ఉత్తరాఖండ్ కాలుష్య మండలి వెల్లడి
డెహ్రాడూన్: దేశంలో నదులు కాలుష్యం బారినపడుతున్నాయి. మురికి కూపాలుగా మారుతు న్నాయి. ఆయా నదుల్లో ప్రవహించే నీరు తాగడానికి వీల్లేకుండా పోతోంది. హిందువులు చాలా పవిత్రంగా భావించే గంగా నది జలాలకు సైతం ఇదే పరిస్థితి దాపురించింది. ఉత్తరాఖండ్ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తాజా నివేదిక ఇదే విషయం బహిర్గతం చేసింది.
హరిద్వార్లో గంగా నదిలో ప్రవహించే నీటిపై అధ్యయనం చేశారు. 8 ప్రాంతాల్లో నీటి నమూనాలు సేకరించి, క్షుణ్నంగా పరిశీలించారు. ఈ నీరు బీ కేటగిరిలోకి వస్తుందని.. స్నానానికి తప్ప తాగడానికి పనికిరాదని పీసీబీ తేల్చిచెప్పింది. గంగా జలం కాలుష్యమయం అవుతుండడం పట్ల స్థానిక పూజారులు ఆందోళన వ్యక్తం చేశారు. మానవ వ్యర్థాల కారణంగానే గంగానది స్వచ్ఛతను కోల్పోతోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment