రాజీనామా లేఖతో సన్యాసిపాత్రుడు
నర్సీపట్నం: విశాఖ జిల్లాలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి సోదరుడు, నర్సీపట్నం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు, ఆయన సతీమణి మున్సిపాలిటీ మాజీ చైర్‌పర్సన్ సీహెచ్ అనిత బుధవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నర్సీపట్నం పర్యటనలో ఉండగా సన్యాసిపాత్రుడు రాజీనామా చేసి అయ్యన్నకు షాక్ ఇచ్చారు. నర్సీపట్నం మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా రెండు సార్లు, కొనసాగారు.
ఈ నేపథ్యం లో బుధవారం సన్యాసిపాత్రుడు తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనతో పాటు తన భార్య అనిత, పది మంది మాజీ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. పార్టీలో రెండేళ్లుగా తనకు ప్రాధాన్యత లేకుండా చేశారన్నారు. గ్రూపు రాజకీయాలు ప్రోత్సహించారన్నారు. ఈ విషయాలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదన్నారు. తన పట్ల వ్యవహరించిన తీరుతో మనస్తాపం చెంది రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment