
లక్నో: సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ మరోసారి స్పందించారు. సనాతన ధర్మం ఒక్కటే మతమని.. మిగిలినవన్నీ విభాగాలు, పూజా విధానాలు మాత్రమేనని వ్యాఖ్యానించారు. 'శ్రీమధ్ భగవత్ కథా జ్ఞాన్' కార్యక్రమంలో యోగీ ఆదిత్యానాథ్ ఈ మేరకు మాట్లాడారు.
'సనాతన ధర్మం మాత్రమే మతం. మిగిలినవన్నీ వివిధ రకాల పూజా విధానాలు మాత్రమే. సనాతన ధర్మం అంటే మానవత్మమనే మతం. ప్రస్తుతం దానిపై దాడి జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే ప్రపంచంలో మానవత్వమే ఆపదలో ఉన్నట్లు.' అని యోగీ ఆదిత్యనాథ్ అన్నారు.
'శ్రీమధ్ భగవత్ కథా జ్ఞాన్' కార్యక్రమాలు ఏడు రోజులపాటు గోరఖ్‌నాథ్ దేవాలయం వద్ద నిర్వహించారు. చివరి రోజు వేడుకలో భాగంగా యోగి ఆదిత్యనాథ్ ఈ మేరకు మాట్లాడారు. మహంత్ దిగ్విజయ్ నాథ్ 54వ వర్థంతి, మహంత్ అవైద్యనాథ్ 9వ వర్థంతి సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. విశాల దృక్పథం ఉన్నవారు మాత్రమే శ్రమధ్ భగవత్ కథా సారాన్ని అర్థం చేసుకోగలరని అన్నారు.
ఇదీ చదవండి: ఉజ్జయిని హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్.. బుల్డోజర్‌కు పని