bhagwant mann
-
డిపోర్టేషన్‌కు అమృతసర్నే ఎందుకు?: పంజాబ్ సీఎం మాన్
చండీగఢ్: భారతీయ అక్రమ వలసదారులతో కూడిన రెండో విమానం కూడా అమృత్‌సర్‌లోనే ల్యాండవడంపై పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పవిత్ర నగరాన్ని డిపోర్ట్ సెంటర్‌గా మార్చవద్దని ఆయన కేంద్రాన్ని కోరారు. శనివారం రాత్రి అమెరికా నుంచి 119 మంది వలసదారులను తీసుకుని ప్రత్యేక విమానం రానున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. దేశంలో వైమానిక కేంద్రాలు చాలానే ఉన్నాయని, వలసదారుల విమానాలను అక్కడికి కూడా పంపించ వచ్చని పేర్కొన్నారు. ఇక్కడి వారిని వాటికన్ సిటీకి పంపిస్తామంటే అనుమతిస్తారా? అని ప్రశ్నించారు. మన వాళ్ల కోసం విమానాలను పంపుతామని ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు చెప్పాలని సూచించారు. ఇతన దేశాలు ఇలాగే చేస్తున్నాయన్నారు. -
Bhagwant Mann: పంజాబ్ సీఎంను మార్చేయబోతున్నారా?
న్యూఢిల్లీ: ఢిల్లీ ఫలితం నేపథ్యంలో.. పొరుగున్న ఉన్న పంజాబ్ ముఖ్యమంత్రిని అక్కడి అధికార ఆమ్ఆద్మీ పార్టీ మార్చేయబోతోందంటూ ప్రచారం నడుస్తోంది. ప్రస్తుత సీఎం భగవంత్ మాన్ విషయంలో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద కేజ్రీవాల్ అసంతృప్తిగా ఉన్నారని, హామీల అమలులో మాన్ ఘోరంగా విఫలమయ్యారని, త్వరలో ఆయన్ని తప్పించి సమర్థుడిని ఎంపిక చేయబోతున్నారన్నది ఆ ప్రచార సారాంశం. దీనిపై పంజాబ్ సీఎం మాన్ స్పందించారు.ఢిల్లీలో ఇవాళ పంజాబ్ ఆప్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, ఇతర ముఖ్యనేతలు హాజరయ్యారు. ఆ మీటింగ్ తర్వాత.. ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే(నూతన) మజిందర్ సింగ్ సిస్రా చేసిన కామెంట్ల గురించి మాన్కు మీడియా నుంచి ప్రశ్నెదురైంది. దానికి ఆయన గట్టిగా నవ్వారు. వాళ్లను అలా మాట్లాడనివ్వండి అని మీడియాతో చెప్పారు.పంజాబ్ ఆప్‌లో ఎలాంటి మార్పు ఉండబోదు. ఢిల్లీ ఫలితాల తర్వాత పంజాబ్ యూనిట్ మా పార్టీ కన్వీనర్‌ను కలవాలనుకుంది. అందుకే వచ్చాం. ఇవాళ్టి మీటింగ్‌లో అలాంటి అంశం కూడా ఏదీ చర్చకు రాలేదు. పంజాబ్‌లో మా ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉంది. ప్రత్యర్థులు ఎన్ని రకాల ప్రచారాలు చేసినా.. మాకొచ్చిన నష్టమేమీ లేదు అని అన్నారాయన. అదే సమయంలో.. తనతో ఇరవై మంది పంజాబ్ ఆప్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా చేసిన వ్యాఖ్యలపైనా మాన్ స్పందించారు. ‘‘ఆయన గత మూడేళ్లుగా ఆ మాటే చెబుతూ వస్తున్నారు. ఆ లెక్కలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఒకసారి మొన్నటి ఢిల్లీ ఎన్నికల్లో.. ఆ పార్టీ ఎన్ని సీట్లు నెగ్గిందో ఆయన్ని లెక్కించుకోమనండి’’ అంటూ ఎద్దేశా చేశారాయన.అలాగే.. ఎన్నికల హామీలను పంజాబ్ ఆప్ ప్రభుత్వం విస్మరిస్తోందన్న విమర్శలపైనా మాన్ స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో హామీలను అమలు చేసి తీరతామని ఉద్ఘాటించారాయన. ఇదిలా ఉంటే.. 117 మంది సభ్యులున్న పంజాబ్ అసెంబ్లీలో 93 మంది ఆప్ సభ్యులు ఉండగా, 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. -
‘ఆప్’ ఓటమితో పంజాబ్‌లో వణుకు.. సీఎంకు ముచ్చెమటలు
న్యూఢిల్లీ: దేశరాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపాలు కావడంతో పంజాబ్‌లో వణుకు మొదలయ్యింది. పంజాబ్ ముఖ్యమంత్రి, ఆప్ నేత భగవంత్ మాన్ సింగ్‌కు ఢిల్లీ ఫలితాలు అగ్నిపరీక్షలా మారాయి. ఆయన ప్రచారం చేసిన 12 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది.ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal), మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు పలువురు ఆప్ సీనియర్ నేతలు ఓటమిపాలయ్యారు. ఈ ఓటమి తర్వాత పార్టీలోనూ, పంజాబ్ రాజకీయాల్లోనూ కొత్త చర్చలు ఊపందుకున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు పంజాబ్ ముఖ్యమంత్రి కాగలరని వ్యాఖ్యానించారు. ఆయన పంజాబ్ మంత్రి, ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు అమన్ అరోరా ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఉదహరించారు. పంజాబ్‌లో హిందువు కూడా ముఖ్యమంత్రి కావచ్చని అన్నారు.పంజాబ్‌లోని లూథియానా స్థానం నుంచి ఆప్ ఎమ్మెల్యే గుర్ప్రీత్ గోగి మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక జరగాల్సి ఉందని బజ్వా అన్నారు. ఆప్ తలచుకుంటే అరవింద్ కేజ్రీవాల్‌ను ఈ స్థానం నుంచి పోటీచేయించి, ముఖ్యమంత్రిని చేయవచ్చన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ వాదనపై ఆప్ నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి, ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. భగవంత్ మాన్(Bhagwant Mann) ముఖ్యమంత్రి అయ్యారు. తదనంతరం కేజ్రీవాల్ పంజాబ్ ప్రభుత్వాన్ని 'రిమోట్ కంట్రోల్'తో నడుపుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పంజాబ్ రాజకీయాల్లో కేజ్రీవాల్ పెద్దన్న పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారనే చర్చ జోరందుకుంది.ఇది కూడా చదవండి: Delhi Election 2025: ఆప్ ఓటమి బాట.. ఐదు కారణాలు -
Bhagwant Mann: పంజాబ్ సీఎం ఇంట్లో పోలీసుల సోదాలు!
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి.. ఢిల్లీలోని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ సింగ్ (Bhagwant Mann Singh) నివాసం వద్ద పోలీసు బలగాలు మోహరించారని చెప్పారు. ఈ ఘటన ఒక్కసారిగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం అతిశి వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు.తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి ట్విట్టర్ వేదికగా.. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ సింగ్ నివాసం వద్ద పోలీసు బలగాలు మోహరించారు. ముఖ్యమంత్రి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించేందుకు వచ్చారు. కానీ, బీజేపీ చేసిన తప్పులను, కాషాయ పార్టీ నేతలను మాత్రం పోలీసులు పట్టించుకోవడం లేదు. బీజేపీ నేతలు పట్టపగలే డబ్బులు పంచినా ఎందుకు పట్టించుకోవడం లేదు. ఎన్నికల కోసం వస్తువులను ప్రజలకు పంచేందుకు వెళుతున్నారు అయినప్పుటికీ పోలీసుల నుంచి స్పందన కరువైంది. కానీ, ప్రజలు ఎన్నుకున్న నాయకుడి ఇంటి పైకి సోదాలు చేసేందుకు మాత్రం వచ్చారు’ అంటూ మండిపడ్డారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.మరోవైపు.. సీఎం అతిశి ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. తాము సీఎం నివాసంలో ఎలాంటి సోదాలు చేపట్టలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్బంగా సీ-విజిల్ పోర్టల్‌లో వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు కోసం రిటర్నింగ్ ఆఫీసర్ నేతృత్వంలోని పోలీసు బృందం పంజాబ్ సీఎం నివాసానికి రావాల్సి వచ్చిందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. అయితే.. అక్కడున్న భద్రతా సిబ్బంది పోలీసుల బృందాన్ని దర్యాప్తు చేసేందుకు అనుమతించలేదని తెలిపారు.ఇదిలా ఉండగా.. అతిశి ఆరోపణలపై బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఆప్ నేతలు ఇలా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ నేతలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇక, ఢిల్లీ ఎన్నికల వేళ యమునా నది నీళ్ల విషయం కూడా సంచలన మారిన సంగతి తెలిసిందే. दिल्ली पुलिस @BhagwantMann जी के दिल्ली के घर पर रेड करने पहुँच गई है। भाजपा वाले दिन दहाड़े पैसे, जूते, चद्दर बांट रहे हैं- वो नहीं दिखता। बल्कि एक चुने हुए मुख्यमंत्री के निवास पर रेड करने पहुँच जाते हैं।वाह री भाजपा! दिल्ली वाले 5 तारीख़ को जवाब देंगे!— Atishi (@AtishiAAP) January 30, 2025 -
పార్టీ చీఫ్ పదవిపై పంజాబ్ సీఎం కీలక వ్యాఖ్యలు
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పార్టీ చీఫ్ పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ రాష్ట్ర విభాగానికి పూర్తికాల అధ్యక్షుడిని నియమించటంపై ఆప్ పార్టీ నాయకత్వంతో చర్చిస్తామని అన్నారు. ఆయన చబ్బేవాల్లో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను రాష్ట్ర చీఫ్ పదవి నుంచి వైదొలగాలనే కోరికను బయటపెట్టారు.‘‘రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు పెద్ద బాధ్యతలు ఉన్నాయి. ఇప్పటికే నాకు 13-14 శాఖలు ఉన్నాయి. బాధ్యతలు విభజించబడేలా పూర్తి సమయం రాష్ట్ర యూనిట్ చీఫ్‌ను నియమించడానికి పార్టీ న్యాయకత్వంతో మాట్లాడతా’’ అని అన్నారు. భగవంత్ మాన్ 2017లో సంగ్రూర్ ఎంపీగా ఉన్నప్పుడు ఆప్ పంజాబ్ యూనిట్ చీఫ్‌గా నియమితులయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికలు, 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాన్ పంజాబ్‌లో పార్టీకి నాయకత్వం వహించారు. అంతేకాకుండా.. 2022లో 117 మంది సభ్యుల పంజాబ్ అసెంబ్లీలో 92 స్థానాలను గెలుచుకుని ఆప్‌ను అధికారంలోకి తీసుకువచ్చారు. అయితే.. 2023 జూన్ ఆప్ పంజాబ్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బుధ్ రామ్‌ను నియమించింది. మరోవైపు.. గిద్దర్బాహా, డేరా బాబా నానక్, చబ్బేవాల్, బర్నాలా నాలుగు అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు నవంబర్ 23న వెలువడుతాయి. ఈ స్థానాల ఎమ్మెల్యేలు లోక్‌సభకు ఎన్నిక కావటంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి.చదవండి: సీజేఐ ఇంట్లో గణపతి పూజకు మోదీ హాజరు.. చంద్రచూడ్ రియాక్షన్ -
పంజాబ్ సీఎంకి లెప్టోస్పిరోసిస్ నిర్ధారణ! అంటే ఏంటీ? ఎందువల్ల వస్తుంది?
పంజాబ్ సీఎం భగవంత్ మాన్కు లెప్టోస్పిరోసిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. బుధవారం అర్ధరాత్రి భగవంత్ మాన్ హఠాత్తుగా స్పృహ తప్పిపడిపోయారు. హుటాహుటినా ఆయన్ను మొహాలీలోని ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ వైద్యులు ఆయనకు లెప్టోస్పిరోసిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయనకు యాంటీ బయాటిక్స్ అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అసలేంటీ వ్యాధి? ఎందువల్ల వస్తుంది..?.లెప్టోస్పిరోసిస్ అంటే ..?లెప్టోస్పిరోసిస్ అనేది లెప్టోస్పిరా బాక్టీరియా వల్ల కలిగే వ్యాధి. ఇది మానవులను జంతువులను ప్రభావితం చేస్తుంది. సాధారణంగా మానవులకు లెప్టోస్పిరోసిస్ సోకిన జంతువుల ద్వారా లేదా వాటి మూత్రంతో ప్రత్యక్ష సంబంధం లేదా ఆ మూత్రంతో కలుషితమైన నేల, నీరు వంటి వాతావరణ పరిస్థితుల కారణంగా వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా చర్మంపై కోతలు లేదా రాపిడి ద్వారా లేదా కళ్లు, ముక్కు నోటిలో శ్లేష్మ పొరల ద్వారా మానవుకులకు సంక్రమిస్తుంది. లక్షణాలు..ఈ వ్యాధి కారణంగా అధిక ఉష్ణోగ్రత, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, అతిసారం, చలి, కళ్ళు ఎర్రబడటం తదితర లక్షణాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఛాతీ నొప్పి,వాపు చేతులు, కాళ్లల్లో కనిపించడం వంటివి జరుగుతాయి. వ్యాధి తీవ్రత..దీన్ని యాంటీ బయాటిక్స్‌తో రెండు వారాల్లో నయం అయ్యేలా చెయ్యొచ్చు. అదే ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటే మాత్రం మూత్రపిండాలకు వ్యాపిస్తుంది. మెదడు, వెన్నుపాము, కాలేయానికి సోకవచ్చు. అరుదైన పరిస్థితుల్లో ఊపిరితిత్తులకు వ్యాపించే అవకాశం కూడా ఉంటుందని వైద్యులు హెచ్చరించారు. నిర్థారించడం కష్టమైతే..ఈ వ్యాధిని ఏంటనేది నిర్థారించడం కష్టముతుందని అన్నారు. దీనిపై సదరు వైద్యుడికి సరైన అవగాహన ఉంటేనే నిర్థారించగలరని చెప్పారు. అలాంటి సమయాల్లో మరో వైద్యుడిని కూడా సంప్రదించటం అనేది ఉత్తమం అని సూచిస్తున్నారు నిపుణులు. ఈలోగా ఆ బ్యాక్టీరియా గనుక మెదడులోకి ప్రవేశిస్తే మాత్రం ప్రాణాతంకంగా మారిపోతుంది. అయితే ఇది మానవుడి నుంచి మానవుడికి మాత్రం సంక్రమించదట.ఎందువల్ల అంటే..కాలుష్యం కారణంగా ఈ వ్యాధి వస్తుందని చెబుతున్నారు వైత్యులు. ముక్యంగా కిరాణ స్టోర్స్‌లలో లూజ్కి సరుకులను తీసుకుంటుంటారు. ఇలా అస్సలు చేయకండి. సాధ్యమైనంత వరకు ప్యాక్ చేసి, సీల్ చేసిన వాటినే కొనుగోలు చేయాలని చెబుతున్నారు నిపుణులు. ఉష్ణమండల వాతావరణంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. తొలిసారిగా..1920లలో అండమాన్ దీవుల నుంచి తొలిసారిగా ఈ వ్యాప్తి చెందిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది భారతదేశంలోని గుజరాత్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక అండమాన్ నికోబార్ దీవులు వంటి తీర ప్రాంత రాష్ట్రాలలో అధికంగా ఉంటుందని వెల్లడించారు నిపుణులు . అయితే ఈ వ్యాధి గణనీయమైన మరణాలకు దారితీసినప్పటికీ చాలా అరుదుగా సంభవించడం గమనార్హం.(చదవండి: ఓ డాక్టర్ హార్ట్ బిట్..! హృదయాన్ని మెలితిప్పే కేసు..!) -
సీఎం భగవంత్ మాన్‌ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరిక
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించారు. రాష్ట్రంలోని జలంధర్, లూథియానాలో జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న ఇంజనీర్లు, కాంట్రాక్టర్లపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. జలంధర్‌లో ‘ఢిల్లీ- అమృత్ సర్–కత్రా ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు నిర్మాణ పనులు జరుగుతుండగా, ఇంజినీర్లు, సిబ్బందిపై దాడులు, ప్రాజెక్టు క్యాంప్ ఆఫీసు పైనా, లుధియానాలోని స్టాఫ్ మీద దాడులు సంఘటనలపై భగవంత్ మాన్కు గడ్కరీ లేఖ రాశారు.ఒకవేళ పంజాబ్‌లో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడకపోతే రాష్ట్రానికి కేటాయించిన మొత్తం 293 కిలోమీటర్ల పొడవుతో రూ. 14,288 కోట్లతో నిర్మించనున్న ఎనిమిది ప్రధాన జాతీయ రహదారుల ప్రాజెక్టులను భారతీయ జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) రద్దు చేయడం గానీ, పూర్తిగా తొలగించడం గానీ చేస్తుందని తన లేఖలో హెచ్చరించారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా, సీఎం మన్ నేతృత్వంలోని పంజాబ్ ప్రభుత్వం తక్షణం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నిందితులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.గత నెల 15న జరిగిన సమీక్షా సమావేశంలోనూ భూ సేకరణతోపాటు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటామని తమకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ హామీ ఇచ్చారని నితిన్ గడ్కరీ గుర్తు చేశారు. కానీ, అందులో చెప్పుకోదగ్గ ప్రగతి కాన రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పంజాబ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందన్నారు. -
వినేశ్ ఫోగట్ అనర్హత: ‘కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులు సెలవుల మీద వెళ్లారా?’
చంఢీఘఢ్: ప్యారిస్ ఒలింపిక్స్ రెజ్లింగ్ ఫైనల్‌కు చేరిన వినేశ్ ఫోగట్‌పై అనర్హత వేటు పడింది. అధిక బరువు కారణంగా ఆమెను డిస్క్వాలిఫై చేశారు. అనర్హత వేటుపై అభిమానులు, రాజకీయ ప్రముఖలు ఆందోళన వ్యక్తం చూస్తూ.. ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ వినేశ్ ఫోగట్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. చర్కీ దాద్రిలోని రెజ్లర్ ఇంటికి వెళ్లిన సీఎం మాన్.. అక్కడ వినేశ్ ఫోగట్ మామ మహావీర్ ఫోగట్‌ను కలిసి మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.Charkhi Dadri, Haryana | On Vinesh Phogat's disqualification in the Paris Olympics, Punjab CM Bhagwant Mann says"...I don't want to connect with this politics. But please tell me have the members of the Indian Olympic Association gone there on holiday? Indian Olympic Association… pic.twitter.com/Pw7NSW4WUJ— ANI (@ANI) August 7, 2024‘రెజ్లర్ బరువును తనిఖీ చేయడం ఆమె కోచ్‌లు, ఫిజియోథెరపిస్టుల పని. ఇప్పడు ఆమెపై అనర్హత వేటుపడింది. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు. ఈ సమస్యను కేంద్రం పరిష్కరించదా? అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయంపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) అభ్యంతరం తెలపలేదు. ఇంత పెద్ద స్థాయి ఈవెంట్లో ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. కోచ్‌లు, ఫిజియోథెరపిస్టులు రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు. వారంతా అక్కడికి సెలవుల కోసం వెళ్లారా? ’అంటూ సీఎం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కూడా మాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వినేశ్ ఫొగాట్ ఫైనల్‌కు చేరుకున్నప్పుడు ప్రధాని మోదీ ఒక్క ట్వీట్ కూడా పెట్టలేదు. కానీ, ఆమెపై అనర్హత వేటు పడిన వెంటనే ‘ఎక్స్’లో ట్వీట్ పెట్టారు’విమర్శలు చేశారు.#WATCH | Charkhi Dadri, Haryana | On Vinesh Phogat's disqualification, Punjab CM Bhagwant Mann says," To check her weight was the work of her coaches and physiotherapists. Now, the decision has come. This injustice should have been stopped...Did they (The Centre) fix anyone's… pic.twitter.com/0UmPHc7s4Q— ANI (@ANI) August 7, 2024 మరోవైపు.. వినేశ్ ఫోగట్‌కు న్యాయం చేయాలని ప్రతిపక్ష ఇండియా కూటమి ఎంపీలు ఉభయ సభల నుంచి వాకౌట్ చేశారు. అనంతరం పార్లమెంట్ ముందు ధర్నా చేశారు. ‘వినేశ్‌కు న్యాయం చేయాలి’అంటూ నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ విషయంలో ప్రధాని మోదీ కేవలం ట్వీట్ చేయటం సరికాదు.. ఆమెకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్రీడలు, క్రీడాకారులను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. -
Olympics: ప్యారిస్ వెళ్లేందుకు పంజాబ్ సీఎంకు అనుమతి నిరాకరణ
ఒలింపిక్స్‌ను వీక్షించేందుకు పారిస్ వెళ్లేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించింది. ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత హాకీ జట్టుకు మద్దతుగా మాన్ ఆగస్టు 3 నుంచి 9 వరకు ఫ్రాన్స్ రాజధానిని సందర్శించాల్సి ఉంది.పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఒలింపిక్స్‌ను వీక్షించేందుకు ప్యారిస్ వెళ్లేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అనుమతి నిరాకరించింది. భద్రతా కారణాలతో అనుమతి నిరాకరించినట్లు పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందించింది.కాగా సీఎం భగవంత్ మాన్ ఆగస్టు 3 నుంచి 9 వరకు ప్యారిస్ పర్యటనకు వెళ్లాలని అనుకున్నారు. అక్కడ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత హాకీ జట్టుకు మద్దతు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు. సీఎం, తన భార్య డాక్టర్ గుర్ప్రీత్ కౌర్ మాన్, ఇద్దరు సహాయకులు, మరో అయిదుగురు భద్రతా అధికారులు, సీఎంఓ నుంచి 10 మంది సీనియర్ అధికారుల ప్యారిస్‌కు వెళ్లేందుకు అనుమతి కోరగా.. ఆలస్యంగా అనుమతి కోరడం వల్ల భద్రతా కారణాలతో తిరస్కరించినట్లు ఎమ్ఈఏ పేర్కొంది.భారత్ నుంచి ఒలింపిక్ కంటెంజెంట్లో పంజాబ్‌కు చెందిన 19 మంది ఆటగాళ్లు ఉన్నారు. హాకీ జట్టులో పది మంది క్రీడాకారులు మన రాష్ట్రానికి చెందినవారు. 52 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. అయితే ప్యారిస్ వెళ్లడానికి అనుమతి కోసం దరఖాస్తు చేయడంలో మా అధికారులు ఆలస్యం చేశారు, అయితే హాకీ జట్టు ప్రారంభ మ్యాచ్‌లను క్లియర్ చేసిన తర్వాత మాత్రమే మేము వారిని ఉత్సాహపరిచేందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాం’ అని సీఎం ఓ ప్రకటనలో తెలిపారు.అయితే తనకు అనుమతి నిరాకరించడంపై మాన్ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. దేశ సమాఖ్య విధానంపై బీజేపీ నిరంతరం దాడి చేస్తోందని విమర్శించారు. 2022లోనూ సింగపూర్ వెళ్లేందుకు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు బీజేపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు ప్రస్తావించారు. గత ఏడాది గోపాల్ రాయ్‌కి కూడా అమెరికా వెళ్లేందుకు అనుమతి నిరాకరించారని, ఆయన కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. బీజేపీ పాలనలో ప్రతిదానికీ కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందని అన్నారు. -
ఓటు వేశాక పంజాబ్ సీఎం భార్య ఏమన్నారంటే..
లోక్‌సభ ఎన్నికల చివరి దశలో పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాలకు ఈరోజు(శనివారం) పోలింగ్ జరుగుతోంది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్‌తో కలిసి సంగ్రూర్‌లో ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో పంజాబ్ సీఎం భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్ మాట్లాడుతూ సాధారణంగా మహిళల ఓటింగ్ ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. అయితే ఈసారి మహిళలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ విషయంలో కొత్త చరిత్ర సృష్టిస్తూ, నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు.పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా మీడియాతో మాట్లాడారు. పంజాబ్ ప్రజలకు ఓటు హక్కుపై పూర్తి అవగాహన ఉందని, వారు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తారని భావిస్తున్నానని అన్నారు. పంజాబీలు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చి, ఓటు హక్కు వినియోగించుకుని బాధల్లో, సంతోషాల్లో అండగా ఉండే మంచి ప్రతినిధులను ఎన్నుకోవాలని అన్నారు. అలాంటి వారు లోక్‌సభ మెట్లు ఎక్కినప్పుడే మంచి చట్టాలు కూడా వస్తాయన్నారు.పంజాబ్‌లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గతంలో 70 నుంచి 80 శాతం ఓటింగ్ నమోదైందని, ఇప్పుడు కూడా ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. గడచిన 25 రోజుల్లో తాను 122 ర్యాలీలు నిర్వహించానని, ఏ సీటునూ తేలిగ్గా తీసుకోలేదని అన్నారు. తాను అందించిన కరెంటు, నీళ్లు, ఉద్యోగాలు లాంటి సంక్షేమ పథకాల పేరుతో ఓట్లు అడిగానన్నారు. తన మీద ఎన్నికల కమిషన్‌కు ఒక్క ఫిర్యాదు కూడా అందలేదన్నారు. -
‘ఫోర్లు, సిక్స్‌లు కొట్టడంలో తనకు తానే పోటీ’.. కేజ్రీపై మాన్
కేజ్రీవాల్ రిటైర్డ్ హర్ట్ మాత్రమే సిక్స్, ఫోర్లు అదే ఉత్సాహంతో కొడతారు. కాబట్టే జూన్ 4న కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో ఆప్ భాగస్వామ్యమని, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు దాటవని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు.ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆప్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ భగవంత్ మాన్ ప్రసంగించారు. కేజ్రీవాల్ నియంతృత్వ శత్రువు. ప్రతి చోటా నేను ఇదే మాట చెప్పాను. చెబుతున్నాను. కేజ్రీవాల్ ఒక వ్యక్తి కాదు ఒక ఆలోచన. మీరు ఆ వ్యక్తిని అరెస్టు చేయొచ్చు. కానీ ఆలోచనను కాదు అని ప్రశంసల వర్షం కురపించారు. కష్ట సమయాల్లో పార్టీకి అండగా నిలిచిన ఢిల్లీ ఆప్ కార్యకర్తలకు భగవంత్ మాన్ కృతజ్ఞతలు తెలిపారు. సమయం లేదు మిత్రమా‘కేవలం 20 రోజుల సమయం మాత్రమే ఉన్నందున కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు కేవలం 20 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. 12 గంటలకు బదులుగా మాకు 18 గంటలు పని ఉంది. మొదటి మూడు రౌండ్ల సర్వేలు మోదీ 400 సీట్లు గెలవలేరని తేలింది. దర్యాప్తు సంస్థల్ని ఉసిగొల్పి ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తే ఎన్నికల్లో గెలవలేరని’ ఆయన ఆరోపించారు. ఫోర్లు, సిక్స్‌లు కొట్టడంలోక్రికెట్ పరిభాషలో క్రేజీవాల్‌ను ఉద్దేశిస్తూ ‘కేజ్రీవాల్ రిటైర్డ్ హర్ట్ మాత్రమే సిక్స్, ఫోర్లు అదే ఉత్సాహంతో కొడతారని’అన్నారు. అదే ఉత్సాహంతో పంజాబ్‌లో ఆప్ హవా కొనసాగుతుంది. బీజేపీ, కాంగ్రెస్‌లు తుడిచిపెట్టుకుపోయి. మొత్తం 13 లోక్‌సభ సీట్లు ఆప్కే దక్కుతాయని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ జోస్యం చెప్పారు. -
‘కేజ్రీవాల్ అవుట్ కాలేదు.. రిటైర్డ్ హర్ట్ అయ్యారంతే’
ఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తి కాదని.. ఆయన ఒక సిద్ధాంతమని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ అన్నారు. వ్యక్తిని అర్టెస్ చేయవచ్చు. కానీ సిద్ధాంతాన్నిఅరెస్ట్ చేయలేరని అన్నారు. ఢిల్లీలో ఆప్ నిర్వహించిన బహిరంగ సభలో భగవంత్ సింగ్ పాల్గొని మాట్లాడారు.‘‘అరవింద్ కేజ్రీవాల్ దేశంలోనే అత్యంత ప్రజాదారణ కలిగి ఉన్న నేత. ఆయన విషయంలో ఏం జరగిందో మొత్తం దేశం చూసింది. దేశంలో అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తి కాదు.. ఒక సిద్ధాంతం. వ్యక్తిని అరెస్ట్ చేయవచ్చు. కానీ సిద్ధాంతాన్ని అరెస్ట్ చేయలేరు. మే 25న బీజేపీ పని అయిపోతుంది. పంజాబ్‌లో 13 స్థానాల్లో ఆప్ గెలుస్తుంది. ఈ సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ బ్యాటింగ్ చేయడానికి పోలిటికల్ పిచ్‌కు వచ్చారు. ఆయన అవుట్ కాలేదు. కేవలం రిటైర్డ్ హర్ట్ అయ్యారు. అదే రాజకీయ క్షేత్రంలోకి మళ్లీ తిరిగి వచ్చారు’’ అని భగవంత్ సింగ్ అన్నారు.ఢిలీ మద్యం పాలసీ మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్ నిన్న(శుక్రవారం) మధ్యంతర బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. కేజ్రీవాల్‌కు జూన్ 1 వరకు సుప్రీం కోర్టు మధ్యత బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న తిరిగి తిహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. -
ఢిల్లీలో పంజాబ్ సీఎం ఎన్నికల ప్రచారం!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు కొనసాగున్నాయి. వివిధ పార్టీలు మ్యానిఫెస్టోలు విడుదల చేసి, ప్రచారాలు ముమ్మరం చేశాయి. దేశరాజధాని ఢిల్లీలో జరిగే లోక్‌సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరపున ప్రచారం చేయనున్నారు.సీఎం భగవంత్ మాన్ మే 11న తూర్పు ఢిల్లీ, దక్షిణ ఢిల్లీలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇందుకోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ఢిల్లీలో రోడ్ షో నిర్వహించారు. ఢిల్లీ సీఎం జైలుకు వెళ్లిన తర్వాత సునీతా కేజ్రీవాల్ రాజకీయాల్లో చురుకుగా మారారు.ఈసారి ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది. ఆప్ నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాయి. ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలకు మే 25న ఆరో దశలో ఓటింగ్ జరగనుండగా, జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను మే 21న ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి కేజ్రీవాల్ తీహార్ జైలులో కస్టడీలో ఉన్నారు. -
ఎంపీ టికెట్ నిరాకరణ.. ఆప్‌లో చేరిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే
పంజాబ్ కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే దల్వీందర్ సింగ్ గోల్డీ ఆమ్ ఆద్మీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.దల్వీందర్ కాంగ్రెస్ నుంచి సంగ్రూర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ అధిష్టానం దల్వీందర్ సింగ్‌కు సీటు ఇచ్చేందుకు నిరాకరించింది. ఆ స్థానానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుఖ్‌పాల్ సింగ్ ఖైరా పేరును కాంగ్రెస్ ప్రకటించింది.ఈ నేపథ్యంలో పంజాబ్ ఆప్ సీఎం భగవంత్ మాన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. దల్వీందర్ సింగ్ పార్టీ చేరికపై భగవంత్ మాన్ మాట్లాడుతూ.. నా తమ్మడు, కష్టపని చేసే యువకుడు గోల్డీని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. గోల్డీ రాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ధురీ స్థానం నుంచి భగవంత్ మాన్‌పై పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గోల్డీ పరాజయం పాలయ్యారు. ఆప్‌లో చేరిన అనంతరం పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పగించాని విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్‌కు రాసిన రాజీనామా లేఖలో గోల్డీ, రాష్ట్ర నాయకత్వం పట్ల విసుగు చెంది పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. -
మరోసారి కేజ్రీవాల్‌ను కలవనున్న పంజాబ్ సీఎం
ఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న'అరవింద్ కేజ్రీవాల్'ను ఇప్పటికే ఓ సారి కలిసిన పంజాబ్ ముఖ్యమంత్రి 'భగవంత్ మాన్' మళ్ళీ కలవనున్నట్లు ఆప్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఏప్రిల్ 30న తీహార్ జైలులో కలవనున్నట్లు సమాచారం.గతంలో ఓ సారి కేజ్రీవాల్‌ను కలిసిన తరువాత భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ను చూసి నేను ఎమోషనల్ అయ్యానని చెప్పుకొచ్చారు. ఆయన్ను ఒక హార్డ్ కోర్ క్రిమినల్ మాదిరిగా ట్రీట్ చేస్తున్నారు. అతని తప్పు ఏమిటి? అతను మొహల్లా క్లినిక్‌లు కట్టడం అతని తప్పా? అంటూ ప్రశ్నించారు.లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులు ప్రచారం కోసం వివిధ ప్రాంతాలను సందర్శించాల్సిందిగా కేజ్రీవాల్ గతంలో తనను కోరారని పంజాబ్ ముఖ్యమంత్రి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న ఆమ్ ఆద్మీ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా అవతరించనుందని ఆయన అన్నారు. ఢిల్లీ ప్రజల గురించి కేజ్రీవాల్ ఆందోళన చెందుతున్నారని, వారికి సబ్సిడీలు అందుతున్నాయా అని నిరంతరం ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు. -
పంజాబ్ సీఎం కీలక వ్యాఖ్యలు.. కేజ్రీవాల్‌ను అలా ట్రీట్ చేస్తున్నారంటూ..
ఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న'అరవింద్ కేజ్రీవాల్'ను సోమవారం పంజాబ్ ముఖ్యమంత్రి 'భగవంత్ మాన్' కలిశారు. ఆప్ ఎంపీ సందీప్ పాఠక్‌తో కలిసి వచ్చిన భగవంత్.. కేజ్రీవాల్‌తో అరగంట సేపు కలిసినట్లు పేర్కొన్నారు. కరడుగట్టిన నేరస్థులకు అందించే కనీస సౌకర్యాలను కూడా ఢిల్లీ ముఖ్యమంత్రికి అందించడంలేదని ఆయన ఆరోపించారు. భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ను చూసి నేను ఎమోషనల్ అయ్యానని చెప్పుకొచ్చారు. ఆయన్ను ఒక హార్డ్ కోర్ క్రిమినల్ మాదిరిగా ట్రీట్ చేస్తున్నారు. అతని తప్పు ఏమిటి? అతను మొహల్లా క్లినిక్‌లు కట్టడం అతని తప్పా? అంటూ ప్రశ్నించారు. ఇండియా బ్లాక్ అభ్యర్థుల ప్రచారం కోసం వివిధ ప్రాంతాలను సందర్శించాల్సిందిగా కేజ్రీవాల్ తనను కోరారని పంజాబ్ ముఖ్యమంత్రి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న ఆమ్ ఆద్మీ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా అవతరించనుందని ఆయన అన్నారు. ఢిల్లీ ప్రజల గురించి కేజ్రీవాల్ ఆందోళన చెందుతున్నారని, వారికి సబ్సిడీలు అందుతున్నాయా అని నిరంతరం ఆరా తీస్తున్నారని పాఠక్ చెప్పారు. జైలులో ఉన్నా.. ఆయన ఢిల్లీ ప్రజల గురించి ఆందోళన చెందుతున్నారు. వచ్చే వారం నుంచి సమస్యలపై చర్చించడానికి ఇద్దరు మంత్రులను పిలుస్తానని, అలాగే పార్టీ ఎమ్మెల్యేలను కూడా ప్రజల మధ్యకు వెళ్లాలని ఆయన కోరినట్లు సందీప్ పాఠక్ అన్నారు. #WATCH | Delhi: After meeting AAP convener and Delhi CM Arvind Kejriwal in Tihar Jail, Punjab CM Bhagwant Mann says, "It was very sad to see that he isn't getting the facilities which are available even to hardcore criminals. What's his fault? You're treating him as if you have… https://t.co/HA4Xu1a1lE pic.twitter.com/HkihsLbPMK — ANI (@ANI) April 15, 2024 -
ఎలాగైనా ఆ సీటు మళ్లీ గెలవాల్సిందే: సీఎం
జలంధర్: లోక్‌సభ ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆదివారం జలంధర్‌లోని స్థానిక హోటల్లో పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులతో అంతర్గత సమావేశం నిర్వహించారు. కేబినెట్ మంత్రి బల్కర్ సింగ్, నకోదర్ ఎమ్మెల్యే ఇంద్రజిత్ కౌర్, జలంధర్ సెంట్రల్ ఎమ్మెల్యే రమణ్ అరోరా, జలంధర్ లోక్‌సభ సీటు పరిధిలోని తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్ల ముగ్గురు ఇన్ఛార్జ్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ మార్చి 14న జలంధర్ అభ్యర్థిగా తమ సిట్టింగ్ ఎంపీ సుశీల్ కుమార్ రింకూను ప్రకటించింది. అయితే, రింకూ మార్చి 27న పార్టీని వీడి బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి బరిలోకి దిగారు. రింకూతో పాటు ఆప్ జలంధర్ వెస్ట్ ఎమ్మెల్యే శీతల్ అంగురాల్ కూడా రాజీనామా చేసి కాషాయ పార్టీలో చేరారు. గత ఏడాది జరిగిన జలంధర్ లోక్‌సభ ఉపఎన్నికల్లో రింకు 58,691 ఓట్ల ఆధిక్యంతో భారీ విజయాన్ని నమోదు చేశారు. ఆయన దోబా ప్రాంతంలో కీలక దళిత నాయకుడిగా ఎదిగారు. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా భావించే దళితుల ప్రాబల్యం ఉన్న జలంధర్ పార్లమెంట్ స్థానాన్ని చేజిక్కించుకోవడానికి సమిష్టి కృషి చేయాలని సీఎం భగవంత్ మాన్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు. "జలంధర్ లోక్‌సభ స్థానంపై దృష్టి అంతా ఉంది. పార్టీ ఎలాగైనా ఈ సీటును మళ్లీ గెలవాలనుకుంటోంది" అని సీఎం మాన్ పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. -
మూడో బిడ్డకు తండ్రైన పంజాబ్ సీఎం.. కుమార్తె ఫోటో షేర్ చేసిన భగవంత్ మాన్
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ భార్య.. డాక్టర్ ''గురుప్రీత్ కౌర్'' గురువారం మొహాలీలోని ప్రైవేట్ ఆసుపత్రిలో పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని భగవంత్ స్వయంగా తన ఎక్స్ (ట్విటర్) ఖాతా ద్వారా వెల్లడించారు. దేవుడు ఒక కుమార్తెను బహుమతిగా ఇచ్చాడు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు అంటూ.. బిడ్డ ఫోటో కూడా షేర్ చేశారు. లూథియానాలోని ఫోర్టిస్ ఆసుపత్రిలో గురుప్రీత్‌కు ప్రసవం జరిగినట్లు తెలిసింది. ఈ వార్త తెలుసుకున్న నెటిజన్లు, అభిమానులు భగవంత్ మాన్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. పంజాబ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో పదవిలో ఉన్నప్పుడు తండ్రి అయిన మొదటి వ్యక్తి భగవంత్ సింగ్ మాన్. ఈయన 2022 జులైలో గురుప్రీత్‌ను రెండో వివాహం చేసుకున్నారు. అంతకు ముందు ఇంద్రప్రీత్ కౌర్ అనే మహిళను పెళ్లి చేసుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల 2015లో విడిపోయారు. భగవంత్ సింగ్ మాన్, ఇంద్రప్రీత్ కౌర్ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ఇప్పుడు రెండో భార్య పాపకు జన్మనివ్వడంతో మూడోసారి తండ్రయ్యారు. జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకల్లో భగవంత్ మాన్ తన భార్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ప్రకటించారు. ఇప్పుడు తన కుమార్తె ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. Blessed with baby Girl.. pic.twitter.com/adzmlIxEbb — Bhagwant Mann (@BhagwantMann) March 28, 2024 -
సీఎం భగవంత్ మాన్ వీడియో వైరల్.. ప్రతిపక్షాల విమర్శలు
లోక్‌సభ ఎన్నికల వేళ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చేస్తున్న పనులకు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శల పాలవుతున్నారు. ఒకవైపు పంజాబ్‌లోని సంగ్రూర్ లోక్‌సభ నియోజవర్గంలో కల్తీ మద్యం బారినపడిన మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు.. గతంలో ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి, ప్రస్తుతం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్.. బాలీవుడ్ సింగర్ సుఖ్విందర్ సింగ్, పాటల రచయిత బబ్బు మాన్‌తో కారులో ప్రయాణిస్తూ పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. While Rome was burning Nero was playing flute ! Following in the foot steps of Nero, Bhagwant Mann ji is singing tappas while people in own constituency Sangrur are dying of illicit liquor. ਜਦੋਂ ਰੋਮ ਸੜ ਰਿਹਾ ਸੀ ਤਾਂ ਨੀਰੋ ਬੰਸਰੀ ਵਜਾ ਰਿਹਾ ਸੀ! ਨੀਰੋ ਦੇ ਨਕਸ਼ੇ-ਕਦਮਾਂ 'ਤੇ ਚੱਲ ਕੇ ਭਗਵੰਤ… pic.twitter.com/uAVvzz9Ybf — Sunil Jakhar(Modi Ka Parivar) (@sunilkjakhar) March 21, 2024 ‘రోమ్ తగలబడుతుంటే.. నీరో చక్రవర్తి ప్లూట్ వాయించినట్ల ఉంది భగవంత్ మాన్ వ్యవహారం. ఒకవైపు కల్తీ మద్యంతో ప్రజలు మరణిస్తుంటే.. భగవంత్ మాన్ పాటలు పాడుతున్నారు’అని పంజాబ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ తీవ్ర విమర్శలు చేశారు. భగవంత్ మాన్కు సంబంధించిన వీడియోను సునీల్ జాఖర్ తన ఎక్స్( ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్నా శాంతి భద్రతల పరిస్థితుల విషయంపై కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా మండిపడ్డారు. ‘దిర్బా అసెంబ్లీ నియోజకవర్గంలో ఎనిమిది మంది కల్తీ మద్యం బారినపడి మరణించారు. ఈ నియోజకవర్గానికి పంజాబ్ ఎక్సైస్ మంత్రి పాతినిధ్యం వహిస్తున్నారు. దిర్బా.. సంగ్రూర్ లోక్‌సభ పరిధితో వస్తుంది. అది సీఎం భగవంత్ మాన్ సొంత జిల్లా. ఆప్ ప్రభుత్వం కనీసం బాధ్యత వహించపోవటం దారణం’అని ప్రతాప్ సింగ్ విమర్శలు చేశారు. ఇక.. ఇటీవల చోటు చేసుకున్న కల్తీ మద్యం మరణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. చదవండి: Punjab CM: ఎన్నికల వేడి.. హోటల్లో రోజంతా సీఎం రిలాక్స్! -
ఎన్నికల వేడి.. హోటల్లో రోజంతా సీఎం రిలాక్స్!
దేశమంతా సార్వత్రిక ఎన్నికల వేడి మొదలైపోయింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనుండగా తొలి దశ పోలింగ్‌కు అప్పుడే నోటిఫికేషన్ కూడా జారీ చేసింది ఎన్నికల సంఘం. అయితే పంజాబ్‌లో లోక్‌సభ ఎన్నికలకు ఇంకా 72 రోజులు ఉన్న క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జలంధర్‌లోని ఒక హోటల్లో రోజంతా గడిపినట్లు తెలిసింది. ‘ది ట్రిబ్యూన్’ కథనం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు హోటల్ రాడిసన్‌కు వచ్చిన సీఎం దాదాపు 24 గంటల తర్వాత బుధవారం వెళ్లిపోయారు. జలంధర్ ఎంపీ సుశీల్ రింకూను ఆయన మంగళవారం కలిశారు. ఇక బుధవారం ఆయన ఎంపీ బల్బీర్ ఎస్ సీచెవాల్, స్థానిక సంస్థల మంత్రి బల్కర్ సింగ్‌ను మాత్రమే కలిశారు. అది కూడా మధ్యాహ్నం 2 గంటల సమయంలో. ఆ తర్వాత ఆయన వెంటనే వెళ్లిపోయారు. “సీఎం విశ్రాంతి మోడ్‌లో ఉన్నారని, ఎన్నికల వాతావరణం వేడెక్కడానికి ముందు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ సీనియర్ నాయకులతో సమావేశానికి, మా అభిప్రాయాన్ని తీసుకోవడానికి, ఎన్నికల వ్యూహానికి సంబంధించి సూచనలు ఇవ్వడానికి ఆయన ఒక గంట లేదా రెండు గంటలు కేటాయించి ఉంటారు” అని సీనియర్ నాయకుడొకరు చెప్పినట్లుగా కథనంలో పేర్కన్నారు. -
Lok Sabha polls 2024: ఇండియా కూటమికి బీటలు
కోల్‌కతా/చండీగఢ్: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మోదీ సారథ్యంలోని అధికార బీజేపీ కూటమికి గట్టి పోటీ ఇవ్వాలన్న విపక్షాల ప్రయత్నాలకు ఆదిలోని హంసపాదు! కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష ‘ఇండియా’ కూటమికి భాగస్వామ్య పారీ్టలు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం రెండు భారీ షాకులిచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో పశి్చమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించింది. పంజాబ్‌లోనూ తమది ఒంటరి పోరేనని ఆప్ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర బెంగాల్లోకి ప్రవేశించడానికి ఒక రోజు ముందు జరిగిన ఈ పరిణామంతో ఆ పార్టీ ఒక్కసారిగా కంగుతిన్నది. వెంటనే నష్ట నివారణ చర్యలకు రంగంలోకి దిగింది. మమత లేని విపక్ష కూటమిని ఊహించలేమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. తృణమూల్‌తో పొత్తు చర్చలింకా సాగుతున్నాయని, బెంగాల్లో కలిసే పోటీ చేస్తామని ఆశాభావం వెలిబుచ్చారు. కానీ ఆ వ్యాఖ్యలను మమత నిర్ద్వంద్వంగా ఖండించారు. పొత్తుపై కాంగ్రెస్‌తో ఎలాంటి చర్చలూ జరగడం లేదని స్పష్టం చేశారు. ఈలోపే, సీట్ల కోసం తృణమూల్‌ను వేడుకోబోమంటూ కాంగ్రెస్ అగ్ర నేత, బెంగాల్ పీసీసీ చీఫ్ అధీర్ రంజన్ చౌధరి చేసిన వ్యాఖ్యలు మరింతగా మంటలు రేపాయి. 28 విపక్ష పార్టీలతో కూడిన ఇండియా కూటమికి కీలక సమయంలో బీటలు పడుతుండటం కాంగ్రెస్‌ను కుంగదీసే పరిణామమేనని అంటున్నారు. బెంగాల్లో కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తూ ఉండబోదని మీడియాతో మమత కుండబద్దలు కొట్టారు. ఆ పార్టీ మొండి వైఖరి వల్లే ఒంటరి పోరు నిర్ణయం తీసుకోవాల్సి వచి్చందని స్పష్టం చేశారు. సీట్లు సర్దుబాటుపై తన ప్రతిపాదనలను కాంగ్రెస్ పరిశీలించను కూడా లేదని ఆమె ఆరోపించారు. అంతేగాక బెంగాల్లో క్షేత్రస్థాయి వాస్తవాలను పరిగనణలోకి తీసుకోకుండా కాంగ్రెస్ ఆచరణసాధ్యం కాని డిమాండ్లు తమ ముందుంచినట్టు తృణమూల్ వర్గాలు మండిపడ్డాయి. ఆది నుంచీ అంతంతే... విపక్ష ఇండియా కూటమికి మమత దూరంగానే మెలుగుతూ వస్తున్నారు. ఇటీవలి వర్చువల్ భేటీకి కూడా డుమ్మా కొట్టారు. బెంగాల్లో ఆగర్భ శత్రువులైన తృణమూల్, లెఫ్ట్ ఫ్రంట్ రెండూ ఇండియా కూటమి భాగస్వాములే. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 42 స్థానాలకు గాను తృణమూల్ 22 సీట్లు నెగ్గగా బీజేపీ ఏకంగా 18 స్థానాలు సొంతం చేసుకుంది. కాంగ్రెస్ కేవలం 2 సీట్లతో సరిపెట్టుకుంది. ఈసారి పొత్తులో భాగంగా అవే రెండు సీట్లు కాంగ్రెస్‌కు ఇస్తామని మమత ప్రతిపాదించడంతో కాంగ్రెస్ అవాక్కైనట్టు చెబుతున్నారు. అన్ని తక్కువ స్థానాలతో సరిపెట్టుకునేందుకు ససేమిరా అనడంతో చిర్రెత్తుకొచి్చన దీదీ మొత్తానికే అడ్డం తిరిగారని సమాచారం. పొత్తులో భాగంగా లెఫ్ట్ ఫ్రంట్‌కు కూడా కొన్ని సీట్లు వదులుకోవాల్సి రావడం కూడా ఆమెకు రుచించలేదని తృణమూల్ వర్గాలు వివరించాయి. బెంగాల్లో 2001, 2011 అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2009 లోక్‌సభ ఎన్నికల్లో కూడా తృణమూల్, కాంగ్రెస్ జట్టుగా పోటీ చేశాయి. పంజాబ్‌లో ఒంటరి పోరే సీఎం భగవంత్ మాన్ వెల్లడి పంజాబ్‌లో మొత్తం 13 సీట్లలోనూ ఆప్ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తుండబోదని స్పష్టం చేశారు. నిజానికి లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ, పంజాబ్, హరియాణా, గోవా, గుజరాత్‌ల్లో పొత్తు దిశగా కాంగ్రెస్, ఆప్ మధ్య చర్చలింకా జరుగుతూనే ఉన్నాయి. పైగా త్వరలో జరగనున్న చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాన్ ప్రకటన కాంగ్రెస్‌లో కలకలం రేపింది. ఆ పార్టీతో పొత్తు ప్రతిపాదనను పంజాబ్ ఆప్ నేతలంతా వ్యతిరేకిస్తున్నారని మాన్ మీడియకు స్పష్టం చేశారు. మొత్తం 13 లోక్‌సభ స్థానాలకూ ఆప్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఇప్పటికే చురుగ్గా సాగుతోందని తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో 13 స్థానాలకు గాను కాంగ్రెస్ 8 నెగ్గింది. అకాలీదళ్, బీజేపీ చెరో రెండు, ఆప్ ఒక స్థానంలో గెలిచాయి. కూటమిపై ఎవరికీ పెత్తనముండదు మమత నర్మగర్భ వ్యాఖ్యలు బెంగాల్లో పొత్తు లేకపోయినా జాతీయ స్థాయిలో మాత్రం విపక్ష ఇండియా కూటమికి తృణమూల్ కట్టుబడి ఉంటుందని మమత ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం విశేషం. ‘‘కావాలంటే కాంగ్రెస్‌ను దేశవ్యాప్తంగా 300 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయమనండి. మిగతా 243 స్థానాల్లో ప్రాంతీయ పారీ్టలు బరిలో దిగుతాయి. కానీ బెంగాల్లో మాత్రం కాంగ్రెస్ వేలు పెడతానంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు’’ అంటూ ఆమె కుండబద్దలు కొట్టారు. జాతీయ స్థాయిలో విపక్షాల వ్యూహం ఎలా ఉండాలో కూడా లోక్‌సభ ఎన్నికల తర్వాతే నిర్ణయించుకుంటామని చెప్పుకొచ్చారు. ‘‘బీజేపీని సమష్టిగా ఎదుర్కొనే విషయంలో ప్రాంతీయ పారీ్టలన్నీ ఒక్కతాటిపై ఉంటాయి. దాన్ని ఓడించేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలూ చేస్తాం’’ అని స్పష్టం చేశారు. అయితే, విపక్ష కూటమి ఏ ఒక్క పారీ్టకో చెందబోదంటూ కాంగ్రెస్‌పై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ యాత్ర శుక్రవారం బెంగాల్లోకి ప్రవేశించనున్నా కనీసం మర్యాద కోసమన్నా దానిపై కాంగ్రెస్ తనకు సమాచారం కూడా ఇవ్వలేదని దీదీ ఆరోపించారు. మమత ప్రకటన బహుశా ఇండియా కూటమి వ్యూహంలో భాగమై ఉండొచ్చని మరో భాగస్వామ్య పార్టీ ఎన్సీపీ (శరద్ పవార్) అభిప్రాయపడింది! -
ఇండియా కూటమికి డబుల్ షాక్!
చంఢీగర్: ఇండియా కూటమికి డబుల్ షాక్ తగిలింది. పంజాబ్‌లో లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ సొంతంగానే పోటీ చేస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు. రాష్ట్రంలో తమకు కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తు లేదని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండబోదని సీఎం మమతా బెనర్జీ చెప్పిన కొన్ని గంటల తర్వాత భగవంత్ మాన్ కూడా పొత్తుపై స్పష్టతనిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోరాడాలని ఆప్ పంజాబ్ వర్గం చేసిన ప్రతిపాదనకు కేజ్రీవాల్ ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు ఇప్పటికే తెలిపాయి. రాష్ట్రంలో మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: ఒంటరిగానే పోటీ.. ఇండియా కూటమికి సీఎం మమత షాక్ ప్రతిపక్ష ఇండియా కూటమికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భారీ షాక్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో బెంగాల్ నుంచి తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధాలు లేవని.. ఆ పార్టీతో తాము పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారామె. ఇండియా కూటమిలో భాగంగా.. కాంగ్రెస్‌తో జరిపిన సీట్ల పంపకం చర్చలు విఫలమయ్యాయని ఆమె తెలిపారు. ‘మేము వారికి ఏ ప్రతిపాదన ఇచ్చినా, వారు అన్నింటినీ తిరస్కరించారు. ఇక మాకు కాంగ్రెస్‌తో ఎలాంటి సంబంధాలు లేవు... బెంగాల్లో ఒంటరిగానే పోరాడతాం. ఎన్నికల తర్వాత అఖిల భారత స్థాయిలో నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. ఇదీ చదవండి: అస్సాం ఉద్రిక్తతల వేళ.. మళ్లీ సంచలన ఆరోపణలకు దిగిన రాహుల్ గాంధీ -
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ మరోసారి బెదిరింపులు
ఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను ఈ రిపబ్లిక్ డే రోజు హత్య చేస్తానని బెదిరింపులు చేశాడు. జనవరి 26న భగవంత్ మాన్‌పై గ్యాంగ్స్టర్లు ఏకమై దాడికి దిగాలని పన్నూ కోరారు. గ్యాంగ్స్టర్లపై రాష్ట్ర పోలీసు యంత్రాంగం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నదని పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తెలిపారు. పన్నూ బెదిరింపులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సిక్కు ఫర్ జస్టిస్ (SFJ) వ్యవస్థాపకుడు పన్నూ గతంలో భారతీయ సంస్థలు, అధికారులపై అనేకమార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. గత నెల, డిసెంబర్ 13న భారత పార్లమెంటుపై దాడి చేస్తానని వీడియోను విడుదల చేశాడు. అదే క్రమంలో పార్లమెంట్‌పై డిసెంబర్ 13న ఆగంతకులు కలర్ బాంబు షెల్స్‌తో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూ మరొక బెదిరింపు వీడియో ఇటీవల బయటపడింది. నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో వెళ్లాలనుకుంటున్న ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని బెదిరింపులు చేశాడు. ఎయిరిండియా బెదిరింపు వీడియోపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పన్నూపై కేసు నమోదు చేసింది. ఇదీ చదవండి: కృష్ణ జన్మభూమి కేసు: మసీదు సర్వేపై సుప్రీంకోర్టు స్టే -
తీహార్ జైళ్లో పుట్టిన పార్టీ ఆప్: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కొనసాగడం సందిగ్ధంలో పడింది. కాంగ్రెస్,ఆప్ నేతలు పరస్పరం చేసుకుంటున్న విమర్శలు రెండు పార్టీల మధ్య దూరం పెంచుతున్నాయి. కాంగ్రెస్ అనేది ఒక చరిత్రగా మారిందని పంజాబ్ సీఎం, ఆప్ అగ్రనేత భగవంత్‌మాన్ తాజాగా చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘ఆమ్ ఆద్మీ పార్టీ తీహార్ జైలులో పుట్టింది. ఆ పార్టీకి చెందిన సగం మంది నేతలు ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ఆప్ నమ్మదగిన పార్టీ కాదు. ఆ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు పొత్తు రాజకీయాలు అర్థం కావు. ఆప్ ఇండియా కూటమిలో ఉందో లేదో వాళ్లకే తెలియాలి. కూటమిలో ఉండాలంటే ఆప్ ఇతర పార్టీలతో కలిసి పని చేయాల్సి ఉంటుంది’అని కాంగ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్ అన్నారు. కాంగ్రెస్‌ను ఉద్దేశించి పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ సోమవారం ఘాటు విమర్శలు చేశారు. ఢిల్లీ, పంజాబ్‌లలో ఆ పార్టీ గురించి తల్లులు పిల్లలకు కథలు కథలుగా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు కాంగ్రెస్ అనే పార్టీ ఉండేదని పిల్లలకు కథ చెప్పొచ్చని ఎద్దేవా చేశారు. దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్, ఆప్‌పై విరుచుకుపడుతోంది. ఇదీచదవండి..కేరళ గవర్నర్‌పై బృందాకారత్ సంచలన వ్యాఖ్యలు -
సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారు.. బీజేపీ నేత ఫైర్
బీజేపీ చెత్త రాజకీయలు చేస్తోందన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విమర్శలపై ఢిల్లీ బీజేపీ నేత మన్జిందర్ సింగ్ సిర్సా మండిపడ్డారు. ‘రిపబ్లిక్ డే’ సందర్భంగా రాష్ట్రాలకు సంబంధించి ప్రదర్శించే ఘాటాల వ్యవహారంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారని మన్జిందర్ అన్నారు. ఇటీవల ఇదే విషయంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. కేంద్ర బీజేపీ ప్రభుత్వం రిపబ్లిక్ డే ఘాటాల విషయంలో పంజాబ్‌పై తీవ్రమైన వివక్ష చూపుతోందని మండిపడ్డ విషయం తెలిసిందే. అయితే తాజాగా ఢిల్లీ బీజేపీ నేత మన్జిందర్ స్పందించి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. పంజాబ్ రాష్ట్ర ఘాటాన్ని తిరస్కరించడానికి అసలైన నిజం మరోటి ఉందని తెలిపారు. పంజాబ్ రూపొందించే ఘాటంపై మై భాగో జీ, అమరవీరుల ఫొటోలకు బదులుగా.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఫొటోలు ఉన్నాయని అన్నారు. భగవంత్ మాన్ సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. అందుకే పంజాబ్ ఘాటం తిరస్కరణకు గురైందని తెలిపారు. భగవంత్ మాన్.. పంజాబ్ సార్వభౌమత్వాన్ని కేజ్రీవాల్ కాళ్ల వద్ద వదిలేశారని తీవ్రంగా దుయ్యబట్టారు. The real reason for rejection of Punjab Tableau is that it prominently showed pics of Arvind Kejriwal & Bhagwant Mann rather than Mai Bhago Ji or martyrs! Mann Sahab is shamelessly lying; and worst is he has surrendered Punjab’s sovereignty in the feet of Kejriwal. Tussi Ta… pic.twitter.com/qF81TUHOyC — Manjinder Singh Sirsa (@mssirsa) December 29, 2023 ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల సంబంధించిన ఘాటాలను ‘రిపబ్లిక్ డే’ ఉత్సవాలకు పంజాబ్ ఘాటం ఎంపిక చేయకుండా బీజేపీ చెత్త రాజకీయాలు చేస్తోందని ఆప్ నేత ప్రియాంఖ్ కక్కర్ శుక్రవారం విమర్శలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, అస్సాం, ఉత్తర్ఖండ్లకు చెందిన ఘాటాను వరుసగా ఎంపిక చేస్తోందని.. ఢిల్లీ, పంజాబ్‌లను మాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కకు తప్పించిందని మండిపడ్డారు. చదవండి: క్షమాపణ చెప్పిన అస్సాం సీఎం.. శ్లోకంపై క్లారిటీ.. -
మనీలాండరింగ్ కేసులో పంజాబ్ ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్..
చండీగఢ్: పంజాబ్ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే జశ్వంత్ సింగ్ గజ్జన్ మజ్రాను కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. మలేర్కోట్లా జిల్లాలోని అమర్‌గఢ్‌లో సోమవారం ఉదయం ఓ బహిరంగ సభలో ఎమ్మెల్యే ప్రసంగిస్తుండగా.. అక్కడకు వచ్చిన ఈడీ అధికారులు ఆయనను అదుపులోకీ తీసుకున్నారు. గతేడాది నమోదైన రూ. 40 కోట్ల బ్యాంక్ మోసం కేసులో ఈడీ ఈ చర్యకు పాల్పడింది. ఈ కేసులో పంజాబ్ శాసనసభ్యుడికి ఈడీ ఇప్పటి వరకు మూడు సార్లు నోటీసులు జారీ చేసింది. అయితే వీటిని జశ్వంత్ సింగ్ పట్టించుకోకపోవడంతో అతడిని అదుపులోకి తీసుకుంది. ఈ సాయంత్రం ఎమ్మెల్యేను మొహాలీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. అసలేం జరిగిందంటే.. పంజాబ్ లూదియానాలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ గతేడాది తారా కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీతోపాటు జశ్వంత్ సింగ్, మరికొందరిపై సీబీఐకి ఫిర్యాదు చేసింది. వీరంతా తమ బ్యాంకును రూ.41కోట్ల మేర మోసం చేసినట్లు ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ గతేడాది సెప్టెంబరులో.. జశ్వంత్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన పలుచోట్ల సోదాలు జరిపింది. ఈ తనిఖీల్లో లెక్కల్లో తేలని రూ.16.57లక్షల నగదు, విదేశీ కరెన్సీ, బ్యాంకు, ఆస్తి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఈ సోదాల ఆధారంగా ఈడీ కూడా మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతోంది. ఎమ్మెల్యే అరెస్టును తీవ్రంగా ఖండించిన ఆప్.. తమను దెబ్బతీయాలని బీజేపీ కుట్ర పన్నుతోందని విమర్శలు గుప్పించింది. జశ్వందర్ సింగ్ ఆప్‌లో చేరే ముందు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఇది తమ పరువు తీసేందుకు బీజేపీ పన్నిన పన్నాగమని ఆప్ అధికార ప్రతినిధి మల్విందర్ కాంగ్ ఆరోపించారు. బహిరంగ సభలో నుంచి ఎమ్మెల్యేను తీసుకెళ్లిన విధానం చూస్తుంటే ఆప్‌ను కించపరిచేందుకు బీజేపీ బలమైన వ్యూహాలను అనుసరిస్తుందనే విషయం అర్థమవుతుందని మండిపడ్డారు. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సహా పలువురు ప్రతిపక్ష పార్టీ నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలు చేపట్టాయి. మహాదేవ్ బెట్టింగ్ యాప్ యజమాని నుంచి రూ. 508 కోట్లు లంచంగా తీసుకున్న ఆరోపణలపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌ను కూడా ఈడీ విచారిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. నవంబర్ 2న తమ ఎదుట హాజరు కావాలని కోరగా.. ఇందుకు ఢిల్లీ సీఎం నిరాకరించారు. ఇక ఇటీవల డ్రగ్స్ సంబంధిత మనీలాండరింగ్ విచారణలో భాగంగా మరో ఆప్ ఎమ్మెల్యే కుల్వంత్ సింగ్‌కు చెందిన పలు చోట్ల ఈడీ సోదాలు జరిపింది. చదవండి: బిల్లుల ఆమోదంలో జాప్యం.. గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు -
సీఎం మాన్కు గవర్నర్ ఘాటు లేఖ.. ఆప్ సీరియస్
చండీగఢ్: ఆప్ సర్కార్ అధికారంలో ఉన్న పంజాబ్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. పంజాబ్‌లో గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్, సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం మధ్య విభేదాలు పీక్ స్టేజ్‌కు చేరుకొన్నాయి. తాను పంపిన లేఖలకు సీఎం భగవంత్ మాన్ సమాధానం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన గవర్నర్.. రాష్ట్రపతి పాలన పెట్టిస్తానని, ఈ మేరకు రాష్ట్రపతికి సిఫార్సులు చేస్తానని హెచ్చరించారు. దీంతో, ఈ వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. వివరాల ప్రకారం.. సీఎం భగవంత్ మాన్కు పంజాబ్ గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ తాజాగా లేఖ రాశారు. ఈ లేఖలో సీఎం మాన్‌ను గవర్నర్ హెచ్చరించారు. తన లేఖలకు సమాధానం ఇవ్వకుంటే ఐపీసీలోని సెక్షన్ 124 కింద క్రిమినల్ చర్యలు కూడా తీసుకొంటానని లేఖలో వార్నింగ్ ఇచ్చారు. ఈ లేఖను శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. తాను గతంలో రాసిన లేఖలకు మీరు(సీఎం మాన్) సమాధానం ఇవ్వకపోవడం పట్ల చాలా కలత చెందానని గవర్నర్ తన తాజా లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 కింద రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని పేర్కొంటూ రాష్ట్రపతికి నివేదిక పంపిస్తానని హెచ్చరించారు. పొలిటికల్ హీట్.. అంతేకాకుండా.. శిక్షణ నిమిత్తం 36 మంది పాఠశాలల ప్రిన్సిపాల్స్‌ను విదేశాలకు పంపడంతో పాటు పలు ఇతర అంశాలపై తాను గతంలో రాసిన లేఖ ద్వారా సమాచారం కోరానని, అదేవిధంగా రాష్ట్రంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం సమస్యను నివారించేందుకు తీసుకొన్న చర్యలపై వివరాలు కోరానని గవర్నర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉద్దేశపూర్వకంగా సమాధానం నిరాకరిస్తున్నట్టు కనిపిస్తున్నదని పేర్కొన్నారు. దీంతో, ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. గత కొన్నేండ్లుగా బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంచాయితీలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. గవర్నర్ పురోహిత్ లేఖపై ఆప్ ఘాటుగా స్పందించింది. గవర్నర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. పంజాబ్‌కు బదులు మణిపూర్, హర్యానాలో రాష్ట్రపతి పాలన విధిస్తే బాగుంటుందని కౌంటర్ ఇచ్చింది. ఈ రెండు రాష్ట్రాలు అల్లర్లతో అట్టుడుకుతున్నాయి.. వీలైతే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని సూచించింది. ఇది కూడా చదవండి: రైలు బోగీలో పేలిన సిలిండర్.. పలువురు మృతి -
పంజాబ్ సర్కార్ కీలక ముందడుగు.. ఇక ఉచితంగా గుర్బానీ ప్రసారాలు
అమృత్‌సర్‌లోని శ్రీ హర్మందిర్ సాహిబ్ (స్వర్ణ దేవాలయం) నుంచి గుర్బానీని ఉచితంగా ప్రసారం చేసేలా ‘సిక్కు గురుద్వారాస్ (సవరణ) బిల్లు 2023’ను పంజాబ్ అసెంబ్లీ ఆమోదించింది. రాజకీయంగా వివాదాల నడుమ ఈ బిల్లుకు అసెంబ్లీలో మంగళవారం ఆమోద ముద్ర పడింది. సెక్షన్ 125ఏ సవరణ ద్వారా ఇక నుంచి గుర్బానీ ప్రసారాలు ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. బిల్లు ప్రవేశ పెట్టిన తర్వాత అసెంబ్లీలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ.. గుర్బానీ ప్రసారాన్ని అందరికీ ఉచితంగా అందించడమే ఈ బిల్లు లక్ష్యమని, దీనికి టెండర్ అవసరం లేదని తెలిపారు. ఇకపై గుర్భానీని ప్రసారాలను ప్రతి ఒక్కరు తమకు నచ్చిన ఛానల్ నుంచి అయినా ఉచితంగా వినవచ్చు, చూడవచ్చని సీఎం పేర్కొన్నారు. బాదల్ కుటుంబంపై విమర్శలు గుప్పిస్తూ తను సొంతంగా ఎలాంటి ఛానల్ నిర్వహించడం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘నా ఛానల్‌కు టెలికాస్ట్ హక్కులు ఇవ్వాలని నేను అడగడం లేదు. అలాంటప్పుడు బాదల్‌కు ఎందుకు సమస్య’ అని ప్రశ్నించారు. ఇకపై గుర్బానీ ప్రసారాలు ఉచితంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు. చదవండి: కేదార్నాథ్: ఆలయ గర్భగుడిలో అపచారం.. కరెన్సీ నోట్లు వెదజల్లి.. కాగా, గుర్బానీ అనేది సిక్కుల పవిత్ర శ్లోకం. సిక్కు గురువులు, రైటర్లు కంపోజ్ చేసిన పవిత్ర కీర్తనలను గుర్బానీ అంటారు. స్వర్ణదేవాలయంలో పఠించే ఈ శ్లోకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు భక్తిశ్రద్ధలతో ఆలకిస్తారు. ఈ శ్లోకం ప్రసార హక్కులు ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఛానల్ దగ్గర మాత్రమే ఉన్నాయి. 2007 నుంచి రాజకీయంగా శక్తివంతమైన శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన ప్రైవేట్ చానల్ పీటీసీ ప్రసారం చేస్తోంది. ఈ మేరకు శిరోమణి గురుద్వారా పర్భంధక్ కమిటీకి ప్రతి ఏడాది రూ. 2 కోట్లు చెల్లిస్తుంది. అయితే ఈ ప్రసార హక్కులను ఒక ఛానల్‌కే పరిమితం చేయకుండా అందరికీ అందుబాటులో ఉండేలా ఉచితంగా ప్రసారం చేయాలని పంజాబ్ సర్కారు నిర్ణయించింది. ఇందుకు బ్రిటిష్‌కాలంనాటి సిక్కు గురుద్వారాస్ చట్టం 1925 సవరణ ప్రతిపాదనలకు పంజాబ్ రాష్ట్ర మంత్రి మండలి సోమవారమే ఆమోదముద్ర వేసింది. ఈ చట్టాన్ని సవరించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సామర్థ్యం ఉందని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అన్నారు. హర్యానాకు ప్రత్యేక గురుద్వారా కమిటీ అంశంపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చిందని, ఇది రాష్ట్ర పరిధిలోనిదని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) మండిపడుతోంది. 1925 చట్టాన్ని పార్లమెంట్ చేసిందని దీనికి సవరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని విమర్శిస్తోంది. మరోవైపు పీటీసీ ప్రైవేట్ చానెల్‌కు అధిపతి అయిన శిరోమణి అకాళీదళ్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకే సర్కార్ ఈ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది . -
నా లివర్ ఇనుముతో తయారుకాలేదు..
న్యూఢిల్లీ: ప్రఖ్యాత టెలివిజన్ షో ఆప్ కీ అదాలత్ కార్యక్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ ను మీరు గత 10-12 సంవత్సరాలుగా రాత్రి పగలు తేడా లేకుండా బాగా మద్యం సేవిస్తుంటారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. నిజమేనా? అని ప్రశ్నించగా పంజాబ్ ముఖ్యమంత్రి.. నా లివర్ ఇనుముతో తయారైందనుకున్నారా ఏంటని చమత్కరించారు సీఎం. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ పెద్ద తాగుబోతు అని ప్రతిపక్షాలు గత కొన్నేళ్లుగా విమర్శిస్తూ ఉన్నాయి. కానీ ఆ విషయాన్ని ఆయనెప్పుడూ సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఇటీవల ఆప్ కీ అదాలత్ టీవీ కార్యక్రమానికి అతిధిగా హాజరైన ఆయనను ఇదే విషయం గురించి ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ.. నా లివర్ ఇనుముతో తయారయ్యిందనుకున్నారా? ఏంటి? 10-12 ఏళ్లపాటు పగలు రాత్రి తేడా లేకుండా మద్యం తాగుతూ కూర్చుంటే అసలు బ్రతికేవాడినా? ప్రతిపక్షాలకు నా గురించి మాట్లాడటానికి ఏమీ లేనప్పుడు ఇలాంటి చెత్త విమర్శలే చేస్తుంటారన్నారు సీఎం. నేను పొద్దున్న లేస్తూనే మొదటి ఫైల్ తెప్పించుకుని దాని గురించే ఆలోచిస్తాను. ఇలా పనిచేసే పంజాబ్‌లో గత 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఏడాదిన్నరలోనే చేసి చూపించా. చిత్తశుద్ధితో పని చేశాను కాబట్టే ఈరోజు 88% ఇళ్లలో విద్యుత్తు ఇవ్వగలిగాము. 2019లో జరిగిన ఒక పబ్లిక్ ర్యాలీలో భగవంత్ మన్ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, తన తల్లి సమక్షంలో మద్యం మానేస్తున్నట్టు బాహాటంగానే మాటిచ్చారు. ఆయన ఆ అలవాటు మానుకున్నా కూడా ఆయనకు ఆ ట్యాగ్ మాత్రం అలా ఉండిపోయింది. ప్రతిపక్షాలు విమర్శించడానికి ఈ కారణమే ఇప్పుడు అదనుగా మారింది. मेरा Liver क्या लोहे का है जो 10–12 साल से सुबह शाम पी रहा हूं, फिर भी जिंदा हूं? जितना काम 75 साल में नहीं हुआ, पिछले सवा साल में किया है 88% घरों में मुफ़्त बिजली जाती है Punjab में! इतना कोयला कभी नहीं था जितना आज है। नीयत होनी चाहिए काम करने की। —CM @BhagwantMann… pic.twitter.com/u9YcIxgHk4 — AAP (@AamAadmiParty) June 18, 2023 ఇది కూడా చదవండి: "మన్ కీ బాత్"లో "మణిపూర్ కీ బాత్" లేదా? -
బీజేపీపై పోరులో మాది ప్రత్యేక శైలి!
సాక్షి, హైదరాబాద్: నూతన పార్లమెంటు భవన ప్రారంభ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్టు కాంగ్రెస్, ఆప్ సహా 19 పార్టీలు చేసిన సంయుక్త ప్రకటనపై తాము సంతకం చేయకున్నా.. కార్యక్రమానికి తాము కూడా దూరంగా ఉంటామని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేర్కొంది. బీజేపీ అనుసరిస్తున్న ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు తమదైన శైలిలో పనిచేస్తామని స్పష్టం చేసింది. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలను కుదించేలా కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించాలని కోరుతూ ఆప్ అధినేత, ఆ రాష్ట్ర సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో భేటీ అయ్యారు. పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్ మాన్, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు తదితరులు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీపై కేంద్ర ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించడం మొదలు జాతీయ రాజకీయాలు, బీజేపీ, ప్రధాని మోదీ విధానాలపై కేసీఆర్, కేజ్రీవాల్ మధ్య చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర నేతలు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలతో జరిగిన చర్చల సారాంశాన్ని కేసీఆర్‌కు కేజ్రివాల్ వివరించినట్టు తెలిసింది. విపక్షాల ఐక్యతకు విశాల ఎజెండా విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ కార్యకలాపాలను విస్తరిస్తూనే, భావసారూప్య పార్టీ లను కలుపుకొని ముందుకెళ్లే ధోరణితో వ్యవహరించాల న్నది తమ విధానంగా సమావేశంలో సీఎం కేసీఆర్ వివరించినట్టు తెలిసింది. రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం బీజేపీపై జాతీయ స్థాయిలో పోరాడేందుకు భావ సారూప్య పార్టీల నడుమ విశాల ఎజెండా అవసరమని పేర్కొన్నట్టు సమాచారం. విపక్షాల ఓట్ల చీలిక ద్వారానే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందంటూ పలు ఉదాహరణలను పేర్కొన్నట్టు తెలిసింది. 1970వ దశకంలో ఎమర్జెన్సీ విధింపు దేశంలో కొత్త రాజకీయ పార్టీల ఆవిర్భావం, ప్రత్యామ్నాయ భావజాలానికి పురుడు పోసిందని.. ప్రస్తుత బీజేపీ విధానాలు కూడా దేశ రాజకీయాల్లో మార్పులకు కారణమవుతాయని కేసీఆర్ వివరించినట్టు సమాచారం. ప్రధాని మోదీ మోడల్ విఫలమైందని, కర్ణాటక ఫలితాలే ఇందుకు నిదర్శనమని ముగ్గురు సీఎంలు అభిప్రాయపడినట్టు తెలిసింది. బీజేపీ కార్యాలయాలుగా గవర్నర్ ఆఫీసులు విపక్షాలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై అధికారం చేపట్టిన రాష్ట్రాల్లో గవర్నర్లను అడ్డుపెట్టుకుని బీజేపీ అరాచకాలకు పాల్పడుతోందని ముగ్గురు సీఎంల భేటీలో చర్చ జరిగినట్టు తెలిసింది. గవర్నర్ల వ్యవస్థను అడ్డుపెట్టుకుని ఢిల్లీ, పంజాబ్‌లలో బీజేపీ కుట్రలకు పాల్పడుతోందని కేజ్రీవాల్, భగవంత్‌సింగ్ మాన్ పేర్కొనగా.. తెలంగాణలోనూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ తొక్కిపెట్టిన వైనం, దీనిపై సుప్రీంకోర్టు దాకా వెళ్లిన విషయాన్ని కేసీఆర్ వివరించినట్టు సమాచారం. దేశంలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణ కోసం జరిగే పోరాటంలో ముందు వరుసలో ఉంటామని కేసీఆర్ స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే జూన్ మొదటి వారంలో జాతీయస్థాయిలో విపక్షాల నేతలు, సీఎంల సమావేశం జరిగే అవకాశం ఉందని కేజ్రీవాల్ వెల్లడించినట్టు సమాచారం. అయితే ఇతర విపక్షాలతో కలిసి నడిచే అంశంలో కేసీఆర్ కొంత ఆచితూచి స్పందించినట్టు తెలిసింది. -
Hyderabad: కేసీఆర్‌తో కేజ్రీవాల్, భగవంత్ మాన్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం మధ్యాహ్నం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో భేటీ కానున్నారు. కేజ్రీవాల్‌తో పాటు కూడా వచ్చిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సైతం ఈ భేటీలో పాల్గొంటారు. ప్రగతి భవన్ చేరుకున్న ఈ ఇద్దరికీ కేసీఆర్ ఆత్మీయ స్వాగతం పలికారు. లంచ్ తర్వాత వీళ్ల భేటీ జరగనున్నట్లు సమాచారం. అధికారుల బదిలీ, పోస్టింగ్‌లపై కేంద్రంతో ఢీ కొట్టడానికి కేజ్రీవాల్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్రం తీసుకొచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా విపక్షాల మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్ మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. పలువురు ముఖ్యమంత్రులను కలిశారు కూడా. తాజాగా కేసీఆర్‌తోనూ కేజ్రీవాల్ ఇదే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఓవైపు నీతి ఆయోగ్ సమావేశానికి గైర్హాజరు అయ్యి మరీ ఈ ముగ్గురు సీఎంలు భేటీ అవుతుండడం గమనార్హం. సమావేశం అనంతరం ముగ్గురు సీఎంలు మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. చదవండి: త్వరలో సికింద్రాబాద్ – నాగ్‌పూర్ మధ్య.. వందేభారత్ -
గ్రాండ్‌గా పరిణీతి- రాఘవ్ ఎంగేజ్మెంట్, ఫోటోలు వైరల్
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆప్ నేత, ఎంపీ రాఘవ్ చద్దాల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. మే 13న జరిగిన ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు కపుర్తలా హౌస్ వేదికగా మారింది. నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను పరిణీతి, రాఘవ్ తమ ఇన్స్టాగ్రామ్ పేజీల్లో పోస్ట్ చేశారు. ఇందులో ఇద్దరూ సేమ్ కలర్ డ్రెస్సులో సింప్లీ సూపర్బ్ అనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న కొత్త జంటకు అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ ఫంక్షన్‌కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కాంగ్రెస్ నేత చిదరంబరం సహా దాదాపు 150 మంది హాజరైనట్లు తెలుస్తోంది. వీరిలో పరిణితి కజిన్ ప్రియాంక చోప్రా కూడా ఉంది. కాగా ఈ జంట డేటింగ్లో ఉన్నట్లు గతకొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే! వాటికి బలం చేకూర్చుతూ ముంబై, ఢిల్లీ విమానాశ్రయాల్లో వీరిద్దరూ జంటగా కెమెరాలకు చిక్కారు. అక్కడితో ఆగకుండా ఐపీఎల్ మ్యాచ్‌లోనూ జంటగా కనిపించి అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అయిన విషయం తెలిసిందే! ఎంత ప్రచారం జరిగినా దీనిపై స్పందించని ఈ జంట తాజాగా నిశ్చితార్థ వేడుకతో అభిమానులను సర్ప్రైజ్ చేసింది. View this post on Instagram A post shared by @parineetichopra చదవండి: సమంతకు నేను పెద్ద ఫ్యాన్‌ను.. ఆమెలా నటిస్తున్నానని చెప్తుంటే.. -
Bhagwant Mann Daughter: ‘చంపేస్తాం’
ఢిల్లీ: పాక్ ప్రేరేపిత ఖలీస్తానీ సానుభూతిపరుడు, వేర్పాటువాది అమృత్‌పాల్ సింగ్ కోసం గాలింపు ఉధృతం అయిన తరుణంలో.. ఖలీస్తానీ మద్దతుదారులు తీవ్ర చర్యలకు దిగుతున్నారు. విదేశాల్లో ఉన్న భారతీయ విద్యార్థులపై దాడులు చేస్తామని, చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఈ మేరకు తమకు బెదిరింపు లేఖలు, మెయిల్స్, సందేశాలు వచ్చినట్లు పలువురు విద్యార్థులు, రాజకీయ నేపథ్యం ఉన్న పలు భారతీయ కుటుంబాలు వాపోతున్నాయి. ఈ క్రమంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూతురు సీరత్ కౌర్‌కు సైతం ఈ బెదిరింపులు వెళ్లినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ చెప్పారు. సియాటెల్(సీటెల్)లో ఉంటున్న సీరత్ కౌర్‌కు చంపేస్తామని బెదిరింపులు వెళ్లాయట. ఈ మేరకు ఆమెకు భద్రత కల్పించాలని అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని స్వాతి మలివాల్ కోరుతున్నారు. మరోవైపు ఈ బెదిరింపులకు సంబంధించిన విషయాన్ని హర్మీత్ బ్రార్ అనే అడ్వొకేట్ తన ఫేస్బుక్ పోస్ట్‌లో ప్రస్తావించారు. బెదిరించినంత మాత్రానా?.. పిల్లలను తిట్టినంత మాత్రానా మీకు ఖలీస్తాన్ సిద్ధిస్తుందా? అని ఖలీస్తానీ మద్దతుదారులను ఉద్దేశించి పోస్ట్‌చేశారు. బెదిరింపులను సీరత్ కౌర్ తల్లి ఇందర్‌ప్రీత్ కౌర్ గ్రెవాల్ ధృవీకరించారు. ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని, తమను వదిలేయాలంటూ ఆమె ఖలీస్తానీలకు విజ్ఞప్తి చేస్తోంది. ఇక.. స్థానిక గురుద్వారా నుంచే ఈ బెదిరింపులు వచ్చినట్లు అక్కడి పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉంటే.. ఇందర్‌ప్రీత్, భగవంత్ మాన్కు మొదటి భార్య. వీళ్లకు ఇద్దరు సంతానం. కూతురు సీరత్, కొడుకు దిల్షాన్ ఉన్నారు. 2015 నుంచి వీళ్లిద్దరూ విడిగా ఉంటుండగా.. తర్వాత విడాకులు తీసుకున్నారు. ఆపై కొడుకు, కూతురితో ఇందర్‌ప్రీత్ విదేశాలకు వెళ్లి స్థిరపడింది. ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది మాన్, గుర్ప్రీత్ కౌర్ అనే వైద్యురాలిని రెండో వివాహం చేసుకున్నారు. ఖలీస్తానీ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. అమెరికాకు చెందిన వేర్పాటువాద గ్రూప్, ‘సిక్స్ ఫర్ జస్టిస్’.. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులకు, రాజకీయ నేపథ్యం ఉన్న పలు భారతీయ కుటుంబాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోన్ కాల్స్ బయటకు వచ్చాయి కూడా. అమెరికాతో పాటు యూరప్, ఆస్ట్రేలియాలో ఉన్న పలు ప్రాంతాల్లోనూ ఈ బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. ఖలీస్తానీ నేత(ఉగ్రవాది) జర్నైల్ సింగ్ భింద్రావాలేకు ప్రతిరూపంగా.. భింద్రావాలే 2.0 గా అమృత్‌పాల్‌సింగ్‌ను పిలుచుకుంటున్నారు ఖలీస్తానీ మద్దతుదారులు. గత 14 రోజులుగా అతని ఆచూకీ కోసం పంజాబ్ పోలీసులు విస్తృతంగా గాలింపు చేస్తున్నారు. ఈ క్రమంలో అతని అనుచరులను వంద మందికిపైగా అరెస్ట్ చేసి.. జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు పలు ప్రాంతాలు తిరుగుతూ, వేషాలు మారుస్తున్న అమృత్‌పాల్ సింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చక్కర్లు కొడుతున్నాయి. -
80వేల మంది పోలీసులు ఏం చేస్తున్నట్లు?
ఖలిస్తానీ-పాకిస్తాన్ ఏజెంట్ అమృత్‌పాల్ సింగ్ Amritpal Singh వ్యవహరంలో పంజాబ్-హర్యానాల హైకోర్టు.. పంజాబ్ ప్రభుత్వంపై మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. అమృత్‌పాల్‌ను అరెస్ట్ చేయడంలో విఫలం కావడంపై మండిపడ్డ కోర్టు.. చేపట్టిన ఆపరేషన్ తాలుకా నివేదికను సమర్పించాలని పంజాబ్ పోలీస్ శాఖను ఆదేశించింది. మీదగ్గర ఎనభై వేలమంది పోలీసులున్నారు. ఏం చేస్తున్నట్లు? అసలు అమృత్‌పాల్ సింగ్ ఎలా తప్పించుకున్నట్లు? అని పంజాబ్ సర్కార్‌పై ఆగ్రహం వెల్లగక్కింది. ఇది పూర్తిగా నిఘా వర్గాల ఫెయిల్యూర్ అంటూ వ్యాఖ్యానించింది కోర్టు. ఈ తరుణంలో.. అతన్ని అరెస్ట్ చేసేందుకు శనివారం నుంచి భారీ ఎత్తున్న చర్యలు మొదలుపెట్టినట్లు పోలీసులు కోర్టుకు వివరించారు. ఇప్పటిదాకా 120 మంది అమృత్‌పాల్ అనుచరుల్ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. అంతకు ముందు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ పరిణామాలపై స్పందించారు. పంజాబ్ కోరుకునేది శాంతి, అభివృద్ధి మాత్రమే. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే ఎవరినీ ఊపేక్షించబోం. కఠినంగా అణచివేస్తామని ప్రకటించారు. ఖలీస్తానీ-పాకిస్తాన్ ఏజెంట్‌గా అమృత్‌పాల్ సింగ్ పంజాబ్ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది. ‘వారిస్ పంజాబ్ దే’ సిక్కు గ్రూప్ చీఫ్‌గా.. అమృత్‌పాల్ సింగ్ పంజాబ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. వాస్తవానికి దానిని స్థాపించింది సందీప్ సింగ్ అలియాస్ దీప్ సింగ్ అనే పంజాబీ నటుడు కమ్ ఉద్యమకారుడు. పంజాబీల హక్కుల సాధన-పరిరక్షణ విషయంలో కేంద్రంతో కొట్లాడేందుకు ఈ గ్రూప్‌ను స్థాపించాడు. సందీప్ నుంచి వారసత్వంగా విభాగపు బాధ్యతలు తీసుకున్నాడు అమృత్‌పాల్ సింగ్. అయితే హక్కుల గ్రూప్‌ను కాస్త.. ఉగ్రవాదంపై మళ్లించినట్లు అమృత్‌పాల్ సింగ్‌పై అభియోగాలు నమోదు అయ్యాయి ఇప్పుడు. ఉదమ్యం ముసుగులో యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు నిఘా వర్గాలు కాస్త ఆలస్యంగా గుర్తించాయి. కిందటి నెలలో తన అనుచరులను ఉసిగొల్పి ఓ పోలీస్ స్టేషన్‌పై మారణాయుధాలతో దాడికి దిగి.. తన ప్రధాన అనుచరుడిని విడిపించుకున్నాడు. ఈ దాడిలో ఆరుగురు పోలీస్ సిబ్బంది గాయపడ్డారు. ఈ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న పంజాబ్‌లోని ఆప్ సర్కార్, కేంద్రంతో పాటు అసోం ప్రభుత్వ సాయంతో అమృత్‌పాల్ సింగ్‌ని, అతని ప్రధాన అనుచరుల్ని అరెస్ట్ చేసేందుకు రహస్య ప్రణాళికను అమలు చేసింది. ఈ మేరకు మార్చి 2వ తేదీన పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి అమృత్‌పాల్ సింగ్ అరెస్ట్‌కు వ్యూహం అమలు చేసే విధానంపై చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు ఏం చెబుతున్నాయంటే.. ఖలిస్తానీ-పాకిస్తాన్ ఏజెంట్ అయిన అమృత్‌పాల్ సింగ్ పక్కా ప్లాన్‌తోనే పంజాబ్‌లో వారిస్ పంజాబ్ దే గ్రూప్‌ను నడిపిస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. అనుచరుల పేరుతో బలగం తయారు చేసుకుని.. ఆత్మాహుతి దాడులకు ప్రణాళిక గీశాడు. ఈ మేరకు పాక్ నుంచి వచ్చిన అక్రమాయుధాలను.. డీ ఆడిక్షన్ కేంద్రాల్లో భద్రపరిచినట్లు కూడా తెలుస్తోంది. మరోవైపు అమృత్‌పాల్ సింగ్‌పై ఆయుధాల చట్టం కింద మరో కేసు నమోదు చేసి.. ఉగ్రకోణంలో దర్యాప్తు చేయాలనే ఆలోచనలో ఉంది కేంద్రం. ఈ కేసులో ఏ1గా అమృత్‌పాల్ సింగ్ పేరును చేర్చింది కూడా. ఇదిలా ఉంటే.. అమృత్‌పాల్ సింగ్ అనుచరుల అరెస్ట్ పేరిట.. పంజాబ్ గ్రూప్‌ల కీలకసభ్యులను.. ఉద్యమకారులను, అమాయకపు పంజాబీ యువతను అరెస్ట్ చేస్తున్నారని, రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీని తలపిస్తున్నారని, కుట్రను అంచనా వేయడంలో ఆప్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. రాజకీయ విమర్శలు చెలరేగుతున్నాయి. అయితే.. అలాంటిదేం జరగడం లేదని సీఎం మాన్ ఇవాళ వివరణ ఇచ్చుకున్నారు. ఇక.. విదేశాల్లోని పంజాబీ గ్రూప్‌లను.. ఖలిస్తానీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని కేంద్రం విజ్ఞప్తి చేస్తోంది. అమృత్‌పాల్ సింగ్ కోసం నాలుగు రోజులుగా వేట కొనసాగుతున్న వేళ.. విదేశాల్లోని వివిధ భారత రాయబార కార్యాలయాలపై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడులకు తెగపడుతున్నారు. ఈ తరుణంలో కేంద్ర విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక అమృత్‌పాల్ సింగ్ పంజాబ్ దాటేసి పారిపోయి ఉంటాడన్న అనుమానాలతో అంతర్జాతీయ సరిహద్దులను సైతం అప్రమత్తం చేసింది కేంద్రం. సంబంధిత వార్త: పంజాబ్ వదిలి పారిపోయిన అమృత్‌పాల్ సింగ్? -
AAP: కీలక ప్రకటన చేసిన కేజ్రీవాల్
భోపాల్: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. రాబోయే మధ్యప్రదేశ్ ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేయనున్నట్లు పేర్కొన్నారాయన. ఈ మేరకు ఆ రాష్ట్రంలో గెలిపిస్తే.. ఉచిత కరెంట్, విద్య, ఆరోగ్యభద్రత ఉంటుందని మధ్యప్రదేశ్ ప్రజలకు హామీ ఇచ్చారాయన. మంగళవారం బీహెచ్ఈఎల్లోని దసరా మైదాన్‌లో ఏర్పాటు చేసిన జనసభలో ప్రసంగిస్తూ.. కేజ్రీవాల్ పై ప్రకటన చేశారు. అంతేకాదు.. మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే గనుక ఉద్యోగులను రెగ్యులైజ్ చేస్తామని, అవినీతికి చరమగీతం పాడతామని పేర్కొన్నారాయన. ఢిల్లీ, పంజాబ్‌లలో ఆప్ ప్రభుత్వాల పని తీరును ప్రత్యేకంగా ప్రస్తావించిన ఆయన.. మధ్యప్రదేశ్‌లోనూ ఆప్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సభలో కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు. -
Gun Culture: ఒకే రోజు 813 తుపాకీ లైసెన్సులు రద్దు..
పంజాబ్‌లో తుపాకి సంస్కృతికి వ్యతిరేకంగా భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం విరుచుకుపడింది. విచ్చలవిడిగా వినియోగిస్తున్న తుపాకులకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఒకే రోజు సుమారు 813 ఆయుధాల లైసెన్సులను రద్దు చేసింది ప్రభుత్వం. ఇప్పటి వరకు దాదాపు 2 వేలకు పైగా ఆయుధ లైసెన్సులు రద్దు చేసింది. ఈ మేరకు లూథియానా రూరల్ నుంచి 87, షాహీద్ భగత్‌సింగ్ నగర్ నుంచి 48, గురుదాస్‌పూర్ నుంచి 10, ఫరీద్కోట్ నుంచి 84, పఠాన్‌కోట్ నుంచి 199, హోషియాపూర్ నుంచి 47, కపుర్తలా నుంచి 6, ఎస్ఏఎస్ కస్బా నుంచి 235, సంగర్ నుంచి 16 తపాకీ లైసెన్స్‌లను రద్దు చేసింది. అలాగే తుపాకుల లైసెన్సు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నియమాలను పేర్కొంది. పంజాబ్‌లో బహిరంగ కార్యక్రమాలు, మతపరమైన ప్రదేశాలు, వివాహ వేడుకలు లేదా ఇతర కార్యక్రమాల్లో ఆయుధాలు తీసుకువెళ్లడం, ప్రదర్శించడాన్ని నిషేధించింది. రానున్న రోజుల్లో పోలీసులు వివిధ ప్రాంతాల్లో రాండమ్ చెకింగ్లు నిర్వహిస్తారని, హింసను ప్రోత్సహించేలా ఆయుధాలను ప్రదర్శించడంపై పూర్తి నిషేధం ఉంటుందని అధికార ఆప్ ప్రభుత్వం తెలిపింది. పంజాబ్‌లో మొత్తం మూడు లక్షల ఆయుధాల లైసెన్సులు ఉన్నాయని, ఈ తుపాకీ సంస్కృతిని అంతం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కాగా, 28 ఏళ్ల పంజాబీ గాయకుడు సిద్ధు మూస్ వాలా హత్యోదంతంతో రాష్ట్ర ప్రభుత్వం తుపాకీ సంస్కృతిపై దృష్టి సారించి, నియంత్రణ కోసం పిలుపునిచ్చింది. వాస్తవానికి సిద్ధు మూస్ వాలా వివాదాస్పద పంజాబీ పాటలకు ప్రసిద్ధి, అవి తుపాకీ సంస్కృతిని బహింరంగంగా ప్రోత్సహించడమే గాక గ్యాంగ్స్టర్లను కీర్తించింది. అతను రైఫిల్‌తో కాల్పులు జరుపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అతనిపై కేసు కూడా నమోదైంది. (చదవండి: ఫుల్‌గాతాగి పెళ్లి మండపంలోనే నిద్రపోయిన వరుడు.. ఆ తర్వాత ఏమైందంటే..) -
తెలంగాణలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్
-
ఎర్రవల్లికి పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్
సాక్షి, హైదరాబాద్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ నేతృత్వంలో ఆ రాష్ట్ర అధికారుల బృందం గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వగ్రామం ఎర్రవల్లిని సందర్శించనుంది. కాగా బుధవారం రాత్రి భగవత్‌మాన్‌సింగ్ హైదరాబాద్‌కు చేరుకొని సీఎం కేసీఆర్‌ను కలిశారు. మాన్సింగ్ బృందం కొండపోచమ్మ సాగర్ జలాశయంతో పాటు ఎర్రవల్లిలోని చెక్‌డ్యాం, పాండవుల చెరువును పరిశీలించనుంది. గురువారం ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి బయల్దేరి.. మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి నగరానికి చేరుకోనుంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్, గజ్వేల్ ఈఎన్సీ హరిరామ్ ఈ పర్యటనలో పాల్గొని.. ఆయా ప్రాజెక్టుల గురించి పంజాబ్ బృందానికి వివరించనున్నారు. కార్యక్రమంలో పంజాబ్ సీఎంతో పాటు ఆ రాష్ట్ర సీఎంవో కార్యాలయ ఐఏఎస్ అధికారులు, నీటిపారుదల శాఖాధికారులు పాల్గొంటారు. -
రేపు సిద్ధిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇరిగేషన్ పాలసీ పరిశీలనలో భాగంగా సిద్ధిపేట జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం (రేపు) పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్‌తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్సింగ్ కూడా పాల్గొనున్నారు. ఈ క్రమంలో పంజాబ్ సీఎం బుధవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. సిద్దిపేట పర్యటనలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని కొండపోచమ్మ, మల్లన్న సాగర్ రిజర్వాయర్లను ఇద్దరు సీఎంలు సందర్శించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అందులోని రిజర్వాయర్లు, తెలంగాణ ఇరిగేషన్ పాలసీని పంజాబ్ సీఎంకు కేసీఆర్ వివరించనున్నారు. -
ఆరోగ్య పంజాబ్ సృష్టికి తీవ్ర కృషి: సీఎం మాన్
అమృత్సర్: పంజాబ్‌ను ఆరోగ్యకరంగా, శక్తివంతంగా మార్చేందుకు తమ ప్రభుత్వం తీవ్ర కృషి చేస్తోందని ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ చెప్పారు. ప్రతి రంగంలోనూ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమన్నారు. శుక్రవారం అమృత్‌సర్‌లో ఆయన ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిసి 400 ఆమ్ ఆద్మీ క్లినిక్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఎన్నికల సమయంలో తమ పార్టీ ఇచ్చిన హామీలన్నిటినీ మాన్ సర్కార్ నెరవేరుస్తుందని కేజ్రీవాల్ చెప్పారు. ఆప్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న పంజాబ్ ప్రజలు ఆకాంక్షలు నెరవేరేందుకు కొద్దిగా ఓపిక పట్టాలన్నారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే 500 ఆమ్ ఆద్మీ క్లినిక్కులను ఏర్పాటు చేయనుండటం సంతోషకరమని చెప్పారు. -
ఇవాళ మార్పు కోసం తొలి అడుగు పడింది: పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్ మాన్
-
టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు: సీఎం భగవంత్‌మాన్
సాక్షి, ఖమ్మం: ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని, ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని, నిత్యావసర వస్తువులు సామాన్యులకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ భారతీయ అబద్ధాల పార్టీగా మారిపోయిందని పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ విమర్శించారు. గుట్టలు, నదులు, ఫ్యాక్టరీలు, ఎయిర్‌పోర్ట్‌లు, రైల్వే, ఎల్ఐసీ ఇలా దేశం మొత్తాన్ని బీజేపీ ప్రభుత్వం అమ్మేస్తోందని మండిపడ్డారు. ఖమ్మం సభలో భగవంత్‌మాన్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘మోదీ ప్రధాని అయినప్పటి నుంచీ కూడా ఎర్రకోట మీద పంద్రాగస్టు ప్రసంగంలో నిరుద్యోగం, ఉగ్రవాదంపై చింతిస్తున్నానని చెప్తూనే ఉన్నారు. ఇంకా ఎప్పుడు పరిష్కరిస్తారు? ఇప్పటికైనా ప్రధాని ప్రసంగాన్ని మార్చాలి. నేను దేశాన్ని ప్రేమిస్తాను. బోకేలో రంగురంగుల పూలు ఉన్నట్టే.. దేశం రంగు రంగుల పూల సమాహారం. కానీ ఒకే పువ్వు ఉండాలని కొందరు చూస్తున్నారు. బీజేపీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోంది. రాష్ట్రాల్లో బీజేపీ గెలవదు. ఆ పార్టీది లోక్తంత్ర కాదు.. లూటీ తంత్రం. మీడియాను గుప్పిట్లో పెట్టుకుని అన్నీ తమ కోసమే అన్నట్టు వ్యవహరిస్తోంది. పంజాబ్‌లో కంటి వెలుగు ఢిల్లీ తరహాలోనే పంజాబ్‌లో మొహల్లా క్లినిక్‌లు పెట్టాం. కంటి వెలుగు పథకం బాగుంది. ఇంత పెద్ద సభకు వచి్చన జనాన్ని చూసేందుకు పెద్ద కళ్లజోడు అద్దాలు ఉంటే ఇంకా బాగా చూసి ఆనందించేవాడిని. ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని పంజాబ్‌లో చేపడతాం. ఎమ్మెల్యేలను తక్కువ ధరకు అమ్మే పారీ్టగా కాంగ్రెస్ మారిపోయింది. గతంలో ఢిల్లీ స్కూళ్ల గురించి బీజేపీ సర్కార్ విమర్శలు చేసింది. ఆ తర్వాత ట్రంప్ సతీమణి మన దేశంలో స్కూళ్లను చూడాలనుకుంటే.. కేజ్రీవాల్ అభివృద్ధి చేసిన స్కూళ్లనే కేంద్రం చూపించింది. దేశం కోసం బ్రిటీష్ వాళ్లతో పోరాడి ప్రాణాలు అరి్పంచిన భగత్‌సింగ్ గుర్తుగా ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదం నినదించాలి. తెలంగాణ కోసం పోరాడి సాధించుకున్న కేసీఆర్‌కు అభినందనలు..’’ అని భగవంత్‌మాన్ పేర్కొన్నారు. -
రాష్ట్రానికి విచ్చేసిన బీఆర్ఎస్ అతిథులు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొనడానికి బీఆర్ఎస్ ఆహ్వానించిన ప్రముఖులు మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. వారికి మంత్రులు ఘనస్వాగతం పలికారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌సింగ్ మాన్కు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛాలు ఇచ్చి, శాలువాతో సత్కరించారు. కాగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ స్వాగతించారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆహ్వానించారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా కూడా.. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఈటీ నరసింహ, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, రవీంద్ర చారి, పర్వతాలు, స్టాలిన్ తదితరులు స్వాగతం పలికారు. కంటి వెలుగు కోసమే వచ్చా: కేజ్రీవాల్ తాను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొనడానికి మాత్రమే వచ్చానని, ఈ పర్యటనలో ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇది ఒక అధికారిక కార్యక్రమమని ఆయన పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ వచ్చిన కేజ్రీవాల్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు ఇందిరా శోభన్, డాక్టర్ దిడ్డి సుధాకర్, శోభన్ బాబు భూక్య, బుర్ర రాము గౌడ్, డాక్టర్ అన్సారీ కలిశారు. -
కేసీఆర్, ముగ్గురు సీఎంల పర్యటన షెడ్యూల్ ఖరారు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మంలో బీఆర్ఎస్ సభకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్‌తోపాటు మూడు రాష్ట్రాల సీఎంలు, యూపీ మాజీ సీఎం, ఇతర జాతీయస్థాయి నేతలు హాజరవుతుండటంతో పోలీసులు, అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్ సభా ప్రాంగణం, కలెక్టరేట్ ప్రాంతాలను పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఇక ప్రముఖుల పర్యటనకు సంబంధించి ప్రాథమికంగా షెడ్యూల్ ఖరారైనట్టు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్‌మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్ ఈ నెల 17న రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్నారు. 18న ఉదయం వారు సీఎం కేసీఆర్‌తో కలసి రెండు ప్రత్యేక హెలికాప్టర్లలో యాదాద్రికి చేరుకుని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. తర్వాత ఖమ్మంకు చేరుకుంటారు. బీఆర్ఎస్ తొలి సభకావడంతో సెంటిమెంట్‌గా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది. అభివృద్ధి పనులు ప్రారంభించి సభకు.. 18న మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎంలు, ఇతర ప్రముఖులు ఖమ్మం కొత్త కలెక్టరేట్‌కు చేరుకుంటారు. కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం అక్కడే మెడికల్ కాలేజీ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. కంటివెలుగు రెండో దశ కార్యక్రమాన్ని ప్రా రంభిస్తారు. తర్వాత సభా వేదికకు చేరుకుంటారు. క్యూఆర్ కోడ్‌తో పార్కింగ్‌కు కసరత్తు సభ ఏర్పాట్లను మంత్రులు పర్యవేక్షిస్తుండగా.. వేదికను తీర్చిదిద్దే బాధ్యతను టీఎస్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) చైర్మన్ గ్యాదరి బాలమల్లుకు అప్పగించారు. వేదికపై ముఖ్య నేతలతోపాటు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులకు సీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. ఇక ఇల్లెందు, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్ నుంచి వచ్చే వాహనాలకు ఖమ్మంలోని ఇల్లెందు రోడ్డులో.. సూర్యాపేట మీదుగా వచ్చే వాహనాలకు ముదిగొండ, కోదాడ క్రాస్‌రోడ్డు మీదుగా ప్రకాశ్‌నగర్, మమత రోడ్డులో ఏర్పాటు చేసే పార్కింగ్ స్థలాల్లో.. భద్రాద్రి కొత్తగూడెం, సత్తుపల్లి, వైరా, మధిర నుంచి వచ్చే వాహనాలకు వైరా రోడ్డులోని అమ్మపాలెం సమీపంలో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి వచ్చే వాహనాలకు ఒక్కో క్యూఆర్ కోడ్ ఇచ్చేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. నేతలకు వివిధ బాధ్యతలు.. ఖమ్మం సభ విజయవంతానికి సీఎం కేసీఆర్ సూచనల మేరకు 24 మందితో టీమ్ సిద్ధమైంది. అందులో మంత్రులతోపాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు ఉన్నారు. సభకు సంబంధించి మొత్తంగా మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షించనుండగా.. ఆయన సారథ్యంలో మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వర్రావు సభకు ఇన్చార్జులుగా ఉంటారు. దేశం దృష్టిని ఆకర్షిస్తుంది: హరీశ్, పువ్వాడ ఖమ్మం బీఆర్ఎస్ సభ దేశం దృష్టిని ఆకర్షిస్తుందని.. అందుకు తగినట్టు ప్రతిష్టాత్మకంగా సభ నిర్వహణ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. బుధవారం సభ స్థలాన్ని, కొత్త కలెక్టరేట్‌ను వారు పరిశీలించారు. కలెక్టర్, పోలీసు అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. సభ ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయన్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత మొదటి బహిరంగ సభను ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్నామని.. దీనికి ఢిల్లీ, పంజాబ్, కేరళ సీఎంలు కేజ్రీవాల్, భగవంత్‌మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు హాజరవుతారని తెలిపారు. సభ మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమై 4.30 వరకు కొనసాగుతుందన్నారు. భారీగా హాజరై సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తుమ్మలతో మంత్రుల భేటీ దమ్మపేట: ఖమ్మం సభ ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్, ఇతర నేతలు బుధవారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలోని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసానికి వెళ్లారు. తుమ్మల ఆతిథ్యాన్ని స్వీకరించి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలపై చర్చించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నట్టుగా కొన్ని నెలలుగా వస్తున్న వార్తలు, ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో వారు తుమ్మలను కలవడం చర్చనీయాంశంగా మారింది. -
Punjab: సివిల్ సర్వీస్ ఉద్యోగులకు అల్టీమేటం జారీ చేసిన సీఎం మాన్
పంజాబ్‌లో సివిల్ సర్వీస్ ఉద్యోగులు నిరసన బాట పట్టారు. అవినీతి ఆరోపణల కారణంగా లూథియానాలోని ప్రాంతీయ రవాణాశాఖ అధికారి నరీందర్ సింగ్ ధాలివాల్‌ను స్టేట్ విజిలెన్స్ బ్యూరో గత శుక్రవారం అరెస్ట్ చేసింది. నిబంధనలు ఉల్లఘించిన వారిపై చలాన్లు జారీ చేయకుండా వాహనాదారుల నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణంతో అదుపులోకి తీసుకున్నట్లు విజిలెన్స్ బ్యూరో అధికారులు తెలిపారు. అయితే తమ సహోద్యోగిని అక్రమంగా, చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారంటూ సివిల్ సర్వీస్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ విధులు బహిష్కరించారు. అయిదు రోజులపాటు సామూహికంగా సాధారణ సెలవులపై వెళ్లారు. దీంతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు లేక పనులు ఆగిపోయాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగిన సివిల్ సర్వీసెస్ అధికారులపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తీవ్రంగా స్పందించారు. ఈ తరహా నిరసనలను బ్లాక్‌మెయిల్‌గా పరిగణించాల్సి వస్తుందని హెచ్చరించారు. సమ్మె విరమించి బుధవారం మధ్యాహ్నం 2 గంటల్లోగా తిరిగి విధుల్లో చేరాలని, లేకుంటే వారిని సస్పెండ్ చేస్తామని హుకూం జారీ చేశారు. ఈ మేరకు సీఎం ట్వీట్ చేశారు. ‘కొందరు అధికారులు సమ్మె ముసుగులో విధులకు హాజరుకావడం లేదని నా దృష్టికి వచ్చింది. అవినీతి అధికారులపై ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యలకు వ్యతిరేకంగా వారు నిరసన చేస్తున్నారు. ఈ ప్రభుత్వం అవినీతిని ఏమాత్రం సహించదని అందరికీ స్పష్టంగా తెలియజేస్తున్నాం. అలాంటి సమ్మె బ్లాక్‌మెయిలింగ్, పని చేయకుండా చేతులు దులుపుకోవడమే అవుతుంది. బాధ్యతాయుతమైన ఏ ప్రభుత్వమూ దీనిని సహించదు. సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటిస్తూ.. ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం 2 గంటలలోపు విధుల్లో చేరని అధికారులందరినీ సస్పెండ్ చేయండి’ అని భగవంత్ మన్ పేర్కొన్నారు. అయితే, సీఎం హెచ్చరికను కూడా ఉద్యోగులు పట్టించుకున్నట్లు కనిపించడంలేదు. భగవంత్ మాన్ విధించిన డెడ్‌లైన్ ముగిసినప్పటికీ ఉద్యోగులు సమ్మె విరమించి విధుల్లో చేరలేదు. దీంతో అధికారులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని ఉత్కంఠగా మారింది. -
Punjab CM: పంజాబ్ సీఎం హత్యకు కుట్ర? ఇంటివద్ద బాంబు స్వాధీనం..
చండీగఢ్: పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ఇంటి వద్ద లైవ్ బాంబు దొరకడం కలకలం రేపింది. చండీగఢ్‌లోని ఆయన నివాసం వద్ద పోలీసులు ఈ బాంబును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సీఎం భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. చండీగఢ్‌లోని పంజాబ్, హరియాణ సీఎంల నివాసాలకు సమీపంలో బాంబ్ షెల్ లభించింది. బాంబ్ స్క్వాడ్ అధికారులు సోమవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో దీన్ని స్వాధీనం చేసుకున్నారు. భగవంత్ మాన్ హెలిప్యాడ్ సమీపంలోనే ఈ బాంబు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బాంబును గుర్తించిన సమయంలో ఆయన ఇంట్లో లేరు. ఎవరో భగవంత్ మాన్ హత్యకు కుట్ర పన్నే బాంబు అమర్చి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. కేసు నమోదుచేసుకుని త్వరితగతిన దర్యాప్తు చేపట్టారు. భారత సైన్యం వెస్టర్న్ కమాండ్ రంగంలోకి దిగి ఈ ఘటనపై ప్రాథమిక విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఏకంగా సీఎం ఇంటి వద్ద బాంబు దొరకడంతో భద్రతా వైఫల్యం స్పష్టంగా కన్పిస్తోంది. సైన్యం, అధికారులు ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నారు. Bomb found near Punjab CM Bhagwant Mann's house in Chandigarh; bomb squad present at the spot pic.twitter.com/qrDCnBS2IF — ANI (@ANI) January 2, 2023 చదవండి: 'సమాజం ఎటుపోతుందో అర్థంకావట్లేదు.. ఆ కిరాతకులను ఉరి తీయాలి' -
సీఎం కేసీఆర్‌తో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భేటీ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మంగళవారం సమావేశయ్యారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ భేటీలో దేశంలోని ప్రస్తుత రాజకీయాలతోపాటు పంజాబ్ రాష్ట్ర పరిస్థితులపై ఇరు రాష్ట్రాల సీఎంలు చర్చించినట్లు తెలుస్తుంది. కేసీఆర్‌తో భేటీ ముగియడంతో ప్రగతి భవన్ నుంచి పంజాబ్ సీఎం బయలు దేరారు. కాగా తాజ్ కృష్ణలో ఓ ఇన్వెస్ట్మెంట్ మీటింగ్‌లో పాల్గొనడానికి భగవంత్ మాన్ హైదరాబాద్ విచ్చేసిన సంగతి తెలిసిందే. 24న పంజాబ్ స్పీకర్ రాక పంజాబ్ శాసనసభ స్పీకర్ సర్దార్ కుల్తార్‌సింగ్ సంధ్వాన్ ఈ నెల 24న తెలంగాణకు రానున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ స్పీకర్ జైకిషన్ సింగ్ రౌరీ, రాజ్యసభ సభ్యుడు విక్రమ్‌జీత్ సింగ్ సాహ్ని, ఎమ్మెల్యే కుల్వంత్ సింగ్ పండోరి, మరో ఇద్దరు కూడా హైదరాబాద్‌కు రానున్నారు. చదవండి: బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ -
కాంగ్రెస్ కోమాలో ఉంది: రాహుల్ వ్యాఖ్యలపై పంజాబ్ సీఎం చురకలు
న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోకాంగ్రెస్ ఘోర పరాజయానికి ఆమ్ ఆద్మీ పార్టీ కారణమంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కోమాలో ఉందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అంటే మార్పు(చేంజ్) కాదు, మార్పిడికి(ఎక్స్ఛెంజ్) సంబంధించినదని పంజాబ్ సీఎం ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యర్థి పార్టీలకు అడ్డంగా మారారని ఆరోపించారు. పార్టీ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా మారిందని.. ప్రత్యర్థి పార్టీలకు సంఖ్యాబలం లేనప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వారి ఎమ్మెల్యేలను అమ్మేస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కోమాలో ఉందని దుయ్యబట్టారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ .. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీయే అధికారంలో ఉందని అన్నారు. ‘గుజరాత్లో రాహుల్ గాంధీ ఎన్నిసార్లు పర్యటించారు. కేవలం ఒకేసారి. మరి ఒక్కసారే రాష్ట్రాన్ని సందర్శించి ఎన్నికల్లో గెలవాలనుకున్నాడు. సూర్యుడు ఎక్కడ అస్తమిస్తాడో (గుజరాత్) అక్కడ ఎన్నికలు జరిగాయి. రాహుల్ గాంధీ తన పాదయాత్రను సూర్యుడు మొదట ఉదయించే ప్రదేశం (కన్యాకుమారి) నుంచి ప్రారంభించాడు. ముందు తన టైమింగ్‌ను సరిచేసుకోనివ్వండి” అని భగవంత్ మాన్ చురకలంటించారు. చదవండి: బార్‌పై రైడ్.. సీక్రెట్ రూంలో 17 మంది మహిళలు.. పోలీసులు షాక్.. కాగా శుక్రవారం రోజు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావకాశాలను ఆమ్ ఆద్మీ పార్టీ దెబ్బతీసిందని మండిపడ్డారు. ఆప్ లేకుండా అధికార బీజేపీని ఓడించేవాళ్లమన్నారు. కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకోవడానికి బీజేపీ ఆప్‌ను ఉపయోగించిందని ఆరోపించారు. ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని అందుకుంది. 182 స్థానాల్లో 156 సీట్లు గెలుచుకొని రికార్డ్ సృష్టించింది. గుజరాత్ ఎన్నికల చరిత్రలో ఏ రాజకీయ పార్టీకీ ఇన్ని సీట్లు దక్కలేదు. 1985 ఎన్నికలలో కాంగ్రెస్ 149 స్థానాలు గెలుచుకోగా.. 37 ఏళ్ల ఈ రికార్డును బీజేపీను అధిగమించింది. అయితే తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 17 స్థానాలకే పరిమితమైంది. ఆప్ 5 స్థానాల్లో విజయం సాధించింది. -
గుజరాత్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ తారుమారు
న్యూఢిల్లీ: గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు రాబోతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జోస్యం చెప్పారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. గుజరాత్ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పుతాయని, అనూహ్య ఫలితాలు వస్తాయని వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున గెలిచిన వారంతా తమతోనే ఉంటారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా, గుజరాత్, హిమచల్ ప్రదేశ్ ఎన్నికలు ఫలితాలు గురువారం వెలువడనున్నాయి. అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు బీజేపీ ఢిల్లీని వరుసగా 15 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్‌ను అరవింద్ కేజ్రీవాల్ పార్టీ పెట్టి ఓడించారని సీఎం భగవంత్ మాన్ గుర్తు చేశారు. అలాగే 15 ఏళ్లుగా ఎంసీడీని ఏలుతున్న బీజేపీని ఇప్పుడు మట్టి కరిపించారని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీని అడ్డుకునేందుకు మొత్తం యంత్రాంగాన్ని బీజేపీ.. ఢిల్లీలో మొహరించిందని ఆరోపించారు. విద్వేష రాజకీయాలు వద్దు ఢిల్లీ ప్రజలు అభివృద్ది కోరుకుంటున్నారని సీఎం భగవంత్ మాన్ అన్నారు. ‘ఢిల్లీ వాసులు విద్వేష రాజకీయాలు ఇష్టపడటం లేదు. స్కూల్స్, ఆస్పత్రులు, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల కోసం ఓటు వేశార’ని పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: హస్తినలో ‘ఆప్’ హవా.. ఢిల్లీ మేయర్‌గా మహిళ!) -
పంజాబ్ సీఎం ఇంటి వద్ద ఉద్రిక్తత.. పోలీసుల లాఠీఛార్జ్!
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని పలు కార్మిక సంఘాలకు చెందిన నేతలు, కార్యకర్తలు ఆయన ఇంటి వద్ద బుధవారం ఆందోళనకు దిగారు. వేతనాల పెంపు సహా ఇతర డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించటంతో వారితో గొడవకు దిగారు. దీంతో పరిస్థితులు అదుపుతప్పాయి. కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ముందుగా పాటియాలా బైపాస్‌లో సమావేశమయ్యారు. అక్కడి నుంచి సంగ్రూర్‌లోని సీఎం భగవంత్ మాన్ ఇంటి వద్దకు ర్యాలీగా తరలివెళ్లారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో భారీగా బలగాలను మోహరించారు అధికారులు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయటంతో పలువురికి గాయాలయ్యాయి. #WATCH | Punjab Police lathi-charged Mazdoor Union people who were marching towards CM Bhagwant Mann's residence in Sangrur regarding their various demands pic.twitter.com/MkpxdNSNQf — ANI (@ANI) November 30, 2022 ఇదీ చదవండి: ‘కేజ్రీవాల్ సర్ మీ మఫ్లర్ ఏది?’.. ఢిల్లీ సీఎంకు ఎదురైన వింత ప్రశ్న -
Delhi Pollution: క్షీణించిన గాలి నాణ్యత.. కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. గాలి నాణ్యత రోజురోజుకు తక్కువ స్థాయికి పడిపోతుంది. గాలి నాణ్యత మెరుగు పడేందుకు ఢిల్లీ ప్రభుత్వం నడుం బిగించింది. గాలి నాణ్యత 450 పాయింట్ల తీవ్ర స్థాయికి చేరడంతో పలు కీలక చర్యలకు ఉపక్రమించింది. 50% ఢిల్లీ ప్రభుత్వ సిబ్బంది ఇంటి నుంచి పని చేసేలా(వర్క్ ఫ్రం హోమ్) ఆదేశాలు జారీ చేసింది. ప్రేవేటు కార్యాలయాలు కూడా ఈ పద్దతినే అనుసరించాలని పేర్కొంది. పాఠశాలలు బంద్ ఢిల్లీలో శనివారం నుంచి అన్ని ప్రాథమిక పాఠశాలలను మూసివేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. 5వ తరగతి పై విద్యార్థులు బహిరంగ ఆటలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. సరి బేసి విధానం గురించి ఆలోచిస్తున్నామని పేర్కొంది. చదవండి: ఎంత క్రూరం! కాలితో తన్నాడు.. జనం ఊరుకోలేదు! ఆ వాహనాలపై నిషేదం కేవలం అత్యవసర వస్తువుల్ని రవాణా చేసే వాహనాలు, సీఎన్జీతో నడిచే వాహనాల్ని, ఎలక్ట్రిక్ బండ్లను మాత్రమే ఢిల్లీలోకి అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెద్ద వాహనాలు, బిఎస్-4 డీజిల్ ఇంజిన్ వాహనాలు ఢిల్లీలోకి రాకుండా నిషేధం విధించింది. కమర్షియల్ డీజిల్ ట్రక్స్ వాహనాలు కూడా ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లోకి అనుమతించవద్దని నిర్ణయం తీసుకుంది.అంతేగాక రోడ్లు వేయడం, వంతెనలు నిర్మించడం, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, పవర్ ట్రాన్సిమిషన్ యూనిట్లు, పైప్‌లైన్ నిర్మాణం వంటి పెద్ద ప్రాజెక్టుల్నినిలిపివేయనున్నారు. అలాగే గతేడాది అవలంబించినటే సరి, భేసి విధానంలో వాహనాల్ని అనుమతించాలి యోచిస్తోంది ఢిల్లీ సర్కార్. అప్రమత్తమైన ఎన్హెచ్ఆర్సీ ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ అప్రమత్తమైంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఈ రష్ట్రాల సీఎస్‌లను నవంబర్ 10లోపు ఎన్హెచ్ఆర్సీ ముందు హాజరు కావాలని కోరింది. పంజాబ్‌లో పంట వ్యర్ధాలను రైతులు కాల్చివేస్తుండటం వల్ల ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. వాయు కాలుష్యం అనేది ఉత్తర భారతదేశ సమస్య అని, ఢిల్లీ ప్రభుత్వం లేదా పంజాబ్ ప్రభుత్వం మాత్రమే దీనికి బాధ్యత వహించవని అన్నారు. దీనికి ఒకరిపై ఒకరు నిందలు వేయడానికి సమయం కాదని అన్నారు. రైతులను తప్పు పట్టలేం ఒకవేళ పంజాబ్‌లో పంటల వ్యర్ధాలను కాల్చివేస్తున్నారంటే దానికి తామే బాధ్యులమని కేజ్రీవాల్ తెలిపారు. వరి పంట వ్యర్ధాల్ని కాల్చివేయాలని రైతులు కూడా కోరుకోవడం లేదని, కానీ రెండు పంటల మధ్య తక్కువ సమయం ఉన్నందున వాళ్లకు మరో అవకాశం లేదని పేర్కొన్నారు.ఆ వ్యాఖ్యలను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. పడిపోతున్న గాలి నాణ్యత ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో గురువారం దట్టంగా పొగమంచు పేరుకుపోయింది. గాలి నాణ్యత సూచికలో ప్రస్తుతం యూపీలోని నోయిడా 562తో తీవ్ర స్థాయిలో ఉంది. ఆ తరువాత గురుగ్రామ్ 539(హర్యానా). ఢిల్లీ యూనివర్సీటీ సమీపంలో 563 ఉన్నాయి. ఢిల్లీలో ప్రస్తుత గాలి నాణ్యత 472గా ఉంది. ఘజియాబాద్-391, నోయిడా-388, గ్రేటర్ నోయిడా-390, గురుగ్రామ్-391, ఫరీదాబాద్-347గా నమోదైంది. -
‘ఇదేనా సామాన్యుడి ప్రభుత్వం?’.. పంజాబ్ సీఎంపై విమర్శలు!
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌పై విపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. రాష్ట్రంలో వీఐపీ సంస్కృతికి స్వస్తి పలుకుతానని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని సీఎం విస్మరించారని ఆరోపించాయి. గత ముఖ్యమంత్రులతో పోలిస్తే ఎక్కువ కార్లు తన కాన్వాయ్‌లో ఉనియోగిస్తున్నట్లు సమాచార హక్కు దరఖాస్తు ద్వారా వెల్లడైంది. ఈ క్రమంలో గత ముగ్గురు సీఎంలను మించి కార్లు వినియోగిస్తున్నారని, ఇది వీఐపీ సంస్కృతికి నిదర్శనమని పేర్కొన్నాయి. సామాన్యుడి ప్రభుత్వం అంటే ఇదేనా అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా. ఆయన ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ‘షాకింగ్ విషయం.. 2007-17 వరకు సీఎం బాదల్ 33 వాహనాలను ఉపయోగించారు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆదే కొనసాగించారు. కానీ, ఆర్టీఐ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే.. సీఎం భగవంత్ మాన్ తన కాన్వాయ్‌లో 42 కార్లు ఉపయోగిస్తున్నారు.’ అని పేర్కొన్నారు పంజాబ్ అసెంబ్లీలో విపక్ష నేత ప్రతాప్ సింగ్. సెప్టెంబర్ 20, 2021 నుంచి మార్చి 16, 2022 వరకు సీఎంగా చేసిన చరణ్ జీత్ సింగ్ చన్నీ కెప్టెన్‌తో పోలీస్తే మరో ఆరు కార్లు ఎక్కువగా ఉనియోగించినట్లు చెప్పారు. భారీ స్థాయిలో కాన్వాయ్‌ని ఉపయోగించి పంజాబ్ ప్రజలకు సీఎ మాన్ ఏం చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రజల డబ్బును నిర్లక్ష్యంగా ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ప్రస్తుత పరిస్థితుల్లో భారీ కాన్వాయ్‌ని ఎలా ఉపయోగిస్తారు? అంటూ దుయ్యబట్టారు. అయితే.. ఈ విషయంపై ఎలాంటి సమాధానం ఇవ్వలేదు ఆమ్ ఆద్మీ పార్టీ. Shocking revelation- CM Badal had 33 vehicles when he was CM from 2007-17 in his cavalcade & there was no change in number of vehicles when Captain Amarinder S became the CM but it has been revealed through RTI that CM Mann “The so called Aam Aadmi” has 42 cars in his cavalcade. pic.twitter.com/lEFt6Ve3xm — Partap Singh Bajwa (@Partap_Sbajwa) September 28, 2022 ఇదీ చదవండి: పొలిటికల్ ట్విస్ట్.. ఆ ఆటోవాలాకు డబ్బులిచ్చి ప్రలోభ పెట్టారు? -
కోట్లమంది నమ్మకంగా ఉన్నా... కోట్లిస్తే మన ఎమ్మెల్యేలు నమ్మకంగా ఉండరనిపిస్తుంది సార్!
కోట్లమంది నమ్మకంగా ఉన్నా... కోట్లిస్తే మన ఎమ్మెల్యేలు నమ్మకంగా ఉండరనిపిస్తుంది సార్! -
విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం భగవంత్‌మాన్
ఛండీగఢ్: పంజాబ్ అసెంబ్లీలో ఇవాళ(మంగళవారం) కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నేతృత్వంలోని సర్కార్ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ సభ్యుల గోల నడుమ, బీజేపీ సభ్యుల వాకౌట్ నిరసనల మధ్య తీర్మానం ప్రవేశపెట్టారాయన. స్పీకర్ కుల్టార్‌సింగ్ సంధ్వాన్ అసెంబ్లీలో మాన్ ప్రవేశ పెట్టిన విశ్వాస తీర్మాన ప్రకటన చేయడంతో.. బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. విశ్వాస పరీక్ష, ఇతర పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను అక్టోబర్ 3వ తేదీ వరకు పొడిగించాలని బిజినెస్ అడ్వైజరీ కమిటీ(బీఏసీ)లో నిర్ణయించినట్లు స్పీకర్ ప్రకటించారు. కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభను హోరెత్తించారు. ఇదిలా ఉంటే.. సెప్టెంబర్ 22వ తేదీనే ప్రత్యేక సమావేశాల కోసం ఆప్ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే.. కేవలం విశ్వాస తీర్మానం కోసమని ప్రభుత్వం కోరిన నేపథ్యంలో గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ అందుకు అంగీకరించలేదు. సభ నిబంధనలు అందుకు అంగీకరించవని బీజేపీ, కాంగ్రెస్ గవర్నర్‌ను కోరడంతో.. ఆయన న్యాయ అభిప్రాయం తీసుకున్నారు. ఈలోపు ఆప్ ప్రభుత్వం గవర్నర్ నిర్ణయంపై, కేంద్రంలోని బీజేపీపై విరుచుకుపడింది. మరోవైపు బీజేపీతో పాటు కాంగ్రెస్ సైతం గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతించాయి. అయితే.. విశ్వాస తీర్మానంతో పాటు సభలో చర్చించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయని ప్రభుత్వం నివేదించడంతో.. గవర్నర్ సెప్టెంబర్ 27(ఇవాళ) నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు అనుమతులు ఇచ్చారు. ఇదిలా ఉంటే.. బీజేపీ తమ పార్టీలోని కనీసం పది మంది ఎమ్మెల్యేలను బీజేపీ పాతిక కోట్ల చొప్పున ఒక్కొక్కరికి ఇచ్చి పార్టీ మార్పించేందుకు ప్రయత్నించిందని, ఆపరేషన్ లోటస్‌ను తాము భగ్నం చేశామంటూ ఆప్ ప్రకటించుకుంది. ఈ క్రమంలోనే బలనిరూపణకు సిద్ధపడింది కూడా. అయితే పంజాబ్ బీజేపీ మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేసింది. ఆరు నెలల ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నాటకాలాడుతోందని విమర్శించింది బీజేపీ. మరోవైపు ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీపై ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలతో ఈమధ్యే బలనిరూపణలో నెగ్గింది కేజ్రీవాల్ ప్రభుత్వం. ఇదీ చదవండి: పాస్‌పోర్ట్ కోసం... ఆన్లైన్లోనే పీసీసీ దరఖాస్తు -
పంజాబ్ సీఎంకు బిగ్ రిలీఫ్.. అందుకు గవర్నర్ ఓకే!
చండీగఢ్: అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బల నిరూపణ చేసుకోవాలని భావిస్తున్న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు ఊరట లభించింది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి చివరి క్షణంలో నిరాకరించి ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ ఇచ్చిన గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్.. ఎట్టకేలకు ఓకే చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు ఆప్ ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్. ‘మా వినతికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈనెల 27న మంగళవారం అసెంబ్లీ మూడో సెషన్స్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.’అని పేర్కొన్నారు. అయితే.. ఈ ప్రత్యేక సమావేశాల్లో విశ్వాస పరీక్ష నిర్వహిస్తారా? లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియటం లేదని ఆప్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు.. సెప్టెంబర్ 27న ప్రారంభం కానున్న ప్రత్యేక సమావేశాలను రాష్ట్రంలోని పంట వ్యర్థాల కాల్చివేత, విద్యుత్తు రంగం సమస్యలపై చర్చించేందుకు ఉపయోగించుకుంటామని ఆప్ ప్రభుత్వం చెబుతోంది. బీజేపీ ఆపరేషన్ లోటస్ పేరుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోందన్న ఆరోపణల మధ్య తమ బల నిరూపణ చేసుకునేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ఆప్ ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 22న విశ్వాస పరీక్ష నిర్వహిస్తామని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. అయితే.. చివరి క్షణంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు నిరాకరించి.. ఆప్‌కు షాక్ ఇచ్చారు గవర్నర్ బన్వారి లాల్ పురోహిత్. దీంతో గవర్నర్‌పై తీవ్ర విమర్శలు చేశారు ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని దుయ్యబట్టారు. ఇదీ చదవండి: పంజాబ్ సీఎంకు షాక్.. ప్రత్యేక అసెంబ్లీ సెషన్‌కు గవర్నర్ నో.. -
సీఎంకు చివరి నిమిషంలో షాక్ ఇచ్చిన గవర్నర్
సాక్షి,న్యూఢిల్లీ: పంజాబ్ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. సెప్టెంబర్ 22న పంజాబ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశానికి అనుమతి నిరాకరించారు. విశ్వాస పరీక్ష ఎదుర్కొనేందుకు సీఎం భగవంత్ మాన్ ఈ సెషన్ నిర్వహించనున్నట్లు రెండు రోజుల క్రితమే ప్రకటించారు. ఇప్పుడు గవర్నర్ నిర్ణయంతో షాక్‌కు గురయ్యారు. అసెంబ్లీ సెషన్‌కు గవర్నర్ అనుమతి నిరాకరించడంపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మండిపడ్డారు. సభ నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించిందని, రెండు రోజుల క్రిత అనుమతి ఇచ్చిన గవర్నర్ ఇప్పుడు చివరి నిమిషంలో ఆదేశాలను ఎందుకు ఉపసంహరించుకున్నారని ప్రశ్నించారు. పంజాబ్‌లో ఆపరేషన్ లోటస్ విఫలమైందని, అందుకే కేంద్రం నుంచి ఒత్తిడితోనే గవర్నర్ ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఈమేరకు ట్వీట్ చేశారు. తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25కోట్లు ఆశజూపారని పంజాబ్ మంత్రి అన్నారు. ఈ నేపథ్యంలోనే తమ బలం నిరూపించుకునేందుకు విశ్వాస పరీక్ష ఎదుర్కొంటామని, ఇందుకోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహిస్తామని సీఎం భగవంత్ మాన్ ఇటీవల ప్రకటించారు. ఇదే ఆరోపణలతో ఢిల్లీ అసెంబ్లీలో సెప్టెంబర్ మొదటివారంలోనే విశ్వాసపరీక్ష ప్రవేశపెట్టి బలం నిరూపించుకున్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. తమ పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీ ప్రలోభాలకు లొంగలేదని స్పష్టం చేశారు. చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై అశోక్ గహ్లోత్ కీలక వ్యాఖ్యలు -
పంజాబ్ సీఎం నిజంగానే ఫుల్లుగా తాగారా? పౌర విమానయాన శాఖ దర్యాప్తు!
సాక్షి, న్యూఢిల్లీ: ఫుల్లుగా తాగి నడవలేని స్థితిలో ఉన్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను జర్మనీలోని ఎయిర్‌పోర్టులో విమానం నుంచి దించేశారని సోమవారం ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్షాలు శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించాయి. తాజాగా పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విషయం స్పందించారు. పంజాబ్ సీఎంపై వచ్చిన ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయని సింధియా తెలిపారు. అయితే ఈ ఘటన విదేశీ గడ్డపై జరిగినందున అసలు నిజానిజాలు ఏంటో తెలుసుకోవాల్సి ఉందన్నారు. లుఫ్తాన్సా విమానయాన సంస్థ వివరాలు వెల్లడించాల్సి ఉందన్నారు. దీనిపై విచారణ జరిపించాలని తనకు విజ్ఞప్తులు అందాయని, కచ్చితంగా దర్యాప్తు చేయిస్తామని స్పష్టం చేశారు. ఏం జరిగింది? జర్మనీ పర్యటన ముగించుకుని సోమవారం ఢిల్లీకి తిరిగివచ్చారు భగవంత్ మాన్. అయినే ఫుల్లుగా తాగి ఉన్న కారణంగా ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్‌పోర్టులో విమానం నుంచి దించేశారని, దీనివల్ల నాలుగు గంటలు ప్రయాణానికి ఆలస్యమైందని మీడియాలో వార్తలొచ్చాయి. దీంతో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. భగవంత్ మాన్ పంజాబీల పరువు తీశారని శిరోమణి ఆకాలీదళ్ ధ్వజమెత్తింది. అయితే లుఫ్తాన్సా సంస్థ దీనిపై స్పష్టత ఇచ్చింది. విమానాన్ని మార్చాల్సి రావడం వల్లే ఆలస్యం అయిందని చెప్పింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఆరోపణలను ఖండించించి. పంజాబ్ సీఎంను అప్రతిష్టపాలు చేసేందుకే కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగింది. భగవంత్ మాన్ సోమవారం జర్మనీ నుంచి ఢిల్లీకి చేరుకుని నేరుగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. చదవండి: మాట్లాడింది మమతేనా? మోదీకి సపోర్ట్ చేయడమేంటి? -
ఆప్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఫోన్! విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్న సీఎం
చండీగఢ్: ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ నెల మొదట్లో ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బలం నిరూపించుకున్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఇప్పుడు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా విశ్వాస పరీక్షకు సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ 22న(గురువారం) పంజాబ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. పంజాబ్ ప్రజల కలలను సాకారం చేసేందుకు ఆప్ ఎమ్మెల్యేలు కృత నిశ్చయంతో ఉన్నారని రుజువు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు. ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన ఈమేరకు వీడియో సందేశం పంపారు. ਲੋਕਾਂ ਦੇ ਵਿਸ਼ਵਾਸ ਦੀ ਦੁਨੀਆਂ ਦੀ ਕਿਸੇ ਕਰੰਸੀ ਵਿੱਚ ਕੋਈ ਕੀਮਤ ਨਹੀਂ ਹੁੰਦੀ …22 September ਦਿਨ ਵੀਰਵਾਰ ਨੂੰ ਪੰਜਾਬ ਵਿਧਾਨ ਸਭਾ ਦਾ ਸਪੈਸ਼ਲ ਸ਼ੈਸ਼ਨ ਬੁਲਾ ਕੇ ਵਿਸ਼ਵਾਸ ਮਤਾ ਪੇਸ਼ ਕਰਕੇ ਕਾਨੂੰਨੀ ਤੌਰ ‘ਤੇ ਇਹ ਗੱਲ ਸਾਬਤ ਕਰ ਦਿੱਤੀ ਜਾਵੇਗੀ…ਇਨਕਲਾਬ ਜ਼ਿੰਦਾਬਾਦ..! pic.twitter.com/VM2zA1upDP — Bhagwant Mann (@BhagwantMann) September 19, 2022 తమ ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదిస్తోందని పంజాబ్ ఆర్థిక మంత్రి హర్పాల్ సింగ్ ఛీమ ఇటీవలే ఆరోపించారు. ఒక్క ఎమ్మెల్యేలకు రూ.25 కోట్లు ఇస్తామని ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. దాదాపు 11 మంది ఆప్ ఎమ్మెల్యేలకు బీజేపీ నుంచి ఫోన్ వచ్చినట్లు చెప్పారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందన్నారు. కాగా.. ఈ నెలలోనే ఢిల్లీ అసెంబ్లీలో బలం నిరూపించుకున్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. అనంతరం ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీ ప్రలోభాలకు తలొగ్గలేదని చెప్పారు. ఈ విశ్వాస పరీక్షలో ఆప్‌కు 58 ఓట్లు వచ్చాయి. మరో నలుగురు ఎమ్మెల్యేలు వ్యక్తిగత కారణాలతో అసెంబ్లీకి హాజరు కాలేదు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 సీట్లు కాగా.. ఆప్‌కు 62, బీజేపీకి 8 మంది సభ్యులున్నారు. చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరిలో శశి థరూర్! సోనియాతో కీలక భేటీ -
పంజాబ్ సీఎంపై సంచలన ఆరోపణలు... ఆయన ఫుల్‌గా తాగింది నిజమేనా?
చండీగఢ్: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ జర్మనీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఐతే ఆయన ఢిల్లీలోని ఆప్ జాతీయ సమావేశానికి హాజరుకావాల్సి ఉండగా...సమయానికి పర్యటన ముగించుకుని రాలేకపోయారు. అంతేకాదు ఆయన అనారోగ్యంతో ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి తిరిగి రావడం ఆలస్యం అయ్యిందని సీఎం కార్యాలయం కూడా వెల్లడించింది. ఐతే సీఎం భగవంత్ మాన్ మద్యం మత్తులో ఉన్నందునే ఆలస్యమైందని, ఆయన్ను ఫ్లైట్ నుంచి దించేశారంటూ పలు వార్తలు గుప్పుమన్నాయి. అందువల్లే ఆయన ఢిల్లీకి రావడం ఆలస్యమైందంటూ వార్తలు ఊపందుకున్నాయి. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్షాలు ఆప్‌ని డిమాండ్ చేశాయి. ఈ మేరకు భగవంత్ మాన్ సహా ప్రయాణికుడు ఆయన ఫుల్ తాగి ఉండటం వల్ల లుఫ్తానా ఎయిర్ పోర్టులో భగవంత్ మాన్‌ను విమానం నుంచి దించేశారని, పైగా ఆయన నడవలేకపోవడంతో భార్య, భద్రతా సిబ్బంది సాయం కూడా తీసుకున్నారని ట్విట్టర్లో పేర్కోన్నాడు. ఈ పోస్ట్‌ని కాంగ్రెస్ పార్టీ షేర్ చేస్తూ ఆప్‌ని ఈ విషయం పై క్లారిటీ ఇవ్వాల్సిందేనని పట్టుపట్టింది. ఈ క్రమంలో అకాలీదళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ భగవంత్ మాన్‌పై విమర్శలతో విరుచుకుపడ్డాడు. భగవంత్ మాన్ తీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పంజాబీలను సిగ్గుపడేలా చేసిందన్నారు. భారత ప్రభుత్వం ఈ విషయంపై జోక్యం చేసుకుని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. అంతేగాదు జర్మనీ దేశాన్ని ఈ విషయమై విచారించాలంటూ పెద్ద ఎత్తున్న విమర్శలు ఎక్కుపెట్టారు. ఐతే ఆప్ అధికార ప్రతినిధి మల్విందర్‌సింగ్ కాంగ్ మాట్లాడుతూ....సీఎం సెప్టెంబర్ 19న షెడ్యూల్ ప్రకారం తిరిగి వచ్చారు. మాన్ తన విదేశీ పర్యటనలతో విదేశీ పెట్టుబడులు తీసుకువస్తున్నారన్న అక్కసుతో ప్రతిపక్షాలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. అంతగా కావలనుకుంటే లుఫ్తాన్స్ ఎయిర్‌లైన్స్‌లో తనిఖీ చేసుకోండి అని సవాలు విసిరారు. A Big Shame!! Punjab Chief Minister Bhagwant Mann deplaned because he was heavily Drunk pic.twitter.com/7PaPSiVDtb — Delhi Congress (@INCDelhi) September 19, 2022 (చదవండి: చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ ఘటన.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. మహిళా అధికారులతో సిట్) -
వారితో టచ్‌లో ఉన్నా.. దయచేసి వదంతులు నమ్మొద్దు: పంజాబ్ సీఎం
చండీగఢ్: చండీగఢ్ యూనివర్సిటీలో అమ్మాయిల ప్రైవేటు వీడియోల లీక్ వ్యవహారంపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ స్పందించారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించిటన్లు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు చెప్పారు. 'చండీగఢ్ యూనివర్సిటీ ఘటన దురదృష్టకరం. మన బిడ్డలే మనకు గర్వకారణం. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించాం. దోషులుగా తేలినవారిపై అత్యంత కఠినచర్యలు తీసుకుంటాం. అధికారయంత్రాంగంతో నేను టచ్‌లోనే ఉన్నా. దయచేసి వదంతులు నమ్మొద్దు' అని భగవంత్ మాన్ హిందీలో ట్వీట్ చేశారు. चंडीगढ़ यूनिवर्सिटी की घटना सुनकर दुख हुआ...हमारी बेटियां हमारी शान हैं...घटना की उच्च स्तरीय जांच के आदेश दे दिए हैं..जो भी दोषी होगा सख्त कार्रवाई करेंगे... मैं लगातार प्रशासन के संपर्क में हूं...मैं आप सब से अपील करता हूं कि अफवाहों से बचें... https://t.co/kgEGszUhAq — Bhagwant Mann (@BhagwantMann) September 18, 2022 చండీగఢ్ యూనివర్సిటీలో 60 మంది అమ్మాయిల ప్రైవేటు వీడియోలు లీకైనట్లు వార్తలు రావడం తీవ్రదుమారం రేపింది. దీనిపై యూనివర్సిటీ విద్యార్థినులు ఆందోళనకు దిగడం ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే యూనివర్సిటీ యాజమాన్యం ఈ ఆరోపణలను కొట్టి పారేసింది. ఒక్క అమ్మాయి వీడియో మాత్రమే లీకైనట్లు వెల్లడించింది. మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పింది. అలాగే యూనివర్సిటోలో ఏ ఒక్క విద్యార్థిని కూడా ఆత్మహత్య చేసుకోలేదని, ఆస్పత్రిలో కూడా చేరలేదని ప్రకటనలో తెలిపింది. చదవండి: 60 మంది అమ్మాయిల వీడియోలు లీక్..? స్పందించిన యూనివర్సిటీ -
సాక్షి కార్టూన్ 23-07-2022
ఒక్కసారి తాగితేనే మీ పరిస్థితి ఇలా ఉంది!.. జనం ఎలా తాగుతున్నార్సార్!! -
అందుకే పంజాబ్ సీఎం ఆస్పత్రి పాలయ్యారా?
ఛండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(48) కడుపు నొప్పితో ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయనకు ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యులు నిర్ధారించారు కూడా. అయితే ఇప్పుడు ఆ ఇన్ఫెక్షన్కు కారణం ఏంటో బయటకు వచ్చింది. పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్.. పట్టణాలు, గ్రామాల నుంచి వచ్చే మురుగు వ్యర్థాలతో కూడిన నీటిని పంజాబ్ ముఖ్యమంత్రి నిరభ్యంతరంగా తాగారని, అందుకే ఆయనకు ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యులు పేర్కొన్నట్లు సమాచారం. ఈ మేరకు.. ఆయనకు సంబంధించిన వీడియో కూడా ఒకటి వైరల్ అవుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ఆ ట్వీట్లో పార్టీ సభ్యుల నినాదాల మధ్య ఆయన గ్లాస్ నీటిని తీసుకుని తాగారు. రాజ్యసభ ఎంపీ, ప్రముఖ పర్యావరణవేత్త బాబా బల్బీర్ సింగ్ సుల్తాన్పూర్ లోధీలో చేపట్టిన కాళి బెన్ శుభ్రత కార్యక్రమంలోనిది ఆ వీడియో. అది జరిగిన వారంలోపే ఆయన ఆస్పత్రి పాలు కావడం విశేషం. అయితే ఆయన ఆస్పత్రి పాలుజేసింది ఆ నీరేనా? అన్నది నిర్ధారణ కావాల్సి ఉంది. ਗੁਰੂ ਨਾਨਕ ਸਾਹਿਬ ਦੀ ਚਰਨ ਛੋਹ ਪ੍ਰਾਪਤ ਧਰਤੀ ਸੁਲਤਾਨਪੁਰ ਲੋਧੀ ਵਿਖੇ ਪਵਿੱਤਰ ਵੇਈਂ ਦਾ ਪਾਣੀ ਪੀਂਦੇ ਹੋਏ CM @BhagwantMann ਜੀ ਪਵਿੱਤਰ ਵੇਈਂ ਨੂੰ ਸਾਫ਼ ਕਰਨ ਦਾ ਬੀੜਾ ਰਾਜ ਸਭਾ ਮੈਂਬਰ ਸੰਤ ਸੀਚੇਵਾਲ ਜੀ ਨੇ ਚੁੱਕਿਆ ਹੋਇਆ ਹੈ pic.twitter.com/4LnU0U66wQ — AAP Punjab (@AAPPunjab) July 17, 2022 -
Bhagwant Mann: ఆస్పత్రిలో చేరిన పంజాబ్ సీఎం
ఢిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(48) ఆస్పత్రి పాలయ్యారు. అస్వస్థతతో ఆయన బుధవారం ఉదయమే ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. కడుపు నొప్పి రావడంతో ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో చేరారు పంజాబ్ సీఎం మాన్. ఆయనకు ఇన్ఫెక్షన్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉంటే.. దగ్గరి బంధువైన డాక్టర్ గురుప్రీత్ కౌర్(32)ను మాన్ ఈమధ్యే రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు ఆస్పత్రిలో ఉండగానే సీఎం భగవంత్ మాన్ ఓ ప్రకటన విడుదల చేశారు. సింగర్ సిద్ధూ మూసేవాలా హంతకుల్లో ఇద్దరిని, యాంటీ గ్యాంగ్‌స్టర్ టాస్క్‌ఫోర్స్ బుధవారం అమృత్‌సర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మట్టుపెట్టినందుకు అభినందనలు తెలియజేశారు. ఇదీ చదవండి: పంజాబ్ ఎన్కౌంటర్: సిద్ధూ హంతకులకు మట్టుబెట్టారిలా.. -
Gurpreet kaur: పెళ్లైన మరుసటి రోజే అకౌంట్ బ్లాక్ చేసిన సీఎం భార్య
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భార్య.. డాక్టర్ గురుప్రీత్ కౌర్(32) మరోసారి వార్తల్లో నిలిచారు. వివాహం జరిగిన మరుసటి రోజే ఆమె తన ట్విట్టర్ ఖాతాను నిలిపివేశారు. దీంతో, ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. కాగా, పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. గురువారం రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో, డాక్టర్ గురుప్రీత్ కౌర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు. నెటిజన్లు ఆమె గురించి వివరాల కోసం తెగ వెతికేశారు. ఇదిలా ఉండగా.. వివాహం సందర్బంగా గురుప్రీత్ కౌర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో మెహందీ, పెళ్లికి సంబంధించిన ఫొటోలను పోస్టు చేశారు. అంతేకాకుండా పెళ్లికి ముందు సీఎం మాన్, ఆయన తల్లి హర్పాల్ కౌర్‌తో దిగిన ఫొటోలను కూడా ఆమె షేర్ చేశారు. అయితే, సీఎం మాన్ భార్య కావడం, ఎంతో ఫేమస్ అవడంతో ఆమె ట్విట్టర్ ఖాతాను ఫాలో చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఒక్కసారిగా ఆమె ట్విట్టర్ అకౌంట్ కనిపించకుండా పోయింది. దీంతో, సోషల్ మీడియాలో నెటిజన్లు ఖంగుతిన్నారు. ఆమె ఎందుకు ఇలా చేశారని ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, ఫాలోవర్ల సంఖ్య పెరగడం కారణంగానే ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ అయినట్టు సమాచారం. Dr. Gurpreet Kaur TDr. Gurpreet Kaur Twitter Account : ਭਗਵੰਤ ਮਾਨ ਦੀ ਪਤਨੀ ਡਾ. ਗੁਰਪ੍ਰੀਤ ਕੌਰ ਦੇ ਨਾਂ ‘ਤੇ ਬਣਿਆ ਟਵਿੱਟਰ ਅਕਾਊਂਟ ਸਸਪੈਂਡwitter Account : ਭਗਵੰਤ ਮਾਨ ਦੀ ਪਤਨੀ ਡਾ. ਗੁਰਪ੍ਰੀਤ ਕੌਰ ਦੇ ਨਾਂ ‘ਤੇ ਬਣਿਆ ਟਵਿੱਟਰ ਅਕਾਊਂਟ ਸਸਪੈਂਡ https://t.co/eJxCVX3wgK — PREETNAMA (@preetchouhan346) July 8, 2022 ఇక, ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ అవడంపై సీఎం మాన్ కానీ, ఆయన భార్య కానీ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. ఇక, డాక్టర్ గురుప్రీత్ కౌర్ 2018 నుంచి ట్విట్టర్లో యూజర్‌గా అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. కానీ, రెండేళ్లలో ఆమె ప్రత్యేకంగా ట్వీట్ ఏమీ చేయలేదు, పోస్ట్‌లను మాత్రం రీట్వీట్ చేసింది. అదే సమయంలో, ఆమె తనను తాను రైతు కుమార్తెగా అభివర్ణించింది. -
సీఎం పగ్గాల తర్వాత లగ్గం చేసుకుంది వీళ్లే!
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(49) వివాహం ఇవాళ వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. దగ్గరి బంధువు డాక్టర్ గుర్ప్రీత్ కౌర్(32)తో కొద్దిమంది సమక్షంలోనే ఆయన వివాహం జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో ఆయన వివాహం జరగడం చర్చనీయాంశంగా మారగా.. గతంలోనూ ఇలా రాజకీయంగా అత్యున్నత హోదాలో ఉండి.. మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రముఖులు చాలా మందే ఉన్నారు. హెచ్డీ కుమారస్వామి జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామి.. కర్ణాటక ముఖ్యమంత్రిగా 2006-07 మధ్య కాలంలో పని చేశారు. 1986లోనే ఆయనకు వివాహం అయ్యింది. అయితే.. 2006లో ఆయన కన్నడ నటి రాధికను రహస్యంగా రెండో వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత రాధిక తనంతట తానుగా ప్రకటించేదాకా ఈ విషయం బయటకు తెలీలేదు. ఆ తర్వాత కుమారస్వామి కూడా ఆ విషయాన్ని అంగీకరించారు. వీర్‌భద్ర సింగ్ హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో తిరుగులేని నేత ఈయన. 1962, 1967, 1971లో.. మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే 1983లో వీర్‌భద్ర సింగ్.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఏడేళ్లపాటు సీఎంగా ఉన్నారు. ఆ సమయంలోనే 1985లో ప్రతిభా సింగ్‌ను రెండో వివాహం చేసుకున్నారు ఆయన. మొదటి భార్య రత్నకుమారి(జుబ్బల్ యువరాణి) అప్పటికే అనారోగ్యంతో మరణించింది. ప్రతిభా సింగ్ ఎవరో కాదు.. మండి లోక్ సభ ఎంపీ. బాబుల్ సుప్రియో మాజీ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో. 2015లో మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న ఈయన.. 2019లో మోదీ కేబినెట్లో కేంద్ర మంత్రిగా ఉండగానే ఎయిర్ హోస్టెస్ రచనా శర్మను రెండో వివాహం చేసుకున్నారు. ముంబై నుంచి కోల్‌కతా మధ్య ఫ్లైట్‌లో ప్రయాణించేప్పుడు వాళ్ల మధ్య పరిచయం అయ్యింది. చందర్ మోహన్ హర్యానా మాజీ ఉప ముఖ్యమంత్రి. ఈయన వివాహ జీవితం వివాదాస్పదంగా నిలిచింది. 2008లో మంత్రి పదవిలో ఉన్నప్పడు.. ప్రేయసి అనురాధా బాలి కోసం మతం మార్చుకున్నాడు ఆయన. భార్య సీమా భిష్ణోయ్ సమ్మతితోనే.. చాంద్ మొహమ్మద్, ఫిజా(అనురాధా బాలి)గా ఇద్దరూ పేర్లు మార్చుకుని మరీ వివాహం చేసుకున్నారు. కానీ, ఈ చర్య ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఘోరంగా దెబ్బ తీసింది. అయితే ఈ ప్రేమ కథ ఎన్నోరోజులు సాఫీగా సాగలేదు. కొన్నిరోజులకే ఇద్దరూ విడిపోగా.. 2012లో బాలి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ప్రఫుల్లా కుమార్ మహంతా అస్సాం మాజీ ముఖ్యమంత్రి. 1985 డిసెంబర్ నుంచి 1990 వరకు ఆయన సీఎంగా విధులు నిర్వహించారు. సీఎంగా ఉన్న టైంలో 1988లో జయశ్రీ గోస్వామి మహంతను ఆయన వివాహం చేసుకున్నారు. రైటర్ అయిన జయశ్రీ గోస్వామి.. ఆ తర్వాత రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు కూడా. అయితే.. అసెంబ్లీ సెక్రటేరియెట్ ఎంప్లాయి సంఘమిత్ర భరాలిని ఆయన రహస్యంగా రెండో వివాహం చేసుకున్నారన్న ఆరోపణలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. భార్య జయశ్రీ గోస్వామితో ప్రఫుల్లా కుమార్ మహంతా -
డాక్టర్‌ను రెండోపెళ్లి చేసుకున్న పంజాబ్ సీఎం, కేజ్రీవాల్ శుభాకాంక్షలు
చండీగఢ్: పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ రెండో పెళ్లి చేసుకున్నారు. డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను ఆయన పరిణయమాడారు. చండీగఢ్‌లోని గురుద్వారాలో అతికొద్ది మంది సమక్షంలో ఈ విహహం జరిగింది. పెళ్లి దుస్తుల్లో మెరిసిపోతున్న భగవంత్ ఫోటోను ఆప్ నేత రాఘవ్ చద్దా ట్విట్టర్లో పోస్టు చేశారు. ఇందులో బంగారు వర్ణం దుస్తులు, పసుపు రంగు టర్బన్‌ను ధరించి వెలిగిపోయారు పంజాబ్ సీఎం. భగవంత్‌మాన్ వివాహం సిక్కుల సంప్రదాయం ప్రకారం నిరాడంబరంగా జరిగింది. ఆయన తల్లి, సోదరి, అతికొద్ది మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుటుంబంతో పాటు ఇతర పార్టీ నేతలు ఈ వేడుకకు వెళ్లినవారిలో ఉన్నారు. ఈరోజు నుంచి కొత్త జీవితం ప్రారంభించబోతున్న భగవంత్ మాన్కు శుభాకాంక్షలు అని కేజ్రీవాల్ మీడియాకు తెలిపారు. Chandigarh | Wedding rituals underway of Punjab CM Bhagwant Mann with Dr. Gurpreet Kaur pic.twitter.com/4QjnNsRXtg — ANI (@ANI) July 7, 2022 AAP convenor and Delhi CM Arvind Kejriwal arrives in Mohali ahead of party leader and Punjab CM Bhagwant Mann's wedding which will be held in Chandigarh..."He is embarking on a new journey today, I wish him a happy married life," he says pic.twitter.com/YowaFASB8V — ANI (@ANI) July 7, 2022 అంతకుముందు తన సోదరుడికి పెళ్లి జరగడం చాలా సంతోషంగా ఉందని ఆప్ నేత రాహుల్ చద్దా తెలిపారు. భగవంత్ మాన్ రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభించాలనేది ఆయన తల్లి కల అని, ఇప్పుడు అది నెరవేరడం ఆనందంగా ఉందన్నారు. మరి ఆమ్ ఆద్మీ పార్టీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అయిన మీ పెళ్లి ఎప్పుడు అని చద్దాను ట్విట్టర్లో ఓ జర్నలిస్ట్ అడిగారు. ముందు పెద్దవాళ్ల పెళ్లి జరిగిన తర్వాతే చిన్నవాళ్లు చేసుకుంటారని ఆయన చమత్కరించారు. Waheguru Ji Apne Bacche Utte Aashirwad Banaye Rakheo 🙏🏻 pic.twitter.com/snnmdTi1sw — Raghav Chadha (@raghav_chadha) July 7, 2022 పసందైన విందు భగవంత్ పెళ్లిలో అతిథులకు భారతీయ, ఇటాలియన్ వంటలు సిద్ధం చేయించారు. కరాహీ పనీర్, తందూరి కుల్చే, దాల్ మఖానీ, నవరత్న బిర్యానీ, మౌసమీ సబ్జీలు, ఆప్రికాట్ స్టఫ్డ్ కోఫ్తా, లసగ్న సిసిలియానో, బుర్రానీ రైత వంటి రకరాకల వంటలు తయారు చేశారు. Saade veer da vyah Saanu gode gode chah pic.twitter.com/0c09v6YG4N — Raghav Chadha (@raghav_chadha) July 7, 2022 -
పంజాబ్ సీఎం మాన్ రెండో పెళ్లి.. వధువు వివరాలు ఇవే..
Details About Bride Gurpreet Kaur.. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(49) పెళ్లి పీటలు ఎక్కనున్నారు. డాక్టర్ గురుప్రీత్ కౌర్ అనే యువతితో గురువారం సీఎం మాన్ వివాహం జరుగనుంది. ఛండీగడ్‌లో.. అతి తక్కువ మంది సభ్యుల మధ్య వీరి వివాహం జరుగనున్నట్టు తెలుస్తోంది. కాగా, సీఎం భగవంత్ మాన్కు ఇది రెండో వివాహం. మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న 7 ఏళ్ల తర్వాత భగవంత్ మాన్ రెండో వివాహం చేసుకుంటున్నారు. ఇంద్రప్రీత్ కౌర్‌ను మొదటి వివాహం చేసుకుని.. వ్యక్తిగత కారణాలతో 2015లో విడాకులు ఇచ్చారు. ఈ జంటకు ఒక పాప, బాబు ఉన్నారు. కాగా, రెండో వివాహం చేసుకోబోతున్న గురుప్రీత్ కౌర్ గురించి సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఆమె ఎవరూ అనేది హాట్ టాపిక్‌గా మారింది. అయితే, గురుప్రీత్ కౌర్(32).. కుటుంబం కురుక్షేత్రలోని పెహ్వా ప్రాంతానికి చెందినది. ఆమె తండ్రి.. ఇంద్రజీత్ సింగ్ ఓ రైతు కాగా ఆమె తల్లి మాతా రాజ్కౌర్ గృహిణి. గురుప్రీత్ కౌర్‌కు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. వారిద్దరూ విదేశాల్లో సెటిల్ అయ్యారు. మెడిసిన్ చదివిన గురుప్రీత్ కౌర్.. గోల్డ్ మెడల్ సాధించినట్టు ఆమె.. మేనమామ గురీందర్ జీత్ తెలిపారు. ఇదిలా ఉండగా.. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి భగవంత్ మాన్కు గురుప్రీత్ కౌర్ సహాయం చేసినట్టు సమాచారం. Bhagwant Mann’s Wedding Tomorrow: 5 Things About The Bride Gurpreet Kaur https://t.co/1YnExWs7uX — VB WEB AND SOFTWARE SOLUTIONS (@seoraval) July 6, 2022 -
పెళ్లి పీటలు ఎక్కనున్న పంజాబ్ సీఎం
ఛండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(49) పెళ్లి పీటలు ఎక్కనున్నారు. డాక్టర్ గురుప్రీత్ కౌర్ అనే యువతితో ఆయన వివాహం గురువారం ఛండీగడ్‌లో .. అతి తక్కువ మంది సభ్యుల మధ్య జరగనుందని తెలుస్తోంది. వధువు ఫ్యామిలీ ఫ్రెండ్ అని, చాలా ఏళ్ల నుంచి వీళ్లద్దరికీ పరిచయం ఉందని తెలుస్తోంది. కాగా, ఆయనకిది రెండో వివాహం. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు ఆప్ నేతలు, పంజాబ్ రాజకీయ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. సీఎం భగవంత్ మాన్‌కి ఇది రెండో వివాహం. ఆరేళ్ల కిందట ఆయన విడాకులు తీసుకున్నారు. ఇంద్రప్రీత్ కౌర్‌ను మొదటి వివాహం చేసుకుని.. వ్యక్తిగత కారణాలతో 2015లో విడాకులు ఇచ్చారు. ఈ జంటకు ఒక పాప, బాబు ఉన్నారు. Punjab CM Bhagwant Mann will get married in a close private ceremony at his house in Chandigarh tomorrow with Dr Gurpreet Kaur. CM Delhi & AAP National convener Arvind Kejriwal will be in attendance. CM Mann was divorced from his earlier marriage almost 6 years back. (file pic) pic.twitter.com/tC3Zd2LGfv — ANI (@ANI) July 6, 2022 -
మందుబాబులకు గుడ్ న్యూస్, భారీగా తగ్గనున్న ధరలు
చండీగఢ్: పంజాబ్ రాష్ట్రం మద్యం బాబులకు గుడ్ న్యూస్ చప్పింది. పంజాబ్‌లోని ఆమ్ఆద్మీ సర్కార్ సరికొత్త ఎక్సైజ్ పాలసీ 2022-23ని విడుదల చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పంజాబ్ క్యాబినెట్ ఆమోదించింది, ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 40 శాతం అధికంగాఆమోదించింది. జులై 1వ తేదీ నుంచి ఈ సరికొత్త మద్యం పాలసీ అమల్లోకి రానుంది. ముఖ్యంగా 35 నుంచి 60 శాతం వరకు ధరలను తగ్గించేలా సరికొత్త మద్యం పాలసీని ప్రకటించింది. ఈ కొత్త విధానం వల్ల 2021-22లో రూ.6,158 కోట్ల ఆదాయం రాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.9,647.85 కోట్లకు చేరుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. పంజాబ్‌లో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సారథ్యంలోని ఆప్ సర్కార్ మద్యం పాలసీని తీసుకురావడమేకాదు, కొన్నినిర్మాణాత్మక చర్యలను ప్రతిపాదించింది. లాట్ల ద్వారా మద్యం విక్రయాలను కేటాయించే బదులు, టెండర్లను ఆహ్వానించడంద్వారా వేలం వేయనుంది. అలాగే డిస్టిల్లర్లు, మద్యం పంపిణీదారులు, మద్యం రిటైలర్లు డీలింక్ చేయనుంది. అంతేకాదు రాష్ట్రంలో కొత్త డిస్టిలరీల ప్రారంభంపై నిషేధాన్ని కూడా ప్రభుత్వం ఎత్తివేసింది. పంజాబ్ మీడియం లిక్కర్ (పిఎంఎల్) మినహా అన్ని రకాల మద్యంపై ఒక శాతం ఎక్సైజ్ సుంకం వసూలు చేయనుంది. హర్యానా నుంచి రాష్ట్రంలోకి అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని అరికట్టడమే దీని లక్ష్యమని పంజాబ్ ప్రభుత్వం చెబుతోంది. మద్యం ధరల తగ్గుదలతో ఎక్సైజ్ ఆదాయాన్ని 40 శాతం పెంచుకోవాలని భావిస్తోంది. ఈ పాలసీ తొమ్మిది నెలల పాటు 2023, 31 మార్చి వరకు అమల్లో ఉంటుంది. మద్యం కల్తీ, స్మగ్లింగ్, అక్రమ డిస్టిలరీలను అరికట్టేందుకు డిపార్ట్మెంట్లోని ఎన్ఫోర్స్మెంట్ వింగ్‌ను పటిష్టం చేస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ వరుణ్ రూజం తెలిపారు. ఇందుకోసం పోలీసు శాఖకు రెండు అదనపు బెటాలియన్లు కేటాయించనున్నామన్నారు. ఫలితంగా హర్యానా కంటే10-15 శాతం తక్కువగా ధరలు ఉండ నున్నాయి. కొన్ని బ్రాండ్ల ధరలు పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఉంటాయి. అదేవిధంగా ఎక్కువగా వాడే ఇండియన్ ఐఎంఎఫ్ఎల్ ధర కూడా భారీగా తగ్గనుంది. తాజాగా ప్రకటించిన మద్యం పాలసీ ప్రకారం పంజాబ్‌లో ఐఎంఎఫ్ఎల్ ధర 400 రూపాయలకు దిగిరానుంది. -
కాంగ్రెస్ నేతల రక్తంలోనే అనినీతి ఉంది: సీఎం సంచలన కామెంట్స్
పంజాబ్‌లో పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చాక వినూత్న సీఎం భగవంత్ మాన్ వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో పంజాబ్‌లో కాంగ్రెస్ నేతల సీఎం భగవంత్ మాన్ నివాసం ఎదుట నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలను గురువారం మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని సెక్టార్-3లోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో కాంగ్రెస్ నేతలు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా సీఎం మాన్ స్పందించారు. కాంగ్రెస్ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముడుపుల కేసులను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేతలకు మద్దతుగా ఆ పార్టీ నేతలు తన నివాసం వద్ద నిరసన చేపట్టారని మండిపడ్డారు. పంజాబ్‌ను అక్రమంగా దోచుకుతిన్న వారిని కాపాడటానికి కాంగ్రెస్ ఇలా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు తమ రక్తంలోనే అవినీతి ఉందని నిరూపించుకున్నారని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అవినీతి కాంగ్రెస్ నేతలకు హక్కుగా మారిందని సీఎం ఫైర్ అయ్యారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేతలు.. మాజీ మంత్రి సాధు సింగ్ ధరమ్‌సోత్ అరెస్ట్ వ్యవహారంపై మాట్లాడేందుకు తమకు అపాయింట్మెంట్ ఇచ్చిన సీఎం భగవంత్ మాన్.. తర్వాత తమతో భేటీకి నిరాకరించారని ఆరోపించారు. కాగా, దళిత స్కాలర్షిప్ స్కీముల్లో కోట్లాది రూపాయల స్కామ్‌కు ప్రధాన సూత్రధారిగా సాధుసింగ్‌ను విజిలెన్స్ బ్యూరో అరెస్ట్ చేసింది. ਮੈਨੂੰ ਦੁੱਖ ਹੈ ਕਿ ਬਿਨਾਂ ਸਮਾਂ ਲਏ ਪੰਜਾਬ ਦੀ ਬਚੀ ਖੁਚੀ ਕਾਂਗਰਸ ਅੱਜ ਰਿਸ਼ਵਤ ਦੇ ਕੇਸਾਂ ਦਾ ਸਾਹਮਣਾ ਕਰ ਰਹੇ ਆਪਣੇ ਲੀਡਰਾਂ ਦੇ ਹੱਕ ਵਿੱਚ ਮੇਰੇ ਘਰ ਧਰਨਾ ਦੇਣ ਆਈ ਪੰਜਾਬ ਲੁੱਟਣ ਵਾਲਿਆਂ ਦਾ ਸਾਥ ਦੇਣਾ ਇਹ ਸਬੂਤ ਹੈ ਕਿ ਰਿਸ਼ਵਤ ਇਹਨਾਂ ਦੇ ਖੂਨ ਵਿੱਚ ਹੈ.ਨਾਅਰੇ ਲਾ ਰਹੇ ਸਨ ਕਿ ਸਾਡੇ ਹੱਕ ਐਥੇ ਰੱਖ ਮਤਲਬ ਰਿਸ਼ਵਤਖੋਰੀ ਕਾਂਗਰਸ ਦਾ ਹੱਕ ਹੈ ? — Bhagwant Mann (@BhagwantMann) June 9, 2022 ఇది కూడా చదవండి: ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌పై కేసు నమోదు -
పంజాబ్ మాజీ మంత్రి అరెస్ట్, నెల క్రితమే సీఎం వార్నింగ్
చండీఘడ్: అవినీతి ఆరోపణలపై పంజాబ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సాధు సింగ్ ధరమ్‌సోత్ అరెస్టయ్యారు. మంగళవారం తెల్లవారుజామున రాష్ట్ర విజిలెన్స్ బ్యూరో ధరమ్సోతను అరెస్ట్ చేసింది. అతనితో పాటు సహాయకుడిగా పనిచేస్తున్న కమల్జిత్ సింగ్ అనే స్థానిక జర్నలిస్టును కూడా అరెస్టు చేశారు. కాగా సాధు సింగ్ గతంలో కెప్టెన్ అమరీందర్ సింఘ్ కేబినెట్లో అటవీ, సాంఘిక, సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. అయితే పంజాబ్‌లో అటవీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో చెట్లను నరికివేయడానికి అనుమతి ఇచ్చినందుకు లంచం తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. డెవలప్మెంట్ ప్రాజెక్టుల కోసం చెట్లు నరికినప్పుడు కాంట్రాక్టర్లు చెట్టుకు రూ.500 చొప్పున లంచం తీసుకున్నారని విజిలెన్స్ అధికారులు అభియోగాలు మోపారు. అలాగే దళితుల స్కాలర్షిప్ పథకాల్లో కోట్లాది రూపాయల కుంభకోణానికి సూత్రధారిగా ఉన్నట్లు సాధు సింగ్‌పై ఆరోపణలు వచ్చాయి. కాగా కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రిపై చర్యలు తీసుకుంటామని ఆప్ నాయకుడు, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్సింగ్ హెచ్చరించిన నెల రోజుల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇక గతవారం అవినీతికి పాల్పడిన ఆరోపణలపై క్యాబినెట్ మంత్రి విజయ్ సింగ్లా అరెస్టు అయిన సంగతి తెలిసిందే. టెండర్లపై ఒక శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నాడని ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ అతన్ని అరెస్టు చేసింది. చదవండి: ఇంటిముందున్న పెంపుడు కుక్కపై చిరుతపులి దాడి.. సీసీటీవీ దృశ్యాలు వైరల్ -
తీవ్ర విమర్శలు.. ఆ నిర్ణయం వెనక్కి తీసుకున్న పంజాబ్ సీఎం
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఎట్టకేలకు తన నిర్ణయం వెనక్కి తీసుకున్నారు. పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలా హత్య నేపథ్యంలో పంజాబ్‌లో వీఐపీలందరికీ భద్రతను పునరుద్ధరించనున్నట్లు గురువారం ప్రకటించారు. జూన్ 7వ తేదీలోగా ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకుంటామని పంజాబ్, హరియాణా హైకోర్టుకు భగవంత్‌మాన్ సర్కార్ గురువారం నివేదించింది. భవిష్యత్తులో మళ్లీ ఈ నిర్ణయాన్ని అమలు చేయడంపైనా ఎలాంటి ఆలోచనలుచేయడం లేదని కోర్టుకు తెలిపింది. సుమారు 400 మందికి పైగా వీఐపీలకు భద్రతను ప్రభుత్వం ఉపసంహరించడం, ఆ మర్నాడే మూసేవాలా దారుణ హత్య కు గురవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తీవ్ర విమర్శలు తలెత్తడంతో పాటు వ్యవహారం కోర్టుకు సైతం చేరింది. ఈ నేపథ్యంలోనే సీఎం భగవంత్ మాన్, పునరుద్ధరణ నిర్ణయం తీసుకున్నారు. చదవండి: సిద్ధూ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం! -
పంజాబ్ ముఖ్యమంత్రి మరో సంచలన నిర్ణయం..
చండీగఢ్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరోగ్యశాఖ మంత్రిని పదవి నుంచి బర్తరఫ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 424 మంది ప్రముఖులకు సెక్యురిటీ రద్దు చేశారు. ప్రముఖులకు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించుకుంటున్నట్టు శనివారం సంచలన ప్రకటన చేశారు. గత నెలలో కూడా 184 మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కేటాయించిన భద్రతను రద్దు చేస్తూ భగవంత్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వాళ్ల అవసరం లేదు.. రాష్ట్ర ప్రభుత్వం భద్రత ఉపసంహరించిన వారిలో అకాల్ తక్త్ జాటేదార్గా వ్యవహరిస్తున్న జ్ఞాని హర్‌ప్రీత్ సింగ్ కూడా ఉన్నారు. ఆయనకు ఇదివరకు 6 మంది అంగరక్షకులు ఉండగా.. సీఎం నిర్ణయంతో ముగ్గురు సేవల నుంచి వెనుదిరిగారు. ఈ విషయమై హర్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయంతో తనకు ఇబ్బందేమీ లేదని అన్నారు. మిగతా ముగ్గురిని కూడా వెనక్కి పంపిస్తానని చెప్పారు. తనకు రక్షణ కల్పించేందుకు పంజాబ్ యువకులు చాలునని స్పష్టం చేశారు. మరోవైపు హర్‌ప్రీత్ సింగ్ సెక్యురిటీ ఉపసంహరణపై విమర్శల నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. వెనక్కి పిలిచిన ముగ్గురు బాడీ గార్డులను తిప్పి పంపిస్తామని తెలిపింది. అయితే, దీనిని హర్‌ప్రీత్ సింగ్ తిరస్కరించినట్టు తెలిసింది. With its decision & flip flop on the withdrawal of official security to the highly respected Jathedar Sahiban of Khalsa Panth's venerated Takhts, including Sri Akal Takht Sahib, @AAPPunjab govt has merely exposed itself as a stooge of anti-Punjab & anti-Panth @ArvindKejrival.1/3 pic.twitter.com/cc1Mpg3dKB — Sukhbir Singh Badal (@officeofssbadal) May 28, 2022 -
‘కళ్లల్లో నీళ్లు తిరిగాయి’.. పంజాబ్ సీఎంపై కేజ్రీవాల్ ప్రశంసలు
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌పై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసలు కురిపించారు. అవినీతి ఆరోపణలపై ఆరోగ్యశాఖ మంత్రిని కేబినెట్ నుంచి తొలగించిన కొద్దిసేపటికే అరవింద్ కేజ్రీవాల్ ట్విటర్ ద్వారా స్పందించారు. సీఎం భగవంత్ మాన్‌ను చూసి గర్వపడుతున్నానని అన్నారు. సీఎం భగవంత్ మాన్ చర్య తన కళ్లల్లో నీళ్లు తెప్పించిందని, దేశంలో నిజాయితీ పాలనను అందించే పార్టీ ఒక్క ఆమ్ ఆద్మీనేనని, ఆప్‌ను చూసి పంజాబ్‌తో సహా దేశమంతా గర్విస్తోందని అన్నారు. భగవంత్ మాన్ నిర్ణయానికి చాలా ధైర్యం కావాలని, దేశంలో రాజకీయాలు తిరోగమనం చెందుతున్న వేళ ఆమ్ ఆత్మీ పార్టీ కొత్త ప్రారంభాన్ని తీసుకొచ్చిందన్నారు. సీఎం భగవంత్ మాన్ తలుచుకుంటే ఆరోగ్య మంత్రి చేసిన అవినీతిని కప్పిపుచ్చగలరని, కానీ అలా చేయకుండా మంత్రిపై చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. తను కూడా ఢిల్లీలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఓ మంత్రిని తొలగించినట్లు కేజ్రీవాల్ గుర్తు చేశారు. సంబంధిత వార్త: అవినీతి ఆరోపణలు.. పంజాబ్ సీఎం సంచలన నిర్ణయం.. మంత్రి అరెస్ట్ Proud of you Bhagwant. Ur action has brought tears to my eyes. Whole nation today feels proud of AAP https://t.co/glg6LxXqgs — Arvind Kejriwal (@ArvindKejriwal) May 24, 2022 కాగా పంజాబ్ ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ సింఘ్లాను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మంత్రి విజయ్ సింగ్లాపై అవినీతి ఆరోపణలు రావడంతో పదవి నుంచి బర్తరఫ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. టెండర్ల కోసం సింగ్లా ఒక శాతం కమీషన్ డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు. పదవి నుంచి తొలగించిన వెంటనే ఏసీబీ అధికారులు మంత్రిని అరెస్ట్ చేశారు. -
ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు
చండీగఢ్: దేశంలో బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణ సీఎం కేసీఆర్.. దేశ వ్యాప్త పర్యటనలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా కేసీఆర్.. ఈరోజు(ఆదివారం) సాయంత్రం చండీగఢ్‌కు చేరుకున్నారు. కాగా, ఆదివారం ఉదయం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీలో కలిసిన కేసీఆర్.. ఆపై చండీగఢ్‌కు వెళ్లారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వెంట ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా అక్కడికి బయల్దేరారు. చండీగఢ్‌లో వారిద్దరూ పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను కలిశారు. దాంతో ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు కలిసినట్లయ్యింది. ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు.. ముందుగా గల్వాన్ లోయలో అమరులైన భారత సైనికుల కుటుంబాలకు, రైతు ఉద్యమంలో మరణించిన రైతులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం గాల్వాన్ లోయలో అమరులైన వారిలో పంజాబ్ నుంచి నలుగురు సైనికులు ఉండగా, వారికి రూ. 10 లక్షల చొప్పన ఆర్థిక సాయం అందించారు సీఎం కేసీఆర్. రైతులతో పాటు సైనిక కుటుంబాలకు చెక్కులను అందించారు. అనంతరం తెలంగాణ కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ఎక్కడా లేని సమస్యలు మన దేశంలోనే ఉన్నాయి. ఇలాంటి సమావేశాలు పెట్టాల్సి రావడం బాధాకరం. 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత కూడా దేశం పరిస్థితి మారలేదు. దేశం ఇలా ఎందుకు ఉందో ఆలోచన చేయాలి. సాగు చట్టాలపై పోరాడిన రైతులకు పాదాభివందనం. గాల్వాన్‌లో చైనాతో జరిగిన పోరాటంలో పలువురు సైనికులు మరణించారు. పంజాబ్‌లో ఎన్నికల వలన సైనిక కుటుంబాలను కలవలేకపోయా’ అని పేర్కొన్నారు. చదవండి👉ఆసక్తి రేపుతున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్- కేసీఆర్ భేటీ.. -
సీఎం మీటింగ్‌లో కొట్టుకున్నంత పని చేశారు.. వీడియో వైరల్
పంజాబ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఫ్రీ లంచ్ కార్యక్రమంలో ప్లేట్స్ కోసం ప్రిన్స్‌పాల్స్, టీచర్లు కొట్టుకున్నంత పనిచేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. వివరాల ప్రకారం.. పంజాబ్‌లో విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎం భగవంత్ మాన్ ఓ రిసార్ట్‌లో ప్రిన్స్‌పాల్స్, ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ మీటింగ్ సందర్భంగా సీఎం మాన్.. ఉపాధ్యాయుల సూచనలు, ఐడియాలను షేర్ చేసుకునేందుకు ఆన్లైన్ పోర్టల్‌ను ప్రారంభించారు. విద్యార్ధులకు మంచి విద్యను అందించేందుకు కృషి చేయాలని వారిని సీఎం కోరారు. ఇదిలా ఉండగా.. సీఎం మీటింగ్ ముగిసిన అనంతరం లంచ్ కోసం ఉపాధ్యాయులంతా వెళ్లారు. ఆ సమయంలో పేట్స్ కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ మీటింగ్ కోసం విద్యాశాఖ మంత్రి గుర్మీత్‌సింగ్.. ఉపాధ్యాయులను ఏసీ బస్సుల్లో రీసార్ట్‌కు తరలించడం విశేషం. Lunch time of Principals and Teachers in Punjab after meeting CM. Time to go to HEYWARD. CM might have gone home with some HEYWARDS. pic.twitter.com/bDwF1HooCm — Abhijit Guha (@Abhijit33886372) May 11, 2022 ఇది కూడా చదవండి: నూతన ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా రాజీవ్‌కుమార్ -
సీఎం జగన్ బాటలోనే పంజాబ్ ప్రభుత్వం
చండీగఢ్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాదరణ పొందిన ‘ఇంటివద్దకే రేషన్ సరుకుల పంపిణీ’ పథకాన్ని పంజాబ్ ప్రభుత్వం అందిపుచ్చుకుంది. లబ్ధిదారులకు ఇళ్ల వద్దే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించింది. సోమవారం ముఖ్యమంత్రి భగవంత్ మాన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 26,000 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ముక్తసర్ జిల్లాలో పత్తి రైతులకు రీయింబర్స్మెంట్ కింద రూ.41.89 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. కేబినెట్ నిర్ణయం మేరకు రాష్ట్రంలో అక్టోబర్ 1 నుంచి గోధుమ పిండితోపాటు ఇతర సరుకులను హోం డెలివరీ చేయనున్నారు. మొబైల్ ఫెయిర్ ప్రైస్ షాప్స్(ఎంపీఎస్)గా పిలిచే రవాణా వాహనాల్లో రేషన్ సరుకులను లబ్ధిదారుల ఇళ్ల వద్దకు చేరవేస్తారు. చదవండి👉🏾 (సీఎం జగన్ బాటలో స్టాలిన్.. తమిళనాడులోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ) -
పంజాబ్‌లో టెన్షన్.. టెన్షన్.. ఇంటర్నెట్ సేవలు బంద్
Patiala Clashes Punjab: పంజాబ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాటియాలలో శివసేన కార్యకర్తలకు, ఖలిస్థాన్ మద్దతుదారులకు మధ్య శుక్రవారం ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాళీ మాత ఆలయం వెలుపల ఇరువర్గాల సభ్యులు కత్తులు ఊపుతూ ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో సీఎం భగవంత్ మాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శాంతిభద్రతల విషయంలో వైఫల్యం చెందడంతో ప్రభుత్వం రాష్ట్ర పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంది. హింసను నియంత్రించడంలో విఫలమైనందుకు డిపార్ట్మెంట్లోని ముగ్గురు ఉన్నతాధికారులను భగవంత్ మాన్ సర్కార్ తొలగించింది. పాటియాలా రేంజ్ ఐజి, పాటియాలా ఎస్ఎస్పీ, ఎస్పీలను ఆ పదవి నుండి బదిలీ చేశారు. पटियाला में आज सुबह 9:30 से शाम 6 बजे तक मोबाइल इंटरनेट सेवाएं अस्थायी रूप से निलंबित किया गया: गृह विभाग, पंजाब सरकार | #Patiala | #PatialaViolence | #PatialaRiots | #Panjab | pic.twitter.com/KEFsOoi62j — IBC24 News (@IBC24News) April 30, 2022 ఇదిలా ఉండగా.. ఘర్షణల కారణంగా శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాజియాలా జిల్లాలో శనివారం ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాయిస్ కాల్స్ మినహా మొబైల్ ఇంటర్నెట్, SMS సేవలను నిలిపివేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఇప్పటికే నగరంలో రాత్రి 7 గంటల నుంచి ఉదయం వరకు కర్ఫ్యూ అమలులో ఉంది. #Patiala pic.twitter.com/0XgntqTEcG — Jitender Sharma (@capt_ivane) April 29, 2022 ఇది కూడా చదవండి: భారత్‌లో కరోనా.. అంతకంతకు పెరుగుతున్న కేసులు -
పంజాబ్ సీఎం మరో కీలక నిర్ణయం.. 184 మంది భద్రత ఉపసంహరణ
చండీగఢ్: పంజాబ్‌లో భారీ విజయంతో అధికారం చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం పలు కీలక సంస్కరణలు చేపడుతోంది. తాజాగా ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వం శనివారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో సహా 184 మందికి సంబంధించిన భద్రతను ఉపసంహరించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం వారికి ఉన్న ముప్పును అంచనా వేసి ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. తాజాగా భద్రత తొలగించిన వారిలో మాజీ మంత్రులు బీబీ జాగీర్ కౌర్, మదన్ మోహన్ మిట్టల్, సుర్జిత్ కుమార్ రఖ్రా, సుచా సింగ్ చోటేపూర్, జనమేజా సింగ్ సెఖోన్, తోట సింగ్, గుల్జార్ సింగ్ రాణికే ఉన్నారు. అదే విధంగా మాజీ ముఖ్యమంత్రులు, మంత్రుల కుటుంబానికి ఉన్న భద్రతను కూడా ఉపసంహరించారు. పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, అమరీందర్ సింగ్ కుమారుడు రణిందర్ సింగ్ కుటుంబీకులు కూడా తమ భద్రతను కోల్పోనున్నారు. భద్రత కోల్పోయినవారిలో మాజీ ఎంపీ, ఐపీఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ఉన్నారు. పంజాబ్ ఎన్నికల్లో బీజేపీకి స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న మహి గిల్, మాజీ డీజీపీ సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ కుమారుడు సిధాంత్ కూడా భద్రతను కోల్పోనున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రతను ఆప్ ప్రభుత్వం తొలగించడం ఇది రెండోసారి కావాడం గమనార్హం. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఆప్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. రాష్ట్రంలో కాంగ్రెస్, అకాలీదళ్ పార్టీలకు చెందిన 122 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా పలువురు వీవీఐపీలకు భద్రతను ఉపసంహరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మార్చి 11న ఉత్తర్వులు కూడా జారీ చేసింది. చదవండి: పాకిస్తాన్లో చదివినోళ్లకు ఉద్యోగాలు ఇవ్వం! -
Punjab: సీఎం భగవంత్ మాన్కు కవి వార్నింగ్..
చండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నేత, కవి కుమార్ విశ్వాస్ పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు వార్నింగ్ ఇచ్చారు. పంజాబ్ పోలీసులు తన ఇంటి ముందు నిల్చున్న ఫోటోలను ట్విటర్లో పోస్టు చేస్తూ.. సీఎం భగవంత్ మాన్, ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను హెచ్చరించారు. ‘ఈ రోజు ఉదయం పంజాబ్ పోలీసులు మా ఇంటి వద్దకు వచ్చారు. ‘పంజాబ్ ప్రజలు ఇచ్చిన అధికారంతో ఆడుకోవడానికి ప్రయత్నిస్తున్న ఢిల్లీలో కూర్చున్న వ్యక్తిని హెచ్చరిస్తున్నాను. అతను ఏదో ఒక రోజు నిన్ను(భగవంత్ మాన్) పంజాబ్ ప్రజలను కూడా ద్రోహం చేస్తాడు. నా హెచ్చరికను దేశం గుర్తించుకుంటుంది’ అని ట్వీట్ చేశాడు. सुबह-सुबह पंजाब पुलिस द्वार पर पधारी है।एक समय, मेरे द्वारा ही पार्टी में शामिल कराए गए @BhagwantMann को आगाह कर रहा हूँ कि तुम, दिल्ली में बैठे जिस आदमी को, पंजाब के लोगों की दी हुई ताक़त से खेलने दे रहे हो वो एक दिन तुम्हें व पंजाब को भी धोखा देगा।देश मेरी चेतावनी याद रखे🙏🇮🇳 pic.twitter.com/yDymGxL1gi — Dr Kumar Vishvas (@DrKumarVishwas) April 20, 2022 అయితే ఈ ట్వీట్లో విశ్వాస్ కేజ్రీవాల్ పేరును ట్వీట్లో ప్రస్తావించలేదు. కాగా కుమార్ విశ్వాస్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. విశ్వాస్ ట్వీట్ చేసిన వెంటనే ఆప్ నాయకుడు నరేష్ బల్యాన్ స్పందించాడు.. విశ్వాస్ ఎందుకు అంతలా భయపడుతున్నాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎన్నికలకు ముందు తమరు చెప్పిన దానికి పోలీసులు రుజువు అడుగుతున్నారని, సాక్ష్యాధారాలు ఇచ్చి ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలంటూ హితవు పలికారు. काँप काहे रहे हो? जो बोला था चुनाव से पहले आपने उसी का तो सबूत माँगने पहुँची है पंजाब पुलिस, दे दो । बात ख़त्म। ऐसे कैसे चलेगा? मै पंजाब जीत की ख़ुशी में मिठाई खिलाने पहुँचा तो भी आप नही खाये। फ़िलहाल आप पंजाब पुलिस की चेतावनी याद रखो @DrKumarVishwas ! pic.twitter.com/CdbTre5cLU — MLA Naresh Balyan (@AAPNareshBalyan) April 20, 2022 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌పై కుమార్ విశ్వాస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దేశాన్ని విచ్చిన్నం చేసేలా అరవింద్ జ్రీవాల్ మాట్లాడారని ఆరోపించారు. కేజ్రీవాల్, ఆప్‌కు వ్యతిరేకంగా చేసిన ప్రకటనలకు సంబంధించి విశ్వాస్‌పై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే అతని ఇంటికి పోలీసులు చేరుకున్నారు.