
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి.. ఢిల్లీలోని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ సింగ్ (Bhagwant Mann Singh) నివాసం వద్ద పోలీసు బలగాలు మోహరించారని చెప్పారు. ఈ ఘటన ఒక్కసారిగా రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సీఎం అతిశి వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు.
తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి ట్విట్టర్ వేదికగా.. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్ సింగ్ నివాసం వద్ద పోలీసు బలగాలు మోహరించారు. ముఖ్యమంత్రి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించేందుకు వచ్చారు. కానీ, బీజేపీ చేసిన తప్పులను, కాషాయ పార్టీ నేతలను మాత్రం పోలీసులు పట్టించుకోవడం లేదు. బీజేపీ నేతలు పట్టపగలే డబ్బులు పంచినా ఎందుకు పట్టించుకోవడం లేదు. ఎన్నికల కోసం వస్తువులను ప్రజలకు పంచేందుకు వెళుతున్నారు అయినప్పుటికీ పోలీసుల నుంచి స్పందన కరువైంది. కానీ, ప్రజలు ఎన్నుకున్న నాయకుడి ఇంటి పైకి సోదాలు చేసేందుకు మాత్రం వచ్చారు’ అంటూ మండిపడ్డారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.
మరోవైపు.. సీఎం అతిశి ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. తాము సీఎం నివాసంలో ఎలాంటి సోదాలు చేపట్టలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్బంగా సీ-విజిల్ పోర్టల్‌లో వచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు కోసం రిటర్నింగ్ ఆఫీసర్ నేతృత్వంలోని పోలీసు బృందం పంజాబ్ సీఎం నివాసానికి రావాల్సి వచ్చిందని పోలీసు ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. అయితే.. అక్కడున్న భద్రతా సిబ్బంది పోలీసుల బృందాన్ని దర్యాప్తు చేసేందుకు అనుమతించలేదని తెలిపారు.
ఇదిలా ఉండగా.. అతిశి ఆరోపణలపై బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఆప్ నేతలు ఇలా లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ నేతలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇక, ఢిల్లీ ఎన్నికల వేళ యమునా నది నీళ్ల విషయం కూడా సంచలన మారిన సంగతి తెలిసిందే.
दिल्ली पुलिस @BhagwantMann जी के दिल्ली के घर पर रेड करने पहुँच गई है।
भाजपा वाले दिन दहाड़े पैसे, जूते, चद्दर बांट रहे हैं- वो नहीं दिखता। बल्कि एक चुने हुए मुख्यमंत्री के निवास पर रेड करने पहुँच जाते हैं।
वाह री भाजपा! दिल्ली वाले 5 तारीख़ को जवाब देंगे!— Atishi (@AtishiAAP) January 30, 2025
Comments
Please login to add a commentAdd a comment