ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మరో జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రయాగ్‌రాజ్ జిల్లా పరిధిలో ఉన్న ఈ ప్రాంతానికి ఇకపై కొత్త గుర్తింపు రానుంది. ఈ జిల్లా పేరు మహాకుంభమేళా. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అధికారులతో సమావేశమైన అనంతరం దీనిపై ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ప్రయాగ్‌రాజ్ జిల్లా మేజిస్ట్రేట్ ఒక నోటిఫికేషన్ జారీ చేస్తూ, ఈ విషయాన్ని ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.
జనవరిలో రాబోయే కుంభమేళాను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డీఎం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం కొత్తగా ఏర్పాటైన జిల్లాను మహాకుంభమేళా జిల్లాగా పిలవనున్నారు. కుంభమేళాను సజావుగా నిర్వహించేందుకు, పరిపాలనా పనులను మరింత మెరుగ్గా నిర్వహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
మహా కుంభమేళా జిల్లాలో ఇండియన్ సివిల్ సెక్యూరిటీ సెక్షన్ 14 (1) ప్రకారం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, జిల్లా మేజిస్ట్రేట్, అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌లను నియమించనున్నారు. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే మహాకుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో 2025, జనవరి 13 నుండి ప్రారంభమై 2025, ఫిబ్రవరి 26 వరకూ కొనసాగనుంది.
ఇది కూడా చదవండి: నేడు రైతుల ఆందోళన.. ప్రభుత్వం అప్రమత్తం
Comments
Please login to add a commentAdd a comment