కేజ్రీవాల్‌ సర్కారు విశ్వాస తీర్మానం | Arvind Kejriwal Moves Confidence Motion In Delhi Assembly Amid ED Summons, See Details Inside - Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌ సర్కారు విశ్వాస తీర్మానం

Published Sat, Feb 17 2024 5:44 AM | Last Updated on Sat, Feb 17 2024 10:54 AM

Arvind Kejriwal moves confidence motion in Delhi assembly amid ED summons - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తమ సర్కారుపై శుక్రవారం శాసనసభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మద్యం కుంభకోణంలో ప్రశ్నించేందుకు ఈడీ ఎన్నిసార్లు సమన్లు జారీచేసినా గైర్హాజరవడంతో శనివారం తమ ముందు హాజరుకావాలని సిటీ కోర్టు కేజ్రీవాల్‌ను ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈ చర్యకు దిగడం గమనార్హం. విశ్వాస తీర్మానంపై శనివారం సభలో చర్చించనున్నారు.

70 మంది సభ్యుల అసెంబ్లీలో కేజ్రీవాల్‌ బలపరీక్షకు సిద్ధపడటం ఇది రెండోసారి. ఆప్‌కు 62 మంది ఎమ్మెల్యేలుండగా బీజేపీ బలం రెండుకు పడిపోయింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రసంగానికి అడ్డు తగిలారన్న కారణంతో గురువారం ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సెషన్‌ మొత్తానికీ సస్పెండ్‌ చేయడమే ఇందుకు కారణం. శుక్రవారం విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి కేజ్రీవాల్‌ మాట్లాడారు. తమ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారన్నారు. కానీ వారెక్కడ జారిపోతారోననే భయంతోనే ఆయన బలపరీక్షకు దిగారని బీజేపీ ఎద్దేవా చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement