Delhi Chief Minister
-
అన్ని వర్గాలకు నచ్చే విధంగా... ఢిల్లీ కేబినెట్ కూర్పు
న్యూఢిల్లీ: ఢిల్లీలో దాదాపు 26 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తాజాగా ఏర్పాటైన రేఖా గుప్తా ప్రభుత్వంలో అన్ని ప్రధాన వర్గాలకు ప్రాతినిథ్యం కల్పించింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా(50) బనియా వర్గానికి చెందిన ఎమ్మెల్యే. మంత్రులుగా పర్వేశ్ వర్మ, ఆశిష్ సూద్, మంజిందర్ సింగ్ సిర్సా, కపిల్ మిశ్రా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, పంకజ్ సింగ్ ప్రమాణం చేశారు. వీరిలో పర్వేశ్ వర్మ జాట్ నేత. సీఎం పదవికి పోటీ పడిన వారిలో ఈయన ముందు వరుసలో ఉన్నారు. రవీందర్ ఇంద్రజ్ సింగ్ దళిత నేత కాగా, మజిందర్ సింగ్ సిర్సా సిక్కు నేత . కపిల్ మిశ్రా, పంకజ్ సింగ్‌లు పూర్వాంచల్ ప్రాంత వాసులు. ఆశిష్ సూద్ బీజేపీ పంజాబీ నేతల్లో ప్రముఖుడిగా ఉన్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చిన ఆయా వర్గాల వారికి సంతుష్టి కలిగించేందుకు బీజేపీ పెద్దలు యత్నించినట్లు చెబుతున్నారు.కేబినెట్లో జాట్ వర్గం నేత ఢిల్లీ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో న్యూఢిల్లీ సీటు నుంచి ఆప్ చీఫ్, మాజీ సీఎం కేజ్రీవాల్‌పై ఘన విజయం సాధించడం ద్వారా ఒక్కసారిగా తెరపైకి వచ్చారు పర్వేశ్ వర్మ(47). ఢిల్లీ సీఎం కుర్చీ కోసం పోటీ పడిన బీజేపీ నేతల్లో ఈయన కూడా ఉన్నారు. 2014 ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన పర్వేశ్ వర్మ పేరు జాతీయ రాజకీయాల్లో వినపడింది. అయితే, మూడుసార్లు సీఎంగా పనిచేసిన కేజ్రీవాల్‌ను ఓడించిన తర్వాత ఈయన పేరు ఒక్కసారిగా మారుమోగింది. ఢిల్లీలోని జాట్ నేతల్లో ప్రముఖంగా ఉన్నారు. గురువారం సీఎం రేఖా గుప్తాతోపాటు మంత్రిగా ప్రమాణం చేసిన వారిలో పర్వేశ్ వర్మ ఒకరు. మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడే పర్వేశ్. కేజ్రీవాల్‌పై పోటీ చేస్తానంటూ బహిరంగంగా ప్రకటించిన ఫైర్ బ్రాండ్ నేత. అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్‌కు గట్టి పోటీ ఇచ్చేది తానేనంటూ ముందుకు వచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో నాలుగు వేల ఓట్ల తేడాతో కేజ్రీను ఓడించారు. కాగా, మూడు పర్యాయాలు సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్‌ను ఇదే న్యూఢిల్లీ నియోజకవర్గంలో 2013లో కేజ్రీవాల్ ఓడించడం గమనార్హం. 1977లో పుట్టిన పర్వేశ్ వర్మ రాజకీయాలపై ఆసక్తి పెంచుకుని 1991లో ఆర్ఎస్ఎస్లో బాల్ స్వయంసేవక్‌గా చేరారు. బీజేపీ యువ మోర్చాలో చేరి నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడి స్థాయికి ఎదిగారు. బీజేపీ ఢిల్లీ విభాగం ప్రధాన కార్యదర్శిగాను పనిచేశారు. ఫోర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబీఏ డిగ్రీ చేసిన వర్మ తన తండ్రి నెలకొల్పిన రాష్ట్రీయ స్వాభిమాన్ అనే ఎన్జీవో ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. 2013లో మెహ్రౌలీ నుంచి మొదటి సారిగా ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం ఢిల్లీ పశ్చిమ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. 2019 ఎన్నికల్లో ఏకంగా 5.78 లక్షల ఓట్ల తేడాతో పర్వేశ్ వర్మ సాధించిన విజయం ఒక రికార్డుగా ఉంది.దంత వైద్యుడు.. పూర్వాంచల్ నేత పంకజ్ కుమార్ సింగ్ రేఖా గుప్తా ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేసిన మరో ఎమ్మెల్యే పంకజ్ కుమార్ సింగ్(48). వృత్తి రీత్యా దంతవైద్యుడైన పంకజ్ కుమార్ గుప్తా పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన నేత. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా వికాస్పురి నుంచి పోటీ చేసి, ప్రత్యరి్థపై 12వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఢిల్లీ బీజేపీ పూర్వాంచల్ మోర్చా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు పంకజ్ కుమార్. ఢిల్లీలో ఉండే ఉత్తరప్రదేశ్, తూర్పు ప్రాంతం బిహార్, జార్ఖండ్ వారిని పూర్వాంచల్ వాసులుగా పిలుస్తుంటారు. ఢిల్లీలోని పలు నియోజకవర్గాల్లో వీరిదే పైచేయి. బిహార్‌లోని బోధ్‌గయలో ఉన్న మగధ్ యూనివర్సిటీ నుంచి 1998లో డెంటల్ సర్జరీలో ఇగ్రీ చేశారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కార్పొరేషన్ నేతగా పనిచేశారు. మరికొద్ది నెలల్లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న వేళ బీజేపీ ఈయనకు కేబినెట్లో స్థానం కల్పించడం గమనార్హం. ఒకప్పుడు మోదీ విమర్శకుడు.. నేడు హిందుత్వ వీరాభిమాని ఢిల్లీ మంత్రిగా గురువారం ప్రమాణం చేసిన కపిల్ మిశ్రా(44) ఒకప్పుడు ఆప్ సభ్యుడు. ప్రధాని మోదీని, బీజేపీ, ఆర్ఎస్లను తీవ్రంగా విమర్శించిన వివాదాస్పద నేతగా ఉన్నారు. అటువంటి వ్యక్తి పూర్తిగా మారిపోయారు. నేడు హిందుత్వకు వీరాభిమాని అయ్యారు. కపిల్ మిశ్రాను కేబినెట్లో తీసుకోవడాన్ని బీజేపీ వ్యూహాత్మక చర్యగా భావిస్తున్నారు. 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ గేమ్స్ జరిగిన సమయంలో కపిల్ మిశ్రా అవినీతి వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన కుమార్ విశ్వాస్‌కు సన్నిహితుడిగా భావిస్తారు. ఢిల్లీ వర్సిటీ నుంచి సోషల్ వర్క్‌లో ఎంఏ చేసిన మిశ్రా 2015లో ఆప్ తరఫున కరవల్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కేజ్రీవాల్ కేబినెట్లో జల వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, కేజ్రీవాల్, కుమార్ విశ్వాస్ మధ్య విభేదాలు తలెత్తడంతో కపిల్ మిశ్రా కూడా కేజ్రీకి దూరమయ్యారు. అనంతరం కుమార్ విశ్వాస్, కపిల్ మిశ్రాలు కేజ్రీతోపాటు ఆప్ మరో నేత సత్యేందర్ జైన్లకు వ్యతిరేకంగా అవినీతి ఆరోపణలు చేశారు. 2017లో మంత్రి పదవి కోల్పోయారు. అయినప్పటికీ, ఆప్ ఎమ్మెల్యేగా ఉంటూనే కేజ్రీవాల్‌పై విమర్శలు మాత్రం మానలేదు. 2019లో ఆయనపై ఆప్ బహిష్కరణ వేటు వేసింది. 2019లోనే బీజేపీలో చేరారు కపిల్ మిశ్రా. బీజేపీ ఢిల్లీ విభాగం ఉపాధ్యక్ష పదవిని చేపట్టారు. 2020 ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం, బీజేపీ, హిందుత్వకు అనుకూలంగా ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలైంది. 2020 ఢిల్లీ అల్లర్ల సమయంలో విద్వేష ప్రసంగాలు చేశారంటూ ఆయనపై ఆరోపణలొచ్చాయి. తాజాగా బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేసిన నేపథ్యంలో గతంలో ఆయన ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్, బీజేపీల తీరును ఎండగడుతూ ఆయన చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఇటీవలి ఎన్నికల్లో ఆప్ నేత మనోజ్ కుమార్ త్యాగిపై 23 వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు.పంజాబీ నేత ఆశిష్ సూద్ ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడైన ఆశిష్ సూద్(58) ఢిల్లీలోని బీజేపీ పంజాబీ నేతల్లో ఒకరు. తాజా ఎన్నికల్లో జనక్‌పురి నుంచి 18 వేల ఓట్ల తేడాతో ఎమ్మెల్యేగా గెలుపొంది గురువారం రేఖా గుప్తా కేబినెట్లో మంత్రిగా ప్రమాణం చేశారు. సంస్థాగత వ్యవహారాల్లో నిపుణుడిగా పేరున్న సూద్ ప్రస్తుతం బీజేపీ గోవా వ్యవహారాలతోపాటు జమ్మూకశ్మీర్ సహ ఇన్చార్జిగా ఉన్నారు. ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగాను పనిచేశారు. 2003లో బీజేపీ యువమోర్చా జనరల్ సెక్రటరీగా పనిచేసిన ఈయన, ఆ తర్వాత రెండేళ్లకే జాతీయ ఉపాధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. 2009లో ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత రాష్ట్ర విభాగం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2012లో దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికయ్యారు. ఆర్ఎస్ఎస్తోపాటు బీజేపీ అగ్ర నాయకులకు ఆశిష్ సూద్ ఎంతో నమ్మకస్తుడని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వ్యాపారవేత్త అయిన ఈయన కామర్స్‌లో డిగ్రీ చేశారు. దళిత వర్గం నేత రవీందర్ రేఖా గుప్తా సారథ్యంలోని ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణం చేసిన రవీందర్ ఇంద్రజ్ సింగ్(50) కేబినెట్లో దళిత వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీజేపీ ఎస్సీ మోర్చాలో కీలక సభ్యుడిగా ఉన్న రవీందర్ ఇటీవలి ఎన్నికల్లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఢిల్లీ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఓపెన్ లెరి్నంగ్(ఎస్‌వోఎల్) నుంచి బీఏ పట్టా అందుకున్న రవీందర్‌కు ఢిల్లీ బీజేపీలో దళిత నేతగా మంచి పేరుంది. ఇటీవలి ఎన్నికల్లో బావన ఎస్సీ రిజర్వుడ్ స్థానంలో ఆమ్ఆద్మీ పార్టీ నేత జై భగవాన్ ఉప్కార్ను 31 వేల ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. నార్త్ ఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీకి మద్దతు కూడగట్టడంలో రవీందర్ కీలకంగా వ్యవహరించారు. మొదట్నుంచీ బావన నియోజకవర్గంతోనే ఆయనకు ఎక్కువగా అనుబంధం ఉంది. ఈయన తండ్రి ఇంద్రజ్ సింగ్ గతంతో నరేల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎన్నికల కమిషన్‌కు సమరి్పంచిన అఫిడవిట్‌ను అనుసరించి ఈయన ఆస్తులు రూ.7 కోట్లు కాగా, ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు.సిక్కుల ప్రతినిధి మంజిందర్ సింగ్ సిర్సా ఢిల్లీ రాజకీయ ముఖచిత్రంలో బాగా వినిపించే పేరు మంజిందర్ సింగ్ సిర్సా(53). కోవిడ్ మహమ్మారి ప్రబలంగా ఉన్న సమయంలో ఆక్సిజన్ లాంగార్స్ నిర్వహించి చురుగ్గా వ్యవహరించిన సామాజిక కార్యకర్తగా సిక్కు నేతగా సిర్సాకు మంచి పేరుంది. తాజాగా రేఖా గుప్తా ప్రభుత్వంలో మంత్రిగా మాతృభాష పంజాబీలో ప్రమాణం చేశారు. సిక్కు వర్గం మద్దతు కూడగట్టేందుకే ఈయనకు బీజేపీ మంత్రి వర్గంలో స్థానం కల్పించినట్లు పరిశీలకులు చెబుతున్నారు. తాజా ఎన్నికల్లో ఆప్‌కు చెందిన ధన్వతి చండేలాపై 18 వేల పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాజౌరీ గార్డెన్ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మజీందర్ సింగ్ శిరోమణి అకాలీదళ్‌ను వీడి 2021లో బీజేపీలో చేరారు. 2013లో మొదటిసారిగా రాజౌరీ గార్డెన్ సీటును గెలుచుకున్నారు. 2013 నుంచి 2019 వరకు ఢిల్లీ సిక్కు గురుద్వారా యాజమాన్య కమిటీ(డీఎస్‌జీఎంసీ)కి సుదీర్ఘకాలం ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అనంతరం డీఎస్జీఎంఎంసీకి అధ్యక్షుడిగా 2019–2022 మధ్య సేవలందించారు. ఎన్నికల సంఘానికి సమరి్పంచిన అఫిడవిట్లో తనకు రూ.188 కోట్ల ఆస్తులు, భార్య సత్విన్దర్ కౌర్ సిర్సాకు కూడా రూ.71 కోట్ల ఆస్తులున్నట్లు వెల్లడించారు. మంజిందర్‌పై ఒక ఎఫ్ఐఆర్, నాలుగు పరువు నష్టం కేసులు నమోదై ఉన్నాయి. -
ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా, మంత్రుల ప్రమాణం..
Delhi CM Rekha Gupta Oath Ceremony Live Updates..👉ఢిల్లీకి తొమ్మిదో ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటుగా మంత్రులు కూడా ప్రమాణం స్వీకారం చేశారు. వారితో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు. #WATCH | BJP's first-time MLA Rekha Gupta takes oath as the Chief Minister of Delhi. Lt Governor VK Saxena administers her oath of office. With this, Delhi gets its fourth woman CM, after BJP's Sushma Swaraj, Congress' Sheila Dikshit, and AAP's Atishi. pic.twitter.com/bU69pyvD7Y— ANI (@ANI) February 20, 2025 👉ఢిల్లీలో మంత్రులుగా పర్వేష్ వర్మ, రవీందర్ ఇంద్రజ్ సింగ్, మంజిందర్ సింగ్ సిర్సా, ఆశిశ్ సూద్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు.#WATCH | BJP's Parvesh Sahib Singh takes oath as minister in CM Rekha Gupta-led Delhi Government. pic.twitter.com/0ertQiFXHO— ANI (@ANI) February 20, 2025 #WATCH | BJP's Kapil Mishra takes oath as a minister in CM Rekha Gupta-led Delhi Government. pic.twitter.com/PVDlRfsq1U— ANI (@ANI) February 20, 2025 BJP's Parvesh Sahib Singh, Ashish Sood, Manjinder Singh Sirsa and Ravinder Indraj Singh take oath as ministers in CM Rekha Gupta-led Delhi Government. pic.twitter.com/pzOXHgqXu1— ANI (@ANI) February 20, 2025 👉ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం.. వారికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. #WATCH | Along with Delhi's new cabinet, led by CM Rekha Gupta, Prime Minister Narendra Modi greets the crowd at Ramlila Maidan. pic.twitter.com/jiy2AbWjUd— ANI (@ANI) February 20, 2025 👉ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, ఎన్డీయే నేతల హాజరయ్యారు. 👉 యమునా నది సందర్శనకు ఢిల్లీ సీఎం, మంత్రులుఢిల్లీలో కీలక పరిణామం..యమునా నది ప్రక్షాళనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొత్త ప్రభుత్వంయమునా నది సందర్శనకు ఢిల్లీ సీఎం, మంత్రులుప్రమాణ స్వీకారం అనంతరం యమునా నది తీరానికి వెళ్ళనున్న సీఎం, మంత్రులు 👉రామ్‌లీలా మైదానానికి చేరుకున్న రేఖా గుప్తా.. ఆమెకు స్వాగతం పలికిన బీజేపీ నేతలు, కార్యకర్తలు. #WATCH | Delhi CM-designate Rekha Gupta and BJP leader Parvesh Sahib Singh greet each other at Ramlila Maidan in Delhi. Parvesh Sahib Singh will also take oath today as part of her council of ministers. pic.twitter.com/k41QI69r4n— ANI (@ANI) February 20, 2025👉ఈ సందర్భంగా రేఖా గుప్తా మాట్లాడుతూ..‘ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు సీఎంను అవుతానని నాకు తెలియదు. 48మంది ఎమ్మెల్యేల్లో ఒకరిగా బీజేపీ శాసన సభాపక్ష సమావేశానికి వెళ్లాను. కానీ పర్వేశ్‌వర్మ నా పేరు ప్రతిపాదించిన తర్వాతే తెలిసింది. నేను ముఖ్యమంత్రిని కాబోతున్నాను అని చెప్పుకొచ్చారు. అలాగే మార్చి ఎనిమిది నాటికి ఢిల్లీలోని మహిళలకు నెలకు రూ.2500 అందజేస్తామని తెలిపారు. ప్రధాని మోదీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. అలాగే ఈ పదవికి నన్ను ఎంపిక చేసినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సమయంలో శీష్‌మహల్‌ను మ్యూజియంగా మారుస్తామని వెల్లడించారు.#WATCH | Delhi CM-designate Rekha Gupta shows a victory sign and accepts the greetings of people as she leaves from her residence. pic.twitter.com/LDCQZAICBb— ANI (@ANI) February 20, 2025 👉ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌గా విజేందర్ గుప్తాకు అవకాశం. ఈ సందర్బంగా విజేందర్ గుప్తా మాట్లాడుతూ.. బీజేపీ హైకమాండ్‌కు ధన్యవాదాలు. స్పీకర్ స్థానం నాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నా బాధ్యతలను నేను నెరవేరుస్తాను అని అన్నారు. అయితే, గతంలో సభ జరుగుతున్న సమయంలో మార్షల్స్.. విజేందర్ గుప్తాను బయటకు ఎత్తుకెళ్లారు. అధికార ఆప్ నేతలపై కామెంట్స్ చేయడంతో ఆయనను బయటకు తీసుకెళ్లారు. VIDEO | Delhi: BJP leader Vijender Gupta (@Gupta_vijender) says, “I am thankful to the party for giving me the responsibility of Speaker of Delhi Assembly. I will fulfill my responsibility… I hope we will have healthy discussions in the House.”(Full video available on PTI… pic.twitter.com/8SsH8GEmNT— Press Trust of India (@PTI_News) February 20, 2025 👉రామ్‌లీల మైదానం వద్ద బీజేపీ కార్యకర్తలు సందడి చేస్తున్నారు. మరోవైపు.. రేఖా గుప్తా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు బీజేపీ నేతలు అక్కడికి చేరుకుంటున్నారు. #WATCH | Delhi swearing-in ceremony | BJP Mahila Morcha workers rejoice at Ramlila Maidan ahead of the swearing-in ceremony of CM-designate Rekha Gupta. pic.twitter.com/Hr8gMubHzo— ANI (@ANI) February 20, 2025 👉 ఇక, సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, ఆతిశీల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్న నాలుగో మహిళగా ఆమె నిలవనున్నారు. అలాగే, బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్, ఉమాభారతి, వసుంధర రాజే, ఆనందీబెన్ పటేల్‌ల తర్వాత ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టనున్న ఐదో మహిళగా, దేశంలో విభిన్న పార్టీల నుంచి సీఎం పదవి చేపట్టనున్న 18వ మహిళగా రేఖా గుప్తా నిలవనున్నారు.#WATCH | Delhi CM designate Rekha Gupta says, "It is a miracle, it is a new motivation and a new chapter. If I can be the CM, this means ways are open for all the women... Anyone who has been corrupt will have to give an account of each and every rupee..." pic.twitter.com/F1GUVRELVp— ANI (@ANI) February 20, 2025 #WATCH | Swearing-in ceremony of Delhi CM-designate Rekha Gupta and her council of ministers to take place at Ramlila Maidan today. Visuals from the venue. pic.twitter.com/d6acoUYOSr— ANI (@ANI) February 20, 2025మోదీకి థ్యాంక్స్: రేఖా గుప్తా భర్త👉రేఖా గుప్తా భర్త మనీష్ గుప్తా మాట్లాడుతూ.. రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతారని మేము ఎప్పుడూ అనుకోలేదు. ఇది ఒక అద్భుతంలా అనిపిస్తుంది. పార్టీ మాకు ఇంత గౌరవం ఇవ్వడం మాకు సంతోషకరమైన విషయం అని ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. #WATCH | Delhi CM-designate Rekha Gupta's husband, Manish Gupta says, "...We never thought that she (Rekha Gupta) would become the Chief Minister of Delhi. It seems like a miracle... It is a matter of happiness for us that the party has given us so much respect..." pic.twitter.com/I7rX6X9PaW— ANI (@ANI) February 20, 2025 👉ఢిల్లీ ముఖ్యమంత్రితో పాటుగా నేడు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేస్తారు. వీరిలో పర్వేష్ వర్మ, అశిశ్ సూద్, మన్జిందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రాజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్‌సింగ్ ఉన్నారు. Delhi swearing-in ceremony | Parvesh Sahib Singh, Ashish Sood, Manjinder Singh Sirsa, Ravinder Indraj Singh, Kapil Mishra and Pankaj Kumar Singh to take oath as Ministers today. pic.twitter.com/1Gbvkq9xK7— ANI (@ANI) February 20, 2025👉అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ హైకమాండ్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను ఎంపిక చేసింది. 26 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారం సాధించిన బీజేపీ.. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన అభ్యర్థికి సీఎంగా అవకాశం దక్కింది. అయితే, దేశంలో మెజార్టీ రాష్ట్రాల్లో(సొంతంగా 15 రాష్ట్రాల్లో.. మరో ఆరు రాష్ట్రాల్లో మిత్రపక్షాలు) బీజేపీ అధికారంలో ఉన్నది. కానీ, ఏ రాష్ట్రంలోనూ మహిళా సీఎం లేరు. మహిళలకు బీజేపీ సముచిత స్థానం ఇవ్వడం లేదనే ఆరోపణలు ఇదివరకే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రేఖా గుప్తాకు అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.#WATCH | NSG (National Security Guard) commandos, Delhi Police personnel and RAF (Rapid Action Force) personnel deployed on security at Ramlila Maidan. Delhi CM-designate Rekha Gupta and her new cabinet ministers will take oath here today. pic.twitter.com/9WMgoncQtb— ANI (@ANI) February 20, 2025రేఖా గుప్తా రాజకీయం ప్రస్థానం ఇలా.. 👉హర్యానాలోని జులానాలో 1974 జులై 19న జన్మించిన రేఖా గుప్తా.. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని దౌలత్‌రామ్ కళాశాలలో బీకాం చదివారు. ఆ సమయంలోనే (1992) ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించారు. 1995-96లో ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం కార్యదర్శిగా పని చేశారు. 1996-97లో అధ్యక్షురాలిగా సేవలందించారు. మేరఠ్‌లోని చౌధరీ చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకున్నారు. కొంతకాలం న్యాయవాదిగా పని చేశారు. 1998లో మనీశ్ గుప్తాను వివాహం చేసుకున్నారు. 2007లో ఉత్తర పీతంపుర మున్సిపల్ కౌన్సిలర్‌గా విజయం సాధించారు. అనంతరం దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆరెస్సెస్‌తో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి. సంఘ్ మహిళా సంబంధిత కార్యక్రమాల్లో ఆమె చురుకుగా పాల్గొనేవారు. ప్రస్తుతం భాజపా మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు.మోదీకి కృతజ్ఞతలు👉ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ఎంపిక చేసిన వెంటనే ప్రధాని మోదీకి రేఖా గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలోని ప్రతి పౌరుడి సంక్షేమం, సాధికారత, సర్వతోముఖాభివృద్ధికి విశ్వాసం, నిజాయితీ, అంకిత భావంతో పని చేస్తానని వెల్లడించారు. రేఖా గుప్తాకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రస్తుత ముఖ్యమంత్రి ఆతిశీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ శుభాకాంక్షలు తెలిపారు. -
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా
న్యూఢిల్లీ: పదకొండు రోజుల సస్పెన్స్‌కు తెర పడింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరో తేలిపోయింది. కొన్నాళ్లుగా ముఖ్యమంత్రులుగా కొత్త ముఖాలకు అవకాశమిస్తున్న ఆనవాయితీని ఢిల్లీ విషయంలోనూ బీజేపీ అధిష్టానం కొనసాగించింది. అంతటితో ఆగకుండా ఓ మహిళకు పట్టం కడుతూ బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకుంది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన 50 ఏళ్ల రేఖా గుప్తాను సీఎంగా ఎంచుకుంది. సుష్మా స్వరాజ్ (బీజేపీ), షీలా దీక్షిత్ (కాంగ్రెస్), ఆతిశి (ఆప్) తర్వాత ఆమె ఢిల్లీకి నాలుగో మహిళా సీఎం కానున్నారు. మదన్‌లాల్ ఖురానా, సుష్మ, సాహెబ్‌సింగ్ వర్మ తర్వాత రాష్ట్రానికి మొత్తమ్మీద నాలుగో బీజేపీ సీఎం కూడా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రస్తుతం మహిళలెవరూ సీఎంగా లేరు. దాంతో ఆ పార్టీ నుంచి ఏకైక మహిళా ముఖ్యమంత్రిగానూ రేఖ నిలవనున్నారు. దేశవ్యాప్తంగా చూస్తే మమతా బెనర్జీ తర్వాత రెండో మహిళా సీఎం అవుతారు. గురువారం సాయంత్రం రాంలీలా మైదానంలో అట్టహాసంగా జరిగే బహిరంగ సభలో రేఖ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలతో పాటు సినీ, పారిశ్రామిక ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొననున్నారు. రేఖకు అమిత్ షా అభినందనలు తెలిపారు. రాజధాని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆమె నాయకత్వంలో నూతన బీజేపీ ప్రభుత్వం రేయింబవళ్లూ కృషి చేస్తుందని ఆశాభావం వెలిబుచ్చారు. తాజా మాజీ సీఎం ఆతిశితో పాటు ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా రేఖకు అభినందనలు తెలిపారు.పర్వేశ్ అనుకున్నా...ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించి ఆప్ పదేళ్ల పాలనకు తెర దించడం తెలిసిందే. రాష్ట్రంలో 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అధికారం చేపట్టబోతోంది. మాజీ సీఎం సాహెబ్‌సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మకు సీఎంగా చాన్స్ దక్కుతుందని తొలుత భావించారు. కేజ్రీవాల్‌ను ఓడించి జెయింట్ కిల్లర్‌గా నిలవడంతో ఆయన పేరు మార్మోగింది. కానీ క్రమంగా పలువురు ఇతర నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈసారి మహిళకే అవకాశమని కొద్ది రోజులుగా బీజేపీ నేతలే చెబుతుండటంతో రేఖ పేరు ప్రముఖంగా విన్పించింది. చివరికదే నిజమైంది. బుధవారం సాయంత్రం ఢిల్లీ బీజేపీ శాసనసభా పక్ష భేటీ జరిగింది. రేఖను శాసనసభా పక్ష నేతగా పర్వేశ్ వర్మ తదితర సీనియర్లు ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అనంతరం ఎల్పీ భేటీకి పరిశీలకులుగా వచ్చిన బీజేపీ అగ్ర నేతలు రవిశంకర్ ప్రసాద్ తదితరులతో కలిసి రేఖ రాజ్‌నివాస్‌కు వెళ్లారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వెలిబుచ్చారు.‘‘నాకు అవకాశమిచ్చినందుకు ప్రధాని మోదీకి, బీజేపీ నాయకత్వానికి, అగ్ర నేతలకు కృతజ్ఞతలు. ఢిల్లీ సమగ్రాభివృద్ధికి సంక్షేమానికి పూర్తి నిజాయితీతో, చిత్తశుద్ధితో కృషి చేస్తా. నగరాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్తా’’– రేఖా గుప్తా..అలా కలిసొచ్చింది! రేఖా గుప్తాను వరించిన అదృష్టంకలిసొచ్చిన బనియా సామాజికవర్గంఏబీవీపీతో రాజకీయ ప్రస్థానం మొదలుఎమ్మెల్యేగా తొలిసారి నెగ్గిన రేఖా గుప్తాను ఢిల్లీ సీఎంగా ఎంచుకోవడం ద్వారా బీజేపీ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎంతోమంది సీనియర్లున్నా చాలా సమీకరణాలు ఆమెకు అనుకూలించాయి. మహిళ కావడంతో పాటు వైశ్య (బనియా) సామాజికవర్గం కూడా కలిసొచ్చింది. ఆప్ అధినేత కేజ్రీవాల్‌ది కూడా బనియా సామాజికవర్గమే. ఇక ఆ పార్టీకి చెందిన మహిళా నేత ఆతిశి తాజా మాజీ సీఎం. రేఖ ఎంపిక వెనక ఈ రెండు అంశాలనూ బీజేపీ అధిష్టానం దృష్టిలో ఉంచుకున్నట్టు కన్పిస్తోంది. పార్టీ పట్ల తిరుగులేని విధేయత వీటికి తోడైంది.మహిళల్లో మరింత ఆదరణ కోసం...ఈసారి ఢిల్లీ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే అధికంగా ఓట్లేశారు. పురుషుల ఓట్లపై అధికంగా ఆధారపడ్డ ఆప్ పరాజయం పాలవగా మహిళల ఆదరణే తమకు అధికారం అందించిందని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. అందుకే మహిళను సీఎం చేసి వారి రుణం తీర్చుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. బీజేపీ నుంచి 9 మంది మహిళలు పోటీ చేయగా నలుగురు గెలిచారు.ఆరెస్సెస్‌తో బంధం50 ఏళ్ల రేఖ వివాదాలకు సుదూరం. ఆర్ఎస్ఎస్తో ఆమెది సుదీర్ఘ అనుబంధం. 1974 జూలై 19న హరియా ణాలో జన్మించారు. ఢిల్లీలోని దౌలత్‌రామ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేస్తుండగానే ఏబీవీపీలో చేరారు. ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలతో ఏబీవీపీ అభ్యర్థిగా రాజకీయ అరంగేట్రం చేశారు. విద్యార్థి సంఘం కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా పనిచేశారు. తర్వాత న్యాయ విద్య అభ్యసించి కొంతకాలం అడ్వొకేట్‌గా ప్రాక్టీస్ చేశారు. 2002లో బీజేపీలో చేరి యువజన విభాగం జాతీయ కార్యదర్శి సహా పలు హోదాల్లో పని చేశారు. మూడుసార్లు ఢిల్లీ కౌన్సిలర్‌గా గెలిచారు. సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ) మేయర్‌గా సేవలందించారు. మహిళలు, చిన్నారుల సంక్షేమానికి కృషి చేశారు. బాలికల విద్య కోసం సుమేధ యోజన ప్రారంభించారు. 2022లో ఢిల్లీ మేయర్ పదవికి పోటీ పడి ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ చేతిలో ఓడారు. ప్రస్తుతం రేఖ బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలు. అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్‌బాగ్ నుంచి 29,595 వేల ఓట్ల మెజార్టీతో ఆప్ అభ్యర్థిపై గెలిచారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అతిశీపై అల్కా లాంబా పోటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. అభ్యర్థుల ప్రకటనలో ముందంజలో ఉంది. కేవలం ఒక్క అభ్యర్థి ఆల్కా లాంబా పేరుతో శుక్రవారం మూడో జాబితా విడుదల చేసింది. కల్కాజీ నియోజకవర్గంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అతిశీపై కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత ఆల్కా లాంబా పోటీ చేయబోతున్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఖరారు చేసింది. ప్రస్తుతం అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పనిచేస్తున్న ఆల్కా లాంబా 2015లో చాందినీ చౌక్ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ అభ్యర్థిగా నెగ్గడం గమనార్హం. -
అరెస్ట్ ఖాయమంటూ కేజ్రీవాల్ కామెంట్స్ .. ఢిల్లీ సీఎం అతిశీకి అధికారిక లేఖ
ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. తప్పక గెలవాల్సిన ఎన్నికల్లో ఫలితం తారు మారైతే మాజీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) భవితవ్యం కూడా గందరగోళంలో పడనుండగా.. తాజాగా, కేజ్రీవాల్ ( Arvind Kejriwal) చేసిన ఆరోపణలతో అక్కడి రాజకీయం రంజుగా మారింది.సీఎం అతిశీ (Atishi Marlena) త్వరలోనే అరెస్ట్ కానున్నారంటూ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల్ని ఢిల్లీ రవాణా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ గోయల్ (Prashant Goyal) ఖండించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు తప్పుడు ప్రచారం,తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని మండిపడ్డారు. గత బుధవారం ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ప్రస్తుత సీఎం అతిశీలు సంయుక్తంగా మీడియా సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ..ఆ ట్వీట్లో కేంద్ర దర్యాప్తు సంస్థలతో కేంద్రం (బీజేపీ పెద్దలు) సమావేశమైంది. సమావేశంలో తమ ప్రభుత్వం ఢిల్లీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తుంది. ఆ పథకాన్ని ఆపేందుకు కుట్ర పన్నింది. సీఎం అతిశీపై తప్పుడు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల మేరకు అతిశీ ఇవ్వాళో, రేపో అరెస్ట్ కావొచ్చనే’ సమాచారం మాకు అందింది అని అన్నారు. ఆ మేరకు ట్వీట్ కూడా చేశారు.महिला सम्मान योजना और संजीवनी योजना से ये लोग बुरी तरह से बौखला गए हैं।अगले कुछ दिनों में फ़र्ज़ी केस बनाकर आतिशी जी को गिरफ्तार करने का इन्होंने प्लान बनाया हैउसके पहले “आप” के सीनियर नेताओं पर रेड की जायेंगी आज 12 बजे इस पर प्रेस कांफ्रेंस करूँगा।— Arvind Kejriwal (@ArvindKejriwal) December 25, 2024కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్ గోయల్ (Prashant Goyal) స్పందించారు. ఆయన వ్యాఖ్యలు తప్పుడు ప్రచారం,తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఢిల్లీ సీఎం అతిశీకి లేఖ రాశారు. ఆ లేఖలో ఉచిత బస్సు సర్వీసు పథకంపై విచారణ చేపట్టాలని ‘ది గవర్న్మెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ’ (gnctd),విజిలెన్స్ విభాగం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు. కాబట్టే కేజ్రీవాల్ పేర్కొన్న దావా పూర్తిగా తప్పుగా, తప్పుదారి పట్టించేది’అని గోయల్ తన లేఖలో పేర్కొన్నారు.కేజ్రీవాల్‌తో పాటు సీఎం అతిశీ మాట్లాడారు. నేను గట్టి నమ్మకంతో చెబుతున్నా. ఒక వేళ దర్యాప్తు సంస్థలు నాపై తప్పుడు కేసులు పెట్టినా, అరెస్ట్ చేసినా చివరికి నిజమే గెలుస్తోంది. దేశ న్యాయ వ్యవస్థపై గట్టి నమ్మకం ఉంది. అరెస్టయినా బెయిల్‌పై బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. -
రామాయణ ప్రస్తావనతో సీఎం అతిషి భావోద్వేగం
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ఈరోజు బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో సీఎం అతిషి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కుర్చీ ఎప్పటికీ కేజ్రీవాల్దేనని అన్నారు. ఈ సందర్బంగా సీఎంగా కేజ్రీవాల్ కూర్చున్న కుర్చీని పక్కనపెట్టి మరో కుర్చీ వేసుకుని కూర్చున్నారు.ఢిల్లీ సీఎంగా అతిషి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేను ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాను. రాముడు 14 ఏళ్లు వనవాసంలో ఉన్నప్పుడు భరతుడు రాజ్యం బాధ్యతలు చేపట్టాల్సి వచ్చినప్పుడు ఎలాంటి బాధ కలిగిందో ఈరోజు నాకు కూడా అంతే బాధగా ఉంది. ఎంతో కఠిన సమయంలో బాధ్యతలు స్వీకరిస్తున్నాను. 14 ఏళ్ల పాటు భరతుడు కుర్చీపై చెప్పులు పెట్టుకుని పాలన కొనసాగించాడో.. అదే విధంగా, రాబోయే నాలుగు నెలల పాటు నేను ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపిస్తాను. అరవింద్ కేజ్రీవాల్‌పై తప్పుడు కేసులు పెట్టి, అరెస్టు చేసి ఆరు నెలలు జైల్లో ఉంచారు. ఢిల్లీ ప్రజలకు ఆయన నిజాయితీపై నమ్మకం ఉంది. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం అరవింద్ కేజ్రీవాల్‌కే చెందుతుంది. ప్రజలు మళ్లీ ఆయనను ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు’ అని కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ, ఈడీ అరెస్ట్ కారణంగా కేజ్రీవాల్ జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అనంతరం, సుప్రీంకోర్టు తీర్పుతో కేజ్రీవాల్ విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ సీఎంగా మంత్రి అతిషి ప్రమాణ స్వీకారం చేశారు. నేడు బాధ్యతలు స్వీకరించారు. #WATCH | Delhi CM Atishi says, "I have taken charge as the Delhi Chief Minister. Today my pain is the same as that was of Bharat when Lord Ram went to exile for 14 years and Bharat had to take charge. Like Bharat kept the sandals of Lord Ram for 14 years and assumed charge,… https://t.co/VZvbwQY0hX pic.twitter.com/ZpNrFEOcaV— ANI (@ANI) September 23, 2024ఇది కూడా చదవండి: కశ్మీర్లో ‘హంగ్’ రావొద్దనే... కాంగ్రెస్‌తో పొత్తుపై ఒమర్ -
సీఎం అతిషీతో పాటు ప్రమాణం.. ఐదుగురు మంత్రుల వివరాలివే..
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆప్ నేత అతిషీ ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం సాయంత్రం ఢిల్లీలోని రాజ్ నివాస్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. ఆమె చేత ప్రమాణం చేయించారు. కాగా ఢిల్లీ సీఎం పదవిని చేపట్టిన అతిపిన్క వియస్కురాలిగా ఆమె రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆమె ఆర్థిక, విద్య, పీడబ్ల్యూడీ, రెవెన్యూ సహా పలు కీలక శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు.అతిషీ పాటు గోపాల్ రాయ్, కైలాష్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్, ఇమ్రాన్ హుస్సేన్, ముకేశ్ అహ్లావత్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో ముకేశ్ అహ్లవత్ దళిత ఎమ్మెల్యే కాగా, తొలిసారి మంత్రిగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అతిశీ తల్లిదండ్రులు, ఆప్ ఎమ్మెల్యేలు, పలువురు మంత్రులు పాల్గొన్నారు.మంత్రుల వివరాలుగోపాల్ రాయ్..ఆయన ఢిల్లీలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు, అరవింద్ కేజ్రీవాల్ హయాంలో పర్యావరణం, అటవీ, వన్యప్రాణి, అభివృద్ధి సాధారణ పరిపాలన శాఖను నిర్వర్తించారు. ఆలాగే ఆప్ ఢిల్లీ రాష్ట్ర విభాగానికి కన్వీనర్‌గా కూడా ఉన్నారు. ఈశాన్య ఢిల్లీలోని బాబాపూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.కైలాష్ గహ్లోత్.. 2015లో నజఫ్‌గఢ్ నియోజకవర్గం నుంచి ఢిల్లీ శాసనసభకు తొలిసారి ఎన్నికలయ్యారు. కేజ్రీవాల్ పదవీకాలంలో పరిపాలనా సంస్కరణలు, రవాణా, రెవెన్యూ, చట్టం, న్యాయం, శాసనసభ వ్యవహారాలు, మహిళా శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ & టెక్నాలజీ పోర్ట్‌ఫోలియోలను నిర్వహించారు.సౌరభ్ భరద్వాజ్.. ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, పర్యాటక-కళా సంస్కృతి భాషలు, పరిశ్రమలు, నీటిపారుదల, వరద నియంత్రణ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.ఇమ్రాన్ హుస్సేన్.. ఢిల్లీ క్యాబినెట్లో ఆహార, పౌర సరఫరాలు, ఎన్నికల మంత్రిగా పనిచేస్తున్నారు. 2015, 2020 ఎన్నికల్లో బల్లిమారన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆప్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఐదుసార్లు సిట్టింగ్ ఎమ్మెల్యేను ఓడించి గెలుపొందారు.ముకేశ్ అహ్లావత్.. ఢిల్లీలోని సుల్తాన్పూర్ మజ్రా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సాంఘిక సంక్షేమ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ రాజీనామా చేయడంతో ముకేశ్ మంత్రివర్గంలో చేరారు. కాగా గత ఏప్రిల్‌లో ఆనంద్ కుమార్ ఆప్‌కు రాజీనామా చేసి ప్రభుత్వం నుంచి వైదొలిగారు. సుల్తాన్పూర్ మజ్రా నుంచి 2020లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అహ్లావత్.. 48,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
ఢిల్లీ సీఎంగా అతిషి ప్రమాణస్వీకారం
సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త సీఎంగా అతిషి శనివారం(సెప్టెంబర్21) సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అతిషి ఎల్జీ కార్యాలయం రాజ్‌నివాస్‌లో ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకారానికి ముందు అతిషి ఆమ్ఆద్మీపార్టీ చీఫ్, మాజీ సీఎం కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. అతిషితో పాటు నలుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. అతిషితో పాటు ఐదుగురు మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. వీరిలో సౌరభ్ భరద్వాజ్, గోపాల్‌రాయ్,ముకేష్ అహ్లావత్,ఇమ్రాన్‌హుస్సేన్ తదితరులు మంత్రులుగా భాద్యతలు చేపట్టారు. ప్రమాణస్వీకారానికి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు ఆమ్ఆద్మీపార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. అతిషి ఢిల్లీకి మూడో మహిళా సీఎం కావడం విశేషం. కాగా లిక్కర్ స్కామ్ కేసులో ఇటీవలే బెయిల్‌పై విడుదలైన ఆమ్ఆద్మీపార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో అతిషి సీఎంగా పదవి చేపట్టారు. మళ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిస్తేనే సీఎం పదవి చేపడతానని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. 2025 ఫిబ్రవరి ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు రానున్నాయి. అప్పటిదాకా అతిషి నేతృత్వంలో ఆప్ ప్రభుత్వం కొనసాగనుంది. #WATCH | AAP leader Atishi takes oath as Chief Minister of Delhi pic.twitter.com/R1iomGAaS9— ANI (@ANI) September 21, 2024 -
అతిషి మర్లెనా సింగ్: ఢిల్లీ సీఎం పీఠం ఎక్కబోతున్న ఈమె ఎవరు?
గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ.. దిల్లీ తదుపరి సీఎం పేరును ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. కేజ్రీవాల్ నివాసంలో మంగళవారం జరిగిన ఆప్ శాసనసభ సమావేశంలో మంత్రి అతిషి పేరును ఢిల్లీ సీఎంగా ప్రకటించారు. ఆమె పేరును కేజ్రీవాల్ స్వయంగా ప్రతిపాదించారు. ప్రస్తుత సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ నేటి సాయంత్రం లెఫ్ట్నెంగ్ గవర్నర్ సక్సేనాతో భేటీ కానున్నారు. ఆయన్ను కలిసి రాజీనామా సమర్పించనున్నారు. ఆ తర్వాత అతిషి . సీఎంగా బాధ్యతలను చేపట్టనున్నారు.ఎవరీ అతిషిఢిల్లీ లిక్కర్ పాలసీలో మాజీ డిప్యూటీసెం మనీష్ సిసోడియా జైలుకెళ్లినప్పటి నుంచి అతిషి మర్లెనా సింగ్ పేరు బాగా ప్రాముఖ్యంలోకి వచ్చింది. ఆమె ఢిల్లీలోని కల్కాజీ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆమె ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు కూడా. ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వంలో విద్య, పీడబ్ల్యూడీ, సంస్కృతి, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.అతిషి మర్లెనా సింగ్ 8 జూన్ 1981న జన్మించారు. ఆమె తల్లిదండ్రులు విజయ్ సింగ్, త్రిప్తా వాహి ప్రొఫెసర్లు ఆమె తల్లిదండ్రులు కార్ల్ మార్స్క్, లెనిన్ పేర్లలోని కొన్ని భాగాలను కలిపి అతిషీ పేరులో ‘మార్లీనా’ అని చేర్చారు. 2018 ఎన్నికల ముందు నుంచి ఆతిశీ తన ఇంటి పేరును వాడటం మానేశారు. తన ఉన్నత పాఠశాల విద్యను న్యూ ఢిల్లీలోని స్ప్రింగ్డేల్స్ స్కూల్ (పూసా రోడ్)లో పూర్తి చేసింది. ఆమె 2001లో ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందారు. 2003లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో హిస్టరీలో మాస్టర్స్ పూర్తి చేశారు. అక్కడ ఆమె చెవెనింగ్ స్కాలర్షిప్న్ను కూడా పొందారు.రాజకీయ ఎంట్రీ..2013 జనవరిలో ఆమ్ ఆద్మీ పార్టీతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. పార్టీ విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. 2015లో,ఆమె మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో జరిగిన చారిత్రాత్మక జల సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత జరిగిన నిరసనలు, న్యాయ పోరాటం సమయంలో ఆప్ నేత, కార్యకర్త అలోక్ అగర్వాల్‌కు మద్దతునిచ్చారు.2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో తూర్పు ఢిల్లీకి లోక్‌సభ ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. ఆ ఎన్నికల్లో తూర్పు ఢిల్లీ నుంచి బీజేపీ నంచి బరిలోకి దిగిన గౌతమ్ గంభీర్‌పై అతిషి పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. 4.77 లక్షల ఓట్ల తేడాతో గౌతమ్ గంభీర్‌పై ఓడిపోయి మూడో స్థానంలో నిలిచారు.2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు..ఆ తర్వాత 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీలోని కల్కాజీ నియోజకవర్గం నుంచి అతిషికి ఆప్ టికెట్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో ఆమె 11,422 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ధరంబీర్ సింగ్‌పై విజయం సాధించారు. 2020 ఎన్నికల తర్వాత ఆమె గోవా ఆప్ యూనిట్‌కు ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు.కేబినెట్ మంత్రిగా పదోన్నతి..2015 నుంచి 2018 ఏప్రిల్ 17 వరకు ఢిల్లీ మాజీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియాకు సలహాదారురాలిగా పనిచేశారు. ఉప ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ రాజీనామా తర్వాత సౌరభ్ భరద్వాజ్‌తోపాటు ఆమె ఢిల్లీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా చేరారు. అనే పోర్టుఫోలియోల భారం ఆమె మీదే పడింది. దాదాపు 14 శాఖలకు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం విద్య, ఆర్థిక, ప్రణాళిక, పీడబ్ల్యూడీ, నీరు, విద్యుత్, ప్రజా సంబంధాలు వంటి కీలక మంత్రిత్వ శాఖలను అతిషి చూసుకుంటున్నారు. అప్పట్లో విద్యావ్యవస్థలో ప్రవేశపెట్టిన హ్యాపీనెస్ కరికులం, ఎంటర్ప్రెన్యూర్ షిప్ కరికులం అందరి దృష్టినీ ఆకర్షించింది. విద్యార్థుల భావోద్వేగాలపై దృష్టిపెట్టడం, వారిలో పలురకాల స్కిల్స్‌ను పెంపొందించడంపై దృష్టిపెట్టింది. ఆ తర్వాత ఆమె విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె చేపట్టిన విద్యా సంస్కరణలను పార్టీ తరచూ ఎన్నికల ప్రధాన అజెండాగా ప్రచారం చేస్తుంటుందిఢిల్లీ ప్రభుత్వంలో ఆమె పాత్ర..ఢిల్లీలో విద్యావ్యవస్థలో అనేక మార్పులు తీసుకు రావడంలో అతిషి కీలక పాత్ర పోషించారు. నగరంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలనే మార్చేసిన ఘనత ఆమెది. అప్పట్లో విద్యావ్యవస్థలో ప్రవేశపెట్టిన హ్యాపీనెస్ కరికులం, ఎంటర్ప్రెన్యూర్ షిప్ కరికులం అందరి దృష్టినీ ఆకర్షించింది. విద్యార్థుల భావోద్వేగాలపై దృష్టిపెట్టడం, వారిలో పలురకాల స్కిల్స్‌ను పెంపొందించడంపై దృష్టిపెట్టింది. ఆమె చేపట్టిన విద్యా సంస్కరణలను పార్టీ తరచూ ఎన్నికల ప్రధాన అజెండాగా ప్రచారం చేస్తుంటుంది.అతిషీనే ఎందుకు?మద్యం కుంభకోణంలో ఆప్ కీలక నేతలందరూ జైలుకు వెళ్లారు. మార్చి 21న కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత పార్టీ పరంగా అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అటు సౌరభ్ భరద్వాజ్‌తో కలిసి ప్రభుత్వ పరమైన నిర్ణయాల్లోనూ తనదైన పాత్ర పోషించారు. ఆప్ ప్రతిష్టను నిలబెట్టే బాధ్యతను తన భూజాలపై వేసుకున్నారు. తన వాగ్ధాటితో ప్రతిపక్షాలను ముప్పుతిప్పలు పెట్టారు. అందుకే అరవింద్ కేజ్రీవాల్ రాజీనామాతో ఆమె ఢిల్లీ పీఠాన్ని అధిరోహించబోతున్నారు. కీలక అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రభుత్వాన్ని నడపనున్నారు. -
నేడే కేజ్రీవాల్ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి ఆప్ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయనున్నారు. సాయంత్రం 4.30కు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ సందర్భంగా ఎల్జీకి కేజ్రీవాల్ రాజీనామా లేఖ సమరి్పస్తారని ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ సోమవారం మీడియాకు తెలిపారు. రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని, ప్రజలు గెలిపించాకే తిరిగి సీఎం కురీ్చలో కూర్చుంటానని కేజ్రీవాల్ ఆదివారం సంచలన ప్రకటన చేయడం తెలిసిందే. ఢిల్లీ అసెంబ్లీకి నవంబర్లోనే ముందస్తు ఎన్నికలు పెట్టాలని కూడా ఆ సందర్భంగా ఆయన ఈసీని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం రోజంతా ఆప్ నేతలతో కేజ్రీ సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. తన ప్రకటనపై స్పందన ఎలా ఉందని పార్టీ అత్యున్నత నిర్ణాయక విబాగమైన రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో ఆరా తీశారు. సీఎం అభ్యర్థిపై ఒక్కక్కరి నుంచీ వ్యక్తిగతంగా అభిప్రాయాలు సేకరించారు. అంతకుముందు ఉదయం కీలక నేతలు మనీశ్ సిసోడియా, రాఘవ్ ఛద్దా తదితరులతోనూ ఈ అంశంపై లోతుగా చర్చలు జరిపారు. సీఎం పదవికి మంత్రులు ఆతిశి, గోపాల్ రాయ్, కైలాశ్ గహ్లోత్, సౌరభ్ భరద్వాజ్ తదితరుల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు స్పీకర్ రాంనివాస్ గోయల్, కేజ్రీవాల్ భార్య సునీత పేర్లపైనా లోతుగా చర్చ జరుగుతున్నట్టు ఆప్ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో 12 ఎస్సీ రిజర్వుడు శాసనసభ స్థానాలున్నాయి. కనీసం మరో ఆరు స్థానాల్లో మైనారిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ, లేదా మైనారిటీ నేతకు చాన్స్ దక్కొచ్చన్న వాదనా ఉంది. దాంతో ఎస్సీ, మైనారిటీ వర్గానికి చెందిన పలువురు ఆప్ ఎమ్మెల్యేల పేర్లు కూడా కొత్తగా తెరపైకి వస్తున్నాయి! మంగళవారం కేజ్రీవాల్ రాజీనామాకు ముందు ఉదయం 11.30కు ఆప్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరగనుంది. సీఎం అభ్యర్థిపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. మైనారిటీ వర్గానికి చెందిన ఆప్ ఎమ్మెల్యే ఇమ్రాన్ హుసేన్ పేరు ఖరారైనా ఆశ్చర్యం లేదని ఆప్ ముఖ్య నేత ఒకరు చెప్పడం విశేషం!హరియాణాలో సుడిగాలి ప్రచారం! రాజీనామా అనంతరం కేజ్రీవాల్ హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో సుడిగాలి ప్రచారం చేస్తారని ఆప్ వర్గాలు చెబుతున్నాయి. హరియాణలో అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది. అక్కడ కాంగ్రెస్‌తో ఆప్ పొత్తు పెట్టుకోలేదు. మొత్తం 90 స్థానాల్లో ఒంటరిగానే అభ్యర్థులను బరిలోకి దింపింది. జమ్మూకశ్మీర్‌లో కూడా కేజ్రీవాల్ ప్రచారం చేస్తారని సమాచారం. -
Delhi Chief Minister Arvind Kejriwal: బీజేపీ మళ్లీ గెలిస్తే.. తదుపరి ప్రధాని అమిత్ షా!
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మళ్లీ విజయం సాధిస్తే నరేంద్ర మోదీ.. అమిత్ షాను తదుపరి ప్రధానమంత్రిని చేస్తారని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మార్చేస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. బీజేపీలో సీనియర్ నేతల రాజకీయ జీవితానికి ముగింపు పలికిన మోదీ ‘ఒక దేశం, ఒకే నాయకుడు’ పేరిట ప్రమాదకరమైన మిషన్‌ను ప్రారంభించారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం మళ్లీ వస్తే ప్రతిపక్ష నేతలంతా జైలుకు వెళ్లక తప్పదని అన్నారు. మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, తేజస్వీ యాదవ్, స్టాలిన్, పినరయి విజయన్ తదితరులను మోదీ ప్రభుత్వం కచి్చతంగా జైలుకు పంపిస్తుందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టి నియంతృత్వ పాలన తీసుకురావాలన్నదే ప్రధాని లక్ష్యమని చెప్పారు. బీజేపీలోని తన ప్రత్యర్థులను రాజకీయంగా అంతం చేయాలని మోదీ భావిస్తున్నారని పేర్కొన్నారు. మధ్యంతర బెయిల్‌పై విడుదలైన తర్వాత కేజ్రీవాల్ శనివారం ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచే అవకాశం లేదని స్పష్టం చేశారు. జూన్ 4 తర్వాత ‘ఇండియా’ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. జైలు నుంచి విడుదలయ్యాక నిపుణులతో, ప్రజలతో మాట్లాడానని, ఎన్నికల్లో బీజేపీకి ఓడిపోవడం ఖాయమని పేర్కొ న్నారు. కేంద్రంలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వంలో ‘ఆప్’ చేరుతుందని, ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా సాధిస్తామని హామీ ఇచ్చారు. కేజ్రీవాల్ ఇంకా ఏం చెప్పారంటే.. ఎందుకు రాజీనామా చేయలేదంటే... ముఖ్యమంత్రి పదవి నాకు ముఖ్యం కాదు. నాపై కేసు నమోదైన తర్వాత సీఎం పదవికి రాజీనామా చేయకపోవడం వెనుక కారణం ఉంది. ఢిల్లీలో భారీ మెజారీ్టతో మేము గెలిచాం. అందుకే మాపై కక్షగట్టారు. తప్పుడు కేసులో ఇరికించి, నన్ను బలవంతంగా పదవి నుంచి దింపేయడానికి కుట్ర జరిగింది. కుట్రను ఛేదించి, బీజేపీపై పోరాటం కొనసాగించడానికే పదవికి రాజీనామా చేయొద్దని నిర్ణయించుకున్నా. జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తా. ప్రజాస్వామ్యాన్ని ఖైదు చేస్తే పరిపాలన ఆగదు. హేమంత్ సోరెన్ జార్ఖండ్ సీఎం పదవికి రాజీనామా చేయకుండా జైలు నుంచే పాలన నడిపిస్తే బాగుండేది. దొంగలు, దోపిడీదారులకు బీజేపీ అడ్డాగా మారింది. అవినీతిపై పోరాటం ఎలా చేయాలో ప్రధాని మోదీ నిజంగా నేర్చుకోవాలనుకుంటే నన్ను చూసి నేర్చుకోవాలి. అవినీతిపరులను మేము జైలుకు పంపించాం. ఈ విషయంలో మా మంత్రులనూ వదిలిపెట్టలేదు’’ అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. హనుమాన్ ఆలయంలో పూజలు అరవింద్ కేజ్రీవాల్ శనివారం సెంట్రల్ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట భార్య సునీత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఉన్నారు. హనుమాన్జీ ఆశీస్సులు పొందడం చాలా సంతోషంగా ఉందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.అమిత్ షా కోసం ఓట్లడుగుతున్న మోదీ ‘‘ఇండియా కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థి లేడని బీజేపీ నేతలు అంటున్నారు. ఒకవేళ బీజేపీ మళ్లీ గెలిస్తే తదుపరి ప్రధానమంత్రి ఎవరవుతారో ఆ పార్టీ నాయకులు చెప్పాలి. వచ్చే ఏడాది సెపె్టంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీకి 75 ఏళ్లు నిండుతాయి. 75 ఏళ్లు దాటిన నేతలు పదవుల నుంచి తప్పుకోవాలన్న నిబంధనను మోదీ తీసుకొచ్చారు. ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, సుమిత్రా మహాజన్ వంటి నేతలను పక్కనపెట్టారు. శివరాజ్‌సింగ్ చౌహాన్, వసుంధరరాజే సింధియా, మనోహర్‌లాల్ ఖట్టర్, రమణ్ సింగ్ వంటి నాయకుల రాజకీయ జీవితానికి మోదీ ముగింపు పలికారు. ఇక తర్వాతి వంతు యోగి ఆదిత్యనాథ్‌దే. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల్లో గెలిస్తే రెండు నెలల్లోనే యోగి ఆదిత్యనాథ్ రాజకీయ జీవితానికి తెరపడుతుంది. ఉత్తరప్రదేశ్‌లో మరొకరిని ముఖ్యమంత్రిని చేస్తారు. యోగిని రాజకీయాల నుంచి శాశ్వతంగా బయటకు పంపిస్తారు. వచ్చే ఏడాది మోదీ కూడా పదవి నుంచి తప్పుకుంటారు. అమిత్ షాను ప్రధానమంత్రిని చేస్తారు. మోదీ ఇప్పుడు అమిత్ షా కోసం ఓట్లు అడుగుతున్నారు. మోదీ ఇచి్చన గ్యారంటీలను అమిత్ షా నెరవేరుస్తారా? ఒక దేశంలో ఒకే నాయకుడు ఉండాలన్నదే మోదీ విధానం. ఇదే నియంతృత్వం. నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాటం సాగించడం నా ఒక్కడితో సాధ్యం కాదు. అందుకు 140 మంది కోట్ల ప్రజల మద్దతు, ఆశీర్వాదం కావాలి’’ -
కేజ్రీవాలే అసలు కుట్రదారు
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను ఆరు రోజులపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కస్టడీకి అప్పగిస్తూ రౌజ్‌అవెన్యూ కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేజ్రీవాల్‌ను ఈ నెల 28వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు మళ్లీ కోర్టులో ప్రవేశపెట్టాలని ఈడీని ప్రత్యేక జడ్జి కావేరీ బవేజా ఆదేశించారు. మద్యం కుంభకోణంలో విచారణ కోసం కేజ్రీవాల్‌ను 10 రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ విజ్ఞప్తి చేయగా, న్యాయస్థానం కేవలం ఆరు రోజులపాటు కస్టడీకి అనుమతించింది. కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు గురువారం రాత్రి కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో పటిష్టమైన భద్రత మధ్య ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు వాదనలు వినిపించారు. ఢిల్లీ మద్యం కుంభకోణం వెనుక ఉన్న అసలు కుట్రదారు, కీలక సూత్రధారి అరవింద్ కేజ్రీవాలేనని తేలి్చచెప్పారు. ఆయనతోపాటు పలువురు ఢిల్లీ మంత్రులు, ఆమ్ ఆద్మీ పారీ్టలు నేతలు ఈ కేసులో భాగస్వాములేనని స్పష్టం చేశారు. ఢిల్లీలో 2021–22లో నూతన లిక్కర్ పాలసీని రూపొందించి, అమలు చేసినందుకు గాను ‘సౌత్ గ్రూప్’ నుంచి కేజ్రీవాల్ కోట్లాది రూపాయలు ముడుపులుగా స్వీకరించారని ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా దృష్టికి తీసుకొచ్చారు. సౌత్ గ్రూప్‌కు చెందిన కొందరు నిందితుల నుంచి రూ.100 కోట్ల మేర వసూలు చేశారని వెల్లడించారు. నాలుగు హవాలా మార్గాల్లో అందిన రూ.45 కోట్లను గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు. మిగిలిన సొమ్ము ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలకు నగదు రూపంలో అందిందని తెలిపారు. నిందితులు, సాకు‡్ష్యల కాల్ డిటైల్ రికార్డులు(సీడీఆర్), స్టేట్మెంట్లు ఇదే విషయాన్ని నిరూస్తున్నాయని తెలియజేశారు. అవినీతి కోసం కేజ్రీవాల్ తన పదవిని వాడుకున్నారని పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌ను ప్రశ్నించి, మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని, అందుకే ఆయనను 10 రోజులపాటు ఈడీ కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానానికి ఎస్.వి.రాజు విజ్ఞప్తి చేశారు. అరవింద్ కేజ్రీవాల్ తరపున సీనియర్ అడ్వొకేట్ అభిõÙక్ మనూ సింఘ్వీ హాజరయ్యారు. ‘‘సిట్టింగ్ సీఎంను అరెస్టు చేయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయాల్సిన అవసరమే లేదు. కేజ్రీవాల్ తప్పు చేశారనేందుకు ఎలాంటి సాక్ష్యాలూ లేవు’’ అని వాదించారు. సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరణ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం ఉపసంహరించుకున్నారు. దీనిపై విచారణ చేపడతామని ఉదయమే సుప్రీంకోర్టు వెల్లడించగా పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కేజ్రీవాల్ తరఫున అభిõÙక్ సింఘ్వీ మధ్యాహ్నం కోర్టుకు తెలిపారు. ఇదే కేసులో నిందితురాలైన బీఆర్ఎస్ నేత కవిత బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు నిరాకరించిన కాసేపటికే కేజ్రీవాల్ పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం గమనార్హం. ట్రయల్ కోర్టులో విచారణ తర్వాత మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని సింఘ్వీ చెప్పారు. జైల్లో ఉన్నా సీఎంగా కొనసాగుతా తన జీవితం దేశ సేవకే అంకితమని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. శుక్రవారం కోర్టు నుంచి బయటికొచ్చాక ఆయన మీడియాతో మాట్లా డారు. జైలు బయట ఉన్నా, లోపలున్నా సీఎంగా కొనసాగుతానని స్పష్టం చేశారు. -
కేజ్రీవాల్ సర్కారు విశ్వాస తీర్మానం
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ సర్కారుపై శుక్రవారం శాసనసభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మద్యం కుంభకోణంలో ప్రశ్నించేందుకు ఈడీ ఎన్నిసార్లు సమన్లు జారీచేసినా గైర్హాజరవడంతో శనివారం తమ ముందు హాజరుకావాలని సిటీ కోర్టు కేజ్రీవాల్‌ను ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈ చర్యకు దిగడం గమనార్హం. విశ్వాస తీర్మానంపై శనివారం సభలో చర్చించనున్నారు. 70 మంది సభ్యుల అసెంబ్లీలో కేజ్రీవాల్ బలపరీక్షకు సిద్ధపడటం ఇది రెండోసారి. ఆప్‌కు 62 మంది ఎమ్మెల్యేలుండగా బీజేపీ బలం రెండుకు పడిపోయింది. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారన్న కారణంతో గురువారం ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సెషన్ మొత్తానికీ సస్పెండ్ చేయడమే ఇందుకు కారణం. శుక్రవారం విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి కేజ్రీవాల్ మాట్లాడారు. తమ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారన్నారు. కానీ వారెక్కడ జారిపోతారోననే భయంతోనే ఆయన బలపరీక్షకు దిగారని బీజేపీ ఎద్దేవా చేసింది. -
అవినీతిపరులంతా బీజేపీలోకే: కేజ్రివాల్
చండీగఢ్: కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అవినీతిపై పోరాటం పేరిట డ్రామాలు ఆడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కనీ్వనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఆరోపించారు. అవినీతిపరులుగా ముద్ర పడిన వారిని బీజేపీలో చేర్చుకొని, మంత్రి పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఆదివారం హరియాణాలోని రోహ్తక్లో పార్టీ కార్యక్రమంలో కేజ్రివాల్ మాట్లాడారు. అవినీతిపై మోదీ సర్కారు సాగిస్తున్న పోరాటమంతా నాటకమేనని ధ్వజమెత్తారు. నేరాలు, అవినీతికి పాల్పడిన వారు బీజేపీలో చేరుతున్నారని, దాంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు వారిని ఏమీ చేయలేకపోతున్నాయని పేర్కొన్నారు. బీజేపీలో చేరి రక్షణ పొందుతున్న అక్రమార్కుల జోలికెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదని చెప్పారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసుల్లో చిక్కుకొని జైలుకెళ్లిన వారంతా అవినీతిపరులు కాదని కేజ్రివాల్ వ్యాఖ్యానించారు. ఈడీ కేసుల భయంతో బీజేపీలో చేరినవారే అసలైన అవినీతిపరులని తేలి్చచెప్పారు. -
నేడు హైదరాబాద్ కు ఢిల్లీ, కేరళ సీఎంలు
-
‘నేను పెద్ద దొంగనైతే.. కేజ్రీవాల్ మహా దొంగ’
న్యూఢిల్లీ: రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ మరోమారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ మరో లేఖ రాశాడు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన అంశం బయటకు రావడంతో ఆప్ లీడర్ సత్యేంద్ర జైన్, మాజీ డీజీ( తిహార్ జైళ్ల శాఖ)తనను బెదిరించినట్లు లేఖలో పేర్కొన్నాడు. తాను అతిపెద్ద క్రిమినల్ అయితే.. కేజ్రీవాల్ మహా క్రిమినల్ అంటూ ఆరోపించాడు సుకేశ్. ‘కేజ్రీవాల్ జీ నీ ప్రకారం నేను దేశంలోనే అతిపెద్ద నేరస్థుడిని. అప్పుడు నా దగ్గర నుంచి రూ.50 కోట్లు ఎందుకు తీసుకున్నావు, రాజ్యసభ సీటు ఎందుకు ఇస్తానని చెప్పావు? అది నిన్ను ఎలా చూపుతుంది.. మహా నేరస్థుడిగా?’అని లేఖలో పేర్కొన్నాడు సుకేశ్ చంద్రశేఖర్. మరోవైపు.. సీట్ల పంపిణీ విషయంలో 20-30 మంది నుంచి పార్టీకి రూ.500 కోట్లు విరాళం ఇచ్చేలా తనపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించాడు. అంతకు ముందు ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌పై ఆరోపణలు చేశాడు సుకేశ్. జైలులో భద్రంగా ఉండేందుకని సత్యేంద్ర జైన్‌కు రూ.50 కోట్లు ఇచ్చానని పేర్కొంటూ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు లేఖ రాశాడు. కొద్ది రోజుల క్రితం ఈ అంశం ఢిల్లీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే, ఈ ఆరోపణలను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కొట్టిపారేశారు. గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో కేబుల్ బ్రిడ్జి విషాదం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు కేజ్రీవాల్. ఇదీ చదవండి: గుజరాత్ నుంచి వైదొలగమని బీజేపీ ఆఫర్ ఇచ్చింది: కేజ్రీవాల్ -
గుజరాత్ నుంచి తప్పుకోవాలని బీజేపీ ఆఫర్: కేజ్రీవాల్
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగిన రోజుల వ్యవధిలోనే బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నుంచి వైదొలగాలని బీజేపీ ఆఫర్ ఇచ్చినట్లు ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలా చేస్తే విచారణ ఎదుర్కొంటున్న ఢిల్లీ మంత్రులు సత్యేంద్ర జైన్, మనీశ్ సిసోడియాలకు ఉపశమనం కల్పిస్తామని ఆఫర్ చేసినట్లు తెలిపారు. గుజరాత్ ఎన్నికల నుంచి తప్పుకుంటే సత్యేంద్ర జైన్‌ను జైలు నుంచి విడుదల చేస్తామని చెప్పిందని పేర్కొన్నారు. ‘ఢిల్లీలో ఎంసీడీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించటం ద్వారా కేజ్రీవాల్ ఆందోళన చెందుతున్నట్లు కనిపించటం లేదు. బీజేపీ భయపడుతున్నట్లు స్పష్టమవుతోంది. వారు రెండు ప్రాంతాల్లో గెలుస్తామనే ధీమాలో ఉంటే అలాంటి ఆలోచన అవసరం లేదు. నిజానికి గుజరాత్‌తో పాటు ఢిల్లీ ఎంసీడీ ఎన్నికల్లో రెండు చోట్లా ఓడపోతామని బీజేపీ భయపడుతోంది. అందుకే రెండు ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలనుకుంటున్నారు. ఆప్‌ను వీడితే ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి ఇస్తామన్న ఆఫర్‌ను మనీశ్ సిసోడియా తిరస్కరించిన తర్వాత వారు నన్ను సంప్రదించారు. గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకుంటే.. సత్యేంద్ర జైన్, సిసోడియాలపై ఉన్న అన్ని కేసులను తొలగిస్తామని ఆఫర్ చేశారు.’ అని సంచలన ఆరోపణలు చేశారు కేజ్రీవాల్. అయితే, ఎవరు ఆఫర్ చేసారనే ప్రశ్నకు.. బీజేపీ నేరుగా ఎప్పుడూ సంప్రదించదని, సొంత పార్టీ నేతల ద్వారానే వచ్చినట్లు చెప్పారు. ఇదీ చదవండి: ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం -
ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం
-
ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ పదవీ స్వీకార ప్రమాణం చేశారు. కేజ్రీవాల్‌తో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఆదివారం రాంలీలా మైదానంలో ‘ ధన్యవాద్ ఢిల్లీ’ పేరుతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కేజ్రీవాల్‌తో ప్రమాణం చేయించారు. వరుసగా మూడవ సారి ఆయన ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించారు.మనిష్ సిసోడియా, కైలేష్ గెహ్లాట్, ఇమ్రాన్ హుస్సేన్, సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్, రాజేంద్ర పాల్ గౌతమ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. (చదవండి : బ్రేక్ లేకుండా.. రాష్ట్రాలేలిన హ్యాట్రిక్ హీరోలు..!) కాగా, ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులెవరికీ ఆహ్వానాలు పంపలేదు. వేదికపై కేజ్రీవాల్‌తోపాటు ఢిల్లీ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న వివిధ రంగాలకు చెందిన 50 మంది ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు. ‘ఢిల్లీ వాసులారా, మీ కుమారుడు మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.వచ్చి మీ కుమారుడిని ఆశీర్వదించండి’ అంటూ శనివారం కేజ్రీవాల్ పిలుపునివ్వడంతో ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. ఢిల్లీ ఎన్నికల్లో వరసగా మూడో మూడోసారి ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 62 సీట్లలో బీజేపీ 8 సీట్లలో విజయం సాధించింది. -
కేజ్రీ.. ముచ్చటగా మూడోసారి
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా మూడోసారి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్(51) ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి ఢిల్లీలోని చారిత్రక రాంలీలా మైదానం వేదిక కానుంది. మూడోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న కేజ్రీవాల్ ఈసారి.. రాజకీయ ప్రముఖులెవరికీ ఆహ్వానాలు పంపలేదు. వేదికపై కేజ్రీవాల్‌తోపాటు ఢిల్లీ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్న వివిధ రంగాలకు చెందిన 50 మంది ప్రత్యేక అతిథులు ఉంటారని ఆప్ నేత మనీశ్ సిసోడియా వెల్లడించారు. అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి సుమిత్ నగల్, ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఐఐటీ సీటు సాధించిన విజయ్ కుమార్, మొహల్లా క్లినిక్ డాక్టర్ ఆల్కా, బైక్ అంబులెన్స్ సర్వీస్ అధికారి యుధిష్టిర్ రాఠీ, నైట్ షెల్టర్ కేర్ టేకర్ సబీనా నాజ్, మెట్రో పైలట్ నిధి గుప్తా తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమానికి 1.25లక్షల మంది ప్రజలు తరలివస్తారని భావిస్తున్నామని మనీశ్ సిసోడియా చెప్పారు. ప్రధాని మోదీతోపాటు ఢిల్లీకి చెందిన బీజేపీ, ఆప్ ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపారు. ‘ఢిల్లీ వాసులారా, మీ కుమారుడు మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వచ్చి మీ కుమారుడిని ఆశీర్వదించండి’ అంటూ కేజ్రీవాల్ ట్విట్టర్లో ప్రజలను ఆహ్వానించారు. రాంలీలా మైదానం, పరిసరాల్లో ఢిల్లీ పోలీసు, పారామిలిటరీ దళాలు, సీఆర్పీఎఫ్ కలిపి సుమారు 3 వేల మందిని మోహరించనున్నారు. ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్ల నిఘాతోపాటు మైదానం చుట్టుపక్కల బ్యాగేజి స్కానర్లను, డోర్ ఫ్రేమ్ డిటెక్టర్లను అమర్చారు. మైదానంలోపలా బయటా ‘ధన్యవాద్ ఢిల్లీ’ అంటూ కేజ్రీవాల్ ఫొటో ఉండే భారీ కటౌట్లు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి: బీజేపీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరుకావాలంటూ జారీ చేసిన ఆదేశాన్ని అరవింద్ కేజ్రీవాల్ వెనక్కి తీసుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా కోరారు. ఈ ఆదేశం నియంతృత్వాన్ని తలపిస్తోందని ఆయన వ్యాఖ్యానిం చారు. ఉపాధ్యాయులకు తాము ఆహ్వానాలు పంపామేతప్ప, ఆదేశాలు కాదని ఆప్ నేత మనీశ్ సిసోడియా స్పష్టం చేశారు. కాబోయే మంత్రులకు కేజ్రీవాల్ విందు ఢిల్లీ అభివృద్ధి కార్యాచరణతోపాటు వచ్చే మూడు నెలల్లో తీసుకోవాల్సిన కీలక నిర్ణయాలపై కేజ్రీవాల్ కాబోయే మంత్రులతో చర్చించారు. గత మంత్రివర్గంలోని ఆరుగురికి శనివారం తన నివాసంలో కేజ్రీవాల్ విందు ఇచ్చారు. ఢిల్లీలో రెండు కోట్ల మొక్కలు నాటడం, యమునా నదిని శుద్ధి చేయడం, కాలుష్యం తగ్గించడం వంటి ప్రజలకిచ్చిన 10 హామీల అమలుకు రంగంలోకి దిగాలని సహచరులను కేజ్రీవాల్ కోరారని ఆప్ నేత మనీశ్ సిసోడియా తెలిపారు. గత మంత్రివర్గంలో ఉన్న సిసోడియా, సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్ సహా ఆరుగురు మంత్రులు కేజ్రీవాల్‌తోపాటు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
మార్చి1 నుంచి కేజ్రీవాల్ నిరవధిక దీక్ష
న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మార్చి1 నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించారు. ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌తో దీక్ష చేయనున్నట్టు కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీని సంపూర్ణ రాష్ట్రంగా ప్రకటిస్తామంటూ గత 20 ఏళ్లుగా బీజేపీ , కాంగ్రెస్ చెబుతూనే వస్తున్నాయనీ.. కానీ ఎప్పుడూ ఆ పార్టీలు మాట నిలబెట్టుకోలేదని కేజ్రీవాల్ విమర్శించారు. ఢిల్లీ పూర్తిస్థాయి రాష్ట్రంగా అవతరిస్తే.. యువతకు ఉద్యోగాలు రావడంతో పాటు ప్రజలకు ఇళ్లు, మహిళలకు భద్రత లభిస్తాయన్నారు. ఢిల్లీని పూర్తిస్థాయి రాష్ట్రంగా ప్రకటించాలని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మొదటి నుంచి డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఇంటి ముందు మంత్రులతో కలిసి కేజ్రీవాల్ మెరుపు ధర్నా చేశారు. సుమారు ఆరుగంటల పాటు.. అర్ధరాత్రి దాటాక కూడా లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ కార్యాలయ వెయిటింగ్ రూంలో వేచిచూసినా ఆయన మాట్లాడేందుకు అనుమతించకపోవడంతో.. అక్కడే సోఫాలో నిద్రపోయారు. శాసనసభలో కూడా ఢిల్లీని పూర్తి స్థాయి రాష్ట్రంగా ప్రకటించాలన్న తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదం తెలిపారు. -
కేజ్రీవాల్‌కు షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు రెబల్ ఎమ్మెల్యే కపిల్ మిశ్రా షాకిచ్చారు. అసెంబ్లీకి తక్కువ హాజరు అయ్యారంటూ కేజ్రీవాల్‌కి వ్యతిరేకంగా సోమవారం ఢిల్లీ హైకోర్టులో కపిల్ ఓ పిటిషన్ దాఖలు చేశారు. తాగునీటి శాఖను తన వద్దే ఉంచుకున్న కేజ్రీవాల్.. ఆ సమస్యను పరిష్కరించటంలో ఘోరంగా విఫలం అయ్యారని, అంతేకాకుండా అసెంబ్లీ సెషన్స్‌ను ఎగ్గొడుతూ.. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్నారని కపిల్ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ‘ముఖ్యమైన అంశాలపై చర్చించే సమయంలో పట్టుమని పది నిమిషాలు కూడా ఆయన అసెంబ్లీలో లేరు. 2017 నుంచి ఇప్పటిదాకా 27 అసెంబ్లీ సెషన్స్ జరగ్గా.. ఏడింటికి మాత్రమే కేజ్రీవాల్ హాజరయ్యారు. ఈయనేం ముఖ్యమంత్రో అర్థం కావట్లేదు. ప్రజా సమస్యలపట్ల ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమయ్యేందుకు ఇదే ఉదాహరణ. దయచేసి.. ఆయన(కేజ్రీవాల్) అసెంబ్లీ రికార్డులను ఓసారి క్షుణ్ణంగా పరిశీలించండి. అంతేకాదు నియోజకవర్గాల్లో ఆయన ఎన్నిసార్లు పర్యటించారో.. ప్రజల దగ్గరి నుంచి ఎన్ని విజ్ఞప్తులు పరిశీలించారో ఆరా తీయండి. ఆయన ఆస్తుల వివరాలను కూడా ఓసారి పరిశీలించండి’ అని కపిల్ పిటిషన్లో న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ పిటిషన్‌ను బెంచ్ అత్యవసరంగా స్వీకరించగా.. మంగళవారం విచారణకు రానుంది. మరోవైపు ఈ పిటిషన్‌పై ఆప్ మాత్రం గప్‌చుప్‌గా ఉంది. -
అలాంటి వారి చెంప పగలగొట్టాలి: సీఎం
న్యూఢిల్లీ: మహిళలపై జరుగుతున్న అన్యాయాలకు అడ్డుకట్ట వేయాలని, దీని కోసం రాజకీయ నాయకులు విచ్చలవిడిగా తిరిగే తమ కుమారులను హద్దుల్లో ఉంచుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. మహిళలపై ఆంక్షలు విధించే బదులు వారు స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం కల్పించాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో జెండా ఆవిష్కరణ అనంతరం ప్రసంగించారు. రాజకీయ నేతల కుమారులు ఎవరైనా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే రెట్టింపు స్థాయి శిక్షలు వేసేలా చట్టం చేయాలన్నారు. ‘‘ఈ మధ్య ఓ నేత కుమారుడు మహిళపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మరో నేత మహిళలు రాత్రి వేళల్లో బయటికి రావద్దు అని సలహా ఇచ్చారు. అలాంటి వారి చెంప పగలగొట్టాలని నేను కోరుతున్నా’’అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. భారత్ తరువాత స్వాతంత్య్రం వచ్చిన దేశాలు విద్యా రంగంలో పెట్టుబడులతో అభివృద్ధి రంగంలో మనకంటే వేగంగా దూసుకుపోతున్నాయన్నారు. గడిచిన రెండేళ్లలో తమ ప్రభుత్వ పనితీరు భేషుగ్గా ఉందన్నారు. పేదరికం పోవాలంటే అందరికీ విద్య అందడం ఒక్కటే మార్గమని కేజ్రీవాల్ వివరించారు. డెంగీ, చికున్‌గున్యాను అరికట్టేందుకు సమగ్ర ప్రణాళిక రానున్న పది రోజుల్లో ప్రభుత్వం డెంగీ, చికున్‌గున్యాల వ్యాప్తిని అరికట్టేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. జలజనిత వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతుందని తెలిపారు. సరిబేసి వాహనాల నియంత్రణ కోసం ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినట్లుగానే ఢిల్లీవాసులు వ్యాధుల నియంత్రణకు సహకరించాలని ఆయన కోరారు. డెంగీ, చికున్ గున్యా వ్యాధుల నియంత్రణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టవలసిన అవసరం ఉందన్నారు. 25–30 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటు రానున్న ఏడాది కాలంలో ప్రభుత్వం ఢిల్లీలో 25–30 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తుందని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. మొదటి సంవత్సరంలో ఈ కేంద్రాలు 25 వేలమందికి పైగా యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి పొందేటట్లు చేస్తాయని వివరించారు.భద్రత, పారిశుధ్యం అనేవి కొంతకాలానికి పరిమితమైన పనులు కావని, ఏడాది పొడవునా కొనసాగుతుందని అన్నారు. పారిశుధ్య పనుల కోసం కాంట్రాక్టు పద్దతిన ఉద్యోగులను నియమించడం సరికాదని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులు దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉద్యోగాల్లో కాంట్రాక్టు పద్దతిని ప్రభుత్వం అంతం చేయడానికి ప్రయత్నిస్తుందని హామీ ఇస్తూ కాంట్రాక్టులు తన పద్ధతిని సరిదిద్దుకోవాలని లేనట్లయితే వారిని సరిదిద్దుతామని హెచ్చరించారు. -
హవాలా స్కాంలో ముఖ్యమంత్రి హస్తం!
-
హవాలా స్కాంలో ముఖ్యమంత్రి హస్తం!
హవాలా స్కాంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హస్తం ఉందని బహిష్కృత మంత్రి కపిల్ మిశ్రా ఆరోపించారు. ముఖేష్ కుమార్ అనే ఢిల్లీ వ్యాపారవేత్త ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 2 కోట్ల విరాళం ఇచ్చానని చెప్పడం అంతా అబద్ధమేనని కొట్టిపారేశారు. ఇదంతా నల్లధనాన్ని తెల్లగా మార్చుకోడానికి చేసిన ప్రయత్నమేనని మిశ్రా అన్నారు. ఈ మొత్తం స్కాంకు సూత్రధారి అరవింద్ కేజ్రీవాలేనని ఆయన చెప్పారు. నాలుగు షెల్ కంపెనీల ద్వారా రూ. 50 లక్షల చొప్పున మొత్తం రూ. 2 కోట్ల మొత్తం చెక్కుల రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాలోకి వచ్చిందని ఐదు రోజుల క్రితం మిశ్రా ఆరోపించారు. అయితే దీన్ని ముఖేష్ కుమార్ అలియాస్ ముఖేష్ శర్మ ఖండించారు. తాను స్వయంగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఆ డబ్బులను విరాళంగా ఇచ్చానన్నారు. పేదలకు సేవ చేయడానికే ఆమ ఆద్మీ పార్టీ రాజకీయాల్లోకి వస్తోందని భావించి, అందుకు సాయపడాలనే తాను ఇచ్చినట్లు ఆయన ఒక వీడియో సందేశంలో చెప్పారు. ఆ వీడియోను అరవింద్ కేజ్రీవాల్ రీట్వీట్ చేశారు. ఆ నాలుగు కంపెనీలు ఈ వ్యక్తివేనని, తాము ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే పార్టీకి విరాళం ఇచ్చాడని అన్నారు. కానీ ముఖేష్ కుమార్/శర్మ పూర్తి నిజాలు బయట పెట్టడంలేదని మిశ్రా తాజాగా అంటున్నారు. అతడు రూ. 2 కోట్లు ఇవ్వలేదన్న విషయాన్ని తాను నిరూపించగలనని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ. 50 లక్షల చొప్పున విరాళంగా ఇస్తున్నట్లు ఉన్న నాలుగు లేఖలను ఆయన చూపించారు. వాటిలో రెండింటిమీదే శర్మ సంతకాలు ఉన్నాయన్నారు. అంటే శర్మ కేవలం కోటి రూపాయలే ఇచ్చారని, మిగిలిన కోటి ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నించారు. గత నెలలో జరిగిన మునిసిపల్ ఎన్నికలకు ఒక్క రోజు ముందే ఆ 2 కోట్ల విరాళం వచ్చిందని, ఇది మరింత ప్రశ్నార్థకంగా ఉందని కపిల్ మిశ్రా అన్నారు. ఆదాయపన్ను శాఖ కేజ్రీవాల్‌ను దాని గురించి అడిగితే, ఎక్కడినుంచి వచ్చాయో తెలియదన్నారని చెప్పారు. మొత్తం 16 షెల్ కంపెనీలను ఉపయోగించుకోవడం ద్వారా కేజ్రీవాల్ మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. -
ఆప్‌లో లుకలుకలు, సిసోడియాతో కేజ్రీవాల్ భేటీ
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పరాజయం మూటగట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీలో లుకలుకలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీలో కుమార్ విశ్వాస్ వ్యవహారం ముగిసిపోకముందే...తాజాగా ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ పేరు తెర మీదకు వచ్చింది.ఆప్‌ను చీల్చేందుకు అమానతుల్లా ఖాన్ కుట్ర పన్నుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. 40మంది ఎమ్మెల్యేలు అతనిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే పీఏసీ అధ్యక్ష పదవి నుంచి అమానతుల్లా ఖాన్ ను తొలగించాలంటూ వారు ఈ సందర్భంగా సీఎంకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఆప్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో అత్యవసరంగా భేటీ అయ్యారు. పార్టీలో తాజా పరిణామాలపై చర్చలు జరుపుతున్నారు. కాగా పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన ఎమ్మెల్యే కుమార్ విశ్వాస్ కూడా చేజారిపోతున్నట్లు సంకేతాలతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని మరీ కుమార్ విశ్వాస్ బీజేపీలో చేరుతారని పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే కుమార్ విశ్వాస్ తన సోదరుడి లాంటివాడంటూ కొంతమంది వ్యక్తులు తామిద్దరి మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని వాళ్లు పార్టీకి శత్రువులని సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేశారు. -
తమ్ముడితో నాకు గొడవలేంటి: సీఎం
ఆప్ కోటకు బీటలు వారుతున్నాయి. పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన కుమార్ విశ్వాస్ కూడా చేజారిపోతున్నట్లు సంకేతాలు అందుతుండటంతో.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కలవరపడ్డారు. కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని మరీ కుమార్ విశ్వాస్ బీజేపీలో చేరుతారని పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఆరోపించడంతో వెంటనే సీఎం స్పందించారు. తనకు, కుమార్ విశ్వాస్‌కు అసలు గొడవలేమీ లేవని.. అతడు తన తమ్ముడి లాంటి వాడని చెప్పారు. అయితే ఒక్కొక్కరికి రూ. 30 కోట్ల చొప్పున ఆఫర్ ఇచ్చి మరీ కుమార్ వివ్వాస్ కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లిపోతున్నారని అమానతుల్లా ఖాన్ అంటున్నారు. ఈ మేరకు ఆయన వాట్సప్‌లో ఓ మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలను పిలిపించి.. తనను పార్టీ కన్వీనర్ చేయాలని కుమార్ విశ్వాస్ చెప్పారన్నది ఖాన్ వాదన. ఇదంతా బీజేపీయే చేయిస్తోందని ఆయన అన్నారు. సుమారు 14 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆరోపించారు. అతడు నా తమ్ముడు.. కుమార్ విశ్వాస్ తనకు సొంత తమ్ముడి లాంటి వాడని, కొంతమంది వ్యక్తులు తామిద్దరి మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని.. వాళ్లు పార్టీకి శత్రువులని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తమను ఎవ్వరూ వేరు చేయలేరని స్పష్టం చేశారు. ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో పార్టీ నాయకత్వం మార్పు దిశగా ఆలోచనలు జరుగుతున్నాయని కుమార్ విశ్వాస్ ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచినా.. ఆప్‌కు వచ్చిన స్థానాలు చాలా తక్కువ. -
సీఎం కొన్నిరోజులు మాట్లాడరు
బెంగళూరు: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొన్ని రోజులు ఎవరితోనూ మాట్లాడరు. చాలాకాలం నుంచి దగ్గు సమస్యతో బాధపడుతున్న కేజ్రీవాల్ బెంగళూరులోని నారాయణ హెల్త్ సిటీలో సర్జరీ చేయించుకున్నారు. కేజ్రీవాల్ గొంతుకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించామని వైద్యులు తెలిపారు. కొన్ని రోజుల పాటు మాట్లాడకుండా ఉండాలని ఆయనకు వైద్యులు సూచించారు. కేజ్రీవాల్ నాలుక సాధారణ పరిమాణం కంటే పెద్దగా ఉందని వైద్యులు తెలిపారు. ఆయన నోటి పరిమాణం కంటే నాలుక కొంచెం పెద్దగా ఉందని చెప్పారు. కేజ్రీవాల్ గొంతు పైభాగంలో చిన్న కండరానికి సర్జరీ చేసినట్టు తెలిపారు. ఆయన కోలుకునే పరిస్థితిని బట్టి ఎప్పటి నుంచో మాట్లాడవచ్చో వైద్యులు నిర్ణయిస్తారు. సర్జరీ చేయించుకునేందుకు కేజ్రీవాల్ ఇటీవల బెంగళూరుకు వెళ్లారు. -
గోవాపై కేజ్రీవాల్కున్నది కృత్రిమప్రేమ
పనాజీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గోవా పర్యటనకు రావడాన్ని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. గోవాపై కేజ్రీవాల్కున్నది కృత్రిమమైన ప్రేమని, ఎన్నికల్లో లబ్ధిపొందటానికి మాత్రమే వచ్చారని గోవా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి టోజనొ డిమెల్లో అన్నారు. గోవా ప్రజలపై కేజ్రీవాల్ లేనిపోని ప్రేమ వ్యక్తం చేస్తున్నారని, ఇక్కడి ప్రజలను మోసం చేసి, దోచుకోవడానికి వస్తున్నారని చెప్పారు. గోవాలోని భూవనరులపై కేజ్రీవాల్ కన్నుపడిందని, ఢిల్లీవాలాలకు ఏజెంట్ అని డిమెల్లో విమర్శించారు. గత ఆదివారం గోవా పర్యటనకు వెళ్లిన కేజ్రీవాల్ కాంగ్రెస్‌పై విమర్శులు చేశారు. వచ్చే ఏడాది జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్కసీటు కూడా గెలవలేదని అన్నారు. -
సీఎం గారూ.. మావాళ్ల విషయంలో జోక్యం వద్దు
న్యూఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యే అసీం అహ్మద్ ఖాన్ మరోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు చేశారు. కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనను చంపించేందుకు కేజ్రీవాల్ కుట్ర పన్నారని ఇటీవల అసీం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ పోరాటం తనపైనే కానీ, తన కుటుంబ సభ్యులపై కాదని, తమ కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకోరాదని అన్నారు. కేజ్రీవాల్, ఆయన అనచరులు తన కుటుంబ సభ్యులను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు చూస్తున్నారని చెప్పారు. తన తండ్రి హజి మున్నె అలీపై తప్పుడు కేసు పెట్టవచ్చని ముఖ్యమంత్రి కార్యాలయంలో తనకు కావాల్సినవారు గత నెల 31న హెచ్చరించారని వెల్లడించారు. ఈ నెల 2న పాత ఢిల్లీ మీనా బజార్‌లోని తన తండ్రి షాప్ వద్దనకు ఇద్దరు మహిళలు వచ్చి కావాలనే ఆయనతో గొడవపెట్టుకున్నారని, అనుచితంగా ప్రవర్తించి తిట్టారని అసీం చెప్పారు. ఇది కుట్ర అయివుంటుందని సందేహం వ్యక్తం చేశారు. -
10 రోజులూ పేపర్లు, మొబైల్‌కు సీఎం దూరం
ధర్మశాల: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పదిరోజుల పాటు మెడిటేషన్ కోర్సులో పాల్గొనేందుకు హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లారు. కేజ్రీవాల్ ఈ పది రోజులు ఎవరినీ కలవరు. ఆయన భద్రత సిబ్బంది కూడా దూరంగా ఉంటారు. కేజ్రీవాల్ న్యూస్ పేపర్లు, టీవీలకు దూరంగా ఉండటంతో పాటు మొబైల్ ఫోన్ కూడా వాడరు. సోమవారం ధర్మశాలకు వచ్చిన కేజ్రీవాల్ కు ఆప్ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఈ నెల 12 వరకు ఆయన ఇక్కడే గడపనున్నారు. ధర్మకోట్లోని హిమాచల్ విపాస్సన సెంటర్లో బస చేస్తారు. మెడిటేషన్ కోర్సు మంగళవారం ప్రారంభమై, ఈ నెల 11 వరకు కొనసాగుతోంది. ఆ మరుసటి రోజు కేజ్రీవాల్ ఢిల్లీకి తిరిగివెళతారు. -
సీబీఐ వస్తుంది జాగ్రత్త!
ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి మండిపడ్డారు. కొత్తగా కట్టిన కాలేజి భవనాన్ని ప్రారంభించిన తన ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాను ఉద్దేశించి ట్వీట్ చేస్తూ.. సీబీఐ ఏ నిమిషంలోనైనా రావొచ్చు, జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ప్రధానమంత్రి మోదీ సీబీఐని పంపొచ్చు లేదా ఆ కాలేజి భవనాన్ని కట్టే అధికారం నీకు లేదని చెప్పొచ్చు అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. అలాగే, మనీష్ సిసోదియా మీడియా సలహాదారు ఇంట్లో దోపిడీ జరిగిందంటూ గురువారం మరో ట్వీట్ చేశారు. అయితే దొంగలు కేవలం కొన్ని అధికారిక పత్రాలను మాత్రమే తీసుకెళ్లి విలువైన వస్తువులున్నింటినీ వదిలేశారని.. దీని వెనకాల ఎవరున్నారని ప్రశ్నార్థకం సంధించారు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న మనీష్ సిసోదియా కొత్తగా నిర్మించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ కాలేజిని బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పీడబ్ల్యుడీ శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కూడా పాల్గొన్నారు. ఇలాంటి మంచి భవనం కట్టినందుకు జైన్‌ను సిసోదియా అభినందించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తమను ఇబ్బందులు పెట్టినా, తాము పనులు చేస్తూనే ఉన్నామని ఆయన అన్నారు. Robbery at Dy CM's media advisor's home. Burglars stole only official papers, left all valuables. Who's behind it? https://t.co/t5uHXivwnE — Arvind Kejriwal (@ArvindKejriwal) 21 July 2016 Manish, be prepared. Modi ji will either send CBI against u or declare that u did not have power to construct it https://t.co/oOEZBkYBDi — Arvind Kejriwal (@ArvindKejriwal) 20 July 2016 -
నన్ను ఫోన్ తీసుకెళ్లనివ్వలేదు: సీఎం
అంతర్రాష్ట్ర మండలి సమావేశం జరిగిన మూడురోజుల తర్వాత ఆ సమావేశం గురించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో జరిగిన ఆ సమావేశం హాల్లోకి తనను ఫోన్ తీసుకెళ్లనివ్వలేదని తాజాగా ఆయన ఆరోపించారు. అంతర్రాష్ట్ర మండలి సమావేశం దాదాపు పదేళ్ల తర్వాత ఈనెల 16న జరిగింది. కేవలం కొంతమంది ముఖ్యమంత్రులను మాత్రమే ఫోన్లు బయట పెట్టాలని చెప్పారని.. అందులో ప్రధానంగా తాను, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నామని ఆయన తెలిపారు. తన రాష్ట్రంలో ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే తనకు ఎలా తెలుస్తుందని ఆమె గట్టిగా నిలదీయడంతో ఆమెను అనుమతించారు గానీ తనను మాత్రం అనుమతించలేదని కేజ్రీవాల్ చెప్పారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తన బ్యాచ్‌మేట్ అయిన ఓ వ్యక్తి రాసిన ‘అరవింద్ కేజ్రీవాల్ అండ్ ద ఆమ్ ఆద్మీ పార్టీ - యాన్ ఇన్సైడ్ లుక్’ అనే పుస్తకం ఆవిష్కరణ సభలో ఆయనీ విషయాలు తెలిపారు. తాను మాట్లాడేటప్పుడు కూడా చాలాసార్లు అడ్డుపడ్డారని, ప్రతిపక్షం మాట వినడానికి కూడా మీకు ఇష్టం లేకపోతే అసలు ఎందుకు పిలిచారని మండిపడ్డారు. తన ప్రభుత్వాన్ని కేంద్రం పనిచేయనివ్వడం లేదని ఆరోపించారు. -
సీఎం భార్య రిటైర్మెంట్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య, భారత రెవెన్యూ సర్వీస్ అధికారిణి సునీత స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) చేశారు. వీఆర్ఎస్ కోరుతూ ఈ ఏడాది మొదట్లో సునీత దరఖాస్తు చేయగా, సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) ఇందుకు అనుమతిస్తూ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆదాయపన్ను శాఖలో సునీత దాదాపు 22 ఏళ్ల పాటు పనిచేశారు. సునీత చివరిసారిగా ఢిల్లీలోని ఐటీఏటీలో ఐటీ కమిషనర్ హోదాలో విధులు నిర్వహించారు. కాగా అరవింద్ కేజ్రీవాల్ కూడా గతంలో ఐఆర్ఎస్ అధికారిగా పనిచేశారు. కేజ్రీవాల్ ఉద్యోగానికి రాజీనామా చేసి తొలుత ప్రజాఉద్యమకర్త అన్నా హజారే బృందంతో కలసి ఉద్యమించారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. -
ఆమె నా కార్యక్రమాన్ని అడ్డుకున్నారు: సీఎం
అహ్మదాబాద్: కేంద్ర ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేసే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. బీజేపీ పాలితరాష్ట్రం గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. గుజరాత్‌లోని సూరత్‌లో జరగాల్సిన తన కార్యక్రమాన్ని ఆనందీబెన్ అడ్డుకున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరికీ తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉందన్నారు. శనివారం ఉదయం కేజ్రీవాల్ తన కుటుంబ సభ్యులు, ఆప్ నేతలతో కలసి గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు వెళ్లారు. సోమ్నాథ్లోని ప్రసిద్ధ శివాలయాన్ని దర్శించారు. ఆ తర్వాత 2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రెండురోజుల పర్యటనకు గుజరాత్‌కు వచ్చానని, ఆదివారం సూరత్ వెళ్లాల్సివుందని కేజ్రీవాల్ చెప్పారు. అయితే ముఖ్యమంత్రి ఆనందీబెన్ సూరత్‌లోని వ్యాపారవేత్తలు, ప్రజలపై ఒత్తిడి చేసి తమ పార్టీ కార్యక్రమాన్ని రద్దు చేయించారని ఆరోపించారు. కాగా సూరత్ పర్యటనకు రావాలని కేజ్రీవాల్‌కు పంపిన ఆహ్వానాన్ని ఓ వర్తక సంఘం విరమించుకోగా, దీనివెనుక బీజేపీ ప్రభుత్వం హస్తముందని ఆప్ నేతలు చెబుతున్నారు. -
ప్రధాని డిగ్రీలు ఎందుకు చూపించరు: సీఎం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిగ్రీల అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ట్విట్టర్లో విరుచుకుపడ్డారు. ప్రధాని డిగ్రీల రికార్డులు చూపించడానికి ఢిల్లీ యూనివర్సిటీ నిరాకరిస్తోందని.. అది ఎందుకని ప్రశ్నించారు. తనకు తెలిసిన సమాచారం ప్రకారం ఆయన అక్కడి నుంచి బీఏ చేయలేదని అన్నారు. కొన్ని పత్రికలు ప్రచురించిన డిగ్రీలు ఫోర్జరీవని కూడా సీఎం ఆరోపించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తన డిగ్రీల గురించి కొంతమంది ప్రశ్నించారని, వెంటనే తాను దాన్ని రుజువు చేసుకున్నానని అన్నారు. తనకు అక్కడి నుంచి డిగ్రీ ఉందని కూడా తెలిపారు. సుర్బజిత్ రాయ్ అనే వ్యక్తి ఐఐటీ ఖరగ్‌పూర్‌ను సమాచార హక్కు చట్టం ప్రకారం కేజ్రీవాల్ విద్యార్హతల గురించి ప్రశ్నించగా అక్కడి నుంచి వచ్చిన లేఖను కూడా ఆయన తన ట్వీట్‌తో పాటు జతపరిచారు. తన డిగ్రీల గురించి ఖరగ్‌పూర్ ఐఐటీ ఇంత స్పష్టంగా చెబుతోందని, కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిగ్రీల గురించి ఢిల్లీ యూనివర్సిటీ ఎందుకు దోబూచులు ఆడుతోందని ప్రశ్నించారు. ఎందుకంటే, ఆయనకు డిగ్రీలు లేవని కూడా కేజ్రీవాల్ సూత్రీకరించేశారు. ఆయన యూనివర్సిటీలో చేరడం, ఆయన డిగ్రీ, మార్కుల జాబితా, స్నాతకోత్సవం.. ఇలాంటి వాటికి సంబంధించిన రికార్డులు ఏవీ ఢిల్లీ యూనివర్సిటీలో లేవని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. DU refuses to show records of PM's degree. Why? My info- he did not do BA from DU. No records in DU. Degree published by some papers forged — Arvind Kejriwal (@ArvindKejriwal) 4 May 2016 Someone asked info abt my degree from IIT Kgp. They immediately provided it. Becoz I have a degree from there(1/2) pic.twitter.com/2LMzmZasxS — Arvind Kejriwal (@ArvindKejriwal) 4 May 2016 Why is DU refusing info abt PM's degree? Becoz he does not have it (2/2) — Arvind Kejriwal (@ArvindKejriwal) 4 May 2016 No records in DU related to his enrolment, his degree, his marksheets and convocation — Arvind Kejriwal (@ArvindKejriwal) 4 May 2016 -
మోదీనే కాదండి.. కేజ్రీవాల్ కూడా!
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ నినాదంతో ఢిల్లీ పీఠాన్ని దక్కించుకున్న నాయకుడు అరవింద్ కేజ్రీవాల్. సామాన్యుల కోసం పోరాడే చాంపియన్ గా కేజ్రీవాల్ ను ఆయన అభిమానులు కీర్తిస్తారు. అయితే, త్వరలోనే ఆయన లండన్ లోని ప్రఖ్యాత మేడం టుస్సాడ్ మ్యూజియంలో వీవీఐపీల సరసన నిలువబోతున్నారు. ఇప్పటికే మేడం టుస్సాడ్ మ్యూజియంలో మైనపు బొమ్మలుగా అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ సందర్శకులను ఆకట్టుకుంటుండగా.. త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ మైనపుబొమ్మ కూడా ఈ మ్యూజియంలో చేరనుంది. అచ్చం మోదీలా రూపురేఖలు, హవాభావాలున్న ఈ మైనపు బొమ్మకు ఇటీవల తుది మెరుగులు దిద్దుతూ దింపిన ఫొటోలు బాగా హల్ చల్ చేశాయి. నిజంగా మోదీనే చూస్తున్న భావన కల్పించాయి. ఇక అరవింద్ కేజ్రీవాల్ మైనపుబొమ్మ కూడా ఈ మ్యూజియంలోకి చేరనుంది. అచ్చం తనలాగే ఉండే ఈ బొమ్మ రూపకల్పన కోసం కొలతలు ఇచ్చేందుకు కేజ్రీవాల్ ఒప్పుకొన్నారని, వచ్చేనెలలో కొలతలు తీసుకుంటారని కేజ్రీవాల్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. మఫ్లర్ తో పోజిస్తారా? కామన్ మ్యాన్ ప్రతీకగా తనను తాను భావించుకునే అరవింద్ కేజ్రీవాల్ అనగానే చాలామందికి ఆయన మఫ్లర్ గుర్తుకొస్తుంది. ఢిల్లీలోని చలి వాతావరణం తట్టుకోవడానికి ఆయన తరచూ మఫ్లర్ ధరించి కనిపించేవారు. తన ఇంటిలో సీబీఐ దాడులు జరిపితే మఫ్లర్లే ఎక్కువగా దొరుతాయని కేజ్రీవాల్ ఓ సందర్భంలో చెప్పారు కూడా. ఈ నేపథ్యంలో మేడం టుస్సాడ్ మ్యూజియంలో పెట్టే మైనపు బొమ్మకు కూడా మఫ్లర్ ఉంటుందా? మోదీ, కేజ్రీవాల్ పోటాపోటీగా ఈ మ్యూజియంలో కొలువైతే.. ఎవరితో ఎక్కువగా సెల్ఫీలు దిగేందుకు ప్రజలు పోటీపడతారు? అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. అన్నట్టు వచ్చే ఏడాది ఢిల్లీలో కూడా తన శాఖను ఏర్పాటుచేయాలని మేడం టుస్సాడ్ మ్యూజియం భావిస్తోంది. -
సుప్రీం కోర్టులో సీఎంకు ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. కేజ్రీవాల్‌పై నమోదైన క్రిమినల్ కేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లోని అమేథి కోర్టుకు ప్రస్తుతానికి ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరంలేదని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ సీఎం తరపున ఆయన న్యాయవాది అమేథి కోర్టులో వాదనలు వినిపించవచ్చని వెసులుబాటు కల్పించింది. అమేథి కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ జే చలమేశ్వర్, జస్టిస్ అభయ్ మనోహర్ సప్రేలతో కూడిన ధర్మాసనం విచారించింది. కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ వాదనలు వినిపించారు. అమేథి కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి కేజ్రీవాల్ కు మినహాయింపు ఇచ్చిందని రాజీవ్ చెప్పారు. -
'దృశ్యం' చూడండి
న్యూఢిల్లీ : ప్రముఖ బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ హీరోగా నటించిన 'దృశ్యం' చిత్రంపై న్యూఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసల జల్లు కురిపించారు. 'దృశ్యం' తప్పక చూడాల్సిన చిత్రమని పేర్కొన్నారు. ఆ చిత్రాన్ని ఆయన సోమవారం న్యూఢిల్లీలో ప్రత్యేకంగా వీక్షించారు. అనంతరం కేజ్రీవాల్ పైవిధంగా స్పందించారు. 'నేను దృశ్యం చూశాను... తప్పక చూడాల్సిన చిత్రం అని' తన అధికారిక ట్విట్టర్లో పేర్కొన్నారు. కాగా ఈ చిత్రం విడుదలకు ముందే హిందీ 'దృశ్యం' ఘన విజయం సాధించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆకాంక్షించారు. ఆ క్రమంలో హీరో అజయ్ దేవగన్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్లో అమిత్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దృశ్యం చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషలలో తెరకెక్కి ఘన విజయం సాధించిన విషయం విదితమే. నిశికాంత్ కామత్ దర్శకత్వంలో దృశ్యం చిత్రం హిందీలో రీమేక్ అయింది. దృశ్యం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ సరసన శ్రియ శరన్ నటించగా... టబూ పోలీసు అధికారిగా నటించారు. -
ముఖ్యమంత్రిపై కానిస్టేబుల్ పరువునష్టం దావా
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పోలీసులను పరుష పదజాలంతో దూషించారంటూ ఓ కానిస్టేబుల్ దాఖలుచేసిన పరువునష్టం దావాను విచారిచేందుకు కోర్టు అంగీకరించింది. దక్షిణ ఢిల్లీలోని గోవింద్‌పురి పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేసే హర్వీందర్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలుచేశారు. ఈ కేసు విచారణను కోర్టు సెప్టెంబర్ 10వ తేదీకి పోస్ట్ చేసింది. ఆరోజు ఫిర్యాది తరఫు సాక్షులను విచారిస్తారు. గోవింద్‌పురి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌తో పాటు ఓ హెడ్ కానిస్టేబుల్ కూడా ఈ కేసులో సాక్షులుగా ఉన్నారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పోలీసులను 'తుల్లా' అనే పదం వాడటం వల్ల తాము ప్రజలతో పాటు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువుల దృష్టిలో బాగా చులకన అయిపోయామని హర్వీందర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎల్.ఎన్. రావు అనే న్యాయవాది ద్వారా కోర్టులో ఫిర్యాదు చేశారు. కేజ్రీవాల్ చేసిన నేరాలు ఐపీసీ సెక్షన్లు 500, 504 కిందకు వస్తాయన్నారు. -
'సీఎంను కలిసేందుకు మోదీ విముఖత'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశమయ్యేందుకు నిరాకరించారని ఆప్ వర్గాలు తెలిపాయి. మోదీ తీరికలేకుండా ఉన్నారని ప్రధాని కార్యాలయం అధికారులు చెప్పినట్టు వెల్లడించారు. '10 రోజుల క్రితం ప్రధాని అపాయింట్మెంట్ కోరుతూ కేజ్రీవాల్ లేఖ రాశారు. అయితే ఇప్పటికీ సమయం ఇవ్వలేదు. ప్రధాని జాతీయ వ్యవహరాలతో తీరికలేకుండా ఉన్నారని మాకు సమాచారం ఇచ్చారు' అని కేజ్రీవాల్ సలహాదారు నాగేంద్ర శర్మ చెప్పారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీమ్ జంగ్‌తో ఏర్పడ్డ విభేదాల గురించి చర్చించేందుకు ప్రధాని అపాయింట్మెంట్ కోరినట్టు ఆప్ వర్గాలు తెలిపాయి. సెల్ఫీలు దిగేందుకు మోదీకి సమయం ఉంది కానీ సీఎంతో మాట్లాడేందుకు తీరికలేదా అని ఓ ఆప్ లీడర్ విమర్శించారు. -
ఏకే 67 అరవింద్ కేజ్రీవాల్
కవర్ స్టోరీ ఒక్కడు.. ఒకే ఒక్కడు.. సాదా సీదా సామాన్యుడు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల చరిత్రనే తిరగ రాశాడు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘చీపురు’ పట్టిన సామాన్యుడు ప్రచారార్భాటాల చెత్తనంతా చెడామడా చిమ్మేసి, విజయ దుందుభి మోగించాడు. ‘చీపురు’ ధాటికి దేశ రాజధానిలో చిరపరిచిత ‘కర’ ‘కమలాలు’ చిరునామా లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. ‘చీపురు’ విజయగాథపై మీడియాలో ఇప్పటికే రాజకీయ విశ్లేషణలు హోరెత్తాయి. రాజకీయ విశ్లేషణలు సరే, ‘చీపురు’నే పతాక చిహ్నంగా ధరించి, ఎన్నికల బరిలో అ‘ద్వితీయ’ విజయాన్ని సొంతం చేసుకున్న ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకునే స్థాయికి ఎదిగిన క్రమం, ఈ క్రమంలో ఆయనకు సహకరించిన శక్తులు, వ్యక్తులు, గెలుపు బాటలో ఆయనకు కలసి వచ్చిన అంశాలపై ఒక సింహావలోకనం... నేపథ్యం సామాన్యం అరవింద్ కేజ్రీవాల్ 1968 ఆగస్టు 16న హర్యానాలోని భివానీ జిల్లా శివానీ గ్రామంలో పుట్టారు. గోవింద్రామ్ కేజ్రీవాల్, గీతాదేవి దంపతులకు అరవింద్ తొలి సంతానం. అరవింద్ తండ్రి గోవింద్రామ్ కూడా ఇంజనీరే. మెస్రాలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఆయన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పొందారు. తండ్రి ఉద్యోగం కారణంగా అరవింద్ బాల్యం పలుచోట్ల సాగింది. సోనేపట్, హిస్సార్, ఘజియాబాద్‌లలో ఆయన పాఠశాల చదువు సాగింది. కేజ్రీవాల్ తండ్రికి, తాతకు ఆయనను మెడిసిన్ చదివించాలని బాగా కోరికగా ఉండేది. అయితే, అరవింద్ మాత్రం ఇంజనీరింగ్ వైపే మొగ్గారు. పన్నెండో తరగతి పూర్తవుతూనే ఐఐటీ ఎంట్రన్స్ రాసి, మొదటి ప్రయత్నంలోనే ఖరగ్‌పూర్ ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో సీటు పొందారు. బీటెక్ పూర్తయిన వెంటనే 1989లో జెమ్షెడ్పూర్లోని టాటా స్టీల్ కంపెనీలో చేరారు. మూడేళ్ల తర్వాత ఆ ఉద్యోగం వదిలేసి, సివిల్స్‌కు చదవడం ప్రారంభించారు. ఆ కాలంలోనే కోల్‌కతాలో మదర్ థెరిసాను కలుసుకున్నారు. మిషనరీస్ ఆఫ్ చారిటీ, ఈశాన్య రాష్ట్రాల్లో రామకృష్ణ మిషన్, నెహ్రూ యువక్ కేంద్ర వంటి సంస్థలు చేపట్టే సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. వివిధ ప్రాంతాల్లోని సామాన్యుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. బహుశ అప్పటి అనుభవాలే ఆయన ఉద్యోగ, ఉద్యమ, రాజకీయ జీవితాలకు పునాది వేశాయి. ఉద్యోగపర్వం తొలి ప్రయత్నంలోనే సివిల్స్ సాధించి, 1995లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌లో (ఐఆర్ఎస్) ఉద్యోగం సాధించారు. ముస్సోరిలో శిక్షణ పొందుతున్న కాలంలోనే తన బ్యాచ్‌మేట్ సునీతతో ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో ఆమెను జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. అవినీతికి ఆలవాలమైన ఆదాయపు పన్ను శాఖలో వివిధ హోదాల్లో పనిచేసినా, కేజ్రీవాల్‌పై అవినీతి మరకలేవీ లేవు. అయితే, ప్రభుత్వంతో కొన్ని వివాదాలు మాత్రం ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా కొనసాగుతున్న కాలంలో ఉన్నత విద్య కోసమంటూ 2000 సంవత్సరంలో రెండేళ్ల దీర్ఘకాలిక సెలవు తీసుకున్నారు. తిరిగి చేరిన తర్వాత కనీసం మూడేళ్లు పూర్తయ్యేంత వరకు ఉద్యోగానికి రాజీనామా చేయరాదనే షరతుపై ప్రభుత్వం ఆయనకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసింది. సెలవు ముగిశాక 2002 నవంబర్‌లో తిరిగి చేరిన కేజ్రీవాల్‌కు ఎలాంటి పోస్టూ మంజూరు చేయలేదు. ఆయనను ఖాళీగానే ఉంచి, 18 నెలలు జీత భత్యాలు ఇచ్చారు. ఈ పరిస్థితికి విసుగెత్తిన కేజ్రీవాల్, మరో 18 నెలలు వేతనం లేని సెలవు కోరుకున్నారు. ఆ సెలవు ముగిసిన వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా చేసే నాటికి ఆయన జాయింట్ కమిషనర్ హోదాలో ఉండేవారు. వేతనంతో కూడిన సెలవు తర్వాత కనీసం మూడేళ్లు ఉద్యోగంలో కొనసాగాలన్న షరతును కేజ్రీవాల్ ఉల్లంఘించారని ప్రభుత్వం కోర్టుకెక్కింది. ఏడాదిన్నర కాలం తనకు ఎలాంటి పోస్టింగ్ మంజూరు చేయలేదని, అందువల్ల వేతనం చెల్లించని సెలవులో మరో ఏడాదిన్నర గడిపానని, మొత్తం మూడేళ్లు పూర్తయిన తర్వాతనే తాను రాజీనామా చేశానని కేజ్రీవాల్ వాదన. ఈ వివాదం 2011 వరకు కొనసాగింది. కేజ్రీవాల్ రూ. 9,27,787 ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చింది. ఉద్యమపర్వం ఉద్యోగపర్వం కొనసాగుతుండగా, కేజ్రీవాల్ తన ఉద్యమపర్వానికి నాంది పలికారు. తాను పనిచేసే ఆదాయపు పన్ను శాఖ సహా వివిధ ప్రభుత్వ విభాగాల్లో వేళ్లూనుకున్న అవినీతిపై పోరాడేందుకు మనీష్ సిసోడియా వంటి మిత్రులతో కలసి 1999లోనే ‘పరివర్తన్’ పేరిట ప్రజా ఉద్యమ సంస్థను ప్రారంభించారు. ఆదాయపు పన్ను శాఖ లావాదేవీలలో పారదర్శకతను డిమాండ్ చేస్తూ 2000 సంవత్సరంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇదే డిమాండ్‌తో ఢిల్లీలోని ఇన్‌కమ్‌ట్యాక్స్ చీఫ్ కమిషనర్ కార్యాలయం ఎదుట సత్యాగ్రహం కూడా చేశారు. తర్వాత 2005లో మిత్రులతో కలసి ‘కబీర్’ పేరిట రిజిస్టర్డ్ ఎన్జీవోను ప్రారంభించారు. ‘పరివర్తన్’, ‘కబీర్’ సంస్థల ద్వారా ప్రభుత్వ శాఖల్లో అవినీతికి వ్యతిరేకంగా పోరాడటంతో పాటు సమాచార హక్కు చట్టం కోసం ఉద్యమం చేశారు. ఫలితంగా ఢిల్లీ ప్రభుత్వం 2001లో సమాచార హక్కు చట్టాన్ని అమలులోకి తెచ్చింది. నాలుగేళ్ల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం 2005లో జాతీయ స్థాయిలో సమాచార హక్కు చట్టాన్ని అమలులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా సమాచార హక్కు చట్టం అమలులోకి తెచ్చేందుకు అన్నా హజారే, అరుణా రాయ్, శేఖర్ సింగ్ తదితరులతో కలసి కేజ్రీవాల్ పోరాటం సాగించారు. కేజ్రీవాల్ నాయకత్వ పటిమకు గుర్తింపుగా 2006లో ఆయనకు ప్రతిష్టాత్మకమైన రామన్ మెగసెసె అవార్డు లభించింది. అవార్డు కింద లభించిన డబ్బునే మూలధనంగా పెట్టి పబ్లిక్ కాజ్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. అసలు మలుపు కేజ్రీవాల్ సాగించిన ఉద్యమాలు, పోరాటాలు ఢిల్లీకే పరిమితమై ఉండేవి. సమాచార హక్కు చట్టం దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చినా, కేజ్రీవాల్‌కు అప్పట్లో లభించిన ప్రాచుర్యం అంతంత మాత్రమే. అయితే, అన్నా హజారే 2011లో జన లోక్‌పాల్ బిల్లు కోసం ప్రారంభించిన ఉద్యమంతో కేజ్రీవాల్ జీవితం అసలు మలుపు తిరిగింది. హజారేకు అనుంగు అంతేవాసిగా కేజ్రీవాల్ పేరు కూడా జాతీయ, అంతర్జాతీయ మీడియాలో మార్మోగింది. హజారే చేపట్టిన ఉద్యమంలో కిరణ్ బేడీ, ప్రశాంత్ భూషణ్ తదితరులు కూడా కీలక పాత్ర పోషించారు. ఉద్యమం తీవ్రరూపం దాల్చి, అన్నా హజారే నిరాహార దీక్షకు దిగడంతో పరిస్థితి దిగజారి, అప్పటి యూపీఏ ప్రభుత్వం ఉద్యమకారులతో చర్చలకు దిగి వచ్చింది. అయితే, కట్టుదిట్టమైన జన లోక్‌పాల్ బిల్లు అమలుపై ప్రభుత్వం వాగ్దాన భంగానికి పాల్పడటంతో 2012 జనవరిలో కేజ్రీవాల్, ఆయన సహచరులు ఉద్యమాన్ని మళ్లీ ప్రారంభించారు. 2012 పూర్వార్ధం పూర్తయ్యే నాటికి హజారే స్థానంలో కేజ్రీవాల్ ఉద్యమనేతగా ఎదిగారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులను ఉద్యమకారులు మార్గనిర్దేశనం చేయజాలరనే విమర్శలు రావడంతో ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడమే మార్గమని కేజ్రీవాల్, ఆయన సహచరులు భావించారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనను హజారే వ్యతిరేకించినా, కేజ్రీవాల్ 2012 నవంబర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీని (ఆప్) ప్రారంభించారు. మరుసటి ఏడాదే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. మొదటి ప్రయత్నంలోనే మొత్తం 70 స్థానాలకు 28 స్థానాలను గెలుచుకున్నారు. ఆ ఎన్నికల్లో బీజేపీకి 31 స్థానాలు వచ్చాయి. అయితే ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక జనతాదళ్ ఎమ్మెల్యే, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మద్దతును కూడదీసుకుని 2013 డిసెంబర్ 28న కేజ్రీవాల్ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ‘ఆప్’ ఆవిర్భావాన్ని తొలుత వ్యతిరేకించిన హజారే కూడా కాస్త మెత్తబడి, శిష్యుడికి ఆశీస్సులు తెలిపారు. ఢిల్లీ అసెంబ్లీలో జన లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టడంలో విఫలమైన కేజ్రీవాల్, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 49 రోజులకే రాజీనామా చేశారు. రాజీనామా నిర్ణయంపై తర్వాత ఆయన పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తనకు మరోసారి అవకాశం లభిస్తే, రాజీనామా చేసి ప్రజల ఆశలను వమ్ము చేయబోనని మాట ఇచ్చారు. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని తొలుత ప్రకటించినా, సన్నిహితులు ఒప్పించడంతో వారణాసి నుంచి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీపై పోటీచేసి ఓడిపోయారు. బీజేపీకి పూర్తి ఆధిక్యత లభించడంతో మోదీ ప్రధాని పదవి చేపట్టారు. అయితే, ఏడు నెలల్లోనే మోదీ ప్రభ మసకబారింది. ఫలితంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు విస్పష్టమైన తీర్పునిచ్చి, కేజ్రీవాల్‌కు పట్టం కట్టారు. 70 స్థానాలకుగానూ అనూహ్యంగా 67 సీట్లలో గెలిపించి, ‘ఆప్’ను భారతీయ ఎన్నికల ‘చరిత్ర’ పుటల్లోకి ఎక్కించారు. - పన్యాల జగన్నాథదాసు విజయం వెనుక... కేజ్రీవాల్ అ‘ద్వితీయ’ విజయం వెనుక ఆయన జీవిత భాగస్వామి సునీత పాత్ర అమోఘమైనది. ఆమె లేకుండా తానొక్కడినే ఇంతటి విజయాన్ని సాధించగలిగే వాడిని కాదని ఫలితాలు వెలువడిన వెంటనే అరవింద్ బహిరంగంగా చెప్పారు. విజయోత్సాహంతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం బయట కేరింతలు కొడుతున్న అభిమానులకు ఆమెను పరిచయం చేశారు. ముస్సోరీలో ఐఆర్ఎస్ శిక్షణ పొందుతున్న సమయంలో తన బ్యాచ్‌మేట్‌గా ఉన్న సునీతతో ప్రేమలో పడ్డ అరవింద్, ఆమెను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. ప్రజా ఉద్యమాల కోసం అరవింద్ ఉద్యోగానికి రాజీనామా చేసినా, ఆమె ఇంకా ఐఆర్ఎస్ అధికారిగానే కొనసాగుతున్నారు. ఫలితాలు వెలువడక ముందు ఇదివరకు ఎన్నడూ ఆమె పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టలేదు. ఉద్యోగ జీవితంలో సునీతా కేజ్రీవాల్‌ది మచ్చలేని చరిత్ర. అందువల్లే ఆదాయపు పన్ను శాఖ ఆమెకు ఎంతో కీలకమైన ‘సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్’ వంటి బాధ్యతలను అప్పగించింది. ఆదాయపు పన్ను శాఖ అదనపు కమిషనర్ హోదాలో ఆమెకు దక్కిన ప్రభుత్వ క్వార్టర్‌లోనే ప్రస్తుతం కేజ్రీవాల్ కుటుంబం నివాసం ఉంటోంది. కేజ్రీవాల్‌కు మధుమేహం ఉండటంతో ఆయన ప్రచారం కోసం బయటకు వెళ్లినా, వేళకు ఇంటి భోజనం అందే ఏర్పాటు చేయడాన్ని సునీత ఎప్పుడూ మరచిపోరు. తరచు జలుబు, దగ్గుతో బాధపడే కేజ్రీవాల్‌కు శీతల పానీయాలంటే తగని ఇష్టం. వాటిని కాస్త తగ్గించుకోవాలని సునీత తన భర్తకు తరచు సలహా ఇస్తుంటారు. ఆమె రాజకీయ అభిప్రాయాలకు కేజ్రీవాల్ చాలా విలువ ఇస్తారని, ఆమె అభిప్రాయాన్ని ఆయన పార్టీలకు అతీతమైన స్వతంత్ర ప్రతిపత్తి గల పౌరుల అభిప్రాయంగా పరిగణిస్తారని ‘ఆప్’ నేతలు చెబుతుంటారు. అ‘సామాన్యుడు’ సామాన్యుడిగా ఉండే లక్షణమే రాజకీయ యవనికపై ఆయనను అసామాన్యుడిగా నిలిపింది. ఎన్నికల బరిలో ‘చీపురు’ ఝుళిపించడమే తడవుగా ఓట్ల వర్షం కురిపించింది. ఘన విజయం సాధించి, త్వరలోనే ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న అరవింద్ కేజ్రీవాల్ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు.. చదువుకునే రోజుల్లో చురుకైన విద్యార్థిగా ఉండే అరవింద్‌ను డాక్టరుగా చూడాలని ఆయన తండ్రి గోవింద్రామ్ బలంగా కోరుకున్నారు. అరవింద్ డాక్టర్‌గా చదువు పూర్తి చేసుకుంటే, ఆస్పత్రి కోసం పనికొస్తుందనే ఉద్దేశంతో హర్యానాలోని స్వస్థలమైన హిస్సార్‌లో ముందుగానే స్థలాన్ని కూడా కొని సిద్ధం చేశారు. అయితే, అరవింద్ ఐఐటీ వైపు మొగ్గారు. తండ్రి కోరికకు విరుద్ధంగా ఐఐటీలో చేరేందుకు ఇంట్లో వాళ్లతో దాదాపు పోరాటమే చేశారు. తొలి ప్రయత్నంలోనే ఖరగ్‌పూర్ ఐఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో సీటు సాధించారు. ఐఐటీ రోజుల్లో మిగిలిన విద్యార్థుల మాదిరిగా మందు పార్టీలు, పేకాట కాలక్షేపాల జోలికి పోకుండా నాటకాలు, సినిమాలతో కాలక్షేపం చేసేవారు. కేజ్రీవాల్‌కు అప్పట్లో అకడమిక్ విషయాల కంటే, నటనపైన, రంగస్థలంపైనే ఎక్కువగా ఆసక్తి ఉండేదని ఆయన సన్నిహితులు చెబుతారు. బాలీవుడ్ సినిమాలను తెగ చూసే కేజ్రీవాల్‌కు ‘మిస్టర్ పెర్ఫెక్ట్’ ఆమిర్ ఖాన్ నటన అంటే చాలా ఇష్టం. ఆమిర్ సినిమాలను ఆయన మిస్సవకుండా చూస్తారు. ఆమిర్ నటించిన సందేశాత్మకమైన సీరియస్ సినిమాలనే కాదు, హాస్య చిత్రాలనూ ఆస్వాదిస్తారు. ఐఐటీలో చదువు పూర్తయిన వెంటనే 1989లో టాటా స్టీల్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. మూడేళ్ల తర్వాత ఆ ఉద్యోగం వదిలేసి, సివిల్స్‌కు ప్రిపేరయ్యారు. మొదటి ప్రయత్నంలోనే ఐఆర్ఎస్ సాధించారు. సివిల్స్ కోసం ప్రిపేరవుతున్న కాలంలోనే ఆయన కొన్నాళ్లు కోల్‌కతాలోని రామకృష్ణ మిషన్‌లో గడిపారు. అదే కాలంలో మదర్ థెరీసాను కలుసుకొని, కొన్నాళ్లు ఆమెతో కలసి పని చేశారు. అరవింద్ కేజ్రీవాల్ వేడుకలకు, సంబరాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. తన పుట్టిన రోజునే కాదు, కనీసం తన పిల్లల పుట్టిన రోజు వేడుకలను కూడా జరుపుకొనే అలవాటు లేదాయనకు. ఐఆర్ఎస్లో చేరిన తర్వాత ప్రభుత్వాధికారిగా ప్యూన్ సేవలు వినియోగించుకునే అవకాశం ఉన్నా, దానిని వదులుకున్నారు. ఐఆర్ఎస్ అధికారిగా కొనసాగినంత కాలం కార్యాలయంలో తన డెస్క్‌ను తానే శుభ్రం చేసుకునేవారు. పూర్తిగా శాకాహారి అయిన కేజ్రీవాల్‌కు రోజూ ధ్యానం చేసే అలవాటు ఉంది. చాలాకాలంగా ఆయన విపాసన ధ్యాన సాధన కొనసాగిస్తున్నారు. రోజుకు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతారు. ధ్యానం చేసే అలవాటు వల్లనే కాబోలు నిర్విరామంగా ఎన్ని గంటలు పనిచేసినా ఆయన ముఖంలో అలసట కనిపించదు. ఆదాయపు పన్ను శాఖలో జాయింట్ కమిషనర్‌గా ఉండగా, 2006లో ఉద్యోగానికి రాజీనామా చేసి, ‘పరివర్తన్’ పేరిట స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు. అదే ఏడాది మనీష్ సిసోడియా, అభినందన్ సేక్రీ వంటి సహచరులతో కలసి స్థానిక స్వయం పరిపాలన, సమాచార హక్కులపై ప్రచారం చేసేందుకు ‘పబ్లిక్ కాజ్ రీసెర్చ్ ఫౌండేషన్’ను ప్రారంభించారు. ‘ఆప్’కా టీమ్.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అంటే తెరపై కనిపించేది కేజ్రీవాల్ మాత్రమే అయినా, ఆయన వెనుక గల సలహా బృందానికి కూడా ఈ ఘనవిజయంలో గణనీయమైన పాత్ర ఉంది. కేజ్రీవాల్‌కు సన్నిహితులైన సలహాదారుల్లో ముఖ్యులు వీరే.. మనీష్ సిసోడియా: ‘ఆప్’ బృందంలో కేజ్రీవాల్ తర్వాత అంతటి ప్రాధాన్యం గల నాయకుడు. ‘ఆప్’ ఆవిర్భావానికి ముందు నుంచే కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడు. కేజ్రీవాల్ తొలిసారి ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో విద్య, పట్టణాభివృద్ధి, పీడబ్ల్యూడీ శాఖల మంత్రిగా పనిచేశారు. గోపాల్ రాయ్: మాజీ విద్యార్థి నాయకుడు. ఆలిండియా స్టూడెంట్స్ యూనియన్‌లో కీలక పాత్ర పోషించేవారు. ‘ఛాత్ర యువ సంఘర్ష్ సమితి’ ద్వారా విద్యార్థుల్లో పార్టీ ప్రాబల్యాన్ని పెంచడంలో గణనీయమైన కృషి చేశారు. ఆసిమ్ అహ్మద్ ఖాన్: ‘ఆప్’ మైనారిటీ విభాగం నాయకుడు. ఢిల్లీలోని మాతియా మహల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి, ఆ నియోజకవర్గానికి ఐదు పర్యాయాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న జనతాదళ్ (యు) అభ్యర్థి షోయబ్ ఇక్బాల్‌ను మట్టికరిపించారు. మైనారిటీ వర్గాల్లో పార్టీ ప్రాబల్యాన్ని పెంచడంలో అహ్మద్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. సత్యేంద్ర జైన్: సీపీడబ్ల్యూడీ మాజీ ఉద్యోగి. వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలతో కలసి పనిచేసిన జైన్... అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంతో తెరపైకి వచ్చారు. తర్వాత ‘ఆప్’లో చేరి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. జితేందర్ తోమర్: కేజ్రీవాల్ బృందంలో కాస్త వివాదాస్పదుడు ఈయనే. నామినేషన్ పత్రాలతో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు దాఖలు చేసినట్లు బీజేపీ ఆరోపణలు చేయడంతో వార్తలకెక్కారు. అయితే, నేరచరిత్ర లేకపోవడంతో ఆరోపణలు, విమర్శలు ఆయనపై ప్రభావం చూపలేకపోయాయి. సందీప్ కుమార్: వృత్తిరీత్యా న్యాయవాది. సుల్తాన్పూర్ నియోజకవర్గం నుంచి 60 వేల ఓట్ల ఆధిక్యత సాధించారు. ఆ నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లలో దాదాపు సగం ఓట్లను రాబట్టుకున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ తమ పార్టీ అభ్యర్థుల కోసం వెనుకబడిన వర్గాల మద్దతును కూడగట్టడంలో కీలక పాత్ర పోషించారు. -
సామాన్యుల గుండెల్లో కేజ్రీయే హీరో!!
పదవీ బాధ్యతలు నిర్వహించలేక.. సమస్యల నుంచి తప్పించుకోడానికే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. కానీ.. ఎవరేమనుకున్నా ఇప్పటికీ సామాన్యుల గుండెల్లో మాత్రం ఆయనే హీరో. ఢిల్లీలోని సామాన్యులు ఇప్పటికీ ఆయననే బలపరుస్తున్నారు. ఒకవేళ గనక ఇప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఈసారి పూర్తిమెజారిటీతో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించే అవకాశాలు కూడా లేకపోలేవు. సరిగ్గా 50 రోజులు పాలన కూడా పూర్తి చేసుకోకముందే ముఖ్యమంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేశారు కేజ్రీవాల్. తాను ఎంతగానో కలలుగన్న జన లోక్‌పాల్ బిల్లును కనీసం అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపడటాన్ని ఆయన ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. బిల్లు విషయంలో కాంగ్రెస్ - బీజేపీ ఒక్కటిగా నిలిచి అడ్డుకోవడం కూడా ఆయన కలతకు కారణమైంది. కేజ్రీవాల్ రాజీనామా చేసినంత మాత్రాన ఏమీ కాలేదని, చీపురు పట్టుకుని ఆయన ఢిల్లీలోని అవినీతిని తుడిచేయగలరన్న మాట రుజువైందని ఢిల్లీ వాసులు వ్యాఖ్యానిస్తున్నారు. జన లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందితే తామంతా జైళ్లలో ఉండాల్సి వస్తుందన్న భయంతోనే ఇతర పార్టీల నాయకులు ఈ బిల్లుకు మద్దతు పలకలేదని విమర్శిస్తున్నారు. ఆయన రాజీనామా చేసినా తామంతా ఆయనతోనే ఉన్నామని, మరోసారి ఎన్నికలు నిర్వహించాలని.. అలా చేస్తే ఆయనకు 50 స్థానాలకు పైగా వచ్చి, ఎవరి మద్దతు లేకపోయినా బిల్లు ఆమోదం పొందుతుందని ఢిల్లీ నివాసి వినోద్ సక్సేనా వ్యాఖ్యానించారు. ఆయన కచ్చితంగా అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఆప్ పూర్తి మెజారిటీ సాధించడం ఖాయమని ప్రేమ్ చౌహాన్ అనే ఆటోడ్రైవర్ కూడా వ్యాఖ్యానించాడు. ఏది ఏమైనా ఆయన రాజీనామా మాత్రం తమకు బాధ కలిగించిందని పలువురు అంటున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన రోజని, తమలాంటి సామాన్యుల గోడు పట్టించుకునేవాళ్లు ఎవరుంటారని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ముఖేష్ అంబానీతో తలపడినందుకే ఆయన పదవి పోయిందని, అంతలా ఢీకొనాలంటే చాలా ధైర్యం ఉండాలని, అది కేజ్రీకి మాత్రమే సొంతమని దక్షిణ ఢిల్లీలో ఉండే భువన అనే మహిళ అన్నారు. -
అంబానీతో ఢీ.. కేజ్రీవాల్ పదవికి ఎసరు!!
దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యాపార సామ్రాజ్యంతో ఢీకొన్నారు. అలా ఢీకొన్నది ఓ మామూలు సామాన్యుడు. అంతే, అతడి ఉద్యోగానికే ఎసరు వచ్చింది. ఆయనెవరో ఇప్పటికే అర్థమైంది కదూ. అరవింద్ కేజ్రీవాల్.. సరిగ్గా 50 రోజులు కూడా ముఖ్యమంత్రిగా పని చేయకముందే ఆయన పదవి ఊడిపోయేంత పరిస్థితి వచ్చింది. ఇంతకీ అలా ఎందుకు జరిగింది? అంబానీలతో ప్రత్యక్షంగా ఢీకొన్నందుకేనా? గొర్రె పొట్టేలు వెళ్లి కొండను ఢీకొంటే కొండకు ఏమీ కాదు సరికదా.. పొట్టేలు కొమ్ములే విరిగిపోతాయి. ఈ సత్యాన్ని తెలుసుకోలేకనే కేజ్రీవాల్ దాదాపుగా తన పదవి కోల్పోయే పరిస్థితికి చేరుకున్నారు. ఓ సామాన్య ఐఆర్ఎస్ ఉద్యోగిగా ఉండే అరవింద్ కేజ్రీవాల్.. ఆ తర్వాత సమాచార హక్కు చట్టం కోసం పోరాడేందుకు ఉద్యోగానికి రాజీనామా చేసేశారు. ఆ తర్వాత అన్నా హజారేతో కలిసి జన్‌లోక్‌పాల్ బిల్లు కోసం తీవ్రస్థాయిలో ఉద్యమించారు. అటు నుంచి ఢిల్లీ రాజకీయాలను ప్రక్షాళన చేసే ఉద్దేశంతో ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆమ్ ఆద్మీ పార్టీ పేరుతో సొంతంగా పార్టీ ఏర్పాటుచేసి, అతి తక్కువ కాలంలోనే ఎన్నికల్లో పోటీకి దిగారు. పూర్తి స్థాయి మెజారిటీ రాకపోయినా, ఢిల్లీ అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా నిలిచి కాంగ్రెస్ వెలుపలి నుంచి మద్దతు ఇవ్వడంతో అధికారం చేపట్టారు. పార్టీ పెట్టిన తొలినాళ్ల నుంచే ఢిల్లీలో కరెంటు బిల్లులు, వాటిలో ఉన్న లోపాల గురించి గట్టిగా పోరాటం చేసిన అరవింద్ కేజ్రీవాల్, పదవిలోకి వచ్చిన అతికొద్ది కాలంలోనే రిలయన్స్ పవర్ ఇండస్ట్రీస్‌పై విచారణకు ఆదేశించారు. రిలయన్స్ లెక్కల్లో ఉన్న తప్పొప్పులు వెతికి తీయాల్సిందిగా కాగ్, ఏసీబీ లాంటి సంస్థలను ఆదేశించారు. అంతేనా.. ఏకంగా చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ, గతంలో ఆ శాఖ మంత్రిగా పనిచేసిన మురళీ దేవ్రా, ముఖేష్ అంబానీలపై కూడా ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించారు. అంతే, తెరవెనక ఏం జరిగిందో గానీ.. జనలోక్‌పాల్ బిల్లును అడ్డం పెట్టుకుని కేజ్రీవాల్ తనంతట తానుగానే ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగేలా వాతావరణం తీసుకొచ్చారు కాంగ్రెస్ పెద్దలు. కాంగ్రెస్ తలచుకుంటే ఎంతటి సమర్థుడైనా మట్టికరవాల్సిందేనని మరోసారి చెప్పేందుకు సిద్ధమైపోయారు!! -
ఎన్ని వందలసార్లయినా.. సీఎం కుర్చీ వదిలేస్తా
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి హెచ్చరిక గళం వినిపిస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇటీవల ధర్నాకు దిగిన కేజ్రీవాల్.. అసెంబ్లీలో జన్ లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందకుంటే ఏకంగా పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. అవినీతిని అరికట్టేందుకు ఎంతదాకా అయినా పోరాడుతానని చెప్పిన మరుసటి రోజే మరో ముందడుగు వేశారు. అసెంబ్లీలో బిల్లు పాసవకుంటే తనకు పదవిలో కొనసాగే అర్హత లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. దేశంలో అవినీతిని నిర్మూలించేందుకు వందసార్లయినా ముఖ్యమంత్రి పదవిని వదులు కుంటానని పేర్కొన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది ముఖ్యమంత్రి కావడం కోసం కాదని, అవినీతి అరికట్టేందుకని చెప్పారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీకి కాస్త దూరంలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతు ఇవ్వడంతో ఏడు వారాల క్రితం కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ మద్దతుతో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని నడపుతున్నా ఎన్నికల హామీలను నెరవేరుస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆమ్ ఆద్మీ ఎన్నికల హామీలో లోక్‌పాల్ బిల్లు ముఖ్యమైనది. కాగా లోక్బిల్లును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. ప్రతిపక్ష బీజేపీ కూడా మద్దతు ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ తన పంతం నెగ్గకుంటే పదవిని వదులుకునేందుకు సిద్ధమయ్యారు. జన్ లోక్‌పాల్ బిల్లుతో పాటు స్వరాజ్ బిల్లు పాసవకుంటే తమ ప్రభుత్వం పడిపోతుందని చెప్పారు. జన్ లోక్‌పాల్, బిల్లును ఈ నెల 13న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు కేజ్రీవాల్ చెప్పారు. 70 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఆప్‌కు 28 మంది ఎమ్మెల్యేలున్నారు. కాగా అసమ్మతి ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కాంగ్రెస్‌కు 8 మంది, బీజేపీకి 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒకవేళ ప్రభుత్వం పడిపోయినా ఆప్ మళ్లీ పూర్తి మెజారిటీ సాధించే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
నడిరోడ్డుపై నిద్రించిన సీఎం
-
నడిరోడ్డుపై నిద్రించిన సీఎం
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాత్రంతా నడి రోడ్డు మీదనే పడుకున్నారు. చలి వణికిస్తున్నా లెక్కచేయకుండా మంత్రులు, మద్దతుదారులతో కలిసి రైల్ భవన్ ఎదుటే రాత్రంతా గడిపారు. డ్రగ్స్, వ్యభిచార రాకెట్‌పై దాడి చేయడానికి నిరాకరించిన పోలీసులపై చర్య తీసుకోవాలన్న డిమాండ్‌తో ఆయన మళ్లీ ఉద్యమబాటలోకి వెళ్లిన విషయం తెలిసిందే. గణతంత్ర వేడుకలు జరిగే రాజ్‌పథ్‌ను లక్షలాది మంది ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులతో ముట్టడిస్తానని కేజ్రీవాల్ హెచ్చరించారు. చర్చలకు తావులేదని, ఉద్యమం ఆపే ప్రసక్తి లేదని, ఢిల్లీలో మహిళల భద్రత అనే అంశం చర్చించాల్సింది కాదని, చర్యలు తీసుకోవాల్సిందని ఆయన అన్నారు. ఢిల్లీలో ఇన్ని నేరాలు జరుగుతుంటే అసలు హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు నిద్ర ఎలా పడుతోందని ఆయన మండిపడ్డారు. నగరంలో మహిళలకు రక్షణ ఎప్పుడుంటుందని, దీనిపై తాము చర్చించేది లేదని స్పష్టం చేశారు. వందలాది మంది ఆప్ మద్దతుదారులు ఇప్పటికే రైల్ భవన్ ఎదురుగా, రిపబ్లిక్ డే వేడుకలు జరిగే ప్రాంతానికి చేరుకున్నారు. ఆరుగురు మంత్రులతో పాటు సీఎం కేజ్రీవాల్ కూడా రాత్రంతా రైల్ భవన్ బయటే కూర్చుని ఉన్నారు. నడిరోడ్డుమీదే ఆయన నిద్రపోయారు. కొందరు మద్దతుదారులు మాత్రం రాత్రి పాటలు పాడుతూ నినాదాలు చేస్తూ గడిపారు. మంత్రులు కూడా రోడ్డుమీదే పడుకున్నారు. తమ డిమాండ్లు అంగీకరించకపోతే లక్షలాది మంది మద్దతుదారులు రాజ్‌పథ్‌కు వస్తారని, కేంద్రం ప్రజల మాట వినాల్సిందేనని కేజ్రీవాల్ అన్నారు. జంతర్ మంతర్ వద్దకు ధర్నా వేదికను మార్చాలని పోలీసులు చెప్పినా, ఆయన నో అనేశారు. నిర్ణయాలు వారంతట వారే తీసుకునే హక్కును ఢిల్లీ వాసులు వాళ్లకిచ్చారా అని ప్రశ్నించారు. ప్రజలు ఆ హక్కు తనకిచ్చారని, తానెక్కడ కూర్చోవాలో చెప్పడానికి షిండే ఎవరని నిలదీశారు. నిన్నంతా తాము రైల్ భవన్లో ఉన్న టాయిలెట్‌ను ఉపయోగించుకున్నామని, కానీ ఈరోజు దాన్ని కూడా వాళ్లు మూసేశారని చెప్పారు. ఇక్కడకు ఆహారం తెచ్చుకోడానికి కూడా అనుమతించట్లేదని, టీ తెచ్చుకోడానికి తాను కూడా బ్యారికేడ్ల వరకు వెళ్లాల్సి వచ్చిందని అంటూ.. కేంద్రం తన ఆందోళనను అణిచేయడానికి ఎంతలా ప్రయత్నిస్తోందో కళ్లకు కట్టినట్టు చెప్పారు. ఇక్కడ నిరసన తెలుపుతున్నవాళ్లు పాకిస్థానీలో, అమెరికన్లో కారని, వాళ్లంతా మన సొంత మనుషులేనని గుర్తుచేశారు. షిండే ఈ సొంత వాళ్లపైనే యుద్ధం ప్రకటించారని మండిపడ్డారు. -
ధర్నా చేస్తే కేజ్రీవాల్, మంత్రుల అరెస్టు?
ఢిల్లీ ముఖ్యమంత్రి.. నేరుగా కేంద్ర ప్రభుత్వంతో ఢీకొంటున్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించడంతో పాటు, మంత్రులను కూడా ధిక్కరించినందుకు ఢిల్లీ పోలీసులపై చర్య తీసుకోవాలంటూ ఏకంగా కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కార్యాలయం ఎదుటే ధర్నా చేయనున్నారు. అయితే.. కేంద్రం కూడా ఢిల్లీ సర్కారుతో ఢీ అంటే ఢీ అనేలాగే ఉంది. అరవింద్ కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు గనక ధర్నా చేస్తే, వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇద్దరు మంత్రులు చెప్పినా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను కొంతమంది పోలీసు అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోరవాలని స్వయంగా ముఖ్యమంత్రి అరవింద్ర కేజ్రీవాల్ కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కోరినా ఆయన ఏమాత్రం స్పందించలేదు. ఇందుకు నిరసనగా సీఎం కేజ్రీవాల్‌తో పాటు ఆయన మంత్రులు, మొత్తం ఆప్ ఎమ్మెల్యేలు షిండే కార్యాలయం ఎదురుగా ధర్నా చేయాలని నిర్ణయించారు. దీంతో ఇప్పటికే నార్త్‌బ్లాక్ వద్దకు భారీ సంఖ్యలో పోలీసు బలగాలను తరలించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్నాను విజయవంతం కాకుండా చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక యాసీన్ భత్కల్ను విడిపించుకోడానికి కేజ్రీవాల్‌ను కిడ్నాప్ చేసేందుకు ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ ప్రయత్నిస్తోందని కథనాలు వచ్చినా కూడా కేజ్రీవాల్ ఏమాత్రం లెక్కచేయకుండా ధర్నాకు దిగాలని నిర్ణయించారు. కాగా, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట ఆమ్ ఆద్మీ పార్టీ ధర్నా నేపథ్యంలో నార్త్ బ్లాక్‌కు సమీపంలో ఉన్న నాలుగు మెట్రో స్టేషన్లను ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మూసేశారు. ఢిల్లీ పోలీసుల సూచన మేరకు పటేల్ చౌక్, కేంద్ర సచివాలయం, ఉద్యోగ భవన్, రేస్ కోర్స్ మెట్రో స్టేషన్లను మూసేశారు. కేంద్ర సచివాలయం వద్ద ఉన్న ఇంటర్‌ఛేంజ్ స్టేషన్ వద్ద మాత్రం కేవలం ఉద్యోగులనే, అది కూడా వాళ్ల ఐడీ కార్డులు చూశాక మాత్రమే అనుమతిస్తున్నారు. -
కేంద్ర హోం శాఖ ఎదుట కేజ్రీవాల్, మంత్రుల ధర్నా!
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గంలోని మొత్తం మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు.. అందరూ కలిసి కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఎదుట సోమవారం నాడు ధర్నా చేయనున్నారు. చిన్న చిన్న విషయాల కోసం ఢిల్లీ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులతో గొడవపడ్డ పోలీసులపై చర్య తీసుకోని పక్షంలో ఈ ధర్నా తప్పదని ఇప్పటికే ప్రకటించారు. పోలీసు అధికారులపై చర్య తీసుకోని పక్షంలో సోమవారం ఉదయం 11 గంటల నుంచి ధర్నా చేయనున్నట్లు మంత్రి మనీష్ సిసోదియా తెలిపారు. దక్షిణ ఢిల్లీలో జరుగుతున్న వ్యభిచార రాకెట్‌పై చర్య తీసుకోవాలని న్యాయశాఖ మంత్రి సోమనాథ్ భారతి కోరగా, ఇద్దరు పోలీసు అధికారులు అందుకు నిరాకరించారని, పైగా ఆయనతో గొడవపడ్డారని, వారిపై చర్య తీసుకోవాల్సిందిగా కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను స్వయంగా కేజ్రీవాల్ కోరినా ఆయన పట్టించుకోలేదని సిసోదియా చెప్పారు. అలాగే మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి రాఖీ బిర్లాతో కూడా మరో పోలీసు అధికారి గొడవపడ్డారని చెప్పారు. డేనిష్ మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం కేసును ఢిల్లీ పోలీసులు సరిగా ఛేదించలేదని కూడా కేజ్రీవాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మాలవీయ నగర్ ఎస్‌హెచ్‌ఓతో పాటు ఇద్దరు ఏసీపీలను సస్పెండ్ చేయాలని కేజ్రీవాల్ స్వయంగా షిండేను డిమాండ్ చేశారు. అలాగే బిర్లాతో గొడవపడిన అధికారిని కూడా సస్పెండ్ చేయాలన్నారు. ఇంతవరకు దీనిపై ఎలాంటి నిర్ణయం రాకపోవడంతో ధర్నా చేయాలని నిర్ణయించారు. -
కేజ్రీవాల్‌కు యూపీలో జడ్ కేటగిరీ, ఢిల్లీలో రహస్య భద్రత
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఇష్టం ఉన్నా.. లేకపోయినా ఆయనకు మాత్రం జడ్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గల కౌశాంబి ప్రాంతంలోని ఆయన ఇంటివద్ద మొత్తం 30 మంది భద్రతా సిబ్బంది అనుక్షణం పహరా కాస్తుంటారు. అయితే ఢిల్లీలో మాత్రం రహస్య భద్రత మాత్రమే కల్పిస్తున్నారు. శనివారం నాడు ఢిల్లీ సచివాలయం వెలుపల నిర్వహించిన 'జనతా దర్బార్'లో అత్యధిక స్థాయిలో జనం రావడం, వారిని నియంత్రించడం కూడా సాధ్యం కాకపోవడం లాంటి సంఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్‌కు తెలియకుండానే ఆయనకు భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఇంతకుముందే ప్రకటించారు. సామాన్య ప్రజల రూపంలో ఆయనకు ముప్పు కలిగించే శక్తులు వచ్చే ప్రమాదం ఉన్నందున భద్రత తప్పనిసరిగా కల్పిచాల్సిందేనని ఆయన అన్నారు. అయితే ఘజియాబాద్ పోలీసులు ఎన్నిసార్లు కోరినా కేజ్రీవాల్ మాత్రం తనకు భద్రత అవసరం లేదని కుండబద్దలుకొట్టి చెబుతున్నారు. గత వారం కూడా ఆయన ఇంటికి కిలోమీటరు దూరంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంపై కొందరు దుండగులు దాడిచేసి తగలబెట్టినా.. దాన్నీ తేలిగ్గానే తీసుకున్నారు. దాంతో ఇక ఆయనకు 24 గంటలూ జడ్ కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించినట్లు ఘజియాబాద్ పోలీసు అధికారి ధర్మేంద్రసింగ్ తెలిపారు. ఆయన ఇంటి బయట ఎప్పుడూ ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఎనిమిది మంది కానిస్టేబుళ్లు ఉంటారు. వారితో పాటు ఇద్దరు వ్యక్తిగత భద్రతాధికారులు కూడా ఉంటారు. కేజ్రీవాల్ ఎప్పుడు బయటకెళ్లినా ఆయనతో పాటు సాయుధులతో కూడిన రెండు కార్లు వెంట ఉంటాయి. -
జనతా దర్బార్‌కు భారీగా జనం.. మధ్యలోనే వెళ్లిన కేజ్రీవాల్
-
జనతా దర్బార్‌కు భారీగా జనం.. మధ్యలోనే వెళ్లిన కేజ్రీవాల్
ఢిల్లీ సచివాలయం వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన జనతా దర్బార్‌లో గందరగోళం నెలకొంది. దీంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యలోనే వెళ్లిపోవాల్సి వచ్చింది. వేలాది మంది ప్రజలు తమ కష్టాలు చెప్పుకోడానికి వచ్చారు. అక్కడకు ముఖ్యమంత్రితో పాటు మొత్తం మంత్రులంతా వచ్చారు. బ్యారికేడ్లు కూడా పడగొట్టి మరీ జనం తోసుకురావడంతో వారిని నియంత్రించడం ఢిల్లీ పోలీసులకు, సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ) దళానికి కష్టమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో కేజ్రీవాల్ సగంలోనే కార్యక్రమం వదిలి వెళ్లిపోయారు. అంతమంది ప్రజలు వస్తారని ఊహించలేకపోయామని, అందుకే వారిని నియంత్రించడం కష్టమైందని, తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని పోలీసులు చెప్పడం వల్లే అక్కడినుంచి వెళ్లానని తర్వాత కేజ్రీవాల్ విలేకరులకు తెలిపారు. దాదాపు 50 వేల మంది ప్రజలు అక్కడికొచ్చినట్లు పోలీసులు చెప్పారు. వారిలో ఎక్కువ మంది డీటీసీ, బీఎస్ఈఎస్, వివిధ ప్రభుత్వాస్పత్రులు, మునిసిపాలిటీల్లాంటి శాఖల్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికులే ఉన్నారు. తన ఫ్లాటును కొంతమంది ఆక్రమించుకున్నారని సునీతా కపూర్ అనే మహిళ చెప్పారు. ఆమె ఉదయం ఆరు గంటలకే అక్కడకు చేరుకున్నారు. ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరించేవరకు తాను విశ్రమించేది లేదని కేజ్రీవాల్ ఈ సందర్భంగా చెప్పారు. -
కేజ్రీవాల్‌కు తెలియకుండానే భద్రత: షిండే
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు తెలియకుండానే ఆయనకు భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. భద్రత వద్దని ఆయన ఎన్నిసార్లు చెప్పినా కల్పించామనే అన్నారు. వీవీఐపీలకు, ప్రమాదంలో ఉన్నవారికి భద్రత కల్పించడం ప్రభుత్వ విధి అని, అందుకే హోం మంత్రిత్వశాఖ ఇలా చేస్తోందని ఆయన చెప్పారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కాగానే ఆయనకు భద్రత ఇవ్వడం మొదలైందని షిండే వివరించారు. ఇప్పుడు ఆయనకు తెలియకుండానే భద్రత కల్పిస్తున్నామని తన నెలవారీ విలేకరుల సమావేశంలో షిండే చెప్పారు. భద్రతా సంస్థలు మూడుసార్లు కేజ్రీవాల్‌కు భద్రత కల్పిస్తామని కోరగా, ఆయన ఇప్పటికే రెండుసార్లు తిరస్కరించారని తెలిపారు. ఢిల్లీ పోలీసులే కేజ్రీవాల్‌కు భద్రత కల్పిస్తున్నారని, అలాగే ఆయన నివాస ప్రాంతంలోను, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యలయం వద్ద భద్రతా ఏర్పాట్లు చూసుకోవాల్సిందిగా ఘజియాబాద్ ఎస్పీని ఢిల్లీ పోలీసు కమిషనర్ ఆదేశించారని షిండే తెలిపారు. యూనిఫాంలో కాకపోయినా.. మఫ్టీలో అయినా సరే భద్రత కల్పించాల్సిందేనన్నారు. -
10 రోజుల్లో గాడినపెడతా: కేజ్రీవాల్
ఆ తర్వాతే సమస్యలను పరిష్కరిస్తా ప్రజలకు తప్పుడు హామీలివ్వను జనతా దర్బార్‌లో సీఎం కేజ్రీవాల్ ఘజియాబాద్: ఢిల్లీవాసుల సమస్యల పరిష్కారానికి తాను తప్పుడు హామీలు ఇవ్వనని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుత పాలనా వ్యవస్థను గాడిన పెట్టేందుకు తనకు వారం నుంచి పది రోజుల సమయం కావాలన్నారు. ఆ తర్వాతే ప్రజల సమస్యలు, కష్టాలను పరిష్కరిస్తానన్నారు. ఆదివారం కౌశాంబీలోని తన నివాసం వద్ద కేజ్రీవాల్ జనతా దర్బార్ నిర్వహించారు. తనకు వినతిపత్రాలు సమర్పించేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడుతూ ‘మనం ఇప్పుడే అధికారం చేపట్టాం. పాలనా వ్యవస్థను గాడిన పెట్టి మీ సమస్యలను పరిష్కరించేందుకు కొంత సమయం...అంటే వారం నుంచి పది రోజులు పడుతుంది. నేను మీకు తప్పుడు హామీలు ఇవ్వను. పాలనా వ్యవస్థను గాడిన పెట్టాకే మీ వినతిపత్రాలు స్వీకరిస్తా’ అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ప్రజల మద్దతు తనకు అవసరమని...వారి సహకారం లేనిదే సమస్యలను పరిష్కరించలేనన్నారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేసి తమను పర్మనెంట్ చేయాలని కోరేందుకు ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ)కు చెందిన సుమారు వెయ్యి మంది కాంట్రాక్టు డ్రైవర్లు, కండక్టర్లు, మున్సిపల్ కార్పొరేషన్ల కాంట్రాక్టు ఉద్యోగులు జనతా దర్బార్‌కు హాజరయ్యారు. అధికారంలోకి వస్తే కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేస్తానని ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. కాగా, కేజ్రీవాల్ ఇంటి వద్దకు వచ్చే సందర్శకులను నియంత్రించేందుకు ఢిల్లీ, యూపీ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయన ఇంటి పరిసరాల్లో ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతను 10 మంది యూపీ పోలీసులు చేపట్టనుండగా అనుకోని అవాంతరాలను ఎదుర్కొనేందుకు ఢిల్లీ పోలీసులు సివిల్ దుస్తుల్లో కేజ్రీవాల్ ఇల్లు ఉన్న హౌసింగ్ సొసైటీ ప్రాంగణంలోనే ఉండనున్నారు. హౌసింగ్ సొసైటీ ప్రధాన ద్వారం వద్ద ఘజియాబాద్ పోలీసులు డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ ఏర్పాటు చేశారు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా ఢిల్లీలో విద్యుత్ చార్జీలను 50 శాతం తగ్గించాలంటే ప్రభుత్వం నగదు సబ్సిడీ ఇవ్వడం మినహా మరో మార్గం లేదని విద్యుత్‌రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకుంటుంది: బీజేపీ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ను అవినీతి పార్టీగా అభివర్ణించిన కేజ్రీవాల్ అధికారం కోసం అదే పార్టీ మద్దతు తీసుకోవడం వింతగా ఉందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రభాత్ ఝా విమర్శించారు. కాంగ్రెస్ ఎన్నడూ ఇతర పార్టీలకు ఐదేళ్లపాటు మద్దతివ్వలేదని గుర్తుచేశారు. అందువల్ల ఆప్ ప్రభుత్వానికి ఇచ్చిన మద్దతును కాంగ్రెస్ ఎప్పుడో అప్పుడు ఉపసంహరించుకుంటుందన్నారు. అరవింద్ కేజ్రీవాల్, ఆప్, కాంగ్రెస్, ఢిల్లీ ముఖ్యమంత్రి, Arvind Kejriwal,AAP, Delhi chief minister -
తొలిరోజే తడాఖా చూపించిన కేజ్రీవాల్
-
కేజ్రీవాల్ అను నేను..
సాక్షి, న్యూఢిల్లీ: రెండున్నరేళ్ల కిందట.. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం.. అవినీతికి వ్యతిరేకంగా ‘సామాన్యుడు’ గర్జించాడు.. జనలోక్‌పాల్ కోసం నినదించాడు..! ఇప్పుడూ అదే రామ్‌లీలా మైదానం.. లక్షల గొంతుల జయజయధ్వానాలతో మార్మోగింది.. నాడు అవినీతిపై గర్జించిన ఆ ‘సామాన్యుడి’ రాక కోసం ఎదురుచూసింది.. అందరిలాగే ఆ ‘ఆమ్ ఆద్మీ’ మెట్రో రైల్లో వచ్చాడు.. వస్తూ వస్తూ రెండున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను మోసుకొని వచ్చాడు.. వారి ఆశలను ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టాడు!! ఆ అ‘సామాన్యుడే’ కేజ్రీవాల్!!! శనివారం మధ్యాహ్నం ఢిల్లీ ఏడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ లె ఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు మనీష్ సిసోడియా, రాఖీబిర్లా, గిరీష్సోనీ, సౌరభ్ భరద్వాజ్, సోమ్‌నాథ్ భారతి, సత్యేంద్రజైన్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఆప్ కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలిరావడంతో రామ్‌లీలా మైదానం కిక్కిరిసిపోయింది. జైహింద్ నినాదాలతో మార్మోగిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తయిన చీపురు కట్టలను చేతపట్టుకొని కార్యకర్తలంతా ఉత్సాహంగా కనిపించారు. నేను మీ వాడిని.. ఇది మీ ప్రభుత్వం: సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం కేజ్రీవాల్ ప్రజలనుద్దేశించి 20 నిమిషాలప్రసంగించారు. ఇది మీ ప్రభుత్వం అని, మీలో ఒకడిగా పనిచేస్తానని చెప్పారు. భారత్ నుంచి అవినీతిని తరిమేద్దామని, మరో పదేళ్లలో దేశం సగర్వంగా తలెత్తుకొనే స్వర్ణయుగపు రోజులు వస్తాయని పేర్కొన్నారు. ప్రజలు, రాజయకీయ నేతలు, అధికార యంత్రాంగం కలిసిక ట్టుగా పనిచేస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదన్న సత్యాన్ని చాటుదామని పిలుపునిచ్చారు. పాలనలో తమ ప్రభుత్వం కొత్తదనాన్ని చూపిస్తుందని, అధికారగర్వాన్ని ప్రదర్శించకుండా సామాన్యుడి కోసం పనిచేస్తుందని చెప్పడంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. ‘‘ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసింది అరవింద్ కేజ్రీవాల్, ఇతర మంత్రులు కాదు. ఈ ప్రమాణ స్వీకారం చేసింది ఢిల్లీ ప్రజలు. ఈ పోరాటమంతా కేజ్రీవాల్‌ను సీఎం చేయడానికి కాదు.. మార్పు కోసం.. ప్రజల చేతికే అధికారం ఇవ్వడం కోసం.. నిజంగా మేం అధికారంలోకి రావడం ఆ దేవుడి మహిమే..’’ అని అన్నారు. సమస్యలు పరిష్కరించేందుకు తన చేతిలో మంత్రదండమేదీ లేదంటూనే ఢిల్లీవాసులంతా సహకరిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామని ధీమా వ్యక్తంచేశారు. ‘‘మాకు ఎలాంటి గర్వం లేదు. భవిష్యత్తులోనూ రాదు. ప్రజలకు సేవచేయడమే మా లక్ష్యం. అవినీతి రహిత సమాజ నిర్మాణమే ప్రధాన లక్ష్యం’’ అని ఉద్ఘాటించారు. జీవితంలో లంచం ఇవ్వబోమని, తీసుకోబోమని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. లంచం అడిగేవారిని పట్టించడంలో సహకరించాలని, వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టించాలన్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫోన్ చేయాలని, ఫోన్ నంబరును రెండు రోజులలో ప్రకటిస్తామని చెప్పారు. అహంకారం వద్దు.. నిరాడంబరత ముద్దు: అహంకారం అలవరచుకోరాదని, హంగూ ఆర్భాటాలు లేకుండా నిజాయతీగా పనిచేయాలని పార్టీ ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు కేజ్రీవాల్ సూచించారు. సామాన్యునికి సేవచేయడం కోసం తామున్నామన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలన్నారు. నిజాయితీతో పోటీ చేసి ఎన్నికల్లో ఎవరైనా గెలవవచ్చన్న సందేశాన్ని ఢిల్లీ ప్రజలు దేశవ్యాప్తంగా చాటారని అభినందించారు. రెండున్నరేళ్ల కిందట ప్రారంభమైన అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రస్తావిస్తూ తన గురువు అన్నా హజారేను గుర్తుచేసుకున్నారు. రాజకీయాలు బురద అని వాటికి దూరంగా ఉండాలని అన్నా అనే వారని, కానీ ఆ మాలిన్యాన్ని తొలగించాలంటే బురదలోకి దిగాల్సిందే అని తాను ఆయనకు నచ్చచెప్పేవాడినని కేజ్రీవాల్ చెప్పారు. వారం రోజుల తర్వాత బల నిరూపణలో ప్రభుత్వం ఉంటుందో పోతుందో అన్న భయం తమకు లేదని, అది చాలా చిన్న విషయమని పేర్కొన్నారు. ప్రభుత్వం పడిపోతే మళ్లీ ఎన్నికల్లో పోటీచేసి పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తామన్నారు. ప్రభుత్వం నడపడంలో అధికారస్వామ్యం అడ్డుపడుతుందని అందరూ అంటున్నారని, అయితే గడిచిన రెండు మూడ్రోజుల్లో తనను కలిసిన ఢిల్లీ ప్రభుత్వ అధికారులలో చాలామంది మంచివారున్నారని పొగిడారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన బీజేపీ శాసనసభా పక్ష నేత హర్షవర్దన్‌పైనా ప్రశంసలు కురిపించారు. ఆయన నిజాయితీపరుడంటూ కొనియాడారు. భారత్ మాతాకీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాలతో ప్రసంగాన్ని ముగించారు. ఢిల్లీ పగ్గాలు చేపట్టిన అతి పిన్న వయస్కుల్లో కేజ్రీవాల్(45) రెండో వ్యక్తి. 1952లో చౌదరి బ్రహ్మ ప్రకాశ్ 34 ఏళ్ల వయసుకే ఢిల్లీ సీఎంగా పనిచేశారు. నిస్వార్థంగా సేవ చేయి: కేజ్రీవాల్‌కు హజారే సూచన రాలెగావ్ సిద్ధి: ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తన ఒకప్పటి శిష్యుడు కేజ్రీవాల్‌కు సామాజిక కార్యకర్త అన్నా హజారే అభినందనలు తెలిపారు. కొత్త ప్రభుత్వం ఫలితాలపై ఆలోచించకుండా నిస్వార్థంగా ప్రజాసేవ చేయాలని సూచించారు. రాజకీయాల అంతిమ లక్ష్యం ప్రజాసేవేనని రాలెగావ్‌సిద్ధిలో చెప్పారు. అనారోగ్యం వల్ల కేజ్రీవాల్ ప్రమాణస్వీకారానికి హాజరుకాలేకపోయానన్నారు. ఈ మేరకు కేజ్రీవాల్‌కు లేఖ కూడా రాశారు. కీలక శాఖలు సీఎం వద్దే.. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత కేజ్రీవాల్ ఢిల్లీ సచివాలయానికి వెళ్లి బాధ్యత లు స్వీకరించారు. ఆ తర్వాత విలేఖరుల సమావేశంలో మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలను వెల్లడించారు. విద్యుత్తు, హోం, ఆర్థిక, విజిలెన్స్, సర్వీసెస్, ప్లానింగ్ వంటి కీలక శాఖలను కే జ్రీవాల్ తన వద్దే ఉంచుకున్నారు. ఎవరెవరికి ఏయే శాఖ కేటాయించారంటే ? మనీష్ సిసోడియా: రెవెన్యూ, ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, పీడ బ్ల్యూడీ, పట్టణాభివృద్ధి, స్థానిక సంస్థలు, భూమి-భవనాలు సోమ్‌నాథ్ భారతీ: పాలనా సంస్కరణలు, పర్యాటక, న్యాయ, కళలు, సాంస్కృతిక శాఖ సౌరభ్ భరద్వాజ్: రవాణా, ఆహారం-పౌర సరఫరాలు, పర్యావరణం, ఎన్నికలు, సాధారణ పరిపాలన గిరీష్ సోనీ: ఉపాధి, కార్మిక, ఎస్సీ, ఎస్టీ వ్యవహారాలు, నైపుణ్య అభివృద్ధి సత్యేంద్ర జైన్: ఆరోగ్యం, పరిశ్రమలు, గురుద్వారా ఎన్నికలు రాఖీ బిర్లా: సామాజిక అభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమం, మహిళా భద్రత, భాషలు ‘సౌభ్రాతృత్వ’ గీతాలాపన ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన కేజ్రీవాల్, ఈ సందర్భంగా ‘సౌభ్రాతృత్వ’ గీతాన్ని ఆలపించారు. విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని చాటే ‘ఇన్సాన్ కా ఇన్సాన్ సే హో భాయ్‌చారా... యెహీ పైగామ్ హమారా’ (మనిషితో మనిషికి ఉండాలి సోదరభావం... ఇదే మా ఆహ్వానం...) అంటూ పాడారు. 1959లో విడుదలైన ‘పైగామ్’ చిత్రం కోసం కవి ప్రదీప్ రాసిన ఈ పాటను మన్నాడే ఆలపించారు. ఈ పాట మనం ఎలాంటి దేశాన్ని, సమాజాన్ని కోరుకుంటున్నామో చెబుతుందని కేజ్రీవాల్ అన్నారు. దేవుడి మహిమ: కేజ్రీవాల్ కొన్నేళ్ల కిందటి వరకు తాను నాస్తికుడినని చెప్పుకున్న కేజ్రీవాల్ సీఎంగా ప్రమాణం తర్వాత చేసిన ప్రసంగంలో భగవన్నామాన్ని జపించారు. దేశంలోని నాలుగు ప్రధాన మతాల దేవుళ్లను పేరుపేరునా కొనియా డారు. ఇటీవలే పుట్టిన ఆప్ ఎన్నికల్లో సాధించిన విజయం దేవుడి మహిమ అని, తమను అధికారంలోకి తీసుకొచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు.‘ఇది చారిత్రక దినం. అవినీతిని ఓడించి, ప్రజాపాలనను నెలకొల్పే విప్లవం రెండేళ్ల వరకూ ఊహకే అందనిది. ఇది మా ఘనత కాదు, కచ్చితంగా దేవుడి మహిమే. పరమపితకు, ఈశ్వరుడికి, అల్లాకు, వాహే గురువుకు కృతజ్ఞతలు’ అని అన్నారు. కేజ్రీవాల్‌కు ప్రధాని శుభాకాంక్షలు న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కేజ్రీవాల్‌కు ప్రధాని మన్మోహన్సింగ్ శనివారం ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన బాధ్యతలు స్వీకరిస్తున్న వేళ తన మద్దతు ఉంటుందని చెప్పారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. హామీలు అమలు చేస్తే మద్దతు కొనసాగుతుంది ఢిల్లీవాసులు విద్యుత్, మంచినీటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను పరిష్కరిస్తామంటూ ఎన్నికలప్పుడు ఆప్ ఇచ్చిన హామీలు నెరవేరిస్తే వారికి మా మద్దతు కొనసాగుతుంది. - షకీల్ అహ్మద్ (కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, పార్టీ ఢిల్లీ ఎన్నికల ఇన్చార్జి) ప్రభుత్వం స్థిరంగా ఉండాలి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన కేజ్రీవాల్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కాంగ్రెస్, ఆప్ స్థిర ప్రభుత్వాన్ని అందించాలని కోరుకుంటున్నా. కొత్త ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చి ప్రజల అంచనాలను అందుకుంటుందని ఆశిస్తున్నా. - రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ అధ్యక్షుడు -
ఢిల్లీ సింహాసనంపై సామాన్యుడు
-
ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం
-
లంచం ఇవ్వద్దు.. తీసుకోవద్దు: కేజ్రీవాల్
భారత్ మాతాకీ జై, ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాలతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన ప్రసంగాన్ని ఆరంభించారు. ఇది సామాన్యుల సభ అని, అయితే ఎవరూ అత్యుత్సాహంతో ముందుకు వచ్చి పోలీసులకు ఇబ్బంది కలిగించొద్దని కోరారు. అందరికీ ప్రమాణాలు తెలిపారు. ''ఈరోజు చాలా చరిత్రాత్మక దినం. ఇప్పుడు ప్రమాణస్వీకారం చేసింది కేవలం ఆరుగురు మంత్రులు, కేజ్రీవాల్ మాత్రమే కాదు.. ప్రతి సామాన్యుడూ చేశాడు. సామాన్యుడే అరవింద్ కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి చేశాడు. సామాన్యుడే గెలిచాడు. ఢిల్లీ ప్రజలు ఈసారి శాసన సభ ఎన్నికల్లో చాలా పెద్ద విజయం సాధించారు. దేశవాసులు చాలా నిరాశలో ఉన్నారు. ఈ దేశాన్ని ఏమీ బాగుచేయలేమని, రాజకీయాలు కుళ్లిపోయాయని అనుకున్నారు. కానీ, నిజాయితీతో కూడా రాజకీయాలు చేయొచ్చని, దాంతోనే గెలవచ్చని ఢిల్లీ ప్రజలు చేసి చూపించారు. అందుకు ముందుగా ఢిల్లీ వాసులకు అభినందనలు. దేవుళ్లందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. రెండేళ్ల క్రితం అసలు ఇలా ఆలోచించగలిగేవాళ్లం కూడా కాదు. ఇది కేవలం మా వల్ల కాదు. ఇదేదో దేవుడు చేసిన చమత్కారం. అందుకే ఈశ్వరుడు, అల్లా.. అందరికీ కృతజ్ఞతలు. ఇది కేవలం ప్రారంభమే. ఇంకా చాలా పోరాడాల్సి ఉంది. ఇది కేవలం మా ఆరుగురం మాత్రమే పోరాడలేం. ఢిల్లీకి చెందిన కోటిన్నర మంది మొత్తం పోరాడితేనే అవినీతిని అరికట్టగలం. సమస్యలన్నింటికీ పరిష్కారం మా వద్దే ఉందన్న గర్వం మాకు లేదు. అలాంటి సమాధానం కూడా మా దగ్గర లేదు. కానీ, ఢిల్లీ ప్రజలంతా ఒక్కటైతే పరిష్కారం లేని సమస్యలంటూ మిగలవు. ప్రభుత్వాన్ని నడిపించేది మంత్రులు, పోలీసులు, అధికారులు కారు.. మొత్తం కోటిన్నర మందీ నడిపిస్తారు. సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం మనమంతా ఇక్కడే రాంలీలా మైదాన్‌లో కలిశాం. అవినీతిపై అన్నా హజారే నేతృత్వంలో పోరాటం చేశాం. రెండున్నరేళ్లలో చాలా చాలా చేశాం. నిరాహారదీక్షలు, పోరాటాలు, అన్నీ చేశాం. రాజకీయాలు మారితే తప్ప దేశం బాగుపడదని భావించి రాజకీయాల్లోకి వచ్చాం. అన్నా హజారే మాత్రం రాజకీయాలు బురద, అందులోకి వెళ్లద్దని అనేవారు. నేను మాత్రం ఆ బురదలోకే దిగి దాన్ని శుభ్రం చేయాలని చెప్పేవాడిని. ప్రభుత్వ పాఠశాలల్లో చదువు ఎందుకు బాగోలేదంటే.. రాజకీయాలు బాగోలేదు. కరెంటు బిల్లులు ఎందుకు ఎక్కువ వస్తాయి, నీళ్లు ఎందుకురావు, రోడ్లు ఎందుకు పాడయ్యాయి.. అన్నీ కుళ్లు రాజకీయాల వల్లే. వాటిని బాగు చేయాలనే నేను వాటిలోకి వచ్చాను. సంతోష్ కోహ్లీ అనే సహచరురాలిని మేం కోల్పోయాం. ఆమె లేకపోవచ్చు గానీ, ఆమె ఆత్మ మాత్రం ఎక్కడున్నా సంతోషిస్తుంది. గత కొన్ని రోజులుగా నేను ఢిల్లీలోని కొందరు అధికారులను కలిశాను. కొందరు అవినీతిపరులు కావచ్చు గానీ చాలామంది నిజాయితీపరులున్నారు. వాళ్లతోనే మనం వ్యవస్థను బాగుచేయచ్చు. దేశమంతా కూడా ఒక్కటిగా అయితే, ప్రజలు ఒక్కటిగా అయితే, నాయకులు ఒక్కటిగా అయితే అవినీతి, పేదరికాలను దేశం నుంచి తరిమి కొట్టగలం. మా మంత్రులు, కార్యకర్తలు అందరికీ చేతులెత్తి నమస్కరించి కోరుతున్నాను. మన మనస్సులో ఎప్పుడూ గర్వం రాకూడదు. అలా వస్తే ఇన్నాళ్ల పోరాటం వృథా అవుతుంది. ఇతర పార్టీల గర్వాన్ని అణిచేందుకు వచ్చాం. మన గర్వాన్ని అణిచేందుకు మరో పార్టీ రావల్సిన అవసరం రాకూడదు. మేం మంత్రులు, ముఖ్యమంత్రులు అవ్వడానికి రాలేదు. సేవ చేయడానికి వచ్చాం. ఈ సేవా భావాన్ని మనం మరువకూడదు. ఢిల్లీ ప్రజలంతా కలిసి చాలా పెద్ద శక్తులతో పోరాడారు. ఆ శక్తులన్నీ ఊరికే కూర్చోవు. నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి గానీ ఇప్పుడు వాటిని ప్రస్తావించను. మన మార్గంలో చాలా రాళ్లు, ముళ్లు ఎదురవుతాయి. వాటన్నింటినీ ఎదుర్కోడానికి మేం సిద్ధం. రాబోయే ఏ ఎన్నికనైనా కూడా ఎదుర్కోడానికి నేను సిద్ధం. మామీద చాలా పెద్ద బాధ్యతను ఢిల్లీ వాసులు ఉంచారు. కానీ ఈ బాధ్యతను నెరవేర్చాలంటే మాకు ఢిల్లీ ప్రజల సాయం కావాలి. వారి ఆశలు చూస్తే నాకు భయం వేస్తుంది. మాతో ఎలాంటి తప్పులు తెలిసి, తెలియక చేయించద్దని భగవంతుడిని కోరుతున్నాను. ఈ పోరాటంలో నేను అందరినీ ఆహ్వానిస్తున్నాను. బీజేపీ నాయకుడు హర్షవర్ధన్ చాలా మంచి వ్యక్తి. ఆయన పార్టీ గురించి మాత్రం నేను చెప్పలేను. కాంగ్రెస్, బీజేపీ, అన్ని పార్టీలకూ ఇదే వినతి. మీరు చేస్తున్న పని దేశం కోసమే అయితే.. పార్టీ విభేదాలు మర్చిపోండి. ఈ పోరాటంలో నాతో కలిసి రండి. వారం రోజుల తర్వాత విశ్వాస తీర్మానం వస్తుంది. కొందరు అందులో మేం ఓడిపోతామంటున్నారు. దాని గురించి మాకు బాధ లేదు. ఓడిపోతే మళ్లీ ప్రజల ముందుకు వస్తాం. ఎన్నికల్లో పోరాడతాం. ప్రజలు మాకు అప్పుడు భారీ మెజారిటీ ఇస్తారు. గత రెండేళ్లుగా దేశంలో చాలా పోరాటాలు జరుగుతున్నాయి. అన్నా హజారే ఇక్కడకు వచ్చి దీక్ష చేసినప్పుడు దేశమంతా కదిలి వచ్చింది. ఇలా ఎలా జరిగిందని నేను ఆలోచించాను. అలాగే నిర్భయపై అత్యాచారం జరిగినప్పుడు కూడా అందరూ రోడ్లమీదకు వచ్చారు. దేశంలో చాలా పెద్ద విప్లవం వస్తోంది. ఇది రాబోయే రోజుల్లో పెద్దశక్తిగా మారుతుందన్న నమ్మకం నాకుంది. ఇప్పుడు మనమంతా కలిసి ఢిల్లీని మార్చాలి. ఇప్పుడు జీవితంలో ఎప్పుడూ లంచం తీసుకోము, ఇవ్వబోమని శపథం చేయాలి. రేషన్ కార్డు కావాలన్నా, ఏం కావాలన్నా ఇన్నాళ్లూ లంచం ఇవ్వాల్సి వచ్చేది. ఇక మీదట ఎవరైనా లంచం అడిగితే మీరు ఇవ్వబోమని చెప్పద్దు. మీకు రెండు రోజుల్లోనే ఓ ఫోన్ నెంబర్ ఇస్తాం. దానికి ఫోన్ చేసి చెప్పండి. లంచగొండులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుందాం. మీ పని నేను చేయిస్తాను. జీవితంలో ఎప్పుడూ ఎవరికీ లంచం ఇవ్వను, తీసుకోను అని అందరూ శపథం చేయండి'' అంటూ తన ప్రసంగం ముగించారు. చివరిలో ఎప్పటిలాగే తమ పార్టీ ప్రార్థన చేశారు.. అదే సమయంలో ప్రజలందరితో చేయించారు. -
ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం
సామాన్యుడు చరిత్ర సృష్టించాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించాడు. చీపురుకట్టతో విప్లవం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకరం చేశారు. మంత్రులుగా తాను ఎన్నుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలు వెంటరాగా.. 11.55 నిమిషాలకు వేదికపైకి వెళ్లారు. ముందుగా పోలీసు బ్యాండుతో జనగణమణ ఆలపించగా.. ఆ తర్వాత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అరవింద్ కేజ్రీవాల్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. దేవుడి పేరుమీదే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మనీష్ సిసోదియా, మిగిలిన ఐదుగురు మంత్రులతో కూడా నజీబ్ జంగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాఖీ బిర్లా, సౌరభ్ భరద్వాజ్, సోమ్‌నాథ్ భారతి, గిరిషీ సోని, సత్యేంద్ర కుమార్ జైన్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. రాఖీ జైన్ మాత్రం ముందుగా భారత్ మాతాకీ జై, వందే మాతరం అంటూ ప్రజలతో నినాదాలు చేయించారు. ఆ తర్వాతే ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. గిరీష్ సోనీ మాత్రం ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు పలు సందర్భాలలో కొంత తడబడ్డారు. ఆయనతో ప్రమాణం చేయించేటప్పుడు నజీబ్ జంగ్ కూడా ఒక సారి తడబడ్డారు. అందరికంటే చివరిగా సౌరభ్ భరద్వాజ్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. రాంలీలా మైదాన్ ప్రజలు, అభిమానులతో కిక్కిరిసింది. పలువురు జాతీయ జెండాలు, చీపురు కట్టలతో మైదానానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎవరికీ ప్రత్యేక పాస్‌లు ఇవ్వకపోవడం గమనార్హం. జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. -
నేడు సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం
ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ శనివారం మధ్యాహ్నం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. తన కుటుంబ సభ్యులు సహా ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరికీ కూడా ప్రత్యేకంగా పాస్‌లు జారీ చేసేది లేదని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. వాళ్లు కూడా సామాన్య ప్రజలతో పాటే సభలో కూర్చోవాలన్నారు. అలాగే ప్రజలందరూ ఈ కార్యక్రమానికి ఆహ్వానితులేనని, ఎవరూ పాస్‌ల కోసం ప్రయత్నించాల్సిన అసవరం లేదని కేజ్రీవాల్ చెప్పారు. కాగా, కేజ్రీవాల్ కేబినెట్లో ఆరుగురు మంత్రులు కూడా శనివారం నాడు ప్రమాణ స్వీకారం చేస్తారు. వారిలో మనీశ్ సిసోడియా, రాఖీ బిర్లా, సౌరభ్ భరద్వాజ్, సోమ్‌నాథ్ భారతి, గిరిషీ సోని, సత్యేంద్ర కుమార్ జైన్ ఉన్నారు. మంత్రి పదవి దక్కలేదని ఆగ్రహంతో ఉన్న వినోద్ కుమార్ బిన్నీని నాయకులు సమాధాన పరచడంతో అసంతృప్తి చల్లారినట్లయింది. -
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. 26న ప్రమాణ స్వీకారం
-
ఢిల్లీ గద్దెపై కేజ్రీవాల్
-
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. 26న ప్రమాణ స్వీకారం
సామాన్యుడు ఢిల్లీ గద్దె ఎక్కుతున్నాడు. ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఈనెల 26వ తేదీ గురువారం నాడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఎన్నో పోరాటాలకు వేదికగా నిలిచిన జంతర్మంతర్లోనే ప్రమాణ స్వీకారం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కలిసి ఈ విషయాన్ని తెలిపారు. అనంతరం కిక్కిరిసిన విలేకరుల సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటించారు. పదిహేను సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇవ్వడంతో ఆ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమైంది. మొత్తం తాను గెలిచిన 28 నియోజకవర్గాల్లో సర్వే చేయించి మరీ తాము అధికారం చేపట్టాలో వద్దో ఆప్ నిర్ణయించుకుంది. బీజేపీ అధికారంలోకి రాకూడదన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ పార్టీకి మద్దదు ఇచ్చిందని అంటున్నారు. గతంలో ప్రైవేటు కంపెనీలకు దన్ను ఇచ్చిందంటూ షీలా దీక్షిత్ సర్కారుపై తీవ్రస్థాయిలో ఉద్యమం చేసిన అరవింద్ కేజ్రీవాల్.. ఇప్పుడు అదే పార్టీతో చేతులు కలిపి సర్కారును ఏర్పాటుచేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన వాగ్దానాలన్నీ ఆచరణ సాధ్యమేనని, తాము షరతులతో కూడిన మద్దతునే ఆ పార్టీకి ఇస్తున్నామని షీలా దీక్షిత్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తమ విధానాలకు తప్పనిసరిగా అంగీకరించాలని, ఒకవేళ మధ్యలో కూలదోసే ప్రయత్నం చేసినా కూడా అది తమకు సానుభూతి తెస్తుందని కేజ్రీవాల్ స్పష్టం చేస్తున్నారు. -
షీలాకు జరిమానా
న్యూఢిల్లీ: బీజేపీ నాయకుడు విజేందర్ గుప్తాపై దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణకు హాజరుకాని సీఎం షీలా దీక్షిత్‌కు స్థానిక కోర్టు రూ.ఐదు వేల జరిమానా విధించింది. జనవరి 27న తప్పకుండా కేసు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో ప్రశ్నించేందుకు, క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు ఫిర్యాదుదారు దీక్షిత్ కోర్టుకి రావాలని గతంలోనే ఆదేశించినా ఆమె పట్టించుకోకపోవడంతో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నమ్రితా ఆగర్వాల్ రూ.ఐదు వేల జరిమానాను విధించారు. ఈసారి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని దీక్షిత్ పెట్టుకున్న అభ్యర్థనను మన్నించిన ఆమె తదుపరి విచారణ తేదీ 2014, జనవరి 27న తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితా తయారుచేసే పనిలో నిమగ్నమవడంతో పాటు ప్రచారంలో బిజీగా ఉండటం వల్ల కోర్టుకు హాజరుకాలేకపోయారని షీలా తరఫు న్యాయవాది అన్నారు. ఇదే కోర్టు నుంచి గతంలో ఆదేశాలు వచ్చినా పట్టించుకోకుండా సీఎం షీలా దీక్షిత్ తెలివి తక్కువదని గుప్తా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఈ కేసులో నిందితుడు కావడంతో కావాలనే తన క్లయింట్‌ను వేధిస్తున్నారని గుప్తా తరఫు న్యాయవాది అజయ్ బుర్మన్ అన్నారు.డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో రోహిణి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా గుప్తా కోర్టు ముందు హాజరయ్యారని తెలిపారు. గతేడాది జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో విద్యుత్ కంపెనీలతో లలూచీపడి సహాయం తీసుకున్నానని అభ్యంతరకర పదజాలాన్ని వినియోగించిన గుప్తాపై దీక్షిత్ పరువు నష్టం దావా దాఖలు చేసిన సంగతి తెలిసిందే.