Ayyanna patrudu
-
బారువడ్డీ, చక్రవడ్డీతో సహా చెల్లిస్తాం.. అయ్యన్నకు మాస్ వార్నింగ్
-
నేటి నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, అమరావతి: శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. అనంతరం సభ వాయిదా పడనుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగే బీఏసీ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలి? ప్రవేశ పెట్టాల్సిన బిల్లులు, చర్చించాల్సిన అంశాలు, తీర్మానాలను నిర్ణయిస్తారు. ప్రాథమికంగా మూడు వారాలపాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. 25వ తేదీన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 26, 27వ తేదీల్లో సభకు సెలవు ఇవ్వనున్నారు. 28వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. దానికి ముందు మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సభను వాయిదా వేసే అవకాశం ఉంది. మార్చి 1, 2వ తేదీలు సెలవు రోజులు కావడంతో తిరిగి 3వ తేదీన సభ ప్రారంభం కానుంది. ⇒ ఈ సమావేశాలకు ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ కాంగ్రెస్ పార్టీ సభ్యులు హాజరవుతారనే సమాచారంతో ఆంక్షలు పెంచారు. భద్రత పేరుతో మంత్రులు, ఎమ్మెల్యేల ప్రవేశాలు, రాకపోకలకు సంబంధించి నిబంధనలను పెంచారు. అసెంబ్లీ, శాసన మండలికి వెళ్లేందుకు వేర్వేరు రంగులతో పాస్‌లు ఇచ్చారు. అధికారులు, మీడియా, విజిటర్లు, పోలీసులకు ప్రత్యేక పాస్‌లు జారీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమికి చెందిన పార్టీలకు ఎన్ని కావాలంటే అన్ని పాసులు జారీ చేసి వైఎస్సార్సీపీకి మాత్రం చాలా పరిమితంగా పాసులు ఇచ్చారు. -
కూటమి ప్రభుత్వంపై భగ్గుమంటున్న గిరిజనులు
-
అయ్యన్న వ్యాఖ్యలపై నిరసన.. ఏజెన్సీ బంద్
సాక్షి, అల్లూరి జిల్లా: పాడేరు ఏజెన్సీలో బంద్ కొనసాగుతోంది. గిరిజన హక్కులకు భంగం కలిగేలా అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. 1/70 యాక్ట్‌ను సవరించాలన్న అయ్యన్న వ్యాఖ్యలపై నిరసనలకు దిగాయి. అయ్యన్న వ్యాఖ్యలపై రాజకీయ, గిరిజన, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఉదయం నుంచే వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసివేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు బంద్‌లో పాల్గొన్నారు. 1/70 యాక్ట్‌ను సవరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని గిరిజన సంఘాలు హెచ్చరించాయి. టూరిజం ముసుగులో గిరిజన భూములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని గిరిజనులను దోపిడీ చేసే కుట్ర జరుగుతుందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్న పాత్రుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని.. క్షమాపణ చెప్పాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేశాయి.1/70 చట్టాన్ని సవరించాలన్న అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుపై చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల అఖిల పక్షం నేడు(మంగళ), రేపు( బుధవారం) మన్యం బంద్ నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ బంద్‌కు వైఎస్సార్ సీపీ మద్దతు తెలిపింది. గిరిజన హక్కులు, చట్టాలను గౌరవించాల్సిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇటీవల విశాఖలో జరిగిన పర్యాటక సదస్సులో 1/70 చట్టాన్ని సవరింలంటూ చెప్పడంపై రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అయ్యన్నపాత్రుడుపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో పలు రాజకీయ పార్టీలు, గిరిజన సంఘాలు మన్యం బంద్ చేపట్టాయి. -
మా ప్రాంతంలో అయ్యన్న పాత్రుడు అడుగు పెడితే..
-
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు
-
అయ్యన్న వ్యాఖ్యలతో విస్మయానికి గురైన టీడీపీ నేతలు
-
పింఛన్ లబ్ధిదారులను దొంగలతో పోల్చిన స్పీకర్
-
అయ్యన్న పాత్రుడు పై అంబటి రాంబాబు ఫైర్
-
ఏపీ శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి.. మధ్యలో స్పీకర్
అమరావతి, సాక్షి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. శాసనసభను వైఎస్సార్సీపీ బహిష్కరించినప్పటికీ.. ‘ప్రతిపక్షం లేదే!’ అనే లోటును కూటమి నేతలే భర్తీ చేస్తున్నారు. గత ఐదు రోజులుగా జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం.తాజాగా.. శాసనమండలి వాయిదాతో శనివారం ఐదో రోజు శాసనసభ మాత్రమే నడుస్తోంది. అయితే జీరో అవర్‌లో మంత్రుల తీరుపై టీడీపీ ఎమ్మెల్యే కూన రవి విమర్శలకు దిగారు. ‘అసెంబ్లీలో జీరో అవర్ డ్రైవర్ లేని కారులా ఉంది’ అని అన్నారాయన.‘‘ఎమ్మెల్యేలు జీరో అవర్ లో ప్రశ్నలు వేస్తున్నారు. కానీ మంత్రులు ఎవ్వరు లేచి నోట్ చేసుకున్నాం అని చెప్పడం లేదు. మరి ఎమ్మెల్యేలు సమస్యలు చెప్పి ఏం లాభం?. జీరో అవర్ లో చెప్పిన సమస్య పై వచ్చే సభ లోగా మంత్రులు సభ్యులకు పురోగతి పై స్పష్టత ఇవ్వాలి’’ అని కాస్త ఆవేశపూరితంగానే అన్నారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు ఖచ్చితంగా రాసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో.. కూన రవి వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు.‘‘మంత్రులం ఎవ్వరం పట్టించుకోవడం లేదనుకోకండి. ప్రతి ప్రశ్నను సంబంధించిన మంత్రికి పంపమని చెప్పారు. దాని ప్రకారం మంత్రులు చర్యలు తీసుకుంటారు’’ అంటూ గట్టిగానే బదులిచ్చారు. అయితే అచ్చెన్న మాట్లాడుతున్నంత సేపు.. కూన మాత్రం సీరియస్‌గా ముఖం పెట్టుకుని కనిపించారు.అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైననాటి నుంచే.. సభలో మునుపెన్నడూ చోటు చేసుకోని పరిణామాలు కనిపిస్తున్నాయి. స్పీకర్ అయ్యన్నపాత్రుడు బహిరంగంగానే కూటమి నేతలపై, మంత్రులపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే.. నిన్నటి బడ్జెట్ చర్చలో టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. కొత్తగా డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన రఘురామ కృష్ణంరాజుపై అసహనం వ్యక్తం చేశారు. తన ప్రసంగాన్ని అడ్డుకోవడంతో.. తానేమీ ప్రతిపక్షం కాదని, మాట్లాడకుండా కూర్చోమంటే అదే పని చేస్తానని, అసెంబ్లీకి రావద్దంటే రానంటూ జ్యోతుల నెహ్రూ ఎమోషనల్ అయ్యారు.ఇదీ చదవండి: ఇసుక పాలసీ బాలేదన్న జ్యోతుల.. మైక్ కట్ చేసిన రఘురామ!ఇదీ చదవండి: బాబుగారి మాటలకు అర్థాలే వేరులే..! -
శాసనసభలో ఏపీ మంత్రులకు స్పీకర్ మందలింపు
అమరావతి, సాక్షి: ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి.. సభలో కూటమి నేతల తీరు ఏమాత్రం సహించడం లేదు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం వేళ.. తమ అనుచరుల్ని సభలోకి తోలుకురావడంపై టీడీపీ ఎమ్మెల్యేలపైనే అసహనం వ్యక్తం చేసింది తెలిసిందే. అయితే..ఇవాళ నాలుగో రోజు సెషన్లో మంత్రులపైనే ఆయన మండిపడినట్లు తెలుస్తోంది. ఉదయం 9.గంకు సభ ప్రారంభం కాగా.. మంత్రుల్లో కొందరు సభకు ఆలస్యంగా వచ్చారు. ఇది గమనించిన స్పీకర్.. కాసేపు చూస్తూ ఉండిపోయారు. ఇంతలో కార్మిక శాఖకు సంబంధించిన ప్రశ్న ఎదురుకాగా.. సదరు మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆ టైంకి సభలో లేరు. అనంతరం వచ్చిన మంత్రితో స్పీకర్ అయ్యన్న.. క్వశ్చన్ అవర్ ని మంత్రులు సీరియస్ గా తీసుకోవాలని, మంత్రులే ఆలస్యంగా వస్తే ఎలా? అని, సమయం పాటించాలని హితవు పలికినట్లు సమాచారం. ఆలస్యానికి మంత్రి సుభాష్ క్షమాపణ చెప్పి.. మరోసారి ఇలా జరగదంటూ తన సీట్లో కూర్చున్నారు. ఇక సమావేశాల ప్రారంభ రోజు.. ‘‘మీ అనుచరులను సచివాలయం, ఇతర ప్రాంతాల్లో వుండే విధంగా చూస్కోండి. అసెంబ్లీ హాల్లోకి తేకండి’’ అని కాస్త కటువుగానే సొంత ఎమ్మెల్యేలతో స్పీకర్ అయ్యన్న చెప్పారు. -
కూటమి ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యన్న అసహనం
అమరావతి, సాక్షి: ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి కోపమొచ్చింది. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. ఎమ్మెల్యేలతో పాటు వాళ్ల అనుచరులు కూడా అసెంబ్లీ హాల్‌కు వచ్చారు. దీంతో ఆయన ఒకింత అసహనానికి గురయ్యారు. అయితే..అంతటితో ఆయన ఆగలేదు. అనుచరులను తీసుకొని రాకుండా ఉండాలని ఎమ్మెల్యేలకు గట్టిగానే చెప్పారు. ‘‘మీ అనుచరులను సచివాలయం, ఇతర ప్రాంతాల్లో వుండే విధంగా చూస్కోండి. అసెంబ్లీ హాల్లోకి తేకండి’’ అని కాస్త కటువుగానే సొంత ఎమ్మెల్యేలతో చెప్పినట్లు తెలుస్తోంది. -
అనకాపల్లిలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచరుల దౌర్జన్యం
-
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి... స్పీకర్ అయ్యన్నపాత్రుడికి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ప్రజల గొంతును గుర్తించండి.. స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైఎస్ జగన్ లేఖ
అంతరంగం అప్పుడే అర్థమైంది..ఈ నెల 21న అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణం కార్యక్రమాన్ని పరిశీలిస్తే నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వరనే అభిప్రాయం కలిగింది. అసెంబ్లీ సంప్రదాయాల ప్రకారం ముందుగా సభా నాయకుడు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు, అనంతరం మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా అలా జరగలేదు. సంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రుల తర్వాతే నాతో ప్రమాణం చేయించారు. నాకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదనే నిర్ణయాన్ని మీరు ముందుగానే తీసుకున్నట్లు కనిపిస్తోంది.సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని, ఈ విషయంలో పరిశీలన చేయాలని కోరుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం లేఖ రాశారు. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు సాధించాలని చట్టంలో ఎక్కడా లేదన్నారు. విపక్ష పార్టీల్లో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని పేర్కొన్నారు. శాసనసభలో కూటమి పార్టీల ఉద్దేశపూర్వక చర్యలను సైతం లేఖలో ప్రస్తావించారు. వైఎస్ జగన్ లేఖలో ముఖ్యాంశాలు ఇవీ..శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు..మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు పూర్తి విరుద్ధం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లు దీనిద్వారా కనిపిస్తోంది. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం సీట్లు సాధించి ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు. పార్లమెంట్లోగానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోగానీ ఈ నిబంధన పాటించలేదు. అధికార కూటమి, స్పీకర్ ఇప్పటికే నాపట్ల శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు వీడియోల ద్వారా బయటపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో గొంతు విప్పే అవకాశాలు కనిపించడం లేదు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే ఆస్కారం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నా లేఖను పరిశీలించాలని కోరుతున్నా.చట్టంలో స్పష్టంగా ఉంది.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరనే విషయాన్ని చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. ‘ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 చట్టం 12 ఆ’ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటే ఎవరనే విషయాన్ని స్పష్టంగా నిర్వచించింది. విపక్షంలో ఉన్న పార్టీల్లో ఎవరికి ఎక్కువ సంఖ్యా బలం ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెబుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందున విపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ జూన్ 21న జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూస్తే వైఎస్సార్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం, పార్టీ శాసనసభా పక్ష నాయకుడిగా నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడంలో మీ ఉద్దేశాలేమిటో బయటపడ్డాయి. కానీ చట్టాన్ని పరిశీలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంలోగానీ, పార్టీ శానసభా పక్షనేత అయిన నన్ను ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తించేందుకుగానీ ఎలాంటి సందిగ్ధతకు తావులేదు. ఇటీవల స్పీకర్ చేసిన వ్యాఖ్యలు యూట్యూబ్ ఛానళ్లలో ఉన్నాయి. ఓడిపోయాడుగానీ చావలేదు.. చచ్చేవరకూ కొట్టాలి..! అంటూ నన్ను ఉద్దేశించి గౌరవ స్పీకర్ అన్న మాటలు ఆ వీడియోల్లో ఉన్నాయి. తద్వారా నాపై ఉన్న శత్రుత్వాన్ని స్పీకర్ రూపంలో అధికార కూటమి వ్యక్తం చేసింది.వైఎస్సార్ సీపీ 40 శాతం ఓట్లను సాధించింది..ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 40 శాతం ఓట్లను సాధించింది. ప్రజా సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రాతినిథ్యం వహించాల్సిన బాధ్యత మాపై ఉంది. అయితే ప్రభుత్వం, స్పీకర్ శత్రుత్వ వైఖరిని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో మా పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీ కార్యకలాపాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కట్టడి చేస్తున్నట్లే అవుతుంది. వైఎస్సార్ సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి తగిన సమయం లభిస్తుంది. దీనివల్ల ప్రజా సంబంధిత అంశాలను సభ దృష్టికి బలంగా తేగలుగుతారు. సభా కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనేలా, ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష పార్టీగా అభిప్రాయాలను చెప్పేలా చట్టబద్ధమైన భాగస్వామ్యం ప్రధాన ప్రతిపక్ష పార్టీకి లభిస్తుంది. ఇలాంటి పరిస్థితి లేకపోతే అసెంబ్లీలో అధికార కూటమి గొంతు మాత్రమే వినిపిస్తుంది. వివిధ అంశాల్లో బలమైన చర్చలు జరిగే అవకాశం కనిపించదు.ఉపేంద్ర, పీజేఆర్‌ను ప్రధాన ప్రతిపక్ష నేతలుగా గుర్తించారు.. అసెంబ్లీలో 10 శాతం సీట్లు రానందున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా లభించదనే చర్చ జరుగుతోంది. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 208 కింద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నోటిఫై చేసిన సభా ప్రవర్తనా నియమావళిలో నిర్దిష్ట సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదనే విషయాన్ని మీ ముందుకు తెస్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎక్కడా ఈ నిబంధన పాటించలేదనే అంశాన్ని గుర్తు చేస్తున్నా. లోక్‌సభకు 1984లో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 30 ఎంపీ సీట్లను గెలుచుకుంది. సభలో 10 శాతం సీట్లు సాధించనప్పటికీ నాడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకుగానూ కాంగ్రెస్ 26 సీట్లు మాత్రమే సాధించింది. 10 శాతం సీట్లు కాంగ్రెస్‌కు దక్కనప్పటికీ పి.జనార్థనరెడ్డిని నాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు.3 సీట్లు వచ్చిన బీజేపీకి సైతం..2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకుగానూ బీజేపీ కేవలం 3 సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఈ అంశాలన్నీ కూడా కేవలం ప్రజా ప్రయోజనాల రీత్యా మీ దృష్టికి తెస్తున్నా. ప్రజల తరఫున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశంతో మీకు ఈ లేఖ రాస్తున్నా. అయితే ఇలాంటి పరిస్థితికి ఆస్కారం లేకుండా అధికార కూటమి ఇప్పటికే శతృత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో నేను సభలో మాట్లాడాలనుకుంటే అది భారీ మెజార్టీ సాధించిన అధికార కూటమి దయమీద, నన్ను చచ్చేవరకూ కొట్టాలన్న స్పీకర్ గారి విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం సభలో ఉన్న పార్టీల సంఖ్యా బలాలను దృష్టిలో ఉంచుకుని ఈ లేఖను పరిశీలించాలని కోరుతున్నా. -
కొత్త ఎమ్మెల్యేలకు స్పీకర్ గుడ్ న్యూస్
-
ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవ ఎన్నిక
సాక్షి, విజయవాడ: ఆంధప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవి కోసం ఒకటే నామినేషన్ రావడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అయ్యన్న పాత్రుడు ఇప్పటి వరకు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందగా, అనకాపల్లి ఎంపీగానూ, పలు శాఖలకు మంత్రిగా పనిచేశారు. కాగా, ఏపీ అసెంబ్లీలో ఇవాళ 172 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాలుగు పార్టీల ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. ఇక రేపు మిగిలిన ముగ్గురు సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయనున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్ పోస్ట్ జనసేన లేదంటే బీజేపీకి వెళ్లే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపించినప్పటికీ.. టీడీపీనే ఆ పోస్ట్ దక్కించుకునే అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. డిప్యూటీ స్పీకర్ బదులు జనసేనకు విప్ పోస్ట్‌తో సరిపెట్టవచ్చని సమాచారం. -
ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడికి గణేష్ అదిరిపోయే కౌంటర్
-
"నేను స్పీకర్..మీ అంతు చూస్తా.." అధికారులపై అయ్యన్న ఫైర్
-
అరుపులు.. కేకలు.. మరోసారి రెచ్చిపోయిన అయ్యన్నపాత్రుడు
సాక్షి, విశాఖపట్నం: మున్సిపల్ అధికారులపై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మరోసారి రెచ్చిపోయారు. తమాషాలు చేస్తున్నారా అంటూ బెదిరింపులకు దిగారు. రోడ్ల నిర్మాణంలో నాణ్యత లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్లు మూసుకుపోయాయా అంటూ అసభ్య పదజాలంతో దూషించారు.ఇష్టం లేకపోతే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ బూతు పదం వాడుతూ వార్నింగ్ ఇచ్చారు. త్వరలో నేను స్పీకర్‌ను అవుతున్నాను. మిమ్మల్ని అసెంబ్లీలో గంటలకొద్దీ నిలబెడతానంటూ హెచ్చరించారు. అయ్యన్న తీరుతో అధికారులు భయభ్రాంతులకు గురయ్యారు. -
అయ్యన్న..హన్నన్న..నేరాల ప్రీతిపాత్రుడు
సాక్షి, అనకాపల్లి: ఏజెన్సీ ముఖద్వారమైన నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండల పరిధిలో వేలాది హెక్టార్లలో ఉన్న విలువైన ఖనిజం లేటరైట్. ఈ ఖనిజం అంటే మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి ఎంతో ప్రీతి. టీడీపీ హయాంలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఖనిజ నిల్వలను అక్రమంగా తవ్వుకుని రూ.వందల కోట్లు ఆర్జించారు. ఇందులో ఆయన తనయుడు విజయ్ ప్రధాన భాగస్వామి. అప్పట్లో ఖనిజ సంపద తవ్వకాల అనుమతులు రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలిచ్చినా అమలు కాలేదు. తవ్వకాలను వ్యతిరేకించిన గిరిజనులపై తప్పుడు కేసులు పెట్టించి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. చివరికి శివపురంలోని పంట కాలువనూ అయ్యన్న వదల్లేదు. కాలువను ఆక్రమించి మరీ తన ఇంటి నిర్మాణం చేపట్టారు. తొలగించేందుకు వచ్చిన అధికార యంత్రాంగంపై దాడికి తెగబడ్డారు. అప్పటి సరుగుడు సర్పంచ్‌పై ఒత్తిడి బమిడికలొద్ది ఏరియాలో 110 హెక్టార్ల లీజుదారుడైన జర్తా లక్ష్మణరావును తన బినామీకి 80 శాతం వాటా ఇవ్వాలని అయ్యన్న తనయుడు అప్పట్లో డిమాండ్ చేశారు. దీనికి ఆయన నిరాకరించాడు. దీంతో మైనింగ్ లీజు రద్దు చేయించేందుకు తీర్మానం చేయాలంటూ ప్రస్తుత ఎంపీపీ, అప్పటి సరుగుడు పంచాయతీ సర్పంచ్ లక్ష్మణ్మూర్తిపై విజయ్ ఒత్తిడి చేశారు. దీంతో లక్ష్మణ్‌మూర్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే సరుగుడు పంచాయతీలో జర్తా లక్ష్మణరావుకు మైనింగ్ కోసం ఇచ్చిన పంచాయతీ తీర్మానం సరైనది కాదని, రికార్డులు తారుమారు చేశారంటూ అప్పటి మంత్రి అయ్యన్న పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా తక్షణ విచారణ చేపట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. విచారణ చేపట్టిన జిల్లా అధికారులు పంచాయతీ తీర్మానానికి రెండు పుస్తకాలను వినియోగించటమే కాకుండా కొన్ని పొరపాట్లు చేశారని పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శికి నివేదించారు. అయ్యన్న ఒత్తిడితో ఆ రోజు చేసిన తీర్మానాలన్నింటినీ రద్దు చేయాలని కలెక్టర్‌ను పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశించారు. అప్పటి కలెక్టర్ యువరాజ్ సరుగుడు ప్రాంతంలో మైనింగ్ తవ్వకాలు జరగకుండా చూడాలని తొమ్మిది శాఖల అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చారు. టీడీపీ హయాంలో లేటరైట్ అనుమతుల కోసం మైనింగ్ మాఫియా బినామీలైన సింగం భవాని పేరిట 5 హెక్టార్లు, కిల్లో లోవరాజు పేరుతో 35 హెక్టార్లలో లేటరైట్ తవ్వకాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందారు. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని అయ్యన్న తనయుడు విజయ్ సహకారంతో కాకినాడకు చెందిన అబ్బాయిరెడ్డి, బుజ్జి, తోట నవీన్, శ్రీనివాస్ అలియాస్ నల్లశ్రీను ఏకమై తవ్వకాలు చేపట్టారు. రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్ల విలువైన ఖనిజాన్ని అక్రమంగా తవ్వి, సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. కలెక్టర్ అనుమతులు రద్దు చేసినా నిరాటంకంగా తవ్వకాలు సాగించారు. అక్రమ నిర్మాణంపై ప్రశ్నిస్తే దౌర్జన్యం నర్సీపట్నంలోని శివపురంలో 10 అడుగుల ఇరిగేషన్ పంట కాలువను అయ్యన్నపాత్రుడు కబ్జా చేసి, అక్రమంగా ఇంటిని నిర్మించారని జిల్లా అధికారులు గుర్తించారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఆక్రమణను తొలగించాలని నోటీసులిచ్చినా ఆయన స్పందించలేదు. దీంతో నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాన్ని తొలగించేందుకు 2022 జూన్ 20న అధికారులు ప్రయతి్నంచారు. దీన్ని అయ్యన్న కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. జేసీబీ ఆపరేటర్లను బెదిరించడంతో వారు జేసీబీ వదిలి వెళ్లిపోయారు. టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌పై దాడి చేసి, అతని చేతిలో కెమెరా లాక్కున్నారు. జాయింట్ సర్వే చేయించి ఆక్రమణలు నిరూపిస్తే తామే తొలగిస్తామని అప్పటి ఆర్డీవో గోవిందరావుకు అయ్యన్న రెండో కొడుకు రాజేష్ వినతిపత్రం అందించారు. ఆర్డీవో ఆదేశాలతో రెవెన్యూ అధికారులు రీసర్వే చేపట్టారు. సర్వే చేస్తుండగా టీడీపీ కార్యకర్తలు సర్వేను అడ్డుకుని కొలత చెయిన్ లాక్కున్నారు. రికార్డులు పట్టుకుపోయారు. పోలీసుల హెచ్చరికలతో సర్వే రికార్డులను తిరిగి అప్పగించారు. టీడీపీ కార్యకర్తలు జేసేబీ అద్దాలు పగులగొట్టడంతోపాటు టైర్లలో గాలి తీసేశారు. ఇప్పటికీ ఆ జేసీబీ అక్కడే ఉత్సవ విగ్రహంలా దర్శనమిస్తోంది. ఈ గొడవ జరుగుతుండగానే అయ్యన్న కోర్టును ఆశ్రయించి అదే రోజు సాయంత్రానికి కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నలుగుతోంది. రేప్ కేసు సహా 23 ఎఫ్ఐఆర్లు ► అయ్యన్నపై ఇప్పటివరకూ రేప్ సహా 23 కేసులు నమోదయ్యాయి. బట్టలూడదీసి కొడతానని మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై 2020లో క్రైమ్ నెం. 777/2020 యు/ఎస్ 354(ఏ), 500, 504, 505(1)(బి), 505(2), 506, 509 ఐపీసీ కింద నర్సీపట్నం టౌన్ స్టేషన్లో రేప్ కేసు నమోదైంది. ► దళితులను దూషించినందుకు క్రైమ్ నెం. 690/2020 యు/ఎస్ 3(ఐ)(ఆర్), 3(ఐ)(యు) ఆఫ్ ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. ► తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి ఇరిగేషన్ కాలువను ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టినందుకు అమరావతి సీఐడీ పోలీసులు క్రైమ్ నెం.64/2022 యు/ఎస్ 464, 467, 471, 474 ఆర్/డబ్ల్యూ 120–బి, 34 ఐపీసీ సెక్షన్ల కింద ఫోర్జరీ కేసు నమోదు చేశారు. ► ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించటంపై క్రైమ్ నెం.542/2019 యు/ఎస్ 179, 186, 189, 353, 500, 504 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ► పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించి వారి విధులకు ఆటంకం కలిగించినందుకు క్రైమ్ నెం. 10/2020 యు/ఎస్ 341, 188, 189, 504, 505,(1)(బి) ఐపీసీ కింద కేసు నమోదైంది. -
సీఎం రమేష్ రౌడీయిజం!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ మాజీ నేత, బీజేపీ ప్రస్తుత నేత సీఎం రమేష్ తన మార్క్ రౌడీ రాజకీయాలకు తెరతీశారు. అనకాపల్లి జిల్లాలో అరాచకాలు సృష్టిస్తున్నారు. ఎక్కడా తనిఖీలు నిర్వహించకుండా ముందస్తుగానే అధికారులపై ఎదురుదాడికి దిగుతున్నారు. తనిఖీలు నిర్వహించే అధికారుల వద్దకు వెళ్లి నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు అధికారులు తనిఖీలు నిర్వహించకూడదంటూ ప్రశి్నస్తున్నారు. ఎదురుదాడికి మించిన ఆత్మరక్షణ లేదనే ధోరణితో ఎన్నికల్లో తాము చేసే అక్రమాలకు అడ్డురాకూడదనే ఆలోచనతో ఈ తరహాలో బెదిరింపులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే అనకాపల్లిలోని లాడ్జీల్లో కడప నుంచి వచ్చిన అనుచరులు మకాం వేసి హల్చల్ చేస్తున్నారు. అంతేకాకుండా టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుతో తనకున్న పాత పరిచయాలతో ఇద్దరూ కలిసి నోటికి పనిచెబుతున్నారు. ఇప్పటికే అయ్యన్నకు భారీ ప్యాకేజీని సీఎం రమేష్ అందించారనే ప్రచారం జరుగుతోంది. రానున్న రోజుల్లో తాము చేసే విచ్చలవిడి అరాచకాలకు అడ్డులేకుండా చూసుకునేందుకే.. అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తించకుండా అడ్డుకట్ట వేసేందుకు భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ప్రశాంతంగా ఉన్న అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో సీఎం రమేష్ రాకతో అలజడి ప్రారంభమైంది. ఈనెల 6వ తేదీన నర్సీపట్నంలో చీరల పంపిణీని అడ్డుకున్న పోలీసులపై చిందులేస్తున్న కూటమి అనకాపల్లి ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ కోతికి కొబ్బరి చిప్ప! అనకాపల్లి జిల్లాలో ఇప్పటికే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇష్టారీతిలో చెలరేగి అధికారులపై మాటల దాడికి దిగుతున్నారు. ఇప్పుడు కల్లు తాగిన కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందంగా... ఈయనకు కాస్తా సీఎం రమేష్ జతకలిశారు. దీంతో నోటికి అదుపులేకుండా అధికారులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొద్దిరోజుల క్రితం చోడవరంలోని ఒక షాపులో పన్ను ఎగవేతకు సంబంధించిన వ్యవహారంలో డీఆర్ఐ అధికారులు తనిఖీలు వస్తే.. వెంటనే సీఎం రమేష్ రంగంలోకి దిగారు. అధికారులు తనిఖీలు చేయవద్దంటూ అడ్డుకోవడంతోపాటు బెదిరింపులకు దిగారు. తాజాగా నర్సీపట్నంలో నోట్లు, చీరలు పంచుతూ ఓటర్లను ప్రలోభపరిచేందుకు కూటమి చేసే ప్రయత్నాలపై ఫిర్యాదు రావడంతో అధికారులు తనిఖీలకు వెళ్లారు. వెంటనే ఒకవైపు సీఎం రమేష్... మరోవైపు అయ్యన్నపాత్రుడులు అధికారులపై మాటల దాడికి దిగారు. తనిఖీలు ఎలా చేస్తారంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. చీఫ్ సెక్రటరీ, డీజీపీపై పరుష వ్యాఖ్యలు ఇక అయ్యన్న ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీలు వెధవలు అంటూ పరుషంగా వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా ఎన్నికల సమయంలో అధికారులు తనిఖీలకు వస్తే అభ్యర్థులు సహకరించడం సహజం. అంతేకాకుండా ఎన్నికలకు సంబంధం లేని వ్యక్తుల వద్ద తనిఖీలు నిర్వహించినప్పటికీ ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా సహకరించడం పరిపాటి. ఇందుకు భిన్నంగా ఈ ఇద్దరూ అడ్డగోలుగా అధికారులపై ఆరోపణలు గుప్పిస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడుతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా సహకరిస్తూ తమ ప్రచారాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసే బెదిరింపుల ద్వారా లబ్ధి పొందేందుకు ఆ ఇద్దరూ ప్రయతి్నస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లాడ్జీల్లో మకాం! స్థానికంగా కనీసం ఒక్క ఓటరూతోనూ పరిచయం లేని సీఎం రమే‹Ù... కేవలం రౌడీయిజం ద్వారానే ఎన్నికల్లో ముందుకు వెళ్లేందుకు కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా అనకాపల్లిలోని లాడ్జీల్లో ఇప్పటికే 200 మందికిపైగా తన అనుచరులు మకాం వేశారు. ఎన్నికల కౌంటింగ్ ముగిసే వరకూ అనకాపల్లిలోని లాడ్జీలను బుకింగ్ చేసుకున్నారు. కౌంటింగ్ వరకూ ఇక్కడే మకాం వేసి పార్లమెంటు నియోజకవర్గం మొత్తం తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయతి్నస్తున్నట్టు సమాచారం. మరోవైపు మొదటగా సీఎం రమేష్ నియోజకవర్గంలో తిరుగుతూ టీడీపీ, జనసేన నాయకులను కలిసి తమకు సహకరించాలంటూ భారీగానే ప్యాకేజీని ముట్టచెప్పినట్టు తెలుస్తోంది. అనంతరం సీఎం రమేష్ రాక సందర్భంగా హడావుడి చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అయ్యన్నకు నోట్ల కట్టలు? ఇన్నాళ్లూ అనకాపల్లి ఎంపీ సీటు స్థానికుడికి ఇవ్వాలని హడావుడి చేసిన అయ్యన్న.. సీఎం రమేష్ విషయంలో మాత్రం ఒక్క మాట మాట్లాడడంలేదు. పైగా అయ్యన్ననే వెంటబెట్టుకుని మరీ తిరుగుతున్నారు. ఈ వ్యవహారంలో భారీగానే అయ్యన్నకు ప్యాకేజీ ముట్టిందని టీడీపీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. ఒకవైపు రౌడీయిజం.. మరోవైపు నోట్ల కట్టల ద్వారా ఎన్నికల్లో ముందుకెళ్లేందుకు సీఎం రమేష్ చేస్తున్న ప్రయత్నాలపై అనకాపల్లి జిల్లాలో ఓటర్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రశాంతంగా ఉన్న అనకాపల్లి జిల్లాలో వీరి రాకతో రానున్న రోజుల్లో ఏమి జరుగుతుందోనని భయాందోళన చెందుతున్న ఓటర్లు అందరివాడు, సౌమ్యుడు బూడి ముత్యాలనాయుడుతో పాటు స్థానిక వైఎస్సార్సీపీ అభ్యర్థులవైపు మొగ్గుచూపుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. చోడవరంలో కేసు నమోదు జీఎస్టీ చెల్లించకుండా అనధికారికంగా వ్యాపారం సాగిస్తున్న బుచ్చిబాబు ట్రేడర్స్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం (డీఆర్ఐ) అధికారుల విధులకు ఆటంకం కల్గించడమే కాకుండా వారిపై దౌర్జన్యం చేసినందుకు అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమే‹Ù, టీడీపీ చోడవరం ఎమ్మెల్యే అభ్యర్థి కె.ఎస్.ఎన్.ఎస్.రాజు చోడవరం పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎన్నికల్లో ఓటర్లు రెచ్చగొట్టేలా ప్రవర్తించడంతో పాటు కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను ధిక్కరించడం, విధుల్లో ఉన్న అధికారులపై దౌర్జన్యాలకు పాల్పడడం వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శనివారం రాత్రి సీఎం రమేష్‌కు పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9న విచారణకు హాజరు కావాలని అనకాపల్లి ఎస్డీపీవో ఆదేశించారు. -
జనసేన...వేసెయ్ టీడీపీ కండువా
నర్సీపట్నం : ఎన్నికల వేళ టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కండువాల రాజకీయానికి తెరలేపారు. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా ఇరుపార్టీలు వలసలు ప్రోత్సహించుకోకూడదని ఒప్పందం చేసుకున్నారు. కానీ అయ్యన్నపాత్రుడు మిత్ర ధర్మాన్ని పక్కన పెట్టి జనసేన నాయకులను టీడీపీలో చేర్చుకోవడానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో అంతంత మాత్రంగా ఉన్న జనసేన క్యాడర్‌కు అయ్యన్నపాత్రుడు వ్యవహారశైలి మింగుడు పడడం లేదు. ఈ ఎన్నికల్లో గట్టెక్కేందుకు అయ్యన్నపాత్రుడు చోటామోటా నాయకులకు కండువాలు వేస్తున్నారు. అయ్యన్నపాత్రుడు ప్రోత్సహిస్తున్న వలసలతో నియోజకవర్గంలో జనసేన కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. నర్సీపట్నం మండలం, చెట్టుపల్లి గ్రామానికి చెందిన గజాల నాగరత్నం స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన మద్దతుతో సర్పంచ్‌గా గెలుపొందారు. అప్పట్లో ఆమెకు మద్దతుగా జనసేన నియోజకవర్గ కన్వీనర్ రాజాన వీర సూర్యచంద్ర, పూడి చక్రవర్తి, అద్దేపల్లి గణేష్ నాగరత్నంను గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన మద్దతుతో గెలిచిన సర్పంచ్ దంపతులు గజాల నాగరత్నం, సూరిబాబుతో పాటు నలుగురు వార్డు మెంబర్లు మంగళవారం అయ్యన్నపాత్రుడు సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో మిత్ర ధర్మానికి అయ్యన్నపాత్రుడు తూట్లు పొడవడంతో పలువురు విస్మయం చెందుతున్నారు. అయ్యన్నపాత్రుడు కండువా రాజకీయంతో నియోజకవర్గంలో జనసేన పార్టీ తుడుచుపెట్టుకుపోతుందని చెబుతున్నారు. -
వేలు చూపించి అయ్యన్న భార్య బెదిరింపులు
-
హతవిధీ.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి ఎంత దుర్గతి పట్టింది...
అనకాపల్లి: హతవిధీ.. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి ఎంత దుర్గతి పట్టింది. పార్టీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతుండగా అసలే టీడీపీ పరిస్థితి దీనంగా ఉంది. దానికి తోడు జనసేనతో పొత్తు బెడిసికొట్టి ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా గోడ దూకేస్తున్న దుస్థితి. అందుకే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ‘కొత్త’ నాటకానికి తెర తీశారు. కొత్త సీసాలో పాత సారా అన్నట్టు.. (పాత సీసాలో కొత్త సారా అనాలేమో) ఇప్పటికే పార్టీలో ఉన్న వారికి కండువాలు కప్పి కొత్తగా చేరినట్టు బిల్డప్ ఇస్తున్నారు. బుధవారం నాటి నాటకంలో పాత్రధారులు పాత కాపులే అన్న సంగతి తెలియడంతో అందరూ విస్తుపోతున్నారు. సిహెచ్.నాగాపురం గ్రామంలో అయ్యన్నపాత్రుడి సమక్షంలో వైఎస్సార్సీపీ నుంచి 10 మంది టీడీపీలో చేరినట్టు ప్రచారం చేశారు. తీరా చూస్తే టీడీపీ కండువాలు కప్పుకున్న వారంతా గతంలో తమ పార్టీకి చెందిన వారు కావడంతో స్థానిక తెలుగుదేశం నేతలు తలెత్తుకోలేని పరిస్థితి నెలకొంది. నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ప్రభంజనాన్ని తట్టుకోలేక వేస్తున్న ఎత్తులతో నవ్వువులపాలయ్యామని పార్టీ కార్యకర్తలే చెవులు కొరుక్కుంటున్నారు. సిహెచ్.నాగాపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులే మళ్లీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సమక్షంలో పార్టీలో చేరడం చాలా సిగ్గుచేటుగా ఉందని నాగాపురం సర్పంచ్ యలమంచిలి రఘురాం ఎద్దేవా చేశారు. ఆయన గురువారం విలేకర్లుతో మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఉప్పులూరి రంగా, కులం రాము, కంకిపూడి మంగరాజు, చంటిబాబు టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారని, వీరితో పాటు మరో నలుగురు 2019లో అయ్యన్నపాత్రుడు గెలుపు కోసం పనిచేసిన వ్యక్తులేనని తెలిపారు. వీరికే మళ్లీ టీడీపీ కండువాలు కప్పడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. ఉప సర్పంచ్ సుబ్రమణ్యం తదితర్లు పాల్గొన్నారు. -
రూటు మార్చిన నాగబాబు?
జనసేన లో పవన్ కళ్యాణ్ .. నాదెండ్ల మనోహర్ తరువాత మూడో స్థానంలో ఉన్న పవన్ సోదరుడు నాగబాబుకు రాజకీయ ఆలోచనలు ఉన్నా.. వాటిని సరిగా అమలు చేయలేకపోవడం .. స్థిరత్వం లేకపోవడం.. సరైన ప్రణాళిక... వ్యూహాలు కొరవడడంతో చట్టసభల్లోకి వెళ్లే అవకాశం దక్కడం లేదు.. గతంలో 2019 లో నరసాపురం నుంచి జనసేన తరఫున లోక్ సభకు పోటీ చేసిన నాగబాబుకు రెండున్నర లక్షల ఓట్లు వచ్చినా గెలుపు సాధ్యపడలేదు.. అక్కడ రఘురామా కృష్ణం రాజు గెలవగా ఈయన ఏకంగా మూడో స్థానంలో మిగిలిపోయారు.. ఈసారైనా చట్టసభలో అధ్యక్షా అనాలన్నది అయన ఆశగా కనిపిస్తోంది.. చిన్నా చితకా యాక్టర్లు.. ఛోటామోటాగాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అవుతున్నారు కానీ మెగా బ్రదర్ అనే బ్రాండ్ ఉన్న నాకేం తక్కువ.. నేనూ గెలుస్తా అనే ధీమా ఆయనలో ఉన్నా.. తన కోరికను నెరవేర్చుకునే కృషి.. పట్టుదల.. అవేమి లేవు.. దీంతో ఆయన కోరిక నెరవేరడం లేదు.. ఈసారైనా గెలవాలన్న అయన లోక్ సభకు పోటీ చేస్తారని అంటున్నారు.. అయితే గతంలో కాపులు ఎక్కువగా ఉంటారన్న లెక్కతో నరసాపురంలో పోటీ చేసి దెబ్బతిన్న నాగబాబు ఈసారి రూటు మార్చారని అంటున్నారు.. ఏకంగా మూడు జిల్లాలు మారి అనకాపల్లికి రావడానికి ప్లాన్ చేస్తున్నారు . అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు రూట్ వేస్తున్నట్లు అయన కదలికలు స్పష్టం చేస్తున్నాయి. అయన ఇటీవల విశాఖలో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు.. దానికితోడు కాపు నాయకులూ.. వ్యాపారాలు.. పారిశ్రామికవేత్తలతోను సైతం తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారినుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం ... ఇంకా నిధుల వసూళ్లు వంటి పనుల్లో అయన యాక్టివ్ గా ఉన్నారు. ఇందులో భాగంగా పెందుర్తి.. యలమంచిలి నియోజకవర్గాల్లో అయన పర్యటిస్తున్నారు.. ఈమధ్యనే వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు... రాజీనామా చేసి జనసేనలో చేరారు.. అయన పెందుర్తిలో పోటీ చేస్తారని .. ఈ మేరకు పవన్ సైతం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఇద్దరికీ ప్రయోజనం కలిగేలా నాగబాబు సైతం పెందుర్తిలో పర్యటిస్తున్నారు. అయితే ఇదే పెందుర్తి టిక్కెట్ తనకు కావాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.. ఇక్కడ వైఎస్సార్సీపీ నుంచి అదీప్ రాజు ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో పెందుర్తి పోరు మంచి రసకందాయంగా ఉంటుందని తెలుస్తోంది. ఇక అనకాపల్లి ఎంపీ టిక్కెట్ కోసం అయ్యన్నపాత్రుడు కొడుకు విజయ్ కూడా లైన్లో ఉన్నారు.. తన కొడుక్కి ఎంతమాత్రం టిక్కెట్ ఇవ్వాల్సిందే అని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ నుంచి బైరా దిలీప్ అనే వ్యాపారవేత్త సైతం లైన్లో ఉన్నారు. తన కొడుక్కు టిక్కెట్ ఇవ్వకుండా పొత్తులో భాగంగా నాగబాబు పోటీ చేస్తే అయ్యన్న ఊరుకుంటారా ? మరి ఆయన్ను ఎలా శాంత పరుస్తారన్నది తెలియడం లేదు. ఈసారి నాగబాబు తన అభీష్టం మేరకు అనకాపల్లిలో పోటీ చేయగలరా లేదా అన్నది చూడాలి.. - సిమ్మాదిరప్పన్న ఇదీ చదవండి: ఢిల్లీలో బాబుకు ఎదురుదెబ్బ.. పవన్‌తో కొత్త రాయబారం! -
ఈ 420 గాడు మందు ఎక్కువై మాట్లాడుతున్నాడు: ఉమా శంకర్ ఫైర్
-
గాదిరాజు ప్యాలెస్ కేంద్రంగా పచ్చ మీడియా కుతంత్రం
-
మరోసారి బయటపడ్డ అయ్యన్నపాత్రుడి నోటి దురద
-
టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సీహెచ్ అయ్యన్నపాత్రుడు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులను అసభ్యంగా దూషించినందుకు ఎమ్మెల్యే పేర్ని నాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా ఆత్కూరు పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ అయ్యన్న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వీవీ సతీష్ వాదనలు వినిపిస్తూ.. పోలీసులు నమో దు చేసిన ఐపీసీ సెక్షన్లు 505(2), 153ఏలు పిటి షనర్లకు వర్తించవన్నారు. అయ్యన్నవర్గ విభేదాలను రెచ్చగొట్టేలా మాట్లాడలేదని, అసభ్య పదజాలం వాడలేదని అన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులపై మాత్రమే వ్యాఖ్యలు చేశారని తెలిపారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులపై అభ్యంతరకర పదజాలం ఉపయోగించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. అలాంటి భాషా ప్రయోగం మంచిది కాదని హితవు పలికారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఉన్నతస్థానాల్లో ఉన్న వ్యక్తులను దూషించడం అయ్యన్నకు అలవాటుగా మారిందన్నారు. ఇలాంటి వారి విషయంలో కోర్టులు తగిన విధంగా స్పందించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, పిటిషనర్ అయ్యన్నకి సీఆర్పీసీ సెక్షన్ 41ఏ నోటీసు ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు. చదవండి: ఎక్కడి దొంగలు.. అక్కడే! -
టీడీపీ కొత్త డ్రామా.. అర్జంటుగా బీసీ కార్డు గుర్తుకొచ్చిందా?
సాక్షి, విశాఖపట్నం: బీసీ నేత అయ్యన్నను అరెస్టు చేశారంటూ టీడీపీ కొత్త డ్రామాకు తెరతీసింది. అర్జంటుగా టీడీపీకి బీసీ కార్డు గుర్తుకొచ్చింది. నానా బూతులు తిడుతున్నప్పుడు అయ్యన్నకు గుర్తుకు రాని బీసీ కార్డు.. అయ్యన్నను అదుపు చేయనప్పుడు గుర్తుకు రాని బీసీ కార్డు.. అరెస్ట్ అనగానే టీడీపీకి గుర్తుకువచ్చిందా? అంటూ ఆ పార్టీ వైఖరీపై పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు. కాగా, అనుచిత వ్యాఖ్యల కేసులో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిని అదుపులోకి తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు.. ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చి.. అనకాపల్లి జిల్లా వెంపడు టోల్గేట్ వద్ద వదిలేశారు. ఇటీవల గన్నవరం యువగళం మీటింగ్‌లో సీఎంతో పాటు ఇతర మంత్రులను అయ్యన్న దూషించిన సంగతి తెలిసిందే. పత్రికల్లో రాయలేనంత దారుణంగా అయ్యన్న రెచ్చిపోయారు. మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయ్యన్నపై 153 A, 354 A1(4), 504, 505(2), 509 ఐపీఎస్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. చదవండి: బాబు ‘బ్లాక్‌మనీ యవ్వారం’.. బిగ్ ట్విస్ట్ -
టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: అనుచిత వ్యాఖ్యల కేసులో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడిని అదుపులోకి తీసుకున్న కృష్ణా జిల్లా పోలీసులు.. ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చి.. అనకాపల్లి జిల్లా వెంపడు టోల్గేట్ వద్ద వదిలేశారు. ఇటీవల గన్నవరం యువగళం మీటింగ్‌లో సీఎంతో పాటు ఇతర మంత్రులను అయ్యన్న దూషించిన సంగతి తెలిసిందే. పత్రికల్లో రాయలేనంత దారుణంగా అయ్యన్న రెచ్చిపోయారు. మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయ్యన్నపై 153 A, 354 A1(4), 504, 505(2), 509 ఐపీఎస్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. -
వాడుకుని వదిలేశాడా? ఆ సీనియర్ నేతకు ఎల్లో బాబు హ్యాండ్
చంద్రబాబు వాడుకుని వదిలేసే జాబితాలో మరో నేత చేరారా? ఉత్తరాంధ్రకు చెందిన ఆ సీనియర్ నేతకు ఎల్లో బాబు హ్యాండిస్తున్నారా? నాలుగేళ్ల పాటు ఆయన్ను పొలిటికల్‌గా వాడుకుని ఇప్పుడు సీటు లేదంటున్నారా? చంద్రబాబు చేసిన మోసంతో ఆ నాయకుడికి రాజకీయంగా జ్ఞానోదయం కలిగిందా? ఇంతకీ ఆ నేత ఎవరు? ఆయనకు చంద్రబాబు చేసిన ద్రోహం ఏంటి? అనకాపల్లి జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకి తగిన శాస్తి జరిగిందనే చర్చ తెలుగుదేశంలో జరుగుతోంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసం ఎవరినైనా ఎలాగైనా వాడుకోగలడనే విషయం ఆ పార్టీ వాళ్ళందరికీ బాగానే తెలుసు. గడచిన నాలుగేళ్లుగా అయ్యన్నతో అధికార పార్టీ మీద అడ్డగోలు విమర్శలు చేయించారు. అయ్యన్నను అడ్డుపెట్టుకుని బీసీల మీద జగన్ ప్రభుత్వం దాడులు చేస్తోందంటూ మొసలి కన్నీరు కార్చారు. తన రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అయ్యన్న కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం మీద ఇష్టారీతిన రెచ్చిపోయారు. చంద్రబాబు మాట విని ప్రభుత్వం మీద రెచ్చిపోతే తనకు ఎమ్మెల్యే సీటు, తన కొడుక్కి ఎంపీ సీటు వస్తుందని ఆశపడ్డారు. అయితే అయ్యన్న కుటుంబానికి రెండు సీట్లు ఇవ్వడం కుదరదు. కేవలం ఎమ్మెల్యే సీటుతోనే సరిపెట్టుకోవాలనే సంకేతాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. జనసేన, టీడీపీ మధ్య పొత్తు కుదురుతుందనే సాకుతో అయ్యన్న కుటుంబానికి ఎంపీ సీటు ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతోందని టీడీపీలో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు తీరుతో తన కుమారుడి రాజకీయ భవిష్యత్ గురించి అయ్యన్న బెంగ పెట్టుకున్నారు. అయ్యన్న కుమారుడికి సీటు ఇచ్చేదిలేదని చెప్పడమే గాకుండా..ఆయన వ్యాఖ్యల వల్ల పార్టీకి డ్యామేజ్ అయిందనే వాదనను చంద్రబాబు తెరపైకి తీసుకువస్తున్నారు. నాలుగేళ్ల పాటు చంద్రబాబు మాటలు విని ఒళ్ళు మరిచి ఇష్టానుసారంగా రెచ్చి పోయిన అయ్యన్నకు ఇప్పుడు అసలు విషయం బోధపడుతోంది. చంద్రబాబు తన రాక్షస క్రీడలో తనను బలి పశువును చేశారనే విషయం అయ్యన్నకు అర్థమైంది. తన రాజకీయ ప్రత్యార్థులైన గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తితో కలిసి చంద్రబాబు తన కుమారునికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నారని అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మాట్లాడని వారికి పెద్దపీట వేస్తూ తనను తొక్కే ప్రయత్నం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎర్రన్నాయుడు ఇంట్లో అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, ఆదిరెడ్డి భవానికి సీట్లు ఇవ్వడంతో పాటు రామ్మోహన్ నాయుడు మామ బండారు సత్యనారాయణమూర్తికి పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తున్నారని.. అదే తన ఇంట్లో తనకూ తన కుమారునికి ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడానికి చంద్రబాబుకు వచ్చిన ఇబ్బంది ఏంటని అయ్యన్న ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు పెద్దపీట వేస్తుంటే చంద్రబాబు మాత్రం పార్టీలో ఉన్న బీసీలను అవసరానికి వాడుకొని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని అయ్యన్న వర్గీయులు మండిపడుతున్నారు.. సీఎం జగన్ మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటారని, చంద్రబాబు మాత్రం మాట ఇస్తే నిలబెట్టుకోరని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. చదవండి: బాబు బాటలో పవన్.. నమ్మినవారినే నట్టేట ముంచేశాడా? గత ఎన్నికల్లో ఎంతోమంది యువకులకు సీఎం వైఎస్ జగన్ రాజకీయంగా అవకాశాలు కల్పించారని..చంద్రబాబు మాత్రం ఎంపీ సీటు ఇస్తానని చెప్పి తమను మోసం చేశారని, మళ్ళీ ఇప్పుడు అదే తరహాలో మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని అయ్యన్న రగిలిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తన కుమారునికి సీటు ఇవ్వకపోతే చంద్రబాబుతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. చంద్రబాబు మాటలు విని నాలుగేళ్లపాటు ఇస్టానుసారంగా రెచ్చిపోయిన అయ్యన్నకు తగిన శాస్తి జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
బరితెగించి అయ్యన్న బూతు పురాణం
పాలకొల్లు సెంట్రల్: పత్రికల్లో రాయలేనంత పచ్చి బూతులతో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు రెచ్చిపోయారు. సంస్కారం లేకుండా ఆయన పబ్లిక్‌గా బూతులు మాట్లాడుతుంటే అక్కడ సభలో పాల్గొన్న తెలుగు మహిళలు సిగ్గుతో తలదించుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో సోమవారం జరిగింది. భవిష్యత్‌కు గ్యారంటీ చైతన్య రథయాత్ర సమావేశంలో అయ్యన్న.. సీఎం జగన్‌పై రెచ్చిపోయి మాట్లాడారు. పనికిరాని సన్నాసి, నత్తి నాకొ.. లాంటి దారుణ పదజాలంతో సీఎంను విమర్శించారు. వీడు.. వాడు.. అంటూ సీఎం అనే మర్యాద లేకుండా ఏకవచనంతో సంబోధించారు. సీఎం సతీమణిపైనా అవాకులు చెవాకులు పేలారు. ఇప్పటికే తనపైన 14 కేసులు పెట్టారని, ఎన్ని కేసులు పెట్టినా ఏమీ పీకలేరంటూ అసభ్యంగా సంజ్ఞలు చేస్తూ చూపించారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ‘గత ఎన్నికల ముందు రూ.10 వేలు ఇచ్చాం. అంతా మనకే గుద్దేస్తారని చంకలు కొట్టేసుకున్నాం. అయినా మనకి పెద్ద పువ్వు చూపించారు. గెలుపు అంత ఈజీ కాదు. చివరి వరకూ పోరాటం చేయాల్సిందే’ అని చెప్పారు. శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. -
మరోసారి టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, నర్సీపట్నం: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై తన నోటి దురుసును ప్రదర్శించారు. ‘‘6 నెలల్లో చంద్రబాబు సీఎం అవుతున్నారు.. పోలీసులు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలి.. లేదా లిస్ట్ రాసుకుని ఒక్కొక్కరి సంగతి చెప్తా’’ అంటూ బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా పలు సందర్భాల్లో అయ్యన్న పోలీసులపై నోరు పారేసుకున్నారు. గుంటూరులో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయాడు. తాము అధికారంలోకి వచ్చాక పోలీసులు తమ చంకే నాకాలంటూ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. 'త్వరలో టీడీపీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చాక నాకు లా అండ్ ఆర్డర్ మంత్రి పదవి ఇవ్వాలి. షూట్ అండ్ సైట్ అధికారాలు అప్పగించాలి. అప్పుడు ఈ పోలీసుల సంగతి చెబుతా' అంటూ అయ్యన్న పాత్రుడు భయబ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యానించారు. చదవండి: పాయకరావుపేటలో అనిత ఎలా గెలుస్తారో చూస్తాం.. -
ఈ సభా సాక్షిగా..అయ్యన్న పని అయిపాయె
-
అయ్యన్న ఆశ అదేనట.. అడ్డు పడుతోందెవరు..?
టీడీపీలో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోతోందా? అయ్యన్నకు అడుగడుగానే అవమానాలేనా? కొడుకును ఎంపీగా చూసుకోవాలనే ఆశ అయ్యన్నకు నెరవేరదా? చంద్రబాబు నుంచి అయ్యన్న కుమారుడికి సీటు విషయంలో క్లారిటీ ఎందుకు రాలేదు. దీనికి అడ్డు పడుతున్నదెవరు? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మంత్రిగా పనిచేసిన చింతకాయల అయ్యన్నపాత్రుడు తన కుమారుడు విజయ్ రాజకీయ భవిష్యత్ గురించి ఆందోళన పడుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికత తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ అవుదామనుకుంటున్న అయ్యన్న.. తాను యాక్టివ్‌గా ఉండగానే కొడుకును ఎంపీగా చూడాలని కలలు కంటున్నారు. కాని ఆ కలలు కల్లలవుతాయేమోనని ఆయన ఆందోళన చెందుతున్నట్లు పచ్చ పార్టీలో టాక్ నడుస్తోంది. అనకాపల్లి నుంచి కొడుకు ఎంపీగా పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని చంద్రబాబుకు విన్నవించుకున్నారు. అయితే అనకాపల్లి ఎంపీ టిక్కెట్ కోసం చంద్రబాబు పరిశీలిస్తున్న పేర్లంటూ రోజుకో పేరు ప్రచారంలోకి వస్తుండటంతో అయ్యన్న తన కొడుకు భవిష్యత్ గురించి బెంగ పడుతున్నారని టాక్. అచ్యుతాపురం సెజ్ లోని ఒక కంపెనీ అధిపతి పేరు ఇటీవల తెరపైకి వచ్చింది. అదేవిధంగా అనకాపల్లిలోని ప్రముఖ వస్త్ర వ్యాపారి పేరు కూడా టీడీపీలో వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు మధ్య పొత్తు కుదిరితే జనసేన కచ్చితంగా అనకాపల్లి ఎంపీ సీటు అడుగుతుంది. ఎందుకంటే ఆ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కాపుల ఓట్లు అధికంగా ఉన్నాయి. ఒక వేళ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరకపోయినా..ఆ సీటు కాపు సామాజికవర్గ నేతకే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సమీకరణాల మధ్య తన కొడుక్కు సీటు రాకుండా పోతుందేమోనన్న బాధ అయ్యన్నను వేధిస్తోంది. చదవండి: వీరి పొత్తుల ఎత్తులు చూడాల్సిందే! తన సమకాలీకుడైన ఎర్రన్నాయుడి కుటుంబం నుంచి ఆయన తమ్ముడు, కొడుకు, కూతురు కూడా టీడీపీ నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. దశాబ్దాలుగా టీడీపీనే నమ్ముకున్న తనకు మాత్రం రెండో సీటు సాధించుకోవడం అనేది కలగానే మిగులుతోందని అయ్యన వాపోతున్నట్లు ఆయన సన్నిహితులు అంటున్నారు. తన తండ్రి రాజకీయ అనుభవం తన రాజకీయ ప్రవేశానికి సరిపోలేదని గ్రహించిన చింతకాయల విజయ్.. నారా లోకేష్ టీమ్‌లో చేరి ఐటీడీపీ పేరుతో టీడీపీ సోషల్ మీడియా నిర్వహిస్తూ.. రాష్ట్రంలో అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబాన్ని టార్గెట్ చేసి వైఎస్ఆర్సీ నాయకత్వం, పోలీసులు దృష్టి తనపై పడేటట్లు చూసుకుంటున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అనకాపల్లి ఎంపీ సీటుపై మాత్రం తనకి క్లారిటీ రాకపోవడంపై తండ్రీ కొడుకుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఎంపీ సీటు మీద ఆశ పెట్టుకుని, చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో అయ్యన్నపాత్రుడు ప్రభుత్వంపైన, సీఎం జగన్‌పైన లేనిపోని ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు పరిస్థితులు ఆయనకు సానుకూలంగా కనిపించడంలేదు. చింతకాయల విజయ్ కు ఎంపీ సీటు ఇవ్వకపోతే నోటు దురుసు ఎక్కువున్న అయ్యన్న పార్టీలో రచ్చలేపుతారనే చర్చ తెలుగుదేశం పార్టీ నేతల్లోనే సాగుతోంది. చదవండి: మళ్లీ కులపిచ్చి బయటపెట్టుకున్న చంద్రబాబు -
సుప్రీంకోర్టులో టీడీపీ నేత అయ్యన్న పాత్రుడికి చుక్కెదురు
-
ఫోర్జరీ కేసు: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడికి సుప్రీంలో చుక్కెదురు
ఢిల్లీ: టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గతంలో అయ్యన్నపాత్రుడిపై నమోదైన ఓ ఫోర్జరీ కేసుకు సంబంధించి దర్యాప్తునకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్ ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.సెక్షన్ ఐపీసీ 467 కింద దర్యాప్తు చేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాగా, ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆయన కుమారుడు రాజేష్‌పై గతంలో ఫోర్జరీ కేసు నమోదైంది.. అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాచపల్లి రిజర్వాయర్ పంట కాలువపై రెండు సెంట్లు మేర స్థలంలో అక్రమంగా ప్రహరి నిర్మాణం చేశారు. అక్రమ నిర్మాణం.. సక్రమం చేసుకునేలా.. నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడు ఇంటికి ఆనుకుని పంట కాలువ ఉంది. నిర్మాణ సమయంలో బిల్డింగ్ అనుమతి కోసం ఇచ్చిన దరఖాస్తులో కూడా తాము నిర్మించబోయే ఇంటికి దక్షిణం, పశ్చిమాన పంట కాలువ ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. తీరా నిర్మాణం సమయం.. అది కూడా టీడీపీ అధికారంలో ఉన్న సమయం కావడంతో ఏకంగా పంట కాలువను ఆక్రమించి ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. ఇన్నాళ్లుగా గుట్టుగా ఉన్న ఈ వ్యవహారం వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టబయలైంది. ప్రభుత్వ భూములను కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డ్రైవ్‌లో భాగంగా రెవెన్యూ యంత్రాంగం సర్వే చేసింది. ఇందులో జలవనరుల శాఖకు చెందిన పంట కాలువను ఆక్రమించి అయ్యన్న కుటుంబ సభ్యులు ఇంటి నిర్మాణాన్ని చేపట్టారని సర్వేలో తేలింది. ఈ మేరకు చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ యంత్రాంగం ఉపక్రమించింది. అక్రమంగా పంట కాలువలో నిర్మించిన నిర్మాణాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తే తన నోటి దురుసుతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించి అధికారులను అడ్డుకున్నారు. అదే సమయంలో అక్రమ నిర్మాణం కాదంటూ ఫోర్జరీ సంతకాలతో నిరంభ్యంతర పత్రం(ఎన్వోసీ)ను సృష్టించి.. సక్రమ నిర్మాణమేనని చెప్పుకునేందుకు యత్నించారు. తీరా సదరు అధికారి ఎన్వోసీలో ఉన్నది తన సంతకం కాదని స్పష్టం చేసి సీఐడీకి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది. ఫోర్జరీ సంతకాలు.. తప్పుడు స్టాంపు పేపర్లు చింతకాయల విజయ్ పేరుతో నర్సీపట్నంలో అయ్యన్న కుటుంబ సభ్యులు 2017లో ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం నర్సీపట్నం మున్సిపాలిటీకి సర్వే నంబర్లు 277, 278/1లోని 387.33 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణానికి అనుమతి కోరుతూ దరఖాస్తు(సెటిల్మెంట్ డీడ్ నం–3660 ఆఫ్ 2017) చేశారు. దక్షిణం, పశ్చిమం వైపు పంట కాలువ ఉన్నట్టు పేర్కొన్నారు. అనంతరం ఈ కాలువను ఆక్రమించి మరీ నిర్మాణం చేపట్టారు. దీనిపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి పెట్టడంతో ఫోర్జరీ సంతకాలతో నిరంభ్యంతర సర్టిఫికెట్ (ఎన్వోసీ) సృష్టించడమే కాకుండా ఏకంగా కోర్టునే తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారు. 2019 ఫిబ్రవరి 25న ఇంటి నిర్మాణం కోసం ఎన్వోసీని జలవనరులశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లికార్జున రావు సంతకంతో ఇచ్చినట్టుగా కోర్టులో సమర్పించారు. దీనిని పరిశీలించిన ఈఈ ఎన్వోసీలో ఉన్నది తన సంతకం కాదని గుర్తించారు. అంతేకాకుండా దీనిపై కార్యాలయంలోని ఫైళ్లను పరిశీలించగా.. తాను ఇవ్వలేదని గుర్తించారు. కోర్టుకు సమర్పించిన ఎన్వోసీ పత్రాల్లో ఉన్న సంతకం తనది కాదని కూడా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని పేర్కొంటూ జలవనరులశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లికార్జునరావు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి వాగు, కెనాల్, నాలా, డ్రెయిన్ బౌండరీకి 9–10 మీటర్లలోపు ఎటువంటి నిర్మాణం చేపట్టరాదని ఏపీ బిల్డింగ్ చట్టం–2017 చెబుతోంది. ఇందుకు అనుగుణంగా కెనాల్ బౌండరీని మొదటగా నిర్ణయించాల్సి ఉంటుంది. అసలు ఇక్కడ కెనాల్ బౌండరీని నిర్ణయించకుండా ఎన్వోసీ ఇవ్వడం సాధ్యం కాదు. అయినప్పటికీ తన పేరుతో ఎన్వోసీ ఇచ్చినట్టుగా కోర్టులో చూపారని ఈఈ మల్లికార్జునరావు పేర్కొన్నారు. అసలు ఆ డాక్యుమెంటులో ఉన్న సంతకం తన స్టయిల్లో చేసిన సంతకం కాదని.. సంతకం కింద తేదీ వివరాలు పేర్కొనడం కూడా ఫోర్జరీనేనని తెలిపారు. మరోవైపు కార్యాలయం సీల్ కూడా తమది కాదని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు సీఐడీకి 30 సెపె్టంబరు 2022లో ఈఈ ఫిర్యాదు చేయగా... దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇన్స్పెక్టర్ పైడిరాజు విచారణ అధికారిగా తన నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో ఫోర్జరీ ఎన్వోసీ వ్యవహారం స్పష్టంగా తేటతెల్లమైంది. -
అయ్యన్నపాత్రుడుకి మతి భ్రమించింది: నారాయణ స్వామి కౌంటర్
సాక్షి, చిత్తూరు: టీడీపీ అయ్యన్నపాత్రుడిపై డిప్యూటీ నారాయణ స్వామి సీరియస్ అయ్యారు. అయ్యన్నపాత్రుడు మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. సంస్కారం లేని వ్యక్తి అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కాగా, నారాయణ స్వామి మాట్లాడుతూ..‘రాబోయే ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ గల్లంతవడం ఖాయం. అయ్యన్నపాత్రుడు సంస్కారం లేని వ్యక్తి. ఓడిపోతామనే భయంతో మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. తాను కాబోయే హోం మంత్రిని అంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడు. అయ్యన్నపాత్రుడు తన భాషను మార్చుకోవాలి. లేకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు.. అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలపై నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ కూడా ఆగ్రహ వ్యక్తం చేశారు. ఆయన ఒక సైకో, శాడిస్డు అని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌లు పెద్ద సైకోలు అని ధ్వజమెత్తారు. అయ్యన్నపాత్రుడు చరిత్ర అందరికి తెలుసని, నర్సీపట్నంను గంజాయి అడ్డాగా మార్చిన చరిత్ర ఆయనదని విమర్శలు గుప్పించారు. అయ్యన్న కంటే మేము బూతులు మాట్లాడగలము. అయ్యన్న నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. -
'అయ్యన్న పాత్రుడు సైకో, శాడిస్టు.. ఆయన చరిత్ర అందరికీ తెలుసు'
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేత అయ్యన్న పాత్రుడును ఏకి పారేశారు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్. ఆయన ఒక సైకో, శాడిస్డు అని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌లు పెద్ద సైకోలు అని ధ్వజమెత్తారు. అయ్యన్నపాత్రుడు చరిత్ర అందరికి తెలుసని, నర్సీపట్నంను గంజాయి అడ్డాగా మార్చిన చరిత్ర ఆయనదని విమర్శలు గుప్పించారు. 'రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీ ముఠా చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు. అయ్యన్న కంటే మేము బూతులు మాట్లాడగలము. అయ్యన్న నోరు అదుపులో పెట్టుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేశారు. జన్మభూమి కమిటీల్లా బ్రోకర్లలా కాకుండా వలంటీర్ల వ్యవస్థ పని చేస్తుంది. పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లే ధైర్యం చంద్రబాబుకు ఉందా? 175 స్థానాల్లో పోటీ చేసే ధైర్యం చంద్రబాబుకు ఉందా? ఓడిపోతామనే భయంతో అన్ని పార్టీల నేతల ఇంటికి అయ్యన్నపాత్రుడు తిరుగుతున్నారు. వెయ్యి మంది చంద్రబాబులు, లక్ష మంది అయ్యన్నపాత్రుడులు వచ్చినా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏమీ చేయలేరు. రూ. 500 కోట్లతో మెడికల్ కాలేజీ ఇచ్చారు. రూ.470 కోట్లతో తాండవ ఏలేరు కాలువ నదులను అనుసంధానం చేశారు' అని ఉమా శంకర్ గణేశ్ వ్యాఖ్యానించారు. చదవండి: శ్రీవారి ఆలయం డ్రోన్ విజువల్స్‌పై టీటీడీ సీరియస్.. విచారణకు ఆదేశం -
టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
-
ఆ పదవి నాకు ఇవ్వాలి.. అప్పుడు పోలీసుల సంగతి చెప్తా: అయ్యన్న
సాక్షి, గుంటూరు: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులపై తన నోటి దురుసును ప్రదర్శించారు. గుంటూరులో గురువారం రోజున ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయాడు. తాము అధికారంలోకి వచ్చాక పోలీసులు తమ చంకే నాకాలంటూ తీవ్ర అభ్యంరతరకర వ్యాఖ్యలు చేశారు. 'త్వరలో టీడీపీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చాక నాకు లా అండ్ ఆర్డర్ మంత్రి పదవి ఇవ్వాలి. షూట్ అండ్ సైట్ అధికారాలు అప్పగించాలి. అప్పుడు ఈ పోలీసుల సంగతి చెబుతా' అంటూ అయ్యన్న పాత్రుడు భయబ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యానించారు. గతంలో కూడా పలు సందర్భాల్లో అయ్యన్న పోలీసులపై నోరు పారేసుకున్నారు. చదవండి: (బెంచ్ మార్క్‌గా సీఎం జగన్ నిర్ణయం: సజ్జల రామకృష్ణారెడ్డి) -
కోల్డ్ స్టోరేజ్ నేతలంతా చేరి ప్రభుత్వంపై విమర్శలా: అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: దాదాపు మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో పదవులు అనుభవించిన కొంత మంది కోల్డ్ స్టోరేజీ, డార్క్ రూం లీడర్లు కలిసి ఉత్తరాంధ్ర చర్చా వేదిక పేరిట టీడీపీ వాయిస్ వినిపించారని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఈ చర్చా వేదికలో ఉత్తరాంధ్ర ప్రాంతవాసుల కంటే ఇతర ప్రాంతాల వారే ఎక్కువగా ఉన్నారన్నారు. విశాఖ పరిపాలనా రాజధానికి మద్దతుగా తీర్మానం చేసి, మిగతా అంశాలన్నీ చర్చించాల్సింది పోయి, అవేమీ లేకుండా తెలుగుదేశం టార్గెట్ చేసిన విధంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేశారని చెప్పారు. శనివారం ఆయన సర్క్యూట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. తటస్థుల ముసుగులో టీడీపీ నాయకులే ఈ చర్చా వేదికలో ఉన్నారని, రాజకీయ విమర్శలు చేయడానికే ఉత్తరాంధ్ర చర్చ నిర్వహించారన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా ప్రచారం చేసిన కొణతాల రామకృష్ణ ఈ చర్చా వేదికకు అధ్యక్షత వహించడమే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. సీపీఐ రామకృష్ణ ‘చంద్రబాబు ఆఫ్ ఇండియా’గా పేరు మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. వీరితో సహజీవనం సాగిస్తున్న నాదెండ్ల మనోహర్, ఏపీలో తుడిచి పెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రరాజు రాజకీయ మేధావులా? అని ప్రశ్నించారు. తాగుబోతు అయ్యన్నపాత్రుడుకి వయసు మీద పడిన దశలో అరగంట మాట్లాడిన తర్వాత కంట నీరు వస్తే అది భావోద్వేగానికి గురైనట్టు కొన్ని పచ్చ చా నళ్లు చూపించడం చూస్తుంటే నవ్వొస్తోందన్నారు. మార్చి 31 తర్వాత విశాఖ నుంచే పరిపాలన ►మార్చి 31 తర్వాత ఎప్పుడైనా విశాఖ నుంచి పరిపాలన ప్రారంభమవుతుంది. ప్రభుత్వ భూములు దోచుకున్నది టీడీపీ నేతలే. గీతం యూనివర్సిటీ టీడీపీ నాయకులది కాదా? 45 వేల కోట్ల పెట్టుబడులతో ఐటీ సెజ్.. మెడికల్ కళాశాలలు ఎప్పుడైనా ఏర్పాటు చేశారా? బాక్సై ట్ కోసం జీవో ఇచ్చింది ఎవరు? చింతపల్లిలో ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ ఆందోళనలో పాల్గొనడం మరిచిపోయారా? రూ.4 వేల కోట్లకు పైగా విలువచేసే ప్రభుత్వ భూములను కాపాడి, ప్రభుత్వానికి ఆదాయాన్ని చేకూర్చాం. ►ఈనెల 6న గ్లోబల్ హెల్త్ సదస్సు జరిగింది. మార్చి 28, 29న, ఏప్రిల్ 24న జీ–20 సదస్సులున్నాయి. జనవరి 20, 21న ఐటీ సదస్సు ఏర్పాటు చేయనున్నాం. ఏపీలో బీఆర్ఎస్, కేఏ పాల్ గురించి మాట్లాడడం అనవసరం. టీడీపీ, ఎల్లో మీడియా జీవో నం.1ను వక్రీకరిస్తున్నాయి. ప్రత్యేక హోదాపై మాట్లాడే హక్కు టీడీపీకి లేదు. చదవండి: (చరిత్ర అంటే ఏంటో తెలుసా బాలయ్య..?) -
హమ్మమ్మ.. అయ్యన్నా.. ఏకంగా కోర్టునే తప్పుదోవ పట్టించిన వైనం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టుగా ఉంది టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యవహారం. నోరు తెరిస్తే బూతులతో పాటు నీతులు చెప్పే అయ్యన్న.. తనవరకు వచ్చే సరికి మాత్రం ఫోర్జరీ పత్రాలతో నిరంభ్యంతర పత్రం(ఎన్వోసీ) సృష్టించి తప్పును ఒప్పుగా చూపించుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఏకంగా కోర్టును కూడా తప్పుదోవ పట్టించి తన అక్రమ ఇంటి కట్టడాన్ని కూల్చేయకుండా స్టే తెచ్చుకున్నారు. కాలువ భూమిని ఆక్రమించి.. కట్టుకున్న తన ఇంటిని సక్రమమైన నిర్మాణం చేసుకునేలా అయ్యన్న వ్యవహరించిన తీరు అందరూ ఛీత్కరించుకునేలా ఉంది. మరోవైపు అయ్యన్న చేసింది అక్రమమని తేలిన నేపథ్యంలో సీఐడీ రంగంలోకి దిగడంతో టీడీపీ నేతలు బీసీ కార్డును ఉపయోగించడం మరీ విడ్డూరంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ నిర్మాణం.. సక్రమం చేసుకునేలా.. నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడు ఇంటికి ఆనుకుని పంట కాలువ ఉంది. నిర్మాణ సమయంలో బిల్డింగ్ అనుమతి కోసం ఇచ్చిన దరఖాస్తులో కూడా తాము నిర్మించబోయే ఇంటికి దక్షిణం, పశ్చిమాన పంట కాలువ ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. తీరా నిర్మాణం సమయం.. అది కూడా టీడీపీ అధికారంలో ఉన్న సమయం కావడంతో ఏకంగా పంట కాలువను ఆక్రమించి ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. ఇన్నాళ్లుగా గుట్టుగా ఉన్న ఈ వ్యవహారం వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బట్టబయలైంది. ప్రభుత్వ భూములను కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన డ్రైవ్‌లో భాగంగా రెవెన్యూ యంత్రాంగం సర్వే చేసింది. ఇందులో జలవనరుల శాఖకు చెందిన పంట కాలువను ఆక్రమించి అయ్యన్న కుటుంబ సభ్యులు ఇంటి నిర్మాణాన్ని చేపట్టారని సర్వేలో తేలింది. ఈ మేరకు చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ యంత్రాంగం ఉపక్రమించింది. అక్రమంగా పంట కాలువలో నిర్మించిన నిర్మాణాన్ని కూలదోసేందుకు ప్రయత్నిస్తే తన నోటి దురుసుతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించి అధికారులను అడ్డుకున్నారు. అదే సమయంలో అక్రమ నిర్మాణం కాదంటూ ఫోర్జరీ సంతకాలతో నిరంభ్యంతర పత్రం(ఎన్వోసీ)ను సృష్టించి.. సక్రమ నిర్మాణమేనని చెప్పుకునేందుకు యత్నించారు. తీరా సదరు అధికారి ఎన్వోసీలో ఉన్నది తన సంతకం కాదని స్పష్టం చేసి సీఐడీకి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకొచ్చింది. ఫోర్జరీ సంతకాలు.. తప్పుడు స్టాంపు పేపర్లు చింతకాయల విజయ్ పేరుతో నర్సీపట్నంలో అయ్యన్న కుటుంబ సభ్యులు 2017లో ఇంటి నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం నర్సీపట్నం మున్సిపాలిటీకి సర్వే నంబర్లు 277, 278/1లోని 387.33 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణానికి అనుమతి కోరుతూ దరఖాస్తు(సెటిల్మెంట్ డీడ్ నం–3660 ఆఫ్ 2017) చేశారు. దక్షిణం, పశి్చమం వైపు పంట కాలువ ఉన్నట్టు పేర్కొన్నారు. అనంతరం ఈ కాలువను ఆక్రమించి మరీ నిర్మాణం చేపట్టారు. దీనిపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి పెట్టడంతో ఫోర్జరీ సంతకాలతో నిరంభ్యంతర సర్టిఫికెట్ (ఎన్వోసీ) సృష్టించడమే కాకుండా ఏకంగా కోర్టునే తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారు. 2019 ఫిబ్రవరి 25న ఇంటి నిర్మాణం కోసం ఎన్వోసీని జలవనరులశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లికార్జున రావు సంతకంతో ఇచ్చినట్టుగా కోర్టులో సమర్పించారు. దీనిని పరిశీలించిన ఈఈ ఎన్వోసీలో ఉన్నది తన సంతకం కాదని గుర్తించారు. అంతేకాకుండా దీనిపై కార్యాలయంలోని ఫైళ్లను పరిశీలించగా.. తాను ఇవ్వలేదని గుర్తించారు. కోర్టుకు సమర్పించిన ఎన్వోసీ పత్రాల్లో ఉన్న సంతకం తనది కాదని కూడా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని పేర్కొంటూ జలవనరులశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మల్లికార్జునరావు సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి వాగు, కెనాల్, నాలా, డ్రెయిన్ బౌండరీకి 9–10 మీటర్లలోపు ఎటువంటి నిర్మాణం చేపట్టరాదని ఏపీ బిల్డింగ్ చట్టం–2017 చెబుతోంది. ఇందుకు అనుగుణంగా కెనాల్ బౌండరీని మొదటగా నిర్ణయించాల్సి ఉంటుంది. అసలు ఇక్కడ కెనాల్ బౌండరీని నిర్ణయించకుండా ఎన్వోసీ ఇవ్వడం సాధ్యం కాదు. అయినప్పటికీ తన పేరుతో ఎన్వోసీ ఇచ్చినట్టుగా కోర్టులో చూపారని ఈఈ మల్లికార్జునరావు పేర్కొన్నారు. అసలు ఆ డాక్యుమెంటులో ఉన్న సంతకం తన స్టయిల్లో చేసిన సంతకం కాదని.. సంతకం కింద తేదీ వివరాలు పేర్కొనడం కూడా ఫోర్జరీనేనని తెలిపారు. మరోవైపు కార్యాలయం సీల్ కూడా తమది కాదని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు సీఐడీకి 30 సెపె్టంబరు 2022లో ఈఈ ఫిర్యాదు చేయగా... దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఇన్స్పెక్టర్ పైడిరాజు విచారణ అధికారిగా తన నివేదికను సమర్పించారు. ఈ నివేదికలో ఫోర్జరీ ఎన్వోసీ వ్యవహారం స్పష్టంగా తేటతెల్లమైంది. కప్పిపుచ్చుకునేందుకు కులం కార్డు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో వందల కోట్ల విలువ చేసే భూములను కాపాడింది. 430 ఎకరాల మేర ప్రభుత్వ భూములను స్వా«దీనం చేసుకుంది. ఇందులో భాగంగానే నర్సీపట్నంలో కూడా అయ్యన్న కుటుంబసభ్యులు ఇంటి నిర్మాణం కూడా పంట కాలువను ఆక్రమించి నిర్మించారని సర్వేలో తేలింది. ఈ అక్రమ నిర్మాణాన్ని కూలగొట్టేందుకు యత్నించగా భౌతికంగా అడ్డుకునే ప్రయత్నంతో పాటు ఈ నిర్మాణానికి ఎన్వోసీ ఉందంటూ ఫోర్జరీ డాక్యుమెంట్‌ను సృష్టించారు. అది తీరా సీఐడీ విచారణలో ఫోర్జరీ అని తేలడంతో చివరకు టీడీపీ నేతలు కులం కార్డును తెరమీదకు తెచ్చారు. వాస్తవానికి గతంలో ఏ ప్రభుత్వ హయాంలో లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మేలు చేస్తోంది. బీసీల్లో గతంలో ఎన్నడూలేని విధంగా మెజార్టీ కులాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వారికి రాజకీయ అధికారాన్ని కట్టబెట్టింది. మరోవైపు టీడీపీ మాత్రం అమరావతి ప్రాంతంలో సామాజిక సమీకరణ దెబ్బతింటుందని పేర్కొంటూ అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేసింది. అయితే చట్టాన్ని సవరించి మరీ పట్టాలను ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే.. దానిని కూడా టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారు. ఆయా వర్గాలపై తనకున్న వ్యతిరేకతను నిర్లజ్జగా కనబరుస్తున్న టీడీపీ.. అక్రమ వ్యవహారంలో కూరుకున్న అయ్యన్న విషయానికి వచ్చేసరికి మాత్రం బీసీ కార్డును ప్రయోగిస్తుండం ఆశ్చర్యం కలిగిస్తోంది. -
అయ్యన్న నేరాలకు బీసీలకు సంబంధమేంటి?
సాక్షి, అమరావతి/నెట్వర్క్: అయ్యన్నపాత్రుడిని అరెస్టుచేస్తే బీసీ నేతను అరెస్టుచేశారని టీడీపీ బీసీ నేతలు మాట్లాడడం సిగ్గుచేటని పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు మండిపడ్డారు. అయ్యన్న తప్పుచేస్తే బీసీలకు ఏం సంబంధమని వారు సూటిగా ప్రశ్నించారు. ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోకుండా బీసీలపై దాడి అంటూ రాజకీయ లబ్ధిపొందేందుకు యత్నించడం చాలా హేయమని వారు వ్యాఖ్యానించారు. ఫోర్జరీ ఆరోపణలతో అయ్యన్నను సీఐడీ అరెస్టుచేసిన నేపథ్యంలో చంద్రబాబు సహా టీడీపీ నేతలు స్పందిస్తున్న తీరుపై మంత్రులు బూడి ముత్యాలనాయుడు, జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. వారు ఏమన్నారో వారి మాటల్లోనే.. అడ్డంగా దొరికిపోయిన దొంగ అయ్యన్న ‘అయ్యన్నపాత్రుడు నేరాలకు బీసీలకు ఏం సంబంధం ఉంది? దొంగ పనులు చేసి అడ్డంగా దొరికిపోయిన దొంగ అయ్యన్నను పోలీసులు అరెస్టుచేస్తే బీసీలకు అన్యాయం చేస్తున్నట్లు టీడీపీ నేతలు వక్రీకరించడం అన్యాయం. అయ్యన్న చేసిన తప్పులకు అయ్యన్నే బాధ్యుడు. వాటితో బీసీలకు ఏం సంబంధం? చట్టం ఎవరికీ చుట్టంకాదు. పంట కాలువను ఆక్రమించి ఇంటి గోడను నిర్మించిన ఆయనపై సీఐడీ చట్టప్రకారమే కేసు నమోదు చేసింది. ఆక్రమించిన ఇరిగేషన్ భూమిలో ప్రహరీ నిర్మాణానికి తాను ఎన్వోసీ ఇవ్వలేదని, అయ్యన్న హైకోర్టుకు నకిలీపత్రాలు సమర్పించారని జలవనరుల శాఖ ఈఈ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐడీ జరిపిన దర్యాప్తులో అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారణ అయ్యాకే అరెస్టుచేశారు. ఇందులో కక్ష సాధింపు ఎక్కడ ఉందో చంద్రబాబు, టీడీపీ నేతలు చెప్పాలి..’ అని అన్నారు. చట్టం ముందు ఎవరైనా ఒక్కటే తప్పుచేసిన వారు ఎవరైనా శిక్షార్హులే. అయ్యన్నపాత్రునికి ఒక న్యాయం చంద్రబాబుకు ఒక న్యాయం ఉండదు. బీసీలపై దాడి, అర్ధరాత్రి అరెస్టు అంటూ చంద్రబాబు వెకిలివాగుడు వాగుతున్నాడు. ప్రజా ప్రతినిధులు, పలుకుబడిగల నేతలను పోలీసులు రాత్రివేళల్లోనే అదుపులోకి తీసుకుంటారు. ఇది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఇక పవన్ కళ్యాణ్‌ని చంపేందుకు రెక్కీ నిర్వహిస్తున్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ అనడం హాస్యాస్పదం. కుట్రచేస్తే అది చంద్రబాబే చెయ్యాలి. – కొడాలి నాని, గుడివాడ ఎమ్మెల్యే తప్పుడు పనులకు టీడీపీ లైసెన్స్ ఇచ్చిందా? అయ్యన్నకు ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి ఆ పార్టీ ఏమైనా లైసెన్స్ ఇచ్చిందా? అరెస్టుచేసిన సమయంలో వీడియోలను పరిశీలిస్తే అయ్యన్న పోలీసులను తీవ్రస్థాయిలో బెదిరించారన్నది స్పష్టమవుతోంది. అయ్యన్న అరెస్టును బీసీలకు ముడిపెట్టి.. రాజకీయంగా లబ్ధిపొందాలని ప్రయత్నిస్తే బీసీలు వాటిని తిప్పికొడతారు. ఇక విశాఖ భూములపై తాము ప్రశ్నిస్తున్నందుకే తప్పుడు కేసులు పెడుతున్నారంటున్న టీడీపీ నేతల వ్యాఖ్యలు హాస్యాస్పదం. ఫోర్జరీలు చేసేవాడు సామాజిక కార్యకర్త అవుతాడా? టీడీపీ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ.. వీళ్లంతా ఏమైనా సంఘ సేవకులా? వీళ్లంతా రాష్ట్రాన్ని దోచుకున్న దోపిడీదారులు. ఈ ముఠాకు నాయకుడు చంద్రబాబు. నారా లోకేశ్ సోషల్ మీడియాను అడ్డంపెట్టుకుని సీఎం జగన్‌ను, ఆయన కుటుంబ సభ్యులతోపాటు వైఎస్సార్సీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై సీఐడీ పోలీసులు దృష్టిసారించి చర్యలు తీసుకోవాలి. – తాడేపల్లిలో మీడియాతో మంత్రి బూడి ముత్యాలనాయుడు తప్పులు కప్పి పుచ్చుకునేందుకే రాద్ధాంతం అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ నేతలు లేనిపోని ఆరోపణలతో రాద్ధాంతం చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే అయ్యన్నపాత్రుడిపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. పోలీసులు చట్టప్రకారం ఆయన్ను అరెస్టుచేస్తే బీసీలపై దాడిగా టీడీపీ నేతలు ఆరోపణలు చేయటం సిగ్గుచేటు. ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోకుండా బీసీలపై దాడి అంటూ రాజకీయ లబ్ధిపొందేందుకు యత్నించడం హేయం. అయ్యన్న తప్పులను కాపాడేందుకు టీడీపీ నాయకులు చేస్తున్న గగ్గోలును కట్టిపెట్టాలి. – మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అయ్యన్న అతిపెద్ద భూకబ్జాదారుడు రాష్ట్రంలో అత్యధికంగా భూకబ్జాలు చేసిన వ్యక్తి, గంజాయి దొంగ అయ్యన్నపాత్రుడే. న్యాయస్థానాలకు తప్పుడు పత్రాలు సమర్పించి రెవెన్యూ రికార్డుల్లో టాంపరింగ్ చేశారు. అధికారులు చెబుతున్నా పట్టించుకోకుండా ఇష్టానుసారం అక్రమ నిర్మాణం చేపడితే చర్యలు తీసుకోకూడదా? ఆక్రమించిన భూమి ఎవరి నుంచి వచ్చిందో చెప్పాలి. ఆయన కొడుకు రాజేష్ ఐటీడీపీ ద్వారా సీఎంను, మహిళా మంత్రులపై సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెడుతున్నాడు. – ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫోర్జరీ చేయడం నేరం కాదా? ఒకవైపు అయ్యన్న తప్పు చేశాడంటూనే చంద్రబాబు మరోవైపు మమ్మల్ని తప్పుపట్టడం, దూషించటం ఏమిటి? ఫోర్జరీ డాక్యుమెంట్‌తో ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించుకుంటే తప్పుకాదా? అయ్యన్నపాత్రుడిని అరెస్టుచేస్తే బీసీ నేతను అరెస్టుచేశారని మాట్లాడుతున్నారు.. బీసీ నాయకులు తప్పుచేస్తే అరెస్టు చేయరా? అయినా అయ్యన్న తప్పుచేస్తే బీసీలకు ఏం సంబంధం? ఆ ఘటనకు కులాన్ని ఎందుకు ఆపాదిస్తున్నారు. కులాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. రెండు సెంట్ల భూమి ఆక్రమించుకుంటే, కేసు పెడతారా? అరెస్టు చేస్తారా? అని చంద్రబాబు అంటున్నారు. అంటే అయ్యన్న చేసింది తప్పే అని ఒకవైపు అంటూనే, మరోవైపు అరెస్టు చేయడాన్ని తప్పుపడుతున్నారు. ఫోర్జరీ డాక్యుమెంటు సృష్టించి దాన్ని హైకోర్టులో సమర్పించడం చంద్రబాబుకు తప్పుకాదు. ఇన్సైడ్ ట్రేడింగ్ చేయొచ్చు.. కానీ కేసు పెడితే మాత్రం ఓర్చుకోలేరు. ఇక పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించే టైమ్ కూడా మాకులేదు. అలాంటప్పుడు ఆయనపై రెక్కీ చేయాల్సిన అవసరం అంతకన్నాలేదు. ఈ విషయంలో మాపై నిందలు వేస్తే చంద్రబాబుకే నష్టం. – మంత్రి జోగి రమేష్ అయ్యన్న పెద్ద కబ్జా కోరు టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పెద్ద కబ్జా కోరు, గంజాయి మాఫియా నడిపే 420. ఫోర్జరీ పత్రాలతో జలవనరుల శాఖకు చెందిన భూమిని ఆక్రమించుకుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా. అవినీతికి పరాకాష్ట అయిన అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేస్తే.. చంద్రబాబు, లోకేశ్ వెనకేసుకురావడం, గందరగోళం సృష్టించడం సిగ్గుచేటు. ప్రభుత్వం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంటే బీసీలను ఇబ్బంది పెడుతోందని మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. ఎస్సీ, బీసీలను హేళన చేసినందుకు గత ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలు టీడీపీ తాట తీశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలో బీసీలకు తగిన న్యాయం చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ మాత్రమే. – మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు -
అయ్యన్న పాత్రుడు అడ్డంగా దొరికిపోయాడు: డిప్యూటీ సీఎం
సాక్షి, తాడేపల్లి: అధికారంలో ఉండగా అయ్యన్న పాత్రుడు అక్రమాలకు పాల్పడి, అడ్డంగా దొరికిపోయారని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మండిపడ్డారు. నకిలీ పత్రాలతో ప్రభుత్వ స్థలాన్ని కాజేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని అన్నారు. అయ్యన్న పాత్రుడి అరెస్ట్‌తో బీసీలకు సంబంధమేంటి అని ప్రశ్నించారు. కులంకార్డు అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు సానుభూతి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. మీరు తప్పు చేయకపోతే కోర్టులో నిరూపించుకోవాలని కోరారు. రాష్ట్రంలో టీడీపీ నేతలకు ఏమైనా ప్రత్యేక చట్టాలున్నాయా?. తప్పచేసిన వారిపై చర్యలు తీసుకోకూడదా అన్ని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ప్రశ్నించారు. చదవండి: (అనంతపురం దుర్ఘటన.. విద్యుత్ శాఖకు సీఎం జగన్ కీలక ఆదేశాలు) -
టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు అరెస్ట్
సాక్షి, అనకాపల్లి జిల్లా: ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి తప్పుడు పత్రాలు సృష్టించిన కేసులో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆయన కుమారుడు రాజేష్‌ను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయ్యన్నపాత్రుడు మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాచపల్లి రిజర్వాయర్ పంట కాలువపై రెండు సెంట్లు మేర స్థలంలో అక్రమంగా ప్రహరి నిర్మాణం చేపట్టారు. అక్రమంగా నిర్మించిన ప్రహరీని అధికారులు తొలగించే సమయంలో అధికారులకు అయ్యన్న కుటుంబ సభ్యులు తప్పుడు పత్రాలు సమర్పించారు. అయ్యన్న కుటుంబ సభ్యుల సమర్పించిన తప్పుడు పత్రాలపై ఇరిగేషన్ అధికారులు.. సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన సీఐడీ అధికారులు అయ్యన్న కుటుంబ సభ్యుల సమర్పించినవి ఫోర్జరీ పత్రాలుగా నిర్ధారించారు. ఈ రోజు తెల్లవారుజామున అయ్యన్న కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చిన సీఐడీ అధికారులు అయనను, ఆయన చిన్న కుమారుడు రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ ఏలూరు కోర్టుకు తరలిస్తున్నట్లు సీఐడీ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. చదవండి: అది రాజకీయ యాత్రే -
నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అరెస్ట్
-
‘అందుకే అసెంబ్లీకి రాకుండా చంద్రబాబు దాక్కుంటున్నారు’
సాక్షి, విశాఖపట్నం: ప్రజల్లోకి వెళ్తే ధైర్యం చంద్రబాబుకు లేదని.. అందుకే అసెంబ్లీకి కూడా రాకుండా దాక్కుంటున్నారని ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ఇంట్లో దాక్కుని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చదవండి: అదే ‘రొడ్డ కొట్టుడు’.. పవన్ కల్యాణ్‌కు అర్థమవుతుందా? తన నియోజకవర్గానికి అయ్యన్నపాత్రుడు ఏం చేశాడు?. మీరెప్పుడు ఊహించని రీతిన సీఎం జగన్ నర్సీపట్నం సమీపంలో మెడికల్ కాలేజీ మంజూరు చేశారు. అయ్యన్న పాత్రుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. లేకపోతే ప్రజలు తరిమి కొడతారు. ఎన్టీయార్‌ను వెన్నుపోటు పొడిచిన సమయంలో అయ్యన్న చంద్రబాబుకు సహకరించారు. అయ్యన్న సైకో. ఆయన ప్రవర్తన నర్సీపట్నం ప్రజలందరికీ తెలుసు. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ గెలిచే పరిస్థితి లేదని ముత్యాలనాయుడు అన్నారు. -
అమాయక గిరిజనుడిని బలిగొన్న అయ్యన్న పాత్రుడి కుటుంబం !
-
‘నర్సీపట్నం పిల్లి బయటకు రావాలి’
సాక్షి, విశాఖపట్నం: ఎక్కడో నక్కిన నర్సీపట్నం పిల్లి బయటకు రావాలని వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు అన్నారు. ‘మీ నాయకుడు లోకేశ్ నర్సీపట్నం పులిగా అభివర్ణిస్తున్నాడే. ఇంతకీ నువ్వు నర్సీపట్నం పులివా.. పిల్లివా లేదా ఊరకుక్కవా?. నీ మాటలు చూస్తే ఊరకుక్కలాగే ఉన్నాయి’ అని అయ్యన్నపాత్రుడిపై విరుచుకుపడ్డారు. శనివారం విశాఖ మద్దిలపాలెంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. , గంజాయి మత్తులో అయ్యన్న నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు, మాజీ మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరెన్ని భూకబ్జాలు చేశారో సిట్ త్వరలోనే తేలుస్తుందన్నారు. విశాఖలో భూకబ్జాలపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. చదవండి: సీఎం వైఎస్ జగన్ చొరవతో పూజరి శైలజకు న్యాయం -
అయ్యన్న పాత్రుడు ఇంటికి మరోసారి పోలీసులు..
సాక్షి, విశాఖపట్నం: మాజీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడిపై త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇటీవల ఆంధ్ర యూనివర్సిటీపై ట్విట్టర్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన అయ్యన్న పాత్రుడిపై ఏయూ జేఏసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జేఏసీ ఫిర్యాదు మేరకు అయ్యన్నపై కేసు నమోదు చేశారు. అయ్యన్నకు 41 కింద నోటీసులు ఇవ్వడానికి త్రీటౌన్ పోలీసులు నర్సీపట్నం వెళ్లారు. పోలీసులు వెళ్లిన సమయంలో ఇంటిదగ్గర అయ్యన్న లేకపోవడంతో అయ్యన్న కుటుంబసభ్యులకు నోటీస్ విషయాన్ని పోలీసులు తెలియపర్చారు. చదవండి: పంట కాలువను కబ్జా చేసిన అయ్యన్న -
అయ్యన్న పాత్రుడి పై తీవ్రస్థాయిలో మండిపడ్డ నారాయణ స్వామి
-
అయ్యన్న లాంటి బఫూన్ ని పట్టించుకోనవసరం లేదు
-
ఆధారాలతో బయటప పెట్టిన ఇరిగేషన్ శాఖ
-
అయ్యన్న పాత్రుడు ఇంటి ముందు టీడీపీ నాయకుల డ్రామా
-
అయ్యన్న బాగోతం.. మంత్రి అమర్నాథ్ ఏమన్నారంటే?
సాక్షి, శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి వాయు లింగేశ్వర స్వామిని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం దర్శించుకున్నారు. మంత్రికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఆలయ ఛైర్మన్ అంజూరు శ్రీనివాసులు స్వాగతం పలికారు. ఆలయ దక్షిణ గోపురం వద్ద ఈవో సాగర్ బాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మంత్రి అమర్నాథ్.. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆయనను వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. మంత్రిని కలంకారి వస్త్రంతో సత్కరించి వినాయక ప్రతిమను బహుకరించారు. చదవండి: ఇదేం దిగజారుడు.. ట్విట్టర్లో ఆ పోస్టులేంటి అయ్యన్న.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రాన్ని ఐటీ రంగంలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. అయ్యన్నపాత్రుడు ఆక్రమించుకున్న భూమినే ప్రభుత్వం తొలగిస్తుందన్నారు. చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు అక్రమ మార్గంలో సాగే వారిని, సక్రమమైన మార్గంలో నడిచే వారు కాదని మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. అయ్యన్నపాత్రుడు తన ఇంటి కోసం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని, ప్రభుత్వం ఆక్రమణల తొలగింపు చేపట్టిందన్నారు. ఆక్రమణలు చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి అన్నారు. శ్రీకాళహస్తి సమీపంలోని ఐనగలూరు రూ.700 కోట్లు పదివేల మందికి ఉపాధి కల్పించే విధంగా అపాచీ పరిశ్రమకు ఈ నెల 23న సీఎం వైఎస్ జగన్ భూమి పూజ చేయనున్నారని తెలిపారు. అలాగే తిరుపతిలో ఐఐటీ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. పరిశ్రమల స్థాపన ఐటీ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా సీఎం జగన్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఏపీని అగ్రగామి తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తున్నారన్నారు. -
ఇదేం దిగజారుడు.. ట్విట్టర్లో ఆ పోస్టులేంటి అయ్యన్న..
సాక్షి, విశాఖపట్నం: పవిత్రమైన ఏయూ ప్రతిష్టను దిగజార్చేవిధంగా అసభ్యకరమైన వ్యాఖ్యలతో ట్విట్టర్లో పోస్టుచేసిన టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్థులు, ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం వారు నగర పోలీస్ కమిషనరేట్‌లో డీసీపీ – 1 గరుడ సుమిత్‌సునీల్‌కు ఫిర్యాదు లేఖ అందజేశారు. చదవండి: అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు గత 40 ఏళ్లగా ఏయూ పరిసర ప్రాంతాల్లో దట్టంగా తుప్పలు, చెట్లు, పొదలు ఉండడంతో అక్కడ ఆకతాయులు, అల్లరిమూకలు చేరి గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు సేవించడానికి అనువైన ప్రదేశంగా మార్చుకుంటున్నారని.., అందుకే ఏయూ వీసీ ప్రసాదరెడ్డి ఆ ప్రాంతాన్ని ‘నాడు – నేడు’ కార్యక్రమంలో భాగంగా నెల రోజులుగా శుభ్రం చేయిస్తున్నారని పేర్కొన్నారు. అసాంఘిక కార్యాకలాపాలకు అవకాశమిచ్చేలా ఉన్న పొదలు, తుప్పలను తొలగించి క్రీడా మైదానంగా తయారుచేస్తుంటే దానిపై విమర్శలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఏయూపై లేనిపోని ఆరోపణలు చేస్తూ విద్యార్థులు, ఉద్యోగుల్లో గ్రూప్‌లను సృష్టించి విధ్వంసకర వాతావరణాన్ని తీసుకొస్తున్న టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. ఏయూ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ జీఎల్ఎస్ రవికుమార్, ప్రొఫెసర్లు షారోన్‌రాజు, పుల్లారావు, సుబ్బారావు, ప్రేమానంద్, ఎన్ఏడీ పాల్, గెస్ట్ ఫ్యాకెల్టీ తుల్లి చంద్రశేఖర్ యాదవ్, విద్యార్థి నాయకులు బి.కాంతారావు, చరణ్, పీతాన్ ప్రసాద్, పవన్, రాజుగౌడ్, ఆనంద్రత్నకుమార్, శ్యాంసుందర్‌రావు, కళ్యాణ్, ఎంప్లాయిస్ నాయకులు త్రినాథరెడ్డి, రమాణారెడ్డి, లక్ష్మణరెడ్డి, రాంబాబు, లా కాలేజ్ విద్యార్థులు తదితరులు ఫిర్యాదు అందజేశారు. -
బురదపాములు బయటకొస్తున్నాయి
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సొంత పార్టీలోని నేతలపై మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మరోసారి విమర్శలు గుప్పించారు. మూడేళ్లుగా పుట్టలో దాక్కున్న బురద పాములు ఇప్పుడు బయటకు వస్తున్నాయని.. వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలని అధినేత చంద్రబాబును హెచ్చరించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మూడేళ్లుగా ఈ బురదపాములు బయటకు రాలేదని వ్యాఖ్యానించారు. మూడేళ్ల తర్వాత చంద్రబాబు పక్కన కూర్చుని ఫొటోలకు ఫోజులిస్తున్నారంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును ఉద్దేశించే పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖలో జరుగుతున్న తెలుగునాడు స్టూడెంట్ ఫ్రంట్ (టీఎన్ఎస్ఎఫ్) శిక్షణ తరగతుల సందర్భంగా రెండు రోజుల క్రితం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా అవి బయటకు రాగా చర్చనీయాంశమయ్యాయి. -
పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు.. అయ్యన్న పాత్రుడిపై కేసు నమోదు
సాక్షి, అనకాపల్లి: విధి నిర్వహణలో ఉన్న ఎస్సైపై దౌర్జన్యం చేసిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడిపై కేసు నమోదైంది. 304, 305, 188, 204 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకెళ్తే.. జాతర పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయ్యన్న పాత్రుడు పోలీసులపై రెచ్చిపోయారు. కార్యక్రమాన్ని త్వరగా ముగించాలని పోలీసులు కోరడంతో రెచ్చిపోయిన అయ్యన్న నానా హంగామా సృష్టించారు. ఎస్సైని తోసేయడంతోపాటు, అసభ్యకరంగా మాట్లాడారు. మరో రెండేళ్లు అంటూ పోలీసులకు హెచ్చరికలు జారీచేశారు. కాగా, అయ్యన్న పాత్రుడి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ప్రజల్లోకి వెళ్లమని నా కుమారుడు చెబుతున్నాడు
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/నర్సీపట్నం: ‘పార్టీ అనుబంధ సంస్థలకు ఇన్చార్జిగా ఉన్నాను. ఎప్పుడూ ఇంటి దగ్గరే కాకుండా ప్రజల్లోకి వెళ్లాలని నా కుమారుడు దేవాన్ష్ అడుగుతున్నాడు. వాళ్ల తాతకు కూడా ఫిర్యాదు చేస్తున్నాడు’ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో గురువారం పార్టీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. కేసుల గురించి భయపడొద్దనీ.. తనపై కేసులున్నా భయపడటం లేదని అన్నారు. తన జీవితంలో జైలు మినహా అన్నీ చూశాననీ, ఇప్పుడు ఎన్ని కేసులు పెట్టినా భయపడనని చెప్పారు. వచ్చే రెండేళ్లు ప్రజల్లో తిరుగుతాననీ, ఇంటికి అంతగా రానని భార్య బ్రాహ్మణికి కూడా చెప్పినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా లోకేశ్ నర్సీపట్నం వచ్చి పోలీసులపై తీవ్రంగా విమర్శలు చేశారు. అయ్యన్నపాత్రుడిపై 9 కేసులు పెట్టి పోలీసులు ఏం పీకారని ప్రశ్నించారు. తనపై 11 కేసులు పెట్టి ఏం పీకారన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ఏ ఒక్కరినీ వదిలిపెట్టనన్నారు. -
అయ్యన్న పాత్రుడి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు
-
టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నకు 41(ఎ) నోటీస్
నర్సీపట్నం/నల్లజర్ల/: పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో ఇటీవల ఓ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్‌ని దూషించిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బుధవారం ఆయనకు 41(ఎ) నోటీసు ఇచ్చేందుకు విశాఖ జిల్లా నర్సీపట్నం వచ్చారు. తాడేపల్లిగూడెం సీఐ రఘు ఇద్దరు ఎస్ఐలతో కలిసి ఉదయాన్నే అయ్యన్న నివాసానికి చేరుకున్నారు. చదవండి: బాబు చేస్తే ఒప్పు.. మరొకరు చేస్తే తప్పా? అయ్యన్నతో పాటు కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో 3 గంటల పాటు నిరీక్షించారు. అయ్యన్నకి ఫోన్ కలపాలని ఆయన పీఏకు సీఐ సూచించగా.. స్విచ్ఛాఫ్ వస్తోందని పీఏ ఆయనకు బదులిచ్చాడు. అయ్యన్న ఎంతకూ రాకపోవడంతో చివరకు ఆయన ఇంటి గోడకు 41(ఎ) నోటీసు అంటించారు. అయ్యన్న మెయిల్ అడ్రస్‌కు నోటీసు ఫార్వర్డ్ చేసి, మరో 2 నోటీసులను పీఏకి ఇచ్చారు. టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ఆ బిల్లులన్నీ ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం: మంత్రి సురేశ్
సాక్షి, అమరావతి: మధ్యాహ్న భోజన పథకం బిల్లులు చెల్లించలేదని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఖండించారు. ఆదివారం ఆయనొక ప్రకటన చేస్తూ.. మధ్యాహ్న భోజన పథకానికి సంబందించిన బిల్లులను వంట వారికి, కాంట్రాక్టర్లకు డిసెంబర్ వరకు పూర్తిగా చెల్లించామని స్పష్టం చేశారు. ‘బిల్లులను అప్లోడ్ చేసిన వెంటనే ఆటో డెబిట్ సిస్టం ద్వారా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఆదేశాలిచ్చారు. కేంద్రం ఇస్తున్న ఆర్థిక సహాయంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన వాటా కూడా సింగిల్ నోడల్ ఖాతాకు వచ్చిన బిల్లులన్నీ వంటవారి ఖాతాలకు బదిలీ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో గోరుముద్దకు సంబంధించిన లావాదేవీలన్నీ సింగిల్ నోడల్ ఖాతాకు బదలాయించి ప్రతినెలా 7వ తేదీలోగా వంటవారికి, కాంట్రాక్టర్లకు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా వారానికి 5 రోజులు కోడిగుడ్లతో పాటు చిక్కీని అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్’ అని మంత్రి సురేష్ వివరించారు. జగనన్న గోరుముద్ద పథకంలో పూర్తిగా మార్పులు చేసి పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని 15 రకాల వంటలతో 6 రోజులపాటు మెనూను తయారు చేశామని తెలిపారు.ఇవేమీ తెలియని అయ్యన్నపాత్రుడు భోజన పథకం బిల్లులు చెల్లించటం లేదని ఆరోపించటం సిగ్గు చేటని మంత్రి సురేష్ పేర్కొన్నారు. -
‘అయ్యన్న పోలీసులకు క్షమాపణ చెప్పాలి’
సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడుపై తూర్పుగోదావరి జిల్లా పోలీసు అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. పోలీసుల పట్ల అయ్యన్న పాత్రుడు విజ్ఞతతో మాట్లాడాలని జిల్లా పోలీసు అసోసియేషన్ అధ్యక్షడు సత్యమూర్తి, కార్యదర్శి వైఆర్కే శ్రీనివాస్ అన్నారు. వారిద్దరూ గురువారం మీడియతో మాట్లాడుతూ.. అయ్యన్న మాటలు వీధి రౌడీలు ఉపయోగించే భాష కంటే నీచంగా ఉన్నాయని మండిపడ్డారు. ఆయన పిల్లలకు మాత్రమే అయ్యన్న తండ్రి అని.. తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారని తెలిపారు. అయ్యన్న పాత్రుడు అధికారంలో ఉండగా పోలీసు సేవలను ఎంతగానో ఉపయోగించుకున్నారని గుర్తుచేశారు. తన రాజకీయ ఉనికి కోసం పోలీసుల పట్ల అయ్యన్న పాత్రుడు దుర్భషలాడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నారని గుర్తుపెట్టుకోవాలని.. అరాచకవాదిలా మాట్లాడొద్దని హితవు పలికారు. సరైన భాషలో మాట్లాడకపోతే ప్రజలే అయ్యన్నను పరుగెత్తించి కొడతారని హెచ్చరించారు. అయ్యన్నను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని తాము కోరుతున్నామని తెలిపారు. పోలీసులకు అయ్యన్న బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసరమైతే అయ్యన్న పాత్రుడుపై ప్రైవేటు కేసులు కూడా వేస్తామని తెలిపారు. -
‘వైఎస్సార్సీపీ విజయాన్ని ఎల్లో మీడియా వక్రీకరించింది’
సాక్షి, విశాఖపట్నం: అధికారంలోకి రాగానే 90 శాతం హామీలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో పంచాయతీ ఎన్నికలు పెట్టాలంటేనే చంద్రబాబు భయపడ్డారన్నారు. (చదవండి: ఏపీ పరిషత్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సరికొత్త రికార్డు) ‘కరోనా పేరుతో ఎన్నికలను చంద్రబాబు వాయిదా వేయించారు. ఎన్నికల నిర్వహణ, ఫలితాలపై చంద్రబాబు ఎన్నో అడ్డంకులు యత్నించారు. ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు బీఫారమ్ ఇచ్చింది చంద్రబాబే. వైఎస్సార్సీపీ విజయాన్ని ఎల్లో మీడియా వక్రీకరించి వార్తలు రాస్తోంది. ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీదే విజయం. పంచాయతీ ఎన్నికల నుంచి పరిషత్ ఎన్నికల వరకు వైఎస్సార్సీపీదే గెలుపు. కరోనా సంక్షోభంలోనూ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందని’’ గుడివాడ అమర్నాథ్ అన్నారు. ‘‘అయ్యన్న పాత్రుడు ఒక గంజాయి డాన్. ఎన్నికల ఫలితాలు పక్కదారి పట్టించేందుకు అయ్యన్నపాత్రుడుతో సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేయించారు. పరిషత్ ఎన్నికలపై అయ్యన్న ఎందుకు నోరు మెదపడం లేదని’’ గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. చదవండి: టీడీపీకి ఓటమిని అంగీకరించే ధైర్యం లేదు: బొత్స -
ప్రజలు టీడీపీ జెండాను పీకిపడేశారు
-
వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లడం దండయాత్రా?
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్, మంత్రులపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు దుర్భాషలాడుతూ చేసిన వ్యాఖ్యలను వివరించి.. పార్టీ పరంగా ఆయనపై చర్య తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చేందుకే శుక్రవారం తాను చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లానని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ పునరుద్ఘాటించారు. కానీ.. రెండు పచ్చ పత్రికలు ఒకే గొంతుకతో కూడబలుక్కుని ‘చంద్రబాబు ఇంటి మీద దండయాత్ర’ అనే శీర్షికతో నీచపు రాతలను అచ్చేసి.. చంద్రబాబుకు వత్తాసు పలికాయని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి, టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మాట్లాడిన మాటలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయని.. కనీసం పచ్చ పత్రికలు కూడా రాయలేని భాషలో మాట్లాడారని తప్పుపట్టారు. వీటిని పరిశీలిస్తే దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా ఉందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. అది చంద్రబాబు స్క్రిప్టు ► రాజకీయ చరిత్రలో 3,648 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి, ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా చూసి, చలించిపోయి అధికారంలోకి వచ్చాక.. వారికి అన్నివిధాలా అండగా ఉంటున్న సీఎం వైఎస్ జగన్‌ను అయిదున్నర కోట్లమంది రాష్ట్ర ప్రజలే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలంతా గౌరవిస్తున్నారు. ► జనం మెచ్చేలా పాలన చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌ను, హోం మంత్రి అయిన దళిత మహిళను, మంత్రులను పచ్చ ప్రతికలు కూడా రాయలేని విధంగా, టీవీల్లో చూపించలేని విధంగా అయ్యన్న పాత్రుడు అమ్మనా బూతులు తిట్టారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ మేరకే.. అయ్యన్న నోరు పారేసుకున్నారు. ► భాష మార్చుకోవాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చేందుకే శుక్రవారం చంద్రబాబు నివాసం వద్దకు వెళితే నా కారు మీద రాళ్లు వేశారు. కారు దిగకముందే కారు అద్దాలు పగులగొట్టారు. టీడీపీ గుండాలు బలహీన వర్గానికి చెందిన ఎమ్మెల్యే అయిన నా మీద దాడి చేశారు. ► చంద్రబాబే తన నివాసం వద్ద నాపై దాడి చేయించారు. బుద్ధా వెంకన్నలాంటి కాల్‌మనీ సెక్స్ రాకెట్ గాళ్లని, పట్టాభి లాంటి పందికొక్కులను, గన్నే నారాయణప్రసాద్ లాంటి రౌడీ షీటర్లను గద్దె రామ్మోహన్, మీరావలీ, నాగూల్ మీరా, బ్రహ్మంలాంటి వాళ్లను పెట్టుకుని రాళ్లతో దాడి చేయించారు. తనపై దాడి చేసిన దృశ్యాలను అన్ని టీవీ ఛానల్స్ చూపించాయి. టీడీపీపై ఎప్పుడైనా దాడి చేశామా? టీడీపీ నేతలు ఎన్నిసార్లు నిరసన చేయలేదు.. సీఎం నివాసం, సచివాలయం ‘ముట్టడి‘ కార్యక్రమం చేస్తూ ఉంటారు. అక్కడ పోలీసులు కూడా ఉంటారు? మీరు ముట్టడికి వెళ్లినప్పుడు వైఎస్సారీసీపీ తరఫున మేము కానీ, మా పార్టీ కార్యకర్తలు కానీ ఎక్కడైనా ప్రతిఘటించామా? మీపై దౌర్జన్యం చేసి కొట్టామా? వ్యవస్థ ఉంది.. పోలీసులు ఉన్నారు.. నన్ను కూడా మంగళగిరి పోలీస్ స్టేషన్ వరకూ తీసుకెళ్లారు. నిరసన తెలియ చేయడానికి వెళితే నామీద, మా కార్యకర్తలపై దాడి చేస్తారా? చంద్రబాబు ఇంత దుర్మార్గంగా వ్యవహరించడమే కాకుండా మళ్లీ మాపైనే ఎదురు దాడి చేస్తారా? కొంచమైనా మానవత్వం ఉందా? ప్రతిపక్షం కాదు.. పనికి మాలిన పక్షం ► నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించొచ్చు. ప్రశ్నించడం అంటే బూతులు తిట్టడమా? మీరు కడుపుకు ఏం తింటున్నారు? ప్రతిపక్షం పనికిమాలిన పక్షంగా తయారైంది. అమ్మ ఒడి, రైతు భరోసా, ఇళ్లు.. ఇలాంటి పథకాలకు ఎవరికైనా అర్హత ఉండీ అందకపోతే ఇవ్వాలని అడగండి. ► రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు. మీకు తగిన శాస్తి జరుగుతుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలలో మీ గూబ గుయ్యిమనేలా ప్రజలు తీర్పు ఉంటుంది. ► మీ భాష మార్చుకోకపోతే చంద్రబాబు ఎక్కడ పర్యటిస్తే, అక్కడ నిరసన తెలుపుతాం. అయ్యన్నపాత్రుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా.. లేక బాగా బూతులు తిట్టారని మీ జాతీయ అధ్యక్ష పదవిని ఆయనకు కట్టబెడతారా.. అన్నది మీ ఇష్టం. -
మహిళలను గౌరవిస్తే 23 సీట్లేనా?
సాక్షి, అమరావతి: ‘ఐదేళ్ల పాలనలో మహిళలను మీరు గౌరవించి ఉంటే.. మీకు 23 సీట్లు మాత్రమే వచ్చేవా?’ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడును హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్.. దళిత మహిళనైన నన్ను హోం మంత్రిని చేస్తే మీకు ఎందుకు కడుపు మంట? అని నిలదీశారు. ‘హోంమంత్రినైన నన్నే మనుషులు పలకకూడని మాటలతో, సభ్యసమాజం తల దించుకునేలా దూషించే మీరు ఇక సాధారణ మహిళలను ఎలా గౌరవిస్తారో అర్థమవుతోంది’ అంటూ మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న మహిళను ‘బట్టలిప్పి కొడతా’ అని దూషించిన అయ్యన్నపాత్రుడు వంటి సంస్కారహీనుడి నుంచి ఇంతకంటే గొప్ప మాటలు వస్తాయని ఆశించలేమన్నారు. ఇతని వ్యాఖ్యలపై స్పందించడమంటే అశుద్ధంపై రాయి వేయడమేనన్నారు. వైఎస్సార్సీపీకి ప్రజలు ఆఖండ విజయాన్ని కట్టబెట్టడం వల్లే ముఖ్యమంత్రిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టారని.. అలాంటి సీఎంను దూషించడమంటే ప్రజాతీర్పును అగౌరవ పరిచినట్లేనని చెప్పారు. ఎవరు ఏం చేస్తున్నారన్నది ప్రజలు గమనిస్తున్నారని.. ఇప్పటికైనా టీడీపీ నేతలు నోటిని అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. ఈ సందర్భంగా హోం మంత్రి ఇంకా ఏమన్నారంటే.. దళిత జాతిలో పుట్టినందుకు గర్వపడుతున్నా ► వాస్తవానికి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై నేను స్పందించకూడదని అనుకున్నాను. కానీ స్పందించాల్సి వచ్చింది. దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా.. అని స్వయంగా చంద్రబాబు దళితజాతిని అవమాన పరిచారు. ► రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు అంబేడ్కర్ జన్మించిన, ఆత్మాభిమాం ఉన్న జాతిలో పుట్టినందుకు గర్వపడుతున్నాం. మీరు మాట్లాడిన భాషను, మేము ఈ జన్మలోనే కాదు. వచ్చే జన్మలోనూ మాట్లాడలేము. ఎందుకంటే మాకు సంస్కారం ఉంది కాబట్టి. గొప్పతనం అనేది మన ప్రవర్తనను బట్టి వస్తుంది కానీ.. కులం, జాతి వల్ల రాదు. చంద్రబాబు, అయ్యన్నల సంస్కారం ఏమిటన్నది అందరికీ తెలిసింది. ఐదేళ్లు బాగు చేసి ఉంటే ఎలా ఓడారు? ► మీరు ఐదేళ్లు అధికారంలో ఉన్నారు. అన్నీ బాగా చేసి ఉంటే, ఎందుకు ఓడిపోయారు? టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కై వైఎస్ జగన్‌ను జైలుకు పంపేలా కుట్ర చేశారన్నది ప్రజలందరికీ తెలుసు. ప్రజలకు వాస్తవాలు తెలుసు కాబట్టే.. 151 సీట్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించారు. ప్రజల తీర్పుతో అధికారంలోకి వచ్చిన సీఎం వైఎస్ జగన్‌పై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేయడం ప్రజాతీర్పును అవమానించడమే. ► వంగవీటి రంగా హత్య మీ హయాంలో జరిగింది. ఆ తర్వాత మీరు అధికారంలో ఉన్నప్పుడే ఒక ఎమ్మెల్యేను, మరో మాజీ ఎమ్మెల్యేను హత్య చేశారు. శాంతిభద్రతలపై మీరా మాకు చెప్పేది? ► చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తిరుపతిలో ఆయనపై హత్యాయత్నం జరిగితే.. అప్పుడు విపక్షనేతగా ఉన్న దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా వచ్చి ఆయన్ను పరామర్శించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు విపక్షనేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగితే చవకబారు విమర్శలు చేశారు. ఇదీ.. మీకూ మాకు మధ్య ఉన్న తేడా. రాజీనామా చేయమనడానికి మీరెవరు? సామాజిక న్యాయాన్ని చేతల్తో చూపిస్తూ సీఎం వైఎస్ జగన్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని రంగాల్లోనూ పెద్దపీట వేస్తున్నారు. వైఎస్ జగన్ నన్ను రాజీనామా చేయాలని కోరితే.. ఒక్క క్షణంలో చేస్తా.. నన్ను రాజీనామా చేయాలని కోరడానికి మీరెవరు? ► ఒక వ్యక్తి సంస్మరణ సభకు వచ్చి అయ్యన్న పాత్రుడు ఇలా మాట్లాడటం సభ్య సమాజం ఇష్టపడుతుందని అనుకుంటున్నారా? మల్లెపూలు కట్టుకుని అమ్మే వాళ్లు మనుషులు కారా? ► మా పని తీరు బాగా లేదని మీరనుకుంటే ప్రశ్నించండి. అన్నింటికీ స్పష్టంగా సమాధానం చెబుతాం. దిశ చట్టం ఇంకా అమలులోకి రాలేదు. దాని గురించి అడగండి చెబుతాం. మీ పాలనలో మహిళలకు ఏమేర న్యాయం చేశారో చెప్పండి. ► చంద్రబాబుకు మహిళలపై గౌరవం ఉంటే, ఆ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. నాడు వనజాక్షిని కొట్టి, ఆమెనే తప్పు పట్టిన చంద్రబాబు ఇప్పుడు అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై స్పందిస్తారని ఆశించలేం. విన్నవించడానికి వెళ్లిన ఎమ్మెల్యేపై దాడి చేస్తారా? ► అయ్యన్నపాత్రుడుపై చర్యలు తీసుకోవాలని.. బాష మార్చుకోవాలని చంద్రబాబుకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌పై రౌడీలతో దాడి చేయిస్తారా? జోగి రమేష్ సింగిల్‌గానే వెళ్లారు.. కానీ అప్పటికే కరకట్టపై టీడీపీ నేతలు భారీ ఎత్తున పోగయ్యారు. జోగి రమేష్ కారు దిగక ముందే కారు అద్దాలు పగలగొట్టారు. ఆయనపై దాడి చేశారు. ఇదీ వాస్తవం. పోలీసులు ఏకపక్షంగా కేసులు నమోదు చేస్తున్నారన్నది అవాస్తవం. ► నాడు మీరు (చంద్రబాబు) అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అవన్నీ ప్రజలు చూశారు కాబట్టే, మిమ్మల్ని విపక్షంలో కూర్చోబెట్టారు. ఇప్పటికైనా మాటలు అదుపులో పెట్టుకోండి. ► రాష్ట్రంలో 15 శాతం నేరాలు తగ్గాయని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డులు చెబుతున్నాయి. కానీ దాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా మాస్కులు ధరించని వాటికి సంబంధించి నమోదైన 80 వేల కేసులను కూడా నేరాలుగా చూపి, రాష్ట్రంలో 64 శాతం కేసులు పెరిగాయని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తుండటం దారుణం. -
గంజాయి తాగి, మందు కొట్టినవా?
రాయలవారి ఆస్థానంలో ఉన్న అష్టదిగ్గజ కవుల్లో తెనాలి రామకృష్ణ కవి మోస్ట్ పాపులర్. ఆయనకు వికటకవిగా పేరు. తెనాలి రామలింగడు అనే పేరుతో ఆయన మీద అనేకానేక జానపద కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పటి సందర్భానికి కూడా పనికివచ్చే ఒక చిన్న కథను ఒకసారి గుర్తు చేసు కుందాము. కృష్ణదేవరాయల వారు హాస్యప్రియుడు. సమయస్ఫూర్తి, సరస సంభాషణా చతురత కలిగిన రామకృష్ణుడంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం. మిగిలిన కవులకు, కొలువులోని ఉన్నతోద్యోగులకు ఇది కంటగింపుగా ఉండేది. రామకృష్ణ కవి మీద అడపాదడపా చాడీలు చెబుతుండేవారు. కుట్రలు చేస్తుండే వారు. తన తెలివితేటలతో వాటి నుంచి ఎప్పటికప్పుడు రామకృష్ణుడు బయటపడేవారు. ఒక రోజు రాజుగారిని కలవడానికి తెనాలి రామకృష్ణుడు బయల్దేరాడు. రాజాశ్రయంలో అతని ప్రభ వెలుగుతున్న రోజు లవి. అపాయింట్మెంట్ లేకపోయినా సరే భటులు అతడిని ఆపేవారు కాదు. వినయంగా నమస్కరించి లోపలికి పంపించే వారు. ఈసారి ఎందుకనో తేడా కొట్టింది. భటుడు నిర్లక్ష్యపు చూపు విసిరాడు. లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని అడ్డు కున్నాడు. మొదట ఖంగుతిన్న రామకృష్ణ కవి వెంటనే తేరుకొని తనకు అపాయింట్మెంట్ ఉన్నదని చెప్పాడు. అయితే నేనొక సమస్యనిస్తాను, దాన్ని పూరించి పద్యం చెప్పమన్నాడు భటుడు. ఇప్పుడు మనం చూస్తున్న అవధాన ప్రక్రియల్లో ఈ సమస్యాపూరణం కూడా ఒకటి. భటుడు సమస్యాపూరణం అడగటమేమిటని సందేహిస్తూనే సరే, అడగ మంటాడు రామకృష్ణ కవి. ‘కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్’ అనే సమస్య నిస్తాడు భటుడు. ఒక ఏనుగుల గుంపు దోమ గొంతులోకి దూరిందట. ఆ వాక్యాన్ని అలాగే ఉంచి మిగతా పద్యం చెప్పాలి. ఆ సమస్య ఎక్కడి నుంచి భటుడికి చేరి వుంటుందో రామకృష్ణ కవికి అర్థమైంది. దాని వెనుక ఉన్న కుట్ర కథ కూడా అర్థమైంది. భటుడికి భారీగా లంచం ఎరవేసిందెవరో కూడా కనిపెట్టగలి గాడు. బాగా కోపమొచ్చింది. భటుణ్ణి బండ బూతులు తిడు తూనే సమస్యను పూరించి వెళ్లిపోయాడు. ‘గంజాయి తాగి దుష్టుల సంజాతము చేత, కల్లు చవి గొన్నావా .......కొడక, ఎక్కడ కుంజర యూధంబు దోమ కుత్తుకజొచ్చెన్’ అని పూరణ రూపంలోనే కవి ప్రశ్నించాడు. ‘ఏనుగులు దోమ గొంతులోకి పోవడమేమిట్రా! గంజాయి దమ్ముకొట్టి, మద్యం సేవించి డ్యూటీ కొచ్చినావా’ అని కళ్లెర్ర జేశాడన్నమాట. విషయం తెలుసుకున్న రాయలవారు ఇదే సమస్య మీద మహాభారత కథతో పద్యం చెప్పమని కోరగా ఒక అందమైన పద్యం చెబుతాడు. అదంతా వేరేకథ. రాజుల దగ్గరనే కాదు, రాజకీయ నాయకుల దగ్గర కూడా భటులుంటారు. హీరోల దగ్గరే కాదు కాదు, విలన్ల దగ్గర కూడా ఉంటారు. ఇప్పుడు వాళ్లను బంటులని పిలుస్తున్నాము. ఉచ్చనీచాలెంచకుండా స్వామి కార్యం నెరవేర్చడమే ఈ బంటుల తక్షణ కర్తవ్యం. తెలుగుదేశం పార్టీ అధినేత దగ్గర కూడా కొందరు బంట్లున్నారు. ఆంబోతుల్ని ఊరిమీద వదిలేసే చందంగా అధికారంలో ఉన్నప్పుడు వీరిని జిల్లాల మీద వదిలేసే వారు. ఈ ఆంబోతులు ఎవరి చేన్లోనైనా దూరవచ్చు. మేత మేయవచ్చు. తొక్కేయవచ్చు. సర్వాధికారాలుంటాయి. బదులుగా బాస్ ఎవరిపేరు చెబితే వారి మీదకు కాలుదువ్వడం, కొమ్ము విసరడం లాంటి విద్యల్ని ఆంబోతులు ప్రయోగించాలి. బంట్లు కూడా అంతే. అయ్యన్న పాత్రుడు అనే బంటు రెండు రోజుల కింద కాలు దువ్వాడు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి మీదనే చిల్లర కామెంట్లు విసిరాడు, మంత్రులను, పోలీసు అధికారులను, ఎమ్మెల్యేలను కూడా వదల్లేదు. ఆ వేదిక మీద చంద్రబాబు కూడా ఉన్నారు. ఆ సమయంలో బంటును ప్రోత్సహిస్తున్నట్టుగా ఆయన హావ భావాలున్నాయని ప్రత్యక్ష సాక్షుల సమాచారం. నర్సరావు పేటలో జరిగిన కోడెల వర్ధంతి సభలో అయ్యన్న వాడిన భాష పత్రికల్లో రాయడానికి అభ్యంతరకరమైనది. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మీద అభ్యంతరకరమైన ఒక్క కామెంట్ చేసినందుకే ఐదు సెక్షన్ల కింద కేసులు పెట్టి కేంద్రమంత్రిని సైతం జైలుకు పంపించారు. అటువంటప్పుడు ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే యథేచ్ఛగా తిట్లవర్షం ఎలా కురిపించగలిగాడు? బాస్ కట్టిన తావీజు మహిమ. తెనాలి రామలింగడి కథలో ఉన్నట్టే, ఇక్కడ కూడా కుట్ర నేపథ్యం ఉన్నది. గంజాయి దమ్ము ఉన్నది. మద్యం దందా ఉన్నది. లంచాలు మేయడం ఉన్నది. ఒక్కొక్కటే బయటకొస్తున్న అయ్యన్న ఘనకార్యాల చిట్టాను చూస్తుంటే ఔరా అనిపిస్తున్నది. నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలంలో ఉన్న లేటరైట్ ఖనిజ నిక్షేపాలను అయ్యన్న కొడుకు తవ్విపోసి వందల కోట్ల మేరకు సొమ్ము చేసుకున్నాడని ఆధారాలతో కూడిన ఆరోపణలున్నాయి. అయ్యన్న కొడుకు నిర్వాకంలో లోకేశ్‌బాబు కూడా భాగస్వామేనని నర్సీపట్నం ప్రాంతంలో చెప్పుకుంటారు. ఈ మైనింగ్ కోసం రెండు కిలోమీటర్ల రోడ్డు వేయడానికి వందలాది అత్యంత విలువైన అటవీ వృక్షాలను కొట్టి వేయిం చారనీ, ఎటువంటి అనుమతుల్లేకుండానే సుందరకోట నుంచి అక్రమ రోడ్డును వేసుకొని ఖనిజాన్ని తరలించారన్న ఆరో పణలకు ఆధారాలున్నాయి. మన్యంలోని దట్టమైన అడవుల్లో వందల ఎకరాల్లో గంజాయి పండించి స్మగ్లింగ్ చేయించడంలో అయ్యన్న దిట్ట అని ఆయన సోదరుడు సన్యాసిపాత్రుడే చెప్పారు. గతంలో ఒకసారి తన మాట వినలేదని ఒక మహిళా అధికారిని బట్టలూడదీసి కొడతానని బహిరంగంగానే అయ్యన్న బెదిరించారు. చంద్రబాబు జమానాలో విశాఖ మన్యం ఇలాఖా అయ్యన్న ఇష్టారాజ్యంగా మారింది. ఆడింది ఆట, పాడింది పాటగా నడిచిపోయింది. అందుకు కృతజ్ఞతగానే నర్సరావుపేట సభలో అయ్యన్న పూనకాన్ని ప్రదర్శించారని అనుకోవచ్చు. ఇది సహజమైన పూనకం కూడా కాదు. ఇందులో ఎమోషనల్ ఎలి మెంట్ కనిపించలేదు. బాబు ఇషారా అందగానే అయ్యన్న విషం కక్కడం మొదలుపెట్టాడని సాక్షుల కథనం. ఈ సభ జరగడానికి కేవలం రెండు గంటల ముందే స్థానిక సంస్థల కౌంటింగ్‌కు సంబంధించిన తీర్పు వెలువడింది. ఆదివారం కౌంటింగ్. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయ బోతున్నది. మీడియా స్థలాన్ని, సమయాన్ని ఈ వార్త రోజంతా ఆక్రమించకూడదు. తెలుగుదేశంలో మిగిలిన శ్రేణుల నైతిక బలం దెబ్బతినకూడదు. ఇదీ లక్ష్యం. అప్పటికప్పుడు సిద్ధమైన వ్యూహం ప్రకారమే అయ్యన్న పూనక ప్రదర్శన జరిగింది. ముఖ్యమంత్రిపైనే తిట్ల వర్షం కురిపించిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏమీ మాట్లాడకుండా గమ్మున కూర్చోవు కదా! వాళ్లూ కౌంటర్ విమర్శలు చేశారు. బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే జోగి రమేశ్ కార్యకర్తలతో కలిసి చంద్రబాబు ఇంటిముందు నిరసన తెలపడానికి వెళ్లాడు. వ్యూహం ప్రకారం వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ ఈ పరిణామాన్ని ముందే ఊహించింది. బాబు ఇంట్లో ఉన్న పార్టీ మందను ఉసిగొల్పింది. ఎమ్మెల్యే కారును ధ్వంసం చేశారు. కార్యకర్తలకు గాయాల య్యాయి. ఎల్లో మీడియా అండతో ఈ ఎపిసోడ్‌కు తాము కోరు కున్న ట్విస్టును తెలుగుదేశం పార్టీ ఇచ్చుకున్నది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిపై దాడి చేయడానికే జోగి రమేశ్ బృందం వచ్చిందనే ప్రచారాన్ని లేవ దీశారు. ఎల్లో మీడియా, అనుంగు సోషల్ మీడియా శోకాలు పెట్టడం ప్రారంభమైంది. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టింది తెలుగుదేశం వారే. నిరసన తెలపడానికి వచ్చినవారిపై దాడిచేసి కొట్టింది తెలుగుదేశం వారే. ఇప్పుడు లబలబలాడుతున్నదీ తెలుగుదేశం వారే. ఆదివారం నాడు ఎల్లో మీడియాలో ఈ రచ్చ మరింత ఎక్కువగా ఉంటుంది. సాయం త్రానికైనా సద్దుమణుగుతుందో లేదో చూడాలి. తమ పార్టీకి మింగుడుపడని సన్నివేశాలు ఎదురయ్యే ప్రతి సందర్భంలోనూ జనం దృష్టిని మళ్లించే ప్రయత్నాలను తెలుగు దేశం పార్టీ చేస్తున్నది. గత రెండేళ్లలో కనీసం డజన్ సంద ర్భాలను ఉదాహరణగా చూపెట్టవచ్చును. 2019 నవంబర్ 14 రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మనబడి నాడు – నేడు కార్యక్రమాన్ని ఒంగోలులో ప్రారంభించారు. విద్యారంగాన్ని సమూల ప్రక్షాళన గావించే విప్లవాత్మక కార్యక్రమం ఇది. ఒకపక్క ముఖ్యమంత్రి కార్యక్రమం జరుగుతుండగానే గుంటూరులో దుర్గ గుడిని కూల్చివేస్తున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో కార్చిచ్చులా వ్యాపించింది. అక్కడ జరిగిందేమి టంటే రోడ్డు విస్తరణ కోసం ప్రజల సమ్మతితో, పోలీసుల అనుమతితో గుడిని కొంచెం పక్కకు జరిపి నిర్మించారు. గడిచిన సంవత్సరం జనవరిలో ముఖ్యమంత్రి 3 వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ప్రకటించారు. ఆ తర్వాత మూడు రోజుల్లోనే పిఠాపురంలోని ఓ ఆలయంలో విగ్రహాలు ధ్వంసమయ్యాయని బీభత్సమైన ప్రచారం జరిగింది. విచారణలో అది తప్పుడు వార్తని తేలింది. ‘దిశ’ పోలీస్ స్టే్టషన్లను ప్రారంభించిన తర్వాత వరసగా నాలుగు రోజులపాటు ఆలయాల మీద దాడులు జరిగాయని ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేశారు. వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించిన మరుసటి రోజున, జగనన్న విద్యాకానుక ప్రారంభానికి రెండు రోజుల ముందు బీసీలకు, 56 కార్పొరేషన్లు ప్రకటించిన మరునాడు ఇటువంటి వార్తల్నే వ్యాప్తిలో పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల నాలుగు నెలలైంది. ఎన్నికల ముందు జనం ముందుంచిన మేనిఫెస్టోను దాదాపుగా అమలు చేసింది. మరో రెండున్నరేళ్లలో జరగబోయే ఎన్నికల కోసం జనంలోకి వెళ్లేం దుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉరకలెత్తుతున్నది. ఈ పద్ధతిలో ముఖాముఖి పోటీపడగల స్థితిలో తెలుగుదేశం పార్టీ లేదు. మబ్బుల చాటు నుంచి యుద్ధం చేసే ఇంద్రజిత్తు వ్యూహాన్ని ఆశ్రయించబోతున్నది. అది వ్యవస్థల మాటున దాక్కొని దాడులు చేయాలని చూస్తున్నది. మీడియా భుజాలపై తుపాకులు పెట్టి కాల్పులు జరపాలని ఆలోచిస్తున్నది. విషప్రచారాలతో కూడిన ఒక కృత్రిమ సుడిగాలిని సృష్టించే సన్నాహాల్లో ఉన్నది. కవ్వింపులకు, రెచ్చగొట్టే చర్యలకు దిగబోతున్నది. ఈ రెండున్నరేళ్లు అరాచక – అప్రజాస్వామిక చర్యలకే అది బరితెగించబోతున్నది. చైతన్యవంతులైన ప్రజలు ఆ పార్టీ పోకడలను అర్థం చేసుకుంటున్నారు. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
సంస్కారం లేని వ్యక్తి అయ్యన్న పాత్రుడు: ధర్మాన కృష్ణదాస్
సాక్షి, శ్రీకాకుళం: ఎమ్మెల్యే జోగి రమేష్‌పై దాడి హేయమైన చర్య అని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అయ్యన్న పాత్రుడికి పిచ్చి మరింత ముదిరిందని మండిపడ్డారు. అయ్యన్న పాత్రుడు సంస్కారం లేని వ్యక్తిలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అయ్యన్న పాత్రుడికి ప్రజలే గుణపాఠం చెబుతారని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. తిరుపతి: దళితులను కించపరచటం టీడీపీ డీఎన్ఏలోనే ఉందని.. నిన్నటి ఘటనపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే జోగి రమేష్‌పై టీడీపీ గూండాలు దాడి చేశారన్నారు. చంద్రబాబుకు సీపీఐ రామకృష్ణ పెయిడ్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్నారని పార్థసారధి ధ్వజమెత్తారు. అనంతపురం: మైనారిటీల పట్ల చంద్రబాబుది కపట ప్రేమ అని.. ఆయన ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూశారని ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ మండిపడ్డారు. కోడెల శివ ప్రసాద్‌రావు మరణానికి చంద్రబాబే కారణమన్నారు. ప్రజాస్వామ్యం గురించి మట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. చదవండి: అయ్యన్న వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నిరసన కాకినాడ మేయర్‌పై అక్టోబర్ 5న అవిశ్వాస తీర్మానం -
అయ్యన్న వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నిరసన
సాక్షి, విశాఖపట్నం: అయ్యన్న వ్యాఖ్యలపై నర్సీపట్నంలో వైఎస్సార్సీపీ నిరసన తెలిపింది. అయ్యన్న తీరును నిరసిస్తూ అబిద్ సెంటర్లో వైఎస్సార్సీపీ ఆందోళన నిర్వహించింది. చంద్రబాబు, అయ్యన్న దిష్టిబొమ్మలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు దహనం చేశారు. అయ్యన్న పాత్రుడిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ వైఎస్సార్సీపీ నిరసన వ్యక్తం చేసింది. అయ్యన్నపై ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతూ, ‘‘సీఎంపై అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలు హేయమన్నారు. గత ప్రభుత్వంలో అయ్యన్న భూ దోపిడీకి పాల్పడ్డాడు. అయ్యన్న తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని’’ ఉమాశంకర్ గణేష్ అన్నారు. చదవండి: మహిళలను గౌరవిస్తే మీకు 23 సీట్లు వచ్చేవి కావు: హోంమంత్రి సుచరిత ‘చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు’ -
శాంతియుతంగా నిరసన తెలిపిన తమపై దాడి చేస్తారా?
-
అక్కసుతోనే అయ్యన్నపాత్రుడు పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు
-
అయ్యన్నపాత్రుడు పిచ్చితుగ్లక్‌లా మాట్లాడుతున్నాడు: సన్యాసిపాత్రుడు
-
అయ్యన్న పాత్రుడికి ఇంకా సిగ్గు రాలేదు: ఆర్కే రోజా
-
అయ్యన్నపాత్రుడు సప్త వ్యసనపరుడు: అవంతి శ్రీనివాస్
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి టీడీపీ ఓర్వలేకపోతుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో అలజడి, అశాంతి సృష్టించాలనే టీడీపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.(చదవండి: ‘పెగ్గేనా.. గంజాయి కూడా తీసుకున్నారా?’) ‘‘మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సప్త వ్యసన పరుడు. సీఎంపై మాట్లాడిన తీరు అమానుషం. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైఎస్సార్సీపీకి ఏకపక్ష విజయం వస్తుందని అందరికీ తెలుసు. వైఎస్సార్సీపీ విజయం ఖాయమని భావించి టీడీపీ కుట్రలు చేస్తోంది. అయ్యన్న పాత్రుడిని బేషరతుగా అరెస్ట్ చేయాలని’’ మంత్రి అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. చదవండి: కొరటాల, జక్కన్నలను ఓ ఆటాడుకున్న తారక్! -
పిచ్చి ముదిరి అయ్యన్న బూతులు మాట్లాడుతున్నారు
నర్సీపట్నం: టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు మద్యంతోపాటు గంజాయి కూడా సేవించి ఇష్టం వచి్చనట్లు మాట్లాడుతున్నాడని ఆయన సోదరుడు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు చింతకాయల సన్యాసిపాత్రుడు ఘాటుగా విమర్శించారు. తన సతీమణి, డీసీసీబీ చైర్పర్సన్ అనితతో కలిసి శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అయ్యన్నపాత్రుడి పిచ్చి మరింత ముదిరిందని.. బూతులు తప్ప ఆయన నోటి నుంచి మంచి మాటలు రావటంలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలంతా మనసారా ప్రేమించే ముఖ్యమంత్రిని, హోంమంత్రిని ఉద్దేశించి బూతులు మాట్లాడే హక్కు ఆయనకు ఎవడిచ్చాడన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు, లోకేశ్ ఇచి్చన స్క్రిప్ట్‌తో అయ్యన్నపాత్రుడు నోటికి వచి్చనట్లు మాట్లాడుతున్నాడన్నారు. గంజాయి వ్యాపారం, దోపిడి, భూకబ్జాలు, రౌడీయిజం చేసే అయ్యన్నపాత్రుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎంకు బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అయ్యన్నపాత్రుడిని సన్యాసిపాత్రుడు హెచ్చరించారు. -
అయ్యన్న పాత్రుడు, చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, అమరావతి: అయ్యన్న పాత్రుడు, చంద్రబాబుపై డీజీపీ గౌతం సవాంగ్‌కి వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వారిని అరెస్ట్ చేయాలని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. అనంతరం మీడియాతో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ టీడీపీ నేతల వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని, చంద్రబాబు డైరెక్షన్లో అంతా జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే జోగి రమేష్‌పై దాడిని ఖండిస్తున్నామన్నారు. రాజకీయంగా టీడీపీకి మనుగడ లేదన్నారు. చంద్రబాబు హస్తం.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ, జరిగిన అన్ని ఘటనల వెనుక చంద్రబాబు హస్తం ఉందన్నారు. చంద్రబాబుని అరెస్ట్ చేయాలని డీజీపీని కోరామని ఆయన తెలిపారు. అత్యంత దారుణం.. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, అయ్యన్నపాత్రుడు అత్యంత నీచంగా మాట్లాడారని మండిపడ్డారు. జోగి రమేష్‌పై భౌతిక దాడికి దిగడం అత్యంత దారుణమన్నారు. అయ్యన్నపాత్రుడితో మాట్లాడించింది చంద్రబాబేనన్నారు. చంద్రబాబు, టీడీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు, అయ్యన్నపై చర్యలు తీసుకోవాలని కోరామని ఆర్కే తెలిపారు. విద్వేషాలను రెచ్చగొడుతున్నారు.. చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదని ఎంపీ సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య చంద్రబాబు విద్వేషాలను రెచ్చగొడుతున్నారని నిప్పులు చెరిగారు. అయ్యన్న పాత్రుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సభ్య సమాజం తలదించుకునేలా.. సభ్య సమాజం తలదించుకునేలా అయ్యన్న మాట్లాడారని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన తనపై దాడి చేశారన్నారు. గూండాలు, రౌడీలతో చంద్రబాబు దాడి చేయించారని ధ్వజమెత్తారు. ‘వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు.. వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిన వ్యక్తి సీఎం జగన్ అని జోగి రమేష్ అన్నారు. చదవండి: వెలుగులోకి భూ ఆక్రమణలు: రోడ్డును మింగేసిన గల్లా ఫుడ్స్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నిరసన