందానికి వచ్చి, సంతకాలు చేశాయి. శ్రీలంకతో పటిష్ఠ బంధానికై కేంద్రంలో ఇందిరా గాంధీ సారథ్యంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చిరుద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించింది. ఇప్పుడు యాభై ఏళ్ళ తర్వాత మోదీ నేతృత్వంలోని బీజేపీ భారత సమైక్యతకు విఘాతం కలిగిస్తూ కాంగ్రెస్, డీఎంకెలు ‘నిర్లక్ష్యంగా’ ఆ ద్వీపాన్ని శ్రీలంకకు ధారాదత్తం చేసేశాయంటూ దాడికి దిగింది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఇటీవల ‘సమాచార హక్కు’ పిటిషన్ ద్వారా ఇప్పటి దాకా బయటపడని ఈ ద్వీపం అప్పగింత వివరాలను తీసుకున్నారు. అవన్నీ మీడియాలో వచ్చాయి. దక్షిణాదిన, అందునా తమిళనాట బీజేపీ జెండా ఎగరేయాలని తరచూ పర్యటిస్తున్న ప్రధాని మోదీ దాన్ని అందిపుచ్చుకొన్నారు. ద్వీపం అప్పగింత తప్పుడు నిర్ణయమంటూ కాంగ్రెస్‌ను దుయ్య బట్టారు. విదేశాంగ మంత్రి జైశంకర్ స్వరం కలిపారు. సమీప శ్రీలంక జలాల్లో భారతీయ జాలర్లను పదే పదే అరెస్టు చేస్తున్నారంటే, అదంతా అప్పటి తప్పుడు నిర్ణయం ఫలితమేనని ఆయన ఆరోపణ. ఈ చిరుద్వీపానికి తన దృష్టిలో పెద్దగా ప్రాధాన్యం లేదని 1961 మేలోనే ప్రధాని నెహ్రూ అన్నారట. ద్వీపాన్ని అప్పగించినా చేపలు పట్టుకొనేందుకు భారతీయులకున్న హక్కుల్ని 1974 ఒప్పందంలో పరిరక్షిస్తున్నామంటూ పార్లమెంట్‌కు హామీ ఇచ్చిన నాటి సర్కార్ తీరా ఆ ప్రాంతంలో చేపలు పట్టే హక్కులను సైతం 1976లో వదులుకుందని జైశంకర్ నిందిస్తున్నారు. గత ప్రధానులు ఈ అంశంపై ఉదాసీనంగా ఉన్నా, భారత – శ్రీలంక సముద్రజలాల సరిహద్దు చట్టం అమలు, భారతీయ జాలర్ల హక్కులపై తమ సర్కార్ శ్రీలంకతో చర్చలు జరుపుతుందని ఆయన చెబుతున్నారు. గమ్మత్తేమిటంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న కమలనాథులు గత పదేళ్ళుగా ఆ పని ఎందుకు చేయలేదో తెలీదు. అలాగే, ఆ ద్వీపాన్ని తిరిగి స్వాధీనం చేసుకొనే పనిలో మోదీ సర్కార్ ఉన్నట్టు తమిళనాడు బీజేపీ చెబుతోంది కానీ, అసలు ఇప్పటి దాకా ఆ అంశంపై మోదీ సర్కార్ నుంచి అధికా రిక సమాచారమే లేదని శ్రీలంక మంత్రి ఒకరు తేల్చేశారు. మరి, కచ్చతీవు అంశాన్ని బీజేపీ ఉన్న ట్టుండి ఎందుకు లేవదీసినట్టు? లోక్‌సభ ఎన్నికల తొలి దశలో భాగంగా ఈ నెల 19న తమిళనాట పోలింగ్ జరగనుంది. ప్రాంతీయ, భాషాభిమానాలు మెండుగా ఉండే తమిళనాట చొచ్చుకుపోవడా నికి తంటాలు పడుతున్న బీజేపీ దీన్ని ఓ అస్త్రంగా భావించింది. కేంద్రంలోని కాంగ్రెస్ సర్కార్ ఆ ద్వీపాన్ని ఇచ్చేస్తుంటే, అడ్డుకోని కరుణానిధి సారథ్యంలోని డీఎంకె సర్కార్‌దీ తప్పుందని బీజేపీ నిందిస్తోంది. తమిళ ఓటర్లలో సెంటిమెంట్ రగిల్చి లబ్ధి పొందడమే దాని అజెండాగా కనిపిస్తోంది. నిజానికి, ఎవరు సలహా ఇచ్చారో కానీ ఆ దీవిని శ్రీలంకకు ఇచ్చేశాం. దీవి అప్పగింత విషయం అంతర్జాతీయ వ్యవహారం గనక అప్పట్లో కేంద్రం తమిళ సర్కార్‌కు సమాచారమిచ్చి ఉంటుందే తప్ప, సరేనన్న అనుమతి తీసుకొని ఉంటుందనుకోలేం. స్థానిక అనివార్యతల రీత్యా అప్పటి కరుణానిధి సర్కార్ నుంచి ఇప్పటి స్టాలిన్ సర్కార్ దాకా డీఎంకె ప్రభుత్వాలు శ్రీలంకతో ఒప్పందాన్ని నిరసిస్తూనే వచ్చాయి. చేపల వేటకు వెళ్ళే తమిళ జాలర్లు పదే పదే లంకేయుల చేతిలో అరెస్టవుతున్నారని చెబుతూనే ఉన్నాయి. ఆ మధ్య భారత – శ్రీలంక ప్రధానుల భేటీ ముందూ స్టాలిన్ ఈ సంగతి మోదీ దృష్టికి తెచ్చారు. అవేవీ పట్టించుకోని బీజేపీ ఎన్నికల ముందు ఈ అంశం పట్టుకోవడమే విడ్డూరం. ద్వైపాక్షిక బంధాలపై ప్రభావం చూపే సున్నితమైన అంశాన్ని ఎన్నికల లబ్ధి కోసం తలకెత్తుకోవడం ప్రమాదకరం. నేపాల్ లాంటి పొరుగుదేశాలతోనూ అపరిష్కృత ప్రాదేశిక వివాదాలున్న భారత్ గతాన్ని తవ్వితే తలనొప్పులే. శ్రీలంకలో జాతుల యుద్ధం ముగిశాక వాణిజ్యం, ఇంధన, రవాణా రంగాల్లో ఇరు దేశాలూ ముందుకు సాగుతున్నాయి. పాత చరిత్రను ఆశ్రయిస్తే కొత్త దౌత్య యత్నాలకు చిక్కులు తప్పవు. హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మక ప్రాంతంలో లంగరేయడానికి చైనా సిద్ధంగా ఉన్నవేళ కచ్చతీవు వివాదం అభిలషణీయం కానే కాదు. అయినా, మనమే వదులుకున్న ఈ దక్షిణాగ్ర ద్వీపంపై ఇంత ప్రేమ ప్రదర్శిస్తున్న పాలకులు ఉత్తరాన వేలాది చదరపు కిలోమీటర్లు చైనా ఆక్రమించుకున్నట్టు వార్తలున్నా ఉలకరేం? పలకరేం? -
ద్రవిడ నేలపై కమలం వికసించేనా?
స్టేట్ స్కాన్ దక్షిణాదిని పాదాక్రాంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రధా నంగా తమిళనాడుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ద్రవిడ పార్టీల ఆవిర్భావంతో దశాబ్దాలుగా జాతీయ పార్టీలకు ఆ రాష్ట్రం కొరకరాని కొయ్యగా మారిపోయింది. డీఎంకే, అన్నాడీఎంకేల్లో ఏదో ఒకదానికి తోక పార్టీగా కొనసాగడం మినహా కాంగ్రెస్, బీజేపీలకు మరో దారి లేని పరిస్థితి! ఈసారి ఈ పరిస్థితిని ఎలాగైనా మార్చాలని బీజేపీ కంకణం కట్టుకుంది. కె.అన్నామలై రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టిన నాటినుంచీ దూకుడుగా వెళ్తున్నారు. రాష్ట్రమంతటా కలియదిరుగుతూ ఇటు జనాన్ని ఆకట్టుకుంటున్నారు. మంత్రుల అవినీతిపై వీడియోలు విడుదల చేస్తూ అటు అధికార డీఎంకేకు వణుకు పుట్టిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 39 లోక్‌సభ స్థానాలకూ ఏప్రిల్19న తొలి విడతలోనే పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో తమిళనాట ఎన్నికల వేడి ఇప్పటికే పరాకాష్టకు చేరింది... జాతీయ పార్టీలతో కుర్చిలాట తమిళనాట 50 ఏళ్లుగా ద్రవిడ పార్టీలైన డీఎంకే, అన్నాడీఎంకేలదే హవా. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 1967లో డీఎంకే తొలిసారి ఓటమి రుచి చూపింది. 234 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా డీఎంకే 179 చోట్ల గెలవగా కాంగ్రెస్ 51 స్థానాలకు పరిమితమైంది. నాటినుంచి నేటిదాకా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది! కరుణానిధితో విభేదాలతో 1972లో ఎంజీ రామచంద్రన్ డీఎంకేను చీల్చి అన్నాడీఎంకేను ఏర్పాటు చేశారు. నాటినుంచీ వాటి మధ్యే ప్రధాన పోరు సాగుతూ వస్తోంది. జాతీయ రాజకీయాల్లో సంకీర్ణ యుగం ఆవిర్భావంతో 1989 నుంచి రెండు దశాబ్దాల పాటు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో డీఎంకే, అన్నాడీఎంకే కీలక పాత్ర పోషించాయి. ఆ క్రమంలో రాష్ట్రంలోనూ కాంగ్రెస్, బీజేపీలతో మార్చి మార్చి పొత్తు పెట్టుకుంటూ వస్తున్నాయి. డీఎంకే 2004 దాకా కాంగ్రెస్‌కు బద్ధ విరోధిగా కొనసాగింది. అన్నాడీఎంకే కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో 1999లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో చేరింది. కానీ 2004లో అన్నాడీఎంకే మళ్లీ ఎన్డీఏ గూటికి చేరడంతో డీఎంకే తన వైఖరి మార్చుకుని కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. నాటినుంచీ 2014లో మినహాయిస్తే వాటి బంధం అన్ని ఎన్నికల్లోనూ కొనసాగుతూ వస్తోంది. ఇక అన్నాడీఎంకే తాను తొలిసారి ఎన్నికల బరిలో 1977లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది. తర్వాత 1984 నుంచి 1991 ఎన్నికల దాకా వాటి బంధం సాగింది. 1998లో తొలిసారి బీజేపీతో చేతులు కలిపినా ఏడాదికే మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరింది. 2004లో మళ్లీ బీజేపీతో జట్టు కట్టింది. అప్పటినుంచీ కాంగ్రెస్‌ను దూరం పెట్టింది. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో 2009, 2014 ఎన్నికల్లో బీజేపీతో బంధం తెంచుకుంది. 2019లో మళ్లీ ఎన్డీఏలో చేరినా ఈసారి మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తోంది. చిన్న పార్టీలైన పీఎంకే, ఎండీఎంకే కూడా పరిస్థితిని బట్టి డీఎంకే, అన్నాడీఎంకేలతో పొత్తు పెట్టుకుంటూ వస్తున్నాయి. పొత్తులు ఇలా... డీఎంకే ఈసారి కూడా చిరకాల మిత్రులు కాంగ్రెస్, వామపక్షాలతో పొత్తు పెట్టుకోగా అన్నాడీఎంకే మాత్రం బీజేపీతో దూరం పాటిస్తోంది. దివంగత నటుడు విజయ్‌కాంత్‌కు చెందిన డీఎండీకేతో పొత్తు పెట్టుకుంది. ఇక బీజేపీ ఈసారి పీఎంకే, ఏఎంఎంకే, టీఎంసీ (ఎం) వంటి చిన్న పార్టీలతో జట్టు కట్టింది. 1999లో రాష్ట్రంలో అత్యధికంగా 4 లోక్‌సభ స్థానాల్లో నెగ్గిన బీజేపీ ఈసారి ఆ రికార్డును అధిగమించాలని పట్టుదలతో ఉంది. పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాట పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. ఈ మధ్యకాలంలోనే రాష్ట్రానికి ఆయన ఏకంగా ఆరుసార్లు వచ్చారు. ఎవరి సర్వేలు ఏమంటున్నాయి... సీఎన్ఎన్–న్యూస్ 18 సర్వే ఈసారి ఎన్డీఏకు రాష్ట్రంలో 5 సీట్ల దాకా వస్తాయని పేర్కొనగా ఇండియాటుడే సర్వే మాత్రం మొత్తం 39 సీట్లనూ విపక్ష ఇండియా కూటమి క్లీన్‌స్వీప్ చేస్తుందని జోస్యం చెప్పింది. ఎవరెన్ని సీట్లలో... తమిళనాట ఎన్డీఏ, ఇండియా, అన్నాడీఎంకే కూటముల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఇండియా కూటమిలో డీఎంకే 22 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్‌కు 9, వామపక్షాలకు 4, ఇతర పార్టీలకు మరో 4 స్థానాలు కేటాయించింది. ఎన్డీఏ కూటమి విషయానికొస్తే బీజేపీ 20 చోట్ల, పీఎంకే 10, టీఎంసీ(ఎం) 3, ఏఎంఎంకే 2 చోట్ల, ఇతర పార్టీలు మూడింట బరిలో ఉన్నాయి. మరోచోట ఎన్డీఏ మద్దతుతో ఒ.పనీర్‌సెల్వం స్వతంత్రునిగా బరిలో దిగుతున్నారు. ఇక అన్నాడీఎంకే 32 స్థానాల్లో పోటీ చేస్తోంది. డీఎండీకేకు 5, ఇతరులకు 2 సీట్లు కేటాయించింది. యువ ఓటర్లపైనే బీజేపీ ఆశలు... తమిళనాట బీజేపీ ప్రధానంగా యువ ఓటర్లపైనే ఆశలు పెట్టుకుంది. ద్రవిడ పార్టీలతో విసిగిపోయారని, మార్పు కోసం చూస్తున్నారని నమ్ముతోంది. బీజేపీ రాష్ట్ర సారథి అన్నామలైకి వారిలో ఆదరణ నానాటికీ పెరుగుతోందని పరిశీలకులు చెబుతున్నారు. దీనికితోడు ద్రవిడ పార్టీల నేతలపైనా బీజేపీ కన్నేసింది. ఇప్పటికే అన్నాడీఎంకేకు చెందిన ఒక మాజీ ఎంపీ, 17 మంది మాజీ ఎమ్మెల్యేలు ఇటీవలే బీజేపీలో చేరారు. దక్షిణ తమిళనాట పదేళ్లుగా తమకు గట్టి పునాదే ఏర్పడిందని పార్టీ భావిస్తోంది. అక్కడి కొంగు ప్రాంతంలో పార్టీకి సంస్థాగతంగా చెప్పుకోదగ్గ బలమే ఉంది. దీనికితోడు కోయంబత్తూరు నుంచి రాష్ట్ర పార్టీ సారథి అన్నామలై పోటీ చేస్తున్నారు. పీఎంకేతో పొత్తు ద్వారా ఉత్తర తమిళనాడులో తన బలహీనతను అధిగమిస్తానని బీజేపీ భావిస్తోంది. 2014లోనూ ఇలాగే చిన్న పార్టీలతో జట్టు కట్టి బీజేపీ ఏకంగా 19 శాతం ఓట్లు రాబట్టడమే గాక ఒక లోక్‌సభ స్థానాన్ని గెలుచుకుందని ఆ పార్టీ అభిమానులు గుర్తు చేస్తున్నారు. కాకపోతే అప్పటి భాగస్వాముల్లో డీఎండీకే, ఎండీఎంకే ఇప్పుడు ఎన్డీఏతో లేవు. పైగా ముక్కోణపు పోటీలో విపక్షాల ఓట్లు చీలి ఇండియా కూటమికే లబ్ధి చేకూరవచ్చన్న విశ్లేషణలున్నాయి. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రస్తుత ఇండియా కూటమి ఏకంగా 53 శాతం ఓట్లు ఒడిసిపట్టింది! ఎన్డీఏ కేవలం 10 శాతంతో సరిపెట్టుకోగా అన్నాడీఎంకే కూటమికి 21 శాతం వచ్చాయి. అయితే ఈసారి ఏఎంఎంకే వంటి భాగస్వాములు అన్నాడీఎంకే ఓటు శాతానికి గండి కొట్టి తమవైపు మళ్లిస్తాయని బీజేపీ ఆశ పెట్టుకుంది. అన్నాడీఎంకే ఓట్లను ఏకంగా మూడొంతల దాకా ఒడిసిపట్టడంతో పాటు మోదీ చరిష్మా, స్టాలిన్ సర్కారుపై వ్యతిరేకత సాయంతో ఇండియా కూటమి ఓట్లలోనూ 10 శాతం దాకా ఎన్డీఏ కొల్లగొట్టగలిగితే 7 సీట్ల దాకా నెగ్గవచ్చని విశ్లేషకుల అంచనా. కాకపోతే అన్నాడీఎంకే ఓటు శాతానికి అంతగా గండి పెట్టడం బీజేపీకి పెనుసవాలే! ప్రచారంలో సినీ తళుకులు.. బీజేపీ తరఫున సినీ నటులు ఖుష్బూ, ఇటీవలే తన పార్టీని విలీనం చేసిన శరత్ కుమార్, సెంథిల్ ప్రచారంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. డీఎంకేకు కమల్‌హాసన్, అన్నాడీఎంకేకు గౌతమి, గాయత్రీ రఘురాం తదితర సినీ స్టార్లు ప్రచారం చేయనున్నారు. -
TN: ప్రధానికి ఉదయనిధి స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్
చెన్నై: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ మరోసారి విరుచుకుపడ్డారు. మంగళవారం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎంకే నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నామని ప్రధాని మోదీ ఇటీవలి తమిళనాడు పర్యటనలో చేసిన వ్యాఖ్యలకు ఉదయనిధి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మోదీని, బీజేపీని ఇంటికి పంపించేదాకా తమ పార్టీ నిద్రపోదన్నారు. ‘డీఎంకే నేతలకు నిద్ర రావడం లేదని ప్రధాని అంటున్నారు. అవును మేం నిన్ను, బీజేపీని ఇంటికి పంపించేదాకా నిద్రపోము. 2014లో గ్యాస్ సిలిండర్ రూ. 450, ఇప్పుడు రూ.1200. ఇటీవలే పీఎం దానిని రూ.100 తగ్గించి ఒక డ్రామా ఆడారు.ఎన్నికల తర్వాత గ్యాస్ ధరను తిరిగి రూ.500 పెంచుతాడు’అని ఉదయనిధి ఫైర్ అయ్యారు. కాగా, తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తొలి దశలోనే ఏప్రిల్ 19న జరగనుంది. ఇందుకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ఇదీ చదవండి.. రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం కీలక వ్యాఖ్యలు -
డీఎంకే ప్రజా వ్యతిరేకం.. మండిపడ్డ అన్నాడీఎంకే నేత
తమిళనాడు: సార్వత్రిక ఎన్నికలకు దేశం మొత్తం సిద్ధమవుతోంది. జాతీయ పార్టీల దగ్గర నుంచి ప్రాంతీయ పార్టీల వరకు అన్నీ కూడా తమదైన రీతిలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ఈ తరుణంలో తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే కూడా పోటాపోటీగా బరిలో నిలిచాయి. ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని, ప్రజలకు చేసిందేమీ లేదని ఏఐఏడీఎంకే అభ్యర్థి జే జయవర్ధన్ ఆరోపించారు. ఈయన సౌత్ చెన్నై లోక్‌సభ స్థానం నుంచి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. డీఎంకే ప్రజావ్యతిరేక పార్టీ, ప్రజావ్యతిరేక ప్రభుత్వం అని జయవర్ధన్ పేర్కొన్నారు. డీఎంకే ప్రభుత్వంలో ఏ నియోజక వర్గంలోనూ అభివృద్ధి జరగలేదని అన్నారు. ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం ఏమీ చేయలేదని, హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ చెన్నై నియోజకవర్గంలో ఏఐఏడీఎంకే తప్పకుండా గెలుస్తుంది. పార్టీ విజయం కోసం కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను గురువారం అన్నాడీఎంకే ప్రకటించింది. అన్నాడీఎంకే కూటమిలో ఏఐఏడీఎంకే 32 స్థానాల్లో, డీఎండీఎంకే 5 స్థానాల్లో, ఎస్డీపీఐ 1 స్థానంలో, పుతియా తమిళగం 1 స్థానంలో పోటీ చేయనున్నాయి. మొత్తమ్ ఈ 39 స్థానాలకు ఏప్రిల్ 19న సార్వత్రిక ఎన్నికల తొలి దశలో ఓటింగ్ జరగనుంది. ఆ తరువాత జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. #WATCH | Tamil Nadu: Dr J Jayavardhan, AIADMK candidate from South Chennai says, "This is a consultation meeting with regards to how to work for the coming Lok Sabha election in South Chennai constituency...It is very well seen that the party cadres are with much enthusiasm… pic.twitter.com/Ff6u5pa6CA — ANI (@ANI) March 26, 2024 -
తమిళిసై వర్సెస్ తమిళచ్చి.. ఆసక్తికర పరిణామం
చెన్నై: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వియం తెలిసిందే. బీజేపీ తరపున తమిళనాడు నుంచి ఆమె లోక్‌సభ బరిలో నిలిచారు. గతంలో ఎమ్మెల్యే, ఎంపీగా పోటీచేసి ఓటమిచెందిన తమిళిసై.. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. చెనై సౌత్ టికెట్‌ను ఆమెకు కేటాయించింది పార్టీ అధిష్టానం. ఈ క్రమంలో సోమవారం తమిళిసై నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా అనూహ్య పరిణామం జరిగింది. అదే సమయంలో సిట్టింగ్ ఎంపీ, సమీప ప్రత్యర్ధి తమిళచ్చి తంగపాండియన్ నామినేషన్ వేసేందుకు అక్కడికి వచ్చారు. తమిళిసై నామినేషన్ వేసి బయటకు వస్తుండగా డీఎంకే నేత ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళా నేతలు నవ్వుతూ.. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరు అప్యాయంగా పలకరించుకున్నారు. ఇది చూసిన అక్కడున్నవారంతా కాసేపు షాక్‌కు గురయ్యారు. డీఎంకే, బీజేపీ మధ్య తీవ్ర రాజకీయ పోరు నెలకొన్న వేళ ఇలా ఇద్దరు నేతలు ఆప్యాయంగా పలకరించుకోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. S Chennai: Pic of Tamilisai and Tamizhachi extending a courtesy hug after filing nominations N Chennai: Sekar Babu and Jayakumar fighting over which party arrived at the location first to file nomination pic.twitter.com/0AHpuWhYkN — Dharani Balasubramaniam (@dharannniii) March 25, 2024 కాగా సౌత్ చెన్నైలో బీజేపీ నుంచి తమిళిసై, డీఎంకే నుంచి సిట్టింగ్ ఎంపీ తమిళచ్చి, అన్నాడీఎంకే నుంచి డాక్టర్ జయవర్దన్ పోటీలో నిలిచారు. గత ఎన్నికల్లో చెన్నై సౌత్ నుంచి తమిళచ్చి ఏకంగా 1.40 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో చెన్నై సౌత్ నుంచి గెలిచిన జయవర్థన్.. 2019 లో ఓటమి పాలయ్యారు. తాజాగా మూడోసారి ఇక్కడి నుంచి మరోసారి బరిలో నిలిచారు. ఈ క్రమంలో స్థానికంగా పోరు ఆసక్తికరంగా మారింది. #WATCH | Chennai, Tamil Nadu: After filing her nomination for the Lok Sabha elections, former Telangana Governor and Puducherry Lieutenant Governor and BJP candidate Tamilisai Soundararajan says, " The people want PM Modi to be Prime Minister again. South Chennai is a… pic.twitter.com/SLmZ0sy05R — ANI (@ANI) March 25, 2024 -
ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. డీఎంకే మంత్రిపై కేసు
చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి అనితా ఆర్ రాధాకృష్ణన్‌పై కేసు నమోదు అయింది. బీజేపీ ఫిర్యాదు మేరకు టుటికోరిన్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కమల్ రాజు నిద్రిస్తున్న సమయంలో హత్య చేయడానికి ప్రయత్నించింది మీరు కాదా?. కమల్ రాజు మిమ్మల్ని కమల్ రాజు హత్తకున్నట్లు చెబుతున్నారని ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంత్రి అనితా ఆర్ రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తీవ్రంగా ఖండించారు. ‘డీఎంకే నేతలు అసభ్య వ్యాఖ్యలు చేయటంలో దిగజారిపోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై క్షమించరని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది డీఎంకే నేత స్థాయి. డీఎంకే నేత కనిమోళి సమక్షంలోనే మోదీపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా అడ్డుకోక పోగా ఆమె చూస్తూ ఉండిపోయారు. మేము ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకువెళతాం. డీఎంకే నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరతాం’అని అన్నామలై ఎక్స్ వేదికగా తెలిపారు. DMK leaders have reached a new low in their uncouth behaviour by passing vile comments & unpardonable public discourse against our Hon PM Thiru @narendramodi avl. When they have nothing to criticise, this is the level DMK leaders have stooped. DMK MP Smt Kanimozhi avl was on… pic.twitter.com/sTdQSNjkir — K.Annamalai (மோடியின் குடும்பம்) (@annamalai_k) March 24, 2024 ఇటీవల ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొని దివంగత తమిళనాడు మాజీ సీఎం కమల్ రాజు తీసుకువచ్చిన పథకాలపై ప్రశంసలు కురిపించారు. అదే విధంగా ఆయన ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం తనకు ఎంతో స్పూర్తీ అని పేర్కొన్నారు. ఇక..గత నెల కులశేఖరపట్నంలో ‘ఇస్రో’ రాకెట్ లాంచ్‌ప్యాడ్ నిర్మాణానికి శుంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోదీకి స్వాగతం పలికే ఓ పత్రికా ప్రకటనలో చైనా జెండా ముద్రించటం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ పత్రికా ప్రకటన చేసింది కూడా మంత్రి అనితా ఆర్ రాధాకృష్ణ కావాటం గమనార్హం. అప్పుడు కూడా బీజేపీ నేతల చేత తీవ్ర విమర్శలు పాలయ్యారు అనిత రాధాకృష్ణన్. -
ప్రధాని మోదీపై డీఎంకే మంత్రి నీచపు వ్యాఖ్యలు.. మండిపడుతున్న బీజేపీ నేతలు
చెన్నై: డీఎంకే మంత్రి అనితా రాధాకృష్ణన్ ఓ బహిరంగ సమావేశంలో మాట్లాడుతూ.. దేశ ప్రధాని నరేంద్ర మోదీని దుర్భాషలాడారు. ఈ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు మండి పడుతున్నారు. తక్షణమే రాధాకృష్ణన్ మీద చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అనితా రాధాకృష్ణన్.. మోదీపై చేసిన వ్యాక్యాలకు సంబంధించిన వీడియోను తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేశారు. ప్రధానిని కించపరిచే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని, అది క్షమించరాని నేరమని ఆరోపించారు. తమిళనాడు బీజేపీ కూడా ఈ వీడియోను తమ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేసారు. DMK leaders have reached a new low in their uncouth behaviour by passing vile comments & unpardonable public discourse against our Hon PM Thiru @narendramodi avl. When they have nothing to criticise, this is the level DMK leaders have stooped. DMK MP Smt Kanimozhi avl was on… pic.twitter.com/sTdQSNjkir — K.Annamalai (மோடியின் குடும்பம்) (@annamalai_k) March 24, 2024 ఈ ఘటనపై రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి స్పందిస్తూ.. మంత్రిని బర్తరఫ్ చేసి వెంటనే అరెస్ట్ చేయాలని అన్నారు. ఇంగ్లిష్ భాషలో అత్యంత నీచమైన (చెడ్డ) పదమని ఆ మంత్రి వాడారని.. డీఎంకేకు సిగ్గు ఉంటే.. ప్రధానిని దుర్భాషలాడినందుకు మంత్రిని బర్తరఫ్ చేయాలని అన్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా.. ప్రధానిపై రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో అలాంటి భాషకు స్థానం లేదని అన్నారు. మనిషికి విధ్వంసం సంభవించినప్పుడు, ముందుగా చనిపోయేది మనస్సాక్షి. ఇండియా కూటమిలో ఉన్నవారు మనస్సాక్షిని కోల్పోతున్నారని ఠాకూర్ అన్నారు. #WATCH | Chennai: On Tamil Nadu Minister Anitha Radhakrishnan's remark against PM Modi, State BJP Vice President Narayanan Thirupathy says, "This is really atrocious...If DMK has some shame, they should dismiss this minister for abusing PM in a filthy manner. He should be sacked… pic.twitter.com/o0ST1zjfjv — ANI (@ANI) March 24, 2024 -
వారసత్వ వ్యాఖ్యలపై బీజేపీకి ఉదయనిధి కౌంటర్
చెన్నై: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ బీజేపీ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. బీజేపీ చేసిన వారసత్వ, కుటుంబ రాజకీయలకు సంబంధించిన వ్యాఖ్యలపై ఉదయనిధి ఆదివారం స్పందిస్తూ ఎదురుదాడి చేశారు. ‘బీజేపీ వాళ్లు విమర్శంచినట్లు.. డీఎంకే పార్టీ కుటుంబ వారసత్వ పార్టీనే. నేను కూడా అంగీకరిస్తాను. అయితే తమిళనాడు ప్రజలు మొత్తం కరుణానిధి కుటుంబం’ అని మంత్రి ఉదయనిధి అన్నారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెన్నై ర్యాలీలో పాల్గొని ఎంకే స్టాలిన్ డీఎంకే పార్టీ వారసత్వం కుటంబ పార్టీ అని విమర్శలు చేశారు. కుటుంబ పార్టీలు కేవలం తమ భవిష్యత్తు మాత్రమే చూసుకుంటాయని అన్నారు. కానీ, నేను దేశంలో ప్రతి ఒక్కరి భవిష్యత్తు కోసం కృషి చేస్తానని మోదీ తెలిపారు. డీఎంకే, కాంగ్రెస్ పార్టీలకు మొదట ప్రాధాన్యం కుటుంబం.. తర్వాతే దేశం అని అన్నారు. అదే విధంగా ఇండియా కూటమి మొత్తం ఇదే విధానాన్ని పెంచి పోషిస్తోందని విమర్శలు చేశారు. ఇక.. తమిళనాడు మొత్తం 39 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2019లో డీఎంకే నేతృత్వంలోని కూటమి మొత్తం 38 స్థానాల్లో విజయం సాధించింది. డీఎంకే సొంతంగా 23 స్థానాల్లో గెలుపొంది.. 33.2 శాతం ఓట్ షేర్‌ను సంపాధించుకుంది. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో మొదటి విడతలోనే ఏప్రిల్ 19న తమిళనాడులో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. -
గెలుపు మాదే.. పీఎం కేర్ ఫండ్స్‌పై సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,చెన్నై : పీఎం కేర్ ఫండ్స్‌పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పీఎం కేర్ ఫండ్స్ రహస్యాల్ని బహిర్గతం చేస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ఎంకే స్టాలిన్ మాట్లాడారు. ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. కాబట్టే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారని అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల మాదిరిగానే ఎలక్టోరల్ బాండ్ల మాదిరిగానే, ‘వారు (బీజేపీ, కేంద్రాన్ని ఉద్దేశిస్తూ) మరొక విధంగా నిధుల్ని సేకరించారు. దీనికి పీఎం కేర్స్ ఫండ్ అని పేరు పెట్టారు. ఈ ఏడాది జూన్‌లో ఇండియా కూటమి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఫండ్‌కు సంబంధించిన అన్ని రహస్యాలు వెలికి తీస్తామని స్పష్టం చేశారు. ఆయుష్మాన్ భారత్ సహా ఇతర సంక్షేమ కార్యక్రమాల్లో అవక తవకలు జరిగాయని కాగ్ నివేదిక తెలిపింది. ఆ నివేదికపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించ లేదని స్టాలిన్ ప్రశ్నించారు. తమిళనాడు కోసం అమలు చేసిన ఒక ప్రత్యేక పథకాన్ని ప్రధాని మోదీ చెప్పగలరా? అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అడిగారు. -
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 'పొన్ముడి'
సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన మరుసటి రోజు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి శుక్రవారం చెన్నైలోని రాజ్‌భవన్‌లో డీఎంకే ఎమ్మెల్యే కే పొన్ముడితో ప్రమాణం చేయించారు. పొన్ముడిని తిరిగి తన కేబినెట్లో చేర్చుకోవడంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేసిన సిఫార్సును గవర్నర్ ఆమోదించారు. ప్రస్తుతం మంత్రి ఆర్ఎస్ రాజకన్నప్పన్ నిర్వహిస్తున్న సాంకేతిక విద్య, ఎలక్ట్రానిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా ఉన్నత విద్య వంటి వాటిని పొన్ముడికి కేటాయించాలని స్టాలిన్ గవర్నర్‌కు సిఫార్సు చేశారు. #WATCH | Tamil Nadu Governor RN Ravi administers oath to DMK leader K.Ponmudy as a minister in the state cabinet pic.twitter.com/1DcWbBYD5Y — ANI (@ANI) March 22, 2024 పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు నిరాకరిస్తూ వచ్చిన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి సుప్రీంకోర్టు చీవాట్లు పెడుతూ.. 24 గంటల్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఈ రోజు గవర్నర్ పొన్ముడి చేత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పొన్ముడి గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించారు. పొన్ముడి ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత, సీఎం స్టాలిన్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో సుప్రీంకోర్టు సకాలంలో జోక్యం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. On behalf of the people of Tamil Nadu, I thank the Hon'ble Supreme Court, the custodian of the Constitution, for its timely intervention & upholding the spirit of the Constitution and saving the democracy. In the last decade, the people of #INDIA witnessed the dithering of… pic.twitter.com/zthecHWbXL — M.K.Stalin (@mkstalin) March 22, 2024 -
కూటమి అభ్యర్థి విజయానికి సమష్టిగా పని చేయండి
తిరువళ్లూరు: స్థానిక పార్లమెంట్ స్థానంలో కూటమి అభ్యర్థి విజయానికి అన్ని పార్టీల ప్రతినిధులు సమష్టిగా పని చేయాలని తిరుత్తణి ఎమ్మెల్యే, డీఎంకే జిల్లా కార్యదర్శి తిరుత్తణి చంద్రన్ పిలుపునిచ్చారు. తిరువళ్లూరు పార్లమెంట్ స్థానం నుంచి డీఎంకే కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేయనున్నారు. కూటమి అభ్యర్థి గెలుపు అంశంపై చర్చించడానికి వేర్వేరు పార్టీలకు చెందిన ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా తిరుత్తణి ఎమ్మెల్యే, డీఎంకే జిల్లా కార్యదర్శి తిరుత్తణి చంద్రన్ హాజరై మాట్లాడారు. డీఎంకే ప్రభుత్వం మూడేళ్లలో వేర్వేరు సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. కార్యక్రమంలో డీఎంకే ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్, పారీ నేతలు తిరుత్తణి భూపతి, కూటమి నేతలు ఆదిశేషన్, ద్రావిడభక్తన్, బాబు, గోపాల్, తమిళరసు తదితరులు పాల్గొన్నారు. -
డీఎంకే మేనిఫెస్టోలోని కీలక అంశాలు ఇవే..
సాక్షి, చైన్నె: సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో క్లీన్ స్వీపే లక్ష్యంగా డీఎంకే మెగా కూటమి వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. మిత్రపక్షాలకు పుదుచ్చేరితో పాటు తమిళనాడులోని 19 స్థానాలను అధికార డీఎంకే కేటాయించింది. మిగిలిన 21 స్థానాలలో తమ అభ్యర్థులను రంగంలోకి దించింది. ఇందులో భాగంగా బుధవారం తేనాంపేటలోని డీఎంకే కార్యాలయం అన్నా అరివాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎన్నికల మేనిఫెస్టో, అభ్యర్థుల జాబితాను సీఎం స్టాలిన్ ప్రకటించారు. డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎంపీ కనిమొళి నేతృత్వంలోని కమిటీ రూపొందించిన మేనిఫెస్టోలోని అంశాలను స్టాలిన్ మీడియాకు వివరించారు. ఎన్నికల ముందు ఇచ్చే వాగ్దానాలే కాదు. అధికారంలోకి వచ్చినానంతరం ఇవ్వని వాగ్దానాలనూ కూడా అమలు చేసిన ఘనత ద్రవిడ మోడల్ ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుందన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావడం తథ్యమని, దీనిని దృష్టిలో ఉంచుకునే తమ మేనిఫెస్టోను రాష్ట్ర, జాతీయ స్థాయి అంశాలతో రూపొందించామని వివరించారు. మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్నీ అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు ● రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించే విధంగా చట్ట సవరణకు తొలి ప్రాధాన్యత. ● అనవసరంగా ఉన్న గవర్నర్ పదవి వ్యవహారంలో మార్పులు, సీఎం సలహాలను తప్పని సరిగా స్వీకరించాలనే నిబంధన రూపకల్పనకు కృషి. గవర్నర్‌కు ప్రత్యేక అధికారులు కల్పించే సెక్షన్ 361 రద్దు. ● చైన్నెలో సుప్రీంకోర్టు శాఖ ఏర్పాటు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పనకు ప్రణాళిక. ● కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే పోటీ పరీక్షలన్నీ తమిళంతో పాటు ఇతర ప్రాంతీయ భాషలలో నిర్వహణ. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో తమిళం తప్పనిసరి. అన్ని భాషల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపు. జాతీయ గ్రంథంగా తిరుక్కురల్ ప్రకటన. ● శ్రీలంక నుంచి తమిళనాడులోకి వచ్చి స్థిరపడ్డ తమిళులకు భారత పౌరసత్వం కేటాయింపు. ● రైల్వే శాఖకు ప్రత్యేక బడ్జెట్, చైన్నెలో మూడవ అతిపెద్ద రైల్వే టెర్మినల్ ఏర్పాటు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ తక్షణం అమలు. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ బడులలో అల్పాహార పథకం అమలు చేసేందుకు చర్యలు. ● దేశవ్యాప్తంగా గృహిణులకు నెలకు రూ. 1000 నగదు పంపిణీ పథకం అమలు. ● నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు. అన్ని రాష్ట్రాలలో సీఎంల నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి మండలి ఏర్పాటు. మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 10 లక్షలు వడ్డీ లేని రుణం పంపిణీ. ● బీజేపీ తీసుకొచ్చిన కొన్ని అసంబద్ధ కార్మిక చట్టాలు, ఇతర చట్టాలు, పథకాలు రద్దు, మరికొన్నింటిపై పునర్ సమీక్ష. జమిలీ ఎన్నికల రద్దు. జాతీయ రహదారులలో టోల్గేట్ల ఎత్తివేత. బ్యాంక్‌లలో కనీస నగదు నిల్వ నిబంధన ఎత్తివేత. సీఏఏ చట్టం రద్దు. దేశవ్యాప్తంగా కులగణన. రైతులకు మద్దతు ధర కల్పన, దేశవ్యాప్తంగా విద్యార్థుల విద్యారుణాల రద్దు. కొత్తగా రూ. 4 లక్షలు రుణాల పంపిణీ. తమిళనాడులో జాతీయ స్థాయి విద్యా సంస్థల ఏర్పాటు. విమాన చార్జీల క్రమబద్ధీకరణ. ● ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 500, లీటరు పెట్రోల్ రూ. 75, లీటరు డీజిల్ ధర రూ. 65గా నిర్ణయం. ఉపాధి హామీ పథకం 100 రోజుల నుంచి 150 రోజులకు పెంపు. రోజు వారీ కూలి రూ. 400కు పెంపు. 21 మంది అభ్యర్థుల ప్రకటన మేనిఫెస్టో విడుదల తర్వాత తమ పార్టీ పోటీ చేసే స్థానాలలో 21 మంది అభ్యర్థుల జాబితాను స్టాలిన్ ప్రకటించారు. ఇందులో 10 మంది సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ అవకాశం కల్పించారు. మరో 11 మంది కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు. అయితే సిట్టింగ్ ఎంపీలలో ధర్మపురి సెంథిల్‌కుమార్, కళ్లకురిచ్చి సీనియర్ నేత పొన్ముడి వారసుడు గౌతం శిఖామణి, సేలం పార్తీబన్, తంజావూరు నాలుగు సార్లు గెలిచిన ఎస్ఎస్ పళణి మాణిక్యం, తెన్కాశి ధనుష్‌కుమార్, పొల్లాచ్చి షణ్ముగసుందరం తదితరులకు ఈసారి సీటు కేటాయించలేదు. పొన్ముడి వారసుడిపై కోర్టులలో కేసులు ఉండటం ఓ కారణమైనా, నాలుగు సార్లు గెలిచిన ఎస్ఎస్ పళణి మాణిక్యంకు సీటు ఇవ్వక పోవడం చర్చనీయాంశంగా మారింది. తంజావూరులో పోటీ చేసే మురసోలి అనే అభ్యర్థి పేరును పలుమార్లు సీఎం వ్యాఖ్యానించడం గమనార్హం. ఈరోడ్‌లో కొత్తగా పోటీ చేస్తున్న కె. ప్రకాష్ మంత్రి ఉదయనిధి స్టాలిన్ సన్నిహితుడు కాగా, పెరంబలూరులో పోటీ చేయనున్న అరుణ్ నెహ్రూ, సీనియర్ నేత, మంత్రి కేఎన్ నెహ్రూ వారసుడు కావడం గమనార్హం. అలాగే మాజీ మంత్రి సెల్వ గణపతికి ఈసారి సేలం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. కాగా 21 మంది అభ్యర్థుల్లో 19 మంది పట్టభద్రులు, ముగ్గురు మహిళలు ఉండడం గమనార్హం. -
టోల్గేట్ల తొలగింపు.. నీట్ రద్దు, డీఎంకే మేనిఫెస్టో విడుదల
సాక్షి, చెన్నై : వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తమమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ బుధవారం మేనిఫెస్టోని విడుదల చేశారు. పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, నీట్ పరీక్షలపై నిషేధం, ముఖ్యమంత్రికి గవర్నర్‌ను నియమించే అధికారం వంటి ఇతర హామీలను మేనిఫెస్టోలో పేర్కొన్నారు.మేనిఫెస్టోను రూపొందించినందుకు స్టాలిన్ తన సోదరి కనిమోళిని ప్రశంసించారు. ప్రతి జిల్లాకు సంబంధించిన పథకాలపై కనిమొళి అద్భుతమైన మేనిఫెస్టోను రూపొందించారని అన్నారు. కాగా మేనిఫెస్టోతో పాటు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కూడా స్టాలిన్ ప్రకటించారు. అనంతరం సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు రూపొందించిన మేనిఫెస్టోలో ఏం చెప్పామో డీఎంకే అది చేస్తుంది. మా నాయకులకు అదే నేర్పాం. ద్రవిడ మోడల్లో అమలు చేసిన పథకాలు తమిళనాడు అభివృద్ధిని దేశమంతా వ్యాప్తి చేసేలా చేస్తాయని అన్నారు. డీఎంకే మెనిఫెస్టోలో ఏయే అంశాలు ఉన్నాయంటే రాష్ట్రాలకు సమాఖ్య హక్కులు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చెన్నైలో సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు పుదుచ్చేరికి రాష్ట్ర హోదా జాతీయ విద్యా విధానం (NEP) ఉపసంహరణ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలు ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్ధులకు ఉదయం అల్పాహారం సదుపాయం. నీట్ బ్యాన్. రాష్ట్రంలో టోల్ గేట్ల తొలగింపు రాష్ట్రంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై నిషేధం ఎల్పీజీ గ్యాస్ -500, లీటర్ పెట్రోల్ రూ.75, డీజిల్- రూ.65 అందిస్తూ నిర్ణయం తిరుకురల్‌ను ‘నేషనల్ బుక్’ గా తీర్చిదిద్దేలా నిర్ణయం దేశానికి తిరిగి వచ్చిన శ్రీలంక తమిళులకు భారత పౌరసత్వం గవర్నర్లకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ నుండి మినహాయింపునిచ్చే ఆర్టికల్ 361 సవరణ కొత్త ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్ఈ, ఐఐఏఆర్‌ఐలు ఏర్పాటుతో పాటు ఇతర హామీలు నెరవేర్చేలా మేనిఫెస్టోని సిద్ధం చేసింది డీఎంకే. లోక్‌సభ అభ్యర్ధులు వీరే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న లోక్ సభ అభ్యర్ధుల జాబితాను ఎంకే స్టాలిన్ విడుదల చేశారు. వారిలో డీఎంకే పార్టీలో కీలకనేతలైన కె కనిమొళి, ఎ రాజా తదితరులు ఉన్నారు. ఉత్తర చెన్నై - కళానిధి వీరాసామి, దక్షిణ చెన్నై - తమిళచ్చి తంగపాండియన్, సెంట్రల్ చెన్నై - దయానిధి మారన్, శ్రీపెరుంబత్తూరు - టీఆర్ బాలు, అరకోణం - జగత్రాచహన్, వెల్లూరు - కంధీర్లను బరిలోకి దించాలని పార్టీ నిర్ణయించింది. వీరితో పాటు తిరువనమలై - అన్నాదురై, ఆరణి - ధరణి, సేలం - సెల్వగపతి, ఈరోడ్ - ప్రకాష్, నీలగిరి - ఏ రాజా, కోవై - గణపతి రాజ్‌కుమార్, పెరంబలూరు - అరుణ్ నేరు, తంజావూరు - మురసోలి, తేని - తంగ తమిళ్ సెల్వం, తుత్తుకుడి - కనిమొళి, తెంకాసి - రాణి, కళ్లకురిచి - మలైయరసన్. -
తమిళనాడులో బీజేపీ వ్యూహం
సాక్షి, చెన్నై : తమిళనాడులో బీజేపీ పార్టీ బలోపేతం దిశగా వడివడిగా అడుగులు వేస్తోందా? 400కుపైగా లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న కషాయ దళానికి దక్షిణాది రాష్ట్రాల్లో గెలుపు కచ్చితంగా అవసరమని భావిస్తోందా? ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా తమిళనాట అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ అధినాయకత్వం సరికొత్త వ్యూహం రచిస్తుందా? అంటే అవుననే అంటున్నాయి తమిళ రాజకీయాలు ఎన్డీయే కూటమిలోకి పీఎంకే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. 400 ఫ్లస్ సీట్లను ఎన్డీయే టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందుకోసం దక్షిణ రాష్ట్రాల్లో గెలుపు కచ్చితంగా అవసరమని భావిస్తోంది. ఈ క్రమంలోనే లక్ష్యం దిశగా..సీట్ల కేటాయింపుల విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తమిళనాడులో ఇప్పటికే దినకరన్, మాజీ సీఎం పన్నీర్ సెల్వంతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. అయితే తాజాగా ఎన్డీయే కూటమిలో చేరిన పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) కు 10 సీట్లను కేటాయించి ఆసక్తికర చర్చకు దారి తీసింది. అన్నా డీఎంకే వద్దకు పీఎంకే దూత పీఎంకే నిర్ణయంతో తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే (ఏఐఏడీఎంకే) లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకులలో ఒకరైన పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్ రామదాస్ పొత్తు, సీట్లపై చర్చలు బీజేపీతో కాకుండా ఏఐఏడీఎంకేతో జరిపాలని అనుకున్నారు. చర్చలు జరిపేందుకు ఏఐఏడీఎంకే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి వద్దకు ఓ దూతను పంపారు. బీజేపీతో పొత్తు అదే సమయంలో చెన్నైకి 120 కిలోమీటర్ల దూరంలోని తైలాపురంలో సమావేశమైన పీఎంకే అత్యున్నత స్థాయి కమిటీ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అన్నాడీఎంకేని కాదని బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే నిర్ణయాన్ని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ ప్రతిపాదించారు. ఆ పార్టీ ఏఐఏడీఎంకేతో తెగతెంపులు చేసుకుని బీజేపీతో పొత్తుతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల ఒప్పందంపై సంతకమే పొత్తుపై పీఎంకే ప్రధాన కార్యదర్శి వడివేల్ రావణన్ మాట్లాడుతూ.. ‘బీజేపీతో పొత్తు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొంటామని పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్ రామదాస్ అత్యున్నత స్థాయి కమిటీ సమావేశంలో ప్రకటించినట్లు తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని కూటమిలో చేరాలనే నిర్ణయాన్ని రామదాస్, ఆయన కుమారుడు అన్బుమణి సంయుక్తంగా తీసుకున్నారని’ చెప్పారు. పీఎంకేలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని పార్టీ నేతలు వెల్లడించారు. అధికారిక ఎన్నికల ఒప్పందంపై సంతకం చేసేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై తైలాపురం వెళ్లనున్నారు. అన్నామలై ప్రయత్నాలు సఫలం బీజేపీ కూటమిలో చేరాలని పీఎంకే తీసుకున్న నిర్ణయం, అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐఏడీఎంకేలకు ధీటుగా బీజేపీ ఎదిగేందుకు.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం చేస్తున్నాయి. బీజేపీలోకి 15 మంది మాజీ ఎమ్మెల్యేలు గతంలో బీజేపీ ఎన్డీయే కూటమిలో అన్నాడీఎంకే భాగస్వామిగా ఉండేది. అన్నామలై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్నాడీఎంకే నేతల అవినీతిపై ఆరోపణలు చేశారు. దాంతోపాటు దివంగత ముఖ్యమంత్రి జయలలితను విమర్శించడంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 15మంది మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీని బీజేపీలో చేర్చుకుంది. ఒకే దెబ్బకు తాజాగా, లోక్‌సభ ఎన్నికల్లో వన్నియార్ సామాజిక వర్గంలో దాదాపు 6 శాతం ఓటు బ్యాంకు ఉన్న పీఎంకేతో జతకట్టింది. ఉత్తర తమిళనాడులో ఓటు షేర్ పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీకి పీఎంకేతో పొత్తు మరింత లబ్ధి చేకూర్చుతుంది. దక్షిణ తమిళనాడు అంతటా ఆధిపత్య Mukkulathorలను ఆకర్షించడంలో అన్నాడీఎంకే నాయకులు ఓ పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్‌ల మద్దతు కూడగట్టుకుంది. లోక్‌సభ ఎన్నికలే కాదు తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా మోదీ వరుస పర్యటనలు చేయడంతో పాటు, భారీగా నిధులు కేటాయించేందుకు కేంద్రం సిద్ధమైంది. -
పార్టీలకు రూ.వేల కోట్లు.. ఎవరీ 'లాటరీ కింగ్'?
'లాటరీ కింగ్' శాంటియాగో మార్టిన్కి (Santiago Martin) చెందిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ఎలక్టోరల్ బాండ్ల అగ్ర కొనుగోలుదారుగా ఉద్భవించింది. ఇందులో తమిళనాడు అధికార పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం (DMK)కు అత్యధికంగా రూ.509 కోట్లు విరాళంగా ఇచ్చింది. రాజకీయ పార్టీలకు అనామక, అపరిమిత విరాళాలను అనుమతించే ఎలక్టోరల్ బాండ్ల విధానంలో డీఎంకే రూ. 656.5 కోట్ల విలువైన బాండ్లను పొందిందని ఎన్నికల కమిషన్ డేటా తాజాగా వెల్లడించింది. ఈ ఎలక్టోరల్ బాండ్ల విధానం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సుప్రీం కోర్ట్ రద్దు చేసింది. ఫ్యూచర్ గేమింగ్ మొత్తం రూ.1,368 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. అందులో దాదాపు 37 శాతం డీఎంకేకి వెళ్లింది. మేఘా ఇంజినీరింగ్ (రూ. 105 కోట్లు), ఇండియా సిమెంట్స్ (రూ. 14 కోట్లు), సన్ టీవీ (రూ. 100 కోట్లు) సంస్థల నుంచి కూడా డీఎంకేకి విరాళాలు ముట్టాయి. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషన్ ఎలక్టోరల్ బాండ్లపై తాజా డేటాను బహిరంగపరిచింది. అంతకుముందు సీల్డ్ కవర్లలో ఈ డేటాను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఈ వివరాలు ఏప్రిల్ 12, 2019కి ముందు కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. ఈ తేదీ తర్వాత ఎలక్టోరల్ బాండ్ వివరాలను ఎన్నికల సంఘం గత వారం బహిరంగపరిచింది. డేటా ప్రకారం, 2018లో బాండ్లను ప్రవేశపెట్టినప్పటి నుంచి అధికార బీజేపీ అత్యధిక మొత్తంలో (రూ. 6,986.5 కోట్లు) బాండ్లను స్వీకరించింది. తృణమూల్ కాంగ్రెస్ రెండవ అతిపెద్ద గ్రహీత (రూ. 1,397 కోట్లు) ఉంది. ఆ తర్వాత స్థానాల్లో కాంగ్రెస్ (రూ. 1,334 కోట్లు), బీఆర్ఎస్ (రూ. 1,322 కోట్లు), ఒడిశా అధికార పార్టీ బీజేడీ (రూ. 944.5) ఉన్నాయి. ఇక డీఎంకే ఆరో అతిపెద్ద గ్రహీతగా ఉంది. ఎవరీ శాంటియాగో మార్టిన్? శాంటియాగో మార్టిన్‌కు చెందిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ 2019 నుంచి 2024 మధ్య రూ.1,368 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. ఎన్నికల సంఘం గురువారం తన వెబ్సైట్లో అప్లోడ్ చేసిన డేటా ప్రకారం.. తన తరువాతి స్థానంలో ఉన్న దాత కంటే 40 శాతం ఎక్కువగా ఈ సంస్థ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. మార్టిన్ యుక్తవయసులో లాటరీ టిక్కెట్లను విక్రయిస్తూ లాటరీ-టు-రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. మార్టిన్ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రకారం.. ఆయన తన కుటుంబ పోషణ కోసం మయన్మార్‌లో యుక్తవయసులో కార్మికుడిగా పనిచేశాడు. 1980ల చివరలో భారతదేశానికి తిరిగి వచ్చి కోయంబత్తూరులో తన వ్యాపార ప్రస్తానాన్ని ప్రారంభించాడు. మార్టిన్ రెండు-అంకెల లాటరీ ఈ ప్రాంతంలో మంచి ప్రజాదరణ పొందింది. దీంతో ఇతర రాష్ట్రాలతోపాటు పొరుగున ఉన్న భూటాన్, నేపాల్ దేశాలకు విస్తరించాడు. -
డీఎంకే, కాంగ్రెస్ వైఖరి ఇప్పటికీ అలాగే.. మండిపడ్డ మోదీ
తమిళనాడును డీఎంకే - కాంగ్రెస్ ఇండియా కూటమి ఎప్పటికీ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చలేవని కన్యాకుమారిలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహిళలతో ఎలా అనుచితంగా ప్రవర్తించాలో కాంగ్రెస్, డీఎంకేలకు మాత్రమే తెలుసు. డీఎంకే మహిళల పేరుతో రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. జయలలితకు డీఎంకే నేతలు ఏం చేశారో అందరికీ గుర్తుంది. మహిళల పట్ల వారి వైఖరి ఇప్పటికీ అలాగే ఉంది. తమిళనాడులో మహిళలపై నేరాలు పెరిగాయి. మేము పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ - డీఎంకే మద్దతు ఇవ్వలేదు. తమిళనాడు ఓడరేవు మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని తెలిపారు. నేను ఇటీవల తూత్తుకుడిలో చిదంబరనార్ పోర్టును ప్రారంభించాను. మా ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం కూడా కృషి చేస్తోంది. ఆధునిక ఫిషింగ్ బోట్లకు ఆర్థిక సహాయం అందించడం నుంచి వాటిని కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం పరిధిలోకి తీసుకురావడం వరకు మేము వారి సంరక్షణను తీసుకున్నామని మోదీ వెల్లడించారు. ప్రధాని మోదీ తన ప్రభుత్వ సంక్షేమ పథకాలను, డీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎత్తిచూపుతూ 2జీ కుంభకోణంతో ప్రజల సొమ్మును దోచుకున్నారని అన్నారు. ఒకవైపు బీజేపీ సంక్షేమ పథకాలు.. మరోవైపు మీ వద్ద INDI అలయన్స్ స్కామ్ జాబితా ఉంది. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ.. తమిళనాడులోని డీఎంకే - కాంగ్రెస్ కూటమి దురహంకారాన్ని బద్దలు కొట్టనుందని మోదీ అన్నారు. -
ద్రవిడవాదంలో వేర్పాటు నినాదం
వెనుకబాటుతనం ఆ ప్రాంతంలో అసంతృప్తిని రేకెత్తించడం, అది ఆగ్రహమై, ఉద్యమంగానో, ఆఖరికి ఉగ్రవాదంగానో పరిణమించడం పరిపాటే. ఒకప్పుడు ఈశాన్య భారతదేశంలో ప్రత్యేక దేశం నినాదాలు వినిపించేవి. కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు కూడా ఇదే వినిపించేవారు. రెడ్ కారిడార్ నినాదంలో కూడా ఇందుకు సంబంధించిన ఛాయలు ఉన్నాయి. కానీ తమిళనాడులో ద్రవిడవాదం మోతాదు ఎక్కువగా ఉన్న డీఎంకే వినిపించే వేర్పాటువాదం, తామొక జాతి అని చెప్పుకోవడం వెనుక కుత్సిత రాజకీయం మాత్రమే ఉంది. ఆ పార్టీలో కొందరు ప్రత్యేక దేశం నినాదాన్ని అందుకోవడం చరిత్ర పట్ల మహా ద్రోహం. భారతదేశం ఐక్యంగా ఉండాలన్న భావన కేవలం బీజేపీది అనుకోవడం అజ్ఞానం. ఒక పార్టీ మీద ద్వేషం దేశ ఐక్యతకు విఘాతం కారాదు. భారత ఈశాన్య ప్రాంతాన్నో, కశ్మీర్ లోయ పరిస్థితులతోనో పోలిస్తే తమిళనాడు ప్రాంతం వేర్పాటువాద నినాదాన్ని అందుకోవలసిన అగత్యం ఏమాత్రం లేదు. కొందరు నాయకుల అజెండా ప్రజలందరి ఆశయం కూడా కాదు. తమిళ సమాజంలో అందుకు సంబంధించిన రుజువులు కూడా లేవు. చెన్నై ఇవాళ నాలుగు మెట్రో నగరాలలో ఒకటి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం (ఏ పార్టీది అయినా) అండ లేకుండా అది సాధ్యమయ్యే దేనా? ఢిల్లీ వివక్షే చూపి ఉంటే జరిగేదేనా? ద్రవిడవాదం, అది చెప్పే ప్రాంతీయవాదం, వేర్పాటువాదం, నాస్తికత్వం తమిళనాట కొద్దిమందిలో ఉంటే ఉండవచ్చు. మెజారిటీ ప్రజలు కచ్చితంగా వాటికి దూరంగానే ఉన్నారు. అక్కడి జీవన సరళిని చూసినవారు ఎవరైనా దీనిని ఒప్పుకుంటారు. కాబట్టి తమిళనాడులో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించే వాదనలు కుత్సిత రాజకీయానికి సంబంధించినవే. డీఎంకే ఎంపీ ఎ.రాజా తాజాగా భారత్ ఒక దేశం కాదని తీర్పు ఇచ్చాడు. ఇది కొన్ని రాష్ట్రాల కూటమి అంటాడు. ఒక దేశమైతే ఒకే భాష ఉంటుందని వింత భాష్యం చెప్పాడు. తమిళనాడుకు దేశం అనదగ్గ లక్షణాలు ఉన్నాయంటాడు. ఈ దేశంలో అనుసంధాన భాషగా సంస్కృతం చిరకాలం ఉంది. రాజా వాదన మీదే ఒక్క క్షణం నిలబడి ఇంకొక ప్రశ్న వేయాలి. తమిళనాడులోనే ఉన్న కొంగునాడు (కొంత భాగం కేరళ, కర్ణాటకలలో కూడా విస్తరించి ఉంది) ప్రజలు ఇది కూడా ‘నాడు’, కాబట్టి తమదీ ఒక జాతేననీ, తమకూ దేశం కావాలనీ అంటే డీఎంకే ప్రభుత్వం నుంచి ఏం సమాధానం వస్తుంది? ‘నాడు’ అనేది భౌగోళిక ఉనికికి పేరు. అది మరచిపోతే ఎలా? తమిళులకో ప్రత్యేక దేశం కోరికతో ఈవీ రామస్వామి నాయకర్ క్రిప్స్ మిషన్‌కు వినతిపత్రం సమర్పించాడు. దానికి హేతుబద్ధమైన ప్రాతిపదిక ఏమిటో ఇప్పటికీ తెలియదు. ద్రవిడస్థాన్ నినాదంతో, కోరికతో ఏమాత్రం పొంతన లేనిది ముస్లింలకో ప్రత్యేక రాజ్యం. అది జిన్నా, కొందరు ముస్లింల కోరిక. అలాంటి జిన్నాను తనకు వత్తాసుగా తెచ్చుకోవాలని చూసి ఈవీ భంగపడిన సంగతి చరిత్ర ప్రసిద్ధమే. ‘నేను ముస్లింలందరికీ నాయకుడినే; కానీ తమిళులంతా నీ (ఈవీ) వెనుక లేరు’ అన్నది జిన్నా వివరణ. నేటికీ అదే వాస్తవం. తమిళులంతా ద్రవిడవాదం మత్తులో లేరు. ఏనాడూ లేరు. 1942లోనే కాలం చేసిన ఆ వాదాన్ని ఆవాహన చేస్తామని బెదిరిస్తూ డీఎంకే పబ్బం గడుపుకొంటున్నది. ఇదంతా గమనించాక ఈవీ రామస్వామి నాయకర్ను పిచ్చాసుపత్రిలో ఉంచవలసిన వ్యక్తిగా ప్రథమ ప్రధాని నెహ్రూ కూడా భావించారు. కానీ ఇప్పటికీ అలాంటివాడి వికృత వాదంతో పార్టీలు రాజకీయాలు సాగించడమే విషాదం. ఎ.రాజా తాజా ప్రకటన కావచ్చు, ఆ మధ్య ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమా రుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన సనాతన ధర్మ వ్యతిరేక వ్యాఖ్యలు కావచ్చు, ఆ ఆవాహన బెదిరింపులో భాగమే. వీటికి తాజా నేపథ్యం ఉంది. దేశ రాజకీయాలలో బీజేపీ ప్రబల శక్తిగా ఎదగడం. ద్రవిడవాద అడ్డా తమిళనాడుకు రాదనుకున్న బీజేపీ... అన్నామలై (తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు) రూపంలో విశ్వరూపం దాల్చడం! భారత్ ఒక దేశం కాదు, ఉపఖండం అంటాడు రాజా. ఈ ఒక్క అంశమే కేంద్రబిందువుగా ఆయన వాదం సాగడం లేదు. దీనికి రాముడినీ, రామాయణాన్నీ జోడిస్తున్నాడు. ఆ రెండు అంశాల మీద ఆయనకి విశ్వాసం లేదట. లేకపోవచ్చు. కానీ రాజా ఈ రాముడినీ, రామాయణాన్నీ డీఎంకే వేర్పాటువాదానికి తోడు తెచ్చుకునే పిచ్చి ప్రయత్నం చేస్తున్నాడు. రాముడు భారతదేశ ఉత్తర భాగం వాడనీ, భారతభూమి దక్షిణ భాగంతో సంబంధమే లేదనీ డీఎంకే మొదటి నుంచి భాష్యం చెబుతోంది. ఈరోడ్ జిల్లా గోబిచెట్టిపాళయం వద్ద ఇటీవలే జరిగిన సభలో రాజా ఇవన్నీ మాట్లాడాడు. నిజానికి ఈ వాదం కూడా తప్పే. దీనికి అన్నామలై ఇటీవలనే చక్కని వివరణ ఇచ్చాడు. తమిళనాడులోనే ఆరణి క్షేత్రంలో శివాలయం ఉంది. దాని పేరు పుత్తరకామెట్టీశ్వరాలయం. దశరథుడు ఇక్కడికి వచ్చి తపస్సు చేసిన తరువాతే ఆయనకు సంతానం కలిగిందని ప్రతీతి. అలాగే రామేశ్వరానికీ, వారణాసికీ నేటికీ చెక్కుచెదరకుండా కొనసాగుతున్న బంధాన్ని మరచిపోరాదు. ఈ జనవరి 22న అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగిన బాలరాముడి ప్రతిమకు దక్షిణాది కన్నడిగుడే జన్మనివ్వడం యాదృచ్ఛికం కావచ్చు. భారతదేశం ఐక్యంగా ఉండాలన్న భావన 1950లలో పుట్టిన భారతీయ జనసంఘ్దో లేదా 1980లలో ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీదో అనుకోవడం శుద్ధ అజ్ఞానం. మొత్తం భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుంచి విముక్తం చేసే ఉద్దేశంతోనే భారత స్వాతంత్య్రోద్యమం సాగింది. దీనికి వందలాది ఉదాహరణలు చూపించవచ్చు. తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి జీవితమే దీనికి రుజువు. గాంధీజీ పిలుపునకు, సైమన్ కమిషన్ వ్యతిరేకోద్యమానికి తమిళనాడు కూడా కదిలింది. జాతీయ భావనతో, సాంస్కృతికంగా ఏకత్వం ఉన్న దేశంలో సామాజిక రాజకీయ ఏకత్వం తేవడానికి భారత జాతీయ కాంగ్రెస్, కొన్ని ఇతర అతివాద జాతీయ భావాలను నమ్మిన సంస్థలు పనిచేశాయి. జాతీయ కాంగ్రెస్ తన సభలు తమిళనాడులోనూ (నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ) పలుసార్లు నిర్వహించింది. అడయార్ కేంద్రంగా పనిచేసిన అనీబిసెంట్ భారతీయులందరి స్వేచ్ఛ కోసం పనిచేశారు. కానీ మరొక పక్క తమిళనాడులో బలపడిన జస్టిస్ పార్టీ బ్రిటిష్ వాళ్ల మోచేతి నీళ్లు తాగింది. భారత్ ఐక్యతకూ, భారతీయులు చైతన్యవంతం కావడానికీ ఇంగ్లండ్ బద్ధవ్యతిరేకి. ఎవరో ఒకరిని వివక్షతో అణచివేయడానికి కుటిలనీతిని అవలంబించడమే బ్రిటిష్ లక్షణం. దాని అవశేషమే ద్రవిడవాదం. దాని పేలికే డీఎంకే. భారతదేశ చరిత్రను బట్టి, సమీప గతాన్ని బట్టి, ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ పరిణామాల ఆధారంగా డీఎంకే నేతల వదరుబోతుతనం ఎంత నిర్హేతుకమో అర్ధం చేసుకొనే ప్రయత్నం చేయాలి. నాలుగు ముక్కలైన పోలెండ్ కలసిపోయింది. రెండు ముక్కలయిన జర్మనీ ఐక్యమైంది. వేరుకావడం వల్ల కలిగే కష్టనష్టాలను ప్రపంచం గుర్తిస్తున్న క్షణాలివి. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నా, ఆక్రమిత కశ్మీర్లో, బలూచిస్తాన్‌లో ప్రజలు తాము భారత దేశంలో భాగం కావాలనుకుంటున్నామని చెప్పుకోవడం వాస్తవం. ఇన్ని ఉదాహరణలు ఉండగా ఇంత అభివృద్ధి చెందిన దేశంలో వేరే దేశం కోరుకోవడం, అది కూడా తమ పార్టీ బలహీనపడే లేదా ఓడిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రత్యేక దేశం నినాదాన్ని అందు కోవడం చరిత్ర పట్ల మహా ద్రోహం. ఓట్ల రాజకీయంతో స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని భగ్నం చేయాలని అనుకుంటే ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పడం అవసరమే. ఇప్పుడు ఎ. రాజా ప్రకటననీ, అప్పుడు ఉదయనిధి స్టాలిన్ వాగుడునూ బీజేపీ ఖండించింది. అది సహజమే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించింది. ‘రాజా వ్యాఖ్యలతో నేను నూరు శాతం విభేదిస్తున్నాను’ అంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనేత్ నిర్ద్వంద్వంగా పేర్కొనడం స్వాగతించవలసినదే. ఆ పార్టీ కర్ణాటక ఎంపీ డీకే సురేశ్ రెండు భారతదేశాల గురించి మాట్లాడినందుకు ఇది పాప పరిహారం కావచ్చు. రేపు ఎన్నికలలో ‘ఇండి’ పేరుతో ఎన్డీఏని ఎదుర్కొ నబోతున్న కూటమి భాగస్వాములు తోటి ద్రవిడ భాగస్వామి చేస్తున్న ఇలాంటి ప్రేలాపనలను నిర్ద్వంద్వంగా ఖండించడం అవసరం. భార తీయ జనతా పార్టీని వ్యతిరేకించడం, దానిని అధికారం నుంచి దించా లనుకోవడం తప్పు పట్టవలసిన విషయం కాదు. కానీ ఒక రాజకీయ పార్టీ మీద ద్వేషం భారతదేశ ఐక్యతకు విఘాతం కారాదు. పి. వేణుగోపాల్ రెడ్డి వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ ‘ pvg@ekalavya.net -
‘నా వ్యాఖ్యలు వక్రీకరించారు.. అది డీఎంకే డీఎన్ఏ’
చెన్నై: మహిళలకు సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలను అధికార డీఎంకే పార్టీ వక్రీకరిస్తోందని బీజేపీ నేత కుష్బూ సుందర్ అన్నారు. తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఇంట్లో కుటుంబ పెద్దగా ఉన్న మహిళలకు ప్రతినెల రూ.1000 చొప్పున ఆర్థిక సాయం అందించే పథకంపై కుష్బూ సుందర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘మహిళలకు డీఎంకే ప్రభుత్వం రూ.1000 భిక్ష ఇస్తే.. వారికి ఓటు వేస్తారా?. డీఎంకే ప్రభుత్వం రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలిస్తే.. ప్రజలు ఇలా ప్రభుత్వం ఇచ్చే రూ.1000 భిక్ష తీసుకోవాల్సిన అవసరం లేదు’ అని ఆమె సోమవారం బీజేపీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొని అన్నారు. కుష్బూ చేసిన వ్యాఖ్యలు.. మహిళలను కించపరిచేలా ఉన్నాయని డీఎంపీ పార్టీ మహిళా విభాగం తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలిపింది. తాను చేసిన వ్యాఖ్యలను డీఎంకే వక్రీకరించిందని కుష్బూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. ‘మహిళలకు రూ. 1000 ఇచ్చే బదులు ప్రభుత్వం మద్యం షాపుల సంఖ్యను తగ్గించాలి.అలా చేయటం వల్ల మహిళలకు వేల రూపాయలు పొదుపు చేసినట్లు అవుతుంది.వారి కుటుంబాలకు సాయం చేసినట్లు అవుతుంది. వాళ్లు సంతోషంగా తల ఎత్తుకొని జీవిస్తారు. నేను మాట్లాడిన వ్యాఖ్యల వెనక ఉన్న అర్థం ఇది. నేను మహిళలను అవమానించినట్లు నా మాటలను తప్పుదోవ పట్టించారు. మహిళలపై తప్పుడు వ్యాఖ్యలు చేయటం డీఎంకే డీఎన్ఏ.. కానీ నాది కాదు’ అని కుష్బూ సుందర్ వివరణ ఇచ్చారు. ‘నేను ఎప్పుడు తప్పు చేయను. తప్పు చేసి పారిపోయే వ్యక్తిని కాదు. ధైర్యంగా మాట్లాడటం నేర్పిన వ్యక్తి కలైంజ్ఞర్ కరుణానిధి. మీరు( డీఎంకే) దానిని మర్చిపోయి ఉండవచ్చు. కానీ నేను మర్చి పోలేదు’ అని కుష్బూ అన్నారు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అయిన కుష్బూను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ చెన్నై సెంట్రల్ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
2019 ఫార్ములా రిపీట్.. కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లంటే..
లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో డీఎంకే 2019 ఫార్ములాను మళ్ళీ పునఃప్రారంభించింది. పార్టీ తన మిత్రపక్షమైన కాంగ్రెస్‌తో సీట్ల పంపకాల ఒప్పందం ఎట్టకేలకు ఖరారు చేసుకుంది. దీంతో తమిళనాడులో 9 స్థానాలు, పుదుచ్చేరిలో ఒక్క స్థానంలో కాంగ్రెస్ పోటీ చేయనుంది. సీట్ల పంపకాల ఒప్పందం డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, టీఎన్‌సీసీ చీఫ్ కే సెల్వపెరుంతగై, ఏఐసీసీ నేతలు కేసీ వేణుగోపాల్, అజయ్ కుమార్ సమక్షంలో జరిగింది. తమిళనాడు, పుదుచ్చేరిలో డీఎంకే నేతృత్వంలోని కూటమి మొత్తం 40 సీట్లను గెలుచుకుంటుందని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. కాంగ్రెస్, డీఎంకే మధ్య బంధం పటిష్టంగా ఉందని, కలిసికట్టుగా పోరాడి రాబోయే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని అన్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)తో అధికారిక పొత్తును ప్రకటించడం సంతోషంగా ఉందని, తమిళనాడులో 9 స్థానాలు మరియు పుదుచ్చేరిలో ఒక స్థానంలో కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని వేణుగోపాల్ అన్నారు. మిగిలిన స్థానాల్లో డీఎంకే అభ్యర్థులకు మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ (MNM) పార్టీ కూడా డీఎంకే నేతృత్వలోని కూటమిలో భాగమే. కానీ త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో వారికి స్థానం కేటాయించలేదు. ఆ తరువాత జరిగే రాజ్యసభ ఎన్నికలకు సీటు కేటాయించనున్నట్లు సమాచారం. కాగా ప్రజా సంక్షేమం కోసం మాత్రమే డీఎంకే నేతృత్వంలోని కూటమిలో చేరినట్లు కమల్ హాసన్ తెలిపారు. #WATCH | Tamil Nadu | Congress will contest elections on 9 seats in Tamil Nadu and one seat in Puducherry. On the remaining seats, we will support the candidates of DMK and alliance parties. We will win all 40 seats of Tamil Nadu, says Congress MP KC Venugopal pic.twitter.com/fcksz92VVK — ANI (@ANI) March 9, 2024 -
Chennai: డీఎంకేతో కుదిరిన కమల్‌హాసన్ పార్టీ పొత్తు.. డీల్ ఇదే
చెన్నై: ప్రముఖ నటుడు కమల్‌హాసన్ పార్టీ మక్కల్ నీది మయ్యమ్(ఎమ్ఎన్ఎమ్), అధికార డీఎంకే మధ్య తమిళనాడులో పొత్తు కుదిరింది. పొత్తులో భాగంగా తమ పార్టీ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని కమల్ పార్టీ ఎమ్ఎన్ఎమ్ శనివారం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో డీఎంకే కూటమి తరపున ప్రచారం మాత్రమే చేస్తామని తెలిపింది. చెన్నైలోని డీఎంకే కార్యాలయం అన్నా అరివలయంలో డీఎంకే చీఫ్, సీఎం స్టాలిన్‌తో కమల్‌హాసన్ భేటీ తర్వాత ఎమ్ఎన్ఎమ్ పార్టీ ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. అయితే పొత్తులో భాగంగా 2025లో డీఎంకే, ఎమ్ఎన్ఎమ్కు ఒక రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పొత్తు ప్రకటన అనంతరం కమల్‌హాసన్ మాట్లాడుతూ దేశ ప్రయోజనాల కోసం తాము డీఎంకే కూటమిలో చేరామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. తమిళనాడులోని 39, పుదుచ్చేరిలోని ఒక్క లోక్‌సభ స్థానాల్లో డీఎంకే తరపున ప్రచారం చేస్తానని తెలిపారు. ఇదీ చదవండి.. హిమాచల్ సంక్షోభం మళ్లీ మొదటికి -
'భారత్ ఒక దేశం కాదు'.. డీఎంకే ఎంపీ సంచలన వ్యాఖ్యలు
డీఎంకే ఎంపీ ఎ రాజా ద్వేషపూరిత ప్రసంగాలు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉన్నాయి. సనాతన ధర్మాన్ని నిర్మూలించమని ఉదయనిధి స్టాలిన్ పిలుపునిచ్చిన తరువాత, భారతదేశాన్ని బాల్కనైజేషన్ చేయాలని పిలుపునివ్వడమే కాకుండా.. రాముణ్ణి అపహేళన చేయడం, భారతదేశం ఒక దేశం కాదని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం ఒక దేశం కాదు. దీన్ని బాగా అర్థం చేసుకోండి. ఒక దేశం అంటే ఒక భాష, ఒక సంప్రదాయం, ఒక సంస్కృతి. అప్పుడు మాత్రమే అది ఒక దేశంగా పరిగణిస్తారు. భారతదేశం ఒక ఉపఖండం. కారణం ఏమిటంటే.. ఇక్కడ తమిళం ఒక దేశం, మలయాళం ఒక భాష. ఇలా దేశాలన్నీ కలిసి భారతదేశాన్ని ఏర్పరుస్తాయి. సంస్కృతులు కూడా వేరుగా ఉన్నాయంటూ.. మణిపూర్ ప్రజలపైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. మన ఇళ్లలోనే వంటగది, టాయిలెట్లకు ఒకే ట్యాంకర్ నుంచి నీళ్లు వస్తాయని. కానీ టాయిలెట్లో వచ్చే నీళ్లను వంటగదిలో ఉపయోగించరు. నీరు ఒక్కటే, అది వచ్చే ప్రదేశాన్ని బట్టి ఉపయోగించడమా.. లేదా అనేది మనమే నిర్ణయించుకుంటామని వ్యాఖ్యానించారు. ఈ వీడియోను బీజేపీ నేషనల్ ఇన్ఫర్మేషన్ & టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ అమిత్ మాల్వియా తన ఎక్స్ (ట్విటర్) ఖాతలో పోస్ట్ చేశారు. మేము రాముడికి శత్రువులు. నాకు రామాయణంపైనా, రాముడిపైనా విశ్వాసం లేదని ఎంపి ఎ రాజా వ్యాఖ్యానించారు. రాజా చేసిన ఈ వ్యాఖ్యలపైన అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయ ప్రధాన పూజారి మండిపడ్డారు. దీనిపైన ప్రధానికి, రాష్ట్రపతికి లేఖ రాస్తామని పేర్కొన్నారు. భారతదేశ ధర్మాన్ని అవమానించడం, హిందూ దేవుళ్లను బహిరంగంగా కించపరచడం వంటివి క్షమించరానివని, ఈ వ్యాఖ్యలను ఎవరూ అంగీకరించరని, వెంటనే ఎ రాజాను అరెస్టు చేయాలని తమిళనాడు బిజెపి అధికార ప్రతినిధులు అన్నారు. The hate speeches from DMK’s stable continue unabated. After Udhayanidhi Stalin’s call to annihilate Sanatan Dharma, it is now A Raja who calls for balkanisation of India, derides Bhagwan Ram, makes disparaging comments on Manipuris and questions the idea of India, as a nation.… pic.twitter.com/jgC1iOA5Ue — Amit Malviya (मोदी का परिवार) (@amitmalviya) March 5, 2024 -
స్టాలిన్ బర్త్‌డే.. బీజేపీ ‘కౌంటర్’ విషెస్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బీజేపీ తమిళనాడు విభాగం కూడా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పింది. కానీ, అందులో ఆయనకు కౌంటరే వేసింది. ఇటీవల ఇస్రో కొత్త కాంప్లెక్స్ శంకుస్థాపన సందర్భంగా డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనలో చైనా జెండా ఉండడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే ఈ యాడ్‌పై రాష్ట్ర మత్స్య మంత్రి అనిత ఆర్ రాధాకృష్ణన్ వివరణ కూడా ఇచ్చారు. ‘ప్రకటనలో చిన్న పొరపాటు జరిగింది. మాకు వేరే ఉద్దేశ్యం లేదు. మా హృదయాల్లో భారతదేశంపై ప్రేమ మాత్రమే ఉంది’ తెలిపారు. అయితే.. వివాదాన్ని కొనసాగిస్తూ.. సీఎం స్టాలిన్‌కు మాండరీన్ భాషలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది బీజేపీ. ఆయనకు(స్టాలిన్‌కు) ఇష్టమైన భాషలో శుభాకాంక్షలు తెలుపుతున్నామని ‘ఎక్స్’(ట్విటర్)లో బీజేపీ కౌంటర్ వేసింది. On behalf of @BJP4Tamilnadu, here’s wishing our Honourable CM Thiru @mkstalin avargal a happy birthday in his favourite language! May he live a long & healthy life! pic.twitter.com/2ZmPwzekF8 — BJP Tamilnadu (@BJP4TamilNadu) March 1, 2024 అంతకు ముందు.. తిరునెల్వేలిలో బుధవారం జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ డీఎంకేపై విమర్శలు సంధించారు. ‘ప్రస్తుతం హద్దులు దాటేశారు. ఇస్రో లాంచ్ చేసే రాకెట్‌కు చైనా స్టిక్కర్‌ను అతికించారు. ఇది మన అంతరిక్ష శాస్త్రవేత్తలు, అంతరిక్ష రంగాన్ని అవమానించడమే. ప్రజల పన్ను, డబ్బు, దేశాన్ని అవమానించటమే’అని ప్రధాని మోదీ అన్నారు. అయితే ప్రధాని వ్యాఖ్యలకు డీఎంకే ఊరుకోలేదు.. కౌంటర్ ఇచ్చింది. తూర్పు లడఖ్‌లోని నియంత్రణ రేఖ వెంబడి చైనా చొరబాట్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంటి చూపు కూడా సన్నగిల్లిందేమో.. మోదీ చైనా జెండాను పేపర్ యాడ్‌లో నిశిత దృష్టితో చూడగలరు. కానీ, గత పదేళ్లలో భారత భూభాగంలో చైనా జెండా పాతిందనే నివేదికలు ఆయన కళ్లను కప్పేశాయయేమో అని డీఎంకే ఎంపీ పి విల్సన్ విమర్శించారు. -
క్రెడిట్ కోసం చైనా స్టిక్కర్లు
-
ఇండియా కూటమిలో చేరికపై కమల్ హాసన్ స్పందన
చెన్నై: స్వార్థరహితంగా ఆలోచించే ఏ కూటమితోనైనా పొత్తుకు సిద్ధంగా ఉన్నామని తమిళనాడుకు చెందిన ఎమ్ఎన్ఎమ్ పార్టీ చీఫ్ కమల్‌హాసన్ తెలిపారు. ఇండియా కూటమిలో చేరతారా? అనే ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. ఇప్పటివరకైతే ఇండియా కూటమిలో తాము భాగస్వాములం కాదని స్పష్టం చేశారు. ఏ కూటమిలో చేరినా స్థానిక ఫ్యూడల్ శక్తులతో కలిసి మాత్రం పనిచేయబోమని చెప్పారు. స్టాలిన్‌కు చెందిన డీఎంకే పార్టీతో కమల్‌హాసన్ కలిసి పనిచేయబోతున్నారన్న పుకార్లు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో కమల్ ఇచ్చిన సమాధానం చర్చనీయాంశమైంది. స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని కమల్‌హాసన్ ఈ సందర్భంగా స్వాగతించారు. ఇదీ చదవండి.. గగన్‌యాన్‌పై ఇస్రో కీలక అప్డేట్ -
రెండు రోజుల్లో శుభవార్త వింటారు: కమల్ హాసన్
చెన్నై: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరో రెండు రోజుల్లో శుభవార్త చెప్తానని ప్రకటించారు నటుడు, మక్కల్ నీది మయ్యం(ఎమ్ఎన్ఎమ్) పార్టీ అధినేత కమల్ హాసన్. పార్లమెంట్ ఎన్నికల కోసం సద్ధమవుతున్నామని.. తమకు మంచి అవకాశాలు వస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల్లో పొత్తుకు సంబంధించి నిర్ణయం ప్రకటిస్తామని కమల్ హాసన్ వెల్లడించారు. తన తదుపరి చిత్రం ‘థగ్ లైఫ్’ షూటింగ్ కోసం అమెరికా వెళ్లిన కమల్ సోమవారం చెన్నై తిరిగొచ్చారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టులో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా లోక్‌సభ ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీతో కమల్ ఎమ్ఎన్ఎమ్ పొత్తు పెట్టుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని గత ఏడాది సెప్టెంబర్‌లో డీఎంకే నాయకుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్‌తో పోత్తుపై పార్టీ నేతలు నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. అంతేగాక సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వివాదాస్ప వ్యాఖ్యలకు మద్దతుగా కమల్ హాసన్ నిలిచారు. సనాతన ధర్మంపై మాట్లాడినందుకే చిన్న పిల్లావాడిని టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. ఇక 2018లో కమల్ హాసన్ ఎమ్ఎన్ఎమ్ పార్టీని స్థాపించారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికలు, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. అనంతరం గత ఏడాది జరిగిన ఈరోడ్ ఉప ఎన్నికల్లో డీఎంకే నిలబెట్టిన అభ్యర్థికి ఎమ్ఎన్ఎమ్ మద్దతు ఇచ్చింది. చదవండి: యూపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ‘ఆర్ఎస్ఎస్పీ’ -
TN: డీఎంకే ప్రచారం షురూ.. మారిన ప్రత్యర్థి !
చెన్నై: తమిళనాడులో లోక్‌సభ ఎన్నికల ప్రచారం మొదలైంది. అధికార పార్టీ డీఎంకే ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. ‘హక్కుల కోసం స్టాలిన్ పోరు’ పేరుతో ప్రచార భేరి మోగించింది. చెన్నైలోని మూడు, పుదుచ్చేరిలోని ఒక్క పార్లమెంట్ నియోజకవర్గం తప్ప రాష్ట్రంలోని 37 లోక్‌సభ స్థానాల్లో ఒకేసారి ప్రచారం ప్రారంభించింది. సాధారణంగా తమిళనాడులో ఎన్నిక ఏదైనా డీఎంకే, అన్నా డీఎంకే మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుంది. అయితే ఈసారి అనూహ్యాంగా డీఎంకే నేతలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి ప్రారంభించారు. తమిళనాడుకు అన్యాయం చేస్తున్న బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించాల్సిందేనని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి నిధులు రావాలన్నా,మైనారిటీల హక్కులు కాపాడాలన్నా ఇండియా కూటమి అధికారంలోకి రావాల్సిందేనన్నారు. విరుదునగర్ జిల్లాలో జరిగిన ప్రచారంలో ఎంపీ కనిమొలి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమిళనాడుకు నిధులివ్వకపోయినప్పటికీ స్టాలిన్ విద్య,వైద్యం రంగాల్లో రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా నిలిపారని చెప్పారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి రాకూడదని, వారు ఒక వర్గం ప్రజలను విలన్లుగా చిత్రీకరిస్తున్నారని మంత్రి శేఖర్‌బాబు ఆరోపించారు. మరోవైపు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై డీఎంకే ఫైల్స్ 3 పేరుతో టూ జీ కుంభకోణానికి సంబంధించి డీఎంకే నేతల ఆడియో విడుదల చేశారు. ఇదీ చదవండి.. భారత్ జోడో న్యాయ యాత్రకు అఖిలేశ్ దూరం -
TN: మంత్రి పదవికి సెంథిల్ బాలాజీ రాజీనామా
చెన్నై: మనీలాండరింగ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ మంగళవారం ఉదయం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని డీఎంకే పార్టీ వర్గాలు ధృవీకరించాయి. మరో రెండు రోజుల్లో మద్రాస్ హైకోర్టులో బాలాజీ బెయిల్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. న్యాయపరమైన చిక్కుల వల్లే బాలాజీ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. గత ఏడాది జూన్ 14న మనీలాండరింగ్ కేసులో బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)అరెస్టు చేసింది. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో బాలాజీపై చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు క్యాష్ ఫర్ జాబ్ స్కామ్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ బాలాజీని అరెస్టు చేసింది. అరెస్టయి జైలులో ఉన్నప్పటికీ బాలాజీని సీఎం స్టాలిన్ మంత్రివర్గంలోనే కొనసాగించారు. పోర్ట్‌ఫోలియో మాత్రం కేటాయించలేదు. అయితే దీనిపై హైకోర్టు ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసింది. బాలాజీని మంత్రి పదవిలో కొనసాగించే విషయమై మరోసారి ఆలోచించాలని సీఎం స్టాలిన్‌కు కోర్టు సూచించింది. దీంతో బెయిల్ పిటిషన్ రెండోసారి హైకోర్టు ముందు విచారణకు రానున్న నేపథ్యంలో బాలాజీ మంత్రి పదవికి రాజీనామా చేయడం గమనార్హం. ఇదీ చదవండి.. హస్తినలో హై టెన్షన్ -
‘మంత్రిగా పనికి రావు’.. డీఎంకే ఎంపీ అనుచిత వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: లోక్‌సభలో డీఎంకే ఎంపీ టీఆర్ బాలు కేంద్రమంత్రిపై చేసిన వ్యాఖ్యలు గందరగోళం రేపాయి. లోక్‌సభ క్వశన్ అవర్ సమయంలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్‌పై ఎంపీ టీఆర్ బాలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్లో ప్రకృతి విపత్తుల వల్ల భారీ వర్షాలు, వరదలతో దక్షిణ చెన్నై అతలాకుతలం అయిందని.. నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్రం ఎటువంటి బృందాన్ని పంపిందని డీఎంకే పార్టీ ఎంపీలు ఏ రాజా, ఏ గణేశ్‌మూర్తి ప్రశ్నించారు. ఇదే సమయంలో తమిళనాడుకు చెందిన కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ జోక్యం చేసుకునే ప్రయత్నం చేయగా.. డీఎంకే ఎంపీ టీఆర్ బాలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘మీరు ఎందుకు ఈ విషయంతో జోక్యం చేసుకుంటున్నారు. మీరు దయచేసిన కూర్చోండి. అసలు మీకు ఏం కావాలి?. మీరు పార్లమెంట్ సభ్యులుగా అర్హులు కారు. మీరు కేంద్ర మంత్రిగా పనికిరారు’ అని డీఎంకే ఎంపీ విమర్శలు చేశారు. దీంతో వెంటనే స్పందించిన కేంద్ర మంతి ప్రహ్లాద్ జోషి, అర్జున్ రామ్ మేఘవాల్ ఎంపీ టీఆర్ బాలు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు దళితులను అవమానించటం కిందకు వస్తాయని ఆరోపించారు. ‘డీఎంకే ఎంపీ టీఆర్ బాలు ఒక ప్రశ్న అడిగారు. దానికి కేంద్ర మంతి ఎల్ మురుగన్ స్పందిస్తూ.. అప్రస్తుత ప్రశ్న అని తెలిపే క్రమంలో టీఆర్ బాలును.. మురుగన్‌ను కేంద్ర మంత్రిగా పనికిరావు అని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు దళిత వర్గాన్ని అవమానించటం కిందకు వస్తాయి. ఎంపీ టీఆర్ బాలు.. మంత్రి మురుగన్‌కు క్షమాపణ చెప్పాలి’ అని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ డిమాండ్ చేశారు. ఎంపీ టీఆర్ బాలు వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ఎల్ మురుగన్ స్పందించారు.‘ డీఎంకే పార్టీ వెనకబడిన కులాల నుంచి ఓ వ్యక్తి మంత్రిగా ఎదగటాన్ని సహించలేకపోతుంది. అందుకే నాపై అనుచిత వ్యాఖ్యలు చేయించి.. నా కులాన్ని అవమానపరిచింది’ అని మండిపడ్డారు. కేంద్రమంత్రిపై డీఎంకే ఎంపీ టీఆర్ బాలు చేసిన వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తీవ్రంగా ఖండించారు. బాలు ఇలాంటి దళిత వర్గాలపై అనుచిత వ్యాఖ్యలు ఇదే మొదటిసారి కాదని మండిపడ్డారు. Thiru TR Balu is a disgrace to politics & this is not the first time he has made disgraceful remarks about a member of the Scheduled Caste Community. I strongly condemn these remarks on Hon MoS Thiru @Murugan_MoS avl in the Temple of Democracy. Our Hon PM Thiru @narendramodi… pic.twitter.com/TDt3p39hks — K.Annamalai (@annamalai_k) February 6, 2024 -
తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్?
చెన్నై: డీఎంకే నేత, క్రీడా శాఖా మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ను తమిళనాడు ఉపముఖ్యమంత్రిగా చేయనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరిలో స్టాలిన్ విదేశీ పర్యటనకు వెళ్లే క్రమంలో ఉదయనిధిని డిప్యూటీ సీఎం హోదాలో ఉంచనున్నారని డీఎంకే వర్గాలు తెలిపాయి. జనవరి 21న సేలంలో జరగనున్మ పార్టీ యూత్ వింగ్ సమావేశం తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా చేసేది ముఖ్యమంత్రి మాత్రమేనని డీఎంకే ఆర్గనైజేషనల్ సెక్రటరీ ఎళంగోవన్ అన్నారు. ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా చేయనున్నారనే విషయం తనకు తెలియదని చెప్పారు. అయినప్పటికీ ఉదయనిధి పార్టీలో చాలా చురుకుగా ఉంటారు.. డిప్యూటీ సీఎం హోదా ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదని చెప్పారు. ఈ అంశంపై ఉదయనిధిని ప్రశ్నించగా.. ఆయన పుకారుగా పేర్కొన్నారు. ఉదయనిధిని ఉపముఖ్యమంత్రిగా చేస్తున్నారనే వార్తలపై అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం(ఏఐఏడీఎంకే) విమర్శించింది. ఉదయనిధికి ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు.. ఆ తర్వాత మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా ఉపముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. 2026లో ఉదయనిధిని ముఖ్యమంత్రిని కూడా చేయాలనుకుంటారు. డీఎంకేలో పరివార్ వాదానికే ప్రాధాన్యం ఉందని, ప్రజాస్వామ్యం లేదని ఏఐఏడీఎంకే నేతలు విమర్శించారు. ఇదీ చదవండి: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుపై అవిశ్వాసానికి పిలుపు -
ఒక్క సీటుతో కింగ్‌మేకర్.. కూటమిలతో తగ్గిన విజయకాంత్ క్రేజ్
కోలీవుడ్ ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ (71) అనారోగ్యంతో చికిత్స పొందుతూ... నేడు (డిసెంబర్ 28) తుది శ్వాస విడిచారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. విజయకాంత్ మృతి పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. విజయకాంత్ జననం: విజయకాంత్ 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురైలో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అలగరస్వామి. సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత తన పేరును విజయకాంత్‌గా మార్చుకున్నారు. విజయకాంత్‌కు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. సినిమా ఎంట్రీ: విజయకాంత్ 27 ఏళ్ల వయసులో సినీ రంగ ప్రవేశం చేశారు. 1979లో 'ఇనిక్కుం ఇలామై' చిత్రంతో విలన్‌గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి 2015 వరకు 150కి పైగా చిత్రాల్లో నటించారు. రోజుకు మూడు షిఫ్టులు పనిచేశారు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నప్పటికీ. ఆ తర్వాత ఆయన నుంచి ఎన్నో మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 1984లో విజయకాంత్ నుంచి 18 సినిమాలు విడుదలయ్యాయి. 20కి పైగా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. విజయకాంత్ తమిళ చిత్రాల్లో మాత్రమే నటించారు. ఇతర భాషల్లో నటించలేదు. కానీ ఆయన సినిమాలు చాలా భాషల్లో డబ్బ్ అయ్యాయి. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ లకు విజయకాంత్ ఒకప్పుడు గట్టి పోటీ ఇచ్చారు. విజయకాంత్ మెసేజ్ బేస్డ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. దేశభక్తి చిత్రాలైనా, గ్రామీణ నేపథ్య సినిమాలైనా, ద్విపాత్రాభినయాలైనా నటించేందుకు విజయకాంత్ ఎప్పుడూ ముందుండేవారు. వాటితో పాటు కమర్షియల్ సినిమాల్లోనూ సందడి చేసేవారు. అయితే ఆయన ఏ నిర్మాత వద్ద కూడా ముందుగా డబ్బు తీసుకోడని కోలీవుడ్ పరిశ్రమలో గుర్తింపు ఉంది. కోలీవుడ్ నిర్మాతలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే వారి నుంచి రెమ్యూనరేషన్ తీసుకోకుండానే సినిమా అవకాశం ఇస్తారని సమాచారం. ఒక్క సీటుతో రాజకీయ ప్రయాణం 2005లో దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం (డీఎండీకే) అనే పార్టీని సినీ నటుడు విజయకాంత్ ఏర్పాటు చేశారు. తొలిసారిగా 2006 ఎన్నికల సమయంలో తన పార్టీ నుంచి తానొక్కడే గెలిచాడు.. కానీ ఆయన పార్టీ 10 శాతం ఓట్లు సాధించి తమిళ రాజకీయాలలో విజయకాంత్‌ను ప్రత్యామ్నాయ శక్తిగా మార్చింది. 2011 అసెంబ్లీ ఎన్నికలలో జయలలిత (అన్నాడీఎంకే)తో చేతులు కలిపి 41 సీట్లలో 29 స్థానాలను గెలుచుకున్నారు. ఆ సమయంలో ఎం.కరుణానిధి (డీఎంకే) పార్టీని చిత్తు చేసిన విజయకాంత్ ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించారు. ఆ తదుపరి అన్నాడీఎంకేతో వైరం వంటి పరిణామాలు విజయకాంత్ పార్టీకి గడ్డు పరిస్థితులను సృష్టించాయి. దీంతో జయలలిత, విజయకాంత్ పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి. కూటమిల పేరుతో నష్టం 2014 లోక్‌సభ ఎన్నికలలో ఆయన ఎన్డీఏతో వెళ్లి ఓటమిని చవి చూశారు. కానీ ఓటు బ్యాంక్ శాతం పెంచుకోవడం ఆయనకు కలిసి వచ్చిన అంశంగా మారింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే నేతృత్వంలో రాష్ట్రంలో మూడో కూటమి అవతరించినా, ఫలితం శూన్యం. ఆ ఎన్నికల్లో అన్నిచోట్ల విజయకాంత్ కూటమి పార్టీ డిపాజిట్లను కోల్పోయింది. ఆ ఎన్నికల్లో విజయకాంత్ కూడా సుమారు 50 వేలకు పైగా ఓట్లతో ఓటమి చెందారు. ఆ తర్వాత వరుస ఓటములు ఎదురైనా ఏ మాత్రం డీలా పడకుండా కేడర్ మద్దతు, సినీ అభిమానుల అండతో ఒంటరిగానే పార్టీని నడిపిస్తూ వచ్చారు. కానీ కూటమిల పేరుతో ఆయన ఇతర పార్టీలకు అనుకూలంగా పనిచేయడం, ఇతర పార్టీలకు చెందిన అధినేతల సలహాలతో డీఎండీకేను ముందుకు నడపడం వంటి కారణాలతో ఆయన ఇమేజ్ క్రమేపి తగ్గుతూ వచ్చింది. ఇంతలో ఆయన తరుచుగా అనారోగ్యంతో ఇబ్బందులు పడటం కూడా పార్టీకి నష్టం వాటిల్లింది. చివరకు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా, పార్టీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షించ లేని పరిస్థితి నెలకొంది పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కూడా ఆయన సతీమణి ప్రేమలతకు ఆయన అప్పచెప్పారు. తాజాగా ఆయన మరణం డీఎండీకే పార్టీకి తీరని లోటు అని చెప్పవచ్చు. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలలో ఆయన సతీమణి ప్రేమలత ఒంటరిగానే బరిలోకి దిగుతారా..? మరేదైనా పార్టీకి మద్ధతు ఇస్తారా..? అనేది తేలాల్సి ఉంది. -
నా వ్యాఖ్యలను బీజేపీ తప్పుదారి పట్టించింది: ఉదయనిధి
చెన్నై: సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరించిందని డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. తన వ్యాఖ్యలను పెద్దవిగా చేసి దేశమంతా విస్తరించేలా చేశారని ఆరోపించారు. మారణహోమానికి పిలుపునిచ్చానని పేర్కొంటూ తన వ్యాఖ్యలను ప్రధాని మోదీ తప్పుదారి పట్టించారని విమర్శించారు. సనాతన ధర్మాన్ని కరోనా, డెంగ్యూతో పోలుస్తూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సనాతన ధర్మంపై తాను వ్యాఖ్యలను మధ్యప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తప్పుదారి పట్టించారని ఆరోపించిన ఉదయనిధి స్టాలిన్.. “నేను మారణహోమానికి పిలుపునిచ్చానని మోదీ అన్నారు. కానీ నేను చెప్పని విషయాలను ఆయన అన్నారు. నేను ఒక సమావేశంలో పాల్గొని మూడు నిమిషాలు మాత్రమే మాట్లాడాను. ఎలాంటి వివక్ష లేకుండా అందరినీ సమానంగా చూడాలనే ఉద్దేశంలో వివక్షను రూపుమాపాలి అని మాత్రమే నేను మాట్లాడాను. కానీ దాన్ని వక్రీకరించి పెద్దది చేసి యావత్ భారతదేశం నా గురించి మాట్లాడుకునేలా చేశారు." అని ఉదయనిధి అన్నారు. “ఓ సాధువు నా తలపై 5-10 కోట్ల రూపాయల బహుమతిని ప్రకటించారు. ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తోంది. కోర్టులపై నమ్మకం ఉంది. ఆ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని నన్ను అడిగారు. క్షమాపణ చెప్పలేనని చెప్పాను. నేను స్టాలిన్ కొడుకుని, కలైంజ్ఞర్ మనవడిని, నేను వారి భావజాలాన్ని కొనసాగిస్తాను." అని ఉదయనిధి తెలిపారు. ‘తమిళనాడు ప్రొగ్రెసివ్ రైటర్స్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’.. ‘సనాతన నిర్మూలన’ పేరుతో సెప్టెంబర్‌లో నిర్వహించిన సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ హాజరై ప్రసంగించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని, దీనిని కేవలం వ్యతిరేకించడమే కకుండా.. పూర్తిగా తొలగించాలని వ్యాఖ్యానించారు. అది తిరోగమన సంస్కృతి అని.. ప్రజలను కులాలు పేరిట విభజించిందని పేర్కొన్నారు. సమానత్వానికి, మహిళా సాధికారతకు సనాతన ధర్మం వ్యతిరేకతమని అన్నారు. ఈ క్రమంలోనే సనాతన ధర్మాన్ని డెంగ్యూ, కరోనాతో పోల్చారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఇదీ చదవండి: ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా సస్పెన్షన్ ఎత్తివేత -
ఈడీకి స్టాలిన్ సర్కారు షాక్..!
చెన్నై: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి తమిళనాడు ప్రభుత్వం షాకిచ్చింది. దిండిగల్ జిల్లాలోని ఓ ప్రభుత్వ డాక్టర్ నుంచి రూ.20 లక్షలు లంచం తీసుకున్నందుకు మధురై జోన్ ఈడీ అధికారి అంకిత్ తివారీని తమిళనాడు విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ పోలీసులు అరెస్టు చేశారు. ఈడీ అధికారి అరెస్టు రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపింది. డీఎంకే, బీజేపీ పరస్పర మాటల దాడికి దిగాయి. ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాదని ఎక్స్టార్షన్ డిపార్ట్మెంట్ అని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ ట్విట్టర్లో ఎద్దేవా చేశారు. ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని ఈడీని బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఫైరయ్యారు. ఈడీపై ఎంపీ దయానిధి మారన్ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఒక్క అధికారి తప్పు చేస్తే మొత్తం ఏజెన్సీనే తప్పు పట్టడం సరికాదని పేర్కొంది. ఈడీ అధికారి అమాయకుడైతే విజిలెన్స్ పోలీసులు వచ్చినప్పుడు ఎందుకు పారిపోయాడని స్టేట్ కాంగ్రెస్ చీఫ్ కె.ఎస్ అళగిరి ప్రశ్నించారు. The Directorate of Vigilance & Anti-Corruption police , Tamil Nadu have arrested an ED Officer for demanding and accepting a bribe of ₹20 Lakh in Dindigul. This shatters the faith citizens have in public institutions, making one wonder if ED stands for Extortion Department or… — Dayanidhi Maran தயாநிதி மாறன் (@Dayanidhi_Maran) December 2, 2023 ఇదీచదవండి..ఎంపీ మహువా లోక్‌సభ సభ్యత్వం రద్దుకు కేంద్రం చర్యలు! -
డిప్యూటీ సీఎంగా ఉదయనిధి?
సాక్షి, చైన్నె: డీఎంకే వారసుడు ఉదయ నిధి స్టాలిన్ సోమవారం 46వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఇదే సమయంలో ఆయనకు డిప్యూటీ సీఎం పదవి అప్పగించాలనే నినాదం తెర మీదకు వచ్చింది. డిసెంబరులో జరిగే యువజన మహానాడు అనంతరం ఆయనకు ప్రమోషన్ ఖాయం అనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. వివరాలు.. రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి, డీఎంకే యువజన విభాగం ప్రధాన కార్యదర్శి ఉదయ నిధి స్టాలిన్ జన్మదినాన్ని డీఎంకే యువజన విభాగం వాడవాడలా సేవా కార్యక్రమాలతో ఘనంగా జరుపుకున్నాయి. ఉదయాన్నే తండ్రి, సీఎం స్టాలిన్, తల్లి దుర్గా ఆశీస్సులను ఉదయ నిధి అందుకున్నారు. అదే సమయంలో డీఎంకే యూత్ నేతృత్వంలో ఉదయ నిధి కోసం ఎంగల్ అన్న ( మా అన్న)పేరిట ఓ పాటల సీడీని సిద్ధం చేసింది. అలాగే ఉదయ నిధి నటించి విజయవంతమైన మామన్నన్ చిత్రంలోని ఓ పాట ఆధారంగా మరో ప్రత్యేక గీతాన్ని సిద్ధం చేశారు. వీటిని మంత్రి అన్బిల్ మహేశ్ విడుదల చేశారు. ఇక రానున్న లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉదయ నిధి సేవలను మరింత విస్తృతంగా ఉపయోగించుకునేందుకు వీలుగా ఆయనకు ప్రమోషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం ఊపందుకుంది. తండ్రి బాటలోనే.. తన తండ్రి, పార్టీ అధినేత కరుణానిధి వారసుడిగా డీఎంకే రాజకీయాల్లో ఎంకే స్టాలిన్ చక్రం తిప్పిన విషయం తెలిసిందే. తండ్రి సీఎంగా ఉన్న కాలంలో ఆయన డిప్యూటీ సీఎంగా అధికార వ్యవహారాల్లో దూసుకెళ్లారు. తండ్రి మరణంతో డీఎంకే పగ్గాలు చేపట్టి ప్రస్తుతం సీఎంగా ద్రవిడ మోడల్ పాలన నినాదంతో ముందుకెళ్తున్నారు. అదే సమయంలో తన వారసుడు ఉదయ నిధి స్టాలిన్‌ను సైతం రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో సినీ నటుడిగా డీఎంకే రాజకీయాల్లోకి వచ్చిన ఉదయ నిధి ప్రజాకర్షణలో ఫలితం సాధించారు. 2021 లోక్ సభ ఎన్నికలలో తండ్రి స్టాలిన్‌తో సమానంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారంలో దూసుకెళ్లడమే కాదు, చేపాక్కం ట్రిప్లికేన్ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పగ్గాలు అందుకున్నారు. ఏడాది తర్వాత ఆయనకు మంత్రి పదవి అప్పగించాలని పలువురు సినీయర్లు నినాదించడంతో క్రీడల శాఖను కేటాయించారు. ప్రస్తుతం డిప్యూటీ నినాదం తెర మీదకు వచ్చిన నేపథ్యంలో ప్రమోషన్ ఉంటుందా..? లేదా..? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. -
మంత్రులూ... అవేం మాటలు?
చెన్నై: అధికారంలో ఉన్నవారిలో సమాజంలో చీలిక తెచ్చే వ్యాఖ్యలు చేసే ధోరణి ప్రబలుతోందంటూ మద్రాస్ హైకోర్టు ఆందోళన వెలిబుచి్చంది. ఇలాంటి వ్యాఖ్యలు సమాజంపై చూపే ప్రతికూల ప్రభావం తాలూకు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకోవాలని హితవు పలికింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సెపె్టంబర్లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడం తెలిసిందే. ‘సనాతన ధర్మ నిర్మూలన’పేరిట జరిగిన ఆ సభలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు అందులో పాల్గొన్న అధికార డీఎంకేకు చెందిన పలువురు ఇతర మంత్రులు కూడా మద్దతు పలికారు. ఈ ధోరణిపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలకు దిగే బదులు డ్రగ్స్, అవినీతి, అంటరానితనం తదితర పెడ ధోరణుల నిర్మూలనపై దృష్టి పెడితే మంచిదని వారికి సూచించింది. సదరు మంత్రులపై ఇంకా చర్యలెందుకు తీసుకోలేదంటూ పోలీసులకు తలంటింది. మంత్రుల వ్యాఖ్యలకు పోటీగా ద్రవిడ సిద్ధాంత నిర్మూలన సదస్సుకు అనుమతించేలా పోలీసులను ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తి స్టవిస్ జి.జయచంద్రన్ కొట్టేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సనాతన ధర్మ నిర్మూలన సభను ఉదాహరిస్తూ, అందుకు పోటీగా సభ పెట్టుకునేందుకు పిటిషనర్ అనుమతి కోరుతున్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన మంత్రులు తదితరులపై అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితే వచ్చేది కాదు కదా! పిటిషనర్ విజ్ఞప్తికి అంగీకరించడమంటే సమాజంలో మరింత చీలిక తేవడమే కాదా?’’అని ప్రశ్నించారు. మంత్రుల తీరుపైనా ఈ సందర్భంగా న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెడతామంటూ చేసిన ప్రమాణాలకు విరుద్ధంగా అధికారంలో ఉన్న కొందరు ప్రవర్తిస్తున్న తీరుతో ప్రజలు ఇప్పటికే విసిగిపోయి ఉన్నారు. ఇలాంటి సమావేశాలకు అనుమతినిచ్చి వారికి శాంతిని మరింత కరువు చేయమంటారా?’’అన్నారు. నా వ్యాఖ్యలకు కట్టుబడ్డా: ఉదయనిధి చెన్నై: సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు తమిళనాడు యువజన సంక్షేమ మంత్రి, సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ పునరుద్ఘాటించారు. ఈ అంశంపై న్యాయ వివాదం తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధమన్నారు. ‘సనాతన ధర్మం కరోనా, మలేరియా, డెంగీ వంటిది. అది సామాజిక న్యాయానికి వ్యతిరేకం. దాన్ని నిర్మూలించాలి‘ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్త దుమారానికి దారితీయడం తెలిసిందే. అణగారిన, పీడిత వర్గాల తరఫున తనలా మాట్లాడానని ఆయన సోమవారం చెప్పుకొచ్చారు. అంబేడ్కర్, పెరియార్ రామస్వామి నాయకర్ వంటి గొప్ప నేతలు కూడా గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్నారు. -
TN: రాజ్‌భవన్‌పై పెట్రో బాంబుల దాడి
చెన్నై: తమిళనాడు రాజ్‌భవన్ వద్ద పోలీసులు బుధవారం హైఅలర్ట్ ప్రకటించారు. ఓ వ్యక్తి పెట్రోల్ బాంబులతో రాజ్‌భవన్‌పై దాడికి పాల్పడడమే అందుకు కారణం. అయితే ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. రాజ్‌భవన్ మెయిన్ గేట్ వద్ద బారికేడ్లు మాత్రం ధ్వంసం అయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు ఘటనకు కారణమైన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. బుధవారం మధ్యాహ్నాం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రెండు పెట్రోల్ బాంబుల్ని రాజ్‌భవన్ మెయిన్ గేట్ వద్దకు విసిరేశాడు ఆగంతకుడు. ఆ ధాటికి బారికేడ్లు ధ్వంసం అయ్యాయి. రోడ్డు కొంత భాగం దెబ్బ తింది. వెంటనే అతన్ని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నిందితుడ్ని కారుకా వినోద్‌గా గుర్తించారు. ఘటన సమయంలో గవర్నర్ రాజ్‌భవన్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. సైదాపేట కోర్టు బయట పార్క్ చేసిన ఉన్న బైకుల నుంచి పెట్రోల్ దొంగతనం చేసిన వినోద్.. రాజ్‌భవన్ వైపు నడుచుకుంటూ వచ్చాడు. నెమ్మదిగా ఆ రెండు బాటిళ్లకు నిప్పటించి మెయిన్ గేట్ వైపు విసిరాడు. నీట్ బిల్లు.. గవర్నర్ ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. అయితే ఈలోపు అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది.. అతన్ని నిలువరించారు. అతని నుంచి మరో రెండు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నీట్ బిల్లుకు గవర్నర్ ఆర్ఎన్ రవి క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్లే వినోద్ ఈ దాడికి పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇక్కడో విషయం ఏంటంటే.. వినోద్ 2022లో చెన్నై బీజేపీ కార్యాలయంపైకి పెట్రోల్ బాంబులు విసిరిన కేసులో అరెస్ట్ అయ్యాడు. మూడు రోజుల కిందటే జైలు నుంచి విడుదలయ్యి వచ్చాడు. ఈ ఘటనపై బీజేపీ, డీఎంకే సర్కార్‌పై మండిపడుతోంది. శాంతి భద్రతలను ఈ ప్రభుత్వం ఏస్థాయిలో పరిరక్షిస్తుందో.. రాజ్‌భవన్‌పై జరిగిన దాడి ప్రతిబింబిస్తోందని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. Petrol bombs were hurled at Raj Bhavan today, reflects the true law and order situation in Tamil Nadu. While DMK is busy diverting the attention of people to insignificant matters of interest, criminals have taken the streets. Incidentally, it is the same person who attacked… — K.Annamalai (@annamalai_k) October 25, 2023 -
ఉదయనిధికి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
ఢిల్లీ క్రికెట్ స్టేడియంలో జై శ్రీరాం నినాదాలు చేయడాన్ని డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ తప్పుబట్టడంపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఉదయనిధిని విషాన్నిచిమ్మే దోమగా బీజేపీ జాతీయ ప్రతినిధి గౌరవ్ భాటియా పేర్కొన్నారు. గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా పాక్ క్రికెటర్ రిజ్వాన్ ముందు అభిమానులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. ఈ చర్యను సహించరానిదిగా పేర్కొన్నారు ఉదయనిధి. క్రీడా వేదికగా ద్వేషాన్ని చిమ్ముతున్నారని మండిపడ్డారు. ఆటలు దేశాల మధ్య సోదరభావాన్ని పెంచాలని కోరారు. India is renowned for its sportsmanship and hospitality. However, the treatment meted out to Pakistan players at Narendra Modi Stadium in Ahmedabad is unacceptable and a new low. Sports should be a unifying force between countries, fostering true brotherhood. Using it as a tool… pic.twitter.com/MJnPJsERyK — Udhay (@Udhaystalin) October 14, 2023 ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఉదయనిధి వ్యాఖ్యలు విద్వేషంతో కూడుకున్నవని మండిపడ్డారు. మైదానంలో నమాజ్ చేయడానికి ఆటను కాసేపు ఆపినప్పుడు మీకు ఎలాంటి అభ్యంతరం లేదా..? అంటూ ఉదయనిధిని ఉద్దేశించి బీజేపీ జాతీయ ప్రతినిధి గౌరవ్ భాటియా దుయ్యబట్టారు. రాముడు విశ్వంలో ప్రతి అణువునా ఉంటాడని పేర్కొన్న గౌరవ్ భాటియా.. జై శ్రీ రాం అనాలని ఉదయనిధికి హితువు పలికారు. नफ़रती डेंगू मलेरिया मच्छर फिर निकला है विष घोलने जब मैच रुकवा कर फील्ड पर नमाज़ पड़ी जाती है तो तुम्हें साँप सूँघ जाता है सृष्टि के हर कन कन मे हमारे प्रभु श्री राम बसते है, तो बोलो जय श्री राम 🙏#IndiavsPak pic.twitter.com/Tm7Ikxbtqw — Gaurav Bhatia गौरव भाटिया 🇮🇳 (@gauravbhatiabjp) October 15, 2023 పాక్ క్రికెటర్ల సమక్షంలో జై శ్రీరాం నినాదాలకు సంబంధించిన వీడియోలపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వచ్చాయి. అభిమానుల చర్య క్రికెట్ స్ఫూర్తికి విరుద్ధమని, క్రికెటర్‌పై వేధింపులుగా కొందరు భావించారు. అదే క్రమంలో యుద్ధంలో గాజాకు సంఘీభావం తెలుపుతూ మైదానంలో రిజ్వాన్ నమాజ్ చేశాడని మరికొందరు స్పందించారు. మైదానంలోకి మతాన్ని తీసుకురావడంపై నెటిజన్లు మండిపడ్డారు. ఇదీ చదవండి పాక్ క్రికెటర్ల ఎదుట ఆ నినాదాలు సరైనవి కావు: ఉదయనిధి -
'సనాతన ధర్మం మాత్రమే మతం.. మిగిలినవన్నీ..'
లక్నో: సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ మరోసారి స్పందించారు. సనాతన ధర్మం ఒక్కటే మతమని.. మిగిలినవన్నీ విభాగాలు, పూజా విధానాలు మాత్రమేనని వ్యాఖ్యానించారు. 'శ్రీమధ్ భగవత్ కథా జ్ఞాన్' కార్యక్రమంలో యోగీ ఆదిత్యానాథ్ ఈ మేరకు మాట్లాడారు. 'సనాతన ధర్మం మాత్రమే మతం. మిగిలినవన్నీ వివిధ రకాల పూజా విధానాలు మాత్రమే. సనాతన ధర్మం అంటే మానవత్మమనే మతం. ప్రస్తుతం దానిపై దాడి జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే ప్రపంచంలో మానవత్వమే ఆపదలో ఉన్నట్లు.' అని యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. 'శ్రీమధ్ భగవత్ కథా జ్ఞాన్' కార్యక్రమాలు ఏడు రోజులపాటు గోరఖ్‌నాథ్ దేవాలయం వద్ద నిర్వహించారు. చివరి రోజు వేడుకలో భాగంగా యోగి ఆదిత్యనాథ్ ఈ మేరకు మాట్లాడారు. మహంత్ దిగ్విజయ్ నాథ్ 54వ వర్థంతి, మహంత్ అవైద్యనాథ్ 9వ వర్థంతి సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. విశాల దృక్పథం ఉన్నవారు మాత్రమే శ్రమధ్ భగవత్ కథా సారాన్ని అర్థం చేసుకోగలరని అన్నారు. ఇదీ చదవండి: ఉజ్జయిని హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్.. బుల్డోజర్కు పని -
అన్నాడీఎంకేలో చీలికకు బీజేపీ యత్నం
అన్నాడీఎంకేలో చిచ్చుపెట్టే దిశగా బీజేపీ వ్యూహాలు పన్నుతోందనే ప్రచారం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆ పార్టీలో సీనియర్‌గా ఉన్న ఎస్పీ వేలుమణిని అస్త్రంగా చేసుకుని పళణి స్వామికి వ్యతిరేకంగా కేంద్రపెద్దలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఫలితంగా అన్నాడీఎంకే నుంచి త్వరలో ఓ ఏక్నాథ్ షిండే వస్తారని, మహారాష్ట్ర తరహా రాజకీయం తమిళనాడులో చూడబోతున్నామనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో ఊపందుకుంది. సాక్షి, చైన్నె: ఎన్డీయే కూటమి నుంచి అన్నాడీఎంకే ఇటీవల బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో పళణిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే వర్గాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైను టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే పనిలో పడ్డారు. రాయబారానికి, సామరస్యానికి చోటు లేదని స్పష్టం చేస్తూ, ఇక బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఈ పరిణామాలను బీజేపీ అధిష్టానం పెద్దలు నిశితంగా పరిశీలిస్తున్నారు. అయితే అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటిస్తున్నారు. అదే సమయంలో కొత్త వ్యూహాలకు సైతం పదును పెట్టినట్లు తెలుస్తోంది. చిచ్చు ప్రయత్నాలు అన్నాడీఎంకే సీనియర్లలో ఎస్పీ వేలుమణి కీలక నేత. ఆయనపై అనేక కేసులు సైతం పెండింగ్‌లో ఉన్నాయి. ఈ కేసులను అస్త్రంగా చేసుకుని ఆయన్ని తమ దారికి తెచ్చుకునేందుకు బీజేపీ వ్యూహ రచన చేస్తున్నట్టు ప్రచారం ఊపందుకుంది. ఎస్పీ వేలుమణి ద్వారా అన్నాడీఎంకేలో చిచ్చు పెట్టే అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నట్లు చర్చ జోరందుకుంది. అన్నాడీఎంకేలో ఎస్పీ వేలుమణి ఓ ఏక్నాథ్ షిండే (మహారాష్ట్ర సీఎం) అన్న ట్యాగ్‌లైన్‌తో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్‌గా మారాయి. మహారాష్ట్రలో శివసేన నేత ఉద్దవ్ ఠాక్రేను ఏవిధంగా ఏక్నాథ్ షిండే కూల దోశాడో..అదే తరహాలో పళణిస్వామికి ఎస్పీ వేలుమణి చుక్కలు చూపించబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఇది కాస్త అన్నాడీఎంకేలో కొత్త చర్చకు దారి తీశాయి. దీంతో ఎస్పీ వేలుమణి స్పందించారు. తాను అప్పుడు.. ఇప్పుడు..ఎల్లప్పుడూ అన్నాడీఎంకేకు విశ్వాస పాత్రుడినే అని స్పష్టం చేశారు. తాను సైకిల్ యాత్ర చేసిన ఫొటోను ట్యాగ్ చేస్తూ తన సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాలకు ముగింపు పలికే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే కూటమి సీఎం అభ్యర్థిగా అన్నామలైను ప్రకటించాలని బీజేపీ ఒత్తిడి తీసుకు రావడంతోనే కూటమి నుంచి తాము బయటకు వచ్చామని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి కరుప్పన్నన్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బీజేపీకి వారి బలం ఏమిటో లోక్ సభ ఎన్నికలు స్పష్టం చేస్తాయని మరో సీనియర్ నేత కేపీ మునుస్వామి వ్యాఖ్యానించారు. నేడు అమిత్ షాతో అన్నామలై అన్నాడీఎంకే కటీఫ్ ప్రకటన నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపుతో అన్నామలై అన్ని అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆదివారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కానున్నారు. దూకుడు మీదున్న అన్నామలై అమిత్ షా ముందు కొత్త ప్రతిపాదనను ఉంచేందుకు సిద్ధమైనట్లు చర్చ ఊపందుకుంది. రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయడానికి అనుమతి ఇవ్వాలని అమిత్‌షాను ఆయన కోరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అప్పుడే తమిళనాడులో బీజేపీ బలం ఏమిటో తెలుస్తుందని, అందుకు అనుగుణంగా భవిష్యత్తుకు కార్యాచరణ సిద్ధం చేయవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తూ ఓ నివేదికను సిద్ధం చేసుకుని మరీ ఆయన ఢిల్లీ వెళ్తున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. పళణి కొత్త ప్రయత్నాలు బీజేపీతో ఇక దోస్తీ లేదని తేల్చిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి కొత్త కూటమి ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు సమాచారం. బలమైన కూటమి దిశగా తమతో కలిసి రావాలని పీఎంకే, తమిళ మానిల కాంగ్రెస్, డీఎండీకేలకు ఆహ్వానం పలికేవిధంగా రాయబార ప్రయత్నాలు మొదలెట్టినట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఈ మూడు పార్టీలతోపాటు కొన్ని చిన్న పార్టీలను తన వైపునకు తిప్పుకునే దిశగా ప్రయత్నాలను జరుగుతున్నట్లు చర్చ జరుగుతోంది. డీఎంకేలో అసంతృప్తిగా ఉన్న కొన్ని చిన్న పార్టీలను సైతం కలుపుకునే ప్రయత్నంలో పళణిస్వామి ఉన్నట్లు అన్నాడీఎంకే నేతలు పేర్కొంటున్నారు. -
విజయ్ 'లియో' సినిమాపై పొలిటికల్ దెబ్బ
తమిళ చిత్రసీమలో టాప్ స్టార్లలో నటుడు విజయ్ ఒకరు. మల్టీ టాలెంటెడ్ నటుడు అయిన విజయ్‌కి తమిళ చిత్రసీమలో భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాలు విడుదల అవుతున్నాయంటే అభిమానులకు పండుగ అని చెప్పవచ్చు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమాలో విజయ్ నటించాడు. ఈ చిత్రంలో త్రిష, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సంజయ్ దత్, అర్జున్, మన్సూర్ అలీఖాన్ వంటి ప్రముఖ నటీనటులు ఉన్నారు. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. మాస్టర్ తర్వాత విజయ్, లోకేష్ కనగరాజ్, అనిరుధ్ రెండోసారి జతకట్టారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 19న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు నిర్మాణ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. దీంతో లియో ఆడియో విడుదల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లో లియో ఆడియో వేడక జరగనున్న నేపథ్యంలో విజయ్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్ అందింది. లియో సినిమా మ్యూజికల్ లాంచ్ కార్యక్రమం లేదని వార్త వచ్చింది. ఇదే విషయాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ ప్రకటించింది. తన ఎక్స్ (ట్విటర్) ద్వారా ఒక పోస్ట్‌లో, వారు ఇలా అన్నారు. 'పాస్‌ల కోసం ఎక్కువ సంఖ్యలో అభ్యర్థనలు వచ్చాయి. అంతే కాకుండా భద్రతా కారణాల వల్ల, మేము లియో మ్యూజిక్ లాంచ్‌ను నిర్వహించకూడదని నిర్ణయించుకున్నాము. అభిమానుల కోరిక మేరకు మేము తరచుగా అప్డేట్లతో మీతో టచ్‌లో ఉంటాము. చాలామంది అనుకుంటున్నట్లుగా మాపై ఎలాంటి రాజకీయ ఒత్తిడిలేదు. అంతేకాకుండా మరేదైనా కారణం కూడా కాదు.' అని తెలిపారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: పల్లవి ప్రశాంత్ తలకు గాయం.. కుప్పకూలిపోయిన రైతు బిడ్డ!) ఈ పరిస్థితిలో విజయ్ అభిమానులు లియో విడుదల కార్యక్రమం రద్దు కావడం వెనుక స్టాలిన్ డీఎంకే ప్రభుత్వం ఉందని విజయ్ ఫ్యాన్స్ చెబుతూ #DMKFearsThalapathyVIJAY అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. విజయ్ అభిమానులు #LeoAudioLaunch #westandWithLeoతో సహా హ్యాష్‌ట్యాగ్‌లను వారు ట్రెండింగ్ చేస్తున్నారు. #DMKFearsTHALAPATHYVijay pic.twitter.com/VODZwCGNI9 — 𝙍ᴀᴊᴀ𝘿ᴜʀᴀɪ 💥🌐 (@rajubhaii09) September 26, 2023 .@actorvijay Na ❤️ Political Announcements Pannu Na **Thaa Ivanugala Senjividalam.#DMKFearsThalapathyVIJAY#WeStandWithLEO pic.twitter.com/8gZ4hJ53ol — AJITH Kumar (@ActorAJlTH) September 26, 2023 -
తూత్తుకుడిలో వివక్షకు చెక్
సాక్షి, చైన్నె : తూత్తుకుడిలో అల్పాహారం పథకం వివాదానికి తెర పడింది. వెనుక బడిన సామాజిక వర్గానికి చెందిన మహిళ సిద్ధం చేసిన అల్పాహారాన్ని విద్యార్థులతో కలిసి మంగళవారం ఎంపీ కనిమొళి , మంత్రి గీతా జీవన్ స్వీకరించారు. వివరాలు.. తూత్తుకుడి జిల్లా ఎట్టయపురం సమీపంలోని ఉసిలం పట్టి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో సీఎం అల్పాహార పథకం అమలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఆ గ్రామానికి చెందిన వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన మునియ సెల్వి అల్పాహారాన్ని సిద్ధం చేసి వడ్డిస్తుండడం అగ్ర వర్ణాలలో ఆగ్రహాన్ని రేపింది. దీంతో తమ పిల్లల చేత అల్పాహారం బహిష్కరించారు. ఈ సమాచారంతో అధికారులు రంగంలోకి దిగి గ్రామస్తులను బుజ్జగించారు. అదే సమంయలో డీఎంకే ఎంపీ, మంత్రి గీతా జీవన్ , తూత్తుకుడి జిల్లా ఉన్నతాధికారులు అందరూ మంగళవారం ఉదయాన్నే ఆగ్రామానికి వెళ్లారు. గ్రామ పెద్దలతో మాట్లాడారు. వివక్ష తగదని హితవు పలికారు. అందరూ సమానమే అని సూచించారు. విద్యార్థులను అల్పాహారం స్వీకరణకు పంపించాలని తల్లిదండ్రులను కోరారు. వీరి విజ్ఞప్తికి తల్లిదండ్రులు స్పందించారు. పిల్లలందరితో కలిసి ఎంపీ, మంత్రి, అధికారులు అల్పాహారం స్వీకరించారు. పిల్లలకు కనిమొళి స్వయంగా వడ్డించారు. అలాగే, ఆహారం తయారు చేస్తున్న మునియ సెల్వితో మాట్లాడారు. ఆమెకు భరోసా ఇచ్చారు. -
త్వరలో జైలుకు మరికొందరు మంత్రులు
సాక్షి, చైన్నె : రాష్ట్రంలో హైకోర్టు సుమోటోగా స్వీకరించిన కేసుల రూపంలో త్వరలో మరికొందరు డీఎంకేమంత్రులు జైలుకు వెళ్లబోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యలు చేశారు. వీరంతా ఏఏ జైళ్లల్లో ఉండనున్నారో...? తేలే సమయం ఆసన్నం అవుతోందన్నారు. డీఎంకేకు వ్యతిరేకంగా అవినీతి ఫైల్స్ పేరిట రెండు జాబితాలను అన్నామలై విడుదల చేసిన విషయం తెలిసిందే. తొలి జాబితా విడుదల తదుపరి పరిణామాలతో మంత్రి సెంథిల్ బాలాజీ కటకటాల పాలయ్యారు. రెండో జాబితా విడుదల కాగానే ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడిని ఈడీ టార్గెట్ చేసింది. త్వరలో మరో ఫైల్ అంటూ అన్నామలై పేర్కొంటూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నా మట్టి..నా ప్రజలు పాదయాత్రలో భాగంగా శనివారం తేనిలో జరిగిన కార్యక్రమంలో అన్నామలై చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. -
అధికారం కోల్పోయినా పర్వాలేదు
సాక్షి, చైన్నె : సనాతన ధర్మం నిర్మూలించే వ్యవహారంలో తమ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయినా పర్వాలేదని క్రీడల శాఖ మంత్రి ఉదయ నిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యవహారంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. వివరాలు.. సనాతన ధర్మం గురించి ఉదయ నిధి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆయనకు వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు, ఫిర్యాదులు, కేసుల మోత మోగుతోంది. ఈ పరిస్థితుల్లో శనివారం రాయపేటలో ఉదయనిధి మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అంబేడ్కర్, పెరియార్, అన్నా వంటి మహానేతలు సనాతనం గురించి వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. వీరు చేసిన వ్యాఖ్యలను తలదన్నే విధంగా తానేదో గొప్పగా మాట్లాడేసినట్టు కొందరు విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. సనాతన ధర్మం వ్యవహారంలో పదవి నుంచి తప్పించినా, తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేసినా తగ్గేది లేదన్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించే వ్యవహారంలో తమ ప్రభుత్వం అధికారం కోల్పోయినా బాధ పడాల్సిన అవసరం లేదన్నారు. తమ సిద్ధాంతం ద్రవిడ మార్గం అని అధికారం తమకు ముఖ్యం కాదని, సిద్ధాంతాలే కీలకం అని వ్యాఖ్యలు చేశారు. -
డీఎంకే వ్యాఖ్యలను ఒప్పుకోం
న్యూఢిల్లీ: సనాతన ధర్మంపై డీఎంకే నేతలు ఉదయనిధి స్టాలిన్, ఎ.రాజా చేసిన వ్యాఖ్యలతో తాము ఏకీభవించబోమని కాంగ్రెస్ పేర్కొంది. అన్ని మతాలకు సమాన గౌరవం(సర్వధర్మ సమభావ) భావననే తమ పార్టీ విశ్వసిస్తుందని స్పష్టం చేసింది. కాంగ్రెస్ మీడియా విభాగం చీఫ్ పవన్ ఖెరా స్పందిస్తూ..‘సమధర్మ సమభా వమనే దానినే కాంగ్రెస్ ఎల్లప్పుడూ విశ్వసిస్తుంది, ప్రతి మతం, ప్రతి విశ్వాసాలకు ఇందులో సమస్థానం ఉంటుంది. ఎవరూ ఎవరినీ తక్కువగా చూడరు. ఇలాంటి వ్యాఖ్య లను కాంగ్రెస్ పార్టీ కూడా సమ్మతించదని అన్నారు. విద్వేషాలు తొలిగేదాకా యాత్ర: రాహుల్ విద్వేషాలు తొలిగిపోయి భారత్ ఏకమయ్యేదాకా తన యాత్ర కొనసాగుతుందని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర ప్రారంభమై గురువారం ఏడాది పూర్తయిన సందర్భంగా రాహుల్ స్పందించారు. నాలుగు వేల కిలోమీటర్ల పైచిలుకు సాగిన తన పాదయాత్ర తాలూకు వీడియో ఫుటేజిని ఎక్స్‌లో పంచుకుంటూ.. ‘ఈ యాత్ర కొనసాగుతుంది. ఇది నా ప్రామిస్’ అని రాహుల్ పేర్కొన్నారు. భారత్ జోడోయాత్రలో రాహుల్ 12 బహిరంగ సభల్లో, 100 పైచిలుకు రోడ్డు కార్నర్ మీటింగ్‌లలో, 13 విలేకరుల సమావేశాల్లో పాల్గొన్నారు. -
ప్రజల దృష్టి మళ్లించేందుకు మోదీ యత్నం
చెన్నై: సనాతన ధర్మకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ చేస్తున్న తీవ్ర ఆరోపణలపై డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఎదురుదాడి ప్రారంభించారు. ప్రధాని మోదీ సహా కాషాయ పార్టీ నేతలు తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. వ్యాఖ్యలపై దాఖలైన కేసులన్నిటినీ చట్టపరంగానే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. మణిపూర్‌లో నెలలుగా కొనసాగుతున్న హింసపై విమర్శలను ఎదుర్కోలేని ప్రధాని మోదీ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు తన వ్యాఖ్యలపై రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ప్రధాని మోదీ, మంత్రులు సనాతన ధర్మపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై చర్చించిన విషయం తెలిసిందే. ‘ప్రజలకిచ్చిన వాగ్దానాలను తొమ్మిదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విస్మరించింది. ప్రజల సంక్షేమం కోసం బీజేపీ ఫాసిస్ట్ ప్రభుత్వం చేసిందేమీ లేదు. దీనిని కప్పిపుచ్చుకునేందుకే బీజేపీ నేతలు ‘జనహననం’అంటూ నా వ్యాఖ్యలను వక్రీకరించారు. తమను తాము రక్షించుకునేందుకు దీనిని ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు’అని గురువారం ఉదయనిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాము ఏ మతానికీ వ్యతిరేకం కాదని ప్రతి ఒక్కరికీ తెలుసునన్నారు. ‘మణిపూర్‌లో ఆగని హింసపై సమాధానం ఇవ్వాల్సి వస్తుందనే భయంతోనే మోదీజీ స్నేహితుడు అదానీని వెంటేసుకుని ప్రపంచ దేశాల్లో తిరుగుతున్నారు. మణిపూర్ హింసలో 250 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు..మోదీ ప్రభుత్వం 7.5 లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది. వీటన్నిటినీ మరుగుపరిచేందుకే మోదీ, ఆయన బ్యాచ్ సనాతన వ్యాఖ్యలను వాడుకోవాలనుకుంటున్నారు. ప్రజల అమాయకత్వమే వారి రాజకీయాలకు పెట్టుబడి. ’అని విమర్శించారు. ‘ఈ రోజుల్లో సాధువులు కూడా ప్రచారం కోరుకుంటున్నారంటూ తన తలపై రూ.10 కోట్లు ప్రకటించిన సాధువుపై ఉదయనిధి వ్యాఖ్యానించారు. అంతా త్యాగం చేసిన ఆ సాధువుకు రూ.10 కోట్లు ఎలా వచ్చాయంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అమానవీయ విశ్వాసాలపైనే..: స్టాలిన్ సనాతన ధర్మంపై తన కొడుకు, మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై రేగుతున్న దుమారంపై సీఎం స్టాలిన్ స్పందించారు. సనాతన ధర్మంలో భాగమైన అమానవీయ సిద్ధాంతాలపైనే ఉదయనిధి మాట్లాడారని చెప్పారు. వీటి ఆధారంగా ప్రతిపక్ష ఇండియా కూటమిలో విభేదాలు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. -
'సనాతన ధర్మంపై 'ఇండియా' ఉద్దేశం ఇదే..'
ఢిల్లీ: ప్రతిపక్ష కూటమి 'ఇండియా' అన్ని మతాలను, సిద్ధాంతాలను గౌరవిస్తుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా చెప్పారు. సనాతన ధర్మాన్ని డీఎంకే ఎంపీ ఏ రాజా ఎయిడ్స్‌తో పోల్చుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత కాంగ్రెస్ ఈ మేరకు స్పందించింది. ఎంపీ రాజా వ్యాఖ్యలను సమ్మతించబోమని చెప్పారు. డీఎంకే ఎంపీ ఏ రాజా వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత స్పందించిన కాంగ్రెస్ తన సిద్ధాంతం సర్వధర్మ సమభావం అని పేర్కొంది. ప్రతి మతానికి, సిద్ధాంతానికి సమాన ఆధరణ ఉంటుందని స్పష్టం చేసింది. తాము ఏ మతానికి, విశ్వాసాలను కించపరచబోమని వెల్లడించింది. డీఎంకే వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కూటమిలో ప్రతి ఒక్కరూ అన్ని మతాలను గౌరవిస్తారని అన్నారు. డీఎంకే ఎంపీ రాజా ఈ రోజు సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని ఎయిడ్స్, కుష్టు రోగంతో పోల్చారు. దీనిపై బీజేపీ మండిపడింది. దేశవ్యాప్తంగా ఈ వ్యాఖ్యలు విమర్శలకు కారణమయ్యాయి. అనంతరం కాంగ్రెస్ తన అభిప్రాయాన్ని మరోసారి స్పష్టం చేసింది. ఇదీ చదవండి: ‘సనాతన ధర్మం అంశంపై చర్చలకు ఎవరు రమ్మన్నా వస్తా’ -
ఉదయనిధి వ్యాఖ్యల దుమారంపై మౌనం వీడిన సీఎం స్టాలిన్..
డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన దర్శంపై చేసిన వ్యాఖ్యల దుమారంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తొలిసారి స్పందించారు. ఉదయనిధి ఏం మాట్లాడారో తెలుసుకోకుండా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కామెంట్ చేయడం సరికాదని అన్నారు. కాగా సనాతన ధర్మాన్ని వ్యతికించడమే కాకుండా నిర్మూలించాలని మంత్రి ఉదయనిధి ఇటీవల ఓ సమావేశంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మంత్రిపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు.. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని ఆపేది లేదని ఉదయనిధి స్టాలిన్ మరోసారి స్పష్టం చేశారు. కుల వివక్ష లేకుండా అందరికీ అన్నీ దక్కాలన్నదే ద్రావిడ మోడల్ ఉద్దేశమని ఈ సందర్భంగా తెలిపారు. ఈ వ్యవహారంలో తనపై ఎలాంటి కేసులు వేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. దీంతో బీజేపీ, డీఎంకే మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది. Hon'ble Minister @UdhayStalin didn't call for 'genocide' as distorted by BJP, but only spoke against discrimination. Disheartening to see the 'responsible' Hon'ble Prime Minister, Union Ministers and BJP Chief Ministers ignore facts and driven on fake narratives despite having… pic.twitter.com/F9yrdGjxqo — M.K.Stalin (@mkstalin) September 7, 2023 ప్రధాని మాటలు నిరుత్సాహపరిచాయి తాజాగా కొడుకు మాటల దుమారంపై తండ్రి స్టాలిన్ స్పందిస్తూ.. బీజేపీ వక్రీకరించినట్లు 'జాతి నిర్మూలన'కు మంత్రి పిలుపునివ్వలేదని కేవలం వివక్షకు వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడారని స్పష్టం చేశారు.వాస్తవాలను ధృవీకరించడానికి అన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ.. బాధ్యత కలిగిన ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు వాస్తవాలను విస్మరిండం, నకిలీ వార్తలను ప్రచారం చేయడం బాధ కలిగించిందన్నారు. తప్పుగా ప్రచారం చేస్తున్నారు సనాతన ధర్మం విషయంలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై తప్పుగా విమర్శిస్తున్నారని స్టాలిన్ పేర్కొన్నారు. అణచివేత సూత్రాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు బీజేపీ అనుకూల శక్తులు అతని(ఉదయనిధి) వైఖరిని సహించలేకపోతున్నాయని మండిపడ్డారు. అందుకే ‘సనాతన ఆలోచనలు గల వ్యక్తులను నరమేధం చేయాలని ఉదయనిధి పిలుపునిచ్చాడంటూ తప్పుగా ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. బీజేపీ పెంచి పోషిస్తున్న ఓ వర్గం సోషల్ మీడియా గ్రూపు ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ అబద్ధాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తోందని విమర్శించారు. స్వామిజీపై ఏం చర్యలు తీసుకున్నారు? ఉధయనిధిన తల నరికి తీసుకువస్తే రూ. 10 కోట్లు ఇస్తామంటూ ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యకు చెందిన ఓ స్వామీజీ చేసిన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్టాలిన్ ఘాటుగా స్పందిస్తూ ఇలాంటి ప్రకటన చేసిన స్వామిపై ఏం చర్యలు తీసుకున్నారని యూపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదే ఉదయనిధిపై అయితే కేసులు పెట్టారని అన్నారు. కేంద్ర కేబినెట్ భేటీలో ఉదయనిధి వ్యాఖ్యలను సమర్థంగా తిప్పికొట్టాలని ప్రధాని మోదీ చెప్పినట్లు మీడియా ద్వారా తెలిసిందని.. ఇది చాలా నిరాశ పరిచిందన్నారు. డీఎంకే ప్రతిష్టను దిగజార్చలని చూస్తే.. ‘ఏదైనా ఆరోపణలను, నివేదికను ధృవీకరించడానికి ప్రధాన మంత్రికి అన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. మరి ఉదయనిధిపై ప్రచారమవుతున్న అబద్ధాల గురించి ప్రధానికి తెలియదా, లేక తెలిసి అలా చేస్తున్నారా?. సనాతన వివక్షత పట్ల బీజేకిపీ అసలు పట్టింపు లేదు. ఒకవేళ డీఎంకే పార్టీ ప్రతిష్టను దిగజార్చాలని బీజేపీ ప్రయత్నిస్తే.. వారు ఆ ఊబిలో మునిగిపోతారు. కొందరు వ్యక్తులు ఇప్పటికీ ఆధ్యాత్మిక వేదికలపై మహిళలను కించపరుస్తారు, మహిళలు కొన్ని పని చేయకూడదు. వితంతువులు పునర్వివాహం చేసుకోకూడదని వాదిస్తున్నారు. మానవ జాతిలో సగానికి పైగా ఉన్న స్త్రీలపై అణచివేతను కొనసాగించడానికి వారు 'సనాతన' అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. అలాంటి అణచివేత సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మాత్రమే ఉదయనిధి మాట్లాడాడు. ఆ సిద్ధాంతాలపై ఆధారపడిన పద్ధతులను నిర్మూలించాలని పిలుపునిచ్చారు’అని స్టాలిన్ తన కొడుకు వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. -
ఉదయనిధి, ప్రియాంక ఖర్గేలపై కేసు
లక్నో:మతపరంగా ఓ వర్గం ప్రజలను కించపరుస్తున్నారనే ఆరోపణలపై ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గేపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే మతపరంగా రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో పోలీసులు సెక్షన్ 295ఏ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. ఉదయనిధి స్టాలిన్, ప్రియాంక ఖర్గేలపై న్యాయవాదులు హర్ష గుప్తా, రామ్ సింగ్ లోధిలు ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మీడియా కథనాలను ఆధారాలుగా చూపుతూ మతపరమైన భావాలను కించపరుస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. The FIR came at the complaint of lawyers who highlighted media reports on Stalin's statement alleging that the politician's comments had hurt their feelings.https://t.co/7jPY2h9UvS — IndiaToday (@IndiaToday) September 6, 2023 సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సనాతన ధర్మంపై డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ మలేరియా, కరోనా వంటి రోగాలతో పోల్చారు. దానిని వ్యతిరేకించడం కాదు.. పూర్తిగా నిర్మూలించాలని అన్నారు. ఈ పరిణామాల అనంతరం కర్ణాటక నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక ఖర్గే కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. దీనిపై సనాతనీయుల మారణహోమానికి పిలుపునిస్తున్నారని బీజేపీ ఆరోపించడంతో దేశస్థాయిలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. ఇదీ చదవండి: అక్కడ సనాతన దినోత్సవంగా సెప్టెంబర్ 3 -
బెదిరింపులపై ఉదయ్‌నిధి స్టాలిన్ స్పందన
సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. బీజేపీ, హిందూ సంఘాల నుంచే కాకుండా.. మిత్ర కూటమి ఇండియా(INDIA) కూటమిలో కూడా ఉదయనిధి వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో ఆయనకు హెచ్చరికలు సైతం జారీ అవుతున్నాయి. తాజాగా.. ఉదయనిధి స్టాలిన్ తలపై రూ.10కోట్ల బహుమతిని అయోధ్య అర్చకుడు ఒకరు ప్రకటించారు. ఉదయనిధి స్టాలిన్ తల నరికి తన వద్దకు తీసుకువస్తే రూ.10కోట్ల నగదు బహుమతి ఇస్తానని ఉత్తరప్రదేశ్ తపస్విచావిని ఆలయ ప్రధాన అర్చకుడు పరమహంస ఆచార్య ప్రకటించారు. ఒకవేళ ఎవరూ సాహసించక పోతే.. తానే అతన్ని కనిపెట్టి మరీ చంపేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. ఆచార్య తన తలపై రివార్డు ప్రకటించడంపై ఉదయనిధి చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో స్పందించారు. బెదిరింపులు తమకు కొత్త కాదని, ఈ బెదిరింపులకు భయపడే వాళ్లం కాదని ఉదయనిధి చెప్పారు. తమిళ భాష కోసం రైలు ట్రాక్ పై తల పెట్టిన కరుణానిధి మనవడినని ఆయన పేర్కొన్నారు(సిమెంట్ ఫ్యాక్టరీని నిర్మిస్తున్న పారిశ్రామికవేత్త దాల్మియాస్ కుటుంబం పేరు మార్చడాన్ని నిరసిస్తూ కరుణానిధి నేతృత్వంలోని డీఎంకే కార్యకర్తలు ట్రాక్‌లపై పడుకుని తమ నిరసనను తెలిపారు.). రూ.10 కోట్లు ఎందుకని.. తన తల దువ్వు కోవడానికి 10 రూపాయల దువ్వెన చాలని ఆచార్య బెదిరింపును ఉదయనిధి తేలికగా చెప్పారు. మళ్లీ అదే చెబుతున్నా.. సనాతన ధర్మ మలేరియా, డెంగ్యూలాంటిదని.. దానిని అరికట్టాల్సిన అవసరం ఉందని ఉదయ్‌నిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ, హిందూ సంఘాలు ఉదయ్‌నిధికి వ్యతిరేకంగా ధర్నాలు చేపట్టడంతో పాటు పలుచోట్ల ఫిర్యాదులు చేశాయి. తమిళనాడు బీజేపీ నేతలు ఆ రాష్ట్ర గవర్నర్ రవిని కలిసి.. మంత్రి ఉదయ్‌నిధిపై చర్యలు తీసుకోవాలని కోరాయి. అయితే.. ఉదయ్‌నిధి స్టాలిన్ మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని చెబుతున్నారు. మళ్లీ అదే చెబుతున్నా.. మళ్లీ అదే చెబుతా కూడా అంటూ వ్యాఖ్యానించారు. ‘‘సనాతన ధర్మం గురించి ఓ కార్యక్రమంలో మాట్లాడాను. నేను ఏదైతే మాట్లాడానో.. అదే పదే పదే చెబుతాను నేను హిందూమతాన్నే కాదు అన్ని మతాలను కలుపుకుని.. కులవిభేదాల్ని ఖండిస్తూ మాట్లాడాను, అంతే’’ అని చెన్నై కార్యక్రమంలో పేర్కొన్నారాయన. ప్రతిపక్షాల ఐక్యతపై భయపడి.. బీజేపీ తన వ్యాఖ్యలను వక్రీకరిస్తోంది. వాళ్లు నాపై ఎలాంటి కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా ఉదయ్‌నిధి స్టాలిన్ మండిపడ్డారు. ఉదయ్‌నిధి హిట్లర్ అంటూ బీజేపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న వేళ, మరోవైపు మిత్రపక్ష ఇండియా కూటమిలోనూ ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో.. ఉదయ్‌నిధి స్టాలిన్ ఇలా తన వ్యాఖ్యలపై దిద్దుబాటు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
సనాతన ధర్మంపై ఇంకా మాట్లాడుతా..
సాక్షి, చైన్నె: సనాతన ధర్మం వ్యవహారంలో తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని.., ఇంకా చెప్పాలంటే, నిర్మూలనే లక్ష్యంగా ఎక్కడ కావాలంటే, అక్కడ మరింతగా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని.. మంత్రి ఉదయ నిధిస్టాలిన్ స్పష్టం చేశారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా హిందూ సంఘాలు ఆయనపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నాయి. బిహార్‌లో ఉదయనిధిపై సోమవారం కేసు కూడా నమోదైంది. ఓబీజేపీతో పాటు హిందూ సంఘాల డీఎంకేను టార్గెట్ చేసి విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అ న్నామలై ఒక అడుగు ముందుకు వేసి, సనాతన ధర్మం గురించి ఉదయ నిధి అనుచిత వ్యాఖ్యలపై దేవదాయ శాఖ మంత్రి శేఖర్‌బాబు మౌనం వహించడం సిగ్గుచేటన్నారు. ఈనెల 10వ తేదీలోపు శేఖర్‌బాబు పదవి నుంచి వైదొలగని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ పేర్కొంటూ, సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియా తరహాలో నిర్మూలించలేమని, అది విశ్వవ్యాప్తంగా వ్యాప్తి చెందుతోందన్నారు. సనతాన ధర్మానికి వ్యతిరేకం అంటే, హిందూ, దేవదాయ శాఖ ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. కా గా తనకు వ్యతిరేకంగా కేసుల నమోదు, ఫిర్యాదులు హోరెత్తడంతో ఉదయ నిధి స్టాలిన్ తూత్తుకుడిలో మీడియాతో మాట్లాడుతూ, తాను చేసిన వ్యాఖ్యలను నిశితంగా పరిశీలించాలని సూచించారు. తాను స నాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశానే గానీ, హిందువుల గురించి కాదని స్పష్టంచేశారు. సామాజిక న్యాయం గురించి ప్రస్తావిస్తూ సనాతన ధర్మంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశానని, తాను ఏ మతానికి వ్యతిరేకంగా మాట్లాడ లేదన్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి మరో మార్గంలో తీసుకెళ్తున్నారని వివరించారు. మంత్రి శేఖర్‌బాబు రాజీనామాకు డిమాండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. క్షమాపణకు పట్టు.. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఉదయ నిధి స్టాలిన్ తక్షణం క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఢిల్లీలోని బీజేపీ నేతలు తమిళనాడు భవన్ కమిషనర్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలోని తమిళనాడు భవన్, డీఎంకే కార్యాలయానికి భద్రతను మరింతగా పెంచారు. -
ఉదయనిధి 'సనాతన ధర్మ' వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందన ఏంటంటే..?
ఢిల్లీ: తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. ఉదయనిధిని విమర్శించే క్రమంలో ఇండియా కూటమి స్వభావం ఎంటో స్పష్టమవుతోందని బీజేపీ మండిపడింది. ఈ నేపథ్యంలో ఉదయనిధి వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించింది. అన్ని మతాలను గౌరవించడమే కాంగ్రెస్ స్వభావమని సీనియర్ నాయకుడు కేసీ వేణు గోపాల్ తెలిపారు. 'సర్వ ధర్మ సమభావన' అని పేర్కొంటూ ఇదే కాంగ్రెస్ ఐడియాలజీ అని పేర్కొన్నారు. #WATCH | On DMK leader Udhayanidhi Stalin's 'Sanatana dharma' remark, Congress General Secretary KC Venugopal says, "Our view is clear; 'Sarva Dharma Samabhava' is the Congress' ideology. Every political party has the freedom to tell their views....We are respecting everybody's… pic.twitter.com/86Mg265PQT — ANI (@ANI) September 4, 2023 ఉదయనిధి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ప్రతి రాజకీయ పార్టీకి వాక్ స్వాతంత్య్రం ఉంటుందని చెప్పారు. ఏ మతాన్ని కాంగ్రెస్ విమర్శించబోదని స్పష్టం చేశారు. సమాన అవకాశాలు ఇవ్వని మతమేదైనా వ్యాధితో సమానమని కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే మాట్లాడిన వెంటనే కాంగ్రెస్ ఈ మేరకు స్పందించింది. ఇండియా కూటమిలో భాగమైన రాజ్యసభ ఎంపీ, శివసేన (యూబీటీ) నాయకురాలు ప్రియాంక చతుర్వేది సనాతన ధర్మానికి మద్దతుగా మాట్లాడారు. సనాతన ధర్మం శాశ్వతమైన సత్యాన్ని సూచిస్తుందని అన్నారు. ఆక్రమణదారుల దాడులను తట్టుకుని నిలబడగలిగిందని చెప్పారు. ఇది దేశానికి పునాది అని మాట్లాడారు. అలాంటి ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సబబు కాదని చెప్పారు. హక్కుల కోసం పోరాడిన అలాంటి సనాతనీయులపై మహారాష్ట్రలో లాఠీ ఛార్జీ చేసిన చరిత్ర బీజేపీదని మండిపడ్డారు. ఉదయనిధి ‘సనాతన ధర్మం’ వ్యాఖ్యల దుమారం.. స్టాలిన్ ఏమన్నారంటే.. ఉదయనిధి స్టాలిన్ ఏమన్నారంటే.. సనాతన నిర్మూలన పేరుతో నిర్వహించిన సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ హాజరై ప్రసంగించారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని, దీనిని కేవలం వ్యతిరేకించడమే కకుండా.. పూర్తిగా నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. సమానత్వానికి, మహిళా సాధికారతకు సనాతన ధర్మం వ్యతిరేకతమని అన్నారు. Udhayanidhi Stalin, son of Tamilnadu CM MK Stalin, and a minister in the DMK Govt, has linked Sanatana Dharma to malaria and dengue… He is of the opinion that it must be eradicated and not merely opposed. In short, he is calling for genocide of 80% population of Bharat, who… pic.twitter.com/4G8TmdheFo — Amit Malviya (@amitmalviya) September 2, 2023 బీజేపీ మండిపాటు.. దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ కూటమిలో తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ కూడా ఉంది. ముంబయి వేదికగా జరిగిన సమావేశంలో సీఎం స్టాలిన్ పాల్గొన్నారు. సీఎం స్టాలిన్ కుమారుడు తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఇండియా కూటమిపై బీజేపీ దాడి చేసింది. ముంబయి భేటీలో ఇదే నిర్ణయించారా? అని ప్రశ్నలు గుప్పించారు. ఇదీ చదవండి: సనాతన ధర్మంపై సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు.. -
జమిలీతో అన్నాడీఎంకే బలి
సాక్షి, చైన్నె: కేంద్ర అసంబద్ధ విధానాల వల్ల దేశం అధోగతి పాలవుతోందని సీఎం స్టాలిన్ విమర్శించారు. ఆదివారం చైన్నెలో డీఎంకే నేత మనోహర్ ఇంటి శుభ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఆయన హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ఈ వేడుకకు హాజరు అయ్యే గొప్ప అవకాశం లభించినందుకు సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. మనోహర్ ఇంటి ప్రతి వేడుక తన చేతుల మీదుగా జరిగినట్టు గుర్తు చేశారు. తనకు రక్షకుడు లాంటి వాడు మనోహరన్ అని కొనియాడారు. సమాజమే కుటుంబం, కుటుంబమే సమాజం అని వ్యాఖ్యలు చేస్తూ, ఈ రోజు దేశ పరిస్థితులు ఏ మేరకు అధ్వానంగా మారుతున్నాయో వివరించారు. నాడు వ్యతిరేకత...నేడు మద్దతా..? ఒకే దేశం – ఒకే ఎన్నికల అమలు కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఉన్నారని, దీనికి చైర్మన్‌గా భారత ప్రథమ పౌరుడిగా ఇది వరకు ఉన్న రామ్‌నాథ్ కోవింద్‌ను నియమించి, ఆయనతో రాజకీయ కార్యక్రమాలు చేపట్టడంపై మండి పడ్డారు. దేశంలో అంతా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, పరిస్థితులు చక్క దిద్దేందుకు ఇండియా కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తోందన్నారు. అయితే, జమిలీ ఎన్నికలతో దేశంలోకి నియంత పాలన, నియంత్రత్వానికి ప్రధాని నరేంద్రమోదీ కుట్ర పన్నారని, దీనిని భగ్నంచేసే వరకు డీఎంకే విశ్రమించబోదన్నారు. తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకే, జమిలీ ఎన్నికలకు మద్దతు ఇవ్వడం శోచనీయమన్నారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఈ ఎన్నికలను వ్యతిరేకించిన అన్నాడీఎంకే, ఇప్పుడు మద్దతు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టుగా కేంద్రాన్ని అన్నాడీఎంకే నమ్ముకుంటోందని, తొలి బలి పశువు అన్నాడీఎంకే కావడం తథ్యమని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల కారణంగా డీఎంకే మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలన్నీ మనుగడ సాధించడ కష్టతరం అన్నారు. దేశంలో ఏకాధిపతి పాలన వైపుగా ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని గుర్తు చేస్తూ, తాము అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతోందన్నారు. మరో రెండున్నరేళ్లు తమకు అవకాశం ఉందని, అలాంటప్పుడు ఈ పాలనను రద్దు చేస్తారా..? కర్ణాటకలో పరిస్థితులు బీజేపీకి పునరావృతం కాబోతోందని హెచ్చరించారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించిన పక్షంలో, రాష్ట్రాలలో ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ తగ్గితే, ఆ రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధిస్తారా..? అని ప్రశ్నించారు. అందుకే నీచాతినీచమైన ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నారని ధ్వజమెత్తారు. ఈ రోజు నుంచే భారతదేశాన్ని రక్షించ కోవడం లక్ష్యంగా, అందరూ సిద్ధం అయ్యే విధంగా ప్రతిజ్ఞ చేయాలని స్టాలిన్ పిలుపు నిచ్చారు. జమిలీ ఎన్నికల కారణంగా దేశంలో తొలి బలి పశువు అయ్యే పార్టీ అన్నాడీఎంకే అని సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు రాష్ట్రంలోని ఈ పార్టీ కేంద్రంలోని బీజేపీని నమ్ముకోవడం శోచనీయమని విమర్శించారు. ఒకే దేశం..ఒకే ఎన్నికలతో దేశంలో నియంతృత్వానికి ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జమిలీని అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా? దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ప్రస్తుతం ప్రతి పౌరుడి మీద ఉందన్నారు. ఎవరు ప్రధాని అవ్వాలో..? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఎవరు ప్రధాని కాకూడదో అన్నది ముఖ్యం అని అభిప్రాయపడ్డారు. ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలనే ప్రయత్నాలలో బీజేపీ తీవ్ర కుట్రలు చేస్తోందని, వ్యూహాలకు పదును పెడుతోందని వివరించారు. వీటిని అడ్డుకునేందుకే ఇండియా కూటమి ఏర్పడిందని, ఈ కూట మిని చూసిన ప్రధాని నరేంద్ర మోదీలో వణుకు మొదలైందని ఎద్దేవా చేశారు. ఈ కూటమి నేతృత్వంలో క్షేత్రస్థాయిలో కార్యక్రమా లు విస్తృతం కాబోతున్నాయన్నారు. ఇండియా కూటమికి వస్తున్న ఆదరణను చూసి భయంతో కొత్త కుట్రలపై కేంద్రం దృష్టి పెట్టిందని ధ్వజ మెత్తారు. ఒకే దేశం..ఒకే ఎన్నిక పేరుతో రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వాన్ని అర్ధాంతరంగా రద్దు చేస్తారా? అదీచూద్దాం.. అంటూ సవాల్ విసిరారు. -
చూస్తూ ఉండండి..సనాతన ధర్మమే గెలుస్తుంది : అమిత్ షా
జైపూర్: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. జైపూర్‌లో 'పరివర్తన యాత్ర' ప్రారంభోత్సవంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై అమిత్ షా తీవ్ర స్థాయిలో స్పందించారు. త్వరలో రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దుంగార్పూర్ వేదికగా 'పరివర్తన యాత్ర'ను ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టే అర్ధమవుతుంది ఇండియా కూటమి హిందూత్వాన్ని వ్యతిరేకమని.. ఇది ఒకరకంగా హిందూత్వ వారసత్వంపై దాడి చేయడమేనని.. స్టాలిన్ తనయుడు చేసిన వ్యాఖ్యలు ఇండియా కూటమి ఓటు బ్యాంక్ రాజకీయాలకు, బుజ్జగింపు రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. డీఎంకే నాయకుడి కుమారుడు.. కాంగ్రెస్ నేత కుమారుడు మారణహోమానికి పిలుపునిస్తున్నారని అన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా గతంలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలను చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆనాడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాడికల్ హిందూ సంస్థలు లష్కర్-ఏ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థల కంటే ప్రమాదమని అన్నారు. మీ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా ఇది హిందూ ఉగ్రవాదమని అన్నారు. కానీ ఈనాడు సనాతన ధర్మం ప్రజల మనుసును గెలుచుకుందని మళ్ళీ మోదీ అధికారంలోకి వస్తే సనాతన పరిపాలన వస్తుందని వారు ఆశాభావంతో ఉన్నారని అన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఏళ్ళు అడ్డుకుందని.. మా హయాంలోనే రామ మందిరం నిర్మాణ పనులు మొదలయ్యాయని జనవరికల్లా మందిర నిర్మాణం పూర్తవుతుందని దాన్ని అడ్డుకోవడం కాంగ్రెస్ వల్ల కాదని అన్నారు. ఇక ఈరోజు ప్రారంభమైన 'పరివర్తన యాత్ర' 19 రోజుల పాటు 2500 కి.మీ కొనసాగుతుందని.. మొత్తం 52 నియోజకవర్గాల్లో 152 చిన్న సభలు.. 54 భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నామని.. అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయిన అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని అన్నారు. అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ మాట్లాడుతూ ఉదయనిధి వ్యాఖ్యలను సమర్ధించడమే కాదు సనాతన ధర్మం మతం పేరిట ప్రాంతం పేరిట ప్రజలను వేరు చేసే సిద్ధాంతమని అన్నారు. ఉదయనిధి స్టాలిన్ కూడా అమిత్ షా వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ నేను చెప్పిందాంట్లో తప్పేమీ లేదని.. ఒక్క మాట కూడా వెనక్కి తీసుకోబోవడం లేదని స్పష్టం చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించడమంటే మానవత్వాన్ని, సమానత్వాన్ని కాపాడటమేనని అన్నారు. సనాతన ధర్మం వలన అణగారిన వర్గాల తరపునే నేను ఆ మాటలన్నానని తెలిపారు. మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం కూడా ఉదయ నిధి స్టాలిన్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ.. కులం దేశానికి శాపమని అన్నారు. చెన్నైలో రైటర్ల సదస్సులో మాట్లాడుతూ స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చారు. సనాతన ధర్మాన్ని వ్యతిరేకించలేమని నిర్మూలించడం ఒక్కటే మార్గమని అన్నారు. ఇది కూడా చదవండి: జమిలీ ఎన్నికలపై స్పందించిన రాహుల్.. ఏమన్నారంటే? -
ఎమ్మెల్యే చంద్రన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు
తిరుత్తణి: డీఎంకే ఎమ్మెల్యే చంద్రన్‌పై ఆ పార్టీ మహిళా నేత ఫేస్బుక్లో లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం మంగళవారం స్థానికంగా కలకలం రేపింది. వివరాలు.. తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ తిరువళ్లూరు జిల్లా డీఎంకే కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో ఇటీవల డీఎంకేలోని పవు విభాగాలకు జిల్లా స్థాయిలో కొత్తగా పదవులు కేటాయించారు. ఇప్పటి వరకు మహిళా కన్వీనర్‌గా పదవీ బాధ్యతలు నిర్వహించిన తిరుత్తణికి చెందిన ప్రియదర్శిని స్థానంలో కడంబత్తూరుకు చెందిన సరస్వతి చంద్రశేఖర్ నియమితులయ్యారు. దీంతో ప్రియదర్శిని గత కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే సోమవారం తన ఫేస్బుక్ పేజీలో కార్యదర్శి పదవి ఇవ్వాలంటే తన కోరిక తీర్చాలని ఎమ్మెల్యే చంద్రన్ వేధించినట్లు ఆరోపించారు. తాను అంగీకరించక పోవడంతో మరో మహిళకు కార్యదర్శి పదవి కట్టబెట్టారని ఆరోపిస్తూ ఓ వీడియో అప్లోడ్ చేశారు. ఈ వీడి యో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రాజకీయ కుట్ర: ఎమ్మెల్యే ఇక పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే పార్టీలో కొత్త వారికి పదవులు కట్టబెట్టినట్లు ఎమ్మెల్యే చంద్రన్ స్పష్టం చేశారు. మహిళా నేత ప్రియదర్శిని తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. నాలుగు దశాబ్దాలుగా క్రమశిక్షణతో కూడిన రాజకీయం చేస్తున్నాని కొంత మంది స్వార్థం కోసం తనపై తప్పుడు ఆరోపణలు చేసినట్లు తెలిపారు. కాగా ప్రియదర్శిని అక్కసుతోనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కొందరు డీఎంకే నాయకులు మండిపడ్డారు. -
డీఎంకే మంత్రులకు హైకోర్టు ఝలక్
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం 2006–11 మధ్య అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఈ కాలంలో మంత్రులుగా ఉన్న వారి భరతం పట్టే విధంగా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే దూకుడు పెంచింది. డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరెప్షన్(డీవీఏసీ) విభాగాన్ని రంగంలోకి దించింది. డీఎంకే మాజీ మంత్రులే కాదు, పలువురు ఎమ్మెల్యేలపై కేసుల మోత మోగించారు. ఈ క్రమంలో అక్రమాస్తులు, స్థలాల కబ్జా, ఆదాయానికి మించిన ఆస్తులు కూడ బెట్టారని, ప్రభుత్వ నిధులను మింగేశారని అనేక కేసులు పలువురిపై నమోదు అయ్యాయి. మరికొందరిపై పరువు నష్టం దావాలు కూడా దాఖలయ్యాయి. అక్రమాస్తుల కేసులు అత్యధికంగా అప్పటి డీఎంకే సీనియర్లు, మాజీ మంత్రులపై నమోదు అయ్యాయి. రాష్ట్రంలో అన్నాడీఎంకే పదేళ్లు అధికారంలో ఉండడంతో ఈ కేసుల విచారణ నిమిత్తం డీఎంకే నేతలు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి తప్పలేదు. అధికారంలోకి వచ్చాక.. వరుస తీర్పులు... డీఎంకే 2021లో మరోసారి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. 10 ఏళ్ల అనంతరం అధికారం చేజిక్కించుకున్న తర్వాత గతంలో మంత్రులుగా పనిచేసిన సీనియర్లు అధిక శాతం మంది మళ్లీ పదవులు దక్కించుకున్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయ్యింది. అయితే, ఆదాయానికి మించిన ఆస్తులు, అక్రమాస్తుల కేసులలో పలువురు మంత్రులకు కింది కోర్టులో ఆగమేఘాలపై విముక్తి కల్గించే తీర్పులు ఇస్తుండటాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. గత కొన్ని నెలల్లో ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు, రెవెన్యూ మంత్రి కేకేఎస్ఎస్ ఆర్. రామచంద్రన్, ఉన్నత విద్యా మంత్రి పొన్ముడి వంటి వారిపై , వారి బంధువులు, కుటుంబీకులపై నమోదైన కేసుల్లో కింది కోర్టులు ఇస్తున్న తీర్పులు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. జస్టిస్ ఆనంద్ వెంటకేషన్ కన్నెర్ర కింది కోర్టులు తీర్పు వెలువరించి నెలలు గడస్తున్నా అవినీతి నిరోధక శాఖ అప్పీల్‌కు వెళ్లక పోవడం అనుమానాలకు దారి ల్సింది. పొన్ముడిని అక్రమాస్తుల కేసులో విడుదల చేస్తూ వేలూరు కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి ఆనంద్ వెంకటేషన్ అప్పీల్ వ్యవహారంపై స్పందించని అవినీతి ని రోధక శాఖకు అక్షింతలు వేసే విధంగా వ్యాఖ్యలు చేశారు. అలాగే, పొన్ముడి విడుదలను వ్యవహారంలో సుమోటోగా కేసు నమోదు చేసి విచారించనుల్ట్లు ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో బుధవారం మరో ఇద్దరు మంత్రులను ఆనంద్ వెంకటేషన్ టార్గెట్ చేశారు. గతంలో విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు తంగం తెన్నరసు, బీసీ సంక్షేమ మంత్రిగా ఉన్నప్పుడు కేకేఎస్ఎస్ఆర్లపై నమోదైన కేసులలో తాజాగా వెలువడ్డ తీర్పులు ఒకే రకంగా ఉండడాన్ని న్యాయమూర్తి ఆనంద్ వెంకటేషన్ తీవ్రంగా పరిగణించారు. డీఎంకే మంత్రులు, వారి బంధువులు, కుటుంబీకులను విడుదల చేస్తూ కింది కోర్టులు ఇస్తున్న తీర్పులన్నీ ఒకే విధంగా ఉండడంతో అనుమానించారు. న్యాయమూర్తి ఆనంద్ వెంకటేషన్ బుధవారం ఓ కేసు విచారణ సమయంలో మంత్రులను విడుదల చేస్తూ కింది కోర్టులు ఇస్తున్న తీర్పులను ప్రస్తావించారు. ఈ తీర్పులను చదివినానంతరంమూడు రోజులు తనకు నిద్ర రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తంగం తెన్నరసు, కేకేఎస్ఎస్ఆర్ను విడుదల చేస్తూ అనుసరించిన విధానం సరిగ్గా లేదని, కింది కోర్టుల తీర్పు అసంతృప్తిని కలిగించినట్లు పేర్కొన్నారు. తీర్పుల తేదీలను మార్చారేగానీ, సారంశమంతా ఒకే విధంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఎవరు అధికారంలోకి వచ్చినా తమపై కేసులను నిర్వీర్యం చేసుకోవడం, నీరుగార్చి విముక్తి పొందడం పరిపాటిగా మారిందన్నారు. తన మనసాక్షికి కట్టుబడి ఈ కేసులను సుమోటోగా విచారించేందుకు నిర్ణయించానని తెలిపారు. తాను కూడా కళ్లు మూసుకుంటే , న్యాయ వ్యవస్థ తన బాధ్యతల నుంచి తప్పుకున్నట్టేనని అందుకే కింది కోర్టులు ఇచ్చిన తీర్పులపై విచారించేందుకు సిద్ధమైనట్టు ప్రకటించారు. న్యాయమూర్తి వ్యా ఖ్యలు డీఎంకే మంత్రులకు షాక్ గురి చేశాయి. ఇప్పటికే పదేళ్లు న్యాయ పోరాటం చేసిన, తమకు మళ్లీ విచారణ తప్పదన్న బెంగ వారిలో కనిపిస్తోంది. అలాగే ఈ వ్యవహారంలో అవినీతి నిరోధక శాఖ స్పందించాలని ఆదేశిస్తూ, విచారణను సెప్టెంబరు 20వ తేదీకి వాయిదా వేశారు. సుమోటోగా కేసులు అధికారంలోకి వచ్చినానంతరం డీఎంకే మంత్రులు పలువురికి ఆదాయానికి మించిన ఆస్తులు, అవినీతి తదితర కేసుల నుంచి క్రమంగా విముక్తి కలుగుతోంది. అయితే కింది కోర్టు తీర్పులన్నీ ఒకే రకంగా ఉండడం పలు అనుమానాలకు దారి తీశాయి. ఈ తీర్పులను చదివిన హైకోర్టు న్యాయమూర్తి ఆనంద్ వెంకటేషన్ తీవ్రంగా స్పందించారు. జిల్లా కోర్డులు ఇచ్చిన ఆదేశాలను పరిశీలించిన అనంతరం మూడు రోజులు తనకు నిద్ర రాలేదని, అందుకే ఆ కేసులను సుమోటోగా విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు బుధవారం సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే గవర్నర్ తీరుతో తలబొప్పికట్టిన స్టాలిన్ ప్రభుత్వానికి హైకోర్టు నిర్ణయం అశనిపాతంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
తగ్గేదేలేదు!
సాక్షి, చైన్నె: రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్రవి, సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరు పతాక స్థాయికి చేరింది. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన 13 ముసాయిదాలు రాజ్‌భవన్ ఇప్పటికే తుంగలో తొక్కింది. మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీ వ్యవహారంలో అత్యుత్సాహాన్ని గవర్నర్ ప్రదర్శించారు. అదే సమయంలో గుట్కా తదితర కేసుల విచారణకు అనుమతి కోరుతూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదిక విషయంలో అన్నాడీఎంకే మాజీ మంత్రులకు అభయం కల్పించే విధంగా గవర్నర్ కొత్త మెలికలు పెట్టారు. ప్రభుత్వం నుంచి పంపించే ప్రతి నివేదికను కొద్ది రోజులు పెండింగ్‌లో పెట్టడం, తర్వాత వెనక్కి పంపించడం ఆయనకు పరిపాటిగా మారింది. ఈ పరిణామాలు డీఎంకే పాలకుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే గవర్నర్‌ను ఓ రాజకీయ నాయకుడిగా చిత్రీకరిస్తూ డీఎంకే మంత్రులు, కూటమి పార్టీలు సవాళ్లను విసిరే పనిలో పడ్డాయి. దమ్ముంటే పదవికి రాజీనామా చేసి రాజకీయంగా ఢీ కొట్టేందుకు సిద్ధం కావాలనే హెచ్చరికలు చేస్తూ వస్తున్నాయి. ఆదివారం నీట్ వ్యవహారంలో గవర్నర్ తీరుకు వ్యతిరేకంగా అధికార పక్షానికి చెందిన అనుబంధ విభాగాలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు హోరెత్తించాయి. ఇందులో మంత్రి ఉదయ నిధి స్టాలిన్‌తో పాటు మరికొందరు గవర్నర్‌ను ఏక వచనంతో పిలుస్తూ, తీవ్రవిమర్శలు, ఆరోపణలు, హెచ్చరికలు, సవాళ్లు చేశారు. అయితే, వీటన్నింటికి తాను భయ పడబోనని , ఇంకా చెప్పాలంటే తగ్గేదేలేదు అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారం గవర్నర్ ఆర్ఎన్రవి దూకుడు పెంచడం గమనార్హం. టీఎన్పీఎస్సీపై పీఠముడి.. రాష్ట్రంలో గత ఏడాది కాలంగా ఖాళీగా ఉన్న టీఎన్పీఎస్సీ చైర్మన్ పదవిని భర్తీ చేయడానికి జూన్‌లో ప్రభుత్వం చర్యలు తీసుకుంది. చైర్మన్ పదవిలో అప్పటి డీజీపీ శైలేంద్రబాబును నియమించేందుకు నిర్ణయించారు. పదవీ విరమణ చేయగానే ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించి గౌరవించే విధంగా సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. శైలేంద్రబాబుతో పాటు మరో 8 మంది సభ్యుల నియామకానికి ఆమోద ముద్ర వేయాలని రాజ్‌భవన్‌కు పంపించిన సిఫార్సును రెండు నెలలుగా పట్టించుకోలేదు. ఈక్రమంలో ఎట్టకేలకు మంగళవారం ఈ నివేదికకు వ్యతిరేకంగా గవర్నర్ స్పందించారు. చైర్మన్, సభ్యుల నియామకంపై అనేక ప్రశ్నలు సంధించారు. ఎంపికకు ముందుగా బహిరంగ ప్రకటన ఇచ్చారా..? సుప్రీంకోర్టు ఉత్తర్వులను అనుసరించారా..? అని ప్రశ్నలు సంధించారు. అలాగే అనేక నిబంధనలను ఉల్లంఘనలను ఎత్తి చూపుతూ నివేదికను వెనక్కి పంపించారు. ఈ ఘటన డీఎంకే పాలకులకు పుండు మీద కారం చల్లినట్లుగా మారింది. ఏదేని నివేదిక, ఫైల్స్‌ను ఆమోదం కోసం పంపిస్తే కొన్ని నెలలు, లేదా సంవత్సరం కాలానికి పైగా పెండింగ్‌లో పెట్టడం..తర్వాత వెనక్కు పంపించడం ఈ గవర్నర్‌కు పరిపాటిగా మారిందని డీఎంకే నేత ఆర్ఎస్ భారతి మండి పడ్డారు. అదే సమయంలో టీఎన్పీఎస్సీ ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్న దృష్ట్యా, గవర్నర్‌కు వివరణ ఇవ్వడమా..? లేదా, తన అధికారాలను ప్రయోగించి నేరుగా సీఎం ఏదైనా నిర్ణయం తీసుకుంటారా? అన్న చర్చ జోరందుకుంది. అదే సమయంలో గవర్నర్ మరో అడుగు ముందుకు వేసి రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకు వ్యతిరేకంగా విద్యాసంస్థలకు లేఖలు రాయడం రచ్చకెక్కింది. స్టేట్ సిలబస్ అమలుచెయొద్దని వర్సిటీలకు ఆదేశాలు ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, స్వయంప్రతిపత్తిహోదా కలిగిన విద్యా సంస్థలు, వర్సిటీల పరిధిలోని కళాశాలలో ఒకే రకమైన సిలబస్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం గత నెల ఆదేశాలు ఇచ్చింది. దీనికి వ్యతిరేకంగా వర్సిటీలకు, విద్యా సంస్థలకు గవర్నర్ ప్రత్యేక ఆదేశాలతో లేఖ పంపించడం చర్చకు దారి తీసింది. తమిళనాడు ఉన్నత విద్యలో జనరల్ సిలబస్‌కు ఆస్కారం లేదని వివరించారు. అనేక విద్యా సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై వచ్చిన సమాచారం, ఫిర్యాదులు, వివరాల మేరకు జనరల్ సిలబస్ అమలును ఖండిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం విద్యా వ్యవస్థ స్వతంత్రతకు తీవ్ర నష్టం కలిగించడమే కాకుండా, విద్యాప్రమాణాలను తగ్గిస్తాయని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఉన్నత విద్యా పరంగా పార్లమెంట్లో చేసిన చట్టం మేరకు అనేక అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నట్లు వివరించారు. ఇక యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జనరల్ సిలబస్ తీసుకొచ్చిందని, దీనిని అమలు చేయవద్దని అన్ని విద్యా సంస్థలను గవర్నర్ ఆదేశించడం గమనార్హం. అలాగే మద్రాసు పేరును గతంలోనే ప్రభుత్వం చైన్నెగా మార్చేసింది. దీంతో అప్పటి నుంచి చైన్నె డేగా అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే, చైన్నె డే అని కాకుండా, మద్రాసు డే అని పేర్కొంటూ గవర్నర్ మంగళవారం శుభాకాంక్షల తెలియజేస్తూ లేఖ విడుదల చేయడాన్ని తమిళాభిమానులు వ్యతిరేకిస్తున్నారు. -
‘నీట్’ నుంచి మినహాయించేదాకా ఉద్యమిస్తాం
చెన్నై: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్) నుంచి తమిళనాడును మినహాయించేదాకా తమ ఉద్యమం ఆగదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తేల్చిచెప్పారు. ‘నీట్’ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అధికార డీఎంకే నేతృత్వంలో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలను, ఆందోళనలు నిర్వహించారు. నిరాహార దీక్షలు సైత చేపట్టారు. నీట్ రద్దు అనేది రాజకీయపరమైన డిమాండ్ కాదని, అందిరికీ సమాన అవకాశాలు లభించాలన్నదే తమ ఉద్దేశమని స్టాలిన్ చెప్పారు. ఈ పరీక్ష నుంచి తమిళనాడు మినహాయించేలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తామని వెల్లడించారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటి ఎదుట ధర్నా చేస్తామని పేర్కొన్నారు. ఈ ధర్నాలో పాల్గొనాలని విపక్ష ఏఐఏడీఎంకేకు స్టాలిన్ సూచించారు. అయితే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే నీట్‌ను తీసుకొచ్చానని ఏఐఏడీఎంకే నేత, మాజీ సీఎం పళనిస్వామి గుర్తుచేశారు. -
‘వారసత్వ రాజకీయాలు విషతుల్యం’
భోపాల్: వారసత్వ రాజకీయాలు విషంతో సమానమని హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. వీటివల్ల ఒకే కుటుంబం చెప్పుచేతల్లో పార్టీ, ప్రభుత్వం ఉంటాయన్నారు. కాంగ్రెస్, డీఎంకే, శివసేన(ఉద్ధవ్)వర్గం కుటుంబ రాజకీయాలను నడిపిస్తున్నాయని ఆరోపించారు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కుల ఉద్యమాలను ప్రోత్సహిస్తోందన్నారు. వీటివల్లే 2018లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని చెప్పారు. -
కేంద్రంపై సీఎం స్టాలిన్ సీరియస్.. కారణం ఇదే..
చెన్నై: హిందీ విషయంలో కేంద్రం వర్సెస్ తమిళనాడు అన్నట్టుగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కేంద్రం భారత్‌లో నేర సంబంధిత న్యాయ వ్యవస్థలో కీలక మార్పులకు సిద్దమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టాలను వేరే కొత్త చట్టాలతో భర్తీ చేయనుంది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లను అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇక, ఈ బిల్లులపై తమిళనాడు అధికార పార్టీ డీఎంకే సంచలన కామెంట్స్ చేసింది. ఇక, కేంద్రం బిల్లులకు హిందీ పేర్లు పెట్టడం పట్ల డీఎంకే అభ్యంతరం వ్యక్తపరిచింది. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. కేంద్రం తెచ్చిన మూడు బిల్లులకు హిందీ పేర్లు పెట్టడం భాషా సామ్రాజ్యవాదమని మండిపడ్డారు. ఇది సమైక్య భారత దేశ మూలాలను కించపరచడమే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో తమిళంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తమిళం అనే పదాన్ని పలకడానికి బీజేపీకి, ప్రధాని మోదీకి హక్కు లేదన్నారు. డీకాలనైజేషన్ పేరుతో రీకాలనైజేషన్ చేస్తున్నారని విమర్శించారు. ఇది కచ్చితంగా తమ గుర్తింపును వెనక్కి నెట్టే ప్రయత్నమేనని తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు.. కేంద్రం తెచ్చిన బిల్లులపై పార్లమెంట్లో డీఎం ఎంపీ విల్సన్ సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. సభలో విల్సన్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం హిందీని దేశమంతటికీ రుద్దుతోందన్నారు. ఈ మూడు బిల్లుల పేర్లను ఇంగ్లిష్‌లోకి మార్చాలని డిమాండ్ చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. దీంతో, డీఎంకే నేతల వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఇది కూడా చదవండి: 'మణిపూర్ సమస్యకు సర్జికల్ స్ట్రైక్ ఒక్కటే మార్గం..' -
జై షా బీసీసీఐ సెక్రటరీ ఎలా అయ్యాడు?.. అమిత్ షాకు ఉదయనిధి స్టాలిన్ కౌంటర్
సాక్షి, చెన్నై: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై తమిళనాడు క్రీడామంత్రి ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. డీఎంకే పార్టీ వారసత్వ పార్టీ అని తమిళనాడులో వారసత్వ రాజకీయాలు ఉన్నాయంటూ అమిత్‌షా చేసిన వ్యాఖ్యలకు ఉదయనిధి స్టాలిన్ కౌంటర్ వేశారు. కేంద్ర మంత్రి కొడుకు జై షాకు ఏ అర్హత ఉందని బోర్డు ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(బీసీసీఐ) సెక్రటరీ పదవి కట్టబెట్టారని ప్రశ్నించారు. కాగా అమిత్ షా శుక్రవారం తమిళనాడులో పర్యటించిన విషయం తెలిసిందే. రామేశ్వరంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ కే అన్నామలై పాదయాత్రను ప్రారంభించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పూర్తి అవినీతి పార్టీ అని, మిత్రపక్షలతో కలిసి వారసత్వ రాజకీయాలను ప్రొత్సహిస్తుందని విమర్శలు గుప్పించారు. అదే విధంగా డీఎంకేను కుటుంబ పార్టీగా అభివర్ణించారు. చదవండి: ఉమేశ్ పాల్ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ లాయర్ అరెస్టు.. తాజాగా చెన్నైలో ఏర్పాటు చేసిన డీఎంకే యువజన విభాగం నూతన కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్ని అమిత్ షా ఆరోపణలపై విరుచుకుపడ్డారు. తాను ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాతే మంత్రి అయ్యానని పేర్కొన్నారు. తనను ముఖ్యమంత్రిని చేయాలన్నదే డీఎంకే నేతల ధ్యేయమని అమిత్ షా చెబుతున్నారని, మరి మీ కొడుకు(జై షా) బీసీసీఐ సెక్రటరీ ఎలా అయ్యాడని ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. జే ఎన్ని క్రికెట్ మ్యాచ్‌లు ఆడారని, ఆయన ఎన్ని పరుగులు సాధించాడని ఉదనినిధి స్టాలిన్ అమిత్ షాను ప్రశ్నించాడు. తన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. (జాతీయ విపత్తు కింద రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూ.900 కోట్లు: కిషన్ రెడ్డి) -
గవర్నర్‌కు డీఎంకే ఫైల్స్–2
సాక్షి, చెన్నై: డీఎంకే అవినీతి అక్రమాలు ఫైల్స్ –2 పేరుతో ఏకంగా ఓ ట్రంక్ పెట్టెలో ఆధారాలను పెట్టి మరీ రాజ్‌భవన్‌లో బీజేపీ రాష్ట్ర అ«ధ్యక్షుడు అన్నామలై బుధవారం గవర్నర్‌కు సమరి్పంచడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందులో తొమ్మిది మంది రాష్ట్ర మంత్రుల అవినీతికి సంబంధించిన వివరాలు, మూడు ప్రాజెక్టుల్లో చోటుసుకున్న అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. వివరాలు.. అవినీతి అక్రమాలు.. పేరుతో సీఎం స్టాలిన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తులు, డీఎంకే పార్టికి సంబంధించిన ఆస్తులు, పలువురు ఎంపీల అక్రమార్జన వివరాలను డీఎంకే ఫైల్స్ –1 పేరుతో ఈ ఏడాది ఏప్రిల్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విడుదల చేశారు. ఈ సమయంలో త్వరలో డీఎంకే ఫైల్స్– 2 కూడా బయటకు వస్తుందని వ్యాఖ్యానించారు. డీఎంకే ఫైల్స్ వ్యవహారంలో అన్నామలైపై డీఎంకే పార్టీ వర్గాలు పరువునష్టం దావా కూడా వేశాయి. ఈ పరిస్థితుల్లో ఇది వరకు మీడియా ముందు ఫైల్స్– 1ను విడుదల చేసిన అన్నామలై ఈసారి రూటు మార్చారు. డీఎంకే ఫైల్స్– 2 పేరుతో ఒక ట్రంక్ పెట్టెలో కొన్ని పత్రాలను పెట్టి పెట్టి మరీ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు అందజేశారు. అలాగే ఇటీవల కాలంలో మూడు ప్రాజెక్టుల్లో రూ. 5,600 కోట్ల అవినీతి జరిగిందని పేర్కొంటూ, ఆ వివరాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. -
తీవ్ర విషాదం: కుటుంబంతో సహా డీఎంకే కౌన్సిలర్ బలవన్మరణం
తమిళనాడు: రాశిపురం డీఎంకే మహిళా కౌన్సిలర్ దేవి ప్రియ (31) తన భర్త, కుమార్తెతో కలిసి బలన్మరణానికి పాల్పడింది. బుధవారం వారి ఇంట్లో వారు ఉరికి వేలాడుతుండటాన్ని గుర్తించిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. వివరాలు.. నామక్కల్ జిల్లారాశిపురం బొమ్మితేరు ప్రాంతానికి చెందిన అరుణ్‌లాల్(42) రెండు దశాబ్దాలుగా స్థానికంగా నగల దుకాణం నడుపుతున్నాడు. ఆయనకు భార్య దేవి ప్రియ(31), కుమార్తె మోనిక శ్రీ(18)తో పాటు మరో కుమార్తె ఉన్నారు. దేవిప్రియ రాశిపురం మునిసిపాలిటీ 13వ వార్డు డీఎంకే కౌన్సిలర్‌గా ఉన్నారు. మోనిశ్రీ ప్లస్–2 ఉత్తీర్ణత సాధించి ఉంది. పెద్దకుమార్తె బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. ఈ పరిస్థితులలో బుధవారం ఉదయం వీరి ఇంటి తలుపులు ఎంతకూ తెరుచుకోక పోవడంతో ఇరుగు పొరుగు వారు కిటికి గుండా లోనికి చూశారు. అరుణ్ లాల్, దేవిప్రియ ఉరికి వేలాడుతుండటంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు పగల కొట్టి లోనికి వెళ్లారు. దంపతులు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. చిన్న కుమార్తె మోనిక శ్రీకి విషం తాగి మరణించినట్లు తేలింది. ఎంతో ఆనందంగా ఉన్న కుటుంబం హఠాత్తుగా బలన్మరణానికి పాల్పడటం అనుమానాలకు దారి తీశాయి. వ్యాపారంలో ఏదైనా నష్టం వచ్చిందా..? లేదా మరెదేని కారణాలు ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి మృతి విషయాన్ని బెంగళూరులోని పెద్దకుమార్తెకు పోలీసులు తెలియజేశారు. -
నియంత్రించాం.. నష్టపోతున్నాం: స్టాలిన్
చెన్నై: దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణతో ఆయా రాష్ట్రాలు నియోజకవర్గాలను కోల్పోతున్నాయని తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. స్టాలిన్ తాజాగా ‘ది వీక్’ వార్తాసంస్థతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘ దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలుచేస్తూ దేశానికి మేలుచేస్తున్నాయి. కానీ అదేసమయంలో ఈ ప్రాంతంలో జనాభా క్షీణించడంతో నియోజకవర్గాల సంఖ్య తగ్గుతోంది. ఈ పరిణామం దక్షిణాది రాష్ట్రాలకు పెద్ద నష్టం. ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పథకాలను సరిగా అమలుచేయలేక చేతులెత్తేశాయి. అయినాసరే ఎక్కువ లోక్‌సభ స్థానాలను దక్కించుకోనున్నాయి. తమకు ఓటు వేయని దక్షిణాది రాష్ట్రాలపై పగ తీర్చుకునేందుకు ఈ ‘జనాభా ప్రాతిపదికన సీట్లు’ విధానాన్ని అమలుచేయాలని బీజేపీ భావిస్తోంది. ఈసారి ఎన్నికల్లో గెలిస్తే దీనిని అమలుచేసేందుకు బీజేపీ ఉవి్వళ్లూరుతోంది. అయినాసరే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల మధ్య బేదాభిప్రాయాలు తుడిచిపెట్టుకుపోతాయి. ప్రతిపక్షానికి ఏకైక నిర్వచనంగా కాంగ్రెస్ అవతరిస్తుంది. దేశానికి సరికొత్త నమ్మకంగా రాహుల్ గాంధీ నిలిచారు’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. -
బీజేపీకి పతనం తప్పదు! : తమిళనాడు సీఎం స్టాలిన్
సాక్షి, చైన్నె: మతపరంగా ప్రజల మధ్య చిచ్చు పెట్టి రానున్న ఎన్నికల్లో గెలవచ్చన్న ధీమాతో ఉన్న బీజేపీకి జాతీయ స్థాయిలో పతనం తప్పదని సీఎం స్టాలిన్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి 2024 ఎన్నికల్లో ప్రజలు పెద్ద గుణపాఠం చెప్పడం తథ్యమన్నారు. గురువారం డీఎంకే కార్యాలయం అన్నాఅరివాలయంలో పార్టీ నాయకుడు గుమ్మిడిపూండి వేణు ఇంటి శుభకార్య వేడుకలో సీఎం స్టాలిన్ పాల్గొని ప్రసంగించారు. డీఎంకే అంటే ఓ కుటుంబం అన్న విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుంచుకుంటే మంచిదని హితవు పలికారు. మహానాడులైనా సరే, పార్టీ కార్యక్రమాలైనా సరే కుటుంబ సమేతంగా నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చే ఒకే ఒక్క పార్టీ డీఎంకే అని గుర్తు చేశారు. డీఎంకేలో ఉన్న ప్రతి ఒక్కర్ని దివంగత నేత కలైంజ్ఞర్ కరుణానిధి తన కుటుంబంలోని వ్యక్తులుగానే భావిస్తారని పేర్కొన్నారు. డీఎంకేకు ఓటు వేస్తే అది కరుణానిధి కుటుంబ ప్రయోజనానికే ఉపయోగకరం అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. డీఎంకే అంటే కుటుంబం, డీఎంకే అంటే తమిళనాడు, తమిళనాడు ప్రయోజనాలే డీఎంకేకు ముఖ్యం అన్న విషయాన్ని ఆయన బాగానే గ్రహించినట్టున్నారని హితవు పలికారు. ఓటమి తప్పదు.. గత 50 ఏళ్లుగా తమిళనాడు అనే కుటుంబం సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా డీఎంకే శ్రమిస్తున్న విషయాన్ని మోదీ గుర్తెరగాలని సూచించారు. ఆధునిక తమిళనాడు రూపకర్త దివంగత నేత కరుణానిధి అని, ఆయన అడుగుజాడల్లో ద్రావిడ మోడల్ పాలన తమిళనాట సాగుతోందన్నారు. కలైంజ్ఞర్ శత జయంతి ఉత్సవాల వేళ గత రికార్డుల గురించి చెబుతూ పోతే సమయం చాలదని పేర్కొన్నారు. మీసా చట్టంలో తాను అరెస్టయిన సమయంలో జైల్లో ముందుగా తనను కాకుండా ఇతర నాయకులు, కార్యకర్తలను దివంగత నేత పరామర్శించారని గుర్తు చేశారు. ఆయనకు కుమారుడి కంటే డీఎంకే కుటుంబం ముఖ్యం అని గుర్తు చేస్తూ, ఇవన్నీ మోదీకి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో అని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీలో భయం పెరిగిందన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకం కావడంతో ఓటమి తప్పదన్న ఆందోళనలో ఆయన ఉన్నారని పేర్కొన్నారు. అందుకే ప్రజల మధ్య మత చిచ్చులు పెట్టి, ఆ నీడలో 2024 ఎన్నికల్లో గెలవాలన్న వ్యూహ రచనలో ఉన్నారని ఆరోపించారు. ఆయన పాచికలు ఇక పారబోవని, ప్రజలు మోదీ గురించి సమగ్రంగా అధ్యయనం చేసి ఓడించడం లక్ష్యంగా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. మణిపూర్ ఘటనలను గుర్తు చేస్తూ, ఈ వ్యవహారంలో మోదీ అనుసరిస్తున్న తీరుపై ధ్వజమెత్తారు. అల్లర్లు బయలుదేరిన నెలన్నర రోజుల తర్వాత హోంమంత్రి అమిత్‌షా ద్వారా అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడం శోచనీయమని విమర్శించారు. ఈసారి ఎన్ని కుట్రలు చేసినా మోదీకి ఓటమి తప్పదని, ప్రజలు ఆయనకు రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. -
మంత్రిపై అవినీతి ఆరోపణలు.. డిస్మిస్ చేసిన గవర్నర్
చెన్నై: తమిళనాడులో మరోసారి ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఆవినీతి ఆరోపణల నేపథ్యంతో అరెస్ట్ అయిన మంత్రి సెంథిల్ బాలాజీని మంత్రి పదవి నుంచి తొలగించారు ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి. ఈ మేరకు గురువారం రాజ్‌భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. ‘జాబ్స్ పర్ క్యాష్, మనీలాండరింగ్‌తో సహా అనేక అవినీతి కేసుల్లో మంత్రి సెంథిల్ బాలాజీ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సెంథిల్‌ను గవర్నర్ మంత్రివర్గం నుంచి ఆయన్ను తొలగించారు. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయి’ అని రాజ్ భవన్ ప్రకటనలో పేర్కొంది. కాగా జూన్ 14న తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖల మంత్రి వి. సెంథిల్ బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. చెన్నైలోని మంత్రి అధికారిక నివాసాలు, కార్యాలయాల్లో 18 గంటలపాటు సోదాలు, విచారణ అనంతరం అదుపులోకి తీసుకుంది. ఈ సమయంలో గుండెపోటు రావడంతో ఆయనకు శస్త్ర చికిత్స అనివార్యమైంది. కావేరి ఆస్పత్రిలో డాక్టర్ ఏఆర్ రఘురాం బృందం ఐదు గంటల పాటు శ్రమించి సెంథిల్ బాలాజీకి బైపాస్ సర్జరీ విజయవంతం చేశారు. ప్రస్తుతం ఆయన ఈడీ దర్యాప్తు చేస్తున్న క్రిమినల్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. దివంగత సీఎం జయలలిత హయాంలో(2011-2016) రవాణా శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీపై లంచాలు తీసుకుని ఉద్యోగాలిచ్చినట్లు (క్యాష్ పర్ జాబ్స్) కుంభకోణం కేసు ఉంది. ఇందులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. చదవండి: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారు.. ఆ రోజే వరంగల్‌కు రాక సెంథిల్ బాలాజీ రాజకీయ ప్రస్థానం బాలాజీ 2006 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ తరపున కరూర్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2011లో కరూర్ నుంచి ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచి దివంగత జె. జయలలిత నేతృత్వంలోని ఏఐఏడీఎంకే ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2015లో జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ కుటుంబ సభ్యుడితో విభేదాలు రావడంతో కేబినెట్ నుంచి తొలగించారు. 2016 ఎన్నికల్లో అరవకురిచ్చి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ అన్నాడీఎంకే ప్రభుత్వంలో కేబినెట్ హోదా లభించలేదు. 2017లో అనర్హత వేటు అన్నాడీఎంకేలో చీలిక తర్వాత బాలాజీ శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌కు మద్దతు తెలిపాడు. 2017లో ముఖ్యమంత్రిని మార్చాలంటూ అప్పటి గవర్నర్‌కు పిటిషన్ అందించినందుకు.. అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేసిన 18 మంది ఎమ్మెల్యేల్లో ఆయన ఒకరు. బాలాజీ 2018లో డీఎంకేలో చేరి అరవకురిచ్చి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. మళ్లీ 2019లో అదే నియోజకవర్గం నుంచి, 2021లో కరూర్ నుంచి గెలిచారు. సీఎంకు సన్నిహిత వ్యక్తిగా బాలాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌కు సన్నిహిత వ్యక్తిగా పేరుగాంచడంతో మంత్రి బాధ్యతలు అప్పగించారు. ఇటీవల అన్నాడీఎంకే నుంచి మారినప్పటికీ అతనికి ముఖ్యమైన శాఖలను కేటాయించాడు. అనంతరం బాలాజీపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. డీఎంకే-కాంగ్రెస్ కూటమి అభ్యర్థి గెలుపొందిన ఈరోడ్ ఈస్ట్ ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లకు నగదు పంపిణీ చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. టెండర్ల కేటాయింపులో కూడా అవకతవకలు జరిగాయని బార్ యజమానులు ఆయనపై ఆరోపణలు గుప్పించారు. కొంతమంది బార్ యజమానులు అతని పేరు మీద నెలవారీ రక్షణ డబ్బును డిమాండ్ చేశారని కూడా ఆరోపించారు. -
ఇక జాతీయ రాజకీయాలు!
సాక్షి, చైన్నె: లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా జాతీయస్థాయి రాజకీయాలపై డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ ప్రత్యేక దృష్టిపెట్టారు. బిహార్‌లోని పాట్నా లో జాతీయ రాజకీయచట్రంలో తాము కీలకపాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్న సంకేతాన్ని ఇచ్చారు. ఇందుకు తగ్గట్టుగానే గురువారం రాత్రి, శుక్రవారం డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ పాట్నాలో బిజీబిజీ అయ్యారు. బీహార్ సీఎం నితీష్‌కుమార్, మాజీ సీఎం లాలుప్రసాద్ యాదవ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ముఖ్యనేతలతో పలకరింపులతో బీజేపీకి వ్యతిరేకంగా తన తీవ్రగళాన్ని స్టాలిన్ వినిపించినట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. మొదటి నుంచి డీఎంకే అధ్యక్షుడు సీఎం స్టాలిన్ కేంద్రంలోని బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా తన స్వరాన్ని పెంచుతున్న విషయం తెలిసిందే. గవర్నర్ ద్వారా తన ప్రభుత్వాన్ని కేంద్రం ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చేయడాన్ని, తమను బెదిరించి దారిలోకి తెచ్చుకునే విధంగా కేంద్రం సాగిస్తున్న పరిణామాలను స్టాలిన్ తీవ్రంగానే పరిగణించారు. కేంద్రం చర్యలను వ్యతిరేకించడమే కాకుండా, సమయం దొరికినప్పుడల్లా తీవ్ర స్వరంతో హెచ్చరికలు సైతం చేస్తున్నారు. ఈ పరిస్థితులో బిహార్ సీఎం నితీష్‌కుమార్ నేతృత్వంలో ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యే విధంగా పాట్నా వేదికగా శుక్రవారం జరిగిన సమావేశం ద్వారా దివంగత డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి గతంలో అనుసరించిన ఫార్ములాతో జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. తాము కీలకపాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నామని చాటే ప్రయత్నం చేశారు. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోని 40 స్థానాలను తాము కై వసం చేసుకుంటామన్న ధీమాను వ్యక్తం చేయడం విశేషం ఒక రోజు ముందుగానే.. ఈ సమావేశం నిమిత్తం గురువారమే పాట్నాకు సీఎం స్టాలిన్ వెళ్లారు. అదే రోజు రాత్రి ఆయన సీఎం నితీష్‌కుమార్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కొన్ని గంటల పాటు రాజకీయ అంశాలపై ఈ భేటీ జరిగినట్టు డీఎంకే వర్గాలు పేర్కొన్నాయి. అలాగే, మాజీ సీఎం లాలుప్రసాద్ యాదవ్‌తో కూడా భేటీ అయ్యారు. ఈసందర్భంగా దివంగత నేత కరుణానిధితో తనకు ఉన్న అనుబంధం గురించి లాలు వ్యాఖ్యలు చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్‌తో పాటు పలువురు ముఖ్యప్రముఖులను శుక్రవారం స్టాలిన్ కలిశారు. బిహార్‌లోని పలువురు తమిళ అధికారులు స్టాలిన్‌ను కలవడం విశేషం. అనంతరం జరిగిన లౌకిక వాద పార్టీల నేతల సమావేశంలో బీజేపీకి వ్యతిరేకంగా స్టాలిన్ తన ఆగ్రహాన్ని తీవ్రంగానే వ్యక్తం చేసినట్టు డీఎంకే వర్గాలు పేర్కొన్నాయి. అందరూ ఐక్యతతో ముందుకు వెళ్తే, బీజేపీని ఓడించడం ఖాయం అన్న ధీమాను స్టాలిన్ వ్యక్తం చేయడం విశేషం. సమావేశానికి హాజరైన అన్ని పార్టీల నేతలు, పలు రాష్ట్రాల సీఎంలతో స్టాలిన్ ప్రత్యేకంగా కలవడమే కాకుండా జాతీయ రాజకీయాలలో డీఎంకే మరింత చురుగ్గా పాల్గొనబోతోందన్న సంకేతాన్ని ఇవ్వడం గమనార్హం. నమ్మకం ఉంది.. పాట్నా పర్యటన ముగించుకుని రాత్రి చైన్నెకు చేరుకున్న సీఎం స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలన్నీ ఏకం కావడం ఓ నమ్మకాన్ని కలిగించిందన్నారు. బీజేపీని ఓడించి తీరాలన్న సంకల్పంతో అన్ని పార్టీలు ఉన్నట్టు వివరించారు. దేశాన్ని, ప్రజల్ని రక్షించాలంటే ఐక్యతతో, ఒకే గళంతో అందరూ ముందుకెళ్లాల్సిన తరుణం ఇదేనని వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల అనంతరం కూటమి కన్నా, ముందుగానే కూటమిని తేల్చడం మంచిదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 2024లో బీజేపీని ఓడించి తీరుతామన్న నమ్మకం తనకు ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు అందరం ఏకం కావడం నమ్మకాన్ని పెంచిందని వ్యాఖ్యలు చేశారు. -
ఆస్పత్రిలో కుష్బూ
ఫైర్‌బ్రాండ్ నటిగా ముద్ర వేసుకున్న నటి, బీజేపీ అధికార ప్రచారకర్త కుష్బూ గురువారం సాయంత్రం మరోసారి ఆస్పత్రిలో చేరారు. ఇమె ఇటీవలే చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి వైద్య చికిత్స పొంది డిశ్చార్జి అయిన విషయం తెలిసిందే. ఈమె ఇటీవల తనను కించపరిచేలా మాట్లాడిన స్థానిక డీఎంకే ప్రచారకర్తపై చెన్నై పోలీస్ కమిÙనర్కు ఫిర్యాదు చేసి ఆయనకు మీడియా ద్వారా స్ట్రాంగ్ వారి్నంగ్ ఇచ్చి వార్తల్లోకెక్కారు. ఇలాంటి పరిస్థితుల్లో కుష్బూ మరోసారి ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్లో పేర్కొన్నారు. వెన్నెముక మళ్లీ నొప్పిగా ఉండడంతో ఆస్పత్రిలో చేరినట్లు తెలిపారు. ఈ సారి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొస్తాననే నమ్మకం ఉందని పేర్కొన్నారు. -
కుష్బు ఆక్రోశం
సాక్షి, చైన్నె: బీజేపీ మహిళా నేత, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు కుష్బులో ఆక్రోశం రగిలింది. ఆదివారం ఆమె మీడియా సమావేశంలో డీఎంకే నాయకులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచే విధంగా ఎంతటి వారైనా సరే వ్యాఖ్యలు చేస్తే సహించబోనని హెచ్చరించారు. డీఎంకే అధికార ప్రతినిధి శివాజీ కృష్ణమూర్తి ఓ సభలో కుష్బుకు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. దీనిపై కుష్బు తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ అనాగరికంగా మహిళలను ఉద్దేశించి ఎవరైనా మాట్లాడితే, అది వారి తల్లిని కించపరిచినట్టే అని మండిపడ్డారు. మహిళలకు వ్యతిరేకంగా ఒక నాయకుడు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తుంటే, సీఎం మౌనం వహించడాన్ని ఖండిస్తున్నామన్నారు. తన ఇంటి మీద రాళ్లు విసిరినా భయపడను అని హెచ్చరించారు. ఇప్పటికే తన ఇంటి మీద గతంలో దాడి చేశారని గుర్తు చేస్తూ, ఇక ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు ఎదురు దాడికి తాను సిద్ధం అని హెచ్చరికలు చేశారు. తాను పార్టీ రీత్యా చూడడం లేదని, మహిళలను కించ పరిచే విధంగా ఎవరు వ్యాఖ్యలు చేసినా అది చట్టపరంగా నేరం అని స్పష్టం చేశారు. మహిళలను కించపరిచే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. తన కోసం మాట్లాడడం లేదని, కించపరిచే వారిపై ఎదురు దాడికి ప్రతి మహిళ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇందులో తాను ముందు ఉంటానని స్పష్టం చేశారు. గొడవకై నా సరే, ఎదురు దాడికై నా సరే తనకు ధైర్యం ఉందన్నారు. తాను ప్రతిభను నమ్ముకుని తమిళనాడుకు వచ్చానని, తనను రెచ్చగొట్టొద్దని హెచ్చరించారు. మహిళలను కించ పరిచే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే తాను చూస్తూ ఊరుకోబోనని వ్యాఖ్యలు చేశారు. వేదికలు ఎక్కి మహిళలను కించ పరిచే అధికారం డీఎంకే వాళ్లకు ఎవరు ఇచ్చారో అని ప్రశ్నిస్తూ, చట్ట రీత్య వారిపై చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. తనలోని ఆక్రోశాన్ని వెళ్లగక్కే విధంగా మరిన్ని వ్యాఖ్యలతో కుష్బు సమావేశంలో ఆవేశంతో స్పందించడం గమనార్హం. శివాజీ కృష్ణమూర్తికి ఉద్వాసన కుష్బుకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన అధికార ప్రతినిధి శివాజీ కృష్ణమూర్తిని డీఎంకే నుంచి శాశ్వతంగా బహిష్కరించారు. ఇందుకు సంబంధించిన ప్రకటనను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ ఆదివారం రాత్రి విడుదల చేశారు. పార్టీకి కళంకం తెచ్చే విధంగా వ్యవహరించిన శివాజీ కృష్ణ్ణమూర్తిని పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు అన్ని పదవుల నుంచి శాశ్వతంగా తొలగిస్తున్నట్టు ప్రకటించారు. కాగా, కుష్బు తీవ్ర ఉద్వేగం, ఆక్రోశంతో స్పందించిన కొన్ని గంటల్లో దురైమురుగన్ చర్యలు తీసుకోవడం గమనార్హం. ఈ చర్యలను కుష్బు ఆహ్వానించారు. అయితే, శివాజీ కృష్ణమూర్తిపై తాను చట్టపరంగా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. -
తగ్గేదేలే.. ముఖ్యమంత్రి స్టాలిన్
సాక్షి, చైన్నె: రాష్ట్ర హక్కుల పరిరక్షణలో తగ్గేది లేదని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. డీఎంకే కార్యకర్తలకు ఆదివారం ఆయన లేఖ రాశారు. ఇందులో రాష్ట్రంలో ఇటీవల కాలంగా జరుగుతున్న పరిణామాలను గుర్తు చేశారు. కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టారు. దివంగత నేత కరుణానిధి శత జయంతి ఉత్సవాలను గుర్తుచేస్తూ, ఏడాది పొడవునా వేడుకలను జయప్రదం చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రాల హక్కులను హరించే విధంగా కేంద్రం తీరు ఉందని ధ్వజమెత్తారు. తమిళనాడు హక్కుల పరిరక్షణలో తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఎంత వరకై నా వెళ్లి ఢీకొట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు వ్యాఖ్యలు చేశారు. యువత మేధాసంపతికి దోహదపడే విధంగా మదురైలో కలైంజ్ఞర్ కరుణానిధి స్మారక గ్రంథాలయం రూపుదిద్దుకుంటున్నదని వివరించారు. ఇది మరి కొద్ది రోజుల్లో ప్రజాపయోగంలోకి వస్తుందని పేర్కొన్నారు. తిరువారూర్‌లో నిర్మించిన కలైంజ్ఞర్ కోట్టం ఈనెల 20న ప్రారంభం కాబోతోందన్నారు. ఈ వేడుకకు బిహార్ సీఎం నితీష్కుమార్హాజరు కానున్నారని గుర్తు చేశారు. ఈ వేడుక జయప్రదం చేయడానికి పెద్ద ఎత్తున కేడర్ తరలిరావాలని పిలుపునిచ్చారు. బెదిరింపులకు భయపడ వద్దని, తాను ఉన్నానని కేడర్‌కు భరోసా ఇచ్చారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం స్వస్థలం తిరువారూర్‌కు ఆదివారం రాత్రి సీఎం స్టాలిన్ బయలుదేరి వెళ్లారు. సీఎం రాకతో మూడు రోజుల పాటు తిరువారూర్‌లో డ్రోన్లపై నిషేధం విధించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి సీఎం పర్యటనకు భద్రతను పోలీసు యంత్రాంగం మరింత కట్టుదిట్టం చేసింది. -
కుష్బూపై వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత సస్పెండ్
చెన్నై: బీజేపీ నాయకురాలు, తమిళ సీనియర్ నటి కుష్బూపైన, తమిళనాడు గవర్నర్ టీ.ఎన్.రవిపైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తిని ఆ పార్టీ ప్రాధమిక సభ్యత్వం సహా అన్ని పదవుల నుండి ఆయన్ను సస్పెండ్ చేసింది. అనంతరం కొడుంగైయూర్ పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఇటీవల జరిగిన ఒక బహిరంగ వేదిక మీద సీఎం స్టాలిన్ సమక్షంలోనే శివాజీ కృష్ణమూర్తి బీజేపీ నేత కుష్బూ గురించి ప్రస్తావిస్తూ.. నేను నిన్ను చెప్పుతో కొట్టగలను.. కానీ అది చెప్పులకు అవమానమని అన్నారు.. ఇక తమిళనాడు గవర్నర్ టీ.ఎన్.రవి ఇటీవల అసెంబ్లీలో అంబేద్కర్ పేరును ఉచ్ఛరించడానికి కూడా సంకోచిస్తున్నారు.. అలాంటప్పుడు ఆయనపై దాడి చేయడం తప్పే లేదని వెంటనే కాశ్మీర్ వెళ్ళండి, అక్కడ టెర్రరిస్టులు మీపై తుపాకులు ఎక్కుపెడతారని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు శివాజీ కృష్ణమూర్తి. తనపై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలైన కుష్బూ తీవ్రంగా స్పందించారు.. ఆయన నన్నే కాదు మీ నాన్నలాంటి గొప్ప నాయకులను కూడా కించపరుస్తున్నారు అర్ధం కావడం లేదా? అని సీఎం స్టాలిన్ ను ప్రశ్నించారు. ఆడవాళ్ళ గురించి ఏది పెడితే అది మాట్లాడొచ్చన్న వారి ధోరణి చూస్తేనే అర్ధమవుతోంది వారి పెంపకం ఎలాంటిదో. నేను దీన్నంత తేలిగ్గా వదలను, IPC సెక్షన్ 509 కింద కేసు నమోదు చేస్తానన్నారు. ఆడవాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, క్రమశిక్షణను ఉల్లంఘించి, పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ప్రవర్తించినందుకు శివాజీ కృష్ణమూర్తి ప్రాధమిక పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసింది డీఎంకే పార్టీ. అలాగే ఆయన్ను అన్ని పార్టీ పదవుల నుండి సస్పెండ్ చేసింది. ఇది కూడా చదవండి: నా లివర్ ఇనుముతో తయారుకాలేదు.. -
బీజేపీ శవపేటికకు చివరి మేకు అదే..కేంద్రానికి స్టాలిన్ హెచ్చరికలు..
తమిళనాడు:ప్రతిపక్షాలతో బీజేపీ ఎన్నికల్లో పోరాడటంలేదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ఎన్నికల్లో పోరాడి బీజేపీని ఓడిస్తామని హెచ్చరించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని కేంద్రం ప్రభుత్వంపై డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలియన్స్ నిరసన సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అసత్య ప్రచారాలతో బీజేపీ సృష్టించుకున్న ఇమేజ్ను దెబ్బతీస్తామని అన్నారు. 'బీజేపీకి ఓటమి కళ్ల ముందు కనిపిస్తుంది. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలపై దురహంకార చర్యలకు పాల్పడుతోంది. ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వడమే బీజేపీ శవపేటికకు చివరి మేకు అవుతుంది' అని స్టాలిన్ అన్నారు. మనీ లాండరింగ్ కేసులో తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇందుకు నిరసనలు తెలుపుతూ సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలియన్స్ సమావేశం నిర్వహించింది. ఇదీ చదవండి:ముందస్తును కొట్టిపారేయలేం: నితీశ్ -
గుండెపోటు వచ్చేంతగా ఒత్తిడి..
మనీలాండరింగ్ కేసులో అత్యంత నాటకీయ పరిణామాలు, ఉత్కంఠ భరిత వాతావరణం నడుమ రాష్ట్ర విద్యుత్, ఎకై ్సజ్ శాఖా మంత్రి సెంథిల్ బాలాజీని ఈడీ బుధవారం అరెస్టు చేసింది. అర్ధరాత్రి వరకు కొన్ని గంటల పాటు తనను నిర్బధించి విచారించడంతో ఆందోళనకు గురైన సెంథిల్ బాలాజీకి గుండెపోటు సైతం వచ్చింది. ఆయన్ను ఆస్పత్రికి తరలించగా, అత్యవసరంగా బైపాస్ సర్జరీ చేయాల్సిందేనని వైద్యులు నిర్ధారించారు. అయినా, ఈడీ తగ్గలేదు. ఆయన్ను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే హయాంలో రవాణాశాఖలో ఉద్యోగాల పేరిట జరిగిన మోసం వ్యవహారం ప్రస్తుతం డీఎంకే ప్రభుత్వంలో విద్యుత్, ఎకై ్సజ్ శాఖ మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీ మెడకు ఉచ్చుగా మారిన విషయం తెలిసిందే. గతంలో ఆయన రవాణా మంత్రిగా ఉన్న కాలంలో జరిగిన ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ ఆరోపణలను ఈడీ అస్త్రంగా చేసుకుంది. దీంతో ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాలతో సెంథిల్ బాలాజీని టార్గెట్ చేసింది. మంగళవారం ఆయన నివాసం, సన్నిహితులు, సోదరుడి నివాసం కార్యాలయాలో ఈడీ సోదాలు పొద్దుపోయే వరకు జరిగాయి. కొన్ని గంటల పాటు ఈడీ వర్గాలు విచారణ పేరిట సెంథిల్ బాలాజీని ఉక్కిరి బిక్కిరి చేసినట్టు సమాచారం. అర్ధరాత్రి మూడు గంటల పాటు ఆయన్ను ప్రత్యేక గదిలో ఉంచి నిర్బంధించి మరీ విచారించినట్టు ప్రచారం. దీంతో ఆయన ఆందోళనకు గురై గుండెపోటు తెచ్చుకున్నట్టున్నారు. అదే సమయంలో ఆయన్ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచేందుకు ఈడీ ప్రయత్నించినా, చివరకు సెంథిల్ బాలాజీ నొప్పితో పెడుతున్న కేకలతో సీఆర్పీఎఫ్, ఆర్పీఎఫ్ భద్రతా బలగాలు, ఈడీ వర్గాలు తమ వాహనంలో ఎక్కించుకుని ఓమందూరార్ ప్రభుత్వ మల్టీ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. మూడు చోట్ల బ్లాక్‌లు.. పరీక్షించిన వైద్యులు సెంథిల్‌బాలాజీకి గుండెపోటుగా ధ్రువీకరించారు. ఆయన గుండెలోని నాళాలలో మూడు చోట్ల రక్తం బ్లాక్ అయినట్టు తేల్చారు. అత్యవసరంగా ఆయనకు బైపాస్ సర్జరీ చేయాల్సిందేనని సూచించారు. అయితే, ఆయన తమ ఆధీనంలో ఉండడంతో ఈడీ వర్గాలు వైద్యుల సూచనలపై అనుమానాలు వ్యక్తం చేశాయి. చివరకు ఈఎస్ఐ వైద్యులు పరిశోధించి నిర్ధారించారు. అయినా, ఈడీ ఏ మాత్రం తగ్గలేదు. ఆయన్న అరెస్టు చేయడం లక్ష్యంగా దూకుడుగానే ముందుకు సాగింది. సెంథిల్ బాలాజీకి గుండెపోటు సమాచారంతో సీఎం స్టాలిన్, మంత్రులు ఓమందూరార్ ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులతో మాట్లాడారు. ఆయన్ను కావేరి ఆస్పత్రికి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే, ఈడీ అడ్డుపడడంతో కావేరి వైద్యులు ఓమందూరార్కు వచ్చి మరీ పరీక్షించి చికిత్స అందిస్తున్నారు. ఉత్కంఠ నడుమ అరెస్ట్.. సెంథిల్ బాలాజీ అరెస్టుపై ఈడీ దూకుడును ఏమాత్రం తగ్గించలేదు. చైన్నె జిల్లా మొదటి మెజిస్ట్రేట్ న్యాయమూర్తి లిల్లీని ఆశ్రయించారు. ఆమె స్వయంగా ఆస్పత్రికి వచ్చి సెంథిల్ బాలాజీని విచారించారు. వెళ్తూ వెళ్తూ సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసినందుకు తన వద్ద ఆధారాలు సమర్పించినట్టు ఈనెల 28వ తేదీ వరకు రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించి వెళ్లారు. దీంతో సాయంత్రం ఆమె కోర్టులో ఈడీ తరఫు, డీఎంకే తరఫు న్యాయవాదులు వాదనలు వాడి వేడిగా జరిగాయి. ఒక మంత్రి పదవిలో ఉన్న వ్యక్తికి కనీసం సమన్లు కూడా ఇవ్వకుండా సోదాల పేరిట వచ్చి అరెస్టు చేయడమే కాకుండా, మానవత్వాన్ని మరిచి మరీ ఈడీ వ్యవహరిస్తున్నదని వాదనలు వినిపించారు. అత్యవసరంగా బైపాస్ సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు పేర్కొంటున్నా, కస్టడీకి ఈడీ కోరడం వెనుక కక్ష సాధింపు ధోరణి ఉన్నట్టు అనుమానాలు కలుగుతున్నాయని డీఎంకే సీనియర్ న్యాయవాదులు వాదన వినిపించారు. అలాగే, అరెస్టును వ్యతిరేకిస్తున్నామని, రిమాండ్‌ను రద్దు చేయాలని కోరారు. లేదా బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈడీ తరఫు న్యాయవాదులు తమ వాదనలో అరెస్టుకు సంబంధించిన సమాచారం, సెంథిల్‌బాలాజీ, ఆయన కుటుంబానికి తెలియజేశామని, ఆయన్ను కస్టడీకి అప్పగించాలని కోరారు. వాదనల అనంతరం న్యాయమూర్తి తర్వాత ఉత్తర్వులను రిజర్వుడ్‌లో ఉంచారు. గురువారం న్యాయమూర్తి తీర్పు వెలువరించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఆయన్ను శస్త్ర చికిత్స నిమిత్తం కావేరి ఆస్పత్రికి తరలించే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో తన భర్తను ఎందుకు అరెస్టు చేశారో, ఏ కేసులో అరెస్టు చేశారో, ఆయన్ను గుండె పోటు వచ్చేంతగా నిర్బంధించాల్సిన పరిస్థితి ఎమిటో అని ప్రశ్నిస్తూ సెంథిబాలాజీ సతీమణి మేఘల హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను తొలుత ఓబెంచ్కు అప్పగించగా, అందులోని ఓ న్యాయమూర్తి తాను విచారణ నుంచి తప్పుకుంటున్నట్టు పేర్కొనడం చర్చకు దారి తీసింది. రిమాండ్‌కు కోర్టు ఆదేశాలు ఇచ్చిన దృష్ట్యా, ఓమందూరార్ ఆస్పత్రి పరిసరాలలో పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు నిఘా పెంచారు. ఈడీ పర్యవేక్షణలో సెంథిల్ బాలాజీకి చికిత్స అందిస్తున్నారు. నిఘా కట్టుదిట్టం... మంత్రి అరెస్టు సమాచారంతో ఆయన సొంత జిల్లా కరూర్‌లో, కొంగు మండలంలోని జిల్లాలో భద్రత పెంచారు. కోయంబత్తూరు జిల్లాకు డీఎంకే ఇన్చార్జ్గా సెంథిల్ బాలాజీ దూసుకెళ్తున్నారు. దీంతో అక్కడ ఆయనకు మద్దతు పెరిగింది. అలాగే, ఆయన సామాజిక వర్గం కూడా అధికంగా ఈ మండలంలో ఉండడంతో పోలీసులు ముందు జాగ్రత్తగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే, ఓమందూరార్ ఆస్పత్రి పరిసరాలను నిఘా నీడలోకి తెచ్చారు. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు అవస్థలు తప్పలేదు. గుండెపోటు వచ్చేంతగా ఒత్తిడి.. సెంథిల్‌బాలాజీకి గుండెపోటు వచ్చేంతగా ఈడీ ఒత్తిడి చేసినట్టుందని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వాన్ని మరిచి మరీ తమ యజమానుల కోసం (కేంద్రం) ఈడీ వ్యవహరిస్తున్నట్టు స్పష్టం అవుతోందని ధ్వజమెత్తారు. మంత్రులు ఎం సుబ్రమణియన్, నెహ్రూ, ఉదయనిధి స్టాలిన్, గీతా జీవన్ సెంథిల్ బాలాజీని పరామర్శించినానంతరం కేంద్రం తీరుపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. బీజేపీ హద్దులు దాటి వ్యవహరిస్తున్నదని 2024 ఎన్నికలలో ప్రజలు ఆ పార్టీకి గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. కోయంబత్తూరు , తిరుప్పూర్, ఈరోడ్ కొంగు మండలంలోని జిల్లాలో బీజేపికి వణుకు పుట్టించే విధంగా సెంథిల్‌బాలాజీ పనితీరు ఉండడంతో, ఆయన్ను అడ్డు తొలగించుకునేందుకే అరెస్టు అని మండిపడ్డారు. డీఎంకే మిత్ర పక్ష పార్టీలు సీపీఐ నేత రాజా, సీపీఎం నేత బాలకృష్ణన్ అరెస్టును ఖండించారు. అయితే, ఈ అరెస్టును అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సమర్థించారు. ఈడీని వెనకేసుకొచ్చారు. తప్పు చేసిన వాళ్లు శిక్షించ బడాల్సిందేనని వ్యాఖ్యలు చేశారు. -
తమిళనాడులో ఐటీ శాఖకు చేదు అనుభవం..
-
అన్నామలైపై టీఆర్ బాలు దావా
సాక్షి, చైన్నె: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైపై డీఎంకే పార్లమెంటరీ నేత, పార్టీ కోశాధికారి టీఆర్ బాలు శుక్రవారం పరువునష్టం దావా వేశారు. సైదాపేట కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. డీఎంకే అవినీతి అక్రమాలు అంటూ గత నెల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఓ జబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది వివాదానికి దారి తీసింది. అన్నామలైకు డీఎంకే వర్గాలు నోటీసులు పంపిస్తూ వివరణ కోరుతున్నాయి. ఆయన స్పందించకపోవడంతో కోర్టులో పిటిషన్ల దాఖలుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే అన్నామలైపై సీఎం స్టాలిన్ పరువునష్టం దావా వేశారు. తాజాగా టీఆర్ బాలు కూడా దావా దాఖలు చేశారు. సైదాపేట కోర్టులో ఈ పిటిషన్ వేశారు. ఆధార రహిత ఆరోపణలు చేసి తన పరువుకు అన్నామలై భంగం కలించారని టీఆర్‌బాలు ఆ పిటిషన్లో వివరించారు. వివరణ కోరుతూ నోటీసులు పంపినా సమాధానం లేదని, అందుకే అన్నామలైపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేసినట్టు కోర్టుకు సూచించారు. ఈ సందర్భంగా టీఆర్‌బాలుతో కలిసి డీఎంకే నిర్వాహక కార్యదర్శి ఆర్ఎస్ భారతి మీడియాతో మాట్లాడుతూ, అన్నామలై జైలుకు వెళ్లే రోజులు సమీపించాయన్నారు. ఆధార రహిత ఆరోపణలు చేయడమే కాకుండా, వివరణ కోరుతూ నోటీసులు పంపించిన వారిపై ఆయన ఎదురుదాడి చేయడం శోచనీయమన్నారు. తాజాగా దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా అన్నామలైకు ఏడాది జైలు శిక్ష తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. తనపై ఎన్ని కేసులు వేసినా తగ్గేదేలే అన్నట్టుగా అన్నామలై ఉన్నారు. ఈ దావా గురించి మీడియా ఆయన్ను కదిలించగా, ఎన్ని కేసులైనా వేసినా, డీఎంకే అవినీతిని బట్టబయలు చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. జూలైలో డీఎంకే అవినీతి ఫైల్స్ రెండో భాగం విడుదల కాబోతోందని ప్రకటించారు. -
పరిశ్రమల శాఖ మంత్రిగా రాజ
సాక్షి, చైన్నె: డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈనెల 7వ తేదీతో రెండేళ్లు పూర్తయిన విషయం తెలిసిందే. ప్రజా పాలన మూడో వసంతంలోకి అడుగు పెట్టిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి వర్గంలో భారీ మార్పులు చేపట్టాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు. దీంతో పలువురు మంత్రుల పదవులు ఊడినట్లే అనే చర్చ జోరందుకుంది. అయితే పాడి పరిశ్రమల శాఖ మంత్రి నాజర్‌కు మాత్రమే ఉద్వాసన పలికారు. డీఎంకే సీనియర్ నేత టీఆర్ బాలు వారసుడు టీఆర్బీ రాజకు కొత్తగా మంత్రి వర్గంలో చోటు కల్పించారు. వేడుకగా ప్రమాణ స్వీకారం.. గురువారం ఉదయం గిండిలోని రాజ్‌భవన్‌లో మంత్రిగా టీఆర్బీ రాజతో గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా గవర్నర్ రవికి సీఎం స్టాలిన్ పుష్పగుచ్ఛాలను అందజేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీఆర్బీ రాజ సీఎం స్టాలిన్ ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. టీఆర్బీ రాజకు మంత్రి పదవి దక్కడంతో మన్నార్‌కుడిలోని ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. తిరువారూర్ జిల్లాకు ఇంతవరకు మంత్రి లేరు. ఆ లోటు టీఆర్బీ రాజ రూపంలో సీఎం స్టాలిన్ భర్తీ చేయడాన్ని ఆహ్వానిస్తూ అక్కడి డీఎంకే శ్రేణులు స్వీట్లు పంచి.. బాణసంచా పేల్చుతూ ఆనందాన్ని పంచుకున్నారు. కాగా, తన కుమారుడు రాజకు మంత్రి పదవి దక్కడంతో డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్ బాలు ఆనందం వ్యక్తం చేశారు. మంత్రిగా రాజ ఉత్తమ సేవలు అందిస్తారన్నారు. సీఎం స్టాలిన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మరింత నమ్మకాన్ని పెంపొందించుకునే విధంగా పని తీరు ఉంటుందని ధీమా వ్యక్తంచేశారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం మంత్రులు అందరూ సీఎం స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్రవితో కలిసి గ్రూప్ ఫొటో తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. తదుపరి జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి వర్గం మార్పుకు గురించి సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. పీటీఆర్ చేజారిన ఆర్థికశాఖ ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు, టీఆర్బీ రాజకు శాఖను కేటాయిస్తూ సీఎం స్టాలిన్ చేసిన సిఫారసులకు గవర్నర్ రవి ఆమోద ముద్ర వేశారు. సీఎం స్టాలిన్, ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి ఆర్థిక మంత్రి పళణి వేల్ త్యాగరాజన్(పీటీఆర్) వివాదాస్పద వ్యాఖ్యలు, అవినీతి ఆరోపణలు చేసినట్లుగా ఓ ఆడియో ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు పదవీ గండం తప్పదనే చర్చ జరిగింది. అయితే ఆయనకు ఉద్వాసన పలకలేదు. ఆయన శాఖలో మాత్రం మార్పు చేశారు. ఆర్థిక శాఖ నుంచి ఆయన్ని తప్పించి ఐటీ శాఖకు మార్చారు. ఈ శాఖను తనకు కేటాయించడాన్ని ఆహ్వానిస్తూ, సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ పీటీఆర్ ట్వీట్ చేశారు. పలువురి మంత్రుల శాఖల్లో మార్పు కొత్త మంత్రి టీఆర్బీ రాజకు పరిశ్రమల శాఖను కేటాయించారు. ఇది వరకు ఈ శాఖ తంగం తెన్నరసు చేతిలో ఉండేది. 2024 జనవరిలో పెట్టుబడిదారుల మహానాడు చైన్నె వేదికగా జరగనుంది. ఇందుకోసం ప్రపంచ దేశాలలో పర్యటించి పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు సీఎం స్టాలిన్ సిద్ధమయ్యారు. ఆయనతో పాటు టీఆర్బీ రాజ కూడా విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. వచ్చి రాగానే రాష్ట్రంలో ప్రస్తుతం కీలకంగా ఉన్న పరిశ్రమల శాఖ టీఆర్బీ ఖాతాలో పడడం గమనార్హం. ఇక ఆర్థిక శాఖను తంగం తెన్నరసుకు అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఆర్థిక శాఖకు తంగం తెన్నరసు పూర్తి స్థాయిలో అర్హుడు అని పలువురు సీనియర్ మంత్రులు సైతం కితాబు ఇవ్వడం విశేషం. సమాచార శాఖ మంత్రి ఎంపీ స్వామినాథన్‌కు అదనంగా తమిళాభివృద్ధి శాఖను కేటాయించారు. ఇది వరకు ఐటీ శాఖ మంత్రిగా ఉన్న టి. మనో తంగరాజ్కు ప్రస్తుతం పాడి పరిశ్రమల శాఖను అప్పగించారు. శాఖల కేటాయింపు తర్వాత మంత్రులు టీఆర్బీ రాజ, పీటీఆర్, తంగం తెన్నరసు, ఎంపీ స్వామినాథన్, మనో తంగరాజ్ సీఎం స్టాలిన్‌ను సచివాలయంలో కలిసి.. ఆశీస్సులు అందుకున్నారు. -
కేబినెట్లో కొత్త ముఖాలకు చోటు
సాక్షి, చైన్నె: రాష్ట్ర కేబినెట్లో మార్పులకు వేళైంది. సీఎం స్టాలిన్ తన మంత్రి వర్గంలో మార్పులకు సంబంధించిన తాజా జాబితాను సిద్ధం చేసినట్లు సచివాలయంలో చర్చ జోరందుకుంది. నలుగురు మంత్రులకు ఉద్వాసన పలికి, వారి స్థానంలో కొత్త ముఖాలకు అవకాశం కల్పించబోతున్నట్లు తెలుస్తోంది. వివరాలు.. రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యింది. ఆదివారం మూడో వసంతంలోకి అడుగు పెట్టింది. గత కొంత కాలంగా పలువురు మంత్రుల పనితీరుపై సీఎం స్టాలిన్ అసంతృప్తితో ఉన్నట్లు ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయి. వీరిలో కొందరిక ఉద్వాసన పలకడం, మరికొందరికి శాఖల్లో మార్పులు చేసే విధంగా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం మార్పుల జాబితా సిద్ధమైనట్లు తెలిసింది. బుధవారం ఈ జాబితా బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ జాబితాలో ఆర్థిక మంత్రి పళణి వేల్ త్యాగరాజన్, అటవీ శాఖ మంత్రి రామచంద్రన్‌తో పాటు మరో ఇద్దరు మంత్రుల పేర్లు గల్లంతయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. -
గవర్నర్లను కించపరచొద్దు!
సాక్షి, చైన్నె: అధికార పక్షం సభ్యులు గవర్నర్లను కించపరచొద్దని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ హితవు పలికారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజ్‌భవన్ అవసరమని, అధికారంలోకి వచ్చినానంతరం అదే రాజ్‌భవన్‌ను విమర్శించడం తగదని వ్యాఖ్యానించారు. తిరుచ్చిలో శనివారం లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మీడియాతో మాట్లాడారు. పుదుచ్చేరి జిప్మర్ ఆసుపత్రి పూర్తిగా పేదల కోసమే ఏర్పాటు చేసినట్లు వివరించారు. అయితే ఇక్కడ సరిగ్గా వైద్యసేవలు అందడం లేదంటూ తమిళనాడు నుంచి వచ్చి కొందరు పోరాటాలు, ఆందోళనలు చేయడం శోచనీయమన్నారు. అనవసర వ్యాఖ్యలు తగవు.. అసలు గవర్నర్ పదవే అవసరం లేదంటూ ప్రస్తుతం కొందరు ఇష్టారాజ్యంగా వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజ్ భవన్ గడప తొక్కకుండా ఉన్నారా? అని డీఎంకే పాలకులను పరోక్షంగా ప్రశ్నించారు. ఆన్లైన్ రమ్మీతో పాటు అనేక చట్టాలను రాజ్ భవన్ నిశితంగా పరిశీలించి ఆమోదించడం జరిగిందని మరో ప్రశ్నకు సమధానంగా చెప్పారు. ఒకటి రెండు బిల్లుల సమగ్ర పరిశీలన కోసం కొంత సమయం తీసుకుంటే.. పక్కన పెట్టేశారంటూ గవర్నర్లను విమర్శించడం దారుణమన్నారు. గవర్నర్లను గవర్నర్లుగానే చూడాలని హితవు పలికారు. గవర్నర్లకు దురుద్దేశాలను ఆపాదించడం తగదని, వారికీ వాక్ స్వాతంత్య్రం ఉందే విషయాన్ని గుర్తించాలన్నారు. తీవ్ర వాదాన్ని బీజేపీ అనుమతించదని, సినిమాలను సినిమాలుగా చూడాలని కేరళ స్టోరీ చిత్రంపై సంధించి ప్రశ్నకు బదులిచ్చారు. భూతద్దంలో చూడడం తగదు మరోవైపు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి ఎం. సుబ్రమణియన్ శనివారం మీడియాతో మాట్లాడారు. భూతద్దం పెట్టి మరీ ఏదేని ఒక చిన్న సమస్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా దొరుకుతుందా..? అని ఈ గవర్నర్ వెతుకుతున్నట్లుందని ధ్వజమెత్తారు. చిదంబరంలో బాల్యవివాహం జరిగినట్టు, బాలిక వేలి ముద్రలను కూడామోదు చేసుకున్నట్లుగా ఆయన చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. జరగని ఘటనలను జరిగినట్లు గవర్నర్ స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పడం ఆయన విజ్ఞతనే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. -
గవర్నరా..రాజకీయ నాయకుడా?
సాక్షి, చైన్నె: బాధ్యత గల పదవిలో ఉంటూ రాజకీయ నాయకుడి అవతారం ఎత్తిన గవర్నర్ ఆర్ఎన్ రవి తక్షణం ఆ పదవి నుంచి తప్పుకోవాలని డీఎంకే మిత్రపక్షాలు డిమాండ్ చేశాయి. ద్రావిడ మోడల్ కాదు...సనాతన ధర్మం కాలం చెల్లిందని మంత్రి పొన్ముడి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతలను విస్మరించి రాజకీయ అవతారంతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మారిన గవర్నర్‌కు వ్యతిరేకంగా పోరాట బాటకు సిద్ధమవుతున్నామని సీపీఎం నేత బాలకృష్ణన్ ప్రకటించారు. మొదటి నుంచి గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు, వివాదాలకు దారి తీస్తున్న విషయం తెలిసిందే. గురువారం ఓ ఆంగ్ల మీడియాకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ మరింత చర్చకు దారి తీసింది. ఆయన రాజకీయనాయకుడిగా మారారని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు మొదలయ్యాయి. ఆ ఇంటర్వ్యూలో గవర్నర్ ఆర్ఎన్ రవి చేసిన వ్యాఖ్యలను డీఎంకే మిత్రపక్షాలు తీవ్రంగా పరిగణించాయి. శుక్రవారం మిత్ర పక్ష పార్టీల నేతలు వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ గవర్నర్ తీరును ఎండగట్టే విధంగా విమర్శనాస్త్రాలను ఎక్కుబెట్టారు. విమర్శల దాడి.. ఉన్నత విద్యా మంత్రి పొన్ముడి స్పందిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రతినిధిగా గవర్నర్ అవతారం ఎత్తారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రగతికి దోహద పడాల్సిన గవర్నర్, రాష్ట్రాన్ని పాతాళంలోకి ఎలా నెట్టాలో అనే వ్యూహాలకు పదును పెట్టినట్టున్నారని ధ్వజమెత్తారు. ద్రావిడ మోడల్ ఎల్లప్పుడు ప్రకాశవంతంగానే ఉంటుందని, సనాతన ధర్మం ఇప్పటికే కాలం చెల్లినట్టు విమర్శించారు. మైనారిటీ కమిషన్ చైర్మన్ పీటర్ అల్బోన్స్ మాట్లాడుతూ గవర్నర్ ఇటీవల కాలంగా తన పదవికి భిన్నంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయన ఓ ప్రజాప్రతినిధిగా, రాజకీయనాయకుడిగా మారి, ప్రభుత్వంపై విమర్శలు ఎక్కు బెడుతుండడం శోచనీయమని మండిపడ్డారు. సీపీఎం నేత బాలకృష్ణన్ స్పందిస్తూ, రాజకీయాలపై గవర్నర్‌కు ఉత్సాహం ఎక్కువగానే ఉన్నట్టుందని ఎద్దేవా చేశారు. అలాంటప్పుడు బాధ్యత గల పదవి నుంచి తప్పుకుని, ఆ తర్వాత రాజకీయాలపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. ఈయన తీరును ఎండగట్టే విధంగా డీఎంకే మిత్ర పక్షాలను కలుపుకుని పెద్ద ఎత్తున పోరాటాలకు సమాయత్తం అవుతున్నామన్నారు. సీపీఐ నేత ముత్తరసన్ పేర్కొంటూ పబ్లిసిటీ ప్రియుడిగా గవర్నర్ మారారని, అందుకే ఏదో ఒక విమర్శ, ఆరోపణలు, వివాదాలతో కాలం నెట్టకొస్తున్నట్టు విమర్శించారు. రాజకీయాల్లోకి రావాలనుకుంటే, పదవికి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మారిపోవాలని హితవు పలికారు. వీసీకే నేత తిరుమావళవన్ స్పందిస్తూ, ఆయన బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలా వ్యహరిస్తున్నారే గానీ, ఆయనలో గవర్నర్‌కు ఉండాల్సిన లక్షణాలు లేవు అని మండిపడ్డారు. అలాగే, డీఎంకే మిత్ర పక్షాలకు చెందిన మరికొన్ని పార్టీల నేతలు గవర్నర్‌కు వ్యతిరేకంగా స్పందిస్తూ, ఆయన్ను బర్త్‌రఫ్ చేయాలన్న నినాదాన్ని మళ్లీ అందుకున్నారు.సేలం జిల్లా వాళప్పాడిలో ద్రావిడ మోడల్ పాలన గురించి చర్చనీయాంశంగా గవర్నర్ ఆర్.ఎన్.రవి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ డీఎంకే కార్యకర్తలు తమ నిరసనను వ్యక్తం చేసిన సంఘటన ఆ ప్రాంతంలో శుక్రవారం కలకలం రేపింది. -
దిగజారుడు నేతలకు పబ్లిసిటీ ఇవ్వం!.. అన్నామలైపై సీఎం పరోక్ష విమర్శలు
సాక్షి, చైన్నె: దిగజారుడు రాజకీయాలు చేసే వారికి ఫ్రీ పబ్లిసిటీ ఇవ్వదలచుకోలేదని పరోక్షంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైను ఉద్దేశించి సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. తానుప్రజా సేవలో బిజీగా ఉన్నానని, అనాగరిక రాజకీయాలు చేసే వాళ్లను పట్టించుకోనని స్పష్టం చేశారు. మీలో ఒకడిని.. పేరిట సామాజిక మాధ్యమాల వేదికగా తనకు వచ్చే ప్రశ్నలకు సీఎం ఎంకే స్టాలిన్ సమాధానాలు ఇస్తూ వస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం పలువురు సంధించిన అనేక ప్రశ్నలకు సీఎం జవాబిచ్చారు. ఈ సారి సమాధానాలు ఇవ్వడంలో కొంత జాప్యం జరిగిందని పేర్కొంటూ, రెండేళ్ల పాలనలో అమల్లోకి తెచ్చిన కీలక పథకాలను, వాటి తీరు తెన్నులను వివరించారు. ప్రాజెక్టులు ఊపందుకుంటున్నాయని, అన్ని రంగాలలో తమిళనాడును నెంబర్ –1 చేయడమే లక్ష్యంగా దూసుకుపోతున్నామని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. సామాజిక న్యాయ రాజధాని.. తమిళనాడు స్వరం భారతదేశ వ్యాప్తంగా మారుమోగిందని, సామాజిక న్యాయానికి తమిళనాడు రాజధానిగా మారిందని పేర్కొన్నారు. రాష్ట్ర స్వయం ప్రతిపత్తి హక్కుల విషయంలో తగ్గేదే లేదన్నారు. రెండేళ్ల పాలన పూర్తిస్థాయి సంతృప్తిని కలిగించినట్లు పేర్కొన్నారు. ఈ కాలంలో మూడు వంతులకు పైగా హామీలను నెరవేర్చినట్లు వివరించారు. పదేళ్ల అన్నాడీఎంకే పాలన రూపంలో రాష్ట్రంలో పరిపాలన పూర్తిగా దిగజారిందని, దీనిని తాము మళ్లీ నిలబెట్టే ప్రయత్నంలో విజయవంత మయ్యామన్నారు. అమిత్ షాపై ఆగ్రహం బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తాం.. అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిని సంతృప్తి పరిచేందుకు మరొకరిపై ద్వేషం పెంచడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఈ దేశంలో హిందూ, ముస్లింలు సోదర భావంతో మెలుగుతున్నారని పేర్కొన్నారు. ద్వేష పూరిత రాజకీయాల వైపుగా బీజేపీ ముందుకెళ్తోందని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే విధంగా హోంమంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రజలు నిశితంగానే గమనిస్తున్నారని పేర్కొన్నారు. చౌకబారు విమర్శలను పట్టించుకోం.. ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ చేసిన వ్యాఖ్యలుగా పేర్కొంటూ సామాజిక మాధ్యమాలలలో జరుగుతున్న ఆడియో ప్రచారం గురించి సీఎం స్పందించారు. ఇప్పటికే మంత్రి రెండు సార్లు ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజా సేవలో తాను బిజీగా ఉన్నానని, చౌక బారు విమర్శలు, ఆరోపణల గురించి పట్టించుకోదలచుకో లేదన్నారు. అన్నామలైను ఉద్దేశించే ఈ00 వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. ఇక దివంగత నేత కరుణానిధి శత జయంతి వేడుకలను ఈ ఏడాది పొడవున బ్రహ్మాండంగా నిర్వహిస్తామన్నారు. ఈ వేడుకలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనుండడం ఆనందంగా ఉందన్నారు. ప్రజల విజ్ఞప్తులను అర్థం చేసుకోవడం, వారి గళానికి గౌరవం ఇచ్చే విధంగా ముందుకెళ్లడం తన అభిమతంగా పేర్కొన్నారు. అన్నాడీఎంకే పాలనలో ఏం జరిగిందో ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. అవినీతికి పాల్పడిన వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని, అవినీతి కేసుల్లో అందరినీ కచ్చితంగా కోర్టు బోనులో నిలబెడుతామన్నారు. -
డీఎంకేలో విలీనం చేద్దాం..!
సాక్షి, చైన్నె: ఎండీఎంకేలో మళ్లీ అంతర్గత కుమ్ములాటలు మరోమారి తెరపైకి వచ్చాయి. ఆ పార్టీ ప్రిసీడియం చైర్మన్ దురైస్వామి, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగోకు రాసిన లేఖ తీవ్ర చర్చకు దారి తీసింది. ఎండీఎంకేను డీఎంకేలోకి విలీనం చేద్దాం.. అని అందులో పేర్కొనడం కొత్త వివాదాన్ని తెర మీదకు తెచ్చినట్లయ్యింది. వివరాలు.. డీఎంకేలో చీలిక కారణంగా ఒకప్పుడు ఎండీఎంకే ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వైగో ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో ఆ పార్టీలో అంతర్గత సమరం సాగుతోంది. ఇందుకు కారణం తన వారసుడు దురై వైగోను రాజకీయ తెర పైకి వైగో తీసుకు రావడమే. తన కుటుంబం నుంచి ఎవ్వరూ రాజకీయల్లోకి రారు అని, ఎండీఎంకే కార్యకర్తలు తన ఆస్తి అని.. గతంలో తాను చేసిన ప్రకటనను వైగో విస్మరించడం అనేక మంది సీనియర్ నేతలకు మింగుడు పడ లేదు. వారసుడి రాకతో అనేక మంది ముఖ్య నేతలు వైగోకు బై ..బై చెబుతూ బయటకు వెళ్లారు. వచ్చి రాగానే వారసుడికి పార్టీ కార్యాలయ నిర్వాహక కార్యదర్శి పదవిని వైగో కట్టబెట్టడం అనేక మంది సీనియర్లకు ఇష్టం లేదు. అయినా, సర్దుకున్నారు. ఈ పరిస్థితుల్లో మరో మారు ఆ పార్టీలో జరుగుతున్న అంతర్యుద్ధం శనివారం తెర మీదకు వచ్చింది. ఈ సారి ఏకంగా వైగోకు వ్యతిరేకంగా పార్టీ ప్రిసీడియం చైర్మన్ దురైస్వామి గళం విప్పడం చర్చకు దారి తీసింది. వైగోకు లేఖాస్త్రం.. పార్టీ ప్రిసీడియం చైర్మన్ తిరుప్పూర్ దురైస్వామి ప్రధాన కార్యదర్శి వైగోకు శనివారం రాసిన లేఖ కేడర్‌లో గందరగోళం, చర్చను రేపింది. ఇప్పటికే తాను వైగోకు ఐదు సార్లు లేఖ రాశానని, ఇంత వరకు ఏ ఒక్కదానికి సమాధానం లేదని దురై స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో దురై వైగోకు పెద్దపీట వేసే విధంగా ముందుకెళ్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇది కేడర్‌కు చేస్తున్న ద్రోహం, మోసం కాదా..? అని ప్రశ్నించారు. ఇలా వ్యవహరించడం కన్నా, పార్టీని మాతృ సంస్థ డీఎంకేలో విలీనం చేద్దాం అని పిలుపు నిచ్చే విధంగా లేఖలో వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అదే సమయంలో తిరుప్పూర్ వేదికగా ఎండీఎంకే నేతలతో దురైస్వామి సమావేశం కావడం చర్చకు దారి తీసింది. ఆయన ఎలాంటి నిర్ణయంతో తీసుకుంటారనే చర్చ మొదలైంది. వైగో తీరును దుయ్యబట్టే విధంగా లేఖలో వ్యాఖ్యలను పొందుపరిచిన దురై స్వామి, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘ మంతనాలలో ఉన్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. అదే సమయంలో దురై వైగో స్పందిస్తూ, పార్టీలో గందరగోళ పరిస్థితులు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సీనియర్లకు గుర్తింపు, ప్రాధాన్యత, గౌరవాన్ని ఇస్తున్నామని వివరించారు. దురై స్వామి పార్టీ ప్రధాన కార్యదర్శి వైగోకు రాసిన లేఖ గురించి కేడర్ పట్టించుకోవద్దు అని సూచించారు. -
చిన్నమ్మ.. ఎవరా జ్యోతిష్కుడు?
సాక్షి, చైన్నె: కొడనాడు హత్య, దోపిడీ కేసులో శశికళను విచారణ వలయంలోకి తెచ్చేందుకు సీబీసీఐడీ నిర్ణయించింది. ఆమెతో పాటు మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టి, ఎడపాడిలో ఉన్న ఓ జ్యోతిష్కుడిని కూడా విచారించేందుకు కసరత్తులు మొదలయ్యాయి. దివంగత సీఎం జయలలితకు చెందిన కొడనాడు ఎస్టేట్‌లో 2017లో నవంబర్‌లో జరిగిన వాచ్‌మన్ హత్య, దోపిడీ ఘటన గురించి తెలిసిందే. అన్నాడీఎంకే హయాంలో ఈ కేసును మమా అంటూ ముగించారు. అయితే, ఈ ఘటన వెనుక ఉన్న మిస్టరీని వెలుగులోకి తెచ్చేందుకు తాజాగా డీఎంకే ప్రభుత్వం కంకణం కట్టుకుంది. తొలుత ఐజీ సుధాకర్, డీఐజీ ముత్తుస్వామి నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏడాది కాలంగా విచారించింది. ఆ తర్వాత సీబీసీఐడీకి కేసును అప్పగించారు. ప్రధానంగా మాజీ సీఎం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి, ఆయన సన్నిహిత మిత్రుడు ఇలంగోవన్‌ను టార్గెట్ చేసి ఈకేసులో సీబీసీఐడీ దూకుడుగా ముందుకెళుతోంది. గతవారం పళనిస్వామికి భద్రతాధికారిగా పనిచేసిన కనకరాజ్‌ను సీబీసీఐడీ విచారించింది. ఈపరిస్థితులలో ఈకేసులో శశికళ, మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టిని స్వయంగా విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అలాగే, పళనిస్వామి డ్రైవర్‌గా పనిచేసి అనుమానాస్పదంగా గతంలో మరణించిన కనకరాజ్‌కు ఎడపాడిలోని ఓ జ్యోతిష్కుడికి మధ్య సంబంధాలు ఉన్న సమాచారం సీబీసీఐడీ దృష్టికి చేరింది. దీంతో శశికళ, మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టితోపాటు ఆ జ్యోతిష్కుడిని విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మే మొదటి వారంలో వీరిని విచారించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా సమన్ల జారీకి ఏర్పాట్లు జరుగుతుండడం గమనార్హం. అదే సమమయంలో పళనిస్వామి నియోజకవర్గం ఎడపాడికి చెందిన జ్యోతిష్కుడి గురించిన సమాచారం తెరపైకి రావడంతో విచారణలో ఎలాంటి ఆసక్తికర అంశాలు బయటకు రానున్నాయో అన్న ఉత్కంఠ మొదలైంది. అలాగే, గతంలో చిన్నమ్మ వద్ద విచారణ బృందం వాంగ్మూలం సేకరించిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రత్యక్ష విచారణకు సిద్ధం కావడం గమనార్హం. -
తమిళనాట డీఎంకే ఫైల్స్ కలకలం
తమిళనాట రాజకీయం ఆడియో క్లిప్‌లతో ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర బీజేసీ చీఫ్ అన్నామలై విడుదల చేసిన ఆడియో క్లిప్స్.. హాట్ టాపిక్‌గా మారాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుటుంబానికి సంబంధించి అవినీతి అరోపణల క్లిప్‌ని ట్విట్టర్లో విడుదల చేశారు. అందుకు సంబంధించి.. 'డిఎంకే ఫైల్స్' పేరుతో వరుసగా రెండు ఆడియో క్లిప్‌లను ట్వీట్ చేశారు. ఆ వీడియోలో తమిళనాడు రాష్ట్ర ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగ రాజన్ అధికార డీఎంకేను కించపరుస్తూ.. ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నట్లు వినిపిస్తోంది. తమ ప్రభుత్వ హయాంలో దోచుకున్న మొత్తంలో ఎక్కువ భాగం స్థాలిన్ కొడుకు, అల్లుడు అధిక భాగం తీసుకున్నట్లు స్వీకర్ చెబుతున్నట్లు వినిపిస్తుంది. అంతేగాదు ఒక వ్యక్తి ఒకే పాలన అని ప్రశంసస్తూ వ్యవస్థ లోపానికి అర్థం డీఎంకేనే అని ఆరోపణలు చేస్తున్నట్లు ఆ స్పష్టంగా వినిపిస్తోంది. అంతేగాదు ఆ వీడియో క్లిప్ ఆధారంగా స్టాలిన్ తనయుడు.. క్రీడా మంత్రి అయిన ఉదయ్ స్టాలిన్, అల్లుడు శబరీశన్ 30 వేల కోట్ల అక్రమ ఆస్తులను కూడబెట్టారని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ విషయంపై స్పందించిన ఆర్థిక మంత్రి పళనివేల్ మా మధ్య విభేదాలు సృష్టించి విడదీసేందుకు ఇలా కుట్రలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని వీడియోలు కూడా రావొచ్చు అన్నారు. ఈ వీడియో క్లిప్ మొత్తం డీఎంకే నేతలు దాదాపు 1.34 లక్షల కోట్లు వరకు అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు పేర్కొంది. అంతేగాదు తమిళనాడు ముఖ్యమంత్రి కుటుంబంతో సహా ఇతర మంత్రులు దురై మురుగన్, ఈవీ వేలు, కే పొన్ముడి, వీ సెంథిల్ బాలాజీ, కేంద్ర మాజీ మంత్రి ఎస్ జగత్రక్షకన్ తదితరులపై ఆరోపణలు వచ్చాయి. అంతకుమునుపు 2011లో డీఎంకే హయాంలో చెన్నై మెట్రో రైలు కోచ్‌ల నియమాక విషయమై ఓ ప్రెవేట్ కంపెనీ స్టాలిన్‌కి సుమారు రూ. 200 కోట్లు ముట్టచెప్పినట్లు కూడా ఆ వీడియో క్లిప్‌లో ఆరోపణలు వచ్చాయి. Listen to the DMK ecosystem crumbling from within. The 2nd tape of TN State FM Thiru @ptrmadurai. Special Thanks to TN FM for drawing a proper distinction between DMK & BJP! #DMKFiles pic.twitter.com/FUEht61RVa — K.Annamalai (@annamalai_k) April 25, 2023 ఐతే రైల్వే సంస్థ దీన్ని ఖండించడమే గాక న్యాయమార్గంలోనే నియామకాలు జరిగినట్లు స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా అధికార డీఎంకే ఆ ఆరోపణలను ఖండించింది. అంతేగాక ఈ అంశమై అన్నామలైకి లీగల్‌గా నోటీసులు జారీ చేయడే గాక, క్షమాపణలతో సహా రూ. 500 కోట్ల భారీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది. ఐతే అన్నామలై తానెలాంటి పరువు నష్టం చట్టాన్ని ఉల్లంఘించ లేదంటూ క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించారు. తన వాయిస్‌తో నేరారోపణ చేసే కంటెంట్ ఉన్న వీడియోని రూపొందించమని కూడా సవాలు విసిరారు. ఆ వీడియో క్లిప్‌పై ఫోరెన్సిక్ దర్యాప్తు చేయాల్సిందిగా పట్టుబట్టారు. ఈ మేరకు ఆ ఆడియో క్లిప్‌పై ఫోరెన్సిక్ దర్యాప్తు చేయాల్సిందిగా గవర్నర్ ఆర్ఎన్ రవిని కోరారు. తమిళనాడులో బీజేపి హవా అంతమాత్రంగా ఉన్న ఈ తరుణంలో మిత్రపక్షమైన అన్నా డీఎంకేతో సంబంధాలు సైతం తెగిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. (చదవండి: సూడాన్‌లో చిక్కుకున్న తెలంగాణ వాసుల తరలింపుపై సమీక్ష) -
తమిళనాడు: స్టాలిన్ బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఐటీ సోదాల వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, ఐటీ అధికారులు సోమవారం ఉదయం నుంచి 50 ప్రాంతాల్లో బృందాలుగా సోదాలు నిర్వహించారు. ఇక, తమిళనాడు సీఎం స్టాలిన్ కుటుంబ సభ్యుల ఇళ్లలో, అధికార డీఎంకే నేతలు, జీ స్వ్కేర్ కంపెనీ రియల్టర్ల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అన్నానగర్ డీఎంకే ఎమ్మెల్యే మోహన్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరులో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కాగా, ఐటీ సోదాలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
పని వేళల పెంపుపై సర్వత్రా నిరసన
సాక్షి, చైన్నె: ప్రైవేటు సంస్థల్లో పని వేళలు 8 గంటల నుంచి 12 గంటలకు పొడిగిస్తూ అసెంబ్లీ వేదికగా తీసుకొచ్చిన చట్టం వివాదానికి దారి తీసింది. దీనిని వ్యతిరేకిస్తూ డీఎంకే మిత్ర పక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. ఆ పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు శనివారం రాష్ట్రంలో పలు చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. వివరాలు.. ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలలో పని వేళలను 12 గంటలుగా నిర్ణయిస్తూ అసెంబ్లీ వేదికగా శుక్రవారం చట్టం ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని డీఎంకే మిత్ర పక్ష పార్టీలు అసెంబ్లీ వేదికగా ఈ చట్టానికి వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించాయి. దీనిని పట్టించుకోని పాలకులు చట్టాన్ని ఆమోదించారు. ఈ చట్టం కారణంగా కార్మికులకు పని భారం పెరగనుందని, ఉప సంహరించుకోవాలని నినాదిస్తూ డీఎంకే మిత్ర పక్షాలకు చెందిన సీఐటీయూ, ఏఐటీయూసీ, తదితర కార్మిక సంఘాలు శనివారం పలు చోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి. మదురై, తిరునల్వేలి, రామనాథపురంలో నిరసనలు హోరెత్తాయి. రామేశ్వరం అగ్ని తీర్థంలోకి దిగి మరీ తమ నిరసనను కార్మిక సంఘాలు వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉపసంహరించుకోకుంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉధృతం అవుతాయన్న హెచ్చరించారు. ఇక ఈ చట్టాన్ని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి తీవ్రంగా వ్యతిరేకించారు. కార్మికుల జీవితాలతో చెలాగాటాలు వద్దు అని హెచ్చరించారు. గతంలో కేంద్రం ఇచ్చిన ఈ ఆదేశాలను తాము అమలు చేయడానికి ప్రయత్నిస్తే తీవ్రంగా వ్యతిరేకించిన డీఎంకే, ఇప్పుడు దీనిని అమలు చేయడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా, ఈ చట్టం వివాదానికి దారి తీయడం, కార్మికుల్లో నెలకొన్న ఆందోళనను నివృత్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 24వ తేదీ అన్ని కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించి, ఈ చట్టం గురించి వివరించనున్నారు. -
డీఎంకే మిత్రుల్లో ‘పని’ చిచ్చు
సాక్షి, చైన్నె: డీఎంకే మిత్రపక్షాలలో ప్రైవేటు సంస్థలలో పని వేళల పొడిగింపు వ్యవహారం చిచ్చు రేపింది. ప్రైవేటు సంస్థలలో 8 గంటలకు బదులుగా 12 గంటల పని వేళలు అన్న ప్రభుత్వ నిర్ణయాన్ని మిత్రపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. డీఎంకే అధ్యక్షుడు, సీఎం ఎంకే స్టాలిన్ నిర్ణయానికి అనుగుణంగా గత కొన్నేళ్ల పాటు మిత్ర పక్షాలైన కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే పార్టీలు అడుగులు వేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అసెంబ్లీ వేదికగా మిత్ర పక్షాలు తమ కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న డీఎంకే ప్రభుత్వ నిర్ణయాన్ని శుక్రవారం తీవ్రంగా వ్యతిరేకించాయి. మంత్రులు సీవీ గణేషన్, తంగం తెన్నరసు సభలో ఓ ముసాయిదా ప్రవేశపెట్టారు. ప్రైవేటు సంస్థలు, పరిశ్రమలలో ఇక 8 గంటలకు బదులుగా 12 గంటల పనివేళలు నిర్ణయిస్తున్నామని ఆ తీర్మానంలో వివరించారు. దీనిని సభలో ఉన్న కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే డీఎంకే మిత్రపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. 8 గంటల పనివేళలను 12 గంటలుగా నిర్ణయించడం కార్మికులతో చెలాగాటం ఆడినట్టేనని, ఈ ప్రయత్నాన్ని వీడాలని డిమాండ్ చేశాయి. ఇందుకు మంత్రులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా, ఆ పార్టీలు అంగీకరించ లేదు. దీంతో సభలో ఆ తీర్మానాన్ని డీఎంకే మెజారిటీ సభ్యుల నిర్ణయంతో ఆమోదించారు. అయితే, డీఎంకే మిత్రపక్షాలు మాత్రం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సభలో నినదించడం గమనార్హం. అనంతరం వెలుపల మంత్రులు మీడియాకు ఈ చట్టం గురించి వివరించారు. ఇది బలవంతం కాదని, ఆయా సంస్థలు, అక్కడి సిబ్బంది నిర్ణయం మేరకు అమల్లో ఉంటుందని వివరించారు. పని వేళలను పొడిగించడం ద్వారా రాష్ట్రంలోకి పెట్టుబడుల వరద మరింతగా పెరగనున్నాయని, లక్షలాది మందికి ఉపాధి దక్కబోతోందని వివరించారు. 12 గంటల పని వేళ అనేది పరిశ్రమల యాజమాన్యం, కార్మికుల పరస్పరం అంగీకారం మేరకు అమలు అవుతుందని, ఇందులో బలవంతం లేదని స్పష్టం చేశారు. ఏదేని సంస్థ, పరిశ్రమల బలవంతంగా 12 గంటలు పనిచేయాలని ఒత్తిడి తెచ్చిన పక్షంలో ఆసంస్థలపై చర్యలు తీసుకునేలా ఈ చట్టంలో అంశాలను పొందుపరిచినట్టు వివరించారు. ఈ చట్టం ఎలక్ట్రానిక్ ఆధారిత, క్లస్టర్ ఎలక్ట్రానిక్స్, నాన్ లెదర్ పరిశ్రమలకు ఉపయోగకరంగా ఉంటుందని, ఇక్కడ కార్మికులు అధిక గంటలు పనిచేస్తున్నారని వివరించారు. ఈ చట్టం ఆధారంగా కార్మికులకు అదనపు పని వేళలకు తగ్గ ప్రయోజనాలు కూడా ఉంటాయని వివరించారు. -
శాంతివనంగా తమిళనాడు
సాక్షి, చైన్నె: అల్లర్లు, కుల, మతఘర్షణలు, తుపాకీ కాల్పులు, లాకప్ డెత్‌లు వంటి ఘటనలకు చోటులేకుండా రాష్ట్రం శాంతివనంగా మారిందని సీఎం ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తం చేశారు. స్కాట్లాండ్ పోలీసులతో సమానంగా తమిళనాడు పోలీసుల పనితీరు ఉందని కొనియాడారు. పోలీసు, అగ్నిమాపక శాఖల బలోపేతం లక్ష్యంగా 101 వరాలను అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా శుక్రవారం పోలీసు, అగ్నిమాపక శాఖలకు నిధుల కేటాయింపులపై సీఎం స్టాలిన్ ప్రసంగించారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగం పనితీరును పొగడ్తలతో ముంచెత్తారు. నేరాల కట్టడిలో, నేరగాళ్లను పట్టుకోవడంలో పోలీసులు విశిష్ట ప్రతిభ కనబరుస్తున్నారని వివరించారు. అన్నాడీఎంకే హయాంలో రాష్ట్రంలో గంజాయి వంటి మాదక ద్రవ్యాల విక్రయం రాష్ట్రంలో జోరుగా సాగిందని, వీటిని కట్టడి చేయడం లక్ష్యగా తాము తీవ్రంగా శ్రమిస్తున్నామని పేర్కొన్నారు. తూత్తుకుడిలో జరిగిన తుపాకీ కాల్పులకు అనుమతి ఎవరు ఇచ్చారో అనే ప్రశ్నకు ఇక్కడ సమాధానం ఇచ్చే వారు లేరని మాజీ సీఎం పళని స్వామిని ఉద్దేశించి విమర్శలు చేశారు. కొడనాడు కేసు విచారణపై పళనిస్వామికి ఎ ందుకు అంత తడబాటో అర్థం కావడం లేదని, సీబీసీఐడీ విచారణలో వాస్తవాలు త్వరలో వెలుగులోకి రాబోతున్నాయని సీఎం వ్యాఖ్యలు చేశారు. వలస కార్మికులను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో అతిపెద్ద అల్లర్లకు కొందరు చేసిన కుట్రలను తమిళనాడు పోలీసు భగ్నం చేశారని, కార్మికుల భద్రతకు భరోసా కల్పించారని గుర్తు చేస్తూ ప్రశంసలు కురిపించారు. 101 వరాలు... నేరాల కట్టడిలో పోలీసుల పాత్రను గుర్తు చేస్తూ, రాష్ట్రంలో అల్లర్లు, మత, కుల ఘర్షణలు వంటి ఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా శాంతివనంగా మారిందని వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ఆ విధంగా శ్రమిస్తున్నారని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే ఉపేక్షించకుండా కఠినంగా వ్యవహరించి శిక్షల పడేలా చేస్తున్నారని పేర్కొన్నారు. అందుకే పోలీసు విభాగాన్ని మరింత బలోపేతం చేయడం, నిఘాపెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంటూ 101 వరాలను ప్రకటించారు. ఇందులో కొత్త పోలీసుస్టేషన్ల ఏర్పాటు, క్వార్టర్స్ల నిర్మాణాలు, అగ్నిమాపక కేంద్రాల బలోపేతం అంశాలు ఉన్నాయి. అలాగే, చైన్నెలో మహిళలు, బాలికలకు రక్షణగా రూ.5 కోట్లతో 3,500 నిఘా నేత్రాలను ప్రత్యేకంగా కొన్ని చోట్ల ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. పోలీసులకు ఏడాదికి గాను యూనిఫాం భత్యంగా రూ. 4,500 అందజేస్తామన్నారు. అలాగే, పోలీసు పిల్లలకు విద్యా ప్రోత్సాహకంగా రూ. 35 వేలు అందజేయనున్నామని ప్రకటించారు. పోలీసు శునకాలకు రోజుకు ఆహారం ఖర్చు రూ. 200 నుంచి రూ.300లకు పెంచుతున్నామని తెలిపారు. క్రిష్టో కరెన్సీ, ఆన్లైన్ మోసాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలను కట్టడి చేయడం లక్ష్యంగా ఆయా సంస్థలపై నిఘా వేయడానికి ప్రత్యేక కార్యాచరణపై దృష్టి పెట్టనున్నామని తెలిపారు. ఖైదీలు తప్పించుకోకుండా ఉండే విధంగా రిమోట్ లాక్ సిస్టమ్‌పై దృష్టి పెట్టనున్నామని వివరించారు. నేరాలకు పాల్పడే వారు ఎవరైనా, ఎంతటి వారైనా సరే ఉపేక్షించమని, శిక్షించి తీరుతామని సీఎం హెచ్చరించారు. ఇదిలా ఉండగా, సీఎం స్టాలిన్ ప్రసంగం వినేందుకుగాను ప్రేక్షకుల గ్యాలరీలో ఆయన సతీమణి దుర్గా స్టాలిన్ ఆశీనులయ్యారు. అలాగే, డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్ బాలు కూడా గ్యాలరీలో నుంచి సభా వ్యవహారాలను వీక్షించారు. స్పీకర్ ఆవేదన.. అన్నాడీఎంకే తీరుపై స్పీకర్ అప్పావు ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ వ్యవహారాల ప్రత్యక్ష ప్రసారంపై ఇప్పటికే సభా వేదికగా వివరాలను వెల్లడించామని స్పీకర్ గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రశ్నోత్తరాలను మాత్రం ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని, దశల వారీగా అన్నీ కార్యక్రమాలను ప్రసారం చేస్తామన్నారు. సభా వేదికగా అన్నాడీఎంకే సభ్యులు వాడిన పదాలు, చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆవేదనకు గురి చేశాయని, ఇది తప్పుడు సంకేతాలకు మార్గం అవుతుందని పేర్కొన్నారు. తాను కక్ష సాధిస్తున్నట్లుగా అన్నాడీఎంకే వర్గాలు చెప్పడం శోచనీయమని విమర్శించారు. తాను కక్ష సాధించాలనుకుంటే అన్నాడీఎంకే–1, అన్నాడీఎంకే–2 అని వారి శిబిరాలను విభజించి ఉండేవాడినని వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే వాకౌట్.. సీఎం ప్రసంగాన్ని అన్నాడీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. ప్రధాన ప్రతి పక్ష నేత , అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ప్రసంగాన్ని సభలో ప్రత్యేక్ష ప్రసారం చేయడం లేదని, శాసన సభా పక్ష ఉపనేత పదవి నుంచి పన్నీరుసెల్వంను తొలగించి ఉదయకుమార్‌ను నియమించడంలో స్పీకర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని, సభా పద్దుల కమిటీని తమకు ఇవ్వకుండా స్పీకర్ రాజకీయం చేశారని ఆరోపిస్తూ సభ నుంచి అన్నాడీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. స్పీకర్ అప్పావు ఏకపక్షంగా సభలో వ్యవహరిస్తున్నారని, తమళగళాన్ని నొక్కేస్తున్నారని ఆ పార్టీ విప్ ఎస్పీ వేలుమణి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
108తో ప్రత్యేక గుర్తింపు
సాక్షి, చైన్నె: తమిళనాడుకు ప్రత్యేక చిహ్నంగా 108 సేవలు నిలుస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ తెలిపారు. ఇప్పటి వరకు 1.46 కోట్ల మందికి ఈ అంబులెన్స్‌ల ద్వారా సేవలు అందించామన్నారు. వీటిని మరింత విస్తృతం చేయనున్నామన్నారు. మదురైలో ఆదివారం 108 ఉద్యోగ, కార్మికుల సంక్షేమం సంఘం తొలి మహానాడు జరిగింది. ఇందులో ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ ప్రసంగిస్తూ, 2008లో 200 వాహనాలతో అంబులెన్స్ సేవలకు డీఎంకే ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు వివరించారు. ప్రస్తుతం 1,353 వాహనాలు ఉన్నాయని పేర్కొన్నారు. 205 అంబులెన్స్‌లను మరిన్ని వసతులతో తీర్చిదిద్దామని వివరించారు. మరో 65 అంబులెన్స్‌లు చిన్న పిల్లలకు అసవరమైన అన్ని రకాల సేవలతో రూపొందించామన్నారు. తాము ప్రస్తుతం అధికారంలోకి వచ్చినానంతరం రూ. 102 కోట్ల 28 లక్షలతో 293 అంబులెన్స్‌లను కొనుగోలు చేశామన్నారు. ఈ అంబులెన్స్‌లో తమిళనాడుకు ప్రత్యేక గుర్తింపు చిహ్నంగా మారినట్లు ధీమా వ్యక్తం చేశారు. ప్రపథమంగా తమ ప్రభుత్వం గతంలో తీసుకొచ్చిన ఈ పథకాన్ని, సేవలను అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా మలుచుకున్నాయని పేర్కొన్నారు. రోజుకు 108 అంబులెన్స్‌కు 12,500 ఫోన్‌కాల్స్ వస్తున్నట్టు వివరించారు. 2008 నుంచి ఇప్పటి వరకు 1.46 కోట్ల 71 వేల 266 మంది సేవలు పొందారని తెలిపారు. కరోనా కాలంలో 108 సేవలు అభినందనీయమని, సిబ్బంది సేవలు వెలకట్ట లేనిదిగా పేర్కొన్నారు. కరోనా సమయంలో 542 అంబులెన్స్‌ల ద్వారా 6 లక్షల 30 వేల 500 మంది కరోనా రోగులను ఆస్పత్రులకు తరలించామన్నారు. ఈ అంబులెన్స్‌ల సేవలను మరింతగా విస్తరించనున్నట్లు తెలిపారు. -
40 స్థానాల్లోనూ గెలుపే లక్ష్యం
సాక్షి, చైన్నె : లోక్‌సభ ఎన్నికల్లో పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలోని 40 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా.. కార్యక్ర మాలపై దృష్టి పెట్టాలని నియోజకవర్గ పర్యవేక్షకులకు డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్ పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో క్లీన్ స్వీపే లక్ష్యంగా స్టాలిన్ వ్యూహాలకు పదును పెట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లు, పర్యవేక్షకులను నియమించి కార్యక్రమాలను విస్తృతం చేయాలని నిర్ణయించారు. వీరితో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యా రు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి. సభ్యత్వ నమోదు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని వివరించారు. పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలోని 40 స్థానాల్ని కై వసం చేసుకునే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన ఆదేశించారు. అలాగే ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటి ముంగిటకు చేరే విధంగా ప్రత్యేక కార్యక్రమాలను విస్తృతం చేయాలని సూచించారు. -
తమిళనాట హైలైట్ ట్విస్ట్.. స్టాలిన్ దెబ్బకు దిగివచ్చిన గవర్నర్
గతకొద్దిరోజులుగా తమిళనాడులో సీఎం స్టాలిన్ వర్సెస్ గవర్నర్‌్ ఆర్ఎన్ రవి అన్నట్టుగా వ్యవహారం నడుస్తోంది. సీఎం స్టాలిన్, గవర్నర్ మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో ప్రభుత్వం పాస్ చేసిన బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడంపై స్టాలిన్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తాజాగా అసెంబ్లీ రెండుసార్లు ఆమోదించి పంపిన ఆన్లైన్ జూదాన్ని నిషేధించే, ఆన్లైన్ గేమ్‌లను నియంత్రించే బిల్లుకు గవర్నర్ వెంటనే ఆమోదం తెలిపారు. అయితే, అంతకుముందు.. సీఎం స్టాలిన్ సోమవారం రెండోసారి గవర్నర్‌కు వ్యతిరేకంగా తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తాము ప్రజల కోసం తీసుకొచ్చిన బిల్లును బహిరంగ వేదికపై గవర్నర్ విమర్శించారని, ప్రజల సంక్షేమానికి వ్యతిరేకంగా నిలుస్తున్నారని మండిపడ్డారు. అలాగే, అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు వెంటనే ఆమోదం తెలిపేలా గవర్నర్‌కు తక్షణమే తగిన ఆదేశాలు జారీ చేయాలని కేంద్రం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములను కోరారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ అధికార వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకోకూడదని అంబేద్కర్ చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి.. గవర్నర్ గైడ్‌గా ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని అన్నారు. కానీ తమిళనాడు గవర్నర్ మాత్రం ప్రజలకు మంచి చేసేందుకు సిద్ధంగాలేరని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ రవి దిగి వచ్చారు. అసెంబ్లీ రెండుసార్లు ఆమోదించి పంపిన ఆన్లైన్ జూదాన్ని నిషేధించే, ఆన్లైన్ గేమ్‌లను నియంత్రించే బిల్లుకు వెంటనే ఆమోదం తెలిపారు. మరోవైపు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వద్ద మరో 20 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఛాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగించాలన్న బిల్లు కూడా ఇందులో ఉన్నది. ఇదిలా ఉండగా.. ఆన్లైన్ జూదంలో డబ్బులు పోగొట్టుకోవడంతో తమిళనాడులో 40 మందికిపైగా వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే, గత ప్రభుత్వం ఆమోదించిన ఈ తరహా బిల్లును కోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో డీఎంకే అధికారంలోకి రాగానే ఈ బిల్లుపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. దీంతో, తొలిసారి అసెంబ్లీ ఆమోదించి పంపిన 131 రోజుల తర్వాత గవర్నర్ గత నెలలో ఈ బిల్లును ప్రభుత్వానికి తిప్పి పంపారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో మరోసారి ఆమోదించి గవర్నర్‌కు రెండోసారి ఈ బిల్లును ప్రభుత్వం పంపింది. -
ఈ గవర్నర్ మాకొద్దు
సాక్షి, చైన్నై: మాకొద్దు ఈ గవర్నర్..గో బ్యాక్ ఆర్ఎన్ రవి అనే నినాదంతో డీఎంకే కూటమి పోరుబాటకు సిద్ధమైంది. గవర్నర్ రవి వేదికలపై చేస్తున్న వ్యాఖ్యలు వివాదానికి దారితీయడంతో ఆయనకు వ్యతిరేకంగా ఈనెల 12న భారీ ఎత్తున నిరసనకు డీఎంకే కూటమి నిర్ణయించింది. రాజ్‌భవన్‌ను ముట్టడించేందుకు సిద్ధమైంది. గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మొదటి నుంచి వివాదాలు భగ్గుమంటున్న విషయం తెలిసిందే. వేదికలపై గవర్నర్ చేస్తున్న హిందూత్వ నినాద వ్యాఖ్యలు, సనాతన ధర్మ ఉపదేశాలు చర్చకు దారి తీస్తున్నాయి. ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటికే రాష్ట్రంలో నిరసనలు పలుమార్లు జరిగాయి. ఆయన తీరుపై రాష్ట్రపతికి, హోంశాఖకు ప్రభుత్వంతో పాటు తమిళ పార్టీలు ఫిర్యాదులు చేశాయి. అలాగే, తమిళనాడు ప్రభుత్వ తీర్మానాలను ఆయన తుంగలో తొక్కుతూ వస్తున్న నేపథ్యంలో డీఎంకే కూటమి తన ఆగ్రహాన్ని ప్రదర్శించడం పెరుగుతోంది. ఈ సమయంలో గురువారం గవర్నర్ చేసిన వ్యాఖ్యలు పుండు మీద కారం చల్లినట్లైంది. అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాల విషయంగా, వాటిని ఎలా ఆమోదించాలని, పక్కన పెట్టాలి అనే అంశాలను విద్యార్థులకు ఉపదేశించే సమయంలో గవర్నర్ చేసిన వ్యాఖ్యలను తమిళ పార్టీలు తీవ్రంగానే పరిగణించాయి. స్టెరిలైట్ వ్యవహారంలో ప్రజలను రెచ్చగొట్టారని గవర్నర్ చేసిన వ్యాఖ్యలను అన్నాడీఎంకే సైతం తీవ్రంగానే పరిగణించింది. ఆ పార్టీ సంయుక్త కార్యదర్శి కేపీ మునుస్వామి స్పందిస్తూ, ప్రజల మనోభావాలకు అనుగుణంగానే స్టెరిలైట్‌కు తాము అధికారంలో ఉన్నప్పుడు తాళం వేయాల్సి వచ్చిందన్నారు. అయితే, బాధ్యత గల పదవిలో ఉన్న గవర్నర్ వేదికలపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయమని విమర్శించారు. ఇక, న్యాయ శాఖ మంత్రి రఘుపతి అయితే, మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, ఆయన గవర్నర్ కాదని, రాజకీయనాయకుడి అవతారం ఎత్తిన వ్యక్తి అని మండిపడ్డారు. ఈ వివాదాల నేపథ్యంలో డీఎంకే కూటమి గవర్నర్‌కు వ్యతిరేకంగా చలో రాజ్‌భవన్ కార్యక్రమానికి పిలుపునివ్వడం గమనార్హం. 12న భారీ నిరసన.. డీఎంకే, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకే, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్, మనిదనేయమక్కల్ కట్చి, కొంగునాడు దేశీయ కట్చి, తమిళర్ వాల్వురిమై కట్చి పార్టీల నేతృత్వంలోని కూటమి చలో రాజ్‌భవన్‌కు నిర్ణయించింది. గవర్నర్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతూ నేతలు ప్రకటన విడుదల చేశారు. ఈ గవర్నర్ తమకు వద్దేవద్దని నినదించారు. అసలు గవర్నర్ల వ్యవస్థనే రద్దు చేయాలని పట్టుబట్టారు. తాము అధికారంలో లేని రాష్ట్రాల్లో ఇలాంటి గవర్నర్ల ద్వారా ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టే విధంగా కేంద్రం వ్యవహస్తోందని ధ్వజమెత్తారు. గవర్నర్ల ద్వారా రాష్ట్రాలలో మరో ప్రభుత్వాన్ని నడిపించే విధంగా కేంద్రం వ్యవహరిస్తున్న తీరును, గవర్నర్ పద్ధతిని ఖండిస్తూ భారీ ర్యాలీతో రాజ్‌భవన్‌కు నిరసన ప్రదర్శన నిర్వహించనున్నామని ప్రకటించారు. రాజ్‌భవన్ వివరణ.. గవర్నర్ వ్యాఖ్యలు దుమారాన్ని రేపడంతో రాజ్‌భవన్ అప్రమత్తమైంది. ఆయన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ రాజ్‌భవన్ అధికారులు ట్వీట్ చేశారు. నిబంధనలకు అనుగుణంగానే గవర్నర్ పనిచేస్తున్నారని వివరించారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించే సమయంలో తన విధులను గుర్తు చేశారని పేర్కొన్నారు. అసెంబ్లీ నుంచి వచ్చిన ముసాయిదాపై నిర్ణయం తీసుకునేందుకు గవర్నర్‌కు మూడు అవకాశాలు ఉన్నాయని, వాటిని విద్యార్థులకు వివ రిస్తూ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని సూచించారని, ఇందులో తప్పుబట్టాల్సిన అంశాలు లేవని పేర్కొన్నారు. గతంలో ఇదేవిధంగా గవర్నర్‌కు వ్యతిరేకంగా వచ్చిన నిరసనల సమయంలో వివరణ ఇవ్వని రాజ్‌భవన్ ప్రస్తుతం ట్వీట్ చేయడం కూడా చర్చకు దారి తీసింది. -
మహిళను మోసం చేసిన డీఎంకే నేత అరెస్ట్
తిరువళ్లూరు: మనస్పర్థల కారణంగా భర్తకు దూరంగా వున్న వివాహితను తిరిగి భర్త చెంతకు చేరుస్తానని నమ్మించి గర్భవతిని చేసిన డీఎంకే నేతను తిరువళ్లూరు మహిళ పోలీసులు అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా పూండి యూనియన్ తిరుప్పాచ్చూర్ గ్రామానికి చెందిన హృదయరాజ్ కుమార్తె సత్య(20)కు గత ఏడాది పెళ్లి అయింది. ఆరు నెలలకే భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా పుట్టింటికి వచ్చేసింది. అదే ప్రాంతానికి చెందిన డీఎంకే ప్రతినిధి కృష్ణన్(70)ను ఆమె ఆశ్రయించింది. తనను భర్త వద్దకు చేర్చాలని కోరింది. భర్త వద్దకు చేరుస్తానని నమ్మించి ఆమైపె పలుమార్లు లైంగిక దాడి చేశాడు. దీంతో సత్య గర్భం దాల్చింది. ఈ విషయాన్ని బయటకు చెబితే ఇబ్బందులు పడతావని కృష్ణన్ ఆమెను బెదిరించాడు. ఆమె రెండు రోజుల క్రితం ఆడశిశువుకు జన్మనిచ్చింది. శిశువు మృతి చెందింది. శిశువును ఇంటికి సమీపంలోనే పాతిపెట్టిన కృష్ణన్ విషయాన్ని బయటకు చెప్పవద్దని ఆమెను మళ్లీ బెదిరించాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో సత్యను విచారించారు. కృష్ణన్ లైంగిక దాడి చేయడంతోపాటు విషయాన్ని బయటకు చెప్పవద్దని బెదిరించినట్టు నిర్ధారణ కావడంతో శుక్రవారం రాత్రి అతన్ని అరెస్టు చేశారు. -
ఆ వైభవం తిరిగొస్తుందా?
గత అక్టోబర్‌లో యాభై ఏళ్ళు నిండినప్పుడు అందరూ ఆగిచూసిన దక్షిణాది ప్రాంతీయ పార్టీ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకె)కు మంచి రోజులు రానున్నాయా? అప్పట్లో ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకె)తో సరిపడక హీరో ఎమ్జీఆర్ బయటకొచ్చి స్థాపించిన ఈ పార్టీపై పట్టు కోసం కోర్టులో పోరు కొలిక్కి వచ్చినట్టేనా? పార్టీ నుంచి తనను బహిష్కరించడాన్నీ, తన ప్రత్యర్థి – మాజీ సీఎం ఈడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడాన్నీ సవాలు చేస్తూ మాజీ సమన్వయకర్త ఓ. పన్నీర్‌సెల్వం (ఓపీఎస్) వేసిన పిటిషన్లను మద్రాస్ హైకోర్ట్ మంగళవారం తోసిపుచ్చింది. కోర్టులో ఓపీఎస్‌కు ఎదురుదెబ్బ ఇది వరుసగా మూడోసారి. తీర్పుపై అప్పీలుకు అవకాశం ఉన్నా, ఆయన రాజకీయ పునరాగమనానికి దారులు మూసుకుపోతున్నట్టే అనిపిస్తోంది. కేడర్‌పై విస్తరించిన పట్టు, కీలక స్థానాల్లో నమ్మినబంట్ల నియామకం, సమర్థ పరిపాల కుడిగా సాధించిన పేరు, తాజా కోర్టు తీర్పుతో... పార్టీ పగ్గాలు ఈపీఎస్ చేతికి దాదాపు వచ్చినట్టే. ఇది పార్టీ పునర్వైభవానికి దోహదమవుతుందా అన్నదే ఇక మిగిలిన ప్రశ్న. అధినేత్రి జయలలిత మరణానంతరం క్రమంగా కష్టాల్లో పడ్డ అన్నాడీఎంకె గత రెండేళ్ళలో తేవర్లు, గౌండర్లు, వగైరా కులాల కుంపట్లతో ఒకటికి నాలుగు (ఈపీఎస్, ఓపీఎస్, పదవీచ్యుత ప్రధాన కార్యదర్శి శశికళ, ఆమె మేనల్లుడు – ఏఎంఎంకె అధినేత టీటీవీ దినకరన్) వర్గాలైంది. సాంప్రదాయికంగా అన్నాడీఎంకెకు పట్టున్న రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలో నిరుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకె పాగా వేసింది. మహిళలు, వెనుకబడిన వర్గాలు, అగ్రవర్ణాల ఓటు బ్యాంక్ క్రమంగా చెదిరిపోతోంది. ఈపీఎస్, ఓపీఎస్ శిబిరాల మధ్య పోరుతో పార్టీ దశ, దిశ కోల్పోయి బలహీనపడ్డ సమయంలో కోర్ట్ తీర్పు అయాచిత వరమే. పేరుకు ప్రధాన ప్రతిపక్షమైనా వర్గ విభేదాలు, పార్టీకి సారథి ఎవరో తెలియని అయోమయం, ఎన్నికల చిహ్నం రెండాకులపై పోరాటం సాగుతున్న వేళ ఈ తీర్పు పార్టీ ప్రస్థానానికి దిశానిర్దేశమే. కోర్టు ఆదేశాలు ఈపీఎస్ వర్గానికి నైతికంగా పెద్ద అండ. నిజానికి, దివంగత జయలలితనే పార్టీ శాశ్వత అధినేత్రిగా ప్రకటించాలన్నది ఓపీఎస్ వర్గం దీర్ఘకాలిక డిమాండ్. ఇప్పుడీ తీర్పుతో వారి డిమాండ్‌కు గండిపడింది. ఈపీఎస్ మద్దతుదారులు తమ నేతను శాశ్వత ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొని, పార్టీని మళ్ళీ పట్టాలెక్కించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ ఫిబ్రవరిలో సుప్రీం కోర్ట్ సానుకూలంగా ఇచ్చిన తీర్పూ వారికి కలిసొచ్చే అంశం. ఇప్పటికే పార్టీ జనరల్ కౌన్సిల్లో, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెజారిటీ సభ్యుల మద్దతు ఈపీఎస్‌కే ఉంది గనక ఈపీఎస్ యథేచ్ఛగా ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవచ్చు. సదరు సమావేశాల్లో పార్టీలో ఓపీఎస్ లాంటి ప్రత్యర్థుల్ని ఇంటికి సాగనంపుతూ తీర్మానాలు చేసే వీలు చిక్కుతుంది. అవసరాన్ని బట్టి పార్టీ రాజ్యాంగాన్నీ సవరించుకోవచ్చు. ఇవన్నీ ఈపీఎస్‌కు కలిసొచ్చే అంశాలు. ఇల్లలకగానే పండగ కాదనట్టు ఈపీఎస్‌కు అనేక సవాళ్ళు ముందున్నాయి. దాదాపు 1.5 కోట్ల మంది కార్యకర్తలున్న పార్టీని ఒంటరి దళపతిగా ఆయన ముందుకు నడపాలి. పార్టీకి మునుపు సారథ్యం వహించిన ఎమ్జీఆర్, జయలలిత లాంటి దిగ్గజాలకున్న ఇమేజ్, ప్రాచుర్యం ఈపీఎస్‌కు లేవు. వారిలా జనాకర్షణ, మాటే శాసనంగా పార్టీని నడిపే పట్టు ఆయన నుంచి ఆశించలేం. సొంత గూటి సంగతి పక్కన పెడితే, ప్రత్యర్థి పార్టీ అయిన డీఎంకెతో ఢీ అంటే ఢీ అనాలంటే ముందుగా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా జనంలో పార్టీపై నమ్మకం పెంపొందించాలి. మరోపక్క 2019 లోక్‌సభ ఎన్నికల్లో, 2021 తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో విజయాలతో డీఎంకెను ముందుకు నడిపిన ఘనత స్టాలిన్‌ది. బలమైన ఈ ప్రత్యర్థితో తలపడడం ఈపీఎస్‌కు ఈజీ కాదు. తమిళ రాజకీయాలెప్పుడూ డీఎంకె, అన్నాడీఎంకెల మధ్య... కరుణానిధి, జయలలితల మధ్య ఊగడం రివాజు. ఆ రాజకీయ దృశ్యం ఇప్పుడు గణనీయంగా మారింది. చిరకాలంగా తమిళ రాజకీయాలకు దిక్సూచైన ద్రావిడ సిద్ధాంతం క్రమంగా కుంచించుకుపోతోంది. ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులను (గవర్నర్ రవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై) 2021లో బరిలోకి దింపి, డీఎంకె వ్యతిరేక, హిందూత్వ జాతీయవాద వైఖరితో బీజేపీ కాలు దువ్వుతోంది. అలాగే, జయ మరణానంతరం అన్నాడీఎంకెకు పెద్దన్నగా వ్యవహరించిన బీజేపీ... ఆ పార్టీ బలహీనతల్ని వాటంగా చేసుకొని, జయ వదిలివెళ్ళిన స్థానంలో ప్రధాన ప్రతిపక్షంగా తాను కూర్చోవాలని శతధా ప్రయత్నిస్తోంది. పక్కనే పొంచివున్న ఈ ముప్పు పట్ల ఈపీఎస్ జాగరూకత వహించి, సమర్థంగా ఎదుర్కోవాలి. ఒక్కమాటలో– 39 పార్లమెంటరీ స్థానాలున్న తమిళనాట రానున్న 2024 లోక్‌సభ ఎన్నికలు ఈపీఎస్‌కు తొలి పెద్ద పరీక్ష. దానిలో పార్టీని బలంగా నిలబెట్టి, తర్వాత మరో రెండేళ్ళకు వచ్చే 234 స్థానాల శాసనసభా సమరంలో అధికారం చేజిక్కించుకునేలా పోరాడాలి. నిరుటి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకె కూటమి 159 స్థానాలు సాధిస్తే, 75 సీట్లకే పరిమితమైన అన్నాడీఎంకె కూటమి ఆ లెక్కను తిరగరాయాలి. అదే జరిగితే అధినేతగా ఈపీఎస్‌కు తిరుగుండదు. లేదంటే, అన్నాడీఎంకెలో మరోసారి అసమ్మతి స్వరాలు పైకొస్తాయి. రిటైరయ్యానని ప్రకటించిన జయలలిత నెచ్చెలి శశికళను మళ్ళీ తెర పైకి తేవాలనే మాటలు వినిపిస్తాయి. అందుకే, రాగల మూడేళ్ళ కాలం ఈపీఎస్‌కు పరీక్షా సమయం. మంచి మార్కులు తెచ్చుకుంటేనే ఆయనకైనా, అన్నాడీఎంకెకైనా భవిష్యత్తు! -
Tamil Nadu: అధికార డీఎంకేలో భగ్గుమన్న వర్గపోరు.. మంత్రి Vs ఎంపీ!
తిరుచ్చి వేదికగా అధికార డీఎంకే వర్గపోరు రచ్చకెక్కింది. పార్టీలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతలకు చెందిన మద్దతు దారుల మధ్య బుధవారం ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ప్రొటోకాల్ ప్రకారం తమ నేతకు విలువ ఇవ్వడం లేదంటూ ఎంపీ శివ అనుచరులు మంత్రి నెహ్రూకు వ్యతిరేకంగా తొలుత నల్ల జెండాలను ప్రదర్శించడం వివాదానికి దారి తీసింది. దీంతో పోలీస్ స్టేషన్లోకి చొరబడి మరీ ఎంపీ అనుచరులను మంత్రి వర్గీయులు చితక్కొట్టారు. సాక్షి, చెన్నై: డీఎంకేలో నగరాభివృద్ధి శాఖ మంత్రిగా, పారీ్టలో సీనియర్ నేతగా కేఎన్ నెహ్రూ మంచి గుర్తింపు పొందారు. ఇక, ఎంపీ శివ ఢిల్లీ వేదికగా డీఎంకే రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు. ఈ ఇద్దరు తిరుచ్చికి చెందిన వారే. ఇదే జిల్లా నుంచి మరో మంత్రిగా అన్బిల్ మహేశ్ కూడా ఉన్నారు. మంత్రుల మధ్య ఎలాంటి విభేదాలు లేకున్నా, మంత్రి నెహ్రూ, ఎంపీ తిరుచ్చి శివ మాత్రం ఉప్పు..నిప్పులా వ్యవహరిస్తున్నారు. నిరసనతో మొదలై.. తిరుచ్చిలో బుధవారం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, కొత్త భవనాల నిర్మాణాలకు శంకు స్థాపనలు, నిర్మాణాలు పూర్తి చేసుకున్న వాటికి ప్రారంభోత్సవాలు పెద్దఎత్తున జరిగాయి. ఈ కార్యక్రమాల్లో మంత్రి నెహ్రూ బిజీ అయ్యారు. అయితే ఈ కార్యక్రమాలకు ఎంపీ తిరుచ్చి శివను ఆహ్వానించక పోవడాన్ని ఆయన వర్గీయులు తీవ్రంగా పరిగణించారు. అదే సమయంలో తిరుచ్చి కంటోన్మెంట్‌లోని ఎంపీ శివ ఇంటికి సమీపంలోని ఓ క్రీడా మైదానం ప్రారంభోత్సవానికి ఉదయాన్నే మంత్రి నెహ్రూ వచ్చారు. ఈ సమయంలో శివ వర్గీయులు నల్ల జెండాలను ప్రదర్శించి నిరసన తెలియజేయడం వివాదానికి ఆజ్యం పోసింది. శివ వర్గీయులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ ప్రా రంబోత్వవాన్ని ముగించుకుని మంత్రి నెహ్రూ తిరుగు ప్రయాణంలో ఉండగా, ఆయన మద్దతుదారులు రెచ్చి పోయారు. తిరుచ్చి శివ ఇంటి ముందు ఆగి ఉన్న కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ఇంటి ముందు ఉన్న వస్తువులు, ఫర్నీచర్ ధ్వంసం చేయడంతో వివాదం ముదిరింది. మంత్రి కళ్లెదుటే ఈ దాడులు జరగడం గమనార్హం. అంతటితో వదిలి పెట్టక నేరుగా మంత్రి మద్దతుదారులు పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ భద్రతా విధుల్లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు మాత్రమే ఉన్నారు. 100 మందికి పైగా వచ్చిన మంత్రి మద్దతుదారులు లోనికి చొరబడి వీరంగం సృష్టించారు. తిరుచ్చి శివ వర్గీయులపై దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ శాంతికి గాయాలు కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ఎంపీ శివ ఇంటి వద్ద పోలీసు భద్రతను పెంచారు. పోలీసు స్టేషన్లోకి చొరబడి దాడులకు పాల్పడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. పార్టీ నాయకుల వీరంగంపై సీఎం స్టాలిన్ సమాధానం చెప్పాలని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణి స్వామి డిమాండ్ చేశారు. தேர்தலுக்கு முன்னாடியே போலீஸ் ஸ்டேசனுக்கு லஞ்சம் குடுத்த @KN_NEHRU வை அமைச்சரா ஆக்குனா ஸ்டேசன்ல இதான் நடக்கும். pic.twitter.com/XezvEN06DW — Savukku Shankar (@Veera284) March 15, 2023 నెల్లైలోనూ వివాదం.. తిరుచ్చిలో ఇద్దరు కీలక నేతల మద్దతు దారుల మధ్య వార్ చోటు చేసుకుంటే, తిరునల్వేలిలో మేయర్, జిల్లా కార్యదర్శి మధ్య సమరం రాజధానికి చెన్నైకు చేరింది. తిరునల్వేలి కార్పొరేషన్ మేయర్ శరవణన్, జిల్లా పార్టీ కార్యదర్శి అబ్దుల్ వకాబ్ మధ్య వివాదంతో ఆ కార్పొరేషన్ డీఎంకే చేజారే పరిస్థితి నెలకొంది. అబ్దుల్ వకాబ్ మద్దతుగా 30 మందికి పైగా కార్పొరేటర్లు మేయర్ శరవణన్‌కు వ్యతిరేకంగా తిరుగు బావుట ఎగుర వేశారు. మేయర్‌ను తప్పించాలని నినాదిస్తూ చెన్నైకు బుధవారం ప్రయాణమయ్యారు. మా«ర్గంమధ్యలో తిరుచ్చిలో మంత్రి కేఎన్ నెహ్రూను కలిసి కొందరు కార్పొరేటర్లు వినతి పత్రం సమరి్పంచారు. గురువారం చెన్నైలోని డీఎంకే కార్యాలయంలో మేయర్‌పై ఫిర్యాదు చేయనున్నారు. ఐదుగురికి పార్టీ నుంచి ఉద్వాసన పార్టీ నాయకులు, కార్యకర్తలు పరస్పరం దాడుల నేపథ్యంలో పోలీసు స్టేషన్లోకి చొరబడి వీరంగం సృష్టించిన వారిపై డీఎంకే అధిష్టానం కన్నెర్రజేసింది. తిరుచ్చి కార్పొరేటర్లు ముత్తసెల్వం, విజయ్, రాందాసు, యూనియన్ నేత దురై రాజ్, ఉపనేత తిరుపతిని పార్టీ నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు డీఎంకే కార్యాలయం ప్రకటించింది. దీంతో ఈ ఐదుగురు పోలీసు స్టేషన్లో లొంగి పోయారు. పోలీస్ స్టేషన్లోకి చొరబడి ప్రత్యర్థులపై జరిపిన దాడికి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ వీరంతా పోలీసులకు లొంగిపోయినట్లు వెల్లడించారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు తెలిపారు.