Atishi Marlena
-
అలా అయితే మీ తరపున ప్రచారం చేస్తా: బీజేపీ ఎమ్మెల్యేకు సీఎం అతిషి ఆఫర్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ సమావేశా ల్లో భాగంగా శుక్రవారం ప్రతిపక్ష బీజేపీపై సీఎం అతిషి మార్లేనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కొర్పొరేషన్ బస్సులో బస్ మార్షల్స్‌ను తిరిగి నియమించే విషయంలో బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు అతిషి కౌంటర్ ఇచ్చారు.అయితే ఆప్ ప్రతిపాదనపై రోహిణి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా అసెంబ్లీలో మాట్లాడుతూ.. ఆప్‌పై విమర్శలు గుప్పించారు. అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెబితేనే బస్ మార్షల్స్‌ను తొలగించామని చెప్పారు. దీనిపై సీఎం అతిషి స్పందిస్తూ..‘ నేను ముఖ్యమంత్రినే.. బస్ మార్షల్స్‌ను తిరిగి నియమించాలని నేను కూడా లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు పదేపదే చెబుతున్నాను. వీకే సక్సేనా కూడా ఒక ముఖ్యమంత్రి చెప్పిన మాట వింటుంటే.. మార్షల్స్‌ను తిరిగి నియమించగలరు’ అని కౌంటర్ ఇచ్చారు.బస్ మార్షల్‌పై "నవంబర్ 10న మేం మీటింగ్ పెట్టాం. నవంబర్ 13న లెఫ్టినెంట్ గవర్నర్కురిపోర్టు పంపాం. ఈరోజు నవంబర్ 29. ఇప్పుడు బస్ మార్షల్స్‌ను పునరుద్దరించే ప్రతిపాదన ఆయన వద్ద ఉంది. ఒకవేళ మీరు (విజేందర్ గుప్తా) బస్ మార్షల్స్ నియమాకానికి సంబంధించిన ఫైల్‌ను ఎల్ సంతకం చేయిస్తే.. మీపై ఎలాంటి అభ్యర్థిని నిలబెట్టకుండా మా పార్టీని ఒప్పిస్తాను. అంతేగాక మీ తరపున నేను కూడా ప్రచారం చేస్తాను’ అని పేర్కొన్నారు. VIDEO | "You (BJP MLA Vijender Gupta) just get the file for the appointment of bus marshals signed by the LG, I will convince my party not to field any candidate against you in Rohini, I will also campaign for you," said Delhi CM Atishi (@AtishiAAP) speaking in the Assembly,… pic.twitter.com/XxVHRuDwlO— Press Trust of India (@PTI_News) November 29, 2024 కాగా ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు బస్సులో మహిళా ప్రయాణీకుల భద్రత కోసం బస్ మార్షల్స్‌ను తక్షణమే పునరుద్ధరించాలని ఆప్ సర్కార్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. బస్ మార్షలల్స్ను తిరిగి నియమించాలని కోరూతూ ఢిల్లీ ప్రభుత్వం తీర్మానించి సిఫార్సు చేసిన ఫైల్ ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా వద్ద పెండింగ్‌లో ఉంది. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులపై మార్షల్స్‌పై అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే మధ్య వాగ్వాదం గత ఏడాది అక్టోబర్ నుంచి సాగుతోంది. -
కేజ్రివాల్ కంటే ఆతిశి నయం
న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కంటే ఢిల్లీ ప్రస్తుత సీఎం ఆతిశి వెయ్యి రెట్లు నయమని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా శుక్రవారం ప్రశంసలు కురిపించారు. ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో ఆయన ఆతిశితో కలిసి పాల్గొన్నారు. వేదికపై నున్న ఆతిశిని ఉద్దేశిస్తూ.. ‘ఢిల్లీ సీఎంగా మహిళ ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది. పూర్వ సీఎం కంటే ఆమె వెయ్యిరెట్లు నయమని నేను పూర్తి విశ్వాసంతో చెప్పగలను’ అని సక్సేనా వ్యాఖ్యానించారు. సాధారణంగా ఢిల్లీ ఎల్జీకి, ఆప్ ప్రభుత్వానికి పొసగదు. ఎప్పుడూ ఉప్పునిప్పుగా ఉండే సక్సేనా.. ఆతిశిపై ప్రశంసలు కురిపించడం విశేషం. జైలు నుంచి బెయిల్‌పై బయటికి వచ్చాక అరవింద్ కేజ్రివాల్ ఈ ఏడాది సెప్టెంబరులో సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన నిజాయితీకి ప్రజలు సర్టిఫికెట్ ఇచ్చాకే (ఎన్నికల్లో నెగ్గి) మళ్లీ సీఎం పదవిని చేపడతానని కేజ్రివాల్ అన్నారు. కేజ్రివాల్ బదులుగా స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆతిశి జెండా ఎగురవేస్తారని ఆప్ సర్కారు ప్రతిపాదించగా.. సక్సేనా నిరాకరించిన విషయం తెలిసిందే. -
ఢిల్లీలో హీట్ పాలిటిక్స్.. సీఎం ఇంటి వద్ద ఆప్ ఎంపీ వినూత్న నిరసన
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి నివాసం వద్ద ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ వినూత్న నిరసన చేపట్టారు. ఓ వాటర్ బాటిల్లో కలుషిత నీటిని తీసుకువచ్చి సీఎం ఇంటి ఎదుట పారబోసి ఆప్ సర్కార్‌పై మండిపడ్డారు. దీంతో, ఆమ్ ఆద్మీ పార్టీలో కొత్త చర్చ మొదలైంది.ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలివాల్ తాజాగా సీఎం అతిషి నివాసం వద్ద వినూత్న నిరసన తెలిపారు. ఓ వాటర్ బాటిల్లో కలుషిత నీటిని తీసుకువచ్చి సీఎం ఇంటి ఎదుట పారబోశారు. అనంతరం స్వాతి మాలివాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు సాగర్పూర్, ద్వారక ప్రజలు నాకు ఫోన్ చేసారు. దీంతో, నేను అక్కడికి వెళ్లాను. ఆ ప్రాంతాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేను ఒక ఇంటికి వెళ్లి అక్కడ నల్లానీరు సరఫరాను గమనించాను. ఆ నల్లా నీటిని బాటిల్లో నింపాను.నల్లాల్లో సరఫరా అవుతున్న నీరు నల్లగా, కలుషితంగా ఉంది. అదే నీటిని ఇప్పుడు నేను సీఎం అతిషి ఇంటి వద్దకు తెచ్చాను. ఇలాంటి నీటిని ఎవరైనా తాగుతారా?.. వాడుకుంటారా?. ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదల కష్టాలు మాత్రం తీరడం లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రికి ఇదే నా హెచ్చరిక. రానున్న 15 రోజుల్లో ఢిల్లీలో ప్రతీ ఇంటికి మంచి నీరు అందాలి. లేని పక్షంలో పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఇవే నీటిని ట్యాంకర్లో నింపి సీఎం నివాసం వద్ద పారబోస్తాం. ఇప్పుడు కేవలం ఒక్క బాటిల్ నీటిని మాత్రమే వేస్తున్నాను. ఇది కేవలం శాంపిల్ మాత్రమే.#WATCH | AAP MP Swati Maliwal arrives at Delhi CM Atishi's residence with a bottle filled with polluted water and throws it outside the CM's residence. She is claiming that this water is being supplied to the people of Delhi pic.twitter.com/ERJpqowuZX— ANI (@ANI) November 2, 2024ఇలాంటి నీటిని ఎవరైనా తాగుతారా? తాగితే వారు ప్రాణాలతో ఉంటారా?. ఢిల్లీలో ఛత్ పూజ వస్తోంది. ఈరోజు గోవర్ధన్ పూజ జరిగింది. నిన్న దీపావళి. పండుగ వేళ ఇలాంటి నీటితో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యమంత్రి అతిషి వద్దే నీటి పారుదల శాఖ కూడా ఉంది. నీటి సమస్యపై ఆమె ప్రతీరోజు మీటింగ్ పెట్టి ఈ సమస్యను పరిష్కరించాలి’ అని డిమాండ్ చేశారు. ఇక, ఆప్ ఎంపీ నిరసన రాజకీయంగా బీజేపీకి అనుకూలంగా మారే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. #WATCH | Delhi | AAP Rajya Sabha MP Swati Maliwal says, "The people of Sagarpur, Dwarka had called me and the situation there is very bad... I went to a house and black water was being supplied there. I filled that black water in a bottle and I brought that water here, at the… https://t.co/FN3JgtYUXn pic.twitter.com/2twrYzVlO8— ANI (@ANI) November 2, 2024 -
ఢిల్లీలో 'ముంబై అండర్‌వరల్డ్' పరిస్థితి: సీఎం అతిషి
ఢిల్లీ: ఢిల్లీ రోహిణిలోని ఓ పాఠశాల సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై అతిషి కేంద్రంలో ఉన్న బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో నెలకొన్న పరిస్థితి.. అండర్‌వరల్డ్ కాలంతో ముంబైలా మారిపోయిందని ‘ఎక్స్’ వేదికగా ఆరోపించారు.‘ఢిల్లీలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఉంది. కానీ బీజేపీ శాంతిభద్రతలను పట్టించుకోదు. ఢిల్లీ ప్రభుత్వాలు చేస్తే.. పనికి అంతరాయం కలిగించడానికి మాత్రం తన పూర్తి సమయాన్ని ఉపయోగిస్తుంది. అందుకే ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి.. అండర్ వరల్డ్ కాలంలో ముంబైలా తయారైంది. బహిరంగంగా బుల్లెట్లు పేల్చుతున్నారు. గ్యాంగ్స్టర్లు డబ్బు వసూలు చేస్తున్నారు. నేరస్థులు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. శాంతి భద్రతలను కాపాడే ఉద్దేశం లేదా అదుపులోకి తీసుకువచ్చే సామర్థ్యం బీజేపీకి లేదు’ అని అన్నారు.रोहिणी स्थित एक स्कूल के बाहर Bomb Blast की घटना दिल्ली की चरमराती सुरक्षा व्यवस्था की पोल खोल रही है। दिल्ली में लॉ एंड ऑर्डर की जिम्मेदारी भाजपा की केंद्र सरकार के पास है। लेकिन भाजपा अपना ये काम छोड़कर सारा समय दिल्ली की चुनी हुई सरकार के कामों को रोकने में लगाती है। यही…— Atishi (@AtishiAAP) October 20, 2024ఇక.. పొరపాటున ఢిల్లీ వాసులు బీజేపీకి ప్రభుత్వ బాధ్యతలు అప్పగిస్తే.. ఆసుపత్రులు, విద్యుత్, నీటి సరఫరా పరిస్థితి ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితి మాదిరిగానే దారుణంగా మారుతుందని సీఎం అతిషి ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని రోహిణిలో ప్రాంతం ఓ పాఠశాల గోడపై బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. పేలుడు ధాటికి పాఠశాల గోడను ద్వంసమై.. సమీపంలోని కార్లు దెబ్బతిన్నాయి.చదవండి: ఢిల్లీ పేలుడు: ఖలిస్తానీ హస్తంపై టెలిగ్రామ్‌కు లేఖ -
బీజేపీ డర్టీ పాలిటిక్స్ వల్లే కాలుష్యం: ఢిల్లీ సీఎం
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యానికి బీజేపీ డర్టీ పాలిటిక్స్ కారణమని ఢిల్లీ సీఎం అతిషి అ న్నారు. నగరంలో గాలి కాలుష్యం పెరగడం,యమునా నది నీటిపై రసాయనాల నురగ కనబడటంపై ఆమె ఆదివారం(అక్టోబర్20) మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో కాలుష్యం పెరగడానికి బీజేపీ పాలిత హర్యానా,ఉత్తరప్రదేశ్లే కారణమని ఆరోపించారు.హర్యానాలో పంట వ్యర్థాలు కాల్చడం,ఇటుక బట్టీలు,యూపీ నుంచి వేల సంఖ్యలో డీజిల్ బస్సులు రావడం,నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లోని(ఎన్సీఆర్) థర్మల్ పవర్ ప్లాంట్లు కాలుష్యానికి కారణాలని అతిషి చెప్పారు.యమునా నదిలోకి వదిలే పారిశ్రామిక జలాలను శుద్ధి చేయకపోవడం వల్లే నదిపై నురగ ఏర్పడుతోందన్నారు. యమునా నది ఉపరితలంపై ఏర్పడిన నురగను ఆదివారం రాత్రి నుంచి తొలగిస్తామని తెలిపారు.అయితే ఢిల్లీ పొరుగున ఉన్న ఆప్ పార్టీ పాలిత పంజాబ్ మాత్రం ఢిల్లీ కాలుష్యానికి ఏ మాత్రం కారణమవడం లేదని అతిషి చెప్పడం విశేషం.ఇదీ చదవండి: ఢిల్లీలో భారీ పేలుడు.. పోలీసులు అలర్ట్ -
ప్రధాని మోదీతో ఢిల్లీ సీఎం అతిశి భేటీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశి సోమవారం భేటీ అయ్యారు. తమ ప్రభుత్వానికి కేంద్రం నుంచి సహకారం లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఈ రోజు గౌరవ ప్రధాని నరేంద్రమోదీ గారిని కలిశాను. మన రాజధాని సంక్షేమం, అభివృద్ధి గురించి ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్రం నుంచి పూర్తి సహకారం కోసం ఎదురు చూస్తున్నాను’’ అని ఆమె ఎక్స్‌లో పోస్టు చేశారు. గత నెలలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆమె మొదటిసారి ప్రధానిని కలిశారు. ఈ సమావేశం గురించి ప్రధాన మంత్రి కార్యాలయం కూడా ఎక్స్‌లో పోస్ట్ చేసింది. -
మేం ప్రజల హృదయాల్లో జీవిస్తున్నాం: ఢిల్లీ సీఎం
ఢిల్లీ: తమ పార్టీని గెలిపించుకొని సీఎం పదవిని పొందే సత్తాలేక బీజేపీ ఢిల్లీ సీఎం నివాసాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని సీఎం అతిషి మండిపడ్డారు. ఆప్ నేతలు ప్రజల హృదయాల్లో నివసిస్తారని, బీజేపీ కోరుకుంటే ఆ బంగ్లాను వారే ఉంచుకోవచ్చని అన్నారు. సీఎం నివాసం విషయంపై ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. ఆప్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వాన్ని అణగదొక్కేందుకు బీజేపీ అనేక వ్యూహాలను రచిస్తోందని మండిపడ్డారు. ఓడిపోయిన రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు బీజేపీ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తుందని అన్నారు.‘‘ఎన్నికల్లో మమ్మల్ని ఓడించలేమని బీజేపీ ఆందోళన చెందుతోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైనప్పుడు.. బీజేపీ ‘ఆపరేషన్ కమలం'ను ఆశ్రయిస్తుంది. పార్టీ చేరని నేతలను జైల్లో పెడతారు. సొంతంగా ముఖ్యమంత్రిని గెలిపించుకోలేక ఇప్పుడు సీఎం నివాసాన్ని సీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. విలాసవంతమైన కార్లు, బంగ్లాలలో నివసించేందుకు మేం రాజకీయాల్లోకి రాలేదు. అవసరమైతే వీధుల్లోంచి పాలన చేస్తాం. బీజేపీ వాళ్లు బంగ్లాలో ఆనందించవచ్చు. మేము ప్రజల హృదయాలలో జీవిస్తున్నాం’’ అని అన్నారామె.ఇక.. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించిన ఆప్ నాయకురాలు అతిషికి ఇంకా అధికారిక బంగ్లా కేటాయించకపోవడంపై వివాదం నెలికొంది. దీంతో సీఎం హోదాలో గతంలో అరవింద్ కేజ్రీవాల్‌కు కేటాయించిన ఢిల్లీలోని ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డు, నంబర్ 6 అధికారిక బంగ్లాలోకి అతిషి మారారు. దీంతో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తన అధికారాన్ని ఉపయోగించి అతిషికి సంబంధించిన సామగ్రిని బయట పడేశారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది.చదవండి: సీఎం అతిషి సామాన్లు పడేశారు.. లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌పై ఆప్ ఆరోపణలు -
సీఎం సామాన్లనే బయటపడేశారు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అధికార నివాసం వేదికగా ఆప్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాల మధ్య మరోసారి అధికార ఆధిపత్యపోరు కనిపించింది. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించిన ఆప్ నాయకు రాలు అతిశికి ఇంకా అధికారిక బంగ్లా కేటాయించకపోవడం ఈ వివాదానికి ఆజ్యంపోసింది. దీంతో సీఎం హోదాలో గతంలో అరవింద్ కేజ్రీవాల్‌కు కేటాయించిన ఢిల్లీలోని ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డు, నంబర్ 6 అధికారిక బంగ్లాలోకి అతిశి మారారు. దీంతో ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ తన అధికారాన్ని ఉపయోగించి అతిశికి సంబంధించిన సామగ్రిని బయట పడేశా రని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ బుధవారం ఢిల్లీలో మీడి యా సమావేశంలో మాట్లాడారు. ‘‘ సీఎం అతిశికి అధికారిక బంగ్లాను కేటాయించలేదు. అందుకే ఇ న్నాళ్లూ సీఎంగా ఉన్నపుడు వినియోగించి, కేజ్రీవాల్ ఖాళీ చేసిన అధికారిక బంగ్లాలోకే అతిశి మారారు. దీనిని జీర్ణించుకోలేని బీజేపీ ప్రభుత్వం ఎలాగైనా ఆ బంగ్లాను బీజేపీ అగ్రనేతకు కేటాయించాలని కుట్ర పన్నింది. లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలను అడ్డుపెట్టుకుని అతిశికి చెందిన సామగ్రిని బయట పడేశారు. అంతకుముందు అదే బంగ్లాలోని క్యాంప్ ఆఫీస్‌లో అతిశి ఒక సమావేశం కూనిర్వహించారు. ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల్లో మూడుసార్లు ఓడిపోయిన బీజేపీ ఇలా చవకబారు బంగ్లా రాజకీయాలు చేస్తోంది’’ అని సంజయ్ వివరించారు.బంగ్లాకు సీలు వేయాల్సిందే: బీజేపీవివాదంపై బీజేపీ దీటుగా స్పందించింది. ఢిల్లీ శాసనసభలో విపక్షనేత, బీజేపీ నాయకుడు విజేందర్ గుప్తా మీడియాతో మాట్లాడారు. ‘‘ గత ఏడాది కేజ్రీవాల్ మంత్రివర్గంలోకి అతిశి చేరినప్పుడే కేబినెట్ మంత్రి హోదాలో ఆమెకు మథుర రోడ్డులోని ఏబీ–17 బంగ్లాను ప్రజాపనుల విభాగం(పీడబ్ల్యూడీ) గతంలోనే కేటాయించింది. ఆ బంగ్లా ఉండగా ఈ బంగ్లాతో సీఎంకు పనేంటి?. కేజ్రీవాల్ వెళ్లిపోయినా సీఎం బంగ్లా తాళాలు పీడబ్ల్యూడీకి అప్పజెప్పలేదు. ఇప్పుడు అతిశి అక్రమంగా ప్రవేశించిన ఈ బంగ్లాకు సీలు వేయాల్సిందే’’ అని గుప్తా డిమాండ్‌చేశారు.అక్రమంగా తరలించారు: సీఎం కార్యాలయం‘‘దేశ చరిత్రలో తొలిసారిగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. బీజేపీ ఆదేశాలను శిరసావహిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా.. అతిశి వస్తువులను బయట పడేయించారు. బీజేపీ బడా నేతకు ఈ బంగ్లాను కేటాయించాలను ఎల్జీ ఉవ్విళ్లూరుతున్నారు. ఢిల్లీ రాష్ట్రంలో 27 ఏళ్లుగా అధికారాన్ని అందుకోలేని బీజేపీ ఇప్పుడు సీఎం బంగ్లాను ఆక్రమించాలని చూస్తోంది’’ అని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.అది అధికారిక బంగ్లా కాదు: ఎల్జీ వర్గాలుసీఎంఓ ప్రకటన తర్వాత ఎల్జీ కార్యాలయం వర్గాలు స్పందించాయి. ‘‘ సీఎం హోదాలో అతిశికి ఆ బంగ్లాను కేటాయించలేదు. అనుమతి లేకుండా అతిశి ఆమె సామగ్రిని బంగ్లాలోకి తరలించారు. తర్వాత ఆమెనే వాటిని బయటకు తరలించారు. ప్రస్తుతా నికి ఆ బంగ్లా పీడబ్ల్యూడీ అధీనంలోనే ఉంటుంది. గతంలో సమకూర్చిన వస్తువులను సరిచూసు కున్నాకే కేటాయిస్తారు’’ అని ఎల్జీ ఆఫీస్ వర్గాలు తెలిపాయి. -
ఢిల్లీ సీఎం అడ్డగింత.. ఆప్ ఆగ్రహం
ఢిల్లీ: పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, ఆయన మద్దతుదారులను సోమవారం సింగు సరిహద్దుల్లో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సోనమ్ వాంగ్చుక్కు సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మార్లెనా సింగ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిణామంపై ఆప్ వర్గాలు భగ్గుమన్నాయి. ‘‘ ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు సోనమ్ వాంగ్చుక్ను అదుపులోకి తీసుకున్న బవానా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ సీఎంను పోలీసు అధికారులు అడ్డుకున్నారు’’ అని ఆప్ ఓ ప్రకటనలో పేర్కొంది.దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.దీంతో పోలీసులు ఢిల్లీ-హర్యానా సరిహద్దులో ఉన్న బవానా పోలీస్ స్టేషన్ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదుపులోకి తీసుకున్న వాంచుక్ మద్దతుదారులను ఢిల్లీ సరిహద్దుల్లోని ఇతర పోలీస్ స్టేషన్లలో ఉంచారు.#WATCH | Delhi CM Atishi reached Bawana police station to meet activist Sonam WangchukShe says, "People of Ladakh want statehood. Sonam Wangchuk and the people of Ladakh, who were going to visit Bapu's Samadhi, were arrested. They did not let me meet Sonam Wangchuk. This is the… pic.twitter.com/j5rmK3KCBa— ANI (@ANI) October 1, 2024 సోనమ్ వాంగ్‌చుక్ లడఖ్ నుంచి దాదాపు 120 మంది మద్దతుదారులతో లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీకి మార్చ్ చేపట్టారు. దీంతో పోలీసులు.. సోనమ్ వాంగత్చుక్, ఆయన మద్దతుదారులను సోమవారం అర్థరాత్రి సింగు సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా సింగు సరిహద్దుల్లో సెక్షన్ 163 విధించినట్లు ప్రకటించారు. నెల క్రితం లేహ్ నుంచి ప్రారంభమైన ‘‘ ఢిల్లీ చలో పాదయాత్ర’’కు వాంగ్‌చుక్ నాయకత్వం వహిస్తున్నారు.ఇక.. ఇప్పటికే సోనమ్ వాంగ్చుక్ను అదుపులోకి తీసుకోవటాన్ని లోక్‌సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన్ను నిర్భందించడం ఆమోదయోగ్యం కాదని అన్నారు.చదవండి: గుడి, మసీదు, దర్గా.. రోడ్లపై ఉన్న నిర్మాణాలు తొలగించాల్సిందే: సుప్రీంకోర్టు -
పరువునష్టం కేసులో అతిషి, కేజ్రీవాల్‌కు ఊరట
న్యూఢిల్లీ: క్రిమినల్ పరువునష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, ఆప్ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఢిల్లీలో ఓటర్ల జాబితా నుంచి పలువురు పేర్లను తొలిగించారంటూ ఆరోపిస్తూ దిగువ కోర్టులో దాఖలైన క్రిమినల్ పరువునుష్టం కేసు విచారణపై సుప్రీంకోర్టు సోమవారం స్టే విధించింది.కాగా ఢిల్లీ ఓటర్ల జాబితా నుంచి పలువురి పేర్లను తొలగించారంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కేజ్రీవాల్, అతిషి, ఆప్ నేతలు సుశీల్ కుమార్ గుప్తా, మనోజ్ కుమార్లపై పరువునష్టం కేసు దాఖలైంది.ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఆప్ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో కేజ్రీవాల్, అతిషి సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్నారు.దీనిపై సమాధానం ఇవ్వాల్సిందిగా ఢిల్లీ పోలీసులకు, ఫిర్యాదుదారు, బీజేపీ నేత రాజీవ్ బబ్బర్‌కు జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం అరవింద్ కేజ్రీవాల్, అతిషిపై దిగువ కోర్టులో విచారణపై స్టే ఇచ్చింది. -
నాదీ భరతుడి వ్యథే!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఆతిశి బాధ్యతలు స్వీకరించారు. మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పై తనకున్న ప్రభు భక్తిని చాటుకున్నారు. ఇన్నాళ్లూ ఆయన కూర్చున్న ఎర్ర రంగు కుర్చీని ఖాళీగానే ఉంచి, ఆ పక్కనే మరో తెల్ల రంగు కుర్చీలో కూర్చుని సాదాసీదాగా సోమవారం సచివాల యంలో ఆమె ఢిల్లీ 8వ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆతిశి మీడియాతో మాట్లాడారు.ఈ కుర్చీ కేజ్రీవాల్దిరామాయణంలో శ్రీరాముడి సోదరుడు భరతుడి మాదిరిగానే తాను వ్యథ చెందుతున్నానని ఆతిశి అన్నారు. ‘ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాను. ఆనాడు భరతుడి వ్యథలాగే.. నేడు నా మనసు వ్యథ చెందుతోంది. శ్రీరాముడు 14 ఏళ్ల వనవాసానికి వెళ్లినప్పుడు భరతుడు అయోధ్య రాజ్య పాలన బాధ్యతలు తీసుకోవాల్సివచ్చింది. శ్రీరాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి ఆయన రాజ్యపాలన చేశారు. అదే తీరుగా వచ్చే నాలుగు నెలలు ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపిస్తాను. తండ్రికిచ్చిన మాట కోసం శ్రీరాముడు 14 ఏళ్లు వనవాసం చేశారు. అందుకే మనం ఆయనను మర్యాద పురుషోత్తముడిగా పిలుచుకుంటాం. శ్రీరాముడి జీవితం మర్యాద, నైతికతకు నిదర్శనం. అదే విధంగా కేజ్రీవాల్ కూడా మర్యాద, నైతికతకు నిదర్శనంగా నిలిచారు. గత రెండేళ్లుగా కేజ్రీవాల్‌పై బురదజల్లేందుకు బీజేపీ ఏ అవకాశాన్నీ వదిలి పెట్టలేదు. అయితే, నిజాతీపరుడినని నిరూపించుకునే వరకూ సీఎం పీఠంలో కూర్చోనని ఆయన పదవికి రాజీమా చేశారు. కానీ, ఈ కుర్చీ (తన పక్కనే ఖాళీగా ఉన్న కుర్చీని చూపెడుతూ) కేజ్రీవా ల్ది. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు తమ ఆశీర్వాదంతో కేజ్రీవాల్‌ను సీఎం పీఠంపై కూర్చో బెడతారనే నమ్మకం నాకుంది’’ అని ఆతిశి అన్నారు. సీఎం పదవికే అవమానంకేజ్రీవాల్ వాడిని కుర్చీలో కూర్చోరాదంటూ సీఎం ఆతిశి తీసుకున్న నిర్ణయంపై బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా మండిపడ్డాయి. ‘ఆతిశి చేసిన పని ఆదర్శం ఎంతమాత్రమూ కాదు. ఆమె సీఎం పదవిని అవమా నించడమే కాదు, ఢిల్లీ ప్రజల మనోభావాలను దెబ్బతీశారు’’ అని ఆ పార్టీ ప్రతినిధులు ధ్వజమెత్తారు. -
రామాయణ ప్రస్తావనతో సీఎం అతిషి భావోద్వేగం
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో సీఎం అతిషి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కుర్చీ ఎప్పటికీ కేజ్రీవాల్దేనని అన్నారు. ఈ సందర్బంగా సీఎంగా కేజ్రీవాల్ కూర్చున్న కుర్చీని పక్కనపెట్టి మరో కుర్చీ వేసుకుని కూర్చున్నారు.ఢిల్లీ సీఎంగా అతిషి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేను ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాను. రాముడు 14 ఏళ్లు వనవాసంలో ఉన్నప్పుడు భరతుడు రాజ్యం బాధ్యతలు చేపట్టాల్సి వచ్చినప్పుడు ఎలాంటి బాధ కలిగిందో ఈరోజు నాకు కూడా అంతే బాధగా ఉంది. ఎంతో కఠిన సమయంలో బాధ్యతలు స్వీకరిస్తున్నాను. 14 ఏళ్ల పాటు భరతుడు కుర్చీపై చెప్పులు పెట్టుకుని పాలన కొనసాగించాడో.. అదే విధంగా, రాబోయే నాలుగు నెలల పాటు నేను ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపిస్తాను. అరవింద్ కేజ్రీవాల్‌పై తప్పుడు కేసులు పెట్టి, అరెస్టు చేసి ఆరు నెలలు జైల్లో ఉంచారు. ఢిల్లీ ప్రజలకు ఆయన నిజాయితీపై నమ్మకం ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం అరవింద్ కేజ్రీవాల్‌కే చెందుతుంది. ప్రజలు మళ్లీ ఆయనను ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు’ అని కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ, ఈడీ అరెస్ట్ కారణంగా కేజ్రీవాల్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అనంతరం, సుప్రీంకోర్టు తీర్పుతో కేజ్రీవాల్ విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ సీఎంగా మంత్రి అతిషి ప్రమాణ స్వీకారం చేశారు. నేడు బాధ్యతలు స్వీకరించారు. #WATCH | Delhi CM Atishi says, "I have taken charge as the Delhi Chief Minister. Today my pain is the same as that was of Bharat when Lord Ram went to exile for 14 years and Bharat had to take charge. Like Bharat kept the sandals of Lord Ram for 14 years and assumed charge,… https://t.co/VZvbwQY0hX pic.twitter.com/ZpNrFEOcaV— ANI (@ANI) September 23, 2024ఇది కూడా చదవండి: కశ్మీర్లో ‘హంగ్’ రావొద్దనే... కాంగ్రెస్‌తో పొత్తుపై ఒమర్ -
సాక్షి కార్టూన్ 23-09-2024
-
ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అతిశి... మరో ఐదుగురు కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
సీఎం పీఠంపై మహిళా శక్తి
న్యూఢిల్లీ: ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఆతిశి దేశ చరిత్రలో 17వ మహిళా ముఖ్యమంత్రి కావడం విశేషం. అంతేకాదు ఇప్పటిదాకా ఢిల్లీ సీఎంగా పనిచేసిన మహిళల్లో అత్యంత పిన్నవయసు్కరాలు అతిశి. ఆమె వయసు కేవలం 43 ఏళ్లు. ప్రస్తుతం దేశంలో ఉన్న మహిళా సీఎంలలో రెండో సీఎం ఆతిశి. పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మహిళా ముఖ్యమంత్రులు సుచేతా కృపలానీ స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా సుచేతా కృపలానీ రికార్డు సృష్టించారు. ఆమె 1963 నుంచి 1967 దాకా ఉత్తరప్రదేశ్ సీఎంగా పనిచేశారు. నందిని శతపథి దేశంలో రెండో మహిళా సీఎం నందిని శతపథి. 1972 నుంచి 1976 వరకు ఒడిశా ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఇందిరా గాందీకి ఆమె అత్యంత సన్నిహితురాలు. శశికళ కకోద్కర్ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ నేత శశికళ కకోద్కర్ 1973 నుంచి 1979 దాకా కేంద్ర పాలిత ప్రాంతమైన గోవా, డయ్యూడామన్కు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 1987లో గోవాకు రాష్ట్ర హోదా లభించింది. అన్వర తైమూర్ దేశంలో మొదటి ముస్లిం మహిళా ముఖ్యమంత్రిగా అన్వర తైమూర్ రికార్డుకెక్కారు. ఆమె 1980 నుంచి 1981 దాకా అస్సాం సీఎంగా పనిచేశారు. వి.ఎన్.జానకి రామచంద్రన్ ప్రఖ్యాత తమిళ నటుడు, దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ భార్య వి.ఎన్.జానకి రామచంద్రన్ తమిళనాడు తొలి మహిళా సీఎంగా చరిత్ర సృష్టించారు. 1988లో భర్త ఎంజీఆర్ మరణం తర్వాత కేవలం 23 రోజులపాటు సీఎంగా పనిచేశారు. జె.జయలలిత ఎంజీఆర్ శిష్యురాలు, డీఎంకే నేత, ప్రముఖ సినీ నటి జె.జయలలిత ఆరు పర్యాయాలు తమిళనాడు సీఎంగా సేవలందించారు. మొత్తం 14 ఏళ్లకుపైగా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. మాయావతి బహుజన సమాజ్ పారీ్ట(బీఎస్పీ) అధినేత మాయావతి నాలుగు పర్యాయాలు ఉత్తరప్రదేశ్ సీఎంగా వ్యవహరించారు. మొత్తం ఏడు సంవత్సరాల పాటు పదవిలో ఉన్నారు. రాజీందర్ కౌర్ భట్టాల్ పంజాబ్‌కు ఇప్పటిదాకా ఏకైక మహిళా సీఎంగా రాజీందర్ కౌర్ భట్టాల్ రికార్డుకెక్కారు. ఆమె 1996 నుంచి 1997 దాకా పంజాబ్ సీఎంగా పనిచేశారు. రబ్రీ దేవి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ జైలు పాలు కావడంతో ఆయన భార్య రబ్రీ దేవి 1997లో బిహార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బిహార్‌లో ఇప్పటివరకు ఏకైక మహిళా సీఎం రబ్రీ దేవి. సుష్మా స్వరాజ్ ఢిల్లీ తొలి మహిళా సీఎం సుష్మా స్వరాజ్. 1998లో ఆమె 52 రోజులపాటు ఈ పదవిలో కొనసాగారు. షీలా దీక్షిత్ ఢిల్లీ రెండో మహిళా సీఎం షీలా దీక్షిత్. ఢిల్లీలో అత్యధిక కాలం పనిచేసిన సీఎంగా రికార్డు నెలకొల్పారు. ఆమె 1998 నుంచి 2013 దాకా 15 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఉమా భారతి రామ జన్మభూమి ఉద్యమ నేత, ఫైర్‌బ్రాండ్ ఉమా భారతి 2003 నుంచి 2004 దాకా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. వసుంధర రాజే గ్వాలియర్ మహారాజు జీవాజిరావు సింధియా, విజయరాజే సింధియా దంపతుల కుమార్తె అయిన వసుంధర రాజే రెండు పర్యాయాల్లో 10 సంవత్సరాలపాటు రాజస్తాన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ 2011 నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. ఆనందిబెన్ పటేల్ గుజరాత్‌కు ఏకైక మహిళా ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్. నరేంద్ర మోదీ తర్వాత ఆమె 2014 నుంచి 2016 దాకా సీఎంగా పనిచేశారు. మహబూబా ముఫ్తీ పీపుల్స్ డెమొక్రటిక్ పారీ్ట(పీడీపీ) నేత మహబూబా ముఫ్తీ జమ్మూకశ్మీర్ తొలి మహిళా సీఎంగా చరిత్ర సృష్టించారు. 2016 నుంచి 2018 వరకు సీఎంగా వ్యవహరించారు. ఆతిశి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో నూతన ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి వరుస: షీలా దీక్షిత్, ఉమా భారతి, ఆనందీబెన్ పటేల్, మెహబూబా ముఫ్తీ, జానకీ రామచంద్రన్, మాయావతి రెండో వరుస: నందినీ శతపథి, అన్వర తైమూర్, రబ్డీదేవి, శశికళా కకోడ్కర్, వసుంధరా రాజె సింధియామూడో వరుస: సుష్మా స్వరాజ్, సుచేతా కృపలానీ, రాజీందర్ కౌర్, మమతా బెనర్జీ, జయలలిత. -
అతిశి అనే నేను..! ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణస్వీకారం
-
సీఎం అతిషీతో పాటు ప్రమాణం.. ఐదుగురు మంత్రుల వివరాలివే..
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆప్ నేత అతిషీ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం సాయంత్రం ఢిల్లీలోని రాజ్ నివాస్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. ఆమె చేత ప్రమాణం చేయించారు. కాగా ఢిల్లీ సీఎం పదవిని చేపట్టిన అతిపిన్క వియస్కురాలిగా ఆమె రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆమె ఆర్థిక, విద్య, పీడబ్ల్యూడీ, రెవెన్యూ సహా పలు కీలక శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు.అతిషీ పాటు గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముకేశ్ అహ్లావత్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో ముకేశ్ అహ్లవత్ దళిత ఎమ్మెల్యే కాగా, తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అతిశీ తల్లిదండ్రులు, ఆప్ ఎమ్మెల్యేలు, పలువురు మంత్రులు పాల్గొన్నారు.మంత్రుల వివరాలుగోపాల్ రాయ్..ఆయన ఢిల్లీలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు, అరవింద్ కేజ్రీవాల్ హయాంలో పర్యావరణం, అటవీ, వన్యప్రాణి, అభివృద్ధి సాధారణ పరిపాలన శాఖను నిర్వర్తించారు. ఆలాగే ఆప్ ఢిల్లీ రాష్ట్ర విభాగానికి కన్వీనర్‌గా కూడా ఉన్నారు. ఈశాన్య ఢిల్లీలోని బాబాపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.కైలాష్ గహ్లోత్.. 2015లో నజఫ్‌గఢ్ నియోజకవర్గం నుంచి ఢిల్లీ శాసనసభకు తొలిసారి ఎన్నికలయ్యారు. కేజ్రీవాల్ పదవీకాలంలో పరిపాలనా సంస్కరణలు, రవాణా, రెవెన్యూ, చట్టం, న్యాయం, శాసనసభ వ్యవహారాలు, మహిళా శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ & టెక్నాలజీ పోర్ట్‌ఫోలియోలను నిర్వహించారు.సౌరభ్ భరద్వాజ్.. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, పర్యాటక-కళా సంస్కృతి భాషలు, పరిశ్రమలు, నీటిపారుదల, వరద నియంత్రణ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఇమ్రాన్ హుస్సేన్.. ఢిల్లీ క్యాబినెట్లో ఆహార, పౌర సరఫరాలు, ఎన్నికల మంత్రిగా పనిచేస్తున్నారు. 2015, 2020 ఎన్నికల్లో బల్లిమారన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆప్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఐదుసార్లు సిట్టింగ్ ఎమ్మెల్యేను ఓడించి గెలుపొందారు.ముకేశ్ అహ్లావత్.. ఢిల్లీలోని సుల్తాన్పూర్ మజ్రా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సాంఘిక సంక్షేమ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా చేయడంతో ముకేశ్ మంత్రివర్గంలో చేరారు. కాగా గత ఏప్రిల్‌లో ఆనంద్ కుమార్ ఆప్‌కు రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి వైదొలిగారు. సుల్తాన్పూర్ మజ్రా నుంచి 2020లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అహ్లావత్.. 48,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణస్వీకారం
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి శనివారం(సెప్టెంబర్21) సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అతిషి ఎల్జీ కార్యాలయం రాజ్‌నివాస్‌లో ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకారానికి ముందు అతిషి ఆమ్ఆద్మీపార్టీ చీఫ్, మాజీ సీఎం కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. అతిషితో పాటు నలుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. అతిషితో పాటు ఐదుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో సౌరభ్ భరద్వాజ్, గోపాల్‌రాయ్,ముకేష్ అహ్లావత్,ఇమ్రాన్‌హుస్సేన్ తదితరులు మంత్రులుగా భాద్యతలు చేపట్టారు. ప్రమాణస్వీకారానికి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆమ్ఆద్మీపార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. అతిషి ఢిల్లీకి మూడో మహిళా సీఎం కావడం విశేషం. కాగా లిక్కర్ స్కామ్ కేసులో ఇటీవలే బెయిల్‌పై విడుదలైన ఆమ్ఆద్మీపార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో అతిషి సీఎంగా పదవి చేపట్టారు. మళ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిస్తేనే సీఎం పదవి చేపడతానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. 2025 ఫిబ్రవరి ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు రానున్నాయి. అప్పటిదాకా అతిషి నేతృత్వంలో ఆప్ ప్రభుత్వం కొనసాగనుంది. #WATCH | AAP leader Atishi takes oath as Chief Minister of Delhi pic.twitter.com/R1iomGAaS9— ANI (@ANI) September 21, 2024 -
కేజ్రీవాల్ పాలనపై విమర్శలు.. అతిషికి అభినందనలు
ఢిల్లీ: ఆప్ ప్రభుత్వ పదేళ్ల పాలనపై విమర్శలు చేస్తూనే.. ఢిల్లీకి కొత్త సీఎంగా ఎంపికైన ఆప్ నాయకురాలు అతిషికి ప్రతిపక్ష బీజేపీ నేత హర్ష్ మల్హోత్రా అభినందనలు తెలిపారు. దశాబ్ద కాలం పాటు అరవింద్ కేజ్రీవాల్ పాలనలో ఢిల్లీని వేధించిన పలు కీలక సమస్యలకు పరిష్కరం చూపించాలని కోరారు. ఢిల్లీలో ఉన్న అవినీతిని ఎదుర్కోవాలని విజ్ఞప్తి చేశారు.‘‘గత 10 ఏళ్లలో ఢిల్లీ ప్రజలకు అందని అభివృద్ధి, సౌకర్యాలు కనీసం మీ(అతిషి) నాయకత్వంలోనైనా అందేలా చూడాలి. జాతీయ రాజధాని అంతటా అపరిశుభ్రమైన మురుగు, విస్తృతమైన నీటి ఎద్దడి, నిరంతర సమస్యలు ఉన్నాయి.ఈ సమస్యల ముఖ్యమంత్రిగా పరిష్కారానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా’’ అని అన్నారు.ఇదిలాఉండగా.. అఫ్జల్ గురును ఉరితీయకుండా కాపాడే ప్రయత్నాలకు అతిషి కుటుంబ సభ్యులు మద్దతు ఇచ్చారని ఇటీవల ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలను హర్ష్ మల్హొత్రా ప్రస్తావిస్తూ.. అలాంటి వారికి మద్దతు ఇవ్వాలా? వద్దా? అనేదానిపై అతిషి , కేజ్రీవాల్ ఆలోచించాలన్నారు.మరోవైపు.. అతిషి ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆమెతో పాటు ఐదుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.చదవండి: ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం నేడే -
ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణ స్వీకారం నేడే
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నాయకురాలు అతిషి ఇవాళ (శనివారం) ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు సీఎంగా అతిషితో సహా ఐదుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఢిల్లీ సీఎంగా అతిశి నియామకం సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం అతిషి సీఎం నియామకానికి సంబంధించి గెజిట్ విడుదల చేసింది. ఇక.. ఇవాళ జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.President Murmu officially appoints Atishi as Delhi CM; accepts Kejriwal's resignationRead @ANI Story | https://t.co/R278OnyQt6#DroupadiMurmu #Atishi #ArvindKejriwal pic.twitter.com/RwgGCmrHXn— ANI Digital (@ani_digital) September 20, 2024ఇటీవల ఢిల్లీ సీఎంగా రెండు రోజుల్లో అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేస్తానని ప్రకటించారు. ప్రకటించిన విధంగానే ఆయన రాజీమానా చేసి.. తమ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా సీనియర్ నాయకురాలు అతిషిని ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ముందు ఆమెను శాసనసభా పక్షనేత ఎన్నుకున్నారు. అనంతరం ప్రమాణస్వీకార తేదీని ప్రతిపాదిస్తూ.. లెఫ్టినెంట్ గరర్నర్ (ఎల్జీ) వీకే సక్సేనాకు లేఖ అందజేశారు. ఇక.. ఢిల్లీకి అతిషి ఎనిమిదో సీఎం కానున్నారు. ఆమె ఢిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా సరికొత్త రికార్డు క్రియేట్ చేయనున్నారు. చదవండి: ప్రభుత్వ సలహాదారు నుంచి ప్రభుత్వాన్నే నడిపించేదాకా.. -
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అతిషి మర్లెనా ఇష్టపడే రెసిపీ ఇదే..!
మన దేశ రాజధానిని చారిత్రాత్మక ప్రాధాన్యత తోపాటు విభిన్న సంస్కృతుల కలబోతగా పేర్కొనవచ్చు. ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా అనంతరం కొత్త సీఎంగా అతిషి మర్లెనా ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. ఢిల్లీకి అతిషి ఎనిమిదో సీఎం కాగా మూడో మహిళ సీఎంగా నిలవడం విశేషం. పంజాబీ కుటుంబానికి చెందిన మన కొత్త సీఎం ఇష్టంగానే తినే వంటకం గురించి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మన దేశ రాజధాని ఆహ్లాదపరిచే వివిధ వంటకాల సమ్మేళనాలకు ప్రతీకగా ఉంటుంది. అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు విభిన్న సంస్కృతుల రుచులు ఇక్కడ కనిపిస్తాయి. అలాంటి ఢిల్లీకి సీఎం కానున్న అతిషి ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తాం అనే వాగ్దానంతో ప్రజల్లోకి బలంగా వచ్చిన నాయకురాలు. అయితే ఆమె ఒక ఇన్స్టాగ్రాం వీడియోలో తనకు ఇష్టమనే రెసీపీ గురించి నెటిజన్లతో పంచుకున్నారు. తనకు 'రాజ్మా చావలె' అంటే మహాఇష్టమని చెప్పారు. పంజాబీ వంటకమైన ఈ మసాల రెసిపీ సంపూర్ణంగా తిన్న ఫీల్‌ని అందిస్తుంది. దీన్ని వండటం చాల సులభం. అప్పటికప్పుడూ ఇంట్లో ఉండే మసాలా దినుసులతోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ ఉత్తర భారత వంటకాన్ని ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తానని చెప్పుకొచ్చారు. మరింత రుచికరంగా ఉండాలంటే.. ఈ రాజ్మా కర్రీలో చివరగా కాస్త క్రీమ్ లేదా వెన్నని జోడిస్తే ఆ రుచే వేరేలెవెల్ అని అన్నారు. అయితే ఆమె తాను స్వయంగా వండటంలో ఇబ్బంది లేదు గానీ తానే ఆ కూర తినాలంటే మాత్రం కష్టమే అంటూ చమత్కరించారు.(చదవండి: కాబోయే అమ్మలకే కాదు తండ్రులకు కావాలి సెలవు..!) -
21న ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణస్వీకారం..!
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎంగా మంత్రి అతిషి ప్రమాణస్వీకారం 21న ఉండే అవకాశాలున్నాయి. ప్రమాణస్వీకార తేదీని అతిషి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనాకు అందజేసిన లేఖలో తెలపలేదు. అయితే ఎల్జీ మాత్రం 21న అతిషి ప్రమాణస్వీకారాన్ని ప్రతిపాదిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమాచారమందించారు. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాతో పాటు అతిషి అందించిన ఎమ్మెల్యేల మద్దతు లేఖను ఎల్జీ రాష్ట్రపతికి పంపించారు. ఈ సందర్భంగా అతిషి ప్రమాణస్వీకారం 21న ఎల్జీ ప్రతిపాదించారు. అయితే అతిషి ఒక్కరే ప్రమాణస్వీకారం చేస్తారా లేదా కేబినెట్ మంత్రులు ఎవరైనా ఆమెతో ప్రమాణస్వీకారం చేస్తారా అనేదానిపై ఇప్పటికీ స్పష్టత లేదు.కాగా, అరవింద్ కేజ్రీవాల్ తన రాజీనామా లేఖలో ఎల్జీకి కాకుండా రాష్ట్రపతిని ఉద్దేశించి ఒకే ఒక వ్యాఖ్యంలో రాశారు. లేఖ అందించడానికి మాత్రం కేజ్రీవాల్ స్వయంగా ఎల్జీ వద్దకు వెళ్లి అందిచడం గమనార్హం. ఇదీ చదవండి.. ‘అతిషి డమ్మీ సీఎంగా ఉంటారు’ -
ఆతిశి డమ్మీ సీఎంగా ఉంటారు!
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎంగా ఆప్ నేత అతిశిని ఎంపిక చేయడంపై రాజ్యసభ ఎంపీ స్వాతీ మలివాల్ స్పందించారు. ముఖ్యమంత్రిగా ఆమె డమ్మీగా మిగిలిపోతారనే విషయం అందరికీ తెలిసిందే అంటూ ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. అతిశి కుటుంబం ఉగ్రవాది అఫ్జల్ గురును ఉరి శిక్ష నుంచి కాపాడేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ‘అఫ్జల్ గురు అమాయకుడు. అతడు రాజకీయ కుట్రకు బలయ్యాడు. అతడిని ఉరి తీయకండి, క్షమాభిక్ష పెట్టండంటూ ఈమె తల్లిదండ్రులు రాష్ట్రపతికి పలుమార్లు వినతులు పంపారు’అని మలివాల్ ఆరోపించారు. ‘దేశ భద్రతపై ఆందోళన కలిగించే పరిణామమిది. ఇది ఎంతో విచారకరమైన రోజు. ఢిల్లీని ఆ దేవుడే కాపాడాలి’అని ఆమె పేర్కొన్నారు. అతిశి తల్లిదండ్రులు విజయ్ సింగ్, త్రిప్తా వాహి సంతకాలతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపిన క్షమాభిక్ష పిటిషన్ కాపీని కూడా మలివాల్ షేర్ చేశారు. వీటిపై ఆప్ ఎమ్మెల్యే దిలీప్ పాండే స్పందిస్తూ..‘ఆప్ టిక్కెట్‌పై రాజ్యసభకు వెళ్లిన స్వాతి మలివాల్..ఇప్పుడు బీజేపీ గొంతు వినిపిస్తున్నారు. ఏమాత్రం సిగ్గున్నా వెంటనే ఆమెకు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి’అని డిమాండ్ చేశారు. రాజ్యసభలోనే కొనసాగాలనుకుంటే బీజేపీ టిక్కెట్‌పై ఆమె మళ్లీ ఎన్నికవ్వొచ్చని పాండే పేర్కొన్నారు. పార్లమెంట్‌పై 2001లో జరిగిన దాడి కేసులో దోషి అయిన అఫ్జల్ గురును 2013లో ఉరితీయడం తెలిసిందే. తన తల్లిదండ్రులు అఫ్జల్ గురుకు అనుకూలంగా రాష్ట్రపతికి పంపిన క్షమాభిక్ష పిటిషన్‌పై 2019లో ఓ ఇంటర్వ్యూలో అతిశి..‘ఆ అంశంతో నాకెలాంటి సంబంధమూ లేదు. అది నా తల్లిదండ్రులు వారి ఆశయాలకు అనుగుణంగా స్పందించారు. అది వారిష్టం. ఈ విషయంలో వారికి నేను ఎలాంటి మద్దతివ్వలేదు కూడా’అని స్పష్టం చేయడం గమనార్హం. -
ప్రభుత్వ సలహాదారు నుంచి ప్రభుత్వాన్నే నడిపించేదాకా..
ఢిల్లీ ఆప్ సర్కార్‌లో కీలక మంత్రులంతా జైల్లో ఊచలు లెక్కబెడుతుంటే డజనుకుపైగా మంత్రిత్వ శాఖలను ఒంటిచేత్తో నడిపి సమర్థవంతమైన నాయకురాలిగా నిరూపించుకున్న అతిశికి సరైన మన్నన దక్కింది. మధ్యప్రదేశ్‌లోని కుగ్రామంలో ఏడు సంవత్సరాలపాటు ఉండి అక్కడి రైతులకు సేంద్రీయ వ్యవసాయంపై పాఠాలు బోధించిన అతిశి తర్వాతి కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. సోషలిస్ట్ విప్లవయోధులు మార్క్స్, లెనిన్ పేర్లను కలిపి అతిశి తల్లిదండ్రులు ఆమెకు ‘మార్లెనా’ పేరును జోడించారు. అయితే రాజకీయరంగ ప్రవేశానికి ముందే 2018లో మార్లెనా పదాన్ని తన పేరు నుంచి అతిశి తొలగించుకున్నారు. రాజకీయ నామధేయం పోయినా ఈమెకు రాజకీయాలు బాగా అబ్బడం విశేషం. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కరణల కోసం పాటుపడి మంచి పేరు తెచ్చుకున్నారు. పలు శాఖలను నిర్వర్తించిన పాలనా అనుభవం సీఎంగా ఆమెకు అక్కరకు రానుంది.రాజకీయ ప్రవేశం2013లో ఆప్ పార్టీలో చేరారు. 2013లో ఆప్ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించిన ముసాయిదా కమిటీలో కీలక సభ్యురాలిగా ఉన్నారు. పట్టణ, మధ్యతరగతి వర్గాల్లో ఆప్ ఇమేజ్ పెరిగేలా ముసాయిదా కమిటీకి అతిశి కీలక సూచనలు ఇచ్చినట్లు చెబుతారు. 2015లో మధ్యప్రదేశ్‌లోని ఖంద్వా జిల్లాలో జల సత్యాగ్రహం దీక్ష చేపట్టి పార్టీలో ముఖ్యురాలిగా మారారు. అప్పటి నుంచి మూడేళ్లపాటు మనీశ్ సిసోడియాకు ముఖ్య సలహాదారుగా సేవలందించారు. 2019లో ఈస్ట్ ఢిల్లీ స్థానం నుంచి లోక్‌సభకు పోటీచేశారు. అయితే అక్కడి బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ చేతిలో ఓడిపోయారు. 2020లో ఢిల్లీలోని కాల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు. పలుశాఖలకు మంత్రిగా: మనీశ్ సిసోడియా అరెస్ట్ తర్వాత 2023 ఫిబ్రవరిలో విద్యా, ప్రజాపనులు, సంస్కృతి, పర్యాటక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో ఎక్సయిజ్ పాలసీ కేసులో మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్ట్ కావడంతో పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత అన్నీ తానై ఆర్థికశాఖసహా 14 మంత్రిత్వ శాఖల బాధ్యతలు తన భుజస్కంధాలపై మోశారు. 2024లో ఆప్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. అతిశి ఒకప్పుడు రిషివ్యాలీ టీచర్ కురబలకోట(అన్నమయ్య జిల్లా): అన్నమయ్య జిల్లా మదనపల్లెకు సమీపంలోని కురబలకోట మండలం రిషివ్యాలీ స్కూల్లో అతిశి గతంలో టీచర్‌గా పనిచేశారు. 2003 జూలై నుంచి 2004 మార్చి వరకు హిస్టరీ టీచర్‌గా చేశారు. 6, 7 తరగతులకు ఇంగ్లీషు టీచర్‌గా పనిచేశారు. తమ పూర్వ టీచర్ ఢిల్లీ సీఎం కానుండటంతో రిషివ్యాలీ స్కూ ల్ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి రిషివ్యాలీ స్కూల్‌ను స్థాపించారు. – సాక్షి, నేషనల్డెస్క్జననం: 1981 జూన్ 8తల్లిదండ్రులు: విజయ్ సింగ్, త్రిప్తా వాహీ(వీళ్లిద్దరూ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు)భర్త: ప్రవీణ్ సింగ్ (పరిశోధకుడు, విద్యావేత్త)విద్యార్హతలు: ఢిల్లీలోని స్ప్రింగ్డేల్స్ స్కూల్లో చదువుకున్నారు. 2001లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి టాపర్‌గా నిలిచారు. చెవెనింగ్ స్కాలర్షిప్ సాయంతో ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో హిస్టరీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 2005లో రోడ్స్ స్కాలర్‌షిప్‌తో ‘ఎడ్యుకేషన్’లో మాస్టర్స్ చేశారు. -
ఢిల్లీ సీఎం ఆతిశి
సాక్షి, న్యూఢిల్లీ: సస్పెన్స్ వీడింది. ఢిల్లీ సీఎం పీఠం ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకురాలు ఆతిశీ మార్లీనాకు దక్కింది. పార్టీ శాసనసభాపక్షం మంగళవారం ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. అనంతరం కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఆయన రాజీనామా లేఖ అందజేయడం, ఆ వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఎల్జేకు ఆతిశి లేఖ సమరి్పంచడం వెంటవెంటనే జరిగిపోయాయి. వారంలోగా ఆమె ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం 26, 27 తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో లాంఛనంగా మెజారిటీ నిరూపించుకుంటారు. కేజ్రీవాల్ కేబినెట్లో ఆరి్ధకం, విద్య, సాగు నీరు సహా 14 శాఖల బాధ్యతలను మోస్తూ వచి్చన ఆతిశి త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల దాకా సీఎంగా ప్రభుత్వాన్ని నడపనున్నారు. ఢిల్లీకి ఆమె మూడో మహిళా సీఎం. గతంలో బీజేపీ దిగ్గజం సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ సీఎంలుగా చేశారు. మమతా బెనర్జీ (పశి్చమ బెంగాల్) తర్వాత ప్రస్తుతం దేశంలో రెండో మహిళా సీఎం కూడా ఆతిశే కానున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఐదు నెలల పై చిలుకు కారాగారవాసం నుంచి కేజ్రీవాల్ వారం క్రితం బెయిల్‌పై బయటికి రావడం, సీఎం పదవికి రాజీనామా చేస్తానంటూ ఆదివారం సంచలన ప్రకటన చేయడం తెలిసిందే. దాంతో తదుపరి సీఎంగా ఆతిశితో పాటు కేజ్రీవాల్ భార్య సునీత తదితర పేర్లు రెండు రోజులుగా తెరపైకొచ్చాయి. మంగళవారం ఆప్ ఎల్పీ భేటీలో కేజ్రీవాల్ సూచన మేరకు ఆతిశి పేరును పార్టీ సీనియర్ నేత దిలీప్ పాండే ప్రతిపాదించారు. ఎమ్మెల్యేలంతా నిలబడి ఆమోదం తెలిపారు. 2013లో ఆప్ ఆవిర్భావం నుంచి పారీ్టలో ఆతిశి క్రియాశీలంగా ఉన్నారు. 2015 నుంచి కేజ్రీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2018 దాకా నాటి ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చూసిన విద్యా శాఖకు సలహాదారుగా ఉన్నారు. 2020లో కాల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారి గెలుపొందారు. మద్యం కుంభకోణంలో మంత్రి పదవులకు సిసోడియా, సత్యేంద్ర జైన్ రాజీనామా తర్వాత ఆమె మంత్రి అయ్యారు. కీలకమైన ఆర్ధిక, విద్య, తాగునీరు సహా 14 శాఖలు చూస్తున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత అటు పారీ్టని, ఇటు ప్రభుత్వాన్ని సర్వం తానై నడిపించారు. కేజ్రీవాల్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే మా ఏకైక లక్ష్యం: అతిశిఆప్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యాక ఆతిశి మీడియాతో మాట్లాడారు. తన గురువు కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘సీఎం పదవికి ఆయన రాజీనామా చేస్తున్నందుకు ఎంతో బాధగా ఉంది. నన్ను నమ్మి ఇంతటి బాధ్యత కట్టబెట్టారు. ఎమ్మెల్యేను చేశారు. మంత్రిని చేశారు. ఇప్పుడిలా సీఎంనూ చేశారు. ఇది ఆప్‌లో మాత్రమే సాధ్యం. సామాన్య కుటుంబం నుంచి వచి్చన నా వంటివారికి మరో పారీ్టలో అయితే కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా దక్కదు. ఢిల్లీ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేజ్రీవాల్ మార్గదర్శకత్వంలో సాగుతా. ఆయన్ను తిరిగి సీఎం చేయడమే లక్ష్యంగా పని చేస్తాం’’ అన్నారు. నిజాయితీపరుడైన కేజ్రీవాల్‌పై తప్పుడు అభియోగాలు మోపారన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను గెలిపించి ఆయన్ను మళ్లీ సీఎం చేయాలని ఢిల్లీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. షెడ్యూల్ ప్రకారం అవి వచ్చే ఫిబ్రవరిలో జరగాల్సి ఉంది. మహారాష్ట్రతో పాటే నవంబర్లోనే జరపాలని కేజ్రీవాల్ డిమాండ్ చేయడం తెలిసిందే. ఆ అవకాశం లేదని ఈసీ వర్గాలంటున్నాయి.మారింది ముఖమే: బీజేపీ సీఎంగా ఆతిశి ఎంపికపై బీజేపీ పెదవి విరిచింది. కేవలం ముఖాన్ని మార్చినంత మాత్రాన పార్టీ స్వభావం మారబోదని పార్టీ ఢిల్లీ విభాగం చీఫ్ వీరేందర్ సచ్దేవ అన్నారు. ఈ రాజకీయ జూదంతో కేజ్రీవాల్‌కు లాభించేదేమీ ఉండబోదని ఆయన జోస్యం చెప్పారు.