Drinking
-
నిషాలో తూగడం...ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
ప్రపంచం నలుమూలలా ఉన్న మానవ నాగరిక సమాజమంతటికి ఒక విషయం సర్వ సాధారణం : మత్తుపదార్ధం. కొన్ని పదార్ధాలు పవిత్రమైనవాటివిగా పరిగణింపబడతాయి, కానీ ఎక్కువ సార్లు, మనం కేవలం వేడుకలకో లేదా నిషా కోసమో తాగుతాం.మత్తులో స్పృహ తప్పడం మానవుల హక్కేమి కాదు. చాలా జంతువులు మత్తులో తూగడానికి ఎంతో శ్రమకోడుస్తాయి. తమిళనాడులోని బానేట్ మాకాక్‌లు అడవిలో దాచే అక్రమ సారాయి పీపాలను కొల్లగొట్టేవయితే, కరీబియన్ వెర్వేట్ కోతులు క్రమం తప్పక తప్పతాగి తూగుతుంటాయి. ఆ దీవిలో ఏడాది పొడుగునా సెలవల సందడి ఉండడంతో అక్కడ మత్తు పానీయాలకు ఏమి కొదవలేదు.పనికిమాలినట్టుగా అనిపించినా, వెర్వేట్ కోతుల తాగుడు అలవాట్లపై చేసిన ఒక శాస్త్రీయ అధ్యయనం, అవి అచ్చం మనుషుల్లా ప్రవర్తిస్తాయని చూపడం ఆశ్చర్యకరం. వాటిలో కొన్ని అతిగా తాగేవి ఉంటాయి - అవి త్వర త్వరగా, ఎక్కువ ఎక్కువ, తరచూ తాగుతుంటాయి. కొన్ని స్థిరంగా ఉండే తాగుబోతులు ఉంటాయి - అవి సరాసరి మద్యాన్ని సోడాగానీ, నీళ్లుగానీ కలపకుండా, క్రమం తప్పకుండా కొట్టేస్తాయి. కానీ చాలామటుకు కోతులు సామాజిక జీవనంలో భాగంగా తాగుతుంటాయి. అటువంటి కోతులు కాక్టైల్స్ ఇష్టపడతాయి. మరికొన్ని మద్యాన్ని అసలు తాకవు. అక్కడితో వాటికీ మనకీ పోలికలు ఆగవు. కొన్ని కోతులు తాగినప్పుడు నిషాలో బాగా మునిగిపోయి దూకుడుగా తయారవుతాయి, కొన్ని కఠినంగా దుర్భాషలాడతాయి, మరికొన్ని దిగాలుగా, ముభావంగా తయారవుతాయి. కానీ చాలామటుకు సంతోషంగా నిషాలో మునిగిపోతాయి…. బహుశా గులాబీ రంగు ఏనుగులను చూసిన భ్రమలో ఊగుతాయి.మామూలు నలుపురంగు ఏనుగులు కూడా కాస్త మద్యం ఎక్కువైత ఒళ్లు మర్చిపోయేంతగా విజ్రుoభిస్తాయి. జార్ఖండ్‌లో ఆశియా ఏనుగులు పాకల లోపల కాగుతున్న మద్యాన్నిగైకొనడానికి పాకలని నాశనం చేస్తాయని విషయం తెలిసినది. కొన్ని ఏళ్ల క్రితం, ఒక మత్తెక్కిన ఏనుగులగుంపు ఊరుమీద విరుచుకుపడి, విద్యత్ స్థంభాలను పాడగొట్టి తిరిగితూ, ఆ ప్రక్రియలో అవే విద్యుత్ షాకు తగిలి కాలిపోయాయి.పశ్చిమ దేశాలలో పిల్లులు పుదీనాలా ఉండే క్యాట్నిప్ అనే మొక్క మత్తులో మునిగిపోతాయి. పిల్లులు ఆ పుదీనా వంటి మొక్క కొమ్మల మీద పడి మూలుగుతూ, చోంగకారుస్తూ, మళ్ళీ మళ్ళీ దొర్లుతాయి. నేను కొంచం ఆ మొక్కను తెచ్చి ఇవ్వగానే, ముందెన్నడూ ఆ మొక్కని చూడని మా నాన్నగారి పిల్లి కూడా మతిపోయినట్టు ప్రవర్తించింది. కానీ కొద్ది నిముషాల తరవాత అది బాగా తేరుకుని మళ్ళీ హుందాగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఏళ్ల తర్వాత అమెరికా జంతు ప్రదర్శనశాలను సందర్శించే సమయంలో, మేము ఒక కౌగర్ క్యాట్నిప్తో నింపివున్న మేజోడు పట్టుకుని వెర్రివేషాలు వేయడం చూశాము. అన్ని జాతుల పిల్లులూ ఈ క్యాట్నిప్కు ఆకార్షితమవుతాయని స్పష్టంగా తెలుస్తోంది.రాకీ కొండలలో పెద్ద కొమ్ముల గొర్రెలు మత్తు కోసం, ఒక రకమైన బూజు గోకి తినడానికి, ఎంతో ప్రమాదకరమైన కొండ చరియలుఎక్కుతాయని తెలిసినది. మరి ఈమెన్లో మేకలైతే వారి కాపారులలాగే ఖట్ ఆకుల మత్తుకు బానిసలు.ఎంతో అందంగా మిఠాయిలా కనిపించి, ఎర్ర టోపీలతో, పైన కాస్త పంచదార చల్లినట్టు ఉండీ, యాక్షినిల కథలలో కనిపించే బొమ్మల్లో అమ్మాయాకంగా కనిపించే పుట్టగొగుల పేరు ఫ్లై ఆగారికస్ పుట్టగొడుగులు. నన్ను తినకండి అని హెచ్చరించే రంగులో ఉన్నాకూడా రెయిన్ డీర్లు వాటిని తిని మత్తులో గెద్దలంత ఎత్తు ఎగురుతాయి. ఎన్నో మత్తు పదార్ధాలను రెయిన్ డీర్ మూత్ర పిండాలు వడగొట్టగలవు కనుక, వాటి మూత్రం పుట్టగొడుగులు తినటం కాంటే స్పష్టంగా ఎంతో శక్తివంతమైన మత్తు పదార్థం. మరి మత్తు కోసం ప్రాకులాడే యూరోప్ మారియు ఉత్తర ఆసియాలో గొర్రెకాపరులు చేసేది అదే!ఎన్నో శాంతా క్లాస్ పుట్టుక కథలలో ఒకటైన కథ మనని సైబీరియా వైపుకు దారితీస్తుంది. ఒక సీతాకాలం మధ్యలో వచ్చే పండుగలో, ఒక నాటు వైద్యుడు, పోగాకమ్ముకున్న ఒక ముఖం ద్వారoగుండా ఫ్లై ఆగారిక్ నిండిన సంచీని మోస్తూ ఒక యూర్ట్ ( జూలుతో చేయబడ్డ గుండ్రటి డేరా) లోపలకి ప్రవేశిస్తాడు. ప్రజలు ఈ గొడుగుల నిషాలో పడ్డ వేళ, వారి ముఖము - ముఖ్యంగా వారి బుగ్గలు, ముక్కు, ఎర్రగా మారతాయి. శాంతా, అతని ఎర్ర ముక్కు రెయిన్ డీర్ రుడోల్ఫ్, ఆకాశంలో దీనిపై ఎగురుతున్నారన్న అంచనా వేసినందుకు ఏమి బహుమతులు లేవు!శతాబ్దాలా నుంచీ సమాజం ఈ పదార్ధాలను భయంకరమైన చెడుతో కూడిన వాటిగా పరిగణించి బహిష్కరించడానికి ప్రయత్నించింది. అయినా వాటిలో మునిగి తెలడం మన ఆచ్చారాలలో ఎంత బలంగా నాటుకుందో, అది అంతే బలంగా మన జన్యువులో కూడా నాటుకుని ఉండి ఉంటుంది. పిల్లలు కూడా ఆ అనుభూతి పొందడానికి కళ్ళుతిరిగి, కాలపై నిలబడడానికి తడబడేదాకా పదే పదే గుండ్రంగా తిరిగితారు. దెర్విషలు (సన్యాసులు) కూడా మనకుకి అతీతమైన ఆధ్యాత్మిక అనుభూతి పొందడానికి ఇటువంటి పద్దతే వాడతారు. పార్స్వ ఆలోచన అనే భావాన్ని పెంపొందించిన ఎడ్వర్డ్ డి బోనో ప్రస్తావన ఇక్కడే వస్తుంది. అతను మత్తుపదార్థాలు మనని పోతపోసిన ఆలోచనా విధానాలనుంచి బయటకులాగి, ఎంతో సృజనత్మాకంగా ఆలోచింపచేయగలదని అతను సూచించాడు. అదే గనక నిజమైతే, మనసుని మార్చేటువంటి ఈ మత్తు అనుభూతులతో, ఖచ్చితంగా ఈ పాటికి ప్రపంచంలో ఎన్నో కొత్త ఆలోచనలు, ఆవిష్కరణలు మారియు ప్రయత్నలు చూసుండేవాళ్ళం. రచన : జానకి లెనిన్ ఫోటోలు: సిద్దార్థ్ రావు -
మందు బాబులు జాగ్రత్త..! పరిశోధనలో షాకింగ్ విషయాలు
మద్యం ఆరోగ్యానికి హానికరం అంటూ పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు నిపుణులు. దీని కారణంగా పలు అనారోగ్యాల బారినపడతామని చెబుతుంటారు. ముఖ్యంగా కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందంటూ హెచ్చరిస్తుంటారు. కానీ ఇది ఆల్కహాల్ సేవించడం వల్లే వస్తుందనేందుకు కచ్చితమైన ఆధారాలు లేవు. అయితే పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో ఆల్కహాల్‌కి కేన్సర్‌కి లింక్అప్ ఉందంటూ షాకింగ్ విషయాలు వెల్లడించారు. మొత్తం నాలుగు అధ్యయనాలను ఉదహరిస్తూ సవివరంగా తెలిపారు యూఎస్ సర్జన్ డాక్టర్ వివేక్ మూర్తి. అంతేగాదు మద్యపానం సేవిస్తే.. కేన్సర్ తప్పదనే ఓ హెచ్చరిక లాంటి లేబుల్ ఉండాలని వాదిస్తున్నారు. ఎలా కారణమంటే..ఆల్కహాల్ కేన్సర్‌కు ఎలా కారణమవుతుందో నాలుగు కారణాలను వివరించారు. మొదటిది శరీరంలో ఆల్కహాల్ విచ్ఛిన్నమైప్పుడు డీఎన్ఏతో విభేదించి కణాలను దెబ్బతీస్తుంది. కణితులు వచ్చేందుకు కారణమవుతుంది. అందుకు బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి. అలాగే దీన్ని చాలామంది వైద్యులు అంగీకరించారు. రెండోది ఆల్కహాల్ ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. ఇది రొమ్ము కేన్సర్‌కు మార్గం సుగమం చేస్తుందని కొత్త పరిశోధనలో తేలింది. అయితే ఇది ఎలా అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. మూడోది ఇటలీ, యుఎస్, ఫ్రాన్స్, స్వీడన్, ఇరాన్ పరిశోధకుల బృందం దాదాపు 4 లక్షలకు పైగా కేన్సర్ కేసులను పరిశీలించగా..సుమారు 572 అధ్యయనాల్లో చాలా షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. తాగేవారు, తాగనివారిగా విభజించి మరీ అంచనా వేశారు. ఆ పరిశోధనలో నోటి, గొంతు, అన్నవాహిక, కొలొరెక్టమ్, కాలేయం, స్వరపేటిక, రొమ్ము తదితర కేన్సర్లకు మద్యపానంతో సంబంధం ఉందని తేలింది. నాలుగు..అధిక మద్యపానం సేవించిన వారికి మెడ, తలకు సంబంధించిన కేన్సర్ వస్తుందని సుమారు 26 పరిశోధనలో వెల్లడయ్యింది. చివరిగా మరో ముఖ్యమైన అంశమేమిటంటే.. 26 సంవత్సరాల కాలంలో 195 దేశాలలో సంభవించిన మద్యపాన సంబంధిత మరణాలపై 2018 ప్రపంచ నివేదికలో మద్యపానం సేవించడం సురక్షితం కాదని తేలింది. ఇది ఏడు రకాల కేన్సర్ల బారినపడేందుకు కారణమవుతుందని వివరించారు సర్జన్ వివేక్ మూర్తి. ఈ అధ్యయనం నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రచురితమయ్యింది. అయితే ఈ అధ్యయనం మద్యం అతిగా సేవించే వారికి, మితంగా తీసుకునే వారి మధ్య తేడాలను వివరించలేదు. ఈ పరిశోధనపై కొందరు శాస్త్రవేత్తలు విభేదిస్తున్నారు. ఎందుకంటే..మధ్యధరా ప్రాంతంలో ఉండేవారు రోజూ వైన్ తాగుతారని, అదివారికి బలమైన ప్రయోజనాలను అందిస్తుందనేది వాదన. అలాగే మితంగా మద్యం సేవించేవారే గుండెపోటు, స్ట్రోక్, అకాల మరణానికి గురయ్యే ప్రమాదం ఉందని, రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని గుర్తించారు పరిశోధకులు. -
హరిద్వార్ గంగాజలం తాగడానికి పనికిరాదు
డెహ్రాడూన్: దేశంలో నదులు కాలుష్యం బారినపడుతున్నాయి. మురికి కూపాలుగా మారుతు న్నాయి. ఆయా నదుల్లో ప్రవహించే నీరు తాగడానికి వీల్లేకుండా పోతోంది. హిందువులు చాలా పవిత్రంగా భావించే గంగా నది జలాలకు సైతం ఇదే పరిస్థితి దాపురించింది. ఉత్తరాఖండ్ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తాజా నివేదిక ఇదే విషయం బహిర్గతం చేసింది. హరిద్వార్‌లో గంగా నదిలో ప్రవహించే నీటిపై అధ్యయనం చేశారు. 8 ప్రాంతాల్లో నీటి నమూనాలు సేకరించి, క్షుణ్నంగా పరిశీలించారు. ఈ నీరు బీ కేటగిరిలోకి వస్తుందని.. స్నానానికి తప్ప తాగడానికి పనికిరాదని పీసీబీ తేల్చిచెప్పింది. గంగా జలం కాలుష్యమయం అవుతుండడం పట్ల స్థానిక పూజారులు ఆందోళన వ్యక్తం చేశారు. మానవ వ్యర్థాల కారణంగానే గంగానది స్వచ్ఛతను కోల్పోతోందని చెప్పారు. -
Clinical Vampirism: ఈ జబ్బు గురించి తెలుసా?
ఇంగ్లిష్ సినిమాల్లో, కథల్లో డ్రాక్యులాలు రక్తం తాగుతాయి. ఇలా రక్తాన్ని రుచి చూసే ఆ పిశాచాల్లాంటి క్యారెక్టర్స్‌ను ఇంగ్లిష్‌లో ‘వాంపైర్స్’ అని పిలుస్తారు. కానీ అలా రక్తం తాగే కోరికతో ఉండే ఒక జబ్బు ఉంటుందనీ, ఆ మెడికల్ కండిషన్ పేరే ‘వాంపైరిజమ్’ అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఆ వాంపైరిజమ్ గురించిన కథనమే కాస్త సంక్షిప్తంగా... ప్రతి మనిషీ తనకు తెలియకుండానే ఒక్కోసారి రక్తాన్ని ఎంతో కొంత రుచి చూస్తుంటాడు. దీనికి ఉదాహరణే... వేలు తెగినప్పుడు గబుక్కున అకస్మాత్తుగా చాలామంది ఆ వేలిని నోట్లో పెట్టుకుంటారు. ఇందులో రక్తాన్ని రుచిచూడడానికంటే... అలా కంటిన్యువస్‌గా రక్తస్రావం జరగకుండా నివారించేందుకే ఇలా తెగిన వేలిని నోట్లో పెట్టుకుంటారు. ఎవరికి వారు తమ సొంత రక్తాన్ని రుచి చూసే ఆ ప్రక్రియకు ‘ఆటో వాంపైరిజమ్’ అంటారు. వేలు తెగి రక్తస్రావం అవుతున్నప్పుడు చాలామందిలో కనిపించే ఈ ప్రక్రియ చాలా సాధారణమైన ప్రతిక్రియగా భావించవచ్చు. అయితే కొంతమంది మానసిక రోగుల్లో ఓ అసాధారణమైన కండిషన్ ఉంటుంది. చాలా చాలా అరుదైన ఈ కండిషన్ ఉన్నవారిలో రక్తం తాగాలనే కోరిక కలుగుతుంది. ఈ కోరిక పుట్టడాన్ని ‘క్లినికల్ వాంపైరిజమ్’ అంటారు. మరికొందరిలోనైతే ఇది కాస్త రుగ్మత స్థాయికి చేరుకుంటుంది. అలాంటి ఓ అత్యంత అరుదైన జబ్బే ‘రెన్‌ఫీల్డ్స్ సిండ్రోమ్’. ఈ జబ్బు ఉన్నవారికి రక్తం తాగాలనే కోరిక కలుగుతుంది. ఇది చాలా చాలా అరుదు కావడంతో దీనికి నిర్దిష్టమైన చికిత్స అంటూ లేకపోయినా... ప్రవర్తనకు సంబంధించిన రుగ్మతలకు చికిత్స అందించినట్లే న్యూరోసైకియాట్రిస్టులు దీనికీ ‘బిహేవియరల్ థెరపీ’ అనే చికిత్స చేస్తారు. అన్నట్టు... ఈ జబ్బు ‘రెన్‌ఫీల్డ్స్’ పేరిట 2023లో ఓ అమెరికన్ మూవీ కూడా విడుదలైంది. పేరుకు తగ్గట్టుగానే ఇది ఓ ‘అమెరికన్ యాక్షన్ కామెడీ హారర్’ థీమ్‌తో తయారైన సినిమా. -
అతిగా నీళ్లు తాగుతున్నారా?
నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అలాగే ప్రతి సెలబ్రిటీ ప్రకావంతమైన చర్మం వెనుక సీక్రెట్ హైడ్రేషన్. మంచి ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం పుష్కలంగా నీళ్లు తాగడం అత్యంత కీలకం. నీళ్లు తాగడం ఎంత ముఖ్యమో అలానే బ్యాలెన్స్‌గా తాగడం అనేది కూడా అత్యంత అవసరమని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అతిగా నీళ్లు తాగితే అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలమంది నీళ్లు తాగే విషయంలో తప్పులు చేస్తున్నారని చెబుతున్నారు నిపుణులు. మోతాదుకి మించి నీళ్లు తాగితే ఎలాంటి సమస్యలు వస్తాయో నిపుణుల మాటల్లోనే సవివరంగా చూద్దాం..!.అధికంగా నీళ్లు తాగితే..హైపోనాట్రేమియాగా పిలిచే ఇంటాక్సికేషన్ సంభవిస్తుంది. ఇది రక్తంలోని సోడియం సాంద్రతలు పలుచన చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. సోడియం అనేది ఒక కీలకమైన ఎలక్ట్రోలైట్. ఇది కణాల లోపల, వెలుపల ద్రవాల సమతుల్యతను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే కిడ్నీలు అదనపు నీటిని సమర్థవంతంగా తొలగించకపోతే మిగులు నీరు కణాల్లోకి ప్రవేశిస్తుంది. తద్వారా అవి ఉబ్బుతాయి. ఇక్కడ సోడియం నరాల సిగ్నలింగ్ , కండరాల పనితీరుకి ద్రవ సమతుల్యతకు బాధ్యత వహించే కీలకమైన ఎలక్ట్రోలైట్. తగినంత సోడియం లేకుండా శరీరం సాధారణ సెల్యులార్ పనితీరు నిర్వహించడం కష్టమవుతుంది. ఇది ఒక్కసారిగా బహుళ అవయవాలను ప్రభావితం చేస్తుంది. అలానే మూత్రపిండాలు గంటకు 0.8 నుంచి 1 లీటరు నీటిని మాత్రమే ఫిల్టర్ చేయగలవు. ఎప్పడైతే అధికంగా నీరు తీసుకుంటామో దీని వల్ల రక్తం పలుచబడటానికి దారితీస్తుంది. ఫలితంగా ఎలక్ట్రోలైట్స్ పలుచబడి ద్రవాల మార్పుకి కారణమవుతుంది. ఇది సెల్యూలర్ వాపుకి కారణమయ్యి.. మెదడు వంటి ముఖ్యమైన అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ వాపు ఇతర భాగాల్లో అంత ప్రమాదకరం కాదు కానీ మెదడులో సంభవిస్తే ప్రాణాంతకంగా మారిపోతుంది. ఈ పరిస్థితిని సెరిబ్రల్ ఎడెమా అంటారు. సెరిబ్రల్ ఎడెమా లక్షణాలు...వికారం, వాంతులుతలనొప్పులుగందరగోళంఅలసటకండరాల తిమ్మిరిమూర్చకోమా, తలనొప్పిచేతులు, పాదాలు లేదా ముఖంలో వాపు ఈ పరిస్థితి రాకుండా నీటిని తాగడం తగ్గించాలి. అలాగే ఎలక్ట్రోలైట్ సమతుల్యతను పునరుద్ధరించేలా వైద్య సహాయం తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ఎంత నీరు తాగితే బెటర్..మనం ఉంటున్న వాతారవణం, శారీరక శ్రమ తదితర అంశాల ఆధారంగా నీటిని తీసుకోవడం అనేది ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా నిపుణులు సిఫార్సు చేసినవి..పురుషులు: రోజుకు సుమారుగా 3.7 లీటర్లు (125 ఔన్సులు) మొత్తం ద్రవాలు (నీరు, ఇతర పానీయాలు, ఆహారంతో సహా).మహిళలు: రోజుకు సుమారుగా 2.7 లీటర్లు (91 ఔన్సులు) మొత్తం ద్రవాలు.ఇంతకు మించి తీసుకుంటే ఓవర్‌హైడ్రేషన్ సంభవించే అవకాశం ఉంటుంది. అందువల్ల మన శరీరం ఇచ్చే సంకేతాలకు అనుగుణంగా నీటిని తీసుకునే యత్నం చేయమని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే ఎక్కువ చెమట పట్టే వ్యాయామాలు చేసేవారు, వేడి లేదా పొడి వాతావరణంలో ఉన్నవారు ద్రవ నష్టాన్ని భర్తీ చేసుకునేలా అధిక నీరు తీసుకోవడం మంచిది. (చదవండి: ఐదుపదుల వయసులోనూ స్లిమ్‌గా మలైకా..శరీరాకృతి కోసం..!) -
Health: మందు మానేందుకు కూడా.. మందు ఉందా?
మా వివాహమై పదిహేనేళ్ళయింది. పెళ్ళికి ముందే ఆయనకు కొద్దిగా తాగుడు అలవాటుండేది. పోను పోను ఈ మధ్య మరీ ఎక్కువైంది. రెండేళ్ళ నుండి పగలు రాత్రి తేడా లేకుండా, తాగుతున్నారు. తాగనప్పుడు ఎంత మంచిగా ఉంటారో, తాగితే అంత గొడవ చేస్తారు. పొద్దున లేస్తూనే, ఒళ్ళంతా వణకటం, నీరసం, చికాకుగా, ... ఉందంటూ ఏ పనీ చేయలేకపోవడం, మళ్ళీ తాగితేనే గాని పని చేయలేనంటున్నారు.ఈ అలవాటు వల్ల, బిజినెస్ దెబ్బ తిని, చాలా నష్టపోవటమే కాకుండా, నలుగురిలో చులకన అయిపోయారు. పిల్లలు కూడా ఆయన్ను లెక్క చేయడం లేదు. తిండి, నిద్ర కూడా బాగా తగ్గి, చిక్కిపోయారు. ఇలాగే తాగుతుంటే ఆయన మాకు దక్కరేమోనని భయంగా ఉంది. డాక్టరు దగ్గరకు రమ్మంటే రావడం లేదు. మాకేదైనా పరిష్కారం చూపించగలరు. – కోమలి, రాజమండ్రితాగుడుకు అలవాటు పడటమనేది కూడా, ఒక మానసిక జబ్బు కిందే వస్తుందన్నది చాలామందికి తెలియదు. సరదాగా ్ర΄ారంభించి, చివరకు దానికి అలవాటు పడిపోతారు. మానాలనుకున్నా మానేయలేని స్థితికి వెళ్తారు. సమస్యలొచ్చినా, సంతోషమొచ్చినా, ఏదో ఒక కారణం పెట్టుకుని చాలామంది ఇలా తాగుడుకు బానిసలవుతారు. దీనివల్ల అన్ని విధాలా నష్టపోవడమే కాకుండా లివర్ దెబ్బతిని చివరకు ‘సిరోసిస్’ అనే వ్యాధి బారిన పడతారు. ్ర΄ాణాలకు ముప్పు ఉందని తెలిసినా తెగించి తాగే వారు కూడా చాలామంది ఉంటారు.మునుపటి కంటే ఇప్పుడు తాగుడు అలవాటు నుంచి పూర్తిగా విముక్తి కల్పించేందుకు ఆధునిక మానసిక వైద్య శాస్త్రంలో మంచి మందులు, చికిత్సా పద్ధతులు ఉన్నాయి. అయితే అందుకు ఆ వ్యక్తి సహకారం చాలా అవసరం. ఏదో ఒక విధంగా ఒప్పించి మీరు సైకి యాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. మద్యం పైన తపన తగ్గించేందుకు ‘యాంటీ క్రేవింగ్ డ్రగ్స్’, మద్యం పై ఎవర్షన్ కలిగించేందుకు ‘డిటెరెంట్స్’ అనే మందులతో ΄ాటు, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, ఫ్యామిలీ కౌన్సెలింగ్ లాంటి మానసిక చికిత్సా పద్ధతులతో మీ వారిని ఆ అలవాటు నుంచి పూర్తిగా బయట పడేయవచ్చు.– డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com -
Bihar: కలుషిత నీరు తాగి బాలిక మృతి.. 9 మంది విద్యార్థులు అస్వస్థత
నలంద: బీహార్‌లోని నలంద జిల్లాలోగల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో కలుషిత నీరు తాగి ఒక బాలిక మృతి చెందగా, 9 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. మృతిచెందిన బాలిక పాఠశాల విద్యార్థిని కాదని, పాఠశాలలోని తన స్నేహితురాలిని కలిసేందుకు వచ్చిందని నలంద జిల్లా అధికారులు చెబుతున్నారు. కలుషిత నీరు తాగి అనారోగ్యం బారినపడిన మరో 9 మంది బాలికలను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా నీటి నమూనాను అధికారులు పరీక్షల నిమిత్తం పంపారు.నలంద జిల్లా మేజిస్ట్రేట్ శశాంక్ శుభాంకర్ మంగళవారం మాట్లాడుతూ పాఠశాల ఆవరణలోని ఆర్ఓ సిస్టమ్ దగ్గర నీటిని తాగిన కొంతమంది బాలికలు వాంతులు, కడుపునొప్పితో బాధపడ్డారన్నారు. వెంటనే వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించామమన్నారు. అయితే చికిత్స పొందుతూ ఓ బాలిక మృతి చెందిందని తెలిపారు. అస్వస్థతకు గురైన తొమ్మిది మంది విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. పాఠశాలలోని ఆర్ఓ వ్యవస్థను సక్రమంగా నిర్వహించడం లేదని తమ దృష్టికి వచ్చిందని, దానిలోని నీటి నమూనాలను టెస్టింగ్ కోసం పంపించామన్నారు. పాఠశాల వార్డెన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అతన్నిఅధికారులు సస్పెండ్ చేశారు. -
ఎకో విలేజ్‌లో కలుషిత నీరు.. 200 మంది అస్వస్థత
న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడా వెస్ట్‌లోని ఎకో విలేజ్- 2 సొసైటీలో కలుషిత నీరు తాగి, 200 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో మహిళలు, పిల్లలు అధికంగా ఉన్నారు. అధికారులు బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం గ్రేటర్ నోయిడాలోని ఎకో విలేజ్- 2లో రెండు రోజుల క్రితం ట్యాంక్‌ను రసాయనాలతో శుభ్రం చేశారు. ఆ తరువాత ఈ ట్యాంకు నీటిని తాగిన 200 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ ఉదంతం గురించి సొసైటీలో ఉంటున్న వారు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం వాటర్ ట్యాంక్‌ను రసాయనాలతో శుభ్రం చేశారని, అయితే వాటర్ ట్యాంక్‌లో ఇంకా రసాయనం మిగిలి ఉందని, దాని కారణంగానే ఈ ఘటన జరిగిందని చెప్పారు. ప్రస్తుతం తాము బయటి నుంచి నీరు తెచ్చుకుని వినియోగించుకుంటున్నామన్నారు. -
అతిగా కాఫీ తాగడం కూడా ఒక వ్యసనమేనని మీకు తెలుసా!?
రవికుమార్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. 29 సంవత్సరాలు. కాలేజీ రోజుల్లో అర్ధరాత్రి చదువుల కోసం కాఫీ తాగడం మొదలుపెట్టాడు. క్రమంగా అది అలవాటుగా మారింది. ఉద్యోగంలో చేరాక పనిలో ఒత్తిడి తట్టుకోవడానికి కాఫీ తీసుకోవడం ఎక్కువైంది. మొదట్లో రోజూ ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ తాగేవాడు. కొన్ని సంవత్సరాలుగా అది రోజుకు ఐదారు కప్పులకు పెరిగింది.ప్రతి కప్పులో సుమారు 100–150 మి. గ్రా. కెఫీన్ ఉంటుంది. కాఫీతో పాటు కోలా, ఎనర్జీ డ్రింక్స్ కూడా తాగడం వల్ల అతను రోజూ 600 మి. గ్రా. కంటే ఎక్కువ కెఫీన్ తీసుకుంటున్నాడు. ఇది రోజువారీ పరిమితి కంటే 400 మి. గ్రా. ఎక్కువ. ఇప్పుడు కాఫీ లేదా సాఫ్ట్ డ్రింక్ తాగకుండా ఉండలేని పరిస్థితికి వచ్చాడు. మానాలని ప్రయత్నించినా సాధ్యంకావట్లేదు. కాఫీ మానేస్తే విపరీతంగా తలనొప్పి. నిద్ర పట్టట్లేదు. డాక్టర్‌ను కలిశాడు. అతను కాఫీకి అడిక్ట్ అయ్యాడని, మానేయమని చెప్పాడు. మానేశాడు. మళ్లీ తలనొప్పి, నిద్ర పట్టకపోవడం మామూలయ్యాయి. దాంతో డాక్టర్ సలహా మేరకు సైకాలజిస్ట్‌ని సంప్రదించాడు. సైకాలజీ అనగానే ఆశ్చర్యపోయాడు రవికుమార్. ‘ఏంటి సర్, కాఫీ తాగడమేమైనా మెంటల్ ఇల్నెసా? దానికి కూడా సైకాలజిస్ట్‌ను కలవాలా?’ అని అడిగాడు.‘అతిగా ఏ పని చేసినా అది వ్యసనమే. కాఫీ వ్యసనంగా మారడం, దాన్నుంచి బయటపడలేకపోవడం కూడా ఒక మానసిక సమస్యే. ఒక పద్ధతి ప్రకారం దాన్నుంచి బయటపడాలి. అందుకు సైకోథెరపీ అవసరం’ అని డాక్టర్ చెప్పారు. దాంతో సైకాలజిస్ట్‌ని సంప్రదించాడు రవికుమార్.మూడు నెలల చికిత్స తర్వాత, రవి విజయవంతంగా రోజుకు ఒక కప్పు కాఫీకి మాత్రమే పరిమితమయ్యాడు. విత్ డ్రాయల్ లక్షణాలేవీ కనిపించలేదు. కెఫీన్ పై ఆధారపడకుండానే పని చేయగలుగుతున్నాడు. ఇప్పుడు మరింత ఎనర్జిటిక్‌గా, కంట్రోల్డ్‌గా ఉంటున్నాడు.కెఫీన్ వ్యసనం లక్షణాలు..– కాఫీ లేదా ఎనర్జీ డ్రింక్ తాగనప్పుడు తలనొప్పి.– పని ముగించుకుని అలసిపోయినప్పటికీ, రాత్రి నిద్ర పట్టకపోవడం, దీర్ఘకాలిక నిద్ర లేమి.– తక్కువ వ్యవధిలో ఎక్కువ కాఫీ తాగినప్పుడు విశ్రాంతి లేకపోవడం, ఆత్రుత, చికాకు. – స్ట్రాంగ్ కప్ కాఫీ లేకుండా దినచర్య మొదలుపెట్టలేకపోవడం. పని, మీటింగ్స్ అన్నీ కెఫీన్పై ఆధారపడటం. – కెఫీన్ తీసుకోవడం తగ్గించడానికి ప్రయత్నించినప్పుడు, పనితీరు పేలవంగా మారడం. – ఉద్యోగంలో పని ఒత్తిడిని, డిమాండ్స్‌ను ఎదుర్కోవడానికి ఎక్కువ కెఫీన్ తీసుకోవడం. – సరైన ఆహారం, వ్యాయామం వంటి వాటిని వదిలేయడం. శక్తి కోసం కెఫీన్ పై మాత్రమే ఆధారపడటం.విత్ డ్రాయల్ లక్షణాలు..– కాఫీ మానేసిన 24 గంటల్లో తీవ్రమైన తలనొప్పి.– విపరీతమైన అలసట, మామూలు పనులు కూడా చేయలేకపోవడం.– ఆందోళన, కుంగుబాటు.. ఏదో కోల్పోయిన ఫీలింగ్, ఏదో జరుగుతుందన్న భయం. – పనిపై ఏమాత్రం దృష్టి పెట్టలేకపోవడం, గడువులోపు పూర్తి చేయలేకపోవడం, చేసిన పనిలో తప్పులు.నిదానంగా, పద్ధతిగా..హఠాత్తుగా కాఫీ మానేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని గుర్తించిన రవి, వైద్యుని సలహా మేరకు మొదట రోజుకు నాలుగు కప్పులు మాత్రమే తీసుకున్నాడు. ఆ తర్వాత మూడు, ఆ తర్వాత రెండు కప్పులకు పరిమితమయ్యాడు. – నెమ్మదిగా కెఫీన్ లేని కాఫీ, హెర్బల్ టీలకు మారాడు. ఒత్తిడిని తట్టుకునేందుకు కాఫీపై ఆధారపడకుండా ఉండటానికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ) చికిత్స తీసుకున్నాడు. – కెఫీన్ పై ఆధారపడకుండా పని సంబంధిత ఒత్తిడిని నిర్వహించడానికి మెలకువలను నేర్చుకున్నాడు. – మైండ్‌ఫుల్‌నెస్, శ్వాస వ్యాయామాలు, పని సమయంలో విరామాల ద్వారా ఒత్తిడిని అధిగమించాడు. సమతుల ఆహారం, క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం, స్థిరమైన నిద్రతో కూడిన ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాడు. కెఫీన్ నుంచి వచ్చే శక్తిని సరైన పోషకాహారం, శారీరక శ్రమ ద్వారా వచ్చే సహజ శక్తితో భర్తీ చేశాడు.– అతను కాఫీ లేదా సాఫ్ట్ డ్రింక్ వైపు వెళ్లినప్పుడు వారిస్తూ కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా మద్దతుగా నిలిచారు.– సైకాలజిస్ట్ విశేష్ -
అందం ఆరోగ్యం కలగలిపిన సిరి : కలబంద
Aloe Vera Juice: కలబంద రసం ప్రతిరోజు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?ప్రస్తుత కాలంలో కలబంద పేరువినని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అలోయి జాతికి చెందిన ఇది ఉష్ణమండలంలో విస్తారంగా పెరుగుతుంది. అలోవెరా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది కూడా చాలామందికి తెలుసు. అందంనుంచి ఆరోగ్యం దాకా కలబందతోలాభాల గురించి తెలుసుకుందాం.చర్మం, దంత, నోటి , జీర్ణ ఆరోగ్యానికి అలాగే బ్లడ్ షుగర్ లాంటి ఎన్నో సమస్యలకు చెక్ పెట్టడంలో సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.యాంటీఆక్సిడెంట్ లక్షణాలు సన్‌బర్న్ చికిత్సకు ఉపయోగడతాయి. చర్మం, జుట్టు అందాన్ని కాపాడుతుంది. అందుకే అనేక రకాల బ్యూటీ ప్రొడక్ట్స్‌లో దీన్ని విరివిగా వాడతారు. దీంట్లో ఇంట్లోనే పెంచుకోవడం కూడా చాలా సులువు.కలబందలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. కలబందలో విటమిన్ ఏ, సీ, ఇ , బి-కాంప్లెక్స్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, అమైనో ఆమ్లాలు వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఎంజైమ్‌లు, ఫైబర్లు జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కాలిన గాయాలు , అటోపిక్ డెర్మటైటిస్ (1 ట్రస్టెడ్ సోర్స్, 2 ట్రస్టెడ్ సోర్స్) వంటి ఇతర చర్మ రుగ్మతలకు చికిత్సగా పని చేస్తుంది.కలబంద రసం ఆరోగ్య ప్రయోజనాలుఆహారాన్ని జీర్ణం చేస్తుంది. కొవ్వు నిల్వను నిరోధిస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. షుగర్ బోర్డర్లో ఉన్నవారు, ప్రీ డయాబెటిక్ రోగులకు కూడా ఈ కలబంద రసం బాగా పని చేస్తుంది.కలబంద పొట్టను శుభ్రపరుస్తుంది. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. కలబంద రసం తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కలబంద రసాన్ని తరచుగా తీసుకోవడం వల్ల చర్మం గ్లో పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య కూడా దూరమవుతుంది. నోటి దుర్వాసనను తగ్గించడంలో పాటు చిగుళ్ళు, దంతాలను శుభ్రంగా ఉంచడంలో అలోవెరా రసం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. -
కొన్ని వ్యాధులకు మద్యమే మందట.. తాగితే తగ్గుతుందట!
'మద్యం ఆరోగ్యానికి హానికరం' అంటూ యాడ్లలోనూ సినిమాల్లోనూ తెగ కనిపిస్తుంది. అదీగాక మద్యం తాగితే లివర్, కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులు పాడై ప్రాణాలు కోల్పోతారనివైద్యులు హెచ్చరిస్తుంటారు. అయితే మద్యం తాగితే కొన్ని వ్యాధులు రావట. పైగా ఆ వ్యాధులకు మద్యమే మందట. తాగితే ఆ వ్యాధులు తగ్గుముఖం పడతాయిని సాక్షాత్తు వైద్యులే చెబుతున్నారు. అలా అని ఇష్టారీతిగా తాగేయ్యొద్దని వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ ఏ వ్యాధులకు మద్యం మందు? ఎంత మోతాదులో తాగితే బెటర్ అంటే.. ఇటీవల కాలంలో మద్యం తాగేవాళ్ల సంఖ్య రోజు రోజుకి అనూహ్యంగా పెరుగుతుంది. దీనివల్ల దీర్ఘాకాలిక వ్యాధులు బారినపడే ప్రమాదం ఉదన్నా సరే వీకెండ్ అని, వెకేషన్ అని ఏదో ఒక సందర్భం పేరుతో విచ్చల విడిగా తాగేయడం నేటి యువతకు ఓ ఫ్యాషన్ అయిపోయిందని చెప్పొచ్చు. పోనీ తాగిన అందుకు తగ్గ ఫుడ్ జ్రాగత్తలు తీసుకుంటే బావుండు. పడని బ్రాండెడ్ మందు కూడా ట్రై చేసేసి లేనిపోని ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటుంటారు కొందరూ. ఆరోగ్య నిపుణులు, వైద్యులు మద్యం సేవిస్తే వచ్చే ఆరోగ్య సమస్యల గురించి వివరించినా.. ఐ డోంట్ కేర్ అన్నట్లు తాగేస్తుంటారు మందుబాబులు. పరిస్థితి చేయి దాటాక తాగుడు అలవాటు నుంచి బయటపడేందుకు డీ అడిక్షన్ సెంటర్ల చుట్టూ తెగ ప్రదిక్షణాలు చేసేస్తుంటారు. ఇంత వరకు పరిస్థితి ఎందుకు తెచ్చుకోవడం అని వైద్యులు తరుచుగా ప్రశ్నిస్తుంటారు రోగులన. అసలు ఇలాంటి సమస్య తెచ్చుకోకుండా మందుబాబులు జాగ్రత్తగా ఉండేలా వైద్యులు కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ఇష్టంగా తాగే మందు వల్ల కలిగే ప్రయోజనాల తోపాటు ఏ మోతాదులో తీసుకుంటే హాయిగా ఉండొచ్చో సవివిరంగా చెప్పారు. అవేంటంటే.. ఆ వ్యాధులు తగ్గుతాయట.. బ్రాందీ, రమ్, విస్కీ జలుబు, ఫ్లూ వంటి వ్యాధులు బారినపడకుండా కాపాడుతుందట. దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయట. అలాగే జలుబు కారణంగా వచ్చే శ్లేష్మాన్ని క్లియర్ చేస్తుందట. ఇందులో ఉండే ఎల్లాజిక్ యాసిడ్ కంటెంట్ క్యాన్సర్ వ్యతిరేకంగా పనిచేస్తుందట. ముఖ్యంగా అండాశయ, మూత్రాశయ క్యాన్సర్లు రాకుండా నియంత్రిస్తుందట. రాగి బారెల్స్‌లో ఉండే బ్రాందీలో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందట. ఇది మంచి యాంటీ ఏజింగ్‌గా పనిచేస్తుంది. అలాగే కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది. పైగా హృదయనాళాల ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఇలాంటి మంచిఫలితాలను పొందాలంటే ఇక్కడ బ్రాందీ, రమ్ వంటివి రోజుకి 30 నుంచి 60 ఎంఎల్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వ్యక్తిగత ఆరోగ్య చరిత్రను పరిగణలోనికి తీసుకుని, అందుకు అనుగుణంగా నిపుణుల సూచించిన విధంగా మోతాదుకు మించి మద్యం సేవించకుండా ఉంటేనే ఈ సత్ఫలితాల పొందగలరని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ ఏదైన తగు మోతాదులో మితంగా ఉంటే శరీరానికి అవసరమయ్యే మంచి ఔషధ గుణాలను పొందగలమని చెబుతున్నారు నిపుణులు. వార్నింగ్: తాగమని కాదు..! ఇక్కడ మందు తాగండని లేదా తాగడం మంచిదని చెప్పడం ప్రధాన ఉద్దేశ్యం కాదు. తాగే అలవాటు ఉన్నవారు, అస్సలు తాగకుండా ఉండలేని వారు దీని వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుంటే కనీసం తగు మోతాదులో లేదా ఆరోగ్యకరమైన పద్ధతిలో తీసుకుని సురక్షితంగా ఉంటారని తెలియజేయడమే తప్ప. ఇక్కడ ఎవర్నీ మందు తాగమని ప్రోత్సహించే ఉద్దేశ్యం లేదని చెబుతున్నారు నిపుణులు. కొన్ని హానికరైమన వాటిల్లో కూడా మేలు చేసే గుణాలు ఉంటాయని చెప్పేందుకే అని అన్నారు. ఇవి తెలుసుకుంటే ఆ చెడు అలవాటుని కూడా ఆరోగ్యానికి మంచిదిగా మలుచుకుంటే తాగుడు సమస్య నుంచి బయటపడొచ్చు లేద చెక్ పెట్టగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసమే. దీన్ని అనుసరించే ముందు వ్యక్తిగత వైద్యులు, ఆరోగ్య నిపుణుల సలహాలు సూచనల మేరుకు పాటించటం ఉత్తమం. -
ఫుల్‌గా తాగితే చిరుత అయినా అంతేనా! ఇలానే ఉంటుందా..?
ఫుల్‌గా తాగితే మనిషి ఎలా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కపడితే అక్కడ పడిపోయి ఉంటాడు. పైగా ఏం మాట్లాడతాడో కూడా తెలియదు. అలా తాగేసి రోడ్లపై పడిపోయిన వాళ్లు ఎందరో ఉన్నారు. అయితే ఇలా క్రూర జంతువులు తాగినే పరిస్థితి ఇలానే ఉంటుందా? అంటే కచ్చితంగా చెప్పలేం అవి కూడా మత్తులోనే జోగుతాయని. కానీ ఇక్కడొక చిరుతని చూస్తే అవి కూడా ఇంతేనా! అని అనుకుంటారు. అసలేం జరిగిందంటే..బీహార్ రాష్ట్రంలో అడవికి దగ్గరగా ఉన్న ఓ మారుమూల గ్రామంలో మద్యం తయారీ కర్మాగారం ఉంది. అయితే అందులోకి ఓ చిరుత పులి అనుకోకుండా ప్రవేశించింది. పైగా అక్కడ ఉండే మద్యాన్ని ఫుల్‌గా తాగేసింది. పాపం ఆ మద్యం సేవించిన తర్వాత అది ఒక్కసారిగా మత్తులోకి వెళ్లిపోయింది. కనీసం అడుగు తీసి అడుగువేయలేనంత మత్తులోకి వెళ్లిపోయింది. ఇంతలో కర్మాగారంలో పనిచేసే సిబ్బంది అక్కడకు వచ్చారు. మొదట ఆ చిరుతను చూసి వారంతా భయపడ్డారు. అయితే అది అలాగే పడుకుని ఉండటం చూసి బహుశా మద్యం తాగేసి ఉంటుంది అందుకే అలా ఉందని అనుకున్నారు. అయినప్పటికి అది ఇక్కడే ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే అనుకుని దాన్ని అక్కడ నుంచి బయటకు పంపే యత్నం చేశారు. ఇంతలో అది లేచింది. కానీ నడిచే మూడ్‌లో అస్సలు లేదు. ఇక వాళ్లు ఎలాగో లేచింది కదా అని నెమ్మదిగా బయటకు వెళ్లేలా చేశారు. అయితే అక్కడున్న వారంతా దాని దగ్గరకు వచ్చి దాని మీద చేయి వేసినా.. కిమ్ అనకుండా ఉంది. పైగా అడుగులో అడుగు వేసుకుంటూ ప్రశాంతంగా వెళ్తోంది. అందుకు సంబంధించిన ఘటనను ఓ ఔత్సాహికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లంత ఆశ్చర్యం వ్యక్తం చేయడమే గాక ఆ పులి గనుకు మత్తులో లేకుంటే మీ అందరి తలలు తీసుకువెల్లేది అంటూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి (చదవండి: మంచు పడవ..కేవలం శిల్పం కాదు! అలా నీటిలో చక్కర్లు కొట్టేయొచ్చు!) -
fact check: పచ్చమీడియాకు ‘అతి’సారం!
సాక్షి ప్రతినిధి, గుంటూరు/నెహ్రూనగర్(గుంటూరు): పచ్చమీడియాకు అతిసారం సోకినట్టుంది. గుంటూరు నగరంలో కలుషిత జలం కాటేసిందంటూ మరోసారి విషాన్ని విరజిమ్మింది. తప్పుడు కథనాలతో పేట్రేగిపోయింది. చికెన్‌పాక్స్, న్యూమోనియా కారణాలతో శుక్రవారం మరణించిన మహ్మద్ ఇక్బాల్ డయేరియాతో మరణించాడని దుష్ప్రచారానికి దిగింది. గత వారంలో మరణించిన పద్మ మరణంపైనా ఇలాగే రాక్షస రాతలు రాసింది. గుంటూరులో నివాసం ఉంటున్న మహ్మద్ ఇక్బాల్ ఈ నెల 11న సాయంత్రం విరేచనాలు , వంటిమీద చీము పొక్కులతో ఆస్పత్రిలో చేరాడు. చికిత్స అందించడంతో విరేచనాలు తగ్గాయి. పొక్కులను చికెన్‌పాక్స్‌గా వైద్యులు గుర్తించారు. బ్లడ్‌షుగర్ లెవల్స్ కూడా 400 దాటి ఉండటంతో డెర్మటాలజీ డాక్టర్లు పరీక్షించి గోరంట్లలోని అంటువ్యాధుల ఆస్పత్రి(జ్వరాల ఆస్పత్రి)లో చేరాలని సూచించారు. ఇక్బాల్ అక్కడికి వెళ్లేందుకు నిరాకరించాడు. జీజీహెచ్‌లోనూ ఉండకుండా వెళ్లిపోయాడు. రెండురోజల తర్వాత 15న న్యూమోనియా లక్షణాలతో ఊపిరితీసుకోవడానికి ఇబ్బందిపడుతూ మళ్లీ వచ్చాడు. అప్పుడు కూడా వైద్యులు జ్వరాల ఆస్పత్రికి వెళ్లాలని సూచించినా వెళ్లలేదు. ఇంటికి వెళ్లిపోయాడు. మళ్లీ తర్వాత రోజు తెల్లవారుజామున రెండు గంటల సమయంలో చికెన్‌పాక్స్, న్యూమోనియా లక్షణాలతో తీవ్రంగా ఇబ్బందిపడుతూ జీజీహెచ్‌కు వచ్చాడు. వచ్చిన అరగంటలోనే మృతి చెందాడు. వైద్యులు చికెన్‌పాక్స్, అదుపులో లేని మధుమేహం, న్యూమోనియా లక్షణాలతో చనిపోయాడని నివేదిక ఇచ్చారు. కుటుంబ సభ్యులు భీమవరం వెళ్లడంతో గుంటూరు మేయర్ కావటి మనోహర్‌నాయుడు వారితో ఫోన్లో మాట్లాడారు. వారు కూడా అనారోగ్యం వల్లే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటన జరిగిన వెంటనే మృతుడు ఇక్బాల్ నివాసం ఉన్న రైలుపేట ప్రాంతాలలో తాగునీటి నమూనాలు సేకరించి పరీక్షించారు. ఎక్కడా నీరు కలుషితం కాలేదని నివేదికలొచ్చాయి. గుండెపోటుతోనే పద్మ మరణం ఈనెల 10న మరణించిన ఎం.పద్మ(18) కూడా కార్డియాక్ అరెస్టుతో చనిపోయిందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. వాంతులు, విరేచనాలతో రెండురోజుల పాటు ఆర్ఎంపీ వద్ద వైద్యం చేయించుకుని ఆఖరి ఘడియల్లో జీజీహెచ్‌లో చేరింది. అస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే కార్డియాక్ అరెస్టుతో మృతి చెందింది. కలుషిత నీరైతే ఒకరిద్దరే జబ్బున పడతారా? కలుషిత నీరైనా, అతిసారం అయినా ఒకరిద్దరే జబ్బున పడరని వైద్యులు చెబుతున్నారు. ఆ కలుషిత నీరు తాగిన అందరూ రోగం బారిన పడతారని పేర్కొంటున్నారు. అలాంటప్పుడు ఒక వేళ కలుషిత నీటి వల్ల ఇక్బాల్, పద్మ జబ్బు బారిన పడితే వారి కుటుంబాలు ఎలా ఆరోగ్యంగా ఉన్నాయన్న ప్రశ్నకు ఎల్లోవీుడియా వద్దగానీ, టీడీపీ నేతల వద్దగానీ సమాధానం లేదు. అధికారులు అప్రమత్తం ఎల్లోవీుడియావి కట్టుకథలే అయినా గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈనెల పది నుంచి నగరంలో రోజుకు వెయ్యికిపైగా తాగునీటి శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేస్తున్నారు. ఎక్కడా కూడా తాగునీరు కలుషితం అయినట్లు ఆధారాలు దొరకలేదు. మినరల్ వాటర్ వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని రీజనల్ మెడికల్ ల్యాబ్ రిపోర్టు ఇచ్చింది. పలు ఆర్ఓ ప్లాంట్లలో ఉండాల్సిన పీహెచ్ కన్నా తక్కువ ఉండటం, బ్యాక్టీరియా ఉండడాన్ని గుర్తించారు. వీటిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు. మరోవైపు పానీపూరి కోసం వాడుతున్న నీరు కలుషితంగా ఉండటం వల్ల వ్యాధులు వస్తున్నాయని రీజినల్ ల్యాబ్ నిర్ధారించింది. ఈ విషయాలన్నీ తెలిసినా కేవలం ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా పచ్చమీడియా రెచ్చిపోతోంది. స్వచ్ఛనీరే సరఫరా చేస్తున్నాం గుంటూరు నగర ప్రజలకు నగరపాలక సంస్థ ద్వారా స్వచ్ఛనీరే సరఫరా చేస్తున్నాం. కొన్ని పత్రికలు రాజకీయ అజెండాతో కలుషిత జలాలు అంటూ విషం చిమ్ముతున్నాయి. రైలుపేటకు చెందిన ఇక్బాల్ చికెన్‌పాక్స్, న్యూమోనియాతోనే చనిపోయాడు. ఈ విషయాన్ని అతడి కుటుంబ సభ్యులూ, జీజీహెచ్ వైద్యులూ ధ్రువీకరించారు. గత ప్రభుత్వ హయాంలో 2018లో గుంటూరు నగరంలో 27 మంది అతిసారంతో మృతి చెందారు. అప్పట్లో జీజీహెచ్‌లో రెండు వేల మంది చికిత్స తీసుకున్నారు. డయేరియా అయితే వందల మంది ఆస్పత్రుల పాలవుతారు. ప్రజలకు సరఫరా చేసిన ప్రతినీటిబొట్టునూ పరీక్షించిన తర్వాతే కుళాయిలకు వదులుతున్నాం. సీజనల్ వ్యాధులు సోకుతున్నందున ప్రజలంతా కాచి చల్లార్చిన నీటినే తాగాలని ముందే సూచించాం. ఇంటింటి ప్రచారమూ చేపట్టాం. రీజనల్ మెడికల్ ల్యాబ్ నివేదిక మేరకు మినరల్ వాటర్ ప్లాంట్ల నిర్వహణపై తగిన చర్యలు తీసుకోవాలని ఫుడ్ కంట్రోల్ శాఖకు లేఖ రాశాం. – మీడియాతో మేయర్ కావటి మనోహర్‌నాయుడు, కమిషనర్ కీర్తిచేకూరి, డిప్యూటీ మేయర్ బాలవజ్రబాబు -
రైలు నుంచి జారి పడి వ్యక్తి అక్కడిక్కడే మృతి
గద్వాల్ క్రైం: ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి ఒకరు మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం, నాపాడు జిల్లా, బాబుపలికి చెందిన గౌరి శంకర్(40) మంగళవారం ఉదయం 7 గంటలకు యశ్వంత్‌పూర్ నుంచి కోర్బా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైల్లో భార్య లంబేసాగర్, 6 ఏళ్ల కుమారుడితో బెంగుళూరుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో గద్వాల్ రైల్వేస్టేషన్ దాటిన అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో పూడూరు రైల్వేస్టేషన్ సమీపంలో వెళ్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు గౌరిశంకర్ జారి కిందపడడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ తెలిపారు. తాగిన మైకంలో కిందపడి.. జడ్చర్ల టౌన్: పట్టణానికి చెందిన విష్ణు (26) బుధవారం వీరశివాజీనగర్లోని మద్యం దుకాణం సమీపంలో ఉన్న డ్రెయినేజీ పక్కన పడి మృతిచెందాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మద్యానికి బానిసయ్యాడు. తాగిన మైకంలో పడిపోగా.. బుధవారం ఉదయం స్థానికులు గుర్తించి బంధువులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి చూడగా అప్పటికే చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. అంత్యక్రియలకు వెళ్తూ మరొకరు.. జడ్చర్ల టౌన్: సమీప బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు రైల్వే ప్లాట్‌ఫారంపై పడి మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాసులు (52) మహబూబ్‌నగర్‌లో సమీప బంధువు చనిపోవడంతో బుధవారం అంత్యక్రియలకు హాజరయ్యేందుకు రైలులో బయలుదేరాడు. జడ్చర్లలో ఉన్న కుమార్తెను తీసుకెళ్లేందుకు స్టేషన్లో రైలు ఆగకముందే దిగేందుకు ప్రయత్నించి ప్లాట్‌ఫారంపై పడి అక్కడికక్కడే మృతిచెందాడు. రైల్వే పోలీసులు పంచనా మా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాదేపల్లి ఆస్పత్రికి తరలించారు. ఇంటి తాళం పగలగొట్టి బంగారం, నగదు అపహరణ చారకొండ: మండల కేంద్రంలో ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి బంగారం, వెండి, నగదు చోరీకి పాల్పడ్డారు. ఎస్ఐ రవి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కొప్పుల బాల్నారయ్య ఈనెల 4న తమ కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్లారు. తిరిగి 5వ తేదీన ఇంటికి వచ్చారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంట్లో దాచిన రెండు చైన్లు, పూసలదండా, రింగులు, బంగారు నగలు నాలుగు తులాలు, వెండి ఆభరణాలు, రూ.98 వేల నగదు చోరీకి గురయ్యాయి. బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. -
భర్త వేధింపులు తాళలేక వివాహిత తీవ్ర నిర్ణయం!
నల్లబెల్లి(వరంగల్): భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సోమవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని రాంపూర్ గ్రామ పంచాయతీలో చోటుచేసుకుంది. నల్లబెల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ నైనాల నగేష్ తెలిపిన వివరాల ప్రకారం... సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలోని చిన్ననెమలి గ్రామ పంచాయతీకి చెందిన సూరినేని లక్ష్మి–సోమేశ్వర్రావు దంపతుల కుమార్తె మౌనిక(30), వరంగల్ నల్లబెల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పురం సారంగపాణి 14 ఏళ్ల క్రితం ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లు వీరి దాంపత్య జీవితం సజావుగానే సాగింది. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. కాగా, ఇటీవల సారంగపాణి మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని భార్యను తరుచూ వేధిస్తున్నాడు. ఈ విషయమై పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించి సారంగపాణిని మందలించారు. అయినా అతడిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ క్రమంలో సోమవారం ఉదయం మరోమారు భార్యతో గొడవ పడ్డాడు. దీంతో మనస్తాపానికి గురైన మౌనిక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
కిక్కెక్కింది.. నిద్ర ముంచుకొచ్చింది.. అట్లుంటది మనతోని!
పెద్దపల్లి: మందు బాబులూ.. ఒక్కక్షణం ఆలోచించండి.. మనం బయటకు వెళ్తే మళ్లీ ఇంటికొచ్చే దాకా మన కుటుంబం కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తూ ఉంటుంది. ఏదైనా జరగరానిది జరిగి ప్రాణాలు పోతే వాళ్లకు దిక్కెవరు? ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. జిల్లా కేంద్రంలోని అయ్యప్పగుడి చౌరస్తావద్ద రోడ్డుపై ఓ వ్యక్తి ఇలా గాఢనిద్రలో పడుకున్నాడు. చిత్తుగా మద్యం తాగడంతో మత్తు ఆవరించింది. ఆ కిక్కుతో ఒళ్లు మరిచి ఇలా నడిరోడ్డుపై నిద్రలోకి జారుకున్నాడు. ఎన్నికల వేళ.. ఎవరు పిలిచి మద్యం తాగించారో లేక.. సొంతంగా కొనుగోలు చేసి తాగాడో తెలియదు కానీ.. రాజీవ్‌రహదారి సిగ్నల్స్ పక్కనే రోడ్డుపై నిద్రపోతున్నాడు.. వాహనాల రద్దీ అధికంగా ఉంది. వాహనదారులు ఏమరుపాటుగా ఉంటే.. ప్రాణాలే పోవచ్చు. కానీ ‘సాక్షి’ చొరవ చూపింది. రోడ్డు నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి -
తాగిన మత్తులో.. మొగుడే యముడైనాడు..!
మహబూబ్‌నగర్: తాగిన మైకంలో కట్టుకున్న భార్యను కడతేర్చాడో ప్రబుద్దుడు. ఈ ఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని తల్పునూర్లో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల మేరకు.. తల్పునూర్‌కు చెందిన రాంపేట రాములు, నాగమణి (40) భార్యాభర్తలు. వీరిద్దరూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి పనులు చేసుకుని బతికేవారు. దసరా పండుగ నిమిత్తం వారంరోజుల కిందట స్వగ్రామానికి వచ్చారు. వీరికి ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉండగా.. పెద్దకూతురు స్వప్నకు పెళ్లయింది. మరో కూతురు హైదరాబాద్‌లో చదువుకుంటోంది. కుమారుడు సైతం హైదరాబాద్‌లో ఉంటూ పని చేసుకుంటున్నాడు. బుధవారం తాగిన మైకంలో నాగమణితో భర్త రాములు గొడవ పడ్డారు. ఇంట్లో ఏం జరిగిందో తెలియదు కానీ.. సాయంత్రం వరకు అతడు ఇంటి తలుపులను తెరవలేదు. సాయంత్రం 6గంటల ప్రాంతంలో వారి మొదటి కూతురు స్వప్న పిల్లలతో కలిసి ఇంటికి రాగా, చాలాసేపటి తర్వాత తండ్రి తలుపులు తెరిచాడు. ఆమె ఇంట్లోకి వెళ్లి చూస్తే తల్లి రక్తపు మడుగులో కనిపించింది. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడగా, అప్పటికే ఆమె మరణించినట్లు గుర్తించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. -
ఆల్కహాల్ మోతాదుకు మించితే చనిపోతారా?
మోతాదుకు మించి ఆల్కహాల్ తాగితే చనిపోతారా?..అంటే పలు ఉదంతాల్లో అది నిజమనే ప్రూవ్ అయ్యింది కూడా. ఎందువల్ల ఇలా జరుగుతుంది?. ఒక్కసారిగా అది మన శరీరానికి హని కలిగించే విషంలా ఎలా మారుతోంది తదితారాల గురించే ఈ కథనం. ఈ ఆల్కహాల్‌కి చెందిన ఛాలెంజింగ్లను తీసుకుని చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే చైనాలో ఓ వ్యక్తి రెండు లక్షలు గెలుచుకోవడం కోసం ఆఫీస్ పార్టీలో ఏకంగా ఒక లీటరు ఆల్కహాల్‌ని కేవలం పది నిమిష్లాల్లో హాంఫట్ చేశాడు. ఇక అంతే కాసేపటికే ప్రాణం పోయింది. ఆ వ్యక్తి పేరు జాంగ్. ఆస్ప్రతికి తరలించగా గుండెపోటు, ఆస్పిరేషన్ న్యూమోనియా తదతరాలతో బాధపడుతున్నట్లు తేలింది. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయినట్లు అతడి సన్నిహితులు తెలిపారు. ఆల్కహాల్ తాగేంతవరకు బాగానే ఉన్న వ్యక్తి వెంటనే ఎలా పాయిజన్ అయ్యి ప్రాణాంతకంగా మారింది...?. తక్కువ సమయంలో ఎక్కువ ఆల్కహాల్ తాగితే.. ఓ వ్యక్తి ఛాలెంజ్ పరంగా, లేదా ఏ కారణం చేతనైనా తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తాగితే అది ఒక్కసారిగా పాయిజన్‌గా మారిపోతుంది. అమాంతం రక్తంలో ఆల్కహాల్ స్థాయిలు పెంచేందుకు దారితీస్తుంది. రక్తంలో ఎప్పుడైతే ఆల్కహాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటాయో..అప్పుడూ కాలేయం దాన్ని విచ్ఛిన్నం చేయలేక ఇబ్బంది పడుతుంది. రక్తప్రవాహంలో అదనపు ఆల్కహాల్ సాధారణ పనితీరును దెబ్బతీసి శ్వాస, హృదయస్పందన రేటు, రక్తపోటు పడిపోయేలా చేస్తుంది. దీంతోపాటు శరీర విధులను నియంత్రించే మెదుడలోని భాగాలను కూడా ప్రభావితం చేస్తుంది. రక్తంలో ఆల్కహాల్ పెరుగుతూనే ఉన్నందున అతడు బతికే అవకాశాలు నెమ్మదిగా నెమ్మదిగా తగ్గిపోతుంది. సంకేతాలు లక్షణాలు.. ఆల్కహాల్‌తో ఇలాంటి ఛాలెంజ్‌లు ప్రమాదకరమైనవి. అత్యవసరంగా చికిత్స అందించకపోతే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఆ వ్యక్తులు ప్రమాదకరంలో ఉన్నారని ఎలా గుర్తించాలంటే.. వారి గోళ్లు, పెదవులు నీలం రంగులో మారి తేమగా లేదా చల్లగా అవుతున్నా.. నడవలేకపోతున్నా హృదయస్పందన సరిగా లేకపోయినా మూత్రశయం లేదా ప్రేగు నియంత్రణ కదలికలను నియంత్రించడం వాంతులు లేదా ఉక్కిరిబిక్కిరి చికిత్స! నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆల్కహాల్ పాయిజనింగ్ అనేది చాలా తీవ్రమైన పరిస్థితి. తక్షణమే ప్రాణాలను రక్షించేలా చికిత్స అందించాలి. నిర్జలీకరణానికి ఇంట్రావీనస్ ద్రవాలు ఇస్తారు. ఆ తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతారు అలాగే ఆల్కహాల్ పాయిజనింగ్తో బాధపడుతున్న వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండొచ్చు. కాబట్టి కాన్యులాను ఉపయోగించి వారికి ఆక్సిజన్ని అందించడం చికిత్సలో అత్యంత ముఖ్యం పొట్టని ఒక పంపు సాయంతో టాక్సిన్లు లేకుండా శుభ్రం చేయడం రక్తంలోఇన ఆల్కహాల్ స్థాయిలను తగ్గించేలా రక్తాన్ని ఫిల్టర్ చేసేందుకు డయాలసిస్ చేయడం చేసి. ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడతారు వైద్యులు. (చదవండి: అరుదైన అలెర్జీ..! సాక్షాత్తు వైద్యురాలే ఐనా..) -
తాగుడుకు బానిసై యువకుడి ఆత్మహత్య!
ఆదిలాబాద్: మద్యానికి బానిసై యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని మాకోడ గ్రామంలో గురువారం వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం... రకాడే సందీప్(33) కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం మానుకోవాలని మృతుడి తండ్రి రకాడే కారేబా, భార్య ఆశ తరుచుగా చెబుతున్నప్పటికీ మారడం లేదు. బుధవారం సైతం రాత్రి తాగి ఇంటికి వచ్చిన సందీప్‌ను కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో కోపంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన సందీప్ గుర్తు తెలియని పురుగుల మందు తాగి అర్ధరాత్రి ఇంటికి వచ్చి వాంతులు చేసుకోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. -
అన్నల మద్యం అలవాటుకు చెల్లెలు బలి.. సూసైడ్ నోట్లో మరో యువకుని పేరు?
ఉత్తరప్రదేశ్‌లోని కౌషాంబీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులకు ఆ బాలిక ఇంటిలో ఒక సూసైడ్ నోట్ లభ్యమయ్యింది. దానిలో ఆమె తాను సూసైడ్ చేసుకునేందుకు గల కారణాలను వివరించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ బాలిక సోదరులు మద్యానికి బానిసగా మారి ఇంటిలోని వారిని ఇబ్బంది పెడుతుంటారు. ఈ ఇబ్బందులను భరించలేకనే వారి సోదరి ఆత్మహత్య చేసుకుంది. కౌషాంబీ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్-4లో ఉంటున్న ఆ బాలిక ఇంటిలో ఎవరూలేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారికి ఆ ఇంటిలో మృతురాలు స్వయంగా రాసిన సూసైడ్ నోట్ లభ్యమయ్యింది. మద్యం మత్తుకు బానిసలైన సోదరులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 16 ఏళ్ల బాలిక తన తల్లి, ఇద్దరు సోదరులతో పాటు ఈ ప్రాంతంలో ఉంటోంది. ఆ బాలిక తండ్రి కొన్నేళ్ల క్రితమే మృతిచెందాడు. తల్లి ఇంటి భారాన్నిమోస్తోంది. ఆ బాలిక ఇద్దరు సోదరులు నిత్యం మద్యం మత్తులో మునిగితేలుతుంటారు. తల్లీకూతుర్లు ఈ విషయమై వారిని హెచ్చరించినా వారు తమ వ్యసనాన్ని విడిచిపెట్టలేదు. కొన్ని రోజుల క్రితం ఒక సోదరుడు ఏదో కేసులో జైలుకు వెళ్లాడు. తాజాగా ఆ బాలిక ఇంటిలో ఉన్న సోదరునికి తన ఫోను ఇచ్చి, మరమ్మతు చేయించి తీసుకురమ్మని చెప్పి బయటకు పంపింది. తల్లి కూడా పని కోసం వెళ్లింది. సూసైడ్ నోట్లో మరో యువకుని పేరు? ఇంటిలో ఎవరూలేని సమయం చూసుకుని ఆ బాలిక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనికి ముందు ఆమె ఒక సూసైడ్‌నోట్ రాసింది. దానిలో ఆమె తన సోదరులు మద్యానికి బానిస కావడంపై ఆవేదన వ్యక్తం చేసింది. అందుకే తాను సూసైడ్ చేసుకుంటున్నట్లు పేర్కొంది. కాగా ఆ బాలిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. పెద్దగా చదువుకోకపోయినా ఆ బాలిక సూసైడ్ నోట్‌ను ఇంగ్లీషులో రాసింది. ఆ నోట్లో ఆమె ఒక యువకుని పేరు రాసింది. అతను తన సోదరుని స్నేహితుడని, తన మృతదేహాన్ని చూసేందుకు అతనికి అవకాశం కల్పించాలని కోరింది. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి, దర్యాప్తు ప్రారంభించారు. ఇది కూడా చదవండి: ఆగస్టు 14.. చాలామందికి జ్వరం?.. మీరూ ఆ జాబితాలో ఉన్నారా?.. పిచ్చెక్కిస్తున్న మీమ్స్! -
ఎయిర్‌క్రాఫ్ట్ నడుపుతూ 11 ఏళ్ల చిన్నారి.. పక్కనే మద్యం తాగుతూ తండ్రి.. మరుక్షణంలో..
కొంతమంది వినోదం పేరుతో చేసే పనులు వారి ప్రాణాలకు ముప్పును తెచ్చిపెడతాయి. తాజాగా ఇటువంటి సంఘటనే చోటుచేసుకుంది. 42 ఏళ్ల పరిశోధకుడు గారాన్ మైయా, అతని కుమారుడు ఫ్రాన్సిస్కో మైయా నిర్లక్ష్యపు వినోదానికి పోయి మృత్యువు పాలయ్యారు. వీరు ప్రయాణిస్తున్న ట్విన్ ఇంజిన్ బీచ్‌క్రాఫ్ట్ బారన్- 58 ఒక అడవిలో ప్రమాదానికి గురయ్యింది. ఈ దుర్ఘటనకు జరగడానికి కొన్ని నిముషాల ముందు రికార్డయిన వీడియో అందరినీ ఆలోచింపజేస్తోంది. దీనిని చూస్తే ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో ఇట్టే తెలిసిపోతుంది. వీడియోలో మద్యం తాగుతున్న తండ్రి గారోన్ మైయా, ఎయిర్‌క్రాఫ్ట్‌ను కంట్రోల్ చేసే ప్రయత్నంలో ఉన్న 11 ఏళ్ల కుమారుడు ఫ్రాన్సిస్కో మైయా కనిపిస్తారు. Express.co.uk తెలిపిన వివరాల ప్రకారం ఈ వీడియో దుర్ఘటన జరగడానికి ముందు షూట్ చేసినది. ఈ కేసు విచారణ చేపట్టిన అధికారులు ఈ వీడియో ఈ ఘటనకు ముందు సమయానిదా? కాదా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే ఎయిర్‌క్రాఫ్ట్‌లోని తండ్రీకొడుకులు తమ రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు కనిపిస్తున్నారని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. బ్రెజిల్‌కు చెందిన మీడియా రిపోర్టు ప్రకారం గారాన్ నోవా కాంక్విస్టాలోని రోండోనియా పట్టణంలోని తమ పొలం నుండి ఎయిర్ క్రాఫ్ట్‌లో బయలుదేరాడు. ఇంధనం నింపడానికి విల్హేనాలోని విమానాశ్రయంలో ల్యాండ్ చేశాడు. తన కుమారుడిని కాంపో గ్రాండే నుంచి వేరే ప్రాంతానికి తీసుకు వెళ్లాలని అతను అనుకున్నాడు. వారి కుమారుడు అక్కడ తల్లితో పాటు ఉంటూ స్కూలులో చదువుకుంటున్నాడు. కాగా ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదంలో భర్త, కుమారుడు మృతిచెందారని తెలియగానే అతని భార్య ఎనాఫ్రిడోనిక్ ఆత్మహత్య చేసుకుంది. భర్త, కుమారుని అంత్యక్రియలకు ముందే ఆమె ఆత్మహత్య చేసుకుంది. కాగా బ్రెజిల్ చట్టాల ప్రకారం 18 ఏళ్ల వయసుదాటిన వారే అధికారికంగా ఎయిర్ క్రాఫ్ట్ నడిపేందుకు అర్హులు. ఇది కూడా చదవండి: అలస్కాలో పగిలిన హిమానీనదం.. కేదార్నాథ్ విపత్తును తలపించేలా.. Avião bimotor Beechcraft Baron 58, de matrícula PR-IDE, "caiu matando pai e filho" a Aeronave cair em uma região de mata fechada, na divisa de Rondônia e Mato Grosso. Os destroços da aeronave foram localizados na manhã deste domingo (30) o pecuarista Garon Maia e o filho.🇧🇷 pic.twitter.com/nOEBpVZJup — D' AVIATION 🇧🇷 (@pgomes7973) August 1, 2023 -
చల్లని కూల్‌డ్రింక్.. తాగిన తరువాతే అసలు విషయం!
భద్రాద్రి: ఓ వ్యక్తి కొనుగోలు చేసిన కూల్‌డ్రింక్ సీసాలో పురుగులు కనిపించిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల పరిధిలోని స్టేషన్ బేతంపూడి గ్రామానికి చెందిన బానోత్ చంద్రు అదే గ్రామంలోని కిరాణా షాపులో ఈనెల 2న 10 కూల్‌డ్రింక్ సీసాలు కొనుగోలు చేశాడు. ముగ్గురు కుటుంబసభ్యులు మూడు సీసాల్లోని శీతల పానీయం తాగగా వారికి వాంతులు అయ్యాయి. మిగిలిన సీసాలను గమనించగా మరో సీసాలో కూడా పురుగులు కనిపించడంతో ఖంగుతిన్నారు. సీసాలో పురుగులు ఉన్నాయని దుకాణ యజమానిని అడగగా అతడు డీలర్ వివరాలు ఇచ్చాడు. దీంతో పాత కొత్తగూడెంలోని గోడౌన్ వద్దకు సదరు సీసాను పట్టుకెళ్లి ఈ విషయాన్ని డీలర్‌కు చెప్పగా.. అతడు తమకేమీ సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించాడు. సోమవారం సుజాతనగర్లో సదరు వాహనాన్ని గుర్తించి అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఘటనపై బాదితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
అసలు 'ఆచమనం' ఎందుకు చేయాలి? మూడుసార్లే ఎందుకు తాగాలి..
పూజలు, వ్రతాల్లో 'ఆచమనం' అనేమాట చాలాసార్లు వింటాం. కానీ ఆ పదానికి అర్ధం.. అసలు అలా ఎందుకు చేయాలి అనే విషయం చాలామందికి తెలియదు. అందుకే 'ఆచమనం' అంటే ఏమిటో, దాని వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటో చూద్ధాం. "ఆచమనం" అనే ఆచారం అపరిమితమైనది. ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత, పూజకు ముందు, సంధ్యావందనం చేసే సమయంలో పలుసార్లు, భోజనానికి ముందు తర్వాత, బయటకు ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత ముఖం, కాళ్ళూ చేతులూ కడుక్కున్న తర్వాత ఆచమనం చేయొచ్చు. ఆచమనం చేసే వ్యక్తి శుచిగా, శుభ్రంగా ఉండాలి. ఎన్నిసార్లు అయినా చేయొచ్చు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉద్ధరణి చొప్పున మంత్రయుక్తంగా మూడుసార్లు చేతిలో నీరు పోసుకుని తాగాలి. ఆచమనం గురించి సంస్కృతంలో ''గోకర్ణాకృతి హస్తేన మాషమగ్నజలం పిబేత్'' అని వర్ణించారు. అంటే, కుడి అరచేతిని ఆవు చెవి ఆకారంలో ఉంచి, ఇందులో మూడు ఉద్ధరణిల నీటిని (ఒక మినపగింజ మునిగేంత పరిమాణంలో నీళ్ళు) పోసి, వాటిని తాగాలి. చేతిలో పోసే నీళ్ళు అంతకంటే ఎక్కువ కానీ, తక్కువ కానీ ఉండకూడదు. నీరు కొలత అంతే ఉండాలి. ఆచమనం ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. అంతా బాగానే ఉంది మరీ అసలు ఆచమనం ఎందుకు చేయాలి? నీటిని అరచేతిలో పోసుకుని తాగడం వల్ల ప్రయోజనం ఏమిటి?. అలానే ఎందుకు తాగాలి?. ఉద్ధరణితో తిన్నగా నోట్లో పోసుకుని ఎందుకు తాగకూడదు?. మూడు ఉద్ధరణిల నీరు మాత్రమే ఎందుకు తీసుకోవాలి?. నీరు కొంతఎక్కువో తక్కువో అయితే ఏమవుతుంది. “కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా, మాధవాయ స్వాహా” అని మాత్రమే ఎందుకు చెప్పాలి? ఇలాంటి ఎన్నో లెక్కకు మించి సందేహాలు మీమదిలో వచ్చే ఉంటాయి. పైగా దేవుడు, ఆచారాల పట్ల నమ్మకం లేని నాస్తికులు అయితే వీటిని అపహాస్యం చేస్తారు కూడా. అందుకే ఆచమనం చేయడంలో పరమార్థం ఏమిటో విపులంగా తెలుసుకుందాం. మన గొంతు ముందు భాగం లోంచి శబ్దాలు వస్తాయి. దీన్ని స్వరపేటిక అంటాం. దీని చుట్టూ కార్టిలేజ్ కవచం ఉంటుంది కనుక కొంత వరకూ రక్షణ లభిస్తుంది. అయినప్పటికీ, ఇది ఎంత అద్భుతమైనదో, అంత సున్నితమైనది. ఈ గొంతు స్థానంలో చిన్నదెబ్బ తగిలినా ప్రమాదం. స్వరపేటిక దెబ్బతిని మాట పడిపోవచ్చు, ఒక్కోసారి ప్రాణమే పోవచ్చు. స్వరపేటిక లోపలి భాగంలో ధ్వని ఉత్పాదక పొరలు ఉంటాయి. ఇవి ఇంగ్లీషు అక్షరం 'V' ఆకారంలో పరస్పరం కలిసిపోయి ఉంటాయి. ఈ తంత్రులు సూక్ష్మంగా ఉండి, ఎపెక్స్ ముందుభాగంలో పాతుకుని ఉంటాయి. స్వరపేటిక కవాటాలు పల్చటి మాంసపు పొరతో ముడిపడి ఉంటాయి. ఈ శరీర నిర్మాణం గురించి చెప్పుకోవడం ఎందుకంటే, మన భావవ్యక్తీకరణకు కారకమైన స్వరపేటిక మహా సున్నితమైనది. ముక్కు, నోరు, నాలుక, పెదవులు, పళ్ళు, గొంతు నాళాలు, అంగిలి, కొండనాలుక, గొంతు లోపలి భాగం, శ్వాస నాళం, అన్ననాళం, స్వర తంత్రులు, వాటిచుట్టూ ఉన్న ప్రదేశం ఇవన్నీ ఎంతో నాజూకైనవి. వీటికి బలం కలిగించడమే ఆచమనం పరమోద్దేశం. ఆచమనంలో మూడు ఉద్ధరణిల నీరు మాత్రమే తాగాలి అని చెప్పుకున్నాం కదా! గొంతులోంచి శబ్దం వెలువడేటప్పుడు అక్కడున్న గాలి బయటికొస్తుంది. ఒక రకంగా వ్యాయామం.. ఇలా లోపలి నుండి గాలి బయటకు వస్తున్నప్పుడు అందులో వేగం ఉండకూడదు. శబ్దం సులువుగా, స్పష్టంగా రావాలి. ఇలా కొన్నినీటిని జాగ్రత్తగా చేతిలోకి తీసుకుని, అంతే జాగ్రత్తగా మెల్లగా తాగడం అనే అలవాటు వల్ల మనం చేసే ప్రతి పనిలో శ్రద్ధ, జాగ్రత్త అలవడుతుంది. రోజులో ఆచమనం పేరుతొ అనేకసార్లు మెల్లగా నీరు తాగడంవల్ల గొంతు, ఇతర అవయవాలు వ్యాయామం చేసినట్లు అవుతుంది. 'కేశవాయ స్వాహా' అన్నప్పుడు అది గొంతునుండి వెలువడుతుంది. 'నారాయనాయ స్వాహా' అనే మంత్రం నాలుక సాయంతో బయటకు వస్తుంది. చివరిగా 'మాధవాయ స్వాహా' అనే మంత్రం పెదవుల సాయంతో వెలువడుతుంది. ఆచమనం అనే ఆచారాన్ని పాటించి ఈ మంత్రాలను ఉచ్చరించడం వల్ల గొంతు, నాలుక, పెదాలకు వ్యాయామం లభిస్తుంది. పైగా ఇవి పరమాత్ముని నామాలు కనుక, భక్తిభావంతో ఉచ్చరించడం వల్లమేలు జరుగుతుంది. ఇక ఉద్ధరణితో తిన్నగా ఎందుకు తాగకూడదు, చేతిలో వేసుకునే ఎందుకు తాగాలి అంటే, మన చేతుల్లో కొంత విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. చేతిలో నీళ్ళు వేసుకుని తాగడం వల్ల ఆ నీరు విద్యుత్తును పీల్చుకుని నోటి ద్వారా శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అక్కడ ఉన్న విద్యుత్తుతో కలిసి శరీరం అంతా సమానత్వం ఉండేలా, సమ ధాతువుగా ఉండేలా చేస్తుంది. ఒక ఉద్ధరణి చొప్పున కొద్దికొద్దిగా నీరు సేవించడం వల్ల ఆ కొద్దిపాటి విద్యుత్తు పెదాలు మొదలు నాలుక, గొంతు, పేగుల వరకూ ఉన్న సున్నితమైన అవయవాలను ఉత్తేజ పరుస్తాయి. ఈ ప్రయోజనాలే కాకుండా ఒక పవిత్ర ఆచారంగా భావిస్తూ రోజులో అనేకసార్లు పాటించడం వల్ల మనసు దానిమీద కేంద్రీకృతమై, లేనిపోని బాధలు, భయాలు తొలగుతాయి. ఏదో అలవాటుగా పాటించే ఆచారాల వెనుక ఎన్నో ప్రయోజనాలు ఉండటమేగాక శాస్త్రీయత కూడా ఉంది. (చదవండి: నేటి నుంచి అధిక శ్రావణమాటాసం? అంటే ఇది డూప్లికేటా?) -
అతిగా 'టీ' తాగుతున్నారా! ఈ సమస్యలు ఎదుర్కొనక తప్పదు
'టీ' అంటే ఇష్టపడని వారుండరు. చల్లటి ఈ వర్షాకాలంలో ఓ కప్పు చాయ్ ఎంత హాయిగా ఉంటుంది. ఏం తినకపోయిన పర్వాలేదు కానీ.. ఆకలేసినప్పుడల్లా వేడివేడి 'టీ' సిప్ చేస్తుంటూ కొందరికి చాలా హాయి అనిపిస్తుంది. ఆ టీ గొంతులో పడగానే శరీరంలో కాస్త ఉత్సాహం వచ్చి మళ్లీ తమ పనులు యథావిధిగా చేసుకోగలుగుతారు. కప్పు టీ పడితే చాలు అబ్బా} ప్రాణం హాయిగా ఉంది అంటారు చాలామంది. ఇలా భావించే కొందరూ..రోజుకు రెండు మూడు కప్పుల చాయ్ తాగేస్తుంటారు. ఇది చాలా దుష్ప్రభావాలకు దారితీస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అందులో ఉండే కెఫిన్, టానిన్ కారణంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొనక తప్పదని గట్టిగా హెచ్చరిస్తున్నారు. టీ తాగడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటంటే.. ఐరన్ లోపం.. టీలో కెఫిన్, టానిన్లు అధికంగా ఉంటాయి.అందువల్ల దీన్ని ఎక్కువ తీసుకోవడం వల్ల ఐరన్ శోషించుకోనీకుండా చేస్తుంది. దీని వల్ల నిద్రలేమి ఏర్పడి తీవ్రమైన తలనొప్పికి దారితీస్తుందంటున్నారు నిపుణలు. టానిన్లు కొన్ని ఆహారాలలో ఉండే ఇనుమును బంధిస్తాయి. దీంతో మీ జీర్ణవ్యవస్థ శోషించుకునే సమయంలో ఐరన్‌ని అందుబాటులో లేకుండా చేస్తుంది. దీంతో ఐరన్ లోపం ఏర్పడుతుంది. ఇది ప్రపంచంలో ఉన్న అత్యంత సాధారణ పోషకాహార లోపాల్లో ఒకటని చెబుతున్నారు నిపుణులు. అలాగే మీరు గనుక శాఖహారులైతే మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఎందుకంటే 'టీ' టానిన్లు జంతు ఆధారిత ఆహారాల కంటే మొక్కల మూలాల నుంచి ఇనుమును ఎక్కువగా గ్రహించడంలో ఆటంకం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి ఏర్పడుట టీలో ఉండే కెఫిన్ కారణంగా నిద్ర చక్రానికి అంతరాయ ఏర్పడుతుంది. మెదుడును నిద్రకు ఉపక్రమించేలా చేసే మెలటోనిన్ అనే హార్మోన్‌ని నిరోధిస్తుంది. ఫలితంగా మంచి నిద్ర పట్టదు. సరిపోని నిద్ర కారణంగా అలసటగా అనిపిస్తుంది. దీంతో జ్ఞాపకశక్తి తగ్గి..అనేక రకాల మానసిక సమస్యలకు దారితీస్తుంది. దీర్ఘకాలిక నిద్రలేమి కారణంగా ఊబకాయం వచ్చే అవకాశం లేకపోలేదు. అలాగే రక్తంలో చక్కెర నియంత్రణ సరిగా ఉండదు. ఈ కెఫిన్ గుండెల్లో మంటకు కారణమవుతుందని చెబుతున్నారు నిపుణులు. చాలామంది వ్యక్తులలో యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను కూడా తీవ్రతరం చేస్తుందని అంటున్నారు. ఈ కెఫిన్ మీ అన్నవాహికను, మీ కడుపును వేరు చేసే స్పింక్టర్‌ను నెమ్మదించేలా చేస్తుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. తద్వారా కడుపులో ఉత్ఫన్నమయ్యే ఆమ్లాలు అన్నవాహికలోకి సులభంగా వెళ్తాయి. రోజంతా టీ సిప్ చేస్తూ ఉన్నవారు దీర్ఘకాలిక తీవ్రమైన తలనొప్పితో బాధపడతారట. సోడా లేదా కాఫీ వంటి ఇతర కెఫిన్ పానీయాల కంటే టీలో కెఫిన్ తక్కువే అయినా కొన్ని రకాల టీలు ఒక కప్పు టీకి సుమారు 60 మిల్లీ గ్రాముల కెఫిన్ అందిస్తుందని, ఇది ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. (చదవండి: ఈ కాక్టెయిల్ వృద్ధాప్యాన్ని రానివ్వదట!ఎప్పటికీ..) -
ములుగు జిల్లాలో కలకలం సృష్టిస్తున్న విద్యార్థులు
-
బీచ్‌లో బీర్ తాగుతూ జల్సా చేస్తున్న అల్లు అర్జున్ హీరోయిన్ (ఫోటోలు)
-
నా లివర్ ఇనుముతో తయారుకాలేదు..
న్యూఢిల్లీ: ప్రఖ్యాత టెలివిజన్ షో ఆప్ కీ అదాలత్ కార్యక్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ ను మీరు గత 10-12 సంవత్సరాలుగా రాత్రి పగలు తేడా లేకుండా బాగా మద్యం సేవిస్తుంటారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. నిజమేనా? అని ప్రశ్నించగా పంజాబ్ ముఖ్యమంత్రి.. నా లివర్ ఇనుముతో తయారైందనుకున్నారా ఏంటని చమత్కరించారు సీఎం. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ పెద్ద తాగుబోతు అని ప్రతిపక్షాలు గత కొన్నేళ్లుగా విమర్శిస్తూ ఉన్నాయి. కానీ ఆ విషయాన్ని ఆయనెప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఇటీవల ఆప్ కీ అదాలత్ టీవీ కార్యక్రమానికి అతిధిగా హాజరైన ఆయనను ఇదే విషయం గురించి ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ.. నా లివర్ ఇనుముతో తయారయ్యిందనుకున్నారా? ఏంటి? 10-12 ఏళ్లపాటు పగలు రాత్రి తేడా లేకుండా మద్యం తాగుతూ కూర్చుంటే అసలు బ్రతికేవాడినా? ప్రతిపక్షాలకు నా గురించి మాట్లాడటానికి ఏమీ లేనప్పుడు ఇలాంటి చెత్త విమర్శలే చేస్తుంటారన్నారు సీఎం. నేను పొద్దున్న లేస్తూనే మొదటి ఫైల్ తెప్పించుకుని దాని గురించే ఆలోచిస్తాను. ఇలా పనిచేసే పంజాబ్‌లో గత 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఏడాదిన్నరలోనే చేసి చూపించా. చిత్తశుద్ధితో పని చేశాను కాబట్టే ఈరోజు 88% ఇళ్లలో విద్యుత్తు ఇవ్వగలిగాము. 2019లో జరిగిన ఒక పబ్లిక్ ర్యాలీలో భగవంత్ మన్ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, తన తల్లి సమక్షంలో మద్యం మానేస్తున్నట్టు బాహాటంగానే మాటిచ్చారు. ఆయన ఆ అలవాటు మానుకున్నా కూడా ఆయనకు ఆ ట్యాగ్ మాత్రం అలా ఉండిపోయింది. ప్రతిపక్షాలు విమర్శించడానికి ఈ కారణమే ఇప్పుడు అదనుగా మారింది. मेरा Liver क्या लोहे का है जो 10–12 साल से सुबह शाम पी रहा हूं, फिर भी जिंदा हूं? जितना काम 75 साल में नहीं हुआ, पिछले सवा साल में किया है 88% घरों में मुफ़्त बिजली जाती है Punjab में! इतना कोयला कभी नहीं था जितना आज है। नीयत होनी चाहिए काम करने की। —CM @BhagwantMann… pic.twitter.com/u9YcIxgHk4 — AAP (@AamAadmiParty) June 18, 2023 ఇది కూడా చదవండి: "మన్ కీ బాత్"లో "మణిపూర్ కీ బాత్" లేదా? -
69 క్యాన్ల సోడాలు హాంఫట్
ఒట్టావా: కెనడాలో ఒక మహిళకి వింత అనుభవం ఎదురైంది. ఇంట్లో అవసరాల కోసం తెచ్చుకున్న సోడా క్యాన్లను ఒక ఎలుగు ఊది పారేసింది. షరోన్ రోజెల్ అనే మహిళ తెల్లవారుజామున కుక్క మొరగడంతో లేచి చూసింది. అప్పటికే తన కారు అద్దాలు బద్దలు కొట్టిన ఎలుగుబంటి అందులో ఉంచిన 72 సోడాల క్యాన్లలో ఏకంగా 69 తాగేసింది. బాల్కనీ నుంచి ఇదంతా చూసి రోజెల్ వాటి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒక ఎలుగు బంటి ఆ స్థాయిలో సోడాలు తాగడం అత్యంత అరుదు అని కొందరు వ్యాఖ్యానించారు. -
విమానం టేకాఫ్ అవుతుందనంగా అది కావాలన్నాడు..అంతే గెంటేశారు
విమానంలో ప్రయాణికుల వికృతి ఘటనలు గురించి తరుచుగా విన్నాం. కానీ ఇప్పుడూ ఒక ప్రయాణికుడు అలా ఏం చేయకపోయినా విమాన నుంచి బయటకు గెంటేశారు. అదీకూడా కేవలం డ్రింక్ చేస్తానని రిక్వెస్ట్ చేసినందుకు విమానం నుంచి బలవంతంగా బయటకు పంపించేశారు. ఈ ఘటన యూఎస్ ఎయిర్‌లైన్స్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..యూఎస్‌లోని ఒక వ్యక్తి విమానం బయలుదేరే ముండు డ్రింక్ చేస్తానని తనకు జిన్ వంటి పానీయం కావాలని అడిగాడు. అంతే అక్కడ ఉన్న సిబ్బంది సదరు వ్యక్తిని విమానం నుంచి దిగిపోమని సీరియస్ అయ్యారు. మొత్తం సిబ్బంది వచ్చి దిగిపోమని పలుమార్లు సూచించారు. అతనికేం అర్థం కాక ఎందుకిలా అంటున్నారని ఆ ఘటనను మొత్తం ఫోన్‌తో వీడియో తీసేందుకు రెడీ అయ్యాడు. అంతే అక్కడ ఉన్న సిబ్బంది, ఫ్లైట్ అటెండెంట్ అతని ఫోన్‌ని లాక్కుని, ఆ వ్యక్తిని బలవంతంగా విమానం నుంచి బయటకు గెంటేశారు. తదనంతరం అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ భద్రతా విభాగం అతన్ని అరెస్టు చేశారు. ఐతే సిబ్బంది అసహనంతో అలా చేశారా లేక ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడో తెలియాల్సి ఉంది. అందుకు సంబంధించిన వీడియో రెడ్ఇట్లో వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్లు మండిపడ్డారు. అతను చిన్నపిల్లాడిలా అలా చేయడం ఆశ్చర్యంగా అనిపించిందని కొందరూ, ఇది అత్యంత అవమానకరం అని మరికొందరూ కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: కాల్పుల భయంలో అమెరికా..పరుగెత్తండి, దాక్కోండి అంటూ యూనివర్సిటీ హడావిడి..) -
చల్లటి నీళ్లు కావాలా నాయనా.? కొన'కుండ' ఉండలేరు మరి!
కురబలకోట : మట్టి కుండలు అనాదిగా వాడుకలో ఉన్నాయి. అల్యూమినియం, స్టీలు, ఇతర పాత్రల ప్రవేశంతో వీటికి ఆదరణ తగ్గింది. ఆధునిక (మెటల్) వంట పాత్రల వాడకం ద్వారా రోగాలు కూడా మనిషిని చుట్టుముట్టాయి. దీంతో మళ్లీ జనం ఆలోచనలో పడ్డారు. ఇప్పుడు వంటకు, తాగునీళ్లకు కుండలను ఆదరిస్తున్నారు. మట్టివి తిరిగి జన జీవన స్రవంతిలో కన్పిస్తున్నాయి. తీరెను తాపం, కలిగించెన్ ఉపశమనం వేసవిలో మట్టి కుండల్లో నీళ్లు తాగడం హాయి హాయిగా.. కూల్ కూల్‌గా అన్పిస్తుంది. వేసవి తాపాన్ని తీరుస్తాయి. దీంతో ఈ నీళ్లు మనస్సుకు హాయిని, శరీరానికి ఉపశమనాన్ని కల్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఎండల సీజన్. ఒక పక్క ఉక్క పోత, మరో వైపు మండుటెండలు. ఇలాంటి పరిస్థితుల్లో మట్టి కుండ అనగానే ఎవ్వరికై నా చల్లని నీళ్లు గుర్తుకు వస్తాయి. చలివేంద్రాలు అంటే కూడా మట్టి కుండలే కన్పిస్తాయి. ఈ కుండల్లో నీళ్లు తాగితే వేసవి తాపం తీరుతుంది. ఆల్కలీన్ లక్షణాలు నీటిలోని పీహెచ్ స్థాయుల్ని సమతుల్యం చేస్తాయని చెబుతారు. ఆరోగ్యానికి ఎంతో మంచిది కుండ నీళ్ల వల్ల వక్రియ మెరుగపడి పొట్టకు ఇబ్బంది లేకుండా చేస్తాయన్న పేరుంది. అంతేగాకుండా ఖనిజాలు, లవణాలు కూడా అందుతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే మట్టి కుండల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో అంగళ్లు, కంటేవారిపల్లె, పలమనేరు, సదుం, మదనపల్లె దగ్గర సీటీఎం, ఈడిగపల్లె, కాండ్లమడుగు, కుమ్మరపల్లె తదితర ప్రాంతాల్లో వీటిని అమ్ముతున్నారు. రోడ్ల పక్కన స్టాల్స్‌లో వీటిని విక్రయిస్తున్నారు. ఉక్క పోత ఎక్కువగా ఉండడం ఎండలు మండుతుండడంతో వీటి అమ్మకాలు కూడా జోరుగా సాగుతున్నాయి. మట్టి కుండ అంటనే చల్లదనానికి మారుపేరు. దీంతో చలివేంద్రాలలో ఎక్కడ చూసినా మట్టి కుండలే కన్పిస్తాయి. మట్టి కుండలకు పెట్టింది పేరు మట్టి కుండలు, బొమ్మలు అంటేనే ఎవ్వరికై నా తొలుత గుర్తుకు వచ్చేది కురబలకోట మండలంలోని అంగళ్లు, కంటేవారిపల్లె, ఆ తర్వాత పలమనేరులోని ఘంటావూరు. వీటికి ఇవి ప్రసిద్ధి. ఇక్కడ సీఎఫ్‌సీ సెంటర్లు, ఆధునిక మిషన్లు ఉండడంతో వీటి తయారీలో హస్త కళాకారులు ఆరితేరారు. కుండలు, కడవలు రూ.120 నుంచి రూ. 300 చొప్పున అమ్ముతున్నారు. మగ్గులు రూ.150 నుంచి రూ.250, వాటర్ బాటిళ్లు రూ.150 నుంచి రూ.200, పెరుగు, మజ్జిగ కుండలు రూ.50 నుంచి రూ.70 చొప్పున విక్రయిస్తున్నట్లు హస్తకళాకారులు వెల్లడించారు. వివిధ రాష్ట్రాలకు సరఫరా కుండల తయారీ వెనుక కుమ్మరుల కృషి ప్రశంసనీయం. వేసవి వస్తే వీటికి తరగని డిమాండ్ ఉంటుంది. ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫారా అవుతున్నాయి. వీటిలో నీళ్లు ఆరోగ్యానికి మంచిదని నిపుణులు కూడా చెబుతున్నారు. మూడు నెలలు వేసవి సీజన్ ఉంటుంది. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రూ.2 కోట్ల దాకా ఈ కుండల అమ్మకం ద్వారా లావాదేవీలు జరుగుతాయి. – కష్ణమూర్తి, టెర్రకోట హస్తకళాకారుల సలహాదారు ఫ్రిజ్‌లున్నా వీటిపైనే మక్కువ నగర, పట్టణ వాసులు సై తం ఫ్రిజ్‌లు ఉన్నా మట్టి కుండల వైపే చూస్తున్నా రు. వీటిలో నీళ్లు సహజంగా చల్లబడతాయి. ఆరోగ్యానికి శ్రేయస్కరమని ని పుణులు చెబుతారు. మనిషి నాగరిగత నేర్చుకు న్న తర్వాత మొదటి వంట చేసింది మట్టి పాత్రల్లోనే అని చెబుతారు. ఇవి ఇళ్లలో ఉండడానికి ఇష్టపడుతున్నారు. మరో వైపు పర్యావరణ ప్రేమికు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. – శ్రీనివాసులు, హస్తకళాకారుల సంఘ నాయకులు, కురబలకోట మండలం కుండ నీరు శ్రేయస్కరం కుండ, కడవల్లోని నీరు ఎంతో మంచిది. ఇప్పటికీ పేదవాడి ప్రిడ్జ్‌గా పిలుస్తారు. సాధారణంగా మనిషి శరీరం ఆమ్లస్వభావం కల్గి ఉంటుంది. మట్టి ఆల్కలీన్. కుండనీళ్లు తాగినప్పుడు శరీర ఆమ్ల స్వభావంతో చర్య జరుపుతుంది. సరైన పీహెచ్‌కు దోహదపడుతుంది. భూమి వివిధ ఖనిజ లవణాల సహజ గని. దీని నుంచి వచ్చిన మట్టితో చేసే కుండలు, సామగ్రి ఆరోగ్య ప్రయోజనాలను కల్గిస్తుంది. – బి.పద్మనాభరెడ్డి, పవర్ వాటర్ టెక్ నిర్వాహకులు, గుంతవారిపల్లె -
స్నేహితులతో మద్యం తాగుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో..
సాక్షి, హైదరాబాద్: మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తికి గుండెపోటు రావడంతో మృతి చెందిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కార్మికనగర్‌లో నివసించే మల్లె రామారావు(35) సెంట్రింగ్ వర్కర్. భార్య, పిల్లలు ఈ నెల 7న పెద్దపల్లిలో ప్రార్థనకు వెళ్లగా రామారావు ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు. గురువారం రాత్రి జవహర్‌నగర్‌లోని సతీష్ వైన్స్ వద్ద మద్యం తాగేందుకు వెళ్లాడు. అక్కడే నలుగురు స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆయనను అంబులెన్స్‌లో ఆస్పత్రికి చేర్చగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే స్నేహితులతో జరిగిన గొడవలో మద్యం మత్తులో ఇద్దరు స్నేహితులు పిడిగుద్దులు గుద్దడం వల్లే రామారావు మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఇక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలించగా, ముగ్గురు యువకులు గొడవ పడుతున్నట్టు నిర్ధారణ అయింది. అయితే, ఆ గొడవకు రామారావు చాలా దూరంలో ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు రామారావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఒంటిపైన ఎలాంటి గాయాలు లేవని కార్డియక్ అరెస్ట్ వల్లే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మద్యం మత్తులో గుండెపోటు రాగా వెనక్కి కుప్పకూలాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. మృతుడి భార్య వరలక్ష్మి ఇచి్చన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాత్రికి రాత్రే స్టార్ సింగర్‌గా మారిన ఖైదీ! వెల్లువలా ఆఫర్లు
ఇంతవరకు మనం ఎంతోమంది మట్టిలో మాణక్యలాంటి సింగర్ల గురించి విన్నాం. అదీ కూడా పల్లెటూరు నేపథ్యం నుంచి వచ్చిన సాధారణ మహిళలు, పురుషులు సింగర్ మాదిరి అద్భుతంగా పాడి ప్రశంసలందుకున్నారు. వారిలో కొందరైతే సినిమాల్లో పాడే అవకాశాన్ని కూడా కొట్టేశారు కూడా. అవన్నీ ఒకతైతే ఇక్కడొక ఖైదీ ఏకంగా ఒక పాటతో స్థార్ సింగర్‌గా పేరు సంపాదించేసుకున్నాడు. పైగా అవకాశాలు కూడా వెల్లువలా వచ్చేయడమే కాకుండా ఆ వ్యక్తిని విడుదలయ్యేలా చేస్తామని ఓ ఎమ్మెల్యే చెప్పడం విశేషం. వివారాల్లోకెళ్తే...కంగయ్య కుమార్ అనే వ్యక్తి బిహార్ జైలులో ఉండే ఖైదీ. ఐతే ఒక రోజు భోజ్‌పురికి సంబంధించిన ఫేమస్ పాట పాడాడు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక్కసారిగా నెటిజన్లంతా అతడి వాయిస్‌కి అతను పాడిన విధానానికి ఫిదా అయ్యారు. దీంతో అతన్ని బయటకు తీసుకువచ్చి పాటలు పాడే అవకాశం ఇవ్వాలనుకున్నారు బాలీవుడ్ ప్రముఖ గాయకుడు అంకిత్ తివారీ. అతన్ని టాలెంట్ నాలుగు గోడలకే పరిమితకాకుండా అతన్ని బయట వచ్చేలా చట్టపరమైన సాయం అందించి పునరావాసం కల్పించాలనుకున్నారు ఒక యూపీ ఎమ్మెల్యే. ఏది ఏమైతే ఒక పాటతో కంగయ్య అందరీ మనసులను దోచుకున్నాడు. ఏకంగా విడుదలయ్యే అవకాశం తోపాటు పాటలు పాడే అవకాశం ఇచ్చేందుకు బాలీవుడ్ ప్రముఖ గాయకులు ముందకు వచ్చారు. వాస్తవానికి కంగయ్య బిహార్‌లోని కైమూర్ జిల్లా నివాసి. అతను పని కోసం ఉత్తప్రదేశ్ సరిహద్దు జిల్లాకు వెళ్లి మద్యం సేవించి వచ్చాడు. ఐతే బిహార్‌లో మద్యం చట్టాలను కట్టుదిట్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బిహార్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడంతో అతను జైల్లో ఉన్నాడు. కంగయ్య జైల్లో దరోగజీ హో... సోచి-సోచి జియా హమ్రో కహే గబ్రతా..." అనే ప్రసిద్ధ భోజ్‌పురి పాటను పాడాడు. వాస్తవానికి కంగయ్య లాకప్‌లో ఉండగా ఎవరో ఒక వ్యక్తి ఆపాటను తప్పుగా పాడటంతో..అది కరెక్ట్ కాదని చెప్పేందుకు పాడాడు. అది సంగీత ప్రియులను ఎంతో ఆకట్టుకోవడంతో అద్భుతమైన అవకాశాన్ని కొట్టేశాడు. TV के पूर्व सहयोगी @cmohan_pat के माध्यम से संपर्क करने पर पता चला कि ये कैमूर का गरीब युवक कन्हैया है,नशे में मिलने पर बिहार पुलिस ने इसे जेल भेजा,इनकी कानूनी मदद के उपरांत इन्हें सुधारने का प्रयास होगा,साथ ही UP के मशहूर त्रिनेत्र स्टूडियो में गाने का अवसर भी उपलब्ध कराया जाएगा pic.twitter.com/Id8HrJV2HZ — Dr. Shalabh Mani Tripathi (@shalabhmani) January 8, 2023 (చదవండి: ఎయిర్ ఇండియా ఘటన: పశ్చాత్తాపం లేకుండా ఆరోపణలా!) -
షాకింగ్ ఘటన: విమానంలో సహ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన..
ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సహ ప్రయాణికురాలిపై ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. నవంబర్ 26వ తేదీన న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ఒక వ్యక్తి మద్యం మత్తులో 70 ఏళ్ల మహిళపై మూత్ర విసర్జన చేశాడు. మధ్యాహ్న భోజనం తర్వాత లైట్లు ఆరిపోవడంతో.. అక్కడ ఏం జరుగుతోందో కొందరి ప్రయాణికులకే అర్థమైంది. పైగా మూత్ర విసర్జన తర్వాత కూడా ఆ వ్యక్తి అక్కడ నుంచి వెళ్లకుండా అలానే నుంచొని ఉన్నాడు. అతడి వికృత చర్య కారణంగా.. సదరు ప్రయాణికురాలి బట్టలు, బూట్లు, మూత్రంతో తడిచిపోయాయి. దీంతో ఆమె విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత విమాన సిబ్బంది ఆమెకు బట్టలు, చెప్పులు ఇచ్చి మళ్లీ తన సీటుకే రావలని చెప్పారు. ఐతే ఆమె అందుకు గట్టిగా నిరాకరించడంతో మరో సీటు పురమాయించారు.ఐతే సిబ్బంది ఆ సీటు కవర్లు మార్చి, వాసన రాకుండా స్ప్రె చల్లారు గానీ ఆ సీటుపై కూర్చోవాలంటేనే చిరాకనిపించదని ఆ మహిళ వాపోయింది. ఆ ఘటన తర్వాత ఆమె మరొక సిబ్బంది సీటులో కూర్చొని విమానంలో మిగతా ప్రయాణాన్ని కొనసాగించారు. ఢిల్లీలో విమానం ల్యాండ్ అయిన తర్వాత కూడా సదరు ఎయిర్‌లైన్ అధికారులు అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సదరు మహిళకు మరింత కోపం తెప్పించింది. దీంతో ఆ మహిళ టాటా గ్రూప్ చైర్మన్‌కి ఈ విషయమై లేఖ రాశారు. అంతేగాదు ఆమె లేఖలో.. బిజినెస్ క్లాస్‌లో సీట్లన్నీ ఖాళీగా ఉన్నప్పటికీ మరో క్యాబిన్ సీటు కూడా తనకి ఇవ్వలేదని ఎయిర్ ఇండియా సిబ్బందిపై కూడా ఆరోపణలు చేసింది. దీంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ విషయమై సదరు ఎయిర్‌లైన్ నుంచి వివరణ కోరింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవడమే గాక సదరు వ్యక్తిని నోఫ్లై లిస్ట్‌లో చేర్చనున్నట్లు పేర్కొంది. (చదవండి: బీజేపీ నాయకుడి అక్రమ హోటల్ని..ఏకంగా 60 డైనమైట్లతో ధ్వంసం) -
Telangana: న్యూ ఇయర్ కిక్.. ఒక్కరోజే రూ.215 కోట్లు తాగేశారు..
హైదరాబాద్: తెలంగాణలో డిసెంబర్ 31న ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం వచ్చింది. ఒక్కరోజే రూ.215 కోట్ల 74 లక్షలు ఆర్జించింది. మద్యం అమ్మకాలు తగ్గినప్పటికీ ధరలు పెరిగిన కారణంగా ఇంత మొత్తం వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 19 డిపోల నుండి జరిగిన రిటైల్ అమ్మకాలు వివరాలు (సుమారుగా)... 2 లక్షల 17 వేల 444 లిక్కర్ కేసులు లక్షా 28వేల 455 కేసుల బీర్లు హైదరాబాద్ 1 డిపో 15 వేల 251 లిక్కర్ కేసులు 4వేల 141 కేసుల బీర్లు 16 కోట్ల 90 లక్షలు ఆదాయం హైదరాబాద్ 2 డిపో 18 వేల 907 లిక్కర్ కేసులు 7వేల 833 బీర్ కేసులు 20 కోట్ల 78 లక్షల ఆదాయం మొత్తం హైదరాబాద్ రెండు డిపోల్లో వచ్చిన ఆదాయం రూ.37 కోట్ల 68 లక్షలు. చదవండి: మందుబాబులకు షాక్.. 5,819 డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు -
ఫ్రెండ్స్‌తో అడవిలో మందు తాగుతుండగా ఈడ్చుకెళ్లిన పులి.. సగం తిని..
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్ రిషికేశ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తున్న 32 ఏళ్ల వ్యక్తిని అకస్మాతుగా పులి వచ్చి ఈడ్చుకెళ్లింది. అనంతరం అతడ్ని సగం తిని వదిలేసింది. రామ్‌నగర్ అడవిలో శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మృతుడ్ని ఖతారి గ్రామానికి చెందిన నఫీస్‌గా గుర్తించారు. శనివారం సాయం కాలం అతడు స్నేహితులతో కలిసి మద్యం తాగేందుకు ఊరిబయటకు వెళ్లాడు. కాలువ బ్రిడ్జ్ పక్కన కూర్చొని మందుతాగుతున్నారు. ఇంతలో ఓ పులి అక్కడకు వచ్చింది. నఫీస్‌ను నోటితో పట్టుకుని ఈడ్చుకెళ్లింది. ఇది చూసి స్నేహితులు భయంతో అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులకు సమాచారం అందడంతో వాళ్లు నఫీస్ కోసం గాలించారు. బ్రిడ్జికి 150 మీటర్ల దూరంలో ఆదివారం ఉదయం అతని మృతదేహం సగ భాగం లభ్యమైంది. పులి అతడ్ని సగం తిని వదిలేసింది. అయితే ఇది కార్బెట్ టైగర్ రిజర్వ్ ప్రాంతమని, తరచూ పులులు ఇక్కడ సంచరిస్తాయని పోలీసులు తెలిపారు. గ్రామస్థులు ఈ ప్రదేశానికి వెళ్లవద్దని సూచించారు. చదవండి: యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా? -
భర్త ఇంటికి లేటుగా వచ్చాడని.. బాత్రూమ్లోకి వెళ్లి యాసిడ్..
సాక్షి, పటాన్చెరు టౌన్: భర్త ఇంటికి లేటుగా వచ్చాడని మనస్తాపం చెందిన భార్య యాసిడ్ తాగి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటన పటాన్చెరు పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రామనాయుడు వివరాల ప్రకారం ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం గాజిపూర్ జిల్లాకు చెందిన రవీంద్ర, భార్య అంజులదేవి(28)తో కలిసి బతుకుదెరువు నిమిత్తం పటాన్చెరు మండలం ఇస్నాపూర్‌లో ఓ కిరాణ షాపులో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 18న రవీంద్ర ఇంట్లో టిఫిన్ తినకుండా షాపుకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తతో అంజుల దేవి మధ్యాహ్న భోజనానికి ఎందుకు రాలేదని అరుస్తూ బాత్రూమ్లోకి వెళ్లి యాసిడ్ తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు పటాన్చెరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చేర్యాలలో.. చేర్యాల(సిద్దిపేట): చేర్యాల మండలం ఆకునూరులో ఆత్మహత్యకు పాల్పడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన బోయిని శేఖర్(32) ఈ నెల 15న పురుగుల మంది తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య కావ్య ప్రస్తుతం 5నెలల గర్భిణి. కాగా మృతుడి తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
హబ్సిగూడలో కారు బీభత్సం
సాక్షి, లాలాపేట: మద్యం మత్తులో ఓ కారు డ్రైవర్ హబ్సిగూడ ప్రధాన రహదారిలో బీభత్సం సృష్టించారు. నలుగురు ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆటోను, ఓ స్కూటీని ఢీకొట్టిన ఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ తెలిపిన వివరాల మేరకు.. హబ్సిగూడలో ఫుడ్ పాయింట్ నిర్వహిస్తున్న మౌర్య తన స్నేహితులతో కలిసి అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు పూటుగా మద్యం తాగారు. ఉదయం ఒక్కడే మౌర్య 8 గంటలకు హబ్సిగూడ స్ట్రీట్ నంబర్–8 నుంచి సికింద్రాబాద్‌కు కారులో బయలుదేరారు. కొద్ది సేపటికే మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ తన కారుతో రామంతాపూర్ వైపు వెళ్తున్న ఓ ఆటోను, ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఆటో, స్కూటీ నుజ్జునుజ్జయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తో పాటు ఇద్దరు ప్యాసింజర్లు హరీష్, శ్రీనివాస్, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి మొత్తం నలుగురు వ్యక్తులు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ మల్లికార్జున్ పరిస్థితి విషమంగా ఉందన్నారు. కారు డ్రైవర్ మౌర్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉందని ఇన్స్పెక్టర్ రమేష్ నాయక్ తెలిపారు. (చదవండి: హాస్టల్లో ఉంటున్న కూతుర్ని చూసేందుకు వెళ్లి...అంతలోనే) -
నర్సు నిర్వాకం.. ఊహించని రీతిలో పట్టించిన 13 ఏళ్ల కూతురు
భర్తను చంపి ఏమి ఎరుగనట్టు ఆస్పత్రికి తీసుకవచ్చింది ఓ నర్సు. ఆత్యహత్య చేసుకుని చనిపోయాడంటూ వైద్యులను నమ్మించేందుకు యత్నించి కటకటాల పాలయ్యింది. ఈ ఘటన ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..కవిత అనే మహిళ నర్సుగా పనిచేస్తోంది. ఆమె నవంబర్ 29న భర్తతో గోడవ పడి ఆవేశంలో చంపేసింది. ఆ తర్వాత ఏమి తెలియనట్లు తాను పనిచేసే ఆస్పత్రికే తీసుకువచ్చింది. వైద్యులకు భర్త దుప్పటితో ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు చెప్పింది. దీంతో ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించి పోస్ట్‌మార్టం కార్యక్రమాలు నిర్వహించారు. పోస్ట్‌మార్టం నివేదికలో సదరు వ్యక్తి గొంతుపై ఊపిరాడకుండా చేసిన గుర్తులు ఉన్నట్లు పేర్కొంది. దీంతో పోలీసులు అనుమానంతో కవితను గట్టిగా విచారించగా...తన భర్త మహేశ్ తాగి వచ్చి తరుచు కొడుతూ ఉండేవాడని చెప్పింది. ఇలానే నవంబర్29న ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, దీంతో తన భర్త నిద్రపోతున్నప్పుడూ గొంతు నులిమి చంపినట్లు పేర్కొంది. అంతేగాదు ఆమె 13 ఏళ్ల కూతుర్ని కూడా విచారించగా...వాళ్ల అమ్మ కవిత తన తండ్రి నోటిని మూసి చంపుతుండటం చూసినట్లు తెలిపింది. విచారణలో భాగంగా ఆమె ఫోన్‌ని కూడా తనిఖీ చేయగా ఆమె ఆస్పత్రిలో ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వినయ్ శర్మతో ఆమెకు సంబంధం ఉందని తేలింది. ఈ హత్యలో వినయ్ ప్రమేయం కూడా ఉన్నట్లు చెప్పే.. వాట్సప్ చాట్లు, ఆడియో రికార్డులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. దీంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. (చదవండి: ఇల్లరికపు అల్లుడు షాకింగ్ ట్విస్ట్.. భార్యకు వివాహేతర సంబంధం ఉందని..) -
Viral Video: ట్యాప్ తిప్పి దాహం తీర్చుకున్న పక్షి
-
రోజూ 8 గ్లాసుల నీళ్లు తాగాలా?.. నిపుణులు ఏం చెప్తున్నారంటే..!
‘ఎన్నినీళ్లు తాగితే అంత మంచిది’ మనం తరచూ వినేమాట. అసలు ఒక వ్యక్తి రోజుకెన్ని నీళ్లు తాగాలన్న చర్చ నిత్యం జరుగుతూనే ఉంది. ఒక మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ కనీసం రెండు లీటర్లు అంటే.. ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలని వైద్యులు, నిపుణులు చెప్పేమాట. అయితే.. అన్ని నీళ్లు అవసరం లేదని ఓ అధ్యయనం చెబుతోంది. అబెర్డీన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు దీనిపై అధ్యయనం చేశారు. 23 దేశాల నుంచి 5,604 మంది అన్ని వయసులవారిని పరిశీలించారు. ఈ సర్వే ప్రకారం ఒకటిన్నర లీటర్లు తాగితే సరిపోతుందని చెబుతున్నారు. నీళ్లు ఎక్కువగా తాగితే ఓవర్‌హైడ్రేషన్ అయి దానివల్లా సమస్యలొస్తాయని వివరించారు. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు, శారీరక శ్రమ చేసేవాళ్లు.. ఈ గ్లాసుల సంఖ్య పెంచాలని సూచిస్తున్నారు. అథ్లెట్లు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు నీళ్లు ఎక్కువ తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ‘బరువును బట్టి నీళ్లు తాగాలి.. 20 కిలోల బరువుకు లీటర్ చొప్పున.. 40 కిలోల బరువుంటే రెండు లీటర్లు, 80 కిలోలుంటే 4 లీటర్లు తాగాలి’ అని అబెర్డీన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జాన్ స్పీక్‌మాన్ చెబుతున్నారు. అయితే ఈ పరిమాణం మీరు తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుందట. చదవండి: ఇరాన్ ఫుట్ బాల్ జట్టు ఓటమి.. స్వదేశంలో సంబరాలు.. కారణం ఇదే! -
సర్వేలో బయటపడ్డ షాకింగ్ విషయాలు.. తెలంగాణలో మరీ ఇంత ఘోరమా?
(శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి) ఉద్వేగాల నేల తెలంగాణ.. సంతోషం, సంబురం, వినోదం, విషాదం.. ఏదైనా సామూహిక విందు ఇక్కడి కలివిడి జీవితాలకు సంకేతం. నలుగురు కలిసిన సమయంలో విందు, విలాసాల్లో సరదాగా మొదలవుతున్న మద్యం వినియోగం.. తర్వాత అలవాటుగా మారి జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతున్న మద్యంతో వినియోగం విపరీతంగా పెరుగుతోంది. దేశంలో అరుణాచల్‌ప్రదేశ్ 15 లక్షలు జనాభాలో సుమారు 7.60 లక్షల మందికి మద్యం తాగే అలవాటుతో టాప్‌లో ఉంది. ఆ తర్వాతి స్థానంలో తెలంగాణ ఉంది. ఇక్కడ నాలుగు కోట్లకుపైగా జనాభా ఉండగా.. వీరిలో 15– 49 ఏళ్ల మధ్య వయసువారిలో యాభై ఐదు శాతం మంది మద్యం తాగుతున్నట్టు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019–21) ఇటీవలే వెల్లడించింది. కొత్తగా మద్యం అలవాటు అవుతున్న వారి సంఖ్య జాతీయ సగటు కంటే వేగంగా పెరుగుతోందని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో మరింతగా.. తెలంగాణలో మద్యం అలవాటు గ్రామీణ ప్రాంతాల్లో మరింత ఎక్కువగా 62 శాతం (15–49 ఏళ్ల మధ్య వయసువారిలో) మేర ఉంది. ఇందులో 7శాతం మహిళలు కూడా ఉండటం గమనార్హం. ఇందులో 54శాతం మంది వారంలో ఒకసారి మద్యం తాగుతుంటే.. 28శాతం మంది నాలుగు రోజులకోసారి, మరో 19 శాతం మంది ప్రతిరోజు తాగుతున్నారు. ఇక మద్యం అలవాటు/వ్యసనంగా మారిన కుటుంబాల్లో 28 శాతం మంది మహిళలు భర్తల నుంచి హింసకు గురవుతున్నారు. 16 శాతం మంది మహిళలు తీవ్రగాయాల పాలవుతున్నట్టు జాతీయ కుటుంబ సర్వే పేర్కొంది. నిషాలో ప్రమాదాలతో.. దేశంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న పది రాష్ట్రాల్లో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. డ్రంకెన్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు, మరణాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో బాధితులు 18– 35 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉంటున్నారు. ఇక పదిలక్షల జనాభా దాటిన యాభై నగరాల్లో రోడ్డు ప్రమాదాలకు సంబంధించి.. హైదరాబాద్ 7వ స్థానంలో ఉందని ట్రాన్స్పోర్ట్ రీసెర్చ్ వింగ్ 2020 నివేదిక పేర్కొంది. అమ్మకాలు.. ఆదాయం.. చీర్స్ మద్యం వినియోగం అధికంగా ఉండే రాష్ట్రాలతో పోలిస్తే తలసరి వినియోగంలో తెలంగాణ టాప్‌లో ఉంది. రాష్ట్రంలో 2017–2020 మధ్య మద్యం వినియోగం 18 శాతం పెరిగి రాష్ట్ర ఖజానాకు కాసులు కురిపించింది. అత్యధికంగా మద్యం విక్రయించిన వైన్స్‌ల వివరాలు చూస్తే తాజా ఎక్సైజ్ ఏడాదిలో.. హన్మకొండ హంటర్ రోడ్డులోని ఓ వైన్స్ రూ.38 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయిస్తే, అశ్వారావుపేటలో రూ.31 కోట్లు, కరీంనగర్లో రూ.29 కోట్లు, కల్వకుర్తిలో ఒక వైన్స్ రూ.20.50 కోట్లు, నిజామాబాద్‌లో ఒక వైన్స్ రూ.19.50 కోట్లు, తొర్రూరులో ఒకవైన్స్ రూ.14.33 కోట్లు విలువైన మద్యాన్ని బాటిలింగ్ యూనిట్ల నుంచి కొనుగోలు చేసి జనానికి విక్రయించాయి. డ్రంకెన్ డ్రైవ్.. ప్రాణాలు తీసింది.. అది 2021 డిసెంబర్ 18. తెల్లవారుజామున రెండుగంటలు.. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతున్న కారు సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలో చెట్టును ఢీకొట్టి రెండు ముక్కలైంది. డ్రైవర్ సీట్లో ఉన్న రహీం అనే యువకుడితోపాటు ఎం.మానస, ఎన్.మానస ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. సిద్ధు అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. రహీం మద్యం మత్తులో వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. ఈ ఘటనపై జడ్చర్లకు చెందిన మానస తండ్రి రవీందర్‌ను పలకరిస్తే.. ‘‘ఆరేళ్ల క్రితమే తల్లిని పోగొట్టుకున్న మానసను గారాబంగా పెంచాను. ఆమెకు ఇష్టమైన టీవీ, సినిమా రంగంలోకి వెళ్తానంటే సంతోషపడ్డాను. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉంటుందని భావించాను. కానీ డ్రంకెన్ డ్రైవ్ నా బిడ్డను నాకు కాకుండా చేసింది. ఇలాంటి శిక్ష ఏ తండ్రికి పడొద్దు..’’అని కన్నీళ్లు పెట్టారు. పెంచిన చేతులతోనే.. అతడి పేరు కిరణ్ (28).. బీరుతో సరదాగా మొదలైన వ్యసనం విస్కీతో విస్తరించింది. ఆపై గంజాయికీ చేరింది. మత్తు లేనిదే ఉండలేక డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధించడం, దాడులు చేయడం దాకా ఉన్మాదం చేరింది. కిరణ్ భార్య వేధింపులు భరించలేక పుట్టింటికి వెళ్లిపోయింది. అక్టోబర్ 10న మత్తులో ఇంటికి వచ్చిన కిరణ్ డబ్బులు కావాలంటూ తల్లి మీద దాడి చేశాడు. అడ్డుకోబోయిన తండ్రినీ గాయపరిచాడు. ఏమీ దిక్కుతోచని ఆ వృద్ధ దంపతులు కిరణ్ మెడకు తాడు బిగించి చంపేశారు. ఇది సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో జరిగిన విషాద ఘటన. జీవిత చరమాంకంలో ప్రశాంతంగా గడపాలనుకున్న తల్లిదండ్రులు యాదగిరి, వెంకటమ్మ మద్యం పెట్టిన చిచ్చుతో జైలు జీవితం గడుపుతున్నారు. తల్లి కోసం తండ్రిని.. ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆ ఇద్దరూ ఉన్నంతలో బాగానే కాలం గడిపారు. భర్త భాస్కర్ (45) ఆటో నడుపుతూ భార్య కరుణారాణి, ఇద్దరు కుమారులు బాలతేజ, తరుణ్ తేజలను పోషించుకుంటూ వచ్చాడు. కానీ భాస్కర్ సరదాగా మొదలుపెట్టిన మద్యం తాగుడు.. తర్వాత అలవాటుగా, వ్యసనంగా మారింది. కొన్నేళ్ల క్రితం మద్యం మత్తులో భాస్కర్ దాడి చేయడంతో భార్య చేయి విరిగింది. తర్వాతా మద్యానికి డబ్బుల కోసం వేధించడం పెరిగింది. ఈ నెల 20న ఆలేరు మండలం తూర్పుగూడెంలో చర్చి పండగతో ఊరంతా సందడిగా ఉంటే.. భాస్కర్ మాత్రం తనకు తాగేందుకు డబ్బులివ్వాలంటూ భార్యపై దాడికి దిగాడు. అడ్డుకోబోయిన కొడుకులను గాయపర్చాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇద్దరు కొడుకులు కత్తితో దాడి చేయగా.. భాస్కర్ చనిపోయాడు. ఆ ఇద్దరు జైలుకు వెళ్లారు. కరుణారాణిపైనా కేసు నమోదైంది. కష్టం చేస్తేగానీ పూటగడవని కుటుంబానికి మద్యం అలవాటు చేసిన గాయం ఎలా మానుతుందంటూ తూర్పుగూడెం గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ప్రేమపెళ్లి.. నడిరోడ్డులో ఆలిని నరికేసి.. మహబూబాబాద్ జిల్లా కేంద్రం భవానినగర్ తండాలో ఉండే జాటోత్ భాస్కర్ 15 ఏళ్ల కింద కల్పన అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భాస్కర్ ఒకచోట గుమాస్తాగా, కల్పన ఇళ్లలో పనిచేస్తూ ముగ్గురి ఆడపిల్లల్ని పోషించుకుంటూ వచ్చారు. కానీ, కొంతకాలంగా మద్యానికి బానిసైన భాస్కర్ తాగి వచ్చి డబ్బుల కోసం కల్పనను కొట్టేవాడు. వేధింపులు భరించలేక కల్పన ఈ ఏడాది సెప్టెంబర్ 17న పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీనిపై ఆగ్రహించిన భాస్కర్ సెప్టెంబర్ 22న ఉదయం పనికోసం వెళ్తున్న కల్పనను నడిరోడ్డులో కత్తితో పొడిచి చంపాడు. తల్లి హత్యకు గురై తండ్రి జైలుకు వెళ్లడంతో చిన్నారులు అమ్మమ్మ ఇంట్లో భారంగా బతుకు వెళ్లదీస్తున్నారు. భారీగా మద్యం ఆదాయం 2020–21లో తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సుమారు పదివేల కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. మిగతా జిల్లాల్లో బాట్లింగ్ యూనిట్ల ద్వారా ప్రభుత్వానికి నేరుగా వచ్చిన ఆదాయం ఇదీ .. సులువైన ఆదాయం మద్యం నుంచే.. అది పేరుకే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ. కానీ ప్రొహిబిషన్ (నిషేధం) బదులు విస్తరణ శాఖగా మార్చేశారు. మద్యం ఆదాయం ప్రధాన వనరుగా మారింది. ప్రభుత్వాలకు సులువుగా వచ్చే ఆదాయం ఇదే. కానీ మద్యం వినియోగంతో పాటు క్రైం రేటు భారీగా పెరుగుతోంది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను మర్చిపోయామనిపిస్తోంది. – ఎంవీ చంద్రవదన్, ఎక్సైజ్ మాజీ కమిషనర్ డేంజర్ జోన్‌కు చేరువలో ఉన్నాం తెలంగాణ ఇప్పుడు డేంజర్ జోన్‌కు చేరువలో ఉంది. మా అంచనా మేరకు 90శాతం మంది (15 ఏళ్లు పైబడిన వారిలో) పలు రకాల మద్యం తాగుతున్నారు. మొదట తొలుత కల్లు, బీరు, విస్కీ.. అనంతరం గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు. పంజాబ్ ఇప్పటికే మద్యం వినియోగం నుంచి డ్రగ్స్ వైపు వెళ్లింది. తెలంగాణలో పరిమితికి మించి మద్య వినియోగం జరుగుతుంది. కొన్నాళ్లకు ఈ మత్తు చాలక గంజాయి, డ్రగ్స్ వైపు వెళ్లటం సహజం. తక్షణం మద్య నియంత్రణ కార్యాచరణ ప్రకటించకపోతే తెలంగాణ మరో పంజాబ్ కావడానికి ఎంతో సమయం పట్టదు. – ఎం పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ మద్యం విచక్షణను దూరం చేస్తుంది సరదా కోసం తీసుకునే మద్యం అలవాటుగా మారి మనిషిలో విచక్షణను దూరం చేస్తోంది. మెదడు నుంచి కాలిబొటన వేలి వరకు ప్రభావం చూపుతుంది. ఆహారంలా అవసరంగా మారి.. మద్యం తీసుకోకపోతే మనిషిని ఉన్మాదిగా మారుస్తుంది. – డాక్టర్ ఎ.లక్ష్మీలావణ్య, హైదరాబాద్ -
కొడుకును కడతేర్చిన తల్లి
గుంతకల్లు: నిత్యం మద్యం తాగొచ్చి వేధిస్తున్న కుమారుణ్ని కన్నతల్లే కడతేర్చింది. ఈ ఘటన గుంతకల్లు పట్టణంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ గణేష్, ఎస్ఐ నరేంద్ర, సమీప బంధువుల కథనం మేరకు... పాత గుంతకల్లుకు చెందిన నాగరాజు, జయమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. నాగరాజు హమాలీ పని నిమిత్తం చైన్నెకు వెళ్లాడు. జయమ్మతో పాటు పెద్దకుమారుడు భీమేష్ (20), చిన్నకుమారుడు వశికేరి ఉండేవారు. ముగ్గురూ బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. అయితే పెద్దకుమారుడు భీమేష్ మద్యానికి బానిసయ్యాడు. తనకు పెళ్లి చేయాలని, తాగడానికి డబ్బులు కావాలంటూ రోజూ తల్లిని వేధించేవాడు. డబ్బులు లేవంటే నడిరోడ్డుపై గట్టిగా కేకలు వేస్తూ గొడవలకు దిగేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి కూడా అతిగా మద్యం తాగొచ్చి తల్లితో గొడవకు దిగాడు. నిగ్రహం కోల్పోయిన తల్లి చిన్నకొడుకు వశికేరి సహాయంతో భీమేష్‌ను కత్తి పొడిచి, కట్టెలతో కొట్టి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని రైల్వే ట్రాక్‌పై వేయడానికి ఇద్దరూ కలిసి స్కూటర్‌పై తీసుకెళుతుండగా కుక్కలు గట్టిగా మొరిగాయి. దీంతో భయపడి మృతదేహాన్ని స్కూటర్‌పై నుంచి కిందకు పడేశారు. దీంతో చుట్టుపక్కల వారు గుర్తించడంతో మృతదేహాన్ని అక్కడే పడేసి పారిపోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులు పరారీలో ఉన్నారు. (చదవండి: పావురాలు కొనడానికి వచ్చి...కత్తితో దాడి) -
టీ పొడి అనుకొని పురుగులమందు.. చాయ్ తాగి అయిదుగురు దుర్మరణం
లక్నో: విష రసాయనాలు కలిసిన టీ (చాయ్) తాగి ఇద్దరు చిన్నారులు, వారి తండ్రి సహా ఐదుగురు మృత్యువాతపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లా నగ్లా కన్హాయ్ గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామమూర్తి అనే మహిళ గురువారం తన ఇంట్లో టీ పొడిగా పొరపడి, పొలంలో పిచికారీ చేసిన పురుగులమందు డబ్బాలోని పౌడర్‌ను వేసి టీ కాచింది. దానిని భర్త శివనందన్(35), కుమారులు శివాంగ్(6), దివ్యాన్ష్5)తోపాటు తన తండ్రి రవీంద్ర సింగ్(55), పొరుగునుండే సొబ్రాన్(42)లకు ఇచ్చిది. తాగిన తర్వాత వీరంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రవీంద్ర సింగ్, శివాంగ్, దివాన్ష్ ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే చనిపోగా మిగతా ఇద్దరు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని ఎస్పీ చెప్పారు. చదవండి: కదులుతున్న కారుపైకి ఎక్కి టపాసుల కాల్పులు...సీన్ కట్ చేస్తే... -
దారి కాచి.. దాడి చేసి..
సాక్షి, బంజరాహిల్స్: అర్ధరాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ యువకుడిపై నలుగురు ఆకతాయిలు మద్యం మత్తులో కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్ నగర్ బస్తీకి చెందిన నగేష్ కొత్త చెరువు వద్ద ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తుంటాడు. బుధవారం రాత్రి వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళ్తుండగా నలుగురు యువకులు డబ్బులు డిమాండ్ చేస్తూ అతడిని తీవ్రంగా కొట్టారు. దీంతో బాధితుడు డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకోగా ముగ్గురు నిందితులు అక్కడి నుంచి ఉడాయించారు. ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పోలీసులు వెళ్లిన క్షణాల్లోనే చెట్ల మాటున దాక్కున్న మిగతా ముగ్గురు మళ్లీ అక్కడికి వచ్చి మాపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ మరోసారి బాధితుడిపై కర్రలతో దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన అతడిని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు కొద్దిసేపు నిఘా ఉంచితే మళ్లీ దాడి జరిగి జరిగే ఉండేది కాదని స్థానికులు పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు. (చదవండి: భార్య గొంతుకోసి హత్య) -
బారాత్‌లో తప్పతాగి పెళ్లికొడుకు డ్యాన్సులు.. మరొకరిని పెళ్లాడిన వధువు
జైపూర్: రాజస్థాన్‌లోని ఒక వరుడు అర్ధరాత్రి వరకు బారాత్‌లో పార్టీ చేసుకుంటూ తప్పతాగి తూలుతూ డ్యాన్సులు చేయడంతో ఆ వధువు గట్టి షాకిచ్చింది. అతన్ని కాదని వేరే వ్యక్తితో తాళి కట్టించుకుంది. రాజస్థాన్‌లోని చురు జిల్లా చెలానా గ్రామంలో ఈ ఘటన జరిగింది. వరుడు సునీల్ తన బంధుమిత్ర గణంతో వధువు ఊరుకి వచ్చాడు. రాత్రి తొమ్మిదికల్లా వధువు ఇంటికి వరుడు కుటుంబం చేరుకోవాలి. కానీ స్నేహితులతో కలిసి తాగుతూ డ్యాన్సులు చేస్తూ అర్ధరాత్రి 1:15కి ముహూర్తం సమీపిస్తున్నప్పటికీ రాలేదు. దీంతో సహనంలో కోల్పోయిన ఆ వధువు అతనిని పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అప్పటికప్పుడు వేరే వ్యక్తితో ఆమె వివాహం జరిపించారు. చదవండి: (మీరొస్తానంటే.. నేనొద్దంటా!) -
ఆరేళ్లుగా తన మూత్రాన్ని తానే తాగుతున్న వ్యక్తి.. 10 ఏళ్లు యవ్వనంగా..
ప్రపంచంలో ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. చాలా మంది నిత్యం అందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఇందుకు చాలామంది ఆహార నియమాలు పాటిస్తారు. వ్యాయామం, యోగా, డైట్ తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. కానీ ఓ వ్యక్తి చాలా విచిత్రంగా మూత్రం(యూరిన్) తాగడం వల్ల తన వయసు తగ్గి యవ్వనంగా కనిపిస్తున్నట్లు చెబుతున్నాడు. మానసిక ఒత్తిడిని సైతం జయించినట్లు పేర్కొన్నాడు. అతనే ఇంగ్లాండ్‌కు చెందిన 34 ఏళ్ల హ్యారీ మెటాడీన్.. యూకేలోని హాంప్‌షైర్‌కు చెందిన హ్యారీ 2016 నుంచి ఇప్పటి వరకు రోజూ తన మూత్రాన్ని తానే తాగుతున్నాడు. ఇలా చేయడం వల్ల దాదాపు 10 ఏళ్లు యంగ్‌గా కనిపిస్తున్నట్లు పేర్కొన్నాడు. గతంలో తనకు మానసిక సమస్యలను ఎదురవ్వగా వాటి నుంచి బయట పడేందుకు ఈ ’యూరిన్ థెరపీ’ ప్రారంభించినట్లు తెలిపాడు. దీంతో తనకు శాంతి, ప్రశాంతత వంటి కొత్త అనుభూతిని ఇచ్చిందని వెల్లడించాడు. అప్పటి నుంచి సొంత మూత్రాన్ని తాగుతున్నట్లు చెప్పాడు. తన మూత్రాన్ని బాటిల్స్‌లో స్టోర్ చేసుకొని.. రోజుకో 200 మి. లీ చొప్పున తాగుతుంటాడు. మూత్రాన్ని బాటిల్స్‌లో నింపి.. రెండు మూడు నెలల తర్వాత తాగుతున్నట్లు తెలిపాడు. దీనిని తాగినప్పుడు ఎంతో శక్తివంతంగా ఉంటుందని, ఒత్తిడి దూరమై, మెదడు చురుకుగా పనిచేస్తుందని హ్యరీ తెలిపాడు. అలాగే మూత్రాన్ని మాయిశ్చరైజర్‌గా తన ముఖానికి మసాజ్ చేస్తానని కూడా వెల్లడించాడు. ఇలా చేయడం వల్ల తన చర్మం యవ్వనంగా, మృదువుగా, మెరుస్తూ కనిపిస్తుందంటున్నాడు. ఇక 90 శాతం నీరు ఉన్న మూత్రానికి శరీరంలో ఉన్న అన్ని రోగాలను నయం చేసే శక్తి ఉందని హ్యారీ విశ్వసిస్తున్నాడు. చదవండి: Pakistan: ఇమ్రాన్‌ఖాన్‌కు మరో బిగ్ షాక్ మూత్రం తాగడం వల్ల తనకు ఎంతో మేలు జరిగిందని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అలవాటును మార్చుకోనని చెబుతున్నాడు. దీనిని తయారు చేసేందుకు ఖర్చుకూడా లేకపోవడంతోపాటు నిత్య మూత్రం తాగడం వల్ల శరీరంలో అనూహ్య మార్పులు వచ్చాయని చెప్పారు. కాగా గతంలో సింగర్స్ మడోన్నా, కేషా కూడా మూత్రం తాగుతామని వెల్లడించారు. అయితే ఈ నిర్ణయాన్ని వైద్యులు వ్యతిరేకిస్తున్నారు. మూత్రం తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ పెరుగుతుందని.. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వస్తాయని హెచ్చరిస్తున్నారు. -
24 వేల ఏళ్లుగా గడ్డకట్టే మంచులోనే పడిఉంది... కానీ ఆ జీవి బతికే ఉంది!
Cold grave for nearly 24,000 years without eating or drinking: చాలా షాకింగ్ ఘటనలు చూస్తే అసలు అదేలా సాధ్యం అని కూడా అనుకుంటాం. నిజానికి ఈ విశాలా విశ్వంలో మన ఊహకు అందని ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. కాకపోతే అసాధ్యం అనుకునేవి జరిగేంత వరకు కూడా మనం అంత తేలిగ్గా నమ్మం. అచ్చం అలాంటి సంఘటనే ఆర్కిటిక్ మంచు ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఆర్కిటిక్‌లో మైనస్ డిగ్రీల ఉష్టోగ్రత ఉంటుంది. పైగా చాలా దారుణమైన గడ్డకట్టుకుపోయేంత చలి. అలాంటి ప్రాంతంలో మంచు తుపానులో చిక్కుకున్న లేదా కూరుకుపోయిన బతికే ఛాన్స్ లేనే లేదు. కానీ శాస్త్రవేత్తలు ఆర్కిటిక్‌లోని గడ్డకటట్టే చలిలో పరిశోధనలు చేయడానికి వెళ్లినప్పుడూ వారికి ఒక ఊహించని షాకింగ్ ఘటన ఎదురైంది. అక్కడ మంచులో కూరుకుపోయి పడి ఉన్న ఒక వింత జీవిని చూశారు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అది నిక్షేపంగా బతికే ఉంది. అయితే ఆ జీవి దాదాపు 24 వేల ఏళ్లుగా ఏమి తినకుండా, తాగకుండా మంచులోనే పడి ఉంది. ఇలాంటి వాటిని మైక్రో-జోంబీ జీవులు అంటారని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇలాంటి జంతువులు 50 మిలియన్ల ఏళ్ల క్రితం వివిధ నీటి ప్రాంతాల్లో కనుగొన్నారని చెప్పారు. అయితే ఈ జీవి చర్మం మంచు ప్రభావం ఏ మాత్రం కనిపించలేదని చెప్పారు. ఇది మాత్రమే కాదు, వీటిని లేడ్ రోటిఫర్స్ లేదా వీల్ యానిమల్స్ అని కూడా పిలుస్తారని అన్నారు. అయితే వీటి చర్మంపై చాలా కణాలతో కూడిన సూక్ష్మ జీవుల ఉంటాయని, పైగా నోటి చుట్టూ దట్టంగా వెంట్రుకలు ఉంటాయని అన్నారు. ఇంతకుముందు రష్యన్ శాస్త్రవేత్తలు -20 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పది సంవత్సరాల వరకు జీవించగల అటువంటి రోటిఫర్‌లను కనుగొన్నారని కూడా చెప్పారు. అయితే ఇవి జన్మనివ్వవని, అలైంగికమైనవని తెలిపారు. అయితే శరీరం పొడవుగా ఉంటుందన్నారు. వాటి పొడవు 0.04 నుంచి 2 మిల్లీమీటర్ల వరకు ఉంటుందని, కానీ చాలా వరకు 0.5 మిల్లీమీటర్లకు మించి పెరగవు అని వెల్లడించారు. పరిమాణంలో చిన్నది అయినప్పటికీ వారి శరీరంలో చాలా క్లిష్టమైన అవయవాలు ఉన్నాయని వాటిని మైక్రోస్కోప్ లేకుండా చూడలేమని చెబుతున్నారు. ఈ రోటిఫర్‌లను చూస్తే ఈ ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింత జీవులు ఉన్నాయని అనిపిస్తుంది కదా (చదవండి: ఇంతకీ ఐపీఎస్ అధికారి సూట్ కేస్‌లో ఏముందో తెలుసా!) -
తమ్ముడి నిర్వాకం... సొంత అక్కపైనే అఘాయిత్యం
18-year-old youth shoots sister: చెడు అలవాట్లకు బానిసైన వాళ్లను దారిలో పెట్టెందుకు కుటుంబ సభ్యులు చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఒక్కసారి కౌన్సిలింగ్‌లకు పంపించి మరీ సరైన మార్గంలో పెట్టేందుకు శతవిధాల ప్రయత్నిస్తారు. అయితే వాళ్లు సహకరిస్తేనే ఏదైన చేయగలం. మరికొంత మందికి అవి చెవికి ఎక్కవు, పైగా కక్ష పెంచుకుని ఎంతటి దుర్మార్గానికైన ఒడికట్టేందుకు ప్రయత్నిస్తారు. అచ్చం అలాంటి ఘటనే గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకెళ్తే...ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో హర్ధోయి ప్రాంతంలోని 32 ఏళ్ల వివాహిత సోదరుడు తాగుడికి బానిసై అందర్నీ దూషించడం వంటి పనులు చేస్తుంటాడు. దీంతో విసిగిపోయిన ఆమె తన తమ్ముడుని తాగడం మానేయమని హితవు చెప్పింది. ఇలా అందర్నీ దూషించడం సరికాదని చెప్పేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అసలే తాగి ఉన్నాడమే ఆ మైకంలో ముందు వెనుక చూడకుండా పిస్టల్ తీసుకుని తన అక్కనే అతి దారుణంగా కాల్చి చంపి అక్కడ నుంచి పారిపోయాడు. దీంతో బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులకు సంఘటన స్థలికి వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తు్నారు. ఈ మేరకు నిందుతుడిని షహబెరి ప్రాంతంలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ యోగేంద్ర సింగ్ పేర్కొన్నారు. -
వివాహేతర సంబంధమే కారణమా? భర్త మెడకు చున్నీ బిగించి..
సాక్షి, కామారెడ్డి(నిజామాబాద్): నిద్రిస్తున్న భర్త మెడకు చున్నీ బిగించి హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అజాంపుర కాలనీలో మంగళవారం వెలుగు చూసింది. తాగి వచ్చి వేధిస్తుండడంతో తానే చంపేశానని భార్య చెబుతుండగా, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే చంపేసిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అసలేం జరిగిందంటే.. అజాంపుర కాలనీలో నివాసముండే అఫ్రోజ్ ఖాన్ (37)కు భార్య ఫర్జానా బేగం, కుమారుడు ఉన్నారు. ఫర్జానా మొదటి భర్తను వదిలేసి, అఫ్రోజ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. అఫ్రోజ్ ఖాన్ గతంలో ఆటో నడిపే వాడు. కొద్ది రోజుల నుంచి అల్లం, వెల్లుల్లి విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, రోజూ మద్యం సేవించి వచ్చి భార్యను వేధిస్తున్నట్లు తెలిసింది. విసిగి పోయిన ఫర్జానా సోమవారం అర్ధరాత్రి సమయంలో భర్త మెడకు చున్నీ బిగించి హత్య చేసింది. సమాచారమందుకున్న పోలీసులు మృతదేహాన్ని మంగళవారం పోస్టుమార్టం కోసం తరలించారు. ఘటన స్థలాన్ని డీఎస్పీ సోమనాథం, ఎస్‌హెచ్‌వో మధుసూదన్ పరిశీలించారు. రోజు మద్యం సేవించి తనను వేధించడంతోనే హత్యకు పాల్పడినట్లు ఫర్జానా చెబుతోంది. అయి తే, వివాహేతర సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడనే కారణంతోనే హత్చ చేసినట్లు అఫ్రోజ్ బంధువులు ఆరోపిస్తున్నారు. భార్య ఒక్కరే హత్యకు పాల్పడిందా? లేక ఎవరైనా సహకరించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతానికి హత్య కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని డీఎస్పీ సోమనాథం తెలిపారు. చదవండి: యువతి ఫొటోలతో న్యూడ్ ఫొటోలు అప్లోడ్ చేస్తానంటూ.. -
డ్రగ్స్ అడిక్ట్ టూ విన్నర్!: ‘ఆ రోజు చేసిన పని నన్ను పదే పదే కలచివేసింది'
ఇటీవలకాలంలో యువత ఎక్కువగా సిగరెట్స్, మద్యం, డ్రగ్స్ వంటి వాటికి బానిసై తమ జీవితాలను ఏవిధంగా నాశనం చేసుకుంటున్నారో చూశాం. ఆఖరికి సినితారలను సైతం ఈ జాడ్యం వదలడం లేదు. ప్రముఖ సెలబ్రెటి పిల్లలతో సహా అందరూ వీటికి బానిసై పోతున్నారు. ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన ప్రజల్లోనూ, యువతలోను మార్పు రాకపోవడం మన దురదృష్టమో లేక మరోకటో తెలియదు. అయితే ఇక్కడొక మహారాష్ట్రవాసి చిన్నవయసులో సిగరెట్ కాల్చడం, మద్యం సేవించడం వంటి వాటికి బానిసయ్యాడు. అయితే అతను అలా వాటికి అడిక్టి అవ్వడమే తనకు వరంగా మారిందనే చెప్పలి. ఒక రకంగా తన జీవితాన్ని అర్థవంతంగా మార్చింది. అసలు విషయంలోకెళ్లితే...మహారాష్ట్రలోని గోధాని గ్రామ నివాసి అయిన పంకజ్ మహాజన్ నాల్గవ తరగతి చదువుతున్నప్పటి నుంచి పొగాకు, మద్యపానానికి బానిసయ్యాడు. దీనికితోడు మద్యానికి బానిసైన తండ్రి, వికలాంగురాలైన తల్లి ఉండటంతో పంకజ్కి సరైన మార్గదర్శకత్వం లేకుండా పోయింది. అయితే పంకజ్ తండ్రి పోగాకుతో సహా నిత్యావసరాల వస్తువులు విక్రయించే దుకాణాన్ని నడిపేవాడు. ఈమేరకు పంకజ్ తన తండ్రి, ఆ గ్రామ పెద్దలు స్టైయిలిష్‌గా పొగాకు తాగటం చూసి తాను కూడ వారి అడుగుజాడల్లోనే నడవాలని అనుకున్నాడు. అంతేకాదు ఎవరికి తెలియకుండా పొగాకు కాల్చడం కూడా నేర్చుకున్నాడు. అమ్మను కాపాడుకోలేని స్థితి.... అయితే అది ఎంతవరకు వచ్చిందంటే ఒక్కరోజులోనే పొగాకు ప్యాకెట్ మొత్తం అయిపోయిలా తాగేంతవరకు వచ్చింది. అంతేకాదు పంకజ్ సిగరెట్ కాలుస్తున్నప్పటికీ తండ్రి మందలించకపోవడంతో పంకజ్కి అది తప్పు అన్న విషయం తెలియలేదు. ఆ తర్వాత పంకజ్ మద్యం సేవించటం కూడా మొదలు పెట్టేశాడు. దీంతో ఆ బస్తీలో ఉన్న మిగతా పిల్లల తల్లిదండ్రులు పంకజ్ దగ్గరకు వెళ్లనిచ్చేవారు కాదు. మరోవైపు తన తండ్రి మద్యానికి బానిసై డబ్బులు కోసం తన తల్లిని, తనను కొడతుండటంతో పదిలోనే చదువుకు స్వస్తి పలికి డబ్బులు సంపాదించటం మొదలు పెట్టాడు. అయితే ఒకరోజు తన తండ్రి తాగి వచ్చి తన తల్లిని చితకొట్టాడు. ఈ క్రమంలో ఆమె తలకు పెద్ద గాయం అవుతుంది. అయితే అక్కడే ఉన్న పంకజ్ తన తండ్రిని ఆపడానికి గాని తన తల్లిన కాపాడుకోవటానికి గాని ప్రయత్నించకుండా అలా చూస్తుండిపోతాడు. జీవితాన్ని మలుపు తిప్పిన ఘటన.... చుట్టుపక్కల వాళ్లు వాళ్ల అమ్మను ఆసుపత్రిలో జాయిన్ చేసి కాపాడతారు. ఆ సంఘటనే తన జీవితాన్ని మారుస్తుంది. పంకజ్ ఈ చెడ్డఅలవాట్లకు బానిసయ్యి నీరసించపోవటం, అలిసిపోయి ఏ పని చేయలేని స్థితికి చేరుకుంటాడు. అందువల్లే ఆ రోజు అతను తన తండ్రి దాడి చేస్తున్నప్పుడు తల్లిని కాపాడే శక్తి కూడా లేక నిస్సత్తువగా చూస్తుండిపోయాడు. ఆ సంఘటనే తన జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. అనుకోకుండా పంకజ్ గ్రామానికి ఎన్జీవోలు వచ్చారు. అయితే ఆ గ్రామస్తులు కారణంగా పంకజ్ గురించి ఎన్జీవోలకు తెలుస్తుంది. ఈ మేరకు వారు స్వచ్ఛందంగా పంకజ్ విషయంలో జోక్యం చేసుకుని విజయ్ బార్సే ప్రారంభించిన ఆశ్రమంలో జాయిన్ చేశారు. అది ఎన్జీవోల ద్వారా జాయిన్ అయిన నిరాశ్రయులైన పిల్లలకు ఉచితంగా ఫుట్‌బాల్ శిక్షణ ఇచ్చే సెంటర్. ఈ మేరకు ఉచిత ఫుట్‌బాల్ శిక్షణ మాత్రమే కాక స్టైఫండ్ ఇచ్చి స్కూలుకి కూడా పంపిస్తారు. అయితే ఒక్కొక్కసారి తన చెడ్డ అలవాట్ల వైపు వెళ్లాలనిపించినా అతను వెళ్లలేదు. ఆ సంఘటనే కళ్ల ముందు మెదలడంతో... ఆ రోజు తన తల్లి నెత్తురోడుతుంటే అంబులెన్స్‌కి కూడా కాల్ చేయలేని నిస్సహాయ స్థితి అతనికి గుర్తుకు వచ్చేదని పంకజ్ ఇతరులకు పదే పదే చెబుతూ ఉండేవాడు. అంతేకాదు పంకజ్ ఎంతో కసిగా ఫుట్ బాల్ ఆడటం కూడా నేర్చకునేవాడు. పైగా ఒక్కరోజు కూడా ప్రాక్టీస్ చేయడం మానేవాడు కాదు. ఆ నిర్విరామ కృషే అతన్ని రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఫుట్బాల్ని ఆడేలా చేసింది. ఆ తర్వాత అతను 2013లో హోమ్‌లెస్ వరల్డ్ కప్ కోసం తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు పోలాండ్‌కు వెళ్లాడు. అప్పుడే అతని గురించి పత్రికల్లోనూ, మీడియాల్లోనూ బాగా వచ్చింది. అంతేకాదు ఏ గ్రామస్థులైతే అసహ్యంగా చూశారో వారే నన్ను ఇప్పుడూ మెచ్చకుంటున్నారని చెప్పాడు. అయితే తనలాంటి పిల్లలకు సాయం చేయడం కోసం ఎన్జీవోలో పేరు నమోదు చేసుకున్నానని, పైగా తాను ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశానని చెప్పాడు. ఇతని కథ నిజంగా స్ఫూర్తిధాయకం కదా! (చదవండి: బాప్రే! 14 అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం... ఐతే ఆ ఇద్దరు...!! షాకింగ్ వీడియో) -
గుర్...ర్...ర్.... గురకకు చెక్ పెట్టండిలా
సాధారణంగా గాఢనిద్రలో ఉన్నప్పుడు ఒక గంట లేదా రెండు గంటల సేపు తేలికపాటి గురక అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ నిద్ర పట్టీ పట్టగానే పెద్ద శబ్దంతో గురక వస్తుంటే మాత్రం డాక్టర్ సలహా తీసుకోవాల్సిందే. సాధారణ గురక వల్ల ఇంట్లో వాళ్లకు అసౌకర్యం మినహా మరే ప్రమాదమూ ఉండదు. ఇన్ఫెక్షన్ల కారణంగా వచ్చిన గురక అయితే ఇన్ఫెక్షన్కు చికిత్స చేయించుకుంటే సరిపోతుంది. లైఫ్‌స్టైల్ మార్పుతో ఈ గురకను దూరం చేసుకోవచ్చు. సాధారణ గురక (స్నోరింగ్) ప్రమాదకరం కాదు, కానీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అయితే తేలిగ్గా తీసుకోకూడదు. ఈ కండిషన్లో గురక మధ్యలో గాలి పీల్చుకోవడం ఆగుతుంటుంది. ఇది ప్రమాదకరమైన స్థితి. దీనికి డాక్టర్‌ను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. అసలు గురక ఎందుకు వస్తుంది? గురకకు దారి తీసే కారణాలివి: ►ముక్కు మూసుకుపోయి గాలి సరఫరాకు అంతరాయం కలుగుతున్నప్పుడు గురక వస్తుంది. అయితే ఇది చాలామందిలో సీజనల్‌గానే ఉండవచ్చు. సైనస్ ఇన్ఫెక్షన్లున్నప్పుడు కూడా నాసికామార్గం నుంచి గాలి సులువుగా ఊపిరితిత్తులను చేరలేదు. అటువంటప్పుడు కూడా గాలి పీల్చుకునేటప్పుడు శబ్దం వస్తుంది. నాసల్ పాలిప్స్ కూడా గురకకు కారణం కావచ్చు. పాలిప్స్ అంటే ముక్కులోపలి గోడలకు కానీ ముక్కుదూలం వెంబడి కానీ కండరం పెరగడం. ►రోజంతా శారీరకంగా ఎక్కువగా శ్రమించి దేహం ఎక్కువ అలసటకు లోనయినప్పుడు నిద్రలోకి జారుకోగానే గొంతు, నాలుక శ్వాసకోశ వ్యవస్థతో కలిసే ప్రదేశంలో కండరాలు పూర్తిగా విశ్రాంతిదశలోకి వెళ్లిపోతుంటాయి. దాంతో గాలి ప్రయాణించాల్సిన మార్గం కుంచించుకున్నట్లు అవుతుంది. ఆల్కహాల్ ఇతర మత్తు పదార్థాలు సేవించేవారిలో కూడా ఇదే కండిషన్ ఏర్పడుతుంది. ►అధికబరువు ఉన్న వాళ్లలో బల్కీ థ్రోట్ టిష్యూస్ కండిషన్ కనిపిస్తుంది. గురకకు ఇదీ ఓ కారణమే. ►దిండు మరీ మెత్తగా ఉండి భుజాల కంటే తల దిగువగా ఉన్నప్పుడు, దిండు మరీ గట్టిగా ఎత్తుగా ఉన్నప్పుడు కూడా గాలిపీల్చుకునేటప్పుడు శబ్దం వస్తుంది. ►పిల్లల్లో కొందరికి టాన్సిల్స్, అడినాయిడ్స్ పెద్దవిగా ఉంటాయి. పిల్లల్లో గురకకు ప్రధాన కారణం ఇదే అయి ఉంటుంది. గురకను తగ్గించుకునే మార్గాల.... ►అధికబరువును తగ్గించుకోవాలి. ►దూమపానం, మద్యపానం మానేయాలి. ►వెల్లకిలా పడుకోకుండా పక్కకు ఒత్తిగిలి పడుకోవాలి. ►దిండు ఎత్తు పట్ల జాగ్రత్త (మెడ మరీ కిందకు ఉండకూడదు, మరీ ఎత్తుగానూ ఉండకూడదు, భుజాలకు సమాంతరంగా ఉండాలి) ►గురకను అరికట్టే ప్లాస్టిక్ డివైజ్ ఉంటుంది. దానిని నోట్లో పెట్టుకుంటే ఫలితం ఉంటుంది. దీనిని డాక్టర్ సలహా మేరకు ఉపయోగించాలి. పాలిప్, బల్కీ టిష్యూ వంటి సమస్యలైతే చిన్నపాటి శస్త్ర చికిత్సతో నయం చేసుకోవచ్చు. -
9 గంటల్లో 51 పబ్‌లు చుట్టి.. ప్రతీ పబ్‌లోనూ డ్రింక్ తీసుకుని
బ్రిటన్: పబ్‌కి వెళ్లి తాగకుండా ఉండటమనేది సాధారణంగా జరగదు. కానీ ఇక్కడ ఒక 48 ఏళ్ల వ్యక్తి తాను ఒక్కో రోజులో 51 పబ్లకి వెళ్లి కనీసం ప్రతీ పబ్ వద్ద 125 మి.లీ డ్రింక్ తీసుకుని రికార్డు సృష్టించాడు. ఇంతకి అతనెవరనే కదా! అసలు విషయంలోకి వెళ్లితే కోవిడ్-19 దృష్ట్య పబ్లకి జనాలు దూరంగా ఉండటంతో ఆ వ్యాపారాలు కాస్త దెబ్బతిన్నయన్న సంగతి తెలిసిందే. (చదవండి: అక్కడ తాగే నీటిలో అత్యధిక స్థాయిలో డీజిల్, కిరోసిన్ ఉన్నాయట!) ఇలాంటి సమయంలో అందరి దృష్టిని ఆకర్షించేలా కావాలనే పబ్లకి వెళ్లానంటున్నాడు యూకేకి చెందిన మ్యాట్ ఎల్లిస్. అంతేకాదు కేవలం ఒక్కరోజులోనే ఎనిమిది గంటల 52 నిమిషాల్లో 51 పబ్‌లు చుట్టి వచ్చాడు. ఈ క్రమంలో అతను ఆరోగ్య రీత్యా ప్రతి పబ్‌లోనూ కేవలం 125 మిల్లీ లీటర్ల మాత్రమే ఆల్కహాల్ తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇందులో జ్యూస్, డైట్ కోక్ మిక్స్ చేసి డ్రింక్ తీసుకున్నాడు. ఓవరాల్‌గా పబ్‌లను చుట్టొచ్చే సమయంలో ఓవరాల్‌గా 6.3 లీటర్లు ఆల్కాహల్ తీసుకున్నాడట. దీనికి గిన్నిస్ వరల్డ్ ఇద్దరు స్వతంత్ర ప్రతినిధుల్ని నియమించి అతన్ని పర్యవేక్షించింది. ఈ ఏడాది చాలా భయంకరమైనదని, పబ్‌ల నుంచి ప్రజలను దూరం చేయడమే కాక అందరూ ఆనందంగా వారాంతాల్లో గడిపే అవకాశం లేకుండా చేసిందంటూ తన అసహనం వ్యక్తం చేశాడు. ఈ మేరకు తాను వరల్డ్ రికార్డుకి దరఖాస్తు చేసుకున్నట్లు కూడా తెలిపాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఎల్లిస్ రికార్డును ధృవీకరిస్తే మాత్రం ఇలాంటి ఘనత సాధించిన మొట్ట మొదటి వ్యక్తిగా ఎల్లిస్ నిలుస్తాడు. (చదవండి: అతను కూడా నాలాగే ఆమెను ప్రేమిస్తున్నాడు) -
శివ శివా.. ఏమిటీ అపచారం!
సాక్షి,కర్నూలు(మహానంది): రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన మహానందిలో గురువారం అపచారం చోటు చేసుకుంది. ఆలయ ఆవరణ, అందులోనూ ఈఓ ఇంటి వెనుకే కొందరు భక్తులు మద్యం తాగుతూ కనిపించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కొందరు భక్తులు రెండు వాహనాల్లో మహానందికి వచ్చారు. ఈఓ ఇంటి వెనుక ఖాళీ ప్రదేశంలో కూర్చుని మద్యం తాగుతూ కాలక్షేపం చేస్తుండటంతో గమనించిన భక్తులు ఆవేదన చెందారు. దేవదాయశాఖ నిబంధనల మేరకు ఆలయ ప్రాంగణంలోకి మద్యం, మాంసం తీసుకు రాకూడదు. కానీ ఇక్కడికి ఎలా వచ్చాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, దేవస్థానం అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిఘా ఉంచాల్సిన అవసరం ఉందని హిందూ ధర్మపరిరక్షణ సమితి, హిందూసంఘాల నాయకులు కోరుతున్నారు. కాగా వ్యక్తిగత లాభాపేక్షకు ఇచ్చిన ప్రాధాన్యత ఇక్కడి పవిత్రతను కాపాడేందుకు ఆలయ అధికారులు ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చదవండి: అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే.. -
మనవడి వేధింపులు తాళలేక వృద్ధుడి ఆత్మహత్య
చంద్రగిరి : మద్యం కోసం మనుమడు వేధింపులను తట్టుకోలేక తాత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళవారం మండలంలోని కొత్తశానంబట్లలో చోటు చేసుకుంది. మృతుని బంధువుల కథనం..గ్రామానికి చెందిన చిన్నబ్బరెడ్డి (72), గోవిందమ్మ దంపతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో చిన్నబ్బరెడ్డి దంపతులు తన మనమడితో కలసి అదే గ్రామంలో వేరే కాపురం ఉంటున్నారు. మద్యానికి బానిసైన మనుమడు తరచూ తన తాతను డబ్బులు కోసం వేధించేవాడు. ఈ క్రమంలో రెండు రోజులుగా చిన్నబ్బరెడ్డితో తీవ్రంగా గొడవ పడ్డాడు. దీంతో ఆయన జీవితంపై విరక్తి చెందాడు. ఇంట్లోని ఫ్యాను కొక్కీకి ఉరివేసుకుని మృతి చెందాడు. వృద్ధుని కుటుంబ సభ్యులు ఆగమేఘాలపై అంత్యక్రియలను పూర్తి చేశారు. పోలీసులకు ఫిర్యాదు అందలేదు. -
బస్సు ఆపలేదని డ్రైవర్‌ను చితకొట్టాడు..
సాక్షి, డిండి(మహబూబ్‌నగర్) : ఆర్టీసీ బస్సు ఆపలేదని మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి డ్రైవర్‌పై దాడి చేసిన ఘటన బుధవారం రాత్రి మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. దేవరకొండ ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ 24 జెడ్ 0011 నంబరు గల బస్సు అచ్చంపేట నుంచి దేవరకొండ వైపు వెళ్తుంది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న మండలంలోని కాటికబండతండాకు చెందిన రాత్లావత్ రమేష్ ఎర్రారం గేటు వద్ద ఆర్టీసీ బస్సు ఆపలేదని ద్విచక్రవాహనంపై వెళ్లి బస్సును ఓవర్టేక్ చేసి డ్రైవర్ కేతావత్ పత్యానాయక్‌పై దాడి చేశాడు. డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ.శోభన్‌బాబు తెలిపారు. -
మద్యం మానేస్తే వచ్చే మార్పులు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం విధించిన లాక్డౌన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మద్యం వినియోగం విపరీతం అయింది. ఎంతంటే, ఒక్క ఆస్ట్రేలియాలోనే ఎప్పటికన్నా 2020 సంవత్సరంలో మద్యం విక్రయాలు రెండు బిలియన్ పౌండ్లు (దాదాపు 20 వేల కోట్ల రూపాయలు) పెరిగాయట. మద్యపానం వల్ల మంచికన్నా చెడే ఎక్కువన్న విషయం తెలిసిందే. మద్యం మానేస్తే 31 రోజుల్లో మనువుల ఆరోగ్యం ఎంతో మెరగుపడుతుందని పోషక నిపుణులు తెలియజేస్తున్నారు. అందుకనే ఆస్ట్రేలియా వాసులు ప్రతి ఏడాది ‘డ్రై జనవరి’ పేరిట మద్యం తీసుకోకుండా ఉపవాసం పాటిస్తున్నారు. ఆఖరి పెగ్గు తీసుకున్న గంట నుంచి ఆరోగ్యకరమైన మార్పులు కనిపిస్తాయని, కొన్ని రోజులు, వారాలు దూరంగా ఉన్నట్లయితే ఆరోగ్యం మరింత మెరగుపడుతుందని డైటీషియన్లు, ఫిట్నెస్ కోచ్‌లు తెలియజేస్తున్నారు. మద్యానికి దూరంగా ఉన్నట్లయితే కాలేయం బాగా పని చేస్తుందని, శరీర బరువు తగ్గుతుందని, మంచి నిద్ర వస్తుందని, జ్ఞాపక శక్తి పెరగుతుందని వారంతా చెబుతున్నారు. మద్యం మానేస్తే శక్తి, సామర్థ్యాలు పెరగడమే కాకుండా ఆర్థికంగా డబ్బు ఎంతో కలసి వస్తోందని ‘డ్రై జనవరి’ పాటిస్తున్న ఆస్ట్రేలియా వాసులు సూచిస్తున్నారు. ప్రతి ‘డ్రై జనవరి’లో 70 శాతం మంది ఆస్ట్రేలియా వాసులు మద్యానికి దూరంగా ఉంటుండగా, ఈ సారి లాక్డౌన్ కారణంగా ఆ సంఖ్య యాభై శాతానికి దిగువకు పడిపోయింది. అందుకే మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. మద్యం వల్ల రక్తపోటు పెరిగి గుండె పోటు వచ్చే అవకాశాలు పెరగడంతోపాటు, పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పడిపోతుందని, లైంగిక సుఖాన్ని కలగజేసే ‘టెస్టోస్టెరోన్’ ఎంజైమ్ తగ్గిపోతుందని, మహిళలో పీరియడ్స్ పడిపోతాయని, కడుపుల్లో అల్సర్లు ఏర్పడే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియా వైద్యులు తెలియజేస్తున్నారు. -
మందు పార్టీ.. విద్యార్ధినులు సస్పెండ్
-
వీడియో వైరల్.. విద్యార్థినుల బహిష్కరణ
చెన్నై : తమిళనాడు నాగపట్నం జిల్లాలోని ఓ కాలేజ్ సంచలన నిర్ణయం తీసుకుంది. నలుగురు విద్యార్థినులు మద్యం సేవిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో.. కాలేజ్ నుంచి వారిని బహిష్కరించింది. వివరాల్లోకి వెళితే.. నలుగురు విద్యార్థినులు, వారి స్నేహితులతో కలిసి ఆరు వారాల కిందట ఓ పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో అబ్బాయిలతో పాటు వారు కూడా మద్యం సేవించారు. విద్యార్థినులు బీర్ తాగుతున్న దృశ్యాలను అందులోని ఓ వ్యక్తి సెల్ఫోన్లో వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థినులు తీరును తప్పుబడుతూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. ఈ విషయం డిసెంబర్ 24వ తేదీన కాలేజ్ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీంతో ఆ కాలేజ్ ప్రిన్సిపల్.. ఈ ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించారు. అయితే విద్యార్థినుల చర్య కాలేజ్‌కు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉండటంతో.. వారిని బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ బహిష్కరణ 2020 జనవరి 2 నుంచి అమల్లోకి రానుంది. అయితే తమిళనాడులో 21 ఏళ్లు పైబడ్డవారు మద్యం సేవించడం చట్టబద్ధం కాగా, ఆ నలుగురు విద్యార్థినుల వయసు అంతకన్నా తక్కువగా ఉంది. -
ఆల్కహాలిక్ కామెంట్లపై శృతి వివరణ
గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శృతిహాసన్.. తాజాగా ఓ తెలుగు టాక్ షో ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ టాక్ షోలో పాల్గొన్న శృతి తన బ్రేకప్‌తో పాటు ఇతర అంశాలను కూడా వెల్లడించారు. అలాగే.. ప్రస్తుతం తాను మద్యానికి దూరంగా ఉంటున్నానని.. ప్రశాంతమైన జీవితం గడుపుతున్నానని తెలిపారు. అయితే ఈ షో తర్వాత కొందరు శృతి ఆల్కహాలిక్ అంటూ కామెంట్లు చేయడం, సెటైర్లు వేయడం ప్రారంభించారు. వీటిపై స్పందించిన శృతి.. తన వ్యాఖ్యలపై సమయం, సందర్భం లేకుండా ద్వందార్థాలు తీయడంపై మండిపడ్డారు. అలాగే తన వ్యాఖ్యలను వక్రీకరించే వారికి ఘాటైన సమాధానం ఇచ్చారు. ‘ఆ టాక్ షోలో నేను మాట్లాడుతూ మద్యానికి దూరంగా ఉంటున్నానని.. ప్రస్తుతం ప్రశాంతమైన జీవితం గడుపుతున్నానని చెప్పాను. కానీ ఆ వ్యాఖ్యలు కొందరికి సరిగా అర్థం కాలేదు. ఇటీవలి కాలంలో డ్రింకింగ్ అనేది కామన్‌గా మారింది. దీని వల్ల వ్యక్తి ప్రతిష్టకు ఎలాంటి భంగం వాటిల్లదు. కానీ నేను ఈ పని చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఇకపై ప్రశాంతమైన జీవితం గడపాలని అనుకుంటున్నాను. డ్రింక్ చేసే వాళ్లను నేను జడ్జ్ చేయలేను. ప్రతి ఒక్కరు తాగుతారు కానీ ఎవరు దాని గురించి మాట్లాడరు. పైగా చాలా మంది తాము డ్రింక్ చేస్తామని అంగీకరించరు. 2019లో ఉండి కూడా ఇలా చేయడం హాస్యాస్పదం. మద్యానికి దూరంగా.. ప్రశాంతమైన జీవితం గడుపుతున్నానని నేను చెప్పినప్పుడు.. ఆ వ్యాఖ్యలను ఎందుకు వేరే రకంగా మార్చారని’ని శృతి ప్రశ్నించారు. మరోవైపు ఏడాది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న శృతిహాసన్.. విదేశాల్లో పలు మ్యూజిక్ ప్రదర్శనలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తాను లండన్‌లో గడిపిన జీవితం గురించి కూడా తెలిపారు. ‘యూకేలో నాకు ఎవరు తెలియదు. కానీ అక్కడ నేను ఒక ఇళ్లు లాంటి వాతావరణాన్ని ఏర్పరచుకోగలిగాను. ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. మ్యూజిక్ మీద ఎక్కువ దృష్టి సారించాను. ఇంతకు ముందు తెలియని కొత్త వాళ్లను కలవడం నాలో చాలా ఉత్సాహం నింపింది. ఈ డిసెంబర్లో అక్కడికి మళ్లీ వెళతాను. నేను ఉత్తమమైన జీవితం గడుపుతున్నాను. సినిమాల్లో మంచి గుర్తింపు పొందాను. కానీ నా వ్యక్తిత్వంలోని వివిధ కోణాలను అవిష్కరించనప్పుడే పూర్తి విజయాన్ని సాధించనట్టు అవుతోంది. నా జీవితంలో కొద్దిగా ఉత్తేజం నింపుకోవడానికి సినిమాలకు విరామం ఇచ్చాన’ని తెలిపారు. కాగా, శృతి ప్రస్తుతం విజయసేతుపతితో లాభం చిత్రంలో నటిస్తున్నారు. ఓ హిందీ చిత్రంలో నటించేందుకు కూడా శృతి అంగీకరించినట్టుగా సమాచారం. సరైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాను: శ్రుతి -
కీళ్లెంచి మేలెంచు
ఆర్థరైటిస్ అంటే కీళ్ల దగ్గర వచ్చే రుగ్మత. ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఏదో కీళ్లలో నొప్పి వచ్చింది కదా అని నిర్లక్ష్యం చేసి పెయిన్‌కిల్లర్ వేసుకుంటే సరిపోదు. చికిత్స తీసుకోకపోతే రోగి ఆయుర్దాయం 10 నుంచి 15 ఏళ్లు తగ్గిపోయే అవకాశాలూ లేకపోలేదు. ఎందుకంటే... చాలా రకాల కీళ్లవాతాల్లో ఆర్థరైటిస్ అనేది చాలా సాధారణంగా చూసే మొదటి లక్షణం. అవి ఆర్థరైటిస్ లక్షణంతో మొదలై కాలక్రమేణా శరీరంలోని ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. దాంతో కీళ్లవాతాలు పూర్తిగా ప్రాణాంతకంగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే వీటిని తేలిగ్గా తీసుకోకూడదు. చికిత్స విషయంలో నిర్లక్ష్యం కూడదు. పైగా వీటి నిర్ధారణ కూడా అంత తేలిక కాకపోవడంతో వీలైనంత త్వరగానూ, జాగ్రత్తగానూ గుర్తించడం కూడా ఎంతో అవసరం. ఈ నెల 12న ‘వరల్డ్ ఆర్థరైటిస్ డే’ సందర్భంగా ఆ రుగ్మతపై అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం. కీళ్ల దగ్గర తీవ్రమైన నొప్పి, విపరీతమైన వాపు, బాగా బిగుసుకుపోయినట్లుగా కావడాన్ని ఆర్థరైటిస్‌గా వ్యవహరిస్తారు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. అంటే... ఎన్నో రకాల కీళ్లవాతాలను కలుపుకొని ఆర్థరైటిస్ రుగ్మతలుగా వ్యవహరిస్తారు. వీటిల్లో కొన్ని ఎముకల సమస్యలు వయసు పెరుగుతూ పోతున్నకొద్దీ ఏర్పడే అరుగుదల కారణంగా వస్తాయి. ఇక మరికొన్ని మాత్రం మన సొంత వ్యాధి నిరోధక శక్తి మన కణాలనే పరాయివిగా పరిగణించి దాడి చేయడం వల్ల మన దేహంలోని ఎన్నో కీలకమైన కణజాలాలు, వ్యవస్థలు దెబ్బతింటాయి. దాంతో చాలా తీవ్రమైన పరిణామాలు ఏర్పడే అవకాశముంది. మనం మన రోజువారీ పనుల్లో ఏది చేయడానికైనా కీళ్లు సరిగా పనిచేయడం అవసరం. అయితే కీళ్లల్లో ఏర్పడే ఈ వ్యాధుల కారణంగా అంగవైకల్యం కూడా రావచ్చు. ఫలితంగా వృత్తులు, ఉపాధులు కోల్పోవడం వంటి సామాజిక పరిణామాలు కూడా చోటుచేసుకుంటాయి. ఈ సమస్య కారణంగా మానసికంగా, ఆర్థికంగా కూడా నష్టపోతారు. అంతేకాదు... కొన్ని రకాల కీళ్లవాతాల కారణంగా అంటువ్యాధులు, క్యాన్సర్ వంటి జబ్బులొచ్చే అవకాశాలు బాగా పెరిగిపోతాయి. ఆర్థరైటిస్‌కు కారణాలు... ముందుగా చెప్పినట్లుగా వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే ఆర్థరైటిస్ అన్న ఓ సమస్య ఒక వయసు దాటాక అనివార్యంగా అందరిలోనూ కనిపించేందుకు అవకాశం ఉంది. ఎముకల్లో అరుగుదల కారణంగా కనిపించే ఇలాంటి సమస్యను ఆస్టియో ఆర్థరైటిస్‌గా చెబుతారు. ఇది చాలా సాధారణమైన, సాహసమైన సమస్య.అయితే కొందరిలో జన్యులోపాల కారణంగా మన రోగనిరోధక వ్యవస్థ తప్పుదారి పడుతుంది. ముందుగానే చెప్పినట్లుగా ఆరోగ్యకరమైన తమ సొంతకణాలనే హాని చేయడానికి వచ్చిన పరాయి కణాలుగా పరిగణించి వాటిని తుదముట్టించడానికి మన రోగనిరోధక వ్యవస్థ... శత్రుసంహారం కోసం యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేస్తుంది. తత్ఫలితంగా... ఆ యాంటీబాడీస్ దాడి కారణంగా... ఆ వ్యక్తి తాలూకు ఎముకలు, కీళ్లు, కండరాలు, ఇక కొన్ని సందర్భాల్లో వివిధ కీలకమైన అవయవాలు సైతం దెబ్బతింటాయి. ఇదే సమయంలో పర్యావరణంలోని హాని చేసే క్రిములు, రసాయనపదార్థాలు, కాలుష్యాలు అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా అప్పటికే ఉన్న వ్యాధిని మరింత తీవ్రతరం చేస్తాయి. దీనికి తోడు ఒకవేళ ఆ వ్యక్తికి పొగతాగడం, మద్యం అలవాటు ఉంటే... అవి వ్యాధి తాలూకు దుష్ప్రభావాలను మరింతగా పెంచుతాయి. ఇక కొన్ని రకాల ఆర్థరైటిస్లు వంశపారంపర్యంగా కొనసాగుతుంటాయి. ఆర్థరైటిస్‌లలో ప్రధాన రకాలైన ఆటోఇమ్యూన్ వ్యాధులివి... రకరకాల ఆర్థరైటిస్‌ల కారణంగా రకరకాల కీళ్ల సమస్యలు వస్తాయి. ఇలాంటి కీళ్లవాతాల్లో లూపస్ (సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్–ఎస్‌ఎల్‌ఈ), రుమటాయిడ్ ఆర్థరైటిస్ (ఆర్ఏ), గౌట్, షోగ్రన్స్ డిసీజ్, స్కీ›్లరోడర్మా వంటివి ప్రధానమైనవి. అలాగే మయోసైటిస్, వాస్కులైటిస్, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్, సోరియాసిస్, సార్కాయిడ్ వంటివి తీవ్రత చాలా ఎక్కువగా ఉండే కీళ్లవాతాలు. ఇవి కూడా ఆర్థరైటిస్లాగే మొదలవుతాయి. ఎవరిలో ఎక్కువగా కనిపిస్తాయంటే... ఇలాంటి ఆటోఇమ్యూన్ కీళ్లవాతాలు ప్రధానంగా మహిళల్లో ఎక్కువగా వస్తుంటాయి. వారి జీవితంలోని అన్ని దశల్లోనూ తీవ్రమైన ప్రభావం చూపెడతాయి. ఇక యాంకైలోజింగ్ స్పాండలైటిస్, కొన్ని రకాలైన వాస్కులైటిస్ వంటివి పురుషుల్లో ఎక్కువగా వస్తుంటాయి. సాధారణంగా... వయసు పెరగడం వల్ల వచ్చే ఆస్టియో ఆర్థరైటిస్ మినహా మిగతా రకాల కీళ్లవాతాలు ఏ వయసు వారిలోనైనా కనిపించడానికి అవకాశం ఉంది. వ్యాధి లక్షణాలు ఒక్కో రకమైన కీళ్లవాతానికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. అలాగే ఈ లక్షణాలన్నీ అందరిలోనూ ఒకేలా వ్యక్తం కాకపోవచ్చు కూడా. వ్యాధి తీరు, తీవ్రత, రోగి వయసు, రోగికి ఉన్న ఇతర వ్యాధులపై ఆధారపడి వ్యాధి లక్షణాలు వ్యక్తమయ్యే తీరు మారుతూ ఉంటుంది. తొలిదశలో ఏ రకమైన కీళ్లవాతంలోనైనా లక్షణాలన్నీ సాధారణమైన ఇతర వ్యాధుల్లో ఉన్నట్లుగానే ఉంటాయి. ఉదాహరణకు సాయంత్రమయ్యేసరికి జ్వరం రావడం, అలసట, నెమ్మదిగా బరువు తగ్గిపోవడం, ఆకలి మందగించడం లాంటి లక్షణాలు ప్రారంభదశలో కనిపిస్తాయి. ఈ సాధారణ లక్షణాలు ఇతర వ్యాధుల్లో సైతం కనిపిస్తుండటం వల్ల వీటిని ఆర్థరైటిస్‌గా గుర్తించడం కొంచెం కష్టమైన పని. కీళ్ల దగ్గర విపరీతమైన నొప్పి, వాపు వచ్చి... అక్కడ ఎర్రగా కందిపోయినట్లుగా అవుతుంది. ఈ లక్షణాలు కనిపించేసరికి రోగి పరిస్థితి దిగజారిపోయి సొంతపనులను కూడా చేసుకోలేని స్థితి వస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్య ముఖ్యంగా చిన్న కీళ్ల మీద తన ప్రభావం చూపిస్తే... యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అనేది వెన్నుపూసలు, పెద్దకీళ్లపై ప్రభావం చూపిస్తుంది. కీళ్లవాతం కారణంగా వచ్చే సంక్లిష్ట సమస్యలు ►ఆర్థరైటిస్ కాలక్రమేణా ఎన్నో రకాలైన సంక్లిష్టమైన సమస్యలకు దారితీస్తుంది. ఎముకలను బాగా పెళుసుగా తయారు చేస్తుంది. దాంతో చిన్నపాటి దెబ్బకు సైతం, ఒక్కోసారి ఎలాంటి గాయాలు లేకపోయినా ఎముక విరిగిపోతుంది. ►నరాల మీద ఒత్తిడి కలిగించి, స్పర్శలో మార్పు రావడం, కాళ్లూ–చేతులు పట్టుకోల్పోవడం జరుగుతుంది. ►ఈ సమస్య వచ్చిన కొందరిలో నోరు, కళ్లు విపరీతంగా పొడిబారిపోతాయి. ►గుండెజబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సమస్యలూ తలెత్తుతాయి. వ్యాధి నిర్ధారణ... తొలిదశలో వ్యాధి నిర్ధారణ ఒకింత కష్టమైన పనే. అయినప్పటికీ రుమటాలజిస్ట్లు ఈ వ్యాధికి సంబంధించిన నిపుణులు కావడం వల్ల రోగి లక్షణాలనూ, కొన్ని వైద్యపరీక్షల తర్వాత అవసరమైన రక్తపరీక్షలు చేయించి, వ్యాధిని ప్రారంభదశలోనే గుర్తిస్తారు. అయితే ఒక్కోసారి ఈ పరీక్షలలో సానుకూల ఫలితాలు ఉన్నంత మాత్రన కూడా వ్యాధి ఉన్నట్లు కాదు. ఈ పరీక్షలలో ఎన్నో ‘నాన్–రుమటలాజికల్’ జబ్బులు కూడా ‘ఫాల్స్ పాజిటివ్’ ఫలితాలను ఇవ్వవచ్చు. అంటే వ్యాధి లేకపోయినా ఉన్నట్లుగా తప్పుడు రిపోర్టులు రావచ్చు. అలాగే ఒకే జబ్బులో ఎన్నో యాంటీబాడీస్ పాజిటివ్‌గా ఉండవచ్చు. అందువల్లనే రుమటాలజిస్టులు తమ అనుభవంతో అసలైన వ్యాధినీ... వ్యాధిలేకపోయినా ఉన్నట్లుగా కనిపించే ఫాల్స్పాజిటివ్ అంశాలను గుర్తించి, తగిన మందులను సూచిస్తారు. అయితే ఒక్కోసారి ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోకపోవడం వల్ల వ్యాధి లేనివారికి కూడా ఉన్నట్లు పరిగణించి మందులు వాడితే అనర్థాలు కలిగే అవకాశం ఉంది. అందుకే ఈ విషయంలో రుమటాలజిస్టులను సంప్రదిస్తే వారు చాలా నిశితంగా (మెటిక్యులస్‌గా) రోగిని పరీక్షించి వ్యాధి నిర్ధారణ చేస్తారు. చికిత్స ఆర్థరైటిస్‌కి కారణమైన కీళ్లవాతాన్ని బట్టి చికిత్స విధానాలు ఉంటాయి. చాలావాటికి కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులతోపాటు, చిన్న మోతాదుల్లో స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. జబ్బు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పెద్దమోతాదులో స్టెరాయిడ్స్ వాడటంతో పాటు ‘డిసీజ్ మాడిఫైయింగ్ డ్రగ్స్’ అనేవి మొదలుపెట్టాలి. దాదాపు 10 – 20 శాతం మందిలో ఎన్ని రకాల మందులు వాడుతున్నప్పటికీ ఒక్కోసారి జబ్బుతీవ్రతను అదుపు చేయడం చాలా కష్టమవుతుంది. అలాంటివారిలో బయలాజిక్స్ అనే మందులను రుమటాలజిస్టులు సూచిస్తారు. అయితే అన్ని రకాల కీళ్లవాతాలకూ ఒకేరకం బయలాజిక్స్ పనిచేయవు. బయాలజిక్స్ను సూచించే సమయంలో... వ్యాధి తీవ్రత, దాని కారణంగా ప్రభావితమైన అవయవాలతో పాటు రోగి బరువు, స్త్రీ/పురుషుడు అన్న అంశం, మహిళలైతే గర్భవతా అనే అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. చికిత్సతో పాటు తీసుకోవాల్సిన ఇతర జాగ్రత్తలు ►లక్షణాలు కనిపించడం మొదలైన కొన్ని వారాల నుంచి నెలల వ్యవధిని ‘విండో ఆఫ్ ఆపర్చునిటీ’ అంటారు. ఈ సమయంలో రుమటాలజిస్ట్లను సంప్రదించి, తగిన చికిత్స పొందే వ్యక్తులలో రుమాటిక్ ప్రభావాల కారణంగా కలిగే దీర్ఘకాలిక సమస్యలను అరికట్టవచ్చు. ►క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా చికిత్సలో ఒక భాగం. దీనివల్ల కీళ్లు వంకర్లు పోవు. ►ఉండాల్సినదాని కన్నా ఎక్కువగా ఉన్న బరువును తగ్గించుకోవాలి. ఒంటి బరువును అదుపులో పెట్టుకోవడం వల్ల మందులు సమర్థంగా పనిచేయడమే కాకుండా గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది. ► పొగతాగడం, మద్యపానం అలవాటును పూర్తిగా మానేయాలి. ►క్యాల్షియమ్ సమృద్ధిగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవాలి. ►కీళ్లవాతానికి సంబంధించిన అపోహలను పక్కన పెట్టాలి. ►కీళ్లలో నొప్పి వంటివి కనిపిస్తే... దాన్ని తేలిగ్గా తీసుకోకుండా, అది ఆర్థరైటిస్‌కు సంబంధించిన వ్యాధేమోనని అనుమానించి రుమటాలజిస్టులను సంప్రదించి, వ్యాధిని తొలిదశలోనే తుంచేస్తే... ఎన్నో అనర్థాలు తప్పుతాయనీ, జీవనశైలి, జీవననాణ్యత మెరుగుపడతాయని గుర్తుంచుకోవడం మంచిది. గుర్తించడం ఎలా... ►ఇంగ్లిష్ అక్షరం ‘ఎస్’తో మూడు ‘ఎస్’ల సహాయంతో ఆర్థరైటిస్‌ను తేలిగ్గా గుర్తించవచ్చు. అదెలాగంటే... ►స్వెల్లింగ్ (వాపు) – చిన్న కీళ్లదగ్గర వాపు రావడం. ►స్టిఫ్నెస్ (బిగదీసుకుపోవడం) – ఉదయాన్నే30 నిమిషాలకు పైనే కీళ్లు బిర్రుగా పట్టుకుపోవడం/బిగుసుకుపోవడం. స్క్వీజ్: చేతిని చిన్నగా నొక్కినా (స్క్వీజ్ చేసినా) విపరీతమైన నొప్పి రావడం. పైన పేర్కొన్న మూడు ‘ఎస్’లతో కూడిన లక్షణాలు కనిపిస్తే అప్పుడు ఆర్థరైటిస్ సమస్య ఉండే అవకాశాలు ఎక్కువ. అప్పుడు దాన్ని ఆర్థరైటిస్ సమస్య కావచ్చేమోనని అనుమానించాలి. ►చర్మంపై ఎర్రని మచ్చలు, దద్దుర్లు, మాననిపుండ్లు, చర్మం కుళ్లిపోవడం అనేవి లూపస్‌తో పాటు వాస్కులైటిస్ వంటి కీళ్లవాతాలలో ఎక్కువగా జరుగుతుంటుంది. లూపస్ వ్యాధిగ్రస్తుల్లో ముక్కుకు ఇరువైపులా బుగ్గల మీద సీతాకోకచిలుక ఆకృతితో ‘బటర్‌ఫ్లై రాష్’ అనే కండిషన్ వచ్చి అక్కడ కందిపోయినట్లుగా కనిపిస్తుంది. ►వైద్యచికిత్స తీసుకోని రుమటాయిడ్ వ్యాధిగ్రస్తుల్లో చర్మం కింద బొడిపెలు ఏర్పడతాయి. ►మరికొందరిలో చలికాలంలో చల్లటినీళ్లు తగిలినప్పుడు వేళ్లు నీలంగా, ఎర్రగా, తెలుపురంగులోకి మారిపోతాయి. ఇలా కావడాన్ని ‘రెనాడ్స్ ఫినామినా’ అంటారు. ఇది అనేక రకాల కీళ్లవాతాల్లో కనిపిస్తుంది. ►లూపస్ అనే సమస్యలో... నోటిలో కురుపులు, పూత రావడం, జుట్టు రాలిపోవడం, మహిళల్లోనైతే తరచూ గర్భస్రావాలు కావడం వంటివి కనిపిస్తాయి. ఈ వ్యాధి ముదిరినప్పుడు ఊపిరితిత్తులపైన, గుండెపైన ఒక పొర ఏర్పడి, వాటి చుట్టూ నీరు చేరుతుంది. దాంతో ఊపిరితీసుకునే సమయంలో నొప్పి రావడంతో పాటు దగ్గు, ఆయాసం కనిపిస్తాయి. ఇవే లక్షణాలు టీబీలోనూ కనిపించడం వల్ల ఒక్కోసారి రోగి తాలూకు వ్యాధి నిర్ధారణ తప్పుగా జరిగి... టీబీ మందులు వాడటం కూడా సంభవించవచ్చు. టీబీ మందులు ఎంత వాడినా మెరుగుదల కనిపించకపోవడం, రోగి తాలూకు ఇతర లక్షణాలు బయటపడటం జరిగినప్పుడు మాత్రమే కీళ్లవాతం అనే అనుమానం వచ్చి అప్పుడు రుమటాలజిస్ట్ను సంప్రదిస్తారు. అయితే అప్పటికే వ్యాధి తీవ్రరూపం దాల్చి అనేక సమస్యలకు కారణమవుతుంది. ►మరికొందరిలో రక్తకణాలు తగ్గిపోవడం, తరచూ రక్తహీనత కలగడం, కామెర్లు రావడం కూడా జరుగుతాయి. ►చిన్న వయసులోనే కిడ్నీ సమస్య రావడం, అధిక రక్తపోటు వంటివి కూడా కీళ్లవాతం తాలూకు సంకేతాలే. ►కీళ్లవాతం కారణంగా మెదడు, నరాలు ప్రభావితమైనప్పుడు... తరచూ ఫిట్స్ రావడం, అకస్మాత్తుగా చూపుపోవడం, పక్షవాతం రావడం వంటి విపరీత పరిణామాలు చోటుచేసుకుంటాయి. ►సాధారణంగా నడుమునొప్పి అనేది వయసు మీద పడ్డాక కనిపించే సమస్య. అలా కాకుండా యుక్తవయసులోనే విపరీతమైన నడుమునొప్పి. మెడ, మడమల నొప్పులతో పాటు నిద్ర లేవగానే నడుము దగ్గర బిర్రుగా పట్టేసినట్లు ఉండటం, తరచూ విరేచనాలు లాంటి లక్షణాలు స్పాండైలోఆర్థరైటిస్లో కనిపిస్తాయి. ►జ్ఞాపకశక్తి మందగించడం, రోజువారీ జీవన కార్యకలాపాలపై ఆ ప్రభావం కనపడటం అన్నది రుమాటిక్ వ్యాధుల్లో కనిపించే ప్రధాన లక్షణం. ►రోగులకు ఇటు శారీరకంగా, అటు మానసికంగా బలహీనపరిచే వ్యాధుల్లో కీళ్లవాతాలు చాలా ముఖ్యమైనవి. చికిత్స కూడా ఒకింత సంక్లిష్టంగానే ఉంటుంది. దాంతో ఈ రోగుల్లో ఆందోళన, నిరాశ, కుంగుబాటు (డిప్రెషన్) కారణంగా ఆత్మహత్యాధోరణులు ఎక్కువగా కనిపిస్తాయి. అపోహలూ – వాస్తవాలు ►విశ్రాంతి వల్ల కీళ్లవాకీళ్ల వాతాన్ని నివారించవచ్చునని కొందరు అపోహపడతారు. ఇది పూర్తిగా అవాస్తవం. కీళ్లవాతం వచ్చినవారిలో ఒంటి కదలికలు ఉండేలా నడక వంటి వ్యాయామాలు చేయాలి. ►ఆర్థరైటిస్ ఒక వయసు దాటాకే కనిపిస్తుందని కొందరి అపోహ. అది పూర్తిగా వాస్తవం కాదు. ఆస్టియో ఆర్థరైటిస్ మాత్రమే వయసు పెరిగాక కనిపిస్తుంది. మిగతావి ఏ వయసువారిలోనైనా కనిపించవచ్చు. ►పిల్లలకు ఆర్థరైటిస్ రాదని కొందరు అపోహపడుతుంటారు. కానీ కొన్ని ఆర్థరైటిస్ సమస్యలు పిల్లల్లోనూ కనిపించవచ్చు. ►ఆర్థరైటిస్ వచ్చినవారు దుంపకూరలూ, మాంసాహారం తినకూడదని కొందరు భావిస్తారు. అయితే అది వాస్తవం కాదు. పోషకాహారలోపం ఏర్పడకుండా ఉండేందుకు వాటిని తీసుకోవచ్చు. ►దాంపత్య జీవితానికి దూరంగా ఉండాలన్నది మరో అపోహ. కాని ఇది వాస్తవం కాదు. డాక్టర్ విజయ ప్రసన్న పరిమి సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్. -
అటవీశాఖాధికారిపై దాడి
-
మద్యం మత్తులో కన్నూ మిన్నూ తెలియక..
మహబూబ్‌నగర్ జిల్లా: మద్యం మత్తులో ఆరుగురు యువకులు కన్నూ, మిన్నూ తెలియక అటవీశాఖాధికారితో జుగుప్సాకరంగా ప్రవర్తించారు. అంతేకాకుండా అతనిపై దాడికి పాల్పడి భయభ్రాంతులకు గురి చేశారు. కర్నూలు జిల్లా సున్నిపెంట వద్ద అటవీశాఖాధికారిపై ఆరుగురు యువకులు మంగళవారం రాత్రి దాడి చేశారు. అటవీ ప్రాంతంలో మద్యం తాగవద్దన్నందుకు వారు కోపంతో అటవీశాఖాధికారి చెంప చెల్లుమనిపించారు. అందులో ఒకరు తాను ఎమ్మెల్సీ కుమారుడినని, నీ అంతు చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. అనంతరం అటవీశాఖాధికారి చేత కాళ్లు పట్టించుకుని క్షమాపణ అడిగేలా చేశారు. ఇదంతా పక్కన ఉన్న వ్యక్తి వీడియో తీయడంతో వెలుగులోకి వచ్చింది. దాడి చేసిన వారు హైదరాబాద్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ విషయం గురించి తోటి అటవీశాఖాధికారులకు సదరు బాధిత అటవీశాఖాధికారి తెలియజేయడంతో వారు వచ్చి ఆ ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కర్నూలు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పార్టీ అంటే పీకలదాకా తాగడమే..
సాక్షి, కామారెడ్డి: పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్న నేటి యువత పుట్టిన రోజు వేడుకల పేరుతో చేస్తున్న హంగామా శృతిమించుతోంది. స్నేహితుడి బర్త్‌డే పార్టీ అంటే చాలు పదుల సంఖ్యలో జమ కావడం, అర్ధరాత్రి వరకు తాగి తూగడం, అల్లరి చేయడం ద్వారా అడ్డగోలుగా వ్యవహరిస్తూ రచ్చ చేస్తున్నారు. పట్టణాల్లోనే కాదు పల్లెల్లోనూ పుట్టిన రోజు వేడుకల పేరుతో పార్టీలు జోరుగా సాగుతున్నాయి. పుట్టిన రోజు వస్తుందంటే నాలుగు రోజుల ముందుగానే ప్రోగ్రాం ఫిక్స్ చేసేస్తున్నారు. ఆ రోజు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వేడుకల కోసం తమ స్థాయికి మించి కూడా ఖర్చు పెడుతున్నారు. తమ కొడుకు స్నేహితులతో కలిసి పుట్టిన రోజు జరుపుకుంటున్నాడంటే తల్లిదండ్రులు కూడా అడిగినన్ని డబ్బులు ఇస్తున్నారు. ఇక ఖర్చుకు డోకాలేదని స్నేహితులతో కలిసి మందుతో విందులు చేసుకోవడం, చిందులు వేయడం అలవాటుగా మారింది. దగ్గరి స్నేహితులంటూ 15 నుంచి 20 మంది వరకు ఉంటారు. వారిలో నెలలో ముగ్గురు, నలుగురి పుట్టిన రోజులు వస్తుంటాయి. ఇంకేముంది ఆయా రోజుల్లో పుట్టిన రోజు వేడుకల పేరుతో పీకలదాకా తాగి హంగామా చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో పుట్టిన రోజు వేడుకల పేరుతో అర్ధరాత్రుల్లో హంగామా చేసే గ్యాంగ్‌లు చాలానే ఉన్నాయి. పోలీసులు రాత్రుల్లో పెట్రోలింగ్ నిర్వహించే సమయంలో చాలా చోట్ల ఇలాంటి గ్యాంగులు తారసపడుతున్నా బర్త్‌డే పార్టీ కదా అని వదిలేస్తున్నారు. అయితే బర్త్‌డే పార్టీ పేరుతో చేస్తున్న హంగామా ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తోంది. పార్టీ అంటే పీకలదాకా తాగడమే.. బర్త్‌డే పార్టీ అంటూ స్నేహితులంతా కలిసి పీకలదాకా మద్యం సేవిస్తున్నారు. తాగిన తరువాత వారి హంగామాకు అడ్డులేకుండాపోతోంది. అరుపులు, పెడబొబ్బలు పెట్టడం, డీజేలు ఏర్పాటు చేసుకుని పెద్ద సౌండ్‌తో నృత్యాలు చేయడం, తాగిన బాటిళ్లను పగులగొట్టడం వంటి వెర్రి పనులు చేస్తున్న సంఘటనలు నిత్యం ఎక్కడో ఓ చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. సాధారణ కుటుంబాలకు చెందిన యువకులు సైతం తన బర్త్‌డే రోజున తక్కువలో తక్కువ రూ.10 వేల నుంచి రూ.20 వేల దాకా ఖర్చు చేస్తున్నారు. ఇక ఉన్నత వర్గాలకు చెందినవారి ఖర్చుకు లెక్కే లేదు. ఇలా స్నేహితుల్లో ఎవరి పుట్టిన రోజైనా సరే ఆ రోజు కచ్చితంగా విందులు చేసుకోవడం ఆనాయితీగా మారింది. ఇరుగుపొరుగు వారికి ఇబ్బందే.. బర్త్‌డే పార్టీలంటూ అర్ధరాత్రి వరకు చేస్తున్న హం గామాతో ఇరుగుపొరుగు వారు ఇబ్బందులు పడు తున్నారు. జిల్లా కేంద్రంలో ఇటీవల ఓ యువకుడి బర్త్‌డే పేరుతో సాయంత్రం నుంచి మొదలైన హంగామా అర్ధరాత్రి వరకూ కొనసాగింది. ఆ వీ ధిలో నివసించే కుటుంబాలన్నీ ఇబ్బంది పడ్డాయి. యువకులు పీకలదాకా మద్యం తాగి చేసిన హం గామాతో విసిగిపోయిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీ సులు వచ్చి వారించి వెళ్లారు. సాధారణంగా పుట్టిన రోజు అంటే కేక్ కట్ చేయిస్తారు. కాని కొం దరు తమ స్నేహితుడు కేక్ కట్ చేయగానే ముఖా న్ని కేకుపై రుద్దుతూ తమ ఆనందాన్ని చాటుకుంటారు. ఇదేం సంప్రదాయమో గాని రూ. వందలు ఖర్చు చేసి తెప్పించిన కేక్‌ను తలా కొంత తినకుం డా ముఖానికి రుద్దడం ద్వారా వేడుకల్లో ప్రత్యేకత అంటూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. బైక్‌లపై హంగామా... బర్త్‌డే వేడుకలు పూర్తి చేసుకున్న తరువాత చాలా మంది యువకులు బైకులపై తిరుగుతూ వాహనాల వేగాన్ని పెంచుతూ రోడ్లపై నానా హంగామా చేస్తున్నారు. బైక్ రేసింగ్‌లు చేస్తున్నారు. తాగిన మత్తులో యువత చేస్తున్న బైక్ రైసింగ్‌లతో రోడ్లపై వెళ్లే ఇతర వాహనాదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పట్టణాల్లోనే కాకుండా పల్లెల్లోనూ యువత బైక్ రైసింగ్లకు పాల్పడుతున్నారు. బైక్ రైసింగ్ ప్రాణాలు తీస్తుందని తెలిసినా చాలా మంది స్నేహితుల పుట్టిన రోజైనా ఎంజాయ్ చేయొద్దా అంటూ హంగామా చేస్తున్నారు. నిత్యం ఏదో ఒక గ్యాంగులో ఎవరో ఒకరి పుట్టిన రోజు వస్తుండడంతో విందుల్లో మునిగితేలుతున్నారు. బర్త్‌డే పార్టీ వేడుకలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి అవసరమైతే కేక్ కట్ చేసి టీపార్టీతోనే, టిఫిన్‌తోనే లేదంటే భోజనంతోనే జరుపుకోవలసింది పోయి తాగడం, అల్లరి చేయడం, బైక్ రైసింగ్‌లతో ఇతరులను ఇబ్బందులకు గురిచేసే పద్దతి వారినే ఇబ్బందులకు గురిచేస్తుందన్న విషయాన్ని గుర్తించాలి. అడ్డగోలుగా వ్యవహరించే వారి విషయంలో పోలీసు యంత్రాంగం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. -
గుండెలు పిండేసే చిత్రం..
దుర్భర దారిద్ర్యంలో మగ్గుతూ, ఆకలికి అలమటిస్తూ, భగభగమండే భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేక దాహంతో ఓ చిన్నారి రోడ్డుపై నిలిచిన మురికినీరు తాగుతున్న విషాద దృశ్యమిది. మంగళవారం అర్జెంటీనాలోని పొసడాస్ సిటీలో ఐక్యరాజ్య సమితి బాలల నిధి(యూనిసెఫ్) వాలంటీర్ ఒకరు ఈ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో అర్జెంటీనాలో నెలకొన్న దారుణ పరిస్థితులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మేబా గరానీ తెగకు చెందిన భిక్షాటన చేసే వందలాది మంది చిన్నారులు ఇలా కడుపునింపుకుంటున్నారని ఈ ఫొటో తీసిన స్థానిక జర్నలిస్ట్ చెప్పారు. -
తాగునీటి కోసం నిరహార దీక్షా?
ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఐటీడీఏ ఎదురుగా ఆందోళన రంపచోడవరం : ఏజెన్సీలో గిరిజనులు రక్షితనీటి కోసం ధర్నాలు, నిరాహార దీక్షాలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆరోపించారు. రంపచోడవరం ఐటీడీఏ ఎదురుగా శుక్రవారం సీపీఐ ఆధ్వర్యంలో వై.రామవరం మండలం కోట గ్రామంలో ఒక వీధికి తాగునీరు కావాలంటూ శుక్రవారం రిలే నిరాహారదీక్ష చేశారు. దీక్ష శిబిరాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో కలిసి సందర్శించారు. గిరిజనుల ఆందోళనకు ఆమె మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏజెన్సీలో గిరిజనుల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. గిరిజన గ్రామాలకు కనీస మౌలిక సదుపాయాలు లేవన్నారు. రవాణా వ్యవస్థ లేకపోవడంతో ఎంతదూరమైన కాలినడకే శరణ్యమన్నారు. చాపరాయిలో 17 మంది గిరిజనులు చనిపోతే సీఎం చంద్రబాబు ఏజెన్సీకి రావడానికి కుదరలేదన్నారు. మంత్రులు వచ్చి చూసి వెళ్లాలన్నారు. గిరిజన, సాంఘిక సంక్షేమ మంత్రి రంపచోడవరం ఐటీడీఏలో అధికారులతో మాట్లాడి వెళ్లిపోయారన్నారు. ఇప్పటికీ ఏజెన్సీలో కాళ్లవాపుతో 17 మంది, మతాశిశు మరణాలు 216, చాపరాయిలో జ్వరాలతో 17 మంది చనిపోయినా ఏజెన్సీలో వైద్య సేవలు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి లోకేష్ టోల్ ఫ్రీ నంబర్‌కు పోన్ చేస్తే మంచినీటి సమస్యలు పరిష్కారిస్తామంటున్నారు. ఏజెన్సీలో బోర్లు సక్రమంగా పనిచేయడం లేదన్నారు. గిరిజనుల సమస్యలపై ఐక్యంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ మంత్రి కామినేని శ్రీనివాస్ ఎంతో చక్కగా పనిచేస్తున్నారని, నాలుగు అవార్డులు కూడా వచ్చినట్లు సెలవిచ్చారన్నారు. అవార్డులు ఎవరిచ్చారని అయన ఎక్కడ పెట్టుకున్నారని ఘాటుగా విమర్శించారు. విశాఖ, తూర్పు ఏజెన్సీ గ్రామాల్లో పర్యటిస్తే వణుకున్న గిరిజనుల పరిస్థితులు తెలుస్తాయన్నారు. కోట గ్రామం నుంచి కిందివీధి బోర్ల నుంచి తెచ్చిన బురద నీటిని ఎమ్మెల్యే రాజేశ్వరి, రామకృష్ణలు పరిశీలించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, డివిజన్ నాయకుడు జుత్తుక కుమార్ తదితరులు పాల్గొన్నారు. రిలే దీక్షలో పాల్గొన్న గిరిజనులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. గిరిజనులతో మాట్లాడిన పీఓ.. ఐటీడీఏ ఎదురుగా రిలే దీక్ష చేసిన కోట గిరిజనులతో పీఓ దినేష్‌కుమార్ మాట్లాడారు. గ్రామంలో బోర్ల మరమ్మతులకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. గిరిజనులు తెచ్చిన బోరు నీటిని పీఓ పరిశీలించారు. అలాగే ఆదివాసీ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బోండ్ల వరప్రసాదరావు కూడా దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. -
దాహమే
ఎండాకాలం ప్రారంభంలోనే అవస్థలు మరమ్మతులకు రూ.80 లక్షలతో ప్రతిపాదనలు నిధుల మంజూరుకు మొరాయిస్తున్న ప్రభుత్వం బిందెడు నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం నిరుపయోగంగా గొట్టపు బావులు, మంచినీటి పథకాలు వేసవికి ముందే దాహం కేకలు జిల్లాలో 680 చేతి పంపులు, 2107 రక్షిత మంచినీటి పథకాలున్నాయి. వీటి ద్వారా ప్రజలకు మంచి నీరు సరఫరా అవుతుంది. ప్రస్తుతం చేతిపంపులు సగానికిపైగా మరమ్మతులకు గురికావడంతో సక్రమంగా పనిచేయలేని స్థితిలో ఉన్నాయి. జిల్లాలో ఉన్న చేతిపంపులు మరమ్మతులకు రూ.45.46 లక్షలు అవసరమని, ఏడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో నీరు నిల్వ చేసేందుకు రూ.24 లక్షలు అవసరమని గుర్తించి జిల్లా అధికారులు ప్రభుత్వానికి నిధులు మంజూరుకు పింపిన నివేదికకు అతీగతీ లేదు. గత సంవత్సరం చెరువులు నింపడానికి, ట్యాంకర్ల ద్వారా మంచి నీటి సరఫరాకు ఖర్చు చేసిన రూ.76 లక్షల్లో కేవలం రూ.16 లక్షలు మాత్రమే మంజూరు చేసింది. మిగిలిన రూ.60 లక్షలకు ఇంకా బిల్లులు చెల్లించకపోవడంతో తాజాగా కాంట్రాక్టర్లు భయపడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 354 శివారు ప్రాంతాలకు మంచినీరు అందజేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గుర్తించారు. ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేసేందుకు కూడా నిధులు ప్రభుత్వం కేటాయించకపోవడంతో పంచాయతీలపై భారం మోపి చేతులేత్తేస్తున్నారు. బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ) : ముందస్తు ప్రణాళికేదీ లేకపోవడంతో గ్రామాల్లో మంచినీటి కష్టాలు ఫిబ్రవరి నుంచే ప్రారంభమయ్యాయి. ఓ వైపు మంచు తెరలు తొలగడమే లేదు ... ఇంకోవైపు మంచినీళ్ల కోసం దాహం కేకలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో ఉన్న మంచినీటి పథకాలు ప్రజలకు పూర్తిస్థాయిలో మంచినీరు అందించలేకపోవడంతో దూరప్రాంతాల నుంచి మంచినీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. జిల్లాలో 680 చేతిపంపులు, 2107 మంచినీటి పథకాలున్నాయి. వీటి ద్వారా ప్రజలకు మంచి నీరు సరఫరా అవుతుంది. ప్రస్తుతం చేతిపంపులు సగానికిపైగా మరమ్మతులకు గురికావడంతో అవి సక్రమంగా పనిచేయలేని స్థితిలో ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు ఆదాయం నామమాత్రంగానే ఉండడంతో వీటి నిర్వహణ కష్టమవుతోందని గ్రామపాలకులు చెబుతున్నారు. నిధులు విదల్చని ప్రభుత్వం... ఓ పక్క గ్రామాల్లో దాహంతో ప్రజలు అలమటిస్తున్నా నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. జిల్లాలో ఉన్న చేతిపంపులు మరమ్మతులకు రూ.45.46 లక్షలు అవసరమని, ఏడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుల్లో నీరు నిల్వచేసేందుకు రూ.24 లక్షలు అవసరమని గుర్తించి జిల్లా అధికారులు ప్రభుత్వానికి నిధులు మంజూరుకు గత పదిహేను రోజులు కిందట నివేదిక పంపారు. ఇంకా ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదు. గత సంవత్సరం చెరువులు నింపడానికి, ట్యాంకర్ల ద్వారా మంచి నీటి సరఫరాకు ఖర్చు చేసిన రూ.76 లక్షల్లో కేవలం రూ.16 లక్షలు మాత్రమే మంజూరు చేసింది. మిగిలిన రూ.60 లక్షలు ఇంకా బిల్లులు చెల్లింపులు చేయకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీలపైనే భారం... ప్రస్తుతం జిల్లాలో 354 శివారు ప్రాంతాలకు మంచినీరు అందజేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గుర్తించారు. ఆయా గ్రామాలకు మంచినీరు ట్యాంకర్లు ద్వారా మంచినీరు సరఫరా చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ట్యాంకర్లు ద్వారా మంచినీరు సరఫరా చేసేందుకు ఎటువంటి నిధులు కేటాయించడం లేదు. దీంతో గ్రామ పంచాయతీ నిధులతోనే మంచినీటి సరఫరా చేసేందుకు సంబంధితాధికారులు సన్నద్ధమవుతున్నారు. మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు.. జిల్లాలో మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే గ్రామాల్లో మంచినీటి చెరువుల్లో జనరేటర్లు ద్వారా నీరు నింపడానికి చర్యలు తీసుకుంటున్నాం. మరమ్మతులకు గురైన మంచినీటి పథకాలు, చేతిపంపులను పనిచేసేటట్టు చేయడానికి సిబ్బందిని సిద్ధం చేస్తున్నాం. – ఆర్. రాజేశ్వరరావు, ఎస్ఈ, ఆర్డబ్ల్యూఎస్ -
ఫ్యాటీ లివర్ ఉంటే...
గ్యాస్ట్రో కౌన్సెలింగ్ నా వయసు 55 ఏళ్లు. ఇటీవల జనరల్ హెల్త్ చెకప్‌లో భాగంగా స్కానింగ్ చేయించుకున్నాను. నాకు ఫ్యాటీ లివర్ ఉన్నట్లు తెలిసింది. తగిన సలహా ఇవ్వండి. – ఎల్. కృష్ణారెడ్డి, విశాఖపట్నం లివర్... కొవ్వు పదార్థాలను గ్రహించి శరీరానికి ఉపయోగపడేలా చేస్తుంటుంది. అది కొన్ని రకాల కొవ్వుపదార్థాలను స్వయంగా ఉత్పత్తి చేస్తుంటుంది. ఇది ఒక సంక్లిష్టమైన చర్య. ఏమాత్రం తేడా వచ్చినా కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇదే ఫ్యాటీ లివర్‌కు దారితీస్తుంది. సాధారణంగా రెండు రకాలుగా ఫ్యాటీలివర్ వస్తుంది. మొదటిది మద్యం అలవాటు లేనివారిలో కనిపించేది. రెండోది మద్యపానం వల్ల కనిపించేది. ఇవే కాకుండా స్థూలకాయం, కొలెస్ట్రాల్స్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉండటం, హైపోథైరాయిడిజమ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఫ్యాటీ లివర్‌కు దారితీయవచ్చు. సాధారణంగా ఇది 80 శాతం మంది వ్యక్తుల్లో ఎలాంటి ప్రమాదమూ కలిగించకపోవచ్చు. కానీ అది లివర్ సిర్రోసిస్ అనే దశకు దారితీసినప్పుడు కాలేయ కణజాలంలో మార్పులు వచ్చి స్కార్ రావచ్చు. కొందరిలో రక్తపు వాంతులు కావడం, కడుపులో నీరు చేరడం వంటి ప్రమాదాలు రావచ్చు. మీకు స్కానింగ్‌లో ఫ్యాటీలివర్ అనే రిపోర్టు వచ్చింది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొదట మీరు స్థూలకాయులైతే మీ బరువు నెమ్మదిగా తగ్గించుకోవాలి. ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు : ∙మీరు తీసుకునే ఆహారంలో కొవ్వుల పాళ్లు ఎక్కువగా ఉంటే వాటిని తగ్గించుకోవాలి. ∙ఆకుపచ్చని ఆకుకూరలు, కూరగాయలు, మొలకెత్తిన విత్తనాలు కూడా వాడవచ్చు. ∙తరచూ చేపలు తినడం మేలు. అంటే వారానికి 100–200 గ్రాములు తీసుకోవడం మంచిది. ∙మటన్, చికెన్ తినేవారు అందులోని కాలేయం, కిడ్నీలు, మెదడు వంటివి తీసుకోకూడదు. మిగతా మాంసాహారాన్ని పరిమితంగా తీసుకోవాలి. ఏవైనా వ్యాధులు ఉన్నవారు అంటే ఉదాహరణకు డయాబెటిస్ ఉంటే రక్తంలో చక్కెరపాళ్లు అదుపులో ఉండేలా చూసుకోవాలి. హైపోథైరాయిడిజమ్ ఉంటే దానికి తగిన మందులు వాడాలి. డాక్టర్ సలహా మేరకు కాలేయం వాపును తగ్గించే మందులు కూడా వాడాల్సిరావచ్చు. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ ఒకే స్ట్రెచ్‌లో పనిచేస్తుంటే... స్లీప్ కౌన్సెలింగ్ వాస్తవానికి మా వర్కింగ్ షిఫ్ట్ వ్యవధి ఎనిమిది గంటలు. అయితే మరో ఆరు గంటలు అదనంగా పనిచేస్తే మాకు ఇచ్చే వేతనం డబుల్ ఉంటుంది. అందుకే మేం సాధారణంగా డబుల్ డ్యూటీలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటాం. నాకు తీవ్రమైన ఒళ్లునొప్పులు వస్తున్నాయి. తగిన సలహా ఇవ్వండి. – ఒక సోదరుడు, హైదరాబాద్ అదేపనిగా పన్నెండు గంటల కంటే ఎక్కువసేపు (ఒకే స్ట్రెచ్‌లో) పనిచేసేవారికి తీవ్రమైన అలసట మొదలుకొని ఇంకా అనేక సమస్యలు వస్తాయి. మీలా డబుల్ షిఫ్ట్ పనిచేసేవారిలో ఎక్కువ అలసటతో పాటు, తీవ్రమైన ఒత్తిడికి లోనైనట్లు అనిపించడం చాలా సాధారణం. ఇక కండరాల నొప్పులు, నడుమునొప్పితో పాటు చర్మ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు, ఇతర వృత్తిసంబంధ సమస్యలు సైతం రావచ్చు. మీలాంటి వారిలో అలసటతోపాటు, ఇతర సమస్యలను నివారించేందుకు ఈ సూచనలు పాటించడం మేలు చేస్తుంది. పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. సిగరెట్ పొగలో కార్బన్‌మోనాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. అది రక్తకణాల్లోని ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యాన్ని తగ్గించి, వెంటనే అలసిపోయేలా చేస్తుంది. ∙చాలాసేపు కూర్చొని పనిచేసేవారైతే, శరీరానికి కదలికలు ఉండేలా తప్పనిసరిగా వ్యాయామం చేయండి. మీరు లక్ష్యాలను అధిగమించాల్సిన (టార్గెట్స్ రీచ్ కావాల్సిన) వృత్తిలో ఉంటే తీవ్రమైన అలసటకు లోను కావడం చాలా ఎక్కువ. కంటి నిండా నిద్ర అవసరం. ∙కాఫీలు ఎక్కువగా తాగకండి. కెఫిన్ ఉండే ద్రవపదార్థాలను తీసుకునే అలవాటు ఉంటే, రోజూ రెండు కప్పులకు మించి వద్దు. రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికివెళ్లే సమయంలో కాఫీ అస్సలు తాగవద్దు. ∙రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించండి. ప్రతిరోజూ ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఒత్తిడిని అధిగమించండి. ∙భోజనవేళలను కచ్చితంగా పాటించండి. భోజనం ఎగ్గొట్టి పనిచేయకండి. ఇలా చేస్తే రక్తంలో చక్కెరపాళ్లు తగ్గిపోయి త్వరగా, తేలిగ్గా అలసిపోతారు. ∙ఎక్కువగా నీళ్లు తాగండి. దీనివల్ల మీరు డీ–హైడ్రేషన్‌కు లోనుకారు. ఫలితంగా అలసిపోకుండా పనిచేయగలుగుతారు. ఈ సూచనలు పాటించాక కూడా మీరు ఇంకా అలసటతోనూ, నడుంనొప్పితో బాధపడుతుంటే డాక్టర్‌ను సంప్రదించండి. డాక్టర్ సుధీంద్ర ఊటూరి కన్సల్టెంట్, లైఫ్‌స్టైల్ అండ్ రీహ్యాబిలిటేషన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
యమ'డ్రింకరులు'!
హైదరాబాద్: యమ ‘డ్రింకరులు’ యమ కింకరుల్ని మించిపోతున్నారు... పగలు, రాత్రి, చిన్నా.. పెద్దా తేడా లేకుండా మద్యం మత్తులో వాహనాలపై దూసుకుపోతున్నారు... మృత్యుశకటాలను నడిపేవారు సేఫ్‌గానే ఉంటున్నప్పటికీ ఎదుటి వారి బతుకుల్లో చీకట్లు నింపుతున్నారు... మొన్న పంజగుట్ట పరిధిలో రమ్య కుటుంబం, నిన్న హయత్‌నగర్‌లో సంజన కుటుంబం, తాజాగా మంగళవారం అర్దరాత్రి సరూర్‌నగర్ లిమిట్స్‌లోని కర్మన్‌ఘాట్ వద్ద రత్నాకర్‌రెడ్డి మద్యం మత్తులో వాహనం నడుపుతూ వచ్చి యాదగిరిని ఢీకొట్టి క్షతగాత్రుడిని చేశాడు. వీరే కాదు... రికార్డుల్లోకి ఎక్కని, ఎక్కిన ‘నిషా’చరుల బాధితులు ఇంకా ఎందరో. ఈ మందుబాబుల్ని కట్టడి చేయడంలో మాత్రం ప్రభుత్వ విభాగాలు విఫలమవుతున్నాయి. ఎస్ఓపీ లేక మరిన్ని ఇబ్బందులు... ఈ తరహా కేసుల నమోదు, దర్యాప్తులోనూ స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) లేకపోవడం సైతం మందుబాబులకు అనుకూలంగా మారుతోంది. ఈ కారణంగానే పోలీసులు ఒక్కో కేసును ఒక్కో రకంగా నమోదు చేయడంతో పాటు దర్యాప్తు చేస్తున్నారు. రమ్య ప్రమాదం విషయంలో ఆ రోజు వాహనంలో ఉన్న వారంతా మద్యం తాగినప్పటికీ... కేవలం ఆ స్థితిలో వాహనం నడిపిన వ్యక్తి మీద మాత్రమే కేసు నమోదు చేశారు. సంజన విషయానికి వచ్చేసరికి అతడితో పాటు ప్రమాదానికి కారణమైన వాహనంలో ఉన్న డ్రైవర్, మరో ఇద్దరినీ అరెస్టు చేశారు. రమ్య కేసులో నిందితుడికి బెయిల్ రావడానికి మూడు నెలల పడితే... సంజన కేసులో 24 గంటల్లోనే వచ్చింది. కఠిన చర్యలు లేకపోవడమూ... మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కిన వారిపై కఠిన చర్యలు లేకపోవడం సైతం ‘నిషా’చరులు పెరగడానికి ఓ కారణమవుతోంది. ప్రస్తుతం డ్రంకన్ డ్రైవ్‌లను ట్రాఫిక్ పోలీసులు మాత్రమే నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో చిక్కిన వారి నుంచి వాహనాలు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ఆపై కోర్టులో హాజరుకావల్సిందిగా ఆదేశిస్తున్నారు. అయితే అనేక ఉదంతాల్లో మందుబాబులు న్యాయస్థానాలకు వెళ్లకుండా తన వాహనాలను వదిలేస్తున్నారు. తక్కువ ఖరీదైన వాహనాల విషయంలోనే ఇలా జరుగుతోంది. ‘నిషా’చరులకు జైలు శిక్షలు, జరిమానాలు పెంచడం, వారి డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయడం, వారితో పాటు కుటుంబీకులకూ పక్కాగా కౌన్సెలింగ్ చేయడం తదితర కఠిన చర్యలు తీసుకుంటేనే ఫలితాలు ఉంటాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. అది మూడో కేటగిరీ వైలేషన్... ట్రాఫిక్ ఉల్లంఘనలను వాటి తీవ్రతను బట్టి అధికారులు వాటిని మూడు రకాలుగా విభజిస్తారు. మొదటిది వాహనం నడిపే వ్యక్తికి ప్రమాదకరమైనవి, రెండోది ఎదుటి వారికి ప్రమాదకరమైనవి. ఈ రెంటినీ మించి తీవ్రమైన వాటిని మూడో కేటగిరీలోకి చేరుస్తారు. ఈ ఉల్లంఘనల వల్ల వాహనం నడిపే వ్యక్తితో పాటు ఎదుటి వారికీ ప్రమాదం పొంచి ఉంటుంది. హెల్మెట్, సీట్‌బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడం వంటివి మొదటి కేటగిరీలో ఉంటే.., డ్రంకన్ డ్రైవింగ్, రాంగ్‌రూట్ తదితరాలు మూడో కేటగిరీలోకి వస్తాయి. నిరూపించడమూ పెద్ద సవాలే... మద్యం తాగి వాహనాలు నడుపుతూ ప్రమాదాలు చేసిన కేసుల్లో ‘నిరూపణలు’ కష్టసాధ్యంగా మారుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే నిందితులు పారిపోవడం జరుగుతోంది. మళ్లీ వీరు చిక్కేప్పటికీ 24 నుంచి 48 గంటలు గడిచిపోతున్నాయి. దీంతో సదరు వ్యక్తి మద్యం తాగి ఉన్నాడని, ఆ స్థితిలో డ్రైవింగ్ చేశాడని నిరూపించడం కష్టమవుతోంది. ఒకవేళ వారు యాక్సిడెంట్ చేసిన వెంటనే చిక్కినా... మూడు కమిషనరేట్లలోనూ అవసరమైన స్థాయిలో శ్వాస పరీక్ష యంత్రాలు లేవు. ట్రాఫిక్ పోలీసుస్టేషన్లలో కొంత వరకు అందుబాటులో ఉన్నా... శాంతిభద్రతల విభాగం దగ్గర దాదాపు లేనట్లే. అయితే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు యాక్సిడెంట్ స్పాట్‌కు వెళ్లేది, ఆ కేసుల్ని దర్యాప్తు చేసేదీ శాంతిభద్రతల విభాగం పోలీసులే కావడం గమనార్హం. మద్యం మత్తులో ‘చిత్తు’ లెన్నో,.. మద్యం తాగడం కొందరికి సరదా అయితే మరెందరికో వ్యసనం. తమ ఆనందం కోసం మత్తులో జోగుతూ వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు తమ ప్రాణాల మీదికి తెచ్చుకోవడమే కాకుండా... జనం జీవితాల్నీ చిత్తు చేస్తున్నారు. ♦ లాల్‌దర్వాజకు చెందిన సాయికిరణ్ తన తల్లి అనూరాధతో కలిసి బైక్‌పై బంధువులు ఇంటికి వస్తున్నారు. పోచమ్మ ఆలయం దాటాక అడ్రస్ కనుక్కోవడం కోసం ఆగారు. ఇంతలో వెనుక నుంచి వచ్చిన వ్యాన్ ఢీ కొట్టడంతో అనూరాధ అక్కడికక్కడే చనిపోయారు. డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని నడపడమే ఈ ప్రమాదానికి కారణమని సనత్‌నగర్ పోలీసులు నిర్థారించారు. ♦ సికింద్రాబాద్‌కు చెందిన న్యాయవాది రంజిత్ మద్యం తాగి తన బొలేరో వాహనంపై మితిమీరిన వేగంతో దూసుకువచ్చారు. వాహనంపై అదుపు కోల్పోవంతో బేగంపేట ఫ్లైఓవర్‌పై దిమ్మెను తాకుతూ అతి వేగంగా వచ్చి బైక్‌పై వస్తున్న రసూల్‌పురకు చెందిన ప్రైవేట్ ఉద్యోగి శ్రీకాంత్ తదితరుల్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శ్రీకాంత్ అక్కడిక్కడే చనిపోయారు. ♦మద్యం మత్తులో ఓ వాహనచోదకుడి నిర్లక్ష్యం 18 రోజుల కాలంలో మూడు ప్రాణాలు తీయడంతో పాటు నాలుగు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. బంజారాహిల్స్‌లోని పరిధిలోని పంజగుట్ట శ్మశానవాటిక వద్ద జరిగిన ‘రమ్య ఉదంతం’లో రమ్యతో పాటు ఆమె బాబాయి పమ్మి రాజేష్, తాత మధుసూదనాచారి ప్రాణాలు తీయగా... తల్లి రాధికకు తీవ్రగాయాలు చేసింది. ♦ మూడు రోజుల క్రితం నగర శివార్లలోని పెద్ద అంబర్‌పేటలో జరిగిన ‘మద్యం’ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారి సంజన మృత్యువుతో పోరాడుతోంది. ఆమె తల్లి శ్రీదేవి సైతం తీవ్రంగా గాయపడ్డారు. -
ఎల్ఎండీ దిగువకు నీటి విడుదల
పది రోజులు విడుదల చేస్తాం ఎస్సారెస్పీ సీఈ శంకర్ తిమ్మాపూర్ : లోయర్ మానేరు డ్యాం నుంచి కాకతీయ కాలువ ద్వారా దిగువకు ఆదివారం నీటిని విడుదల చేశారు. ఎల్ఎండీ నుంచి హెడ్ రెగ్యులేటరీ వద్ద కాకతీయ కాలువకు 500 క్యూసెక్కుల నీటిని ఏఈలు కాళిదాసు, రాంబాబు, శ్రావణ్ విడుదల చేశారు. రాత్రి వరకు వెయ్యి క్యూసెక్కులకు పెంచుతామని తెలిపారు. సీఈ శంకర్ ఫోన్లో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాల మేరకు సాగు, తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. రోజుకు వెయ్యి క్యూసెక్కుల చొప్పున పది రోజులు ఒక టీఎంసీ నీటిని విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఎల్ఎండీ దిగువన రైతులు వేసుకున్న పంటలు వర్షాలు లేక ఎండిపోతున్న దృష్ట్యా ప్రభుత్వం నీటి విడుదలకు నిర్ణయం తీసుకుందన్నారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 1075.10 అడుగులు (39.953 టీఎంసీలు) నీరు ఉండగా 693 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉందన్నారు. ఎల్ఎండీలో 889.30 అడుగులు (5.741 టీఎంసీలు) నీటి మట్టం ఉండగా 119 క్యూసెక్కులు తాగునీటికి, వెయ్యి క్యూసెక్కులు ఎల్ఎండీ దిగువకు విడుదల చేసినట్లు వివరించారు. నీటి విడుదల కార్యక్రమంలో మానకొండూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మాడ తిరుపతిరెడ్డి, ఎల్ఎండీ వర్క్ ఇన్స్పెక్టర్ లక్షా్మరెడ్డి, ఆపరేటర్ దుర్గారెడ్డి పాల్గొన్నారు. 2015 ఫిబ్రవరిలో... ఎల్ఎండీ నుంచి కాకతీయ కాలువ ద్వారా దిగువ ఆయకట్టుకు 2015, ఫిబ్రవరి 21న చివరిసారి నీటిని విడుదల చేశారు. అప్పుడు ఎల్ఎండీలో 7.91 టీఎంసీల నీటి మట్టం ఉండగా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిన ఏప్రిల్ 6వ తేదీ వరకు నీటిని వదిలారు. 4.4 టీఎంసీల వద్ద నిలిపివేశారు. గతేడాది మే నెలాఖరున వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం హెడ్ రెగ్యులేటర్ సమీపంలో నీటి నిల్వ చేసేందుకు మూడు రోజులు రోజుకు 300 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశారు. తాజాగా ఆదివారం తాగు, సాగునీటి అవసరాలకు నీటిని వదిలారు. -
ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలి
డీపీఓ నారాయణరావు ఖమ్మం జెడ్పీసెంటర్ : గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి నారాయణరావు అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో డీఎల్పీఓ రామయ్యతో కలిసి సెక్రటరీలు, ఈఓఆర్డీలతో పంచాయతీల అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమైందని, గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో ఎక్కడా మురుగునీరు నిల్వ లేకుండా చూడాలని, దోమలు వ్యాప్తి చెందకుండా ఫాగింగ్ చేపట్టాలని, అన్ని గ్రామాల్లో బ్లీచింగ్‌ను స్టాక్ పెట్టుకుని ఎప్పటికప్పుడు చల్లిస్తూ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. మంచినీటి పథకాల నిర్వహణ సక్రమంగా చూడాలని చెప్పారు. ప్రతీ వారం వాటర్ ట్యాంక్‌లు శుభ్రం చేయాలని, మంచినీటి సమస్య తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత సెక్రటరీలదేనని సూచించారు. గ్రామజ్యోతి కార్యకలాపాలను ప్రియాసాఫ్ట్లో అప్లోడ్ చేయాలన్నారు. పంచాయతీలకు సంబంధించిన ప్రతీ ఖర్చు జమలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపర్చాలని సూచించారు. ఇంటి పన్నుల వసూళ్లలో 500 పంచాయతీలకు పైగా వందశాతం కలెక్షన్లు సాధించాలని చెప్పారు. పంచాయతీల్లో ఆడిట్ అభ్యంతరాలు లేకుండా చూడాలని, అభ్యంతరాలు ఉంటే వెంటనే క్లియర్ చేయాలని ఆయన ఆదేశించారు. -
‘మల్లన్నసాగర్’తో సాగునీరు
రామన్నపేట మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే బస్వాపురం రిజర్వాయర్ ద్వారా నియోజకవర్గంలోని 25వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం తెలి పారు. బుధవారం మండలంలోని పల్లివాడలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి రూ.12లక్షలతో గ్రామపంచాయతీ భవనం, రూ.25లక్షల సీసీరోడ్డు, రూ.4లక్షలతో ఫార్మేషన్రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. హరితహారం కింద మొక్కలను నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. చెట్లను బట్టి భూమి విలువను లెక్కగట్టే కేరళ ప్రజలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.కరువును జయించాలంటే ప్రభుత్వం నిర్దేశించిన విధంగా వీలైనచోటల్లా మొక్కలను పెంచాలని కోరారు. ప్రతీఇంటికీ ఐదుచొప్పున పండ్లమొక్కలను పంపిణీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి వివరించారు. బోరుమోటారును సమకూరుస్తానని ఎమ్మెల్యే హామీఇవ్వడంతో 20ఎకరాల్లో మొక్కలు నాటడానికి గ్రామస్తులు మందుకు వచ్చారు. లోవోలే్టజీ నివారణకు విద్యుత్సబ్స్టేçÙన్ను మంజూరు చేయాలని, పీహెచ్సీలో 24గంటల వైద్యసేవలు అం దేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు. సర్పంచ్ గంగుల వెంకటరాజారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీపీ కక్కిరేణి ఎల్లమ్మ, జెడ్పీటీసీ జినుకల వసంత, ఎంపీడీ కె.జానకిరెడ్డి, డీఈ విష్ణువర్దన్రావ్, ఏఈ జి.కొండయ్య, ఎంపీటీసీ కన్నెకంటి వెంకటేశ్వరాచారి, ఆర్ఐ డి.జానయ్య, వీఆ ర్ఓ సైదులు, పంచాయతీ కార్యదర్శి మానస, బందెల రాములు,కమ్మంపాటి శ్రీనివాస్, యాదగిరి, లింగయ్య పాల్గొన్నారు. -
పట్టపగలు బరి తెగించిన తాగుబోతులు
► అంగన్వాడి కేంద్రంలో మందు.. విందు ► గోల్నాక గంగానగర్‌లో ఘటన అంబర్‌పేట: బడి, గుడి ఎంతో పవిత్రమైనవి. వీటిలో మద్యపానం నిషేధం. చిన్నారులు ఓనామాలు దిద్దే బడిలో మందుబాలు పట్టపగలు దర్జాగా విందు చేసుకుంటున్నారు. అక్షరాలు దిద్దించడంతో పాటు శిశువులకు, గర్భవతులకు మందులు, పౌష్టిక ఆహారం అందించే అంగన్వాడి కేంద్రాన్ని పానశాలగా మర్చేశారు. గోల్నాక గంగానగర్‌లోని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న అంగాన్‌వాడి కేంద్రంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఇద్దరు తాగుబోతులు అంగన్వాడి కేంద్రంలో ఉన్న సామగ్రిని ఒకవైపు చేర్చి, టేబుల్‌పై మద్యం గ్లాసు పెట్టుకుని విందు చేసుకున్నారు. ఈ దుశ్చర్య అంగవాడి కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. ఈ ఘటనపై స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. అంగన్వాడి కేంద్రాల హైదరాబాద్ జిల్లా ప్రాజెక్ట్ అధికారిణి–1 ప్రజ్వలను ‘సాక్షి’ ఈ విషయంపై వివరణ కోరగా ఇలాంటి సంఘటన మొట్టమొదటి సారి తన దృష్టికి వచ్చిందని, విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
సిదార్ధ్ మహారియాకు వ్యతిరేకంగా సాక్ష్యం
-
వయసు నిబంధన.. ప్రమాదాన్ని తగ్గిస్తుంది!
హూస్టన్‌ః అనేక దేశాల్లో వివాహాలకు చట్టపరమైన వయసు నిబంధనలు ఉన్నసంగతి తెలిసిందే. కానీ అలవాట్లకు సైతం నిబంధనలు విధిస్తే ఆరోగ్యాలు బాగుపడతాయంటున్నారు తాజా పరిశోధకులు. చిన్ననాటినుంచే చెడు అలవాట్లకు బానిసలౌతుండటంతో, అతి తక్కువ వయసులోనే అనారోగ్యాల బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఓ శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేపట్టింది. మద్యపానానికి చట్టపరంగా 21 ఏళ్ళ వయసును నిర్థారిస్తే.. చిన్నవయసునుంచే మద్యం తాగే అలవాటు ఉన్నవారితో పోలిస్తే మరణాల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు. మద్యం తాగేందుకు కనీస వయసు (మినిమమ్ లీగల్ డ్రింకింగ్ ఏజ్ (ఎంఎల్డీయే) 21 ఏళ్ళు ఉండేట్టుగా చట్టాన్ని తెస్తే మరణాల శాతం తగ్గుతుందని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. మద్యం తాగే వయసు కనీసం 21 ఏళ్ళు ఉండేట్లుగా చూస్తే.. యవ్వనంలో ఆరోగ్య పరంగా అనేక లాభాలు చేకూరుతాయని అధ్యయనకారులు చెప్తున్నారు. 21 ఏళ్ళ వయసుకన్నా ముందే మద్యానికి అలవాటు పడినవారు... మద్యానికి సంబంధించిన అనేక దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడటమే కాక, మరణించే ప్రమాదం కూడ ఉన్నట్లు పరిశోధనల్లో తెలుసుకున్నారు. 1990 నుంచి 2010 మధ్య జనాభా మరియు, వారి మరణాలకు కారణాల డేటాను అమెరికా రీసెర్స్ సొసైటీనుంచి సేకరించిన శాస్త్రవేత్తలు.. 21 ఏళ్ళ వయసులోపు మద్యపానం అలవాటు అనేక ప్రమాదాలకు దారి తీస్తుందని తెలుసుకున్నారు. మద్యపానం అలవాటుతో కాలేయానికి సంబంధించిన వ్యాధుల బారిన పడినవారు, మద్యపానం వల్ల క్యాన్సర్ తో చనిపోయినవారి రికార్డులను సైతం అధ్యయనకారులు పరిశీలించారు. దీనిద్వారా మద్యపానం సేవించే కనీస వయసు 21 ఏళ్ళు ఉండాలనే చట్టపరమైన నిబంధన విధిస్తే... అనేక ఆల్కహాలిక్ వ్యాధులవల్ల ఏర్పడే మరణాల సంఖ్య తగ్గించి, జీవించే సమయాన్ని పెంచవచ్చని అభిప్రాయం వ్యక్తంచేశారు. ముఖ్యంగా కాలేజీలకు వెళ్ళనివారికి ఈ నిబంధన వల్ల అధిక ప్రయోజనం ఉంటుందని అధ్యయనకారులు చెప్తున్నారు. అలాగే విద్యాలయ ప్రాంగణాల్లో 21 ఏళ్ళ వయసు లోపు ఉన్నవారిపై మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే ఎంఎల్డీయే వల్ల కళాశాలలకు హాజరయ్యే విద్యార్థులకు సైతం లాభం చేకూరుతుందని భావిస్తున్న అధ్యయనకారులు తమ క్లినికల్ అండ్ ఎక్స్ పరిమెంటల్ పరిశోధనలను ఆల్కహాలిజం జర్నల్ లో నివేదించారు. -
కొడుకును కడతేర్చిన తల్లిదండ్రులు
వేధింపులు భరించలేక.. ఎదురు దాడి చేయడంతో మృతి జహీరాబాద్ టౌన్: తాగుడుకు బానిసై తరచూ వేధిస్తున్న కొడుకును కడతేర్చారు తల్లిదండ్రులు. తమపై దాడి చేయడానికి వచ్చిన కొడుకుపై ఎదురు దాడి చేయడంతో అతను ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం దిడ్గి గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. జహీరాబాద్ రూరల్ ఎస్ఐ, శ్రీకాంత్ కథనం ప్రకారం.. దిడ్గి గ్రామానికి చెందిన రాజప్ప, రాచమ్మల కుమారుడు జోగు మల్లేశం(28) తాగుడుకు బానిసయ్యాడు. తరచూ తల్లిదండ్రులతో గొడవ పడేవాడు. మల్లేశంకు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు కూతురు ఉండగా రెండో పెళ్లిచేసుకున్నాడు. మొదటి భార్య కూతురుతో కలిసి అత్తామామల వద్దే ఉంటుంది. మల్లేశం తన రెండో భార్య లక్ష్మితో కలిసి మునిపల్లి మండలం బుధేరాలో నివాసముంటున్నాడు. మొదటి భార్య కూతురుకు సంబంధించిన వేడుకను శుక్రవారం దిడ్గి గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యానికి మల్లేశం వచ్చాడు. రాత్రి మద్యం తాగి తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. ఇంట్లో ఉన్న గొడ్డలి తీసుకుని తండ్రిపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఫంక్షన్‌కు వచ్చిన బంధువులు ఆయన్ను పట్టుకున్నారు. ఈ క్రమంలో కొడుకు చేతిలో ఉన్న గొడ్డలిని లాగేసుకున్న తండ్రి రాజప్ప దానితోనే మల్లేశం తలపై బాదాడు. తలకు గాయమై స్పృహతప్పి పడిపోయాడు. ఆగ్రహంతో ఉన్న తల్లి కూడా మల్లేశాన్ని కొట్టింది. దీంతో మల్లేశం అక్కడికక్కడే మృతిచెందాడు. మల్లేశం రెండో భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు తల్లిదండ్రులతోపాటు బంధువులు నవీన్, సుధాకర్‌తోపాటు మరో నలుగురిపై కేసునమోదు చేశామని ఎస్ఐ శ్రీకాంత్ వివరించారు. -
మురుగునీళ్లే ‘మహా’భాగ్యం!
హైదరాబాద్ శివారు ప్రాంతాలకు కలుషిత నీరే దిక్కు సాక్షి, హైదరాబాద్: ‘ఈ నీళ్లను పొరపాటున నోట్లో పోసుకున్నా నోరంతా పొక్కుతోంది.. రోగాలపాలవుతున్నాం..’ చేతిలోని మురికినీళ్ల బాటిల్ చూపిస్తూ ఎన్టీఆర్నగర్ బస్తీకి చెందిన ఓ మహిళ ఆవేదన.. నీళ్లను పరీక్షించే వాళ్లే లేరు.. ఈ మురికి నీళ్లకు కూడా ట్యాంకర్‌కు రూ.1,500 తీసుకుంటున్నారు..’ సైదప్పకాలనీలో ఓ సగటు నగరజీవి గోడు.. ...వీరిద్దరే కాదు మహానగరంలోని అనేక బస్తీల్లో లక్షలాది మంది అభాగ్యులది ఇదే దుస్థితి! ముఖ్యంగా శివారుల్లోని బస్తీలు గుక్కెడు నీటికోసం అల్లాడిపోతున్నాయి. వందలు పోసి ట్యాంకర్ నీళ్లను కొంటున్నా తాగేందుకు ఏమాత్రం పనికి రావడం లేదు. ఆ మురికి నీళ్లను స్నానానికి, బట్టలు ఉతికేందుకు, కాలకృత్యాలకు వాడుకుంటూ.. తాగునీళ్ల కోసం గత్యంతరం లేక మళ్లీ ఫిల్టర్ నీళ్లు కొనుక్కుంటున్నారు. మండు వేసవిలో బోరుబావులు వట్టిపోవడం, జలమండలి నల్లా కనెక్షన్లు లేకపోవడంతో శివారు ప్రాంతాలకు మురుగునీరే దిక్కవుతోంది. ఈ నీటిని వాడుతున్న బస్తీవాసులు చర్మ, గొంతు సంబంధ రోగాలతో సతమతమవుతున్నారు. నగరంలో చివరికి మురుగునీరు కూడా వ్యాపారులకు కాసుల పంట కురిపిస్తుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నిజాంపేట్‌లోని తుర్కచెరువులో నిల్వ ఉన్న వ్యర్థ జలాలను మోటార్లతో తోడి నిత్యం వందలాది ట్యాంకర్లలో అమ్ముతున్నారు. ప్రైవేటు ట్యాంకర్ల యజమానులు ఈ నీటిని ట్యాంకర్‌కు రూ.1,500 చొప్పున సమీప బస్తీలైన ఎన్టీఆర్ నగర్, సైదప్ప కాలనీలతోపాటు పలు అపార్ట్మెంట్లకు సరఫరా చేస్తున్నారు. ఈ నీటిని నోట్లో పోసుకుంటే పొక్కులు, స్నానం చేస్తే దద్దుర్లు వస్తున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఇక్కడే కాదు... పలు శివారు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మురుగు నీటిని ట్యాంకర్లలో నింపి విక్రయిస్తున్న ముఠాలను కట్టడి చేయడంలో రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా విఫలమౌతోంది. మణికొండ, పుప్పాల్‌గూడ, నిజాంపేట్, కూకట్‌పల్లిలోని ఎల్లమ్మబండ, తెల్లాపూర్, అమీన్పూర్, మియాపూర్, ఉప్పల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, అల్వాల్, కాప్రా తదితర ప్రాంతాల్లో ప్రైవేటు ట్యాంకర్ల నీళ్ల దందా మాఫియాను తలపిస్తోంది. కూకట్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని నిజాంపేట్రోడ్, ఎల్లమ్మబండ చౌరస్తాల్లో బారులు తీరిన ట్యాంకర్లు, బహిరంగంగా మురుగు నీటిని నింపుతున్న దృశ్యాలు నిత్యకృత్యమయ్యాయి.! ఎక్కడిది ఈ మురుగు? ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడంతో శివారు ప్రాంతాల్లో సుమారు 14 లక్షల బోరుబావులు వట్టిపోయాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు విధిగా ట్యాంకర్ నీళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఇక నిజాంపేట్ తుర్కచెరువు వంటి చోట్ల సమీప కాలనీలు, బస్తీల్లో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ (అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ) లేదు. దీంతో ఓపెన్ నాలాల ద్వారా గృహ, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల నుంచి వచ్చి చేరుతున్న వ్యర్థ జలాలు ఈ చెరువులను ముంచెత్తుతున్నాయి. ఈ నీటినే తోడుతూ వ్యాపారులు ట్యాంకర్ల ద్వారా అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. జేబులు గుల్ల చేస్తున్నారు ప్రైవేటు ట్యాంకర్ మాఫియా మా జేబులు గుల్ల చేస్తోంది. మురుగు నీటికి సైతం ట్యాంకర్‌కు (5 వేల లీటర్లు) రూ.1,500 నుంచి రూ.2,000 వరకు దండుకుంటున్నారు. ట్యాంకర్ నీళ్ల నాణ్యతను పరీక్షించే నాథుడే లేడు. -శ్రీధర్, మియాపూర్ నోట్లో పోసుకుంటే అంతే బోరుబావులు వట్టిపోవడంతో విధిలేక ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొంటున్నాం. ఈ నీటిని పొరపాటున నోట్లో పోసుకుంటే నోరంతా పొక్కి రోగాల బారిన పడుతున్నాం. ఈ పరిస్థితి నుంచి మమ్మల్ని కాపాడాలి. - వర్ష వర్మ, అమీన్పూర్ -
తాగితేనే మార్కులేస్తా..!
బీజింగ్: మీరు ఎంత మద్యం సేవించగలరు? నేను మీకు రేటింగ్ ఇస్తాను.. అంటూ విద్యార్ధులు అధికంగా మద్యం సేవించే విధంగా ప్రేరేపించిన ఓ చైనా ప్రొఫెసర్‌పై సస్పెన్షన్ వేటు పడింది. గు జోయూ ప్రావిన్సులో గు జోయూ ఒకేషనల్ ఇన్స్టిట్యూట్లో సంప్రదాయ చైనీ మందుల కోర్సులో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నగుజోయూ అన్షున్.. విద్యార్ధులు మద్యం సేవించే విధంగా ప్రొత్సహించినందుకు బాధ్యతల నుంచి తప్పించారు. ఓ విద్యార్థి ఆన్లైన్ లో ఉంచిన వివరాల ప్రకారం.. ఎవరైతే ఒక పూర్తి గ్లాసు మద్యాన్ని సేవిస్తారో వారికి 10 మార్కులు, సగం తాగిన వారికి 90 మార్కులు, ఒకసారి రుచి చూసిన వారికి 60 మార్కులు, అసలు ముట్టుకోకపోతే ఫెయిల్ చేస్తానని టీచర్ తెలిపినట్లు పోస్ట్ చేశారు. గూ అలా చెప్పడం జోక్ కావచ్చని సంస్థ డైరక్టర్ గుయ్షెంగ్ అన్నారు. ఈ విషయం ఆన్లైన్లో టీచర్‌పై మండిపడిన వారు కొందరైతే, ఈ టీచరైన విద్యార్థులపై కరుణ చూపించాడని మరికొందరు పోస్ట్‌లు చేశారు. -
తాగునీరిస్తారా చావమంటారా
♦ పురుగుమందు డబ్బాలతో కేసానుపల్లి వాసుల నిరసన ♦ పురుగు మందు డబ్బాతో గ్రామస్తుల నిరసన ♦ తంగెడ మేజర్ కాలువ నుంచి నీరందించాలని డిమాండ్ దాచేపల్లి : తమ గ్రామాలకు తక్షణం తాగునీరు విడుదల చేయకుంటే తాము ఆత్మహత్య చేసుకుంటామని కేసానుపల్లి గ్రామ ప్రజలు అధికారులను హెచ్చరించారు. తంగెడ మేజర్ కాలువ నుంచి కేసానుపల్లి కాలువకు నీటిని మళ్లించేందుకు గ్రామస్తులు గురువారం వెళ్లారు. విషయం తెలుసుకున్న జలవనరుల శాఖ ఏఈ పసుపులేటి ఆదినారాయణ తన సిబ్బందితో కలిసి కాలువ వద్దకు వెళ్లి గ్రామస్తులను అడ్డుకున్నారు. నీటిని తరలించేందుకు కాలువలో వేసిన మట్టిని అధికారులు పొక్లెయిన్‌తో తొలగించారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. కేసానుపల్లి కాలువకు నీరు విడుదల చేయకుంటే ఆత్మహత్యలు చేసుకుంటామని వెంట తెచ్చుకున్న పురుగు మందు డబ్బాలను అధికారులకు చూపించారు. వర్షాలు కురవకపోవడం, భూగర్భ జలాలు అడుగంటడంతో గ్రామంలోని మంచినీటి బోర్లు పనిచేయడంలేదని తెలి పారు. నీటికోసం రేయింబవళ్లు పడిగాపులు పడుతున్నాం నీటి కోసం రేయింబవళ్లు బోర్ల వద్ద పడిగాపులు కాస్తున్నామని, నీరు దొరక్క ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు వివరించారు. గ్రామంలో ఉన్న బావుల్లో నీటిని నింపితే భూగర్భజలాలు పెరిగి బోర్లు పనిచేస్తాయని, తాగునీటికి ఇబ్బందులు ఉండవని గ్రామస్తులు నెల్లూరి శ్రీనివాసరావు, కర్నాటి నాగేశ్వరరావు, జక్కుల వీరాస్వామి, నెల్లూరి బ్రహ్మయ్య, అలవల ప్రసాద్, గొంది చందు, యడ్లపల్లి లక్ష్మీనారాయణ చెప్పారు. బావులు నింపడానికి అనుమతులు లేవని, ఉన్నతాధికారులకు విషయం తెలియజేస్తామని ఏఈ ఆదినారాయణ గ్రామస్తులకు తెలిపారు. ఉన్నతాధికారులతో మాట్లాడి నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. -
కాఫీతో ఆ రిస్క్ సగానికి పైగా తగ్గుతోంది!
లండన్: కాఫీ ప్రియులకు శుభవార్త. మీరు రోజు మామూలుగా తాగేదానికన్నా అదనంగా మరో రెండు కప్పుల కాఫీని లాగించమని చెబుతున్నారు పరిశోధకులు. దీని ద్వారా కాలేయానికి సంబంధించిన ప్రాణాంతకమైన వ్యాధులు సగానికి పైగా తగ్గుతాయని చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. శరీరంలో ఆల్కహాల్ మోతాదు మించడం, హెపటైటిస్ సీ లాంటి వైరల్ వ్యాధుల భారిన పడటం ద్వారా కాలేయం(లివర్) తీవ్రంగా ప్రభావితం అవుతుంది. ఇలా దీర్ఘకాలంగా కాలేయ వ్యాధులు ఉన్నవారిలో అది లివర్ క్యాన్సర్‌గా మారి ప్రాణాంతకంగా తయారవుతోంది. అయితే ఈ ముప్పును కాఫీ సగానికి పైగా తగ్గిస్తోందని లండన్‌లోని సౌతాంప్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృంధం తాజాగా తేల్చింది. సుమారు 5 లక్షల మందిని పరిశీలించి ఈ ఫలితాలను వెల్లడించారు. లివర్ సిర్రోసిస్ వ్యాధికి కాఫీ మంచి విరుగుడులా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. కాఫీతో కలిగే ఈ ప్రయోజనాలను తెలుసుకోవడం ద్వారా లివర్‌కు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న వారికి మంచి ఉపయోగాలున్నాయని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఒలివర్ కెన్నడీ వెల్లడించారు. -
వైన్ తాగి 107 ఏళ్ళు బతికాడు..!
ఇటీవల చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్ళిన ఓ 107 ఏళ్ళ వృద్ధుడి జీవన విధానం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అతడు కేవలం రెడ్ వైన్ మాత్రమే తాగి బతికాడన్న విషయం తెలిసి అంతా విస్మయం చెందారు. స్పెయిన్ గాల్సియాలోని విగోకి చెందిన యాంటోనియో డొకాంపో గార్సియా క్రితం వారం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. బతికున్నంత కాలం తాను స్వయంగా ఇంట్లో తయారు చేసుకున్న రెడ్ వైన్ మాత్రమే తాగేవాడట. డొకాంపో మధ్యాహ్న భోజనానికి బదులుగా రెండు బాటిల్స్... డిన్నర్ కు బదులుగా మరో రెండు బాటిల్స్ రెడ్ వైన్ తాగేవాడు. అంటే ఒక్కసారి అతడు తాగే మొత్తం వైన్ ఒకటిన్నర లీటరు వరకు ఉంటుందని అతడి కుమారుడు మిగ్వెల్ డొకాంపో తెలిపాడు. తామిద్దరూ కలిసి ఇంట్లోనే నెలకు రెండు వందల లీటర్ల రెడ్ వైన్ తయారు చేసేవాళ్ళమని, నీళ్లు కూడా తాగకుండా తన తండ్రి వైన్ మాత్రమే ఆహారంగా తీసుకునేవాడని చెప్తున్నాడు. 107 సంవత్సరాలపాటు తన తండ్రి ఎంతో ఆరోగ్యంగా బతికారని... స్పానిష్ అంతర్యుద్ధంలో ప్రాంకో కోసం పోరాటం తరువాత వైన్ ఉత్పత్తి కేంద్రం.. బొడేగాస్ డొకాంపో స్థాపించారని, అందుకోసం రబాదావియా టౌన్ లో స్వంత ద్రాక్షతోట ఏర్పాటు చేసుకున్నారని తెలిపాడు. డొకాంపో కేవలం కెమికల్ ఫ్రీ ఆర్గానిక్ వైన్ ను మాత్రమే తాగేవాడు. అయితే అతడు ఉత్పత్తి చేసిన వైన్ లో ఎక్కువ భాగం అమ్మేయగా... మిగిలిన వైన్ తో పాటు, అతని ద్రాక్షతోటను ప్రస్తుతం అతడి మేనల్లుడు జెరోనిమో డొకాంపో నిర్వహిస్తున్నాడు. డొకాంపో సంవత్సరానికి 60,000 లీటర్ల వైన్ ను ఉత్సత్తి చేసి, అందులో 3 వేల లీటర్లను తన కోసం ఉంచుకొనేవాడు. అయితే తాను అన్నేళ్ళు ఆరోగ్యంగా బతకడానికి వైనే కారణమని ఎప్పుడూ చెప్తుండేవాడట.