Legislative Assembly
-
పోలీసులు వచ్చే లోపే తిరగబడి కొట్టండి
సాక్షి, అమరావతి: ‘మృగాల కంటే హీనంగా కొందరు ప్రవర్తిస్తున్నారు. ఏం చేయాలన్నా చట్టం కట్టేస్తోంది. పోలీసులు వచ్చే లోపే ప్రజలు తిరుగుబాటు చేసి వారిని కొట్టాలి’ అంటూ సీఎం చంద్రబాబు గురువారం అసెంబ్లీలో చెప్పారు. సభలో ప్రవేశ పెట్టిన వివిధ బిల్లులు, తీర్మానాలపై ఆయన మాట్లాడారు. గతంలో ఇంతకంటే కష్టమైన పరిస్థితులు చూశానని, హైదరాబాద్‌లో ఉగ్రవాదం, విద్వేషాలు, మత కలహాలు, సీమలో ఫ్యాక్షన్ , విజయవాడలో రౌడీయిజం ఉండేదన్నారు. రాయలసీమలో ఫ్యాక్షన్‌ను అణచివేశామన్నారు. ముంద్రా పోర్టుకు ఏపీ అడ్రస్‌తో డ్రగ్స్ వచ్చాయని, దానిపై నిరసన తెలిపితే టీడీపీ కార్యాలయంపై దాడి చేశారని అన్నారు. రాష్ట్రంలో నేరాలన్నీ గంజాయి మత్తులోనే చేస్తున్నారని, కాలేజీ పరిసరాల్లోకి కూడా గంజాయి వెళ్లిందని చెప్పారు. గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడిన వారిని మార్చడం కష్టమని అన్నారు. తల్లి, చెల్లిపై అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టిన వారిని జగన్ ప్రోత్సహించారని ఆరోపించారు. డిజిటల్ కార్పొరేషన్లో సొంత మనుషులను పెట్టి సోషల్ మీడియాలో పని చేయించుకున్నారని ఆరోపించారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా లాండ్ మాఫియాను ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం లాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని చంద్రబాబు ఆరోపించారు. సివిల్ జడ్జి అధికారాలను రెవెన్యూ అధికారులకు ఇచ్చారన్నారు. ఎవరినైనా లాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికారిగా పెట్టుకునేలా చట్టంలో పేర్కొన్నారని, అంటే ‘సాక్షి’లో పని చేసే గుమస్తాలను అధికారులుగా పెట్టాలని చూశారని అన్నారు. రెవెన్యూ రికార్డులో పేరు మార్చాలంటే ఆ యజమానికి నోటీసు కూడా ఇవ్వడానికి అవకాశం లేకుండా నేరుగా హైకోర్టులో తేల్చుకునేలా చేశారన్నారు. అందుకే ఆ చట్టాన్ని రద్దు చేశామన్నారు. తాము తెచ్చిన యాంటీ లాండ్ గ్రాబింగ్ యాక్ట్ ద్వారా ఎక్కడ భూమి కబ్జా చేసినా, ప్రయత్నించినా, బెదిరించినా శిక్షిస్తామని, భూమి కబ్జా చేయలేదని కూడా వారే నిరూపించుకోవాలని అన్నారు. భూ ఆక్రమణలకు పాల్పడ్డవారిని 6 నెలల్లోనే శిక్షిస్తామని, ఇసుక అక్రమాలకు, బియ్యం స్మగ్లింగ్‌కు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామన్నారు. ఈ మేరకు చట్టంలో మార్పులు చేయాలని హోం మంత్రి అనితకు సూచించారు. అమరవీరుల స్థూపం నిర్మాణానికి రాజధానిలో 5 ఎకరాలు కేటాయిస్తామని చంద్రబాబు ప్రకటించారు. త్వరలోనే 6,100 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. 2,812 పోలీస్ వాహనాల కొనుగోలుకు రూ.281 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. రూ.859 కోట్ల బకాయిలు త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. అనంతపురం, తిరుపతి, రాజమండ్రిలో ప్రాంతీయ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లు, రాజధానిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేస్తామన్నారు.వివేకా హత్యపై అధికారులూ అదే చెప్పారువివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు ఉదయం సాక్షిలో గుండెపోటుతో చనిపోయారని కథనం నడిపారని, తానూ దానిని నమ్మానని, అధికారులు, విజయసాయిరెడ్డి కూడా అదే చెప్పారని చంద్రబాబు అన్నారు. అక్కడి సీఐని మేనేజ్ చేశారని, రక్తం మరకలు కనబడకుండా బాత్రూమ్ క్లీన్ చేసి మృతదేహాన్ని వెంటనే ఫ్రీజర్‌లో పెట్టారన్నారు. వివేకా కుమార్తె సునీతారెడ్డి పోస్టుమార్టం చేయాలని అడగ్గా, అప్పుడు నెత్తిపైన గొడ్డలి వేట్లు ఉన్నాయని తేలిందన్నారు. గిరిజన మ్యూజియంకు అల్లూరి పేరుభోగాపురం విమానాశ్రయానికి, అక్కడి గిరిజన మ్యూజియంకు అల్లూరి సీతారామరాజు పేరు పెడతామని చంద్రబాబు చెప్పారు. పార్లమెంటులో అల్లూరి విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేంత వరకూ కేంద్రంపై పోరాడతామని తెలిపారు. దేవాలయాల కమిటీల్లో విశ్వ బ్రాహ్మణులకు కూడా అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ కోరారు. శాసనసభలో బుధవారం ఆమోదించి మండలికి పంపిన నాలుగు బిల్లులు యధాతథంగా ఆమోదం పొందినట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ సాక్షి, అమరావతి: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబునాయుడు గురువారం శాసన సభలో చెప్పారు. ఇప్పటికే ఈ అంశాన్ని కేబినెట్ ఆమోదించిందని, అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని హైకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు తీర్మానాన్ని న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ గురువారం సభలో ప్రవేశపెట్టారు. మంత్రి సవిత, పలువురు రాయలసీమ ఎమ్మెల్యేలు తీర్మానంపై మాట్లాడారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కర్నూలును బెస్ట్ టౌన్‌గా మార్చడంలో భాగంగా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల సంఘం కార్యాలయాలు కూడా అక్కడే ఉంటాయన్నారు. వికేంద్రీకరణ తమ విధానమని చెప్పారు. ఉత్తరాంధ్రలో విశాఖ, రాయలసీమలో కర్నూలు, తిరుపతి, ఇక్కడ అమరావతి అభివృద్ధి చేస్తామన్నారు.హార్టికల్చర్ అభివృద్ధి చేస్తే రాయలసీమకు మహర్దశ వస్తుందని చెప్పారు. అనంతపురానికి బెంగళూరు ఎయిర్‌పోర్టు, కర్నూలుకు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు, చిత్తూరుకు చెన్నై ఎయిర్‌పోర్టు దగ్గరగా ఉన్నాయని, ఈ అవకాశాన్ని అభివృద్ధికి ఉపయోగించుకోవచ్చన్నారు. గత ప్రభుత్వం రాయలసీమకు చీమంత మేలు కూడా చేయలేదన్నారు.చెత్త యూజర్ చార్జీలు, కాంట్రాక్టర్ల లబ్ధిపై విచారణ: మంత్రి నారాయణ గత ప్రభుత్వంలో చెత్తపై యూజర్ చార్జీల వసూలు, కాంట్రాక్టుల్లో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు.5 లక్షల ఉద్యోగాలు: మంత్రి లోకేశ్వచ్చే ఐదేళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని ఐటీ, కమ్యూనికేషన్స్ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని గతంలో ఏ ప్రభుత్వం హామీ ఇవ్వలేదని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ అండ్ డేటా సెంటర్ పాలïÜలపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడుతూ గత టీడీపీ పాలనలో 53 కంపెనీలు, రూ.17 వేల కోట్ల పెట్టుబడి, 96,220 మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. -
సంప్రదాయానికి తూట్లు
సాక్షి, అమరావతి: పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి రాకుండా చేసి శాసనసభ వ్యవహారాల్లో అనాదిగా కొనసాగుతున్న ప్రజాస్వామ్య సంప్రదాయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు తిలోదకాలు ఇస్తున్నారు. పారదర్శకత ఉండాలంటే ప్రజా పద్దుల కమిటీ చైర్మన్‌గా ప్రతిపక్షానికి చెందిన సభ్యుడు ఉండటం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి ఇవ్వాల్సిన పదవిని కూడా తమ కూటమికే దక్కేలా అన్ని స్థానాలకు తమ సభ్యులతో నామినేషన్లు వేయించి ఎన్నిక జరిగేలా చేశారు. దీంతో శాసనసభ చరిత్రలో తొలిసారి పీఏసీ కమిటీకి ఎన్నిక అనివార్యమైంది. ఈ కమిటీలో 12 మంది సభ్యులకు అవకాశం ఉండగా.. 9 ఎమ్మెల్యేల తరఫున, మూడు ఎమ్మెల్సీల తరఫున ఎన్నికవ్వాల్సి ఉంది. ఎమ్మెల్సీల తరఫున ఉన్న మూడు స్థానాలకు కేవలం మూడు నామినేషన్లు రావడంతో అవి ఏకగ్రీవమయ్యాయి. ఎమ్మెల్యేల తరఫున ఉన్న 9 స్థానాలకు 10 నామినేషన్లు దాఖలవడంతో ఎన్నిక తప్పనిసరైంది. 9 స్థానాలకు కూటమి తరఫున 9 నామినేషన్లు, వైఎస్సార్సీపీ తరఫున ఒక నామినేషన్ (పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి) దాఖలవడంతో శుక్రవారం ఎన్నిక నిర్వహించనున్నారు.ఆనవాయితీకి చెల్లుచీటీపీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి కేటాయించడం ఆనవాయితీ. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ పదవిని ప్రతిపక్ష పార్టీకి వదిలిపెట్టాలనే సంప్రదాయం పార్లమెంటు నుంచి దాదాపు అన్ని రాష్ట్రాల శాసనసభల్లోనూ కొనసాగుతోంది. అప్పుడే ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ప్రతిపక్షానికి వస్తుందని ఈ సంప్రదాయాన్ని తెచ్చారు. ప్రతిపక్షానికి పీఏసీ కేటాయించాలనేది ప్రజాస్వామిక స్ఫూర్తి. కానీ.. రాష్ట్రంలో ఇప్పుడు ప్రతిపక్షం అనే దాన్నే గుర్తించకుండా, పీఏసీ కూడా వారికి ఇవ్వకుండా అసెంబ్లీలో ప్రజల గొంతు ఏమాత్రం వినపడకూడదనే ఉద్దేశంతో దాన్ని కూడా తామే చేజిక్కించుకునేందుకు సిద్ధమయ్యారు. అధికారంలో ఉన్నవాళ్లే పీఏసీ తీసుకుంటే ఇక ప్రజల తరఫున మాట్లాడేవాళ్లే ఉండరనే దుర్బుద్ధితోనే దాన్ని కూడా తమ చేతుల్లో పెట్టుకుంటున్నారని స్పష్టమవుతోంది. పీఏసీ అనే దానిలోనే పబ్లిక్ అనే పదం ఉంది. అంటే ప్రజలకు సంబంధించిన పదవి అని అర్థం. ప్రతి అంశం పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు జరిగింది. నామినేషన్ దాఖలులో హైడ్రామా మరోవైపు పీఏసీ సభ్యత్వాలకు వైఎస్సార్సీపీ సభ్యులు నామినేషన్లు వేసే సమయంలోనూ హైడ్రామా నెలకొంది. మధ్యాహ్నం ఒంటిగంటలోపు నామినేషన్లు దాఖలు చేయాల్సివుండగా అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఆ సమయంలో అందుబాటులో లేకుండాపోయారు. పీఏసీ సహా ఇతర రెండు కమిటీల సభ్యత్వాలకు నామినేషన్లు వేసేందుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు 11 గంటలకు సెక్రటరీ జనరల్ చాంబర్కి వెళ్లారు. కానీ.. ఆ సమయంలో ఆయన కావాలని అసెంబ్లీలోనే ఉండిపోయినట్టు తెలుస్తోంది. సాధారణంగా ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఎన్నికల అధికారి (సెక్రటరీ జనరల్) తన చాంబర్లో అందుబాటులో ఉండాలి. లేకపోతే ప్రత్యామ్నాయంగా మరొకరిని నియమించాలి. కానీ.. సమయం దాటిపోయే వరకూ నామినేషన్లు తీసుకోకుండా ఉండేందుకే ఆయన దురుద్దేశంతో అసెంబ్లీలో ఉండిపోయినట్టు సమాచారం. గంటన్నరపాటు ఎదురుచూసినా ఆయన రాకపోవడంతో శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకున్నారు. సెక్రటరీ జనరల్ దురుద్దేశపూర్వకంగా చాంబర్లోకి రావడంలేదనే విషయం తెలుసుకుని ఆయన కూడా చాంబర్ వద్దకెళ్లారు. అక్కడి సిబ్బందిని ప్రశ్నించడంతో నీళ్లు నమిలారు. ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి నామినేషన్లు తీసుకోకుండా ఉండటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎదురుగా ఉన్న మరో చాంబర్లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉండటంతో ఆయన్ను కూడా ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు. దీంతో అచ్చెన్నాయుడు వెంటనే అసెంబ్లీలోకి వెళ్లి సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్‌ను బయటకు పంపారు. నామినేషన్లు దాఖలు చేయడానికి కొద్ది నిమిషాలు ఉందనగా.. సెక్రటరీ జనరల్ హడావుడిగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల నుంచి నామినేషన్లు స్వీకరించారు. బొత్స సత్యనారాయణ సభలోనే ఉంటే నామినేషను దాఖలుకు అవకాశం ఇవ్వకుండా చేసేవారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్సార్సీపీ హయాంలో ఇలా చేసి ఉంటే.. 2019లో టీడీపీకి 23మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పీఏసీ చైర్మన్ పదవి టీడీపీకి కేటాయించింది. ఉన్న 23 మందిలో ఐదుగురు పక్కకు వెళ్లిన తరుణంలోనూ ప్రజాస్వామిక సంప్రదాయాలను కొనసాగించేందుకు ప్రస్తుత ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌కి అప్పట్లో ఈ పదవి ఇచ్చారు. అప్పట్లో వైఎస్సార్సీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేల బలంతో టీడీపీకి పీఏసీ ఇవ్వకూడదని అనుకుంటే ఎన్నిక జరిపే అవకాశం ఉన్నా అలా చేయలేదు. ప్రజాస్వామిక సూత్రాలకు, సంప్రదాయాలకు గౌరవం ఇచ్చి పీఏసీ చైర్మన్ పదవిని అప్పట్లో టీడీపీకి కేటాయించారు. అందుకు విరుద్ధంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి పీఏసీ పదవి దక్కకుండా చేసేందుకు ఎమ్మెల్యేల తరఫున ఉన్న 9 మంది పీఏసీ సభ్యత్వాలకు (టీడీపీ తరఫున 7, జనసేన 1, బీజేపీ 1) కూటమి తరఫున నామినేషన్లు వేయించారు. సంప్రదాయంగా తమకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ తరఫున మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేయడంతో 9 మంది సభ్యులకు 10 నామినేషన్లు వచ్చాయి. దీంతో పీఏసీకి ఎన్నిక జరగనుంది. అసెంబ్లీ సంప్రదాయాలకు గండిపడింది. -
శాసనమండలి నుంచి వైఎస్ఆర్ సీపీ వాకౌట్
-
ఎంత మంది పిల్లలున్నా పోటీ చేయొచ్చు
సాక్షి, అమరావతి: ఇకపై ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సవరణ బిల్లుకు రాష్ట్ర శాసన సభ సోమవారం ఆమోదం తెలిపింది. దీంతోపాటు మరో నాలుగు బిల్లులను కూడా ఆమోదించింది. ఒక బిల్లు వాయిదా పడింది. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అర్హత కల్పించే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాల సవరణ బిల్లు 2024 బిల్లును పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మున్సిపల్ చట్టాల సవరణ బిల్లును మంత్రి నారాయణ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ.. గతంలో జరిగిన చట్ట సవరణల ప్రకారం ఇద్దరికంటే ఎక్కువ మంది సంతానం ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని చెప్పారు. అయితే, గత మూడు దశాబ్దాలలో జనాభా నియంత్రణ చర్యలతో సంతానోత్పత్తి సామర్ధ్యం రేటు బాగా తగ్గిపోయిందన్నారు. మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జనాభాను పెంపొందించాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతోనే చట్టంలో సవరణలు చేసినట్లు వివరించారు. గతంలో ఆ చట్టాల్లో చేసిన సవరణలకు సంబంధించిన సెక్షన్లను తొలగిస్తూ చేసిన చట్ట సవరణకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.జనాభా పెరగదుఈ బిల్లుపై అధికార కూటమి శాసన సభ్యులే పలువురు పెదవి విరిచారు. చట్ట సవరణ చేసినప్పటికీ, ప్రస్తుత కుటుంబ పరిస్థితుల దృష్ట్యా సంతానోత్పత్తి పెరగకపోవచ్చునని, పైగా సంక్షేమ పథకాలు ఆ కుటుంబాలకు అందవని ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబ పరంగా ఆలోచిస్తే ఈ సవరణ సంతానోత్పత్తి రేటు వృద్ధికి దోహద పడదని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అభిప్రాయపడ్డారు. జననీ సురక్ష పథకం ఒక్కరికే వర్తిస్తుందని, ఇద్దరు పుడితే ఆ పథకం వర్తించదని చెప్పారు. ఇటువంటి నిబంధనలు ఉన్నన్ని రోజులూ సంతానోత్పత్తి రేటు పెరగదని స్పష్టం చేశారు. కుటుంబాలను ఆదుకునే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలైన రోజే సంతానోత్పత్తి రేటు పెరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో యువత పెరగడానికి ఈ సవరణ తోడ్పడుతుందని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవి అన్నారు.మరి కొన్ని బిల్లులకూ ఆమోదంవైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రవేశపెట్టిన మూడు బిల్లులను శాసన సభ ఆమోదించింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సిఫార్సు మేరకు మూగ, చెవిటి, కుష్టు పదాలను తొలగిస్తూ ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సవరణ బిల్లు–2024ను సభ ఆమోదించింది. ఆయా సమస్యలున్న వారికి విశ్వవిద్యాలయం ఈసీ సభ్యులుగా అవకాశం కల్పించేలా చట్ట సవరణ చేసినట్లు మంత్రి చెప్పారు. అదే విధంగా ఈ మూడు పదాలను తొలగిస్తూ ఏపీ ఆయుష్, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టిషనర్స్ రిజిస్ట్రేషన్, ఏపీ మెడికల్ ప్రాక్టిషనర్స్ రిజిస్ట్రేషన్ సవరణ బిల్లులనూ సభ ఆమోదించింది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టిన ఏపీ కో–ఆపరేటివ్ సొసైటీస్ సవరణ బిల్లు –2024కు కూడా సభ ఆమోదం తెలిపింది. రెవెన్యూ శాఖ మంత్రి అభ్యర్థన మేరకు ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ బిల్–2024ను మరో రోజుకు వాయిదా వేసినట్టు స్పీకర్ ప్రకటించారు. -
'నిజమే'.. నిత్యావసరాల ధరలు పెరిగాయ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగినట్టు ప్రభుత్వం శాసన సభలో అంగీకరించింది. కీలకమైన నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగాయా అంటూ వైఎస్సార్సీపీ సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, దాసరి సుధ అడిగిన ప్రశ్నను ప్రశ్నోత్తరాల సమయం షెడ్యూల్లో ఉంచినప్పటికీ సంబంధిత మంత్రి సమాధానం చెప్పకుండా దాటవేశారు. సంబంధిత విభాగం ద్వారా రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. జూన్‌తో పోలిస్తే ప్రస్తుతం నిత్యావసరాల ధరలు పెరిగినట్లు ప్రభుత్వం ఆ సమాధానంలో తెలిపింది. శనగపప్పు 17 శాతం, సన్‌ఫ్లవర్ నూనె 21 శాతం, పామాయిల్ 33 శాతం, ఉల్లిపాయలు 87 శాతం ధరలు పెరిగినట్టు ప్రకటించింది. రైతుబజార్లలో సబ్సిడీపై సరుకులను అందిస్తున్నామంది.అతిసార మృతుల కుటుంబాలకు పరిహారం లేదుసోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. విజయనగరం జిల్లాలో ఇటీవల అతిసారతో మరణించిన వ్యక్తుల వివరాలు చెప్పాలని, వారికి ఎలాంటి పరిహారం ఇస్తారో చెప్పాలని అడిగిన ప్రశ్నకు సమధానం చెప్పినట్టే భావించాలని స్పీకర్ ప్రకటించారు. అయితే, నలుగురు మాత్రమే అతిసారతో చనిపోయారని, వారి కుటుంబాలకు పరిహారం ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.రీసర్వేలో తప్పుచేసిన అధికారులను శిక్షిస్తాం: మంత్రి అనగాని సత్యప్రసాద్ గత ప్రభుత్వంలో అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని 22ఏ నుంచి తొలగించారని, ఇందులో అక్రమాలు జరిగాయని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. 25 వేల రిజిస్ట్రేషన్లలో 8 వేల వరకు తప్పు జరిగినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై దర్యాప్తు చేయిస్తామన్నారు. గత ప్రభుత్వ రిజిస్ట్రేషన్లు అసైనీలను బెదిరించి లాక్కోవడమే కాకుండా రిజిస్ట్రేషన్లు త్వరగా చేసుకునేందుకు జీవోలు కూడా ఇచ్చారన్నారు. నంద్యాల, పుట్టపర్తి, రాయచోటి, విశాఖలో జరిగిన అవకతవకలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, అందుకే ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు తెస్తున్నట్టు చెప్పారు. 70 వేలకుపై అర్జీలు రీ సర్వేపైనే వచ్చాయన్నారు. రీ సర్వే పూర్తయిన 6,700 గ్రామాల్లో సభలు పెట్టి సమస్య పరిష్కరిస్తామన్నారు. వాటిన్నింటినీ పాత పద్ధతిలో వెబ్‌ల్యాండ్‌లో పెట్టి రిజిస్ట్రేషన్లు, బ్యాంకు రుణాలకు ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. తప్పు చేసిన అధికారులను కూడా శిక్షిస్తామని చెప్పారు. ఇనాం భూములపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టి న్యాయం చేస్తామన్నారు.సర్వే చేసి హౌసింగ్ బిల్లులు చెల్లిస్తాం: గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథిగత ప్రభుత్వ అప్రజాస్వామిక పాలనకు హౌసింగ్ ప్రోగ్రామ్ మచ్చుతునక అని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం బిల్లులను నిలిపివేసిందని, గ్రామాల్లో ఇళ్ల పరిస్థితిపై సర్వే చేసిన అనంతరం పాత బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. విశాఖలో గృహాల నిర్మాణం 2026 మార్చికి పూర్తి చేస్తామన్నారు.జగనన్న కాలనీల్లో లోన్లు ఎక్కడా బలవంతంగా తీసుకోలేదని, 52 వేల మంది బ్యాంకు రుణాలు తీసుకున్నారని, ఈ మొత్తం కలెక్టర్ వద్దే ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వంలో యూఎల్బీలో యూనిట్ ధర తగ్గించడంతో రుణాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. వీటిలో ఎక్కడా తప్పులు జరగలేదని మంత్రి వివరించారు. వైఎస్ జగన్‌ని దూషించిన బుచ్చయ్య చౌదరిజగనన్న కాలనీ ఇళ్లను ప్రస్తావిస్తూ రాజమండ్రి గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాజీ సీఎం వైఎస్ జగన్‌ను తీవ్ర పదజాలంతో దూషించారు. జగనన్న కాలనీల పేరుతో వేల ఎకరాలు కొని, అన్యాక్రాంతం చేశారని, దీనిపై సమగ్ర విచారణ చేయాలని అన్నారు. ఆ భూములు నిర్మాణాలకు ఉపయోగపడవన్నారు. ప్రతిచోటా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. పట్టాపై వైఎస్ జగన్ బొమ్మ వేసుకుని పనికిరాని పట్టాలు ఇచ్చారని, ఇవేమన్నా ఆయన సొంత ఆస్తులు ఇస్తున్నారా అంటూ విమర్శించారు.మల్లవల్లి పారిశ్రామికవాడలో సమస్యలు లేవు: మంత్రి టీజీ భరత్మల్లవల్లి పార్కులో సదుపాయాల కొరతతో యాజమాన్యాలు, ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారన్న విషయంలో వాస్తవం లేదని, అక్కడ ఎలాంటి సమస్యలు లేవని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు.మత్స్యకార భరోసా ఇవ్వలేంవ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడుమత్స్యకారులకు 2014–19 మధ్య మేలు జరిగితే, గత ఐదేళ్లలో ప్రభుత్వం వారిని నాశనం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఈనెల 21న మత్స్యకార భరోసా కింద రూ.20 వేలు చొప్పున ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేమని, అసలైన అర్హులను గుర్తించేందుకు సర్వే చేస్తున్నామని చెప్పారు. వేట విరామ సమయంలో గత టీడీపీ ప్రభుత్వం మత్స్యకారులకు రూ.5 వేలు ఇచ్చేదని, వైఎస్సార్సీపీ ప్రభుత్వం దానిని రూ.10 వేలకు పెంచిందని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ ఒక్కటీ తప్ప గత ఐదేళ్లలో మత్స్యకారులకు ఏదీ అందలేదన్నారు. గత ఐదేళ్లల్లో 63 మంది వేటకెళ్లి చనిపోతే పరిహారం ఇవ్వలేదన్నారు. కాగా, మత్స్యకారుల అంశంపై ప్రత్యేక చర్చ పెట్టాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు సూచించారు.ఆర్టీసీలో సిబ్బంది క్రమబద్ధీకరణ లేదు: మంత్రి రాంప్రసాద్రెడ్డిఏపీఎస్ ఆర్టీసీలో సిబ్బంది కొరత ఉందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. 1,275 డ్రైవర్లు, 789 కండక్టర్లు పోస్టుల కొరత ఉందన్నారు. ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరించే ప్రతిపాదన లేదన్నారు. ఆన్ కాల్ డ్యూటీ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. ఆర్టీసీ విలీనం అశాస్త్రీయంగా జరిగిందని అన్నారు. ఆర్టీసీలో 18 విభాగాల్లో 7,545 పోస్టులు పెండింగ్ ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తెలిపారు. గత ప్రభుత్వం ఆన్ కాల్ డ్యూటీ ప్రవేశపెట్టి, అనుభవం లేని డ్రైవర్లను విధుల్లోకి తెస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. సిబ్బందిని చిన్న విషయానికి కూడా శిక్షిస్తున్నారని తెలిపారు. ఈహెచ్ఎస్ను పాత విధానంలో అమలు చేయాలని కోరారు. -
వచ్చే విద్యా సంవత్సరం నాటికి డీఎస్సీ
సాక్షి, అమరావతి: ఈ ఏడాది జూన్ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో 13,497 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి సంతకం 16,347 టీచర్ పోస్టుల భర్తీపై చేసినట్టు వివరించారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. వచ్చే ఆరు నెలల్లో నోటిఫికేషన్ జారీచేసి, వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో 6,100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేసిందన్నారు. అభ్యర్థుల వయోపరిమితి పెంచే ఆలోచన చేస్తున్నామన్నారు. జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకొచ్చే ఆలోచనచేస్తున్నామని మంత్రి తెలిపారు. గతంలో ఉపాధ్యాయులు ధర్నా చేసినప్పుడు అనేక కేసులు పెట్టారని, త్వరలో వాటిని తొలగిస్తామని చెప్పారు. ఉన్నత విద్యపై అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్‌లో సంస్కరణలు తెస్తున్నామని, తమ ప్రభుత్వం వచ్చాక ఇంటర్లో 15 వేల అడ్మిషన్స్ పెరిగాయని చెప్పారు. తాము నారాయణ విద్యాసంస్థలతో పోటీపడేలా పనిచేస్తున్నామని, 9వ తరగతి నుంచే క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. దీనికోసం ప్రత్యేక డాష్ బోర్డు ఏర్పాటు చేసి స్కూల్స్‌కు ర్యాంకింగ్స్ ఇస్తామన్నారు. నాడు–నేడుతో ప్రయోజనం లేదు గత ప్రభుత్వం టీచర్ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఘనంగా మోసం చేసిందని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు జీతాలు కూడా సరిగా ఇవ్వకుండా చాకరీ చేయించిందని విమర్శించారు. ఉపాధ్యాయులకు అదనపు పనులు చెప్పడంతో వారు పాఠాలు చెప్పలేకపోతున్నారని, దీంతో విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోతున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం రావాలన్నారు. గత ప్రభుత్వంలో నాడు–నేడు కార్యక్రమంతో ఎలాంటి ప్రమోజనం లేదని, దీనివల్ల చాలా నష్టం జరిగిందన్నారు.. పాఠశాలలు శిథిలమైపోయాయన్నారు. విద్యారంగానికిరూ.29 వేల కోట్లు కేటాయించడం హర్షించతగ్గ విషయమన్నారు. -
3లక్షల పింఛన్లు కట్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేదలకు కూటమి ప్రభుత్వం మరో షాక్ ఇవ్వనుంది. అనర్హత పేరుతో మూడు లక్షల మంది పింఛన్లను రద్దు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అసెంబ్లీలో మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఈ విషయాన్ని వెల్లడించారు. శాసనసభ సమావేశాల్లో నాలుగో రోజు గురువారం ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రులు వివరణ ఇచ్చారు. తొలగించిన పింఛన్లు పునరుద్ధరిస్తామని ఎన్నికల వేళ హామీ ఇచ్చామని, దానిని ఎప్పటి నుంచి అమలు చేస్తారని, కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారని సభ్యులు ప్రశ్నించారు. 3 లక్షల మంది అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నారని, 2.5 లక్షలు కొత్త పింఛన్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి కొండపల్లి బదులిచ్చారు. దివ్యాంగులు కానివారు కొంతమంది డాక్టర్ల ద్వారా నకిలీ సరి్టఫికేట్ పొంది పింఛన్లు తీసుకుంటున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పారు. రాష్ట్రంలో 8 లక్షల దివ్యాంగుల పింఛన్లు ఉన్నాయని, వాటన్నింటినీ తనిఖీ చేసి అనర్హులను తొలగిస్తామని మంత్రి వివరించారు. ఎస్సీ, ఎస్టీ బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని, ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందో మంత్రి చెప్పాలని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ప్రశ్నించారు. కానీ ఈ ప్రశ్నకు మంత్రి కొండపల్లి స్పందించలేదు. విశాఖలో భూ కుంభకోణాలపై విచారణకు సిట్టింగ్ జడ్జితో కమిటీ లేదా హౌస్ కమిటీ వేయాలని సంబంధిత మంత్రికి స్పీకర్ సూచించారు.విశాఖలోని రుషికొండలో నిరి్మంచిన భవనాల నిర్మాణ ఖర్చులు రూ.409.39 కోట్ల వివరాలను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సభలో వివరించారు. ఈ సమయంలో టీడీపీ సభ్యుడు రఘురామకృష్ణరాజు స్పందిస్తూ రుషికొండలో భవనాలు కూల్చేయాలన్న పిటిషన్‌ను వెనక్కితీసుకుంటామని చెప్పారు. సీట్లు కేటాయించండి అధ్యక్షా! పారీ్టలు మారినట్లు అసెంబ్లీలో సీట్లు మారుతుంటే కష్టంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సభలో ఆవేదన వ్యక్తంచేశారు. సభ్యులకు ఎవరి సీట్లు వారికి కేటాయిస్తే బాగుంటుందని ఆయన స్పీకర్‌ను కోరారు. అంతా మన హౌసే కదా... అని స్పీకర్ చెప్పగా... అయినా కూడా ఎవరి సీట్లు వాళ్లకు ఇవ్వాలని బుచ్చయ్య స్పష్టంచేశారు. డిసెంబర్లో కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ రాష్ట్రంలో అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్లో ఆయన సెర్ప్, వైద్య ఆరోగ్యశాఖ, ఏపీ ఆన్లైన్, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆధికారులతో సమీక్ష జరిపారు. -
ప్రజల గొంతును గుర్తించండి.. స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైఎస్ జగన్ లేఖ
అంతరంగం అప్పుడే అర్థమైంది..ఈ నెల 21న అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణం కార్యక్రమాన్ని పరిశీలిస్తే నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వరనే అభిప్రాయం కలిగింది. అసెంబ్లీ సంప్రదాయాల ప్రకారం ముందుగా సభా నాయకుడు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు, అనంతరం మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా అలా జరగలేదు. సంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రుల తర్వాతే నాతో ప్రమాణం చేయించారు. నాకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదనే నిర్ణయాన్ని మీరు ముందుగానే తీసుకున్నట్లు కనిపిస్తోంది.సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని, ఈ విషయంలో పరిశీలన చేయాలని కోరుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం లేఖ రాశారు. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు సాధించాలని చట్టంలో ఎక్కడా లేదన్నారు. విపక్ష పార్టీల్లో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని పేర్కొన్నారు. శాసనసభలో కూటమి పార్టీల ఉద్దేశపూర్వక చర్యలను సైతం లేఖలో ప్రస్తావించారు. వైఎస్ జగన్ లేఖలో ముఖ్యాంశాలు ఇవీ..శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు..మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు పూర్తి విరుద్ధం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లు దీనిద్వారా కనిపిస్తోంది. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం సీట్లు సాధించి ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు. పార్లమెంట్లోగానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోగానీ ఈ నిబంధన పాటించలేదు. అధికార కూటమి, స్పీకర్ ఇప్పటికే నాపట్ల శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు వీడియోల ద్వారా బయటపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో గొంతు విప్పే అవకాశాలు కనిపించడం లేదు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే ఆస్కారం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నా లేఖను పరిశీలించాలని కోరుతున్నా.చట్టంలో స్పష్టంగా ఉంది.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరనే విషయాన్ని చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. ‘ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 చట్టం 12 ఆ’ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటే ఎవరనే విషయాన్ని స్పష్టంగా నిర్వచించింది. విపక్షంలో ఉన్న పార్టీల్లో ఎవరికి ఎక్కువ సంఖ్యా బలం ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెబుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందున విపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ జూన్ 21న జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూస్తే వైఎస్సార్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం, పార్టీ శాసనసభా పక్ష నాయకుడిగా నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడంలో మీ ఉద్దేశాలేమిటో బయటపడ్డాయి. కానీ చట్టాన్ని పరిశీలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంలోగానీ, పార్టీ శానసభా పక్షనేత అయిన నన్ను ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తించేందుకుగానీ ఎలాంటి సందిగ్ధతకు తావులేదు. ఇటీవల స్పీకర్ చేసిన వ్యాఖ్యలు యూట్యూబ్ ఛానళ్లలో ఉన్నాయి. ఓడిపోయాడుగానీ చావలేదు.. చచ్చేవరకూ కొట్టాలి..! అంటూ నన్ను ఉద్దేశించి గౌరవ స్పీకర్ అన్న మాటలు ఆ వీడియోల్లో ఉన్నాయి. తద్వారా నాపై ఉన్న శత్రుత్వాన్ని స్పీకర్ రూపంలో అధికార కూటమి వ్యక్తం చేసింది.వైఎస్సార్ సీపీ 40 శాతం ఓట్లను సాధించింది..ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 40 శాతం ఓట్లను సాధించింది. ప్రజా సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రాతినిథ్యం వహించాల్సిన బాధ్యత మాపై ఉంది. అయితే ప్రభుత్వం, స్పీకర్ శత్రుత్వ వైఖరిని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో మా పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీ కార్యకలాపాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కట్టడి చేస్తున్నట్లే అవుతుంది. వైఎస్సార్ సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి తగిన సమయం లభిస్తుంది. దీనివల్ల ప్రజా సంబంధిత అంశాలను సభ దృష్టికి బలంగా తేగలుగుతారు. సభా కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనేలా, ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష పార్టీగా అభిప్రాయాలను చెప్పేలా చట్టబద్ధమైన భాగస్వామ్యం ప్రధాన ప్రతిపక్ష పార్టీకి లభిస్తుంది. ఇలాంటి పరిస్థితి లేకపోతే అసెంబ్లీలో అధికార కూటమి గొంతు మాత్రమే వినిపిస్తుంది. వివిధ అంశాల్లో బలమైన చర్చలు జరిగే అవకాశం కనిపించదు.ఉపేంద్ర, పీజేఆర్‌ను ప్రధాన ప్రతిపక్ష నేతలుగా గుర్తించారు.. అసెంబ్లీలో 10 శాతం సీట్లు రానందున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా లభించదనే చర్చ జరుగుతోంది. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 208 కింద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నోటిఫై చేసిన సభా ప్రవర్తనా నియమావళిలో నిర్దిష్ట సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదనే విషయాన్ని మీ ముందుకు తెస్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎక్కడా ఈ నిబంధన పాటించలేదనే అంశాన్ని గుర్తు చేస్తున్నా. లోక్‌సభకు 1984లో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 30 ఎంపీ సీట్లను గెలుచుకుంది. సభలో 10 శాతం సీట్లు సాధించనప్పటికీ నాడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకుగానూ కాంగ్రెస్ 26 సీట్లు మాత్రమే సాధించింది. 10 శాతం సీట్లు కాంగ్రెస్‌కు దక్కనప్పటికీ పి.జనార్థనరెడ్డిని నాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు.3 సీట్లు వచ్చిన బీజేపీకి సైతం..2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకుగానూ బీజేపీ కేవలం 3 సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఈ అంశాలన్నీ కూడా కేవలం ప్రజా ప్రయోజనాల రీత్యా మీ దృష్టికి తెస్తున్నా. ప్రజల తరఫున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశంతో మీకు ఈ లేఖ రాస్తున్నా. అయితే ఇలాంటి పరిస్థితికి ఆస్కారం లేకుండా అధికార కూటమి ఇప్పటికే శతృత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో నేను సభలో మాట్లాడాలనుకుంటే అది భారీ మెజార్టీ సాధించిన అధికార కూటమి దయమీద, నన్ను చచ్చేవరకూ కొట్టాలన్న స్పీకర్ గారి విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం సభలో ఉన్న పార్టీల సంఖ్యా బలాలను దృష్టిలో ఉంచుకుని ఈ లేఖను పరిశీలించాలని కోరుతున్నా. -
Sikkim: ఎస్కేఎం శాసనసభాపక్ష నేతగా తమాంగ్
గ్యాంగ్‌టక్: సిక్కిం క్రాంతికారీ మోర్చా(ఎస్కేఎం) శాసనసభా పక్ష నేతగా ప్రేమ్ సింగ్ తమాంగ్ ఎన్నికయ్యారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో ఆ పార్టీ అసెంబ్లీలోని 32 సీట్లకు గాను 31 సీట్లను కైవసం చేసుకోవడం తెల్సిందే. ఆదివారం రాత్రి సీఎం తమాంగ్ అధికార నివాసంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశానికి మొత్తం 31 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎస్కేఎం సెక్రటరీ జనరల్ అరుణ్ ఉప్రెటి శాసనసభా పక్ష నేతగా తమాంగ్ పేరును ప్రతిపాదించగా ఎమ్మెల్యే సోనమ్ లామా బలపరిచారు. అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి తమాంగ్ గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. -
టార్గెట్ హిమాచల్‌ప్రదేశ్?
సిమ్లా/న్యూఢిల్లీ: హిమాచల్‌ప్రదేశ్ రాజకీయ పరిణామాలు రసకందాయంలో పడ్డాయి. రాజ్యసభ ఎన్నికల్లో అనూహ్య ఓటమితో కాంగ్రెస్ ప్రభుత్వ మనుగడపై సందేహాలు మొదలయ్యాయి. ప్రభుత్వంపై శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రతిపక్ష బీజేపీ సిద్ధమవుతున్నట్లు ప్రచారం మొదలైంది. లోక్‌సభ ఎన్నికల ముందు చోటుచేసుకున్న ఈ పరిణామాలు కాంగ్రెస్‌ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నష్ట నివారణ కోసం ఆ పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని సంకేతాలిచి్చంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముగ్గురు సీనియర్ నేతలు భూపేష్ బఘేల్, భూపీందర్ సింగ్ హుడా, డీకే శివకుమార్‌ను పార్టీ పరిశీలకులుగా హిమాచల్‌ప్రదేశ్‌కు పంపించారు. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 68 స్థానాలుండగా, కాంగ్రెస్‌కు 40 మంది, బీజేపీకి 25 మంది, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారు. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ పట్ల అసంతృప్తితో ఉన్న పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు ముగ్గురు స్వతంత్ర సభ్యులు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఒక రాజ్యసభ స్థానానికి మంగళవారం జరిగిన ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌కు తగిన బలం ఉన్నప్పటికీ క్రాస్ ఓటింగ్ జరగడంతో ఆ పార్టీ అభ్యర్థి అభిõÙక్ మనూ సింఘ్వీ ఓడిపోయారు. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రఎమ్మెల్యేలు బీజేపీ అభ్యరి్థకి ఓటువేశారు. ఈ 9 మంది ఎమ్మెల్యేలు బుధవారం అసెంబ్లీకి వచ్చారు. ‘జైశ్రీరామ్, బన్ గయా కామ్’ అని నినదిస్తూ బీజేపీ సభ్యులు వారికి స్వాగతం పలికారు. ఇదిలా ఉండగా, హిమాచల్‌ప్రదేశ్ ప్రజా పనుల శాఖ మంత్రి విక్రమాదిత్య సింగ్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రికి, గవర్నర్‌కు సమరి్పంచానని చెప్పారు. ప్రభుత్వంలో తనకు, తన కుటుంబానికి అవమానాలు ఎదురయ్యాయని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నానని తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో అసలు ఏం జరుగుతోందో అధిష్టానం తెలుసుకోవాలని కోరారు. తన అనుచరులతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకుంటానని వెల్లడించారు. బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు హిమాచల్‌ప్రదేశ్ శాసనసభలో బుధవారం అనూహ్య పరిణామం చేసుకుంది. 15 మంది ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ కులదీప్ సింగ్ పఠానియా సస్పెన్షన్ వేటు వేశారు. వీరిలో ప్రతిపక్ష నేత జైరామ్ ఠాకూర్ కూడా ఉన్నారు. బీజేపీ సభ్యులు సభలో స్పీకర్‌ను అగౌరవపరుస్తున్నారని, ఇతరులతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, సభ సజావుగా సాగాలంటే వారిని సస్పెండ్ చేయాలని కోరుతూ మంత్రి హర్షవర్దన్ చౌహాన్ ప్రవేశపెట్టిన తీర్మానం అసెంబ్లీలో ఆమోదం పొందింది. బడ్జెట్‌ను ఆమోదింపజేసుకోవడానికే తమను సస్పెండ్ చేశారని జైరామ్ ఠాకూర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారీ్టలో పడిందని, ముఖ్యమంత్రి సుఖీ్వందర్ సింగ్ సుఖూ రాజీనామా చేయాలని జైరామ్ ఠాకూర్ అన్నారు. బీజేపీ సభ్యుల సస్పెన్షన్ అనంతరం అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందింది. ప్రజా తీర్పును కాపాడుకుంటాం హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రజా తీర్పును కాలరాచే ప్రయత్నాలను సహించబోమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ చెప్పారు. రాష్ట్రంలోని పార్టీ ఎమ్మెల్యేలందరితో మాట్లాడి, త్వరలో సమగ్ర నివేదిక సమరి్పంచాలని కాంగ్రెస్ పరిశీలకులను ఖర్గే ఆదేశించారని తెలిపారు. వ్యక్తుల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని, అదే సమయంలో ప్రజలు ఇచి్చన తీర్పును కాపాడుకోవడం ముఖ్యమని తేలి్చచెప్పారు. హిమాచల్‌లో అధికారంలోకి రావడానికి బీజేపీ తప్పుడు మార్గాలు వెతుకుతోందని ఆరోపించారు. -
కేజ్రీవాల్ సర్కారు విశ్వాస తీర్మానం
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ సర్కారుపై శుక్రవారం శాసనసభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. మద్యం కుంభకోణంలో ప్రశ్నించేందుకు ఈడీ ఎన్నిసార్లు సమన్లు జారీచేసినా గైర్హాజరవడంతో శనివారం తమ ముందు హాజరుకావాలని సిటీ కోర్టు కేజ్రీవాల్‌ను ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈ చర్యకు దిగడం గమనార్హం. విశ్వాస తీర్మానంపై శనివారం సభలో చర్చించనున్నారు. 70 మంది సభ్యుల అసెంబ్లీలో కేజ్రీవాల్ బలపరీక్షకు సిద్ధపడటం ఇది రెండోసారి. ఆప్‌కు 62 మంది ఎమ్మెల్యేలుండగా బీజేపీ బలం రెండుకు పడిపోయింది. లెఫ్టినెంట్ గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారన్న కారణంతో గురువారం ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలను సెషన్ మొత్తానికీ సస్పెండ్ చేయడమే ఇందుకు కారణం. శుక్రవారం విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి కేజ్రీవాల్ మాట్లాడారు. తమ ఎమ్మెల్యేలంతా తమతోనే ఉన్నారన్నారు. కానీ వారెక్కడ జారిపోతారోననే భయంతోనే ఆయన బలపరీక్షకు దిగారని బీజేపీ ఎద్దేవా చేసింది. -
శాసనసభలో సెల్ఫోన్లు వాడొద్దు
సాక్షి, హైదరాబాద్: శాసనస సభ స్పీకర్ రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక నుంచి సభలో సభ్యులెవరూ సెల్ఫోన్లు, ట్యాబ్‌లు, ఇతర ఎల్రక్టానిక్ గ్యాడ్జెట్స్‌ను వినియోగించకూడదని రూలింగ్ ఇచ్చారు. వాటిని ఉపయోగించి వీడియోలు ప్రదర్శించకూడదని ఆదేశించారు. ‘కృష్ణా నది మీద నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కేఆర్ఎంబీకి అప్పగించే అంశం’మీద సభలో ఇటీవల జరిగిన చర్చ సందర్భంగా అధికార–ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగిన విషయం తెలిసిందే. కేఆర్ఎంబీకి తాము ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత అప్పగించటం లేదని ప్రభుత్వం స్పష్టం చేసిన సమయంలో, ఆ నిర్ణయానికి భిన్నమైన అభిప్రాయాన్ని వెల్లడించిన అప్పటి నీటి పారుదల శాఖ ఈఎన్సీ (ప్రస్తుతం మాజీ) మురళీధర్‌రావు పేర్కొన్నట్టుగా ఉన్న వీడియోను ఫోన్ ద్వారా ప్రదర్శించారు. ఇది ప్రభుత్వాన్ని కొంత ఇ రుకున పెట్టింది. ఈ నేపథ్యంలో సభలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వినియోగంపై గురువారం స్పీకర్ నిర్ణ యం వెల్లడించటం విశేషం. స్పీక ర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా సభలో వాటిని వినియోగించవద్దని స్పష్టం చేశారు. మీడియా పాయింట్ వద్ద కూడా ఇక సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన మీదట బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం వారు మీడియాతో మాట్లాడేందుకు సభ ఆవరణలోని మీడియా పాయింట్ వద్దకు వస్తుండగా భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. సభ జరుగుతున్న తరుణంలో మీడియా పాయింట్ వద్ద మీడియా సమావేశానికి అనుమతి లేదంటూ వారు పేర్కొనడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ బీఆర్ఎస్ సభ్యులు నేలమీద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం సభ ప్రారంభం అవుతూనే స్పీకర్ ప్రసాద్‌కుమార్ కీలక ప్రకటన చేశారు. సభ జరుగుతున్న తరుణంలో సభా ప్రాంగణంలో మీడియా పాయింట్ వద్ద విలేకరుల సమావేశానికి అనుమతి లేదని, టీ, లంచ్ విరామ సమయాల్లో, సభ వాయిదా పడ్డ తర్వాత యధావిధిగా మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడవచ్చని పేర్కొన్నారు. -
నేడు అసెంబ్లీకి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రతిపక్ష నాయకుడి హోదాలో శనివారం తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నారు. రెండు రోజుల కిందట అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. శనివారం రాష్ట్ర ప్రభుత్వం 2024–25 సంవత్సరానికి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతోంది. ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం, ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు కేసీఆర్ రెండ్రోజులుగా దూరంగా ఉన్నారు. బడ్జెట్‌ను శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెడతారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి నేపథ్యంలో కేసీఆర్ డిసెంబర్ 8న జారిపడి గాయపడ్డారు. తుంటి ఎముక శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న కేసీఆర్.. ఈనెల 1న గజ్వేల్ ఎమ్మెల్యేగా స్పీకర్ చాంబర్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే కేసీఆర్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈమేరకు బులెటిన్ కూడా విడుదలైంది. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ తొలిసారిగా సమావేశాలకు హాజరవుతుండటంపై ఆసక్తి నెలకొంది. -
కేసీఆర్‌కు ఈ చాంబర్ ఏంటి?
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఇన్నర్ లాబీలో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఏళ్ల తరబడి కేటాయిస్తూ వస్తున్న చాంబర్‌ను తొలగించి తాజాగా కె.చంద్రశేఖరరావుకు ఔటర్ లాబీలో ఇరుకైన చిన్న గదిని కేటాయించడంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శాసనసభ సమావేశాల తొలిరోజున గురువారం గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్ చాంబర్‌కు వెళ్లి తమ నిరసన తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, హరీశ్‌రావు, సీనియర్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి తదితరులు కేసీఆర్ చాంబర్‌ను మార్చడాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. 39 మంది ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ప్రధాన ప్రతిపక్షం నేత కార్యాలయాన్ని ఇన్నర్ లాబీ నుంచి ఔటర్ లాబీకి మార్చడాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచీ ఇన్నర్ లాబీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ప్రత్యేక చాంబర్‌ను కేటాయించడం ఆనవాయితీగా వస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతకు కేటాయించిన చాంబర్‌ను ఔటర్ లాబీకి తరలించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలపైనా ఫిర్యాదు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాసేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తూ నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలకు సంబంధించిన పలు సంఘటలను కూడా స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అనారోగ్యంతో బాధపడుతున్నా ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి భార్య వచ్చేంత వరకు సుమారు రెండు గంటల పాటు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు నిలిపివేశారన్నారు. నర్సాపూర్, దుబ్బాక, జహీరాబాద్ తదితర నియోజకవర్గాల్లోనూ ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఓటమి పాలైన కాంగ్రెస్ అభ్యర్థులను పోలీసులు ఎస్కార్ట్ వాహనంతో అనుసరిస్తున్నారని స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరగకుండా అధికారులను ఆదేశించాలని స్పీకర్‌ను కోరారు. పని చేయని టీవీ.. డోర్ హ్యాండిల్ లేని బాత్ రూం గతంలో ఐదుగురు సభ్యులున్న కాంగ్రెస్‌కు కూడా చాంబర్‌ను కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇన్నర్ చాంబర్‌లోని ప్రతిపక్ష నేత చాంబర్‌ను తాను వాడుకుంటానని స్పీకర్ కోరడంతో ఔటర్ లాబీకి తన కార్యాలయాన్ని తరలించేందుకు కేసీఆర్ సుముఖత వ్యక్తం చేశారన్నారు. అయితే ఔటర్ లాబీలో ఇరుకైన చిన్న గది కేటాయించారని, అందులోని మూత్రశాలకు కనీసం డోర్ హ్యాండిల్ లేదనీ, టీవీ పనిచేయడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు తెలిపారు. ఇది ప్రతిపక్ష నేతను అవమానించడం లాంటిదేనని, విశాలమైన చాంబర్‌ను కేటాయించాలని కోరారు. వచ్చే సెషన్‌లోగా ప్రతిపక్ష నేత చాంబర్‌ను విశాలంగా తీర్చిదిద్ది అన్ని వసతులు కల్పిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. -
అసెంబ్లీలో టీడీపీ రగడ
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన సభలో మంగళవారం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అవమానకరంగా ప్రవర్తించారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం మీద చర్చను అడ్డుకుని రాద్ధాంతం చేశారు. ఇతర సభ్యులు ఎవరూ ప్రసంగించకుండా స్పీకర్‌ను చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఎంతకీ వారి తీరులో మార్పు రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. ఉదయం 9 గంటలకు సభ ప్రారంభం కాగానే విశాఖ ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాకు శాసనసభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రకటించారు. అనంతరం ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు వల్లూరి రామకృష్ణ చౌదరి (అనపర్తి), అలికిరి జగదీష్ (గుత్తి), పరకాల కాళికాంబ (నరసాపురం) అకాల మృతికి శాసన సభ సంతాపం ప్రకటించింది. తర్వాత గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. ఇంతలో టీడీపీ సభ్యులు నిత్యావసర ధరలపై వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు. చర్చ పూర్తయ్యాక మాట్లాడదామని స్పీకర్ చెప్పారు. ఇందుకు టీడీపీ సభ్యులు అంగీకరించలేదు. ఆ పార్టీ సభ్యులు అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, వెలగపూడి రామకృష్ణ, గద్దె రామ్మోహన్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, ఏలూరి సాంబశివరావు, ఆదిరెడ్డి భవాని సహా 15 మంది స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. అచ్చెన్న వెల్‌లో ఉండగా, మిగతా సభ్యులు పోడియం పైకి ఎక్కి స్పీకర్ కురీ్చని చుట్టుముట్టారు. ప్రభుత్వానికి, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అక్కడితో ఆగకుండా బిల్లు పత్రాలను చింపి స్పీకర్‌పై చల్లి రగడ సృష్టించారు. స్పీకర్ వారిని ఎంతగా వారించినా పద్ధతి మార్చుకోకపోవడంతో 48 నిమిషాల్లోనే సభను వాయిదా వేశారు. తిరిగి ఉదయం 10.34 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు ఈసారి విజిల్స్ తీసుకొచ్చి స్పీకర్ చెవుల్లో ఊదడం ప్రారంభించారు. ఇది సరికాదని, స్పీకర్ పట్ల అవమానకరంగా ప్రవర్తించడం సభ్యత అనిపించుకోదని మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు సుధాకర్‌బాబు, అబ్బయ్య చౌదరి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి వారించినా పట్టించుకోలేదు. వెలగపూడి రామకృష్ణ అత్యుత్సాహం ప్రదర్శించి స్పీకర్ వద్దనున్న బెల్‌ను అదే పనిగా మోగించడం ప్రారంభించారు. సభలో ఇతర సభ్యులు మాట్లాడేది ఏదీ వినబడకుండా, స్పీకర్ చెప్పేది సభ్యులకు వినిపించకుండా టీడీపీ సభ్యులు నానా రగడా సృష్టించారు. దీంతో మార్షల్స్ స్పీకర్ తమ్మినేనికి రక్షణగా నిలబడ్డారు. ఎంత వారించినా వినకపోవడంతో టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. వెంటనే వారు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. బ్రేక్ తర్వాత టీడీపీ సభ్యలు 11 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నారు. -
ఆరు రోజులు.. రెండు స్వల్పకాలిక చర్చలు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ తొలి విడత సమావేశాలు గురువారంతో ముగిశాయి. ఈ నెల 9న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇంధన రంగంపై జరిగిన స్వల్పకాలిక చర్చ అనంతరం ప్రకటించారు. డిసెంబర్ ఏడో తేదీన కొత్త ప్రభుత్వం కొలువుదీరగా, ఈ నెల 9న ఉదయం 11 గంటలకు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో తొలిరోజు కొత్తగా ఎన్నికైనవారు శాసనసభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. 11న స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్, 13న నామినేషన్ల స్వీకరణ, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకే నామినేషన్ దాఖలు కావడంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. 14న నూతన స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. 15న శాసనసభ, శాసనమండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించేందుకు 16న శాసనసభ, మండలి వేర్వేరుగా సమావేశమై చర్చ అనంతరం ఆమోదం తెలిపాయి. ధన్యవాద తీర్మాన ఆమోదం అనంతరం శాసనమండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి నిరవధికంగా వాయిదా వేశారు. శాస నసభను మాత్రం 20వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. 20న రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై, 21న ఇంధన రంగంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ తీవ్ర వాగ్వాదం నడుమ సాగింది. 26 గంటల 33 నిమిషాలు ఆరురోజుల్లో శాసనసభ మొత్తంగా 26 గంటల 33 నిమిషాల పాటు సమావేశమైంది. 19 మంది సభ్యు లు చర్చలో పాల్గొనగా, రెండు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది. తుంటి ఎముక శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మినహా మిగతా 118 మంది శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. -
అప్పుల రాష్ట్రంగా మార్చారు!
సాక్షి, హైదరాబాద్: ‘సంపదతో కూడిన మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే రూ.5 లక్షల కోట్ల అప్పు చేసి అప్పుల రాష్టంగా మార్చారు. కృష్ణా, గోదావరి నుంచి ఓ చుక్క నీటినైనా తెచ్చారా? ఒక్క ఎకరాకైనా అదనంగా నీళ్లు ఇచ్చారా? రూ.లక్షల కోట్లు వృథా చేశారు. ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? ఒక్క ఇందిరమ్మ ఇళ్లయినా ఇచ్చారా? రాష్ట్రంలో పదేళ్లు విధ్వంసం చేశారు. స్వేచ్ఛ లేకుండా చేశారు. ప్రజలు స్వేచ్ఛ ఇచ్చేటువంటి తీర్పునిచ్చారు అని గవర్నర్ ప్రసంగంలో చెప్పాం’అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ విమర్శలు చేస్తుండగా భట్టి విక్రమార్క పలుమార్లు అడ్డుపడి మాట్లాడారు. ‘మనం తెలంగాణ శాసనసభలో చర్చిస్తున్నాం. 2014 జూన్ 2 నుంచి జరిగిన పనుల గురించే మాట్లాడుకోవాలి’అని చెప్పారు. 55 ఏళ్ల ఉమ్మడి రాష్ట్ర పాలన వద్దనే ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నామన్నారు. నాడు కాంగ్రెస్ మంత్రులందరూ రాజీనామా చేసి ప్రత్యేక రాష్ట్రం కావాలని తీర్మానం చేశారని, కేంద్ర నాయకత్వాన్ని ఒప్పించారని చెప్పారు. పార్లమెంట్లో సరైన బలం లేకపోయినా కాంగ్రెస్ మిగిలిన పార్టీలను ఒప్పించి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందన్నారు. చర్చ తొలిరోజే దాడితో ప్రసంగాన్ని మొదలుపెడితే ప్రభుత్వం తగిన రీతిలో సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ పాలనలోనే ఆర్డబ్ల్యూఎస్ పథకం కింద 70–80 శాతం ప్రాంతాలకు తాగునీళ్లు ఇచ్చామని భట్టి గుర్తు చేశారు. మిషన్ భగీరథ కోసం రూ.43 వేల కోట్లు్ల ఖర్చు పెట్టి నీళ్లు ఎక్కడ ఇచ్చారని కేటీఆర్‌ను ప్రశ్నించారు. నల్లగొండకు 2014కు ముందు నీళ్లు రాలేదా? అని పేర్కొన్నారు. సీఎం ఎంపిక హైకమాండ్‌దే: మంత్రి దామోదర కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించినప్పుడు సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్‌కు అప్పగించే సంప్రదాయం ఉందని మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. హైకమాండ్ తీసుకునే నిర్ణయాన్ని తామంతా శిరసావహిస్తామని ప్రజలకు కూడా తెలుసన్నారు. సీనియర్ కాంగ్రెస్ నేతలను కాదని రేవంత్‌రెడ్డిని సీఎం చేయడంపై కేటీఆర్ చేసిన విమర్శకు దామోదర ఈ మేరకు స్పందించారు. పైన పటారం.. లోన లొటారం: మంత్రి పొన్నం గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన పైన పటారం.. లోన లొటారం అన్న చందంగా సాగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైందనే తెలంగాణ తెచ్చుకున్నామని, తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన కార్యక్రమాల గురించి మాట్లాడుకుందామని కేటీఆర్‌కు సూచించారు. మా తాత మీసాల మీద నిమ్మకాయ పెట్టాడంటే నడవదని పొన్నం చెప్పగా.. దీనికి కేటీఆర్ గట్టిగా స్పందించారు. ‘మా తాతలు నెయ్యి తాగిన్రు.. మా మూతులు వాసన చూడండి’అంటే కుదరదని కౌంటర్ ఇచ్చారు. నాగార్జునసాగర్, శ్రీశైలం కట్టామని క్రెడిట్ మాత్రమే తీసుకుంటామంటే నడవదని, కాంగ్రెస్ దురాగతాలను బరాబర్ చెప్తామని పేర్కొన్నారు. మీరా మమ్మల్ని అధికారంలోకి తెచ్చింది: మంత్రి శ్రీధర్ బాబు గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనతో సైతం 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన గురించే చెప్పారని మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ రాజ్యంలోనే సామాజిక న్యాయం, పేదలకు న్యాయం జరిగాయని, ఇళ్లు, భూములు, పోడు భూములొచ్చాయని చెప్పారు. అలాంటి ప్రభుత్వం కోసమే మళ్లీ ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. ఉమ్మడి ఏపీలో 1999లో 91 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారంటూ.. కాంగ్రెస్‌ను తామే గెలిపించామన్న హరీశ్‌రావు వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ‘నాడు మీరెంత మంది ఉన్నారు? ఎన్ని సీట్లలో పోటీ చేసి ఎంత మంది గెలిచారు? మీరా మమ్మల్ని అధికారంలోకి తెచ్చింది’అని నిలదీశారు. -
రేవంత్ ప్రసంగానికి అడ్డు తగిలిన బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలో బీఆర్ఎస్ సభ్యులు పలుమార్లు అడ్డుతగిలారు. రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో బీఆర్ఎస్ పార్టీ పైన, కేసీఆర్ ప్రభుత్వంపైన విమర్శలు చేస్తుండటంతో రెండుసార్లు మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో పలువురు బీఆర్ఎస్ సభ్యులు వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను ప్రస్తావిస్తూ మాజీ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశిస్తూ ‘సిగ్గుతో తలదించుకోవలసిందే’నని రేవంత్ వ్యాఖ్యానించగా హరీశ్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, మాగంటి గోపీనాథ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్ తదితరులు వెల్‌లోకి వెళ్లి నిరసన తెలిపారు. మీకు కూడా మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని స్పీకర్ ప్రసాద్‌కుమార్ తెలపడంతో సీట్లలో కూర్చున్నారు. ► రేవంత్ ప్రసంగంలో బీఆర్ఎస్ను, కేసీఆర్‌ను విమర్శిస్తున్నప్పుడు సభ్యులు పాడి కౌశిక్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ పలుమార్లు అరుస్తూ అడ్డు తగిలే ప్రయత్నం చేశారు. ► రేవంత్ మాటలకు కౌశిక్‌రెడ్డి అడ్డు తగులుతుంటే స్పీకర్ ప్రసాద్‌కుమార్ జోక్యం చేసుకుంటూ ‘కౌశిక్‌రెడ్డి.. కొత్త సభ్యుడివి. సభ నాయకుడు మాట్లాడుతుంటే వినాల్సిందే’అని స్పష్టం చేశారు. ► డ్రగ్స్ మాఫియా గురించి రేవంత్ మాట్లాడుతూ యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్ గురించి మాట్లాడుతుంటే సపోర్ట్ చేసేందుకు మనసు రాలేదా అని ప్రశ్నించగా, ‘వుయ్ సపోర్ట్ యూ’అని పాడి కౌశిక్‌రెడ్డి అరిచారు. దానికి రేవంత్ స్పందిస్తూ ‘ఆయనకు తెలియక మాట్లాడుతున్నాడు. తరువాత ఆయన కష్టాలు ఆయనకుంటాయి’అని వ్యాఖ్యానించారు. కాగా తమ ప్రభుత్వ హయాంలో కూడా డ్రగ్స్ కట్టడికి సీవీ ఆనంద్ నేతృత్వంలో చర్యలు తీసుకున్నామని మాజీ మంత్రి కేటీఆర్ బదులిచ్చారు. ► రేవంత్ మాటలకు కౌశిక్‌రెడ్డి అడ్డు తగిలిన సమయంలో ‘గట్టిగా అరుస్తున్న ఆయన కూడా మేనేజ్మెంట్ కోటానే’అని వ్యాఖ్యానించారు. -
గూండాలు, సైకోల్లా టీడీపీ సభ్యులు
సాక్షి, అమరావతి: శాసన సభలో ప్రతిపక్ష టీడీపీ సభ్యులు గూండాలు, సైకోల్లా వ్యవహరించారని వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెప్పారు. వారు గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టుపై టీడీపీ సభ్యులు సభ ప్రారంభంలోనే చేసిన రచ్చను తీవ్రంగా తప్పుబట్టారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌పై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, తగిన ఫార్మాట్లో వస్తే ఎంతసేపైనా చర్చిద్దామని చెబుతున్నా వినిపించుకోకుండా పోడియం వద్దకు వెళ్లి స్పీకర్‌ను చుట్టుముట్టి, ఆయనపై కాగితాలు విసిరి, మానిటర్‌ను, గ్లాసును పగులగొట్టి టీడీపీ సృష్టించిన గందరగోళం సభా కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగించిందని తెలిపారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సభలో మీసం మెలేసి, తొడగొట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. సభ్యుల వ్యాఖ్యలు వారి మాటల్లోనే.. రచ్చకోసమే అసెంబ్లీకి.. టీడీపీ నేతలు రచ్చకోసమే అసెంబ్లీకి వస్తున్నారు. ఏదో ఒక కారణంతో సభ నుంచి పారిపోతున్నారు. సభలో రేపు స్కిల్ డెవలప్మెంట్ పైన చర్చిస్తున్నాం. 26న ఫైబర్ నెట్, 27న ఇన్నర్ రింగ్ రోడ్డుపై చర్చ ఉంది. ధైర్యం ఉంటే టీడీపీ చర్చకు రావాలి. సభలో బాలకృష్ణ నిజమైన సైకోలా కనిపించాడు. – ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం లాంటి జగన్ ముందు కాదు టీడీపీ సభ్యులు సభలో గూండాలు, సైకోల్లా ప్రవర్తించారు. స్పీకర్ చైర్ మీద గౌరవం లేకుండా స్పీకర్ చుట్టూ చేరి అరుస్తూ పేపర్లు చింపేసి మొహం మీద విసిరేశారు. మానిటర్, మంచి నీటి గ్లాస్ పగులగొట్టారు. శాసన సభ సమావేశాలను బాలకృష్ణ షూటింగ్ అనుకుంటున్నాడేమో. మీసాలు తిప్పుతూ, తొడలు కొడుతున్నాడు. ఏ రోజూ ప్రజా సమస్యలను ప్రస్తావించని బాలకృష్ణ.. బావ కళ్లల్లో ఆనందం చూడటానికి అసెంబ్లీకి వచ్చినట్టున్నాడు. తండ్రి ఎన్టీఆర్ మీద చెప్పులు వేసినప్పుడు చంద్రబాబుపై బాలకృష్ణ మీసాలు తిప్పి ఉంటే రాష్ట్ర ప్రజలు హర్షించేవారు. చంద్రబాబు అవినీతి చేసి దొరికిపోయిన దొంగ. బాలకృష్ణా.. ఫ్లూటు జింక ముందు ఊదు.. సింహం వంటి జగన్ ముందు కాదు. బాలకృష్ణకు తెలిసిందల్లా షూటింగ్‌లకు వెళ్లడం... ఈవెంట్లలో ఆడవాళ్లను గౌరవం లేకుండా మాట్లాడటం. సభలో చర్చ జరిగితే చంద్రబాబు అవినీతి ఆధారాలను పెద్ద స్క్రీన్లపై చూపిస్తామనే భయంతోనే టీడీపీ రివర్స్ డ్రామా ఆడింది. దమ్ము, ధైర్యం ఉంటే బాలకృష్ణ చర్చకు సిద్ధమై సభకు రావాలి. ఎంత సేపైనా చర్చించేందుకు మేం సిద్ధం. సెంట్రల్ జైలు చంద్రబాబు కట్టిందేనని వాళ్లే చెబుతున్నారు. అంటే ఇన్నాళ్లూ అక్కడ ఖైదీలకు ఏ సదుపాయాలూ లేకపోయినా పర్లేదు కానీ చంద్రబాబుకు ఉండాలా?. – మంత్రి ఆర్కే రోజా బాబుకు తప్పించుకునే అవకాశం లేదు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో సాక్ష్యాధారాలతో దొరికిన చంద్రబాబుకు తప్పించుకొనే అవకాశం లేదు. చంద్రబాబు అనేక పాపాలు, నేరాలు, ఘోరాలకు పాల్పడ్డారు. కాంగ్రెస్‌ని, ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచారు. ఒక ఎమ్మెల్సీని కొంటూ దొరికారు. మీడియా బలంతో బయట పడ్డారు. చివరికి చట్టానికి దొరికారు. కోట్లు ఖర్చు పెట్టి పెద్దపెద్ద లాయర్లను తెచ్చారు. వారు కూడా నేరం జరగలేదని అనటంలేదు. టెక్నికల్ అంశాలనే ప్రస్తావిస్తున్నారు. టీడీపీ సభ్యులు అసెంబ్లీ వేదికగా చంద్రబాబు పాపాలను ఒప్పుకోవాలి. దొంగను పట్టుకుంటే సానుభూతి రాదు. నకిలీ సర్వేలతో సానుభూతి పొందాలని చూస్తే ఉపయోగం లేదు. – మంత్రి అంబటి రాంబాబు స్కామ్ జరగలేదని చెప్పరేం? స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ జరగలేదని టీడీపీ చెప్పడంలేదు. స్పీకర్ చర్చిద్దామని చెబుతున్నా టీడీపీ ముందుకు రావడంలేదు. చంద్రబాబును అరెస్టు చేయకూడదని అంటున్నారే తప్ప స్కిల్ స్కామ్ గురించి మాట్లాడటంలేదు. చంద్రబాబును ఎందుకు అరెస్టు చేశారో ప్రజలకు తెలిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఫైబర్ నెట్ కేసులో కూడా అవినీతి జరిగింది. ఈ ఐదు రోజుల్లో చంద్రబాబు అవినీతిపై చర్చించి ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడిస్తాం. – ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం బాబు నైజం స్కిల్ స్కామ్‌లో అడ్డంగా దొరికిన చంద్రబాబు రాజమండ్రి జైల్లో కూర్చుని సత్య హరిశ్చంద్రుడిని అంటూ బిల్డప్ ఇస్తున్నాడు. కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకోవడం బాబు నైజం. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో యువతను దోచుకున్నాడు. సభలో బాలకృష్ణ తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది. ఎమ్మెల్యేగా ఏనాడైనా బాలకృష్ణ ప్రజల సమస్యలపై చర్చించాడా? తండ్రిని వెన్నుపోటు పొడిచినప్పుడు, ఆయనపై చెప్పులు వేయించినప్పుడు బాలకృష్ణ పౌరుషం ఏమైంది? కక్ష సాధించాలంటే చంద్రబాబును ఎప్పుడో అరెస్టు చేసే వాళ్లం. – ఎమ్మెల్సీ పోతుల సునీత సభాపతి పట్ల అమర్యాదగా ప్రవర్తించారు సభలో టీడీపీ సభ్యులు దారుణంగా వ్యవహరించారు. బాలకృష్ణ సినిమాల్లో మాదిరిగా తొడలు కొడుతూ, మీసాలు తిప్పడం దురదృష్టకరం. సస్పెన్షన్ తర్వాత కూడా టీడీపీ సభ్యులు సభా మర్యాదలను పాటించలేదు. పయ్యావుల కేశవ్ సెల్ ఫోన్‌తో చిత్రీకరించాలని చూశారు. సభ నుంచి బయటకు వచ్చి ప్రజలకు వేరే విధమైన సంకేతాలు ఇవ్వాలన్నదే వారి ప్రయత్నం. టీడీపీ వారు మీసాలు తిప్పినా, తొడలు కొట్టినా జనం నమ్మే పరిస్థితి లేదు. – మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ టీడీపీ సభ్యులకు భయం చంద్రబాబు అవినీతిపై చర్చ అంటే టీడీపీ సభ్యులకు భయం. వారు చంద్రబాబు అరెస్టు పైనే మాట్లాడు తున్నారు. స్కిల్ స్కామ్‌పై చర్చిద్దామంటే పారిపోతున్నారు. స్కామ్‌పై చర్చిస్తే దొరికిపోతామన్నది వారి ఆందోళన. చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేశారో ప్రజలకు తెలిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ సమావేశాల్లోనే కచ్చితంగా చంద్రబాబు అవినీతిపై చర్చించి నిజనిజాలను ప్రజల ముందుంచుతాం. – ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు -
Telangana: అక్టోబర్ 5 తర్వాత నగారా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల తరుణం ముంచుకొస్తోంది. తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, మిజోరం శాసనసభల ఎలక్షన్లకు అక్టోబర్ తొలి వారం తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో శాసనసభ ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను పరిశీలించడానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్ నేతృత్వంలో ఎలక్షన్ కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కూడిన కేంద్ర ఎన్నికల సంఘం బృందం వచ్చే నెల 3న రాష్ట్ర పర్యటనకు రానుంది. 5 వరకు అంటే మూడురోజులపాటు విస్తృత సమీక్షలు, వరుస సమావేశాలు నిర్వహించనుంది. మిగతా చోట్ల ఇప్పటికే ముగియడంతో.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు సంసిద్ధతను స్వయంగా పరిశీలించడానికి సీఈసీ బృందం రాష్ట్రాల్లో పర్యటనలు నిర్వహిస్తుంది. ఆ తర్వాత షెడ్యూల్‌ను ప్రకటిస్తుంది. ప్రస్తుతం ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాలకుగాను.. తెలంగాణ మినహా మిగతా 4 రాష్ట్రాల్లో ఇప్పటికే సీఈసీ బృందం పర్యటనలు ముగిశాయి. అక్టోబర్ 5వ తేదీ నాటికి తెలంగాణలోనూ పర్యటన ముగుస్తుంది. అంటే ఆ తర్వాత ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం గత శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను 2018 అక్టోబర్ 6న ప్రకటించగా.. అదే ఏడాది డిసెంబర్ 7న పోలింగ్, 11న ఫలితాలను ప్రకటించారు. ఈసారి కొన్ని రోజులు అటూఇటూగా షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలను ఒక్కో దఫాలోనే పూర్తి చేశారు. అలాగే ఈసారి కూడా ఒకే దఫాలో నిర్వహించవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత శాసనసభ గడువు వచ్చే ఏడాది జనవరి 16వ తేదీతో ముగుస్తుంది. ఆలోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా చేపట్టిన ఓటర్ల జాబితా రెండో సవరణ కార్యక్రమంలో భాగంగా.. అక్టోబర్ 4న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. దానితో ఎన్నికలకు సర్వం సిద్ధమైనట్టేనని అధికారవర్గాలు చెప్తున్నాయి. సీఈసీ బృందం షెడ్యూల్ ఇదీ.. ► కేంద్ర ఎన్నికల కమిషనర్ల బృందం రాష్ట్ర పర్యటనలో భాగంగా.. అక్టోబర్ 3న జాతీయ, రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశమై, అభిప్రాయ సేకరణ జరుపుతుంది. అనంతరం వివిధ కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై.. ఎన్నికల్లో ధనం, మద్యం, ఇతర ప్రలోభాలు, అక్రమాల నిర్మూలన కోసం తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తుంది. తర్వాత రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్, రాష్ట్ర పోలీసు నోడల్ అధికారి (ఎస్ఎన్పీఓ), కేంద్ర సాయుధ బలగాల నోడల్ అధికారి తమ సన్నద్ధతను ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారు. ► అక్టోబర్ 4న ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 33 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు/పోలీసు కమిషనర్లతో సీఈసీ బృందం సమావేశం అవుతుంది. జిల్లాల వారీగా క్షేత్రస్థాయిలో ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లు, ఎస్పీలు/పీసీలు ప్రజెంటేషన్ ఇస్తారు. ► అక్టోబర్ 5న ఓటర్లలో చైతన్యం కల్పించడానికి అమలు చేస్తున్న ‘స్వీప్’ కార్యక్రమం తీరు తెన్నులను సీఈసీ బృందం పరిశీలిస్తుంది. ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రచారకర్తలుగా ఉన్న క్రీడా, సినీ రంగ సెలబ్రిటీలతో సమావేశం అవుతుంది. దివ్యాంగ, యువ ఓటర్లతో ముఖాముఖీగా మాట్లాడుతుంది. చివరిగా ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌లతో సమావేశమై రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం, భద్రత సంస్థలను సమన్వయం పర్చే అంశంపై సమీక్షిస్తుంది. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి తమ పర్యటన విశేషాలను వెల్లడిస్తుంది. -
విద్యారంగంపై ఇంత నిర్లక్ష్యమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి దారుణంగా ఉందని, క్రమంగా అది తీసికట్టుగా మారుతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. విద్య–వైద్యంపై శుక్రవారం శాసనసభ లో జరిగిన స్వల్పకాలిక చర్చలో పాల్గొంటూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యారంగానికి సంబంధించి ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా.. వాస్తవంగా పరిస్థితులు బాగా లేవని, తెలంగాణ వచ్చాక విద్యా రంగానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గుతున్నాయని అంకెలతో సహా వివరించారు. అయితే, భట్టి విక్రమార్క సభను, తద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే అంకెలు చెబుతున్నారని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. కేవలం విద్యాశాఖ బడ్జెట్‌ను మాత్రమే భట్టి పేర్కొంటున్నారని, ఇతర శాఖల ద్వారా కూడా విద్యారంగానికి జరుగుతున్న కేటాయింపులను ఆయన ప్రస్తావించలేదని అన్నారు. దీనికి భట్టి జవాబు ఇస్తూ, ప్రతి సంవత్సరం బడ్జెట్ పద్దు పెరుగుతున్నప్పుడు, ఆ దామాషా ప్రకారం విద్యా రంగానికి కేటాయింపులు లేక పోవటం అంటే బడ్జెట్ తక్కువ ఇచ్చినట్టేనంటూ మళ్లీ సభ ముందు లెక్కలు ఉంచారు. ఇదేనా మీ స్ఫూర్తి: స్పీకర్‌పై భట్టి అసహనం.. తాను మాట్లాడుతుండగా మంత్రులు పదేపదే అడ్డు తగులుతుండటం, ప్రసంగాన్ని ముగించాలని స్పీకర్ బెల్ కొడుతుండటంతో ఓ దశలో భట్టి అసహనం వ్యక్తం చేశారు. ‘నేను ఐదు నిమిషాలు మాట్లాడితే, మంత్రులు పది నిమిషాలు అడ్డుతగులుతున్నారు. వారు లేచినప్పుడల్లా మీరు వారికి మైక్ ఇస్తున్నారు. ఇదేనా మీ ప్రజాస్వామ్య స్ఫూర్తి?’ అని ప్రశ్నించారు. కాగా, వచ్చే అసెంబ్లీకి బీఆర్ఎస్ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు కూడా వస్తారో రారో తెలియదని, అంతకు మించి అయితే రారని భట్టి వ్యాఖ్యానించారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సభ జరుగుతున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. -
గవర్నర్ తిరస్కరించిన బిల్లులు మళ్లీ పాస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ రెండో రోజు సమావేశాల్లో కీలకమైన 4 బిల్లులకు తిరిగి ఆమోదం లభించింది. అసెంబ్లీ గతంలోనే పురపాలక శాసనాల చట్టం (సవరణ) బిల్లు, ప్రభుత్వ ఉద్యోగ (పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ)బిల్లు, రాష్ట్ర ప్రైవేటు విశ్వవిద్యాలయాల (స్థాపన, క్రమబద్దీకరణ) సవరణ బిల్లు, పంచాయతీరాజ్ చట్ట (సవరణ) బిల్లులను పాస్ చేసింది. ప్రభుత్వం వాటిని గవర్నర్ తమిళిసైకి పంపించినా ఆమోదముద్ర వేయలేదు. ఆయా బిల్లుల్లోని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తిప్పిపంపేశారు. ఈ క్రమంలో ఆ నాలుగు బిల్లులను పునః పరిశీలించాలంటూ సంబంధిత మంత్రులు శుక్రవారం రాత్రి శాసనసభలో ప్రతిపాదించగా ఆమోదం లభించింది. శాసనసభ రెండోసారి పాస్ చేసి పంపుతున్న నేపథ్యంలో ఈ బిల్లులను గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ఉదయం నుంచి ప్రశ్నోత్తరాలు, లఘు చర్చలతో శుక్రవారం ఉదయం 10 గంటలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన శాసనసభ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర సాంకేతిక సేవల సంస్థ, ఉద్యాన అభివృద్ధి సంస్థ, విద్యుత్ సరఫరా సంస్థ, ఉపాధ్యాయుల బదిలీ ల నియమావళి, చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి సంస్థ, అటవీ అభివృద్ధి సంస్థల నివేదికలను సంబంధిత మంత్రులు సభకు సమర్పించారు. తర్వాత ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. ఎజెండాలో పది ప్రశ్నలు ఉన్నప్పటికీ సమయాభావం కారణంగా.. ఐటీ ఎగుమతులు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలు, చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు, ఆరోగ్య లక్ష్మి పథకం తదితర అంశాలపైనే మంత్రులు సమాధానాలిచ్చారు. అంతకుముందు మాజీ ఎమ్మెల్యేలు కె.విజయరామారావు (ఖైరతాబాద్), కొమిరెడ్డి రాములు (మెట్పల్లి), కొత్తకోట దయాకర్‌రెడ్డి (మక్తల్), సోలిపేట రామచంద్రారెడ్డి, (దొమ్మాట), చిల్కూరి రామచంద్రారెడ్డి (ఆదిలాబాద్) మృతిపట్ల సంతాపం ప్రకటిస్తూ సభ రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. ఇటీవల సంభవించిన వరదలపై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, బీజేపీ సభ్యుడు రఘునందన్‌రావు ఇచ్చిన వాయిదా తీ ర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. జీరో అవర్ తర్వాత మధ్యాహ్నం 12.05కి స్పీకర్ టీబ్రేక్ విరా మం ఇవ్వగా.. సభ తిరిగి 12.50కి సమావేశమైంది. వరదలు, విద్య, వైద్యారోగ్యంపై లఘు చర్చ రెండో రోజు సమావేశం ఎజెండాలో భాగంగా రెండు అంశాలపై లఘు చర్చ జరిగింది. భారీ వర్షాలు, వరదల నష్టం, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై జరిగిన చర్చకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. అయితే తాము లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం స్పందించలేదంటూ కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. తర్వాత రాష్ట్రంలో విద్య, వైద్యారోగ్య రంగాలపై చర్చను ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ ప్రా రంభించారు. దీనిపై రాత్రి 8 వరకు సభ్యుల ప్రసంగాలు కొనసాగాయి. తర్వాత మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీశ్‌రావు ఆయా అంశాలపై సమాధానాలిచ్చారు. రాత్రి 10.20 వరకు సమావేశం కొనసాగగా.. కీలక బిల్లులను ఆమోదించాక శనివారం ఉదయం 10 గంటలకు సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. గవర్నర్ తిరస్కరించడంతో.. అసెంబ్లీ సమావేశాల్లో ఎనిమిది బిల్లులను ప్రవేశపెడతామని బీఏసీ సమావేశంలో ప్రభుత్వం తెలిపింది. అందులో గవర్నర్ తిప్పిపంపిన నాలుగు బిల్లులను శుక్రవారం సభలో ప్రవేశపెట్టారు. పురపాలక బిల్లును మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ఉద్యోగ (పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ) బిల్లును మంత్రి హరీశ్‌రావు, ప్రైవేటు వర్సిటీల బిల్లును మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీరాజ్ బిల్లును ఎర్రబెల్లి దయాకర్‌రావు సభకు సమర్పించారు. వాటిని పునః పరిశీలించి ఆమోదించాలని కోరారు. ఈ బిల్లులను తిరస్కరిస్తూ గతంలో గవర్నర్ కార్యాలయం నుంచి మూడు సందేశాలు అందాయని ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. వీటిపై సభ్యుల నుంచి అభ్యంతరాలు స్వీకరించాక.. బిల్లులను సభ ఆమోదించినట్టు ప్రకటించారు. ఇక శనివారం సభలో ‘తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ బిల్లు, ఫ్యాక్టరీల చట్టం సవరణ బిల్లు, రాష్ట్ర అల్పసంఖ్యాక వర్గాల కమిషన్ (సవరణ) బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. సభ్యులు సభలో ఉండాలి: కేటీఆర్ శాసనసభ సమావేశాలను 30 రోజులు జరపాలని బీజేపీ, 20 రోజులు జరపాలని కాంగ్రెస్ కోరాయని.. కానీ చర్చల సమయంలో ఆ పారీ్టల సభ్యులు సభలో ఉండటం లేదని మంత్రి కేటీఆర్ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సమయంలోనే ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సభలోకి రాగా.. ‘‘శ్రీధర్ బాబుగారికి వెల్కమ్. శాసన సభ్యులు కచ్చితంగా సభలో ఉండేలా చూడాలి. సభలో ఉండి సమాధానాలు వినాలి. బయటికి వెళ్లి అటూ ఇటూ తిరగడం, మీడియాతో మాట్లాడడం సరికాదు’’అని కేటీఆర్ పేర్కొన్నారు. దీనిపై రాజాసింగ్ స్పందిస్తూ.. తనతోపాటు రఘునందన్‌రావు బీజేపీ తరఫున ఉన్నారని పేర్కొన్నారు. దీంతో బీజేపీ నుంచి సస్పెండైన మీరు ఆ పార్టీ ఎమ్మెల్యే కాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక జీరో అవర్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేవనెత్తిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘‘మీరు సంగారెడ్డి వరకు మెట్రో కోరితే.. మేం ఇస్నాపూర్ వరకు మంజూరు చేసినా అభినందించడం లేదు. సంగారెడ్డి, ములుగు, పెద్దపల్లిలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేసినా.. ప్రభుత్వాన్ని అభినందించేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీతక్క, జగ్గారెడ్డి, శ్రీధర్‌బాబులకు మనసు రావడం లేదు..’’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
మాది మానవీయ బడ్జెట్
సాక్షి, అమరావతి :తమ ప్రభుత్వానిది సమాజంలో అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధిని అందించే మానవీయ బడ్జెట్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ‘ఇది అక్క చెల్లెమ్మలు, రైతన్నల పక్షపాత బడ్జెట్.. గ్రామ స్వరాజ్య బడ్జెట్.. మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సామాజిక న్యాయ బడ్జెట్’ అని చెప్పారు. శుక్రవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా రూపొందించి అమలు చేస్తున్నట్టుగానే 2023–24లోనూ మానవీయ బడ్జెట్‌ను అందించామన్నారు. కచ్చితంగా సంక్షేమ కేలండర్‌ను ప్రకటించి ఆ మేరకు అన్ని వర్గాల లబ్ధిదారులకు ప్రయోజనం కల్పిస్తున్నామని చెప్పారు. తాము ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావిస్తున్న మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీకి గత నాలుగేళ్లుగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తూ, ఆ పనులు పూర్తి చేస్తూ వచ్చామని తెలిపారు. గత నాలుగు బడ్జెట్లలోనూ ఇదే మానవత్వం కనిపించిందన్నారు. -
మహిళా రిజర్వేషన్ బిల్లుపై... శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు
పూణే: లోక్‌సభ, శాసన సభల్లో మహిళల రిజర్వేషన్ విషయమై కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించే విషయంలో ఉత్తర భారతదేశం సానుకూలంగా లేదని, వాళ్లు దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ఈ మేరకు శనివారం పూణే డాక్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తన కుమార్తె లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సూలేతో పాల్గొని ఇచ్చిన ఇంటర్వ్యూలో శరద్ పవార్ ఈ వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలోనూ అన్ని రాష్ట్రాల శాసన సభల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఉండాలని రూపొందించిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంకా ఆమోదం పొందాల్సి ఉంది. ఈ విషయలో దేశం ఇంకా మానసికంగా సిద్ధంగా లేనట్టుంది అని శరద్ పవర్‌ని మీడియా ప్రశ్నించగా...దీనికి ఆయన సమాధామిస్తూ...తాను కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి పార్లమెంట్లో ఈ అంశంపై మాట్లాడుతున్నానని పవార్ అన్నారు. ముఖ్యంగా అందుకు ఉత్తర భారతదేశం సుముఖంగా లేదని స్పష్టం చేశారు. తాను ఒకసారి ఈ అంశంపై ప్రసంగిస్తుంటే తమ పార్టీకి చెందిన మెజార్టీ ఎంపీలు లేచి వెళ్లిపోయారని చెప్పారు. ముఖ్యంగా తమ పార్టీకి చెందిన వారే దీన్ని జీర్ణించుకోలేకపోత్నురని తనకు అప్పుడే స్పష్టమైందని అన్నారు. ఈ బిల్లు ఆమోదం పొందేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తూనే ఉండాలని శరద్‌పవార్ అన్నారు. అంతేగాదు తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ..జిల్లా పరిషిత్, పంచాయితీ సమితి వంటి స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టానని, మొదట్లో వ్యతిరేకించిన తర్వాత ప్రజలే దానిని ఆమోదించారని చెప్పుకొచ్చారు. (చదవండి: యడ్డి తనయుడిపై లోకాయుక్తాలో కేసు) -
గోవా పీఠంపై మళ్లీ బీజేపీ!
చిన్న రాష్ట్రం గోవాలో ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని మరీ అధికార బీజేపీ మంచి ఫలితాలు సాధించింది. మొత్తం 40 సీట్లకు గాను 20 సీట్లు గెలుచుకుంది. శాసనసభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్‌కు అడుగు దూరంలో ఆగిపోయింది. జీఎఫ్‌పీతో కూడిన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూటమి 12 స్థానాలు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 2, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూటమికి 3 సీట్లు వచ్చాయి. తృణమూల్ కూటమిలో ఉన్న ఎంజీపీ రెండు సీట్లు సాధించింది. ముగ్గురు స్వతంత్రులు నెగ్గారు. ఎంజీపీకి చెందిన ఇద్దరు సభ్యులతోపాటు ముగ్గురు స్వతంత్రులు బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. దీంతో బీజేపీ బలం 25కు చేరింది. గోవాలో మరోసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరడం ఇక లాంఛనమే. ఎంజీపీ తమకు బేషరతుగా మద్దతునిచ్చేందుకు అంగీకరించిందని ముఖ్యమంత్రి, బీజేపీ నేత ప్రమోద్ సావంత్ చెప్పారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నట్లు బీజేపీ గోవా ఎన్నికల ఇన్చార్జి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ప్రభుత్వ నూతన సారథి ఎవరన్నది పార్టీ నాయకత్వమే నిర్ధారిస్తుందని ప్రమోద్ సావంత్ అన్నారు. కొత్త ప్రభుత్వంపై మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ(ఎంజీపీ)కి ప్రాతినిధ్యం కల్పించాలా, లేదా ఇంకా నిర్ణయించలేదని వెల్లడించారు. శుక్రవారం జరగబోయే బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో దానిపై స్పష్టత వస్తుందన్నారు. గోవా ఎన్నికల్లో ఓటమిపై రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు గిరీష్ చోడాంకర్ స్పందించారు. నాన్–బీజేపీ ఓట్లు చీలిపోవడం వల్లే కమలం పార్టీ గెలిచిందని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 33.31 శాతం, కాంగ్రెస్ 23.46 శాతం ఓట్లు సాధించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అమిత్ పాలేకర్ ఓటమి చెందడం గమనార్హం.