Chintakayala ayyannapatrudu
-
ఏపీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు నామినేషన్
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ వేశారు. శుక్రవారం ఉదయం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం అయ్యన్న తరపున కూటమి నేతలు నామినేషన్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి మంత్రులు పవన్, నారా లోకేష్, ఇతరులు పాల్గొన్నారు.ఏపీ అసెంబ్లీలో ఇవాళ 172 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాలుగు పార్టీల ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. ఇక రేపు మిగిలిన ముగ్గురు సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయనున్నారు. ఆ తర్వాత స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక డిప్యూటీ స్పీకర్ పోస్ట్ జనసేన లేదంటే బీజేపీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపించినప్పటికీ.. టీడీపీనే ఆ పోస్ట్ దక్కించుకునే అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్ బదులు జనసేనకు విప్ పోస్ట్‌తో సరిపెట్టవచ్చని సమాచారం.అయ్యన్నపాత్రుడి కామెంట్స్.. చంద్రబాబు , పవన్, బీజేపీ నేతలు నన్ను స్పీకర్ గా నామినేట్ చేశారు. నామినేషన్ వేశాను. సాయంత్రం వరకు నామినేషన్ గడువు ఉంది..ఇంకా ఎవరైనా వేస్తారేమో వేచి చూడాలి. స్పీకర్ గా ఎన్నిక కావడం సంతోషం గా ఉంది. గతంలో ఎమ్మెల్యే గా, మంత్రిగా, ఎంపీ గా పని చేశాను. స్పీకర్ గా కుర్చీలో కూర్చున్న తరువుతా పార్టీ గుర్తు రాకూడదు. గౌరవ సభ్యులకు కూడా ప్రాధాన్యత ఇస్తాను. మాట్లాడేందుకు సమయం ఇస్తాను. -
అయ్యన్నపాత్రుడి బూతు పురాణం..
-
టీడీపీ విద్వేష భాష
-
టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుకి సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: ఫోర్జరీ కేసులో కౌంటరు దాఖలు చేయాలని టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడుకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బిల్డింగ్ ప్లాన్ విషయంలో సంతకాలు ఫోర్జరీ చేశారన్న కేసులో హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈఈ మల్లికార్జునరావు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. గత విచారణ సమయంలో జారీ చేసిన నోటీసులు రెండు రోజుల క్రితమే అందాయని అయ్యన్న పాత్రుడు తరపు న్యాయవాది తెలిపారు. దీంతో రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని అయ్యన్నకు ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ ఫిబ్రవరి 27కు వాయిదా పడింది. చదవండి: (ప్రత్యేక హోదాపై గళమెత్తుతాం: వైఎస్సార్సీపీ ఎంపీలు) -
చింతకాయల విజయ్‌కు షాకిచ్చిన చంద్రబాబు
సాక్షి, అమరావతి: టీడీపీ సోషల్ మీడియా విభాగం ఇన్ఛార్జిగా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్‌కు చంద్రబాబు షాక్ ఇచ్చారు. విజయ్ స్థాయిని తగ్గించి ఆయనపై మరో ఇద్దరు నేతలు పయ్యావుల కేశవ్, జీవీ రెడ్డిని సోషల్ మీడియా సలహాదారులుగా నియమించారు. పార్టీలో సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యేగా ఉన్న పయ్యావులకు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించడం ద్వారా విజయ్‌కు చెక్ పెట్టినట్లేనని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. పయ్యావుల నేతృత్వంలో జీవీ రెడ్డికి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. విజయ్ ఇకపై కేవలం ఐటీడీపీ బాధ్యతలు మాత్రమే చూస్తూ పయ్యావుల, జీవీ రెడ్డి కింద పనిచేయాల్సి ఉంటుందని టీడీపీ నేతలు చెప్పారు. టీడీపీ సోషల్ మీడియా సమర్థంగా పనిచేయడం లేదని చంద్రబాబు భావించడం వల్లే ఈ మార్పులు జరిగినట్లు టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. చదవండి: (చంద్రబాబుపై బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్) -
‘ప్రొక్లెయిన్‌తో వెళ్తే తండ్రి పారిపోయాడు.. గోడదూకి కొడుకు పారిపోయాడు’
సాక్షి, తాడేపల్లి: ఇళ్ల నిర్మాణాలపై ఈనాడులో తప్పుడు వార్తలు రాశారని గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామోజీరావుకి దమ్ముంటే ఆ వార్త నిజమని నిరూపించాలని డిమాండ్ చేశారు. నేను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే నా పదవికి రాజీనామా చేస్తా. నిరూపించకపోతే నీ ఈనాడు ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తావా? అని సవాల్ విసిరారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'రాజ్యాంగం టీడీపీ వారికి వర్తించదా?. ఎలాగైనా వ్యవహరించవచ్చని రాసుందా?. చింతకాయల విజయ్ అరాచకవాది. ఐటీడీపీ అనే దాన్ని అతను పర్యవేక్షిస్తున్నాడు. మహిళల మాన, ప్రాణాల గురించి వెబ్ సైట్లో దారుణంగా పోస్టులు పెట్టాడు. అతని దగ్గరకు సీఐడీ పోలీసులు వెళ్తే దాడి చేసినట్టు తప్పుడు కథనాలు రాశారు. దొంగ ఇంటికి పోలీసులు వెళ్తారని తెలీదా?. విజయ్ తప్పు చేయకపోతే ఎందుకు గోడ దూకి పారిపోయాడు?' అని ప్రశ్నించారు. చదవండి: (ఐటీడీపీ పేరుతో చింతకాయల విజయ్ చేసే పని అదా?: మేరుగ నాగార్జున) 'రామోజీరావు, రాధాకృష్ణలకు కూడా ఫ్యామిలీ ఉంది. మేము వారందరినీ గౌరవిస్తున్నాం. మా నాయకుడు జగన్ అలా నేర్పాడు. కానీ ఇతరుల కుటుంబాలపై తప్పుడు పోస్టులు పెడితే మీరు ఎలా సపోర్ట్ చేస్తారు?. మీవారు చేసిన పనే ఇంకెవరైనా చేస్తే మీకు ఎలా ఉంటుంది?. ఒక దొంగని ఎల్లోమీడియా సపోర్టు చేస్తోంది. విజయ్ తప్పు చేయకపోతే ధైర్యంగా వచ్చి ఆ మాట సీఐడీ పోలీసులకు చెప్పాలి. ప్రభుత్వ స్థలాన్ని తండ్రి ఆక్రమించాడు. ప్రొక్లెయిన్ తీసుకుని వెళ్తే తండ్రి పారిపోయాడు. కొడుకు తప్పుడు పని చేసి గోడదూకి పారిపోయాడు. అయ్యన్నపాత్రుడు నోరు తెరిస్తే పచ్చిబూతులు మాట్లాడుతున్నారు. చంద్రబాబు, అయ్యన్నపాత్రుడులకి కొడుకుల మీద నమ్మకం పోయినట్లుంది. అందుకే ఏం మాట్లాడాలో తెలియక బూతులు మాట్లాడుతున్నారు. మహిళలకు జగన్ 50% రిజర్వేషన్ ఇచ్చి ముందుకు తీసుకుని వెళ్తుంటే మీరేమో దుర్మార్గాలు చేస్తున్నారు. రాక్షసుల్లాగ వ్యవహరిస్తున్నారు. అలాంటి వారిని పోలీసులు అరెస్టు చేయకూడదా?. వారిని సమర్థిస్తే రేపు మీ కుటుంబ సభ్యుల మీద కూడా పోస్టులు పెడతారు. మా లీడర్ మాకు సంస్కారం, బాధ్యతలు నేర్పాడు. మీరేమో అరాచకవాదులను తయారు చేస్తున్నారు. మీరు సమర్థిస్తే రేపు మీ మీడియాలో అరాచశక్తులకు అండగా ఉంటామని రాయండి' అని మంత్రి జోగి రమేష్ సూచించారు. -
దొంగను పట్టుకునేందుకు CID పోలీసులు వెళ్తే తప్పా : జోగి రమేష్
-
నోరు అదుపులో పెట్టుకో.. లేకుంటే ప్రజలే నాలుక చీరేస్తారు
సాక్షి, అనకాపల్లి: స్థాయి మరిచి నోటికి వచ్చినట్లు ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే ప్రజలే నీ నాలుక చీరేస్తారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడును రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటుగా హెచ్చరించారు. చోడవరం వైఎస్సార్సీపీ ప్లీనరీలో పాల్గొన్న మంత్రి అమర్నాథ్ ఇటీవల టీడీపీ మినీమహానాడులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడుల మాట తీరుపై తీవ్రంగా స్పందించారు. ఒక ముఖ్యమంత్రిని నోటికి వచ్చినట్టు ఏక వచనంతో తన బ్యాండ్ బాజా అయ్యన్నపాత్రుడు ఇష్టానుసారంగా తిడుతుంటే పక్కనే ఉన్న 14ఏళ్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు వారించకపోవడం సిగ్గుచేటన్నారు. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని మాట్లాడితే చూస్తూ ఊరుకోమని అమర్నాథ్ నిప్పులు చెరిగారు. చదవండి: (YSRCP Plenary 2022: కొడాలి నాని కీలక వ్యాఖ్యలు) -
3 రాజధానుల నుంచి జనం దృష్టి మరల్చేందుకే..
నర్సీపట్నం: చింతకాయల అయ్యన్నపాత్రుడు పిచ్చి ప్రేలాపన మానుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేష్ హెచ్చరించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక నేరస్థుడైన అయ్యన్నపాత్రుడే ఆర్థిక నేరాల గురించి మాట్లాడటం సిగ్గు చేటన్నారు. రాజకీయాల్లోకి రాకముందు ఎన్ని ఆస్తులున్నాయో.. రాజకీయాల్లోకి వచ్చాక వేల కోట్లు ఎలా సంపాదించావో చెప్పాలని డిమాండ్ చేశారు. తమపై వచ్చిన అవినీతి ఆరోపణల నుంచి, రాయలసీమ ప్రజల మూడు రాజధానుల ఉద్యమం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే పిచ్చి తుగ్లక్ లాంటి అయ్యన్నపాత్రుడితో చంద్రబాబు, లోకేశ్‌లు పిచ్చి ప్రేలాపనలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎల్లో మీడియాకు మేత కోసమే అయ్యన్నపాత్రుడు మందు కొట్టి మాట్లాడుతున్నారని.. ఆయనవి మత్తు మాటలు.. మందు మాటలు.. మతిలేని మాటలంటూ ఎద్దేవా చేశారు. సుదీర్ఘకాలం మంత్రిగా వెలగబెట్టిన అయ్యన్నపాత్రుడు నర్సీపట్నాన్ని గంజాయి అడ్డాగా మార్చారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో మంత్రిగా అతను ఏం చేశాడన్నది చూస్తే.. గంజాయి రవాణా తప్ప అభివృద్ధి శూన్యమన్నారు. తండ్రీకుమారులు ఇద్దరి చేతిలోనూ ఓడిపోయారు.. సిగ్గు లేదా చంద్రబాబు? 2019 ఎన్నికల్లోనే కాక.. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఓడిపోయినందుకు, వైఎస్సార్ చేతిలో, ఆయన కుమారుడు వైఎస్ జగన్ చేతిలో ఓడినందుకు సిగ్గుతో రాజీనామా చేయాల్సింది చంద్రబాబేగానీ, ప్రతి రూపాయినీ ప్రజల కోసమే ఖర్చు చేస్తున్న సీఎం జగన్ కాదని ఉమాశంకర్‌గణేశ్ స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు, లోకేశ్‌లు రూ.241 కోట్లను అప్పనంగా కొట్టే్టశారని ప్రజలు గుర్తించారని, సంతకం పెట్టిందెవరన్నది కాదు.. బస్తాల్లో డబ్బులు పట్టుకుపోయిందెవరన్నదే ముఖ్యమన్న విషయాన్ని అయ్యన్నపాత్రుడు తెలుసుకోవాలంటూ ఉమాశంకర్ గణేశ్ హితవుపలికారు. -
అయ్యన్నకు మతి భ్రమించింది: జయరాం
సాక్షి, అమరావతి: ‘పచ్చ’ కళ్ల వానికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని ఉద్దేశించి రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ విమర్శించారు. తాడేపల్లిలో మంగళవారం ఆయన తనను కలిసిన మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. టీడీపీ అధికారం కోల్పోయాక మంత్రులుగా పనిచేసిన మాజీలకు పూర్తిగా మతిభ్రమించిందన్నారు. ఆలూరు నియోజకవర్గం వచ్చి వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. నిరాధార ఆరోపణలు చేస్తే పరువు నష్టం కేసు వేస్తానని మంత్రి హెచ్చరించారు. ఫ్యాక్టరీ పెట్టాలనే తలంపుతో 15 ఏళ్ల క్రితం మంజునాథ్, మను అనే సోదరులు రైతుల వద్ద భూమిని కొనుగోలు చేశారని తెలిపారు. తరువాత వారి మధ్య విభేదాలు రావడంతో అందులో కొద్దిపాటి భూమిని మాత్రమే మంజునాథ వద్ద తాను కొన్నానని వివరించారు. ఒక బీసీ రైతు 30 ఎకరాలు కొనుగోలు చేయకూడదా అని ప్రశ్నించారు. రెండెకరాల చంద్రబాబు రూ.వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించాడో అయ్యన్నపాత్రుడు సమాధానం చెప్పాలని నిలదీశారు. -
అయ్యన్నపై మొదలైన విచారణ
నర్సీపట్నం: మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడుపై నిర్భయ చట్టంలోని పలు సెక్షన్ల కింద నమోదైన కేసుపై విచారణ కొనసాగుతుందని ఏఎస్పీ తుహన్ సిన్హా తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అయ్యన్నపాత్రుడు అసభ్య పదజాలంతో దూషించి, తన విధులకు భంగం కలిగించారని మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకున్యాయసలహా తీసుకుని ఐపీసీ సెక్షన్ 354–ఎ(4), 500, 504, 505(1)(బి), 505(2), 506, 509 ప్రకారం కేసు నమోదు చేశామని ఏఎస్పీ తెలిపారు. బుధవారం ప్రాథమిక విచారణ ప్రారంభించామన్నారు. కేసును పట్టణ సీఐ దర్యాప్తు చేస్తున్నారన్నారు. విచారణ అనంతరం తీసుకునే చర్యలు గురించి వివరిస్తామన్నారు. -
యాంకర్స్‌తో మాజీ మంత్రి డాన్స్.. వీడియో వైరల్
-
యాంకర్స్‌తో టీడీపీ నేత డాన్స్.. వీడియో వైరల్
సాక్షి, అమరావతి : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి డాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ఎల్లు వచ్చి గోదారమ్మ’ అనే పాటకు ఆయన లయబద్ధంగా స్టెప్పులు వేశారు. అయ్యన్నపాత్రుడి కుమారుడి వివాహం శుక్రవారం విశాఖపట్నంలో జరిగింది. కొడుకు పెళ్లి రిసెప్షన్లో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు డాన్స్ చేశారు. ‘దేవత’ సినిమాలో శోభన్ బాబు మాదిరి ఇద్దరు యాంకర్లతో కలిసి అయ్యన్నపాత్రుడు స్టెప్పులేశారు. వ్యాఖ్యాతల చేతులు పట్టుకొని పాటకు తగిన స్టెప్పులేసి అలరించారు. అంతేకాకుండా చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ప్రతీ ఒక్క మాస్ ఆడియన్స్‌ని ఇటీవల ఉర్రూత లూగించిన ‘ గున్న గున్న మామిడి’ పాటకి బంధువులతో కలిసి చిందులేశారు. ప్రసుత్తం ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. -
వైఎస్సార్సీపీలోకి అయ్యన్నపాత్రుడి సోదరుడు
సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి సోదరుడు చింతకాయల సన్యాసిపాత్రుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో సోమవారం వైఎస్సార్సీపీలో చేరారు. సన్యాసిపాత్రుడుతోపాటు ఆయన సతీమణి, నర్సీపట్నం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనిత, మరికొందరు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీలో చేరారు. సన్యాసిపాత్రుడు తన అనుచరులతో సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి వైఎస్ జగన్‌ను కలవగా.. ఆయన వారికి కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సన్యాసిపాత్రుడు మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్రెడ్డి గత ఐదు నెలల్లో ప్రజలకోసం అపూర్వమైన రీతిలో సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారని, వాటి పట్ల ఆకర్షితులమై తమ కుటుంబసభ్యులు, పార్టీ నేతలతో కలిసి వైఎస్సార్సీపీలో చేరామని చెప్పారు. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ట ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో సన్యాసిపాత్రుడి కుమారుడు వరుణ్, మాజీ కౌన్సిలర్లు ఎం.అప్పారావు, ఎం.శ్రీనివాసరావు, ఎం.గణేష్, సీహెచ్.సతీష్, మీసాల సత్యనారాయణ, సీహెచ్ కరుణాకర్, ఆర్వీ రమణ కూడా వైఎస్సార్సీపీలో చేరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. పవన్.. చంద్రబాబుకు దత్తపుత్రుడే: విజయ సాయిరెడ్డి ఇసుకపై ఆందోళన పేరుతో హడావుడి చేస్తున్న పవన్ ముమ్మాటికీ చంద్రబాబుకు దత్తపుత్రుడేనని, అందులో ఎలాంటి సందేహం లేదని విజయసాయిరెడ్డి అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధులడిగిన ప్రశ్నలకు ఆయన జవాబిస్తూ.. పవన్ చేసింది లాంగ్‌మార్చ్ కానే కాదని, అది రాంగ్ మార్చ్ అని పునరుద్ఘాటించారు. పవన్.. చంద్రబాబు డైరెక్షన్లోనే నడుస్తున్నారన్నారు. పవన్ ఢిల్లీ వెళ్లి నేతలతో మాట్లాడినా, అమెరికా వెళ్లి అధ్యక్షుడితో మాట్లాడినా ప్రయోజనమేమీ ఉండబోదని అన్నారు. -
టీడీపీకి అయ్యన్న సోదరుడి రాజీనామా
నర్సీపట్నం: విశాఖ జిల్లాలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి సోదరుడు, నర్సీపట్నం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు, ఆయన సతీమణి మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ సీహెచ్ అనిత బుధవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నర్సీపట్నం పర్యటనలో ఉండగా సన్యాసిపాత్రుడు రాజీనామా చేసి అయ్యన్నకు షాక్ ఇచ్చారు. నర్సీపట్నం మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా రెండు సార్లు, కొనసాగారు. ఈ నేపథ్యం లో బుధవారం సన్యాసిపాత్రుడు తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనతో పాటు తన భార్య అనిత, పది మంది మాజీ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. పార్టీలో రెండేళ్లుగా తనకు ప్రాధాన్యత లేకుండా చేశారన్నారు. గ్రూపు రాజకీయాలు ప్రోత్సహించారన్నారు. ఈ విషయాలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదన్నారు. తన పట్ల వ్యవహరించిన తీరుతో మనస్తాపం చెంది రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. -
పర్యాటకుల స్వర్గధామం వైజాగ్
సాక్షి, విశాఖపట్నం : పర్యాటకుల స్వర్గధామంగా వైజాగ్‌ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం ఆర్కేబీచ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాల్లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అయ్యన్న ప్రసంగిస్తూ పర్యాటకంగా జిల్లాను అభివృద్ధి చేయడానికి కావాల్సిన వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఏజెన్సీలోని లంబసింగి, అల్లూరి సీతారామరాజు సమాధి ఉన్న కేడీ పేట ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్నారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నకాలంలో మంజూరైన ప్రాజెక్టుల్లో ప్రగతి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉందన్నా రు. వాటన్నిం టినీ పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్‌ను కోరారు. మంత్రి గంటా మాట్లాడు తూ బీచ్ కారిడా ర్ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సముద్రంలో ఒకటీ రెండు రోజుల పాటు క్రూయిజ్‌ల్లో విహారం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే విశాఖ పోర్టు చైర్మన్‌తో చర్చించినట్లు వెల్లడించారు. పర్యాటకంగా విశాఖ గురించి దేశమంతా తెలి సేలా విశాఖ ఉత్సవ్ నిర్వహించాలని అధికారులను కోరారు. సినిమా పరిశ్రమకు ఇప్పటికే విశాఖలో భూమి మం జూరు చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ లాలం భవానీ, ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, విష్ణుకుమార్‌రాజు, కిడారి సర్వేశ్వరరావు, పీలా గోవింద్, వంగలపూడి అనిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోట నగేష్, కలెక్టర్ యువరాజ్, జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్ ప్రవీణ్‌కుమార్, వుడా ఇంచార్జ్ వీసీ ఎంవీ శేషగిరిబాబు, పర్యాటకశాఖ విశాఖ డివిజన్ జనరల్ మేనేజర్ భీంశంకరరావు, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు. ‘సాక్షి’కి బహుమతులు పర్యాటక రంగానికి అద్దంపట్టేలా ఫొటోలు తీసిన సాక్షి ఫొటో జర్నలిస్టులు పీఎన్ మూర్తి, మహమ్మద్ నవాజ్‌లకు ద్వితీయ, తృతీయ బహుమతులు లభించాయి. ప్రజాశక్తి ఫొటో జర్నలిస్టు కె.రాజేశ్‌కు ప్రథమ బహుమతి వచ్చింది. వారికి మంత్రులు అయ్యన్న, గంటా జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేశారు. రఫీ (లీడర్), విజయ్ (ఆంధ్రజ్యోతి), శరత్‌కుమార్ (టైమ్స్ ఆఫ్ ఇండియా), భాస్కరరావులకు ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. పర్యాటక దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన చిత్రలేఖనం, వ్యాసరచన పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. -
స్త్రీ, శిశు సంక్షేమానికి ప్రాధాన్యం
గర్భిణులకు, బాలింతలకు నాణ్యమైన పోషకాహారం అధికారులకు మంత్రి పీతల సుజాత ఆదేశాలు విశాఖ రూరల్: వచ్చే ఏడాదికల్లా మాతా, శిశు మరణాలు పూర్తి స్థాయిలో తగ్గేలా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖమంత్రి పీతల సుజాత ఆదేశించారు. శనివారం ఆమె కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్త్రీ, శిశు, వికలాంగుల సంక్షేమం, గనులు, భూగర్భ వనరుల శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్, ఎమ్మెల్యేలు పీలా గోవింద సత్యనారాయణ, వంగలపూడి అనిత ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుజాత మాట్లాడుతూ స్త్రీ, శిశు సంక్షేమాన్ని కాంక్షిస్తూ ప్రభుత్వ అందిస్తున్న పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందేలా అధికారులు శ్రద్ధ చూపాలని సూచించారు. మాతా, శిశు మరణాలు తగ్గించాలన్న లక్ష్యంతో నిరుపేదలకు అంగ న్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అయితే సరఫరాలో పలు అక్రమాలు జరుగుతున్నట్టు తనకు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. కేంద్రాల్లో మెనూ ప్రకారం గర్భిణులు, బాలింతలు, శిశువులకు నాణ్యమైన పోషకాహారాన్ని సరఫరా చేయాలని, సరఫరాలో ఎలాంటి అవినీతి ఆరోపణలు వచ్చినా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. అంగన్వాడీలకు భవనాలు: మంత్రి అయ్యన్న మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద అంగన్వాడీ భవనాలు మంజూరు చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం అక్టోబర్ 2 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్విహంచనున్నట్లు తెలిపారు. ఇందులోభాగంగా అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలకు అవసరమైన మరుగుదొడ్లు మంజూరు చేస్తామని తెలిపారు. కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ జిల్లాలో స్త్రీ, శిశు సంక్షేమానికి అమలు చేస్తున్న కార్యక్రమాల ప్రగతిని పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. 2500 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేవని, 1700 గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేయాల్సి ఉందని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఏజేసీ వై.నరసింహారావు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆర్జేడీ పి.అనసూయ, పీడీ ఎ.ఇ.రాబర్ట్స్, ఏపీడీ చిన్మయిదేవి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్ల నిర్మాణంలో నాణ్యత తప్పనిసరి
పీఆర్ ఇంజినీర్ల వర్క్‌షాప్‌లో మంత్రి అయ్యన్న విశాఖ రూరల్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ గ్రామాల్లో నాణ్యమైన రోడ్ల నిర్మాణానికి ఇంజినీర్లు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ ఇంజినీర్ల రెండు రోజుల రాష్ట్ర స్థాయి వర్క్‌షాపును ఆయన ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, తాగునీటి సౌకర్యాల మెరుగుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో ఈ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఈ శాఖకు క్వాలిటీ కంట్రోల్ విభాగం కీలకమని, దాన్ని పటిష్టపర్చి రానున్న కాలంలో అన్ని రకాల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూస్తామన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ వర్క్‌షాపులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ క్వాలిటీ కంట్రోల్‌ను అమలు పర్చే అంశంపై పూర్తి స్థాయిలో మేధోమథనం చేయాలని ఇంజినీర్లకు సూచించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ లాలం భవాని మాట్లాడుతూ గ్రామాల్లో నాణ్యమైన రోడ్లను నిర్మించాల్సిన బాధ్యత ఇంజినీర్లపై ఉందని పేర్కొన్నారు. పంచాయతీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందజేయాలనే లక్ష్యంతో రోడ్, వాటర్, పవర్, గ్యాస్, ఆప్టికల్ ఫైబర్ గ్రిడ్లను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తోందని పేర్కొన్నారు. వీటి నిర్మాణంలో సమస్యలు తల్తెకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇంజినీర్లకు సూచించారు. కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంతో వస్తున్న మార్పులను సమాజ శ్రేయస్సుకు వినియోగించాలని సూచించారు. పీఆర్ ఇంజినీర్-ఇన్-చీఫ్ సి.వి.ఎస్.రామ్మూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లను రూ.2 వేల కోట్లతో అభివృద్ధి పరుస్తున్నామని, వీటి నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఇంజినీర్లను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ కనెక్టవిటీని పెంచేందుకు ఈ వర్క్‌షాపులో సుమారు రూ.100 కోట్లకు తక్కువ కాకుండా ప్రతిపాదనలు ఆశిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పంచాయతీరాజ్ ఇంజినీర్ల రెడీ రెకనానర్ పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. సమావేశంలో క్వాలిటీ కంట్రోల్ సీఈ వెంకటేశ్వరరావు, నాబార్డు సీఈ పద్మజ, జెడ్పీ సీఈఓ మహేశ్వరరెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ రవీంద్రనాథ్, ఈఈ ఎల్.కృష్ణమూర్తి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కాంతానాథ్ తదితరులు పాల్గొన్నారు. -
పాలన దారిలోకి తెస్తున్నాం
మంత్రి అయ్యన్నపాత్రుడు చోడవరం టౌన్: గడచిన పదేళ్లలో రాష్ట్రంలో పరిపాలన గాడితప్పిందని, దాన్ని గాడిలో పెడుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పరిశీలనకు ఆదివారం చోడవరం వచ్చిన ఆయన ఎమ్మెల్యే కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల హామీలు నెరవేర్చేందుకు చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. లక్షన్నర మాఫీతో 86 శాతం మంది లబ్ధిపొందనున్నారని చెప్పారు. రాష్ట్రం లో 13 వేల పంచాయతీలకుగాను 3 వేల పంచాయతీల్లో స్వచ్ఛంద సంస్థలు తాగునీటిని సరఫరా చేస్తున్నాయని, మిగలిన వాటిలో 5 వేల పంచాయతీల్లో ఎన్టీఆర్ సుజల స్రవంతి ప్రా రంభించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో మండలానికి ఐదు పంచాయతీలు ఎంపిక చేస్తామని, విశాఖ జిల్లాలో మాత్రం పది పంచాయతీలు చొ ప్పున ఎంపిక చేయన్నుట్లు తెలిపారు. డ్వాక్రా సంఘాలు ముందుకు వస్తే వారికి ఈ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం టూర్ ప్రోగ్రాం వివరించారు. 30న చోడవరంలో మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రైతులతో సమావేశం, అనంతరం అనకాపల్లి పరిశోధనా కేంద్రంలో అధికారులతో సమీక్ష ఉంటుందన్నారు. 31న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు జిల్లా ముఖ్య నాయకులు, అధికారులతో సమీక్ష సమావేశాలుంటాయన్నారు. ఆ తర్వాత కశింకోటలో జరిగే ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. అనంతరం తాళ్లపాలెంలో ప్రజాసదస్సు, తర్వాత యలమంచిలిలో రోడ్‌షో, మధ్యాహ్నం 2 గంటలకు పురుషోత్తపురంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభం ఉంటుందన్నారు. 3 గంటలకు నక్కపల్లిలో డ్వాక్రా మహిళలతో సమావేశం, 5 గంటలకు ఉపమాక వేంకటేశుని దర్శనం అనంతరం హైదరాబాద్ ప్రయాణమవుతారని చెప్పారు. ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం పరిశీలించారు. చోడవరం హైస్కూల్ ఆవరణను పరిశీలించాక కలెక్టర్, ఎస్పీతో చర్చించారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంత్రుల వెంట ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పీలాగోవింద, కె.ఎస్.ఎన్.రాజు, టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు రామానాయుడు ఉన్నారు.