న్యూఢిల్లీ: ప్రఖ్యాత టెలివిజన్ షో ఆప్ కీ అదాలత్ కార్యక్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ ను మీరు గత 10-12 సంవత్సరాలుగా రాత్రి పగలు తేడా లేకుండా బాగా మద్యం సేవిస్తుంటారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. నిజమేనా? అని ప్రశ్నించగా పంజాబ్ ముఖ్యమంత్రి.. నా లివర్ ఇనుముతో తయారైందనుకున్నారా ఏంటని చమత్కరించారు సీఎం.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ పెద్ద తాగుబోతు అని ప్రతిపక్షాలు గత కొన్నేళ్లుగా విమర్శిస్తూ ఉన్నాయి. కానీ ఆ విషయాన్ని ఆయనెప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఇటీవల ఆప్ కీ అదాలత్ టీవీ కార్యక్రమానికి అతిధిగా హాజరైన ఆయనను ఇదే విషయం గురించి ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ.. నా లివర్ ఇనుముతో తయారయ్యిందనుకున్నారా? ఏంటి?
10-12 ఏళ్లపాటు పగలు రాత్రి తేడా లేకుండా మద్యం తాగుతూ కూర్చుంటే అసలు బ్రతికేవాడినా? ప్రతిపక్షాలకు నా గురించి మాట్లాడటానికి ఏమీ లేనప్పుడు ఇలాంటి చెత్త విమర్శలే చేస్తుంటారన్నారు సీఎం. నేను పొద్దున్న లేస్తూనే మొదటి ఫైల్ తెప్పించుకుని దాని గురించే ఆలోచిస్తాను. ఇలా పనిచేసే పంజాబ్లో గత 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఏడాదిన్నరలోనే చేసి చూపించా. చిత్తశుద్ధితో పని చేశాను కాబట్టే ఈరోజు 88% ఇళ్లలో విద్యుత్తు ఇవ్వగలిగాము.
2019లో జరిగిన ఒక పబ్లిక్ ర్యాలీలో భగవంత్ మన్ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, తన తల్లి సమక్షంలో మద్యం మానేస్తున్నట్టు బాహాటంగానే మాటిచ్చారు. ఆయన ఆ అలవాటు మానుకున్నా కూడా ఆయనకు ఆ ట్యాగ్ మాత్రం అలా ఉండిపోయింది. ప్రతిపక్షాలు విమర్శించడానికి ఈ కారణమే ఇప్పుడు అదనుగా మారింది.
मेरा Liver क्या लोहे का है जो 10–12 साल से सुबह शाम पी रहा हूं, फिर भी जिंदा हूं?
— AAP (@AamAadmiParty) June 18, 2023
जितना काम 75 साल में नहीं हुआ, पिछले सवा साल में किया है
88% घरों में मुफ़्त बिजली जाती है Punjab में! इतना कोयला कभी नहीं था जितना आज है।
नीयत होनी चाहिए काम करने की।
—CM @BhagwantMann… pic.twitter.com/u9YcIxgHk4
ఇది కూడా చదవండి: "మన్ కీ బాత్"లో "మణిపూర్ కీ బాత్" లేదా?
Comments
Please login to add a commentAdd a comment