
సాక్షి, విశాఖ : మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడికి పుట్టినరోజు నాడే ఆయన సోదరుడు ఝలక్ ఇచ్చారు. అయ్యన్న సోదరుడు సన్యాసిపాత్రుడు బుధవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు పలువురు కౌన్సిలర్లు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఇప్పటికే విశాఖపట్నం జిల్లాకు చెందిన పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీలో చేరిన విషయం విదితమే. విశాఖ డెయిరీ సీఈఓ, టీడీపీ అనకాపల్లి ఎంపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్, డెయిరీ డైరెక్టర్ పిల్లా రమాకుమారి(యలమంచిలి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్), డెయిరీ ఇతర డైరెక్టర్లు ....సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. తాజాగా సన్యాసిపాత్రుడు నిర్ణయంతో తెలుగు తమ్ముళ్లు షాక్ తింటున్నారు. అది కూడా విశాఖ జిల్లాలో నారా లోకష్ పర్యటన వేళ టీడీపీకి షాక్ తగిలినట్లు అయింది. కాగా కొన్నాళ్ల నుంచి ఉప్పూ, నిప్పులా ఉన్న అయ్యన్న అన్నదమ్ముల మధ్య వైరం తీవ్రరూపం దాల్చిన విషయం విదితమే. అయ్యన్నపాత్రుడు, ఆయన సోదరుడు సన్యాసిపాత్రుడు (జమీలు)ల ఆధిపత్యపోరు అదుపు తప్పడంతో ఇద్దరి మధ్య చాలాకాలంగా మాటలు కూడా లేవు.
Comments
Please login to add a commentAdd a comment