న్యూఢిల్లీ: గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు రాబోతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ జోస్యం చెప్పారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
గుజరాత్ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పుతాయని, అనూహ్య ఫలితాలు వస్తాయని వ్యాఖ్యానించారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున గెలిచిన వారంతా తమతోనే ఉంటారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా, గుజరాత్, హిమచల్ ప్రదేశ్ ఎన్నికలు ఫలితాలు గురువారం వెలువడనున్నాయి.
అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు బీజేపీ
ఢిల్లీని వరుసగా 15 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్‌ను అరవింద్ కేజ్రీవాల్ పార్టీ పెట్టి ఓడించారని సీఎం భగవంత్ మాన్ గుర్తు చేశారు. అలాగే 15 ఏళ్లుగా ఎంసీడీని ఏలుతున్న బీజేపీని ఇప్పుడు మట్టి కరిపించారని తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీని అడ్డుకునేందుకు మొత్తం యంత్రాంగాన్ని బీజేపీ.. ఢిల్లీలో మొహరించిందని ఆరోపించారు.
విద్వేష రాజకీయాలు వద్దు
ఢిల్లీ ప్రజలు అభివృద్ది కోరుకుంటున్నారని సీఎం భగవంత్ మాన్ అన్నారు. ‘ఢిల్లీ వాసులు విద్వేష రాజకీయాలు ఇష్టపడటం లేదు. స్కూల్స్, ఆస్పత్రులు, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల కోసం ఓటు వేశార’ని పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: హస్తినలో ‘ఆప్’ హవా.. ఢిల్లీ మేయర్‌గా మహిళ!)
Comments
Please login to add a commentAdd a comment