మహా కుంభమేళాలో అగ్నిప్రమాదం | Massive Blaze In maha kumbh mela Yamuna Puram Sector | Sakshi
Sakshi News home page

మహా కుంభమేళాలో అగ్నిప్రమాదం

Published Fri, Feb 7 2025 11:25 AM | Last Updated on Fri, Feb 7 2025 12:19 PM

Massive Blaze In maha kumbh mela Yamuna Puram Sector

లక్నో: కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. సెక్టార్‌-18 శంకరాచార్య మార్గంలో మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తోంది. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదంపై ఎస్పీ  సర్వేష్‌ కుమార్‌ స్పందించారు. అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు. 

కొద్ది రోజల క్రితం సెక్టార్‌-22లో మంటలు చెలరేగాయి. ఓ గుడారంలో రెండు గ్యాస్‌ సిలిండర్లు పేలడం వల్లే  ప్రమాదం జరిగింది. అక్కడి నుంచి  క్రమంగా మంటలు వ్యాపించడంతో 18 టెంట్‌లు ఆహుతయ్యాయని  పోలీసులు తెలిపారు. మరోవైపు, దట్టమైన పొగ వ్యాపించడంతో భక్తులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. దీంతో ప్రాణనష్టం తప్పింది.  

అంతకుముందు .. ఇదే కుంభమేళాలో తొక్కిసలాట కారణంగా 30 మంది భక్తులు మృతిచెందారు. 60 మంది గాయపడ్డారు. ఇలా వరుస ఘటనలతో అప్రమత్తమైన సీఎం యోగీ సర్కార్‌ తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. అయినప్పటికీ వరుస ప్రమాదాలు జరుగుతుండడంపై యోగీ సర్కార్‌ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement