
బడ్జెట్ లోటు ఉన్నందున.. ఉన్నదాంతోనే సరిపెట్టుకోవాలి
స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు
రామభద్రపురం: ఫ్రీ(ఉచితం)గా ఏమిచ్చినా తీసుకోవడానికి జనం సిద్ధంగా ఉన్నారంటూ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్య చేశారు. విజయనగరం జిల్లా బూసాయవలసలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. బడ్జెట్ లోటు ఉన్నందున.. ఉన్నదాంతోనే సరిపెట్టుకోవాలని సూచించారు.
బడ్జెట్‌ను బట్టి సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదన్నారు.