Maha Kumbh Mela
-
మహా కుంభమేళాలో ఆటో కుర్రాడికి ఊహించని సాయం
-
కష్టం తీర్చిన కుంభమేళ.. ఆటో కుర్రాడి భావోద్వేగం
ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం... మహా కుంభమేళ ముగిసింది! త్రివేణీ సంగమ స్థలి ప్రయాగ్‌రాజ్‌లో సాగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కోట్లమంది సందర్శించారు. పవిత్ర గంగలో మునకేసి తమ పాపాలు కడిగేసుకున్న పారవశ్యంలో మునిగితేలారు. వీరందరిది ఒక ఎత్తైతే.. కొందరు పరోపకారాన్ని కూడా అంతే శ్రద్ధాసక్తులతో చేసి ఆత్మానందం పొందారు. అలాంటి ఓ సంఘటన సాగిందిలా...కోట్లమందిలాగే.. స్వీయ జ్ఞానోదయం, మనసును పరిశుద్ధ పరచుకోవడం, ఆధ్యాత్మికతలోని వెలుగులను అన్వేషించడం కోసం ఆమె కూడా కుంభమేళాకు వెళ్లారు. ఎక్కడో ఓ మూలనున్న రిసార్టులో మకాం. అక్కడి నుంచి సంగమ స్థలికి వెళ్లేందుకు ఓ ఆటో మాట్లాడుకున్నారు.. దాన్ని నడుపుతోంది ఓ నూనూగు మీసాల కుర్రాడు. మాట మాట కలిసింది. కుశల ప్రశ్నలయ్యాయి. బడికెందుకు వెళ్లడం లేదన్న ప్రశ్న వచ్చింది. అంత సౌలభ్యం లేదన్న సమాధానంతోపాటు తప్పనిసరి పరిస్థితుల్లోనే... బతుకు కోసం ఆటో నడపాల్సి వస్తుందని ఆ కుర్రాడు తన బాధను వెళ్లబోసుకున్నాడు. ఈ మాటలు ఆమెలో ఆసక్తిని పెంచాయి. మెల్లిగా మాటలతో అతడి నేపథ్యం గురించి ఆరా తీశారు.మేడమ్ జీ.. అంటూ మొదలుపెట్టి తన గురించి మొత్తం చెప్పుకొచ్చాడతను. చదువుకోవాల్సిన వయసులో తల్లిని పోషించాల్సిన భారం ఆ కుర్రాడిపై పడింది. అందుకే బాడుగకు ఆటోను నడిపిస్తున్నట్లు చెప్పాడతను. రోజుకు రూ.వెయ్యి కిరాయి చెల్లిస్తేనే ఆటో నడుపుకోవచ్చునని, చెల్లించని రోజు లేదా తక్కువ మాత్రమే ఇవ్వగలిగిన రోజు ఆటో యజమాని నానా ఇబ్బందులు పెడుతున్నాడని ఆ కుర్రాడు వాపోయాడు. అతని పరిస్థితి గురించి తెలుసుకుని ఆమె చలించిపోయారు. సొంత ఆటో ఉంటే బాగుంటుంది కదా? అని అన్నారామె. నిజమే.. కానీ నాకెవరు ఇస్తారు మేడమ్ జీ?. అంత స్థోమతెక్కడిది నాకు? అన్నాడా కుర్రాడు. అదంతా నేను చూసుకుంటా.. నీ వివరాలివ్వు అన్న ఆ మేడమ్ జీ.. మరుసటి రోజు ఆ కుర్రాడికి ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపింది. ఆటో కొనుగోలుకు సంబంధించిన డౌన్‌పేమెంట్ రసీదును వాట్సప్‌లో అందుకున్న ఆ కుర్రాడి కళ్లల్లో కచ్చితంగా నాలుగు చుక్కల ఆనందభాష్పాలు రాలే ఉంటాయి. అందుకేనేమో.. కష్టాల ఊబి నుంచి తనను బయటకు లాగేసేందుకు విచ్చేసిన ఇంకో తల్లికి కృతజ్ఞతలు చెప్పాడు. తనతోపాటు జన్మనిచ్చిన తల్లితోనూ ఆ మేడమ్ చేసిన సాయానికి థ్యాంక్స్ చెప్పించాడు. ఆడియో మెసేజీ ద్వారా.. ఆ మేడమ్ జీని దేవుడే పంపించాడని మురిసిపోయారు. మళ్లీ సంగం వస్తే తప్పకుండా తమకు ఇంటికి భోజనానికి రావాలంటూ ఆహ్వానించారు. ఇంతకీ ఆ మేడమ్ ఎవరన్నదేనా మీ సందేహం. పేరు.. భారతి చంద్రశేఖర్. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక పరిశ్ధోన సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ మాజీ డైరెక్టర్, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్ సతీమణి. ఎస్సీఎస్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే పలువురి విద్య, ఆరోగ్య అవసరాలకు సాయం చేసిన భారతీ చంద్రశేఖర్ తాజాగా తనకెంతో తృప్తిని కలిగించిన ఈ అనుభవాన్ని ‘సాక్షి.కాం’తో పంచుకున్నారు. -
రోజూ రెండు కోట్ల మంది భక్తులు.. అంతరాయంలేని కనెక్టివిటీ!
ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన కార్యక్రమాల్లో ఒకటైన మహా కుంభమేళా 2025లో రోజూ దాదాపు 20 మిలియన్ల(రెండు కోట్లు) మంది భక్తులు పాల్గొన్నారని అంచనా. ఈ భారీ జన సమూహం ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటడమే చేయడమే కాకుండా టెలికాం పరిశ్రమపై గణనీయమైన ప్రభావం చూపింది. టెలికమ్యూనికేషన్స్ విభాగం, సర్వీస్ ప్రొవైడర్ల సహకారంతో లక్షలాది మంది భక్తులకు అంతరాయం లేని కనెక్టివిటీని అందించేందుకు డేటా ట్రాఫిక్‌ను నిశితంగా పర్యవేక్షించినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.రంగంలోకి దిగిన టెలికాం దిగ్గజాలుమహా కుంభమేళా సమయంలో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా జియో, ఎయిర్టెల్ వంటి ప్రముఖ టెలికాం కంపెనీలు కొత్త సైట్లను, అదనంగా స్పెక్ట్రమ్‌ను జోడించి ముందస్తు చర్యలు చేపట్టాయి. పెరిగిన డేటా ట్రాఫిక్‌ను నిర్వహించడానికి, భక్తులకు అంతరాయం లేని సేవలను అందించడానికి ఈ వ్యూహాత్మక చర్య ఎంతో అవసరమైంది. దాంతో డేటా ట్రాఫిక్ గణనీయంగా 55% పెరిగినట్లు కంపెనీ తెలిపాయి.కంపెనీలకు ఆదాయం పెంపుమహా కుంభమేళా 2025 సందర్భంగా డేటా వినియోగం పెరగడం టెలికాం కంపెనీలకు గణనీయమైన ఆదాయాన్ని సమకూర్చినట్లు నిపుణులు తెలుపుతున్నారు. పెరిగిన డేటా ట్రాఫిక్ ప్రతి వినియోగదారుడి నుంచి సంస్థలకు వచ్చే సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) 4% నుంచి 6% వరకు పెంచుతుందని అంచనా. మిలియన్ల మంది ప్రజల కమ్యూనికేషన్ అవసరాలను తీర్చేందుకు మెరుగైన టెలికాం మౌలిక సదుపాయాలను అందించడంతోనే ఇది సాధ్యమైందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: సెబీ కొత్త చీఫ్‌గా తుహిన్ కాంత పాండేపరస్పర సహకారంసర్వీస్ ప్రొవైడర్లతో కలిసి టెలికమ్యూనికేషన్స్ విభాగం ఈ మహా కుంభమేళాలో కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాల నిర్వహణలో కీలక పాత్ర పోషించింది. క్రౌడ్ మూవ్మెంట్, డేటా ట్రాఫిక్‌ను పర్యవేక్షించడం ద్వారా నెట్వర్క్ స్థిరంగా, సమర్థవంతంగా ఉండేలా చూసుకున్నారు. టెలికాం విభాగం, సర్వీస్ ప్రొవైడర్ల మధ్య ఈ సహకారం పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించడంలో ఎంతో అవసరమనే విషయాన్ని హైలైట్ చేస్తుంది. -
భారతీయ ఐక్యతకు కుంభమేళా నిదర్శనం
-
మోనాలిసా మోసపోయిందా
-
ముగిసిన మహా కుంభమేళా
మహాకుంభ్‌నగర్: ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక వేడుకగా రికార్డుకెక్కిన మహా కుంభమేళా శివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాల ఘట్టానికి తెరపడింది. 144 సంవత్సరాల తర్వాత వచి్చన ఈ మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు పోటెత్తారు. 45 రోజులపాటు వైభవంగా సాగిన పుణ్యక్రతువులో ఉత్సాహంగా పాల్గొన్నారు. చివరి రోజు బుధవారం భక్తుల పుణ్యస్నానాలతో గంగ, యమున, సరస్వతి నదుల సంగమస్థలి కిక్కిరిసిపోయింది. ఒక్కరోజే 1.32 కోట్ల మంది తరలివచ్చారు. హరహర మహాదేవ అనే మంత్రోచ్ఛారణలతో ఈ ప్రాంతమంతా మార్మోగిపోయింది. చివరి రోజు కావడంతో భక్తులపై హెలికాప్టర్ల ద్వారా పూలవర్షం కురిపించారు. ఈ ఏడాది జనవరి 13న పౌష్య పూర్ణిమ రోజు మహా కుంభమేళా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26 వరకూ 66.21 కోట్ల మందికిపైగా జనం స్నానాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంఖ్య ప్రపంచంలోని చాలా దేశాల ఉమ్మడి జనాభా కంటే అధికం కావడం గమనార్హం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ నటులు మహా కుంభమేళాలో పాలుపంచుకున్నారు. భూటాన్ రాజు సైతం పుణ్నస్నానం ఆచరించారు. మహా కుంభమేళాను విజయవంతం చేయడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈసారి పటిష్టమైన చర్యలు చేపట్టింది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించింది. డ్రోన్లు, కృత్రిమ మేధ కెమెరాలను రంగంలోకి దించింది. మహాకుంభ్‌నగర్‌లో ప్రత్యేకంగా టెంట్ సిటీని నిర్మించింది. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. -
కుంభమేళా నుంచి వస్తుండగా కారు ప్రమాదం.. ఎంపీకి తీవ్ర గాయాలు
లతేహార్: ప్రయాగ్‌రాజ్‌లో అత్యంత వైభవంగా మొదలైన మహాకుంభమేళా నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో కుంభమేళాకు వచ్చారు. ఇక, తాజాగా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించి తిరిగి వెళ్తుండగా రాజ్యసభ ఎంపీ మహువా మాజీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎంపీకి గాయాలు కావడంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. జార్ఖండ్‌కు చెందిన ఎంపీ మహువా మాజీ కుంభమేళాకు వెళ్లారు. అక్కడ నుంచి తిరిగి వస్తున్న సమయంలో జార్ఖండ్‌లోని లతేహర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. హాట్‌వాగ్ గ్రామ సమీపంలోని NH-75పై బుధవారం తెల్లవారుజామున ఆగి ఉన్న ట్రక్కును ఆమె కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంపీ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, వెంటనే ఆమెను రాంచీలోకి రిమ్స్‌కు తరలించారు. కారు ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎంపీ కుమారుడు, కోడలు కూడా ఉన్నారు. ఈ ప్రమాద ఘటనపై ఎంపీ కుమారుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం వైద్య చికిత్స జరుగుతోంది. ఉదయం 3:45 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో ఆమె ఎడమ చేతికి బలమైన గాయమైనట్టు వైద్యులు తెలిపారు. కొన్ని టెస్టులు కూడా చేశారు. కాసేపట్లో చేతికి సర్జరీ చేయనున్నారు. ప్రస్తుతం ఆమె మాతో మాట్లాడుతున్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని అన్నారు. #WATCH | Jharkhand: JMM Rajya Sabha MP Mahua Maji's son Somvit Maji says "We were returning from Maha Kumbh, Prayagraj when this accident took place...My mother (Mahua Maji) and wife were in the back seat. I was driving the car, and around 3:45 AM, I fell asleep, and the car hit… https://t.co/Rz1MXP3tAZ pic.twitter.com/6yswYEnkuH— ANI (@ANI) February 26, 2025ఇదిలా ఉండగా.. ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13న మొదలైన మహాకుంభమేళా నేటితో ముగియనుంది ఈక్రమంలో బుధవారం మహా శివరాత్రి (Maha siva rathri) పర్వదినం సందర్భంగా భక్తులు తరలివస్తున్నారు. ఈ కుంభమేళాలో నేడు చివరి అమృత్ స్నానం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన ఏర్పాట్లుచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అధికారులు భక్తులకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. భద్రతా నియమాలు పాటించి తమతో సహకరించాలని కోరారు.శివరాత్రి రోజున భక్తులు ట్రాఫిక్‌లో చిక్కకుపోకుండా ఉండేందుకు కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ (No Vehicle Zone)గా అధికారులు ప్రకటించారు. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి దీన్ని అమలుచేశారు. కుంభమేళా ముగిశాక భక్తులు క్షేమంగా తిరుగు పయనం అయ్యేలా ప్రయాగ్‌రాజ్ నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు బుధవారం 350 రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఇక, ఇప్పటివరకు 64 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు రాష్ట్రప్రభుత్వం తెలిపింది. -
హర హర మహాదేవ్.. చివరిరోజు మహా కుంభమేళాకు పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)
-
హైప్ అవసరం లేదు.. ఏది అవసరమో అది చేయండి చాలు: మమతా బెనర్జీ
కోల్ కతా: మహా కుంభ మేళాను ‘మృత్య్ కుంభ్’గా ఆరోపించారంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర విమర్శలు రావడంతో దానిపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చే యత్నం చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారంటూ ఆమె స్పష్టం చేశారు. తాను ప్రతీ మతాన్ని గౌరవిస్తానని, కానీ తాను చేసిన వ్యాఖ్యలు ఒకటైతే దాన్ని వేరే రకంగా చిత్రీకరించే యత్నం జరిగిందన్నారు మమతా. ప్రధానంగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ అసెంబ్లీ వేదికగా .. మమతా వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చారు మమతా.‘యోగి నాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ వ్యాఖ్యలతో నాకు బొప్పి ఏమీ కట్టదు. ఒక సీఎంగా యోగికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాను. నేను ఆరోజు చెప్పింది ఒక్కటే. మహా కుంభమేళా ఏర్పాట్లు సరిగా చేయని కారణంగా కొన్ని కుటుంబాల మీద ప్రభావం పడింది. మీరు వారికి డెత్ సర్టిఫికేట్లు, పోస్ట్ మార్టమ్ సర్టిఫికేట్లు ఇవ్వకపోయినా ఇక్కడకు వచ్చిన తర్వాత మేము వారికి పోస్ట్ మార్టమ్ నిర్వహించాం. మిగతా రాష్ట్రాల్లో ఏమి జరిగిందో నాకైతే తెలీదు. మీరు వారికి పరిహారం ప్రకటించి ఉంటే పరిహారం ఇవ్వండి’ అని మమతా ఘాటుగా స్పందించారు.ప్రజలు భారీ సంఖ్యలో హాజరైటప్పుడు వారికి తగిన సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. అసలు ఎంతమంది వస్తున్నారు.. ఏర్పాట్లు ఎలా ఉండాలి అనేది ముందుకు పర్యవేక్షించుకోవాలి.. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. అంతేకానీ మహా కుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తోంది అనే హైప్ ఇక్కడ అవసరం లేదు. కుంభమేళా అనేది 2014లో కూడా వచ్చింది. ఏది అవసరమో అది చేయాలి కానీ అవసరం లేనిది అక్కర్లేదు’ అంటూ మమతా చురకలంటించారు. తమ రాష్ట్రంలో కూడా దుర్గా పూజ ఘనంగా నిర్వహిస్తామని, ఆ సమయంలో ప్రతి నిమిషం దగ్గర ఉండి అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తామన్నారు. -
కుంభమేళాలో ఇషా అంబానీ దంపతుల పుణ్యస్నానాలు (ఫోటోలు)
-
దయచేసి ప్రయాగ్‌రాజ్ రావొద్దు.. నెట్టింట పోస్టులు
ప్రయాగ్‌రాజ్: మహా కుంభమేళా ముగింపు వేళ ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ సంగమం వద్ద భక్తుల రద్దీ మరింత పెరిగింది. మహా శివరాత్రి పర్వదినాన పుణ్య స్నానాల కోసం ఇంకా కోట్ల మంది ఆధ్యాత్మిక నగరం(Devotional City Prayagraj) వైపు అడుగులేస్తున్నారు. ఈ తరుణంలో నగరవాసుల ప్రజల తరఫున ఓ విజ్ఞప్తి.. అక్కడ నెలకొన్న అధ్వాన్న పరిస్థితులు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.‘‘మీకు దణ్ణం పెడతాం.. దయ చేసి ప్రయాగ్‌రాజ్ రావొద్దూ..’’ అక్కడి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పోటెత్తుతున్న భక్తజనంతో తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, అలాగే నగర సందర్శన పేరిట కొందరు ఇప్పటికే ఇక్కడి పరిస్థితిని అధ్వాన్నంగా మార్చేశారని వాపోతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.‘నేను ఎక్కడినుంచి స్టార్ట్ చేయాలో కూడా నాకు తెలియడం లేదు. ప్రయాగ్‌రాజ్ పూర్తిగా విధ్వంసకర దశకు చేరుకుంది. గత సంవత్సరమేమో కుంభమేళా ఏర్పాట్లకు సరిపోయింది. ఇక్కడి రోడ్లన్నీ తవ్వేశారు. ఫ్లై ఓవర్లు వేశారు. అయితే ప్రస్తుతం మహాకుంభమేళా చివరి అమృత స్నానం కూడా ముగిసింది. అయినా జనం తగ్గకుండా రోజురోజుకు పెరుగుతున్నారు ఎందుకో తెలియడం లేదు. ఇక్కడికి రావడం ఇక ఆపండి. భారీ జనసందోహాన్ని భరించే శక్తి ప్రయాగ్‌రాజ్(Pyagraj)కు ఎంత మాత్రం లేదు. నగరంలోని చిన్న చిన్న సందులు కూడా ట్రాఫిక్‌తో నిండిపోయాయి. జనాలకు సివిక్ సెన్స్ లేకుండా ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తూ ఉమ్మేస్తున్నారు. మలమూత్ర విసర్జన చేస్తున్నారు’ అని మండిపడ్డాడు.మహా కుంభమేళా నేపథ్యంలో ఆధునీకరణ పేరిట వేల కోట్ల రూపాయలు కేటాయించింది యూపీ ప్రభుత్వం. కొత్త రోడ్లు, ఫ్లైఓవర్లతో పాటు రకరకాల హంగుల నగరాన్ని ముస్తాబు చేసింది. అంతేకాకుండా.. భారీగా జనం వస్తారనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టింది. అయితే.. మహా కుంభమేళా(Maha Kumbh Mela) ఆరంభం అయ్యాక ఆ పరిస్థితి దారుణంగా మారింది.అందంగా అలంకరించిన నగరాన్ని.. భక్తుల్లో కొందరు అధ్వాన్నంగా తయారు చేశారని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. పాదాచారులు ఎక్కడపడితే అక్కడ చెత్తపడేయడం, మూత్రమలవిసర్జన చేసేయడంతో పరిస్థితి దారుణంగా మారింది. పారిశుద్ధ్య సిబ్బంది రంగంలోకి దిగినా ఆ పరిస్థితి మార్పు రాలేదని చెబుతున్నారు. మరోవైపు.. దారులన్నీ జనం, వాహనాలతో నిండిపోయాయి. ఆఖరికి.. ఇరుకు సందులను కూడా వదలకుండా ట్రాఫిక్‌తో నింపేస్తున్నారు.ఇక.. ప్రైవేట్ వాహనాల దోపిడీ దందా, రోడ్లపై ఇష్టానుసారం సంచరించం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదంటున్నారు మరికొందరు. కుంభమేళా ముగుస్తుందనగా.. రద్దీ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఎందుకు?. గంగానదీ.. త్రివేణి సంగమం ఎక్కడికి పోదు కదా.. తీరికగా వచ్చి పుణ్యస్నానాలు చేసుకోవచ్చు కదా అంటూ కొందరు.. ఇంకోసారి ప్రయాగ్‌రాజ్ వైపు రావొద్దంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు. -
బానిస మసస్తత్వంతో దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు: ప్రధాని
భోపాల్: కొన్ని శక్తులు దేశాన్ని విచ్చిన్నం చేయాలని చూస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. భారతదేశ మత, సాంస్కృతిక సంప్రదాయాలను కొన్ని శక్తులు వ్యతిరేకిస్తున్నాయని ద్వజమెత్తారు. మహా కుంభమేళాను ఉద్దేశిస్తూ ఇటీవల ప్రతిపక్షాలు చేసిన విమర్శలపై మోదీ ఘాటుగా స్పందించారు. వారంతా బానిస మనస్తత్వం కలిగిన వారిగా అభివర్ణించారు ప్రధాని మోదీ. ఈ తరహా వ్యాఖ్యలతో దేశ ఐక్యతను దెబ్బ తీయడమే అవుతుంది కానీ దాని వల్ల కలిసొచ్చే ఏమీ లేదన్నారు. అనేక సార్లు విదేశీ శక్తులు సైతం ఈ వ్యక్తులకు మద్దతు ఇవ్వడం ద్వారా దేశాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు.విశ్వాసాలు, నమ్మకాలు, ఆలయాలు, మతం, సంస్కృతితో పాటు మన పండుగలు, సంప్రదాయాలు, ఆచారాలను వీరంతా మంటగలుపుతున్నారు. దాని ఫలితంగా దేశ ఐక్యతను దెబ్బతీయడమే వారు పనిగా పెట్టుకున్నారని మోదీ మండిపడ్డారు.ప్రధాని మోదీ మధ్యప్రదేశ్ లోని చత్తార్ పుర్లో భాగేశ్వర్ ధామ్ మెడికల్ అండ్ సెంటర్ సైన్స్ రీసెర్చ సెంటర్ కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హాజరైన ప్రజలను ఉద్దేశించిన మోదీ మాట్లాడారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకునే శక్తులతో చాలా ప్రమాదకరమన్నారు. మన దేశ సాంప్రదాయలు, సంస్కృతిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వారు బానిస మసనస్తత్వంతో ఉంటూ దేశ ఐక్యతను దెబ్బ తీయడానికి యత్నిస్తున్నాయన్నారు. మహా కుంభ మేళాలో తొక్కిసలాల జరిగిన నాటి నుంచి అటు కేంద్ర ప్రభుత్వంపై ఇటు యూపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిపక్షాలు. మహా కుంభమేళా అనేది మృత్యు కుంభ్ మేళా అని పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ వ్యాఖ్యానించగా, అఖిలేస్ యాదవ్, మల్లిఖార్జున ఖర్గే వంటి వారు సైతం తీవ్ర విమర్శలు చేశారు. -
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కాసులు కురిపిస్తున్న మహా కుంభమేళా
-
మహా కుంభమేళాను వదిలిపెట్టని యాంకర్ సుమ! అక్కడ కూడా.. (ఫోటోలు)
-
మహా కుంభమేళాకు ఒక్కసారిగా పోటెత్తిన భక్తజనం
లక్నో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం.. మహా కుంభమేళా మరో ఐదురోజుల్లో ముగియనుంది. చివరి వారాంతం కావడంతో ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. ఇవాళ 40వ రోజు ఉదయం రికార్డు స్థాయిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించిట్లు అధికారులు ప్రకటించారు.కుంభమేళా ముగుస్తుండడంతో ప్రయాగ్‌రాజ్(Prayagraj) సంగమంకు భక్తుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. మేలా ప్రాంతంలో హోటల్స్, ధర్మశాలలు కిక్కిరిసిపోయాయి. గురువారం సాయంత్రం గణాంకాల ప్రకారం.. మొత్తంగా 58 కోట్ల మంది పుణ్యస్నానాలు పూర్తి చేసుకున్నారని అధికారులు ప్రకటించారు. శని, ఆది వారాల్లో భక్తుల తాకిడి మరింత అధికంగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా.. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.గత వారంగా కుంభమేళా భక్తుల సంఖ్య👇ఫిబ్రవరి 13, గురువారం: 80 లక్షల 46 వేలుఫిబ్రవరి 14 శుక్రవారం: 94 లక్షల 98 వేలుఫిబ్రవరి 15 శనివారం: కోటి 36 లక్షల మందిఆదివారం: కోటి 49 లక్షల మందిసోమవారం: కోటి 35 లక్షల మందిమంగళవారం : కోటి 26 లక్షల మందిబుధవారం: కోటి 19 లక్షల మందిగురువారం: కోటి 55 లక్షల మంది..ఇక.. కుంభమేళా(KumbhmelaI నిర్వహణపై రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జనవరి చివరి వారంలో మౌనీ అమవాస్య సందర్బంగా జరిగిన తొక్కిసలాట 30 మంది మరణించిన సంగతి తెలిసిందే. దీంతో రాబోయే రద్దీని నియంత్రించేలా అధిక సిబ్బందిని నియమించారు. మరోవైపు.. పరిసరాలను, సంగమ నీటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇప్పటికే వీఐపీ పాస్‌లను రద్దు చేసిన అధికారులు.. వాహనాల రాకపై కూడా కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.రైల్వే శాఖ కీలక నిర్ణయంమహా కుంభమేళా(Maha Kumbh Mela) ముగుస్తుండడంతో భక్తులు అధిక సంఖ్యలో ప్రయాగ్‌రాజ్ వెళ్తున్నారు. రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పలు స్టేషన్లలో ప్రత్యేక హోర్డింగ్‌లను ఏర్పాటు చేయించింది. సురక్షిత ప్రయాణం కోసం తాము సూచించే మార్గదర్శకాలను పాటించాలని అందులో విజ్ఞప్తి చేస్తోంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట చోటు చేసుకుని 18 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. -
మహాకుంభమేళాలో స్టాల్స్ : స్ట్రీట్ వెండర్లుగా అంబానీ, అదానీ, మస్క్.. (ఫొటోలు)
-
మమతా బెనర్జీపై యోగి ఆదిత్యానాథ్ ఆగ్రహం
లక్నో: మహా కుంభమేళాపై వ్యాఖ్యలతో రాజకీయ విమర్శలు ఎదుర్కొంటున్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోట్ల మంది మనోభావాల్ని దెబ్బతీసేలా ఆమె మాట్లాడారాంటూ బుధవారం అసెంబ్లీ వేదికగా మండిపడ్డారాయన.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) మహా కుంభమేళాను మృత్యు కుంభమేళాగా అభివర్ణించిన విషయం తెలిసిందే. కుంభమేళా నిర్వహణలో యూపీ ప్రభుత్వం(UP Government) ఘోరంగా విఫలమైందని తీవ్ర విమర్శలే గుప్పించారామె. అయితే ఆమె వ్యాఖ్యలపై అసెంబ్లీలోసీఎం యోగి ఇవాళ స్పందించారు. మహా కుంభమేళా(Maha Kumbh Mela) ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా 56 కోట్ల మంది సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. నిరాధారమైన ఆరోపణలతో ఆమె వాళ్లందరి విశ్వాసాలతో ఆటాడుకున్నారు అని సీఎం యోగి మండిపడ్డారు. జనవరి చివర్లో ప్రయాగ్‌రాజ్ కుంభమేళా ఘాట్ల వద్ద తొక్కిసలాట జరిగి 30 మంది మరణించారు. కుంభమేళా తొక్కిసలాట మృతులకు, వివిధ రాష్ట్రాల నుంచి కుంభమేళాకు వచ్చి మృత్యువాత చెందిన వాళ్లకు అసెంబ్లీ వేదికగా సంతాపం ప్రకటించారాయన. ఈ క్రమంలో.. దీదీ వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు.#WATCH | Lucknow: In the UP assembly, CM Yogi Adityanath says, "While we are participating in the discussion here, at that time more than 56.25 crore devotees have already taken their holy dip in Prayagraj... When we make any baseless allegations or snow fake videos against… pic.twitter.com/VYNnzPn4w1— ANI (@ANI) February 19, 2025కుంభమేళా మృతులకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుంది. కానీ, ఇలాంటి సున్నితమైన అంశాన్ని కూడా రాజకీయం చేయడం ఏంటి?. ఈ కుంభమేళాలో దేశం.. ప్రపంచమే పాల్గొంటోంది. అలాంటప్పుడు ఇలాంటి తప్పుడు ప్రచారాలను పట్టించుకోవాల్సిన పనేముంది? అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. యోగి మాత్రమే కాదు పలువురు బీజేపీ నేతలు కూడా మమత వ్యాఖ్యలపై మండిపడ్డారు. బీహార్ బీజేపీ చీఫ్ దిలీప్ జైశ్వాల్ మాట్లాడుతూ.. మత విశ్వాసాలు లేనివాళ్లే అలాంటి సిగ్గుమాలిన ప్రకటనలు చేస్తారంటూ మండిపడ్డారు. మరోవైపు హిందూ సంఘాలు కూడా దీదీపై విరుచుకుపడుతున్నాయి. దీదీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ..మహా కుంభమేళాపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అయితే.. దీదీ వ్యాఖ్యలకు ఓ అనూహ్య మద్దతు లభించింది. ఉత్తరాఖండ్ జ్యోతిష్ పీఠ్ 46వ శంకారాచార్య అయిన స్వామి అవిముక్తేశ్వరానంద్ సరస్వతి(సద్గురు) మమత వ్యాఖ్యలతో ఏకీభవించారు. ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే మార్గాల్లో వందల కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ ఉంటోంది. భక్తులకు సరైన సదుపాయాలు కల్పించలేకపోతున్నారు. ఇది నిర్వహణ లోపం కాకుంటే మరేమిటి?. మహా కుంభమేళా రాబోతోందని మీకు తెలియదా?. అలాంటప్పుడు మీరు చేసే ఏర్పాట్లు ఇవేనా? అంటూ యోగి ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారాయన.#WATCH | Bemetara, Chhattisgarh: On West Bengal CM Mamata Banerjee's 'Mrityu Kumbh' remark, Jagadguru Shankaracharya Swami Avimukteshwaranand Saraswati Maharaj says, "... There was a traffic jam of 300 kilometres, if this is not mismanagement then what is it? People had to walk… pic.twitter.com/pxDXWI5og7— ANI (@ANI) February 19, 2025 -
మహా కుంభ్‌కు 55 కోట్ల మంది
మహాకుంభ్ నగర్: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ్ మేళా సందర్భంగా త్రివేణీ సంగమంలో ఇప్పటి వరకు 55 కోట్ల మంద పుణ్య స్నానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. దేశంలోని 143 కోట్ల జనాభాలో 110 కోట్ల మంది సనాతన ధర్మ పరాయణులు కాగా వీరిలో దాదాపు సగం మంది పుణ్నస్నానాలు ఆచరించినట్లయిందని తెలిపింది. మొత్తం జనాభాలో ఇది 38 శాతంతో సమానమని తెలిపింది.26వ తేదీకల్లా ఈ సంఖ్య 60 కోట్లకు మించిపోనుందని అంచనా వేసింది. జనవరి 13న ప్రారంభమైన కుంభ మేళా ఈ నెల 26వ తేదీన మహా శివరాత్రి పర్వదినంతో ముగియనుండటం తెలిసిందే. ఈ కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద మత, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమంగా నిలిచిపోనుందని యూపీ ప్రభుత్వం తెలిపింది. హోటల్ పరిశ్రమకు పెద్ద ఊతం మహాకుంభ మేళాకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ప్రయాగ్‌రాజ్‌లోని అన్ని రకాల హోటళ్లు, రెస్టారెంట్ల పరిశ్రమ 20 నుంచి 30 వృద్ధి నమోదు చేసుకుందని ప్రభుత్వం తెలిపింది. అదాయ మార్జిన్లు కూడా 5 నుంచి 10 శాతం పెరిగాయంది. సందర్శకుల రాకతో టూర్, ట్రావెల్ పరిశ్రమ కూడా బాగా లబ్ధి పొందిందని వివరించింది. ఈ నెల 26వ తేదీ వరకు ప్రయాగ్‌రాజ్‌లోని మూడు, నాలుగు నక్షత్రాల హోటళ్లు, లాడ్జీలు, లగ్జరీ టెంట్ హౌస్‌లు పెద్ద సంఖ్యలో ముందుగానే బుక్కయ్యాయన్నారు.కుంభ మేళా పొడిగింపు అబద్ధం భక్తుల రద్దీ కొనసాగుతున్న దృష్ట్యా మహా కుంభ్ మేళాను మరికొద్ది రోజులు పొడిగించనున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై ప్రయాగ్‌రాజ్ జిల్లా మేజి్రస్టేట్ రవీంద్ర మందర్ స్పష్టతనిచ్చారు. పవిత్ర దినాలను పరిగణనలోకి తీసుకుంటూ ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం కుంభ మేళా 26వ తేదీ వరకు మాత్రమే కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ తేదీల్లో ఎలాంటి మార్పులూ ఉండవని కుండబద్దలు కొట్టారు. పొడిగింపు అంటూ వస్తున్న వార్తలను పట్టించుకోవద్దని ఆయన ప్రజలను కోరారు. కుంభమేళా కారణంగా ప్రయాగ్‌రాజ్‌లో విద్యార్థులెవరూ పరీక్షలను నష్టపోలేదని కూడా ఆయన పేర్కొన్నారు. అనివార్య కారణాలతో ఎవరైనా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలను మిస్సయినా వారి కోసం ప్రత్యేకంగా నిర్వహించాలని కోరామన్నారు.కాశీకి 17 రోజుల్లో కోటి మంది ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ మేళా జరుగుతున్న వేళ ఫిబ్రవరి 1 నుంచి 17వ తేదీ వరకు కాశీ విశ్వనాథుని ఆలయాన్ని కోటి మంది భక్తులు దర్శించుకున్నారని మంగళవారం అధికారులు తెలిపారు. అత్యంత రద్దీ ఉండే శివరాత్రినాడు కూడా ఇంత రద్దీ లేదన్నారు. ఈ నేపథ్యంలో వారణాసిలోని స్కూళ్లలో 8వ తరగతి వరకు తరగతులను ఈ నెల 27వ తేదీ వరకు రద్దు చేశామన్నారు. వారణాసిలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లతోపాటు మైదాగిన్, గొడొవ్లియా, దశాశ్వమేథ వంటి ముఖ్య ప్రాంతాల్లో తీవ్రమైన రద్దీ నెలకొందని వివరించారు. ప్రాముఖ్యమున్న గంగా ఆరతి కార్యక్రమాన్ని నామమాత్రంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 27 నుంచి తిరిగి ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చేపడతామని వివరించారు. -
కుంభమేళాకు వెళ్లిన హీరో విజయ్ దేవరకొండ ఫొటోలు వైరల్
-
న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాట ఘటన.. ద్విసభ్య కమిటీ విచారణ ప్రారంభం
New Delhi Railway Station Stampede Live Updates:న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో పెను విషాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న మహాకుంభమేళా (Kumbh Mela)లో పాల్గొనేందుకు వెళ్తున్న భక్తులతో కిక్కిరిసిన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో (New Delhi Railway Station) తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో మొత్తం 18 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. 30మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2:00pmతొక్కిసలాటకు కారణాలేంటి?ప్రయాగ్ రాజ్‌కు వెళ్లే ప్రత్యేక రైళ్ల ఆలస్యం కారణంగా ఫ్లాట్‌ఫామ్‌పై వేల సంఖ్యలో వేచి చూస్తున్న ప్రయాణికులురద్దీ గమనించకుండా గంటలోనే 1500 జనరల్ టికెట్లను అమ్మిన రైల్వే శాఖ అప్పటికే ఫ్లాట్‌ఫామ్‌లపై ఉన్న రద్దీకి తోడు కొత్తగా టికెట్లు ఇవ్వడంతో పెరిగిన రద్దీ 16వ నెంబర్ ఫ్లాట్‌ఫామ్ పైకి స్పెషల్ ట్రైన్ వస్తుందని రైల్వే అనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్ విని 14,14,15 ప్లాట్ ఫామ్‌లో ఉన్న ప్రయాణికులు 16వ ప్లాట్ ఫామ్ పైకి పరుగులు పరుగులు తీయడంతో ఒకరిపై ఒకరు పడి తొక్కిసలాట శని, ఆదివారాలు సెలవు దినం కావడంతో కనీ విని ఎరుగని స్థాయిలో పెరిగిన రద్దీ ఈనెల 26వ తేదీతో మహాకుంభమేళా ముగుస్తుండడంతో ఎలాగైనా అక్కడికి చేరుకోవాలని భక్తులు ఆత్రుత సరైన మేనేజ్మెంట్ లేక చేతులెత్తేసిన రైల్వే శాఖ పోలీసులు ఫలితంగా 18 మంది ప్రయాణికుల మృతి 50 మందికి పైగా గాయాలుప్రస్తుతం రైల్వేస్టేషన్లో సాధారణ పరిస్థితి. యధావిధిగా ట్రైన్ ఆపరేషన్స్12:06pmన్యూఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాట ఘటనపై ద్విసభ్య కమిటీ విచారణ ప్రారంభమైంది. ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసిన రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. ద్విసభ్య కమిటీలో నార్తన్ రైల్వేకు చెందిన నర్సింగ్ దేవ్,పంకజ్ గంగ్వార్‌లను సభ్యులుగా చేర్చింది. 11:40amఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనపై ఢిల్లీ పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో కుంభమేళాకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు ప్రకటన, కుంభమేళాకు వెళ్లే రైళ్ల జనరల్ భోగి టికెట్ల అమ్మకమే ప్రధాన కారణమని సమాచారం. 10:40amఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (#AshwiniVaishnawResignNow) వెంటనే రాజీనామా చేయాలనే డిమాండ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.9:40amఢిల్లీ దుర్ఘటన.. యూపీ పోలీసుల అప్రమత్తంఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనతో ఉత్తర ప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జీల వద్ద భారీ ఎత్తున బందుబస్తు పటిష్టం చేశారు. రైల్వే స్టేషన్లలో హై అలర్ట్ ప్రకటిస్తున్నారు. 8:50amతొక్కిసలాటకు ప్రభుత్వ అసమర్థతే కారణంన్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోవడం నన్ను కలచివేస్తోంది. మృతులకు సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.ఈ ఘటన మరోసారి రైల్వే విభాగం వైఫల్యాన్ని, ప్రభుత్వ అసమర్ధతకు అద్దం పడుతోంది ప్రయాగ్‌రాజ్‌కు వెళ్తున్న భక్తుల విపరీతమైన సంఖ్యను దృష్టిలో ఉంచుకుని, స్టేషన్లో మెరుగైన ఏర్పాట్లు చేయాల్సింది. ప్రభుత్వంతో పాటు పరిపాలన యంత్రాంగం కూడా నిర్లక్ష్యం, అసమర్ధతే ప్రయాణికుల ప్రాణాలు తీసింది. కుంభమేళాకు భక్తులు భారీగా వస్తారని తెలిసినా ప్రయాణికులకు కనీస సౌకర్యాలు ఎందుకు కల్పించలేదు’ అని ప్రశ్నల వర్షం కురిపించారు. नई दिल्ली रेलवे स्टेशन पर भगदड़ मचने से कई लोगों की मृत्यु और कईयों के घायल होने की ख़बर अत्यंत दुखद और व्यथित करने वाली है।शोकाकुल परिवारों के प्रति अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं और घायलों के शीघ्र स्वस्थ होने की आशा करता हूं।यह घटना एक बार फिर रेलवे की नाकामी और सरकार…— Rahul Gandhi (@RahulGandhi) February 16, 2025 మృతులకు ఎక్స్ గ్రేషియాఢిల్లీ తొక్కిసలాట మృతులకు కేంద్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు, తీవ్రంగా గాయాపడిన వారికి రూ.2.5లక్షలు,స్వల్పంగా గాయపడిన వారికి ఒక లక్ష ఎక్స్ గ్రేషియా ఇచ్చింది. ప్రధాని మోదీ ద్రిగ్భ్రాంతిన్యూఢిల్లీ రైల్వే స్టేషన్ పెను విషాదంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ద్రిగ్భాంతిని వ్యక్తం చేశారు. ‘న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనతో ఆందోళనకు గురయ్యాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు’ అని ట్వీట్లో పేర్కొన్నారు. Distressed by the stampede at New Delhi Railway Station. My thoughts are with all those who have lost their loved ones. I pray that the injured have a speedy recovery. The authorities are assisting all those who have been affected by this stampede.— Narendra Modi (@narendramodi) February 15, 2025మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి : రాష్ట్రపతి శనివారం రాత్రి న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విచారం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట గురించి తెలిసి చాలా బాధపడ్డాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. Deeply anguished to know about the loss of lives in a stampede at New Delhi Railway station. I extend my heartfelt condolences to the bereaved families and pray for speedy recovery of those injured.— President of India (@rashtrapatibhvn) February 16, 2025 పరిస్థితి అదుపులోనే ఉంది : అశ్విని వైష్ణవ్రైల్వే స్టేషన్లో పరిస్థితిని అదుపు చేసేందుకు అదనపు భద్రతా బలగాలను మోహరించినట్లు, నాలుగు ఫైర్ ఇంజన్లు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాయని అధికారులు తెలిపారు. పరిస్థితి అదుపులోనే ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. Situation under control at New Delhi railway station (NDLS) Delhi Police and RPF reached. Injured taken to hospital. Special trains being run to evacuate sudden rush.— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) February 15, 2025 న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన దుర్ఘటనపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా విచారం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. చీఫ్ సెక్రటరీ, పోలీస్ కమిషనర్‌తో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తేవాలని, సహాయక సిబ్బందిని నియమించాలని సీఎస్‌ను ఆదేశించాం. ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను నియంత్రించాలని సీఎస్ అండ్ సీపీని ఆదేశించాం. నిరంతరం కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాను’ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. There has been an unfortunate incident at New Delhi Railway Station. Have spoken to Chief Secretary & Police Commissioner and asked them to address the situation. CS has been asked to deploy relief personnel. Have instructed CS & CP to be at the site and take control of…— LG Delhi (@LtGovDelhi) February 15, 2025ప్రయాణికులు మా మాట వినలేదున్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట దుర్ఘటనపై మరో ప్రత్యక్ష సాక్షి ఐఏఎఫ్ సార్జెంట్ అజిత్ మీడియాతో మాట్లాడారు. ‘రైల్వే స్టేషన్లో మాకు ట్రై సర్వీస్ కార్యాలయం ఉంది. నేను నా డ్యూటీ ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రయాణికులు కిక్కిరిపోయారు. దీంతో నేను ముందుకు వెళ్లలేకపోయాను. గుమిగూడొద్దని నేను ప్రయాణికులకు చెప్పి చూశా. రైల్వే అధికారులు సైతం ప్రయాణికులు గుమిగూడకుండా ఉండేలా చూసేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ ప్రయాణికులు ఎవరూ వినలేదు’అని తెలిపారు. "Administration working hard to prevent any mishap, but no one was listening": Eyewitness IAF sergeant recounts NDLS stampedeRead @ANI Story | https://t.co/XPLjbQzxn3#Stampede #Crowdsurge #NDLS pic.twitter.com/wpGCdXoNcr— ANI Digital (@ani_digital) February 16, 2025 విషాదంపై ప్రత్యక్ష సాక్షి ఏమన్నారంటే? న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట ఘటనపై ప్రత్యక్ష సాక్షి రవి మాట్లాడుతూ.. సుమారు 9.30 గంటల సమయంలో అనుకుంటా. కుంభమేళాకు వెళ్లే రైళ్లు ఫ్లాట్‌ఫారమ్స్ మారనప్పటికి కిక్కిరిసిన 13వ నంబర్ ప్లాట్‌ఫారమ్‌లోని ప్రయాణికులు 14, 15 ప్లాట్‌ఫారమ్‌లో రైళ్లను చూసి అటువైపు పరిగెత్తారు.రద్దీ విపరీతంగా ఉండటంతో పరిస్థితిని అదుపు చేయలేకపోవడంతో విషాదకరమైన తొక్కిసలాటకు దారితీసింది -
‘మహా కుంభమేళాను పొడిగించండి’
ప్రపంచంలోనే అత్యంత భారీ ఆధ్యాత్మిక సమ్మేళనం మరో 11 రోజుల్లో ముగియనుంది. ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాను ఇప్పటిదాకా(శుక్రవారం సాయంత్రానికే) 50 కోట్ల మంది హాజరైనట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించుకుంది. ఇది అమెరికా, రష్యా లాంటి అగ్రరాజ్యల జనాభా కంటే అధికం. అయితే..మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఇంకా కోట్ల మంది ప్రయాగ్‌రాజ్ వైపు అడుగులేస్తున్నారు. ఈ క్రమంలో కుంభ మేళాను పొడిగించాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) కుంభమేళాను మరికొన్ని రోజులు పొడిగించాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.గతంలో మహా కుంభమేళా, కుంభమేళాల రద్దీ దృష్ట్యా 75 రోజులపాటు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి!. కానీ, ఇప్పుడు నిర్వహిస్తున్న మహా కుంభమేళా(Maha Kumbh Mela) తక్కువ రోజులు నిర్వహిస్తున్నారని అఖిలేష్ అంటున్నారు. మహా కుంభమేళా కోసం ఎంతో మంది ఆశగా ప్రయాగ్‌రాజ్ వైపు వస్తున్నారు. ఈ క్రమంలో వాళ్లను నిరాశపర్చడం సరికాదు. కుంభమేళాను మరికొన్ని రోజులు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా అని అన్నారాయన.ఇదిలా ఉంటే.. ఈసారి మహా కుంభమేళాలో తొక్కిసలాట విషాదం నెలకొంది. జనవరి చివరి వారంలో మౌనీ అమావాస్య సందర్భంగా భక్తులు ప్రయాగ్‌రాజ్ ఘాట్ల వద్ద ఎగబడడంతో బారికేడ్లు విరిగిపడ్డాయి. దీంతో తోక్కిసలాట జరగ్గా ముప్ఫై మంది మరణించారు. అయితే.. మృతుల సంఖ్యను యూపీ ప్రభుత్వం దాస్తోందని అఖిలేష్ ఆరోపించారు. అంతేకాదు.. నిర్వహణ విషయంలో యోగి సర్కార్ విఫలైమందని, భారత సైన్యానికి కుంభమేళా బాధ్యతలను అప్పగించాలని డిమాండ్ చేశారు కూడా. మహా కుంభమేళా కోసం క్యూ కడుతున్న భక్తుల సంఖ్య తగ్గడం లేదు. రైళ్లు, బస్సులు నిండిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. కిందటి వారం ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ ప్రయాగ్ రాజ్(Prayag Raj) రూట్లో నెలకొనడం చూశాం. ఇంకోవైపు.. జనాల తాకిడితో ప్రయాగ్‌రాజ్ సంగమ రైల్వే స్టేషన్‌ను తాత్కాలికంగా మూసేశారు.ఇదిలా ఉంటే.. జనవరి 13వ తేదీన పౌష పూర్ణిమతో మహా కుంభమేళా ఆరంభమైంది. కుంభమేళా అయినా, మహా కుంభమేళా అయినా గ్రహాల స్థితిగతులు.. శాస్త్రాలను.. తదితరాలను అనుసరించి 45 రోజులపాటు కొనసాగుతాయి. ఈ ఏడాది మహా కుంభమేళా.. ఫిబ్రవరి 26 శివరాత్రి పర్వదినంతో ముగియనుంది.ఇదీ చదవండి: స్టార్ హీరో భద్రత విషయంలో ఇంత నిర్లక్ష్యమా? -
కుంభమేళాకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మీర్జాపుర్- ప్రయాగ్‌రాజ్ రహదారిపై బొలేరో వాహనం బస్సును ఢీకొన్న ప్రమాదంలో దాదాపు 10 మంది భక్తులు మృతిచెందారు. ఈ ఘటనలో మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డినట్టు తెలుస్తోంది. వీరంతా మహాకుంభామేళకు వెళ్తున్న సమయంలోనే ప్రమాదం జరిగింది.వివరాల ప్రకారం.. మీర్జాపుర్-ప్రయాగ్‌రాజ్(Prayagraj) జాతీయ రహదారిపై మహా కుంభమేళా(Maha KumbhaMela)కు భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనం ఓ ట్రావెల్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది భక్తులు అడికక్కడే మృతిచెందారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక, మృతులందరూ ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారిగా అధికారులు గుర్తించారు. అర్థరాత్రి రెండు గంటల సమయంలో మేజా సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అతి వేగంగా వచ్చిన బొలెరో బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో బొలెరో నుజ్జునుజ్జయింది. మరణించిన భక్తులందరూ బొలెరోలో ప్రయాణిస్తున్నవారేనని పోలీసులు తెలిపారు. 19 మంది బస్సులో ఉన్నవారు గాయపడినట్టు చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీశారు. చనిపోయిన వారంతా ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లా నివాసితులని తెలిపారు. మృతుల్లో అందరూ పురుషులే ఉన్నట్టు వెల్లడించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. VIDEO | At least 10 people have been killed and several injured in a head-on collision between a car and a bus in Prayagraj. More details awaited.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/06t5TkNd4m— Press Trust of India (@PTI_News) February 15, 2025 -
ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో 50 కోట్ల మంది పుణ్యస్నానాలు
-
మహాకుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నటి కస్తూరి (ఫోటోలు)
-
ఫస్ట్ క్లాస్ జర్నీలో ‘హౌస్ అరెస్ట్’.. వీడియో వైరల్
మహా కుంభ మేళా ఇంకా కొన్ని రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో అక్కడకు భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిపోతోంది. ఒకసారి మహా కుంభ మేళా వెళ్లి అక్కడ పుణ్య స్నానం రావాలనేది భక్తుల తాపత్రయం. ఈ క్రమంలోనే ఎవరికి దొరికిన వాహనాల్లో వారు ప్రయాగ్ రాజ్ కు పయనం అవుతున్నారు. అయితే ఇక్కడ ఎక్కువ మంది రైలు మార్గంలోనే ప్రయాగ్ రాజ్‌కు చేరుకుంటున్నారు. ఇందులో కొందరు టికెట్ తీసుకుని వెళ్లేవారైతే, కొందరు టికెట్ లేకుండానే అక్కడకు వెళుతున్నారు.తాజాగా ఓ ప్రయాణికుడు ట్రైన్ లో ఫస్ట్ క్లాస్ టికెట్ బుక్ చేసుకున్నాడు. రైలు ఎక్కాడు. అతనికి కేటాయించిన క్యాబిన్లోకి వెళ్లిపోయాడు. అంతా బానే ఉంది. ఫస్ట్ క్లాస్ టికెట్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదనుకున్నాడు సదరు ప్రయాణికుడు. కానీ ఒకానొక సందర్భంలో లేచి క్యాబిన్ డోర్ ఓపెన్ చేశాడు. అంతే ఫస్ట్ క్లాస్ ఏసీ కంపార్ట్మెంట్ కాస్తా జనరల్ బోగీల కనిపించింది. దాన్ని వీడియోలో బంధించాడు. కనీసం బాత్రూమ్కు వెళ్లే దారి కూడా లేకపోవడంతో 16 గంటల పాటు ఫస్ట్ క్లాస్ క్యాబిన్ లోనే ‘హౌస్ అరెస్టు’ అయినట్లు ఆ ప్రయాణికుడు తెలిపాడు. దీన్ని ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా 26 మిలియన్ వ్యూస్ వచ్చాయట. View this post on Instagram A post shared by Piyushh Agrawal (@piyushhagrawal) -
#MahaKumbh2025 : మాఘ పూర్ణిమ స్నానాలు కుంభమేళాకు పోటెత్తిన జనం (ఫొటోలు)
-
మహా కుంభమేళాలో అంబానీ ఫ్యామిలీ (ఫోటోలు)
-
45 కోట్ల ‘మహా’ కుంభ్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో జరుగుతున్న కుంభమేళాకి భక్తులు ఊహించని స్థాయిలో పోటెత్తుతున్నారు. కుంభమేళా(Kumbh Mela) జరిగే 45 రోజుల్లో మొత్తంగా 45 కోట్ల మంది భక్తులు పవిత్ర గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా వేయగా, కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఆ సంఖ్య దాటిపోయింది.ఈ నెల 11 నాటికే కుంభమేళాకు వచ్చిన భక్తుల సంఖ్య 45 కోట్లకు చేరిందని, మహా కుంభమేళా చరిత్రలో అతిపెద్ద మతపరమైన సమావేశాలలో ఇది ఒకటిగా మారిందని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, గొప్ప ఆచారాలు, అత్యాధునిక సాంకేతిక సమ్మిళితంగా, ఈ కుంభమేళా జనసమూహ నిర్వహణ, పారిశుధ్యం, డిజిటల్ సౌకర్యాలలో కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని ప్రకటించింది. నేడు నో వెహికిల్ జోన్‌గా మేళా ప్రాంతం.. కాగా బుధవారం మాఘ పూర్ణిమ(Magha Purnima) సందర్భంగా కోట్ల మంది భక్తులు అమృత్ స్నానాలను ఆచరించే అవకాశం ఉందని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. మాఘ పూర్ణిమ స్నానం, గురు బృహస్పతి పూజతో సంబంధం కలిగి ఉండటం, గంధర్వుడు స్వర్గం నుండి పవిత్ర సంగమానికి దిగుతాడనే నమ్మకానికి ప్రసిద్ధి చెందడంతో ఈ స్నానమాచరించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు రానున్నారు.ఈ నేపథ్యంలో మాఘ పూర్ణిమ స్నానం సమయంలో జనసమూహ నిర్వహణను నిర్ధారించడానికి , రాష్ట్ర ప్రభుత్వం నెల 11 ఉదయం 5 గంటల నుంచే మేళా ప్రాంతాన్ని ’వాహనాలు నిషేధించబడిన ప్రాంతం’(నో వెహికిల్ జోన్’)(No Vehicle Zone)గా ప్రకటించింది. అవసరమైన, అత్యవసర సేవలను అందించే వాహనాలను మాత్రమే అనుమతిస్తుంది. మాఘ పూర్ణిమ తర్వాత ఈ నెల 26 శివరాత్రి రోజున అధిక సంఖ్యలో భక్తులు స్నానమాచరిస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 7 లక్షల మందికి పైగా వైద్య సేవలు.. ఇక మేళాకు వచ్చే భక్తులకు విస్తృతమైన ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా 7 లక్షలకు పైగా యాత్రికులు వైద్య సంరక్షణ పొందారని యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 23 అల్లోపతి ఆసుపత్రులలో 4.5 లక్షలకు పైగా వ్యక్తులకు చికిత్స అందించామని, 3.71 లక్షలకు పైగా పాథాలజీ పరీక్షలు చేయించుకున్నారని తెలిపింది. -
‘మహా’ విషాదం.. మరణంలోనూ వీడని స్నేహబంధం
ఉప్పల్/మల్లాపూర్: మహా కుంభమేళా ప్రయాణం హైదరాబాద్‌కు చెందిన ఏడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి తిరుగుప్రయాణంలో ఉన్న ఆ ఇంటి పెద్దల్ని రోడ్డు ప్రమాదం కబళించింది. మరో ఇద్దరిని తీవ్రంగా గాయపర్చింది. మహా కుంభమేళా నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు చెందిన 8 మంది స్నేహితులు ఈనెల 8న నాచారం కార్తికేయ నగర్ నుంచి మ్యాక్సీ క్యాబ్‌లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. ఈ వాహనంలో డ్రైవర్ సహా తొమ్మిది మంది ఉన్నారు. వీరంతా వారివారి కుటుంబాలను పోషించే వారే కావడం గమనార్హం. సోమవారం ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు ఆచరించి, చుట్టుపక్కల ఉన్న ఆలయాల్లో దర్శనాలను పూర్తి చేసుకుని మంగళవారం హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. ఈ విషయం తమ కుటుంబీకులకు ఫోన్ ద్వారా తెలిపారు. అయితే వీరి తిరుగు ప్రయాణం ప్రారంభమైన కొన్ని గంటల్లోనే ట్రక్కు రూపంలో మృత్యువు ముంచుకొచ్చింది. మధ్యప్రదేశ్‌లోని సిహోరా పోలీసుస్టేషన్ పరిధిలోని మోహ్లా–బార్గీ గ్రామాల మధ్య వీరి మ్యాక్సీ క్యాబ్ వాహనం ఘోర ప్రమాదానికి గురైంది. కత్నీ వైపు నుంచి జబల్పూర్ వైపు వస్తుండగా.. ఓ వంతెనపై ఎదురుగా అతివేగంతో దూసుకొచ్చిన ఓ ట్రక్ బలంగా వారి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడిక్కడే చనిపోగా... తీవ్రగాయాలపాలైన శ్రీరాం బాలకిషన్ (62), నవీన్‌చారి జబల్పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనతో నాచారంలోని కార్తికేయ నగర్, శ్రీరాంనగర్, చైతన్యపురిలో విషాదఛాయలు అలముకొన్నాయి. కుంభమేళాకు వెళ్లిన వీరంతా ప్రాణ స్నేహితులని, మంచిచెడులను పంచుకుంటూ కలివిడిగా ఉంటుండేవారని స్థానికులు చెబుతున్నారు. ఎక్కడకు వెళ్లినా కలిసే వెళ్తారని, మరణంలోనూ వీరి స్నేహబంధం వీడలేదని అంటున్నారు. సీఎం రేవంత్ దిగ్భ్రాంతి మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని నాచారం ప్రాంతానికి చెందిన వారు చనిపోయినట్లు సమాచారం అందడంతో వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య అందేలా అందేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయ, సహకారాలను అందించాలని, గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని కోరారు. ఫోన్లో బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి పరామర్శించారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు. అమ్మా... నాన్నకు ఏమైంది? ప్రమాదమృతుల్లో ఒకరైన శశికాంత్ కుమార్తె శ్రీ మూడో జన్మదిన వేడుకల్ని సోమవారం ఇంట్లో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ దృశ్యాలను భార్య కళ్యాణి వీడియో కాల్ ద్వారా శశికాంత్‌కు చూపించారు. మంగళవారం పిడుగులాంటి వార్త రావడంతో కళ్యాణి సహా కుటుంబీకులంతా కన్నీరుమున్నీరయ్యారు. ఇది చూసిన శ్రీ అమాయకంగా అమ్మా... నాన్నకు ఏమైందంటూ ప్రశి్నస్తుండగా... ఏం చెప్పాలో అర్థం కాక విలపించడంతో అందరూ కంటతడిపెట్టారు. వస్తానని చెప్పాడు.. కానీ.. నా భర్త రాజు ఈ రోజు ఉదయాన్నే ఫోన్ చేసి మాట్లాడాడు. ఇంటికి వస్తున్నా అంటూ నాకు మాట ఇచ్చాడు. కానీ ఇప్పుడు తిరిగిరాని లోకాలకు వెళ్లాడని తెలిసింది. నేను ఇద్దరు చిన్న పిల్లలతో ఎలా బతికాలి. మమ్మల్ని విడిచి ఎలా వెళ్లిపోయాడో తెలియడం లేదు. - రాజు భార్య మహేశ్వరి మృతులు: 1. సూరకంటి మల్లారెడ్డి (64), నాచారం కార్తికేయనగర్ కాలనీ అధ్యక్షుడు. స్థానికంగా పాల వ్యాపారం చేస్తున్నారు. 2. రాంపల్లి రవి కుమార్ (56) కార్తికేయనగర్ తిరుమల రెసిడెన్సీ వాసి. స్థానికంగా తిరుమల మెడికల్ షాపు నిర్వహిస్తున్నారు. 3. బోరంపేట సంతోష్ (47), కార్తికేయ నగర్ సాయిలీలా రెసిడెన్సీ నివాసి. 4. కల్కూరి రాజు (38), నాచారం శ్రీరాంనగర్ కాలనీ, వాహనం డ్రైవర్. 5. సోమవారం శశికాంత్ (38), నాచారం రాఘవేంద్రానగర్ వాసి, సాఫ్ట్వేర్ ఉద్యోగి. 6. టి.వెంకట ప్రసాద్ (55) తార్నాక గోకుల్ నగర్ వాసి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్యోగి. 7. గోల్కొండ ఆనంద్ కుమార్ (47) దిల్‌సుఖ్‌నగర్‌లోని వివేకానందనగర్ వాసి -
మహా కుంభమేళాలో అంబానీ కుటుంబం పవిత్ర స్నానం
ప్రయాగ్‌రాజ్, 11 ఫిబ్రవరి 2025: మహా కుంభమేళా(Maha Kumbh Mela) సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ముకేశ్ అంబానీ(Mukesh Ambani) తన తల్లి, కుమారులు, మనుమలు/మనుమరాళ్లతో కలిసి పవిత్ర స్నానం చేశారు.ముకేశ్ అంబానీ తన తల్లి కోకిలాబెన్, కుమారులు ఆకాశ్, ఆనంత్, కోడళ్ళు శ్లోకా, రాధికా, మనుమలు పృథ్వి, వేద, అక్కలు దీప్తి సల్గావ్కర్, నీనా కోఠారి తదితరులతో కలిసి స్నానం చేశారు. వీరితో పాటు ముకేశ్ అంబానీ అత్త పూర్ణిమాబెన్ దలాల్ మరియు మరదలు మమతాబెన్ దలాల్ కూడా పాల్గొన్నారు.గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమం వద్ద అనేకమంది యాత్రికులతో కలిసి అంబానీ కుటుంబం ఆధ్యాత్మిక యాత్రలో భాగమైంది. నిరంజని అఖాడాకు చెందిన స్వామి కైలాషానంద గిరిజీ మహారాజ్ గంగా పూజను నిర్వహించారు. పూజ అనంతరం ముకేశ్ అంబానీ పరమార్థ్ నికేతన్ ఆశ్రమానికి చెందిన స్వామి చిదానంద సరస్వతీ మహారాజ్‌ను కలుసుకున్నారు. ఆశ్రమంలో అంబానీ కుటుంబం ప్రసాదం, లైఫ్ జాకెట్లను పంపిణీ చేసింది.రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, మహా కుంభమేళాలో యాత్రికుల సేవ కోసం ‘తీర్థ యాత్రి సేవ’ పేరిట వివిధ సేవలను అందిస్తోంది. ఈ యాత్రలో యాత్రికుల సంక్షేమం, సౌకర్యాలను మెరుగుపరచడానికి కంపెనీ ఈ ప్రత్యేక సేవలను చేపడుతోంది.‘వీ కేర్’ తత్వాన్ని ఆధారంగా తీసుకుని రిలయన్స్ యాత్రికులకు పౌష్టికమైన భోజనం (అన్న సేవ), పూర్తి వైద్యం, భద్రతా రవాణా, మెరుగైన కనెక్టివిటీ వంటి అనేక సేవలను అందిస్తోంది. అంతేకాకుండా పవిత్ర నదీ జలాల్లో భద్రత, సౌకర్యవంతమైన విశ్రాంతి కేంద్రాలు, స్పష్టమైన మార్గదర్శక వ్యవస్థ, పరిపాలన, పోలీస్, మరియు లైఫ్ గార్డులకు మద్దతు వంటి ఇతర సేవలు కూడా అందిస్తోంది. -
జబల్పూర్ వద్ద ట్రక్కును ఢీకొట్టిన మినీ బస్సు
-
Sonal Chauhan : మహా కుంభమేళాలో బాలయ్య హీరోయిన్ పవిత్ర స్నానం (ఫోటోలు)
-
అలరించిన ఏరో ఇండియా
సాక్షి బెంగళూరు: ప్రయాగ్‌రాజ్‌లో ఆధ్యాత్మిక మహాకుంభమేళ జరుగుతుంటే బెంగళూరు వైమానిక మహాకుంభమేళ జరుగుతోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. సోమవారం బెంగళూరు సమీపంలోని యలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో 15వ ఎడిషన్ ఏరో ఇండియా ప్రదర్శనను మంత్రి రాజ్‌నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా ఆధ్యాత్మిక శక్తిని, సంస్కృతిని చాటిచెబుతుంటే యలహంక ఎయిర్‌బేస్‌లో ఏరో ఇండియా ప్రదర్శన మన దేశ పరాక్రమాన్ని, రక్షణ సామార్థ్యాలను యావత్తు ప్రపంచానికి చాటిచెబుతోందని తెలిపారు.ఇక్కడికి తరలివచ్చిన అంతర్జాతీయ భాగస్వామ్య దేశాల ప్రతినిధులు ‘ఒక భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే లక్ష్యానికి సాక్ష్యంగా నిలిచారని ప్రశంసించారు. దేశంలో, ముఖ్యంగా వైమానిక రంగంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చు కోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎయిర్ షో ఆçహూతులను విశేషంగా అలరించింది. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తేజస్ యుద్ధ విమానాన్ని నడిపి విన్యాసాలను ప్రారంభించారు.తేజస్, సుఖోయ్, సూర్యకిరణ్ తదితర యుద్ధ విమానాలు చేసిన విన్యాసాలు అందరినీ అలరించాయి. ఇంకా, అత్యాధునిక, 5వ తరం లాక్‌హీడ్ మార్టిన్ తయారీ అమెరికా యుద్ధ విమానం ఎఫ్–35, రష్యాకు చెందిన ఎస్‌యూ–57 ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. అనంతరం, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్(ఓఈఎం)ల సీఈవోలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. కాగా, ఈ షో అయిదు రోజులపాటు జరగనుంది. -
ప్రపంచంలో అతిపెద్ద ట్రాఫిక్ జామ్.. 300 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
లక్నో: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న ప్రపంచంలోని అతిపెద్ద అథ్యాత్మిక కార్యక్రమాల్లో ఒకటైన మహా కుంభమేళాకు (Maha Kumbh Mela) వెళుతున్నారా? అయితే జాగ్రత్త. కుంభమేళా ముగింపు తేదీ గడువు సమీపిస్తున్న తరుణంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు పోటెత్తుతున్నారు. ఫలితంగా కుంభమేళా జరిగే ప్రయాగ్ రాజ్ వెళ్లే మార్గంలో ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫ్రిక్ జామ్ (world's biggest traffic jam) ఏర్పడింది. సుమారు 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. శనివారం నుంచి లక్షల వాహనాలు ప్రయాగరాజ్ వైపు మళ్లాయి. దీంతో భక్తులు త్రివేణి సంగమ్ (గంగ, యమునా, సరస్వతి నదుల సంగమం) వద్ద పవిత్ర స్నానమాచరించేందుకు సమయానికి చేరుకోలేకపోతున్నారు. రోజుల సమయం పట్టనున్నడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో ప్రయాగరాజ్ సంగమ్ రైల్వే స్టేషన్‌ను అధికారులు శుక్రవారం వరకు మూసివేశారు.प्रयागराज महाकुंभ में फँसे करोड़ों श्रद्धालुओं के लिए तुरंत आपातकालीन व्यवस्था की जाए। हर तरफ़ से जाम में भूखे, प्यासे, बेहाल और थके तीर्थयात्रियों को मानवीय दृष्टि से देखा जाए। आम श्रद्धालु क्या इंसान नहीं है? प्रयागराज में प्रवेश के लिए लखनऊ की तरफ़ 30 किमी पहले से ही नवाबगंज… pic.twitter.com/1JXmzgDEGI— Akhilesh Yadav (@yadavakhilesh) February 9, 2025 ఈ తరుణంలో ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ఆధిత్యనాథ్ సర్కార్‌పై సమాజవాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ (akhilesh yadav) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆకలి,దాహంతో ఇబ్బంది పడుతున్న భక్తులను మనవత్వంతో చూడాలి. సామాన్య భక్తులు మనుషులే కదా? వారికి కనీస సదుపాయాలు కల్పించారా? అని ప్రశ్నలు సంధించారు. అంతకుముందు కుంభమేళా ఏర్పాట్లపై అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. ప్రయాగరాజ్‌లో ట్రాఫిక్ పరిస్థితి గురించి హైలైట్ చేస్తూ.. భక్తుల కోసం అత్యవసర ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రయాగరాజ్ ప్రవేశం సమీపంలో నవాబగంజ్‌లో 30 కిలోమీటర్లు, గౌహానియాలో 16 కిలోమీటర్లు,వారణాసి మార్గంలో 12 నుండి 15 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఉంది. ట్రాఫిక్ జామ్ వల్ల జనజీవనం స్తంభించింది.అందుకే ఉత్తర ప్రదేశ్‌లో వాహనాలకు టోల్ ఛార్జీల నుంచి విముక్తి కల్పించాలి. తద్వారా ప్రయాణ సమస్యలు, ట్రాఫిక్ జామ్‌ను తగ్గించవచ్చు. సినిమాల్లా వినోదానికి కూడా ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్‌ను వసూలు చేయనప్పుడు, వాహనాలకు టోల్ ఫ్రీ ఎందుకు చేయలేరు? అని పునరుద్ఘాటించారు. -
ప్రయగ్ రాజ్ లో పుణ్యస్నానం చేసిన కోమటిరెడ్డి
-
మహాకుంభ మేళాలో పాల్గొన్న రాష్ట్రపతి ముర్ము
-
కుంభమేళాలో మంత్రి కోమటిరెడ్డి పవిత్ర స్నానం
లక్నో: యూపీలోని ప్రయాగరాజ్‌లో ఎంతో వైభవంగా మహా కుంభమేళా జరుగుతోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహా కుంభమేళాలో పుణ్య స్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం, కోమటిరెడ్డి మొక్కులు సమర్పించారు. ఈ సందర్బంగా కోమటిరెడ్డికి అక్కడి పూజారులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా కొనసాగుతోంది. కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుంభమేళాకు వెళ్లారు. సోమవారం ఉదయం 5.10 గంటలకు ప్రయాగరాజ్‌లోని సంగం ఘాట్‌లో పవిత్ర స్నానం ఆచరించారు. ఈ సందర్బంగా తెలంగాణ సుభిక్షంగా ఉండాలని సంగం ఘాట్‌లో ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం బడే హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ఆంజనేయస్వామికి మంత్రి కోమటిరెడ్డి మొక్కులు సమర్పించారు. ఈ క్రమంలో మంత్రికి తీర్థ ప్రసాదాలు ఇచ్చి పూజారులు.. ఆయనను ఆశీర్వదించారు. ఈ మేరకు తాను కుంభమేళాకు వెళ్లిన దృశ్యాలను మంత్రి కోమటిరెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఇదిలా ఉండగా.. కుంభమేళాలో సాధువులతో పాటు రాజకీయ ప్రముఖులు, సామాన్యులు కూడా లక్షలాదిగా పాల్గొంటున్నారు. మహా కుంభమేళాలో ఇప్పటి వరకు 43 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానం ఆచరించారని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మకర సంక్రాంతి, మౌని అమావాస్య, బసంత్ పంచమి సందర్భంగా ‘అమృత స్నానాలు’ ముగిసినప్పటికీ భక్తులు ఇప్పటికీ మహా కుంభమేళాకు పెద్ద సంఖ్యలో తరలి వస్తూనే ఉన్నారు.ఈరోజు ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో పాల్గొని బ్రహ్మ ముహూర్తంలో షాహీ పుణ్యస్నానం ఆచరించడం జరిగింది.. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజా ప్రభుత్వానికి నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడేందుకు మరింత శక్తిని ప్రసాదించాలని ఆ దేవదేవుడిని కోరుకోవడం… pic.twitter.com/sZSvsV4tCd— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) February 10, 2025 -
కుంభమేళాకు రాష్ట్రపతి ముర్ము
-
మేళా కిటకిట
ప్రయాగ్‌రాజ్ (యూపీ): మహా కుంభమేళాకు వేదికైన ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కనీవినీ ఎరగనంతగా వచ్చి పడుతున్న జనసందోహంతో కిటకిటలాడుతోంది. దాంతో కొద్ది రోజులుగా నగరానికి నాలుగు వైపులా ఎటు చూసినా పదుల కొద్దీ కిలోమీటర్లు ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. జనం తాకిడిని తట్టుకోలేక ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్‌ను ఇప్పటికే మూసేశారు. ప్రయాగ్‌రాజ్, లక్నో మధ్య 30 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి! వాహనదారులు గంటలపాటు పడిగాపులు కాస్తున్నారు. షాహీ స్నానాల వంటి విశేషమైన ప్రత్యేకత ఏదీ లేకున్నా ఆదివారం భక్తులు త్రివేణి సంగమానికి పోటెత్తారు. సాయంత్రం 6 గంటలకే 1.42 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. దీంతో కుంభమేళాలో ఇప్పటిదాకా పుణ్య స్నానాలు ఆచరించిన వారి సంఖ్య 42 కోట్లు దాటినట్టు అధికార యంత్రాంగం తెలిపింది. ఇంతటి రద్దీని ఇప్పటిదాకా ఏ కుంభ మేళాలోనూ చూడలేదని అధికారులే విస్తుపోతున్నారు. ‘‘షాహీ స్నాన్, పర్వదినాలు మినహాయిస్తే ఇతర రోజుల్లో భక్తుల రద్దీ తక్కువగానే ఉండేది. ఈసారి సాధారణ రోజుల్లోనూ విపరీతంగా వస్తున్నారు’’ అని చెబుతున్నారు. రద్దీని తట్టుకునేందుకు ప్రయాగ్‌రాజ్ స్టేషన్లో సింగిల్ డైరెక్షన్ ట్రాఫిక్ సిస్టమ్‌ను అమల్లోకి తెచ్చారు. -
మహా కుంభమేళాలో అగ్నిప్రమాదం
లక్నో: కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. సెక్టార్-18 శంకరాచార్య మార్గంలో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తోంది. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదంపై ఎస్పీ సర్వేష్ కుమార్ స్పందించారు. అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు. కొద్ది రోజల క్రితం సెక్టార్-22లో మంటలు చెలరేగాయి. ఓ గుడారంలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలడం వల్లే ప్రమాదం జరిగింది. అక్కడి నుంచి క్రమంగా మంటలు వ్యాపించడంతో 18 టెంట్లు ఆహుతయ్యాయని పోలీసులు తెలిపారు. మరోవైపు, దట్టమైన పొగ వ్యాపించడంతో భక్తులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. #WATCH | Prayagraj | The Fire that broke out in Sector 18, Shankaracharya Marg of Maha Kumbh Mela Kshetra has been brought under controlThere has been no loss of lives. The reason behind the fire is under investigation..." says SP city Sarvesh Kumar Mishra pic.twitter.com/SBshdMCkrT— ANI (@ANI) February 7, 2025అంతకుముందు .. ఇదే కుంభమేళాలో తొక్కిసలాట కారణంగా 30 మంది భక్తులు మృతిచెందారు. 60 మంది గాయపడ్డారు. ఇలా వరుస ఘటనలతో అప్రమత్తమైన సీఎం యోగీ సర్కార్ తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. అయినప్పటికీ వరుస ప్రమాదాలు జరుగుతుండడంపై యోగీ సర్కార్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. -
Mahakhumb 2025 : తండ్రితో కలిసి సైనా నెహ్వాల్ పడవ ప్రయాణం (ఫొటోలు)
-
త్రివేణి సంగమంలో ప్రధాని మోదీ పుణ్యస్నానం
-
Watch Live: కుంభమేళాలో ప్రధాని మోదీ
-
ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాకు భూటాన్ రాజు జింగ్మే ఖేసర్
-
మోదీ పుణ్య స్నానం
ఢిల్లీ: మహా కుంభమేళా సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాగ్‌రాజ్(Prayagraj త్రివేణి సంగమంలో పుణ్య స్నానమాచరించారు. అనంతరం ఆయన గంగాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో ప్రధాని వెంట ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఉన్నారు. జనవరి 13న మొదలైన మహాకుంభ మేళా ఈ నెల 26న మహా శివరాత్రి రోజున ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇవాళ మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించేందుకు ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్ వచ్చారు. హెలికాప్టర్లో అరైల్ ఘాట్ వద్దకు.. అక్కడి నుంచి బోట్లో సంగమం వద్దకు చేరుకున్నారు.ప్రధాని రాక నేపథ్యంలో అరైల్ ఘాట్ నుంచి సంగమం వరకు భారీ భద్రతా మోహరించారు. #WATCH | Prime Minister Narendra Modi to shortly take a holy dip at Triveni Sangam in Prayagraj, Uttar Pradesh(Source: ANI/DD) #KumbhOfTogetherness pic.twitter.com/3F2guB1ElQ— ANI (@ANI) February 5, 2025 -
కుంభమేళాకు వ్యతిరేకంగా కుట్రలు
ప్రయాగ్‌రాజ్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తోపాటు సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే కొందరు వ్యక్తులు మహా కుంభమేళాలో భారీ విషాదం జరగాలని కోరుకున్నారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధ్వజమెత్తారు. ఆయన బుధవారం ప్రయాగ్‌రాజ్‌లో మీడియాతో మాట్లాడారు. ఇక్కడ జరుగుతున్న సనాతన ధర్మ వేడుకను చూసి దేశ ప్రజలు గర్వస్తున్నారని చెప్పారు. కొందరు దుష్టులు మాత్రం ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా కుట్రలు సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. కుంభమేళా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజల్లో అనుమానాలు సృష్టిస్తున్నారని విమర్శించారు.ఖర్గే, అఖిలేష్ యాదవ్‌లు పార్లమెంట్లో మాట్లాడిన మాటలు చూస్తే వారి అసలు అజెండా ఏమిటో తెలిసిపోయిందని అన్నారు. కుంభమేళాపై వారు మొదటి నుంచే దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమాన్ని అప్రతిష్టపాలు చేయడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై అధికారులు ఇచ్చిన గణాంకాలనే తాను విడుదల చేశానని తెలిపారు. ఇందులో ఎలాంటి దాపరికం లేదన్నారు. తొక్కిసలాటపై సమాచారం అందిన వెంటనే తమ ప్రభుత్వం చాలా వేగంగా స్పందించిందని చెప్పారు. విశ్వాసానికి, సనాతన ధర్మానికి కుంభమేళా ఒక ప్రతీక అయోధ్యలో రామమందిర నిర్మాణం, ప్రజలకు కోవిడ్–19 వ్యాక్సిన్ ప్రభుత్వం ఉచితంగా ఇవ్వడం పట్ల అసంతృప్తితో ఉన్న కొన్ని గ్రూప్‌లు మహా కుంభమేళాను వ్యతిరేకిస్తున్నాయని సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. ఆయన మంగళవారం సాయంత్రం ప్రయాగ్‌రాజ్‌లోని జగద్గురు రమణానందాచార్య స్వామి రామ్ భద్రాచార్య క్యాంప్‌ను సందర్శించారు. 151 కుండ్లీ అఖండ్ భారత్ సంకల్ప్ మహా యజ్ఞంలో పాల్గొన్నారు. అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడారు.మన విశ్వాసానికి, సనాతన ధర్మానికి మహా కుంభమేళా ఒక ప్రతీక అని ఈ సందర్భంగా స్పష్టంచేశారు. మన ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి చాటుతున్న గొప్ప వేడుక అని అన్నారు. లక్షలాది మంది సాధువులు, యోగులు సనాతన ధర్మాన్ని చక్కగా కాపాడుతున్నారని చెప్పారు. మారీచులు, సుబాహులు మన సనాతన ధర్మాన్ని ఏమీ చేయలేరని తేల్చిచెప్పారు. కుంభమేళాలో ఇప్పటిదాకా 38 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. -
‘కుంభమేళా’ మృతుల సంఖ్యను దాచిపెడుతున్నారు
న్యూఢిల్లీ: ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో చాలామంది చనిపోయారని, వారి సంఖ్యను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాచిపెడుతోందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. మృతుల సంఖ్యపై ఇప్పటికైనా నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.ఆయన మంగళవారం లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో మాట్లాడారు. కుంభమేళాను సక్రమంగా నిర్వహించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని అన్నారు. అక్కడ జరిగిన వైఫల్యాల సంగతి బయటకు రాకుండా తొక్కిపెడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిజిటల్ కుంభమేళా నిర్వహిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం మృతుల సంఖ్యను మాత్రం బయటపెట్టడం లేదని మండిపడ్డారు.‘బడ్జెట్ సంఖ్యల గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు కుంభమేళా తొక్కిసలాట మృతుల లెక్కలు చెప్పండి’ అని అఖిలేశ్ యాదవ్ నిలదీశారు. ఒకవైపు మృతదేహాలు మార్చురీలో ఉంటే, మరోవైపు కుంభమేళా జరుగుతున్న ప్రాంతంపై హెలికాప్టర్ ద్వారా పూలు చల్లారని, ఇదెక్కడి సనాతన సంప్రదాయమని ధ్వజమెత్తారు. జేసీబీలతో మృతదేహాలను నదిలోకి నెట్టేశారని ఆరోపించారు. కుంభమేళాలో ఎంతోమంది భక్తులు చనిపోతే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కనీసం విచారం వ్యక్తం చేయలేదని విమర్శించారు. కుంభమేళా ఏర్పాట్లపై చర్చించడానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. కుంభమేళాలో భద్రతా ఏర్పాట్లు చూసే బాధ్యతను సైన్యానికి అప్పగించాలని సూచించారు. -
మోడీ కుంభమేళ షెడ్యూల్
-
Milind Soman: మహాకుంభమేళాలో పుణ్యస్నానం ఆచరించిన 'ఆవారా' నటుడు (ఫోటోలు)
-
భారత సామాజిక చేతనకు మహాకుంభమేళా నిదర్శనం : రాష్ట్రపతి
-
మహా కుంభమేళా.. విమాన ఛార్జీలు తగ్గింపు
మహా కుంభమేళా సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు రాకపోకలు సాగిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ తరుణంలో కొన్ని విమాన సంస్థలు ఇప్పటికే ఛార్జీలు పెంచాయి. దాంతో ప్రయాణికుల రద్దీ పెరగడం వల్ల సహేతుకమైన విమాన ఛార్జీలు ఉండాలనేలా ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన పిలుపు మేరకు ఆకాసా ఎయిర్ స్పందించింది. విమాన ఛార్జీలను గణనీయంగా తగ్గిస్తున్నట్లు, ప్రయాగ్‌రాజ్‌కు విమానాల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించింది.ఛార్జీల తగ్గింపు, విమానాల సంఖ్య పెంపుఆకాసా ఎయిర్ ప్రయాగ్‌రాజ్‌కు విమానాల టికెట్ ధరలను 30-45% తగ్గించింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం భక్తులకు విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తెచ్చింది. ముంబై, ఢిల్లీ నుంచి రోజువారీ డైరెక్ట్ సర్వీసులతో పాటు పుణె, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు వంటి నగరాల నుంచి ప్రత్యేక విమానాలను నడుపుతుంది. మహా కుంభమేళా సందర్భంగా విమానాలను పెంచాలని, సహేతుకమైన ఛార్జీలను నిర్వహించాలని విమానయాన సంస్థలను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దాంతో కంపెనీ ఈమేరకు స్పందించినట్లు తెలిపింది.ప్రభుత్వ జోక్యంవినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుకు గతంలో లేఖ రాశారు. ప్రయాగ్‌రాజ్ విమాన ప్రయాణానికి అధిక ఛార్జీలు ఉన్నాయనే ఫిర్యాదులను ఆ లేఖలో హైలైట్ చేశారు. తరువాత ఛార్జీలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికపరమైన ప్రయాణ ఇబ్బందులు లేకుండా మహా కుంభమేళాకు భక్తులు వెళ్లేందుకు వీలుగా ప్రభుత్వం జోక్యం చేసుకుంది.ప్రయాణికులపై ప్రభావం..ఛార్జీల తగ్గింపు, విమానాల పెంపు నిర్ణయం మహా కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. గతంలో విమాన ఛార్జీలు 300-600% పెరగడంతో, చాలా మంది రోడ్డు లేదా రైలు రవాణా మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ పీక్ పీరియడ్‌లో ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఆకాసా ఎయిర్ చేస్తున్న ప్రయత్నాలను ప్రయాణికులు స్వాగతిస్తున్నారు.ఇదీ చదవండి: బ్లాక్ బడ్జెట్ గురించి తెలుసా?: ఎప్పుడు ప్రవేశపెట్టారంటే..ఇప్పటికే చాలా సంస్థలు..యాత్రికుల రాకపోకలను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు చేసే ప్రయత్నాల్లో ఆకాసా ఎయిర్ ఒక్కటే కాదు.. ఇండిగో, స్పైస్ జెట్ సహా ఇతర విమానయాన సంస్థలు కూడా ప్రయాగ్‌రాజ్‌కు తమ విమానాల సంఖ్యను పెంచాయి. విమానయాన పరిశ్రమ నుంచి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల లక్షల మంది భక్తుల ప్రయాణం సులభతరం అవుతుందని భావిస్తున్నారు. ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా కొనసాగుతుంది. -
మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం
ప్రయాగ్‌రాజ్: మహా కుంభామేళాలో మరో అపశృతి చోటుచేసుకుంది. కుంభామేళా వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సెక్టార్-22లో మంటలు చెలరేగాయి. ఎగసిపడుతున్న మంటల ధాటికి టెంట్లు కాలిపోతున్నాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెలుస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వివరాల ప్రకారం.. ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో తొక్కిసలాట జరిగిన మరుసటి రోజే మరో ప్రమాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం కుంభమేళా జరుగుతున్న సెక్టార్-22లో మంటలు చెలరేగాయి. ఎగిసిపడుతున్న మంటల ధాటికి అక్కుడున్న టెంట్లు కాలిపోయాయి. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు. మంటలు చెలరేగిన స్థలంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది. సీనియర్ అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అయితే, వరుస ప్రమాదాల నేపథ్యంలో భక్తులు ఆందోళన చెందుతున్నారు. प्रयागराज महाकुंभ महाकुंभ 2025 फिर से आग। झूसी छतनाग घाट नागेश्वर घाट सेक्टर 22 के पास महाकुंभ मेले में लगी भीषण आगमहाकुंभ के सेक्टर 22 में भीषण आग लगने से कई टेंट जलकर हुए राख pic.twitter.com/wvYZQWyIbC— Gaurav Shukla (@shuklaagaurav) January 30, 2025ఇదిలా ఉండగా.. కుంభమేళాలో బుధవారం తొక్కిసలాట కారణంగా 30 మంది భక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మరో 60 మంది భక్తులు త్రీవంగా గాయపడ్డారు. ఇక, కొద్దిరోజుల క్రితమే కుంభమేళా వద్ద అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ గుడారంలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అక్కడి నుంచి క్రమంగా మంటలు వ్యాపించడంతో 18 టెంట్లు ఆహుతయ్యాయని తెలిపారు. మరోవైపు, దట్టమైన పొగ వ్యాపించడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు.प्रयागराज महाकुंभ मेला क्षेत्र में लगी भीषण आग की घटना अत्यंत दुर्भाग्यपूर्ण है। प्रशासन से अपील है कि राहत और बचाव कार्य में तुरंत तेजी लाएं। #KumbhMelapic.twitter.com/sbp6bOeb1X— Hansraj Meena (@HansrajMeena) January 30, 2025సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 15 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. మహా కుంభమేళాలోని సెక్టార్ 19 వద్ద గుడారంలో రెండు గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఆ మంటలు ఇతర గుడారాలకు వ్యాపించాయి. కుంభమేళా (Kumbh Mela) వద్ద భద్రతా ఏర్పాట్లలో భాగంగా అప్పటికే ఉంచిన అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశాయి. సమీపంలోని టెంట్లలో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని పోలీసులు తెలిపారు. -
కుంభమేళా ఘటనకు అసలు కారణం ఇదే
-
అధికారిక ప్రకటన.. కుంభామేళా తొక్కిసలాటలో మరణాలు ఎన్నంటే?
లక్నో: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక కుంభమేళాలో విషాదం చోటుచేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా నెలకొన్న రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 30 మంది భక్తులు చనిపోయినట్టు మహాకుంభ డీఐజీ వైభవ్ కృష్ణా అధికారికంగా వెల్లడించారు. ఇదే సమయంలో 60మంది త్రీవంగా గాయపడినట్టు వెల్లడించారు. కాగా, మరణించిన వారిలో 25 మందిని గుర్తించినట్టు తెలిపారు. మరో ఐదుగురి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.తాజాగా డీఐజీ వైభవ్ కృష్ణా మీడియాతో మాట్లాడుతూ.. తొక్కిసలాట ఘటనలో 30 మంది మృతి చెందారు. మరో 60 మందికిపైగా గాయపడ్డారు. అర్ధరాత్రి 1-2 గంటల మధ్యలో తొక్కిసలాట జరిగింది. అఖారా మార్గ్‌లో భారీగా భక్తులు గుమ్మిగూడారు. ఈ రద్దీ కారణంగానే తొక్కిసలాట జరిగింది. బారికేడ్లు ధ్వంసం కావడం వల్లే ప్రమాదం చోటుచేసుకుంది. మరణించిన వారిలో 25 మందిని గుర్తించాం.. మరో ఐదుగురిని గుర్తించాల్సి ఉంది. ఈ ప్రమాద ఘటనపై వివరాల కోసం హెల్ప్‌లైన్ నెంబర్ 1920ను సంప్రదించాలని సూచించారు. ఈ ఘటన తర్వాత దాదాపు 90 మందిని అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రికి తరలించారు. కానీ దురదృష్టవశాత్తు భక్తులు అప్పటికే చనిపోయారు. 36 మంది స్థానిక వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని తెలిపారు. #WATCH | Prayagraj, UP: DIG Mahakumbh, Vaibhav Krishna says "Before Brahma Muhurta, between 1 am to 2 am, a huge crowd gathered on the Akhara Marg. Due to this crowd, the barricades on the other side broke and the crowd ran over the devotees waiting to take a holy dip of Brahma… pic.twitter.com/ZL6KlmMf9k— ANI (@ANI) January 29, 2025ఇదిలా ఉండగా.. మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాల కోసం భక్తులు పోటెత్తారు. ఈక్రమంలోనే బుధవారం తెల్లవారుజామున రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీంతో, తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధితులకు అందుతున్న వైద్య సాయంపై ఆరా తీసినట్లు ప్రధాని వెల్లడించారు.आज के अमृत स्नान का विहंगम दृश्य...यह धरती है कल्पवास की, यह धरती है महाकुंभ की, यह धरती है तिर्थराज प्रयाग की...ॐ नमः पार्वती पतये हर हर महादेव#महाकुंभ2025 pic.twitter.com/oKsX0qJdOa— कर्वज्ञम् (@eternalroute) January 29, 2025ఇక, తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో రద్దీ తగ్గిపోగా.. ప్రస్తుతం అక్కడి దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రాణ భయంతో పరుగులు తీసిన ప్రజలు.. తమ చేతుల్లోని వస్తువులను కింద పారేశారు. వాటి మీది నుంచే అందరూ పరుగులు తీసినట్లు అక్కడి దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. అఖాడాల స్నానం కోసం ఏర్పాటు చేసిన ఘాట్ల వద్ద ఈ ఘోరం చోటు చేసుకుంది. అఖాడాల కంటే ముందు స్నానాలు ఆచరించాలని భక్తులు ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో బారికేడ్లు విరిగిపోయాక.. తొక్కిసలాట చోటు చేసుకుంది. చీకట్లో ఆ చెత్తకుండీలు గమనించక చాలామంది కిందపడిపోయారని, వాళ్ల మీద నుంచే మిగతా వాళ్లు తొక్కుకుంటూ పరుగులు పెట్టినట్లు భావిస్తున్నారు. మరోవైపు.. ఊపిరి ఆడని పరిస్థితుల నుంచి తాము క్షేమంగా బయటపడ్డామని కొందరు చెబుతున్నారు. महाकुंभ में में मौनी अमावस्या पर लगभग 10 करोड़ श्रद्धालु पहुंचे हैंभगदड़ की सूचना अप्रिय है लेकिन स्थिति नियंत्रित है. लश्कर मीडिया अफ़वाह उड़ा रहा है, उस पर भरोसा न करेंप्रशासन की सूचना पर ही भरोसा करें. ये आपका अपना MahaKumbh है, आपको ही संभालना है#MahakumbhStampede pic.twitter.com/ND25xkgPt7— Abhay Pratap Singh (बहुत सरल हूं) (@IAbhay_Pratap) January 29, 2025 ప్రయాగ్‌రాజ్ ఆస్పత్రుల ప్రాంగణాలు బాధితుల కుటుంబాల రోదనలతో మారుమోగుతున్నాయి. తమ వాళ్లు కనిపించకుండా పోవడంతో హెల్ప్ సెంటర్ల వద్దకు కొందరు పరుగులు తీస్తున్నారు. ఘటన సమయంలో.. బారికేడ్లు, ఫెన్సింగ్‌ల మీద నుంచి దూకి ప్రాణభయంతో కొందరు పరుగులు పెట్టిన కొన్ని దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.सरकार को पहले से ही पता था इतनी भीड़ आएगी तो फिर पूरा प्रबंध सरकार ने सेना को क्यों नहीं दे दिया... #MahakumbhStampede #MouniAmavasya #AmritSnan #MahaKumbh2025 #Prayagraj #Stampedepic.twitter.com/ZAF2zW0iov— Prerna Yadav (@prerna_yadav29) January 29, 2025 -
మహా కుంభమేళాలో అపశ్రుతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
-
‘చెల్లాచెదురైన’ బతుకులు.. కుంభమేళా ఘటనలో హృదయవిదారక దృశ్యాలు
లక్నో: చెల్లాచెదురుగా పడి ఉన్న చెప్పులు.. బ్యాగులు.. దుస్తులు.. దుప్పట్లు.. మహా కుంభమేళా తొక్కిసలాట ఘటన జరిగిన ప్రయాగ్‌రాజ్ సెక్టార్-2లో ప్రస్తుతం దృశ్యాలివే. మరోవైపు తమ వారి జాడ తెలియక వందల మంది ప్రయాగ్‌రాజ్ ఆస్పత్రుల ముందు కంటతడి పెడుతూ కనిపిస్తున్న దృశ్యాలు హృదయవిదారకంగా కనిపిస్తున్నాయి.ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా పేరొందిన మహా కుంభమేళాలో ఈ ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా త్రివేణి సంగమం వద్దకు అమృత స్నానం కోసం భక్తులు పోటెత్తగా.. బారికేడ్లు విరిగిపోవడంతో భక్తులు చెల్లాచెదురయ్యాయి. ఈ క్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో పలువురు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో రద్దీ తగ్గిపోగా.. ప్రస్తుతం అక్కడి దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రాణ భయంతో పరుగులు తీసిన ప్రజలు.. తమ చేతుల్లోని వస్తువులను కింద పారేశారు. వాటి మీది నుంచే అందరూ పరుగులు తీసినట్లు అక్కడి దృశ్యాలు చూస్తే అర్థమవుతోంది. మరోవైపు.. ఘటనకు అక్కడ ఏర్పాటు చేసిన ఇనుప చెత్తకుండీలే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.అఖాడాల స్నానం కోసం ఏర్పాటు చేసిన ఘాట్ల వద్ద ఈ ఘోరం చోటు చేసుకుంది. అఖాడాల కంటే ముందు స్నానాలు ఆచరించాలని భక్తులు ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో బారికేడ్లు విరిగిపోయాక.. తొక్కిసలాట చోటు చేసుకుంది. చీకట్లో ఆ చెత్తకుండీలు గమనించక చాలామంది కిందపడిపోయారని, వాళ్ల మీద నుంచే మిగతా వాళ్లు తొక్కుకుంటూ పరుగులు పెట్టినట్లు భావిస్తున్నారు. మరోవైపు.. ఊపిరి ఆడని పరిస్థితుల నుంచి తాము క్షేమంగా బయటపడ్డామని కొందరు చెబుతున్నారు.ప్రయాగ్‌రాజ్ ఆస్పత్రుల ప్రాంగణాలు బాధితుల కుటుంబాల రోదనలతో మారుమోగుతున్నాయి. తమ వాళ్లు కనిపించకుండా పోవడంతో హెల్ప్ సెంటర్ల వద్దకు కొందరు పరుగులు తీస్తున్నారు. ఎంత మంది చనిపోయారు, ఎంత మందికి గాయాలయ్యాయనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఘటన సమయంలో.. బారికేడ్లు, ఫెన్సింగ్‌ల మీద నుంచి దూకి ప్రాణభయంతో కొందరు పరుగులు పెట్టిన కొన్ని దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. सरकार को पहले से ही पता था इतनी भीड़ आएगी तो फिर पूरा प्रबंध सरकार ने सेना को क्यों नहीं दे दिया... #MahakumbhStampede #MouniAmavasya #AmritSnan #MahaKumbh2025 #Prayagraj #Stampedepic.twitter.com/ZAF2zW0iov— Prerna Yadav (@prerna_yadav29) January 29, 2025A daughter is hugging her father and crying because her mother has left this world💔But only those who have experienced such loss can truly understand the pain of a family.#MahakumbhStampede pic.twitter.com/2dGo0OQKxQ— هارون خان (@iamharunkhan) January 29, 2025CM Yogi Adityanath should watch this video and feel some shame 👇#MahakumbhStampede pic.twitter.com/t0l3aUldGc— Dhruv Rathee (Parody) (@dhruvrahtee) January 29, 2025#MahakumbhStampede15 pilgrims have paid with thier lives in a stampede in #MahaKumbh2025 #Mahakumbh #MahaKumbhMela2025 pic.twitter.com/0f26oBgnMH— Sanghamitra Bandyopadhyay (@SanghamitraLIVE) January 29, 2025 -
మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనపై ప్రధాని విచారం
న్యూఢిల్లీ, సాక్షి: మహా కుంభమేళాలో ఈ ఉదయం ప్రయాగ్‌రాజ్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మహా కుంభమేళా ప్రయాగ్ రాజ్(Prayagraj)లో జరిగిన ప్రమాదం బాధాకరం. ఘటనలో తమ వారిని కోల్పోయిన వాళ్లకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. క్షతగాత్రులకు సాయం అందించడంలో అధికారులు ఉన్నారు. ఘటనకు సంబంధించి యూపీ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నా. ముఖ్యమంత్రి యోగితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నా అని ప్రధాని మోదీ(PM Modi) ట్వీట్ చేశారాయన. ఘటనపై ఎప్పటికప్పుడు ప్రధాని సమీక్ష జరుపుతున్నారని ఇటు యూపీ సీఎం యోగి, అటు పీఎంవో వర్గాలు చెబుతున్నాయి. प्रयागराज महाकुंभ में हुआ हादसा अत्यंत दुखद है। इसमें जिन श्रद्धालुओं ने अपने परिजनों को खोया है, उनके प्रति मेरी गहरी संवेदनाएं। इसके साथ ही मैं सभी घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं। स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव मदद में जुटा हुआ है। इस सिलसिले में मैंने…— Narendra Modi (@narendramodi) January 29, 2025మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ప్రయాగ్‌రాజ్ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఘటనపై ఉప రాష్ట్రపతి, పలువురు కేంద్ర మంత్రులు, పలువురు ముఖ్యమంత్రులు, ఇతర రంగాల ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. మహా కుంభమేళాలో మౌనీ అమావాస్య సందర్భాన్ని పురస్కరించుకుని భారీ సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్ సెక్టార్-2 వద్ద అమృత స్నానాల కోసం వచ్చారు. ఈ క్రమంలో తోపులాటలో బారికేడ్లువిరిగిపడగా.. తొక్కిసలాట జరిగింది. తీవ్రంగా గాయపడిన భక్తులను ఆంబులెన్స్‌లలో ఆస్పత్రలకు తరలించారు. అయితే మరణాలపై రకరకాల ప్రచారం జరిగినప్పటికీ అక్కడి అధికారులెవరూ దానిని ధృవీకరించలేదు. చివరకు ప్రధాని మోదీ ప్రకటనతో ఈ విషయం నిర్ధారణ అయ్యింది. అయితే ఎంత మంది మరణించారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే అక్కడికి భారీగా భక్తులు చేరుకోవడంతో ఆందోళన వ్యక్తం కాకూడదనే యూపీ ప్రభుత్వం మరణాల విషయంలో ప్రకటనేదీ చేయలేదని ఓ అధికారి జాతీయ మీడియాతో చేసిన వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. మరోవైపు ఈ ఘటనతో విపక్షాలు యూపీ సర్కార్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నాయి.ఇదీ చదవండి: నిర్వహణ లోపాల వల్లే తొక్కిసలాట ఘటన.. యూపీ సర్కార్‌పై సంచలన ఆరోపణలు -
Mahakumbh-2025: తొక్కిసలాట తర్వాత హెలికాప్టర్ నిఘా పెంపు
ప్రయాగ్‌రాజ్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా జరుతోంది. అయితే ఈరోజు(బుధవారం) మౌని అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు పోటెత్తడంతో తొక్కిసలాట చోటుచేసుంది. ఈ నేపధ్యంలో సంగమతీరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.తొక్కిసలాట సద్దుమణిగిన దరిమిలా లక్షలాది మంది భక్తులు స్నానం చేయడానికి సంగమ తీరానికి తరలివస్తున్నారు. వీరిని పర్యవేక్షించేందుకు, మరింతగా భద్రత కల్పించేందుకు హెలికాప్టర్ నుండి నిఘా సారించారు. జనసమూహాన్ని నియంత్రించేందుకు పోలీసులు పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే జనం మరింతగా పెరిగిపోవడంతో పోలీసులు బారికేడ్లను తొలగించారు. భద్రతను మరింతగా పెంచేందుకు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని రంగంలోకి దించారు.కుంభమేళా పర్యవేక్షణ అధికారులు భద్రత విషయంలో ఇప్పుడు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం మహా కుంభలో పరిస్థితి అదుపులో ఉందని, భక్తుల పుణ్యస్నానాలు సజావుగా జరుగుతున్నయని అధికారులు తెలిపారు. తొక్కిసలాట ఘటన అనంతరం సీఎం యోగి స్పందిస్తూ వివిధ గంగా ఘాట్ల వద్ద స్నానాలు చేయాలని భక్తులకు సూచించారు. అధికారులు అందించే సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.ఇది కూడా చదవండి: అలాంటి దుస్తులతో రావొద్దు: ముంబై సిద్ధివినాయక ఆలయ ట్రస్ట్ -
పరిస్థితి అదుపులోనే ఉంది సీఎం యోగి
-
తొక్కిసలాట ఘటన.. ప్రధాని నాలుగుసార్లు ఫోన్ చేశారు: సీఎం యోగి
లక్నో: మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఈ ఉదయం మీడియాతో స్పందించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, పుణ్య స్నానాలు కొనసాగుతున్నాయని చెప్పారాయన. అలాగే ఈ ఘటనపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నారని తెలిపారాయన. ‘‘నిన్న రాత్రి నుంచి మౌని అమావాస్య పుణ్య స్నానాలు మొదలయ్యాయి. ప్రయాగ్‌రాజ్‌లో భక్తుల రద్దీ ఎక్కువగా నెలకొంది. అయినా అమృత స్నానాలు కొనసాగుతున్నాయి. భక్తుల రద్దీ తగ్గాక తాము స్నానాలకు వెళ్తామని అఖాడాలు తెలిపారు. ఈ ఉదయం 8గం. వరకే దాదాపు 3 కోట్ల మంది పుణ్య స్నానాలు చేశారు. ప్రయాగ్‌రాజ్‌కి ఇవాళ 8-10 కోట్ల మంది వస్తారని అంచనా. .. గత రాత్రి తొక్కిసలాట జరిగింది. అఖాడ మార్గం గుండా వెళ్లి స్నానాలు చేయాలని కొందరు భక్తులు ప్రయత్నించారు. ఈ క్రమంలో బారికేడ్లు విరిగిపడి తొక్కిసలాట జరిగింది. తీవ్రంగా గాయపడిన భక్తులను ఆస్పత్రికి తరలించాం. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉంది. ప్రధాని మోదీ ఇప్పటికే నాలుగుసార్లు ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీశారు, కేంద్ర మంత్రి అమిత్ షా,గవర్నర్ కూడా ఘటన గురించి చర్చించారు ’’ అని యోగి ప్రకటించారు. అలాగే.. త్రివేణి సంగం వద్దకు కాకుండా ఎక్కడికక్కడే ఘాట్లకు వెళ్లి స్నానం చేయాలని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు. #WATCH | Lucknow | Uttar Pradesh CM Yogi Adityanath says," The situation in Prayagraj is under control...""Around 8-10 crore devotees are present in Prayagraj today. There is continuous pressure due to the movement of devotees towards the Sangam Nose. A few devotees have… pic.twitter.com/lOc1OIraqm— ANI (@ANI) January 29, 2025ఇదిలా ఉంటే.. మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటెత్తారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. సుమారు 47 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కాగా.. త్రివేణి సంగమానికి 30 కిలోమీటర్ల వరకే అధికారులు వాహనాలను అనుమతిస్తున్నారు. దీంతో భక్తులు కాలినడకన చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సెక్టార్ 2 వద్ద తొక్కిసలాటలో పలువురికి గాయాలు కాగా చికిత్స అందుతోంది. ఘాట్ వెంట కిక్కిరిసిన భక్తులతో కిలోమీటర్ మేర బారికేడ్లు విరిగిపడ్డాయి. దీంతో ఊపిరాడని పరిస్థితుల నడుమ భక్తులు నలిగిపోయారు. తీవ్రంగా గాయపడిన 50 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే పది నుంచి 15 మంది మరణించారనే ప్రచారం జరుగుతుండడం గమనార్హం. దీనిని అధికారులు ధృవీకరించాల్సి ఉంది.ఇదీ చదవండి: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. జరిగింది ఇదే! -
మౌని అమవాస్య రద్దీ.. మహా కుంభమేళాలో తొక్కిసలాట (ఫొటోలు)
-
మహా కుంభమేళాలో తొక్కిసలాట..
-
మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అసలేం జరిగిందంటే..!
లక్నో: మహా కుంభమేళాలో తొక్కిసలాట చోటు చేసుకుంది. మౌని అమవాస్య సందర్భంగా బుధవారం వేకువఝామున అమృత స్నానం కోసం భక్తులు పోటెత్తారు. ఒక్కసారిగా తోసుకోవడంతో కిందపడి పదుల సంఖ్యలో భక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురు మరణించి ఉంటారని ప్రచారం నడుస్తున్నా.. అధికారులు మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రయాగ్‌రాజ్ సెక్టార్ 2 వద్ద రాత్రి 2 గంటల ప్రాంతంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. అమృత స్నానం కోసం భక్తులు ఎగబడడంతో బారికేడ్లు విరిగిపోయాయి. దీంతో భక్తులు ఒకరిమీద ఒకరు పడిపోయి చెల్లాచెదరు కావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ‘‘మేం మొత్తం అరవై మంది రెండు బస్సుల్లో ప్రయాగ్‌రాజ్ వచ్చాం. తొమ్మిది మంది ఒక గ్రూప్‌గా అమృత స్నానం కోసం వెళ్లాం. ఒక్కసారిగా జనం తోసుకున్నారు. అందులో మేం ఇరుక్కుపోయి కిందపడిపోయాం. ఆ గందరగోళంలో కిందపడినవాళ్లను తొక్కుకుంటూ వెళ్లిపోయారు. ఆ టైంలో జనాలను నియంత్రించలేని పరిస్థితి నెలకొంది’’ అని కర్ణాటకకు చెందిన సరోజినీ ఓ జాతీయ మీడియాకు తెలిపారు. ఈ గందరగోళంలో భక్తులు భయంతో పరుగులు తీశారు. తొక్కిసలాటలో 50 మందిదాకా గాయపడ్డారు. వీళ్లలో అధికంగా మహిళలే ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను ఆంబులెన్స్‌లలో ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనతో తొలుత అఖాడ పరిషత్ కమిటీ అమృత స్నానాలు రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. అయితే.. ఘటన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోవాలని అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేశారు. దీంతో రద్దీ తగ్గడంతో అమృత స్నానాలు కొనసాగించాలని అఖాడ పరిషత్ కమిటీ నిర్ణయించింది. రద్దీ తగ్గడంతో అమృత స్నాన కార్యక్రమాన్నికొనసాగిస్తునన్నట్లు అధ్యక్షుడు రవీంద్ర పూరి ప్రకటించారు. అలాగే.. తప్పుడు సమాచారం బయటకు వెళ్తోందని, దానిని కట్టడి చేసేందుకు తమవంతు కృషి చేస్తున్నట్లు చెబుతున్నారాయన. ఇక.. భక్తులు త్రివేణి సంగమం ద్వారం వద్ద కాకుండా, ఘాట్ల వద్దే స్నానమాచరించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. #WATCH | Prayagraj, Uttar Pradesh: Rescue operations are underway after a stampede-like situation arose in Maha Kumbh and several people were reported injured. https://t.co/4z63F7pAS9 pic.twitter.com/YxZHXIoy51— ANI (@ANI) January 29, 2025ఇదిలా ఉంటే.. ఘటనపై ప్రధాని మోదీకి సమాచారం అందింది. దీంతో ఆయన యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌తో ఫోన్లో మాట్లాడారు. బాధితులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని సూచించారు. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 13వ తేదీన ప్రధాని మోదీ కుంభమేళాలో పవిత్ర స్నానం కోసం వెళ్లనున్నారు. మరోవైపు.. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ సైతం ఆరా తీసినట్లు సమాచారం. ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహాకుంభ మేళాకు బుధవారం నాటి ‘మౌనీ అమావాస్య’ సందర్భంగా భారీసంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు యూపీ సర్కారు ప్రకటించుకుంది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళాలో ఇప్పటిదాకా 15 కోట్లమందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు చేయగా, బుధవారం(ఇవాళ) ఒక్కరోజే అమృతస్నానం కోసం 10 కోట్లమంది తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంతకుముందు అంచనా వేశారు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మహా కుంభమేళాలో మన సాంస్కృతిక పరిమళాలు
అనేక శాస్త్రీయ నృత్యప్రదర్శనలు మహా కుంభమేళాలో జరుగుతున్నాయి. వీటిలో భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ, కథక్, మణిపురి, సత్రియా.. ఇతర నృత్యరూపాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 160 మంది నృత్యకారులు ప్రదర్శన ఇవ్వడానికి ఎంపికయ్యారు. వారిలో హైదరాబాద్ నుంచి ఎంపికైన ప్రతిభావంతులైన కూచిపూడి నృత్యకారిణులు పద్మజారెడ్డి, దీపికారెడ్డిలు ఉన్నారు.నయనానందంప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో గణతంత్ర దినోత్సవం రోజున గంగా పండాల్లో పెద్దస్టేజీపై ప్రదర్శన ఇచ్చాం. యు.పి. ప్రభుత్వంతోపాటు కేంద్ర సాంస్కృతిక శాఖ వారు అన్ని ఏర్పాట్లు చేశారు. గణతంత్ర దినోత్సవం రోజున ఉదయం మా శిష్య బృందంతో కలిసి నదీ స్నానాలు చేశాం. చిన్నా, పెద్దా తేడా లేకుండా లక్షలాదిగా భక్తులు ఒక ప్రవాహంలా కదలి వెళ్లడం చూస్తుంటే మాకందరికీ రోమాంచితం అయ్యింది. దారిలో ఖిలా ఘాట్ దగ్గర జనగణమన, వందేమాతరం వినిపిస్తూ ఉంటే మాటల్లో చెప్పలేని ఆనుభూతి. దాదాపు ఎనిమిది కిలోమీటర్లు అలుపు లేకుండా నడిచాం.నదీ స్నానం చేసి, రూమ్‌కి వచ్చి, సాయంత్రం ప్రదర్శన చేశాం. గంగామాతగా నా కూతురు శ్లోకారెడ్ది, పార్వతిగా నేను, రుత్విక అనే అమ్మాయి శివుడిగా, 12 మంది శిష్యబృందంతో ప్రదర్శన ఇచ్చాం. డి.ఎస్.శాస్త్రి సంగీతం అందించారు. అక్కడికి వచ్చిన భక్తులు ఎంతోమంది తమ హర్షధ్వానాలతో మా ప్రదర్శనను అభినందించారు. జవాన్లు వచ్చి ఫొటోలు తీసుకున్నారు. 50 నిమిషాలపాటు జరిగిన ఈ నృత్య ప్రదర్శనలో శివపార్వతి కళ్యాణం, గంగను భగీరథుడు భూమికి తీసుకురావడంలో చేసిన తపస్సు ప్రధానాంశాలు. కుంభమేళాకు తగినట్టు కొన్ని మార్పులు చేసి, ఇందులో ప్రదర్శన ఇచ్చాం. పవిత్ర నదీస్నానం సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఇన్నేళ్లుగా కళాసేవ చేయడం వల్ల మహాకుంభమేళాలో ప్రదర్శించే అవకాశం వచ్చిందనుకుంటున్నాను. మా శిష్యబృందం చాలా ఆనందించారు. అన్ని కోట్లమందిని చూడటమే నయనానందకరం అనుకుంటే, మా నృత్యం ద్వారా అక్కడకు వచ్చినవారికి మేం నేత్రానందం కలిగించడం అదృష్టంగా భావిస్తున్నాం. – దీపికారెడ్డి, కూచిపూడి నృత్యకారిణినమామి గంగే: డాక్టర్ పద్మజారెడ్డిగంగ పారే చోటుకి యాత్రలకు వెళితే ఆ నీటిని ఇంటికి తెచ్చుకుంటాం. మన ఇళ్లలో అందరూ తలపై చల్లుకుంటారు. బంధుమిత్రులకు కూడా ఆ నీటిని ఇస్తుంటారు. ఎందుకంటే, గంగ స్వచ్ఛమైనది కాబట్టి. మనం ఒక దేవతను కలుషితం చేసి, మన బిడ్డలకు ఇస్తున్నామా.. ఇది కరెక్టేనా.. ప్రభుత్వమే అన్ని చర్యలు తీసుకోవాలా, మనకి బాధ్యత లేదా.. ఈ విషయాన్నే ఆలోచించి ‘నమామి గంగే’ పేరుతో మహా కుంభమేళాలో 30 మంది శిష్యబృందంతో కలిసి కూచిపూడి నృత్యం చేస్తున్నాను. కేంద్ర సాంస్కృతిక శాఖ నుంచి కుంభమేళాకు రెండు వారాల ముందే ఆహ్వానం అందింది. ఫిబ్రవరి 9న పాల్గొనబోయే ఈ కార్యక్రమం గురించే కాదు ఏ కాన్సెప్ట్ అనుకున్నా దానికి ముందు నాకు కొన్ని నిద్రలేని రాత్రులే ఉంటాయి.కాన్సెప్ట్ ఎలా ఉండాలి, దానికి తగిన కొరియోగ్రఫీ, ఎంతమంది, డ్రెస్సింVŠ ... అన్నింటి గురించి అర్ధరాత్రులు కూర్చొని నోట్స్ రాసుకుంటాను. గ్రాఫ్స్ గీస్తూ, ప్లాన్స్ రాసుకుంటూ ఉంటాను. టాపిక్ గురించి ఎవరూ నన్నేం అడగలేదు. కుంభమేళా నదీస్నానం. కాబట్టి నేనే ‘గంగానది’ గురించి టాపిక్ ఎంచుకున్నాను. నృత్యమంతా గంగ, శివుడు, శక్తి ప్రధానంగా ఉంటుంది. గతంలో స్వచ్ఛగంగలో భాగంగా దేశంలో మొత్తంలో ప్రధానంగా గంగానది పారే ఐదు చోట్లలో నృత్య ప్రదర్శన ఇచ్చాను. కళ సామాజిక చైతన్యానికి తోడ్పడాలి. ఆ తపనతోనే పురాణాల నుంచి ఎన్నో కథనాలు తీసుకొని చేశాను.‘భ్రూణ హత్యలు, హెచ్ఐవి పట్ల అవగాహన, ప్రకృతిని కాపాడుకోవడం... వంటి సామాజిక అంశాలమీద నృత్యప్రదర్శనలు ఇచ్చాను. ఇందుకు భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాను. ఈసారి మహా కుంభమేళాలలో నా నృత్యాన్ని ప్రదర్శించే అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నాను. 50 ఏళ్ల నా నృత్య జీవనంలో 30 ఏళ్లుగా సామాజిక అంశాలలో ప్రజలకు అవగాహన కలిగించేలా వేలాది ప్రదర్శనలు ఇస్తూ వచ్చాను. ఈ కార్యక్రమం తర్వాత ప్రభుత్వం చేస్తున్న మూసీ ప్రక్షాళనలో ‘నమామి మూసీ’ కథనాన్ని నృత్యరూపకంగా తీసుకురాబోతున్నాను. – డాక్టర్ పద్మజారెడ్డి, కూచిపూడి నృత్యకారిణి -
మోదీ, అమిత్ షా, కుంభమేళాపై ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు
ఢిల్లీ: బీజేపీ నేతలు, మహా కుంభమేళాపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నో తప్పులు చేసిన బీజేపీ నేతలు కుంభమేళాలోని గంగా నీటిలో మునిగితే విముక్తి కలగదు అన్నారు. ఇదే సమయంలో మోదీ, అమిత్ షా కచ్చితంగా నరకానికే వెళ్తారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఖర్గే వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు.కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘గంగా నదిలో స్నానం చేయడం వల్ల పేదరికం తొలగిపోతుందా?. అది ఆహారాన్ని అందిస్తుందా?. నేను ఎవరి విశ్వాసాన్ని దెబ్బతీయాలని అనుకోవడం లేదు. నా మాటలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే నేను క్షమాపణలు కోరుతున్నాను. కానీ, పిల్లలు ఆకలితో చనిపోతున్నప్పుడు, పాఠశాలకు వెళ్లలేకపోతున్నప్పుడు, కార్మికులకు జీతం అందనప్పుడు, బీజేపీ నాయకులు గంగలో స్నానం చేయడానికి పోటీ పడుతున్నారు. వారు టీవీల్లో పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల నుండి దేశం ప్రయోజనం పొందదు. అలాగే.. ప్రధాని మోదీ(Modi), అమిత్ షా(Amit Shah) ఎన్నో తప్పులు చేశారు. అలాంటి వ్యక్తులు కుంభమేళాలో స్నానాలు చేస్తే విముక్తి రాదు. మోదీ, అమిత్ షా కచ్చితంగా నరకానికి వెళ్తారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో ఖర్గే వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు. తాజాగా బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందిస్తూ ఖర్గే వ్యాఖ్యలను సనాతన ధర్మంపై దాడిగా అభివర్ణించారు. ఆయన మరే ఇతర మతం గురించి అలాంటివి చెప్పగలరా? అలాంటి ప్రకటనలు ఖండించదగినవి. దీనిపై కాంగ్రెస్ పార్టీ వివరణ ఇవ్వాలి. ఖర్గే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా అంటూ కామెంట్స్ చేశారు.#WATCH | Indore, MP | Congress National President Mallikarjun Kharge says, "On one hand Narendra Modi salutes the Constitution and on the other, he does everything against it... Don't be fooled by Narendra Modi's false promises. Does taking a dip in Ganga alleviate poverty?...… pic.twitter.com/lgCJW4HYtY— ANI (@ANI) January 27, 2025మరోవైపు.. ఖర్గే వ్యాఖ్యలపై అమిత్ మాలవీయా స్పందిస్తూ.. కుంభమేళాపై ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఆయనవి కాదు. ఆ మాటలు గాంధీ కుటుంబానికి చెందినవి. కాంగ్రెస్ హిందువులను ఎందుకు అంతగా ద్వేషిస్తుంది?. మహా కుంభామేళా 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ప్రజల నమ్మకాలను కాంగ్రెస్ అవమానిస్తోంది. కాంగ్రెస్ నేతలు కావాలనే కుంభమేళాను అవమానిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా.. ఈరోజు కేంద్రహోం మంత్రి అమిత్ షా కుటుంబ సభ్యులు మహా భమేళాలో పవిత్ర స్నానాలు చేశారు. ఆ తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమానికి అమిత్ షా అర్చన చేసి గంగా హారతి ఇచ్చారు. ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో ఇది 15వ రోజు. ఇప్పటికే కుంభమేళాకు 13 కోట్లకుపైగా భక్తులు హాజరయ్యారు. ఫిబ్రవరి 5వ తేదీన మహాకుంభమేళాకు ప్రధాని మోడీ రాబోతున్నారు. దానికి ముందే ఇవాళ ప్రయాగ్‌రాజ్‌కు అమిత్ షా రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఈ కుంభమేళాకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ప్రపంచ దేశాల నుంచి ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానాలు చేస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్, అమెరికా, జపాన్, జర్మనీ, నెదర్లాండ్, కెనడా, స్విట్జర్లాండ్, స్వీడన్, సహా 73 దేశాల దౌత్యవేత్తలు సైతం ఫిబ్రవరి 1న కుంభమేళాలకు వస్తున్నారు.बोल खड़गे जी रहे हैं, पर शब्द गांधी परिवार के हैं। आखिर कांग्रेस को हिंदुओं से इतनी नफरत क्यों है? 144 साल में एक बार महाकुंभ आता है, लेकिन कांग्रेस के नेता इस तरह बौखला गए हैं कि हिंदुओं को कोस रहे हैं। पहले कांग्रेस के हुसैन दलवी ने कुंभ को बुरा-भला कहा, और अब स्वयं कांग्रेस… pic.twitter.com/UAqLNMVLzZ— Amit Malviya (@amitmalviya) January 27, 2025 -
మహా కుంభమేళా ఎఫెక్ట్.. పెరిగిన ఛార్జీలు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా 2025(Maha Kumbh 2025) ఉత్సవానికి లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తుతున్నారు. ఇదే అదనుగా విమాన సంస్థలు ఛార్జీలను గణనీయంగా పెంచేశాయి. ప్రధాన నగరాల నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లి రావడానికి రౌండ్ ట్రిప్ టిక్కెట్లు(roundtrip tickets) రూ.50,000 వరకు చేరుకున్నాయి. డిమాండ్ పెరుగుదలకు అనుగుణంగా టికెట్ ధరలను నియంత్రించాలని, ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్యను పెంచాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విమానయాన సంస్థలను ఆదేశించింది.ముందున్న శుభదినాలు..జనవరి 29న మౌని అమావాస్య, ఫిబ్రవరి 3న బసంత్ పంచమి, ఫిబ్రవరి 12న మాఘీ పూర్ణిమ, 26న మహా శివరాత్రి వంటి పుణ్యస్నానాల కోసం ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాలని చాలామంది భావిస్తున్నారు. ఇదే అదనుగా విమాన సంస్థలు భారీగా ఛార్జీలు పెంచుతున్నాయి. చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన నగరాల నుంచి ప్రయాగ్‌రాజ్ వెళ్లి రావడానికి రౌండ్ ట్రిప్ టికెట్ల ధరలు మునుపెన్నడూ లేనంతగా పెరిగాయి. నగరాన్నిబట్టి సాధారణ టికెట్లు రూ.50,000 వరకు చేరుకున్నాయి.డీజీసీఏ స్పందన..పెరుగుతున్న ఛార్జీలకు ప్రతిస్పందనగా డీజీసీఏ 2025 జనవరి 23న విమానయాన ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. ఛార్జీల హేతుబద్ధీకరణ, విమానాల సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ప్రయాగ్‌రాజ్(Prayagraj)కు ప్రయాణించేందుకు డీజీసీఏ జనవరిలో 81 అదనపు విమానాలను ఆమోదించింది. దీనితో దేశవ్యాప్తంగా ప్రయాగ్‌రాజ్‌కు మొత్తం విమానాల సంఖ్య 132కు చేరుకుంది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడమే లక్ష్యంగా ఈ చర్యకు పూనుకుంది.ఇదీ చదవండి: స్వతంత్ర డైరెక్టర్ల నియామకాలు ప్రారంభంప్రయాణికులపై ప్రభావం..దేశవిదేశాల నుంచి యాత్రికులను ఆకర్షించే మహా కుంభమేళా ఉత్సవానికి భక్తుల తాకిడి పెరుగుతోంది. అధిక రద్దీ కారణంగా విమాన ఛార్జీలు పెరిగాయి. స్థానికంగా వసతికి కూడా డిమాండ్ అధికమవుతుంది. ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయం మొదటిసారి రాత్రి సమయాల్లోనూ అంతర్జాతీయ విమానాలు నడుపుతూ రికార్డు స్థాయిలో ప్రయాణీకుల రద్దీని నిర్వహిస్తోంది. -
Mahakumbh-2025: ఏడాదిన్నరగా పరారై.. పుణ్యస్నానం చేస్తూ పోలీసులకు చిక్కి..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. దేశంతో పాటు ప్రపంచంలోని నలుమూలల నుండి పర్యాటకులు ఇక్కడికి వచ్చి, పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. భారీ జనసమూహంతో కిటకిటలాడుతున్న ఈ ప్రాంతంలో పలు ఆసక్తికర ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. గత కొంతకాలంగా పరారీలోవున్న ఒక నేరస్తుడు పుణ్యస్నానం ఆచరిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.వివరాల్లోకి వెళితే ఆదివారం మహా కుంభమేళాలో పర్యాటకులు, భక్తులు స్నానమాచరించే ప్రక్రియ కొనసాగుతోంది. ఒక మద్యం స్మగ్లర్ కూడా పుణ్యస్నానం చేసేందుకు సంగమతీరానికి చేరుకున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలిసింది. వారు సంగమస్థలిలో మద్యం స్మగ్లర్ ప్రవేశ్ యాదవ్‌ను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని భదోహి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభిమన్యు మాంగ్లిక్ మీడియాకు తెలియజేశారు.మద్యం స్మగ్లర్ ప్రవేశ్ యాదవ్ రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా నివాసి అని అభిమన్యు మాంగ్లిక్ తెలిపారు. ప్రవేశ్ యాదవ్ ఒకటిన్నర సంవత్సరాలుగా పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. 2023, జూలై 29న జాతీయ రహదారి-19పై వాహనాల తనిఖీలు చేస్తుండగా మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ప్రవేశ్ యాదవ్, రాజ్ దోమోలియాలను పోలీసులు అరెస్టు చేసినట్లు అభిమన్యు పేర్కొన్నారు. నాడు ఆ నిందితులు బీహార్‌కు అక్రమంగా తరలిస్తున్న కల్తీ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇంతలో ప్రవేశ్ యాదవ్ పోలీసుల కన్నుగప్పి, అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే కుంభమేళాలో పుణ్యస్నానం చేసేందుకు ప్రవేశ్ యాదవ్ వచ్చాడన్న సమాచారం అందుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని అభిమన్యు మాంగ్లిక్ తెలిపారు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: 10 ప్రత్యేక ఆకర్షణలు.. సోషల్ మీడియాలో చక్కర్లు -
అంతరిక్షం నుంచి మహాకుంభ మేళా ఎలా కనిపిస్తుందంటే?.. ఫొటోలు విడుదల చేసిన ఇస్రో
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో మహా కుంభమేళా(Maha Kumbh Mela)కు భక్తులు పోటెత్తుతున్నారు. జనవరి 13న మొదలైన కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీన పూర్తికానుంది. మౌని అమావాస్య (రెండో షాహీ స్నానం) వచ్చే జనవరి 29న , ఫిబ్రవరి మూడో తేదీన వసంత పంచమి రోజు (మూడో షాహీ స్నానం), ఫిబ్రవరి 12న (మాఘ పూర్ణిమ) అధిక సంఖ్యలో జనం రావచ్చని అంచనా.. ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో కుంభమేళా ముగుస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గణాంకాల ప్రకారం జనవరి 20 నాటికి 8.81 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు.భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) తాజాగా మహాకుంభ మేళాకు సంబంధించిన కొన్ని చిత్రాలను విడుదల చేసింది. స్పేస్ సెంటర్ నుంచి కుంభమేళా ఏరియాను ఉపగ్రహాలు తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. మహాకుంభ మేళాకు సంబంధించిన ఏర్పాట్లు చేయకముందు, తర్వాత తీసిన ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోల్లో గతేడాది ఏప్రిల్‌లో మహాకుంభ్ ప్రాంతం మొత్తం నిర్మానుష్యంగా కనబడగా, డిసెంబర్ 22 నాటికి నిర్మాణాలతో కనిపించింది. ఈ నెల 10న తీసిన ఫొటోల్లో ఓ పెద్ద నగరాన్ని తలపించేలా మహాకుంభ్ ప్రాంతం దర్శినమిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఇదీ చదవండి: స్వచ్ఛ కుంభమేళాకాగా, అశేష భక్త జనవాహిని తరలివస్తోన్న ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం పాల్గొనబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి ఐదో తేదీన ప్రధాని మోదీ త్రివేణి సంగమ స్థలిలో పుణ్యస్నానం ఆచరిస్తారని ఆయా వర్గాలు మంగళవారం తెలిపాయి. మరోవైపు ఈనెల 27వ తేదీన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా త్రివేణి సంగమంలో పవిత్రస్నానం ఆచరించనున్నారు. గంగా హారతి కార్యక్రమంలోనూ పాల్గొంటారు. అధికారులతో భేటీ కానున్నారు. అమిత్ షా వారంరోజుల్లో వస్తుండటంతో కుంభమేళాలో భద్రతను మరోసారి సమీక్షించారు. ప్రధాన కూడళ్ల వద్ద మరోసారి తనిఖీలుచేశారు. Maha Kumbh Tent City, Prayagraj, India as viewed by EOS-04 (RISAT-1A) satellite. 🛰️#MahaKumbh2025 #ISRO pic.twitter.com/J9nT6leYIJ— ISRO InSight (@ISROSight) January 22, 2025 -
స్వచ్ఛ కుంభమేళా
(మహా కుంభమేళా ప్రాంతం నుంచి సాక్షి ప్రతినిధి) సాధారణ రోజుల్లో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ త్రివేణి సంగమం ప్రాంతాన్ని రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల మంది పర్యాటకులు మాత్రమే సందర్శిస్తారు. ఇప్పుడు అక్కడ జరుగుతున్న మహా కుంభమేళాకు రోజూ కోటి, రెండు కోట్ల మంది పర్యాటకులు వచ్చి వెళుతున్నా ఆ పరిసరాలు వీలైనంత మేర పరిశుభ్రంగానే కనిపిస్తున్నాయి. ఈ నెల 13న మొదలై 45 రోజులు నిరంతరం కొనసాగే.. భూమిపై జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమంగా గుర్తింపు పొందిన మహా కుంభమేళా కార్యక్రమాన్ని పూర్తి పరిశుభ్రత, పర్యావరణ జాగ్రత్తలతో నిర్వహించేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్రం ముందస్తుగా అనేక చర్యలు చేపట్టినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.సాధారణంగా ఎక్కడైనా ఒక లక్ష మంది ప్రజలతో ఒక సభ జరిగితే అది ముగిసిన తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతమంతా ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు, ఇతర చెత్తా చెదారంతో అపరిశుభ్రంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే, ఇప్పటికే ఎనిమిది రోజులపాటు రోజూ సరాసరి కోటి మందికి పైగా యాత్రికులు మహా కుంభమేళా త్రివేణి సంగమం ప్రాంతాన్ని సందర్శిస్తున్నా.. అక్కడ పరిసరాలు పరిశుభ్రంగానే కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల పూర్తి నియంత్రణకు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. పరిశుభ్రత కోసం 20,000 మంది సఫాయి సిబ్బంది ఆ ప్రాంతంలో షిఫ్టుల వారీగా నిరంతరం పనిచేస్తున్నారు. 10 వేల ఎకరాల విస్తీర్ణంలో లక్షన్నర మరుగుదొడ్లు..ప్రయాగరాజ్ త్రివేణి సంగమం పరిసర ప్రాంతం చుట్టుపక్కల మొత్తం పది వేల ఎకరాల విస్తీర్ణంలో మహా కుంభమేళా ఉత్సవాలు కొనసాగుతుండగా, యూపీ ప్రభుత్వం ఆ ప్రాంతంలో లక్షన్నర మరుగుదొడ్లు, 5,000 యూరినల్స్ కేంద్రాలు, 350 కమ్యూనిటీ టాయిలెట్లు, 10 టాయిలెట్ కాంపె్లక్స్లు ఏర్పాటుచేసింది. మరుగుదొడ్ల శుభ్రతను పర్యవేక్షించడానికి 2,500 మంది సిబ్బందితో పాటు 12 కిలోమీటర్ల పొడవున్న 44 పుష్కర ఘాట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు మరో 5,000 మంది పనిచేస్తున్నారు. త్రివేణి సంగమం నదీ గర్భంలో నీటిని ఎప్పటికప్పుడు శుద్ధిచేసేందుకు 40 కాంపాక్టరు మోటార్లు వినియోగిస్తుండగా, ఆ ప్రాంతంలో పోగయ్యే చెత్తను ఎప్పటికప్పుడు అక్కడ నుంచి తరలించేందుకు 120 టిప్పర్లను వినియోగిస్తున్నారు.పారిశుధ్య కార్మికులకు బీమాఇక మహాకుంభమేళా పారిశుధ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్న కార్మికులతో పాటు బోట్మెన్లకు స్వచ్ఛ కుంభ్ ఫండ్ నిధుల ద్వారా రూ.2 లక్షల జీవిత బీమా పాలసీలు అందజేశారు. అలాగే, ప్లాస్టిక్ వస్తువు వినియోగంపై ముందే శిక్షణ పొందిన దాదాపు 1,500 మంది సిబ్బంది కుంభమేళాకు వచ్చే పర్యాటకులతో ఆ ప్రాంతంలో చిన్న వ్యాపారాలు నిర్వహించుకుంటున్న యజమానులకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేస్తూ, వారిలో అవగాహన కలిగిస్తున్నారు. మహా కుంభమేళా ప్రారంభానికి నెలల ముందే ప్రయాగరాజ్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే 400 పాఠశాలల్లో ఉపాధ్యాయులు, 4 లక్షల మంది విద్యార్థులకు పరిశుభ్రతపై అవగాహన కలిగించేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. స్వచ్ఛమైన తాగునీటి కోసం 1,249 కి.మీ. పైపులైన్లు.. ఇక మహా కుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో పవిత్రస్నానాలు చేసేందుకు రోజూ భారీగా తరలివచ్చే భక్తుల తాగునీటి అవసరాల కోసం ఆ పదివేల ఎకరాల విస్తీర్ణ ప్రాంతంలోనే 1,249 కిలోమీటర్ల పొడవునా మంచినీటి పైపులైన్లును ప్రత్యేకంగా ఏర్పాటుచేశారు. శుద్ధిచేసిన తాగునీటిని ఆ పైపులైన్ ద్వారా యాత్రికులు వినియోగించుకునేలా 56,000 చోట్ల కుళాయిలు ఏర్పాటుచేశారు. 85 గొట్టపు బావులు, 30 జనరేటర్లతో నడిచే పంపింగ్ స్టేషన్‌తో కుంభమేళా ప్రాంతమంతా నిరంతరం నీటి సరఫరా కొనసాగిస్తున్నారు. ఏమైనా సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు సెక్టార్ల వారీగా ఇంజనీర్లు, సిబ్బందిని నియమించారు. ఆకుపచ్చ మహాకుంభ్.. మహా కుంభమేళాలో భాగస్వాములయ్యేందుకు జాతీయ, అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కోట్లాది మంది భక్తులకు పరిశుభ్రమైన, స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభు త్వం రెండేళ్లుగా భారీస్థాయిలో మొక్కల పెంపకం చేపట్టింది. పది ప్రాంతాల్లో చిన్నచిన్న వనాలను రూపొందించింది. మహా కుంభమేళా ప్రారంభానికి ఏడాది ముందు నుంచే ప్రయాగరాజ్ అంతటా సుమారు మూడు లక్షల మొక్కలను పెంచడానికి అధికారులు చర్యలు చేపట్టారు. మేళా ముగిసిన తర్వాత కూడా వాటి సంరక్షణ, నిర్వహణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లుచేసింది. నగరానికి దారితీసే 18 ప్రధాన రహదారుల వెంట ఈ మొక్కల పెంపకం డ్రైవ్‌లు కొనసాగాయి. కదంబ, వేప, అమల్టాస్ వంటి స్థానిక జాతులకు చెందిన 50,000 మొక్కలు రోడ్లకు ఇరువైపులా ప్రత్యేకంగా నాటారు. -
5న కుంభమేళాలో మోదీ పుణ్యస్నానం
న్యూఢిల్లీ: అశేష భక్త జనవాహిని తరలివస్తోన్న ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళాలో ప్రధాని నరేంద్ర మోదీ సైతం పాల్గొనబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి ఐదో తేదీన ప్రధాని మోదీ త్రివేణి సంగమ స్థలిలో పుణ్యస్నానం ఆచరిస్తారని ఆయా వర్గాలు మంగళవారం తెలిపాయి. మరోవైపు ఈనెల 27వ తేదీన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా త్రివేణి సంగమంలో పవిత్రస్నానం ఆచరించనున్నారు. గంగా హారతి కార్యక్రమంలోనూ పాల్గొంటారు. అధికారులతో భేటీ కానున్నారు. అమిత్ షా వారంరోజుల్లో వస్తుండటంతో కుంభమేళాలో భద్రతను మరోసారి సమీక్షించారు. ప్రధాన కూడళ్ల వద్ద మరోసారి తనిఖీలుచేశారు.ఫిబ్రవరి ఒకటో తేదీన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ఫిబ్రవరి 10వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రయాగ్‌రాజ్‌కు రానున్నారు. నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దట్టంగా పొగమంచు కమ్ముకున్నాసరే భక్తులు మంగళవారం సైతం భారీస్థాయిలో పుణ్యాస్నానాలు ఆచరించారు. జనవరి 13న మొదలైన కుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీన పూర్తికానుంది. మౌని అమావాస్య (రెండో షాహీ స్నానం) వచ్చే జనవరి 29న , ఫిబ్రవరి మూడో తేదీన వసంత పంచమి రోజు (మూడో షాహీ స్నానం), ఫిబ్రవరి 12న (మాఘ పూర్ణిమ) అధిక సంఖ్యలో జనం రావచ్చు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో కుంభమేళా ముగుస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర గణాంకాల ప్రకారం జనవరి 20నాటికి 8.81 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారు. -
ప్రపంచం చూపు.. ప్రయాగ్‌రాజ్ వైపు.. మహా కుంభమేళా చిత్రాలు
-
మహాకుంభమేళాకు ఐదోరోజు పోటెత్తిన భక్తులు
-
మహాకుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి 10 లక్షల మందికిపైగా భక్తులు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద వేడుకైన మహాకుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివెళ్లనున్నారు. ఈ మేరకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. సంక్రాంతి (Sankranti) వేడుకలు, శబరిమల సందర్శన కూడా ముగియడంతో భక్తజనం కుంభమేళాకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు టూర్స్, ట్రావెల్స్ సంస్థలు, పర్యాటక సంస్థలు ప్రత్యేక ప్యాకేజీలతో భక్తులను ఆకట్టుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి 10 లక్షల మందికిపైగా వెళ్లనున్నట్లు అంచనా. మరోవైపు కుంభమేళా (Kumbh Mela) కోసం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం రైల్వే శాఖ 3 వేల ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయగా, తెలుగు రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 177 రైళ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. రెగ్యులర్ రైళ్లకు అదనపు బోగీలను జత చేస్తున్నట్లు అధికారులుమ తెలిపారు. బస్సులు, రైళ్లు, విమానాలతోపాటు సొంత వాహనాల్లోనూ జనం పెద్ద ఎత్తున తరలి వెళ్లనున్నారు. ఒక్కరికి రూ.45 వేల పైనే... భక్తులు మహాకుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానం ఆచరించడాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఈ మేరకు 10 నుంచి 20 మంది దంపతులు కలిసి ఒక బృందంగా మహాకుంభమేళాకు (Maha Kumbh Mela) వెళ్తున్నట్లు హిమాయత్‌నగర్‌కు చెందిన ఒక ట్రావెల్స్ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇలా వచ్చేవారి కోసం మినీబస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కనీసం వారంపాటు కొనసాగనున్న ఈ పర్యటనలో మహాకుంభమేళాతోపాటు అయోధ్య, వారణాసి తదితర పుణ్యక్షేత్రాలను కూడా సందర్శిస్తారు. ఇందుకనుగుణంగా ప్యాకేజీలను సిద్ధం చేస్తున్నారు. కొన్ని సంస్థలు భోజనం, వసతి, రవాణా తదితర సదుపాయాలతో కలిపి ప్యాకేజీలను అందజేస్తుండగా కొన్నిసంస్థలు హైదరాబాద్, విజయవాడ, (Vijayawada) విశాఖ తదితర నగరాల నుంచి కేవలం రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి.హైదరాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లి తిరిగి వచ్చేందుకు టూరిస్ట్ బస్సుల్లో రూ.15 వేలకుపైగా చార్జీ విధిస్తున్నారు. అక్కడి నుంచి పలు పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు నాలుగు రాత్రులు, ఐదు పగళ్లకు కలిపి రూ.25 వేల చొప్పున ప్యాకేజీలు ఉన్నాయి. మహాకుంభమేళాకు వెళ్లేందుకు సగటున ఒక భక్తుడు రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు చేయవలసి వస్తుంది. సాధారణ రోజుల్లో అయితే కేవలం రూ.20 వేలల్లోనే అయోధ్య, వారణాసి వంటి ప్రాంతాలను సందర్శించి వచ్చే అవకాశం ఉంటుందని సికింద్రాబాద్‌కు చెందిన ఒక ట్రావెల్స్ సంస్థ ప్రతినిధి మురళి తెలిపారు.ఫ్లైట్ చార్జీ రూ.20 వేలు.. విమాన చార్జీలు కూడా చుక్కలను తాకుతున్నాయి. హైదరాబాద్ (Hyderabad) నుంచి వారణాసికి సాధారణ రోజుల్లో రూ.4 వేల నుంచి రూ.7 వేల వరకు చార్జీ ఉంటుంది. ఇది రూ.18 వేల నుంచి రూ.20 వేలకు పెరిగింది. అయినప్పటికీ టికెట్లు లభించడం లేదని పలువురు ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ప్రయాణికుల రద్దీ ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు విమాన చార్జీలు కూడా పెరగవచ్చని ట్రావెల్స్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. రైళ్లలో వంద శాతం ఆక్యుపెన్సీ హైదరాబాద్‌తోపాటు వివిధ ప్రాంతాల నుంచి వారణాసి, లక్నో, రెక్సల్, పట్నా తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే రెగ్యులర్ రైళ్లలో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఎలాంటి బుకింగ్ సదుపాయం లేదు. అన్ని రైళ్లలో రిగ్రేట్ దశకు చేరుకుంది. ప్రత్యేక రైళ్లన్నీ 90 శాతం నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో ప్రత్యేక రైళ్లలోనూ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఏ రోజుకు ఆ రోజు అనూహ్యమైన డిమాండ్ కనిపిస్తోందని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రయాణికుల డిమాండ్, రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇప్పటి వరకు 177 రైళ్లను అదనంగా ఏర్పాటు చేయగా, రానున్న రోజుల్లో మరిన్ని రైళ్లను నడిపేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు చెప్పారు.చదవండి: జంట హత్యల కేసులో వీడిన మిస్టరీసొంత వాహనం సో బెటర్ రైళ్లు, బస్సులు, విమానాల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కొంతమంది భక్తులు సొంత వాహనాల్లో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆధ్యాత్మికయాత్రతో పాటు వారం, పది రోజులు నచ్చిన ప్రాంతాల్లో పర్యటించేందుకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించుకొని బయలుదేరుతున్నారు. ఫ్యామిలీ టూర్‌గా వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.పక్కా ప్రణాళికతో వెళ్లండిమహాకుంభమేళాకు ఇప్పటికే లక్షలాదిగా జనం తరలి వస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే దారాలన్నీ జనసంద్రంగా మారాయి. హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి వెళ్లేవారు ప్యాకేజీలపై స్పష్టమైన అవగాహనతో ప్రణాళికలు వేసుకోవడం మంచిది. – హరికిషన్, వాల్మీకి టూర్స్ అండ్ ట్రావెల్స్ఫ్లైట్లకు డిమాండ్ పెరిగింది కొద్ది రోజులుగా ఫ్లైట్స్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. బుకింగ్స్ కూడా లభించడం లేదు. ఫ్లైట్ బుకింగ్ కోసం వేచిచూడటం మంచిది. చార్జీల్లో హెచ్చుతగ్గులను గమనించి బుక్ చేసుకోవాలి. – మురళి వడ్ల, టూరిస్ట్ ఆపరేటర్ -
భక్తజన సంద్రంగా మహా కుంభమేళా
-
కుంభ మేళాకు బాబా @ 100 ఏళ్లు
మహాకుంభ్ నగర్: యూపీలోని ప్రయాగరాజ్‌లో నాలుగు రోజులుగా జరుగుతున్న మహా కుంభ మేళాకు కోట్లాదిగా జనం తరలివస్తున్నారు. ఈ క్రతువులో బయటి ప్రపంచంలోకి అరుదుగా అడుగుపెట్టే సాధువులు, మునులు సైతం పాలుపంచుకోవడం తెలిసిందే. అలాంటి కోవకు చెందిన వారే పద్మ శ్రీ అవార్డు గ్రహీత, యోగ సాధకుడు స్వామి శివానంద బాబా. 1896లో జన్మించిన స్వామి శివానంద బాబా గత వందేళ్లుగా ప్రయాగరాజ్, నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్‌లలో జరిగే ప్రతి కుంభమేళాలోనూ హాజరవుతున్నారు. తాజాగా, మహాకుంభమేళాకు సైతం వచ్చారు. సంగంలోని 16వ నంబర్ సెక్టార్‌లోని టెంట్లో ఈయన బస చేస్తున్నారు. టెంట్ బయట బాబా ఆధార్ కార్డు, పుట్టిన రోజు సర్టిఫికెట్ కాపీని ఆయన శిష్యులు ప్రదర్శనకు ఉంచారు. బాబా శిష్యుడు, బెంగళూరుకు చెందిన ఫల్గుణ్ భట్టాచార్య వారిలో ఒకరు. ‘బాబా బిచ్చగాళ్ల కుటుంబంలో పుట్టారు. ఆయన తల్లిదండ్రులు సాధువుల బోధనలకు తరచూ వెళ్లేవారు. ఆ క్రమంలోనే వారు నాలుగేళ్ల వయస్సులో బాబాను సాధువులకు అప్పగించేశారు. ఆరేళ్ల వయస్సులో బాబా తిరిగి సొంతింటికి చేరుకున్న కొన్ని రోజులకే ఆయన సోదరి మరణించింది. మరికొద్ది రోజులకు తల్లిదండ్రులు సైతం తనువు చాలించారు. వారి కర్మకాండలు పూర్తయ్యాక బాబా ఒంటరయ్యారు’అని భట్టాచార్య వివరించారు. ‘అప్పటి నుంచి జీవితమే మారిపోయింది. రాత్రి 9 గంటలకు పడుకుని, వేకువజామున 3 గంటలకే నిద్ర లేవడం మిగతా దినమంతా యోగా, ధ్యానంలోనే గడపడం దినచర్యంగా మార్చుకున్నారు’అని తెలిపారు. ఇప్పటి వరకు ఆయన అనారోగ్యం బారిన పడిన దాఖలాలు లేవన్నారు. కానుకలు స్వీకరించరని చెప్పారు. పాలు, పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటారని, ఉడికిన ఆహారాన్ని ఉప్పు, నూనె లేకుండానే తీసుకుంటారని తెలిపారు. వారణాసిలోని దుర్గాకుండ్ ప్రాంతం కబీర్ నగర్‌లోని ఆశ్రమంలో ఉంటున్నారని తెలిపారు. 2022 మార్చి 21వ తేదీన అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మీ శ్రీ అవార్డును స్వీకరించారు. బాబా వయస్సు 125 ఏళ్లని రాష్ట్రపతి భవన్ అప్పట్లో పేర్కొంది. కాగా, ప్రజల ఇబ్బందులకు అనారోగ్యకర అలవాట్లు, శారీరక శ్రమే కారణమన్నది స్వామి శివానంద బాబా అభిప్రాయం. అందుకే, ఉదయాన్నే మేల్కొనడం, కాసేపు నడక, కనీస అరగంటపాటు యోగ సాధనతోపాటు సరైన ఆహార నియమాలతో జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారని ఫల్గుణ్ భట్టాచార్య తెలిపారు. -
కుంభమేళాపై స్టీవ్ జాబ్స్ లేఖ.. ఎన్ని కోట్లు పలికిందంటే?
ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన కార్యక్రమాలలో.. భారతదేశంలో జరిగే 'మహా కుంభమేళా' (Maha Kumbh Mela) ఒకటి. ఇటీవల ప్రారంభమైన ఈ కార్యక్రమానికి కోట్లాది మంది భక్తులు విచ్చేస్తున్నారు, పవిత్ర సంగమం వద్ద పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి దివంగత స్టీవ్ జాబ్స్ భార్య 'లారెన్ పావెల్ జాబ్స్' కూడా వచ్చారు.మహా కుంభమేళాకు వచ్చిన లారెన్ పావెల్ జాబ్స్ తన పేరును 'కమల'గా మార్చుకున్నారు. కాగా ఇప్పుడు ఆపిల్ కో ఫౌండర్ స్టీవ్ జాబ్స్ చేతితో రాసిన ఓ లేఖ (Letter) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1974లో రాసిన ఈ లేఖలో స్టీవ్ జాబ్స్ కుంభమేళా కోసం భారతదేశాన్ని సందర్శించాలని రాసినట్లు తెలుస్తోంది.50 ఏళ్లకింద స్టీవ్ జాబ్స్ రాసిన ఈ లేఖ బోన్హామ్స్ వేలంలో 500312 డాలర్లు లేదా రూ.4.32 కోట్లుకు పలికింది. ఇది స్టీవ్ జాబ్స్ స్వయంగా రాసిన మొదటి లేఖ కావడం గమనార్హం. ఈ కారణంగానే దీనిని చాలామంది సొంతం చేసుకోవడానికి ప్రయత్నించారు.స్టీవ్ జాబ్స్ 19వ పుట్టిన రోజుకు ఒక రోజు ముందు.. అతని చిన్ననాటి స్నేహితుడు టిమ్ బ్రౌన్కు ఈ లేఖను పంపించారు. ఇందులో ఆయన ఆధ్యాత్మిక, ఆత్మపరిశీలనకు సంబంధించిన చాలా విషయాలను వెల్లడించారు. అంతే కాకుండా బౌద్ధమతాన్ని గురించి ప్రస్తావిస్తూ.. కుంభమేళా కోసం భారతదేశాన్ని సందర్శించాలనే తన ఆకాంక్షను కూడా అందులో వెల్లడించారు.భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ.. తాను చాలా సార్లు ఏడ్చినట్లు లేఖలో పేర్కొన్నారు. ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే కుంభమేళా కోసం నేను భారతదేశానికి వెళ్లాలనుకుంటున్నాను. నేను మార్చిలో ఎప్పుడో బయలుదేరుతాను, కానీ ఇంకా ఖచ్చితంగా తెలియలేదని అందులో ప్రస్తావించారు.స్టీవ్ జాబ్స్ మొదట ఉత్తరాఖండ్‌లోని నీమ్ కరోలి బాబా ఆశ్రమాన్ని సందర్శించాలని అనుకున్నారు. అయితే, నైనిటాల్‌కు చేరుకోగానే, నీమ్ కరోలి బాబా అంతకుముందు సంవత్సరం మరణించినట్లు అతను కనుగొన్నాడు. నిరుత్సాహపడకుండా, జాబ్స్ కైంచి ధామ్‌లోని ఆశ్రమంలో ఉండి, నీమ్ కరోలి బాబా బోధనల నుంచి ఓదార్పు పొందారు. ఆ సమయంలో ఆయన పూర్తిగా ఆధ్యాత్మికతలో మునిగిపోయారు. ఆ తరువాత ఆయనలో చాలా మార్పు వచ్చిందని కూడా చెప్పారు.ఇప్పుడు, స్టీవ్ భార్య లారెన్ పావెల్ జాబ్స్, మహా కుంభమేళా 2025కి హాజరవడం ద్వారా అతని చిరకాల కోరికలలో ఒకదాన్ని నెరవేర్చింది. ఈమె జనవరి 15 వరకు నిరంజినీ అఖారా క్యాంపులోని కుంభ్ టెంట్ సిటీలో ఉండనున్నారు. ఆ తరువాత జనవరి 20న అమెరికాలోనూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి హాజరవుతారు.ఇదీ చదవండి: కుంభమేళాలో స్టీవ్ జాబ్స్ భార్యకు అస్వస్థతఈ కుంభమేళా కారణంగా రాష్ట్ర ఆర్థిక వృద్ధి కూడా భారీగా పెరుగుతుందని చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి కేటాయించిన బడ్జెట్ రూ.7,000 కోట్లు కాగా.. రాష్ట్రానికి వచ్చే ఆదాయం రూ. 2 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి వచ్చే సందర్శకులు సగటున రూ. 5,000 ఖర్చు చేస్తే ఏకంగా రూ. 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఈ ఖర్చు రూ.10వేలకు పెరిగితే.. వచ్చే ఆదాయం రూ. 4 లక్షల కోట్లకు చేరుతుంది.Steve Jobs letter to his friend about planning to visit Kumbh Mela in India.The thing to notice here is, he used the word "Shanti" before concluding. pic.twitter.com/s4yN2pupjr— Kartik Jaiswal (@draken73jp) October 24, 2021 -
కన్నుల పండుగగా కుంభమేళ
-
మహా కుంభమేళాకు తరలివస్తున్న అశేష జనవాహిని.. రెండ్రోజుల్లో రెండున్నర కోట్ల మంది పుణ్యస్నానాలు
-
కుంభమేళాలో స్టీవ్ జాబ్స్ భార్యకు అస్వస్థత
దివంగత యాపిల్ సహ వ్యవస్థాపకుడు 'స్టీవ్ జాబ్' భార్య 'లారెన్ పావెల్ జాబ్స్' ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా 2025కు హాజరయ్యారు. అయితే.. కొత్త వాతావరణం కారణంగా ఆమె అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని నిరంజనీ అఖాడాకు చెందిన మహా మండలేశ్వర్ స్వామి 'కైలాసనంద గిరి మహారాజ్' వెల్లడించారు.లారెన్ పావెల్ జాబ్స్ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని, ఆరోగ్యం కుదుటపడిన తరువాత ఆమె త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరిస్తారని కైలాసనంద గిరి మహారాజ్ చెప్పారు. ఇంత రద్దీగా ఉండే ప్రదేశానికి ఆమె ఎప్పుడూ వెళ్లలేదు. అంతే కాకుండా లారెన్ చాలా సాదాసీదాగా ఉంది, పూజా సమయంలో కూడా మాతో పాటు ఉండేవారని ఆయన పేర్కొన్నారు.ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు లారెన్ పావెల్ జాబ్స్ హాజరై.. ఆమె పేరును 'కమల'గా మార్చుకున్నట్లు కైలాసనంద గిరి మహారాజ్ పేర్కొన్నారు. అంతే కాకుండా ఆమె భారతదేశానికి రావడం ఇది రెండోసారి, ఇప్పుడు ధ్యానం చేసుకోవడానికి మన దేశానికి వచ్చినట్లు చెబుతున్నారు.లారెన్ పావెల్ జాబ్స్ జనవరి 15 వరకు నిరంజినీ అఖారా క్యాంపులోని కుంభ్ టెంట్ సిటీలో ఉండనున్నారు. ఆ తరువాత జనవరి 20న అమెరికాలోనూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి హాజరవుతారు.మంగళవారం జరిగే మొదటి అమృత స్నాన్ లేదా పవిత్ర స్నానానికి కనీసం 3-4 కోట్ల మంది ప్రజలు గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ ప్రదేశమైన త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం చేస్తారు. సనాతన ధర్మానికి చెందిన 13 అఖాడాలకు చెందిన సాధువులు ఒక్కొక్కరుగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు.మహా కుంభమేళా అనేది ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత ముఖ్యమైన మతపరమైన సమ్మేళనాలలో ఒకటి. ఇది ఫిబ్రవరి 26 వరకు జరుగుతుంది. దీనికి సుమారు 40 కోట్ల మందికిపైగా ప్రజలు వచ్చే అవకాశం ఉందని సమాచారం. కుంభమేళా ప్రారంభమైన మొదటిరోజే.. 50 లక్షల మందికి పైగా ప్రజలు మొదటి పవిత్ర స్నానం చేశారు.రూ.2 లక్షల కోట్ల ఆదాయంఈ కుంభమేళా కారణంగా రాష్ట్ర ఆర్థిక వృద్ధి కూడా భారీగా పెరుగుతుందని చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి కేటాయించిన బడ్జెట్ రూ.7,000 కోట్లు కాగా.. రాష్ట్రానికి వచ్చే ఆదాయం రూ. 2 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి వచ్చే సందర్శకులు సగటున రూ. 5,000 ఖర్చు చేస్తే ఏకంగా రూ. 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చెబుతున్నారు. ఈ ఖర్చు రూ.10వేలకు పెరిగితే.. వచ్చే ఆదాయం రూ. 4 లక్షల కోట్లకు చేరుతుంది.2019లో జరిగిన ప్రయాగ్‌రాజ్ అర్ధ కుంభమేళా సమయంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 1.2 లక్షల కోట్ల రూపాయలు వచ్చిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ఆ సమయంలో 24 కోట్లమంది కుంభమేళా సందర్శించారని పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ కార్యక్రమ సంస్కృతుల సంగమం అని.. భిన్నత్వంలో ఏకత్వ సందేశంగా అభివర్ణించారు. -
మహా కుంభమేళాలో...
‘సింహా, లెజెండ్, అఖండ’ వంటి హిట్ సినిమాల తర్వాత హీరో బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఎం. తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ మహా కుంభమేళాలో సోమవారం ప్రారంభమైంది.‘‘ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళాలో ‘అఖండ 2’ చిత్రీకరణ కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. సినిమాలోని పలు కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నాం. సెప్టెంబర్ 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తాం’’ అని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా:సి.రాంప్రసాద్, సంతోష్ డి.