సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి శనివారం(సెప్టెంబర్21) సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అతిషి ఎల్జీ కార్యాలయం రాజ్‌నివాస్‌లో ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకారానికి ముందు అతిషి ఆమ్‌ఆద్మీపార్టీ చీఫ్, మాజీ సీఎం కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు.
అతిషితో పాటు నలుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. అతిషితో పాటు ఐదుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో సౌరభ్ భరద్వాజ్, గోపాల్‌రాయ్,ముకేష్ అహ్లావత్,ఇమ్రాన్‌హుస్సేన్ తదితరులు మంత్రులుగా భాద్యతలు చేపట్టారు. ప్రమాణస్వీకారానికి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆమ్‌ఆద్మీపార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. అతిషి ఢిల్లీకి మూడో మహిళా సీఎం కావడం విశేషం.
కాగా లిక్కర్ స్కామ్ కేసులో ఇటీవలే బెయిల్‌పై విడుదలైన ఆమ్‌ఆద్మీపార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో అతిషి సీఎంగా పదవి చేపట్టారు. మళ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిస్తేనే సీఎం పదవి చేపడతానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. 2025 ఫిబ్రవరి ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు రానున్నాయి. అప్పటిదాకా అతిషి నేతృత్వంలో ఆప్ ప్రభుత్వం కొనసాగనుంది.
#WATCH | AAP leader Atishi takes oath as Chief Minister of Delhi pic.twitter.com/R1iomGAaS9
— ANI (@ANI) September 21, 2024
Comments
Please login to add a commentAdd a comment